కుండలినిశక్తి జాగృతి(108)

 



శ్రీశైలం క్షేత్రానికి ఒక బస్సు చేరుకుంది . ఆ బస్సులో నుంచి శివ నందిని సాధనా కుటుంబం అంతా కూడా కిందకి దిగింది.  అంటే రుద్రస్వామి, మహాదేవి బాలగణపతి , భైరవి, శివ నందిని ఆ బస్సు దిగి శ్రీశైల క్షేత్రంలోకి అడుగుపెట్టారు. కొంతసేపు నిల్చుని రోడ్డు వైపు చూశారు.  అక్కడ ఉన్న జనాలకేసి చూశారు.  ఎవరు తమని పట్టించుకోవడం లేదు. ఎవరు తమని ఇబ్బంది పెట్టడం లేదు అని తెలుసుకున్నారు.  ఎందుకంటే వీళ్ళ వేషములు బట్టి ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఈ క్షేత్రానికి రావద్దని అంటారా అని శివ నందిని ఆలోచనలో పడింది.  ఇదే ఆలోచన రుద్ర స్వామికి మహాదేవికి కూడా వచ్చింది.  కానీ ఎవరూ కూడా తమని పట్టించుకోవడంలేదని గుడి దగ్గరలో ఉన్న ఏదైనా సత్రంలో గది తీసుకోవాలని నిశ్చయించుకుని…. దగ్గరలో ఉన్న సత్రానికి వెళ్లారు. తీరా సత్రం దగ్గరికి వెళ్లేసరికి వీళ్ళ వేషభాషలను చూసి ఆ సత్రంలో ఉన్న అతను, వీళ్ళకి గది ఇవ్వటానికి భయపడ్డాడు.  వీళ్ళు చూడటానికి ఒకళ్ళు అఘోరాలాగా ఉన్నారు. ఒకళ్ళు తంత్రసాధన చేసే వాళ్ళ లాగా ఉన్నారు. ఇంకొకళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళ లాగా ఉన్నారు.  కానీ బాలగణపతికి గోచి గుడ్డ తప్ప ఒంటిమీద ఎలాంటి వస్త్రాలు లేవు. పైగా వీడి చేతిలో రెండు అడుగుల త్రిశూలం ఉంది . చూడగానే ముచ్చటేసింది.  వీళ్ళ వేష భాషలు అలంకరణ దుస్తులు చూసేసరికి ఎక్కడో స్మశానంలో సాధన చేసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా అనిపించింది.  దానితో గది ఇవ్వటానికి ఆ సత్రం యజమాని భయపడ్డాడు . ఆలోచనలో పడ్డాడు. 


ఇతని ఆలోచనలు గమనించిన బాల గణపతి వెంటనే “అయ్యా! మేము ఎవరిని ఇబ్బంది పెట్టము. మేము చెడ్డవాళ్లం కాదు. మేము సాధన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము . అయ్యవారిని ,అమ్మవారిని చూడటానికి వచ్చాము.  మా వలన ఎలాంటి ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరైనా ఇబ్బంది కలిగించినట్టు మీ దృష్టికి వస్తే…. మేము వెంటనే గది ఖాళీ చేసి వెళ్లిపోతాము.  అలాగే నా దగ్గర ఉన్న భైరవి కుక్క కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు.తన మానన తను నా అదుపులో ఉంటుంది.  నేను చెప్పినట్టు వింటుంది.  కాబట్టి మాకు గది ఇచ్చి పుణ్యం కట్టుకోండి.  అంతేగాని ఇబ్బంది పెట్టకండి. భయపడకండి. కంగారు పడకండి . మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు”  అని బాలగణపతి ముద్దుముద్దు మాటలతో చెప్పేసరికి…. ఆ మాటల సమ్మోహనానికి ఆ సత్రం యజమాని పిల్లాడి మాటలకి ఆనందపడిపోతూ…. సంబరపడిపోతూ సరేలెండి!  మీ వల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేదా ఈ సత్రానికి ఏమైనా ఇబ్బంది కలిగించినా …వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వచ్చినా పోలీసులకి సమాచారం ఇస్తాము.  వాళ్లే వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళి జైల్లో పెడతారు.  కాబట్టి అంతదాకా పరిస్థితులు తెచ్చుకోవద్దు.  నాకు గది ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బంది లేదు.  మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు.  ఈ కుక్క వల్ల కూడా మాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటే చాలు . మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు అన్నది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎంత కాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండండి.  మీకు కావలసిన భోజనాలు కూడా మా సత్రం వారు ఏర్పాట్లు చేస్తారు… అనగానే బాలగణపతి అయ్యా! నాకు భోజనం వద్దు ఉండ్రాళ్ళు కావాలంటే చేసి పెడతారా!  అని అడగగానే,  ఆ సత్రం యజమాని సంబరపడుతూ ఇక్కడ అలా చేయడానికి ఉండదు.  కేవలం పొద్దున్న సాయంత్రం టిఫిన్లు మరియు మధ్యాహ్నం భోజనం మాత్రమే ఉంటుంది.  నీకు ఉండ్రాళ్ళు కావాలంటున్నావు కాబట్టి మా ఇంట్లో వ్యక్తిగతంగా చేసి నీకు తీసుకొని వస్తాను.  నువ్వు దాని గురించి ఇబ్బంది పడొద్దు అని బాలగణపతిని చూస్తూ అనేసరికి …..అలా అయితే మంచిదే.  కానీ 21 తక్కువ కాకుండా చేసి తీసుకురా!  నేను శుభ్రంగా తిని పెడతాను ….అనేసరికి పిల్లాడి ముఖం చూసిన యజమాని తనకి పిల్లలు లేని లోటు ఈ పిల్లోడు తీరుస్తున్నాడులే అని…. రాబోయే జన్మలో అయినా ఇలాంటి పిల్లవాడు పుడతాడేమోలే అని మనసులో అనుకుంటూ…….సరే బాబు నీకు ఎన్ని కావాలంటే అన్ని చేసి పెడతాను . మా ఆవిడని అడిగి మా ఇంటి నుంచి తీసుకు వస్తాను.  నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు చెబితే చాలు …..నీకు ఆ ఏర్పాటు చేసేస్తాను… అనేసరికి రుద్ర స్వామి నెమ్మదిగా శివ నందినితో


రుద్రస్వామి:- చూసావా!  వీడు ఇక్కడ ఉండ్రాళ్ళు చేసుకునే అవకాశం లేదని తెలుసుకొని…. ఆ యజమానిని కాకా పట్టేసాడు.  వాడికి కావలసిన అవసరం వాడు తీర్చేసుకుంటున్నాడు.  వీడు ఎలా అయినా బతికేస్తాడు.  వీడు నోరున్నోడు . లోకం తెలియదు అనుకుంటాం కానీ… లోకాన్నే మార్చేస్తాడు.  వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


అంటూ ఉండేసరికి శివ నందిని చిరునవ్వునవ్వి ఆ యజమానికేసి చూస్తూ….


శివనందిని:-  అయ్యా!  మీరు మా యందు దయతలచి అద్దెకు ఇస్తా అంటున్నారు. అలాగే ఎంత కాలం ఉండాలో అంతకాలం ఉండడానికి కూడా అనుమతి ఇచ్చారు.  అలాగే పిల్లవాడికి కావాల్సిన ఉండ్రాళ్ళ సమస్య కూడా తీర్చారు.  చాలా కృతజ్ఞతలు . మీకు మా వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటాము.  ఒకవేళ తెలిసో తెలియకో ఏదైనా తప్పు జరిగితే మాకు చెప్పండి.  మేము సరిదిద్దుకుంటాము.  మీరు ఇబ్బంది పడకూడదు. బాధపడకూడదు….


అని అనేసరికి “ అమ్మ మాకు మీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని అర్థమవుతుంది. కానీ మీ వేషధారణ చూస్తే అందరూ ఇబ్బంది పడతారని ఆలోచనలో ఉన్నాను.  కాకపోతే మిమ్మల్ని మేము తప్పు పట్టడానికి లేదు.  ఇవి మీరు తీసుకున్న సాధనా దీక్షలు అని మాకు అర్థమయింది.  కాబట్టి మీకు నచ్చినట్టుగానే మీరు తీసుకున్న దీక్షకు తగ్గట్టుగానే మీ ఆచార వ్యవహారాలు చేసుకోండి.  అది వేరేచోట చేసుకోండి. మీ సాధన అంతా కూడా వేరే చోట చేసుకోండి.  ఇక్కడ గదిలో మాత్రం ఎలాంటి పూజలు అవి చేయొద్దు.  కావాలంటే ధ్యానాలు చేసుకోండి. అంతేగాని ఇక్కడ క్షుద్ర పూజలు , తాంత్రిక పూజలు …గదిలో చేయడానికి లేదు …” 


అని రుద్రస్వామి కేసి చూస్తూ అనేసరికి ….రుద్ర స్వామి“  చ…..చ మేము అలాంటి వాళ్ళం కాదండి. అలా చేసేవాళ్ళము కాదు… కాకపోతే మా వేషం అలాంటిది.  క్షుద్ర , తాంత్రిక పూజలు,  హోమాలు అవేమీ మేము చేయము. మేము కేవలం ధ్యాన నిష్ఠ లో ఉండి ధ్యాన తపస్సు చేసుకునే వాళ్ళం”. అనేసరికి అయితే చాలా మంచిది. మీరు దక్షిణాచారంలో ఉన్నారో , వామాచారంలో ఉన్నారో లేదా రెండు చేసే వాళ్ళో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు.  కాకపోతే మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు.  అది మాత్రం గుర్తుపెట్టుకోండి.  మీ వల్ల ఇబ్బంది అయితే ఇతరులు గదులు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం గది ఖాళీ చేసి పంపించాల్సి వస్తుంది. దానికి మీరు ఎలాంటి అభ్యంతరం పెట్టడానికి లేదు… అనేసరికి అలాంటి పరిస్థితులు అయితే మా నుంచి రావండి.  మీరు ఆ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు… అనేసరికి మీ మీద నమ్మకంతో నేను గది ఇస్తున్నాను . అది కూడా పెద్ద గది ఇస్తున్నాను.  ఒక ఆరుగురు శుభ్రంగా పడుకోవచ్చు …ఉండవచ్చు అని ఉన్న గదుల్లో…. పెద్దగది అని మూడవ అంతస్తులో ఉన్న గదిని కేటాయించడం జరిగింది. ఆ మూడో అంతస్తు లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేని పెంట్ హౌస్ లాంటి గదిని ఇవ్వటం జరిగింది. 


సరే అని వీళ్ళు తాళాలు తీసుకుని ఆ గదికి వెళ్లారు. గది చూస్తే చాలా విశాలంగా అనిపించింది.  పడుకోవడానికి వీలుగా మంచాలు కూడా ఉన్నాయి.  సరే అని ఎవరికి వారు మంచాలు చూసుకుని వాటి మీద పడుకున్నారు. కునుకు తీశారు. శివ నందిని ఈలోగా స్నానాదికాలు చేయాలని అనుకునేసరికి రుద్రస్వామి ఉన్నట్టుండి అమ్మ!  మనం ఈ గదిలో స్నానం చేయవద్దు.  ఇక్కడ పాతాళ గంగా ఉంది. అక్కడికి వెళ్లి స్నానం చేద్దాం.  ముఖం,  కాళ్లు చేతులు కడుక్కొని టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పాతాళ గంగకి వెళ్లి స్నానం చేసి వద్దాం అనేసరికి…..సరే స్వామి మీ ఇష్టం….. ముఖం కాళ్లు చేతులు కడుక్కుంటాం అని ఒక్కొక్కరు ముఖం కాళ్లు చేతులు కడుక్కోవడం ఆరంభించారు .  టిఫిన్ సిద్ధంగా ఉంది ఒక కుర్రాడు వచ్చి చెప్పేసరికి అందరూ టిఫిన్ చేయడానికి బయలుదేరారు.


అందరూ కూడా టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత… సత్రం యజమాని దగ్గరికి వెళ్లి , స్వామి! ఇక్కడ చూడటానికి ఏమేమి ఉన్నాయి? అని అడిగేసరికి….” అమ్మ! ఇక్కడ ఇష్టకామేశ్వరి గుడి కాస్త లోపలికి ఉంటుంది… అలాగే ఫాలధార పంచదార, శిఖర దర్శనం, హటకేశ్వర క్షేత్రం,  సాక్షి గణపతి, పంచ మఠాలు , భీముని కొలను, మల్లమ్మ కన్నీరు, భీముని పాదాలు, శివాజీ స్తూపం, రుద్రాక్ష వనం, గుడి లోపల అయితే… కదలివనం, త్రిఫల వృక్షం, మల్లికా కుండం, వృద్ధ మల్లికార్జున గుడి, సీతారాముల చేత ప్రతిష్ట చేయబడిన సహస్ర లింగాలు…. అలాగే ఈ గుడి లోపల ఉన్న నవలింగాలు, పాశుపత అస్త్ర యంత్రం , అమ్మవారి గుడి వెనకవైపు తుమ్మెదలు చేసే ఝుంకార నాదం, అతి ముఖ్యమైన ప్రదేశాలుగా చెప్పవచ్చు.” మీకు పంచ మఠాలలో ప్రశాంతంగా, ఏకాగ్రతగా సాధన చేసుకోవడానికి వీలుగా ఉంటాయి.  కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి.  అలాగే ఈ పంచ మఠాలలో ఘంటా మఠం ఉంటుంది.  ఈ ఘంటా మఠం లో ఆకాశ సిద్ధి చేసే తంత్రం ఉంది.  ఇంతవరకు దాని ప్రయత్నించిన వాళ్ళని మేము చూడలేదు . కాబట్టి మీకు అవకాశం ఉంటే….. వీలు ఉంటే దానిని ప్రయత్నిస్తే ప్రయత్నించండి . అందులో విజయం పొందితే, ఆకాశ సిద్ధి వస్తుంది కదా ! అంటూ ఉండేసరికి….  బాలగణపతి ఇదంతా విని అయితే నేను ఆకాశ సిద్ధి పొందటానికి ప్రయత్నం చేస్తాను.  ఏముంది…. వస్తే ఆకాశ సిద్ధి వస్తుంది.  పోయేదేమీ లేదు కదా!  అమ్మ…. నేను ఆకాశ సిద్ధికి ప్రయత్నం చేస్తాను.  అదేదో ఘంటా మఠం అంటున్నారు కదా!  అది వచ్చినప్పుడు నాకు చూపించు.  ఓ ప్రయత్నం చేసేస్తాను… అయితే విజయం… లేదంటే అపజయం.  ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా… అంటూ ఉండేసరికి,  ఇలా పిల్లాడి మాటలు వినేసరికి యజమాని నవ్వు ఆపుకోలేకపోయాడు.  సరే స్వామి!  మేము అమ్మవారిని, అయ్య వారిని చూడటానికి వెళ్తున్నాము అని ఆయనకు చెప్పి సత్రం నుంచి బయటకు వచ్చారు. 


అలా పాతాళ గంగకు దారి తెలుసుకొని సుమారుగా 300 మెట్లు దిగటానికి బయలుదేరారు.  ఇలా సుమారుగా 108 మెట్లు దిగిన తరువాత వీళ్ళకి ఒకవైపు అమ్మవారు ,మరొకవైపు అయ్యవారు వ్యతిరేక భంగిమలో కూర్చొని ఉండి… మధ్యలో బాల కుమారస్వామి ఒక చిన్నపాటి విగ్రహంతో ఆడుకుంటున్నట్టుగా….. ఒక పిల్లవాడి దృష్టి వీళ్లని ఆకర్షించింది.  పిల్లవాడు చూడటానికి ఎనిమిది సంవత్సరాల పిల్లవాడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అమ్మవారి కళ …..స్త్రీ మూర్తి కళ ఉట్టిపడుతున్నట్టుగా గ్రహించింది. గబుక్కున చూస్తే ఇతను మగ పిల్లవాడా…. ఆడపిల్లనా…. అనిపించే అంతలాగా తేజస్సుతో ఉన్నాడు . ఇలా చూసేసరికి వీడెవడో మంచి ఉపాసకుడి లాగా ఉన్నాడు…. చూడగానే బాల కుమారస్వామి లాగా…. దేవి ఉపాసకుడి లాగా ఉన్నాడు.  వీడేంటి దేవత విగ్రహంతో ఆడుకుంటున్నాడు..?  అయినా ఆ విగ్రహ మూర్తి ఏంటి…. విచిత్రంగా ఉందే!  ఎప్పుడూ చూడలేదే!  అని శివ నందిని అనుకుంటూ ఉండేసరికి…. ఆడుకుంటున్న పిల్లవాడు కాస్త వెనక్కి తిరిగి శివ నందిని వైపు చూసేసరికి….బాలగణపతి కాస్త “ ఓ అన్నయ్య !నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ శ్రీశైలంలో నువ్వు ఎక్కడ ఉన్నావా అని చెప్పి వెతుకుతున్నాను. ఇక్కడే ఉన్నావా….. పాతాళ గంగ మెట్ల దగ్గరే ఉన్నావా!  దా!  మన శివ నందిని అమ్మకి …..మహాదేవి అమ్మకి పరిచయం చేస్తాను…. అని అనేసరికి వీళ్ళకి ఆశ్చర్యం వేసింది.  వీడు ఎవడినో పట్టుకొని అన్నయ్య అంటాడేంటి!  అని అనుకుంటూ శివ నందిని మరియు మహాదేవి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.


ఇంతలో ఆ పిల్లవాడు తమ్ముడు బాగున్నావా? చాలా లావుగా, బొద్దుగా అయినట్టు ఉన్నావు …..ఉండ్రాళ్ళ తిండి బాగానే వంట పట్టింది అని ఆ పిల్లవాడు అనేసరికి… వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది.  రుద్ర స్వామికి అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగానే అంతా చూస్తూ ఉన్నాడు.  అప్పుడు బాలగణపతి కాస్త ఆ కొత్త పిల్లవాడిని శివ నందిని దగ్గరకు తీసుకువచ్చి….. వీడు మా అన్నయ్య , ఇక్కడే శ్రీశైలంలోనే ఉంటాడు.  మా అమ్మానాన్నకి వీడు అంటే ప్రాణం.  వీడికేమో నేనంటే అనుమానం ….నేనంటే వాళ్ళకి ఇష్టం అని . మా అమ్మానాన్న మీద అలిగి మొదట ఇక్కడికే వచ్చాడు.  ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా అలిగి వెళ్లిపోయాడు …అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు…. అనేసరికి ఏమీ తెలియనట్టు


రుద్రస్వామి:-“ఒరేయ్!  నువ్వున్నది కాశీలో…. వీడున్నది శ్రీశైలంలో…. మీరిద్దరూ అన్నదమ్ములు ఎలా అయ్యారు రా?..........అనేసరికి 


బాలగణపతి:- మేమిద్దరం మొదట శ్రీశైలానికే వచ్చాము… మొదట వాడొచ్చాడు . వీడు ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ…. మా అమ్మానాన్న వచ్చారు. వీళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి నేను కూడా వచ్చాను.  వచ్చిన తర్వాత అనుకోకుండా మాకు చెప్పకుండా శ్రీశైలం నుంచి ఎటో పారిపోయాడు…  ఇక వాడు వెళ్లిపోయాడని ….వాడి రాక కోసం మా అమ్మ నాన్న ఇదిగో ….ఈ కొండ ఉంది కదా…. శ్రీగిరి కొండ…. ఈ కొండమీద కూర్చుని, వాళ్ళు అలా సాయంత్రం 6:00కి సమావేశం పెట్టేవాళ్ళు. వీడ్ని వెతుక్కుంటూ నేను అన్ని క్షేత్రాలు తిరిగేసరికి వీడేమో అక్కడక్కడ కనబడే వాడు…. నేను ఇక్కడే ఉంటాను,  నేను ఎక్కడికి రాను అనేసరికి… ఇక నేను కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడే స్థిరపడిపోయాను . అది మా బాగోతం అనేసరికి…. 


ఒరేయ్! నీ పేరేంటి రా? అని మహాదేవి అడిగేసరికి,  అందరూ బాల కుమారస్వామి,  కుమార మంగళం ,సుబ్రహ్మణ్య స్వామి అని ఇలా పిలుస్తూ ఉంటారు. నా పేరు బాల కుమారస్వామి అనేసరికి అదేంటి….! నీ చేతుల్లో!  విచిత్రమైన విగ్రహం ఉంది…. అని అడిగితే, 


బాలగణపతి:-  అదా!  మా అమ్మ నాన్నకి గుర్తుగా ఆ విగ్రహం వీడికి ఇచ్చారు. మా అమ్మా నాన్న వ్యతిరేక భంగిమలో కూర్చుని ఉంటారు.. చూడండి.  మధ్యలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడే ….వాడు వీడే అంట!  కుమారస్వామి అంట! దీన్ని స్కంద మూర్తి విగ్రహం అంటారంట!  ఇది వీడికి వాళ్ళ గుర్తుగా ఇచ్చి పంపించారు.  నాకు ఎలాంటి విగ్రహాలతోనూ పని లేదు కదా!  విగ్రహం ఉంటే నిగ్రహం అవసరం ఉంటుంది కదా!  నాకు ఇప్పటికే నిగ్రహ శక్తి ఉంది కదా!  అందుకనే వీడికి విగ్రహం ఇచ్చి పంపించారు  తోడుగా అనేసరికి…. ఆ పిల్లవాడు “సరే తమ్ముడు! ఇంక నేను వెళతాను” అనగానే ఎక్కడికి వెళ్ళేది….. ఇకనుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి లేదు.  మాతో పాటే నువ్వు కూడా ఉండు . మాతో పాటు తిరుగు.  మేమంతా ఇప్పుడు యాత్రకు వెళ్తున్నాము.  అన్ని క్షేత్రాలకి వెళ్తున్నాము. మా శివ నందిని అమ్మ ఏదో మోక్షం పొందాలంట . ఆ మోక్షం పొందితే విశ్వ మోక్షం అవుతుందంట . ఆవిడ సాధన మనం పరి సమాప్తి చేయాలి.  ఆవిడ ఏ క్షేత్రానికి వెళ్తే,  ఆ క్షేత్రానికి మనము కూడా వెళ్లాలి.  నువ్వు కూడా మాతో పాటు ఉండు…. అనేసరికి , నువ్వే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నావు!  మళ్లీ నేను కొత్తగా ఇబ్బంది కలిగించడం ఎందుకు?  నేనేదో నాకు కావాల్సిన చోటికి కావాల్సినట్టుగా వెళ్తాను …..అనేసరికి శివ నందిని కాస్త వీడి మీద కూడా పుత్ర వ్యామోహం కలిగి….. అదేం లేదమ్మా!  పైగా మీ ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు . ఏ జన్మ ఋణానుబంధమో తెలియదు.  నాకు నిన్ను చూస్తే కుమారుడిగానే కనపడ్డావు. నువ్వు కూడా చిన్న పిల్లవాడే కాబట్టి …..మీ ఇద్దరూ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తేడాతో ఒకే వయసులో ఉన్నారు కాబట్టి…. వీడికి తోడుగా నువ్వు కూడా ఉండు.  నాకేం అభ్యంతరం లేదు.  నీకు కావలసినట్టుగా…. నీకు నచ్చినట్టుగా…. నీకు కావాల్సింది నువ్వు తింటూ ఉండు.  నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉండు.  మా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు.  ఎలాంటి సమస్య లేదు.  కాబట్టి నువ్వు మా గురించి ఆలోచించవద్దు.  నీకు ఇష్టం అయితే రా ! మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేసరికి….


బాల కుమారస్వామి వెంటనే…. అమ్మా!  నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.  నేను కొద్దో గొప్పో సాధనలో తెలుసుకున్నాను.  ఏదో జ్ఞానం పొంది ఉన్నాను . నాకు మా అయ్య ఎప్పుడో చిన్నప్పుడే జ్ఞానఫలం తినిపించాడు.  ఆ జ్ఞానఫలం తినటం వలన కొద్దో గొప్పో బ్రహ్మజ్ఞానం అలవాటు పడింది.  నేను నిత్యం ఓంకార నాదం చేసుకుంటాను. నేను ఎక్కువగా తిండి గురించి ఆలోచించను. నా జీవితం అంతా సాధనగా ఉంటుంది. నేను ఎక్కువగా మౌనంగా ఒంటరిగా ఏకాంతంగా ఉంటాను.  కాకపోతే నాకు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నేను అందరిలాగా కలిసిపోను.  అందరితో మాట్లాడను.  నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను.  అది కూడా కొద్దిగ సమయం మాత్రమే ఉండటానికి ఇష్టపడతాను.  దానికి మీకు ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను….. ఏం చేస్తున్నాను …..ఇవన్నీ అడగవద్దు.. పట్టించుకోవద్దు.  బాలగణపతి ఎలా మీ సాధనకు రక్షణగా ఉన్నాడో , నేను కూడా అలా మీ సాధనకు రక్షణగా ఉంటాను.  మీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. నా ఆకలి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.  పండు, ఫలము సరిపోతుంది.  వీడికి లాగా ఉండ్రాళ్ళు చేసి పెట్టాల్సిన అవసరం లేదు.  మీరు ఇబ్బంది పడే పరిస్థితి అయితే రాదు. అని చెప్పేసరికి శివ నందిని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.  మీ ఇద్దరు కూడా నాకు కొడుకుల లాగానే అనుకుంటాను… ఒకడు బాలగణపతి,  ఒకడు బాల కుమారస్వామి అనుకుంటాను.  కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.  నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. అనగానే ….. పదా! మనం అంతా కలిసి,  పాతాళ గంగలో స్నానం చేసి…. అమ్మవారి దర్శనానికి, అయ్యవారి దర్శనానికి వెళదాం అని  కిందకు బయలుదేరారు. 


ఈ పాతాళ గంగలో స్నానం చేయడానికి కిందకి దిగుతూ.. రుద్రస్వామి దీని విశిష్టతను సాధనా కుటుంబానికి చెప్పడం ప్రారంభించాడు. తుంగభద్రా,కేదవతి,మణి ప్రభావి అనే నదులు ఇందులో కలుస్తాయి… దీని చుట్టూ ఉండే కొండలను బ్రహ్మ విష్ణు శివగిరులుగా పరిగణిస్తారు. ఈ గిరుల మధ్యలో ప్రవహించే ఈ పాతాళగంగలో స్నానం ఆచరించడం… ఈ గంగను ఆ మల్లికార్జునునిపై అభిషేకించడం వలన ఎన్నో రకాల పాపాలు పటాపంచలవుతాయి అని భక్తుల నమ్మకం. అయితే పూర్వం కాంచీపురం లో కళ్యాణ వతి అనే సుగుణవతి ఉండేది. ఆమె యుక్తవయస్సుకు రాగానే  ఆమె మనసు తెలుసుకోకుండా…తన ఇష్టాఇష్టాలకు గౌరవం ఇవ్వకుండా…అవంతిపురమునకు చెందిన ఒక వయో వృద్ధుడికి ఇచ్చి ఆమె వివాహం జరిపించారు. ఇక తన తలరాత ఇంతే అని బాధపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ గడిపేది. ఒకరోజు ఈమె గంగా స్నానానికని బయలుదేరి వెళ్తూ ఉండగా…అక్కడ దారిలో అందమైన యువకుడిని చూసింది. ఆ యువకుణ్ణి చూడగానే ఆమె మనసు చలించి…కామవేశమునకు గురై అతనితో కలిసి సుఖించింది. ఆ తర్వాత గంగా స్నానానికని నదిలో దిగబోతుండగా.. నది మానవ గొంతుతో… ఆగు! నువ్వు నాలో దిగి నీ అపవిత్రతను నాకు అంటగట్టకు.. నువ్వు నీ పతికి ద్రోహం చేశావు. నన్ను పట్టుకోకు.. ఒకవేళ కాదని నన్ను అంటుకునే ప్రయత్నం చేస్తే శపించేస్తాను అనగానే…. ఆ యువతి ఏడుస్తూ…. అవును తల్లి! నేను తప్పే చేశాను. కానీ నా మనసు అర్థం చేసుకోకుండా.. ఒక వృద్ధుడికి నన్ను కట్టబెట్టారు.  ఆ యువకుడిని చూడగానే నా వయస్సు, శరీర స్పర్శ కోసం నా మనసు  పడే తపన తాపత్రయంలో నేను మంచి చెడు ఆలోచించలేకపోయాను. గాడి తప్పాను. నేనేం చేయను. నిగ్రహించుకోలేకపోయాను అని కుమిలిపోయి ఏడుస్తూ ఉండేసరికి.. గంగ కరిగిపోయి…సరే అని తనలో స్నానమాచరించి పాపాన్ని కడిగివేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గంగను నీల గంగా అని కూడా పిలిచేవాళ్ళు అని అంటూ వుండగానే మెట్లు దిగి పాతాళ గంగ వద్దకు చేరుకున్నారు. చుట్టూ కనిపించే గిరులు…. నది ప్రవాహం.. చుట్టూ చూస్తూ… బాల గణపతి శివ నందినితో అమ్మ ఈ పాతాళ గంగ నది నీళ్ళు ఎందుకు ఇంత పచ్చగా ఉన్నాయి అని అడిగితే… దానికి శివ నందిని… నేను విని , చదివి తెలుసుకున్న శబ్ధ పాండిత్యం ప్రకారం అయితే… చంద్రగుప్తుడు అనే రాజు తనకి కూతురు పుట్టిన తరువాత శత్రురాజులపై యుద్ధానికి అని వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు.. అలా యుద్ధంలో విజయం సాధించి వచ్చిన ఆ రాజుకు  రాజ్యంలోని ప్రజలంతా స్వాగత సత్కారాలతో ఆహ్వానించారు. రాజ మందిరంలో తన భార్య పక్కన నుంచుని ఉన్న తన కూతురు చంద్రావతిని చూసి రాజు కామోద్రేకుడు అయ్యాడు. ఆమె అతని కూతురు అని ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినలేని పరిస్థితికి రాజు వెళ్లిపోయాడు. అప్పుడు ఆమె ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ శ్రీశైలంలోని పాతాళ గంగ నది ప్రాంతానికి చేరుకుంది. ఈమె  శ్రీశైలం ప్రాంతంలో ఉందని తెలుసుకున్న మహారాజు…మోహవేశంతో ఈ పాతాళగంగా ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడ ఆయన చంద్రావతిని చూసి బలవంతం చేయబోగా ఆమె సర్వస్య శరణాగతితో ఆ పరమేశ్వరుని ప్రార్థించింది.  అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై రాజును పచ్చని రాయిగా మారి పాతాళ గంగలో ఉండమని శపించాడు. పరమశివుని శాపం తరువాత తేరుకున్న రాజు కాస్త తన కూతురు  పట్ల తనకి కలిగిన ఈ దుష్ట ఆలోచనలకు చింతించి… పశ్చాతాపంతో ఆ పరమశివుని తనకి శాపం విమోచనం ఎలా కలుగుతుందని అడిగాడు…అప్పుడు ఆ పరమశివుడు కలియుగంలో విష్ణుమూర్తి ఈ పాతాళ గంగ దగ్గరకు వచ్చి అతని చేతి స్పర్శ ఈ నీటికి తగిలిన తరువాత నీకు శాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి అదృశ్యమయ్యారు . అలా ఈ పాతాళ గంగలోని నీరు పచ్చగా ఉంటుందని చెబుతారు అని చెప్పింది. 

పాతాళ గంగ 


కింద అడుగున ఉన్న కృష్ణా నది ప్రవాహమైన పాతాళ గంగలో దిగి స్నానాదికాలు పూర్తి చేసుకున్నారు.  అక్కడ గుండ్రంగా ఉన్న పడవలు ఎటో వెళుతూ ఉండేసరికి….. బాల కుమారస్వామిని ఆ పడవలు ఎక్కడికి వెళ్తున్నాయని అడిగితే…. ఈ నదికి అవతలవైపు అక్కమహాదేవి గుహలు ఉన్నాయి.  అక్కమహాదేవి అనే ఆవిడ సాధన చేసిందని చెబుతారు.  ఆ గుహల్లో  ఒక శివలింగం ఉంటుంది.. ఇక్కడే దత్తాత్రేయ రెండవ అవతారమైన నృసింహసరస్వతి కూడా తపస్సు చేశారని చెబుతారు అనేసరికి,  ఆ అక్కమహాదేవి గురించి నీకు తెలుసా అని రుద్రస్వామిని అడగగా…. అక్కమహాదేవి గురించి చెప్పడం మొదలుపెట్టాడు…. శివ నందిని, బాల గణపతి, కుమారస్వామి, మహాదేవి ఆసక్తిగా రుద్రస్వామి చెప్పేది వింటూ ఉన్నారు. 


అక్కమహాదేవి :- 


అక్క మహాదేవి ఎవరూ? అనేసరికి రుద్రస్వామి… ఈమె కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ అనే ఉడుతడి అనే ప్రాంతానికి చెందినదిగా చెపుతారు. ఈమె  తండ్రి పేరు నిర్మల్ శెట్టి, ఈమె తల్లి పేరు సుమతి… ఈమె వీరశైవ మతధర్మానికి సంబంధించింది కావడంతో చిన్నతనంలోనే లింగారాధన …..రుద్రాక్ష, విభూది ధారణ  చేశారు.  బాల్యంలోనే ఆమె గురువుగారు పంచాక్షరి మహా మంత్రాన్ని ఉపదేశం చేశారు.  ఈమె యుక్త వయసుకు వచ్చేసరికి శరీరం మీదమోహ వ్యామోహాలు పెంచుకోకుండా… రత్నాలు ఆభరణాలు ధరించాలనే కోరిక లేకుండా…నిత్యం శివ ధ్యాన పరాయణురాలై ఉండేది. వివాహ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా ఆ మల్లికార్జునుడే నా భర్త అని చెప్పేది. చిన్నతనం కొద్ది అంటుందని చుట్టూ ఉన్నవారు సరదాగా తీసుకున్నప్పటికీ….. ఈమె శివ భక్తికి అందరూ మెచ్చుకునే వారు. ఇదిలా ఉంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించే కౌశిక మహారాజు ఇతను జైనుడు….ఒకనాడు పురదర్శనమునకు వచ్చి ప్రజలందరి మధ్యలో ఉన్న అక్కమహాదేవిని చూశాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై…ఆమెను వివాహం చేసుకోవాలని బలంగా అనుకున్నాడు. మంత్రి చేత ఆమె తల్లిదండ్రులకు కబురు పంపించాడు. ఆమె యొక్క శివ ధ్యాన నిష్ఠ తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడదని…పూర్తిగా శివ ధ్యానంలో నిమగ్నమై ఉన్నదని చెప్పారు. ఆ తర్వాత రాజు వాళ్ళ తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి తన కుమార్తెను రాజుగారికి ఇచ్చి పెళ్లి చేయమని బలవంతం చేశారు. వీళ్ళతో ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఏకంగా అక్కమహాదేవి దగ్గరకు వెళ్లి రాజు గారిని వివాహం చేసుకొని రాజ్య భోగాలలో సుఖించమని…. లేదంటే తమ తల్లిదండ్రులు చిత్రవధ గురికాక తప్పదని రాజు గారి ఆజ్ఞ అని చెప్పడంతో…. ఆమె కోపంగా నేను ఇష్ట లింగ ఆరాధనలో శివుని  పతిగా భావించుకొని జీవిస్తున్నాను అని ఆమంత్రితో చెప్పింది. అయినప్పటికీ ఆమె మనస్సులో తమ తల్లిదండ్రులకు ఎక్కడ పెనుముప్పు వాటిల్లుతుందో అని…. ఒకపక్క ఆలోచన చేస్తూ…తుల్యమగు సంసారంలో పడటం వలన మాయా బంధనములో లో చిక్కుకోవడం వలన ఉపయోగం లేదని గ్రహించి ఏం చేయాలో అర్థం కాక…అటు తల్లిదండ్రులకు తన వల్ల ఆపద రాకూడదని ఇటుతన మాన గౌరవం తగ్గకూడదని పలు రకాలుగా ఆలోచించి…కొన్ని రకాల షరతులతో మాత్రమే తను రాజ భవనంలోకి అడుగు పెడతానని ఒకవేళ షరతును ఉల్లంఘించిన రోజే రాజభవనం నుంచి వెళ్ళిపోతానని చెప్పి రాజభవనంలోనికి ప్రవేశించింది. అయితే ఆ రాజు జైనుడు కాబట్టి…అక్కమహాదేవి అతనిని వీరశైవునిగా శివ భక్తునిగా మారమని చెప్పింది…కేవలం మారడం అంటే నామమాత్రముగా కాదు…శివుని యొక్క గుణగణాలను  శివుని యొక్క తత్వమును తత్వ జ్ఞానమును వేద పండితుల దగ్గర తెలుసుకొని శివ భక్తునిగా శైవుడిగా మారమని…అప్పుడు మాత్రమే తనని వివాహం చేసుకుంటానని చెప్పింది. కానీ రాజు మాత్రం ఆమె చెప్పిన షరతుని పక్కనపెట్టి ఎప్పటికైనా తన మనసు మారుతుంది లే అనుకుని జైనుడిగానే తన సొంత మత ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆమె కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఆమె అక్కడ కూడా నిత్యం ఇష్టలింగ ఆరాధనలో నిమగ్నమై ఉండగా.. రాజు ఆమెను వివాహ ప్రస్తావన గురించి కానీ లేదా తన కోరిక గురించి గానీ చెప్పడానికి వీలు లేకపోయింది. రోజులు గడిచే కొద్దీ రాజులో  కామవేశాలు పెరిగిపోయి …నిష్టను కోల్పోయి…ఆమె శివలింగారాధనలో ఉన్న సమయంలో, ఆమెను ఆలింగన భావంతో పట్టుకున్నాడు. దానితో ఆమె కోపావేశాలకు లోనై నువ్వు నియమాలను ఉల్లంఘించావు.  నేను శివ ధ్యాననిష్ట లో ఉన్నప్పుడు …నా అనుమతి లేకుండా నన్ను తాకావు . అయినప్పటికీ నా కోరిక మేరకు నీవు కూడా వీరశైవంలోకి వచ్చి ఇష్ట లింగం ఆరాధన చేస్తూ నాలా ఉన్నప్పుడు మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పటికీ కూడా నువ్వు నీ కామ భావంతో నా శివ పూజకు ఆటంకం కలిగించావు…అంటూ ఇక తను ధరించిన రాజ వస్త్రముతో సహా….ఆభరణాలన్నింటినీ తీసేసి…దిగంబరంగా మారి నగ్నత్వం యొక్క రహస్యాన్ని రాజుకు బోధించింది.  రాజు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె నగ్నత్వ బోధకు  ఆమెలో తన జైన గురువులు కనిపించి…. కామ భావం నశించి ఆమె కాళ్ళపై పడ్డాడు. ఇక ఎవరు చెప్పినా వినకుండా తల్లిదండ్రులు వారించినా …స్నేహితురాళ్ళు చెప్పినా…వినకుండా ఈమె అనుభవ పాండిత్యమును అనుభూతి చెందాలని…శివ సన్నిధానమే శరణ్యమని కళ్యాణి నగరానికి బయలుదేరి వెళ్ళింది . దారిలో ఎన్ని ఆటంకాలు ఏదురుపడిన ఆగలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుదేవుడు ఈమెను పరీక్షించమని సూక్ష్మగ్రాహి అయిన కిన్నెర బొమ్మయ్య అనే అతనిని పంపించాడు. ఈమె భక్తిని వీర వైరాగ్యాన్ని గ్రహించిన బొమ్మయ్య గారు ఈమె నిగ్రహాన్ని పరీక్షించాలని ఆమె శరీరంగముల మీద  తాకగానే….. మూత్రపు చుక్కలు ఒడిసే ఈ శరీర అంగముల మీద నీకు అంత మోహం ఎందుకు అన్నా……చెన్న మల్లికార్జునుడు తప్ప నాకు అందరూ సోదరులే అన్నా……అని తన వీర వైరాగ్యాన్ని తెలిపింది. ఈమె కామ సంహారిణి అని గ్రహించి ఆమె శరీరాన్ని తాకినందుకు ఆయనలో ఆయనే పశ్చాత్తాప పడుతూ బాధపడ్డాడు. ఇతని భావాన్ని గమనించిన మహాదేవి అతని వైపు లాలనగా చూడగానే ఆమెను  తల్లిగా భావించి…ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 

అక్క మహాదేవి 



ఆ తర్వాత ఈమె కళ్యాణి నగరానికి చేరుకొని అక్కడ వీర శైవుడైన భక్త బసవన్నను కలిసింది.  ఈమె నగ్నత్వమును చూసి పురవీధుల్లో ఉన్న వారు కొంతమంది ఈమెకు నమస్కారం చేస్తే ….కొంత మంది ఈమెను అసహ్యంగా చూశారు. ఎవరేమనుకున్నా మానవమానాలకు అతీతంగా ఉన్న ఈమె స్థితిని గురించి అల్లమ ప్రభువుకు చెప్పారు. ఈ అల్లమ ప్రభువు శూన్య మంటపమునకు సభాధ్యక్షుడు. మనకి కాశ్మీర్లోని శారదాపీఠం సర్వజ్ఞ పీఠంగా ఎలా అయితే గౌరవించబడుతుందో…. అదేవిధంగా శ్రీశైలంలోని ఈ శూన్య మండపంలోని అధ్యక్షత పదవి కూడా ఉంటుంది. అన్ని భావాలు కూడా శూన్యంలో నుంచి వస్తాయి …శూన్యంలోకి వెళ్లిపోతాయి …శూన్యమే సర్వము అనే భావమును వీరశైవులు విశ్వసిస్తారు. అల్లమ ప్రభువు దగ్గరకు అక్కమహాదేవిని తీసుకువస్తారు. ఈమె ముఖ  వర్చస్సు చూడగానే  మహా శివ భక్తి సంపన్నురాలు అని అర్థమైనప్పటికీ కూడా అల్లమ ప్రభువు ఈమె భక్తి జ్ఞాన వైరాగ్యాలను లోకానికి తెలియజేయాలనే సదుద్దేశంతో ఈమెను ఎన్నో రకాలుగా వాద ప్రతి వాదనలతో పరీక్షించడం జరిగింది. ఈ వాదనలో అల్లమ ప్రభువు ఈమెను జుట్టు విరబోసుకుని తన శరీరాన్ని కప్పుకోవడం చూసి ఈమెకు ఇంకా  శరీరంపై మోహం పోలేదని అనుకుని…. శివయోగిని అని చెప్తున్నావు…. శివుడే భర్త అని చెప్తున్నావు…నీ శరీరాన్ని జుట్టుతో కప్పుకున్నావు……సిగ్గుతో శరీరాన్ని కప్పుకున్న నువ్వు…. శరీరంపై బ్రాంతి విడవలేని నీవు…. శివుడంతటి వాడిని భర్తగా ఎలా పొందగలుగుతావు అని అడగగా…. దానికి ఆమె “శరీరం లోపల పండు పండకుండా…బయటతోలు పండిన రంగు చూపదు…ఏ శరీర భాగములు అయితే పురుషునిలో కామోద్రేకాన్ని రేపుతాయో…. అట్టివారు కాముని ముద్ర చూడగానే మనసు గతి తప్పుతుంది….  మనసు యొక్క కామ వికారములు తీరక…  వేదనకు గురి అయ్యి జీవుడు అధోగతి పాలవుతాడు…. అందుకోసం నేను రహస్యంగా ఉంచాను తప్ప నాకేదో దేహభ్రాంతి ఉందని కాదు” …అని తన శైలి లో సమాధానం చెప్పింది. ఈమెను అన్ని రకాలుగా పరీక్షించి…. ఇక నువ్వు నీ భర్త అయిన మల్లికార్జునుని పొందడం కోసం  శ్రీశైలం వెళ్లి తపస్సు చేసుకో అని ఆమెను శ్రీశైలం పంపించారు. ఈమె ఆ దారి  పొడువునా ఎన్నో రకాల శివ కీర్తనలు పాడుతూ శ్రీశైలం చేరుకుంది. శివుడు సన్యాస రూపంలో వచ్చి ఈమెను కదళీ వనం పక్కన ఉన్న గుహల్లో కూర్చుని తపస్సు చేయమని చెప్పారు. ఈమె ఈ గుహలోనే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. మల్లికార్జున స్వామి దేవాలయంలో త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయుడు ధ్యానం చేసేవారు. ఆ తర్వాత వచ్చిన రెండవ దత్త అవతారమైన నృసింహ సరస్వతి కూడా ఈ కదళీ వనం పక్కన ఉన్న గుహల్లోనే తపస్సు ఆచరించి ఇక్కడే అంతర్ధానం అయ్యారని చెపుతారు. ఈ అక్కమహాదేవి గుహకి…. నృసింహ సరస్వతి స్వామి వారి  తపో గుహ కి 6కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటారు. ఈ కదళీ వనం భూలోక స్వర్గమని….  సిద్ధ భూమి అని…. అంటారు. అయితే హిమాలయాలో తపస్సు చేస్తే ఎంతటి శక్తి తరంగాలు అనుభూతి చెందుతామో అంతటి శక్తి కేంద్రంగా చెపుతారు. . అయితే ఈ అక్కమహాదేవి గుహ లోపలికి వెళ్ళిన తర్వాత మరో గుహ లోకి పాకుతూ వెళ్ళే మార్గం ఉంటుందని…. ఆ లోపల ఒక అస్థిపంజరం ఇప్పటికీ పద్మాసనం లో కూర్చుని కనిపిస్తుందని….అంతటి సాహసాన్ని అందరూ చేయలేరని…అలాంటి వాటి జోలికి ఎవరూ కూడా వెళ్లకుండా తమ మానాన తపస్సు చేసుకుని వచ్చారని కొంతమంది యోగులు చెపుతారు.పరిపూర్ణ యోగ సిద్దులు మాత్రమే ఎవరో కోటికి ఒకరు మాత్రమే ఆ లోపలికి వెళ్లి చూసి రావడం జరిగింది అని…. మామూలు స్థితిలో ఉన్నవాళ్లు వెళ్తే పెను ప్రమాదం అని…. చాలా పవిత్రమైన స్థలంగా చూస్తారని…. ఆ ప్రాంతవాసులు చెబుతారు. అందులో నిజానిజాలు ఇక ఆ మల్లికార్జునుడికే తెలియాలి. ఇలా అక్కమహాదేవి కూడా అక్కడే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి భావలింగాన్ని ఏర్పరచుకొని కఠోరమైన తపస్సుతో సర్వస్య శరణాగతితో మల్లికార్జునిలో ఆత్మ విలీనం గావించి స్వయం లింగమైందని చెబుతారు . అక్కమహాదేవి ఎన్నో రకాల శివ కీర్తనలు చేసింది. అవి అక్కమహాదేవి వచనములుగా ప్రసిద్ధి చెందాయి. అందులో కొన్ని….



(1)

నన్ను నేను  నే నెరుగక మున్ను 

నీ వెందుంటివో తెలుపుమయ్య….?

సువర్ణమందలి వర్ణము వలె 

నాయందు నీ వుంటివయ్యా! 

అయ్యా! నా యందుండియు

కనిపించని భేదము మీయగంటి

గనుమ చెన్నమల్లి కార్జున!


(2)

యోగికి యోగిని యయ్యే నీ మాయ 

తాపసికి తపస్వి యయ్యే నీ మాయ 

శ్రవణునకు శ్రవణీ యయ్యే నీ మాయ 

ఐన ఈ మాయకు 

భయపడు దాననా!

చెన్న మల్లిఖార్జునా నీ యానా!


(3)

ఎల్లప్పుడూ నా మనసు ఉదర పోషణకై ప్రాకులాడుచుండును. 

కాన లేదయ్యా నిన్ను భేదించలేనయ్య…

నీ మాయను…

మాయా సంసారమునందు చిక్కుకొంటిని…

ఓ దేవా… చెన్న మల్లికార్జునా…

నిన్ను చేరునట్టు చేయుమయ్యా!నీ ధర్మము!


(4)


నేన పుట్టినప్పుడు సంసారము పుట్టెను 

సంసారం పుట్టినప్పుడు అజ్ఞానము పుట్టెను 

అజ్ఞానము పుట్టినప్పుడు ఆశ పుట్టెను 

ఆశ పుట్టగానే కోపము పుట్టెను 

కోపాగ్ని యొక్క తామసపు ధూమము 

చుట్టుకొనగా నేను నిన్ను మరచి

భవదుక్కమునకు గురి అయితిని 

కరుణించి నన్ను ఎత్తుకొని నామా రూపును తప్పించి…

నీ పాదమును చూపుమయ్యా చెన్నమల్లికార్జునా!


(5)

ఒకటి గాదు రెండు గాదు మూడు గాదు నాలుగు గాదు ఎనుబది లక్షల యోనుల నుండి వచ్చితిని వచ్చితిని రారానిభవముల అనుభవించితిని వాని సుఖాసుఖములు వెనుకటి జన్మల ఎంత ఏమైనా గానీ ముందుకు నీవు కరుణించుము చెన్న మల్లికార్జునా!


(6)

గుంపును వదిలి పట్టుబడిన కుంజరము 

తానున్న వింధ్యను తలచునట్లు తలచెదనయ్యా! 

బంధింపబడిన చిలుక తన 

బంధువులను తలచునట్లు తలచెదనయ్యా! 

బిడ్డా నీ విటురా’అని నీవు నీ దయను 

చూపుమయ్యా చెన్న మల్లికార్జునా!


(7)

ఆయుష్యము తరగిపోవుచున్నది 

భవిష్యత్తు తొలగిపోవుచున్నది 

కూడియున్న సతిసుతులు , తమ తమ దారిని పోవుదురు 

వద్దు వద్దురా, వంధ్యయై చెడకుము ఓ మనసా! 

చెన్న మల్లికార్జునుని శరణుల సంఘమందు 

ప్రజ్ఞాశాలినివై బ్రదుకుము ఓ మనసా!


(8)

ఆకలియైనచో ఊరియందు భిక్షాన్నము గలదు

దప్పిగ గలిగినచో బావులు చెరువులు, నదులు గలవు 

చలి బెట్టినచో పారవేసిన చింపులు గలవు 

పరుండుటకు పాడు దేవళములు గలవు 

చెన్న మల్లికార్జునయ్యా! ఆత్మ సాంగత్యమునకు 

నీవుంటివి గదయ్యా చెన్న మల్లికార్జునా!


(9)

ఆది అనాదులకు అతీతుడయ్య బసవన్న

ముగ్గురు మూర్తులకు మూలస్థానమయ్య బసవన్న 

నాద బిందు కళాతీత నిరంజనుడయ్యా బసవన్న 

ఆ నాదస్వరూపమే బసవన్న ఐనందున

ఆ బసవన్న శ్రీపాదములకు నమో నమో 

యను చుందును  గనుమా చెన్న మల్లికార్జునా!


(10)

శ్వాస యందే సువాసన యు

కుసుమముల వ్యసన మింకెందుకయ్యా,

క్షమా దమా శాంతి సైరింపులున్నా

సమాధి వ్యసన మింకెందుకయ్యా! 

లోకమే తానైయున్న

ఏకాంతపు వ్యసన మింకెందుకయ్యా

చెన్న మల్లికార్జునా!


(11)

ఆకారము లేని నిరాకార లింగమును 

చేతబట్టి మెడలో కట్టితి  మనెద  రజ్ఞానులు 

హరి బ్రహ్మ లు వేద పురాణ గమములు 

వెదకి చూడ జాలని లింగము 

భక్తికి ఫలమే గాని లింగము గాదు 

జ్ఞానానికి పరిభ్రమణమే గాని లింగము గాదు

 వైరాగ్యానికి ముక్తియే గాని లింగము గాదు

గాన తన్ను తా దెలిసి తా నైనచో

చెన్న మల్లికార్జునుడు తానే వేరు గాదు!


అంత గొప్ప శివ భక్తురాలా తను…. అయితే మనం ఒకసారి వెళ్లి ఆ గుహలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుని రావాల్సిందే…మరి మనందరం వెళ్దామా అని బాల గణపతి, శివ నందిని కేసి చూసేసరికి ……ఇప్పుడు అమ్మవారిని, అయ్య వారిని దర్శనం చేసుకోవాలి అనగానే …. ఓహో!  మా నాన్నని, మా అమ్మని దర్శనం చేసుకున్న తర్వాతే  అంటావు ! అని బాల గణపతి అనేసరికి …..కుమారస్వామి బాల గణపతి తల మీద ఒక దెబ్బ వేసి ….నువ్వేంటి రా!  నిజాలు చెప్తావు…. నిజాలు మాట్లాడకూడదు అని నెమ్మదిగా అనేసరికి…… నాకు నోరు ఆగదు కదా!  నోట్లో నూనె గింజ కూడా ఆగదు.  ఏం చేయమంటావు!  తప్పదు…. అయినా వాళ్ళకి అర్థం కాదులే!  అందరిని అమ్మానాన్న అంటూ ఉంటా కాబట్టి…. వీళ్ళకి పెద్దగా అర్థం కాదు.  నువ్వు ఆ విషయంలో కంగారుపడమాకు. భయపడక మాకు…. అని బాల కుమారస్వామిని చూస్తూ …..సరేగాని స్నానాదికాలు పూర్తి అయ్యాయి కదా!  ఇక బయలుదేరుదాం అని చెప్పి అందరూ అక్కడ నుంచి మల్లికార్జున స్వామి గుడి వైపుకు బయలుదేరడం జరిగింది.



అందరూ కూడా కుటుంబ సభ్యుల లాగా కలిసి నిలబడ్డారు . కాస్త రద్దీగా ఉంది . లైన్లో నిలబడి దర్శనము కోసం నిలుచున్న చోట రుద్ర  స్వామి ఓంకారం …..శివనందిని ఓం శివోహం మంత్రం…… బాలగణపతి ఓం నమశివాయ….. బాల కుమార స్వామి ఓం ……పఠిస్తూ లోపల స్వామివారి దర్శనానికి వెళ్లారు . శివలింగాన్ని తాకారు . మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ…. తమ తలలను ఆ లింగానికి  తాకించారు. ఆయన చెవిటి మల్లన్న  కాబట్టి…. ఆయనకి మనం మాట్లాడేది వినబడదని చెప్పి…. తలలను  తాకించి మనసులో ఉన్న కోరికను  చెబితే ఆ కోరిక తీరుతుంది అని చెప్పి స్థల పురాణం చెప్పడంతో అందరూ కూడా తలలను ఆ లింగానికి తాకించారు . తనివి తీరా ఆ లింగాన్ని స్పృశించారు.  ఆ తర్వాత వాళ్ళు తెచ్చుకున్న పాతాళగంగ నీళ్లతో అభిషేకాలు చేశారు.  ఎవరు కూడా ….అక్కడ ఉన్న భక్తులు కూడా ….వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు.  దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉండి స్వామివారిని  తనివి తీరా చూసుకున్నారు.  వీళ్ళ ఆరుగురు మాత్రమే గర్భగుడిలో ఉండేలాగా మిగిలిన వారంతా బయట ఉండిపోయారు .  వీళ్ళ వేషభాషలు చూసి అందరికీ కాస్త భయం కలిగినా కూడా రకరకాల సాధనా దీక్షలతో సాధన చేస్తున్నారని అనిపించింది.  అయినా మనకెందుకులే!  అని భక్తులు తమ పనిలో తాము ఉన్నారు.  వీళ్ళని ఎవరైనా పలకరించినా ….నమస్కారం చేసినా …. కొంత మంది వచ్చి ఆశీస్సులు తీసుకునే వాళ్ళు.. రుద్ర స్వామి అందరికీ ఆశీస్సులు ఇస్తూ…. అక్కడే ఉన్న అర్ధనారీశ్వర గుడికి వెళ్లారు.  ఆ గుడిలో అర్ధనారీశ్వర తత్వం చూసి సంతోషించారు.  ఆ తర్వాత అక్కడే ఉన్న భ్రమరాంబిక దేవి గుడికి వెళ్లారు.  అమ్మవారి ముందు ఉన్న శ్రీ చక్ర యంత్రానికి కొంతమంది భక్తులు పూజ చేయడం చూశారు.  నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనాలు చేసుకున్నారు.  అమ్మవారి కళ్ళు ఈ యంత్రం కేసి ఉన్నాయని శివ నందిని గమనించింది.  కానీ కళ్ళ మీద దృష్టి పెట్టలేకపోతున్నామని ఒకటి పది సార్లు చూసింది.  కానీ తన కళ్ళు ….అమ్మవారి కళ్ళ చూపు కలవట్లేదు అని గ్రహించింది . ఇదే విషయాన్ని బాల గణపతి కూడా గమనించాడు. గ్రహించి… శివ నందినితో …


అమ్మ చూశావా!  అమ్మవారి కళ్ళు కలవట్లేదు.  అమ్మవారి చూపు మన మీద పడట్లేదు.  కాకపోతే ఆవిడ ముందు ఉన్న యంత్రం కేసి చూస్తుంది.  చూశావా!  అదే శ్రీచక్ర యంత్రం కేసి చూస్తుంది గమనించావా…. అనగానే శివ నందిని మనసులో… వీడు పొట్టోడే గాని గట్టోడే . వీడు చాలా లోతైన విషయాలు కూడా గమనిస్తున్నాడు.  ఏమీ తెలియని వాడిలాగా ఉంటాడు అనుకుంటూ… అవును నాయనా!  అలాగే కనిపిస్తుంది.  అమ్మవారి చూపుకి ,మన చూపుకి కలవట్లేదు.  ఆ విధంగా ఏర్పాటు చేసి ఉంటారు.  అమ్మవారి చూపు యంత్రం మీదే ఉంది.  నువ్వు బాగానే కనిపెట్టావు అంటూ ఉండేసరికి…. అలా బయటికి నాలుగు అడుగులు వేశాక వచ్చిన అర్ధనారీశ్వర గుడిని చూడడం జరిగింది. ఆ గుడిలో అమ్మవారు ,అయ్యవారు ఏకమై రెండు శరీరాలు అర్థ భాగంతో ఉండటం గమనించారు. ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు. 


బాల గణపతి అక్కడ ఉన్న పూజారిని ఈ గుడిలో ఉన్న నందిని శనగల బసవన్న అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాడు…. దానికి పూజారి, పూర్వం శ్రీశైలంకి దగ్గరలో ఉన్న బ్రహ్మగిరి ప్రాంతంలో ఒక శిల్పి ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. ఒకసారి శ్రీశైల క్షేత్రానికి వచ్చి మల్లికార్జున స్వామి వారిని భ్రమరాంబికా దేవిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. మనిషి వెళ్ళిపోయాడు కానీ మనసు మాత్రం ఆ మల్లన్న మీదే స్థిరపడిపోయింది. ఆ స్వామివారి మీద తనకున్న భక్తిని, ఆ స్వామివారికి చూపించాలని… అతను సంతృప్తి పరచాలి అనుకుంటూ శిల్పి కాబట్టి ఈ స్వామివారి ప్రాంగణంలో నందులను ప్రతిష్టించడానికి పూనుకున్నాడు. అతను నిత్యం శివనామ స్మరణతో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివ పూజ చేసిన తర్వాత భోజనం చేసుకుంటూ అలా ఒక మండలం రోజులపాటు కష్టపడి రెండు నదులను చెక్కాడు. కానీ ఈ రెండు నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలో అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే దారిలో పాతాళగంగా నదిని దాటి వెళ్ళాలి. ఇదే ఆలోచన చేస్తూ మనసులో బాధపడుతూ తన భక్తిని ఆ శ్రీశైలం మల్లన్నకి చూపించడానికి అవకాశం లేకుండా పోతుందా అని బాధపడుతూ నిద్రపోయాడు. అప్పుడు స్వామివారి స్వప్న దర్శనం ఇచ్చి, ఈ పలుకు తాళ్లతో నందులను కట్టి శ్రీశైలానికి తీసుకురా! ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకు…. అని చెప్పి అదృశ్యం అయ్యారు. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన శిల్పికి ఎదురుగా పలుకు తాళ్ళు కనిపించాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక నందిని వెనుక వైపు మరొక నందిని ముందువైపు కట్టి…. శ్రీశైలానికి బయలుదేరాడు. అలా పాతాళగంగా నది యువతల ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి వస్తున్న సమయానికి…. నంది కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయేసరికి అది అరవటం ఆపేసింది. ఇది అరవటం ఆపేసింది అని అతను ఓరకంటగా వెనక్కి తిరిగి చూశాడు. నంది అక్షరమే మళ్లీ తిరిగి శిల్పంగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక ముందు ఉన్న నందిని మాత్రమే తీసుకొని శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ గుడిలో దర్శనమిచ్చే నంది ఆనందియే.  శనగలు మూట కట్టి దీని మూతికి తగిలించడం జరుగుతుంది.  ఎందుకంటే నందికి శనగలు అంటే చాలా ప్రీతి పాత్రమైనవి. ఇక పాతాళగంగలో ఆగిపోయిన నందిని ఉబ్బలి బసవన్న అని పిలుస్తారు…కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ నందిని అదే చెన్న కాలు బసవన్న అనే అంటారని కూడా చెబుతారు. ఇది ఈ నంది కథ అని అనేసరికి బాల గణపతి ఓహో అన్నట్టు తల ఊపాడు. 


సరే అని అమ్మవారి గుడి వెనక వైపు వెళ్లేసరికి తుమ్మెద  ఝుంకార నాదం వినపడుతుందని అనేసరికి అక్కడికి వెళ్లారు.  అక్కడ  ఒక రంధ్రం కనపడే సరికి అందరూ ఒక్కొక్కళ్ళు అందులో  చెవి పెట్టి వినేసరికి… లోపల తుమ్మెదలు ఓంకార నాదం చేస్తున్నట్టుగా వినిపించేసరికి…. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుడిలో ఉన్న తొమ్మిది రకాల శివలింగాలను చూశారు.  వాటిలో ఎనిమిది లింగాలకు పానవట్టం ఉండటం గమనించి,  ఒక మోక్షలింగానికి  పానవట్టం లేకపోవడం బాలగణపతి గమనించి ఇదే విషయాన్ని శివ నందిని చెవిలో వేశాడు. అప్పుడు బాల గణపతి తో ఇవే నవ బ్రహ్మలు ప్రతిష్ఠించిన లింగాలు అని…. వీటి పేర్లు వరుసగా వాయు లింగం, జల లింగం, ఆకాశ లింగం ,నభోలింగం, సూర్యలింగం, చంద్రలింగం, అగ్ని లింగం యజమాన లింగం, మోక్ష లింగం అని ఈ నవలింగాలకు ఉగ్రమూర్తి, భైరవమూర్తి, భీమమూర్తి, ఈశ్వరమూర్తి, ఈశాన్యమూర్తి, మహాదేవమూర్తి, రుద్ర మూర్తి, పశుపతి మూర్తి, కైలాస మూర్తి అని చెప్పడం జరిగింది అని చెప్పింది . ఆ తర్వాత గుడిలో ఉన్న త్రిఫల వృక్షం కిందకి చేరారు . ఇది జువ్వి మేడి రావి వృక్షాల సమ్మిళితం అని….. అగస్త్య మహాముని ఈ చెట్టు కింద సూక్ష్మ రూపంలో ఉంటారని…….ఆ వృక్షం మొదలులో ఉన్న దత్తాత్రేయుని విగ్రహ మూర్తికి నమస్కారం చేసుకుని….. ఇక్కడ దత్తాత్రేయ స్వామి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారని తెలుసుకొని ఎవరికి వారే ధ్యాన నిష్ఠ లో కూర్చుండిపోయారు. 


ఒక రెండు గంటలు అయిన తర్వాత… ఆలయ గోపురం కేసి చూశారు.  ఆ తర్వాత ఆలయ శిఖరాన్ని చూపిస్తున్న మల్లికా కుండంలో ఉన్న సరస్వతి నీటిలో …త్రిశూలం యొక్క గాలిగోపురం కేసి చూసి…బాల గణపతి అమ్మ ! సాధన విగ్రహము ఇచ్చిన ఆధారంలో సరస్వతి చూస్తుంది అన్నారు కదా! ఇదే అనుకుంటా ….సరస్వతి నది గాలి  గోపురం కేసి చూస్తుంది చూశావా ! అని నీడని చూపించేసరికి…. అవును అన్నది . ఆ మల్లికా కుండం పక్కనే ….ఓ స్త్రీ మూర్తి శిల్పం కనిపించేసరికి …అమ్మ!  ఈవిడే  అనుకుంట వేశ్య.   ఈవిడకే మోక్షం ఇచ్చాడు అనుకుంటా!  అని అనేసరికి 


శివ నందిని అవును…. పార్వతి దేవి పరమశివున్నీ శిఖరం చూసినంత మాత్రము చేత మోక్షం వస్తుందా అని అడిగేసరికి దానికి ప్రత్యక్ష నిదర్శనం చూపించడానికి అని…పరమశివుడి పండు ముసలివాడి లాగా శ్రీశైల క్షేత్రంలో ఉన్న విభూది కుండం వద్దకు వచ్చి విభూతి కుండలో పడిపోయారు. అప్పుడు ఎవరో ఒకరు నన్ను కాపాడండి నన్ను బయటకి తీయమని అడగగా…ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులు వచ్చి స్వామివారి చేయి పట్టుకోవడానికి ప్రయత్నించగా…అప్పుడు ఆ వయోవృద్ధుడు పాపాలు చేయని వాళ్ళు మాత్రమే నన్ను బయటకు లాగండి అని అడిగితే…. అందరూ వెనక్కి తగ్గారు. ఒక్క స్త్రీ మూర్తి మాత్రం ముందుకు వచ్చి చెయ్యి ఇవ్వండి అని అడిగింది…దానికి ఆ ముసలాయన నువ్వు ఏ పాపాలు చేయలేదా అని అడిగాడు…అప్పుడు ఆమె నేను వేశ్య వృత్తిలో ఉన్నాను. నేను పాపం చేయకుండా ఏమీ లేను. కాకపోతే నేను శిఖర దర్శనం చేసుకున్నాను. నేను మోక్షానికి అర్హురాలిని. మోక్షార్హత పొందినప్పుడు పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? నాకు అలాంటివి ఏమీ లేవు మీరు చెయ్యండి…మిమ్మల్ని నేను పైకి లాగుతాను అని అనగానే సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై , ఆమెకు మోక్ష ప్రాప్తి కలిగించాడు. ఆవిడే మనకి మల్లికా కుండం పక్కన విగ్రహ మూర్తి రూపంలో కనిపిస్తున్నారు అనింది. నమ్మకంతోనే ప్రతిదీ ముడిపడి ఉంటుంది . ఈ విశ్వం కూడా విశ్వాసం మీదనే నడుస్తుంది కదా అని శివ నందిని చెప్పింది.  


 ఆ తర్వాత వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. ఇది అతి ప్రాచీనమైన శివలింగం అని…ఈ శ్రీశైలం యుగయుగాల నుంచి ఆరాధింప పడుతూ వచ్చింది అని….. హృదయంలో హిరణ్యకశిపుడు ఈ శ్రీగిరి మీదనే తపస్సు చేసి సకల సౌభాగ్యవతి అయిన లీలావతిని భార్యగా పొందడం జరిగింది అని….. ఆ తపస్సుకు ఫలితంగా ప్రహ్లాదుని వంటి ఉత్తమ కుమారుడు అయిన జన్మించడం జరిగింది అని…. త్రేతా యుగానికి వచ్చేసరికి అరణ్యవాసంలో ఉన్న రాములవారు కూడా ఈ నల్లమల దండకారణ్యంలోకి సంచరిస్తూ హనుమంతుని పరిచయం నుంచి వాలి సంహారం వరకు కూడా ఈ నల్లమల అరణ్య ప్రాంతంలోనే జరగటం…ఆ తర్వాత ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో కూడా ఈ పర్వత లింగేశ్వరుని ఆరాధించి ఆ తర్వాత శ్రీకృష్ణుని అనుగ్రహం పొంది ఆ తర్వాత కౌరవులను ఓడించి తమ రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. అలాగే కలియుగంలో ఎందరో రాజవంశీయులు కూడా ఈ శ్రీశైలం ప్రాంతాన్ని పరిపాలించి దీనిని అభివృద్ధి పరిచారు…. వ్యవసాయ భూములుగా మార్చారు..అప్పటినుంచి ఇప్పటివరకు ఆరాధిస్తూ వచ్చిన ఈ ప్రాచీన లింగమే ఈ వృద్ధ మల్లికార్జున లింగం అని అక్కడ ఉన్న ఆలయ పూజారి చెప్పడం ద్వారా తెలుసుకున్నారు.  


ఆ తర్వాత శ్రీరాముడు ,సీతాదేవి ప్రతిష్టించిన సహస్ర లింగములు, రాజ రాజేశ్వరి, రాజరాజేశ్వర స్వామి వారి ఉప ఆలయాలు, గోశాలలు, యాగ శాలలు దర్శనం, అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న రుధిర కుండం, ఎన్నో నాగ శిలలతో… నిండి ఉన్నప్రాంతంలో చెట్టు కింద ఉన్న కుమారస్వామినీ, దర్శనం చేసుకున్నారు.  ఆ పక్కనే ఉన్న కదళీ వనానికి వెళ్లారు. ఆ తర్వాత బయటకు వచ్చి దగ్గరలో ఉన్న పంచ మఠాల వివరాలు తెలుసుకోవాలని …..అక్కడ ఉన్న భక్తులను అడిగేసరికి దారి చూపించారు . వాళ్ళు ఆ దారిలో వెళ్ళగా… మొదటగా వచ్చే ఘంటా మఠానికి చేరటం జరిగింది. 


ఘంటా మఠం:- 

పూర్వం ఒక ఘంటా సిద్దేశ్వరుడు ఈ ఘంటా మఠంలో పూజ చేసుకునే సమయంలో ఈ గంటను మోగించి పూజను ఆరంభించే వాడని…. ఒక కథ నానుడిలో ఉంది. అలా దీనిని ఘంటా మఠం అన్నారని , మరొక కథనం ప్రకారం చూస్తే, కార్తికేయనికి గణపతికి పెట్టిన గణాధిపత్యం పోటీలో…. కుమారస్వామి అలిగి ఈ శ్రీగిరి పర్వతం మీదకి వచ్చారు…కుమారుడు ఒక్కడే ఉన్నాడని….. బాధతో ఉన్నాడని…. కృత్తికలలో ఒకరైన కౌమారి అమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చారని ప్రతీకగా…ఈ శివలింగానికి ఎదురుగా ఆరు తలలతో ఉన్న కౌమారీ అమ్మవారి విగ్రహ మూర్తి కనబడుతుంది. అలా వచ్చిన కొన్ని రోజులకి ఈయన ఈ శ్రీశైల పరిధిలో ఉన్న ఓ క్షేత్రం వద్ద వల్లి దేవసేనను చూసి తన వివాహ ప్రస్తావన తండ్రిగారికి తెలియజేయాలని….. ఈ ఘంటా మఠంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి…స్వామికి పూజ చేస్తూ ఉండగా, వృద్ధ మల్లికార్జున శివలింగం నుంచి స్వామివారు బయలుదేరి ఘంటా మఠానికి వచ్చి కుమారస్వామికి అభిషేకము పూజ ఎలా చేయాలో నేర్పించారు…ఘంటా మఠం లోని ఈ గంటను మోగిస్తే కాశీలో గంట కొట్టినట్టుగా పరిగణిస్తారని…. స్థానికులు చెప్తూ ఉండగా మీరు విన్నారు. ఈ పక్కనే మార్కండేయుడు కూడా ప్రతిష్టించిన శివలింగం కనిపిస్తుంది. ఆ పక్కనే ఒకే పాన మట్టం మీద మూడు శివలింగాలు కనిపిస్తాయి…. కాశీలో ఉండే ఒక అఘోరీ…. నిత్యం త్రిమూర్తుల దర్శనం చేసుకుంటూ ఉండేవాడు…. ఒకసారి ఆయన ఈ శ్రీశైల క్షేత్రం యొక్క మహత్యం తెలుసుకొని ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు…. ఈ ఘంటా మఠంలోనే ధ్యానం చేసుకునేవాడు. అయితే త్రిమూర్తి దర్శనం ఆయనకు కలగడం లేదని…. దానికి ఒక పరిష్కారం మార్గంగా…. ఒకే పానమట్టం మీద త్రిమూర్తుల స్వరూపంగా త్రిలింగాలను స్థాపించాడు. ఈత్రిలింగాలను దర్శించిన వారికి కాశీలో విశ్వనాథ లింగాన్ని దర్శించిన పుణ్యం ఫలితం కలుగుతుందని చెబుతారు.  ఈ మార్కండేయుడు ప్రతిష్టించిన శివలింగాన్ని ఒకసారి దర్శనం చేసినంత మాత్రాన సంవత్సరం పొడవునా ఉదయం సాయంత్రం వేళలో సూర్య నమస్కారాలు చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. ఆ తర్వాత నేపాల్ నుంచి ఒక యోగి ఈ ఘంటా మఠానికి వచ్చి ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని కఠోరమైన శివ తపస్సు చేశాడు. దానికి పరమశివుడు సంతోషించి నిజరూప దర్శనం సాక్షాత్కారం ఇచ్చి వరం కోరుకోమని అడగగా….. ఒక మండలం పాటు ఇక్కడ ఎవరైతే ఈ శివలింగానికి ఎదురుగా కూర్చుని ధ్యానం చేసుకుంటారో….వాళ్ళకి భవిష్యత్తు తెలిసే విధంగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. మరొక వరం కోరుకోమని అడగగా తనలో ఐక్యం చేసుకోమని కోరుకుంటాడు. ఈ రెండు వరాలు పరమశివుడు తీరుస్తాడు… అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి భవిష్యవాణిని పొందారని కానీ భవిష్యవాణి వలన లోకవాసులకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువగా ఉంటుంది అని…. వాటిని భూస్థాపితం చేయడం జరిగింది…. కేవలం మూడు తాళపత్ర గ్రంథాలు మాత్రమే వెలికి తీయడం జరిగింది అని అక్కడ ఉన్న ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు. 

ఘంటా మఠం 


అక్కడ ఆ ఘంటా మఠం లో ఆకాశ సిద్ధి గురించి ఒక శిలాఫలకం కనిపించేసరికి ……అందరూ ఆ శిలాఫలకంలో ఏముందని చదవటం ప్రారంభించారు.  ఇక బాలగణపతి ఉన్నటువంటి పెద్దగా చదువుతూ ….అమ్మ!  ఈ మఠంలో ఆకాశ సిద్ధి కోసం ప్రయత్నం   చేయవచ్చంట . ఆ ప్రయత్నం చేస్తే ఆకాశ సిద్ధి వస్తుందంట.  దీనికి మనం మూడు పనులు  చేయాలంటా …. ఒకళ్ళేమో గంట కొట్టాలి… ఒకళ్ళేమో బావిలో నీళ్లు తీసుకురావాలి ….మూడో వాళ్ళు ఆ  నీళ్ళతో అభిషేకం చేయాల్సి ఉంటుంది.  ఇక నాలుగవ వాడు ఓం నమశ్శివాయ మంత్రం చేస్తూ ఉండాలి. ఎవరైతే ఏకకాలంలో ఈ మూడు పనులు చేస్తూ ఉంటారో….అప్పుడు ఆ నాలుగో వాడు లేస్తాడంట.  ఇది మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం అనేసరికి…. శివ నందిని పరమహంస పవనానంద రాసిన కపాలమోక్ష గ్రంథంలో ఇదే సిద్ధి కోసం ప్రయత్నించినప్పుడు…. వాళ్ళ మేనమామ చనిపోయిన విషయం కథగా తెలిసింది…. అనేసరికి బాలగణపతి అవునా!  ఇప్పుడు మనం సాధన  కోసం ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరి ప్రాణాలు పోతాయేమో అంటావు.  పొతే పోనీ! వెదవ ప్రాణాలు…. వస్తే సిద్ధి వస్తుంది ….పోతే ప్రాణాలు పోతాయి…. ఎటు శిఖర దర్శనం అయితే ఆరు నెలల్లో చనిపోతాం కదా! అలాగే ఈ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తే ….ప్రాణాలు పోతాయి అన్నారు కదా ! పోయే ప్రాణాన్ని మనం ఎటూ ఆపలేం కదా!  అసలు ఉందో లేదో తెలుసుకొందాం ….ఒక ప్రయత్నం చేస్తే సరిపోతుంది అనేసరికి…. బాల గణపతి ఉత్సాహం చూస్తే… వాడు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు అనుకొని ….వాడి ఆవేశం తగ్గించాలని ముందు ఇక్కడి నుంచి పదా ! మిగతావన్నీ  తర్వాత చూద్దాం!  ఇక్కడే ఆకాశ సిద్ధి కోసం కూర్చుంటే ఉపయోగం లేదు . మనం వచ్చింది సాధన సిద్ధి కోసం . ఆకాశ సిద్ధి కోసం కాదు.  సిద్దుల కోసం కాదు అని…. వాడి మనసు మార్చి పక్కనే ఉన్న భీమశంకర మఠం వైపు వెళ్ళారు.


భీమ శంకర మఠం:- 


భీమ శంకర మఠం 


ఈ మఠంలో ఉన్న శివలింగాన్ని పాండవులలో ఒకడైన భీముడు ప్రతిష్టించాడు అని చెబుతారు. ఏ క్షేత్రంలో అయినా నందీశ్వరుడు ఎడమ కాలు పైకి లేచి ఉంటే దానిని సజీవ నంది కింద పరిగణిస్తారు. ఈ భీమ శంకరమఠంలో అలాంటి సజీవనంది వంటి విగ్రహ మూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అయితే కొంతమందిని ఆలయం అని మరి కొంతమంది దీనిని మఠం అని వ్యవహరిస్తారు. అయితే ఈ మఠం లేదా ఆలయం యొక్క గోపురం ఉసిరికాయ ఆకారంలో కనిపించడం వలన దీనిని అమలక గోపురం అని కూడా పిలుస్తారు అని ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు. 


దీనికి దగ్గరలోనే బాగా శిథిలమైపోయిన,  జటా వీరభద్ర మఠాన్ని పునరుద్ధరణ చేస్తున్నారు అని అక్కడ ఉన్నవారు చెప్పగా తెలుసుకున్నారు. 


విభూతి మఠం:-


ఒక్కనొకప్పుడు ఈ విభూతి మఠం మధ్య భాగంలో ఒక రాతి ఫలకం ఉండేది…దీనిపై సూర్యకిరణాలు పడేటట్లుగా అమర్చారు. ఇక్కడ సాధన చేసుకునే సాధువులు , ఋషులు ఈ రాతి ఫలకంపై బీజాక్షరాలను రాసి,  అడవిలో వనమూలికలను తెచ్చి దాని రసాన్ని ఈ ఫలకంపై పూసి రాత్రంతా వదిలేసేవారు. ఉదయం వచ్చిన సూర్యకిరణాలు ఈ రాతి పలకపై పడిన తర్వాత….. దానిని విభూతిగా రాసుకునేవారు. అది చాలా మహిమాన్వితమైనదని పవిత్రమైనదని నమ్మేవారు. విభూతి మఠంలో ఎందరో సాధకులు …యోగులు తపస్సు ఆచరిస్తూ ఉండడం వల్ల ఈ మఠం నిత్యం శక్తి తరంగాలతో నిండి ఉంటుంది అని అక్కడ సాధన చేసుకుని ఒక సాధకుడు చెప్పగా తెలుసుకుని….….సాధనా కుటుంబం కాసేపు ఈ విభూతి మఠం లో ధ్యాన నిష్ఠలో కూర్చున్నారు. కొంతసేపు అయిన తరువాత నిజంగానే ఇక్కడ ఆ రాతి ఫలకం ఉందా  అని బాలగణపతి వెతకడం మొదలుపెట్టాడు. ఆ రాతి ఫలకం కనిపించలేదు. ఇదే విషయం తిరిగి ఆ సాధకుడ్ని అడగగా…. నాయన ! పాండవులు వనవాసం సమయంలో…. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని అర్చించారని శాస్త్ర వచనం కదా! నేను విన్నదాని ప్రకారం…. అర్జునుడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో…. పాటుగా ఈ శివలింగాన్ని ఆరాధన చేస్తూ కొంతకాలం గడిపాడు. అప్పుడు మహా శక్తివంతమైన ఈ పాశుపత మంత్రాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఆ పాశుపత మంత్రం బీజాక్షరాలే ఈ రాతి ఫలకం మీద ఉన్నాయి. అయితే ఈ పాశుపత మంత్రం ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు ఇంద్రకీలాద్రి వెళ్లి  కఠోరమైన తపస్సు చేసి ఆ పరమశివుని పరమేశ్వరిని మెప్పించి పాశుపత అస్త్రమును పొందాడు అని చెబుతారు. శివానుగ్రహం పొందటం వల్లనే ఈ క్షేత్రంలో మల్లన్నని మల్లికార్జునుడు అని పిలుస్తారని కూడా చెబుతారు. ఇక్కడ పాశుపత హోమం చేయడం జరుగుతుంది.  జ్వాలా వీరభద్ర స్వామి ఆలయం సమీపంలో ఈ రాతి ఫలకాన్ని పెట్టడం జరిగింది అని… ప్రస్తుతం అది వాడుకలో లేదు అని చెప్పడంతో  రుద్రాక్ష మఠానికి బయలుదేరారు. 


రుద్రాక్ష మఠం:- 


అలా వెళ్లే దారిలో ….కాళికాదేవి , చిన్నమస్తా దేవి విగ్రహాలు కనిపించాయి . ఈ మఠంలోకి ప్రవేశం చేయగానే ఎడమ వైపున ఒక పెద్ద పుట్ట కనిపించింది. కుడివైపు నాగ శిలలు,నంది శివలింగం, మట్టితో చేసినట్టుగా ఉన్న వినాయకుడు కనిపించారు. ఆ పుట్టను చూస్తూ ఉండేసరికి…. శివ నందినికి ఎందుకో ఒళ్ళు జలదరించినట్టు అనిపించింది . రుద్రస్వామి ఆ పుట్టకేసి చూసి….. ఇందులో ఎవరో మహాముని సాధకుడు ఉన్నట్టు ఉన్నారు. అది కూడా తెల్ల సర్పంలో ఉన్నాడు అనిపిస్తుంది . కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఆగ్రహానికి గురవుతాము . ఓయ్ పిల్లలు ! జాగ్రత్త . మీరు చేసే చేష్టలకి ఆయనకు ధ్యాన భంగం అయితే శాపాలు ఇస్తాడు. అందర్నీ శపిస్తాడు.  మొదటికే మోసం వస్తుంది . కాబట్టి జాగ్రత్తగా ఉండండి…. అని అంటుంటే… సరే! మేము జాగ్రత్తగానే ఉంటామని పిల్లలు అనేసరికి…. మహాదేవి నేను మాత్రం రుద్రాక్ష మఠం లోపలికి రాలేను.  ఇక్కడే ధ్యానంలో  కూర్చుంటాను . ఎందుకంటే మహాముని శక్తి నన్ను లోపలికి రానివ్వదు . నాది తంత్ర శక్తి కదా ! అనేసరికి నీ ఇష్టం తల్లి అని….. శివ నందిని అనేసరికి…. సరే ! ఎవరికి రావాలనిపిస్తే వాళ్ళు లోపలికి రండి…. లోపలికి వెళ్దాం అని ప్రవేశిస్తూ ఉండగానే ….ఎందుకో ఎదో తెలియని ఆనంద స్థితి మనసు ఉల్లాసంలోకి వెళ్లిపోవడం… ఎవరో తనకి పరిచయమైన వాళ్ళు ఉన్నట్టుగా శివ నందినికి భావనలు, ఆలోచనలు… ఎప్పుడూ లేనిది మనసు ఉత్సాహంలోనికి వెళ్లడం గమనించింది.  ఏం జరుగుతుంది?  ఏమవుతుంది? ఏంటి? అని అనుకుని …..సరే!  ఎందుకైనా మంచిది …..ఏదో తేడాగా ఉంది!  అని మహాదేవి పక్కనే ధ్యానంలో కూర్చుని అలా ఉండిపోయింది.

రుద్రాక్ష మఠం (చినమస్తా దేవి, కాళిక అమ్మవారు)



రుద్రాక్ష మఠం (పుట్ట)


పిల్లలు,  రుద్ర స్వామి రుద్రాక్ష లింగమును చూశారు.  ఈ లింగం పైన రుద్రాక్షలు పెట్టినట్లుగా ఉన్నాయి. ఈ రుద్రాక్ష మఠంలోని శివలింగం మరియు నందిని, రుద్రసిద్దేశ్వరుడు అనే యోగపుండవుడు కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టించాడని…. అతని పేరు మీదుగా దీనిని రుద్రాక్ష మఠం అన్నారని,పాండవుల వనవాసంలో వాళ్ళు ఉపయోగించిన సామాగ్రి ఈ ప్రాంతంలో ఈ మఠంలోని భూ గర్భ గుహ లో దొరికియాని…. ఆలయపూజారి చెప్పారు. ఈ మఠంలోపల గర్భ గుడిలో…. ఎడమ పక్కగా చిన్న సందు లాంటిది కనపడింది. రుద్రస్వామీ దాని వంక చూస్తూ ఉండగా…. పూజారి, ఇది నిగూఢంగా సాధన చేసుకోవడానికి నిర్మించారు. చాలా చీకటిగా… నిశ్శబ్దంగా… ధ్యానానికి వీలుగా ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడండి అనగానే…వీళ్ళ ముగ్గురు కాసేపు లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకుని బయటకి వచ్చారు.  ఒకప్పుడు పంచముఖ రుద్రాక్షలు ఇక్కడ అందరికీ ఉచితంగా ఇచ్చే వాళ్ళని….. అక్కడ ఉన్న పూజారి చెప్పేసరికి అవునా!  అనుకుంటూ ….ఆ పక్కనే ఒక త్రిశూలం కనిపించేసరికి….. అది రుద్ర త్రిశూలం అని తెలుసుకొని ….బాలగణపతి మరియు బాల కుమారస్వామికి ఆ త్రిశూలం తాకాలని అనిపించింది.  బాలగణపతికి త్రిశూలాన్ని పెకిలించి తనతో తీసుకువెళ్లాలని అనిపించింది.  అక్కడ అమ్మ శివ నందిని తిడుతుందేమోనని….. మనసును చాలా అదుపుగా ఉంచుకొని,  ఏదైతే అది అవుతుందని ఆ త్రిశూలాన్ని తాకారు . అక్కడ ఉన్న పూజారి కూడా ఏమీ అనలేదు. ఏమీ మాట్లాడలేదు…  చిన్నపిల్లలే కదా పట్టుకోవాలని మనసుకి ఉంటుంది అనుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు తలా ఒక దిక్కులో కూర్చొని…. ధ్యాన నిష్ఠలో ఉండిపోయారు. మహాదేవి మరియు శివ నందిని మాత్రం పుట్ట దగ్గర కూర్చుని ఉన్నారు . కాకపోతే శివ నందిని లో కామ వికారాలు మొదలైంది.  తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. కామానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉండేసరికి…. మనసుని అదుపు చేసుకోవడం కష్టంగా ఉంది.  ధ్యానంలో కూర్చునే సరికి,  వచ్చావా దేవి ! నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ….ఈ రుద్రాక్ష మఠం లోపలి వైపు ఉన్నాను . లోపలికి రా!  అనేసరికి………


అమ్మో ! వీడు ఇంక తగులుతున్నాడు. ధర్మపత్ని అనుకుంటూ ఒకడు తగులుకున్నాడు…వాడు వీడే అయ్యి ఉంటాడు.  లోపల ఉన్నాడన్నమాట !ఇప్పుడు వీడిని ప్రత్యక్షంగా చూడాలా?అసలు వీడి సంగతి ఏంటి ?ముఖ పరిచయం లేదు…. నేను ఎలా ఉంటానో ,ఏంటో తెలియదు…. భౌతికంగా చూడలేదు.  అలాంటిది ఏకంగా ధర్మపత్ని….. గత జన్మలో ధర్మపత్ని అని చెప్పి తగులుకున్నాడు.  వీడు అసలు సాధన చేయడం మానేశాడా ?నా గురించి సాధన చేస్తున్నాడా? ప్రణవ మంత్రం కాస్త ప్రణయ మంత్రం గా మార్చేసాడా ఏంటి? వీడి వల్ల నా సాధన పోతుంది. వీటి సంగతి ఏంటో తెలుసుకోవాలి….! తన భర్త మీద ఉన్న కోపం వీడి మీద చూపించాలి…. గట్టిగా కొట్టాలి…చెంపలు పగలగొట్టాలని అనుకుంటూ ఉండేసరికి…. అలాంటిదేమీ లేదు! నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు! నేను అలాంటి వాడిని కాదు… నేను మీ ఆయన లాంటి వాడిని కాదు….నేను నిన్ను చాలా చక్కగా చూసుకుంటాను…. నీ సాధనకి సంగమం చేస్తాను…. అని చిలిపిగా చూస్తున్నట్లు ధ్యానంలో అనిపించేసరికి కోపావేశాలు తగ్గకపోగా ….పెరిగినాయి.  వీడి అంతు చూడాలని చెప్పేసి రుద్రాక్ష మఠం లోపలికి వెళ్లింది.


తీరా శివ నందిని కాస్త… రుద్రాక్ష మఠం లోపలికి వెళ్లేసరికి… ఎవరూ కనిపించలేదు.  ఒకవైపు బాల గణపతి…ఒకవైపు రుద్రస్వామి… మరొకవైపు బాల కుమారస్వామి ….ఇంకా ఎవరో సాధకులు సాధన చేసుకుంటూ కనిపించారు . ఆలయ పూజారి తప్ప ఇంకెవరూ కనిపించలేదు . శివ నందిని కాస్త …. ఇక్కడ కనిపించాలి కదా!  ఇప్పుడు ధ్యానంలో కనిపించాడు కదా!  వీడెక్కడున్నాడు..! కనిపించాలి కదా! కనిపించకుండా పారిపోయాడా ఏంటి ?అని అక్కడ ఉన్న రుద్రాక్ష శివలింగానికి నమస్కారం చేసింది.  తన దగ్గర ఉన్న పాతాళ గంగ నీళ్లతో అభిషేకము చేసింది . పక్కనే ఉన్న విభూతి డబ్బాలో నుంచి విభూది తీసి రాసింది.  రుద్ర నమకంతో అభిషేకం చేస్తూ ఉండేసరికి….  ఈవిడ ఎవరో మహా భక్తురాలు అయి ఉంటుందని….మనం ఇబ్బంది పెట్టకూడదు అని మౌనం  వహించారు.  ఒక రుద్రం చదివిన తరువాత…. పూజ అయిపోయిన తర్వాత…. అక్కడే ఉన్న రుద్ర త్రిశూలాన్ని తాకకుండా నమస్కారం చేసింది.  కాసేపు ఆ లోపలే కూర్చుని ధ్యానం చేసింది . ధ్యానం చేస్తూ ఉండేసరికి…. యధావిధిగా శివానంద ధ్యానంలో కనిపించి…. ఏంటి నేను లోపల ఉన్నా …..అనుకున్నావా? లోపల కనిపించలేదా!  ధర్మపత్నిని ఆటపట్టించాలని అనుకున్నాను… లోపల ఉన్న వాడిని బయటికి వచ్చేసాను. ఇన్నాళ్లుగా నీ మనసులో ఉన్నాను…. ఇప్పుడు బయటకు వచ్చేసాను….కావాలంటే బయటకు వచ్చి చూడు!  నీ కోసం ఎన్నో యుగాల నుంచి ఎదురుచూస్తున్నాను . నా మనో  శరీర ధారి కదా నువ్వు…. నా ఆకాశ శరీర ధర్మ పత్నివి కదా!  నీకోసం ఎదురు చూస్తున్నాను… నీ మనో శరీర దర్శనం ఇప్పించు అని…. ఏవేవో మాటలు అంటూ ఉండేసరికి ….మనో శరీరం ఏంటి ?ఆకాశ శరీరం ఏంటి? అసలు వీడెవడు….. వీడు నా గురించి సాధన చేయడమేంటి? నన్ను ధర్మపత్ని అనటం ఏంటి? అసలు వీడు నాకు ధర్మపతి అవ్వాలి కదా!  ఇదంతా నిజమేనా?గత జన్మలో భార్య అంటాడు… ధర్మపత్ని అంటాడ…. అసలు వీడెవడు? వీడి గురించి తాడోపేడో తేల్చాలి. అసలు విషయం ఏంటో తేల్చాలి. కాశీలో ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష దర్శనంతో ఇబ్బంది పెడతా అంటున్నాడు.  వీడు అంతేంటో చూడాలి! లేదంటే రుద్రస్వామి మరియు మహా దేవి ఉండనే ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. లేదంటే పిల్లలు చూసుకుంటారు అని అంటూ …. శరవేగంతో రుద్రాక్ష మఠం నుంచి బయటకు వచ్చేసరికి…. అక్కడ ఉన్న  చెట్టు దగ్గర ఒక ఆయన ధ్యానంలో కూర్చుని కనిపించారు.


చూడడానికి సన్నగా… పీలగా ఉన్నాడు.  ఆరడుగుల పైన ఉన్నాడు.  దట్టమైన నల్లని గడ్డంతో,  జడముడివేసి  జటాధారిగా ఉన్నాడు.  నల్లని కారుంగలి మాల వేసుకుని ఉన్నాడు.  చేతికి కూడా ఏవో మాలలు వేసుకొని ఉన్నాడు. రుద్రాక్ష మాలలు కానీ …..ఏ ఇతర మాలలు కానీ కనిపించలేదు . ఇలా చూస్తూ కోపంగా అతని దగ్గరికి వెళ్లేసరికి …..అతనిని చూడగానే అప్రయత్నంగా కోపం పోయి ….నమస్కారం చేసి మౌనంగా అతనికేసి చూస్తుంది . కళ్ళు మూసుకొని తీవ్ర ధ్యానంలో ఉన్న ఆయన కాస్త,  కళ్ళు తెరిచి వచ్చావా! నీకోసమే చూస్తున్నాను…. నీ సాధన పరిసమాప్తికి….నా సాధన  పరిసమాప్తికి మధ్య అనుసంధానం ఉంది. అందుకే నేను ఇబ్బంది పెడుతున్నాను . అంతే తప్ప వేరే చెడు ఉద్దేశం కానీ….. చెడు దృష్టి కానీ…. నీ మీద నాకు లేవు.  నీ కామ వికారాలు తగ్గించాలి.  అదుపులో ఉంచాలి.  ఇంద్రియ నిగ్రహం పెంచుకోవాలి.  నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనేసరికి….


శివనందిని:-  స్వామి ! అసలు మీరు ఎవరు? మీరు ఎందుకు నా వెంట పడుతున్నారు…. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు…. మీ సాధన మీరు చేసుకోవచ్చు కదా!  నా సాధన నేను చేసుకుంటాను.  మీ సాధనకి, నా సాధనకి కలపడం ఏమిటి?  అనుసంధానం చేయడం ఏమిటి? దీని సంగతేంటో తేల్చండి.  అసలు ఎందుకు మీరు నా వెంటపడుతున్నారు. ధర్మపత్ని అని ….గత జన్మ భార్య అని….. మీరు చూస్తేనేమో సన్యాస దీక్షలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కాషాయ వస్త్రధారిగా ఉన్నారు. మనోవికారాలు, కామ  వికారాలు కలుగుతాయి అంటే నేను నమ్మను.  అసలు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు….


శివానంద:– నందిని! నువ్వేం నా గురించి అతిగా ఆలోచించవద్దు. కంగారు పడవద్దు. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది సమస్య రాదు. అలాగే నీ సాధనకి కూడా ఎలాంటి సమస్య రాదు.  కాకపోతే ఏంటంటే…. నీ సాధన పరిసమాప్తి కావాలంటే నా సాధన  పరిసమాప్తి సహాయం తీసుకోవాలి. ఎందుకంటే…. నేను ఎవరో కాదు పరమాహంస పవనానంద యొక్క స్థూల శరీరానికి,  ఆకాశ శరీర ధారిని.  ఆయన ఒక రకంగా ఆకాశ శరీర సాధన పరిసమాప్తిలో నా శరీరం మోక్షం పొందలేదు.  కారణం ఏంటి?  అన్నప్పుడు  తనకి ధర్మపత్నీ ఋణం ఉన్నదని తెలుసుకున్నాడు.  ఆ ధర్మపత్ని ఎవరు అని సాధన మొదలుపెడితే….. నువ్వు అని తెలిసింది.  నీ మనో శరీరం…. నా ఆకాశ శరీరం మిళితమైతే  విశ్వ మోక్షం వస్తుందని ఒక ఆలోచన ప్రయత్నం స్థూల శరీరంతో పవనానంద చేస్తున్నారు.  కాబట్టి అది ఏమవుతుంది…. ఏంటి…. అనేది ఎవరికీ తెలియదు. పరమహంస సాధనా పరంగా పురుష ప్రకృతిలో ఆయన సాధన చేసినప్పుడు పురుషుడైన దక్షిణామూర్తి మోక్షం పొందాడని తెలుసుకున్నాడు.  ఆదిపరాశక్తి మోక్షం పొందలేదని గ్రహించాడు . ఆ ఆదిపరాశక్తి అంశ అయిన కామాక్షి దేవి విగ్రహం ఆయన దగ్గరికి చేరుకుంది.  ఆ విగ్రహ మూర్తిని నాకు  ఇవ్వడము జరిగింది.  అదిగో ఆ విగ్రహం మూర్తి చూడు… ఇది కంచి నుంచి వచ్చిన ప్రాణ శక్తితో ఉన్న నిజమైన విగ్రహ మూర్తి అని తన చేతి సంచిలో నుంచి ఒక అర చెయ్యంత పొడవుతో సజీవ మూర్తిగా ఉన్న కామాక్షి విగ్రహ మూర్తిని శివ నందిని చేతిలో పెట్టాడు.  ఆమె చూడటానికి దివ్య తేజస్సుతోను , దివ్యజీవ కళతోను …ఉట్టిపడుతుంది.  నిజంగానే అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నట్టుగా ఉంది.  ఒకవైపు చెరుకుగెడ , ఒకవైపు  విల్లందులు , ఒకవైపు రామచిలుక,  ఆయుధాలు ఉన్నట్లుగా…. నిజానికి కంచిలో కామాక్షి ఎలాగైతే ఉంటుందో…. అదే విధంగా ఈ విగ్రహం వచ్చి ఉండేసరికి , ముట్టుకునేసరికి  శివ నందినిలో ఏదో తెలియని ప్రకంపనాలు మొదలయ్యాయి. 


ఉన్నట్టుండి… ధ్యానంలోకి వెళ్లిపోవాలని అనిపించింది . అలాగే ఆ విగ్రహ మూర్తిని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని…  శివానంద పక్కనే ధ్యానంలో కూర్చుంది. ఈ శివానంద ఏమీ మాట్లాడకుండా… మౌనంగా చూస్తూ కూర్చున్నాడు.  ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది.  ధ్యానంలో నీలిరంగు శివుడు.. ఆ తర్వాత ఎవరో అమ్మవారు కలిసి వ్యతిరేక భంగిమలో కూర్చున్నట్లుగా ఒక పీఠం మీద కనిపించింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఏకమైనప్పుడు శివుడు కనపడలేదు. అమ్మవారు మిగిలిపోయింది. అప్పుడు శివ మూర్తి మోక్షం పొందినట్లుగా శివ నందినికి అనిపించింది.  అమ్మవారు కాస్త ఉన్నట్టుండి కంచి కామాక్షి అమ్మవారిగా కనిపించింది.  ఓహో ఈయన  చెప్పింది నిజమే అన్నమాట!  అంటే అమ్మవారు  స్త్రీ మూర్తి రూపంలో…. మోక్షం పొందడానికి శివానంద దగ్గరకు వచ్చిందని గ్రహించింది.  ఇంతలో మరొక ధ్యాన దృశ్యం కనిపించింది…ఒక  అమ్మవారు నాట్యం చేస్తున్నట్లుగా కనిపించింది.  ఆ తర్వాత ఇంకో పురుషుడు నటరాజస్వామి అనుకుంట! మధుర మీనాక్షి,  నటరాజు అని గ్రహించింది. ఈ నటరాజు మధుర మీనాక్షి ఇద్దరు కలిసి… నించుని చాలాసేపు నాట్యం చేసి… అలసిపోయి తర్వాత నుంచుని ఏకత్వంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర తత్వంలో కనిపించారు. ఇది స్త్రీ ప్రకృతి అనుకుంట!  ఇందులో మీనాక్షిలోకి  నటరాజ మూర్తి లీనమై పోయారు. అంటే అమ్మవారు మోక్షం పొందారు. నటరాజు మిగిలిపోయారు. మొదట ధ్యానా అనుభవంలోనేమో… ఆదిపరాశక్తి మోక్షం పొందకుండా మిగిలిపోయింది.  అదే విధంగా స్త్రీ ప్రకృతిలో నిల్చున్న అర్ధనారీశ్వర తత్వంలో పురుషుడు మిగిలిపోయారు. స్త్రీ మూర్తి మోక్షం పొందిందని గ్రహించింది . అంటే ఇప్పుడు తన దగ్గరికి పురుషుడికి సంబంధించిన విగ్రహం మూర్తి రావాలని గ్రహించింది. ఈ శివానందకి మోక్షం పొందని కంచి కామాక్షి విగ్రహ మూర్తి ఎలాగైతే వచ్చిందో….. ఇప్పుడు మోక్షం పొందని పురుష విగ్రహం తనకి రావాలి.  ఈ రెండు విగ్రహం మూర్తులు కలిస్తే,  అర్ధనారీశ్వర తత్వం పొందితే…. విశ్వమోక్షం అవుతుంది అని అనుకుంటూ ఉండగానే…. ధ్యానభంగం అయింది.  కళ్ళు తెరిచింది.  చిరునవ్వుతో ఎదురుగా శివానంద కనిపించారు.  స్వామి!  మీరు చెప్పింది అక్షరసత్యమే. మీ దగ్గరికి ఎలా అయితే మోక్షం పొందని ఆదిపరాశక్తి విగ్రహ మూర్తి వచ్చిందో…. అలాగే నా దగ్గరికి మోక్షం పొందని పురుష విగ్రహ మూర్తి ఏదో రావాలి అని ధ్యానా అనుభవం అయింది.  అది వస్తుందో!  రాదో నాకు తెలియదు. కదా! 


శివానంద:- సరే! అది వస్తుందా? రాదా? అనేది పక్కన పెట్టు.  నీ వలన స్త్రీ ప్రకృతి మోక్షం పొందాలని రాసిపెట్టి ఉంది.  నా వలన పురుష ప్రకృతికి మోక్షం సగం వరకు వచ్చింది. పురుషుడు మోక్షం పొందాడు.  ఆదిపరాశక్తి మోక్షం పొందలేదు.  అది పరమహంస స్థూల శరీరం ధ్యాన అనుభవాలను బట్టి తెలుస్తుంది. కారణం ఏంటి అన్నప్పుడు…. ఆకాశ శరీరం మిగిలిపోయింది అని,  ఆదిపరాశక్తిలో మనో శరీర ఋణం మిగిలిపోయింది. ఆకాశ శరీరంలో ధర్మపత్ని ఋణం , మనో శరీరంలో ధర్మపతీ ఋణం మిగిలిపోయాయి.  ఈ రెండు  ఋణాలు కలిస్తే,  ఏకమైనప్పుడు అర్ధనారీశ్వర తత్వం వస్తుంది.  పురుష ప్రకృతిలో కూర్చుని ఉన్న  అర్ధనారీశ్వర తత్వం వస్తే,  స్త్రీ ప్రకృతిలో నిల్చుని ఉన్న అర్ధనారీశ్వర తత్వం వస్తుందని గ్రహించు. ఈ రెండు  మిళితమైనప్పుడు నీకు శివ ధ్యాన మూర్తి అనే విగ్రహ మూర్తి రావాలి.  అలాగే నాకు కామాక్షి విగ్రహ మూర్తి ఎలాగైతే వచ్చిందో…. అలాగే నీకు పురుష విగ్రహ మూర్తి ఎక్కడో ఒకచోట… ఏదో ఒక క్షేత్రంలో వస్తుంది . ఆ విగ్రహ మూర్తి , నా దగ్గర ఉన్న విగ్రహ మూర్తి  మిళితమైతే విశ్వమోక్షం వస్తుంది.  అందుకని నీకు సాధన పరిసమాప్తి అవ్వాలంటే…. కర్మ శేషంగా నీ మనో శరీరానికి మిగిలిపోయి ఉన్న ఋణం ….నాకు మిగిలిపోయి ఉన్న ధర్మపత్ని ఋణం …. తీరితే కానీ…. పూర్ణ మోక్షం రాదని గ్రహించు.


 శివ నందిని:- సరే స్వామి!  నేను ఇన్నాళ్లుగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.  మీరు నాలో కామ  వికారాలు కలిగిస్తున్నారని…. నాకు కామమాయ కలిగిస్తున్నారని…. తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. తప్పుగా మీ గురించి ఆలోచించాను . నన్ను క్షమించండి..


శివానంద:- ఎవరో…ఏమిటో తెలియనప్పుడు ఎవరి గురించి ఏమీ తెలియనప్పుడు….. వచ్చే ఆలోచనలు తప్పుడు ఆలోచనలు కావచ్చు…. కాకపోతే నువ్వు సాధనలో ఉన్నావుగా!  సాధనకు అడ్డుపడుతున్నానేమో అని నువ్వు నన్ను తప్పుగా భావించుకొని ఉండవచ్చు.  కాబట్టి నువ్వు నా గురించి ఎటువంటి కామ వికారాలు పొందాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఇద్దరికి ధర్మపత్ని ధర్మపతి  ఋణానుబంధం ఉండడం వలన… నీలో కామ వికారాలు కలుగుతాయి. నేను ఆ కామ వికారాలు అన్ని దాటేశాను.  ఇప్పుడు నేను మనోనిగ్రహంతో నిలబడ్డాను.  అదే మనో నిగ్రహ స్థితి నీకు వస్తుంది. ఇప్పుడు మనకి ఉన్న ఈ భౌతిక శరీరాలతో సాధన  పరిసమాప్తి చేసుకుందాం! 


శివనందిని:- సరే స్వామి!  మీరు ఎలా చెప్తే అలా చేస్తాను . మరి మీరు మాతో పాటు ఉంటారా! వస్తారా?


శివానంద:- నేను మీతో ఉండను… మీ గదిలో ఉండవలసిన అవసరం లేదు.  కాకపోతే నేను ఆకాశ శరీర ధారి కాబట్టి…. ఎప్పుడు కావాలంటే అప్పుడు…. ఎక్కడికి కావాలంటే అక్కడికి…. ఆకాశగమనం చేసి వస్తాను. నీకు నా  అవసరం ఉన్నప్పుడు… ధ్యానంలో కానీ,  స్వప్నంలో కానీ, ప్రత్యక్షంగా నీ వెంటే ఉంటాను.  నీకు కనపడుతూనే ఉంటాను. నీకు సలహాలు… సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. వాటిని పాటిస్తూ…. నీ సాధన పరిసమాప్తి చేసుకో!  విశ్వమోక్షం పొందుతావా!  లేదా స్త్రీ మోక్షం పొందుతావా ! అనేది కాల  నిర్ణయానికి వదిలేద్దాము.  లేదంటే ఏదైనా శరీరం మోక్షం పొంది అయినా నీ సాధన  పరిసమాప్తి చేసుకో!  ఇదే పొందాలి ….ఇదే చేయాలి అని ఆశతో మాత్రం సాధన చేయకు . మోక్ష కోరిక కూడా సాధనకు పనికిరాదు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు….


శివ నందిని:- సరే స్వామి!  మీరు ఎలా చెప్తే అలాగా…. ఇక సెలవా మరి! 


శుభం భూయాత్ అని ఆయన రుద్రాక్ష మఠంలోకి వెళ్ళేసరికి…. మహాదేవి ఉన్నట్టుండి ….


మహాదేవి:- ఓహో!   ఈయనేనా …. నిన్ను స్వప్నంలోనూ…. ధ్యానంలోనూ…. ఒక ఆయన ఇబ్బంది పెడుతున్నాడని…. ఆయన మీద కామ  వికారాలు కలుగుతున్నాయని…. అన్నావు . ఆయన చూడటానికి కూడా అందంగా ఉన్నాడు.  సమ్మోహన రూపం లో ఉన్నాడు.  నాకే ఆయన మీద మనసు లాగింది. ఒక్కసారిగా ఆయనతో శృంగారం చేయాలని బలంగా అనిపించింది.  నా మనసునే  కదిలించాడు అంటే అతను సామాన్యమైన వాడు కాదు….నాకు తెలిసినంతవరకు అతను నడయాడే మల్లికార్జునుడు… శివ స్వరూపుడు.. చాలా జాగ్రత్తగా ఉండు . మగవాళ్ళని నమ్మడానికి లేదు.  వాళ్ళు చూపులతోనే,  మాటలతోనే  కామోద్రేకాన్ని కలిగించగలరు. వాళ్ళు చేష్టలతో మీ మనసు లయ తప్పుతుంది.  కాబట్టి దూరంగా ఉండు…


శివ నందిని:-  ఆయన  మాటలు అలాగే ఉంటాయి.  కానీ చేష్టలు అలాంటివి కాదు. మనసు చాలా పవిత్రమైనది.  శరీరం కూడా పవిత్రమైనది.  ఆత్మ శుద్ధి కలిగిన వాడు.  మనోవికారాలను జయించిన జితేంద్రియుడిలాగా కనపడుతున్నాడు.  ఈయన సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి.  ఎందుకంటే ధర్మమును పాటించే పరమహంస రూప ధారి అని రుద్ర స్వామి ఇంతకుముందే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన విషయంలో నాకు ఎలాంటి భయాలు ,అనుమానాలు, సందేహాలు లేవు.  కాకపోతే నేను ఇంతవరకు ప్రత్యక్షంగా చూడలేదు.  ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన మీద ఉన్న చెడ్డ అభిప్రాయం పోయింది. మంచి అభిప్రాయం ఉంది.  ఈయన  కూడా సాధన  పరిసమాప్తి 98% పూర్తి చేశారు.  ఇక రెండు శాతం మాత్రమే మిగిలింది. ఆ రెండు శాతం మాత్రమే ఉన్న సాధన పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నారు.  తద్వారా పురుష వ్యక్తిగత మోక్షం కాస్త విశ్వ మోక్షమునకు ప్రయత్నించాలి అనుకుంటూ ఉన్నారు. ఆ ప్రయత్నానికి సహాయకారాలు నేను అందిస్తాను.  నాకు ఎటువంటి అభ్యంతరం లేదని…


శివ నందిని అనేసరికి మహాదేవి మౌనం వహించింది.


ఇంతలో రుద్రాక్ష మఠంలో నుంచి రుద్ర స్వామి పిల్లలతో బయటకు వస్తూ….. 


రుద్రస్వామి:– అయిందా అమ్మ…. శివానంద దర్శనం!  ఇప్పుడు ఆ అబ్బాయి మీద అభిప్రాయం మారిందా!  ఆ అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకున్నావు కదా!  ఆ అబ్బాయి వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదని గ్రహించావు కదా! 


శివనందిని:-  స్వామి!  మీకు తెలియని విషయం కాదు కదా! మీకు అన్ని తెలుసు కదా! మీకు అన్నీ తెలిసినా కూడా…. ఏమీ తెలియనట్లే ఉంటారు కదా! అమాయకంగా అజ్ఞానిగా ఉంటారు కదా! మీకు అన్ని తెలుసు….  అన్నీ అర్థం అవుతాయని తెలుసు…. ఆయన సాధన స్థితిగతి ఎంతవరకు వెళ్లిందో తెలుసు…. నా సాధన ఎంతవరకు వెళ్లాలో కూడా మీకు తెలుసు…. కాబట్టి నేను మళ్లీ దాని గురించి మాట్లాడను.


అనేసరికి చిరునవ్వు నవ్వుతూ ముందుకు సాగుతూ ఉండేసరికి…. 


బాలగణపతి:-  అమ్మ!  నేను ఇందాక రుద్రాక్ష మఠంలో ఒక ఆయన్ని చూశాను… చాలా బాగున్నాడు.. నీకు సరిగ్గా సరిపోతాడు…మంచి అందగాడు. మంచి గుణవంతుడు. పరస్త్రీలను అసలు చూడను కూడా చూడట్లేదు.  ఎప్పుడు చూసినా…. ధ్యానంలో కూర్చుని ఏదో గొనుగుతున్నాడు.  మంత్రం చేసుకుంటూ ఉన్నాడు. మెడలో  నేరేడు పండు లాంటి మాల వేసుకుని ఉన్నాడు.  నేనెప్పుడూ ఆ మాలను చూడలేదు.  రుద్రాక్ష మాలలు,  స్పటిక మాలలే చూశాను.  నున్నగా ఉన్నాయి ఆ మాలలు…. ఆ మాలలు ఒకటి తీసుకుందామా…ఆయన నుంచి అనుకున్నాను.  కానీ ఆయన మెడలో ఒకటే మాల ఉంది.  అప్పటికే ఆ మాల ఎంత అని లెక్కేస్తే 54 కాయలు ఉన్నాయి.  ఈసారి కనబడితే ఆ మాలను నేను తీసుకోవాలి.  నాకు ఆ మాల కావాలి అని అడుగుతాను.  ఆయన్ని చూస్తే మంచోడిలాగే అనిపించాడు.  


అనేసరికి శివనందినికి అర్థమైంది. బాలగణపతి చూసింది శివానందనీ అని…. అతని గురించి చెబుతున్నాడు అని అనుకొని…. సరే!  ఈసారి కనబడితే నీకు కూడా తన  లాంటి మాల  తీసుకొని వేస్తాను అనేసరికి…. అక్కడే ఉన్న బాల కుమారస్వామి కాస్త 


బాల కుమారస్వామి:- ఆ మాల నా దగ్గర ఉందమ్మా!  ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాను.  ఇదిగో చూడండి….


అని తన చేతి సంచిలో నుంచి మాలలు తీశాడు.  అతని సంచిలో శివలింగాలు చెక్కతో చేసిన కర్రలు, యోగ దండం ఉండేసరికి… అమ్మ!  దీనిని కారుంగలి మాల అంటారు. ఇది నల్ల తుమ్మ చెక్క జాతికి చెందింది.  ఇది చాలా బరువుగా ఉంటుంది. కాకపోతే ఇది ఇంత బరువుగా ఉండటం వల్ల….  నీళ్లల్లో మునిగిపోతుంది.  నిజానికి చెక్క నీటి మీద తేలుతుంది కదా!  ఈ చెక్క మాత్రం నీళ్ళల్లో మునిగిపోతుంది . అలాగే కాకుండా ఈ చెక్క సూర్యరశ్మిలో 75% సూర్యరశ్మి తీసుకుంటుంది .






ప్రపంచంలో ఏ వస్తువు కూడా… ఏ జీవి కూడా అంత సూర్యరశ్మి తీసుకోదు.  ఈ చెట్టు మాత్రం తీసుకుంటుంది . ఇది సూర్యరశ్మిని పొద్దున్న తీసుకొని….మనకి రాత్రి సూర్యరశ్మిని ఇస్తుంది.  అలాగే పౌర్ణమి నాడు… గ్రహణాల నాడు ….చంద్రశక్తిని కూడా 75% తీసుకుంటుంది.  ఇది సూర్య, చంద్ర శక్తులను…75% తీసుకునే ఏకైక వస్తువు.  ఇది పాతాళ మురుగన్ స్వామి అని తమిళనాడు దుండిగల్ ప్రాంతంలో  ఆలయం ఉంది.  అక్కడ కుమారస్వామి మెడలో ఈ కారుంగలి మాలలు…. కారుంగళి దండం వేసుకొని ఉంటారు.  చేతిలో పట్టుకొని ఉంటాడు. ఈ మాలలు అనేక సైజుల్లో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు అతను వేసుకున్న మాల సైజు పెద్దది. నేరేడు పళ్ళంత సైజు.  25mm .  ఇది రుద్రాక్ష కన్నా పెద్ద సైజు . మన శరీరంలో సాధన చేస్తున్నప్పుడు వచ్చే పది లక్షల రేడియేషన్ శక్తిని ఈ మాల అదుపులో ఉంచుతుంది. తద్వారా మనలో ఉన్న మనోవికారాలు, అలసట, చిరాకు, కోపం ఇవన్నీ కూడా పోయి…. అశాంతి నుంచి శాంతిని పొందుతామని యోగసాధకులు ఈ మధ్యనే తెలుసుకున్నారు.  ఈ మాలలు వాడకం ఎక్కువైంది.  అని చెప్పేసరికి…. అవునా అని  అక్కడ ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యం చెందుతూ…. తన సంచిలో ఉన్న కారుంగలి యోగ దండం…. కారుంగలీ శివలింగములు, కారుంగలి మాలలు అవన్నీ చూసేసరికి శివానంద మెడలో ఉన్న లాంటిదే ఇక్కడ కూడా ఉండేసరికి ….


అన్నయ్య..! అన్నయ్య..!  నాకు ఈ మాల ఇస్తావా!  నేను వేసుకుంటాను అనేసరికి…. వేసుకో!  నాకేం అభ్యంతరం లేదు.  నీకు ఎన్ని కావాలంటే అన్ని మాలలు వేసుకో అనేసరికి…. బాలగణపతి 54 కారుంగళి మాల మెడలో వేసుకున్నాడు.  చేతులకి కాళ్ళకి కూడా కారుంగలి బ్రాస్లెట్స్ కంకణాలుగా బిగించుకోవడం చేసేసరికి వస్త్రాల మధ్యలో ఉన్న బాల కుమారస్వామి కంఠాభరణం కింద ఇదే కారుంగళీ మాల  ఉన్నదని శివ నందిని గ్రహించింది.  అంటే వీడు బాలమురుగన్ అంశ అని అనుకొని….ఏమీ తెలియనట్లుగా చూస్తూ ఉండేసరికి….. అమ్మ!  మీరంతా వేసుకుంటారా అని ఏమీ తెలియనట్లు చూస్తూ ఉండేసరికి….


రుద్రస్వామి:-  అది వేసుకునే స్థాయికి మన సాధన రావాలి నాయనా!  ఆ సాధన  పరిసమాప్తి సమయంలో వచ్చే యోగం ఉంటే వస్తుంది. అది ఎక్కడో ఒకచోట రావాల్సింది రాక మానదు.  అప్పటిదాకా మనం ఎదురు చూడాలి.  మన ప్రకృతి ….మన సాధనాస్థితిని బట్టి….దైవిక వస్తువులు ,దైవిక లింగాలు ఇవ్వడం జరుగుతుంది. ముందే తొందరపడి తీసుకోవడం మంచిది కాదు.  అన్నప్రాసన రోజే అవకాయ తింటే మనం తట్టుకోలేము కదా!  ఆ పది లక్షల శక్తి దాకా మన సాధనా శక్తి రావాలి కదా!  బాల గణపతి ఏనాడో ….ఎప్పుడో…. ఎన్నో యుగాల నుంచి అదే సాధన స్థితిలో ఉన్నాడు కాబట్టి…. ఆయన ఆ సాధనా శక్తిని తట్టుకోలేక అవస్థలు పడుతూ….. గరిక మీద పడుకోవడం జరుగుతుంది.  గరిక ద్వారా శాంతిని పొందటము జరుగుతుంది.  అలాగే కుమారస్వామి కూడా తన సాధన  పరిసమాప్తి సమయంలో 10 లక్షల శక్తిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నప్పుడు ఈ కారుంగలి వస్తువులు కనిపెట్టడం జరిగింది. ఆయన ధరించడం జరిగింది.  లబ్ధి పొందటము జరిగింది.  వాళ్ళు వాళ్ళ సాధనా పరిసమాప్తి స్థితి దాకా వచ్చారు కాబట్టి…. అలాగే శివ నందిని, మేము కూడా అదే సాధన పరిసమాప్తి వచ్చిన తరువాత…. మాకు కారుంగలి వస్తువులు ధరించే యోగం,  ఆ ప్రకృతి ఇస్తే… ఆ అర్హత, యోగ్యత, యోగం ఉంటే తప్పక ధరిస్తాము అని చెప్పేసరికి….


సరే మీ ఇష్టం….ఎప్పుడు కావాలంటే అప్పుడు,  ఈ వస్తువుల గురించి ఆలోచించవద్దు. ఇవి నా దగ్గర ఉన్నాయి.  కారుంగళి దైవిక వస్తువులు అన్నీ ఉన్నాయి. వీటి గురించి మీరు ఎక్కడా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు.  నేను ఏకంగా పాతాళమురుగన్ ఆలయం నుంచే ఈ వస్తువులు ఏనాడో తీసుకువచ్చాను.  నేనే స్వయంగా వెళ్లి దగ్గరుండి చెక్కతో ఈ వస్తువులన్నీ తయారు చేసి ఉంచాను.  ఎందుకో తెలియదు ఎవరికో ఈ వస్తువులు ఇవ్వాల్సి వస్తుంది.  సాధన పరిసమాప్తికి ఉపయోగపడతాయని అనుకున్నాను.  కాకపోతే మీ అందరిని చూసేసరికి మీ అందరికీ ఉపయోగపడతాయేమో అనుకున్నాను.  ఏమోలే!  ఎవరికి తెలుసు…ప్రకృతి ఎప్పుడు ఏమీ ఇస్తుందో ఎవరికీ తెలియదు కదా! మీరు అన్నట్టు మీ సాధన పరిసమాప్తి అయ్యేసరికి….. వీటిని పొందే అర్హత, యోగ్యత, యోగం వచ్చేసరికి నేనే ఇవ్వచ్చేమో!  వీటిని మీకోసం తెచ్చి ఉండొచ్చు.  మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా!  నేను కూడా వీటిని ఎందుకు తీసుకున్నానో ….ఎందుకు దగ్గర ఉండి చేయించానో …..  నాకు తెలియదు అనేసరికి……సరే నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో!  పది సంవత్సరాల నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నావు కదా!  మా  సాధన పరిసమాప్తి అయ్యే సమయానికి వీటితో మాకు అవసరం ఉంది అన్నప్పుడు నేనే చెబుతాను…. అని రుద్రస్వామి అనేసరికి….. సరే స్వామి!  మీ ఇష్టం ….మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను.  మీరు వద్దు అంటే వేరే వాళ్ళకి వీటిని అందజేస్తాను . అప్పటిదాకా నాతో ఉంచుతాను.  అయినా వీటిలో మా తమ్ముడైన బాలగణపతికి కూడా ఉపయోగపడ్డాయి కదా! అనగానే ఇక బాలగణపతి తన త్రిశూలం చేత్తో పట్టుకుంటూ….. కారుంగలి మాల మెడలో తిప్పుకుంటూ…. ఆనందపడుతూ…. సంబరపడుతూ ఉండేసరికి…. ఇప్పటికే సమయం మించిపోయింది…. గదికి వెళ్లి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత….మిగిలిన చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్లాలి…. అని సారంగ ధర మఠం కేసి బయలు దేరారు…. 


సారంగ ధర మఠం:- 

సారంగదరుడు అనే ఒక గొప్ప యోగ సాధకుడు తన సాధనా శక్తిని ధారపోసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు అని…. ఇక్కడ ఆలయ మధ్య భాగంలో ఒక పుష్పం లాంటి ఆకృతిని అదే విధంగా అచ్చుగుద్దినట్టు దానికి ఎదురుగా పైన కనపడే సరికి శివ నందిని ఆలయ పూజారిని దీని గురించి అడగగా…. ఇది అయస్కాంత శక్తి తరంగాలతో విశ్వం నుంచి నేరుగా అనుసంధానం అవుతుంది. ఈ పుష్పంపై కూర్చుని సాధన చేస్తున్నప్పుడు…. శూన్య  స్థితిని అనుభూతి చెందుతారు. ఈ సారంగ ధర మఠంలో ఎంతో మంది సిద్ధులు, యోగులు, సాధకులు సాధన చేసుకుంటూ… ఈ ప్రాంతాన్ని శక్తి తరంగాలతో అనుసంధానమై ఈ ప్రదేశాన్ని శక్తి కేంద్రంగా మార్చేశారు. ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగాన్ని అందరూ తాకి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి… అదే అనుగ్రహ ఆశీస్సులు ఈ శివలింగం ద్వారా స్వామివారు ప్రసాదిస్తారు. మల్లన్న లింగంతో సరిసమానంగా ఈ లింగమును తాకి భక్తులు ఆయన స్పర్శ దర్శనానికి పాత్రులు అవుతారు అని చెపితే విని అందరూ ఆ మఠంలో కాసేపు ధ్యానం చేసుకుని ఇక ఆలస్యం అవుతుందని…..అందరూ కలిసి సత్రం గదికేసి బయలుదేరడం జరిగింది. 


గమనిక:- (శ్రీశైల క్షేత్రంలో ఇవే కాక ఇంకా ఎన్నో మఠాలు స్థాపించబడ్డాయి. అందులో సిద్ధులు తిరుగాడిన మఠం సిద్ధమఠం అని, నందికేశ్వర లేదా హీరా మఠం అని ఇందులో గుహ మార్గాలు ఉన్నాయని, అంతేకాక మల్లమ్మ కన్నీరు వెనక వైపు విశ్వామిత్ర మఠం , కాల ముఖ శాఖకు చెందిన శిలా మఠం, అగస్త్యేశ్వర మఠం, పాశుపత శాఖకు చెందిన భగీ మఠం, శివలింగ మఠం, అరశ మఠం, వీరశైవ మఠాలలో నంది మఠం, ధన మఠం, భిక్ష వృత్తి మఠం,బసవ మఠం ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతకాలంలోవాటి స్థితిగతులు ఉనికి ఎలా ఉన్నాయో తెలీదు అని సాధకులు చెప్పేసరికి సాధనా కుంటుంబం ఈ పంచ మఠాలను మాత్రమే దర్శనం చేసుకోవడం జరిగింది.)


ఇలా వీళ్ళందరూ కలిసి సత్రంలో ఉన్న గదికి వెళ్లడం జరిగింది. అప్పుడే ఆ సత్రం యజమాని ఎదురుపడి శివ నందినితో ….అమ్మ!  భోజనాల సమయం అయింది… భోజనాలు వడ్డిస్తున్నాము….ఇంకొంచెం సేపు ఆగితే భోజనాలు దొరకవు ….అందుకని భోజనం చేసి మీ గదికి వెళ్ళండి అనేసరికి …..అలాగేనండి!  భోజనం చేయడానికే ఇక్కడికి వచ్చాము అని అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు . వేరే వేరే గదిలో ఉన్న వాళ్లంతా కూడా భోజనానికి రావటం మొదలుపెట్టారు.  అప్పుడే తయారు చేసిన పదార్థాలు కావటం వలన  వేడివేడిగా ఉండటంతో అందరూ ఆబగా తినటం మొదలుపెట్టారు. కానీ బాల గణపతి మరియు బాల కుమారస్వామి వేడి పదార్థాలు చేతులు కాలుతూ…. తినటానికి అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్లని ….శివ నందిని కాస్త  దగ్గరికి పిలిపించుకొని నేల మీద అరిటాకు వేయించుకొని…. భోజనం పదార్థాలు అన్నీ పెట్టుకుని చేరొకపక్క కూర్చోబెట్టుకొని….. వీళ్లిద్దరికి ఆహారం తినిపించడం మొదలు పెట్టింది.  బాల కుమారస్వామికి నెమ్మదిగా కళ్ళ వెంట నీళ్లు రావడం గమనించి…. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు! అని  శివ నందిని అడిగేసరికి….. ఏం లేదమ్మా!  ఇలాంటి అమ్మ ప్రేమను చూసి ఎన్ని సంవత్సరాలు …ఎన్ని యుగాలు అయిందో కూడా గుర్తులేదు.  నువ్వు నిస్వార్ధంగా ప్రేమను చూపిస్తున్నావు . నాకు ఇలా తినాలి …..తినిపించాలి అని కోరిక ఉండేది . నా కోరిక నేను అడగకుండానే తీరుస్తున్నావు… అనేసరికి ఇంతలో సత్రం యజమాని వచ్చి చూస్తూ …ఇదిగో నీకు ఇష్టమైన ఉండ్రాళ్ళు అనేసరికి చూస్తున్నాను….. అన్నంతో సరిపెట్టుకోవాలా…. ఉండ్రాళ్ళు పెడతారా లేదా ! అనుకుంటూ శివ నందిని పెట్టే గోరుముద్దలు తింటూ ఉన్నాడు. బాల గణపతి…..  అప్పుడు శివ నందిని బాల కుమారస్వామిని చూస్తూ …..నీకు ఇష్టమైన  ఆహార పదార్థం ఏమిటి?  అంటే బాల కుమారస్వామి నాకు చలిమిడి ముద్దలంటే ఇష్టం…. బెల్లం  బియ్యం కలిపి చేస్తారు కదా!  అవి చాలా ఇష్టంగా తింటాను… అనేసరికి ఈసారి అది కూడా చేస్తాలే ! వాటిని కూడా నువ్వు తిను… నీకు కావలసినప్పుడు అనేసరికి సరే అమ్మ అని అంటూ ఉండేసరికి…. వీళ్ళ ముగ్గురు ప్రేమ ఆప్యాయతలు చూసిన సత్రం యజమాని…. రుద్ర స్వామి దగ్గరికి వెళ్లి… స్వామి ఈ పిల్లలు ఈమెకు పుట్టిన పిల్లలా?  ఎవరు ఈమె? ఈమె చరిత్ర ఏమిటి ?అని అడిగేసరికి….. రుద్ర స్వామి అన్నం తింటూ 


రుద్ర స్వామి:- వాళ్ళు ఆవిడకి పుట్టిన పిల్లలు కాదు. ఆమెకి దొరికిన పిల్లలు. దత్తపుత్రులు . శివపుత్రులు 


అనేసరికి అర్థం కాలేదు స్వామి ! అనేసరికి….


రుద్ర స్వామి :- ఒకడేమో కాశీలో డూండీ గణపతి గుడి దగ్గర దొరికాడు. వాడికి బాల గణపతి అని పేరు పెట్టుకుంది . ఇంక రెండో వాడు ఇప్పుడు మాకు పాతాళగంగ మెట్ల దగ్గర దొరికాడు.  అందుకే వాడు బాల కుమారస్వామి అంట …


అని చెప్పేసరికి అవునా!  ఈ పిల్లవాడిని ఎక్కడా చూడలేదే!  అయినా ఇప్పుడు ఆమె సన్యాసం తీసుకోవాల్సినంత కర్మేం పట్టింది ….చూస్తే సంసార జీవితానికి బాగా చూసుకునేటట్టుగా ఉంది . పిల్లలంటే మమకారం, ఆప్యాయత ఉంది కదా! అనేసరికి…



రుద్రస్వామి:- ఆమె  భోగ  జీవితంలో ముగ్గురు పిల్లల తల్లి ! ఇద్దరు ఆడపిల్లలు…. ఒక మగపిల్లాడు . ముగ్గురికి కూడా వివాహం చేసి బాధ్యతలు తీర్చేసుకుని… భర్త యొక్క అక్రమ సంబంధాల విషయం తెలిసి… సవితి పోరు తట్టుకోలేక…. వైరాగ్యం చెంది… కాశీ క్షేత్రానికి వచ్చి…. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.  ఆమె మరణాన్ని మోక్ష మరణంగా మార్చాలని  కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అనుకున్నారు.  అందుకనే ఆమెకి మోక్ష సన్యాస దీక్ష ఇచ్చారు…


 అనేసరికి అవునా స్వామి!  మంచిదే ఈ జీవితాన్ని అంతిమజీవితంగా మార్చుకోవాలని అనుకుంటుంది కాబోలు…. అయినా కూడా ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం రావడం కూడా కష్టం లేండి…. సన్యాసయోగం పొందడం కూడా కష్టమే లేండి…. ఇప్పుడు మేము ఉన్నాము ….ఈ క్షేత్రంలోనే ఉన్నాము… మాకు ఈ వ్యాపారాలతోనే సతమతమవుతాము… కనీసం రోజులో ఒకసారైనా భ్రమరాంబిక దేవి… మల్లికార్జున స్వామిని చూడటానికి…  మాకు అవకాశం లేదు. ఎంతైనా క్షేత్ర వాసి మహాపాపి అంటారు .  అందుకే కాబోలు…. అదే మీరు బయట వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు  స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు.  కానీ మేము 24 గంటలు ఇక్కడే ఉన్నా కూడా వ్యాపార ప్రపంచంలో ఉండిపోయి… ఆయన్ని పట్టించుకోము.  అది…. ఇది… అనేసరికి 


రుద్రస్వామి:- అలా ఎప్పుడూ అనుకోవద్దు... ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు అనుకోండి… ఆ యజమానికి పనివాడు ఉన్నాడనుకోండి… ఆ పనివాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు యజమానిని చూడవచ్చు.  ఎందుకంటే 24 గంటలు ఆయజమాని పనివాడికి అందుబాటులో ఉంటాడు.  అలాగే పని వారు కూడా యజమానికి అందుబాటులో ఉంటారు.  కాబట్టి ఎప్పుడూ సమస్య లేదు . ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు… చేసుకోవచ్చు… వాళ్లు చూసుకోవాలి… చేయాలి అనే తపన,తాపత్రయం ఉండవు కదా!  అదే యజమాని ఒక జమిందారు అయ్యాడు అనుకోండి…. ఆ జమీందారుని చూడటానికి మాలాంటి వాళ్ళు భక్తులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ జమీందారు సంవత్సరానికి ఒకసారో …రెండు సార్లో కనిపిస్తారు.  24 గంటలు చూసే పనివాడు గొప్పవాడా! సంవత్సరంలో ఒకటి రెండు సార్లు చూసే మాలాంటి అవసర భక్తులు గొప్ప వాళ్ళా …ఆలోచించుకోండి …క్షేత్ర వాసి మహాపాపి కాదు…. పుణ్యవాసి.  వాడు 24 గంటలు దైవ సన్నిధానంలోనే ఉంటాడు …వ్యాపారం చేసుకుంటాడో… ఇంకొకటి చేసుకుంటాడో శివ సన్నిధానంలో ఉంటాడు.  ఆ శివ సన్నిధానంలో  శివ సాంగత్యం పొందటానికి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం.  మేము సంచార జీవులం… మీరు స్థానిక జీవులు… శివ సన్నిధానంలో ఉన్నప్పుడు నిత్యం మనసులో తలుచుకుంటే చాలు… మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మాకు సంవత్సరంలో ఒకసారి… రెండుసార్లు మాలాంటి భక్తులకు అవకాశం ఇస్తూ ఉంటారు.  అదే మీకు మాకు తేడా!  మీరు గత జన్మలో చేసిన పూజల వలన శివానుగ్రహం ఉండి… ఇక్కడ ఉంటారు.  అందుకే మిమ్మల్ని  ఈ శ్రీశైల క్షేత్రంలో ఉంచారు.  అందరూ కూడా ఆయన గణాలలో ఏదో ఒక గణానికి చెందిన వారై ఉండొచ్చు… మీరు ఆయన సన్నిధానంలో ఉన్నారు ..శివ సన్నిధానంలో ఉన్నారు. కాబట్టి అన్ని ఆయనే చూసుకుంటారు .మీరు ఆయన్ని చూసుకో వక్కర్లేదు… ఆయనే మిమ్మల్ని చూసుకుంటారు… కాకపోతే మాలాంటి వాళ్ళం ఆయనని చూసుకోవడానికి వస్తూ వుంటాం.  అంతే తేడా!  రోజు వెళ్లి అభిషేకాలు చేసుకుంటేనో… దర్శనం చేసుకుంటేనో …లేదంటే పూజలు చేసుకుంటేనో….. దేవాలయ దర్శనం చేసుకుంటేనో…. ఆయన అనుగ్రహం ఉంటుందని అనుకోవద్దు.  ఎల్లప్పుడూ శివ సాంగత్యం మీరు మానసికంగా చేసుకున్నా సరిపోతుంది… శివయ్య సన్నిధిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి…సాక్షాత్తు ఆదిదంపతుల సమక్షంలో మీరు ఉన్నారు. పెరుగుతున్నారు. మీరు …మీ పిల్లలు… మీ వంశాలన్నీ వృద్ధి అవుతున్నాయి. మీకు కావాల్సినవి చేస్తున్నారు . ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు.భోగ ప్రపంచంలో ఉంటున్నారు. అవి ఆర్థిక అవసరాలు తీర్చడానికే….మానసికంగా మీరంతా ఆయన భక్తులు… ఆయన సాంగత్యం పొందిన వాళ్లు…


 అనేసరికి…. అవును స్వామి!  మీరు చెప్తుంది నిజమే… మీ మాటల వల్ల నాకు ధైర్యం వచ్చింది. అయితే నేను తప్పు చేయట్లేదు అన్నమాట!  జన్మకో శివరాత్రి అన్నట్టు…. శివరాత్రి రోజున వెళ్ళినా సరిపోతుంది. ఆయన్ని నిత్యం మనసులో తలుచుకుంటున్న కానీ…. ఆయన సాంగత్యం పొందుతున్నట్టే కదా!  ఆయన్ని వెళ్లి దర్శనం చేసుకోవాలని అయితే ఏమీ లేదు అన్నమాట!  ఖచ్చితంగా ఏమీ వెళ్లక్కర్లేదు… మనసులో అనుకుంటే చాలు… మీరన్నట్టు మాకు శివసాంగత్యం… శివ సన్నిధి నిత్యం ఉంది.  మీకు అప్పుడప్పుడు ఉంది అని అర్థం అవుతుంది.  ఇన్నాళ్ల నా మనోవేదన తీరింది అనేసరికి… అందరూ భోజనాల పనులలో పడేసరికి.. అక్కడి నుంచి మౌనంగా సత్రం యజమాని వెళ్లిపోవడం జరిగింది.  తన పనిలో తాను పడ్డాడు.


రుద్ర స్వామి మరియు సత్రం యజమాని మాటల వింటున్న శివ నందిని…. ఏవో ఆలోచనలు వస్తూ ఉంటే….. ఈయన భోజనం చేశాడో లేదో ! అసలు ఏం తిన్నాడో! ఏమో! అని శివానంద గురించి ఆలోచనలు చేస్తూ ఉండేసరికి…. పక్కనే ఉన్న మహాదేవి భోజనం తింటూ…. ఏంటి? స్వప్న దారి గురించి ఆలోచిస్తున్నావా! ఆయన భోజనం చేశాడా లేదా అని ఆలోచిస్తున్నావా!  ఆయన గురించి ఆలోచనలో పడుతున్నవా! ఇప్పుడు ఆయన ప్రేమలో పడ్డావా ఏంటి? ఆయన మాటలకు లొంగిపోయావా ఏంటి! మోహ మాయలో పడ్డావా ఏంటి?  అని సన్నగా శివ నందిని కి మాత్రమే వినపడేలాగా అనే సరికి శివ నందిని  ముఖం మాడ్చుకుని ……కోపంగా మహాదేవి వంక చూస్తూ ……అలాంటిదేమీ లేదు!  ఆయన నా గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు…. ఆ ఆలోచనలు నాకు వస్తున్నాయి… అంతే…అంటే కాదు!  ఆయన నీ గురించి ఆలోచిస్తే…. నువ్వు తిన్నావా లేదా గురించి ఆలోచనలు వస్తాయి.  నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి…. ఆయన తిన్నాడా లేదా అని ఆలోచనలు వస్తున్నాయి.  కాబట్టి మీ ఇద్దరి మధ్య ఆత్మ అనుసంధానం అవుతున్నట్టు ఉంది.  ఆత్మలు కలుస్తున్నట్టు ఉన్నాయి అనేసరికి……ఊరుకో అమ్మ.! నువు మరీను…ఆట పట్టిస్తున్నావు…. నా మనసే ఎటుపోతుందో అర్థం కాని అయోమయ స్థితిలో నేనుంటే…. లేనిపోని ఆలోచనలు కలిగిస్తున్నావు!  అనేసరికి పిల్లలిద్దరూ కూడా అమ్మ! ఆకలి తీరిపోయింది…. నువ్వు తినేసెయ్యి.  మేము వెళ్లి ఆడుకుంటాం అనేసరికి…..  శివ నందిని భోజనం పూర్తి చేసుకుని, చేతులు కడుక్కునే సమయంలో…. ఎవరో తన చెవిలో చెబుతున్నట్టుగా లీలగా అనిపించింది.  


శివాని ఏం చేస్తున్నావో  నీకు తెలుస్తుందా!  నువ్వు వచ్చింది ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడానికి కాదు….. ఈ క్షేత్రంలో ఉన్న ప్రదేశాలని చూడడానికి కాదు…. సాధన చేసుకోవడానికి! శక్తి జాగృతి చేసుకోవడానికి! ఆ విషయం మర్చిపోయావు.. కాశీలో ఉన్నప్పుడేమో రహస్య యంత్రం గురించి ఆలోచిస్తూ…. రహస్య చేదనలో గడిపేసావు… ఇక్కడికి వచ్చాక నాలాంటి వ్యక్తుల గురించి… పదేపదే ఆలోచించడం,  ఈ క్షేత్రంలో ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయి! ఏమేం తిరగాలి.. అని ఆలోచనగా చేస్తున్నావ్  కానీ,  సాధన గురించి ఆలోచించడం లేదు.  సాధన ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఏ విధంగా అనుభవాలు పొందాలి అని ఆలోచించడం లేదు. నువ్వు రాను రాను సాధన గురించి మర్చిపోయి… పుత్రుల గురించి, జనాలు గురించి, క్షేత్రాల గురించి, ఆలోచిస్తున్నావు.  ఇది మంచి పద్ధతి కాదు.  నువ్వు ఆలోచించుకో!  నువ్వు వచ్చింది ఎందుకు?నువ్వు సన్యాసం తీసుకున్నది ఎందుకు? సాధనా అనుభవాలు పొందాలి కదా!  అసలు మోక్షజ్ఞానం దొరకడమే కష్టం. అలాంటిది ఇష్ట దేవత అనుగ్రహం  పొందడం కష్టం.  అలాంటిది గురువు అనుగ్రహం పొందడం కష్టం.  నీకు ఈ మూడూ కూడా అందినాయి. మోక్షజన్మ అయ్యింది.  శివానుగ్రహం పొందడం అయ్యింది.  గురువులనుగ్రహం మంత్ర గురువు రూపంలో దొరికింది.  ఆయన ఉపదేశించిన  గురు మంత్రమును సాధన చేసుకోకుండా… ధ్యానంలో చేసుకోకుండా… జపం చేసుకోకుండా…ఏంటి ఇది….ఈ క్షేత్రంలో ఉన్న ప్రాంతాలన్నీ తిరగటం కాదు.  ఇది అందరూ చేసే పనే…. అందరూ చేయని పని నువ్వు చేయాలి. సాధించాలి. సాధనా సాధ్యతే సర్వం సాధ్యం.  సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాలి కదా! అది మర్చిపోయి ఏదేదో ఆలోచనలు అన్నీ చేస్తున్నావు. నేను తిన్నానా ?నువ్వు తిన్నావా…. నేనేం చేస్తున్నాను…. ఇలా ఆలోచనలు కాదు.  దీని వలన ఉపయోగం లేదు.  కాబట్టి తక్షణమే నువ్వు రుద్రాక్ష మఠానికి రా! సాధన చేసుకుందాం… అనేసరికి ఎవరూ మాట్లాడుతున్నారా!  అని కళ్ళు మూసుకునే సరికి శివానంద రూపం కనపడే సరికి…. ఓహో ! ఇతనా! ఇప్పటిదాకా తనకి అక్షింతలు వేసింది అని మనసులో అనుకుని….. ఆయన సాధన చేసుకోవడానికి రమ్మంటున్నాడు కదా!  వేరే విషయం కాదు కదా! ఒకవేళ ఏమైనా ఎక్కువ, తక్కువ చేస్తే… రుద్రాక్ష మఠంలో ఉన్న త్రిశూలంతో ఒక పోటు పొడిచేసి రావచ్చులే …..అని అనుకొని ఇదే విషయాన్ని శివ నందిని మహాదేవి చెప్పబోతుండగా……ఆ..! అర్థం అయింది.  ఆయన సాధన చేసుకోవడానికి రమ్మన్నారు కాబట్టి…… నువ్వు వెళ్ళు.  నేను దగ్గరలో ఉన్న భైరవకోనకి వెళ్తాను.  అక్కడ తంత్రసాధకులు, తంత్ర గురువులు ఉంటారు.  అక్కడ తంత్ర విధానంలో సాధన చేసుకోవడానికి వెళ్తాను.  రేపు ఉదయం నిన్ను కలుస్తాను.  నాకు ఇక్కడ తెలిసిన ప్రాంతం లాగానే అనిపిస్తుంది. గత జన్మ స్ఫురణలు గుర్తుకు వస్తున్నాయి.  నేను భైరవకోనలోనే ఉండి సాధన చేసుకుంటాను.  కావలసినప్పుడు నేను కూడా వస్తాను అనేసరికి…. రుద్రస్వామి కాస్త శివ నందినితో నువ్వేం కంగారుపడకమ్మా!  పిల్లల్ని నేను చూసుకుంటాను. పిల్లలకు కావలసినవి నేను ఏర్పాట్లు చేస్తాను.  నువ్వు, శివానంద కలిసి సాధనలో కూర్చోండి.  విషయం తెలుసుకోండి.  శక్తి జాగృతి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో!  అసలు మనం వచ్చిందే దానికోసం కదా!  ఇక్కడే మనం ఇంకో ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది.  శక్తి జాగృతి అయ్యేసరికి 6 నెలలు పడుతుంది. కాబట్టి మనం సాధన పరిసమాప్తి చేసుకునే లోపల…. ఇక్కడ చుట్టూ పక్కల ఉన్న ప్రదేశాలు రోజు ఒకటి చూడొచ్చు. మనందరం కలిసి చూడొచ్చు. కంగారేం లేదు. అన్ని ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు. సాధన మొదలు పెట్టు.  గురు మంత్రం ఎటు పొందావు కదా!  దాన్ని నువ్వు దీక్ష మంత్రంగా చేసుకుంటూ…. సాధన మొదలుపెట్టు. అది శివానంద సన్నిధానంలోనే చెయ్యి. మంచి ఫలితం ఉంటుంది అనేసరికి…. సరే స్వామి!  మీ ఇష్టం .మీరు చెప్పినట్టే నేను రుద్రాక్ష మఠానికి వెళ్తున్నాను.  పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అనేసరికి….


పిల్లలు అమ్మ రుద్రాక్ష మఠానికి వెళ్తుందని తెలుసుకొని…. మేము కూడా వస్తాము అన్నారు. రుద్రస్వామి కాస్త మీరు వద్దు,  అమ్మ సాధన చేసుకోవడానికి వెళుతుంది.  ఒంటరిగా ఏకాంతంగా సాధన చేసుకోనివ్వాలి . మనమంతా వేరే మఠానికి వెళ్దాము.  ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూసేసి వద్దాం…. అనేసరికి రుద్ర స్వామి తో పాటు బాల కుమారస్వామి, బాల గణపతి కూడా సంతోషంగా వెళ్లిపోయారు.  మహాదేవి అక్కడి నుంచి భైరవకోనకి వెళ్ళిపోయింది. ఇక దాంతో శివ నందిని  గదికి వెళ్ళకుండ సరాసరి రుద్రాక్ష మఠానికి వెళ్ళింది.  రుద్రాక్ష మఠానికి వెళ్లేసరికి,  అక్కడ శివానంద కనిపించలేదు. ఓహో! ఈయన ఇంకా రాలేదు అని చెప్పేసి… అక్కడ ఉన్న రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసి, విభూది రాసి, తాకి 


“నీ సన్నిధానంలో ఉండి నేను ఇంక సాధన మొదలు పెడుతున్నాను. ఈరోజు నుంచి గురు మంత్రంను దీక్షా మంత్రముగా చేస్తాను. సాధన జాగృతి చేస్తావో…. సాధన పరిసమాప్తి చేస్తావో …సాధన ఆపుతావో …ఇక నీ ఇష్టం… నువ్వు ఎక్కడ ఉన్నా…. ఏ పేరుతో ఉన్నా ….నువ్వు శివుడివే కదా!  ఒకప్పుడు మల్లన్న గా కనపడతావు… ఒక్కొక్కసారి కాశీ విశ్వనాథుడిగా కనబడతావు….. మరొకసారి మహాకాలుడిగా కనపడతావు…. ఎలా కనపడ్డా,  ఏ విధంగా కనపడ్డా …అన్నీ 64 రూపాలు… శివరూపాలే …రుద్రరూపాలే.  నువ్వు అమ్మ వేరు వేరు కాదు… శివ శివాని ఒకటే అనే భావన నాకు కలిగించండి.  సాధన పరిసమాప్తి చేయండి. నన్ను దీవించండి.”  అని వేడుకుని మఠంలో ఒక మూలన ధ్యానంలో కూర్చుంది. ఓం శివోహం అను గురు మంత్రమును చేసుకుంటూ పద్మాసనంలో ఒక చేయి మీద చేయి పెట్టుకొని ధ్యాన నిమగ్నం అయింది.  అలా గురు మంత్రం చేస్తూ ఉండేసరికి…. ఒక అరగంట అయ్యేసరికి ఆలోచనలు రాను రాను మార్పులు మొదలుపెట్టాయి. భోగ జీవితము మీద ఆలోచనలు మొదలుపెట్టినాయి. తన భర్త చూపించిన ప్రేమ, మాటలు …ఆయన చేసిన ఒక్కొక్క చేష్టలు… గుర్తుకు రావడం జరిగింది. ఉన్నట్టుండి సంతానం మీద ఆలోచనలు వచ్చినాయి. సరే ఏకాగ్రత కుదరటం లేదు అని కళ్ళు తెరిచి చూసింది.  రెండు నిమిషాల పాటు మనసు మళ్లించుకోవడానికి సమయం ఇచ్చి మళ్లీ ధ్యానంలో కూర్చుంది.


ధ్యానంలో కూర్చుంటే… ఈసారి ఏదో తెలియని ఆవేదన, ఏడుపు అనుకోకుండా కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి.  ఎవరో కొట్టినట్టు… ఎవరో తిట్టినట్టు ….ఎవరో ఏదో చేస్తున్నట్టుగా అనిపించింది.  ఎవరో మానసిక క్షోభ పెడితే ఏ విధంగా ఏడుపు వస్తుందో…. ఆ విధంగా ఏడుపు వస్తూ ఉండేసరికి ఏమైయిందా అని ఒక 15 నిమిషాలు అలా ఏడుస్తూనే ఉంది. ఆ తరువాత ఒక్కోసారి ఉన్నట్టుండి పెద్దగా అరుపులు మొదలు పెట్టింది.  అరుపులు వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఈమెకి ఏదో పూనకం వచ్చినట్టుగా ఉంది అని ఆ చుట్టుపక్కల భక్తులు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారు.  తనకి ఎందుకు ఏడుపు వస్తుందో….. తనకి ఎందుకు అరుపులు వస్తున్నాయో…. అర్థం కాక ధ్యానం నుంచి బయటకు వచ్చేసింది.  కళ్ళు తెరిచి చూసింది. ఏమీ అర్థం కాలేదు.  రెండు నిమిషాల ఆగి మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండేసరికి…. పొత్తికడుపులో నొప్పి మొదలైంది.  వెన్నుపూస కింద ఏవో కదులుతున్నట్టు…. ఏదో అవుతున్నట్టుగా ఏదో కొట్టుకుంటున్నట్టుగా అనిపించింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏమైందా అని చూస్తూ ….ఉండేసరికి పొత్తికడుపులో విపరీతంగా నొప్పి రావడం మొదలయ్యింది. ఒకవేళ నెలసరి వస్తుందా అనేంత భయం కలిగింది. అయినా తన దగ్గర సేఫ్టీ ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి… నెలసరి వచ్చినా పర్వాలేదు అనుకుంది.  నెలసరి నొప్పికి మించి పదిరెట్లు నొప్పి వస్తూ ఉండేసరికి… ఏం అర్థం కాలేదు. మళ్లీ ఒక పక్క కడుపులో ఆవేదన ,ఆందోళన, కడుపులో వికారాలు మొదలైనాయి.  సరే అని తట్టుకోలేని పరిస్థితి వచ్చేసరికి కళ్ళు తెరిచింది.  అసలు ఏం జరుగుతుంది.  పట్టుమని పది నిమిషాలు కూడా ధ్యానంలో ఉండలేకపోతున్నాను.  రకరకాల ఆలోచనలు వస్తున్నాయని అనుకుని… తనకి ఏకాగ్రత కుదరట్లేదు అని… మనసంతా ఏవేవో ఆలోచనలు చేస్తున్నానని అనుకొని… అయినా సరే చేయక తప్పదు,  మనసు పరిపరివిధాలా పోతుంది…. అనుకొని ఈసారి ధ్యానంలో కూర్చునేసరికి కామ వికారాలు మొదలయ్యాయి… శివానంద మీద కామకోరికలు మొదలవుతూ,  శృంగార దృశ్యాలు,వాళ్ళిద్దరూ ఏకాంతంగా నగ్నంగా గదిలో కలుస్తున్నట్టు విపరీతమైన ఆలోచనలు కామ భావాలు వస్తూ ఉండేసరికి…. చ…చ…ఏంటి!  ఆయన గురించి నేను చెడుగా ఆలోచించను కదా! ఆయన కూడా అలా చెడుగా ఆలోచించే రకం కాదు కదా! వస్తే  తన మాజీ భర్త మీద రావాలి గాని పోయి…పోయి యోగ మిత్రుడు, గురు సమానుడైన శివానంద మీద కోరికలు రావడం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది ! ఏంటి? మనసు ఎందుకు వికలం అవుతుంది….ఇలా  పలు విధాలుగా పలు ఆలోచనలు చేస్తోంది.  ఇలా కాదు అనుకుని కళ్ళు తెరిచేసింది.  సమయం చూస్తే తను అక్కడికి వచ్చి గంటన్నర అవుతుంది. ఈ గంటన్నర వ్యవధిలో పది నిమిషాలకు మించి తను సాధన చేయలేక పోయానని అర్థం అయింది.  పది నిమిషాలు కూడా ధ్యానంలో ఉండలేదని గ్రహించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక…. శరీర బాధలు ,మానసిక బాధలు ఇవన్నీ ఏంటి? తప్పుడు ఆలోచనలు ఏమిటి? తప్పుడు భావాలు ఏమిటి? అసలు మనసు ఎటు పోతుందో ఏమిటో అర్థం కాలేదు అనుకుంటూ ఇక ఉండలేక రుద్రాక్ష మఠం నుంచి బయటకు వస్తూ ఉండగా…. బయట శివానంద కనిపించారు. 


శివానంద:- ఏంటి శివాని!  ఏంటి సంగతులు… 


శివనందిని:- వచ్చారా! అదే ఇందాక అక్షింతలు వేశారు కదా!  సాధన చేయట్లేదు ….నేనేదో మాయలో ఉన్నా అని…. క్షేత్ర మాయ… పుత్ర మాయలో ఉన్నా… అని అన్నారు కదా!  సరే సాధన చేసుకుందామని ఇక్కడికి వచ్చాను.  తీరా చూస్తే, ఎక్కువ ఆలోచనల వైపే పోతున్నాయి.  పట్టుమని పది నిమిషాలు కూడా ఏకాగ్రత లేదు.


శివానంద:– ఓహో!  ఇప్పుడే సాధన ప్రారంభ స్థితిలో ఉన్నావు కాబట్టి… జాగృతి స్థితిలో ఉన్నావు కాబట్టి…. ఇలాంటి ఆలోచనలు తగ్గించడమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. శ్వాస మీద దృష్టి పెట్టు.  శ్వాసే  ధ్యాసగా మార్చుకో… 


శివానందిని:–  శ్వాస మీద కాదు కదా స్వామి!  విగ్రహం మీద పెట్టినా ….నాదం మీద పెట్టనా ….మంత్రం మీద పెట్టినా …మనసు పోవట్లేదు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి.  ఆలోచనలు ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. శారీరకంగా నొప్పులు మొదలవుతున్నాయి… మానసికంగా క్షోభ మొదలవుతుంది.  ఏకాగ్రత కుదరటం లేదు. ఏమైనా మార్గం ఉంటే  చెప్పవచ్చు కదా!  నివారించడానికి….


శివానంద:– మనసు ఉంటే మార్గం లేకుండా పోతుందా! ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది . కాకపోతే అదే మనం ఎంచుకునే విధి విధానం బట్టి ఉంటుంది. దాన్నిబట్టి నీ మనసు, నీ సాధన ఆధారపడి ఉంటుంది. మార్గం అడిగావు కాబట్టి చెబుతాను.  


శివ నందిని:– చెప్పండి స్వామి!  నేను వింటాను… చేస్తాను… శ్రద్ధగా చేస్తాను…


అనేసరికి సరే అయితే,  విను…. అని చెప్పడం ఆరంభించారు. 


అమ్మ! సాధన మంత్రానికి…. గురు మంత్రానికి తేడా తెలుసుకో! సాధన మంత్రం అంటే మనకి పుస్తకాల్లో దొరికినవి …మనసుకి నచ్చిన మంత్రాన్ని ఉపాసన చేస్తే దాన్ని సాధన మంత్రం అంటారు.  ఈ సాధన మంత్రం వలన మన అవసరాలు, కోరికలు తీరుతాయి. సాధన చేసే కొద్ది ఆ మంత్రం సిద్ధి పొంది వాక్సిద్ధి వస్తుంది. అదే గురు మంత్రం వచ్చేసరికి…. అది మోక్ష జన్మ పొందే వాళ్లకి మాత్రమే గురువు స్వయంగా వచ్చి…. అది గురు మంత్రంగా  ఉపదేశం చేయడం జరుగుతుంది.   మోక్ష  సాధన కి మాత్రమే గురు మంత్రం అందుతుంది.  గురువు అనుగ్రహం కలుగుతుంది.  సాధన మంత్రాన్ని గురు మంత్రంగా కొంతమంది పొందడం జరుగుతుంది.  కొంతమంది ఓం నమశ్శివాయ అని….. గాయత్రీ మహా మంత్రాన్ని….లేదంటే ఓంకార నాదాన్ని…. గురు మంత్రంగా పొందడం జరుగుతుంది. ఎవరైతే, ఎప్పుడైతే…. ఈ గురు మంత్రమును పొందుతారో… ఆ గురుమంత్రం సాధన మంత్రానికి మించి,  వెయ్యిరెట్లు ఫలితాన్ని ఇస్తుంది. గురు ఉపదేశం పొందడం అంటే గురువు సాధన శక్తిని ఆ సాధకుడికి లేదా సాధకురాలికి…తన శక్తిని అందించడం లాంటిది అన్నమాట!  తన మంత్ర శక్తిని , తన సాధనా శక్తిని అంతా గురు మంత్రంలో పెట్టి గురూపదేశం చేయడం జరుగుతుంది.  అందుకు అర్హత, యోగ్యత, యోగం ఉందా!  లేదా?  అని గురు మంత్రం ఇచ్చే గురువు…. ఒకటికి పది సార్లు పరిశోధించి…పరిశీలించి చేస్తారు. నీకు…. నాకు తెలిసి రుద్ర స్వామి మంత్ర గురువుగా ఉండి “ఓం శివోహం” అనే గురు మంత్రమును ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే నువ్వు గురు మంత్రమును సాధన చేస్తావో….. శరీరంలో చాలా కదలికలు మార్పులు జరుగుతాయి.  మొదట నీ ఆవేదనే నీ తొలి గురువు అవుతుంది అని గుర్తుంచుకో!  అకారణంగా నీకు ఏడుపు వస్తుంది. అకారణంగా ఆవేదన వస్తుంది. అకారణంగా కడుపులో నొప్పి, పొత్తికడుపు నొప్పి… లేదంటే గుండె నొప్పి, నరాల  బలహీనత రావటం… నరాలు పట్టేస్తున్నట్లుగా అనిపించడం…. కండరాలు పట్టేయడం…. ఇవన్నీ వస్తాయి.  ఆ తర్వాత గతంలో జరిగిన సంఘటనలన్ని ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి.  నీ తప్పు లేకపోయినా తప్పు జరిగిపోయింది అని….నిన్ను అవమానించిన వాళ్లు… సంఘటనలు  ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి.  నీ మనసు ఆవేదనకు గురి అవుతుంది. ఆలోచనల మయంలోకి వెళుతుంది. ఆగని ఏడుపు వస్తుంది. ఎంత అదుపు చేసినా అదుపులో ఉంచుకోలేవు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి… అంటే నీ కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు…. అనగా మూలధార చక్రం కింద అజ్ఞాన గ్రంధి ఉంటుంది. ఈ అజ్ఞాన గ్రంధిలో కుండలినీ శక్తి  ఒక పాము రూపంలో ఉంటుంది.  ఇది ఎలా ఉంటుంది అంటే…. మూడు చుట్లు చుట్టుకున్న పాములాగా ఉంటుంది.  ఈ కదలికలు ఎలా ఉంటాయంటే….  ఒడ్డున పడిన చేప ఎలా గిలగిలా కొట్టుకుంటుందో…. అలా ఈ పాము కూడా గిలగిలా కొట్టుకుంటుంది.  ఈ అజ్ఞాన గ్రంథిని భేదించి మూలాధార చక్రానికి రావాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  ఈ అజ్ఞానగ్రంధి లోనే అజ్ఞాన పొర మాయగా భవ బంధాలు, బాధ్యతలు మాయలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.  ఇవన్నీ మానసికంగా, శారీరకంగా తట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇవి ఈ జన్మలో నువ్వు చేసిన సంఘటనలే  నీకు ఆధారం అవుతాయి అన్నమాట! కుటుంబ సభ్యులు కానీ… బంధుమిత్రులు కానీ…. సంతానం కానీ…. నీ భర్త చేసిన పనులు కానీ….. గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు చదువుకుంటున్నప్పుడు…. నీ చుట్టుపక్కల జరిగిన సంఘటనలు…. నీ కాలేజీ జీవితములోను ….ఆ తర్వాత నీ ఉద్యోగ జీవితంలోను…. ఇలా పలు రకాలుగా…. యధార్థ సంఘటనలు నువ్వు తెలిసి చేసిన తప్పులు… తెలియక చేసిన తప్పులు… అన్నీ కూడా ఒక్కొక్కటి  కుండలినీ శక్తి జాగృతి అవుతున్నప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి. అందులో నువ్వు వేటిలో అయినా మాయలో పడి,  అయ్యో నేను ఇక్కడ తప్పు చేశానే ….నేను వెనక్కి వెళ్ళి క్షమాపణ చెప్పాలి…. లేదంటే వీళ్ళతో ఉండాలి…. ఇలా సాంగత్యం పొందాలి అని అనుకుంటారని…. ఆ విధంగా ప్రకృతి చేస్తుంది. అప్పుడు వీటన్నింటిని కూడా ప్రకృతిలో జరిగిందేదో జరిగింది…. అంతా మన మంచికే జరిగింది. కాబట్టి మనం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.  తప్పు జరిగినా ….ఒప్పు జరిగినా ఇప్పుడు చేసేది ఏమీ లేదు… అని మనసుని నువ్వు స్థిరపరచుకోవాలి.  అదుపులో ఉంచుకోవాలి. వాటి గురించి ఆలోచనలు తగ్గించుకుంటూ రావాలి . ఈ ఆలోచనలు ఎలా వస్తాయంటే…. ఒక ఆవుని మనం ఆధీనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి?  దానికి మేత పెట్టాలి…. ఆ మేత కూడా ఒక్కసారిగా పెట్టకూడదు…. కొద్దికొద్దిగా మేత పెడుతూ ఉంటే… ఆ మేత కోసం అలవాటు పడి,  ఆవు మన మాట వింటుంది.  అదేవిధంగా మనసు కూడా కొద్దికొద్దిగా ధ్యానానికి అలవాటు చేయాలి. అంతేగాని గంటలు గంటలు బలవంతంగా కూర్చుని చేయడం వల్ల…. ఎలాంటి ఉపయోగం లేదు. ధ్యానాన్ని మనసు ఇష్టపడి చేయాలి . అదే ధ్యానాన్ని మనసు కష్టపడి చేస్తే, ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే ధ్యానం చేసేటప్పుడు… నిస్వార్ధంగా చేయాలి.  నిష్కామ కర్మగా చేయాలి. ఎలాంటి కోరికలు… అవసరాలు లేకుండా చేయాలి.  వేటి గురించి ఆలోచించకుండా,ఆశించకుండా చేసుకోవాలి.  అంతేగాని ఆలోచనలు వస్తున్నాయి కదా!  అని ధ్యానాన్ని ఆపివేయకూడదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి.  వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించుకోకూడదు. ఈరోజు ఏం ఆలోచనలు వచ్చాయి…  ఎన్ని ఆలోచనలు వచ్చాయి అని…. ఆలోచించడం కూడా ఆలోచన అవుతుంది.  కాబట్టి ఆ ఆలోచనలు వాటంతట అవే, నీకు తెలియకుండా ఎలాగైతే వస్తున్నాయో…. అలాగే నీకు తెలియకుండా అవే వెళ్ళిపోతాయి.  అవి వెళ్లిపోయేదాకా ఓపిక, శ్రద్ధ, భక్తి, మనలో ఉండాలి. ఇది ఒక రోజు పట్టొచ్చు….ఆరు నెలలు పట్టొచ్చు…. కుండలినీ శక్తి జాగృతి అవుతుంది అంటే నీకు తెలియని మనోవేదన మొదలవుతుంది. శరీరంలో నొప్పులు మొదలవుతాయి… ఇవన్నీ కూడా ఏంటంటే,  జన్మాంతరంలో నువ్వు తెలిసో తెలియకో చేసిన దోషాలన్నీ కూడా శరీరంలో ఉన్న 303 ఎముకల్లో ఉంటాయి.  ఆ ఎముకల్లో చేసిన పాపాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ పాపాలను ప్రక్షాళన చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఆవేదనలు, ఆవేశాలు కలుగుతూ ఉంటాయి. ఒకళ్ళ మీద అకారణంగా కోపాలు కలుగుతాయి. ఒకళ్ళ మీద అకారణంగా ప్రేమలు కలుగుతాయి. ఒకళ్ళ మీద అకారణంగా ప్రేమ, ద్వేషాలు, కామోద్రేకాలు కలుగుతాయి. ఏమి కలిగినా కూడా మనసును అదుపులో ఉంచుకోవాలి. అలా అని బలవంతంగా నీ మనసును ఆధీనం చేసుకోవద్దు. నీ మనసుకి, నీ ధ్యానాన్ని అనుసంధానం చేయాలి. అది ఇష్టపడేటట్లుగా చేయాలి.. కష్టపడేలా చేయకూడదు ..అది మాత్రం గుర్తుపెట్టుకో! 


శివనందిని:– సరే స్వామి! మీరు చెప్పినట్టు మనసు ఇష్టపడే విధంగా చేయాలి …దానికి కాస్త సమయం పడుతుందని అర్థం అయింది.  అలాగే వచ్చే ఆలోచనలు, ఆవేదలు ,ఆవేదనలు, ఆవేశాల గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు నేను సంసార బాధ్యతలు వదిలేసి సన్యాసం తీసుకోవడం సరి అయినదేనా? ….


శివానంద:– అమ్మ!  కర్మానుసారం అన్నీ జరుగుతాయి. ఋణానుబంధం ఉన్నంతవరకే బంధాలు, బాధ్యతలు ఉంటాయి.  ఋణం తీరిన తర్వాత ఎవరికి వారే యమునకు తీరే! ఇప్పుడు నువ్వు కావాలి అని నువ్వేం తీసుకోలేదు కదా!  అతను చేసిన తప్పు వలన నీకు మానసిక క్షోభ కలిగింది. ఆ తప్పును సరి చేసుకోమని అవకాశాలు ఇచ్చావు. ఆయన అక్రమ సంబంధాలు కావాలి… దానితో పాటు నువ్వు కావాలి…. నీ పిల్లలు కావాలి అంటున్నాడు…. అందరిలోనూ నిన్ను కలుపుతున్నాడు… నీకంటూ భార్య అని గుర్తింపు ఇవ్వట్లేదు.  ఊర్లో ఉన్న భార్యలంతా ఆయన భార్యలే! అన్నప్పుడు…. ఇక భార్య స్థానం లేనప్పుడు…. నువ్వు అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు. ఋణాను బంధ రూపేణా  బంధాలు అని అంటారు కాబట్టి… ఋణం వచ్చింది…తీరింది…. వెళ్ళిపోయింది. …. అతను వచ్చాడు, వెళ్లిపోయాడు.  వెళ్ళిపోయిన వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు. ఇప్పుడేమైనా అతను ఆలోచిస్తున్నాడా?లేదు కదా!  అతను ఈపాటికి వేరే పెళ్లి చేసుకుని ఉంటాడు.  లేదా వేరే దాంతో కులుకుతూ ఉంటాడు. తన సంసార సుఖం తను చూసుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు…. నువ్వు ఎందుకు వాటి గురించి ఆలోచనలు చేయడం…. నువ్వు వచ్చింది దేనికి!  వాడిని వదిలించుకున్నావు… శారీరకంగా వదిలించుకున్నావు…. మానసికంగా నీ సంతానం గురించి…. వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే….ఉపయోగం ఏమిటి?  నువ్వే ఆలోచించు.  నువ్వేం చేస్తున్నావు?  సన్యాసం  తీసుకున్నా కూడా ఉపయోగమేముంది.  మానసికంగా నువ్వు క్షోభ పడుతుంటే ఉపయోగం ఏముంది… లేదు కదా!  ఆ క్షోభ నుంచి నువ్వు బయటికి రా! కుండలినీ శక్తి జాగృతమవుతుంది అన్నప్పుడు…. మానసిక క్షోభ …శారీరక సమస్యలు వస్తాయి.  అది గుర్తుపెట్టుకో!  వాటిని నువ్వు అదుపులో ఉంచుకో!  తట్టుకునే స్థితి నీ శరీరానికి,  నీ మనసుకి ఇవ్వు. అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు కోపావేశాలు శత్రుత్వంపెంచుకోవడం ….మిత్రుత్వం పెంచుకోవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు….

 

శివనందిని:– అంటే రోజు సాధన చేసుకుంటూ ఉంటే …ఆలోచనలన్నీ తగ్గుతాయి అంటారా!  అంతేనా!  


శివానంద:– రోజూ కూడా సాధన చేసేటప్పుడు… క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా చూసుకో!  అంటే నువ్వు ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకో. ఆ సమయానికి గురు మంత్రం చేసుకోవాలి… పంచభూతాలు అడ్డం వచ్చినా ….లేక పంచ పాశాలే అడ్డం వచ్చినా …. ఋణాలే అడ్డం వచ్చినా …. ఏదోచ్చినా కూడా…. వాటిని పక్కన పెట్టేయాలి . ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానంలో కూర్చోవాలి అని పెట్టుకుంటే…. ఆ సమయం ఇంక దేనికి కేటాయించకూడదు… లేదా ఒకరోజులో మొత్తం ఒక గంట ధ్యానంలో కూర్చోవాలి అనుకున్నప్పుడు…. ఆ గంట నిర్దేశం చేసుకో!  ఆ గంట దైవానికి ఇచ్చేసేయ్యి.  దైవ సన్నిధానంలో ఉన్నానని మానసికంగా అనుకో. కష్టసుఖాలు చెప్పుకో.  నువ్వు చేసిన తప్పులు ఆయన ముందు ఒప్పుకో!  మొదట ఒక దైవాన్ని నమ్ముకో…. విగ్రహారాధన చేసుకో….మానసికంగా ఆయన ఉన్నాడని ఆలోచన చేసుకో… దానిమీద మనస్సు స్థిరం చేసుకో…. విగ్రహారాధన చేస్తే నిగ్రహం వస్తుంది.  ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటాయి.  వచ్చే ఆలోచనలు వాటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి….. మానసికంగా సమస్యలు ఏమి వస్తున్నాయి…. శారీరకంగా సమస్యలు ఏం వస్తున్నాయి…. అనారోగ్య సమస్యలు ఏమి వస్తున్నాయని…. వీటి గురించి నువ్వు ఆలోచించవద్దు.  నువ్వు చావాలనుకుని సాధన మొదలు పెట్టావు.  చావాలనుకున్నప్పుడు బతకడానికి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇదం  శరీరం పరోపకారార్ధం . ఈ శరీరం ఇక సాధనకి ఉపయోగపడాలి.  ఆదిదంపతులకే ఉపయోగపడాలి… ఆది దంపతుల సన్నిధానంలోనే నీ ప్రాణం వదిలిపెట్టాలి అని మానసికంగా,  శారీరకంగా నిర్ణయం తీసుకో!  శాసించుకో!  అంతేగాని ఈ శరీరం వేరే వాళ్ళకి ఇవ్వాలి…. వేరే వాటికి ఉపయోగించాలి అని ఇన్నాళ్ళు భోగ జీవితంలో నువ్వు చేసావు.  కానీ దీని వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నావు. ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాల జన్మల నుంచి చేస్తూనే వచ్చావు అని తెలుసుకున్నావు.  కాబట్టి ఈ జన్మని అంతిమ జన్మ చేసుకుని…. జీవ జగన్నాటకంలో నీ పాత్ర లేకుండా చేసుకో!  శాశ్వత మోక్షం పొందు !  విశ్వ శూన్యంలో శూన్యం అవ్వు .దానికోసం సాధన చెయ్యి…..


శివనందిని:– సరే స్వామి!  మీరు ఏ విధంగా సాధన చేశారో చెప్తారా?


శివానంద:– నా సాధనా విధివిధానం నీకు చెబుతాను. అదే అమలు చేయమని చెప్పను . నాకు నచ్చినట్టుగా…. నా  విధి విధాన సాధన ఉంటుంది.  ఇప్పుడు నాకు మిరపకాయ బజ్జీలు తినడం ఇష్టం.  అది అందరికీ నచ్చాలని లేదు కదా!  కొంతమందికి కారంపూస అంటే ఇష్టం. కొంత మందికి బూందీ ఇష్టం.  కొంతమందికి స్వీట్ ఇష్టం . అలా ఎవరి రుచికి తగ్గట్లుగా ఉంటుంది. ఒకరి సాధనని మనం మన సాధన అనుకుని చేయడం వల్ల , ఎలాంటి ఉపయోగం లేదు.  మన మనసుకి ఏ  సాధన విధానం నచ్చుతుందో….. ఆ సాధన విధానంతో ఇష్టపడి చేసుకుని… ఆ సాధనా స్థితిని పొందు. అంతేగాని కష్టపడి సాధన చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. అని తెలుసుకో! మనసు ఎప్పుడైతే జాగృతి అవుతుందో…. ఎప్పుడైతే ధ్యానానికి కూర్చొమని అంటుందో…. అప్పుడు ఆ సమయాన్ని గుర్తించు.  ఓహో ! ఈ సమయంలో ధ్యానం చేసుకోవాలని అనిపిస్తుంది అంటే ఆ సమయంలో చేసుకో!  అది ఐదు నిమిషాలు అయినా ….పది నిమిషాలు అయినా….. ఒక అరగంటైనా…. పావుగంటైనా…. గంటైనా…. వదిలేసేయి. నీ మనసు రెండు సెకండ్లు ధ్యానంలో స్థిరంగా నిలబడిన చాలు.  నీకు ధ్యాన ఫలితం ఉన్నట్టే.  అంతేకానీ గంటలు గంటలు ధ్యానంలో కూర్చున్నా….ఇష్టం లేకుండా ధ్యానం చేసినా …..ఉపయోగం లేదు. ఇష్టపడి రెండు నిమిషాలు ధ్యానం చేసినా రెండు సంవత్సరాల ధ్యాన ఫలితం ఇవ్వచ్చు.  కష్టపడి 24 గంటలు ధ్యానం చేసినా రెండు క్షణాల ధ్యాన ఫలితం ఇవ్వచ్చు.  కాబట్టి ధ్యానం,  చేసే మనసును బట్టి ఉంటుంది.  మనసు యొక్క ఇష్టం బట్టి…. సాధనా విధి విధానం ఉంటుందని తెలుసుకో!  నా సాధన విధి విధానం చెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  నేను ఉదయం 2:30 కి లేగుస్తాను.  ఎందుకంటే దేవతలు సుప్రభాత సేవ చేసే సమయం కాబట్టి.  2:30 కి లేచి ముఖ  ప్రక్షాళన చేసుకుని…. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగి …ఆ తర్వాత స్నానాదికాలు, ప్రకృతి కార్యాలు పూర్తి చేసుకుని…. మూడు గంటలకు ధ్యానంలో కూర్చుంటాను.  ఓంకార నాదం చేసుకుంటాను. అలా ఓంకార నాదం చేసుకుంటూ ఆరు గంటల దాకా ఉంటాను. ఆరు గంటలకు మేడ పైకి వెళ్లి సూర్యుడు ఎదురుగా కూర్చుంటాను.  8:30 దాకా ఆయన నుంచి వచ్చే సూర్యరశ్మిని తీసుకుంటాను.  సూర్యరశ్మిలో ‘డి’ విటమిన్ ఉంటుంది.  ఇది ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది.  శక్తిని ఇస్తుంది.  వ్యాధి నిరోధకశక్తిని సహజసిద్ధంగా పెంచుతుంది.  మనోవికారాలు కలగకుండా… ఆ సూర్యరశ్మిశక్తి  ఆ శక్తిని అందిస్తుంది.  ఎనిమిదిన్నరకి కిందకి దిగుతాను.  10 గంటలలోగా అల్పాహారం తీసుకుంటాను.  లేదంటే హోటల్ కి వెళ్ళి తినటము చేస్తాను.  ఆ తరువాత 10 గంటల నుంచి 1:00 దాకా ధ్యానంలో కూర్చుంటాను.  ఓంకార నాదం చేసుకుంటాను. అది పడుకుని చేసుకుంటాను లేదా కూర్చొని చేసుకుంటాను. ఇక నా శరీరాన్ని బట్టి… నా తత్వాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్యలో భోజనాధి కార్యక్రమాలు చేసుకుంటాను. ఆ తర్వాత రెండు నుంచి మూడు గంటల వరకు విశ్రాంతిగా పడుకుంటాను. ఇక 20 నిమిషాలు అలా నిద్రపోతాను.  ఎక్కువసేపు పడుకోను. ఆ తర్వాత మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యానంలో కూర్చుంటాను…. లేదా  8:00 వరకు కూర్చుంటాను.  8:00  గంటల నుంచి 9 గంటల మధ్యలో రాత్రి భోజనం, టిఫిన్ చేయడం చేస్తాను.


ఇక 9 గంటల నుంచి 12 గంటల వరకు యోగ నిద్రలో  ఉండి ధ్యానం చేసుకుంటూనే…. కళ్ళు మూసుకొని నిద్రపోతాను.  మళ్ళీ 2:30 కి  ఎలాంటి అలారం లేకుండా…. ప్రకృతి సిద్ధంగా మెలకువ వస్తుంది. ఆ మెలకువతో మళ్ళీ యధావిధిగా నా దినచర్య వెళ్ళిపోతుంది.  ఈ విధంగా నేను సన్యాసం తీసుకున్నప్పటినుంచి…. నా ధ్యాన విధానం ఉండేది. అదే భోగ ప్రపంచంలో ఉన్నప్పుడు 10 నుండి 5 గంటల వరకు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండేవాడిని.  అప్పుడప్పుడు రోజు మానసికంగా….ఈ ఏడు గంటల పాటు ఓంకారం చేసుకుంటూ ఉండేవాడిని.  ఇది నాకు మనసుకు నచ్చింది.  ఈ ఓంకార నాదం వలన మనసు స్థిరపడేది. నాకు మంత్ర గురువు గాయత్రీ మహా మంత్రం ఇవ్వడం జరిగింది.  గాయత్రి మహా మంత్రం ఉపాసన చేసేవాడిని.  ఈ ఉపాసన అక్షర లక్షలు పూర్తి చేశాను.  24 లక్షల గాయత్రి పూర్తి చేశాను.  వాక్ సిద్ధి వచ్చింది.  రాబోయే మూడు రోజుల సంఘటనను నేను ముందుగానే పసిగట్టి చెప్పేవాడిని… విశ్లేషణ శక్తి పెరిగేది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి?  అని చూస్తే వాళ్ళ తలరాతలు తెలుస్తూ ఉండేవి.  నేను చెప్పిందే శాసనంగా అయ్యేది. ఇవన్నీ వచ్చిన తరువాత వాక్సిద్ధి  సిద్ధుల లోకి వెళ్తుంది అని….108 లేదా 1008 సార్లు చేసి ఆపివేసే వాడిని.  ఆ తర్వాత అనుకోకుండా నాకు దీక్షా మంత్రంగా ఓంకార నాదం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మూలమంత్రాలు అన్నింటిలోనూ గాయత్రీ మహా మంత్రమే మూలం అంటారు.  ఈ మంత్రానికి మూలం ఓంకార నాదం. ఈ ఓంకార నాదం చేయాలి అంటే సన్యాసికి మాత్రమే అర్హత, యోగ్యత ఉంది.  ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఎవరు చేసినా కూడా ఓంకారం ఉపయోగం ఉండదు. సన్యాస దీక్ష తీసుకున్న వాళ్లు మాత్రమే ఓంకార నాదం చేయాలని….. యోగ వాశిష్టంలో చెప్పడం జరిగింది.  కాబట్టి అప్పటినుంచి నేను ఓంకార నాదం చేయాలని అనుకున్నాను.  అలాగే మన సాధనలో పదవదేహం అయిన పిండదేహం కూడా ఓంకార నాదంతోనే బంధనం అవుతుంది…..అని పరమహంస ధ్యాన అనుభవాలలో తెలిసింది కదా!  ఆ ఓంకార బంధం నుంచి బంధ విముక్తి అవ్వాలంటే ….సాధకుడు ఓంకార నాదం చేయాలని చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి నేను ఓంకార నాదం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక వెయ్యి గాయత్రి చేసుకుంటూ….గాయత్రీ జపశక్తి పొందాను.  మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడు ఉన్నాయని గుర్తు పెట్టుకో! నువ్వు ఏ విధంగా వెళ్లినా… సాకార ధ్యానం చేసినా …నిరాకార ధ్యానం చేసినా ….మనసుపెట్టి చెయ్యి. నీకు రూపం కావాలంటే రూపం ఊహించుకొని భావించుకొని, స్వప్నంలోనూ, ధ్యానంలోనూ కనబడేటట్లు చూసుకో. ఆ రూపమే నీకు సాక్షాత్కారం అవుతుంది. దానినే దైవసాక్షాత్కారం అంటారు.  లేదు రూపం వద్దు, భావం వద్దు అనుకున్నప్పుడు…. నిరాకారంలోకి వెళ్ళు.  ఆ నిరాకార తత్వంలో ఉన్నది ఏంటి?. అనేది నీకు తెలుస్తుంది.  యద్భావం తద్భవతి.  నువ్వు ఏ భావనతో సాధన చేస్తావో…. అదే నీకు కనపడుతుంది.  కనిపించేది అసత్యము…. కనిపించనిది సత్యము… అనేదాకా నీ సాధన పరిసమాప్తి కాదని గుర్తుపెట్టుకో! అన్నప్రాసన రోజే ఆవకాయ తినాలంటే కుదరదు.  నీకు నెమ్మది నెమ్మదిగా ఆలోచనలు పోతూ ఉంటాయి అనేసరికి…. 


శివనందిని:– సరే స్వామి!  ధ్యానం అనేది క్రమం తప్పకుండా,  వేళ తప్పకుండ చేయాలి అన్నారు.  సరే మీరు చెప్పిన విధివిధానములో మీ సాధనను చెప్పారు.  అవన్నీ నాకు కూడా సాధ్యపడతాయి.  నాకేం పెద్ద సమస్య కాదు.  అలాగే సాధనా విధివిధానములో నేను అయితే ముద్ర విధివిధానంతో  చేసుకోవాలని అనుకున్నాను.  ఆ ముద్రలు చక్ర జాగృతికి ఉపయోగపడతాయని ….పరమహంస గారు చెప్పిన యోగ దర్శనం అనే గ్రంథంలో చదివి తెలుసుకున్నాను.  చదివిన తర్వాత అర్థమయింది అది చదివిన తర్వాత నేను ముద్రా విధానం ద్వారా సాధన చేసుకోవాలనుకుంటున్నాను.  ఇప్పుడు ఆలోచనలు ,ఆవేశాలు ,ఆవేదనలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్తున్నారు. అసలు నాలో కుండలినీ శక్తి జాగృతి అయ్యింది అని…. నాకు ఎలా తెలుస్తుంది..


శివానంద:–అమ్మ తల్లి!  నీలో కుండలినీ శక్తి జాగృతి అయ్యింది అంటే…. నీలో ఆవేదనలు, ఆవేశాలు, అకారణంగా కలుగుతాయి.  నువ్వు ఆపాలనుకున్న ఆపలేవు.  రెండోది…. అకారణంగా మీ కుటుంబ సభ్యులు, మీ సంతానం లేదా నీ భర్త పిల్లలు గుర్తుకు వస్తారు…. నీ తల్లితండ్రులు గుర్తుకు వస్తారు….. వాళ్లతో గడిపిన సంఘటనలు గుర్తుకు వస్తాయి…. వాళ్లతో నువ్వు తెలిసి చేసినవి, తెలియక చేసినవి…. తప్పులు గుర్తుకు వస్తాయి.  ఒకటి నీలో ఆవేదన మొదలయ్యింది అంటే కుండలిని శక్తి కదలికలు మొదలైనట్టే గుర్తు.  అది కూడా అదుపు లేని అంతులేని కథ లాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు అదుపు చేయాలన్నా… చేయలేవు.  అదే  కుండలినీ శక్తి నీలో జాగృతి అయినప్పుడు…. ఏదో తెలియని ఆనంద స్థితి కలుగుతుంది. ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అది క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఈ ఆనంద స్థితి దీర్ఘ కాలం ఉంటే బాగుండును  అని మనసు కోరుకుంటూ ఉంటుంది. అంటే కదులుతున్న లోలకము ఒక్కసారిగా ఆగిపోతే ఎలా ఉంటుందో….. ఊగుతున్న మనసుకు కూడా నెమ్మదిగా ఆగిపోవడం మొదలవుతుంది. అప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతి అయినట్టే లెక్క.  కుండలినీ శక్తి జాగృతికి,  కదలికకి తేడా ఏంటంటే… కదలిక అంటే నీళ్లలో చేప ఒడ్డున పడితే ఎలా కొట్టుకుంటుందో…. ప్రాణాపాయ స్థితిలో,  ప్రాణం పోయే సమయంలో ఎలా అయితే కొట్టుకుంటూ ఉంటుందో…… అలా నీలో కుండలిని శక్తి కదులుతుందన్నమాట!  ఇది చీమలు పాకినట్లుగా ఉందని కొంతమంది చెప్తారు.  పాము పాకినట్టుగా ఉందని కొంతమంది చెప్తారు. కొంతమందేమో చేపలు కదులుతున్నట్టుగా ఉందని చెబుతారు.  కొంతమంది తాబేలు కదలికలాగా ఉందని చెబుతారు.  కొంతమంది హృదయ స్పందన లాగా వినపడుతుందని చెబుతారు.  ఎవరికి తగ్గట్టుగా ప్రకృతి వారికి ఇచ్చింది. అలాగే కుండలిని శక్తి జాగృతి అంటే ఎప్పుడైతే అజ్ఞాన గ్రంధి విభేదన జరుగుతుందో….. ఆ అజ్ఞాన మాయ పొర పోతుందో…. సంతానం ,కుటుంబం, తల్లిదండ్రుల గురించి….అత్తమామల గురించి…. లేదంటే కుటుంబ సభ్యుల గురించి…. కుటుంబ మిత్రుల గురించి… ఆత్మబంధువులు ,బంధుమిత్రుల గురించి…. అంటే బంధాలు, బాధ్యతలు గురించి…. ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తుందో…. నువ్వే ఉన్నావు, నువ్వే శాశ్వతం, నువ్వే సత్యం, నువ్వు ఎవరో తెలుసుకో అని మనసు ఎప్పుడైతే కోరుకుంటుందో….. తెలుసుకోమని ఆజ్ఞ ఇస్తుందో….. తెలుసుకోవడానికి మనసు తపన పడుతుందో….. అప్పుడు కుండలిని శక్తి జాగృతి అయినట్టు.  అంటే కుండలిని శక్తి నీ మూలాధారం లోకి ప్రవేశిస్తే అక్కడి నుంచి మన శరీరంలో ఉన్న 13 చక్రాలలోనికి ఆ కుండలినిశక్తి కాలానుగుణంగా ప్రవేశం జరుగుతూ ఉంటుంది.  ఇది కుండలిని శక్తి జాగృతికి…. కుండలినీ శక్తి కదలికకి ఉన్న తేడా.!  దానిని బట్టి ప్రస్తుతం నీ సాధన కుండలిని శక్తి కదలికలో ఉందని అర్థం అయ్యి ఉంటుంది. అలాగే పరమహంసకి కపాలమోక్షం తొలి అధ్యాయం కూడా నా ఏడుపే నా తొలి గురువు అని చెప్పడం జరిగింది కదా!  ఇప్పుడు నీ ఏడుపు సాధనలో నీ సాధన ఆరంభం అయ్యిందని గుర్తుపెట్టుకో!  కుండలినీ .శక్తి కదలికలు ఆరంభం అయినాయని గుర్తు పెట్టుకో!  ఇప్పుడు సాధన అనేది సాంగత్యంతోనే సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకో!  సాధకుల సాంగత్యం కానీ….గురువుల సాంగత్యం కానీ……నువ్వు సాధన చేస్తే వాళ్ళ సాధన అనుభవాలు….. వాళ్ళకి కలిగే సాధన అనుభవాలు సరిపోతున్నాయని….. లేదా ఎక్కడైనా ఇది అవుతున్నాయా? కొత్త కొత్త అనుభవాలు ఏమైనా పొందుతున్నారా? ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి.. తెలుసుకునే అవకాశం ఉంటుంది.  అందుకని సాధన అనేది సాంగత్యంగా చేయాలి అని పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ  నిజ సాధకులు ఎవరు? నిజగురువులు ఎవరో తెలియడం కష్టం. ఎందుకంటే ఈ కలి ప్రభావం వలన ఈ కలియుగంలో నూటికి 90% మంది లేదా 80 శాతం మంది నకిలీ గురువులు, నకిలీ సాధకులు ఉంటారు.  ఇతరుల యొక్క మానాలు,  ధనాలను ఆశించే వారే ఉంటారు. కాషాయ వస్త్రం ధరించిన ప్రతివాడు…. సన్యాసికాడని గుర్తుపెట్టుకో!  దానిని భక్తి వ్యాపారం కోసం…. పొట్టకూటి కోసం…. ఆకలి కోసం….. నూటికి ఎనభై శాతం మంది ఈ అవతారం ఎత్తే వాళ్ళు ఉంటారు.  నిజసాధకులు, నిజగురువులు లోకానికి తెలియకుండా గుప్త సాధనలో ఉండి గుప్తయోగులుగా ఉంటారు.  వాళ్ళు ప్రకృతి ఆదేశాల ప్రకారం కాలానుసారంగా….. కర్మానుసారంగా…. నిజసాధకుల దగ్గరికి వచ్చి మంత్రోపదేశము…. గురు ఉపదేశము ఏదో వాళ్ళకి తోచిన విధి విధానం చెప్పేసి మౌనంగా వెళ్ళిపోతారు.  ఏకాంతంగా ఉన్న ప్రపంచంలోనికి వెళ్లిపోతారు.  వాళ్ళు ఎవరు? ఏంటి?  అనేది గుర్తుపట్టడం కష్టం. చూడటానికి వాళ్ళు బాలోన్మత్త పిశాచ అవస్థ పొందిన అవధూతల్లాగా ఉండవచ్చును. పిచ్చి వాళ్ళ లాగా ఉండవచ్చును…. ఎలా ఉంటారు…. ఏ విధంగా ఉంటారు…. అన్నది మనకి తెలియదు.  కాలమే నిర్ణయం చేయాలి.  ఎవరు నకిలీ గురువు, ఎవరు నిజ గురువు అన్నది మనకి తెలియదు.  ఎవరు నకిలీ సాధువు, ఎవరు నిజసాధకుడు అనేది కూడా కాలమే చెప్పాలి.  కాలమే పరిచయం చేయాలి. అలా పరిచయమైన వారిని మనం ఒకటికి పది సార్లు పరీక్ష పెట్టుకోవాలి. వాళ్లు కూడా మనకి ఒకటికి పది సార్లు పరీక్ష పెడతారు.  ఆ పరీక్షల్లో మనం జయం పొందితే …..వాళ్ళకి నచ్చితే…. వాళ్లు మెచ్చే విధంగా ఉంటే….వీళ్ళు సాధనకి పనికి వస్తారు.. వీళ్లది మోక్షజన్మ అని తెలుసుకుంటే… వాళ్ళు చేయవలసింది చేసి…. చెప్పవలసింది చెప్పి మౌనంగా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు.  వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు.  వాళ్ళు గుప్తంగా ఉండి… గుప్త సాధన చేసి లుప్తమవుతారు.  అది మాత్రం గుర్తుపెట్టుకో!  ఇక  ఇవాళ నుంచి నువ్వు నా సమక్షంలో,  నా సాంగత్యంలో సాధన ఆరంభించు….


 అనేసరికి సరే స్వామి!  నాకు అంతకన్నా భాగ్యం ఏముంది.  సాధనకి సహాయ సహకారాలు అందిస్తానన్నప్పుడు…. మీ సాంగత్యంలోనే నేను సాధన చేస్తాను.  నాకు ఎలాంటి అభ్యంతరం లేదు….. అనేసరికి ఆయన ఇక సాధనా మంత్రం చేయడం ప్రారంభించాడు.  అనగా ఓంకార నాదం చేయడం ఆరంభించాడు.  ఆయన ఓంకార నాదం చేయడం ఆరంభించగానే…. ఈమె ఓంకార నాదం చేయడం ఆరంభించింది.  అలా దాదాపు 45 నిమిషాల పాటు చేస్తూ ఉంటే…. అదే విధంగా ఈమె కూడా ఓంకార నాదం చేస్తూ ఉంటే…. తనలో ఏదో తెలియని ఆనందం, సంతోషం, బాధలు తగ్గిపోవడం…. శారీరక  బాధలు తగ్గుతూ రావడం…. మానసిక బాధలు తగ్గుతూ రావడం… చెప్పలేని స్థితి పొందుతున్నట్టుగా… అలవికాని సంతోషం పొందుతున్నట్టుగా…. మనసు ఉర్రూతలు వేస్తూ ఉండేసరికి…. కామ వికారాలు కూడా తగ్గుతూ ఉండేసరికి….తను ఒంటరిగా ఏకాంతంగా సాధన చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవాలన్నీ కూడా ఈయన సమక్షంలో, ఈయన సాంగత్యంలో అవన్నీ కూడా తగ్గిపోతున్నాయని గ్రహించింది.  కాబట్టి సాధనకి సాంగత్యం చాలా అవసరం అని గ్రహించి…. ఓంకార నాదం మనసుపెట్టి చేస్తున్న కొద్ది ఈయన ఉన్నట్టుండి ఆ ఓంకార నాదమును తగ్గిస్తూ మౌనంగా ఉండేసరికి, ఈమె కూడా ఈ ఓంకార నాదమును తగ్గిస్తూ మౌనంగా  ఉండిపోయింది . ఎంతసేపు వీళ్లిద్దరూ ధ్యానంలో ఉన్నారో… కాలమే తెలియలేదు.  కళ్ళు తెరిసేసరికి సాయంత్రం ఏడు గంటలు అయింది అని అర్థం అయింది.  


అమ్మాయి! శివాని….నువ్వు నా సమక్షంలో మనసు తెలియని స్థితిలో, శరీర స్పృహ లేని స్థితిలో… సుమారు మూడు గంటల పాటు నిలబడ్డావు , ఇదే సాధన యొక్క మంత్రోపదేశ ఫలితం కాబట్టి…. సాధన ఎలా చేసుకోవాలి? ఏమిటి అనేది? నీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి…. గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుని…. ఆహారం తిని, మళ్లీ నువ్వు ఏకాంతంగా ఒంటరిగా ధ్యానం చేసుకో!  ఎంతసేపు ధ్యానం చేసుకోవాలనిపిస్తే… అంతసేపు చేసుకో!  నీకు ధ్యానమే ధ్యాస గా ఉండాలి. ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు… సాధన గురించి ఆలోచించు. బంధాల గురించి బాధ్యతల గురించి నీకు సంబంధం లేదు. ఇవి కొత్తగా పుట్టుకు వచ్చిన బంధాలు.  వీటివల్ల ఉపయోగం లేదు. భోగ జీవితంలోనూ,  యోగ జీవితంలోనూ మనకి బంధాలు, బంధనాలు, బాధ్యతలు వస్తాయి.  ఇవి భోగ జీవితంలో మనం వాటిని అంటిపెట్టుకొని ఉండక తప్పదు. అదే యోగ జీవితంలో వీటిని అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు.  వాళ్లకి కావలసిన అవసరాలు…. నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళకి తీరిపోతాయి.  వాటి మీద ధ్యాస తగ్గించు.  ధ్యానం మీద ధ్యాస పెట్టుకో!  ధ్యానమే ధ్యాసగా చేసుకో! గురు మంత్రం చేసుకుంటూ ఉండు…..సహజసిద్ధంగా ఎలా అయితే ఆలోచనలు వస్తూ ఉంటాయో….అదేవిధంగా ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.  ఆవేదన చెందాల్సిన అవసరం లేదు.  నువ్వు ఎప్పుడో తప్పులు చేశావు… ఈ జన్మకి కారణాలు పొందావు… ఈ పాపాలు చేశావు… వీటివల్ల అని చెప్పి, ప్రకృతి ధ్యాన దృశ్యాలు చూపిస్తుంది. వాటిని విని సాక్షిభూతంగా చూస్తూ వదిలెయ్యి . వాటి గురించి ఆలోచనలు చేసి మనసుని ఆవేదనపరచుకోకు . ఏడుపు అదుపులో ఉంచుకో… భయపడాల్సిన అవసరం లేదు… ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో…. ధ్యానంలో చూపించే ధ్యాన దృశ్యాలు అన్నీ కూడా నిజాలు కాదు. అవన్నీ అసత్యాలే. ఇక మన మానసిక పరిస్థితి ఎలా ఉంది అని ప్రకృతి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వాటన్నింటినీ మనం మానసికంగా, శారీరకంగా సాక్షిభూతంగా చూస్తూ… సరే జరిగిందేదో జరిగిపోయింది….అంతా మన మంచికే అని అనుకో! ఇవన్నీ కూడా గత జన్మలో జరిగిన సంఘటనలే….ధ్యాన దృశ్యాలే….అని తెలుసుకో!  ఇవన్నీ కూడా ప్రస్తుత జన్మవి కావని గ్రహించు.  అంతేకానీ వాటిని చూసి నువ్వు భయపడ్డావా……!  నీ మనసు బలహీనమై పోతుంది… బలహీనమైన మరుక్షణమే అది ధ్యానానికి పనికిరాదు.  ధ్యానంలో కూర్చోమన్నా…. కూర్చోలేవు.  ధ్యానము అంటే ఒకచోట కూర్చుని చేసేది కాదు… ఏ పని చేసినా కూడా అది ధ్యానం కిందకే వస్తుంది… అని గ్రహించు. అంతే!  అని చెప్పి ఆయన ఉన్నట్టుండి అంతర్ధానం అయ్యేసరికి…. యోగ విద్యలో సిద్ధి పొందిన వాడికి ….ఇదేం పెద్ద విద్య కాదని మనసులో అనుకుని …..ఆయనకి నమస్కారం చేసి,  శివ నందిని అక్కడి నుంచి సత్రం ఉన్న గది వైపుకి  శరవేగంతో బయలుదేరింది. 



ఇలా శివనందిని గదికి వెళ్ళేసరికి… గదిలో పిల్లలు ఈమె కోసం ఎదురుచూస్తూ కనిపించారు. అయ్యో పాపం!  అనుకుంటూ…. ఎరా పిల్లలు…. భోజనాలు చేశారా?  అంటే లేదమ్మా!  నీకోసమే ఎదురు చూస్తున్నాము.  నువ్వు ఏదో ధ్యానం చేసుకోవడానికి… రుద్రాక్ష మఠానికి వెళ్ళావని బాలగణపతి అనేసరికి… సరే పదండి!  అందరం కలిసి భోజనం చేద్దాం అనేసరికి… అందరూ కిందికి వచ్చారు.  భోజనాలు కావాల్సిన వాళ్ళు భోజనాలు చేస్తున్నారు.  టిఫిన్లు కావలసినవారు టిఫిన్లు చేస్తున్నారు. పిల్లలిద్దరికి కూడా శివ నందిని ప్రేమతో తన చేతుల మీదుగా పెట్టేసరికి…. వీళ్ళిద్దరూ తృప్తిగా తిన్నారు.  ఆ తర్వాత హోటల్ యజమాని వీళ్ళ దగ్గరికి వచ్చి… బాలగణపతికి ఉండ్రాళ్ళు,  బాల కుమారస్వామికి చలివిడి ముద్దలు ఇచ్చేసరికి, శివ నందిని కాస్త   మొహమాటపడుతూ… ఇబ్బంది పడుతూ…. సార్!  మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా పిల్లలు…. అనేసరికి,  ఏముందమ్మా!  ఇబ్బంది.. ఆహార పదార్థాలు ఎటూ వండాలి కదా!  కాకపోతే కొద్దిగా శ్రమ తీసుకొని చేయడమే.  పిల్లలు సంతృప్తి పొందుతారు కదా! ఒకరేమో కుమారస్వామి లాగా కనబడుతున్నారు.  ఒకరేమో బాలగణపతి లాగా కనిపిస్తున్నారు.  శివపుత్రులకే నేను పెడుతున్నాను.  ఆ యోగం అందరికీ రాదు కదా!  నేను దీన్ని బాధ్యతగా, భారంగా అనుకోను.  మీరేం దీనికి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.  నా సంతృప్తి కోసం పిల్లలు నన్ను అడిగారు.  కాబట్టి చేస్తున్నాను. నాకు ఉన్నంతలో నేను చేసి పెడుతున్నాను. వాళ్లకి అవి నచ్చాయి …..తింటున్నారు… వాళ్ల సంతృప్తి నాకు సంతృప్తి కలుగుతుంది… అనేసరికి బాలగణపతి కాస్త ఉన్నట్టుండి,  నా ఆకలి తీరుస్తున్నావు కదా అయ్యా!  నీకు కడుపు పండి నాలాంటి పిల్లలు పుడతారులే!  కంగారు పడమాకు…  నేను ఇక్కడి నుంచి వెళ్లే లోపల…. సంతానాన్ని ఇస్తాను. నాలాంటి వాడు పుడతాడు. వంశోద్ధారకుడు పుడతాడు లే ! అనేసరికి బాల కుమారస్వామి కూడా సంతానం నిలబడట్లేదు కదా!  నా దోషం వల్ల నీకు నిలబడట్లేదు….. ఎప్పుడైతే నాకు ఆహారం పెట్టావో ….నీకున్న సర్ప దోషాలు అన్నీ కూడా పోయాయి… మా తమ్ముడు చెప్పినట్టుగానే… నీకు సంతానం కలుగుతుంది.  మగ పిల్లవాడు పుడతాడు .ఆడపిల్ల పుడుతుంది. కంగారు పడమాకు…. అని పెద్దలు దీవించినట్టు, పిల్లలు దీవించేసరికి…. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు కదా!  అని సత్రం యజమాని నమస్కారం చేస్తూ ఉండేసరికి ….శివ నందినికి నోట మాట రాలేదు.


చిన్నపిల్లల్లో దైవత్వం చూస్తున్నాడే ఈయన!  అని అనుకొని….ఈయన సాధన పరిపక్వత ఎంత స్థాయికి వెళ్ళింది.   తను మాత్రం పిల్లల్లో పిల్లల్ని చూస్తుంది….పిల్లల్లో దైవాన్ని చూడట్లేదు. యజమాని మాత్రం పిల్లల్లో దైవాన్ని చూస్తున్నాడు.  వాళ్లు చిన్నపిల్లలు అయినప్పటికీ…. కూడా అతను వయసులో పెద్దవాడు అయినప్పటికీ కూడా…. బాల వాక్కు ,బ్రహ్మ  వాక్కు అన్నట్లుగా…. వీళ్ళని బాల దైవాలు అనుకొనే యజమాని భక్తికి… తన భక్తి ఏ పక్కకి సరి తూగదు కదా!  అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది.  రుద్రస్వామి ఈ విషయం గ్రహించి….ఏమీ తెలియని వాడిలాగానే,  అమ్మ ! శివానంద చెప్పిన శివబోధ విన్నావు కదా!  ఆయన చెప్పిన సాధన విధివిధానం చేసుకో ….శక్తిని జాగృతి చేసుకో… ఇప్పుడు శక్తిచే కదలికలు  మొదలయ్యి జాగృతి అవుతుంది.  మీ ఆవేదన,  ఆవేశాలు,  అకారణ కోపాలు తగ్గుతాయి. ఇవన్నీ కూడా  కుండలినీ జాగృతి యొక్క శుభ సూచనలే అని తెలుసుకో!  నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉండు.  మా వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు.  ఏ మఠంలోనో…ఏ గుడి ప్రాంగణంలోనో పడుకుంటాము.  నువ్వు గదిలో సాధన చేసుకుంటా అంటే వెళ్లి చేసుకో ఒంటరిగా అనేసరికి ….


అదేం లేదు స్వామి!  నేను రుద్రాక్ష మఠం దగ్గరికి వెళ్లి సాధన చేసుకుంటాను.  రేపు ఉదయం సూర్యోదయం సమయానికి గదికి వస్తాను… అనేసరికి …నీ ఇష్టం తల్లి!  జాగ్రత్త.. పాములు,  జర్రులు ఉంటాయి.  మండ్రగబ్బలు ,తేళ్లు ఉంటాయి… అనేసరికి ఇక వాటి గురించి నేను ఆలోచించట్లేదు.  ఇక పిల్లలు ఎలాగో… అవి కూడా పిల్లలతోనే సమానం.  కాకపోతే పాములు రూపంలోనో… తేళ్ళ రూపంలోనూ… తిరుగుతూ ఉంటాయి. అవి నా దగ్గరికి రాకుండా వాటంతటా అవే వెళ్ళి పోయేలాగా చూస్తాను.  వాటిని ఇబ్బంది పెట్టను. నేను ఇబ్బంది పడను. భయపడను .భయపెట్టను… అనేసరికి నీ ఇష్టం తల్లి!  సాధన పరిపక్వత స్థితికి నీ మనసును తీసుకొని వెళ్ళు.  కనిపించేది ఏది సత్యం కాదు… అనే స్థితికి వెళ్ళు.  నిజం కాదు అనే స్థితికి వెళ్ళు. ప్రకృతి మాత నీకు అంతా కూడా భయపెట్టే విధంగా పరీక్షలు పెడుతుంది.  ఎప్పటికప్పుడు వాటన్నింటినీ నీ వివేక బుద్ధితో…. విచక్షణా జ్ఞానంతో…. వాటిని దాటుకుంటూ వెళ్ళు.  అయితే మేము గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాము.  మేము ముగ్గురం అలాగే నువ్వు కూడా రుద్రాక్ష మఠానికి వెళ్లి సాధన చేసుకో!  అయినా నీకు రక్షణగా శివానంద కూడా అక్కడే ఉండి ఉంటారు…. అంటే ఆయన ఉన్నట్టుండి కనిపిస్తారు…. ఉన్నట్టుండి మాయమవుతారు…గాల్లో నుంచి వస్తారు…. గాల్లో కలిసిపోతారు… నాకు అర్థం కావట్లేదు అనేసరికి, సాధన సిద్ధి పొందిన యోగులకి అసాధ్యం అంటూ ఏమీ ఉండదు తల్లి! నీటిలో నుంచి కనపడతారు…. అగ్నిలో నుంచి కనబడతారు…. గాల్లో కనపడతారు… గాల్లో కలిసి పోతారు…. వాళ్లకి పంచభూతాలు అధీనంలోకి వెళ్తుంది.. కాలానికి అతీతులు. వాళ్ళు కాలం గురించి కూడా ఆలోచించరు.  పంచభూతాలను శాసించగలిగే స్థితిలో ఉంటారు.  ఇప్పుడు వర్షం రావాలి అనుకుంటే వర్షం పడుతుంది . అగ్ని దహనం అవ్వాలి అనుకుంటే అగ్ని దహనం అవుతుంది. ఏది కావాలంటే అది చేయగల సిద్ధ పురుషులు వాళ్ళు… ప్రకృతి విరుద్ధమైన పనులు చేయరు. స్వార్థం కోసం ప్రకృతిని వాడుకోరు.  అలాంటి వాళ్ళకే ప్రకృతి ఆధీనం అవుతుంది. ఆయన ప్రకృతిని ఆధీనం చేసుకున్న వారు. సాధన పరిసమాప్తి చేసుకున్నవాడు… కాబట్టి ఆయనకి సాధ్యాసాధ్యాలు అంటూ ఉండవు.  నాకు పంచభూతాలు ఆధీనం అయినాయి.  కాలం ఆధీనం అవ్వలేదు. ఆయనకి కాలం కూడా ఆధీనం అయిపోయింది పంచభూతాలతో పాటు…. ఆయన అంతిమ స్థితిలో ఉన్నారు.


కాకపోతే ఆయన వ్యక్తిగత మోక్షం ఏనాడో పొందాడు…ఆయన  లింగ దేహం ఏనాడో దహనం అయిపోయింది. కాకపోతే ఆకాశ శరీర దహనంలో దహనం చేసుకునే ముందు నీ యొక్క  ఋణం ఉంది అని తెలుసుకున్నాడు. ధర్మపత్ని ఋణం ఉందని తెలుసుకున్నాడు. ఆ ఋణం తీర్చాలి అని ఆగాడు. లేకపోతే ఆయన శరీర త్యాగం ఎప్పుడో చేసేసేవాడు. స్థూల శరీర త్యాగం కూడా చేసేవాడు. మోక్షమును పొందేవాడు. ఆయన వల్ల నీ సాధన ఆగిపోకూడదు. నీ సాధనకి ఆయన ఒక ఋణానుబంధంగా ఉన్నాడు అని తెలుసుకుని…. ఆ ఋణ విముక్తి చేయాలని ఆయనకి ఆయనే ఆగాడు. నిన్ను బంధ విముక్తురాలిని చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. ప్రకృతి నీకు భవబంధముల నుంచి విముక్తి కలిగించింది. ఇప్పుడు ఈయన సాధనా అనుభవాలు…. చెప్పే విధివిధానాలు… వీటిని నువ్వు నేర్చుకుంటూ , తెలుసుకుంటూ ఉంటే…. నిన్ను ఋణ విముక్తి చేస్తాడు. తద్వారా సర్వ బంధాలు…. సర్వ ఋణాల నుంచి విముక్తి పొంది,  కర్మజన్మ లేని మోక్ష జన్మకి నువ్వు వెళ్ళిపోతావు. ఇంక నువ్వు జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. నీకు ఇది అంతిమ జన్మ అవుతుంది. ఇదే మోక్ష జన్మ అవుతుంది. కాకపోతే అది వ్యక్తిగత మోక్షం అవుతుందా లేదా విశ్వమోక్షం అవుతుందా అనేది కాలమే నిర్ణయం చేయాలి. నీకు చివరిదాకా నాకు తెలిసినంతవరకు… శివానంద తోడునీడగా ఉంటాడు. నీకు సాధనలో సహాయ సహకారాలు అందిస్తాడు. అతని గురించి నువ్వు చెడు ఆలోచనలు చేస్తున్నప్పటికీ… చెడు భావనలు కలిగినప్పటికీ… నీ మనసుని అదుపులో ఉంచుకో! నిగ్రహించుకొని ఉండు. అతను నిన్ను ప్రేరేపించినా కూడా నువ్వు భయపడకు,  బాధపడకు! అదంతా యోగ పరీక్ష , సాధన పరీక్ష అనుకో. అతను ఏది చేసినా లోక కళ్యాణార్థం చేస్తాడు. జ్ఞాని ఏది చేసినా కూడా పాప పుణ్యాలు ఉండవు. పూర్ణ జ్ఞాని ఏది చేసినా లోకకల్యాణమే జరుగుతుంది. అతను అలా భయపెట్టే విధంగా చేస్తాడు. భయపెట్టే విధంగా మాట్లాడతాడు. భయపెట్టే విధంగా ప్రవర్తిస్తాడు. అతను మాత్రం నీ మనసు స్థితిగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే నీకు పరీక్ష పెడుతున్నాడని గ్రహించు అనేసరికి….


అలాగే స్వామి!  నాకు అర్థం అయింది.  ఆయన అలాంటివారు కాదని మనసుకి అర్థం అయింది.శరీరానికి అందుతుంది. ఆయన అన్నిటియందు నిగ్రహమును పొందారు. ఇంద్రియ నిగ్రహమును పొందారు.  సర్వకాల సర్వావస్థలో ధ్యానమే ధ్యాసగా ఉన్నారు. మంత్రమే ప్రణవ నాదంగా చేస్తున్నారు అని గ్రహించాను. ఆయన వల్ల నాకు ఎలాంటి సమస్య ఉండదు. మీరన్నట్టు ఆయన నా సాధనకి సహాయ సహకారాలు అందిస్తారు . అది మాత్రం నాకు అర్థమవుతుంది.  నేను ఎక్కడ ఉన్నా…. నాకు తుది శ్వాస వరకు… ఈ స్థూల శరీరం విడిచి పెట్టేదాకా… నా చెయ్యి వదిలిపెట్టడని గ్రహించాను. ఎప్పటికీ పట్టుకొనే ఉంటాడని గ్రహించాను. నేను ఎప్పుడైతే నా స్థూల శరీరం వదిలిపెడతానో ఆయన నన్ను వదిలిపెట్టేసి వెళ్లిపోవచ్చు….. లేదంటే నా సాధన పరిసమప్తి అయిన తరువాత వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా ఆయన నన్ను పట్టుకుని ఉంటాడని నాకు నమ్మకం,  ప్రభలమైన విశ్వాసం కలుగుతుంది. ఆయన గురించి నేను చెడుగా ఆలోచించడం లేదు. ఆయన నా గురించి చెడుగా ఆలోచించట్లేదని నాకు అర్థం అయింది. కాకపోతే నా మనసు అదుపుతప్పి చెడు భావనలు చెడు ఆలోచనలు ఆయన మీద కలుగుతున్నాయి. అది కాలానుగుణంగా పోతాయి అని ఆయనకు తెలిసినా కూడా ఆయన ఏమి పట్టించుకోవడం లేదు. అన్ని గమనించి…. ఏమీ గమనించినట్లుగా ఉంటున్నారని నాకు అర్థం అయింది. ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నేను దాచాలన్న నేను దాచలేని పరిస్థితి అని అర్థమయింది. గ్రహించాను. నాది తెరిచిన పుస్తకం అని అర్థమయింది. నాలో ఎలాంటి రహస్యాలు ఉండవు. రహస్య ఆలోచనలు ఉండవు అని ఆయనకు తెలుసు…. అనేసరికి సరేనమ్మా ! ఆయన గురించి నువ్వు మంచి భావనతోనే ఉన్నావు.  ఆయన నీ సాధనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వెళతాడు.  అది మాత్రం గుర్తుపెట్టుకో ! ఒకవేళ సాధనలో తప్పు, ఒప్పు చేస్తే  ఆయన మాత్రం దండిస్తాడు, అరుస్తాడు, కోపావేశాలను లోనవుతాడు.  ఆయన కోపాన్ని కూడా నువ్వు ఓర్పుతోనో… సహనంతోనో…. తెలుసుకొని ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని, బాధ్యతని గుర్తించు.  అది మాత్రం తెలుసుకో ! ఏది చేసినా దాని వెనుక ప్రేమ, బాధ్యత ఉంటుంది.  ఆవేశపడ్డాడు కదా!  బాధ పెట్టాడు కదా! కోపగించుకున్నాడు కదా! అని నువ్వు అనుకోవద్దు …..మూడు రోజులకు, వారం రోజులకు ఆయన తిట్టిన దాని వెనకాల గల కారణం ఏమిటి? దాని ఫలితం ఏమిటి అనేది తెలుస్తుంది.  అందాక జాగ్రత్తగా పట్టుకో!  ఇంకొకటి…. శివానంద విషయంలో నిన్ను వదిలేస్తాను,  నిన్ను పట్టించుకోను, నీకు నాకు సంబంధం లేదు అని ఒకటికి పదిసార్లు నీ మనసు మీద కొడుతూ ఉంటాడు. ఆ మనసుని స్థిరపరచడానికి అతను ఆ విధంగా చేస్తూ ఉంటాడు. తప్పుడు ఆలోచనలు…. తప్పుడు భావాలు…. తెలిసి చేసిన తప్పులు… తెలియక చేసిన తప్పులు…. ఉన్న కర్మలను,  కర్మ ఫలితాలను అలా తీసేస్తూ ఉంటాడని గ్రహించు. ఆయన తిట్టినా నీ రక్షణే …మెచ్చుకున్న నీ  రక్షణే …నీకు మంచి జరుగుతుంది. ఆయన తిట్టాడని దూరంగా పెట్టడం…. ఆయన మెచ్చుకున్నాడని దగ్గరగా తీసుకోవడం పెట్టుకోవద్దు. సాధనలో ఉన్నప్పుడు  శౌచము, అశౌచము ఉండకూడదు. మంచి చెడు అనే భావాలు ఉండకూడదు.. ఏమి జరిగినా మన మంచికే…అని ,స్థిర ఆలోచనతో స్థిర మనసుతో ఉండు.  ఆయన కోపగించుకుంటే బాలకుమార స్వామి… బాలగణపతి ఎలా కోపగించుకుంటున్నారో…ఆయన్ని కూడా పసిపిల్లాడిలా భావన చేసుకో!  అలాగే ఆయన మెచ్చుకుంటే… ఒక తండ్రి లేదా గురువు ఏ విధంగా మెచ్చుకున్నాడో… ఆ విధంగా మెచ్చుకున్నాడని గుర్తుంచుకో!  నీలో అహంకారాన్ని పెంచుకోవద్దు.  సాధన అహంకారం, జ్ఞాన అహంకారం… సిద్దుల అహంకారం… నేనే గొప్పదాన్ని… నేను గొప్ప జ్ఞానిని…నేనే సిద్ధురాలిని… ఆయన ఎంత.!. ఆయన కన్నా నేనే ఎక్కువ అని చెప్పేసి ఇలా అహంకారాలని మాత్రం పెంచుకోవద్దు. సాధనకి మొదటి మెట్టు అవరోధమే అహంకారం.  ఆ అహంకారానికి విరుగుడే ఓంకారం.  ఆ ఓంకార నాదమే ఆయన నీకు దీక్ష సాధనగా చేస్తున్నాడు.  ఆయన్ని దీక్ష గురువుగా తీసుకో! నన్ను మంత్ర గురువుగా భావించుకో! ఇలాంటి గురువులు దొరకడం అనేది కష్టం.  యోగం ఉంటే యోగి కాక తప్పదు అన్నప్పుడు…. ఆ యోగానికి తగ్గ యోగ గురువు కూడా వస్తూ ఉంటారు.  వీళ్లిద్దరూ కాలానుగుణంగా… కర్మానుసారం వస్తూ ఉంటారు.  అది మాత్రం గ్రహించు. తప్పుడు ఆలోచనలు తప్పుడు భావాలు ఆయన దగ్గర నుంచి పెంచుకోవద్దు.


ఎందుకంటే పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టు…. ఆయన అహంకారిగా కనబడతారు… కోపదారిగా కనపడతారు… నిన్ను చిన్నచూపు చూస్తారు…చులకనగా మాట్లాడతారు….మీ గత జన్మ విషయాలన్నీ తీసుకువచ్చి మాట్లాడతారు… నువ్వు అలా చేశావు! నువ్వు తప్పు చేశావు!  నువ్వు ఇలా చేశావు… నువ్వు మంచి దానివి కాదు… అని అన్నీ తెలిసినవాడు కూడా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు.  బాధ పెడుతూ ఉంటాడు.  ఇవన్నీ కూడా ఆయన చేయడానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఉండదని గుర్తుంచుకో!  అంత పూర్ణజ్ఞాని నీతో అసభ్యకరంగా…. ప్రస్తుత జన్మలో నువ్వు చేసిన తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు పాపాలు వంటివి… ఆయన చెబుతున్నారు…. మాట్లాడుతున్నారు….  కోపావేశంలో ఉండి చేస్తున్నారు అంటే…. నీలో ఉన్న కర్మ శేషాలని తీసివేస్తున్నాడని మాత్రం గ్రహించు!  మసులుకో! కోపంలో ఆయన్ని దూరం చేసుకోకు …ఎంత కోపంలో ఉన్నా…మిత్రత్వంలో ఉన్నా ….ఆనందంలో ఉన్నా …ఒకే సమదృష్టి, సమదర్శనంతో మెలుగు.  ఆయన జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు.  లేదంటే అర్ధాంతరంగా ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు.  అది గుర్తుపెట్టుకో ! ఇలాంటివారు దొరకడం చాలా కష్టం. చాలా అరుదుగా ఉంటారు.  వీరు గుప్తయోగంతో… గుప్త సాధన చేసే గుప్తయోగులు. వీళ్లు నిజయోగులు ,నిజగురువులు.  వీళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. నూటికి ఒక్కరు ఉంటారని మాత్రం గుర్తుంచుకో!  ఇంతకంటే ఇంక నేను ఎక్కువగా చెప్పకూడదు.  ఏది అతిగా చెప్పకూడదు… నీకు నువ్వే తెలుసుకో!  నువ్వు అతన్ని వదిలి పెట్టుకోకు.  సరే సాధన సమయం అవుతుంది… నువ్వు సరాసరిగా రుద్రాక్ష మఠానికి వెళ్ళిపో!  అని చెప్పేసరికి….


 సరే స్వామి! నేను ఇంక వెళతాను . పిల్లల్ని చూస్తూ…. పిల్లలు నేను సాధన చేసుకోవడానికి వెళుతున్నాను… రాత్రికి అక్కడే రుద్రాక్ష మఠంలో సాధన చేసుకుంటాను.. ఉదయం వస్తాను… అనేసరికి సరే అమ్మ!  మేం కూడా ఇక్కడే గదిలో కూర్చుని సాధన చేసుకుంటాము. సాధన చేసుకొని నిద్రపోతాము.  నేను అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాను. మా గురించి ఆలోచించకు… మాకు రక్షణ గారు రుద్ర స్వామి ఉన్నాడు కదా!  చూసుకుంటాడు లే!  అని పిల్లలు భరోసా ఇచ్చేసరికి…. ఆనందంతో వాళ్లకి చెప్పాల్సినవి చెప్పేసి…. రుద్రాక్ష మఠం వైపుకి సాధన చేసుకోవడానికి శివ నందిని బయలుదేరింది.


యోగసాధన చేసుకోవడానికి…మంత్ర సాధన చేసుకోవడానికి…. శివ నందిని రాత్రి వేళలో విభూతి మఠానికి చేరుకుంది. విభూతి మఠంలో ఎవరూ లేరు. ఇక్కడ పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూసింది . పడుకోవడానికి ఎవరు లేరు అని గమనించింది. తలుపులు కూడా తెరిచే ఉన్నాయని…విభూతి లింగం దగ్గర కూర్చుని ఓం శివోహం అనే మంత్రాన్ని 1008 సార్లు చేసి తర్వాత ఓంకార నాదం తనకి తగులుతున్నట్లుగా అనిపించింది. నాద శబ్దమే తిరిగి వచ్చి తన హృదయాన్ని తాకుతుంది…తన తలని తాకుతుంది అనిపించేది. లోపలయధావిధిగా కదలికలు మొదలయ్యాయి. వెన్నుపూస కింద నొప్పి మొదలయ్యింది. అయినా కూడా భరిస్తూ కూర్చుంది. పొత్తి కడుపు నొప్పి మొదలయ్యింది. అయినా గాని భయపడలేదు, బాధపడలేదు,.. ఇంతలో తన కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు  వచ్చాయి. అయినా కూడా పట్టించుకోలేదు. ఏం జరిగితే అది జరుగుతుంది అని ఆలోచనలన్నీ గాలికి వదిలేసింది . వచ్చే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. సాధన మంత్రం చేస్తూనే ఉంది. సాధనా మంత్రం ఆపట్లేదు. తన సాధనా మంత్రం తనకే స్పష్టంగా వినపడే పరిస్థితికి వచ్చింది. రాత్రి 11:00 అవుతూ ఉండేసరికి గుడి తలుపులు మూసేసినట్టుగా అనిపించింది. ఊరంతా … ప్రశాతంగా.. నిద్రావస్థలోకి వెళ్ళినట్టు అనిపించసాగింది. తను ఒంటరిగా … ఏకాంతంగా ఉన్నానని తెలిసింది. అయినాగానీ భయపడలేదు. ఆలోచనలు వస్తున్నాయి. తనకి తోడుగా నడయాడే మల్లికార్జునుడు శివానంద రూపంలో ఉన్నాడు కదా! ఇంకెందుకు భయం…ఈ చీకటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు …ఓంకార నాదాన్ని అలాగే చేసుకుంటూ ఉండగా….ఉన్నట్టుండి ఏదో తన కాళ్ళ మీద పాకుతున్నట్టుగా అనిపించేసరికి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. సరే పామే కదా! కాటు వేస్తే కాటు వేయనీ.. అది ఎందుకు వచ్చిందో…ఏ యోగి ఆ పాము రూపంలో ఉన్నాడో…ఎవరికి ఎరుక. మనం ఎందుకు విదిలించుకోవడం అని కూర్చుంది . కానీ ఆ పాము శివలింగాన్ని చుట్టుకుని… తనకి ఎదురుగా ఉన్నట్టు శివలింగానికి సజీవ నాగాభరణం  పెట్టినట్టుగా అనిపించేసరికి… సరే పాము కూడా ధ్యానం చేసుకోవడానికి వచ్చిందేమోలే!  అని అనిపించి అప్పటిదాకా  కళ్ళు తెరిచి ఉన్నది కూడా కళ్ళు మూసుకుంది. ఆ పాము స్థానంలో ఒక యోగి శివునికి అభిషేకం చేస్తున్నట్లుగా , రుద్ర నమకాలతో మంత్రాలు చదువుతున్నట్లుగా, లీలగా అనిపించింది.  అంటే ఈయన పాముజన్మ ఎత్తాడు.  దీనిలో ఉన్నది యోగి అని…. ఇక ఈ పాము గురించి భయపడాల్సిన అవసరం లేదని… ఇది సాధారణమైన పాము కాదు,  అసాధారణమైన …యోగం ఉన్న దైవత్వం ఉన్న పాము అనుకుని అలాగే ఓంకార నాదం చేస్తుంది. అదే విధంగా తనకేదురుగా ఉన్న పాము నోట్లో నుంచి కూడా అదే విధంగా ఓంకార నాదం వస్తూ ఉండేసరికి… కళ్ళు తెరిచి చూసేసరికి… పాము కూడా నోరు కదుపుతున్నట్టుగా,  నాలుక బయటపెడుతున్నట్లుగా పదేపదే . అనిపించేసరికి…. ఈ పాములో ఉన్న యోగి సాధన చేస్తున్నాడు… ఆయన కూడా ఓంకార నాదం చేస్తున్నాడు అనుకుంటా!  అనుకొని ఇద్దరు  ఓం కార నాదం  చేస్తూ ఉండేసరికి…ఆ విభూతి మఠం ఏదో శబ్ద నాదానికి లోనవుతూ… ఉన్నట్టు అనిపించసాగింది. ఏమైనా ప్రమాదం జరుగుతుందా!  అన్నట్టు ఆ అంధకారంలో వీళ్ళు చేస్తున్న ఓంకార నాదం శ్రీశైలం మొత్తం వినబడుతున్నట్టుగా శివనందినికి అనిపించ సాగింది.  తన నాదానికి ఊర్లో జనాలంతా లేచి వచ్చి తనని కొడతారని ఆలోచన కూడా వచ్చింది. అయినా భయపడలేదు. తప్పేమీ చేయట్లేదు. తన సాధన తను చేసుకుంటుంది. కాకపోతే పగటిపూట చేసే సాధన కన్నా రాత్రి పూట చేసే సాధనలో నాదం స్పష్టంగా వినపడుతుంది ఎందుకంటే…


వాతావరణం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటం వలన అనుకుంది. నాదాన్ని ఆపలేదు. ఇంతలో పాము ఉన్నట్టుండి శివ నందిని పాదాల దగ్గరికి వచ్చి… తలపెట్టి ఒళ్లో పడుకున్నట్టుగా ఉండేసరికి ఈమెకి ఆశ్చర్యం వేసింది. ఏముందిలే!  బాల కుమారస్వామి పడుకున్నట్టుగా ఈ పాము కూడా  పడుకుంది అనుకుని…. తను  ధ్యానం నుంచి బయటకు రాలేదు.  శరీరం కదలలేదు.  తను పద్మాసనంలో ఎలా అయితే కూర్చుందో… అలాగే కూర్చుని ఉంది. ఆ తర్వాత ఆ పాము సరాసరి దగ్గరలో ఉన్న పుట్టలోకి వెళుతూ ఉండేసరికి , ఇది దగ్గరలో ఉన్న పుట్టలోకి వెళ్తుంది అనుకొని….సరే ఈ పాము వలన,  ఈ పాము ఆలోచన వలన ధ్యానం కుదరట్లేదు అని…. మనసులో అనుకొని… ముందు మనసులో భయపడటం మానేయాలి.  కనిపించే దృశ్యాల గురించి అసలు ఆలోచించకూడదు.  కనిపించని వాటి గురించి ఆలోచనలు చేయాలని… ఓంకార నాదం చేసుకుంటూ ఉండేసరికి… సుప్రభాత సమయం అయ్యింది అన్నట్టుగా గుడిలో గంటలు మోగేసరికి ఆహా!  సుప్రభాత సేవ మొదలైన సమయం అయ్యింది. సుప్రభాత సమయానికి సాధన చేసుకోవడానికి శివానంద వస్తా అన్నాడు కదా!  సరే వస్తాడేమో లే అనుకునేలోపులే!  వచ్చాను…. శివాని!  నువ్వు నా గురించి ఆలోచన చేయగానే నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. కంగారుపడమాకు. నీ ఆలోచన నాకు పిలుపు అనేసరికి…. ధ్యానంలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఎదురుగా ఆయన కూర్చొని ధ్యానంలో కనబడ్డారు.  ఏంటి!  ఆలోచనలు చేసి చేయంగానే ఎదురుగా కనబడుతున్నారు. గాల్లో నుంచి సాక్షాత్కారం ఇస్తున్నారు. ఈయన నిజంగానే సిద్ధ పురుషులు.  సిద్ధ పురుషుడు ఇలా దర్శనం ఇస్తారా!  వామ్మో! ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మన ఆలోచనే పిలుపుగా అందుకుంటున్నాడు. అంటే మనం ఈయన గురించి చేసే ప్రతి ఆలోచన… ఈయనకి తెలిసే ఉంటుందిగా!  ఏముందిలే తెలిసినా కూడా ఏమవుతుంది… అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఆయన ఉంటాడు.   అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు నేను ఉంటాను.  ఇద్దరం ఏమీ తెలియని స్థితిలో ఉన్నాము.  అన్నీ తెలిసి ఏమీ తెలియని స్థితికి వెళ్లడమే కదా!  సాధన పరిసమాప్తి అని పరమహంస గారు చెప్పారు కదా!  సరే ఆయన కూడా ధర్మ పత్ని అని నా వెంట పడుతున్నాడు కదా!  నేను ధర్మపతి అనుకోవడంలో తప్పేముంది…. ఆయన కూడా నాకు భర్తే అవుతాడు కదా! భోగ భర్తకి ఎటు విడాకులు ఇచ్చి బంధ విముక్తి పొందాను . ఈయన యోగ భర్త అయి ఉంటాడు.  ఈయనతో ఆ ధర్మపత్ని ఋణానుబంధం తీర్చుకోవాలి అనుకుంటూ… ఉండగా …. 


అమ్మ! తల్లి నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి,  ధ్యానం మీద ధ్యాస పెట్టు. అంతేగాని నా గుణగణాల గురించి పదేపదే ఆలోచించావనుకో నువ్వు నాలాగే తయారవుతావు.  దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ధ్యాస ఓంకార నాదం మీద పెట్టి చేసుకో …..అనేసరికి స్వామి!  మనిద్దరం కలిసి ఓంకార నాదం చేద్దామా!  అనేసరికి ఇప్పుడు పాముతో చేసింది చాల్లేదా! నాతో కూడా కలిపి చేయాలా!  అనేసరికి …. వామ్మో!  ఈయనకి తెలియని విషయం లేదన్నమాట.  అంటే మీకు పాముతో చేసిన విషయం కూడా తెలుసా ! అంటే అన్నీ తెలుసు.  ఆయన మునీశ్వరుడు.  శాపగ్రస్తుడు.  ఒక దేవతాపామును చంపడం వలన అంతిమ మరణ అవస్థలో ఉండగా ఈ పామును చంపడం వలన అది గర్భస్థ పాము అవడం వలన శాపం ఇవ్వటం జరిగింది. అందుకోసమని ఆ పాప నివారణ కోసం…. ఈ పాము జన్మ ఎత్తాడు. సర్ప దోషాలు, సర్ప గండాలు ఎవరికైతే ఉంటాయో ….ఈ పుట్టకు పూజ చేస్తే ఆయా దోషాలన్నీ నివారణ చేస్తారు . శ్వేత నాగు సర్పము. ఆయన దేవతా సర్పం. మహాశివరాత్రి నాడు , ఇది పైకి వెళ్లి శివునికి అభిషేకాలు చేస్తుంది.  అలాగే రాత్రి 12 గంటలకి ఘంటా మఠంలో శివలింగానికి అర్చన చేస్తూ ఉంటుంది.  ఇదే పాముని.పరమహంస  గారు చూసి పాముల అర్చన అని చెప్పడం జరిగింది.  అది మనకి ఏమి ఇబ్బంది పెట్టదు. బాధ పెట్టదు. కాకపోతే భయపెడుతుంది. కాటు వేయదు. కాకపోతే బుసలు కొడుతుంది. దీనితో జాగ్రత్తగా ఉండాలి. మనం సాధనలో తప్పుడు ఆలోచనలు చేసిన కూడా…. అది పుట్టలో నుంచి బయటకు వచ్చి భయపెడుతుంది..


కాబట్టి మనసు స్థిరంగా పెట్టుకో!  ఇక్కడ అంతా సిద్ధమాయ,  సిద్ధయోగులమయం అని గుర్తుపెట్టుకో!  ఇక్కడ దక్షిణాచారం ఉంది .వామాచారం ఉంది అని గుర్తుపెట్టుకో!  ఇక్కడ అన్ని మతాలు, శైవ మత ధర్మాలు, 112 శైవ విధి విధానాలు ఉన్నాయని గ్రహించు. నీ సాధన ఎవరూ చూడట్లేదు… ఎవరు పట్టించుకోవడం లేదు…అనుకోవద్దు. గాలిలోనే అందరూ రుద్ర పిశాచాల రూపంలో,  రుద్ర గణాల రూపంలో తిరుగుతూ ఉంటారు.  నాకు తెలిసి నీ చుట్టూ ఇప్పుడు 1000 మంది కూర్చుని ధ్యానం చేస్తున్నారు.  కావాలంటే మనసుపెట్టి శివలింగాన్ని తాకి చూడు… నీకే ధ్యానంలో అనుభవం అవుతుంది. అది నిజమా కాదా అని శివలింగం మీద చేయి పెట్టి… ధ్యానంలో చూసేసరికి తన చుట్టూ యోగ శరీరాలు, ఆత్మ శరీరాలు, పిశాచ అవస్థ, రుద్రావస్థలో ఉన్న ఆత్మలు.. వివిధ రంగుల్లో తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ ఇలా వివిధ శరీరాలతో ఉన్న ఆత్మలు కనిపించేసరికి… వామ్మో! నేను ఒక్కదాన్నే స్థూల శరీరంతో సాధన చేస్తున్నానా, మిగతా వారంతా ఆయా శరీరాలతో సాధన చేస్తున్నారన్నమాట!  అంటే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నా అనుకోవడం తప్పు అన్నమాట!  అంటే స్థూల శరీరంలో ఉన్న జీవులు పగటిపూట సాధన చేస్తూ ఉంటే…. మిగతా  శరీరం ధరించిన జీవులు…. రాత్రిపూట సాధన చేస్తూ ఉంటారు.  అంటే ఈ పంచ మఠాలలోనూ, దేవాలయాలలోనూ ఉండి సాధన చేస్తూ ఉంటారన్నమాట!  అందుకని రాత్రి వేళలో తలుపుకి ఉన్న  గొళ్ళెమునో, గంటనో కొట్టి గుడి లోపలికి వెళ్లాలని నియమం పెట్టారన్నమాట!  ఆ గంట శబ్దానికి దైవాత్మలు, ప్రేతాత్మలు, క్షుద్రాత్మలు తాంత్రిక ఆత్మలు ,ఉపాసన ఆత్మలు ఇవన్నీ కూడా తప్పుకుంటాయి అన్నమాట!  అని అనుకునేసరికి పూర్వీకులు ఏ ఆలోచన లేకుండా,  ఆలోచించకుండా ఏ నియమం పెట్టలేదు.  ఏ ఆచార వ్యవహారం పెట్టలేదు.  బాగా ఆలోచించి పెట్టారని గ్రహించింది.  శివానంద చెప్పినట్టు…. ప్రతిదీ కూడా సత్యమే అన్నమాట!  ఈయనతో జాగ్రత్తగా ఉండాలి. ఈయన అనుభవాలను మన అనుభవంలోనికి తీసుకోవాలి. ఈయన అనుభవ జ్ఞానమును…. మన శబ్ద పాండిత్యం ద్వారా పొంది, అనుభవ పాండిత్యంగా పొందాలి అని…. నిశ్చయించుకుని, అయినా రుద్ర స్వామి ఏనాడో చెప్పాడు కదా!  ఈయనని దీక్షా గురువుగా తీసుకోమని అన్నాడు కదా!   ఓంకార నాదం దీక్షగా ఇస్తాడా లేక వేరేది ఇస్తాడా అని అనుకుంటూ ఉండేసరికి…


శివానంద:– అమ్మ తల్లి!  నేను ఓంకార నాదం చేసుకోమని చెప్పి అన్నా గాని…. అది ఓంకార నాదం నీకు దీక్ష కాదు. నీ గురు మంత్రమే నీకు మంత్రం అవుతుంది. ఓం శివోహం మాత్రమే తీసుకో. అందులో ఓం శివోహం ఓం నాదం ఎక్కువగా గుర్తు పెట్టుకో!  ఎందుకంటే అది నీ పిండ దేహ సాధన. నీ పదవ దేహమైన పిండ దేహానికి విముక్తిని… నువ్వు ఇప్పటినుంచే సాధన చేసి ఓంకారం మీద పట్టు సాధిస్తే… అప్పుడు నీకు  ఉన్న పిండదేహానికి ఓంకార నాదం నుండి విముక్తి చేయడానికి కుదురుతుంది అని… ఓంకార నాదం చేయమంటున్నాను.  అలాగే ఓంకార నాదం ఎందుకు చెప్తున్నాను అంటే… ఇప్పటికే నువ్వు సన్యాస దీక్ష తీసుకున్నావు కాబట్టి…ఇప్పుడు సన్యాసులకి ఓంకార నాదమే మంత్రంగా ఉపయోగపడుతుంది . అది నాద మంత్రం, గురు మంత్రం, దీక్ష మంత్రం అవుతుంది. కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రారంభ స్థితిలో ఉన్నావు. ఓం శివోహం సాధనా మంత్రమును గురు మంత్రం గా పొందావు. కాబట్టి గురు మంత్రం సిద్ధి పొందు. ఆ తర్వాత దీక్ష మంత్రంగా ఓంకార నాదం నిత్యం చేసుకుంటూ ఉండు….అనేసరికి 


శివనందిని:– స్వామి!  నాకు ఏది,  ఏ మంత్రం చేయాలో అర్థం కావడం లేదు. ఒకళ్ళేమో గాయత్రి మంత్రం చేయమంటారు. ఒకళ్ళేమో శివుడి మంత్రం చేయమంటారు. ఇప్పుడు మీరు వచ్చి ఓంకార నాదం చేయమంటున్నారు. రుద్ర స్వామి ఓం శివోహం చేయమంటున్నారు.  ఏ మంత్రం చేయాలో నాకే అర్థం కావడం లేదు.  అంతా గందరగోళంగా ఉంది.  అసలు ఏ మంత్రం చేయాలి ..ఏ మంత్ర సిద్ధి పొందాలి అర్థం కావడం లేదు.  నాకు వివరంగా చెప్పండి.  నాకు ఈ మంత్రం అయోమయాలన్నీ పోతాయి. లేదంటే నేను ఏ మంత్రం చేస్తున్నానో …ఎందుకు చేస్తున్నానో అర్థం కావట్లేదు. మీరేమో సాధనా మంత్రం, గురు మంత్రం, దీక్ష మాత్రం అని మూడు రకాలు చెప్తున్నారు. ఏ మంత్రం సిద్ధి పొందాలి…. అసలు మంత్రం ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి ….ఇది నాకు వివరంగా చెప్పండి.  అప్పుడు గాని నేను సాధనలో ముందుకు వెళ్ళలేను… చేయలేను… అనగానే తెలియనంత వరకు ఏదీ కూడా తెలియదు.  తెలుసుకుంటే సమాధాన పడతావు. అందులో తప్పేముంది .ముందు నీకు ఈ మంత్రం గురించి వివరంగా చెబుతాను.  దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో! నీకు విషయం అర్థం అవుతుంది… అని శివానంద ఇక చెప్పడం ఆరంభించాడు.


శివాని! ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో!  మొదట మనకి సాధనా మంత్రం అనేది ఒకటి వస్తుంది.  అది మన ఇష్ట దైవానికి సంబంధించిన పుస్తకములు చదువుతున్నప్పుడు…. అందులో నీకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం సాధనా మంత్రంగా ఎంచుకొని చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే…. ఇది మన అవసరాలను,  కోరికలను తీర్చే మంత్రం అన్నమాట!  మన ఇష్టదైవంతో మన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటే… ఇలా కోరికలు తీరడం కోసం చేసుకోవచ్చు.  కొంతమందికి అమ్మవారి ఇష్టం. కొంతమందికి శివుడు అంటే ఇష్టం.. కొంతమందికి గణపతి అంటే ఇష్టం… కొంతమందికి హనుమంతుడు అంటే ఇష్టం…. కొంతమందికి సరస్వతి, కొంతమందికి గాయత్రి ఇలా ఎవరి భావాలకు తగ్గట్టుగా వాళ్ళు దైవాలను ఎంచుకుంటారు.  దేవతా విగ్రహారాధనలను చేస్తారు. భక్తి మార్గంలో మనకి ఉపయోగపడేది…. అందులో పూజాదికాలు ఉంటాయి.  విగ్రహారాధన ఉంటుంది.  కాబట్టి దానికి సంబంధించిన మూలమంత్రం,  బీజాక్షరాల మంత్రం ఉంటుంది .కాబట్టి ఆ మంత్రం చేసుకోవచ్చు . దానిని సాధనా మంత్రంగా చెప్పవచ్చును. అంటే సాధారణంగా మనకి పుస్తక గ్రంథాలలోనూ, పారాయణ గ్రంథాలలోనూ దొరికే మంత్రం అన్నమాట!  ఇది ఎవరికి వారే వారి మనసుకి నచ్చి ఎంచుకునే మంత్రం అన్నమాట!  ఇక గురు మంత్రం అంటే…. ఏదైనా దేవాలయంలో గుళ్లో పూజారి  లేదా మన మత ధర్మానికి తగ్గట్టుగా బ్రాహ్మణులు ఉన్నారనుకో ఒడుగు చేస్తారు.  ఆ ఒడుగు చేసినప్పుడు…. తండ్రి మంత్ర గురువుగా ఉండి గాయత్రీ మహా మంత్రమును ఉపదేశిస్తారు.  అలాంటి వారికి గురు మంత్రం అనేది గాయత్రీ మంత్రం అవుతుంది. కొంతమంది మోక్ష జన్మ ఉన్నప్పుడు యోగులు,గురువులు సాధనలో ఉన్నవాళ్లు… మనకి మంత్ర ఉపదేశం చేస్తారు.  అది మనకి గురువు ఉపదేశ మంత్రం అవుతుంది.  అది మన ఇష్టదైవ మంత్రం అవ్వచ్చు.. అవ్వకపోవచ్చు. సహజంగా సాధ్యమైనంత వరకు ఓం నమశ్శివాయ మంత్రమునే గురు మంత్రముగా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే శివుడే మోక్షం  ఇచ్చేది .అది మాత్రం గుర్తుపెట్టుకో!  స్మశాన వైరాగ్యం కలిగించి…. ఎలాగైతే మన శరీరం శూన్యం నుంచి వచ్చిందో,  అలాగే శూన్యంలో కలిసిపోవడానికి ఉపయోగించే తారక మంత్రం  శివ మంత్రమే కాబట్టి ఓం నమశ్శివాయ గురు మంత్రమునే నూటికి 99% సాధారణంగా గురు మంత్రంగా ఇస్తారు.  మనకి విష్ణు ఆరాధన కూడా గురు మంత్రంగా ఓం నమశ్శివాయ అనే రావచ్చును. అమ్మవారి ఉపాసకులకు కూడా ఓం నమశ్శివాయ అనే రావచ్చును.  ఎందుకంటే మోక్షతారక మంత్రం ఓం నమశ్శివాయ . ఓం నమశ్శివాయ మంత్రమునే మనకి కాశీ క్షేత్రంలో మరణం పొందిన తరువాత కాశీ విశ్వనాథుడు స్వయంగా ఇచ్చే గురు మంత్రము ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇదే విషయం మనకి కాశీఖండంలో సుస్పష్టంగా తెలుస్తోంది.  కాబట్టి ఇది గురు మంత్రమే….తారక మంత్రంగా సహజసిద్ధంగా ఓం నమశ్శివాయ అవుతుంది. ఇక తర్వాత దీక్ష మంత్రం అనేసరికి మంత్రాలన్నింటిలోనూ మూలమంత్రం ఓంకార నాదం.  ఓం తోనే అన్ని మంత్రాలు చివరికి 24 అక్షరాలు ఉన్న గాయత్రి మహా మంత్రం కూడా ఓంకార నాదంతోనే మొదలవుతుంది. అలాగే శివతారక మంత్రం కూడా ఓంకార నాదంతోనే మొదలవుతుంది. 


దేవతా మంత్రాలన్నీ కూడా ఓంకార నాదంతోనే మొదలవుతాయని కదా!  ఇది లోక విధితమే కదా ! ఆ ఓంకార నాద మంత్రముతోనే…. దీక్షా గురువు సంగమంతోనే దీక్షా మంత్రంగా అందడం జరుగుతుంది. ఈ దీక్ష మంత్రమైన ఓంకార నాద మంత్రమును మనం పొందాలి అంటే…. మనం శారీరకంగా, మానసికంగా అన్నీ పరిత్యాగం చేసి…. భౌతిక సన్యాస దీక్ష తీసుకున్న వారికి మాత్రమే… ఓంకార నాదమును ఇచ్చే అర్హత, యోగ్యత ,యోగం ఉంటుంది. అలాగే ఒక నిజ సన్యాసి చేతుల మీదుగానే ఈ ఓంకారమును దీక్షా మంత్రంగా పొందవలసి ఉంటుంది.  అది నువు నిన్న చేసిన ఓంకార నాదమును …ఇప్పుడు నా సమక్షంలో ఓంకార నాదమును …ఇవ్వడం జరిగింది. అది దీక్ష మంత్రం అన్నమాట!  ఈ ఓంకార నాదంలో సిద్ధి పొందాలి అంటే సాధకుడు ఖచ్చితంగా సన్యాస దీక్ష తీసుకోవాలని …యోగ వాశిష్టంలో చెప్పడం జరిగింది. ఎవరైతే సన్యాస దీక్ష తీసుకుంటారో… వాళ్లకి మాత్రమే ఓంకార నాదం చేసే అవకాశం ఉంది. మిగిలిన ఏ మంత్రం కూడా చేయకూడదని చెప్పడం జరిగింది.  వాళ్ళకి మంత్రం ఓంకార నాదం అవుతుంది. దీక్ష మంత్రం అవుతుంది. నీకు ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరిక…. పాతివ్రత్య ధర్మమును పొందాలని అనుకుంటున్నావు.  ఆ కోరికకు అనుగుణంగానే నీకు పాతివ్రత్య దీక్షను ఇవ్వటానికి నేను నిశ్చయించుకున్నాను.  ఈ దీక్షతోపాటు దీక్ష మంత్రంగా….ఓంకార నాదమును ఇవ్వటం జరిగింది.  నువ్వు ఓం శివోహం చేసినా ….గాయత్రీ చేసినా ….ఓంకారం నాదం చేస్తున్నట్టే!  ఒక విధంగా నువ్వు ఓంకార నాదంలో సిద్ధి పొందాలి అంటే…. అది సన్యాసయోగ దీక్షలో మాత్రమే సిద్ధి పొందుతావు . ఓంకార నాదమే అన్ని నాదాలలో మిన్న.  ఓంకార నాదం దాటిన తర్వాత నిశ్శబ్ద నాదమైన నాద స్థితిని నువ్వు పొందవలసి ఉంటుంది.   నీ దేహమైన పదవదేహం ఎప్పుడైతే దహనం అవుతుందో….. లింగ దేహానికి వెళ్లేటప్పుడు,  ఓంకార నాదమును దాటి నిశ్శబ్ద నాదమైన తుంకార స్థితిని పొందవలసి ఉంటుంది. ఈ ఓంకార నాదమే…..ఈ సృష్టిని నడుపుతుంది.  సృష్టి స్థితి లయలు చేస్తుంది . మొట్టమొదట నాదం ఓంకార నాదముని గుర్తుపెట్టుకో!  అంటే నిశబ్ద నాదమైన తుంకార నాదము నుంచి ఓంకార నాదం వచ్చింది. ఈ ఓంకార నాదంలో సప్త స్వరాలు సరిగమపదనిసలు వచ్చినాయి. దీని నుంచి సంగీతం ఏర్పడిందని గ్రహించు. కాబట్టి నాదాలన్నింటిలోనూ… శబ్దాలన్నింటిలోనూ అన్నిటికీ మూలం ఓంకారం . ఈ ఓంకార నాదమును మానసికంగా , శారీరక దీక్ష తీసుకున్న సన్యాసపరులకే …ఈ నాదం చేసే అర్హత ,యోగ్యత, యోగం ఉంటుందని గ్రహించు . అది నువ్వు ఇప్పటికే తీసుకొని ఉన్నావు కాబట్టి…. శక్తి జాగృతి కావాలి కాబట్టి… ఓంకార నాదమునకు పుట్టినిల్లు అయిన శ్రీశైలంలోనే నీకు ఓంకారము దీక్ష మంత్రముగా నా సమక్షంలో దీక్ష గురువుగా ఇవ్వడం జరిగింది. అలాగే నీకు ఇష్టమైన పాతివ్రత్య ధర్మమును కూడా దీక్షగా ఇవ్వటం జరుగుతుంది.   ఈరోజు నుంచి నేనే నీ పతి దేవుడిని… అని భావన చేసుకో ! నేనే ధర్మ పతి అని ఆలోచన చేసుకో! పతి దేవుడికి సేవ చేసినా కూడా మోక్షం పొందవచ్చునని…. నీకు ఇప్పటికే రుద్రస్వామి చెప్పడం జరిగింది కదా!  అలా అని నువ్వు నాకు గురు సేవలు చేస్తావో… పతి సేవలు చేస్తావో …ఏ విధంగా చేస్తావో …నాకు అనవసరం.  ఏ సేవలో చేసినా ….చెయ్యకపోయినా నీ మనసు నా యందు ఉంచి ….నన్నే ప్రత్యక్ష దైవంగా…. పతి దైవంగా ఆరాధించగలిగితే ….నా ధర్మపత్ని నువ్వు తప్ప పరస్త్రీ గురించి నేను ఆలోచనలు చేయను.  నువ్వు పర పురుషుల గురించి ఆలోచించవద్దు.  పాతివ్రత్య ధర్మంతో నీ జీవితాన్ని కొనసాగించు. అది గృహస్థాశ్రమంలో చేయడానికి కుదరదు కాబట్టి….వాన ప్రస్థావంలో ఉండి సాధన పరిసమాప్తి చేసుకుందాము.  గృహస్థాశ్రమంలో భోగ జీవితంలో విడాకులు తీసుకొని… ఆ భర్తతో విముక్తి పొందావు.  ఇక యోగ సాధనలో యోగ భర్తగా..  నీ ధర్మపతిగా ఉండి… నీకు దగ్గర ఉండి సాధన  పరిసమాప్తి చేస్తాను.  ఇద్దరం కూడా వాన ప్రస్థావంలో ఉండి సాధన పరిసమాప్తి చేసుకుందాం. ఆ తర్వాత  ఇద్దరం కూడా మోక్షసన్యాస దీక్షలోకి అడుగు పెట్టడం వలన…. సన్యాస దీక్ష ధర్మం కూడా పరిసమాప్తి అవుతుంది.  కాబట్టి నీ సాధన నువ్వు చేసుకోవడానికి వచ్చే మాయలు, మర్మాలు రహస్యాలు అన్నీ కూడా నేను దగ్గరుండి చెబుతాను చేస్తాను. 


ఒకవేళ ప్రకృతి మాయ వలన గాని…. రహస్య చేధనలో గాని తెలిసో తెలియకో…. కావాలని నువ్వు మాయలో పడితే,  నిన్ను హెచ్చరిస్తాను. హెచ్చరించినా కూడా నువ్వు కాలానుగుణంగా…. పరిస్థితులకు అనుగుణంగా…. అహంకారమాయలో గానీ,  ధన అహంకార మాయలో కానీ, గురు అహంకార మాయలో గాని, జ్ఞానాహంకార మాయలో కానీ…. యోగ శక్తుల అహంకార మాయలో గాని…. ఎక్కడైనా, ఎప్పుడైనా నన్ను ఎదిరించి…. నన్ను పక్కనపెట్టి మాట్లాడితే…. నన్ను చులకన చేసి మాట్లాడితే….. అనుమానంగా మాట్లాడినా ….అవమానించినట్లుగా మాట్లాడినా …..ఏది జరిగినా, నేను ఆ క్షణమే నీ నుంచి అదృశ్యం అవుతాను.  నీకు స్వప్న దర్శనాలు ఉండవు. ధ్యాన దర్శనాలు ఉండవు. నేను యధా స్థానంలో యధావిధిగా శూన్యంలో కలిసిపోతాను. ఇప్పుడు నీ కోసం నేను ఆకాశ శరీరానికి మోక్షం ఇవ్వకుండా….. నీకు సాధన పరిసమాప్తి కోసం నా అవరోధం ఉండకూడదు అని చెప్పేసి…. నీకున్న ఋణానుబంధం తీర్చాలని…. నువ్వు కూడా మోక్షం పొందాలని…చెప్పేసి ఎదురు చూస్తున్నాను.  ఒకవేళ నువ్వు తెలిసి మాయలో పడినా…..తెలియక మాయలోపడినా నీకు అవకాశం ఇస్తాను.  మూడు అవకాశాలు ఇస్తాను.  ముమ్మారులు నిన్ను హెచ్చరిస్తాను.  అయినా కూడా నువ్వు పట్టించుకోకుండా…. నీ మాయలో నువ్వు ఉంటే,  ఇక నిన్ను వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోతాను.  శూన్యంలో కలిసిపోతాను.  అది మాత్రం గుర్తుపెట్టుకో!  సరే స్వామి ..మీరు పాతివ్రత్య దీక్ష ఇస్తా అంటున్నారు. నాకు కావాల్సింది కూడా అదే…నేను కోరుకునేది కూడా అదే… నేను మానసికంగా, శారీరకంగా నేను మిమ్మల్ని పతి దేవునిగా భావించుకుంటాను.  సాక్షాత్ నడయాడే శివుడే పతి దేవుడిగా వస్తున్నప్పుడు…. పరపురుషుల గురించి నేను ఆలోచించను.  అలాగే బంధాలు, బాధ్యతలు గురించి… భోగ సంబంధమైన, యోగ సంబంధమైన వాటి గురించి… ఆలోచించను.  నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను.  ఒకవేళ తెలిసో తెలియకో నేను పొరపాటున ఏదైనా మాయలో పడినా….అహంకార మాయలో పడినా నన్ను హెచ్చరించండి.  సాధ్యమైనంతవరకు నూటికి 99.9 9999999% నన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి.  నన్ను అర్ధాంతరంగా వదిలిపెట్టవద్దు. నేను మీరు ఉన్నంతవరకు మీతో ఉంటాను.  నేను మాట ఇస్తున్నాను… మీరు నాతో ఉంటారో …లేదో నాకు తెలియదు.  నేను దాని గురించి ఆలోచించట్లేదు.  మీ సాధన పరిసమాప్తి అయిపోయింది.  మహా అయితే ఇంకో 5 లేదా 6 సంవత్సరాలు ఈ భూమి మీద స్థూల శరీరంతో ఉంటారు.  ఈ లోపల నేను సాధన  పరిసమాప్తి చేసుకోవాలి. నా సాధన పరిసమాప్తిలో వచ్చే అవరోధాలు, మాయలు, మర్మాలు, ఆటంకాలు, ఇవన్నీ కూడా దగ్గరుండి దాటిస్తారని నాకు మాట ఇవ్వండి.  నన్ను వదిలిపెట్టనని మాట ఇవ్వండి. అది చాలు…. మీరు ఉన్నారన్న మనోధైర్యంతోనే నేను సాధనకు కూర్చుంటాను.  మీతో అన్ని విషయాలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వండి. మనసులో ఆనందం చెప్పుకోవచ్చు…. బాధ చెప్పుకోవచ్చు…. సంతోషం చెప్పుకోవచ్చు…. అనేంత స్వేచ్ఛను నాకు ఇస్తారని అనుకుంటున్నాను.  ఇది చెయ్యొచ్చు…. ఇది చేయకూడదు అనేలా ఆజ్ఞలు పెట్టకండి.  నేను ఏం చేసినా కూడా చిన్న పిల్లలా చేస్తుంది…. చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది అని భరించండి. మిమ్మల్ని వ్యతిరేకించడాలు చేయను. కానీ నేను మనిషినే కాబట్టి అప్పుడప్పుడు కోపావేశాలు కలుగుతాయి.  ఈ జన్మలో జరిగే సంఘటనల వల్ల గాని… వేదన వల్ల కానీ…. మీరేదో తప్పు చేస్తున్నారని… మానసిక క్షోభ వల్ల కానీ…. ఏదో నాకు ఉన్న పిసరంత జ్ఞానం వలన పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వాటిని మీరు ఓపిగ్గా విని భరించగలిగితే చాలు.  నా కోపం వెనకాల ప్రేమ ఉన్నది…. బాధ్యత ఉన్నది….అని తెలుసుకుంటే చాలు. నేను సాధ్యమైనంత వరకు  మిమ్మల్ని కోపావేశాలతో ఎగర్తిచ్చి మాట్లాడటాలు…. మిమ్మల్ని అవమానించడం…. చేయను . అలాగే మీరు నా దగ్గర అలా చేయరని అనుకుంటున్నాను.  కాబట్టి మీరు నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తే,  మీతో ఎలా ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు… బాధ లేదు, కలగదు అన్నంత వరకు నేను ఉంటాను. కాకపోతే నన్ను మధ్యలో వదిలిపెట్టి మీరు వెళ్ళవద్దు.  అలాగే మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళను అనేసరికి…..


శివానంద:-  అది కాలమే నిర్ణయం చేస్తుంది…బంధాలు,  బాధ్యతలు అనేవి కర్మానుసారం…  ఋణానుసారం ఉంటుంది.  అయితే నేను ఖచ్చితంగా మాట ఇస్తాను.  నీతో జీవితాంతం ఉండటానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు నాతో ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు.  అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. నువ్వు ఉంటావా!  లేదా,  అనేది కాల నిర్ణయమే చెప్పాలి. ఒకవేళ కుటుంబ పరిస్థితుల వలన….. లేదంటే సాధన పరిస్థితుల వలన ….లేదంటే మాయలో ఉండటం వలన…. లేదా తెలిసో తెలియకో అహంకార మాయలో పడటం వలన….ఆ పరిస్థితులు వస్తే,  వాటిని దాటుకునేది ఉందా లేదా అనేది నీకు విడమరిచి చెబుతాను.  తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కానీ…. దాటలేని పరిస్థితి వచ్చినప్పుడు కానీ…. అప్పుడు సమస్యకు తగ్గ పరిష్కారం చూసి…. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు నాతో ఉంటావా?  ఉండవా?  అనేది ప్రకృతికే వదిలేస్తాను.  నేనైతే నువ్వు ఉండాలి…. చేయాలి… అని ఆశపడను.  లేవని చెప్పేసి బాధపడను. నువ్వు ఉన్నావని ఆనందపడను.  ఉన్నా లేకపోయినా,  నా సాధన  పరిసమాప్తి నేను చేసుకోవాలి. అలాగే నేనున్నా లేకపోయినా నీ సాధన పరిసమాప్తి చేసుకోవాలి. ఒకవేళ కుటుంబ పరిస్థితుల వలన…. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా సాధనాపరంగా పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే మనం కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  నేనైతే నిన్ను వదిలిపెట్టను.  అర్ధాంతరంగా నీ కర్మ తీరిపోయింది… నీ  ఋణం తీరిపోయింది… నీకు నాకు ఏం సంబంధం లేదు అనుకోను.  నా శ్వాస ఉన్నంతవరకు నా స్థూల శరీరం ఉన్నంతవరకు నీ చెయ్యి అలాగే పట్టుకుని ఉంటాను.  నువ్వు పట్టుకుంటావా లేదా నువ్వు నాతో ఉంటావా లేదా అనేది నేను చెప్పలేను.  పట్టుకోవాలి అని ఆశించడం లేదు . వదిలి పెట్టేయాలి అని అనుకోవడం లేదు.  అది కాల నిర్ణయం బట్టి ఉంటుంది.  నేను ఎవరి నుంచి ఏదీ ఆశించను.  అలాగే ఉండాలని అనుకోను. వద్దు అని అనుకోను. ఏదైనా నాదంతా స్థిర మనసు, స్థిర బుద్ధి . కాబట్టి పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, ప్రకృతి ఇచ్చే అవకాశాలను బట్టి… నా జీవితం ముందుకు వెళుతుంది అనుకో… నేను శివుని ఆధీనంలో ఉండేవాడిని.  శివుడు ఏది చెబితే అది చేస్తాను.  శివుడు ఎలా చేయమంటే అలా…. అది మాత్రం గుర్తుంచుకో.  ఆయన నిన్ను వదిలిపెట్టమని నీ  ఋణం తీరిపోయింది అని…. కర్మానుసారం నిన్ను వదిలిపెట్టమని చెప్పడం అయితే ఉండదు.  నీ అంతట నువ్వు వెళ్లిపోవాలి…. నా నుంచి నీకు స్వేచ్ఛ కావాలి అని…. నీ అంతట నువ్వు అడిగితే నేను ఇవ్వడానికి నాకు  ఎలాంటి అభ్యంతరము లేదు.  కాకపోతే ఒకటికి పది సార్లు నిన్ను హెచ్చరిస్తాను.  వదిలిపెట్టకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాను.  కానీ ఋణాను బంధ రూపేణా అన్నారు కాబట్టి…. అది కాల  నిర్ణయానికి వదిలేస్తాను.  దాని గురించి నువ్వు ఆలోచించవద్దు…. ఆందోళన చెందవద్దు…. కంగారు పడాల్సిన అవసరం లేదు…. కాకపోతే ప్రస్తుతం మనమిద్దరం కూడా భార్యాభర్తలుగా కాకుండా….. ధర్మపత్ని ధర్మపతి అనే భావంతో శివాని, శివుడు అనే భావంతో సాధన మొదలుపెట్టు.  ఇదిగో ఈ రోజు నుంచి నేను నీకు శారీరకంగా, మానసికంగా ధర్మపతిని. నువ్వు నాకు ధర్మపత్ని అని భావన చేసుకో!  అని చెప్పి ఆమె చేతికి ఒక ఉంగరాన్ని  తొడిగి ….తన మెడలో ఉన్న కారుంగళీమాలను ఆమె మెడలో వేసి….ఇదే నీకు మంగళసూత్రం అనుకో!  ఈ ఉంగరమే నీకు నిశ్చితార్థ ఉంగరం అనుకో…. అని కారుంగలి ఉంగరం చేతికి తొడిగాడు.  అలాగే మెడలో ఉన్న కారుంగళీమాలను ఆమె మెడలో వేశాడు. ఈరోజు నుంచి మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతి భావంతో…. పర స్త్రీ వైపు నేను పోను… పరపురుషుని వంక నువ్వు చూడవద్దు.  నా ధర్మపత్ని నువ్వు అని… నీ ధర్మపతి నేను అని మానసికంగా, శారీరకంగా మనమిద్దరం భార్యాభర్తలు అనుకుంటూ… ధర్మపతి ధర్మపత్నిగా మన జీవితం కొనసాగిస్తూ సాధన  పరిసమాప్తి చేసుకుందాము ..ఇదే నీకు నేను ఇచ్చే పాతివ్రత్య ధర్మదీక్ష అని దీవించేసరికి…. 


శివనందిని:– సరే స్వామి ! ఇంతకంటే మహాభాగ్యం ఏముంది… శివుడే నాకు భర్తగా వచ్చినప్పుడు… నేను ఏమాత్రం ఆలోచించను.  నేను నా భర్తగా కాకుండా ధర్మపతిగా చూసుకుంటాను.  శివుడిగా మీలో భర్తని చూడను,  మీలో శివుడిని చూసుకుంటాను. శివుడే నాకు ధర్మపతి అని భావన చేసుకుంటాను.  శివుణ్ణి నేను మీలో చూస్తున్నాను అంటే…. నేను శివాని అయి ఉండాలి.  శివాని స్థితికి వచ్చి ఉండాలి . నాలో మీరు శివానీని చూసే సాధన స్థితికి నేను చేరుకోవాలి.  మీలో నేను శివుడిని చూడగలుగుతున్నాను అంటే….. మీ స్థితి శివోహం స్థితికి ఎలా అయితే వెళ్ళిందో…. అలా శివోహం స్థితికి వెళ్లాలని నాకు అర్థం అవుతుంది.  నేను అది పరిసమాప్తి చేసుకుంటాను.  ఆ స్థితిని నేను పొందుతాను.  ఈరోజు నుంచి నా మనసా వాచా కర్మణా మీరే నాకు సర్వస్వం.  మీరే నాకు దీక్ష గురువు.  అలాగే పాతివ్రత్య ధర్మంతో ఉంటాను. చచ్చేదాకా ఇక పరపురుషుడు, పర స్త్రీ వైపుకి మనం వెళ్లొద్దు.  మనిద్దరం ఉందాము…


స్వయంగా నా సాధన పరిసమాప్తి కోసం…. నా గత  జన్మలో ఉన్న భర్తే…. ధర్మపతిగా సాక్షాత్తు నడయాడే శివాంశగా వచ్చి… నా సాధన పరి సమాప్తికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పైగా పాతివ్రత్య దీక్ష ఇచ్చారు. ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు.  నా సాధన పరిసమాప్తి అవుతుందో… లేదో… నేను మోక్షం పొందుతానో లేదో కూడా నేను ఆలోచించను.  నాకు కావాల్సిందల్లా మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు …నేను సాధనా అనుభవాలు పొందుతూ ఉంటాను… ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ నేను తెలిసో తెలియకో ఏదైనా మాయలో ఉంటే మాత్రం నన్ను హెచ్చరించండి. సాధన పరిసమాప్తి చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించండి.  మోక్ష ప్రాప్తి పొందుతానో ….వ్యక్తిగత మోక్షం పొందుతానో లేదా విశ్వమోక్షం పొందుతానో …అనేది తెలియదు. మీరు వ్యక్తిగత మోక్షస్థితికి ఎలా అయితే వెళ్లారో… అదేవిధంగా నాకు సాధనలో వచ్చే అడ్డంకులు, అవరోధాలు, మాయలు, మర్మాలు అన్నీ కూడా నేనుచేధించుకుని  పాతివ్రత్య ధర్మంతో కామ వికారాలన్నీ తగ్గించుకొని…. నేను సాధన పరిసమాప్తి చేసుకుంటాను.  స్వామి!  ఇకనుంచి మీరు అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని…. అంటే ఒక రకంగా శివుడిగా నాతో పాటు ఉంటారు.  మరొక పక్క గురువుగా నాతో పాటు ఉంటారు.  మరొక పక్క నా పతిదైవంగా నాతో పాటు ఉంటారు.  నాకు ఎప్పుడు ఏది కావాలనిపిస్తే,  అది చేసుకునే అవకాశాలు కల్పించండి.  


స్వామి ! ఇక్కడ చిన్న ధర్మ సందేహం . నాకు మీ మీద కామ  కోరికలు కలుగుతున్నాయి.కామ భావాలు, కామ ఆలోచనలు కలుగుతున్నాయి. ఆ విషయంలో నేను అదుపు చేసుకోలేక పోతున్నాను. ఎందుకని?  అనేది నాకు అర్థం అవ్వట్లేదు.. అనేసరికి 


శివానంద:– శివాని ! ముందు అసలు కుండలిని శక్తి అంటే ఏమిటి?  అనే దాని గురించి పూర్తిగా తెలుసుకో…..


కుండలినీ యోగము :- 

మూలాధార చక్ర త్రికోణము యొక్క మధ్య భాగంలో సుషుమ్నా  నాడి ప్రారంభమవుతుందని తెలుసు కదా! ఈ సుషుమ్నా నాడి యొక్క ముఖ భాగం ఒక చిన్న పువ్వు మొగ్గలాగా ఉండి ఒక చిన్న రంధ్రం కలిగి ఉంటుంది. ఈ మొగ్గ లింగాకృతి లాగా ఉంటుంది. అందుకే ఈ మొగ్గను స్వయంభు లింగం అంటారు. ఈ లింగమును మూడున్నర చుట్లు చుట్టుకొని ఒక సర్పం లాగా తన తోకను తానే నోటిలో పెట్టుకుని ఈ లింగాన్ని ఒక సర్పము వంటి శక్తి కప్పి ఉంచుతుంది. దానినే కుండలీని శక్తి అంటారు. ఇది సహజంగా  నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు తన సాధన ద్వారా ఈ కుండలిని శక్తిని జాగృతి చేయాలి. అప్పుడు ఈ శక్తి మూలాధార చక్రం నుంచి ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చేస్తుంది. అప్పుడు సాధకుడు సమాధి స్థితిని మరియు ముక్తిని పొందుతాడు. ఈ శక్తి జాగృతి అవ్వటం అంత తేలికైన విషయం కాదు. శక్తి జాగృతికి గురువు ఖచ్చితంగా అవసరం అవుతాడు. ఈ శక్తిని జాగృతి చేసే గురువునే శక్తి పాత గురువు అని పిలుస్తారు. అదేవిధంగా సాధకుడు జపం ధ్యానం ప్రాణాయామం ద్వారా ఇంకా కొన్ని సాధనల ద్వారా శక్తిని జాగృతి చేసుకోవాలి. 


కుండలినీ శక్తి:-

మనల్ని శ్వాసించేలా చేసే శక్తిని ప్రాణశక్తి అందురు! దీనినే విశ్వశక్తి అనీ లేదా కాస్మిక్ ఎనర్జీ అని లేదా చేతనశక్తి అందురు! ఇది మన శరీరం లోపల, బయట కూడ ఉంటుంది! ఈ ప్రాణశక్తే దైవత్వము! ఈ ప్రాణశక్తి మనలో ఉన్నంతవరకు దేవుడు మనలో ఉన్నట్టే! అలాగే మనలో ఎంత ప్రాణశక్తి ఉంటే మనం అంత ఆరోగ్యంగా దైవత్వంతో ఉంటాం!ఈ ప్రాణశక్తి ప్రాణంలో ప్రతిబింబించినపుడు “ఇచ్ఛాశక్తి” అని, మనస్సులో ప్రతిబింబించినపుడు “క్రియాశక్తి” గా, బుద్ధిలో ప్రతిబింబించినపుడు “జ్ఞానశక్తి”గా పిలువబడుతుంది. ఈ శక్తులకు ప్రతీకలుగా పరమేశ్వరుడు, విష్ణుమూర్తిని, బ్రహ్మను ఉంచారు!రక్తము దేహమంతటా వున్నప్పటికి దాని ముఖ్యకేంద్రము హృదయమన్నట్లు, ప్రాణశక్తి దేహమంతటా వున్నప్పటికి దాని స్థానము వెన్నుముక క్రింది భాగమని చెప్పబడుతున్నది! అంటే మూలాధార చక్రస్థానము కన్న క్రిందిభాగము అన్నమాట! 


మన శరీరంలో 72 వేల నాడులున్నాయి! కాని అందులో ఏడు నాడులు చాలా ప్రధానమైనవి! ఈ ఏడు నాడులే ధ్యానానికి ప్రధానమైనవి! అవి ఏమిటంటే భ్రూమధ్యమముపైన గల రెండు నాడులు, రెండు కళ్లనుంచి రెండు నాడులు, రెండు చెవుల నుంచి రెండు నాడులు వచ్చి సుషుమ్నా నాడిలో చేరుతాయి! అంటే (2+2+2+1) సుషుమ్నా నాడితో కలిపి ఇవి మొత్తం ఏడునాడులు అవుతాయి! అందుకే గురువు తన శక్తిపాతము ద్వారా గురుశక్తిని గురుఃమంత్రము ద్వారా అనగా చెవులో చెప్పటం ద్వారా లేదా గురువు తన రెండు కళ్ల ద్వారా శిష్యుడి కళ్లకు ఇవ్వటం ద్వారా, లేదా గురువు తన హస్తమును శిష్యుడి భ్రూమధ్యమును తాకించుట ద్వారా తన గురుశక్తిని ప్రసాదిస్తాడు! ప్రాణశక్తి దేహము క్రింది భాగాన ఉంటుంది! దానిని శిరోభాగానికి తీసుకొని రావాలి! వెన్నుముక క్రింది భాగం నుంచి రెండు నాడులు అనగా ఇడ, పింగళ అనేవి పెడమార్గాన పయనించి, పాము మెలికలరీతిగా, రెండు పర్యాయాలు మార్గమును మార్చి, మూడవసారి భ్రూమధ్యంలో కలుస్తాయి! అంటే మూడు సున్నాలు ఒకదానిపై మరొకటి పెట్టినట్లుగా ఉంటాయి! అంటే ఎనిమిది అంకెమీద మరోసున్న నిలబెట్టినట్లుగా ఇడ, పింగళ నాడులు కలిసి ఉంటాయి! ఆ రెండు నాడులు మూడు చోట్ల కలియడం చేత మూడు గ్రంధులు ఏర్పడ్డాయి! అవి 1. బ్రహ్మగ్రంథి 2. విష్ణుగ్రంథి 3. రుద్రగ్రంథి! ఇందులో బ్రహ్మగ్రంథి బొడ్డు దగ్గర ఉంటుంది! విష్ణుగ్రంథి హృదయంలోఉంటుంది! రుద్రగ్రంథి భ్రూమధ్యమున ఉంటుంది! మూడవనాడి అయిన సుషుమ్నానాడి వెన్నుముక యొక్క మధ్య భాగములో సన్నని ద్వారములో ఈ నాడి ఉంటుంది! అనగా ఇడ, పింగళ నాడుల మధ్యగా, బయలుదేరి, నిలువుగా పయనించి, మూడు గ్రంధులను, షట్చ్క్రాలను తాకుతూ, సహస్రారము దాకా వెళ్లుతుంది! ఈ నాడి యొక్క ముఖభాగము మూసి వుంటుంది! అందువలన ఈ నాడియందు ఎలాంటి శక్తి ఉండదు! ఈ సుషుమ్నా నాడి మార్గము ద్వారానే ప్రాణశక్తి పయనించాలి! పయనిస్తుంది! ఈ మార్గానికే కుండలినీ అని పేరు! 


అంతేకాని కుండలినీ శక్తి అని వేరే శక్తి అనేది లేదు! ప్రాణశక్తికి మరొకపేరే కుండలినీ శక్తి అన్నమాట! ఈ ప్రాణశక్తి సుషుమ్నానాడి మార్గమున ప్రయాణించును! కాబట్టి దీనిని కుండలినీ శక్తిగా పిలుస్తారు! ధ్యానమంటే ప్రాణశక్తిని సుషుమ్నా నాడిలో ప్రవేశపెట్టి సహస్రారానికి తీసుకొని పోయే ప్రక్రియ ! మామూలుగా అయితే ఇడ, పింగళ నాడులలో ప్రాణశక్తి పయనిస్తూ ఉంటుంది! కాని సుషుమ్నా నాడిలో ప్రయాణించదు. గురుః అనుగ్రహము వలనే ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించును! ఎపుడైతే ఈ ప్రాణశక్తి సుషుమ్నానాడిలోనికి ప్రవేశించునో, అపుడు కుండలినీ శక్తి అనగా ప్రాణశక్తి జాగృతి అయ్యినట్లుగా భావించుకోవచ్చును!

అండ, పిండ, బ్రహ్మండములో ఎన్ని రకాల దివ్యశక్తులున్నాయో, వాటినన్నింటిని పరమాత్ముడు ఈ శరీరమనే పిండాండంలో నిక్షిప్తం చేశాడు ! అందులో సుషుమ్నా నాడిలో ఉంచాడు! ఈ సుషుమ్నానాడికి ఎడమవైపు ఇడ నాడి, కుడివైపు పింగళనాడులుంటాయి! ఈ ఇడ, పింగళ నాడులలో నిరంతరము ప్రాణశక్తి ప్రవహించును! ఈ సుషుమ్నా నాడి అడుగు భాగమున త్రికోణయోని మండలములో ప్రాణశక్తి ఇడ నాడి నుండి ప్రయాణిస్తూ, షట్చ్క్రాలను నిరంతరం తాకుతూ, వాటిని ఉత్తేజము చేస్తూ ఉంటుంది. మరి కాసేపు పింగళ నాడి ద్వారా ప్రయాణిస్తూ, షట్ చక్రాలను ఉత్తేజము చేస్తూ ఉంటుంది! ఈ త్రికోణ యోని మండలములో ప్రాణశక్తి మూడున్నర చుట్టలు చుట్టుకొని, తోకను ముఖముతో పట్టుకొని శంఖాకారంగా, నిద్రామగ్నమై, సుషుమ్నా నాడి ముఖ ద్వారాన్ని మూసి ఉంచుతుంది! ఈ మహాశక్తినే కుండలినీ శక్తి అందురు! అంటే రక్తానికి హృదయము ఎలా ముఖ్య కేంద్రమో అలాగే ప్రాణశక్తికి ముఖ్య కేంద్రము ఈ త్రికోణ మండలము! ఎపుడైతే ఈ సుషుమ్నానాడియందు ఈ కుండలినీ శక్తి నిద్రమేల్కొని, చుట్టలు విప్పదీసుకొని, నిట్టనిలువుగా నుంచుంటే అనగా పాము తోక విూద నిలబడితే అపుడు కుండలినీ శక్తి సుషుమ్నానాడిలోనికి ప్రవేశించును! దీనినే కుండలినీ శక్తి జాగరణం లేదా కుండలినీశక్తి జాగృతి అందురు! ఈ సుషుమ్నా నాడి వెంట్రుక వాసినంత వంగినా సరే కుండలినీ శక్తి ఈ నాడిలోనికి ప్రవేశించదు! గమనించగలరు! అందుకే తల, మెడ, శరీరము ఎక్కడ వంగకుండా నిటారుగా పెట్టిధ్యానము చేయమనేది! దీనివలన సుషుమ్నా నాడి నిటారుగా నిలబడి ఉంటుంది! అపుడు కుండలినీ శక్తి లేదా ప్రాణశక్తి ఈ నాడియందు ప్రవేశించుటకు వీలు అవుతుంది! కుండలినీ శక్తి జాగృతి అవ్వాలంటే అజ్ఞాన గ్రంధి విభేదనం జరగాలి! ఇది గురు అనుగ్రహమువలనే మాత్రమే ఈ గ్రంధి విభేదనం జరుగును! అపుడు మాత్రమే ఈ కుండలినీశక్తి అనగా ప్రాణశక్తి సుషుమ్నానాడియందు ప్రవేశించును! గమనించగలరు.


గురువు తన శక్తిపాతము ద్వారా గురుశక్తిని, శిష్యుడిలోనికి చెవులద్వారా అనగా గురుః మంత్రము ద్వారా, కళ్లు ద్వారా భ్రూమధ్యమము తాకుట ద్వారా ప్రవేశ పెడతారు! శక్తిపాతం అంటే మనలోని దుష్కర్మలన్ని రద్దు చేస్తూ కుండలినీ శక్తిని మేల్కొల్పడం! గురువు శక్తిపాతము చేసినపుడు గురుశక్తి శిష్యుడిలోనికి ప్రవేశించును! అపుడు శిష్యడికి అజ్ఞాన గ్రంధి విభేదనం జరిగి, శిష్యునకు ఈ మాయపూరిత ప్రపంచమంతా పరబ్రహ్మ రూపంగా దర్శనమిచ్చును! అపుడు అజ్ఞాన గ్రంధి విభేదనం జరిగినదని భావించుకోవచ్చును. తరువాత గురువు ఇచ్చిన గురుఃమంత్రమును జపించుటవలన గురువు ఆ మంత్రరూపంలో ఉండి శిష్యుడ్ని క్రియాశీలుడ్ని చేస్తాడు! అంటే ఓ విత్తనంలో అందులో మొలకెత్తు వృక్షం శక్తి అంతా ఎలా నిక్షిప్తమై వుంటుందో, అలా గురువు తన శక్తి శిష్యుడిలో బీజరూపములో ప్రవేశపెడ్తాడు! దీనినే సిద్ధమార్గం అందురు! ఈ గురుశక్తి కుండలినీ మాతను మేల్కొలిపి, అనేక రకాల యోగసాధనలద్వారా స్థూల శరీరములోని, అలాగే సూక్ష్మ శరీరములోని ఉన్న మాలిన్యాలని పోయేటట్టుగా చేస్తాయి! అనగా శరీరంలోని నాడులలో ఉండే రోగాలు, మాలిన్యాలు, గ్రంథి దోషాలు, షట్చ్ క్రాల దోషాలు, ముందుగా తొలగింపబడి, శుభ్రపడతాయి! ఈ విధంగా శరీరం రోగరహితంగా, వజ్రమంత గట్టిగా అయ్యాక అసలైన ధ్యానంలోనికి ప్రవేశిస్తాం! అపుడు ఇటువంటి ధ్యానమువలన కుండలినీ శక్తి సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించును! అంటే దీనినిబట్టి చూస్తే కుండలినీశక్తి జాగృతి కావాలంటే గురు అనుగ్రహము తప్పని సరిగా ఉండాలి గదా!


మామూలుగా అయితే ప్రతి నిత్యం ప్రాణశక్తి అనగా 24 గం||లు ఇడ, పింగళ నాడుల ద్వారా సంచరిస్తూ, షట్చ్ క్రాలను తాకుతూ, వాటిని ఉత్తేజితము చేస్తూ ఉంటుంది. ఎలా అంటే మానవుని పంచజ్ఞానేంద్రియాల ద్వారా మన విశ్వములోని విశ్వశక్తి ఇడ, పింగళ నాడులు ప్రవేశించును! ఉదాహరణకు ముక్కు ద్వారా వాసన గ్రహించుట వలన మూలాధార చక్రమునందు చలనము, అలాగే నాలుక ద్వారా రుచిని అనుభవించుట వలన స్వాధిష్ఠాన చక్రము, అలాగే కన్నుల ద్వారా రూపమును చూచుటవలన మణిపూరక చక్రమును, అలాగే చర్మము ద్వారా స్పర్శను అనుభవించుటవలన అనాహత చక్రమును,అలాగే చెవి ద్వారా శబ్దాలు వినుటవలన విశుద్ధ చక్రము ఇలా పంచచక్రాలు ఎల్లపుడు రాత్రి, పగలు తేడా లేకుండా చలనమును కలిగి ఉంటాయి! అనగా ఉదయము, దశేంద్రియాలు పనిచేయుటవలన ప్రకృతిలోని విశ్వశక్తిని ఇవి తీసుకొంటాయి. రాత్రి సమయాలయందు జీవుడు నిద్రించుటవలన పగలు తీసుకొన్న విశ్వశక్తి లేదా ప్రాణశక్తి రాత్రి వేళలయందు పరిభ్రమణము చెంది వాటియందు చలనములు కల్గిస్తాయి! అందుకే పరమాత్ముడు మానవుడికి పంచేంద్రియాలను ఏర్పరిచినాడు! తద్వారా పంచచక్రాలకు నిరంతరం చలనం కల్గిస్తూ, మానవుడి జీవన యాత్రకు ఉపయోగపడుతున్నాయి! అలాగే ప్రాణశక్తి ఉదయం 6 గం|| నుంచి 6-40 ని॥ వరకు మూలాధార చక్రమును (గుదప్రాంతము), ఉదయం 6-40 ని॥ల నుండి మధ్యాహ్నం 1-20 ని॥ల వరకు స్వాధిష్టాన చక్రము (లింగమును)ను, మధ్యాహ్నం 1-20 నుండి రాత్రి 8 గం||ల వరకు మణిపూరక చక్రము (నాభి)యందు, రాత్రి 8 గం||ల నుండి తెల్లవారు ఝామున 2-40 ని॥ల వరకు అనాహత చక్రము (హృదయం) యందు, తెల్లవారుజామున 2-40 నుండి 3-46 వరకు విశుద్ధి చక్రమునందు (కంఠం), తెల్లవారు జామున 3-46 నుండి 4-53 వరకు ఆజ్ఞా (భ్రూమధ్యం), తెల్లవారు ఝామున 4-53 నుండి ఉదయం 6 గంటల వరకు సహస్రారము (నెత్తిన ముచ్చిలి చిప్ప) యందు సంచారము చేస్తూ ఉంటుంది! అనగా ప్రాణశక్తి 24 గం॥లు ఇడ, పింగళ నాడుల ద్వారా ఏడు స్థానములలో సంచరిస్తూ ఉంటుంది! గురు అనుగ్రహము వలనే మాత్రమే కుండలినీశక్తి లేదా ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించునని తెలుసుగదా!


ఎపుడైతే యోగసాధకుడు గురుః మంత్రమును నిరంతరముగా జపించుటవలన కుండలినీ శక్తిలో కదలిక లేర్పడును! అపుడు సుషుమ్నా నాడి యొక్క ముఖ ద్వారము తెరచుకొంటుంది! అపుడు ఇడ, పింగళా నాడులలో ప్రవేశించే ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించును! అంతేగాని త్రికోణ మండలములోని ప్రాణశక్తి ప్రవహించదు! గమనించగలరు! ఎపుడైతే ప్రవేశించిన ప్రాణశక్తి సుషుమ్నానాడిని, షట్చక్రాలను గ్రంధి, విభేదనాలను జరిపి వీటిని శుద్ధి చేయును! ఎపుడైతే సాధకుడు ధ్యానమునందు గంటసేపు ఉండగల్గుతాడో, అపుడు సుషుమ్నానాడిలోనికి ఒక శక్తి ప్రసారము జరుగుతున్నట్లుగా అనుభూతి పొందుతాడు! అది కూడ పాదాలనుండి మొదలై, హృదయము వరకు ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి పొందుతాడు! అక్కడికి వచ్చేసరికి సాధకుడు దీర్ఘశ్వాసలు చేయటం ప్రారంభిస్తాడు! కొన్నాళ్లు ఈ శక్తి ప్రసారము భ్రూమధ్యములోనికి ప్రవేశించినట్లుగా అనుభూతి పొందుతాడు! అపుడు యోగసాధకుడికి విపరీతమైన నొప్పి కనుబొమ్మల మధ్య ఏర్పడుతుంది! గమనించగలరు! తర్వాత కొన్నాళ్లకు సహస్రారములోనికి ఈ శక్తి ప్రసారము జరుగుతుంది! అపుడు యోగసాధకుడు విపరీతమైన తలపోటుగాని, అర్థముగాని అయోమయ స్థితిలోగాని ఉంటాడు! తర్వాత కొన్నాళ్లకు ఈ శక్తి ప్రసారం తలభాగమునుండి అనగా సహస్రారమునుండి వెన్నుముక అడుగుభాగము అనగా గుదము వరకు ప్రవహించును! పదే పదే ఈ ప్రాణశక్తి క్రింద నుండి పైకి, పై నుండి క్రిందకి ప్రవహించును! ఈ విధమైన ప్రవాహమువలన షట్చక్రాలు శుద్ధి అవుతాయి! తద్వారా గ్రంథి విభేదనాలు జరిగి గ్రంథులు మరియు నాడులు శుద్ధి అవుతాయి! ఈ శక్తి ప్రసారము చాలా నెమ్మదిగా చీమలు ప్రాకినట్లుగా జరుగుతుంది! లేదంటే వేగముగా క్రింద నుండి పైకి ప్రవహించును! 


ఈ శక్తి ప్రసారము చాలామంది… కుండలినీశక్తి ప్రవహిస్తోందని భావిస్తారు! ధ్యానములో ఒక గంటసేపు ఎవరైతే కూర్చోగలుగుతారో వారందరికి ఇటువంటి అనుభూతి కల్గుతుంది! అనగా శక్తి క్రింద నుండి పైకి ప్రవహించినట్లుగా భావిస్తారు! అంటే ఈ లెక్కన వీరందరికి పంచభూతాలు ఆధీనము గావాలి గదా! కావటం లేదు గదా! అంటే మొదట ఇడ, పింగళ నాడులలో ప్రవహించే ప్రాణశక్తి, ఈ సుషుమ్నానాడిలోనికి ప్రవేశించి, షట్చ్ క్రాలను, గ్రంథి విభేదనాలను జరిపి చక్రశుద్ధిని, అలాగే గ్రంథి విబేధనము చేస్తుంది! ఎపుడైతే సుషుమ్నానాడి, షట్చ్ క్రాలు, అలాగే గ్రంథి దోషాలు నశించి, ఇవి శుద్ధి అవుతాయో అపుడు కుండలినీ శక్తి జాగృతి అవుతుంది! అనగా త్రికోణ యోని మండలములోని ప్రాణశక్తి జాగృతి అవుతుంది అన్నమాట! ఇడ, పింగళ నాడులలో ప్రవహించే ప్రాణశక్తి మొదట సుషుమ్నానాడిలోనికి ప్రవేశించునని తెలుసుగదా! ఈ ప్రాణశక్తి షట్చ్ క్రాలను, గ్రంథులను శుద్ధిచేయుటకు 12 సంవత్సరాలు తీసుకొంటుంది! ఎలా అంటే ప్రవేశించిన ప్రాణశక్తి ఒక్కొక్క చక్రమును పరిభ్రమించుటకు ఒక నిమిషము తీసుకొంటుంది! అనగా ప్రకృతి కాలమాన ప్రకారము ఒక నిమిషము ఒక సంవత్సరముతో సమానము! గమనించగలరు! అంటే షట్ క్రాలయందు అనగా ఆరుచక్రాలయందు ఈ ప్రాణశక్తి క్రిందనుండి పైకి పోవుటకు ఆరు నిమిషాలు పట్టును! అంటే 6సం||లు పట్టును గదా! అలాగే పై నుండి క్రిందకి ప్రాణశక్తి ప్రవహించుటకు మొత్తము 12 ని||లు పట్టును! అంటే ప్రకృతి కాలమాన ప్రకారము ఈ 12 ని॥లు 12 సంవత్సరాలతో సమానము! అంటే ఈ లెక్కన షట్ క్రాలు శుద్ధి అగుటకు 12 సం||లు పట్టును! అదియు గూడ ధ్యాన నిష్ఠను కలిగి ఉంటే అనగా క్రమము తప్పకుండా ధ్యానము చేస్తే 12 సం॥లలో శుద్ధి అవుతాయి! లేదంటే 24 సం॥లు గాని, 48 సం॥లుగాని పట్టును! గమనించగలరు। అందుకే మన పూర్వీకులు 12 రాశులను ఏర్పరిచినారు! ఎపుడైతే ఈ ప్రాణశక్తి నిరాటంకముగా మూలాధార చక్రము నుండి సహస్ర చక్రము వరకు అలాగే సహస్ర చక్రము నుండి మూలాధార చక్రము వరకు ప్రవహించగలదో, అపుడు సాధకుడు తన్మయత్వం పొందుతాడు! అనగా యోగసాధకుడు ఎపుడైతే భజనలోగాని, ధ్యానమునందుగాని, కీర్తనలు పాడుట ద్వారాగాని పాటలు వినడం ద్వారాగాని, పాటలు పాడటం ద్వారాగాని, పూజలయందుగాని, దేవుని స్తోత్రాలు, మంత్రాలు, చదివేటపుడుగాని, క్రమక్రమేపి తన్మయత్వం పొందుతాడు! ఇట్టి స్థితి రావాలంటే సాధకుడు ధ్యానమునందు మూడు గంటలపాటు ఉండగలిగితే గాని ఇట్టి తన్మయత్వం రాదు! గమనించండి! అలాగే ధ్యానముగాని, జపముగాని, పూజగాని, స్తోత్రాలు పఠించడం గాని, భజనలు చేయటంగాని, పాటలు, పద్యాలు పాడటంగాని మున్నగునవి ఇంక ఆపుదాం అనుకున్నా, ఇంకా అయిదు నిమిషాలు పాటు చేసుకొందాం అనుకుంటూ సాధన చేసే వాడికి మాత్రమే తన్మయస్థితిలోనికి అలవాటు పడగలడు! గ్రహించండి!


ఎపుడైతే యోగసాధకుడు క్రమ క్రమేపి తన్మయత్వం పొందుతూ, ఒక్కొసారి తనకి తెలియకుండానే లేచి రిధమిక్గా నాట్యం చేస్తాడు! అపుడు అతని ముఖంలో ఆనందముతో కూడిన చిరునవ్వో లేక ఆనంద భాష్పాల్లా వచ్చే కన్నీళ్లు తప్పకుండా వస్తాయి! అనగా క్షణికమైన ఆనందస్థితిని పొందుతాడు! ఇలాంటి స్థితిని సాధకుడు పదే పదే పొందుతూ ఉంటే అనగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయే తన్మయత్వములోనికి వెళ్లగలిగితే సాధకుడికి అపుడు ఇష్టదేవత అనుగ్రహము కల్గుతుంది! అపుడు దైవానుగ్రహమువలన శక్తిపాత సిద్ధి గలిగిన గురువు నీ దగ్గరకు వస్తారు! అనగా ఆత్మసాక్షాత్కరమును పొందిన గురువుకు మాత్రమే శక్తిపాత సిద్ధి ఉంటుంది! గమనించండి! అపుడు ఇటువంటి గురువు చూపుతోగాని, స్పర్శతోగాని సాధకుడికి శక్తిపాతము చేస్తారు! అనగా తన అపారమైన గురుశక్తితో సాధకుడి యొక్క త్రికోణ యోనిమండలములోనున్న ప్రాణశక్తి అదే కుండలినీ శక్తిని సుషుమ్నానాడిలోనికి ప్రవేశించేటట్లుగా చేస్తారు! అపుడు సాధకుడికి గురువు కళ్లలోంచి తన కళ్లలోనికి ఏదో చల్లటి అదృశ్యశక్తి సోకిన భావన కలుగుతుంది! తలతిప్పుకుందామన్న, చూపు మరల్చుకుందామన్నా, కనురెప్పలు వేద్దామన్నా, ఏది చేయలేని స్థితిలో సాధకుడు కొన్ని గంటలపాటు ఉండిపోతాడు! తిరిగి సాధకుడికి స్పృహ వచ్చేసరికి ఏదో తెలియని, అంతదాక ఎన్నడూ అనుభవంలోనికి రాని అద్వితీయ ప్రశాంతత, తద్వారా అనిర్వచనీయమైన ఆనందముతో మనస్సు నిండి ఉంటుంది! అలాగే శరీరం తాగిన వాడిలాగా ఎంతో మత్తుగా, తూలుతూ, ఊగుతూ, గమ్మత్తుగా ఉంటుంది! ఇటువంటి స్థితి సాధకుడిలో ఒకరోజుగాని, రెండు రోజులుగాని ఉంటుంది! ఈ రెండు రోజులలో సాధకుడి మనస్సు అంతా స్థబ్దతగా ఉంటుంది! అలాగే లేవబుద్ధిగాదు! లేచిన ఏది చేయబుద్ధిగాదు! ఆకలి ఉండదు! శరీరమంతా బాధ, తల వెడెక్కినట్లుగా ఉంటుంది! రెండు రోజుల తరువాత సాధకుడు ధ్యానం చేస్తే సాధకుడి ధ్యానమునందు ఒక నల్లటి బారెడు కృష్ణ సర్పం చరచర పాకుతూ వస్తున్నట్లుగా కనపడుతుంది! అపుడు సాధకుడు కళ్లు తెరచిన, కళ్లు మూసుకున్న ఇలాంటి దృశ్యమే కనపడుతుంది! అంటే ఇలాంటి దృశ్యానికి అర్థము ఏమిటంటే సాధకుడిలోని త్రికోణయోని మండలములోని ప్రాణశక్తి అదే కుండలినీ శక్తి ఇప్పుడు జాగృతి అయినది! అంటే దీనినిబట్టి చూస్తే మొదటి గురువు తన గురుఃమంత్రము వలన సుషుమ్నానాడి తెరచుకొనేటట్లుగా చేసి, తద్వారా అందులోనికి ఇడ, పింగళానాడులలో ప్రవేశించే ప్రాణశక్తిని (వీర్యంతో కూడిన) సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించేటట్లుగా చేసి, షట్చక్రాలను, నాడులను శుద్ధిచేస్తారు! ఇక రెండవగురువు అనగా శక్తిపాత సిద్ధి గురువు వలన సాధకుడిలోని త్రికోణ యోని మండలములోని ప్రాణశక్తి (విశ్వశక్తితోకూడిన) అదే కుండలిని శక్తి సుషుమ్నానాడిలోనికి ప్రవేశించేటట్లుగా చేసి, షట్చక్రాలను ఆధీనము అయ్యేటట్లుగా చేస్తారు అన్నమాట! కాని


ఓసారి గురు కృప లభిస్తే, అది జన్మ జన్మాంతరాలు శిష్యుడ్ని వెంబడిస్తూనే ఉంటుంది! మన కర్మలు నుంచి మనం ఎలా తప్పించుకోలేమో, అలాగే గురు కృప నుంచి కూడ తప్పించుకోలేము! ఎవరూ స్వశక్తితో కుండలినీశక్తి అదే త్రికోణ యోనిమండలంలోని ప్రాణశక్తిని జాగృతి చేసుకోలేరు! అలాగే ముక్తిని గూడ పొందలేరు! ఇది కూడ శక్తిపాత దీక్ష గురువువలనే సాధ్యపడును! అందుకే గురువే సత్యం, గురువే పూర్ణం, గురువే శాంతి, గురువే జ్ఞానం! ఇది తెలిసిన వాళ్లు "ధ్యాన మూలం గురోర్ముక్తిః" అన్నారు! అందుకే గురువుకు అంత ప్రాముఖ్యత ఏర్పడినది! గ్రహించండి! అదే విధంగా త్రికోణ యోనిమండలములోని ప్రాణశక్తిని అదే కుండలినీ శక్తిని జాగృతి చేయాలన్న గుర్తుగా పిరమిడ్లుంచారు! త్రికోణము యొక్క 3డినే పిరమిడు ఆకారమని గ్రహించగలరు! అలాగే అండ, పిండ, బ్రహ్మాండములోని విశ్వశక్తి అదే ప్రాణశక్తి సాధకుడి యొక్క త్రికోణ యోనిమండలములో ఉంటుందని తెలియచేయుటకు పిరమిడ్లయందు ధ్యానము చేస్తారు! అదే విధంగా ఆదిశంకరాచార్యులవారు శ్రీమేరు చక్రములో లలితాదేవిని, శ్రీ రాజరాజేశ్వరిని అధిష్ఠాన దేవతలుగా ఉంచారని తెలుసుగదా! మేరు శ్రీ చక్రముగూడ త్రికోణ యోనిమండలమునకు గుర్తు! అందులో శ్రీ లలితాదేవిని ఇడ, పింగళా నాడులలో ప్రవేశించే ప్రాణశక్తికి ప్రతీకగా ఉంచారు! ఎందుకంటే ఇడ, పింగళనాడులలో ప్రవేశించే ప్రాణశక్తి మంచి, చెడు ఆలోచనలతో, రకరకాల భావనలతో, రకరకములైన కర్మ వాసనలతో గూడి ఉంటుంది! అందుకే శ్రీ లలితాదేవికి దగ్గర అనేకానేక దేవతలు, దేవుళ్లులుంచారు! అదే విధంగా శ్రీ రాజరాజేశ్వరిదేవిని త్రికోణ యోనిమండలములోని ప్రాణశక్తి అదే కుండలినీశక్తికి ప్రతీకగా ఉంచారు! ఎందుకంటే ఈ శక్తి అంతా పరిశుద్ధముగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటుంది కాబట్టి! అందువలన శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దగ్గర ఎటువంటి దేవతలు, దేవుళ్లులుండరు! అలాగే సాధకుడికి కుండలినీశక్తి జాగృతి అయితే ఈ విశ్వమంతా ఒకే పరబ్రహ్మ స్వరూపంగా కనపడుతుంది! కాని శ్రీ లలితాదేవికి, రాజరాజేశ్వరీ అమ్మవారికి ఇసుమంత భేదము కన్పించదు! గమనించండి! ఎందుకంటే ప్రాణశక్తి అనేది ఒక్కటే కాబట్టి!

ఒకసారి కుండలినీశక్తి జాగృతి అయితే మూలాధారచక్రములోనికి ప్రవేశించును! అపుడు అది తోకమీద నిలబడి మణిపూరక చక్రము వరకు నిలబడి ఉంటుంది! అందువలనే కుండలీశక్తి ఒకసారి జాగృతి అయితే మణిపూరక చక్రము క్రిందకు వెళ్లదు! గ్రహించగలరు! అనగా కుండలిశక్తి స్వరూపము అయిన పాము మూలాధార చక్రమునుండి మణిపూరక చక్రమువరకు వ్యాపించి ఉంటుంది! అపుడు ఇది విశ్వములోని విశ్వశక్తిని తీసుకొంటుంది! 



ప్రాణశక్తి లేదా కుండలిని శక్తిలో కదలికలు ఎపుడు ఏర్పడును?


యోగసాధకుడు గురు: మంత్రమును తీవ్రముగా ఎప్పుడు జపించునో అపుడు త్రికోణ యోనిమండలములోని ప్రాణశక్తి లేదా కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడును! గురు:మంత్రము అనగా గురువు ఉపదేశించిన మంత్రము! సాధారణంగా ఒడుగు సమయాలయందు బ్రాహ్మణులకి గాయత్రిమంత్రమును ఉపదేశిస్తారు! ఈ మంత్రమే గురు: మంత్రము అవుతుంది! ఇది అందరికి వీలుండదు గాబట్టి కనీసము దేవాలయములోని అర్చకుడి ద్వారా కనీసము మీ ఇష్టదేవత మంత్రమును మూడు సార్లు చెప్పించుకొంటే అది గురు:మంత్రము అవుతుంది! ఈ గురు:మంత్రము ఎవరైతే తీవ్రముగా జపము చేస్తారో, వారికి తీవ్రమైన మన:స్థాపము అనగా తీవ్రమైన దు:ఖము లేదా ఆవేదన ఏర్పడుతుంది! ఈ విధంగా ఏర్పడినపుడు కుండలినీశక్తిలో కదలికలు ఏర్పడును! ఉదాహరణకు ప్రేమికులు విడిపోయినపుడు ఏ విధమైన విరహవేదన ఉంటుందో, అదే విధమైన ఆవేదన సాధకుడిలో కలుగుతుంది! అపుడు మాత్రమే కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడును! తద్వారా సుషుమ్నానాడి ముఖభాగము తెరచుకొంటుంది! అపుడు ఇడ, పింగళ నాడులలో ప్రవహించే ప్రాణశక్తి సుషుమ్నానాడిలోనికి ప్రవేశించును!


అదేవిధంగా ద్వాదశలింగ క్షేత్రాలను దర్శించుకొన్నపుడు, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకొన్నపుడు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఉన్నపుడు, అమ్మవారి విగ్రహాలు చూచినపుడు, మహాత్ముల సన్నిధిలో ధ్యానం చేసినపుడు, మహాత్ముల సమాధులవద్ద ధ్యానం చేసినపుడు, మనస్సుకు నచ్చిన ప్రదేశాలను చూచినపుడు, ఆహ్లాదకరమైన ప్రకృతిని చూచినపుడు, హృదయానికి హత్తుకొనే సంగీతమును వింటునప్పుడు, సంగీత సాధన చేసేటపుడు, లయబద్ధముగా, రాగయుక్తముగా పాటలు పాడుతున్నపుడు, అద్భుతమైన 'డాన్స్'ను చూచినపుడు, తత్త్వమునకు సంబంధించిన గ్రంథాలు చదువుతున్నపుడు, మహాత్ముల చరిత్రలు వారి బోధనలను నిత్య పారాయణము చేయునపుడు, యోగతత్త్వము గూర్చి చెప్పినపుడు, వ్రాయునపుడు, తీవ్రమైన ఆనంద క్షణాలు అనుభవించునప్పుడు, చన్నీటిలో స్నానము చేయునప్పుడు, తీవ్రమైన మనఃస్థాపమును అనుభవించునప్పుడు, కాలిబోటన వ్రేళ్లపై నిలబడి నృత్యం చేసే వారిలో, మున్నగు ప్రక్రియల ద్వారా గూడ కుండలిని శక్తిలో కదలికలు అనగా పడుకున్న పాము కదలటం లాంటిది అనగా నిద్రపోతున్న పాము కళ్లు తెరచి చూడటం లాంటిది అన్నమాట! కుండలినీశక్తి జాగృతి అనగా నిద్రలేచిన పాము లేచి తోక మీద నిలబడటం లాంటిది! గ్రహించండి! అందుకే యోగసాధకుడు తీవ్రమైన ధ్యానము చేసినపుడు అతడి ధ్యానమునందుగాని, కలయందు నాగుపాము తల కనపడుతుంది! అంటే కుండలినిశక్తిలో కదలికలు ఏర్పడ్డాయని గుర్తు! అదే విధంగా ధ్యానమునందు ఒక నల్లటి బారెడు కృష్ణసర్పం చరచర పాకుతూ వస్తున్నట్లుగా కనబడితే, అపుడు కుండలిని శక్తి జాగృతి అయినట్లుగా భావించుకోవచ్చును! ఈ కుండలిని శక్తిలో కదలికలు అందరికి సాధారణంగా వుండవు! ఎన్నో జన్మల ఈశ్వరాధన మరియు ధ్యాన సాధనవలన మాత్రమే కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడతాయని యోగశాస్త్రాలు చెపుతున్నాయి! అదే విధంగా కుండలిని శక్తి జాగృతి లక్షలమందిలో కొద్దిమందికే కలుగుతుంది! అదిగూడ శక్తి పాత సిద్ధి గురు అనుగ్రహమువలనే కలుగుతుంది! గ్రహించగలరు!


కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడినపుడు యోగసాధకుడిలో కలిగే స్థితులు వివరించండి?


@ మొదట సాధకుడు తాను ఏమి చేస్తున్నాడో తెలియని అయోమయ స్థితిలో ఉంటాడు!


@ ఎక్కువభాగము మౌనముగానే ఉంటాడు! అది కూడ మనము పలకరిస్తే గాని పలుకుతాడు.


@ ఏ విషయాలయందు ఆసక్తి ఉండదు! అలాగే దేనియందు స్థిరమైన నిర్ణయాలుండవు!


@ ఎవరినిగూర్చి పట్టించుకోడు! ఎలాంటి పనులుగాని, సహాయాలుగాని చేయడు! తన లోకములో తాను ఉంటాడు!

@ అలాగే వేళకు భోజనము చేయాలి అనే తపనగాని, స్నానాలు చేయాలనే ఆలోచనలు గాని ఉండవు! 

@ఎపుడు చూసిన సబ్దతగానే ఉంటాడు! ఒకరకంగా పిచ్చివాడి మాదిరిగా ఉంటాడు!

@ ఎపుడు చూసిన ఏదో తెలియని విషయాన్ని గూర్చి ఆలోచిస్తూనే ఉంటాడు! అనగా మనుష్యులు కేసి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు!

@ రాత్రులయందు నిద్రపోకుండా నగర సంచారాలు చేస్తూ ఉంటాడు!

@ శూన్యములోనికి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ వెకిలి నవ్వులతో ఉంటాడు!

@ ఎపుడు ఒంటరిగానే ఉంటాడు! ఒంటరిగానే సంచారము చేస్తాడు! దేనికి భయపడడు! అలాగే తీవ్రమైన కోపతాపాలు కలిగి ఉంటారు!

@ అలాగే తీవ్రముగా ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు, అందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు!

@ ఇలాంటి సమయాలయందు సాధకుడు ఎవరికి చెప్పకుండా పుణ్య క్షేత్రాలకు వెళ్లిపోతారు! అలాగే ఎవరికి చెప్పకుండా ఇంటినుండి పారిపోవుటకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు!

@ ఇటువంటి స్థితిని తట్టుకునే సాధకులు ఎపుడు పూజలు, జపాలు, ధ్యానాలు యందు ఆసక్తిని కనపరిచి వాటినే ఎక్కువగా చేస్తూ వుంటారు! అదే విధంగా విపరీతముగా విగ్రహారాధనలు చేస్తూ ఉంటారు! అనగా దేవుళ్లుయందు అమితమైన భక్తిని కనపరుస్తారు! గ్రహించండి!

@ ఇటువంటి స్థితిని తట్టుకోలేని వారు పూజలయందు కూర్చొన్నపుడు విపరీతముగా ఊగిపోతూ ఉంటారు! అనగా పూనకాలు రావటం లాంటివి అన్నమాట! ఈ స్థితులను తట్టుకోలేని వారికి పూనకాలు, మూర్ఛవ్యాధి, మతి భ్రమణాలు కల్గును! గమనించండి!

పైన చెప్పిన స్థితులను సాధకుడు తట్టుకోవటానికి 3 సం॥ల నుండి 5 సం॥ల పాటు పట్టును! ఈ సమయాలయందు సాధకుడు గురుఃమంత్రముతో జపముగాని,..ధ్యానముగాని చేసినట్లయితే ఇడ, పింగళా నాడులలో ప్రవహించే ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించును! తద్వారా షట్చ్ క్రాలు శుద్ధి అగును! ఈ షట్చ్ క్రాలు శుద్ధి అగుటకు 12 సం॥లు పట్టును! ఇది సాధకుడి యొక్క ధ్యాననిష్టను బట్టి ఉంటుంది! ఎపుడైతే షట్చక్రాలు శుద్ధి అగునో, అపుడు సాధకుడి త్రికోణ యోని మండలములోని ప్రాణశక్తి అదే కుండలిని శక్తి జాగృతి అవుతుంది.

ఒకటి మాత్రం గుర్తుంచుకో!  కామ భావాలు, కామ ఆలోచనలు విపరీతంగా కలుగుతున్నాయి అంటే… నీలో కుండలినీ శక్తి కదలికలు జరుగుతున్నట్టు… జాగృతికి సిద్ధపడింది అని గుర్తు పెట్టుకో!  అంతేకానీ భోగపరమైన కామ కోరికలు తీర్చుకునే సాధన శరీరాలు మనవి కాదు. భోగ కామ కోరికలలో వచ్చే ఆనందం తీర్చుకోవడం వల్ల వచ్చే ఆనందం క్షణికమైన ఆనందం అని గుర్తు పెట్టుకో!  దీర్ఘకాలిక ఆనందమును పొందాలి అంటే ఈ కామ కోరికలు అదుపు చేసుకోవాలి. అప్పుడు గాని మనం సాధన పరిసమాప్తి చేసుకోవడానికి ఉండదు.  ఎందుకంటే వీర్యం వలనే మనలో తేజస్సు పెరుగుతుంది.  వీర్యం బంగారం లాగా మారుతుంది. ఆ బంగారం యొక్క తేజస్సే మన ఆరాశక్తిగా  ఉపయోగపడుతుంది.  మనలో దివ్య తేజస్సుకి కారణం అవుతుంది. సాధన పురోగతి సాధిస్తుంది. ఈ వీర్యం ఎప్పుడైతే మెదడులో ఉన్న సహస్ర చక్రమునకు ….ఆ తర్వాత బ్రహ్మ రంద్రమునకు చేరుతుందో…. అన్ని చక్రాలను దాటి ఎప్పుడైతే ఈ బ్రహ్మ రంధ్రమునకు చేరుతుందో…. అప్పుడు వారు సాధనలో,  సాధనకి ఉన్న మాయలు,  మర్మాలు, బ్రహ్మజ్ఞానం అర్థం కానివన్నీ అవలీలగా తెలుస్తాయి.  ప్రకృతిలో ఉన్న మార్పులు… సృష్టి, స్థితి, లయలు… బ్రహ్మజ్ఞానం ద్వారా సాధకుడికి అర్థమవుతాయి.


కాకపోతే ఈ ఙ్ఞానం అందించకుండా… ఆదిపరాశక్తి మనకి కామ వికారాలు కలిగిస్తుంది. ఆ కామ వికారాల కోసం ఆశపడితే, వీర్య స్కలనం చేసుకుంటే… ఆ వీర్య స్కలనం వల్ల శరీరానికి కావలసిన బలం అందదు.  ఇంద్రియ నిగ్రహ శక్తి కోల్పోవడం వలన… శరీరం నీరసానికి వెళ్ళిపోతుంది.  వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఎముకలు బలహీనమవుతాయి. నరాలు నిస్సత్తువ పొందుతాయి.  నరాల బలహీనత వస్తుంది. శరీరంలో భాగాలు ఒక్కొక్కటిగా దెబ్బ తినటం మొదలవుతుంది.  అందుకని శరీర సాధనం  ఉంటేనే  మన సాధన పరిసమాప్తి అవుతుంది.  అందుకని మన పెద్దలు కామి గాని వాడు మోక్షగాని కాలేడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భోగం అనుభవించడానికి శరీరం కావాలి. అలాగే అనుభవాలు పొందడానికి శరీరం కావాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి మొదట శరీర వృద్ధి కావాలి.  శరీరము వృద్ధి కావాలంటే నీలో వీర్యవృద్ది ఉండాలి. వీర్యవృద్ది ఉండాలంటే ఈ కామ వికారాల వల్ల కలిగే మనోవికారాలన్నీ కూడా మానసికంగా వీర్యస్కలనం అవ్వకుండా…. మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆలోచనలు వస్తాయి.  అదుపులో ఉంచుకోవాలి. ఆ ఆలోచనలను ఏ మార్చాలి. ధ్యానం వైపు తిప్పుకోవాలి. కామ ఆలోచనలు ఎప్పుడైతే ధ్యానం వైపుకు తిప్పుకుంటావో ప్రణయ మంత్రం కాస్త ప్రణవ మంత్రంగా మార్చుకోవాలి. అంటే కామ ఆలోచనలు కాస్త దైవంలోకి తిప్పి… దైవ ఆలోచనల్లోకి తీసుకురా!  దైవ ఆలోచనలు చెయ్యి.  ఆలోచనలు రావు అని నేను అనను . ఆహారం బట్టి మనసు ఉంటుంది.  మనసును బట్టి ధ్యానం ఉంటుంది.  ధ్యానం బట్టి ధ్యాస ఉంటుంది. మనం తినే ఆహారంలో మసాలా పదార్థాలు ఎక్కువగా ఉంటే…. మనలో కామ వికారాలు కలుగుతాయి.  అందుకని ఉల్లిపాయ, వెల్లుల్లి, మునక్కాయలు, మునగాకు, బాదం పప్పులు తింటే మనలో వీర్యవృద్ది కలిగి కామ వికారాలు కలిగే అవకాశాలు ఉంటాయి.  కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండి సాత్వికమైన ఆహారం తింటే…. మనసు మన అదుపులో ఉంటుంది.  శరీరం తినే ఆహారమును బట్టి మనసు వికారాలు పొందుతాయని గ్రహించు.  ఇది చాలా మంది పట్టించుకోని విషయం.  మనం తినే ఆహారాన్ని బట్టి మనలో కోరికలు మొదలవుతాయి.  అవి కామకోరికలు అవ్వచ్చు….కామ ఆలోచనలు కావచ్చు…. కామ భావాలు కావచ్చు…. ధన సంబంధమైన ఆలోచనలు అవ్వచ్చు… సంతాన సంబంధమైన ఆలోచనలు అవ్వచ్చు… ఆర్థిక అవసరాలు అవ్వచ్చు… ఏదైనా కావచ్చు… కాబట్టి ఆహారమును బట్టి శరీరం ఉంటుంది…శరీరం బట్టి ఆలోచనలు ఉంటాయని గ్రహించు. నువ్వు తినే ఆహారం సాత్వికమైనది అయితే… తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అందుకనే ఇక్కడ మనకి చాంద్రాయణ వ్రతం గురించి చెప్పడం జరిగింది.  ఒక్కొక్క ముద్దని 14 రోజులు అంటే అమావాస్య పౌర్ణమికి ఒక్కొక్క ముద్ద తింటూ వస్తారు. మనం ఒక ముద్ద తినే స్థితికి రావాలి.రుచుల  కోసం ఆహారం తినటం మేనెయ్యి . ఎప్పుడైతే నువ్వు రుచుల కోసం ఆహారం తినటం మొదలుపెట్టావో….. ఆ రుచుల వలన ఆహారంలో మార్పులు జరుగుతాయి.  ఆహార పదార్థాలు కొత్తవి జరుగుతాయి.  వాటిలో ఏర్పడే పదార్థాల మిళితం వలన… కారాల వలన లేదా ఇతర పదార్థాల వలన ఆ కారకాల వలన ప్రకృతి మనమీద ప్రభావం చూపిస్తుంది. కామ వికారాలు కలిగిస్తుంది. మనోవికారాలు కలిగిస్తుంది. అది ఎవరికైనా ఎప్పుడైనా ఎవరి మీద అయినా కలగొచ్చు. నా మీదే కలగాలని  ఏమి లేదు.  ధ్యానం చేస్తున్న సమయంలోను…. జపం చేస్తున్న సమయంలోను…. అందమైన పురుషుడిని ప్రకృతి చూపిస్తుంది. ఆ పురుషుడి మీద నీకు కామ వికారాలు కలిగించవచ్చు.  కాబట్టి ఏదైనా కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  అదే తగినంత ఆహారం అంటే…. ఆకలి తీర్చడానికి ఆకలి తీర్చే ఆహారం కొద్దిగా పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఆకలి పెంచే  రుచుల కోసం ఆహారం తీసుకుంటే రుచుల మీద ప్రభావం చూపిస్తుంది. తద్వారా నీకు కామ వికారాలు కలుగుతాయని చెబుతున్నాను.  ఇది నీకు అర్థం అయింది అనుకుంట!  


శివనందిని:-  అవును స్వామి!  మీరు చెప్పింది నిజమే…. అక్షర సత్యం. ఎందుకంటే నాకు బయట ఆహార పదార్థాలు బిరియాని, ఇతర ఆహార పదార్థాలు మీరు చెప్పిన ఉల్లిపాయలు మునగాకులు, బాదంపప్పు ఎక్కువగా తిన్నప్పుడు నాకు కామ వికారాలు కలిగేవి. శృంగారంలో పాల్గొనాలని విపరీతంగా కామకాంక్ష కలిగేది. నెలసరి సమయంలో విపరీతమైన కామకోరికలు కలిగేవి.  అది ప్రకృతి వ్యతిరేకమైనవి.  వాటిని అదుపు చేసుకోలేకపోయాను.  అదుపు చేసుకోలేకపోవడం వలనే ముగ్గురు సంతానం కలిగారు.  అదేవిధంగా ఇప్పుడు యోగ పరంగ కూడా వస్తుంది. నాకు అర్థం అవుతుంది. ఆహారం బట్టి మన సాధన ఉంటుందని అర్థమైంది. మనోవికారాలు కలగటానికి కారణం మనం తినే ఆహారం అని అర్థమయింది. రుచులకు పోకుండా ఆకలి తీర్చే ఆహారం తినడం మంచిదని నాకు అర్థం అయింది.  నా శరీర ధర్మానికి తగ్గట్టు కొద్ది పరిమాణంలో ఆకలి తీరేటట్టుగా… ఆహారం తినడం ఆరంభిస్తాను. ఇన్నాళ్లు రుచుల కోసం ఆహారం తిన్నాను.  ఇప్పుడు ఆకలి తీర్చే ఆహారం కోసం అని పెట్టుకుంటాను.  పెరుగన్నం, దద్దోజనం, పులిహోర, ఏదో ఒకటి నా మనసుకి తగట్టుగా పరిమితంగా తినటం మంచిది. ఇతర ఆహార పదార్థాల గురించి….ఇతర పదార్థాల రుచుల గురించి…. మసాలాల గురించి…. నేను ఇక పోను. మనం ఆదిలోనే చేస్తున్న తప్పును గమనించట్లేదు. ఆహార విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటే…. నిగ్రహం సహజసిద్ధంగా వస్తుందని నాకు అర్థం అయింది. అలాగే ప్రకృతి ధర్మంగా శరీర వాంఛలు,కోరికలు కలిగిస్తుంది. వాటిని మనం అదుపులో ఉంచుకోవాలి. పరపురుషుడు, పర స్త్రీ వైపు వెళ్లకుండా మనం అదుపులో ఉంచుకుంటే చాలు. సాధన చేస్తున్న కొద్దికి మన ఆహారాన్ని బట్టి మన సాధన స్థితిగతులు ఉంటాయి. తద్వారా మనలో కామ  వికారాలు కలిగితే… వాటిని అదుపు చేసుకోగలిగితే…. తద్వారా వచ్చే వీర్య వృద్ధి బ్రహ్మా రంధ్రం దాకా వెళ్ళగలిగితే… సాధన  పరిసమాప్తి అవుతుంది.  తద్వారా మనలో తేజస్సు పెరుగుతుంది.  దివ్య తేజస్సు వస్తుంది అంటున్నారు.  కాబట్టి దీనిని నిజమా కాదా అని అనుభవంలోకి తెచ్చుకొని సాధన చేయడం ప్రారంభిస్తాను. 


 అని అనేసరికి


శివానంద:- సరే నీ ఇష్టం తల్లి!  కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా చూసుకో!  నీ సాధన కుటుంబానికి తెలియకుండా చూసుకో! రుద్ర స్వామికి తెలిసిన గాని పెద్దగా పట్టించుకోడు. మహాదేవికి తెలిసిన పెద్దగా పట్టించుకోదు. తెలిసి తెలియని స్థితిలో ఉన్న పిల్లలకు తెలిస్తే మాత్రం అయోమయంలో పడతారు…నిన్ను అవమానిస్తారు. అనుమానిస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకో ! మనమధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు.  మానసిక బంధం మాత్రం ఉంటుంది.  అది మాత్రం గుర్తు పెట్టుకో!  నీలో కామ కోరికలు భావాలు కలుగుతాయి. కలగవని చెప్పను. కలిగినప్పుడు సాధనా శక్తి జాగృతి అవుతుందని…. వాటిని అదుపులో ఉంచుకో!  వీర్యాన్ని సాధ్యమైనంత వరకు వీర్య స్ఖలనం కాకుండా కాపాడుకో! వీర్యం ఎంత వృద్ధిలో ఉంటే… నీ సాధన అంత వృద్ధిలో ఉంటుంది. సర్వం వీర్యమే. శివుని వీర్యమే పాదరసం అని చెప్తారు.  పాదరసానికి ఎంత శక్తి ఉంటుందో… నీకు తెలుసు కదా!  పాదరసం నుంచి బంగారం కూడా తయారు చేయవచ్చు అని ఒక నానుడి ఉంది. కాబట్టి రక్తమే వీర్యంగా మారుతుంది. అలాగే వీర్యమే నీకు బంగారపు వర్ణపు తేజస్సు ఇస్తుంది. దివ్యత్వం ఇస్తుంది.  యోగత్వం ఇస్తుంది.  దైవత్వంగా మారుస్తుంది. జీవత్వం నుంచి శివత్వం స్థితికి వీర్య శక్తి తీసుకువెళ్తుంది.  కాబట్టి మూలధార చక్రంలో ఉన్న వీర్యం కాస్త బ్రహ్మ రంధ్రం దాకా తీసుకువెళ్లాలి. ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆహారంతో మొదలుపెట్టి ఆహారం లేని స్థితికి నువ్వు వెళ్ళ కలిగేదాకా… ప్రకృతి, పంచభూతాలు నీకు పరీక్షలు పెడుతూ ఉంటాయి.  అది మాత్రం గుర్తుపెట్టుకో!  ఏది.. ఎవరు.. ఏమి  పెట్టినా భయపడవద్దు. బాధపడవద్దు. ఆశపడ వద్దు , ఆలోచన చేయవద్దు. కంగారు పడాల్సిన అవసరము లేదు. నీకు ఎల్లవేళలా రుద్రస్వామి, నేను సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. సాధన మర్మాలు చెబుతూ ఉంటాము. కాకపోతే సాధ్యమైనంత వరకు సాధనకే నీ సమయాన్ని కేటాయించు. సమయం ఆరు గంటలవుతుంది. నీకు గదికి వెళ్లి స్నానాధికాలు పూర్తి చేసుకుని… టిఫిన్ పూర్తి చేసుకుని ఈ చుట్టుపక్కల ఇంకేమైన ప్రదేశాలు ఉంటే చూసుకుంటూ మానసికంగా ఓంకార నాదం చేసుకో! పాతివ్రత్య ధర్మమే నీకు దీక్షా ధర్మం అని గుర్తుపెట్టుకో!  ఈ రెండు నువ్వు సర్వస్వ శరణాగతి భావంతో చెయ్యి. నేను పక్కన లేను….. పట్టించుకోవడం లేదు…. నేను గమనించట్లేదు…. అని మాత్రం అనుకోవద్దు. నీ ప్రతి ఆలోచన, ప్రతి శ్వాస, ప్రతిభావం, నాకు ఎక్కడున్నా తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు వేరు…. నేను వేరు కాదు.  ఇద్దరం ఒకటే. శరీరాలు వేరు.  మనసు మాత్రం ఒకటే. ఆత్మ ఒకటే . ఇద్దరం అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నామని గుర్తుపెట్టుకో! నువ్వు తప్పుగా ఆలోచించినా నేను బాధపడను. భయపడను ఆలోచించను బాధ పెట్టను. నేను తప్పుగా ఆలోచించాను అని నువ్వు నన్ను అనుమానించొద్దు….ఒకరినొకరు అభిప్రాయాలు చెప్పుకుందాం. ధ్యానానుభవాలు చెప్పుకుందాం. లోటుపాట్లు చెప్తాను అర్థం చేసుకో! విషయం నీకే అర్థమవుతుంది. విషయం విషమించకుండా సాధన చేసుకో! వీర్య స్కలనం గురించి ఆలోచనలు మానెయ్యి. కామ వికారాల గురించి మనోవికారాల గురించి ఆలోచించడం మానెయ్యి. నీ సాధన పరిసమాప్తి  చేసుకో! సాధ్యమైనంతవరకు వీర్యాన్ని కాపాడుకో! వీర్యమే నీకు రక్షగా మారుతుంది. తద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తి …మనోనిగ్రహ శక్తి మరియు వ్యాధి నిరోధక శక్తి ఆ వీర్యమే నీకు ఇస్తుంది. కాబట్టి అది జాగ్రత్తగా కాపాడుకో! వీర్యమే నీకు బంగారం అని తెలుసుకో! ఇంతకంటే నేను చెప్పవలసింది ఏమి లేదు.


అనేసరికి ఆయన గాల్లో కలిసిపోయాడు. అంతర్ధానం అయిపోయాడు. ఇదేమంత గొప్ప విషయం కాదు. సాధారణమైన విషయమే. ఈ సాధన స్థితి తను అనతి కాలంలో వెళితే సరిపోతుంది. ఈరోజు ఈయన చెప్పినట్లుగా సాధన చేసుకుంటే … సరిపోతుంది. సాధన  పరిసమాప్తి చేసుకోవాలని….నిర్ణయించుకొని పాతివ్రత్య ధర్మదీక్షతో దీక్ష మంత్రంగా ఓంకార నాదం చేసుకోవడం ఆరంభించింది. అక్కడి నుంచి తన ప్రమేయం ఏమీ లేకుండానే ఓంకార నాదం సహజ సిద్ధంగా బొడ్డు నుంచి వస్తుందని గ్రహించింది. తనలో ఓంకార నాదం చేసేవారు ఎవరా అని అనిపించింది.. అది ఎవరు ఏంటి అనేది కాలానుగుణంగా అర్థం అవుతుందని గ్రహించి…. ఆ ఓంకార నాదం తను చేయకుండా ఆ ఓంకార నాదం వినడం అభ్యాసంగా పెట్టుకుంది. తనలో వచ్చే ఓంకార నాదం వింటుంటే తన కడుపులో ఎవరో ఉండి ఓంకార నాదం సాధన చేస్తున్నట్టుగా అనిపించసాగింది. విచిత్రంగా అనిపించింది. ఒక విధమైన విచిత్ర అనుభూతిని పొందుతూ బయలుదేరి సత్రం గది వైపుకు అడుగులు వేసింది . సత్రం గదికి చేరుకుంది. 


శివ నందిని కాస్త విభూతిమఠంలో ధ్యానము ముగించుకొని సత్రం ఉన్న గదికి వెళ్ళింది. గది తలుపు తీసేసరికి… గాఢ నిద్రలో పిల్లలు, రుద్ర స్వామి ఉండేసరికి ఆశ్చర్యం వేసింది.  సూర్యోదయం అవుతుంది కదా!  ఈపాటికి పిల్లలు లేవాలి… రుద్ర స్వామి ధ్యానంలో కూర్చోవాలి కదా!  అలాంటిది ఏంటి వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారు… నిద్రపోతున్నారా?  నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా?  అని ఆలోచిస్తూ ఉండగా…. వెనకనుంచి మహాదేవి లోపలికి వస్తూ….


మహాదేవి:–  లేదు…. వాళ్ళు నటించట్లేదు .నిద్రపోతున్నారు. రాత్రంతా నీకు కావలి కాసారట. అంటే నువ్వు లోపల ధ్యానంలో ఉన్నావని… వీళ్ళు బయట కూర్చుని కాపలాకాశారు. విష జంతువులు, కానీ లేదా సింహాలు, పులులు లేదా అబ్బాయిలు ఏదైనా అఘాయిత్యం చేస్తారేమోనని… వీళ్ళ ముగ్గురు ధ్యానం చేసుకుంటూ అక్కడే కాపలా కాస్తూ కూర్చున్నారని చెప్పారు. 


శివ నందిని:–  నీకు ఎలా తెలుసు? నువ్వు భైరవకోనకి వెళ్లలేదా.?


మహాదేవి:–  వెళ్లాను… వెళ్లి వస్తూ ఉండగా… ఈ రచ్చబండ మీద జనాలు మాట్లాడుకుంటుంటే… విని వచ్చాను.


శివనందిని:–  అవునా!  వీళ్ళు రాత్రంతా నాకోసం కాపలా కాసారా? నేను అసలు పట్టించుకోలేదు. బయటకి రాలేదు లే!  నేను చూడను కూడా చూడలేదు. సరే ….వీళ్ళు ఎందుకు నాకోసం ఇంత తపన ,తాపత్రయం పడడం… కాసేపు విశ్రాంతిగా పడుకోవచ్చు కదా! 


మహాదేవి:– వాళ్ళు భోగపుత్రులు కాదు. సాధనకు వచ్చినవాళ్లు.  నీ సాధనకి ఆటంకాలు అవాంతరాలు రాకుండా చూసుకునేవాళ్లు. వాళ్ళ ముగ్గురు కూడా అలాంటి వాళ్లే. తమ సాధన చేసుకుంటూ నీకు రక్షణగా ఉంటారు. అంతేగాని వాళ్ళ స్వార్థం చూసుకోవడమో లేదా నిన్ను వదిలివేయడం… నిన్ను పట్టించుకోకపోవడం లాంటివి ఉండవు. అలా వాళ్ళు ఏనాడు చేయరు కాకపోతే పెద్దాయన చేయడంలో ఆశ్చర్యం లేదు… కానీ చిన్నపిల్లలు కూడా అలాగే చేస్తూ ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. 


సరే!  నాకు రాత్రంతా నిద్ర లేదు ధ్యానంతోనే సరిపోయింది ఒళ్లంతా నొప్పులుగా ఉంది పడుకుంటాను అని అంటే మహాదేవి కూడా నేను కూడా పడుకోవాలి నాకు కూడా రాత్రంతా ధ్యానంతోనే సరిపోయింది అనేసరికి….


శివ నందిని:– ఎలా ఉంది నీ సాధన…. ఆ భైరవ కోనలో.  మీ సాధువుల్ని కలిసి వచ్చావా?


మహాదేవి:– ఆ ! చూసొచ్చాను.. నూటికి 80%  శాతం మంది వేషదారుల్లోనే సరిపెట్టుకున్నారు.  వీరంతా కూడా ప్రారంభ సాధకులు. ఒకళ్ళిద్దరు మాత్రం నిజ సాధనా శక్తితో పూర్ణ సిద్ది పొందే స్థితిలో ఉన్నారు. నేను భైరవ కుక్కను తీసుకుని వెళ్లాను.  వాళ్లంతా దాన్ని చూసి భయపడ్డారు. అందులో భైరవమాతని  ఒక ముసలాయన తప్ప ఇంక ఏ ఒక్కరు కూడా చూడలేకపోయారు. అప్పుడే నాకు అర్థమైంది.  వీళ్ళు సాధన ఇంకా పరిపక్వత కాలేదు.  వీళ్ళు  భుక్తి కోసమో… లేదా సాధనలో ఏదో సాధించాలి… సిద్దులు పొందాలి… అని ప్రయత్నాలు చేసే వాళ్ళలా అనిపించింది. ఉండటానికి ఉన్నారు…. సుమారు వంద నుంచి 150 దాకా ఉన్నారు. యువసాధకులు ఉన్నారు, వృద్ధ సాధకులు ఉన్నారు. అందులో ఒక వయో వృద్దుడు సుమారుగా 85 సంవత్సరాలు ఉన్న ఆయన,  ఈ భైరవి కుక్కని చూసి …వచ్చావా తల్లి! నీకోసమే చూస్తున్నాను… కాశీ నుంచి నా కోసం వచ్చావా!  నన్ను అనుగ్రహించు తల్లి… అనేసరికి ఇదేదో తన తల మీద కాలు పెట్టి రుద్ది…ఆశీర్వాదం చేసింది.  ఆయన ఒళ్ళో కెళ్ళి పడుకుంది.  దువ్వించుకుంది… ఆయనతోనే ఎక్కువసేపు ఉంది. 


శివ నందిని:– ఎవరి దగ్గర అయితే కుక్క గాని పిల్లి గాని రాత్రంతా కాపలా కాస్తుందో వాళ్ళకి మృతి వడియలు సమీపించినట్లు అని ఒకసారి వార్తల్లో నేను విన్నాను.


మహాదేవి:–  ఆ మాట నిజమేనేమో! తెల్లారే ఆ వృద్ధ భైరవుడు లేవలేదు. శరీర త్యాగం చేశారు. శివైక్యం చెందారు అని… అందరూ అనుకున్నారు. అంటే అది నిజమే అన్నమాట! అంటే రాత్రంతా భైరవి ఆయన దగ్గరే ఉంది. తెల్లవారుజామున సుమారుగా మూడు గంటలు వరకు ఉంది.  ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. 


శివనందిని:– ఆ సమయంలోనే ఆయన చనిపోయి ఉంటారు. 


మహాదేవి:- ఏమో తెలియదు… కాకపోతే బ్రహ్మా రంధ్రం నుంచి రక్తపు మరకలు వచ్చాయి. కపాల మోక్షం పొందారని అక్కడ భైరవులు అనుకుంటున్నారు. 


శివనందిని:- ఒహో…అవునా! అయితే భైరవ కోనలో భైరవ దర్శనం ఎలా జరిగింది..? 


మహాదేవి:- ఈ శ్రీశైల క్షేత్రంలో అష్టభైరవులు కొలువై ఉన్నారట. కాకపోతే ఈ దండకారణ్యంలో ఎక్కడ ఆ భైరవాలయాలు ఉన్నాయి. అంతా కనుమరుగు కావటం వలన చాలావరకు అభయారణ్యంలో కలిసిపోయాయి. అనేది సిద్ధయోగులకి సిద్ధ పురుషులకి మాత్రమే తెలుస్తుంది. అది కూడా వాళ్ళు గుప్తంగా వాళ్ళ తాంత్రిక పూజలు చేసుకుంటూ వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ లోకానికి తెలియకుండా గుప్తంగా ఉండిపోయారు. అయితే అరకొరగా ఆటవిక జనులు నివసించే దగ్గరగా ఉండి కొన్ని భైరవ ఆలయాలు అక్కడక్కడ కనబడతాయి. వాటిని ఈ గిరిజనులు చాలా పవిత్రంగా నిష్టగా కొలుచుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా దట్టమైన అడవి మధ్యలో ఉండటం వలన పులులు ఎలుగుబంట్లు వంటి వాటికి నివాసం .అయ్యాయి.  అందులో కొన్ని బైరవాలయాల గురించి ఆ వృద్ధ భైరవుడు చెప్పాడు. 


1.భైరవకోన:- 

ఇది ఆరవ శతాబ్దానికి చెందింది. ఈ భైరవకోనలో ఒకే రాతి తో చెక్కిన ఎనిమిది శివాలయాలు దర్శనం ఇస్తాయి. ముందుగా వెళ్లి కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని కాసేపు స్వామి అర్చించి ధ్యానంలో కూర్చున్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆలయాలు దర్శించి…... కాలభైరవ స్వామికి ఎదురుగా త్రిముఖ దుర్గాంబ అమ్మవారు కనిపించారు. ఈ అమ్మవారు మహాకాళి ,మహాలక్ష్మి, మహా సరస్వతీ కలిసిన త్రిశక్తి స్వరూపం. ఈ అమ్మవారిలో ఉన్న కాళికామాతను దక్షిణ కాళీ అని కూడా పిలుస్తారని అక్కడ ఉన్న సాధువులు చెప్పారు. ఈ అమ్మవారి ముందు ఉన్న శివలింగాన్ని భర్గులేశ్వర స్వామి అని పిలుస్తారట. అమ్మవారు ఇక ఆదిశక్తి అనుకో! ఈ అమ్మవారికి ఎదురుగా ఒక నీటి కుండం కప్పి వేసి ఉంచారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ నీటిపై కప్పును తీస్తారని….  ఆరోజు ఈ కార్తీక పౌర్ణమి చంద్ర కిరణాలు ఈ కుండంలో పడి ఆ కిరణాల వెలుగులు అమ్మవారి విగ్రహాన్ని తాకుతాయట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీనిని చూడడానికి ఇక్కడికి ఆరోజు ఎంతోమంది భక్తులు వస్తారు. ఈ ఏకరాతి తో చెక్కిన అష్ట లింగాలు మాత్రమే కాకుండా…. ఈ రాతి మొత్తంలో 108 శివలింగాలు కనిపిస్తాయి. ఈ అష్ట లింగాలలో ఏడు లింగాలు తూర్పు ముఖంగా ఉంటే ఒక లింగం మాత్రం ఉత్తర ముఖంగా కనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా శివ నందిని! బ్రహ్మదేవుని విగ్రహమూర్తులు మనం ఎక్కడా దర్శించుకోవడానికి అవ్వదు కదా. కానీ ఇక్కడ ప్రతి శివలింగానికి బయట ద్వారానికి ఇరువైపులా బృంగి,  శృంగి లతో పాటుగా ఒక వైపు బ్రహ్మదేవుడు, మరొకవైపు విష్ణుమూర్తి బయట నంది విగ్రహం, ప్రకారంలో ఒకవైపు గణపతి, మరో ఒకవైపు చండీశ్వరుడు ప్రతి శివలింగ ప్రకారమునకు కూడా ఇలాగే దర్శనమిస్తాయి. ఈ భైరవకోన మొత్తంలో కోటి ఒక్క శివలింగాలు దర్శనం ఇస్తాయట. కానీ వాటిని మనం చూసే ఇది లేదు. అది చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఏమరపాటుగా ఉండటానికి లేదు. ఇక్కడ శివలింగాలు అన్నీ కూడా బ్రహ్మసూత్ర లింగాలే.. వాటి పేర్లు…..

1) అష్టకాల ప్రచండ భైరవలింగం 

2) శ్రీ పక్షి ఘాత లింగం:- ఈ శివలింగ దర్శనం చేత శత్రుసంహారం జరుగుతుందని అంటారు…. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ పాన మట్టం కింద నుంచి నీటి ఊట నిరంతరం వస్తూనే ఉంటుంది. 

3) శ్రీశైలం మల్లికార్జున లింగం:- లింగ దర్శనం ….శ్రీశైలం మల్లన్నను  దర్శించినంత భాగ్యం కలుగుతుందని చెబుతారు. 

4) నగరేశ్వర లింగం 

5) రామేశ్వర లింగం:- రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితమో ఈ లింగాన్ని దర్శించుకున్నా అంతే ఫలితం దక్కుతుందని చెప్తున్నారు. 

6) కాశీ విశ్వేశ్వర లింగం:- కాశీలో కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ లింగ దర్శన భాగ్యం చేత కలుగుతుందట. 

7) రుద్ర లింగం 

8) శశి నాగలింగం:- ఈ ఒక్క లింగం మాత్రమే ఉత్తరం ముఖంగా ఉంటుంది. మిగిలిన లింగాలన్నీ తూర్పుముఖంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ శివలింగం పైన మణి ఉండేదట. ఆ మణికాంతులు ఈ ప్రదేశం అంతటా పడేవట. కానీ ఇప్పుడు అది లేదు. ఈ లింగ దర్శనం చేత ఈ లింగ ని అర్చించడం వల్ల సర్ప దోషాలు, సర్ప శాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.


ఇక్కడికి నిత్యం ఎంతోమంది సిద్ధులు, అఘోరాలు, కాపాలికులు, నాగసాధువులు,  వచ్చి బైరవ దర్శనం చేసుకొని ఎవరి సాధన వారు గుప్తంగా చేసుకుంటారు. 


చుట్టూట భైరవ స్వామి:-

అయితే ఆటవికుల చేత పూజలు అందుకుంటున్న భైరవ ఆలయాలలో చుట్టూటి భైరవ స్వామి ఒకరున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం చెందే విషయం ఏమిటంటే అసలు ఇక్కడ నవ్వకూడదు అని చెబుతారు. ఈ ఆలయం వద్ద ఒక కోనేరు ఉంటుంది. ఆ భైరవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని చిన్న భార్యను తీసుకురావడంతో పెద్ద భార్య అలిగి కోనేరులో దూకిందని చెబుతారు. భైరవుడ్ని శివుడిగా భావించి ఒకరు గంగా అని ఒకరు పార్వతి అని చెబుతూ ఈ కోనేరులో అమ్మవారు దూకటం వల్ల దీనిని అమ్మవారి కొలను అని అతి పవిత్రంగా చూస్తారు. అంటు , ఋతుక్రమం అశౌచం తో ఉండి ఈ కోనేరు వద్దకు వెళ్లేవారు కాదు. ఇలాంటివి అన్నీ ఇక్కడ చాలా నిష్టగా పాటిస్తారట. ఒకసారి ఒకతను కాళ్లు కడుక్కోవడానికి అని ఈ కోనేటిలో కాళ్లు పెట్టగానే కాలు కడిగి నాలుగు మెట్లు పైకి ఎక్కేసరికి పాము కరిచి చనిపోయాడని ఈ గిరిజనులు చెబుతారు. ఇక్కడ నవ్వకూడదని చెప్పారు అన్నాను కదా! ఇక్కడ దిష్టిబొమ్మల కింద సృష్టియజ్ఞ దృశ్యాలు అంటే కామక్రీడా శిల్పాలు చెక్కి అమర్చారు.  మరి వీటి వెనక ఉన్న కథ ఏమిటో ఎవరికైనా తెలిసి ఉండొచ్చేమో కానీ నాకైతే తెలియదు. వీటిని చూసి నవ్వకూడదని చెబుతారు. ఇక్కడ భైరవ స్వామి విగ్రహం, దేవతల విగ్రహాలు,  అమ్మవారు కొలనులో దూకే శిల్పాలు చెక్కి ఉంచారు. మొత్తానికి ఇక్కడ  చుట్టూట భైరవ  స్వామి చెంచులు గిరిజనులచే పూజలు అందుకుంటున్నారని చెప్పారు. 


భైరవ కొండ:- 

ఇక్కడ ఎన్నో శిధిలమైన విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా శివలింగం అమ్మవారి దేవాలయాలతో పాటుగా భైరవ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇది అట్టమైన అడవి మార్గంలో ఉండటంవల్ల అడవి మృగాలకు ఆనవాళ్ళు అయింది. 


భైరవ సెల:- 


ఈ స్వామిని ఇప్ప మూలబయన్న అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న భైరవాలయానికి వచ్చి చెంచులు, కాపాలికులు, నాగసాధువులు అనేకమంది సిద్ధులు వచ్చి పూజిస్తూనే ఉంటారు. ఈ ప్రదేశంలో దేవతలు జంతువుల రూపంలో సంచారం చేస్తూ ఉంటారు. సూక్ష్మ రూపంలో సిద్ధ పురుషులు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉండే గుహలలో ఎంతోమంది యోగులు, సాధకులు నిగూఢంగా గుప్తంగా సాధన చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ మరకత లింగం దర్శనమిచ్చేది. కానీ దాన్ని పెకిలించి దొంగిలించబడిన తర్వాత చెంచులు మరొక శివలింగాన్ని ప్రతిష్టాపన గావించారు.  ఈ భైరవ ఆలయానికి పక్కనే ఒక సెలయేరు ప్రవహించటం వలన దీనిని భైరవసేల అని పిలుస్తారు అంట. ఒకప్పుడు ఇక్కడ వాసుకి సర్పం కూడా తిరిగేదని చెబుతారు. ఎలా పడితే అలా ఇక్కడికి వెళ్ళటానికి తిరగటానికి లేదు. ఇది చిరుతలు ,పెద్దపులులు, ఎలుగుబంట్లు, సంచారం విపరీతంగా ఉండి దట్టమైన అడవి కొండ లోయలో ఉంటుంది. ఇక్కడ ఉన్న గుహలకు బలి గుహలు అనే పేరు కూడా ఉంది. ఇక్కడ జంతువుల రూపంలో ఋషులు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న భైరవుడు సంహార భైరవుడు. ఆయనతోపాటు భైరవి అమ్మవారు ఇక్కడ సజీవ మూర్తిగా ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ పూజ చేసినప్పుడు లేదా ఈ ప్రాంతంలో ధ్యానం లేదా తిరుగుతున్నప్పుడు గజ్జెల శబ్దం వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిగూఢంగా ఉన్న పాతాళ గుహల్లో గుప్తంగా సాధన చేసుకునే వాళ్ళు చేసే ఘంటా నాదాలు…ఎన్నో వింత శబ్దాలు వినవచ్చు. ఈ అటవీ ప్రాంతంలో భైరవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఉగ్రంగా తిరుగుతూ ఉంటాడు. ఈ భైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉండడం చేత ఈయన దర్శన భాగ్యం చేత ఎన్నో చెడు కర్మలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ భైరవుడిని సంహార భైరవుడు అని కూడా పిలుస్తారు. 


కాలభైరవలయం:- 

మనకి మల్లన్న దేవాలయానికి కొంచెం దూరంలో మహిషాసుర మర్ధిని ఆలయం ఉంది. దానికి దగ్గరలోనే భైరవాలయం ఉంది. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు, పంచ ముఖ హనుమాన్ కూడా మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారికి పౌర్ణమి అమావాస్యలు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారట. ఇక్కడ మౌన స్వామి అనే యోగ సాధకుడు సాధనలో సిద్ధిపొంది జీవ సమాధి చెందాలని చెబుతారు. దీనినే పాండవుల గుహ అని కూడా పిలుస్తారట. ఇక్కడే చాలాకాలం పాటు పాండవులు ఉండి సాధన చేసుకుంటూ స్వామి వారి దర్శనం చేసుకుంటూ నివసించే వారిని …. ఈ గుడిలో ఉన్న గుహ  మార్గం ద్వారా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వచ్చే వారని…. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఆనవాళ్లు ఏవి లేవని చెప్పారు.


శివనందిని:- సరే అక్కడ నిజసాధకులు లేరు అని అనుకుంటున్నావా? 


మహాదేవి:- సాధనలో నిలబడగలిగే వాళ్ళు…. నిలబడగలగే మనోధైర్యం ఉన్నవాళ్లు… చావు భయం లేని వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తున్న దేవత మూర్తిని చూస్తే… చిన్నమాస్తా దేవి ఆరాధన కనపడింది.  చిన్న మస్తా దేవి అంటే నీకు అవగాహన ఉంది కదా!  ఆమె తలనరికి తన సహాయకులకి రక్తధారను ఆహారంగా ఇస్తుంది. ఆమె పాదాల కింద మన్మధ రతీ దేవులు…నగ్నంగా ఉండి శృంగారం చేస్తూ కనపడతారు కదా!  


శివ నందిని:- అవును…చినమస్తా దేవి కుండలిని జాగృతికి ప్రతీక అంటారు.  శీఘ్రమే సహస్ర చక్రానికి తీసుకువెళ్తుంది. ఈవిడ సాధన చేస్తే 41 రోజుల్లోనూ…లేదా 41 నెలల్లోనూ ఫలితం దొరుకుతుందని తంత్ర శాస్త్రంలో చెప్పడం జరిగింది.


మహాదేవి:- అవును….ఇది కూడా నిజమే! పరమహంస గారు రాసిన కపాలమోక్షం గ్రంథంలో కూడా ఆయనకి సహస్ర చక్రంలో చినమస్తా దేవి దర్శనం అయినట్టుగా చెప్పడం జరిగింది.  కాబట్టి ఇది నిజమే అయి ఉంటుంది. కాకపోతే ఈవిడ  అనుగ్రహం పొందాలి అంటే… సంయోగం నుంచి సమాధి స్థితి పొందే సాధన చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువగా వీళ్ళు 80% శృంగార ప్రక్రియలో పాల్గొంటారు. అవతలి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా… కూడా శృంగారం చేస్తారు. స్త్రీ పురుషుల కలయిక ఈ సాధనలో ఉంటుంది . అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. భైరవి సాధనలో అలా ఉండదు. అవతల వాళ్ళకి ఇష్టం ఉంటేనే…భైరవుడు మన  దగ్గరికి వస్తాడు.  లేదు అంటే ఇక ఏకాంతంగా ఒంటరిగా వదిలేస్తాడు.  కానీ వీళ్ళు అలా కాదు… రాత్రి 12 గంటలు అవ్వగానే.. శృంగారం మొదలు పెడతారు.  సంయోగంతోనే సమాధి స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.  పైగా  వీళ్ళు గంజాయి సేవిస్తారు. గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాదక ద్రవ్యాలు విపరీతంగా సేవిస్తారు. గుట్కా, పొగాకు, గంజాయి ఇవన్నీ సేవిస్తారు.  ఆ సేవనం… విపరీతమైన కామకాంక్షతో… కామ వాంఛతో… వికృత చేష్టలతో  శృంగారం చేస్తారు.  ఆ శృంగారం విపరీత రతీక్రీడ చూస్తేనే నాకు జుగుప్స కలుగుతుంది.  అందులోనూ తాంత్రిక అధిదేవత అయిన చినమస్తా దేవి అంటేనే…. ఒక విధమైన భయము కంగారు ఉంటుంది.  కాకపోతే నేను ఎప్పుడూ ఆనంద భైరవి సాధనలో అష్టభైరవి సాధన చేసుకుంటూ వచ్చాను.  కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాకపోతే వీళ్ళు సాధన విధి విధానం తెలుసుకునేసరికి… సరేలే!  వాళ్ల సాధన అది. కాకపోతే నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు.  నన్ను అడుగుతూ వచ్చారు. నేను కాదంటూ వచ్చాను.  నాకు రక్షణగా భైరవి కుక్క ఉండేసరికి ….అది అందరి మీదకి కరవడానికి వెళ్లేసరికి…. నా దగ్గరికి ఎవరు రాలేదు.  లేకపోయి ఉంటే ఒక పది పదిహేను మంది నామీద  ఎగబడేవాళ్లు.  వాళ్ళ కామావేశాలు తీర్చుకునేవాళ్లు.  సరే అని చినమస్తా దేవి మీద భారం వేశాను.  ఎవరు కూడా నా జోలికి రావడానికి సాహసించలేదు.  ఇక్కడ భైరవి సాధనలో శృంగారంలో పాల్గొనడం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది..ఇక్కడ చిన్నమస్తా దేవి సాధనకు వచ్చేసరికి…. మనకి అవకాశం ఇవ్వరు….బలవంతం చేస్తారు.  అదే నాకు నచ్చదు. కానీ తంత్రంలో కొన్ని విధివిధానాలు… కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని బాధాకరంగా ఉంటాయి.  కొన్ని శీఘ్ర ఫలితాలు ఇస్తాయి. వీళ్ళ అనుభవం ప్రకారం సంయోగం చేస్తే,  సమాధి స్థితికి వెళతారు అని చెప్పేసి…. తంత్రంలో ఉన్నది. అది  నిజమో కాదో నేను ఇంతవరకు పరీక్షించలేదు.  చూడలేదు.  కానీ నిన్న చనిపోయిన ఆయన చెప్పడం మాత్రం ఆ సాధనలో ఆ స్థితి ఉంది.  ఆ సాధనలో నేను సమాధి స్థితి పొందాను.  అమ్మవారి సాక్షాత్కారం పొందాను అని ఆయన చెప్తుంటే… నేను విన్నాను.  తెల్లవారేసరికి ఆయన  చనిపోయారు ఆ వృద్ధ భైరవ సాధకుడు.  సరే అని నేను వచ్చేసాను…


 అనేసరికి సరే విశ్రాంతి తీసుకుందాం! మళ్ళీ పిల్లలు లెగిస్తే  నిద్రా భంగం అవుతుంది అని….వీళ్ళు కూడా ఘాడ నిద్రలోకి వెళ్లిపోయారు.    


శివ నందిని మంచి గాఢ నిద్రలో ఉండగా….. బాలగణపతి ఈమె దగ్గరికి వచ్చి…


బాలగణపతి:- అమ్మ! అమ్మ! లేలే ఇంకా ఎంతసేపు పడుకుంటావు….నాకు ఆకలేస్తుంది. కింద టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఉన్నారు…పదా తిందాం… వెళ్లి… లే! లే! 


అనేసరికి…. పిల్లవాడి పిలుపుకి అంత గాఢ నిద్రలో ఉన్న శివ నందిని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది .లేచి…. ఏమైందిరా!  ఏంటి? అనేసరికి…


బాలగణపతి:- ఏం లేదమ్మా!  ఉదయం పది అయింది.  రాత్రి నీకు నిద్ర లేదు….మాకు నిద్ర లేదు… మేము మంచి నిద్ర పోయాము. నువ్వు కూడా నిద్రపోయావా? మధ్యలో లేపేసానా? ఎందుకంటే కింద యజమాని తాతయ్య వచ్చాడు. టిఫిన్లు రెడీ అయ్యాయి.. ఒక అరగంట మాత్రమే ఉంటుంది… ఆ తర్వాత ఉండదు అని అనేసరికి భయం వేసి ఇంక నేను నిద్ర లేపాను.


శివనందిని:- సరేలే! ఇప్పుడు టైమ్ ఎంత అయింది…?


బాలగణపతి:- 10:00 అయిందమ్మా! లే! పదా టిఫిన్ చేద్దాం..


శివనందిని:- 11:00 లోపలనే టిఫిన్ ఉంటుందని ఆయన అన్నారు.  సరే కిందకి వెళ్దాం.  ఈ లోపు నేను ముఖం, కాళ్ళు ,చేతులు కడుక్కొని స్నానం చేసి వస్తాను.


బాలగణపతి:-  స్నానం నువ్వు చేయవద్దమ్మా! స్నానం మనం వేరే చోట చేద్దాం ఈసారి…ఆ పాతాళ  గంగ మెట్లు దిగి వెళ్ళలేకపోతున్నాము… నావల్ల కావడం లేదు. కాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ  ఫాలధార పంచదార ఉందంట…. అక్కడికి వెళ్లి స్నానం చేసి వద్దాం……


అనేసరికి సరే!  పిల్లవాడి ముచ్చట కాదనటం ఎందుకు అనేసరికి… 


శివనందిని:-  అవును! మీ అన్నయ్య కనబడటం లేదు… ఎక్కడికి వెళ్ళాడు?


బాలగణపతి:- వాడు బయటకు వెళ్లి చెట్టుకింద కూర్చున్నాడు. ఏదో దీర్ఘ ఆలోచన చేస్తున్నాడు… సరే వాడి ఆలోచనే వాడి ధ్యానం అనుకుంట!  ఉలకట్లేదు ….పలకట్లేదు… సరే ఏకాంతంగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు ఏమోలే! అని నేను నీ దగ్గరికి వచ్చాను.  రుద్ర స్వామి స్నానాధికాలు ఇక్కడే చేసేసి…. ఆయన గది బయట కూర్చుని ఉన్నారు. మహాదేవి కూడా ఇప్పుడే లేచి బాత్రూం కి వెళ్ళింది. ఇంక నువ్వే లేవాలి….


శివనందిని:- సరే! నేను కూడా లేచి ముఖం, కాళ్లు చేతులు కడుక్కుంటాను. నువ్వు చెప్పినట్టు ఫాలధార ,పంచదారకి వెళ్లి స్నానం చేసి వద్దాంలే!  సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి…..


బాలగణపతి:- నా కోరికలు తీర్చే మహా తల్లివి…..నువ్వు నేను ఏది అడిగినా నువ్వు కాదనవు…. నా కోరికలన్నీ తీరుస్తావు…. నాకు కావలసినవి అన్ని ఇస్తావు… నన్ను బాగా చూసుకుంటావు… ఇంక ఇట్టా చూసుకుంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాను… వదిలిపెట్టను…. ఉండు అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తాను…


అని వెళ్ళిపోయాడు ఈలోపు మహాదేవి కూడా తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని రావడం చూసిన శివ నందిని కూడా తయారై రావడానికి ఒక 15 నిమిషాలు సమయం పట్టింది.  ఈ 15 నిమిషాల తర్వాత వచ్చి గదికి తాళం వేసి అందరూ కిందకు వెళ్లి వేడివేడి ఇడ్లీలు, గారెలు తినడం ఆరంభించారు. శివ నందిని కాస్త పిల్లలు ఇద్దరికీ ప్రేమగా మురిపెంగా తన చేతులతో పెట్టి వాళ్ళిద్దరూ కడుపునిండా తిని బయటకు వెళ్లిపోయిన తరువాత ….ఇక తను తినడం ఆరంభిస్తూ ఉండేసరికి…. 


రుద్రస్వామి:-  అమ్మ!  నీతో ఒక విషయం చెప్పాలి.


శివనందిని:-  చెప్పండి స్వామి! 


రుద్రస్వామి:- నేను శివానందని కలవాలి అనుకుంటున్నాను….. ఆయనతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆయనకి ఎప్పుడు వీలు ఉంటుందో చూడు…


అనేసరికి ఇప్పటిదాకా ఆయన గురించి ఆలోచన రానందుకు….ఆయన్ని మనసులో అనుకుంటూ ….శివ స్వామి ఎక్కడున్నాడో!  అనేసరికి …ఆయన మనసులో నుంచి నేను ఇక్కడే ఉన్నాను.నాకు అర్థం అయింది ….రుద్ర స్వామి నన్ను కలవాలి అనుకుంటున్నారు అని తెలిసింది. సరే మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని రుద్రాక్ష మఠానికి రండి.  మీ ఇద్దరే రండి… పిల్లలు వద్దు. మనం దైవ రహస్యం గురించి, సాధన విధివిధానం గురించి చర్చించుకోవాలి. దాని గురించి ఆయన నన్ను కలవాలి అనుకుంటున్నారు… అనేసరికి…. సరే స్వామి మీరు చెప్పినట్టే మేము మూడు గంటలకి వస్తాము. అనేసరికి మహాదేవి ఉన్నట్టుండి…


మహాదేవి:-  ఏంటి!  ఆయన నీ పెనిమిటి అయ్యాడు అంట కదా.!  పెళ్లి చేసుకున్నాడంట కదా! అందరూ మంగళసూత్రం కడితే ఈయన కరుంగలి మాల… కారుంగలి ఉంగరం ఇచ్చారంట! కదా అందరూ చెప్పుకుంటున్నారు….


అనేసరికి శివ నందిని గతుక్కుమంది. ఒకవేళ ఇది అందరికీ తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ ఉండేసరికి…. 


మహాదేవి:- కంగారు పడమాకు!  నా మనసుకు తెలిసింది.  నువ్వేం తప్పు చేయలేదు… మీ ఇద్దరిదీ జన్మాంతర ఋణానుబంధం.  దైవ సంబంధం.  దైవమే మీ ఇద్దరినీ కలిపింది.  మీ ఇద్దరి సాధన వలనే విశ్వానికి ఏదో మేలు జరుగుతుంది.  అది రెండు వ్యక్తిగత మోక్షాలు కలిస్తే…. విశ్వమోక్షం అవుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది.  అందుకే మీ ఇద్దరినీ కలిపారు.  విధి కారణం లేనిదే కారకం చేయదు.  కార్యము ఉండదు. అదిగుర్తుపెట్టుకో!  నేనెప్పుడూ మీ ఇద్దరి గురించి తప్పుగా ఆలోచించను.  తప్పుడుగా భావన చేయను.  మీ ఇద్దరూ కూడా నువ్వు భోగ భర్త  నుండి విడిపోయావు.  ఆయన వివాహం చేసుకున్నారో లేదో నాకు తెలియదు.  ఆయన కూడా బంధాలు, బంధనాలు నుంచి తప్పుకుని ఉన్నాడు.  కాబట్టి ఆయన ఏకాంతం, ఒంటరితనంలో  ఉన్నాడు.  నువ్వు ఏకాంతం, ఒంటరితనంలో ఉన్నావు. మీ ఇద్దరి ఆధ్యాత్మిక స్థితి ఆలోచనలు అన్నీ కూడా కలిసి ఉంటాయి.  రెండోది ఏదో జన్మాంతర   ఋణానుబంధం  ధర్మపత్ని, ధర్మపతి అని ఉన్నదని చెప్పేసి ఉన్నారు.  కాబట్టి మీ ఇద్దరూ కూడా గత జన్మలో ఎన్నో కోట్ల  సంవత్సరాలు భార్యాభర్తలుగా కలిసి ఉండవచ్చు.  కానీ అనివార్య కారణాలవల్ల పర స్త్రీ, పర పురుషుల  మాయలో పడిపోయి ఉండవచ్చు.  అంతకుమించి ఏమీ లేదు.  ఆ ఋణాలు తీర్చుకోవడానికి మళ్లీ మీ ఇద్దరూ కలిసి ఉండవచ్చు.  అంతే తప్ప ఇంకేమీ లేదు. 


రుద్రస్వామి:-  కలిపే వాళ్ళని కలుపుతావు… కలవాలి అనుకున్న వాళ్ళని….  నన్ను మాత్రం నీ దగ్గరికి రానివ్వవు. నాలో కలవవు.  అన్నీ తెలుసుకుంటావు… అందరి జీవితాలని అర్థం చేసుకుంటావు . కానీ అన్నీ తెలిసిన నన్ను మాత్రం నీ దగ్గరికి మాత్రం రానివ్వవు… నన్ను నీలో కలుపుకోవు. నువ్వు నాలో కలవవు… మన ఇద్దరినీ కలపాలని ప్రయత్నించవు.  కలుసుకోవాలని చెప్పవు.  నేనేమన్నా నా కోరికలు తీర్చమంటున్నానా? శృంగారం చేయమంటున్నానా? ఏదో భార్యగా ముద్దు ముచ్చట్లు ,కబుర్లు చెప్పమని చెబుతున్నాను.  పక్కన కూర్చొని తల నిమురుతూ ఏవో కబుర్లు చెబుతూ ఉంటే… నాకు ఏదో నేత్రానందం… మానసిక ఆనందం ఉంటుంది.  ఈ వయసులో నాకు శృంగార కోరికలు ఏమైనా ఉంటాయా!  చేసే ఓపిక ఉంటుందా? ఆమాత్రం ఆలోచించొద్దు… ఏదో నా పక్కన, నా వ్యక్తిగతమైన మనిషి ఉంది. నాకు తోడు ఉంది. నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు… అని నాకు భరోసా ఉంటుంది కదా!  నేను నీకు తోడు ఉన్నానని భరోసా ఉంటుంది కదా! ఏదో ధైర్యం ఉంటుంది.  ఒకరినొకరు అర్థం చేసుకుంటే…. ఈ మలి వయసులో ప్రేమ మొదలవుతుంది.  ఎటు తొలిప్రేమ సంక నాకిపోయింది. మలి ప్రేమైనా కాస్త నిలబెట్టుకోవచ్చు కదా! తప్పేముంది….ఇప్పుడు వాళ్ళిద్దరూ చూడు వాళ్ళిద్దరి ప్రేమ తొలిప్రేమలో సంకనాకి పోయినాయి… మలి ప్రేమలు చిగురించినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అలాగే వృద్ధాప్యంలో మన ప్రేమ కలిసింది. కలిసి ఉండవచ్చు కదా! నేనేమన్నా నువ్వు చేయలేని పనులు చెబుతున్నానా…! ఏదో నాకు వంట సహాయం , బట్టలు ఉతుకుతావు, నాతో ఉంటావు ,నా పక్కన పడుకుంటావు. నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటావు ….సాధనలో నేనేమన్నా లోటుపాట్లు చేసినా చెబుతూ ఉంటావు. నీకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా….. నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా ఒకరికొకరం ఉంటాము.  చూసుకుంటాము. అందుకే నాతో ఉండమని చెబుతున్నాను..


మహాదేవి:- చాల్లేవయ్యా!  ఈ వయసులో నీకు ఈ ముచ్చట్లు తగ్గాయా..! పక్కన పడుకోవాలా !మంచం మీద పడుకోవాలా !ఒంటిమీద చెయ్యి వేయాలా! ఏం మనిషిని దూరం నుంచి చూస్తుంటే నీకు ఆ భావాలు రావా? నేను ఉన్నాను అనే ధైర్యం లేదా? నీకు రోగాలేస్తేనో…. వంట చేయడానికి కావాలా ..?ఇప్పుడు భోగ జీవితంలో అవన్నీ చేసి వచ్చి…… అవన్నీ చేయలేక,  పనిమనిషిగా ఉండలేక…. ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం అందడంతో… ఏదో తంత్రసాధనలో కింద మీద పడుతూ… సాధన చేసుకోవడానికి వచ్చాను.  ఇక్కడ కూడా అవే పనులు చేయాలి… అదే గురు సేవలు చేయాలి…. అని నువ్వు తగులుకున్నావు.  గురుసేవలకి, భర్త సేవలకి ఏం తేడా నాకేం కనిపించట్లేదు. నేనెందుకు చేయాలి? కావాలంటే నువ్వు చేసి పెట్టు.


రుద్రస్వామి:-  కావాలంటే శుభ్రంగా చేసి పెడతాను.  నాకేం అభ్యంతరం లేదు.  కాకపోతే వయసులో నీకంటే పెద్దవాడిని… వయసుకు వచ్చేసిన వాడిని… శరీరంలో ఓపిక లేదు. శరీరం సహకరించట్లేదు. మనసైతే ఉరకలేస్తుంది…. గానీ శరీరం సహకరించట్లేదు…. అనే ఆ ఒక్క ఆలోచనతోనే ఉన్నాను.  అంతకుమించి ఇంకేమీ లేదు. కాకపోతే వయాగ్రా టాబ్లెట్స్ వేసుకుంటే… నన్ను మించిన మగాడు ఎవరూ ఉండరు . 


మహాదేవి:- ఇప్పుడు అదొక్కటే తక్కువ మన జీవితానికి…. నేను ఉన్నంతవరకు నిన్ను చూసుకుంటాను. నువ్వు ఉన్నంతవరకు నన్ను చూసుకో… ఇద్దరం విడివిడిగా ఉందాము …విడిపోకుండా ఉందాం… అంతే.  మన మధ్య పడక సుఖాలు, ప్రేమలు మాత్రం ఉండవు. చేతిస్పర్శలు ఉండవు, ఆ సుఖాలు ఉంటాయని అనుకోవద్దు. నీకు కావాలంటే చేసి పెడతాను. వండి పెడతాను, తిని పెట్టు. అయినా నీకు వంట చేయాల్సిన అవసరం ఏముంది.. పదార్థాన్ని నీకు కావలసిన విధంగా మార్చుకొని తినేస్తూ ఉంటావు కదా!  నా అవసరం ఏముంది.  అయినా నా చేతి వంటలన్నీ శాఖాహారం కన్నా మాంసాహారం వంటలే …కదా!  మాంసాహారం వంటలు నువ్వు తినలేవు.ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు.  ఎందుకు నన్ను ఓ……సతాయిస్తావు… నన్ను ఏ రోజుకి ఆ రోజు సతాయించంది….నాతో తిట్లు తినంది …నీకు రోజు గడవదు కదా! 


రుద్రస్వామి:-  అదొక ఆనందం ….నువ్వు తిడుతున్న కూడా అదో ప్రేమానందం… కామానందం…. నయనానందం… వినసొంపుగా ఉంటుంది.  అదే నాకు ఓంకార నాదం. అదే నాకు జపం. అదే నాకు ధ్యానం. ప్రేమగా తిడుతూ ఉంటావు. బాధ్యతగా తిడుతూ ఉంటావు. ఆ తిట్లలో కూడా ప్రేమను చూస్తూ ఉంటాను…


మహాదేవి:-  ఇలా ఎప్పుడోకప్పుడు తిట్టి తిట్టి…ఆ తిట్లు భరించలేక నువ్వు నేను గొడవపడి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో!


రుద్రస్వామి:-  ఆరోజు వస్తే ఇక ఎవరో ఒకరు శరీరంతో ఉండరు.  భూమి మీద నూకల చెల్లి పోయినట్లే. అది మాత్రం గుర్తు పెట్టుకో!  విడిపోవడం అంటూ వస్తే… మరణమే మనల్ని విడదీయాలి . 


అని చెప్పి రుద్రస్వామి అక్కడ నుంచి చరచరా వేగంతో ఉగ్రంగా గది బయటకు వచ్చేసారు. ఆయన అట్లాగే అంటాడు లే! ఆయన కోపం చిన్నపిల్లాడి కోపం లాగానే ఉంటుంది. నసుగుతూ ఉంటారు.  దాని గురించి ఏం పట్టించుకోకు…. అనేసరికి , శివ నందిని ఏముందిలే అమ్మ ! ఇవన్నీ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలే కదా! మీరేమో గురు శిష్యులు. మీకు ఆ విధంగా నడుస్తుంది… ఒకరు అలకపడతారు… ఇంకొకళ్ళు అలక తీరుస్తారు . ఇది తప్పేమీ కాదు అనేసరికి…. మహాదేవి నీకు నీ జీవితంలో అలకలు మొదలవుతాయేమో చూసుకో ! ఇక మొదలయ్యాయేమో …అంటే… 


శివనందిని:-  ఏమో ఎవరికి ఎరుక!  ఏం జరుగుతుందో…. నేను ఇంకా వాటి గురించి ఆలోచించుకోవట్లేదు.. బంధాలు,బంధనాలు గురించి ఆలోచించుకోవట్లేదు. పట్టించుకోదలచుకోవట్లేదు. ఇక నా సాధనలో నేను ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను…. ఆ సాధనకి ఆయన శివ స్వామి సహాయం చేస్తా అన్నారు.  తను సహాయ సహకారాలు అందిస్తా అన్నారు.  అంతవరకే….. నాకు మనసులో ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మర్యాద ఉన్నాయి. అంతేగాని నాకు ఆయనతో బంధం ఏర్పడాలి…మోహ వ్యామోహాలు కలగాలి…. అని అనుకోవట్లేదు.  నా హద్దుల్లో నేను ఉన్నాను.  ఆయన పరిమితుల్లో ఆయన ఉన్నారు. కాబట్టి మేము హద్దులు దాటము… హద్దులు దాటే పరిస్థితి వస్తే,  మా ఇద్దరికీ మరణాలే సంభవించాలి అని అనుకుంటాం.  లేదు,  ఎవరి హద్దులు దాటారో వాళ్ళు మరణం పొందాలి. వాళ్లకి భూమి మీద ఉన్న లేనట్టే!  తప్పు చేయకూడదు అనుకుంటున్నాం… తప్పు చేసిన తరువాత సాధన చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. శరీర త్యాగం చేయడమే.  గంగా నదిలో దూకడమే…. కృష్ణా నదిలో దూకడమే. ఏదో ఒక నదిలో దూకి చనిపోవడమే…. మూడు మునగలు వేస్తాను… మూడో మునక ఇంక రావడం అనేది ఉండదు.  మా ఇద్దరి మధ్యన భౌతిక పరమైన కామకోరికలు తీర్చుకునే పరిస్థితులు కల్పిస్తే మాత్రం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. భోగ జీవితంలో ఈ శరీరం నా భర్తకి అప్పజెప్పేసాను. మానసికంగా,  శారీరకంగా ఆయనే నా భర్త. కాకపోతే ఈయన గత జన్మలో నా భర్త అని ఆయనకి ఆ జ్ఞానం అందింది. నాకు ఇంక ఆ జ్ఞానం అందలేదు.  అది నిజమా కాదా అనేది కూడా నాకు తెలియదు. ఏం జరుగుతుందో అని వీటి గురించి ఇంక నేను ఆలోచించే పని కూడా లేదు. కామ వికారాలు,  కామకోరికలు అన్నీ కూడా నేను అదుపు చేసుకుంటూ ఉండగలిగే సాధనాస్థితికి నేను వెళ్ళాలి. నేను సుఖాల కోసం…. కామకోరికల కోసము,  సిద్దుల కోసము నేను సాధన చేయడం లేదు. నా మరణమే మోక్షమారణం అవుతుంది అన్నారు.  కాబట్టి నేను సాధన చేసుకోవాలి. దాని గురించి నేను ఏకాగ్రత పెట్టుకోవాలి. వేటి గురించి నేను పట్టించుకోను.  వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు…. పోయేవాళ్ళు పోతూ ఉంటారు…. అంతే! ఎవరూ శాశ్వతం కాదు….


మహాదేవి:-  ఇదే నిజం అమ్మ! ఇదే సత్యం మానసికంగా , శారీరకంగా ఇదే సంకల్పంతో ఉండు. ఎవరు ఏమన్నా,  ఎవరు ఏం చేసినా కూడా పట్టించుకోవద్దు…


 అని టిఫిన్ చేసి ముగించేసరికి…. అమ్మ!  రామ్మ! ఇప్పటికే సమయం అవుతుంది . పాలధార పంచదార ప్రదేశానికి వెళ్లాలి.  చాలా దూరం అంట అని… బాల గణపతి వచ్చేసరికి….సరే వస్తున్నా చిన్న…. ఏమనుకోకు అని అందరూ టిఫిన్లు ముగించుకొని అంతా పాలధార పంచదార ప్రదేశం వైపుకి బయలుదేరారు.


ఫాల ధార - పంచ ధార:- 


ఇలా సాధనా కుటుంబం అంతా కలిసి… ఫాలధార పంచదారకి వెళ్లారు. అక్కడ 300 మీటర్లు కిందికి దిగి వెళ్లారు. పైన కొండ చరియల నుంచి నీటి ధారలు కిందకి రావడం కనపడుతుంది. శివుని ఫాల భాగం లో ఉండే త్రినేత్రమును తాకుతూ… వస్తున్న గంగా…ఆయన ఫాల భాగం నుండి కారుతున్న ధారను ఫాలధార అని…. అలాగే శివుని పంచ ముఖాల నుంచి వస్తున్న నీటి ధారలను పంచ ధార అంటారని…వాటి పేర్లు వరుసగా….1) బ్రహ్మ ధార,2) విష్ణు ధార 3) రుద్ర ధార 4) చంద్ర ధార 5) దేవ ధార. ఇక్కడే శంకరాచార్యుల వారు చాలా కాలం తపస్సు చేసుకున్నారని…  ఈ క్షేత్రంలోనే ఆయన బ్రమరాంబికా అష్టకం, శివానందలహరి అంటే రచనలు చేశారని చెపుతారు అని మహాదేవి అంటుంటే విని….అక్కడ  ఉన్న శంకర శారద అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసింది . చంద్రశేఖర సరస్వతి స్వామి వారు శ్రీశైలం సందర్శనానికి వచ్చినపుడు హాటకేశ్వరంలో ధ్యాన నిమగ్నమై ఉండగా… ఆయనకి ధ్యానంలో శంకరుల పాదములు, ఒక మహావృక్షం దగ్గరలో ఉన్న గుహలు దర్శనం అయ్యాయట. ఈ క్షేత్రంములు ఈ ఫాల ధార, పంచ ధార క్షేత్రములు అని తెలుసుకొని… ఇక్కడ తపమాచరించారని చెబుతారు కదా! ఆయనకి ఒక సమయంలో ఆశ్రమ బాధ్యతలు వదిలేసి ఇక్కడే గుహల్లో కూర్చుని ఇక్కడే ఉండిపోవాలి అనేలా అనిపించిందని చదివాను…. అది ఇదే క్షేత్రం కదా అని ఫాల ధార ను చూస్తూ ఉండగా ఈ ఫాల ధార వద్ద ఒక అడుగు ఉన్న సరస్వతి విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేస్తూ కనబడ్డది.  ఒకవైపు నీళ్లు పాలవలే తెల్లగా ఉండి రుచికి పంచదార లాగా ఉండడం గమనించింది.  చూడడానికి పాలలాగా ఉండటం…. రుచికి పంచదారలా ఉన్నాయని గ్రహించింది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని…. పైనుంచి సరస్వతి నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయో…. శాస్త్రవేత్తలు కూడా రహస్య చేదన  చేయలేకపోయారని…. మహాదేవి అనేసరికి… అవునా!  అని చూస్తే,  సుమారుగా 300 అడుగుల ఎత్తు నుండి నీరు ధారాపాత్రగా వస్తుందని అర్థం అయింది.  


ఫాల ధార 

పంచ ధార


ఇక పిల్లలు స్నానాలు చేస్తామని, మిగతా వాళ్ళందరూ కూడా ఈ నది నీటిని తీర్థంగా తీసుకుని… నెత్తిమీద చల్లుకొని… ఆ సౌందర్యాన్ని చూస్తూ… ముగ్ధ మనోహరమౌతున్న జనాలని చూస్తూ….శివ నందిని కాస్త అక్కడ ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంది.  మహాదేవి, రుద్ర స్వామి కూడా అక్కడే చెట్టు కింద కూర్చుని ధ్యాన నిష్ఠలోకి ఎవరికి వారే యమునకు  తీరే అన్నట్టుగా…. ధ్యానం నిష్ట లో ఉన్నారు.  పిల్లలు ఆటల రందిలో…. వీళ్ళ ముగ్గురు ధ్యానంలో ఉండిపోయారు.  ఉన్నట్టుండి శివనందినికి కుండలినీ శక్తి కదలికలు మొదలైనట్టుగా అనిపించింది.  వెన్నుపూస కింద నొప్పులు… మోకాళ్ళ కింద నొప్పులు… కండరాలు పట్టేయటం… ఒక అరగంట ధ్యానానికి పొత్తికడుపు నొప్పి రావడం…. గుండెల్లో నొప్పి రావడం…. గాలి అందకపోవటం… శ్వాసకి ఇబ్బంది రావటం… ఇవన్నీ  కదిలిస్తూ ఉండేసరికి…. బయటికి రావాలి అనుకున్నా కూడా “రావద్దు ….అలాగే ఉండు… కదలికలు అలాగే ఉంటాయి…. ఏమి ఇబ్బంది కలిగించవు”  అని అంతర్వానిగా శివానంద చెప్పేసరికి…. అలాగే అని బలవంతంగా కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఉండేసరికి…ఉదృతంగా ఉన్నవి కూడా నెమ్మదించడం మొదలయ్యేసరికి….  ధ్యానంలో నలుపు తెలుపు చారికలు ఉన్న ఒక కృష్ణ సర్పం సరస్వతి నది నుంచి బయటికి వచ్చి…. తనని కాటు వేస్తున్నట్టుగా ధ్యాన అనుభవం అయ్యింది.  అది కూడా తన ఎడమ చేతి చిటికెన వేలు మీద కాటు వేసినట్టుగా భావన కలిగే సరికి ఉన్నట్టుండి కళ్ళు  తెరిచి చూసేసరికి….


 అమ్మ !అమ్మ! నలుపు తెలుపు ఉన్న ఆరడుగుల పాము నీ దగ్గరికి వచ్చి…. నిన్ను కాటేసింది అని బాలగణపతి అనేసరికి…. నిజమా అని  చేతి మీద చూసేసరికి… కాటు ఉన్నట్టుగా కనబడింది.  ఏం జరిగింది… ఏంటి? నిజంగా పాము కాటు వేసిందా? అని చూసేసరికి రుద్ర స్వామి మూలికను తీసి బయటకు తీసి అమ్మ!  నువ్వే కంగారు పడాల్సిన అవసరం లేదు. నీలో కుండలినీ శక్తి జాగృతికి నువ్వు అర్హత ,యోగ్యత ,యోగం సంపాదించావు… అని చెప్పి …..దీనిని కృష్ణ సర్పం అంటారు అని….ఇది నలుపు తెలుపు చారికలతో ఉంటుంది.స్వయంగా సరస్వతి నది దగ్గర,  సరస్వతి దేవి సమక్షంలో జ్ఞానమును ఇచ్చే  కుండలినీ శక్తి జాగృతి అయ్యింది.  మనలో కుండలిని శక్తి  పాము రూపంలో జేగురు పొగ రూపంలో  ఉంటుంది. ఈ జేగురు రంగు పొగ  కూడా పాము మెలికలు తిరుగుతూ…. కుండలినీ శక్తి మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా చేరుతుంది.  కాకపోతే ఏంటంటే… ఒక్కో చక్రంలో ఒక్కోద్వార బంధనాలు ఉంటాయి. ఆ ద్వారబంధనాలన్నీ కూడా…. మన సాధన స్థితిని బట్టి తెరుచుకుంటూ… మూలధార చక్రం నుంచి మొదలుపెట్టి సహస్ర చక్రం దాటి హృదయచక్రం చేరాల్సి ఉంటుంది.  అదే సాధన పరిసమాప్తి అవుతుంది.  ఇక్కడ సాధన మాయల వలన గాని… ఆశ వలన కానీ…. యోగ సిద్దుల వలన కానీ…. యోగ శక్తుల వలన కానీ…. వాటికి లోబడి అది కావాలని గాని… లేదా వాటికి భయపడి ఆపితే మన సాధన ఆగిపోతుంది.  ఆశించనంత వరకు….భయపడనంతవరకు…. మన సాధన ఆగిపోదు.  ఇక్కడ మనం అగనంత వరకు మన సాధన కొనసాగుతూనే ఉంటుంది.  కాకపోతే ప్రతి ఒక్క చక్రానికి నువ్వు అర్హత, యోగ్యత, యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది.  దానికి సంబంధించి దైవిక వస్తువులు… దైవిక శివలింగాలను పొందవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రెండు వస్తువులు రావడం ద్వారా ఈ చక్రబంధనం నుంచి విముక్తి  పొందుతాము.  ఆ విముక్తి పొందినప్పుడు ఆ చక్రమాయ కలిగిస్తుంది.  ఆ చక్రమాయ దాటగలిగి నువ్వు స్థిరత్వం పొందితే అప్పుడు దాని నుంచి ఏమీ ఆశించినట్లయితే….నువ్వు రెండో చక్రానికి వెళ్ళటం జరుగుతుంది. ఇలా బ్రహ్మ రంధ్రం దాకా నీకు పరీక్షలు ఉంటూనే ఉంటాయి.  సాధనా పరీక్షలు ఉంటాయి. యోగ పరీక్షలు ఉంటాయి. మాయ పరీక్షలు ఉంటాయి. వీటన్నింటినీ నిలబెట్టుకొని నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది…. అనేసరికి అలాగే స్వామి!  ఇదేవిధంగా శివ స్వామి కూడా చెప్పారు. కాకపోతే ఇది ఇంత ఇదిగా చెప్పలేదు. కాకపోతే ఒక్కో చక్రంలో ఒక్కో మాయ ఉంటుందని నాకు అర్థం అయింది . ఎందుకంటే పరమహంస గారు చెప్పిన అనుభవం ప్రకారం చూస్తే ఒక్కో చక్రంలో ఒక్కో మాయ ఉంటుంది . ఇలా 13 చక్రాలకి 13 మాయలు ఉండి ఉండాలి. ఈ 13 మాయలు నేను దాటగలగాలి. ఎక్కడ ఆపకూడదు… ఆగకూడదు. నా సాధనని కొనసాగించాలి అని అర్థం అయింది. గ్రహించాను . పరమహంస గారికి కూడా ఒక పాము కాటు వేసినట్టుగా చెప్పారు.  ధ్యాన అనుభవం పొందారు. ఇప్పుడు నేను ప్రత్యక్ష అనుభవం పొందాను.నిజంగానే పాము కాటు వేసింది కదా ….అనేసరికి ఈ పాము కాటు వల్ల నీకు ఎలాంటి ప్రాణ హానీ ఉండదు. అది విష సర్పం కాదు… కాకపోతే ఏంటంటే నీకు కుండలినీ శక్తి జాగృతి చేసే దేవతా సర్పం . తన ప్రాణ శక్తిని… తన జీవ శక్తిని….తన యోగ శక్తిని… అంతా కూడా నీకు సమర్పించి అది  చనిపోతుంది.  కావాలంటే అక్కడికి వెళ్లి చూడు నీకే తెలుస్తుంది.


బాల  గణపతి కాస్త…. అమ్మ!  ఆ నీటిలో ఉన్న కలుగులోకి ఆ పాము వెళ్ళింది.  మేము వెళ్లి చూశాము అనేసరికి తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి పాము చనిపోయి పడి ఉండడం గమనించారు.  ఆ పాము శవం చూసేసరికి స్వామి ఏం చేద్దాం? నావల్ల పాము అనవసరంగా చనిపోయింది కదా! అంటే కాదు తను నీకోసమే ఉన్నది. తన సాధన శక్తిని నీకు జాగృతి చేయాలని కాల నిర్ణయం….. తనకి ఈ విధంగా దీనికి మోక్షం ప్రసాదించారు అనుకో!  దీనికి శ్రీశైలంలో ఈ విధంగా మోక్షం కలిగింది.  కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదు.  సహజంగా పాము చనిపోదు …ఇక్కడ పాము చనిపోయింది.  అంటే ఏం జరుగుతుందో చూద్దాం…. అనేసరికి శివ నందిని ఇప్పుడు ఏమి చేద్దాం స్వామి!  అనేసరికి సమాధి చేద్దాం.  గోతిలో పాతిపెట్టేద్దాం.  అప్పుడు సర్ప దోషాలు మనకి అంటవు. పైగా ఇది దేవత సర్పం. శాపాలు ఉండవు. సర్ప దహనం చేసినా …సర్పం ఇలా పూడ్చినా… మనకి పుణ్యమే వస్తుంది. తద్వారా సర్ప దోషాలు ఏమీ రావు… అనేసరికి సరే స్వామి! మీ ఇష్టం అంటూ…ఎదురుగా పామును తీసుకొని దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో 5 అడుగుల గొయ్యి తవ్వి ….అందులో ఈ పామును పాతిపెట్టి…. అందులో మట్టి కప్పేసి….నమస్కారం చేసి ఎవరికి వాళ్లే వచ్చేసి… దగ్గరలో ఉన్న హాటకేశ్వర ప్రాంతానికి బయలుదేరారు. 


ఇలా సాధనా కుటుంబం అంతా… హటకేశ్వరం క్షేత్రానికి దర్శనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న సంతాన వృక్షమును చూశారు… దానికి ఎన్నో ముడుపులు కట్టి ఉన్నాయి.ఆ పక్కనే ఉన్న సుబ్రమణ్య స్వామిని దర్శనం చేసుకున్నారు.ఆ తర్వాత లలితా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత  హాటకేశ్వర లింగాన్ని దర్శనం చేసుకునిబయటకి వచి కూర్చున్నారు. 



అక్కడ లోపల ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుని వస్తూ ఉండగా…. బాల గణపతి ఉన్నట్టుండి శివ నందినితో అమ్మ!  హాటకేశ్వర క్షేత్రంలో  కుండ పెంకులో నుంచి బంగారుపు లింగం ఉద్భవించింది అంట  స్వయంభుగా అన్నయ్య చెప్తున్నాడు. నిజమేనా ? అనేసరికి….….అవునమ్మా నిజమే.  కుండలు చేసే ఆయనకి కుండ పెంకులో బంగారపు శివలింగము దర్శనం ఇచ్చిందంట… అనేసరికి ఆహా!  అవునా ….అయితే అన్నయ్య అన్నీ నిజాలే చెప్తాడు అన్నమాట!  నిజానికి ….నిజమా కాదా అని నేను పరిశీలించి… శోధించి తెలుసుకోవాలన్న మాట…. అని అంటూ ఉండేసరికి …అది కాదు,  నిజానికి కుండ పెంకులో బంగారు శివ  లింగం ఎలా వస్తుంది. మట్టి లింగం రావాలి కదా!  అనేసరికి 


రుద్రస్వామి కాస్త నువ్వు అన్నది నిజమే…. కానీ అది స్వయంభుగా బంగారు లింగం రాలేదు.  ఇక్కడ సాధకులు అందరూ కూడా రససిద్ధి సాధకులే …సినారే స్వామి అంటారు.  ఆయన రస సిద్ధికి మూలపురుషుడు.  ఆయన ఏకంగా పాదరసమునే బంగారంగా మార్చిన తొలి వ్యక్తి.  ఈ పాదరసమునే ఆయన  తవ్వించాడని ఇక్కడ చెప్తూ ఉంటారు.  ఆ సీనారే ఎక్కువగా మనకి ఇష్టకామేశ్వరి ఆలయం ఉన్న ప్రాంతంలో రెండు కొండల మధ్యన ధ్యాననిష్టలో ఉంటారు.  అలా ఉన్నట్లుగా…. చాలా మందికి ధ్యానంలో కనపడతారు.  స్వప్న దర్శనాలు ఇస్తారు.  ఆయన ద్వారా  రససిద్ధి పొందిన సిద్ధరామప్ప…. ఇలా చాలామంది సిద్ధ పురుషులు ఉన్నారు. అసలు ఈ శ్రీశైల క్షేత్రమే… 112 రకాల సాంప్రదాయ  పద్ధతులలో ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ లేని ఆచార వ్యవహారాలు అనేవి లేవు. వామాచర, దక్షిణాచారములలో… అన్ని రకాల సంప్రదాయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సిద్ధులు, యోగులు, అఘోరాలు, కాపాలికులు, నాగ సాధువులు, భైరవులు ఇలా వీళ్ళు మాత్రమే కాకుండా నాథ్ సంప్రదాయం కూడా ప్రఖ్యాతి గాంచింది. ఈ నాథ్ సంప్రదాయంలో మచ్చింద్ర నాథుడు ముఖ్యమైన వాడు. పరమశివుడు పార్వతి మాతకు యోగసార రహస్య జ్ఞానాన్ని బోధించేటపుడు ఒకానొక సమయములో యోగ మత్తు ఆవరించి ఆవిడ నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక చేప ఈ జ్ఞాన సారాన్ని ఆపాదించుకుంది. పరమశివుడు బోధించడం అపగానే స్వామివారికి నమస్కారం చేసి నిలబడిపోయింది. అప్పటినుంచి నాథ్ సంప్రదాయాన్ని ఈ మచ్చింద్ర నాథుడు దగ్గరి నుంచి ఆచరిస్తూ ఉన్నారు. వీళ్లు నవ నాథుల జీవిత చరిత్రలు చాలా గొప్పగా చరిత్రలో నిలిచిపోయాయి. అందులో గోరక్ష నాథ్/గోరఖ్ నాథ్ అనే అతను తన గురువైన మచ్చింద్ర నాథుడిని ఈ శ్రీశైలం క్షేత్రములోనే కలుసుకున్నాడు. తన గురువు ఒకానొక సమయంలో…మాయలో పడిన సందర్భం వచ్చినప్పుడు.. గురువుని తన లోపల దాచుకొని…యోగమార్గంలోకి తిరిగి తీసుకువచ్చి…. నాథ్ సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. కొంతమంది పురాణ కథనాల ప్రకారం…విభూతి నుంచి ఉద్భవించిన పరమశివుడే ఈ గోరఖ్ నాథ్ అని…. చెప్తారు. 


కుమ్మరి కేశప్ప:- 

హాటకేశ్వరం 


పూర్వం కేశప్ప అనే కుమ్మరి వాడు ఉండేవాడు. ఇతను మహా శివ భక్తుడు. తన స్వధర్మ వృత్తిని చేసుకుంటూ…. శివ నామస్మరణతో బతికేవాడు  ఇంతేకాక… ఎవరైనా శ్రీశైలం వెళ్ళే బాటసారులకు ఆకలి దప్పులు  తీర్చి, తృప్తి పడేవాడు. ఇలా శివరాత్రికి తన దగ్గరున్న మొత్తం సొమ్మును శ్రీశైలం వెళ్ళేవాళ్ళకి భోజనాదులు సమకూర్చాలని ఖర్చు చేశాడు. ఇది అంగీకరించలేని చుట్టుపక్కల వాళ్ళు ఇతని సేవకు, ఇతని భక్తికి ఈర్ష్య అసూయలకు లోనై ఈ కుండలలో దాచిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసి, అతన్ని కొట్టి వెళ్ళిపోయారు. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్న భక్తులు ఈ తంతు చూసి బాధపడి, కేశప్పను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. శివ భక్తులకు ఆహారం సమకూర్చులేని జన్మ దేనికి అని…. దగ్గరలో ఉన్న మారేడు చెట్టుకి తల మోదుకొని రక్తం కారుతుండగా….. ఆ రక్తం కాస్త ఒక చిన్న కుండ పెంకులో చిన్న నీటిమడుగు లాగా తయారయ్యింది. ఆ మడుగులో నుంచి ఒక బంగారు లింగం ఉద్భవించింది. ఆ లింగమే ఈ హాటకేశ్వర లింగంగా చెబుతారు. కాకపోతే అది రస సిద్ధితో తయారు అయిన సువర్ణ లింగం అతనికి ఆ మట్టి కుండలో దొరుకుతుంది. అది శివ అనుగ్రహం అనుకోవచ్చు…. సిద్ధ పురుషుల లీలా విన్యాసం అనుకోవచ్చు…. అది ఏదైనా ఆ మల్లన్నకే తెలియాలి….


అనేసరికి అవునా పాదరసం నుంచి బంగారం తయారు చేయవచ్చా? నిజంగా ఆసిద్ధి ఉందా అని కుమారస్వామి అమాయకంగా అడిగేసరికి….. ఎందుకు చేయకూడదు… చేయొచ్చు… మా రుద్రయ్య చేస్తాడు… అనేసరికి మహాదేవి… ఆయన చేయంది ఏముందిలే! అన్నీ చేస్తాడు… ఏదైనా సృష్టిస్తాడు… ఏదైనా మారుస్తాడు…పాదరసం నుంచి బంగారం ఏంటి!  బంగారం నుంచి పాదరసం కూడా తీయగలడు…ఆయనకి  సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి…. అని వెటకారంగా అనేసరికి…


 ఆగవే…!  ఎప్పుడు నా మీద పడి చస్తావు.  పిల్లలకి తెలియాలి కదా!  రస సిద్ధి అని ఒక విద్య ఉంది అని… ఇప్పుడు వాళ్లేదో బంగారం తయారుచేసుకోమని నేను అనటం లేదు. పూర్వకాలంలో రసవిద్య ద్వారా రస శక్తి పొంది… ఒక వస్తువుని మరొక వస్తువుగా మార్చేవాళ్ళు.  పాదరసమును బంగారంగా మార్చేవాళ్ళు. అది వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో నేను ఉన్నాను అని రుద్రస్వామి అనేసరికి….ఏదో ఒకటి చేసుకుని చావండి…నాకేం సంబంధం లేదు. నేను ధ్యానం చేసుకుంటాను అని మహాదేవి కళ్ళు మూసుకుంది.  శివ నందిని వీళ్ళందర్నీ గమనిస్తూ చూస్తూ ఉండిపోయింది.  ఇంతలో రుద్రస్వామి కాస్త బాల గణపతిని తీసుకొని ఎటో వెళ్లి ఒక వేరు మొక్కను తీసుకువచ్చి… ఇసుక తీసుకువచ్చి… ఒక మట్టి పెంకు ని కూడా తీసుకువచ్చి ….తన చేతిసంచి లో నుంచి పాదరసం తీసి… ఆ ఇసుకలో పాదరసమును ….ఆ వేరు మొక్క రసాన్ని కలిపి కొద్దిసేపు ఏదో మంత్రాల చదువుతూ….అదంతా చేస్తూ ఉండేసరికి ….పాదరసం కాస్త గట్టి పడిపోయి  బంగారపు లింగంగా మారేసరికి…. వీళ్ళ ముగ్గురికి నోట మాట రాలేదు. అది నిజమైన బంగారం లాగానే మెరుస్తూ ఉండేసరికి….. ఇది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం అమ్మ!  కావాలంటే  తనిఖీ చేయించుకో అని రుద్ర స్వామి అన్నారు . కాదు మీ రస విద్యని చూస్తున్నాను. మీరు సిద్ధి పొందిన విధానం చూస్తున్నాను… కేవలం పాదరసంతో బంగారం క్షణాల్లో మార్చేశారు.  ఇలాంటి విద్య వస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది.  పేదవాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందుతాయి కదా!  అంటే రుద్రస్వామి యోగం ఉన్నవాడికి మాత్రమే అన్ని అందుతాయి.  యోగం లేని వాడికి ఏది అందదు.  నువ్వు బంగారం ఇవ్వాలన్నా కానీ ఇవ్వలేవు.  కావాలంటే ఆ దేవాలయం దగ్గర బిచ్చగాడు ఉన్నాడు కదా!  ఆ బిచ్చగాడికి ఇచ్చి చూడు…. అనేసరికి సరే,  ఇదేదో చూద్దాం అనేసరికి… బంగారపు శివలింగం తీసుకొని శివ నందిని బిచ్చగాడికి వేసేసరికి… దాని వాడు చూసి …


అమ్మో!  ఇది బంగారపు శివలింగంలాగా ఉంది. ఇది నాకెందుకు దానం ఇస్తున్నారు. ఎక్కడో కొట్టేసి వచ్చావని పోలీసులు నన్ను జైల్లో పెడతారు. నావల్ల కాదు. నాకొద్దు… నేను దీన్ని అమ్ముకోలేను… పైగా ఇది శివలింగం.  ముద్ద బంగారం అయితే,  ఆలోచించే వాడిని. అయినా బంగారం నాకొద్దు.  ఇది బంగారమో ఇత్తడో పుత్తడో తెలియదు. ఇక్కడ అంతా సిద్ధపురుషులు ఉంటారు. రస సిద్ధులు ఉంటారు. గారడీ చేస్తారు. మాయ చేస్తారు. ఒకవేళ దీన్ని అమ్మకానికి తీసుకువెళ్తే… అది అక్కడకు వెళ్ళాక ఇత్తడి అయింది అనుకో… నన్ను ఇత్తడి చేస్తారు.  నన్ను కుమ్ముతారు జనాలు…. అని ఆ బిచ్చగాడు భయపడి,  నాకొద్దు కావాలంటే డబ్బులు ఇవ్వు అనేసరికి సరే అని తన చేతి సంచిలో నుంచి వంద రూపాయలు బిచ్చగాడికి ఇచ్చి తిరిగి వచ్చింది.  స్వామి ఆ బంగారు  శివలింగాన్ని పొందే అర్హత ఎవరికి ఉందంటారు…. ఆ బిచ్చగాడికి లేదని అర్థం అయింది.  అని అనగానే… దీనికి అర్హత ఉండాల్సిన అవసరం లేదు.  ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది అని ….ఆయన మళ్ళీ తన  రస సిద్ధితో దాన్ని  యథాస్థానంగా పాదరసంగా చేసి మళ్ళీ ఆ పాదరసాన్ని తన సంచిలో ఒక డబ్బాలోకి తీసుకొని ఆ పాదరసాన్ని భద్రపరచుకోగానే …..అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కాకుండా… అంతా క్షణాల్లో జరిగిపోయినట్టుగా ఉంది. 


ఉన్నదీ లేనట్టుగా… లేనిది ఉన్నట్లుగా   భ్రమ బ్రాంతి చేశాడు రుద్ర స్వామి అంటూ ఆశ్చర్యపోయింది.  శివ నందిని ఇదేవిధంగా అమ్మవారు కూడా  చేస్తుందేమో …సృష్టిలో.  కనిపించేది సత్యం గాను …. కనిపించనిది అసత్యముగాను చేస్తుంది. నిజానికి కనిపించేది అసత్యము…. కనిపించనిది సత్యము… అని చెప్పి లోకానికి తెలియట్లేదు. ఇప్పటిదాకా బంగారపు శివలింగం కాస్త పాదరసంగా మారింది.  యధావిధిగా మార్చుకున్నారు. దాన్నే ఏ విధంగా అయినా మార్చొచ్చు…..  అంటే నిజానికి ఉన్నది లేనట్టుగా,  లేనిది ఉన్నట్టుగా ప్రభావం కలిగిస్తున్నట్టు కనికట్టు చేశాడు.  ఈయన ఈ మాత్రం కనికట్టు చేశాడు అంటే ….విశ్వమంతా కనికట్టు చేయడంలో సందేహం లేదు…  అని సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న పూర్ణానంద స్వామి ఆశ్రమునకు వెళ్ళి నమస్కారం చేసుకుని కాసేపు అక్కడే ధ్యాన నిష్ఠలో కూర్చుండి పోయారు.


పూర్ణానందఆశ్రమం:- 


కాసేపు ధ్యాన నిష్ఠ తరువాత శిఖర దర్శనానికి బయలుదేరారు. 


శిఖర దర్శనం:- 

శ్రీశైలం శిఖర దర్శనం 


శిఖర దర్శనానికి వెళితే… కింద వైపు శిఖరేశ్వర స్వామి శివలింగం దర్శనం అయ్యింది.  ఆ శివలింగం పక్కనే సుమారుగా 20 మెట్లు పైకి వెళితే… అక్కడ ఒక నంది ఉంది.  పూర్వకాలం ఈ నందిని తిప్పితే…. చిన్న నంది యొక్క కొమ్ముల నుంచి చూస్తే శిఖర దర్శనం అవుతుంది అని చెప్పేసి… అలా దర్శనం అయితే ఆరు నెలల్లో మృత్యువు వస్తుందని….అక్కడ ఉన్న గైడ్ చెప్పేసరికి,  ప్రస్తుతం అది పగిలిపోవడంతో ఆ నంది తిరగటం లేదని… బైనాక్యులర్ సహాయంతో… గాలిగోపురాల సహాయంతో దర్శనాలు చేసుకోవచ్చు అని చెప్పేసరికి…. బైనాక్యులర్ లో అందరూ గోపురాలు దర్శనం చేసుకున్నారు.  నాలుగు వైపుల్లో మొదట తూర్పు వైపు ఉన్న గాలిగోపురం వైపు ఉన్న ఎనిమిది శిఖరాలు దర్శనం అవుతున్నాయి… కానీ నిజానికి ఈ గాలిగోపురాల మీద ఉన్న శిఖరాలు కాదు,  మల్లికార్జున గుడి మీద ఉన్న త్రిశూల దర్శనం అవ్వాలి…అది దర్శనం అయితేనే,  శిఖర దర్శనం అని…. దాన్ని శిఖర దర్శనం అని అంటారని… అది అయితే ఆరు నెలల్లో మృత్యువు వస్తుందని చెప్పేసి…. రుద్ర స్వామి అనేసరికి…దాన్ని చూడాలని సాధనా కుటుంబం అంతా ప్రయత్నం చేశారు.  కానీ వీళ్ళకి ఎంత చూసినా… బైనాకులర్ లో చూసినా అది కనిపించలేదు.  కేవలం గాలిగోపురం మీద ఉన్న 8 శిఖరాలు మాత్రమే కనిపించాయి.  సరే అని…. గైడ్ కి చూసినందుకు డబ్బులు ఇచ్చి… కిందకి రాబోతూ ఉండగా శివ నందినికి ఏదో ఆవేదన ఉన్నట్టుగా అనిపించింది . ఏమైందమ్మా!  ఏంటి… ఏదో ఆవేదనలో ఉన్నావు… అనేసరికి పూర్వీకులు మనకు చేసిన వస్తువులు ఏర్పాట్లు విధివిధానాలు…మనం ప్రస్తుతం ఉన్న వాళ్లు నిలబెట్టుకోలేకపోతున్నారు.  చిన్న నంది కానీ తిరిగే అవకాశం ఉంటే…మనకి శిఖర దర్శనం అయ్యేదేమో కదా అని అనేసరికి ఏముందమ్మా!  దానిని నేను తాత్కాలికంగా కొన్ని క్షణాల పాటు  సరి చేయగలను. సిద్ధం చేయగలను.  నువ్వు చూస్తానంటే చూడు…. అనేసరికి సాధ్యపడుతుందంటారా స్వామి!  అనేసరికి ఎందుకు సాధ్య పడదు ….సాధ్యం కానిది ఏదీ లేదు. మనము మనసు, సంకల్పం ఇస్తే అది నిస్వార్ధంగా ఉంటే… నిష్కామంగా ఉంటే….సాధ్యపడుతుంది.  నువ్వు చూడాలని అనుకుంటున్నావు.  త్రిశూల  శిఖర దర్శనం అవుతుందా లేదా అనేసి పరీక్షించుకుంటున్నాం. అసలు మోక్షం అనే అర్హత ఎప్పుడు వస్తుంది అంటే… అది సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులు నువ్వు చూడగలిగే స్థితిని వచ్చినప్పుడే….నువ్వు మోక్షం పొందుతావు అని చెప్పేసి శాస్త్రవచనం.  అంటే ఏంటంటే సుమారుగా 30 అడుగుల దూరంలో ఉన్న నల్ల చీమ ఏం తింటుందో…. దోమ ఏం చేస్తుందో…30 అడుగుల దూరం నుంచి చూడగలిగే స్థితిలో నువ్వు ఉండగలిగితే… దాన్ని సూక్ష్మాతి సూక్ష్మ దృష్టి అంటారు.  తద్వారా నీకు మోక్షమును పొందే అర్హత ఉన్నట్టు. అందుకోసమని ఇప్పుడు ఇక్కడ సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో…ఉన్న శ్రీశైలం మల్లన్న శిఖర దర్శనం నువ్వు పొందితే….ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన త్రిశూల దర్శనం నువ్వు పొందినట్టే. అయితే నువ్వు మోక్షం పొందినట్లే అవుతుంది. పెద్దలు ఈ విధంగా ప్రత్యక్ష నిదర్శనంగా చూపించడం జరిగింది. అలాగే ఈ సూక్ష్మ దృష్టి పొందిన వాళ్లు…. కాశీలో ఉన్న విశాలాక్షి బావి దగ్గరికి వెళితే వాళ్ళ సూక్ష్మ శరీరం అయిన నీడ కనిపించదు. నీడ కనిపించకపోతే వాళ్లకి అది కూడా మోక్ష మరణం అవుతుందని… పెద్దలు మనకి సాధన ఎంతవరకు ఉంది… మనది మోక్ష మరణమా కాదా అని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి…. ఆయా క్షేత్రాలలో రహస్యంగా మోక్ష విధివిధానం ఏర్పాటు చేయడం జరిగింది. కాలానుగుణంగా అవి మరుగునపడడం…. వాటిని పట్టించుకోకపోవడంతో ఆక్రమ దారులు ఏవో గుప్త నిధుల కోసం వాటిని పగలగొట్టడం…మూసివేయడం వల్ల …..స్వార్థాల కోసం పగలగొట్టడం… లాంటివి చేస్తూ వచ్చారు.  ఇదంతా కలి ప్రభావం.  ఎవరిని ఏమీ అనటానికి లేదు.  కాబట్టి నువ్వు శిఖర దర్శనం చూస్తాను అంటే నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి…. మళ్ళీ తిరిగి సాధన కుటుంబం అంతా పైకి వచ్చారు.  ఆయన చిన్న నందిని తిప్పడానికి ప్రయత్నం చేస్తే అది తిరగకపోయేసరికి మనోదృష్టితో చూసి అది ఎక్కడ ఇరుక్కుపోయింది….. దాని ఎలా సరిచేయాలో తెలుసుకుని ఆ విధంగా తిప్పుతూ ఉండేసరికి…..


 ఆ పక్కనే ఉన్న గైడ్ స్వామి! మీరు ఎంత తిప్పినా అది తిరగదు. ఉపయోగం లేదు. కావాలంటే ఇందాక చూసినట్టుగానే బైనాక్యులర్లో దర్శనం చేయండి. అనగానే నువ్వు మాట్లాడొద్దు అని ఉగ్రంగా వాడికేసి చూసేసరికి.. మీ చావు మీరు చావండి .నాకేం సంబంధం లేదు అని వచ్చిన వాళ్ళందరినీ బైనాక్యులర్లో గాలి గోపురాన్ని దర్శనం చేయించడం మొదలుపెట్టారు. ఆయనకి అందిన జ్ఞాన సమాచారం ప్రకారంగా ఈ చిన్న నందిని బాగు చేశాడు. ఇప్పుడు యధావిధిగా తిరగటం మొదలుపెట్టింది . అమ్మ ఇది సరి చేశాను. బాగుపడింది…కాకపోతే ఇది తాత్కాలికంగా నీకోసం మాత్రమే ఈ విధంగా చేశాను.  నీకు దర్శనం అయ్యిందా లేదా అని చూసిన తర్వాత….తిరిగి యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది.  ఈ చిన్న నందిలో నుంచి చూడటం దీనికి ఇష్టం లేదనుకుంటా!  అనేసరికి ….


సరే స్వామి ఇప్పుడు నేను ఏం చేయాలి?  అంటే తన చేతి సంచిలో నుంచి బెల్లం నువ్వులు గుప్పెడు తీసి…. ఆ చిన్న నంది గాడిలో వేసి…. అమ్మ ఇప్పుడు నువ్వు దీనిని బాగా తిప్పుతూ ఉండు…. బెల్లం నువ్వులు బాగా నలిగిపోయిన తరువాత ఒక చుక్క నూనె తయారు అవుతుంది.  ఆ చుక్క కింద ఉన్న శిఖరేశ్వర శివలింగం మీద పడితే ….అప్పుడు నీకు శిఖర దర్శనం అవుతుంది.  ఆ శిఖర దర్శనం అయ్యింది అంటే…. నీకు మోక్షం 6 నెలల్లో వస్తుంది. .. అని స్థలపురాణం చెబుతుంది.  నీకు అవుతుందా లేదా అని నువ్వు చూసుకో అనేసరికి! సరే స్వామి అని అనగానే ….బాలగణపతి నేను కూడా చూస్తా… నేను కూడా చూస్తా…. ఎప్పుడూ చూడలేదు… ఆ బైనాక్యులర్ నాకు అంతగా సంతృప్తి అనిపించలేదు.  అదేదో ఇందులో చూస్తే,  త్రిశూల దర్శనం అవుతుంది అంటున్నారు కదా! నేను చూస్తా… నేను చూస్తా… అని గోల చేసేసరికి చిన్న పిల్లవాడు కదా!  అని ఏం మాట్లాడకపోయేసరికి….నేను కూడా చూస్తా అని మహాదేవి అనేసరికి…. బాల కుమారస్వామి అనేసరికి…. సరే చూడండి! ఎవరికి ఏ ప్రాప్తి ఉందో ఎవరికి తెలుసు… ఎవరికి ఏ విధంగా దర్శనం ఇస్తాడో ఆ శివయ్య లీల ఎవరికి తెలుసు? నేను కిందకి వెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని కిందకి వెళ్లి ఆలయ పూజారికి డబ్బులు ఇచ్చి శివలింగం మీద ఉన్న పూలు,  బిలాలు అన్నీ తీసేసి శుభ్రంగా శివలింగం ఖాళీగా ఉంచేసరికి…. పైకి చూసేసరికి చిన్నపాటి రంధ్రం కనిపించింది.  ఆ రంధ్రం నుంచి నువ్వులు బెల్లం కలిపిన చుక్క పడుతుందని గ్రహించి స్వామి!  మా వాళ్ళు పైనుంచి చూడాలనుకుంటున్నారు… బెల్లం నువ్వులు కలిపిన నూనె చుక్క పడిందో లేదో చూస్తూ ఉండండి…. అనేసరికి సరే స్వామి!  అనేసరికి మళ్ళీ యధావిధిగా పైకి వెళ్లేసరికి బాల గణపతి గిరగిరా మూడుసార్లు తిప్పేసరికి… చిన్న చుక్క తయారయ్యేసరికి…. అది లింగం మీద పడలేదు. పక్కన పడింది. ఆ తర్వాత శిఖరాన్ని చూస్తే బాలగణపతికి శిఖరాలు దర్శనం అయ్యాయి… కానీ త్రిశూల దర్శనం అవ్వలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినా గాలిగోపురాలే కనిపిస్తున్నాయి గాని…. త్రిశూల శిఖర దర్శనం అవ్వట్లేదు అనేసరికి …..నీకు ఇంకా యోగం ,మోక్ష ప్రాప్తి రాలేదనుకుంటా అని మహాదేవి అనేసరికి… సరే అని మహాదేవికి ఇచ్చాడు. 


 మహాదేవి కూడా బెల్లం ,నువ్వులు వేసి చిన్న నందిని తిప్పి…. దర్శనం కోసం చూస్తే, అమ్మ నాకు కూడా బాల గణపతి లాగానే గాలిగోపురాలు మాత్రమే దర్శనం అవుతున్నాయి. త్రిశూల దర్శనం అవ్వడం లేదు అనేసరికి… బాల కుమారస్వామి ఈసారి నేను చూస్తాను… అనేసరికి అమ్మ ! నాకు కూడా త్రిశూల చక్ర దర్శనం అవ్వట్లేదు కానీ…. మల్లికార్జున స్వామి గుడి మాత్రం కనిపిస్తోంది….అనేసరికి అంటే బాల కుమారస్వామి వీళ్ళిద్దరి కన్నా ముందున్నాడు అనేసరికి… రుద్రస్వామి ఈసారి నేను చూస్తాను అని చెప్పేసరికి నాకు శిఖరదర్శనాలు కనపడట్లేదు… కేవలం గాలిగోపురం మాత్రమే కనపడుతుంది అనగానే…. అందరూ ఫక్కున నవ్వారు.  వయసు మీద పడింది కదా….50 సంవత్సరాలు కదా!  మనకి పక్కనే ఉన్నవాళ్లే కనిపించరు…. పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ఏం కనిపిస్తారు ….అనేసరికి నువ్వు ఎటకారాలు ఆపు.  అసలే  కాలి ఉన్నాను…. నాకు కనపడింది మీకు ఏదో కనపడనట్టు చెప్తారు…. కాకపోతే కాస్త వెనక ముందు అయ్యింది. నాకు గోపురం కనబడింది.  మీకు గాలిగోపురం కనబడింది. దాని మీద ఉన్న శిఖరాలు కనబడ్డాయి అంతే కదా! తేడా ఏముంది .అనేసరికి అమ్మ శివ నందిని!  ఈసారి నువ్వు ప్రయత్నం చెయ్యి.  ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి… శివ నందిని బెల్లం, నువ్వులు తీసుకుని గిరగిరా మూడుసార్లు కుడి వైపుకి మూడుసార్లు ఎడమ వైపుకి తిప్పి “స్వామి!  నాకు మోక్ష ప్రాప్తి ఉందో లేదో నువ్వే చెప్పాలి” అని అనేసరికి మొదట గాలిగోపురాలు….. ఆ తర్వాత గాలి గోపురము శిఖరాలు కనబడ్డాయి.  ఆ తర్వాత మల్లన్న గుడి గాలిగోపురం కనపడింది.. ఆపైన 6  సెకండ్ల పాటు ఒక మెరుపు మెరిసినట్టుగా త్రిశూల శిఖర దర్శనం అయ్యేసరికి….నాకు స్పష్టంగా అవుతుంది అనేసరికి…. దానికి ఢమరుకం ఉందా?  అంటే లేదు అనేసరికి అయితే…. నీకు శిఖర దర్శనం అయ్యింది తల్లి…. అనేసరికి బాల గణపతి అమ్మ!  నువ్వు ఆరు నెలల్లో చచ్చిపోతావు…. కాశీలో కూడా నీకు నీడ కనిపించలేదు… శ్రీశైలంలో నీకు త్రిశూల శిఖర దర్శనం అయ్యింది . అంటే నువ్వు ఇంకో ఆరు నెలల్లో చచ్చిపోతావ్ అన్నమాట! అయ్యో…. నీకు మోక్షం వచ్చేసిందమ్మో!  నువ్వు చచ్చిపోతావు అమ్మో! అంటూ ఉండేసరికి నువ్వు ఆగరా అని రుద్ర స్వామి గద్దించేసరికి…. వాడు ఇంక ఆపేశాడు. అప్పుడు ఆయన దీన్ని యథావిధిగా దీనిని ఏమీ పని చేయకుండా చేసేసి…. మళ్ళీ కిందకి వచ్చేసరికి…. స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండేసరికి ….అక్కడ ఉన్న ఆలయ పూజారి ఆఖరిగా మాత్రమే ఒక్క బొట్టు శివలింగం మీద పడింది. అప్పటిదాకా బొట్టు గోడల మీద ,వాటి మీద జారింది కానీ… ఎక్కడా శివలింగం మీద పడలేదు అనేసరికి…. మిగతా వాళ్ళు ప్రయత్నం చేసినవన్నీ కూడా చారికలలాగా శివలింగం మీద ఆ పాకం పడినట్టుగా కనబడింది.  ఆఖరిగా శివ నందిని ప్రయత్నం చేసింది,  శివలింగం మీద నుంచి ధారగా కారింది అని అర్థమయింది.  అందుకే త్రిశూల దర్శనం అయ్యింది అని రుద్రస్వామి గ్రహించాడు.  అంటే ఈమెకి ఈ దర్శనానికి అర్హత,యోగ్యత, యోగం ఉన్నట్టుంది . మోక్ష ప్రాప్తి ఉన్నట్టుంది అని విశ్వనాధుడు ఈమెను ఎంచుకొని ఉంటాడు. అందుకని మిగతా వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలగలేదు. ఏ జన్మలో చేసిన సాధన ఫలితమో ….ఏ జన్మ సుకృతమో శివానుగ్రహ ఫలితం పొందింది… అని మనసులో అనుకుని….అందరూ అక్కడి నుంచి సెలవు తీసుకుని భోజనాలు చేసి గదిలో విశ్రాంతి తీసుకుందామని సత్రం ఉన్న గది వైపుకి బయలుదేరారు. 


యధావిధిగా సత్రం యజమాని ఏర్పాటుచేసిన భోజనమును సాధన కుటుంబం అంతా సంతృప్తిగా తినేసి…. తర్వాత విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి… గదిలోకి ప్రవేశించి,  ఎవరి మంచాల మీద వాళ్ళు దొర్లటం ప్రారంభించారు.  ఆ తర్వాత రుద్రస్వామి మెల్లగా ….అమ్మ!  పిల్లలు నిద్రలోకి జారుకుంటున్నారు.  కావాలంటే పిల్లలకి కాపలాగా మహాదేవి ఉంటుంది.  మనం వెళ్లి శివానందని కలుద్దాము.  సమయం మూడు కావస్తుంది కదా!  అంటే…. సరే స్వామి ! నాకేమీ ఇబ్బంది లేదు. నేను వస్తాను అని…. ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని వస్తా అనేసరికి…. ఇప్పుడేం వద్దులే!  సమయం రెండు గంటలే కదా అయింది…. ఒక గంట విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాం… అనేసరికి సరే స్వామి ! మీ ఇష్టం అని ఎవరికి వారే నిద్రలోకి జారుకున్నారు. ఒక గంట తర్వాత రుద్ర స్వామికి శివనందిని కి మెలుకువ వచ్చింది. అలాగే మహాదేవికి కూడా మెలకువ వచ్చింది. మహాదేవి నేను కూడా వస్తాను అని… అనగానే పిల్లలు  గాఢ నిద్రలో ఉన్నారు.  మనం తలుపుకు తాళం వేసుకొని వెళ్లిపోదాం అనేసరికి…. పిల్లల గురించి మనం భయపడవలసిన అవసరం లేదు.  వాళ్ళు లెగవరు. కావాలంటే వాళ్ళకి కావాల్సినవి చేసి తీసుకొచ్చి పెట్టొచ్చు… సమయానికి వచ్చేయొచ్చు… అని చెప్పేసి ముగ్గురు గదికి తాళం వేసి విభూతి మఠం దగ్గరకి శివానంద దగ్గరికి వచ్చారు.


అప్పటికే శివానంద వాళ్లకి ధ్యానం చేసుకుంటున్నట్లుగా… ధ్యానంలో కనబడేసరికి సరే అని వీళ్ళ ముగ్గురు విభూతి శివలింగానికి నమస్కారం చేసుకొని ఆ విభూతి రాసుకొని యధావిధిగా ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి ఈయన అప్పుడే కళ్ళు తెరిచి అనుకున్న సమయానికి…. చెప్పిన సమయానికే వచ్చారు. సమయపాలన ఉన్నది. సాధనలో మొట్టమొదటి లక్షణం సమయపాలన ఉండాలి.  చెప్పిన సమయానికి ఒక పది నిమిషాలు ముందు వచ్చినా పర్వాలేదు… కానీ చెప్పిన సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నేను సహించను. నాకు ఇష్టం ఉండదు. నాకే కాదు ఎవరికైనా అది ఇబ్బంది కలిగించకూడదు. ఎవరి సమయాలు వారికి విలువైనవే కదా!  ఆ సమయానికి మనం గౌరవం ఇవ్వాలి… విలువ ఇవ్వాలి… సరే మీరు అది పాటిస్తున్నారా లేదా అని అనుకున్నాను… సరే నేను ఒక్కరినే రమ్మంటే ముగ్గురు వచ్చారు ఏంటి? అనేసరికి… ఏముందిలే స్వామి!  ఒకళ్ళేమో గత జన్మలో భార్య, ఒకళ్ళేమో గత జన్మ కూతురు. అంతేగా…. వీళ్ళకి తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు కదా! తెలియని విషయాలు అంటూ ఏమీ లేవు కదా!  ఎవరి సాధన వారిది… ఎవరి వ్యక్తిగత సాధన స్థితులు వారివి. ఇక్కడ అందరం ఒకటే కుటుంబం… సాధన కుటుంబం… చిన్నపిల్లలు వాళ్లు నిద్రపోతున్నారు. లేదంటే వాళ్లు కూడా వచ్చేవాళ్లే. మేమంతా విడివిడిగా ఉన్నా విడిపోకుండా ఉండే వాళ్ళం.  దైవ రహస్యాలను కాపాడే వాళ్ళం.  శివనందిని ఏదో సాధన చేయాలి…. మోక్షం పొందాలని అనుకుంటుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే….ఇప్పుడు ఈ పిల్ల చేత ఏ విధంగా సాధన పరిసమాప్తి చేయిస్తారు…. దాని విధివిధానం ఏమిటి?  అని తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను…. అనగానే మీకు తెలియని విషయం అంటూ ఉండదు కదా!  రుద్రయ్య మీకు అన్ని విషయాలు తెలుసు కదా!  ఏం తెలుసులే స్వామి! నేనేదో ఆజ్ఞా చక్రంలో ఉండి శక్తి ఆధీనం చేసుకొని కాశీ క్షేత్రం దాటలేక…. అక్కడే ఉండిపోయిన వాడిని.


రుద్రస్వామి:- మీరు అన్నీ శరీరాల సాధనను పరిసమాప్తి చేసుకున్న వారు మీరెక్కడ…. ఏదో ఆత్మ శరీరానికి మోక్షం కోసం తపన తాపత్రయం పడుతున్న నేనెక్కడ….నేను చనిపోయిన తరువాత నాకు కాశీలో మరణం ఉంటే తారకరామ మంత్రోపదేశం చేస్తారు. ఆ తర్వాత ఆయన జ్యోతి స్వరూపమైన అరుణ జ్యోతి ఉన్న అరుణాచలానికి పంపిస్తారు. అక్కడ నాలుగు శరీరాలు మోక్షం పొందుతాయి. అంతవరకు సాధన విధానం తెలుసు. ఆ సాధన విధానాన్ని కూడా మీరు పరిసమాప్తి చేసుకున్నారు. నాకన్నా నాలుగు మెట్లు ఎక్కువగానే ఉన్నారు. పూర్ణజ్ఞాని.  ఏకంగా శరీరం మోక్షాల గురించి ఆలోచించకుండా వ్యక్తిగత పురుష మోక్షం కూడా పొందిన వాళ్లు. అదే స్త్రీ మూర్తికి మోక్ష విధానం చెప్పి, స్త్రీకి వ్యక్తిగత మోక్షం ఇచ్చి…. ఆ రెండు వ్యక్తిగత మోక్షాలు కలిపి… అంటే స్త్రీ వ్యక్తిగత మోక్షం,  పురుష వ్యక్తిగత మోక్షం కలిపి దానిని విశ్వమోక్షం పొందాలని చెప్పి మీరు అనుకుంటున్నారు.  మీరేదో ప్రయత్నం చేస్తున్నారు….ఆ ప్రయత్నానికి నా వంతుగా మా సాధన కుటుంబం సహాయ సహకారాలు అందిస్తుంది. ఇదంతా విధిరాతలోని భాగమే కదా ! ఆయన సంకల్పించినట్టుగా నడుస్తున్న తోలు బొమ్మలమే కదా!


శివానంద:-  నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు.  అన్నీ తెలిసిన పూర్ణజ్ఞానివి.  చేసేది చేయించేది అంతా కూడా నువ్వే… అని నాకు తెలుసు.  కాకపోతే నువ్వు మోక్షం పొందాలి అనుకుంటున్నావు… మోక్షం పొందలేకపోతున్నావు.. అది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నావు. 


రుద్రస్వామి:- అవును స్వామి!  నేను చచ్చాను అన్న విషయం నాకు తెలుసు.  కానీ నేను కానీ నేను ….నేనుగా ఉన్న నా భార్య నన్ను నమ్మడం లేదు. నన్ను ఆపుతుంది. అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో!.


శివానంద:-  అయ్యా! పురుష ప్రకృతిలో ఆది రుద్రుడు, ఆదిపరాశక్తి ఉన్నారు. ఆది రుద్రుడు మోక్షం పొందాలని అనుకున్నప్పుడు….ఆదిపరాశక్తి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. సరే స్వామి! నేను పిల్లల కోసం ఉండిపోతాను. మీరు మోక్షం పొందండి అని…. శూన్యం అయిపోండి అని…. వీళ్ళ కోసం మీరెందుకు ఆగడం,  నేను మోహమాయలో ఉన్నాను… మోహ మాయను వదిలించుకోవడం నా వల్ల కాదు… కాబట్టి మీరంతట మీరు వెళ్లిపోండి.  మీకు కావాల్సినట్టుగా మీరు మోక్షం పొందండి .శూన్యం అవ్వండి .నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీరు ఉన్నారని గుర్తుగా… నాకు మనోధైర్యం ఇచ్చే విధంగా నాకు ఏదైనా ఇవ్వండి ….అంటే , ఆయన స్పటిక లింగం ఇచ్చి ఇదే నీకు గుర్తు.  ఇదే ఆరాధన చేసుకో… నీకు ఎల్లవేళలా సాధనలో ఉన్నా కూడా… నా అవసరం ఉంది అన్నప్పుడు… అంతర్వాణిగా నీకు సహాయ సహకారాలు అందిస్తాను. ఈ శివలింగమే నీకు సమాధానం చెబుతుంది అని రుద్రస్పటిక లింగం ఇవ్వడం జరిగింది.  ఇది మనకి అమర్నాథ్ గుహలో తొలి మంచులింగం శివలింగంగా ఏర్పడినది… అని ఆయన చెప్పడం జరిగింది.  ఈ శివపార్వతులలో అప్పటిదాకా భర్తగా ఉన్న శివుడు కాస్త గురువుగా మారి….ఆవిడకి గురు మంత్ర ఉపదేశం చేసి… గురు మంత్రం సాధన విధి విధానం అంతా చెప్పి…. ఆది రుద్ర స్పటిక లింగం ఇచ్చి గుహలోకి వెళ్ళిపోయారు. గుహ లోపలికి వెళ్లి ఆయన ఆభరణాలన్నీ తీసేసి…. శివమోక్షమును పొందడం జరిగింది అని.. స్థల పురాణం చెప్పడం జరిగింది. దాన్ని ఆరాధన చేసుకుంటూ… ఆవిడ కాలం గడుపుతూ… పుత్రుల కోసం,  లోకాల కోసం మోక్షమును పొందకుండా ఉండిపోయింది. తద్వారా ఆదిపరాశక్తి ముక్తులు మాత్రమే పొందుతూ వెళ్ళింది. కానీ మోక్షమును పొందలేదు. అంటే అమోక్షమును పొందింది. ఇప్పుడు ఆదిపరాశక్తి మోక్షం పొందాలని కంచి కామాక్షిగా అంటే ఈవిడలో లలితాదేవి రాజేశ్వరి శక్తి కలయిక లేదా మీనాక్షి విశాలాక్షి శక్తి కలయికలు …మూడు ఉండి మనకి ఆది కామాక్షిలో ఈ శక్తులు ఉన్నాయి.  ఆ శక్తులతో ఆవిడ మోక్షం పొందాలి అని నా దగ్గరికి వచ్చింది. ఇది పురుష ప్రకృతిలో …పురుషుడు మోక్షం పొందాడు. నేను మోక్షం పొందాను అని ధ్యాన అనుభవాలు పొందడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది .


ఇప్పుడు స్త్రీ ప్రకృతికి వచ్చేసరికి… ఇదిమిత్తంగా లేదు.  గందరగోళంగా ,తేడా తేడాగా ఉంది.  ఎందుకు అంటే… స్త్రీ ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాలి అనుకుంటే,అమ్మవారు పొందనివ్వడం లేదు, అమ్మవారు ఆపుతుంది…. అనేసరికి శివ నందిని కాస్త స్వామి!  శివ స్వామి… ఇక్కడ మీ మాటకి అడ్డు వస్తున్నాను. నాకు కలిగిన రెండు ధ్యాన అనుభవాలు మీకు చెప్పాలనుకుంటున్నాను… ఈ విషయం రుద్ర స్వామికి, మహాదేవికి కూడా తెలియదు. మీ దగ్గర ప్రస్తుతం ప్రస్తావనకి వచ్చింది కాబట్టి…. యధావిధిగా మీకు చెప్తాను అనేసరికి …సరే చెప్పు తల్లి!  అనేసరికి శివ నందిని తన వ్యక్తిగతముగా కలిగిన ధ్యాన అనుభవం గురించి చెప్పడం ప్రారంభించింది.


కాశీలో ఉన్నప్పుడు… కాశీ క్షేత్రాన్ని నేను వదిలిపెట్టేసి వస్తున్నప్పుడు….  విశాలాక్షి దేవి ఒక సింహాసనం మీద త్రిశూలం  పట్టుకున్నట్టుగా కనబడింది.  కాలు మడత పెట్టి ,ఒక కాలు కింద, ఒక కాలు పైన పెట్టుకొని కనపడింది.  అది కూడా లలితాదేవి భంగిమలో కనపడింది. ఆ తర్వాత చూస్తే, ఆమె చేతిలో పద్మ శివలింగం…. ఇంకో చేతిలో పద్మ గణపతి స్థానంలో రెండు పద్మాలు మాత్రమే కనిపించాయి.  గణపతి మూర్తి లేదు.. ఆవిడ ఉన్నట్టుండి ఉగ్రరూపం లోకి వెళ్లి….కూర్చున్న ఆవిడ కాస్త ఉగ్రరూపంలోకి వెళ్లి త్రిశూలంతో నన్ను పొడుస్తున్నట్టుగా…. ధ్యాన అనుభవం అయింది.  నాకు అర్థం కాలేదు.  అప్పుడు కళ్ళు తెరిచి ఆత్మ విచారణ చేసుకుంటే…. శివలింగమును,  గణపతిని ,ఆమె  నుంచి దూరం చేశానని చెప్పేసి… ఆవిడ నన్ను చంపాలని అనుకుంటుందేమో అనిపించింది.  ఒకవేళ రుద్ర స్వామికి చెబితే… ఆయన ఏం కంగారు పడతాడో …..ఏం చేస్తాడో… ఏం మాయలో పడతాడో…. ఏమో అని రుద్రస్వామికి , మహాదేవికి చెప్పలేదు…. అనేసరికి సరే!  రెండో అనుభవం ఏమిటి ?అని శివ స్వామి అడిగేసరికి…. ఇక్కడ నేను శ్రీశైలం వస్తుండగా…. మొదటి రోజు దర్శనం చేసుకున్నాను. రెండో రోజు దర్శనం చేసుకోవడానికి వెళుతున్నప్పుడు… నాకు బొమ్మలు అమ్మే షాప్ లో  రెండు శివమూర్తులు చాలా బాగా నచ్చారు.  ఒకటి లేత నీలిరంగు ధ్యానంలో ఉన్న శివమూర్తి, రెండోది నిండు నీలి రంగులో ఉన్న శివమూర్తి. ఈ రెండు విగ్రహమూర్తులను నేను తీసుకున్నాను. తీసుకొని యధావిధిగా మల్లన్న గుడికి, అమ్మవారి గుడికి, త్రిఫల వృక్షం కింద ధ్యానంలో కూర్చునేసరికి… ఒక ఎనిమిది సంవత్సరాల పాప బొద్దుగా, లావుగా, ఉన్న ఆవిడ త్రిఫల వృక్షానికి మూడు ప్రదక్షిణలు చేస్తూ….. నా వంక ఉగ్రంగా, రౌద్రంగా చూస్తున్నట్లుగా కనబడింది.  చేతిలో ఒక త్రిశూలం లేదు.  కాకపోతే  బాలాదేవిగా అనిపించింది .త్రిశూలం లేని రూపం బాల అమ్మవారు అనిపించింది. నాకు ఒక్క క్షణం పాటు భయం వేసింది.  ఆ ఉగ్రరూపం… రౌద్రరూపం… చూసేసరికి ఏమైయిందా! అని అనుకున్నాను.  ఆ తర్వాత కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేసరికి…. ఒక కొండలో నుంచి నీలం రంగు శివుడు వస్తున్నట్టుగాను,  అమ్మవారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ… ఏదో జ్యోతి ఉన్న కొండవైపు వెళుతున్నట్టుగాను…. నీ వల్ల ఇదంతా జరిగింది అని…. త్రిపుర సుందరి అనుకుంటా!  త్రిశూలంతో పొడవడానికి వస్తున్నట్లు ధ్యానా నుభవం అయింది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను.  ఇప్పటికే నేను చావాలనుకున్నానే తల్లి!  నీ చేతుల్లో చచ్చిపోతాను… నేను చచ్చానా బతికానా అనేది నా సాధనా…అనుభవాలను బట్టి తెలుస్తుంది.  లేని శివుడిని నువ్వు ఉన్నట్లుగా భ్రమ, బ్రాంతి కలిగిస్తున్నావని …పరమహంస  గారు చెప్పారు.  అది నిజమా కాదా అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.  ఒకవేళ అది నిజమైతే… లేనిది ఉన్నట్లుగా పునః సృష్టి చేస్తున్నట్లే,... కదా!  అప్పుడు ఎవరూ లేనట్లే కదా! నువ్వు సత్యం కాదు…. నేను సత్యం కాదు కదా!  అనేసరికి ఆవిడ అంతర్దానమైంది.  ఇలా ఈ రెండు శక్తి పీఠాల్లో ఉన్న అధిష్టాన దైవాలు నన్ను ఎందుకు చంపాలి అనుకున్నారో నాకు అర్థం కాలేదు.


ఇప్పుడు అర్థమవుతుంది ….మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే…. అక్కడ ఉన్న శివుడు మోక్షం పొందాలి అనుకుంటున్నాడు. అక్కడున్న అమ్మవారు ప్రతిబంధనం చేసింది . కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడిని కాశీ విశాలాక్షి బంధనం చేసింది.  ఇప్పుడు శ్రీశైలంలో మల్లికార్జునడు మోక్షం పొందాలి అనుకున్నప్పుడు…..బాలా త్రిపుర సుందరి ఆపుతుంది అని అర్థం అయింది.  ఆయన మోక్షం పొందేటట్లు చేస్తున్నానని…. ఇద్దరు అమ్మవార్లు నన్ను చంపాలని ప్రయత్నం చేశారని…. మీ మాటలను బట్టి నాకు అర్థం అవుతుంది… అనేసరికి…. శివ స్వామి చిరునవ్వు నవ్వి….


శివస్వామి:- అవును!  శివాని.  స్త్రీ ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాలనుకున్నప్పుడు…. అమ్మవారు ఆపుతుంది.  ఇక్కడ ఒక విషయం గమనించు. భోగ జీవితంలో విడాకులు కావాలనుకున్న భార్యాభర్తల్లో… భార్య కావాలనుకున్నా…భర్త కావాలనుకున్నా…ఒకరు ఆపుతారు…. ఒకళ్ళు ఇవ్వమని చెబుతారు… ఒకళ్ళు తీసుకోక తప్పదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది కదా!  ఇక్కడ రెండు విధాలుగా చెప్పే అవకాశం ఉంటుంది.  భర్త విడాకులు భార్యకు ఇచ్చేటప్పుడు తనకి కావలసిన ఆస్తిపాస్తులు… అన్ని ఇచ్చేస్తే ….విడాకులు ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరాలు చూపించదు . అలాగే కొంతమంది భార్యలు ఉంటారు…. భర్త ఆస్తులని ఆశించరు….. భర్త విడాకులు ఇవ్వాలని అనుకున్నా….కూడా ఇవ్వకుండా నాకు ఆస్తులు వద్దు …నువ్వే కావాలి అని ….నువ్వే సర్వం అనుకునే ఆడవాళ్ళు ఉంటారు.  కాబట్టి స్త్రీ ప్రకృతిలో అమ్మవారు విడాకులు ఇవ్వటానికి ఇష్టం చూపించట్లేదు.  మోక్షం పొందడానికి ఇష్టం చూపించట్లేదు. పురుష ప్రకృతిలో ఆయన మోక్షం పొందాలంటే అమ్మవారు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు…. అని చెప్పేసరికి 


అవును స్వామి! ఇలా జరగడానికి అవకాశం ఉంది . అని మహాదేవి అన్నది. ఆ తర్వాత ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు. ఆదిపరాశక్తి మోక్షం పొందలేదు. ఆవిడ మోక్షం పొందాలి అనుకుంటుంది. ఆవిడ కామాక్షి దేవిగా నా దగ్గరికి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది.  ఇప్పుడు స్త్రీ ప్రకృతిలోకి వచ్చేసరికి…. పురుషుడు మోక్షం ఎక్కడ పొందుతాడో అని చెప్పి 14 బంధనాలతో ఆమె  బంధించింది. ఆ 14 శివ  బంధనాల నుంచి మనం విముక్తి కలిగించాలి.  అప్పుడు ఆయన ఆనందతాండవం కాస్తా  విలయ తాండవం చేస్తాడు.  తద్వారా కదిలే అమ్మవారు,  కదిలే శివుడు కలిస్తే కదలని స్థితి…. అంటే మోక్ష స్థితి పొందే అవకాశాలు ఉంటాయి అని అన్నారు. ఇప్పుడు అమ్మవారిని మనం బంధించాలి. అయ్యవారిని బంధ విముక్తి చేయాలి. అప్పుడు కదిలే వాళ్ళిద్దరూ కలిసి… ఏకమై… ఏక స్వరూపమై… స్త్రీ పురుష తత్వం లేని స్థితిని పొందితే పూర్ణ మోక్షం పొందే అవకాశాలు ఉంటాయని అనేసరికి….. రుద్ర స్వామి మరియు మహాదేవికి అర్థమైంది కానీ…. శివ నందినికి అర్థమై అర్థం కానట్టుగా అనిపించింది.  ఇక్కడ శివుడు 14 రకాల  బంధనాలలో ఉన్నారు అంటున్నారు కదా!  అది ఏ విధంగా మీరు చెప్పగలరు అన్నప్పుడు…..


శివ స్వామి:- మనకి ఏకాదశ రుద్రలలో విలోహిత అనే ఒక రుద్ర మూర్తి ఉన్నాడు . 14 చేతులతో మనకి దర్శనం ఇస్తాడు.  ఆయన ఉపమన్యు అనే మహర్షికి 14 చేతులతో రుద్ర మూర్తిగా దర్శనమిచ్చాడు.  ఆయన పాలు అడిగితే పాలసముద్రమే ఇచ్చినట్లుగా…. ఈయన చరిత్రలో మనం చూడవచ్చు. ఈయన  యొక్క లక్షణం ఏమిటంటే… ఆయన ఎప్పుడు ఉగ్రంగా ఉంటాడు. అగ్నిజ్వాలలో ఉంటాడు.  బడవాగ్ని కలిగి ఉంటాడు.  నాశనం చేసే నాశన కారకుడు.  ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రటి జ్వాలాగ్ని నాశనం చేయడం తప్ప…ఆ అగ్నిని ఆర్పడం అనేది జరగని పని.  అందుకని అతన్ని విలోహిత అన్నారు.  విలోహిత రుద్ర మూర్తి చేతుల్లో ఉన్న 14 బంధనాలు… అనగా 14 వస్తువులు ఉంటాయి. మన శివుడు కూడా నిజానికి 14 వస్తువులతో ఉంటాడు.  ఆ 14 వస్తువులే 14 బంధనాలతో అమ్మవారు బంధనం చేయడం జరిగింది.


అంటే ఏమిటంటే…… తనకి ఇష్టమైన వాటినే అమ్మవారు బంధనంగా మార్చింది.  ఉదాహరణకి నాగాభరణం.  మనం వాసుకి సర్పం ఆయనకి ఆభరణం అనుకుంటాం… నిజానికి అది నాగబంధనం. రుద్రాక్షలు ఆయన వేసుకుంటాడు.  ఆయనకి రుద్రాక్షలు అంటే ఇష్టం అనుకుంటాం… నిజానికి ఆ రుద్రాక్ష బంధనం.  ఇలా ప్రతిదీ కూడా ఆయన ఒంటి మీద ఉన్న వస్తువులు, జంతు చర్మాలు, ఆయన వాడినవి అన్నీ కూడా… ఆయన అవసరాలు తీర్చేవి. అవి లేకపోతే ఉండలేడు అన్నట్టుగా అమ్మవారు భ్రమ సృష్టించింది.  ఆ విధంగా ఆయనకి భ్రమను సృష్టించడంతో…. ఆయన వాటి బంధనాలలో ఉండిపోయాడు.  ఉదాహరణకి…. తన ప్రియ భక్తుడు గజాసురుడు తనకి గజచర్మము ఇవ్వడంతో…. ఇప్పుడు నేను వెళ్ళిపోతే…. గజాసురుడు అన్యాయం అయిపోతాడు.  ఒంటరి అయిపోతాడు.  ఏకాంతంగా అయిపోతాడు అని ఆయన మోక్షము పొందకుండా ఆగిపోవడం జరిగింది.  అలాగే వాసుకి సర్పం తన మెడలో ఉంది. తను మోక్షం పొందితే ….పాము ఒంటరి అయిపోతుందని భయంతో ….ఆయన ఆగిపోవడం జరిగింది.  ఇలా తన శరీరం మీద మొత్తం 14 బంధనాలతో శివుని బంధనం చేసేసి…. స్త్రీ ప్రకృతిలో అమ్మవారు ఉంచేసింది. మనం చేయవలసింది ఏమిటంటే…. ఈయనకి ఉన్న 14 బంధనాల నుంచి బంధ విముక్తి కలిగించి…. అమ్మవారికి ఈ 14  బంధనాలతో బంధనం చేస్తే,  అప్పుడు ఆవిడ కదిలే ఆవిడ కాస్త నించుని…. తర్వాత కూర్చుని…. మన మాట వింటుంది.  ఈయన కదిలే ఆయన కూడా… కూర్చునే స్థితికి వస్తాడు.  ఒక విధంగా చెప్పాలంటే స్కంద మూర్తిలో  అయ్యవారు, అమ్మవారు ఏ విధంగా వ్యతిరేక భంగిమలో కూర్చుని ఉంటారో ….ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా కూర్చునే స్థితికి రావాలి.  ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఏకమై, నిల్చున్న అర్ధనారీశ్వర తత్వంలోకి రావాలి.  ఆ తర్వాత వీళ్ళిద్దరూ…. స్త్రీ, పురుష తత్వం లేని నామరూపాలు లేని…. స్థితికి రావాలి.  అప్పుడు వీరు పొందే మోక్షమే విశ్వ మోక్షం అవుతుంది. దీనికి గాను…. మనం ఏం చేయాలంటే,అయ్య వారికి ఉన్న 14 బంధనాలు తీసేయాలి.  అలాగే అమ్మవారిని 14 బంధనాలలో బంధనం చేయాలి.  ఆవిడకి విశ్వ పూర్ణ జ్ఞానం ఇవ్వాలి. శివుడు లేడు తల్లి!  నువ్వు కూడా లేవు!  నువ్వు లేవు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి… అందుకు ధ్యానంలో కూర్చోవాలి అని బోధ చేయాలి. ఆవిడ కదిలేంతవరకు మన మాట వినదు. ఆ కదిలే ఆవిడని….కదలని స్థితికి తీసుకురావాల్సి ఉంటుంది.  నిశ్చల స్థితికి తీసుకురావాలి. అప్పుడు ఆమె మోక్షం పొందే అవకాశం ఉంది. శివుడిని ఈ బంధనాలలో ఉంచడం వలన…ఇప్పుడు ఈయన సృష్టి, స్థితి, లయలు చేస్తున్నాడు.  కావాలంటే ద్వాదశ లింగాలు… అష్టాదశ శక్తి పీఠాలు… కలిపి చూడు . మూడు చోట్ల మాత్రమే శివుడు పార్వతీ కలిసి ఉంటారు.  శక్తి లింగం, శక్తిపీఠం కలిసి ఉన్నవి మూడు క్షేత్రాలు లోనే ఉంటుంది. ఒకటి శ్రీశైలం, రెండు మహా ఉజ్జయిని,మూడు కాశీ క్షేత్రం.  కావాలంటే చూసుకో అనేసరికి… ఆ!  అవును స్వామి అని అందరూ తల ఊపారు.


ఇందులో ఉజ్జయిని క్షేత్రంలో కుజుడు పుట్టాడు.  అంటే భూమి పుట్టింది . ఖగోళ శాస్త్రం ,జ్యోతిష్య శాస్త్రం అక్కడే మొదలయ్యాయి.  నవగ్రహాలు, అంతరిక్షం ఇక్కడ నుంచే వచ్చాయి.  అంటే ఏంటి….మహాకాలుడు, మహాకాళికా… శృంగారం, రతీక్రీడా చేయడం వలన… సృష్టి జరిగింది. అంటే ఉజ్జయిని క్షేత్రం సృష్టి కార్యక్రమానికి ఉపయోగపడింది.  అదేవిధంగా శ్రీశైలానికి వచ్చేసరికి…. శ్రీశైలంలో ఉన్న నటరాజు సాయంత్రం ప్రదోషకాలంలో…. ఇక్కడకు వచ్చి నాట్యం చేస్తాడు.  ఆనందతాండవం చేస్తాడు.  ఆ తర్వాత సమావేశం జరుగుతుందని… స్థల పురాణం చెబుతోంది.  అంటే ఏమిటి..? స్థితికారకుడు అవుతున్నాడు… ఇక్కడ ఈయన చేయవలసిన పనులు…. ఏ రోజుకి ఆ రోజు తన గణాలకి ఆదేశం ఇస్తున్నాడు.  ఇక కాశీ క్షేత్రానికి వెళితే నిత్యం 20 నిమిషాలకు ఒకసారి శవదహనం జరుగుతుంది. అంటే ఏంటి ….అది లయం అని అర్థం అవుతుంది కదా!  అంటే ఈ లెక్కన చూస్తే, ఉజ్జయిని క్షేత్రంలో శివుడు సృష్టి కారకుడు అయితే….శ్రీశైలంలో స్థితికారకుడు అయితే…. కాశీ క్షేత్రంలో లయ  కారకుడు అవుతున్నాడు అన్నమాట!  ఈ ప్రక్రియలు చేయడానికి కారణం అమ్మవారు 14  బంధనాలల్లో శివుని ఉంచటం వలన ఆయన అమ్మవారి ఆజ్ఞను చేస్తున్నారు.  ఇదే తను పూర్ణజ్ఞాని అయినా కూడా…. అసంపూర్ణంగా అజ్ఞానిగా…. ఉండి సృష్టి ,స్థితి ,లయలు కూడా అమ్మవారి ప్రకారంగా స్త్రీ ప్రకృతిలో చేస్తున్నాడు. ప్రకృతి ఉంది . ఆ ప్రకృతిలో నుంచి స్త్రీ ప్రకృతి ,పురుష ప్రకృతి వచ్చింది. ఇప్పుడు పురుష ప్రకృతి లేనప్పుడు… సహజ సిద్ధంగా కూడా దానికి ప్రతిబింబం అయిన స్త్రీ ప్రకృతి ఎలా ఉంటుంది?  సత్యంగా ఎలా ఉంటుంది? ఉండదు కదా!  ఇదే సత్యం కానప్పుడు… ఇదే నిజం కానప్పుడు… అది భ్రమ , బ్రాంతి అయినప్పుడు… దాని నుంచి వచ్చిన పురుష ప్రకృతి , స్త్రీ ప్రకృతి నిజాలు, సత్యాలు ఎలా అవుతాయి.  అవ్వట్లేదు.  అంటే లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు.  అంటే  పురుష ప్రకృతిలో పురుషుడు లేడు,  అమ్మవారు లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది . కాబట్టి పురుషుడు మోక్షం పొందాడు.  అనే విషయం తెలియనివ్వకుండా ఆపుతుంది. అదేవిధంగా పురుష ప్రకృతిలో చేస్తుంది. స్త్రీ ప్రకృతికి వచ్చేసరికి…. మోక్షం పొందనీయకుండా మాయాబంధానాలు పెట్టేస్తుంది… అవాంతరాలు పెట్టేస్తుంది… ఆటంకాలు పెట్టేస్తుంది…. అడ్డంకులు పెట్టేస్తుంది….పురుషుడికి తను మోక్షం పొందాలని ప్రయత్నం చేయడం లేదు… పురుషుణ్ణి మోక్షం పొందనివ్వకుండా ఆపేస్తుంది. దీని వలన మోక్షం పొందాల్సిన వాడు మోక్షం పొందడం లేదు. చావాలనుకున్నవాడు చావటం లేదు . బతకాలనుకున్నవాడు తనకి కావలసినట్టుగా బతకలేక పోతున్నాడు.  ఈ విధంగా స్త్రీ ప్రకృతిలో జరుగుతుంది.


అదే పురుష ప్రకృతిలో… నేను పరమహంస యొక్క సాధన అనుభవాలు,  ధ్యాన అనుభవాల ప్రకారంగా చూసి…పురుషుడు మోక్షం పొందాడు.  ఆదిపరాశక్తి మాత్రం పొందలేదు… ఆవిడ మోక్షం పొందాలని అనుకుంటుంది అని తెలుసుకున్నాడు.  ఇక స్త్రీ ప్రకృతికి వచ్చేసరికి… పురుషుడు మోక్షం పొందాలనుకున్నప్పుడు , మోక్షం పొందినవ్వకుండా అమ్మవారు ఆపుతుంది.  కాబట్టి కదిలే ప్రకృతి చేస్తుంది.  కదిలే స్థితిలో ఉన్న… కూర్చున్న స్థితిలో ఉన్న లలితాదేవి కానీ, నించుకున్న స్థితిలో ఉన్న మీనాక్షి దేవి కదలడం వల్ల కానీ….. కూర్చున్న రుద్రుడు కాస్త నిలబడి నాట్య భంగిమలో నటరాజ మూర్తిగా మారుతున్నారు. తద్వారా ఆయన నాట్యం ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాడు.  విలయతాండవం కాస్త ఆనందతాండవంలోనే ఉండిపోతున్నాడు.  దీనికి కారణం ఆయన బంధనంలో ఉన్నారు.


14 రకాల బంధనాలు …ఆ 14 రకాల బంధనాలనుంచి నువ్వు బంధ విముక్తుని చేయాలి.  అంటే మొదట శివుని బంధ విముక్తిని చేయాలి.  ఆ తర్వాత కదిలే అమ్మవారిని మనం 14 బంధనాలతో బంధించాలన్న మాట!  తర్వాత కదిలే ఆవిడ కదలదు.  కదిలే శివుడు కూడా కదలడం మానేస్తాడు.  ఈ ఇద్దరు కదలని స్థితికి వెళితే…. సహజసిద్ధంగా మోక్షమును పొందడం జరుగుతుంది. ఇదే విశ్వమోక్షం అవుతుంది.  ఇది మనం చేయవలసిన రహస్యం మోక్ష విధి విధానం. అనేసరికి ….స్వామి!  మీరు శబ్ద పాండిత్యం ప్రకారం బాగానే చెప్పారు.  అనుభవ పాండిత్యంలో ఇవన్నీ నేను సాధిస్తానా?  అని శివనందిని అనేసరికి…. అనుమాన భయాలు పెట్టుకోవద్దు. లక్ష్యాలు పెట్టుకోవద్దు… కోరికలు పెట్టుకోవద్దు…. ఇది ఎలా అయినా సాధించాలి అని సంకల్పాలు పెట్టుకోవద్దు. జరిగేది జరుగుతూ ఉంటుంది….ఎక్కడా మాయలో పడకు.  ఎక్కడా సాధన ఆపకు.  ఏం జరిగినా మన మంచికే అని భ్రమ ,బ్రాంతి అని భయపడకుండా… ఆశపడకుండా…. నీ సాధన నువ్వు కొనసాగిస్తూ ఉండు.  రత్నాలే కనిపించొచ్చు.. మణులే కనిపించవచ్చు…. సిద్దులే రావచ్చు…. శక్తులే రావచ్చు…. పంచభూతాలే ఆధీనం అవ్వచ్చు… బ్రహ్మ పదవులే రావచ్చు… ఏదైనా ఆశ పెడుతుంది ప్రకృతి.  వాటిని చూస్తూ ఊరుకో! నీవు పాపాలు చేశావు… నీవు దోషాలు చేశావు… నీవు తప్పుడు పనులు చేశావు…. నీకు మోక్షం లేదు… నువ్వు ఆగిపో!  నీకు అర్హత లేదు… అని చెప్పినా కూడా…నువ్వు దేనికి పనికిరావని చెప్పినా కూడా ……నువ్వు నిరుత్సాహపడకుండా, భయపడకుండా, బాధపడకుండా, అవేం ఆలోచించకుండా… నీ సాధన నువ్వు కొనసాగించు. ఎప్పటిదాకా అంటే నువ్వు ఆగిపోయి స్థిరపడేదాకా ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వు ఆగిపోవడం జరిగితే అది మరణం అవ్వాలి. ఆ మరణమే నీకు మోక్షమరణం అవ్వాలి.  అప్పటిదాకా ప్రకృతి నానారకాలుగా, నానావిధాలుగా పరీక్షలు పెడుతూనే ఉంటుంది.  ఆ పరీక్షలు అన్నీ నువ్వు తట్టుకొని నిలబడాలి. అదే నువ్వు చేయవలసిన సాధన విధానం.  అందుకు మేము అందరం నీకు సహాయ సహకారాలు అందిస్తాం…. అంటూ ఉండేసరికి,  విభూతి మఠం నుంచి వేణునాదం లీలగా  వినపడుతూ ఉండేసరికి… అందరూ అటువైపు చూశారు.


వేణునాదం వాయిస్తూ విభూతి మఠంలో నుంచి కృష్ణ స్వామి బయటకు వచ్చేసరికి…. ఓరినీ! ఇతను కూడా వచ్చేశాడా! అని రుద్రస్వామీ అంటూ ఉండేసరికి…ఇక మహాదేవి మరియు శివ నందినీ కి కథ అర్థం అయిపోయింది… స్వామి! ఈయన కాశీ క్షేత్రంలో ఉండే కృష్ణ అంశ అయిన కృష్ణస్వామి అని అనేసరికి…. ఒకసారి శివ స్వామి ఈయన కేసి చూస్తూ…. ఇతనిని గురించి తెలియనిది ఏముంది? ఇతను అందరికీ సుపరిచితుడే.  సాధనలో ఉండే యోగసాధకులకి, సాధువులందరికీ… ఈయన ఆటంకాలు అవాంతరాలు కలిగిస్తూ ఉంటాడు.  వీళ్ళు లోకకళ్యాణార్థం ఉండేవాళ్లు.  మన సాధనవలన లోకానికి ఏదైనా వినాశనం జరుగుతుందేమో అని వీళ్ళు భయపడుతూ ఉంటారు.  వీళ్ళు రక్షకులు.  వీళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ఉండేసరికి…. కృష్ణస్వామి కాస్త శివ స్వామి దగ్గరికి వచ్చి…. స్వామి! నమస్కారాలు. నేనెవరో… నా సాధనాస్థితి ఏమిటో… నాకున్న శక్తి సామర్ధ్యాలు ఏమిటో…. నీకు పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. నీకు అన్ని తెలిసే ఉంటాయి. ఎందుకంటే పురుష ప్రకృతిలో ఇప్పటికే నీ చేతిలో నేను దెబ్బలు తిని ఓడిపోయి ఉన్నాను.  కాబట్టి నీవు గ్రహించే ఉంటావు.  నేను ఎన్ని అవాంతరాలు కలిగించినా….అటంకాలు కలిగించినా ….కూడా నా మాయలో పడకుండా,  నీ సాధన ఆగకుండా పరిసమాప్తి చేసుకున్నావు.  అంతా బాగానే ఉంది.  పురుష ప్రకృతిలో నువ్వు జయం పొందావు.  మళ్లీ స్త్రీ ప్రకృతికి ఎందుకు వస్తున్నావు.  స్త్రీ మూర్తికి ఎందుకు సహాయ సహకారాలు అందిస్తున్నావు. ఇప్పుడు రక్షకుడే భక్షకుడు అయితే ఎలాగ స్వామి!  రక్షించాల్సిన వాడే భక్షిస్తే ఎలా చెప్పు… సృష్టిని కాపాడాల్సిన బాధ్యత తెలుసు నీకు.. పూర్ణజ్ఞానం  పొంది….సృష్టిని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు… లోకవినాశనం పనులు ఎందుకు చేస్తావు? లోక విరుద్ధమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు?లోకాన్ని నాశనం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు ? ఇప్పుడు నీకు ఆట ఆడటం ఇష్టం లేదు…..నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళిపో ! ఆట నుంచి తప్పుకో!  జగన్నాటకం ఆపాలి… ఈ విశ్వనాటకం ఆపాలి… అని ఎందుకు అనుకుంటున్నావు.  అందరూ చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు…. నాకు మోక్షం పొందాలని లేదు…. ఎందుకు నన్ను చంపాలని అనుకుంటున్నావు…? నేను ఇంకా ఈ నాటకంలో ఉండాలి. ఈతి బాధలు పడాలి… కష్టసుఖాలు అనుభవించాలి… కామకోరికలు తీర్చుకోవాలి… మహిమలు, సిద్ధులు, యోగ శక్తులతో నేను ఆడుకోవాలి.  దైవిక వస్తువులు సంపాదించుకోవాలి.  ఇలాంటి ఆశలు ,కోరికలు ఉన్నాయి.  నా కోరికలు నేను తీర్చుకుంటాను… నువ్వు బలవంతపు బ్రాహ్మణత్వం అంటగడతావేంటి ? మోక్షం పొందాలని…. విశ్వ శూన్యం అయిపోవాలని అంటావు అనేసరికి…


శివ స్వామి నవ్వుతూ…. స్వామి! కృష్ణ స్వామి!  నీకు తెలియనిది కాదు…. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అన్ని తెలుసు… కాకపోతే ఏంటి? పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు అనే విషయం నేను తెలుసుకునేదాకా లోకానికి తెలియకుండా అమ్మవారు, నువ్వు చేయాల్సిన ఏర్పాట్లు చేశారు.  చేయాల్సిన ఆటంకాలు చేశారు.  చేయాల్సిన మాయలు పెట్టారు.  అవాంతరాలు పెట్టారు.  అసలు ఆది పరాశక్తి,  స్పటిక శివలింగానికి… స్పటిక రుద్ర శివలింగానికి తేడా తెలియనంతటి జ్ఞాన శక్తిని జనాలకి ఇచ్చేసింది.  ఆ రెండు చూడాలంటే తేడా పెద్దగా ఎవరికి తెలియదు.  అలాగే ఆదిపరాశక్తి ఏం చేసింది ……,?లలితగా తానే ఉంది…. రాజరాజేశ్వరిగా తానే ఉంది…. చూడటానికి ఒకే రూపాలతో ఉంటారు… కానీ కూర్చునే భంగిమలు తేడా ఉంటాయని, ఆమె పూజించే భక్తులకు కూడా తెలియదు. ఆమె దర్శనం దైవసాక్షాత్కారం పొందిన యోగ భక్తులకి కూడా తెలియదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు నేను మోక్షం పొందాలనుకున్నాను… మోక్షం పొందనివ్వ కుండా ఆపేది మీరే!  అలాగే స్త్రీ మూర్తిగా శివ నందిని మోక్షం పొందాలని అనుకుంటుంది.  తనంతట తాను చావాలని అనుకున్నప్పుడు తనకి చావును ఇవ్వలేదు… మోక్షమును ఇవ్వలేదు. చావటానికి ఆటంకాలు ,అవాంతరాలు ఇస్తున్నారు. ఇక్కడ చావాలనుకున్న వారికి బంధాలు, బంధనాలు,  అన్ని పెట్టి ఆపుతుంది ఎవరు? మీరా? నేనా ? ఇప్పుడు మీరు ఆడుతున్నారు… నాటకంలో మీకు ఈతి బాధల్లో ఆనందం,  సంతోషం ఉండి ఉండవచ్చు.   ఒకరి కష్టాలు, సుఖాలు మీకు సంతృప్తి కలిగించి ఉండవచ్చు.  ఇక్కడ మీరు కష్టాలు పడట్లేదు… మేము కష్టాలు పడుతున్నాం. మేము ఈతి బాధలు పడుతున్నాం. మేం మానసిక, శారీరక సమస్యలతో మేము ఉన్నాము …మేము అనారోగ్య సమస్యలతో ఉన్నాము…మా భౌతిక శరీరాలు ఈతి బాధలు,కష్టాలు పడుతున్నాయి.  వాటిలో మీరు మా కపాలంలో ఉండి ఆనందం పొందుతున్నారు.  కేవలం మీరు ఆనందమే పొందుతున్నారు.  మీరు ఆడించే నాటకంలో మీకు పాత్రలు కావలసినట్టుగా మీరు చేస్తున్నారు.  ఎవరెవరినో కలుపుతారు…. ఎవరెవరినో విడదీస్తారు…. కలిపేటప్పుడు ప్రేమ అంటారు…. విడదీసేటప్పుడు విరహవేదన అంటారు… ఈ రెండు ఈతి బాధల మధ్య ప్రేమ కలిగినప్పుడు…ప్రేమ వల్ల కలిగే ఆనంద లక్షణాలు…. విరహవేదన కలిగినప్పుడు వచ్చే విషాదక్షణాలు…. మేము అనుభవిస్తున్నాం.  అనుభవాలు, అనుభూతులు మేము అనుభవిస్తున్నాం.  వాటిని మీరు చూసి ఆనంద పడుతున్నారు. మేము బాధపడుతుంటే, మేము కష్టాలు పడుతుంటే, మీరు ఆనంద పడుతున్నారు. మేము ఆనందంగా ఉంటే…మీకు ఈర్ష్యా, ద్వేషాలు కలిగి మీరు బాధ పెడుతున్నారు.  ఎవరడిగారయ్యా ! బంధాలు, బాధ్యతలు….ఎవరైనా సంసారం కావాలని…. కామా కోరికలు కావాలని…. తీర్చమని… ఆర్థిక సమస్యలు తీర్చమని….!  మేము 10 లక్షలు సంపాదించి ఆనందంగా ఉంటే ,మీరు చూడలేరు.  మేము 10 మందిలో కలిసి ఆనందంగా ఉంటే మీరు చూడలేరు.  మీకు నచ్చదు. ఆ పది మందిని విడదీసే దాకా నిద్రపోరు .పోనీ విడదీసి ఉంచుతున్నారు అంటే… మళ్ళీ ఇంకో పది మందిని కలుపుతున్నారు.  విడదీసేది మీరే…. కలిపేది మీరే…. చూసేది,  ఆనందించేది మీరే…. మేము ఆనందంగా ఉంటే, మీరు మాత్రం చూడలేరు. కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేరు….ఈర్ష,  ద్వేషాలతో వీడు సుఖపడిపోతున్నాడు….. వీడు నన్ను పట్టించుకోవట్లేదు…. వీడు నాకు నైవేద్యాలు పెట్టట్లేదు…. నాకు కావలసిన పూజలు చేయట్లేదు….. నాకు నచ్చినట్లుగా చేయట్లేదు….. అని చెప్పేసి నాటకాన్ని, మీకు ఇష్టం వచ్చినట్లుగా… మీకు కావలసినట్లుగా మారుస్తారు. ఎవరు సృష్టించారు జీవనాటకం.?  ఎవరు మమ్మల్ని పాత్రలుగా చేయమన్నారు…. అదేమంటే , నాలో ఉన్నది శివుడే ….నీలో ఉన్నది శివుడే అంటారు. నాలో ఉన్న శివుడు ఎందుకు కష్టపడుతున్నాడు…. నీలో ఉన్న ఎందుకు సంతోషపడుతున్నాడు.  నాలో ఉన్న శివుడి కష్టాన్ని చూసి, నీలో ఉన్న శివుడు ఎందుకు ఆనందపడుతున్నాడు?  ఇదే నాకు నచ్చట్లేదు.  నీలో ఉన్న శివుడిని కూడా కష్టపడమని చెప్పు అనేసరికి ….


దానికి కృష్ణ స్వామి….నేను కష్టపడకుండానే వచ్చానా?  నేను మానవమాత్రుడిగా ఉండి కురుక్షేత్ర యుద్ధం దాకా తీసుకువచ్చాను కదా!  అంటే…. అది ఒక జన్మ,  ఒక మానవ జన్మ, కానీ మేము పునః జన్మతో కొన్ని కోట్ల కోట్ల జన్మలు చేసిన పనులే చేస్తున్నాము…. చేసిన ఆనందాలే పొందుతున్నాము… చేసిన ఈతి బాధలే పొందుతున్నాము… కష్టాలే పొందుతున్నాము…. నూటికి 98 శాతం మేము మా జీవితాలు అన్నీ కూడా …మీ జగన్నాటకంలో కష్టాలే రాశారు.  రెండు శాతం మాత్రమే ఆనందాలు రాశారు.  ఆ ఆనందాలు కూడా….మమ్మల్ని పొందనివ్వకుండా,  మా చేతుల్లో లేకుండా… మా చావు మమ్మల్ని చావనివ్వకుండా…. మాకు కావలసినట్టు బతకనివ్వకుండా…. విధిరాత రూపంలో పెట్టి.. మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు.  మీకు కావాల్సినట్టు చేసుకుంటున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు..? ఆదిపరాశక్తి చేస్తుంది.  ఆదిపరాశక్తి అంశ అయిన  నువ్వు చేస్తున్నావు ….మీ ఇద్దరూ లేని విశ్వాన్ని ఉన్నట్లుగా… భ్రమ, బ్రాంతి కలిగిస్తూ లేని పాత్రలు సత్యము,  నిజం అని ఎలాగైతే చూపిస్తున్నారో…. ఏ విధంగా నడిపిస్తున్నారో ….ఏ విధంగా నాశనం చేస్తున్నారో… ఏ విధంగా తాత్కాలిక మరణాలు ఇచ్చి మరలా పునః సృష్టి చేస్తున్నారో….అవన్నీ కూడా నేను శివనందిని అలాగే చేస్తాము.. మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తాము.  ఉన్నది ఉన్నట్లుగా సత్యంగా లోకానికి చెప్పే ప్రయత్నం నేను చేశాను.  పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు.  ఆదిపరాశక్తి మోక్షం పొందలేదు అని…. నేను నా ధ్యాన అనుభవాలలో కష్టనష్టాలు పడి… మాయలు, మర్మాలు దాటుకొని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా స్త్రీ ప్రకృతిలో కూడా శివ నందిని తెలుసుకుంటుంది.  తెలుసుకొనేటట్టు చేస్తాను.  అప్పుడు ఆవిడకి కలిగిన అనుభవాలు ఏమిటో… ఆవిడ లోకానికి తెలియజేస్తుంది. తద్వారా విశ్వంలో ఏముంది…. ప్రకృతిలో ఏం జరుగుతుందో… ఏమిటో… లోకవాసులకి తెలియాలి. ప్రకృతిలో జీవరాశులకు తెలియాలి!  మానవుడికి తెలియాలి. జ్ఞానము పొందాలి. ఇదే మూల జ్ఞానం అని అందరికీ తెలియనియకుండా,  మూలంలో ఏం జరిగిందో కొంతమంది చేతుల్లోనే ఉంచి… వాళ్ళని బయటపడనివ్వకుండా…. బయటకు రానివ్వకుండా….  వాక్ బంధనం చేసి చెప్పనివ్వకుండా….మీలాంటి వాళ్లు ఎంతోమందిని చేశారు. నువ్వు ఒక్కడివే ఇందులో దోషి అని నేను అనను.  నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లంతా కూడా ఆది పరాశక్తికి అనుగుణంగా నడిచే వాళ్లే.  మీలాంటి వాళ్ళు ఒక 18 మంది ఉంటారని నాకు తెలుసు.  ఆ 18 మంది 18 రకాల మాయలు, మర్మాలు పెడతారని తెలుసు. మమ్మల్ని మీరు చంపరు.  కానీ చంపేంత పని చేస్తారు.  మాయలు పెడతారు… ఆశలు పెడతారు… భయపెడతారు. బాధపడతారు… వాటిని మేము భరిస్తూ, ఏడుస్తూ మౌనంగా వస్తామా… లేదా ఏదైనా  బంధనాలలో ఇరుక్కుంటామా… అని అనుకుంటాము. ఈ జన్మ బంధనాలే కాకుండా గత జన్మ,   జన్మాంతర బంధనాలను కూడా జ్ఞాన  స్పురణలు ఇస్తారు. వాళ్ళని తీసుకువస్తారు… పరిచయాలు చేస్తారు… మళ్ళీ వాటి బంధనాల్లో పడేస్తారు… అంతెందుకు సాధనంతా పరిసమాప్తి అయిపోయింది.  ఆకాశ శరీరానికి మోక్షం ఇవ్వకుండా ఆదిపరాశక్తి నా కంఠంలో ఉన్న స్పటిక లింగాన్ని పీకేసింది.  ఇప్పుడు అదేంటి అంటే… ఆకాశ శరీరానికి మోక్షం రావాలంటే, నీకు గత జన్మలో ధర్మపత్ని ఋణం ఉందని చెప్పింది ఎవరు?  ఆ ఋణాన్ని మిగిల్చింది ఎవరు?  ఆదిపరాశక్తి కదా!  ఆ ధర్మపత్ని ఈ శివ నందిని రూపంలో వచ్చింది. ఒకవేళ ఈమె కామ మాయలో పడి పునః జన్మకి వెళతానేమో అని ఆశపడింది .ఆశపెట్టించింది. ఆశ కలిగించింది ఎవరు? నేను ఆశపడలేదు… ఆ అమ్మాయి కూడా ఆశపడలేదు ….దానితో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఎలా మా ఇద్దరి సాధన ఆపాలి అని…. అడ్డంకులు  కలిగించాలని అని ….అవాంతరాలు కలిగించాలి అని…. మీ ఇద్దరూ కూడా కూడబలుక్కుని వచ్చారని నాకు తెలుసు.  ఇప్పుడు నువ్వు బయటికి వచ్చావు… ఇంకో ఆవిడ ఉంది.  యోగాంబిక..  ఆవిడ హిమాలయ యోగిని . ఆవిడ అమ్మవారి అంశ  అని అనుకుంటుంది.  భవానీ దీక్షతో ఉంటుంది.  త్రిశూలంతో… ఎర్రని వస్త్రాలతో ఉంటుంది.  తులసిమాలతో ఉంది.  ధ్యాననిష్ట లో ఉంది.  ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం అంత మీరంతా విన్నారని… వింటారని తెలుసు. అయినా కూడా నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమీ తెలియనట్లుగా… ఏమీ పట్టించుకోనట్టుగా… ఎందుకంటే నేను రహస్యంగా పోరాడను.  దొంగ చాటుగా దెబ్బతీయను. ఏదైనా ముఖాముఖిగా పోరాడాలని నిశ్చయించుకున్నాను.  అదేవిధంగా పోరాడతాను… ఇప్పుడు తాడోపేడో తేల్చుకుందాం!  ఇప్పుడు స్త్రీ ప్రకృతిలో శివనందిని అయిన  శివానికే సహాయ సహకారాలు అందిస్తాను.  అలాగే నువ్వు యోగాంబికకి సహాయ సహకారాలు అందిస్తూ…. మా సాధనకి మాయలు, మర్మాలు అవాంతరాలు, అడ్డంకులు కలిగిస్తావని నాకు తెలుసు.  దానిని ఎలా దాటుకోవాలో… ఎలా దాటించాలో నేను దాటిస్తాను. 


శివాని చేత నేను దాటిస్తాను.  ఇకనుంచి శివ నందిని కాస్త శివానిగా మార్పు చెందుతుంది.  ఎప్పుడైతే నువ్వు మా సాధనలో అడుగు పెట్టావో…. మా సాధనకి ఆటంకాలు కలిగించాలని మీ ఇద్దరు ప్రయత్నాలు చేశారో ….మీ ఇద్దరికీ వ్యతిరేకంగా మేమిద్దరము కలిసి నేను అలాగే శివాని కలిసి సాధన  పరిసమాప్తి చేసుకుంటాము.  ఎవరి ప్రయత్నాలు వాళ్ళం చేద్దాము.  ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళం ఉందాం.  ఎవరు జయం  పొందుతారో …ఎవరు అపజయం పొందుతారో ….కాల నిర్ణయానికి వదిలేద్దాం అనేసరికి… కృష్ణస్వామి పెద్దగా పగలబడి నవ్వాడు . సరే!  నువ్వు చెప్పింది అక్షరసత్వమే.  నేను కాదనను…లోపల ఆదిపరాశక్తి అంశ అయిన యోగాంబిక ఉంది.  నేను ఆరాధన చేసిన ఆది దేవత ఆవిడే.  నేను కాదనను.  తంత్రంలోనూ రాధాదేవిగా ఆవిడని ఆరాధన చేశాను. దక్షిణాచారంలో అమ్మగా జగజ్జననిగా… ఆరాధన చేశాను. మీకు తెలియందేమీ కాదు… జగద్ధాత్రి అనుకో!  ఇక యోగాంబిక మరియు నేను… ఇక నీ పరంగా, శివాని పరంగా మాయలు పెడతాము. మీరు ఎంతవరకు మాయలు దాటుకొని వస్తారో …ఆటంకాలు దాటుకుని వస్తారో …ఆశపడకుండా ,భయపడకుండా ఎంతకాలం ఉంటారో చూస్తాను.  మీకు మోక్షం మరణం పొందనివ్వకుండా భౌతిక మరణం పొందనివ్వకుండా చావంటే ఏంటో ప్రత్యక్షంగా మేమిద్దరం చూపించాలని నిశ్చయించుకున్నాము… అనేసరికి యోగాంబిక రుద్రాక్ష మఠంలో నుంచి వీళ్ళ ముందుకు వచ్చింది. 


శివ స్వామి వంక చూస్తూ… ఏమిరా బడవ!  పురుష ప్రకృతిని జయించావు.  సాధించావు.  స్త్రీ ప్రకృతిని జయించడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు.  ఇప్పుడు నువ్వు సాధనలో లేవు.  ఏమీ తెలియని అజ్ఞాని,  భయభ్రాంతులకు ,భావోద్వేగాలకు బలి అయ్యే బలి పశువు అయిన  శివనందిని చేత ….ఒక ఆడపిల్ల చేత… ఒక అబల చేత… సాధన చేపించాలని అనుకుంటున్నావు.  ఇదివరకు మీ పురుష ప్రకృతిలో నీ సాధన అనుభవాలు… నీకు నీవు మాయలు దాటుకుంటూ వచ్చావు. ఇక్కడ ఈ పిల్లకి ఏది మాయో …ఏది జ్ఞానమో …ఏది అజ్ఞానమో తెలీదు. ప్రతీది కూడా ఈ అమ్మాయికి అనుమాన భయాలు ఉంటాయి. ఆడపిల్లల సాధన వేరు ,మగవాళ్ళ సాధన వేరు. మగవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి.  ఆడపిల్లకి బాధ్యతతో పాటు బంధనాలు కూడా ఉంటాయి.  ఆ బంధనాల మాయలో ఆదిపరాశక్తి మోహమాయలో పడి మోక్షమును పొందలేదనే విషయం నీకు తెలుసు.  నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు.  కాబట్టి ఆడవాళ్ళకి ఉండే మోహమాయలు మగవారికి ఉండవు.  ఈ చిన్న విషయం ఎలా మరిచిపోయావో నాకు తెలియదు. పురుష ప్రకృతిలో పురుష మోక్షం పొందినట్టుగా…. ఆది రుద్రుడు మోక్షం పొందినట్టుగా ధ్యాన అనుభవం పొందావు.  అదేవిధంగా స్త్రీ ప్రకృతిలో అలా జరగదు. జరగనివ్వను… ఎందుకంటే నీకు ప్రతిదీ కూడా శివ నందిని ద్వారా  అనుభవ జ్ఞానం రావాలి… ఆవిడ సాధన చేస్తేనే ఆవిడ పొందిన అనుభవ జ్ఞానం …ధ్యానం అనుభవాలు… నువ్వు జ్ఞాన స్ఫురణగా పొందగలవు.  లోకానికి చెప్పగలవు.  ఆమెను ఈ క్షణాన కూడా నేను చంపేయగలను… అనేసరికి , శివ స్వామి కాస్త సరే చంపాలనుకుంటే చంపమ్మ !  ఏదో చేయాలి …ఏదో సాధించాలనే కోరికతో,  స్వార్థంతోను, ఏవో సిద్దులు పొందాలనో ….ఆ అమ్మాయి సాధన చేయడం లేదు.  చంపాలనుకుంటే ఈ క్షణానైనా చంపు. చచ్చే యోగం ఉంటే ఆ అమ్మాయి  కాశీ క్షేత్రంలోనే చచ్చేది.  ఆ విషయం మీకు తెలుసు.  నువ్వు ప్రయత్నం చేయగలవే కానీ చంపలేవు.  ఎందుకంటే కాశీ విశాలాక్షి చంపాలని ప్రయత్నం చేసింది…. ఏమీ చేయలేక పోయింది.  అలాగే ఈ క్షేత్రంలో ఉన్న బాలాదేవి కూడా చంపాలని ప్రయత్నం చేసింది…. ఏమీ చేయలేకపోయింది ….ఇప్పుడు నువ్వేదో కొత్తగా హిమాలయాలనుంచి వచ్చిన అంబికా దేవి అయినంత మాత్రాన…. నువ్వు చంపాలనుకున్న చంపలేవు.  ఎందుకంటే ఆమె పూర్ణయుష్కురాలు..ఆ విషయం మీకు తెలుసు. ఆమె సాధన పరిసమాప్తి చేస్తుందని తెలిసినా కూడా మీరు వచ్చారు. 


దానిని ఆపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు.  ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  నేనేమో నా విశ్వ ప్రయత్నంలో విశ్వానికి మోక్షం ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే విధంగా మీరు మీ విశ్వప్రయత్నంలో విశ్వానికి అమోక్షం ఇవ్వాలని అనుకుంటున్నారు.  నేనేమో విశ్వం అశాశ్వతం విశ్వం లేదు అని చెప్పాలనుకుంటున్నాను.  ఇక్కడ మేమిద్దరం కలిసి మోక్ష సాధన చేస్తాము.  మీ ఇద్దరు కలిసి అమోక్ష సాధన చేస్తారు.  ఎవరు గెలుస్తారో ….ఎవరు ఓడిపోతారో…. కాల నిర్ణయానికి వదిలేద్దాం. తాడోపేడో విషయం తేల్చేసుకుందాం. విషయం ఇక్కడిదాకా వచ్చింది కాబట్టి…. మన మధ్య మోక్ష యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు… ఎవరు ఓడిపోతారు… ఆ శూన్య బ్రహ్మకి వదిలేద్దాం… గెలవాలని మా ఇద్దరికీ లేదు.  ఓడిపోవాలని లేదు . అలాగే మీకు ఓడిపోవాలని లేదు.  గెలవాలని మీకు తపన ,తాపత్రయం ఉంది.  కోరికలు ఉన్నాయి.  స్వార్థం ఉంది.  మా దాంట్లో స్వార్థం లేదు.  నిస్వార్థం ఉంది. ఎవరు గెలుస్తారో ఇది నిజం గా మీకే ఒక సూచన వచ్చేసి ఉంటుంది .కాబట్టి మాకు ఇప్పుడు ఈ క్షణాన చావు వచ్చినా కూడా వ్యక్తిగత మోక్షమే పొందుతాము.   విశ్వ మోక్షం మేము ప్రయత్నం చేస్తున్నాం.  కర్మ కాలి అది వ్యక్తిగత మోక్షానికి అవ్వచ్చు . అందులో ఏం లేదు… మా దారిన మేము వెళ్ళిపోతాం.  మేము శూన్యం అవుతాము …విశ్వ జగన్నాటకంలో మా పాత్రలు అంతరించిపోతాయి.  శూన్యం అయిపోతాయి.  ఇక మాలాంటి వాళ్లు పుడతారో, లేదో అని ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరీ యే నిర్ణయం చేయాలి. కాబట్టి మేము వాటి గురించి ఆశించట్లేదు.  ఈశ్వర ఆజ్ఞ అని అనుకుంటున్నాము.  ఆయన ఆజ్ఞ లేనిదే… చీమైనా కుట్టదు కాబట్టి… నా భోగ జీవితం నాశనం అయ్యి, యోగ జీవితంలో ఉన్నత స్థితికి తీసుకువచ్చారు . అదేవిధంగా శివాని యొక్క భోగ జీవితం నాశనం అయ్యింది …ఆమె యోగ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. నా సహాయ సహకారాలు అందిస్తాను.  ఇక్కడ ఏకంగా మోక్ష సాధన కుటుంబమే ఆమెకు రక్షణగా ఉంది అని తెలుసుకోండి . 


ఒరేయ్!మూర్ఖులు రా వీళ్ళు….. వీళ్ళు మన మాట వినరు. వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేసుకుంటారు. మనం చేయాల్సింది మనం చేసుకుందాం… ఈ మెట్ట వేదాంతం మనకెందుకు?  చూద్దాం!  వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఎంతవరకు వస్తాయో చూద్దాం…. మన అవకాశాలు వదులుకోవద్దు….మన అవకాశాలతో వాళ్ళకి ఆటంకాలు, మాయలు, మర్మాలు, అన్ని కలిగిద్దాం. చావు భయం అంటే ఏంటో చూపిద్దాం. మృత్యువు దాకా తీసుకువెళదాం. మృత్యువు మన చేతిలో ఉండకపోవచ్చు… మృత్యు భయం మన చేతుల్లో ఉంటుంది కదా!  భావాలు  కలిగిన పిల్ల.  ఈవిడ సాధన పరిసమాప్తి చేస్తుందని నాకు ఎక్కడా అనిపించట్లేదు.  నేనైతే అనుకోవట్లేదు అనేసరికి… సరే అని కృష్ణస్వామి, యోగాంబిక పాతాళ  గంగాలో స్నానం చేయడానికి అని వెళ్ళిపోయారు.  ఇదంతా చూసిన వీళ్ళ ముగ్గురు ఆలోచనలో పడ్డారు.  అప్పుడు శివ స్వామి మీరేం భయపడవద్దు… వాళ్లు భయపెట్టే వాళ్లే కానీ… చంపే వాళ్ళు కాదు.  చంపాలని అనుకునే వాళ్ళు. చావు దాకా తీసుకువెళతారు.  దాని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాధనకి ఆటంకాలు ,అవాంతరాలు కలిగిస్తారు. 


 కాబట్టి శివాని!  ఇష్టకామేశ్వరి ఈ క్షేత్రంలో ఉంది . ఆవిడ చేతిలో ఇష్ట లింగం ఉంటుంది.  ఆ అమ్మవారి అనుగ్రహం పొంది ఆ ఇష్ట లింగాన్ని నువ్వు పొందినట్లయితే…. దాన్ని మెడలో వేసుకుని సాధన ఆరంభిస్తే…. ఆ ఇష్టలింగేశ్వరుడే అన్ని చూసుకుంటాడు.  మాయల్ని అదుపు చేయగలిగేది ఆ ఇష్ట లింగేశ్వరుడే . ఆ ఇష్ట లింగమే. మొదట ఇష్టకామేశ్వరి అనుగ్రహం పొంది….ఆవిడ దగ్గరకు వెళ్లి, నీ బాధ అంతా చెప్పుకో!  ఆవిడ దగ్గర ధ్యానం చేసుకో!  ఆవిడ అనుగ్రహించింది అనుకో…. మన సాధన సగానికి సగం పూర్తి అయినట్లే… అని చెప్పేసరికి సరే శివ స్వామి!  మీరు ఏమి చెప్తే అది చేస్తాను.  మాకు సెలవిప్పించండి …మేము వెళ్తాము… రాత్రి ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్లి సాధన చేసుకొని… ఆవిడ అనుగ్రహం పొందితే ఉదయం వస్తాను.  ఉదయం ఆవిడ అనుగ్రహం పొందలేదు అంటే… కృష్ణ నదిలో నా శరీరమును నిమజ్జనం చేసుకుంటాను.  ఇదే నా శపథం అనేసరికి ఇలాగే ఉండాలి. చావు గురించి భయపడకు… మరణం గురించి ఆలోచించకు… మనం సాధన పరిసమాప్తి చేసుకోవాలి…. దానికోసమే మనం వచ్చామని గ్రహించు… అనేసరికి సరే స్వామి ! మాకు సెలవిస్తే మేము వెళ్తాము ….అనేసరికి సరే అని శివ స్వామి అక్కడి నుంచి అంతర్దానం అయ్యారు.  వీళ్ళ ముగ్గురు కూడా మౌనంగా సత్రం ఉన్న గదికి వచ్చారు.


ఇలా ఈ సాధన కుటుంబం అంతా సత్రానికి వెళ్లే దారిలో ఉంటుండగా…..మహాదేవి ఉన్నట్టుండి శివ నందినితో….


మహాదేవి:- అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనం దైవలతో ఆడుకుంటున్నామో …..దైవాలు మనతో ఆడుకుంటున్నారో …అర్థం కావట్లేదు. 


శివనందిని:- ఏం లేదమ్మా! ఇక్కడ దైవాలతో సమస్య లేదు.  కాకపోతే ఏంటంటే…. ఇక్కడ ఉన్న ప్రకృతిలో పురుషుడు గాని స్త్రీ గాని మోక్షం పొందాలని సాధన చేస్తూ ఉంటే…. వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మోక్షం పొందనివ్వకుండా ఆపాలని చూస్తున్నారు.  అంటే ఏంటంటే పురుషుడు మోక్షం పొందాలి అనుకుంటే స్త్రీ ఆపుతుంది.  స్త్రీ మోక్షం పొందాలి అనుకుంటే పురుషుడు మోక్షం పొందనివ్వకుండా ఆపుతున్నాడు.  ఎవరి సంసారసుఖాలు వాళ్ళవి. ఇప్పుడు పురుషుడు మోక్షం పొందితే, సంసార బాధ్యతలన్నీ తన మీద పడతాయని స్త్రీ ఆపివేస్తుంది.  అదే స్త్రీ మోక్షం పొందితే తనకి సంసారసుఖం లేకుండా పోతుందని పురుషుడు స్త్రీని ఆపేస్తున్నాడు.  ఇలా ఎవరి చావు వాళ్ళు చావనివ్వకుండా…. ఎవరి మోక్షం వాళ్ళని పొందనివ్వకుండా…. మనల్ని ఆపుతున్నారు. ఈ ఆపడాలు వీటన్నింటికి శివ స్వామి ఏం చేస్తున్నాడంటే….. ఎవరి మోక్షం వాళ్ళు పొందేటట్లుగా ఎవరి చావు వాళ్ళు చచ్చేటట్లుగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటిదాకా మోక్షం పొందే వాళ్ళని మోక్షం పొందనివ్వకుండా ఆపేవాళ్ళందరినీ కూడా ఈ కృష్ణస్వామి, యోగాంబికకి చెందిన వాళ్ళన్నమాట!  మోక్షం పొందాలనుకున్న వాళ్లంతా కూడా శివ స్వామి అంశలు అన్నమాట!  ఆయనకి చెందిన వ్యక్తులన్నమాట…. ఇక్కడ ఏంటంటే నేను చావాలనుకున్నప్పుడు నన్ను చావనివ్వండి… నువ్వు బతకాలనుకుంటే నువ్వు బతుకు అనే సిద్ధాంతంలో శివ స్వామి ఉన్నాడు.  అంతేకానీ నన్ను చావనివ్వకుండా…. నాకు ఇష్టం లేని బతుకులు ఎందుకు బతికిస్తున్నారు అని శివ స్వామి వాదన.  ఇక్కడ కృష్ణస్వామి వాదన ప్రకారం ఏంటంటే నువ్వు చావాలనుకుంటే చావు…. నువ్వు చచ్చిపోతే నేను బతకలేను కదా!  నువ్వు ఉండాలి కదా!  నాతో పాటు ఉండి నేను చచ్చిన తర్వాత నువ్వు చావు అంటాడు.  అది శివ స్వామికి నచ్చదు. ఎవరి చావు వారిది ….ఎవరి మోక్షం వారిది…. ఎవరి అవసరాలు వాళ్లవి…. ఎవరు చావాలనుకున్నప్పుడు వాళ్ళు చావాలి అనేది వీళ్ళిద్దరి వాద ప్రతి వాదనలు.  ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్లకి ఉంటాయి.  ఎవరికి ఉండాల్సిన విధివిధానాలు వాళ్ళకి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పూర్ణజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు.  ఆ పూర్ణ జ్జ్ఞానం ఏంటి అనేది శివ స్వామీ లాంటి వాళ్లు అనుభవ పాండిత్యంలో తెలుసుకొని …..పురుషుడు లేడు, ఆది రుద్రుడు లేడు, ఆయన మోక్షం పొందాడు… ఆయన మోక్ష విధి విధానం ఏ విధంగా పొందాడు అనేది, మనకి కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరూ సాహసించలేకపోయారు.  చెప్పాలనుకున్న వాళ్ళని కూడా ఈ కృష్ణస్వామి ,యోగాంబికా లాంటి వాళ్ళని చెప్పనివ్వకుండా వాక్ బంధనం చేశారు.


ఇప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళు… మోక్షం పొందాలనుకున్నప్పుడు…. వాళ్ళకి మణుల  మాయగా చింతామణి మాయ పెట్టేసి… కోరికలే కష్టాలకి మూలం అని తెలుసుకున్న ఆయనకే….కోరిక లేని సమాజాన్ని చూడాలనే కోరిక కలిగించారు….  అంటే ఎంతటి మాయ బంధనంలో పడేశారు.  ఈ కృష్ణస్వామి, యోగాంబికా లాంటి వాళ్ళు ఆలోచించుకో!  మాయా అంటే అలాంటిది.  అన్నీ తెలిసినా కూడా మనం మర్చిపోయే పరిస్థితికి వస్తాము.  దాన్ని అపస్మారక స్థితి అని అంటారు.  తెలిసిన జ్ఞానం మరిచిపోయే స్థితిని పొందడం జరుగుతుంది. ఈ విధంగా కుమారస్వామి చేయడంలో సిద్ధహస్తులు అంటారు.. ఆయన  తన విభూతి ధారలను సహస్ర చక్రం మీదకి సహస్ర చక్రం సాధన చేసే సాధకులపై….ధారగా పోయడం వలన తను తెలుసుకున్న జ్ఞానం అంతా మరిచిపోయే పరిస్థితికి వస్తారని… మనకి అరుణాచల స్థల పురాణంలో కనపడుతుంది.  అది కూడా ఒక రకమైన మాయ.  ఆ మాయను కూడా దాటగలిగే స్థితి వస్తుంది.  ఒక విధంగా చెప్పాలంటే కృష్ణస్వామి,   యోగాంబిక వీళ్లంతా కూడా మనం మోక్షం పొందటానికి అర్హత, యోగ్యత, యోగం ఉందా లేదా అనేది పరీక్షలు పెడతారు.  ఆ పరీక్షల్లో మనం జయం పొందితే ఎవరూ ఏమీ మాట్లాడరు. మనకి లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇస్తారు. ఎవరు పడితే వారు మోక్షం పొందితే కుదరదు కదా! ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే డిగ్రీ చదివిన ప్రతివాడు ఐఏఎస్ ఆఫీసర్అయిపోతే కుదరదు కదా! దానికి అర్హత, యోగ్యత, యోగం ఉందా లేదా?  అని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని మూడు పరీక్షలు ఎలా ఉంటాయో ఆ విధంగా మనకి అర్హత, యోగ్యత ,యోగం ఉందా లేదా అని ఈ కృష్ణస్వామి, యోగాంబిక లాంటివాళ్ళు పెడతారు.  శివ స్వామి వాళ్ళు ఏమంటారు అంటే….నేను ఐఏఎస్ చదవాలి అనుకోవట్లేదు. సాధారణ వ్యక్తిగా ఉండి కూడా నా చావే మోక్షమరణం పొందాలనుకుంటున్నాను. ఐఏఎస్ గా అయ్యాకే నువ్వు చావాలి.  అదే మోక్షం అవుతుంది అని చెప్పడం ఏంటి? సాధారణ వ్యక్తి ఎందుకు చావకూడదు…. చావే మోక్షం ఎందుకు అవ్వకూడదు…. అతని మరణమే మోక్షమరణం  ఎందుకు కాకూడదు…. ఐఏఎస్ కి, సాధారణ వ్యక్తికి తేడా ఏంటి? ఏమీ లేదు కదా!  కేవలం గుర్తింపు ,పేరు ప్రఖ్యాతలు తప్పితే ఏమీ లేదు.  సాధారణమైన వ్యక్తి తనకి ఇష్టమైన రంగంలో ఉన్నత స్థితికి పొందుతారు.  అదే విధంగా ఐఏఎస్ చదివిన వ్యక్తి ఒక రకంగా…. ఒక రంగంలో గుర్తింపు పొందుతాడు.  ఇప్పుడు రైతు గొప్పవాడే …ఐఏఎస్ ఆఫీసర్ గొప్పవాడే . ఎవరి రంగానికి వాళ్ళు గొప్పవాళ్ళే.  కాకపోతే రైతుని ఒక విధంగాను, ఐఏఎస్ ఆఫీసర్ ని ఇంకొక విధంగా చూడాలనేది… ఈ అర్హత, యోగ్యత, యోగం పరీక్షలు పెట్టడం అనేది నిషిద్ధమని చెప్పేసి అంటారు. ఇక్కడ భౌతిక మరణమే మోక్ష మరణం అవ్వాలి. ఇప్పుడు స్థూల శరీరం మరణం పొందాలంటే సుమారుగా 11 దేహాలు మరణం పొందితే గాని…. అది మోక్షమరణం అవ్వట్లేదు.  ఇవన్నీ ఎందుకు చేశారు,... అనేది శివ స్వామి ప్రశ్న . ప్రతి లోకంలోనూ ప్రతి జీవుడు ఏదో ఒక శరీరంతో ఉంటాడు.  ఆ జీవుడి యొక్క మరణమే శాశ్వతమైన మోక్షమరణం చేయవచ్చు కదా!  శూన్యంలో కలిపేయొచ్చు కదా! అది కూడా జీవుడికి ఇష్టం అయ్యి వాడు చనిపోవాలి అనుకున్నప్పుడు….మోక్షంపొందాలనుకున్నప్పుడు….. మోక్షమును ఇవ్వచ్చు కదా!  అతను కోరికలతో బతకాలి, ఇష్ట కోరికలు ఉన్నాయి…. కోరికలు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు.. వాడికి పునర్జన్మ ఇవ్వండి.  వాడికి కావలసిన కోరిక కర్మ జన్మ ఇవ్వండి.  దానికి ఎలాంటి అభ్యంతరము లేదు.  కానీ చావాలనుకున్న వాడిని మోక్షం పొందాలనుకున్న వాడికి ఆ పరీక్షలు పెట్టడం ఏంటి? ఈ ఆటంకాలు పెట్టడం ఏంటి?  ఒకవేళ వాడు మోక్షం పొందాలనుకున్నప్పుడు…. వాడికి పునః జన్మ ఆశలు ఎందుకు కలిగిస్తారు… ఎందుకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు… వాడిని ఎందుకు వెనక్కి లాగాలని అనుకుంటారు.  చావాలనుకున్న వారిని చావనివ్వరు ఎందుకు? చావడానికి వెళ్తున్న వాడికి బతకడానికి ఎందుకు ఏర్పాటు చేస్తారు,...? ఆశ, ఆటంకాలు, అవాంతరాలు, మాయలు కలిగిస్తారు.  వీటివల్ల ఉపయోగం ఏమిటి?  చచ్చినవాడు ఎటు చచ్చాడు.  మూలపురుషుడు అయిన  ఆదిరుద్రుడు చచ్చాడు.  ఆ చచ్చిన వాడి విషయం పూర్ణజ్ఞానం తెలుసుకున్నారు.  కానీ లోకానికి చెప్పనివ్వకుండా చేశారు.  ఆ చచ్చిన వాడిని బతికే ఉన్నాడని…. లేనివాడిని ఉన్నవాడిగా…. భ్రమ , భ్రాంతి కలిగించి…. ఇన్నాళ్లు నాటకం ఆడారు.  ఇవన్నీ ఎందుకు చేయడం? చావాల్సిన సాధారణ వ్యక్తి, భౌతిక మరణాన్ని వాడికి ఇవ్వచ్చు కదా!  వాడి మోక్షం మరణాన్ని ఎందుకు ఆపాలి అని… శివ స్వామి యొక్క ఆలోచన, సంకల్పం..


మహాదేవి:- ఇందాక ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమై అర్థం కాలేదు.  సరే మళ్ళీ ప్రశ్నలు అడిగితే బాగుండదు…..ఆ వాక్ ప్రవాహం పోతుంది.  ఆయన చెప్పే విధి విధానం ఆగిపోతుందని ఆపేశాను.  ఇప్పుడు అర్థం అవుతుంది.  నిజమే కదా! ఇప్పుడు నేను చావాలనుకున్నప్పుడు… నా చావే మోక్షమరణం చేయొచ్చు కదా! ఇప్పుడు రుద్రస్వామి లాంటి బతకాలి అనుకున్న వాళ్ళకి, పునః జన్మలు ఇవ్వచ్చు కదా!  వాళ్లతో మనల్ని ఎందుకు కలపడం. 


 అంటూ ఉండేసరికి ..


శివనందిని:-  అక్కడ సమస్య అది కాదు….చావాలనుకున్న వాళ్ళు మోక్షమరణం పొందాలనుకుంటే సరిపోతుంది.  బతకాలనుకున్న వాళ్ళు చస్తూ కూడా…. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు… నా జీవితాంతం ఉండాలి.  నా ఏడు జన్మలు నువ్వే నా భార్యగా ఉండాలని అనుకుని చస్తారు.  అప్పుడు మనకి చావు కాస్త మరణం అవుతుంది.  అంటే  మోక్ష మరణం కాకుండా పునః జన్మకి వెళ్లడం జరుగుతుంది.  ఒకవేళ ఫోన్ మన చేతిలో ఉందనుకో… అవుట్ గోయింగ్ తీసేసినా ….నాకు ఇన్కమింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయి కదా!  మనకి ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు.  కానీ అవతలి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు.  అదేవిధంగా అవతలి వాళ్ళ కోసం మోక్షాన్ని ఆపాలని చెప్పేసి…. స్త్రీ ప్రకృతి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి….శివ స్వామి చెప్పడం జరిగింది. అందుకే శివ స్వామికి ఇది నచ్చలేదు.  కృష్ణస్వామి మాత్రం ఇదే సత్యం ,ఇలాగే జరగాలి….నేను నా భార్యా పిల్లలతో ఉండాలనుకుంటున్నాను.  తరతరాలు వాళ్లే ఉండాలి. జన్మ జన్మలు వాళ్లే ఉండాలనుకుంటాను.  వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే…. ఎలాగ? అని అంటాడు.  నువ్వు బతకాలనుకుంటే నీకు కావలసినట్టుగా నువ్వు బతుకు. నువ్వు ఒంటరిగా బతకాలేక పోతే నువ్వు కూడా చావు.  అంతేగాని చావాలనుకున్న వాళ్ళందరిని నీ కోరిక కోసం… నీ అవసరాల కోసం వాళ్లని చావనివ్వకుండా ఎందుకు మోక్షం పొందనివ్వకుండా ఆపుతున్నారు… అని శివ స్వామి అంటారు.  ఒకవైపు శివ స్వామికి మద్దతు చేస్తుంటే…. ఒకవైపు కృష్ణ స్వామికి మద్దతిస్తూ నిలబడిన వాళ్లు ఉన్నారు. ఇక్కడ ఒక శివుడు మోక్షం పొందితే …మరో శివుడు మోక్షం పొందట్లేదు.  పురుషుడులో ఉన్న శివుడు మోక్షం పొందితే ,స్త్రీ మూర్తిలో ఉన్న శివుడు మోక్షం పొందట్లేదు . పురుషుడిలో ఉన్న శివుడు మృత్యువు జయిస్తే, స్త్రీ మూర్తిలో ఉన్న శివుడు మృత్యువుకి భయపడి చావటానికి వెళ్తూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే జరుగుతుంది….అదే విధంగా కదిలే ప్రకృతిలో ఉన్న అమ్మవారు, అయ్యవారు మృత్యు భయానికి  లోనై పునః సృష్టి చేస్తున్నారని నాకు అర్థం అయింది.  కదలని ప్రకృతి ఎటు కదలదు కాబట్టి మోక్షం కావాలనుకుంటే మోక్షం పొందుతారు.  కదిలే ప్రకృతి మోక్షం పొందకుండా ఉండాలనుకుంటుంది.అదే పునః సృష్టి చేయాలని అనుకుంటుంది.  కదిలే ప్రకృతిని మనం ఇప్పుడు కదలని ప్రకృతిగా మార్చి… నిశ్చల స్థితికి తీసుకురాగలిగితే …అదే మోక్షం అవుతుందని చెప్పేసి …ఇందాక శివ స్వామి చెప్పిన మాటలను బట్టి నాకు అర్థం అయింది.


మహాదేవి:- ఏమోనమ్మా!  ఆ వేదాంతం కూడా అర్థమై అర్థం కానట్టు ఉంటుంది . అర్థమైతే వేదాంతం….అర్థం కాకపోతే రాద్ధాంతం …అని నాకు అర్థం అయింది.  సరే ఏం చేస్తాం.  నీకు అర్థమైంది కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు చూసుకో!


అని గది తలుపు తెరిచేసరికి వీళ్లిద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.  కారణం ఏమిటంటేబాల గణపతి, బాల కుమారస్వామి మంచి గాఢ నిద్రలో ఉన్నారు. బాల గణపతి ముఖానికి ఏనుగు ముఖం మాస్క్ ఉంది.  చూస్తే నిజంగానే వాడు బాల   గణపతి లాగా కనిపించాడు.  ఒకవేళ కైలాసం నుంచి గణపతి వచ్చాడని ఒక్క క్షణం అనిపించింది.  ఇద్దరు ఆశ్చర్య ఆనందాలకి లోనయ్యారు.  కాదు అది ఏదో మాస్క్ అని తెలియడానికి కొన్ని క్షణాలు పట్టింది . ఆ మాస్క్ ని చూసి ముచ్చటేసి… మంచి నిద్రలో ఉన్నా కూడా ….ఒళ్ళోకి తీసుకుని వాడికి జోలాడుతూ పడుకోబెట్టింది.  అలాగే కూర్చుని తను నిద్రలోకి జారుకుంది.  ఇదంతా చూస్తున్న మహాదేవి నవ్వుకుంటూ…. ముఖం కడుక్కుందామని గదిలోని బాత్రూంకి వెళ్లడం జరిగింది. 


బాత్రూంలో నుంచి వచ్చిన మహాదేవి వీళ్ళ నలుగురు గాఢ నిద్రలో ఉన్నారని…. తను కూడా విశ్రాంతి తీసుకుందామని…ఒక మంచం చూసుకుని నడుము వాల్చింది . అందరూ లేచేసరికి సాయంత్రం ఐదు గంటలు అయిందని…. గుడి దర్శనం చేసుకుందామని….గుడికి బయలుదేరారు. 


👉 దగ్గరలో ఉన్న మనోహర కుండంలో సప్త మాతృకలను దర్శనం చేసుకున్నారు. 


👉ఆ తరువాత సారంగ ధర మఠం దగ్గరలో ఉన్న మల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడ మల్లమ్మ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. దీనికి ఎదురుగా ఒక నీటి కుంట లో నుంచి ఊరే తీర్థమే బిందు తీర్థం అంటారు. బహుశా ఇదే మల్లమ్మ కన్నీరు అని శివ నందిని అంటే రుద్రస్వామి అవును అన్నట్టుగా తల ఊపాడు. ఈ పక్కనే ఉన్న గిరిజ శంకర మఠానికి వెళ్లారు. ఆ చుట్టుపక్కల ఉన్న మల్లమ్మ గృహం , ఇతర లింగాలను దర్శించారు. ఆ పక్కనే అరుణాచలం మాదిరి మోక్ష మార్గ గుహ లాగా కనిపించేసరికి అందరూ కూడా అందులో నుంచి దూరి బయటకి వచ్చారు. 

మోక్ష మార్గ గుహ మాదిరి ఉన్న ద్వారం 

ఏదైనా కోరిక కోరుకుని ఈ రోకలిని  నించోపెట్టినప్పుడు అది నుంచుంటే వాళ్ళ కోరిక తీరుతుంది అని భక్తుల విశ్వాసం.


హేమా రెడ్డి మల్లమ్మ 


👉ఈ గిరిజ శంకర మఠానికి పక్కనే గోకర్ణ తీర్థం దర్శించుకున్నారు. 

👉 అమ్మవారి ఆలయానికి వెనక పశ్చిమం వైపు ఒక పెద్ద అగాధ తటాకం కనిపించింది. ఇది ఉత్తర దక్షిణములకు వ్యాపించి కనిపించింది. దీన్ని ఏనుగుల చెరువు అని పిలుస్తారని రుద్ర స్వామి చెప్పారు. 


సాక్షి గణపతి:- 

మనకి కాశీ క్షేత్రంలో లాగానే…. శ్రీశైలంలో కూడా సాక్షి గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారు సాక్షి గణపతిని కూడా దర్శించుకుంటారు. ఈ క్షేత్ర దర్శనానికి ఈయన సాక్షిగా ఉంటారని చెబుతారు…. అందుకనే ఇక్కడ గణపతి రాస్తున్న భంగిమలో కనిపిస్తారు….అని చెప్పుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆ పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. శ్రీశైల మహత్యంలోని చంద్రావతికి దొరికిన అసలు శివలింగం ఇదేనని అక్కడ ఉన్న పూజారి చెప్పడంతో ఆ శివలింగానికి నమస్కారం చేసి బయటకు వచ్చారు. 

సాక్షి గణపతి 



కదళీ వనం:- 

ఆ తర్వాత సాధన కుటుంబం కదళీ వనానికి బయలుదేరారు. రుద్రస్వామి ఈ క్షేత్రం గురించి చెపుతూ…. ఒకప్పుడు  ఉమా మహేశ్వరం నుంచి వచ్చే వాళ్ళు మిద్దెల గుడి దాటి చుక్కల పర్వతం మీదుగా …పాతాళ గంగ కు చేరి అటుపైన శ్రీశైలం చేరుకునేవారు.  ఈ చుక్కల పర్వతం పై కూర్చుని మూడు లక్షలు పంచాక్షరి జపిస్తే సాధకునికి కదళీ వనం కనిపిస్తుంది. దత్తాత్రేయ రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారని చెబుతారు. ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్న స్వామివారి చుట్టూ ఒక పుట్ట పెరిగిపోవటం…కాల క్రమంలో చెంచులు ఆ చుట్టుపక్కల ప్రదేశంలో నివాసం ఉండటం…అనుకోకుండా ఈ పుట్టపై గొడ్డలితో కొట్టడం వలన…ఈ పుట్ట నుంచి రక్తం కారడం జరిగిందట…. నరసింహ స్వామి వారు తపస్సు చేసిన గుహ చాలా విశాలంగా వెయ్యి మంది ఒకేసారి కూర్చుని తపస్సు చేసుకునే విధంగా ఉంటుందట. స్వామివారు ఈ క్షేత్రంలోనే ఎంతోకాలం జీవించి చివరికి పాతాళ గంగలో అంతర్ధానమయ్యారని చెబుతారు.  అక్కమహాదేవి గుహకి మరియు ఈ నృసింహ సరస్వతి స్వామి వారి గుహకి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని…అందరూ అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేరని….…దానికి ఎంతో సిద్ధ శక్తి ఉండాలని…. ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైన ప్రదేశం గా చూస్తూ… అది కాక ఆ గుహ ఎక్కడ ఉందో కూడా సాధారణ మానవులు కనుక్కోలేరని…ఒక ఆశ్రమంలో ఉండే సాధువు చెప్పగా నేను విన్నాను అని రుద్ర స్వామి చెపుతూ…. ఇప్పుడు ఈ కదలివనానికి వెళ్లడానికి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలతో మాత్రమే అనుమతి ఇస్తున్నారని సత్రం దగ్గర మాట్లాడుకుంటుంటే విన్నాను…ఈ కదలివనం ప్రాంతంలో పెద్దపెద్ద సర్పాల రూపంలో…. సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు.  ఈ గుహల్లో ఎక్కడో నిగూడంగా సమాధి స్థితిలో ఉంటారు. ఈ ప్రదేశంలో రాత్రిపూట ఉండడం అనేది నిషిద్ధం అని చెప్పాలి. పగటిపూట కూడా మనసు శరీరం పవిత్రంగా ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే రాగలుగుతాము. ఇక్కడ ఉన్న ప్రకృతి ఎంతో పవిత్రమైనది. ఎందరో సిద్దపురుషుల ఆవాస ప్రదేశం. అయినప్పటికీ ఇక్కడ అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రదేశానికి వెళ్లడం అనేది నియమ నిబంధనలతో కూడికున్నటువంటి అంశం. 

కదళీ వనం 



బాల గణపతి రుద్రస్వామితో అయ్యా! ఇక్కడ సిద్ధ రామప్ప కొలను అని కపాల లోయ అని ఉన్నాయట…ముందు మనం వెళ్లి అక్కడ సిద్ధ రామప్ప కొలను చూసి వద్దాము… అసలు  ఆ కపాలలోయ అంటే ఏంటో . ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది అని అడిగేసరికి సరే పిల్లాడు ముచ్చట పడుతున్నాడు అని ముందు ఆ ప్రాంతానికి బయలుదేరారు. 


కపాల లోయ/సిద్ధ రామప్ప కొలను:-

సరే అయితే సిద్ధ రామప్ప  కొలను వెళ్లడానికి మనకి మెట్ల మార్గం కూడా ఉంది. కానీ మనం వేరే మార్గం ద్వారా వెళ్దాము.  అక్కడ పుణ్య తీర్థాలు ఉన్నాయి. అక్కడ ఉన్న తీర్థాలను, శివలింగాలను దర్శనం చేసుకుందామని అడవి మార్గం నుంచి బయలుదేరారు.  ముందుగా వాళ్లకి వజ్రాల గంగమ్మ లేదా వరాల గంగమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక్కడ పక్కన పారే చిన్న నది పాయ సరస్వతీ నదిగా చెబుతారు. దీనిని సరస్వతీ  కుండమని కూడా పిలుస్తారు. ఇది ఏ కాలంలో అయినా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడే మనకి వజ్రవారాహి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈ గుహలో సాధన చేశారని చెబుతారు. 


ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన తర్వాత చక్ర కుండం లేదా అమృత కుండం అని పిలిచే తీర్థం కనిపించింది. 

చక్ర కుండం 


ఇక్కడ ఒక శివలింగం దర్శన ఇచ్చింది.

దీన్ని సిద్దేశ్వర లింగం అంటారని ఇక్కడ ఆనంద భైరవుడ్ని క్షేత్రపాలకుడిగా చెప్తారని రుద్ర స్వామి చెప్పారు. ఈ శివలింగం మల్లికార్జున లింగంతో పోలి ఉండడం చేత దీనిని సిద్దేశ్వర లింగం లేదా గుప్త మల్లికార్జున అని పిలుస్తూ ఉంటారు. కానీ అసలు గుప్త మల్లికార్జునము ఇక్కడ కాకుండా మరొకచోట అడవిలో గుప్తంగా ఉన్నదని కేవలం తొలి ఏకాదశి మాత్రమే ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని…. కాకపోతే ఇక్కడ దగ్గరలోనే సిద్దుల గుట్ట కూడా కనిపిస్తుంది.  బహుశా దానివల్ల దీనిని సిద్దేశ్వర లింగమని ….ఇక్కడ సిద్ధముని తపస్సు చేయడం వల్ల కూడా దీనిని సిద్దేశ్వర లింగం అని కూడా చెప్పి ఉండవచ్చు అని చెబుతూ ఈ కొండ చరియల పై ఉన్న దేవతా ప్రతిమలను చెక్కి ఉన్న వాటిని చూస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్లారు….


ఇంకాస్త ముందుకు వెళ్లిన తర్వాత చంద్ర లింగం దర్శనం జరిగింది. ఈ శివలింగం బంగారు రంగులో మెరుస్తూ కనిపించేసరికి….అందరూ ఆశ్చర్యపోతూ ఈ శివలింగం పై నిత్యం అభిషేకం చేస్తున్నట్టుగా ఈ కొండ చరియల నుంచి జాలువారే నీటి అభిషేకం చూసి ఆనందించి….ఆ శివలింగానికి నమస్కారం చేసుకున్నారు…

చంద్ర లింగం 


ఇలా వస్తూ వస్తూ రుద్ర స్వామి….. పూర్వం ఇక్కడ భృగు పాతం చేసేవారు. ఇక్కడ తాంత్రిక విద్యలో పంచమకారాలు జరిగేవి. స్వామివారిలో ఐక్యం అవడం కోసం లేదా రాజ్య శాంతి.కోసం ఆత్మార్పణ చేయడం ఇక్కడ నుంచి దూకి చనిపోతే స్వామివారిలో ఐక్యమై ముక్తి లభిస్తుందని నమ్మటం ఇలాంటి విధివిధానాలు ఇక్కడ జరిగేవి. కొంతమంది తమ శిరస్సును ఖండించి శ్రీశైలం మల్లన్నకు ఆత్మార్పణం గావించేవారు. వీరి శరీర భాగాలను మల్లన్న స్వామికి అర్పించేవారు. కొంతమంది ఈ లోయలో కొండ అంచుల నుంచి దూకి శరీర త్యాగం చేసేవారు. అలా పైనుంచి దూకినప్పుడు కపాలము పగిలిపోయేది కాబట్టి దీనిని కపాల లోయ అని పిలిచేవారు. సిద్ధ రామప్ప అనే బాలుడు కూడా ఈ కపాలలోయలో దూకాలనుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారు దర్శనమిచ్చి అతనిని అనుగ్రహించారు….. అని చెప్పగా సిద్ధరామప్ప ఎవరు ఈ కొలనుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు అని బాలగణపతి అడిగితే రుద్ర స్వామి చెప్పడం మొదలుపెట్టాడు. 


సిద్ధ రామప్ప:-

పూర్వం 12వ శతాబ్దంలో జరిగిన కథ ఇది. సోమయాజి అనే అతనికి పుత్రుడు ఈ సిద్ధరామప్ప. ఇతనికి ఏడు సంవత్సరాల వయసు ఉండగానే తండ్రి అయిన సోమయాజి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తరువాత తల్లి మరియు కుమారుడు మాత్రమే పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ…. ఉన్న రోజు తింటూ లేని రోజు పస్తులు ఉంటూ పేదరికంలో బతుకుతూ ఉండేవారు. ఒకరోజు సిద్ధ రామప్ప మరియు అతని స్నేహితులు ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వాళ్లంతా ఆరోజు దీపావళి గురించి మాట్లాడుకుంటున్నారు. దీపావళికి తమ ఇంటికి అందరూ వస్తారని….. అక్కా బావలు వస్తారని…. ఇంట్లో అమ్మ పిండి వంటలు చేస్తారని…. అక్క బావ వచ్చేటప్పుడు ఎన్నో ఆట బొమ్మలు ఎన్నో మిఠాయిలు తీసుకువస్తారని…బావ సందడి సందడిగా ఆడిస్తూ ఉంటారని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ సిద్ధ రామప్ప కూడా…. మా ఇంటికి కూడా మా అక్క బావ వస్తారు అని చెప్పి గొప్పగా చెప్పాడు. దానికి తమ స్నేహితులు నవ్వి మీ ఇంటికి మీ అక్క బావ ఎలా వస్తారు?  అసలు నీకు అక్క బావ లేరు కదా!  ఎక్కడి నుంచి వస్తారని హేళన చేస్తూ నవ్వారు. ఇలా వీళ్ళు నవ్వి ఆటపట్టించేసరికి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు అక్క బావ ఉన్నారా?  స్నేహితుల వద్ద జరిగిన వృత్తాంతం అంతా చెప్పగానే…. నా స్నేహితులతో నేను చెప్పి వచ్చాను అక్క బావని తీసుకువస్తా అని చెప్పగానే….. కుమారుని బాధ పెట్టడం ఇష్టం లేక…నీకు అక్క బావ ఉన్నారు.. వాళ్ళు చాలా ధనవంతులు. చాలా దూరంగా ఉంటారు. రావడానికి అసలు కుదరదు. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇద్దరూ మగ పిల్లలే. వాళ్ళు శ్రీశైలంలో ఉంటారు. చాలా దట్టమైన అటవీ ప్రాంతం అది. వెళ్లడమైన రావటమైనా చాలా కష్టంగా ఉంటుంది. అదికాక వాళ్ళు రావడానికి అసలు కుదరక రావడం లేదు. నీకు అక్క బావ ఉన్నారయ్యా అని చెప్పింది. ఆరోజు సాయంత్రం అన్నం తినేసి సిద్ధ రామప్ప మరియు తల్లి నిద్రపోయారు. తల్లి నిద్రపోగానే సిద్ధ రామప్ప రాత్రికి రాత్రే శ్రీశైలం ప్రయాణం అయ్యాడు. చెప్పా పెట్టకుండా బయలుదేరాడు. ఉదయం లేచి తల్లి చూసేసరికి కుమారుడు లేడని… బాధపడి…. అక్క బావని తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్లి ఉంటాడని ….ఈమె చెప్పింది శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక గురించి అని…కుమారుడు బాధపడటం ఇష్టం లేక అలా చెప్పానని తనలో తాను కుమిలి పోయింది. 

ఈ సిద్ధరామప్ప అడవి మార్గంలోనే అక్కా బావని ఇంటికి తీసుకురావాలని…దృఢ నిశ్చయంతో దారిలో భయం వేసిన బెదరకుండా…చెట్లు పుట్టలు దాటుకుంటూ ముందుకు వస్తూ ఉండగా అతనికి ఒక శివ బృందం కనిపించింది. ఇతను ఏదో ఒక బృందం నుంచి తప్పిపోయాడేమోనని ఆ శివ బృందం వాళ్ళు కూడా ఇతన్ని కలుపుకున్నారు…వాళ్లతో పాటే నడుస్తూ వాళ్ల దగ్గరే తింటూ చిన్నచిన్న పనులు చేస్తూ శ్రీశైలం చేరుకున్నాడు. శ్రీశైలం వచ్చిన తర్వాత తమ వాళ్ళని తాను వెతుక్కుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి దారిలో మల్లికార్జున బ్రమరాంబ ఎక్కడ ఉంటారు అని అడుగుతూ వచ్చాడు. అందరూ కూడా గుడి వంక చూపించారు. అంటే ఈ గుడిలో తమ అక్క బావ ఉంటారేమోనని గుడిలోకి వెళ్లి గుడి అంతా వెతికి చూశాడు…గుడిలో పూజారి ఇతనిని దగ్గరికి పిలిచి ఇతని వాలకం కాస్త అనుమానంగా అనిపించేసరికి వృత్తాంతం అంతా తెలుసుకుని….. తన తల్లి చెప్పిన కథను ఈ పూజారికి చెప్పగా అది అంతా విని విషయం అర్థమయి…. వీళ్లే మీ అక్క బావ అని చెప్పేసరికి…అమ్మ చెప్పింది మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారులని…తన అక్క బావ గురించి కాదని…. ఇప్పుడు అక్క బావ లేకుండా ఇంటికి ఎలా వెళతాము…. ఈ మల్లికార్జున బ్రమరాంబలను ఇంటికి ఎలా తీసుకువెళతాము….. అని తనలో తాను కుమిలిపోయి తనకి అక్కా బావ లేరని….. ఈపాటికి ఇంటిదగ్గర అమ్మను ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ సతాయించి తనని బాధపెట్టి ఉంటారని…. ఈ ముఖంతో ఇంటికి వెళ్ళలేక ఈ కపాలలోయలోనే దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఈ ప్రయత్నం చేయబోగా…. భ్రమరాంబిక అమ్మవారు ఇతని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది. గొప్ప ధనవంతులుగా మల్లికార్జున బ్రమరాంబలు వేషాలు మార్చుకొని ఇతనికి దర్శనం ఇచ్చారు. ఇతనికి ఉన్న అనుమాన సందేహాలు అన్ని తీర్చి , వాళ్లే తమ అక్కా బావ అని అతను నమ్మేలాగా తనకి నమ్మకం కలిగించి…. అతనిని అడవిలో ఒక పెద్ద  భవంతిని  ఏర్పాటు చేసి ఆ భవనానికి తీసుకువెళ్లారు. సాయంత్రానికి ఇద్దరు మగ పిల్లలు కూడా వచ్చేసరికి…వాళ్లతో కాసేపు ఆడుకుని…ఇక దీపావళి పండక్కి ఇంటికి వెళదామని చెప్పి బండ్లు కట్టుకొని అందరూ కలిసి సిద్ధరామప్ప ఇంటికి వచ్చారు. సిద్ధ రామప్ప తల్లి, కొడుకుని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉండగా అక్క బావని తీసుకువచ్చానని చెప్పి గుమ్మం దగ్గరకి తీసుకువచ్చాడు. వారిని చూసి ఆశ్చర్యపోయి ఎవరో దారిలో వెళ్లే బాటసారులుతప్పిపోయిన కుమారుని ఇంటికి తీసుకురావడానికి ఇలా వచ్చారేమోనని…. మళ్లీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పూరి గుడిసె కాస్త పెద్ద భవనం లాగా మారిపోయింది. అప్పుడు ఆమెకి వచ్చింది పార్వతీ పరమేశ్వరులని….. మల్లికార్జున బ్రమరాంబిక అని అర్థమయ్యి వాళ్ళకి నమస్కారం చేసింది.. ఆ తరువాత మల్లన్న భ్రమరాంబలు సిద్ధ రామప్ప కి రకరకాల పిండి వంటలు ఆటబొమ్మలు ఇచ్చి తన స్నేహితులకి చూపించి వాళ్ళతో పంచుకోమని చెప్పి పంపించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సిద్ధ రామప్ప తనతో వచ్చిన…..అక్క బావలు ఎవరో కాదని తమ నిజరూప దర్శనం ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి శ్రీశైలానికి తీసుకువెళ్లి శ్రీశైల క్షేత్రంలో స్థిర నివాసాన్ని కల్పించారు. అలా ఇది కపాల లోయ అయింది. ఈ కొలను సిద్ధరామప్ప కొలను అయింది అని చెప్పాడు. 

సిద్ధ రామప్ప కొలను 


తిరిగి బాల గణపతి…. ఇందాక గుప్త మల్లికార్జున లింగం ఇక్కడ కాదు… ఎక్కడో అడవిలో ఉంది అని చెప్పావు కదా!  అది ఎక్కడ ఉంది…. నన్ను తీసుకువెళ్ళు… నేను దర్శనం చేసుకుంటాను… న నాకు చూడాలనిపిస్తుంది అని అంటే…. ఇప్పుడు కాదు ఈసారి ఎప్పుడైనా వెళ్దాం అని చెప్పినప్పటికీ…. బాల గణపతి వినకుండా మొండికేసేసరికి సరే అని  బయలుదేరారు…


గుప్త మల్లికార్జునము/లొద్ది మల్లయ్య:-

ఒకానొక సమయంలో మల్లికార్జున స్వామి భక్తుల కోరికలను తీర్చలేక…. గుప్తంగా గుహల్లోకి వెళ్లిపోయారు. ముల్లోకాలు కూడా పరమశివుడు జాడ తెలియక సతమత మవుతున్నారు. పార్వతి దేవికి కూడా పరమశివుడు ఎక్కడ ఉన్నాడో తెలియ రాలేదు. అప్పుడు నంది ముల్లోకాలు వెతికి…. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు…స్వామివారు ఇక్కడ గుప్తంగా గుహల్లో ఏకాంత ధ్యానతపస్సులో నిమగ్నమై ఉన్నారని తెలుసుకొని…దేవీ దేవతలకు ఈ విషయాన్ని తెలియపరచి…. అందరూ కలిసి ఇక్కడికి వచ్చి…స్వామివారిని తీసుకువెళ్తారు. స్వామివారు వెళుతూ ఇక్కడ తన అంశగా శివలింగంగా మనకి కనిపిస్తారు. ఈ శివలింగాన్ని దర్శించడానికి ఎప్పుడు పడితే అప్పుడు వీలుపడదు. కేవలం తొలి ఏకాదశి రోజు మాత్రమే ఈ స్వామి వారి దగ్గరికి భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు చేస్తారు. ఈ స్వామివారి ఎదురుగా ఉండే తీర్థాన్ని గుప్తపాపహర తీర్థం అని పిలుస్తారు. దీని దర్శన భాగ్యంతోనే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆటవీకులు ఇతనిని లొద్ది మల్లయ్య అని గుప్త మల్లికార్జున అని పిలుస్తూ ఉంటారు . ఇక్కడ గణపతి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అని ఈ క్షేత్రం యొక్క విశిష్టత చెబుతూ రుద్రస్వామి సాధనా కుటుంబం ఇక్కడికి చేరి ఈ తీర్థంలో స్నానాలు ఆచరించి స్వామి వారిని అర్చించి అభిషేకించి తిరిగి ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకున్నారు. 

గుప్త మల్లికార్జునము 



బయలు వీరభద్ర స్వామి:- 


ఆ గుడిలో మల్లికార్జున స్వామి… ఆ తర్వాత భ్రమరాంబిక , రత్న గర్భ గణపతి ఇంకా ఇతర దేవాలయాలు అన్నీ కూడా దర్శనం చేసుకుని…. దగ్గరలో ఉన్న బయలు వీరభద్ర స్వామి గుడికి వెళ్లారు.  అక్కడ నిలువెత్తు ఉన్న వీరభద్ర స్వామి విగ్రహం చూసి ఆశ్చర్యానందానికి గురయ్యారు.  గాలిగోపురం ఏమీ లేదు.  నాలుగు స్తంభాలు ఎత్తైన పీఠం మాత్రమే ఉన్నాయి.  ఎండకి, వర్షానికి ఈ విగ్రహ మూర్తి తడుస్తూ ఉండటం వలన… ఈయనకి బయలు వీరభద్ర స్వామి అని చెబుతారు.  ఈ క్షేత్రానికి ఈయన పాలకుడని చెబుతారు అని అక్కడ ఆలయ పూజారి చెప్పేసరికి… దక్షిణ కింద ఒక వంద రూపాయలు ఇచ్చి ఆయనకి నమస్కారం చేసింది. పిల్లలు కూడా బయలు వీరభద్ర స్వామికి ప్రదక్షిణలు చేసి…. కాసేపు ఆటల్లో మునిగిపోయారు. 


రుద్రస్వామి సాధనా కుటుంబం వంక చూస్తూ…. ఇక్కడ ఈ శ్రీశైల క్షేత్రంలో మొత్తం 36 మంది వీరభద్ర ఆలయాలు ఉంటాయి. అయితే… మరి వాటి ఉనికి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అందులో ఆరామ వీర భద్రుడు, సుదర్శన వీరభద్రుడు, ఇలా మొత్తం 36 మంది దాకా  ఉంటారని పురాణంలో చెపుతారు అని చెప్పాడు. 



బయలు వీరభద్ర స్వామి 


శివ నందిని కాస్త రుద్ర స్వామి తో…


అయ్యా! విశ్వమోక్షం అంటే ఏ శూన్యంలో నుంచి మనం వచ్చామో ….తిరిగి అదే శూన్యంలో శూన్యం అవ్వటం అని చెప్పారు!  ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు శూన్యమే శివుడు మరియు శివుడే శూన్యం అయినప్పుడు ఈయనే నిర్గుణ రూపం నుండి సగుణ రూపానికి వచ్చినప్పుడు విశ్వమోక్షం పొందడం ఏమిటి ? అన్నప్పుడు…


అమ్మ నువ్వు చెప్పింది నిజమే!  శివుడు అంటే శూన్యమే. అలాగే విశ్వమే… కానీ చిన్నపిల్లాడిని శివుని రూపంలో ఉన్నది ఏమిటిరా అని అడిగితే…. ఏముంది!  మెడలో పాములు ఉంటాయి… చేతిలో త్రిశూలం ఉంటుంది… నెత్తి మీద గంగ ఉంటుంది… పులి చర్మముతో, ఏనుగు చర్మంతో, రుద్రాక్షలతో జటాధారిగా ఉంటాడు అని చెప్తాడు కదా! అదే శివలింగమును చూడగానే ఇది శివలింగం అని చెబుతాడు కదా! అంటే శూన్యంలో నుంచి ఆకార స్వరూపం శివలింగ రూపం,  అలాగే సాకారముగా శివుడి మనుష్య రూపం వచ్చాయని అనుకోవచ్చును కదా! ఈ రెండు శివరూపాలు గురించి మనం మాట్లాడడానికి చెప్పడానికి చూపించడానికి వీలుగా ఉంటున్నాయి కదా! పూర్ణ శూన్యము అంటే ఏమిటి?  అది ఉందో లేదో తెలియని స్థితి. అది చూడలేని స్థితి. అది చూపించలేని స్థితి. దానిని గురించి చెప్పలేని స్థితి కదా!  ఈ స్థితిలో శివుడి రూపాలు పొందడమే విశ్వమోక్షం అవుతుంది… అనగా ఆకార సాకార శివరూపాలు కాస్త నిరాకార స్థితి అనగా పూర్ణ శూన్యస్థితికి రావాలి.. మారాలి… పొందాలి… కానీ వీటికి ఈ తత్వాలు అనగా శూన్యతత్వమే ఉంది. అంటే ఒక నల్లని కాగితం మీద ఒక తెల్లటి చుక్కని పెడితే మన దృష్టి ఈ తెల్ల గుర్తు మీద పడుతుంది కదా! ఎందుకంటే నల్లని కాగితం మీద ఈ తెల్లటి చుక్క విభిన్నంగా ప్రత్యేకంగా కనపడుతుంది కదా! మరి అప్పుడు ఇది తెల్లని చుక్క అంటామా లేదా నల్లని చుక్క అంటామా? తెల్లటి చుక్క అంటాము కదా! నల్లనిది శూన్యమైతే,  శూన్య బిందువుగా తెల్లని చుక్క అయింది. పరమాత్మ ఆదిలో ఎలాంటి సంకల్పం లేకుండా… నిరాకార తత్వముతో పరమ శూన్య స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈయనకి తను ఎవరో తెలుసుకోవాలని సంకల్ప ఆలోచన వచ్చిందో….ఒక్కడు కాస్త అనేకమయ్యాడు. దానితో పరమ శూన్యం నుంచి పరమాత్మ కాస్త ఆకార స్వరూపంగా పరంజ్యోతిగా రావటము…. దీని నుండి సాకార స్వరూపముగా ఏకపాద రుద్ర మూర్తిగా రావటము… ఈయన ఎడమవైపు నుండి కుడివైపు నుండి బ్రహ్మ, విష్ణుమూర్తి రావటము జరిగింది కదా! ఇప్పుడు ఏ శివుడైతే ఆదిశూన్యంలో నుంచి సంకల్పంతో వచ్చాడో ….ఆయన తిరిగి సంకల్ప రాహిత్య స్థితి పొందడమే విశ్వమోక్షం అవుతుంది . అంటే తను ఎవరు తానే తెలుసుకుంటే… అది ఆయన మోక్షం అన్నమాట! ఆయన మోక్షం అంటే విశ్వమోక్షం కదా…. ఎందుకంటే ఆయనే విశ్వము… ఆయనే శూన్యము కదా! పదార్థము దాటితే గాని యదార్థం అర్థం కాదు. అనుభవ అనుభూతి పొందితే కానీ మూల జ్ఞానము అర్థం కాదు. ఇది నేను ఎంత చెప్పినా అర్థమయి అర్థం కానట్టుగా ఉంటుంది. సందేహాలు వస్తూనే ఉంటాయి.  వీటికి సమాధానాలు వెతుకుతూనే ఉంటాము . ఎప్పుడైతే ప్రశ్నించేది ఎవరు? సమాధానం ఇచ్చేది ఎవరు? వీరిద్దరూ లేరు…. ఉన్నది ఒకటే…. అది  యే  యద్భావం తద్భవతి అని ఎవరైతే అనుభవ అనుభూతి పొందుతారో…. వారు పొందేది విశ్వమోక్షమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సర్వం శివమయం కదా! శివుడు కాని వాడు లేడు. శివుడు లేనిది లేదు. శివుడే శివుడిని చూస్తున్నాడు… పొందుతున్నాడు అని చెప్పాడు.


ఇక శివాని, మహాదేవి, రుద్ర స్వామి ధ్యాననిష్ట లో ఉండిపోయారు. ఎంతసేపు అలా ఉండిపోయారో…. వాళ్లకే తెలియలేదు.  అలా తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండేసరికి… శివాని పాము తనని కాటు వేసిన ధ్యాన దృశ్యం పదేపదే కనిపించింది .అయ్యో శివానందకి చెప్పలేకపోయాను.  శివ స్వామికి చెప్పలేకపోయానే… అనేసరికి శివానంద నుంచి అంతర్వాణిగా తన మనసు లో నుంచి… అంతా తెలుసు… పాము కాటు వేసిన విషయం తెలుసు. అదే కృష్ణ సర్పం.  కంగారు పడాల్సిన అవసరం లేదు . నీ శరీరంలో  ఎలాంటి విషం పనిచేయదు….అది విషం లేని పాము. కుండలినీ శక్తి జాగృతికి శుభసూచికంగా మనకి కనపడుతుంది.  అలాగే కుండలినీ శక్తి కదలికలు ఉండేసరికి… మనకి పాము దర్శనం అవుతుంది. ఆ పాము ముఖం పదేపదే కనబడుతుంది అనేసరికి అవును స్వామి!  నాకు ధ్యానంలో పదేపదే పాము కనబడేది.  ఇక్కడికి వచ్చిన కొత్తల్లో…. ఆ తర్వాత పూర్తిగా కనపడటం మొదలుపెట్టింది. నేను నా చుట్టుపక్కల పాములని ప్రత్యక్షంగా చూడటం వలన…వాటిని భావించుకోవడం వలన ధ్యానంలో అలా కనిపించిందేమో అని అనుకున్నాను… అంటే కుండలినీ శక్తిలో కదలికలు ఏర్పడినప్పుడు…. పాము తల కనపడుతుందన్నమాట!  అదే విధంగా కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు…. పాము కాటు వేస్తుందన్నమాట!  అది ప్రత్యక్షంగా జరగొచ్చు…. లేదా ధ్యానంలో జరగొచ్చు… కాకపోతే నాకు ప్రత్యక్షంగా జరిగింది అంటే ప్రత్యక్షంగా జరిగే అవకాశం ఉంటుంది . నూటికి డెబ్బై శాతం మోక్షజన్మ కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు…. ఈ విధంగా జరుగుతుంది… అని శివ స్వామి చెప్పాడు. ఈ విధంగా నీకు  కుండలినీ శక్తి  జాగృతి చేసే శక్తి పాత గురువు కూడా తొందరలో వస్తారు.  ఆయన ద్వారా ఈ అజ్ఞాన గ్రంధి విభేదనం ఎప్పుడైతే పూర్తి చేసుకుంటావో….దాని నుంచి ఎప్పుడైతే బయటపడతావో…. కుండలినీ శక్తి అంశ అయిన జేగురు రంగు పాము మూలాధార చక్రం కింద జాగృతి చేస్తారు.  అప్పుడు నీకు సాధనా శక్తితో అక్కడ ఉన్న స్వయంభు శివలింగమును మూడున్నర చుట్లు చుట్టుకొని ఉన్న సర్పం లేస్తూ…. జాగృతి అవుతూ…. నిద్రావస్థకు వెళుతూ ఉంటుంది.  దానిని నువ్వు శక్తి పాత గురువు అనుగ్రహం పొందినట్లయితే, ఆ శక్తిపాతం ఎప్పటికీ నిద్రావస్థకు చేరని విధంగా…. 13 యోగ చక్రాల్లోకి ప్రవేశించే విధంగా అనుగ్రహిస్తారు. అలాంటి శక్తిపాత గురువు దొరకడం అనేది…. శివానుగ్రహం వల్లే జరుగుతుంది. నేను దీక్ష గురువు, రుద్ర స్వామి మంత్ర గురువుగా ఉన్నారు. త్వరలో నీకు అనుగ్రహం ఉంటే…. శక్తిపాత గురువు కూడా వస్తారు.  ముందు నువ్వు ఇష్టకామేశ్వరి అనుగ్రహం పొందు. ఆ తర్వాత జరగాల్సిందంతా కూడా ప్రకృతి చూసుకుంటుంది.  కృష్ణ స్వామి మరియు యోగాంబిక గురించి ఆలోచన చేయకు…. అంటే అలాగే స్వామి!  నేను వాటి గురించి ఆలోచించను.  మీరు ఇలా ధ్యానంలో పదేపదే వస్తే నా సాధన ఎలా ముందుకు వెళుతుంది…. అనగానే ఆయన అంతర్దానం అవ్వడం జరిగింది. ఆ తర్వాత శివాని కాస్త ధ్యానంలో యధావిధిగా కూర్చునే సరికి…. ఈసారి పాము కదలికలలాగా కుండలిని శక్తి కదులుతున్నా కూడా ఎలాంటి నొప్పులు రాలేదు. ఇది వరకు నెలసరి నొప్పి లాగ… పొత్తికడుపు నొప్పిలాగా…. ఒళ్లంతా నొప్పులుగా…. జ్వరం వచ్చినట్టుగా…. వేడి ఆవిర్లు వస్తూ ఉండేది.  కానీ ఇప్పుడు తనకి అలాంటివి ఏమీ జరగట్లేదు అని గ్రహించడం మొదలుపెట్టింది.  కదలికలు ఈసారి స్పష్టంగా, వేగంగా, బాగా కదులుతున్నట్లుగా అనిపించి సాగింది. ఇక త్వరలో అజ్ఞాన గ్రంధి నుంచి కుండలినీ పాము బయటపడుతుందని బలంగా అనిపించసాగింది.  ఆ తర్వాత తనలో స్పష్టంగా ఓంకార నాదం మణిపూరక చక్రం ప్రాంతమైన నాభి దగ్గర నుంచి వస్తుందని గ్రహించింది.  ఆనాదం వింటూ ధ్యానంలోకి వెళ్లిపోసాగింది.  ఇప్పుడు గాఢాంధకారంలో చిన్న బొట్టు పిల్లంత సైజులో చుక్క కనిపిస్తుంది  ధ్యానంలో అనుకుంటూ ఉన్నది. ఈ బొట్టు ఏమిటో…. ఈ గాఢాంధకార చీకటి ఏమిటో…..ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు… అని ధ్యానం చేసుకుంటూ ఉండిపోయింది.  కాకపోతే ఇదివరకు ధ్యానం నుంచి బయటకు రావాలి అని మనసు పరి విధాలుగా ఉంటూ ఉండేది. ఎప్పుడైతే పాము కాటు వేసిందో…. ఆ క్షణం నుంచి ధ్యానం చేసుకోవాలి ….ధ్యానం తప్ప ఏమీ లేదు… అని మనసు కోరుకోవడం మొదలు పెడుతుందని గ్రహించింది.  ఇవాళ కొన్ని శక్తి కదలికలు గమనించింది. ఇప్పుడు కుండలిని శక్తి జాగృతి ఆరంభ దశ ఆరంభమైందని…. అదేదో శక్తిపాత గురువు అనుగ్రహం వలన సంపూర్ణ జాగృతి అవుతుందని అంటున్నారు… కాబట్టి ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూద్దాం అని ఇలా ఆలోచనలు తన ధ్యానంలో కొనసాగుతూనే ఓంకారం వింటూ ధ్యానంలోకి వెళ్లిపోయింది. సుమారు ఇలా అందరూ కూడా మూడు గంటల పాటు ధ్యానంలో ఉండిపోయారు.పిల్లలు ఆటల్లో మునిగిపోయారు.ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయిందని గమనించి….అక్కడ నుంచి బయలుదేరి సత్రానికి వెళ్లి…భోజనం ఏర్పాట్లు చేశానని సత్రం యజమాని అనేసరికి …భోజనాలు గావించుకొని…. యధావిధిగా పిల్లలు నిద్రపోయిన తర్వాత , మహాదేవి, రుద్ర స్వామి, శివాని కాస్త గది తలుపు వేసి… ధ్యానం చేసుకోవాలని చెప్పేసి….వాళ్లకి ఇష్టమైన అంటే శివాని కాస్త రుద్రాక్ష మఠానికి వెళితే….రుద్రస్వామి కాస్త విభూతి మఠానికి వెళితే…. మహాదేవి కాస్త సారంగధర మఠానికి వెళ్లి ….ధ్యానంలో కూర్చుని సాధన చేసుకోవాలని ….నిశ్చయం చేసుకొని…. వాళ్ళు వెళ్లి ధ్యాన నిమగ్నం అయ్యారు. పిల్లలు ప్రశాంతంగా గదిలో గాఢ నిద్రలో ఉండిపోయారు.


ఇలా ధ్యాన నిష్ఠలో ఉన్న శివ నందిని కాస్త…. ధ్యానంలో ఎవరో ఒక స్త్రీమూర్తి , శివలింగం పట్టుకుని…. ఒక చేత్తో రుద్రాక్ష మాల పట్టుకుని ….తీవ్ర  ధ్యాన నిష్ఠలో ఉంది.  ధ్యానం చేస్తున్నట్టుగా కనిపించింది.  ఈ విధంగా చూసేసరికి…..ఎక్కడో చూసినట్టుగా అనిపించేసరికి….. దా! నీ కోసమే ఎదురు చూస్తున్నాను.  దానికి అర్హత, యోగ్యత,  యోగం ఉందో లేదో పరీక్ష చేసి నా దగ్గర ఉన్న శివలింగం నీకు ఇస్తాను.  విశ్వమోక్షం కోసం  ప్రయత్నించే మోక్ష సాధకురాలు అని తెలిసింది.  నీకు ఆ పరీక్షలు పెడతాను.  పరీక్షా కాల సమయం ఆసన్నం అయ్యింది…. అంటూ ఉండేసరికి సరే ఇదేదో కృష్ణ స్వామి లేదా యోగాంబిక చేసే మాయ పరీక్షలా ఉంటుంది… అని తను ధ్యానాన్ని కొనసాగుతూ ఉన్నప్పటికీ…. ధ్యానంలో ఈవిడ పదేపదే కనిపిస్తూ ఉండేసరికి…. ఈమెకి అర్థం కాక శివ స్వామిని మనసులో ధ్యానం చేసుకుని…. స్వామి!  నాకు ఈవిడ ఎవరో కనబడుతుంది.  ఈవిడ ఎవరు …నాకు తెలియట్లేదు అనేసరికి…. ఆవిడ ఎవరో కాదు,  ఇష్టకామేశ్వరి.  నిన్ను పిలుస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళు ఇప్పుడు…అంటే  ఈ అర్ధరాత్రి సమయంలో వెళ్లడం మంచిదేనా!  అంటే అసలు ఆవిడ ఎక్కడ ఉంటుందో… కూడా నాకు తెలియదు.  పొద్దున పూట కూడా కొన్ని జీపులు మాత్రమే తీసుకువెళ్తాయి.  ఏదో అడవిలో చిన్న గుడిలో ఉంటుందని విన్నాను అనేసరికి…. నేను నీకు తోడుగా నీ వెంట రక్షకుడిగా ఉంటాను.  నీ మనసులోనే ఉంటాను.  కాబట్టి నువ్వేం ఆలోచన చేయొద్దు… భయపడవద్దు….ఇప్పుడు రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా లేరు …వాళ్ళిద్దరూ లేకుండా నేను ఒంటరిగా వెళ్ళేదెలా ..? అంటే ముందు నీలో ఉన్న భయాన్ని తొలగించు.  మహా అయితే ఏమవుతుంది… చావొస్తుంది….చచ్చిపోతావు ….ఏముంది అందులో.  నువ్వు ఎటు చావాలనుకున్నప్పుడు కాశీ క్షేత్రం అయితే ఏముంది…. శ్రీశైల క్షేత్రం అయితే ఏముంది?  నీకు మరణం పొందాలి అనుకున్నప్పుడు…. మరణం పొందుతావు.  చావు భయం ఎందుకు?  దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్?  ఇప్పుడు నువ్వు బంధాలన్నీ వదిలేసావు కదా!  నీవి కాని బంధాలు బాధ్యతల గురించి ఆలోచిస్తావా!  లేకపోతే ఇక్కడ ఉన్న యోగ పుత్రుల, యోగ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నావా?  అంటే నేను నా గురించి ఆలోచించట్లేదు…. ఇప్పుడు నేను అర్ధాంతరంగా చచ్చిపోతే ….. విశ్వ మోక్షం ఆగిపోతుంది కదా!  అంటే తల్లి!  ఇది మాత్రం గుర్తు పెట్టుకో.  ఇది నీ వల్ల సాధ్యపడుతుందా…. లేదా అని మాత్రమే పరీక్ష పెడుతున్నారు.  సాధ్యపడితే నీకు అర్హత ఉంది అని…..నీకు మోక్షం ఇస్తారు.  నువ్వే విశ్వ మోక్షానికి నాంది కాదు. ఈ విశ్వ మోక్షం కోసం ప్రయత్నం చేసే కొన్ని కోట్ల మందిలో నువ్వు ఒకదానివి మాత్రమే…. అని గుర్తుపెట్టుకో! ఈ విశ్వంలో 108 లోకాలు ఉన్నాయి.


అందులో 107 లోకాల్లో నీలాంటి వాళ్ళు… కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అందులో ఎవరో ఒకరికి మాత్రమే విశ్వ మోక్షానికి అర్హత, యోగ్యత, యోగం పొందుతారు.  ఇప్పుడు ప్రకృతి పురుష వ్యక్తిగత మోక్షం పొందటానికి… నాలాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు.  అందులో యుగానికి ఒక్కడు లాగా నేను మాత్రమే జయం పొందడం జరిగింది. అలాగే నువ్వు కూడా జయం పొందుతావు అని చెప్పేసి పరీక్షలు చేస్తున్నారు.  అంతేగాని నువ్వు చచ్చిపోతే ఇంకొకళ్ళు…. మనలాంటి జంట ప్రయత్నం చేస్తుంది. మనమిద్దరం జయం పొందలేకపోవచ్చు.  నువ్వు పునః జన్మకి వెళ్తావు.  లేక వ్యక్తిగత మోక్షం పొందుతావు.  నేను మాత్రం వ్యక్తిగత మోక్షం పొందేసి శూన్యం అవుతాను.  ఇక్కడ ఏమీ జరగదు.. ఏమీ అవ్వదు. మనం ఉన్న లేకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది . మన ప్రమేయం ఏమీ లేదు…. కాకపోతే ఏంటంటే మన భౌతిక మరణం కాకుండా విశ్వమోక్ష మరణం చేసుకోవాలని చెప్పేసి….. మనతో పాటు మోక్షం పొందాలనుకున్న వాళ్ళందరికీ స్త్రీ పరంగా స్త్రీకి ఉన్న ఆటంకాలు, మాయలు, మర్మాలు అన్నింటిని నీ ద్వారా తీసేయాలని చెప్పేసి… స్త్రీ మోక్షమార్గం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.  ఆ ప్రయత్నంలో నువ్వు  చచ్చిపోయినా….. విశ్వమోక్షం ఆగిపోదు.  జరగాల్సింది ఎప్పటికైనా జరుగుతుంది. జరగనిది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు.  అది మాత్రం గుర్తుపెట్టుకో!  నీ వల్లే విశ్వ మోక్షం వస్తుంది అనుకోకు.  నువ్వు కాకపోతే ఇంకొకళ్లు వచ్చి చేస్తారు.  కాకపోతే ఇంకొక పాత్ర . ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు.  జయం పొందేది మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.  ఒకళ్ళు జయం పొందిన చాలు.  కొన్ని కోట్లాదిమందికి మోక్షమార్గం అయి నిర్దేశకురాలిగా అవుతావు.  అంతే దానికి పరీక్షలు పెడతారు.  అంతేగాని చావు భయం గురించి ఆలోచించకు. విశ్వమోక్షం ఆగిపోతుందని ఆందోళన చెందకు, కంగారు పడకు. ఏది జరగాలో అది జరుగుతుంది.  నేను నీడలాగా నీ వెంట ఉంటాను.  నా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు.  ఆ అమ్మవారే నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్లే విధివిధానం చూపిస్తుంది అనేసరికి…. సరే స్వామి!  మీ మీద నమ్మకం నాకుంది.  అచంచల విశ్వాసం ఉంది.  మీరు చెప్పింది కూడా నిజమే.  ఏది జరగాలో అది జరుగుతుంది. చావాలనుకున్నప్పుడు నాకెందుకు చావు భయం.  కాకపోతే విశ్వమోక్షం ఆగిపోతుంది ఏమో… అని ఆలోచన చేశాను.  ఆ ఆలోచన కూడా తప్పు అన్నారు.  కాబట్టి తెగించిన వాడికి తెడ్డే గతి అంటారు. కాబట్టి ఏది జరిగితే అది జరుగుతుంది. ఇప్పుడు మహాదేవి కానీ రుద్ర స్వామి కానీ నేను చస్తే నాతోపాటు వస్తారా!  రారు కదా! ఏకాంత మరణమే కదా…. కాబట్టి ఒంటరి మరణమే కాబట్టి ఒంటరిగా సాధన చేస్తాను.  అవకాశం ఉంటే వాళ్ళు ఉంటారు.  అవకాశం లేకపోతే ఉండరు ….అని  బయటకు వచ్చేసరికి  వీళ్ళకి కూడా ఇలాంటి జ్ఞాన స్ఫురణలు అందడంతో…. మహాదేవి కాస్త సారంగధర మఠం నుంచి, రుద్రస్వామి విభూతి మఠం నుంచి అప్పటికే రుద్రాక్ష మఠం ముందు… బయట ధ్యానంలో ఉండటం గమనించి…. వీళ్ళకి కూడా జ్ఞాన స్ఫురణలు అంది ఉంటాయని… శివ నందిని కాస్త వాళ్ళవైపు మౌనంగా చూస్తూ ఉండగానే…. ధ్యానంలో ఉన్న వాళ్ళు కాస్త, కళ్ళు తెరిచి…మాకు అంతా అర్థం అయింది అమ్మ …నువ్వు ముందు పదా ! నీ వెనక మేము రక్షణగా ఉంటాము అనేసరికి…. సరే స్వామి!  అని చీకటిలో దారి తెలియని స్థితిలో,  మనోజప శక్తిని ఉపయోగించుకొని… ఆ ఇష్టకామేశ్వరి గుడి వైపుకు వెళ్ళటం ప్రారంభించారు. ఈ విషయం గ్రహించిన కృష్ణ స్వామి మరియు యోగాంబిక కూడా వీళ్ళని  నీడలాగా వెంబడిస్తున్నారు అనే విషయం రుద్రస్వామి, మహాదేవి గ్రహించినా కూడా ఏమీ పట్టనట్టే ఉన్నారు. 


కానీ శివనందినికి ఇవేమీ తెలియదు. తను ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో…. మనసు ఎటు చెప్తే అటు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.  అర్ధరాత్రి 12 గంటలకి అందరూ నిశితంగా నిద్రావస్థలో ఉండగా….. వీళ్ళ ముగ్గురు కూడా అతివీర భయంకరంగా…. పగలుపూట కూడా వెళ్లడానికి భయపడే కారడివిలో….. వీళ్ళ ముగ్గురు నడుచుకుంటూ వెళ్లడం జరిగింది.  


ఇష్ట కామేశ్వరి అమ్మవారు:- 


రుద్ర స్వామి నడుస్తూ…శివ నందినితో నీకొక విషయం తెలుసా శివనందిని…. భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అమ్మవారు ఈ ప్రాంతంలోనే దర్శనం ఇస్తారు. ఈ అమ్మవారు ఆగమంలో లేని విధంగా ఇక్కడ ఉండడం విశేషం. 

ఉదయం వెళలో అయితే దారిలో వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. జీపులో వచ్చేవాళ్ళు ఆ వినాయకుని వద్ద ఆగి నమస్కారం చేసుకుని రావడం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారిని శైలపుత్రి అని కూడా పిలిచేవారని పూర్వీకులు చెబుతారు. అమ్మవారు తపస్సు చేసిన ప్రాంతమని, ఇక్కడ ఇంతకుముందు ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం  కూడా ఉండేది అని ఇప్పుడు దాని ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యాయి అని చెప్పాడు. 


ఇష్ట కామేశ్వరి అమ్మవారు 


తరువాత  అలుపు వచ్చి శివ నందిని విశ్రాంతిగా ఒక రాయి మీద కూర్చునే సరికి…. ధ్యానంలో గదిలో ఉన్న పిల్లలద్దరికీ పెద్ద పాము పాదాల వద్ద కాటు వేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ధ్యాన అనుభవం అయ్యింది. అది చూసి శివ నందిని కంగారుపడుతూ……అయ్యా! అయ్యా! పిల్లలు ఉన్న గదిలోకి పాము చేరింది. పాము కాటు వేస్తుందేమో…!  మీ ఇద్దరు వెళ్లండి.  ఆ పాముని తరిమేయండి. పిల్లల్ని రక్షించండి…. అంటూ ఉండేసరికి… అమ్మ ఇదంతా కృష్ణ స్వామి మాయా లీల. నువ్వేం కంగారు పడకు,  నువ్వేం భయపడమాకు.  దాని గురించి ఆలోచించకు.  వాళ్ళు యోగ పుత్రులు.  చస్తే చస్తారు.  మీ సొంత బిడ్డలు కాదు కదా!  నువ్వెందుకు భవ బంధాల గురించి ఆలోచిస్తున్నావు.  చచ్చే యోగం ఉంటే మేం వెళ్లినా కూడా చస్తారు.  చావు రాసిపెట్టి ఉంటే…. ఎప్పుడు ఏ క్షణాన మరణం వస్తుందో తెలీదు.  వాళ్ల గురించి నువ్వు ఆలోచించకు.  ముందు ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళు…. అంటే స్వామి!  మీరు వెళ్లాల్సిందే… మీరు వెళ్లకపోతే నేను వెళ్ళను. పాపం చిన్నపిల్లలు….. నిండా ⅚ సంవత్సరాలు కూడా ఉండవు.  వాళ్లు నాకు కడుపున పుట్టిన వాళ్లు కాకపోయినా,  దత్తపుత్రులు… దైవ పుత్రులు.  నేను వాళ్ళని చూస్తూ చూస్తూ చంపుకోలేను.  నేను వెనక్కి తిరిగి వెళ్తాను…. అనేసరికి మహాదేవి కాస్త ఉగ్రరూపంగా ఏమిటి వెళ్ళేది? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. మాయ అంటే ఇదే.. మాయ అని తెలుసుకో.  ఇప్పుడు పాము వాళ్ళని కాటు వేయలేదుగా….. వేయడానికి సిద్ధంగా ఉన్నట్టేగా ధ్యానానుభవం పొందావు. మనస్సు స్థిరపరచుకో.  మనసు ఆధీనం చేసుకో. కంగారుపడమాకు. భయపడకు…. ఏం జరుగుతుంది. కాటు వేసినంత మాత్రాన మనం పిల్లల్ని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది.  విషం బయటికి తీసే నాగవేరు రుద్ర స్వామి దగ్గర ఉంది. నువ్వేం ఆలోచించమాకు. అనగానే…. అసలు నువ్వు కన్నతల్లివేనా! నీకు పిల్లలు ఉన్నారు కదా! అభం , శుభం తెలియని చిన్న పిల్లలు.  పాము కాటుకి అందులోనూ పెద్ద పాము కాల సర్పము లాగా ఉంది ….నాగుపాము లాగా ఉంది…. అది కాటు వేస్తే ఇక ఉండరు.  అది అనకొండ అయి ఉండచ్చేమో…. పిల్లల్ని మింగేస్తుందేమో…. అని డీలాపడుతూ ఉండేసరికి , ఇక రుద్రస్వామికి కోపావేశాలు కట్టలు తెంచుకుని….శివాని ఏం మాట్లాడుతున్నావ్!  నీ మనసు స్థిరపరచుకో…. అని గట్టిగా ఒక చంప మీద కొట్టేసరికి…. మామూలు స్థితికి వచ్చి ,ఏం జరిగిందో అర్థం కాకపోయేసరికి, అక్కడే ఉన్న బండరాయి మీద కుప్ప కూలిపోయింది.  ఇప్పుడు ధ్యానంలో కూర్చో. నీకేం తెలుస్తుందో చూడు… అనేసరికి ధ్యానంలో కూర్చోగానే, కాటు వేసే పాము కాస్త వీళ్ళకి పాము పడగ ఇస్తూ… రక్షణ కవచం లాగా కనపడింది.  ఇప్పుడైనా నీకు అర్థమైందా!  అది బాల కుమారస్వామి అంశ అయిన బాలసుబ్రమణ్య స్వామి . అది రక్షణ కోసం వచ్చిన పాము.  అది భక్షించే పాము కాదు.  నిజానికి ఆ పాము చేత కాటు వేయించాలని…. కృష్ణ సర్పమును కృష్ణస్వామి పంపించారు.  కానీ ఆ బాల కుమారస్వామిలో  సుబ్రమణ్య స్వామి అంశను చూసి ఆ పాము కాటు వేయాల్సింది కాస్త….. రక్షకురాలై పడగ ఇవ్వటం జరిగింది.


కనిపించే ధ్యాన దృశ్యాలు అన్నీ కూడా నిజాలు కావు . భ్రమ , బ్రాంతులు కలిగిస్తాయి. నువ్వు కోపావేశంలో ఉన్నావు… ఆవేదనలో ఉన్నావు…. నువ్వు సాధించాల్సిన విషయం మర్చిపోయావని , నిన్ను చంప మీద కొట్టి మామూలు స్థితికి తీసుకురావాల్సి వచ్చింది. …. అనేసరికి ఇదంతా నాకు తెలియదు కదా స్వామి! ఇప్పుడే అర్థమయింది. ఓహో!  ఈ విధంగా కృష్ణస్వామి తన మాయని చూపిస్తారన్నమాట! కంగారు పడాల్సిందేమీ లేదన్నమాట! ధైర్యే సాహసే లక్ష్మి! ఎవరికి ఏం జరిగినా నేను పట్టించుకోకూడదు. అవన్నీ నిజాలు కాదు. మనసును స్థిరం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉండేసరికి…. పులిగాండ్రింపు వినిపించింది. ఒక్కసారిగా ముగ్గురి ఒళ్ళు జలదరించింది. అమ్మ!  యోగాంబిక మాయ మొదలైంది. పులి రూపంలో ఆవిడ ఇక్కడ సంచారం చేస్తుంది. ఆవిడ నన్ను కానీ… మహాదేవిని కానీ…. తినటానికి ప్రయత్నించినా తిన్నా కంగారు పడకు. నువ్వు యధావిధిగా ముందుకు వెళ్ళిపో అని అంటూ ఉండేసరికి….. ఆడ పులి రుద్ర స్వామి మీద దాడి చేసి, ఆయన చేతిలో ఉన్న కర్ర అవతలికి తోసి, తన పంజాతో కొట్టి చీల్చేసరికి….. శివ నందిని మరియు మహాదేవి ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. మహాదేవి మూర్ఛ పోయింది. శివ నందిని భయంతో ఏం చేయాలో అర్థం కాక….. శివ స్వామిని మనసులో తలుచుకుంటూ స్వామి!  ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా?  మీరు ధ్యానంలో ఉన్నట్టున్నారు.  ధ్యానం నుంచి బయటకు రండి.  నాకు భయం వేస్తుంది.  నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.  ఇక్కడ పెద్ద పులి ఉంది. అది రుద్రస్వామిని చంపేస్తుంది అని అంటూ ఉండేసరికి…శివాని!  నువ్వు భయపడమాకు…. ఇదంతా భ్రమ ,బ్రాంతి.  అదంతా నిజం కాదు.  వాళ్లు చనిపోయినా…చంపేటట్టు చేసినా కూడా నువ్వు వదిలేసెయ్యి.  నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు ముందు ఇష్టకామేశ్వరి సంగతి చూడు. ఆవిడ అనుగ్రహం పొందు.  ఇవన్నీ కూడా ఆవిడ అనుగ్రహం పొందకుండా చేస్తున్నారు అనేసరికి…. అలా అంటారేంటి స్వామి!  నిజంగానే ఒక పులి వచ్చి రుద్ర స్వామి గుండె చీల్చింది కదా ! చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే …..అది నిజం కాదు,  భ్రమ , బ్రాంతి అని ఎలా అంటారు?  ఎలా నమ్మమంటారు…. అనేసరికి,  సరే చూడు… అనేసరికి,  ఆ పులి కాస్త పిల్లి లాగా మారి పోయి అక్కడ నుంచి పారిపోయేసరికి….. రుద్ర స్వామికి ఎలాంటి గాయాలు కనిపించకపోయేసరికి….. ఓ మనసుకి  భ్రమ, భ్రాంతి మాయలు చేస్తున్నారన్నమాట!  కలిగిస్తున్నారన్నమాట!  ఏకాగ్రత కలగకుండా చేస్తున్నారన్నమాట!  ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు….. అని చెప్పేసి మాయలు ఇలా ఉంటాయన్నమాట! అని అనుకుంటూ ఉండేసరికి…. ఏం చేయాలి స్వామి!  నాకేం అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఉన్నచోటనే ఒక బండమీద కూర్చో….ఏం చేయాలి, ఏం జరగాలి అనేది ఆవిడే నీకు సందేశం ఇస్తుంది అనగానే.. ఇక మనసుని ఆధీనం చేసుకోవాలి మనసు అదుపు తప్పుతుంది, భయానికి గురి అవుతుంది, అని ధ్యానంలో కూర్చోబోతుండగా…. ఏమీ తెలియనట్టుగా, గాఢ నిద్రలో నుంచి రుద్ర స్వామి అలాగే మహాదేవి ఈమె దగ్గరికి వచ్చి….అసలు ఏం జరిగిందమ్మ!  మేము మంచి నిద్రపోయాము.  అమ్మ!  మనం ఇష్టకామేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం కదా! అనుకోకుండా మేము ఇద్దరం కూడా నిద్రలోకి పోయినట్టుగా ఉన్నాము…. అనేసరికి ఏం జరిగిందో రేపు పొద్దున వివరంగా చెప్తాను.  ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి… నా మనసు అదుపుతప్పి ఏకాగ్రత కోల్పోతున్నాను.  నాకు రకరకాల భయభ్రాంతులు కలుగుతున్నాయి.  మనో భ్రాంతులు కలుగుతున్నాయి.  మాయలు కలుగుతున్నాయి.  ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నాను.  కాబట్టి మనసుని స్థిరపరచుకోవడానికి నేను ధ్యానంలో కూర్చోవాలి అనుకుంటున్నాను అనేసరికి…


సరేనమ్మా!  మేం కూడా కూర్చుంటాము అని అక్కడే ఉన్న చెత్తాచెదారం మీద వీళ్ళిద్దరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు.  ఇలా ముగ్గురూ ధ్యానంలో కూర్చున్నారు.  అర్ధరాత్రి సమయం రెండు గంటలు కావస్తుంది. అక్కడక్కడ కుక్కల అరుపులు, నక్కల అరుపులు,  ఘీంకారాలు ,గుడ్లగూబల అరుపులు తీవ్రస్థాయిలో వినపడుతున్నాయి.  ఎండిపోయిన ఆకుల మీద ఏవో కదులుతున్నట్లుగా….. పాములు పాకుతున్నట్లుగా…. శబ్దాలు వినబడుతున్నాయి.  కప్పలు అరుస్తున్నాయి…. ఈ శబ్దాల మధ్య నిశ్శబ్దంగా మనసు ఆధీనం, అదుపు, నిగ్రహం చేసుకోవడానికి తపన తాపత్రయాలు పడుతూ శివ నందిని ధ్యానంలో ఉండిపోయింది. అలా నిగ్రహం చేసుకోవడానికి తనలో నుంచి సహజసిద్ధంగా వచ్చే ఓంకార నాదమును వినటానికి ప్రయత్నం చేస్తూ ధ్యానంలో ఉండిపోయింది. అలా కొంతసేపు అనగా సుమారుగా….. ధ్యానంలో ఉండి ఓంకార నాదమును,  సహజసిద్ధంగా వింటూ ఉండేసరికి…. తన మనస్సు అదుపులోకి వచ్చింది. ఇక తను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.  దీని గురించి ఆలోచన అవసరం లేదు…. అని అనుకుంటూ ఉండేసరికి,  ఈ పిల్లలిద్దరూ కూడా గది బయటకు వచ్చేసరికి…. పులి వెంటపడుతున్నట్టుగా ధ్యాన అనుభవం అయింది. పిల్లలు బయటికి రావటం ఏమిటి? ధ్యాన అనుభవం అవ్వటం ఏమిటి? ఇదంతా కూడా కల్పితం.  చస్తే చస్తారు పిల్లలు.  నాకు సంబంధం లేదు కదా!  నా పుత్రులు కాదు కదా!  ఉంటే నా పుత్రులు…. లేకపోతే శివ పుత్రులు…. పిల్లలు బతికి ఉంటే శివప్రసాదం అనుకుంటాను… పిల్లలు చనిపోతే శివార్పితం అనుకుంటాను… అని మనసు నిగ్రహం చేసుకొని జరిగే ధ్యాన దృశ్యాల కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు…. అనుకొని ఆమె లేచి నడుచుకుంటూ వెళుతూ ఉండేసరికి…. వీరిద్దరికీ కూడా ధ్యాన భంగమై రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా పది అడుగుల వెనుక ఉంటూ ఇష్టకామేశ్వరి గుడికి చేరుకోవడం జరిగింది.


ఇలా వీళ్ళ ముగ్గురు కాస్త… ఇష్ట కామేశ్వరి గుడి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.  గుడి చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. గుడి ద్వారం కూడా ఒక మనిషి లోపల పట్టే విధంగా ఉంది.  విగ్రహం చూడటానికి రెండు చేతుల్లో పద్మాలు ఉండి, ఒక చేతిలో అక్షరమాల, ఒక చేతిలో శివలింగం పట్టుకున్నట్లుగా ఉంది. మనిషి ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్లి విగ్రహాన్ని తాకి కూర్చోవచ్చు.  కానీ లోపల  నుంచునే  అవకాశం లేదని… వీళ్ళ ముగ్గురు గ్రహించారు.  మొదట రుద్ర స్వామి లోపలికి వెళ్లి… అమ్మవారి నుదుటన తాకగానే మనిషి నుదురు  ఉన్నట్లుగా అనిపించింది.  అక్కడ కుంకుమ ఉండేసరికి….కుంకుమ పెట్టి అమ్మ ! అంతా నీదే రక్ష.  నువ్వే సాధన పరిసమాప్తి చేయడానికి ఇష్ట లింగం శివ నందినికి ఇస్తానని ధ్యానానుభవంలో చెప్పావు.  కానీ ఆ అమ్మాయికి దానికి పరీక్షలు పెడతా అని చెప్పావు . కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో… చేసుకో! నేను ఎలాంటి అభ్యంతరం పెట్టను . మహాదేవి కూడా ఏమీ పెట్టదు.  మేము ఇద్దరం మౌనంగా సాక్షి భూతంగా చూస్తూ ఉంటాము. 


ఆవిడని చంపుతావో ….చంపే శక్తి ఇస్తావో….నీ ఇష్టం అని మనసులో అనుకుని…. బయటకు వచ్చాడు.  ఆ తర్వాత మహాదేవి కూడా వెళ్లి అక్కడ ఉన్న కుంకుమతో నుదుటన కుంకుమ పెట్టేసరికి మానవ మాత్రులకి నుదుటున కుంకుమ పెట్టినట్టుగా భావన కలిగింది.  అమ్మవారిని సజీవ మూర్తిగా చూస్తున్నట్లు అనిపించింది.  కళ్ల వెంట నీరు ధారగా వచ్చాయి.  అదుపు చేసుకుంటూ…. అంతా నీదే భారం తల్లి.  చేసేది చేయించేది నువ్వే. నీ మోక్షం కోసమే మేము సాధన చేస్తున్నాము ….  తపన, తాపత్రయం పొందుతున్నాము.  అందులో శివ నందిని నువ్వు ఎంచుకుంటావా? …. లేదా?  అనేది… ఇక నీ ఇష్టం అని బయటకు వచ్చింది.  ఆ తరువాత శివ నందిని లోపలికి వెళ్ళింది.  ఈ శివ నందిని ఆరడుగుల శరీరం.  భారీ విగ్రహం.  ఆమె ఒక పట్టానా లోపల కూర్చోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాగే సాష్టాంగ నమస్కారాలు చేసుకొని,  కుంకుమ తీసుకొని, ఆమె నుదుటన కుంకుమ పెట్టే సరికి…. ఏదో తెలియని ఆవేదనకి గురి అవుతూ…. కళ్ళ వెంట నీళ్లు వస్తూ…. అమ్మ!  ఇంతవరకు ఒక విగ్రహ మూర్తిలో సజీవ తత్వమును చూడలేదు. నీకు కుంకుమ పెడుతూ ఉంటే అమ్మవారే ఒక స్త్రీ మూర్తిగా వచ్చి కుంకుమ పెట్టించుకున్నట్లుగా అనిపిస్తుంది.  సజీవ మూర్తిగా ఉన్నావు తల్లి… నువ్వు రమ్మన్నావని ఇక్కడికి వచ్చాను.  శివ స్వామి ఆజ్ఞ ప్రకారం, నీ దగ్గర ఇష్ట లింగం ఏదో ఉందంట… అది పొందాలని అన్నారు.  దానికి ఏదో అర్హత పరీక్షలు పెడతాను అని అన్నావు? కాబట్టి దానికి నాకు అర్హత ఉంటేనే అనుగ్రహించు.  అర్హత లేని మరుక్షణం ఈ దేహం కృష్ణ నదిలో నిమజ్జనం చేసేస్తాను.  అర్హత లేనప్పుడు, ఓడిపోయినప్పుడు సాధనకి పనికిరానప్పుడు…. ఇక ఈ దేహంలో నేను ఉండటం వల్ల ఉపయోగం లేదు.  మూర్ఖత్వమే కదా అని అనుకొని… అలాగే పాకుతూ బయటకు వచ్చేసింది. ఎవరికి వారే ధ్యానంలో కూర్చున్నారు.  ఉన్నట్టుండి ధ్యానంలో రెండు పర్వతాల మధ్యన సూక్ష్మ శరీరధారిగా ధ్యాన నిష్ఠ లో ఎముకల గూడు శరీరంతో ఉన్న ఒక వయోవృద్ధుడు కనిపించాడు. సుమారుగా ఆయనకి వెయ్యి సంవత్సరాల వయసు పైబడే ఉంటుందని శివ నందిని అనుకుంది.  ఆయన్ని ధ్యానంలోనే చూస్తూ ఉండేసరికి …..కళ్ళు ఆయన రూపాన్ని చూస్తూంటే .. ఆయన బక్కపలుచని  శరీరం, ఎముకల గూడు…. అలాగే శరీర భాగాలైన గుండె , కాలేయం లాంటిది కూడా కనిపించే అంతలా నరాలు, నాడులతో సహా కనిపించే అంత….పలుచని శరీరంతో కనిపించేసరికి, ఒకవేళ ఈయన సజీవ మూర్తిగా ఉన్నాడా?  లేక జీవ సమాధి చెందాడా ? ఈయన ఎవరు!  ఎందుకు కనపడుతున్నారు…. అని కళ్ళు తెరిచి చూసేసరికి ఈ గుడి వెనక వైపు ఉన్న చెట్ల మధ్యలో…. రెండు పర్వతాల మధ్యలో ఈయన ధ్యాన నిష్ఠలో ఉన్నట్టుగా కనిపించారు. ఓహో !  ఈయన సినారే స్వామి.  స్వామి ! నమస్కారాలు అనుకొని ఆయన్ని అలా చూస్తూ ఉంది.  ఆయన ధ్యాననిష్టలో అలాగే ఉండిపోయారు.  కదలట్లేదు…. మెదలట్లేదు.  సరే అని రుద్ర స్వామి మరియు మహాదేవి కేసి శివ నందిని తేరిపారా చూసింది.  కానీ వాళ్ళిద్దరూ కూడా తీవ్రమైన ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉన్నారు.   వాళ్ళ ధ్యానానికి భంగం కలిగించకూడదని ఎదురుగా సజీవ మూర్తిగా ధ్యానంలో కనిపిస్తున్న సినారే మూర్తిని చూస్తూ ఉండిపోయింది.  ఆయన కొన్ని క్షణాల పాటు అలాగే ఉండి, ఆ తరువాత అదృశ్యమయ్యారు.  ఓహో!  ఈయన సిద్ధ మార్గంలో సాధన చేసినట్లయితే…. రస విద్యల  గురించి జ్ఞానబోధ చేసి ఉండేవాళ్లేమో!  రసవిద్యా గురువులు అయి ఉండే వాళ్లేమో!  తను రసవిద్య గురించి సిద్ధ మార్గంలో లేకపోవడం వలన… సజీవ మూర్తిగా నేను ఉన్నాను అని నిరూపణ ఇచ్చి అదృశ్యం అయి ఉంటారని ధ్యానంలో కూర్చుంది. 


ఇంతలో తనకి ఇష్టమైన పదార్థాల వాసన వస్తూ ఉండేసరికి…. ఎక్కడా! ఏంటి? అని చూసేసరికి…. తనకి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకువచ్చిన…. ఆటవిక జంట కనపడ్డారు.  వీళ్ళు ఎవరు?  ఇంత అర్ధరాత్రి చీకట్లో…. వీటిని ఎవరు తీసుకువచ్చారు….ఎవరు తెమ్మన్నారు…. తనకి ఇష్టమైన ఆహార పదార్థాలు,  అనుకుంటూ ఉండేసరికి…. ఇది ధ్యానంలో  కనిపించింది కాబోలు అని కళ్ళు తెరిచి చూసేసరికి…..నిజంగానే ఇద్దరు ఆటవిక ఆదిదంపతులు…. “అమ్మ!  నీకు ఇష్టమైనవి ఇవి.  నువ్వు అడవిలో ఉన్నావు.  ధ్యానం చేసుకుంటున్నావు.  ఆకలి మీద ఉన్నావు అని తెలిసి నీకు ఇష్టమైన పదార్థాలు మనో జప సిద్ధితో తెలుసుకున్నాము.  మేము తయారు చేసి తీసుకు వచ్చాము.  నువ్వు ఇక్కడికి వస్తావని మాకు మధ్యాహ్నమే తెలిసింది.  మంచి ఆకలి మీద ఉన్నావు కదా!  ఈ ఆహార పదార్థాలు తిను…” అని అంటూ ఉండేసరికి…. ఏమీ చేయలేని, అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయింది. చూడ్డానికి నోరు ఊరుతున్నాయి.  పదార్థాల వాసనకి మనసు లాగేస్తుంది. పైగా వీళ్ళు అమాయకులు. ఆటవిక జాతికి చెందినవారు. వీళ్ళకి పాపపుణ్యాలు తెలీదు. ఆకలి తీర్చే వాళ్లే . దైవ సమానం.  సాక్షాత్తు ఈ గూడెం వాసులందరూ కూడా బ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురు గాను మల్లికార్జున స్వామిని తన అల్లుడు గాను భావించుకొని ఆరాధన చేసే ఆరాధకులు. భక్తి తత్పరులు అని అనుకుంటూ…. లేదు స్వామి!  నాకు ఆకలిగా లేదు .తినాలని లేదు. ఆకలి ఉన్న నాకు అవసరం లేదు. నాకు ఆహారం గురించి ఆలోచన లేదు. ఆహారం అవసరం లేని జన్మ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆకలి లేని జన్మ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వీటి గురించిన ఆలోచన చేశాను అంటే…. ఆకలి జన్మ కోరుకున్నట్టే కదా!  నాకు ఆకలి లేని జన్మ కావాలి అని అనేసరికి…. తధాస్తు అని వాళ్ళు ఉన్నట్టుండి…. అందరూ మాయం అయ్యేసరికి ఓహో!  ఇది కూడా ఒక మాయ అన్నమాట!  అమ్మవారి పరీక్ష అన్నమాట …హృదయ చక్రంలో వచ్చే ఇష్ట లింగం రెండు రకాల పరీక్షలు పెట్టడం జరుగుతుంది కదా!  ఇష్టపదార్థమాయ, ఇష్ట కోరిక మాయ అని చెప్పడం జరిగింది కదా!  ఇప్పుడు ఇష్టపదార్థమాయను దాటినట్టు ఉన్నాను…. ఇంకో పది నిమిషాల పాటు ఉండి ఉంటే,  తనకి ఉన్న ఆకలికి లేచి వెళ్లి  ఎగబడి మరి తినే పరిస్థితుల్లో తను ఉన్నదని… శివ నందిని తెలుసుకుంది . ఇంతలో బాలగణపతి ఉండ్రాళ్ళ ఇష్ట కోరికను దాటలేక తిన్న విషయం గుర్తుకు వచ్చి నవ్వుకున్నది . సరేలే!  అని ధ్యానంలో కూర్చుంది.  ఈసారి ధ్యానంలో ఎలాంటి ధ్యాన దృశ్యాలు కనిపించలేదు . మనోనేత్రం మూసుకుపోయిందా? అనిపించేంత భయం కలిగింది .మనోభయం కలిగింది. మనోనేత్రం ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? పోయిన దాని గురించి మనం ఏం ఆలోచించక్కర్లేదు కదా! అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నప్పటికీ…. కూడా ఉన్నట్టుండి, ధ్యాన దృశ్యాలు చూపించే మనోనేత్రం ఎలా మూసుకుపోయింది.  ఇప్పుడు ఈ మనోనేత్రం మూసుకుపోతే,  తను ధ్యాన దృశ్యాలు ఎలా చూడగలుగుతుంది. భవిష్యత్తు సాధన ఎలా చేయగలుగుతుంది అని…. మనసుకు మనోవేదన గురి అవ్వడం మొదలు పెట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూసుకుంది. చుట్టూ ఏమీ లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరికి వారే ధ్యానంలో ఉన్నారు. సరే!  అని మళ్లీ కళ్ళు మూసుకొని కూర్చుంది. గుడి కనపడుతుందేమో అనుకుంది. శివ స్వామి కనపడతాడేమో అని శివ స్వామిని తలచుకుంది. ఎంతసేపు తలచుకున్నా శివ స్వామి కనిపించకపోయేసరికి ….ఇక అనుమాన భయం మొదలయ్యింది.  తలుచుకోగానే కనిపించే శివస్వామి ధ్యానంలో తనకి కనిపించట్లేదు.  అంటే తనకి మనోనేత్రం మూసుకుపోయింది.  అంటే ఇప్పుడు ఇష్టకామేశ్వరి గుడికి రావడం వలన, ఆవిడకి నుదుటిన కుంకుమ పెట్టడం వలన, ఆజ్ఞా చక్రంలో ఉండే తన మనో నేత్రము ఈమె తీసేసుకుందా…. అని ఆందోళన చెందింది. మనసు పరివిధాలుగా ఆలోచిస్తుంది. 


పలు రకాల ఆలోచనలు, భయాలు వస్తున్నాయి.  ఇప్పుడు మనోనేత్రం తెరుచుకోకపోతే ఏం జరుగుతుంది లే!  ఏమైతే అది అవుతుందిలే! అని ఒకపక్క అనుకుంటున్నప్పటికీ….. కూడా ఒకపక్క ధైర్యం లేకుండా భయానికి గురి అవుతూ…. మానసిక వికలం అవుతుంది.  చెప్పేవాడు కనిపించట్లేదు , అనుకోగానే కనిపించే శివ స్వామి కనిపించట్లేదు అని అనుకుంటూ ఉండేసరికి…. ఏం చేయాలో అర్థం కాక… మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది.  తీక్షణంగా అమ్మవారి గుడిని మనసులో ఊహించుకుంటూ….భావన చేసుకుంటూ…. మళ్లీ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పటికీ…. ఆ గుడి ధ్యానంలో కనిపించలేదు. ఇలా కాదనుకొని ఇందాక సినారే స్వామి కనిపించారు కదా!  ఆయన వల్ల తన మనోనేత్రం మూసుకుపోయిందా అని సినారే స్వామి శక్తికి తన మనోనేత్రం లేకుండా పోయిందా అని…. ఆవేదన చెందుతూ ఇక ధ్యానంలో కూర్చోలేకపోయింది.  ఉండబట్టలేక పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కోపావేశాలకు గురి అయింది. ఆ పక్కనే ఓ చెట్టు ఉంటే ఆ చెట్టుకి తల వేసి కొట్టుకుంది.  బండకేసి బాదుకుంది. చచ్చిపోవాలని అనుకుంది. అయినా రక్తం కారుతూ తీవ్రమైన వేదనకి గురి అవుతున్న కూడా….. అర్థం కాని పిచ్చిలోకి వెళ్లిపోయింది.  ఉన్న ఒకేఒక సిద్ధిని కూడా తను కాపాడుకోలేకపోయింది.  తన మనోనేత్రంతో ఇప్పటిదాకా…. ధ్యాన దృశ్యాలు చూడడం జరిగింది.  అనుకున్న వ్యక్తిని మనసులో చూడడం జరిగింది. అలాగే రాబోయే ధ్యాన దృశ్యాలు కనబడడం జరిగింది.  ఇప్పుడు కనపడకుండా పోయింది.  ఇప్పుడు మనోనేత్రం తెరుచుకోవాలంటే…. ఏం చేయాలి.? ఎలా చేయాలి? అని అనుకుంటూ ఉండేసరికి…. ఏమీ తెలియని, అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటూ ఉండేసరికి,  ఆక్రందనకి గురి అయ్యేసరికి…. ఆ గుడి చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం కాస్త ఆమె అరుపులకి, కేకలకి ఒక్కసారిగా నిశ్శబ్దం చేధనమైంది. ప్రశాంతంగా ఉన్నది కాస్త అశాంతిగా మారింది…ఇలా కాదనుకొని ధ్యానంలో కూర్చుంది. మనసు నిలబడలేదు . ధ్యాన దృశ్యాలు కనిపించట్లేదు.  మనోనేత్రం తెరుచుకోవట్లేదు అని మనోవేదన మొదలయ్యింది.  అనుకోకుండా తను చేసిన తప్పు…. సజీవ మూర్తిగా సినారే స్వామిని చూడటం వలన…. ఆ శక్తికి మనోనేత్రం మూసుకుపోయిందని….ఆలోచనలు చేస్తూ…. ఆవేదన చెందుతూ…. అలాగే నిద్రపోయింది.  కొంతసేపు అయిన తర్వాత మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి వీరిద్దరూ అలాగే ధ్యానంలో ఉన్నారు.  కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చునే సరికి… మనో నేత్ర దర్శనం కనిపించలేదు.  చూద్దామన్న గుడి కనిపించట్లేదు.  తలచుకోగానే కనిపించే శివ స్వామి కనిపించట్లేదు.  ఇక్కడేదో జరిగింది….. మనోనేత్రం శాశ్వతంగా మూసుకుపోయింది అనుకుంటూ….. అలాగే ఉండిపోతుండగా….. అసలు మనోనేత్రం గురించి తను ఎందుకు ఆలోచిస్తుంది ……కాశీలో త్రైలింగస్వామి అనుగ్రహం వలన మనోనేత్రం తెరుచుకుంది….. ఆయన ధ్యాన దృశ్యాలు చూడటానికి ఉపయోగపడుతుందని చెప్పారు…. నిజానికి అది ఆజ్ఞ చక్రంలో కదా తెరుచుకోవాలి…. ఆజ్ఞ చక్రంలో జాగృతి, శుద్ధి ,ఆధీనం అయినప్పుడు తెలరుచుకుంటుంది కదా!  అది కాశీ క్షేత్రంలో మళ్లీ ఆయనే తెరిపిస్తారు కదా!  మూసుకుపోయి ఉండవచ్చు… దాని అవసరం అయిపోయి ఉండవచ్చు .. ధ్యాన  దృశ్యాలు చూసి భయపడకుండా….. ప్రకృతి ఈ విధంగా ఏర్పాటు చేసిందేమో అనుకోవచ్చు కదా!  ఇప్పుడు మూసుకుపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను.  ఆవేదన చెందుతున్నాను… ఒకవేళ శాశ్వతంగా మనోనేత్రం మూసుకుపోయినంత మాత్రాన మనకి  ఒరిగిపోయేదేమీ లేదు కదా!  భయపడాల్సింది అంటూ ఏమీ లేదు కదా!  కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎటూ గురువుల రూపంలో…. సాధకుల రూపంలో ….సిద్ధ పురుషులు ఉండనే ఉన్నారు కదా!  మనోనేత్రం కేవలం ధ్యాన దృశ్యములు చూడటానికి ఉపయోగపడుతుంది కదా!  కేవలం మనోనేత్రం గురించి ఎందుకు ఆలోచన చేయాలి… భయపడాలి… బాధపడాలి… అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనోనేత్ర దృశ్యం కనిపించినా ….కనిపించకపోయినా తను ధ్యానం చేసుకుంటూ ఓంకార నాదమును వినటానికి ప్రయత్నం చేయగా అప్పటిదాకా వినిపించని ఓంకారం కాస్త నెమ్మది నెమ్మదిగా వినపడుతూ ఉండేసరికి…. ఏకాగ్రతగా ఆ నాదాన్ని వింటూ సుమారుగా 40 నిమిషాల పాటు ధ్యానంలో ఉండేసరికి అర్ధరాత్రి రెండున్నర సమయంలో ఇష్టకామేశ్వరి గుడి నుంచి కాంతులు వెదజల్లి శివ నందిని మీద పడేసరికి….. అప్పటిదాకా ధ్యానంలో ఉన్న శివ నందిని కాస్త కళ్ళు తెరిచి చూసేసరికి….. ఎదురుగా ఉన్న ఇష్టకామేశ్వరి గుడి లోపల నుంచి వస్తున్న కాంతి కిరణాలను గ్రహించి…. లోపలికి వెళ్ళేసరికి, అమ్మవారి చేతిలో ఉన్న శివలింగం నుంచి కాంతులు వస్తున్నాయని గ్రహించింది.  అక్కడికి వెళ్లేసరికి ఆ శివలింగమును తాకటానికి భయపడుతూ, ఆలోచిస్తూ ఏది జరిగితే అది జరుగుతుంది అని శివలింగమును తాకేసరికి ……ఒక్కసారిగా శివలింగం నుంచి నల్లటి కాంతివంతమైన తామర మొగ్గ లాంటి శివలింగం అగ్ర భాగం లింగభాగం తన చేతిలో పడింది. 


 ఇది చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ…. నిండు నీలంతో ఉన్నదని అర్థం అయ్యింది.  ఇదే కాబోలు …ఇష్ట లింగం అనుకుంటా!  సిద్ధలింగం అయి ఉండాలి.  ఇదే తొమ్మిది రకాల విషాలను కలిపి చేసే నవపాషాన ఇష్ట లింగం అయి ఉండాలి అని…. అనుకొని,  అమ్మ!  నీ పరీక్షల్లో నేను జయం పొందానని నాకు అర్థం అయింది ……ఉత్తీర్ణురాలిని అయ్యానని నాకు ఇష్ట లింగం ఇచ్చావు. ఈ ఇష్ట లింగాన్ని నేను ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఆరాధన చేసుకుంటాను. చచ్చే వరకు ఉంచుకుంటాను. ఎందుకంటే ఈ ఇష్టలింగం మెడలో వేసుకుని ఉంటారు.  వారిని లింగాయతులు అంటారు. వారు చనిపోయిన తరువాత తమ దేహ దహనంతో పాటు తమ ఇష్టం లింగ దహనం కూడా చేసుకుంటారని పరమహంస అనుభవం ద్వారా తెలుసుకున్నాను.  ఇష్ట లింగ ఆరాధన ఎలా చేయాలో….. ఆ విధంగా చేసుకుంటాను.  ఇక ఈరోజు నుంచి దీనిని నా కంఠంలో శివలింగంగా ఆరాధన చేసుకొని పెట్టుకుంటాను.  హృదయ లింగంగా పెట్టుకుంటాను. ప్రాణలింగంగా భావించుకుంటాను. నా దేహదహనంతో పాటు ఈ ఇష్ట లింగం కూడా దహనం అయ్యే విధంగా అనుగ్రహించు తల్లి!  ఇది కర్మ బీజాలకి మూలం అని తెలిసింది.  ఈ ఇష్ట లింగం లేకపోతే…. ఈ ఇష్ట లింగం పోతే కర్మజన్మ రాహిత్య స్థితి వచ్చి మోక్షం పొందడం జరుగుతుందని చెప్పేసి….. హృదయ చక్రం ప్రదేశంలో రావలసిన ఇష్ట లింగం అని నాకు అర్థం అయింది అనేసరికి…. అమ్మవారి విగ్రహం చుట్టూ ఒక ఆరాశక్తి వచ్చి… ఈ ఇష్ట లింగం లోనికి ప్రవేశించటం ఈ ఇష్ట లింగంలోని శక్తినంత తన నుదుటిలోనికి ప్రవేశించి…. తన హృదయ చక్రంలోనికి ప్రవేశించి స్థిరపడినట్లుగా… ధ్యాన అనుభవం అవడంతో తను మనో నేత్రము మూసుకుపోలేదని…. మూసుకుపోయినట్లుగా భ్రమ ,బ్రాంతి అమ్మవారు కలిగించిందని… అదికూడా మనోమాయ పరీక్ష అనుకొని….యధావిధిగా తన మనోనేత్రం తెరుచుకొని ఉన్నదని…. సంతృప్తి పడుతూ గుడి బయటకు వచ్చేసరికి…. తన చేతిలో దివ్య తేజస్సుతో మెరుస్తున్న లింగం శక్తి ధాటికి ధ్యాన నిష్ఠలో ఉన్న రుద్రస్వామి, మహాదేవి కళ్ళు తెరిచి వచ్చిందా! అమ్మ అనుగ్రహించిందా! ఇష్టం లింగం అయిన సిద్ధలింగమును  ఇచ్చిందా! సరే …అయితే ఈ సిద్దలింగాన్ని ధరించు అని తన చేతి సంచిలో నుంచి నల్ల తాడును తీసుకొని….. ఆ ఇష్ట లింగానికి  ముడులు వేసి …..ఇష్ట లింగం మహాదేవి చేత మెడలో శాశ్వతంగా ఉండేటట్లుగా…. శివ నందిని మెడలో వేయడం జరిగింది. అప్పుడు శివ నందిని ఇష్ట లింగం మెడలో వేసుకుని ధ్యానంలో కూర్చునే సరికి దాదాపు …..ఒక గంట రెండు గంటలు ఏకాగ్రత కోసం పట్టే సమయం 15 నిమిషాల్లో మనసు స్థిరమవుతూ…. ధ్యానమునకు ఆసక్తిగా ఉంటుందని గ్రహించింది.. అదేవిధంగా ఆలోచనలు ,మనోవేదనలు, శరీర నొప్పులు కూడా…. శాశ్వతంగా తగ్గిపోతున్నట్లుగా అనిపించింది.  సరే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఉండేసరికి….. ఈ ఇష్టలింగం చూసి దూరంగా ఉన్న కృష్ణ స్వామి,  యోగాంబిక కాస్త నిట్టూర్చుకుంటూ  మన ప్రయత్నాలు వృధా అయినాయి.  ఎన్ని మనోవేదన ధ్యాన దృశ్యాలు చూపించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఇష్ట లింగం పొందింది.  నెమ్మది నెమ్మదిగా ఈమె కూడా పరమహంస లాగా స్త్రీ ప్రకృతిని ఆధీనం చేసుకుంటుందేమో….. చూసుకో!  అని యోగాంబిక అనేసరికి,  ఇష్టం లింగమును పొందినంత మాత్రాన అన్ని అయిపోయినట్టు కాదు కదా!  ఇల్లు అలికినంత మాత్రాన పండగ అయినట్టు కాదు కదా!  ఇప్పుడే ఆరంభం చేసింది.  ఆరంభంలో ఉత్సాహం ఉత్సుకత ఉంటుంది కదా! దానితో మాయలు, మర్మాలు దాటుకుంటూ వచ్చింది. అంతేగాని లోపలికి వెళ్లేసరికి ఎన్ని మాయలు, ఎన్ని మర్మాలు ఉంటాయో…..ఆదిపరాశక్తి ఎన్ని రహస్యాల్లో పెట్టిందో…. తెలుసు కదా!  ఆ రహస్య చేదన చేసేసరికి… మనసు, శరీరం అలసిపోతాయి.  నీరసించిపోతాయి.  ఆమె అంతరించిపోతుంది. ఇక్కడిదాకా వస్తుందని నేనైతే అనుకోను.  మన ప్రయత్నాలు మనం చేస్తాము. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.  ఎవరు జయం పొందుతారో కాల నిర్ణయానికి వదిలేద్దాము.  మనమెందుకు నిరుత్సాహపడాలి…. ఒకటి పొందినంత మాత్రాన అన్ని పొందినట్టు కాదు కదా!  అన్ని పొంది ఒకటి పొందకపోయినా ఉపయోగం లేదు.  చూసుకో!  మూలం ఆదిపరాశక్తి లో ఉంది.  ఇవన్నీ కూడా ప్రతిబింబాలే.  ప్రతిబింబాలు ఎన్ని పొందినా కూడా ఉపయోగం లేదు.  అసలు సిసలైన  కారుంగలి శివలింగానికి ఆమె చేరుకోవాలి కదా!  అసలు శివలింగం ఆరాధన ఉన్నట్టే ఎవరికి తెలియదు కదా!  ఒక  పరమహంసకి తప్ప ఎవరికీ తెలియదు.  లింగ పురాణంలో కూడా చెప్పనివ్వకుండా ఆదిపరాశక్తి ఆపివేసింది కదా!  మనమెందుకు భయపడాలి.  మూలజ్ఞానం అంతా…. మూల శక్తి అంతా అమ్మవారు ఆదిపరాశక్తి చూసుకుంటుంది.  ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.  ఇక్కడ నుంచి వెళ్దాం పద! మనం వెంబడిస్తున్నాము అని శివ నందిని కి అర్థం అయిందంటే…. మనకి లేనిపోని సమస్యలు శివ స్వామి చేస్తాడు.  తన సాధనకి అడ్డం వస్తున్నామని మనల్ని ఏమైనా చేయొచ్చు.  కాబట్టి మనం గుప్తంగా ఉండిపోదామని…. వాళ్ళిద్దరూ యధావిధిగా దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలోకి కృష్ణస్వామి ,యోగాంబిక వెళ్ళిపోయారు.  ఆ తర్వాత కొంతసేపు ధ్యానంలో ఉండి, ఆ తర్వాత ఇష్టం లింగమును తీసుకొని మహాదేవి, రుద్ర స్వామి శివ నందిని తన మెడలో ఉన్న ఇష్ట లింగమును కళ్ళకి అద్దుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. సినారే స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. వీళ్ళ ముగ్గురు గది వైపుకు రావడం జరిగింది.


ఈ గది తెరిచి చూసేసరికి… గదిలో పిల్లలు లేకపోయేసరికి…..మహాదేవి, రుద్రస్వామి ఆందోళన చెందారు.  కానీ శివ నందిని ఆందోళన చెందలేదు. కారణం ఏమిటంటే…. పులి వెంటపడిన ధ్యాన  దృశ్యం నిజమే అన్నమాట!  అనుకుంటూ రుద్రస్వామితో…. అయ్యా! పిల్లలు ఒంటేలు కని లేచినప్పుడు ఒక పులి వీళ్ళని వెంబడిస్తున్నట్టు ధ్యాన దృశ్యం కనిపించింది. ఆ పులికి వీళ్ళు బలయ్యారో …లేక ఏ మూల ఉన్నారో నాకు తెలియదు.  నా పుత్రులు అయితే శివప్రసాదం అనుకుంటాను. ఆ పులికి ఆహారం అయితే శివార్పితం  అనుకున్నాను.  ఒకవేళ అది ధ్యాన అనుభవం లేదా భ్రమ ,బ్రాంతి అనుకున్నాను. కానీ అది నిజమని నాకు అర్థం అయింది. పిల్లల్ని ఏదో పులి వెంటపడినట్టుంది. ఎత్తుకెళ్లిపోయినట్టుంది అనేసరికి…. పిల్లలు ఇద్దరు కూడా బయటనుంచి లోపలికి వచ్చి ….“అమ్మ! పులి గాండ్రింపులు వినపడ్డాయి.  కానీ మా దగ్గరికి వచ్చేసరికి….. నా దగ్గర ఉన్న త్రిశూలం దానికి చూపించాను….అనేసరికి అన్నయ్య భయపడ్డాడు……  ఒరేయ్ దాని ముందు నీ త్రిశూలం ఎంత? అది రెండు అడుగులే… పులి పది అడుగులు ఉంది. ఒక పంజా విసిరిందంటే ఇద్దరం చచ్చిపోతాము… అని వాడు భయపడి నన్ను భయపెట్టాడు. లేకపోయి ఉంటే ఈపాటికి పులిని చంపేసేవాడిని… చంపి ఆ చర్మాన్ని నీకు చూపించేవాడిని.. పులి చర్మం ఈ పాటికే వేసుకునే వాడివి. వాడు పెద్దగా అరుపులు అరిచేసరికి …..చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి పులి వచ్చింది…. పులి వచ్చింది….పిల్లల మీద దాడి చేస్తుందేమో అని…. గబగబా కర్రలు పట్టుకొని లాంతర్లు పట్టుకొని వచ్చేసరికి….వాళ్ళు చేసిన డప్పు చప్పులకి పులి పారిపోయింది.  లేకపోయి ఉంటే ఈపాటికి పులిని నేను చంపేసేవాడిని” అని అంటూ ఉండేసరికి…..వీడి బుల్లి బుల్లి . మాటలకి…. అమ్మ!  వీళ్ళు దత్తపుత్రులు అయినప్పటికీ, యోగ పుత్రులు అయినప్పటికీ, నీ పుత్రులుగానే నువ్వు భావన చేసుకున్నావు.  వాళ్లని అలాగే చూసుకున్నావు.  కాకపోతే నీ పుత్రులు అనుకుంటే శివప్రసాదం అనుకున్నావు.  ఒకవేళ వీళ్ళు చనిపోతే శివార్పితం అనుకున్నావు.  సరే దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది.  వీళ్ళు మృత్యుగండం దాటారు కదా!  ఇక విశ్రాంతి తీసుకో రేపు పొద్దున్న చూద్దాం అనగానే…. శివ నందిని మెడలో శివలింగం లాగా కనిపించేసరికి బాలగణపతి ఉన్నట్టుండి “అమ్మ! ఇది ఎప్పుడు కొన్నావు… నాకు చెప్పను కూడా చెప్పలేదు. నాకు కూడా కొనొచ్చు కదా! నీకేం చెప్పాను…. ఎప్పుడు నువ్వు ఏం కొనుక్కున్నా నాకు కూడా కొనాలని చెప్పాను కదా! ఏంటి సగం కాయ లాగా ఉందేమిటి ?ఇదేంటి మెరుస్తుంది….. నల్లగా ఉంది…. ఏంటిది!  నాకు కూడా కొంటావా? నాకు కూడా ఇస్తావా…. అంటే కొన్నది కాదు,  ఇది అమ్మ ఇచ్చింది.  అంటే అమ్మకి అమ్మవారు ఇచ్చిందా!  ఇది ఏంటో విచిత్రంగా ఉందే…… ఓహో!  ఇష్టకామేశ్వరి గుడికి వెళ్తా అన్నారు కదా!  ఇష్ట లింగం అదేదో సిద్దలింగం ఏదో తెచ్చుకుంటాను అన్నావు కదా!  ఇదా…! అంటే అక్కడ అమ్మ పెట్టిన పరీక్షలు జయం పొందావన్నమాట! ఉత్తీర్ణత సాధించావన్నమాట! అందుకని అమ్మ ఇచ్చిందన్నమాట! నీకు ఇచ్చింది. నాకు ఎప్పుడు ఇస్తుందో లే! నీకు ఇచ్చినప్పుడు నాకు ఇస్తుందిలే! అమ్మకి ఇచ్చినప్పుడు కొడుక్కి ఇవ్వకుండా ఉంటుందా..! అనేసరికి నీకు కావాలంటే నా దగ్గర ఉంది రా! అని బాల కుమారస్వామి తన చేతి సంచిలో నుంచి,  ఇష్టం లింగం తీసి పిల్లాడికి ఇచ్చేసరికి….. ఓరిని ….! నీ దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయిరా… ఏది కావాలంటే అది సంచిలో నుంచి తీస్తున్నావు…. నిజంగా సంచిలో నుంచి తీస్తున్నావా…. సంచిలో నుంచి సృష్టించి ఇస్తున్నావా…. సంచి చూస్తే ఖాళీ సంచి లాగా ఉంటుంది.! ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీస్తున్నావు ….సరేలే! అమ్మదేమో మూడు అంగుళాలు ఉంది. నాదేమో అరంగుళం ఉంది. అంటే కణుపంత ఉంది . సరేలే….. అమ్మో!  నీ దగ్గర పెద్ద సిద్ధ లింగం …..నాదేమో చిన్న సిద్ధ లింగం.. అవును దీనిని నేను ఎలా మెళ్ళో వేసుకోవాలి అనగానే…రుద్రస్వామీ,నేను దానికి ఏర్పాట్లు చేసి ఇస్తాను….. దాన్ని తాడుతో కట్టేసి ఇస్తాలే!  రేపు ఉదయం వేసుకో… అంటే బాల  గణపతి రేపు ఉదయం వేసుకోను….నాకు ఇప్పుడే కట్టి మెడలో వేస్తేనే…. నిద్రపోతాను. లేదంటే నిద్రపోను.. అనేసరికి మహాదేవి వీడు మొండోడు…. మొండి పట్టు పట్టాడు అంటే వదిలిపెట్టడు.  ఇక చచ్చినట్టు శివ నందినికి ఎలా అయితే మెడలో వేసావో…. వీడికి కూడా తాడుతో లింగాన్ని తయారు చేసి ఇవ్వు…అనగానే ఇక పిల్లాడు ముచ్చట పడుతున్నాడని… రుద్ర స్వామి చేతి సంచిలో నుంచి తాడు తీసి,  శివలింగానికి చుట్టి, మెడలో వేసుకోవడానికి వీలుగా ….ఏర్పాటు చేసి శివ నందిని చేత బాల గణపతి మెడలో శివలింగాన్ని వేయించాడు. అలాగే బాల కుమారస్వామికి కూడా మెడలో సిద్ధ లింగమును వేయించాడు.  ప్రమాదాలు అనేవి ఉండవు.  ఈ లింగాలు మీతో పాటే ఉండాలి. మీరు దహనం అయిపోయినప్పుడు ఈ లింగాలు కూడా దహనం అయ్యేటట్టుగా చూసుకోండి.. అని రుద్ర స్వామి చెప్పేసరికి,  అలాగే అని ముగ్గురు అనేసరికి ….ఎవరికి వాళ్లే విశ్రాంతి  తీసుకోవడానికి…. ఎవరి మంచాల మీద వాళ్ళు దొర్లుతూ…… ఆనందంతో ప్రశాంతంగా ఉన్నారు . శివ నందిని పడుకోబోతుండగా శివ స్వామి కాస్త,  ధ్యానంలో కనిపించి… భళా శివాని! భళా .  విజయం సాధించావు.  నేను నీకు దగ్గరగా ఉందాం అనుకున్నా కానీ,  ఉండలేకపోయాను.  ఇష్టకామేశ్వరి నన్ను దూరంగా ఉండమని చెప్పి అనుజ్ఞ ఇచ్చింది.  మానసికంగా,  శారీరకంగా నువ్వు సిద్ధపడాలి. సమస్యలు, మాయలు ఎదుర్కోవాలని అన్నారు.  ఇంక అమ్మ మాట కాదనలేక నీడలాగా ఉండవలసిన వాడిని కాస్త తప్పుకున్నాను. అందుకనే నువ్వు ధ్యానంలో పదేపదే నా గురించి ఆలోచన చేసి తలచుకున్న కూడా నీకు మనో నేత్రం ముందు కనిపించలేకపోయాను.  కనిపించకుండా అమ్మవారి చేసింది.  నన్ను ఏమనుకోవద్దు అంటే…. నాకు అంతా తెలుసు స్వామి!  అమ్మ చేసింది కూడా మంచిదే కదా …అర్హత ఉందో లేదో పరీక్ష పెట్టాలి కదా…. ఎవరు పడితే వాళ్ళు మోక్షసాధనకి ప్రయత్నాలు చేస్తే విశ్వమోక్షం పొందుతారా!  విశ్వనాశనం చేస్తారా!  అని వాళ్ళ పరీక్షలు పెట్టుకుంటారు కదా!  నేను విశ్వ రక్షకురాలిని అని తెలుసుకున్నారు.  విశ్వనాశనం చేయనని ఆమె గ్రహించారు.  అందుకని నాకు ఇష్ట లింగం ఇచ్చారు. మీరు నాకు నీడలాగా నాకు  అండగా ఉండి…నాకు సహాయ సహకారాలు అందిస్తూ… సలహాలు ఇస్తే చాలు. నేను సాధనలో ముందుకు వెళ్తూ ఉంటాను.  మీరు ఉన్నారని మనోధైర్యంతో నేను వేటి గురించి ఆలోచించను… భయపడను… కాకపోతే ఏంటంటే మాయలు ఎలా ఉంటాయి? ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయి? భయపెట్టే విధంగా ఏ విధంగా మాయలు చేస్తారనేది …..కృష్ణస్వామి మరియు యోగాంబికా లీలలు ధ్యానా అనుభవాల ద్వారా చూశాను. నాకు అర్థం అయింది . సాధన ఆటంకాలు, అవాంతరాలు అన్నీ ఇలాగే ఉంటాయని గ్రహించాను. ఇది కూడా ఒకందుకు మంచిదేలే!  ఇందులో మీ తప్పేముంది… అనేసరికి శివ స్వామి మంచిది…శుభం భూయాత్….రేపు పొద్దున కలుద్దామని అంతర్ధానం అయిపోయారు. శివ నందినితో పాటు అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా గాఢ నిద్రలోకి జారుకున్నారు.


తెల్లారేసరికి అందరూ నిద్రలేచి…ముఖ ప్రక్షాళనం గావించుకొని,  స్నానానికి అని పాతాళ గంగ వైపు బయలుదేరారు.  300 మెట్లు కిందకు దిగుతూ ఉండేసరికి….లింగాల గుట్ట ప్రాంతం ఒకటి కనపడింది.

లింగాల గట్టు/లింగాల గుట్ట 


 ఆ ప్రాంతం పేరు చదువుతూ రుద్రస్వామి కేసి చూసి ….,ఇదేంటి…ఈ  పేరేంటి ఇలా ఉంది అనేసరికి…. పూర్వకాలంలో శైవులు ,మహా శైవులు, వీర సైవులు,  అని శివ దీక్షాపరులు ఉండేవారు.  వాళ్ళు ఈ పాతాళగంగ ఒడ్డున ఉన్న నల్ల రాళ్ళని సేకరించి… ఆ నల్ల రాళ్ళను ప్రాణలింగాలుగా ధరించేవాళ్లు. ఇప్పుడు రాత్రి శివ నందినికి వచ్చిన సిద్ధ లింగమైన ఇష్ట లింగం ఎంత శక్తివంతమైనదో…. ఆ నల్ల సాలిగ్రామాలు లేదా బాణలింగాలు అని…. వాటినే ప్రాణలింగాలుగా ఆరాధన చేసేవారు.  ఆ తర్వాత బసవేశ్వరుడు అనే యోగి ధ్యాన  అనుభవాలతో నవపదార్థాలతో ఇష్ట లింగం తయారు చేయడం జరిగింది. అంటే అరిషడ్వర్గాలు ఈ సిద్దలింగం ధరించడం వలన అదుపులోకి వస్తాయి.  సప్త వ్యసనాలు దూరం అవుతాయి.  కోపావేశాలు తగ్గుతాయని,  కామా వేశాలు తగ్గుతాయని చెప్పడం జరిగింది. దీనికి ఇష్టపదార్థాలు, ఇష్ట కోరికలు ఇష్టమాయలు చెప్పడం జరిగింది.  వీటిని జయించాలి… నిగ్రహం పొందాలి… దశ ఇంద్రియాలను కూడా నిగ్రహం పొందే విధంగా , ఎవరైతే ఇష్ట లింగమును ధరిస్తారో వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పేసరికి…. బసవేశ్వరుడు అనే యోగి లింగాయతులు అని మత ధర్మ విధానం పెట్టడం జరిగిందని చెప్పాడు. ఓహో!  అవునా!  ఇప్పుడు ఈ  నల్ల రాతి బాణ లింగాలకి, ఇష్ట లింగాలకి ఒకే రకమైన శక్తి ఉంటుందా?  అంటే ఇష్ట లింగం అనేది మానవమాత్రులు తయారు చేసేది…. ప్రతిష్ట లింగం లాంటిది.  ఈ నల్ల బాణ లింగం అనేది దొరకడం చాలా అరుదు. అది సహజసిద్ధమైన స్వయంభూ శివలింగంగా భావించుకోవచ్చు.  రెండింటిలోనూ ఇంచుమించు అదే శక్తి ఉంటుంది.  కాకపోతే సిద్దలింగ ఆరాధనలో మనకి ఆ శక్తి ప్రకటిమవుతుంది.  బాణ లింగంలో ఆ శక్తి ప్రకటితం అవ్వదు. దానికి ఆచార వ్యవహారాలు చాలా నియమ నిష్టలు ఉంటాయి.  దీనికి కూడా అంతే ఆచార వ్యవహారాలు ఉంటాయి.  కానీ పెద్దగా నియమాలు ఉన్నట్లుగా నేను తెలుసుకున్నాను… అని వాళ్ళు స్నానాలు చేస్తూ ఉండేసరికి గులకరాళ్ళలో నల్ల  బాణ లింగాలు వెతకాలని…. అందరూ కూడా తలా ఒక దిక్కుకి బయలుదేరారు.  వెతకడం ఆరంభించారు.  బాలగణపతికి ఎక్కడా కనిపించలేదు. రుద్ర స్వామికి గుంటలో ఒకచోట నల్లగా మెరుస్తుందని తీస్తే,  అది నల్ల బాణ లింగం అని తెలుసుకొని…. దానిని చేతిలోకి తీసుకున్నాడు.  తన దగ్గర నుంచి బాలగణపతి లాక్కుని….ఇది నాది,  నాకు ఇచ్చేసేయ్యి!  ఇది నాది.  నాకు దొరకలేదు… నీకు దొరికింది…మనిద్దరం ఒకటే కదా ! ఎవరికీ దొరికినా మనం పంచుకోవాలని కదా!  అంటుంటే వాడి వంక చూస్తూ…. సరే రా! నేను ఇంకొకటి వెతుక్కుంటాలే అనేసరికి వెతుక్కో….. అని ఆ లింగం కుడి చేతిలో పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఓం నమశివాయ అని పెద్దగా అరుస్తున్నాడు.  సరే ఇవన్నీ పిల్ల చేష్టలు లాగా ఉందిలే అనుకుంటూ ఉండగా….. శివ నందిని ఒక నల్లని బాణలింగం దొరికితే,  పాపం ఎంత ప్రయత్నం చేసినా బాల కుమారస్వామికి దొరకకపోయేసరికి….. ఇదిగో కన్నా!  ఇది నువ్వు తీసుకో …..అంటే అమ్మ ఇది నీకు దొరికింది కదా!  ఇది నువ్వే తీసుకో….!  అంటే నేను తర్వాత వెతుకుతాలే!  చిన్న పిల్లాడివి కదా! నీకు కనిపించదు.  నాకు తర్వాత  కనపడ్డప్పుడు తీసుకుంటాలే..!  అయినా నా దగ్గర సిద్ధ లింగం ఉంది కదా!  అంటే,  నా దగ్గర కూడా సిద్ధలింగం ఉంది కదా.. అంటే సరే ఇది ప్రాణలింగం అని చెబుతున్నారు కదా!  ఉంచుకో…నీ సంచిలో పెట్టుకో!  దైవిక వస్తువు అనేసరికి…. అంత ఇదిగా నువ్వు ఇస్తా అన్నప్పుడు నాదేముంది? అనేసరికి ఒరేయ్!  తమ్ముడు ఇదిగో నాకు కూడా దొరికింది. నాకు అమ్మ ఇచ్చింది అనేసరికి….. మంచిది.  నువ్వు కూడా కూర్చుని ధ్యానం చేసుకో! ఓం నమశ్శివాయ అని అరుస్తూ కూర్చో…. అని అనేసరికి వాడు కూడా కుడి చేతిలో పెట్టుకొని ఓం నమశ్శివాయ అని అరుస్తూ ఉండేసరికి….కొద్దిసేపటికి మహాదేవి నాకు దొరికింది అని అరుస్తూ ఉండేసరికి…. మూడు అంగుళాల నల్లని బాణ లింగం చూపించేసరికి…. దానిమీద ఓంకారం గుర్తు ఉండేసరికి…. ఇది ఓంకార లింగం అని అన్నారు.  ఆ తర్వాత శివాని వెతికితే చంద్రవంక కనిపించేసరికి …ఇదిగో చంద్రుడు ఉన్నాడు అని చెప్పి అన్నది.  ఆ తర్వాత వెతకగా వెతకగా రుద్రస్వామికి ఆ లింగం మీద త్రిశూలం గుర్తు ఉండేసరికి, అది వాళ్ళకి చూపించి….ఇవి   శివాంశ గుర్తులు ఉంటే శివ బాణ లింగం అని,  దాన్ని ప్రాణలింగంగా ఆరాధన చేస్తారని చెప్పారు.  పిల్లలు ఇద్దరు తమ చేతుల్లో ఉన్న వాటి మీద గుర్తులు ఉన్నాయేమో అని చూసేసరికి…. వాళ్లకి ఎలాంటి గుర్తులు కనిపించకపోయేసరికి…. ఇక మొహం బిక్క మొహం వేసి నిరుత్సాహం వహించి… మాకేమో గుర్తులు లేని రాళ్లు ఇస్తారా? మీరేమో శివ గుర్తులు ఉన్నవి ఏరుకుంటారా?  ఇది అన్యాయం…. అని నీళ్ళల్లో  పడవెయ్యపోతుంటే ఒరేయ్! ఆగండి…. ఆగండి…. వాటిని అలా పడేయడానికి లేదు.  మీరు సరిగ్గా చూసి ఉండరు. వాటికి గుర్తులుంటాయి అనేసరికి…. బాల కుమారస్వామికి వచ్చిన  రాయిలో…. పాములాగా కనపడుతుంది చూసావా  నాగాభరణం కనపడుతుంది అనేసరికి… కుమారస్వామి అంటేనే పాము కదా!  సుబ్రమణ్య స్వామి అంశ కదా! అంటే అవునవును…. ఇది నాకే… ఇది నా రాయే… అనుకునేసరికి …. మరి నా రాయిలో ఏం కనపడుతుంది… ఇక్కడ పాము లేదు, చేప లేదు, త్రిశూలం లేదు, ఏమీ లేదు అంటూ ఉండేసరికి…. పరీక్షగా చూస్తే, వాళ్ళకి ఎవరికీ అక్కడ ఏం గుర్తుందో అర్థం కాలేదు . అరేయ్ ఏం గుర్తులేదు రా …అంటే మీకు గుర్తు కనబడకపోయి ఉండవచ్చు…. నా గుర్తు నాకు తెలుసు.  ఆ రాయిని ఒక వంపుగా చూపించేసరికి…. ఏనుగు తొండం ఎలా  అయితే కనపడుతుందో…. అలా ఆ రాయి మీద అచ్చు ఉండేసరికి…. అరేయ్!  ఇది ఏనుగు తొండం గుర్తు లాగా ఉంది.  నేను గణపతి  కదా!  అందుకని శివుడు ఏనుగు తొండం గుర్తు ఇచ్చాడు.  మీకేమో లింగాల మీద గుర్తులు ఉంటే నాకు లింగమే ఏనుగు తొండంగా కనబడుతుంది చూసారా ! అనేసరికి ఓరి బడవ ! నీకు అన్నీ తెలిసినా కానీ ఏమీ తెలియనట్టు ఉంటావు రా!  అందుకే రా నువ్వు అన్ని ఆలోచించి చేస్తావు….పొట్టోడివి అయినా కూడా నువ్వు గట్టోడివి రా….అనేసరికి ఇక అందరూ స్నానాలు చేసుకుంటూ మెడలో సిద్ధ లింగాలు పెట్టుకొని ధ్యానానికి ఉపక్రమించారు.  అలా చేస్తూ ఉండేసరికి యధావిధిగా పాము కాటు వేసిన దృశ్యం, కుండలిని శక్తి జాగృతి చేసిన దృశ్యం, ఆ తర్వాత ధ్యానంలోకి వెళుతున్నప్పుడు …మనసు పీకుతున్నట్టుగా… ప్రాణం పోతున్నట్టుగా…. అన్నీ కూడా లోపలికి లాగుతున్నట్టుగా…. ప్రాణశక్తి గుంజేస్తున్నట్టుగా భావనలోకి శివ నందిని వెళ్లిపోయింది.  కూర్చున్న చోటనే పడిపోతానేమో అని శివానికి భావన కలిగింది. పడిపోయినా….. చచ్చిపోయినా తను ధ్యానం నుంచి బయటకు రాకూడదు అని అలాగే కూర్చుంది.  శరీరం ఊగటం గమనించింది.  ఆ  కుండలిని శక్తి కదలికల ధాటికి శరీరం తట్టుకోలేకపోతుందని అర్థం అయ్యింది.  అయినా కూడా ధ్యానంలో కళ్ళు తెరవకుండా,  ధ్యానభంగం అవ్వకుండా చూసుకుంటూ ఉన్నది.


ధ్యానంలో ఎలాంటి ధ్యాన దృశ్యాలు కనిపించట్లేదు.  కాకపోతే శరీరం వణుకుతుంది. నరాలు పీకుతున్నాయి. మాడునొప్పి వస్తుంది. నుదురు నొప్పి వస్తుంది. శరీర బాధలు మొదలవుతున్నాయని చెప్పేసి… శరీరం తట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తోందని… మనసా వాచా కర్మణా చేసిన పాపాలు, తప్పులు, దోషాలు అన్నీ కూడా ఈ బాధల ద్వారా నివృత్తి అవుతున్నాయని అనుకుంటూ….. సాధనకి సంసిద్ధం చేయాలని అనుకుంటూ….. సరాసరి సాధనకి కూర్చోకూడదు ,యోగాసనాలు చేసుకోవాలి అని… ఒక జ్ఞాన స్ఫురణ కూడా అందడంతో “ శివ స్వామి ధ్యానంలో కనిపించి అవును… యోగాసనాలు చేసుకో ! సూర్య నమస్కారాలు చేసుకో!  సూర్య నమస్కారాలు అందులో 12 ఆసనాలు వస్తాయి. ఆ ఆసనాలు 72 ఆసనాలతో సమానంగా ఉంటుంది.  ఆ ఆసనాలు 72,000 నాడులని జాగృతి శుద్ధి చేస్తుంది. అవి ఆరోగ్యవంతంగా ఉండేటట్లుగా చేస్తుంది. దేహ  గ్రంథులను కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకో… లేదంటే శరీరం అల్లాడిపోతుంది… నిలబడదు… తట్టుకోలేదు…. ఊగిపోతూ ఉంటుంది… పూనకాలు లేదా మతిభ్రమణం వస్తుంది.  కాబట్టి శరీర ధారుడ్యం పొందు. ధ్యాన సిద్ధి పొందే ముందు ఆసన సిద్ధి పొందాలి.  ఆసనాలు చేసుకో అనేసరికి…. ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం సంధ్యాకాలంలో యోగాసనాలు వేయడం సూర్యనమస్కారాలు చేయటం మొదలుపెట్టింది.


ఇలా సాధన కుటుంబం అంతా పాతాళ గంగ వద్ద ధ్యాన నిష్ట లో ఉండగా…. శివనందినికి తన మనోనేత్రమునందు ఏదో కదలాడడం గమనించింది. ఒక పండు ముసలావిడ, సుమారుగా 85 సంవత్సరాలు ఉన్న ముసలావిడ లేత గులాబీ రంగు చీర కట్టుకొని…. అమ్మ నేను అవతలి ఒడ్డుకు వెళ్లాలి…. నేను అక్కమహాదేవి గుహ కి వెళ్ళాలి…. నాకు పరపురుషులతో, పరస్త్రీలతో వెళ్లడం ఇష్టం లేదు.  కాబట్టి నువ్వు నన్ను తీసుకువెళ్తావా!  నేను పడవ నడుపుతాను… అనేసరికి సరేనమ్మా!  నేను తీసుకువెళతాను అని చెప్పేసరికి…. గుండ్రంగా తొట్టి లాగా ఉన్న పడవలో వీళ్లిద్దరూ వెళ్తూ ఉండగా… మధ్యలోకి వచ్చేసరికి…. నీళ్లు విపరీతంగా సుడులు తిరుగుతూ ఉండేసరికి….అమ్మో నాకు భయం వేస్తుంది. నేను మునిగిపోతానేమో!  వెనక్కి వెళ్ళిపోతాను అని నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వెళ్లేసరికి….. ఆ పడవలో శివ నందిని ఉండిపోయినట్లుగాను….ఆ పడవ నీటి దాటికి బోల్తా పడి లోపలికి వెళ్ళిపోయినట్టుగాను… తను నీళ్లలోకి వెళ్లి ఊపిరాడక కొట్టుకుంటున్నట్టుగాను …..ధ్యాన అనుభవం అయ్యేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచింది.  ఇదేమిటి విచిత్రంగా ఉంది.  కలా లేక నిజమా లేక ధ్యానానుభవమా? అని అనుకొని చుట్టూ చూసింది…. అలాంటి వ్యక్తులు గాని, అలాంటి మనుషులు కానీ , ఎవరు కనిపించలేదు.  ఏమోలే ! రాబోయే కాలంలో ఇది జరగచ్చేమో…. జరగొచ్చు, జరగకపోవచ్చు అని 10 నిమిషాల తర్వాత మళ్లీ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి… ఈసారి నీళ్లలో కొట్టుకు వెళుతున్న తనకి పాతాళ గంగ లోపలికి వెళ్తున్నట్టుగాను…. సుమారు 2000 అడుగులు నీటి లోతుల్లోకి వెళ్తున్నట్టుగాను…. శరీరం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా…. లోపలికి వెళ్ళిపోతున్నట్టుగాను…. అనిపించేసరికి, సరే ఎక్కడిదాకా వెళ్తుందో అక్కడిదాకా ధ్యానం వెళ్ళని అని శివ నందిని ధ్యానం నుంచి కదలకుండా, మెదలకుండా ధ్యాన దృశ్యం చూస్తూ అలాగే ఉండిపోయేసరికి…. ఆ ధ్యాన దృశ్యంలో శివ నందిని కాస్త లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటే ….ఏదో ఒక ద్వారం దగ్గర ఇనుప ద్వారం కనిపించింది.


ద్వారం  తలుపు తీసేసరికి….. రాతి మీద ఎవరో పరమ యోగి ధ్యానముద్రలో ఉన్నట్టుగా కనిపించేసరికి…. ఈయన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది . ఈయన  ఎవరో…  దగ్గరగా చూశాను.  ఈయన ఎవరో అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది అని పాద నమస్కారం చేసుకుందామని అనుకుని కూడా….. భయపడి మామూలుగా  నమస్కారం చేసుకొని వస్తూ ఉండగా…. ధ్యాన భంగం  అయ్యింది.  ఈయన ఎవరు అని అనుకొని మళ్లీ రెండు నిమిషాలు ఆగి తిరిగి ధ్యానంలో కూర్చుంది.  ఎవరో కాషాయ వస్త్రధారి చేతిలో ఏకదండం ధరించి ఒక తొట్టి లాంటి పడవలోకి వెళుతూ ఉండేసరికి…. ఆయన చుట్టూ చాలామంది భక్తులు ఉండి….“ జయ జయ నృసింహ సరస్వతి !దత్త అవధూత రూప! నృసింహ సరస్వతి మహాస్వామికి జై జై” అని చెప్పి వీడ్కోలు పలుకుతూ ఉండగా…. ఆ తొట్టి కదలీ వనం వద్దకు వచ్చేసరికి… ఆ తొట్టి, ఆయన అదృశ్యం అవటం….. ఆ తర్వాత ఆయన నీటి అడుక్కి వెళ్లిపోవడం…. ఆ కొద్దిసేపటికి తొట్టి నీటి పైకి వెళ్ళటం….. ఆ తొట్టిలో కొన్ని మల్లెపూలు ఉండి ఆ తొట్టి పడవ భక్తుల వైపు రావడం చూసేసరికి….. ఓహో ఇందాక కనిపించిన స్వామి దత్తాత్రేయ రెండో రూపమైన నృసింహ సరస్వతి స్వామి వారై ఉంటారు.  ఆయన శ్రీశైలం కదళీ వనం ప్రాంతంలోనే ఈ పాతాళ గంగ లోనే జల సమాధి అయ్యారని చెప్పారు.  అది నిజమే అన్నమాట!  సజీవ మూర్తిగా ధ్యాననిష్ట లో ఉన్నారన్నమాట!  మరి దత్త రూపుడైన గురుదేవుడు, తనకి ఎందుకు దర్శనం ఇచ్చారో…. కారణం లేనిదే,  మహాత్ములు దర్శనం ఇవ్వరు కదా!  అనుకుంటూ ఉండేసరికి ధ్యానభంగం అయింది.  చుట్టూ చూసేసరికి ధ్యాన నిష్ఠలో ఉన్న రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా కళ్ళు తెరిచి…. తన వంక చూసి మౌనంగా తన వైపు తదేకంగా చూస్తూ ఉండేసరికి…. వీళ్ళకి కూడా ఏదో ధ్యాన అనుభవాలు వచ్చాయేమోలే అని అనుకునేసరికి…. మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు.  కానీ మాట్లాడుకోలేదు… సరే అని ముగ్గురు యధావిధిగా ధ్యాననిష్టలోకి వెళ్లిపోయారు. ఈసారి శివ నందినికి ధ్యానానుభవంగా ఎక్కడో ఏదో కొలనులో…. ఒక పెద్ద చేప, ఒక చిన్న చేప నీటిలో ఈదుతూ కనబడుతూ ఉన్నట్లుగా…. ఆ చేపలు రెండు ఒడ్డుకు వచ్చినట్టుగా…. ఆ రెండు చేపలు ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటునట్టుగా…..ఒక పెద్ద చేప ఒడ్డికి చేరుకునే సరికి తెల్లని వస్త్రాలు, తెల్లని గడ్డంతో, తెల్లని జుట్టుతో, దివ్య తేజస్సుతో ఉన్న ఒక శరీర ధారి యోగి లాగా ధ్యానంలో కనిపించేసరికి…..ఎక్కడో చూసినట్టుగా ఉంది.  బాగా తెలిసిన మనిషిలాగ ఉన్నారు. ఈయన ఎవరు అని అనుకుంటూ ఉండేసరికి…. రెండో చేప కూడా మనిషి రూపంలో ఈయన పాదాల దగ్గర ఉండేసరికి….. ఓహో! ఈయన శిష్యుడా!  అంటే ఈయన గురువు, ఈయన శిష్యుడై ఉంటారు అని అనుకునేసరికి…. ధ్యానభంగం అయింది.  ఏం జరుగుతుందో ఏంటో,  ఈ ధ్యానానుభవాలు నిజమా ?అబద్దమా అనుకుంటూ కళ్ళు తెరిచి శివ నందినిని …… అప్పటికే ధ్యానం నుంచి బయటికి వచ్చిన రుద్ర స్వామి కాస్త ఏంటమ్మా ఏంటి మూడు ధ్యాన అనుభవాలు అయినాయా? అన్నాడు.  ఆ అవును స్వామి మూడు రకాలుగా అయినాయి. 


ఒకటేమో ఒక వృద్ధ స్త్రీ నన్ను పాతాళ గంగలో పడేయాలని ప్రయత్నం చేసింది. రెండోది ఒక యోగి పుంగవుడు దర్శనమిచ్చారు.  ఆయన దత్తాత్రేయ రెండో అవతారమైన నృసింహ సరస్వతి స్వామి అని తెలుసుకున్నాను.  ఇక మూడవది ….ఏదో కొలనులో చేపల రూపంలో ఉన్న గురువు,శిష్యుడు కనబడ్డారు. సరే ఇది నిజమా! కాదా! అని కాల నిర్ణయమే చేస్తుందిలే! దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించకు.  ఈ ధ్యానానుభవాలు నిజమా! కాదా! అనేది ప్రకృతి చూపిస్తుంది. నూటికి 99.99% ధ్యానానుభవాలు సత్యమే ఉంటాయి. కాకపోతే మాయ చేయడానికి భ్రమ,బ్రాంతి కలిగిస్తుంది. ఆశ కలిగిస్తాయి.  భయం కలిగించేటట్టు చేస్తాయి. వాటిలో ఏది నిజమైంది. ఏది సత్యమైనది. ఏది అసత్యం అని అనుభవాలు తెలుసుకోవాలి. విచక్షణ జ్ఞానం, వివేచనా బుద్ధితో ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. మన ప్రస్తుత జీవితానికి ఏవి దగ్గరగా ఉన్నాయి.  ఆ అనుభవాలు అని ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. వాటిలో మనం దేనిని ఆశపడలేదు,  దేనికి భయపడలేదు అని నిర్ధారణ చేసుకుంటే,  వాటిని ధ్యాన అనుభవాలు అనుకోవచ్చు.  మనం దేనికైనా ఆశపడుతున్నాము…. లేదా దేనికైనా భయపడుతున్నాము…. దేనికైనా స్పందిస్తున్నాము…. దేనికోసమైనా ఆలోచిస్తున్నాము…. ఏదైనా సంకల్పం చేసుకున్నట్టు ధ్యాన అనుభవాలు వస్తే, అవి మాయకు సంబంధించిన అనుభవాలు అనుకోవాలి. వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఇంకొకటి….. ధ్యాన అనుభవాలలో మనం తప్పులు చేస్తున్నట్టుగా, పాపాలు చేసినట్టుగాను, ఈ కారణం వల్ల నిన్ను జన్మలు ఎత్తించాము. నీకు మోక్షం రాదు…. నీకు ముక్తే వస్తుంది. ఇలా భయపెట్టే విధంగా ధ్యాన అనుభవాలు ఉంటాయి.  అనుభవాలు కూడా మనం పెద్దగా పట్టించుకోకూడదు కాబట్టి…..నీకు వచ్చిన ఈ మూడు అనుభవాలు కూడా ఎటువంటి స్థితిగతులు లేవని నాకు అర్థం అవుతుంది.  నీకు కుండలినీ శక్తి జాగృతి పాము కాటు వేసింది కదా!  అలాగే శక్తి పాత గురువు నీ దగ్గరికి వస్తాడు. శక్తిని జాగృతి చేస్తారు. అది త్వరలోనే ఉన్నట్టుంది… ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే…. దత్తాత్రేయ రెండవ అవతారమైన నృసింహ సరస్వతి అనుగ్రహం నువ్వు పొందడం జరిగింది కాబట్టి,  త్వరలో సత్యాసత్యాలు ఏమిటో నీకే తెలుస్తాయి…. అని సరే పిల్లలు! ఇక పదండి టిఫిన్ చేయడానికి వెళ్లాలి…. అనేసరికి ఆడుకుంటున్న పిల్లలు కూడా బయలుదేరారు.  అందరూ కలిసి సత్రం ఉన్న గది వైపుకి ఉపక్రమించారు.


అందరూ టిఫిన్లు చేసిన తరువాత…. నేను భైరవకోనకి వెళ్లి తంత్రసాధన చేసుకుంటాను….. మీరు మఠాలకు వెళ్లి సాధన చేసుకోండి…. పిల్లల గురించి సత్ర యజమానికి అప్పజెప్పేసి వెళదాము… ఆయన చూసుకుంటాడు అనేసరికి…. సరే అని రుద్రస్వామి కాస్త సరేనమ్మా!  మనిద్దరం కలిసి విభూతి మఠానికి వెళ్లి శివానందని కలిసి వద్దాము.  ఆయనతో కొంచెం మాట్లాడాల్సింది ఉంది. నిన్న మాట్లాడుతూ ఉండగా,  కృష్ణస్వామి మరియు యోగాంబిక రావటంతో ఆయన మాట మార్చడం జరిగింది.  కాబట్టి మనం వివరంగా తెలుసుకుందాం అనేసరికి… సరే అయ్యా!  నీ ఇష్టం . నాకేం అభ్యంతరం లేదు అనేసరికి…. పిల్లల బాధ్యతలేమో సత్రం యజమానికి అప్పజెప్పేసరికి…..పర్లేదమ్మా పిల్లలు వాళ్ల ఆటల  రందిలో ఉంటారు అని యజమాని అనేసరికి…. మహాదేవి కాస్త భైరవకోనికి ప్రయాణించింది. వీళ్లిద్దరూ కలిసి విభూతి మఠానికి వెళ్లేసరికి…. అక్కడ వీళ్ళ కోసం ఎదురుచూస్తూ శివానంద ధ్యానం నుంచి బయటకు వచ్చి కూర్చొని వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. శివ నందిని ఆయన పాదాల మీద పడి స్వామి నమస్కారం అనేసరికి


శివానంద:- లే శివాని!  మనిద్దరం కూడా సాధనలో ఒకే సాధనాస్థితి పొందినవాళ్లం. హెచ్చుతగ్గులు లేవు. సాధనకి స్త్రీ, పురుష భేదం లేదు ….


శివనందిని:-  కాదు స్వామి!  మీరు ఒకవైపు భర్తగా ఉన్నారు….మరొకవైపు గురువుగా ఉన్నారు. రెండు బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారు.  సాధనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే భోగపరంగా నాకు వచ్చే మాయలన్నింటిని కూడా మీ మాటలతో, మీ సలహాలతో వాటిని తీసేస్తున్నారు.  అలాగే సాధన పరంగా వచ్చే ధర్మ సందేహాలు అన్నింటిని గురువుగా ఉండి తీరుస్తున్నారు. అందుకోసం అని భర్త సేవకి ,గురుసేవకి ఒకే వ్యక్తి రావడం…. అలాగే నడయాడే శివుడే సాక్షాత్తు మానవ స్వరూపాన వచ్చాడు అని అనుభవ అనుభూతి కలుగుతుంది. శివసాంగత్యం, పొందుతున్నాను. ధర్మపతి సాంగత్యం, గురు సాంగత్యం పొందుతున్నాను. ఒకే వ్యక్తులు మూడు రూపాలు మూడు అవస్థలు చూస్తున్నాను.


శివానంద:- ఇప్పుడే నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి దర్శనం అయినట్టు… నువ్వు మూడు తలల ఆసామిని నాలో చూస్తున్న అన్నమాట! 


శివనందిని:- స్వామి ! మీకు తెలియంది ఏమి కాదు కదా!  అది నిజమేనా? అనుభవాలు ….


శివానంద:- అదంతా నిజమే శివాని!  ఏవి అబద్ధం కాదు.  రాబోయే కాలంలో అవి జరగబోయేవి …..ముందుగా మనకి ధ్యాన అనుభవాలుగా కనిపిస్తాయి.  కాబట్టి వాటి గురించి నువ్వేం ఆలోచించకు.  త్వరలో నీకు శక్తి పాత గురువు అనుగ్రహం కలిగే అవకాశం ఉంది.  ఎందుకంటే శక్తిపాత గురువు అనుగ్రహం పొందాలంటే, దత్తాత్రేయ అనుగ్రహం పొందాలి. అలాంటిది నీకు దత్తాత్రేయ రెండో అవతారమైన నృసింహ సరస్వతి స్వామి స్వయానా తన నిజరూప దర్శనం ఇచ్చారు. కాకపోతే నువ్వు ప్రత్యక్షంగా వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలనే నీ ఆలోచనకి… కాలమే నిర్ణయం చెప్పాలి.  దానికి తగ్గ శక్తిపాతం నీకు జరగాలి . సాధనా శక్తి కుండలిని శక్తి జాగృతి అవ్వాలి.  దానికి ఎప్పుడు, ఎలా, ఏం జరుగుతుంది?  అనేది ప్రకృతి నిర్ణయం చేస్తుంది అనేసరికి….. 


శివనందిని:- స్వామి!నిన్న  అమ్మవారు, అయ్యవారిని 14 బంధనాలతో బంధించింది అన్నారు కదా!  ఆ 14  బంధనాలు గురించి చెప్పగలరా….


శివానంద:- ఆ చెప్పచ్చు శివాని!  అదేం పెద్ద సమస్య కాదు.  ఆయనకు ఇష్టమైన వాటినే….. ఆయనకి బంధనం చేసిన విషయం ఆయనకు తెలియకుండానే బంధనంలో పెట్టింది.  ఇప్పుడు ఉదాహరణకి శివలింగ బంధనం అంటారు.  ఆయన ముందు శివలింగం ఉంటుంది.  శివలింగ బంధనం ఎలా చేస్తారు?  అని సందేహం రావచ్చు.  ఇప్పుడు అరుణాచల క్షేత్రానికి వెళ్ళావనుకో….. మధ్యలో అరుణాచలేశ్వర అగ్ని లింగం ఉంటుంది. దాని చుట్టూ 8 దిక్కుల్లో 8 లింగాలు ఉంటాయి. ఆ ఎనిమిది లింగాలు 8 దిక్కులు శివలింగాలుగా ఉంటాయి. ఆ ఎనిమిది శివ లింగాలతో 9వ లింగమైన అరుణాచల లింగాన్ని అష్టదిగ్బంధనం చేసింది అమ్మవారు.  అది శివుని పరంగా శివలింగ బంధనం అవుతుంది. అదే ధర్మపురిలో ఉన్న నరసింహ స్వామిని చూడు….. ఆయన భోగ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహ స్వామిగా ఉంటారు.  ఆయన్ని ప్రకృతి హనుమంతుని చేత ఎనిమిది హనుమ లతో అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. అది విష్ణుపరంగా చూసేసరికి భక్తి పరంగా హనుమభక్తికి ఆ హనుమంతుల స్వామికి లొంగినట్లుగా శాస్త్రం చెబుతోంది. 


ప్రతి పురుషుడిని కూడా అమ్మవారు అయ్యవారిని అష్టదిగ్బంధనంలో ఉంచడం జరిగింది. ఆ విధంగా విష్ణువు పరంగా మహాలక్ష్మి దేవి బంధనం చేయడం జరిగితే….. ఆదిపరాశక్తి అంశ అయిన పార్వతీదేవి శివుణ్ణి మహాబంధనం చేసింది.  ఆయనకి ఏవైతే అవసరం అవుతాయో! ఆయన ఏవైతే ఇష్టపడతాడో వాటినే మాయ బంధనాలుగా అమ్మవారు ఏర్పాటు చేసింది.  అయినా అది తెలియకుండానే…. ఆయన మాయలో పడిపోయాడు.  ఆ మాయలో ఉన్నా అనే విషయం శివుడు కూడా తెలుసుకోలేని స్థితిలో మాయ ఉంచింది. శివుని యొక్క 14 బంధనాలు ఇలాగే ఉంటాయి. మనం సాధారణంగా శివుడి ఫోటోలోనూ, శివుడి విగ్రహ మూర్తిలోనూ, మనకి కనపడతాయి.  కానీ ఇవి ఆయన్ని బంధించిన బంధనాలనే విషయం అతి తక్కువ మందికి నిజ అనుభవ పాండిత్యం పొందిన యోగులకి మాత్రమే తెలుస్తుంది. అవి బంధనాలు అని  కూడా తెలుసుకోలేరన్నమాట..! 


 శివుడు పరంగా ఉన్న 14 బంధనాలు అలాగే మూడు మాయల గురించి కూడా నీకు వివరంగా చెబుతాను.  వీటితోనే తిరిగి మనం ఆదిపరాశక్తిని బంధనం చేయాల్సి వస్తుంది. దీనికి ఏం చేయాలి? ఎలా చేయాలి?  అనే విషయం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే అర్థమవుతుంది.  శివుడి యొక్క 14 బంధనాలు ఏమిటో వివరంగా చెప్తాను.  మొదటిది శివలింగ బంధనం . అష్ట శివలింగాలతో ఈయన్ని బంధిస్తారు.  రెండవది ఈయన వాహనమైన నంది బంధనం . మూడు నాగాభరణం లేదా నాగబంధనం ….నాలుగు గజ బంధనం లేదా కరి వస్త్రముతో గజ బంధనం….అయిదు పులిచర్మం ఆసనం కింద పెట్టుకుంటారు కదా!  వ్యాగ్రబంధనం అంటారు. ….. ఆరవది త్రిశూల బంధనం , ఈయన రక్షణఆయుధంగా త్రిశూలం ఉండటం వలన ఇది……..ఏడవది రుద్రాక్ష బంధనం,  ఇది ఏకముఖి నుంచి 108 ముఖాల రుద్రాక్ష దాకా ధరించడం జరుగుతుంది. ఇది కూడా ఒక విధమైన బంధనం అన్నమాట!  ఎనిమిది ఆ తర్వాత జల బంధనం ఈయన జటాజూటంలో గంగాజలమును ఉంచి జలముతో బంధనం చేయడం జరిగింది. దీనినే జల బంధనం అంటారు…… తొమ్మిదవది ఆ తర్వాత మణి బంధనం….. ఈయన మణికైలాష్ పర్వతంలో మణి బంధనం అయ్యారు…. అంటే రుద్రమణి తో ఈయన బంధనం అవడం జరిగింది. దీనినే రుద్రమణి బంధనం అంటారు.ఆ తర్వాత పదవది అగ్ని బంధనం , ఈయన త్రినేత్రంలో అగ్నిని ఆపాదించడం వలన…. ఇది అగ్ని బంధనం అయింది….11)  డమరుకం నుంచి నాదం వస్తుంది…. ఈ నాదాన్ని ఓంకార నాదం అంటారు.  ఇదే  నాద బంధనం అన్నమాట! 12) ముద్ర బంధనం…. ఈయన ఎల్లప్పుడూ చిన్ముద్ర తో ఉంచేటట్టుగా అమ్మవారు బంధనం చేసింది.  దీనిని ముద్ర బంధనం అంటారు.  13 ) త్రిదళ బంధనం అంటే బిల్వపత్రాలతో ఇయన్నీ బంధనం చేసింది.  14) విభూతి  బంధనం అంటే ఒంటినిండా విభూతి పూసి విభూతి బంధనం చేయడం జరిగింది. ఈ 14 బంధనాలు శివుడిని మోక్షం పొందనివ్వకుండా  అమోక్షం పొందేటట్టుగా పునః సృష్టి జరిగే విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఈయన 14 బంధనాలు కాకుండా త్రివిధ మహామాయలు అమ్మవారు దగ్గరుండి చేసింది.  అవి ఇష్టపదార్ధమాయ, పాల పాయసం తనకి ఇష్టమైన ఆహార పదార్ధంగా రుచికి అలవాటు చేసింది.  ఇది కాశీ క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరిగా ఉండి ఎల్లప్పుడూ పాల పాయసం ఆహారంగా ఇచ్చింది. ఆయనకి అది ఇష్టపదార్ధ రుచి మాయ అవుతుంది. 


ఇది మాయ బంధనం కింద ఉంటుంది. రెండోది ఇష్ట కామమాయ.  ఇది మనకి శ్రీశైల క్షేత్రంలో కనపడుతుంది… ఇష్టకామేశ్వరిగా మారి తన కామ కోరికలను తీర్చడానికి ఈ మాయబంధం ఉపయోగపడుతుంది.  ఇక మూడవది ఉజ్జయిని.  ఇది వచ్చేసి కీర్తికాంత మాయ.  విశ్వాధినేత తను అనే ఒక స్థితిని చూపిస్తుంది. కాలాతీత స్థితిని పొందాడు. విశ్వానికి అధినేత అనే జ్ఞానమాయను సృష్టిస్తుంది. అందుకే ఇక్కడ మహాకాలుడు, మహాకాళిక అధిపతిగా ఉంటారు. కాబట్టి శ్రీశైలం , కాశీ ,ఉజ్జయినిలో అమ్మవారు, అయ్యవారు కలిసి ఉంటారు.  ద్వాదశ లింగాలలో ఒక లింగం…. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం…. కలిస్తే అమ్మవారు కాస్త అయ్యవారిని మాయలో ఉంచడం జరిగింది. ఈ విధంగా సృష్టి, స్థితి ,లయ చేయడానికి శివుడే పూనుకోవాల్సి వచ్చింది. ఎంతవాడైనా కాంతా దాసుడు అయితే కాంత చెప్పినట్టుగానే నడుచుకుంటాడు కదా!  పురుషుడు అలాగే మహాశివుడు కూడా అమ్మవారికి కాంతా దాసుడై ఆమె ఏ విధంగా చెబితే…. ఆ విధంగా నడుచుకోవడం మొదలుపెట్టాడు.  దీనినే మహామాయగా చెప్పడం జరుగుతుంది. ఈయనకి 14 బంధనాల్లో ఉన్నట్టుగాను, అలాగే త్రివిధ మాయల్లో ఉన్నట్టుగాను ,తెలియని అయోమయ స్థితిలో మహా శివుడు ఉన్నాడు.  ఆయనకి తెలియకుండా తన చెప్పు చేతల్లో అదుపు ఆఙ్ఞల్లో….మహా మాయగా ఆదిపరాశక్తి అయిన మహాదేవి ఉంచుకోవడం జరిగింది.  లేదంటే ఈపాటికి స్త్రీ ప్రకృతిలో ఉన్న పురుషుడు ఎప్పుడో మోక్షం పొందడం జరిగేది.  కాకపోతే ఈ బంధనాలు ఈ మాయల్లో ఉన్నానని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ….సాధనలోకి రావాలి…. మోక్షమును పొందాలి అని అనుకుంటున్నాడు.  ఎప్పుడైతే మనిద్దరి సాధన పరిసమాప్తి అవుతుందో ……అప్పుడు బంధ విముక్తుడు అవుతాడు.  అమ్మవారు బంధనంలో పడుతుంది.  తద్వారా వీళ్ళిద్దరూ కూడా కదిలే స్థితి నుంచి కదలని స్థితికి వస్తారు.  అప్పుడే మనకి స్వాధీనమై, ఆధీనమై, ఏక శరీరమై కదలని స్థితి పొంది…. ఏక రూప నించున్న అర్ధనారీశ్వర రూపాన్ని పొందితే…. ఏక దేహమై, ఏక లింగ దేహమై, కారుంగలి శివలింగముగా మారి….. ఆ తర్వాత  అది కాస్తా విశ్వ శూన్యమైనట్టయితే….. అది స్త్రీపరంగా వ్యక్తిగత మోక్షం అవుతుంది. ఇద్దరూ కలిసిపోయి మోక్షం పొందినట్లయితే…. అది పూర్ణ మోక్షం లేదా విశ్వమోక్షం అవుతుంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే…. స్త్రీ ప్రకృతిలో శివ బంధనాలని తొలగించాలి.  అలాగే అమ్మవారిని శక్తి యుక్తులతో నీ మాయ ప్రభావంతో 14 శివలింగాలతో బంధనం చేయాల్సి ఉంటుంది.  దీనికి ఎప్పుడు ప్రకృతి తన సహాయ సహకారాలు ఏ విధంగా…. ఎలా చేయాలనేది…. ఎప్పటికప్పుడు ధ్యాన దృశ్యాల రూపంలో నీకు చూపించడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది…. అనేది కాల నిర్ణయానికి వదిలేద్దాం. అది అవుతుందా లేదా కూడా మనకి తెలియదు.  కాకపోతే మనం చేయవలసిందిగా అమ్మవారికి బంధనంలో పడేయాలి.  అయ్యవారిని బంధ విముక్తుడిని చేయాలి.  అప్పుడు కదిలే శివుడు, కదిలే అమ్మవారు నిశ్చల స్థితికి వస్తారు.  ఆ నిశ్చల స్థితికి తీసుకువచ్చేదాకా మన సాధన పరిసమాప్తి పూర్తి కాదని గ్రహించు అనేసరికి….


శివనందిని:-  సరే స్వామి!  నాకు అర్థమై అర్థం కానట్టుగా ఉంది. ఈ బంధనాలన్నీ మనం సాధారణంగా శివుడికి చేస్తూనే ఉంటాము… అవి బంధనాలని ఎవరు అనుకోరు.  మీరు చెప్పింది నిజమే.  శివలింగ బంధనం చూస్తే అరుణాచలంలో అష్ట లింగాల బంధనం కనిపించడం నిజమే కదా!  అష్ట లింగాల మధ్యలో బంధించి…. ఆయన్ని ఎటు కదలనివ్వకుండా అరుణాచలేశ్వరునిగా ఉంచేశారు.  ఒకవేళ ఆ అష్ట లింగ బంధనం కానీ చేయకపోయి ఉంటే…. అరుణాచల అగ్ని లింగం కాస్త ఈ విశ్వాన్ని దహనం చేసేసి ఈ విశ్వానికి విశ్వమోక్షం వచ్చేదేమో….. ఎవరికి ఎరుక..! 


శివానంద:- అవును శివాని!  నిజమే 


రుద్రస్వామి:- ఇన్ని తెలిసినా కూడా… ఇలా చేయాలని తెలిసినా కూడా ….చేయలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాము?


శివానంద:- అదే మహామాయ.  చేయాలని అనుకోవడం…. తెలియకపోవటం… ఇవేమీ కాదు. అందరికీ తెలిసినా చేయనివ్వలేదు… భయపడ్డారు. చావటానికి వచ్చిన వాళ్ళు చావు భయం చూసి మృత్యు భయానికి భయపడి బతకడానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చారు.  అదే ఇక్కడ వచ్చిన తేడా అదేమంటే ….లోకకల్యానార్థం మేము బతకాలి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.  కాబట్టి శివానికి ప్రారంభంలోనే మృత్యు భయం అనేది చూపించారు.  తను చావాలనుకున్న చావలేని స్థితిలో ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఆమెకి చావు భయం, మృత్యు భయం లేకపోవడంతో దానికి ఈమెకి అర్హత , యోగ్యత, యోగం ఉండి మోక్షసాధనకి యోగం సంపాదించుకుంది.  ఏం జరుగుతుంది? ఏంటి ?  అనేది ప్రకృతి కాల నిర్ణయానికి వదిలేయాలని అంటూ ఉండేసరికి….. కృష్ణస్వామి మరియు యోగాంబిక గాలిలో అదృశ్యం నుంచి దృశ్యంలోకి వచ్చేసరికి….. వీళ్ళు మౌనంగా వాళ్ళ వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. 


కృష్ణ స్వామి శివ స్వామితో, 


కృష్ణస్వామి:- రాత్రంతా మీ శిష్యురాలు అయిన శివానికి…. ఎన్ని రకాల ధ్యాన దృశ్యాలు చూపించినా…ఎంత భయపెట్టినా…. మొదట్లో భయపడింది.  రుద్ర స్వామి మరియు మహాదేవి ధైర్యం ఇవ్వటంతో,  మనోధైర్యం పొంది నేను చూపించిన దృశ్యాలు అన్నీ కూడా భ్రమ భ్రాంతి అనుకుని వదిలేసి…. ఇష్ట లింగాన్ని ఎలాగైనా చేజెక్కించుకుంది.  చూద్దాం…. మా మాయలు చూపించడం మొదలవుతుంది.  ఇక ఆట మొదలైంది.  ఎవరికి గెలుస్తారో చూద్దాం. ఎవరు ఓడిపోతారో చూద్దాం.  తాడోపేడో తేల్చుకుందాం. నేను మాత్రం వదిలిపెట్టను.  జగన్నాటకం జరుగుతూనే ఉండాలి.  ఆపే వాళ్ళని నేను వదిలిపెట్టను.  రక్షించే వాళ్ళం భక్షణగా మారినా పరవాలేదు.  నేను నా ప్రాణం పోయినా కూడా ఈ జగన్నాటకాన్ని ఆపే వాళ్ళని సంహారం చేసేదాకా వదిలిపెట్టను.  చంపను.  కానీ చంపే పరిస్థితులు తీసుకు వస్తాను.  చంపేవాడు ఈశ్వరుడు…. చంపే పరిస్థితులు దాకా తీసుకువచ్చేది ఆదిపరాశక్తి… అని నాకు తెలుసు.  ఆ మృత్యుంజయుడు వల్లే మీకు బుద్ధి రావాలి. స్త్రీ ప్రకృతి మోక్షం పొందాలని అనుకోవట్లేదు.  మీరు గమనించారో లేదో….!


శివస్వామి:- శివుడు మోక్షం పొందాలని అనుకున్నప్పుడు అమ్మవారు ఎందుకు అష్టదిగ్బంధనం చేయాలి. అష్టదిక్కుల్లో మోక్షం పొందటానికి వెళ్తున్నప్పుడు ఎందుకు దశమహావిద్యలు లాగా దశదిక్కుల్లో ఎందుకు కాపలా కాయాలి…..


కృష్ణస్వామి:- ఏదో ఒకచోట,  ఎక్కడో ….ఏమైనా జరిగి ఉండొచ్చు.  అయ్యవారికి అసలు మోక్షం పొందాలని లేదు.  అయ్యవారు మోక్షం పొందటానికి వెళ్తున్నప్పుడు, అమ్మవారు మోహంలో ఉండి సంసార బాధ్యతలు చూసుకోవాలి…..తనని ఒంటరి చేసి వదిలిపెట్టేస్తే తట్టుకోలేకపోయింది. అందుకోసమని కోపావేశాలకు లోనయి ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపి ఉండవచ్చు.  ఏదో చిన్న సంఘటన ఎక్కడో జరిగింది…. అని అనుకుంటే అది ఎలా సత్యం అవుతుంది 


అనేసరికి……….విభూతి మఠంలో నుంచి విభూతి లింగంలో నుంచి దివ్యకాంతి వచ్చేసరికి అందరూ …ఆ లింగం దగ్గరికి వెళ్తూ ఉండేసరికి అందులో నుంచి అంతర్వాణిగా 


నాయనా…!  నేను మోక్షం పొందాలని అనుకుంటున్నాను.  నేను నీలి ఆకాశ శరీరధారిగా ఈ క్షేత్రంలో ఆవాసం చేస్తున్నాను . నా మోక్షమును పొందినివ్వకుండా నా ఇల్లాలైన ఆదిపరాశక్తి నన్ను ఆపుతుంది.  ఆవిడ మోక్షం పొందుతుందా లేదా అన్నది నాకు సంబంధం లేదు.  నేను ఈ జగన్నాటకంలో ఉండలేను… చూడలేను …చేయలేను…. నావల్ల కాదు అని చెప్పినా కూడా ఏదో విధంగా సమస్యను తెచ్చి పెట్టడం ఏదో ఒక అవరోధం కలిగించటం…. నేను ఫలానా తప్పు చేశాను… ఆ తప్పుకి పరిహారంగా నువ్వు ఉండాలి చేయాలి అని చెప్పి ఏదోరకంగా నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు, బాధలు పెడుతూ నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఇది శివ స్వామి చేస్తుంది కాదు….. శివ స్వామి రూపంలో నేను దగ్గరుండి ఆయనతో సాధన చేపిస్తున్నాను.  కాకపోతే మీ ఇద్దరూ ఆదిపరాశక్తి అంశలో ఉండటంవల్ల….ఆవిడకి ఇష్టం లేని దానిని మీరు కూడా ఇష్టం లేని దానిగా….. వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు. ప్రకృతి ఏం నిర్ణయం చేస్తుందో తెలియదు. శూన్యంలో నుంచి వచ్చిన నేను శూన్యంలోకి వెళ్లాలనుకున్నాను….ఆవిడ మాత్రం శూన్యం అవ్వాలని అనుకోవట్లేదు. జగద్ధాత్రిగా ఉండి ఈ విశ్వాన్ని నడపాలనుకుంటుంది. లేని విశ్వాన్ని, లేని అసత్యాన్ని సత్యంగా చూపించి…. భ్రమ, భ్రాంతులను కలుగజేస్తుంది.  ఆ విషయం మీకు తెలియాలి…. ఆ విషయం లోకానికి తెలియాలి.  అదే శివ నందిని ద్వారా శివ స్వామి ద్వారాలోకానికి తెలియజేస్తాను.  నేను పొందిన ధ్యాన అనుభవాలు, జ్ఞాన అనుభవాలు…!  నా సాధన ఏమిటి అనేది లోకానికి తెలియజేస్తాను.  కాబట్టి మీరు ఆదిపరాశక్తి అంశలు కాబట్టి…. మీరు చేయాల్సింది మీరు చేయండి. ఎవరు జయం పొందుతారో…… ఎవరు అపజయం పొందుతారు  అనేది శూన్యానికి వదిలేద్దాం. ఆ శూన్యబ్రహ్మే చూసుకుంటాడు.  అయినా అందులో ఉన్నది నేనే …..ఇందులో ఉన్నది నేనే….. ఏది ఉందో , ఏది లేదో సత్యాసత్యాలు తెలుసుకోవడమే…. నిజసత్య జ్ఞానమును తెలుసుకోవడమే…. అంటే మీ ఇద్దరిలో ఎవరు సత్యం ,ఎవరు అసత్యం అనేది తెలియాలి. నేను భ్రమ పడుతున్నానా?  నేను బ్రాంతిలో ఉన్నానా అనే విషయం నాకు తెలియాలి. పూర్ణజ్ఞానం ఏంటో తెలియాలి. అసలు మూలం ఏమున్నదో తెలుసుకోవాలి. మూలంలో ఆ పూర్ణజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలి. దాని ద్వారా పూర్ణ జ్ఞానమును పొందాలి.  నా ఇల్లాలు భ్రమ ,భ్రాంతిలో పడుతుందా? లేదా నేను భ్రమభ్రాంతులో పడుతున్నానా? అనేది తేల్చుకోవాలి. ఇది మీ ఇద్దరి సమస్య కాదు…..మా ఇద్దరి సమస్య

…. కాబట్టి ఒకపక్క ఆదిపరాశక్తి ఆడటం మొదలుపెడితే ,ఒకపక్క ఆది రుద్రుడిగా నేను ఆడటం మొదలు పెడుతున్నాను. ఈ ఆటలో ఎవరు గెలుస్తారు…. ఎవరు ఓడిపోతారు…. కాల నిర్ణయానికి వదిలేద్దాం. భవిష్యత్తు చూస్తే క్షణంలో నాకు తెలిసిపోతుంది.  కానీ నేను చూడదలచుకోలేదు… విషయం ఏమిటో తెలుసుకోవాలి .అనుభవం పొందాలి. ఆ అనుభవం సత్యము అసత్యము అనేది తెలుసుకోవాలి…. ఏది భ్రమ బ్రాంతి తెలుసుకోవాలి . ఏది మాయో.!  ఏది మాయ రహితమో తెలుసుకోవాలి. ఏది మోక్షము ఏది అమోక్షము నాకు తెలియాలి.  నేను  ఉన్నది లేనట్లుగా….. లేనిది ఉన్నట్లుగా కనబడుతుందా! తెలుసుకోవాలి అని ఈ విషయాన్ని ఇక్కడదాకా తీసుకురావడం జరిగింది. మీ ఇద్దరి ద్వారా మా ఇద్దరి ఆట కొనసాగుతుంది అని గ్రహించండి. 


తప్పొప్పులు ఎవరికి లేవు. ఎవరి బలాలు వాళ్ళవి. ఎవరి శక్తి యుక్తులు వాళ్ళవి. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి ఉపయోగించుకుని….. ఎవరి ఆటను ఎంతవరకు తీసుకువెళతారో తీసుకువెళ్లండి. ఆ ఆట యొక్క కర్మ ఫలితం ఏంటి అనేది…. కాల నిర్ణయానికి వదిలేద్దాం. ఇందులో ఎవరిది తప్పు కాదు…. ఎవరిది ఒప్పు కాదు….. ఏది నిజము కాదు….ఏది సత్యము కాదు…. పూర్ణ సత్యం ఏమిటో తెలుసుకోవాలి. అసలు ఏమి ఉన్నదో తెలుసుకోవాలి….. మూలంలో ఏమున్నది…. ఏం కనపడుతుంది…. ఏం అర్థం అవుతుందో తెలుసుకోవాలి . నాకు 14వ లోకంలో 14వ చక్రంలో 14వ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అదే సత్య లోకంలో  ఏం సత్యం ఉందో తెలుసుకోవాలి.  దానికోసం నేను మీ ఇద్దరినీ వ్యతిరేక స్థితిలో, వ్యతిరేక బుద్ధితో, వ్యతిరేక ఆలోచనలతో, బలబలాలతో, శక్తి సామర్థ్యాలతో ,సమసక్తితో…. మీ ఇద్దరినీ పోటాపోటీగా దింపడం జరిగింది. ఇది విశ్వ జగన్నాటకంలో మోక్ష సాధన నాటకం అని గ్రహించండి.  గ్రహించండి ….తెలుసుకోండి.  ఇందులో ఎవరు జయం పొందుతారో…..ఎవరు అపజయం పొందుతారో కాల నిర్ణయానికి వదిలేద్దాం. ఆది రుద్రుడు గెలుస్తాడో…..ఆదిపరాశక్తి గెలుస్తుందో…. ఆది రుద్రుడు మాయలో ఉన్నాడో ….ఆదిపరాశక్తి మాయలో ఉన్నదో…. ఎవరు సత్యమో ….ఎవరు నిత్యమో ….ఎవరు అసత్యమో …..కాలమే నిర్ణయం చేయాలని… ఇందులో మీ ఇద్దరి యొక్క పోటా పోటీని బట్టి సాధన పరిసమాప్తి బట్టి యుక్తాయుక్తలను బట్టి మాయ ఎవరైతే జయిస్తారో…. మాయ రహితంగా ఎవరైతే ఉంటారో… మాయలో ఎవరైతే పడతారో….. ఏంటి అనేది కాలమే నిర్ణయం చేస్తుంది.  దానినిబట్టి ఇందులో ఒకరు ఎక్కువ , ఒకరు తక్కువ లేదు. ఒకరు మంచి, ఒకరు చెడు అనేది లేదు.  ఒకరు సత్యము, ఒకరు అసత్యము అనేది లేదు.  ఎవరి పరంగా వారికి సత్యం…. ఎవరి పరంగా వారికి అసత్యము… కాకపోతే నాకు పూర్ణజ్ఞానం తెలియాలి. అసలు విషయంలో మూలం ఏమున్నదో తెలుసుకోవాలి. ఎవరు నడిపిస్తున్నారు…. ఎవరు ఆడిస్తున్నారు…. ఎవరు చంపుతున్నారు…. నాకు తెలియాలి.  ఎవరు ఆ బ్రహ్మము… అయ్యవారా? అమ్మవారా? అనేది నాకు తెలియాలి. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను….లోకానికి తెలియజేయాలి అనుకుంటున్నాను…. అని అంతర్వాణిగా ఆ శివలింగంలో నుంచి వచ్చిన అశరీరవాణి అదృశ్యమైంది.  తర్వాత కాంతి పుంజం కూడా అదృశ్యమయ్యేసరికి…. అందరూ కలిసి…. ఆడించేది ఆడేది అన్నీ కూడా ఆ ఈశ్వరుడే కదా! మనమెంత అని అందరూ కూడా విభూతి శివలింగానికి నమస్కారం చేసుకొని …..ఎవరికి వారే బయటకు వచ్చి యోగాంబిక మరియు కృష్ణస్వామి వీళ్ళని రౌద్రంగా అదోవిధంగా చూసుకుంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా అక్కడే కూర్చొని….వీళ్ళు వెళ్లిన దిక్కుని చూస్తూ ఉండిపోయారు.



శివ నందిని కాస్త శివ స్వామి కేసి చూస్తూ…


శివనందిని:- స్వామి!  అయ్యవారికి  బంధ విముక్తి ఎలా చేయాలి? ఎలా అమ్మవారిని బంధనం చేయాలి. దాని విధివిధానం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు …


శివస్వామి:- అమ్మ!  నీకు ఒక్కో క్షేత్రంలో శివుడి బంధనాలకు సంబంధించిన వస్తువులు దొరుకుతాయి.  అవి దైవిక  వస్తువుల కింద నువ్వు పెట్టుకోవాలి. అలాగే నీకు 14 శివలింగాలు దొరుకుతాయి . అవే దైవిక లింగాలుగా పెట్టుకోవాలి. ఆ శివలింగాలను జాగ్రత్తగా పెట్టుకో!  అలాగే వస్తువులను జాగ్రత్తగా పెట్టుకో!  ఉదాహరణకి ఇప్పుడు త్రిశూల బంధ విముక్తి కలిగించడానికి నీకు కాశీలో త్రిశూలం రావడం జరిగింది కదా!  అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా శివుని బంధనానికి సంబంధించిన ఏదో ఒక దైవిక వస్తువు దొరుకుతుంది.  దానిని కూడా జాగ్రత్తగా పెట్టుకో! అలాగే నీకు కాశీ క్షేత్రంలో ఆజ్ఞ చక్ర జాగృతికి వెళ్లేటప్పుడు…. ఇక్కడికి రావాల్సి వస్తుంది. అప్పుడు నీకు ఒక శివలింగం దొరుకుతుంది. ఆ శివలింగాన్ని జాగ్రత్తగా పెట్టుకో! ఆ శివలింగం తోనే అమ్మవారిని బంధనం చేయాల్సి ఉంటుంది.  అలాగే శ్రీశైలం క్షేత్రానికి కూడా నువ్వు రావాల్సి ఉంటుంది.  నాకు తెలిసినంతవరకు ఏదో ఒక చక్ర జాగృతిలో ఇక్కడికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న పాతాళ శివలింగం నీకు మళ్ళీ అందుతుంది. ఈ శివలింగం కూడా నువ్వు భద్రంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని పాతాళంలో ఉన్న గురుమూర్తి దత్తాత్రేయ రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి వారు నీకు నిజరూప దర్శనం ఇవ్వటం జరిగింది.  రాబోయే కాలంలో ఆయన  ప్రత్యక్ష దర్శనం ఇచ్చినా కూడా…. ఆశ్చర్యపోనక్కర్లేదు.  కాబట్టి ప్రస్తుతానికి నువ్వు శక్తి జాగృతి కర్మలో ఇక్కడికి వచ్చావు.  చాలామంది విశుద్ధ చక్ర శుద్ధిలో ఇక్కడ ఆకాశం తత్వం కోసం ఇక్కడికి వస్తారు ..లేదా ఆకాశ సిద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు వస్తారు. వచ్చి ఘంటా మఠంలో ఉన్న ఆకాశ సిద్ధిని పొందడం చేస్తారు.  అలాగే చిదంబర క్షేత్రంలో విశుద్ధ చక్రం జాగృతి, శుద్ధి అవుతుంది అని… కొంతమంది సాధకుల అనుభవాలు చెబుతున్నాయి.  కాకపోతే ఎక్కడ ఎవరికి ఏ క్షేత్రంలో చక్ర జాగృతి అవుతుందని ఇదిమితంగాగా చెప్పలేము.  ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్రంలో ఆ స్థితి కలుగుతుంది.  ఇప్పుడు నీకు శ్రీశైలంలో శక్తి జాగృతి అయ్యింది.  అది కొంతమందికి ఇదే క్షేత్రంలో వివిధ రకాలుగా అవ్వచ్చు. ఆకాశ శుద్ధి ఇవ్వచ్చు… లేదా విశుద్ధ చక్రం ఇక్కడే జాగృతి అవ్వచ్చు….ఇది జరుగుతుందని చెప్పలేము.  కాకపోతే సప్త మోక్ష పట్టణాలలో మన సప్త శరీరాలు మాత్రం మోక్షం పొందుతాయని ఖరాఖండీగా చెప్పవచ్చును.  ఈ జన్మలో కాకపోయినా…. గత జన్మల్లో అయినా శరీరం మోక్షాలు మనం పొంది ఉండవచ్చు.  పొందని శరీరం మోక్షం నుంచి ఈ జన్మ సాధన ఆరంభం అయ్యి ఉండవచ్చు.  ఇదే ప్రారంభ మోక్ష జన్మ అంశ కూడా కావచ్చు.  ఇది అని మనం సాధన  చేస్తున్న కొద్దికి విషయం అర్థమవుతుంది.  మన ధ్యాన  అనుభవాలను బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఇది శక్తి జాగృతి అనేది మనకి ఇది మోక్షజన్మ లేదా సప్తశరీరాల్లో అన్ని మోక్షం పొంది ఒక శరీరం మిగిలిపోవడం వల్ల ఇక్కడికి వచ్చామా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.  కాలానుగుణంగా కాకపోతే నువ్వు ప్రతి జన్మలోను…. నువ్వు అన్ని చక్రాలు జాగృతి చేసుకోవాలి. మోక్షం పొందినట్లుగా అనుభవాలు పొందాలి…ఒకవేళ శరీరం మోక్షాలు పూర్తి అయినప్పటికీ… చక్రాలు జాగృతి అయినప్పటికీ…. వాటికి సంబంధించిన శరీరం మోక్షాలు అనేవి ఖచ్చితంగా జరగాలి. ఆ తరువాత సాధన అనేది పెట్టావు అని అంటే…. ధ్యానం చేయడం మొదలు పెట్టావు అంటే…. ఈ జన్మ సాధన మొదలైనట్టుగా మనం గ్రహించాలి. నాకు తెలిసినంతవరకు నువ్వు శరీరం మోక్షాలన్నీ పొంది ఉంటావు…. చక్రాల జాగృతి శుద్ధి ఆధీనం చేసుకునే ఉంటావు…. లేకపోతే అపస్మారక స్థితిని దాటలేక నువ్వు మాయలో పడిపోయి ఉండవచ్చు. పొందిన అపస్మారక స్థితిని తొలగించుకోవడానికి, తెలిసిన జ్ఞానాన్ని తిరిగి పొందడానికి మోక్ష సాధన కోసం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఉండాలి. ఈ జన్మ ప్రారంభ సాధన చేసి ఉండాలి.  మళ్ళీ సాధన మొదటి నుంచి అందుకోవడం జరుగుతుంది. 


కాకపోతే అందరికీ 12, 14, 16 సంవత్సరాలు పట్టేది…. నీకు ఆరు నెలల్లో చక్ర జాగృతి అవ్వటం, శరీరం మోక్షం పొందడం అనేది జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు అలా నీ మోక్ష సాధన ఉంటుంది.  కాబట్టి ప్రతి ఆరు నెలలకి స్త్రీ ప్రకృతి పరంగా ఆలోచిస్తే,  18 శక్తి పీఠాలు ఉన్నాయి కదా!  నీ శరీరంలో కూడా 13 యోగ చక్రాలు, మూడు గ్రంధులు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులు… రెండు జీవనాడులు అంటే బ్రహ్మనాడి, జీవనాడి మొత్తం కలిపితే 18 అవుతాయి కదా!  కాబట్టి ఈ 18 నీకు శక్తివంతం అవ్వటానికి నాకు తెలిసి అమ్మవారి పరంగా చూస్తే అష్టాదశ శక్తి పీఠాలు ఉపయోగపడతాయి.  అలాగే శరీరాలు మనలో 11 శరీరాలు,  అలాగే అజ్ఞాన గ్రంధిలో రెండు శరీరాలు, మొత్తం కలిపితే 13 శరీరాలు అవుతాయి.  ఈ 13 శరీరాలు  దహనం చేసుకోవడానికి… నాకు తెలిసి ద్వాదశలింగాలు నీకు ఉపయోగపడతాయి. ద్వాదశలింగాలు ఉన్న క్షేత్రాలకు వెళ్లడం జరుగుతుంది.  అంటే  చక్రాల జాగృతికి అష్టాదశ శక్తి పీఠాలు ఉపయోగపడితే,  శరీరాల జాగృతికి నాకు తెలిసి ద్వాదశ శివలింగ క్షేత్రాలు నీ సాధనకి ఉపయోగపడతాయని నాకు జ్ఞాన స్ఫురణలు అందుతున్నాయి. అదేవిధంగా సప్త మోక్ష పట్టణాలలో సప్త శరీరాలు మోక్షమును పొందితే, నాలుగు శరీరాలు కూడా మిగిలిన  నాలుగు క్షేత్రాలలో కూడా… తిరువాయువురు, తిరువనంతపురం, కాశీ ,అరుణాచల క్షేత్రాలలో నీవు పూర్తిగా శరీర మోక్షాలు పొందడం జరుగుతుంది. ఇక ఆ తరువాత నువ్వు సంపాదించిన,  నీకు వచ్చిన శివలింగాలతో అమ్మవారిని బంధనం చేసి, నీకు వచ్చిన 14 దైవిక  వస్తువులతో అయ్యవారిని బంధ విముక్తులను చేసినట్లయితే చిందులు వేస్తున్న అయ్యవారు, నిల్చున్న అమ్మవారు ఇద్దరూ కూడా కూర్చునే భంగిమలో అనగా….. స్కంద మూర్తి భంగిమలో కూర్చునే పరిస్థితికి తీసుకురాగలిగితే ఆ తరువాత వీళ్ళిద్దరూ ఏకమై ఒక అర్ధనారీశ్వర తత్వంలోకి రాగలిగితే….ఆ తర్వాత వీరి నుంచి స్త్రీ పురుష అనే భేదం లేని ….నీ దగ్గరికి వచ్చిన సాధనా విగ్రహ మూర్తి రూపస్థితికి వీళ్లిద్దరూ శరీర రూప స్థితులు మారిపోయినట్లయితే,  అప్పుడు ఏకలింగ దేహమై తద్వారా వచ్చే  కారుంగలి లింగముగా జ్వాలాగ్నిలో దహనమై శూన్యంలో శూన్యం అయితే అదే పూర్ణ మోక్షం అవుతుంది.  అదే విశ్వమోక్షం అవుతుంది. కాబట్టి నువ్వు శ్రద్ధా భక్తులతో నీకు వచ్చే 14 దైవిక వస్తువులను అలాగే 14 శివలింగాలను ఏ మార్చకుండా…. ఎక్కడా పోకుండా నీ దగ్గరే నీ పరిధిలోనే ఉంచుకోవాలి. వాటిని నీ శరీరంలో భద్రపరుచుకునే అవకాశం ఉంది.  ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ శరీరం నుంచి తీయొచ్చు.  కాకపోతే నువ్వు ఒక్కొక్క బీజాక్షరంతో ఒక్కొక్క మంత్రంతో దాన్ని భద్రపరుచుకునే యోగం ఉంది.


శివ నందిని:- అయ్యో!  నాకు ఆ విషయం తెలియక కాశీలో దొరికిన త్రిశూలం పిల్లాడు ఆడుకుంటున్నాడు కదా!  అని బాలగణపతికి ఇచ్చాను.


శివానంద:- వాడు వస్తువులను జాగ్రత్త పరుస్తాడు.  దైవిక వస్తువులు అన్నీ కూడా వాడికే ఇవ్వు . వాడే చూసుకుంటాడు.  ఆ తర్వాత దైవిక విగ్రహాలన్నీ కూడా బాల కుమారస్వామికి ఇవ్వు. వాడు చూసుకుంటాడు.  వీళ్లిద్దరూ వాటిని కాపలా కాయడానికి వచ్చారు.  చివరికి ఎక్కడ మనం అమ్మవారిని బంధనం చేయాలో అక్కడికి అమ్మవారి బంధనం చేయడానికి కావలసిన వస్తువులు… సరైన సమయానికి ఇస్తారు.  పైకి మాత్రం ఆడుకోవడానికి తీసుకున్నట్టుగా కనబడుతుంది.  కాకపోతే వాటిని భద్రపరచడానికి వచ్చిన రక్షకులు అని గ్రహించు. వాళ్ళు ఆ వస్తువులు మోయలేరు…. చేయలేరు…. దాచలేరు…. అని మాత్రం అనుకోవద్దు. విశ్వాన్ని అండ, పిండ,  బ్రహ్మాండలను ఆడించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లు.  వాళ్ళకి వస్తువులు రక్షించడం పెద్ద సమస్య కాదు.  ఒక్కో వస్తువు వాళ్లకి అందిస్తూ ఉండు.  శివుడికి బంధనానికి సంబంధించిన వస్తువులు బాలగణపతికి…. అమ్మవారికి బంధనానికి సంబంధించిన వస్తువులన్నీ…. బాల కుమారస్వామికి ఇవ్వు.  వాళ్ళే చూసుకుంటారు.  ఇక నువ్వు వాటి గురించి ఆలోచించకు.  ఎప్పుడు ఏది ఎలా తీయాలో… ఎక్కడ ఉన్నదో… వీళ్ళిద్దరూ మీకు చెబుతారు.  ఆ సూచనలను అమలుపరిచి వివేక జ్ఞాన బుద్ధితో విశ్లేషణ చేసుకొని…. నిజమా! కాదా!  అని ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే….ఆ వస్తువులన్నీ నీకు దొరుకుతాయి. దొరికిన వస్తువుని దొరికినట్టుగా ఏ వస్తువుకి ఆ వస్తువు  వీళ్ళకి ఇచ్చేసెయ్యి . ఆ వస్తువు గురించి నువ్వు ఇంక ఆలోచించాల్సిన అవసరం లేదు.  ఒకవేళ వీళ్ళు చిన్నవాళ్లు,  ఐదు సంవత్సరాలకు మించి వయస్సు లేదు… కాబట్టి వీళ్ళు వస్తువులు జాగ్రత్తగా ఉంచుతారో లేదో అని అనుమానం వస్తే , ఆ వస్తువులను నీ శరీరంలో భద్రపరిచే విధి విధానం కూడా నేను చెప్పగలను.  నవఖండ సాధన సిద్ధిద్వారా  ఒక్కో  వస్తువును మన శరీరంలో ఉంచుకోవచ్చు…. అనేసరికి


శివ నందిని:- నవఖండ సిద్ధి ద్వారానా ……అంటే ఏమిటి స్వామి?  


శివస్వామి:- అది త్వరలో నీకు తెలుస్తుంది.  అది ఏంటి అనేది ప్రత్యక్షంగా అనుభవం అయితే కానీ , నువ్వు చూసేది ధ్యానంలో కనబడితేనో లేక గ్రంథములో నువ్వు చదివినా కూడా నమ్మవు కదా! 


శివ నందిని :- అన్నీ తెలిసిన వాళ్ళు,  మళ్ళీ నేను ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు… ఏదైనా కానీ నాకు ప్రత్యక్షంగా చూస్తే గానీ నేను నమ్మను స్వామి….


శివస్వామి:- ఒకళ్ళకి చెబితే అర్థం అవుతుంది… ఒకళ్ళకి కొడితే అర్థమవుతుంది… ఒకళ్ళకి తిడితే అర్థమవుతుంది… ప్రకృతి,  జీవానికి ఒక రుచి ఉన్నట్టుగా ఒకే అనుభవాన్ని ఒక్కో రకం గా చెప్పడంతోనే ఇలా వచ్చింది. ఒకటి కాస్త వెయ్యి రకాలుగా మారింది. ఒక శివలింగం కాస్త కోటి శివలింగాలుగా మారింది.  యద్భావం తత్ భవతి గానే అయ్యింది. ఏకత్వం కాస్త భిన్నత్వంలోకి రావడం అయ్యింది…. భిన్నత్వం కాస్త ఏకత్వంలోకి తీసుకురావాలి…ఇప్పుడు ఇదే మనం చేయవలసింది అనేసరికి…. 


శివనందిని:- నాకు అర్థం అయింది స్వామి!  ఇప్పుడు శివ బంధనానికి సంబంధించిన దైవీక వస్తువులు అలాగే అమ్మవారి బంధనానికి సంబంధించిన దైవిక శివలింగాలు కాలానుగుణంగా వస్తాయి.  ఇప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాలలో నా సాధన మొదలవుతుంది.. ఆ ద్వాదశ లింగాలలో చక్ర జాగృతి అవడం…. ఏకాదశ దేహాలు జాగృతి ఆరంభం అన్ని అవుతాయి. ఇప్పుడు సాధన అంతా అక్కడే ఆరంభం అవుతుందన్నమాట ! సరే ….స్వామి,  ఏ క్షేత్రానికి ఎప్పుడు వెళ్లాలనేది ఇంతవరకు సాధనా మూర్తి నుంచి వచ్చే ఆధారం బట్టి దాని విశ్లేషణ నాకు నేనే చేసుకుని, ఆ క్షేత్రానికి వెళ్లాల్సి వస్తుంది.  ఎందుకంటే కాశీ క్షేత్రంలో సాధనా మూర్తి ఆధారం ఇవ్వడంతో…. శ్రీశైల క్షేత్రానికి రావడం జరిగింది అని.. తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ త్రిశూలం తర్వాత జరిగే చక్ర జాగృతి ఏ క్షేత్రంలో అవుతుందో తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి…. ఏ విధంగా తెలుసుకోవాలనేది మీలాంటి సిద్ధ పురుషులు సమయానుసారంగా….కాలానుసారంగా జ్ఞాన స్ఫురణలు ఇస్తారని నాకు అర్థం అవుతుంది. 


అనేసరికి శుభం భూయాత్ నేను ధ్యానం చేసుకోవాలి…. నాకు ధ్యానం చేసుకునే సమయం ఆసన్నమైంది.  ఆ తర్వాత మీరేం చేయాలో నిర్ధారణ చేసుకోండి.. అంటే మేం కూడా ధ్యానంలో కూర్చుంటాం… అనేసరికి ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టు ఏకాంతంగా ఒంటరిగా ధ్యానంలో కూర్చుండిపోయారు. 



ఉన్నట్టుండి ధ్యానం నుంచి బయటకు వచ్చిన శివ స్వామి…. కాస్త ధ్యానంలో ఉన్న శివ నందిని కేసి చూస్తూ…. శివాని!  అనగానే,  ఆ స్వామి!  అని కళ్ళు తెరిచేసరికి…. నీకు ధ్యానంలో ఒక కొలనులో ఒక పెద్ద చేప , ఒక చిన్న చేప ఉన్నట్టుగా కనబడింది కదా!  ధ్యాన దృశ్యంగా కనపడింది కదా!  అనగానే ఆ అవును స్వామి అనేసరికి…అక్కడే ధ్యానంలో ఉన్న రుద్రస్వామి కేసి చూస్తూ…. స్వామి ఆ కొలను భీముడికొలను.  ఇక్కడికి దగ్గరలోనే ఉంది.  ఆపైన ఉంది. ఆ కొలను దగ్గరికి శివానిని తీసుకువెళ్ళు.  అక్కడ ఏం జరుగుతుందో చూడు…. అనేసరికి సరే స్వామి మీ ఆజ్ఞ అని…. రుద్ర స్వామి కాస్త ధ్యానంలో నుంచి బయటకు వచ్చి,  శివ నందినినీ తీసుకొని అక్కడ ఉన్న భీముని  కొలను వైపుకు వెళ్ళటం జరిగింది.  యధావిధిగా ఈయన  శివ స్వామి ధ్యానంలో కూర్చొని పోయారు. 



తీరా వీళ్ళిద్దరూ పంచ మఠాలు దాటి…. హాటకేశ్వరము చేరుకున్నారు. ఇక్కడి నుంచి భీముని కొలనుకు 6 కిలోమీటర్లు పడుతుంది అని కాలినడక మార్గంలో బయలుదేరారు. కాస్త దూరం వెళ్లేసరికే కైలాస ద్వారము అని అక్కడ రెండు శివలింగాలు ప్రతిష్టించి ఉండడం చూశారు. 

కైలాస ద్వారము 


ఈ రెండింటికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత….ఆ కొండపైన 30 అడుగుల వెడల్పులో సుమారుగా 50 అడుగుల లోతు ఉన్న చిన్న  కొలను కనపడింది.  ఆ కొలను చూపిస్తూ…. ఇదే శివ స్వామి చెప్పిన భీముని కొలను.  


భీముడు ఇక్కడికి వచ్చినప్పుడు దాహం వేసేసరికి తన గదతో ఈ కొండపైన  ఒకసారి మోదేసరికి  పాతాళగంగ పైకి వచ్చింది అంటారు.  దీనినే భీముని కొలను అని చెప్పడం జరిగింది. శ్రీశైలం పాదయాత్ర చేస్తూ వచ్చే యాత్రికులు ఈ కొలను మీద నుంచే శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు అని చెప్తారు. ఈ కొలనులో నీకేమైనా చేపలు కనపడుతున్నాయేమో చూడు అనేసరికి…… ఇదే నాకు ధ్యానంలో కనిపించిన కొలను.  దీనిని భీముని కొలను అంటారని నాకు ఇప్పుడే తెలిసింది.  సరే స్వామి! నేను అక్కడికి వెళ్తాను…. అని అక్కడ ఉన్న భీముని విగ్రహానికి నమస్కారం చేసుకొని……పక్కనే ఉన్న కొలనులో చూస్తే, నిజంగానే ఒక పెద్ద చేప, ఒక చిన్న చేప కనపడ్డాయి.  పెద్దది మూడు అడుగులు ఉన్నట్టుగాను….. చిన్నది ఒకటిన్నర అడుగు ఉన్నట్టుగాను కనబడింది.  తనకి ధ్యానంలో కనిపించింది ఈ చేపలే అని అర్థం అయింది. కానీ కేవలం రెండు చేపలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇదేం విచిత్రము అనుకునేసరికి…. ఆ చేపలు కూడా తెలుపు, బంగారపు వర్ణం కలిపి ఉన్నాయి.  ఇవి ఎక్వేరియంలో సాధారణంగా పెరిగే చేపలు కదా!  అలాంటివి ఇక్కడ ఉన్నాయి…. అది కూడా అక్వేరియంలో 2 అంగుళాలు మూడు అంగుళాలకు మించి ఉండవు. ఇవి ఏకంగా మూడు అడుగులు ఉన్నాయి అనుకుంటూ ఉండేసరికి….. అందులో దాగి ఉన్న పెద్ద చేప కాస్త…..తల్లి!  నీకోసమే ఎదురు చూస్తున్నాను.  నీ రాక  కోసం ఎదురు చూస్తున్నాను… నేను నీకు ధ్యానానుభవం ఇచ్చాను అంటుంటే….. చేప మాట్లాడడం ఏంటి?  నిజంగా చేప మాట్లాడుతుందా? లేక తను భ్రమ బ్రాంతి పడుతుందా!  ఎవరైనా ఇలా అనుకరణ చేస్తున్నారా అని చూస్తూ ఉండేసరికి….. లేదు తల్లి!  నేనుc చేప  రూపంలో ఉన్న యోగి ని అంటూ ఆ చేప కాస్త ఒడ్డుకు వచ్చేసరికి పెద్ద చేపల వెనకాల చిన్న చేప కూడా వచ్చి…. ఈ రెండు నేలను తాక గానే, అది కాస్త తెల్లని వస్త్రాలతో…. మనుష్య శరీరంతో…. తెల్లని గడ్డంతో…. తెల్లని జుట్టుతో….. ఒకాయన సుమారు 80 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన కనబడ్డాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఉన్న మరో ఆయన కాషాయ వస్త్రం తో కనపడ్డాడు.  తెల్లని వస్త్రాలు ధరించిన పెద్దాయన ఒక బండరాయి మీద కూర్చుని ఉంటే…. కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన పాదాల దగ్గర ఉన్నారు.  ఓహో!  వీరిద్దరూ గురు శిష్యులు అనుకునేసరికి…. ఈ పెద్దాయనని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.  తెలిసినట్టుగా…. తెలిసిన మనిషిలాగ అనిపించారు. ఎక్కడ చూశానో అని ఒకటికి పది సార్లు ఆలోచనలు చేస్తూ ఉండేసరికి…. హఠకేశ్వర ప్రాంతంలో ఉన్న పూర్ణానంద ఆశ్రమమునకు తన పరివారం అంతా వెళ్ళటం జరిగింది.  అక్కడ ఆయన వయస్సులో దిగిన ఫోటో….. ఆ తర్వాత ఆయన పూజించిన శివలింగం…. ఆయన ఆరాధన చేసిన శివలింగం…. ఆయన అక్కడ ఉన్న ధ్యానం జపాలు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి ….ఈయన జీవ సమాధి శ్రీశైలానికి దగ్గరలో ఉన్న సున్నిపెంట అనే ప్రాంతంలో ఆయన జీవ సమాధి పెట్టి ఆశ్రమం పెట్టారని….. ఈయన పూర్ణానంద అని…. ఈయన రాఖాడి బాబా ప్రధాన శిష్యుడని…. అక్కడ ఉన్న  వాళ్ళు చెప్పేసరికి… ఆ విషయం గుర్తుకు వచ్చి…. 


అవును స్వామి!  మీరు పూర్ణానంద స్వాములు.  మా గురువుగారైన పరమహంస పరమానంద గారికి చిన్న వయసులో ఎనిమిదవ తరగతిలో మీరు శక్తిపాతం చేసిన శక్తిపాత గురువులు…. అని గ్రహించాను. తెలుసుకున్నాను. క్షమించండి…. నేను మిమ్మల్ని మొదట్లోనే గుర్తుపట్టలేకపోయాను.  దానికి సమయం తీసుకున్నాను…. అని ఆయన పాదాలను తాకటానికి ప్రయత్నం చేసేసరికి ….వద్దు తల్లి ! నీకు శక్తిపాతం చేయమని నాకు శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు.  అందుకోసం అని నీకు ఎలా  యథావిధిగా శక్తిపాత గురువుగా ఉండి శక్తి జాగృతం చేసుకోవాలి.  నేనెవరో తెలుసుకున్నావు కదా!  నీవు ఎవరో జ్ఞాన స్ఫురణ అయింది కదా…! నేను ఎందుకు వచ్చాను అన్నది నీకు అర్థం అయింది కదా! కాబట్టి నువ్వు అక్కడే ఉండి ధ్యానంలో నన్ను తదేకంగా చూస్తూ ఉండు…. నేను నా కళ్ళ ద్వారా నీకు శక్తి జాగృతి చేస్తాను అనేసరికి… సరే స్వామి గురువాజ్ఞ… అని చెప్పేసి ఇద్దరు ఎదురుబోదురు కూర్చొని….. యథావిధిగా  దాదాపు రెండున్నర గంటల సేపు రుద్ర స్వామి మరియు పూర్ణానంద శిష్యులు కూడా యధావిధిగా ధ్యాన నిష్ఠలో కళ్ళు మూసుకుని ఉండిపోయారు.  కాకపోతే వీళ్ళిద్దరూ శివ నందిని మరియు పూర్ణానంద స్వామి వారు కళ్ళు తెరుచుకొని ఒకరినొకరు చూస్తూ ధ్యానంలో ఉండిపోతూ ఉండేసరికి….. కొద్ది సమయం తర్వాత  పూర్ణానంద కళ్ళ నుండి ఒక దివ్యమైన నీలివర్ణం , బంగారు వర్ణం మిళితమైన ఒక కాంతి శక్తి ప్రసారం శివ నందిని భ్రుకుటి స్థానమున….బొట్టు పెట్టుకునే స్థానం అయిన …ఆజ్ఞ చక్రం లోనికి ప్రవేశిస్తున్నట్లుగా అనుభవ అనుభూతి ప్రత్యక్షంగా శివ నందిని చూస్తూ ఉండిపోయింది. కాకపోతే ఆ శక్తి ధాటికి శరీరం ఊగిపోతూ….. పడిపోయే పరిస్థితికి వచ్చినా కూడా….ధ్యానభంగం కాకుండా….. కదలకుండా…. మెదలకుండా…. ధ్యానంలో నుంచి లేవకుండా….శక్తితట్టుకున్నా….తట్టుకోకపోయినా తన సమక్షంలో శరీరం నాశనం అయినా ….భగ్నమైన…. దహనమైన పర్వాలేదు అని…. భ్రమ పడుతున్న మనసును స్థిర మనసు చేసుకుంటూ…. ఆ శక్తి ప్రవాహమును అలాగే చూసుకుంటూ ….పొందుతూ ఉండిపోయింది.  అలా ఎంతసేపు జరిగిందో తెలియలేదు. 


ఆ శక్తి కాస్త కిందకి వెళ్ళిపోతూ… మూలాధార చక్రంలో నుంచి ఇంకా కిందకి….ఏదో గ్రంధి విభేదం చేస్తున్నట్లుగా అనిపించ సాగింది.  ఇలా అనుభవ అనుభూతితో….ఒక పాము పైకి కిందకి కదులుతున్నట్లుగా అనిపించ సాగింది.  ఆ తర్వాత ఉన్నట్టుండి శక్తి ప్రసారం ఆగిపోయింది. అబ్బా!  ఏం జరిగిందో…. ఈ శక్తి ప్రసారం ఇంకాస్త ఎక్కువసేపు ఉంటే బాగుండు. కాకపోతే శరీరం దహనం అవుతున్నట్లు…. ఒళ్లంతా మండుతున్నట్లుగా…. కట్టెతో కాల్చుతున్నట్లుగా అనిపించినప్పటికీ…..ఏదో తెలియని సుఖంగాను …ప్రశాంతంగాను …. తన్మయత్వ స్థితి పొందుతోంది.  ఈ ఆనందం పదికాలాలపాటు ఉంటే బాగుండేది కదా!  అప్పుడే ఈయన శక్తిపాతం చేయడం ఆపేశారా!  లేక పూర్తి అయిపోయిందా….అని పరివిధాల  ఆలోచనలతో శివనందిని ఉండేసరికి… తన శరీరంలో నుంచి మూలాధార చక్రంలోకి ఉన్న ఒక పాము కదలిక కాస్త జేగురు రంగులో ఉన్న పొగ లాంటిది…. గ్రంధి విభేదనం చేస్తున్నప్పుడు,  తల్లి కడుపులో నుంచి బిడ్డ ఎలా అయితే పురిటి నొప్పులతో బయటికి వస్తాడో …..అలా తన అజ్ఞాన గ్రంధిలోను ఒక పాము బయటికి వస్తున్నట్లుగా అనిపించసాగింది.  అంటే ఇతను తన శక్తిపాతంతో ఆజ్ఞాన గ్రంధిని విభేదనం చేశారన్నమాట! తద్వారా నిద్రలో ఉన్న కుండలినీ శక్తి పొగ రూపంలో అనుభవం అనుభూతి పొందుతూ ఉండేసరికి…. అది కాస్త మూలధర చక్రంలోనికి ప్రవేశించేసరికి….. ఆ చక్ర అది దేవత అయిన మహాగణపతి అమ్మవారితో కలిసి కనిపించేసరికి ఇది మూలాధార చక్రంలోనికి ప్రవేశించింది అన్నమాట!  శక్తి జాగృతి అయ్యింది అన్నమాట!  అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ యధావిధిగా మూలాధార చక్రం లో నుంచి కిందికి వెళ్లేసరికి  మూలాధార చక్రం కింద మధ్యలో….. ఈ శక్తి ప్రవాహం జరుగుతున్నట్లుగా అనిపించింది . అక్కడ స్వయంభు మొగ్గ లాగా చిన్న శివలింగం కనిపించింది.  ఈ పాము లాంటి శక్తి జేగురు రంగులో ఉండి…. మూడున్నర చుట్లు చుట్టుకొని ఆ లింగం మీద తన తల పెట్టుకున్నట్లుగా ఒక పాము తన తలని ఎలా అయితే శివలింగం మీద పెడుతుందో…. అలా పెట్టి పడుకున్నట్లుగా అనిపించింది.  అంటే ఇప్పుడు శక్తి జాగృతి అయింది అన్నమాట!  ఈ శక్తి కాస్త చక్రాల్లోకి ప్రవేశించాలంటే చక్ర జాగృతి అవ్వాలి. ఇది సాధన చేస్తున్నప్పుడు పాము తల ఎత్తటం…. కొద్దిసేపటికి పాము తల కాస్త శివలింగం మీద పెట్టడం…. ఎత్తడం, పెట్టడం పదేపదే చేస్తూ ఉంటే శక్తి జాగృతి అవుతుంది.  ఇది నిద్రావస్థకు వెళుతుంది.  ఇది చక్ర జాగృతి అయితే…. ఈ పాము లాంటి జేగురు రంగులో ఉన్న  కుండలినీ శక్తి కాస్త  ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించడం జరుగుతుంది అన్నమాట ! ఇప్పుడు శక్తి జాగృతి పూర్తి అయ్యింది.  చక్ర జాగృతికి ఎక్కడికి వెళ్లాలి… ఏంటి అనేది…. ప్రకృతి నిర్ణయం చేస్తుంది…. అని ఇన్నాళ్లు అజ్ఞాన గ్రంథిలో నిక్షిప్తమైన సాధనా శక్తి ఇప్పుడు మూలాధార చక్రంలోనికి,  మధ్య భాగంలోనికి చేరి పడుతూ లేస్తూ….  నిద్రావస్థలో, సుషుప్తావస్థ లో ఉన్నదన్నమాట!  అంటే కలలను నిద్ర మెలుకువగానే స్థితిలో తన  కుండలినీ శక్తి జాగృతి స్థితిలో ఉంది.  పూర్తిగా మెలకువ స్థితిలో ఉంటే….. చక్రాల్లో ఈ శక్తి జాగృతి అవుతుందని.. ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  అంటే దానికి జ్ఞాన స్ఫురణలు అవుతున్నాయి.  తనకి జ్ఞాన అనుభవాలు అర్థం అవుతున్నాయి అంటే…. తను అజ్ఞాన గ్రంధి వివేధనం జరిగిందన్నమాట!  ఎప్పుడైతే తనకి కలలు,  ధ్యానానుభవాలు , ఙ్ఞాన స్పురణలు ఎవరికి వారే స్వయంగా అర్థం చేసుకునే పరిస్థితికి వస్తారో…. వారికి జ్ఞానం అందుతుంది.  పూర్ణ జ్ఞాని అయ్యే అర్హత ,యోగ్యత, వస్తుంది.  అంటే వాళ్ళకి అజ్ఞాన గ్రంధి విభేదం అయింది అని అర్థం చేసుకోవచ్చు…. అని  గ్రహించింది . అంటే ఈ అజ్ఞాన గ్రంధి విభేదనం అవ్వాలి అంటే….. జాగృతి అవ్వాలి అంటే….. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి. అందుకనే ఆయన విశ్వగురువు అని లోక విధితమే కదా!  ఆయన రెండవ అవతారమైన నృసింహస్వామి దర్శనం పొందడం వలన శక్తిపాత గురువు అయిన శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహం తను పొందడం జరిగింది.  తద్వారా ఆయన ఇచ్చిన శక్తి ద్వారా తనలో కుండలినీ శక్తి జాగృతి చేసుకోవడం జరిగింది . తద్వారా పూర్ణానంద స్వామి వారు….మీ శక్తిపాత గురువు అవుతారు… అనుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన మరియు ఆయన శిష్యులు అక్కడ కనపడలేదు. 


యధావిధిగా రెండు చేపల రూపంలో నీటిలో జలకలాడుతూ కనిపించారు.  అంటే ఎవరికైతే అర్హత ,యోగ్యత ,యోగం పొందుతారో…..శక్తి జాగృతి స్థితికి వస్తారో…. అప్పుడు ఈయన శక్తిపాత గురువుగా ఉండి,  సాధనను పరిసమాప్తి చేయడానికి…. భౌతిక శరీరంతో వచ్చి…. శక్తిని శిష్యులకి ఇస్తారని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  ఆ ఇద్దరిని చూసుకుంటూ…. ఆ పెద్ద చేప వైపు చూస్తూ…. స్వామి ! ఇక సెలవు. మీరు శక్తిపాత గురువులుగా జీవితాంతం మనసులో ఉంచుకుంటాను.  ఈ విషయం లోకానికి తెలియకుండా జాగ్రత్త పడతాను. మీరు అదృశ్య రూపంలో ఉండి…..సదృశ్య రూపంలోకి వచ్చి …..యోగ సాధకులకు సహాయ సహకారాలు అందిస్తారని అర్థం అయింది. ఆనాడు  పరమహంస గారికి చెప్పిన అనుభవం నిజమా! కాదా? అని అనుమానం నాలో ఉండేది. ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనంగా….ప్రత్యక్ష అనుభవంతో మీరు సత్యమని, నిత్యమని ,నిజమని జీవ సమాధి చెందిన కూడా…ఊర్ధ్వ లోకాలకు వెళ్లకుండా,  సాధన శక్తిని లోక కళ్యాణార్థం మీ శక్తితో పదిమందికి సాధకులకు…. శక్తి జాగృతం చేస్తున్నారని….. ప్రత్యక్ష అనుభవం  నేను పొందడం అయ్యింది. అలాగే నిత్య సత్య హరి నా అనుభవం కూడా పొందడం అయ్యింది నేను బాతాల గంగ దగ్గర పొందిన ధ్యానానుభవం సత్యమని నిరూపణ చేశారు.  సరే స్వామి ! జాగ్రత్తగా ఆరోగ్యం.  నేను వెళ్ళొస్తాను ….నాకు శక్తిపాతం చేసినందుకు శతకోటి నమస్కారాలు అని చెప్పేసి నన్ను దీవించండి….. నన్ను ఆశీర్వదించండి…. అంటూ ఉండేసరికి,  ఆ పెద్ద చేప కాస్త ఒకసారిగా నీళ్లలో నుంచి ఎగిరి మళ్ళీ నీళ్ళల్లో పడిన శబ్దం వినపడే సరికి….. ఇదే మీ ఆశీర్వాదం అనుకుంటాను…. ఇదే మీ దీవెన అనుకుంటాను… అని నమస్కారం చేసేసరికి…. అమ్మ! ఇంక జనాలు రావడం మొదలుపెట్టారు.  ఈ కుండంలో ఏదో ఉంది అని భక్తులు కానీ వేట మొదలుపెడితే…. ఆయనకి ప్రమాదం వస్తుంది. గురువుగారికి మొదటికే మోసం వస్తుంది.  ఆయన గుప్తంగా సాధన చేసుకుంటూ గుప్త యోగిగా సాధనలో ఉన్నారు.  ఇప్పుడు ఈ చేపల రూపంలో ఉన్న వాళ్ళు…. రేపు ఇదే రూపంలో ఉంటారని చెప్పలేము.  జింకల రూపంలో తిరగవచ్చు …పులుల రూపంలో తిరగవచ్చు…పాముల రూపంలో తిరగవచ్చు….. గబ్బిలాల రూపంలో తిరగవచ్చు….. గుడ్లగూబ రూపంలో తినవచ్చు….. చెట్ల రూపాంతరం చెందవచ్చు…..వాళ్లకి  సాధ్యాసాధ్యాలు కానీవి లేవు.  ఒక్కొక్క శిష్యునికి సాధనాస్థితి, భావనా స్థితిని బట్టి అర్హత, యోగ్యత, యోగం బట్టి వాళ్ళు కనపడతారు.  మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. భక్తులు మనం ఈ చెరువులో ఏదో విషయం తెలుసుకున్నాము…. ఇక్కడ ఏదో ఉంది అని వెంటపడే అవకాశం ఉంది.  కాబట్టి మనం గుప్తంగా  వెళ్లిపోదాం అనేసరికి….. సరే రుద్రయ్య!  మీరు చెప్పినట్టుగానే చేద్దాము… నాకు ధ్యానం చేసుకోవాలని విపరీతంగా కలుగుతుంది.. ఆ విషయం నేను చెప్పకుండానే మీకు తెలిసే ఉంటుంది అనేసరికి…. అవును తల్లి ! అజ్ఞాన గ్రంధి నుంచి మూలాధార చక్రంలోకి ఉన్న పాము మూలలింగంలోకి ఒక శక్తి ఒక పాము రూపంలో మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రావస్థ నుంచి జాగృతి అవస్థకు చేరుకుంది అని నేను ధ్యానా నుభవం పొందాను.  ఏకంగా శక్తిపాత గురువులే పూర్ణానంద స్వామి స్వయంగా వచ్చి,  నీకు నిజరూప దర్శనం ఇచ్చి….. శక్తి జాగృతం చేసినప్పుడు ఎలాంటి ధర్మ సందేహం ఉండదు. కాబట్టి ఇక పదా వెళ్లిపోదాం… అనేసరికి అప్పటికే కొంతమంది భక్తులు వచ్చి , ఇది ఏం చెరువు? మీరు ఏం చేస్తున్నారు? ఏం కనపడింది ? అంటూ ఉంటే….ఏముంది రెండు  చేపలు ఉన్నాయి. … అంటే చేపలు చూడడానికి ఇంత సేపు ఇక్కడే ఉన్నారా…. అని నవ్వుకుంటూ వెళ్లిపోయేసరికి….. వీళ్ళు నిజంగానే అజ్ఞానులు….. ఆ చేపల లోపల ఎవరున్నారో తెలుసుకుంటే…. వీళ్ళకి బుర్రలు పోతాయి అనుకుంటూ…. వీళ్ళిద్దరూ యధావిధిగా కిందకి దిగి రుద్రాక్ష మఠంలో ధ్యానం చేసుకోవడానికి బయలుదేరారు.


అప్పుడు రుద్ర స్వామి…. కుండలినీ జాగృతి అయినప్పుడు కలిగే స్థితుల గురించి శివ నందిని కి చెప్పడం ఆరంభించాడు…


కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు కలిగే స్థితిగతులు:- 


కుండలినిశక్తి జాగృతి అయినపుడు సాధకుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాడు! ఇది కొన్ని గంటలపాటు ఉండవచ్చును! 

@ కుండలినీ శక్తి జాగృతి అయినపుడు అది స్థూల జగత్తునుండి సూక్ష్మ జగత్తులోనికి ప్రవేశిస్తుంది! అనగా స్థూలశరీరమునుండి అన్ని ప్రాణముల ప్రవాహము సుషుమ్నానాడి ద్వారా ప్రవహించటం ఆరంభమై, సూక్ష్మ శరీరములోనికి ప్రవేశించును!

@ అపుడు బయట ప్రవహిస్తున్న ప్రాణములతో కాళ్లు, చేతులు లాగి వేయబడతాయి! ఆ సమయంలో ప్రాణం కుంచించుకు పోతుంది! అప్పుడు సాధకుడు భయపడరాదు! సాధకుడు భయపడినట్లైతే అంతర్ముఖమవుతున్న ప్రాణము, ఇంద్రియాలు మరలా యధాస్థానానికి వస్తాయి! కాబట్టి ఈ సమయములో సాధకుడు ధైర్యంగా, సహనంగా ఉండాలి!

@ ఎపుడైతే సాధకుడు ధైర్యముగా, సహనముగా ఉంటే నీ మనస్సు స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరములోనికి పయనిస్తున్నట్లుగా నీకు ఆ సమయంలో అర్థం అవుతూ ఉంటుంది! అనగా అన్నమయకోశమునుండి ప్రాణమయకోశము ద్వారా ఈ ప్రయాణము ఆరంభమవుతుంది!

@ కుండలినిశక్తి మొదట సుషుమ్నానాడిలో ప్రవేశించినపుడు ఆమె తన శక్తిని మూలాధార చక్రము మీద పని చేస్తుంది! మూలాధార చక్రములో తిరగటం ప్రారంభము చేస్తుంది!అప్పుడు మర్మాంగాలు ఉద్రేకము అగును! ఆ సమయంలో సాధకుడు మూలబంధాన్ని గట్టిగా వేసి ఉండాలి! లేకపోతే వీర్యపతనం, మూత్రం బహిర్గతం కావటం సంభవిస్తుంది! మూలబంధనము ఎలావేయాలో పుస్తక జ్ఞానముకన్నా అనుభవ సాధకుల దగ్గర నేర్చుకోవటం చాలా మంచిదని నా మనవి!

@ సాధకుడు మొట్టమొదట మూలబంధాన్ని సాధన చేయాలి! లేకపోతే కుండలినీ మహాశక్తి సంచారాన్ని తట్టుకోవటం చాలాకష్టం! సాధకుడు తట్టుకోలేకపోతే సాధకుడు ఆసనం నుంచి ముందుకు పడిపోతాడు! అనగా ప్రాణభయంతో పడిపోతాడు! కుండలినీశక్తి తట్టుకోవటం చాలా కష్టము అవుతుంది! గమనించండి! కుండలినీశక్తిని తట్టుకోవాలంటే సాధకుడు మూలబంధమును సాధన చేయాలి! మూలబంధసాధన అనగా పద్మాసనములో కూర్చొనుట! కుండలినీ శక్తి జాగృతి అయినపుడు సాధకుడికి విపరీతమైన ఒళ్లు నొప్పులుంటాయి! అలాగే శరీరమునకు విపరీతమైన వేడిని కలిగి ఉంటుంది! గ్రహించండి! ఈ ఒళ్లు నొప్పులను, ఈ వేడిని తగ్గించుకొనుటకు సాధకుడు ప్రయత్నించరాదు!

@ సాధకుడి సూక్ష్మశరీరంలో షట్చక్రాలు దర్శనమిచ్చును! అలాగే సాధకుడికి సూక్ష్మజగత్తులో పరిచయములేని, అత్యంత భయంకరమైన శబ్దాలు వింటాడు! అలాగే భయంకరమైన దృశ్యాలు కనపడతాయి! వీటికి సాధకుడు భయపడకూడదు! వీటికి భయపడితే కుండలినిశక్తి మూలాధార చక్రము క్రిందకి వస్తుంది! గ్రహించండి!

@ ఈ భయములన్ని కుండలినిశక్తి సాధకుడి భ్రూమధ్యము చేరుకొనేదాకా ఉంటాయి! అనగా కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రము మీద స్థిరమైనపుడు సాధకుడు నిర్భయుడవుతాడు!

@ అలాగే సాధకుడికి ధ్యానంలో పూర్వజన్మ సంస్కారాలు గోచరించును! తద్వారా ఈ జన్మవాసనలు వలన సాధకుడికి తెలియకుండానే తన నోటి నుండి విపరీతమైన శబ్దాలు వస్తాయి! ఉదా:- పులిగాండ్రింపులులాంటివి! ఇలాంటి వాటికి సాధకుడు భయపడరాదు!

@ సాధకుడికి ధ్యానమునందు చనిపోయినవారు, ఆత్మలుగాని, ప్రేతాత్మలుగాని కనపడును! అవి మనతో మాట్లాడుటకు ప్రయత్నాలు చేస్తుంటాయి! అయిన కూడ సాధకుడు ఎటువంటి పరిస్థితిలో భయపడరాదు!

@ అలాగే సాధకుడికి ధ్యానంలో అద్భుతమైన దివ్యలోకాలు, అలాగే నిధులు, నిక్షేపాలు కనిపించును! వీటికి సాధకుడు ఆశపడకూడదు! ఆశపడితే సాధకుడి సాధన అంతటితో.ఆగిపోవును! గమనించండి!

@ సాధకుడి ధ్యానంలో అప్సరస వంటి స్త్రీలు, దివ్యకాంతితో కూడిన దేవత స్త్రీలు, పురుషులు, దర్శనమిస్తూ ఉంటారు! వారందరి యెడల అనాసక్తుడై ప్రవర్తిస్తూండాలి!

@ కుండలినీశక్తి షట్చ్ క్రాలు ఆధీనము చేసుకొంటున్నపుడు ఒక్కొక్కరకమైన సిద్ధులు లభించును! అలాగే వాటికి సంబంధించిన యోగమాయలను సాధకుడు దాటుకోవాలి! దాటలేకపోతే షట్చ్ క్రాలు బలహీనపడును!

@ సాధకుడిలో కుండలినీ శక్తి జాగృతి అయినపుడు శరీరము విపరీతమైన వేడిని, తడి ఆరకపోవటం సంభవించును! ఈ వేడి మూలాధార చక్రములో మొదలై మణిపూరక చక్రమునకు వచ్చేసరికి యోగాగ్నిగా మారుతుంది! దీనివలన జన్మవాసనలు, విషయవాసనలు, కర్మవాసనలు ఈ యోగాగ్ని ధాటికి నశించిపోతాయి! అందుకే సాధకుడికి బొడ్డు ప్రాంతములో విపరీతమైన వేడి ఉన్నట్లుగా అనుభూతి కల్గును!

@ కుండలినీశక్తి మూలాధార చక్రము చేరుకుంటే మహాలక్ష్మీ తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన ధనకాంక్షను తాపత్రయ పడతాడు! అనగా కనకమునందు పరీక్షలు పెట్టును! దీనిని సాధకుడు దాటుకోవాలి!

@ కుండలినీశక్తి స్వాధిష్టాన చక్రము చేరుకుంటే మహాశక్తి అయిన పార్వతిదేవి తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన కామవాంఛలు కల్గించును! అనగా ధ్యానమునందు కళ్లు తెరచిన, మూసిన అప్సరసలాంటి దేవతా స్త్రీలు, పురుషులు, వారిద్దరి మధ్య జరిగే రతి క్రీడలు కన్పించును!

@ కుండలినీశక్తి మణిపూరక చక్రమును చేరుకుంటే మన ఇష్టదేవత సాక్షాత్కరించును! అనగా నీవు జపించిన మంత్రదేవత నీకు కనపడతాడు! ఉదా:- శివమంత్రమును జపిస్తే శివుడు, రామమంత్రమును జపిస్తే రాముడు కనపడతాడు! వీరి మహామాయను దాటుకోవాలి! లేదంటే సాధకుడు సాలోక్యముక్తిని మాత్రమే పొందుతాడు! ఇక్కడికి వచ్చిన కుండలినీ శక్తి ఎన్నటికి క్రిందకి ప్రవహించదు! అనగా మూలాధార, స్వాధిష్టాన చక్రాలకు చేరదు! ఈ మణిపూరక చక్రములోనికి కుండలినీశక్తి రావటానికి మాత్రము సాధకుడు కనకము, కాంత మహామాయలు దాటుకొని రావాలి! ఇవి దాటడం అంటే కత్తిమీద సాములాంటిది!

@ కుండలినీశక్తి అనాహత చక్రములోనికి ప్రవేశించినపుడు మహాకాళి తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన, భయంకరమైన దృశ్యాలు,.అయినంతవరకు కుండలినీ శక్తిని జాగృతి చేసుకోవాలి!

@ ఎపుడైతే సాధకుడు ఆశకుగాని, భయమునకు గాని, యోగమాయలకుగాని లోనై అయితే కుండలినీ శక్తి నిద్రావస్థకు వెళ్లుతుంది! కథ మళ్లీ మొదటకు వస్తుంది! అందుకు సాధకుడు జాగ్రత్త వహించాలి!

@ సాధకుడిలో కుండలినీ శక్తి ప్రవాహము చీమలు ప్రాకినట్లుగాని లేదా పాము ప్రాకినట్లుగా గాని లేదా కప్ప గంతులు వేసినట్లుగా గాని ఉంటుందని యోగశాస్త్రాలు చెపుతున్నాయి! గమనించండి! ఇలాంటి అనుభూతులను సాధకుడు పొందుతాడు! ఇలాంటి అనుభూతిని సాధకుడు పొందితే ఆ శక్తి ప్రసారం క్రింది నుండి అనగా మూలాధారచక్రము నుండి పైకి అనగా సహస్రం వరకు ప్రవహించినట్లుగా అనుభూతిని పొందుతాడు! తర్వాత సహస్రం నుండి మూలాధారమునకు చేరుతుంది!

@ క్రిందకి చేరినపుడు అనగా మూలాధారమునకు చేరినపుడు సాధకుడు నిరంతరము ధ్యానమును చేసుకోవాలి! అపుడు మళ్లీ కుండలినీశక్తి జాగృతి అవుతుంది! ఇలా పదేపదే కుండలినీశక్తిని జాగృతి చేసుకొంటే సాధకుడు సమాధిస్థితిని పొందుతాడు! గమనించండి!

@ కాని సమాధిస్థితిని పొందాలంటే మనస్సు యొక్క స్థితి, శరీర ఆరోగ్య అవస్థ, హృదయ నిర్మలత్వము, సూక్ష్మత్వము, విచారము, పవిత్రముగా ఉండుట, పూర్ణ వైరాగ్యము కలిగియుండుట మున్నగు లక్షణాలు సాధకుడు కలిగియుంటే సమాధి స్థితి లభించును! వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కుండలినీశక్తి మూలాధారము క్రిందకు పోయి నిద్రామగ్నమవుతుంది! మళ్లీ నిద్ర లేచుటకు అనగా జాగృతికి 12 సం||రాలు పట్టును! దీనికోసము తీవ్రమైన సాధన చేయవలసి వుంటుంది!

@ సాధకుడు చక్రాలు శుద్ధిగావించవలసిన సమయాలలో, చక్రాలు ఆధీనం చేసుకొంటున్న సమయాలలో, చక్రాలు జాగృతి అవుతున్న సమయాలయందు ఎలాంటి మాయలకు, ఆశలకు, భయాలకులోను కాకూడదు! లోనై అయితే కుండలినీశక్తి నిద్రావస్థకు చేరుతుంది! సాధకుడు మూలాధార, స్వాధిష్ఠాన చక్రాల మహామాయలను అనగా కనకము, కాంతమును దాటుకోవాలి! వీటిని దాటితే కుండలినీశక్తి నిద్రావస్థకు వెళ్లదు! ఒకసారి ఈ కుండలినీశక్తి మణిపూరక చక్రమునకు చేరితే అక్కడనుండి అది సాధకుడికి ఆధీనమగును! అపుడు సాధకుడి ఇష్టానుసారముగా ప్రవహించును!


రుద్రాక్ష మఠానికి చేరుకున్నాక….. ఎవరికి వారు తీవ్ర ధ్యాన నిష్ఠలో ఉండాలని…. ఎవరికి నచ్చిన వైపుకు వాళ్ళు చేరుకొని ధ్యానంలో కూర్చున్నారు. . శివ నందిని మాత్రం ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు ఉంటాడని గ్రహించి ….ఈశాన్య దిక్కులో ధ్యానంలో కూర్చుంది.. ఆమెకు ధ్యానంలో మూలాధార చక్రం రూపం కనిపించసాగింది.  నాలుగు దళాలతో బీజాక్షరంతో కనిపించేసరికి…. ఓహో!  ఇది మూలాధార చక్రం అనుకుంటా… అని  అనుకుంది.  మూలాధార చక్రం మధ్యభాగంలో ఒక మొగ్గ లాంటి శివలింగం మూడున్నర చుట్లు చుట్టుకున్న పాము కదులుతూ మెదులుతూ నిద్రావస్థ నుంచి తిరిగి జాగృదవస్థకి…..ఆ తర్వాత మళ్లీ నిద్రావస్థకు వెళ్లడం….. ఆ శివలింగం మీద తలను పెట్టడం ఇదంతా స్పష్టంగా కనబడుతోంది. తొలిసారిగా తన చక్రమే తనకి కనబడుతుంది.  కాకపోతే ఈ చక్రం విభేదనం జరగలేదు….జాగృతి కాలేదు…. అని తనకి అర్థం అయ్యింది.  కేవలం తనకి శక్తి మాత్రమే జాగృతి అయ్యింది. ఈ శక్తి తన శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. కొద్దిసేపటికి ఈ చక్ర ఆధిపతిగా గణపతి కనిపించసాగాడు. 14 చేతులతో, 14 ఆయుధాలతో ఒక శక్తి మాత తన పక్కనే ఉన్నట్లుగా కనిపించసాగారు. ఈ చక్రం యొక్క అధిష్టానదైవం కదా మహాగణపతి అని పరమ హంస గారు తన కపాల మోక్షంలో చెప్పడం జరిగింది కదా! అనుకుని ధ్యానం చేసుకుంటూ ఉంది. ఉండుండి ధ్యానంలో ఓంకార నాదం సహజ సిద్ధంగా వస్తూ ఉండేసరికి…. ఇక తను ధ్యానం చేయడం ఆపేసి, ఓంకార నాదం వింటూ కూర్చుంది. ఆ నాద సాధన చేసుకోవడం జరుగుతుంది .సాధకుడు శరీరంలో ఉన్న యోగ చక్రాలలో వివిధ రకాలైన నాదాలు ఉంటాయి. ఆ నాదాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఢమరుక నాదం, ఓంకార నాదం, చిన్న ఘంటా నాదం, మహా ఘంటా నాదం, దీర్ఘఘంటానాదం, వివిధ రకాల నాదాలు వినిపిస్తాయని దీనిని మనకి శివపురాణంలో శివ సాధన అధ్యాయంలో చెప్పడం జరిగింది. మహాశివుడు తన సాధనని ఈ నాదయోగం ద్వారానే సిద్ధి పొందినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకృతిలో ఓంకారం నాదం ఆరంభం అయితే, తుం కార నాదం అంటాం అన్నమాట!  అంటే ఓంకార నాదం మణిపుర చక్రంతో ఆరంభమై…. తుంకార నాదం బ్రహ్మ రంధ్రం వద్ద అంతమవుతుంది. ఈ నాదాల మధ్య 12 రకాల నాదాలు మనకి వినబడతాయి .ఒకసారి గాలి సవ్వడి నాదం, ఒకసారి జల సవ్వడి నాదం, వినిపించవచ్చుమీ  ఒక్కొక్కసారి అగ్నినాదం, ఒకొక్కసారి మేఘనాధం, మువ్వల నాదం…. ఇలా ఏది ఎప్పుడు వినపడుతుందో ఈ చక్రాలు జాగృతి ద్వారా చెప్పడం జరిగింది.  ఒకసారి ఓంకార నాదం వినపడొచ్చు…. ఒకసారి ఓంకార  శంఖ నాదం వినపడవచ్చు… శంఖ ధ్వనులు కూడా వినపడతాయి అని లీలగా జ్ఞాన స్ఫురణ గుర్తుకు రావడం జరిగింది. సరేలే! తెలియకుండానే యోగ నాదయోగంలోకి అడుగుపెడుతున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా మనం పట్టించుకోవద్దు. మనం సాధన ఆపకూడదు. దేనిని ఆశించకుండా…. సిద్ధులు ,యోగ శక్తులు ఆశించకూడదు… సిద్దమాయ గురించి భయపడకూడదు అని ఒకటి పదిసార్లు చెప్పుకుంటూ…. సహజ సిద్ధంగానే వినిపించే ఓంకార నాదమును మణిపుర చక్రంలో నుంచి వచ్చే ఓంకార నాదమును వినటం ఆరంభించింది.  ఇంకా సమయంలో మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి విపరీతంగా ఆకలి వేసేసరికి….అప్పుడు గాని శరీర స్పృహ రాలేదు.  అప్పటిదాకా శరీరం ఉంది అనే విషయం కూడా మర్చిపోయే స్థితి తన ధ్యానస్థితికి వెళ్ళిపోయింది.  ఏకధాటిగా చాలాసేపు ధ్యానంలో ఉన్నదని గ్రహించింది . 


దీనంతటికీ కారణం….తనలో శక్తి జాగృతి అవ్వటం అని గ్రహించింది.  తనలో శక్తి జాగృతి  అజ్ఞాన గ్రంధి నుంచి మూలాధార చక్రంలోని మొగ్గలోనికి ప్రవేశించడం వలన ఇలా అయింది… ఇక చక్ర జాగృతి ఎప్పుడు జరుగుతుందనేది…. కాల నిర్ణయానికి వదిలేయాలి అని ఆ ప్రదేశం ఏంటి?  అనేది తెలియాలి అని…. మనసులో అనుకుంటూ ఉండగా…. అప్పటికే కళ్ళు తెరిచి ఉన్న రుద్ర స్వామి కాస్త,  అమ్మ!  నాకు ఆకలేస్తుంది. పిల్లలకి కూడా ఆకలేస్తుందేమో!  మనం సత్రానికి వెళ్లి భోజనం చేయాలి అని అనుకుంటూ ఉండేసరికి….. మరి మహాదేవి ఇప్పుడు వస్తుందా! రాదా? అని అనుకుంటూ ఉండేసరికి….. మహాదేవి సాయంత్రానికి వస్తుంది. రాత్రికి అక్కడ ఉండలేదు. ఉండే పరిస్థితులు అక్కడ లేవని నాతో చెప్పింది. కాబట్టి  సాయంత్రానికి వచ్చేస్తుంది. తన ఆకలి గురించి మనం ఆలోచించక్కర్లేదు. తనకి కావలసిన ఆహారం తన తయారు చేసుకోగలుగుతుంది.  ఏదో విధంగా అక్కడ ఉన్న సాధకుల ద్వారా ఆహారం పొందుతుంది. అయినా వాళ్ళు పంచ మాంసాలలో ఏదో ఒక మాంసం తింటారులే! అనేసరికి సరే స్వామి పిల్లలు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో..! గదికి  వెళదాం అని గదికి వెళ్ళటం జరిగింది. యజమాని ఎదురొచ్చి….మీ గురించి అనుకుంటూ ఉన్నాను!  భోజనం సమయం దాటిపోతుంది…. ఆహార పదార్థాలు ఉంటాయో,  లేదో! వస్తే బాగుండు…..అని అనుకుంటున్నాను. ఏదో దేవుడి పిలిచినట్లుగా ఇద్దరు వచ్చారు. పిల్లలేమో మీరు రాకుండా తినమన్నారు.  ఎంత నేను పెడతానన్నా… తినకుండా కూర్చున్నారు… అనేసరికి పిల్లల వైపు చూసేసరికి ఇద్దరు వీళ్ళకేసి కోపంగానూ, అలిగినట్టుగా ముఖం పెట్టి నవ్వు నవ్వి అయ్యో!  అవునా…. మీ ఇద్దరు చిన్ని చిన్ని బొజ్జలతో ఆకలితో ఉన్నారా!  నాకు  తెలియలేదు రా!  అయినా మీరు నాకు చెప్పాలి కదా! అమ్మ మాకు ఆకలేస్తుంది…. అనే సందేశం నాకు ఇస్తే ధ్యానంలో తెలిసేది కదా! వచ్చేసేదాన్ని కదా! అంటే అదే వద్దు… మాకు ఆకలి వేసినా మేము సందేశం ఇవ్వము. ఎందుకంటే నువ్వు ధ్యానంలో ఉండాలి. మా ఆకలి కోసం నువ్వు ధ్యానం నుంచి బయటకు రాకూడదు. అది మా ఇద్దరికీ నచ్చదు అనేసరికి…..కుమారస్వామి కూడా అవును! నాకు నచ్చదు. మనసు లయం చెందడమే కష్టం. ధ్యానము నందు ధ్యాస కుదరడమే కష్టము. అలాంటిది ధ్యానం లయం చెందుతున్న సమయంలో…. మేము ఆపడం…. ఆకలి దప్పికల గురించి నేను ఇబ్బంది పెట్టడం.. మాకు నచ్చదు. మా ఆకలిదేముంది? ఇప్పుడు తిన్నా మళ్ళీ కొంతసేపటికి వేస్తుంది. ఏదో ఒకటి తింటాము. ఇప్పటిదాకా ఆ పళ్ళు, ఈ పండ్లు తింటూనే ఉన్నాం . ఉండ్రాళ్ళు తింటూ…. నేనేమో చలివిడి ఉండలు తింటూ వచ్చాము . కాకపోతే నువ్వు పెట్టే గోరుముద్దలు తినాలి అని ఆలోచన రావడంతో మళ్లీ పూర్తి అయిన ఆకలి నిద్రలేచింది. ఇప్పుడు ఆకలి వేస్తుంది. మాకు అన్నం పెడతావా? అనేసరికి సరే రండి అని…. ఇద్దరికీ గోరుముద్దలు పెట్టి,  తను కూడా తినేసింది. ఈలోగా రుద్ర స్వామి కూడా తినటం ముగించాడు. ఆ తర్వాత నలుగురు కలిసి గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉండేసరికి…..శివనందిని కాస్త ధ్యానంలో అప్రమేయంగా తన మనసు ధ్యానంలోకి వెళ్ళిపోతుందని….. ఏం జరుగుతుందో ఏమోలే! అని తను ధ్యానంలో కూర్చోవడం వీళ్ళ ముగ్గురు గమనించి సరే అమ్మ ధ్యానం చేస్తుంది కదా!  మనమెందుకు ఇబ్బంది పెట్టడం అని ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు. రుద్రస్వామి కూడా నడుము వాల్చి యోగ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఈమె ధ్యానంలోకి వెళ్తూ ఉండేసరికి….. ఏదో ధ్యానం దృశ్యం లీలగా అస్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి….. మనసు స్థిరపరచుకోవాలని….. ఏవేవో ఆలోచనలు చేస్తున్నట్టుంది …… ధ్యాన దృశ్యం చూడాలి ఏముంది….ఏంటి…. అని అనుకుంటూ ఉండేసరికి త్రిశూల గాలిగోపురం లీలగా కనబడింది. 



గాలిగోపురం నీడ మల్లికా కుండంలో కనపడడం జరిగింది. ఇది సహజంగా మనం చూస్తుందే కదా ! అని అనుకునేసరికి….బాలగణపతి తన త్రిశూలం మల్లికా కుండంలో పొరపాటున జార విడిచినట్టుగా లీలగా ధ్యాన దృశ్యం కనిపించింది. అయ్యో త్రిశూలం నీళ్లలో పడిపోయింది.ఏం చేయాలో అని అనుకుంటూ ఉండేసరికి…. నేను తీసుకు వస్తాను తమ్ముడు! నువ్వేం కంగారు పడమాకు.. అని  బాల కుమారస్వామి నీళ్లలోకి పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ …..శ్వాస ఆడక…. ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించేసరికి…. ధ్యాన భంగమై కళ్ళు తెరిచింది. అంటే ఇప్పుడు మల్లికా కుండం ద్వారా బాల కుమారస్వామికి ఏమైనా ప్రాణగండం ఉందా! అని అనుకుని అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ….. సరేలే ఏం జరిగినా మన మంచికే. కారణం లేనిదే కార్యం జరగదు కదా! వాడికి ఇక్కడ మరణం ఉందేమో! వాడు ఇక్కడ శరీరం మోక్షం పొందాలేమో…. ఇప్పుడు రుద్ర స్వామికి ఇది చెప్పాలా …. తనకి చెప్పినా….చెప్పకపోయినా రుద్ర స్వామికి తెలుస్తుంది కదా! సరే అని విశ్రాంతిగా నిద్రకి ఉపక్రమించడానికి,  మూడు గంటలు అయింది అని కళ్ళు మూసుకుని సరే స్వామి !ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో శివ స్వామిని అనుకునేసరికి,  ధ్యాన దృశ్యాలు అన్నీ కూడా నిజాలే అవుతాయి.  వాటికి మనం భయపడాల్సిందేమీ లేదు.  ఏదో  మెలిక ఉంటుంది.ఆ మెలికలు మనం సరి చేసుకోవాల్సి ఉంటుందేమో! ఏదైనా చెప్పాలనుకుంటుందేమో! ఏదైనా చూపించాలి అనుకుంటుందేమో! అది ఆ విధంగా ఆలోచించు. నువ్వు శ్వాస ఆడకపోయిన విషయమే గమనిస్తున్నావు. పిల్లాడు చనిపోయిన విషయమే చూస్తున్నావు. చనిపోయాడో లేదో అని మనకి నిర్ధారణ అవ్వాలి అంటే….. అది అనుభవంలోకి రావాలి. ప్రత్యక్షంగా చూడాలి. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాము…. కంగారు పడమాకు… ఆందోళన చెందకు…. వాళ్ళు నీ కడుపున పుట్టిన పిల్లలు కాదు,  యోగ పుత్రులు . వాళ్ల గురించి నువ్వు బంధాల్లో,  బంధనాల్లో పడేటట్లు చేయాలి అని ప్రకృతి ఆదిపరాశక్తి ప్రయత్నం చేస్తుంది.  ఆ మాయలో పడమాకు అనగానే….. లేదు స్వామి!  నేను ముందు నుంచి అదే ఆలోచనలో,  అదే దృష్టిలోనే ఉన్నాను. నా దగ్గర ఉంటే శివప్రసాదం అనుకుంటాను…. నా నుండి వెళ్ళిపోతే శివార్పితం…. అని అనుకుంటాను. ఆ మనస్తత్వం ఆలోచన స్థితియే నాకు ఉంది. నాకు వీళ్ళు బంధనాలు , బాధ్యతలు అవుతున్నారని నేను ఎప్పుడూ అనుకోను. నేను చేసి పెట్టినా , పెట్టకపోయినా వాళ్ళ ఆకలి తీరేలా ప్రకృతి నిర్ణయం చేసేసింది. మధ్యలో నేనెవరిని ? మధ్యలో వచ్చాను… మధ్యలోనే వెళ్లిపోతాను…. వాళ్ళు కూడా మధ్యలో వచ్చారు… మధ్యలోనే వెళ్లిపోతారు…. వీళ్ళ బంధాలు, బంధనాలు అవ్వాలి….అయ్యేటట్లుగా చేయాలి…. అని ప్రకృతి ఆదిపరాశక్తి చేస్తూ ఉండొచ్చు.  నా పరంగా వాళ్ళు నాకు  బంధనాలుగా లేరు.  నేను వాళ్లకి బంధనం కాకపోవచ్చు… కళ్ళ ముందు వరకే బంధాలు . మాయలు, ప్రేమలు ఉంటాయి.  కళ్ళు దాటిన తర్వాత ఎవరికి వారే యమునకు తీరే.  అందరం కలిసి ఉన్నట్టుగా కనపడతాము…. విడివిడిగా ఉంటాము… విడిపోకుండా ఉంటాము…. మా సాధన కుటుంబం పరిస్థితి అది. అందరూ కూడా మానసికంగా ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టుగా ఉంటారు.  శారీరకంగా వచ్చేసరికి….ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపన తాపత్రయం, ప్రేమ, ఆప్యాయతలు నిజమైన ప్రేమతో ఉంటాము… అనేసరికి సరే!  ఇలాగే మీ జీవితం కొనసాగించండి…. ఇదే విధి విధానాలతో ఉండండి…. ఒకరినొకరు మోహ  వ్యామోహలలో పడవద్దు. పడేటట్లు చేయాలని ఆదిపరాశక్తి చేస్తుంది. మృత్యు భయానికి ప్రయత్నం చేస్తుంది. చచ్చిపోయాడు అని చూపించే ప్రయత్నం చేస్తుంది. 


ఏదో ఒక విధంగా మీ మనసులను స్పందింప చేసి మాయలో పడేటట్లు చేస్తుంది.  వీటి గురించి మీరు ఆలోచించవద్దు. వేటి గురించి మీరు పట్టించుకోవద్దు….. అనేసరికి సరే స్వామి ! ఇప్పుడు ఈ ధ్యానం దృశ్యం యొక్క అర్థం ఏమిటి? నాకు అర్థం కాలేదు….అనేసరికి ఏమో ప్రకృతి ఏం చేయాలనుకుంటుందో…… ఆదిపరాశక్తి ఏం చేయాలనుకుంటుందో…… బాల కుమారస్వామిని చంపాలనుకుంటుందో….. లేదా బాల కుమారస్వామి ద్వారా ఏమైనా చూపించాలని అనుకుంటుందో…… కాల నిర్ణయానికి వదిలేద్దాం అనగానే ….సరే స్వామి!  మీ ఆజ్ఞ.  నేను ఇంక బయటికి వెళ్తున్నాను… అంటే సరే గుడి దగ్గరికి వెళ్ళండి… గుడిలో ఈ ధ్యాన దృశ్యం కనిపించింది కదా! ఏం జరుగుతుందో చూద్దాం… అనేసరికి సరే స్వామి!  ఇంక ఏం జరిగినా అది దైవ నిర్ణయం గానే భావించుకుంటాను. ఇంక ఆందోళన చెందను. కంగారు పడను…. అనేసరికి శుభం భూయాత్ అని చెప్పి శివ స్వామి అంతర్వాణి ఆగిపోవడం జరిగింది. 


అప్పుడు శివ నందిని కాస్త యోగనిద్ర నుంచి బయటకు వచ్చిన రుద్ర స్వామి కేసి చూసేసరికి అమ్మ! నాకు అంత అర్థం అయింది. మళ్లీ నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఇంక పదా! మనం మల్లికార్జున బ్రమరాంబికలను దర్శనం కూడా చేసుకుందాం. ఏం జరిగినా ఇక మనస్సు స్థిరం చేసుకో!  ఏం జరిగినా…. కాల నిర్ణయానికి వదిలేద్దాం అనగానే….. సరే స్వామి! నాలుగు గంటలవుతుంది కదా!  గుడి కూడా తలుపులు తెరుస్తారు…..అనేసరికి అమ్మ !అమ్మ ! మేం కూడా గుడికి వస్తాం అని పిల్లలిద్దరూ లోపలికి వచ్చేసరికి…..కుమారస్వామి ఎందుకో నీరసం గాను, అసహనంగానూ, భయంగాను, అయోమయ స్థితిలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించేసరికి ఏమైందిరా నాన్న! అంటే ఏం లేదమ్మా ! వాడు నా ఆటలో ఓడిపోయాడు….అందుకే దిగులుగా ఉన్నాడు…. అలక ఎక్కాడు అనేసరికి కుమారస్వామి వెంటనే అది కాదులే అమ్మ !  వాడు చిన్నవాడు కదా, వాడిని ఓడిస్తే వాడు బాధపడతాడు…. అదే నేను ఓడిపోతే వాడు ఆనందపడతాడు… వాడి ముఖంలో ఆనందాన్ని చూడాలనిపించి…. కావాలని ఓడిపోయాను. ఆ విషయం వాడికి తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాడు. అందుకనే నాకు కోపం వచ్చింది అనేసరికి…..ఇప్పుడు నువ్వు గుడికి వస్తావా నాన్న ….ఇక్కడే ఉంటావా!  అంటే మీరు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉంటాను.  దొరక దొరక్క దొరికారు అందరూ…. ఒకరు తాత, నాయనమ్మ ….ఇంకొకళ్ళు తమ్ముడు, నువ్వు అమ్మవి, నాన్నగా ఎటు అయిన ఉండనే ఉన్నాడు…. కాబట్టి అందరినీ వదిలిపెట్టి ఇన్నాళ్లు నేను ఒంటరిగా ఏకాంతంగానే ఉన్నాను.  ఇప్పుడు అందరితో కలిసి ఉంటాను. పదండి వెళ్దాం…. ఆ గుడిలో ఏదో జరుగుతుందని చూపించారు కదా!  ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి…. వీళ్ళు కూడా కాలాంతకులే.  వీళ్ళకి తెలియనివి ఏమీ ఉండవన్నమాట! అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టే బాల కుమారస్వామి ఉంటున్నాడని గ్రహించింది శివ నందిని. ఆ తర్వాత అందరూ కలిసి  గదికి తాళం వేసి…. సత్రం యజమానికి గుడి దర్శనానికి వెళ్తున్నామని చెప్పేసి మల్లికార్జున స్వామి గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది.

  

సాధన కుటుంబం అంతా స్వామివారి దర్శనం కోసమని గుడిలోకి వెళ్ళడం జరిగింది. బాల గణపతి ఉన్నట్టుండి, అమ్మా! నేను దర్శనానికి రాను. కాసేపు త్రిఫల వృక్షం కింద ఆడుకుంటాను..అనేసరికి బాల కుమారస్వామి కాస్త అమ్మా! నేను వాడికి రక్షణ గా ఉంటాను. మీరిద్దరూ కలిసి దర్శనానికి వెళ్ళండి. అనేసరికి శివ నందిని కాస్త మీరు ఆడుకుంటే ఆడుకోండి కానీ ఆ మల్లికా కుండం దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకండి. ప్రాణాపాయం ఉంది అని ఉదయమే ధ్యానానుభవం అయింది . జాగ్రత్తగా ఉండండి…. ఎక్కడికి వెళ్లకుండా ఆ చెట్టు కింద ఆడుకోండి . అంటే అలాగే అమ్మ …. అని వీళ్ళిద్దరూ ఆ త్రిఫల వృక్షం కిందకి వెళ్లి ఆడుకుంటూ ఉండేసరికి…. శివ నందిని మరియు రుద్ర స్వామి కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళటం జరిగింది. స్వామివారి దర్శనం అయిన తర్వాత లోపల నుంచి బయటికి వస్తున్నప్పుడు…. పిల్లలు వృక్షం కింద ఆడుకుంటూ కనిపించేసరికి… శివ నందిని సంతోషంగా చూసుకుంటూ…. అమ్మవారి దర్శనానికి వెళ్లడం జరిగింది.  అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసరికి పిల్లలు చెట్టు కింద కనిపించకపోయేసరికి…. మనసు ఏదో తెలియని ఆందోళనకు గురి అయింది. పిల్లలిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని చూసేసరికి… మల్లికా  కుండం దగ్గర భక్తులంతా గుంపు  గూడుతూ….ఏదో మాట్లాడుకుంటూ ఉండేసరికి….. కీడు శంకిస్తూ అనుమానం మొదలవుతూ ….ఉండేసరికి ఏమైందమ్మా!  లోపల ఏం జరిగింది…. అని అంటూ ఉండేసరికి…. అక్కడ ఉన్న ఒకావిడ వంక చూస్తూఅడగగా …..పిల్లలు ఆడుకుంటూ …..ఆడుకుంటూ ఈ కుండం దగ్గరికి వచ్చారంట!  గాలిగోపురం నీడ నీళ్లలో కనపడుతుందని చూస్తుంటే…. పొరపాటున వాళ్లు చేతిలో ఉన్న త్రిశూలం జారి అందులో పడిపోయిందట. ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీటిలో మునకేశారు.  ఆ త్రిశూలం తెచ్చుకోవడానికి …..అనేసరికి అయ్యో పాపం!  అనగానే ఆ పోలికలు బాలగణపతి బాల కుమారస్వామి స్వామివి అయి ఉంటాయని గ్రహించి, రుద్రస్వామి కేసి చూసేసరికి అమ్మ! జరగాల్సింది జరగక మానదు . ఎవరు ప్రాణాలతో వస్తారో…. లేదా ఇద్దరు ప్రాణాలతో పోతారో …. కాలయముడే నిర్ణయించాలి.  ముందు పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం…. అనుకుంటూ ఉండేసరికి బాల  గణపతి నీటి మీద తేలుతూ కనబడుతూ…. బాల కుమారస్వామి చేర్చాడు.  బాల గణపతి బయటకు వచ్చాడు. అమ్మ! అమ్మ త్రిశూలం పడిపోతే….నేను దూకితే వెంటనే అన్నయ్య కూడా దూకాడు. నన్ను రక్షించడానికి…. వాడు నీటిలో ఉండిపోయాడు.  నేను బయటికి వచ్చేసాను… అని బాలగణపతి అనేసరికి,  పోతే పోయిందిలే!  త్రిశూలం  గురించి ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు…. అది ,ఇది అని శివ నందిని అనేసరికి…. ఒరేయ్!  కుమార మంగళం కన్నా! కన్నా!  అనేసరికి, అమ్మ!  ఉండు వస్తున్న తమ్ముడు త్రిశూలం పడిపోయింది. ఆ త్రిశూలం వెతికి ఒడ్డుకు చేరుస్తున్నాను. నీటి అడుగున  ఎక్కడో పడిపోయిందనుకుంటా! అంటే పోతే పోయింది లే త్రిశూలం…. కుమారస్వామి బయటికి రా! అనేసరికి వీడు పైకి వచ్చాడు.  అన్నయ్య నీకు త్రిశూలం దొరకలేదా ! అయ్యో నాకు త్రిశూలం కావాలి…. నా త్రిశూలం….. అనేసరికి,  నీకు ఏదో ఒక షాపులో త్రిశూలం కొనిస్తాను అనేసరికి….. నాకు షాపులో దొరికే త్రిశూలం కాదు,  నాకు ఇష్టమైన త్రిశూలం నేను కాశీ నుంచి తెచ్చుకున్న త్రిశూలం అది నాది. నాకు కావాలి అని మారం చేస్తూ ఉండేసరికి…. రుద్ర స్వామి నేను వెళ్లి దూకుతాను… నువ్వు పైకి రా!  అని అనేసరికి…. లేదు ఇది పెద్ద వాళ్ళు పట్టే స్థలంలా లేదు.  నేను తీసుకు వస్తాను…. లోపలికి వెళ్లి వెతుకుతాను…. అని నీటిలో మునుగుతూ ఉండేసరికి.. వాడి శ్వాసకు ఇబ్బంది వస్తూ ఉండేసరికి…. అమ్మ !నాకు గాలి ఆడట్లేదు, నా శరీరం  తేలిపోతున్నట్లుగా ఉంది, నేను చచ్చిపోతానేమో… నన్ను ఎవరో కిందకి లాగుతున్నట్టుగా ఉంది. ఊపిరి ఆడట్లేదు అనేసరికి …..


ఒక మధ్య వయస్కురాలు లేత గులాబీ రంగు చీర కట్టుకున్న ఆవిడ….. సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న ఆవిడ, గబగబా వస్తూ….అయ్యయ్యో!  పవిత్రమైన  మల్లికా కుండం నాశనం చేసేశారు కదా!  పిల్లలు ఎక్కడైనా నీటిలో ఆడుకుంటారా! నీటిలో ఆడుకోవాలని అనుకుంటే పాతాళ గంగలో ఆడుకోవచ్చు కదా! పోయి పోయి పరిశుద్ధమైన నీళ్లు ఉన్న మల్లికా కుండంలో ఆడుకుంటారా! అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఎవరి పిల్లలు వీళ్ళు!  అసలు బాధ్యత ఉందా? పిల్లలని పెంచడం ఇంతేనా! ఆట బొమ్మ కోసం పిల్లల ప్రాణాలు తీస్తావా? త్రిశూలం అక్కర్లేదు…. ఏం అక్కర్లేదు…. ముందు వాడిని బయటికి రమ్మని చెప్పు. అది ఇది అనేసరికి క్షణకాలం పాటు స్తంభించిపోయింది శివ నందిని. ఎందుకంటే తనని చంపడానికి అదే ఆవిడ ధ్యానంలో కనబడింది అని శివనందిని గ్రహించింది. అంటే స్వయంగా ఆదిపరాశక్తి ఈవిడ రూపంలో వచ్చిందన్నమాట! ఇక్కడేదో మర్మ రహస్యం ఉంది. అది ఆపడానికి ఈవిడ ప్రయత్నం చేస్తుందని శివ నందిని గ్రహించింది. శివ నందిని ఆలోచన పసిగట్టిన ఆవిడ కాస్త ముందు పిల్లల గురించి ఆలోచిస్తావా! త్రిశూలం గురించి ఆలోచిస్తావా! ఒక పిల్లోడు భక్షించబడ్డాక ఇంకో పిల్లాడు భక్షించబడతాడేమో! అసలే ఇక్కడ మూడు తాటి చెట్ల లోతు నీరు ఉంటుంది. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా ప్రమాదం . బతికి బట్ట కట్టడం కష్టం. లోపల ఉన్న పిల్లాడి పేరేంటి? అంటూ రుద్ర స్వామి వైపు చూసి….ఏమయ్యా! పెద్దాయన…. వయసులో పెద్దవాడివి…. ఈ పిల్ల చేష్టలు ఏంటి? పిల్లలు నీళ్లల్లో మునిగిపోతే…. చూస్తూ కూర్చుంటావేంటి? నీళ్లలోకి దూకు… ఆ పిల్లవాడిని తీసుకురా! ఆ త్రిశూలాలు ఏంటి…. పోతే పోయింది కావాలంటే ఇంకో త్రిశూలం కొనొచ్చు. త్రిశూలం కోసం పిల్లాడి ప్రాణాలు పణంగా పెడతారా! అంటూ ఉండేసరికి బాల కుమారస్వామి పెద్దగా లోపల ఎవరో ఉన్నారు… ఒక పెద్దాయన ఉన్నారు …..శివలింగారాధన చేసుకుంటున్నాడు…. నాకు కనపడుతున్నాడు…. ఆయన ఉన్నాడమ్మా!  నువ్వేం కంగారు పడొద్దు…. నేను జాగ్రత్తగా త్రిశూలం తీసుకు వస్తాను…. ఎవరూ నీటిలో దూకద్దు అని పెద్దగా అరిచేసరికి…. ఆ శబ్దము విని అయ్యయ్యో!  ముసలయ్య దగ్గరికి వెళ్లి పోయాడా? అన్నంత పని చేసేసాడే!  ఆయన కాలయముడు.  ఆయన ఊరుకోడు. చంపేస్తాడు. పిల్లాడిని చంపేస్తాడు…. అని అంటూ ఉండేసరికి ,లోపల ఒక పెద్దాయన ఉన్నాడని ఈవిడకి ఎలా తెలిసింది అని శివ నందిని అనుకుంటూ ఉంటే….. రుద్ర స్వామి ఆలోచనలో పడ్డాడు.  వీళ్లిద్దరూ కూడా ఏం జరిగితే అది జరుగుతుందని సాక్షిభూతంగా ఉండేసరికి ఇక ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాక…. ముందు నేను వెళ్లి పిల్లాడిని తీసుకువస్తాను… నీళ్లలో దూకుతాను…. అనేసరికి ఆగమ్మా ! ఆగు!  పిల్లాడు లోపల ఎవరినో చూసాను… క్షేమంగా ఉన్నానని చెబుతున్నాడు కదా! నువ్వెందుకు కంగారు పడతావు… నువ్వు ఎందుకు భయపడతావు…. మాకే లేని కంగారు భయం నీకెందుకు… ఏం జరగదు…. పిల్లాడు లోపలికి వెళ్లి త్రిశూలం తీసుకుని వస్తాడు… కాకపోతే ఒక ముసలాయన ఉన్నాడు అన్నాడు కదా!ఆయన రక్షణగా ఉంటాడు.  నువ్వేం కంగారుపడమాకు… అని విషయం గ్రహించిన రుద్ర స్వామి ఈవిడను ఆపేసరికి…. మీ చావు మీరు చావండి! పిల్లోడి ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకువస్తున్నారు. లోపల ఉన్నవాడు ఊరుకోడు…చంపిన చంపేస్తాడు పిల్లాడిని….లోపల ఉన్న వాడి సంగతి నీకు తెలియదు. వాడు మంచోడు కాదు… అది ఇది అంటూ పిల్లాడిని రక్షించాల్సింది పోయి, భక్షించేలా చేస్తున్నారు .  



 మీరు ఏం తల్లిదండ్రులో అర్థం కావట్లేదు. నేను రక్షిస్తాను అంటే నన్ను ఆపుతున్నారు.మీకేదో ఆలోచనలు వచ్చాయి….ఏదో నా గురించి ఆలోచనలు చేస్తున్నారు… నన్ను నా భర్తను వేరు చేయాలనుకుంటున్నారు…. నన్ను నా భర్తని దూరం చేయాలనుకుంటున్నారు…. నా భర్తను చంపాలనుకుంటున్నారు…. అని ఆవేశపడుతూ,  ఆవేదన చెందుతూ ,అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈమె మాటలు శివ నందినికి రుద్ర స్వామికి అర్థమై అర్థం కానట్టుగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న భక్తులకి అర్థం కాలేదు. అయ్యో పాపం! పిల్లాడు ఏమైపోయాడు….మమ్మల్ని దిగమంటే మేము దిగుతాం అనేసరికి అవసరం లేదు… పిల్లాడే వస్తాడు లెండి! అనేసరికి బాల కుమారస్వామి కాస్త సుమారు వెయ్యి అడుగుల లోపలికి వెళ్లేసరికి శ్రీ చక్రంలో పాతాళ శివలింగానికి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్న ఒక వయోవృద్ధుడు కనిపించాడు.  ఆ వయోవృద్ధుడు చూడటానికి తెల్లని వస్త్రాలు, ధరించి తెల్లని గడ్డంతో, తెల్లని జుట్టుతో ఉన్నాడు. చేతిలో ఒక త్రిశూలం ఉంది…అని బాల కుమారస్వామి ఆ వయో వృద్దుడికి నమస్కారం చేసేసరికి…. అదిగో నాయన! నీ త్రిశూలం అక్కడ ఉంది.  అది ఎక్కడికి పడిపోలేదు…. దానిని నేను రక్షిస్తున్నాను… అనేసరికి ఎవరు తాతయ్య!  నువ్వు జలంలో ఉన్నావే? అంటే నన్ను జలదిగ్బంధనం చేశారు. ఈ శివలింగానికి బంధనంగా ఇదిగో ఈ త్రిశూలం చేశారు. ఈ త్రిశూలానికి కాపలాగా ఒక పాము ఉంటుంది. అందుకని ఈ త్రిశూలం చూస్తే నేను మోక్షం ఇస్తాను అని…. పైన త్రిశూలం పెట్టడం జరిగిందిమీ ఓహో ఇక్కడ నువ్వు ఉన్న త్రిశూలమే ఆ త్రిశూలం అన్నమాట! ఇంతకీ నా త్రిశూలం ఎక్కడ ఉంది అనేసరికి….అదిగో నీ త్రిశూలం అనేసరికి త్రిశూలం అచ్చు ఉన్న రాయిలోకి ఇరుక్కుపోయేసరికి….కుమారస్వామికి అర్థం కాలేదు. తీయడానికి ఎంత ప్రయత్నించినా, ఆ త్రిశూలం అచ్చులోకి ఈ త్రిశూలం ఇరుక్కుపోయిందని…అది ఎంతకీ రావట్లేదు.  అయినా దీనికి తగ్గట్టుగా త్రిశూలం అచ్చు ఉండటం ఏమిటి? నాకు అర్థం కావట్లేదు? అంటే ఇక్కడ మనకి ఎవరికీ తెలియని లోక రహస్యం ఉంది. ఆ లోక రహస్యం అనేది…. త్రిశూల బంధంతోనే విముక్తి అవుతుంది. లోపల ఏదో ఉండి ఉంటుంది…. అనేసరికి సరే నాకు త్రిశూలం కావాలి …నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే నీ చేతులతో నువ్వే త్రిశూలాన్ని పీకు… అదే వస్తుంది… అనేసరికి త్రిశూలం పీకుతూ ఉండేసరికి రాయి అటు ఇటు కదులుతూ ఉండేసరికి…రాయితో సహా త్రిశూలం బయటకు వచ్చేసింది.  ఆ రాయి ఎప్పుడైతే బయటకు వచ్చిందో… రాయి నుంచి త్రిశూలం ఊడిపోయింది. ఆ రాయి ప్రాంతంలో మూడున్నర అంగుళాలు ఉన్న బంగారపు వర్ణము పాము కనిపించేసరికి… బంగారపు ఆభరణంతో పాము లాంటిది కనిపించేసరికి…. తాతా! తాత ఇక్కడ పాము ఆభరణం ఉంది…. అనేసరికి అది పాము ఆభరణం కాదు… నాగాభరణం. ఈ నాగాభరణం మీ అమ్మకి ఉపయోగపడుతుంది . దీనిని తీసుకువెళ్ళు అనేసరికి…. తాత నువ్వు పూజిస్తున్న శివలింగాన్ని నేను తాకవచ్చా…. అంటే దీనిని పాతాళ శివలింగం అంటారు. దీనిని తాకడమే కాదు…నువ్వు దీన్ని తీసుకెళ్లి, పూజించే అవకాశం కూడా ఉంది. కాకపోతే దీనికి మీ అమ్మగారు సహాయ సహకారాలు అందించాలి. తనకి అంత సాధన శక్తి రావాలి… అంత అర్హత రావాలి…. అది వచ్చే సమయానికి మీ దగ్గరికి చేరుతుంది. ప్రస్తుతం నాగబంధం ఉన్న దీన్ని తీసుకువెళ్ళు… నన్ను త్రిశూల బంధనం చేశారు… ఈ పాతాళ శివలింగాన్ని నాగబంధనం చేశారు. 


అంటే…. నాకేం అర్థం కావట్లేదు… ఈ బంధనాలు గురించి!మా అమ్మకి చెప్తాలే… తాత అనేసరికి,  సరే జాగ్రత్తగా ఇక్కడ నుంచి వెళ్ళు… నీకు ఎలాంటి ఇబ్బంది లేదు….పాము జాగ్రత్త… త్రిశూలం జాగ్రత్త… త్రిశూలం తమ్ముడికి ఇవ్వు! పాము నీ దగ్గరే ఉంచుకో అనేసరికి… సరే తాత ఉంటాను! నన్ను దీవించు! అనేసరికి శుభం భూయాత్… ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు!  అని దీవించేసరికి ఆయన ధ్యానంలో కళ్ళు మూసుకున్నారు. పిల్లాడు ఈదుకుంటూ పైకి వచ్చేసరికి… చేతిలో ఒకవైపు త్రిశూలం…. ఒక వైపు చేతులు ముడుచుకొని రావటంతో ….రుద్ర స్వామి చేతులు అందించి పెళ్లాన్ని పైకి తీసుకువచ్చాడు… శివ నందిని తన చేతి సంచిలో నుంచి టవల్ తీసి తుడుస్తూ ఎక్కడికి వెళ్లావు రా! ఇంతసేపు ఏం చేసావు లోపల… ఏం జరిగింది అని అడిగేసరికి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పి…. తను ముడిచిన గుప్పిట్లో నుంచి పాకుతున్న పాము లాంటి నాగాభరణం కనిపించేసరికి… ఇది అచ్చం మన సాధనా మూర్తి మీద పాకుతున్న పాములాగే ఉంది…. అక్కడ గుంటలో ఈ పాముని పెట్టొచ్చు అన్నమాట! ఈ పాముకి పెడితే ఏదో వస్తుందన్నమాట! ఏదో తెలుస్తుంది… అని బాలగణపతి సంబరపడిపోతూ…. అమ్మ! పాము దొరికిందమ్మా… మనకేదో దొరుకుతుంది… మనకేదో చెప్తున్నాడు…. ఆధారాన్ని పట్టుకొని ఇంకో చోటికి వెళ్లవచ్చు…. మనం ఇంకో ప్రాంతానికి వెళ్ళవచ్చు…. విషయం తెలుస్తుంది అని అంటూ ఉండేసరికి… ఈ పిల్లల మాటలు అర్థం కాక బిక్క ముఖాలు వేశారు అక్కడ ఉన్న భక్తులు.  పిల్లలు కాదండి ఏవో మాట్లాడుతూ ఉంటారు…ఆ మాటలు మాకు తప్ప ఎవరికీ అర్థం కావు . మీరు వెళ్ళండి పిల్లలు క్షేమంగా బయటికి వచ్చారు…. అనేసరికి అవును , ఇందాక ఒక పెద్దవాడ వచ్చి ఆపింది కదా.!  పిల్లల్ని బయటకు తీయండి అని…. ఇంతకీ ఆవిడ ఎవరూ, కనిపించలేదు అని రుద్ర స్వామి శివ నందిని అడిగేసరికి…. ఆవిడ ఎవరో ఏంటో మీకు తెలియదా? మీకు తెలియకుండానే ఉంటుందా? నన్ను ధ్యానంలో త్రిశూలం తో పొడవడానికి వచ్చిన ఆవిడ ఆ పెద్దావిడ.  నాకు తెలిసి త్రిపుర సుందరి అంశ అయి ఉంటుంది అనేసరికి….అవునా!  చూడగానే నాకు అనిపించింది.  అమ్మవారి అంశ అని . ఇందులో ఏదో మర్మ రహస్యం ఉంది. తెలియాలి అనుకున్నాను కాకపోతే పిల్లాడి ప్రాణాలు ఉంటాయో, పోతాయో అని ఆలోచనలో పడ్డాను. ఏం జరిగినా పర్వాలేదులే అని అనుకున్నాను. గణపతి త్రిశూలం తీసుకువస్తే వీడు పాము అంశ కాబట్టి కుమారస్వామి పామును తీసుకువచ్చాడు. ఈ పాముని మనం సాధన విగ్రహ మూర్తి ముందు పెడితే…. విషయం ఏమిటో తెలుస్తుంది అని అంటే, ఏముంది చక్ర జాగృతి యొక్క ప్రాంతం ఎక్కడ అవుతుంది …అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ ఆధారాన్ని బట్టి మనం చేసుకోవచ్చు… అనేసరికి సరే ఈ పాముని జాగ్రత్తగా ఉంచు అనేసరికి ….అమ్మ నేను ఈ పాముని నా దగ్గర ఉంచుకుంటాను… అని కుమారస్వామి అనేసరికి ,చాలా జాగ్రత్తగా ఉంచుకో బాబు!  ఇది ఆట వస్తువు కాదు… అనేసరికి, ఈ త్రిశూలం నేను మాత్రం నీకు ఇవ్వను…పోగొట్టుకున్న త్రిశూలం నాకు తీసుకొచ్చి ఇచ్చావు …కాబట్టి చాలా థాంక్స్ …అని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ ఎప్పుడూ… ఇంక నేను జారవిడిచి పెట్టను. జాగ్రత్తగా చూసుకుంటాను… అనేసరికి బాలగణపతితో కూడా ఈ త్రిశూలం కూడా జాగ్రత్త నాయనా!  అవసరమైనప్పుడు నాకు ఇవ్వాలి అనగానే…. సరే అమ్మ!ఇవి  ఎందుకు ఉపయోగపడతాయో మాకు తెలుసు, కానీ మా వయసుకు చెప్పే పరిస్థితి కాదు. మా ఆత్మలకు తెలుసు. శరీరానికి తెలియకపోవచ్చు. వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటాము అనేసరికి…. వీళ్ళకి తెలియంది ఏమీ లేదు…  అన్నీ తెలుస్తాయిలే అని ఆ గుడి నుంచి సత్రానికి వెళ్లి భోజనం చేయడానికి అని సత్రం గది వైపుకి బయలుదేరారు. 

 


సాధన కుటుంబం అంతా సత్రానికి వెళ్లి భోజనం చేసి విశ్రాంతి తీసుకునేసరికి…. రుద్రస్వామి కాస్త శివ నందినితో అమ్మ! ఇక రెండవ ఆధారం మనకి పాము రూపంలో దొరికింది. ఈ పాముని మనకి వచ్చిన సాధనా విగ్రహ మూర్తి ముందు పెడితే, నీకు చక్ర జాగృతి ప్రాంతం యొక్క వివరాలు చెబుతుంది అని నాకు అర్థం అవుతుంది. ఇక ఈ విధంగా మనకి ఆధారాలు దొరుకుతాయి అనుకుంట!  వీటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఈ శ్రీశైలానికి మనకి నాలుగు ద్వారాలు అని చెప్పడం జరిగింది. ఒకటి త్రిపురాంతకం…. రెండు అలంపురం జోగులాంబ…. మూడు ఉమామహేశ్వరం…. నాలుగు సిద్దవటం అని  అంటారు.  ఈ త్రిపురాంతకం లో కూడా మనకి అరుణాచలంలో గుడి నిర్మాణం ఏ విధంగా ఉంటుందో….. ఆ విధంగా త్రిపురాంతకంలో కూడా ఉంటుందని శాస్త్రవచనం.  అలాగే ఇప్పుడు ఆదిపరాశక్తి అంశ జోగులాంబలో ఉంటుందని అంటారు.  జోగులాంబ తలలో మొదటిలో ఒక గబ్బిలం, ఒక కపాలం, ఒక బల్లి ,ఒక తేలు అనేది ఈవిడ తలలో ఉంటాయని చెబుతారు. వీటిలో తేలు అనేది విషానికి సంబంధించింది కాబట్టి…. అది శివుడికి సంబంధించింది అని,.గబ్బిలం రక్తం తాగే జీవి కాబట్టి…. అది అమ్మవారికి సంబంధించింది అని,  కపాలం అనేది మానవకపాలం కాబట్టి బ్రహ్మదేవుడి కపాలంగా మారాడు కాబట్టి బ్రహ్మదేవుడు అని చెప్తారు.  ఇక మనకి విష్ణుకంచిలో రెండు బల్లులు కనబడతాయి కదా!  విష్ణువు అనేది ఇక బల్లి రూపంలో ఉంటాడని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇది ప్రళయ కాలంలో నాలుగు జీవులు ఈ స్థితిలో ఉండి పునః సృష్టికి జోగులాంబ దగ్గరికి వస్తాయని శాస్త్ర వచనం. ఈ జోగులాంబ చూడటానికి వయో వృద్ధురాలు, మాంత్రికురాలిగా మనకి కనపడుతుంది. ఈవిడ జ్వాలాగ్ని తత్వంతో ఉన్న అమ్మవారు. ఈవిడే మనకి మహా మృత్యుదేవత.  ఈవిడకి శవమే ఆసనం అన్నమాట. అనేసరికి అవునయ్యా!  ఆ పరమహంస గారికి కపాల మోక్ష గ్రంథంలో ఈమె గురించి చెప్పడం జరిగింది. ఈమెను ధ్యానానుభవం పొందడం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది.  నువ్వు చెప్పినవన్నీ కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. మహా మృత్యు దేవత అలంపురం జోగులాంబ అని చెప్పి ఉన్నారు.  ఓహో! ఆ జోగులాంబ ఈవిడే అన్నమాట! అనేసరికి, ఇప్పుడు ఆవిడ దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళాలా ఏమిటి? అనేసరికి ఆవిడే పిలిపించుకుంటుంది. 



అయినా ఇలా క్షేత్రాలు తిరుగుతూ వెళ్లాలి అంటే…నవనందులు దర్శనమిస్తాయి…. ఈ శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఈ నవనందులు ఏర్పడ్డాయి. 

1) అందులో మొదటిది ప్రధమనంది. ఈ నందిపై సాయంత్రం వేళ సూర్య కిరణాలు పడుతూ ఉంటాయని దీని గురించి విశేషంగా చెప్పబడింది. సాక్షి గణపతి దర్శనం చేసుకున్న దగ్గర నుంచి మనకి నంది యాత్ర మొదలవుతుంది. అందులో మొదట ప్రధమ నందితో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు శివుడి కోసం తపస్సు చేశాడని ఈ నందిశ్వర లింగానికి కారకుడు అయ్యాడని చెబుతారు…. ఇక్కడ ఈ ఆలయంలో కేదారేశ్వర దేవి ప్రధమ నందీశ్వరుని భార్యగా ఉంటుంది. 

2) ఆ తర్వాత నాగనంది…పూర్వం గరుత్మంతుని నుంచి నాగులు రక్షణ కోసం పరమశివునికి తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఇది ప్రస్తుతానికి ఆంజనేయస్వామి ఆలయంలో భాగమై ఉంది. 

3) ఆ తర్వాత సోమనంది…. ఇక్కడ శివుడి కోసం చంద్రుడు తపస్సు చేశాడని సోమనందీశ్వరునిగా ఇక్కడ పరమశివుడు వెలిశాడని చెబుతారు. 

4) ఆ తరువాత శివ నంది.. నవనందులలో మహానంది ఆలయం తర్వాత ఈ శివ నంది ఆలయం పెద్దదిగా చెబుతారు. ఈ ఆలయం ముక్తి ప్రదమని భక్తుల విశ్వాసం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారని వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నారని పూర్వికులు చెబుతారు. ఈ క్షేత్రంలో శివరాత్రి సమయంలో ఐదు తలల సర్పం ఒకటి గర్భగుడిలోకి పైకప్పు నుంచి ప్రవేశిస్తుందని చెబుతారు. 

5) ఆ తరువాత విష్ణు నంది, ఇది విష్ణువు ప్రతిష్టించడం వలన దీనిని విష్ణు లింగం అని పూజిస్తారు. 

6) ఆ తరువాత గరుడ నంది. తన తల్లి యొక్క దాస్యం నుంచి విముక్తి కొరకై పరమ శివుని కోసం తపస్సు చేసి అతనిని ప్రసన్నము చేసుకున్న క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని పరిగణిస్తారు. అప్పుడే ఈ పరమశివుడు ఇక్కడ నందీశ్వర లింగంగా కొలువైయ్యారు. 

7) ఆ తర్వాత మహానంది. ఇది నవ నందులలో పెద్దది. ఈ నందీశ్వర లింగంపై నంది పాదముద్రలు ఉంటాయని చెబుతారు. 

8) ఆ తర్వాత వినాయక నంది, ఇది కూడా మహానంది ఆలయం లోనే మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ వినాయకుడు శివుడి కోసం తపస్సు చేశారని…ఈ నందీశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 

9) ఆ తర్వాత సూర్య నంది…సూర్యోదయ సమయంలో ఈ శివలింగాన్ని సూర్యకిరణాలు తాకటం ఇక్కడి విశిష్టత. ఈ నందీశ్వర ఆలయంలోని శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.


ఇలా నవనందుల క్షేత్రాలు మనకి ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో దర్శనమిస్తాయి….


ఇదే కాక…ఈ శ్రీశైల మహా క్షేత్రానికి 8 ఆలయాలు ద్వార క్షేత్రాలుగా ఉన్నాయి. నాలుగు ప్రధాన ద్వారాలు అయితే నాలుగు ఉప ద్వారాలు. 


నాలుగు ప్రధాన ద్వారాలు:


1) తూర్పు ద్వారం త్రిపురాంతకం :- 

పురాణాల ప్రకారం శివుడు ఈ క్షేత్రంలో స్వయంభుగా అవతరించాడని త్రిపురాసుర సంహారం తరువాత దీనిని త్రిపురాంతకం గా పిలవడం జరిగింది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు రాక్షసులను చంపిన తరువాత చితాగ్ని గుండం నుంచి ఉద్భవించింది అని చెబుతారు. ఈ కొండపైనే కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. ఇక్కడ తారకాసురుడు ప్రతిష్టించిన లింగం దర్శనమిస్తుంది.  రాక్షస ఆగమనం ప్రకారం శ్రీ చక్రం పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం ఈ త్రిపురాంతక క్షేత్రంగా చెబుతారు. ఈ క్షేత్రంలో ఆదిశంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారిని చల్ల పరచడానికి శ్రీ చక్రాన్ని స్థాపించారని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. ఇక్కడ కదంబ వృక్షాలు చాలా ప్రసిద్ధి. ఈ ఆలయంలో చామరకర్ణ గణపతి విగ్రహం ఆరడుగుల ఎత్తులో మనకి కనిపిస్తుంది. ఇక్కడ కాపాలికుల సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ త్రిపుర సుందరి అమ్మవారు, కొండ దిగువన ఒక చెరువు మధ్య భాగంలో మనకు దర్శనమిస్తుంది. ఈ త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరీ దేవి ఆదిపరాశక్తి యొక్క మొదటి అవతారంగా ఇక్కడ ఈమె చిన్న పాప రూపంలో నివసిస్తుందని…ఇక్కడ అనేకమంది ఋషులు మరియు సాధువులు తపస్సు చేసుకుని మంత్ర తాంత్రిక మరియు సిద్ధ విద్యలను అభ్యసించారని చెబుతారు. 


2) దక్షిణ ద్వారం సిద్ధవటం:-

దీనిని జ్యోతి సిద్దేశ్వరం అని పిలుస్తారు. ఈ క్షేత్రం చాలాకాలంగా ఇసుకతో కప్పబడి పోయింది. చరిత్రకారుల ప్రకారం యుద్దాల నుంచి ఈ గుడి యొక్క సంపదను కాపాడడం కోసం అప్పటి రాజులు ఇలా దీనిని ఇసుకలో పూడ్చిపెట్టారని చెబుతారు. శ్రీశైలం క్షేత్రం వారు ఈ ద్వారానికి సంబంధించిన వివరాలు సేకరించి ఈ మధ్యకాలంలో ఈ క్షేత్రాన్ని ఇసుకనుంచి బయటకి వెలికి తీశారు. ఈ ఆలయం మరియు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కలిపి 101 లింగాలు ఉంటాయి. . అయితే ఇది శిథిలావస్థకు చేరుకున్న కారణం చేత మనకి కేవలం అందులో సగం మాత్రమే దర్శనానికి యోగ్యంగా ఉన్నాయి. 


3) పశ్చిమ ద్వారం అలంపురం :-

అలంపురం జోగులాంబ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున మనకి కనిపిస్తుంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారం. ఇది 18 శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠం. ఈ అలంపురం జోగులాంబ శవం పై కూర్చుని, తలలో తేలు గబ్బిలం కపాలం బల్లి కనిపిస్తాయి. నాలుకను బయటకు తెరిచి ఉగ్రదేవతగా మనకి ఈ జోగులాంబ అమ్మవారు కనిపిస్తారు. వాస్తవానికి ఈమె పేరు యోగుల అమ్మ ఈమె యోగత్వంలో సిద్ధిని ప్రసాదించే దేవతగా పరిగణిస్తారు. కాలక్రమేనా ఇది జోగులాంబ గా మారిపోయింది. ఈ ఆలయంలో మనకి సప్తమాతృకులు విఘ్నేశ్వరుడు వీణపాణి వీరభద్ర విగ్రహాలు మరియు ప్రధాన దేవతలుగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇంతే కాకుండా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి. అవి వరుసగా స్వర్గ బ్రహ్మ ,బాల బ్రహ్మ ,ఆర్క బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, వీర బ్రహ్మ, కుమార బ్రహ్మ, విశ్వ బ్రహ్మ ,అలాగే తారక బ్రహ్మ. ఇక్కడ స్థానికులు ఈమెను గృహ చండీగా కూడా పిలుస్తారు. ఇక్కడ కూడా మనకి ఎన్నో దేవత మూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. 


4) ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం :- 

ఈ ఆలయంలో ఒక వైపు తెలుపు మరియు మరొకవైపు ఎరుపు రంగులతో కూడిన శివలింగం దర్శనమిస్తుంది. ఈ ఉమామహేశ్వరాన్ని కుబేర స్థానం అని కూడా పిలుస్తారు. ఈ ఉమామహేశ్వర క్షేత్రంలో వెలసిన ఉమామహేశ్వరుడు స్వయంభు లింగంగా సుమారు 500 అడుగుల ఎత్తులో ఒక కొండ గుహ ముందుకు వచ్చినట్టుగా ఉండి దాని కింద మనకి దర్శనం ఇస్తాడు. ఈ ప్రదేశంలోనే అమ్మవారు శివునికోసం తపస్సు చేశారని చెబుతారు.  ఇక్కడ గణేశుడు వీరభద్రుడు జనార్ధన స్వామి మరియు నాగదేవతలు దర్శనం ఇస్తారు. ఈ ఆలయానికి దగ్గరలో పాపనాశనం అనే చిన్న వాగు కనిపిస్తుంది ఇది పర్వత శిలల కింద ప్రవహిస్తూ ఒక చిన్న గుంటలోనికి ప్రవహిస్తుంది. ఈ నీటిని తాగటం లేదా మీద చల్లుకోవడం వలన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించే భక్తులకు పునర్జన్మ ఉండదు అని చెబుతారు.


నాలుగు ఉప ద్వారాలు :- 


1) ఆగ్నేయద్వారం - పుష్పగిరి 

2) నైరుతి ద్వారము-  సోమశిల 

3) వాయువ్య ద్వారం - సంగమేశ్వరం 

4) ఈశాన్య ద్వారం - ఏలేశ్వరం 


కూడా ఎంతో మహిమాన్వితమైనవి.. ఇప్పుడు వీటి అన్నింటిని మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళామే అనుకో మన సాధన ఆగిపోతుంది. మనం ఈ క్షేత్రాలన్నింటినీ దర్శించుకుంటూ వెళ్లిపోతే అసలు సాధన పరిసమాప్తి అవ్వదు. కాబట్టి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి… చేయాలి అని…. అనుకోవడం కాదు.  మన సాధనా మూర్తి చెబుతాడు. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని… అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఏ క్షేత్రాలు పడితే ఆ క్షేత్రాలకి మనం వ్యక్తిగతంగా వెళ్లడానికి లేదు. ఆ క్షేత్రాలు మనల్ని పిలిస్తేనే వెళ్లాలి. పిలుస్తాయి. కాలానుగుణంగా కర్మానుసారంగా , సమయానుసారంగా మన సాధన స్థితిగతులను బట్టి…. మనకి అర్హత, యోగ్యత, యోగం బట్టి ఆ క్షేత్రాలు పిలుస్తాయి.  ఆ క్షేత్రంలో మనం గత జన్మల్లో సాధన చేసినట్లయితే, మరణం ఉండి ఉంటే ఆ క్షేత్ర దర్శనం జరుగుతుంది. ఆ దేవతల తరుపున జరుగుతుంది. అలాగే మనం సాధన చేసి వదిలిపెట్టిన దైవీక వస్తువులు మన మనసుకు నచ్చుతాయి. 


ఆ వస్తువులు మనం తెచ్చుకోవడం జరుగుతుంది. లేదు అంటే అక్షేత్రాల నుంచి మనకి అనుకోకుండానే దైవిక వస్తువులు వస్తాయి . అవి తెలిసిన వారి ద్వారా గాని…. తెలియని వారి ద్వారా గాని… మన దగ్గరికి వస్తాయి. వాటిని మనం పూజలో పెట్టుకుని ఉన్న మంచిదే . పూజించాల్సిన అవసరం లేదు. పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది…. అనేసరికి ఇవన్నీ అవసరం అంటారా? వీటన్నింటినీ సంపాదించడం అవసరమా? అనేసరికి ముందు మనం సాధనలో ముందుకు వెళ్లాలి అంటే… ఆ ద్వారబంధనాలు, మాయ బంధనాలు ఉంటాయి. ఈ దైవిక వస్తువులు గానీ దైవిక శివలింగాలు గాని వస్తే గాని మనకి అర్హత ఉంది అని చెప్పేసి ఆ ద్వారపాలకులు ద్వారం తీసి మనల్ని ముందుకు తీసుకువెళ్తారు.  మనలో ఉన్న 13 యోగ చక్రాలు కూడా 13 ద్వారబంధనాలు అని చెప్పేసి అనుకో!  ఈ ద్వార బంధనాలు తెలియాలి అంటే…. ఒక ద్వారానికి ఒక దైవీక వస్తువు వస్తుంది… ఇంకోవైపు ఉన్న ద్వారం తీయాలి అంటే ఇంకో వైపు ఉన్న శివలింగం రావాలి… ఈ రెండు పూర్తిగా తెరిస్తే గాని లోపలికి వెళ్లలేము.  దీనికి అర్హతగా అక్కడ ఉన్న ద్వారబంధనం యొక్క మాయను దాటుకోవాల్సి వస్తుంది. ఆ మాయకి మనం ఆశపడటం కానీ, భయపడటం కానీ, ఆలోచించడం కానీ ,సంకల్పించడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తాయేమో అని చెప్పి…. ప్రకృతి పంచభూతాలతో… కాలంతోనూ… ఎదురు చూస్తూ ఉంటుంది.  రకరకాల మాయలు, రకరకాల ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. రకరకాల భావాల్ని ఇస్తూ ఉంటుంది.  వాటిని వేటికి మనం భయపడకుండా… ఆలోచించకుండా….ఆశపడకుండా…. జాగ్రత్తగా స్థిర మనసుతో, స్థిర ఙ్ఞానంతో సాక్షిభూతంగా ఒక సినిమాను చూసినట్టుగా చూస్తూ ఉంటే…. మనం నిలబడగలము.  సాధన పరిసమాప్తి చేసుకోగలము. లేదు అంటే మనం ఏదైనా ఆశపడినట్లయితే, భయపడినట్లైతే, దేనికైతే భయపడతావో… దానిని సత్యమని చూపిస్తుంది. ఆ కోరిక తీరుస్తున్నట్టు సత్య నిరూపణ చేస్తుంది. కాబట్టి మనం దేనికి స్పందించకూడదు . దేనికి భయపడకూడదు… ఇంద్రియ నిగ్రహంతో మనో నిగ్రహంతో ఉండాలి. కోరిక  రాహిత్య , కారణ రాహిత్య స్థితికి వెళ్లాలి.  కారక రాహిత్య స్థితికి వెళ్లాలి. ఈ రాహిత్య స్థితి పొందితే గాని మనకి కారణ కోరిక కర్మజన్మ లాంటివి ఉండవు. విశ్వశూన్యంలో శూన్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది.  ఏ శూన్యం నుంచి వచ్చాము…. ఆ శూన్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదు అంటే మనకి మనమే గొయ్యి తవ్వుకొని ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.. అనేసరికి సరే స్వామి!  ఇవన్నీ నాకు తెలియదు. అర్థం కావు .ఏది ఎప్పుడు ఎలా రావాలనుకుంటే అలా వస్తుంది… అనేసరికి ఇక్కడ నీకు పాతాళ శివలింగం ఈ శ్రీశైలం నుంచి రావాలి. కాకపోతే నీది ప్రస్తుతం శక్తి జాగృతిలోనే ఉన్నావు కాబట్టి….నీ విశుద్ధ చక్ర జాగృతి స్థితికి  స్థితికి వచ్చేసరికి,  ఆకాశ సిద్ధి పొందేసరికి… ఈ క్షేత్రం నుంచి పాతాళ శివలింగం వస్తుంది. ఈ శివలింగానికి ఉన్న నాగబంధనమైన నాగభరణం వాసుకి సర్పం నీ దగ్గరికి రావడం  జరిగింది.  ఇప్పుడు శివునికి ఉన్న 14 బంధనాలలో త్రిశూల బంధనం నుంచి విముక్తి పొందాడు.  కాశీలో నువ్వు తీసుకు వచ్చిన బంధం నుంచి విముక్తి పొందాడు. అలాగే శ్రీశైల క్షేత్రం నుంచి నాగాభరణం వలన నాగబంధనం నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇంక మిగిలిన 12 కూడా దైవిక వస్తువులు వస్తాయి…. వాటిని జాగ్రత్తగా ఉంచుకోమని శివ స్వామి చెప్పారు కదా! ఇప్పుడు ఇవి రెండవ వస్తువు. ఇక మూడవ వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది…. ఎలా వస్తుంది….. అనేది సాధనా మూర్తి మనల్ని అనుగ్రహిస్తాడు.. అనేసరికి సరే అని 


స్వామి! ఇప్పుడు ఈ నాగాభరణం సాధనమూర్తికి పెట్టి చూద్దాము… ఏం జరుగుతుందో అనగానే , సరే అమ్మ నీ ఇష్టం…. నాదేముంది! అనేసరికి, పిల్లలు కూడా ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటూ ఉండేసరికి….ఉన్నట్టుండి మహాదేవి అక్కడికి వచ్చింది. ఏంటి దేవి!  నువ్వు రాత్రికి వస్తావు అనుకున్నాను…. సాయంత్రం కల్లా వచ్చేసావు ఏంటి? అని అనేసరికి…. నాకు ధ్యానంలో మీకు ఏదో నాగాభరణం దొరికింది అన్నట్టుగా చూపించింది. ఇక ఉత్సుకత వచ్చేసింది.. తెలుసుకోవాలి… ఏదైనా ఆధారం ఇస్తాడేమో సాధనమూర్తి అని బలంగా అనిపించేసరికి…. ఇక అక్కడి నుంచి  శరవేగంతో వచ్చేసాను.  పిల్లలు ఇద్దరు కూడా ప్రమాదంలో ఉన్నట్టు మరో ధ్యాన దృశ్యం కనిపించింద  నీటి గండంలో ఉన్నట్టుగా అనిపించింది.  ఏం జరిగిందా అనిపించి మనసు ఉండబట్టలేక వచ్చేసాను….అనేసరికి అప్పుడు జరిగిందంతా శివ నందిని చెప్పేసరికి ఓహో!  ఇలా జరిగిందా చాలా జాగ్రత్తగా ఉండాలి….అని పిల్లల కేసి చూస్తూ…. ఒరేయ్ పిల్లలు!  మీరు చాలా గడుగ్గాయిలు. మీ అందరి వల్ల లోకానికి మంచి జరగొచ్చు…. కానీ మీ ప్రాణాలకి అపాయం తెచ్చుకోకండి.  ప్రమాదంలో పడకండి…పెద్దలం మేమున్నాం కదా!  మేము చూసుకుంటాం అనేసరికి మీరంతా ఉండగా మాకేం అవ్వదులే ! అమ్మ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని బాల గణపతి అనేసరికి…. అందరూ నవ్వుకుంటూ ఉంటే శివనందని కాస్త బాల కుమారస్వామిని పిలిచి వాడి చేతిలో ఉన్న నాగభరణం తీసి,  సాధనా మూర్తికి ఉన్న పాము అచ్చులో పెట్టేసరికి, ఇది సరిగ్గా సరిపోయింది.  ఉన్నట్టుండి…. నాగాభరణానికి ప్రాణం వచ్చినట్లుగా అనిపించి… కదులుతున్నట్లుగా అనిపించేసరికి,  అందరూ అది చూసి నిజంగానే పాము కదులుతుందా….. అని ఎంత భ్రమ కలిగింది.  ఆ పాము కాస్త కదులుతూ సాధన విగ్రహ మూర్తిలో….. ఉన్న మూలాధార చక్రంలోనికి వెళ్లి లోపల దూరి పోయినట్లుగా చిన్నపాటిగా మూడున్నర చుట్లు చుట్టుకొని పడగ విప్పినట్టుగా అందరికీ కనిపించేసరికి….. అందరూ ఆశ్చర్యం చెందుతూ….. ఆనందానికి లోనవుతూ ఉండేసరికి…. ఆ సాధనా విగ్రహ మూర్తి పీఠానికి చెందిన నుంచి తలుపు తెరుచుకుని ఒక ఆధారం ఉన్న రాగి రేకు బయటపడే సరికి బాలగణపతి గబగబా దీని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉండి ఆ రాగి  రేకును బయటకు తీసి ఆ రాగి రేకులో ఏముందో పెద్దగా చదవడం ఆరంభించాడు. 


ఇది నీకు సాధనా మూర్తి  చక్ర జాగృతికి ఇస్తున్న రెండవ ఆధారం. అయ్య మెడలో ఉంటే అమ్మ తల మీద ఉంటాను. నన్ను చూస్తే భయం. తోక ఇక్కడ ఉంటే తల అక్కడ ఉంది. అయ్యా అమ్మ కలిస్తే ఎవరో అర్థం కాని చోట ఏడు కొండలు మోస్తూ ఏడు చక్రాలు లేపుతాను. నా ఎదుట సంకెళ్ళతో బందీగా రాంబంటు ఉంటాడు.  అక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను” అని ఉంది. 


ఈ ఆధారం చదివేసరికి అందరూ ఆలోచనలో పడ్డారు. బాలగణపతి ఉన్నట్టుండి అయ్య మెడలో ఉంటే అమ్మ తల మీద ఉంటాను.  అంటే అయ్య మెడలో ఉండేది నాగాభరణమే ఉంటుంది కదా! అమ్మ తలమీద పాము కాపలాగా ఉంటుంది కదా! ఏడు తలలతో ఉంటుంది…. అంటే అవును అన్నారు. అలాగే 7 గిరులు మోస్తూ,  ఏడు చక్రాలు లేపుతాను.  పాము తోక ఇక్కడ ఉంటే తల అక్కడ ఉంది అనేసరికి…. రుద్ర స్వామి శ్రీశైలంలో పాము తోక ఉంటే తిరుపతిలో పాము తల ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారు. అలాగే అక్కడ సప్తగిరులు ఉన్నాయి కదా .! 


అంటే పాము ఏడు తలలతో ఏడు గిరులు మోస్తుంది అని తిరుపతి స్థల పురాణం చెబుతుంది కదా!  ఒకవేళ ఇది తిరుపతి గురించి చెబుతుందా అని రుద్ర స్వామి అనేసరికి…. ఇప్పుడు మొదటి నుంచి ఒక్కొక్కటి చొప్పున పంక్తులన్నీ విందాము…..తిరుపతికి సరిపోతుందో లేదో చూద్దామని శివ నందిని అనేసరికి….. 1) అయ్య మెడలో ఉంటే అమ్మ తల మీద ఉంటాను అనేది పాముకు సంబంధించింది. 2) నన్ను చూస్తే భయం అంటే పాములు చూస్తే ఎవరైనా భయపడతారు..3) నా తోక ఇక్కడ ఉంటే తల అక్కడ ఉంది.. అంటే శ్రీశైలంలో తోక ఉంటే తిరుపతిలో తల ఉంది అని అర్థమవుతుంది. 4) అమ్మ, అయ్యా కలిస్తే ఎవరో అర్థం కాని చోట అంటే….. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని అమ్మవారిగాను, అయ్యవారిగాను చెప్పలేము.  ఎందుకంటే వెంకటేశ్వరస్వామిలో శుక్రవారం పూట అభిషేకాలు అవి చేస్తారు. దేవాలయం మీద సింహం బొమ్మలు అవన్నీ ఉండటం వలన…. దసరా సమయంలో ఆయనకి బ్రహ్మోత్సవాలు చేయడంతో…..అక్కడ అయ్యవారి స్థితి ఉంది…. అమ్మవారి స్థితి ఉంది.  కాబట్టి అమ్మవారు, అయ్యవారు అర్థం కాని రూపం వెంకటేశ్వర స్వామి అని అర్థం అవుతుంది. పైగా వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా అంటారు. బాల అంటే అమ్మవారి కదా బాలాత్రిపుర సుందరిలో బాల కాబట్టి…. అక్కడ అమ్మవారి తత్వం ఉంది.  అయ్యవారి తత్వం, అమ్మవారి తత్వం ఉన్న ఏకైక స్వరూపం వెంకటేశ్వర స్వామి స్వరూపం అని చెప్పకనే అర్థం అవుతుంది కదా! అలాగే నా ఎదురుగా సంకెళ్ళతో రాంబంటు ఉంటాడు… అంటే ఎవరు రాంబంటు అంటే హనుమంతుడే కదా! హనుమంతుడినీ అక్కడ సంకెళ్ళతో బంధించేశారని స్థల పురాణం చెబుతుంది కదా! అని రుద్రస్వామి అనేసరికి…ఈ ఆధారం అంతా కూడా మనకి తిరుపతిని గురించి చెబుతుంది కాబట్టి…. మనం ఇక్కడి నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది… అనేసరికి సరే అయితే ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి,.. అనేసరికి ఇక ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి భయాలు లేవు, దేని గురించి ఆలోచించక్కర్లేదు, తిరుపతికి అవునా కాదా అని మనం సాధన విగ్రహం మూర్తిని అడుగుదాం అనేసరికి….. తనకు వచ్చిన ఆధారం రాగి రేకు అందులో పెట్టేసరికి మూలాధార చక్రం అంతా కూడా జాగృతి అయినట్టుగా వెలుగులు పొందినట్లుగా….. శివనందిని ధ్యానంలో అనుభవం అయ్యేసరికి కళ్ళు….. తెరిచి నిజమే సరియైన ప్రాంతమే!  మనం తిరుపతి వెళ్ళవలసి ఉంటుంది ….మనం సరిగ్గా తెలుసుకున్నాం అనేసరికి అందరూ సంబరమాశ్చర్యాలకు గురవుతూ చప్పట్లు కొట్టుకొని….. అమ్మ!  ఇప్పుడు ఎలాగూ తిరుపతికి వెళ్ళిపోతున్నాం కదా! ఘంటా మఠంలోని ఆకాశ సిద్ధి ప్రయత్నం చేసి వెళదామా అనేసరికి దానికి మీకు నా అంత వయసు రావాలి… గడ్డాలు, మీసాలు రావాలి .అప్పుడు మీరంతట మీరే వచ్చి ఈ ఆకాశ సిద్ధి కోసం ప్రయత్నం చేయండి.  అంటే మేమైతే చేస్తామో చేయమో తెలియదు.  నువ్వు చేస్తే చూడాలని ఉంది అని బాల కుమారస్వామి అనేసరికి….. ఇప్పుడు నాకు అంత అర్హత రాలేదు రా నాయనా!  ఆ యోగ్యత వచ్చినప్పుడు నేను ఆకాశ సిద్ధికి ప్రయత్నం చేయకుండానే వస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు.  అది నిజమా కాదా అనేది ప్రయత్నం చేయవద్దు అని….. అంటే కాదు ఇప్పుడు మనం చేయాల్సిందే….. వెళ్లాల్సిందే అని చెప్పి గోల చేస్తూ ఉండేసరికి మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి ….


సామాన్లన్నీ సర్దుకోండి అనేసరికి …..సరే నీ ఇష్టం తల్లి! ఇక నువ్వు ఏం చెప్తే అదే కదా! ఇక నీ మాటే దైవ శాసనం కదా!  ఇక మా మాట ఎందుకు వింటావులే….. అని పిల్లలు అలకపెట్టుకొని సామాన్లన్నీ సర్దుతూ ఉంటే బాల గణపతి ఉన్నట్టుండి శివ నందిని సామాన్లు కూడా తన సంచిలో పెడుతూ ఉంటే….. అక్కడ ఉన్న రెండు రకాల శివ విగ్రహాలు చూసి అమ్మ! ఇందులో రెండు శివుళ్ళు ఒకటేనా? వేరువేరా?అనేసరికి వీళ్లిద్దరూ వేరు వేరు శరీరాలతో ఉన్న శివుల్లే . లేత నీలం రంగులో ఉన్న శివుడేమో మనో శరీరానికి సంబంధించిన శివుడు,  నిండు నీలంతో ఉన్న శివుడేమో ఆకాశ శరీరానికి సంబంధించిన శివుడు. ఈయన ఆకాశ శరీర ధారి అయితే ఒకరు మనో శరీర ధారి అన్నమాట!  మనో శరీరధారి శివుడు నాకోసం వస్తే ,ఆకాశ శరీర దారి ఆయన కోసం వచ్చారు….. అనగానే అక్కడ ఉన్న బాలగణపతి అర్థం అయింది…. ఆయన ఎవరో అర్థం అయింది ….ఆయనే కదా ! ఆ విభూతి మఠంలో కనిపించిన ఆయనే కదా….. ఆయన పేరేంటి?..... ఆ….. శివానంద …….శివానంద కదా!  ఇప్పుడు శివానంద ఆకాశ శరీర ధారి అన్నమాట!  నువ్వు మనో శరీరధారి అన్నమాట!  మీ ఇద్దరు కలిస్తే విశ్వమోక్షం అవుతుందన్నమాట!  అర్థమైంది చూద్దాం…. ఏం జరుగుతుందో… అందుకేనా ఆకాశ సిద్ధి కోసం ప్రయత్నం చెయ్యొద్దు అంటున్నావు…..ఆకాశ శరీరంతో ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆకాశ శరీరంగా మారిపోతావని భయం ఏమోలే ! అర్థమైంది…..కారణం ఉందిలే! అని అంటుంటే…..ఒరేయ్! నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అని అనేసరికి వీళ్లిద్దరూ సామాన్లు సర్దుకొని….. అమ్మ!  మనకి శ్రీశైలం నుంచి పాతాళ శివలింగం రావాలి. అది ఇప్పుడే రాదు. కాలానుగుణంగా వస్తుందని అర్థం అయ్యింది కదా! ఇక సత్రం యజమానికి గది ఖాళీ చేస్తున్నామని చెప్పి, మనం తిరుపతి వైపు ప్రయాణం చేద్దాం. సామాన్లు ఏమి మర్చిపోలేదు కదా! అని అందరూ ఒకటికి రెండుసార్లు చూసుకొని గది అంతా పరిశీలించి ….ఏమి మర్చిపోలేదు అని అందరూ తమ తమ చేతి సంచులు తీసుకొని, దైవిక వస్తువులను తీసుకొని ఇక సత్రములు ఖాళీ చేసి యజమానికి సెలవు స్వామి ! మా సాధన ఇక్కడ పరిసమాప్తి అయిపోయింది.  ఇక మేము ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరుతున్నాము… అనేసరికి సరేనమ్మా మంచిది!  ఆరోగ్యం జాగ్రత్త!  పిల్లలు జాగ్రత్త!  పెద్దాయన, పెద్దమ్మ వాళ్ళు కూడా జాగ్రత్త!  సాధన పరిసమాప్తి చేసుకోండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. మోక్షమును పొందండి. మీరు మోక్షం పొందారో లేదో మాలాంటి అజ్ఞానులకు కూడా చెప్పండి. ఏదో విధంగా తెలియజేయండి…. అనేసరికి సరే స్వామి! కాల నిర్ణయం చేస్తుంది… అనేసరికి మీరంతా వెళ్తుంటే మనసు అదోలా ఉంది. ఈ క్షేత్రంలో సాధన పరిసమాప్తి చేసుకున్నారు. మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందా? అంటే…. కాలానుగుణంగా మళ్ళీ ఇంకొకసారి రావాల్సి వస్తుందండి. వస్తాము. అప్పటికి మేము అర్హత, సాధిస్తే రావాల్సి వస్తుంది ….అనేసరికి ఈసారి వస్తే మళ్లీ ఖచ్చితంగా ఈ సత్రానికి రండి. మీ గది మీకే ఇస్తాను. ఎవరైనా ఉన్నప్పటికీ ఖాళీ చేయించి మీకే ఇస్తాను. నాకు మీరు ఉంటే ధైర్యం ,ఆనందం అనిపించింది. సాధన చేసుకునే వాళ్ళకి ఉపయోగపడ్డాను….మీకేదో నా వంతు సహాయ సహకారాలు అందించాను అనిపించింది.  కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా, నాకు ఫోన్ చేసినా చేయకపోయినా…. కూడా ఈ సత్రం ముందుకు వస్తే నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. మీకు కావలసిన భోజనాలు కూడా అందిస్తాను. అంటే మీరు ఇప్పటిదాకా చేసింది చాలు స్వామి….. మీరు శుభ్రంగా మమ్మల్ని చూసుకున్నారు. సాధనకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఎక్కడ ఆపలేదు. మన సాధన పరిసమాప్తి చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించారు. అని కృతజ్ఞతలు చెప్పి…. అందరూ కూడా తిరుపతి వెళ్లే బస్సు కోసం బస్టాండ్ కి బయలుదేరారు.






1 కామెంట్‌:

  1. ఇది ఎంతో అద్భుతంగా ఉంది, కానీ ఒక సందేహం ఉండి పోయింది ఏమిటంటే. అసలు శూన్యంమే శివుడు, మరియు విశ్వమే శివుడు అయినపుడు
    శివుడు నిర్గుణంలోంచి సగుణ రూపంగా ఆవిరభవించినపుడు, మళ్ళీ ఆ విశ్వం కి లేదా శివుడికి మోక్షం ఇవ్వడం ఏమిటా అని???

    శివుడు నిర్గుణంగా నిరాకారంగా, ఆది, మరియు అంతం లేకుండా ఎప్పటికి అలాగే ఉండిపోతాడు కధ,,
    దయచేసి ఈ సందేహం నివృత్తి చేయండి పరమహంస గారు, మిమ్మల్ని నేను గురువుగా భావించాను.

    శివోహం
    శివోహం
    శివోహం.

    రిప్లయితొలగించండి