బ్రహ్మ ముడి వీడింది
మేమిద్దరం కూడా శూన్య బిందువు నందు శూన్యబ్రహ్మలుగా ఉండిపోయామని మీకు తెలుసు కదా. ఎందుకంటే బలహీనతలేని బలవంతుడిని ఈ విశ్వ సృష్టియే ఇంతవరకు సృష్టించలేదు. శూన్య బ్రహ్మ నుండి శూన్య బిందువుకు మారే సమయానికి అసలు సిసలైన మూల బలహీనత బయటపడుతుంది. అది కామమే లేదా జ్ఞానమే లేదా భయమే లేదా ఆశయే లేదా ఆనందమును ఏదైనా కావచ్చును. వీటిని కోల్పోతున్నామనే బలహీనత సాధకునిని శూన్య బిందువుగా సంపూర్ణ ఏకత్వ స్థితికి మార్చలేదు. అక్కడ దాకా వచ్చినా కూడా సాధకుడికి శూన్య బిందువు అలాగే శూన్య బ్రహ్మ అనే రెండు స్థితుల్లో అద్వైత స్థితిలో ఉండిపోతాడు. వాడు కాస్త ఏకత్వ స్థితి అనగా శూన్య బిందువుగా మారాలి అంటే సాధకుడికి నాకు తెలిసినంతవరకు జ్ఞానం అనేది ఉండకూడదు. అంటే ఆలోచన అనేది ఉండకూడదు. ఆలోచన అనేది శ్వాసను బట్టి ఉంటుంది. శ్వాస పోతే గాని అంటే మన ప్రాణాలు పోతే గాని ఆలోచన పోదు. ఆలోచన పోతే గాని జ్ఞానం పోదు. అంటే సాధకుడు తన చిట్టచివరి సాధన స్థాయి అయిన శూన్య బ్రహ్మ యందు శూన్య బ్రహ్మ లేదా విశ్వాత్మ లేదా పరబ్రహ్మ లేదా శివోహం లేదా నిరాకార పరబ్రహ్మ ఇలా మున్నగు ఆలోచన లేకుండా కలగకుండా ఉండాలి. అంటే తను ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ తర్వాత తను ఆత్మ అని మర్చిపోవాలి. అప్పుడే శాశ్వత మరణము వస్తుంది.అంటే శూన్య బిందువుగా సాధకుడు మారతాడు. అప్పుడు ఈ విశ్వమంతా ఏర్పడిన శూన్య బిందువు కాస్త అచేతన స్థితి లోకి వెళ్ళిపోయి శూన్యము యందు కలిసిపోతుంది. ఇక కలలాంటి నిజం లేదా నిజం లాంటి కలను కనే వాడు ఉండడు. ఏమీ ఉండదు.సర్వం శూన్యం. అదికూడా ఉంటుందో లేదో తెలియని స్థితి. కానీ ఇవన్నీ జరగాలంటే సాధకుడు తనకున్న చిట్టచివర బలహీనత దాటుకోవాలి. ఇంతవరకు నాకు తెలిసి ఎవరు కూడా దాటుకోలేదు. ఒకవేళ దాటినారేమో నాకు తెలియలేదేమో. ఎవరికి ఎరుక. ఎందుకంటే శూన్య బ్రహ్మ సాధన స్థాయి అంటే 100% కి 99.99 శాతం అన్నమాట.0.01% శాతం మాత్రమే బలహీనత వలన సాధకుడు శూన్య బ్రహ్మగా మిగిలిపోతాడు. ఆదియోగి అయిన సదాశివమూర్తి 36 కపాలములతో ఇదే సిద్ది అనగా శూన్య బిందువులో శూన్యము అయిపోవాలని కైలాస పర్వతము నందు యోగసాధనలో ఉన్నారు. ఇది కోటాను కోట్ల సంవత్సరాల నుండి జరుగుతున్న సాధన ప్రక్రియ అన్నమాట. ఏదో మాకున్న యోగము వలన ఈ శూన్య బ్రహ్మ వరకు మా సాధన వచ్చింది. కానీ నాకున్న కామ గుణము అనే బలహీనత వలన అలాగే మా జిఙ్ఞాసికి వాడుకున్న తెలియని భయము అనే బలహీనత వలన మేమిద్దరం కూడా ప్రస్తుతానికి శూన్య బిందువు కాకుండా శూన్య బ్రహ్మగా మిగిలిపోయినాము. ఆది నుంచి సాధన అంతా కూడా కామ మాయ నన్ను ఆడుకుంది. అలాగే మా జిఙ్ఞాసిని కూడా భయము ఆడుకుంది. ఏమి చేస్తే ఏమి జరుగుతుందో అనే భయం… ఒకవేళ తప్పు చేస్తే సాధన ఆగిపోతుందని భయం ఇలా 18 రకాల భయాలు వాడిని ఆడుకున్నాయి. శూన్య బ్రహ్మగా మారినా చాలు వాడు మనో నిశ్చల స్థితి పొందుతాడు.త్రస్య రేణువు అనగా పిండి రేణువు గా మారి శూన్య బిందువునందు సాక్షీభూతంగా ఆనంద రహితముగా ఉండిపోతాము. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశములో ధ్రువతారగా శూన్య బ్రహ్మగా మిగిలిపోతాము.
అదే శూన్య బిందువు అంటే ఆకాశంలో కలిసిపోవడం అన్నమాట. అంటే మా సాధన భూమి మీద మొదలయ్యి ఆకాశంలోని ధ్రువతారగా మారేదాకా సాగిందని గ్రహించండి. అదే గ్రహాలు అయితే స్పందన మాయ వలన ఆ గ్రహాల జీవులు మీద వారి సంకల్పాలు, ఆలోచనలు, స్పందనలు నెరవేర్చే లోకకల్యాణార్థం అనే బృహత్ ప్రక్రియ ఉంటుంది. అదే ధ్రువతారలకు అయితే ఎలాంటి పనులు ,ప్రక్రియలు ఉండవు. ఇది కేవలం సాక్షీభూతంగా ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని గ్రహ జీవులు దిక్కులు అనగా ఉత్తరదిక్కు ఎటు వైపు ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. అనగా సాధకులు అయితే ఈ ధ్రువతార ఆధారంగా చేసుకుని కపాల మోక్షం ఇచ్చే కృష్ణబిలం ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటారు.కృష్ణబిలం ఎలా అంటే ధ్రువతార ఎప్పుడు నిశ్చలముగా స్థిరముగా ఉత్తరదిక్కులోనే ఉంటుంది.ఎలా అయితే ధ్రువతార నిశ్చలముగా ఉంటుందో అలా శూన్యబ్రహ్మ కూడా ఉంటాడు. అంటే వీరు కూడా అన్ని రకాల జ్ఞానాలని అన్ని రకాల మాయలు దాటిన వారికి నిజ సంపూర్ణ బ్రహ్మజ్ఞానం అనగా మౌనంగా శూన్యబ్రహ్మ మేధా దక్షిణామూర్తి లాగా లోకానికి మౌనముగా సాక్షీభూతంగా అందిస్తారు. ధ్రువ తార ఎలా అయితే తన ప్రమేయం లేకుండానే గ్రహజీవులకి ఉత్తరదిక్కు చూపిస్తుందో అలా శూన్య బ్రహ్మ కూడా తన ప్రమేయం లేకుండా తన అవసరము లేకుండా తన దరి చేరకుండా అర్హత యోగ్యత ఉన్న సాధకుడికి నిజ బ్రహ్మజ్ఞానం సంపూర్ణముగా అందిస్తాడు. సాధకుడికి ఉన్న బలహీనతలు మర్మాలు మాయలు బట్టి వారి శూన్య బ్రహ్మలు వారికి తగ్గట్టుగా వారికి కావాల్సిన బ్రహ్మజ్ఞానము వారి ప్రమేయం లేకుండా వారికి తెలియకుండానే పట్టించుకోకుండా తెలిసినా పట్టించుకోకుండా మౌనంగా అందిస్తారు. దీని కోసము మళ్లీ జన్మలు ఎత్తరు. శిష్యులు కోసము భక్తులు కోసము ప్రాకులాడరు.దేనికి స్పందించరు. దేనిని సంకల్పించరు. దేని గురించి ఆలోచించరు. అంతెందుకు మనకు ఉత్తర దిక్కు చూపించడానికి ధ్రువతార కిందకి వచ్చి చెబుతుందా? చెప్పదు కదా.అలాగే శూన్య బ్రహ్మ గూడా ఉంటారని తెలుసుకోండి. నిజానికి అది ధ్రువతారయో లేదా శూన్య బ్రహ్మయో ఎవరికీ తెలియదు.రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి.
ఇక బ్రహ్మముడి విషయానికి వస్తే సాధకుడు కాస్త 13 యోగ చక్రాలలో ఏదో ఒక మాయ వలన సాధన పరిసమాప్తికి చేసుకోకుండా అదే శూన్య బ్రహ్మగా మారకుండా ఆగిపోవడం జరుగుతుంది. 100 మందిలో 91 మంది 12 యోగ చక్రాలు దాటలేక పోతున్నారు. మిగిలిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది కాస్త హృదయ చక్రమును దాటలేక పోతున్నారు. మిగిలిన ఒక్కడు మాత్రమే బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకుని అక్కడున్న 85 సంవత్సరాలు ఆదిపరాశక్తి అదే బాలా త్రిపుర సుందరి దేవి లోని దేవి మాయ అయిన సహన శక్తిని కోల్పోయి తిరిగి సహస్ర చక్రములోనికి పడి అటుపై మళ్లీ మూలాధార చక్రము నందు చేరుకోవడం జరుగుతుంది. అర్హత యోగ్యత ఉన్నవాడు మాత్రమే శూన్య బ్రహ్మ అవుతున్నాడు. బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలమునకు చేరుకుంటున్నాడు. మరి నాకు ఇవి ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది అన్నప్పుడు సాధకుడు తన చిట్టచివరి సాధన స్థాయి అయిన బ్రహ్మరంధ్రమునకు వచ్చేదాకా చూడాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తీరా అక్కడిదాకా వెళితే బ్రహ్మ రంధ్రము యొక్క చితాగ్ని యొక్క దహనశక్తిని తట్టుకోలేక సాధకుడు సహన శక్తిని కోల్పోవటం వల్ల మాయలో పడితే మూలధార చక్రమునకు చేరుకోవలసినదే.
అంటే ఇదంతా చూస్తుంటే వైకుంఠపాళి ఆట లాగా ఉంటుంది. ఈ ఆటలో అన్ని రకాల పాములు అనగా యోగమాయలు అలాగే అన్ని రకాల నిచ్చెనలు అనగా యోగ సిద్ధులను దాటుకుని ఎక్కి చిట్టచివరి అతి పెద్ద పాము నోట్లో పడితే అనగా 107 గడి నుండి తిరిగి 1 వ గడికి ఎలా అయితే చేరుతామో అలా 107 గడిలో లాగా పాము ఉన్నట్లుగా సాధకుడు బ్రహ్మరంధ్రము వద్ద చితాగ్ని అనే మహా సర్పం ఉంటుంది. దీని తోక మూలాధారచక్రంలో ఉంటుంది. దీని నోట్లో పడితే అంతే సంగతులు. సాధన అంతిమ చక్రం అయిన బ్రహ్మరంధ్రము నుండి సాధన ఆది చక్రమైన మూలాధారచక్రంలో చేరుకోవడం ఖచ్చితం అన్నమాట. పాము నోటిలో పడటం అంటే సహన శక్తిని కోల్పోవడం అన్నమాట. వైకుంఠపాళి ఆట లో పాముని దాటితేగాని 108 గడి రాదు. ఆపై అక్కడ ఎలాంటి పాములు ఉండవు. నిచ్చెనలు ఉండవు. ఆట ఆడే స్థితి ఉండదు. ఖచ్చితంగా చిట్టచివరి గడియైన 111 కి చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భయమూ లేకుండా నిర్భయముగా చేరుకుంటారో అలాగే విశ్వ సృష్టి లోని జీవ నాటకంలో కూడా బ్రహ్మరంధ్రము వద్దనున్న చితాగ్ని మహాకాలుడు సర్పం నోటికి చిక్కకుండా మీరు సహన శక్తి తో నిలబడి మనోధైర్యంతో ఉండగలిగితే నా సామిరంగా! మీరు కూడా ఆటలోని 108 గదిలోనికి ప్రవేశించినట్లు గా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దగ్గరికి చేరుకుంటారు. ఇక ఆపై సాధన ఉండదు. చేసేది ఉండదు. అంతా కూడా నిర్భయంగా సాక్షీభూతంగా చూస్తూ ఉండాలి. దానికంతటే అదే మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంటుంది. అంటే వైకుంఠ పాళి ఆట అయిపోయిన తర్వాత తిరిగి ఆట ఆడితే ఎలా ఉంటుందో అలా సాధన అయిన తర్వాత మీరు శూన్య బ్రహ్మగా మారిన తర్వాత కూడా ఈ విశ్వ ప్రకృతి మళ్ళీ మీరు జీవ నాటకం లో ఏదైనా పాత్ర వేస్తారా? అని అడుగుతుంది. దానికి మీరు స్పందించకుండా మౌనముగా సాక్షిమాత్రంగా ఉండాలి అన్న మాట. ఒకవేళ మీరు పాత్ర వేస్తాను అంటే దానికి తగ్గట్లుగా ఈ కనిపించే విశ్వము ఉండాలని మీరు సంకల్పం లేదా ఆలోచన లేదా స్పందన గాని చేస్తే తిరిగి మీరు హృదయ చక్రమునకు లిప్త కాలంలో చేరుకుంటారు. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రపంచం మీకు కనపడాలంటే అందులో మీకు మీరే అన్ని రకాల పాత్రలు వెయ్యాలి కదా. ఏకత్వం నుండి భిన్నత్వం లోకి మారి పోవటం అన్నమాట. పునర్జన్మలు ఎత్తుతారు. అనగా అపస్మారక స్థితి పొంది తెలుసుకున్న బ్రహ్మజ్ఞానం మర్చిపోయి విశ్వాత్మ కాస్త జీవాత్మగా మారిపోవడం జరుగుతుంది. అంత మీకు అవసరమా? ఆలోచించండి. ఒకసారి ఆట ఆడినందుకే విరక్తి కలిగితే మళ్లీ ఆడిన ఆట ఆడటం ఎందుకు? నా బొందా. నా బూడిద. కావాలని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? బాధపడటం ఎందుకు? అంతా దేవుడే చేస్తున్నాడు అని అనుకోవడం ఎందుకు? అంతా కావాలని మీకు మీరే చేసుకున్నది కదా. ఆదిలోనే ఒకసారి ఆడిన ఆటని తిరిగి ఆడకుండా ఉండి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కావు. సాధన ఎలా చేయాలో పుస్తకాలు చదివే అవసరమే ఉండేది కాదు. దీనికి తగ్గ పుస్తకాలు రాసే అవసరమే ఉండేది కాదు కదా. అంటే మీరు శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వచ్చిన తర్వాత బ్రహ్మ తదాకార స్థితికి అనగా దేనికి స్పందించిన స్థితిని పొందాలి అని తెలుసుకున్నారు కదా. మౌనంగా సాక్షీభూతంగా ఆనందరహితం గా ఉండాలి అన్నమాట. ఇలాంటి స్థితిని సాధకుడు ఎలా పొందాలి అనేది చిక్కుముడి. అదే బ్రహ్మముడి అన్నమాట. ప్రకృతికి పూర్తిగా స్పందించకుండా మీరు ఉండగలిగితే శూన్య బ్రహ్మగా శూన్య బిందువు నందు శూన్యములో లయము అవుతారు.అంటే వైకుంఠపాళి ఆట లో 108 గడి నుండి 111 గడి అనగా ఆఖరికి చేరుకోవడం అన్నమాట. దానితో మీ వైకుంఠపాళి ఆట ఎలా అయితే అయిపోతుందో అలాగే మీ జీవ నాటకంలో జీవన పాత్ర కూడా ఆగిపోతుంది. అయిపోతుంది. ఆట ఆగిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడికి చేరిన తర్వాత ఆగిపోకుండా ముందుకు వెళ్లి తిరిగి జీవ నాటక ఆటను ప్రారంభించవలసి ఉంటుంది. కావాలని వెళ్ళేవాడిని కావాలని ఆడేవాడిని ఎవరు ఆపగలరు. ఎవరి కర్మకి ఎవరు కర్తలు. వారి కర్మకు వారే కర్త కదా.
బ్రహ్మముడి విషయానికి వస్తే బ్రహ్మరంధ్రము వద్ద ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు మూలప్రకృతి 8 అంగాలతో ఉంటుందని ఆపై శూన్య బిందువు ఉంటుందని ముందు అధ్యాయాలలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ ఎనిమిది ప్రకృతి అంగాలే పతంజలికి అష్టాంగ యోగాలు అనగా 1.యమము 2.నియమము 3.ఆసనాలు 4.ప్రాణాయామము 5.ప్రత్యాహారము6.ధారణ 7.ధ్యానము 8. సమాధి అయితే అలాగే బుద్ధుడికి అయితే ఈ అష్టాంగాలు వరుసగా 1.మంచి దృష్టి 2.మంచి సంకల్పం 3.మంచి మాట 4.మంచి పని 5.మంచి జీవితం 6.మంచి వ్యాయామం7. మంచి జ్ఞానం 8.మంచి సమాధి ఉన్నాయని తెలుసు కదా. పతంజలి ప్రకారంగా చూస్తే బ్రహ్మరంధ్రము సాధన గురించి చెప్పడం జరిగినది. అదే బుద్ధుడు ప్రకారంగా చూస్తే బ్రహ్మరంధ్రము సాధన చేసిన తర్వాత వచ్చే స్థితిని గురించి చెప్పడం జరిగినది. ఇందులో ఈయనకి ఒక చిక్కుముడి వచ్చినది.
ఎలా అంటే బుద్ధుడికి ఈ బ్రహ్మరంధ్రము లో సాధన స్థాయిలో ఉన్నప్పుడు ఎనిమిది రకాల వస్తువులు వచ్చినాయి. అనగా గొడుగు, తామర పువ్వు, శంఖము, చిక్కుముడి, ధర్మచక్రము, నిధి పాత్ర ,బంగారు చేపలు, విజయ పతాకము అనే అష్టవసువులు వచ్చినాయి. ఈ వస్తువుల్లో వచ్చిన చిక్కుముడి అనే గుర్తు అంటే దేనిని సూచిస్తుంది అంటే శూన్య బ్రహ్మ అయిన తర్వాత సాధకుడు దేనికి స్పందించకుండా ఎలా ఉండాలో ప్రకృతి కాస్త ఒక చిక్కుముడి రూపంలో సాధకుడు ముందు ఉంచినది.కాకపోతే మరి ఆయన ఈ చిక్కుముడి విప్పారో లేదో నాకైతే తెలియదు. కానీ చిక్కుముడి ఉన్నదని నేను మాత్రం ధ్యాన అనుభవాలు అనుభూతులు పొందడం జరిగినది. దానితో తను శూన్య బ్రహ్మగా మారినప్పుడు తను అనుకున్న కోరిక లేని సమాజం చూడాలని సంకల్పము ప్రకృతి ఈయనకి ఎనిమిది అంగాలు ఇవ్వడం జరిగినది. అవే బుద్ధుడు అష్టాంగాలు అయినాయి. ఇందులో సాధకుడు లేదా జీవుడు తన కోరికకి స్పందించకుండా ఉండాలంటే ఏమి చేయాలో ప్రకృతి ఎనిమిది గుర్తులు ఇచ్చినది. ఈ ఎనిమిది గుర్తుల్లో ఒక గుర్తుగా చిక్కుముడి ఉన్నది. దానిని ఆయన నాకు తెలిసినంతవరకూ చేధించిన లోకానికి చెప్పలేదు.ఎవరికి వారే ఛేదించాలని తమ అభిమతములో అష్టాంగయోగములో ఎనిమిది వస్తువులలో ఒక వస్తువుగా చిక్కుముడిగా ఉంచినారు.అది ఏమిటో తెలుసుకోవాలని ఆలోచనతో అయిన సాధన చేస్తారు అని ఆలోచన వలన ఈయన ఇలా చేసి ఉండాలి. లేదా ఈయనికి ఈ చిక్కుముడి చేధించడం జరగకుండా ఉండి ఉండాలి. ఎవరికి ఎరుక. కాకపోతే మేమిద్దరం కూడా శూన్య బ్రహ్మ అయినప్పుడు మూలప్రకృతి మాకు ఎనిమిది రకాల వస్తువులను ఇచ్చినది.
అది నాకు వచ్చిన ఈ అష్టవస్తువులు ఏమిటంటే 1. ఇష్టలింగం 2.సాలగ్రామము 3. పాంచజన్య శంఖం 4.సుదర్శన చక్రము 5. బ్రహ్మముడి 6. షట్ కోణం 7 . ఓంకార చిహ్నము 8. బ్రహ్మకపాలం. ఇందులో ఇష్టలింగమంటేనే కామానికి ప్రతీక. ఎందుకంటే ఈ లింగానికి అధిదేవతగా ఇష్టకామేశ్వరుడు, ఇష్ట కామేశ్వరి ఉంటారని తెలుసు కదా. ఎనిమిది రకాల వస్తువులు అనగా సాలగ్రామాలు, సుదర్శన చక్రము నేపాల్ లోని గండకీ నది నుండి వస్తే… బ్రహ్మకపాలం అనేది కాశీ క్షేత్రం నుండి వస్తే…. పాంచజన్య శంఖం అనేది ద్వారకా క్షేత్రం నుండి వస్తే ….ఇష్ట లింగము అనేది కర్ణాటక రాష్ట్రంలోని సర్ప భూషణ మఠం నుండి వస్తే ….ఓంకార చిహ్నము రాజస్థాన్లోని పుష్కర క్షేత్రం లో ఉన్న బ్రహ్మ దేవాలయం నుండి వస్తే…. వీటిని ఉపయోగించుకుని పాంచజన్య శంఖంతో ఓంకారనాదంతో సాలగ్రామాలకి, సుదర్శన చక్రాలకి, ఇష్ట లింగానికి నిత్య అభిషేకాలు చేస్తూ జలమే వాటికి ఆహారంగా ఇస్తూ విభూదియే వాటికి శక్తిగా ఇవ్వడం జరిగింది. ఇలా కొన్నాళ్లపాటు చేస్తే గాని నేను నక్షత్రము అదే ధృవతారగా అనగా శూన్య బ్రహ్మ సాధన స్థాయికి రావడం జరిగినది. ఇక్కడకు వచ్చిన తర్వాత చిక్కుముడి లాగా బ్రహ్మముడి అదేనండి! దేనికి స్పందించకుండా మౌనంగా ఎలా ఉండాలో అనే చిక్కు ముడి వచ్చింది. ఆట అయినదని తెలిసింది. కాని మూల ప్రకృతి తమ 8 అంగాలతో మళ్ళీ నాతో తిరిగి ఆడతావా? అని సవాలు చేస్తోంది. 8 అంగాలలోని బ్రహ్మముడి అనే అంగము దాటితేగాని ఈ మూల ప్రకృతి ని దాటి ఉన్న శూన్య బిందువు లోనికి ప్రవేశించాలి. ఇక్కడిదాకా అనగా చిక్కుముడి దగ్గర కొన్నాళ్ళ పాటు ఆగిపోవాల్సి వచ్చింది.
నా పరిస్థితి ఇలా ఉంటే మన జిజ్ఞాసి కూడా శూన్యబ్రహ్మ సాధన స్థాయికి వచ్చినప్పుడు వీడుకున్న భయము అనే బలహీనత దాటటానికి తగ్గట్లుగా ప్రకృతి మాత ఇతనికి కూడ ఎనిమిది అంగాలు ఇచ్చింది. అవి ఏమిటంటే 1. ఇష్టలింగం 2.ఊదే దక్షిణావృత పాంచజన్య శంఖం 3.సుదర్శన చక్రము 4.చిక్కుముడి 5.త్రిశూలము 6. శూలము 7. ఓంకారం చిహ్నము. 8. బ్రహ్మకపాలం. ఇవి వాడికి వచ్చినాయి. ఇందులో వీరికి నాకు కొన్ని వస్తువులు కలిసినాయి. మన వాడికున్న భయము పోగొట్టుకోవడానికి త్రిశూలము అలాగే శూలము వీడికి ఇవ్వడం జరిగినది. దాంతో వీరు కూడా జలముతో సాలగ్రామాలకి సుదర్శన చక్రాలకి ఇష్టలింగమునకు అభిషేకాలు చేస్తూ దక్షిణావృత శంఖముతో ఓంకారనాదము చేస్తూ సాధన కొనసాగిస్తూ శూన్య బ్రహ్మగా మారి తిరిగి నాకు లాగానే చిక్కుముడి దగ్గర ఆగి పోవడం జరిగినది. అంటే వీరికి మూలప్రకృతి కాస్త భయము లేని సమాజం చూడాలని ఉందా? అని వీరికి సవాల్ ఇవ్వడం జరిగింది. దీనినే ఎలా దాటాలో దీనికి స్పందించకుండా ఎలా ఉండాలో నాకు లాగానే నాకు అయితే ప్రకృతి కాస్త కామములేని సమాజమును చూడాలని అనగానే నేను వెంటనే దానికి స్పందించి అవును! స్త్రీపురుషుల మధ్య కామమే లేని సమాజం చూడాలని ఆలోచన చెయ్యడం లిప్తకాలంలో జరిగిపోయినది. అనగా మా 36 కపాలాలలో 33 కపాలము చూపించిన విపరీత శృంగార దృశ్య ప్రపంచానికి నేను ఈ ఆలోచన చేయడం జరిగినది. దానితో నేను కామానికి సంబంధించిన హృదయ చక్రం వద్దకు తిరిగి చేరుకోవడం జరిగినది. అప్పటి గాని నేను చేసిన తప్పు ఏమిటో తెలిసి రాలేదు. అదేనండీ కామం భావము లేని సమాజం చూడాలని అనుకున్నాను కదా. మరి దానిని చూడాలంటే కామదేవతలు ఉండే ఇష్ట కామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఉండే హృదయ చక్రమునకు రావడం జరిగినది. అదే ఈ విశ్వ సృష్టి నా చెప్పుచేతలలో ఉండాలని అనుకుంటే విష్ణుమూర్తి ఆవాసమైన సహస్రార చక్రంలో కి వెళ్ళే వాడిని. కామ గుణమునకు నేను స్పందించడం వలన హృదయ చక్రమునకు తిరిగి రావడం జరిగినది. ఇదంతా కూడా శూన్యబ్రహ్మ సాధన స్థాయిలో ఉన్నప్పుడు వచ్చిన అష్టాంగాలు లోని బ్రహ్మముడిని చేధించి ఉంటే నా స్థితి వెనక్కి వచ్చేది కాదు అని తెలుసుకున్నాను. ఇదే విషయం మా జిజ్ఞాసి విషయంలో జరగకూడదు అని భావించి అందరికీ చిక్కుముడి ఒక్కటే ఉంటుందని దానిని చేధించిన వారికి మాత్రమే శూన్య బ్రహ్మగా శూన్య బిందువు నందు ప్రవేశించే అర్హత లభిస్తుందని లేనిచో నాకు లాగా బుద్ధుడి లాగా ఇతర నామరూప దైవాలుగా నామ రూప గురువులుగా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుందని నేను గ్రహించాను.
వారికున్న బలహీనత మాయ బట్టి 13 యోగ చక్రాల్లో ఏదో ఒక చక్రములోనికి వెళతారని నేను గ్రహించాను. దానితో ఎలాగైనా బ్రహ్మముడిని అదే చిక్కుముడి చేధించాలని విశ్వ ప్రయత్నాలు నేను చేయటం మొదలు పెట్టాను. కారణం లేనిదే కార్యము ఉండదు కదా. ఈ చిక్కు బ్రహ్మముడిని చేధించటానికి ప్రకృతిమాత నన్ను వెనక్కి పంపించినట్టుగా ఉన్నది అని గ్రహించాను. చిక్కుముడి వీడితే అందరు కూడా శూన్య బ్రహ్మలుగా మారి శూన్య బిందువు నందు లయం చెందుతారు. కాకపోతే శూన్య బ్రహ్మ సాధన స్థాయి వరకు వచ్చి వారికున్న మూల బలహీనతకు వస్తారు.దానిని దాటలేక 13 చక్రాలలో ఒక చక్రము మాయలోపడి దానికి తగ్గట్లుగా ఆయా శరీరాలతో జీవ నాటక పాత్రలు వేస్తూ ఉంటారు. దానితో బ్రహ్మముడి అంతం చూడాలని నాకు బలంగా అనిపించింది. అంత తేలికైన విషయం కాదని గ్రహించాను. ముడి వెయ్యటానికి ప్రకృతి ఆదిలో కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు తీసుకుంది.అదే దీనిని ఎవరైనా ఇంతవరకు చేధించినారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ చేధించిన లోకానికి చెప్పకుండా చిదంబర రహస్యంగా ఉంచినారా కూడా తెలియదు. ఏమో ఎవరికి ఎరుక.కాకపోతే ఎలాగైనా మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ఈ చిక్కుముడిని చేధించేటట్లు గా చేసి శూన్య బ్రహ్మగా శూన్య బిందువు నందు లయం చేస్తే వీరి మార్గం ద్వారా మిగిలిన అందరూ కూడా వెళతారు కదా. ఒక ద్వారబంధం తీస్తే గానీ మిగిలిన వాళ్లు వెళ్ళడానికి ఉండదు కదా. మోక్ష ద్వారబంధం అనగా ఈ బ్రహ్మముడి అదే ప్రకృతి మాత కి స్పందించకుండా ఎలా ఉండాలి అనే చిక్కుముడి వీడాలి. అప్పుడే శూన్య బిందువు నందు ప్రవేశించే మహా ద్వారము తెరుచుకోదు అని నాకు అర్థమైంది. దీనికి మార్గ నిర్దేశకుడిగా మా జిజ్ఞాసిని ఉంచాలని నాకనిపించింది. ఎందుకంటే వీరికి అన్ని రకాల అర్హత యోగ్యతలు ఉన్నాయి. కాకపోతే వీరికి బలహీనతగా భయం మాత్రం ఉన్నది. అది కాస్త పెద్ద మాయగా మారినది. బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు కదా. ఇక దానితో ఈ బ్రహ్మముడి సంగతి చూడాలని దాని మీద వివిధ పరిశోధన చేయడం ఆరంభించినాను. అప్పుడు జిజ్ఞాసి వెంటనే “స్వామి! ఎవరి వల్ల కానిది మన వలన అవుతుందా? చాలా ఎక్కువగా ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావేమో. తద్వారా ఏమైనా తేడా వస్తే విపరీతమైన మనోవేదనకు గురి కావాల్సి వస్తుంది. ఇంతటితో మన సాధన ఆపేస్తే మంచిది కదా” అని అనగానే వెంటనే అతనితో “ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది. తాడు లాగితే కొండ రావచ్చును. లేదా పోగు మాత్రమే మిగులుతుంది. ఈ చిక్కుముడి వీడితే వచ్చే బ్రహ్మానందం గురించి ఆలోచించు. అది వీడకపోతే మనకి మిగిలేది ఆవేదనే కదా. ప్రయత్నిస్తే పోలా. వస్తే కొండ. పోతే పోగు. ఏమంటావు. సాధిస్తే ఇద్దరితో పాటు అందరూ కూడా శూన్య బ్రహ్మగా మారి శూన్య బిందువులోనికి పోతాము. లేదంటే అందరూ మిగిలిపోయినట్లుగా శూన్య బ్రహ్మగా శూన్య బిందువు బయట ఉంటాము.అంతే తేడా” అని చెప్పి నా పరిశోధన కొనసాగించడం ఆరంభించాను. మా ఇద్దరికీ ఒకటే వస్తువులుగా సాలగ్రామములు, సుదర్శన చక్రము, బ్రహ్మకపాలం, ఓంకార చిహ్నము వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. అంటే ఈ వస్తువులలో తెలియని మర్మ రహస్యం ఉన్నదని మాకు అర్థం అయినది. ఇవి వచ్చిన క్షేత్రాల మీద ఈ వస్తువుల మీద పరిశోధన చేయడం ప్రారంభించాను.
నిజానికి మాకు గండకీ నది నుంచి వచ్చిన నిజమైన సాలగ్రామము సుదర్శన చక్రాలు రాలేదని నేపాల్లోని పశుపతి నాథ్ క్షేత్రమైన ఖాట్మాండ్ నుండి ఆ పేరుతో వచ్చినాయని తెలిసింది. అలాగే కాశి క్షేత్రం నుండి వచ్చిన బ్రహ్మ కపాలమాల నిజానికి అది కురుక్షేత్రం ప్రాంతమునకు చెందిన కపాలమాలని అటుపైన అది కాశీ క్షేత్రమునకు చేరి కాశీ క్షేత్రము నుండి అటుపై మాకు వచ్చినదని అంటే కాశీ క్షేత్రం నుండి నిజ కపాలమాల( ఎందుకంటే ఇక్కడ వీరభద్రుడు చేతిలో అంటిన బ్రహ్మకపాలం వీడినది )రాలేదని మా దృష్టికి వచ్చింది. ఇందులో వచ్చిన ఓంకార చిహ్నము మాత్రమే తన నిజ ప్రాంతం నుండి వచ్చినదని గ్రహించాము.అంటే నిజ క్షేత్రాల నుండి నిజ వస్తువులైన సుదర్శన చక్రాలు సాలగ్రామాలు రాలేదని తెలియడంతో ఆన్ లైన్ లో ఈ చిత్రాల నుంచి వచ్చిన నిజమైన వస్తువులను గుర్తించి వాటిని సేకరించడం అనగా కొనడం జరిగింది. దానితో కొంతమేర పరిష్కారం దొరికినట్లుగా అనిపించింది.
నేను తయారుచేసిన మోక్షమాల
అప్పుడు వీటిని పూజించడం ఆరంభించిన కొన్నాళ్ళ తర్వాత ధ్యానము నందు ఒక విచిత్ర మాల కనిపించినది. ఈ మాలకి కపాలములు, సాలగ్రామాలు, స్పటికలు, రుద్రాక్షలు లాకెట్ గా సుదర్శన చక్రము ఉన్నట్లుగా లీలగా కనిపించినది.మొదట్లో ఈ మాల ఆకారం ఇలా ఎందుకు ఉందో అర్ధం కాలేదు. ఈ మాల మీద పరిశోధన చేస్తే గానీ మరింత ముందుకి బ్రహ్మముడి దగ్గరికి వెళ్ళలేమని నేను గ్రహించాను. దానితో నాకు ధ్యానములో కనిపించిన మాల మాదిరిగా ఈ నాలుగు వస్తువులు అనగా రుద్రాక్షలు స్పటికాలు కపాలములు, సాలగ్రామాలు పెట్టి దీనికి లాకెట్ గా ఒక సుదర్శనచక్రం ఉంచడం జరిగినది. కానీ నా సమస్యకి ఎలా పరిష్కారం చూపుతుందో అర్థం కాలేదు. కానీ వీటిని అమర్చడంలో ఏదో తెలియని చిక్కుముడి ఉన్నదని నాకు స్పురణ అయినది. దానితో వీటిని మారుస్తూ వీటి సంఖ్య మార్చాలని నిర్ణయించుకున్నాను.
అప్పుడు అసలు బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములో ఉండే భాగాన్ని లెక్కించడం ప్రారంభించాను. అనగా అష్టదళ పద్మము అంటే ఎనిమిది అందులో ఉండే షట్ కోణము అనగా 6 దాని లోపల ఆరు సుదర్శన చక్రాలు అలాగే ఆరు త్రినేత్రాలు ఆపై అష్టాంగ భాగాలు ఆపై శూన్య బిందువు ఉండటం చూసి అనగా 8+ 6+ 6+ 6+ 8+ 1=35 వస్తుంది.అంటే సాధకుడుతో కలిపి 36 అవుతుంది. ఇది సదాశివమూర్తిలో ఉన్న 36 బ్రహ్మకపాలములకి సమానమని గ్రహించాను. అంటే బ్రహ్మాండ చక్రంలోని శూన్య బిందువులోకి వెళ్లాలంటే 36 ఉండాలి. అవి కూడా సాలగ్రామాలు, రుద్రాక్షలు, స్పటికాలు, కపాలములు ఉండాలని నా ధ్యాన అనుభవం చెబుతోంది. దానితో ఈ నాలుగింటిని తొమ్మిది చొప్పున 4x9=36 తో మాల తయారుచేశాను. ఇది వేసుకున్నా కూడా జిజ్ఞాసికి ప్రకృతి మాత యధావిధిగా సవాల్ విసరడము చేసేసరికి నా ఆలోచన తప్పు అని తెలిసినది. అంటే ఈ నాలుగు వస్తువులలో ఏదో మాయాపూరిత వస్తువు ఉన్నది కానీ మాలకి 36 తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే 36 కపాలములకే కపాలమోక్షం జరగాలి కదా. కాబట్టి మాలకి పూసలు 36 ఉండాలి అనేది ఖచ్చితమే. ఈ మాలకి అమర్చిన పూసల వస్తువుల మీద పరిశోధనలు చేయాలని ప్రయత్నాలు చేశాను. అప్పుడు రుద్రాక్షలనేవి ఈ విశ్వ సృష్టి యొక్క పురుష కణాలు అయితే స్పటికాలు అనేవి విశ్వమాత యొక్క స్త్రీ కణాలు అని సాలగ్రామాలనేవి వీరి సంయోగ ఫలితం వలన పుట్టిన జీవులని ఇక బ్రహ్మ కపాలాలు అనేవి చిట్టచివర అన్ని రకాల జీవులు పొందే అంతిమ స్వరూపమని ఇక దీనికి లాకెట్ గా ఉన్న సుదర్శన చక్రం అనేది బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంకు సంకేతాలని గ్రహించాను. అనగా ఆది శివుడు మరియు ఆది శక్తి కలిసి సంయోగం చెందితే ఆదివిష్ణువు జన్మించాడు. వీరంతా కాలానుగుణంగా బ్రహ్మ కపాలంగా మారినారు. ఆపై శూన్య బ్రహ్మగా బ్రహ్మరంధ్రము నందు చేరుకున్నారు అని తెలుస్తోంది. ఇందులో తిరకాసు ఏమిటంటే నిర్జీవ పదార్థాలు సంయోగం చెందితే ఒక జీవ పదార్ధం పుట్టడం అనేది కలలాంటి నిజం. అది సత్యం కాదు. కాని అసత్యమే సత్యముగా చూపిస్తోంది. అంటే ఇందులో ఆదివిష్ణువుకి సంబంధించిన సాలగ్రామాలు ఉంచాలా వద్దా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క రూపమే జగన్మోహిని రూపం కదా. అందువల్లనే విష్ణువే అమ్మవారు అన్నమాట. మరి ఈయనకి విడిగా మాలలో ఉండటం అనేది పొరపాటే కదా. అనగా స్పటికాలుతో సమానంగా సాలగ్రామాలు ఒకే విధమైన ఫలితాలు ఇచ్చినప్పుడు సాలగ్రామాలను మాలలో ఎందుకు ఉంచుకోవాలి. అప్పుడే సాలగ్రామాలను ఈ మాల నుండి తీసివేయాలి కదా అని లీలగా స్పురణ అయినది. దానితో రుద్రాక్షలు- 13, స్పటికాలు- 12, బ్రహ్మకపాలం- 11 ఈ మాల వస్తువులుగా తీసుకోవటం జరిగినది. అంటే 13+12+11=36 పూసల తో కూడిన మాల తయారు అయినది. ఇందులో రుద్రాక్షలలో 13 అనేవి శివ అష్ట మూర్తులు అనగా సూక్ష్మాంశ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పశుపతినాథ్ అన్నమాట. ఇంకా మిగిలిన 5 అనగా ఇష్ట లింగము, ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, ఇష్ట లింగ అనంతపద్మనాభుడు, శివాంశ హనుమంతుడు అవుతారు. అంటే రుద్రాక్ష 13 అనేవి నా హృదయ చక్రం గురించి చెప్పడం జరుగుతుంది. అనగా హృదయ చక్రంలో ఉండే నీలి అష్టదళ పద్మము నందు ఎనిమిది దళములు మరియు మధ్య బిందువు కలిపి పైగా ఈ చక్ర దైవాలుగా ఇష్టలింగము ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంతపద్మనాభుడు మొత్తం కలిపి పదమూడు అవుతాయి. అలాగే స్పటికాలు అనేవి ప్రకృతి యొక్క అష్టాంగాలు అయిన స్ధూలాంశ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అన్నమాట. అలాగే ఇవి బ్రహ్మరంధ్రము గురించి చెప్పడం జరుగుతుంది. అమ్మవారు అష్ట రూపాలలో అష్టదిక్కులుగా ఉంటే ఈ చక్ర దైవాలుగా ఆదిపరాశక్తి దీప దుర్గా, దీప కాళికాదేవి, దీప చండిక దేవతలతో కలిపి వచ్చింది. అనగా 8+4=12 అన్నమాట.బ్రహ్మ కపాలమాల విషయానికొస్తే 36 కపాలాలలో 25 కపాలాలులో మిగిలి 11 కపాలాలు వచ్చి కలుస్తాయి. అంటే 36 కపాలాలలో 11 మాత్రమే సత్యమైనవి. అనగా 1, 3, 5, 7, 9, 11 వరుసలలో ఒకటిలో రెండు 3… 3 లో రెండు 5…5 లో రెండు 7…7 లో రెండు 9.. 9 లో రెండు కలుస్తూ 11 అవుతాయని నా పరిశోధనలో తెలిసింది. దానితో 11 కపాలాలుగా ఉంచడం జరిగినది. విచిత్రమేమిటంటే ఏకాదశరుద్రులు కూడా 11 మంది ఉండటమే ఆశ్చర్యం అన్నమాట. ఈ బ్రహ్మకపాలంలో 11 అనేవి దేనికి స్పందించిన బ్రహ్మ తదాకార స్థితికి సంకేతమన్నమాట. ఇక ఈ మాలకి లాకెట్ అయిన సుదర్శన చక్రం అనేది శూన్య బిందువు దగ్గరికి తీసుకుని వెళ్లి అందులో లయం చేసే ఏకత్వ మార్గ నిర్దేశకం గుర్తు అన్నమాట. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న మాలను నేను అలాగే జిజ్ఞాసి వేసుకుని యధావిధిగా ఆరాధన చేసుకుంటూ ఉండేసరికి ఈ ప్రకృతి మాత నుండి ప్రతిస్పందనలు మాకు రాలేదు. చిక్కుముడి అయిన బ్రహ్మ ముడి వీడింది అని గ్రహించాను.
మోక్షమాలతో సర్వకర్మనివారణానుభవం:
ఒకరోజు ధ్యానము నందు నాకు ఒక ధ్యాన అనుభవం అయినది. అది ఏమిటి అంటే నాలాంటి రూపధారి తెల్లని వస్త్రాలు కట్టుకుని నది ఒడ్డున రావి చెట్టు కింద పిండ ప్రధాన కార్యక్రమము ముగ్గురు బ్రాహ్మణుల సమక్షంలో చేస్తున్నట్లుగా కనిపించింది. పైగా మా చుట్టూ నాలుగు వైపులా వరుసలలో మెట్ల నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో ఒకవైపు బోడిగుండులతో వస్త్రాలతో లామాలు ఉన్నారు. ఒకవైపు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మరొకవైపు కాషాయ వస్త్రాలు ధరించిన వారు ఇంకొక వైపు ఎర్రని వస్త్రములు ధరించిన వారు ఇలా నాలుగు వైపులా మెట్లలో కూర్చున్నారు. వీరందరి మధ్యలో నేను కూర్చుని పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా దృశ్యం కనిపించింది. ఈ ప్రాంతమంతా పరికించి చూస్తే గయలాగే అనిపించింది. అక్కడే పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి కదా. అక్కడున్న ఒక్కొక్కరికి అన్నం ముద్ద ఇస్తూ ఉండేసరికి వారంతా విచిత్రంగా అదృశ్యమవడం మొదలు పెట్టినారు. ఇలా అక్కడున్న వారందరూ కూడా నేను పెట్టే పిండం తినేసరికి వారంతా అంతార్ధనమైనారు. ఆ తర్వాత నేను ఒక పెంకుటింట్లోకి వెళ్ళి మళ్లీ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయగా పిండమును తినటానికి ఎర్రని వస్త్రాలు ధరించిన పిల్లవాడు ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించిన పాపాయి ఆ తర్వాత ఎలుక, కుక్క, కోతి, నగ్న యువకుడు ,యువతి, ముసలివాడు, అవ్వ, పాము , ఇలా రకరకాల వీడియో దృశ్యాలు చాలా వేగంగా జరుగుతున్నట్లుగా వివిధ రకాల జనాలు జంతువులు వచ్చి పిండం అన్నము ముద్దను తిని అదృశ్యము అవ్వడము నాకు కనిపిస్తుండగా నా ధ్యానభంగమైనది. ఆ తర్వాత విశ్లేషణ చేస్తే వీరంతా కూడా నా గత జన్మలని ఈ మోక్షమాల వేసుకోవడం వలన నేడు వీటికి అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలిగి నామరూప దైవాలు వీరంతా కూడా శూన్యములో అంతర్ధానం అయినారని తెలుసుకుని విపరీతమైన ఆనంద స్థితికి గురి అయినాను. అంటే ఈ సాధన జన్మము వలన గత జన్మల స్థూల శరీరాలకు విముక్తి కలిగిందని కల్మషం లేకుండా సంపూర్ణంగా విముక్తి కలిగిందని ఙ్ఞాన స్పురణ అయినది. అంటే ఈ జన్మలో నాకు భూమి మీద ఏ జీవి రూపంలో కూడా పునర్జన్మ ఎత్తనని నాకు అర్థం అయింది. ఇంతటితో నా స్థూలశరీర జన్మలు పూర్తిగా సంపూర్తిగా కర్మ శేషము లేకుండా నాశనం అయినాయని అర్థం అయినది. అంటే మూల ప్రకృతి చిక్కుముడి విడిపోయినది. దానితో 13+ 12+ 11=36 మాల అమర్చడం వలన మా గత జన్మ స్థూల శరీరలన్నింటికి కూడా కపాలమోక్షం స్థితికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే మేము శూన్యబిందువు దగ్గరికి వెళ్ళే అర్హత లభించినట్లు అనిపించింది. ఒకరోజు ఇది నిజమేనని అన్నట్లుగా మా ధ్యానము నందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. హృదయ చక్రం నుండి అంగుళ పరిమాణం ఉన్న నాలాంటి రూపధారి బయలుదేరుతూ సూర్యనాడి మార్గం ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకుని అక్కడ ఉన్న చితాగ్ని దాటుకుని ఆ పై దీప కాళిక అనుగ్రహమును పొంది దీప దుర్గ అనుగ్రహమును పొంది ఆపై 36 కపాలాలు ఉన్న సదాశివమూర్తి రూపమును దర్శనం పొంది ఆపై ఏక కపాలమునకు చేరుకుని అక్కడున్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు ప్రవేశించడం జరిగింది. ఆయన అంతిమ యాత్ర కాబోలు.దానితో మేమిద్దరం బ్రహ్మరంధ్రము లోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దగ్గరికి చేరుకుని ఆపై శూన్య బ్రహ్మగా శూన్య బిందువు దగ్గరికి చేరుకున్నట్లు గా మాకు ధ్యాన అనుభవాలు కలిగినాయి. ఇన్నాళ్ళు మేము శూన్య బిందువు దగ్గరికి చేరుకోలేదు. దానికి అడ్డంగా బ్రహ్మముడి ప్రకృతిమాత అష్టాంగాలు అడ్డుగా వచ్చినాయి. అయితే మేము చేసిన మాల వలన ఈరోజు మేమిద్దరం కూడా అంతిమ స్థానమైన శూన్య బిందువు వద్దకు చేరుకోవడం జరిగింది అని గ్రహించాను. ఆపై మా ఇద్దరికీ కూడా ధ్యానభంగం అయింది. ఇది ఇలా ఉండగా మా ఇద్దరికీ పూజ ఆసనాలుగా సుదర్శన చక్రములు రావడం జరిగినది. అలాగే పావుకోళ్ళు వంటి చెప్పులు కూడా వచ్చినాయి. అంటే మా లో ఒకడికి మాత్రమే ఇందుకు లోనికి ప్రవేశించే అర్హత యోగ్యత ఉన్నాయని నాకు అర్థమైంది. కాకపోతే మన వాడికి ఇంకా శంఖము ఊదే స్థితికి రాలేదు. నేను శంఖము నుండి ఓంకార నాదం చేసే స్థితిలో ఉన్నాను. పైగా వీడికి ఇన్నాళ్లుగా పరమ గురువుగా ఉన్నాను. ఏ మాత్రం ఆలోచించకుండా ఇందులో ప్రవేశించే యోగ్యత ఇవ్వాలని నేను మనోనిశ్చయము చేసుకుని నాకు వచ్చిన బ్రహ్మరంధ్రం సుదర్శన చక్ర పూజ ఆసనము వాడికి ఇవ్వడం జరిగింది.
కారణం మేమిద్దరం వెళితే మార్గం చూపేవాడు ఒకడు ఉండాలి కదా.కపాల మోక్షం ఇచ్చే కపాల బ్రహ్మగా ఒకటి ఉండాలి కదా. అనగా శివుని చూస్తే వైరాగ్యం ఎలా కలుగుతుందో… విష్ణువుని చూస్తే మోహము ఎలా కలుగుతుందో… అదే అమ్మ వారిని చూస్తే వ్యామోహం ఎలా కలుగుతుందో… అలా కపాలమోక్షం భావం కలిగించడానికి ఒకడు ఈ భూమి మీద ఉండి పోవాలి కదా. ఆ కపాలమోక్షం బ్రహ్మ పదవిని నేను తీసుకుని మన జిఙ్ఞాసిని నాలో కలుపుకోవడం జరిగింది. అంటే నేను శూన్య బిందువుగా మిగిలిపోతే నాలో కపాలమోక్షగాములు అందరూ నాలో ఐక్యం అవుతారు అన్నమాట. ఒకడు జనాల కోసం శూన్య బిందువుగా మారాలి. మరొకడు శూన్య బిందువులో శూన్య బ్రహ్మగా లయం చెందాలి అన్నమాట. ఇందులో శూన్య బిందువుగా నేను మిగిలిపోతే జిఙ్ఞాసి కాస్త శూన్య బ్రహ్మగా లయంచెందినాడు. అంటే మేము ఇద్దరం కలిసి కపాలమోక్షం లోకమును ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో ప్రధమముగా నా ప్రథమ శిష్యుడైన జిఙ్ఞాసి శూన్య బ్రహ్మగా మారి సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొంది మనోనిశ్చల స్థితిని పొందినాడు. అనగా శాశ్వత అచేతన స్థితిలోనికి శూన్య బ్రహ్మ వంటి త్రస్య రేణువుగా మారిపోయాడు. కాకపోతే మనవాడికి ఈ స్థితి పొందటానికి భూమిమీద చావు కొన్ని సంవత్సరాల తర్వాత ఉంది. కాకపోతే వీరి ఆకాశ శరీర సాధన పరిసమాప్తి అయింది. రాబోవుకాలంలో స్థూల శరీరానికి పరిసమాప్తి అవుతుందని గ్రహించండి.
కాకపోతే ఈ సాధన పరిసమాప్తి చేసుకోవటానికి మనవాడి ఆకాశ శరీర అంతిమయాత్ర మాత్రము 2019 జులై 4వ తేదీ నాడు జరిగినది. చిత్రం ఏమిటంటే అగ్రరాజ్యమైన అమెరికాకి స్వాతంత్ర దినోత్సవం అలాగే ఇదే రోజున పూరీ పుణ్యక్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతున్న రోజు కావడం విశేషం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ పొందటమే కదా. మన వాడికి కూడా అన్ని రకాల బంధాలనుండి విముక్తి కలిగి విదేహుడై జీవన్ముక్తుడై కపాల మోక్షం పొందడానికి అంతిమయాత్ర గా అనగా పూరి జగన్నాథ్ రథయాత్ర లాగా వీడి ఆకాశ శరీర అంతిమయాత్ర అనగా శూన్య బ్రహ్మ సాధన స్థాయి నుండి శూన్య బిందువు ఆలయం చేరటానికి బయలుదేరడం జరిగినది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మనవాడు శూన్య బిందువులో లయం చెందుతాడు. ఎందుకంటే వీడు వైకుంఠపాళి లోని మహా సర్పమైన బ్రహ్మముడిని దాటి బాదరబందీ లేని ఆట లేని ఆట అయిపోయిన 108 గడిలోనికి ప్రవేశించాడు. ఇంతటితో వీడి ఆట అయిపోయినది. జీవ నాటకం నుండి తన పాత్రకి కపాలమోక్షం ద్వారా విముక్తి కలిగించాడు. మొదటగా మిగతా అన్ని రకాల మాయలు మర్మాలు విజయం పొందినాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సాధన చేసి శూన్య బ్రహ్మగా మారి మీకోసం ఎదురు చూసే కపాలమోక్షం శూన్య బిందువైన నా యందు లయం చెందండి. మన జిఙ్ఞాసిలాగా అన్నమాట. వీరికి లాగా మీరు కూడా కపాల మోక్షం పొందండి. దానికి మీరు చేయవలసిందల్లా మాకు లాగా మోక్షమాల అనగా 108 నిజ రుద్రాక్షమాల, 108 ఉన్న శుద్ధ స్పటిక మాల, 32 ఉన్న బ్రహ్మ కపాలమాల తెప్పించుకోండి.ఈ మాలలు ఆయా చక్రాలు శుద్ధి జరిగినపుడు వస్తాయని గ్రహించండి. లేదా మీ నిజగురువులు ఇస్తారు లేదా అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పడము జరుగుతుంది.ఇలా వచ్చిన వాటిలోంచి 13 రుద్రాక్షలు, 12 స్పటికాలు, 11 బ్రహ్మ కపాలాలు ఉండేటట్లుగా అనగా 13+ 12+ 11=36 ఉండేటట్లుగా… అలాగే గండకీ నది నుండి వచ్చిన ఒక సుదర్శన చక్రమును ఒక అంగుళం సైజులో ఉన్న దానిని తీసుకుని ఈ మాలకి లాకెట్ లా వేయండి. మీకు మీరే కపాల మోక్షమాల తయారుచేసుకొని వేసుకోవాలి. దీనికి బంగారం లేదా వెండి లేదా రాగి తీగలను వాడండి.అంటే దీనిని నిరంతరంగా ఎప్పటికి ఎలాంటి స్థితిలో పరిస్థితిలో తీయకుండా అనగా నెలసరి మహిళ రోజుల్లో కూడా తీయకుండా మీ శరీరం అంగమాలగా మీ మెడలో వేసుకోండి. నిత్యం దీనితో నిత్య స్నానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, ప్రకృతి కార్యాలు, నిద్ర సమయంలో ఈ మాలను తీయవలసిన అవసరం లేదు. ఈ మాల ఉన్నట్లుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు అన్నమాట. అలాగే గండకీ నది నుండి వచ్చిన మూడు అంగుళాల సుదర్శన సాలగ్రామమును అలాగే ఓంకార నాదం ఇచ్చే మహా శంఖమును సేకరించండి. ఈ శంఖాలు ఎక్కువగా మనకి సముద్రం ఒడ్డున ఉండే క్షేత్రాలైన రామేశ్వరము, పూరి, కన్యాకుమారి, కాశీ, అంతర్వేది వంటి క్షేత్రాలలో దొరుకుతాయి. వీటికి అనగా సుదర్శన చక్రమును ప్రతి నిత్యం జలంతో అభిషేకం చేసి దానిపైన దానిని తుడిచి పైన చిటికెడు విభూతిని జల్లి మూడు లేదా పదకొండుసార్లు శంఖనాదం చేయండి. తిరిగి పూజ గదిలో ఉంచండి. జలమే దీనికి ఆహారం అని గ్రహించండి. విభూదియే దీని ప్రాణశక్తి అనుగ్రహించండి.ఆపై మూడు సార్లు శంఖంతో ఓంకారనాదం చేయండి. అంతే. మీకు కపాలమోక్షమునకు అర్హత యోగ్యత పొందినట్లే. ఇందుకు నిదర్శనమే మా ఇద్దరి సాధన జీవితాలే గ్రహించండి. విష్ణుమూర్తి వెంకన్న చేతిలో సుదర్శన చక్రము ఉంటాయని మీకు తెలుసు కదా. శూన్య బ్రహ్మగా మారాలంటే సాధకుడికి రెండు ఉంటే సరిపోతుందని నామరూప దైవాలు చెప్పకనే చెప్పినాయి. అంటే శూన్య బిందువుగా మారటానికి ప్రకృతిమాత చూపించే అనగా బ్రహ్మముడి ఛేధించడానికి మీకు నేను చెప్పిన మోక్షమాల వేసుకోండి. చచ్చినట్లుగా మీరు ఈ రెండు పనులు చేయండి. మోక్షము కలగకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను. చచ్చినట్లుగా మీరు శాశ్వతముగా చచ్చిపోతారు. కపాల మోక్షం పొందుతారని గ్రహించండి. జయము పొందండి. సాధన చేయవలసిన అవసరం లేదు. విగ్రహారాధన చేయవలసిన పనిలేదు. అనుభవాలతో పనిలేదు. ధ్యాన అనుభవాలు అనుభూతులు రాకపోయినా కంగారు పడకండి. ఐహిక వస్తువులు రాకపోయినా కంగారు పడకండి.
ఈ మూడు వస్తువులు అనగా కపాలమోక్ష మాల, సుదర్శన చక్రము, శంఖం మిమ్మల్ని ఖచ్చితంగా శూన్య బిందువు దాకా శూన్యబ్రహ్మగా మార్చుకొని తీసుకు వెళ్తుందని గ్రహించండి. ఒకవేళ మీకు ప్రకృతి మాత ప్రసాదించిన లేదా ఒకవేళ మీరు వాటిని గ్రహించలేకపోయిన మీ నిజ సాధన గురువులు చెప్పిన ఈ దైవిక వస్తువుల కోసము మీరు ఒకవేళ మీకు ఈ 3 వస్తువులు సంబంధించిన ఆయా క్షేత్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉంటే…. ఉండనే ఉన్నది కదా. మన ఇంటర్నెట్ లో ప్రపంచంలోని ఆన్లైన్ షాపింగ్ సైట్ లలో ఈ మూడు రకాల వస్తువులు అనగా రుద్రాక్ష మాలలు, స్పటిక మాలలు, బ్రహ్మ కపాలమాలలు అలాగే సుదర్శన చక్రము, ఓంకార శంఖమును గూడ తెప్పించుకోండి. అలాగే మేము ప్రకృతిమాత మాకు ధ్యానము నందు చూపించిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ సైట్ లలో ఈ వస్తువులను గుర్తించి తెప్పించుకుని సాధన చేసి జయం పొందినాము. కాకపోతే అవి నీ మనస్సుకి నిజమని అనిపిస్తే వాటిని కొనండి. ఈ వస్తువులు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అవి ఎంత పరిమాణంలో ఉంటాయో ఇందులో ఉంటాయి. ఎన్ని ఉంటాయి. ఏ ప్రాంతానికి చెందిన వివరాలు ఉంటాయి. వాటిని చదివి అర్థం చేసుకుని నీ మనస్సుకు నచ్చిన వాటిని మీ శరీరాన్ని తగ్గట్లుగా మీకు కావలసిన సైజులో అంటే అంగుళం ఉండి మూడు అరంగుళం సైజులోపల ఈ మాల వస్తువులు సేకరించండి. సుదర్శన చక్రము మూడు అంగుళాలు మించకుండా చూసుకోండి. మహా శంఖము 16 అంగుళాలు మించకుండా చూసుకోండి. రుద్రాక్షల్లో 13 స్పటికాలు 12 బ్రహ్మ కపాలాలు 11 ఉండేటట్లుగా అమర్చుకోండి. దీనికి లాకెట్ గా ఒక అంగుళం ఉన్న సుదర్శనచక్రం అమర్చుకుని మెడలో వేసుకోండి. ఆ తర్వాత మూడు అంగుళాల పరిమాణంలో ఉన్న సుదర్శన చక్రము అలాగే అరచెయ్యంత ఓంకారనాదం ఇచ్చే ఒక శంఖమును కొనుక్కోండి. ఈ శంఖముతో ఓంకారనాదంను చేస్తూ జలముతో సుదర్శన చక్రమునకు అభిషేకము చేస్తూ ఉండండి. మీరు తప్పనిసరిగా కపాల మోక్షము పొందుతారు. ఎల్లపుడూ ఓం నామమును తప్ప ఇంకేమి చేయొద్దు.మీలో ఓంకారనాదం వినిపించాలని గ్రహించండి. అది గూడ శంఖంలో వినిపించే ఓంకారనాదం లాగా మీలో కూడా ఓంకారనాదం ఉందని గ్రహించండి. ఎప్పుడైతే మీకు ఓంకారనాదం వినపడుతుందో ఆ క్షణమే మీరు శూన్యబ్రహ్మ సాధన స్థాయికి వచ్చినట్లుగా గుర్తించండి. ఇంతకంటే మీకు ఎలాంటి నిదర్శనము ఉండదు అని తెలుసుకోండి. ఇట్టి స్థితి కోసమే మీరు నిత్యము సుదర్శన చక్ర పూజ చేస్తూ ఓంకార శంఖంతో ఓంకారనాదం చేయాల్సి ఉంటుంది. మీలో ఓంకారనాదం వినపడటం అనేది ఒక వారంలో వినవచ్చును. లేదంటే 1, 3, 5, 7, 9, 11 సంవత్సరాలలో తప్పకుండా వినపడుతుంది. అప్పుడే మీరు శూన్య బ్రహ్మ అయినట్లు అన్నమాట. మీ మెడలో నేను చెప్పిన మోక్షమాల ఉండుటవలన ఎలాంటి ఆటంకాలు లేకుండా శూన్య బిందువు నందు నాయందు కపాలమోక్షము పొంది శూన్య బ్రహ్మగా లయంచెందుతారు అన్నమాట.
మీ కోసం నేను భూమి మీద హనుమంతుడు నామరూప దేవుడిగా ….జలము మీద హిమాలయాలలోని రాజహంస లాగా…. అగ్ని మీద కుండలినీ శక్తి మహా కాలాగ్ని సర్పములాగా… వాయువుల్లో అగ్ని చక్రములాగా… ఆకాశములో శూన్య బిందువుగా ధ్రువతారగా మీకోసం కేవలం సాక్షీభూతంగా ఆనందరహితంగా నిశ్చల స్థితిలో స్థితప్రజ్ఞతగా ఎదురు చూస్తూ ఉంటాను అని తెలుసుకోండి. మోక్షసాధన చేసి జయం పొందండి. కపాల మోక్షం పొందండి. సాధన సాధ్యతే సర్వం సాధ్యం. మరి నా సాధన పరిసమాప్తి అయ్యినదో లేదో తెలుసుకోవాలని ఉందా?దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!
శుభంభూయాత్
పరమహంస పవనానంద
**********************************
గమనిక: నేను చెప్పిన మోక్షమాల అలాగే నేను చెప్పిన సుదర్శన చక్ర పూజా విధానం కేవలం అన్నిటి యందు స్మశాన వైరాగ్యం కలిగి కేవలం మోక్షము పొందాలనే తపన తాపత్రయం ఉన్న మోక్షగామికే అర్హత ఉందని గ్రహించండి. ఒకవేళ భోగములో ఉండి భోగ కోరికల కోసం తపన తాపత్రయం పడేవాళ్ళు ఈ మాల అలాగే ఈ పూజ చేయవద్దని నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకంటే ఈ మాల వలన అలాగే పూజ వలన సాధకుడికి విపరీతమైన వైరాగ్య భావాలు కలుగుతాయి. అందరితోనూ రుణానుబంధాలు తీరతాయి.కర్మ శేషం లేకుండా చేస్తాయి. కర్మల నుండి విముక్తి కలిగించి నిజమైన సన్యాసిగా మారుస్తాయి అని గ్రహించండి. పూజించటం వలన లేదా ధరించుట వలన ఎన్నటికీ ఎలాంటి భోగ కోరికలు తీరవు.పైగా వాటి యందు స్మశాన వైరాగ్యం కలిగిస్తాయని గ్రహించండి. కష్టాలకి సమస్యలకి నాంది అన్నమాట.కష్టము వచ్చినప్పుడే దాని యందు ఒక విధమైన వైరాగ్యం కలుగుతుంది అని గ్రహించండి. అలాగే ఎవరికివారే ఈ మాలను తయారుచేసుకొని వారే వాడుకోవాలి.ఎందుకంటే ఎవరు అయితే ఈ మాలను తయారు చేస్తారో ఆ మాలను వేసుకొంటారో వారి కర్మలు నివారణ అవ్వడము మొదలు అవుతాయి.అలాగే మనకి ఈ మాలకి గావలసిన 36 పూసలు ప్రకృతి ప్రసాదించిన మాలలు లేదా నిజ గురువులు ప్రసాదించిన మాలలు పూసలతో ఈ మోక్షమాలను తయారు చేసుకోవాలసి ఉంటుంది. మనకి ఈ అర్హత యోగ్యత ఉన్నపుడు ఈ మోక్షమాలకి గావలసిన మూడు మాల పూసలు మనకి వస్తాయి.అపుడే ఇలా వీటితో చేసిన మోక్షమాల వలన మాత్రమే సర్వకర్మలు నివారణ అవుతాయి అని గ్రహించండి. అలాగే మీ నిజ గురువులు ఇవ్వకుండా లేదా ప్రకృతి ప్రసాదించకుండా మీకు మీరే ఈ మాలపూసలు సేకరించి ఈ మోక్షమాలను తయారు చేసుకున్న అలాగే వేరేవారి మాలను ఇంకొకరు చేసిన యెట్టి ఫలితాలు రావని స్వానుభవములో తెలిసినది. అందుకే ఈ జాగత్రలు చెప్పడము జరిగినది.తస్మాత్ జాగ్రత్త.
కేవలం యోగంలో ఉన్న గృహస్థుడు లేదా బ్రహ్మచారి కూడా వారి మనస్సు యోగంలో ఉండాలి. శరీరము భోగములో ఉన్న పర్వాలేదు. కానీ మనస్సు మాత్రం ఎల్లప్పుడూ ఓంకార నాదం చేస్తూ స్మశాన వైరాగ్యం పెంపొందించుకోవాలని గ్రహించండి. అంతేగాని భోగములో ఉండి బాగా కోరికలు కోరి పూజలు చేస్తే నానా చంకలు నాకవలసి వస్తుందని గ్రహించండి. ఇది కేవలం కోరికల మీద వ్యామోహం లేని వారికి మాత్రమే ఈ మోక్షమాల, సుదర్శన చక్ర పూజ చేసుకోండి. అంటే ఈ జన్మలో కపాలమోక్షం పొందాలనే తపన తాపత్రయం ఉన్నవారికి మాత్రమే ఈ విధానం ఉన్నదని గ్రహించండి. వారికి మాత్రమే అర్హత యోగ్యత ఉన్నది అని గ్రహించండి.ఎవరైనా నా విశుద్ధ చక్రం అనుభవాలు చదివితే నేను ఎందుకు ఆగిపోయానో నేను ఆగిపోవటం వల్ల చేయవలసిన పని ఏమిటో కపాల మోక్షం అంటే ఏమిటో అనే ప్రశ్నలో సమాధానంగా దొరుకుతుంది. అనగా నేను నల్ల సరస్వతి విగ్రహం మూర్తిని పొందలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే నా ఆది జన్మ వేదవ్యాస కావటం వలన ఈ నా పరిపూర్ణ పరిశుద్ధ ఆత్మ జ్ఞానం పొందడానికి తాంత్రిక విధానములో నల్ల సరస్వతి నీల సరస్వతి దేవి ఆరాధన చేయడం జరిగినది. దానితో ఈయన అపర బ్రహ్మజ్ఞాని అయినాడు. అప్పుడు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు రచించడం జరిగింది. అలాంటి బ్రహ్మజ్ఞాని అంశ అయిన నేను నాకున్న బ్రహ్మజ్ఞానం నన్ను ఎలా వదలి పెడుతుంది. కావాలని పొందినప్పుడు వదులుకోవడం చేతకాని పనియే కదా. అందుకే ఈ జన్మలో నాకు నల్ల సరస్వతి విగ్రహమూర్తి రాలేదు. పైగా జ్ఞాన సరస్వతి విగ్రహం మూర్తి రావడం జరిగింది. దానితో నేను జ్ఞాన బ్రహ్మకు మారి వెయ్యి మందిలో 477 ఉండి అందరికీ కపాలమోక్షం ఇవ్వటానికి మోక్ష బ్రహ్మగా మారడం జరిగింది. ఎవరైతే శూన్య బిందువులో శూన్య బ్రహ్మగా మారకుండా పరమ శూన్యములో లయం చెందుతారో. వారి వల్లనే ఈ విశ్వసృష్టిని నడిపించే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఒక వెయ్యి బ్రహ్మలు కూడా అంతరించి పోతారు. అప్పటిదాకా నేను శూన్య బిందువుగానే లేదా శూన్య బ్రహ్మగా మారుతూనే ఉంటాను. నాతో పాటు చిరంజీవి తత్వమును పొందిన శ్రీ దత్తాత్రేయుడు, మార్కండేయుడు, అశ్వధ్ధామ, హనుమంతుడు, సంజయుడు ఇలా వెయ్యి మంది పరబ్రహ్మలు ఉంటారని గ్రహించండి. కాకపోతే ఈ జన్మలో నా స్థూల శరీర జన్మలు సంపూర్తిగా రికార్డు దృశ్యాలు అంతరించిపోయాయి. కేవలం రాబోవు కాలంలో భవిష్యత్తు కపాలమోక్షబ్రహ్మగా ఉండిపోతాను అన్నమాట. పునర్జన్మ లేని స్థితి కర్మ లేని స్థితి కర్మ జన్మ లేని స్థితి అన్నమాట. ఆకాశమునందు ధ్రువ తారగా కపాలమోక్ష బ్రహ్మ అనే ధ్రువ తారగా ఉంటాను అన్నమాట. ఈ విశ్వ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు అంతరించిపోతే అప్పుడు ఈ ధ్రువతారగా ఉన్న మేము కూడా అంతరించి పోతాము. ప్రస్తుతానికి ఈ సాధన జన్మ వలన మా బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అంతరించడం మొదలయింది. దానితో నా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలు అంతరించిపోతాయి. కానీ ధ్రువతారగా ఆకాశమునందు ఆకాశ శరీరంతో శూన్య బిందువుగా కపాలమోక్షం బ్రహ్మగా ఉండిపోతాను. ఇది కూడా కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత అంతరించి పోతుంది. తద్వారా వెయ్యిమంది పరబ్రహ్మలు కూడా నాతో పాటు అంతరించి పోవడం వలన శూన్యమే మిగులుతుంది. సర్వం శూన్యము అన్నమాట. ఎప్పుడైతే నేను కాస్త ఈ విశ్వము యొక్క చిక్కుముడి అయిన బ్రహ్మముడిని చేధించినానో అనగా 13 రుద్రాక్షలు 12 స్పటికాలు 11 కపాలాలు అనగా ఈ విశ్వ సృష్టికి 13 మంది సదాశివుడులు 12 మంది అమ్మవార్లు ఉన్నారని వారందరూ అంతరించాలని అన్నప్పుడు 36 కపాలాలులో 25 కపాలాలు మాత్రమే అంతరించి 11 మిగిలిపోయి తిరిగి విశ్వ సృష్టి చేస్తున్నాయని నా పరిశోధనలో తెలియటంతో నేను కాస్త మోక్షమాలలో మిగిలిపోయే 11 బ్రహ్మ కపాలాలు కలిపి అనగా 13+ 12+ 11= 36 మాల చేయటంతో చచ్చినట్లు అన్ని కూడా చచ్చిపోవడం ప్రారంభమయ్యాయి. సృష్టించే శివుడు లేడు. నడిపించే అమ్మ లేదు. తాత్కాలిక మరణం పొందే బ్రహ్మకపాలం లేదు. దానితో అన్నీ కూడా శాశ్వతం మరణమును పొందక తప్పలేదు.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండి