మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....
దైవవిగ్రహాలకి శక్తి ఉందా?
నేను చేసిన విగ్రహారాధన విగ్రహాలు ఏనాడు కూడా నాకు స్వస్వరూపంగా అనగా సజీవమూర్తిగా కనిపించేవి కావు! మాట్లాడేవి కావు! కానీ వివిధ యోగుల భక్తుల అనుభవాలు చూస్తే అనగా రామకృష్ణ పరమహంస… తన పూజించే కాళీ మాత విగ్రహం నుండి కాళీ మాత సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేది అని తెలుసుకున్నాను! అలాగే నామదేవుడు అనే ఆయన కూడా పూజించే పాండురంగడు విగ్రహమూర్తి నుండి ఆయన సజీవమూర్తిగా కనిపించి మాట్లాడే వారని తెలుసుకుని ఆశ్చర్యం చెందినాను! అసలు నిజంగానే విగ్రహాలకు శక్తి ఉన్నదా లేదా వీరు భ్రమ పడి సజీవశక్తి ఉందని చెబుతున్నారో నాకు అర్థం కాలేదు! ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి నాకు అగుపించని శివమూర్తిని, బాలాదేవి ,హనుమంతుడిని ,వీరభద్రుని, గణపతిని, కుమార్ స్వామిని, సుబ్రమణ్య స్వామిని, నవగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నాను! నిత్య ఆరాధనలు చేస్తున్నాను! నిత్య పూజలు చేస్తున్నాను! కానీ నాకు ఏ ఒక్క దేవుడు కూడా నేను ఉన్నాను అని సజీవంగా కనిపించలేదు! కలలో కూడా కనపడలేదు!
వాళ్ళకేమో ఏకంగా మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడారని వారి చరిత్ర చెబుతుంటే… మరి నా విషయంలో ఎందుకు అలా జరగటం లేదు! నాకు అర్థం కాలేదు! దానితో నేను పూజించే విగ్రహ మూర్తులు నాకు కనిపించట్లేదని, నాతో మాట్లాడటం లేదని, మనోవేదన నన్ను బాగా బాధ పెట్టేది! విగ్రహాలు మాత్రం చాలా సజీవ కళలతో ఉండేవి! కానీ వాటిలో సజీవము ఉన్నదో లేదో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడేది! నా భక్తిలో ఏదైనా లోపం ఉంటే …గుడికి వచ్చే భక్తులలో ఎవరికో ఒకరికైనా కనిపించాలి కదా! వారితో మాట్లాడాలి కదా! వారికి కనిపించక… నాకు కనిపించకపోతే… విగ్రహంలో ఏదైనా లోపం ఉండాలి లేదా విగ్రహారాధనలో ఏదైనా లోపం ఉండాలి అనుకుని …. ఇష్టము లేని, భక్తిలేని, విగ్రహారాధన చేసేవాడిని!
విగ్రహాల్లో లోపం ఉంటే అనగా ద్వారకా క్షేత్రములో శ్రీకృష్ణ విగ్రహ మూర్తి చెయ్యి విరిగిపోతే దానిని కనకదాసు అనే మహా భక్తి యోగి అతికించి… శ్రీకృష్ణ విగ్రహ మూర్తిని అలాగే ఉంచి… ఇప్పటికీ పూజలో ఉంచినారు అని తెలుసుకున్నాను! చెయ్యి విరిగిపోయిన విగ్రహమూర్తి లోనే లోపం లేకపోతే… ఏమీ ఎక్కడ ఏమి దెబ్బతినని నేను పూజించే విగ్రహం మూర్తులలో ఎలాంటి లోపం లేదని తెలుసుకున్నాను! పైగా అన్ని చోట్ల ఉన్న శివ లింగ మూర్తులకు అవే పంచామృత అభిషేకాలు… అవే రుద్రనమకచమక మంత్రాలు…. కాబట్టి మనలో కూడా అనగా విగ్రహారాధన లోపాలు కూడా లేవని తెలుసుకున్నాను! దానితో మరి ఎందుకు వీళ్లు నాకు కనపడి మాట్లాడటం లేదు…. అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా….
దండి పార్వతి అమ్మ
ఒకరోజు అనుకోకుండా మా ఊరికి పక్క గ్రామంలో 18 మంది సిద్ధ పురుషులు పూజించిన దండి పార్వతి అమ్మవారి దేవాలయం ఉన్నదని తెలుసుకుని అక్కడికి వెళ్లాను! అక్కడ యధావిధిగా కూర్చున్న అమ్మవారి విగ్రహ మూర్తి కనిపించినది! మా గుడిలో ఉన్న అమ్మవారు లాగానే ఈ అమ్మవారి కూడా ఉంది అని అనిపించింది! కాకపోతే ఈ గుడికి ఎందుకు సిద్ధపురుషులు వచ్చి ఆరాధన చేసినారో నాకు అర్థం కాలేదు! మా గుడిలో లేనిది ఈ గుడిలో ఏమున్నదో అర్థం కాలేదు! ముత్తయిదువుకు ఇచ్చే వాటిని ఈ అమ్మవారికి ఇచ్చి ఈ దేవాలయ పూజారులు మా బంధువులు కావడంతో వారి ఇంటికి వెళ్ళినాను! కొన్ని గంటల తరువాత ఒక స్త్రీమూర్తి ….నాకు పరిచయం లేని ఆ స్త్రీ…. నా చుట్టూ ఏదో పని ఉన్న దానిలాగా …. నా కళ్ళల్లో పడాలనే తపన పడుతూ ఉండేది! ఆవిడ ఎవరో నాకు తెలియదు! నేను ఊరికి రావటం మొదటిసారి! ఆమెను చూడటం కూడా మొదటిసారి! ఆవిడ చేసే వింత ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు! పాపం మూడు గంటల పాటు ఇలాగే నా చుట్టూ తిరిగి తిరిగి ఎటో వెళ్లిపోయింది! నేను పెద్దగా దీనిని పట్టించుకోలేదు!
మధ్యాహ్నం నాకు కునుకు తీసే అలవాటు ఉంది! అప్పుడు నిద్రపోతే కలలో నన్ను వెంటాడిన స్త్రీమూర్తి నాకు కనిపించింది! మళ్ళీ కొన్ని క్షణాలకే నేను చూసి వచ్చిన అమ్మవారు ఈమె స్థానంలో కనిపించేది! మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మవారి స్థానములో అమ్మాయి కనిపించేది! మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మాయి స్థానంలో అమ్మవారు కనిపించేది… నాకు అర్థమయ్యేది కాదు! అసలు ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోగానే… నాకు మెలుకువ వచ్చింది! సాయంత్రం అయినది! ఇంతలో గుడి తలుపులు తెరవటానికి ఈ ఆలయ పూజారి వెళుతుంటే…. వారితో పాటు నేను కూడా గుడికి వెళ్లడం జరిగింది! విచిత్రమేంటంటే నా వెంట పడిన స్త్రీ మూర్తి ఏ రంగు చీర కట్టుకుని ఉందో...అదే రంగు చీరెతో అమ్మవారి విగ్రహామూర్తి ఉండేసరికి…. నాకు నోట మాట రాలేదు! అప్పుడు ఇదే విషయాన్ని ఆలయ పూజారి ని అడిగితే దానికి ఆయన ఏ మాత్రం ఆశ్చర్యం చెందకుండా “నాయనా! ఇది మాకు మామూలే! అమ్మవారి సజీవ మూర్తి స్వరూపమే నీ వెంట పడిన ఆ స్త్రీ మూర్తి! తను నేనే అని చెప్పటానికి అమ్మవారు నీకు మధ్యాహ్నం కలలో కనిపించింది! కలలో కనిపించిన చీరతో ఇలలో కనపడినది! ఇంతటి శక్తి మూర్తి ఇక్కడ సజీవమూర్తిగా తిరుగు తోంది… కాబట్టి ఈమెను సిద్ధ పురుషులు ఆరాధన చేయడం జరిగినది! పైగా నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను! విను! నాకు పెళ్లయిన కొత్తల్లో అనుకుంటా!
నాకు అత్యవసరముగా ఏదో పని పడి మహానైవేద్యము పెట్టే సమయము నాకు లేక పోయేసరికి…. నా దగ్గర వేదమంత్రాలు నేర్చుకోవటానికి వచ్చిన 5 సం!!ల వయస్సు ఉన్న బాల పూజారిని ….ఆ రోజు అమ్మవారికి పులిహోర నివేదన చేయమని చెప్పి…. నేను వేరే ఊరికి వెళ్లడం జరిగింది! వాడి వయస్సు చిన్నది కావడం వల్లనే….. వాడి అమాయకత్వం భక్తి వలన…. అమ్మవారు వచ్చి పులిహార తింటుందని వాడు అనుకోవడం వలన…. యధావిధిగా అమ్మవారి విగ్రహ మూర్తి ముందు పులిహార పాత్ర ఉంచి …. ఆమె వచ్చి తింటుందని అమాయకంగా ఎదురుచూసినాడు! ఆమె ఎంతసేపటికీ రాకపోయేసరికి వీడికి కోపం వచ్చి…. అమ్మ వచ్చి పులిహోర తినే దాకా నేను అక్కడ నుండి వెళ్ళేది లేదని….. అమ్మతో మాట్లాడినట్లు అమ్మవారి విగ్రహంతో మాట్లాడినాడు! వాడి దృష్టిలో అక్కడ ఉన్నది విగ్రహ మూర్తి గాదు… సజీవ మూర్తి అన్న మాట! “అమ్మ మీకు బాగా ఇష్టమైన పులిహార తీసుకుని వస్తే…. నువ్వు వచ్చి తినవా! నీకు బాగా ఆకలివేస్తుంది కదా! నువ్వు తిను! నువ్వు తింటే నేను తింటాను! నాకు కూడా బాగా ఆకలి వేస్తోందని బ్రతిమాలుకున్నాడట! ఎంతసేపటికి అమ్మవారు తినక పోయేసరికి”… వీడికి ఆకలి వల్ల నీరసం వచ్చి… అలసిసొలసి అక్కడే ఆ విగ్రహ మూర్తి ముందు నిద్రలోకి జారుకున్నాడు! వాడి కలలో అమ్మవారు కనిపించి…. వీడు పెట్టిన పులిహార తినటం కనిపించేసరికి…. వీడికి అమాంతంగా మెలుకువ వచ్చి చూస్తే…. అక్కడ అమ్మవారి విగ్రహం మాత్రమే ఉన్నది! విచిత్రంగా ఖాళీ పులిహార గిన్నె కనిపించేసరికి… అమ్మ వచ్చి తినేసి ఉంటుందని అనుకొని ఆ ఖాళీ పాత్రను తీసుకుని మా ఇంటికి వచ్చినాడు! మా ఆవిడకి విషయం చెపితే నమ్మక …. వీడు ఆకలికి ఆగలేక అమ్మవారి పేరు చెప్పి దొంగచాటుగా తినేసి ఉంటాడని అనుమానం! ఎందుకంటే ఎక్కడైనా విగ్రహ మూర్తులు నైవేద్యాలు తినవు కదా! ఆమె దృష్టిలో ఆవిడ విగ్రహమూర్తి! ఆ పిల్లగాడు దృష్టిలో సజీవ మూర్తి అన్నమాట! మధ్యాహ్నం భోజనానికి నేను ఇంటికి వస్తే…. పులిహోర గొడవ గురించి తెలిసింది! దాంతో ఇందులో ఏదో మర్మం ఉన్నదని… పిల్లవాడు మాట దైవవాక్కు…. కాబట్టి వీడిని అనుమానించకూడదని…. గుడి తలుపులు తీయగానే…. అమ్మవారి విగ్రహం నోటిలో పులిహార ముద్ద కనిపించేసరికి… ఇన్నాళ్లు చేసిన భక్తి కేవలం విగ్రహ భక్తి అని ….. ఆ పిల్లవాడు చేసిన భక్తి మధుర భక్తి అని అనగా ఈ విగ్రహంలో సజీవ మూర్తిని చూడగలిగే మధురభక్తి ఉందని గ్రహించి….. నాకు కన్నీళ్లు వచ్చినాయి! విగ్రహమును విగ్రహం గానే పూజిస్తే అది విగ్రహము గానే ఉంటుంది! విగ్రహముగా కనపడుతుంది… మాట్లాడదు! ఎప్పుడైతే ఈ విగ్రహ మూర్తి ని సజీవమూర్తిగా భావన చేస్తూ ఆరాధన చేస్తే…. ఈ విగ్రహారాధన కాస్త విశ్వారాధన అవుతుందని… వారు చెప్పి మౌనంగా పనులు చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్లడం జరిగింది!
దానితో నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న నా విగ్రహారాధన తప్పు ఏమిటో తెలిసింది! అది నేను విగ్రహారాధనను విశ్వారాధన కాకుండా విగ్రహారాధన చేయటం వలన…. నా భావనలో, నా మనస్సులో విగ్రహాలుగానే మామూలుగానే ఉండుటవలన… ఇలా విగ్రహమూర్తులు గాను ఆరాధన చేయటం వలన … వాళ్లు సజీవమూర్తిగా నాకు ఎలా కనపడతారు ఆలోచించండి! అదే వీళ్ళని విగ్రహమూర్తులుగా కాకుండా సజీవమూర్తులుగా మనస్సులో భావించి ఆరాధన చేసి ఉంటే వాళ్ళు సజీవమూర్తిగా కనిపించేవారు!
ఎలా అంటే రామకృష్ణ పరమహంసకి, తుకారాంకి, నామ దేవుడికి వారి ఇష్టదైవాలను సజీవమూర్తిగా భావించి ఆరాధన చేయడం వలన వారికి కనిపించినట్లుగా నాకు కనిపించేవాళ్ళు కదా! ఎందుకంటే యద్భావం తద్భవతి! ఏ భావం ఉంటే అదే కనపడుతుంది! ఇలాంటి నిజ భక్తితో ఒకాయన తిరుపతి వెంకన్న మీద పెట్టుకుని ఆయన ఎలా ఆరాధన చేశాడో తెలుసుకోవాలని ఉందా… అయితే ఇంకా ఆలస్యమెందుకు!
శుభం భూయాత్
పరమహంస పవనానంద
***************************
గమనిక: కొన్నాళ్ల తర్వాత సజీవ మూర్తి భక్తి అంత తొందరగా వచ్చేది కాదని… దానికి ఎంతో భక్తి, శ్రద్ధ,విశ్వాసము,సహనము,నిష్ట ఉండాలని నేను తెలుసుకోవడం జరిగినది! కొన్ని సంవత్సరాలకి నా సాధన శక్తి పరిసమాప్తి అవుతున్న సమయంలో…. నేను పూజించిన బాలా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్తా సజీవ 8సం!!ల బాలికరూపములో బాలమూర్తిగా కనపడి మాట్లాడుతూండేది! ఆ తర్వాత శ్రీశైల క్షేత్రములో 8సం!!ల బాలికరూపములో బాలదర్శనం అలాగే ఇదే క్షేత్రము యందు 80సం!!ల వయోవృధ్ధురాలిగా సుందరిరూపములో దర్శనం...ఇలా జొన్నవాడకామాక్షి,అలంపుర జోగులాంబ, విజయవాడలో దుర్గామాత,విశ్వనాధపల్లిలో గ్రామదేవత, వరంగల్లులో భద్రకాళిమాత,కాశీక్షేత్రములో అన్నపూర్ణ, మధుర మీనాక్షి 5సం!!ల బాలిక రూపములో బాలగాను,కంచి కామాక్షి 35సం!!ల స్రీమూర్తిగాను త్రిపురగాను,కాశీ విశాలాక్షి 65సం!!ల వృధ్ధురాలిగా సుందరిరూపములో…. వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా దర్శనప్రాప్తి మాకు కలిగినది! మృడేశ్వర క్షేత్రము నందు సాంబశివమూర్తి ,కాణిపాకము యందు మహా గణపతి,పళని బాల కుమారస్వామి,మోపిదేవి యందు నాగేంద్రస్వామి సజీవ మూర్తులుగా దర్శనం అయినది! తిరుపతి యందు,ద్వారక తిరుమల క్షేత్రముల నందు వెంకన్న, పూరి క్షేత్రము నందు శ్రీకృష్ణుడు,నైమిశారణ్యమునందు అష్టభుజశ్రీవిష్ణువు,ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు,శ్రీ లలితాదేవి...వీరందరి సజీవమూర్తి దర్శనప్రాప్తి పొందడము జరిగినది! అటుపై కాశీక్షేత్రములో సద్గురువుగా జీవసమాధి చెందిన శ్రీత్రైలింగ స్వామి ఆత్మదర్శనప్రాప్తి,ఇదే క్షేత్రములో హనుమత్ సజీవమూర్తి దర్శనం...అలాగే పండరీపురము నందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం, గాణ్గాపురము నందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం,అరుణాచలము నందు శ్రీ మేధా దక్షిణామూర్తి నిజరూప దర్శనం, కైలాష్ పర్వతము యందు సదాశివమూర్తి నిజరూప దర్శనం,శ్రీశైలము నందు జీవసమాధి చెందిన శ్రీపూర్ణానంద స్వామి ఆత్మదర్శనప్రాప్తి కల్గడము జరినది! ఈ దర్శనానుభవాలు అన్నియుగూడ మాకు ఆజ్ఞా,సహస్ర చక్ర స్ధితి యందు జరిగినాయి! ఎందుకంటే ఈ చక్రముల నందు దైవ, ఆత్మ సాక్షాత్కర స్ధితి ఉంటుంది! ఈ అనుభవాలు అన్నియుగూడ మా ఆజ్ఞా అలాగే సహస్ర చక్ర స్ధితి యందు చెప్పడం జరిగినది!
ఇలా మేము ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉన్న విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా నాకు కనిపించి…. నావెంట రక్షణగా, తోడుగా, నాతోపాటు తిరిగేవారు! నేను అక్కడ ఉన్నంతసేపు నా వెంట ఉండేవారు! నాకు కల్గిన ఈ దైవ అనుభవాలకి సాక్ష్యముగా నా భార్యకి,నాతో ఉన్న నా కుటుంబ సభ్యులకి,నా బంధుమిత్రులకి సమక్షములో జరుగుతుండేవి! గావాలని ఇలాంటి సజీవ దైవశక్తి చూడటానికి నా వెంట వచ్చి ఆ సజీవమూర్తి రూపాలను చూసి నమ్మకమేర్పడి అమిత ఆనందము పడేవాళ్ళు! కొన్నిసం!!తర్వాత నాకు తెలిసినది ఏమిటంటే ఇలా వీరందరు నాకు దర్శనము ఇవ్వటానికి కారణము ఇలా వీరందరిలో ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కర మాయలో నన్ను పడవెయ్యాలని ప్రయత్నించినారని తెలిసినది!ఎందుకంటే వీరంతా సత్యముగా కనిపించే అసత్యమూర్తులు! పైగా వీరంతా పరమశూన్యము యొక్క స్వప్నమూర్తులు!ఈ జ్ఞానమును పొందటముతో రామకృష్ణపరమహంస,కబీర్ దాసు,నామదేవుడు,ఘోరలాంటి నిజభక్తియోగులు...వీరంతా భ్రమ,భ్రాంతిలని వారి సద్గురువుల వద్ద తెలుసుకుని...వీరి సాక్షాత్కరమాయలను దాటుకోవడము జరిగినది! విచిత్రము ఏమిటంటే నాకు ఇటు వైపు దైవాలు...అటు వైపు గురువులు నన్ను వారి మహా మాయలో పడవెయ్యాలని ప్రయత్నించడము జరిగినది! నాకు అపుడికే ఈ సాక్షాత్కరాలు మహమాయలని వివిధ యోగుల జీవితచరిత్రలు చదవడము ద్వారా మేము పొందిన శబ్ధపాండిత్యము ద్వారా తెలుసుకోవడముతో వీరి మాయలని చిరునవ్వుతో దాటడము జరిగినది! అనగా వీరి యందు నాకు ప్రేమ,మోహ,వ్యామోహ,మాయభక్తి కల్గకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసివచ్చినది!ఒకవేళ వీరి మాయభక్తిలో పడితే...వాళ్ళే నిజమని...వారికి భక్తిపూజలు చేస్తూ...దాసోహం చేయ్యవలసి వచ్చేది! నిజానికి ఇలా వీరంతాగూడ తమకున్న ఇష్టకోరిక మాయ అనగా హృదయచక్రము వద్ద ఈ మహామాయను దాటలేకపోవడముతో...స్వప్నశరీరధారిగా మారడము జరిగినది! దానితో మోక్షప్రాప్తి పొందకపోవడముతో...అనగా నిశ్చిలస్ధితి పొందకపోవడముతో...ఏవో సంకల్పములు పెట్టుకొని మనలాంటి సాధన జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తిమాయలో ఉంచి వారికి గావాలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించండి! అంటే సోహం (నేనే దేవుడిని ) అనవలసిన చోట వారికి దాసోహం(నువ్వే దేవుడివి) అవుతున్నామని తెలుసుకొండి! అందుకే దైవ,గురుభక్తి మాయలు దాటి మీరే గురుదేవుడిగా మారండి! దానితో ఇలా దైవవిగ్రహామూర్తుల వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ క్షేత్రాలకు, దేవాలయాలకు వెళ్ళడం పూర్తిగా మానివేశాను! పైగా దేహమే దేవాలయమని గ్రహించాను! ఆత్మయే ఆత్మలింగం అని తెలుసుకున్నాను! ఇది నేను అహంతో చెప్పడం లేదు! ఒక పిల్లవాడి భక్తి కూడా నాకు లేదని… కసితో… బాధతో ఎన్నో రకాల మాయలు, మర్మాలు దాటుకుని మధురభక్తిని అలవర్చుకుని…. భక్తిమార్గంలో పురోగతి సాధించడం జరిగింది! చేసేదెవరు చేయించుకునేదెవరు …. అందరూ ఒకటే కదా… అంతా ఒకటే కదా… ఉన్నది నేనే కదా! లేనిది నేనే కదా! పోయేది నేనే కదా! ఉండేది నేనే కదా! అంతా నేనే ఉన్నాను! నేను కానిది… ఏమీ లేదని… అసలు నేనే లేనని....సర్వం ఏమిలేదని...సర్వంశూన్యమని నా సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందడం జరిగినది!
ప్రతి విగ్రహంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రతి చోట పంచభూత నిర్మితం శక్తి ఉంటుందని గ్రహించండి! ఈ పంచభూత శక్తి కి మనస్సు యొక్క భావ శక్తి లేదా ఆలోచన శక్తి లేదా సంకల్పశక్తి ఇవ్వగలిగితే…. అది కాస్త స్పందించి భక్తి శక్తి గా మారి అనుకున్న కోరికలు తీరుస్తుంది! ఇలాంటి శక్తి కలగాలి అంటే మన విగ్రహారాధన కాస్త సజీవ మూర్తి భావన శక్తిని పెంపొందించుకోవాలి! అంత తేలికైన విషయం కాదని గ్రహించండి! ఈ మధురభక్తి అలవడితే నిజభక్తులు లేదంటే కేవలం ప్రసాదభక్తులు అవుతామని గ్రహించండి! ఇలాంటి వారికి దేవుళ్ళు అనేవాళ్ళు కోరికలు తీర్చే యంత్రాలన్నమాట! అదే నిజ భక్తి ఉన్న వాడి విషయానికి వస్తే తమకు కావలసినవి అడక్కుండానే ఇచ్చే వరాల దేవతలు అన్నమాట! మనస్సుకి ఏ భావం ఇస్తే అది మనకు చూపిస్తుంది! ఎందుకంటే యద్భావం తద్భవతి! ఏ భావం ఉంటే అదే కనపడుతుంది ! ఆ చిన్న పిల్లవాడి భక్తిని పెంచుకోండి! ఎందుకంటే పసిపాప మనస్సున్న వాడిలో పరమాత్మ ఉంటాడని షిరిడి సాయి బాబా వారు ఇప్పటికే బోధించినారు కదా! ఇంకెందుకాలస్యం! మీ భక్తితో విగ్రహారాధన భక్తి మాయ దగ్గర ఆగిపోకుండా… దీని నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి!
విగ్రహారాధన అనేది అక్షరాలు లాంటిది! భాషకి ఈ అక్షరాలు ఎంత అవసరమో...మన ప్రారంభ సాధనకి ఈ విగ్రహారాధన అంతే అవసరము! ఎందుకంటే నిగ్రహము కోసము! అనగా మన దశేంద్రియాలు అనగా కన్ను,ముక్కు,చెవి,నోరు,చర్మము అలాగే ఇవి చేసే చూచుట,వాసన,వినుట,రుచి,స్ఫర్శ....ఇలా పదింటిని కలిపి ఈ దశేంద్రియాలు… మనకి ఈ విశ్వములో సత్యముగా కనిపించే వాటి మహామాయలలో పడకుండా ఉండటానికి మనకి నిగ్రహశక్తి పొందవలసి వస్తుంది!ఈ నిగ్రహము మనకి వస్తే విగ్రహముతో పని ఉండదు! ఎందుకంటే భాష వచ్చిన వాడికి అక్షరములతో ఏమి పని ఉంటుంది! అంటే మీరు మొదట మీ ఇష్టవిగ్రహరాధన చేసి...అందులో వారి సజీవ సాక్షాత్కరమును పొంది...ఆపై నిగ్రహశక్తితో..వీరి మహాభక్తి మహామాయలో పడకుండా...వీరిని దాటుకుని సాధనలో ముందుకి అనగా విగ్రహారాధన నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి! ఒకటి గుర్తుపెట్టుకోండి! నాస్వానుభవముతో చెపుతున్నాను!అది ఏమిటంటే మన మూలధారచక్రము నుండి అనగా మహాగణపతి నుండి చిట్టచివరిదైన బ్రహ్మరంధ్రము దాకా ఉన్న పరమశూన్యమైనా సర్వేశ్వరుడి దాకా మనము ఇలాంటి సాక్షాత్కారమహామాయలు దాటవలసి వస్తోంది!తస్మాత్ జాగ్రత్త! ఈ మాయలకి నూటికి 90 శాతము మంది దాటడము లేదని మేము తెలుసుకోవడము జరినది!మేము దాటినాము! మీరు గూడ దాటాలని మీకు ఇంత వివరముగా చెప్పడము జరిగినది! ఎందుకంటే బుద్ధుడి లాగా మీరు ఆగిపోకూడదు!అనగా ఈయన సాధన చేసి సర్వమాయలకి కోరికయే మహాకారణమని జ్ఞానప్రాప్తి పొంది...చివరికి కోరికలు లేని సమాజమును చూడాలనే ఇష్టకోరిక కోసము మళ్ళీ తిరిగి తనకి తెలియకుండానే కోరిక మహామాయలో పడినారని తెలుసుకొండి! దీనికి కారణము మన బుద్ధుడు సాధన చేస్తున్నపుడు ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు! ఈ యవ్వన స్రీమూర్తి రూపములో కామమాయగా త్రిపుర దేవి అన్నమాట! మాయ మన సాధనను ఆపటానికి సాక్షాత్కర, సిద్ధులు,దైవిక శక్తులు,యోగశక్తులు,ఇష్టకోరిక, అనుభవ,అనుభూతిలలో ఏదైన తీసుకొని మన నిగ్రహశక్తికి పరీక్ష పెడుతుంది! ఈ పరీక్షలు అన్నీ గూడ మహామాయ పరీక్షలని మీరు జ్ఞానము పొందితే...మాయ మాయం అవుతుంది!
ఈ మాయలకి ప్రతిరూపమే ఆదిపరాశక్తి! మొదట బాలికరూపములో కూతురిగా భక్తి మాయగా బాలగా...ఈ సాక్షాత్కర మాయదాటితే...ఒక యవ్వన స్రీమూర్తి రూపములో కామమాయగా త్రిపురగా…. ఈ సాక్షాత్కర మాయదాటితే... 65సం!! వృద్ధ స్త్రీమూర్తిగా ఇష్టకోరిక మాయగా సుందరి రూపములో వస్తుంది! ఈ సాక్షాత్కర మాయదాటితే… 85సం!! వయోవృద్ధురాలిగా సహనశక్తి మాయతో... దేవిగా ఆదిపరాశక్తి వస్తుంది! ఈ సాక్షాత్కర మాయదాటితే గాని మనకి మహామృత్యువైన శ్వాశతమరణస్ధితి యైన కపాలమోక్షం మనకి కల్గదు! అందుకే బాలా త్రిపుర సుందరి దేవిని మన యోగసాధన స్ధాయిలు చెప్పే అమ్మవారిగా గుర్తించడము జరిగినది! అంటే మన సాధన చేస్తునపుడు బాల వస్తే...మన సాధన ప్రారంభ స్ధాయిలో...అదే త్రిపురగా వస్తే మధ్యమ స్ధాయిలో..అదే సుందరిగా వస్తే అంతిమ స్ధాయిలో... అదే చిట్టచివరి అంతిమ రూపముగా దేవిగా ఆదిపరాశక్తి సాక్షాత్కరమైతే కపాలమోక్ష స్ధాయికి అనగా బ్రహ్మరంధ్రం వద్దకి మన సాధన ఉంటుందని తెలుసుకొండి! ఈ విధంగా మన సాధన స్ధాయిలుంటాయని లోకానికి తెలియచెయ్యటానికి ఆదిపరాశక్తికి బాలా-త్రిపుర-సుందరి-దేవిగా నామకరణ చేసినారని తెలుసుకొండి!
అంతెందుకు మాకు ఇన్ని తెలిసిన గూడ బాల రూపమును దాటినాము గాని కామరూపిణి అయిన త్రిపుర మాయ దాటలేకపోయినాము! ఆ పై త్రిపురదేవి వలన మాకు కలిగిన కామమాయను దాటుకోవటానికి మేము దీక్షాదేవిని వివాహము చేసుకొని…. త్రిపురదేవి కామమాయను దాటడము జరిగినది! ఆతర్వాత సుందరి, దేవి రూపములను దాటి...మహ మృత్యువైనా కపాలమోక్షస్ధితి ఈ సం!! అనగా 2019 మార్చి 11 మహశివరాత్రి పర్వదినమున ఉదయం 10:05 లకి మా సూక్ష్మ,కారణ, సంకల్ప, మా మూలకపాలము యొక్క చితాగ్నిలో ఈ మూడు శరీరాలు దహనమై...విభూదిగా మారడముగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందడము జరిగిన ట్లుగా మాకు ఆ రోజు ధ్యానానుభవమైనది! ఇదే ధ్యానములో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాధ్ కి జై...అంటూ...స్వయంగా గోమయ విభూది చేసుకొని వాడుకో అని ఆదేశము రావడముతో....
ఇదే రోజు బాగా ఎండిన ఆవుపేడను సేకరించి...దానికి ఆవునెయ్యి,కర్పూరం వేసి కాల్చడము...ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాముపొడిని ఆవుపాలతో కలిపి ఎండిపెట్టి...దీనినే విభూతిగా వాడటము జరుగుతోంది! దీనిని స్నానము చేసే నీళ్ళలలో చిటికెడు కలుపుకొని విభూధి స్నామము చెయ్యడము అలాగే ఈ విభూధితో ధారణ చేసుకోవడము చేస్తున్నాను! అలాగే ప్రతి సం!! వచ్చే మహాశివరాత్రినాడు ఈ విధంగా విభూధిని తయారు చేసుకోవాలని...వీలు అయితే అందరికి ఈ నిజమైన గోమయ విభూధిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడము జరిగినది! దానితో మా దీక్ష నామము అయిన శ్రీ పవనానంద సరస్వతి నామము కాస్తా బాబా విభూతినాధ్ గా మారడము జరిగినది! దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్దాంతము అలాగే సమాధి గీత రచించడము జరిగినది! కాని మా స్ధూల శరీరానికి నా చిట్టచివరి ప్రారబ్ధకర్మగా మా అమ్మగారి అంతిమ యాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్ధూల దేహవిముక్తి కల్గదని… అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారము మా చేతులలో జరగాలని ఆమె కోరడముతో...నాకు ఇంతటి సంపూర్ణ సాధన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా...ఆమె అడిగిన కోరికను తీర్చడము కోసము మా స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా ఆగిపోవడము జరిగినది! ఆమె మరణము తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్ధూల శరీరము…. ఆపై ఇది గూడ కాశీక్షేత్రములో మా అస్ధిక చితాభస్మము ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే...ఈ శరీరమునకు బంధవిముక్తి కల్గి మనోనిశ్చలస్ధితి పొంది స్ధూల కపాలమోక్షస్ధితి పొందడము జరుగుతుంది! అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! అంటే దీనితో స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి వచ్చినట్లే అవుతుంది!కాని ఆకాశ శరీర కపాలమోక్షస్ధితి అర్హతకోసము కాశీక్షేత్రములో పంచకోశ ప్రాంతములో ఆకాశకోశములో జీవసమాధి స్ధితి పొంది...ఆపై మణికర్ణిక ఘాట్ యందు దహనము లేదా సమాధి చేయబడితే...అటుపై ఆదిగురువు విశ్వనాధుడి తారకరామబ్రహ్మ మంత్రమును గురూపదేశముగా పొందితే… రేణువు పరిమాణములో ఆకాశ శరీరముతో...మన మూలకపాలములోని చితాగ్ని యొక్క 10లక్షల దహనశక్తి తట్టుకోగలిగితే ...అపుడు మనకి ఆనందరహిత సమాధి స్ధితి కలిగి… అటుపై పరమప్రశాంత స్ధితి అనగా సంపూర్ణ మూలకపాల మోక్షస్ధితి పొందడము జరుగుతుంది!కాని ఇట్టి కపాలస్ధితిని ఇంతవరకు ఎవరుగూడ పొందలేదు!కేవలము ఇట్టి కపాలస్ధితిని పొందుటకు అర్హత మాత్రమే సంపాదించడము జరిగినది! అనగా చితాగ్ని 10 లక్షల దహనశక్తిని తట్టుకుని ఆ ఆదియోగియే నిలబడలేకపోయినారు! దానితో సంపూర్ణ మూలకపాల మోక్షస్ధితి పొందడము జరుగలేదు! కేవలము స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి పొందడము జరుగు తోంది! మేము గూడ కాశీ క్షేత్రము నందు 41 రోజులపాటు ఉండి ఈ చితాగ్ని దహనశక్తిని 96 ని!!లకి 48ని!! పాటు మాత్రమే అనగా 10 లక్షల దహనశక్తిలో 5 లక్షల శక్తిని తట్టుకొని...ఆపై సహనశక్తిని ఒక లిప్తకాలము పాటు కోల్పోయి...ఆకాశశరీర కపాలమోక్షస్ధితి పొందకుండా వెనుతిరగడము జరిగినది! అంటే ప్రస్తుతానికి సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి పొందడము జరిగినది!అలాగే ఆకాశకపాలమోక్షస్ధితిలో విఫలము చెందడము జరిగినది!ఇక స్ధూలశరీర కపాలమోక్షస్ధితి కోసము రాబోవు సం!!లో అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! ఒకవేళ కాశీక్షేత్రములో మరణము పొందితే...ఆకాశశరీరానికి మళ్ళీ కపాలమోక్షస్ధితి పొందటానికి అలాగే ఈ సాధన చేసుకోవటానికి అర్హత వస్తుంది! అంటే ఈ లెక్కన మన పంచశరీరాలకి అనగా స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప, ఆకాశ శరీరాలకి పంచ కపాలమోక్షస్ధితిని పొందవలసి ఉంటుందని గ్రహించండి! అందులో మేము నాలుగు కపాలమోక్షస్ధితిని పొంది...ఆకాశ కపాల మోక్షస్ధితిని పొందలేకపోవడము జరిగినది! మోక్షమంటే చనిపోవడము గాదని తెలుసుకొండి! ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధకర్మలను కర్మశేషము లేకుండా పూర్తిచేసుకుని...వాటి నుండి విముక్తి పొంది...ఆ శరీరము మనో నిశ్చలస్ధితి పొందినట్లు అన్నమాట! అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట ! ఇలా మన శరీరములో ఉన్న పంచశరీరాలు అనగా స్ధూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి మోక్షస్ధితిని పొందాలి అన్నమాట! అదే జీవసమాధి అంటే మరణించడము అన్నమాట! అనగా మన పంచశరీరాలు పంచకపాలస్ధితికి చేరుకొని ఏకకాలములో ఒకదానితర్వాత మరొకటి విభేదనము చెందుతూ పరమశూన్యము నందు ఐక్యం చెందడమే జీవసమాధి అవుతుంది! అనగా యోగసిద్ధి పొందటం అవుతుంది! దానితో ప్రస్తుతము మాకున్న ప్రారబ్ధ కర్మనివారణ చేసుకుంటూ...అందరికి మేము చేసిన గోమయ విభూది అలాగే మేము చేసిన నిమ్మపాల కుంకుమను ఉచితంగా పంచుతూ...మాకు ఆకాశకపాలమోక్షప్రాప్తి కోసము...ఆకాశశరీరముతో... స్వప్నసాధన కోసము...కాలమును ఈ స్ధూలశరీరముతో...నీలి ఆకాశము కేసిచూస్తూ... అన్నింటిని సాక్షిభూతముగా చూస్తున్నాము! విచిత్రము ఏమిటంటే మా భౌతిక గురుదేవుడు అలాగే మా ప్రధమ శిష్యుడైన జిజ్ఞాసి గూడ వారి తల్లి మాయ దగ్గర మాకు లాగానే తాత్కాలికముగా ఆగిపోవడము జరిగినది! నేను త్రిపురమాయ దగ్గర బోల్తా పడితే...జిజ్ఞాసి మాత్రము సుందరి రూపము దగ్గర ఇష్టకోరిక మాయ కి స్పందించడము …. అలాగే ఆదిపరాశక్తి దగ్గర సహనశక్తి మాయ దగ్గర సహనశక్తి కోల్పోవడముతో బోల్తా పడి...ఇపుడు సహనశక్తిని కోల్పోకుండా ఉండటానికి నిగ్రహశక్తి కోసము సాధనను కొనసాగిస్తున్నాడు! అనగా వీరికి సూక్ష్మ,కారణ శరీరాలకి మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందినాయి గాని ఇంక సంకల్ప శరీరాలకి మోక్షప్రాప్తి ఈ సం!! అనగా 2019 నవంబరు 25 కార్తీక సోమవార పర్వదినము నాడు సాయంత్రము 7గం!! లకి తన సంకల్ప శరీరానికి మోక్షప్రాప్తి …. అలాగే మహాస్శశాన క్షేత్రమైన కాశీయందు ఈ క్షేత్ర గంగానదిలో అస్ధిక చితాభస్మము కలిపితే తన స్ధూల శరీరానికి మోక్షప్రాప్తి పొందడము జరుగుతుంది! అలాగే కాశీయందు మరణమును పొందితే...ఆకాశ శరీరానికి మోక్షప్రాప్తికి అర్హత పొందడము జరుగుతుంది!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిdaiva vigrahalaki shakti undani manani vaari maayalo padaveyalani vaaru sajeeva arshanalu istharani alage sajeeva darshanam avvalante antha sulabham kaadani... yadhbhaavam thadhbhavathi bagundi...baba vibudhinath ga meeru maaratam....anni chadivaka nen eppudu ila aythaana? asal aythaana leda? pari pari prashnalu lechayi....dhanyosmi baba vibhudinath gaaru mee ee vivarana ki....
రిప్లయితొలగించండి