అధ్యాయం 11


నేను ఒంటరి వాడిని అయ్యాను!

ఇదిలా ఉంటే… నాతో అనుబంధం పెంచుకునే వాళ్ళు… ఒక్కొక్కళ్ళు గా దూరం అవ్వటం మొదలైంది! నా తొలి ప్రాణస్నేహితుడు, అత్యంత సన్నిహితుడు, ఆత్మబంధువైన మా మేనత్త కొడుకు… అనుకోని పరిస్థితుల్లో మా నాన్నగారితోను… మా మేనత్త కి విభేదాలు రావడంతో… మా రెండు కుటుంబాలు శత్రువులుగా మారటంతో.. నేను వాడు కాస్త దూరం అయినాము! అదే నా జీవితం యొక్క తొలి వైరాగ్య దెబ్బ! ప్రేమ బంధాల మీద కోలుకోలేని తొలి దెబ్బ అయినది! అలాగే నా తోటి విద్యార్థులు, స్నేహితులు, సన్నిహితులు కూడా ఏదో కారణాల వలన దూరమవుతూ వచ్చినారు! నన్ను ఆప్యాయంగా ప్రేమగా… బాగా మెచ్చుకొని ప్రొత్సహించిన నారాయణమూర్తి మాస్టర్ గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు, మేరీ మేడం గారు కూడా తమ ఉద్యోగాల బదిలీల కారణంగా నన్ను వదిలి వెళ్ళి పోవడం జరగడంతో… అది కాకుండా నా అన్నయ్య, అక్కయ్య కూడా మంచి చదువులు పేరుతో రాష్ట్రాలు మారి వెళ్లిపోవడంతో… నేను ఒంటరిగా మిగిలి పోయాను! దాంతో నా అనుకునే వాళ్లంతా మానసికంగా, శారీరకంగా దూరం అయ్యే సరికి తెలియని లేత వయస్సులో నా మనస్సు కాస్త… నాకు తెలియకుండానే వైరాగ్య భావాలు పెంచుకోవడం ఆరంభించినది!

 కలిసేది విడిపోవడానికి… విడిపోయేది ఎన్నటికి కలవటానికి కాదని అని… అలాగే ఈ బంధాలన్నీ కూడా ఆర్థిక, అవసర బంధాలని… మానసికంగా నాలో బలంగా నాటుకు పోవడంతో …అందరూ ఉన్నా కూడా ఏకాంత జీవితము ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవడం ఆరంభించాను! 
ఇంతలో రేడియో నుండి దేవదాసు చిత్రంలోని 


మనస్సున్న మనిషి గతి ఇంతే…
మనస్సు గతి ఇంతే…
తెలిసి విలపించడములో
ఉన్న ఆనందము ఎందరికి తెలుసు…
అనే పాట రావడం మొదలైంది!


శుభం భూయాత్

పరమహంస పవనానంద

*************************
గమనిక: ఈ విశ్వంలో కారణం లేనిదే కార్యం జరగదని నా ప్రగాఢ విశ్వాసం! ఎందుకంటే నా లేత వయస్సులో నాకు బంధాలు ఎందుకు దూరం చేసినాడో నాకు ఆనాడు తెలియ రాలేదు! కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నేను చేసిన గాయత్రి మంత్రం వలన నా చూపులో తెలియని ఆకర్షణ శక్తి, నా ముఖంలో బ్రహ్మవర్చస్సు, మాటల్లో తెలియని సమ్మోహనం… 

నా చుట్టూ ఉన్న స్త్రీ మూర్తులను, పురుషులను ఆకర్షించడం మొదలుపెట్టినాయి! పెళ్లయిన ఆంటీలు, పెళ్లి కావలసిన అమ్మాయిలు, ప్రేమలో ఉన్న అమ్మాయిలు ,భర్తలు లేని స్త్రీలు, నా మాటలు.. నా చేతలకి ఆకర్షించబడటం మొదలుపెట్టినారు! నేను తెలిసిన ప్రతి స్త్రీ మూర్తి నాకు వన్ ఫోర్ త్రీ చెప్పటం ఆఖరి అంకంగా జరుగుతూ ఉండేది! నేను చూడని స్త్రీలు కూడా నా ఫోను సంభాషణకు ఆకర్షితులవ్వడము మొదలయ్యేసరికి… దీనిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కొన్ని గతజన్మలలో ప్రారబ్ధ కర్మల కారణంగా వీరితో అనగా కొంతమందితో చంచల మనస్తత్వం తో ఉండటం జరిగేది! 

కానీ వీరందరి  ప్రేమ, మాయ, వ్యామోహాలు గమనించి వారందరినీ సాధన యోగమాయ పరీక్షలని గ్రహించి…. లేత వయస్సులో కలిగిన వైరాగ్య భావాలు మనస్సులో బాగా నాటుకుని పోవడంతో… ప్రారబ్ధ కర్మలగా భావించుకుని వీరిని దాటుకొని ముందుకు వెళ్లి పోయే మానసిక పరిస్థితి నాకు కలిగినది! చిన్న వయస్సులోనే వైరాగ్య భావాల దెబ్బలు తినటం వలన యుక్తవయస్సులో ఇవి నాకు ఎన్నో విధాలుగా సహాయపడినాయని  గ్రహించాను! 
అప్పుడు నాకు రేడియో నుండి చక్రము సినిమాలోని ……


జగమంత కుటుంబం నాది…
ఏకాకి జీవితం నాది…
సంసార సాగరం నాదే…
సన్యాస శూన్యం నాదే…

అంటూ పాట పాడుకుంటూ నా జీవితమును ముందుకు కొనసాగించాను!


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించు
  2. mee atha kodukunu inka marchipoledu kada ayna lucky.... meeku anni bandhalu dooram avvatam venuka intha meaning undi ani last lo manchi avagaahana ochela chepparu ayna andaru duram ayna meeku unna avagahana shakti ki joharlu...

    రిప్లయితొలగించు