అధ్యాయం 82


గ్రహాంతర యానం

నాకున్న కామగుణ బలహీనతను దాటలేకపోవడము వలన నా పంచ శరీరాలకి భవిష్య జన్మల రికార్డ్ దృశ్యాలను నా ధ్యానము నందు పరమ శూన్యము చూపించడము ఆరంభించినది. అందుకేఈ అధ్యాయము నందు నా భవిష్య జన్మనే గ్రహాంతరవాసి అనుభవాలుగా ప్రస్తావించడం జరుగుతుంది అని గ్రహించండి. ఇన్నాళ్లు స్వప్న సాధన ద్వారా నా గత జన్మల అనుభవాలు చూడడం జరిగినది. అనగా ఆది జన్మ వేదవ్యాస అని తెలుసుకున్నారు కదా. ఇదంతా స్థూల శరీరము భూలోకవాసులు యొక్క గతజన్మలు అని గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది నా రాబోవు జన్మలైనా గురుగ్రహ సూక్ష్మశరీర జన్మల గురించి అని తెలుసుకోండి. నాకు మతి భ్రమణం చెందిందా లేదా అనేగా మీ సందేహం. వస్తోందా? నాకు నిజంగానే అట్టి స్థితి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే ప్రాపంచిక విషయాలు దాటిన పరమ అవధూత స్థితిలో నా గత జన్మలు చూసినట్లుగా నా భవిష్యత్ జన్మలు అలాగే చూస్తున్నాను అని గ్రహించండి. కాలములో వెనక్కి ముందుకి ప్రయాణించవచ్చు. అది కూడా కృష్ణబిలం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎవరైతే ఈ కృష్ణబిలం యందు ప్రవేశించ గలుగుతారో వారి భవిష్యత్తు జన్మలలోకి వెళ్ళవచ్చును.ఇది నేను ఎలా వెళ్ళినానో మీకు చెబుతాను వినండి .ఇది నిజం నిజమని నమ్మితే బాగుపడతారు. లేదంటే బాధపడతారు. నా పంచ శరీరాలు అన్ని కూడా నా స్థూలశరీరం భూలోకములోని బ్రహ్మ రంధ్రము యొక్క బ్రహ్మాండ చక్రం కృష్ణ బిలము నందు ప్రవేశించినానని తెలుసుకున్నారు కదా. అక్కడ ఐదు శరీరాలు కాస్త పొరలు పొరలు గా ఉన్నాయి.ఈ కృష్ణబిలం యందు ప్రయాణం చేస్తూ ఆయా పొరలలో నాతో కర్మబంధముగా ఉన్న వివిధ రకాల దేవుళ్ళు దేవతలు గురువులు మిత్రులు ఈ పొరల మధ్య లీలగా కనిపిస్తున్నారు అని చెప్పడం జరిగింది కదా. అలాగే మేము ప్రయాణించే కృష్ణబిలం యందు మొదట దివ్యమైన కాంతి వలయాలు ఉంటే రానురాను అది కాస్త కాంతి హీనం అవుతూ మధ్యస్థ స్థితి ఉన్న అంతగా కాంతి లేని స్థితి ఉన్న వాటిలో నా పంచ శరీరాలు అది కూడా కోన్ మాదిరిగా ఉన్న అడుగు భాగంలోనికి ప్రయాణిస్తున్నట్లు నా మనోనేత్రం ముందు కనిపించసాగింది. ఇంతటితో ఈ అనుభవము ఆ రోజు పూర్తి అయినది. 

గురుగ్రహ సంచార ధ్యానానుభవం : 1

మరికొన్ని రోజులకు నా పంచ శరీర కోన్ నిర్మాణం యొక్క కృష్ణబిలం యొక్క అడుగు భాగం చేరుకున్నట్లు లీలగా అనిపించసాగింది. అప్పుడు విచిత్రంగా అక్కడున్న పిసరంత రంధ్రము నందు నా సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలు ఈ రంధ్రము ద్వారా క్రిందకు వెళ్ళినాయి కాని నా స్థూల శరీరం వెళ్లలేక పోయినది. నాకు ఆశ్చర్యం వేస్తుండగా ధ్యాన భంగమైనది.ఆనాటికి ఈ అనుభవం పూర్తి అయినది. మరి కొన్ని రోజులకి నా సూక్ష్మశరీరము నందు అలాగే మిగిలిన శరీరాలన్ని కూడా కలిసి పోయి నా స్థూల శరీరము లాంటి సూక్ష్మ శరీరము నందు ప్రవేశించినట్లుగా ధ్యాన అనుభవము అయినది. 

మరి కొన్ని వారాలకి నా సూక్ష్మ శరీరము ఏదో గుర్రపు బండి ఎక్కి ఎక్కడకో వెళ్ళుతున్నట్లుగా నా ధ్యానమునందు కనిపించసాగింది. అంటే ఇక్కడ నుండి నా సూక్ష్మ శరీర యానం మొదలైనది అని గ్రహించాను. అప్పుడు నా సూక్ష్మ శరీరము ఈ బండివాడితో మాట్లాడుతున్నట్లు అనిపించసాగింది. నా స్థూల శరీరానికి ఆశ్చర్యం వేస్తుండగా ఆ బండి వాడు ఎవరో కాదు. భూలోకము నందు ఈ మధ్యకాలంలో కాలం చేసిన మా రెండో మామయ్య వాసు మావయ్య అవటంతో నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు వారితో మామయ్య “ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టినావా? అనగానే ఆయన కాస్త “మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు లీలగా గుర్తుకువస్తోంది. కాకపోతే మా అమ్మమ్మ గారు ఈరోజు భూలోకము నుండి ఒక వ్యక్తి మన లోకానికి వస్తున్నాడు. అతన్ని తీసుకొని రమ్మని చెప్పినారు. మీరు ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు” అన్నాడు. అప్పుడు నా సూక్ష్మశరీరము  కాస్త “మామా! నేను నువ్వు భూలోకం లో ఉన్నప్పుడు నాకు మామవి. కాకపోతే అనుకోని విధంగా చనిపోయారు. నీకు భార్య పిల్లలు ఉన్నారు. నీ తల్లి చనిపోయిన సంవత్సరం లోపల కాలం చేసినావు. ఆ వివరాలు ఏమీ నీకు గుర్తు లేదా” అంటే ఆయన వెంటనే “ఆ వివరాలు నాకు గుర్తులేవు. నేను చనిపోయినానా?నాకు భార్య పిల్లలు ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మమ్మ నాకు పెళ్లి చేయాలని ఇంకా నాకు పుట్టబోయే పిల్లలు ఎత్తుకోవాలని ఉంది. నన్ను పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది” అని ఆశ్చర్యంగా చెప్పడం జరుగుతుంది. వెంటనే నేను వారితో “మనం ఎక్కడికో వెళ్తున్నాము కదా. అక్కడికి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు అలాగే బట్టలు లేవు. బండి ఆపితే నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను” అనగానే వాడు వెంటనే “అయ్యా! అలాంటివి ఈ లోకంలో అవసరం లేదు. అక్కడ డబ్బులు ఇక్కడ చెల్లవు.మనకి కావలసినవి మన పెద్దలు ఏర్పాట్లు చేస్తారు. కంగారుపడకండి” అంటూ గుర్రపు బండి వెంటనే ఆపడం జరిగింది. విచిత్రంగా ఈ బండి నేలమీద ఒక అడుగు ఎత్తులో మనోవేగంతో ప్రయాణము చేస్తున్నట్లుగా నేను గమనించాను. గుర్రాలు కూడా ఎంతో కాంతి శరీరాలతో దైవాశ్వాలుగా ఉన్నట్లుగా అనిపించింది. ఇంతలో మన వాడు అక్కడ ఉన్న వారితో క్రికెట్ ఆడుతూ కనిపిస్తూ మధ్యలో కడుపు మీద చేతులు వేసి బాధపడుతూ ఆడుతున్న ఆట ఆడుతున్నాడు. అంటే మన వాడు భూలోకం ఆడిన ఆటను ఈ లోకంలో ఆడుతున్నాడు. విచిత్రంగా ఉందే అనుకుంటే సరికి వాడు నా దగ్గరికి వస్తూ “ఈ మధ్య నా ప్రేగులకు ,ఊపిరితిత్తులకు, నా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినాయి. దాంతో ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నాను. ఆ రోగాలు తగ్గుముఖం పట్టినాయి ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే మీరు మా లోకానికి ఎలా వచ్చినారు” అని అడిగారు. దానికి వెంటనే “నా భవిష్యత్తు జన్మలు ఈ లోకం లోనే ఉన్నాయి. నేను ప్రస్తుతం భూలోకములో యోగనిద్రావస్థ యందు నా సూక్ష్మ శరీర యానం చేసి ఇక్కడికి వచ్చాను. అందరూ అయితే చనిపోతే ఆ యా లోకాల దర్శనానికి వెళితే నేను మాత్రము బ్రతికుండగానే నా సూక్ష్మ శరీర యానంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ లోకము ఏమిటో?ఇక్కడ ఎవరున్నారో నాకైతే అర్థం కావడం లేదు. తెలిసిన మీరు నన్ను గుర్తు పట్టలేదు. ఇంతకీ నన్ను తీసుకొని రమ్మని చెప్పింది ఎవరు అనగానే మా అమ్మమ్మ అయిన విశాలాక్షి అమ్మగారు అనగానే ఈవిడ నాకు భూలోకంలో అమ్మమ్మ అయితే వీటికి ప్రస్తుతం ఈ లోకంలో అమ్మమ్మ ఎలా అయినదని” అనే ధర్మసందేహం రాగానే నా స్థూల శరీర ధ్యాన భంగమైనది. అంతటితో ఆ రోజు అనుభవం పూర్తి అయినది. 

గురుగ్రహ సంచార ధ్యానానుభవం : 2

మరికొన్ని రోజులకు నేను ప్రయాణించే గుర్రబ్బండి ఒక ప్రాంతము నందు ఆగినట్లు కనిపించసాగింది. అక్కడి వాతావరణం అంతా కూడా సంధ్యాకాలం లాగా ఉంది. అంతగా వెలుగు చూడలేదు. అంతగా చీకటి లేదు. భూలోకమందు ఉదయకాల సంధ్య వాతావరణమే ఈ లోకమునందు వాతావరణంగా కనిపించసాగింది. కాకపోతే ఇక్కడ శరీరం అంతా గాలిలో నడుస్తున్నట్లుగా అనిపించసాగింది. అడుగులు వేస్తున్న నేల మీద కాకుండా ఒక అడుగు ఎత్తులో వేస్తున్నట్లు గమనించసాగాను. అయినా పడిపోవటం లేదు. అక్కడ గుడి గోపురాలు ఇలాంటివి మట్టితో అదికూడా బంకమట్టితో చేసిన ఇల్లు వంటి నిర్మాణాలు కనిపించసాగినాయి. గదులు గదుల మధ్య ఎలాంటి గోడలు లేవు. కిటికీలు ద్వారాలు ఉన్నాయి కానీ వాటికి తలుపులు లేవు. అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. వాటికి మెట్లు లేవు. కేవలం గాలితో ప్రయాణం చేస్తున్నట్లు లీలగా పైకి లేదా కిందకి వెళ్ళవచ్చును. పైగా అక్కడ కొంతమంది స్త్రీలు కనిపించారు. వీరంతా ఆదిమవాసులు దుస్తులతో కొంతమంది నార దుస్తులతో అర్ధ నగ్నముగా కనిపించారు. చాలా మంది నన్ను చూసి భయపడుతూ ఇంట్లో దాక్కోవడానికి వెళుతుండగా నేను వారి వెంట పడినాను. అప్పుడే ఇండ్ల యొక్క లోపలి నిర్మాణాలు ఎలా ఉంటాయో తెలిసినది. ఆ ఇంట్లో నిర్మాణాలన్ని కూడా ఒక దానికి మరొకటి ద్వారాలతో అనుసంధానించబడినాయి.లోపల నాకు ఒక బడి వాతావరణం అలాగే ఆస్పత్రి వాతావరణం కనిపించింది. పేదలు నివసించే స్థల ప్రాంతమని నాకు లీలగా అనిపించసాగుతుండగా ఆ రోజుకి నాకు ధ్యాన భంగమైనది. 

గురుగ్రహ సంచార ధ్యానానుభవం : 3

మరికొన్ని రోజులకు ధ్యానానుభవాలు మళ్ళీ కనిపించసాగింది. ఈసారి విచిత్రంగా ఏదో జనాల మధ్య లో ఉన్నాను. వారంతా కూడా వివిధ భాషల్లో దేనిని గురించో మాట్లాడుతూ బాధపడుతున్నారని వారి హావభావాలను బట్టి నేను గ్రహించాను. అప్పుడు ఇంతలో ఒక తండ్రి వచ్చి తెలుగులో నా బిడ్డని ఎత్తుకుపోయినారు. ఏమి చేస్తారో? అసలు వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటుంటే నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ల దగ్గరికి వెళ్లి నేను ఈ పిల్లవాణ్ణి తీసుకుని వస్తాను అని వారికి ధైర్యం చెప్పి బయలుదేరాను. ఇంతలో భూలోకంలోని గుడి పరిసరాలు లీలగా కనిపించాయి. ఇక్కడ అన్ని సందులు గొందుల మధ్య గుడి ఉన్నది.  అంటే కాశీలోని గల్లీ లో ఉన్నట్లుగా కనిపించసాగింది. ఇంతలో అక్కడ ఒకచోట భూలోకంలో నాన్నగారిని పోలిన వ్యక్తి కనిపించాడు. ఆయన నన్ను గుర్తుపట్టలేదు. బాబు ఇటువైపు ఒక పిల్లవాణ్ణి తీసుకుని ఒక గుంపు వెళ్ళటం చూశాను. వెంటనే వెళ్ళు. ఆ గుంపు దొరుకుతుందని చెప్పడం జరిగినది. ఇదేమిటి? ఈయన మా అయ్య కదా. నన్ను గుర్తు పట్టలేదా? ముందుకు సాగాలి అనుకుంటూండగానే గాని ఒక చాకలి వస్త్రాలతో మా అక్క రూపురేఖలున్న ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఒక స్త్రీ మూర్తి కనిపించి అయ్యా!ఆ పిల్లవాణ్ణి తీసుకుని ఆ గుంపు ఆ కనిపించే చెరువు వెంట వెళ్తున్నారు. మీరు అటువైపు వెళితే కనపడతారని అంటుంటే ఈమె కూడా నా అక్కయ్య కదా. ఈమె కూడా నన్ను గుర్తు పట్టలేదా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. తెలిసిన వారంతా కనపడుతున్నారు. నేను వారిని గుర్తుపడుతున్నాను. కానీ నన్ను ఎవరు గుర్తు పట్టడం లేదు .ఈ లోకం ఏమిటి? ఈ లోకం వాసులు ఎవరు? వీరికి అలాగే భూలోకవాసులుకి గల సంబంధం ఏంటి? అసలు వీళ్లతో నాకున్న అనుబంధం ఏమిటి అనుకుంటూ పిల్లవాడి కోసం వెతకడానికి వెళ్తున్నాను. ఒక చోట దొంగల గుంపు కనపడటం వారి నుండి పిల్లవాడిని రక్షించి పిల్లవాడికి తండ్రికి అప్పజెప్పడం చేస్తుండగా వెంటనే మామయ్య కనిపించి అరే భూలోకవాసి! ఇంకా నువ్వు ఈ లోకం నుండి వెళ్లలేదా? ఇక్కడి నుండి ఏమి చేస్తున్నావు? ఇదిగో మా అబ్బాయి అంటూ ఒకడిని పరిచయం చేస్తుండగా అతనిని చూసి షాక్ కు గురి అయ్యాను. అతను ఎవరో కాదు. ఈ భూలోకము నందు మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి. ఈ లోకమునందు నాకు మేనల్లుడు అయినాడు అన్నమాట అని అనుకుంటున్నాను. అయ్యా వీడికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఆచారం ప్రకారం వీడు ఆ లోకవాసిగా గుర్తింపు పొందుతాడు. వీడికి బుధ గ్రహవాసి స్త్రీమూర్తితో వివాహం నిశ్చయమైనది. ఆనాటి నుండి ఆ గ్రహవాసిగా గుర్తింపు పొందుతాడు అంటూ ఇంకేమో చెబుతుండగా అంటేభూలోకంలో వివిధ దేశాలు అన్నట్లుగా ఈ లోకంలో గ్రహా లోకాలు ఉంటాయి అన్నమాట అనుకుంటూ ఉండగానే నాకు ధ్యాన భంగమైనది. అంతటితో ఈ ధ్యాన అనుభవము కూడా అసంపూర్తిగానే ముగిసినది. 

గురుగ్రహ సంచార ధ్యానానుభవం : 4

మరికొన్ని రోజులకు ఈ లోకములోని సినిమా థియేటర్లకు వెళ్ళినట్లుగా కనిపించసాగింది. విచిత్రమేమిటంటే బాల్కనీ అంటే ఇక్కడ ఈ లోకంలో బెంచీలు అన్నమాట. నాకు ఆ విషయం తెలియక బాల్కనీ టికెట్ కావాలంటే వాడు బెంచి టికెట్ ఇచ్చారని నేను గ్రహించలేకపోయాను. లోపలికి వెళుతుండగా భూలోకములోని నా చిన్ననాటి స్నేహితులు బంధువులు నాకు ఆ థియేటర్ యందు వారి వారి సీట్లలో కూర్చున్నారు. ఎవరు కూడా నన్ను గుర్తుపట్టలేదు. ఇంతలో నేను కూర్చున్న బెంచికి మూడు వరుసల ముందు మా అన్నయ్య వాడి కొడుకు విశ్వ అలాగే వారి స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్నట్లుగా కనిపించినది. వెంటనే వారి దగ్గర వెళ్లి పలకరిస్తే వారు కాస్త నన్ను చూసి ఏమీ గుర్తు పట్టనట్లుగా నేనెవరో తెలియనట్టు గా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అని ఎవరు పడితే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదని ఆయన చుట్టూ ఉన్న పరివారం నాకు వచ్చి చెబుతూ ఉండే సరికి అసలు ఏమి జరుగుతోంది? భూలోకంలో నా బంధుమిత్రులకు కాస్త ఈ విచిత్ర లోకం లో నేనెవరో తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ఈ లోకం ఏమిటి అని పెద్దగా అనుకునే వచ్చేసరికి అయ్యా! ఇది గురుగ్రహ లోకం. మీరు భూలోకం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి. ఈ లోకంలోనే కాదు. అన్ని లోకాల యందు ఒక విధమైన వ్యక్తులు ఉంటారు. కానీ ఆయా లోకాలలో తగ్గట్లుగా వారి వేషభాషలు ఉంటాయి. బంధాలు ఉంటాయి. ఇక్కడ మీకు అందరూ తెలిసిన వారే ఉంటారు కానీ ఎవరూ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేరు. ఏ లోకవాసికి ఆలోకబాషతోనే అనుబంధం ఉంటుంది. మీరు వారికి వేరే లోక భాంధవ్యాలు ఈ లోకవాసికి గుర్తు చేసిన వారికి గుర్తుకు రాదు. అందరూ తెలిసిన వారే కాని ఎవరు కూడా తెలియని వారేనని గ్రహించండి అని అక్కడున్న సినిమా తెరమీద ఎవరో నాతో ఈ మాటలు చెబుతున్నట్టుగా విచిత్రంగా ఆలోకవాసులు వారికి కావల్సిన సినిమాలను ఎవరికి వారే ఒకే థియేటర్లో అన్ని సినిమాలు ఏకకాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉండేసరికి అలాగే నా మనస్సులోని ప్రశ్నకు సమాధానంగా తెరమీద ఒక వ్యక్తి కనిపించడం కూడా అందులో ఒక భాగమని అది అక్కడ ఉన్న వారికి కనిపించడం లేదని నాకు మాత్రమే కనిపించింది అని తెలియగానే వామ్మో !ఏమి టెక్నాలజీ. నా బొందా. నా బూడిద. అదే భూలోకంలో సొంతంగా మనము కావలసిన ఛానల్స్ టీవీ లో చూడలేక పోతున్నాము. ఇక్కడ ఏకంగా ఈ ధియేటర్స్ లో ఎవరికి వారే వారికి కావల్సిన సినిమా చూస్తున్నారా? ఒక్కడే తెరమీద ఏక కాలంలో అన్ని సినిమాలు ఎలా కనబడుతుందో ఏమి విచిత్రం. ఏమి  చిత్రం. ఇది నిజంగానే భళారే విచిత్రం కదా అనుకుంటూ అంటే ఇన్నాళ్ళు నేను సూక్ష్మ శరీర యానం అంతా గురుగ్రహ యానము అన్నమాట. నా భవిష్యత్ జన్మలు అనగా నా సూక్ష్మశరీరము జన్మలు అన్నీ కూడా గురుగ్రహమునకు సంబంధించినవి అన్నమాట అనుకుంటూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి టికెట్ లిస్తూ హాల్ యందు కనిపించాడు. అదేమిటి బయట కౌంటర్లో టికెట్ ఇవ్వరా వీరు తీసుకోరా అనుకుంటూ ఉండగా వాడు కాస్త టికెట్లు హాల్లోనే చింపి ఇస్తూ దానికి తగ్గ డబ్బులు తీసుకుంటూ నా దగ్గరికి వస్తూండగా నా పక్కన ఉన్న వాడికి వాడి టికెట్ చింపి ఇస్తూ ఉండగా వాడు వెంటనే నా వైపు చూపిస్తూ నా డబ్బులు నా పక్కనే కూర్చుని ఉన్న ఈయని జేబులో ఉంచినాను. కావాలంటే వీరి జేబులో డబ్బులు ఉంటాయి అని అతను చెబుతుంటే నాకు కోపం వచ్చి అవి నా డబ్బులే. వారి డబ్బులు కాదు. అతను ఎవరో కూడా తెలియదు. పైగా తాగి ఉన్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు అనగానే ఆ టికెట్లు ఇచ్చే వాడు కాస్త నా దగ్గరికి వచ్చి మీ డబ్బులు అయితే వాటి మీద ఉన్న గుర్తులు చెప్పండి అవి మీ డబ్బులు అని నమ్ముతాను లేదంటే అవి వాడి డబ్బులుగా పరిగణించి మిమ్మల్ని దొంగ కింద జమకట్టి దొంగ అని తేలితే మీకు ఈ లోకములో జీవిత ఖైదుయే. ఈ లోకంలో ఎవరూ కూడా విడిపించలేరు అని చెబుతూ ఉండగానే అంటే భూలోకములో ఉండే అన్యాయాలు అక్రమాలు హత్యలు ఆక్రందనలు అవమానాలు  అనుమానాలు భయాలు ఆస్తులు అన్నీ కూడా ఈ లోకంలోనూ ఉంటాయని ఒకవేళ నన్ను బంధిస్తే నా సూక్ష్మ శరీరం కాస్త బంధి అయితే అక్కడ భూలోకంలో ఉన్న నా స్థూల శరీరమునకు నా సూక్ష్మ శరీరము అందకపోతే అది చనిపోయిందని భావించి ఎక్కడ దానికి దహనసంస్కారాలు చేస్తారనే భయం నా సూక్ష్మ శరీరమునకు కలిగినది. దానితో అది కాస్త సుమారుగా 50 అడుగుల పై నుంచి కిందకు దూకి అక్కడ ఉన్న ద్వారం నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న గుర్రబ్బండి పట్టుకుని ఎక్కి వెనక్కి బయలుదేరడంతో కథ సుఖాంతం అయినది. తిరిగి యథావిధిగా నా సూక్ష్మ శరీరము కాస్తా భూలోక స్థూల శరీరమునకు చేరడముతో ఇలలో గాలిలో కలిసి పోవాల్సిన ప్రాణాలు నిలబడ్డాయి. ఇది అంతా ఒక కట్టుకథ లాగా అనిపిస్తుంది. కనిపిస్తుంది. కాని నిజానికి ఇది కథ కాదు. నా భవిష్యత్ జన్మల మీద ధ్యాన అనుభవాలు అన్నమాట.
 
నాది భవిష్య జన్మల విధంగానే గురుగ్రహ వాసి అని నా జాతకమే చెబుతోంది. ఎలా అంటే జన్మలగ్నం ప్రకారంగా చూస్తే ఐదవ స్థానము అనేది భవిష్య జన్మ గురించి చెబితే తొమ్మిదో స్థానం అనేది గత జన్మ గురించి చెప్పడం జరుగుతుందని జ్యోతిష్య సిద్ధాంతము చెబుతోంది.దీని ప్రకారంగా చూస్తే నా భవిష్యత్తు జన్మ గురుగ్రహ గడికి సంబంధించింది కావడంతో నాకే ఆశ్చర్యం అనిపించింది. నా గత జన్మ యొక్క గదిలోని గ్రహాల యొక్క దశలే భూలోక జీవదశలు అని అవి ఇప్పటిదాకా నడిచినాయని నేను తెలుసుకున్నాను. అంటే నా యోగనిద్ర సాధన వలన ఈ భూలోకంలోని గత జన్మలోని 48 లక్షల ప్రారబ్ద కర్మలు నాశనం చేసుకుని కల్మషం లేకుండా ఉండటం వలన నాకు ఈ జన్మ యందు భూలోకము నుండి శాశ్వత విముక్తి కలిగింది అని అనగా నా స్థూల శరీర కపాలమోక్షం కలిగినదని కాకపోతే గురుగ్రహం సూక్ష్మ శరీరంతో అక్కడ లోకమునందు యోగ సాధన చేయవలసి ఉంటుందని అక్కడ తిరిగి సూక్ష్మశరీర కపాల మోక్షం పొంది అక్కడి నుండి కారణ శరీరము పరలోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ కారణ శరీరం తిరిగి అక్కడి నుండి సంకల్ప శరీరముతో ఇష్ట లోకవాసిగా వేరే లోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ తిరిగి సంకల్ప శరీర కపాల మోక్షం పొంది తిరిగి అక్కడి నుండి వేరే లోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ తిరిగి ఆకాశ శరీర కపాలమోక్షమును పొందవలసి ఉంటుందని గ్రహించాను. కాకపోతే ఈ శరీరాల కపాలమోక్షం స్థితికి అనగా శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వచ్చేసరికి బలహీనత అనే గుణం ప్రభావానికి గురి కాకూడదు. గురి అయితే ఈ పంచ శరీరాల కపాలమోక్షం విధానాలు ఒక చక్రం తిరుగుతూనే ఉంటాయి. చక్రం తిరిగినట్లుగా అవే యుగాలు అవే సంవత్సరాలు అవే నెలలు అవే లోకాలు అవే రోజులు ఎలా అయితే తిరుగుతున్నాయో అలాగే మన శరీరాలు తిరుగుతున్నట్లుగా ఉంటాయని గ్రహించండి. అనగా స్థూల శరీర కపాలమోక్షంతో మొదలై ఆకాశ శరీర కపాలమోక్షంనకు చేరుకుని తిరిగి అక్కడ నుండి మొదలవుతుంది. మళ్లీ కథ మామూలే కదా. ఆగదు. ఆగదు. జీవన నాటకం ఆగదు. మన ప్రయత్నం ఆగదు. ఎందుకంటే అది కూడా అంతే. మన బలహీనతలను దాటటం ఇంతవరకు ఎవరికీ జరగలేదు. కారణము బలహీనతలేని బలవంతుడని ఆ భగవంతుడు సృష్టించలేదు. ఎందుకంటే ఆయనకు ఏదో ఒక బలహీనత ఉన్నది కదా. బలహీనత దాటటం ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఇది మనలోనే ఉంది. తప్పు అనే పదము భావం ఎలాగైతే తప్పు అని చెబుతుందో అలాగే బలహీనతనే గుణము ప్రభావం బలహీనత లక్షణాలు మనమీద అలాగే ఉంటుంది. దీనికి గురి అవటమే గాని దీనిని దాటలేము. ఎందుకంటే తప్పు అనే పదం ఎప్పటికీ తప్పుగానే ఎలా అయితే పలుకుతామో బలహీనత కూడా అంతేనని నాకు అర్థమైనది. ఈ బలహీనత వలన దైవాలు దేవుళ్లు దేవతలు అందరూ కూడా ఆయా శరీరాలతో కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆవాసము చేస్తున్నారని గ్రహించండి. తెలుసుకోండి. కేవలం యోగ సాధన అనేది కేవలం భూలోకము నుండి విముక్తి కలగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని గ్రహించండి. ఈ లోకం నుండి విముక్తి కలిగితే మీ ప్రారబ్ద కర్మలులోని సూక్ష్మ కర్మలను బట్టి మీరు ఆయా గ్రహాల లోకాలలోని సూక్ష్మ శరీరాలతో ఆయా గ్రహాలు కలిగి ఉంటారని గ్రహించండి. యోగ సాధన అనేది నిరంతర సాధన. అది ఒక శరీరంతో సరిపోదు. ఒక కపాలమోక్షంతో సరిపోదు. మీరు బలహీనతలను దాటేంతవరకు ఈ యోగసాధనలోని కపాలమోక్షం అనే విధివిధానాలు కొనసాగుతూనే ఉంటుందని గ్రహించండి. బలహీనతను జయించే మోక్షగామి ఇంతవరకు పుట్టలేదు. పుట్టడు కూడా. పుట్టలేడు కూడా. ఎందుకంటే మనల్ని పుట్టించే పరమశూన్యమునకే 'నేను ఎవరిని' అని తెలుసుకోవాలని బలహీనత ఉన్నది. దానికి నేను ఆత్మ అని తెలుసుకున్న లేదా ఆత్మ గాదని తెలుసుకున్న నేను లేను అని తెలుసుకున్న కూడా ప్రశాంత స్థితిని పొందలేక పోతున్నది. ఎందుకంటే నిజానికి అది ప్రశాంత స్థితిలోనే సహజస్థితిలోనే ఉంది. కానీ అది ఆ స్థితిలో ఉన్నదని అపస్మారక స్థితి పొందటంతో దానికి తెలియటం లేదు. నమ్మడం లేదు. కారణము అది అపస్మారక స్థితి అనగా తెలుసుకొనే జ్ఞానమును మర్చిపోవడం జరిగినది. ఇలా మర్చిపోయిన జ్ఞానమును తిరిగి వివిధ యోగసాధన ప్రక్రియల ద్వారా జ్ఞాన స్పురణ ద్వారా తెలుసుకున్నప్పటికి అది నమ్మడం లేదు. అంతెందుకు మీరే దేవుడని అని చెబితే మీలో ఎంతమంది దీనిని నమ్ముతారా చెప్పండి. నమ్మరు కదా. చివరికి యోగసాధన చేసి తత్వమసి స్థితికి వచ్చి నేనే దేవున్ని అనే భావాతీత స్థితిని పొందిన కూడా నా బొంద. నేను దేవుడు ఏంటి?దేవుడు లేడు. నేను లేను అనే బలహీనత ప్రభావానికి గురి అవుతారు. దానితో అపస్మారక స్థితి పొంది దేవుడు అనే విషయం మర్చిపోయి జీవుడుగా కొనసాగుతారు. ఇలా అందరూ కూడా ఏదో ఒక బలహీనత గురి అవుతూ మరణాల పేరుతో ఒక లోకము నుండి మరొక లోకమునకు నిరంతరం కొనసాగుతూనే ఉన్నారు. 
 
అంటే ఇంతవరకు ఎవరూ కూడా సంపూర్ణ మోక్షము అనగాబలహీనతను జయించే మోక్ష స్థితిని పొందలేదు అని నాకు అర్థం అయింది. అంతవరకు ఈ విశ్వ సృష్టి యొక్క జీవన నాటకమును మనం పంచ శరీరాలతో వివిధ గ్రహ లోకాలలో గ్రహవాసులుగా ఈ నాటకమును అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగానే కొనసాగిస్తూనే ఉంటారు అని గ్రహించండి. కాకపోతే యోగసాధన పరిసమాప్తి చేసుకుంటే ఆ జన్మలోని ఆ శరీరం మాత్రమే కపాల మోక్షం కలుగుతుందని గ్రహించండి. తద్వారా ఆయా లోకము నుండి విముక్తి కలిగి మరొక గ్రహమునకు ప్రయాణం చేయవలసి ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా కపాల సాధన చేస్తేగాని ఆ లోకము నుండి మీకు విముక్తి కలగదు. అంటే మీకు ఆయా లోకాల నుండి విముక్తి కలగాలంటే మీ సాధన కాస్త కపాల సాధన దీక్ష చేస్తారని అలా చేసేటట్లు జగద్గురువైన ప్రకృతిమాత ఏర్పాటు చేస్తుందని అంటే ఆదిలో మీరు చేసిన ఈ కపాల సాధన దృశ్యాలను ఈ జన్మలో వాటిని రికార్డు దృశ్యాలు అనే ధ్యాన అనుభవాలను మీకు సాధనా పద్ధతులు తెలియజేస్తుందని గ్రహించండి. ఇక్కడ సాధన చేయటానికి ఏమీ లేదు. గతంలో ఆదిలో మీరు అంతిమంగా సాధన చేసిన దృశ్యాలు అనుభవాలు వచ్చేదాకా మీరు సాధనలో ఉండాలి. అంతే ఇలాంటి కపాల ధ్యాన అనుభవాలు కలిగితే చూడగలిగితే అవి పూర్తి అయినట్లుగా అనుభవాలు కలిగితే ఆ నాటి నుండి ఆ లోకంలోని ప్రతి జన్మలో కూడా కర్మ క్షయము అయినట్లే అన్నమాట. దానితో మీరు ఈ లోకం నుండి విముక్తి కలిగి భవిష్యత్ జన్మలుగా వేరే లోకవాసుడిగా భవిష్య రికార్డ్ దృశ్యాలు అనుభవాలు కలగటం మొదలవుతాయని గ్రహించండి. అంతెందుకు. నాకు గత జన్మలో అన్నీ కూడా భూలోకమునకు సంబంధించినవే .ఈ లోకం నుండి విముక్తి కలిగి గురుగ్రహ దృశ్యాలను చూపించడం చేస్తోంది కదా. నిజములాంటి అనుభవాలు కలలాంటి నిజం. నిజంలాంటి కల అనుభవాలు అన్నమాట. కాకపోతే ఇలాంటి గ్రహలోక జన్మలు ఉంటాయని అరవింద యోగి స్వయంగా చెప్పడం జరిగినది. పైగా రామకృష్ణ పరమహంస పరమపదించిన తర్వాత తన భార్య అయిన శారదాదేవికి సూక్ష్మశరీరధారిగా కనిపించి నేను చనిపోలేదు. మరణము అంటే ఒక గది నుండి మరొక గదిలోకి వెళ్లడం అని గ్రహించు అని చెప్పడం జరిగింది కదా. అంటే మనకి గత జన్మలు ఉన్నట్లుగానే భవిష్య గ్రహలోక జన్మలు కూడా ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తోంది కదా. ఇది ఎప్పటికీ అంతం కాదని అంతం అవ్వాలంటే మన సాధనలు అంతిమంగా వచ్చే బలహీనతను దాటాలని అది దాటటం ఎవరికీ సాధ్యం కాదని ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక బలహీనతతో పుడుతున్నారని అలాగే ఏదో ఒక బలహీనత కోసం మరణమును పొందుతున్నారని గ్రహించాను. 
గురుగ్రహ నా భవిష్య జన్మల వివరాలు:
ఇంతకీ నా భవిష్యత్తు జన్మలు ఏమిటి అంటారా? గురుగ్రహ లోకవాసుడిగా నా సూక్ష్మ శరీర భవిష్యత్ జన్మలలో మూడింటిని మాత్రమే నేను తెలుసుకొనే ప్రయత్నం చేశాను. అందులో మొదటిది ఆడపిల్లలను వేధించే పోకిరి జన్మ.రెండోది బాధ్యతాయుతమైన మిలట్రీ ఆఫీసర్ జన్మని డిటెక్టివ్ ఆఫీసర్ జన్మ అని మూడవది కోతులను ఆడించే జన్మ అని నేను గ్రహించాను. విచిత్రమేమిటంటే ఈ మూడు జన్మలలో కూడా ప్రస్తుత భూలోక సంబంధ జన్మలకి అనుసంధానమై ఉన్నాయి. ఎలా అంటే ఈ జన్మలో సాధన కోసం స్త్రీల మాయలుగా వచ్చిన సుమారు 148 స్త్రీ మూర్తులను కాదనడం జరిగినది. వీరంతా నన్ను కోరి వచ్చినారు. నేను వారి కోరిక తీర్చలేదు. వ్యామోహంలో పడేవాడిని కదా. వీరి కోరిక తీరకపోవడంతో వలన అది కాస్త వీరికి ప్రారబ్ద కర్మగా నాకు భవిష్యత్తు జన్మగా ఏర్పడినది. అంటే గురు గ్రహ లోకమునందు పోకిరి వేష జన్మ. వీరందరిని ఆ జన్మలో నేను వెంటపడతాను. ఎందుకంటే ఈ జన్మలో ఈ లోకంలో నా వెంట పడుతున్నారు కదా. అప్పుడు నా భవిష్యత్ జన్మలో వీరి వెంటపడి నా నా చంకలు నాకుతానని నాకు అర్థమైనది. అంటే శ్రీరాముడు అవతారములో ఉన్నప్పుడు ఈయన చూసిన మునులు మహర్షులు అంతా కూడా మోహము చెంది శరీర స్పర్శ ఆనందమును కోరితే దానికి శ్రీరాముడు వారితో అయ్యల్లారా ప్రస్తుతం జన్మలో నేను ప్రాతివత్య ధర్మం లో ఉన్నాను. ఈ స్పర్శ ఆనందమును కోసం ఆ భవిష్య  శ్రీకృష్ణ జన్మ అవతారములో మీరందరూ కూడా పదహారు వేలమంది గోపికలుగా అవతరించండి. అప్పుడు మీకు కావలసిన విధంగా ఆనందం పొందండి అని దీవించే సన్నివేశ ఘట్టము నిజమేనని నా స్వానుభవం ద్వారా తెలిసినది.

అలాగే ఈ జన్మలో సాధన పరిసమాప్తి సమయములో ఒక లవ్ సింబల్ మీద ఉన్న రెండు రాజహంసలున్న బొమ్మ ,ఒక కోతి బొమ్మ, ఒక తుపాకి బొమ్మ రావడం జరిగినది. కోతి బొమ్మ నిజం కోతి లాగా వివిధ రకాల యాక్షన్స్ చేయడం చేస్తుంది. అలాగే ఇది తుపాకి బొమ్మ కూడా నిజమైన తుపాకీ జిరాక్స్ కాపీ లాగా ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. ఇవి ఎందుకు వచ్చినాయో ఆనాడు నాకు తెలియలేదు. ఈనాడు తెలిసింది. ఈ మూడు కూడా అనగా  ప్రేమికుడిగాను, కోతిని ఆడించేవాడు గానూ, డిటెక్టివ్ ఆఫీసర్ గానూ గురు గ్రహ భవిష్య జన్మ తాలూకా ప్రారబ్ద కర్మల సంకేత వస్తువులని తెలుసుకునేసరికి నా బుర్ర తిరగటం మొదలైనది. దానితో నేను కాస్త భవిష్య జన్మ వస్తువులు వస్తున్నాయని గ్రహించి వాటిని సేకరించడం ఆపివేశాను. అలాగే నా భవిష్యత్తు జన్మలు తెలుసుకుని యోగనిద్రలో నా సూక్ష్మశరీరం చేయడం కూడా ఆపి వేశాను. ఎందుకంటే ఈ గురుగ్రహము లోని సూక్ష్మ శరీర యానం చేసే ప్రయత్నంలో నా సూక్ష్మ  శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగితే అంతటితో ఆగిపోతే అక్కడ అది ఆగి పోతే నా స్థూల శరీరమునకు భూలోకమందు చితి పెట్ట వలసి వస్తుందని అనే భయం బలహీనత వలన నా భవిష్య జన్మ ల వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఆపివేయడం జరిగినది. ఇక్కడ కూడా భయము అనే బలహీనత నేను దాటలేకపోతున్నాను. నా భవిష్య గురుగ్రహ జన్మలో యోగ సాధన చేస్తే అక్కడ ఉన్న శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వస్తే భయము అనే బలహీనతకు గురవుతాయని ముందుగా తెలిసిపోయింది కదా. భూలోకములో కామగుణ బలహీనతకు గురి అయితే గురుగ్రహ లోకమునందు భయము బలహీనతకు గురవుతారని తెలిసిపోవడంతో భవిష్యత్తు మీద కిక్కు దొబ్బినది. 

నిజానికి భవిష్యత్ జ్ఞాన అనుభవాలు అన్ని కూడా అనుష్క నటించిన "వర్ణ" సినిమాకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమా యందు చూపించిన భవిష్య జన్మల వాతావరణాలు నేను నా భవిష్యత్ లో అదే వాతావరణ దృశ్యాలు చూడడం జరిగినది. అంటే నాకంటే ముందుగానే ఈ వర్ణ సినిమా కథ రచించిన రచయిత తన భవిష్యత్ జ్ఞానం పొంది ఉండాలి. మంచి కథ కోసం ఆయన తీవ్రంగా పరితపించడం వలన ఆయన మెదడు కాస్త పరిమిత స్థితిని దాటి పరిణితి చెంది ఉండటం వలన ఈ గ్రహాంతర వాసుల జీవన విధాన దృశ్యాలు ఆయనకు ఙ్ఞాన స్పురణ వచ్చి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే మూలాధార చక్రము కాస్తా భవిష్య జన్మలు అయితే బ్రహ్మరంధ్రంలోని కృష్ణ చక్రం కాస్తా గత జన్మల చక్రాల బంధనాలని అంటే ఈ రెండు భూత భవిష్య చక్రాలు కలిసి సాలగ్రామ శిలగా ఏర్పడినాయని అనగా లక్ష్మీనారాయణ సుదర్శన చక్రాలు కలిసి ఒక విష్ణు సాలగ్రామ శిలగా మన మెదడు కూడా కొత్త పాత జన్మల జ్ఞాపకాలతో చిన్న మెదడు పెద్ద మెదడు అభివృద్ధి చెందినది. ఈ రెండు చక్రాల పరిభ్రమణము వలన మన మెదడులో అప్పటిదాకా నిక్షిప్తమైన జ్ఞాపకాలను పాతవాటిని కొత్తవాటిని గుర్తుకు తేవడం జరుగుతోంది. నిజానికి నా భవిష్య జన్మలు గురుగ్రహ జన్మలు కూడా నేను చూస్తున్నాను అంటే అవి కూడా గత జన్మలే కదా. నేను అక్కడ పుట్టక ముందే నా అవతారములను చూస్తున్నాను అంటే అది నా భవిష్య జన్మ కానట్లే కదా. నా గతమే కదా. కాకపోతే రాబోవు కాలంలో ఈ గ్రహాంతరవాసిగా జన్మలు ఉంటాయి అన్నమాట.పూర్వము 100 సంవత్సరాల క్రితం అమెరికా కు వెళ్లాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది. అప్పుడు అక్కడ విశేషాలు వింతలు ఎవరైనా చెబుతూ ఉంటే అది చాలా గొప్ప విషయంగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఒక్కరోజులోనే అమెరికా వెళ్లి అక్కడ సంగతులు వింతలు చూసే స్థాయికి రావడంతో దేశాల సంచారము మీద అందరికీ దాని మీద ఆసక్తి తగ్గింది. అలాగే రాబోయే ఆరు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక్క రోజుల్లో అమెరికా దేశము వెళ్ళినట్లుగా భూలోకము నుండి వేరే గ్రహ లోకాలకు వెళ్లడం చాలా మామూలే అవుతుంది. ఇది ఇప్పుడు కొత్తగా ఉండవచ్చును. రాబోవు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఈ గ్రహాంతరయానము కూడా పాతదే అవుతుంది కదా. ఒకప్పుడు అమెరికా దేశ ప్రయాణం కొత్త. ఇప్పుడు అది రోత. అలాగే ఈ గ్రహాంతరయానాలు అంతేనని నాకు అర్థమైనది. కాలచక్ర పరిక్రమంలో మన మెదడు పరిణామ స్థితిని బట్టి భవిష్య జన్మల సూచనలు ఉంటాయని నేను గ్రహించాను. అంటే మన మెదడులో గత జన్మలు ప్రస్తుత జన్మలు భవిష్యజన్మలు  జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మన సాధన పరిణామము బట్టి అవి మనకి తగ్గట్టుగా ఆ దృశ్యాలను మన మెదడు కాస్త ధ్యాన అనుభవాలుగా వివరంగా చూపించడం జరుగుతుంది. ఇది ఎన్నటికీ ఆగదు. నిరంతరంగా ఏదో ఒక అనుభవం చూస్తూనే ఉంటుంది. అది బహుశా భవిష్య జన్మది కావచ్చును లేదా గతజన్మ జ్ఞాపకాలు కావచ్చును. అంటే మన మెదడులో జ్ఞాపకాల  రైలు ఒకటి ఉంటుంది. అందులో మన పంచ శరీరాలతో ప్రయాణం చేస్తూ ఉన్నాము. దీనికి ఐదు పెట్టెలు మాత్రమే ఉంటాయి. ప్రతి పెట్టెలోను పంచ శరీరాలు అలాగే భూత భవిష్యత్ వర్తమాన జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకొని మరొక పెట్టెలోనికి మోక్షమనే మరణముతో వెళ్లడం జరుగుతుంది. కానీ ఎన్నటికి ఈ రైలు ప్రయాణం ఆగదు. ఆగబోదు. అంతులేని కథ. అంతులేని ప్రయాణం అన్నమాట. ఈ పెట్టెలో మనం ఎప్పుడూ ప్రశాంత స్థితిలో మోక్షస్థితిలో సహజ స్థితి లోనే ఉంటున్నాము. కానీ నిశ్చల స్థితిలో ఉండక ఈ పెట్టెలోని కూర్చునే కుర్చీలలో స్థానాలు మార్చుతున్నాము. ఒకసారి కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటే మరొకసారి పెద్ద తలుపు దగ్గర ఉన్న కుర్చీ లో కూర్చుని దగ్గర కూర్చుని ఉన్నాము. ఒకసారి కూర్చుంటే మరొకసారి పడుకుంటున్నాము. ఇలా వివిధ భంగిమలలో వివిధ ఆసనాలు వేస్తూ ప్రయాణం సాగిస్తూ బయట ఉన్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఇది కూడా సాధన ధ్యానం అనుభవాల ద్వారా చూస్తూ మురిసిపోతూ ఆనందపడుతూ బాధపడుతూ రైలు ప్రయాణంలో నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నాము. ప్రశాంత వైరాగ్యము కలిగితే సాధన పరిసమాప్తి పేరుతో మోక్షము పొందిన నామని భ్రమలో మరొక పెట్టెలోనికి అనగా భవిష్యత్ జన్మగా ఒక లోకవాసి నుండి మరొక లోకవాసిగా మారుతున్నారు అన్నమాట. అక్కడ కూడా గత జన్మలో ఒక లోకవాసిగా ఏమేమీ చేసినామో వాటిని అపస్మారక స్థితి పొందటం వలన మర్చిపోయి చేసిన వాటిని తిరిగి తిరిగి చేస్తున్నామని గ్రహించండి. అంటే చేసే ప్రతి పనిలో కొత్తదనం వెతకటం అన్నమాట. పళ్ళు రాలగొట్టుకోవడానికి గత జన్మ అయితే ఏమిటి భవిష్య జన్మ అయితే ఏమిటి? అవే కష్టసుఖాలు కదా. ఇక్కడ అమ్మతో దెబ్బతింటే అక్కడ ఆ లోకము అమ్మాయితో దెబ్బలు తినడం జరుగుతుంది. ఎక్కడైనా దెబ్బతినటం కామనే కదా. ఎవరు కొడితే ఏమిటి నా బొందా. నా బూడిద. భూలోకంలో దెబ్బలు తింటే ఏమిటి. గురుగ్రహము నందు దెబ్బలు తింటే ఏమిటి. బాధలో తేడాలు ఉండవు కదా. కానీ కొట్టేవారులో తేడాలు ఉంటాయి. అంతే తేడా. కాలచక్రము ఆపలేమా అంటే ఆపలేమని చెప్పాలి. ఎందుకంటే ఈ చక్రము ఆపేస్థితికి సాధకుడు చేరుకుని అక్కడ ఉన్న బలహీనత గుణ భావానికి గురి అయి బలహీనపడి రూపమును అంతం చేసుకోవాల్సిన చోట రూపాంతరం చెందుతున్నారు కదా. ఇది అందరూ చేస్తున్నారు. చేస్తారు. చేయబోతున్నారు. ఎందుకంటే బలహీనతలేని బలవంతుడు లేనట్లేనని గ్రహించండి. బలహీనత స్థితిని దాటాలని మానవుడు అలాగే మాధవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు. వీడు జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. దీని కోసం కొత్త యోగ సిద్ధాంతాలు అలాగే రాద్ధాంతాలు చేస్తూనే ఉన్నారు. కనిపెడుతూనే ఉన్నారు. బోల్తా పడుతూనే ఉన్నారు. అయినా కూడా ఆశలు చావటంలేదు. ఎలాగైనా ఈ బలహీనత స్థితిని దాటాలని ఈ కాలచక్రము ఆపివేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేము కూడా పవనానంద నవబ్రహ్మ యోగము అని అలాగే సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించడం జరిగింది. చివరికి ఈ రెండూ కూడా మన పూర్వ మహర్షులు తమ సాధనలో ఎక్కడికి వచ్చి ఆగిపోయినారో అక్కడిదాకా వచ్చి ఆగిపోవటం అదే బలహీనత లక్షణాలు దాటలేకపోవటం మా ఇద్దరిని కలిసి వేసినది. ఈ సాధన పరిసమాప్తి కోసం మేము ఇద్దరం గత 30 సంవత్సరాల నుండి మానసిక యోగిగా మారి అందరియందు అన్నింటియందు స్మశానవైరాగ్యాలు పెంచుకుని అందరినీ దూరం చేసుకుని అన్నిటినీ వదులుకొని సాధించినది ఏముంది. నా బొందా. నా బూడిద. భూలోక వాసి నుండి వేరే గ్రహం వ్యక్తిగా మారడానికి ఈ మా సిద్ధాంతాలు ఉపయోగపడినాయి అంటే ఏమి అనాలో ఏమి చేయాలో అర్థం కాని అయోమయ స్థితి అన్నమాట. కాకపోతే సంపూర్ణముగా భూలోక కర్మలు కర్మశేషము లేకుండా నాశనమవుతాయని మేమిద్దరము గ్రహించాము.కాబట్టి మా ఇద్దరికి భూలోకము నుండి విముక్తి కలిగి జిజ్ఞాసి కాస్త బుధ గ్రహలోకవాసిగా నేను కాస్త గురు గ్రహలోకవాసిగా అవతారాలు ఎత్తక తప్పదు కదా. కాబట్టి మీరు కూడా ఈ భూలోకము నుండి విముక్తి కలగాలంటే మేము చెప్పిన సుదర్శన చక్ర అభిషేక పూజ ఓంకార శంఖనాదం ప్రతినిత్యము జీవితాంతం చేసుకోండి. మీకున్న పూర్వ కర్మలు అన్నీ కూడా కర్మశేషము లేకుండా సంపూర్తిగా నాశనమవుతాయి. తద్వారా మీ ప్రారబ్ద కర్మను బట్టి వేరే గ్రహాల వాసిగా అవతారమెత్తడం జరుగుతుంది. 99.99 శాతం మాత్రమే మీ ప్రారబ్ద కర్మ లు నివారణ అవుతాయి. మిగిలిన 0.01% బలహీనత ప్రారబ్ద కర్మ తగ్గట్లుగా మీరు ఆయా గ్రహలోకవాసిగా మరొక శరీరముతో భవిష్య జన్మ ఎత్తటం జరుగుతుంది అన్నమాట. ఇప్పటివరకు వచ్చిన సాధన సిద్ధాంతాలు అన్నీ కూడా 40% నుండి 80% వరకు మాత్రమే ప్రారబ్ధకర్మ నివారణ చేస్తే మా సిద్ధాంత విధానము 99.99% వరకు సంపూర్తిగా కర్మ నివారణ చేస్తున్నాయి. కానీ 0.01% బలహీనత అనే ప్రారబ్ద కర్మ మాత్రం మిగిలి పోవడం జరుగుతుంది. ఇది లేకపోతే మేము కాస్త రూపాంతరం చెందవలసిన చోట రూపాలు అంతం అయ్యేవి.కానీ బలహీనత కర్మ గుణమునకు స్పందించకుండా ఎవరు కూడా ఉండలేరని మా దృష్టికి వచ్చింది. ఈ బలహీనతకు మేమిద్దరం కూడా స్పందించడం వలన సంపూర్ణ మోక్షానికి అర్హత యోగ్యతను కోల్పోయి కేవలం స్థూల శరీర కపాలమోక్షం కృష్ణ బిలముగా నేను మారితే ఈ బిలము నందు శూన్యబ్రహ్మగా నా మిత్రుడైన జిఙ్ఞాసి మిగిలిపోవడం జరిగినది. దీనికి ఆనందపడాలో బాధపడాలో తెలియని స్థితి. 100% లో కేవలం 0.01% శాతం బలహీనత గుణమువలన మా ఇద్దరి యోగసాధన ప్రస్తుతానికి ఆగిపోవడము మేమిద్దరం కూడా జీర్ణించుకోలేని స్థితి. ఏమి చేయాలో అర్థం కాని స్థితి.ఈ కర్మ చక్రమును అలాగే కాలచక్రము ఆపడం ఆగిపోవడం అనేది ఎన్నటికీ ఉండదని అది నిరంతరంగా అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా భూత వర్తమాన భవిష్యత్ జన్మలలో పరిభ్రమణ చేస్తూనే ఉంటుందని దాని వలన అసత్యమైన విశ్వ సృష్టిలో జీవనాటకము కాస్త సత్యంగా నిజంలాంటి కలతో నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని గ్రహించడం జరిగింది.

భవిష్యత్ జన్మలు లేకుండా చేసుకోవచ్చు కదా అన్నప్పుడు:

కాకపోతే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే యోగనిద్ర సాధన ద్వారా గత జన్మల ప్రారబ్ధ కర్మ నివారణ చేసినప్పుడు అలాగే భవిష్యత్ జన్మల కర్మ నివారణ చేసుకుని భవిష్యత్ జన్మలు లేకుండా చేసుకోవచ్చు కదా అన్నప్పుడు దీనికి సమాధానంగా భూలోకములో ఉన్న భూత వర్తమాన భవిష్యత్తు ప్రారబ్ద కర్మలను యోగ సాధన ద్వారా సమూలంగా నాశనం చేసుకోవచ్చును. కానీ ఇవి భూలోక భవిష్య జన్మలు కాదు. వేరే లోక భూత వర్తమాన భవిష్యత్తు జన్మల యొక్క ప్రారబ్ద కర్మలు అని గ్రహించండి. దానితో ఈ కర్మలు నాశనం కావాలంటే ఆయా గ్రహ లోకమునందు ఆయా శరీరంతో జన్మించి ఆయా కర్మలను నాశనము చేసుకోవాల్సి ఉంటుంది. భూలోకంలో ఎవరైనా రుణము ఉన్నా లేదా రుణము తీర్చుకోవాలన్న వీలుపడుతుంది. తద్వారా ఆయా కర్మ కాస్త బంధనము కాకుండా బంధ విముక్తి అవుతుంది. అదే వేరే గ్రహ వాసికి ఈ లోకవాసితో ఎలాంటి బంధము ఉండదు. వాడు ఆలోకవాసుల వారికి మాత్రమే బంధం అవుతాడు. కాబట్టి మనం కూడా ఆయా కర్మ బంధనాలను నివారణ చేసుకోవాలంటే ఆ లోకంలో ఉండే ఆయా కర్మ బంధనాలు తిరిగి యోగసాధన ద్వారా గుర్తు చేసుకోవలసి ఉంటుందని గ్రహించండి. అప్పుడు ఆలోక శరీర కపాలమోక్షం ప్రాప్తి కలుగుతుంది. ఇలా పంచ శరీరాల కపాల మోక్షం ప్రాప్తి పొందవలసి ఉంటుంది. ప్రతిసారి వచ్చే కపాలమోక్షం ప్రాప్తి సమయంలో కలిగే బలహీనతను దాట కలిగితే మన సాధన పరిసమాప్తి అయినట్లే. నిరంతరంగా తిరిగే అన్ని రకాల చక్రాలు అనగా కాలచక్రము కృష్ణ చక్రము అండ చక్రం పిండ చక్రం బ్రహ్మాండం చక్రం బ్రహ్మ చక్రములు అన్ని కూడా ఆగిపోతే చలన స్థితిలో ఉన్నట్లు కనిపించే విశ్వ జగత్తు అంతా కూడా నిశ్చల స్థితిలోకి వెళ్లిపోయినట్లు కనపడుతుంది. అదియే సంపూర్ణ కపాలమోక్షం స్థితి అన్నమాట. సాధకుడు తనకున్న బలహీనతను దాటవలసి ఉంటుంది. దాటలేడని తెలుస్తోంది. కేవలము దాటాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విశ్వము ఏర్పడక ముందు నుండి ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.విశ్వాంతము కూడా సంపూర్తిగా జరగటం లేదు. ప్రకృతి ప్రళయాలు ఎన్నో ఈపాటికి వచ్చి వెళ్లినాయి. గుడ్డు నుండి తిరిగి ఎన్నోసార్లు ఈ విశ్వ సృష్టి జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంటుంది .గమ్మత్తయిన విషయం ఏంటంటే ఆది యుగములో అన్ని శరీరాలతో అన్ని గ్రహ లోకాలయందు మనమంతా ఏకకాలంలో పుట్టడం పెరగడం చనిపోవడము జరిగిపోయాయి. ఇప్పుడు మనము చూస్తున్నదంతా కూడా 36 కపాలాల రికార్డు చేసిన రికార్డు దృశ్యాలు అని గ్రహించండి. పాతాళ లోకాలు నుండి సప్త ఊర్ధ్వలోకాలు దాకా ఈ విధానం జరిగినది. అధో పాతాళలోకాల యందు రాక్షస జన్మలు ఉంటే అలాగే భూలోకమందు జీవ జన్మలు అలాగే సప్త ఊర్ధ్వ లోకాలు యందు దైవజనులు ఏర్పడినాయి అని గ్రహించండి. కాకపోతే ఆయా లోకాల యందు ఆయా శరీర కపాలమోక్ష స్థితి స్థాయికి సాధకుడు సాధన చేస్తే గానీ ఆయా లోక పాప కర్మలు సంపూర్తిగా నాశనం అవ్వవు. ఇవి అయితే గాని మరొక రికార్డు దృశ్యాలు మనకి కనిపించవు అన్నమాట. ఇలా ఎప్పుడైతే 36 కపాల రికార్డు దృశ్యాలు సంపూర్తిగా చూపించడం అదే ధ్యాన అనుభవాలు అనుభూతులు ఇవ్వటం ఆపివేస్తాయో నాటి క్షణమే మనము బలహీనత అనే గుణ మాయను దాటిన మోక్షగామి అవుతామని గ్రహించండి. 

ఇది జరిగే ప్రతి పని కాదని ఆనాటి మన పూర్వీకులు మహర్షులు ఓంకారం చిహ్నము నందు చెప్పకనే చెప్పి ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఓంకార చిహ్నమును సుదీర్గముగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక విషయం తెలుస్తుంది. అది ఏమిటంటే ఈ చిహ్నము నందు ఉన్న గుండ్రని వృత్తము అతి చిన్న సందు వంటి ఖాళీ ఉంచినట్లుగా కనపడుతుంది.అంటే ఆ వృత్తము ఆసాంతము గుండ్రముగా లేనట్లే అన్నమాట. ఈ చిన్న సందుయే సాధకుడు బలహీనత లక్షణాలు సూచనయని ఆ వృత్తమునకు మూడు అంకెతో అనుసంధానం ఇలా ఏర్పాటు చేసినారు. మూడు అంటే త్రిగుణాలు కదా. ఎప్పుడైతే సాధకుడు తన పరిసమాప్తి సమయంలో బలహీనత అనే లక్షణం వస్తుందని దానిని దాటాలని అప్పుడే అర్ధచంద్రాకారంలో ఉన్న అనగా బ్రహ్మరంధ్రము లో ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము రంధ్రము మూసుకుని పోతుందని అప్పుడు ఈ చక్రం తిరగటం ఆపేస్తుందని తద్వారా కదిలే విశ్వమంతా కూడా నిశ్చలస్థితి లోకి వెళ్లి పోతుంది అని చెప్పడం జరిగినది. ఒకవేళ మీరు ఈ బలహీనత లక్షణమునకు గురి అయితే ఆ విధంగా మనలో త్రిగుణాలు మాయ మొదలై అంతరించే విశ్వ సృష్టి లో సృష్టి స్థితి లయ ప్రక్రియ ప్రారంభం అవుతాయని చెప్పకనే చెప్పినారు. ఆనాటి పూర్వీక మహర్షులే చేతులెత్తేసినప్పుడు ఈనాటి మహర్షి వల్ల ఏమి జరుగుతుంది. నా బొందా. నా బూడిద. ఏదో అనుకుని సాధన చేస్తే ఏదో అయినట్లుగా ఉంది. సప్త సముద్రాలు ఈది ఇంటి వెనక ఉన్న మురుగు కాల్వలో పడి చనిపోయినట్లుగా ఉంది. 100% సాధనలో 99.99% సాధన పూర్తి చేసి 0.01% శాతము మిగిలిపోవడం అంటే ఏమిటి? మా ఖర్మ కాకపోతే ఏమిటి? ఒక మిల్లి సెకండ్ లో గోల్డ్ మెడల్ కోల్పోయిన ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అలా మా ఇద్దరి పరిస్థితి ఉందని నాకు అనిపించింది. కాకపోతే ఏమిటి? 0.01% శాతంలో రూపం అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందటం ఏమిటి? అంతము కావాల్సిన చోట ఆరంభం కావడం ఏమిటి? ఆలోచించండి. నిజమే కదా. కొన్ని కోట్ల గత జన్మల సాధన ఫలితము అలాగే ఈ జన్మలో 27 సంవత్సరాల సాధన ఫలితం కాస్త 0.1% దగ్గర బలహీనత పుణ్యమాని గంగపాలు అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నా బాధ ఆవేదన నీకు అర్థం అవుతాయి. సంపూర్ణ కపాల మోక్షమును పొందాలని IAS కావాల్సిన దానిని కూడా వదులుకొని SAIగా మారి పరమహంస స్థితి యందు పరమ గురువుగా శూన్య బ్రహ్మ సాధన స్థాయికి చేరుకుని 0.01% దగ్గర యొక్క బలహీనత వలన కేవలం స్థూల శరీర కపాలమోక్షం పొందటం ఏమిటి? మిగిలిన నాలుగు విధాలైన శరీరాలు అయినాసూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలు మిగిలిపోవడం ఏమిటి? చెప్పండి. నా బొందా. నా బూడిద కదా. అసలు బలహీనత గుణమును నిజంగానే జయించలేమా? నిజంగానే బలహీనతలేని బలవంతుడు లేడా? మరి ఆంజనేయస్వామి మించిన బలవంతుడు మరొకడు లేడు అని చెబుతారు కదా. మరి ఆయన బలహీనత రామనామమే కదా. అది ఎక్కడ జరుగుతున్నా ఎక్కడ కనపడినా మనవాడు కాస్త చేస్తున్న పనిని ఆఖరికి యుద్ధమైనా కూడా దానిని ఆపివేసి ఆ రామనామస్మరణ మత్తులో జోగుతూనే ఉంటాడు కదా.  అంటే ఈ లెక్కన చూస్తే బలహీనతకి గురికాని మహాత్ముడు లేనట్లే కదా. 

గురుగ్రహ సంచారం నా ధ్యాన అనుభవాలు నిజమేనా?

అసలు నాకు కలిగిన గ్రహ లోక సంచార అనుభవాలు ఎవరికైనా కలిగినాయా అనే సందేహం వచ్చింది. అప్పుడు పుస్తక గ్రంధాలు తిరగేస్తే ఒకచోట అరుణాచల భగవాన్ రమణమహర్షి వారు ఒక భక్తునితో “నాయనా! నాలాంటి వారు ఏడుగురు ఆయా గ్రహ లోకాలలో నేను మీకు చెప్పినట్లుగా జ్ఞానబోధ చేస్తూ ఉంటారని తెలుసుకో” అని తన ధ్యాన అనుభవం చెప్పడం జరిగినది. అంటే ఈయన ఏకంగా సప్త గ్రహ లోకాలలో తనలాంటి ఏడుగురుని చూసినట్లే కదా. 

అలాగే ఒక పుస్తకమునందు గురు అనుగ్రహం వలన కుజ గ్రహ సంచారం చేసినట్లుగా ఒక లామా తన ఆత్మ కథ యందు చెప్పడం జరిగినది. అంటే గ్రహసంచారము నిజమే కదా. 

అలాగే విక్రమాదిత్యుడు అనే రాజు ఇంద్రలోకమునకు వెళ్లి ఇంద్రుడు సమస్యలనుతీర్చి వచ్చినాడని చెప్పిన కథ నిజమేనని అలాగే భక్త తుకారాం అనే భక్తుడు తన అంతిమ కాలంలో వైకుంఠము నుండి ఒక పుష్పక విమానం రావటం అనేది కూడా నిజమేనని నేను గ్రహించాను. అంటే ఈ లెక్కన చూస్తే గ్రహాలు దైవ లోకాలు ఉన్నాయి. కాకపోతే అవి భౌతిక నేత్రాలకు కనిపించవు. కేవలం త్రినేత్రము ద్వారా మాత్రమే వాటి స్వరూపాలు చూడగలము.అలాగే సశరీరముతో లేదా సూక్ష్మ శరీరంతో ఆయా గ్రహాల సంచారం చేసే అవకాశాలు ఉన్నాయని నాకు కలిగిన భవిష్య జన్మ గురుగ్రహ సంచారం ధ్యాన అనుభవాలు నిజమేనని  గ్రహించాను. 
దైవ లోకసంచారాలు కూడా ఉంటాయా?:

అలాగే ఈ గ్రహాల సంచారం కాకుండా దైవ లోకసంచారాలు కూడా ఉంటాయా? అవి కలుగుతాయా అనే సందేహము నాకు వచ్చినది. దీని మీద పరిశోధనలు చెయ్యడం ప్రారంభించాను. అసలు ఈ గ్రహాల సంచారం అనేది బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు ప్రవేశించినప్పుడు దాని అంచు చివర గురుగ్రహ లోకప్రవేశ ద్వారం ఉందని గ్రహించాను. అంటే ఈ లెక్కన ప్రతి కృష్ణబిలమునకు అనుసంధానంగా ఆయా గ్రహాల యొక్క ప్రవేశ ద్వారాలు ఉంటాయి అని గ్రహించాను. అసలు నేను నా స్థూల శరీర బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించిన తర్వాత నాకు 11 రకాల కీ చైన్ లు వచ్చాయని మీకు తెలుసు కదా. గుడ్లు పెట్టే జంతువులు 5 జంతువులు అలాగే పిల్లలు పెట్టే జంతువులు అయిదు మరియు ఒక మానవ కపాలం అన్నమాట. అదేంటి జోగులాంబ తలలో ఉన్న జంతువులు అనగా బల్లి- తేలు- గబ్బిలము- గుడ్లగూబ- కపాలము అలాగే పాములు, రాజహంసలు, కోతి, సింహము అనే జంతువులు అలాగే పరిణతి చెందిన బ్రహ్మఙ్ఞాని కపాలముతో మొత్తం పదకొండు జంతువులు కపాలాలు వచ్చినాయి. అలాగే ఆ తర్వాతనే నాకు గురుగ్రహ సంచార అనుభవాలు కలిగాయి. ఒకవేళ ఈ 11 కపాలాలు అలాగే ఈ గురు గ్రహానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఒకదాని తర్వాత మరొకటి రావడమేమిటి? ఇలా 11 కపాలాలు అయితే నవగ్రహాలు అనగా సూర్యుడు- చంద్రుడు- కుజుడు- రాహువు- కేతువు- శని- శుక్ర- గురువు- బుధుడు ఇలా తొమ్మిది రావడం చూస్తుంటే ఇవి కాస్త 36 కపాలాలలో 1, 3, 5, 7, 9, 11 వరుస కపాలాలలో 11 వ, 9 వ కపాలాలు సంకేతాలు కాదు కదా. 11 కపాలాలు రావటం అలాగే నవగ్రహాలు రావడం బట్టి చూస్తే అది నిజమే అని తెలుస్తోంది. పైగా ఈ పదకొండు కపాలాలు వరుసగా భూ సంబంధ జంతువులే ఉన్నాయి. పైగా ఇవి స్థూల శరీరమునకు సంకేతాలు కదా. ఇక నవగ్రహాలు అనేవి సూక్ష్మ శరీరమునకు చెందిన సూక్ష్మ కర్మలకి సంకేతాలు. అందుకే నేను కాస్త సూక్ష్మ శరీర యానంతో గురుగ్రహ సంచారం చేసి నా భవిష్యత్ చూసుకోవడం జరిగినది. ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా ఈ రెండు స్థితులు(11, 9) కూడా 36 కపాలాలు వరుసకి సంకేతమని తెలిసిపోతుంది కదా. అలాగే ఇందులో వచ్చే మూడో వరుసలో అనేది భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక అనే ఊర్ధ్వ దైవ లోకాలకి సంబంధించినవి అన్నమాట. రాబోయే కాలంలో ఈ లోకాల సంచారము కూడా కారణం శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు. అదేమిటంటే ఈ సప్త లోకాల్లో మళ్లీ భూలోకం వచ్చింది కదా. మరి భూలోక స్థూల కర్మలకు 11 కపాలాలు అన్నారు కదా. సప్త లోకాల్లో వచ్చే భూలోకము అలాగే 11 కపాలాలలో వచ్చే భూలోక స్థూల శరీరము కర్మలు ఒక్కటే అవ్వాలి కదా అన్నప్పుడు సాధకుడు పదకొండు కపాలాలలోని భూలోకంలో స్థూల శరీర కర్మలను నివారణ చేసుకుంటున్న సమయంలో ముక్తి రూపములో అర్ధాంతర కర్మ నివారణ స్థితి పొంది వచ్చే నవ గ్రహ లోకాలను దాటి ఆ తర్వాత వచ్చే సప్త దైవ లోకాలకి చేరుకోవడం జరుగుతుంది. అంటే వీరి కర్మ నివారణ 80% మాత్రమే పూర్తి చేసి 20% శాతం మిగుల్చుకునే వారికి నాలుగు అవస్థలు ఉన్న ముక్తి మార్గాల్లో అశాశ్వత మరణము పొందుతారు అన్నమాట. వీరిని కారణజన్ములు అంటారు. మిగిలిపోయిన 20% శాతం స్థూల శరీర కర్మల నివారణ కోసమూ తిరిగి భూలోకమందు కారణ జన్ముడుగా సాధన జన్మ ఎత్తుతున్నారు. వీరు ఎప్పుడైతే తమకున్న 20% నివారణ చేసుకుంటారో వారు కాస్త భూలోక పూజ్యులై దైవ సమానులు అవుతారు. ఇలాంటి వారే రామకృష్ణపరమహంస, భగవాన్ రమణ మహర్షి, షిరిడి సాయి బాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి లాహిరి మహావతార్ బాబాజీ, అల్లా, ఏసు ప్రభు, మహమ్మద్ ప్రవక్త ,గురునానక్, బుద్ధుడు, జైనుడు అన్నమాట.వీళ్ళు ఇలా జన్మించడానికి కారణము తమకున్న 20% కర్మ నివారణ కోసమే అన్నమాట. దానితో తాము పొందిన దైవ ధ్యాన అనుభవాలతో జ్ఞాపకాలతో ఈ లోకము వారికి సిద్ధాంతాలు రూపంలో, మతాల రూపములో, సాధనల రూపంలో, గురువు ఉపదేశాల మార్గాల రూపంలో బ్రహ్మజ్ఞానం అందించడం జరిగినది. అంటే వీరు మొదట 80% శాతం మాత్రమే 11 కపాలాల స్థూల శరీర కర్మల నివారణ చేసుకుని అనుకోని విధంగా జీవన్ముక్తి పొందుతారు అన్నమాట. అప్పుడు వీరి బ్రహ్మరంధ్రములోని కృష్ణ బిలము యొక్క అంచు చివరన కుజ గ్రహ లోక ప్రవేశ మార్గం అనుసంధానమై ఉంటుంది. ఈ లోకమునందు సూక్ష్మశరీరముతో సాధన చేస్తూ మిగిలిన 20% శాతం స్థూల శరీరములో నివారణ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు వీరి లోకములోని కృష్ణ బిలము అంచున ఈసారి సప్త దైవ లోకాలలోని భూలోకము అనుసంధానమై ఉంటుంది. ఈ లోక ప్రవేశ మార్గము ద్వారా తిరిగి భూలోకమునకు వచ్చి మిగిలిపోయిన 20%శాతం స్థూల శరీర కర్మలను నివారణ చేసుకుని వివిధ పద్ధతుల్లో జీవ సమాధి చెంది లోక పూజ్యులుగా మారుతారు అన్నమాట. అంటే ముక్తిని పొందిన వారికి ప్రకృతిమాత కాస్త వీరికోసం నవగ్రహాలలో కుజ గ్రహమునకు తిరిగి అనుసంధానం చేసినది అన్నమాట. ఇలా రెండోసారి సాధనతో జన్మించిన వారికి మళ్లీ పునర్జన్మలు అలాగే పునఃకర్మలు లేని జన్మ కర్మ రాహిత్య స్థితిని పొంది అనగా 100% శాతములో 99.99% కర్మలను నివారణ చేసుకుని మళ్లీ నవగ్రహాల యందు ప్రవేశించడం అటుపై భూలోకము గాకుండా మిగిలిన దైవ లోకాల యందు ప్రవేశిస్తూ ఆయా కర్మలన్నీ నివారణ చేసుకుంటూ అన్ని రకాల కపాలాలని దాటుకుంటూ అనగా అన్ని లోకాలను దాటుకుంటూ చివరికి ఏకమూల కపాలమునందు శూన్య బ్రహ్మ సాధన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే భూలోకమందు స్థూల శరీర కపాలమోక్షంను పొందితే మళ్ళీ తిరిగి జన్మించే అవకాశం ఉండదని అదే నాలుగు ముక్తులను పొందితే మాత్రమే ఒక భూలోక కారణ జన్మ ఉంటుంది అని గ్రహించండి. ఇక వచ్చే నాలుగవ వరుసలోనే ఐదు కపాలాలు అలాగే 5వ వరుసలోనే ఉన్న మూడు కపాలాలు కలిపి ఎనిమిది కపాలాలు అనేవి ఇష్ట లోక కపాలాలు అన్నమాట. అనగా అష్టదళ పద్మమునకు సంబంధించిన హృదయ చక్రములోని ఇష్ట లోకాలు అన్నమాట. ఇందులో ఎనిమిది మంది మాత్రమే సంకల్ప శరీరముతో ఎనిమిది లోకాల యందు ఆవాసము చేస్తూంటారు.వీరిని అష్టవసువులు అంటారు. ఇక మిగిలిన ఆఖరి 6 వ వరుసలోని ఏకైక బ్రహ్మకపాలం పరమ శూన్యమునకు సంబంధించినది. ఇందులో ఆకాశ శరీరంతో శూన్య బ్రహ్మ ఆవాసం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ లెక్కన చూస్తే సాధకుడు కూడా కాస్త 36 కపాలములలో 11, 9, 7, 5, 3, 1 అనే ఏక స్థితికి చేరుకోవాలని తెలుస్తోంది కదా. అంటే 11 వ వరుస కపాలాలు అనేవి స్థూల కర్మలు అయితే 9 వ వరుస కపాలాలు అనేవి సూక్ష్మకర్మలు  అయితే 7వ వరుస కపాలాలు అనేవి కారణ కర్మలు అయితే 5+3=8 కపాలాలు అనేది సంకల్పం కర్మలు అయితే మిగిలిన ఆఖరి 6 వ వరుస అయిన ఏక బ్రహ్మకపాలం అనేది కర్మ శేషము అన్నమాట. అంటే సాధకుడికి సంపూర్ణ కపాలమోక్షం స్థితి కలగాలి అంటే ఈ 36 కపాలాలు యొక్క అన్ని రకాల కర్మలు కాస్త కర్మ శేషం లేకుండా చేసుకోగలిగితే కానీ సంపూర్ణ మోక్షమును పొందలేడు అన్నమాట. ఈ లెక్కన చూస్తే చిట్టచివరి ఏక బ్రహ్మకపాలం మనకు బ్రహ్మరంధ్రం లోని అంత్యంతిక బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమునకున్న బ్రహ్మరంధ్రం మూసుకుని ఉంటుంది. మిగిలిన వరుసలలోని కపాలాలుకి అనగా 3, 5, 7, 9, 11 బ్రహ్మరంధ్రం తెరుచుకుని ఉండటం వలన అది కాస్త ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండి ఉండాలి. ఎలా అంటే నాకు కలిగిన ధ్యాన అనుభవము ప్రకారంగా చూస్తే నా స్థూల శరీర బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు నా పంచ శరీరాలు ప్రవేశించటం ఇది కాస్త కోన్ ఆకారంగా ఉండటంవలన దాని అడుగున ఉన్న రంధ్రము వద్దకి మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలు కిందకి వెళ్లిపోతే నా స్థూల శరీరం కాస్త ఈ రంధ్రం వద్ద ఆగిపోవడంపైగా మా అమ్మగారి అంతిమ కోరిక అయినా తన అంతిమయాత్ర అయ్యేదాకా నేను ఉండాలనే కోరిక కోరటంతో తునాతునకలు కావాల్సిన నా స్థూల శరీరం ఈ కృష్ణ బిలమునందు ఉండి పోయినదని చెప్పడం జరిగింది కదా. కాకపోతే ఇది బతికున్న శవంలా స్థితి పొందిన శరీరముగా ఉన్నది అని గ్రహించండి. అప్పుడు మిగిలిన ఈ నాలుగు శరీరాలు కాస్త ఈ కృష్ణ బిలము అనుసంధానమైన గురుగ్రహ లోకమునకు ప్రవేశించినానని ఇప్పుడే నాకు తెలుస్తోంది. అంటే 0.01% బలహీనతయైన కామగుణ స్పందన వలన నా స్థూలశరీరం ఆగిపోయినది. ఆ తర్వాత మిగిలిన నాలుగు శరీరాలు కాస్త గురుగ్రహ లోకము భవిష్య జన్మలగా అవతరించినాయి అన్నమాట. ఈ లెక్కన చూస్తే సూక్ష్మ కర్మలను నివారణ చేసుకోవటానికి సూక్ష్మ శరీరంతో నవగ్రహాల యందు యోగ సాధన చేయవలసి ఉంటుంది. అనగా గురుగ్రహము తర్వాత శనిగ్రహము ఆపై బుధ గ్రహము అటుపై కేతుగ్రహము నందు ఆపై శుక్ర గ్రహమునందు ఆపై రవి గ్రహమునందు అలాగే చంద్రగ్రహము నందు అటుపై కుజగ్రహము నందు అటుపై రాహుగ్రహము నందు సూక్ష్మ శరీరంతో యోగ సాధన చేయవలసి ఉంటుంది అని గ్రహించండి. ఒకటి గుర్తుంచుకోండి. స్థూల శరీరము నందు సాధకుడు 0.01% బలహీనతలో ఏ బలహీనతకు గురి అవుతాడో దానికి తగ్గట్లుగా నవగ్రహాల్లో ఏదో గ్రహం అనుసంధానం అవుతుంది. అలాగే అందరికీ ఒకే బలహీనత ఉండదు. అలాగే అందరికి నాకు లాగా నవగ్రహాలు వరుస ఉండదు. నాకు నా కామగుణ  బలహీనత వలన గురుగ్రహ అనుసంధానం అయితే నా యోగ మిత్రుడైన జిజ్ఞాసికి తనకున్న బలహీనత వలన బుధగ్రహ అనుసంధానమయ్యాడని అనుగ్రహించండి. అలాగే అతనికి వరుసగా కేతువు- శుక్రుడు- సూర్యుడు- చంద్రుడు- కుజుడు- రాహువు- గురువు- శని గ్రహాలు అనుసంధానం అవుతాయి అని గ్రహించండి. అంటే సాధకుడు భూలోకములోని 48 లక్షల కర్మలను కర్మ శేషం లేకుండా పూర్తి చేసుకోగలిగితే అతడికి భూలోక విముక్తి కలిగి అటుపై అతనికున్న 0.01% యొక్క కర్మ శేషమైన బలహీనత బట్టి సూక్ష్మ కర్మల నివారణ చేసుకోవటానికి ఆయా గ్రహములకు అనుసంధానమై మిగిలిన అష్టగ్రహాలు అనుసంధానం అవుతాయి అన్నమాట. అంటే సాధకుడు ఈ గ్రహ లోకాలయందు సూక్ష్మ శరీరంతో జన్మించి ఆయా సూక్ష్మ కర్మలు నివారణ చేసుకుని చిట్టచివరి గ్రహం యొక్క కృష్ణ బిలము నందు ప్రవేశించినప్పుడు 0.01% శాతం యొక్క బలహీనత బట్టి దీనికి సప్త ఊర్ధ్వ దైవ లోకాలలో ఏదో ఒక లోకం అనుసంధానం అవుతుంది అన్న మాట. అప్పుడు సాధకుడి కారణ సంకల్ప ఆకాశ శరీరాలకు గూడిన కారణ శరీరం ఈ లోకాల యందు చేరి అక్కడ ఉన్న కారణ కర్మలను ఏడు లోకాలయందు నివారణ చేసుకుంటే చిట్ట చివరి దైవ లోకము యొక్క కృష్ణబిలం నందు ప్రవేశించినప్పుడు అక్కడ వచ్చే  0.01% శాతము యొక్క బలహీనతను బట్టి అష్టవసువులు ఉన్న ఇష్ట లోకాలు అనుసంధానం అవుతాయి. సాధకుడు ఈ లోకాలయందు సంకల్ప ఆకాశ శరీరాలకు కూడిన సంకల్ప శరీరధారిగాఈ లోకము నందు ఉన్న ఇష్ట కర్మలను నివారణ చేసుకోవలసి ఉంటుంది. ఇక ఆఖరి ఇష్ట లోకము యొక్క కృష్ణబిలం నందు ప్రవేశించినప్పుడు అక్కడ వచ్చే 0.01% యొక్క బలహీనత బట్టి ఆఖరిదైన ఏక బ్రహ్మకపాలంలో యందు అనగా పరమ శూన్యమునందు ఆకాశ శరీరములో ప్రవేశించి కర్మ శేషమైన ఏకైక ఆలోచనకు మనం నాశనం చేసుకుంటే గానీ సంపూర్ణ కపాలమోక్షం స్థితిని సాధకుడు పొందలేడు అన్నమాట. ఎప్పుడైతే ఈ కర్మ శేషమును సంపూర్తి చేస్తాడో అక్కడున్న అత్యంతిక  బ్రహ్మాండ కృష్ణబిలం నందు ప్రవేశించి సంపూర్ణ నిశ్చల స్థితి అనగా సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొందడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ ఒక్క బ్రహ్మకపాలంలోని కృష్ణబిలం నందు ఎలాంటి బ్రహ్మరంధ్రము ఉండదని ఉన్న రంధ్రము మూసుకొని ఉంటుంది అని గ్రహించండి. ఆ విషయం అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలు కృష్ణబిలం నందు తెరుసుకున్న రంధ్రము ఉంటే ఆఖరిదైన ఏక మూల బ్రహ్మకపాలం నందు ఎలా మూసుకుని ఉంటుంది అన్నప్పుడు ఒకసారి 36 కపాలాల వరుసక్రమం గుర్తుకు తెచ్చుకోండి. అనగా 1, 3 ,5, 7, 9, 11 వరుసలలో 36 కపాలాలు ఉన్నాయి కదా. ఏక మూల బ్రహ్మకపాలం కింద మూడు ఆపై 5 ,7,9,11 వరుస కపాలాలు ఉన్నాయి. కానీ ఏక మూల కపాలము పైన ఏ కపాలము లేదు కదా. అంటే దీని బ్రహ్మరంధ్రముపైన ఏ కపాలము అనుసంధానంగా లేదు. కాని దీని కింద భాగమునకు మిగిలిన 35 కపాలాలు అనుసంధానమైనవి అని గ్రహించండి. అనగా కింద వరుసలోని 11 కపాలాలతో మొదలై 9, 7 ,5, 3, ఆఖరికి ఏక కపాలంతో అంతమైనదని అర్థం అవుతుంది కదా. ఈ లెక్కన చూస్తే పైన ఉన్న అత్యంతిక ఆఖరి ఏక మూల బ్రహ్మకపాలం నందు బ్రహ్మాండ చక్రం యొక్క కృష్ణబిలం యొక్క బ్రహ్మరంధ్రము మూసుకుని ఉంటుంది కదా. ఒకవేళ మూసుకొని లేకపోతే దీనిపైన కూడా కపాలాలు అనుసంధానమై ఉండేవి కదా. ఏమంటారు.జాగ్రత్తగా ఆలోచించండి. తేడా మీకే తెలుస్తుంది. అసలు ఇలాంటి ఘనాపాటి ఆలోచన మీకు భలే వస్తాయి అండి. అంటారా. అందుకే కదా. నన్ను గురుగ్రహ వాసిగా జన్మించినట్లుగా చేసినారు. ఈ గ్రహమునందు నిజ బ్రహ్మ జ్ఞానము పొందిన బృహస్పతి లే ఉంటారు కదా. 

నవగ్రహాలలోని సూక్ష్మ కర్మలు:

ఇక నవగ్రహాలలోని సూక్ష్మ కర్మలు విషయానికొస్తే సూర్యుడికి 6,000 చంద్రుడి గ్రహము నందు 10,000 కుజగ్రహమునందు 7,000 రాహు గ్రహం వద్ద 18 వేలు గురుగ్రహం నందు 16,000 అలాగే శనిగ్రహము నందు 19,000 బుధగ్రహం నందు  17,000 కేతు గ్రహం నందు  7,000 అలాగే శుక్ర గ్రహం నందు  20,000 అనగా మొత్తం కలిపి 1,20,000 సూక్ష్మ కర్మలు ఉంటాయన్నమాట. గ్రహాల యొక్క జప సంఖ్య కూడా ఇదేనని గ్రహించండి. ఈ సూక్ష్మ కర్మలలోనే ఆయా గ్రహాల యందు సూక్ష్మ శరీరంతో జన్మించి కర్మశేషం లేకుండా నివారణ చేసుకోవాలి అన్నమాట. మన ఖర్మ బాగోకపోతే అక్కడ ఉన్న మాయలలో పడితే 1,20,000 కాస్త కోటి ఇరవై లక్షలు అవుతాయి.ఈ కర్మలను భూలోకములో ఉండి నాశనం చేసుకోలేము. ఎందుకంటే మనకు రుణము ఉన్నవారు గ్రహలోక వాసులు అయితే భూలోకమునకు వారు వచ్చి ఎలా రుణబంధము తీర్చుకోగలరు. చెప్పండి. కాబట్టి ఈ సూక్ష్మ కర్మ నివారణ కోసం మనం ఆయా గ్రహాల యందు సూక్ష్మ శరీరంతో జన్మించి లక్షా ఇరవై వేల సూక్ష్మకర్మలు నివారణ చేసుకోవాలి అన్నమాట. అంతెందుకు. భూలోకమందు స్థూల శరీరంతో 11 రకాల జీవజాతులుగా జన్మించి కోటాను కోట్ల జన్మలు ఎత్తి ఇక్కడ ఉన్న 48 లక్షల సూక్ష్మకర్మలు నివారణ చేసుకోవడం లేదా? అలాగే సూక్ష్మ శరీరంతో నవగ్రహాల్లో జన్మించి ఆయా గ్రహాల సూక్ష్మకర్మలను తీర్చుకోవాల్సిందే కదా. ఇక కారణ లోక కారణ కర్మలు విషయానికి వస్తే సప్త ఊర్ధ్వ దైవ లోకాలలో జన్మించి ఈ లోకాలలో ఉన్న 36వేల కారణ కర్మలను నాశనం చేసుకోవాలి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఉన్న మాయలో పడితే ఈ కర్మలు కాస్త 36 కోట్లు అవుతాయి అన్నమాట. ఇంకా సంకల్ప లోక సంకల్ప కర్మలు విషయానికి వస్తే 800 కర్మలు ఉంటాయి.ఇక్కడున్న అష్ట లోకాలయందు సంకల్ప శరీరంతో జన్మించి ఇక్కడున్న సంకల్ప కర్మల నివారణ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఉన్న మాయలలో పడితే 800 లక్షల కర్మలగా మారుతాయని గ్రహించండి. ఇక ఏకైక మూలకపాలము నందు స్థూల సూక్ష్మ కారణ సంకల్ప కర్మల యొక్క కర్మ శేషము ఆకాశ కర్మలు ఉంటాయి. వీటికి సాధకుడు పరమశూన్యమునందు ఆకాశ శరీర యానము చేసి ఈ పదకొండు కర్మలను కర్మశేషం లేకుండా నివారణ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడున్న బలహీనతకి స్పందిస్తే ఇవి కాస్త 1100  కర్మలగా మారతాయి. తద్వారా మూసుకుని ఉన్న బ్రహ్మరంధ్రము తెరుచుకోవడం ఏకకాలంలో జరుగుతుంది. అప్పుడు సాధకుడు కాస్త దీని కింద ఉన్న అష్టదళ పద్మం అయిన అష్ట లోకాలు ఉన్న హృదయ చక్రమునందు సంకల్పం శరీరముతో పునః సృష్టి జననం జరుగుతుంది అని గ్రహించండి. ఇంత సాధనా క్రమం ఉంటుందని నాకు నాకున్న స్థూల శరీర 48 లక్షల స్థూల కర్మలు తీరేదాకా తెలియలేదు. కాకపోతే భూలోకము నుండి విముక్తి కలిగింది కానీ భవిష్యత్ జన్మలుగా గురుగ్రహంతో అనుసంధానం అయినాయి. ఇలా నాకున్న సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ  కర్మలు సంపూర్తిగా కర్మశేషం లేకుండా నాశనం అయితే కానీ నాకు సంపూర్ణ కపాలమోక్షం స్థితి కలగదని ఈపాటికి గ్రహించి ఉంటారు కదా. కాకపోతే ఒక విషయము నందు మనము ఆనంద పడాలి. అది ఏమిటి అంటే విశ్వ సృష్టి యొక్క జీవ నాటకము అంతం ఉన్నది. ఇది అంతులేని కథ కాదని దీనికి అంతం ఉందని కాకపోతే సాధకుడు కాస్త తన సాధనతో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ కర్మలను ఆయా పంచ శరీరాలతో నాశనం చేసుకుంటే సాధన సంపూర్ణంగా పరిసమాప్తి అవుతుంది. తద్వారా ఈ విశ్వం నందు అత్యంతిక ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది. కనిపించేది ఉండదు. కనిపించే వాడు ఉండడు. చూసేవాడు ఉండడు. చూసేది ఉండదు. అంటే ఈ పంచ కర్మలు కాస్త కర్మశేషం లేకుండా సర్వ నాశనం చేసుకుంటే ఖాళీగా ఉన్న గది బయట ఉన్న వాడు లోపలికి వచ్చి చూస్తే చూసేవాడు ఉండడు. చూసేది ఉండదు. అంతా కూడా సర్వం శూన్యము అన్నమాట. ఇట్టి జ్ఞాన అనుభవం అనుభూతి సంపూర్ణ కపాలమోక్ష స్థితి అన్నమాట. ఇట్టి స్థితిని పొందే క్రమంలో ప్రస్తుతం నేను అలాగే మా జిఙ్ఞాసి కాస్త ఈసాధన జన్మ యందు స్థూలశరీరం 48 లక్షల స్థూల కర్మలు లేకుండా నివారణ చేసుకున్నాము. దీనికోసం 36 కోట్ల జన్మలు ఎత్త వలసి ఉన్నది అని ఆజన్మాంత జ్ఞాన శక్తి వల్లనే తెలిసినది. అంటే పంచకర్మల నివారణ యొక్క అంతము ఆరంభమైనది అన్నమాట. ఇక మిగిలిన నాలుగు కర్మలు నివారణ కోసం ఆరు వందల సంవత్సరాల నుండి పది లక్షల సంవత్సరాల దాకా పడుతుందని దీనికోసం నవ జాతుల నుండి 48 కోట్ల జన్మలు పొందవలసి ఉంటుందని మాకు జ్ఞాన స్పురణ కలగడం జరిగినది. దానితో నాకున్న సహనశక్తి కోల్పోయ్యేది సాధన ఇంకా మిగిలే ఉన్నదని మాకు మిగిలిన నాలుగు శరీరాలుతో మిగిలిన నాలుగు రకాల కర్మలు నివారణ చేసుకోవాలనే జ్ఞాన స్పురణ కలుగగానే నాకు చికాకు విసుగు చిర్రెత్తుకొచ్చింది. దానితో దీనెమ్మ జీవితం. కాలం ఎప్పుడూ నాకు సంపూర్ణ కపాలమోక్షం ఇస్తుంది. అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉండాలని ఇంకా సాధన అంటూ ఏమీ చేయకూడదని కనీసం నా భవిష్యత్ జన్మలలో అయిన సర్వ సుఖాలు అనుభవించాలని నేను మనో నిశ్చయము చేసుకుంటే మా జిఙ్ఞాసి మాత్రం తనకు ఉన్న నాలుగు రకాల కర్మలను ఎంత త్వరగా నాశనము చేసుకోగలిగితే అంత మంచిదనే నిర్ణయానికి వచ్చి సర్వ లోకాల లో ఉన్న సర్వ సుఖాలను త్యాగం చేస్తూ ఎలాగైనా సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందాలని కృతనిశ్చయంతో భవిష్య జన్మయైన బుధగ్రహ వాసిగా జన్మించి యోగసాధన చేస్తూ యోగసాధన పరిసమాప్తి చేసుకుని సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందే ప్రయత్నవాదిగా తన ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు. నా సాధన ఆగిపోతే వాడు యోగ సాధన కొనసాగిస్తున్నాడు అన్నమాట. 

ఇంతకీ ఇక్కడ చాలా మందికి ఒక చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే భూలోకంలో ఉండి మీరు ఎలా భవిష్య జన్మలు గురుగ్రహమునకు సంబంధించినవని తెలుసుకున్నారు అంటే దీనికి సమాధానముగా మనలోని సప్త యోగ చక్రాలు కాస్త అనగా మూలాధార- స్వాధిష్టాన- మణిపూరక- అనాహత- విశుద్ధ- ఆజ్ఞా- సహస్రార చక్రాలు వరుసగా కుజ- బుధ- గురు- శుక్ర- శని- చంద్ర- సూర్య గ్రహాలు అధిపతులుగా అవుతాయి. అనగా భూలోక- భువర్లోక- సువర్లోక- మహర్లోకం- జనలోకం- తపోలోకం కలుగుతాయి. కాకపోతే మన కుండలిని శక్తి ప్రవాహం ఈ చక్రాలయందు ప్రవేశించినపుడు మనకు ఆయా లోకాల ఆయా గ్రహాల సంచారం అలాగే దృశ్యాలు మనో నేత్రము నందు ఆవిష్కరించబడ్డాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చదువుతున్న ఈ కపాలమోక్షం గ్రంథం యొక్క అనుభవాలు అన్ని కూడా భూలోక కపాలమోక్షం అనుభవాలని అనగా స్థూలశరీరం 48 లక్షలు స్థూల కర్మల పరిసమాప్తి అని అనగా మూలాధార చక్రానికి సంబంధించిన ధ్యానానుభవాలు అని అలాగే కుజ గ్రహ మరియు భూలోక కర్మల నివారణ చేసుకున్నామని ఈపాటికే మీరు గ్రహించే ఉంటారు. ఒక్క మూలాధార చక్రము నందు ఇన్ని రకాల మాయలు మర్మాలు ఉండి నా నా చంకలు నాకిస్తూ ఉంటే ఇంకా మిగిలిన యోగ చక్రాలు అలాగే వాటికి ఉన్న గ్రహాలు మరియు వాటికి ఉన్న లోకాల్లో ఇంకా ఎన్ని మాయలు మర్మాలు ఉంటాయో కదా. నిజమే కదా. ఆలోచించండి. సాధన చేస్తున్న కొద్దీ ఎంతెంతదూరం అన్నట్లుగా ఈ ధ్యాన అనుభవాలు పెరుగుతూనే వస్తున్నాయి. కలుగుతూనే ఉన్నాయి. వీటి అంతము మూల ఏక బ్రహ్మకపాలంలో ఉన్న ఆకాశ కర్మలు కూడా కర్మశేషం అయ్యేదాక ఎదురుచూడక తప్పదు అని అప్పుడే మనకి సంపూర్ణ కపాలమోక్షం స్థితి పొందటం జరుగుతుంది అని ఙ్ఞాన స్పురణ అవ్వటంతో నేను కాస్త రాబోవు భవిష్య గురుగ్రహ జన్మల యందు కపాల మోక్ష సాధన నుండి తప్పుకోవడం జరుగుతుంది. కానీ మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి మాత్రం మిగిలిన 25 కపాలాలకు కూడా కపాలమోక్షం కలిగించాలని ఈ కపాలమోక్షం సాధనను మిగిలిన నాలుగు శరీరాలతో అలాగే మిగిలిన నాలుగు రకాల కర్మలు  నివారణ చేసుకోవాలని తన యోగ సాధనను రాబోవు భవిష్య బుధగ్రహ జన్మలో కూడా కొనసాగిస్తూనే ఉంటాడు అని మీకు తెలియజేయడం జరుగుతుంది. అందులో అతను విజయం పొందాలని ఆశిద్దాం. కోరుకుందాం. సంపూర్ణ పంచ శరీర కపాలమోక్ష స్థితిని పొంది మనో నిశ్చల స్థితి యందు ప్రశాంతత స్థితిని పొందుతాడు అని ఆశిస్తున్నాను. ఆశీర్వాదం చేస్తున్నాను. 

ఇక్కడ నాకు ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే ఏక మూల కపాలమునందు ఇంతకు ముందు ఎవరైనా చేరుకున్నారా లేదా అనే సందేహం వచ్చింది. ఇంకేముంది మెదడుకు మేత దొరికింది కదా. పుస్తక గ్రంధాలు తిరగ వేయడం ఆరంభించాను. రామాయణ గ్రంథమును చదువుతుంటే రావణాసురుడిని ఒకపక్క దుర్మార్గుడు, స్త్రీలోలుడు, వ్యసనపరుడు, రాక్షసుడు అని చెబుతూనే మరోపక్క ఆయన రావణబ్రహ్మ అని సకల శాస్త్ర మహా ఉద్దండ పండితుడు అని చెప్పడం జరిగినది. ఒకే వ్యక్తిలో మంచి చెడులను చెప్పడం నాకు ఆశ్చర్యమేసింది. ఇందులో ఏదో తెలియని మర్మము ఉన్నదని నాకనిపించింది. అప్పుడు దీని గురించి తీవ్రంగా విశ్లేషణ చేస్తే రాక్షస రావణాసురుడు కాస్త రావణబ్రహ్మ స్థాయికి చేరుకోవడం వెనుక పెద్ద కథ ఉందని గ్రహించాను. అది ఏమిటంటే పంచ శరీరాలతో పంచకర్మల నివారణ చేసుకుని ఏకమూల కపాలము చేరుకోవాలని అక్కడ ఉన్న 11 రకాల ఆలోచనలు మాయలకు స్పందించకుండా సాక్షీభూతంగా ఉండగలిగితే సంపూర్ణ కపాలమోక్ష స్థితి పొందడం జరిగి పరమ ప్రశాంతత స్థితిని పొందడం జరుగుతుందని ఇదే సంపూర్ణ సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పడం జరిగింది కదా. ఈ విధంగా రావణాసురుడు కూడా యోగ సాధన చేస్తున్న సమయంలో పంచ శరీరాలకి పంచ కర్మల నివారణ సమయంలో ఇక్కడ వచ్చే కృష్ణ బిలములోని బలహీనత వలన 0.1% మిగిలిపోతూ రావడం వలన పంచ కర్మలయందు 0.5% బలహీనత యొక్క కర్మ శేషాన్ని మిగుల్చుకోవడం జరిగినది అన్నమాట. ఇది అందరికీ సహజసిద్ధంగానే జరుగుతుందని గ్రహించండి. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడు లేడు కదా. 

అలా మన వాడు కాస్త పంచ శరీరాల యొక్క  పంచకర్మల కర్మ శేషాన్ని 0.5% మిగుల్చుకుని ఉండటంతో పంచ జతల కపాలాలు మిగిలిపోయాయి. అంటే పది కపాలాలు మిగిలిపోయాయి. ఈ పది కపాలాలే మనవాడికి పది తలలుగా మారి ఏకతల రావణాసురుడు దశకంఠుడు పది తలల రావణుడు అయినాడు అన్నమాట. ఇట్టి స్థితి ప్రతి యోగసాధకుడు పొందక తప్పదు అని గ్రహించండి. ఎందుకంటే 36 కపాలాలు వరుసక్రమం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1, 3, 5, 7, 9, 11 వరుసలో ఉంటాయి కదా. మొదట ఒకటి ఆ తర్వాత వచ్చే మూడు కపాలాలలో పాతది 1 రెండు కొత్త కపాలాలు ఏర్పడి మూడు కపాలాలవుతాయి. 5, 7, 9, 11 వరుసలలో రెండు కొత్తవి ఏర్పడతాయని గ్రహించండి. అంటే 36 కపాలంలో 25 కపాలాలు పాతవి. 11 కొత్తవి అన్నమాట. ఈ కొత్త 11 కపాలాలే పంచ శరీరాలలో వచ్చే పంచకర్మ యొక్క బలహీనతలు యొక్క కర్మ శేషము కపాలాలు అన్నమాట. రావణాసురుడు సాధన విషయానికి వద్దామా. అంటే ప్రతి సాధకుడికి 11 బలహీనతల కారణంగా 11 కపాలాలు ఏర్పడతాయి అన్నమాట. ఈ 11 కపాలాలు ఎవరైతే కర్మ శేషములేకుండా నాశనం చేసుకుంటారో వారే సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొందేవారు అన్నమాట. ఈ 11 కపాలాలే ఏకాదశరుద్రులు అన్నమాట. విష్ణు పరంగా చూస్తే ఏకాదశి అవతారాలన్నమాట. దేవి పరంగా చూస్తే దేవి దశావతారాలు అన్నమాట. దానితో మన రావణాసురుడు కాస్త 11 కపాలాలుకి ఏకాదశరుద్రులు ఉంటారని గ్రహించి వారిని నాశనం చేయాలని యోగ తపస్సు యందు ఒక్కొక్క కపాలమునకు ఒక్కొక్క రుద్రుడి నాశనం కోరుతూ మోక్ష యజ్ఞము చేయడం ఆరంభించాడు. ఇలా10 కపాలాల సమర్పణతో 10 రుద్రులను నాశనం చేసినాడు. చివరి ఈ 11వ కపాలము అతని చేతిలోనికి తీసుకొని ఆయన మోక్ష యజ్ఞము నందు వేస్తూ ఉండగా లీలా మాత్రంగా పార్వతి దేవి కాస్త స్పురణకి వచ్చినది. ఎందుకంటే ఈయన అతిలోక సౌందర్యవతి అయిన పార్వతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.కానీ నారదుడి లీలా మాయ వలన పార్వతీ రూపంలో ఉన్న మండోదరిని పంపించి తిరిగి పార్వతీదేవిని కైలాసమునకు పంపించినాడు. ఈ విషయాన్ని గమనించిన రావణాసురుడు తన వెంట వచ్చినది కైలాస పార్వతీదేవి అనిభ్రమపడి చివరికి మండోదరిని  వివాహము చేసుకోక తప్పలేదు. విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేక పోయినాడు.

అంటే సూక్ష్మ కర్మ శేషంగా పార్వతీ దేవిని వివాహం చేసుకోలేదని బలహీనత కాస్త ఏకాదశి కపాలము నందు జ్ఞప్తికి రావడం జరిగినది. దానితో ఈసారి ఎలాగైనా అంతటి అతిలోక సౌందర్యవతి యువతిని వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన చేసేసరికి తన చేతిలోని ఏకాదశ కపాలము కాస్త పదకొండవ ఏకాదశ కపాల రుద్రుడు గా మారి “ప్రకృతి మాత అయిన స్త్రీమూర్తిని కోరుకున్నందుకు మర్కట మనస్సుని పొందినందుకు ఆ జంతువు చేతుల్లోనే రాబోవుకాలంలో నా అంశగా హనుమంతుడుగా జన్మించి వారి చేతిలో నీ వినాశనం పొందుతావు” అని శపించడం ఏకకాలంలో జరిగిపోయాయి. అంటే మన వాడు 11 కపాలము లోని స్త్రీ వ్యామోహం బలహీనతకు స్పందించడంతో కథ మళ్ళీ మొదలైంది అన్నమాట. ఈ స్త్రీ వ్యామోహమే ప్రకృతి స్త్రీ మూర్తి అయిన సీతాదేవి, ప్రకృతి పురుషుడిగా శ్రీరాముడిగాను, ప్రకృతి రక్షకుడుగా హనుమంతుడును కలిసి రామాయణము అనే కథను నడిపించడం జరిగినది. దానితో ఒక త్రేతాయుగము ఏర్పడినది. ఆ తర్వాత శ్రీరాముడు కూడా యోగ సాధన చేస్తూ ఇట్టి స్థితికి అనగా 11 వ కపాల సాధన స్థితికి అనగా ఒక మూల బ్రహ్మ కపాలము స్థితి కి వచ్చినప్పుడు తన అవతారములో తన శరీర స్పర్శ ఆనందమును కోరుతున్న మునులు కాస్త జ్ఞప్తికి వచ్చేసరికి వీరికి ఇచ్చిన మాట అలాగే వీరికి ఎలాగైనా తన శరీర స్పర్శ ఆనందం అందించాలని ఆలోచన చేయటంతో రాబోవు కాలమును శ్రీకృష్ణ అవతారం ద్వాపరయుగము ఏర్పడినది. దానితో శ్రీరాముడు కాస్త సరయూ నది యందు జలసమాధి చెందడం జరిగింది. రావణాసురుడు కాస్త శూన్య బ్రహ్మ సాధన స్థాయికి రావడంతో ఆయన ఏక మూల కపాలము  స్థితికి రావడంతో ఇక ఆనాటి నుండి రావణబ్రహ్మ అయినాడు అన్నమాట. కాకపోతే స్త్రీ లోలత్వం అనే బలహీనతకు ఈయన లొంగిపోవడంతో రావణ రాక్షస బ్రహ్మగా ఈ లోకమునందు గుర్తింపు పొందినాడు. అదే శ్రీరాముడు అయితే తను కోరి వచ్చిన శూర్పణఖ రాక్షస స్త్రీ మూర్తి మాయ యందు పడక పోవటం వలన దేవుడిగా లోక పూజ్యుడు అయినాడు. కానీ తన భవిష్యత్ జన్మయైన శ్రీకృష్ణావతారంలో పదహారువేల గోపికల రూపంలో మహర్షులు శరీర స్పర్శ ఆనందం ఇవ్వటం వలన సకల శృంగార పురుషుడైనాడు అన్నమాట. పోనీ ఈ కృష్ణావతారంలో అయినా తన కపాల సాధన పరిసమాప్తి చేసుకోలేక పోయినాడు. ఈయన కూడా తన ఏకైక మూల బ్రహ్మ కపాల స్థితికి వచ్చేసరికి తన వల్లనే చనిపోయిన పాండవ కౌరవ యాదవ స్త్రీలు మాత్రం జ్ఞప్తికి రావడం తనకున్న రాజ్యకాంక్ష వల్లనే ఇది జరిగిందని జ్ఞాన స్పందన రావడంతో అసలు తనకి ఈ కోరిక ఎందుకు కలిగిందని తెలుసుకోవాలని క్షణ మాత్ర ఆలోచన చేయడంతో భవిష్యత్ జన్మగా జ్ఞాన తపస్సుచేసే బుద్ధుడి జన్మ రావటం కలియుగము ఏర్పడటం ఏకకాలంలో జరిగినాయి. పోనీ ఈ బుద్ధుడి అవతారములోనైనా సాధన పరిసమాప్తి చేసాడు అంటే చేయలేకపోయాడు. కోరిక లేని సమాజం చూడాలని కోరిక మాయలో పడటం తద్వారా భవిష్య కల్కి అవతారం ఏర్పడటం ఈ అవతారం అయిన తర్వాత కోరిక లేని సమాజం తిరిగి ఆది యుగమైన సత్యయుగము ప్రారంభమవడం ఏకకాలంలో జరిగినాయి.ఇలా ఆదియుగంలోనే సత్య- త్రేతా- ద్వాపర- కలి యుగాలు కాలచక్రము ఏర్పడినాయి. అవే ఇప్పుడు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా తిరుగుతున్నాయి. ఆది యుగంలో రికార్డయిన దృశ్యాలు ఆయా యుగాలకు తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట. కాకభుంశుడు మాత్రమే ఈ కాలాతీత స్థితిని పొంది ఇప్పటికే ఎన్నోసార్లు జరిగిపోయిన రామాయణ, మహాభారత, ఏకాదశరుద్రులు అవతారాలు, దేవి అవతారాలు దశావతారాలు చూడటం జరిగిందని చెప్పడం కొసమెరుపు. అంటే ఈ లెక్కన చూస్తే ఆదియుగంలోనే సత్యయుగము నందు ఎవరో మహానుభావుడు కాస్త తను పరమాత్మ సాకార రూపము చూడాలని ఆయన చేతిలో మరణము పొందాలని దాని కోసం తీవ్రమైన ఘోర తపస్సు జన్మ పొందాలని అనుకోవడం జరగడం వలన ఈయన భవిష్య జన్మగా రావణబ్రహ్మ అవతరణ జరిగి త్రేతాయుగం ఏర్పడటానికి నాంది అయినది అన్నమాట. ఆ మహానుభావుడు ఎవరో నాకైతే తెలియడం లేదు కానీ ఆ నాయాల  ఎవరో తెలిస్తే మాత్రం నేనే వాడిని ఖండ ఖండాలుగా నరికేవాడిని. వాడి ఆలోచన స్పందన వలన దిక్కుమాలిన నాలుగు యుగాలతో కూడిన కాలచక్రమే ఏర్పడినది కదా. కానీ అంతటితో ఆగిందా? ఈ చక్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంది. ఎవరైతే ఏకమూల కపాలము నందు వచ్చే ఆలోచనకి స్పందించకుండా మనో నిశ్చల స్థితి పొందే దాకా అండ పిండ బ్రహ్మాండ చక్రాలు విశ్వ సృష్టి స్థితి లయ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పటికి ఏడు మన్వంతరాలు పూర్తి చేసుకున్న 28 మహాయుగాలు అంటే 1988 యుగాలు పూర్తి చేసుకున్నాము అన్నమాట. ఆదియుగంలోనే ఆది మహాత్ముడు ఆలోచన స్పందన వలనే ఏకంగా ఇన్ని యుగాలు గడిచి పోయినాయి. రాబోవు కాలంలో ఇలా కోటాను కోట్ల యుగాలు నడుస్తూనే ఉంటాయి. ఇది అంతా వాడి చావు కాదు గాని మన చావుకు వచ్చింది. వీడు కానీ ఆనాడు ఆలోచన స్పందన చేయకుండా ఉండి ఉంటే అసలు ఈ విశ్వ సృష్టి ఎలా ఎప్పుడు నిశ్చలస్థితి లోనే ఉండేది. వీరి ఆలోచన వలనే కాలచక్రము ఏర్పడి తద్వారా అన్ని విశ్వ సృష్టి చక్రాలు ఏర్పడి ఇది కదలి విశ్వమంతా మనభూమి అనిశ్చల స్థితిలో తిరుగుతున్నట్లుగా విశ్వ సృష్టి లోని జీవ నాటకము అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా తిరుగుతూనే ఉంది అన్నమాట. కానీ ఎప్పటికైనా కృష్ణబిలం అంతం ఉన్నట్లుగానే ఏక మూల బ్రహ్మకపాలం నందు వచ్చే 11 రకాల ఆలోచన స్పందనలకి స్పందించకుండా సాక్షీభూతముగా మనో నిశ్చల స్థితి పొందితే నా సామిరంగా! విశ్వమంతా సర్వనాశనమై సర్వము ఏమిలేదు. సర్వము శూన్యమే మిగులుతుంది. చూసేవాడు ఉండడు. చూడటానికి ఏమీ ఉండదు. చూపించడానికి ఏమీ ఉండదు. 

మన జిజ్ఞాసి ఆది రికార్డు సాధనా దృశ్యాలు:

ఇలాంటి సంపూర్ణ కపాలమోక్షం స్థితి ప్రయత్నం నా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి చేస్తున్నాడు అని మీకు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది కదా. ఇందులో కనీసం ఈ మహానుభావుడు అయినా విజయం పొందాలని ఆశిద్దాం. అంతకంటే మనం ఏమి చేయలేము కదా. నాకు వీరి విషయము నందు ఒక ఆలోచన వచ్చింది. మన వాడు కూడా ప్రస్తుతం చేస్తున్న సాధన కూడా రికార్డు దృశ్యం ఉండి ఉండాలి కదా. ఎందుకంటే ఆది యుగములో ఈసాధన తప్పకుండా చేసి ఉండాలి. అప్పుడు ఆ యుగంలో పంచ శరీరాలు పంచకర్మలు యొక్క పంచకర్మ శేషము బలహీనతలు కూడా రికార్డు అయి ఉంటాయి కదా. కాకపోతే ఆనాడు వాటిని నివారణ చేసుకోలేదు. ఈనాడు ఇక్కడ దాక అనగా 1988 యుగాల దాకా వీటి నివారణ కోసం సాధన చేస్తూనే ఉండాలి కదా. అంటే వీడి ఆది రికార్డు సాధనా దృశ్యాలను నా సాధనా శక్తితో చూస్తే పోలా? ఎందుకంటే పది లక్షల సం!! దాకా పరిస్థితి ఏమిటో తెలీదు. అదే వీరి ఆది రికార్డు దృశ్యాలు చూస్తే వాడు ఎక్కడ ఏ విషయంలో బలహీనతకు గురయ్యాడో తెలుస్తుంది కదా. అంటే ముందే వీడు సాధన అంతిమ ఫలితం ఏమిటో ముందుగానే తెలుసుకోవాలి అనే తియ్యని దురద నాలో మొదలైంది. దానితో వాడి ఆది సాధన రికార్డు దృశ్యాలు చూడటానికి నేను కాస్త ధ్యాన తపస్సుడిగా మారడం జరిగినది. నలభై ఒక్క రోజుల తర్వాత వీరి సాధన దృశ్యాలు నాకు ధ్యానము నందు కనిపించటం ఆరంభమయ్యాయి. ఆదిలో మనవాడు కూడా ఏక మూల బ్రహ్మకపాలం స్థితికి వచ్చి తన చేతిలోని 11 వ కపాలం తీసుకుని అసలు నేను ఎవరిని ఎందుకు ఈ కపాల జన్మ వచ్చినది అని తెలుసుకునే ఆలోచన చేయడంతో భవిష్య జన్మగా శివాంశ జన్మగా అవతరణ జరిగినది. అంటే మన వాడు సంకల్ప శరీర జన్మ శివాంశ అంశ ఇష్ట ఙ్ఞానేశ్వరి అన్నమాట. అది ఏమిటి అంటే ఆకాశ శరీర జన్మ ఏమైంది అంటే ఆకాశం అంటే ఏమీ లేదు శూన్యమే కదా.శూన్యము కాస్తా శూన్యబ్రహ్మగా మారితే దానిని ఆకాశ శరీరమంటారు. ఇక్కడ ఈ శరీర స్థితిలో అందరికీ శూన్యమే ఉంటుంది. ఆకాశం ఉండదు. అనగా ఆకాశం లాగా అన్నమాట. ఎప్పుడైతే నేను ఎవరిని అనుకున్నాడో ఆకాశం శరీరంతో అవతరణ జరిగినది. నేను ఎవరో తెలుసుకోవాలి అనే సంకల్పం పెట్టుకున్నాడు. అది కాస్త శివ అంశతో ఇష్ట ఙ్ఞానేశ్వరి అనే సంకల్పం ఏర్పడింది అన్నమాట. అంటే సంకల్ప శరీరంలో సంకల్ప కర్మ జ్ఞాన స్పందన అనగా నేను ఎవరిని అని తెలుసుకోవడంతో ఏర్పడినది. దీనికోసం భవిష్య సాధన జన్మగా కారణ శరీరంతో కుమారస్వామి అంశ జన్మ ఏర్పడినది. ఇందులో కారణశరీరం కారణ కర్మ యొక్క కర్మ జ్ఞాన నిరూపణకి స్పందించడం జరిగింది. అంటే కుమారస్వామి అంశలలో తనకి కలిగిన జ్ఞానం అనుభవాలకి ప్రత్యక్ష నిరూపణలు కావాలని అనుకోవడం జరిగినది అన్నమాట. అనగా తనకి కలిగిన అనుభవాలు నిజమా కాదా అనే సందేహం బలహీనతకు గురయ్యాడు అన్నమాట. దీని కోసము భవిష్యత్ జన్మగా నైగేమయుడి మహర్షి జన్మ ఏర్పడినది. అంటే సూక్ష్మ శరీర జన్మ ఏర్పడినది అన్నమాట. ఇందులో ఈ జన్మ యందు వేదవ్యాసుడుతో వాదోపవాదాలు చేసి తనకి కలిగిన అనుభవాలు నిజమేనని నిర్ధారణకు రావడం జరిగినది. కాకపోతే ఈ జన్మ యందు సూక్ష్మశరీర సూక్ష్మకర్మ శేషముగా తను తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానమును తిరిగి సర్వలోకాలకు తెలియచేయాలని సంకల్ప బలహీనతకు గురి అయినాడు. దానితో స్థూల శరీరం జన్మలు ఏర్పడినాయి.అనగా స్థూల శరీరము కర్మలు నాంది అయినాయి అన్నమాట. ఇలా 36 కోట్ల జన్మలలో తను తెలుసుకున్న జ్ఞానమును లోకానికి తెలియజేస్తూ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకుని దానికి ఏమి అంటారో తనని ఏమి చేస్తారో అని భయానికి స్పందించడం చేసినాడు. దానితో ఇలా 36 కోట్ల స్థూల శరీర జన్మలెత్తినాడు అన్నమాట. ఇలా కాదనుకుని ప్రస్తుత సాధన జన్మ యందు తను తెలుసుకున్న విషయాలను జ్ఞాపకంగా తనలో మిగిలిపోయిన వాటిని జ్ఞాన స్పురణతో జ్ఞప్తికి తెచ్చుకుని ఈ కపాలమోక్షం గ్రంథంలో జిజ్ఞాసి పాత్రధారిగా తన గత జన్మల సాధన అనుభవాలు చెపుతూ రావడంతో తిరిగి స్థూల శరీర కర్మ శేషమైన భయమును బలహీనతకి భయపడటం మానివేసి భయ రాహిత్యమును పొందడం జరిగినది. అంటే తను తెలుసుకున్న విషయాలు సాక్షీభూతంగా దేనికి స్పందించకుండా దేనికి భయపడకుండా దేనినీ ఆశించకుండా దేనికి ఆశ పడకుండా బ్రహ్మ తదాకార స్థితిని పొంది స్థూల శరీర కపాలమోక్షం స్థితిని పొంది భవిష్య జన్మగా ప్రస్తుతము బుధ గ్రహ సూక్ష్మ శరీరధారిగా నైగేమయుడి అంశతో సాధన చేస్తున్నాడు అని అర్థమైంది. అంటే మిగిలిన ఈ నాలుగు కర్మ శేషములని కూడా స్థూల శరీరము దాటినట్లుగా దాటితే మన వాడికి సంపూర్ణ కపాల మోక్ష స్థితి ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చిందో లేదో నాకు మాత్రం తెలుసు. వాడికి తెలియదు. నాకు కూడా తెలియదు. సాధనా భవిష్య జన్మలు వివరంగా ముందే తెలిస్తే అలాగే అంతిమ ఫలితం ముందే చెప్తే ఇంకేముంటుంది కిక్కు.నా బొందా. నా బూడిద. వాడి ప్రయత్నం వాడిని చేయనివ్వాలి. వాడు ఈ ప్రయాణము నందు కలిగే అన్ని రకాల అడ్డంకులు ఎలా దాటుకోవాలో తెలుసుకోవాలి. అందుకే కాబట్టి వారి అంతిమ సాధన విషయం ఫలితం గురించి చెప్పేటప్పుడు నేను కాస్త మేధా దక్షిణామూర్తి లాగా మౌనం వహించక తప్పదు .అలాగే నా సాధన అంతిమ ఫలితం వివరాలు కూడా చెప్పడం జరగదు. అన్ని తెలుసు. ఏమీ తెలియని వాడిలాగా సాక్షీభూతంగా మౌనంగా ఉండాలని అనుకుంటున్నాను. 
 
ఇక అదే సాధన పరిసమాప్తి అయితే భూలోక కాలమాన ప్రకారం అయితే అనగా మిగిలిన నాలుగు శరీర కర్మల నివారణ చేసుకోవటానికి సుమారు 97 మన్వంతరాలు అనగా 1988 యుగాలు ఒక్కొక్క యుగములో సుమారుగా 500000 సంవత్సరాలు ఉంటే 1988 x5 =9980 అంటే సుమారుగా పది కోట్ల లక్షల సంవత్సరాల తరువాత నా సాధన స్థితి కాస్తా కూడా ఏక మూల బ్రహ్మ కపాలమునకు చేరుకుంటుంది అన్నమాట. అదే మన జిఙ్ఞాసికి అయితే పది లక్షల సంవత్సరాలకే తన సాధనను పరిసమాప్తి చేసుకునే వీలు ఉంటుంది. అంటే నాకు 10 కోట్ల సంవత్సరాల పెడితే మన వారికి పది లక్షల సంవత్సరాలలో పూర్తి అవుతుంది. ఎందుకంటే నేను సర్వ రకాల సర్వ సుఖాలు భోగాలు మాయలో పడుతూ లేస్తూ వైరాగ్యం కలిగినప్పుడల్లా సాధన చేస్తూ ఉంటే మనవాడు ఏకంగా ఎలాంటి సుఖభోగాలు అనుభవించకుండా వాటిని త్యాగం చేసుకుంటూ ముందుకి అనగా భూలోక స్థూల శరీర కర్మల నివారణ చేసుకున్నట్లుగా మిగిలిన గ్రహాల యందు లోకాలయందు కూడా నివారణ చేసుకుని ఏక మూల బ్రహ్మకపాలంలో మిగిలిపోయిన కర్మ శేషము కూడా నివారణ చేసుకునేదాకా మనవాడు విశ్రమించడు. విశ్రాంతి తీసుకోవడం లేదు అన్నమాట. అంటే ఈ సృష్టియందు అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా కొనసాగుతున్న నాటకంలాగా మనవాడు యోగ సాధన కూడా అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా కొనసాగుతూనే ఉండాలని మంచి పట్టుదలతో ఇంద్రియాలను నిగ్రహంతో ఉన్నాడని తెలుస్తోంది. వీడి మొండి పట్టుదలకి మొండి ధైర్యంకు అచంచల భక్తి విశ్వాసాలను చూస్తూ ఉంటే 10 లక్షల సంవత్సరాల పట్టే కర్మ నివారణ కూడా కేవలం పన్నెండు వందల సంవత్సరాల పూర్తి చేసినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేదు. ఎవరికి ఎరుక. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక సెకను చాలు సాధన పరిసమాప్తి అయిపోతుంది.అందుకే కాలం కూడా మిల్లీ సెకన్ల తో మొదలై బ్రహ్మ కల్పం వరకు విభజన చెందినది. అర్హత యోగ్యతను బట్టి ఏమి జరుగుతుందో ఆ విశ్వ ప్రకృతికే తెలియాలి. ప్రస్తుత నవబ్రహ్మగా రాబోవు హనుమంతుడికే తెలియాలి. ఎందుకంటే సాధన సాధ్యతే సర్వం సాధ్యం కదా. ఇక నాకైతే భూలోక సాధన పరిసమాప్తి చేసుకోవాలని మా ఇద్దరికీ మిగిలిన నాలుగు శరీరాల కర్మలు కూడా కర్మ శేషం లేకుండా సంపూర్తిగా పరిసమాప్తి అయ్యేదాకా మేమిద్దరం ఈ విశ్వ జగతి యందు నేను కాస్త మోక్ష కృష్ణ బిలము గాను అదే మా జిజ్ఞాసి అయితే మా కృష్ణ బిలమునకు మార్గదర్శిగా ధ్రువ తారగా మిగిలిపోవడం కొసమెరుపు.ఈ భూలోక సాధన పరిసమాప్తి చేసుకోవటానికి సాధన జన్మలు 12 లక్షల 372 జన్మనిచ్చినట్లు అక్కడ ఓ భవిష్య జన్మగా గురుగ్రహ లోకమునందు సూక్ష్మ శరీర సాధన స్థితికి రావటానికి 24 లక్షల 714 జన్మ ఎత్తవలసి ఉంటుందని చిట్టచివరి ఈ సాధన జన్మ యందు మళ్లీ నేను కూడా భయం బలహీనతకి గురి కావడంతో అక్కడ నుండి కారణలోకవాసుడిగా అవతార జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని తెలియటంతో ప్రస్తుతానికి మేధా దక్షిణామూర్తి లాగా మౌనం వహించక తప్పడం లేదు. అంటే భూలోక వాసిగా నేను లేను. గురుగ్రహ వాసిగా నేను ఉన్నాను.

మరి ఈ లెక్కన చూస్తే మనకి కాశీ క్షేత్రములో మరణమును పొందినగూడ సంపూర్ణకపాల మోక్ష స్ధితిని పొందుతామా లేదా అనే సందేహము నాకు వచ్చినది.మరి దీనికి సమాధానము మీకు తెలియాలంటే దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు గందా!

శుభంభూయాత్
 
పరమహంస పవనానంద
*********************************
 


1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి