మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....
సాధన అంటే….
అసలు యోగ సాధన అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనే ధర్మ సందేహాలు మా ఇద్దరినీ వెంటాడింది! వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆరంభించినాను! అసలు మనిషికి ఆహారం ఎందుకు తినాలి అనుకున్నపుడు ప్రాణశక్తిని కాపాడుకోవడానికి అని తెలిసింది! అసలు ప్రాణశక్తి ఎందుకు కాపాడుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానం పొందడానికి అని తెలిసినది! అసలు జ్ఞానము ఎందుకు పొందాలి అనుకున్నప్పుడు మాయ తొలగించుకోవటానికి అని తెలిసింది! అసలు మాయ ఎందుకు తొలగించుకోవాలి అన్నప్పుడు ఆనందము పొందటానికి అని తెలిసింది! ఈ ఆనంద స్థితి ఎందుకు పొందాలి అని అంటే జన్మ రాహిత్యమును పొందటానికి తెలిసినది! ఇది ఎందుకు పొందాలి అంటే మాయా జగన్నాటకములోని పాత్ర నుండి తప్పుకోవడానికి అని తెలిసింది! అంటే అన్నం తో మొదలై అన్నం తినేవాడు లేని స్థితికి చేరుకోవాలని తెలిసినది! అనగా అన్నపూర్ణాదేవి తో మొదలై విశ్వనాథుడిని చేరుకోవాలి అన్నమాట! ఇదే విషయం కాశీక్షేత్రము నిరూపణ చేస్తోంది! కాశీ క్షేత్రములో అన్నపూర్ణాదేవి అలాగే విముక్తి కలిగించే విశ్వనాథుడు ఉన్నారు కదా! అన్నము పెట్టే అన్నపూర్ణాదేవి అంటే అన్నము ద్వారా అన్నపూర్ణాదేవి మనల్ని బతికిస్తే…. విశ్వనాథుడు తన తారక మంత్రము తో మనల్ని మరణము ద్వారా తారక లోకాలకి చేరుస్తున్నాడని తెలుస్తోంది కదా!ఇది బాగానే ఉంది! ఇందులో ఎందుకు సాధన చేయాలో తెలిసింది! మాయ నుండి మాయం అవ్వాలని తెలిసినది! అసలు యోగ సాధన అంటే ఏమిటి అన్నప్పుడు
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరునియందు లయం చేయుట! మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట! ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును! అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది! ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి!అసలు యోగ సాధన అంటే ఏమిటి అన్నప్పుడు కర్మలనుండి జననమరణాలు లేకుండా చేసేది అని తెలిసినది! ఈ కర్మలు ఎక్కడినుండి వస్తాయి అని అన్నప్పుడు మోహ, వ్యామోహాల నుండి వస్తాయని…. ఇవి ఎక్కడ నుండి వస్తాయి అంటే ఆశ, భయము, ఆనందం నుండి వస్తాయని తెలిసినది! ఇవి ఎక్కడినుండి వస్తాయి అంటే మన ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు భావాల నుండి వస్తాయని తెలిసింది! మళ్లీ ఈ మూడు భావాలు ఎక్కడ నుండి వస్తాయి అంటే సత్వ రజో, తమో గుణాల నుండి వస్తాయి అని తెలిసినది! ఈ మూడు గుణాలు ఎక్కడ నుండి వస్తాయి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నుండి వస్తాయని అని తెలిసింది! ఈ మూడు శక్తులు మనస్సు, బుద్ధి, అహంకారము నుండి వస్తాయని తెలిసింది! ఇవి మన ప్రాణశక్తి లో ఉంటాయని తెలిసింది! మన ప్రాణ శక్తికి ఆధారము ఆహారం అని తెలిసినది! స్వాతికాహారం తీసుకుంటే మన మనస్సు సత్వగుణము గా కలిగి ఉంటుంది! అదే నిషిద్ధ ఆహారము తీసుకుంటే మన మనస్సు కాస్త తమోగుణమును కలిగి ఉంటుందని…. అనగా ఆహారమును బట్టి మనుసు ఉంటుందని…. మనస్సును బట్టి గుణగుణాలు ఉంటాయని… వీటిని బట్టి మన భావాలు ఉంటాయని…. వీటిని బట్టి మన ఆలోచన విధానాలు ఉంటాయని… వీటిని బట్టి మన కోరికలు ఉంటాయని …వీటిని బట్టి కర్మలు ఉంటాయని.. వీటిని బట్టి జన్మలు ఉంటాయని తెలిసింది! ఇవేమీ లేకుండా ఉండటానికి యోగ సాధన చేయవలసి ఉంటుంది! అసలు ఎలా యోగసాధన ద్వారా ఇవన్నీ జరుగుతాయని అనుకున్నప్పుడు…. కర్మలు అనేవి మనము చేసే కార్యాలను బట్టి ఉంటాయని తెలిసింది! అవే పాపకర్మల గాను, పుణ్యకర్మలు గాను తెలిసినది! పాప కర్మల వలన జన్మలు పెరుగుతాయని …. పుణ్య కర్మల వలన జన్మలు తరుగుతాయని…. జరుగుతాయని తెలిసినది! అసలు సర్వ పాప కర్మలు చేసేది ఏమిటి అన్నప్పుడు …. మనస్సు, బుద్ధి, అహంకారము, శరీరము, మాట, కర్మ అనేది తెలిసినాయి! ఉదాహరణకు దొంగతనం, వ్యభిచారం లాంటివి శరీరంతో చేసే పాపాలు గా చెప్పవచ్చును! అలాగే అబద్ధం చెప్పటం, అపవాదులు వేయటం, దూషించడం అనేవి నాలుక అనగా మాట చేసే పాపాలు గా చెప్పవచ్చును! అసూయ, ద్వేషము, మోహము, వ్యామోహము ఇలాంటివి మనస్సు చేసేవన్నీ మనస్సు చేసే పాపాలు గా చెప్పవచ్చును! నేను మాత్రమే చేయగలను అని అనేది అహంకారం చేసే పాప విధిగా చెప్పవచ్చును! అస్థిర బుద్ధితో తప్పుడు ఆలోచన చేసి తప్పుడు కర్మలు చేయడం వలన వచ్చే టప్పుడు పాప కర్మ ఫలితాలను పొందడం అనేది బుద్ధి చేసే పాపాలు గా చెప్పవచ్చు అని తెలుసుకున్నాను! ఇలా ఇవి ప్రవర్తించడానికి కారణం కర్మ బంధం అని తెలిసినది! దీనికి కారణం మనము వారికి రుణ పడటం లేదా వాళ్ళు మనకి రుణ పడటం వలన జరుగుతుందని తెలిసింది! అనగా రుణ సంబంధాల వలన కర్మబంధాలు ఏర్పడతాయని మాట! అంటే మనకి ఉండే రుణ బంధాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను! అది కాస్త తల్లి - తండ్రి, బంధువు, సోదరుడు- సోదరి, గురువు, మిత్రుడు, భార్య- భర్త, సంతానము, అత్త- మామ, జంతువు, దైవము అనేవి ఉన్నాయని తెలిసింది! ఈ రుణ బంధాల వలన మనము వారికి తెలిసి లేదా తెలియకుండా చేసే పాపాలు చేస్తున్నామని గ్రహించాను! ఈ పాపాల వలన మనకి కర్మలు-జన్మలు ఏర్పడుతున్నాయని గ్రహించాను! మన పాపాలు దగ్ధం చేసుకోవటానికి యోగాగ్ని కారకమైన యోగ సాధన చేయవలసి ఉంటుందని తద్వారా పాపాలు నశించి పోయి…. ఈ కర్మబంధాల నుండి విముక్తి కలిగి పునర్జన్మ లేని జన్మరాహిత్యం కలుగుతుందని గ్రహించాను! అంటే ఎవరికి మనము ఇంకా రుణ పడటం అలాగే కర్మశేషం అనేది ఉండ కూడదని తెలిసినది! ఒకవేళ మనం రుణము ఉంటే… అది కర్మగా ఏర్పడుతుంది! ఈ కర్మ ఉంటే… జన్మ ఉంటుంది! జన్మ ఉంటే …. కోరిక ఉంటుంది! కోరిక ఉంటే మనస్సు ఉంటుంది! మనస్సు ఉంటే శరీరం ఉంటుంది! శరీరం ఉంటే పాపపుణ్యాల కర్మఫలితాలు అనుభవించవలసి ఉంటుంది! అనగా ఏడుపులు, బాధలు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్నమాట! దీనమ్మ జీవితం! ఇదంతా చూస్తుంటే…. చిన్నప్పుడు అమ్మ చెప్పిన రాజు గారి ఏడు చేపల కథ గుర్తుకువస్తోంది!
ఒకరోజు ఒక రాజు ఏడు చేపల తెచ్చి ఎండబెడితే….. అందులో ఒక చేప ఎండకపోవటం… దీనికి కారణం గడ్డివాము అడ్డు రావటం… దీనికి కారణం ఆవు దీనిని మేత మేయకపోవడం …. దీనికి కారణం గొల్లవాడు వచ్చి దీనికి గడ్డి వేయకపోవడం…. దీనికి కారణం గొల్లవాడు తల్లి ఇతనికి అన్నము పెట్టకపోవడం… దీనికి కారణం అన్నం పెట్టే లోపల ఒక చిన్న పిల్లాడు ఏడవటం… దీనికి కారణం వీడికి చీమ కుట్టడం… దీనికి కారణం తన పిల్లవాడు పుట్టలో వేలు పెట్టడం వలన అని చెప్పడంతో… కథ సుఖాంతం అవుతుంది! ఇది అందరూ చెప్పుకునే భోగ జీవిత కథ! ఇప్పుడు దీనిని యోగ జీవిత కథ గా ఎలా చెప్పుకోవచ్చు చూడండి… ఏడు చేపలలో ఎండిన చేపలు అరిషడ్వర్గాలను… ఎండనీ చేప మనస్సు గాను… గడ్డివాము అనేది అజ్ఞానము గాను… ఆవు అనేది జ్ఞానము గాను… గొల్లవాడు అనేది సద్గురువు గాను… అమ్మ అనేది జగన్మాత గాను… పిల్లవాడు అనేది కోరికలు మాయ గాను…. చీమ అనేది సుఖదుఃఖాల సంసారం గాను… పుట్ట అనేది మట్టి లాంటి జీవితమునకు సంకేతాలుగా మార్చి చూస్తే….. ఈ కథ ఎలా ఉంటుందో చూడండి! మనస్సు అనేది ఎండక పోవటానికి కారణం ఇది గడ్డివాము అనే అజ్ఞానం మాయ అడ్డంగా ఉండటం వలన అని తెలిసినది! ఈ అజ్ఞాన మాయ తొలగటానికి ఆవు అనే జ్ఞానము మనము పొందాలని తెలిసినది! ఈ జ్ఞానము ఇచ్చే గొల్లవాడు వంటి వాడు గురువు అనుగ్రహమును మనము పొందాలి! ఈ అనుగ్రహమును పొందాలి అంటే మనము గొల్ల వాడికి అన్నం పెట్టే తల్లి అనుగ్రహం అనగా జగద్గురువు అయిన జగన్మాత అనుగ్రహమును పొందవలసి ఉంటుంది! ఈమె అనుగ్రహమును పొందాలంటే చిన్న పిల్లవాడి లాగా మనము తపన తాపత్రయం పడవాలి అనగా జ్ఞానం పొందాలనే తపన తాపత్రయం ఉండాలి! వీడు ఎలాగైతే ఏడుస్తున్నాడో మనము కూడా ఈమె అనుగ్రహము కోసము అలాగే సద్గురు అనుగ్రహం కోసం తపన తాపత్రయం పొందాలి అన్నమాట! దీనికి మనము కోరికల మాయ నుండి బయటపడాలి అనగా పుట్టలో వేలు పెట్టాలని కోరిక నుండి తప్పుకోవాలని తెలుసుకున్నాను! పిల్లవాడు కావాలనే పుట్టలో వేలు పెట్టడం అనేది కోరిక మాయ కిందకే వస్తుంది! ఆ పుట్టలో కుట్టిన చీమ అనేది కర్మఫలితాలు సంకేతం అని తెలిసినది! అనగా పాపపుణ్యాలు, కష్టసుఖాలు, సుఖదుఃఖాలు అనేవి అన్నమాట! మట్టి పుట్ట విషయానికొస్తే మట్టి లాంటి జీవితం అని తెలిసినది! మనం తినే ఆహారము మట్టి నుండి పుడుతుంది కదా! మనం మట్టిలోనే తిరుగుతున్నాము కదా! చివరికి మనం మట్టిలోనే కలిసిపోతుంది కదా! అంటే కోరికల మాయలో పడిన వాడు మట్టిలో కలిసి పోతాడని తెలుస్తోంది! కాబట్టి ఇలా కాకుండా ఉండాలి అంటే మన కోరికలు లేని స్థితికి చేరితే… మన ఎండని చేప వంటి మనస్సు ఎండిపోతుందని… జన్మ రాహిత్యమును ఇస్తుందని…. దీన్నే మోక్షప్రాప్తి అని అంటారని తెలుసుకున్నాను! అంటే మనకు ఎలాంటి రుణ కర్మ జన్మ బంధాలు లేకుండా ఉండాలి అంటే మన పాపాలు హరించాలి…. దీనికి ఏమి చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులకు సేవలు, అత్తమామల సేవలు, గురుసేవ, గోమాత సేవ ,నిత్య గంగానది స్నానము, నిత్య తుంగభద్రానది పానము, నిత్య విభూది ధారణ, మన స్తోమతను బట్టి దానధర్మాలు, అన్నదానము, ప్రయాగ గయ పిండప్రదానాలు, సర్ప దోష నివారణ పూజలు, నారాయణ బలి క్రతువు, భూతదయ, నిత్య గణపతి పూజ, తులసీదళాల అర్చన, ఏకాదశి ఉపవాస వ్రతం, శివరాత్రి జాగరణ ,లింగార్చన, నిత్య బాణ లింగార్చన, నిత్య రుద్రాక్ష మాల ధారణ, ఎద్దులు ఆంబోతుగా వదిలి పెట్టడం , విశ్వ ఆరాధన మున్నగు వాటిని చేయాలని శాస్త్ర వచనం గా తెలుసుకున్నాను! తద్వారా మన మనస్సు పరిశుద్ధము అవ్వటం ప్రారంభిస్తుందని తెలుసుకున్నాను! పాప భారం తగ్గుతుందని తెలిసినది! అప్పుడు మనం మనస్సు లగ్నం చేయడమే సాధన అని తెలుసుకున్నాను! ఈ మనస్సుని వివిధ యోగ ప్రక్రియల ద్వారా లగ్నమవుతుంది!
ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది! లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది. తాపసులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాథ్ శిష్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ యోగము అను యోగ శాస్త్ర గ్రంథమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్ధతులను, బంధములను, ముద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలో 84 ఆసనములను ముఖ్యమైనవిగా చెప్పబడినవి. ముఖ్యముగా ధ్యానమునకు కావలసిన సుఖాసనము, సిద్దాసనము, అర్ధ పద్మాసనము, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడింది. ఇదే విధముగా పతంజలి యోగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము ఉంది. ప్రాణాయామ సాధనలో - సూర్య భేదన, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర బంధము, మూల బంధము, ఉడ్యాన బంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్, అంతర్ శుచి చాలా అవసరముగా ఈ హఠ యోగమున ప్రధాన అంశముగ చెప్పబడింది.- ధౌతి, నేతి, వస్తి, నొలి, త్రటకం, తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణ గలదు.ఈ సాధన విధి విధానాలను చేయడం వలన మన మనస్సు యొక్క ఆలోచనలు ఏకీకృతం చేయడం జరుగుతుందని దీనినే ధ్యానం అని తెలుసుకున్నాను! ఇట్టి ధ్యాన స్థితిలో నిరంతరంగా కొనసాగితే అదియే సమాధి స్థితి అని గ్రహించాను! ఇలా మనస్సు లేని స్థితి పొందడమే పరిపూర్ణ ఆనంద స్థితి అని … పునర్జన్మ లేని జన్మరాహిత్యం మోక్షప్రాప్తి కలుగుతుందని…. తద్వారా మనకి పసిపాప లాంటి ఆత్మ శాంతి కలుగుతుంది అని… ఇదియే సాధనలో మహోన్నత స్థానం అని గ్రహించాను! అనగా గోచీ గుడ్డ లేని సాధువులాగా మారాలని గ్రహించాను!
అంటే ఒక రోజు ఒక నగ్న సాధువుకి(నగ్నత్వం) తన నగ్న మర్మాంగమును చూసి సిగ్గు పడి , భయపడి… ఎవరికీ కనిపించకుండా ఉండాలని… ఒక చిన్నగుడ్డను (కామత్వం)కప్పుకున్నాడు! దానిని ఎలుక కొరికి వేయడం జరిగినది! దీనిని చంపటానికి పిల్లిని పెంచాడు! దీని పాల కోసం ఆవును పెంచాడు! దీని ఆహారం కోసం గడ్డిని పెంచాడు! గడ్డి కోసం వ్యవసాయం చేయడం ప్రారంభించాడు! వ్యవసాయానికి తోడుగా ఇల్లాలిని తెచ్చుకున్నాడు! ఇల్లాలికి ఉండటానికి ఇల్లు ఏర్పరచుకున్నాడు! రక్షణ కోసం సంతానం కన్నాడు! ఈ సంతానం పోషణార్థం గ్రామమును ఏర్పరచుకున్నాడు! ఈ గ్రామాలు కాస్త పట్టణాలను… పట్టణాలు కాస్త రాష్ట్రాలుగాను… రాష్ట్రాలు కాస్త దేశాలు గాను … దేశాలు కాస్త ప్రపంచము గాను… ఈ ప్రపంచము కాస్త ప్రకృతి గాను… ప్రకృతి కాస్త అండ,పిండ, బ్రహ్మాండం కలిగిన విశ్వమే రూపాంతరం చెందినది! అంటే ఒక గుడ్డ ముక్క వలన ఈ విశ్వమే ఏర్పడినది కదా! అలా మన మనస్సు వలన మన దేహ నిర్మాణం ఏర్పడిందని తెలుసుకున్నాను! ఎప్పుడైతే తనకి గుడ్డముక్క అవసరం లేదని… సర్వం ఏమిలేదని...సర్వం శూన్యమని జ్ఞానము పొందుతాడో(దిగంబరత్వం)…. అప్పుడు వాడికి ఈ శరీరము ఏర్పడే అవకాశమే ఉండదు కదా! ఎప్పుడైతే మనము మన సాధన ద్వారా మనస్సు లేని స్థితి పొందితే… ఈ విశ్వంతో, ఈ శరీరంతో ఇంకా ఏం పని ఉంటుంది? ఆలోచించండి! నిజమే కదా! దీని కోసము మనము యోగ సాధన అనేది తప్పనిసరిగా చేయాలి కదా! ఇప్పుడు సాధన అంటే ఏమిటో… ఎందుకు చెయ్యాలో… తెలిసినది కదా! కాని ఎలా చెయ్యాలో… దానికున్న సాధన మార్గాలు ఏమిటో తెలియలేదు! అపుడు భగవద్గీత చదివితే ఏమి జరిగినదో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం! సాధన నా ప్రారంభ సాధన అనుభవాలు ఏమిటో చూడాలని లేదా… ఉంటే నాతో పాటు ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి!
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*****************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిsaadhana ante emiti? Rendu rakaalugaa alage digambaratvam pondalani cheppatam bagundi ...
రిప్లయితొలగించండి