తిరుపతి వెంకన్న పిలిచాడు
నాకు వచ్చిన కుండలిని శక్తి జాగృతి అనుభవాలు నిజమైన దైవ అనుభవాలు అని తెలిసిన తర్వాత నా యోగ సాధన మీద అమిత భక్తి విశ్వాసాలు,శ్రద్ధ, ఓపిక పెరగటానికి అవకాశం ఏర్పడింది. దీనితో నా యోగ సాధన చేస్తుండగా ఇలా మూడు నెలలు పాటు కొనసాగిన తరువాత ఒక రోజు అర్ధరాత్రి ధ్యానంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువు నల్లరాతి సాలగ్రామ శిల మూర్తి విగ్రహం మెల్లమెల్లగా కనపడసాగింది. కళ్ళు మూసిన అలాగే కళ్ళు తెరిచిన ఈ విగ్రహం కనపడసాగింది. సంపూర్ణ విగ్రహమూర్తి అంటే తిరుపతి వెంకన్న విగ్రహానికి ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు దండలు వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాడో అలా ఈ విగ్రహమూర్తి కనపడసాగినాడు.ఇలా సుమారు మూడు వారాల పాటు తరచుగా తీవ్రమైన ధ్యానంలో కనబడేవారు. ఇలా ఈయన ఎందుకు కనబడుతున్నాడో నాకు అర్థమయ్యేది కాదు.ఒకవేళ ఆయనకు చెల్లించవలసిన మ్రొక్కుబడులు ఉన్నాయేమోనని అమ్మని విచారిస్తే మీకు సంబంధించి నేను మ్రొక్కుకున్న అన్ని రకాలమ్రొక్కుబడులు తీర్చేసినట్లుగా నాకు బాగా గుర్తు. నాకు తెలిసి ఏమీ లేవు.అనగానే ఈయన మాయం అవకుండా ధ్యానంలో యధావిధిగా కనిపించేవారు. నాకు అర్థమై చచ్చేది కాదు. ఈయన కనబడగానే నాకు ధ్యాన భంగం అవ్వటం తరచుగా అగుపించేది.దానితో అకస్మాత్తుగా నాలో ఏదో తెలియని ఆవేశం చికాకులు మొదలయ్యాయి. ఏమిటి విషయం అని మా ఆవిడ అడిగితే దానితో అన్నీ వివరించి చెప్పగా వెంటనే ఆయన మీకు ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారేమో అని ఊరుకుంది. ఆయన మాట్లాడడు. నాకు అర్థమవదు. ఏమి చేయాలో అర్థం కాదు.
పోనీ నా జ్ఞాన గురువును అడుగుదామంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ఏమి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి. ఒక ప్రక్క కుండలిని శక్తి జాగృతి అయినందుకు ఆనందపడాలో లేక ఈయన ఇలా ఎందుకు కనబడుతున్నారో అర్థం కాక బాధపడాలో అర్థం కాని స్థితి. నా ఇష్టదైవాలు కూడా ఎలాంటి సహాయాలు చేయటం లేదు. ఇలా మరో 15 రోజులు గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో ఎవరో నీడ లాంటి ఆకారం ఒకటి కనిపించి రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను నేను అడిగినది చేయాలి సుమా అనే మాటలు లీలగా వినిపించాయి. వామ్మో! ఇది ఏమిటి క్రొత్తగా? కనిపించే వాడు మాట్లాడటం లేదు కనిపించని వాడు మాట్లాడుతున్నాడు.పైగా ఆయన అడిగింది ఇవ్వాలట. ఒకవేళ ప్రాణం అడిగితే? ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఆయన ఎవరు ఏమిటో తెలియకుండానే ఇవ్వాలా. పోనీ డబ్బులు అడిగితే? నా బొంద నా దగ్గర అంత సీన్ లేదు. నేను ఉద్యోగం చేస్తూ ఒకరి దగ్గర అడుక్కుంటున్నాను. నా దగ్గర గీరుకోవటానికి ఏముంది. ఎందుకు కంగారు. రేపు పొద్దున వస్తాను అన్నారు కదా. ఆయనే ఎవరు ఏమిటో తెలుసుకుని ఆ అడిగేది ఏమిటో తెలుసుకుని అది ఇవ్వాలా వద్దా ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకుంటూ గాఢ నిద్రలోకి జారుకున్నాను.ఒక గురువారము ఉదయం ఎవరో ఇంటి ఆరు బయట నిలబడి అయ్యా! అయ్యా! లోపల ఎవరైనా ఉన్నారా అంటూ పిలుస్తున్నారు. నేను బయటికి వస్తూ ఎవరిది అంటూ చూడగానే ఎదురుగా వెంకన్న భక్తుడు లాగా ఆకార వేషధారణలోఒక వ్యక్తి నిలబడి ఉండి “అయ్యా! నేనే మిమ్మల్ని పిలిచాను. ఇక్కడ గురువారం జాతకాలు చెప్పే ఆసామి ఎవరు అంటూ నన్ను” అడిగారు. దానికి నేనే అనగానే వెంటనే అతను “నన్ను క్షమించండి. నేను ఎవరో మీకు తెలియదు. మీ గురించి నాకు బాగా తెలుసు. మా కాలనీలో వారిలో ఎక్కువ మంది మీ దగ్గర జాతకాలు చెప్పించుకొని వారి సమస్యలు తొలగించుకున్నారు. ఆ విషయాల ద్వారా తెలుసుకున్నాను. కానీ మిమ్మల్ని చూసే అవకాశం ఇంతవరకు కలుగలేదు.కానీ ఈ మధ్య మా ఇంటిలో విచిత్ర సమస్యలతో బాధపడుతున్నాను. కానీ నేను వారితో “అయ్యా! ఇందాకటి నుండి నిలబడి మాట్లాడుతున్నారు. కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం. మీరు నిల్చుంటే నా కాళ్లు నొప్పులు పుడుతున్నాయి” అనగానే “నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను” అంటూ క్రింద వేసిన చాప మీద కూర్చొని “అయ్యా! ఈ మధ్య మా అమ్మగారు కాలం చేశారు.ఆనాటి నుండి మా ఇంటిలో విచిత్రమైన సంఘటన జరుగుతోంది. అది ఎందుకు జరుగుతుందో చెప్పగలరా? అనగానే నేను వెంటనే “మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. జాతకం గీసి చూసి చెబుతాను” అనగానే ఆయన వెంటనే “ఆ వివరాలు మా అమ్మకి తెలియదు. వారు పెద్దగా చదువుకోలేదు.పాతకాలపు మనిషి. నేనే ఇంటికి పెద్ద కొడుకు.పోని మిగిలిన నా తోబుట్టువుల పుట్టిన తేదీ వివరాలు కూడా తెలియవు.” అనగానే నేను వెంటనే “కంగారు పడకండి. మీ పుట్టిన తేదీ వివరాలు లేకపోతే గవ్వలతో దైవ ప్రశ్న వేస్తాను. ఖచ్చితంగా సమస్య ఏమిటో తెలుస్తుంది. అలాగే దాని పరిష్కార మార్గం తెలుస్తుంది.” అంటూ గవ్వలతో దైవ ప్రశ్న వేయటం ప్రారంభించాను. పడిన సంఖ్యను బట్టి చూసి నేను వెంటనే వారితో “అయ్యా! ఈ ప్రశ్న పడిన విధానం చూస్తే మీ ఇంట్లో దైవానికి సంబంధించిన సంఘటనలు జరుగుతున్నాయి అని చెబుతోంది నిజమేనా” అని అన్నాను. అతను వెంటనే “నిజమే స్వామి !ఆయన ఎవరో చెప్పగలరా?” అన్నాడు.నేను వెంటనే “మీకు తెలిసి నన్ను పరీక్షిస్తున్నారా” అన్నాను. ఆయన వెంటనే “లేదు స్వామి! గవ్వలతో మీరు ఎలా సమాధానాలు కనిపెడతారో చూడాలని ఉత్సుకతతో ఉన్నాను” అన్నారు.ఇలాంటివారు తగిలితేనే వేద శాస్త్రములకి అందులో ఉన్న గొప్ప రహస్య విధివిధానాలు లోకానికి తెలుస్తాయి అని అనుకుంటూ మళ్ళీ గవ్వలతో ప్రశ్న వేయగానే ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.ఎందుకంటారా ఎందుకో మీరే చూడండి.గవ్వల ప్రశ్న ఇచ్చిన సంఖ్యఆధారంగా చూస్తే కొన్ని నెలలుగా వారి ఇంటిలో తిరుపతి వెంకన్న స్వామి వారు స్వప్న దర్శనం ఇస్తున్నారు.నాకు ఇక్కడ ఉండాలని లేదు నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్ళిపోతాను నేను చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయని ఒక మనిషి చెప్పినట్లుగా చెప్తున్నాడు అని నా వాక్ శుద్ధి ద్వారా బయటికి వచ్చినది. ఆయన ఆశ్చర్యపోతూ “మరి ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం ఎక్కడ ఉంది.ఇంత వరకు మీరు చెప్పినది నిజమే” అనగానే
నాకు వచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహ మూర్తి
“అయ్యా! ఆ విగ్రహమూర్తి బంగారు వన్నెలో పంచలోహ మూర్తులుగా ఒకవైపు వెంకన్న రూపంతో వెనుక వైపు జగన్మోహిని రూపంతో తెల్లని, నల్లని రాళ్లతో మూడు అంగుళాల పరిమాణంలో మనము ఉన్నచోటనే ఉన్నాడు” అని చెబుతోంది అనగానే ఆయన వెంటనే “స్వామి! మీకున్న జ్యోతిష్య పరిజ్ఞానానికి అలాగే దివ్య ఉపాసనతో సిద్ధింపజేసుకున్న వాక్ శుద్ధి ద్వారా వచ్చిన విషయాలు అక్షర సత్యాలే.ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం నా చేతి సంచి లోనే ఉంది. అందుకే ప్రశ్న అలా పడినది అంటూ వెంకటేశ్వర స్వామి విగ్రహ మూర్తి నా చేతిలో పెడుతూ రాత్రి ఈయన మళ్ళీ కనబడి “ఎవరైతే నన్ను తన సోది ద్వారా కనిపెడతారో వారి చేతికి నన్ను అప్పగించమని” చెప్పారు. అందుకే మిమ్మల్ని పరీక్షించాను. దైవ నిర్ణయం నాకు శిరోధార్యము.అలాగే ప్రతి సంవత్సరము ఏకాదశి రోజున మా అమ్మగారు తిరుపతికి ఉత్తర ద్వార దర్శనం తిరుమల వెంకన్నను చూసి ఇంటికి వస్తారు. కాబట్టి తమరు కూడా ఈ విధి విధానము తప్పకుండా పాటిస్తానని నాకు మాట ఇవ్వగలరా అన్నారు.దానికి నేను ఆశ్చర్యపోతూ రాత్రి నన్ను ఒక నల్లటి శరీర ఆకారం అడిగినట్లుగా అనిపించి “తప్పకుండా స్వామి! మీరు ఎందుకు వస్తున్నారో నా మట్టి బుర్రకు అందకపోవచ్చు. కారణము లేకుండా కార్యము జరగదు అని నా గట్టి నమ్మకం అంటూ చేతిలో ఉన్న వెంకన్న స్వామి తో చెప్పటంతో ఆ వచ్చిన ఆసామీ నవ్వుతూ నాకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఈ వేంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వరస్వామిని మీకోసం ఎందుకు తీసుకొని వచ్చినారో కాలనిర్ణయానికి వదిలి పెడుతున్నానని అంటూ వెళ్లిపోయారు.అంటే ఈయన కోరినది ఒక సంవత్సరం లో ఒక సారి వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతికి వెళ్లడమా అని నాకు నవ్వు ఆగలేదు. ఏవేవో అనుకొని అనవసరంగా కంగారుపడినందుకు నా మీద నాకే జాలి వేసింది.
ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత కుడి అరచేతిలో ఈ వెంకన్న విగ్రహమూర్తి పెట్టుకొని తీవ్ర ధ్యానం చేయగానే “నేనే వచ్చినాను కదా ఇంకా ఎందుకు కంగారు పడతావు నేను ఎందుకు వచ్చినానో విచారించు” అనగానే నాకు ధ్యాన భంగమై ఈయన ఏమిటి ఇలా పిలిస్తే అలా పలుకుతున్నాడు.వామ్మో! ఈ విగ్రహం స్వయంభూ విగ్రహమా? అత్యంత శక్తివంతమైన దానిని నేను భరించగలనా?ఎంతో శ్రద్ధా భక్తులు అలాగే మడి ఆచారాలు, నియమ నిష్ఠలు ఉండాలి.అయ్యా! చచ్చింది గొర్రె. ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే పెనుప్రమాదం ఎదురు చూస్తుంది అని జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుంటూ బాబా సజీవ విగ్రహమూర్తి ప్రక్కన ఈ సజీవ వెంకన్న విగ్రహమూర్తి ని పెట్టి ఆరాధన చెయ్యడము ఆరంభమైనది. ముక్కోటి ఏకాదశి రానే వచ్చినది. స్వామి వారికి ఇచ్చిన మాట ప్రకారం నేను తిరుపతి చేరుకోవడం జరిగినది. కానీ అక్కడ ఉన్న జనసందోహం వలన నాకు ఆ రోజు దర్శనం అవ్వదు అని అనిపించి బాధతో ఆవేదనతో ఆవేశంతో బేడి ఆంజనేయస్వామి గుడి దగ్గర కూర్చొని ఉండగా “అసలు నన్ను ఎందుకు ఇక్కడికి స్వామి వారు రమ్మన్నారు. అసలు ఎందుకు ఇంటికి వచ్చినారు. నాకు ఎందుకు కనిపించారు” అని పెను ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. అసలు దర్శనం లభించలేదని వేదనతో నేనుంటే ఈ సమాధానం లభించని ప్రశ్నల వల్ల నాలో ఏదో తెలియని తీవ్రమైన కోపం,ఆవేదన నన్ను ఒక్కసారి చుట్టుముడుతుండగా నా గురుమంత్రం చేస్తుండగా నా వెనుక నుంచి వెన్నుపాము క్రింద ఒక దివ్య అదృశ్య శక్తి ఉన్న విద్యుల్లత పైకి అనగా మాడు దాకా ఏదో వేగంగా ప్రవహించిన అనుభూతి కలిగినది.ఇలా పలుమార్లు సుమారు 12 సార్లు పాటు అనుకుంటా ఇలా జరిగింది అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న సమయంలో ఏడుకొండలవాడా వెంకన్న అంటూ ఎవరో భక్తితో ఆర్తిగా అరుస్తూ వెళుతుండగా నాకు ఏదో విషయము స్ఫురణకువచ్చినది. అంటే మనలో ఉన్న సప్తచక్రాలు ఈ సప్త కొండలు అలాగే సమాధిలోనిచ్చేఆనందం వెంకన్న ఉండే ఆనంద నిలయమని అంటే వెంకన్న తనలో ఉన్న అన్ని 12 రకాల యోగ చక్రాలను తన సన్నిధిలో జాగృతి చేశారని అందుకే తనకి కుండలిని శక్తి క్రింద నుండి పైకి సుమారుగా 12 సార్లు ప్రవహించినదని తెలియగానే నేను వెంటనే వెంకన్న యురేకా( కనిపెట్టాను) యురేకా నాకు తెలిసినది. నీ మర్మము అర్థమైనది. కుండలినీశక్తితో సప్త యోగ చక్రాలు జాగృతి చేసినందుకు చాలా కృతజ్ఞతలు అనుకోగానే ఇది నిజమేనని అన్నట్లుగా వెంకన్న స్వామికి రాత్రివేళ ఏడు గంటలకు మహా నైవేద్యం సమయములో మ్రోగించే ఘంటానాదం వినబడేసరికి ఇది ఆయన సందేశం అని అనుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేచి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి మా ఊరు వెళ్లి పోయాను.
ఇలా నాకా విధముగా 12 యోగ చక్రాలు జాగృతి అయితే అదే మా జిఙ్ఞాసికి మరో విధంగా జరిగిందని వాడి టెలిపతివిధానం ద్వారా తెలిసినది.వాడికి కుండలినీశక్తి జాగృతి అయినదని తెలుసుగదా. దాంతో వాడు కూడా మూడు రోజుల తర్వాత మామూలు మనిషి అయ్యాడు. ఆ తర్వాత బాగా ఆకలివేస్తుంది అని దగ్గర్లో ఉన్న అరటి పండు కోసుకొని తిని ధ్యానానికి కూర్చోగానే తిరుపతి వెంకన్న దర్శనం ఇచ్చి ఆయన అంతర్ధానం అయిన తరువాత వాడు పద్మాసనంలో కూర్చోలేక పోయినాడట.తల వాడి ప్రమేయం లేకుండా పాము పడగ లాగ తల అటు ఇటు ఊగ సాగిందట.వాడు మెడ బలవంతంగా ఆపితే బెణకడం తప్పదు. ఒకవేళ తను కావాలని మెడ ఇలా ఊపితే మెడ ఖచ్చితంగా చేతికి వచ్చేదట. తన ప్రమేయం లేకుండానే ఈసారి చేతులు కాళ్ళు కూడా వేగంగా కదులుతున్నాయి. ఏవో ఆసన భంగిమలలో తన శరీరము చేత తన మెదడు ప్రమేయం లేకుండా ఎవరో దగ్గర ఉండి చెప్పి చేస్తున్నట్లుగా శరీర భంగిమలు ఏర్పడుతున్నాయి. అసలు ఈ శరీర భంగిమలు ఎందుకు వస్తున్నాయో ఈ శరీర ఆసనాలు వేటిగా పిలుస్తారో అతనికి అర్థమయ్యే సరికి శ్వాసలో మార్పు రాసాగింది.శ్వాస దీర్ఘంగా సాగుతోంది. తన ప్రమేయం లేకుండానే శ్వాస లోపలికి వెళితే ఓ పట్టాన బయటికి రావటం లేదు. ఈ లోపల తన పొట్ట ఉబ్బుతోంది.ఆ తర్వాత ఎవరో పీల్చి నట్టు గా బయటికి వస్తుంది ఇలా బయటకి వెళితే శ్వాస ఒక పట్టాన లోపలికి వెళ్లడం లేదు.శ్వాస లేకపోతే తను చచ్చిపోతానేమోనని భయం కలిగినది. పైగా కాళ్లు చేతులు చాలా మొద్దుబారిపోయినాయి అవి కదలలేని స్థితి.అవి కదల్చలేని స్థితి.ఇలా సుమారు 3 గంటల పైగా అతని ప్రమేయం లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆసనాలు నుంచి బయటికి రాగానే కొద్దిసేపటి తర్వాత లేచి దాహం వేయడంతో నీళ్లు తాగి వచ్చాడు. అప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తుండగా ఇదంతా తనలో శక్తిపాతము వలన జాగృతి అయిన అయిన కుండలిని శక్తి వలన తనలో ఉన్న వివిధ యోగ చక్రాలులో ఉన్న పూర్వ కర్మలు అన్నింటినీ దగ్ధం చేసి ఉంటుందని అంటే ఇంత సేపు ఈ ఆసన ప్రక్రియ వలన తనలో చక్రాలు జాగృతి అయ్యాయి అని వాడికి అర్థమయ్యేసరికి సిద్ధగురువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తనపై కరుణ చూపినందుకు ఆనందపడి నాడు.కానీ మనస్సు ఉత్సాహంగా లేదు. ఏ వస్తువు మీద లగ్నం కావడం లేదు. అశాంతిగా ఉండేది.ఒళ్ళంతా పొగలు సెగలు కక్కుతున్నట్లుగా కడుపులో అగ్నిపర్వతం ప్రేలినట్లుగా మంటగా వేడిగా అనుభూతి పొందినాడు.ఎవరో తనని తడిబట్ట పిండినట్లుగా తనలోని నరాలన్నిటిని పిండుతున్న భావన నెమ్మదిగా బలపడసాగింది. స్థిరముగా కూర్చోలేక పోయేవాడట. అలాగని నిల్చునిలేక పోయేవాడట. నడవలేక పోయేవాడట.నడుస్తుంటే పడుకోవాలి అని అనిపించేదట. పడుకుంటే మళ్లీ లేవాలనిపించేదట. అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుండేది.ఇలా కొన్ని వారాలు జరిగిపోయాయి. ఆ తర్వాత ఈ ఆసనాలు ఏమిటని విచారించగా అవి గోముఖ, స్వస్తిక, పద్మ, వీర, సింహ, భద్ర, ముక్త, మయూర,సుఖ,, సిద్ధ అనే పది యోగాసనాలు అని స్ఫురణకు వచ్చినాయి.ఎందుకంటే తను చిన్నప్పుడు ఆరోగ్యం కోసం ప్రతి రోజు యోగాసనాలు, యోగముద్రలు వేసేవాడు. కానీ ఇప్పుడు తన ప్రమేయం లేకుండా ఈ ఆసనాలు వేస్తున్నాడట. అదే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉందని అనిపించిందట. ఎప్పుడూ ఈ ఆసనాలు వస్తాయో అతనికి అర్థం కాని స్థితి అట.ఉన్నట్టుండి శరీరం నేల మీద పడి పోయి ఏవొ ఆసనాలు వెయ్యడం తన ప్రమేయం లేకుండా జరిగిపోయేది.సుమారు ఇలా మూడు లేదా ఐదు గంటలపాటు చేయాల్సి ఉంటుంది. తిరిగి మామూలు మనిషిగా రావాలంటే మళ్ళీ మూడు రోజులు పట్టేది. అంటే తను పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,ప్రత్యాహార ,ధారణ, సమాధి లో మూడవ యోగము (ఆసనం) లో ఉన్నాను అని వాడికి స్ఫురణ వస్తున్న సమయంలో మళ్లీ తల పాము పడగలాగా విపరీతంగా ఊగడము,ఆ తర్వాత మెడ తల శరీరం ఒక సరళరేఖలో ఉండునట్లు ఉండే భంగిమలో వచ్చీరాగానే ఇరవై నిమిషాల తర్వాత ఏదో తెలియని విద్యుల్లత వంటి శక్తి తన వెన్నుపాము క్రింద నుండి నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు కప్పగంతులు వేస్తున్నట్లుగా చీమలు పాకుతున్నట్లుగా,పాము పాకుతున్నట్లుగా ఏదో విద్యుత్ అయస్కాంత శక్తి మొదట మల ద్వారము వద్ద, మర్మాంగం వద్ద, బొడ్డు వద్ద, వక్షస్థలము మధ్యలో ,గొంతు వద్ద, భ్రూమధ్యంలో, మెదడు మధ్య భాగంలో, హృదయములో,మాడు ప్రాంతంలో ప్రవేశించినట్లుగా అనిపించేసరికి ఏదో తెలియని అలవిగాని దివ్య ఆనందం అనుభూతి పొందుతుండగా మనస్సు లేని స్థితి అంటే ఇదే కాబోలు అనుకుంటూ ఎంతటి మృదుమధురమైన మహోన్నతమైన స్థితి అనుకుంటుండగా ఎవరో తనని వెనక్కి పిలుస్తున్నారనిఈ శక్తి ఎలా అయితే పైకి వెళ్ళినదో అంతే వేగంగా క్రిందకి అలా వచ్చేసింది.ఇది అంతా ఒక రెప్పపాటు కాలంలో జరిగినట్లు గా అనిపించింది కానీ నిజానికి ఇది అంతా సుమారుగా మూడు గంటల పైన ఈ విధి విధానము జరిగిందట. ఆ తర్వాత ఈ భాగాలలో ఏమున్నాయని విచారించగా 12 యోగ చక్రాలు ఉంటాయి అని అంటే కుండలినీశక్తి యోగ చక్రాలను జాగృతి చేసిందని తెలుసుకొనే లోపలే అలవిగాని నిద్ర వచ్చేసరికి గాఢ నిద్రలోకి జారుకున్నాడట. మరి ఆలస్యం ఎందుకు.ఇప్పటికే మీకు కూడా బాగా ఆలస్యమైనది కదా. మీరు కూడా బాగా నిద్ర లోనికి వెళ్లండి. నిద్ర లేచిన తర్వాత మనమంతా కలిసి ముందుకి వెళదాం.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
****************************
గమనిక ఈ సిద్ద మార్గంలో ప్రయాణించే వారికి మొదట యోగాసనాలతో శరీర శుద్ధి జరిగిన తర్వాత కుండలినీ శక్తి జాగృతి వలన యోగ చక్రాలు జాగృతి అవుతాయి. అదే జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి కొన్ని క్షణాల పాటు అన్ని యోగ చక్రాలు జాగృతి అవుతాయి. తర్వాత ఇది శాశ్వతంగా ఉండేందుకు యోగ చక్రాలలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క చక్రము నెమ్మదిగా నెమ్మదిగా జాగృతి అవుతూ పైకి చేరతాయి. ఒక్కొక్క చక్రంలోనికి ఈ శక్తి వెళుతున్నప్పుడు జాగృతి అయ్యి ఒక్కొక్క అనుభవంను ఇస్తాయి. అవి ఏమిటో రాబొవు అధ్యాయాలలోచూడండి.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిtirupathi venakanna vigraham ye aabharanalu lekunda kanapadatam ayna em
రిప్లయితొలగించండిcheppalani anukuntunnado ardhamu kaka meeru chikaku padatam, kundalini shakti jagruthiki
aanandpadalo leka eene kanipinchi cheppedi ardhamukaka baadhapadalo theliyani paristhithullo
unnarani ee paristhithullo sahayam cheyatanii daivalu, guruvulu lekapovatam alage mee deggariki
ochemunde meeku cheppatam tellari oka vyakthi ochi ayna adige prashnalu , mee gavvala daiva
prashna chaduvuthunna koddi em jargindo thelsukovalani anipinchindi, mee sambhaashana chaala
bagundi.....alage prathi samvatsaramu mukkoti ekadashi naadu meeru tirupati lo venkanna
darshanam chesukovalani maata theesukovatam mee praanamo,dabbulo kakunda..... mee kudi
cheyi arachethilo pettukoni dhyaanam chesthe meetho maatladatam ekadashi ki ani meeru
tirupathiki bayaluderatam, aa roju darshanam kaakapovatam meeku 12 saarlu shakti
pravahinchatam aa 7 kondalu sapthachakralani, venkateshwaraswamy undede aanandanilayamani
ila meeku 12 chakrala jagruthi avvatam, jignyasi gaaariki kuda venkateshwara swamy varu
kanipinchatam dhaantho shareeram thana prameyam lekunda aasanalu veyatam ashtangallo
aasanam ane amsham dwara thanaki kuda chakra jagruthi thana prameyam lekunda
jaragatam.......