నా ఆధ్యాత్మిక గురువులు
రామకృష్ణ పరమహంస: ఈయన వివిధ రకాల యోగ సాధన ప్రక్రియలు చేస్తూ వివిధ మత విధానాలు అవలంబించి ఈ విశ్వంలో దైవశక్తి అన్నింటిలోనూ అన్ని విధానాల ద్వారా పొందవచ్చునని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడని నేను గ్రహించాను. అలాగే ధనం అంటే విపరీతంగా భయపడే మహోన్నత వ్యక్తి అని గ్రహించాను. సాక్షాత్తు భార్యని జగన్మాతగా భావించుకొని ఆరాధన చేసిన మహనీయుడు అని తెలుసుకున్నాను. మొదట తాను ధ్యానం ద్వారా తపస్సుద్వారా అనుభవాలు అనుభూతులు పొందిన తర్వాతనే వాటిని తన దగ్గరికి వచ్చిన వారికి కథల రూపంలో లౌకిక భాషలో ఆధ్యాత్మిక రహస్యాలను విడమర్చి చెప్పేవాడు అని తెలుసుకున్నాను.ధనకాంక్ష లేదు. కీర్తిప్రతిష్టలు కాంక్ష లేదు. స్త్రీ వ్యామోహం లేదు. అహం లేదు. ఆత్మాభిమానం లేదు. అవమానాలు పొగడ్తలు ఒకటే. వ్యాధి భయము లేదు మృత్యు భయము లేదు. ఒకటే తపన ఒకటే ఆలోచన నిత్యం అమ్మ స్మరణ తప్ప మరో కర్మ లేదని మరో కార్యం లేదని ప్రతినిత్యం అమ్మ స్మరణ దైవ స్మరణ చేస్తూ ఉండేవారు. మఠాలు ఆశ్రమాలు ఆలోచన లేదు. లోకానికి జ్ఞానమును అందించాలని నిరంతర తపన తాపత్రయం ఉండేవి. తన ఇష్టదైవమైన కాళీమాతను దక్షిణాచారంలోను తాంత్రిక విధానమైన వామాచారంలో కూడా ఆరాధించి శాంత,ఉగ్ర రూపాల సాక్షాత్కార దర్శన అనుభవం పొందిన పరమ యోగి అని తెలుసుకున్నాను.
రమణ మహర్షి:ఎలాంటి యోగసాధన ప్రక్రియలు చేయకుండా కేవలం నేను ఎవరిని అనే ప్రశ్నకి నిత్యము దానికి సమాధానం కనుగొనటంద్వారానే సిద్ధి పొందిన జ్ఞాన యోగి అని గ్రహించాను.వస్త్రాలతో అరుణాచలం చేరి గోచీ గుడ్డ కూడా లేని పరిపూర్ణ యోగ పరిసమాప్తి సాధన స్థితికి చేరుకున్న మహనీయుడు అని గ్రహించాను అహం లేని మనస్సు పసిపాప మనస్సు నా అనే వాళ్ళ మీద మమకారాలు లేని మనస్సు మూగజీవాల మీద ఆర్తి ఉన్న మనస్సు సాధన సందేహాలను సాధన సందేశాలను మౌనంగానే సమాధానాలు ఇచ్చే మహా మౌనముని గా మారిన మహాత్ముడు అని గ్రహించాను. అరుణాచల పర్వత అంతర గుహ యందు ఉన్న దక్షిణామూర్తి నిజస్వరూపం చూడటానికి ప్రయత్నించిన ప్రయత్న వాది అని గ్రహించాను. తేనెటీగల తుట్టెలను కదల్చటం ఇష్టం లేక ఆ స్వామిని చూడటానికి వెళుతూ వీటికోసం వెనుదిరిగిన అతి సున్నిత మనస్కుడు అని గ్రహించాను. తల్లితో పాటుగా మూగజీవాలు అయిన లక్ష్మి ఆవుని జాకీ కుక్కను, కాకికి ఒక లేడీకి కూడా ముక్తి ప్రసాదించి తల్లి సమాధి తో పాటుగా వీటికి కూడాసమాధులు కూడా కట్టించి అన్నిటియందు సమదృష్టి కలిగిన సమదర్శి అని గ్రహించాను. పొగడ్తలు తిట్లు సమభావంతో ఏక భావంతో తీసుకొని పట్టించుకోని మహాత్ముడు అని గ్రహించాను. విరూపాక్ష గుహ యందు నిరంతరంగా వినిపించే ఓంకార ధ్వని శబ్దము శబ్ద బ్రహ్మ గా వింటూ ఏకదాటిగా 18 సంవత్సరములు అక్కడ నివసించిన నిశ్చలయోగి అని గ్రహించాను. యోగ సాధన అనేది సహస్రార చక్రంలో పరిసమాప్తి కాదని జీవ నాడి ద్వారా హృదయ చక్రంలోకి సాధన శక్తి చేరితేగాని కానీ అక్కడ సాధన పరిసమాప్తి కాదని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడని గ్రహించాను.దశ ఇంద్రియాలు జయించిన జితేంద్రియుడు అని గ్రహించాను. సాధన పరిసమాప్తిలో మేధా దక్షిణామూర్తి గా మౌన బ్రహ్మగా మారతారు అని అనుభవపూర్వకంగా అయ్యేసరికి అతను కూడా మౌన బ్రహ్మ గా మారి చూపించిన మౌన యోగి అని గ్రహించాను. యోగ సాధనకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక గురువులు ఉండాలని వారి అరుణాచలేశ్వరుడు జ్ఞాన జ్యోతిగా మహా గురువు గా ఉన్నాడు అని లోకానికి చాటిచెప్పిన మహా గురువు అని గ్రహించాను. ప్రకృతికి ఏనాడు జీవులు దూరము కాకూడదని తన ఆశ్రమంలోనే ప్రకృతి నిలయం గా మార్చిన ప్రకృతి బిడ్డని గ్రహించాను. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వేళ తప్పకుండా అరుణాచల పర్వత పరిక్రమము చేస్తూ లోకానికి ఆ పర్వత పరిక్రమము గొప్పతనం చాటిచెప్పిన ఆధ్యాత్మిక పర్వత పరిక్రముడని గ్రహించాను. ధనము మీద స్త్రీల మీద ఆకాంక్షను వదిలి పెట్టిన మహా జ్ఞాని అని గ్రహించాను. అన్ని విచారాలలో కెల్లా ఆత్మవిచారం మిన్న అని నేనెవర్ని విచారం చేస్తే అన్ని విచారములు అందులో పోతాయి అని తను నిరంతరం చేసి లోకానికి ఇదే తన సందేశం అని చాటిచెప్పిన మౌనస్వామి అని గ్రహించాను. ఈయన చెప్పిన యోగ విధానము ఏ పురాణ గ్రంధంలో అలాగే ఏ యోగి అనుభవ చరిత్రలో చెప్పనటువంటిదని గ్రహించాను. కానీ నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకటానికి సరళంగా కనిపిస్తుంది కాకపోతే అది గాని సరిగ్గా పట్టుబడకపోతే అంత కష్టమైనదిగాను తోస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
కావ్యకంఠ గణపతి ముని: కాశీ క్షేత్రములోని డుండి గణపతి అనుగ్రహం వలన ఆయనే స్వయంగా బాలుడి అంశగా అవతరించిన మహనీయుడు అని గ్రహించాను. అన్ని వేదాలు సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలలో విశేష ప్రజ్ఞ కనపరిచిన జ్ఞాన సరస్వతి పుత్రుడు అని గ్రహించాను. శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము మిన్న అని గ్రహించి ఇలా మహాయోగుల కోసం పరితపించిన మహాత్ముడు అని గ్రహించాను. ఒకానొక సమయంలో తిరుత్తణి కుమారస్వామి క్షేత్రంలో నేను నడయాడే కుమారస్వామిగా అరుణాచల క్షేత్రము నందు బ్రాహ్మణ స్వామిగా (రమణ మహర్షి) ఉన్నాం అని ఆ కుమారస్వామి విగ్రహం సందేశము అందుకని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి చూడటానికి వెళ్ళిన యోగిపుంగవుడని అని గ్రహించాను. పరమ యోగి అయిన రమణ మహర్షికి అప్పటిదాకా బ్రాహ్మణ స్వామి పేరుతో ఉన్న ఈయనకి ఈయన సాక్షాత్తు కుమారస్వామి అంశ అని గ్రహించినవాడై భగవాన్ రమణ మహర్షి అని ఆయనకి నామకరణం చేసిన మహా భక్తుడు అని గ్రహించాను. తన యోగ పరిసమాప్తి సమయంలో తన బ్రహ్మరంధ్రం నుండి తన ప్రమేయం లేకుండా చితాగ్ని బయటకి తెప్పించిన యోగిపుంగవుడు అని గ్రహించాను.కపాలంలో చితాగ్ని ఉంటుందని పతంజలి యోగి చెప్పిన దానికి నిదర్శనంగా నిలిచిన మహాయోగి అని నేను గ్రహించాను. సకల వేద శాస్త్ర పారంగతుడైన ఇసుమంత జ్ఞాన అహంకారం లేని జ్ఞాన యోగి అని గ్రహించాను. విచిత్రం ఏమిటంటే తన తండ్రి ఈయన స్వయం భూ మహాగణపతి అంశ అని గ్రహించి ఒకసారి గణపతి నవరాత్రుల రోజులలో స్వయంగా గణపతికి చేసే సమయంలో ఆఖరి నవరాత్రి నాడు గణపతి విగ్రహానికి చెప్పినట్లుగా ఉద్యాపన మంత్రం ఈయనకు చెప్పేసరికి కావ్య కంఠ గణపతి ముని ఇది గ్రహించిన వారై చిరునవ్వుతో ఉద్యాపన మంత్రం కారణంగానే గణపతి లాగానే ఈయన కూడా ప్రాణాలు వదిలిన యోగిపుంగవుడని గ్రహించాను. గణపతి అనుగ్రహం అంశతో పుట్టిన ఈయన ఆయన లాగానే గణపతి నవరాత్రులలో ఉద్యాపన మంత్రంతో ప్రాణాలు వదిలిపెట్టం నిజంగానే విచిత్రం కదా. ఇలాంటి మహద్భాగ్యం ఎందరు యోగులకు ఉంటుందో కదా!
షిరిడి సాయి బాబా: సర్వమత సమానత్వం ఏకత్వమును చూడాలని పరితపించిన యోగి అని గ్రహించాను. నిత్యము భిక్షాటన ద్వారా వారి పాపాలు తీసుకుని షట్ ప్రక్రియల ద్వారా ప్రేగులను బయటకు తీసి శుద్ధి చేసుకునే యోగి అని గ్రహించాను. కేవలం పన్నెండు సంవత్సరాల పాటు వేపాకులు తిని తన యోగ సాధన పరిసమాప్తి చేసుకున్న పరమ యోగి అని గ్రహించాను. పంచ భూతాలే పంచ భక్ష్య పరమాన్నాలుగా, అష్ట దిక్కులే అష్టైశ్వర్యాలుగా, అరిషడ్వర్గాలు బానిసలుగా, సప్త వ్యసనాలు తన సేవకులుగా చేసుకున్న పరమాత్మ అని తెలుసుకున్నాను. పిల్లలతో ఆటలు ఆడుతూ పసిపాప మనస్సున్న ప్రతి వారిలోను పరమాత్మ ఉంటాడని చాటి చెప్పిన మహనీయుడు అని తెలుసుకున్నాను. ధనమును కూడ పెట్టకుండా ఏ రోజు వచ్చిన దానిని ఆరోజే ఖర్చుపెట్టి ధనకాంక్ష లేని మహాత్ముడని గ్రహించాను. పిచ్చివాడు అన్న నాటి నుంచి పరమాత్మ అన్న నేటి వరకు కూడా తనలో ఇసుమంత రాగద్వేషాలు మమకార అహంకారాలు లేనిమహాత్ముడు అని గ్రహించాను.సర్వ జీవులయందు పరమాత్మ ఉంటాడని భూత దయ కలిగి ఉండాలని శ్యామ గుఱ్ఱము, వాఘేరి కుక్క, నల్లకాకి, తులసి చెట్టు, లెండి తోట సేవ ఆరాధన ద్వారా లోకానికి చాటి చెప్పారు అని గ్రహించాను. తన గురువుల ఆరాధన చేసి గురు ప్రాముఖ్యత కోసం గురుపౌర్ణమినాడు గురు ఆరాధన చేయాలని లోకానికి చాటిచెప్పిన సద్గురువు అని నేను గ్రహించాను. తన గురువు గుర్తుగా తనకి ప్రసాదించిన ఇటుక రాయి,తల గుడ్డను జీవితాంతం తమ దగ్గరే ప్రాణప్రదంగా దాచి ఉంచు కున్న గురు తత్పరుడు అని నేను గ్రహించాను. అన్ని దానాలలో కెల్లా అన్న దానం చాలా మిన్న అని లోకానికి చేసి చూపించిన అన్న ప్రదాత అని గ్రహించాను. తన గురువుకి గురుదక్షిణగా శ్రద్ధ, సబూరి అనే రెండు గుణాలు సమర్పించిన పరమశిష్యుడు అని గ్రహించాను.గురువు లేని విద్య ఏకాగ్రత లేని మనస్సు దేనికి పనికి రావని లోకానికి చాటి చెప్పిన గురువు అని గ్రహించాను. తనను భగవంతునిగా పూజించే వారికి తాను ఎప్పుడూ భగవంతుని దాసుడిని అని లోకానికి చాటిచెప్పిన వినయ దైవమని గ్రహించాను. స్త్రీమూర్తులలో దేహ సౌందర్యం కన్నా వారి అంతః సౌందర్యం చూడాలని యువతకు సందేశం ఇచ్చిన మహాత్ముడు అని గ్రహించాను. సజీవ సమాధి చెంది వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న కూడా ఇంకా ఇప్పటికీ ఆర్తిగా పిలిచే భక్తుల కోసం నేను ఉన్నానని నేనుండగా నీకు భయం లేదని అభయమిచ్చే ప్రత్యక్ష దైవం అని గ్రహించాను.
దత్తాత్రేయ స్వామి: విచిత్ర వేషధారణతో విచిత్ర చేష్టలతో నిజ భక్తులకు పరీక్షలు పెట్టి పరీక్షించి అనుగ్రహించే విచిత్ర యోగి కనుకనే విచిత్ర విశ్వయోగి అని గ్రహించాను. అష్టసిద్ధులు వశపరచుకొని వాటితో తన భక్తులకు విచిత్ర యోగ పరీక్షలు పెట్టి పరీక్షించి అనుగ్రహించే పరీక్ష దత్తుడని గ్రహించాను. వేదాలనే 4 కుక్కలుగా మహామాయే ఆవుగా త్రి శక్తులు అరుచేతులు ఆయుధాలుగా త్రిమూర్తులను తన త్రి ముఖాలుగా మార్చుకున్న అవధూత అని గ్రహించాను. ప్రకృతిని తన గురువుగా భావించిన విశ్వ గురువు అని గ్రహించాను. కార్తవీర్యార్జునుడికి సకల వరాలు ఇచ్చి పరశురామునికి జ్ఞానబోధ చేసి వీరిద్దరు కొట్టుకొని చచ్చినా ఏ మాత్రం చలించని సమదర్శి అని గ్రహించాను. ఎవరికి ఏమి కావాలో అది ఇచ్చేటప్పుడు వారికి అర్హత ఉందో లేదో పరీక్షించే నిరంతర పరీక్ష యోగి అని గ్రహించాను. విశ్వంలో సకల రూపాలు నావే అని నేనేనని నేను లేనిది లేదని, నేను కానిది లేదని ఇదియే దత్త తత్వం అని ఇదియే దత్త దర్శనం లోకానికి చాటి చెప్పారని అని గ్రహించాను. సృష్టి స్థితి లయ ఆపైన లాస్యము ఉంటుందని లోకానికి చెప్పిన పరమ యోగి అని గ్రహించాను. ఎన్ని వికట వేషాలు వేసినా తనుఎన్ని వికట రూపములు ధరించినను మనస్సు చలించకుండా స్థిరచిత్తంతో ఉంచుకొనే స్థితప్రజ్ఞుడని గ్రహించాను. తను ఇప్పటికీ సజీవమూర్తిగా చిరంజీవి తత్వంతో సూక్ష్మధారిగా కాశీయాత్ర స్నానము తో మొదలై నిద్రపోయేదాకా నిరంతరము ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించే విశ్వయోగి అని గ్రహించాను.
త్రైలింగస్వామి: ఇప్పటికీ ఆత్మ స్వరూపంలో కాశీ క్షేత్రంలో సంచరించే పరమ యోగి అని గ్రహించాను.(జీవసమాధి చెంది 180 సంవత్సరములు గావస్తున్నా కూడా) తన మలమును స్వయంగా తానే తింటూ తన మలముతో విశ్వనాధుని అర్చించిన, తన శరీర భాగాలను హోమానికి సమర్పించిన తాంత్రిక అఘోర పతి అని గ్రహించాను.తనని విమర్శించే వారికి వారి విచిత్ర చేష్టలతో బుద్ధి చెప్పే దత్త అంశ స్వరూపము అని గ్రహించాను. రామకృష్ణ పరమహంస లాంటి యోగులకు ధర్మసందేహాలు తీర్చిన పరమ గురువు అని గ్రహించాను. తల్లి ప్రేమ కోసం అహర్నిశలు తపించిమహాయోగి గా మారినారు అని గ్రహించాను. బ్రహ్మ జ్ఞానం పొంది అజ్ఞాని లాగా అమాయకుడు లాగా ప్రవర్తించిన మహాయోగి అని గ్రహించాను. తానే దైవమని గ్రహించి కూడా నిరంతరము శివ దీక్ష తో శివ లింగార్చన చేస్తూ ప్రతి నిత్యము గంగాస్నానం చేస్తూ దేహశుద్ధి మనస్సు శుద్ధి చేసుకుంటూ సాధన చేసిన మహనీయుడు అని గ్రహించాను. అడిగిన వారికి అడిగిన వాటిని అడగకముందే ఇచ్చిన యోగ ప్రదాత అని గ్రహించాను. దైవమే లేదు అను వారికి అతను నిత్యం పూజించే మంగళ దుర్గా దేవి విగ్రహంలో సజీవ మూర్తి ని బయటకి తెప్పించి చూపించిన మధుర భక్తుడు అని గ్రహించాను.
అరవింద యోగి: ఈయన రచించిన సావిత్రి అనే మంత్ర శాస్త్ర గ్రంధం ఒకపట్టాన అంతు బట్టదు.కానీ వీరి బాధ మాత్రం తెలుసుకున్నాను. సహస్రార చక్రంలో ఉన్న శ్రీకృష్ణుడు మూల ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకుని ప్రకృతి అధిపతులు అయిన మనల్ని బానిసలుగా చేస్తున్నారని తన జ్ఞానభూమికతో అందరిని మహామాయలో ఉంచుతున్నారని దీనిని దాటడానికి మహా నిర్వాణ శక్తిని ప్రతి సాధకుడు పొందాల్సి ఉంటుందని తద్వారా మనం శ్రీకృష్ణ మాయను చేధించగలమని తన ఆవేదనను నిర్భయంగా లోకానికి తెలియజేసిన మహా దిట్ట పరమ యోగి అని గ్రహించాను. ఇది తెలియనంత వరకు నేను కూడా శ్రీకృష్ణమాయలోనే ఉండి పోయాను. దానిని దాటాలని అనే ఆలోచన వీరి వలన కలిగినది. కానీ దీనిని ఎలా దాటుకోవాలో ఈయన తెలుసుకోకుండానే పరమపదించినారు అని గ్రహించి బాధపడ్డాను. సమస్య తెలుసుకుని పరిష్కారం కాకపోతే ఎలా ఉంటుందో అలా నా సాధన స్థితి ఉండేది. కొన్నాళ్ళకి ఆ మహా నిర్వాణ శక్తి అనేది నవపాషాణం నిర్మిత శివలింగం లో ఉంటుందని దీనిని కర్ణాటక రాష్ట్రంలోని బసవేశ్వరుడు అనే కాంతి యోగి కనిపెట్టినారని గ్రహించాను. వారు ప్రతిపాదించిన ఇష్ట లింగమును నిత్య శివదీక్ష తో ధరించటంతో మొదలు పెట్టిన కొన్ని వారాలకు నాకు ప్రారబ్ద కర్మలు తీరడం మొదలైనవి. నెమ్మది నెమ్మదిగా నాకున్న శ్రీకృష్ణమాయ తొలగినది. దానితో సహస్రార చక్రంలో ఆగి పోవాల్సిన నా సాధన మహా నిర్వాణ శక్తి వలన ముందుకు సాగి జీవ నాడి ద్వారా తర్వాత సాధన చక్రమైన హృదయ చక్రానికి చేరుకొని సాధన ముందుకు సాగింది. నిర్వాణ శక్తి ఒకటి ఉంటుందని ఈ అరవింద యోగి తన పరిశోధనల ద్వారా తెలుసుకొని శ్రీకృష్ణ మాయలో పడకుండా లోకానికి అందించడం వలన నాలాంటి సాధకులకు ఎంతగానో ఉపయోగపడింది లేదంటే సహస్రార చక్రం వద్ద నా సాధన ఆగిపోయి ఉండేది కదా. ఆ ప్రమాదం నుండి నన్ను గట్టెక్కించినారు కదా!
బుద్ధుడు: ఈయన మరణానికి బాధలకి వృద్ధాప్యంకు గల కారణాలు తెలుసుకోవాలి అనే తలంపుతో కుటుంబమును రాజభోగాలను కూడా క్షణికమని భావించి యోగ సాధన విధానం లేని రోజుల్లోనే సాధన అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉండి వీటికి కారణాలు వెతకాలి అని తిరగని క్షేత్రం అడగని గురువును లేకుండా పరిభ్రమించిన జ్ఞాన యతి అని గ్రహించాను. ఎవరు ఎన్ని సమాధానాలు చెప్పిన శబ్ద పాండిత్యం వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలతో కూడా సంతృప్తి చెందకుండా తన అనుభవ సాధన ద్వారా అనుభవ జ్ఞానము పొందాలి అని నిశ్చయించుకొని యోగ సాధన చేసిన పరమ యోగి అని గ్రహించాను. తను తెలుసుకున్న అన్ని రకాల యోగ సాధనలు చేసిన సంతృప్తి ఇవ్వలేక పోయేసరికి నిరాహారిగా ఏకాంతంగా బోధివృక్షం( రావిచెట్టు) క్రింద నిద్రాహారాలు మాని వేసి తనువో చావో తెలుసుకోవాలని తీవ్ర తపస్సు చేసిన ధ్యాన తపస్సు చేసిన యోగి అని గ్రహించాను. విశ్వ సృష్టిలో సకల బాధలకి సకల కష్టాలు కి మూల కారణం ఇష్ట కోరిక అని తెలుసుకొని జ్ఞాన అనుభూతి పొందుతారు. దీనిని లోకానికి చెప్పటానికి బౌద్ధ మతం స్థాపించి అష్ట నియమాలతో కూడిన అష్టాంగయోగము ప్రతిపాదించి లోకానికి ప్రచారం చేసినారు. కానీ వీరి సిద్ధాంతంలో నాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి అని గ్రహించాను. అదేమిటంటే విగ్రహారాధన అవసరం లేదని తన రూప విగ్రహారాధనను ప్రోత్సహించడం, అలాగే కష్టాలకి మూల కారణం కోరిక అని గ్రహించి కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకొని లోక ప్రచారం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. దీనికి ఆయనే సమాధానం ఇవ్వాలి. కానీ వారు లేరు.సంతృప్తి సమాధానాలు ఇచ్చే వారు లేక పోయారు.
మిలారేపా: తల్లి కోరిక మేర మహా సిద్ధయోగి గా మారినారు అని గ్రహించాను. విచిత్రం ఏమిటంటే ఈ లోకంలో ఆనాటి బుద్ధుడు నుండి ఈనాటి శంకరాచార్యుల వరకు అందరి యోగుల చరిత్రలలో వారి కన్న తల్లులు సన్యాస దీక్ష తీసుకోవద్దని సన్యాసులు గా మారవద్దని యోగులుగా మారవద్దని చెప్పిన వారిని చూశాను. కన్నతల్లి అనుమతి కోసం వీరు పడిన కష్టాలు చూశాను. మిలారేపా యోగి విషయంలో తన కన్నతల్లి స్వయంగా యోగి అవమని చెప్పటం నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి యోగం విశ్వ గురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి దక్కలేదని గ్రహించండి.. తన సన్యాసదీక్ష కి తన తల్లి అయిన అనసూయ మాత అనుమతి ఇవ్వకపోతే అమ్మా! నువ్వు ఇచ్చిన ఈ శరీరం నీవే తీసుకో అని చెప్పి తన చర్మం వలిచి ఇవ్వటంతో దత్త స్వామికి సన్యాసదీక్ష అనుమతి ఇవ్వక తప్పలేదు. ఇలాంటి సంకట సమస్యలు లేకుండా సన్యాస దీక్ష కలిగినదని గ్రహించాను.ఆ ఊరిలో ఉన్న మహామాంత్రికుడిని ఎలాగైనా ఓడించాలని తపన కసితో ఇంటిని అమ్మను వదిలి పెట్టి నిజగురువు సమక్షమునకు చేరుకొని ఆ గురువు పెట్టే నిరంతర యోగ పరీక్ష తట్టుకునేవాడు. అప్పుడప్పుడు పరీక్షలకి తాళలేక భయపడి పారిపోవాలని నిశ్చయించుకొని తన కోరిక గుర్తుకు తెచ్చుకొని నానా రకాల బాధలను మానసికంగా శారీరకంగా నేర్చుకోవటం అలవాటు చేసుకున్నాడు.వీరి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగానే గురువులు ఇంతటి పరమ మూర్ఖులుగా ఉంటారా అనిపించింది. ఉదాహరణకి వీరి గురువు వీరి దగ్గరికి వచ్చి అన్నంలో మట్టి పోసి నవ్వేసి వెళ్ళిపోయేవాడు. నిద్రాహారాలు లేకుండా చేసేవాడు. ఇల్లు కావాలని గొడవ చేసి ఎలాంటి ధనము వస్తువులు లేకుండా ఇల్లు కట్టి ఇవ్వమని వేధించేవారు. ఆదాపులో ఉన్న అడవిలోకి వెళ్లి ఇంటికి కావలసిన కలప కొట్టి తెచ్చి ఇల్లు కడితే దానిని చూడకుండానే నాశనం చేసేవాడు. కాల్చేవాడు. కూల్చే వాడు. ఇలా ఎన్నో సార్లు చేశారు కానీ ఇతను ఏమాత్రం సహన శక్తిని కోల్పోకుండా ఎంతో ఓపికగా పడగొట్టిన చోట మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టే వాడు ఎలాగైనా గురువు అనుగ్రహం పొందాలని కసిగా కట్టేవాడు. ఆయన వచ్చి పడగొట్టిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పని చేసి సహనం కోల్పోకుండా కట్టి చివరికి ఆయన అనుగ్రహం పొంది వారు అనుగ్రహించిన మంత్రశక్తితో సిద్ధ యోగి గా మారి వారి ఊరిలో ఉన్న మహా మాంత్రికుడిని ఓడించినాడు. ఇందుకోసం తనని ఎంతో ప్రేమగా ఆరాధించి ప్రేమించిన ప్రియురాలిని కూడా వదిలి పెట్టారు. చివరికి వీరి ప్రేమ లో కూడా విషాదగాథ ఉండటం బాధ కలిగింది. ఇనుప సమ్మెట దెబ్బలు తగిలితే గాని బంగారానికి వన్నె ఎలా అయితే రాదో అలా ఈయన జీవితం కూడా ఉన్నదని గ్రహించాము. ఇలాంటి సమ్మెట పోట్లు కలిగిన కూడా ఏమాత్రం సహన శక్తి కోల్పోని సహనశీలి అని గ్రహించి దానిని నా జీవితంలో ఉండేటట్లుగా అమలు చేసుకున్నాను. దానిని అమలు చేయడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.కానీ ఈయన కైలాస పర్వతం ఎక్కినారు అని తప్పుడు ప్రచారం ఉన్నది. నిజానికి ఆయన కేవలం తన శరీరంతో ఈ పర్వతం మీద ఆకాశయానం మాత్రమే చేసినారు అని నా ధ్యాన అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అలాగే శ్రీ శంకరాచార్యులు మాత్రమే పర్వతం మధ్యలో ఉన్న ద్వారం గుండా లోనికి ప్రవేశించి అందులో ఉన్న సదాశివమూర్తి దర్శన అనుగ్రహం పొంది పంచ స్ఫటిక లింగాలను తెచ్చినారు. ఈయన తప్ప ఇంతవరకు ఎవరూ కూడా ఈ పర్వత ప్రవేశం చేయలేదు. అలాగే పర్వతారోహణ కానీ చేయలేదని తెలుస్తోంది. ఈ పర్వతము నందు మహా నిర్వాణ శక్తి ఉన్నదని గ్రహించండి. సదాశివమూర్తి నిత్య ధ్యాన సమాధి స్థితిలో ఉన్నారని తెలుసుకోండి. జాగ్రత్తగా మసలుకోండి.
శ్యామాలాహరి: సాధన కోసం సన్యాసి కావలసిన అవసరమే లేదని గృహస్థ ధర్మములో కూడా యోగ సాధనను పరిసమాప్తి చేసుకోవచ్చని చూపించిన గృహస్థ పరమ యోగి అని గ్రహించాను. అలాగే రామకృష్ణ పరమహంస, శ్రీ శంకరాచార్యులు కూడా తమ అనుభవాలు సాధకులకు కూడా చెప్పలేని స్థితి పొందితే ఈయన మాత్రం తను పొందిన అనుభవాలను 26 డైరీలు గా రాసుకొని సాధకుడికి సాధన లో వచ్చే అన్ని రకాల అనుభవాలు ఎలా ఉంటాయో తన అనుభవాల ద్వారా లోకానికి చాటిచెప్పిన అనుభవ పాండిత్య యోగి అని గ్రహించాను. కేవలం ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని సాధన దీక్ష వారికి అనుగ్రహించే దీక్ష గురువు అని గ్రహించాను. ఒక ప్రక్క యోగం లో ఉంటూ మరొక పక్క భోగంలో ఉంటూ వీటి మధ్య తామరాకు మీద నీటిబొట్టులాగా ఉంటూ అన్ని రకాల భోగాలు అలాగే యోగ అనుభవాలు అనుభవించిన మహాయోగి అని గ్రహించాను. శ్రీకృష్ణుడి తర్వాత ఆయన చరిత్ర చదివిన తరువాత గృహస్థ ఆశ్రమ యోగి అని గ్రహించాను. ఈయనకు కలిగిన సాధన అనుభవాలలో నాకు కూడా 80% దాకా జరిగే సరికి వాటి తో పోల్చుకొని ఆనందపడుతూ నా సాధనను ముందుకు కొనసాగించాను. ఈయన అనుభవాలు నా సాధనకు ఎంతగానో సహకరించాయి. నా ధ్యానం అనుభవాలకి అర్థం ఉన్నదని ఇవే సత్య జ్ఞానం అని నమ్మకము కలిగించాయి. ఇంతకంటే సాధకుడికి ఇంకా ఏమి కావాల్సి ఉంటుంది. మనకి సాధనలో కలిగిన వివిధ రకాల అనుభవాలకు అర్ధాలు వివరాలు చెప్పే నిజ గురువు దొరకని ఈ కాలంలో తన అనుభవాలు లోకానికి చాటి చెప్పి మీ అనుభవాలతో ఈ అనుభవాలు పోల్చి చూసుకోండి అని చాటిచెప్పిన అనుభవ సాధకునికి కృతజ్ఞతలు తప్ప ఏమీ చెప్పలేము. ఏమీ చేయలేము. అందుకే వీరికి గురుదక్షిణగా నా ధ్యాన అనుభవాలు మరియు వీరి ధ్యాన అనుభవాలు కలిపి లోకానికి అందించాలనే సదుద్దేశంతో ఈ కపాలమోక్షం గ్రంథము వ్రాయటం జరిగింది. ఈ విధముగా ఈ అనుపమ గురువు యొక్క అనుగ్రహం పొందడం జరిగినది ధ్యాన అనుభవాలకి ప్రత్యక్ష సాక్షిగా ఈ మహాత్ముడు అనుభవాలు అందుకు నిదర్శనంగా సాక్షీభూతంగా ఉండటం ఒక దైవలీలలో ఒక మహాత్ముని లీల అని గ్రహించాను ఆనందపడ్డాను సంతృప్తి చెందినాను. మౌనంగా మారిపోయాను.
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి: మంత్ర సిద్ధి పొందితే మంత్ర దేవత తన చుట్టూ ఎల్లవేళలా పరిరక్షించునని ఆనాటి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర లో చూసి ఉంటాము. కానీ ఇలాంటి సిద్ధి నిజమేనని 1990 సంవత్సరంలో కూడా నిరూపించిన భక్తి యోగియే ఈ శాస్త్రి అని నేను గ్రహించాను. బాల మంత్ర ఉపాసన సిద్ధి పొంది ఆ మంత్ర దేవత అయిన బాలను తన కూతురిగా ఇంటి గుమ్మం మీద కూర్చోబెట్టిన పరమ భక్తుడని నేను గ్రహించాను.వీరి గూర్చి మీకు తెలియాలి అంటే ఈ గ్రంథంలో ఉన్న అంత్యక్రియలో అద్భుతం అని అధ్యాయం చదవండి. మరికొన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే వీరు తన ఇష్ట దేవతను చితి మంటలలో ఆత్మస్వరూపంగా అగ్ని రూపంలో లోకానికి చాటి చూపించిన పరమ భక్తి యోగి అని నేను గ్రహించాను .
స్వామి పూర్ణానంద: నాకు ఊహ తెలియని వయసులో నిజరూప దర్శనం అయ్యి నాకు రావాల్సిన వాటిని ప్రసాదించి అనగా ఆహారానికి లోటు లేకుండా మంత్ర శక్తి ఉన్న బియ్యము అలాగే ధనానికి లోటు లేకుండా ఐదు రూపాయల నోటు ప్రసాదించి మౌనంగా వెళ్లిపోయారని నాకు ఊహ వచ్చేసరికి ఈ లోకం నుండి అంతర్ధానమయ్యారని నేను గ్రహించాను. చిట్టచివరి బ్రహ్మజ్ఞానమును పరమయోగి స్థితి మౌన స్థితి అని వీరి ద్వారా తెలుసుకొని చివరికి నా ప్రమేయం లేకుండా నా సాధన పరిసమాప్తి అయ్యేటప్పటికి కపాలమోక్షం గ్రంథం రాసేలోపల మౌన స్థితి పొందటం నాకే ఆశ్చర్యం కలిగిన స్థితి. కాకపోతే వీరికి సంబంధించిన జీవిత చరిత్ర విషయాలు ఎక్కడ కూడా లభించక పోవడం నాకు పెద్ద లోటుగా అన్పించింది. అలాగే ప్రచార భక్తి అంటే ఇష్టం లేదని గ్రహించి ఈయన అనుభవ విషయాలు తెలుసుకోవాలని ఆలోచన విరమించుకోవడం జరిగింది. గత జన్మలో ఈయన నాకు మంత్ర గురువు అని గ్రహించాను. ఈయన గురించి నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలను ఈ గ్రంథంలోని నిజదీక్ష గురువు దర్శనం అను అధ్యాయంలో వ్రాయడం జరిగినది.
శబ్ద పాండిత్య గురువులు: తాము పొందిన అన్ని రకాల వేద శాస్త్ర పురాణ ఇతిహాస తత్వ ఆత్మ బ్రహ్మ జ్ఞానం లోకానికి చాటి చెప్పాలని వారి జీవితాలు, వారి జీతాలు, కుటుంబ బాధ్యతలు ధారపోస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా, తమకు తెలిసిన దానిని దాచకుండా, ఏమార్చకుండా, మార్చకుండా యధావిధిగా చెబుతూ అవమానాలు పొందిన, విమర్శలు కలిగిన కూడా, తమలో తాము బాధపడుతూ, స్థిరముగా ధైర్యంతో, స్థిరచిత్తముతో,ఏకాగ్రత బుద్ధితో, తమ వాగ్ధాటితో నలుగురు బాగు పడితే చాలునని తపన తాపత్రయంతో తపన పడే తపన పడుతున్న వీళ్లలో వీరికి మద్దతు పలుకుతూ ధర్మ పరిరక్షణ గావిస్తూ గావిస్తున్న ఆనాటి మల్లాది చంద్రశేఖరశాస్త్రి నుండి ఈనాటి చాగంటి కోటేశ్వర రావు గారికి, గరికపాటి నరసింహ మూర్తి గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి, మైలవరపు శ్రీనివాస మూర్తి గారికి, అన్నదానం చిదంబర శాస్త్రి గారికి, కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి, అచ్చిరెడ్డి గారికి, అనంతలక్ష్మి గారికి, సివిబి సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, వడిపర్తి పద్మాకర్ గారు అలాగే సన్యాస దీక్షలో ఉండి కూడా లోకకళ్యాణార్థం ధర్మ పరిరక్షణార్థం వీరంతా తమ జ్ఞాన అనుభవాలను లోకానికి తెలియజేస్తున్న స్వామి సిద్దేశ్వరానంద భారతి స్వామి వారికి, స్వామి పరిపూర్ణానంద వారికి , శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి…. ఇలా ఎందరో నాకు తెలిసిన తెలియని మహానుభావులు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాలాంటి వారికి వీరివలన ఎన్నో శబ్ద పాండిత్య ధర్మ సందేహాలు వచ్చినప్పుడు వీరందరూ చెప్పిన జ్ఞానము నాకు ఆనాడు అంది నా యోగసాధన పరిసమాప్తి చేసుకోగలిగాను. ఇంక నా ప్రకృతి గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా...
ప్రకృతి గురువులు:
అలాగే సాధకుడు ప్రకృతి నుంచి కూడా కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. ఇలా చెప్పే వాటిని ప్రకృతి గురువులు అంటారు. ఇలా నేర్చుకునే వారిని జగద్గురువులు అంటారు. అనగా ప్రకృతియే గురువు అవుతుంది అన్న మాట. ఇలాగే శ్రీ దత్త స్వామి కి 24 మంది ప్రకృతి గురువులు ఉన్నారు. వాటి ద్వారా ఆయన ఏమి తెలుసు కున్నాడో మనము కూడా తెలుసుకుంటే సాధనలో ముందుకు వెళ్లలుగుతాము. అవి ఏమిటంటే
1.భూమి - సహన శక్తిని అలవర్చుకోవడం
2.వాయువు - ఇంద్రియ విషయాలలో వైరాగ్యం కలిగి ఉండటం
3.ఆకాశము - త్రిగుణ మాయా రహితంగా ఉండటం
4.అగ్ని - -ఏక రూప తత్వ జ్ఞానం కలిగి ఉండటం
5.సూర్యుడు - అన్నిటి యందును సమదృష్టి,సమదర్శనం ఉండటం
6.పావురము - మమకారం వ్యామోహాలు వదిలిపెట్టటం
7.కొండచిలువ - దొరికిన దానితో తృప్తి గా జీవించుట
8.సముద్రం - అవలక్షణాలు దూరం చేసుకొని సుగుణాలు దరికి చేసుకోవాలి
9.మిడత - పర స్త్రీ /పురుష వ్యామోహాలకు దూరంగా ఉండటం
10.ఏనుగు - -మోహము జయించాలి
11.చీమ - నిరంతర కృషి లక్షణం అలవర్చుకోవాలి
12.చేప - జిహ్వ చాపల్యం జయించాలి
13.వేశ్య - ధన కీర్థులను ఆశించరాదు
14.విలుకాడు - -స్థిర ఏకాగ్రతను అలవర్చుకోవాలి
15.బాలుడు - మాన అవమానాలు పట్టించుకోకూడదు
16.చంద్రుడు - జనన మరణాల యందు సమదృష్టి కలిగి ఉండాలి
17.తేనెటీగ - రేపటి గురించి ఆలోచించరాదు.
18.లేడి - విషయవాంఛలకు చిక్కకుండా ఉండాలి
19.గ్రద్ద - లౌకిక సుఖాలను ఆశించి దుఃఖాలు పొందటం ఉండరాదు
20.కన్య - ఏకాంత సాధన చేసుకోవటం నేర్చుకోవాలి
21.సర్పము - తన అభ్యాస రహస్యాలను,సాధనలను గుప్తంగా ఉంచుకోవాలి
22.సాలెపురుగు - లోకము వాసన మయము కాదని బ్రహ్మమయమని జ్ఞానము పొందాలి
23.భ్రమరకీటకము - తన ఇష్టగురువు లేదా ఇష్టదైవమును నిరంతరంగా ధ్యానించి ఆయనలాగా మారిపోవాలి
24.జలము - తనను ఆశ్రయించిన వారి తాపాలను తొలగించి రక్షిస్తూ వినయం కలిగి ఉండాలి
25.పిల్లి - ఆలోచన లేని శూన్య విశ్రాంతి స్థితి యోగ సాధనకు మూలం అని తెలుసుకోవాలి
26.నిదాన శ్వాస జీవులు(ఎలుగు బంట్లు, ఏనుగులు) - నిదాన శ్వాసక్రియ వలన శ్వాసపై నియంత్రణ చేసుకోవాలి
27.కుక్క - స్థిరమైన విశ్వాసము గుణము తెలుపుతుంది
28.మేక - నీది నాది అనే ద్వంద్వం భావాలు విడనాడాలి
29.ఆవు - అహం కు దూరంగా ఉండాలని తెలుసుకోవటం, సర్వస్యశరణాగతి గా ఉండటం
30.కోడి - స్థిరమైన నిశ్చలమైన పట్టుదలకు సంకేతం
31.కొంగ- స్థిరమైన ఏకాగ్రత సాధన విధానమునకు సంకేతం
32.చెట్టు - పరోపకార బుద్ధికి సంకేతము
33.పులి- చంచల ఆహారమునకు సంకేతము
34.సింహము - నిశ్చలస్థితికి సంకేతము
35.కోతి - అస్థిరమైన మనస్సుకు సంకేతము
36.గుర్రము - జ్ఞాన సముపార్జన విషయ సంగ్రహం సంకేతము
37.గాడిద - శరీరశ్రమకి సంకేతం
38. బల్లి - బ్రతికి ఉన్న శవములాగా నిశ్చలంగా ఉండడం
39.విత్తనము - పునః జన్మలకీ పునః కర్మలకీ సంకేతము
40.మర్రిచెట్టు - ఎండిన ఆకుల నుండి కూడా శబ్దం రాని స్థితికి
41.నల్లని చారలు జింక - పుణ్య కార్యాలకు పుణ్య శక్తికి సంకేతం
42.గులాబి పువ్వు - ప్రేమ విరహ వేదన సంకేతము
43.మల్లెపువ్వు - కర్మ వాసనలకి సంకేతము
44.త్రిదళం - త్రిగుణాల మాయలకి సంకేతము
45.మామిడి పండు - రుచి మాయకు సంకేతము
46.గంగానది - పవిత్రతకు సంకేతము
47.తులసి చెట్టు - పవిత్ర ఆలోచనలకి సంకేతము
48.మామిడి చెట్టు - పవిత్ర కర్మలకి సంకేతము
49.గన్నేరు చెట్టు - మరణ భయానికి సంకేతము
50.జిల్లెడు చెట్టు - రోగ భయాలకు సంకేతము
51.పుస్తకము - అన్ని రకాల జ్ఞానాల మాయలకు నాంది
52.వేప చెట్టు - ఆరోగ్య సమస్య నివారణకు
ఇలా నాకు తెలిసిన ప్రకృతి గురువుల వివరాలు సేకరించాను. ఇలా 84లక్షల ప్రకృతి గురువులు ఉన్నారని తెలిసి అవాక్కు అవ్వటం అయినది. ఈ విశ్వ సృష్టిలో ప్రతి జీవి కూడా ఏదో ఒక జ్ఞానానికి సంకేతం అని మాకు అర్థం అయినది. దానిని అర్థం చేసుకునే వాళ్ళు జగద్గురువులు అలాగే విశ్వ తత్వమును అర్థం చేసుకునే వారు విశ్వగురువు అవుతారు. వీరు సహస్రార చక్ర శుద్ది సమయంలో వస్తారని మేము తెలుసుకున్నాము. నాకున్న విశ్లేషణ జ్ఞానపరిధిలో కొన్ని ప్రకృతిగురువులను పరిశోధించి విశ్లేషణ చేసుకొని వాటి నుండి కొంతమేర మేము జ్ఞానము పొందడము జరిగినది! అవి
కుక్క: విశ్వాసానికి ప్రతీక. యజమాని యందు ఎలా విశ్వాసంగా ఉండాలో అలా భగవంతుని యందు నేను కూడా ఉండాలని గ్రహించాను.తిట్టిన లేదా కొట్టిన కొద్దిసేపటికి అన్నింటినీ మర్చిపోయి ఎలా అయితే కలిసి పోతుందో అలా నేను కూడా అవమానాలయందు పొగడ్త నందు ఉండాలని నేర్చుకున్నాను. వినికిడి శబ్దానికి వాసన శక్తికి భవిష్య జ్ఞాన శక్తి వీటికి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా. అలా నాకు కూడా మాయా మర్మం విషయాలయందు ముందుచూపు ఉండాలని నేర్చుకున్నాను. యజమాని కనపడకపోతే అన్నం తినడం మాని వేయడం మరియు యజమాని చనిపోతే శరీర త్యాగం చేసే లక్షణాలు చూసి నేను కూడా నా యజమాని అయిన భగవంతుడు యందు అలాగే ఉండాలని గ్రహించాను. తనని కానీ వారిని ఎలా అయితే దరికి రాకుండా అరుస్తూ కరుస్తూ ఉంటుందో నేను కూడా అరిషడ్వర్గాలు,సప్త వ్యసనాలు నాయందు రాకుండా జాగ్రత్త పడాలని నేర్చుకున్నాను. అలాగే క్రమశిక్షణతో శేష జీవితమంతా ఎంతో విశ్వాసంతో జీవించును.అలా నేను కూడా ధర్మబద్ధ జీవితంతో దైవమందు విశ్వాసంగా జీవించాలని నేర్చుకున్నాను.
పిల్లి: దీనిద్వారా యోగ నిద్ర ద్వారా విశ్రాంతి ఎలా పొందాలో నేర్చుకున్నాను ఇది ప్రతి రోజు మిట్ట మధ్యాహ్నం వేళ పడుకొని తన శరీర అవయవాలకి విశ్రాంతిని ఇస్తూ కునికిపాట్లు పడుతూ నెమ్మదిగా యోగ నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది.అలాగే ఇది తన మలము ఎవరికీ కనిపించకుండా దాచి పెట్టడం జరుగుతుంది ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు తన నాలుకతో శరీర శుద్ధి చేసుకోవడం చూసి అలాగే నేను కూడా స్నానం తో శరీర శుద్ధిగా ఉంచుకోవాలని నేర్చుకున్నాను.
సాలె పురుగు: ఇది తన నోటి నుండి వచ్చిన తెల్లటి జిగురు పదార్థంతో గూడు కట్టుకోవడం అలాగే కొన్ని రోజులైనా తర్వాత దానిని నాశనం చేసి మళ్ళీ క్రొత్తది కట్టుకోవడం గమనించి మనిషికి కోరికలు కూడా ఇంతేనని మళ్ళీ మళ్ళీ తీర్చుకోవడానికి ప్రారబ్ద కర్మ బంధాల గూడుకట్టుకొంటాడని నేను గ్రహించాను.
కొంగ: నీటిలో ఆహారం కోసం నిశ్చలంగా ఏకాగ్రచిత్తంతో ఒంటి కాలి మీద నిలబడి ఉండటం గమనించి నేను కూడా బ్రహ్మపదార్థం అనుగ్రహం కోసం ఇలాగే సాధన చేయాలని తెలుసుకున్నాను.
చేప: ఇది గాలమునకు ఆహారము యొక్క జిహ్వచాపల్యానికి గురై జాలరికి చిక్కి మరణము పొందుతుంది కదా.అలాగే జీవుడు కూడా వివిధ పదార్ధాలు జిహ్వచాపల్యానికి గురై మృత్యుఒడిలోకి చేరుతాడని నేను గ్రహించాను. అలాగే చేపలు ఎప్పుడు కూడా ఒక చోట నిశ్చలంగా ఉండవు. సాధకుడు కూడా కోరికలలో పడినప్పుడు కూడా ఎప్పుడూ కూడా అనిశ్చలంగా చేపలలాగా ఉండి వాటికి లాగానే అపమృత్యువును పొందుతాడని గ్రహించాను.
చెట్టు: ఇది అడిగినవారికీ అడగనివారికీ…. కొట్టిన వారికి… నీళ్లు పోసిన వారికి… బాధ పెట్టిన వారికి… బాధ పెట్టని వారికి… ఇలా ఇది అందరినీ సమభావంతో సమానత్వం గా చూడటం గమనించి నేను కూడా అందరితో అలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను. అడిగిన వారికి పండ్లు ఇస్తుంది. కొమ్మలను కొట్టిన వారిని భరిస్తుంది. నీళ్లు పోసిన వారికి పువ్వులు ఇస్తుంది.
పాము: ఇది తనకంటూ సొంత గృహము ఏర్పరచుకోదు. చెద పురుగులు నిర్మించిన పుట్టలో ఆవాసం చేస్తుంటాయి. ఒక చోట నుండి మరొక చోటికి మారతాయి. కప్పలను తిని జీవ పర్యావరణం కాపాడతాయి. అలాగే శ్వాసక్రియ ఊపిరితిత్తులలో కాకుండా గుండె లో శ్వాసక్రియ జరుపుకుంటాయి నేను కూడా నా శ్వాస క్రియ స్థితిని గుండెకు మార్చుకునే స్థాయి దాకా సాధన స్థితి పొందాలని నిశ్చయించుకున్నాను.
ఏనుగు:మదం అహంకారానికి ప్రతీక .అలాగే వీటికి మదం ఎక్కినప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా ఉగ్ర స్వరూపమై ఆడ ఏనుగు స్పర్శ కోసం పరితపించి పిచ్చెక్కి వేటగాడికి చిక్కుతాయి లేదా మరణం పొందుతాయి. అలాగే వీటికి లాగా సాధకుడు కూడా తన సాధనలో వచ్చే స్త్రీ /పురుష కామమాయను దాటకపోతే మహామాయకి బలి కావాల్సి వస్తుందని గ్రహించాను.
స్త్రీమూర్తి: వీళ్లు క్షణిక ఇంద్రియ సుఖాలకు ప్రతిరూపాలని వీరిని దాటితేగాని ఏకాంత స్థితి కలగదని లేదంటే కామ మాయ వలలో సాలె పురుగు గూడులో చిక్కుకున్న పురుగుల స్థితిని పొందవలసి ఉంటుందని గ్రహించాను.
గుర్రం:ఇది మనో వేగానికి ప్రతీక. రౌతు బట్టి గుర్రం ఉంటుంది. గుర్రము చేతిలో రౌతు ఉంటే భోగ జీవితం రౌతు చేతిలో గుర్రం ఉంటే యోగ జీవితం అని మనస్సు స్థిరమైతే యోగమని అస్థిరమైతే అదే భోగమని గుర్రం లాగానే మనస్సును సాధకుడు తన ఆధీనంలో ఉంచుకుంటే హయగ్రీవుడు లాగా పరిపూర్ణ జ్ఞానసిద్ధుడు అవుతాడని గ్రహించాను.
కోతి: అస్థిరమైన మనస్సుకు సంకేతము. దీనికి కొబ్బరి చిప్ప దొరికితే దాని ఆనందానికి అంతే ఉండదు. అలాగే కల్లు తాగితే దాని గంతులకి అంతు ఉండదు. అచ్చంగా మన మనస్సులో ఆనందం కలిగినా బాధ కలిగినా అన్నమాట.
ఇలా నా ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ఆధ్యాత్మిక గురువులు అలాగే ప్రకృతి గురువుల వలన నేను మంత్రగురువుగా మారి నా నిజ శిష్యులకోసము వారికి మంత్రపరీక్షలు పెట్టడము జరిగినది!
మంత్ర గురువుగా నా పరీక్షలు:
నేను గాయత్రి మంత్ర సిద్ధి పొందినాను అని మీరు ఈ పాటికి తెలుసుకున్నారు కదా. దానితో నాకు ప్రకృతిమాత కాస్త మంత్ర గురువు పదవిని ఇచ్చినది. అనగా నాలో అలాగే నా చుట్టూ నా మంత్ర దేవతా శక్తి వలయాలు ప్రసారం ఆరంభమయ్యాయి. ఆ విషయం నాకే తెలియదు. ఎప్పుడూ నా ధ్యాస అంతా నా సాధనను ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అనే తపన తాపత్రయం వుండేది.
ఇది ఇలా ఉండగా అన్న గారి ప్రాణస్నేహితుడు మరో తమ్ముడైన దేవరాజ్ అనే వ్యక్తి నన్ను నాలోని శక్తిని కనిపెట్టి మొదట బాబా భక్తుడైన శ్యామ అని పేరు నాకు పెట్టి నన్ను పిలవడం ప్రారంభించినాడు. ఇతను పరమ వైష్ణవ భక్తుడు. అందరి దైవాల భక్తుడు. తన భక్తితో ఏ దేవుడు అనేది లేదు. అందరినీ కొలుస్తాడు. మంత్రాలు నిరంతరం చదువుతూ ఉంటాడు. గుడి కనబడితే నమస్కారం పడేస్తాడు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అనేది వీరి సిద్ధాంతం. ఏ దేవుడు కరుణిస్తాడో ఎవరికి తెలుసు అనే తత్వం అన్నమాట. నెమ్మది నెమ్మదిగా నాకున్న వాక్సుద్ధితో వీడికి జాతకాలు చెప్పడం, జరగబోయే విషయాలు చెప్పడం అవి జరుగుతుండటంతో వీడు కాస్తా నన్ను గురువుగారు అనటం మొదలు పెట్టినాడు. నాలో గురు తత్వం ఉన్నదని కనిపెట్టిన మొట్ట మొదటి వ్యక్తి ఇతనే అన్నమాట. వీడు కనిపెట్టేదాకా నాకు నేను మంత్ర గురువు స్థాయికి వచ్చినాను అని నాకే తెలియదు. దాంతో వీడికి గురు మంత్రోపదేశం చేస్తే సాధన జీవితం ముందుకు వెళుతుంది గదా అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. కానీ ప్రకృతి గురువు ఊరుకుంటుందా? నా ద్వారానే వీడికి మంత్ర పరీక్షలు చేయించడం ఆరంభించినది. నేను అమ్మాయిలతో చనువుగా ఉండటం కనిపించేటట్లుగా ఈ ప్రకృతి చేసినది. దాంతో వీడి నమ్మకం సడలలేదు. గురువు గారే అంటుండేవాడు.మరి కొన్ని రోజులకి నేను ఆ అమ్మాయిలతో బాగా అతిగా అర్ధరాత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాను…. పాపం అక్కడనుండి వాడికి అనుమానపు భక్తి మొదలైనది. అలాగని నా గురించి చెడుగా భావించడం లేదు. అలాగని మంచిగా నాతో ఉండలేక పోతున్నాడు. కల్లు చెట్టు కింద పాలు తాగుతున్నాను అని వాడికే తెలియదు. ఇంకా ఏముంది. నేను ఉన్నది కూడా బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఉన్న వూరు కావటం విశేషం.మరి వీడికి గురు మంత్రోపదేశం సిద్ధి కావాలంటే అక్కడ ఉన్న బాలాదేవి మూర్తి పరీక్షలు పెట్టకుండా ఉంటుందా.పెట్టినది. పాపము ఆరు నెలల పాటు ఇలా అమ్మాయిలతో బాగా అతిగా అర్ధరాత్రి కూడా మాట్లాడుతూ ఉండటం గమనించి గమనించి విసుగు చెంది మన వాడికి నిద్ర పట్టేది గాదు. నేను తెల్లవారే యధావిధిగా ఏమీ తెలియనట్లుగా నన్ను వాడేమీ గమనించనట్లుగా వాడితో ప్రవర్తించేవాడిని.వాడికి లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి. వాడు కళ్ళతో చూసిన దృశ్యాలు సత్యాలని నమ్మే స్థాయికి వచ్చినాడు.
దానితో నా గురు మంత్రోపదేశమునకు దూరమయ్యాడు. ఇటుప్రక్క అమ్మాయిలతో, అటుపక్క ఆధ్యాత్మికతను ఎలా నడుపుతున్నానో వీడికి ఇప్పటిదాకా అర్థం కాలేదు. నాది అంతా మా గురు దేవుడైన విచిత్ర వేదాంతి పద్ధతి అని వాడికి తెలియదు కదా! ఈయనది అంతా కూడా విశ్వ గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలా విన్యాసం అని తెలియదు కదా. దత్తుడు కూడా అంతే కదా. అమ్మాయిల మత్తులో, మైధునంలో జోగుతూ కనబడతాడు.ఎవరైతే ఈ కఠిన పరీక్షకు తట్టుకుంటారో వారికి మాత్రమే ఈయన జ్ఞానోపదేశం చేసేవారని వారి చరిత్ర లో కనబడుతుంది కదా! కాకపోతే నకిలీ గురువులు దీనిని అడ్డుపెట్టుకుని శిష్యుల,భక్తుల మానము, ధనము దోచుకోవటం పరిపాటి అయినది.ఏది నిజగురువు పరీక్షయో శిష్యులకు అర్థం కాకుండా పోయింది. నా నిజ గురువైన విచిత్ర వేదాంతి పెట్టిన సంయోగ మాయ పరీక్ష వీడికి నేను పెట్టి ఉంటే మనవాడు బుర్ర తిరిగి పోయేది. కానీ నేను పెట్టిన చిన్న మైధున పరీక్షకి మన వాడు ఇలా ఉన్నాడు.
అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవిని కూడా పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి ఎన్నో పరీక్షలు పెట్టినాను. అనగా ఒకరోజు మేమిద్దరం పార్కులో కూర్చొని ఉండగా పార్కులోని ఒక కడుపుతో ఉన్న స్త్రీమూర్తి అక్కడికి వచ్చినది. ఆమెను చూస్తూ ఈమెతో “దీక్షగారు! నేను మిమ్మల్ని కూడా ఇలా కడుపుతో చూడాలని అనుకుంటున్నాను” అనగానే ఆమె కాస్త ఏ మాత్రం తడుముకోకుండా ఆలోచించకుండా “పెళ్లికి ముందా? పెళ్లికి తర్వాతా?” అనగానే నేను గతుక్కుమన్నాను. ఈవిడకు శరీర అభిమానం లేదని, కామ మాయ లేదని గ్రహించాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమెకు పెట్టిన పరీక్షలకు ఈ గ్రంథమే సరిపోదు. అన్నింటిని సహనంతో, ఓర్పుగా, తెలివిగా, నేర్పుగా దాటి వచ్చినది కాబట్టి ఈమె నాకు అర్ధాంగిగా వచ్చినారు. బాబా వారు చేసినారు. ఇక మన విషయానికి వస్తే వాడికి నేను చూపించిన విచిత్ర పరీక్షకి మనవాడు భయపడి బాధపడి నన్ను ఒక స్త్రీ వ్యసనపరుడుగా ఊహించుకుని నన్ను దూరం చేయడం ప్రారంభించాడు.నాకు కావలసినది కూడా అదే కదా! బాబా వారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. అది ఏమిటంటే “నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాటిని అందుకునే అర్హత మీకు ఉందా లేదా తెలుసుకోండి” అని అంటుండేవారు. అర్హత ఉన్న వాడికి అన్ని ప్రకృతి సమకూరుస్తుంది. వీడికి నేను పెట్టిన పరీక్షలకు తట్టుకుని ఉంటే నా పంచ శిష్యులలో ఒక్కడిగా ఉండి మోక్ష ప్రాప్తి పొందేవాడు.వీడు నన్ను గురువుగా గుర్తించిన వ్యక్తి కావటం నాగురు పరీక్షలకు బలి అయిన వ్యక్తి కావటం విశేషం. అంతటితో నా నుండి తప్పుకున్నాడు. పేరుకే వాడికి అవసరాలు, సమస్యలు తీర్చే గురువుగా ఉన్నాను. ఇప్పుడు అది కూడా లేదు. ఎవరి భక్తి వారిది. ఎవరి అర్హత వారిది. ఇక అసలుసిసలైన నా ఆధ్యాత్మిక తుఫాను ధ్యానానుభవాలున్న మూడవ విభాగమైన సాధనదీక్ష సాధనానుభవాల విభాగమునకు నాతోపాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!
శుభంభూయత్
పరమహంస పవనానంద
*****************************
గమనిక: అలాగే నిజ గురువులు అలాగే నకిలీ గురువులు పెట్టే పరీక్షలు శిష్యుడు తట్టుకొని అలాగే ఎవరు నిజ గురువు ఎవరు నకిలీ గురువో శిష్యుడు తెలుసుకొని వారికి అన్ని రకాల పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన గురువును మాత్రమే తన గురువుగా శిష్యుడు ఎంచుకోవాలి. అలాగే నిజ శిష్యుడిని ఎంచుకోవటానికి గురువు కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలి. అర్హత యోగ్యత లేని వారిని గురువుగా అలాగే శిష్యుడుగా ఎంచుకోవద్దని నా మనవి. నా విజ్ఞప్తి.గురువు పెట్టే పరీక్షలు శిష్యుడు ఎదుర్కోవాలి. తట్టుకోవాలి. నిలబడాలి. అదేవిధంగా శిష్యుడు పెట్టే పరీక్షలను ఈ గురువు అవలీలగా దాటి పోవాలి. ఒకరికి ఒకరు పరీక్షించుకుని పరిశోధన చేసుకొని గురు శిష్య సంబంధం ఏర్పరచుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఒక నిజ గురువుకి ఒక నిజ శిష్యుడు మాత్రమే చివరిదాకా నిలబడి ఉంటాడు.ఇలా ఏక శిష్యుడు ఉన్న గురువు దగ్గర మీరు గురు మంత్రోపదేశము వారు పెట్టిన పరీక్షలకు నిలబడి ఉంటే పొందవచ్చును. దత్తాత్రేయకు ఎంత మంది శిష్యులు ఉన్నా ఏక శిష్యుడు కార్తవీర్యార్జునుడు మాత్రమే అని తెలుసుకోండి. ఈయనకి ఆయన ఎన్ని రకాల యోగమాయ పరీక్షలు పెట్టినారో గురు చరిత్ర చదివితే మీకే తెలుస్తుంది. మీరు గురువుకి పరీక్షలు పెట్టాలి. అలాగే గురువు పెట్టే భయంకరమైన భయము, అసహ్యం, అనుమానం ఇలా అష్ట పాశ పరీక్షలు సాధక శిష్యుడు తట్టుకోవాలి. తట్టుకొని సాధన జీవితం పరిసమాప్తి చేసుకోండి. మీకు మోక్షము పొందాలనే తపన ఉంటే మీ గురువులను ఎంచుకోండి. లేదంటే విగ్రహ భక్తి దగ్గరే ఆగిపోండి. గురువులు పెట్టే విచిత్ర పరీక్షలు తట్టుకోలేకపోతే మతి భ్రమణం చెందే అవకాశాలు ఉంటాయని గ్రహించండి. ఆర్బాటాలు లేని, ఆడంబరాలు లేని ,ఆశ్రమాలు లేని, ఆశయాలు లేని, ఆవేశాలు లేని నిజ అవధూత స్థితిలో ఉండే వారిని నిజ గురువుగా గుర్తించి వారికి గురు పరీక్షలు అలాగే వీరు పెట్టే శిష్య పరీక్షలు తట్టుకొని నిలబడిన వారికి మాత్రమే మోక్షం పొందే అర్హత వస్తాయని గ్రహించండి. డిగ్రీ చదివిన వారంతా ఎలా అయితే ఐఏఎస్ కాలేరో అలాగే నిజ గురువు దొరకని వాడు మోక్షగామి కాలేడని నా స్వానుభవంతో చెప్పడం జరుగుతోంది. ఇలా నా సాధన పరిసమాప్తి అయ్యేవరకు ప్రకృతి మాత చూపించిన 477 మంది శిష్యులలో 36 మందిని ఎంచుకొని అందులో 11 మంది అందులో 9 మంది అందులో 7 మంది అందులో 5 మంది అందులో 3 అందులో ఒకే ఒక్కడు నిలబడి ఉన్నాడు. వారే నా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి అన్నమాట. నా అంతటి వాడిని చేశాము. గురువును మించిన శిష్యుడు అయినాడు. మిగిలిన వారు గురువును ముంచిన శిష్యులుగా మిగిలిపోయారు.
ఇంతటితో నా మంత్రదీక్ష అనుభవాలు అనే ద్వితీయ విభాగములోని 11 అధ్యాయాలు పూర్తి అయినాయి! ఇక తృతీయ విభాగమైన నా సాధన దీక్ష సాధన అనుభవాలలోని అధ్యాయాలు ప్రారంభమవుతాయి!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిprakruthi kuda guruvu avthundani saadhakudu kotha konamlo manchi lakshanalu ela
రిప్లయితొలగించండిalavarchukovali alage 24 prakruthi guruvu la gurinchi cheppatam 24 nundi 54 nundi 84 lakshala
meeru gayathri mantra siddhi pondatam ade samayaniki devaraj ane vyakti raavatam
meeru rakarakaala pareekshalu pettatam ye sthayi varaki thattukogaligarani vivarinchatam athanu
kalla tho chusinde nijamani nammatam..... mee padhathi dattatreyula vaari la untundani ardham
chesukolekapovatam.....(evadiki ardhamaindani) alage mee srimathi gaariki enno pareekshalu petti
kaani chesukoledani.....
jeevajathula nundi prakruthi prathi jeevi nundi edo okati nerchukovochu ani, ala saadhakuni drushti
konam maaralani, prathi jeevi gnyanaki sanketham ani ila evari the aalochistharo vaare
jagadguruvulani, mee gnyna paridilo konni prakruthi guruvulani vishleshinchina gnynamunu
vivarincharani dhaanilo tiger(kukka), pilli,saalepurugu,Konga,chepa,paamu, sthri murti, gurram,
enugu,kothi...... Saadhakudu veetinundi em nerchuko alane vivarana bagundi mukhyam ha kukka,
kothi, gurram evi nak baaga nachinayi...... Asal prakruthini ila different konam lo kuda chudochu ani
ippude thelisindi...... Ila prathi saadhakudu aalochisthe drushti konam maaruthundani munduku
vellataniki chaala upayoga padthundi.mimmalni oka sthri vyasanaparudila anukoni vadileyatam baadhakaram...