అధ్యాయం 56

ఇద్దరు సరస్వతులు వచ్చారు
(నా విశుద్ధి చక్ర అనుభవాలు)


విశుద్ధి చక్ర అనుభవాలు (నా డైరీలలో):

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.

అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.

ఆగస్టు 5: ఈ రోజు నుండి నా కంఠంలో ఉన్న విశుద్ధి చక్ర ధ్యానం చేయడం ప్రారంభించాను. అనగా  వివిధ శబ్దనాదాలు వింటున్నట్లుగా అనుభూతి పొందుతూ ధ్యానం చేస్తున్నాను.
ఆగస్టు 12: ఈ రోజు నా బొడ్డు నుండి ఏదో తెలియని శబ్దనాదము గుయ్యిమంటూ వినబడసాగినది. అది ఎవరో నా కడుపులో ఉండి ఈ శబ్దము చేస్తున్నారేమో అనిపించింది.
ఆగస్టు 15: ఈ రోజు నాకు ధ్యానములో సముద్ర హోరు బాగా వినిపించింది.
ఆగస్టు 17: ఈ రోజు ఒక పెద్ద గాలి హోరు శబ్దం నాకు ధ్యానమునందు వినబడింది.
ఆగస్టు 20: ఈరోజు నీటి సవ్వడులు, నీటి అల శబ్దాలు వినిపించాయి.
ఆగస్టు 21: ఈరోజు ధ్యానము బాగా చేయాలని బలముగా అనిపించటం జరిగినది.
ఆగస్టు 22: బయట శబ్దాలు వినిపించడం లేదు కానీ నా లోపల నుండి విపరీతంగా శబ్దాలు డిటిఎస్ సౌండ్ సిస్టం మాదిరిగా వినబడుతున్నాయి. ఈ రోజు మా ఇంటికి ఒక అంగుళం సైజు పరిమాణం  పంచలోహ విద్యా సరస్వతి విగ్రహం బాసర క్షేత్రం నుండి వచ్చినది.
ఆగస్టు 23: నా జీవితంలో తొలిసారి చిన్న కవిత రాయడం జరిగింది. ఇది నాకే విచిత్రంగా ఉంది. 

P2:
ఆగస్టు 25: ఏమిటో! ఈ రోజు నా కలము నుండి నా ఆలోచనల నుండి నా భావాల నుండి కవిత్వాలు వస్తున్నాయి. వీటిని కవితలు అంటారని మా స్నేహితులు చెప్పే దాకా నాకు తెలియటం లేదు.

P3:
ఆగస్టు 28: ఈ రోజు నా కంఠము నుండి సినిమా పాటలు వస్తున్నాయి.
సెప్టెంబరు 2: ఈ రోజు నేను భక్తి పాటలు పాడటం మొదలు పెట్టినాను.
సెప్టెంబరు 5: ఈ రోజు భక్తి పాటలు రాయటం మొదలు పెట్టినాను. అసలు నాకేమీ జరుగుతుందో నాకు తెలియటం లేదు. పాటలు పాడటం, పాటలు రాయడం ఏమిటి. నా బొంద. నా బూడిద. ఒకవేళ నేను మా నాన్న ముత్తాత లాగా ఘంటసాల లాగా గాయకుడిని అవుతానా?మా అమ్మ ముత్తాత లాగా ఆధ్యాత్మిక రచయితను అవుతానా?ఏమో ఎవరికి తెలుసు. ఏదో ఒకటి అవ్వక తప్పదు కదా.
సెప్టెంబరు 6: నా కవితలు నా పాటలు చూసి నా ఆడ స్నేహితులు ఆనందపడి పోతున్నారు. నాకు శ్రీ కాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఉన్న స్వర్ణముఖి నది నుండి అమ్మవారి లోహశిల మూర్తి స్వరూపము నా భక్తుల ద్వారా నాకు వచ్చింది. దానిని పంచాయతన పూజలో అమ్మవారి స్థానంలో దీనిని ఉంచి పంచాయతన పూజ చేసుకోవటం ఆరంభించాను.
సెప్టెంబరు 10: మా గురు దేవుడిని కలిసి నాకు కలిగే అనుభవాలు గురించి అడిగితే ఇవన్నీ కూడా విశుద్ధ చక్రం జాగృతి మరియు శుద్ధి సమయములో వచ్చే అనుభవాలని చెప్పటం జరిగినది. పైగా ఈ చక్రము నందు ఉన్నప్పుడు విపరీతమైన ఊహాశక్తి కలుగుతుంది అని అలాగే స్వర విజ్ఞానం పెరుగుతుంది అని చెప్పడం జరిగినది. అలాగే తను ఙ్ఞాని అనే అహంకార మాయ ఇక్కడ నుండే మొదలవుతుందని ఈ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పటం జరిగినది .

P4:
సెప్టెంబర్ 12: ఈ రోజు నాలో నాకే తెలియకుండా నేను అందరిలాంటి వాడిని కాను. నేను అందరి కంటే గొప్ప అనే అహంభావం నాలో మొదలైనదని నాకు అర్థమైనది.
సెప్టెంబరు 18:నా మాటలలో నా చేష్టలలో నా చూపులో ఏదో తెలియని అహం నాకే కనబడుతోంది. తెలుస్తోంది.
సెప్టెంబరు 20: అందరూ నన్ను అన్ని విషయాలలో దూరంగా ఉంచటం నా ఆహానికి దెబ్బతిన్నట్లు గా ఉంది.
సెప్టెంబరు 22: అందరినీ ఎదిరించటం మొదలైంది. పెద్దవారిని పట్టించుకోకపోవటం మొదలైంది. చిన్న వారి మాటలు లెక్కించక పోవటం ఆరంభమైనది. 
సెప్టెంబరు 25: ఈ రోజు ఎందుకో నా గొంతు బొంగురు పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
సెప్టెంబరు 28:మందులు వాడినను  గొంతు నొప్పి తగ్గడం లేదు. కారణం ఏమో? 
సెప్టెంబర్ 30: ఇదివరకటిలాగా నాకు కవితలు రావటం లేదు. ఊహాశక్తి దెబ్బతిన్నదా! ఏమో?

P5:
అక్టోబరు 5: ఈరోజు ఉద్రేకంలో నేను తప్పులు చేశాను. ఆటలో మోసం చేశాను. ఇలా చేయడం తప్పు కదా.
అక్టోబరు 8: ఎప్పుడో ఏదో జరిగిన దానికి ఈరోజు నా మనస్సు పశ్చాత్తాపం పడుతోంది.
అక్టోబర్ 10: ఈరోజు సిగరెట్లు త్రాగాలని బలముగా అనిపిస్తుంది. నా ముఖానికి ఇదే తక్కువ.అలవాట్లే అవసరాలుగా మారతాయి కదా.ఏనాడు ఏమీ అలవాటు లేని నాకు కొత్తగా ఈ ఆలోచన ఏమిటో?
అక్టోబరు 12: ఈ రోజు మందు బాబులను రోడ్డుమీద చూశాను. ఒక చుక్క వేస్తే పోలా అని అనిపించినది. దేవతలే సురాపానము పేరుతో నిత్య త్రాగుబోతులు అయితే  నేను త్రాగితే తప్పు ఏమిటి? వామ్మో! వద్దు. మా అయ్యకి సిగరెట్లు, వక్కపొడి, మత్తు పదార్థాలు,మత్తు పానీయాలు త్రాగనని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట 
తప్ప రాదు కదా.
అక్టోబరు 15: ఈ రోజు ఎందుకో నా బ్రతుకు మీద నిరాశ వచ్చినది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది. ఒకవేళ ఈ చక్రం బలహీన పడుతుందా లేదా నేను ఏమైనా మాయలో పడినానా? గురుదేవుడిని అడగాలి.

P6:
అక్టోబరు 18: దీనిని గూర్చి గురుదేవుడిని అడిగితే “ఈ చక్రం బలహీన పడినప్పుడు ఇవే లక్షణాలు కనబడతాయని ఈ చక్ర బలం కోసం పాయసఅన్నము అలాగే విపరీతకరణి ముద్ర, సర్వాంగాసనము,మత్స్యాసనము,ఉజ్జయ ప్రాణాయామము తో పాటు ఆకాశ ముద్ర/ఉదాన ముద్ర అనే హస్త ముద్రలు ఒక ఆరు నెలలు ఆపకుండా చేస్తే బలపడుతుందని” చెప్పటం జరిగినది.ఈ చక్రము మన రెండవ చక్రమైన స్వాధిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుందని చెప్పటం జరిగినది. ఈ చక్రం బలహీన పడితే ఆ చక్రం కూడా బలహీనపడుతుందని చెప్పినారు.
అక్టోబర్ 30: మా గురుదేవులు ఈ చక్రమునకు బలం చేకూర్చటానికి చెప్పినవి అన్ని చేస్తుంటే నెమ్మది నెమ్మదిగా నాలో మార్పులు రావటం మొదలయ్యాయి. అవలక్షణాలు తగ్గినాయి. విపరీత ఆలోచనలు తగ్గినాయి. ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత నాకు ధ్యానంలో నారదుడు మ్రోగించే మహతి వీణ కనిపించసాగింది. ఇది స్వర జ్ఞానానికి సంబంధించిన చిహ్నము కదా అనుకునే లోపల నీల వర్ణములో మహా సరస్వతీ దేవి దర్శనము ఇవ్వటం జరిగినది. నాకు వేదవ్యాస ప్రతిష్ట అయిన బాసర క్షేత్రము నుండి  తెల్లని విద్యాసరస్వతి విగ్రహము  వచ్చినది.
నవంబరు 2: ఈ రోజు నాకు ధ్యానములో వీణ నాదము లీలగా విన పడసాగింది.ఈ రోజు వీణానాదము బాగా స్పష్టంగా లీలగా వినబడింది. వీణ వాయించే మహాశివుడి ఫోటో నాకు వచ్చింది. విచిత్రంగా ఉంది.ఇంతవరకు వీణ వాయించే సరస్వతిదేవి పటములు చాలా చూశాను.ఇది ఎందుకో తెలియ రాలేదు.అప్పుడు నేను ఈ విశుద్ధి  చక్రం జాగృతి లోనికి ప్రవేశించినాను అని నాకు అర్థం అయింది.ఇలా ఈ నారదుడి వీణ తన ధ్యానంలో కనపడినది అని లాహిరి మహాశయులు తన అనుభవాలలో వ్రాసినాడు. ఆనాటి నుండి నాలో ఏవో తెలియని శబ్దనాదాలు వినబడటం ఆరంభమయ్యాయి.

 P7:

నవంబరు 5: ఈ రోజు నాకు ధ్యానములో 16 దళాలు ఉండి నీలి వర్ణంలో పద్మం మధ్యలో 'హం' అనే బీజాక్షరం ఉన్న చక్రము లీలగా కనబడింది. అంటే ఇదే విశుద్ధి చక్రము అని తెలుసుకునే లోపల నాకు ధ్యానం భంగం అయినది. అతి అరుదుగా కనిపించే జ్ఞానసరస్వతి విగ్రహమూర్తి వచ్చినది.
నవంబరు 8: ఈ రోజు నేను చాలా ఎక్కువ సేపు అనగా సుమారుగా నాలుగు గంటలు పైగా ధ్యానముద్ర లోనే నాకు తెలియకుండా ఉన్నాను. కానీ బయటికి వచ్చిన తర్వాత ఏదో తెలియని తన్మయత్వ స్థితిలో ఉన్నానని నాకు అర్థమైనది. ఇదియే ప్రారంభ సమాధి అని అనుకుంటా. ఏమో ఎవరికి తెలుసు.
నవంబరు 18: ఈ రోజు మా గురు దేవుడిని కలిసి నాకు కలిగిన అనుభవాలు గూర్చి చెప్పగానే ఆయన వెంటనే “నాకు ఆకాశ ధారణ ముద్ర చేయమని చెప్పినారు. దీనివలన సాధకుడికి ఆకాశ సిద్ది కలుగుతుందని తద్వారా తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి సశరీరముతో ఆకాశ మార్గం ద్వారా ప్రయాణించి వెళ్లవచ్చు అని అలాగే మనో జప సిద్ధి కూడా వస్తుందని దీనివలన అనుకున్న చోటికి వెళ్లవచ్చునని చెప్పటం జరిగినది. దీనికోసం ప్రతిరోజు ఈ చక్రము మీద రెండున్నర గంటలు పాటు మూడున్నర సంవత్సరముల సాధన చేస్తే ఈ సిద్ధులు కలుగుతాయని చెప్పటం” జరిగినది. నాకు నవ్వు ఆగలేదు. ఎందుకంటే విమానం కోసం ఇన్ని సంవత్సరములు సాధన చెయ్యాలా? ఎక్కడికి కావాలంటే అక్కడికి విమానంలో పోతే సరిపోదా అనిపించింది.

P8:
నవంబరు 25:ఈ రోజు నాకు లీలామాత్రంగా విద్యా సరస్వతి సజీవ మూర్తి కనబడినది.వీణ, పుస్తకాలతో కనబడినది. కొద్దిసేపటికి ఈమె కూడా శూన్యము నందు లీనమైనది. ఆ తర్వాత సహస్ర పద్మాలు చేతిలో ఉండి హంస వాహినియై జ్ఞాన సరస్వతి సజీవ మూర్తి లీలామాత్రంగా కనబడినది. ఈమె కూడా శూన్యము నందు లీనమైనది. ఆ తర్వాత పంచముఖ మహా గాయత్రి మాత లీలామాత్రంగా సజీవమూర్తిగా కనిపించి శూన్యము నందు లీనమైనది.అంటే ఈ చక్ర దైవాలు కూడా శాశ్వతము కాదని నాకు అనిపించేసరికి నా ధ్యానం భంగం అయినది.

నవంబర్ 28: నేను స్వయంగా నా చేతితో గ్రంథకర్తగా యోగ దర్శనము, విశ్వ గురు చరిత్ర, జాతక ప్రశ్న ముద్రిత గ్రంథాలుగాను కపాలమోక్షం అను అముద్రిత గ్రంథమును రచించడము వలన ఈరోజు మా గురుదేవులు నాకు శ్రీ పవనానంద సరస్వతి దీక్షా నామము ప్రసాదించారు.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
విశుద్ధి చక్ర మా సాధనానుభవాలు:

ఇద్దరు సరస్వతులు వచ్చారు (విశుద్ధి చక్రము): అనాహత చక్రము పైన ఉన్న విష్ణు గ్రంధి జాగృతి, శుద్ధి, ఆధీనము చేసుకోవాలని దానిమీద ధ్యాస పెట్టడం జరిగినది. ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత తిరువనంతపురం నుండి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం వచ్చినది. దానితో ఈ గ్రంధి జాగృతి, శుద్ధి అయినదని అనిపించినది. తర్వాత ఐదవ చక్రమైన విశుద్ధి చక్రము మీద ధ్యాస పెట్టి నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. 

విశుద్ధి చక్ర జాగృతి: 

విచిత్రంగా నాకు ధ్యానమే జీవిత పరమావధిగా అనిపించసాగింది. పైగా చెవులలో ఏవో శబ్దాలు వినిపించటం ఆరంభమైనది.  అవి ఎక్కువగా సముద్ర హోరు,గాలి హోరు,నీటి సవ్వళ్ళు, అలల శబ్దాలు లాంటివి వినపడ సాగినవి. ఎక్కడా కూడా నదులు, సముద్రాలు కానీ నాకు దగ్గరలో గాని దగ్గరి ప్రాంతంలో గాని లేవు. కానీ ఏవో ఇలాంటి శబ్దాలు వినబడటం చాలా చిత్రంగా ఉండేది. ఇలా కొన్ని వారాల పాటు గడిచినది. అప్పుడు మా ఇంటికి ఒక అంగుళం సైజు పరిమాణం  పంచలోహ విద్యా సరస్వతి విగ్రహం బాసర క్షేత్రం నుండి వచ్చినది. అప్పటికే ఇదే పరిమాణంలో గణపతి అలాగే లక్ష్మీదేవి విగ్రహం మూర్తులు వచ్చినాయి. దానితో లక్ష్మి, గణపతి, సరస్వతి విగ్రహ మూర్తులను ఒకే చోట పెట్టి పూజలో ఉంచాను. లక్ష్మీ ఉంటే సరస్వతి ఉండదు. సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు. ఒకవేళ ఈ రెండు ఉంటే గణపతి ఉండడు. అలాంటిది ఈ ముగ్గురు కలిసి వేర్వేరుగా వచ్చి కలిసి ఉండటం విచిత్రంగా ఉండేది. 

విశుద్ధి చక్ర శుద్ధి: 

ఇది వచ్చిన దగ్గరనుండి నాలో జ్ఞాన ప్రవృత్తి పెరగసాగింది. తత్వ జ్ఞానం అవలీలగా బోధించటం ఆరంభించినాను. ఎవరైనా అడిగిన సందేహాలకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇవ్వడం ఆరంభమైనది. అంటే ఈ చక్ర శుద్ధి ఆరంభమైనది. ఎందుకంటే ఈ చక్రంలో సాధకుడికి విపరీతమైన ఊహా శక్తి కలుగుతుందని అలాగే స్వర విజ్ఞానము పెరుగుతుందని యోగ శాస్త్రాలు చెప్పటం జరిగినది. ఈ విధంగా నాలో జ్ఞాన శక్తి పెరుగుతుందని నాకు అనిపించసాగింది. 

ఇది ఇలా ఉండగా నేను ఈ చక్రం ఆధీనము కోసం తీవ్ర ధ్యానం చేస్తున్న రోజులలో నాకు శ్రీ కాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఉన్న స్వర్ణముఖి నది నుండి అమ్మవారి లోహశిల మూర్తి స్వరూపము నా భక్తుల ద్వారా నాకు వచ్చింది. దానిని పంచాయతన పూజలో అమ్మవారి స్థానంలో దీనిని ఉంచి పంచాయతన పూజ చేసుకోవటం ఆరంభించాను. అనగా శివుడు సంకేతముగా బాణలింగము, అమ్మవారి సంకేతముగా ఈ లోహ శిలామూర్తి, విష్ణువుని సంకేతముగా విష్ణు సాలగ్రామము, గణపతి సంకేతముగా గణపతి శిల, సూర్యుడు సంకేతముగా స్పటిక సూర్యుని ఇలా పంచ మూర్తులను ఏకకాలంలో పూజ చేయడమే పంచాయతన పూజ అవుతుంది. ఎవరైతే తమ ఇష్ట దైవమును మధ్యలో ఉంచి దేనిని ఉంచుతారో దాని ఆధారముగా అనగా శివుడిని మధ్యలో ఉంచితే అది శివ పంచాయతనం, అదే విష్ణువు మధ్యలో ఉంచితే అది విష్ణు పంచాయతనము, అదే అమ్మవారిని మధ్యలో ఉంచితే అది దేవి పంచాయతనం, అదే గణపతిని మధ్యలో ఉంచితే గణపతి పంచాయతనము, అదే సూర్యుడిని మధ్యలో ఉంచితే దానిని సూర్య పంచాయతనము అని వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా నాకు వినబడుతున్న శబ్ద నాదములను స్పష్టంగా వినటానికి ప్రయత్నించేవాడిని.ఏ రోజు ఏ హోరు వినబడుతుందో గమనించేవాడిని. ఈ చక్రం లో ఉండగా ఇలాంటి శబ్దాలు వినటానికి నా మనస్సు ఎదురుచూసేది. ధ్యానాలు,మంత్రాలు ఆపేది. కేవలము శబ్దం మాత్రమే వినటానికి ఆసక్తి ఉండేది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు ఏమీ అర్థం అయ్యేది కాదు. అలాగని ధ్యానము భంగము అయ్యేది కాదు. శబ్దాలు వినుకుంటూ ధ్యానానికి ఎక్కువ సమయం నాకు తెలియకుండానే కేటాయించే వాడిని. దానితో నాలో వున్న జ్ఞానశక్తి విపరీతంగా పెరగసాగింది.

నాకు వేదవ్యాస ప్రతిష్ట అయిన బాసర క్షేత్రము నుండి  తెల్లని విద్యాసరస్వతి విగ్రహము  వచ్చినది. సరస్వతి వచ్చిన దగ్గరనుండి నాలో తత్వ జ్ఞాన తరంగాలు ఉత్పన్నమయ్యాయి. ఎవరు దేని గురించి అడిగినా శాస్త్ర బద్ధంగా వేద సమ్మతముగా నాకు తెలియకుండానే వివరణలు ఇవ్వసాగాను. దానికి వారు సంతృప్తి చెందేవారు. ఇవి ఎలా వస్తున్నాయో నాకు మాత్రం తెలిసేది కాదు. అలాగని నేను చెప్పేవి అన్ని కూడా అక్షర సత్యాలే. వాళ్లే అవును. మీరు చెప్పిన విషయాలు ఫలానా గ్రంథములో లేదా ఫలానా పుస్తకములో లేదా ఫలానా యోగి చరిత్రలో చూశామని లేదా చదివామని నాకే చెబుతుంటే సరికి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే వారు చెప్పిన పుస్తకాలు గాని గ్రంధాలు గాని చరిత్రలు గాని నేను ఎప్పుడు కూడా చూడలేదు. చదవలేదు. కానీ వాటిలో ఉన్న ఙ్ఞాన విషయాలు తిరిగి నా నోటి నుండి బయటకి ఎలా వస్తున్నాయో అర్థమయ్యేది కాదు. నాలో నాకే తెలియని జ్ఞాన అహంకారము మొదలైనది. నేను చెప్పినది వేదమని, శాస్త్రమని, నా చుట్టూ ఉన్న వారు నమ్మే స్థితికి వచ్చేశారు. దాంతో నేను ఏమి చెప్పినా కూడా వారికి శిరోధార్యము అయినది.

స్వయంగా గోపినాధ్ కవిరాజ్ గారు చేతివ్రాతతో వ్రాసి నాకు బహుమతిగా అందిన “తంత్రసాధన-దృష్టిభంగి” పుస్తకం. నా చుట్టూ ఉన్న వారు అడిగిన సాధన సందేహాలను సుమారుగా ఆరు వందల దాకా ఏరికోరి వాటిని “యోగ దర్శనం” గ్రంథము రచించే స్థాయికి ఈ చక్రం తీసుకుని వెళ్ళింది.  ఉచితముగా ఈ గ్రంథము అందరికీ పంచటం జరిగినది. హరిద్వార్ క్షేత్రము నుండి పీతాంబర యోగి నుండి నాకు ఆశీస్సులు లభించాయి.నేను రచించిన “యోగదర్శనం” గ్రంథము ఒక నిజ గురువు లాంటిదని… సాధన లో వచ్చే అన్ని రకాల ధర్మ సందేహాలు పూసగుచ్చినట్లుగా సమాధానాలు ఇచ్చినందుకు…. వాటికి కావలసిన విషయ సేకరణ కష్టపడి చేసినందుకు…. వారు తమ ఆశీస్సులు ఇవ్వటం జరిగినది. అయినా నాలో జ్ఞాన దాహం తీరలేదు. కాశీ క్షేత్రము నుండి కవిరాజు గోపినాథ్ కర్మయోగి నుండి ఆశీస్సులు అందినాయి. అంటే నేను పుట్టకముందే వీరు కాశీ నందు మరణమును పొందినారు.గాకపోతే వీరి వంశస్తులైన లక్ష్మీగారు వీరు కవిరాజు గోపినాథ్ స్వయంగా తన చేతితో రాసిన నోట్స్ పుస్తకము నాకు బహుమతిగా ఇవ్వడము జరిగినది.  శ్రీ కాశీ క్షేత్రములో ఉన్న జ్ఞాన బావి లాగా నాలో జ్ఞాన తరంగాలు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉన్నాయి. ఇంకా ఏదో తెలుసుకోవాలని తపన, ఇంకా ఏదో చెప్పాలనే ఆకాంక్ష నన్ను వెంటాడుతూ ఉండేది. దీనితో సాధకులకు తమ పంచ గురువులైన మంత్ర, దీక్ష, సద్గురువు, విశ్వ గురువు, పరమగురువు దర్శన ప్రాప్తి కలగాలని వారి కోసం సంపూర్ణ శ్రీ గురు చరిత్ర రచించటం జరిగినది. ఇది రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితమే మహాసమాధి చెందిన కాశి క్షేత్ర వాసి నడయాడే కాశీ విశ్వనాధుడైన దత్త గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారు నాకు ఆత్మ దర్శనం ఇచ్చి సద్గురువై ఈ మహత్తర గ్రంథము ఆయన ఆజ్ఞ మేరకు ప్రకటించడం జరిగినది. ఇది కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కాశీ క్షేత్రములో పంచడము జరిగినది. ఇది పారాయణ చేసిన వారికి వారి సాధన స్థాయిని బట్టి వారి గురువుల సంప్రాప్తి అవుతున్నారని మా శ్రీమతి స్వానుభవం ద్వారా నాకు అర్థమైనది. 

ఒకానొక సమయంలో దాని సాధనకు సద్గురువు రావలసి ఉండగాఎన్నో వారాలు, నెలలు ఆయన కృప కోసం మా శ్రీమతి తపన పడినను రాలేదు. దాంతో ఈ జన్మకి ఇంతటితో తన సాధన పరిసమాప్తి అవుతుందేమోనని ఒక ప్రక్క భయపడుతూ మరో ప్రక్క తన సాధనను కొనసాగిస్తుంది. రానురాను తన భయము పెరుగుతుంది తప్ప తన సద్గురువు ఎవరు? వారి నుండి ఎలాంటి సూచనలు రాకపోయేసరికి దిగులు మనోవ్యాధికి గురి కాసాగింది. ఇంతలో నేను ఈ సంపూర్ణ గురు చరిత్ర గ్రంథం వ్రాయటం పరిసమాప్తి అవ్వటము మా ఆవిడ ఆరునెలలపాటు దీనిని పారాయణము చేయగా ఒక రోజు రాత్రి దీని కలలో తాజుద్దీన్ బాబా వారు కనిపించి “అమ్మాయి! నీ భక్తికి మెచ్చాను. రేపు వస్తాను. నన్ను పట్టుకో. గుర్తించు. నీకు మంచి జరుగుతుంది” అని చెప్పి అదృశ్యమైనాడు. విచిత్రం ఏమిటంటే ఆ కలలో కనిపించినవారు తాజుద్దీన్ బాబా వారని తెలియదు. ఈమెకు ఎవరో ఒక యోగి అని మాత్రమే తెలుసు. మర్నాడు నాకు వివరాలు చెప్పటం వారి పోలికలను బట్టి వారు శ్రీ తాజుద్దీన్ బాబా వారు అని చెప్పటం జరిగినది. వారే మీ సద్గురువు అని చెప్పటంతో ఆయన రాక కోసం ఎదురుచూడటం వారి అనుగ్రహమును పొందడం జరిగినది.ఇలా ఈ గ్రంథం ఎంతోమంది సాధకులకు వారి గురువులను వెతికి తీసుకొని వచ్చినదని నా దృష్టికి వచ్చింది. 

ఈ రోజు నాకు ధ్యానములో వీణ నాదము లీలగా విన పడసాగింది.ఈ రోజు వీణానాదము బాగా స్పష్టంగా లీలగా వినబడింది. వీణ వాయించే మహాశివుడి ఫోటో నాకు వచ్చింది. ఆ తర్వాత మూడురోజులకి అప్పుడు నాకు ఒక రోజు తీవ్ర ధ్యానంలో ఉండగా 'హం' అనే మధ్య బీజాక్షరముగా 16 దళాలు ఉన్న పద్మము కనబడినది. అంటే ఈ చక్ర శుద్ధి అయినదని నాకు అర్థమైనది.చెవులలో హోరు శబ్దాలు అలాగే వినబడుతుండేవి. నా జ్ఞాన శక్తి వలన జ్యోతిష్య శాస్త్రమునకు సంబంధించిన ప్రశ్న జాతకము అను గ్రంథమును రచించడం జరిగింది. ఇది ఉచితంగా ఇవ్వటం జరిగినది. ఇది సుమారుగా 50వేల మందికిపైగా చేరిందని మా సహోదరులు చెప్పడం కొసమెరుపు. వారికి జాతక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ఈ పుస్తకంలో చూస్తే వారికి తగ్గ సూచనలు రావటం ఇప్పటికి నాకే వింతగా ఉన్నది. దేవి సరస్వతుల జ్ఞానుల ప్రభావము వారి అనుగ్రహ బలం అని నా నమ్మకం. నాకు ఈ చక్రంలో పరచిత్తాది అభిజ్ఞత సిద్ధి వచ్చినది. అనగా ఇతరుల మనసులను గ్రహించడం అలాగే వారికి వచ్చిన కలలు యొక్క భావాలు వివరించడము జరిగినది. ఇది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అంతుచిక్కలేదు. 

విశుద్ధి చక్ర ఆధీనము: 


ఇలా నేను శివ పంచాయతనముగా దీనిని పూజిస్తూ కొన్ని నెలలు గడిచిన తర్వాత నేను తిరుపతి వెళ్ళవలసి వచ్చినది. అక్కడ దర్శనానికి వెళుతుండగా నాకు ఒక కొట్టులో విద్యా సరస్వతి నల్లని విగ్రహం కనపడింది. అంతవరకు తెల్లని ఎన్నో వివిధ రంగులలో ఉన్న సరస్వతి విగ్రహలు చూశాను. కానీ ఇలా నల్లరంగు సరస్వతి విగ్రహం చూడలేదు. నాకున్న జ్ఞానమాయ వలన వెంటనే దానిని కొనాలని అనుకున్నాను.  వెంటనే మా వాసు మామ అరే! అయ్య(వెంకన్న స్వామి) దర్శనానికి వెళ్లి వచ్చి అమ్మను కొనవచ్చు లే అని చెప్పి నన్ను దర్శనానికి తీసుకొని వెళ్ళినాడు. తీరా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ఆ కొట్టుకు వెళ్లి చూస్తే కొట్టు మూసి ఉంది. ప్రక్క వాళ్లను అడిగితే వాడు సరుకు కొనడానికి ఊరు వెళ్లినాడట. మూడు రోజులు దాకా ఆ కొట్టు ఇంకా తెరవడని చెప్పటంతో నాలో తెలియని కోపం వచ్చింది. ఇలాంటి సరస్వతి నల్ల విగ్రహము మరెక్కడైనా దొరుకుతుందేమోనని ఆ పరిసరాలలో ఉన్న కొట్టులు అంతా దాదాపుగా ఐదు గంటలకు పైగా వెతికిన మరొకటి  కనిపించలేదు. నేను చేసిన తప్పు ఏమిటంటే అంతవరకు ఆ చక్రాలకు సంబంధించిన విగ్రహ మూర్తులు వాటంతట అవే నల్లని లేదా ఇతరమైనవి నా దగ్గరకి స్వయంగా వచ్చినాయి. కానీ నా జ్ఞాన అహము మాయలో నేను ఉండుటవలన నల్ల విగ్రహమును చూసి నేనే కొనాలని అనుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ విగ్రహం నేను కొనాలని అనుకోకుండా ఉండి ఉంటే ఈ పాటికి దానంతట అదే నా దగ్గరికి మిగిలిన వారి లాగా వచ్చి ఉండేది. కానీ నేను కోరుకోవటం, ఆమె తప్పుకోవటంతో ఈనాటికి కూడా ఈ చక్రం ఆధీనము కాలేదు.ఒకవేళ ఆధీనము అయ్యి ఉంటే ఇలా మీరు చదువుతున్న కపాలమోక్షం గ్రంథమును ఎందుకు రాసేవాడిని. మరి ఆలోచించండి. ఎప్పుడైతే మన చక్ర దేవతలు నల్ల రూపాలలో వస్తారో ఆనాటితో ఆ చక్రం మనకు ఆధీనం అయినట్లే.ఎప్పుడైతే ఎవరు రారో అప్పుడు ఆ చక్రం కేవలం శుద్ధి లేదా జాగృతి కే పరిమితం అయినట్లేనని ఈ నల్ల సరస్వతి రాకపోవటం వలన నాకు తెలిసినది. నాలో ఇప్పటికీ జ్ఞాన తరంగాలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆపే శక్తి నల్ల సరస్వతికే ఉంది. తాంత్రిక విధానంలో ఈ సరస్వతిని నీల సరస్వతిగా ఆరాధిస్తారు. మీరు కూడా నాకు లాగా ఎప్పుడు చక్ర దేవతల దైవిక వస్తువులు,విగ్రహలు కొనాలని, ఎవరికి దగ్గరైనా చూసి వారి నుండి పొందాలని ప్రయత్నించవద్దు. వాటంతట వారే మీ ఇంటికి మీకు తెలిసిన వారి ద్వారా లేదా తెలియని వారి ద్వారా మీ కోసం వస్తారు. వచ్చేదాకా మాత్రమే ఓపికగా, సహనంగా, ఓర్పుగా, శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసముతో ఎదురు చూడండి.చక్ర ఆధీన శక్తి పొందండి.లేదంటే దానికోసం నాకు లాగా ఎదురుచూడక తప్పదు. అనగా తెల్లని విద్యా సరస్వతి వచ్చినారుగాని ఈ నల్ల సరస్వతి అమ్మ ఇంకా రాలేదు.  ఆవిడ వస్తే నాకు ఈ జ్ఞానంతో పని ఉండదు. గ్రంథాలు వ్రాసే అవసరం ఉండదు. వేరే వారికి చెప్పాలని ఆకాంక్ష ఉండదు. అంతా మౌనమే...అంతా మౌనభాషయే అనగా మౌనబ్రహ్మ మేధా దక్షిణామూర్తిలాగా మారిపోవడము జరిగేది. అప్పటిదాకా నల్ల సరస్వతి కోసం ఎదురుచూడక తప్పదు. తద్వారా ఈ చక్రం ఆధీనశక్తి  కోసం వేచి చూడక తప్పదు. విచిత్రము ఏమిటంటే ఈ సమయములో అనగా నేను తిరుపతి నుండి ఇంటికి వచ్చేసరికి మా ఇంటిలో మా అన్నకి కూతురుగా బాలసరస్వతి అంశతో సాయి స్వప్నిక జన్మించినది.నాకు బాల మాయ మొదలైనదని ఈపాటికే మీరు గ్రహించి ఉంటారు.  


ఈ నల్ల సరస్వతికి బదులుగా అతి అరుదుగా కనిపించే జ్ఞానసరస్వతి విగ్రహమూర్తి నా పుట్టినరోజు కానుకగా మా అత్తగారైన మణిప్రభ గారి నుండి వచ్చినది. విద్యా సరస్వతికి ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో జపమాల రెండు చేతులలో వీణ ఉంటే అదే జ్ఞాన సరస్వతి కి రెండు చేతులలో రెండు సహస్ర కమలాలు అలాగే మిగిలిన రెండు చేతులలో వీణ ఉంటుంది.ఇలా ఈ రెండు విగ్రహలు చేతికి వచ్చేదాకా నాకే తేడా తెలియలేదు. బాగా విచారించి ఆలోచిస్తే గాని ఇందులో ఒకరు విద్యా సరస్వతి, మరొకరు జ్ఞాన సరస్వతి అని తెలియ లేదు. జ్ఞాన సరస్వతి వచ్చిన దగ్గరనుండి నాలో జ్ఞాన తరంగాలు ఉత్పన్నమయ్యాయి. తత్వ జ్ఞానము నుండి ఆత్మ జ్ఞానము అటుపై బ్రహ్మ జ్ఞానం వైపు నా తత్వాలు బయలుదేరినాయి.అప్పటిదాకా నా బ్రహ్మ జ్ఞాన శక్తి వలన  ఇతరుల ధర్మసందేహాలు నా వాక్ ద్వారా వారికి సమాధానాలు వచ్చినాయి. ఈ సమాధానాలు వలన నా ధర్మ సందేహాలు కూడా తీరిపోయేవి. ఒకరోజు ఒకతను నా దగ్గరికి వచ్చి “స్వామి!మీరు ఎపుడు గూడ ఎదో విషయము గూర్చి ఆలోచిస్తున్నట్లుగా ఉంటారు.మీరు దేనికోసమైన సాధన చేస్తున్నారా?” అని అడిగాడు. వెంటనే "అయ్యా!అసలు ఎందుకు యోగసాధన చెయ్యాలి.సాధన పరిసమాప్తిలో మనకి ఏమి కనపడుతుంది.ఏమి తెలుస్తుంది.అసలు వేదాంతమునకు అంతముంటుందా?కనిపించే జగన్నాటకమునకు అంతముంటుందా... ఇలా పలురకాల సాధనసందేహాలకి సంపూర్ణ సమాధానము తెలుసుకొనే ప్రయత్నసాధన చేస్తున్నాను.వెంటనే అతను “స్వామి! మీరు ఎప్పుడైనా ఈ మోక్షప్రాప్తికి ప్రయత్నించారా?” అని అడిగాడు. దానికి “నేను కేవలం మోక్ష గామిల కోసం ఉన్నాను. వారికి కావలసిన మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము, అనుభవాలు కలిగించడమే నా విధి.. మోక్షమును పొందటానికి సాధన చేసే మోక్షగాములకు పరమ గురువుగా ఉండి వారి సాధన సంప్రాప్తి అయ్యేటట్లుగా చూడటమే నా వంతు అన్నమాట. ఇక వారి సాధన పరిసమాప్తి చేసుకోవడము అనేది సాధకుడి అర్హత,యోగ్యతను బట్టి కలుగుతాయని తెలుసుకో! నాకు నీల సరస్వతి అదే నల్ల సరస్వతి సంప్రాప్తి అయ్యేవరకు నేను మోక్షగామి కాలేను . అని నాకు తెలియకుండానే నాకు వాక్ వచ్చినది.

సూచన: విచిత్రము ఏమిటంటే ఈ నాకు వచ్చిన వాక్ గూర్చి ఆనాడు తెలుసుకోలేకపోయినాను.కాని ఈ విషయము నా విషయములో ఎలా సత్యమైనదో ఈ గ్రంధరచన అన్నమాట.
జిజ్ఞాసి అనుభవాలు

ఇక జిజ్ఞాసి అనుభవాలు ఏమిటో చూడాలంటే మీరు ఇప్పుడు వాడి 5వ చక్రమైన విశుద్ధి చక్ర అనుభవాలు వాడు పంపించిన టెలిపతి ద్వారా వాడి విషయాలు వాడి మాటలలో మీరే చూడండి. మన వాడు నన్ను భయ్యా అనటం మానివేసి శివజ్ఞాని అని సంబోధించడం నాకే ఆశ్చర్యం అనిపించింది.శివ జ్ఞాని! మీరు మీ ఐదవ విశుద్ధి చక్ర అనుభవాలు నాకు టెలిపతి ద్వారా పంపించడం జరిగినది. ఇంకా నల్ల సరస్వతి అనుగ్రహము మీకు లభించలేదని తెలిసింది.విద్య,  జ్ఞాన సరస్వతులు మీ ఇంటికి వచ్చినందుకు ఆనందం వేసినది. ఇక నా అనుభవాలు చూడండి. ఎప్పుడైతే నేను నా అనాహత చక్రము యొక్క వాయుతత్వము మీద ఆధిపత్యము వచ్చినదో అప్పుడు విశుద్ధి చక్రము గూర్చి ధ్యానం చేయటం ఆరంభించినాను. 

నీటి సవ్వడులు వినబడటం, నీటి అలలు శబ్దాలు వినబడటంతో ఆరంభమై సముద్రపు హోరు, గాలి హోరు దాకా వినబడేది. ఇవి ఎందుకు అంత స్పష్టంగా వినబడుతున్నాయో నాకేమీ అర్ధం అయ్యేది కాదు. అలా కొన్ని వారాలు గడిచి పోయినాయి. ఈరోజు నాకు ధ్యానము నందు ఒక విధమైన మేఘ గర్జన నాదము వినిపించినది. నామీద పిడుగు పడినదా అని అనిపించగానే భయంతో కళ్ళు తెరిచాను. బయట వాతావరణం చాల ప్రశాంతంగానే ఉంది. మరి నాకు మేఘాల శబ్దము నాలోనే వినబడినది అని నాకు అర్థమైనది.ఒకరోజు నేను తీవ్ర ధ్యానములో ఉండగా 16 రేకులు ఉండి 'హం' మధ్య బీజాక్షరం ఉన్న పద్మము కనపడసాగింది. దీనితో పాటుగా వివిధ శబ్దాలు యధావిధిగా వినబడసాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు ధ్యానములో ఏదో తెలియని యోగ మత్తు ఆవహించసాగింది. మంత్ర నామస్మరణ ఆగిపోయేది. కళ్ళు అర్థ నిమిలిత నేత్రాలుగా మారేవి. నాలో తెలియని మత్తు ఆవహించేది. అనగా త్రాగిన వాడిలాగా తూలుతూ నా ధ్యానస్థితి ఉండేది. నిద్ర కాదు అలాగని మెలుకువ కాని స్థితి. బయట శబ్దాలు చాలా స్పష్టంగా వినబడేవి కానీ వాటికి నా పంచేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు స్పందించేవి కావు. అనగాచెవులలో బయట శబ్దాలు వింటే అవి వాటికి ప్రతిస్పందన చేసేవి కావు. ఎవరెవరు వస్తున్నారు అలాగే వెళ్తున్నారు అని నా కళ్ళు చూడటానికి ఇష్టపడేవి కావు.ఇలా నా ధ్యాన స్థితి కొనసాగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇది ప్రారంభ సమాధి అని తెలిసినది. ఆ తర్వాత కొన్ని వారాలకు నాలో తెలియని తత్వాలు నా నోటి నుండి బయటికి వచ్చేవి. అనగా 

లోన ఉన్నదెవరు
 నీలోన ఉన్నది ఎవరు
 నీలోన నాలోన తాను అయినది ఎవరు
మనలోన తాను అయినది ఎవరు 
తనకు తానుగా నిలిచి 
తాను అన్నిటా వెలిసి 
తనని తాను ఎరుగకనే 
తపించినదెవరు
తపించినదెవరు?

ఇలా నా నోటి నుండి వచ్చిన తత్వాలు పాటలు మాదిరిగా నా నోటి నుండి బయటికి అనర్గళంగా వస్తుంటే అవి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఆ పాటలకు ఆటలు ఆడే వాడిని. డాన్సులు చేసే వాడిని. తన్మయత్వం పొందే వాడిని. గంతులు వేస్తూ ఉండేవాడిని. ఏదో తెలియని ఆనందంతో నాట్యం చేస్తుండేవాడిని. ఇలా అరగంట నుండి మూడు గంటలు లేదా ఐదు గంటల దాకా నా ప్రమేయం లేకుండా ఏదో తెలియని తన్మయత్వంతో నాట్యం చేస్తుండే వాడిని. ఏదైనా ఆధ్యాత్మిక గీతాలు ఎవరైనా ఆలపించిన లేదా ఎక్కడనుండైనా వినబడినను వాయిద్యాల శబ్దాలు వినబడినను నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి నన్ను నేను మరిచిపోయి మైకముతో నాట్యాలు చేస్తుండేవాడిని. ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం అయ్యేది కాదు.

ఒకరోజు నా ధ్యానస్థితి ప్రారంభ సమాధి స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక ఈ విశుద్ధ చక్రం ఆధీన శక్తి అయిన ఆకాశ తత్వం మీద ఆధిపత్యం కోసం అరుణాచలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అరుణాచలం చేరుకొని అక్కడున్న 18 మంది సిద్ధగురువులను యధావిధిగా దర్శించుకుని శబ్ద నాద ప్రక్రియ సాధనలో మూడున్నర సంవత్సరముల తర్వాత ఆకాశతత్త్వం సిద్ది పొందినాను.నా స్థూల, సూక్ష్మ శరీరాలు నా ప్రమేయంతో నేను చూడవలసిన అనుకున్న చోటికి ఆకాశంలో విమానంలాగా ప్రయాణించి వెళ్ళటం నాకు ఏమంత ఆశ్చర్యము అనిపించలేదు.ఆధునిక మానవుడు ఒక విమానంయంత్రములో ఎలా అయితే ప్రయాణిస్తాడో అలాగే ఈ ఆకాశ సిద్ది పొందిన వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తున్నాడని తెలుసుకోవటానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. ఇన్నాళ్ళు శ్రీశైలం, కాశీ క్షేత్రాలు వెళ్ళటానికి బస్సులు, రైలు, నడక కొనసాగించేవాడిని.ఈ సిద్ధి వలన అర్ధరాత్రి సమయంలో ఆకాశ యానం ద్వారా శ్రీశైలం, కాశీ క్షేత్రములకు వెళ్ళటం జరుగుతుండేది. అనగా శ్రీ దత్తాత్రేయ స్వామి గుజరాత్ రాష్ట్రంలోని గిరి ప్రాంతము నుండి మొదలై ఎలా ఇలా శరీర యాత్రను  ఆకాశం సిద్ది ద్వారా చేస్తూ ఇప్పటికీ సంచారం చేస్తున్నారని లోకవిదితమే కదా. అప్పట్లో అది ఎలా సాధ్యమని నాకు అనుమానమే. సందేహము కానీ ఇప్పుడు  అసాధ్యము కాదని సుసాధ్యమని నా ఎరుక అయ్యేసరికి నేను శ్రీశైలము చేరుకోవడం జరిగినది.

అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. నేను బయలు వీరభద్రుడి గుడి దగ్గర ధ్యానం చేసుకుంటూ ఉండగా నా దగ్గరికి ఒక సిద్ధ సాధకుడు వచ్చినాడు.చాలా సేపు నా కోసం ఎదురుచూస్తూ గడిపాడు. అప్పుడు నేను ఇతని కోసము నా ధ్యానము భంగము చేసుకొని కళ్ళు తెరిచి అతడి వైపు చూస్తే “అయ్యా! స్వామీ! మిమ్మల్ని నేను కొన్ని సంవత్సరములుగా ఈ పరిసర ప్రాంతాలలో సాధన చేస్తుండగా చూశాను. నేనొక రస విద్య సిద్దుడిని అంటే బంగారం తయారుచేసే విద్య నేర్చుకోవాలని ఈ యోగ సాధన చేశాను. చాలా సంవత్సరాల పాటు ఎందరినో కలిసి వారికి గురు సేవలు చేస్తూ వారు చెబుతున్న రసవిద్య కి సంబంధించిన విషయాలు సేకరణ చేసి వాటికి కావలసిన వస్తువులు సేకరించి రసవిద్య ఆరంభించాను. కానీ నా విషయ లోపము వలన నాకు ఈ విద్య అబ్బలేదు. ఇనుప వస్తువులు బంగారంగా మారటం లేదు. అలాగే పాదరసంతో బంగారం తయారు చేయలేక పోతున్నాను. మీరు విశుద్ధ చక్రం సాధన స్థాయికి వచ్చినారని ఇక్కడున్న తోటి సన్యాసులు చెప్పుకోవటం విన్నాను.ఈ చక్ర స్థితికి వచ్చిన వారికి మహా నీలి సరస్వతి అనుగ్రహము బలము వలన తెలియని బ్రహ్మ రహస్యాలు ఉండవని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీకు ఖచ్చితంగాఈ రస విద్యకు సంబంధించిన పరిజ్ఞానము మీకు తెలిసే ఉంటుంది. అది నాకు కొంచెం వివరించి చెప్పండి. ఈ రసవిద్య లో ప్రతి అమూల్యమైన పరస్ మణి(పరుసవేది మణి) కూడా సంపాదించాను. ఇదిగో చూడండి అంటూ ముదురు ఆకుపచ్చ నీల వర్ణంలో ఉన్న ఒక రాయి లాంటి వస్తువును తన సంచి నుంచి బయటికి తీసినాడు. అయినా కూడా దీని వలన ఈ రససిద్ధిని పొందలేక పోయాను. దీనికోసం హిమాలయాలలోకి వెళ్లి 8 సంవత్సరాలు  కష్టపడి శోధించి వెతికితే గాని ఈ రాయి ముక్క లభించలేదు.నన్ను అనుగ్రహించి పుణ్యము కట్టుకోండి. నాకు సంబంధించిన ఈ రస విద్య వస్తు సేకరణను చూసి ఎంతోమంది  ప్రయోగాలు చేసి మతి భ్రమణం చెందే సరికి నాలో తెలియని భయం మొదలైంది. వస్తువులు అన్ని ఉన్నాయి కానీ ఎందుకు రససిద్ధి కలగడం లేదో నాకు అర్థం కావటం లేదు. ఈ శ్రీశైల పర్వతం ఒక బంగారు రససిద్ధి నిలయం అని పూర్విక రాజులు తమకు కావలసిన బంగారమును ఇక్కడున్న రససిద్ధులు చేత చేయించుకునేవారు అని తెలిసి అలాగే ఇక్కడ ఏకంగా గుప్తముగా పాదరస బావినే త్రవ్వించిన సి.నా.రే స్వామి అనే రస సిద్ధుడి చరిత్రలో అలాగే ఆచార్య నాగార్జున, సిద్ధ రామప్ప మొదలగు వారి చరిత్రలలో ఈ విషయాలు చదివాను. పైగా యోగి వేమన కూడా ఈ ప్రాంతంలోనే రస సిద్ధుడు అయినాడని వారి పేరు మీద ఉన్న మఠం చూస్తే నాకు అర్థమైనది” అంటూ చెప్పటం ముగించాడు. 

పరుసవేది మణి

కానీ నాకు కూడా చిన్నప్పటినుండి రస విద్య అనేది ఉందా?పరుసవేది మణి అనేది ఉందా? ఇనుము బంగారములాగా ఎలా మారుతుంది అనే ధర్మ సందేహాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి కదా.  ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అందుకే శివ ఙ్ఞాని!ఈ సాధకుడు  నా దగ్గరికి వచ్చేసరికి రసవిద్య జ్ఞానము మీద ఆసక్తి మళ్ళీ మొదలైంది. దాని మీద ఆశ పడలేదు. కానీ ఆ విద్య ఉన్నదో లేదో అని కుతూహలం తీర్చుకోవాలని ప్రత్యక్ష అనుభవం ద్వారా అనుభూతి పొందాలని అనిపించి ఈ రసవిద్య బ్రహ్మ రహస్యం ముడి విప్పాలని మహా నీల సరస్వతీదేవిని ప్రార్ధించటము జరిగినది. కొన్ని క్షణాల తర్వాత నా మనోనేత్రం ముందు ఈ రసవిద్య కి సంబంధించిన దృశ్యాలు వీడియో లాగా కనపడ సాగింది. ఆ తర్వాత ఆది రసవిద్య యోగి అయిన  సి.నా.రె స్వామి కనిపించి రసవిద్య రహస్యాలు వరుసగా బోధించటం జరిగినది. ఆ తర్వాత ఆయన ఆజ్ఞ మేరకు రసవిద్య  సిద్ది ప్రాంతమైన హఠకేశ్వర దేవాలయమునకు చేరుకోవటం జరిగినది. ఈ ప్రాంతంలోని భక్తుడికి మహా శివుడు ఒక కుండపెంకులో బంగారు శివలింగమూర్తిగా దర్శనమిచ్చినారని లోక కథనం. కానీ నిజానికి ఈ భక్తుడు రస సిద్ధుడు. తన రస విద్యలో విజయం సాధించడం వలన తన పాదరస లింగం కాస్త బంగారం లింగముగా మారినది. దానితో ఆయన పూర్తిగా వైరాగ్యము చెంది బైరాగిగా మారిపోయాడు. బంగారం విద్య తెలిసినవాడు బైరాగి అవ్వక తప్పదు అని బ్రహ్మరాత లోనే ఉంది కదా. అలాగే సిద్ధ రామప్ప అను రస సిద్ధుడు కూడా ఇసుక రేణువులను బంగారపు రేణువులుగా మార్చే వాడని చాలా మందికి తెలియని కథనము.రస  విద్య జ్ఞానం పొందడానికి యోగి కావాలి. ఒకవేళ ఈ బంగారం మీద ఇతను ఆశ పడితే బైరాగి అవుతాడు లేదా పరమ యోగి అవుతాడని మహా నీల సరస్వతి ఆదేశం అన్నమాట. మేమిద్దరం కూడా హఠకేశ్వర  ప్రాంతమునకు చేరుకున్నాము. అక్కడ ఒక మట్టి కుండ పెంకును తీసుకొని నేను ఒక పరుసవేది వేరును సంగ్రహించి దానిలో దాని రసమును నింపాను.ఈ వేరు గూర్చి ఈ సాధకుడికి నేను ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత పాదరసము తీసుకొని దానిని ఇతను దగ్గర ఉన్న  పరస్ మణి యొక్క రజము తీసి దీనికి కలిపి ఇలా 21 వస్తువులతో తయారు చేసిన మిశ్రమంను ఒక అంగుళము పరిమాణంలో నల్లగా ఒక పొడి లాగా తయారు చేసి అతనికి ఇచ్చాను. ఈ కుండపై ఈ విధముగా తయారు అయిన మిశ్రమము అతని చేతికి రాసుకోమని చెప్పి ఆ తర్వాత ఏ వస్తువును తాకిన అది బంగారంగా మారుతుంది అని చెప్పాను.కానీ అతను నమ్మలేదు. పైగా ఇలాంటి మిశ్రమ పదార్థం కూడా ఎప్పుడూ చూడలేదు. అప్పటిదాకా ఎంతోమంది ప్రయోగాలు చేసిన ఈ విద్యలో ఇలాంటి మిశ్రమం వచ్చినట్లుగా లేదు అన్నాడు. దానికి నేను నవ్వుతూ ఆ మిశ్రమం అతడి చేతికి రాసి అక్కడే ఉన్న ఒక ఇనుప వస్తువు మీద పెట్టగానే అది బంగారపు వర్ణముగా మారటం గమనించేసరికి ఆ సాధకునికి ఆనందానికి అంతులేదు. ఇప్పటిదాకా అతను పుస్తకాల జ్ఞానము ద్వారా లేదా పాదరసమును ఇనుమును బంగారంగా మార్చడం విన్నాడట.ఆ తర్వాత నది ఒడ్డుకు వెళ్లి నది మధ్యలో ఉన్న ఇసుకను నేను తెచ్చి అతడి చేతిలోఉన్న ఈ మిశ్రమం ఉన్న చేతులలో పోస్తే అది కాస్తా బంగారు రేణువులుగా మారేసరికి మా వాడికి బంగారము మీద సంపూర్తిగా వైరాగ్యం కలిగి బైరాగిగా మారిపోయాడు. ఈ మిశ్రమ పదార్థమును సర్వ నాశనం చేశాడు. నాకు కావలసినది కూడా అదే. అతనిని రస విద్య దాటించాలని నేను అనుకున్నాను. అతను దాటాడు. నేను ఎప్పుడో బైరాగి అయినప్పుడు క్రొత్తగా బైరాగి అవ్వాల్సిన అవసరమే లేదు కదా. నేనొక రసవిద్య సిద్ధుడని ఇతనికి జ్ఞాపకము లేకుండా చేసి నా సాధనను కొనసాగించుకోవడానికి పంచధార పాల ధార ప్రాంతానికి వెళ్లి పోయానుశివ జ్ఞాని. ఇతను వలన ఒక జీవికి ఒక మానవ జన్మ వృధా కానివ్వకుండా చేసినందుకు నాకు సిద్ధ రామ( జిజ్ఞాసి) మీద గౌరవం అలాగే తను రసవిద్య మాయలో పడకుండ ఉన్నందుకు ఆనందం వేయడంతో నాకు వాడితో టెలిపతి తెగిపోయింది.

ఇక నా సాధన విషయానికొస్తే ఈ చక్ర శుద్ధి వలన నాలో శబ్ద పాండిత్యం పెరగసాగింది. వివిధ రకాలు  గ్రంథాలు పుస్తకాలలోని మర్మ రహస్యాలు తెలియటం మొదలైనది. కానీ నాలో తెలియని చింత మొదలైనది. అది ఏమిటంటే ఎవరో వ్రాసిన పుస్తకాలు అలాగే గ్రంథాలు చదివి వాటి మీద అవగాహన పెంచుకుని కొంత పరిజ్ఞానం సంపాదించి నాలోని ఊహాశక్తితో ఏవో గ్రంథాలు నేను ఇంతవరకు రచించడము జరిగినది. నిజానికి ఇందులో నా స్వంత జ్ఞానము తక్కువ అని నాకు అర్థం అయింది. నేను సొంతంగా తత్వాలు కాని పాటలు కాని గ్రంధాలు కానీ  రాయటం చేయాలని కుతూహలం నాలో మొదలైంది. ఎందుకంటే  అరుణాచలవాసి అయిన మౌనయోగి అయిన శ్రీ రమణ మహర్షి కూడా ఈ చక్ర స్థితికి వచ్చేసరికి అమితమైన జ్ఞానపరమైన ఊహాశక్తి పొందటం జరిగింది. కానీ ఎప్పుడూ లోకానికి తెలియ చెప్పలేదు. ఈ విషయం గమనించిన తన ప్రియ శిష్యుడైన కావ్యకంఠ మహాముని యొక్క తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఒక మహా శివరాత్రి రోజున రమణ మహర్షి తన ఇష్టదైవమైన అరుణాచలేశ్వరుడు మీద కొన్ని శ్లోకాలు అనర్గళంగా చెప్పటం జరిగినది. అవి కాస్త ఇప్పుడు అరుణాచలేశ్వర అష్టకముగా ప్రాచుర్యం పొందినాయి. ఇలా జ్ఞాన శక్తితో వచ్చిన ప్రతి అక్షరము కూడా మంత్ర శక్తితో కూడిన మంత్రయుక్తముగా మారతాయని వివిధ యోగుల చరిత్రల ద్వారా విన్నాను. అలాగే ఇట్టి చక్ర స్థితిలోనే అరవింద మహాయోగి కూడా “సావిత్రి” పేరుతో మహత్తర మంత్ర గ్రంథమే రచించడము జరిగినది. ఇంతటి మహత్తర స్వానుభవ జ్ఞాన శక్తి లభిస్తే గాని విశుద్ధ చక్రము ఆధీనము కాదని యోగ శాస్త్రం చెబుతున్నది. కానీ ఇంతవరకు నాకు ఇలాంటి తత్వ జ్ఞానము స్వానుభవంగా నాకు లభించనందుకు ఆవేదన, బాధ వేసేది. దానితో నాకు ధ్యానం భంగం అయ్యేది. ఇలాంటి జ్ఞానశక్తి పొందాలి అంటే మహా నీల సరస్వతి అనుగ్రహం పొందాల్సి ఉంటుందని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. వశిష్ట మహర్షి ఈ అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన అనుగ్రహించ లేదని అలాగే వేదవ్యాసునికి ఈ అమ్మవారి అనుగ్రహం కలగడము వల్లనే ఈయన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రచించటం జరిగినది అని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. మరి నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. వశిష్ట మహర్షికే దిక్కు లేనప్పుడు మరి నాకు దిక్కు ఏమిటి అని పరిపరి విధాలుగా ఏడ్చే వాడిని.అలాగని చక్ర సాధనను ఆపే వాడిని కాను. దాని పని అది చేసుకుంటూ పోయేది. కానీ ధ్యానం మధ్యలో తీవ్రమైన ఆవేదన కలిగి మనస్థాపం చెంది ధ్యానము భంగము అయ్యేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. నాలో ఎలాంటి మార్పు కనిపించేది కాదు. నాకు తోడుగా ఏడుపే ఉండేది. మహా సరస్వతిని అడగని క్షణము ఉండేది కాదు. నాకేమో ఒకసారి అలాంటి మహత్తర జ్ఞాన శక్తితో కూడిన ఊహాశక్తి కలిగితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో స్వానుభవంగా పొందాలని ఆరాటం రోజు రోజు కి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. దానికి తగ్గట్లుగా బాధ ఆవేశం ఏడుపు కూడా పెరుగుతున్నాయి.

దత్త భక్తుడి దర్శనం:

ఒకరోజు నేను ఉన్న ప్రాంతంలో మైసూరు దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి నాద యోగ కచేరి సభ జరుగుతుందని నా స్నేహితుల ద్వారా తెలిసినది. ఈయన వివిధ రకాల వాయిద్య పరికరాలతో లయబద్ధముగా మ్రోగిస్తూ నాద సాధన ద్వారా వివిధ రకాల రోగాలను వ్యాధులను తగ్గించేవారని వారి చరిత్ర గ్రంథాలలో చదవటం జరిగినది. అలాగే తాన్ సేన్ లాగా ఈయన కూడా తన నాద సిద్ది ద్వారా వర్షాలు కురిసేటట్లుగా చేస్తారని అలాంటి నాద కచేరీ ఈరోజు జరుగుతోందని నాకు తెలిసినది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అనగా అదే జల తరంగిణి   రాగముతో వర్షాలు సృష్టించేవారు ఉన్నారా అనే ధర్మ సందేహం నన్ను వెంటాడుతుండేది. అప్పుడెప్పుడో ఈ రాగము నందు తాన్ సేన్ అను నాదయోగి సిద్ది పొందినాడని చరిత్ర చెబుతున్నది. మరి కలికాలంలో ఇలాంటి నాద సిద్ది పొందిన వారు ఉన్నారా అనేది నా ప్రశ్న దానితో మావాడు కాస్త ఒక పదివేలు కట్టినాడు. వాడి కోసం రెండు టికెట్లు కొని నాద కచేరి ప్రాంగణమున చేరుకోవటం మా వాడితో పాటు నాకు ఆయనతో పది నిమిషములు మాట్లాడే అవకాశం ఇవ్వటం జరిగినది. ఎందుకంటే పది వేలు కట్టిన వారికి మాట్లాడటానికి పదినిమిషాలు ఇస్తారట. నాకు ఇలాంటి విషయాల దగ్గర కోపం వచ్చేది. దైవ దర్శనాలకు ,గురు దర్శనాలకు ,యోగుల దర్శనాలకు, సమాధుల దర్శనాలకు వెళ్ళేటప్పుడు డబ్బులు ముక్కుపిండి వసూలు చేయటం నాకు నచ్చని విషయం. అది ఏమిటంటే దేవాలయాలు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు అభివృద్ధి కోసం ఇలా డబ్బులు వసూలు చేస్తామని వాళ్లు చెబుతారు. డబ్బులు రాబట్టుకోవడానికి వారికి కావలసిన కారణాలు వాళ్లు చూపిస్తారు అనుకోండి కానీ ఆ విషయం ఇంతటితో ఆపేద్దాం. తిరుపతి వెంకన్ననే డబ్బులు వసూలు చేస్తున్నారు.  మరి వీళ్ళు ఆయన ముందు ఎంత అని నాలో నేను సమాధానం పడుతూ ఉండేవాడిని. ఈయన  దగ్గరికి వెళ్లడానికి మా వాడు పది వేలు ఇలా కట్టించాడని విదితమే కదా. నేను మావాడు కాస్త ఆయన ఉన్న గదిలోనికి వెళ్ళాము. నన్ను ఆయన చాలా కోపంగా ఎర్రటి కన్నులతో చూడటం నా కనుచూపు నుండి తప్పుకోలేదు. నేను డబ్బులు కట్టలేదని ఆయనకు కోపం వచ్చింది అని అనుకుని మౌనంగా ఆయనకి నమస్కారం చేస్తే మావాడు కాస్త ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆయన మాట కోసం వేయి కళ్లతో వెర్రి చూపులతో వెయ్యి ఆశల మొహంతో ఎదురుచూడటం నాకు చిరు నవ్వు తెప్పించింది. ఆయన వాడితో ఏవో మాటలు మాట్లాడుతూ సలహాలు ఇస్తూ అప్పుడప్పుడు నా వైపు ఓరకంటతో నన్ను చూడటం నేను గమనించాను. కానీ ఆయన నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. దానికి నాకు బాధగానీ ఆనందము కానీ లేదు. ఎవరి ప్రాప్తి బట్టి వారికి ఫలము ప్రాప్తి ఉంటుందని నా గట్టి నమ్మకం. పైగా డబ్బులు ఆశించే వారిని నమ్మే స్థితిలో నేను లేను.ఇలా మనము పూజించే దైవాలును కూడా నమ్మను. ఎందుకంటే ఆ దేవాలయంలో వారు కూడా మన నుండి డబ్బులు ఆశిస్తారు కదా. పది నిమిషాలు పూర్తి కావస్తున్నాయి. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి లోపలికి వచ్చి స్వామీజీ వారు మీకు ఇచ్చిన సమయం పూర్తి అయినది. ఇక మీరు బయటికి వెళ్ళండి అని మా ఇద్దరితో అనటంతో మేమిద్దరం మౌనముగా లేచి బయటకి వెళ్తూ ఉంటే గాలిలో స్వామీజీ చెయ్యి ఊపి మా వాడికి స్పటిక శ్రీచక్రమును సృష్టించి వాడి చేతిలో పెట్టడం నేను కూడా చూశాను. నేను దానికి ఆశ్చర్యము పడలేదు. అది ఎలా వచ్చిందో దాని మీద శబ్ద పాండిత్య జ్ఞానము అప్పటికే నాకు ఉంది. నేను ఆశ్చర్య పడకపోవడంతో అలాగని నాకేదో కావాలని ఆయనని ఆడకపోవడంతో అప్పుడు ఆయన నన్ను తేరిపార ప్రేమతో కూడిన కళ్లతో చూడటము నా ఓరకంట గమనించాను. నన్ను తన కళ్ళతో దగ్గరకు రమ్మని సైగ చేసి అక్కడ దగ్గరలో ఉన్న పూజ పళ్లెము లోని ఎర్రని వస్త్ర కంకణము, ఒక త్రిముఖ దత్త విగ్రహము, ఒక రాగి కడియం నాకు ఇస్తూ ఓం నమఃశివాయ అని మూడుసార్లు నాతో అనిపించి అవి తీసుకొమ్మని నా చేతికి ఇచ్చినారు. కానీ ఆ సమయంలో నా శబ్ద పాండిత్యమును దాటించే భౌతిక గురువు  ఆయనే నాకు అవుతారని తెలియదు. ఈ దైవిక వస్తువులు ఎందుకు ఆయనకి నాకు ఇవ్వాలని అనిపించిందో నాకు అర్థం కాలేదు. మౌనంగా నమస్కారం చేసి మళ్లీ బయటికి మేమిద్దరం ఆయా దైవిక వస్తువులతో వెళ్ళిపోయి మాకు కేటాయించిన సీట్లలో నాద కచేరీ వినటానికి కూర్చున్నాము. 

ఇంతలో మా వాడికి కోపం వచ్చి “నాతో 10,000/- కట్టించుకొని ఈ పనికిమాలిన స్పటిక శ్రీ చక్రమును ఇస్తారా?బంగారంతో చేసిన ఈ వస్తువు ఇస్తే ఆయన సొమ్ము ఏమి పోతుంది. నాకు ఈ చక్రం తో పనిలేదు. అమ్ముకున్న ఆరు వందల రూపాయలు రావు. ఇదిగో దీనిని నువ్వే ఉంచుకో” అని వాడికి ఇచ్చిన స్పటిక శ్రీ చక్రం కూడా నా చేతిలో పెట్టేసరికి నాకేమీ మాట్లాడాలో అర్థం కాలేదు. నమ్మకం లేని చోట నమ్మని వారికి ఎవరికి అందని అందరివాడైనా శ్రీదత్తుడు ఈయన ద్వారా రావటం ఒక విచిత్రం అనుకుంటే మణిద్వీప వర్ణన ఆనవాలు అయిన శ్రీ చక్రము అది కూడా అనఘాశక్తితో కూడి రావటం అనగా దత్త అనఘాశక్తులు నా దగ్గరకు చేరినాయి అని నాకు ఆనాడు తెలిసినది కాదు. ఇంతలో నాద గాన కచేరి మొదలైనది. నాకు అయితే మధ్యలో చాలా బోర్ కొట్టినది. ఆ వాయిద్యాలు శబ్దాలకు నాలో తెలియని ప్రకంపనలు కలుగుతున్నాయని గ్రహించే స్థితిలో నేను నిజానికి లేను. ఎందుకు ఆయన నాకోసం ఈ దత్తుడు విగ్రహము అలాగే స్పటిక శ్రీచక్రము అనుగ్రహించారు తెలియాలనే ఉద్దేశంతో అదే ధ్యాసతో అక్కడ ఉన్నాను. నమ్మిన వాడికి ఏమీ లేదు. నమ్మని వాడికి దత్తుడు రావటం ఏమిటో అర్థం కావటం లేదు.

ఇలా ఈ నాద కచేరి మూడు గంటల పైగా కొనసాగింది. ఇంతలో దత్త స్వామీజీ వారు ఈ కచేరి ముగింపుకు నాందిగా ఒక స్పటిక దండమును చేతిలో పట్టుకొని సభామండపము నుండి స్వయంగా ఆయనే క్రిందకి దిగి రావడం నా ఓరకంట చూపు నుండి తప్పుకోలేదు. ఎప్పుడైతే ఈ దృశ్యము చూశానో ఆ క్షణమే నాలో తెలియని ప్రకంపనలు మొదలయ్యాయి. ఏదో తెలియని ఆవేశం, ఆనందం, ఉత్తేజం నాలో వెన్నుపాము క్రింద నుండి ఏవో కదలికలు వేగంగా కదులుతూ గొంతుదాకా రావటం నాకు స్వానుభవము అవుతుంది. ఇది మరీ విచిత్రంగా ఉంది అనుకున్నాను.ఇంతలో నా కొండ నాలుక ప్రాంతము నుండి ఏదో తెలియని రసము వంటి పదార్థము కావడం కారటం దానిని నేను నోటితో సహజ సిద్ధంగా మింగుతూ ఉండటం తద్వారా నాలో తెలియని ఆనంద ఉత్తేజం కలగడం నేను గమనించే స్థితిలో లేను. పైగా ఈ ద్రవం అందుకోవటానికి నా నాలుక వెనక్కి మరలి దానిని సహజసిద్ధంగా అందుకోవటం నాకు వింతగా ఆశ్చర్యంగా అనిపించసాగింది. అనగా నాకు సహజసిద్ధంగా ఖేచరీముద్ర జరుగుతోంది. అది నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఎవరో ఆజ్ఞాపించినట్లుగా నా నాలుక ప్రవర్తించటం భలేగా ఉంది. నా యోగ మిత్రుడైన జిజ్ఞాసకి ఇలా తన ప్రమేయం లేకుండా యోగముద్రలు వేస్తున్నాడని చెబితే ఏమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూస్తే అది నిజమని నాకు అవగతమైనది.ఇలా కొండ నాలుక నుండి కారే ద్రవాన్ని అమృతం అని శాస్త్ర వచనం. ఈ ఒక్క చిన్న బొట్టు ఏకధాటిగా 96 గంటల పాటు గంజాయి సేవిస్తే ఎంత అనుభూతి కలుగుతుందో అంతే అనుభూతి ఈ ఒక్క అమృత బిందువు అనుభూతి కలుగునని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. కల్లు త్రాగిన వాడిలాగా, సారాయి త్రాగిన వాడిలాగా, గంజాయి సేవించిన వాడిలాగా, ఎక్కిన మత్తు దిగని వాడిలాగా నా పరిస్థితి మారుతోంది. ఆనందంతో, సంతోషంతో, పట్టరాని ఉత్సాహంతో మాటలు రావడం లేదు. నా ప్రమేయం లేకుండా శరీరము పూనకం వచ్చిన వాడిలాగా తూలుతూ వూగుతూ జోగుతూ ఉంది .కానీ భలే విచిత్ర అనుభవ అనుభూతి స్థితి అని చెప్పవచ్చును.ఇంతలో స్వామీజీ తన స్పటిక మంత్రదండంతో సభా ప్రాంగణం అంతా కలియ తిరిగి చివరికి తన సభావేదికకి చేరుకొని ఒక పదిహేను నిమిషాల పాటు జల తరంగిణి రాగము వాయించే సరికి ఆకాశమునుండి టపటపా మంటూ చిరుజల్లుగా వర్షం రావడం మొదలైంది. అందరూ చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నారు. నాకైతే ఈ పరిస్థితిని గమనించే స్థితిలో లేను. ఎందుకో ఆకాశంకేసి పైకి చూసేసరికి ఎదురుగా నీల సరస్వతి ఆకారము వంటి మేఘాల నీడ లీలగా అగుపించే సరికి నాకు తెలియని అలవికాని చెప్పటానికి వ్రాయటానికి వీలులేని ఉత్తేజ స్థితికి చేరుకున్న సమయంలో నాకు అప్పటి దాకా సభా వేదికలో స్వామీజీ కనిపించే స్థానములో అనఘా సహిత శ్రీ దత్త స్వామి అగుపించేసరికి నా నోటి నుండి అనర్గళంగా ……………….


ఓ దత్త స్వామి!!!
ఓ దత్త గురువా!!!
ఓ విశ్వ గురువా!!!
మా పాపాలు తొలగించే దీపజ్యోతివి నీవు 
మా తప్పులు క్షమించే కరుణా మూర్తివి నీవు 
మాలోని కలతలు రూపుమాపే విశ్వగురువువి నీవు
అన్ని యోగాలు ఏకకాలంలో బోధించే 
గురువులకే మహా గురువువి నీవు 

నువ్వు చేసే ప్రతి పనిలోనూ 
నువ్వు తల పెట్టే ప్రతి కార్యక్రమంలోనూ 
ఎన్నో నిగూఢ రహస్యాలను వుంచి 
నాలాంటి తెలుసుకోలేని భక్తులకు 
విసుగు విరామము లేకుండా బోధించే 
శబ్ద పాండిత్య అనుభవ పాండిత్య 
మహామాయ గురువువి నీవు 

వైద్య శాస్త్రము మాత్రమే కాదు 
నాద యోగం ద్వారా ఎన్నో రోగాలు 
వ్యాధులు తగ్గించవచ్చని 
నిరూపించిన మహాయోగివి నీవు 

నేటి యుగంలో దేవుడు 
ఉన్నాడో లేడో తెలియని 
తేల్చుకోలేని మాలాంటి భక్తులకు 
నువ్వు ఉన్నావని సత్య నిరూపణ
సాక్షీభూతంగా నిలుచున్న ప్రత్యక్ష దైవం నీవు 

సాధన చేస్తే సాధ్యం 
కానిది లేదని... నీవే ఆ 
దైవమని సత్య నిరూపణ 
చేసే దాకా మమ్మల్ని తీసుకొని 
పోయే బాటసారివి మహా గురువువి నీవు 

దేనిని దర్శిస్తే మనస్సే ఉండదో
 దేనిని దర్శిస్తే మాయ ఉండదో 
దేనిని దర్శిస్తే సర్వము వదిలిపెడతామో 
అట్టి దివ్య మంగళ స్వరూపానివి నీవు 

దేనిని దర్శిస్తే నిరంతరముగా 
ధ్యాన, తపస్సు, జపము చేస్తామో 
దేనిని దర్శిస్తే బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుందో 
అట్టి దివ్య మంగళ స్వరూపానివి నీవు 

దేనిని దర్శిస్తే ….
అద్వైత స్థితి పొందుతానో 
దేనిని దర్శిస్తే ….
తానే పరబ్రహ్మమని ఎరుక అవుతుందో 
అట్టి దివ్య మంగళ స్వరూపానివి నీవు 

దేనిని దర్శిస్తే ఈ ప్రపంచం 
కాస్త జగత్ గురువుగా కనబడుతుందో… 
దేనిని దర్శిస్తే ఈ ప్రపంచ 
మహామాయలు పటాపంచలు అవుతాయో …
అట్టి దివ్య మంగళ స్వరూపానివి నీవు

దేనిని దర్శిస్తే రాగద్వేషాలు తొలగి
బంధనాలు పోతాయో ….
దేనిని దర్శిస్తే రాగద్వేషాలు 
నశించి బంధ విముక్తి కలుగుతుందో ….
అట్టి దివ్య మంగళ స్వరూపానివి నీవు

దేనిని దర్శిస్తే 
శైవము చెప్పే ఈశ్వరుడువి 
శాక్తేయంచెప్పే ఈశ్వరివి
వైష్ణవం చెప్పే నారాయణుడివి
నీవేనని నీ దివ్య మంగళ 
స్వరూపాన్ని చూస్తే అవగతమౌతుంది దేవా 

దేనిని దర్శిస్తే 
ఇస్లాం చెప్పే అల్లా 
క్రిస్టియన్ చెప్పే ఏసు 
సిక్కు చెప్పే దివ్యకాంతి 
నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే 
అన్ని నీవే అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా 

దేనిని దర్శిస్తే 
వేదాంతం చెప్పే నీవే దేవుడవని 
వేదాలు చెప్పే పరబ్రహ్మమని 
ఉపనిషత్తులు చెప్పే పరబ్రహ్మమని 
నీవే అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా 

దేనిని దర్శిస్తే 
భగవద్గీత చెప్పే సర్వేశ్వరుడు 
గురుగీత చెప్పే పరమ గురువు 
శివ గీత చెప్పే సర్వసాక్షివి 
నీవే కదా అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా

తత్త్వాశాస్త్రము చెప్పే...
ఆనందము నీవేనని
లాస్యము నీవేనని...
సచ్చిదానందము నీవేనని
నీవే కదా అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా….

ఈ స్తోత్రము వస్తుంటే మనవాడు తన ఫోన్లో దీనిని వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాడని కూడా తెలియని ఆనంద స్థితి. పరిస్థితులు స్థితి పూర్తిగా మర్చిపోయాను. ఎదురుగా దత్త స్వామి ఉన్నారు.ఆయనను చూడగానే నాలో ఏదో తెలియని భావోద్రేకం పొందటం జరుగుతుందని  కూడా తెలియని స్థితి. ఇది నిజమో లేదా భ్రాంతి లేదా భ్రమో అర్థంకాని స్థితి. నిద్ర తో కూడిన మెలకువ స్థితి. యోగ మత్తు స్థితిలో పాటలు పాడించే వాడి ముందు పాటగాడిగా మారిన స్థితి. మంత్రాలు వల్లించే వాడి ముందు నిలుచున్న పూజారి స్థితి. వేదాలు పరిరక్షించే వాడి ముందు అజ్ఞాన పండితుడిగా ఎదురుచూస్తున్న స్థితి. ఇలా ఒక 15 నిమిషాలపాటు కలిగిన ఆనంద అనుభూతి. అంతలో శ్రీ స్వామి వారు అలాగే దత్త స్వామి వారు ఆ సభా వేదికను ఖాళీ చేసినారు అని తెలిసిన తెలియని స్థితి. అందరూ వెళ్ళిపోయారు.కుర్చీలు మిగిలిపోయాయి. నిశ్శబ్ద నాదము వినబడుతోంది. కదలలేని స్థితి. కదిలి వెళ్లాలని అనిపించని స్థితి. ఇది నా ప్రారంభ సమాధి స్థితి అని నాకు అర్థమయ్యే లోపల ఇంట్లో మంచం మీద మూడు రోజులపాటు ఏకదాటిగా నిద్ర పోవటం నాకు అందరూ చెప్పేదాకా తెలియని స్థితి. ఈ కొన్ని క్షణాల ఆనందానుభూతి ఇంతటి కిక్ ఇస్తే అదే ఈ స్థితి కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరముల పాటు ఈ స్థితిలో ఉండాలని ఆకాంక్ష నాలో మొదలయ్యేసరికి మళ్లీ యోగ మత్తు ఆవరించసాగింది.ఇలాంటి స్థితి మరికొన్ని రోజులపాటు కొనసాగిస్తూ నెమ్మది నెమ్మదిగా యోగమత్తు దూరమవుతూ భోగమత్తు ఆవరించసాగింది.మనకి కావలసిన స్థితి అందీ అందనట్లు చేయటంలో దైవానికి మించిన ఆటగాడు ఎవరు ఉండరు కదా.

 ఆ తర్వాత నా స్థితి గురించి విచారణ చేయగా అది ప్రారంభ సమాధి స్థితి అని అలాగేఅనర్గళంగా శ్రీ దత్త స్వామి మీద శ్లోకాలు చెప్పినాను అని తెలిసేసరికి నా కోరిక నెరవేరిందని తెలిసినది. అనుభవ పాండిత్య జ్ఞానము నా స్వానుభవం అవ్వాలనే నా కోరిక తీరింది. ఈ స్వామీజీని ఇలా నేను ముచ్చటగా మూడుసార్లు దర్శించుకోవటం దర్శించుకున్న ప్రతిసారి నన్ను చూసి ఉగ్ర నరసింహ స్వామిలాగా శివాలు లెత్తడం నాకు అలవాటు అయినది. దర్శించుకున్న ప్రతిసారి నాలో ఉన్న మూడు గ్రంధులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులు జాగృతి,శుద్ధి, ఆధీనమైనాయని అర్థంకాని స్థితి అన్నమాట. అంటే భౌతిక గురువుగా నాకు ఈయనని శ్రీ దత్త స్వామి వారు ఏర్పాటుచేసినారు అని పదివేల గురు దక్షిణ అనేది నా మూలాధార నుండి విశుద్ధ చక్రం స్థితిలో ఉన్న 10 లక్షల కర్మల నివారణ కోసం అని నా మనో దృష్టికి వచ్చినది. ఈయన తిట్టడం అంటే నాలో అప్పటిదాకా గ్రంధులలో ఉన్న పాప కర్మలను శ్రీ దత్త స్వామి వారు స్వయముగా ఈయన నోటి ద్వారా తిడుతున్నారని ఆనాడు తెలుసుకోలేకపోయాను. నాలో ఈ త్రి దర్శనాలు ద్వారా త్రిగ్రంధులు ఆధీనం అవుతున్నాయని తెలియని స్థితి. అంటే శ్రీ దత్త స్వామి విగ్రహరాధన రావటం అనగా నేను ఆజ్ఞాచక్రం సాధనకి అలాగే శ్రీచక్రము అనేది బ్రహ్మ చక్రం దాక అర్హత సంపాదించినాను అని నాకు అర్థమయ్యే లోపల యోగ మత్తు ఆవరించసాగింది. ఇక ఎందుకు ఆలస్యం. మీరు కూడా నాకు లాగా యోగమత్తు తో ముందుకు ప్రయాణించండి.

శుభంభూయాత్

పరమహంస పవనానంద

***********************

గమనిక: ఈ విశుద్ధి చక్రములోని చక్ర స్థితుల కోసం మహా సరస్వతి క్షేత్రాల నుండి దైవిక వస్తువులు అందరికీ వస్తూ ఉండటం నా అనుభవంలో చూశాను. అలాగే మా శ్రీమతి దీక్షా దేవికి అయితే వర్గల్ సరస్వతి దేవాలయం నుండి దైవిక వస్తువులు వచ్చినాయి. ఈ చక్ర స్థితిలో తను ఉన్నప్పుడు దైవ వాక్ ఏర్పడినది. అడిగినవారికీ అడగనివారికి వారి సమస్యలు పరిష్కారాలు ఆచార వ్యవహారాలు గూర్చి చెప్పటం ఆరంభించినది. ఇలా సుమారుగా మూడు నెలలపాటు ఈమె స్థితి గమనించి ఆమెతో “ఓయ్! నేను భుక్తి కోసము జ్యోతిష్య అవతారము ఎత్తి చెప్పినాను.నీకు ఏమి ఖర్మ. ఈ ప్రశ్న జాతకాలు పరిహారాలు ఇతరులకు చెప్పటం మానుకో. మౌనంగా ఉండటం నేర్చుకో. లేదంటే ఈ చక్ర దేవత ఇచ్చే ఊహాశక్తితో కూడి ఉన్న జ్ఞాన శక్తి మాయకి బలి కావలసి ఉంటుందని” సూచనలు చేయగానే నెమ్మది నెమ్మదిగా తన దైవ వాక్కును ఉపయోగించటం తగ్గిస్తూ వచ్చింది. కొన్ని వారాల తరువాత ఆమె స్వరంలో మార్పులు రావటం మొదలైనది. ఇంటర్ నుండి ఈమెకి థైరాయిడ్ సమస్య ఉండనే ఉంది. అది కాస్త ఈ చక్ర స్థితిలో విపరీతమైన మార్పులకు లోను అవుతుందని నాకు అర్థమైనది. గొంతులోనే ఈ చక్ర తత్వము ఉన్నది కదా. ఈ చక్రం బలహీన పడితే థైరాయిడ్ సమస్యలు వస్తాయని ఆరోగ్య యోగ శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈమె స్వరశక్తి పరీక్షగా నేను రచించిన సంపూర్ణ శ్రీ గురు చరిత్ర గ్రంథమును తన స్వరంతో వ్యాఖ్యానాలతో C.D.లుగా రికార్డు చేయడం జరిగినది. తొమ్మిది నెలల పాటు ఏకదాటిగా 54 అధ్యాయాలతో 24 గంటల C.D.తయారు చేసినది.అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం జరిగినది.ఈ C.D.లను కాశీ క్షేత్రములో ఉచితంగా ఇవ్వటం జరిగినది. ఎందుకంటే ఈ గ్రంథ రచన చేయమని కాశీ క్షేత్రంలో నడయాడే కాశీ విశ్వనాథుడుగా సమాధి చెందిన శ్రీ త్రైలింగ స్వామి ఆజ్ఞ మేరకు నేను రచన చేస్తే మా శ్రీమతి దానిని స్వరపరిచినది. దానితో అలాగే తన స్వరాలాపన వలన మరియు నేను ఈ గ్రంధకర్త గావడము వలన మా ఇద్దరి విశుద్ధ చక్ర స్థితులు సంపూర్తి అయినాయి.

అలాగే ఈ చక్రము నందు నాకు వీణ నాదము వినపడితే...అదే మన జిజ్ఞాసికి మేఘగర్జన నాదము వినపడినది.అపుడు ఈ నాదాల మీద పరిశోధన చెయ్యగా వీణానాదము వలన మనలో తత్త్వజ్ఞానము అమితముగా పెరుగుతుందని...అదే మేఘగర్జన నాదము వలన మనలో స్వరజ్ఞానము అమితముగా పెరుగుతుందని...అనగా పాటగాడు లేదా రచయిత అవుతారు అన్నమాట.ఎందుకంటే ఈ చక్రతత్వము స్వర శక్తి అలాగే ఊహశక్తిని పెంచుతాయిగదా.ఈచక్రమాయగా జ్ఞానాహంకారము ఉంటుందని తెలుసుకొండి.అసలు నాకులాగా ఈ చక్రము నందు బ్రహ్మదేవుడు అలాగే సరస్వతిదేవి దర్శనాలు అలాగే వీణానాదము ఏవరైనా విన్నారని అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలుఉన్నపురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి గూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది. 

**********************************
నా సాధన పరిసమాప్తి  సమయములో

నా సాధన పరిసమాప్తి  సమయములో నేను ఒక జ్ఞానసభకి ఆహ్వానము వస్తే వెళ్ళడము జరిగినది.కాని నన్ను నా వాలకము చూసి అక్కడున్న కాపలవాడు లోపలకి వెళ్ళనీయ్యకుండా గేట్ బయటే ఆపివేసినాడు. ఎందుకంటే అక్కడకి ఎంతో జ్ఞానము పొందిన మహానుభావులు,వేదపండితులు,బ్రహ్మజ్ఞానులు,అపర మేధావులు వస్తారు.పైగా వీరందరికి తమ పేర్లులకి ముందుకు వెనుక ఎన్నో బిరుదులతో ఉన్న తోకలుంటాయి. అలాగే బంగారుపట్టుబట్టలతో, బంగారువజ్రఆభరణాలతో, గండభేరుండాలు,పెద్దకంకణాలు,బంగారు చెవికుండలాలతో వస్తారు. నా బొంద నా మెడలో పట్టుదారముతో ఉన్న రుద్రాక్షమాల,చేతికి పంచలోహ కడియము,ఖాదీ పైజమాలాల్చితో నేను కనపడేసరికి వాడు నన్ను అదోలా చూస్తూ లోపలకి పంపించలేదని నాకు తెలుసు. లోపల సభ మొదలైనది.వాదప్రతివాదనాలు జరుగుతున్నాయి. ఖండించేవారు ఖండిస్తున్నారు.సమ్మతించేవారు సమర్ధిస్తున్నారు.నేను కిటికి కి బయట వైపు ఉండి లోపల జరిగే తంతు చూస్తున్నాను. అందులో ఎవరో లేచి పంచ జ్ఞానప్రశ్నలు అడిగేసరికి అక్కడున్నవారంతా మౌనము వహించేసరికి...నాకు చాలా ఆశ్చర్యమేసి...ఇలాంటి అవకాశము కోసమే ఎదురుచూడటము వలన ప్రధమ ద్వారము దగ్గరకి వచ్చి  అక్కడున్న కాపలవాడికి నా ఆహ్వానపత్రికను చూపించేసరికి వాడు ఆశ్చర్యభయాందోళన పడుతూ నన్ను లోపలకి మారుమాట్లాడకుండా పంపించినాడు.నేను నేరుగా సభవేదిక మీదకి వెళ్ళి ఆ పంచప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పడము మొదలు పెట్టినాను.ఈ దెబ్బతో అక్కడున్న జ్ఞానులు అహంకారమాయను దొబ్బించాలని నేను నిశ్చయించుకొని ఈ వేదికను ఎక్కడము జరిగినది. ఇక ఈ పంచ ప్రశ్నల వివరాలకి వెళ్తే...

1.          ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు … నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలావి కావాలి? అంటే దీని అర్ధము ఏమిటి ?

ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ …. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి అని అర్ధము.

2.          ఒక పెద్ద బావి ఉంది.  ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు? అని అడిగారు.

 పెద్ద బావి అనేది తల్లి తండ్రులు.  ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు.  తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో  పెంచి పోషిస్తారు.కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.  

3.          మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం ద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి? అని అడిగారు. 

ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు.  కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా  ఇరుక్కు పోతారు. 

4.          ఒక పొలంలో ధాన్యం బాగా పండింది.  ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి.  ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు.

ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు.  చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు.  ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు.

5.          బ్రహ్మవిద్య అంటే ఏమిటి?

ఒక పెద్ద గండుచీమను చేతిలో తీసుకొని అందరు చూస్తుండగానే దానిని రెండు ముక్కలుగా చేసి చంపేసి...మళ్ళీ అతికించి దానిని బ్రతికించి చూపించి “ఇదే బ్రహ్మవిద్య...చచ్చేదెవరు...బ్రతికేదెవరు..ఏది సత్యము..ఏది మిధ్య యో  తెల్పే విద్యయే బ్రహ్మవిద్య అన్నమాట. ఈ విద్య పొందినవాడు నిజ బ్రహ్మజ్ఞాని అవుతాడు.తెలుసుకున్నామని భ్రమలో బ్రతికేవాళ్ళు మెట్టవేదాంతులవుతారు.శబ్ధపాండిత్యము కన్నా అనుభవపాండిత్యము మిన్నయని తెలుసుకొండి. నిజజ్ఞానమును ఎవరికి వారే స్వయంగా పొందాలని తెలుసుకొండి.నిజ అనుభవ జ్ఞానమును పొందినవాడికి మౌనమే భాషగా ఉంటుంది” అనగానే అక్కడున్న పెద్దలంతా లేచి నాకు నమస్కారము చెయ్యగానే వారికున్న జ్ఞాన అహంకార మబ్బులు తొలిగినాయని నాకర్ధమై మౌనముగా అక్కడున్నవారికి  నమస్కారము చేసి బయటికి వస్తూండగా అక్కడున్న కాపలాదారుడు వెంటనే “నన్ను క్షమించండి...ఇన్నాళ్లు జ్ఞానికి ఆహార్యముండాలని అనుకున్నాను.నిజజ్ఞానికి వాటితో పనియుండదని మీరు నిరూపించినారు” అంటూ పాదాభివందనము చేసేసరికి వాడిని దీవించి మౌనముగా అక్కడనుండి బయలుదేరినాను.  

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. vishudhi chakra anubhavalu lo meeku apaaramaina gnyanam raavatam, dhaanitho meeru
    vivida grandalu rachinchatamu, appude meeku paramahamsa ani mee peruki mee gg add
    cheyatam..... meeku anni saraswathulu vachayi kaani meeru tirupati lo Kolpoyina nalla saraswathi
    vigrahamu raakapovatam tho KM book raayatam jarigindani.... ikkada meeru ela kolpoyaro
    cheppatam valla evarina konukkovalanukunte ela untadi ani baaga chepparu.... jignyasi gaariki
    rasavidya vachi kuda vadileyatam....parusavedi mani kuda raavatam, ganapathi sachidananda
    aashramam lo aayna darshanam, shabdha tharangalatho varsham kurpinchatam jignyasi gaariki
    ichina Sri chakram meeku ivvatam, meeku datta vigraham ivvatam akkada meeku dattudu
    darahanamai anargalanga mee noti nundi vachina sthothram adi jignyasi gaaru record cheyatam...
    chivaraga gynansabhalo andari norlu mooyinchatam.... watchman lopaliki pampananduku meeku
    kshamapanacheppatam.....

    రిప్లయితొలగించండి