అధ్యాయం 96

నేను ధ్యానానుభవములో పొందిన జ్ఞాన సత్యాలు

1 ఇప్పటికీ సదాశివమూర్తి రూపంలో కైలాస పర్వతము నందు ఆజ్ఞాచక్రముముద్రతో ధ్యాన తపస్సు చేసుకుంటున్నారు. పైగా ఈ పర్వతమునకు కాపలాగా 49 అడుగులున్న కింగ్ కోబ్రా నల్లని పాము ఏక తలతో కాపలా కాస్తోంది. పైగా ఈ పర్వతము అగ్ర భాగమునందు ముప్పై ఏడు అడుగుల హనుమత్ శంఖంతో కప్పి వేయబడినది. అలాగే ఈ పర్వతమునకు రక్షకుడుగా 24 అడుగుల రూపంలో తెల్లని బొచ్చుతో హనుమంతుడు యతీశ్వరుడులాగా కాపలాగా ఉన్నాడు. 
2.మురుడేశ్వర క్షేత్రమునందు సాంబశివమూర్తి సముద్రం ఒడ్డున సజీవ మూర్తిగా ధ్యాన సమాధిలో ఉన్నారు. 
3.మహా గణపతి శంఖము రూపముతో గణపతి శిలారూపంలో శ్వేతార్క వేరు రూపములో సజీవ మూర్తి గా ఉన్నాడు.
4.విష్ణుమూర్తి కాస్త సాలగ్రామ రూపంలో, శంఖముల రూపంలో, సుదర్శన చక్ర సాలగ్రామ రూపములో ఉన్నారు. 
5. అమ్మవారు వివిధ క్షేత్రాల యందు నాకు తెలిసిన కామాఖ్య, జొన్నవాడ, జోగులాంబ, కంచి శ్రీశైలము క్షేత్రాలలో సజీవ మూర్తిగా సంచారము చేస్తున్నారు. 
6.మూలాధార చక్రము నందు ఆది బ్రహ్మ గణపతి ఆకార పరబ్రహ్మము గా ఉంటే ఆజ్ఞా చక్రము నందు సాకార పరబ్రహ్మము ఆత్మ స్వరూపముగా ఉంటే అంతములో నిరాకార పరబ్రహ్మ బ్రహ్మరంధ్రము వద్ద కృష్ణ బిలము ఉంటుంది. 

7. యోగ సాధన అంటే యోగ నిద్రలో తన యొక్క కల ప్రపంచంలోనికి సూక్ష్మ శరీర యానం చెయ్యటమే అన్నమాట. ఇది సగం చేసి వెనక్కి వస్తే మాయా అవుతుంది. అదే సంపూర్తిగా చేస్తే మాయా రహితం అవుతుంది.
8.మాయా అంటే ఒక దాని మీద కోరిక లేదా మోహము లేదా వ్యామోహం పెంచుకోవటం అన్నమాట. 
9. కాశీ క్షేత్రము నందు కాలభైరవుడు అలాగే శ్రీ త్రైలింగ స్వామి వారు మరియు హనుమంతుల వారు సజీవ మూర్తిగా సంచారం చేస్తున్నారు. 
10. దత్తాత్రేయుడు, అశ్వద్ధామ, హనుమంతుడు, వేదవ్యాసుడు, సజీవ మూర్తి గా ఉండి సంచారం చేస్తున్నారు.

11. గయుడు దర్శనము పొందిన తాకిన మోక్షప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. 
12. ద్వారకా తిరుమల యందు చింతామణి గణపతి సజీవ మూర్తిగా ఉంది. ఇక్కడ మనకు ఉన్న అన్ని రకాల చింతలు తొలగిపోతాయి. 
13. తిరుపతి క్షేత్రము నందు వెంకన్న స్వామి వారు బాలాదేవి శక్తితో సంచారము చేస్తున్నారు.
14. విజయవాడ యందు దుర్గాదేవి కాస్త బాలా-త్రిపుర రూపములలో సజీవ మూర్తిగా సంచారము చేస్తున్నారు. ఇక్కడున్న దేవరకొండ ప్రాంతములో ఉన్న జ్వాలాముఖి దేవాలయం లో ఎనిమిది సంవత్సరములు గాను కొండమీద త్రిపుర రూపంలో దుర్గాదేవిగా సంచారం చేస్తుంది. 
15. దత్తాత్రేయుడు అంశలైన దశ దత్త గురువులైన శ్రీ పాదశ్రీ వల్లభ, శ్రీ నృసింహ, సాయి బాబా, తాజుద్దీన్ బాబా, ధునీవాలా బాబాజీ, మాణిక్య ప్రభువు, అక్కల్కోట శ్రీ గజానన మహారాజు, శ్రీత్రై లింగ స్వామి వారు ఇప్పటికీ వీరి క్షేత్రాల యందు సజీవ మూర్తిగా సూక్ష్మశరీరములతో సంచారం చేస్తున్నారు. 
16. జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రము నందు అమ్మవారు ఇప్పటికీ సజీవ మూర్తిగా సంచారం చేస్తున్నారు.
17. ఇప్పటికీ కాశీ క్షేత్రము నందు పెద్ద వానర రూపంలో హిమాలయాలలో యతీశ్వరుడులాగా హనుమంతులవారు సజీవ మూర్తి గా ఉన్నారు. 
18. చెట్ల లో తులసి… జలాలలో గంగ… జంతువులలో ఆవు… ఇవి మాత్రమే అత్యధికముగా ఆక్సిజన్ శాతం కలిగి ఉంటాయి. 

19. అరుణాచల క్షేత్రము నందు ఉన్న ఒక గుహ యందు ఇప్పటికీ సజీవంగా పూర్తిగా ఒక మర్రిచెట్టు కింద మేధా దక్షిణామూర్తి నిత్య ధ్యాన తపస్సులో ఉన్నారు. 
20. గంగానది వైరాగ్య భావాలు కలిగిస్తే …గండకీనది భోగ భావాలు కలిగిస్తుంది. గంగానది కాస్త మహామృత్యువు అయితే గండకీ నది మహా జననం లాంటిది. 
21. ఇప్పటికీ గంగామాత కాశీ క్షేత్రము నందు సజీవ మూర్తిగా సంచారం చేస్తోంది. 

22. సిద్ధులు ఉన్నాయి. సిద్ధ పురుషులు ఉన్నారు. రసవిద్యలు ఉన్నాయి. రస సిద్ధులు ఉన్నారు. 
23. సజీవ మూర్తిగా నాగులు ఉన్నాయి. నాగ శక్తి ఉన్నది. సర్పదోషాలు ఉన్నాయి. వాటికి పరిహారాలు ఉన్నాయి. 
24. బల్లి, తేలు, గబ్బిలం మన ఇంటిలో మన ఒంటిలోని జీవకళను తగ్గిస్తాయి. జోగులాంబను దర్శించుకుంటే త్రిదోషాలు పోతాయి. 
25. గాణ్గాపురమందు మధ్యాహ్నము 12 గంటలకి భిక్కి విశ్వ గురువు అయిన మహా అవదూత అయిన శ్రీ దత్త స్వామి ఇప్పటికీ వస్తున్నారు. అలాగే కొల్హాపురం నందు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ బిక్ష చేస్తారు. 

26. పండరీపురం నందు ఇప్పటికీ కూడా పాండురంగడు సజీవ మూర్తిగా 12 సంవత్సరముల బాలుడి రూపంలో సంచారం చేస్తున్నాడు. 
27. అడ్డముగా త్రినేత్ర దర్శనము అవుతుంది.
28. సాధనలో దక్షిణాచారం, వామాచార, సమయచార,ఇలా 112 విధి విధానాలు ఉన్నాయి. ఇవి అన్ని కూడా సత్యమార్గములే. ఏది ఎక్కువ కాదు. ఏది తక్కువ కాదు. 
29. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, పసుపు, కర్పూరం, తమలపాకులు, కొబ్బరికాయ, అరటిపండు, వడపప్పు, పానకము, గారెలు, పులిహోర, దద్ధోజనం, పరమాన్నము, వేపాకు, శెనగలు, బెల్లం ఇలా వీటియందు మన యోగ చక్రాలు బలము చేకూర్చేవి అన్నమాట. మానసిక శారీరక అనారోగ్య సమస్యల నుండి ఇవి రక్షిస్తాయి అని గ్రహించండి. 
30. ఓంకార నాద ఉపాసన ప్రారంభ స్థితి ఉపాసన. తుంకార నాద ఉపాసన మధ్యమ స్థితి. నిశ్శబ్ద నాదోపాసన స్థితి అత్యున్నత స్థితి అని గ్రహించండి. 
31. సాక్షీభూతంగా, ఆధారభూతంగా, సమ దర్శనముగా, సమదృష్టితో, కృతజ్ఞతతో, భక్తి విశ్వాసంతో, శరణాగతితో, త్యాగము, వైరాగ్య, వివేక బుద్దితో, వివేక జ్ఞానము, స్థిర బుద్ధితో, స్థిర మనస్సుతో, క్షమాగుణంతో, సహన శక్తితో ఉండటమే యోగసాధన అవుతుంది. 
32. జీవితము అసత్యము అని గ్రహించుట జీవిత సత్యం అని గ్రహించండి. 
33. కనిపించేవి అంతా అసత్యమని కనిపించనివి అంతా సత్యమని గ్రహించుట సత్య అన్వేషణ అన్నమాట. 

34. పొగ రూపంలో బూడిద రూపంలో పాము కదలిక రూపంలో కుండలినీ శక్తి ప్రవాహం ఉంటుంది. 
35. మన మెదడు భాగంలో గోముఖ జలము ఉన్నది. 

36. మన బ్రహ్మరంధ్రము లోపల ఏక మూల కపాల దర్శనము దీనిలోపల 36 కపాలధారి అయిన అస్థిపంజరం అది కూడా ధ్యాన తపస్సు ఉన్నట్లుగా దర్శనము అవుతుంది 
37. అన్ని శివలింగ ఆరాధనలో నవపాషాణం ఇష్టలింగ ఆరాధన మిన్న అని గ్రహించండి. 
38. లేని దేవుడు ఉన్నాడనే విశ్వాసముతో ఈ విశ్వము నడుస్తోంది. 
39. మన దేహమంతా మనమంతా కూడా విశ్వమంతా కూడా ఓంకార నాద బ్రహ్మ మయం.
40.శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము మిన్న. 
41. ఎవరికి వారే నిజమైన జ్ఞానం పొందాలి. 
42. దైవ అనుభవాలు వేరు వేరుగా ఉండవచ్చును కానీ అందరికీ అనుభూతి ఒక్కటే ఉంటుంది. 
43. మనమంతా కూడా విశ్వమంతా కూడా పరమ శూన్యము యొక్క కల రూపమే. 

44. అన్ని మాయాలను చేధించాలంటే మనో ఇంద్రియ నిగ్రహము కలిగి ఇంద్రియాలు మీద పట్టు సాధించి జితేంద్రియుడు అవ్వాలి. 
45. ఏకాగ్రతకు తాటక క్రియ విధానం ఉపయోగపడుతుంది. 
46 అమృత సేవనమునకు ఖేచరీ ముద్ర సహాయపడుతుంది. 
47. నవగ్రహ సంచార స్థితులే జీవులు స్థితిగతులను జరగబోయే పరిస్థితులను తట్టుకోవటానికి జ్యోతిష్యశాస్త్రము ఉపయోగపడుతుంది. 
48. విగ్రహము నిగ్రహము కొరకే. దేవాలయం దేవుడు ఉన్నాడని నమ్మకం కొరకే ఉన్నాయి. 

49. దేహమే దేవాలయము అన్నప్పుడు భౌతిక గుడులతో పని ఏమీ ఉండదు. 
50. విగ్రహారాధన కన్నా విశ్వ ఆరాధన మిన్న. 
51. కోరిక లేని భక్తి, నిష్కామకర్మ, నిజ జ్ఞాన స్పురణ మౌనముద్ర మౌనము ఇదియే సాధన పరిసమాప్తికి సూచనలు.
52. మోక్షము పొందినామో లేదో తెలుసుకోలేని విచిత్ర అవస్థ అనగా మన మరణం లాంటిదే ఇది.
54.. బ్రహ్మ రంధ్రము పడిన చోట నిజానికి హింగ్లాజీ మాత ఆలయం లేదు. అది అమ్మవారి త్రినేత్రం పడిన ప్రాంతం అని నాకు ధ్యాన అనుభవము అయినది. 
55. అమ్మవారి కన్ను పడిన చోట జోగులాంబ లేదు. అక్కడ నిజానికి అమ్మవారి బ్రహ్మరంధ్రము పడిన చోటు అని నాకు ధ్యాన అనుభవము అయినది. 
56. బాలగా శ్రీశైల అమ్మవారు ,మధుర మీనాక్షిదేవి గాను, త్రిపురగా కంచి కామాక్షిగాను, సుందరిగా కాశీ విశాలాక్షిగాను, దేవి గాను జోగులాంబ ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవము అయినది. 
57. మన శరీరంలో పంచ శరీరాల సాధన 13 యోగ చక్రాల విభేదనము సాధన ఉన్నదని గ్రహించినాను. 

58. పళని క్షేత్రంలో 12 సంవత్సరముల బాలుడి రూపంలో సజీవ మూర్తిగా కుమారస్వామి అంశ సంచారం చేస్తున్నది. 
59. శాశ్వత మరణము ఇచ్చే క్షేత్రమే కాశీ క్షేత్రము. ఎందుకంటే జననాలు ఇచ్చే గండకీనది అలాగే మరణాలు ఇచ్చే గంగానది ఈ క్షేత్రంలోనే కలుస్తాయి. 
60. కాశీ క్షేత్రములోని మణికర్ణికా ఘాట్ యందు పరమేశ్వరుడు అలాగే పరమేశ్వరి గణపతి కాలభైరవుడు కలిసి తారకరామ మంత్రోపదేశము చేయటము సత్య అనుభవము అయినది.
61. కైలాస పర్వతము, ఉజ్జయిని క్షేత్రము, రామేశ్వరము, బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాలు పునఃజ్ఞానము, పునర్జన్మ, పునఃకర్మ, పునః కోరిక అనే మాయాలు ఇస్తాయి. పైగా ఇవి దైవం నిర్మిత పిరమిడ్లు కావటం వలన సాధకుడి సాధనా శక్తిని తమలోనికి తీసుకుంటాయని ధ్యాన అనుభవము అయినది. 

62. మన మనస్సు కూడా చిదంబర క్షేత్రంలోని నటరాజమూర్తి నాట్యములాగా ఊగిసలాడుతూనే ఉంటుందని ఇలా కాకుండా చిదంబర దక్షిణామూర్తిలా మౌనదీక్షతో నిశ్చలస్థితి పొందితే అదియే మోక్షం ప్రదమని గ్రహించాను. 
63. పిండ ప్రధాన కార్యక్రమమును విష్ణు గయనందు బ్రహ్మ కపాలం నందు ప్రయాగ క్షేత్రము నందు మాత్రమే చేయాలి. ఆత్మ పిండప్రదానము అయితే బ్రహ్మకపాలం నందు చేయాలని కాశీ క్షేత్రములో ఎట్టి పిండప్రదానము చేసినను ఉపయోగం ఉండదని…. ఎందుకంటే ఇది అవిముక్త క్షేత్రమని పునర్జన్మ లేని స్థితిని ఇచ్చేదని నాకు జ్ఞాన స్పురణ అయినది.
64. మనలో కుండలినీశక్తి జాగృతి అంటే మన స్వప్న ప్రపంచ సూక్ష్మ శరీర యానంకి అర్హత యోగ్యత లభించినట్లే అన్నమాట. 
65. ప్రాపంచిక విషయాలు దాటినవారే నిజ అవధూతలు అన్నమాట. 

66. ప్రతి దానిలో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేక జ్ఞాన బుద్ధి గల ప్రతి వారు కూడా నిజ పరమహంసలే అన్నమాట.
67. నిజ యోగ సాధన అంతా సాధకుడికి యోగనిద్ర స్థితిలోనే జరుగుతుంది. ఇందులో వివిధ రకాల స్వప్న అవస్థల స్థితులను తన ధ్యాన అనుభవ దృశ్యాలుగా చూడగలిగి తట్టుకోగలిగితే నిజ యోగసాధన అభివృద్ధి జరుగుతుందని గ్రహించండి. 
68 నిద్ర మరియు మెలుకువ మధ్య కలిగే స్థితిని యోగనిద్ర స్థితి అంటారు. దీనిని తంద్రావస్థ అని అంటారని శాస్త్ర వచనము. 
69. సాధకుడికి తాను సాధనలో ఎక్కడ మాయాలో పడి జారిపోతాడనే భయం ఉంటుంది. దీనిని సాధకుడు అధిగమించాలని తెలుసుకోండి. శాస్త్ర వచనం ప్రకారం మన కుండలినీశక్తి కాస్తా మణిపూరకము లేదా అనాహత చక్రం వచ్చేదాకా శక్తి ప్రవాహ అనుభవాలు పొందితే ఆ సాధకుడి యొక్క కుండలినీ శక్తి జాగృతి క్రిందకి జారదని గ్రహించండి. 
70.  ప్రారంభంలో దైవ మంత్రాలు దైవ ఆరాధనలు దైవ విగ్రహారాధనలు గురువు ఆరాధనలు మాత్రమే ఉపయోగపడతాయి. అటుపై గుడులు క్షేత్రాలు మంత్రాలు విగ్రహారాధన గురు ఆరాధన ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవి అన్నీ కూడా సాధనకి అడ్డుగా బంధముగా మాయాగా ఉంటాయని గ్రహించండి. విగ్రహారాధన నుండి విశ్వారాధనకి సాధకుడు చేరుకుంటేనే సాధన ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు గుడికి వెళ్ళడము క్షేత్రాలకి వెళ్ళటం విగ్రహాలను పూజించడం గురు ధ్యానం చేయటం మంత్ర జపాలు చేయడం ఆపి వేయడం మొదలు అవుతుందో ఆనాటి నుండి మీ యోగసాధన పురోభివృద్ధి వైపుకి వెళుతున్నట్లు అన్నమాట. అనగా నీ దేహమే దేవాలయము అవుతుంది అన్నమాట. నీ ఆత్మయే ఆత్మ దైవము అవుతుంది.మీ ఆత్మయే ఆత్మ గురువై గురుదేవుడు అవుతుంది. 
71. ఆడేవాడు ఆడించేవాడు ఒక్కటే అని జ్ఞానము పొందడమే నిజ జ్ఞానం.
72. కనిపించే విశ్వమంతా అద్ధములో ప్రతిబింబము అయితే కనిపించనది అంతాగూడ అద్ధము లాంటిది.

73. ఈ విశ్వంలో యోగశాస్త్రము ప్రకారము ప్రతి ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి మూలప్రకృతి తన నిజ బ్రహ్మజ్ఞాన స్థితిని లోకానికి అందజేస్తుంది. దీనిని అందుకున్న వాడు మోక్షగామి అవుతాడు. తద్వారా తనకున్న వివిధ కోట్ల కోట్ల జన్మలు యొక్క ప్రారబ్ద కర్మలను నివారణ చేసుకుని కర్మ శేషము లేకుండా చేసుకుని కర్మ రహితుడై జన్మ పునర్జన్మ లేని స్థితిని పొందే యోగ కాలమని గ్రహించండి.ఇది 1419 సంవత్సరంతో మొదలై 2019వ సంవత్సరము జూలై 16 చంద్రగ్రహణం గురుపౌర్ణమి దాకా ఉంటుందని నా మనో దృష్టికి వచ్చినది. ఈ మధ్య కాలంలోనే బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందటం జరుగుతున్నది. ఈ 2019వ సంవత్సరంలోనే ప్రతి 40 సంవత్సరములకు బయటికి వచ్చే కంచి అత్తి వరదరాజ స్వామి విగ్రహ మూర్తి రావటం ప్రతి 150 సంవత్సరాలకు ఒకసారి గురు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రావటము జరిగినది. 
74. సాధకుడు తన స్వప్న సాధనలో దేనికి భయపడకుండా, దేనికి ఆశ పడకుండా, దేనికి స్పందించకుండా, దేనిని సంకల్పించుకుండా, దేనికి ఆనంద పడకుండా, దేనిని ఆలోచించకుండా… తన యోగనిద్ర స్థితిలో తను చూసే ధ్యాన దృశ్యాలను కేవలము మౌనముగా సాక్షీభూతంగా నిర్లిప్తత భావముతో స్మశాన వైరాగ్యంతో చూడగలిగి తట్టుకోగలిగినవాడే దశ ఇంద్రియాలు జయించిన జితేంద్రియుడు అన్నమాట.
75. సాధన చేస్తున్నప్పుడు మన గత భవిష్య జన్మల వివరాలు అలాగే ప్రస్తుత జన్మ యొక్క భవిష్యత్ సంఘటనలు వివరాలు తెలిసినప్పుడు వాటిని తట్టుకుని ఆత్మస్థైర్యంతో ఉండాలని మనోధైర్యంతో ఉండాలని గ్రహించాను. లేదంటే ఐదు సంవత్సరములలో మతిభ్రమించి అకాల మరణం పొందే అవకాశాలు ఉంటాయి.
76. మాయా గూర్చి తెలిస్తే మాయా మాయం అవుతుంది.
77. కుండలిని శక్తి సాధకుడు యొక్క అనాహత చక్రము నందు ప్రవేశించినప్పుడు సాధకుడికి విపరీతమైన మరణ భయం కలుగుతుంది. దీనిని తట్టుకోగలిగితే అప్పుడు సాధకుడు తన అంతరంగము నుండి బయటకి వినిపించని ఒక శబ్దనాదము వినటం జరుగుతుంది.ఈ నాదము మనకి ఈ చక్రము నందు వినిపించటం వలన దీనిని అనాహత నాదం అంటారు. ఈ నాదము వినగలిగితే సాధకుడికి అన్ని చక్రాల యందు సూక్ష్మాతి సూక్ష్మ శబ్దనాదములు అయిన భ్రమరీనాదము, వేణు నాదము,కంచు నాదము, గంటానాదం, దీర్ఘ గంటానాదం, నీటి సవ్వడి, గజ్జల నాదము, గాలి సవ్వడి,వీణా నాదము, ఓంకారనాదం. శృంగ నాదము,శంఖునాదము, డమరుకంనాదము ఇలా పలురకాల నాదాలను సాధకుడు తన యోగ నిద్రలో వినగల్గుతాడు.
78. ఒక సాధారణ వ్యక్తి తన గురించిన అజ్ఞానముతో ఉంటే సాధకుడు తన గురించి జ్ఞానముతో ఉండుట జరుగుతుందని గ్రహించాను. 
79 సాధకుడి జీవితము నిరంతరం అగ్నిపరీక్షకు గురి అవుతూనే ఉంటుంది. కత్తి మీద సాములాంటిది. పులి మీద స్వారీ లాంటిది. భయపడితే బాధపడితే పులి నోట్లో పడినట్లే అని గ్రహించాను. 
80. సాధకుడిలో కుండలినీ శక్తి ప్రవాహం ప్రతి క్షణం ప్రతి రోజు ఏదో ఒక చక్రమునుండి కదలికలు ఆరంభమవుతాయి. దీనికి వరుస క్రమము సమయపాలన పరిస్థితులతో సంబంధం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏ విధముగా శాంత పడుతుందో కుండలినీ శక్తి అధిదేవత అయిన ఆదిపరాశక్తి కే తెలియాలి అని గ్రహించాను. 
81. ధ్యానంలో అందరికీ అంతరాయము అనేది కలుగుతుంది. ఇది కూడా ప్రారబ్ద కర్మ గానే (గత జన్మల కర్మ వాసన) భావించండి. మీరు ఈ అంతరాయం కలిగించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అంతరాయం ఏదో రకంగా మీరు ఊహించని విధంగా జరుగుతుందని గ్రహించండి. ఇది సహజ సిద్ధమైన ప్రక్రియగా భావించి దానిని ప్రతిఘటించకుండా ఆ అంతరాయము తొలగించుకోండి. ధ్యానము కొనసాగించండి.
82. జరిగేది జరుగుతూనే ఉంటుంది. జరగనిది ఎన్నటికీ జరగదని గ్రహించండి. 

83. బ్రహ్మరంధ్రము వద్ద అగుపించే కృష్ణ చక్రము కృష్ణ బిలము అనేది మరొక గ్రహ లోకమునకు అనుసంధానమై ఉంటుందని గ్రహించాను. అనగా కృష్ణబిలాలు అన్ని కూడా ఒక దానితో మరొకటి అనుసంధానమై వేరే గ్రహ లోకమునకు నాంది అవుతాయి. 
84. సంపూర్ణ మోక్షము అనేది లేదు. కేవలము స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాల కపాలమోక్షం ఉన్నాయని గ్రహించాను. సాధకుడు ఈ లోకము నుండి స్థూల శరీర కపాలమోక్షం పొంది వేరే లోకమునకు వేరే శరీరంలో చేరుకుంటాడు అని గ్రహించాను. 
85. యోగ సాధనను ఎవరు కూడా 100%సంపూర్తిగా చేయలేరని కేవలము 99.99% శాతము మాత్రమే చేస్తారు. మిగిలిన 0.01% బలహీనత అనే లక్షణమునకు బలి అవుతారు అని గ్రహించాను. అంతెందుకు మనము వాడే కంప్యూటర్లో యాక్యురేట్ గా కూడా 99.99% అని చెబుతారు కదా. అలాగే సాధన కూడా అన్నమాట. 
86. సాధనచేస్తే ఈ భూలోకము నుండి పునర్జన్మల నుండి కర్మ జన్మ రాహిత్య స్థితిని పొంది వేరే లోక గ్రహ వాసిగా మారటం జరుగుతుంది. లేదంటే ఈ భూ లోకమునందు భౌతిక మరణాలు జన్మలు ఎత్తుతూనే ఉంటారని గ్రహించినాను.
87. శ్రీశైల క్షేత్రము నందు బాలాత్రిపురసుందరి రూపాలతో అమ్మవారి నిజరూప దర్శనాలు కలుగుతాయి. 
88. కాశీ క్షేత్రము నందు సజీవ మూర్తిగా హనుమంతుని దర్శనము అలాగే హిమాలయాలయందు యతీశ్వరుడి రూపంలో ఈయన సంచారం చేస్తుంటారు. 

89. కాశీ క్షేత్రము నందు శ్రీ త్రైలింగ స్వామి వారి సూక్ష్మశరీర దర్శనము అవుతుంది. 
90.కాలారాం అనే తాంత్రిక అఘోర సిద్ధుడు తన కాశీ క్షేత్ర సమాధి యందు సజీవంగా ఉండి ధ్యాన తపస్సులో కనబడతారు. 
91. దత్త గురువులలో ఒకరైన మాణిక్య ప్రభువు, నరసింహ సరస్వతి స్వామి మూర్తుల నిజరూపదర్శనం క్షేత్రాల యందు ఇప్పటికీ మనకి కనబడతాయి. 
92. కాశీ క్షేత్రములో మరణము పొందిన మనకి కేవలము స్థూల శరీర కపాల మోక్షం కలుగుతుంది. సంపూర్ణ కపాల మోక్షం లభించదు. 
93. కాశీ క్షేత్రము నందు మణికర్ణికా ఘాట్ యందు నిజంగానే కాశీ విశ్వనాధుడు కాస్త తారకరామ మంత్రోపదేశము చేస్తున్న ధ్యాన అనుభవము పొందటము జరిగినది. 
94. పంచ సాధన శరీరాలతో పంచకర్మల నివారణ భూలోక,గ్రహ లోకాలు,కారణ లోకాలు,ఇష్ట లోకాలు, కారణ బ్రహ్మలోకము నందు ఉన్న సమస్త కర్మలు నివారణ అయితే గాని సంపూర్ణ మోక్షము రాదు అని గ్రహించాను. 
95. మానవ మెదడు సాధన శక్తిని 48 నిమిషాలకు మించి తట్టుకోలేదని ఆపై సాధన చేస్తే మతిభ్రమణము కలగటం ఖాయం అని గ్రహించాను.

96. ఈ విశ్వసృష్టిలో ఓంకారనాదము కన్నా తుంకారనాదము ఒకటి ఉన్నదని...దీనిని సదాశివమూర్తి చేస్తుంటారని నేను అనుభవము పొందినాను.
97. 96 నిమిషాల సాధన స్థితికి వెళ్ళితే ఒక మన్వంతర కాలంలో జరిగిన సంఘటనలు జరగబోయే సంఘటనలు చూడవచ్చునని శాస్త్ర వచనము. ఇది నిజమేనని గ్రహించాను. 
98. నిత్య ధ్యానం అనుభవాలకి నిదర్శనంగా ప్రకృతిమాత మనకి వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలుగా దైవిక వస్తువులు ఇవ్వడం పరిపాటి అని గ్రహించాను. 
99. బ్రహ్మరంధ్రము లోని కృష్ణ బిలము దర్శనము అయ్యేదాకా మన సర్వ కర్మ నివృత్తి కాదని నేను అనుభవపూర్వకముగా గ్రహించాను. అలాగే అంతటితో మన సాధన పరిసమాప్తి అవుతుంది. 

100. మన అందరికి స్వర్గ నెంబరు ఒకటి ఉంటుందని అనగా అల్లాకి 786,అదే ఏసుప్రభువుకి 749,అమ్మవారికి 16,గణపతికి 21,దత్తస్వామి 16...ఇలా నాకు 477 నెం!! ఉన్నదని అనుభవము పొందినాను.

ఇంతకి నా సాధనకి ఉపయోగపడిన పుస్తక-గ్రంథాలు తెలుసుకోవాలని ఉందా...దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి