I.A.S కాస్త S.A.I అవటం:
అసలు నేను I.A.S అవ్వాలని అనుకునేవాడిని. దానికి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్స్, పరీక్ష విధివిధానాల గురించి, కోచింగ్ సెంటర్లు గూర్చి, ఫీజుల వివరాలు గురించి ఆరా తీసి అన్నీ సిద్ధం చేసుకునే సమయానికి కొత్తగా నాలో ఏదో తెలియని వెన్నుపాము క్రింద కదలికలు అనుభూతి వలన నా మనస్సులో అన్నిటియందు వైరాగ్య భావాలు ఏర్పడి ఏకాంతవాసిగా మౌనమునిగా ఉండటానికి… ఏ పని చేయాలన్నా ఆసక్తి గానీ ఏదో చేయాలని ఆసక్తి లేకపోయేది. అప్పటిదాకా నేను అంటూ ఒకడు ఉన్నానని సమాజానికి తెలియాలని… ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో బ్రతకాలని ఆశ ఉండేది.అందుకే నా లక్ష్యంగా ఐఏఎస్ పెట్టుకొని చదువు కొనసాగించబడింది. కానీ నేను నా లక్ష్యంకు దూరమవుతూ మరొక లక్ష్యం గా అది మారుతుంది అని నేను ఊహించలేకపోయాను. లేని వాడి కోసం ప్రయత్నాలు చేస్తూ నేను వాడిలాగా నాకు తెలియకుండానే నేను మారిపోతున్నానని నేను తెలుసుకునేసరికి ఐఏఎస్ లక్ష్యం కాస్త సాయి గా మారిపోయింది. ఇది తిరగబడి నా జీవితమును తిరగబడే టట్లుగా చేసినది. నేను మంత్ర అనుష్టానం ఆరాధన వలన దీక్ష గురువు రావడం జరిగినది అని మీకు తెలుసు కదా. నాలో కుండలిని యోగము వైపుకి నా యోగసాధన ఆరంభమైంది. ఇది ఇలా ఉండగా ప్రతి గురువారం ఇంట్లో సాగే సాయిబాబా పూజల వలన భక్తుల తాకిడి పెరగటం ఆరంభమైనది. వారి సమస్యలను పరిష్కరించే మార్గాలు ఆలోచనలు చేసినంతగా నా చదువు మీద కూడా ఏకాగ్రత పెట్టలేక పోయేవాడిని. ఎన్నో సార్లు ఈ విషయం లో దిగులు పడేవాడిని. కానీ అది నా చేతుల లో నా చేతల్లో లేదని అర్థం అయ్యేది.పూజలు ఆపలేని పరిస్థితి. అలాగే పూజలు కొనసాగించలేని స్థితి.ముందు గొయ్యి వెనుక నుయ్యిలా ఉండేది. అప్పుడప్పుడు అసలు నేను ఆధ్యాత్మిక సాధనలోకి ఎలా వచ్చినానో అర్థమయ్యేది కాదు.
అసలు అలాగని ఆపలేని పరిస్థితి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ నాకు తెలియకుండానే నేను యోగసాధన వైపుకి.. వివేక వైరాగ్య భావాలు నాలో మొదలు అవుతున్నాయి అని గ్రహించినాను. కానీ ఇలా పంచ గురువుల కోసం కఠినమైన నియమాలతో అసాధ్యమైన సాధన స్థాయిలను మేము పొందగలమా అనే ధర్మ సందేహం నాలో మొదలైంది. అసలు జీవుడు ఎందుకు యోగ సాధన చేయాలి అనే ధర్మ సందేహం వచ్చింది. అన్నిటిని వదిలిపెట్టి సుఖాలు అనుభవించ కుండా ఎందుకు యోగ సాధన చేయాలి అనిపించసాగింది. ఖరీదైన సూట్ వేసుకోకుండా గోచి గుడ్డతో ఎందుకు ఉండాలి. అసలు యోగ సాధన చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అనిపించింది.దానితో యోగ సాధన విధివిధానాలు గూర్చి పుస్తకాలు గ్రంధాలు తిరగ వేయటం మొదలు పెట్టినాను. అప్పుడు జీవాత్మ గా ఉండి నిజములాగా కనిపించే కష్టసుఖాలు అనుభవిస్తున్నామని, ఇవి శాశ్వత ఆనందం ఇవ్వలేవని కేవలం క్షణిక ఆనందాలే ఇస్తాయని ఇందులో నేను చేస్తున్నాను అనే అహం ఉండటం వలన కష్టసుఖాలు కలుగుతున్నాయి అని ఇలా కాకుండా సాధన ద్వారా నేను అనే దానిని తొలగించుకుంటే జీవాత్మ కాస్త విశ్వాత్మ అని తద్వారా శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుందని తద్వారా కర్మరాహిత్యం, జన్మరాహిత్యము, పునః జన్మ రాహిత్యం, ముక్తి రాహిత్యము పొందవచ్చునని ఎల్లప్పుడూ బ్రహ్మ తదాకార స్థితిలో దేని గురించి ఆలోచించని స్థితిలో, దేనికి స్పందించని స్థితిలో, దేనికి చంకల్పించని స్థితిలో నిశ్చలంగా ఉండ కలగటానికి యోగ సాధన అవసరం ఉందని నాకు అర్థం అయింది. అంటే ఇన్నాళ్ళు ఈ విశ్వంలో నడిచే జగన్నాటకమందు పాత్రధారిగా సూత్రధారిగా ప్రేక్షకధారిగా అన్ని కూడా నేనే అనేది చేస్తూ నానా కర్మలు చేస్తూ నానా రకాల కర్మ ఫలితాలు అనుభవిస్తూ నానా జన్మలు ఎత్తుతూ నానా చంక నాకుతోంది అని… ఇలా ఈ జగన్నాటకమందు ఒక లైటు లాగా దేనికి స్పందించకుండా ఉండాలి అనగా… నాటకాలు వేసే స్టేజి ముందు ఫోకస్ లైట్ పెడతారు. దీనికి పాత్ర వేసే వాళ్ళు ఎవరో తెలీదు. అలాగే దీనికి వేయించే సూత్రధారి ఎవరో తెలియదు. అలాగే చూసే ప్రేక్షకులు ఎవరో తెలియదు. కేవలం అన్నింటికీ సాక్షిభూతంగా ఈ జగన్నాటకంలో తన వంతు సహాయ సహకారాలు అందించడానికి యోగ సాధన ఉపయోగపడుతుందని దానితో మన జన్మలు, కర్మలు, మరణాలు, జననాలు లేని అద్వితీయమైన బ్రహ్మానంద స్థితిలో శాశ్వతంగా ఒక లైటు లాగా ఒక దివ్య జ్యోతిగా సాక్షీభూతంగా ఉండి పోవచ్చునని నాకు అర్థమైనది.దానితో మా లక్ష్యం IAS నుండి తప్పుకొని SAI గా మారటానికి మనస్సు ఇష్టపడసాగింది. ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మలలో కుబేరుడిగా, మంత్రిగా, కోటీశ్వరుడుగా, కలెక్టర్ గా, డాక్టర్ గా, యాక్టర్ గా, వ్యాపారవేత్తగా ఇలా ఎన్నో రకాల పాత్రలు వేసి వేసి విసుగు వచ్చింది. సూత్రధారిగా, పాత్రధారిగా, ప్రేక్షక ధారిగా ఉంటే కలిగే క్షణిక ఆనందాల కోసం నానా జన్మలు ఎత్తి నానా చంక నాక వలసి వచ్చినా కూడా అందులో శాశ్వతమైన ఆత్మశాంతి కానీ ఆత్మ తృప్తి కలగడం లేదని అసలు జన్మ లేని, కర్మ లేని, ఆలోచన లేని, స్పందన లేని, చంకల్పం లేని, దానిలో శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుంది అని తెలిసినప్పుడు అశాశ్వతమైన పదవి కన్నా శాశ్వతమైన బ్రహ్మ తదాకారం మిన్న అని నేను గ్రహించాను. ఇక దానితో మా సాధన భోగం నుండి యోగము వైపుకు మరలినది.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
****************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmeeru IAS avdaamani anukoni anni sidhaparuchukunnaka meeru kastha SAI ga maaralani,
రిప్లయితొలగించండిpoojala valla meeku oche ibbandulu alage kshanika aanandam kosam kakunda shaashvatha
aanandamaina yoga saadhanlo Brahma thadakaara sthithi pondalani anukovatam alage yogam
mida makkuva penchukovatam, focus light la undalani anukovatam bagundi.