అధ్యాయం 42

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....



సంపూర్ణ యోగ సాధన విధి విధానము

మా బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన వాళ్ల దీక్ష గురువుగారైన చందోలు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి స్వయంభూ అనుభవాలు విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆవేశం, విసుగు, చికాకు,అసహ్యము మొదలైనాయి. ఇన్నాళ్ళూ మనం కేవలం విగ్రహాలను విగ్రహాలుగా పూజించడం వలన వచ్చిన అరకొర వాక్శుద్ధి వలన ఏదో మహత్తర శక్తి నాకు వచ్చినది అని, నా అంత గొప్పవాడు ప్రపంచంలో మరొకడు లేడు అని అనుకునేవాడిని. కానీ బ్రహ్మ సిద్ధాంతి  చూపించిన చెప్పిన గత అనుభవాలు విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మాలో మాకు తెలియని కసి మొదలైనది. ఎలాగైనా మేము కూడా ఒక రామకృష్ణ పరమహంస లాగా అలాగే నామ దేవుడు లాగా మాకు మా ఇష్టదైవాలతో మాట్లాడాలని విపరీతంగా ఏదో తెలియని ఆవేశం కలిగినది కానీ ఎలా అని అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ మంత్ర దేవత గ్రంథాలు, పుస్తకాలు,యోగుల మరియు దైవ భక్తుల చరిత్రలను చదవటం ఆరంభించాము.నిజానికి మన సాధన స్థాయిలో చెప్పడం అనేది బాల త్రిపుర సుందరి చేస్తుందని ఈ గ్రంధాలలో మేము చదవడం జరిగింది అంటే బ్రహ్మ సిద్ధాంతి గారు చెప్పిన ఈ బాలాదేవి అనుభవాలు నిజమేనని మాకు రూఢీ అయినది.దాంతో అసలు సాధన విధి విధానం ఎలా ఉంటుందని పుస్తకాల్లో పరిశోధన చేయడం ప్రారంభించాము. మొదట ఒక మంత్రగురువు మనకు రావాలి. ఆ తర్వాత ప్రతి రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా  వాయిదా వేయకుండా ఇచ్చిన మంత్రము ఆయన చెప్పిన విధి విధానంలో చేయాలి. ఇలా 3,5,8,12,16,18,21,26 సంవత్సరాలు పాటు ఈ మంత్రము దీక్షగా చేసుకుంటూ పోతే ఆ మంత్ర దేవత మనకి ప్రత్యక్ష నిదర్శనాలు ఇచ్చే ముందు కొన్ని రకాల పరీక్షలు పెడుతుంది. వాటిని ప్రతి సాధకుడు దాటుతుంటే  అప్పుడు ఆ మంత్రదేవత ప్రత్యక్షమై తాను ఉన్నానని నిదర్శనాలు అలాగే చిన్నపాటి యోగసిద్ధులు అనగా వాక్సుద్ధి రాబోవు రెండు రోజుల్లో జరగబోయే
సంఘటనలు, మనం అనుకున్న వ్యక్తులు కనబడటం, వచ్చే వ్యక్తి వివరాలు తెలియడం ఇలాంటి వస్తాయి.  మీరు ఏదైనా మంత్రమును గురూపదేశంగా పొంది మంత్ర సిద్ధి పొందితే ఈ సిద్ధులు వస్తాయి. ఇలా వచ్చే సిద్దులమాయాలో మనము పడకుండా ఉంటే అప్పుడు మనకి భౌతిక దీక్ష గురువు వస్తాడు అన్నమాట. ఈయన  తెలిసినవాడు కావచ్చు లేదా తెలియనివాడు కావచ్చు. ఈయనని మన మంత్ర దేవత చూపుతుంది. ఈయన ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞాన గని అన్నమాట. మనకు ఎలాంటి ధర్మసందేహాలు అనగా యోగపరంగా, సాధనపరంగా, శాస్త్రాలు పరంగా, దైవాలు పరంగా, వేదాలు పరంగా,యోగ శక్తుల పరంగా, యోగమాయాలు పరంగా, భోగం పరంగా వివరంగా చెప్పాలంటే రక్తి, భక్తి ,ముక్తి మీద మంచి జ్ఞానం ఉంటుంది. ఎటునుంచి దేని నుంచి మీరు ఈయనను ప్రశ్నించిన మీకు అర్థమయ్యే భాషలో అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు ఓపిక సహనం గా విడమర్చి చెబుతారు. కానీ అందరూ ఇలాగే ఉండరు. కొందరు మౌనంగా ఉండి చాలా కొద్ది విషయాలు చెబుతారు. మిగతావి మనకి మనం తెలుసుకునేటట్లుగా చేస్తారు. ఇంకొందరు మనము అడుగుతున్న వాటికి సమాధానాలు చెబుతారు. ఇంకొందరు మనం అడిగిన వాటికి ఎదుటివారి మనస్సులో అంతర్గత సందేహాలకు ముందుగానే సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి దీక్ష గురువు మనకు వచ్చి ప్రాథమిక స్థాయిలో మనకి కుండలిని శక్తి జాగృతి చేస్తారు.అంటే అప్పుడు దాకా మంత్రగురువు ఇచ్చిన మంత్రోపదేశం వలన కుండలిని శక్తి నిద్ర లేచి తాను ఉన్నానని నిద్ర లేచాను అని అన్నట్లుగా మనలో కదలికలు ఇస్తుంది.అంటేబద్ధకముతో నిద్ర మత్తుతో వచ్చిన మెలుకువ లాంటిది అన్నమాట. ఒకవేళ మనకి మంత్ర సిద్ధి కాకపోతే  వెంటనే నిద్ర లేచిన  కుండలిని శక్తి మాత తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఈ మహా తల్లి తిరిగి మళ్ళీ నిద్ర లేవాలంటే మరో మూడున్నర సంవత్సరాలు కాలం పడుతుంది.

మనకి దీక్ష గురువు అనగా భౌతిక గురువు రానంతవరకు ఆ కుండలినిమాత మీద నిద్రమత్తు, మెలుకువ నిద్ర స్థితిలో ఉంటుంది.సాధకుడికి మంత్రసిద్ది ప్రభావం బట్టి దీనిలో కదలికలు ఉంటాయి.ఎప్పుడైతే సాధకుడు మంత్ర దేవత దర్శనం పొందుతాడో వారు చూపించిన అన్ని రకాల సిద్ధమాయాలు దాటు కుంటాడో అప్పుడు మనకి దీక్ష గురువైన భౌతిక గురువును చూడటం జరుగుతుంది. ఈయన మనకు వచ్చే మనకున్న అన్ని రకాల సాధన సందేహాలను తీరుస్తూ మనలో నిద్ర మత్తుతో జోగుతున్న కుండలిని మాత తన మాటల శక్తి వలన లేదా తన బొటనివేలును  భ్రూ మధ్య భాగం లో ఉంచి మనలో కుండలిని మాత పూర్తిగా తన నిద్ర మత్తు వదిలించుకుని మనం చెప్పిన దానిని వినడానికి అలాగే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీనినే యోగ పరిభాషలో కుండలిని శక్తి జాగృతి అంటారు.ఇలా ఉన్న 
కుండలిని మాత  ఒకవేళ మళ్లీ నిద్రలోకి జారుకోవాలంటే 12 తర్వాత సంవత్సరాల తర్వాతనే సాధ్యపడుతుంది.ఈ సంవత్సరాలలో మనలోని 12 ద్వాదశ యోగ చక్రాలను ఈవిడ జాగృతి చేస్తుంది. అది కూడా మన సాధన స్థాయిని బట్టి  ముందుకు, వెనక్కు వెళుతుంది. అంటే ఒక్కొక్క చక్రానికి తిరిగి ఒక మంత్ర దేవత, ఆ దేవత దైవిక వస్తువులు అలాగే ఆ దేవత క్షేత్ర దర్శనం ఆ దేవత బీజాక్షరం ఆ దేవత ఇచ్చే యోగమాయాలు అలాగే ఆ దేవత యోగశక్తిని ఈ సాధకుడు తట్టుకోవాలి.అందుకోవాలి.ఇలా పన్నెండు చక్రాలు యోగ శుద్ధి కార్యక్రమం ప్రారంభమవుతుందని అనగా మూలాధార చక్రము నుండి హృదయ చక్రం ఉన్న పన్నెండు చక్రాలు జాగృతికి సిద్ధపడే స్థితికి చేరుకుందని తెలిసిన మన బాలాదేవి వెనువెంటనే బాల రూపంలో రావడం జరుగుతుంది.అంటే రాఘవ శాస్త్రి గారి అనుభవాలు అన్నమాట. మనకి కూడా ఈసాధన స్థాయిలో జరుగుతాయి.అప్పుడు మనకి చక్ర జాగృతి ఆరంభమవుతుంది.ఇది గూడా 3,5,8, 12 సంవత్సరాలలో పూర్తవుతుంది ఒకవేళ మనకు ఎక్కడైనా ఏ చక్రము లో గాని మాయాలు లేదా యోగమాయాను దాటలేకపోతే లేదా యోగసిద్ధులు మాయాలో మనము పడిపోతే మనలో ఉన్న కుండలిని మాత అక్కడే ఆ చక్రంలో ఆగిపోతుంది.అంతటితో ఈ జన్మకి ఆ చక్రబంధనం తో ఆగిపోయినట్లే. ఒకవేళ మీరు అన్ని చక్రాలను 3 నుండి 12 సంవత్సరాల లోపల జాగృతి చేసుకుని అన్ని రకాల సకల చక్ర దేవతల యోగమాయాను దాటగలిగితే కలిగితే, తట్టుకోగలిగితే మీ యోగ సాధన స్థాయి రెండవది అయిన మధ్యమ స్థాయి కి చేరుకుంటుంది. 
ఈ రెండవ దశ అయిన మధ్యమ స్థాయి అంటే మనలో ఉన్న యోగ చక్రాలు అన్ని కూడా చక్ర శుద్ధి మొదలవుతుంది.అప్పుడు బాలాదేవి తిరిగి యవ్వన సౌందర్యవతి రూపమగు త్రిపురగా మాయా స్త్రీ గా మనముందుకు వస్తుంది. త్రిపుర వచ్చింది అంటే మన యోగ సాధన 12 యోగ చక్రాల శుద్ధి ప్రక్రియ ప్రారంభమైందని సూచన.ఈ చక్రాలలో అనేక కోట్ల జన్మల తెలిసి చేసినా తెలియక చేసినా పాప కర్మలు ఉండిపోతాయి. వాటిని మనము ఈ చక్రాల నుండి భస్మం చేయాలి. దీనినే మనం చక్ర శుద్ధి అంటాము. దీనికి మనకి ఆత్మ సాక్షాత్కారము తాను పొంది ఇతరులకు ఇవ్వగలిగిన యోగం కలిగిన గురువును సిద్ధ సద్గురువు అంటారు. ఈయన జీవ సమాధి చెందిన యోగిపుంగవుడు అన్నమాట. ఈయన సూక్ష్మశరీరము మనకి దర్శనమిచ్చి మనము ఎక్కడైనా మాయా లో ఉన్నామో, మన సాధన స్థాయి ఆగిపోతుందో  లేదా ముందుకు వెళుతుందో మనకి స్వప్నముల ద్వారా లేదా ధ్యానఅనుభవాలు ద్వారా  మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు.ఎల్లవేళలా ఆత్మస్వరూపంగా మన వెంట ఉండి గమనిస్తుంటారు. ఒకవేళ ఈ చక్ర శుద్ధి విధానంలో మనము ఏదైనా యోగమాయా లో పడితే నువ్వు ఫలానా యోగమాయాలో పడినావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని మనకి టాటా చెప్పి వెళ్ళిపోతారు.ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. మనకు 12 యోగ చక్రాలను జాగృతి చేయటానికి భౌతిక దీక్ష గురువు వస్తాడు. అనగా మనకు ఈయన  శబ్ద పాండిత్యము చెందినవాడు. ఈయన మన సందేహాలు అన్నింటిని తన పాండిత్యంతో వివరించి చెప్తాడు. ఈయన కేవలం తన ఇష్ట దేవత సాక్షాత్కారం తన ఉపాసన సిద్ధితో పొందిన వ్యక్తి అన్నమాట. ఈయన ఇతరులకి ఇష్ట దేవత సాక్షాత్కారం మాత్రమే ఇవ్వగలరు.ఆత్మసాక్షాత్కారము ఇవ్వలేడు గాని అది ఈయన ఇతరులకు మాత్రమే ఇవ్వలేడు కానీ పొందగలడు. సద్గురువు అంటే ఇక మన యోగ చక్రాలు శుద్ధి కార్యక్రమంలో వస్తాడు..ఈయన అనుభవ పాండిత్యమును ఇవ్వగలడు అంటే ఈయన ఏ చక్రములో ఏమాయా ఉన్నది? ఎలా తట్టుకోవాలి?ఎలా దానిని దాటు కోవాలి? దానిని దాటి పోవటానికి ఏమి పరిహారాలు చేసుకోవాలి? ఏ క్షేత్రదర్శనానికి వెళ్లాలో అక్కడ ఏమి చేయాలో ఎలాంటి యోగశక్తులు వస్తాయో ఎలాంటి యోగసిద్ధులు వస్తాయో ఎలాంటి యోగ మాయాలు వస్తాయో ఒక్కొక్కటి మనకి అనుభవపూర్వకంగా తెలిసేటట్టు చేస్తారు. ఒకసారి ఈయన మనకు ఏదో ఒక క్షేత్రంలో అనగా నువ్వుఏ చక్ర శుద్ధికోసం ఉన్నావో ఆ చక్ర దేవత ఉండే క్షేత్రంలో జీవ సమాధి చెందిన గురువు మనకుసూక్ష్మ శరీరధారిగా ఆత్మ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మన సాధన మధ్యమ స్థాయికి వచ్చినప్పుడు మన బాలాదేవి త్రిపురగా వచ్చిన తర్వాత  జరుగుతుందని గ్రహించండి. అప్పుడు ఇలా మనకి ఆత్మ దర్శనం సద్గురువువు కనిపించిన ఆనాటి నుండి మనం ఆయనకి అనుసంధానం అవుతాము. ఆయన మనతో ఉన్నట్లుగా మనకి తెలియకపోవచ్చు గానీ మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టడు. నువ్వు చనిపోయిన కూడా నిన్ను  తన శిష్యుడుగానే గుర్తుపెట్టుకుని జన్మ జన్మల మీ వెంట ఉంటాడు. అప్పటిదాకా అంటే నువ్వు 12 ద్వాదశ యోగచక్రాల శుద్ధి విధానంలో ఈ చక్రాలు యోగ మాయాలో పడనంతవరకు ఆయన మనల్ని రక్షిస్తూనే వుంటాడు. గమనిస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు ఏదైనా యోగ చక్రశుద్ధి మాయాలో పడితే మాత్రం మారు మాట్లాడకుండా మీ నుండి తన ఆత్మ సంధానం తీసేసి ఆయన యధావిధిగా తను ఉండే క్షేత్రం కు వెళ్లి  మళ్లీ మీలాంటి మధ్యమ స్థాయిలో అదే చక్ర శుద్ధిలో ఉన్న యోగసాధకుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీవు మరణించిన తర్వాత నీవే ఒకవేళ మళ్లీ యోగ జన్మలో వస్తే మాత్రం గత జన్మలో నువ్వు ఏ చక్ర యోగమాయా దగ్గర ఆగి పోయినావో ఆ చక్రమాయా నువ్వు దాటితే  వెంటనే  ఈయన మళ్లీ తిరిగి ఆత్మ అనుసంధానం అవుతారు. అనగా మళ్లీ మీ  యోగ సాధన అనగా మిగిలిన యోగ చక్రాల శుద్ధి అయ్యేటట్లుగా చూస్తారు. ఒకవేళ నీ ఖర్మ కాలి ఏదైనా ఒక చక్రం దగ్గర ఆగిపోతే మాత్రం ఆయన నీ నుండి ఆత్మ అనుసంధానము అనగా టెలిపతి తీసుకుని వెళ్లి పోతారు. ఇది అంతా అక్షర సత్యమే. ఎప్పుడైతే నువ్వు ఈ 12 ద్వాదశ చక్రాలు పరిపూర్ణ శుద్ధి  అవుతుందో అప్పుడు ఈయన తను వచ్చిన పని పూర్తి అయినట్లుగా సంతోషంగా వెళ్లిపోతారు. నీకు అవసరమైనప్పుడు వస్తారు. 

అప్పుడు ఆ తర్వాత నీవు నీ సాధన స్థాయి మూడవ దశ అయిన చివరి దశకు వస్తావు. అప్పుడు నీకు యోగ చక్రాలు ఆధీనం చేసుకోవటానికి లేదా అదుపులో ఉంచుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చాలామందికి చిన్న సందేహము రావచ్చును!అది ఏమిటంటే ఆధీనమునకు లేదా అదుపుకి గల తేడా ఏమిటి అని? దీనికి సమాధానముగా పంచభూతాలు,అష్టసిద్ధులు ఆధీనము అంటే అవి మనమీద ఎలాంటి ప్రభవాలు చూపదు! ఉదా: గాలివాన వస్తోంది! అపుడు మీరు బయటికి వెళ్ళితే ఆగిపోతుంది. కాని దీనివలన ప్రకృతి చేయవలసిన పని మీ వలన ఆగిపోతుంది! అదే వీటిని ఆధీనము చేసుకోకుండా అదుపులో ఉంచుకున్నట్లయితే  తీవ్రమైన గాలివానను మీ అదుపు ఆఙ్ఞ వలన దాని ఉధృతను కొంతమేర తగ్గించవచ్చును! దీనివలన ప్రకృతి పని ఆగిపోదు! నిజానికి ఆధీనము వలన నిరంతరము వాటి యోగమాయాలలో పడే అవకాశముంటుంది!అదే అదుపుఆఙ్ఞ వలన అయితే సాధకుడు ఎలాంటి మాయాలుండవు! దీనికి మళ్లీ మనకి విశ్వ గురువు లేదా జగద్గురువు అవసరం ఏర్పడుతుంది. ఆయన కూడా సహజంగా ఇలాంటి స్థితిలో విశ్వ గురువుగా శ్రీ దత్తాత్రేయుడు లేదా జగద్గురువుగా శ్రీకృష్ణుడు లేదా గురుదక్షిణామూర్తి వస్తారు. అంటే ఎవరైతే తమ చక్రాల ఆధీనం స్థాయికి చేరుకుంటారోవారికి దత్త స్వామి లేదా శ్రీకృష్ణుడు లేదా దక్షిణామూర్తి కనబడతారు. అప్పుడు చక్ర ఆధీనం లేదా అదుపు అయ్యే  విధి విధానం ఉంటుంది. ఆధీనం లేదా అదుపు అయ్యే స్థాయిలో మళ్లీ తిరిగి ఈ యోగ చక్రాలు యోగమాయాలు అలాగే యోగ శక్తులమాయాలో నువ్వు పడకపోతే వీరి అనుగ్రహం వల్ల నువ్వు హృదయ చక్రం చేరుకోగలవు. ఈ అంతిమస్థాయికి నువ్వు వచ్చినప్పుడు మళ్లీ బాలాదేవి తిరిగి సుందర రూపంతో ఒక వృద్ధ స్త్రీ రూపంలో మీ దరికి చేరుకొని  మీ ఇష్టకోరిక తీర్చడానికి వస్తుంది. లేదంటే ఒకవేళ నువ్వు ఏదైనా చక్ర మాయాలో పడితే ఆ చక్రంలో ఆగిపోవటం మరుజన్మ ఎత్తడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒకవేళ నువ్వు అన్ని చక్రాల ఆధీన మాయాలు దాటినా ఈ విశ్వగురువు చూపించే యోగమాయాను దాటవలసి వస్తుంది. అప్పుడు ఆయన చూపించిన గురువు మాయా దాటితే మీరు హృదయ చక్రం లోకి చేరుకుంటారు లేదంటే సహస్రార చక్రం లో ఇరుక్కొని ఒక అణువుగా ఉన్నవారు కాస్తా 1000 పరమాణువులుగా విడిపోతారు. ఆయా లోకాలలో అనగా 1080 సూక్ష్మ లోకాలలో సూక్ష్మ రూపధారులుగా సూక్ష్మ లోకవాసులు గా ఉండి పోతారు. ఇక మీకు పునర్జన్మలు ఉండవు గాని ఇక  ఈసాధన స్థాయిలో మాత్రమే కర్మలు అలాగే స్పందనలు ఉంటాయి. ఇతరులకు కోరికలు తీర్చే స్థాయికి  మీరు చేరుకుంటారు. అంటే మీరే పరమాత్మ లు గా మారతారు అన్నమాట. ఇంతటితో బాలా త్రిపుర సుందరి ప్రాప్తి అవతార సమాప్తి అవుతుంది. 

మీరు ఇక మీ సాధన స్థాయి చిట్ట చివరి స్థితి అయిన  హృదయ చక్రం మాత్రం చేరుకుంటే అక్కడ ఈ చక్ర శుద్ధికోసం ఆదిగురువు రావాల్సి ఉంటుంది. 
ఈయన రావాలంటే మీరు ఇష్ట లింగమైన నవపాషాణం నిర్మిత శివుడి ఆత్మలింగం పొందాల్సి ఉంటుంది.అప్పుడు శూన్య బ్రహ్మ అయిన ఆదిగురువు మీ దగ్గరికి వస్తాడు. ఒకవేళ ఈ చక్రంలో ఉండే ఏకైక మహా మాయా మీ ఇష్టకోరికను మీరు దాట వలసి ఉంటుంది. అప్పుడు మౌనదక్షిణామూర్తి వస్తారు. ఇది చాలా చాలా కష్టంతో కూడిన పని అని చెప్పాలి. వ్రాయటానికి అలాగే చెప్పటానికి ఈ మహామాయా చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ చాలా పెద్దది అన్నమాట. అంటేఈ మహా మాయాలో తన ఇష్ట కోరికైన తమ ఇష్ట పదార్థాలు వదలలేక పోతారు అన్న మాట. మహాశివుడికి పాల అన్నము,దుర్గాదేవి గారెలు పులిహోర, విష్ణువు పరమాన్నం ఇలా దేవతలుగా మనం పూజించే వారంతా  వారి ఇష్ట పదార్థమును దాటలేక మన ఇష్ట కోరికలు తీర్చే దేవతలుగా ఉండిపోయారు. దాంతో హృదయ చక్రం దాటలేక ఉండిపోయారు.. కారణలోకవాసులు గా ఉండి పోయారు. అయితే గాకపోతే వీరికి సూక్ష్మలోక వాసులతో, భూలోక వాసుల తో ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం మీరు తమ సంకల్పాలు వదిలిపెడితే దానిని ఆధారం చేసుకొని వాటిని క్రియ రూపం చేయటానికి సూక్ష్మ లోకవాసులు అలాగే భూలోకవాసులు ఉంటారు. ఒకవేళ మీరు మీ ఇష్టకోరిక మాయా దాటితే  మీరు మీ హృదయ గ్రంధి విభేధనం జరిగి మహామృత్యువు అనగా మోక్షప్రాప్తిని ఇచ్చే బ్రహ్మరంధ్రం చితాగ్ని దేవతగా దేవి రూపములో  ఆదిపరాశక్తి కాస్తా దీప దుర్గ, దీపకాళిక,దీపచంఢి దర్శనం మీకు కలుగుతుంది. అప్పుడు మీరు మీ ఆది జన్మ కపాలం మీకు అందుతుంది. మూల కపాలంలో 36 కపాలాలుఉంటాయి! వీటిలో ఏక మూల కపాలంలో ఉండే బ్రహ్మ రంధ్రం మధ్యలో  వడ్ల గింజ పరిమాణంలో చితాగ్ని ఉంటుంది. ఈ చితాగ్నిలో మధ్యలో పిండిరేణువు పరిమాణములో సుడులు తిరుగుతూ తనలో అన్నింటిని కలుపుకుంటూ ఉన్న బ్రహ్మచక్రమనే కృష్ణబిలముంటుంది! ఇందులో మన పంచ శరీరములను నాశనం చేసుకుంటే, 36 కపాలాలు నాశనం చేసుకుంటే మీరు శాశ్వతమైన మరణమైన మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. ఇదే సాధన అంతిమ స్థితి అంటే సంపూర్ణ కపాల మోక్షం సిద్ధి అన్నమాట. మన సైన్స్ ప్రకారం చూస్తే మన కపాలంలో మధ్యలో ఉన్న మెదడు మధ్య భాగంలోఉండే పిట్యూటరీ గ్రంధివిభేదం చెంది అందులో ఉన్న కారణ శరీర మానవ అస్థిపంజరం  బ్రహ్మ రంధ్రంలో ఉండే అగ్నిలో ఆహుతి అయితే అనగా చిట్టచివరి మానవ అస్థిపంజర కపాలము కూడా నాశనమైతే  మీరు కపాలమోక్షం పొందినట్లు అన్నమాట. అప్పుడు మనకి సత్యము లాగా కనిపించే అసత్యమైనఈ విశ్వ జగత్తు కూడా మాయం అవుతుంది. మనకున్న మాయా మాయం అవడం వలన మనము ఇలా నిజంలాంటి కలలోనే ఉన్నామని తెలుసుకోగానే మనము కపాలమోక్షం స్థితి పొందటం జరుగుతుంది. 

యోగ చక్రాలు వివరాలు :


ఇపుడిదాకా మనము యోగ విధాన పరిసమాప్తి గూర్చి తెలుసుకున్నాము.ఇపుడు ఎలా ఈ యోగసాధన పరిసమాప్తి అవుతుందో తెలుసుకుందాము!అసలు కుండలిని శక్తి అంటే ఏమిటి? జాగృతి అంటే ఏమిటి? యోగచక్రాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఎలా ఎన్ని ఉంటాయి? అవి జాగృతి చేస్తే ఏమి జరుగుతుంది?జాగృతి ఎలా చేయాలి?ఇలా జాగృతి చేసేటప్పుడు వచ్చే యోగమాయాలు ఏమిటి? యోగ శక్తులు ఏమిటి? సకల యోగ చక్రాలు దేవతలు అలాగే వీటి బీజాక్షరాలు అలాగే యోగ చక్రాలు ఉత్తేజం చెందే క్షేత్రాలు ఏవి? ఇలా మున్నగు ఎన్నో ధర్మసందేహాలు నన్ను వేధించసాగాయి. అసలు కుండలినీ యోగం గూర్చి వివరాలు తెలుసుకోవాల్సిందే అని వివిధ శాస్త్ర గ్రంధాలు యోగ పుస్తకాలు తిరగవేయడం జరిగినది. అప్పుడుశబ్ద పాండిత్యం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అని అనిపించేది.ఎందుకంటే ఒక పుస్తకంలో యోగ చక్రాలు 6 ఉన్నాయని, మరో పుస్తకంలో ఏడు అని, వేరొక పుస్తకంలో 12 అని ఇలా ఒకే ప్రశ్నకి పలు సమాధానాలు వివిధ పుస్తకాలు ఉన్నాయి. నిజానికి మనకు ఎన్ని యోగ చక్రాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయో కూడా ఖచ్చితంగా చెప్పే పుస్తకం ఏది లేదని గ్రహించి ఒక డైరీ తీసుకొని వాటిలో యోగ చక్రాలకు సంబంధించి వివరాలు వరుస క్రమంలో రాయటం జరిగింది. ఎవరు ఎక్కడ ఆగిపోయారు? ఎవరు ముందుకు వెళ్తున్నారు తెలుసుకొని
 ఆ వివరాలు వరుసక్రమంలో క్రమం తప్పకుండా కుండలిని యోగమునకు సంబంధం ఉన్న అన్ని వివరాలు సంపూర్ణంగా రాసుకొని రావడం జరిగినది. ఇలా సుమారుగా 27 డైరీలు పూర్తయ్యేసరికి అప్పుడిక వ్రాయటం ఆపి ఇన్ని పుస్తకాలు చదివి నాకు అవసరమైన విషయాలు గుర్తించి ఈ డైరీలు నేనే రాసినానా అనిపించి ఇక ఆ తర్వాత నేను రాసిన డైరీలో వివరాలు ఒక వరుసక్రమంలో అమర్చుకొని చదవడం ప్రారంభించాను. నాకు నేను సేకరించి రాసుకొని నాకు నేనే  చదవటం ప్రారంభించాను. ఇచ్చట వీటి యొక్క సారాంశం ముఖ్యవిషయాలు ఇందులో వ్రాయటం జరిగింది.
మన శరీరం ఐదు శరీరాలుగా  స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప,ఆకాశంగా ఉంటాయి.  ఇందులో స్థూల శరీరము నాలుగు నుండి 24 అడుగుల దాకా ఉంటే, సూక్ష్మ శరీరము 83 అంగుళాలు నుండిమూడు అడుగుల దాకా ఉంటే,కారణ శరీరం మూడు అడుగుల నుండి బొటనవేలు ఆకారం వరకు, సంకల్పం బొటనవేలు ఆకారం నుండి అంగుళం ఆకారం వరకు, ఆకాశ శరీరం అంగుళం నుండి రేణువు అంత పరిమాణంలో ఉంటుంది. అలాగే స్థూల శరీరము బయటికి కనిపించే శరీర స్వరూపంగా చెప్పబడుతుంది. ఇక సూక్ష్మశరీరము తెల్లని కాంతితో కంటికి కనిపించని ఆత్మశక్తితో ఉంటుంది.ఇంకా కారణశరీరము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇక కారణ శరీరము బొటనవేలు అంత ఉంటుంది. ఇక సంకల్ప శరీరము అంగుళం అంత ఉంటుంది. ఇక ఆకాశ శరీరము పిండి పరమాణువు అంత ఉంటుంది.  ఇక  యోగచక్రాలు విషయానికి వస్తే మన శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. అవి వరుసగా 1.మూలాధార చక్రం 2.స్వాధిష్ఠాన చక్రం 3.మణిపూరక చక్రము 4.అనాహత చక్రము 5.విశుద్ధి చక్రము 6.ఆజ్ఞా చక్రము 7.గుణ చక్రము 8.కర్మచక్రం 9. కాలచక్రం 10.బ్రహ్మ చక్రం 11.సహస్రార చక్రం 12.హృదయ చక్రం 13. బ్రహ్మచక్రము(బ్రహ్మరంధ్రం) ఇలా మన సూక్ష్మ శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. మన సూక్ష్మ శరీరంలో మూడు యోగ నాడులతో అనగా ఇడా పింగళ సుషుమ్న నాడులతో మూడు త్రివేణి గ్రంధులు అనగా బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులుతో అనుసంధానం అయి ఉంటాయి. మూలాధార స్వాధిష్ఠాన చక్రం పైన బ్రహ్మ గ్రంధి అలాగే మణిపూరక అనాహత చక్రాల పైన విష్ణు గ్రంధి అలాగే విశుద్ధి ఆజ్ఞా చక్రం పైన రుద్రగ్రంధి ఉంటాయి.అలాగే ఈ చక్రాలు కలిసి అనుసంధానం అవుతాయి.అనగా మూలాధార చక్రము - ఆజ్ఞాచక్రం తో అలాగే స్వాధిష్ఠాన చక్రం-విశుద్ధిచక్రంతో అలాగే మణిపూరక చక్రం- అనాహత చక్రం తో అనుసంధానమై ఉంటాయి. అలాగే ఈ చక్రాలు స్థూల శరీరం లోని వివిధ అంగాలతో అనుసంధానమై వాటి మీద ప్రభావం చూపుతాయి. చక్రాలు బలంగా ఉంటే అంగాలు బలంగా ఒకవేళ చక్రాలు బలహీన పడితే అంగాలు కూడా బలహీనపడి వివిధ రకాల వ్యాధులు వస్తాయి అని తెలుసుకున్నాను. అలాగే యోగ చక్రాలకి ఆయా చక్ర దేవతలుంటారని వాటికి బీజాక్షరాలు ఉంటాయని వీటికి క్షేత్రాలు ఉంటాయని ,వాటికి ఆయా చక్రాలు యోగ మాయాలు అలాగే యోగ శక్తులు ఉంటాయని తెలుసుకున్నాను. 
చక్ర స్థితుల వివరణ: 


ఒక విషయం తెలుసుకోండి. పన్నెండు యోగ చక్రాలు మొదట జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం జరగాలి. ఇందులో విభేదనం స్థితి అనేది సాధకుడు తన జీవ సమాధి స్థితిలోకి వెళ్లేముందు చేసుకుంటాడు. తర్వాత అతను జీవ సమాధి సిద్ధి పొందుతాడు. కానీ 13 యోగ చక్రాల జాగృతికి మూడు నెలల నుండి 12 సంవత్సరాలు ఒక్కొక్క చక్రం జాగృతి పడుతుంది. ఇది చక్రాల జాగృతి అయిన తర్వాతే  చక్రాల శుద్ధి ఆరంభమవుతుంది. మళ్లీ ఇది ఆరు నెలల నుండి 12 సంవత్సరముల వరకు ఒక్కొక్క చక్రం శుద్ధి అవుటకు సమయం పడుతుంది. ఇది చక్రాల శుద్ధి అయిన తర్వాతనే యోగ చక్రాలు ఆధీనం స్థితికి వస్తాయి.ఆధీనం అవ్వాలంటే పన్నెండు చక్రాలు 12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నాలుగవ స్థితి అనేది కేవలం తీవ్రధ్యాన స్థితిలో  సాధకుడు ఉంటే 48 నిమిషాల్లో విభేదనం చెంది సమాధి స్థితి పొందుతాడు లేదంటే 21 రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత జరిగే విభేదనం విధానానికి శరీరము తట్టుకోలేక అకాల శరీరత్యాగం అనగా సమాధి స్థితి పొంద కుండా మరణం పొంద వలసి వస్తుందని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. అంటే ఈ లెక్కన చూస్తే యోగ చక్రాలు జాగృతి,శుద్ధి, ఆధీనముకు వరుసగా 36 నెలలు (12X3),72 నెలలు(12X6),12సంవత్సరాలు పడుతుంది. మొత్తం కలిపి 36 నెలలు అంటే మూడు సంవత్సరములు, 72 నెలలు అంటే ఆరు సంవత్సరములు మరియు 12 సంవత్సరములు అనగా 3+6+ 12=21 సంవత్సరాలు పడుతుంది. అదే మీరుచక్రాల జాగృతి మరియు సిద్ది అలాగే ఆధీనంనకు ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే 36 సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక చక్రం జాగృతి కాకుండా ఎక్కువ సంవత్సరాలు పడితే ఆ లెక్కన చూస్తే ఈ మానవ జన్మ సరిపోదు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి గత జన్మలో మీరు ఈ సాధన స్థాయిలో ఒక దానిని పూర్తి చేసి తర్వాత స్థాయికి వస్తే అక్కడ నుండి చక్రాల స్థితి ప్రారంభం అవుతుందని తెలుసుకోండి.ఉదాహరణకు మీరు క్రింద జన్మలోనే చక్రాలు జాగృతి చేసుకుంటే ఈ జన్మలో చక్రాల శుద్ధి నుండి ప్రారంభం అవుతుంది. మీరు ఒకవేళక్రిందటి జన్మ లోచక్రాల జాగృతి, చక్రాల శుద్ధి చేసుకుని ఉంటే ఈ జన్మలో మీ పరిస్థితి చక్ర ఆధీనంతో మీ సాధన స్థితి ఆరంభమవుతుంది. గత జన్మలో కేవలం కుండలినీ శక్తిని జాగృతం చేసుకుంటే ఈ జన్మలో చక్రాల జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం దాకా మీ ఈ సాధన స్థితి కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఎక్కడైనా యోగ మాయాలో పడి వ్యామోహం చెందితే అంతటితో ఆ సాధన స్థితి వద్ద ఈ సాధన ఆగిపోయి మరుసటి జన్మలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడనుండి మీ సాధన స్థితి ఆరంభం అవుతుందని గ్రహించండి.

ఇక్కడ చిన్న సందేహం రావచ్చు అసలు మనం చక్ర జాగృతి లేదా చక్రశుద్ధి  లేదా చక్ర ఆధీనం లేదా చక్ర విభేదనంలో ఎందులో ఉన్నామో ఎలా తెలుసుకోగలము.ఇది తెలియాలంటే మీకు వచ్చే గురువులు బట్టి మీరు ఏ చక్ర స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు మంత్ర గురువు వస్తే  మీరు చక్ర జాగృతి లో ఉన్నట్లుగా అదే మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో మీకు దీక్ష గురువుగా వస్తే మీరు చక్ర శుద్ధిలో ఉన్నట్లుగా,అదే మీకు మోక్ష క్షేత్రాలలో పరమ గురువు వస్తే మీరు చక్రం విభేదనంలో ఉన్నట్లుగా  భావించుకోవాలి. అలాగే మీకున్న నాలుగు రకాల గ్రంధులు అనగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, హృదయ గ్రంధి జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం కు ఒక్కొక్క దానికి మళ్లీ ఒక నెల నుండి ఆరు నెలలు పడుతుంది.వీటి కోసం విశ్వ గురు దత్తాత్రేయ స్వామి అలాగే జగద్గురువులు శ్రీకృష్ణుడు వస్తారు.ఒకవేళ మీకు తాము వచ్చినట్లుగా ప్రత్యక్ష దైవం అనుభవాలు ఇస్తే మీరు చక్ర గ్రంధిలలో ఏదో ఒక గ్రంధిని జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం  చేసుకోటానికి ఈ జన్మలో ఉన్నారని గ్రహించండి. 

అలాగే మనము అసలు ఏ చక్రం లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అని  సందేహం రావచ్చు. దీనికి చిన్న పరిష్కార విధానం ఉన్నది. అదేమిటంటే మన శ్వాస సహాయంతో సాధకుడు తను ఏ చక్రానికి సంబంధించిన వ్యక్తో తెలుసుకోవచ్చు.ఇందుకు మనము సాధకుడు ముక్కు దగ్గర ప్రతిబింబం కనిపించే విధముగా పరిశుభ్రంగా చూసుకునే మంచి అద్దం ఉంచి అద్దం పైన సాధకుడు శ్వాసను గట్టిగా పీల్చి అద్దం మీద వదిలితే ఆ శ్వాస ఆవిరి అద్దం మీద పడి ఒక క్షణం పాటు ఒక ఆకారము ఏర్పడుతుంది.ఆకారాన్ని బట్టి సాధకుడు ఏక్కడ ఉన్నాడో తప్పకుండా  తెలుస్తోంది. చక్ర తత్వంలో అనగా మన శ్వాస ఆకారాలు వరుసగా 1. నాలుగు పలకల ఆకారం అయితే మూలాధార చక్రము 2.అర్థచంద్రాకారము ఐతే స్వాధిష్ఠాన చక్రము3.త్రికోణాకారం అయితే మణిపూరక చక్రము 4. వృత్తాకారం అయితే అనాహత చక్రము5. చుక్కలు చుక్కలు అయితే విశుద్ధి చక్రము 6.ఏ ఆకారం ఏర్పడకపోతే  ఆజ్ఞా చక్రము మనం ఇలా మూలాధారం నుండి  ఆజ్ఞా చక్రం వరకు ఏచక్ర తత్వంలో ఉన్నామో తెలుస్తుంది. ఇక పైన ఉండే సహస్ర, హృదయ చక్రాలు మనం తెలుసుకోలేం. ఆయా గురువులు వస్తేగానీ మనకు వచ్చే గురువులు బట్టి జాగృతి, శుద్ధి, ఆధీనం విధానము తెలుసుకొని ఈ స్థితిలో మనలో ఏ చక్రమునకుతత్వంలో ఉన్నాయో మన శ్వాస ఆవిరిపట్టి మన శ్వాస కలిపి చూస్తే ఇట్టే అర్థం అవుతుంది కదా! కానీ ఈ రెండు రకాల విధి విధానాలు నేను కనిపెట్టి తెలుసుకునేసరికి మూడు సంవత్సరాల పైన పెట్టినది. నేను నా జిఙ్ఞాసి సాధన చేస్తున్నప్పుడు అసలే చక్రం లో ఉన్నామో తెలిసేది కాదు. అలాగే ఏ చక్ర స్థితి లో ఉన్నామో అర్థమయ్యేది కాదు. చెప్పటానికి వివరించడానికి ఎవరూ కూడా అందుబాటులో ఉండేవారు కాదు. 

కేవలం యోగ శాస్త్రాలువాటిమీద అవగాహన ఇచ్చేవిగానీ అనుభవం లో ఇవి పనికి వచ్చేవి కావు. మేమిద్దరం చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అసలు సాధన ముందుకు వెళుతుందో లేదో అని తెలిసేది కాదు. ఏది యోగ మాయో లేదా ఏది సాధన శక్తి ,ఏది ఏ దేవత దేనికి చెందినది  అలాగే మాకు కనిపించే యంత్రాలు వాటి బీజాక్షరాలు మాకు అర్థమయ్యేవి కావు. అలా అయోమయ స్థితిలో మేము 12 సంవత్సరాలు మా కాలం వృధా చేసుకున్నాము. అలాంటి పొరపాటు మాలాంటి వారు చేయకూడదని యోగ శాస్త్ర గ్రంధాలు మరియు వివిధ రకాల యోగులు అనుభవాలు మరియు మా సాధన అనుభవాలు కలిపి ఏయే చక్రాలు, ఏ ఏ చక్రస్థితిలో ఏ ఏ యోగమాయాలు,ఈ చక్ర దేవతలు, వాటి యోగ శక్తులు, యోగసిద్ధులు ,వాటి బీజాక్షర మంత్రాలు తెలుసుకొని చాలా స్పష్టమైన అవగాహనను నేనే స్వయంగా అనుభవించి వాటన్నిటినీ క్రోడీకరించి మా డైరీలలో  నింపి వేశాము. వాటి సారాంశం ఈ గ్రంథ రచన అన్నమాట. సాధన ఆరంభం నుండి అంతం వరకు అసలు ఏ ఏ స్థితులు వస్తాయి, ఏమాయా మర్మాలు వస్తాయి, వాటిని ఎలా దాటుకోవాలి వివరించడానికి ఈ గ్రంథ రచన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మేము ఇచ్చిన ఆయా చక్రాల అనుభవాల సమాచారాన్ని బట్టి   మీరు ఏ చక్రంలో అలాగే ఏ చక్ర స్థితిలో చక్ర యోగసిద్ధులు,ఏ  యోగ మాయా లో ఉన్నారో మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రంథము ఒకరకంగా మీకు మంత్ర, దీక్ష, సద్గురువువు, విశ్వ గురువు ,జగద్గురువు, పరమ గురువులు గా ఉండి మీరు ఏ ఏ గురువుల స్థితిలో అలాగే ఏ చక్ర స్థితిలో ఉన్నారో మీకు అన్ని విధాలుగా ఖచ్చితంగా నమ్మకంగా చెబుతుంది. ఎందుకంటే ఈ గ్రంథము ముగ్గురు  యోగుల అనగా పురాణపురుషా లాహిరి,పరమహంస పవనానంద,వాసుదేవానంద యొక్క సాధనానుభవాల ఆధారముగా ఈ గ్రంథ రచన చేయడం జరిగినది. ఒక రకంగా చూస్తే ఈ గ్రంథం జ్ఞానగురువుగా ఉంటుందని గ్రహించండి.అంటే ఈ గ్రంథంలో యోగసాధనలో మోక్ష ప్రాప్తి సంబంధించి అన్ని విషయాలు ఇందులో చర్చించడం జరిగినది. గురువుల ప్రకారం చూస్తే మంత్ర గురువు నుండి చివరకు వచ్చే  ఆదిగురువు దాకా, అలాగే చక్రాలలో చూస్తే మొదటిది మూలాధారం నుండి హృదయ చక్రం దాకా, అలాగే చక్రాల్లో వచ్చే జాగృతి నుండి ఆధీనం దాకా మరియు ఈ చక్రం లో వచ్చే దేవతలలో ప్రారంభ దేవత అయిన గణపతి నుండి చివరి దేవత అయిన దీప దుర్గ వరకూ, చక్రం లో వచ్చే ప్రారంభం అయిన యోగమాయా అయిన కామమాయా నుండి చివరిదైన ఇష్టకోరికమాయా దాకా అలాగే చక్రంలో వచ్చే యోగ శక్తులు ప్రారంభమైన ఖేచరి సిద్ది నుండి కపాలమోక్ష  సిద్ది వరకు ఇలా అన్ని విషయాలు సంపూర్తిగా ఇందులో చర్చించడం విశ్లేషించటం దానికి తగ్గ అనుభవాలు అనుభూతులు సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగినది. 

మాకు అలాగే మా చక్ర దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడినది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అనిమేము అనుకుంటుండగా మా 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువువైన కాశీ వాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వటం,   మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తక డైరీలు యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. అలాగేఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగము ధరించి అది ఇచ్చే ఇష్ట కామ్య సిద్ధితో ఎవరి యోగసాధన దేనివలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించటం జరిగినది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వడంతో మంత్ర శక్తి,,చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వడంతో యంత్ర శక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతా శక్తులు, దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వటంతో దైవికశక్తి, గురువును గూర్చి చెప్పడంతో శక్తి పాతం, యోగుల అనుభవ వివరాలు చెప్పటంతో యోగశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది .అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటో కి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీ తోడు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి  ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి ,మధుర భక్తి,,నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు.కేవలం మోక్ష కాంక్షమాత్రమే తీర్చును.  అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారికి మాత్రమే. వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది.అది ఏమిటంటే ఇక్కడ ఇచ్చిన దేవతలలో ఏదో ఒక దేవతను మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని  అలాగే మీ ఇష్ట  గురువుగా భావించికోండి.వారి దగ్గర ఉన్న బీజాక్షర మంత్రము గురు మంత్రంగా భావించి, మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజూ క్రమం తప్పకుండా వేళతప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానంనందు స్థిరపడి  విశ్లేషణ శక్తి పెంపొందించుకుని వివేకబుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన  శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు లేదా మీ ఇష్ట దేవతను గురువు గావించుకుని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవము గురువుగా గురువే దైవము గానుమారుతుంది .కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తాపడి తమ యోగసాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయాను చేధించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూసాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకూడదు. అది ఏమిటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్టభర్త/ఇష్ట భార్య గా భావించకూడదు. ఇది నా మనవి. ఈ వివరాలు మీకు మా ఆఙ్ఞాచక్రానుభవాలలో తెలుస్తుంది!


ఇప్పుడు మన యోగ చక్రాలు ఉండే శరీర స్ధానాలు:

1. మూలాధార చక్రము - వెన్నుపూస క్రింద  
2.స్వాధిష్ఠాన చక్రము - వెన్నుపూస అంతమయ్యే చోట
3.మణిపూరక చక్రము - బొడ్డు వెనుక భాగములో
4.అనాహత చక్రం - హృదయ వెనుక భాగములో
5.విశుద్ధి చక్రము -   కంఠము వెనుక
6.ఆజ్ఞా చక్రము - భ్రూమధ్యము
7. గుణ చక్రం -   భ్రూమధ్య చతుర్ధ గుహ
8. కర్మచక్రం -  భ్రూమధ్య చతుర్ధ గుహ
9.కాలచక్రం-  భ్రూమధ్య చతుర్ధ గుహ
10. బ్రహ్మ చక్రం- భ్రూమధ్య చతుర్ధ గుహ
11.సహస్రార చక్రం – మెదడు వెనుక
12.హృదయ చక్రం- హృదయము
13.బ్రహ్మరంధ్రము- మాడు పై మధ్యభాగము

ఇప్పుడు మన యోగ చక్రాల ధాతువులు:

1. మూలాధార చక్రము -   ఎముక
2.స్వాధిష్ఠాన చక్రము - కొవ్వు
3.మణిపూరక చక్రము - కండరాలు
4.అనాహత చక్రం - రక్తం
5.విశుద్ధి చక్రము -   చర్మం
6.ఆజ్ఞా చక్రము - మజ్జ
7. గుణ చక్రం -   ములుగు
8. కర్మచక్రం - ములుగు  
9.కాలచక్రం- ములుగు 
10. బ్రహ్మ చక్రం- ములుగు
11.సహస్రార చక్రం – శుక్రం
12.హృదయ చక్రం- రక్త ప్రసరణ
13.బ్రహ్మరంధ్రము- జుట్టు

ఇప్పుడు మన యోగ చక్రాల లక్షణాలు:

1. మూలాధార చక్రము -   జీవన పోరాటం
2.స్వాధిష్ఠాన చక్రము - విషయలోలత్వం
3.మణిపూరక చక్రము - అధికారం కోసం పాటుపడటం
4.అనాహత చక్రం - ఇతరుల కోసం పాటుపడటం
5.విశుద్ధి చక్రము -   ఇతరులపై ఆధారపడటం
6.ఆజ్ఞా చక్రము - పనులు అమలు చెయ్యడములో తొందరపాటు
7. గుణ చక్రం -   గుణాల మార్పులలో తొందరపాటు
8. కర్మచక్రం - కర్మలు చెయ్యడములో తొందరపాటు  
9.కాలచక్రం- అనుకోవడములో తొందరపాటు 
10. బ్రహ్మ చక్రం- ఆలోచనలలో తొందరపాటు
11.సహస్రార చక్రం – ఆధ్యాత్మికం
12.హృదయ చక్రం- ఇష్ట కోరిక 
13.బ్రహ్మరంధ్రము- సహన శక్తి

ఇప్పుడు మన యోగ చక్రాల శరీరాలు:

1. మూలాధార చక్రము -   స్ధూల శరీరం
2.స్వాధిష్ఠాన చక్రము - స్ధూల శరీరం
3.మణిపూరక చక్రము - స్ధూల శరీరం
4.అనాహత చక్రం - స్ధూల శరీరం
5.విశుద్ధి చక్రము -   స్ధూల శరీరం
6.ఆజ్ఞా చక్రము - సూక్ష్మ శరీరం
7. గుణ చక్రం -   సూక్ష్మ శరీరం
8. కర్మచక్రం - సూక్ష్మ శరీరం  
9.కాలచక్రం- సూక్ష్మ శరీరం  
10. బ్రహ్మ చక్రం- సూక్ష్మ శరీరం
11.సహస్రార చక్రం – కారణ శరీరం
12.హృదయ చక్రం- సంకల్ప శరీరం
13.బ్రహ్మరంధ్రము- ఆకాశ శరీరం

ఇప్పుడు మన యోగ చక్రాల మానసిక పరిణామం:

1. మూలాధార చక్రము -  అహంకారం 
2.స్వాధిష్ఠాన చక్రము - చిత్తం
3.మణిపూరక చక్రము - బుద్ది
4.అనాహత చక్రం - మనస్సు
5.విశుద్ధి చక్రము -   చైతన్యం
6.ఆజ్ఞా చక్రము - పూర్ణ చైతన్యం
7. గుణ చక్రం - పూర్ణ చైతన్యం  
8. కర్మచక్రం - పూర్ణ చైతన్యం 
9.కాలచక్రం- పూర్ణ చైతన్యం  
10. బ్రహ్మ చక్రం- పూర్ణ చైతన్యం
11.సహస్రార చక్రం – శుద్ధ చైతన్యం
12.హృదయ చక్రం- పరిశుద్ధ చైతన్యం 
13.బ్రహ్మరంధ్రము- సంపూర్ణ చైతన్యం

ఇప్పుడు మన యోగ చక్రాల తత్వాలు:

1. మూలాధార చక్రము -   భూమి
2.స్వాధిష్ఠాన చక్రము - జలము
3.మణిపూరక చక్రము - అగ్ని
4.అనాహత చక్రం - వాయువు
5.విశుద్ధి చక్రము - ఆకాశము   
6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలు
7. గుణ చక్రం -   మనస్సు
8. కర్మచక్రం -  బుద్ది
9.కాలచక్రం- కాలము  
10. బ్రహ్మ చక్రం- అహంకారం
11.సహస్రార చక్రం – శబ్ధం
12.హృదయ చక్రం- కాంతి 
13.బ్రహ్మరంధ్రము- శూన్యం

ఇప్పుడు ఈ చక్రాల బీజాక్షరాలు కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము - "లం" - 4 దళాలు
2.స్వాధిష్ఠాన చక్రము - "వం" - 6 దళాలు
3.మణిపూరక చక్రము - "రం" - 10 దళాలు
4.అనాహత చక్రం - "యం" - 12 దళాలు
5.విశుద్ధి చక్రము - "హం" - 16 దళాలు
6.ఆజ్ఞా చక్రము - "ఓం" - 2 దళాలు
7. గుణ చక్రం - "మః" -3 దళాలు
8. కర్మచక్రం -  "న" - 3 దళాలు
9.కాలచక్రం-  "శి" -3 దళాలు
10. బ్రహ్మ చక్రం- "వా"- 2 దళాలు
11.సహస్రార చక్రం - "య"- 1000 దళాలు
12.హృదయ చక్రం- "తుం'- 4 దళాలు
13.బ్రహ్మరంధ్రము -  నిశ్శబ్ద నాదం - శూన్యం

ఇప్పుడు మీరు క్రింద చూపిన దైవాలలో ఎవరో ఒకరిని మనస్ఫూర్తిగా ఎన్నుకొని మార్చకుండా ఒకే రూపంతో ఒకే నామంతో ఆయనను ఆరాధించి వలసి ఉంటుంది. మన యోగ సాధనలో వీరే తారసపడే దైవాలు. కాబట్టి వారిని ముందు నుంచి మచ్చిక చేసుకుంటే మన సాధన పరిసమాప్తి చేయడానికి సహాయ పడతారు. వారే

1. మహాగణపతి -మూలాధార చక్ర దైవం
2. లక్ష్మీనారాయణులు- స్వాధిష్టాన చక్రం దైవము 
3.మహావిష్ణువు/పాండురంగడు/బాల అమ్మవారు/మీ ఇష్టదైవము- మణిపూరక చక్రం దైవం
4.శివశక్తి (మహాకాలుడు/మహాకాళిక)- అనాహత చక్రం దైవం
5. గాయత్రి/సరస్వతి- విశుద్ధి చక్రము దైవము 
6.అర్ధనారీశ్వర తత్వం (శివ కేశవ/శివ పార్వతి) ఆజ్ఞా చక్రం దైవం
7. శ్రీదత్తుడు - గుణ చక్రము దైవము
8. శ్రీరాముడు - కర్మ చక్రం దైవము
9. కాలభైరవుడు - కాలచక్ర దైవము
10. మహా బ్రహ్మ/ఏకపాదుడు-  బ్రహ్మ చక్ర దైవము
11. మహాశివుడు - సహస్రార చక్ర దైవము, హనుమాన్ జీవనాడి మార్గం దైవం 
12.ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి-  హృదయ చక్రం దైవం, ఉగ్రనరసింహస్వామి-బ్రహ్మనాడి దైవం
13. ఆది పరాశక్తి/దీపదుర్గ,దీపకాళిక,దీపచంఢి - బ్రహ్మ రంధ్రం దైవము 
  బ్రహ్మ విష్ణువు శివుడు - త్రిగ్రంధుల దైవాలు

 ఈ పైన చెప్పిన 13 దైవాలు మనకున్న 13 యోగ చక్రాలు దేవతలు కాబట్టి వీరిలో ఒకరిని మనస్ఫూర్తిగా బాగా ఆసక్తి, అనురక్తి, మధుర భక్తితో మనల్ని కదిల్చే వారిని మీ ఇష్టదైవంగా ఎంచుకొని  సాధన కొనసాగించండి. 

ఇక  ఈ యోగ చక్రాలలో వచ్చే యోగమాయాలను కూడా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడండి.

1. మూలాధార చక్రము - కామ మాయా 
2.స్వాధిష్ఠాన చక్రము - ధన మాయా 
3.మణిపూరక చక్రము - ఇష్ట దేవత మాయా 
4.అనాహత చక్రం - చావు/మరణ భయం మాయా
5.విశుద్ధి చక్రము - జ్ఞాన మాయా 
6.ఆజ్ఞా చక్రము - జీవమాయా, అహంకారము
7. గుణ చక్రం - త్రిగుణాల మాయా 
8. కర్మచక్రం - కర్మ మాయా
9.కాలచక్రం- అకాల మృత్యు భయం మాయా
10. బ్రహ్మ చక్రం-  బ్రహ్మ జ్ఞాన అహంకారం మాయా 
11.సహస్రార చక్రం - సర్వ సిద్ధుల మాయా 
12.హృదయ చక్రం- ఇష్ట కోరిక మాయా,స్పందన మాయా
13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యువు భయము మాయా, సహన శక్తి మాయా 
త్రి గ్రంధులు -త్రిమూర్తి మాయాలు 
హృదయ గ్రంధి-బాలా త్రిపుర సుందరి మాయాలు
ఈ విధంగా మనకుండే యోగ చక్రాలలో మరియు ఈ పైన చెప్పిన యోగ మాయాలు ఉంటాయి 

ఈ 13 యోగ చక్రాలలో ఉండే యోగ శక్తులు ముందుగానే తెలుసుకుంటే వాటిని దాట గలిగే స్థాయికి మన మనోస్థాయి మీ సాధన స్థాయి ఉంటుంది. అది

1. మూలాధార చక్రము - భూచర సిద్ధి 
2.స్వాధిష్ఠాన చక్రము - అనుర్మిమ తత్వం సిద్ధి 
3.మణిపూరక చక్రము - దూరశ్రవణం సిద్ధి
4.అనాహత చక్రం - దూరదృష్టి సిద్ధి
5.విశుద్ధి చక్రము - మనో జపంసిద్ధి 
6.ఆజ్ఞా చక్రము - దివ్య దృష్టి సిద్ధి
7. గుణ చక్రం - కామరూప సిద్ధి
8. కర్మచక్రం -  అపరాజయం సిద్ధి
9.కాలచక్రం-  సహక్రుత్ సిద్ధి
10. బ్రహ్మ చక్రం- అద్వంద్వం సిద్ధి
11.సహస్రార చక్రం - అష్టసిద్ధులు సిద్ధి
12.హృదయ చక్రం- యధా సంకల్ప సిద్ధి
13.బ్రహ్మరంధ్రము -  స్వచ్ఛంద మరణ సిద్ధి
రుద్రగ్రంధి - పంచభూతాలు అదుపులో ఉండటం సిద్ధి,విష్ణు గ్రంధి -ప్రాకామ్యశ్చ సిద్ధి,బ్రహ్మ గ్రంధి-  పర చిత్తాది అభిజ్ఞత సిద్ధి,
హృదయ గ్రంధి- ఆజ్ఞా ప్రతిహత గతి సిద్ధి

ఈ విధంగా మీరు 13 యోగ చక్రాలు జాగృతి , శుద్ధి,ఆధీనం,విభేదనం స్థితిలు గురించి అలాగే ఈ చక్రాల దేవతల గురించి ఈ చక్రాల యోగమాయాలు గూర్చి ఈ చక్రాల యోగ శక్తుల గురించి తెలుసుకున్నారు కదా.అలాగే ఈ 13 యోగ చక్రాల లోని దైవ అనుగ్రహం పొందుటకు అలాగే వాటి యోగ మాయాలను దాటించుటకు పఠించవల్సిన స్తోత్రాలు తెలుసుకోండి. కానీ సిద్ధ మార్గంలో ప్రయాణించే వారికి వీటి అవసరం ఉండదు. కానీ మిగిలిన యోగ మార్గాలు ప్రయాణించే వారికి వీటి అవసరం పడే అవకాశాలున్నాయి. అనగా కర్మ, భక్తి,,జ్ఞాన, ధ్యాన  ఇలా ఈ మున్నగు మార్గాలలో ప్రయాణించే వారికి ఈ స్తోత్ర పఠనము యోగ మాయాలను దాటిస్తాయని వివిధ యోగులు అనుభవాల ద్వారా తెలుసుకొని వాటిని సేకరించి ఒక వరుస క్రమంలో చేర్చడం జరిగింది. అవి  


ఇప్పుడు మన యోగ చక్రాల కోసం పఠించవలసిన స్తోత్రాలు:

1. మూలాధార చక్రము - మహాగణపతి స్తోత్రాలు
2.స్వాధిష్ఠాన చక్రము - లక్ష్మీనారాయణులు స్తోత్రాలు
3.మణిపూరక చక్రము - మహావిష్ణువు స్తోత్రాలు/పాండురంగడు స్తోత్రాలు
4.అనాహత చక్రం - శివశక్తి స్తోత్రాలు,శివ స్తోత్రాలు పార్వతి స్తోత్రాలు 
5.విశుద్ధి చక్రము - గాయత్రి/సరస్వతి స్తోత్రాలు
6.ఆజ్ఞా చక్రము - గురు స్తోత్రాలు,షిరిడి సాయి బాబా, దత్త స్వామి, గురు రాఘవేంద్ర స్తోత్రాలు
7. గుణ చక్రం - శ్రీదత్తుడు స్తోత్రాలు
8. కర్మచక్రం -  సీతారామ స్తోత్రాలు
9.కాలచక్రం-  కాలభైరవుడు/కాలభైరవి స్తోత్రాలు
10. బ్రహ్మ చక్రం- గాయత్రి/సరస్వతి/సావిత్రి స్తోత్రాలు
11.సహస్రార చక్రం - మహాశివుడు/శ్రీకృష్ణ/ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు
12.హృదయ చక్రం- ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి/హనుమ స్తోత్రాలు,అర్గళా స్తోత్రం
13.బ్రహ్మరంధ్రము -  ఆది పరాశక్తి కవచ స్తోత్రం - దీప దుర్గా కవచ స్తోత్రం - దీప కాళికా కవచ స్తోత్రం - దీప ఛంఢి కవచ స్తోత్రం
త్రి గ్రంధులు -బాలా త్రిపుర సుందరి స్తోత్రాలు

మనము ఏఏ చక్రాల్లో ఉన్నామో ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే:

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు
2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు
3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం
4.అనాహత చక్రం -   ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం
5.విశుద్ధి చక్రము -  వివిధ రకాల శబ్దాలు వినబడటం
6.ఆజ్ఞా చక్రము -  ఓంకార నాదం వినబడటం
7. గుణ చక్రం -  త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం 
8. కర్మచక్రం -  వివిధ రకాల ఆయుధాలు కనబడటం  త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం
9.కాలచక్రం-  ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం
10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం
11.సహస్రార చక్రం -  కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం
12.హృదయ చక్రం-  హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు, ఇష్టలింగం రావటం
13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు 
త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు

అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.          

1. మూలాధార చక్రము -  మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా  గాలిలో ఎగరడం,శవ ఆసనాలు 
2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం
3.మణిపూరక చక్రము -  విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం
4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం
5.విశుద్ధి చక్రము -  చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం 
6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం
7. గుణ చక్రం -   ఇదః శరీరం పరోపకారార్ధం ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం
8. కర్మచక్రం -  ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం
9.కాలచక్రం-   చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట
10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం 
11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన
12.హృదయ చక్రం-   ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస
13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం
త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం

అలాగే మనము ఏఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి.  

1. మూలాధార చక్రము -  గాలిలో ఒక అడుగు ఎత్తులో ఎగరటం
2.స్వాధిష్ఠాన చక్రము - నీటిమీద తేలియాడటం
3.మణిపూరక చక్రము - అగ్ని ప్రమాదాలు జరిగిన ఏమీ కాకపోవడం
4.అనాహత చక్రం - వాయు ప్రమాదాలు జరగకపోవడము
5.విశుద్ధి చక్రము -  ఆకాశంలో ఎగరటం
6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం , సూక్ష్మ శరీర యానం చేయడం
7. గుణ చక్రం -   దశేంద్రియాలు జయించడము
8. కర్మచక్రం -  అన్నిటి యందు విజయం పొందడం
9.కాలచక్రం-  భూత, వర్తమాన,భవిష్యత్తు సంఘటనలు చూడటం 
10. బ్రహ్మ చక్రం- బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు , బ్రహ్మాండ దర్శనాలు, గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు
11.సహస్రార చక్రం - పంచభూతాలను అదుపులో ఉంచుకోవడం,సర్వసిద్ధులు ఆధీనం అవ్వటం, ఇచ్చా మరణము పొందడము
12.హృదయ చక్రం-  కావాలనుకునే కోరికలు తీరడం, ఇతరుల రోగాలు, వ్యాధులు నయం చేయటం 
13.బ్రహ్మరంధ్రము - కోరుకునేవారికి మరణం ఇవ్వటం  

అలాగే మనము ఏఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏఏ నాద శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి.

   1. మూలాధార చక్రము -  తుమ్మెదల నాదము
2.స్వాధిష్ఠాన చక్రము - వేణు నాదము
3.మణిపూరక చక్రము - చిన్న ఘంటానాదము 
4.అనాహత చక్రం - దీర్ఘ ఘంటానాదము 
5.విశుద్ధి చక్రము -  వీణా నాదము /మేఘ గర్జన నాదము
6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదము
7. గుణ చక్రం -   దుందుభి నాదము
8. కర్మచక్రం -  కాంస్య నాదము
9.కాలచక్రం-   శృంగ నాదము
10. బ్రహ్మ చక్రం- మేఘ గర్జన నాదము(ఏకపాదుడు)
11.సహస్రార చక్రం - శంఖం/డమరుకం నాదము
12.హృదయ చక్రం-  తుంకార నాదము
13.బ్రహ్మరంధ్రము -   నిశ్శబ్ద నాదము

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహారపదార్ధాలు

1. మూలాధార చక్రము -  పులగము 
2.స్వాధిష్ఠాన చక్రము - పెరుగు అన్నము 
3.మణిపూరక చక్రము - బెల్లం పొంగలి
4.అనాహత చక్రం - నెయ్యి కలిపిన అన్నము
5.విశుద్ధి చక్రము -  పాలపాయసాన్నం 
6.ఆజ్ఞా చక్రము - పులిహోర 
7. గుణ చక్రం -   పులిహోర
8. కర్మచక్రం -  పులిహోర
9.కాలచక్రం-  పులిహోర
10. బ్రహ్మ చక్రం- పులిహోర
11.సహస్రార చక్రం – పాలపాయసాన్నం 
12.హృదయ చక్రం- ఇష్టపదార్ధాలు 
13.బ్రహ్మరంధ్రము -మినప గారెలు

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన లోహములు:

1. మూలాధార చక్రము -   బంగారము 
2.స్వాధిష్ఠాన చక్రము - వెండి 
3.మణిపూరక చక్రము -రాగి 
4.అనాహత చక్రం - ఇనుము 
5.విశుద్ధి చక్రము - జింక్ 
6.ఆజ్ఞా చక్రము – బంగారం
7. గుణ చక్రం – బంగారం
8. కర్మచక్రం – బంగారం
9.కాలచక్రం – బంగారం
10. బ్రహ్మ చక్రం – బంగారం
11.సహస్రార చక్రం - పంచలోహ ధాతువులు 
12.హృదయ చక్రం - నవపాషాణ ధాతువు 
13.బ్రహ్మరంధ్రము -శుద్ధ స్పటికం

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన రంగులు:

1. మూలాధార చక్రము - ఎరుపు
2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ
3.మణిపూరక చక్రము - కాషాయరంగు
4.అనాహత చక్రం - ఆకుపచ్చరంగు
5.విశుద్ధి చక్రము -నీలం
6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు
7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు
8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు
9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు
10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు
11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు
12.హృదయ చక్రం- లేతనీలం
13.బ్రహ్మరంధ్రము - తెలుపు 

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి వెయ్యవలసిన హస్తముద్రలు:

1. మూలాధార చక్రము - పృథ్వీముద్ర/అశ్వనీ ముద్ర/మహావేధముద్ర  
2.స్వాధిష్ఠాన చక్రము – జలముద్ర/ ఖేచరీముద్ర
3.మణిపూరక చక్రము - సూర్యముద్ర/అగ్నిసారాముద్ర/అపానముద్ర/ఉడ్యానబంధముద్ర
4.అనాహత చక్రం - వాయుముద్ర/అపానవాయుముద్ర
5.విశుద్ధి చక్రము - ఆకాశముద్ర/ఉదానముద్ర   
6.ఆజ్ఞా చక్రము - జ్ఞానముద్ర/
 7. గుణ చక్రం - ప్రాణముద్ర/ 
8. కర్మచక్రం - అంజలిముద్ర/ 
9.కాలచక్రం- అగోచరీముద్ర/ 
10. బ్రహ్మ చక్రం- జ్ఞానముద్ర/
11.సహస్రార చక్రం – శూన్యముద్ర
12.హృదయ చక్రం- చిన్ముద్ర 
13.బ్రహ్మరంధ్రము - షణ్ముఖ ముద్ర

ఇప్పుడు మన యోగ చక్రాల లో ఉన్నపుడు వచ్చే దైవిక వస్తువులు:

1. మూలాధార చక్రము -   మహా గణపతి
2.స్వాధిష్ఠాన చక్రము - మహా లక్ష్మీనారాయణ
3.మణిపూరక చక్రము - మీ ఇష్టదైవము
4.అనాహత చక్రం - మహా కాలుడు/మహా కాళిక
5.విశుద్ధి చక్రము - మహా సరస్వతి/మహా గాయత్రి 
6.ఆజ్ఞా చక్రము - శివశక్తి
7. గుణ చక్రం - దత్తాత్రేయస్వామి   
8. కర్మచక్రం - సీతారామస్వామి  
9.కాలచక్రం- కాలభైరవ స్వామి 
10. బ్రహ్మ చక్రం- బ్రహ్మదేవుడు
11.సహస్రార చక్రం – మహా విష్ణువు/మహా శివుడు/శ్రీ కృష్ణుడు
12.హృదయ చక్రం- నవపాషాణ ఇష్టలింగము 
13.బ్రహ్మరంధ్రము- స్పటిక లింగాలు/ఓంకార చిహ్నము/ దక్షిణావృత శంఖము/ సుదర్శచక్రము//వామావృత శంఖం//గణపతి శంఖం/సుదర్శన చక్ర               మాల/సుదర్శన సాలగ్రామ మాల/శూన్యబ్రహ్మ ముద్ర

ఇప్పుడు మన యోగ చక్రాలు ఏ ఏ  క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయో కూడా తెలుసుకోండి.  

1. మూలాధార చక్రము -  గణపతి క్షేత్రం (కాణిపాకం)  
2.స్వాధిష్ఠాన చక్రము - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)
3.మణిపూరక చక్రము - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు
4.అనాహత చక్రం -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)
5.విశుద్ధి చక్రము -  మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)
6.ఆజ్ఞా చక్రము -  శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)
7. గుణ చక్రం -  దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)
8. కర్మచక్రం -  శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)
9.కాలచక్రం-  కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)
10. బ్రహ్మ చక్రం-  బ్రహ్మ దేవుడి క్షేత్రాలు ( పుష్కర్, చిదంబర క్షేత్రం)
11.సహస్రార చక్రం -  మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)
12.హృదయ చక్రం-  అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం) హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం  క్షేత్రం(కర్ణాటక)
13.బ్రహ్మరంధ్రము -   ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం 
త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు

మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు
2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు
3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు
4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు
5.విశుద్ధి చక్రము –నీలం- శని
6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు
7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు
8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు- చంద్రుడు
9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు
10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు
11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు
12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు
13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం

మన ఏఏ యోగచక్రాల యందు ఏఏ గురువులు వస్తారో తెలుసుకోండి

1. మూలాధార చక్రము - మంత్రగురువు
2.స్వాధిష్ఠాన చక్రము - మంత్రగురువు
3.మణిపూరక చక్రము - దీక్ష గురువు
4.అనాహత చక్రం - దీక్ష గురువు /భౌతిక గురువు
5.విశుద్ధి చక్రము - దీక్ష గురువు /భౌతిక గురువు
6.ఆజ్ఞా చక్రము - సద్గురువువు
7. గుణ చక్రం -   సద్గురువువు
8. కర్మచక్రం -   సద్గురువువు
9.కాలచక్రం- సద్గురువువు
10. బ్రహ్మ చక్రం- సద్గురువువు
11.సహస్రార చక్రం – పరమగురువు/విశ్వగురువు/జగత్ గురువు
12.హృదయ చక్రం- ఆదిగురువు
13.బ్రహ్మరంధ్రము - నీకు నీవే ఆత్మగురుదేవుడు


ఇప్పటివరకు మీరు మీకు నేను వివిధ గ్రంథాలలో నుండి అక్కడ అక్కడ ఉన్న విషయాలను సేకరించిన వాటిని చూశారు కదా. కానీ ఇది అంతా శబ్ద పాండిత్యము. పుస్తక జ్ఞానానికి సంబంధించినది. కానీ ఈ శబ్ద పాండిత్యము నుండి అనుభవం పాండిత్యము అనగా ఈ చెప్పిన విషయాలు స్వానుభవంలోకి ఎలా వచ్చాయో వచ్చే రాబోవు అధ్యాయాలలో చూడండి.శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న. అది చాలా కష్టమని గ్రహించండి. ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా నాతో పాటుగా యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోటానికి సాధన కొనసాగిస్తూ ముందుకు వెళ్ళండి. అంతకు ముందుమా మంత్రదేవత దీక్షానుభవాలు తెలుసుకోండి!

మాయాను దాటటం ఎలా?

 ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే చక్రాలలో ఉండే మాయాలు, మర్మాలు, యోగ శక్తులు, యోగ మాయాలు గూర్చి బాగానే చెప్పినారు. కానీ మాయాను దాటటం ఎలా అనే సందేహం వస్తోంది. దీనికి సమాధానం ఏమిటంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవితచరిత్రను చూస్తే తెలుస్తోంది. అనగా

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా కోరిక స్ధితి - మొదటిదశ  

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా మోహము స్ధితి - రెండవ దశ  

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా వ్యామోహము స్ధితి - మూడవ దశ  

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా అంతిమ స్ధితి- స్మశాన వైరాగ్య స్ధితి - నాలుగవ దశ  

అన్నిరకాల మాయాలను జ్ఞానస్ఫురణతో జయించే స్ధితి - జితేంద్రియుడు స్ధితి

విశ్వామిత్రుడు జితేంద్రియుడై రామ-లక్ష్మణలకు సద్గురువువై బ్రహ్మర్షి అయినారు.

అంటే మన గురుడు విశ్వామిత్రుడు తన ధ్యాన తపస్సు ద్వారా బ్రహ్మర్షిపదవి పొందాలని తీవ్ర ధ్యానసమాధిలో ఉండగా...ఇంద్రుడికి ఈయన వలన తన ఇంద్రపదవికి చేటు కలుగుతుందని భయముతో...మేనకను పంపించి మన విశు యొక్క తపస్సు భంగము చెయ్యమని ఆదేశించాడు.పాపం ఈమె కొన్ని సం!!రాలు పాటు మనగురుడికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినది.కాని మన గురుడు ఎంతో నిగ్రహముగానే ఉన్నాడు. కాని ఒకరోజు అనుకోకుండా మన గురుడు కాస్త మేనక యొక్క నగ్నదేహమును చూడటం జరిగినది. దానితో మనవాడి ఇంద్రియం లేవడము మొదలైంది.ఆపై ఇంద్రియ నిగ్రహశక్తిని కోల్పోయి ఆమె యందు మోహము చెంది అటు  పై వ్యామోహము చెంది సంతానమును పొందిన తర్వాత మనగురుడికి అసలు విషయము అర్ధమైనది.దానితో తను 10 లక్షల సం!!ల ధ్యానశక్తిని కోల్ఫోయినానని జ్ఞానస్ఫురణ పొంది...దానితో ఇంద్రియనిగ్రహశక్తితో తిరిగి ధ్యానతపస్సు చేస్తుండగా...ఈసారి రంభ రావడము...దానితో మన గురుడు కాస్త ఈమె యందు తీవ్ర కోపావేశాలు కల్గి శాపము ఇవ్వడము...తద్వారా మళ్ళీ 10 లక్షల సం!!రాల జపశక్తిని కోల్పోవడము జరిగినది. అటుపై  అంతిమముగా దశేంద్రియాల నిగ్రహశక్తిని పొంది...జితేంద్రియుడై బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయినారు.

ఇంతకి అసలు మాయా అంటే ఏమిటి? ఒక దానిమీద కోరిక, మోహము, వ్యామోహము  కలిగించటమే మాయా అవుతుంది. ఉదాహరణకి యుక్తవయస్సులో  ప్రేమ పొందాలనే కోరిక కలిగి ప్రేమలో పడతారు. ఆ ప్రేమికుడు/ ప్రేమికురాలి మీద మొదటిలో ప్రేమ కలుగుతుంది. కొన్నాళ్ళకి ఈ ప్రేమ కాస్త ఆమె/ అతడి మీద మోహము గా మారుతుంది. అంటే ఆమె/ అతను చూడకుండా ఉండలేని స్థితి. మాట్లాడకుండా ఉండలేని స్థితి మోహము అన్నమాట.ఇది కాస్త కొన్నాళ్ళకి బాగా ముదిరి వ్యామోహంగా మారుతోంది. అనగా ఆమె/ అతను ఇక మీద కనిపించక పోతే ఉండలేని స్థితి. వాళ్ళు చనిపోతే బ్రతకలేని స్థితి. వాళ్లను క్షణము కూడా వదల లేని స్థితి. వాళ్లు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకోవడమే వ్యామోహం అవుతుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఇలాంటి భావాలు కలిగించేవి మానవ శరీరంలోని దశేంద్రియాలే కదా. అనగా పంచ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చర్మము, చెవి, నాలుక అలాగే పంచ కర్మేంద్రియాలు అనగా చూచుట, వాసన, స్పర్శ, వినుట, రుచి కదా. ఇవి చేసే పనుల వలన మనము మాయాలో పడుతున్నాము అంటే అమ్మాయి /అబ్బాయి మీద మనకి ప్రేమ మోహము వ్యామోహం కలగటానికి ఇవే కారకాలు అన్నమాట. అనగా అబ్బాయి/ అమ్మాయి అందముగా కనిపించేటట్లుగా కన్ను చేస్తే… అందమైన భావాలు పలికించేటట్లుగా నాలుక చేస్తే…. వివిధ రకాల స్పర్శ భావాలు చర్మం చేస్తే…. కవ్వింపు మాటలు వినే టట్లుగా చెవులు చేస్తే ….శరీరాల మీద పూసుకున్న సుగంధ వాసనలు మన మనస్సులను లయ తప్పేటట్లు గా ముక్కు చేస్తోంది. ఈ దశేంద్రియాలు ఈ ప్రేమ విషయంలో ఇలా ఉంటే మిగతా విషయాలలో ఎలా ఉంటాయో దైవానికే తెలియాలి కదా. అంటే అరిష్వర్గాలు అనగా కామం,క్రోధం,లోభం,మధం,మోహం,మాత్సర్యం ఇవి కలుగచేస్తాయి. ఇవి పని చేయడమే ప్రకృతి ధర్మం. కష్టాలకు నాంది పలికించడమే వీటి పని అన్నమాట. కష్టాలలో పడాలో వద్ధో నిర్ణయించుకోవటం మన పని అన్నమాట. 

అంటే దశేంద్రియాలు అన్ని విషయాల్లో వాటి పనులు అవి చేస్తాయి. వాటిని నిగ్రహించుకుని నిలబడి ఉండటమే మాయాను ఎదిరించటం అవుతుంది. అనగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అన్నమాట. అనగా ప్రేమికులు గాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటే వీరిద్దరి మధ్య ప్రేమ, మోహము, వ్యామోహం ఉండదు కదా. మనస్సు దెబ్బతినదు కదా. మనస్సుకి గాయాలు ఉండవు కదా. అవమానాలు అనుమానాలు ఉండవు గదా. కేవలము క్షణిక ప్రేమ మాయాకి లోనై ఐదు నిమిషాలు శారీరక సుఖానికి గురై ఖర్మకాలి విడిపోతే మనస్సు పడే నరకయాతన నరకంలో కూడా అలాంటి శిక్ష ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా సుఖముగా ఉంటారని ఖచ్చితము లేదు. అనుమానాలు, అవమానాలు ,మనస్పర్ధలు, గొడవలు ఏర్పడతాయి. పోనీ పెళ్లి చేసుకోక పోయినా సుఖముగా ఉంటారా అంటే ఉండలేరు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతివ్రత్య ధర్మమును గంగపాలు చేసి మాజీ ప్రేమికుడి/ ప్రియురాలు తో అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు. వివాహ జీవితం దాంపత్య జీవితం నాశనం చేసుకుని విడాకులు తీసుకుని పిల్లలని అనాధలు చేస్తున్నారు. అంటే వ్యామోహం స్థాయికి దిగజా రుతున్నారు అన్నమాట. వీటి అన్నిటికీ కారణం మన మనస్సే కదా. దానికున్న దశేంద్రియాలే కదా. వీటిని ఆదిలోనే నిగ్రహించి ఉంటే మనస్సుకి ఈ ప్రేమ గోల నరకయాతనలు ఉండేవి కావు కదా. ఆదిలోనే నిగ్రహించుకోవటం మాయాను తొలగించుకోవటం అన్నమాట. ఆనాడే ఇంద్రియ నిగ్రహముతో మనస్సుతో వివేక బుద్ధితో నిశ్చలజ్ఞానముతో ఆలోచించుకొని పెళ్లి వయస్సు వచ్చేదాకా నిగ్రహముతో ప్రేమ వివాహము లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని సుఖపడే అవకాశమును మనము తెలిసీ తెలియని వయస్సులో చేసే తప్పు వలన మనశ్శాంతిని కోల్పోవటమే మాయా అవుతుంది. ఈ తప్పు చేయకుండా ఎంతో నిగ్రహంతో ఉండి దానిని దాటి పోవటమే మాయా దాటటం అవుతుంది. 

అంటే సాధకుడు కూడా దేనియందు కోరిక మోహము వ్యామోహము చెందకుండా ఇంద్రియ నిగ్రహముతో అనగా వివిధ చక్రాలలో చూపించే వివిధ రకాల మాయాలు సాధన శక్తులు యోగ శక్తులు యోగ మాయాలకు లోనుగాకుండా ఉంటే మాయా మాయం అవుతుంది. వాటికి లోనుఅవ్వటమే మాయా సహితము అవుతుంది. వాటికి బలి కాకుండా నిగ్రహముతో ఉండటమే మాయా రహితం అవుతుంది. జ్ఞానము ఉంటే మాయా మాయం అవుతుంది. ఈ లెక్కన చూస్తే మన ఇంద్రియాలు చూపించే వాటికి స్పందించకుండా పట్టించుకోకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే ఇంద్రియ నిగ్రహం అవుతుంది. ఇలాంటి నిగ్రహం ఉన్న వారిని జితేంద్రియుడు అంటారు. అనగా ఇంద్రియాలను జయించిన వాడు అన్నమాట. వీరిని మనము నామరూప దైవాలుగా పూజిస్తున్నాము అన్నమాట. కానీ నిజానికి దశేంద్రియాలు జయించిన వారు ఎవరు ఈ లోకంలో లేరు. కేవలం వాటిని తమ అదుపులో ఉంచుకున్నారు అంతే. జయించటం అంటే వాటిని గూర్చి ఆలోచించకుండా ఉండటము అన్నమాట. ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా కామ విషయంలో బోల్తాపడినాడు. ఏకముగా ఈయన మన్మధుడును చంపిన కూడా కామమును జయించలేక పోయినాడు. అమ్మవారి కామ మాయాను దాటినాడు గాని విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని కామమాయాని దాటలేకపోయినాడు కదా అంటే ఈ లెక్కన ఈ విశ్వములో బలహీనత లేని బలవంతుడు లేనట్లే కదా. కాకపోతే వీళ్ళు తమ బలహీనతలను దాటినారు. మానవులు మాత్రము తమకున్న బలహీనతలు దాటలేక వానరులు అవుతున్నారు. అదే దాటిన మానవులు కాస్త మాధవులు అవుతారు అన్నమాట. అంతెందుకు. కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి తోట కూర అంటే ఇష్టమని ఏర్పడినది. అది ఉంటే ఆయన ఆహారమును సంతృప్తిగా తినటం అది లేకపోతే ఏదో తెలియని వెలితి భోజనము ముగించటం ఆయనకు భోజనము పెట్టిన వంటవాడు గమనించాడు. దానితో ప్రతిరోజు ఈయన ఆహారంలో తోటకూర ఉండేటట్లుగా చూసుకునేవాడు. కానీ ఒకానొక సమయంలో వీరికి ఈ ఆకు కూర ఎక్కడ దొరకలేదు. దానితో ఆ రోజు వడ్డనలో తోటకూర పదార్థము రాలేదు. కారణం తెలుసుకున్న స్వామి వారు వెంటనే గోశాలకి వెళ్లి తన నాలుకమీద ఆవుపేడతో శుద్ధి చేసుకుని “ఇన్నాళ్లు ఈ నాలుక తెలియని రుచిని ఇచ్చే తోటకూర మీద మోహము పెంచుకుంది. దాని కోసము నీవు నానా తిప్పలు పడుతున్నావు కాబట్టి ఇన్నాళ్లుగా ఈ నాలుక చేసిన ఈ పాప కార్యము శుద్ధి చేసుకోవటానికి ఆవుపేడతో శుద్ధి చేసుకోవాల్సి వచ్చినది” అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయినారు. యధావిధిగా కొన్ని రోజుల తరువాత భోజనములో తోటకూర పదార్థం వచ్చినా కూడా ఇదివరకటిలాగా దానియందు మోహము చెందకుండా అన్ని పదార్థాలు గానే దీనిని చూడటం సాక్షి భూతముగా తినటం చేసినారు అన్నమాట. అంటే అతి చిన్న విషయమైన తోటకూర విషయములోనే ఈయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే ఆయన మనకి మహాస్వామి అయినారు. చిన్న పామునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలి కదా. అలాగే చిన్న కోరిక మీద కూడా దాని యందు నిగ్రహము కలిగి ఉండాలి అన్న మాట. నిగ్రహము లేకపోతే విగ్రహం కాలేవు. అనగా పూజింపబడలేవు అన్న మాట. అనగా విగ్రహము ఉంటే నిగ్రహము వస్తుంది. కోరికలు అనుభవించాలి కానీ వాటి యందు మోహము, వ్యామోహము ఉండకూడదు. అవి లేకపోతే ఉండలేని స్థితిలోనికి మనము మన మనస్సు వెళ్ళ కుండా చూసుకోవాలి అన్నమాట. అవి ఉన్నా లేకపోయినా ఒకే విధముగా సమదృష్టితో సమానముగా వాటితో ఉండేవాడే ఇంద్రియనిగ్రహము పొందినవాడు అన్నమాట. అనగా జితేంద్రియుడు అన్నమాట. ఇంద్రియాలను జయించలేము కానీ అదుపులో ఉంచుకోవచ్చు కదా. మీకు చుక్కకూర ఇష్టమే కానీ కావలసినప్పుడల్లా దొరికినప్పుడల్లా తినండి. అంతేగాని అది లేకపోతే ఉండలేని స్థితికి వెళ్ళకండి. అది ఉన్నా లేకపోయినా తృప్తిగా ఉంటే ఆ పదార్థ మాయా దాటినట్లే. ఒకరకముగా చెప్పాలంటే దశ ఇంద్రియాలు చూపించే మాయాలు అనేవి వ్యసనాలు లాంటివి అన్నమాట. అలా అలవాటు పడితే అవే అవసరాలుగా మారతాయి అన్నమాట. అలాగే ఇంద్రియ మాయాలకి గురి అయితే అవే అవసర మాయాలుగా మారుతాయి. దానితో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మాధవుడివి కాస్త వానరుడివి  అవుతావు. అదే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటే మానవుడివి కాస్త మాధవుడు వి అవుతావు. తద్వారా నిగ్రహం కాస్త విగ్రహ మూర్తి అయ్యి లోక పూజ్యుడవు అవుతావు. నిజానికి అన్నిటియందు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటమే సాధన పరిసమాప్తి అవుతుంది. అదియే మోక్షం అవుతుంది. మోక్షమంటే దేనికి స్పందించకుండా దేనికి సంకల్పించు కుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చల స్థితిలో ఉండటమే. అనగా దశ ఇంద్రియములు చూపించే దశ మాయాలు తమ అదుపు ఆజ్ఞలో ఉంచుకోవటమే పరమ ప్రశాంత స్థితి పొందటం అన్నమాట. ఇదియే జీవన్ముక్తి .ఇదియే మోక్షపధము అని గ్రహించండి. 

సాధకుడు కూడా తన ఆది చక్రం అయిన మూలాధార చక్రము నుండి మొదలై అంతిమ చక్రమైన బ్రహ్మరంధ్రము దాక చూపించే అన్ని రకాల మాయాలు మర్మాలు శక్తులకు దేనికి కూడా స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేని గురించి సంకల్పించు కోకుండా నిలబడగలిగితే అదే ఇంద్రియనిగ్రహంతో స్థిర మనస్సుగా స్థిర ఏకాగ్రతతో స్థిరబుద్ధి జ్ఞానముతో ఉండగలిగితే వారి సాధన పరిసమాప్తి అయినట్లే. లేదంటే ఏ చక్రము వద్దనైనా ఆగిపోతే సాధన అసంపూర్తిగా ఆగిపోయినట్లే. అనగా ఏ చక్ర మాయాలోనైనా మోహము, వ్యామోహము చెందితే అంతటితో వాడి కర్మ ముగిసినట్లే కదా. కాకపోతే అందరూ మాయాలో పడతారు. మాయాలు దాటుకుని రావాలి అన్నమాట. ఉదాహరణకు మూలాధార చక్రము నందు మనకి కామ మాయా వస్తుంది. 8 సంవత్సరాల వయస్సు నుండి మొదలై 80 సంవత్సరాల వయస్సు వారి మీద దైవాల మీద ప్రేతాత్మల మీద దేవతల సేవకుల మీద ఇలా 13 రకాల జీవ జాతుల మీద ఈ చక్ర మాయా అయిన కామ మాయా చూపించడం జరుగుతుంది. అనగా నగ్న దేహములతో మొదలై రతిక్రీడల దాకా తీసుకొని వెళుతుంది. కానీ వీటిని సాధకుడు కేవలం సాక్షిభూతంగా ఒక శృంగార సినిమా చూసినట్లుగా చూడగలిగితే ఇంద్రియనిగ్రహము పొందటం అవుతుంది. లేదంటే వీరి నగ్న దేహ సౌందర్య మాయాలో పెడితే ప్రేమ మోహ వ్యామోహాలు పొందితే ఈ నగ్న దేహంతో వాడి ముందు సాక్షాత్కారమై వాటి రతి క్రీడలో కాలము అంతా గడిపి అధో గతి పొందుతాడు. నిగ్రహము అనేది సాధకుడు చేతిలోనే ఉంటుంది కదా. అంటే సాధన అనేది పూర్తి చేయాలని లేదా ఆగిపోవాలి అన్నది వాడిచేతిలోనే ఉంటుంది కదా.దేనికి మోహము, వ్యామోహము చెందకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహము మన మనస్సుకి రావాలి. మన మనస్సు మన మాట వినే స్థితికి సాధకుడు తెచ్చుకోవాలి. దానికి సాధన చేసుకోవాలి. అనగా దానికి ఏది మాయో ఏది మర్మమో తెలిసేటట్లుగా చేయాలి. అది విషము అని తెలిస్తే మన మనస్సు త్రాగమన్న తాగదు కదా. అదే మత్తు పానీయం అని మన మనస్సు అనుకుంటే అది వదలమన్నా వదలదు. కాబట్టి ఈ ప్రకృతి చూపించే దశ ఇంద్రియాల మాయాలు అన్ని కూడా విషముగానే మన మనస్సుకి చూపించగలిగితే ఏమాయా మనల్ని ఏమీ చేయదు. ఎందుకంటే అమృతం సేవించిన దేవతలు కూడా ఎప్పుడో అప్పుడు మృత్యువాత పడతారు. అదే మహా కాల కూట విషమును సేవించిన నీలకంఠుడైన పరమేశ్వరుడు మాత్రం మృత్యుంజయుడు అయినట్లుగా మీరు కూడా ఈ దశ ఇంద్రియాల మాయాలను జయించి జితేంద్రియుడు అవుతారని గ్రహించండి. అంతా మనలోనే ఉంది. అంతా మనస్సు లోనే ఉంది. మాయా సహితము లేదా మాయా రహితము అవటం అనేది మన చేతుల్లో మన చేతలలో ఉంది. ఇంద్రియ నిగ్రహము మాయా రహితము, ఇంద్రియ లోలత్వం మాయా సహితము అన్నమాట .

సాధన అనేది ఆగిపోవటం లేదా పూర్తి కావడం అనేది మీ చేతుల్లోనే మీ చేతలలో మీ మనస్సు బట్టి ఉంటుంది. అంతేగాని గ్రహాలు, దైవాలు, పరమాత్మ, గురువులు,యోగుల చేతులలో ఉండదని గ్రహించండి. కాకపోతే ప్రకృతి మాయాలకి మీ మనస్సు మాయాలో పడకుండ చూసుకోవటమే అసలు సిసలైన యోగసాధన అవుతుంది. ఈ సాధనను ఆది చక్రమునుండి అంతిమ చక్రం దాకా మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉండి మోహము, వ్యామోహము, భయము, ఆశ, ఆనందము పడకుండా సాక్షి భూతంగా ఉండగలిగితే అదియే సంపూర్ణ యోగ సాధనను పరిసమాప్తి చేసుకున్న మోక్షగామి అవుతారు. కాకపోతే ప్రకృతి మాత మనమీద ఈ మాయాలు చూపించడానికి కారణం మన ప్రారబ్ద కర్మలు కారణమని గ్రహించండి. ప్రారబ్ద కర్మ అంటే గత జన్మలలో చేసిన పాపము లేదా పుణ్య కర్మల ఫలితమే ప్రారబ్ద కర్మ అంటారు. ఏది ఎక్కువ ఉంటే అది ఫలితముగా ఈ జన్మలో మనము పొందుతాము అన్నమాట. గత జన్మలలో పాపాలు ఎక్కువ ఉంటే ఈ జన్మలో మనం మాయాలో పడతాము. అదే పుణ్యములు ఉంటే ఈ జన్మలో మాయా రహితము అవుతాము. ఇది ఎలా తెలుస్తుంది అంటే మన మనస్సు దేనియందైనా స్పందించిన అదే పనిగా ఆలోచించిన లేదా సంకల్పించుకున్న కూడా అది ప్రారబ్దకర్మ ఫలితమేనని గ్రహించండి. నిజానికి ఆదిలో మనకి శూన్యం నుండి 36 ప్రారబ్ద కర్మలు వచ్చినాయి. శూన్యం నుండి శూన్య బ్రహ్మగా మనము అవతరించి ఈ 36 కర్మలు చేయటానికి ఆది జన్మ ఎత్తడం జరిగినది. దానితో మరో 12 కర్మశేష కర్మలు తోడైనాయి అంటే 
36 +12=48 ప్రారబ్ద కర్మలు ఏర్పడినాయి అన్నమాట. అందుకే ప్రతి 48వ జన్మ సాధన జన్మ లేదా యోగ జన్మ అని శాస్త్రవచనము.

ఈ 48వ జన్మలోనే జీవుడికి అన్ని రకాల కర్మలయందు వైరాగ్య భావాలు కలిగి మోక్షం పొందాలని ఆకాంక్ష మొదలవుతుంది. దాని కోసం తపనలు, పరి తపనలు, తాపత్రయం ఈ సాధన జన్మలో మనకి కలుగుతాయి. ఇవి ఉన్నాయి అంటే ప్రస్తుత జన్మ మనది 48 వ జన్మ అన్నమాట. అనగా ప్రారబ్ద కర్మను నివారించుకునే అవకాశం ఉన్న జన్మ అన్నమాట. కాకపోతే ఆదిలో ఈ ప్రారబ్ద కర్మలు 48 మాత్రమే కానీ అంతమునకు వచ్చేసరికి అవి కాస్త 48 లక్షల  ప్రారబ్ద కర్మలుగా మారినాయి. వీటికి అధిదేవతలుగా బాల త్రిపుర సుందరి దేవి గా ఆదిపరాశక్తి అనగా ప్రకృతి మాత ఉంటుంది. అనగా బాలగా 10లక్షలు, త్రిపుర గా 12 లక్షలు, సుందరిగా 15 లక్షలు, దేవిగా 11లక్షలు కర్మలు…. విశుద్ధ చక్రము వద్ద 10 లక్షలు అనగా ప్రకృతి గాను అలాగే ఆజ్ఞాచక్రము వద్ద 12 లక్షలు ప్రకృతి గాను అదే సహస్రార చక్రం వద్ద నుండి హృదయ చక్రం సుందరిగా 15 లక్షలు మూలప్రకృతిగా అలాగే బ్రహ్మరంధ్రము వద్ద దేవిగా పదకొండు లక్షలు ఆదిపరాశక్తి గా ఉండి మన యోగచక్రాలలో మన ప్రారబ్ధ కర్మలనే యోగమాయాగా మన దశేంద్రియాలకు చూపించడం జరుగుతుంది. సాధకుడు వీటిని గ్రహించి ఆయా కర్మ ఫలితాలను వారి పంచ గురువులైన మంత్ర, దీక్ష, సద్గురువువు, పరమ గురువు, ఆదిగురువులు వారి వారి ప్రారబ్ధ కర్మల బట్టి దైవిక వస్తువులు వీరికి కావలసిన వస్తువులు,జప శక్తి వారి చెడు గుణాలు ఇలా వారిని గురుదక్షిణ పేరిట అడిగి వారి ప్రారబ్ద కర్మలు నాశనం చేస్తారు. దానితో సాధకునికి ప్రకృతిమాత కలిగించే సాధన మాయాలు తొలుగుతాయి. సాధకుడు స్వయంగా వీటిని తొలగించుకోలేడు. దానికి ఈ పంచ గురువుల అనుగ్రహమును తప్పక పొందవలసి ఉంటుంది. అలాగే ఆయా గురువులు వచ్చి వారికి కావలసిన గురుదక్షిణను ఇవ్వగలిగిన మాత్రమే తమ సాధనను పరిసమాప్తి చేసుకోగలుగుతాడు అని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఎందుకంటే 48 లక్షల ప్రారబ్ద కర్మలు అనుభవించాలంటే సాధకుడు కోటి నలభై రెండు లక్షల 372 జన్మలు అది కూడా 48వ సాధన జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అదే గురువులు అడిగిన గురుదక్షిణ మీరు సమర్పించారు అంటే 48 నిమిషాల నుండి 48 సంవత్సరాలలో ఈ 48 లక్షల ప్రారబ్ద కర్మలు నశించి కర్మరాహిత్యం పొంది కర్మశేషము లేని జన్మలు లేని మోక్షపధము పొందుతారు. సాక్షాత్తూ జగద్గురువైన శ్రీకృష్ణునిని తన గురువైన సాందీపమునికి గురుదక్షిణ క్రిందగా కుమారుడిని బ్రతికించి ఇవ్వటం జరిగిందని పురాణ వచనము గదా. మీరే ఆలోచించుకోండి. అంతెందుకు పరమాత్మ అయిన షిరిడి సాయి బాబా వారు తన సద్గురువువు గురుదక్షిణగా రెండు పైసలు అనగా శ్రద్ధ సబూరి ఇచ్చారని లోకవిదితమే కదా. కాబట్టి 48వ సాధన జన్మ రావటం, మోక్షము పొందాలనే కోరిక కలగడం, గురువుల అనుగ్రహము పొందటం అనేది మన ప్రారబ్ద కర్మ ప్రదాత అయిన జగద్గురువైన ప్రకృతి మాత అనుగ్రహమును బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ గురుదక్షిణ పేరిట మీ ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకున్నారో ఆనాటి నుండి మీ యోగసాధన అభివృద్ధి చెందుతుంది. కాకపోతే నిజ గురువులకే గురుదక్షిణ సమర్పిస్తేనే ఈ ఫలితము ఉంటుంది. అదే నకిలీ గురువులకి సమర్పిస్తే అంతటితో మీ సాధన ఆగిపోయి వారి పాప భారం కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించండి. ఒక్కటి గుర్తుంచుకోండి. మీ మనస్సు దేనియందు మోహము, వ్యామోహము చెందుతుందో అది లేకపోతే ఉండలేని స్థితి పొందుతుందో అదియే మీ ప్రారబ్ద కర్మలు అవుతాయి. అలాగే మీ మనస్సుకి మీ నిజ గురువు ఎవరు నకిలీ గురువు ఎవరు గమనించి మీకు అంతరాత్మ గా మారి చెబుతుంది.అట్టి నిజ గురుదేవునికి ఆయన అడిగిన గురు దక్షిణ సమర్పించండి. ఆయా చక్ర ప్రారబ్ద కర్మను తొలగించుకొని ముందుకు కొనసాగించండి. ప్రారబ్ధ కర్మలు అంటే అర్హత యోగ్యతలను గ్రహించండి. ఐఏఎస్ కావాలంటే డిగ్రీ అర్హత ఉండాలి. అదే విధంగా ఐఏఎస్ ఇంటర్వ్యూ యోగ్యత ఉండాలి. ఒక ఐఏఎస్కే ఇలా ఉన్నప్పుడు మీకు ప్రకృతిమాత ఆధీనమై విశ్వాత్మ గా మారాలి అన్నప్పుడు
ఎన్ని అర్హతలు యోగ్యత ఉండాలో మీరే ఆలోచించుకోండి. ప్రారబ్ద కర్మలు అనేవి మన అర్హతను నిరూపించే యోగ పరీక్షలు అని గ్రహించండి. చిత్రం ఏమిటంటే ఈ 36 ప్రారబ్ద కర్మలు ఉన్న 36 కపాలాలు ధరించిన సదాశివమూర్తి నివసించే కైలాస పర్వతం పరిధి కూడా 48 కిలో మీటర్లు ఉండటం ప్రకృతి మాత చూపించే విచిత్రాలలో ఒకటి అన్నమాట. 

అసలు ఈ మాయాలెందుకు...వాటిని తెలుసుకొని దాటడమెందుకు...నా బొంద...నా బూడిద అని మీలో కొందరికి అనిపించవచ్చును. దీనికి సమాధానము ఏమిటంటే ఒక తల్లి తన పిల్లవాడిని ఎల్లపుడు లాలించటానికి అవకాశముండదు గదా! వీడినే గాకుండా మిగిలిన పనులు లేదా ఇతర పిల్లకాయలను చూసుకొనే బాధ్యత ఈమెకి ఉంటుంది గదా! అపుడు వీడిని వదిలి పెట్టి వెళ్ళినపుడు మనవాడు ఏడుపు లంఘించుకుంటాడు గదా!అలాగని అమ్మ వీడి దగ్గర శాశ్వతముగా ఉండలేని పరిస్ధితి.అపుడపుడు అయ్య దగ్గరకి కూడ వెళ్ళాలి గదా!లేకపోతే ఆయన చిన్నపిల్లాడిలాగా గోల చేస్తాడు గదా! ఈ సమస్య పరిష్కారము కోసము పిల్లవాడికి తను లేకపోయిన ఏడ్వకుండా ఉండటానికి ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు ఇచ్చి వెళ్ళుతుంది.ఈ బొమ్మల మాయాలో పడినవాడు అమ్మను మర్చిపోతాడు.ఇవి బొమ్మలు ...అమ్మకాదని తెలుసుకొన్నవాడు నిరంతరముగా అమ్మ తన దగ్గరికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు.చచ్చినట్లుగా అమ్మ ఎక్కడున్న వీడి కోసము రాక తప్పదు గదా! అలాగే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న ఆదిపరాశక్తి అమ్మ గూడ సాధన చేసే పిల్లవాడిని మరిపించటానికి మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా చక్రమాయాల రూపములో,అరిష్వర్గాల రూపములో,వ్యసనాల రూపములో మాయాలు పెట్టినది.వీటి మాయాలో పడినవాడి దగ్గరకి అమ్మ వెళ్ళవలసిన పని ఉండదు గదా.ఎవడు అయితే ఇవి మాయాలని తెలుసుకొని వాటిని తన మనోఇంద్రియనిగ్రహశక్తితో దాటుకుంటాడో...వాడి దగ్గరకి అమ్మవారు వచ్చి వీడి సాధనను పరిసమాప్తి చేస్తుంది అన్నమాట.ఇలా అమ్మ పంచరూపాలలో అనగా భ్రమరి- బాలా- త్రిపుర- సుందరి- దేవి రూపాలలో అమ్మవారు వస్తుందని నా అనుభవాలే గాకుండా వివిధ యోగుల అనుభవాలలో అనగా ఉదా:ఈ గ్రంధములో చెప్పిన లాహిరి అనుభవాలు అలాగే తాడేపల్లి రాఘవా నారాయణ శాస్త్రి అలాగే చంద్రశేఖర శాస్త్రి అనుభవాలు సాక్ష్యం నిలుస్తున్నాయి. వీరందరికి అమ్మవారు వీరి సాధన స్ధితిని బట్టి ఈ పంచరూపాలలో ఆయా రూపములో దర్శనమిచ్చి వారి సాధనను పరిసమాప్తి చేసినదని లోకవిదితమే కదా! మరి మీరు అమ్మవారు ఇచ్చే బొమ్మలలాంటి చక్రమాయాలలో పడతారో...లేదా అమ్మవారు వచ్చేంత సాధన కోసము ఇంద్రియశక్తితో ఉండి అమ్మ వచ్చేదాకా సాధనను కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకొండి.అమ్మగావాలా లేదా బొమ్మ గావాలా అనేది మీకున్న ఇంద్రియనిగ్రహమును బట్టి ఆధారపడి ఉంటుంది.బలహీనత లేని బలవంతుడు అలాగే మాయాలో పడని సాధకుడు ఇంతవరకు సృష్టించపడలేదు.కాని మాయాలలో పడి గూడ పైకి లేచి వచ్చి సాధనను ఇంద్రియనిగ్రహశక్తితో మాయాలను దాటుకొనేవాడి కోసము జగత్ గురువుగా ప్రకృతిమాత అయిన ఆదిపరాశక్తి ఎదురుచూస్తుందని గ్రహించండి. ఇందుకు ఉదా: బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అలాగే యోగివేమన్న జీవిత చరిత్రలు నిలుస్తాయని తెలుసుకోండి.మాయాలో అందరు పడతారు.కాని కొద్దిమంది మాత్రమే ఆ మాయాల యందు మోహము,వ్యామోహము చెందకుండా ఇంద్రియ నిగ్రహశక్తితో ఆ మాయాలను దాటి మానవుడు కాస్తా మాధవుడు అవుతున్నాడు.అలాగే ఈ మాయాలలో పడి ఇంద్రియలోలత్వమునకి లోనై మానవుడు కాస్త సాధనను గంగపాలు చేసి వానరుడు అవుతున్నాడని గ్రహించండి.

   శుభం భూయాత్

పరమహంస పవనానంద

*****************************

 గమనిక: ఒక్క విషయం. మనకు నిజ గురువులైన  మంత్ర గురువు, దీక్ష గురువు, సద్గురువువు,  పరమ గురువు (విశ్వ గురువు, జగద్గురువు) వచ్చినప్పుడు వారు మనల్ని గురుదక్షిణ అడుగుతారు. దీని క్రింద ధనము, చెడు గుణాలు,అనుష్టాన జప సంఖ్య, నామ జప సంఖ్య,వారికి కావలసిన దైవిక వస్తువులు అడుగుతారని నా యోగ సాధన సహస్ర చక్ర స్థితిలోకి  వెళ్ళినప్పుడు నా స్వానుభవాలు అయ్యాయి.ఇక్కడ తప్పనిసరిగా ప్రతి సాధకుడు వారి గురువుకి గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే అంతటితో యోగ సాధన పరిసమాప్తి అయినట్లేనని గుర్తించండి. వారు అడిగిన గురుదక్షిణ స్థాయిని బట్టి నీవు ఈ సాధన స్థాయి ఎక్కడ ఉందో అంచనా వేయవచ్చు. ధనము ఇవ్వలేకపోతే దానికి తగ్గ పరిహారాలు చెబుతారు. అవి కూడా ఇవ్వలేకపోతే ఆయన మీ సాధన స్థితి నుండి ఈ జన్మకి తప్పుకొని మరుజన్మ కోసం మీ సాధన స్థాయికి వచ్చిన తర్వాత వస్తారు. వారే రావాలని లేదు. వారి శిష్యులైన రావచ్చును. తస్మాత్ జాగ్రత్త. మీ నిజ గురువులకు  గురుదక్షిణ ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని శోధించి వారి మీద నమ్మకం కలిగిన తరువాత వారికి గురుదక్షిణ ఇవ్వండి. ఒకవేళ నకిలీ గురువులు చేతుల్లో గురుదక్షిణ పేరుతో మోసపోయే ప్రమాదం అవకాశాలు ఉంటాయని గుర్తించండి.

 అనగా మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు మనకి 10 లక్షల కర్మలు, అలాగే ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం వరకు 12 లక్షల సూక్ష్మ కర్మలు, అలాగే సహస్రార చక్రం నుండి హృదయ చక్రం వరకు 15 లక్షల కారణ  కర్మలు అలాగే హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రము వరకు 8 లక్షల సంకల్ప కర్మలు అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఈ 44 లక్షల కర్మశేషము అనగా 3 లక్షల కర్మఫలాలుంటాయి! ఈలెక్కన మొత్తము 48లక్షల (10+12+15+8+3) కర్మలుంటాయని తెలిసింది. దీనికి నిదర్శనమే సహస్ర చక్ర అధిదేవత అయిన మహాదేవుడి నివాసమైన కైలాస పర్వత పరిక్రమణ అన్నమాట. మొదట ఈ పర్వత పరిక్రమణ 12 కిలోమీటర్లు ,తర్వాత 22 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత 14 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు మనం చివరిదాకా వెళితే కైలాస పర్వతం పై అంచును దూరం నుండి దగ్గరగా చూడటం చూడగలము. నిజానికి మనం కైలాస పర్వతం పరిక్రమణ చేస్తే  పైదాకా పై అంచును వేరే పర్వతాల నుండి చూడవచ్చు.

ఎలా అయితే కైలాస పర్వత పరిక్రమణకు నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయో అలా మన సాధన పరిసమాప్తి అవడానికి 48 లక్షల కర్మలున్నాయి. అందుకే ప్రతి 48 వ జన్మ యోగజన్మ అవుతుందని శాస్త్రవచనము! వీటిని నాశనం చేయటానికి నిజ గురువులు గురుదక్షిణ అడిగి మన కర్మలు వారు తీసుకుని నాశనం చేస్తారు. ఇది నిజం అని అనడానికి నిదర్శనం షిరిడి సాయి బాబా వారు వారి గురువైన వెంకుసాకు గురు దక్షిణ రెండు పైసలు అడిగితే బాబా వారు శ్రద్ధ, నమ్మకం అనే గుణాలు సమర్పించారు.  వారి చరిత్రలో చూడవచ్చును. అలాగే శ్రీకృష్ణుడు గురువు కోరిక మీద తన కుమారుడికి జబ్బు నయం చేశాడు. వారి గ్రంథ పారాయణంలో తెలుస్తుంది. అలాగే టిబెట్ యోగి అయిన మిలారేపా తన గురువు ఆజ్ఞ మేరకు కట్టిన ఇళ్లను మూడు సార్లు పైగా పడగొట్టి మళ్ళీ కట్టి ఇచ్చాడని వారి చరిత్ర లో తెలుస్తుంది. అంటే నిజగురువు అయితే మాత్రం మీ నుండి ధనము ఆశించరు. ఒకవేళ ఆశించిన మీ దగ్గర లేకపోతే  మంత్ర నామ జప సంఖ్య ఇన్ని లక్షలు లేదా కోట్లు చేయమని లేదా మీలో ఉన్న చెడు గుణాలు సమర్పించమని లేదా నామకోటి పుస్తకాలు ఇన్ని రాయమని లేదా వారికి కావలసిన దైవిక వస్తువులు  అడిగి మరీ తెప్పించుకొని మీ చక్రాల స్థాయిలలో మీ ఈసాధన శక్తిని బట్టి  గురుదక్షిణ అడిగి 48 లక్షల కర్మలు నాశనం చేస్తారు.ఇలా నేను ఆజ్ఞా చక్రం లో నా సాధన ఉండగా మా గురువుగారు 10లక్షలు కావాలని అడిగారు. నా దగ్గర నయాపైసాలేదు.  అవి ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికాక తప్పదని భయంతో ఎంతోమందిని అప్పుగా డబ్బులు ఇవ్వమని అడిగితే ష్యూరిటీగా ఏదైనా పెడితే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారు. అప్పుడు ఇలా కాదని వారిని అడిగితే డబ్బులు లేకపోతే నీ జ్ఞాన శక్తితో మా కోసం సత్ గ్రంధాలు రచించి అందరికీ ఉచితంగా పంచమని ఆదేశించారు. నోట్లో నాలుక లేని నాకు గ్రంథాలు ఎలా రాయాలి అర్థం కాలేదు. అప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధికి నా సాధన చేరుకునే సరికి  నా ఊహా శక్తి పెంపొంది మొదట “10 లక్షల” నివారణ కోసం “మంత్రగురువు” దక్షిణ కోసం “యోగ దర్శనం”, రెండవ “12 లక్షల” నివారణ కోసం “దీక్ష గురువు” దక్షిణ కోసం “జాతక ప్రశ్న”, మూడవ “15 లక్షల కోసం” “సద్గురువువు దక్షిణ కోసం” “సంపూర్ణ గురు చరిత్ర” గ్రంథం రాయడం జరిగింది. ఇక చివరిదైన హృదయ చక్రం నుండి బ్రహ్మ రంధ్రం సాధనకై అక్కడ “8 లక్షల సంకల్ప కర్మల” నివారణ “పరమగురువు దక్షిణ” కోసం ఈ “కపాల మోక్షం” గ్రంథం రచించడం జరిగింది. ఇక మిగిలిన “3 లక్షల” కర్మశేషము “ఆదిగురువు” దక్షిణ కోసము "అంతర్వేదం" అను గ్రంథమును రచించడము జరిగి ఆపై మౌన:బ్రహ్మగా కాశిక్షేత్రము నందు లేదా అరుణాచల క్షేత్రమునందు నివాసము ఉండమని ఆజ్ఞనిచ్చారు! నిజానికి ఈ అధ్యాయ వివరాలు అన్నీ గూడ మా సాధన సమయములో మాకు కలిగిన ధ్యానానుభవాల దృష్ట్యా వీటిని ఒకచోట ఉంటే బాగుంటుందని సాధన ప్రారంభములోనే సాధకుడు తెలుసుకోవాలని ఇక్కడ వ్రాయడము జరిగినది!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeku thadepalli raghava shastry gaari anubhavaalu vinna tharuvatha vigrahalanu ela pujinchali ani thelsindi annaru kada... aa tharvata ishta daivalato maatladalani anipinchindi annaru kada nijanga ala jarigite entha baguntundi anedi kallaku kattinattu chepparu...
    mana shwaasatho ye chakramlo unnam ani thelsukogalam ani addam dwara thelsukovochu ane vivarana bagundi..
    mokshaniki evarite deggaraga unnaro vaariki matrame ee grandham andela pettatam bagundi.
    ikkada oka mukhya vishayam chepparu adi mee ishtadevathanu mee ishta bharya/bhartha ga chudakudadani... chakralu,shareeralu cheppatam valla ye chakram ye shareeraniki sambandhinchi untundo thelisindi...
    ye ye chakrallo unnappudu ye guruvulu vastaru, alage ye chakrallo enni karmalu untayi ani vaatiki em em cheyali chaala vivaranga chepparu

    రిప్లయితొలగించండి