అధ్యాయం 36


నేను చూసిన సిద్ధలీలలు

 అంజనా ప్రశ్న సిద్ధుడు :

నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మన స్నేహితుడు గడియారం పోయినది. అది చాలా విలువైంది. పోలీస్ కేసు కూడా పెట్టినా కూడా ప్రయోజనం లేదు. గుర్తుకు దొరకలేదు. ఎవరో అంజనా ప్రశ్న వేసి పోయిన వస్తువులు జాడ చెబుతారని తెలుసుకొని మా స్నేహితులతో పాటు నేను కూడా ఈ చిత్రం ఏమిటో చూద్దామని వెళ్ళినాను. అక్కడికి వెళితే ఒక ముసలాయన ఒక తమలపాకు మీద ఏదో నల్లటి కార్మిక లాంటి పదార్థం వ్రాసి ఏదో వీడియో చూస్తున్నట్లుగా దానిలో ఏదో చూస్తూ జరిగిన దొంగతనం విధి విధానము అలాగే తీసిన వాడి పోలికలు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తిని పట్టుకుని నాలుగు తన్ను తాను దొంగిలించిన గడియారం వెనక్కి తీసుకొని వచ్చాడు! ఇది ఎలా సాధ్య పడింది. నాకైతే అర్థం కాలేదు. అలాగే తప్పి పోయిన వ్యక్తుల గురించి, గుప్త నిధుల గురించి, తప్పిపోయిన పశువుల గురించి ఇలా ఎన్నో నిజాలు సంఘటనలు మనకు ఎదురైన అన్ని కూడా ఆయన చెప్పినట్లుగా జరగటం, దొరకటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. నిజంగానే అంజన సిద్ధుడు అన్నమాట.

నీళ్ల సిద్ధుడు :

ఈయన వయస్సు సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుంది. చదువులేదు. పశువుల కాపరి. కానీ విచిత్రం ఏమిటంటే ఇతనికి నేలలో… ఏ ప్రాంతంలో… నీళ్లు పడతాయో కొబ్బరికాయ ద్వారా గుర్తుపట్టి చెబుతాడు. ఎంతోమంది జియాలజీ డిపార్ట్మెంటు ఆఫీసర్లు వల్లకానిపని కూడా ఈయన కనిపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా జియాలజీ స్టూడెంట్ ని. మా సర్వేలో ఇతని గురించి తెలిసి మేము మా అధ్యాపకులు ఇక్కడ నీళ్లు పడమని చెప్పిన చోట ఆయన ఒక కొబ్బరికాయ సహాయంతో నీళ్లు పడే ప్రాంతాలను గుర్తించి మమ్మల్ని అందరినీ ఆశ్చర్య పరిచే వాడు. సహజ జ్ఞానము ముందు విజ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోయేది అనిపించినది! విచిత్రంగా నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక చేతిలో కొబ్బరికాయ పెట్టుకుని ఏదో మంత్రం చదువుతూ వెతకవలసిన ప్రాంతంలో తిరుగుతూ ఉండగా విచిత్రంగా ఆయన చేతిలో ఉన్న ఉన్న కొబ్బరికాయ కింద పడటం గాని లేదా తిరగడం గాని లేదా నీళ్ల శబ్దంతో విపరీతంగా ఉండటం చేసేది. అది చేసే పనిని బట్టి ఆ చోట నీళ్లు పడే విధానం చెప్పేవాడు. నీళ్లు పడతాయా అని అడిగితే నీళ్లు పడతాయని ఇలా పలు సూచనలు ఇచ్చే వాడు. ఖచ్చితంగా నీళ్లు పడేవి. మంచినీళ్లు పడతాయో లేదా ఉప్పు నీళ్లు పడతాయో కూడా ముందే చెప్పేవాడు. విచిత్రమే కదా. అందుకే నేను నీళ్ల సిద్ధుడు  అని పిలిచే వాడిని.

వాన సిద్ధుడు 

ఇతను కూడా చదువుకోలేదు. గొర్రెలు, మేకలు కాచుకునే వాడు. విచిత్రంగా ఏదో స్పందన కలుగుతున్నప్పుడు వాన పడేది రోజులతో సహా సమయాలతో చెప్పేవాడు. అంటే వర్ష సూచన సమాచారాలు ఇచ్చేవాడు అన్నమాట. అతడు చెప్పినట్లుగా ఖచ్చితంగా అదే సమయానికి వానలు పడేవి. ఇంకా విచిత్రమేమిటంటే వాన లేని ప్రాంతంలో ఇతను మూడు రోజులపాటు నివాసం చేస్తే ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసేవి . ఇది తెలుసుకున్న వారు అతనిని తీసుకు వెళ్లి మళ్లీ మరీ వర్షాలు కురిపించుకొనేవారు! ఇలాంటి సిద్ధి దశరథ మహా రాజు అల్లుడికి కూడా అనగా శ్రీరాముడు యొక్క బావ గారికి వాన సిద్ధి ఉండేదని వాల్మీకి పురాణమందు ఉంది. దానితో ఇతనికున్న సహజసిద్ధ యోగమునకు వాన సిద్ధుడు అని పిలిచే వాడిని.

మంత్ర సిద్ధుడు 

నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా స్నేహితుడు ఉండే ఊరికి అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. అది మండువేసవి రోజులు. మామిడికాయలు విరగబూసిన రోజులు. మా స్నేహితుడు తాత గారికి సుమారుగా 90 ఎకరాల మామిడితోట ఉన్నది. వాటిని చూడటానికి మేమిద్దరం మామిడి తోట కి వెళ్ళినాము. విచిత్రంగా అక్కడికి చెట్లకు ఎవరు కాపలాదారులు లేరు. చెట్ల కేమో మామిడికాయలు విపరీతం గా వేళ్ళాడుతున్నాయి. నోరును ఊరిస్తున్నాయి. ఎవరైనా దొంగతనం చేస్తే దిక్కు కూడా లేదనుకుని ఒక మామిడి పండు కోసుకుని తిందామని అనుకుంటున్నా సమయములో మా స్నేహితుడు వెంటనే “వద్దురా! వాటిని ఎవరూ తాకలేరు! దొంగతనము చేయలేరు. ఎవరైనా ఈ చెట్లకు ఉన్న కాయలకు దగ్గరికి వెళితే మా తాత వేసిన మంత్రము వలన స్తంభన అయిపోతారు అనగా శిలావిగ్రహంలాగ బిగిసుకొనిపోతారు. మళ్లీ మా తాత వచ్చి ఆ మంత్రము నుండి విముక్తి కలిగించే వరకు ఇదే పరిస్థితి” అన్నాడు! నేనా ఆశ్చర్యపోతుండగా ఇది ఎలా సాధ్యమని అనుకుంటుండగా కొన్ని నిమిషాల తర్వాత కొన్ని పక్షులు చెట్ల మీద వాడటం అవి కాస్త బొమ్మలు లాగ బిగిసుకొనిపోవడం అది చూసి నాలో తెలియని భయం మొదలవ్వడం ఏకకాలంలో జరిగిపోయాయి. కొద్దిసేపటికి ఈ విషయం తెలుసుకున్న వీడి తాత వీడి  ఇంటిదగ్గర నుండి వచ్చి ఏదో మంత్రం చదివి వాటి కేసి నీళ్లు చల్లగానే నిద్రలో లేచినట్లుగా ఎగిరి పోవడం చూసి నాకు నోట మాట రాలేదు. అప్పుడు ఆయన నా వంక చూస్తూ “కంగారుపడకు! పూర్వకాలములో దొంగలు బారినుండి పంటలను ఇలాగే రక్షించుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో అంతరించిపోయింది. చేసేవాడు లేడు” అంటూ వెళ్లిపోయాడు. దానితో నేను ఈయనికి మంత్రసిద్ధుడని పిలిచేవాడిని. పాపం ఆయన నాకు ఈ మంత్రం విధానం నేర్పిస్తాను అన్నారు. కానీ నాకు గతంలో జరిగిన కర్ణపిశాచి దెబ్బ కి తాంత్రిక మంత్ర విద్యల జోలికి వెళ్లలేదు.

ప్రాణాలు తీసే పోసే సిద్ధుడు: 


నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నేను ఉన్న గది కి దగ్గరలో ఒక మసీదు ఉండేది .ఇందులో 60 సంవత్సరాలు ఉన్న ఒక పేద మంత్ర పకీరు ఉండేవాడు. ఈయన రోగాలకి చిట్కా వైద్యం చేసేవారు. అలాగే భూత వైద్యం, మంత్ర వైద్యం చేసేవారు. నాకు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించేది. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. చాలా సేపు మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ ఏదో మంత్రోచ్చారణ చేసుకుంటూ మసీదు అరుగు బయట తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తీసుకోవటం ఏదైనా ఏమైనా ఇస్తే వాటిని తీసుకుని మరి కొంత మంది పేద వారికి వాటిని ఇవ్వటం నేను కాలేజీ వెళుతున్నప్పుడు నేను చూసేవాడిని అన్నమాట. అప్పుడప్పుడు నా వంక చూసి నవ్వి ఊరుకునేవాడు. నేను పలకరించే వాడిని కాను. ఆయన పలకరించేవాడు కాదు. ఒక రోజు కాలేజీ కి వెళుతున్న సమయంలో ఆయన ఎదురయ్యాడు. అప్పుడు ఈయన మసీదు మీద వాలిన పావురాలను బలంగా రాళ్ల తో కొడుతున్నాడు. అవి కాస్తా నేలమీద వాలి ప్రాణాలు వదిలేవి! గమనించాను. నాకు చాలా బాధ వేసింది. ఎవరైనా మూగ జీవులను చంపినా గాని లేదా బాధపెట్టిన కానీ నాకు తెలియని వెర్రి కోపావేశాలు వస్తాయి. పరిస్థితులు గమనించను. నోరు అదుపులో ఉండదు. దానితో నేను వేగంగా ఆ ఫకీరు దగ్గరికి వెళ్లి “నువ్వు చేస్తున్న పని ఏమిటి? పావురాలను ఎందుకు చంపుతున్నావు. వాటిని చంపడం పాపం అని నీకు తెలియదా? ప్రాణం పొయ్యలేనివాడికి ప్రాణం తీసే హక్కు ఉండదని నీకు తెలియదా? అనగానే అతను విరగబడి నవ్వుతూ “నేను ఈ పావురాలను చంపుతున్నానా? చంపడం అంటే ఎమిటో నీకు తెలుసా? చూడు చూడు అంటూ కింద పడి విలవిల్లాడుతున్న ఒక పావురమును తీసుకుని దాన్ని మెడ విరిచి మొండెమును వేరు చేస్తూ ప్రాణాలు తీసేసి నాకు తెలుసు విరగబడి నవ్వుతూ ఇది చంపడం అంటే… ప్రాణం పోవడం అంటే… ఇది వికృతంగా నవ్వుతూ ఉండే సరికి… నాకు ఎక్కడ కాలాలో అక్కడ కాలి అతనిని కొట్టడానికి చెయ్యి ఎత్తే సరికి వెంటనే “ఆగు నాయనా! నేను ముసలివాడిని! నీ దెబ్బలు తట్టుకోలేను! పావురం కోసమే కదా నన్ను కొట్టాలి అనుకుంటున్నావు చూడు” అంటూ వేరుచేసిన తల మొండెం ఈ రెండిటిని కలి పేసరికి అది నిద్రలో లేచినట్టుగా పావురం లేచి కొట్టుకోవటం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. ఆయన నవ్వుతూ తన చేతుల్లో నుంచి పావురంను గాలిలోకి వదిలే సరికే ఎగిరిపోయినది! ఇదియే బ్రహ్మవిద్య నాయన…. చావటం లేదు… బ్రతకటం లేదు… ఇవి ఉన్నాయని అనుకోవడమే మాయ… నేర్చుకో మాయ పోతుంది… కూడు పెట్టే విద్యలు కొంతవరకు ఉపయోగం…. కూడుతో అవసరం లేని బ్రహ్మ విద్య నేర్చుకో...అది యోగం అవుతుంది అంటూ లోనికి వెళ్ళిపోయాడు. ఇలా పలుమార్లు ఆయన నా కళ్ల ముందు కోడిని, చీమను, పిచ్చుకను, పందిని, ఆవుని, చిలుకని చంపి వాటిని బతికించడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. దానితో నేను ఇతనిని ప్రాణం పోసే విధాత సిద్ధుడు గా పిలిచే వాడిని.

రస సిద్ధుడు 

నేను అలాగే మా స్నేహితులు ఒక సారి రైల్వే స్టేషన్ లో రాత్రి పూట కూర్చుని ఉండగా ఎవరో బిచ్చగాడు మా దగ్గరికి వచ్చి “స్వామి! నా దగ్గర తులం బంగారం ఉంది దానిని మీకు రెండు వందల రూపాయిలకి అమ్ముతాను కొంటారా?”అన్నాడు మా ఇద్దరికీ ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. కొంపతీసి దొంగ బంగారం అయితే మా పరిస్థితి ఏమిటని? ఒకవేళ పోలీసులకి తెలిస్తే మేముండేది శ్రీకృష్ణ జన్మస్థానం అని ….భయమేసి వాడితో మేము కొనమని చెప్పాను! దానితో వాడు అసలు విషయం తెలుసుకుని “స్వామి! భయపడకండి. ఇది దొంగ బంగారం కాదు. నేను స్వయంగా తయారు చేసిన బంగారం అనగానే నాకు నోట మాట రాలేదు. ఏమిటి బంగారం కూడా తయారు చేస్తారా? అదేదో ఖనిజం నుండి బంగారం అవుతుందని నేను చదివి ఉన్నాను. ఏమిటి అదేదో రసవిద్య ద్వారా బంగారం తయారు చేస్తానని అంటున్నాడు. ఆశ్చర్యము అనిపించి అయితే నువ్వు మా ముందు బంగారం తయారు చేస్తే మీకు కావాల్సిన డబ్బులు ఉచితంగా ఇస్తామని చెప్పగానే…. అతను మొహమాటపడుతూ “స్వామి! అయితే ఇప్పుడు తయారు చేయడం కుదరదు. రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ లేని సమయంలో తయారు చేస్తాను” అనగానే మేమిద్దరం వాచీలను చూసుకుని మరో రెండు గంటలు కూర్చుంటే సరిపోతుంది అని గ్రహించి “సరే! మేము అప్పటిదాకా ఇక్కడే ఉంటామని మా ముందు నువ్వు బంగారం తయారు చేయాలి అనగానే వాడు వెళ్లిపోయాడు .రెండు గంటల తర్వాత ఆ బిచ్చగాడు మా దగ్గరికి వచ్చినాడు. మా ఇద్దరినీ పనికిరాని ఒక రైల్వే భోగి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు .అది వీడికి గది లాగా ఉన్నట్లుగా ఉంది. లోపలికి వెళ్ళాం. వాడు పొయ్యి మీద గిన్నె లాంటి దట్టమైన పాత్ర నుంచి కొద్దిగా పాదరసము పోయాడు. కొద్దిసేపటికి ఏవో వేరు ముక్కలు వేసినాడు. మరికొద్దిసేపటికి ఏవో ద్రవాలు పోసినాడు. ఆ తర్వాత లోపల నుండి ఒక గర్భసంచి తెచ్చి దానిలోంచి ఏదో నల్లని రాయి వంటి దానిని బయటికి తీసి దాని రజను కొంత తీసి ఇందులో వేసి కలుపుతూ సుమారు నాలుగు గంటల దాకా ఉడికించినాడు. ఆ తర్వాత ఆ పాత్రలో బంగారపు వర్ణము ఉన్న పదార్థము తయారైనది. అప్పటిదాకా అన్నం వండటం చూసిన మేము బంగారం వండటం తయారు చేయడం చూడటం అదే మొదటిసారి. ఆ తర్వాత ఈ బంగారం ను ఒక ముద్దగా చేసి మాకు ఇచ్చినాడు. దానిని తీసుకుని వెంటనే మా స్నేహితుడు ఒక రాయి మీద బలంగా రుద్దిన కూడా దీనికి ఉన్న బంగారు రంగు పోకపోయేసరికి మా వాడికి మతి పోయింది. పైగా ఈ ముద్ద కూడా బరువుగా ఉంది. అంటే ఇతను రసవిద్య తెలిసిన రససిద్ధిని నేను గ్రహించే లోపల మా దగ్గర నుండి ఆయన కావలసిన డబ్బులు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు .ఆ చిన్నపాటి బంగారం మొత్తం అక్కడే వదిలేసి మేమిద్దరం బయటికి వచ్చేశాము!

కాగితాలను డబ్బులు గా మార్చే సిద్ధుడు 

ఈయన వయస్సు సుమారుగా 60 సంవత్సరాలు ఉంటుంది. మంచి పట్టు ఉన్న మంత్ర సిద్ధ పురుషుడు. పైగా తాంత్రిక విద్యాపరుడు. భూత మంత్ర వైద్యగాడు. ఆయన దగ్గరికి ఎవరైనా కటిక పేదవాడు డబ్బుల కోసమని వస్తే వెంటనే తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కాగితం ముక్కలు చేసి వాటిని గాలిలో ఊపుతూ వాటిని డబ్బులు కాగితంగా మార్చి వారికి తిరిగి ఇచ్చేవాడు. అవి నిజంగానే డబ్బులు నోట్ల లాగానేచలామణి అయ్యేది. నాకు ఆశ్చర్యం వేసేది. ఆయన నా కోసం ఒకసారి వంద రూపాయల నోటును ఇలాగే సృష్టించి ఇస్తే…. దానిని బజారుకెళ్లి మారుద్దామని వెళ్లేసరికి… కొట్టువాడు ఏమాత్రం అనుమానించకుండా… నాకు కావాల్సిన వస్తువులు ఇచ్చేసరికి… నాకు నోట మాట రాలేదు. అంటే ఈయన ఒక పెద్ద స్కా నర్ లాంటివారిని…. ప్రింటింగ్ మిషన్ లాంటివారని… కొన్ని రోజులకు గానీ నాకు తెలియ రాలేదు. ఈయన కటిక పేదరికంలో ఉన్న వారికి మాత్రమే ఇలాంటి ధన సహాయం చేస్తూ ఉండే వారిని… పిల్లలకు అనారోగ్య అవసరాలకి, తీవ్రమైన అప్పులు వాళ్ళకి మాత్రమే సృష్టించిన డబ్బులు అందించి…. వారి ఆర్థిక అవసరాలు తీర్చే వారని నేను తెలుసుకున్నాను . ఈయన మింట్ మిషన్ అని తెలుసుకున్నాను.

అక్షయ సిద్ధుడు 

ఈయన వయస్సు సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుంది. వీరికి ఒక ఆశ్రమం వున్నది. విచిత్రం ఏమిటంటే వేళకాని వేళలో ఈ ఆశ్రమానికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినను భోజనం ఉండేది. అలాగే వండిన పదార్థాలను మించిన అతిథులు ఎందరో వచ్చినను అందరికీ ఈ పదార్ధాలు సరిపోవటం నేను చాలా సార్లు గమనించాను. ఇందులో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలని చాలా సార్లు కావాలని ఈ ఆశ్రమానికి వెళ్లేవాడిని. విచిత్రమేమిటంటే వడ్డన చేసేముందు ఇది ఆయన ఆయా పదార్థాల మీద మంత్రము తో నీళ్ళు చల్లి  వాటిమీద వస్త్రాలు కల్పించేవారు. వస్త్రాలు తీయకుండా వచ్చిన వారందరికీ వడ్డన చేయించేవారు. అందరికీ వండిన పదార్ధాలు సరిపోయేవి .అంటే ఈ మంత్రము వలన వండిన పదార్థాలు అందరికీ సరిపోయేవి అన్నమాట. దానికి నేను అక్షయ సిద్ధుడు  అని పిలిచే వాడిని.

నీళ్ల మీద తేలే సిద్ధుడు 

మా ముత్తాత గారైన బుద్ధు కుటుంబరావు నీళ్ల మీద నడిచే వాడని… నీళ్ల మీద వెళ్లే వాడని… నీళ్ల మీద పడుకునే వారని మా ముత్తాత గారైన బుద్ధు కుటుంబరావు గారి గురించి మా అమ్మగారు నాకు ఎప్పుడూ చెప్పడమే గాని నేను చూడలేదు. మా వంశంలో సిద్ధులు తెలిసిన సిద్ధపురుషులు ఉన్నారు అని…. ఆనాటి నుండి సిద్ధులు చూపించడము పూర్తిగా మానివేశాను. ఇప్పుడు సిద్ధులు చూపించే సిద్ధపురుషులను వెతకడం పూర్తిగా మానివేశాను. విచిత్రమేమిటంటే అష్టసిద్ధులు తగ్గట్లుగా అష్ట సిద్ధపురుషుల నా జీవితంలో నేను చూడటం జరిగింది. వారి సిద్ధ అనుభవాలను నేను చూడటం జరిగినది. వీరంతా గత జన్మలలో ఆయా చక్ర సాధనలు చేసి ఆ సిద్ధులను పొంది సహజసిద్ధంగా ఈ జన్మలో ప్రదర్శిస్తున్నారని నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను తెలుసుకోవడం జరిగినది.

        ఆ తర్వాత నేను జ్యోతిష్యశాస్త్రము నందు గవ్వలప్రశ్న, దైవప్రశ్న, జాతకప్రశ్న, శకునప్రశ్న,పాచికప్రశ్న,రమలప్రశ్న….ఇలా 36 జ్యోతిష్య ప్రశ్న శాస్త్రములయందు మేము సిద్ధిపొందడము జరిగినది! అంటే సిద్ధులు వెంట తిరిగి నేను కూడా సిద్ధ పురుషుడుగా మారిపోయానని ఈపాటికే గ్రహించి ఉంటారు. ఎందుకంటే మీరు కూడా ఏదో ఒక జన్మలో సిద్ధపురుషులు అయ్యి ఉంటారు కదా! ఏమంటారు! నిజమే కదా! అలాగే ఈ సిద్ధులకోసము లేదా యోగసాధన కోసము ఒక భౌతిక సిద్ధగురువు తప్పనిసరిగా ఉండాలని...వారు ఇచ్చే గురుమంత్రోపదేశము వలన మనకి మంత్రసిద్ధి కలుగుతుందని వీరంతా తమకి వచ్చిన గురువుల గూర్చి నాతో చెప్పేసరికి… అసలు సాధనకి ఈ గురువులకి గల సంబంధము ఏమిటో తెలుసుకోవాలని అనిపించినది!మరి మీకు కూడ తెలుసుకోవాలని ఉందా? అయితే మీరుగూడ నాతోపాటుగా నా రెండవ అనుభవ విభాగమైన మంత్రదీక్ష సాధనానుభవాలలోనికి అడుగుపెడతామా మరి.... 

ఇంతటితో నా ప్రారంభ సాధన అనుభవాలు అనే ప్రధమ విభాగములోని 36 అధ్యాయాలు పూర్తి అయినాయి!ఇక ద్వితీయ విభాగమైన నా మంత్రదీక్ష అనుభవాలు లోని అధ్యాయాలు ప్రారంభమవుతాయి!

శుభంభూయత్

పరమహంస పవనానంద

******************************************

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ashta siddhula gurinchi chepthunte ela kuda untaara ani anipinchindi mukhyam ga maamidi thotaki mantram veyatam... inka rasavidya swamyamugaa chudatam...paavuram ni champi brathikinchinathanu cheppina maata koodu pette vidyalu koddivaraku upayogam koodu avasaram leni brahma vidya nerchuko ani...motham topic lo edi adhurs inka aa siddhulu meeku raavatam...

    రిప్లయితొలగించండి