అధ్యాయం 63

రామబంటు గదికి వచ్చినాడు
( నా జీవనాడి ధ్యానానుభవాలు)
 
 నాకు మహా నిర్వాణ శక్తి ఉన్న నవపాషాణం నిర్మిత వస్తువు ఇవ్వగలిగే మానవాతీత శక్తి గురించి ఎదురు చూస్తూ ఉండగా నాకు తెలియకుండానే నా శరీరము యోగ మత్తు లోనికి వెళ్ళటం జరుగుతుంది. మన సూక్ష్మధారి తల మార్చబడి చిలుక తలతో అది కాస్త అచేతన స్థితిలో నికి అనగా మరణ స్థితికి వెళ్ళిపోతే మరి నాకు ఎక్కడ నుండి యోగ మత్తు వస్తుందో కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు. అప్పుడు నేను ధ్యాన స్థితిలోనికి వెళ్లే సరికి నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. వెళ్లేవాడు చచ్చినాడు అదే నా సూక్ష్మధారి తల మారి చిన్నమస్తా దేవి చేతిలో మరణించినాడు గదా. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు యానము? ఎక్కడికి వెళుతున్నాడు అర్థము కాకుండానే భూమి గ్రహాలు చంద్రుడు సూర్యుడు త్రినేత్రం ఇలా నన్ను దాటుకుంటూ శూన్యము స్థితికి చేరుకున్న అనుభవం అనుభూతి కలిగినది. అక్కడ నా పోలికలు ఉన్న సూక్ష్మధారి చిలుక తలతో అచేతన స్థితిలో పడి ఉండగా ఈ శరీర హృదయ భాగము నుండి నాలాంటి పోలికలు ఉన్న మూడు అడుగుల ఆసామి నల్లటి శరీరంతో బయటకి వచ్చినాడు అనగా ఒక రకంగా చెప్పాలంటే వామనుడు అంత ఎత్తులో ఉన్నాడు.ఇలా వచ్చినవాడే నా కారణ శరీరం రూపధారి అని నాకు అర్థం అయింది. ఈయన కాస్త మూడు అడుగుల పరిమాణం నుండి బొటనవేలు అంత పరిమాణం పురుషుడిగా మారడము జరిగినది. నిజానికి వీరి పరిమాణము బొటనవేలు అంతేనని నాకు అర్థం అయినది. మూడు అడుగులు అనేది విశ్వరూప దర్శనం అదే విరాట్ రూప దర్శనం అన్నమాట. ఈ లెక్కన చూస్తే స్థూల శరీరము 24 అడుగుల నుండి ఆరు అడుగుల దాకా ఉంటుందని అదే సూక్ష్మశరీరము ఆరు అడుగుల నుండి 83 అంగుళాల దాకా ఉంటే కారణశరీరం కాస్త మూడు అడుగుల నుండి బొటనవేలు అంత మాత్రమే ఉంటుందని నేను గ్రహించాను. ఈ లెక్కన చూస్తే సంకల్ప శరీరము  అంగుళము నుండి రేణువు అంతా పరిమాణము లో ఉంటుంది అని నాకు స్పురణ అయినది.
 
 శ్రీ లాహిరి మహాశయులు తన కి ధ్యానములో బొటనవేలు పరిమాణం ఉన్న పురుషుడిని సహస్ర పుష్పములో చూశానని అలాగే అంగుళ పరిమాణం ఉన్న పురుషోత్తముడిని హృదయ చక్రములో చూశానని తమ అనుభవ డైరీలో రాసుకోవడం జరిగినది. కాబట్టి నాకు వచ్చిన ఈ అనుభవము నిజమేనని తేలింది. అంటే ఇక్కడ నుండి నా సాధన అంతా ఈ కారణ శరీరధారి చేస్తాడని అర్థమైనది. మరి ఈ శరీరము ఏర్పడటానికి కారణం ఏమిటో తెలిసినది అదే మహా నిర్వాణ శక్తితో బ్రహ్మరంధ్రము వద్ద జరిగే కపాల మోక్షం సిద్ది ప్రయత్నం గురించి తెలుసుకోవటం తెలిసినది కదా. అదే మనకి కుమారస్వామి చెప్పినాడు కదా. ఇంతవరకు బాగానే ఉంది ఈ కారణము కలిగిన కారణ బ్రహ్మ ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. నా స్వప్నధారి కారణం వేదవ్యాసుడు కదా. దీనికి కారణము నిజ బ్రహ్మజ్ఞానము తెలుసుకోవాలనే కారణముతో నా సూక్ష్మధారిగా వచ్చినాడు అని తెలిసినది.  మరి కారణ శరీరమునకు కారణము తెలిసినది కానీ కారణ బ్రహ్మ ఎవరో తెలియరాలేదు అనుకోగానే నాకు ధ్యాన భంగము అయినది.ఇలా కొన్ని రోజులు గడిచి పోయినాయి. 

నా నిత్య కాశీ గంగాస్నానము:

ఒక రోజు నేను గుడిలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక ప్రసాద భక్తుడు నా దగ్గరికి వచ్చి “స్వామి! ఇంకా అయ్యవారికి అభిషేకము చేసినట్లుగా లేదు. మిట్టమధ్యాహ్నం అయినది. శివలింగానికి అభిషేకం చేయకుండా ఇంతసేపు ఎవరైనా పూజారి ఉంటారా? అని నిలదీసినాడు. వీడి దృష్టి అంతా శివ లింగ పూజ అయిన తర్వాత పెట్టే ప్రసాదాల కోసమేనని మాకు తెలుసు. మేము ఇలాంటివారిని ప్రసాద భక్తులని పిలుస్తాము. అప్పుడు మేము వారితో “నాయనా! మధ్యాహ్నం వేళ కాశీలోని మణికర్ణికా ఘాట్ లో స్నానం చేస్తే చాలా మంచిది. అందుకే అక్కడకు వెళ్లి స్నానం చేసి వస్తుంటే ఈ సమయము అయినది” అనగానే వాడు నాకేసి అదోలా చూస్తూ “స్వామి! ఏమి మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడే ఉండి అదేదో క్షేత్రానికి వెళ్లి స్నానం చేసి వచ్చి నారు అంటారు ఏమిటి? నేను అంత పిచ్చి వాడిలా కనబడుతున్నానా? మీ బద్ధకానికి గంగాస్నానము అని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు” అంటుంటే వాడికి ఈ మధ్యనే మేము దేవుడిమి అయ్యామని అదేదో పెద్ద మనిషి అయ్యామని ఎలా చెప్పాలో అర్థంకాక అబద్ధం చెప్పలేక “అయితే మేము కాశీ గంగా స్నానము ఎలా చేసినామో… నీవే నీ కళ్ళతో చూడు.. అని 18 క్షణాల పాటు నా భ్రూమధ్య ప్రాంతములో ఉన్న త్రికోణము లోని త్రివేణి గంగాస్నానములో నా కారణ శరీరధారి స్నానం చేయటం చూపించే సరికి” వాడికి నోట మాట రాలేదు. నా నుదిటి మీద నా లాంటి వ్యక్తి స్నానం చేస్తున్న మినీ వీడియో దృశ్యం చూసేసరికి జడుసుకుని ఒక నెల రోజులపాటు గుడికి రాలేదు. ఒకవేళ నన్ను చూస్తే ఏదో తప్పు చేసిన వాడి లాగా వినయముతో గౌరవంతో భయముతో అణకువగా నమస్కరించి తప్పుకోవటం జరిగేది. పాపము ఒక జీవి నా చిన్నపాటి వీడియో దృశ్యానికి బలి అయినాడు అని నాకు అర్థమైనది. చమత్కారాలు చేస్తే గాని జనాలు నమస్కారాలు చెయ్యరు అని పెద్దల ఉవాచ కదా. 

మన శరీరంలో సమస్త తీర్థ జలాలు:

మన శరీరంలో సమస్త తీర్థ జలాలు ఎక్కడ ఎక్కడ ఉంటాయో మీకు తెలీదు కదా. ఆయా ప్రాంతాలను మేము మనో దృష్టితో మా శరీరంలో చూసినప్పుడు కనిపించాయి. సమస్త జీవనదులు కనిపించినాయి. మరి విశ్వ అండమే మాది అయినప్పుడు విశ్వములో ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి పదార్థం కూడా మాలోనే ఉండాలి కదా. ఇవి అందరిలోనూ ఉంటాయి. తెలుసుకున్న వారికి తెలుస్తాయి. తెలియని వారికి అవి ఉన్న కూడా ఉన్నాయని తెలియదు.ఉన్నాయని అన్నా మీరు నమ్మరు. ఉన్నా మీరు నమ్మరు నమ్మలేరు. ఎవరికి వారే అనుభవము అయ్యేదాకా వేటిని నమ్మలేరు కదా. నాకు స్వానుభవం అయినది కాబట్టి ఆ తీర్ధాలు నాలో ఎక్కడ చూశానో మేమే చెప్పడం జరుగుతోంది. ఆలకించండి. అనగా హృదయ చక్రమునందు మానస సరోవరము అగుపించినది. సహస్రార చక్రము నందు బద్రీనాథ్ క్షేత్రం లోని అలకానంద నది కనపడినది. అలాగే బ్రహ్మ చక్రమునందు బ్రహ్మపుత్రా నది, కాల చక్రము నందు యమునా నది, కర్మచక్రము నందు సరయు నది, గుణ చక్రము నందు నర్మదానది అగుపించినాయి.ఆజ్ఞా చక్రము నందు త్రివేణీ సంగమమైన ప్రయాగ నది కనపడినది. రుద్ర గ్రంథి నందు కాశీక్షేత్ర గంగానది కనిపించినది. విశుద్ధ చక్రము నందు సరస్వతీనది, అనాహత చక్రము నందు  కాళీ నది, మణిపూరక నందు  మహానది, స్వాధిష్ఠాన చక్రము నందు కృష్ణానది, మూలాధార చక్రము నందు గోదావరి నది కనిపించినాయి. ఇలా మా శరీరంలో వివిధ రకాల జీవ నదులు ఉన్నట్లుగా ఒకరోజు అనుభవ అనుభూతి పొందటము జరిగినది. 

దేవుడు లేడు దెయ్యము లేదు
ఉన్నది ఒక్కటే
గురువు లేడు శిష్యుడు లేడు
ఉన్నది ఒకటే
 
భయము లేదు బాధ లేదు
ఉన్నది ఒక్కటే
లోకాలు లేవు దైవ స్వరూపాలు లేవు
ఉన్నది ఒక్కటే
 
ఉన్నది పరమ శూన్య బ్రహ్మమే
పరమానంద స్థితియే
అనుభూతియే స్వరూపముగా ఉన్నాను
 
మమ్ము మేము ఇన్నాళ్ళుగా పూజించుకున్నాము
మమ్ము మేము ఇన్నాళ్లుగా ధ్యానించుకున్నాము
మా యందే మేము అంతర్యామిగా ఉన్నాము
మా యందే మేము ఆనందంగా ఉన్నాము
 
మమ్ము మేము అనుభవ అనుభూతి పొందుతున్నామని
నిశ్చల దీపజ్యోతి లాగా సదా వెలుగుతూ
మా చేత మేము వెలుగుతున్నాము
మేము తప్ప మరొకటి లేదు
మేము తప్ప వేరొకటి లేదు
మేము శబ్ద స్వరూపుడిగా ఉన్నాము
మేము శాంతి స్వరూపుడిగా  ఉన్నాము

నాకు పక్షి తల ఎందుకు వచ్చింది:

ఒక రోజు నేను ధ్యానము చేస్తుండగా ఒక చిన్న సందేహము వచ్చినది. అది ఏమిటంటే ఎందుకు నేను అనేది త్యాగము చేయగానే జంతువు తల వచ్చినది. మళ్లీ మనిషి తలనే రావచ్చు కదా అనుకుంటూ ధ్యానములోనికి వెళ్లి పోయినాము. అప్పుడు మాకు ధ్యానములో ఒక దృశ్యం ఆవిష్కరించబడింది. అది ఏమిటంటే మూలాధారచక్రంలో వివిధ రకాల వృక్ష జాతులు ఉన్నట్లు గా కనిపించినాయి. ఆ తర్వాత స్వాధిష్ఠాన చక్రము నందు ఈగలు దోమలు లాంటి పురుగులు ఉన్నట్లుగా కనిపించినది. ఆ తరువాత మణిపూరక చక్రము నందు మనుషులు పశువులు లాంటి జీవజాతులు ఉన్నట్లుగా కనిపించినది. ఆ తర్వాత అనాహత చక్రము నందు పక్షిజాతులు పాములు జాతులు కనిపించినాయి. ఆ తర్వాత విశుద్ధ చక్రము నందు ఇవి అన్ని రకాల జీవజాతులు ఉన్నట్లుగా కనిపించినది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రము లోని రెండు దళాలలో ఒక స్థలము నందు కేవలం మనిషి జాతి ఉంటే మరొక దళంలో జంతు జాతి ఉన్నట్లుగా కనపడినది. ఆ తరువాత సహస్ర చక్రములోని రెండు దళాలలో ఒక దళములో మనిషి తల జంతువు శరీరముతో జాతి ఉంటే మరొక దళములో మనిషి శరీరము జంతువు తల ఉన్న జాతి ఉన్నట్లుగా కనిపించినది. కొద్దిసేపటికి నాకు ధ్యాన భంగము అయినది. బయటికి వచ్చిన తరువాత ఈ దృశ్యము ఏమిటో విచిత్రంగా ఉంది. ఎక్కడా కూడా ఏ పుస్తకము గ్రంధాలలో చూసినట్లుగా చదివినట్లుగా గుర్తుకు రాలేదు. అప్పుడు నాకు నేను విశ్లేషణ చేసుకుంటే మూలాధారచక్రంలో కనిపించిన వృక్షజాతులు భూమి నుండి పుట్టేవే ఉద్భిజములు అయిఉండాలి.అలాగే స్వాధిష్ఠాన స్థానంలో కనిపించిన ఈగలు దోమలు లాంటివి స్వేదము నుండి పుడతాయి కాబట్టి ఇవి స్వేదజములు అయి ఉండాలి.ఇక మణిపూరకములో అయితే మానవ పశువు జాతులు అనేది జరాయువు లు అయి ఉండాలి. ఇక అనాహత చక్రము లో అయితే ఉన్న పక్షి పాము జాతులు అనేవి అండాలు నుండి పుడతాయి కాబట్టి ఇవి అండజములు అయి ఉండాలి.మన హైందవ గ్రంధాలు ప్రకారం చూస్తే సృష్టిలో జీవ సృష్టి అనేది ఉద్భిజములు,స్వేదజములు,  జరాయువులు, అండజములు వంటివి నాలుగు జాతుల నుండి ఏర్పడుతుందని చెప్పటం జరిగినది. అవి ఏ ఏ చక్రాల నుండి ఏర్పడతాయో ఈ నాలుగు చక్రాల ద్వారా జరిగి ఉండాలి. ఇక విశుద్ధి చక్రము అనేది జీవ ప్రకృతి అవుతుంది. ఇందులో ఇలా ఈ నాలుగు రకాల జాతులు కలిసి 84 లక్షల జీవులుగా రూపాంతరం చెందుతాయి. అనగా 21 లక్షలు జాతులు ఉద్భిజములు అని 21 లక్షలు స్వేదజములు అని 21 లక్షలు జరాయువులు అని 21 లక్షలు అండజములు అని ఇవి నాలుగు జాతులు కలిపితే 84లక్షల జీవులు అవుతాయని గరుడ పురాణము చెప్పకనే చెబుతోంది కదా. ఆ తర్వాత వచ్చే ఆజ్ఞా చక్రము నందు మనిషి జాతి జీవజాతిగా రెండుగా విడిపోయినాయి. ఎందుకంటే అన్ని జీవులకి ఆకలి నిద్ర భయము మైధునము ఉంటే మనిషి జాతికి వీటితోపాటుగా అదనముగా జ్ఞానం అనేది ఉండటం వలన ఈ జాతి మిగిలిన జీవజాతుల నుండి వేరు చేయబడింది. దీనితో ఈ చక్రము నందు జీవ ప్రకృతి మనిషి ప్రకృతితో కలిసి ప్రకృతిగా ఏర్పడినట్లుగా ఉండి ఉండాలి. అందుకే కాబోలు జీవరాశులు ఈ ప్రకృతిలో కలిసి ఉన్నట్లుగా ఉన్న విడిపోయి జీవిస్తూ ఉంటాయి. మానవులు జన అరణ్యాలలో జీవిస్తే జీవులు కాస్త జీవఅరణ్యాలలో జీవిస్తున్నాయి కదా. నిజమే కదా. అదేనండి. మనుషులు పట్టణాలలో జీవిస్తే జీవులు కాస్త అడవులలో నివసించటం. ఇక సహస్ర చక్రానికి వస్తే రెండు మానవ జంతువు జీవజాతులు కలిసి మనిషి తల జంతువు శరీరము ఉన్న జీవులుగా అంటే కేతుగ్రహము లాగా అనగా మనిషి తల పాము శరీరం ఉంటుంది. అలాగే పతంజలి మహర్షికి మనిషి తల పాము శరీరం ఉంటుంది. ఇక రెండవ విభాగంలో మనిషి శరీరము జంతువులు తల ఉంటాయి. అనగా నరసింహ స్వామి హయగ్రీవుడు రాహు గ్రహము హనుమంతుడు గణపతి మేము ఇలా ఉంటారు. నాకు తెలిసి దక్షిణామూర్తి ఇచ్చే జీవ మాయను దాటుకొన్నవారు అంతా జంతువు తల మనిషి శరీరంతో కారణ లోకంలో నుండి విముక్తి పొందే విముక్తి ఆత్మగా ఉంటే తట్టుకోలేని వారు అపస్మారక స్థితి పొందేవారు మనిషి తల జంతువు శరీరంతో శాశ్వత కారణ లోక వాసులుగా శ్రీకృష్ణుడిగా మారిపోతారు. తమకు అందిన జ్ఞానమును భూలోక సూక్ష్మ లోక వాసులకి వీరు అందించి అపస్మారక స్థితి లోనికి వెళ్లి పోవడం జరుగుతుంది. అనగా సహస్రార చక్రము మూలప్రకృతి అయితే ఆజ్ఞాచక్రము ప్రకృతి అయితే విశుద్ధి చక్రము జీవ ప్రకృతి అన్నమాట. ఇలా ఈ మూడు ప్రకృతుల నుండి విడదీయటానికి అనగా మూల ప్రకృతి నుండి విడదీయటానికి మనకి మహా నిర్వాణ శక్తి అవసరము పడుతూ ఉండాలి. ఎందుకంటే అరవింద యోగి అనుభవం ప్రకారం చూస్తే ఈ మూడు రకాల ప్రకృతులు శ్రీకృష్ణభగవానుడు ఆధీనములో ఉంటాయని శ్రీకృష్ణ మాయతో బంధింపబడి ఉంటాయని ఈ మాయను దాటాలంటే మనకి మహా నిర్వాణ శక్తి అనగా న్యూక్లియర్ శక్తి కావాలి అన్న మాట. ఈ శక్తి నవపాషాణం అనగా నవ విషాలతో చేసిన పదార్ధం వస్తువు ఉండాలి. ఈ వస్తువు తీసుకొని అర్హత యోగ్యత మనకి ఉందో లేదో పరీక్షించటానికి పరమ శూన్యము ఒక మానవాతీత శక్తిని ఉంచినది. అది ఏమిటో ఎవరో ఎక్కడ ఉందో తెలిస్తే మనము ముందుకు వెళ్లగలం అని నాకు అర్థమైనది. ఇప్పటికైనా మీకు నేను అనేది త్యాగం చేస్తే జంతువు తల ఎందుకు వస్తుందో అర్థం అయినదా? ఇంకా అర్థం కాలేదా? అపస్మారక స్థితి మాయ దాటిన వారికి అనగా జ్ఞాన బ్రహ్మ కాస్త మౌన బ్రహ్మ గా మారిన వారికి మాత్రమే ఈ అవతారము వస్తుంది. మౌన బ్రహ్మగా ఉండలేక జ్ఞాన బ్రహ్మగా తాము పొందిన జ్ఞాన అనుభవ అనుభూతులు పంచటానికి మనిషి తల జంతువు శరీరము ఉన్న వారిగా మారిపోయి భూలోక సూక్ష్మ లోక వాసులకు జ్ఞానము ఇస్తారు. అనగా పతంజలి మహర్షి లాగా కేతుగ్రహము లాగా అన్నమాట. ఇలాంటి వారిని మన సైన్స్ శాస్త్రవేత్తలు ఏలియన్స్ గా పిలుస్తారు. వీళ్లంతా శంబల గ్రామం లో కైలాస పర్వతములలో హిమాలయాలలో సూర్యమండలం నుండి భూమండలం లోపల ఉన్న సప్త రకాల మండలాలలో కారణ శరీరాలతో మన భౌతిక కంటికి కనిపించని స్థితిలో వైరస్, బ్యాక్టీరియా లాగా ఉంటారు.

మనకి నవపాషాణం శక్తి ఉన్న వస్తువు ఇచ్చే దెవరు?

ఒకరోజు మేము ధ్యానానికి కూర్చోబోతూ ఉండగా ఒక ధర్మ సందేహము వచ్చినది. అది ఏమిటంటే నా తల నరికే చోట యోగ్యత అర్హత పరీక్ష అధికారిగా హనుమంతుని సజీవ విగ్రహమూర్తి ఉన్నదని చెప్పినాను కదా. మీకు గుర్తుందా? మరి ఈయన అక్కడ ఎందుకు ఉన్నాడు. మిగిలిన దైవాలు ఎవరు కూడా ఉన్నట్లుగా కూడా అక్కడ కనిపించలేదు. మరి ఈయన ఒక్కడే ఉన్నాడు. అంటే మనకి మహా నిర్వాణ శక్తి అయిన నవపాషాణం శక్తి ఉన్న వస్తువు ఇచ్చేది ఈయనే అయ్యి ఉండాలి. ఎందుకంటే శ్రీరాముడి అవతారం లో శ్రీరామబంటు గాను శ్రీకృష్ణుని అవతారంలో శ్రీ రామదూతగా ఉన్నాడు. అలాగే వీరిద్దరితో అనగా శ్రీ రామాంజనేయ యుద్ధం శ్రీ కృష్ణ ఆంజనేయ యుద్ధం చేసిన ఏకైక మగధీరుడు ఈయన ఒక్కడే. పైగా నవనాథులుకి మంత్ర ప్రయోగాలకి సర్వ కోటి దైవాలు లొంగితే ఈయన తనంతట తనే కావాలని లొంగినాడు. ఏ అస్త్రాలు కూడా ఈయనను ఏమీ చేయలేక పోతే బ్రహ్మాస్త్రానికి కావాలని బందీ అయినాడు. అంటే నా లెక్కన ఈయనికి మాత్రమే ఈ నవపాషాణం పదార్ధ వస్తువు గూర్చి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈయన పంచముఖుడు. గరుడ తల వరాహ తల సింహము తల హయగ్రీవ తల తన మర్కట తలతో ఉంటాడు. పంచ జంతువుల తలలు పొందిన ఏకైక వ్యక్తి ఈయనే కావడం విశేషం. సకల శాస్త్రాల విద్యల జ్ఞానము పొందిన బ్రహ్మజ్ఞాని. ఇంకా రాబోవుకాలంలో ఈయనే భవిష్య బ్రహ్మ గా ఉంటాడని హైందవ గ్రంధాలు చెబుతున్నాయి కదా. నా అంచనా నిజమే అయితే నవపాషాణం సిద్ధి రహస్యం తెలిసిన వ్యక్తి ఈయనే కావాలి అనుకుంటూ ధ్యానానికి కూర్చున్నాను. కొన్ని గంటల తర్వాత నాకు ధ్యానము నందు హిమాలయాల మధ్య ఉన్న అష్టదళపద్మం కొండల మధ్య ఉన్న మానస సరోవరం మధ్యలో ఉన్న అతిపెద్ద తామరపువ్వులు 8 చుట్టూ ఉండే మధ్యలో ఒక పెద్ద తామర పువ్వు ఉన్నట్లుగా కనిపించినది. ఒక తెల్లని పండు అతి పెద్ద కోతి ఒకటి తామరపువ్వు మీదకి దూకింది. అయినా ఈ పువ్వు కొద్దిగా కూడా వంగినట్లుగా అనిపించలేదు. కనిపించలేదు.

పూర్వము గౌతమ బుద్ధుడు వీరి పరివార శిష్యులు ఎప్పుడైనా హిమాలయాలకి వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద తామర పద్మములపై కూర్చుని ధ్యానం చేసుకోనేవారని ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిన విషయము లీలగా గుర్తుకు వచ్చినది. అంటే దీనిని బట్టి అది నిజమేనని అనిపిస్తుంది. ఈ పండు కోతి దూకిన కూడా ఈ తామరపువ్వు మునగలేదు కదా.ఇది 8 తామరపువ్వుల మీద ఒక దాని తర్వాత మరొకటి గా ఎగురుతూ వస్తుంది. చివరికి మధ్య తామర పువ్వు మీద ఎగిరి దాని మధ్యలో ఏదో కాడను బయటకు తీసి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసుకొని ఎవరు లేరని నిర్ధారణ చేసుకొని అతి చిన్నగా ఉన్న కాడ లోనికి దూరి పోయినట్లుగా కనిపించినది.దీనమ్మా! అతి చిన్న కాడలోకి ఈయన ఎలా పట్టినాడు. అసలు ఈయన ఎందుకు దూరినాడు? దూరి ఎక్కడికి వెళ్ళినాడు అనుకోగానే నాకు ధ్యానము భంగం అయినది. నాకు అయితే ఈ దృశ్యము పరమార్థము అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రము ఖచ్చితముగా అర్థమైనది. అది ఏమిటంటే నవపాషాణం శక్తి సిద్ది తెలిసిన ఏకైక వ్యక్తి హనుమంతుడే అని నాకు అర్థం అయింది. అది ఒకవేళ తామరపువ్వు సహస్ర కమలము అనేది అనుకుంటే దీనికి క్రింద కాడ ఉంటుంది. మరి హనుమ ఈ పువ్వు మధ్యలోనికి వెళ్లి కాడ తీసి అందులోనికి దూరినాడు అంటే ఈ సహస్ర కమలానికి నుండి బయటకి అనగా పైకి వెళ్ళడానికి ఏమైనా కాడ రూపములో మార్గము ఉన్నదా ఉంటే అది ఏది? ఉంటే ఈ మార్గము ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని అనిపించింది. కానీ జ్ఞాన అనుభూతి ద్వారా అయితే క్షణాలలో తెలిసిపోతుంది. నాకు ప్రత్యక్ష అనుభవం పొందిన యోగుల అనుభవాల నుండి తెలుసుకోవాలని అనిపించింది. నాకు నిరూపణ అవసరం లేదు. జ్ఞానము చాలు. కానీ మాకు ప్రత్యక్ష అనుభవం నిరూపణ ఉంటే మరి కాస్త నమ్మకం ఏర్పడుతుంది. దానితో అనుమానము, సంశయ బుద్ధి లేకుండా సాధన చేయగలుగుతాము. మీకోసం అనుభవం నిరూపణ కోసం పుస్తకాలు గ్రంథాలు చదవడం ప్రారంభించినాము. ఇదివరకు అయితే ఏ పుస్తకము గ్రంథములో ఏమి ఉందో తెలియక అలాగే నాకు కావలసిన విషయం ఏ పుస్తకము గ్రంథములో ఉన్నదో తెలియక అన్నింటినీ కష్టపడి చదువుకుంటూ వెళ్ళే వాడిని. ఇప్పుడు ఆ సమస్య లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే ప్రత్యక్ష నిరూపణ కోసం ఆయా గ్రంథాలు నేను కొనకుండా నే మా ఇంటికి ఇతరుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా నా దగ్గరికి చేరుతాయి. అలా ఈ సమస్య నివారణ కోసం రమణ మహర్షి అనుభవ గ్రంథమైన “మీ సహజ స్థితిలో ఉండు” పుస్తకము అలాగే లాహిరి మహాశయులు అనుభవ గ్రంథము అయిన “పురాణపురుష యోగిరాజ శ్రీశ్యామాచరణ్ లాహిరీ” పుస్తకము మరియు గీతాచార్యుడు బోధ గ్రంథమైన “భగవద్గీత” నా బల్లమీద ఈ మూడు గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో నాకు కావలసిన విషయమును గూర్చి చదవటం ప్రారంభించాను. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. అరుణాచలక్షేత్ర వాసి అయిన మౌన బ్రహ్మ యోగి అయిన రమణ మహర్షి అనుభవం ప్రకారము చూస్తే యోగ సాధన అనేది సహస్రార చక్రము వద్ద ఆగిపోదని దానికున్న కాడ అనగా జీవనాడి ద్వారా ముందుకు వెళితే హృదయ కమలములో దగ్గరికి తీసుకొని వెళుతుంది ఎందుకు అంటే సహస్రార చక్రంలో ఏర్పడిన సహస్ర కర్మ వాసనలుకు ఏకైక మూల కర్మ వాసన ఏమిటో అనేది హృదయ చక్రం లోని కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ సహస్రార చక్రంలో పొందిన నిర్వికల్ప సమాధి వలన పది లక్షల కర్మ వాసనలు కూడా ఒక వెయ్యి కర్మలు లేశమాత్రంగా మిగిలిపోతాయి. వీటిని సంపూర్తిగా నాశనము చేసుకోవటానికి సహస్రార చక్రము నుండి జీవ నాడి ద్వారా హృదయములోనికి సాధకుడు వెళ్ళాలి. ఈ మార్గము అనగా జీవనాడి అనేది సహస్రార చక్రము నుండి తిరిగి హృదయానికి వంపుగా చేరుకుంటుంది. ఆఖరి చక్రము ఈ హృదయ చక్రమే అవుతుంది. ఎప్పుడైతే సాధకుడు ఈ జీవ నాడి ద్వారా మార్గము గుండా హృదయంలోని చేరతాడో ఆనాటికి అతడి సమాధి సాధన పూర్తి అవుతుంది అని చెప్పటం జరిగినది. అసలు హృదయ చక్రం అనేది ఉన్నదా లేదా అన్నప్పుడు భగవద్గీతలోని మోక్షసన్యాస యోగము అనే ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం చదివితే అది ఖచ్చితంగా ఉన్నదని తెలుస్తుంది. అనగా ఈ శ్లోక భావము బట్టి చూస్తే హృదయకమలం ఉన్నదని ఖచ్చితంగా తెలుస్తుంది. మరి దీనిని ప్రత్యక్ష అనుభవం అనుభూతి పొందినారా? అన్నప్పుడు శ్రీ లాహిరి మహాశయులు తన అనుభవ డైరీలో ఒక చోట కూటస్థంలో బొటన వ్రేలు అంతా పురుషుడిలో ఆత్మ నివసిస్తూ ఉంటుంది. మీరు ఉత్తమ ప్రాణ కర్మ చేస్తే ఈయన దర్శనం అవుతుంది. 

తామర పోచ మాదిరిగా కనిపించే కాంతి మార్గములో వెళ్ళితే ఈయన ఉండే హృదయ ఆకాశం వస్తుంది. అందులో 8 రేకుల కేసరాల లోపల నీలవర్ణము ఉండే బొటనవేలు అంత పురుషుడు ఉంటాడు. ఈయన అనంత పద్మనాభుడు అని ఓంకార్ గీత చెబుతుందని చెప్పటం జరిగినది. మేము ఈయనని చూసాము. మరి మీరు చూశారా అని తన దగ్గరికి వచ్చే భక్తులను అడుగుతుండేవాడు అని తన అనుభవ డైరీలో రాసుకోవడం జరిగినది. మరొకచోట మేము బొటనవ్రేలు పరిమాణములో హృదయ కమలంలో సర్పము మీద శయనించి ఉన్న హరిని చూశానని వ్రాయడము జరిగినది. అంటే ఈ ముగ్గురి అనుభవాలను బట్టి అనగా శ్రీకృష్ణుడు -రమణమహర్షి- శ్రీ లాహిరి అనుభవాలు చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. సహస్ర కమలములో పైన ఉన్న కేసరాలు ఉన్న కాడ వంటి మార్గము ఉండాలి. ఈ మార్గం గుండా పోతే అది కాస్త హృదయ చక్రానికి చేరుతుంది. ఇందులో హృదయ ఆకాశము ఉంటుంది. దీని లోపల 8 రేకుల కేసరాల లోపల నీల వర్ణంలో బొటనవ్రేలు అంత పరిమాణములో అనంత పద్మనాభుడు ఆదిశేషుడి తల్పముపైన శయనించి ఉంటాడు అని నాకు అర్థం అయింది. ఇంతవరకు విశ్లేషణ బాగానే ఉంది. ఇక ఇది ఏ దేవుడు లేనట్లుగా ఈయనే ఎందుకు ఈ హృదయ పద్మములో పడుకొని ఉండాలి అంటే ఇందులో ఏదో మనకి తెలియని మనము తెలుసుకోవలసిన మర్మ రహస్యం ఉండి ఉండాలి అనిపించి ఈయనకి సంబంధించిన ఫోటోలు చూసేసరికి మేము ఒక్కసారిగా గతుక్కుమన్నాము. ఎందుకంటే ఈయన ఎడమచేతిలో ఒక నల్లటి శివలింగమును పట్టుకుని ఉన్నట్లుగా ఉంది. ఒకవేళ ఈ లింగము కాస్త నవపాషాణం నిర్మిత లింగము కాదు కదా. ఎందుకంటే హనుమంతుడిని శివ అంశ అంటారు కదా. మహా శివుడే రక్షకుడుగా ఆంజనేయ స్వామి వారి రూపంలో ఈ లింగానికి కాపలా కాయటం లేదు గదా. విచిత్రం ఏమిటంటే రామ విష్ణు శివ క్షేత్రాలలో కొన్ని చోటులలో హనుమంతుడిని క్షేత్రపాలకుడిగా పెట్టడం జరుగుతుంది.

మనకి శివలింగాలు చెప్పేదేమిటి?

వామ్మో! దీనమ్మ జీవితము. నా అంచనా నిజము అయితే మహా నిర్వాణ శక్తి ఒక శివలింగానికి ఉంటుంది. ఎందుకంటే ఈ భూమ్మీద సహజసిద్ధంగా న్యూక్లియర్ శక్తి విడుదలయ్యే భూమి ప్రాంతాలలో 24 ప్రాంతాలలో రక్షణ కవచంగా మహా శివలింగాలను పెట్టడం జరిగినది. వాటిలో పన్నెండు మాత్రమే మిగిలి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రచారంలోనికి వచ్చినాయి. నిజానికి ఈ శివలింగాలు అనేవి సహజసిద్ధంగా ఏర్పడే న్యూక్లియర్ శక్తి U-235 భూమి పైకి రాకుండా న్యూక్లియర్ రియాక్టర్ లాగా ఈ లింగాలు ఉంటాయని చాలా మందికి తెలియని విషయం. కావాలంటే బాబా ఆటమిక్ రీసెర్చి వారి న్యూక్లియర్ రియాక్టర్ బొమ్మను ఒకసారి చూడండి. అచ్చంగా అది ఒక మహా శివలింగం లాగా ఉంటుంది. ఇంటర్నెట్లో చూస్తే మీకే తెలుస్తుంది.మేము చెప్పినది నిజమో కాదో తెలుస్తుంది. అలాగే లింగ పురాణం చదివితే లింగ ఆరాధన లో చెప్పిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కంగారు పడతారు. అది ఏమిటంటే శివలింగము మీద వాడిన పూలు తాకరాదు. ఎక్కడ ఉపయోగించరాదు అని చెబుతారు. అలాగే లింగానికి వాడిన నీళ్లు తాకరాదు. త్రాగ రాదు అని చెప్పటం జరిగినది. పైగా ప్రతి నిత్యము లింగానికి అభిషేకం చేయాలని బిల్వపత్రాలతో పూజించాలి అని కౌతుకి పుష్పాలు గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలని చెప్పటం జరిగినది.ఎందుకో తెలుసా? భూమి లోపల ఉండే న్యూక్లియర్ శక్తి ఈ లింగాలలోనికి ప్రవేశించి నప్పుడు అవి కాస్త విపరీతమైన అధిక వేడిని కలిగి ఉంటాయి. ఈ వేడి తగ్గటానికి నిత్య జలాభిషేకం చేస్తుంటే అవి కాస్త చల్లబడటం జరుగుతుంది. అలాగే న్యూక్లియర్ శక్తి విశ్వములోనికి ప్రవేశించకుండా బిల్వపత్రాలు కౌతుకి పుష్పాలు గన్నేరు పుష్పాలు సహాయపడతాయి. లింగాల వేడిమి ద్వారా బయటికి వచ్చే అతి కొద్ది న్యూక్లియర్ శక్తిని కాస్త ఇవి పీల్చుకుని ఆక్సిజన్ గా మార్చి విశ్వానికి అందిస్తాయని మన ప్రస్తుత శాస్త్రవేత్తలు విశ్లేషించి ఒప్పుకున్న నగ్నసత్యం అని మీకు తెలుసా. అలాగని శివలింగాలు పూజించకూడదు అని అర్థం కాదు. ఈ షరతులు అన్నీ కూడా స్వయంభూ శివలింగాలకి మాత్రమే వర్తిస్తాయి. ఇంటిలో ప్రతినిత్యము మోక్ష లింగం అయిన శుద్ధ స్పటిక లింగమును నర్మదానది లోని బాణ లింగము నిరభ్యంతరంగా వాడుకోవచ్చును. అందుకే శ్రీ శంకరాచార్యుడు కైలాస పర్వతము లోపలికి వెళ్లి సాంబశివుడి అనుగ్రహము పొంది ఐదు లింగాలు అక్కడ నుండి తెచ్చి 4 పీఠాలలో అనగా పూరి క్షేత్రము నందు గోవర్ధన పీఠం, ద్వారక నందు శారదా పీఠము, బద్రీనాథ్ నందు జ్యోతిర్మఠం, కంచి కామకోటి పీఠం అను నాలుగు పీఠాలలో నాలుగు స్పటిక లింగములు పెట్టి ఐదవ స్పటిక లింగానికి మోక్ష లింగము నామకరణము చేసి చిదంబర క్షేత్రంలో ప్రతిష్టించడం జరిగినది. అలాగే శివ పంచాయతన పూజలో నర్మదానదిలో ని బాణలింగం వాడమని చెప్పటం జరిగినది. కాబట్టి కైలాస శంకరుడే స్వయముగా శ్రీ శంకరాచార్య రూపము కావటం వలన ఈయన చెప్పిన శుద్ధ స్పటిక లింగం ఇంటిలో నిత్యం శివారాధనకి వాడుకోండి. వారి అనుగ్రహమును పొందండి. ప్రతి సోమవారం అలాగే మహా శివరాత్రి కార్తీక పౌర్ణమి రోజులలో పంచామృత అభిషేకము రుద్ర నమక చమకములు చేసుకుంటే చాలా మంచిది. మీ ఇష్ట కోరికలు తీరతాయి. అంటే ఈ లెక్కన చూస్తే నాకు కావలసిన నవపాషాణం నిర్మిత వస్తువు ఖచ్చితముగా శివలింగమే అయి ఉండాలి. 

జిజ్ఞాసి అనుభవాలు:

మరి అనంత పద్మనాభుడి చేతిలో ఉన్న లింగము ఏమిటో మొదట తెలుసుకోవాలి అనుకుంటున్న సమయంలో నాకు నా యోగ మిత్రుడైన నాగ సాధువు జిజ్ఞాసి నుండి ఏవో సంకేతాలు రావడంతో నేను ధ్యానం లోనికి వెళ్ళగానే నా మనోనేత్రం ముందు ఆయన సెల్ఫీ వీడియో ఒక దృశ్యము లాగా కనపడ సాగింది. అది ఏమిటంటే దీర్ఘ ధ్యాన తపస్సు స్థితిలో ఈయన ఉన్నట్లుగా కనిపించసాగింది. విచిత్రముగా ఈయన చుట్టూ జాతి వైరం ఉన్న జంతువులు అనగా ఆవులు- పులులు, ఎద్దులు-సింహాలు  పాములు- ఎలుకలు, కుక్కలు- నక్కలు తోడేళ్ళు  నెమళ్లు ఏనుగులు ఇలా చిన్నపాటి జూ ఈయన చుట్టూ ఉన్నది. ఈయన ధ్యాన ఆకర్షణ శక్తి వలన ఈయన ఉన్న ప్రాంతంలో 18 కిలోమీటర్ల పరిధి దాకా ఏ జంతువులు కూడా జాతి వైరం ఉండవని నేను గ్రహించాను. ఇంతలో ఈయన నెమ్మదిగా కళ్లు తెరవటం నేను గమనించాను. ఎంతో ఆతురతతో ఈయన చుట్టూ చేరిన ఈ జంతువులు తమ మౌన భాషతో పలకరిస్తుంటే ఈయన కూడా వాటిని మౌన భాషలో పలకరించటం చేస్తున్నాడు. మౌన భాషలో ఎదుటి వాడి ఆలోచనలు తెలుసుకొని దానికి తగ్గ ఆలోచనలు ఇవ్వటము అన్నమాట. నాకు మౌన భాష తెలియటం వలన మేము మీకు చెప్పటం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఆవు ఈయన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారని తన మౌన భాష ఆలోచనను పంపించడం జరిగినది. ఈయనకి దానికి ఆయన నువ్వు ఎలాగ ఉన్నావో మేము అలాగే ఉన్నాము అని ఆలోచనను సమాధానముగా మౌన భాషగా ఇవ్వడం జరిగినది. ఇప్పటికైనా అర్థం అయినదా జంతువుల భాష ఏమిటో. వీటికి మనకి లాగా ఆకలి నిద్ర మైధునము భయము ఉంటాయి. మనకి మాత్రమే జ్ఞానము ఉండుట వలన మనము కాస్త మౌన భాషను కాస్త అక్షర భాషగా మార్చుకొని 600 దేశాలుగా 133 భాషలుగాను తయారు చేసుకోవడం జరిగినది. మూగవాడు మాట్లాడకపోయినా సైగల ద్వారా వారి భాష మనకి అర్థమవుతుంది కదా.అలాగే మనకి మన మాట్లాడే భాషలో మన భవిష్యత్తు చెప్పకపోయినా చీటీలు తీసి మన జాతకము మౌన భాషతో చిలుక జ్యోతిష్యముగా చెప్పటం జరుగుతుంది. ఇది సరి అయినదే తీస్తుంది ఉదాహరణకి ఇది చీటీ మీద ముందు ఇంటికి సున్నము వేసుకో అని చెబితే మన వాడు దానిని మార్చి మీ ముందు ఇంటికి సున్నము వేయించు అంటారు. కానీ చిలుక చెప్పినది తన ఇంటికి ముందుగా సున్నము వేయించుకోవాలని అర్థము. కానీ విశ్లేషించి చెప్పే వాడికి దానిమీద మిడిమిడి జ్ఞానం ఉండుట వలన వాడి నోటికి వచ్చిన విషయాలు చెప్పడం వలన అసంపూర్తి ఫలితాలు వస్తున్నాయని మేము ఈ చక్ర స్థితిలో వచ్చిన తరువాత నాకు అర్థమైంది. జ్ఞాన పక్షి ఎక్కడైనా అసత్యము చెప్పదు కదా. దాని మౌన భాష అర్థం చేసుకోలేని మానవ పక్షి వల్లనే సమస్య వస్తుంది అన్న మాట. ఇలాంటి చక్ర స్థితిలోనే ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఒక చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆ చెట్టు పైన ఉన్న రెండు చిలకలు మాట్లాడుకునే వాటి మౌన భాష భావాలు ఈయనకి అర్థం అవ్వటం మొదలైనవి. దీనితో తమకి పక్షి భాషాజ్ఞానం కలిగినదని గ్రహించి బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడినారని వారి జీవిత చరిత్రలో ఈ సంఘటన వివరాలు ఉన్నాయి. ఈ సహస్ర చక్ర స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితి పొంద లేనివారికి దక్షిణామూర్తి ఇచ్చిన వివిధ విద్యా ఙ్ఞానాలు మాయ వలన వచ్చిన జ్ఞాన అహంకార మాయ కి గురి అయిన వారికి అలా మారలేని వారికి పరమానంద స్థితి పొంద లేనివారికి తట్టుకోలేని వారికి అపస్మారక స్థితి పొందిన వారికి మాత్రమే ఈ సమస్త విశ్వం లో ఉన్న వివిధ రకాల జంతువుల మౌన భాష అర్థం చేసుకోలేరని నా స్వానుభవం లో ఎందరో యోగులు గురువులు సాధకులు జిజ్ఞాసులను చూడటము జరిగినది. వీరి జ్ఞాన అహంకార మాయ వలన అపస్మారక స్థితి పొంది భిన్న వాదనలతో సరికొత్త సిద్ధాంతాలతో శాస్త్రానికి విరుద్ధముగా ఆలోచనలు రచనలు తమకు తోచిన అభిమతాలు కొత్త మత విధానముగా ఈ మధ్యన చాలా మంది సన్యాసులు చేస్తూ సన్నాసులు గా మారి పోవటానికి అసలు కారణం ఇదేనని వారు తెలుసుకో లేక పోవటం మన దౌర్భాగ్యం. వారే నిజమైన బ్రహ్మ జ్ఞానులని మహా గురువులని, మఠాధిపతులు అని మనము పూజలు, దానాలు, ధనము, మానము సమర్పించటం చేస్తున్నాము. అంటే మనము ఎంత అవివేక పని చేస్తున్నామో ఆలోచించుకోండి. వేదాలు శాస్త్రాలు విషయాలు పరిధి దాటకుండా దానిలో ఉన్న వివిధ రహస్యాలను వాటిలో ఉన్న ఆధారాలతో చూపించి చెప్పగలిగే వారే నిజమైన శాస్త్ర అనుభవ పాండిత్యం ఉన్న పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానులు అని  మేము చిదంబర దక్షిణామూర్తి దర్శన అనుభూతి ద్వారా తెలుసుకున్న నగ్నసత్యం. ఇది సత్యం అని నమ్మే వారు ఎంతమంది ఉంటారో మీరే చెప్పండి. అయినా మేము చెప్పే ప్రతి అనుభూతికి ఆధారము తప్పక చూపిస్తూ వస్తున్నాము. ప్రతి చక్ర అనుభవానికి ఆయా చక్ర దైవిక వస్తువులు వీటికి సంబంధించిన పుస్తకములు గ్రంధముల విషయాలు వివిధ యోగుల నిజ అనుభవాలు మీకు ఆధారాలతో చూపిస్తూ ఇప్పటి దాకా వచ్చినాము. నాకు ప్రత్యక్ష అనుభవం అనుభూతి కలగనిదే మేమే ఇది నిజమని నమ్మము. మాకు ధ్యానములో కలిగిన అనుభవాలు దృశ్యాలు ఇలలో ఈ ప్రపంచంలో ఆధారముగా ఏదో ఒకటి జరిగితే గాని మేము ఇంత వరకు నమ్మలేదు. కానీ ఇలా వచ్చిన వాటిని కూడా తమకు ఉన్న సంశయ బుద్ధి వలన నమ్మకము నాశనము చేసుకునే ప్రబుద్ధులు ఉంటారు. అది ఉండకూడదు. నమ్మకము రావాలంటే వచ్చిన అనుభవమును ఆధారం చేసుకోవాలి కానీ దానిని అనుమానించకూడదు. 

నిజమా కాదా అన్నప్పుడు అనుభవమైన తగ్గ ఆధారము ఈ ప్రకృతిమాత ఇస్తుంది. ఇచ్చిన ఆధారం కూడా నమ్మకపోతే ఇంకా ఆవిడ అయినా ఏమి చేస్తుంది. భోగంలో అనుమానపు బుద్ధి యోగములో సంశయం బుద్ధి ఉంటే ఏ జీవి భోగఆనందమును యోగములో యోగానందమును మనం అనుభవించలేమని నేను తెలుసుకున్న అక్షరసత్యం. కాబట్టి మీకు ఒకవేళ సంశయం బుద్ధి అనుమానపు బుద్ధి ఉంటే వదిలించుకోండి. కానీ ప్రతిదానికి సందేహ బుద్ధి ఉండాలి. మన వివేక బుద్ధి వలన విశ్లేషణ చేస్తే ఆ సందేహానికి తగ్గ ఆధారాలు ఏమిటో తెలుస్తాయి. అప్పుడు సంపూర్తిగా విశ్వాసంతో నమ్మితే నమ్మాలి. అంతేగాని విపరీత సందేహ బుద్ధి కాస్త సంశయము అనుమానపు బుద్ధిగా మారే అవకాశాలు ఉన్నాయి. అది పనికి రాదు. వేటి యందు అతి ఉండరాదు.అతి ఉంటే అజీర్ణము చేస్తుంది. తినకపోతే నీరసం అతిగా తింటే ఆయాసం అని చెప్పకనే చెప్పినారు గదా. మితముగా తింటే ఆరోగ్యం సందేహ బుద్ధి ఆయాసమే సంశయం బుద్ధి నీరసం అని తెలుసుకోండి. ఈ చక్ర స్థితిలోనే మనకి మెట్ట వేదాంతం జ్ఞానము అలాగే నిజ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మెట్ట వేదాంతం అనేది అపస్మారక జీవులు పొందితే నిజ బ్రహ్మజ్ఞానము ఈ అపస్మారక స్థితి మాయను దాటిన వారికి వస్తుంది. తద్వారా వీరికి శక్తిపాత సిద్ధి కలుగుతుంది. దీనివలన మౌన భాషతో జంతువుల భాషను సాధన జీవుల సందేహాలను మాట్లాడకుండా చెప్పకుండా చెయ్యకుండా మౌన భాషతో సమాధానం ఇస్తారు. ఇలాంటి వారిని మేము ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా గుడికి వచ్చిన శ్రీశైల క్షేత్ర వాసి పూర్ణానంద స్వామి యోగిలో చూసినాము. నమస్కారాలు చేయించుకోలేదు. పాద పూజలు చేయించుకోలేదు. ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అందర్ని చూస్తూ ఒక గంటన్నర సేపు ఉండి పోయినారు. అప్పుడు ఈయన స్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమయ్యే సరికి వారు కాస్త అంతర్ధానం అయినారు. ఇప్పుడు ఉన్న వాళ్లంతా తామే నిజ గురువులని నిజ దైవాలని నిజ బ్రహ్మజ్ఞానులని అనుభవ పాండిత్య సిద్ధ యోగులు అని శక్తిపాత సిద్ధులు అని అంటూ వ్యక్తిగత పూజలు చేయించుకుంటూ మూల దైవం కన్నా మేమే నిజమైన దైవాలని అంటూ ప్రచారం చేసుకునే వారందరూ నా దృష్టిలో మెట్ట వేదాంతం అపస్మారక స్థితిని పొందిన వారేనని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇందులో శబ్ద పాండిత్యం ఉన్న గురువులు ఉన్నారు. వారు వ్యక్తిగత పూజలు చేయించుకోరు కానీ తమ అనుభవ అనుభూతి పొందిన శాస్త్ర విషయాలు చెబుతూ లేనిదాని గురించి చెప్పటం అనుభవములేని దానిని గూర్చి చెప్పటం అతిగా చెప్పటం అసత్యాలు చెప్పటము తెలియని దానిని చెప్పటం వీరు ఏ మాత్రం చేయరు. చెయ్యలేరు. వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ తనకు తెలిసిన దానిని ఉచితముగా ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా హైందవ ధర్మ ప్రచారం చేసే నిజ బ్రహ్మ జ్ఞానులను నా స్వానుభవం లో చూడడం జరిగినది. జ్ఞానము తెలిసినవాడు మాట్లాడలేడు. మాట్లాడితే వాడు తెలిసినవాడు కాదని శాస్త్ర వచనం ఒకటి ఉన్నది. మరి ఇది ఎలా అన్నప్పుడు పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయిన దక్షిణామూర్తి మౌన భాషలో మాట్లాడుతున్నాడు. కానీ వ్యక్తిగత భాషతో మనతో సంభాషించటం లేదని గ్రహించండి. అనగా జ్ఞానము తెలిసినవాడు మౌన భాషలో మాట్లాడుతాడు. వ్యక్తిగత భాషతో మాట్లాడరు. ఇది అంతా నిజ అనుభవ పాండిత్యము పొందిన వారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. నిజ శబ్ద పాండిత్యము ఉన్నవారు మాట్లాడకపోతే చెప్పకపోతే చాలా ప్రమాదం. అనగా జ్ఞాన అనుభవ పాండిత్యము ఉన్నవారు పుస్తకాలను గ్రంథాలను మౌన భాషలో రాస్తే విజ్ఞాన శబ్ద పాండిత్యము ఉన్నవాడు వీటి ఆధారంగా లోకాలకి వ్యక్తిగత భాషలో అందరికీ అర్థమయ్యేటట్లుగా చెబుతాడు. ఇప్పటికైనా తేడా తెలిసినదా ?అనుభవ పాండిత్యము పొందిన జ్ఞాని మాట్లాడడు. మౌన భాషలో గ్రంధాలు వ్రాస్తాడు. అదే శబ్ద పాండిత్యము ఉన్నవాడు గ్రంథాలు రాయడు. ఉన్న వాటిని చదివి వ్యక్తిగత భాషలో ప్రచారం చేస్తాడు. ఈ రెండిటిలో అసంపూర్తిగా మిడిమిడి జ్ఞానం ఉన్న వారు ఉంటారు. వీరు గ్రంథాలు రాస్తారు. అలాగే ఉపన్యాసాలు చేస్తారు. ఇలాంటి వారే అపస్మారక స్థితి మాయ దాటలేని జీవులు. తాము గుడ్డివాళ్ళు అయ్యామని తెలిసిన అనగా జ్ఞాన అహంకార మాయ తమకి ఉన్నదని తెలిసిన మనకి ముక్తి మార్గాలు ఇస్తామని జనాలని నమ్మించి భక్తి ధ్యాన మార్గాలను తమ వ్యాపార కేంద్రాలుగా మార్చిన నపుంసక జీవులు అని మేము గ్రహించాము. ఉంటే అనుభవ పాండిత్య జ్ఞానముతో పురుషుడిగా దక్షిణామూర్తిగా ఉంటాడు. లేదా శబ్ద పాండిత్యమూ జ్ఞానమూ ఉన్న స్త్రీ మూర్తిగా వేదమాత గాయత్రీ దేవతగా ఉంటాడు. అంతేగాని నపుంసకత్వంతో అటు మగ ఆడ కాని వారి లాగా అనగా గ్రంధాలు వ్రాసి ఉపన్యాసాలు చేసే వారికిలాగా ఉండకు. వీరు ఏమీ తెలుసుకో నట్లే. తెలుసుకున్నట్లుగా భ్రాంతిలో వుంటారు. వీరివలన విశ్వ సృష్టిలో మిడిమిడి జ్ఞానం మెట్ట వేదాంతం అసత్య వాదాలు అసత్య వాదనలు రావడం జరిగినది. ద్వంద్వ ప్రవృత్తికి ఇలాంటి వారే కారకులు. 

ఇట్టిస్థితి సహస్రార చక్ర మహామాయ అయినా శ్రీ కృష్ణుడి యొక్క జగన్మోహిని మాయ వలన వస్తుంది. ఈ మాయ దాటలేని జీవులు ఇలా నపుంసక జీవులుగా మారి విశ్వ విజ్ఞానాన్ని పెడదారికి ఆస్కారము కలిగిస్తున్నారు. ఇది వాళ్లకి తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పు కావచ్చును. ఆ తప్పు మీరు కొత్తగా మళ్ళీ చేయవద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక జన్మలో ఇలాంటి మాయని దాటలేక పప్పులో కాలు మనము వేసినవాళ్ళమే. మళ్లీ మనము కాకపోతే ఆ గత జన్మల అనుభవాలను దృష్టిలో. ఇప్పుడు ఈ మాయను దాటటం జరిగి నిజ అనుభవ పాండిత్య బ్రహ్మ జ్ఞానులుగా ప్రస్తుతము మీ ముందు మేము ఉన్నాము. మేము ఏమీ పెద్ద పోటుగాళ్లు కాదు. గత కోటాను కోట్ల జన్మలు ఈ తప్పు చేయకుండా. మేము ఎన్నో లక్షల సార్లు ఈ తప్పు చేసినామని మాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వలన తెలిసినది. తప్పు తెలుసుకొని తప్పుకోవడము జరిగినది. తప్పు చేయడం ఎందుకు? బాధపడటం ఎందుకు? కాబట్టి తప్పు చేయకుండా ఉండమని మేము కేవలం మీకు హెచ్చరిక చేస్తున్నాము. వీళ్ళ విషయంలో అతి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే. వినడం లేదా వినక పోవటము మీ ఇష్టం. ఈ లోపల నా ధ్యాన దృశ్యము లోనికి నాగసాధువు జిజ్ఞాసి వచ్చినారు. ఇప్పటిదాకా ఈయన ప్రకృతి కార్యాల కోసము స్నానము కోసం తన స్థానం నుండి లేసి వెళ్ళినారు. ఎటూ ఆయన లేడు కదా ఏమి చూస్తామని దానిని అలా సాక్షీభూతంగా చూస్తూ నా మనస్సులో కలిగిన వివిధ భావాల పరంపరను ఇప్పటిదాకా మీ ముందు ఉంచడం జరిగినది. ఈయన తన స్థానంలో కూర్చోగానే నాకు ధ్యానములో కనిపించిన పెద్ద తెల్లని పండు వయస్సు ఉన్న పెద్ద కోతి ఈయన కోసం అరటి పండ్లు తెచ్చి ఇవ్వటం అవి కూడా 8 పండ్లు కావటం వాటిని ఆయన తింటుంటే నాలో నాకు ఎక్కడో ఏదో తంతున్నట్లుగా అనిపించింది.ఈ మధ్య 8 అంకె కనపడితే అది హృదయ చక్రములోని నీలి వర్ణపు అష్టదళపద్మం గుర్తుకు రాసాగింది. ఈయన ఎనిమిది పండ్లు తింటుంటే ఈ విషయమే గుర్తుకు వచ్చినది. అది కాకుండా మాకు కలలో కనిపించిన వానరుడు ఈయనకి ఇలలో కనిపించి సేవలు చేస్తున్నాడు. కొంపదీసి ఈయన రామబంటు అయిన హనుమ కాదు గదా. కాకుండా ఎలా ఉంటాడు ఆయన. దీనమ్మ జీవితం. అంటే వామ్మో! నవపాషాణం సిద్ధి యోగి ఈయనే అన్నమాట అనుకుంటూ ఉండగా మన వాడు కాస్త మౌన భాషలో ఈ వానరుడు కి ఏదో చెప్పడం అది కాస్తా ఎగురుకుంటూ వెళ్ళి ఏవో తీసుకొని ఆయన దగ్గరికి రావడం జరిగినది. ఇంతలో ఈయన నిత్య ధ్యానం లోనికి వెళ్ళినట్లునాడు. కళ్లు మూసుకొని ఉన్నాడు. అప్పుడు ఈయన మానవ తల ఉండాల్సిన చోట ఒక నాగపాము తల ఉన్నట్లుగా అనిపించింది. అంటే మన వాడికి కూడా చిన్నమస్తాదేవి తల నరికి మానవ తలను కాస్త నాగ పాము తలగా మార్చినది అని నాకు అర్థం అయింది. ఇంతలో ఆయన కళ్ళు తెరిచి చిరునవ్వుతో వానరుడు తెచ్చిన వాటిని నూరుతూ ఏవో కలుపుతూ నాకు తెలిసిన పాదరసము, ఆవు నెయ్యి, విభూది కలుపుతూ నవ పదార్థాలతో ఏదో నల్లపు నీలి మిశ్రమ వర్ణముతో ఉన్న పదార్థం పొడిని తయారు చేసినారు. దీనిని ఒక బొటనవ్రేలు పరిమాణములో అంత లింగముగా తయారు చేసినారు. అప్పుడు నాకు ఈ లింగమును చూస్తుంటే అనంత పద్మనాభుడి చేతిలో ఉన్న నల్ల లింగములాగా అనిపించసాగింది. అంటే వామ్మో! వాయ్యో! దీనమ్మ జీవితం. మేము ఊహించినది నిజమే. అది నిజముగానే నవపాషాణం లింగము. ఇప్పటిదాకా మనవాడు భోగరు సిద్ధుడు చేసిన నవపాషాణం పదార్థాలతో ఆయన కుమార స్వామి విగ్రహం చేస్తే ఈయన తన కోసం ఒక లింగమూర్తి చేసుకున్నాడు. వామ్మో ఖచ్చితముగా నవపాషాణం నిర్మిత వస్తువు నల్ల శివలింగమే అన్నమాట. మాకు కూడా ఒకటి చేసి పంపించవచ్చు కదా అని చిన్నపాటి ద్వేషము కలిగినా వెంటనే తమాయించుకున్నాను. వచ్చే యోగం ఉంటే మేము స్మశానం లో కూర్చున్న వస్తాయి. లేదంటే కైలాసం లో కూర్చున్న కూడా రాదని నాకు బాగా తెలుసు.
 
కొద్ది సేపు అయిన తరువాత ఈయన ఈ లింగమును తన ఎడమ అరచేతిలో పెట్టుకోగానే అది కాస్త అతుక్కోవడం ఆరంభించినది. తన చేతిని తలక్రిందులుగా చేసినా అది క్రిందకు పడకపోవటం నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే దశ భూతాలు అనగా జీవ ప్రకృతిలో ఉండే పెద్ద పంచభూతాలు అలాగే మూల ప్రకృతి లో ఉండే చిన్న పంచభూతాలు ఈ రెండింటిని కలిపి తయారు చేసిన పదార్థాలు నవవిధ విషాలు అని మేము గ్రహించాము. వారు మరి కొద్ది సేపు అయిన తరువాత ఈ లింగమును విడగొట్టే సరికి దీని లోపల నుండి పైకి ఒక్కసారిగా వెయ్యివోల్టుల విద్యుత్ కాంతి అనగా వెయ్యి వాట్ల కాంతి ప్రసరిస్తున్న నట్లుగా కనపడసాగినది. వామ్మో ఇదే కాబోలు. మహా నిర్వాణ శక్తి న్యూక్లియర్ శక్తి. ఏమి సిద్ధ జ్ఞానము. ఈ ప్రపంచంలో ఇలాంటి నవపాషాణం లతో సిద్ధుడు తరువాత మరొకరు ఇంతవరకు ఎవరు కూడా చేయలేకపోయారు. ఆయన లోకము దృష్టిలో నిజమైన ఫార్ములాలో కేవలము కలిపిన విషాలు పదార్థాలు మాత్రమే చెప్పి అర్థం కాని భాషలో వాటి మోతాదులు చెప్పటం జరిగినది. అర్థం చేసుకోలేక తమకు తోచిన మోతాదుల తో ఈ విషాలను కలిపే సరికి అసలు విగ్రహంగా కాదు గదా పొడిగా కూడా మారడటం లేదని ఇప్పటికే పళని విగ్రహమూర్తి లాంటి మరొక విగ్రహము చేయాలని ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న మన శాస్త్రవేత్తలు- సిద్ధులు ఉన్నారని పుస్తకాలు గ్రంధాల ద్వారా తెలుసుకోవడం జరిగినది. వారి తర్వాత వీరిని ఇలా చూడటం జరుగుతోంది. అంటే ఈ లెక్కన నిజ నవపాషాణ లింగానికి నలుపు నీలవర్ణము ఉండాలని నల్లటి మెరుపు కాంతిలో మెరవాలని చేతిలో పెట్టుకుంటే అతకాలని అనుభవంగా ఈ లింగము దివ్యకాంతి ఉన్నట్లుగా అనుభవము కలగాలని గుర్తుపెట్టుకుని ఉంటూ ఉండగా ఈ దృశ్యము కాస్త అదృశ్యం అయినది. ఇప్పటి వరకు బాగానే ఉంది. నవపాషాణం లింగమని దీనికి అధిష్ఠానదైవం హనుమంతుడని ధ్యాన అనుభవాల ద్వారా పరోక్ష అనుభూతిని పొందడం జరిగినది. ఇది నిజమేనని నాకు స్వానుభవం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు జరిగితే గానీ మేము నమ్మలేము కదా.ఇంకా దాని కోసం ఎదురు చూడాలి అని అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ నిర్వికల్ప సమాధి స్థితి పొందుతూ తిరిగి వస్తూ ఇలా కొన్ని వారాలు గడిచి పోయినాయి. 


ఇక ఆ తర్వాత దైవిక వస్తువులు గా వీరాంజనేయ, దాసాంజనేయ, ప్రసన్నాంజనేయ వంటి విగ్రహ మూర్తులు రావడం జరిగినది. వీటిని పూజలో ఉంచడం జరిగినది. వీటిలో ప్రసన్నాంజనేయ విగ్రహానికి అనగా మనకి నమస్కారము చేస్తున్నట్లుగా విగ్రహ మూర్తి కి ఎదురుగా శ్రీరామ విగ్రహమూర్తి తప్పక ఉంచాలి. ఈయన నమస్కార శక్తిని భరించేది ఆయనకి మాత్రమే ఉన్నది. ఈ విగ్రహము వచ్చినప్పుడు కర్మ చక్రం లో తప్పనిసరిగా వచ్చే శ్రీ రామ విగ్రహం దగ్గర విగ్రహ మూర్తిని ఉంచండి. లేదంటే మనల్ని ఒక ఆట ఆడిస్తాడు. నా నా ఈతిబాధలు కలిగిస్తాడు. మనస్సు పరిపరివిధాలుగా పోతూంది.ఏది మంచో ఏది చెడో తెలియని అయోమయ అనుమాన సందేహ సంశయం బుద్ధి కలిగిస్తాడు. అలాగే ఈ విగ్రహ మూర్తి కి తప్పనిసరిగా నూనె కలిసిన సింధూరము పూయండి. ఈ విగ్రహమూర్తి దగ్గర ఈ రెండు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈయన ఒక పట్టాన మనకి దొరకరు. వశము అవ్వరు. జాగ్రత్త! వీలు అయితే హనుమజ్జయంతి నాడు ఆయనకు నైవేద్యముగా చిట్టి గారెలు, అప్పాలు, పానకము వడ పప్పు, తాంబూలము పెట్టండి. సంతోష పడతాడు. మేము ఇలాగే చేసి ఈయనని వశము చేసుకున్నాము. తట్టుకునే స్థితికి వచ్చినాము. సాక్షాత్తు ఈయనని తట్టుకోవటానికి మా గుడిలో ఉన్న అలాగే రాఘవేంద్ర స్వామివారి మంత్రాలయ వీరాంజనేయ స్వామి అలాగే గుంటూరులోని నల్ల చెరువు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యక్షముగా సేవలు చేస్తే గాని ఈయన మాకు వశము కాలేదు.  

మా గదికి వచ్చిన రామబంటు:

కొన్ని వారాలు తర్వాత మేము కాశీ క్షేత్రానికి మా వాడితో రెండవసారి కాశీ యాత్ర చేసే అవకాశము వచ్చినది. మేము కాశీ క్షేత్రానికి తప్ప ఏ క్షేత్రానికి వెళ్లరాదని వెళ్లే అవసరమే లేదని స్వానుభవం అనుభూతి తెలుసుకున్నాం. మరి కాశీ క్షేత్రానికి ఎందుకంటే నా సూక్ష్మధారి అయిన శ్రీ వేదవ్యాసుడు చేసిన కాశీ నింద శివనింద దేవి నిందలను తొలగించుకోవటానికి విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణమ్మను ప్రసన్నం చేసుకోవటానికి వెళ్ళటం జరుగుతుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు నడయాడే కాశీవిశ్వనాథ్ డైన మా సద్గురువు శ్రీ త్రైలింగ స్వామి వారి సూక్ష్మశరీర దర్శనము అయినది. మరి ఈ రెండవ సారి వెళుతున్నప్పుడు ఏ కారణజన్ముడు కనపడకుండా పోతాడా అనుకుంటూ వారం రోజుల పాటు ఈ యాత్రకు వెళ్ళడం జరిగినది. కాశీకి చేరుకున్నాము. అందరిని అన్ని దేవాలయాలు దర్శించుకున్నాము.ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి ఘాట్ యందు దీపారాధన చేయాలి అని అనుకున్నాము. మిట్టమధ్యాహ్నం వేళ లో ఎక్కడనుండో ఒక పెద్ద కోతి మా గదిలోపలకి వచ్చినది. కానీ ఏవో వెతకటం ప్రారంభించినది. మేము మా వాడు కాస్త అది ఏమి చేస్తుందో అని చూస్తుంటే అది కాస్త గది బయట నిలబడి మాకేసి అదోలా చూసేసరికి సరే అనుకుని మా దగ్గర ఉన్న అరటి పండు దానికి ఇవ్వగానే అది కొంచెం తిని మిగిలిన దానిని అక్కడే పడవేసి వెళ్ళిపోయింది. అంతవరకు సాధారణంగా కనిపించే చిన్న కోతులు ఈ క్షేత్రంలో కనబడటం జరిగినది. కానీ ఇంత పెద్ద కోతిని చూడటము అదే మొదటి సారి అదే ఆఖరి సారి అయినది. ఈరోజు రాత్రికి దీపారాధన చేయడానికి వెళితే ఇసుక వేస్తే రాలనంత జనాలు ఈ ఘాట్ లలో నిండి పోయినారు. దానితో పోలీసులు క్రొత్త వారిని ఈ ఘాట్ లలోకి పంపించడం అడ్డుకుంటున్నారు. ఇలా 9 గంటల దాకా వెళ్లి నిరుత్సాహంతో వెనక్కి తిరిగి రావడం జరిగినది. ఒక ప్రక్క చీకటి పడిపోతుంది. మమ్మల్ని ఘాట్ లలోకి వెళ్లడం లేదు. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. గంగానది ఒడ్డున దీపారాధన చేయాలని మా సంకల్పం. కానీ అది జరిగే అవకాశం కనిపించడం లేదని అనిపించసాగింది. ఇంతలో ఏమి జరిగితే అది జరుగుతుందని మనో మార్గ సిద్ధి ఉపయోగించక తప్పలేదు. ఎందుకంటే దారీతెన్నూ లేకుండా ఉన్నప్పుడు సరైన మార్గం ఏదో ఈ సిద్ధి ద్వారా తెలుస్తుంది. తద్వారా మనము అనుకున్న చోటికి వెళ్ళటం జరుగుతుంది. దానితో మేము ఈ సిద్ధితో దశాశ్వమేధ ఘాట్ కి చేరుకుని అక్కడ ఉన్న చిన్న గుడి ముందు కంగారు కంగారుగా ఆత్రంగా హడావుడిగా దీపారాధన చేసినాము.

దీపారాధన పూర్తి అయిన తృప్తితో ఈ చిన్న గుడి లో ఉన్న దైవము ఎవరా? అని అప్పుడు మేము చూడటం జరిగినది. ఒళ్ళు జలదరించింది. ఇంకా మీకు ఎందుకు అర్థం కాలేదా? ఇంకా ఎవరు? రామబంటు హనుమాన్ గుడి అది. అనగా మధ్యాహ్నం మా గదికి ఒక కోతి రూపంలో వచ్చినది ఈయనే అని అప్పుడు గాని మేము గుర్తించలేక పోయినాము. నిజముగా అది కోతి అయితే మేము ఇచ్చిన అరటిపండు పూర్తిగా తిని ఇంకా మా చేతిలో ఉన్న అరటి పండ్లు కూడా లాక్కుని వెళ్లిపోవాలి. చిన్న కోతులు అయితే ఇలాగే చేస్తాయి. అందరికీ ఇలాంటి అనుభవాలే జరిగి ఉంటాయి. కానీ ఈ పెద్ద కోతి మాత్రము మేము ఇచ్చిన ఒక అరటిపండు సగం తిని మిగిలినది ఆయన ఎంగిలి ప్రసాదముగా మాకు వదిలి పెడితే దానిని కాస్త మేము చెత్త బుట్టలో వేయడం జరిగినది. ఏమి చేస్తాము? ఏది ఎంతవరకు ప్రాప్తమో అది అంత వరకే ప్రాప్తి. ఈ విధంగా మాకు హనుమాన్ నిజరూప ప్రత్యక్ష అనుభవం దర్శనము కాశీలో జరిగినది. నిజానికి ఈయన కాశీక్షేత్రంలో చిరంజీవి తత్వముతో ఆవాసం చేస్తారని కాశీఖండము చెబుతోంది. ఇది నిజమే అనిపించింది. పైగా మేము ఈ కాశీ క్షేత్రానికి రాకముందు మాకు ధ్యానములో తరచుగా కాశీ క్షేత్రముగా కనిపించి అందునుండి రామ్- రామ్- రామ్- రామ్- రామ్ ఎవరో నామ మంత్రము చేస్తున్న శబ్దము వినిపించేది. అడ్డబొట్టు ఉన్నవాడు చోట నిలువు బొట్టు వారి మంత్రము వినబడటం ఏమిటో అనుకునే వాడిని. అది అప్పుడు అర్థం కాలేదు. ఈ ప్రత్యక్ష హనుమ అనుభవ సంఘటన జరిగిన తరువాత ఈ తారక రామ నామము చేస్తున్నది ఈయనే అని నాకు అర్థమైనది. దీనితో మాకు నవపాషాణం లింగమూర్తికి ఈయనే అధిదేవత అని గ్రహించిన మేము యధావిధిగా ఇంటికి వచ్చేసాము.

నేను కాస్త విశ్వము వశము చేసుకోవాలని:

ఒక రోజు మేము తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైనది. శూన్య స్థితి దాకా తీసుకొని వెళ్ళినది. అక్కడ మాకు మా లాంటి మూడు అడుగుల ఆసామి దిగంబరత్వంగా ఉన్నట్లు కనిపించినాడు. ఈయన మా చిలుక కారణ శరీరము హృదయము నుండి వచ్చినారు కదా. అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచన చేస్తూ మాకేసి చూస్తున్నట్లుగా అనిపించినది. ఆ తరువాత వీరు మూల ప్రకృతి వశం చేసుకోవాలని శ్రీకృష్ణ భగవానునిగా జీవ ప్రకృతి- ప్రకృతి- మూల ప్రకృతి యందు ఏక అధిపత్యం పొందాలని తీవ్రమైన తలంపుతో ఉన్నారని మాకు అర్థం అవుతుంది. అంటే వీరు కూడా తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు చేస్తున్న పొరపాటే చేస్తున్నారే అని ఒక క్షణము అనిపించినది. ఆయన కూడా విశ్వా ధీనము చేసుకునే మూలిక కోసం వెదికితే ఆ వేరు అధి దైవమైన దత్త సామి అడ్డుకున్నాడని లోకవిదితమే కదా. అనగా ఈ సహస్రార చక్ర స్థితిలో ఉన్నవారికి మాత్రమే విశ్వము వశము చేసుకోవాలని విపరీతమైన తలంపులు వచ్చి ఉంటాయి. వస్తుంటాయి. దానికి తగ్గట్టుగా పరమాత్మను పంచబ్రహ్మ లు సకల దైవాలు దైవ గణాలు అవకాశాలు ఇస్తూ ఉంటాయని వీటిని బ్రహ్మ పదవి అంటారని పతంజలి యోగశాస్త్రం గ్రంథము చెప్పటం జరిగినది. ఈ తలంపు రావడానికి కారణము శ్రీకృష్ణుడు లీల అయిన జగన్మోహిని మాయ.ఎందుకంటే ఎవరూ కూడా కారణ లోకము దాటి ముందుకు అనగా హృదయ చక్రానికి వెళ్ళకూడదని వెళ్ళి తనని దాటితే ఆపై సృష్టికి మంచి జరగవచ్చు లేదా వినాశనమే జరగవచ్చునని విశ్వ సృష్టి రక్షణ బాధ్యుడిగా ఈయన సాధ్యమైనంతవరకు ఆపటానికి విశ్వప్రయత్నాలు చేస్తాడని అందులో భాగమే ఈ విశ్వ వశ ప్రక్రియ విధానమని మాకు స్పురణ అయినది.మరి మా కారణశరీరధారి ఏమి చేస్తారో చూడాలి అనుకుంటున్న సమయంలో సకల బ్రహ్మలు సకల పరమాత్మ సకల దైవాలు సకల దైవత వివిధ రకాల జీవజాతులు ఇలా అందరు కూడా కనిపించడం జరుగుతుండగా మాకు ధ్యాన భంగమైనది. ఏమి జరుగుతుందో ఆత్రుత లో ఉన్న మాకు నిరుత్సాహం ఎదురైనది. దానితో మాకు ఏమి చేయాలో తెలియక నాకు ధ్యానము లో కనిపించిన దైవాల ఫోటోలు నెట్ లో వెతికి పట్టుకొని వాటిని ఒక చోట సకల దైవాలుగా పెట్టడం జరిగినది. కొన్ని రోజులు మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి ధ్యాన అనుభవము కనిపించడము మొదలైనది. 


సకల దైవ జీవజాతుల పరివారంలో మధ్య ఉన్నట్టుండి స్త్రీ పురుష కాని సమ్మోహన మోహన రూపమైన శ్రీకృష్ణుడి జగన్మోహిని ముగ్ధ మనోహర రూపము మన వాడి దగ్గరికి వచ్చి నవ్వుతూ చూపులతో చూస్తుంటే “నా స్వామిరంగా! ఈ విశ్వంలోని నిజమైన అందము అంటే ఇదేనేమో అనిపించింది. అటు ఇటు పోయి నపుంసకడి వైపు మా మనస్సు పోతుందే అని మాకు అనిపించసాగింది. ఇంతటి అందము ముందు ఎంతటి మహా యోగి అయినా చిత్తు కావలసినదే. అందుకే కాబోలు మహాశివుడు ఒకసారి విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని రూపమును చూసి పరవశించి మోహించి మైధునము జరిపి అయ్యప్పస్వామి జననానికి కారకుడైనాడు. అప్పుడు అది మాకు తప్పు అనిపించినది. ఆ మాత్రం ఇంద్రియనిగ్రహము లేకపోతే ఎలా అని. ఇప్పుడేమో అది తప్పు కాదు. ఈమెను మోహించి లేకపోతే ఆజన్మ ఏమి పొందనట్లేనని…  ఆ మాత్రం ఆ బ్రతుకు బ్రతికే కన్నా శరీరత్యాగం మిన్న అని మాకే తీవ్రమైన శరీర వాంఛతో మేము వున్నాము అంటే పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి. చిత్రం ఏమిటంటే నగ్నత్వం, దిగంబరత్వం దాటి వచ్చిన మాకే నపుంసక స్వరూపం మీద మోహము కలిగినది అంటే ఆ జగన్మోహిని మాయ ఎలాంటిదో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి పరిస్థితి ప్రతి యోగి దాటుకోవాల్సి ఉంటుంది. దాటిన వారికి హృదయ ద్వారం వైపు వెళతాడు.ఇది దాటలేని వారిని మాత్రమే కారణం లోకము నుండి క్రిందకి నెట్టి వేయబడతారు. ఎందుకంటే మూల ప్రకృతిని వశము చేసుకోవాలనే తలంపు వలన శ్రీకృష్ణుడు ఉగ్ర పూరిత ఆగ్రహానికి గురి అవుతారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి వారికి నపుంసక రూపము వస్తుందని మేము గ్ర హించినాము. ఎలా అంటే రాఘవ శాస్త్రి ఈ విశ్వము వశం చేసుకునే వేరు లభించినందున ఈ జగన్మోహిని మాయలో పడిపోయి కాలచక్రంలో తమ సాధన స్థితి అనగా సహస్రార చక్రము నుండి క్రిందకి దిగినది. ఈయన ముందు వైపు పురుషుడు వెనక వైపు 45 సంవత్సరముల వయస్సు ఉన్న స్త్రీ మూర్తి వెనుకభాగం కనబడుతుంది. ఈయన కుర్చీలో కూర్చుని ఉంటే చాలా మంది భక్తులు సాక్షాత్తు అమ్మవారే అలా కూర్చుని ఉన్నారు అని భ్రమ పడినట్లుగా వారి చరిత్రలో చెప్పటం జరిగినది. ఈయన సాధనని కించపరచటం మా ఉద్దేశ్యం కాదు. ఆదియోగి అయినా మహా శివుడే ఈ జగన్మోహినిమాయ దాటలేకపోయినాడు. మనమెంత. ఒకసారి మాకు ధ్యానములో ముందు భాగము రాఘవ శాస్త్రిగారు వెనుకవైపు ఆకుపచ్చ చీర కట్టుకొని 45 సంవత్సరముల వయస్సు ఉన్న స్త్రీమూర్తి వెనుకభాగం ఉన్నట్లుగా అగుపించినది. ఆయన మాకు ఏదో చెప్పాలని ప్రయత్నించడం ఈమె వారించడం ఏకకాలంలో జరిగినాయి. ఈయన సాధన కాలచక్రమైన శ్రీచక్రానికి చేరిందని అనడానికి గుర్తుగా అమ్మవారు ధ్యానంలో కనిపించి “మీ దంపతులు మణి ద్వీప వాసులు అని…. వారికి పూలమాలలు వేసి లోపలకి కొంతమంది దేవతా సేవకులు తీసుకుని వెళ్లారని” వీరు చెప్పిన అనుభవం కాబట్టి మేము ఈ అంచనాకి వచ్చినాము. 

ఇప్పుడు మన కారణలోక వాసుడు ఏమి చేస్తాడు అనుకుంటుండగా జగన్మోహిని నృత్యకేళి మొదలైనది. నృత్యము చేస్తున్నంతసేపు మనవాడు ఇసుమంత జంకలేదు. నిగ్రహము కోల్పోలేదు. ఏమాత్రం చలించలేదు. వీర్యస్కలనం కూడా కాలేదు. దానితో ఈ జగన్మోహిని కాస్త అదృశ్యమైనది. ఉన్నవారంతా క్షణాలలో అదృశ్యమైనారు. నిజానికి ఈ విశ్వ వశం ఆశ అనేది వీరి కోరిక కాదని…. వీరిని పరీక్షించటానికి అత్యాశ కలిగించడానికి కారణ లోకమునుండి పంపించడానికి చేసిన ఏర్పాటు అని… వీరికి కూడా అర్థం అయినట్లు ఉంది. ఇది ఇలా చూస్తుంటే ఏదో విఠలాచార్య సినిమా చూస్తున్నట్లుగా పేదరాశి పెద్దమ్మ చెబుతున్న కథ లాగా ఉంది. సాధన లో ఇలాంటి విచిత్ర అనుభవ దృశ్యాలు ఉంటాయని తెలిసి ఎవరూ కూడా తమ సాధన విషయాలు చెప్పటానికి భయపడేవారు. అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. ఈ అనుభవాలు యధావిధిగా కూడా శ్రీ లాహిరి మహాశయులు కూడా చెప్పలేదు. కేవలం 70% మాత్రమే ముఖ్యంగా సాధన స్థాయి అనుభవాలే చెప్పినారు గాని సాధన మాయ అనుభవాలు ఎక్కడా చెప్పలేదు. ఎందుకో ఏమిటో తెలియదు. చెబితే ఎవరూ కూడా నమ్మరు నమ్మలేరు గదా. కానీ నాకు కలిగిన వివిధ ధ్యాన అనుభవాలను ఒకచోట ఒక దాని తరువాత మరొకటి పెట్టుకుంటూ పోతే నా జ్ఞానము ఎక్కడిదాకా వెళుతుందో చూడాలని పిచ్చి తలంపుతో మేము పొందిన సాధన లేదా మాయ అనుభవాలు ఏ రోజుకి ఆ రోజు వ్రాసుకుంటూ వచ్చేవాడిని. కానీ ప్రస్తుతం ఈ గ్రంథము కోసం వాటిని ఒక మాలగా పేర్చుకుంటూ వస్తుంటే ఇవి అన్నీ కూడా వేదశాస్త్ర పురాణ ఇతిహాస వివిధ మత గ్రంధాలలో విషయాలతో వివిధ యోగుల అనుభవాలతో సరిపోతూ వస్తుంటే ఏదో తెలియని ఆత్మ ఆనందం కలుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. మాకు కలిగిన కొన్ని అనుభవాలు లాంటి కలలు … కలలులాంటి అనుభవాలు… వివిధ యోగుల అనుభవాలతో సరిపోవటం నాకే ఆశ్చర్యం వేస్తుంది. 

మా కారణశరీరధారి జయము పొందటంతో సహస్ర కమలము నుండి ఒక సన్నని ఇరుకైన దారి కనిపించసాగింది. ఇది కాంతి మార్గములాగా ఒక గుహ మార్గంలాగా ఉన్నట్టుగా మాకు అనుభూతి కలుగుతూ ఉండగా మావాడు బొటనవేలు పరిమాణంలో ఈ గొట్టము ద్వారములోనికి ఒక విముక్తి ఆత్మగా ప్రవేశించడం జరుగుతుంది. దీని రెండవ ద్వారము మాకు తెలిసి హృదయకమలం దగ్గర ఉంటుంది. వీరు వెళ్ళేదాకా మాకు ఆ విషయం తెలియదు అనుకుంటూ ఉండగా మాకు ధ్యాన భంగము అయినది. ఒక యోగి ఆత్మ కథ అను గ్రంథములో కారణ లోకము నుండి ముందుకి సాధన చేయటానికి వెళ్లే వారిని విముక్తి ఆత్మ జీవులు అంటారని చెప్పడము జరిగినది. అందుకే మా కారణ శరీరమునకు విముక్తి ఆత్మగా నామకరణము చేయడం జరిగినది. అన్ని రకాల జీవ మాయలు, దైవమాయలు దాటి అన్నిటి యందు విముక్తి పొందాలనే తలంపుతో కపాల మోక్షం పొందాలని దివ్య సంకల్పంతో ఉన్నాడు కదా కాబట్టి నిజంగానే విముక్తి ఆత్మయే గదా. ఇటువంటి మార్గమును నేను చూశానని శ్రీ లాహిరి మహాశయులు తన అనుభవ డైరీలో వ్రాయడము జరిగినది. నిజానికి పూర్వము 24 మంది హిమాలయ గురువులు మూల ప్రకృతిని ఎలా ఆధీనము చేసుకోవాలో ఒక మహత్తరమైన “మహామృత్యువు” అను గ్రంథములో పజిల్స్ రూపంలో నలభై అధ్యాయాలుగా వివరించడము జరిగినది. ఇది చదివి ఈ పజిల్స్ పూర్తి చేస్తూ ఉండే వారికి ప్రకృతి మీద ఒక మహత్తరమైన దివ్య శక్తి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసినారు. కేవలము 39 అధ్యాయాలు అందరూ కూడా చాలా కష్ట పడితే ఈ పజిల్స్ పూర్తి చేయవచ్చును కాని ఆఖరి అధ్యాయము మాత్రం ఎవరైనా తప్పు ఉద్దేశంతో ఈ ప్రకృతిని వశం చేసుకుని నాశనం చేయాలని ప్రయత్నిస్తారో వారికి ఎట్టి పరిస్థితులలో ఈ పజిల్స్ అర్థం కాకుండా ఏర్పాటు చేసినారు. ఒకవేళ ఇలాంటి వాళ్లు ప్రయత్నిస్తే వారి మెదడు చాలా భరించలేని తట్టుకోలేని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునేలాగా పరిస్థితులు కల్పించబడ్డాయి. ఎవరైతే పరిశుద్ధ సత్వగుణంతో నిష్కామకర్మ ఆశ, భయము, మోహము, వ్యామోహము లేని కారణజన్ముడుకి మాత్రమే ఈ ఆఖరి అధ్యాయములోని పజిల్స్ అర్థమవుతాయి. ఇలాంటి వారికి దివ్య ప్రేమ- దివ్య శాంతి- దివ్య ఆనందము కలిగి ప్రకృతిని వీరి చేత వశము చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రంథము హిమాలయాలలోని శ్రీ చక్రం యొక్క అడుగు భాగం లో ఉన్న అమృత బిందువు చింతామణి ఉన్న ప్రక్క సొరంగమార్గం గదిలో అదృశ్యంగా మంచు నీటి బిందువులుగా దాచబడినది. పరిశుద్ధ ఆత్మ కి మాత్రమే ఈ బిందువుల నుండి ఈ అదృశ్య గ్రంథము సదృశ్యమవుతుంది. వారు చదవడానికి వీలు అవుతుంది. దలైలామా మాత్రమే ఈ గ్రంధమును చదివే యోగ్యత ఉంటుందని టిబెట్ గ్రంధాలు చెబుతుండగా కపాలమోక్షం అర్హత పొందే విముక్తి ఆత్మ జీవులకు ఈ గ్రంథము చదివే యోగము ఉంటుందని ప్రాచీన హైందవ గ్రంధాలు చెప్పడం జరుగుతున్నది. మనము ఈ గ్రంథమును చూడలేదు గానీ మన సాధన శక్తి కాలచక్ర స్థితిలో ఉన్నప్పుడు మన జిజ్ఞాసి కాస్తా స్పటిక శ్రీచక్రానికి వెళ్లి త్రికాలజ్ఞాన గ్రంధము చూసి వచ్చినాడని మనకు అనుభవం అనుభూతి అయినది కదా. గుర్తుకు తెచ్చుకోండి. ఒకవేళ ఈ రెండు గ్రంథాలు ఒకటా లేదా వేరా అని తెలియరాలేదు. అయినా మనకి అనవసరమైన విషయం కదా. ఈ గ్రంథాలు చదివితే గేమ్ బ్లూ వేల్ ఆడి నట్లే. చివరికి ఈ గేమ్ లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినట్లుగా ఈ పజిల్స్ పూర్తి చేసుకుంటూ పోతే అదే పరిస్థితి వస్తున్నది. ఉన్న మాయలు చాలక క్రొత్తగా మాయలు తెచ్చుకోవటం అవసరమా ఆలోచించండి. నిజమే కదా. 

నా కారణశరీరధారి కాస్త హృదయచక్ర ప్రవేశం:

ఎటూ మనవాడు జీవనాడి మార్గము నందు ప్రయాణిస్తూ ఎక్కడికి చేరుకున్నాడో తెలుసుకోవాలని లేదా? మనవాడు అదే మా కారణ శరీరమువాడు. మూడు అడుగుల నుండి బొటనవేలు పరిమాణంలో మారిపోయి జీవనాడి యందు అనగా సహస్రార చక్రానికి అలాగే హృదయ చక్రానికి అనుసంధాన మార్గమైన జీవనాడి మార్గము నందు ప్రవేశించారని మీకు విదితమే కదా. నాకు అర్థంకాని విషయము వీడు ఏ విధముగా అంత చిన్న పరిమాణంలోనికి మారినాడో అర్థం కాలేదు. విచారణ చేస్తే సహస్రార చక్రము లో వచ్చే అష్ట సిద్ధులలో ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇలా ప్రయాణించాడు అని నాకు అర్థం అయింది. ఆ అష్టసిద్ధులు ఏమిటంటే అణిమా సిద్ధి అంటే పరమాణువు పరిమాణానికి మారిపోవటం…. గరిమా సిద్ది అంటే కొండలను కదిలించగల శక్తి ని పొందటం…. ఇక లఘిమ సిద్ది అంటే తమ శరీరాన్ని తేలికగా చేసుకోవటం…. ప్రాప్తి సిద్ధి అంటే ఏది కావాలన్నా అది పొందటము…. విశుద్ధి సిద్ధి అంటే ప్రపంచంలోని దేన్నైనా లొంగదీసుకోవటం… ప్రాకామ్య సిద్ధి అంటే పరకాయ ప్రవేశ విద్య పొందటం… ఈశత్వం సిద్ధి అంటే సర్వేశ్వరుడి కృపతో సకల శక్తులను పొందటం…. ఇక ఆఖరి సిద్ది అయిన వశితా సిద్ది అంటే ఇంద్రియాలను జయించటం అన్నమాట. ఈ ఎనిమిది సిద్ధులను అష్టసిద్ధులు అంటారు. వీటిని ప్రతి సహస్రార చక్రమున కారణలోక వాసులు తమ కారణ శరీరాలతో పొందుతారు. అలా పొందిన వారే మన హనుమ అన్నమాట. ఇకరామాయణము చూస్తే ఈయన ఈ సిద్దులు చూపించి చేసిన మహిమలు తెలుస్తాయి అనుకుంటూ ధ్యానములో కూర్చోగానే… ….

నాకు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ మూర్తి లీలగా సజీవ మూర్తిగా కనపడ సాగింది. ఏదో తెలియని ఆవేశం కలిగి ఎగశ్వాస వచ్చేసరికి నాకు ధ్యాన భంగము అయినది. ఇలా ఈయన అక్కడ నుండి తరుచుగా లీలగా కనపడటం మొదలు పెట్టడం జరిగినది. ఒకరోజు నా ధ్యానములో నా కారణ శరీరము జీవనాడి యందు చేస్తున్న ప్రయాణ దృశ్యము లీలగా కనబడుతూ ఉంటే దారి మార్గము లో వివిధ రకాల అవతారాల హనుమత్ సజీవ మూర్తులు కనిపిస్తూ ఉండేసరికి నా స్వామిరంగా! ఈ జీవ మార్గం అంతా హనుమ రూపాలతో నిండి ఉన్నది కదా అనుకోగానే నాకు ధ్యానము భంగం అయినది. బయటికి వచ్చిన తర్వాత నాకు లీలగా గుర్తు ఉన్న హనుమత్ రూపాలను వివిధ గ్రంధాలలో చూస్తే అవి కాస్తా ప్రసన్నాంజనేయ, వీరాంజనేయుడు, అష్టాదశభుజ ఆంజనేయుడు, సువర్చలా సహిత ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయుడు, ద్వాత్రింశ ఆంజనేయుడు, వింశతి భుజ ఆంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు, వామనాకార ఆంజనేయుడు ఇలా తొమ్మిది రూప మూర్తులు కనిపించినట్లుగా లీలగా గుర్తు ఉంది. ఇక ఆ పైన ఉన్న వారి రూపాలను గుర్తించే శక్తి మాకు లేకపోలేదు. ఇంకా ఎందరో ఉన్నారు. వారి రూపాలు మాకు స్పురణకు రావటం లేదు.ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే వామనాకార ఆంజనేయుడు కూడా ఉండటమే అంటే ఈయన కూడా వామన పరిమాణంలో ఈ జీవనాడి ప్రవేశ మార్గము ఆదిలో చేసి ఉంటాడని మాకు అర్థం అయినది. ఇలా ఈయన పంచముఖ రూపముతో దర్శనాలు ఆపటం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. 

అసలు మన దైవానికి పంచముఖాలు ఇలా ఎందుకు వస్తాయో:

ఒకరోజు అసలు మన దైవానికి పంచముఖాలు ఇలా ఎందుకు వస్తాయో అనే ధర్మ సందేహం వచ్చినది. ఎందుకంటే మన హనుమకి, గాయత్రి మాతకి, బ్రహ్మదేవుడికి, మహాశివుడికి ఇలా వీరికి పంచముఖాలు ఉన్నట్లుగా మన హైందవ గ్రంధాలు చెబుతున్నాయి. వీటి అంతరార్థము ఏదో ఉంటుందని మాకే అర్థమై విచారణ చేసుకోగా మాకు స్పురణ అయినది. అనగా ఈ పంచముఖాలు పంచభూత శరీరాలకి సంకేతమని అర్థమైనది. అంటే ఇప్పటి దాకా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉన్నాయని కొన్ని గ్రంథాలు చెబుతుంటే వీటితోపాటుగా సంకల్ప, ఆకాశ శరీరాలు అనగా పంచ శరీరాలు ఉన్నాయని తంత్ర గ్రంధాలు చెప్పడం ఆశ్చర్య తగ్గ విషయం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్తు మహాశివుడు శివ ధనుస్సు ఎక్కుపెట్టి యుద్ధంలో పాల్గొన్న వారి ఆకాశ శరీరాలను నాశనం చేస్తుంటే క్రింద అర్జునుడు వాటి సూక్ష్మ శరీరాలను నాశనం చేసినాడని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పటం జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన మన శరీరాలు పంచ శరీరాలని వాటికి గుర్తుగా ఈ పంచముఖాలు మనదైవాలకి ఆపాదించినారు అని మాకు అర్థం అయినది. మనము మరి ఏ శరీర సాధన లో ఉన్నామో ఎలా తెలుస్తుంది అనుకోగానే విశుద్ధ చక్రము మరియు దీని క్రింద ఉన్న చక్రములలో ఉండే శరీరాలని స్థూల శరీరాలని ఇది 24 అడుగుల నుండి ఆరు అడుగుల దాకా ఉంటుందని ఇది భూతత్వము కలిగి ఉంటుందని ఆ తరువాత ఆజ్ఞ చక్రం లో ఉండే శరీరము సూక్ష్మశరీరము అని ఇది ఆరడుగుల నుండి 83 అంగుళాల మేర ఉంటుందని ఇది జల తత్వము కలిగి ఉంటుందని అలాగే సహస్రార చక్రం లో ఉండే శరీరము కారణ శరీరము అని ఇది మూడు అడుగుల నుండి బొటన వేలు మేర ఉంటుందని ఇది అగ్నితత్వం కలిగి ఉంటుందని అలాగే హృదయ చక్రములు ఉండే శరీరమును సంకల్ప శరీరము అంటారని ఇది బొటన వ్రేలి నుండి అంగుళ పరిమాణం ఉంటుందని ఇది వాయు తత్వమును కలిగి ఉంటుందని అలాగే ఆకాశ శరీరము అనగా బ్రహ్మరంధ్రము వద్ద ఉండే శరీరమని ఇది కాస్త అంగుళము నుండి పిండి రేణువు పరిమాణములో ఉంటుందని ఇది ఆకాశ తత్వం కలిగి ఉంటుందని మాకు అర్థం అయినది. ఇది నిజమే అనటానికి నిదర్శనం గా శ్రీ లాహిరి అనుభవాలను చూస్తే తను సహస్రార చక్రంలో బొటనవేలు పరిమాణం ఉన్న పురుషుడిని చూశానని అలాగే హృదయ కమలంలో అంగుళ పరిమాణంలో ఉన్న పురుషుడిని చూశామని ఈ పురుషుడిలో పిసరంత ఆత్మ ఉన్నట్లుగా గ్రహించినాను అని చెప్పటం జరిగినది. ఈ పాటికి ఇవి ఏమిటో మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ లెక్కన చూస్తే కారణ లోకము నుండి విముక్తి పొందిన ఆత్మ అనేది సంకల్పధారి అవుతాడు కదా. అందుకే మనం మూడు అంగుళాల పరిమాణం మార్చుకొని హృదయకమలంనకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఎప్పుడైతే మన వాడు అక్కడికి చేరుకుంటాడో వాడు కాస్త సంకల్ప శరీరధారి అవుతాడు అన్నమాట. ఇంకా అదృష్టం బాగుండి సాధన ముందుకు వెళ్ళగలిగితే మనవాడు కాస్త ఆకాశ శరీరధారి అవుతాడు అన్నమాట అనుకుంటూ ధ్యానానికి కూర్చోగానే ఇది నిజమే అన్నట్లుగా పంచముఖ హనుమాన్ దర్శనము అయినది.

ఒకరోజు ఒక భక్తురాలు ద్వారా మా ఇంటికి ఒక నల్ల రాతి మీద పంచముఖ హనుమాన్ వచ్చినారు. దానికి సింధూరము పూసి నిత్య పూజలో ఉంచినాము. ఈయనకి సంబంధించిన బీజాక్షర పుస్తకాలు వస్తే మావాడు వాటిని నా నుండి లాక్కొని వాడు చేసుకోవటం ఆరంభించినాడు. అలాగే హనుమత్ యంత్రము తో ఫోటో వస్తే దానిని కూడా మా వాడు లాక్కొని పూజలు చేసుకోవటం ప్రారంభించేసరికి ఈయన పూజ మేము చేయవలసిన పని లేదని తెలుసుకుని అవి జీవన మార్గం సంకేతముగా గ్రహించి యధావిధిగా ధ్యానము చేసుకోవటంలో బిజీ అయ్యాము. ఒక రోజు మేము తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మా కారణ శరీరము కాస్త హృదయ చక్ర ముఖద్వారం వద్దకు చేరుకున్నట్లు గా అనుభూతి కలగ సాగింది. అక్కడ విచిత్రముగా పంచముఖ ఆంజనేయస్వామి రూపము కాపలా కాస్తూ కనిపించసాగింది. అంటే ఇన్నాళ్ళు ఈయన మనకి ధ్యానంలో కనిపించడానికి కారణం తాను హృదయ కమల ప్రవేశద్వారం దగ్గర కాపలా ఉంటాము అని చెప్పటానికి అని మాకు అర్థం అయినది. చిత్రముగా వీడితో వాదనలు చేస్తున్నాడని మాకు అనుభవము అవసాగింది. ఒక్కసారిగా వీడి మీదకి దాడి చేయటం ఆరంభమైనది. అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. పంచముఖ హనుమత్ కాస్త బొటనవ్రేలు అంతా కూడా లేని మా కారణ శరీరం మీద ఊహించని విధంగా దాడి చేయటంలోని అంతరార్థము ఏమి అయి ఉంటుందో అర్థం కాలేదు. కొద్దిసేపటికి వీడు కాస్త కింద పడిపోవడం వీడి శరీరమునుండి పంచ రక్తధారలును ఈయనకి ఉన్న పంచముఖాలు ఏకధాటిగా చూడటము చూస్తుంటే రావణబ్రహ్మ తమ్ముడు అయిన మహిరావణుడు యొక్క పంచప్రాణాలు ఉన్న పంచ తేనెటీగలను ఈయన పంచముఖాలతో ఉద్భవించి వాటిని సంహారం చేసినారని దానితో మహిరావణుడు ప్రాణాలు వదిలినాడని రామాయణంలో చెప్పిన విషయము లీలగా గుర్తుకు రాసాగింది. కొన్ని క్షణాల తర్వాత మనవాడు నిద్రలేచినట్లుగా లేవటం జరిగినది. కాకపోతే బొటనవ్రేలు పరిమాణము కాస్త అంగుళ పరిమాణంలో మారిపోయినాడని అనగా సంకల్ప శరీరధారిగా మారినాడని అంటే ఈయన యుద్ధము చేసి మూలప్రకృతిలోని మహా పంచభూతాల శక్తి యొక్క మహామాయ లను రక్తధారలుగా పంచముఖాలతో త్రాగటం జరిగినదని అలాగే హృదయ చక్రం లో ఉండే హృదయ ఆకాశంలో సూక్ష్మ పంచభూతాలతో ఉన్న సంకల్ప శరీరధారిగా మార్చుకున్నారని మాకు అర్థం అయ్యేసరికి కి అనగా శ్రీరాముడితోను- శ్రీకృష్ణుడితోను శ్రీరామాంజనేయ యుద్ధముగా, శ్రీకృష్ణాంజనేయ యుద్ధంగా వీరితో దీనికోసమే చేయటానికి హనుమ సిద్ధపడినారు అని తెలియగానే నాకు ధ్యాన భంగమైనది. బయటికి వచ్చిన తరువాత అసలు మా సాధన అంతా ఏదో విచిత్ర సచిత్ర అనుభవాలతో ఏదో పాత సినిమా లాంటి విఠలాచార్య సినిమా లాగా ఉంది అని శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యములో ఎంతో తేడా ఉన్నదని ఇన్ని చిత్రవిచిత్ర అనుభవాలు ప్రతి యోగి అనుభవించవలసి ఉంటుంది అని కాబోలు ఎవరు కూడా తమ అనుభవాలు చెప్పటానికి ఆసక్తి చూపలేదని నాకు ఇప్పుడు అర్ధం అవసాగింది. మేము మా అనుభవాలు నిజమా కాదా అని కన్యాకుమారి నుండి హిమాలయాల దాకా అలాగే గుజరాత్ నుండి కాశి క్షేత్రం వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఎందరినో యోగులను కలిసి విచారణ చేస్తే అందులో ఎక్కువమంది మా అనుభవాలు చదివి మౌనము వహించి ఏమీ చెప్పలేదు. కొంతమంది మాత్రమే ఇవి అన్నీ కూడా నిజమని ఒప్పుకోవటం జరిగినది. ఎక్కడ ఈ అనుభవాలు నిజమని చెప్పుకుంటే తమలో అహం మాయ మొదలై వారి సాధనను నాశనం చేస్తుందని భయంతో ఈ నా అనుభవాలు నిజమే అయినా ఏమీ చెప్పకుండా మౌనం వహించినారని మాకు అర్థం అయినది. చిత్రము ఏమిటంటే శ్రీశైల యోగి అయిన శ్రీ పరిపూర్ణానంద ప్రియ శిష్యుడు అయిన శ్రీ ప్రకాశానంద అనుభవ డైరీల ప్రకారము చూస్తే వీరికి సహస్ర కమలములో అన్ని రకాల అనుభవాలు అనుభూతులు కలిగినాయని తనలో అహం మాయ మొదలయ్యే అవకాశం ఉండటం వలన ఇక నుంచి మా అనుభవాలు డైరీలో రాయలేనని రాసినారు. విచిత్రం ఏమిటంటే ఈయనకి ఏడవ సారి వచ్చిన గుండెనొప్పితో దేహత్యాగము చేసినారు. ఇంకా విషయము అర్థం కాలేదా? ఈయన ఏడు సార్లు తమ ప్రయత్నం తో హృదయ కమలములో ప్రవేశించటానికి విశ్వప్రయత్నాలు అనగా ఏడు సార్లు ప్రయత్నించి విఫలం అయి హార్ట్ ఎటాక్ గుండెమీద యుద్ధములో ఓడిపోయినారని నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అది అర్థం అవుతుంది అంటే పంచముఖ ఆంజనేయుడు చేతిలో చనిపోతే వారికి కావలసిన ఆక్సిజన్ శాతం తగ్గి తర్వాత రక్త ప్రసరణ వేగం పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఎందుకంటే ఆంజనేయుడు అనేది శ్వాస గమనాల దేవుడు కదా. ఆయన వాయుపుత్రుడు కదా. ఆయన ఈయన తన సాధన శక్తి హృదయకమలం లోనికి చేరుకోలేదు అన్నమాట. ఎవరైనా హార్ట్ ఎటాక్ తో చనిపోతే ఇక్కడిదాకా సాధనకి వచ్చినట్లేనా? అంటే ఏమో ఎవరికి తెలుసు. గత జన్మలో ఆయన మహాయోగి అయ్యి సహస్రార చక్ర సాధన చేసి ఉంటారని ఉండొచ్చు కదా. ఈ జన్మలో వారికున్న కర్మ వాసనలు తీర్చుకోవటానికి భోగ జన్మ ఎత్తి లేశమాత్రం కర్మ వాసనలు ఇంకా మిగిలిపోయి ఉంటే హార్ట్ ఎటాక్ రూపంలో మరణం పొంద వచ్చు కదా. కాకపోతే ఈయన అనుభవమును బట్టి చూస్తే సాధకులు అంతా కూడా హృదయ కమలానికి చేరుకోలేరని నాకు అర్థమైనది. 

నాకు వచ్చిన హనుమ సమీర పత్ర ఫోటో

నా ఈ స్పురణ నిజమే అనటానికి నిదర్శనం గా సమీర పాత్ర ఆంజనేయ ఫోటో వచ్చినది. అనగా శ్రీ శైల పరిసర దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న సమీరా అనే చెట్టు యొక్క పత్రము స్వయంగా వీరాంజనేయ హనుమాన్ సింధూర రంగుతో వెలసి ఉంటాడని అలాగే ఇలాంటి హనుమాన్ చెట్లు నైమిశారణ్యంలో కూడా ఉన్నాయని చాగంటి కోటేశ్వరరావు గారి శ్రీశైల వైభవంలో ఈ సమీర హనుమ గురించి చెప్పడం జరిగినది. దానికి తగ్గట్లుగా మాకు ఈ ఫోటో వచ్చినది. కానీ ఈయన పత్రము పొందాలని మాకైతే ఆకాంక్ష లేదు. వస్తే వచ్చే యోగము ఉంటే కాదనను. దానికి హనుమ అనుగ్రహం ఉండాలి. ఆయన ఉన్నాడని స్వయంగా శ్రీ కాశీ క్షేత్రంలో చూపించినారు కదా. ఇంకా పత్రాలతో పని ఏముంటుంది చెప్పండి.ఇలా పంచముఖ ఆంజనేయ అనుగ్రహ బలముతో మా కారణ శరీరము కాస్త సంకల్ప శరీరముగా మారి పంచ భూతాలు ఉన్న హృదయ ఆకాశము ఉన్న అష్టదళ పద్మం అయిన హృదయ కమల చక్రము లోనికి ప్రవేశించడం జరిగినది. విచిత్రం ఏమిటంటే మా స్థూల శరీర జనన కాలంలో మా అమ్మ కాస్త హనుమత్ నిత్య పూజ చేస్తూ ఉండటము జరిగినది.  నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండేదని అందువలన ఆయన పేరు మాకు పేరుగా పెట్టడం జరిగినది. అందువలన మాకు ఈయన అనుగ్రహము కలిగినదో ఏమో తెలియదు. ఆ తర్వాత ఏమి జరిగిందో మీకు తెలియాలంటే మీరు కూడా హృదయ కమలమునకు చేరుకోండి.

శుభం భూయాత్

పరమహంస పవనానంద

***************************************

గమనిక: జీవనాడి యందు అందరికీ హనుమంతుని విగ్రహాలు, నల్లరాతి పంచముఖ విగ్రహమూర్తి, స్వయంగా ప్రత్యక్ష హనుమ దర్శనము, హనుమత్ పూజ, హనుమాన్ చాలీసా పారాయణము, హనుమ దీక్ష తీసుకోవటం జరుగుతుందని వివిధ యోగుల అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగినది. ఈయన ఆగ్రహము పొందితే గుండెనొప్పితో మరణము పొందుతారని …. ఈయన అనుగ్రహము పొందితే హృదయ కమలానికి చేరుకుంటారని మేము గ్రహించినాము. అతిశక్తివంతమైన పంచముఖ హనుమాన్ శక్తిని తట్టుకోవటం అంటే మాటలు కాదని ఎంతో మనో ఇంద్రియనిగ్రహం పరీక్షలు ఉండాలని మేము గ్రహించినాము. అలాగే ఈ హనుమత్ శక్తిని తట్టుకోలేని యోగులను, స్వామీజీలను, పీఠాధిపతులను కూడా నా స్వానుభవం లో చూసినాము. అప్పటిదాకా దైవాలుగా పూజింపబడిన వీరంతా కూడా ఈ శక్తిని తట్టుకోలేక హనుమంతుడిని లేదా శ్రీరాముడు మీద వ్యంగ్య అస్త్రాలు ప్రయోగించి నానా చంకలు నాకటం తమ సాధన శక్తిని కోల్పోయి మనో నిశ్చల స్థితిని పొంద లేక మర్కట సన్యాసిగా మిగిలిపోవడం నా స్వానుభవంలో చూడటం జరిగినది. హనుమత్ ఆగ్రహము పొందినవారిని అనుగ్రహం పొందిన వారిని వారి అనుగ్రహం కోసం సాధన చేస్తున్న వారిని మేము మా అనుభవంలో చూడటం జరిగింది. ఈ హనుమత్ శక్తిని తట్టుకోలేని వారు చాలామంది ఎక్కడైనా కోతులు మాట్లాడతాయా? అప్పుడు రాముడు కాలంలో మాట్లాడేవి…. ఈ కాలంలో ఎందుకు మాట్లాడటం లేదని? రాముడు ఏమైనా ఇంజినీరా? బ్రిడ్జీలు కట్టటానికి ఇలా పలు మంది నా నా వ్యంగ్య అభిప్రాయాలు వెలిబుచ్చడం జరిగినది. నిజానికి శ్రీరాముడు స్వయంగా బ్రిడ్జి కట్టలేదు. కేవలం వానర సైన్యం లో ఉన్న నీలుడు అనే వానర ఇంజనీరు సలహా సహాయ సహకారాలతో రామసేతు వంతెన కట్టినారు అని గ్రహించండి. అలాగే శ్రీ మేధా దక్షిణామూర్తి మౌన బ్రహ్మ గా ఉండి ఏమీ మాట్లాడకుండానే సనక సనంద నాదులు మహర్షులకి ఏ విధముగా వారి ధర్మసందేహాలను కేవలం మౌన భాషలో తీర్చినాడో తెలుసు కదా. అలాగే ప్రతి జంతువుకీ మౌన భాష ఉంటుంది. దీనికి మాటలు ఉండవు. చేతలు, సైగలు, భావాలు, ఆలోచనలు ఉంటాయి. వీటి ఆధారంగానే మనిషి తన చుట్టూ ఉన్న జంతువుల మనోభావాలను ఈ మౌన భాష ద్వారా అర్థం చేసుకుంటాడు. ఆ రాముడు కాలంలో ఈ మౌన భాష తెలిసిన వారు ప్రకృతితో అనుసంధానము అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో మానవ భాషలే అర్థం కాక చస్తున్నారు. ఇక జీవ ప్రకృతి భాష అయిన మౌన భాష ఏమి అర్థం చేసుకుంటారో చెప్పండి.అంతెందుకు. రామకృష్ణపరమహంసకి పక్షిభాష తెలుసునని వారి జీవిత చరిత్రలో ఉన్నది కదా. అందుకే ఈయన మౌన భాషలో ప్రకృతిని అర్థం చేసుకొని జగద్గురువు అయ్యాడు.

 నాకు వచ్చిన హనుమ సమీర పత్రము 

అలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నాకు శ్రీశైలములో అక్కమహాదేవి గుహ ఉన్న లోపలి దట్ట అడవి నుండి నాకు నిజ హనుమ సమీర పత్రము ఒక సిద్ధుడి నుండి రావడము జరిగినది. విచిత్రము ఏమిటంటే నాకు వచ్చిన పత్రములో హనుమంతుడు ఒకరి తర్వాత మరొకరు ఉన్నట్లుగా ఉంటే...అదే ఈ పత్ర ఫోటో లో హనుమ బొమ్మ ఎదురెదురుగా ఉన్నట్లుగా ఉంది.ఈ తేడా ఎందుకు వచ్చినదో నాకు అర్ధము కాలేదు. రుద్రాక్షలలో నకిలి భద్రాక్షలున్నట్లుగా ...ఈ హనుమ పత్రాలలో గూడ ఏమైనా తేడాలున్నాయో ఏవరికి ఎరుక. హనుమ భక్తిని కొంతమంది వ్యాపారము చెయ్యాలని పత్రాల మీద హనుమ బొమ్మను ముద్ర వేసి అమ్ముతున్నారని ... అందుకే ఈ పత్రాలలో హనుమ ముద్రలలో తేడాలు వస్తున్నాయని నా దృష్టికి వచ్చినది.

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. mee kaarana shareeram viraat rupamlo vachi botnavrelu antha parimaananiki ravatam,
    mee kaashigangaa snanam, sarva theerdahala darshanam,mahaanirvana shakti enduku
    avasaramani baaga chepparu, navapaashana shakti nichedi hanumanthula vaarani veeriki maatrame
    pancha janthuvula thalalunnayani, raabovu kaalamlo eeyane bhavishya brahma, jeevanaadi dwara
    velite kaani sahasrachakramlo unna sahasra karmalaki moola karmavaasana emiti anedi hrudayachakramloniki
    velite kaani thelidani...gnana ahamkaaram mariyu vishleshana sariga cheyalekapovatam,
    nammakam undali kaani samshaya budhi undakudadani mana anubhavala meeda, apasmaaraka sthithini
    daatina vaariki maatrame shaktipaatha siddhi kaluguthundani...aanjaneya swamyni prasannam chesukovatam,
    jaganmohini maayanu daatatam kaarana shareeradhaari, sahasraaramlo vache ashtasiddhula vivarana,
    jeevanaadilo hanumath rupaala darshanam..kaarana dhaari kastha ela sankalpadhaarigaa maarinaadani
    hanuma sameera patramu raavatam.

    రిప్లయితొలగించండి