శుభవార్త:
మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....
కాపాలికుడు దర్శనం
ఘంఠా మఠము లో జరిగిన సంఘటన కి నేను ఆసుపత్రి పాలవడం మీకు తెలిసిన విషయమే కదా! కొన్ని రోజులకి మా ఊరికి తిరిగి రావడం జరిగింది! విధిగా లింగ మూర్తి ని… కనిపించటం లేదని… ఆవేదన ఆవేశంతో… ఆయన మీద…. ఇష్టం లేని… భక్తిలేని… పూజ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో… ఆరు నెలల తర్వాత ప్రాణాయామం చేసిన వ్యక్తి కిడ్నీ వ్యాధితో చనిపోయాడని నాకు తెలిసింది! నాలో తెలియని మనోవేదన ,ఆవేదన, ఆవేశం బాధ మొదలైనాయి! ఆ కనిపించని దేవుడిని…. కనిపించే లింగమూర్తిని… తిట్టటం ఎక్కువైంది! నా కోరిక ప్రయత్నం వలన ఆయన చనిపోయాడు అనే మనోవేదన నన్ను ఒక సైకో భక్తుడు లాగా… దేవుని చంపే రాక్షసుడు లాగా… మార్చివేసింది! దాంతో ఎక్కడ పోగొట్టుకున్నమో… అక్కడే రాబట్టుకోవాలని… తపన… మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను ఒక్కడినే వంటరిగా శ్రీశైల యాత్ర కి వెళ్లడం జరిగింది! శ్రీశైలమల్లన్న ను చూడకుండా నేరుగా ఈసారి ఘంఠా మఠముకు చేరుకోవడం జరిగినది! అక్కడ అన్నీ ఉన్నాయి! జరిగిన యదార్థ సంఘటనకి సాక్షిగా…. గుర్తు చేయడానికి సాక్ష్యంగా… ఉన్నట్లు కనిపించింది!
ఇంతలో నన్ను అక్కడ ఒక భిక్షకుడు వ్యక్తి గుర్తుపట్టి “ స్వామి… గాల్లోకి ఎగిరారా? మీరు చేసిన ప్రయత్నాలు …. నేను ఓరకంట గమనించాను! నేను ఒకప్పుడు యోగసిద్ధులు కోసం ప్రయత్నించి మతి భ్రమణం చెందే పిచ్చివాడిలాగా… బిచ్చగాడి గా మారినాను! నాకు తెలిసినంతవరకు మీకు సాధన శక్తి సరిపోయినట్లుగా లేదు… అనగానే ఏదో తెలియని నాకు ఒక యోగ ఆప్తుడు దొరికినట్లు అనిపించి జరిగిన విషయం చెప్పే సరికి… అతను వెంటనే “స్వామి… సాధనలో ఇలాంటి విఘ్నాలు కలుగుతాయి! మీకు లాగా బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి ! పుట్టించడం… చంపడము… పై వాడికి తెలిసినంతగా మనకు తెలియదు కదా!
మీకు నిజముగా సాధన మీద ఇంకా ఆసక్తి ఉంటే ఈ శ్రీశైల క్షేత్రానికి పదమూడు కిలోమీటర్ల (13) దూరంలో ఉన్న భైరవ సేల కి వెళ్ళండి! అక్కడ పిచ్చివాడిలాగా… అర్థం కాని పిచ్చి మాటలతో … యోగవంతమైన అర్థవంతంగా మాట్లాడే పిచ్చి వాళ్ళ రూపంలో ఉన్న కాపాలికులు ఉంటారు! వారి భాష, చేష్టలు అన్నిగూడ మతిభ్రమణం చెందిన పిచ్చివాడిలాగా ఉంటాయని గుర్తు పెట్టుకోండి! మీరు వారిని గమనించారో లేదో తెలుసుకున్నారో అనగానే ఏదో పని ఉన్నవాడి లాగా మీ నుండి పారిపోతారు లేదా మిమ్మల్ని భయపెట్టి పారిపోయేటట్లుగా చేస్తారు! వీటి ఆధారంగా ఆ కాపాలికుడు ని పట్టుకోండి! సాధన శక్తి మర్మాలు తెలుసుకోండి” అని చెప్పి ఏదో పిచ్చి వాగుడు వాగుతూ వెళ్ళిపోయాడు! అంటే వీడు అర్థకాపాలికుడు ఏమోనని సందేహం వచ్చే లోపల నా కనుచూపు నుండి దూరమైనాడు ! సరే అతను చెప్పిన వివరాలను పట్టుకుని ఒక మానవ ప్రయత్నం చేస్తే కనిపించని దేవుడున్నాడో లేదో మనకు తెలుస్తుంది కదా అనుకుంటూ ఆ కాపాలికులు ఉండే భైరవ సేల వైపుకి వెళ్లడం జరిగింది!
అర్థ కాపాలికుడు చెప్పిన భైరవ సేలకి నేను వెళ్లే సరికి సాయంత్రం 6:00 అయినది! చీకటి ముదురుతోంది! కాఫీ తాగుదామని కాఫీలు అమ్ముతున్న వాడి దగ్గర ఉండగా …..
అక్కడ ఉన్న ఒక భిక్షకుడు చుట్ట తాగుతూ అమ్ముతున్న వాడి ముందు ఠీవిగా నిలబడి ఉండటము చూసి ఆ కాఫీల వాడు బిచ్చగాడితో “ ఏరా ! చుట్ట త్రాగాటానికి నేను ఉన్న చోటు కావాల్సి వచ్చిందా? పైగా దేవుడి గుహ ఎదురుగా పెట్టుకుని అంత ధైర్యంగా చుట్ట ఎలా తాగుతున్నావురా? వేరేచోట దొరకలేదా? ఇక్కడి నుండి పోరా… ఎదవ నాయాల” అంటూ ఉండగానే … ఆ బిచ్చగాడు వెనువెంటనే “అయ్యా! దేవుడు లేని చోటు నాకు చూపించు! అక్కడికి వెళ్లి తాపీగా నా చుట్ట నేను కాల్చుకుంటాను… చూపిస్తావా… చూపించు.. అంటూ ఉండగానే … ఆ షాపు వాడు వెంటనే “అయ్యా! ప్రతి వెధవా! వేదాంతే! నాలుగు మాటలు నేర్చుకుని… కడుపు కోసం నానా చంకలు నాకుతారు! వీళ్ళకి బుద్ధి లేదు… వీళ్లను చూస్తే నాకు బుద్ధి రాదు” అంటూ నా వైపు తిరిగి నాకు కావలసిన కాపీ ఇచ్చినాడు! నేను ఆ కాఫీని సేవిస్తూ ఆ బిచ్చగాడివైపు ఓరకంట గమనిస్తున్నాను!
వాడు నేను గమనిస్తున్న విషయం గమనించి… గమనించనట్లుగా పెద్దగా బూతులు తిడుతూ నా కనుచూపు నుండి తప్పుకోవాలని ప్రయత్నించే సరికి నాలో తెలియని ఆనందం వేసింది! ఒకవేళ వీడు నిజమైన కాపాలికుడు కాదు కదా అనుకుంటూ తాగుతున్న కాఫీని వదిలేసి… ఈ బిచ్చగాడి వైపు వెళ్లడం… వాడు నన్ను చూసి వేగంగా అడుగులు వేస్తూ దూరంగా వెళ్ళి పోతూ… ఉండటం గమనించి నేను వెంటనే “స్వామి… స్వామి! మీరు కాపాలిక స్వామి దీక్షా పరులే గదా! అంటూ ఉండగానే … వాడు వెంటనే “కాపాలిక? వాడెవడు? వాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు! వాడు ఎవడో నాకు తెలియదు! నన్ను వదిలేయ్” అంటూ ఉండగా… నేను వెంటనే ఆ బిచ్చగాడి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసాను!
వెంటనే స్వామి “ ఎవరైనా చూస్తే బావుండదు… నన్ను వెతకడానికి వచ్చిన వాడివి నువ్వే అని నాకు తెలుసు! ఘంఠా మఠము లో జరిగిన సంఘటన విషయం తేల్చుకోవడానికి… చనిపోయిన వారి గురించి తెలుసుకోవడానికి … నువ్వు వస్తావని… నీ రాక కోసం… నేను ఎదురు చూస్తున్నాను” అనగానే … ఏం మాట్లాడాలో నాకు అర్థంకాని స్థితి.. నేనే ఆ వ్యక్తిని అని ఈయనకి ఎలా తెలుసు? … నేనే ఆ వ్యక్తిని అని ఎలా గుర్తు పట్టినాడు?.. నేను వస్తున్నానని ఈయనకి ఎలా తెలుసు? … అసలు నేను ఘంఠా మఠము లో చేసిన విధానం ఎలా తెలిసింది ? చనిపోయిన వ్యక్తి గురించి ఎలా తెలిసింది? 6 నెలల క్రితం జరిగిన యదార్థ సంఘటన … 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యక్తికి ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే… నా వైపు చూస్తూ బిచ్చగాడు “స్వామి! మీకు వచ్చిన ధర్మసందేహాలు సాధన ప్రారంభంలో ఉన్న వాడికి వస్తాయి! మాయ సంగతి తెలిస్తే గాని అన్ని మాయం అయిపోతాయి! కంగారు పడకు…. ఆశ్చర్య పడకు! ఈ మాత్రానికి ఇలా అయితే ఎలా… కలగా కనబడిన సంఘటనలు ఇలలో జరిగితే నువ్వు నా దగ్గరికి వచ్చే వాడి వా ? ఎప్పుడో ఆ ముసలి దంపతులకు భోజనం అయ్యే వాడివి కదా లేదా స్మశాన కాపరికి దొరికిపోయే వాడివి కదా అనగానే …. నాకు నోట మాట రాలేదు!
నా జీవితం అంతా ఏదో పుస్తకంలో చదివిన లేదా వ్రాసిన విషయాలు చూసినట్లుగా ఇతను చెప్తున్నాడే! నా అనుభవాలు ఎవరికి ఇంతవరకు చెప్పలేదు! అలాంటిది నా అనుభవాలు చూసినట్లుగా సహజంగానే చెప్తున్నాడే! వామ్మో! ఇతను నిజంగానే కాపాలికుడే! జాగ్రత్తగా మసలుకోవాలి! పిచ్చి వేషాలు వేయకూడదు… అనుకుంటూ అప్పటిదాకా వానరుడి లాగా వేషాలు వేసే నా మనస్సు నారాయణుడు వైపు వెళుతోందని గమనించే స్థితిలో నేను లేను…. ఆ బిచ్చగాడైన కాపాలికుడు వైపు నడవడం తప్ప ఏమీ ఆలోచించని స్థితిలో నేను ఉన్నానని మాత్రమే నాకు తెలుస్తోంది! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !
శుభం భూయాత్
పరమహంస పవనానంద
***************************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmeeru baadhani thattukoleka malli srisailam vellatam mee aavedana bhaktitho kaapalikudini gurthupattatam... aa tharvatha em jarginda ane aasakthini maaku penchi meeru thaapeega unnaru...
రిప్లయితొలగించండి