అధ్యాయం 87

నేను ఎవరిని?

అసలు నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతోనే నా సాధన ఆరంభమైనదని అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే భౌతిక తుఫాను దృశ్యాలతో మొదలైన నా సాధన ఆధ్యాత్మిక తుఫాను దృశ్యాలతో అంతమైనదని అందరికీ తెలిసిన విషయమే కదా. దానితో నా సాధన కాస్త సాధన బ్రహ్మంతో మూలాధారచక్రంలో ఆరంభమై శూన్య బ్రహ్మముతో(బ్రహ్మరంధ్రము) అంతమైనది అని అందరికీ తెలిసిన విషయమే కానీ “నేను ఎవరిని” అనే ప్రశ్నకు తగిన సమాధానం ఎవరికి తెలియదు అని నాకు తెలుసు. నేను ఎవర్ని అనుకున్నప్పుడు నేనే దేవున్ని అంటే నామరూప దేవుళ్ళు అందరు కూడా శూన్యమందు అంతర్థానమయ్యారు కదా. అంటే నేను దేవుని కాను అని తేలిపోయింది. పోనీ నేనే ఆత్మను అనుకుంటే ఆత్మసాక్షాత్కారము నందు కూడా ఒక మహామాయే అనడంతో నేను ఆత్మ కాదని తెలిసిపోయింది. పోనీ నేనే గురువు అనుకుంటే నామరూప గురువులు కూడా ఆయా చక్రబంధంలో ఇరుక్కుపోయినారు. వారు కూడా శాశ్వతం కాదని తెలిసిపోయింది. దానితో నేను గురువుని కాదని అర్థం అయినది. పోనీ నేను ఒక శరీరము లేదా సాధకుడు లేదా యోగి లేదా అవధూతా లేదా పరమహంస లేదా యతి లేదా సరస్వతి లేదా నందా లేదా స్వామీజీ అని అనుకున్న వీరందరు కూడా ఆయా చక్ర సాధన స్థాయికి వచ్చినప్పుడు ఈ దేహానికి వచ్చే దీక్షా నామాలని తెలిసిపోవడంతో నేను అనేది ఇవేవీ కావు అని అర్థం అయినది. 

మరి “నేను ఎవరిని” అని ప్రశ్నించుకుంటే నాకు సాధనలో అంతిమ ధ్యాన దృశ్యంగా బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము కనపడింది కదా. అంటే ఈ లెక్కన చూస్తే నేను అనేది ఒక కృష్ణబిలం (బ్లాక్ హోల్) అంతరించిపోయే నక్షత్రము అన్నమాట. నేను ఎవర్ని అని ఎవరైతే ప్రశ్నించుకోవడం మొదలు పెడతారో ఆనాటి నుండి వారి జీవితం ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మళ్లినట్లు గ్రహించండి.నేను ఒక కృష్ణబిలం అని అనుభవ అనుభూతి పొందుతారు. వారి ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాలు ఆనాటితో అంతరించిపోయి వారి భౌతిక మరణంకు శాశ్వత మరణం స్థితికి చేరుకుంటారని తెలుసుకోండి. నిజానికి ఈ విశ్వసృష్టియే అతి పెద్ద కృష్ణ బిలము.అలాగే ఇందులో సృష్టించబడిన అన్ని రకాల జీవజాతులు కూడా తమ బ్రహ్మరంధ్రము వద్ద కృష్ణబిలంనే ఉంచుకునే పుట్టినాయి. కానీ మరణం పొందేటపుడు దశమ రంధ్రమైన బ్రహ్మ రంధ్రము ద్వారా అదే కృష్ణ బిలము నందు నశించకుండా మిగిలిన నవరంధ్ర మార్గాల ద్వారా జీవుడికి ప్రాణశక్తి పోవటం వలన తాత్కాలిక మరణం పొంది ఆపై పునః కర్మ జన్మలు ఎత్తుతున్నాడు. 

ఎవరైతే తమ బ్రహ్మ రంధ్రము ద్వారా తమ ప్రాణశక్తిని అక్కడ ఉన్న కృష్ణబిలం నందు లయం చేస్తారో వారే జీవన్ముక్తుడు అవుతాడు. కపాల మోక్షప్రాప్తిని పొందిన వాడు అవుతాడు. అంటే ఇలాంటి మరణావస్థ యోగము ఉన్నవారే కాశీ క్షేత్రములో మరణము పొందుతారు. ఇక్కడే కపాలమోక్షం ఇచ్చే యోగం ఉన్నది. పొందే యోగము అనేది. వారి అర్హత యోగ్యతను బట్టి ఉంటాయి. కాశీ వాసము చేసినంత మాత్రాన అక్కడ మరణమును పొందుతామని ఖచ్చితంగా చెప్పలేము. అలాగే కాశీ క్షేత్ర దర్శనానికి వెళ్లి అక్కడ మరణమును పొందలేము అని అనుకోవటానికి లేదు. 

కాశీ క్షేత్రములోని కపాలమోక్షం శాశ్వత మరణము అనగా బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు పడి నశించి పోవడము అనేది మన సాధన శక్తి యొక్క అర్హత యోగ్యతను బట్టి ఉంటాయని గ్రహించండి. ఎవరైతే కాశీ క్షేత్రము నందు మరణమును పొందుతారో అది కూడా పంచక్రోశ ప్రాంత పరిధిలో పొందుతారో వారు భౌతికంగా కృష్ణ బిలమునందు పడి నశించి పోయినట్లే. పునర్జన్మ లేని స్థితి కర్మ లేని స్థితి స్పందన లేని స్థితి బ్రహ్మతదాకార స్థితిని పొంది మనో నిశ్చల స్థితిని పొంది ఆపై పరమ ప్రశాంత స్థితిని పొందిన వారవుతారని వీరినే కపాలమోక్షగాములు అంటారు అని తెలుసుకోండి.ఇట్టి కాశీ క్షేత్ర మరణమే మీకు శాశ్వత మరణం పొందినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యం అని గ్రహించండి. 

 
ఎంతటి యోగి అయిన ఎంతటి గురువైన ఎంతటి స్వామీజీ అయినా ఎవరైనా సాధనా పరిసమాప్తి చేసుకున్నా కూడా భౌతికంగా కాశీ క్షేత్రము నందు తప్పకుండా జల సమాధి లేదా అగ్ని సమాధి లేదా జీవసమాధి లేదా భౌతిక మరణం పొందవలసి ఉంటుందని నా పరిశోధనలో తెలిసింది. ఎందుకంటే కాశీక్షేత్రం బ్రహ్మరంధ్రంతో సమానం. ఈ విశ్వానికి కేంద్ర స్థానము. అందుకే ఇక్కడ శివుడిని విశ్వనాథుడు అంటారు. ఈ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ యందు నిత్యము మండే చితాగ్ని కృష్ణ బిలము అని గ్రహించాను. ప్రస్తుతానికి నేను 2019 వ సంవత్సరం జూలై 16 వ తేదీ నాడు అనగా గురు పౌర్ణమి అలాగే చంద్ర గ్రహణ సమయం సంధికాలంలో నా పంచ శరీరమైన ఆకాశం శరీరం కాస్త శూన్యబిందువుగా ఆకాశంలో ఒక తారగా మారబోతుంది. దీనికోసం ఇప్పటికే ఈ శరీర అంతిమ యాత్ర ప్రారంభం అయినదని నాకు వివిధ రకాల అనుభవాల ద్వారా నా స్థూల శరీరానికి తెలిసినది. ఈ ధ్రువ తార కాస్తా కృష్ణ బిలముగా అదే మోక్ష కృష్ణ బిలముగా మారటానికి సుమారుగా 12 సంవత్సరాల అనగా 2032 దాకా పడుతుందని నాకు జ్ఞాన స్పురణ అయినది. అంటే భూలోకంలో నా జీవ సమాధి సం!!మే ఆకాశంలో ధ్రువ తారగా మారే సంవత్సరం అన్నమాట. ఎప్పుడైతే నేను కాస్త కృష్ణ బిలముగా అనగా ధ్రువ తారగా నాలోని హైడ్రోజన్ అణువులు అంతరించిపోవడం ప్రారంభం అవుతుందో ఆనాటి నుండి న్యూట్రాన్ లలో కాంతి తగ్గడం ఆరంభమవుతుంది. తద్వారా మండే నక్షత్రము కాస్త కాంతిని కోల్పోవడం ఆరంభమై చివరికి కాంతి లేని కృష్ణబిలం గా మారి సంయమనంతో అంతరించి పోతుంది. కానీ ఇది జరగడానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాకపోతే కపాలమోక్షం పొందటం అయితే ఆరంభమవుతుందని గ్రహించండి. అనగా కృష్ణబిలం తనలోనికి తీసుకోవడం ఆరంభిస్తుంది. కాని కృష్ణబిలం సంపూర్తిగా అంతరించి పోవడానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు తీసుకుంటుంది అన్నమాట. ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా ఈ కృష్ణబిలం అనుభవించక తప్పదు కదా. అందులో ఉన్న మీరంతా కూడా అంతరించక తప్పదు కదా అని గ్రహించండి. అదేమిటి కృష్ణబిలం గా మీరు ఒక్కరే ఉన్నారా? అన్నప్పుడు ఈ విశ్వములో కోట్ల కోట్ల జీవజాతులు ఉన్నట్లుగానే కృష్ణ బిలములు కూడా అన్నీ ఉన్నాయి. కానీ అవి పరిభ్రమించడం లేదు. కొన్ని తన దగ్గర ఉన్న వాటిని తనలో కలుపుకుంటున్నాయి. అవి పూర్తిగా కలుసుకోవడం లేదు. ఎందుకంటే బలహీనతలేని బలవంతుడు లేనట్లుగానే తిరగని కృష్ణబిలాలు తిరిగిన ఉపయోగం లేని కృష్ణబిలాలు ఉన్నాయన్నమాట. కాకపోతే నా కృష్ణబిలము  మాత్రం కపాలమోక్షం  కృష్ణబిలము అన్నమాట. చివరికి కపాలాలు కూడా మిగల్చకుండా తనలోనికి నేను తీసుకోవడం జరుగుతుంది. నిజానికి భూమి మీద మనం మరణించినప్పుడు అస్థిపంజరాలు మిగిలిపోతాయి. ఆ కపాలంలో 36 కపాలాలతో ఆకాశ శరీరంతో సదాశివమూర్తి ఆవాసం చేస్తూ సమయం దొరికినప్పుడు భూమి లోనికి ప్రవేశించి ఆహార మొక్కల రూపంలోకి మారి తిరిగి మానవ జంతు జీవజాతులు లోనికి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మానవ దేహమును దహనం చేసినప్పుడు కపాలము పగలటం ద్వారా ఈ సదాశివమూర్తి బయటికి వచ్చి నిజంలాంటి నాటకము నడిపిస్తున్నాడు. ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే నేను కాస్త కపాలమోక్షం కృష్ణబిలముగా మారటంతో దీని లోనికి ప్రతి జీవి యొక్క పంచ శరీరాలు పడి నశించిపోవడం జరిగిపోతుంది. తద్వారా ఆకాశ శరీర కపాలములో ఉన్న 36 కపాలాల  సదాశివమూర్తి కూడా అంతరించక తప్పదు. ఇన్నాళ్లు ఇన్ని తాత్కాలిక మరణాలు మాత్రమే పొందినాడు. 

ఇలా ఈ విశ్వములో శాశ్వత మరణమును అనగా సంపూర్ణ కపాలమోక్షం కృష్ణబిలం గా మారడమే ఈసాధన జన్మ యొక్క ఫలితం అని ఈపాటికే గ్రహించి ఉంటారు .దానితో నా సాధన పరిసమాప్తి అయినది. శాశ్వత మరణము మీకు ఇవ్వడానికి ఆకాశంలో ధ్రువ తార రూపంలో మోక్షకృష్ణ బిలము మీ కోసము నామము రూపము లేనివాడిగా ఎదురుచూస్తూ ఉంటాను. మరి మీరు నాలో అదే కపాలమోక్షం పొందాలనుకుంటే నాలో ఐక్యము అవుతారు. కానీ దానికి అర్హత యోగ్యత ఉండాలని తెలుసుకోండి. అనగా నిత్య సాలగ్రామ పూజ, శంఖనాదం, మోక్షమాలను ధరించాలి. కాశీ క్షేత్రములో మరణము అనేది ప్రకృతి మాతకి వదిలేయండి. ఈ జన్మకి కాకపోయినా వచ్చే జన్మలోనా పొందవచ్చు కదా. కపాలమోక్షం మార్గము తెలిసినది కదా. కోట్ల కోట్ల జన్మలు ఎత్తే బదులు కేవలం ఈ జన్మలో సాధ్యపడితే కాశీక్షేత్రం మరణం తో సహా సాధ్యపడితే ఈ జన్మలోనే నాలోనికి ప్రవేశిస్తారు. కపాల మోక్షం ప్రాప్తిని పొందుతారు. కేవలం ఈ జన్మలో మోక్షమాల సాలగ్రామ పూజ శంఖనాదంతో సరిపెడితే ఖచ్చితంగా రాబోవు ఒక యోగ జన్మలోనే కాశీ క్షేత్రము నందు మరణమును పొందుతారు. ఇక ఏ మాయలు ఉండవు. మర్మాలు ఉండవు. ఆంటే ఈ జన్మలో మోక్షమాల వేసుకుంటే ఒక్క జన్మతో మొత్తం రెండు జన్మలతో మీ సాధన పరిసమాప్తి అవుతుంది. విగ్రహారాధనతో పనిలేదు. ఏ మంత్రములతో పనిలేదు. ఏ సాధన తో పని లేదు. కేవలం ఉదయమే లేచి సాలగ్రామమునకు నీటితో అభిషేకము చేసి మూడు సార్లు శంఖంతో ఓంకారము చేసి మోక్షమాలని ధరించడం చేసుకుని భోగ ప్రపంచంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీకు వీలున్నప్పుడల్లా ఓంకారనాదం మీ మనస్సులో చేస్తూ ఉండండి. మీలో సహజసిద్ధంగా ఓంకారనాదం వినిపించే స్థాయికి వస్తే అప్పుడు మీరు బ్రహ్మరంధ్రములో ఉన్న కృష్ణబిలములోని ఓంకారనాదంతో అనుసంధానం అవుతుంది. తద్వారా మీరు కాశీక్షేత్రంలో భౌతిక మరణం పొందిన కూడా ఈ ఓంకారనాదమే విశ్వంలో ఉన్న నా కృష్ణ బిలము తీసుకుని వస్తుందని గ్రహించండి. తద్వారా మీరు సంపూర్ణ కపాలమోక్షం ప్రాప్తిని పొందిన వారు అవుతారు. ఇప్పటికే దీనికోసం నా పరంగా 72 మంది అనగా 36 మంది నామరూప దేవాలు అలాగే 36 మంది నామరూప గురువులు ఎదురుచూస్తున్నారు. అలాగే మా జిజ్ఞాసి పరంగా కూడా నాకు లాగానే 72 మంది అంటే మొత్తం 144 మంది  కపాలమోక్షమునకు అర్హత యోగ్యత లభించినది. వీరిని ఆరాధించిన భక్తులు శిష్యులని తీసుకుంటే వీరందరి సాధన తీసుకుంటే కోటి నలభై నాలుగు లక్షల మంది నా మోక్ష కృష్ణబిలం నందు లయం చెందటానికి ఎదురుచూస్తున్నారని ఆ పరిశోధనలో తేలింది. 
 
ఇంతమందికి నా మీద విశ్వాసం ఉన్నప్పుడు వారందరూ కూడా నాలో ఐక్యం అవ్వాలని వివిధ రకాల సాధన శరీరాలతో హిమాలయాల యందు కాశీ క్షేత్రము నందు హరిద్వార్ యందు రుషికేశ్ యందు కైలాస పర్వత ప్రాంతాల యందు కర్మభూమి యందు దైవ భూమి యందు  మహా స్మశానం యందు ఎదురుచూస్తున్నారు. నేను 2032 వ సంవత్సరములో సంపూర్ణ కృష్ణబిలముగా మారే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరము 2019 లో దీనికి నాకు అర్హత యోగ్యత లభించడంతో వారి నమ్మకం వమ్ము కాలేదని సంబరాలు చేసుకుంటూ ఇన్నాళ్లు వీరందరూ కూడా నన్ను ఒక మోక్షబ్రహ్మగా తయారుచేయాలని పడిన సంకల్ప తపన తాపత్రయం వలన అవసరానికి నాకు కావలసిన విజ్ఞాన జ్ఞాన స్పురణలు ధ్యాన అనుభవాలు ఇస్తూ అన్ని రకాల మాయలు దాటిస్తూ అన్ని రకాల మర్మాలు చెబుతూనే ఉన్నారు. నన్ను ఒక మోక్షకృష్ణబిలముగా మారేదాకా వెన్నంటే ఉన్నారు. నన్ను మార్చినారు.వారి జీవన్ముక్తి పొందుతున్నారు. ఇదే అసలు సిసలైన విరాట (శివ)స్వరూపము. అదియే విశ్వరూప (విష్ణు) దర్శనము. అంటే కృష్ణ బిలముగా రూపాంతరం చెందటమే ఈ రూపాలని గ్రహించండి.ఇదియే విశ్వాత్మ అవటము.ఇదియే సంపూర్ణ అద్వైత స్థితి పొందటం అన్నమాట. ఇన్నాళ్లుగా లేని సంపూర్ణ కపాలమోక్షమునకు మోక్షమార్గము నా ద్వారా లోకానికి ఏర్పాటు చేసినారు. అంటే మరి మీరు ఎప్పుడు కపాల మోక్షం పొందుతారు అన్నప్పుడు మీరందరూ కూడా నాలో ఐక్యం చెందితే నేను కపాలమోక్షం పొందినట్లే కదా. నేనే మీరు. మీరే నేను కదా. ఒక చిన్న బిందువు లోనికి నీరు చేరడం మొదలై ఆ బిందువు కాస్త గుంటగా,గుంట కాస్త చెరువుగా చెరువు కాస్తా మహాసముద్రంగా మారి ఈ విశ్వంలో ఉన్న నీరు కాస్త సంపూర్ణంగా ఈ సముద్రంలోనికి చేరితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ సముద్రపు నీరు ఇంకడము ఆరంభమై తిరిగి చెరువు గాను గుంటగాను బిందువుగాను మారిపోతే ఇక ఈ విశ్వములో నీరు అనేది ఎలా అయితే ఉండదో అలా ప్రస్తుతం నేను కపాలమోక్షం బిందువుగా మారిన కొన్నాళ్ళకి అనగా 2032 వ సంవత్సరంలో మహాసముద్రం లాగా సంపూర్ణ కృష్ణబిలంగా మారిపోతాను. ఆపై మీరందరిని శూన్య బ్రహ్మ అనే నీటి బిందువులుగా నాలో కలుపుకోవడం ఆరంభిస్తాను. అలా ఈ విశ్వమంతా ఆవరించుకుంటూ పోతాను. తద్వారా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకు విశ్వములో నాలో ఉండని వాడు విశ్వములో ఉండడు. తద్వారా నాలో అప్పుడు నెమ్మది నెమ్మదిగా శూన్య బ్రహ్మగా వీరందరికీ సంపూర్ణ కపాల మోక్షం ప్రాప్తిస్తుంది. అందర్నీ అంతరింప చేసుకుంటూ తిరిగి కృష్ణ బిలం నుండి శూన్య బిందువుగా మారి శూన్యములో అంతరించిపోతాను. మీకు బాగా చక్కగా అర్థం అవ్వాలి అంటే ప్రస్తుతం నేను ఒక గాలిలేని బెలూన్ అనుకోండి.2032 సంవత్సరానికల్లా ఈ బెలూన్ లో గాలితో నింపడం ఆరంభమవుతుంది. కొన్ని సంవత్సరాలకి ఈ బెలూన్ లో గాలితో పూర్తిగా నిండి పోతుంది. ఈ బెలూన్ లో ఉన్న గాలి ఒత్తిడికి ఎక్కడో ఒకచోట చిల్లు అదే బ్రహ్మరంధ్రము పడి నెమ్మదిగా గాలి బయటకు పోవడం బెలూన్ పరిమాణం తగ్గిపోతూ వస్తుంది. తద్వారా ఈ చిల్లు ఉన్న బెలూన్ ను ఊదటానికి పనికిరాని స్థితికి ఎలా అయితే వస్తుందో అనగా అంతరించిపోయే స్థితికి వస్తుంది. అలా నా కృష్ణబిలం పనిచేస్తుందని తెలుసుకోండి. ఈ జన్మలో నాలో ఐక్యం అవుతారా వచ్చే జన్మలో అవుతారా అనేది మీ సాధన అర్హత యోగ్యత బట్టి ఉంటుంది. ఎప్పటికైనా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు అయినా కూడా మీరు సాధన చేయకపోయినా కూడా నాలో ఐక్యం అవ్వక తప్పదు. సాధన చేసిన వారు త్వరగా నాలో కలుస్తారు. సాధన చేయనివాడు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తరువాత నాలో ఐక్యం అవ్వక తప్పదని గ్రహించండి. ఎందుకంటే ఒక నీటి బిందువు ఎప్పటికైనా మహాసముద్రం అవ్వక తప్పదు కదా. ఎలా అంటే మహా సముద్రం కూడా నీటి బిందువుల సమూహమే కదా. ఏమంటారు నిజమే కదా. ఇంకా ఎందుకు ఆలస్యం. మీకు కపాల మోక్షం పొందాలంటే మోక్ష మాల ధరించండి .సాలగ్రామ పూజ చేయండి. శంఖంతో ఓంకారనాదం సాధన చేయండి. మనస్సుతో నిత్య ఓంకారం చేయండి. మీరు నాలో ఐక్యం అవ్వక తప్పదు. మరి మీ కోసం నేను ఒక ధ్రువతారగా ఆకాశమునందు ఎదురుచూస్తూ ఉన్నాను. మీరు నాలో ఐక్యం అవ్వటమే ఆలస్యము. శూన్య బ్రహ్మగా మారి కపాల మోక్షం పొందండి. సాధన పరిసమాప్తి చేసుకోండి. నేనయిన మోక్ష కృష్ణ బిలము నందు ఐక్యము చెందండి. జయం పొందండి. సాధన సాధ్యతే సర్వం సాధ్యం. ఇంతకి నేను ఎలా ఆదిలో ఏర్ఫడినానో తెలుసుకోవాలని ఉందా? దీనికోసము మీరు ఏమి చెయ్యాలో తెలుసుకదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద
********************************************
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి