సాధన విగ్రహామూర్తి రావడం
అప్పటికే మోక్ష సన్యాస దీక్ష తీసుకుని ….”ఓం శివోహం” గురు మంత్రం ఉపదేశం పొంది , ఆరు నెలల పాటుగా సాధన చేస్తున్న శివనందిని …..బాలగణపతి గది నుండి మణికర్ణిక ఘాట్ వైపుకి స్నానం చేయడానికి అని బయలుదేరారు . దారిలో బాల గణపతి ఉన్నట్టుండి శివ నందినితో
బాలగణపతి:- అమ్మ! నువ్వు కాశీకి వచ్చి ఎన్ని రోజులు అయింది?
శివనందిని:- నాయనా! సుమారుగా ఇవాళతో 6 నెలలు పూర్తి అయింది.
బాలగణపతి:- అంటే ఇంకో మూడు నెలలు కలిస్తే తొమ్మిది నెలలు అవుతుంది. అంటే తొమ్మిది నెలలు పూర్తి అయితే గర్భావాసం ఉండదని శాస్త్రవచనం. అంటే కాశీలో 9 రోజులు నిద్ర చేసినా లేదా తొమ్మిది నెలలపాటు ఎక్కడికి వెళ్ళకుండా కాశీలోనే స్థిర నివాసం చేసినట్లయితే…. వారికి తల్లి గర్భంలో పుట్టే స్థితి ఉండదని కాశీ పురాణం చెబుతుంది.
శివనందిని:- ఏమోరా! నాకు తెలియదు. నేనెప్పుడూ పురాణాలు, ఇతిహాసాలు ఏమీ చదవలేదు.
బాలగణపతి:- చదివిన వాడికి అర్థం చేసుకునే స్థితి ఉండాలి. అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో ఉంటే ఉపయోగం ఏముంటుంది? శాస్త్రం అర్థం అయితే సిద్ధాంతం…. అర్థం కాకపోతే వేదాంతం….. అర్థం అయ్యి అర్థం కాకపోతే రాద్దాంతం అవుతుందిలే ! తెలుసుకొని ప్రశ్నలు పెంచుకొని ,అనుమానాలు పెంచుకొని, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ తెలిసిన రుద్రస్వామి మహాస్వామి లాంటి గురువులను పట్టుకుంటే వాళ్లే చెప్తారు. మనకేం కావాలి… ఏంటి అని…. అయినా కూడా మనం విశ్వాసంతో నమ్మితే, మనకి ఏం కావాలో…. ఏది ఎంతవరకు ఇవ్వాలో…. అనేది ప్రకృతి చూసుకుంటుంది కదా అమ్మ! మనకెందుకు ….మనం చూస్తూ ఉండటమే …..మనం చేయాల్సింది అంతా కూడా ప్రకృతి మన చేత చేయిస్తుంది. కాకపోతే అది మంచా, చెడా అన్నది మనకు తెలియదు. ఏది జరిగిన మన మంచికే జరిగింది అనుకుంటూ ఉండాలి….
అని అనుకుంటూ ఉండేసరికి మణికర్ణిక ఘాటుకు వచ్చింది . ఆ తర్వాత మణికర్ణిక ఘాట్ లోకి దిగి వీళ్లిద్దరూ స్నానాలు చేసుకొని బట్టలు మార్చుకొని, ఎవరికి వారే ఏకాంతంగా మంత్రాలతో ధ్యాననిష్టలో ఉండిపోయారు. సుమారుగా ఒక గంట తరువాత , ఎవరో తనని చూస్తున్నారని అనిపించి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రుద్ర స్వామి కనిపించారు . వెంటనే వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి నమస్కారం చేశారు. శుభం భూయాత్ …..ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు అని, పక్కనే పడుకొని దీర్ఘ ఆలోచనలో ఉండిపోయారు. వీళ్ళ ముగ్గురి మధ్య మౌనం తాండవిస్తూ ఉన్నది. ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు . ఎవరికి వారే గంగానది కేసి చూస్తున్నారు . కాకపోతే రుద్ర స్వామి ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నాడని, ఆవేదన చెందుతున్నాడని…. మాత్రం వీళ్లిద్దరికి అర్థం అయింది. సరే అని ఇంతలో మహాదేవి కూడా ఉరుకుల పరుగులతో శరవేగంతో రావడం జరిగింది. ఏం జరిగిందా అని శివ నందిని కంగారుపడుతూ
శివనందిని:- అమ్మ! ఏమైంది అంత కంగారు పడుతున్నావ్…. ఏమైనా ఇబ్బంది అయిందా?
మహాదేవి:- ఏమీ లేదమ్మా! నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నిన్న రాత్రి మా గురువుగారు పరమపదించారు. ఆయన దహన సంస్కరాలు…. ఈ మణికర్ణిక ఘాట్ లోనే చేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎందుకు ఉన్నట్టుండి పరమపదించారో తెలీదు. కాకపోతే పరమపదించేటప్పుడు….“నా దగ్గర ఒక వస్తువు ఉంది. ఆ వస్తువులను నువ్వే జాగ్రత్తగా కాపాడాలి…. మన నిత్యం పూజించే దైవ మూర్తి కింద వస్తువు ఉంది….. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు…. నీ తదనంతరం నీ శిష్యులకు ఎవరికైనా దీని బాధ్యత అప్పచెప్పు” అని చెప్పి ఈయన కన్నుమూశారు . ఆ వస్తువు ఏంటో తర్వాత తెలుసుకుందామని నేను ఇంక వదిలేసి వచ్చేసాను..
(అంటూ ఉండగా….. రుద్ర స్వామి మాత్రం, విని విననట్టుగా పట్టించుకోకుండా ….తన దీర్ఘ ఆలోచనలో తన ఉండిపోయాడు. )
ఏమైంది ఈయనకి? ఏమి మాట్లాడట్లేదు…. ఏమైనా కోపం వచ్చిందా? అలిగాడా? కోపం, అలక వచ్చినప్పుడు ఇలా చేస్తాడు…. నీకు తెలియదులే !నీకు కొత్త కదా ! అని
శివ నందినితో అంది .
శివనందిని:- మేమేం అనలేదమ్మా! ఆయన రావడమే ఏదో ఆలోచనలో ఉన్నారు. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మదన పడుతున్నట్టుగా కనిపిస్తుంది . ఆవేదన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఆయనే పలకరిస్తాడులే అని మాట్లాడకుండా కూర్చున్నాము. ఇంతలో నువ్వు వచ్చావు .
రుద్ర స్వామి వాళ్ళ ముగ్గురికేసి అదోలా దీర్ఘంగా చూస్తూ….. చేతి సంచిలో నుంచి ఒక యంత్రం బయటకు తీశాడు . అది చూడటానికి నాలుగు పలకలుగా ఉన్న రాగి యంత్రం…. దానిమీద ఏదో బీజాక్షరాలతో గీసినట్లుగా యంత్రం ఉంది. దీన్ని చూడగానే మహాదేవి…
మహాదేవి:- ఎన్నిసార్లు చూపిస్తావయ్యా? ఆ యంత్రం….. విసుగు వచ్చేటట్టుగా ఉంటుంది. అదేంటో కూడా అర్థం కాదు…. గుడిలో పూజారులు ,దైవిక వస్తువులు అమ్మే దుకాణం వాళ్ళు… అది సాధారణమైన రుద్ర యంత్రం అని …. అది పూజించుకునే యంత్రం అని చెప్పారు కదా! మీ తాత ముత్తాతల నుంచి వస్తుందని, అందులో ఏదో రహస్యం ఉందని…. అయినా కూడా ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది అని చెప్పి సావగొడతావ్ ……నీకు అర్థమయ్ చావదు….నాకు అర్థం కాదు… ఏంది….ఆ యంత్రాన్ని తీయ మాకు…. తీస్తే నాకు కోపవేశాలు వస్తాయి. నువ్వేమో ఆవేదన చెందుతావు. ఇప్పుడు ఇది అవసరమా ? అర్థం కాని దాని గురించి ఎందుకు పదేపదే అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తావు ? అని
ఆ యంత్రం తీసుకొని నీళ్ళల్లో పడవేయబోతుండగా….
రుద్రస్వామి:- ఆగు! ఆ యంత్ర రహస్యం బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. అది మనకి అర్థం కాకపోవచ్చు… బంగారాన్ని అందరూ తయారు చేయలేరు… చేతిలో బంగారం గీత యోగం ఉన్నవాడు మాత్రమే దాన్ని తయారు చేస్తాడు. బంగారం తయారుచేసిన వాడు బైరాగి అవ్వక తప్పదు అని…. బ్రహ్మదేవుడే ఏనాడో చెప్పాడు. ఇప్పుడు యోగి వేమనకి ఆ గీత ఉండబట్టి…. బంగారాన్ని తయారు చేయగలిగాడు. ఆయన శిష్యుడైన రామన్న ఎన్నిసార్లు తయారుచేసిన బంగారాన్ని తయారు చేయలేకపోయాడు కదా! బంగారాన్ని తయారుచేసిన యోగివేమన కాస్త బైరాగిగా మారి సన్యాసంలో కలిసిపోయాడు కదా! ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాకపోతే 48 సంవత్సరాల నుంచి ప్రతి 47వ తరంలో ఒక విరాగి మా వంశంలో పుడుతూ…. అలా 14 మంది యోగుల చేతుల మీద నుంచి యంత్రం వచ్చింది. అంటే ఇది సామాన్యమైన యంత్రమో , రాగి రేకు యంత్రమో .. సాధారణమైన రుద్ర యంత్రం అనుకుంటున్నావా? సామాన్యమైన యంత్రం అయితే …..14 మంది యోగులు 48 తరాల చొప్పున దీనిని భద్రపరుచుకుంటూ వస్తారా? మా తండ్రి దగ్గరికి వచ్చేసరికి …..“నాయనా! దీన్ని ముంచు …ఇది బంగారం అవుతుంది. విషయం తెలుస్తుంది” అని చెప్పాడు. దీన్ని ఇక్కడ ఉన్న 84 ఘాట్ లలోనూ ముంచాను. అది బంగారం అవ్వడం కాదు కదా! దానికున్న తుప్పు బయటకు పోతుంది . అదేంటి అనేది తెలియట్లేదు. ఇందులో ఏదో విశ్వ రహస్యం ఉందని మాత్రం అర్థం అవుతుంది …అది ఏంటి అనేది చేదించాలి…. కానీ దానికి నాకు అర్హత ,యోగ్యత ,యోగం లేదని అర్థమయింది. ఎందుకో.. ఈ రోజు నా పూజా మందిరంలో నుంచి బయటికి తీసాను. అది ఎందుకో తీయాలనిపించింది.. ఎందుకో మూడు రోజుల నుంచి ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ ఈ యంత్రం ద్వారా ఏదైనా విషయం తెలిసే వాళ్ళు వస్తారేమో చూద్దాం అని
అనుకుంటూ ఉండేసరికి….
మహాదేవి:- నీ బొంద! నీ బూడిద . నీకు అర్థం కాదు… ఎవరో వస్తారు…. ఏదో చేస్తారని 80 సంవత్సరాలు నుంచి చూస్తున్నావ్…. మీ నాన్న ఇచ్చిన యంత్రం ….మీ ముత్తాతలు ఇచ్చిన యంత్రం అని చెప్తావ్…. పోనీ ఇది బంగారపు యంత్రము అంటే అమ్ముకుంటే సోమన్న వచ్చేది…. తిప్పితిప్పి కొడితే ఇది రాగి రేకు యంత్రం…. పోనీ ఇది విశ్వ రహస్యం చెప్పే యంత్రం అంటే అది సాధారణ రుద్ర యంత్రం. ఇది సాధారణంగానే షాపుల్లో దొరుకుతాయని పూజారులు చెప్పారు కదా!
రుద్రస్వామి:- ఎవరు ఏం చెప్పినా ….నాకు సంబంధం లేదు. మరి ఇది మా తరతరాలు నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందో దీని సంగతి చూడాలి. అది నాకు ఇచ్చేయ్
అని అంటూ ఉండగానే వీళ్లిద్దరి మధ్య శాంతి పరచాలని చెప్పేసి….బాల గణపతి ఉన్నట్టుండి మహాదేవి చేతిలో నుంచి యంత్రం తీసుకున్నాడు. దాన్ని చూస్తూ… దీర్ఘంగా ఆలోచిస్తూ ….పరిశీలిస్తూ పరిశోధిస్తున్నాడు .
బాలగణపతి:- అరే! ఈ యంత్రం మామూలు యంత్రంలాగా లేదే !
మహాదేవి:- ఏమైందిరా! మామూలు యంత్రమే కదా….
బాలగణపతి:- కాదమ్మా! రుద్రయ్య చెప్పినట్టు ఇందులో ఏదో తెలియని రహస్యం ఉంది. ఎందుకంటావా? చూడు …..ఈ యంత్రానికి నాలుగు వైపులా నాలుగు గుర్తులు ఉన్నాయి. ఒక గుర్తు ఏమో బావి గుర్తు …ఒక గుర్తు ఏమో శివలింగం గుర్తు. ఇంకొక గుర్తు ఏమో గణపతి బొమ్మ . ఇంకొక గుర్తు ఏమో అమ్మవారి విగ్రహం వచ్చి ఉన్నట్టు ఉంది. ఇందులో శివలింగానికి ఏమో కింద పద్మం ఉన్నది . అలాగే గణపతి కింద కూడా పద్మము ఉన్నది. ఈ బావి మాత్రమే మనకి కనపడుతుంది. కానీ మిగతా మూడు కూడా కనపడట్లేదు… చూసావా! ఇందులో ఏదో ఉంది. రుద్రయ్య చెప్పినట్టు…. ఏదో తెలియని రహస్యం ఉంది.
అనగానే అప్పటిదాకా ఈ గుర్తులు గురించి గుర్తించని రుద్రయ్య కాస్త …..
రుద్రస్వామి:- అవునా! నిజమా! నేను ఇంతవరకు గమనించలేదు కదా…..
అని బాలగణపతి దగ్గర నుంచి ఆ యంత్రం తీసుకొని ఆ యంత్రాన్ని పరిశీలనగా చూసేసరికి… యంత్రంలో ఆ గుర్తులు ఉన్నాయని తెలుసుకున్నాడు .
రుద్రస్వామి:- అవును కదా! ఈ యంత్రంలో ఈ గుర్తులేంటి ? నేను ఇంతవరకు చూడనుకూడా చూడలేదు. ఇంతవరకు నేను మామూలు యంత్రం అనుకున్నా….. కాకపోతే ఇవి నాలుగు వైపులా ఉండేసరికి ఇవి బీజాక్షరాలేమో అనుకున్నాను. కాదా.? ఈ గుర్తులు నేను ఎప్పుడూ చూడలేదే…. ఏం చెప్తున్నాయి ఈ గుర్తులు అనగానే….
ఈ యంత్రమును శివ నందిని చేతిలోకి తీసుకొని తేరిపార చూసింది.కళ్ళు మూసుకుంది. ధ్యానంలోకి వెళ్ళింది. ఈ యంత్రం గురించి ఆలోచనలు చేస్తూ ధ్యానం చేస్తూ ఉంది. ఒక పది నిమిషాలు అవ్వగానే …..ఈ యంత్రం బావి గుర్తు ఉన్న భాగం అని అర్థమైంది. అది మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తుంది అని…. కళ్ళు తెరిచి
శివనందిని:- ఈ యంత్రం పూర్తిగా నాలుగు భాగాలుగా ఉంది. అందులో ఇది బావిని సూచించే యంత్రం …
అని చెప్పగానే
రుద్రస్వామి:- అదేంటి! ఇది ఒకటే యంత్రం కదా! పూర్తిగా ఉంది కదా! నాలుగు భాగాలు ఉండటం ఏంటి?
అనగానే
శివనందిని:- యంత్రంలో నాలుగు భాగాలు ఉన్నాయి . ఒకటి అమ్మవారి గుర్తు ఉన్నయంత్రం… రెండు శివలింగం గుర్తు ఉన్నయంత్రం….. మూడు గణపతి గుర్తు ఉన్నయంత్రం…. నాలుగు బావి గుర్తు ఉన్న యంత్రం . ఇందులో మీకు వచ్చింది బావి ఉన్న గుర్తు యంత్రం. మిగతా మూడు గుర్తులు ఉన్నా కూడా అంతగా కనిపించడం లేదు. బావి ఉన్న గుర్తు మాత్రమే బాగా కనపడుతుంది. జాగ్రత్తగా చూడండి .
అవునా అని రుద్రస్వామి తీసుకుని…
రుద్రస్వామి:- మిగిలిన మూడు గుర్తులు కూడా కనిపించి కనిపించకుండా ఉన్నాయి. బావి గుర్తు మాత్రం బాగా కనబడుతుంది . అందుకేనా మా అయ్య యంత్రాన్ని ఇస్తూ ముంచమని చెప్పాడు. ఎందులో ముంచాలో నాకు అర్థం కాలేదు. అన్ని ఘాట్లలో ముంచాను. ఏమి ఫలితం లేదు.
అన్నాడు ఈ యంత్రాన్ని మళ్ళీ తేరిపార బాల గణపతి చూసి ……
బాలగణపతి:- అమ్మ ! ఉండు. నేను ఇప్పుడే వస్తాను. డూండీ గణపతి దగ్గరికి వెళ్ళాలి.
అని చెప్పేసి వెళ్లిపోయాడు . ఆ తర్వాత యంత్రం చూసిన మహాదేవి
మహాదేవి:- అరే… ఈ యంత్రం లాంటిదే, మా గురువుగారు దగ్గర కూడా ఉంది. ఇలాంటి యంత్రాన్ని మా గురువుగారు నిత్య పూజలో పెట్టుకున్నారు. ఆయన ఎవరికి చూపించే వాళ్ళు కాదు . ఎవరిని తాకనిచ్చేవారు కాదు. ఈ యంత్రాన్ని దైవ విగ్రహం కింద పెట్టేవారు. నేను దీనికి పంచాభిషేకాలు ప్రతిరోజూ చేయడం చూశాను. ఆ యంత్రం కూడా ఇలాంటిదే. ఆయన పరమపదిస్తూ…. ఈ వస్తువునే జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఉంటాడు. ఉండు….. నేను విగ్రహ మూర్తి కింద ఉన్న యంత్రమును తీసుకొని వస్తాను. అది ఇది అవునా కాదా చూస్తాను
అంటూ….మహాదేవి శరవేగంతో తను పూజ చేసుకునే స్మశానం వైపుకు వెళ్ళింది. ఇటు బాల గణపతి డూండీ గణపతి వైపుకి వెళితే , మహాదేవి స్మశానం వైపుకు వెళ్ళింది.
రుద్రస్వామి మరియు శివ నందిని ఒకరినొకరు మౌనంగా చూసుకుంటూ…. గంగా నది వైపు ప్రశాంత వదనంతో చూస్తూ ….వాళ్లకోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు . కొద్దిసేపు అయిన తరువాత అలసిపోయి ఎగశ్వాసతో వస్తున్న బాల గణపతి కనిపించాడు .
బాలగణపతి:- అయ్యా! ఈ యంత్రం చూడు…. 10 నెలల క్రితం డూండీ గణపతి దగ్గర ఒక ఆసామి నాకు ఈ యంత్రాన్ని ఇచ్చాడు. వాళ్ళ వాళ్లెవరో చనిపోయారు…. పూజ చేయడానికి లేదని చెప్పేసి…. ఈ యంత్రాన్ని ఏదైనా గుడిలో ఇచ్చేయమని అన్నారట! ఇది గణపతి యంత్రం… చాలా శక్తివంతమైన యంత్రం అంట. దీనికి నిత్యం నైవేద్యాలు, పూజలు చేయాలంట. అభిషేకాలు చేయాలంట… అవన్నీ తన వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి యంత్రాన్ని పూజలో పెట్టమని చెప్పి నాకు ఇచ్చాడు. నేను డూండీ గణపతి దగ్గర పెట్టాను. పెట్టి కూడా పది నెలలు అవుతుందేమో…
ఈ గణపతి యంత్రం ఏంటా అని…..శివ నందిని తీసుకొని చూస్తే ,అచ్చంగా రుద్ర స్వామి దగ్గర ఉన్న రాగి రేకు యంత్రం లాగా ఉంది.. కాకపోతే అది రుద్ర బీజాక్షరాలతో ఉన్న రుద్ర బీజ యంత్రం అయితే ఇది గణపతి బీజాక్షరాలతో ఉన్న గణపతి యంత్రం అని అర్థం అయింది. ఇందులో మూడు గుర్తులు ఉంటే…. బావి గుర్తు, అమ్మవారి గుర్తు, శివలింగం గుర్తు కనిపించి కనిపించకుండా ఉంటే …గణపతి గుర్తు మాత్రమే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇది నిజంగానే గణపతి యంత్రం అని చెప్పేసి అనుకుంది .
కొద్దిగా సేపు అయిన తర్వాత మహాదేవి చేతిలో ఒక యంత్రం తీసుకొని వస్తూ కనిపించింది. ఆమె చేతిలో ఉన్న యంత్రం కూడా శివ నందిని తీసుకొని చూస్తే, అది కూడా దేవి యంత్రం అనగా అమ్మవారి యంత్రం అని అర్థం అయింది. అమ్మవారి బీజాక్షరాలతో ఈ యంత్రం ఉన్నది… అంటే ఈ మూడు యంత్రాలు వచ్చినాయి. ఇప్పుడు నాలుగో యంత్రం రావాలి అంటే శివలింగ యంత్రం రావాలి…. ఇప్పుడు ఆ శివలింగ యంత్రం ఎక్కడుంది ?ఏంటి?. అన్నప్పుడు ఈ మూడు భాగాలు కలిపి చూశారు. కలిపి చూస్తే ఏమీ అతకడం గానీ… ఏమీ తెలియట్లేదు. సరే నాలుగో యంత్రం అయిన శివలింగం యంత్రం రావాలని అనుకొని ….ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి వస్తుంది? ఎవరైనా తీసుకువస్తారా? అని దీర్ఘ ఆలోచనల రుద్రస్వామి ఉండిపోయారు. అసలు ఒక యంత్రానికి నాలుగు భాగాలు ఉంటాయని 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసింది అని….. అనుకుంటూ…. సరే చూద్దాం ! కాలమే నిర్ణయం చేస్తుంది…. మన చేతిలో ఏమీ లేదు కదా! అనుకుంటూ….. ఎవరికి వారే గంగానది కేసి చూస్తున్నారు. ఇలా కాదని శివ నందిని ధ్యాన నిష్ఠలోకి వెళ్లిపోయింది . ధ్యానంలో శివలింగం ఉన్న యంత్ర భాగం కనపడింది. అది తన చేతుల ద్వారానే, తన ద్వారానే వస్తుందని….. ఆ యంత్రం ఈ క్షేత్రంలో ఉందని…. తెలుసుకోవాలని ….అప్పుడే ఈ నాలుగు యంత్రాలు కలిసి సంపూర్ణం అవుతాయని……. ఆ తర్వాత విషయం ఏమిటో తెలుస్తుందని…… దీనిలో ఉన్న మర్మ రహస్యం ఏంటో తెలుస్తుందని….. అర్థం అవుతుందని తెలుసుకునేసరికి …..కళ్ళు తెరిచి ఇదే విషయాన్ని అక్కడ ఉన్న ముగ్గురికి చెప్పింది. అమ్మ! మరి ఎక్కడ ఉందో ధ్యానంలో చూడు అంటే…. తను ఎంత ధ్యానంలో కూర్చున్నా, ఆ యంత్రమే కనిపిస్తుంది కానీ ….ఆ యంత్ర స్థానం అనేది అర్థం కాలేదు …కనబడలేదు. తనకి ధ్యాన శక్తి సరిపోవటం లేదని రుద్ర స్వామి గమనించి….. మౌనం వహించాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఎవరో కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి స్నానం చేయడానికి మణికర్ణిక ఘాట్ దగ్గరకు వెళ్లి స్నానం చేస్తూ కనిపించారు. వీళ్ళు ఏం చేస్తున్నారని మౌనంగా చూస్తూ ఉన్నారు. అందరూ స్నానాలు చేసుకొని బట్టలు మార్చుకుని కూర్చున్నారు. ఇంతలో వాళ్ళల్లో ఉన్న ఒక ముసలాయన…..“ ఒరేయ్! మన తాతయ్య గారు పూజించిన దైవీక వస్తువులు ఉన్నాయి కదా! ఆ వస్తువులన్నీ గంగలో నిమజ్జనం చేయమని పూజారి చెప్పారు కదా! వాటిని నిమజ్జనం చేసేయండి …వాటి శక్తిని తట్టుకోలేము . వాటిని ఆరాధించేవారు ఎవరూ లేరు…. కాబట్టి నిమజ్జనం చేసేసేయ్” అంటూ ఏవేవో దైవిక వస్తువులు ,యంత్రాలు, శివలింగాలు ఇలా ఉన్న వాటిని మణికర్ణిక ఘాట్ లో నిమజ్జనం చేశారు . ఎవరి ఇష్టం వారిది కదా! దేవత విగ్రహాలు, సాలిగ్రామాలు శివలింగాలు, గంగానదిలో నిమజ్జనం చేయడం పరిపాటి అని ఎవరికి వారే మౌనంగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారి వారి జపాలు పూర్తి చేసుకొని గంగానదికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది అంతా ఓర కంట గమనిస్తున్న బాలగణపతికి ఉన్నట్టుండి….
బాలగణపతి:- అమ్మ ! చూశావా…. నీటిలో ఏదో యంత్రం తేలుతూ కనిపిస్తుంది…
చూడు అని శివ నందిని కేసి చూడంగానే …..ముగ్గురు కూడా అటుకేసి చూస్తే , అవును ! ఏదో యంత్రం లాగా ఉంది . తేలుతుంది…. అనగానే ఇక ఏ మాత్రం ఆలోచించకుండా బాల గణపతి నీటిలోకి దూకి అది యంత్రమా లేక ఏదైనా కాగితమా అని దాన్ని తీసుకురావడానికి నీటిలోకి దూకి తీసుకువస్తే….. అది రాగి రేకు యంత్రం అని తెలిసింది. నిజానికి రాగి రేకు మునగాలి కదా! ఎందుకు తేలుతుంది అని మనసులో అనుకుంటూ….. ఏమోలే! ఇది కూడా దీనికి సంబంధించిన యంత్రం ఏమో! అంటూ…. దానికేసి చూడంగానే నాలుగు గుర్తులు చివర్లో కనిపించినాయి . శివలింగం గుర్తు మాత్రం గమకంగా కనబడేసరికి….. నీ శివలింగం యంత్రం వచ్చేసింది చూడు అని శివనందినికి ఇచ్చేశాడు. శివ నందినికి ఇచ్చిన తర్వాత నాలుగు యంత్రాలను కలిపారు. కలిపితే ఎలాంటి ఫలితం రాలేదు . ఇదేంటీ ….యంత్ర భాగంలోనే నాలుగు భాగాలు ఉంటాయి అని తెలుసుకోవడమే కష్టం . ఆ నాలుగు భాగాలను కలిపినా కూడా….. సంపూర్ణ రుద్ర యంత్రం అయినా కూడా ….ఇది ఏం చెప్పట్లేదు ఏంటి ? ఇందులో ఉన్న మర్మ రహస్యం ఏమిటో అర్థం కావట్లేదు అనుకుంటూ…..
ఉండగానే ధ్యానంలో కూర్చున్న శివ నందినికి ఉన్నట్టుండి విశాలాక్షి అమ్మవారి విగ్రహ స్వరూపం పదేపదే కనిపించింది. ఎప్పుడూ కూడా విశాలాక్షి అమ్మవారి విగ్రహ మూర్తిని సంపూర్ణంగా శివ నందిని చూడలేదు. కారణం ఏమిటంటే ఎప్పుడు అలంకారంతో నిండి ఉంటుంది . తల భాగం మాత్రమే కనబడుతుంది.విచిత్రంగా ఈ విగ్రహ మూర్తి చూడటానికి ఒక చేతిలో పద్మాసన శివలింగం, ఒక చేతిలో పద్మంలో ఉన్న గణపతి, ఒక చేతిలో అక్షర మాల , ఒక చేతిలో కమండలం ఉంది . దక్షిణామూర్తి భంగిమలో అనగా…. వీరాసనంలో కూర్చున్న విశాలాక్షి అమ్మవారి విగ్రహమూర్తి పదేపదే కనిపించడం జరిగింది. ఇలాంటి విగ్రహ మూర్తిని ఎక్కడ చూడలేదు అనుకుంటూ…… ధ్యానంలో కనిపించిన విగ్రహ విశేషాలు చెప్పింది. అవునా! నేను ఎప్పుడూ చూడలేదు అమ్మ! ఈ ఘాట్ అన్నింటిలోనూ తిరిగాము … అని మహాదేవి కేసి చూసాడు….. అయ్య! బాబు నేను దక్షిణాచారంలో లేను…. వామాచారంలో ఉన్నాను. దక్షిణాచారంలో ఉన్న విగ్రహ మూర్తుల గురించి నన్ను అడగద్దు… నాకు తెలియదు… ఏదైనా వామాచారంలో విగ్రహ మూర్తుల గురించి అడిగితే ఉన్నాయో లేదో చెప్పగలను …! సరే ! నీకు తెలిసిందే సగం…. అది కూడా గుర్తుండి గుర్తుండదు. అర్థమై అర్థంకాకుండా ఉంటుంది …. నిన్ను అడిగినా ఉపయోగం లేదు… నీది కోడి మెదడు అనుకుంటూ …..సరే అమ్మ! విశాలాక్షి అమ్మ వారి గుడికి వెళ్దాం …అక్కడ మనకి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం! కారణం లేకుండా కార్యం ఉండదు కదా! ధ్యానంలో ఆ విగ్రహ మూర్తి ఎందుకు వచ్చిందో చూద్దాం ! విషయం ఏంటో అర్థం అవుతుంది కదా అని చెప్పేసి నలుగురు కలిసి విశాలాక్షి గుడి వైపుకి వెళ్లారు.
గుడికి వెళ్లగానే అక్కడ ఉన్న పూజారిరుద్రస్వామికి పాదాభివందనాలు చేశారు. “ స్వామి! మీలాంటివారు కారణం లేకుండా రారు….…. ఏదో ఉండి ఉంటుంది…. ఏమైంది ” అని అనగానే…. స్వామి ! ఈ అమ్మాయిని చూశారా! ఈ అమ్మాయి పేరు శివ నందిని …. ఈ మధ్యనే సాధన కోసమని మన కాశీ క్షేత్రానికి వచ్చింది. అనుకోకుండా ఈమెకి ధ్యానంలో మన విశాలాక్షి అమ్మవారి విగ్రహ మూర్తి కనపడుతుందట. సరే అని రూపురేఖలు అవన్నీ చెప్పేసరికి …..అమ్మ! నువ్వు నిజంగానే అమ్మవారి భక్తురాలివి అయ్యుంటావు…. గత జన్మ సంస్కారం వలన నీకు విశాలాక్షి నిజరూప దర్శనం అయ్యింది . నిజానికి అమ్మవారు ఇలాగే ఉంటుంది. కాకపోతే అది ముష్కరుల దాడి వలన విగ్రహ మూర్తి చేధనము జరిగింది. దానికి బదులుగా కొత్తది నించున్న విశాలాక్షి అమ్మవారి విగ్రహ మూర్తిని పెట్టడం జరిగింది. కావాలంటే కొత్తగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం వెనుక నువ్వు చూసిన అమ్మవారి విగ్రహ మూర్తి ఉంటుంది చూడు….. అనగానే, ఇలా కాదు స్వామి! మొత్తం పూలు, అలంకరణ అంతా తీసేయండి చూద్దాం ఏముందో …..ఈ అమ్మాయికి కనిపించినట్టే విగ్రహ మూర్తి ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాను అని రుద్రస్వామి అనేసరికి….. ఆ పూజారి, అంతకన్నా భాగ్యం ఏముంది… అని గుడి తలుపులు మూసేసి ….భక్తులు ఎవర్ని రానివ్వకుండా పూలు అన్నీ తీసేసిన తర్వాత …..
నిజ విగ్రహ మూర్తిని చూడగానే తనకి ధ్యానంలో కనిపించినట్టుగా విగ్రహ మూర్తి కనబడింది . ఒక చేతిలో పద్మాకార శివలింగం ,ఒక చేతిలో పద్మములో ఉన్న గణపతి ఒక చేతిలో అక్షరమాల , ఒక చేతిలో నీటితో ఉన్న కమండలం కనబడింది. ఇదే కదా అమ్మ నీకు కనపడింది అంటే …..అవును స్వామి అని శివనందిని నమస్కారం చేసుకుంది . ఇక ఆ పూజారికి అలంకరణ చేసుకోమని వీళ్ళు బయటకు వచ్చారు. పూజారి వీళ్ళ మాటలు వినట్లేదు అనుకొని నలుగురు “ అంటే మనకి దొరికిన ఆధార యంత్రం ఇక్కడి నుంచే మొదలవుతుంది . ఇక్కడి నుంచే విషయం ఏమిటో తెలుస్తుంది . మర్మ రహస్యం చేధించడానికి మనకి ఈ ప్రాంతంలోనే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడాలి అని…. రుద్రస్వామి అన్నాడు. అప్పుడు ఉన్నట్టుండి శివ నందిని కాస్త
శివనందిని:- స్వామి! అసలు ఈ యంత్రాల ఆరాధన ఏమిటి ? ఈ యంత్రాల ద్వారా ఏమి రహస్యం తెలుసుకుంటాము?
రుద్రస్వామి:- అమ్మ! నాకు తెలిసినంతవరకు ఈ యంత్రం కాస్త ఏదో ఒక విగ్రహ మూర్తి దగ్గరకు తీసుకువెళ్తుంది . దేహంలో ఉన్న యోగ చక్రాలు, యోగ శరీరాలను అనుసంధానం చేస్తుంది. ఆ యోగ చక్రాలు ,యోగ శరీరాలు అనుసంధానం అయిన తర్వాత …..నాకు తెలిసినంతవరకు ఆదిరుద్ర సజీవ మూర్తిగా ఎక్కడ ఉన్నాడో మనకి తెలుస్తుంది. ఆయన సజీవ మూర్తిగా ప్రత్యక్ష దర్శనం చేసుకోవచ్చు అని అర్థం అవుతుంది. ఇప్పటివరకు సాధన చేసినవన్నీ కూడా ధ్యానంలోనే దర్శనమిస్తాయి . ఇది సజీవమూర్తిగా చూడాలి అని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉంది . అది తరతరాల నుంచి ఆ కోరిక వస్తుంది. నాకు తెలిసినంతవరకు ఈ యంత్రం ద్వారా ఆయన దగ్గరికి దారి చూపించే మార్గం తెలుస్తుందేమో! అని ఆశ . అంతకుమించి ఇంకేమీ లేదు. మన దేహమే దేవాలయం అని చెప్పి ఆ సాధన విగ్రహ మూర్తి చూపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేహంలో ఉన్న యోగ చక్రాలు, యోగ శరీరాలు ఆ విగ్రహ మూర్తిలో కూడా ఉంటాయి. నిజానికి మనం ఆ విగ్రహం మూర్తి ద్వారా మన సాధన ఎక్కడి వరకు ఉంది…. ఎంతవరకు ఉంది…. అనేది తెలుసుకోవచ్చు. నిజానికి ఇలాంటి యంత్రం అవసరం లేదు. ఎవరికి వారే వ్యక్తిగతంగా సాధన చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే విశ్వ రహస్యమును చేధించాలి అనుకున్నప్పుడు రుద్రుడు ఎక్కడో సజీవమూర్తిగా ఉన్నాడు కదా! ఆ సజీవ మూర్తి ద్వారా మనకి విశ్వమోక్షం పొందే అవకాశం ఉండొచ్చేమో! ఒకవేళ ఆయన అనుగ్రహం కానీ ఆయన దర్శనం కానీ పొందకపోతే వ్యక్తిగత మోక్షం అయినా పొందొచ్చు. నిజానికి సాధనకి ,ఈ విగ్రహానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మన దేహమే దేవాలయం అని చెప్పడానికి ఈ సాధన విగ్రహ మూర్తి ఉంది అని తద్వారా మనలో అంతర్యామిగా ఉన్న స్వామి కాస్త సర్వాంతర్యామిగా ఎక్కడో ఒకచోట సజీవ మూర్తిగా ఉన్నాడు ….
అంటుంటే ఉన్నట్టుండి బాలగణపతి
బాలగణపతి:- అయ్యా! నిన్న ఇదంతా రికార్డు దృశ్యం అని అన్నావు కదా! రికార్డు దృశ్యం అన్నప్పుడు రుద్ర మూర్తి సజీవంగా ఎట్ట కనపడతాడు ?నువ్వు మరీను…..
అనగానే
రుద్రస్వామి:- ఒరేయ్ పిచ్చివాడా! ఆదిలో అయ్య సజీవమే ….అంతమునకు వచ్చేసరికి ఆయన నిర్జీవ మూర్తిగా మారిపోయాడు. ఆకారుడు ఆదిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు అనేది మనం ఆ కాలంలోకి వెళ్లి ఆ పరిస్థితుల్లో చూడవచ్చు కదా ! ఇది అంతా రికార్డు అయిన దృశ్యమే. రికార్డు దృశ్యంలో…. ఆయన ఆదిలో ఉన్న రికార్డు దృశ్యం చూడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విషయం ఏమిటో తెలుస్తుంది… మనం విశ్వమోక్షం ఎలా పొందాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఆయన అనుగ్రహం పొందలేదు అంటే వ్యక్తిగత మోక్షమును పొందుతాము…. చూస్తే సజీవ మూర్తిగా చూడవచ్చు ….ఇప్పుడు మనకి ధ్యానంలో ఆయన కనబడుతూ ఉంటాడు…. అదంతా ఏంటి పరోక్ష జ్ఞానం …పరోక్ష దర్శనాలు…. ఆయన ఉన్నాడో లేడో మనకి తెలియదు.. ధ్యానంలో అనుభవాలు నిజమని తెలుస్తున్నాయి. అనుభవాలకి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆయన ఎక్కడో ఒకచోట కొండలో ఉన్నాడు అని నా పూర్వీకులు చెప్పడం జరిగింది. అదేంటో ప్రత్యక్షంగా చూద్దాం అని నేను అనుకుంటున్నాను…అందులో తప్పేముంది ? ఇప్పుడు శివ నందిని ద్వారా మనకి విశ్వమోక్షం వస్తుంది అని…. అవకాశం ఉందని ఆ అమ్మాయి స్త్రీ ప్రకృతి మోక్షం కలిగిస్తే అదే విశ్వమోక్షం అవుతుంది. తన మరణమే మోక్షమరణం అవుతుంది. ఆ మరణం ఇవ్వటానికి ఆది రుద్రమూర్తి కావాలి ….ఆ రుద్ర మూర్తి ఎక్కడ ఉన్నాడో …. ఆయన సజీవ మూర్తిగా ఉన్నాడా? నిర్జీవ మూర్తిగా ఉన్నాడా అంటే ప్రస్తుతం ఆయన నిర్జీవ మూర్తిగా ఉండి నిరాకారుడు అయ్యాడు ….కానీ ఆదిలో ఆయన సజీవ మూర్తిగా ఉన్నాడు కదా ! ఇప్పుడు ఆదిలో మనం ఎక్కడో ఏదో తప్పు చేశాము. ఆ తప్పును సరిచేసుకున్నామనుకో…… స్త్రీ ప్రకృతికి మోక్షం వచ్చే అవకాశం ఉన్నది కదా! తద్వారా అది వ్యక్తిగత మోక్షం కాకుండా విశ్వ మోక్షం అవుతుంది కదా !
అని అనగానే ముగ్గురు తలలు ఊపారు. మీరు చెప్పింది నిజమే స్వామి! ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్లాలి అని శివ నందిని అడిగేసరికి …….
రుద్రస్వామి:- ఇక్కడిదాకా నువ్వే తీసుకువచ్చావు కదా! దీని సంగతేంటో నువ్వే చూడు…. నాకేం తెలుస్తుంది ? 80 ఏళ్ల నుంచి ఒకటే యంత్రం అనుకున్నాను…. ఈరోజు అది ఒక యంత్రం కాదు 4 యంత్రాలని తెలిసింది . నాలుగు యంత్ర భాగాలని కలిపాము… విషయము ఏంటి అనేది తెలిసింది . ఇంకెందుకు ఇది కూడా నువ్వే ఆలోచించు …..నీకే తెలుస్తుంది. నీకు ఆ యోగం ఉంది కదా ! యోగం ఉంటే విషయం ఏమిటో నీకే తెలుస్తుంది… నాకు ఆ యోగం లేదు కదా! మా ముగ్గురికి ఇలాంటి యోగం లేదని అర్థమయింది. కేవలం మేము యంత్ర భాగాన్ని అందించే వాళ్లమే…. ఆ యంత్ర భాగం నుంచి విషయం తెలుసుకోవాల్సింది నువ్వే…. విశ్వ రహస్యాన్ని ఛేదించాల్సింది మాత్రం నీ సాధనాస్థితి ,అనుభవ స్థితి, నీ జ్ఞాన స్పురణలు తప్ప ఇంకేమీ చేయలేవు…నీకా యోగం ఉంది… ప్రయత్నించు తెలుస్తుంది..
ఇలా కాదనుకొని శివ నందిని…. అక్కడే ఉన్న విశాలాక్షి అమ్మవారి విగ్రహం మూర్తి ఎదురుగా కూర్చుని ధ్యానంలో కూర్చుంది. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ విగ్రహ మూర్తి చేతిలో ఉన్న నాలుగు గుర్తులు అనగా పద్మకార శివలింగం, ఈ యంత్రంలో ఉన్న పద్మకార శివలింగానికి సరిపోతుంది . అలాగే ఆమె చేతిలో ఉన్న గణపతి గుర్తు కాస్త ఈ యంత్రంలో ఉన్న గణపతి యంత్రానికి సరిపోతుందని …..అలాగే అక్షరమాలలో ఉన్న గుర్తు ఈ యంత్రంలో విశాలాక్షి అమ్మవారి గుర్తుకు సరిపోతుంది అని అర్థం అయింది. కానీ కమండలంలో ఉన్న నీరు బావిలో ఉన్న యంత్ర భాగానికి సరిపోతుంది. అంటే ఇక్కడ ఏదో విషయం తెలుసుకోవాలి అనుకుంది….. కానీ రుద్ర స్వామికి వాళ్ళ తండ్రి ఇస్తూ…. ఈ యంత్రమును ముంచు…. విషయం తెలుస్తుంది…. మర్మ రహస్యం అర్థం అవుతుంది అన్నారు. ఈయన 84 ఘాట్ లలో ముంచాడు. విషయం ఏమీ తెలియలేదని చెప్పాడు. ఒకవేళ ఈ నాలుగు యంత్ర భాగాలను కలిపి 84 ఘాట్ లలో ముంచితే సరిపోతుందా ! అని అనుకుంటూ ఉండేసరికి…. బాలా గణపతి అక్కడకు వచ్చి
బాలగణపతి:- అమ్మా ! నీకు ఒక విషయం చెప్పాలి .
శివనందిని:- ఏంట్రా ఇప్పుడు….. నేను విశ్వ రహస్యం తెలుసుకునే హడావిడిలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఇబ్బంది కలిగించకు…
బాలగణపతి:- అది కాదమ్మా… అవి ఎప్పుడూ ఉండేవే …అవి తేలవు…చావవు… అర్థమై చావవు…. నీకు ఒక విషయం చెప్పాలి…
అని యంత్రాన్ని తీసుకొని రమ్మని ….బాలగణపతి కాస్త శివ నందిని తీసుకొని వెళ్ళాడు. సరే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని రుద్రస్వామి మరియు మహాదేవి కూడా వీళ్ళ వెంట బయలుదేరారు. ఈ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి పక్కన ఉన్న బావి దగ్గరికి తీసుకువెళ్లి …
బాలగణపతి:- అమ్మా! చూశావా ….ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా! ఆరు నెలల్లో ఎవరైతే చనిపోతారో…. వాళ్ళకి తన శరీరం యొక్క నీడ కనిపించదంట. ఈ బావిలో నీడ కనిపించలేదంటే వాళ్ళు ఆరు నెలల్లో చచ్చిపోతారంట…. చూడు నాకు నీడ కనబడుతుంది. మనలో ఎవరికైనా నీడ కనపడుతు ందో లేదో చూద్దాం…..
అని చెప్పేసరికి మిగతా ముగ్గురికి నీడ కనబడింది . కానీ శివ నందిని నీడ కనపడలేదు ..
బాలగణపతి:- అమ్మో! నువ్వు ఆరు నెలల్లో చచ్చిపోతావుగా…. ఎట్టాగే! అయ్యో! నువ్వు నాతో ఎక్కువకాలం ఉండవా? నువ్వు చచ్చిపోతావా? అరెరే….. ఆరు నెలల్లో చచ్చిపోతావుగా!
అంటూ చమత్కారంగా కవ్విస్తూ ఉండేసరికి…
శివనందిని:- నీకు పరిహాసం చేయడానికి వేలాపాల లేదురా! అసలే విషయం అర్థం కాక నేను చస్తుంటే….. నీడ కనిపించట్లేదు ….నువ్వు చస్తావు….అసలు చావడానికే కదా వచ్చింది…. ఆ చావుని కాస్త మోక్షం ఇస్తామని చెప్పారు. ఇక్కడిదాకా తీసుకువచ్చారు… ఇక్కడ అర్థం కాక కొట్టుకుంటుంటే…. నీకు పరిహాసంగా ఉందా?
బాలగణపతి:- అది అర్థం అవుతుందో.. అర్థం కాదో మనకెందుకు….. ఇక్కడ ఉన్న బావి రహస్యం నీకు చెబుదామని తీసుకు వచ్చాను…
అని చెప్పగానే రుద్ర స్వామికి… కోపం వచ్చి
రుద్రస్వామి:- ఒరేయ్! ఈ విషయం నాకు తెలుసు కదరా! బావిలో నీడ కనపడకపోతే ఆరు నెలల్లో చచ్చిపోతామని…. ఎప్పుడూ ….ఏనాడు కనపడకుండా లేదు. అందరికీ కనపడుతూనే ఉంది. కానీ శివ నందిని కి కనపడలేదు. ఆరు నెలల్లో చచ్చిపోతుందో లేదో చూద్దాం. అది నిజమో కాదో తెలుస్తుంది ….
అని అనేసరికి ఎందుకో జ్ఞాన స్ఫురణగా శివ నందిని అనిపించేసరికి …. రుద్రస్వామి కేసి చూస్తూ…
శివనందిని:- స్వామి! ఈ యంత్రాన్ని ఈ బావిలో ముంచారా అని అడిగింది.
రుద్రస్వామి:- లేదు ముంచలేదమ్మ…. 84 ఘాట్ లలో ముంచాను కానీ…..బావిలో ఎక్కడ ముంచలేదు. అరే ! నాకు ఈ ఆలోచన రాలేదే….. అది కాదు ఈ యంత్రంలో బావి గుర్తు ఉంది కదా! ఒకవేళ బావి ఇదేనేమో కదా! ఇది కూడా అయి ఉండొచ్చు కదా! అయ్యుండొచ్చు…. ఈ చుట్టుపక్కల బావులు ఉండడం కూడా చాలా తక్కువ. కుండాలు ఉన్నాయి కానీ బావులు ఉండవు. ఇక్కడే బావి ఉంది . అది కూడా నీడ కనిపించని బావి. నీడలో కనిపించట్లేదు అంటే ఆరు నెలల్లో మరణం వస్తుందని అంటారు. ఇప్పుడు మన సాధన కూడా మోక్షమరణమేగా…. కాబట్టి ఈ మూడు గుర్తులు కూడా మనకి ఈ బావిని చూపిస్తున్నాయి. కాబట్టి ఈ బావిలో ముంచాలి. అంటే ముంచాల్సిన చోట ఈ యంత్రాన్ని ముంచలేదు అన్నమాట! అన్నిచోట్ల ముంచాను …అయినా ఫలితం రాలేదు. ఇప్పుడు అర్థం అయింది . నేను చేసిన తప్పేంటో ! ఇప్పుడు ఈ బావిలో ముంచితే ఏం జరుగుతుందో చూద్దాం
అనేసరికి….. బాల గణపతి ఉన్నట్టుండి
బాలగణపతి:- అయ్యో! నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో…. ఎన్నో తరాల నుంచి…. నువ్వు పుట్టకముందు నుంచి వస్తున్న యంత్రం ఇది. ఏదైనా తేడా వచ్చిందనుకో…. నీళ్ళల్లో మునిగిపోయింది అనుకో….. ఏం జరుగుతుందో తెలియదు…. మళ్ళీ యంత్రం దొరుకుతుందో లేదో కూడా తెలియదు…. అసలే అది నలుగురి నుంచి వచ్చిన యంత్రం. ఏదైనా తేడా వస్తే అది ఎక్కడికి తీసుకు వెళుతుందో తెలవదు…. యంత్రం పేలిపోతుందో తెలియదు ……ఏం జరుగుతుందో తెలియదు…. బావి కూలిపోద్దో తెలియదు ….గుడి కూలిపోద్దో తెలియదు…. ఇవన్నీ ఆలోచించుకో ! మళ్లీ యంత్రం కావాలనుకుంటే రాదు. అసలే ఇది అన్నింటిలోనూ ముంచా అన్నావు . ఏం జరగలేదు అన్నావు. ఇప్పుడు ఇందులో ముంచితే ఏం జరుగుతుందో తెలీదు…. ఏదో శివనందినిని నమ్ముకుంటున్నావ్ …..ఆ అమ్మాయి కొత్త ఆవిడ…. ఆవిడకి అసలు తెలియని కూడా తెలియదు…. తేడా వస్తే అమ్మని అంటానికి లేదు . ముందే చెప్తున్నాను . పోతే యంత్రం పోయింది అనుకో…. వస్తే యంత్ర ఫలితం వచ్చినట్టు అనుకో …..ఏదైనా విషయం తెలుస్తుంది …యంత్రం పోయిందో….. అని అమ్మని అన్నావంటే మాత్రం నేను ఊరుకోను . నేను ముందే చెప్తున్నాను…
అనేసరికి.. రుద్ర స్వామి
రుద్రస్వామి:- అరేయ్! మీ కొత్త అమ్మని నేను ఏమీ అనను… అర్థం అయిందా ! పోతే పోనీ….. ఇప్పుడు అది నా దగ్గర ఉన్న ఉపయోగం లేదు. నిజానికి ఒక భాగమే నా దగ్గర ఉంది. మూడు భాగాలు మీ ముగ్గురి నుంచి వచ్చినాయి . ఆ మూడు భాగాలు కలిపి నాలుగు భాగాలు చేశారు. పోతే మన నలుగురికి నాలుగు భాగాలు పోతాయి. పూర్తి యంత్రం పోతుంది . విషయం లేదని తెలుసుకుంటాం. ఇంక దేని గురించి ఆలోచించను. అవసరం లేదు…. హాయిగా, ప్రశాంతంగా తిని పడుకుంటాను. ఇంకేముంది….. ఇప్పుడు యంత్రం ఉన్న కొద్ది…. నిద్ర పట్టదు. తెలుసుకోలేకపోతున్నామని పదేపదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దైవం గురించి ఆలోచించడం మానేసి…..ఈ యంత్రం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాను ….అదేదో తేలిపోయిందనుకో తాడోపేడో విషయం అర్థం అయిపోతుంది కదా ! దాని గురించి ఒకటికి పది సార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! పోతే యంత్రం పోద్ది…. వస్తే విషయం ఏంటో తెలుస్తుంది…. ఉన్న విషయ జ్ఞానం తెలుస్తుంది అని చెప్పి ….అమ్మ! శివ నందిని ఏమాత్రం ఆలోచించమాకు…. ఏం జరిగితే అది జరుగుతుంది …..ఇప్పుడు ఆ యంత్రం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు కదా ! వేసేయ్….. తేలిపోద్ది . మునిగితే విషయం తెలుస్తుంది. మునగ లేదనుకో విషయం తెలీదు. వచ్చేద్దాం…. తీసుకువెళ్లి ఎవరి ముక్కలు వాళ్ళ దగ్గర ఉంచుకుందాం. వదిలేద్దాం…. దాని గురించి…. ప్రయత్నిద్దాం…. ప్రయత్నిస్తే ఓడిపోతామో గెలుస్తామో తెలుస్తుంది కదా! ప్రయత్నించకుండానే ఓడిపోతామని భయపడితే ఎలాగా….. వెయ్యి …..విషయం ఏంటో తెలుస్తుంది కదా! నీళ్ళల్లో ముంచు ….ఇంతవరకు ఈ బావిలో ముంచలేదు… ముంచుదాం అనేసరికి….
ఇక రుద్ర స్వామియే అనుమతి ఇచ్చేసరికి శివ నందిని ఏమాత్రం ఆలోచించకుండా నాలుగు యంత్ర భాగాలు కలిపి అమ్మవారి చేతిలో గుర్తులు ఎలా ఉన్నాయో…. అదే విధంగా కలిపి… బావి నీళ్లలో శివార్పణమస్తు అని నీళ్లల్లో వేసింది . ఆ యంత్రం ఎప్పుడైతే నీళ్లలో పడిందో….. అది బంగారపు కాంతిగా బంగారపు వర్ణం గా మారేసరికి….. గణపతి ఉన్నట్టుండి
బాలగణపతి:- బకెట్లో నీళ్లు పోసి ఈ యంత్రాన్ని నీళ్ళల్లో వేసి ఉంటే అది బంగారపు యంత్రం అయ్యేది కదా! ఆ బంగారాన్ని అమ్ముకొని ఉంటే సొమ్ములు వచ్చేవి కదా! ఒక పది నెలలు నాకు ఉండ్రాళ్ళు వచ్చేవి కదా !
అంటూ ఉండేసరికి….ఆగరా! నువ్వు మాట్లాడకురా….. అని రుద్రస్వామి గద్దించేసరికి బాలగణపతి మౌనం వహించాడు. ఆ బావిలో లోతుగా ఉన్న నీళ్లు కాస్త ఇంకుతూ ఇంకుతూ బావి అడుగున మట్టి కనిపించేసరికి వీళ్ళకి అర్థం కాలేదు. ఆ బావిలో కింద భాగానికి దిగటానికి మెట్లు కనిపించాయి…. ఇప్పటిదాకా బావిలో మెట్లు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు….. ఈ బావిలో మెట్లు ఉన్నాయా? ఈ బావిలో మెట్లు దిగి ఎక్కడికి వెళ్తాం..? ఏం జరుగుతుంది …..ఏముంటుంది అని అనుకుంటూ ఉండేసరికి ఈ మట్టి మీద ఈ యంత్రం కనిపిస్తుంది …ఓరిని …..అని అనుకుంటూ సరే చుట్టుపక్కల ఎవరూ లేరు …..దాన్ని ఎవరు గమనించట్లేదు అని తెలుసుకొని….. అమ్మ ! శివ నందిని ఈ మెట్లు దిగి లోపలికి వెళ్ళు…. మాలో ఎవరికీ అర్హత, యోగ్యత, యోగం లేదు. విషయం ఏంటో తెలుసుకో …..విషయం అర్థమైతే ఆలోచిద్దాం అనేసరికి…. లేదు స్వామి! వెళ్తే నలుగురం వెళ్దాము …..ఒకవేళ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే , నేను వెనక్కి వచ్చేస్తాను . మన నలుగురం వెనక్కి వచ్చేద్దాం ….మన ప్రాణాలు పోతే బావిలోనే పోతాయి…. లేదంటే ఆ రహస్యం ఏంటో తెలుస్తుంది అనేసరికి ……సరేనమ్మా ఇక్కడిదాకా వచ్చాము కదా! తెగించిన వారికి తెడ్డేగతి…. విషయం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాము …..చావు భయం మనకెటు లేదు ….పోతే మోక్షం మరణం ….లేకపోతే భౌతిక మరణం. ఇంకెందుకు ఆలోచించడం ….అనగానే నేను చిన్నపిల్లవాడిని ….ముందు నేను దిగుతా అని ……బాలగణపతి దిగగానే ఆ తర్వాత మహాదేవి, రుద్ర స్వామి ఆ తర్వాత శివనందిని ….చివరికి మెట్లు దిగుతూ బావి అడుక్కి చేరుకున్నారు.
బావి అడుగున …పైన తాము వదిలేసిన రుద్ర యంత్రం కనిపించింది. ఆ రుద్ర యంత్రాన్ని శివ నందిని చేతిలోకి తీసుకుంది. తేరిపారా బాగా చూస్తే బావి గుండ్రంగా ఉంది. చదరంగా ఉంది . ఏమీ ఉన్నట్లు కనిపించలేదు. బాలగణపతి ఉత్సాహంతో ఉత్సుకతతో ఇక్కడ ఏదో ఉంది….. ఏదో తెలుసుకోవాలని చేతులతో తడమడం మొదలుపెట్టాడు. అలా తడుముతూ తడుముతూ ఉండేసరికి…. ఒకచోట డొల్లగా ఉండేసరికి…. అది రాతితో ఏర్పాటు చేయలేదని….. ఏదో చెక్కతో ఏర్పాటు చేశారని….. కాకపోతే దాన్ని రాళ్ళలాగా ఏర్పాటు చేశారని అర్థమై….. “అమ్మ! ఇక్కడ ఏదో డొల్లగా ఉంది… డోలు లాగా ఉన్నట్టుంది చూడు”.... అనేసరికి శివ నందిని అక్కడికి వెళ్ళింది. అక్కడ చూస్తే రెండు యంత్ర భాగాల గుర్తులు ఉన్నట్టుగా కనిపించింది . ఆ రెండు యంత్ర భాగాలు చూస్తే ….ఒక యంత్ర భాగంలో బావి గుర్తు…. ఇంకో యంత్ర భాగంలో గణపతి గుర్తు…. కనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న నాలుగు యంత్ర భాగాలలో బావి గుర్తు , గణపతి గుర్తు భాగమును అందులో పెట్టేసరికి …..అంతవరకు రహస్యంగా ఉన్న గది తలుపు తెరుచుకుంది. నలుగురు లోపలికి వెళ్లేసరికి…… లోపల దాదాపుగా 300 మెట్లు దాకా ఉన్నాయి. ఆ మెట్లు దిగుతూ నలుగురు కిందకి వెళుతూ ఉండేసరికి …. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని అనిపించింది . కాకపోతే నలుగురు కూడా యోగ స్థితిలో ఉండేసరికి ……వారికి ఆక్సిజన్ మనుషుల కన్నా చాలా తక్కువ స్థితిలో తీసుకున్నా కూడా….. వాళ్ళు బతుకుతారని వాళ్ళకి అర్థం అయింది. సాధారణ మనుషులు మాత్రం బతకరు అని రుద్రస్వామి గ్రహించాడు. అసలు ఏముంది? ఏం జరుగుతుంది అని మెట్లు దిగుతూ ఉంటే…… గాఢాంధకార చీకటి ఉంది . చీకటిగా ఉంది అంటే ఏదో వెలుగు ఇస్తుంది అని గ్రహించారు. అలా మెట్లు పూర్తి అయిన తర్వాత ఒక అంతర్గత గుహ కనిపించింది. ఆ గుహలో మధ్యభాగం నలు చదరంగా ఉన్న ఒక పీఠ భాగం కనిపించింది. దానికి నాలుగు వైపులా నాలుగు స్తంభాలు ఉన్నాయి . ఏదో గుడి అనుకుంటా….. అనుకునేసరికి, ఆ మధ్య భాగంలో ఎలాంటి ఆధారం లేకుండా స్వయం ప్రకాశంగా వెలుగుతున్న జ్యోతి కనిపించింది. ఆ జ్యోతిని చూసేసరికి రుద్రస్వామికి ….“ ఓహో! ఈ జ్యోతి ప్రకాశం వల్లనే ఈ క్షేత్రాన్ని కాశీ అన్నారు. కాశీ అంటే జ్యోతి ప్రకాశమని అర్థం ఉన్నది కదా! అంటే స్వయంభు జ్యోతి ఇక్కడ ఉందన్నమాట ! ఈ జ్యోతి ప్రకాశానికి ఆధారమైన జ్యోతి , ఎక్కడో ఉంటుందని….. ఆ జ్యోతిని మనం తెలుసుకోవాలి……. అదే రుద్రుడు ఉన్న స్థానం చూపిస్తుంది అని” అక్కడున్న వాళ్ళకి చెప్పేసరికి ఈ జ్యోతిని ఆరాధన చేస్తున్న కొన్ని వేల ఆత్మలు కనిపించాయి. వీళ్ళు ఎవరు అని శివనందిని అనుకుంటూ ఉండేసరికి…… వీళ్ళు మణికర్ణిక ఘాట్లో చనిపోయిన తర్వాత విశ్వనాథుడు ఉపదేశించిన ఓం నమశ్శివాయ గురు మంత్రమును ఆధారంగా చేసుకుని…… ఈ ఆత్మలు ఉంటాయని గ్రహించారు. కాకపోతే వీళ్ళకి…. మధ్య భాగానికి చేరుకునేసరికి రెండు ద్వారాలు ఉన్నట్టుగా కనిపించాయి . ఒక ద్వారానికి శివలింగం గుర్తు ఉంది . ఒక ద్వారానికేమో గణపతి గుర్తు ఉంది. అప్పుడు కొంతమంది ఆత్మలు గణపతి గుర్తు ఉన్న ద్వారం వైపు వెళ్లడం గమనించారు. కొంతమంది ఆత్మలు శివలింగం ఉన్న గుర్తువైపుకు వెళ్ళినట్టు గమనించారు. కొన్ని క్షణాల తర్వాత గణపతి గుర్తు ఉన్న ద్వారం లోపలికి ఆత్మలు వెళ్లి రావడం గమనించారు . అప్పుడు రుద్ర స్వామి ఉన్నట్టుండి ఇదే పునః సృష్టికి కారకం అవుతుంది….. అంటే శివలింగం గుర్తు ఉన్న ద్వారంలోనికి వెళితే వాళ్ళు శూన్యం అవుతారు. అంటే గణపతి గుర్తు ఉన్న వైపుకు వెళితే ఏదో ఇష్ట కోరిక అని మాయలో పడి పునః సృష్టికి వచ్చి….. మరల పునర్జన్మలు పొంది కాశీలో మరణం పొంది ఇక్కడకు వస్తున్నారు అని గ్రహించాడు. ఆ జ్యోతి స్వరూపానికి నలుగురు నమస్కారం చేశారు . ఆ తర్వాత ఈ పీఠభాగంలో ఒక శివలింగం గుర్తు…. గణపతి గుర్తు కనిపించాయి. శివ నందిని ఏమాత్రం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న శివలింగం గుర్తును అమ్మవారి గుర్తు ఉన్న యంత్ర భాగాన్ని లోపల పెట్టేసరికి ……ఏం జరుగుతుందో అని చూశారు . అవిఅమర్చేసరికి స్తంభాలు కదలడం మొదలైనాయి…. నాలుగు స్తంభాలు కాస్త రెండు స్తంభాలు అయినాయి. అయినా కూడా జ్యోతి అలాగే వెలుగుతుంది. ఈ ఆత్మలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ ధ్యాననిష్ట లో ఉన్నాయి. కొన్ని ఆత్మలు అయితే….. ఏం జరుగుతుంది అని సాక్షి భూతంగా చూస్తున్నాయి. కాకపోతే వీళ్ళు చేసే పనికి ఎవరు అడ్డుపెట్టడం లేదు. అంతా చూస్తున్నారు… వీళ్ళు చూస్తున్నారని ఈ నలుగురు కూడా గమనించారు. ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని చూశారు, కానీ ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదని గ్రహించారు. నాలుగు కాస్త రెండుగా అయిన స్తంభాలలో ఒకదానిమీద శివలింగం గుర్తు, మరొక స్తంభం పైన గణపతి గుర్తు ఉన్న ఆకారాలు కనిపించాయి. ఇదేమిటి అని రుద్ర స్వామి కేసి చూసింది . రుద్ర స్వామి కూడా ఏమీ అర్థం కానట్టుగా చూశాడు. ఆ తరువాత శివనందిని మహాదేవి కేసి చూస్తే…. నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా చూసింది . బాలగణపతి కేసి చూస్తే , వాడేదో దీర్ఘాలోచనలు చేస్తూ …..ఇక్కడేదో ఉంది అనుకుంటూ…… ఆ స్తంభాల దగ్గరికి వెళ్లడం గమనించింది. వద్దు ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అని గ్రహించి, శివ నందిని నోరు తెరవబోతుంటే వద్దు…. అని సైగ చేశాడు రుద్రస్వామి.. ఏమీ మాట్లాడవద్దని. పిల్లవాడు అక్కడికి వెళ్లి ఆ విగ్రహా మూర్తిని రెండు చేతులతో తాకాడు. తాకేసరికి అవి విగ్రహాలు లోపలికి వెళ్ళినాయి. వెళ్లేసరికి, లోపల ఏదో ఉన్నాయని బాల గణపతి చేతులు లోపలికి పెడితే ఒక పద్మములో శివలింగం మరొక పద్మములో గణపతి విగ్రహ మూర్తులు కనిపించాయి. అమ్మ! ఇవి బంగారు విగ్రహ మూర్తులు అనుకుంటా! ఈ రెండు కనిపించాయి అని….. ఆ రెండిటిని తీసి శివ నందినికి ఇచ్చాడు. మళ్లీ యధావిధిగా ఈ రెండు స్తంభాలు కాస్త నాలుగు స్తంభాలుగా మారిపోయినాయి. అప్పటిదాకా శాంతమూర్తులుగా ఉన్న సాధన ఆత్మలు కాస్త, వీరిని ఉగ్రంగా చూస్తూ….. వీరిని చంపాలని పైకి లేచి, వీళ్ళు ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారని….. సాధన ఆత్మలు వీరిని చంపాలనుకునేసరికి….. ఈ విషయం గమనించిన రుద్ర స్వామి….“ అమ్మ! రండి ….పరిగెత్తండి…. ఈ ఆత్మలు మనల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి…. మనమేదో లోక కళ్యాణార్థం పనిచేస్తుంటే… వీళ్ళేమో లోక వినాశనం చేస్తున్నాం అనుకుంటున్నారు. వీళ్ళకి వివరించే సమయం లేదు… అవకాశం లేదు…. వచ్చిన దారిలోనే వస్తూ పరిగెత్తుతూ…. ఉండేసరికి తన చేతిలో ఉన్న శివలింగం గణపతి వీళ్ళకేసి చూపిస్తూ… తమ దగ్గరికి రావద్దు అని…. అనేసరికి ఈ విగ్రహాల నుంచి వచ్చే తేజస్సుకి ఆ ఆత్మలు వీళ్ళని చంపాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా……. ఏమీ చేయలేకపోయేసరికి ఈ నలుగురు బయటకు వచ్చేశారు. ఆ తర్వాత బావిలో ఉన్న మెట్ల ద్వారా పైకి వచ్చేసారు . అప్పుడు నీళ్లు యధావిధిగా పైకి వచ్చేసాయి. శివ నందిని చేతిలో ఉన్నది పురాతన కాలపు విగ్రహాలు అని అర్థం అయింది …కానీ విగ్రహాల వల్ల ఉపయోగం ఏమిటి అనేది వీళ్ళ నలుగురికి అర్థం కాలేదు. సరేలే! జరిగేది జరగక మానదు. కాలం కలిసి వస్తే గంధర్వులే చేస్తారులే అని….ఎవరికి వారే తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఇక శివ నందిని, బాలగణపతి గదికి బయలుదేరారు. మహాదేవి స్మశానానికి బయలుదేరింది. రుద్ర స్వామి ధ్యానం చేసుకుంటా అని చెప్పేసి పంచగంగా ఘాటు వైపుకి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది.
ఇలా వీళ్ళిద్దరూ…. అనగా శివ నందిని మరియు బాలగణపతి వాళ్లకి వచ్చిన శివలింగం, గణపతి విగ్రహం మూర్తులను తీసుకొని గదికి వెళ్లారు. గదికి వెళ్ళాక గణపతి ఉన్నట్టుండి…
బాలగణపతి:- అమ్మ! నాకు ఆకలేస్తుంది. ఉండ్రాళ్ళు చేసి పెడతావా ?
శివనందిని:- ఆ…! చేసి పెడతాను.
బాలగణపతి:- అమ్మ! నేను కాసేపు ఈ విగ్రహ మూర్తులతో ఆడుకోనా ..? తిట్టవు కదా!
చిన్నపిల్లవాడు కదా! చిన్న పిల్లవాడి మనస్తత్వం కదా! అని….
శివనందిని:- ఆడుకో! నాకేం అభ్యంతరం లేదు ….కానీ విగ్రహాలను పగలకొట్ట మాకు….
బాలగణపతి:- పగలకొడితే ఏమవుతుంది…. ఇందులో ఉన్న రహస్యం పోతుంది…. అయినా మనం ఇంత కష్టపడి లోపలికి వెళ్లి తీసుకుంటే…. బంగారపు విగ్రహాలు దొరుకుతాయేంటమ్మా! నాకు అర్థం కాదు….. ఈ విగ్రహాలు చూస్తే ఏం అర్థం కావడం లేదు. బయట దొరికే ఇత్తడి విగ్రహాల లాగా ఉన్నాయి. కాకపోతే ఇవి బంగారు విగ్రహాలు. అవి ఇత్తడి విగ్రహాలు…. అంతే కదా! మరి అంత భద్రంగా… అంతా లోపలగా …..అంత జాగ్రత్తగా ఎందుకు దాచి పెట్టారు! బంగారం అనా ….! పాత బంగారమనా ..! పాత బంగారానికి విలువ ఎక్కువ కదా! అందుకోసం అని దాచి పెట్టి ఉంటారు. ఆ దాచేదేదో పెద్దపెద్ద విగ్రహాలను దాయచ్చు కదా! చూస్తే నా చూపుడు వేలు అంత లేవు. మూడు అంగుళాలకు మించి లేవు. ఎంత అవుతుంది….. 1 లక్ష రూపాయలు బంగారం విలువ కూడా చేయదు. దాచే వాళ్ళు ఒక పది అడుగుల విగ్రహం దాచుంటే …పదిమందికి ఉపయోగపడేది కదా!
శివనందిని:- అవన్నీ నీకెందుకురా! ఈ విగ్రహాలను అంత జాగ్రత్తగా దాచారు అంటే.. ఏదో ఉంటుంది రహస్యం.. అందులోనూ విశాలాక్షి అమ్మవారి సమక్షంలో స్వయంభూ గా చూశావు కదా పరంజ్యోతి స్వరూపం…. ఆవిడ అలా జ్యోతి స్వరూపంగా కాపలాకాస్తుందట….అంటే కారణం లేకుండా ఉంటుందా ! పైగా ఈ విగ్రహాల్లో అంత మహత్యం లేకపోతే అక్కడ ఉన్న ఆత్మను మనల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాయి! ఆలోచించు ……
బాలగణపతి:- అవునమ్మా ! నిజమే….. నేను వాటికి దొరికిపోయేవాడిని…. తినేస్తాయని భయమేసింది. కానీ, నిజానికి ఈ రెండు విగ్రహాలు కాపాడాయి… ఒకవేళ ఇక్కడ చనిపోయిన వాళ్ళంతా రుద్ర పిశాచాలుగా మారితే ….మనల్ని పీక్కు తినకుండా ఈ విగ్రహాలు ఉంటాయి కదా! ఈ విగ్రహాలు ఎవరికి అమ్మకు… ఎవరికీ ఇవ్వకు….. మనమే ఉంచేసుకుందాం! మహాదేవి అమ్మకి కూడా ఇవ్వకు ….మన దగ్గరే ఉంచుకుందాం…. మన ఇద్దరికీ కాపలాగా ఉంచుకుందాం ….నేను గణపతిని కాబట్టి గణపతి….. నువ్వేమో శివ భక్తురాలివి కాబట్టి నీకు శివలింగం ఉంచుకో…. రాత్రిపూట మన ఇద్దరం పక్క పక్కన పెట్టుకొని పడుకుని రోజు పూజలు చేద్దాం….. ఈ విగ్రహాలకి…. అంతేగాని ఎవరికి ఇవ్వకు… ఎవరికీ అమ్మకు…
అంటూ ఈ విగ్రహం మూర్తులతో ఆడుకుంటూ ఉండేసరికి….. బాల గణపతి కి కావాల్సిన వంటలు చేయడానికి అని చెప్పేసి…. శివ నందిని వంట గదిలోకి వెళ్లి , ఆ ఏర్పాట్లలో నిమగ్నం అయింది. వీడు ఆడుకుంటూ….. ఆ విగ్రహాలు రెండు అతుక్కుంటున్నానని గమనించాడు. ఈ రెండు విగ్రహాలు అతుక్కునే సరికి బంగారపు రంగులో….. ఉన్న విగ్రహం కాస్త అంటే బంగారు శివలింగం కాస్త నల్ల శివలింగాను…. బంగారు రంగులో ఉన్న గణపతి కాస్త….. నిండు కాషాయ రంగులోను కనిపించేసరికి….. వీడికి అర్థం కాలేదు. ఒకటికి రెండుసార్లు అతికించేసరికి…. రెండు కూడా రంగులు మారుతున్నాయి అన్న విషయం గమనించాడు. కాకపోతే గణపతి పొట్టకే శివలింగం అతుక్కుంటుంది ….అంటే గణపతి పొట్టలో శివలింగం ఉన్నదా అనుకుంటూ…..
బాలగణపతి:- అమ్మో! ఇక్కడ ఒక విషయం గమనించారా! ఈ రెండు విగ్రహాలు అతుక్కుంటున్నాయి…. ఎక్కడ బంగారం అతుక్కోదు కదా! ఇక్కడేంటి…. ఈ రెండు అతుక్కుంటున్నాయి… విచిత్రం ఏంటో తెలుసా! గణపతి పొట్టకి శివలింగం అతుక్కుంటుంది. ఇంకా ఎక్కడ అతుక్కోవట్లేదు…. కేవలం గణపతి బొడ్డుకు మాత్రమే అతుక్కుంటుంది…. అంటే గణపతి కడుపులో శివలింగం ఉందా ! కాదు కదా! శివలింగం గజాసురుడి పొట్టలో నుంచి వచ్చింది కదా! ఒకవేళ ఇది గజాసురుడి విగ్రహమా….? మనం గణపతి విగ్రహం అనుకుంటున్నామా ? అని అంటూ ఉండేసరికి …..
వంట పనిలో ఉన్న శివ నందిని విని విననట్టుగా పెద్దగా పట్టించుకోలేదు. వీడు చిన్నపిల్లవాడు కదా! ఏదో వాగుతూ ఉంటాడులే అనుకొని…. ఉండ్రాళ్ళు చేసే పనిలో ఉండిపోయింది. అమ్మ తన మాటలు వినట్లేదు….పట్టించుకోవట్లేదు అని గ్రహించి ఆటల్లో నిమగ్నం అయ్యాడు. కొద్దిసేపు అయినా తర్వాత ఉండ్రాళ్లు పూర్తి అయ్యాయని పిలిచేసరికి ఆడుకునే వాడు కాస్త విగ్రహాలని టేబుల్ మీద పెట్టేసి… అమ్మ పిలిచిందని వెళ్ళాడు. అప్పుడు శివ నందిని పళ్లెంలో 21 ఉండ్రాళ్ళు పెట్టుకొని తెచ్చి… వాడికి ఒక్కొక్కటిగా ప్రేమగా ఆప్యాయంగా తినిపించడం మొదలు పెట్టింది. వీడు తను గమనించిన విషయం అప్పుడు చెబితే…..ఏదో పిల్లవాడు చిన్నతనంలో అంటున్నాడులే! బంగారపు విగ్రహాలు అతుక్కోవడం ఏమిటి? ఎప్పుడో పాతకాలపు విగ్రహాలు కదా ! జిగురుపట్టి ఉంటాయి…. ఆ జిగురుకు అతుక్కుని ఉంటాయిలే! అని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రంగులు మారుతున్నాయి అనే ఆలోచనతో……. రంగులు మారడం ఏమిటి? సరే వీటి సంగతి తర్వాత చూద్దాం అని ప్రేమగా 21 ఉండ్రాళ్ళు తినిపించేసరికి……
బాలగణపతి:- అమ్మ కడుపు నిండింది….నా ఆకలి తిరిగింది… నాకు బాగా నిద్ర వస్తుంది….నీ ఒళ్ళో పడుకుంటా..! పడుకోనా?
శివనందిని:- పడుకో…
బాలగణపతి:- మరి నువ్వు భోజనం చేయాలి కదా!
శివనందిని:- నువ్వు లేచిన తర్వాత చేస్తాలే… నాకు ఆకలిగా లేదు…
బాలగణపతి:- సరే నీ ఇష్టం అమ్మ! నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా నీ ఒళ్ళో ….
అని గణపతి ఒడిలో పడుకున్నాడు … సరే అని చెప్పి ఈమె కూడా కాసేపు అలాగే గురు మంత్రం చేసుకుంటూ ధ్యానంలో ఉండిపోయింది. కూర్చున్న చోటే అలాగే ఒరిగిపోయి పడుకుంది. ఎవరో తలుపు తడితే శివ నందినికి మెలకువ వచ్చింది . అప్పుడు సమయం చూస్తే సాయంత్రం ఐదు గంటలు అయింది. అయ్యో….. మంచి నిద్ర పట్టింది అనుకునేసరికి తన ఒళ్ళో బాల గణపతి లేడని గ్రహించింది. చూస్తే టేబుల్ మీద విగ్రహాలు అలాగే ఉన్నాయి…. సరే అని…. ఎవరు తలుపు తడుతున్నారా అని చూసేసరికి బాల గణపతి…
శివనందిని:- నా ఒళ్లో పడుకున్నావు కదా ! ఎప్పుడు బయటకు వెళ్లావు….
బాలగణపతి:- నేనెంతసేపమ్మా ….. నిన్ను నిద్రపుచ్చడానికి నేను ఒళ్ళో పడుకున్నాను. నువ్వు నిద్రపోయావని నేను బయటికి వెళ్లాను. బయటికి వెళ్తూ తలుపులు దగ్గరికి వేసి వెళ్లాను . ఎన్నింటికి లేచానో గుర్తులేదు. నువ్వు నిద్ర లేచావేమో అని తలుపు కొట్టాను. నువ్వు తలుపు తీశావు…. అంతే ఏముంది… ఇందులో…. సరే సాయం సంధ్య అవుతుంది ….మణికర్ణిక ఘాటుకి వెళ్లి స్నానం చేసి నేను సంధ్యావందనం చేసుకోవాలి …..నువ్వు వస్తావా అమ్మ!
శివనందిని:- నేనెందుకు రాను రా….. నేను వచ్చిందే దానికోసం కదా! పడుకోవడానికి కాదు కదా !
బాలగణపతి:- ఏమీ తినలేదు కదా…..?
శివనందిని:-. మధ్యాహ్నం తిన్నాను…. మధ్యాహ్నం లేచి తిని మళ్లీ పడుకున్నాను. నువ్వు కనబడకపోయేసరికి బయటికి వెళ్లి ఉంటావని, తలుపు దగ్గరికి వేసి మళ్ళీ పడుకున్నాను……
అవునా అని ఆ విగ్రహ మూర్తులను తీసుకొని మణికర్ణిక ఘాటు వైపుకు బయలుదేరారు. స్నానాలు సంధ్యావందనాలు కానిచ్చేశారు . ఇంతలో రుద్ర స్వామి, మహాదేవి ఇద్దరు కూడా వచ్చారు. వీళ్లను చూసి. …. బాల గణపతి కాస్త
బాలగణపతి:- ఏంటి! మీ ఇద్దరూ మా అమ్మ చుట్టూ తిరుగుతున్నారు…. ఎప్పుడో మూడు నెలలకి, ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కనిపించే వాళ్ళు…… ఇప్పుడు ఏంటి? గ్రహాల లాగా విడిచిపెట్టకుండా మా అమ్మని పట్టుకున్నారు. మా అమ్మ చుట్టూనే తిరుగుతున్నారు…. అసలు మీ ఇద్దరు కలిసి సాధన చేస్తున్నారా? మర్చిపోయారా? మా అమ్మ చుట్టూ తిరుగుతూ.. మా అమ్మ గురించి ఆలోచనలో చేస్తున్నారా, లేకపోతే ఈ విశ్వ రహస్యం ఏదో ఉంది …..అదేదో తెలుసుకుంటే మోక్షం వచ్చేస్తుందని సాధన మానేశారా ఏంది? మా అమ్మ తెలుసుకుంటుందో లేదో తెలియదు….. మా అమ్మని నమ్ముకుంటే చేసే సాధన కూడా ఆపేసారంటే కొంపలు మునిగిపోతాయి… ఎవరిని నమ్మొద్దు… మన నీడనే మనం నమ్మటానికి లేదు. జాగ్రత్తగా ఉండండి…. సాధన చేసుకుంటూ ఉండండి…. మా అమ్మ చుట్టూ తిరగకండి…
మహాదేవి:- మా సాధన మాకు జరుగుతూనే ఉంది… మా ఇద్దరి సాధనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే సాధన చేసే సమయం తగ్గించేసాము… విగ్రహాలు సంగతి ఏంటో తెలుసుకుందాం అనిపించింది… స్పురణ వచ్చేసరికి నేను వచ్చాను…. మరి ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు…
రుద్రస్వామి:- నాకు కూడా అదే స్ఫురణ వచ్చింది. రెండు విగ్రహ మూర్తులు గుర్తుకు వచ్చాయి. వీడు ఏమన్నా చేస్తాడేమో…. వీడు ఆడుకుని పగలగొడతాడేమో అనిపించింది…. యంత్రం పోయి విగ్రహాలు వచ్చినాయి…. విగ్రహాలలో ఏదో రహస్యం ఉందేమో అనిపిస్తుంది…
బాలగణపతి:- ఇంతకుముందు నేను అమ్మకి చెప్పాను …. అమ్మ నన్ను పట్టించుకోలేదు.
రుద్రస్వామి:- ఏం చెప్పావురా అమ్మకి …..
బాల గణపతి:- ఏం లేదయ్యా! ఈ రెండు నిజంగా బంగారు విగ్రహాలు కదా! ఈ రెండు విగ్రహాలు అతుక్కుపోతున్నాయి…. అతుక్కునే సరికి ఒక విగ్రహం నల్లగా మారుతుంది…. ఒక విగ్రహం కాషాయ రంగులోనికి మారుతుంది… ఆ విషయం అమ్మకి చెప్పాను…. విచిత్రం ఏమిటో తెలుసా! గణపతి కడుపుకి శివలింగం అతుక్కుంటుంది . మిగతా చోట ఎక్కడ అతుక్కోవట్లేదు….ఎప్పుడైతే ఈ రెండు విగ్రహాలు అతుక్కుంటున్నాయో……అప్పుడు రంగులు మారిపోతున్నాయి… ఈ తేడా ఏంటో నాకు అర్థం కావట్లేదు…. అమ్మకి చెప్తే అమ్మ వంట పనిలో ఉండి నన్ను పట్టించుకోలేదు… చిన్నపిల్లాడిని కద! నా మాట ఎందుకు వింటుంది….. నన్ను ఎందుకు పట్టించుకుంటుంది….. నేను చెప్పింది ఎప్పుడు వింటారు…. వినరు కదా! ఎవరు వినరు! ఎవరు పట్టించుకోరు…..
అని బుంగమూతి పెట్టుకునేసరికి
రుద్రస్వామి:- అవునా అమ్మ! నిజమా?
శివనందిని:- అవును స్వామి! మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చెప్పాడు ….నేను అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు.. చిన్నతనం కదా అని…
బాలగణపతి:- సరే ఇప్పుడు చూద్దాం…. ఆ విచిత్రం ఏంటో చూపిస్తాను ఉండండి…. నా మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది…
అని తన చేతి సంచిలో నుంచి బాల గణపతి ఆ రెండు విగ్రహాలను తీశాడు. ఆ రెండు విగ్రహమూర్తులను చూసేసరికి గణపతి పొట్టకి శివలింగం అతుక్కునే సరికి నల్ల శివలింగం గాను, అప్పటిదాకా బంగారం రంగులో ఉన్న గణపతి విగ్రహం కాషాయ రంగులోను మారడం….. వీళ్ళ ముగ్గురు గమనించారు…పిల్లాడు చెప్పింది నిజమే అని ఈ రెండు అతుక్కుంటున్నాయని గ్రహించారు. ఈ రెండింటి మధ్య అయస్కాంత ఆకర్షణ శక్తి ఉందని వీళ్ళు గ్రహించారు.
ఇలా వీటిని అతుక్కొని ఉన్నప్పుడు శివ నందిని తేరిపార చూసేసరికి….. గణపతి వీపు తెరుచుకోవడం లీలగా గమనించింది. సరే అని వీటిని అలాగే అతికించేసి గణపతి వీపుని నిమిరేసరికి….. ద్వారం ఉన్నట్లుగా అనిపించేసరికి….. గోరుతో తీసేసరికి దాని లోపల నుంచి రాగి రేకు బయటపడింది. అందరూ విచిత్రంగా రాగి రేకును చూశారు. ఆ రాగి రేకు మడతలు విప్పుతూ ఉండేసరికి అది కాస్త 14 మడతలుగా కనబడింది. తీరా చూస్తే అందులో ఏమీ కనిపించలేదు….. ఆ రాగి రేకులో ఎలాంటి అక్షరాలు లేవు ….యంత్రము లేదు…. తెల్లని కాగితము లేదు…. ఏమీ లేదు…. ఏమీ లేకుండా కనబడింది . వీళ్ళకి అర్థం కాలేదు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. సరే అని శివ నందిని కళ్ళు మూసుకుని ధ్యానం చేసేసరికి విశాలాక్షి విగ్రహ మూర్తి లీలగా కనిపించింది. మొదట పద్మాకార శివలింగం, ఆ తర్వాత పద్మకార గణపతి ఉన్నట్టుగా కనిపించింది . ఆ తర్వాత అక్షరమాల, ఆ తర్వాత కమండలం కనపడింది. పదేపదే అక్షర మాల , కమండలం కనిపించేసరికి ఆమెకి అర్థం కాక…. ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసి అందరికీ చెప్పింది . అంటే ఈ కమండలం అక్షర మాల లోనే ఏదో ఉంది అని….
రుద్ర స్వామి అమ్మ! నీ మెడలో ఉన్న అక్షరమాల ఈ యంత్రానికి వెయ్యి అన్నాడు. రుద్రస్వామి చెప్పేసరికి తన మెడలోని అక్షర మాల ఈ యంత్రానికి వేసింది. ఏమీ మార్పు కనిపించలేదు. బాల గణపతి కాస్త “ ఎటు….. అమ్మ అక్షరమాల వేయించారు కదా! కమండలంలో ఉన్న నీళ్లు కూడా పోయించండి… ఒక పని అయిపోతుంది అని చెప్పి గణపతి అన్నాడు . కమండలంలో నీళ్లు ఏంట్రా నాకు అర్థం కాలేదు అని రుద్రస్వామి అంటే……కమండలంలో ఏముంటాయి…. గంగనీల్లే కదా! మన ముందు గంగా నది ఉంది కదా !ఆ నీళ్లను తీసుకొచ్చి పోస్తాను…. ఏమవుతుందో చూద్దాం అనేసరికి …..సరే పిల్లవాడి ముచ్చట ఎందుకు కాదనటం అని ముగ్గురు సరే అన్నారు. అప్పుడు గణపతి ఆనందంగా చేతులతో నీళ్లు తీసుకువచ్చి…. ఈ యంత్రం మీద పోయేగానే, అక్షరాలు కనిపించడం మొదలైంది. సరే అని పూర్తిగా నీళ్లతో నింపేసరికి….. ఏదో ఒక శ్లోకం లీలగా కనిపించింది. సరే అని ఈ యంత్రాన్ని నీటిలో తడిపితే…… అందులో ఉన్న అక్షరాలు కనిపించే విధంగా తయారు చేశారని ……వీళ్ళ ముగ్గురికి అర్థం అవటానికి అట్టే సమయం పట్టలేదు. సరే అని ఆ శ్లోకం లో ఏముందో అని శివ నందిని పెద్దగా చదవడం ఆరంభించింది . అప్పుడు శ్లోకం ఈ విధంగా కనిపించింది ….
“ఈ విశ్వంలో ఉన్న నువ్వు, నువ్వు కాదు . నువ్వు అనేది కేవలం ….ప్రతిబింబం . నువ్వు నిజం కాదు. నిన్ను చూపించేవాడు సత్యమైనవాడు… నీ ప్రతిబింబానికి ఆధారమైన బింబం వాడు….. నీ ఆటకి నిజమైన ఆటగాడు…. చేతులు నీవే , చేతలు వాడివి… వాడెవడో…. ఎక్కడ ఉంటాడో చెప్పేవాడు….. ఆచూకీ ఇచ్చేవాడు… దారి చూపించేవాడు…. వీడే. వీడు మూలపురుషుడు. నాగాభరణం ఆధీనంలో భద్రంగా దాక్కొని ఉన్నాడు. నువ్వు సత్యాన్వేషిగా వెతుకు… ఆలోచించు…. శోధించు …తెలుసుకో! నీకే వాడెవడో…. నేను అయినా నీకు , నేను కానీ నేను అయినా వాడెవడో…. దారి చూపించే పూర్ణ సాధనా మూర్తి నీకోసం ఎదురు చూస్తూ కనపడతాడు. వీడిని చూడాలంటే నాగపంచమి దాకా ఎదురు చూడక తప్పదు వీడి సహాయంతో నీలో ఉన్న శక్తిని నిద్రలేపు. నీలో ఉన్న శక్తి కేంద్రాలను వాడుకో… వీటిని నడిపే వాడి సహాయం తీసుకో…. అప్పుడు మీరు ఆఖరివాడిని … ఆరంభంలో ఉన్న వాడినీ …అంతం చేసేవాడిని…. సత్యమై, నిత్యమై ఉన్నవాడిని….. ఉండి లేనట్లుగా ఉండేవాడిని…. లేనట్లుగా ఉండేవాడిని….. ఈ విశ్వ జగన్నాటకమునకు మూలమైన వాడిని సజీవ మూర్తిగా…. ప్రత్యక్షంగా నీ కళ్ళ ముందు నిలిచి ఉంటాడు. పాము రూపంలో మహర్షి వీణ్ణి ఇక్కడ ఉంచాడు . వాడిని చేరుకో …. కలుసుకో …..అంతరించిపో…అంతం అయిపో ….నేను లేదు… నువ్వు లేదు… ఏమి లేదు… ఏదో లేదు… లేనిది ఉన్నట్లుగా…. నువ్వు ఉన్నావని…. నువ్వు నిజం కాదని…. సత్యాన్వేషిగా తెలుసుకొని…. తెలుసుకునేవాడు లేడని….. తెలుసుకోవడానికి ఏమీ లేదని…. గ్రహించిన నాడు…. అది నువ్వే సత్యమని గ్రహించిన నాడు… నువ్వే ఉండవు ….నేను ఉండను… ఏదీ ఉండదు…. కనిపించేది అసత్యమని , కనిపించనిది సత్యమని, తెలిసిన నాడు ….నీ దేహమే దహనమై ఎక్కడి నుంచి వచ్చావో…. అక్కడికి పోతావు . అంతరించి పోతావు. అంతమైపోతావు… నీదంటూ ఏమీ లేకుండా.. నువ్వు ఇదే సాధించేది . ఇదే నువ్వు పొందేది…. దీనికోసం ఆ మూలపురుషున్ని చూపించే సాధనా మూర్తి రూపాన్ని వెతుకు” అని శ్లోకం ఉన్నది .
శ్లోకాన్ని ఒకటికి పది సార్లు నలుగురి చదివారు. ఇందులో ఎటువంటి ఆధారం లేదు. వేదాంతమే కనపడుతుంది ..రుద్ర స్వామికి విసుగు వచ్చింది. ఇది అందరూ చెప్పే మెట్ట వేదాంతమే కదా! ఏమీ లేదు…. ఏది లేదో దాన్ని తెలుసుకో… అంటున్నారు. ఏం తెలుసుకోవాలి… ఎలా తెలుసుకోవాలి అని మాత్రం చెప్పరు. మనకి ఈ రాగి రేకు ఏమైనా చెప్తుందేమో అని ప్రయత్నిస్తే, ఇది కూడా మెట్ట వేదాంతం చెప్తుంది అని …ఆయన విసుగ్గా అనేసరికి….
బాలగణపతి:- అయ్యో! ఇది మెట్ట వేదాంతంలోనే ఆధారాలు చూపిస్తుంది. జాగ్రత్తగా గమనించు…. అర్థం చేసుకో! నాకు అర్థమవుతుంది… మీకే అర్థం కావట్లేదు …నాకు తెలుస్తుంది …ఇందులో ఏదో ఆధారాలు ఉన్నాయి… ఆధారం లేకుండా ఇంత పెద్ద శ్లోకం రాయరు. చూడ్డానికి మెట్ట వేదాంతమే కావచ్చును…. కానీ ఇందులో ఆధారం ఉంది . ఉండు నేను అన్ని విడమర్చి చెబుతాను …
అని వాడు ఒకటికి రెండుసార్లు పెద్దగా చదువుతూ….. ఆధారాలు ఉన్న శ్లోకం ఆధారం చూపించే చోట గుర్తులు పెట్టుకొని , ఇదిగో ఇప్పుడు చెబుతాను చూడండి…. ఇందులో మొదటి ఆధారం ఏంటంటే వీడు మూల పురుషుడు నాగాభరణం ఆధీనంలో భద్రంగా దాక్కొని ఉన్నాడు. రెండవ ఆధారం వీడిని చూడాలంటే, నాగ పంచమి దాకా ఎదురు చూడాలి . పాము ఉన్న మహర్షి వీడిని ఇక్కడ ఉంచాడు అని ఉంది. అంటే ఈ శ్లోకంలో ఈ మూడు ఆధారాలు అన్నమాట! ఈ మూడు ఆధారాలు పట్టుకొని మనం సాధనా విగ్రహం మూర్తి దగ్గరికి వెళ్ళవచ్చు . విషయం ఏమిటో తెలుస్తుంది అనగానే …రుద్రస్వామి….“ఆగాగు…. నెమ్మదిగా మళ్లీ చదువు” అనేసరికి, ముగ్గురికి కూడా ఏదో తెలియని ఉత్సాహం కలిగింది. బాలగణపతి తీసినది నిజంగానే ఆధారాలు ఏమో అనుకుంటూ ఉండేసరికి…… వీడు మూలపురుషుడు నాగాభరణం ఆధీనంలో భద్రంగా దాక్కొని ఉన్నాడు…. అంటే సాధనా విగ్రహ మూర్తి నాగాభరణం ఆధీనంలో ఉంది. నాగాభరణం ఆధీనంలో ఉంది అంటే నాగాభరణం ఎవరిది! శివుడి యొక్క నాగాభరణం ఎవరు వాసుకి ….అంతే కదా అంటే వాసుకి సర్పం ఆధీనంలో ఈ విగ్రహ మూర్తి ఉన్నాడని అర్థం అవుతుంది కదా! అన్నాడు.
అవును ఇది నిజమే రెండో ఆధారం చదువు….. అనగానే వీడిని చూడాలంటే…. నాగపంచమి దాకా ఎదురు చూడాలి ….అంటే ఆ వాసుకి సర్పం ఉన్నచోట నాగపంచమి రోజు పూజలు చేస్తారేమో! ఆ పూజల సమయంలోనే మనం చూడటానికి వీలుంటుందేమో… అంటే నాగపంచమి రోజు చూసే అవకాశం ఉంటుందని చెప్పారు అని బాలగణపతి అనేసరికి ….అవును నాగపంచమి బాగానే ఉంది.
తర్వాత మూడో ఆధారం …..పాము ఉన్న మహర్షి వీటిని ఇక్కడ ఉంచాడు. అంటే పాము ఉన్న మహర్షి ఎవరు! పతంజలి మహర్షి అయ్యి ఉండాలి. ఎందుకంటే ఆయన తల మనుష్య తల , మిగతా శరీరం అంతా పాము రూపంలో ఉంటుందని పెద్దలు చెప్తారు. అంటే పతంజలి మహర్షి …అంటే పతంజలి మహర్షి వాసుకి సర్పం ఉన్నచోట ఈ సాధన విగ్రహ మూర్తి ఉంచారు. దాని దగ్గరికి వెళ్లాలంటే నాగపంచమి రోజున సాధ్యపడుతుంది అని చెప్పి నాకు అర్థం అవుతుంది అని అన్నారు … ఇలా అనేసరికి వీళ్ళ ముగ్గురు వీడు చెప్పిన ఆధారాలు నిజమేనని అనుకున్నారు. అప్పుడు రుద్ర స్వామి ఉన్నట్టుండి అవును కదా! ఇవ్వాలే నాగపంచమి. ఇక్కడ పూజలు జరుగుతాయి…. అవునవును….. ఒక్క నిమిషం ఉండండి… ఆలోచించుకుంటాను! ఇక్కడ మనకు కాశీలో జవాన్పుర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నాగకుండ్ అని ఒకటి ఉంది . ఆ కుండ్ లో కర్కోటక నాగేశ్వర లింగం అని ఉంటుంది. ఈ కుండంలో 45 అడుగుల లోతున బావి ఉంటుంది . ఈ బావి లోపల కర్కోటక నాగలింగేశ్వర అని ఒక శివలింగం ఉంటుంది. ఈ శివలింగం చూడాలి అంటే….. నాగపంచమినాడు ఈ బావిలో ఉన్న నీరంతా తోడేసి , శివలింగ దర్శనం చేస్తారు. ఎందుకంటే ఈ శివలింగ దర్శనం వలన సర్ప దోషాలు, నాగ దోషాలు , సర్ప శాపాలు ఇవన్నీ కూడా తొలగితాయని…. సంతాన సమస్యలు తొలగి సంతానం కలుగుతుందని చెప్పేసి మన పెద్దల శాస్త్రవచనం ద్వారా తెలుస్తుంది. అంటే నాగాభరణం అంటే వాసుకి సర్పం వంశంలోని వాడే కర్కోటక సర్పం ….పైగా విచిత్రం ఏమిటంటే ఈ నాగకుండ్ ద్వారా…. దానికున్న ద్వారం ద్వారా పాతాళ లోకానికి కూడా వెళ్ళవచ్చు అని కాశీఖండంలో 66వ అధ్యాయంలో ఈ నాగ కుండు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ వెళతారని ఒక ఇనుప తలుపును బిగించి పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రాత్రికి ఈ నాగకుండ్ కి వెళితే విషయం ఏమిటో తెలుస్తుంది . అక్కడ మనకి సాధనా విగ్రహ మూర్తి దొరకవచ్చు. రాత్రి 12 గంటలకి ఎవరూ లేని సమయంలో…. మన నలుగురం కలిసి ఈ నాగ కుండ్ కి చేరదాం…. చేరాక అక్కడ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఎవరికీ చెప్పకండి…. ఎవరూ లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి…. అని చెప్పి రుద్ర స్వామి అనేసరికి ఎవరికి వారే మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నారు.
ఇలా వీళ్ళు ఈ ఆలోచనలో నిమగ్నమై ఉన్న సమయంలో …..తాము ఉన్న చోటికి శరవేగంతో ఆవులు, ఎద్దులు వస్తూ ఉండేసరికి…. వీటిని గమనించిన రుద్ర స్వామి కాస్త….“ అబ్బా! బిందు మాధవుడి అంశ అయిన కృష్ణ స్వామికి మన విషయం తెలిసినట్టుంది…. వాడికి కూడా మనో జపసిద్ధి ఉంది కదా! మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలుసుకుంటున్నాడు… ఏదో సృష్టికి విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నామని వాడు ఇలా చేస్తున్నట్టున్నాడు. మన దానికి మొదటి ఆటంకం ఆరంభమైంది….. అని శివ నందినితో, అమ్మ! వీడు కృష్ణ అంశ.. వీడిని కృష్ణస్వామి అంటూ ఉంటారు. వీడికి కోపం ఎక్కువ. ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. వీడి చేతిలో సుదర్శన చక్ర ఆయుధం ఉంటుంది. దానితో వాడు అందరినీ చంపుతూ ఉంటాడు. వాడు వెనుక ముందు ఆలోచించడు. సృష్టికి తనే స్థితికారకుడు….రక్షకుడు…. వీడితో జాగ్రత్తగా ఉండు. ఈ ఎద్దులు ఇప్పుడు నిన్ను చంపేస్తాయి. మా ముగ్గురిని ఏమీ చేయలేవు . ఈ ఎద్దులు, ఆవులు నిన్ను పొడవడానికి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండు… మేము వెళ్ళిపోతున్నాము. నువ్వు కూడా ఈ విగ్రహాలను తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఉండేసరికి …..ఈమెను పొడవడానికి వస్తూ ఉండేసరికి ముగ్గురు కూడా తప్పుకొని నిలబడి సాక్షి భూతంగా చూస్తున్నారు. అంతలో వేణునాదం చేసుకుంటూ…. అందమైన యువకుడు, నల్లని శరీరం ఉన్నవాడు , జులపాల జట్టు ఉన్నవాడు…. ఈ ఆవులు , ఎద్దులు వెనుక వేణు నాదం చేసుకుంటూ…. వస్తున్నట్లుగా శివ నందినికి వినపడసాగింది. దూరం నుంచి చూసింది…. వీడు చేస్తున్న మోహనరాగానికి మనసు గతి తప్పడం….. పరవశం లోకి వెళ్లడం గమనించి….. వెంటనే బాలగణపతి అమ్మ వాడి మాయలో పడమాకు! వాడు మోహ మాయలో పడేస్తాడు. వేణునాదం వినమాకు అనగానే…. పిల్లవాడి వాక్కు బ్రహ్మ వాక్కు అంటారని చెప్పేసి, ఆ వేణునాదం వినకుండా చెవులు మూసుకుంది. చెవుల్లో చూపుడువేలు పెట్టుకొని అలా తీక్షణంగా చూస్తూ ఉన్నది . చూస్తూ ఉండేసరికి వేణునాదం చేసుకుంటూ కృష్ణస్వామి తన దగ్గరికి రావడం గమనించింది . కృష్ణ స్వామి వాళ్ళ ముగ్గురిని దూరం నుంచి చూసాడు. అలాగే శివ నందిని దగ్గరగా చూశాడు . ఎవరితోనూ ఏమి మాట్లాడటం లేదు. వేణు నాదం వాయిస్తూ ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆవులు, ఎద్దులు కూడా తన కొమ్ములతో శివ నందిని పొడవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దగ్గరకు రావడం లేదు . ఈ విషయం శివ నందిని గమనించింది . తన చుట్టూ పది అడుగుల దూరంలో మాత్రమే తిరుగుతున్నాయి …. ఇతను తిరుగుతున్నాడు అని గ్రహించింది. మనసు స్థిమిత పడింది. అంటే తను ఏదో విశ్వవినాశనం చేస్తున్నారని తెలుసుకొని వచ్చి ఉంటాడు. కానీ వీడు తనని ఏమీ చేయలేకపోతున్నాడు. ఆవులు, ఎద్దులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. ఇవి ఏవో చేయాలని భయపెడుతున్నాయి. తను భయపడకూడదు అని ఒకటికి రెండుసార్లు అనుకుంటూ స్థిర మనసు చేసుకుంటూ…. ఇతను ఏం చేస్తాడు…. జంతువులు ఏం చేస్తాయో అని చెప్పి గమనిస్తూ సాక్షిభూతంగా అలా నిలబడింది . కానీ సమయానికి వీళ్ళ ముగ్గురు సహాయం చేయకుండా దూరంగా నిలబడి, పారిపోతారని మాత్రం శివ నందిని అనుకోలేదు. కానీ వీళ్ళ ముగ్గురు అలా చేసేసరికి మానవ సంబంధాల లాగే దైవ సంబంధాలు కూడా ఉంటాయేమో! భోగంలో ఆర్థిక బంధం ఉంటే యోగంలోకి వచ్చేసరికి అవసర బంధాలేనేమో! వాళ్ళు మోక్షం పొందటానికి తనని వాడుకుంటున్నారేమో! తన ద్వారా మోక్షం వస్తుందని గ్రహించడం వల్ల వీళ్ళ ముగ్గురు కూడా తన చుట్టూ ఉన్నారేమో! అని ఆలోచన చేస్తూ ఉండగా….. బాలగణపతి కాస్త “అమ్మ ! నువ్వు వాడి మోహమాయలో పడిపోయి మా గురించి చెడుగా ఆలోచించకు ….మేము చెడు ఉద్దేశంతో లేము. కావాలంటే ఈ క్షణాన మేము ముగ్గురం వెళ్ళిపోతాం. మాకు మోక్షాలు అవసరం లేదు. నువ్వు రాకముందు అలాగే ఉన్నాము ….నువ్వు వచ్చాక అలాగే ఉన్నాము….మాకు మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు….కాశీ క్షేత్రంలో చస్తే కూడా మోక్షం వస్తుంది అని తెలుసు కదా! కాకపోతే నువ్వు ఇచ్చే మోక్షానికి, మేం పొందే మోక్షాలకి తేడా ఉండవచ్చు. మాకు ఆ తేడాలు కూడా అవసరం లేదు. కాలానుగుణంగా పరిస్థితులకనుగుణంగా జరిగేది జరుగుతుంది. మేము ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో నువ్వు పొందే మోక్షం పొందుతాము….అంతేగాని నువ్వు సహాయం చేయడం వలన మాకు మోక్షం వస్తుందని మేము అనుకోవట్లేదు…. మేము ఆది రుద్ర మూర్తిని చూడాలని అనుకుంటున్నాం…. అది కూడా సజీవ మూర్తిగా చూడాలని అనుకుంటున్నాము. మా ముగ్గురికి ఆయన ఏనాడో ధ్యానంలో, స్వప్నంలో, నిరంతరం మా వెంట ఉన్నాడని తెలుసు . కాకపోతే ఏంటంటే ప్రత్యక్ష దర్శనం కోసం చూస్తున్నాము. తద్వారా మాకేదో పూర్ణం మోక్షం వస్తుంది. అది విశ్వ మోక్షం అవుతుందని తెలుసుకున్నాము. మాకు ఆయన దర్శనం ఇచ్చినా …ఇవ్వకపోయినా మా తలరాతలో రాసిపెట్టి ఉంటే, ఇక్కడైనా సజీవమూర్తిగా దర్శనం ఇస్తాడు. ఎక్కడో ఉన్నాడు…. అది తెలుసుకోవాలి అని అయితే మేము అనుకోవట్లేదు. నీ సహాయంతో మేము మోక్షం పొందాలనో ….నీతో అవసరం ఉంది అనో అయితే అనుకో మాకు” ….అనేసరికి… తను చేసిన చెడు ఊహలకి సిగ్గుపడి నన్ను వదిలిపెట్టేసి మీరు ఎందుకు అక్కడికి వెళ్లిపోయారు….అంటే మేము నీ దగ్గర ఉన్నామని తెలిస్తే నీకు ఇంకా ఎక్కువ సమస్యలు కలిగిస్తాడు…. ఆ కృష్ణస్వామి. ఆ కృష్ణస్వామి ఎవరి మాట వినడు… మూర్ఖుడు…. తను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లు అనే రకం . కాశీ విశ్వనాథుడు, కాశీ విశాలాక్షి ఆయనకి వెనక ఉంటారు. వీడు ఎంత చెబితే అంత వాళ్ళు వింటారు. వీడు లోకాల రక్షకుడు. విశ్వ రక్షకుడు అని అహంకారం ఉంది. వీడి వలన విశ్వానికి, ఈ లోకానికి ఏదో మంచి జరుగుతుంది అంటారు. వీడి ఆలోచన కూడా మంచిదే …తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే లోక విరుద్ధమైన పనులు సమాజ విరుద్ధ పనులు, ఆలోచనలు చేస్తే లోక వినాశనం జరుగుతుందని వీడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు . అనుమాన పడుతూ, అనుమానిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం అనుమానిస్తున్నాడు నిన్ను. నువ్వేదో చేస్తున్నావని ….నువ్వు ఏం చేస్తున్నావో వాడు తెలుసుకోడు. తెలుసుకోలేడు. కానీ అది లోక విరుద్ధమైనదా ….లోకానికి మంచి జరిగేదా అనేది ఆలోచన మాత్రమే చేస్తాడు అని అంటూ ఉండేసరికి వీడు వేణు నాదం కాస్త ఆపేసేసరికి, ఉగ్ర రూపంలో ఉన్న ఎద్దులు కాస్త శాంతించడం మొదలుపెట్టాయి. కృష్ణస్వామి అప్పుడు శివ నందిని కేసి చూస్తూ “మీరేదో విశ్వ వినాశనానికి సంబంధించింది చేస్తున్నారు …..లోక విరుద్ధమైన పనులేవో చేస్తున్నారు….. ఎక్కడివి అక్కడే ఉంచండి…. దీన్ని ఎక్కడ దాచి ఉంచారో…. దాన్ని యధా స్థానంలో తిరిగి పెట్టేయండి. నాకు తెలియదు అనుకోకండి. నేను పట్టించుకోవట్లేదు అనుకోకండి. మీకు అవకాశం ఇస్తున్నాను. మీ అంతట మీరు తీసుకువచ్చిన వస్తువులు యథాస్థానంలో పెట్టేయండి . లేదంటే పెను ప్రమాదాలు పొందుతారు. నేను ఊరుకున్నా మా అమ్మ ఊరుకోదు. నా సన్నిహితుడు ఊరుకోడు. జాగ్రత్త…. నేను ఊరుకుంటా అని మాత్రం అనుకోకండి…. నేను అవకాశం ఇచ్చి చూస్తాను . అవకాశం చేజార్చుకున్నారా ప్రాణం తీస్తాను, మరణం ఇస్తాను. కాబట్టి మీరు చేసిన పనిని మొదటి తప్పుగా భావించి….ప్రాయశ్చిత్తంగా మీకు అవకాశం ఇస్తున్నాను. తెచ్చిన వస్తువులను తిరిగి యధాస్థానం లో పెట్టేయండి. విశ్వానికి సంబంధించి ఏదో చేయాలని…. మీ ద్వారా జరుగుతుందని ….లోక కళ్యాణమైనా కావచ్చు…. లోక విరుద్ధమైన పనులు చేయకండి . నా చేతుల్లో చావకండి… చావు దెబ్బలు తినకండి… ఇప్పుడు ఇవి నా వేణు గానానికి ఉగ్రం నుంచి శాంతం అయిపోయాయి. నేను ఆజ్ఞ ఇస్తే మీ నలుగురు దేహాలను చిన్నాభిన్నం చేయడానికి అట్టే సమయం పట్టదు. నా జోలికి రాకండి… నన్ను రెచ్చగొట్టకండి….మీకు అవకాశం ఇస్తున్నాను” …..అని ఆయన ముందుకు వెళ్లేసరికి ఆయన వేణుగానానికి లోనైనా జంతువులు కూడా అట్టే నడుచుకుంటూ వెళ్లిపోయాయి. ఇదంతా దూరం నుంచి వింటున్న ముగ్గురు అలాగే శివ నందిని కూడా విని మౌనంగా ఉండేసరికి….. ఈ ముగ్గురు శివ నందిని దగ్గరికి వచ్చి “అమ్మ! నువ్వేమైనా భయపడ్డావా! మేము నీకు రక్షణగా లేవని మా గురించి తప్పుగా ఆలోచించకు. మేం ముగ్గురం నీకు సహాయం చేస్తున్నామని వాడికి తెలుసు. మా ముగ్గురుని వాడు చంపలేడు . వాడి చేతిలో మరణం లేదని తెలుసు . కాకపోతే ఏంటంటే నిన్ను చంపడానికి వాడికి అవకాశం ఉంది . వాడి చేతిలోనీకు అపమృత్యు దోషం ఉంది. మరణం పొందే అవకాశం ఉంది. నువ్వు విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నావని వాడికి తెలియదు. గ్రహించడు. నువ్వు ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నావ్ అని మాత్రమే వాడు తెలుసుకుంటాడు. జాగ్రత్తగా ఉండు ….వాడు ఎక్కడ పడితే అక్కడ… ఎలా పడితే అలా వచ్చేస్తాడు. వాడి దృష్టిలో నువ్వు పడ్డావు అంటే వాడు నిన్ను చంపడానికి కూడా వెనకాడడు …జాగ్రత్తగా ఉండు…” అని చెప్పి వీళ్లిద్దరూ అంటే రుద్రస్వామి , మహాదేవి రాత్రి 12 గంటలకు ఆ కుండ్ దగ్గర కలుస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బాలగణపతి వైపు చిరు కోపం ప్రదర్శిస్తూ….
శివనందిని:- నా దగ్గర ఉండ్రాళ్ళు తింటావు….. కానీ నన్ను మాత్రం నువ్వు రక్షించవా? నాకేమైనా సమస్య వస్తే రక్షణగా తోడుగా ఉంటా అని చెప్పేసి వెళ్లి దాక్కున్నావ్! నువ్వేం రక్షకుడివి ….నన్నేం రక్షిస్తావు!
అనేసరికి
బాలగణపతి:- అమ్మ! నేను రక్షించకుండా ఉండకపోతే, నీకు దూరంగా ఉండి నేను చూసుకోకపోతే ….నువ్వు మా గురించి చెడుగా ఆలోచించే దానివి కదా! వాడి యోగ మాయలో పడొద్దని చెప్పాను కదా! వాడి మోహ మాయలో పడకుండా ఉన్నావు కదా! మా గురించి నువ్వు చెడుగా ఆలోచించకుండా ఉన్నావు కదా! అప్పుడు నేను రక్షించినట్టే కదా! వాడు నిన్ను ఏమీ చేయలేడు. సరే నువ్వు నిబ్బరంగా నిలబడతావా, భయపడతావా అది తెలుసుకోవాలని అనిపించింది. చిలిపి ఆలోచన వచ్చింది. వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏమైనా చేస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నా దగ్గర ఉన్న ఆయుధాలతో వారిని పొడిచి చంపెయ్యను…. వాడిని కొట్టనా ! వాడు పారిపోయేటట్టు చెయ్యనా! నా నుంచి వచ్చిన జంతువులు….. నా నుంచి వచ్చిన వాటి నుంచి నిన్ను రక్షించలేనా! నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుంటావా లేదా అని అనుకున్నాను. నువ్వు ఏమైనా భయపడతావా అని చూస్తున్నాను. నువ్వు నా గురించి ఆలోచించావు….. మన బుడ్డోడు ఉన్నాడు…. వాడు చూసుకుంటాడులే! అని అనుకున్నావు కాబట్టి….. నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. కూర్చున్న చోట నుంచి కదలకుండా అలాగే కూర్చున్నావు. ఆవులు వచ్చినాయి…. ఎద్దులు వచ్చినాయి…. వాడు వచ్చి వెళ్ళిపోయారు. నిన్నేదో బెదిరించాడు. నువ్వేమైనా బెదిరావా ….భయపడ్డావా …..లేదు కదా! నేనున్నా అనే ధైర్యంతోనే ఉన్నావు కదా! మరి ఇంకెందుకు కంగారు…. పట్టించుకోలేదు అని చెప్తావు ….నేపం నామీద వేస్తావు… పద వెళ్లి ఉండ్రాళ్ళు తిందాం. మళ్ళీ రాత్రి నిద్ర ఉండదు. 12 గంటలకు నాగ కుండ్ దగ్గరికి వెళ్ళాలి. పద పద ఇప్పటికే ఆలస్యం అయింది. నన్ను అపార్థం చేసుకోకు అని ముందే చెప్పా… నేను ఏం చేసినా మంచికే చేస్తా అని చెప్పా…. జరిగేదేదో మంచికే జరుగుతుందని చెప్పా…. నువ్వేమో నా మాట వినవు…. అనుభవంలోకి వస్తే గాని విషయం అర్థం కాదు…
అనేసరికి
శివనందిని:- నువ్వు రక్షిస్తావనో…. నువ్వు రక్షించవనో నాకు ఎప్పుడూ ఆలోచన లేదు. చచ్చేదానికి ఆశలు, భయాలు ఎందుకుంటాయి. నాకు చావు భయం లేదు. బతకాలని ఆశ లేదు. ఏనాడో చచ్చిపోయాను నేను…. ఈ బతికున్న శవం ఏదో లోకానికి ఉపయోగపడుతుందని అన్నారు. అదేదో చూద్దామని చూస్తున్నాను. ఇదంతా కూడా నేను ఏదో చేస్తున్నానని అనుకోవడం లేదు . ఎప్పుడైతే రుద్ర స్వామి ఇదంతా రికార్డు దృశ్యం అని చెప్పాడో …..ఆ రికార్డు దృశ్యంలో మన సాధన ఎలా ఉంది…. ఏం జరిగింది…. చేసిన తప్పేంటి….ఆ తప్పును మనం సరి చేసుకోవడానికి వీలు ఉంటుందా! లేదా! అని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను. నేనేదో చేస్తున్నాను…. నేను ఏదో పొందుతున్నాను…. మీకేదో ఇస్తున్నానని నేను అనుకోవడం లేదు. చేసేది ఎవరు…. చేయించేది ఎవరు…. ఉన్నది ఎవరు? ఎవరూ లేరని చెబుతున్నారు కదా! దేవుడు లేడని చెబుతున్నారు కదా ! ఇక నాలో ఉన్న శివుడు ఎక్కడ ఉన్నాడు …..చచ్చిపోయాడు కదా! నేను చచ్చిపోదాం అనుకున్నాను… నాలో ఉన్న శివుడు చచ్చిపోయాడు…. ఇంక చేసేవాడు ఎవడు…. చేయించేది ఎవరు? చేయడానికి ఏముంది! తెలుసుకోవడం తప్ప! ఏమీ లేదు… ఆ తెలుసుకున్నది చెప్పడం తప్ప ! అంత తెలిసి కూడా నువ్వు కూడా మానవమాత్రుని లాగా మాట్లాడుతావేంటి? ఏదో నిన్ను ఏడిపించడానికి, కవ్వించడానికి అన్నాను. ఎప్పుడు తల్లి కోపం బిడ్డ చూస్తుంది…. అలాగే బిడ్డ కోపం తల్లి చూడాలనుకుంటుంది కదా! అందులో తప్పేముంది….
బాలగణపతి:- అమ్మ! నేను నిన్ను తప్పు పట్టలేదు. నువ్వు నన్ను తప్పు పడతావని నేను అనుకోను . నిన్ను తప్పు పట్టినా , తిట్టినా, కొట్టినా మా అమ్మే కదా అని నేను అనుకుంటాను. అలాగే నేనేం చేసినా నా బిడ్డే కదా అని నువ్వు అనుకుంటావ్! మన మధ్య ఉన్నది రక్తసంబంధం కాదు…. ఆత్మ సంబంధం. దైవ సంబంధం… కాబట్టి ఇది ఋణానుబంధం కాదు … ఋణాలు తీరితే విడిపోయేది కాదు… మనం జీవితాంతం కలిసే ఉంటాం. కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరచుకున్నా ఏం చేసినా…. విడివిడిగా ఉన్నా విడిపోకుండా ఉంటాము. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు . కంగారు పడతావని నేను అనుకోవట్లేదు కదా! మళ్ళీ రాత్రి 12 గంటలకి దాకా నిద్ర లేవాలి…. ఆ నాగ కుండ్ ఎక్కడ ఉందో….. నాకు తెలుసు. నేను తీసుకువెళ్తాను. అలాగే రుద్రస్వామి, మహాదేవికి కూడా వస్తా అన్నారు. అదేదో విగ్రహం…. ఏదో ఉంది అన్నారు కదా! ఆ సాధనా విగ్రహ మూర్తి సంగతేందో చూసుకుందాం.. పదా ఉండ్రాళ్ళు చేసుకుందాం ….పద !పద !లే! లే అని శివ నందిని చేయి పట్టుకొని బలవంతంగా లేపి అక్కడ నుంచి బాలగణపతి విగ్రహాలను చేతితో పట్టుకొని ఇద్దరు కూడా వాళ్ళు ఉన్న గది వైపుకి వెళ్లారు.
ఇలా వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిన తర్వాత… వీడి ఆకలి తీర్చడానికి అని పొద్దున చేసిన పిండితో ఉండ్రాళ్ళు చేసి బాలగణపతికి తినిపించింది. వాడు కడుపునిండా తినేసి, కాసేపు విశ్రాంతిగా పడుకుంటానని ఒళ్లో పడుకున్నాడు. సరే పడుకో అని శివనందిని ధ్యానంలో కూర్చుంది . అలా ధ్యానం చేస్తూ చేస్తూ యోగ నిద్రలోకి వెళ్లిపోయింది . ఈమెకి కాసేపటికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూసేసరికి…. రాత్రి 11 గంటలు అయింది. అప్పటికే ఒళ్ళో ఉన్న పిల్లవాడు కాస్త విగ్రహ మూర్తులతో ఆడుకుంటూ కనిపించాడు. ఎప్పుడు లేచావురా? అంటే, నేను లేచి ఒక అరగంట అయింది అమ్మ….. మంచి నిద్రలో ఉన్నావు. నువ్వు ఏంటమ్మా కూర్చున్న దానివి కూర్చున్నట్టే పడుకుంటున్నావు. మంచం మీద పడుకోవచ్చు కదా! లేదా నేల మీద చాప వేసుకొని పడుకోవచ్చు కదా! అయినా మంచాలున్నా కూడా చాప మీద పడుకుంటావు కదా! అనగానే నేను అలా పడుకుంటానని నీకు ఎలా తెలుసు రా! అంటే నాకు తెలియని విషయాలు ఏమున్నాయి…. నాకు అన్నీ తెలుసు…. నీకంటూ ఏదీ లేదు…. నాకు తెలియనిదంటూ ఏదీ లేదు. అన్ని విషయాలు తెలుస్తాయి… కానీ కాలానుగుణంగా సమయానుసారం బట్టి ఒక్కొక్కటి చెబుతూ ఉంటాను. పదా ! ఇప్పటికే ఆలస్యం అవుతుంది. 11:00 అవుతుంది. మనం నాగ కుండ్ కి బయలుదేరాలి అనగానే… స్నానాదికాలు చేసుకొని…. చేతి సంచిలో విగ్రహ మూర్తులు పట్టుకొని వీళ్లిద్దరూ కూడా గది తలుపులు వేసి ఆటోలో నాగ కుండ్ కి బయలుదేరారు. కాసేపటికి నాగ కుండ్ కి చేరుకున్నారు. అప్పటికే సమయం 11:30 అయ్యింది. ఎవరూ లేరు… నాగ కుండ్ లోపలికి వెళ్లేసరికి….. సుమారు 40 అడుగుల సరస్సులో బావి ఉన్నట్లుగా కనబడింది. ఆ బావిలో సుమారు 45 అడుగుల లోతు ఉన్నట్లు కనిపించింది. మెట్లు ఉన్నాయి…. మెట్లు దిగి లోపలికి వెళ్లారు. అప్పటికే బావి లోపల ఉన్న నీళ్లన్నీ తోడేశారు. లోపల ఉన్న శివలింగం కనిపించింది. దీనినే కర్కోటక నాగ లింగేశ్వర శివలింగం అంటారమ్మ….. అని బాల గణపతి చెబుతూ….. ఇదిగో ఈ ఇనుప ద్వారం దాటితే మనం పాతాళ లోకానికి వెళ్ళే దారి ఉంటుందంట! ఈ పాతాళ లోకం నుంచి ప్రతిరోజు కర్కోటక సర్పము వచ్చి రాత్రిపూట ఈ శివలింగంకు పూజ చేస్తారంట….. పూజ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు అంటారు….. దీనికి సంబంధించి మనకి కాశీఖండంలో కనిపిస్తుంది…. అంటూ ఉండేసరికి, ఎవరో వస్తున్నారని పైకి చూసేసరికి రుద్రస్వామి, మహాదేవి కూడా మెట్లు దిగి శివలింగం దగ్గరికి వచ్చారు. వీళ్లిద్దరూ నమస్కారం చేశారు. చేసిన తర్వాత ……రుద్రస్వామి “అమ్మ! ఇప్పుడు ఏం చేయాలి…” అని శివ నందిని కేసి చూశాడు. నాకేం తెలుసు స్వామి…..నాకే అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. ఇక్కడికి రావాలి …..ఇక్కడ ఏదో ఉందని…. మనకి ఆధారం చూపించింది కదా! సరే చూద్దామని చెప్పి అన్నారు అనేసరికి …..సరేలే చూద్దాం ఏం జరుగుతుందో అని నలుగురు శివలింగానికి నాలుగు దిక్కుల్లో ధ్యానం చేసుకుంటూ ఈ ధ్యానం నిష్ఠ లో ఉండిపోయారు. ఏదో చప్పుడు అవుతున్నట్టు అనిపించేసరికి అర్ధరాత్రి 12 గంటలు అయింది అని…. రాతి పలక తొలగుతున్నట్టు అనిపించింది. ఎవరు కదలకుండా మౌనంగా ఏం జరుగుతుందో చూస్తున్నారు . ఇంతలో ఒక పెద్ద తెల్లటి పాము బయటకు వచ్చి వీళ్ళ నలుగురిని చూసింది. కాటు వేయాలని అనుకుని కూడా…. కాటు వేయలేదు. ఎందుకైనా మంచిది అని బాలగణపతి తన చేతిలోనే శివలింగమును, గణపతిని రెండింటిని చేతిలో పట్టుకుని ఉన్నట్టుగా ఆ సర్పానికి కనిపించేసరికి విషయం అర్థం అయ్యి శివలింగం చుట్టూ తిరిగి కాసేపు ధ్యాన నిష్ఠ లో ఉండిపోయి, తిరిగి వెళ్ళిపోతూ ఉండేసరికి ద్వారం మూసుకోకపోయేసరికి…. పాము కూడా లోపలికి రమ్మంటుందని బాల గణపతి గ్రహించి ……అమ్మ! మనం లోపలికి వెళ్దాం. ఇది కర్కోటక సర్పం …. పాతాళ లోకానికి దారితీస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో…..అనేసరికి సరే అని వీళ్ళు పాము వెళ్ళిన మార్గము ద్వారా లోపలికి వెళ్లేసరికి…. ఒక చీకటి గృహ మార్గం లాగా కనిపించింది. చిమ్మ చీకటిగా ఉంది. వెలుతురు లేదు . పాము ముందుకు వెళ్తూ ఉండేసరికి ….మొదట గణపతి ,ఆ తర్వాత శివ నందిని, ఆ తర్వాత రుద్రస్వామి, ఆ తర్వాత మహాదేవి ఆ పామును వెంబడిస్తున్నారు. ఆ పాము వీళ్ళని వెనక్కి తిరిగి చూసింది. ముందుకు వెళ్లిపోతున్నది. కాటు వేయాలని కానీ…. చంపాలని కానీ…..అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ పాము వల్ల వాళ్లకి ఎలాంటి భయం లేదని తెలుసుకొని “ఓం నమశ్శివాయ” మంత్రంతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నారు. పాము మార్గం చూపిస్తూ వెళ్తుంది…. సహజ సిద్ధంగానే రాతి ద్వారబంధనం మూసుకుపోయింది. ఒక పది కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఒక మధ్య గుహలాగా వీళ్లకి కనిపించింది. పాము అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పాము లోపలికి వెళ్ళిందో ద్వారబంధనం పడిపోయింది. ఇక లోపలికి వెళ్లడానికి లేదు ……ఇక్కడితో ఆగిపోవాలని తెలుసుకున్నారు. ఎదురుగా చూస్తే ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారానికి ఒక శివలింగం గుర్తు ,ఒక గణపతి గుర్తు ఉండేసరికి…. అది కూడా తమ చేతిలో ఉన్న విగ్రహం మూర్తిని సైజులో ఉండేసరికి…. బాల గణపతి ఉన్నట్టుండి ఆలోచన వచ్చి ఈ విగ్రహ మూర్తులను ఆ ద్వారబంధనానికి గుచ్చేసరికి …..ద్వారా పొందడం తెరుచుకుంది . లోపలికి వీళ్ళు ప్రవేశించేసరికి ద్వారా బంధనం మూసుకుపోయింది. అమ్మ ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్తాము…..! అనేసరికి రుద్ర స్వామి మౌనంగా ఉండమని సైగ చేశారు. చూస్తే చిమ్మ చీకటిగా ఉంది. కాకపోతే మణుల కాంతి వెలుగు లీలాగా కనపడుతుంది . ఏవో వేడిగాలులు గుహ నిండా ఆవరించి ఉన్నాయని అర్థమవుతుంది . బుసలు కొడుతున్నట్టుగా శబ్దం లీలాగా వినిపించింది. ఏమిటా అని చూస్తే వీళ్ళకి అల్లంత దూరంలో…… కనుచూపుమేరలో సుమారుగా 1000 అడుగుల పాము ఏడు చుట్లు చుట్టుకొని వెయ్యి తలలతో బుసలు కొడుతూ కనిపించింది. రుద్రస్వామి నెమ్మదిగా వీళ్ళ ముగ్గురి వైపు చూస్తూ…..ఇదే శివుడి మెడలో ఉన్న వాసుకి సర్పం. ఇదే శివుడి నాగాభరణం. దీని మధ్యలోనే సాధనా విగ్రహ మూర్తి ఉన్నట్టుంది అనేసరికి …..నాకేమీ కనిపించట్లేదు అని అనేసరికి… ఈ పడగల లోపలికి వెళ్లి చూస్తే తెలుస్తుంది…. కాకపోతే ఆయన అనుగ్రహించాలి. ఏదన్నా తేడా వస్తే భక్షించేస్తాడు అంటూ….. ఆ …..రక్షకుడే భక్షకుడు అయితే ఎలాగా! మనం లోకకళ్యాణార్థం కదా చేస్తుంది అని….. బాలగణపతి ఆవేశంగా ముందుకు వెళుతూ ఉండేసరికి …..ఒకసారిగా వాసుకి సర్పం విష గాలి వదిలేసరికి…. వీళ్ళ ముగ్గురు కూడా స్పృహ తప్పి పడిపోయారు. శివ నందిని స్పృహ తప్పి పడిపోతూ ఉండగా బాలగణపతి చేతిలో ఉన్న విగ్రహం తీసుకునే సరికి ….ఇది కాస్త శివలింగం నల్లగా , గణపతి కాషాయం రంగులోకి మారేసరికి….. అప్పుడు ఆ విష గాలులు ఈమె మీద ప్రభావం చూపించలేదు. ఏదైతే అది అవుతుంది ….. చావడానికి వచ్చిన వాడికి….. చావు భయం ఎందుకు? తెగించిన వాడికి తెడ్డే గతి…..అని శివ నందిని కాస్త ఎటూ విష గాలులకు వీళ్ళ ముగ్గులు చచ్చిపోయారు కదా! తను కూడా వాసుకి సర్పం దగ్గరికి వెళ్లి చచ్చిపోవాలని అనుకొని…. వాసుకి సర్పం దగ్గరికి వెళ్లేసరికి, ఈమె చేతిలో ఉన్న విగ్రహం మూర్తులను చూసేసరికి……. ఉగ్రంగా ఉన్న సర్పం కాస్త శాంతంగా అయిపోయి, పడగ తీసేసి తోక ద్వారా తన శరీరాన్ని పక్కకి జరిపేసరికి, ఒక రాతి ఆసనం మీద సుమారుగా మూడు అడుగుల బంగారు వర్ణంతో ఉన్న విగ్రహ మూర్తి కనిపించింది. ఆ విగ్రహ మూర్తి చేతిలోకి తీసుకునేసరికి ….వాసుకి సర్పం అదృశ్యం అయింది. గుహ అదృశ్యం అయింది. చుట్టూ ఏమీ లేదు. ఆ విగ్రహ మూర్తి…. తను…. వీళ్ళ ముగ్గురు స్పృహ తప్పి ఉన్నవాళ్లు కనిపించారు. సరే అని ఆ విగ్రహ మూర్తిని తీసుకొని, వీళ్ళు బతికే ఉన్నారా! చనిపోయారా, అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసేసరికి వీళ్ళు బతికే ఉన్నారు….. కాకపోతే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారని గ్రహించింది. వీళ్ళని ఎలా స్పృహలోకి తీసుకురావాలి అర్థం కాలేదు. విగ్రహ మూర్తిని పక్కనపెట్టి వీళ్ళని లేపడానికి చూస్తూ ఉండేసరికి ……..బాలగణపతి చేయి విగ్రహానికి తగిలి స్పృహలోకి వచ్చాడు అని తెలుసుకుంది. రుద్ర స్వామి, మహాదేవికి కూడా ఈ విగ్రహ మూర్తిని తాకించేసరికి వీళ్ళు స్పృహ లోకి వచ్చి….. ఏం జరుగుతుంది అని చూసే లోపల, తన చేతిలో సాధన విగ్రహ మూర్తిని చూపించింది . ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరాదాము అనుకుంటూ ఉండేసరికి…. ఎదురుగా వారాహి అనగా 4 పళ్ళు ఉన్న సుమారుగా 60 అడుగులు ఉన్న వరాహ రూపం లో అడవి పంది కనిపించింది. విచిత్రంగా దీనికి నాలుగు పళ్ళు ఉన్నాయి. నల్లగా ఉంది . జుట్టు నిక్కపొడుచుకొని ఉంది . పెద్దగా ఘీంకారము చేస్తుంది. ఈ నలుగురు ఒక్కసారిగా భయపడ్డారు. శివ నందిని చేతిలో ఉన్న విగ్రహ మూర్తిని తీసుకోవాలని….శివ నందినిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండేసరికి…. రుద్రస్వామి ఉన్నట్టుండి “అమ్మ! ఈమె కాశి క్షేత్రానికి రక్షకురాలు అయిన వారాహి అమ్మవారు. ఈవిడ ఈ రూపంలో వచ్చింది . విగ్రహ మూర్తిని తీసుకువెళ్లడం…. ఆవిడకి ఇష్టం లేదు. నిన్ను చంపనన్నా చంపేస్తుంది… జాగ్రత్త! మా ముగ్గురిని ఏమీ చేయదు …..ఎందుకంటే మేము లోక విరుద్ధమైన ఆలోచనలు చేయట్లేదు. నువ్వే చేస్తున్నావని ఆవిడ అనుకుంటుంది. పైన కృష్ణ స్వామి…. అలాగే భూమి లోపల వరాహ రూపంలో ఉండి ఇలా చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో …..అనేసరికి తన మనసులో తనకి ఎలాంటి స్వార్థం లేదని…..తన మరణమే మోక్షమరణం అవుతుంది అని….. లోక విరుద్ధమైన ఆలోచనలు చేయడం లేదని….. లోక కళ్యాణార్థమైన విషయమే చేస్తున్నానని మనసులో సంకల్పించుకొని….. తన చేతిలో ఉన్న సాధన విగ్రహం చూపించేసరికి ……ఆ విగ్రహ మూర్తిలో నుంచి వచ్చే దివ్యమైన తేజస్సు కాంతి కిరణాలు ఆ వరాహం మీదకి వచ్చేసరికి….. ఆ వారాహి మూర్తి కాస్త ఘీం కారాలు చేస్తూ…… భయపడిపోతూ భూమి లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళే సరికి…. ఎలా అయితే మెట్ల ద్వారా లోపలికి వెళ్లారో …..అలా బయటకు వచ్చారు. ఆ తర్వాత బావికి చేరుకున్నారు. అక్కడున్న కర్కోటక నాగలింగేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మళ్లీ 40 మెట్లు ఎక్కి పైకి చేరుకున్నారు. పైకి చేరుకొని ఈ విగ్రహ మూర్తి సంగతేంటో చూడాలని….. నలుగురు కలిసి మణికర్ణిక ఘాట్ వైపుకి చేరుకున్నారు.
ఇలా నలుగురు…. విగ్రహ మూర్తితో పాటు బయటకు వచ్చి… మణికర్ణిక ఘాట్ వైపుకి బయలుదేరుతూ ఉండగా…… తెల్లవారుతుందని….. సూర్యోదయం అవుతుందని …..గ్రహిస్తూ శరవేగంతో ఘాటువైపుకి బయలుదేరారు. అప్పటికే వీళ్ళ రాక కోసం ఎదురుచూస్తున్న వెయ్యిమంది అఘోరులు …..ఘాట్ మొత్తం నిండిపోయి ఉన్నారు. వీళ్ళని చూసేసరికి రుద్రస్వామి, మహాదేవి, బాలగణపతి గతుక్కుమన్నారు. వీళ్ళు అఘోరాలు అని శివ నందిని తెలుసుకుంది. చూస్తూ ఉండిపోయింది….. తన చేతుల్లో ఉన్న విగ్రహ మూర్తిని ….చూస్తూ ఆ అఘోరులలో అధినాయకుడిగా ఉన్న అఘోరుడు ….శివ నందిని దగ్గరకు వచ్చి
“ఏంటి….! ఆడపిల్లవి.. జాగ్రత్తగా ఉండు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు . అమ్మవారి అంశవే…. నువ్వంటే మాకు గౌరవం ఉంది. కాకపోతే నీ సాధనాస్థితి ఎంతవరకు ఉంది…. నీకు ఎంతవరకు అర్హత, యోగ్యత, యోగం ఉందనేది తెలుసుకో! విశ్వ మోక్షం గురించి ప్రయత్నం చేయకు …నీ మోక్షం నువ్వు చూసుకో ! నీ తిండి నువ్వు తింటే సరిపోతుంది. నువ్వు తింటే అందరూ తిన్నట్టు కాదు. ఇలాగే లోగడ ఒకడు…. ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఏం చేశాడు ? విశ్వమోక్షం కాస్త వాడి చావు వాడు చచ్చాడు . వ్యక్తిగత మోక్షం పొందాడు. వాడు రాసిన పుస్తకం చదివేసి….. నువ్వేదో చేయాలని … నువ్వేదో తెలుసుకోవాలి అని ….వచ్చేస్తున్నావు. ఇక్కడిదాకా వచ్చావు. అక్కడ ఉన్న విగ్రహ మూర్తిని మేము పాతాళ లోకం లో భద్రంగా దాచి ఉంచితే దాన్ని తెచ్చేసావు. అసలు దాన్ని నీకు ఎవరిచ్చారు? ఏ విధంగా ఆధారాలు ఇచ్చారు! ఎవరు చెప్పారు నీకు… వెనక ఎవరున్నారు ! అని కళ్ళు మూసుకొని….. ఆ ముగ్గురు ఉన్నారని అనుకోమాకు, వాళ్ళ ముగ్గురు వాళ్ళ అవసరాలు తిరగానే తెల్లారే అంతరించిపోతారు. వెళ్ళిపోతారు. వాళ్ళు నీ అవసరం కోసం రాలేదు. వాళ్ళ అవసరం కోసం వచ్చారు. వాళ్లని నమ్ముకుంటే నిన్ను నట్టేట ముంచుతారు అనేసరికి…..” ఏమీ మాట్లాడలేదు. ముందు ఆ విగ్రహం మాకు ఇస్తావా? యథావిధిగా తీసి పెడతావా! అయినా ఇప్పుడు తీసి పెట్టడానికి లేదు. నాగపంచమి గడియలు పూర్తి అయిపోయినాయి. షష్టి గడియలు మొదలైనాయి. కాబట్టి ఇప్పుడు పాతాళలోక ద్వారం మూసుకుపోతుంది. మళ్లీ నాగపంచమి వచ్చేదాకా ఎదురు చూడాలి ….ఆ విగ్రహం మాకు ఇచ్చేయి! మా సంరక్షణలో మేము పెట్టుకుంటాము అని బలవంతంగా శివ నందిని చేతిలో ఉన్న విగ్రహమూర్తిని అధినాయక అఘోరుడు తీసుకొని….. ఇక బయలుదేరు! అనేసరికి మిగతా ముగ్గురు కూడా మౌనం వహించారు. ఈ శివ నందిని కూడా ఏమీ చేయలేక….. ఏమైనా చేస్తే వాళ్ళు వెయ్యి మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని…. 1000 మంది చేతుల్లో ఉన్న త్రిశూలాలు , తననే కాదు…… తన చుట్టూ ఉన్న ముగ్గురిని చంపడానికి కూడా వెనకాడరు అని గ్రహించి…… తన వలన వాళ్ళ ముగ్గురు చావటం ఎందుకు ……తన చావేదో తను చస్తుంది…. ప్రకృతికే ఇష్టం లేనప్పుడు…. ప్రకృతి సహాయం చేయలేనప్పుడు…… ఇక తను ఎందుకు ప్రయత్నం చేయాలి….. తన చావు తాను చావచ్చు కదా! చచ్చిపోవచ్చు కదా! ఏదో లోకకళ్యాణార్థం అని చెప్పేసి….. ఏదో మోక్షం వస్తుందని….. విశ్వ మోక్ష ప్రయత్నం చేయాలనుకోవడం కూడా అవివేకం అవుతుంది. నా వలన వీళ్ళ ముగ్గురు ప్రాణాలు ప్రమాదంలో పడటం ఎందుకు! అని ఏమీ మాట్లాడకుండా, వాళ్ళని ఎదిరించకుండా మౌనం వహించింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోయారని చెప్పి తెలుసుకొని ఇక వీళ్ళ ముగ్గురు ఈమె దగ్గరికి వచ్చారు. అమ్మ! మన చేతుల్లో ఇంక ఏమీ లేదు….. ఏదో సాధనా విగ్రహ మూర్తి ద్వారా సజీవ మూర్తిగా ఉన్న ఆది రుద్ర మూర్తిని చూడాలనుకున్నాం. ఇంక మనకి ఆ యోగం లేనట్లే ఉంది. సరేలే…. కానీ! ప్రకృతి మనకి సహాయం చేయలేనప్పుడు….. మనం ఏం చేయగలం. శుభ్రంగా స్నానం చేసేసి, సంధ్యావందనం చేసుకొని, మనం చేసుకునే ధ్యానం మనం చేసుకుందాం…. మన నిత్య మంత్రం మనం చేసుకుందాం. ఏం జరగాలో…. ఆ విధాత ఏం చేయాలనుకుంటున్నాడో…. కాలానికే వదిలేద్దాం. మనం ఎందుకు ఆలోచించడం….. మన చేతుల్లో లేనప్పుడు…. మనం ఏం చేయగలం? ఇక్కడిదాకా మనం తెలుసుకోవాలని రాసిపెట్టి ఉందేమో….. ఇక్కడిదాకా తెలుసుకున్నాం. కాకపోతే నీ ద్వారా ఏంటంటే, 80 సంవత్సరాల దాకా ఉన్న యంత్రం ద్వారా సాధనా మూర్తిని చూడగలిగాను….. కానీ పూర్తిగా అది తాకలేదు ,పూర్తిగా ఆయన గురించి తెలుసుకోలేదు…. అంటూ …. సరే బాధపడమాకు ,మనం ఎంతవరకు తెలుసుకోవాలో.. అంతవరకే తెలుసుకుంటాము. మనకి ఎంతవరకు యోగం ఉంటే అంతవరకు ఉంటుంది. సరే! ఇంక దాని గురించి ఆలోచించకు . కాశీ విశ్వనాథుడు, విశాలాక్షికే ఇష్టం లేనప్పుడు, మనం ఏం చేయగలం? ఇప్పుడు వారాహి వచ్చింది. అడ్డుపడింది….. ఇప్పుడు రుద్రాంశ రుద్ర గణాలైనా అఘోరాలు వచ్చారు. వాళ్లకి తెలియకుండా ఉండదు కదా! మనం లోక కళ్యాణం చేస్తున్నామో ! లోక వినాశనం చేస్తున్నామో …..కానీ ఇది ఏదైనా పరిక్షేమో చూద్దాం. మన దగ్గరికి తిరిగి సాధనా విగ్రహ మూర్తి వస్తే మంచిది. విశ్వ రహస్యం తెలుసుకుందాం. ఆది రుద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం…. లోకానికి చెబుదాం. ఆయన సజీవమూర్తిగా ఫలానోచోట ఉన్నాడని చెబుదాము. మనం తెలుసుకుంది చెబుదాము. తెలుసుకోలేదనుకో….. వదిలేద్దాం! మన భౌతిక మరణం ఏదో ఒక మోక్షం అవుతుంది కదా ! ఇప్పుడు పరమహంస గారు చెప్పినట్టు కాశీలో మరణం పొందితే ఆత్మ శరీరానికి మోక్షం వచ్చి ఆత్మ మోక్షం కలుగుతుందని చెప్పారు కదా! అంటే ఆత్మ మోక్షం వస్తుంది కదా! మరుజన్మలో మనకి యోగం ఉంటే ప్రయత్నం చేద్దాము. నీ మరణమే విశ్వమోక్షం అవుతుంది అన్నారు! కాబట్టి మనం చూసాము…. మనకి ఆ అవకాశాలు ఇచ్చారు…. విశ్వ రహస్యం చేదించే లోపులే విగ్రహ మూర్తి మన చేతి నుంచి వెళ్ళిపోయింది. సరే మనం నిగ్రహంగా ఉండటానికి…. విగ్రహ మూర్తి వచ్చింది. ఆ విగ్రహ మూర్తి లేకుండా పోయింది. ప్రకృతి మనకి అవకాశం ఇవ్వలేదు. ఆటంకాలు ఇస్తుంది . ఓ పక్క కృష్ణస్వామి, ఓ పక్క వారాహి, ఒకపక్క అఘోరాలు….. ఇంక వాళ్లకే శ్రద్ధ లేనప్పుడు మనం ఏం చేస్తాం…. సరేలే అని ఎవరికి వాళ్లే బాధతో ,ఆవేదనతో, ఆలోచనతో స్నానాధికాలు ముగించుకొని ధ్యానం చేసుకొని ఎవరికి వాళ్ళు…. తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక బాలగణపతి నాకు ఆకలేస్తుంది అనేసరికి శివ నందిని ఉండ్రాళ్ళు చేసే పనిలో ఉంది. ఉండ్రాళ్ళు చేస్తున్నా కూడా ఈ సాధన విగ్రహ మూర్తిని ఎప్పుడైతే తాకిందో….. కళ్ళు మూసినా , కళ్ళు తెరిచినా పదేపదే ఆ సాధన విగ్రహ మూర్తి కనిపిస్తుంది . ఈ విషయం అందరికీ …. అంటే మిగిలిన ముగ్గురికి కూడా జరుగుతుంది . పదేపదే గుర్తుకు వస్తుంది. వెంటనే బాల గణపతి అమ్మ నువ్వు గమనించావా ? ఏ విగ్రహ మూర్తికి లేని గుణం సాధనా విగ్రహం మూర్తికి ఉంది. ఏదో మనిషిని తాకినట్టుగా అనిపించింది. మనిషి కూర్చున్నట్టుగా ఉంది. ఎలా కూర్చున్నాడు…. ఏ విధంగా కూర్చున్నాడు….. అని నేను గమనించలేదు. మనం ఎవరం గమనించలేదు. చీకటిగా ఉంది కదా! తీక్షణంగా చూసే పరిస్థితి అసలు లేదు. అయినా ఆ అఘోరులకి ఏం పనీపాటా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు…. ఎలా పడితే అలా వచ్చేస్తారు. నేను ఉండ్రాళ్ళు తింటున్నప్పుడు కూడా లాక్కొని వెళ్ళిపోయేవాళ్లు….. ఏమన్నా అందామంటే వాళ్ళ చేతుల్లో త్రిశూలం ఉంది… చంపేస్తాం…. అనేవాళ్ళు. చచ్చేవాడినే చంపాలని అనుకుంటారేంటి? తినేవాడిని తిననివ్వరు…. ఏదో అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది అనుకుంటారు. వీళ్ళని నడిపించేవాడు ఒకడున్నాడని ఎందుకు అనుకోరు…. అంతా మేమే చేస్తున్నాం, మేము లేకపోతే ఈ విశ్వం నడవదు…. విశ్వమే లేదు…. అనుకుంటూ ఎవరికి వారే ఉంటున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా జరిగేది జరగక మానదు అని ఎందుకు గమనించరు… ఎందుకు తెలుసుకోరు. ఒక కుటుంబంలో తండ్రి చనిపోయాడు అనుకో….. ఆ కుటుంబం వీధి పాలు అవ్వదు కదా! తల్లి పోషిస్తుంది. తల్లి సంపాదిస్తుంది. ఆ కుటుంబాన్ని చూసుకుంటుంది. అదే తల్లి చనిపోతే తండ్రి చేస్తాడు అదే పని…ఒకవేళ తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ పిల్లలు అనాధలు కాకుండా ప్రకృతి ఏమైనా ఆపుతుందా…! వాళ్లను బతకాల్సిన విధంగా బతికిస్తుంది. రాతలో ఉంటే… తినే యోగం ఉంటే ఎలాగైనా తినొచ్చు. అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది….పిల్లల్ని నేనే పెంచుతున్నాను. పిల్లల్ని మేమే చూస్తున్నాము… మేము లేకపోతే ఉండలేరు అనుకుంటారు. ఉండాల్సిన అవసరం ఏముంది …..,ఈ జన్మలో తల్లిదండ్రులు, ఈ జన్మలో పిల్లలు, భవిష్యత్తు జన్మలో వీళ్ళు ఉంటారా? లేకపోతే గత జన్మలో వీళ్ళు ఉన్నారా? అంతా మన చేతుల్లో ఉంది. మనమే చేస్తున్నాం అనుకుంటారు. భోగ జీవితంలో పరిస్థితి అలా ఉంటే యోగ జీవితంలో ఇలా వీళ్ళు ఉన్నారు…. అఘోరాలు, కాపాలికులు, నాగసాధువులు, భైరవులు. వీళ్లంతా వచ్చేసి రక్షిస్తున్నారు. రక్షణ మాత్రమే చేయమని చెప్పారు. అంతేగాని మేము లేకపోతే ఈ విశ్వం నడవదు అనుకుంటారు…. కృష్ణస్వామి చూడు, వేణు నాదం తో అందరిని మోహమాయలో పడేస్తాడు. ఆ నాదానికి వాడే మోహ మాయలో పడిపోయాడు అన్న విషయం తెలుసుకోడు.. వాడికి తోచింది వాడు చేస్తాడు .మూర్ఖంగా ప్రవర్తిస్తాడు .అదేమన్నా అంటే నేను కృష్ణ అంశ …..కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తా అంటాడు . కృష్ణుడు ఏమన్నా చెప్పాడా? ధర్మంగా ఉండమని చెప్పాడు ….అధర్మ పరుడ్ని నాశనం చేయమని చెప్పారు. వీడు ఏం చేస్తున్నాడు…. మనం అధర్మంగా పనులు చేస్తున్నామా? మనం ఏ పని చేస్తున్నాము ….ఏంటి…. తెలుసుకోలేదు. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని వచ్చాడు .వచ్చాడు …..వెళ్ళిపోయాడు….. ఏంది ఇదంతా! అయినా మనం ఏదో ఆలోచిస్తున్నాం కానీ , విశ్వ మోక్షాలు…. వ్యక్తిగత మోక్షాలు….. మనకెందుకమ్మ…. హాయిగా కాశీలో నువ్వు ఉండ్రాళ్ళు చేసి పెడుతూ ఉండు…. తిని పెడుతూ ఉంటా. ఇద్దరం సరదాగా ఉంటాము… ఏదైనా రోగం వస్తే వస్తుంది …గంగలో మునిగి చచ్చిపోదాం… మనకి విరక్తి కలిగిందనుకో…… ఇప్పటికే నీకు భోగ జీవితం మీద విరక్తి కలిగింది. అట్లాగే యోగ జీవితం మీద కూడా విరక్తి కలిగిందనుకో! చెప్పు….. ఇద్దరం కలిసి మణికర్ణిక ఘాట్ లో ఒక్కటే మునకేద్దాం. మళ్ళీ లేవకుండా అయిపోద్ది. మన చేతుల్లో పని…..చచ్చిపోదాం అనేసరికి విని విన్నట్టుగా పట్టించుకోనట్టుగా….. శివ నందిని ఉంది.
అమ్మ మనసు ఇక్కడ లేదని …..సాధనా విగ్రహ మూర్తి మీద ఉందని …..బాలగణపతి గ్రహించి సరే అమ్మ ఉండ్రాళ్ళు చేసేసరికి, సమయం ఎక్కువ పడుతుంది అని….. ఒక కునుకు వెయ్యాలని నిద్రలోకి వెళ్లిపోయాడు. శివ నందిని మాత్రం సాధన విగ్రహ మూర్తిని గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడుతూ…. ఆవేశపడుతూ…. సరేలే మనకి ప్రాప్తం లేదేమో అనుకుంటూ…. పిల్లవాడికి కావలసిన ఉండ్రాళ్లు చేస్తూ ఆ పనిలో మునిగి అయింది. పిల్లాడ్ని చూస్తే నిద్రపోతున్నాడని….. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపటం ఎందుకులే అని లేచాక ఉండ్రాళ్ళు పెడదాం అని…. చేసిన ఉండ్రాళ్ళు పక్కనపెట్టి , కాసేపు ప్రశాంతత కోసం అని గురు మంత్రమును “ ఓం శివోహం ” మంత్రమును జపంగా చేసుకుంటూ…… కళ్ళు మూసుకుంది. తనకి కూడా రాత్రంతా నిద్రలేక పోయేసరికి మంచి గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది.
ఇలా వీళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉండగా….. తలుపు తడుతున్న శబ్దానికి శివ నందిని కి మెలకువ వచ్చింది.. పిల్లవాడేమో అని కళ్ళు తెరిచి చూస్తే ,పిల్లవాడు తన పక్కనే గాఢ నిద్రలో ఉన్నట్టుగా గమనించింది. ఉండ్రాళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తే…. ఉండ్రాళ్ళు లేవని గ్రహించింది. అంటే తినేసి పడుకున్నాడు అని గ్రహించింది. ఈ సమయంలో తలుపు ఎవరు తడుతున్నారా అని చూస్తే, మధ్యాహ్నం 12 గంటలు అయినట్టుగా కనిపించింది. తలుపు తీసి చూస్తే, ఎదురుగా రుద్రస్వామి, మహాదేవి కనిపించారు . లోపలికి వచ్చారు. అమ్మ ఏమీ అనుకోవద్దు …..కాస్త మంచినీళ్లు ఇస్తావా ? అనగానే, కుండలో ఉన్న నీళ్లు ఇద్దరికీ ఇచ్చింది. వీళ్ళు దాహం తీర్చుకున్నారు. వీడేంటి రాత్రి నిద్ర లేదని ఇప్పుడు మంచి నిద్రపోతున్నాడా! సరే పోనీలే….. చిన్నపిల్లవాడు కదా! పడుకొని….. నిద్ర లేపడం ఎందుకులే! నాకు ఆ విగ్రహ మూర్తిని తాకిన దగ్గర నుంచి…. ఆ స్పర్శ సజీవ మూర్తిగా అనిపించింది. పదేపదే గుర్తుకు వస్తుంది. కానీ ఆ విగ్రహ మూర్తిని చూస్తే ఎక్కడా రుద్రుడి పోలికలు ఏమి కనపడలేదు. జటాజూటం ,పాములు, రుద్రాక్షలు,ఏనుగు చర్మం, పులి చర్మం అలా ఏమీ లేదు. గమనించావా? అంటే స్వామి! నేను అంతగా గమనించలేదు . విగ్రహ మూర్తి మాత్రమే తీసుకున్నాను కానీ ….అది మానవుని తాకితే ఎలా ఉంటుందో….. అలా ఉంది. ఒక సజీవ మూర్తి కూర్చున్నట్టుగా ఉంది. కాకపోతే డమరుకం మీద ఆయన పద్మాసనం లో కూర్చున్నట్టుగా కనిపించింది. రెండు చేతులు ఉన్నాయి. శూన్య ముద్రలో ఉన్నారనుకుంటాను…. రెండు చేతుల్లో పద్మాలు కనిపించినాయి…. అనేసరికి , మహాదేవి మాత్రం నేను తల నుదురు భాగాన్ని తాకాను. మెత్తగా అనిపించింది . శరీరం కూడా పసిపిల్లవాడి శరీరం లాగా ….మెత్తగా అనిపించింది . ఈ విగ్రహం కూడా పెద్దగా బరువు అనిపించలేదు. కాకపోతే మూడు అడుగులు ఉన్నట్టుగా అనిపించింది . ఆ మూడు అడుగులు పిల్లవాడిని మనం ఎత్తుకున్నట్టుగా అనిపించింది. ఆలోచనలు అంతా కూడా నాకు విగ్రహ మూర్తి మీదకి పోతుంది. వేరే ఆలోచన రావట్లేదు… తినాలని అనిపించట్లేదు…. సాధన చేయాలని అనిపించడం లేదు…. ధ్యానం, ధ్యాస రెండు లేవు అనేసరికి…. వీళ్ళ మాటలకి వీళ్ళ అలికిడికి నిద్రపోతున్న బాలగణపతి కూడా మెలకువ వచ్చి, మీరు కూడా వచ్చారా? మీరు కలలో వచ్చారేమో అని నేను ఇంకా నిద్రపోతున్నాను….. నిజంగానే వచ్చారన్నమాట! ఏంటి మీకు కూడా విగ్రహ మూర్తి కనపడుతుందా! విగ్రహ మూర్తి మీద మనసు పీకుతుందా….. నాకు ఉదయం నుంచి అలా పీకుతుంది…. కానీ ఏం చేయలేను! అని ఆలోచిస్తూ నిద్రపోయాను . అమ్మ ఆకలి తీర్చింది . నిద్రొచ్చింది…. నేను చిన్నపిల్లవాని కదా! నేనేం చేయగలను….
అవునయ్యా! మనం ఆ విగ్రహ మూర్తిని దొంగతనం చేసుకొస్తే ఎలా ఉంటుంది? అర్ధరాత్రి మనిద్దరం వెళ్లి ఆ విగ్రహ మూర్తిని తీసుకువద్దామా! దొంగతనం చేసుకుని వద్దామా ! మనం కష్టపడి తెలుసుకుని, తెచ్చుకున్న విగ్రహ మూర్తిని మనం తెచ్చుకోకుండా వాడెవడికో ఇవ్వటం ఏంటి? అంటే పిచ్చోడా! విగ్రహం మూర్తికి చుట్టూ 1000 మంది కాపలా ఉన్నారు . మళ్లీ వచ్చే నాగ పంచమి దాకా వాళ్లకి పాతాళ గుహ తెరుచుకోదు . అందుకోసం అని గుడిసెలో ఆ విగ్రహ మూర్తిని ఉంచి, దానికి 100 మందిని కాపలా ఉంచారు. చీమ చిటుక్కుమన్నా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరో వస్తున్నారు…. దీన్నేదో చేయబోతున్నారు అని కూడా ధ్యానంలో తెలుసుకోగలరు. ఫలానా వాళ్లు అని కూడా ధ్యానంలో తెలుసుకోగలరు. ఇప్పుడు నువ్వు అంటున్న మాటలు ధ్యానంలో తెలుసుకొని , ఇప్పుడు మన ఇంటి చుట్టూ నిలబడ్డా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమనుకుంటున్నావ్ వాళ్ల గురించి… వాళ్లు పరిపూర్ణ సాధకులు . వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు…. అనేసరికి మరి పరిపూర్ణ సాధకులు అన్నప్పుడు మనం విశ్వవినాశనం చేయట్లేదు ……లోక కళ్యాణార్థం చేస్తున్నామని తెలుసుకోలేరా! అని బాల గణపతి అనేసరికి ….నువ్వు విశ్వవినాశనం చేస్తున్నావా! లోక కళ్యాణం చేస్తున్నావా! అనేది వాళ్ళు పట్టించుకోరు…. తెలుసుకోరు…. ఆలోచించరు…. వాళ్ళకి రక్షణ కర్తవ్యం ఏంటి అంటే, ఈ సాధన విగ్రహ మూర్తిని రక్షించాలని. 1000 మంది అఘోరాలకి బాధ్యత అప్పజెప్పారు. ఎనిమిది అఖండాలు ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు….. దీనికి బాధ్యత వహిస్తున్నారు. వాళ్ళకి విగ్రహంలో సజీవ ఆది రుద్ర మూర్తిని దర్శనం చేసుకునే అవకాశం ఉందని వాళ్ళకి తెలియదు . వాళ్ళ పెద్దలు, వాళ్ల గురువులు…. ఈ విగ్రహ మూర్తిని కాపాడమని చెప్పి, ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకు కాపాడమన్నారు అనేది వాళ్ళు ఆలోచించరు. అంతెందుకు కాశీ విశ్వనాథుడే వచ్చి నాకు ఆ విగ్రహ మూర్తి కావాలని అడిగినా ఇవ్వరు …అంత మూర్ఖపు భక్తితో ఉంటారు . అంత రక్షణ కవచంతో ఉంటుంది. గురువుకు మాట ఇస్తే ప్రాణం పోవాల్సిందే. మాట తప్పరు. అంత రక్షణ సైన్యం ఆ విగ్రహ మూర్తికి ఉన్నది. ఇప్పటిది కాదు… ఎన్నో తరాల నుంచి వచ్చింది . మా తాతల వంశం నుంచి తరాల నుంచి ఈ యంత్ర భాగాన్ని ఎలా కాపాడారో ….వీళ్ళ వంశస్థుల తరాల వాళ్ళు విగ్రహ మూర్తిని కాపాడుతూ ఉన్నారు. ఆ బాధ్యత తీసుకున్నారు.
సరే బాధ్యత తీసుకున్నారు…. బాగానే ఉంది. నాగాభరణం అయిన వాసుకి సర్పమే పక్కకి తప్పుకొని విగ్రహం ఇచ్చినప్పుడు, వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తించడం ఏమిటి ? వీళ్ళు వెంట పడటం ఏమిటి? వీళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి? అయినా నువ్వు చెప్పావు కదా! వాళ్ళు మూర్ఖులు…. వాళ్ళ గురువులు ఏం చెప్తే అది చేస్తారని…. ప్రాణము పోయినా, ప్రాణాలు తీసిన పట్టించుకోరని చెబుతున్నావు కదా! ఇప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం కలిగించేది ఎవరు? విషయం చెప్పేది ఎవరు? మన దగ్గరికి విగ్రహ మూర్తి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది ?అసలు నిజంగానే ఆ విగ్రహ మూర్తి వలన మనం విశ్వ రహస్యం తెలుసుకుంటామా? ఎందుకంటే….. ఆ విగ్రహ మూర్తిని చూస్తుంటే, ఏదో సాధారణ మనిషి కూర్చున్నట్టుగానే ఉంది. ఏదో పద్మాసనంలో ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంది. కాకపోతే సాధారణంగా వ్యక్తికి రెండు చేతులే ఉంటాయి. కాకపోతే నాలుగు చేతులు ఉన్నట్లుగా గమనించాను. ఏదో డమరుకం మీద కూర్చున్నట్టుగా ఉంది. కాకపోతే విగ్రహ మూర్తి నుంచి ఓంకార నాదం రావటం విన్నాను….. గమనించాను…. ఆయన నోట్లో నుంచి నాకు ఓంకార నాదం విన్నట్టుగా అనిపించింది. కానీ పూర్తిగా ఆ విగ్రహా మూర్తి స్పర్శ మానవ స్పర్శ లాగా అనిపించింది. కాబట్టి ఏదో ఉంది…. ఆ విగ్రహ మూర్తిలో ….ఆ విగ్రహ మూర్తిని తెలుసుకుంటే గాని నిగ్రహం కలిగి సజీవ మూర్తి రాడేమో! కానీ , మనకి అవకాశం లేకుండా చేశారు. చేతికి అందింది నోటికి అందట్లేదు. అల్లుడు నోట్లో శని ఉంటే ఏం చేయగలం అని బాల గణపతి ఆవేదన చెందుతూ, తనలో తను గొనుక్కుంటూ…. మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళ ముగ్గురు కూడా , ఏం చేయాలని ఆలోచిస్తూ గదిలో ఉండిపోయారు . వీళ్ళకి ఆహారం వండాలి అనుకొని….. వీళ్ళకి సంబంధించిన ఆహారం తయారు చేసే పనిలో శివ నందిని, మహాదేవి వంటగదిలోకి వెళ్లారు . పిల్లవాడు….. రుద్ర స్వామి ఒడిలో పడుకొని , ఏదో దీర్ఘ ఆలోచనలో వీళ్ళిద్దరూ ఉండిపోయారు.
వంట పూర్తి అయిన తర్వాత వీళ్ళ నలుగురు తినేసి, ఆ సామాన్లన్నీ కడుక్కున్న తర్వాత ……విశ్రాంతిగా కూర్చుని ఉన్న సమయంలో…. శివ నందినికి ఉన్నట్టుండి ఏదో తెలియని ఉన్మాద స్థితికి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఎవరో తనని లేపుతున్నట్టుగా…. లాక్కెళ్తున్నట్టుగా…. తీసుకువెళ్తున్నట్టుగా అనిపించింది . ఈ శరీర స్థితిగతులను వీళ్ళ ముగ్గురు గమనించారు. పైకి లేచి, మూసి ఉన్న తలుపులు తెరుచుకుని, ఎవరో తనని ఒంటి మీద ఉండి నడిపిస్తున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది అర్థం కాలేదు ….ఏం మాట్లాడటం లేదు…. చూపులు మాత్రం ఉగ్రంగా ఉన్నాయి. సరే అని ఈమెను అనుసరిస్తూ, ఎక్కడికి వెళ్తుందో అని వీళ్ళ ముగ్గురు కూడా ఏం మాట్లాడకుండా అనుసరిస్తూ వెళ్లారు. ఈమెను అనుసరిస్తూ వెళ్లేసరికి…. ఈమె ఏవేవో ఘాట్ లు దాటుకుంటూ వెళ్ళిపోతూ…. ఎక్కడికో వెళ్తుంది. ఈమె ఎక్కడికి వెళ్తుంది అని గమనిస్తూ వచ్చారు. అలా కొంత దూరం వెళ్ళే సరికి, రాంనగర్ ప్రాంతంలో ఉన్న బాబా కీనారామ్ అఘోర ఆశ్రమం లోపలకి వెళ్లడం రుద్ర స్వామి గమనించారు. ఈ ఆశ్రమంలోకి వెళ్తుందని వీళ్ళ ముగ్గురు కూడా వెళ్లారు. వెళ్లేసరికి ఇప్పటిదాకా ఇలాంటి ఒక ఆశ్రమం ఉందని శివ నందిని చూడలేదు. ఉందని తెలుసు కానీ…. ఇది అఘోర సాంప్రదాయానికి మూలపురుషుడైన కీనారం బాబా సమాధి ఈ ఆశ్రమంలో ఉంటుందని, ఈ ఆశ్రమంలో ఆయన పూజించిన హింగ్లాజ్ మాత యంత్రం ఉంటుందని చెప్పి మహాదేవి చెబితే విన్నది.
అలాగే ఈ ఆశ్రమంలోని కుండ్ ని క్రిమికుండ్ అంటారు. ఈ కుండంలో ఎవరైనా దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు సుమారుగా 5 మంగళ వారాల పాటు స్నానాలు చేసి, ఆ తడిసిన బట్టలను అక్కడే వదిలేసి పొడి బట్టలు వేసుకొని వెళ్లిపోతే ….వాళ్లకి ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పేసి… ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇది నిజమని చాలామంది అనుభవాలు కూడా నిరూపించాయి. కాకపోతే అఘోరాలు అంటే శవాలను పీకు తినేవాళ్లు అనే ఒక అపార్థం జనాల్లో ఉంది . కానీ నిజానికి వీళ్ళు శవాల్ని పీక్కు తినేవాళ్లు కాదని…. శివ భక్తులని చెప్పేసి ఈ కీనారామ్ లోకానికి నిరూపించి చూపించారు. అపారమైన భక్తి తత్పరత కలిగినవాడు.అలాగే ఈ కీనారామ్ స్మశాన కాళీ ఉపాసన చేసేవాడు . కాళీమాత చెప్పిన ఆదేశం ప్రకారమే, ఈయన కాశి క్షేత్రానికి చేరుకొని…. ఈ పీఠమును పెట్టడం జరిగింది . అలాగే అఘోర సంప్రదాయాన్ని కొనసాగించడం జరిగింది. ఆయన సుమారుగా 1000 సంవత్సరాల క్రితం వెలిగించిన ధుని ….ఇప్పటికి నిత్య సత్యంగా ఆరకుండా వెలుగుతూనే ఉంది . ఇప్పుడు ప్రస్తుతానికి 11వ పీఠాధిపతి అఘోర బాబా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి తెలుసుకుంది. అక్కడ ఉన్న కీనారామ్ సమాధి ఆయన ప్రతిష్టించిన హింగ్లాజ్ మాత యంత్రము ఉన్నాయి. ఇక్కడ క్రిమి కుండ్ లో ఈ స్నానం నలుగురు చేశారు . తడి బట్టలతో బయటకు వచ్చి, హింగ్లాజ్ మాత దగ్గర కూర్చుని…. బాధపడుతూ, ఏడుస్తూ, ఏదో తెలియని ఆవేదనతో…. హింగ్లాజ్ మాత యంత్రం ఉన్న దగ్గరికి వెళ్ళింది. శివ నందిని ధ్యానంలో కూర్చుంది.. ఈమెను అనుసరించి ముగ్గురు ధ్యానంలో కూర్చున్నారు. ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. శివ నందిని కళ్ళు మూసుకుని తీవ్ర ధ్యానంలో ఉన్నది.
ఉన్నట్టుండి శివ నందినికి ధ్యానంలో హింగ్లాజ్ మాత విగ్రహ మూర్తి కనబడింది. ఆ విగ్రహం తలని కాస్త కపాలంగా మార్చి ,తన చేతికి ఇచ్చినట్లుగా లీలాగా ధ్యానానుభవం అయ్యింది . ఇది అర్థం కాక ధ్యాన భంగమై కళ్ళు తెరిచింది. ఎదురుగా చూస్తే విగ్రహం కింద ఉన్న యంత్రం యధావిధి గానే ఉంది. ఇదేంటి అమ్మవారు తలనరుక్కోవడం ఏమిటి? తల కాస్త కపాలంగా మారడం ఏమిటి? ఆ కపాలం తన చేతికి ఇవ్వడం ఏమిటి? అని ఏమీ అర్థం కాలేదు. సరే అని అక్కడ ఉన్న ముగ్గురికి తన ధ్యానం అనుభవం చెప్పింది . ఇది విన్న రుద్ర స్వామి…..“ ఇలా కనపడింది అంటే, అమ్మవారు నిన్ను అనుగ్రహించింది. అమ్మవారు నీకు తోడుగాను, సహాయంగాను ఉంటుంది. ఈ అఘోరాల వలన మనం అవమానం పొందాము కదా! మన దగ్గర ఉన్న విగ్రహ మూర్తిని వాళ్ళు తీసుకువెళ్లారు కదా! ఈ అఘోర సాంప్రదాయ మూల పురుషుడైన కీనారాం బాబా ద్వారా….. ఆయన పూజించిన హింగ్లాజ్ మాత మనకేదో సహాయం చేస్తుంది అనుకుంటాను….. ఇది శుభ సూచికమే! మనం కంగారు పడాల్సిన అవసరం లేదు… భయపడాల్సిన అవసరము లేదు… జరగబోయేది ఏంటో చూద్దాం. నువ్వు ఇక్కడిదాకా ఎందుకు వచ్చావో తెలియదు…. ఎందుకు రమ్మన్నారో తెలియదు. సరే అని చెప్పి అక్కడ ఉన్న కినారం సమాధికి నలుగురు కలిసి వెళ్లి నమస్కారం చేసుకొని బయటకు వచ్చారు.
ఇలా బయటకు వస్తూ ఉండేసరికి, ఒక అవధూత స్థితిలో నల్లని వస్త్రాలు ధరించి…. చేతిలో కపాలం పట్టుకుని ఉన్న ఒక అఘోర కనపడ్డాడు. కనబడి ఏంటమ్మా! ఏంటి! అమ్మవారి కపాలం కావాలా? అమ్మవారి కపాలం కావాలని తిరుగుతున్నావా? దేనికోసం..? ఆ విగ్రహం మూర్తి కోసమా! ఆ విగ్రహ మూర్తిని పట్టుకుంటే సజీవ మూర్తి దొరుకుతాడు అనుకుంటున్నావా? ఇదిగో అమ్మ ఇచ్చిందిగా కపాలం…. ఇదిగో తీసుకువెళ్ళు… ఈ కపాలమే ఏం చేయాలో…. ఎలా చేయాలో చూసుకుంటుంది. ఇంతవరకు నువ్వు కపాలం పట్టుకోలేదు కదా! పట్టుకో! ఈ కపాలమే నిన్ను చూసుకుంటుంది….ఈ కపాలం ఒక స్త్రీ మూర్తి కపాలం. ఇది ఎందుకు నా దగ్గరికి వచ్చిందో నాకు తెలియదు. నీకు ఉపయోగపడుతుందని తెలిసింది. నువ్వేదో లోకానికి మేలు చేస్తావని తెలుసు…. కానీ మా వాళ్ళు అడ్డుపడుతున్నారని తెలుసు. అమ్మ అనుగ్రహం పొందావు కదా! అమ్మకే మోక్షం ఇస్తావేమో! చూద్దాం…. అమ్మ బతికే ఉంది కదా! అమ్మకే మోక్షం ఇస్తావేమో…. అమ్మ మోక్షం పొందితే మేమంతా మోక్షం పొ ందినట్టే కదా ! మేమంతా మోక్షం పొందితే విశ్వ మోక్షమే అవుతుంది కదా! నాకంటూ తెలియని విషయం లేదు….. అన్నీ తెలుసు…. నేనెవరో నీ వెనుక ఉన్న రుద్ర స్వామికి తెలుసు. నేను ఎలాంటి వాడినో తెలుసు. నేను ఊరికే కనపడను అని తెలుసు ….ఎరా ….తెలుసుగా…. నేను ఎవరో…. అనేసరికి రుద్ర స్వామి నమస్కారం చేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు., ఆ ఏమి చెప్పకు ….నా గురించి ఏమీ చెప్పకు …..నేనుండగా ఏమీ చెప్పకు….. నా గురించి ఇప్పుడు చెప్తే వీళ్లంతా నా వెంట పడతారు ….జాగ్రత్త! అందరూ నా వెంట పడుతూ ఉంటే ,అమ్మ చెప్పింది అని నేను నీ వెంట పడ్డాను. ఎందుకంటే అమ్మ తలకాయ ఇచ్చింది ….ఆ తలకాయ ఈమెకు ఇవ్వాలి. ఈమెకు ఇవ్వటానికి వచ్చా అని చెప్పి తన చేతిలో ఉన్న కపాలాన్ని శివ నందిని చేతిలో పెట్టేసరికి కొద్దిగ ఇబ్బంది పడింది. అప్పటిదాకా పుర్రెలు చూసిందే కానీ…. తాకలేదు . అప్పుడే రెండు మూడు రోజుల క్రితమే చచ్చిపోయిందో లేదా బతికి ఉన్న శరీరంలో నుంచి పుర్రెను తీసి ఇచ్చినట్టుగా అనిపించింది …ఎందుకంటే ఇంకా రక్తం వాసన వస్తుంది. రక్తం మరకలు ఉన్నాయి… నోట్లో నుంచి రక్తం కారుతున్నట్టుగా కనిపించింది …సరేలే ఇది ఎందుకు వచ్చిందో… శౌచం , అశౌచం అనుకుంటూ కూర్చోకూడదు…. అఘోరాలకి ఈ రెండు ఉండవు. వీళ్ళు మంచిలోనూ మంచి చూస్తారు….. చెడులోనూ మంచి చూస్తారు……వాళ్ళకి మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం ఉండదు. వాళ్ళకి తెలిసిందాల్లా ఏకత్వస్థితి. ప్రతిదీ కూడా వాళ్లకి బ్రహ్మ పదార్థమే …..చచ్చినవాడు బ్రహ్మ పదార్థమే…. బతికి ఉన్నది కూడా బ్రహ్మ పదార్థమే….. వాళ్ళని ఏమీ అనటానికి లేదు. అనేసరికి రుద్ర స్వామి అనుజ్ఞ ఇచ్చేసరికి శివ నందిని కపాలాన్ని తీసుకొని ముందుకు వెళ్లిపోయింది… సరే అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కపాలం ఇచ్చిన వ్యక్తి కనిపించలేదు . ఈయన ఎవరు అని అనుకునేసరికి …
అమ్మ! అమ్మ! వీడు కపాలం ఇచ్చిన వాడు సామాన్యమైన వాడు కాదు…. తంత్ర, మంత్ర యంత్రాలను తెలిసినవాడు. మాయగాడు… యోగ పరీక్షలు పెడతాడు ….ఎలా ఉన్నావు…. ఏం చేద్దాం అని అంటాడు…అన్ని తెలిసినవాడు…. ఏమీ తెలియనట్టు ఉంటాడు. మంచి వాళ్ళకి మంచిగా ఉంటాడు… చెడ్డ వాళ్లకే చెడ్డగా ఉంటాడు… ఒక్కొక్కసారి అఘోరా గా ఉంటాడు…. ఒక్కొక్కసారి శివుడిగా కనపడతాడు…. ఒక్కొక్కసారి అమ్మవారిగా వస్తాడు… ఎట్టా రావాలంటే అట్ట వస్తాడు… ఏం కావాలనుకుంటే అది చేస్తాడు…. ఇంతకీ… ఆయన ఎవరో తెలుసా అనగానే నాకు తెలియదు… నేనెప్పుడూ చూడలేదు…. ఎప్పుడు చూసినా నాకు అర్థం కాదు… నా దగ్గరికి వచ్చి నేను తింటున్న ఉండ్రాళ్ళు లాక్కుంటాడు…. నా బుగ్గలు లాగుతాడు…. నా ముక్కు గిల్లుతాడు…. నా పంచలాగేస్తాడు…. నా బుడంకాయ పట్టుకొని గెలుకుతాడు …..ఆట పట్టిస్తాడు…. అదేమన్నా అంటే నువ్వు నాకు ఇష్టం రా అంటాడు….. నాకు నీతో చాలా చుట్టారికం ఉందిరా…. ఏమనుకోకు రా! అని వెళుతూ…. వెళుతూ పెద్ద ఉండ్రాయి చేసి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈయన ఎవరో ఏంటో నాకైతే అర్థం కాదు…. మనిషి చూస్తే అర్థమయి కానట్టుగా ఉంటాడు…. ఏదన్నా తెలుసా! అంటే అయ్యకి తెలుసు అన్నాడు కదా! ఆయన్ని అడుగు ….అనగానే రుద్ర స్వామి కాస్త ఎవరో కాదమ్మా ! కంగారు పడకు! ఆయన దత్తాత్రేయ స్వామి …. హింగ్లాజ్ మాత నుంచి ఆయనకి అనుమతి రావటంతో స్త్రీ మూర్తి యొక్క కపాలాన్ని ఇచ్చారు . ఈ కపాలాన్ని చివరిదాకా చూసుకో…. ఈ కపాలం మోక్షం పొందితే , నువ్వు మోక్షం పొందినట్టు…. లేదంటే వ్యక్తిగత మోక్షం అవుతుంది ….ఎందుకంటే పరమహంస చెప్పిన కపాలమోక్ష గ్రంథం ప్రకారం 63 కపాలలో 63 కపాలాలు విశ్వ శూన్యంలో కలిసిపోతాయని పురుషకపాలం శూన్యం అవడానికి చాలా కాలం సాధనలో అనుభవాలు పొందుతూ వచ్చారు. చివరికి ఆయనకి ఏక మూల కపాల శూన్యం అయింది…. అలాగే స్త్రీ మూర్తి కపాలం నీ దగ్గరికి వచ్చింది. ఈ ఏక మూల కపాలం , స్త్రీ మూర్తి కపాలం మోక్షం పొందాలి. ఇది శూన్యం అవ్వాలి. అప్పుడు అది విశ్వమోక్షం అవుతుంది…. అది ఎప్పుడు…. ఎలా…. ఏంటి? అనేది జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ కపాలమే సాధన విగ్రహ మూర్తి దగ్గరికి తీసుకు వెళుతుంది …పదా అని అఘోరాలు ఉన్న అఖండానికి వీళ్ళు బయలుదేరడం జరిగింది. ఏది ఉన్నా , ఏది లేకపోయినా…. ఆమెను రక్షించే దైవాలు ఉన్నారని శివ నందిని మనసులో అనుకొని అంటే రక్షించే వాళ్ళు ఉన్నారు, అడ్డగించే వాళ్ళు ఉన్నారు అని గ్రహించి….. ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ… ఆ కపాలం అలాగే పట్టుకొని రుద్ర స్వామి వెంట ఈ ముగ్గురు నడుచుకుంటూ….. రాత్రి వీళ్ళకి దొరికిన సాధనా విగ్రహ మూర్తి ఉన్న అఖండ ఆశ్రమం వైపుకి మౌనంగా బయలుదేరారు.
అఘోరులు దాచిన సాధనా విగ్రహ మూర్తి ….అఖండ ఆశ్రమం అనేది గంగా నదికి అవతల విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఉన్నది అని….. రుద్ర స్వామికి తెలియడంతో….. పడవ సహాయంతో గంగానది అవతలి ఒడ్డుకి వీళ్ళు నలుగురు చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత పడవ దిగి ఆశ్రమం వైపుకు వెళ్లేసరికి….. కొన్ని వందల మంది అఘోరులు ఉండవలసిన చోట వేలమంది ఉన్నారు. వీళ్ళందర్నీ చూసేసరికి బాలగణపతికి ఏదో తెలియని భయం, కంగారు వేసింది. వెంటనే శివ నందిని దగ్గరికి వెళ్లి…. అమ్మ! అమ్మ ! ఈ ఒక్కరోజు నువ్వు నన్ను రక్షించు…. జీవితాంతం నేను నిన్ను రక్షిస్తాను.. నాకైతే తెలియని భయం, బెరుకు వస్తుంది. దడ గా ఉంది. నాకు ఉచ్చ పడేలా ఉంది. నన్ను క్షమించు అంటూ… ఈమె చీర కొంగులోకి…. తన తలని దాచుకుంటూ ఉండేసరికి….. శివ నందిని చేతిలో ఉన్న స్త్రీ మూర్తి కపాలం రక్తం కారుతూ….. ఉన్న దీన్ని చూసేసరికి ఉగ్రంగా కోపావేశాలతో ఉన్న అఘోరులు ఈమెను ఏదో చేద్దామనుకున్న వాళ్లకు …..ఈ నలుగురికి అఖండ ఆశ్రమానికి దారి ఇవ్వటం జరిగింది. అలా వీళ్లు దారి ఇస్తూ ఉండేసరికి…. ఈ నలుగురు మౌనంగా, శాంతంగా…. అఖండ ఆశ్రమంలో ఉన్న అధినాయకుని కలవడానికి వెళ్లారు.తీరా లోపలికి వెళ్లేసరికి అధినాయకుడు ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. వీళ్ళు వచ్చిన రాకను తెలుసుకొని….కళ్ళు తెరిచి ,శివ నందిని చేతిలో ఉన్న స్త్రీ మూర్తి కపాలాన్ని చూసి….. నమస్కారం చేసి …..అమ్మ! నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ పిల్ల చేతిలో చిక్కుకున్నావు….. అని కపాలాన్ని అడిగేసరికి….నాయనా! ఈమె సాధన చేస్తే ఈమె ద్వారా నేను మోక్షం పొందాలని అనుకుంటున్నాను. నేను ఎన్నో కోట్ల జన్మల నుంచి మోక్షం పొందాలని ప్రయత్నం చేసినప్పటికీ…. ఏదో ఒక అనివార్య కారణాలవల్ల ఏదో ఒక మాయలో పడిపోతున్నాను. ఒకప్పుడు భర్త మాయలో పడితే ….ఒకప్పుడు పుత్ర వ్యామోహం లో పడిపోతున్నాను. మరొకప్పుడు సిద్దుల మాయలో పడుతున్నాను . మరొక సారి ఐశ్వర్యం…. ఇంకోసారి కీర్తి ప్రతిష్టలు, ఇంకోసారి సృష్టి, స్థితి ,లయలు చేస్తూ…. విశ్వాన్ని నడిపించాలని చూస్తున్నాను. అలా మాయలో పడుతున్నాను. ఇలా పది రకాల మాయల్లో ,మర్మాల్లో పడిపోతూ ఉన్నాను. నా భర్త అయిన పరమేశ్వరుడు మాత్రం…. మోక్షమును పొంది ఆయన శూన్యమయ్యాడు. ఆ మోక్షమును నేను పొందలేకపోతున్నాను. ఈమె ద్వారా ఆ మోక్షమును పొందాలనికాశీ క్షేత్రానికి రమ్మనడం జరిగింది. ఈమె కోసమే నేను సాధన విగ్రహ మూర్తిని రక్షించమని మీకు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. అందుకు మీరు నా ఆజ్ఞగా ఇన్నాళ్లు కాపలాగా కాస్తూ వచ్చారు. కాకపోతే ఈమె ఈ విగ్రహ మూర్తిని తీసుకొని లోక కళ్యాణార్థం ఉపయోగిస్తుందో లేక వినాశనానికి ఉపయోగిస్తుందో అని అనుమానం నీలో ఉంది. అందువలన అఘోరాలు అందరూ చుట్టుముట్టారు. కాకపోతే ఇది ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఒకవేళ మాయలో పడి తన స్వార్థానికి తన సాధనా శక్తిని ఉపయోగించినట్లయితే….. ఈ విగ్రహ మూర్తి…. నీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ నువ్వు యధావిధిగా నాగపంచమినాడు పాతాళ గుహ లో దాచి ఉంచి నీ జీవితాంతం కాపలా కాస్తూ ఉండు . ఒకవేళ ఈమె నిస్వార్ధంగా ఎలాంటి దురుద్దేశం లేకుండా….. సాధన పరి సమాప్తి చేసుకున్నట్లయితే…. నాకు పూర్ణ మోక్షం కలిగి, నేను పూర్ణ శూన్య స్థితి పొందడం జరుగుతుంది. పురుష ప్రకృతి మోక్షం పొందినట్లుగానే, స్త్రీ ప్రకృతి కూడా మోక్షం పొందినట్లయితే… అది విశ్వమోక్షం అవుతుంది. లేదంటే ఆమెకి అది వ్యక్తిగత మోక్షం అవుతుంది. నేను తిరిగి యధా స్థానంలో కీనారం బాబా ఆశ్రమానికి వచ్చేస్తాను. ఒకవేళ రాకపోతే పూర్ణ మోక్షం పొందినట్లే అనుకో…. నేను పూర్ణ మోక్షం పొందానో లేదో ఈ కపాలమే చెబుతుంది. ఈ కపాలాన్ని ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉంచి ….నువ్వు తీసుకువచ్చిన సాధనా విగ్రహం తిరిగి ఆమెకు ఇవ్వు. ఒకవేళ ఈమె సాధనాస్థితిలో మాయలు తట్టుకోలేక, స్వార్థానికి తన సాధన శక్తిని ఉపయోగించినట్లయితే, ఈమెకు కాపలా ఉన్న రుద్ర స్వామి దగ్గరికి చేరుతుంది . ఈయన ద్వారా ఈ విగ్రహ మూర్తిని తీసుకొని, యధా స్థానంలో పెట్టు. ఈ విగ్రహ మూర్తికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మహాదేవి ,రుద్రస్వామి ,బాలగణపతి కాపలాగా ఉంటారు. జాగ్రత్తగా చూసుకుంటారు . వీళ్ళు ఈ విగ్రహ మూర్తి ఆరాధన ద్వారా సజీవ రుద్ర మూర్తిని చూడాలని చెప్పి అనుకుంటున్నారు. ఈమె ద్వారా నేను పూర్ణ కపాల మోక్షం పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈమె స్త్రీ ప్రకృతికి మోక్షం ఇచ్చే స్త్రీ సాధకురాలని గ్రహించు. ఏమాత్రం ఆలోచించకు….ఎలాంటి సందేహాలు, అనుమానాలు, భయాలు ,పెట్టుకోకు . యధావిధిగా ఈమెకి విగ్రహ మూర్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వు అని ఆజ్ఞ ఇచ్చేసరికి…. అమ్మ ! నీ ఆజ్ఞను నేను ఎప్పుడైనా కాదన్నానా ? నీ మాటని నేను ఎప్పుడైనా ఎదిరించానా! కాకపోతే ఈమె గురించి నాకు తెలీదు . నువ్వు చెబుతున్నావు….. నువ్వు దర్శనం ఇచ్చావు అంటే ఈమె సాధారణమైన వ్యక్తి కాదు….కారణజన్మురాలు అయి ఉంటుంది. ఏదో తెలుసుకోవాలి…. ఏదో మోక్షం పొందాలి అని నువ్వు అనుకుంటున్నావు…. అదేమీ నాకు తెలియదు. నీ ఆజ్ఞ. ఈ విగ్రహ మూర్తిని ఆమెకే ఇస్తాను…. ఆమె చేతిలో ఉన్న నీ కపాలం ఇక్కడ పెట్టి కాపలా కాస్తూ ఉంటాను.. ఒకవేళ నీ కపాలం శూన్యం అయ్యింది అనుకుంటే…. నువ్వు మోక్షం పొందావని భావిస్తాను. ఒకవేళ ఏదైనా సమస్య కాని వచ్చినట్టయితే, ఈమెని మాత్రం ప్రాణాలతో మాత్రం ఉంచను. ఒకవేళ ఈమె తన సాధన శక్తిని స్వార్థానికి వాడుకొని ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు చేస్తే మాత్రం …..ఈవిడని మాత్రం ప్రాణాలతో ఉంచను. ఈమె ప్రాణాలు నా చేతుల్లో పోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. నాకు ఆ వరములు ప్రసాదించు ….అనేసరికి తధాస్తు అని స్త్రీ మూర్తి కపాలం అనేసరికి అధినాయకుడు తను రాత్రి తెచ్చిన విగ్రహ మూర్తిని తీసుకువచ్చి… శివ నందిని చేతుల్లో పెట్టగానే, శివ నందిని చేతిలో ఉన్న హింగ్లాజ్ మాత కపాలం అధినాయకుడు తీసుకుని, మళ్లీ భద్రంగా లోపలికి తీసుకొని వెళ్లేసరికి వీళ్ళ మధ్య జరిగిన సంభాషణలు విని అఘోరాలు శాంతపడి, ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక! అనుకుంటూ అక్కడ నుండి ఎవరికి వాళ్లే వెళ్లిపోయేసరికి…. తమకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయేసరికి… ఆనంద ఆశ్చర్యాలకు లోనవుతూ ఈ నలుగురు కూడా తమ సాధన విగ్రహ మూర్తిని తీసుకొని మణికర్ణిక ఘాటుకి చేరుకోవడం జరిగింది.
అప్పటికే వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ….ఉన్న కృష్ణస్వామి అనిపించాడు. ఏం పిల్ల ! ఏంటి? నీ ఒళ్ళు ఎలా ఉంది? అఘోర నాయకుడు ఏదో అనుకొని వాళ్ళ ఇష్ట దేవత చెప్పిందని నీకు సాధనా విగ్రహ మూర్తి ఇచ్చాడని తెలిసింది. ఈ విగ్రహం నీకు ఎలా ఉపయోగపడుతుందో….. ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. ఈ విగ్రహం ఒకటి ఉందని , దీని కాపాడాలని మాత్రమే నాకు తెలుసు. వామాచారంలో వాళ్ళు కాపాడితే, దక్షిణాచారంలో నేను కాపాడతాను. నేను, విశాలాక్షి అమ్మ కాశీని కాపాడుతూ ఉంటాం. కాకపోతే వాళ్లు ఎందుకు వదిలిపెట్టారో తెలీదు. కారణం లేనిదే కార్యం ఉండదు కదా! ఒకవేళ నువ్వు ఈ విగ్రహంతో లోక విరుద్ధమైన ఆలోచనలు కానీ….. లోక విరుద్ధమైన పనులు కానీ చేస్తే, నేను సహించేది లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నేను వెంటాడి వెంటాడి చంపుతాను. నా దగ్గర ఉన్న సుదర్శన చక్రమే నిన్ను చంపడానికి చూస్తుంది. ఈరోజు నుంచి నీకు, ఈ విగ్రహ మూర్తి గురించి సహాయం చేసే సహాయకులను నేను ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతాను. నీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా…. నేను, అమ్మ కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ, నీ సాధనా శక్తికి ఆటంకాలు కలిగిస్తాము. అదేదో నువ్వు మోక్షం పొందితే , విశ్వ మోక్షం వస్తుందని చెబుతున్నారు…. ఈ జగన్నాటకాన్ని మేమిద్దరం కాపాడాలని అనుకుంటున్నాము… ఆడే వాళ్ళు ఆడండి… వెళ్లే వాళ్ళు వెళ్ళండి… ఆటని ఆపాలనుకోవడం స్వార్థం కాదా ! మాకు బతకాలని ఉంది. మాకు చావాలని లేదు. మాకు మోక్షం పొందాలని లేదు. ఈ జగన్నాటకంలో వివిధ రూపాలు ఎత్తాలని మా అందరికీ ఉంది. మమ్మల్ని ఎందుకు బలవంతంగా చంపాలని అనుకుంటున్నారు… మోక్షం ఇవ్వాలని అనుకుంటున్నారు… ఈ జగన్నాటకం ఎందుకు ఆపాలని అనుకుంటున్నారు… ఎవరి చావు వాళ్ళు చావచ్చు కదా! ఎందుకు నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావ్ ! నీకు కావాలంటే వ్యక్తిగతంగా చావుని ఇచ్చేస్తాను . కాశీ క్షేత్రంలో మరణిస్తే వచ్చే మోక్షమును నేను ఇచ్చేస్తాను . కావాలంటే చూడు. నా ఆయుధం ప్రయోగించమంటావా! అనగానే…..
రుద్రస్వామి:- అయ్యా! నానా కష్టాలు పడి ఈ సాధన విగ్రహ మూర్తిని కనుక్కొని, తీసుకు వచ్చాము . నువ్వు కలిగించిన అవాంతరాలు ఆ పిల్ల దాటింది. అఘోరులు, అమ్మవారు ఇచ్చిన ఆటంకాలు దాటింది. మాయలు దాటింది. ఇప్పుడిప్పుడే మేము సాధనలోకి అడుగుపెడుతున్నాము. ఇంకా సాధన కూడా ప్రారంభించలేదు ఈ పిల్ల… తన మరణమును మోక్షమరణం చేసుకోవాలని అనుకుంటుంది. భౌతిక మరణం వద్దని అనుకుంటుంది..కాశి క్షేత్రంలో మాకు ఎవరికీ కూడా మరణం లేదని నీకు తెలుసు. కాబట్టి మేము భౌతిక ప్రపంచంలోకి వెళ్లి మరణించాలని అనుకోవడం లేదు…భౌతిక మరణాలు పొందుతూనే, ఎన్నో జన్మలు అకారణజన్మలు ఎత్తుతూనే ఇక్కడికి వచ్చాము. కాబట్టి కర్మరాహిత్యం, కోరిక రాహిత్యం పొందాలని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ అమ్మాయి గాని సాధనలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో తప్పు చేసినా …..తన సాధనా శక్తిని స్వార్థానికి వాడినా ….లోక విరుద్ధానికి ఉపయోగించినా కూడా నువ్వు చంపాల్సిన అవసరం లేదు ..నేనే చంపేస్తాను. నేను ఆవిడకి రక్షకుడిగా ఉండి భక్షకుడిగా మారి చంపేస్తాను. నా మాట ఏంటో నీకు తెలుసు కదా! నేను మాట ఎవరికీ ఇవ్వనని తెలుసు కదా! నేను మాట ఇచ్చాను అంటే నిలబెట్టుకుంటాను కదా! ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే , నేనే చంపి తినేస్తాను. అంతవరకు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు అవాంతరాలు కలిగించవద్దు …ఆటంకాలు కలిగించవద్దు ….అయినా కూడా నువ్వు పరీక్షలు పెడతామని తెలుసు. ఏదో ఒకటి చేస్తామని తెలుసు ….కాకపోతే నువ్వు చేస్తావని నేను అనుకోను… చేయకూడదని అనుకుంటున్నాను! అనగానే రుద్రస్వామి కేసి చూస్తూ …
కృష్ణస్వామి:- ఒరేయ్! నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు…. నువ్వు పుట్టకముందు నుంచే నేను ఇక్కడ ఉన్నాను… కాబట్టి నీ మాటకు నేను విలువ ఇస్తున్నాను. ఒకవేళ ఆ అమ్మాయి గాని ఏమన్నా తప్పు చేసినా ,సాధనలో తప్పు చేసినా ….స్వార్థానికి వాడినా …ఏది చేసినా కూడా లోక విరుద్ధమైనది చేసినా కూడా తన చావు నీ చేతుల్లో కానీ నా చేతుల్లో కానీ అఘోరుల చేతుల్లో కానీ అమ్మవారి చేతుల్లో కానీ ఉంటుందని మాత్రం గుర్తుంచుకో! కుక్క చావు చస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో! జాగ్రత్తగా ఉండమని చెప్పు…. అని కృష్ణస్వామి వేణుగానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇదంతా గమనిస్తున్న బాల గణపతి, మహాదేవికి ఏదో తెలియని ఆవేశం వచ్చి ఉన్నట్టుండి… అసలు ఏంటమ్మా! ఇదంతా ఏదో ఒక విగ్రహ మూర్తిని తీసుకొచ్చినంత మాత్రాన అదేదో మనం తప్పులు చేసేస్తున్నామా? మోసాలు చేస్తున్నామా ?సృష్టి వినాశనం చేసేస్తున్నాము… లోక విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నామని ప్రతి వాళ్ళు అడ్డం రావటం ఏంటి? అసలే సాధనలో ఉన్నప్పుడు సాధనలో వచ్చే ఆటంకాలు, మాయలు అవాంతరాలు, మర్మాలు ,మాయలు అర్థం కాక ఒకపక్క కొట్టుకు చూస్తుంటే….. ఒకపక్క వీళ్ళ ఆటంకాలు సృష్టిస్తే వాటిని తట్టుకోవాలా? సాధనలో వచ్చే వాటిని తట్టుకోవాలా? ఆ మాయలు దాటుకోవాలా? నాకేం అర్థం కావట్లేదు. ధ్యానంలో కనిపించే రుద్ర మూర్తిని సజీవమూర్తిగా చూడటానికి ఇన్ని అవస్థలు పడాలా? ఇన్ని కష్టాలు పడాలా? ఎందుకు అవసరమా ! చచ్చేదేదో ఇక్కడే చద్దాం….. మోక్షం వస్తుందో, రాదో మనకి అనవసరం . కాశీలో చస్తే మోక్షం వస్తుంది అని శాస్త్రవచనం కదా ! ఎవరి అనుభవాలు వాళ్లకే ….ఎవరికి యోగం ఉంటే వాళ్ళు పొందుతారు. ఎక్కడికో వెళ్లి, ఏదో తెలుసుకుని అక్కడికి వెళ్లి చచ్చే బదులు, ఇక్కడే చద్దాం. ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది . ఒక్క చావు కోసం ఇన్ని కష్టాలు పడాలా? ఇన్ని సమస్యలు తెచ్చుకోవాలా! ఇన్నిటిని దాటుకోవాలా! అని అనుకోగానే బాల గణపతి వెంటనే ….
అమ్మ మహాదేవి చెప్పింది నిజమే..! మనకెందుకు వచ్చింది. ఈ విగ్రహ మూర్తిని తిరిగి కృష్ణస్వామికో ,అఘోర అధినాయకుడికో ఇచ్చేద్దాం… పనైపోతుంది. మన వల్ల కాదు… ఇప్పుడు ఇక్కడే ఇలా చుక్కలు చూపిస్తే ….రాను రాను సాధనలో లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకేం చేస్తారో తెలియదు . ఒకవేళ నువ్వు ఏదైనా తప్పుడు ఆలోచన చేస్తే, నీ తలకాయ తీసేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకో! మళ్ళీ నేను రక్షించలేదు, నేను చూడలేదు, నేను పట్టించుకోవట్లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను ముందే చెప్తున్నా. వాళ్ళు నేను చంపుతాము అంటే చంపమనే చెప్తాను ….నాకు ఎలాంటి బంధాలు ,బంధనాలు, బ ంధుత్వాలు ,బాధ్యతలు లేవు. కేవలం నువ్వు నాకు ఆహారం వండి పెట్టే అన్నపూర్ణ మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకో! నాకు ఎలాంటి బంధం, బాధ్యత, బంధనాలు అంటవు… అందరితోనూ ఉంటాను ….అందరివాడిగా ఉంటాను…. ఎవరికి అందని వాడిగా ఉంటాను… అది మాత్రం గుర్తుంచుకో!
రాత్రి విగ్రహ మూర్తి పోయేసరికి…అందరూ ఆందోళనకి గురయ్యారని ఒక్కొక్కళ్ళు వాళ్ల బాధను వెళ్లబుచ్చిన తర్వాత , వాళ్ళ ముఖంలో సంతోషం చూసిన తరువాత ఒక్కొక్కరికి విగ్రహాన్ని ఇస్తూ తాకమని చెప్పింది శివనందిని. ఆ తర్వాత విగ్రహ మూర్తిని తన ఎదురుగా పెట్టుకుని ఈ విగ్రహ మూర్తిలో ఏంటి విశేషాలు! విషయాలు ! చెప్పమని బాల గణపతి అడుగగా…..సంతోషం పట్టలేక ఇలాంటి విషయాలు నాకు చాలా ఇష్టం అమ్మ… పరిశీలించడం…. శోధించడం…. నాకు చాలా ఇష్టం లేదా కొత్త విషయం తెలియని విషయం తెలుసుకోవాలంటే నాకు చాలా ఆసక్తి . నా ఆసక్తిని గమనించావు అందుకే నువ్వు నాకు తల్లివి అయ్యావు అని చెప్పి ఆ విగ్రహ మూర్తిని తేరిపారా చూడటం మొదలుపెట్టాడు. తను గమనించిన విషయాలు ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. చెబుతూ….
అమ్మ ఈ విగ్రహ మూర్తిని చూడటానికి మహావతార్ బాబాజీ లాగా ఉంది. మహావతార్ బాబాజీ ఉన్న భంగిమలోనే ఈ విగ్రహ మూర్తి ఉంది గమనించావా! కాకపోతే మహావతార్ బాబాజీకి ఈయనకి తేడా ఏంటంటే….. మహావతార్ బాబాజీకి జుట్టు ఉంటుంది…. పురుషుడిలా కనిపిస్తారు….. ఈ విగ్రహ మూర్తికి జుట్టు లేదు. ఇది పురుషుడు అని చెప్పలేము… స్త్రీ అని చెప్పలేము. మర్మాంగం ఇటు పురుషాంగం లేదు ,ఇటు స్త్రీ యోనిగాను లేదు. ఒక ఉబ్బెత్తు భాగం మాత్రమే ఉంది . అటు పురుషుడు కాదు…. ఇటు స్త్రీ మూర్తి కాదు అని సాధనా విగ్రహ మూర్తి చెబుతుంది. అంటే నపుంసకస్థితి పొంది ఉండవచ్చు. అలాగే ఈయన పురుష మూర్తి దేవుడు కాదు. స్త్రీ మూర్తి కాదు కాబట్టి ఫలానా దేవుడు, పలానా నామము అని చెప్పడానికి మనకి అధికారం లేదు. ఈ విగ్రహ మూర్తికి పలానా రూపం లేదు….నామం లేదు. కాబట్టి రూప నామములకు అతీతంగా ఉన్నాడని అర్థమవుతుంది. కాకపోతే మహావతార్ బాబాజీకి రెండు చేతులు మాత్రమే ఉంటే, ఈ విగ్రహ మూర్తికి నాలుగు చేతులు ఉన్నాయి. రెండు చేతులేమో మహావతార్ బాబాజీ చేతులు ఒకదానిపై ఒకటి పెట్టుకున్నట్టుగా ఉంటే…. రెండు చేతులు మాత్రం గులాబీ రంగు పద్మాలు పట్టుకొని కూర్చున్నట్టుగా ఉంది . ఈ విగ్రహ మూర్తికి ఒకవైపు తాడు లాంటి పాము పాకుతున్నట్టుగా ఉంది. అలాగే విగ్రహ మూర్తిని తేరిపారా చూసినట్టయితే, ముందు వైపు యోగ పద్మాలు ఉన్నాయి. ఉండు లెక్కేస్తాను అని ఒకటి, రెండు ,మూడు…….. అంటూ మొత్తం 14 ఉన్నాయి. ఈ యోగ పద్మాలు 14 యోగ చక్రాల తో సమానం. అనుకుంటా…. ఎందుకంటే మన శరీరంలో కూడా 14 యోగ చక్రాలు ఉన్నాయి. ఈ విగ్రహం వెనుక వైపు చూస్తే 14 శివలింగాలు ఉన్నాయి . వెన్నుపాము అంతా కూడా 14 శివలింగాలు ఉన్నాయి. ఉండు ఒక్కొక్క శివలింగం పైన ఒక్కొక్క లోకం పేరు రాసి ఉంది అని పాతాళ లోకంతో మొదలుపెట్టి బ్రహ్మరంధ్రం వరకు సత్యలోకం వరకు అని రాసి ఉంది… అంటే మొత్తం మీద 14 లోకాలు, 14 యోగ చక్రాలు, 14 శివలింగాలు ఉన్నాయి. పైగా ఈ విగ్రహ మూర్తికి ఆభరణాలు గాని, పులితోలు గాని, ఏనుగు చర్మం కానీ లేవు. వస్త్రాలు కూడా లేవు. పైగా వాహనాలయిన జంతువులు కూడా ఈ విగ్రహానికి లేవు . కేవలం ఒక పాము ఉంది. ఆ పాము కూడా చచ్చిన పాములాగా నిద్రావస్థ లో ఉన్నట్టుంది. ఒకవేళ ఈ పాము ఆయన ధరించే నాగాభరణం అయి ఉండదు. కుండలిని శక్తికి జాగృతి చేసే పాము అయి ఉండాలి. నాకు తెలిసి శివలింగాలు ఉన్న శరీరం పురుష శరీరం అయి ఉంటుంది ……పద్మం ఉన్న శివలింగాలు ఎడమవైపు ఉన్నవి స్త్రీవి అయ్యి ఉంటాయి. కానీ ఈ విగ్రహ మూర్తిలో స్త్రీ ,పురుష తత్వాలు అయితే లేవు . రూపాలు లేవు …చూడ్డానికి ఈయన పురుషుడని చెప్పలేము, స్త్రీ అని చెప్పలేము. ఎలాంటి పురుష లక్షణాలు లేవు. ఎలాంటి స్త్రీ లక్షణాలు లేవు…. అంటే మన శరీరం సాధన అంతిమస్థితికి వెళితే ఇలాంటి సాధనా దేహం ఏర్పడుతుందేమో తెలీదు. ఇదే పూర్ణ దేహం ఏమో! ఎందుకంటే అర్ధనారీశ్వర దేహం ఉన్న విగ్రహ మూర్తి అయితే కాదు…. అర్ధనారీశ్వర అంటే ఒక పక్క పురుషుడు ఉంటారు, ఒక పక్క స్త్రీ మూర్తి ఉంటుంది. పురుషుడికి అనుగుణంగా శివుడు ఉంటాడు. స్త్రీకి అనుగుణంగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఆభరణాలు కానీ ….. చీరకట్టుగాని కనబడుతుంది. అదే శివ తత్వానికి వచ్చేసరికి నాగాభరణం, రుద్రాక్షలు తర్వాత ఏనుగు చర్మం, పులి చర్మం కనబడతాయి. అసలు ఇలాంటివేవీ లేవు. అలా అని నగ్నంగా ఉన్నాడా? అంటే నగ్నంగా లేడు. మర్మాంగం స్థానంలో ఉండి లేనట్టుగా ఒక ఉబ్బెత్తు స్థితి ఉంది. ఒకవేళ ఇది నపుంసకస్థితి అయి ఉంటుంది…. అంటే ఏంటంటే స్త్రీపురుషులకు అతీతమైన స్థితి అయి ఉండాలి. స్త్రీ పురుషరూపాలకు అతీతమైన స్థితి, నామరూపాలకు అతీతమైన స్థితి అయి ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇది పూర్ణ శూన్యమునకు వెళ్లే పూర్ణ రూపమై ఉండాలి. భగవంతుడు అంటే నామరూపాలకు అతీతమైన వాడు అని చెబుతారు. కదా! అలాంటి స్థితి ఈ విగ్రహ మూర్తి పొంది ఉంటుంది. అలాగే మానవ దేహంలో ఎలా అయితే యోగ చక్రాలు ఉన్నాయో…..అలాగే ఈ యోగ పద్మాలు శివలింగాలు ఆయన శరీరం మీద ఉన్నాయి . నాకు తెలిసినంతవరకు మన శరీరం మీద ఉన్నవి 14 యోగ చక్రాలు అయితే ఈ శివలింగాలు యోగ శరీరాలు అయి ఉంటాయి. అంటే 14 శరీరాలు 14 యోగ చక్రాలు సంకేతాలుగా చెబుతూ ఉండచ్చేమో! ఇది నా విశ్లేషణ …..పైగా ఇది డమరుకం మీద ఉంది. డమరుకం అనేది ఓంకార నాదానికి సంబంధించింది కదా! కాబట్టి ఈయన నాగ బంధనం లో ఉండి ఉండాలి. ఉండు చూస్తా అని చెప్పి తన నోటి దగ్గర చెవిపెట్టి చూసేసరికి…..శరీరంలో నుంచి ఓంకార నాదం వినపడుతుంది. ఓంకార శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే, గాలి హోరు ఓంకారం లా ఎలా వినపడుతుందో…. అలా వినపడుతుంది. నేను ముందే చెప్పాను కదా అనేసరికి అవునా అని అందరూ కూడా కుడి చెవి పెడితేనే ఓంకార నాదం వినపడుతుంది. అదే ఎడమ చెవి పెడితే ఓంకార నాదం వినపడట్లేదు. ఈ తేడాని గమనించి అందుకే కుడిచెవి ఆకాశం కేసి పెట్టి కాశీ క్షేత్రంలో మరణం పొందుతున్నారు. ఈ విగ్రహ మూర్తి ఇలా ఉండటంవలనే ఇలా జరుగుతుంది అని రుద్ర స్వామి వీళ్ళకి చెప్పాడు . పైగా ఈ విగ్రహ మూర్తి చూపు కూడా ఆకాశం కేసి చూస్తున్నట్లుగా ఉంది . ఎదురుగా చూడట్లేదు. అంటే ఏంటంటే తను అంతరిక్షంలో ఉన్న పూర్ణ శూన్యం కోసం ఎదురు చూస్తున్నాడు… అన్నట్టుగా ఆసక్తిగా అనురక్తిగా శ్రద్ధ భక్తులతో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా అవును నిజమే చూపు ఆకాశం కేసి ఉంది. చూడటానికి ఇది మహావతార్ బాబాజీ విగ్రహ మూర్తి లాగానే ఉంది అని చెప్పేసి…… కాకపోతే ఆయన పురుషుడు కాదు అని తెలుస్తుంది అని మహాదేవి కూడా అన్నది. ఇదంతా వింటూ చూస్తూ ఉన్న శివ నందిని ఒక్కసారిగా ఈ పద్మాల్లో ఏమున్నాయి…! ఈ పద్మాలేమిటి అని ఆలోచిస్తూ ఉండగానే తన చేతి సంచిలో నుంచి శివలింగం, గణపతి విగ్రహం మూర్తులు బయటికి తీశాడు బాలగణపతి….. అదేంటిరా నువ్వు వీటిని పాతాళ లోకంలో వదిలిపెట్టలేదా అంటే….. నువ్వు అక్కడ మర్చిపోయి వచ్చావేమో అని నేనే తీసుకొచ్చేశానమ్మ ! అని అన్నాడు. నేను ఈ సాధన విగ్రహం తీసుకునే హడావిడిలో అక్కడ ఉన్న ఆత్మలు భయపెట్టేసరికి, చేతిలో ఉన్న వీటిని వదిలిపెట్టేసి, విగ్రహ మూర్తి మీద ఏకాగ్రతతో వీటిని వదిలేశాను. వీటిని వదిలేసాను అని బాధపడ్డాను ,ఆవేదనపడ్డాను, సరేలే మనకి ప్రాప్తం లేదని అనుకునేసరికి……. నేనున్నాను కదా! అమ్మ, నువ్వు మర్చిపోయిన వాటిని గుర్తు చేయడానికి నేను ఉండగా నువ్వు ఏవి మర్చిపోలేవు…. అన్నింటినీ నేను పట్టుకువస్తాను….. నువ్వు మర్చిపోయినా నేను గుర్తు పెట్టుకొని మరీ తీసుకు వస్తాను. అయినా ఇవి నాకు ఇష్టమైనవి…. ఆడుకోవచ్చులే అని తీసుకువచ్చాను. ఇవి నీకు ఉపయోగపడతాయి అంటే నువ్వే తీసుకో! నాకేం అక్కర్లేదు…. అయినా మన దగ్గర విగ్రహ మూర్తులు చూసావా! వీటికి పద్మాలు ఉన్నాయి… ఇప్పుడు వచ్చిన సాధనా విగ్రహ మూర్తికి కూడా రెండు పద్మాలు ఉన్నాయి. పద్మంలో పద్మం పెడితే ఏమవుతుందో చూద్దాం….. అనేసరికి వీడి చిలిపి ఆలోచనకి అలా కాదేమో లేరా! ఒకవేళ విగ్రహం పగిలిపోయిందనుకో….. వీళ్ళందరూ మనల్ని కుమ్ముతారు…. చంపుతారు….. అనేసరికి అదే నిజమే! ఇప్పుడు ఈ విగ్రహానికి ఏదైనా అయినా శివనందిని ఏదైనా తప్పుడు ఆలోచన చేసినా ….మన చావు వీళ్ళ చేతుల్లో ఉంది .
ఉన్నట్టుండి శివ నందినికి ఒక ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు రుద్రస్వామి కేసి చూస్తూ ….అయ్యా! ఏమీ అనుకోవద్దు. నేను ఇది సాధనాపరంగానే అడుగుతున్నాను…. ఇప్పుడు పరమహంస అనుభవం ప్రకారంగా ఆయన ఏకాదశ దేహాలు, 13 యోగ చక్రాలు అని చెప్పారు. కానీ మనకి వచ్చిన ఈ సాధన మూర్తిని చూస్తే 14 యోగ చక్రాలు, 14 దేహాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పురుషునికి స్త్రీకి సాధనలో ఎలాంటి భేదం లేదు అన్నారు కదా! మరి ఆయన దేహాలకి నా సాధనా దేహానికి ఆయన యోగ చక్రాలకి, నాకు ఏమైనా తేడా వస్తుందా ! నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను ఏమైనా తప్పుడు విగ్రహ మూర్తిని తీసుకువచ్చానా? ఏదైనా విగ్రహ మూర్తికి బదులుగా ఈ విగ్రహాన్ని తీసుకువచ్చామా ఆలోచించండి…. ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. ఏదైనా కానీ అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది. ముందే తెలిస్తే ఈ విగ్రహ మూర్తిని యధావిధిగా ఇచ్చేసి ముందే తప్పుకోవచ్చు. ఏదైనా తేడా వస్తే మాత్రం చేయని తప్పుకు మనం బలి కావాల్సి వస్తుంది. నా ప్రాణాల గురించి నేను ఆలోచించను. నావల్ల మీ ముగ్గురి ప్రాణాలు పోకూడదు…. నావల్ల సజీవ మూర్తిని చూడాలనుకుంటున్నారు. అది మొదటికే మోసం వస్తే కష్టం…. అనేసరికి
రుద్రస్వామి:- అమ్మా ! ఇది నిజమైన విగ్రహము. ఈ సాధన విగ్రహ మూర్తి దేహమే దేవాలయం అని చెప్పడానికి వచ్చింది. ఇది మానవ సాధన శరీరానికి సంకేతం….. ఈ విగ్రహ మూర్తి అని నాకు అర్థం అవుతుంది. మన శరీరంలో ఏ యోగ చక్రాలు ఉన్నాయో …..ఈ విగ్రహంలో కూడా అవే యోగ చక్రాలు ఉన్నాయి. కాకపోతే నీ సాధనలో ఉండే యోగ చక్రాలు జాగృతి అయినప్పుడు ఈ విగ్రహంలో కూడా అదే విధంగా మార్పులు జరుగుతాయి. ఈ విగ్రహంలోకి మార్పులు మీ శరీరంలో సుస్పష్టం అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు…. ఇది అని నేను ఇదిమిత్తంగా చెప్పలేను. ఇది ఒక విధంగా నీ సాధనా దేహానికి ఈ విగ్రహ మూర్తి ప్రతిబింబం అనుకో! నీ సాధనలో జరిగే మార్పులు అన్నీ కూడా ఈ విగ్రహ మూర్తిలో జరుగుతాయి. ఈ విగ్రహ మూర్తిలో జరిగే సాధనా మార్పులు అన్నీ కూడా నీలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటావా? ఒకపక్క శివలింగం, ఒకపక్క గణపతి, విశాలాక్షి విగ్రహంలో కనబడింది. అలాగే ఈ విగ్రహ మూర్తిలో కూడా ఒక పక్కన కమండలం,మరోపక్క కమలము కనబడుతుంది. అంటే ఎడమవైపు దైవిక వస్తువులు ఉంచాలి. కుడివైపు సాధన శరీరాలకు వచ్చినప్పుడు ఆ వచ్చే దైవిక వస్తువులు ఉంచాలి. అంటే శివలింగాలను ఉంచాలని నాకు అర్థం అవుతుంది . అంటే చక్రాల దైవీక వస్తువులు ఒకవైపు , అలాగే సాధన శరీరాలలో వచ్చే 14 శివలింగాలు ఒక్కొక్కటిగా కుడివైపు ఉన్న పద్మములో పెట్టాలని నాకు అర్థం అయింది. అప్పుడే చక్రాలు అన్నీ కూడా ఒక్కొక్క చక్రం… ఒక్కొక్కటిగా జాగృతి అవుతూ వస్తుంది. అప్పుడు ఒక్కో లోక అనుభవాలు నీకు తెలుస్తూ ఉంటాయి అనుకుంటా! ఒకవేళ తప్పుడు దైవిక వస్తువు కానీ, శివలింగం కానీ తీసుకొని పెడితే ఏం జరుగుతుందో నాకు తెలియదు. విగ్రహమే మాయం అవ్వచ్చు ….విగ్రహమే పగిలిపోవచ్చు….. ఏదైనా జరగొచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. కాకపోతే జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేయాలి. ఇకపోతే పరమహంస చెప్పిన దానికి నీకు వచ్చిన విగ్రహ మూర్తికి యోగ చక్రాల విషయంలో యోగ శరీరాల విషయంలో తేడాలు ఉన్నాయి అనుకుంటున్నావు. కాబట్టి నువ్వే ధ్యానంలో కూర్చో ! నీకే తెలుస్తుంది….. ఎదురుగా ఈ విగ్రహ మూర్తిని పెట్టుకుని చూడు విషయం నీకే అర్థమవుతుంది. దీని గురించి నాకు తెలిసినా చెప్పలేని పరిస్థితి. వాక్ దిగ్బంధనం. అమ్మవారు వాక్కుని ఆపేస్తుంది. కాబట్టి నీకు నువ్వే తెలుసుకో! ఎవరి జ్ఞానం వారిది…. ఎవరి తత్వం వారిది. ఎవరి అనుభవం వారిది ఎవరు ఎంతవరకు వెళ్తారో ఎవరికి ఎరుక! కాబట్టి నీకు నువ్వే తెలుసుకో…. నీకే అర్థమవుతుంది అనగానే సరే అని సాధన ఆరంభ స్థితి కాబట్టి …..మంత్ర గురువు అయిన రుద్ర స్వామికి పాదాభివందనాలు చేసుకొని….. కాశీ విశ్వనాధుని, కాశీ విశాలాక్షిని అన్నపూర్ణ దేవిని, వారాహిని బిందు మాధవున్ని హృదయపూర్వక నమస్కారాలు చేసుకొని ఎదురుగా సాధన విగ్రహ మూర్తిని పెట్టింది. కళ్ళు మూసుకొని ధ్యాననిష్టలో కూర్చుంది . నెమ్మదిగా శివోహం మంత్రం చేసుకుంటూ ధ్యాన నిష్ట లోకి వెళ్ళ సాగింది. అప్పుడు ఈ విగ్రహం మూర్తిలో తన సాధన శరీరం కనపడటం మొదలుపెట్టింది. అంటే తన ఆత్మ శరీరం తనకే కనపడుతూ వచ్చింది . అంటే ఆ విగ్రహ మూర్తి స్థానంలో తన సాధన శరీరం ఉన్నట్టుగా కనపడుతుంది. ధ్యానంలో ఇదంతా చూస్తోంది…. ఇదేంటి ఇదంతా తన భ్రమ , బ్రాంతి అని చెప్పి కళ్ళు తెరిచేసరికి మూడు అడుగులు ఉన్న సాధనా మూర్తి మాత్రమే కనపడుతుంది. తిరిగి కళ్ళు మూసుకునే సరికి మూడు అడుగులు ఆత్మ శరీరం కనపడుతుంది. అంటే రుద్రస్వామి చెప్పింది నిజమే అన్నమాట! దానికి ఇది ప్రతిబింబంలాగా ఉంటుందన్నమాట! మనో నేత్రంతో వీటిని చూడొచ్చన్నమాట అనుకుంది. అసలు ఏమున్నాయి….. ఈ యోగ చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి….. అన్నప్పుడు 1. మూలాధార చక్రం 2) స్వాధిష్టాన చక్రం 3) మణిపూరక చక్రం 4) అనాహతం 5) విశుద్ధం 6) ఆజ్ఞ…. ఈ ఆజ్ఞలో నాలుగు ఉపచక్రాలు సుస్పష్టంగా కనబడ్డాయి…..అవి 7) కర్మ 8) గుణ 9) కాల 10) బ్రహ్మ చక్రములు కనపడ్డాయి. ఆ తర్వాత 11) సహస్ర చక్రం 12) హృదయ స్థానంలో హృదయ చక్రం 13) బ్రహ్మ రంధ్రానికి వచ్చేసరికి రెండు చక్రాలుగా కనబడ్డాయి….. మానవ మెదడు పెద్ద మెదడు, చిన్న మెదడు భాగాలుగా ఉన్నట్లుగానే ….ఈ బ్రహ్మ రంధ్రం లోనే రెండు చక్రాలు ఉన్నట్లుగా గ్రహించింది. ఆ రెండు చక్రాల్లో ఒకటి బ్రహ్మ రంధ్ర చక్రం లాగా ఉంటే ఇంకొకటి బ్రహ్మ రంధ్రం లాగా కనపడింది . అంటే మొత్తం 14 యోగ చక్రాలు కనిపించాయి. కాకపోతే పరమహంస బ్రహ్మ రంధ్రాన్ని ఏకచక్రంగా భావించడం జరిగింది. కానీ అంతర్గతంగా బ్రహ్మ రంధ్రంలో ఉపచక్రం వుండడం వలన మరొకటి కూడా ఉందని గ్రహించింది . అంటే 14 యోగ చక్రాలు ఉన్నట్లే అన్నమాట! సరే అని మళ్లీ కళ్ళు తెరిచి ఇదే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. మంచిదేనమ్మ తేడా తెలిసింది కాబట్టి పరమహంస యోగ చక్రాలకి నీ యోగ చక్రాలకి ఎలాంటి తేడా లేదు. ఆయన బ్రహ్మ రంధ్రమును ఏక చక్రంగా చెప్పాడు . నువ్వు బ్రహ్మ రంధ్రాన్ని రెండు చక్రాలుగా చూస్తున్నామని తెలుసుకున్నావు . అంతే… సరే మంచిది. ఈసారి నీకు ఏ ధ్యాన అనుభవం వస్తుందో చూడు అనగానే ……మళ్లీ యధావిధిగా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లేసరికి యధావిధిగా తన ఆత్మ శరీరం ఈ విగ్రహ మూర్తిలో కనిపించడం మొదలు పెట్టింది. ఈసారి శివలింగాలు కనిపించినాయి. ఈ 14 శివలింగాలు కూడా వరుసగా నిలువు శరీరం, అడ్డు శరీరం ….ఆ తరువాత స్థూల ,సూక్ష్మ, కారణ ,వాయు, ఆకాశ, ఆత్మ ,సంకల్ప, జ్యోతి, మనో ,పిండ, లింగ శరీరములు కనిపించినాయి. అంటే పరమహంస గారు చెప్పిన 11 దేహాలలో ఆయన నిలువు శరీరం గురించి అడ్డు శరీరం గురించి ఆయన చెప్పలేదు…పట్టించుకోలేదు…. కారణం ఇవి ఎలా ఉంటాయనేది మనకి తెలియదు. మనకి ఇవి చక్రాల్లో ఉండవు…. ఇవి అజ్ఞాన గ్రంధిలో ఉంటాయి . కాబట్టి మోక్షమును పొందితే మోక్ష జీవులకి తెలియదు. వీటికి జ్ఞానం లేదు. అందదు . పూర్ణ జ్ఞాని, మూడవ డైమెన్షన్ అయిన భూలోకవాసి అని అందుకే కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని చెప్పడం జరిగింది. అంటే సాధనకి, కామానికి శరీరం ఉండాలి అని చెప్పేసి మత్స్యేంద్ర నాథుడు ఏనాడో చెప్పడం జరిగింది. కాబట్టి మూడవ శరీరం నుంచి సాధన శరీరాలు ప్రారంభం అవుతాయి….. ఆ లెక్కన వేసుకుంటే 11 శరీరాలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత ఒకటి రెండు అనగా నిలువు శరీరం , అడ్డు శరీరం కలిపితే 13….. ఇక 14వ శరీరం శూన్య శరీరం అవ్వాలి. నిరాకార శరీరం అయి ఉండాలి ….శరీరం లేని స్థితి శూన్య స్థితి అయి ఉండాలి. అందుకోసం చెప్పి ఉండవచ్చు. దీనికి అనగా 14వ చక్రానికి సత్యలోకం అని చెప్పడం జరిగింది. సత్యలోకం ఏంటి అనుకుంటే….. ఏమీ లేని స్థితి పూర్ణ శూన్యస్థితి…. అది ఉందో లేదో తెలియని స్థితి అని తెలుసుకోవడమే సత్యం అవుతుంది. అందుకనే దీన్ని సత్య లోకం అన్నారు. కొంతమంది బ్రహ్మ లోకం అన్నారు. బ్రహ్మం అంటే ఎవరు..! శూన్యమే కదా…. కాబట్టి 14వది శరీరం కాదన్నమాట ! ఈ లెక్కన మూడు శరీరాలే ఉన్నాయి…. మూడు శరీరాలలో రెండు శరీరాలు సాధనకి పనికిరావని చెప్పి పరమాహంస గ్రహించాడు. కేవలం 11 శరీరాలు మాత్రమే సాధనకి పనికి వస్తాయని చెప్పడం జరిగింది. తెలుసుకున్నారు . ఆ 11 శరీరాలు ఏకాదశ రుద్రులు అని చెప్పటం……. ఏకాదశ మోక్ష పట్టణాలను చెప్పడం జరిగింది. కానీ మోక్ష పట్టణాలకి వచ్చేటప్పుడు నాలుగు ఉపచక్రాలకి చెప్పలేదు. ఆజ్ఞ చక్రంలోనే కాశీలోనే నాలుగు ఉపచక్రాల సాధన పూర్తి అయ్యి సాధన అయిపోతుందని ఆయన అనుభవాలు పొందారు. అంటే ఈ లెక్కన చూస్తే పరమహంస చెప్పిన వాటికి తను పొందిన శరీర అనుభవాలకి ఎలాంటి బేధ భావం లేదు. కేవలం ఇలా 14 మాత్రమే కనబడుతున్నాయి. కానీ కేవలం నిజానికి 11 దేహాలు మాత్రమే మోక్షం పొందాలి అన్నమాట… అని చెప్పి కళ్ళు తెరిచి తన పొందిన అనుభవాలు….. తను చేసిన ఆత్మ విశ్లేషణ అంతా మళ్లీ యధావిధిగా వీళ్ళ ముగ్గురికి చెప్పింది. వీళ్ళ ముగ్గురు నిజమే అన్నమాట… సత్యమే అన్నమాట…. అయితే కంగారు పడవలసిన అవసరం లేదు. కేవలం మనం 14 శివలింగాలు దైవిక వస్తువులు సేకరించాలి. అప్పుడు నీలో ఉన్న 14 చక్రాలను జాగృతి చేసుకోవాలి. దానికి సంబంధించిన దైవీక వస్తువులను పొందాలి. ఎప్పుడైతే ఒక చక్ర దైవిక వస్తువు ఒక చక్ర దైవిక లింగమును సేకరించగలుగుతారో అప్పుడు ఆ రెండింటిని ఇక్కడ పెడితే ఏం జరుగుతుందో తెలియాలి. నాకు తెలిసి ఒక్కో చక్రం ,ఒక్కో ప్రాంతాన్ని చూపిస్తుంది. ఆ ప్రాంతంలో నీ సాధనా స్థితిని అభివృద్ధి చేస్తుంది. అక్కడ ఉన్న సాధనా మాయలు నువ్వు దాటగలిగితే నీకు దానికి సంబంధించిన సాధన అనుభవ జ్ఞానం కలిగిస్తుంది అనుకుంటా….
అని రుద్రస్వామి తనకి తెలిసిన జ్ఞానమును బోధించడం జరిగింది. దానితో ఈమెకి ఉన్న విగ్రహ మూర్తికి పరమాహంస గారు చెప్పిన దానికి సరితూగాయని చెప్పి ఇక ధ్యానం నుంచి పూర్తిగా శివ నందిని బయటకు వచ్చేసింది. అప్పుడు శివ నందినికి ఒక సందేహం వచ్చి….. రుద్ర స్వామితో అయ్యా మీరు చెప్పింది అంతా…. అక్షర సత్యమే ! కానీ నేను కాదనను…. కానీ ఆజ్ఞా చక్రం జాగృతి, శుద్ధి అయినప్పుడు మనకి మనోనేత్రం తెరుచుకుంటుంది అని శాస్త్రవచనం. అలాంటిది ప్రస్తుతం నేను కుండలిని శక్తి జాగృతి చేసుకోలేదు. అలాంటిది నా మనోనేత్రం ఎలా తెరుచుకుందో ….ఎలా చూస్తుందో నాకు అర్థం కావడం లేదు ….అనగానే రుద్ర స్వామి చిరునవ్వునవ్వి నువ్వు కంగారు పడవలసింది , భయపడవలసింది ఏమీ లేదు. నీ గత జన్మ యొక్క సాధనా ఫలితం కాశీ క్షేత్రానికి రావడం జరిగింది. ఈ పుణ్యఫలం మరో మూడు నెలల్లో పూర్తి అవుతుంది. అది పూర్తి అయ్యాక నువ్వు యధావిధిగా ఈ జన్మ సాధనకి వస్తావు ….మొదలవుతుంది… కాకపోతే నువ్వు ఎప్పుడైతే మా గురువుగారైన తైలింగ స్వామి సమాధి దగ్గరికి వెళ్లావో అప్పుడు నువ్వుగా ఉండేందుకు మనోనేత్రం జాగృతి చేశాడు . అంతెందుకు పరమహంస కూడా ఈ కాశీ క్షేత్రంలోనికి వచ్చి ఆయన గదిలోకి వెళ్లి సమాధి దగ్గర తల కొట్టుకున్నప్పుడు మాత్రమే తన మనోనేత్రం జాగృతి అయిందని చెప్పాడు కదా ! అదే విషయంగా నీకు జరిగింది . కాకపోతే నీకు ఇది తాత్కాలికం మాత్రమే! ఎప్పుడైతే నువ్వు కాశీ క్షేత్రం వదిలిపెట్టి వెళ్ళిపోతావో ……అప్పుడు నువ్వు సాధారణ యోగ జీవితాన్ని అనుభవించే స్త్రీ మూర్తివి అవుతావు . అప్పుడే నీ సాధన ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నువ్వు సాధనా శక్తిని పెంచుకుంటూ మాయల్ని దాటుకుంటూ ముందుకు సాగాలి. చివరిదాకా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నీ కుండలినీ శక్తి ఏ ప్రాంతంలో…. ఏ క్షేత్రంలో అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అదే మన తక్షణ కర్తవ్యం ఆలోచించు అని చెప్పగానే….
అవును కదా స్వామి! నేను ఈ విషయమే గమనించలేదు. తక్షణ కర్తవ్యం గా ఏ క్షేత్రానికి వెళ్లాలో చూడాలన్నమాట! తెలుసుకోవాలి అనుకుంటూ ఉండేసరికి….. అమ్మ నువ్వు అన్ని మర్చిపోతావు…… నేను ఉన్నాను కదా ! నీకు గుర్తు చేయడానికి సాధనా విగ్రహ మూర్తి ఉంది కదా! అదే గుర్తు చేస్తుంది …ఏం చెప్పాలి…. ఏం చేయాలి…. ఏంటి …? అనేది ధర్మామీటర్లో ప్రవహించే పాదరసంలా మొత్తం చెప్పేస్తుంది. నీకు విషయం తెలియట్లేదు…. నాకు అర్థం అయిపోతుంది…. నువ్వు చిన్నదానివి కదా! నీకు అర్థం కాదు…. నాకు మొత్తం అర్థం అయిపోతుంది…. నాకు అన్ని తెలిసిపోతున్నాయి…. అర్థమయిపోతున్నాయి అంటూ …..
అవును…. విశాలాక్షి అమ్మవారికి కుడివైపు శివలింగం, ఎడమవైపు గణపతి ఉన్నారు కదా! ఈ విగ్రహానికి ఈ రెండు పెట్టి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు ధ్యానంలో కూర్చో… విషయం ఏమిటో అర్థం అవుతుంది కదా! ఒకవేళ ధ్యాన అనుభవంగా నీకేమైనా తెలుస్తుందేమో….. కళ్ళు మూసుకొని కూర్చో! నేను చెప్తా అనేసరికి , అది కాదురా! ధ్యానంలో కూర్చుంటే తెలిసే కాడికి ఆ విగ్రహం మూర్తి వల్ల ఉపయోగం ఏమిటి…. అని మహాదేవి అనేసరికి అవును కదా! ఉపయోగం లేనిదే యోగం ఉండదు. ఏదో ఉంది ఈ విగ్రహం వల్ల మనకి తెలియాల్సింది. తెలుసుకోవాల్సింది…. అవును లే! ఇప్పుడు విఘ్నాలకు అధిపతి వహించేది గణపతి కాబట్టి ప్రారంభ పూజ గణపతి పూజ చేశాకే కదా…. పనులు చేస్తారు. అమ్మ! నేనే గణపతి అనుకో! నా చేతుల్లో ఉన్న రెండు విగ్రహం మూర్తులని ఈ సాధన విగ్రహ మూర్తికి పెడుతున్నాను. ఏదైనా జరిగితే నన్ను అడగమాకు …..ఒకవేళ విగ్రహం పగిలిపోతే నాకు సంబంధం లేదు. నన్ను కోపగించుకోకు మీ నా ఉండ్రాళ్ళు నాకు పెట్టాల్సిందే …..అని ఆ విగ్రహ మూర్తికి ఎడమవైపునున్న పద్మములో గణపతిని ……కుడివైపు ఉన్న పద్మములో శివలింగమూర్తిని పెట్టేసి చూశారు. కానీ విగ్రహంలో ఎలాంటి మార్పులు ,చేర్పులు రాలేదు. విగ్రహంలో రంగులు మారలేదు. విగ్రహం లోపల ఏమైనా శబ్దాలు జరుగుతున్నాయా! అంటే ఏమీ జరగకపోయేసరికి….. చేయాల్సింది ఏదో ఉందమ్మా! అది మనం మర్చిపోయాం …..మనం తెలుసుకోవట్లేదు అని అంటూ ….ఉన్నవాడు ఊరుకోక బాల గణపతి కాస్త, గణపతి విగ్రహ మూర్తిని తన చేత్తో గిరగిరా తిప్పేసాడు. తిప్పేసరికి విగ్రహ మూర్తి కాస్త లోపలికి వెళ్ళిపోయింది.
అమ్మో! విగ్రహ మూర్తి తీసేసుకుందే ఇది ……అయ్యో…… గణపతి విగ్రహం లోపలికి వెళ్ళిపోయింది గా…… అయ్యో…… ఈ విగ్రహం కడుపులోకి గణపతి విగ్రహం పడిపోయిందిగా ………అయ్యో ఏం జరుగుతుంది….. ఇది ఏం చేస్తుంది…… తీయడానికి కూడా లేదు…… చిన్న చిల్లు మాత్రమే కనపడుతుంది. నేను పద్మం అనుకున్నాను . పద్మంలో చిల్లు ఉంది. అయ్యయ్యో……. ఈ చిల్లులోకి లోపలికి వెళ్లి పడిపోయిందే…. తల్లో ! ఇప్పుడు ఏం చేయాలి అంటూ….. ఈ శివలింగం కూడా పడిపొద్దేమో అనుకునేసరికి….. శివలింగం కూడా దానంతట అదే తిరిగి లోపలికి పడిపోయేసరికి……. అయ్యయ్యో శివలింగం కూడా లోపలికి వెళ్ళిపోయిందే …! ఈ రెండు లోపలికి వెళ్లి ఏం చేస్తున్నాయి……అతుక్కుపోయాయా ఏంటి..? అర్థం కావట్లేదు అని…. ఏడుపు మోహం పెట్టాడు. అప్పుడు డమరుకం లోపల ఏదో విధమైన కదలికలు జరుగుతున్నప్పుడు…. విగ్రహం మూడుసార్లు కుడివైపుకు, మూడుసార్లు ఎడమవైపుకి జరిగేసరికి అమ్మో! ఇక్కడేదో జరుగుతుంది….. అనుకుంటున్న సమయంలో ఆ డమరుకంలో తలుపులాగా ఉన్న ఒక భాగం తెరుచుకొని…. ఒక రాగి రేకు బయటపడింది. తర్వాత అదేవిధంగా ద్వారం మూసుకుపోయింది.
ఆ రాగి రేకు తీసి….. హమ్మయ్య విగ్రహం పని చేస్తుందన్నమాట! అంటే దైవిక వస్తువులు తీసుకొని మనకి ఆధారం అనే ఒక జాడ లాగా ఇస్తుంది అన్నమాట! ఆ జాడని పట్టుకొని…. మనం అర్థం చేసుకొని….. ఏం చేయాలో తెలుసుకోవాలన్నమాట! అంటే ఇప్పుడు నీకు కుండలినీ శక్తి జాగృతి ఏ క్షేత్రంలో అవుతుంది….. ఎలా అనేది మనకి ఈ ఆధారం ద్వారా చెబుతుందన్నమాట! అని అంటూ ఉండేసరికి….. సరే ఇంత చేసావు కదా….. ఆ ఆధారం ఏమిటో కూడా నువ్వే చదువు అని శివనందిని అనేసరికి దాన్ని చదవటం ఆరంభించాడు.
బాలగణపతి కాస్త తన చేతిలో రాగి రేకు మీద ఉన్న శ్లోకాలు చదవడం ప్రారంభించాడు.అందులో….
“ఈ సాధన విగ్రహం మూర్తి…. మానవ శరీర సాధన శరీరంతో సమానమని గ్రహించండి. ఈ విగ్రహ మూర్తి అనేది పురుష మరియు స్త్రీ సాధన శరీరంతో సమానం అని తెలుసుకోండి. పురుష శరీరంలోనూ, అలాగే స్త్రీ శరీరంలోనూ 14 యోగ చక్రాలు ,14 శరీరాలు మరియు 14 లోకాలకు అనుసంధానమై ఉంటాయని గ్రహించండి . కానీ ఇందులో 13 యోగ చక్రాలు మాత్రమే…. 13 యోగ శరీరాలు మాత్రమే…. 13 లోకాలు మాత్రమే అర్థం అవుతాయి. అర్థం కాని 14వ చక్రము, 14వ లోకము, 14వ దేహం యొక్క పరిస్థితి తెలుసుకోవడమే….. సత్యాన్వేషిగా మన సాధన ఏమిటో తెలుసుకోవడమే మన సాధనా లక్ష్యం అని గ్రహించండి. ఆ 14వలోకమైన సత్య లోకంలోకి వెళితే, 14వ శరీరం ఉందో లేదో తెలుస్తుంది . ఉంటే ఎలా ఉందో తెలుస్తుంది…. లేదా 14వ యోగ చక్రంలో ఏం చెప్తుందో తెలుస్తుంది. అసలు నిజమైన సత్యం ఏంటో తెలుస్తుంది…. అనుభవ పాండిత్యమునకు , శబ్ద పాండిత్యమునకు గల తేడా తెలుస్తుంది . ఆ సత్యాసత్యాలను తెలిపే లోకం కాబట్టి సత్య లోకం అన్నారు. ఈ సత్య లోకానికి సత్యాన్వేషిగా సాధన విగ్రహ మూర్తి సహాయ సహకారాలు తీసుకొని…. ఎవరైతే మాయలు, మర్మాలు… దాటుకొని నిస్వార్ధంగా సాధన పూర్తి చేస్తారో…. కోరిక రాహిత్యము, ఆశ భయము, స్పందన, ఆలోచన, సంకల్పం , మృత్యుభయం లేని వారు ఎవరైతే ఉంటారో …..వారికి ఈ సాధన విగ్రహం మూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ సాధనా మూర్తి దేహమే మానవదేహమని గ్రహించండి. దేహమే దేవాలయం అవుతుందని గుర్తించండి. ”
అని అంటూ ఉండగా కింద మరొక శ్లోకం కనపడింది. “ఈ శ్లోకం యొక్క ఆధారం ద్వారా సమాధానం వెతికితే…. శక్తి జాగృతి ఏ ప్రాంతంలో జరుగుతుందో అర్థం అవుతుంది. ఇది శక్తి జాగృతి చూపించే ప్రాంతం. దీనిని మీరు అందుకోగలిగితే అదే మీకు శక్తి జాగృతి చేసే ప్రాంతమును ఎక్కడ ఉన్నదో అనేది చూపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా “శక్తి జాగృతి” అయిన ఆధారమును, ఒకటికి పది సార్లు చదివి, అర్థం చేసుకొని ,పరిశీలించి, పరిశోధించి…..ఆ శక్తి కేంద్రం యొక్క ప్రాంతానికి వెళతారని ఆశిస్తున్నాము.”
అందులో ఉన్న ఆధారం:-
“గాలి గోపురం మీద నా ఆవాసం…
నన్ను సరస్వతి ఓరకంటగా చూస్తూనే ఉంటుంది.
వేశ్య నాకు కాపలాదారి.
నేను లేనిదే గుణాలు లేవు.
నేను కనబడితే ఆరు నెలల్లో చస్తారు.
అలాంటిది ఇక్కడ ఉంది.
నన్ను గంగ గర్భంలో ఉంచుకుంది.
నేను ఉన్న చోటికి చచ్చే వాళ్ళు వచ్చి దహనం అవుతారు.
ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్తే నీలో ఉన్న నా నాగభరణం లేస్తుంది.”
అని శ్లోకం ఉన్నది. బాలగణపతి ఒకటికి రెండు సార్లు చదివాడు. అందరూ విన్నారు. కానీ అందరూ అర్థమై అర్థం కానట్టుగా ఉందని వీళ్ళ మోహాలు చూస్తే అర్థమయింది. రుద్ర స్వామి ఆలోచనలో పడ్డాడు. మహాదేవి తనకి ఏమీ అర్థం కాలేదు అని శివ నందిని కేసి చూసింది. శివ నందిని కళ్ళు మూసుకుంది. బాలగణపతికి ఏం చేయాలో అర్థం కాక ఒకటికి రెండుసార్లు పెద్దగా చదువుతూ అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఉన్నట్టుండి బాలగణపతికి ఒక ఆలోచన వచ్చి “అమ్మా! గుణాలు అంటే త్రిగుణాలు కదా! అంటే దీనికి మూడు గుర్తులు ఉండి ఉండాలి. ఆరు నెలల్లో చనిపోతారు అంటే త్రిగుణాలు అనగా త్రిశూలం అని చెబుతారు కదా! ఆరు నెలల్లో చనిపోతారు అంటే…..ఎక్కడైతే త్రిశూలం చూస్తారో…. అక్కడ చచ్చే అవకాశం ఉంది కదా! అంటే త్రిశూలం ఎక్కడ ఉందో మనం ఆలోచన చేయాలి అని ఆధారం బాలగణపతి ఆలోచన ఇవ్వగానే…. అవును అంటూ తల ఊపుతూ నువ్వు చెప్పింది నిజమే….. అంతే త్రిశూలం ఎక్కడ ఉన్నది ?
త్రిశూలం చూస్తే మనకి మరణం ఎక్కడ వస్తుంది? అని అనగానే ….వెంటనే మహాదేవి అదేంటి అలా అంటారు? శ్రీశైలంలో శిఖర దర్శనం అయితేనే మోక్షం వస్తుంది అంటారు కదా! అంటే ఈ త్రిశూలం అనేది శ్రీశైల ప్రాంతానికి సూచన అయి ఉండొచ్చు కదా! అని అనగానే ఆ …ఆ…అవునవును… నిజమే! త్రిశూలం గాలిగోపురం మీద ఉంటుంది. ఇప్పుడు ఆధారాలన్నీ ఒక లెక్క చేస్తే గాలిగోపురం మీద నా ఆవాసం…… అంటే త్రిశూలం గాలిగోపురం మీద ఉంటుంది . నన్ను సరస్వతి ఓరకంట చూస్తుంది…. అంటే ఈ త్రిశూలంను అంతర్వాహినిగా గుడిలో సరస్వతి చూస్తూ ఉంటుంది. ఈ త్రిశూలం నీడ అక్కడ ఉన్న మల్లికా కుండంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదిలో దాని నీడ పడుతుంది అని స్థల పురాణం చెప్పింది. వేశ్య కాపలా దారి అంటే మల్లికాకుండానికి ఒకవైపు వేశ్య ఉండి ఆవిడకి మోక్షం ఇచ్చినట్టుగా స్థల పురాణంలో ఉన్నది. అలాగే నేను లేనిదే గుణాలు లేవు…. అంటే త్రిశూలానికి త్రిగుణాలు ఉన్నాయి…. కాబట్టి ఇది త్రిగుణాలకు సంకేతం . నేను కనపడితే 6 నెలల్లో చస్తారు….. అంటే శిఖర దర్శనం అయితే అంటే త్రిశూల దర్శనం ఎవరికైతే అవుతుందో వాళ్లు ఆరు నెలల్లో మరణం పొందుతారని స్థల పురాణం చెబుతూనే ఉంది. ఇప్పుడు ఆ త్రిశూలం ఈ గంగా గర్భంలో ఉంచుకుంది అన్నారు…. నేను ఉన్న చోటికి చచ్చే వాళ్ళు వచ్చి దహనం అవుతారు అని ఉంది . అవును మణికర్ణిక ఘాట్ లో నిత్య దహనం జరుగుతూనే ఉంటుంది. ఆ మణికర్ణిక ఘాట్ లో ఒక దేవాలయం ఎప్పుడూ నీటి గర్భంలోనే ఉంటుంది. కాబట్టి ఆ నీటి గర్భంలో ఉన్న శివలింగం దగ్గర త్రిశూలం ఉండి ఉండాలి. ఆ త్రిశూలాన్ని తీసుకొని మనం శ్రీశైల ప్రాంతానికి వెళితే…..నీ శక్తి జాగృతి అవుతుంది తల్లి..! అని శివ నందినికి రుద్ర స్వామి చెప్పి చెప్పగానే….. ఇదంతా ఒకటికి పది సార్లు చూసుకుని, శక్తి జాగృతి ప్రాంతం శ్రీశైలం అని గ్రహించి….ఇక అందరూ భోజనాలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి మణికర్ణిక ఘాట్ కి ప్రయాణించారు.
ఇలా అందరూ కలిసి మణికర్ణిక ఘాట్ కు వెళ్ళగానే బాలగణపతి ఉన్నట్టుండి త్రిశూలం నేను తీసుకొని వస్తానమ్మా అని మణికర్ణిక నదీ గర్భంలో ఉన్న దేవాలయంలోని శివలింగం దగ్గరికి నీళ్లలో దూకి లోపలికి వెళ్ళాడు. ఎక్కడా కూడా తనకి త్రిశూలం కనపడలేదు. మళ్లీ బయటకు వచ్చి ఇక్కడెక్కడ త్రిశూలం లేదు, మనం తప్పు దారి పట్టామేమో చూడు …..ఆధారం ఒకచోట ఉంటే మనం ఇంకొక చోట వెతుకుతున్నామేమో అనగానే కాదు ఇక్కడే ఉండాలి….. ఆధారాల ప్రకారంగా ఈ దేవాలయమే సూచిస్తుంది అనగానే, రుద్రస్వామి మరియు బాలగణపతి ఈసారి ఇద్దరూ నీటి అడుగున ఉన్న శివలింగం దగ్గరికి వెళ్లేసరికి గుడి గోడల మీద కానీ ,శివలింగం దగ్గర కానీ ఎక్కడ త్రిశూలం లేకపోయేసరికి…. ఇక్కడ ఏదో ఉంది అనుకుంటూ ….నంది ని చూస్తూ ఉంటే, నంది కదులుతూ ఉండేసరికి బాలగణపతి ఉన్నట్టుండి నందిని తిప్పేసరికి ఆ లోపల ఉన్న శివలింగం కూడా పక్కకి జరిగింది. ఎప్పుడైతే ఈ శివలింగం పక్కకు జరిగిందో…. లోపల నుంచి దివ్యమైన కాంతులు వస్తున్నాయని తెలుసుకొని, శివలింగం జరిగిన ప్రాంతంలో చెయ్యి పెట్టగానే ఒక రెండు అడుగులు ఉన్న బంగారు వర్ణంతో త్రిశూలం కనిపించింది. దివ్య దేశస్సుతో త్రిశూలం కనిపించేసరికి ఇది రుద్రశూలం అయి ఉంటుందని….. తీసుకొని దానిని బాలగణపతి మరియు రుద్ర స్వామి బయటకు వచ్చారు. ఈ త్రిశూలం చూడగానే ఏదో తెలియని ఆనందం శివనందిని, మహాదేవి కొన్ని క్షణాల పాటు అనుభవించారు. అప్పుడు శివ నందిని ఖచ్చితంగా తన శక్తి జాగృతి ప్రదేశం శ్రీశైలం అని అనిపించి…. ఇక శ్రీశైలం ప్రాంతానికి బయలుదేరాలని చెప్పేసి అనుకొని ఇక ఎవరికివారే తమ ప్రాంతానికి వెళ్లారు. మరుసటి రోజు శ్రీశైలానికి వెళ్లాలని నిశ్చయించుకుని బాలగణపతి మరియు శివ నందిని కాస్త గది వైపుకు వెళ్తే , విశ్వనాథ దర్శనానికి రుద్రస్వామి మరియు వారాహి దర్శనానికి మహాదేవి వెళ్ళటం జరిగింది.
ఆ తర్వాత బాలగణపతి మరియు శివ నందిని రోడ్డు మీద వెళ్తూ ఉంటే, అమ్మ! ఇప్పుడు పరమహంస పవనానంద చెప్పిన కపాలమోక్షంలో 11 శరీరాలు మోక్షం పొందుతాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి వచ్చి సాధనా శరీరంలో 14 దేహాలు ఉన్నాయి. మరి ఈ రెండు ఎలా సరితూగుతాయి! నిజానికి మనకి ఉన్నది 11 శరీరాలా ? లేక 14 శరీరాలా ? అంటే….. అప్పుడు మన శరీరంలో 13 యోగ చక్రాలు,13 దేహాలు ఉంటాయి. అంటే అజ్ఞాన గ్రంథిలో నిలువు శరీరం, అడ్డ శరీరం రెండు ఉంటాయి. నిలువు శరీరం శక్తి జాగృతిలో మోక్షం పొందితే….. చక్ర శుద్ధిలో అడ్డు శరీరం మోక్షం పొందుతుంది. అలాగే మూలాధార చక్రంలో స్థూల శరీరం, స్వాధిష్ఠాన చక్రంలో సూక్ష్మ శరీరం, మణిపూరకంలో కారణ శరీరం, అనాహతంలో వాయు శరీరం, విశుద్ధంలో ఆకాశ శరీరం, ఆజ్ఞా చక్రంలో, మరియు దాని ఉపచక్రాలు అయిన కర్మ, గుణ,కాల, బ్రహ్మ చక్రాలలో ఆత్మ శరీరము, సహస్ర చక్రంలో సంకల్ప శరీరం ,హృదయ చక్రంలో జ్యోతి శరీరం, బ్రహ్మ రంధ్రంలో మనో శరీరం, 14వది నిరాకార స్థితి అనేది ఏమిటి అనేది తెలీదు…14 లో ఏ చక్రం ఉంటుందో….. 14 లో ఏ దేహం ఉంటుందో….. అసలు 14 లో ఏముంటుందో….. ఆ 14వ లోకమైన సత్యలోకం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. పరమహంస అనుభవం ప్రకారం, 11 దేహాలు, 13 యొక్క చక్రాల ద్వారా మోక్షమును పొందితే , అజ్ఞాన గ్రంధిలో నిలువు శరీరం మరియు అడ్డు శరీరం గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
ఎందుకంటే…. అవి బుద్ధి రహిత జీవులు మూలాధార చక్రం నుంచి వచ్చినవి బుద్ధి జీవులు. కాబట్టి మూలాధార చక్రం స్థూల శరీరం నుంచి ఆయన సాధన అనుభవాలు చెప్పడం జరిగింది. నిజానికి అజ్ఞాన గ్రంధిలో ఎప్పుడైతే విభేదనం అవుతుందో….. అప్పుడు సాధకుడు జ్ఞానం పొందడం అవుతుంది. జ్ఞానిగా మారడం జరుగుతుంది. అజ్ఞాన గ్రంధి ఉన్నంతవరకు ఎవరూ కూడా జ్ఞానం పొందడం అసంభవం అవుతుంది. ఈ అజ్ఞాన గ్రంథి లోనే నిలువు శరీరాలు, అడ్డు శరీరాలు ఉంటాయనే జ్ఞానం ఏ సాధకుడికి అందదు. అవి మోక్షం పొందుతాయన్న విషయం కూడా తెలియదు. అందువలన పరమహంస ఈ రెండు శరీరాల గురించి అంతగా పట్టించుకోలేదు. మనకి చెప్పడము చేయలేదు. అందువలన ఆయన ప్రకారంగా 11 దేహాలు ఉన్నట్టుగా అనుకుంటాము. ఏకాదశ దేహాలు ఉన్నట్లుగా….. ఏకాదశ మోక్షాలు ఉన్నట్లుగా మనం అనుకుంటాము. కానీ అజ్ఞాన గ్రంథిలో ఉన్న ఈ రెండు శరీరాలు కలిపితే…. మనకి 13 దేహాల మోక్షాలు వస్తాయి. నిజానికి ఆయన అనుభవ శరీరాలు, నా అనుభవ శరీరాలు ఒకటే. కానీ వేరువేరుగా ఉన్నట్లుగా శబ్ద పాండిత్యం, అనుభండిత్యంలో తేడా ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది అనగానే…… ఓహో! అవునా, నిజమే అయి ఉంటుంది… నువ్వు చెప్పేది నిజమేనమ్మ! ఆయన అజ్ఞాన గ్రంధిలో ఆ రెండు శరీరాల గురించి పట్టించుకోలేదు. అందువలన మనకి విషయం ఏమిటి అన్నది అర్థం కాలేదు . సాధనా మూర్తి పరంగా చూస్తే మనకి 14 వస్తున్నాయి… అదే పరమహంస పరంగా చూస్తే ఏకాదశ దేహాలు వస్తున్నాయి… ఇప్పుడు అర్థమయింది… పదమ్మ నాకు ఆకలి వేస్తుంది…. నాకు ఉండ్రాళ్ళు చేసి పెట్టు…. 21 ఉండ్రాళ్ళు తినాలి. తిని పడుకోవాలి. గరిక మీద వెళ్లి పడుకుంటాను. నాకు ఆకలి వేస్తుంది అంటూ ఉండగా…. గది దగ్గరికి వచ్చేసరికి, శివ నందిని కాస్త వంట చేసే ప్రయత్నంలో పడింది. ఈ బాలగణపతి కాసేపు కునుకు తీసే ప్రయత్నంలో పడ్డాడు.
మరుసటి రోజు అందరూ కూడా మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి, శక్తి జాగృతి కేంద్రం శ్రీశైలం అని నిశ్చయించుకొని… స్నానాధికాలు, పూజాదికాలు, జపాదికాలు పూర్తి చేసుకొని….. ఎవరికి వారు ఏకాంతంగా కూర్చొని ఎవరి ఆలోచనలో వారు నిమగ్నమయ్యారు. శ్రీశైలం వెళ్లడంతో ఇక తన సాధన ఆరంభం అవుతుందని శివనందినికి అర్థం అయింది . ఇంతలో రాత్రి జరిగిన స్వప్న దర్శనాలలో ఆకాశ శరీరధారియైన శివానంద తనని పదేపదే ఇబ్బంది పెట్టటం… తనని ధర్మపత్ని అని సంబోధిస్తూ, తనని సొంత భార్యని పిలుస్తున్నట్టుగా కనిపించడం…. నిద్రలో ఏవో తెలియని ఆలోచనలు, ఇబ్బందికరమైన సందేశాలు…. ఇబ్బందికరమైన పరిస్థితులు…. తనకి కలుగుతున్నాయని ఒకటికి పది సార్లు అనుకుంటూ….. ఒకవేళ నిజంగానే తన శ్రీశైలం వెళ్తే అక్కడ శివానంద ఉన్నాడా? శివానంద ఉంటే తన పరిస్థితి ఏమిటి? తన మాటకే…. తన శరీరం, మనసు ,బుద్ధి, స్వాధీనం, ఆధీనం అయిపోయి మనోవికారాలకు పొందుతుంది. ఇప్పుడు ఏం చేయాలి….. ఒకవేళ తను అక్కడికి వెళితే శివానంద తనని ఇబ్బంది పెడతాడా? తన మాయలో పడేస్తాడా? తన మోహమాయలో పడితే కామమాయ ఆలోచనలతో తన సాధన ఆరంభంలోనే ఆగిపోతుందా ! ఏం చేయాలి? ఒకవేళ అతను కామ మాయకు సంకేతమా! ఒకవేళ నిజంగానే తనకి నేను ధర్మపత్నియా ?ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఉండేసరికి….. ఈమె ఆలోచనలు చదువుతున్న రుద్రస్వామి కాస్త….
రుద్రస్వామి:- అమ్మ! నువ్వు శివానంద గురించి ఆలోచించకు, భయపడకు ,కంగారు పడమాకు. అతను ఎవరో కాదు పరమహంస పవనానంద యొక్క ఆకాశ శరీర రూపధారి. అంటే పరమహంసకి ఏ గుణాలు అయితే ఉన్నాయో….. అతనికి కూడా అవే గుణాలు ఉంటాయి. పరమహంస పాతివ్రత్య ధర్మమును పాటించి ధర్మార్థ కామ మోక్షములను పొందడం జరిగింది. అలాగే ఆకాశ శరీర ధారియైన శివానంద కూడా ….అలాంటి గుణాలే కలిగి ఉంటాడు. కాకపోతే ఏమిటంటే , నువ్వు ధర్మపత్నివి అని చెప్పేసి….అతనికి నువ్వు ఒక రుణపాశంగా ఉన్నావని గ్రహించాడు. నీ ఋణ పాశం తీరితే గాని….. అతనికి మోక్ష మార్గం తెలియదు అని చెప్పి అతను గ్రహించాడు. అతని 9 దేహాలలో 10 దేహాలకి మోక్షం ఇవ్వడం జరిగింది. స్థూల శరీరానికి, ఆకాశదేహానికి ఆయన మోక్షం ఇవ్వలేకపోయారు. స్థూల శరీరం పరమహంస అయితే , పరమహంస యొక్క ఆకాశ శరీరమే తను కాబట్టి…. తన విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు…. కంగారు పడవలసిన అవసరము లేదు…. కాకపోతే ఎప్పటికప్పుడు నీ సాధన పురోభివృద్ధి సలహాలు ,సూచనలు ఇస్తూ ఉంటారు. వాటిని మనం అందుకుంటూ ….ముందుకు సాగవలసి ఉంటుంది. అలాగే అతను ఇచ్చిన సలహాలు తీసుకుంటూ….. ఉండాలి. కాకపోతే నిన్ను తన ధర్మపత్నిగా భావించుకుంటాడు గాని…. నీ ఒంటి మీద చేయి వేయడం, నీతో అసభ్యకరంగా మాట్లాడడం కానీ, కామ వికారాలతో సంయోగం చేయడం కానీ, మాయలో పడ వేయడం కానీ….. ఇలాంటివేవి చేయడు. ఒకవేళ నీ మనసు లయ తప్పినా కూడా….. అతని ఏనాడు చలించడు. ఎప్పటికీ చలించడు. ఆ విషయంలో నేను నీకు నమ్మకం ఇవ్వగలను అని భరోసా ఇచ్చేసరికి, ఇది విన్న శివ నందిని కాస్త కుదుటపడి ప్రశాంతంగా ఆలోచనలు వదిలేసరికి…
బాలగణపతి:- అమ్మ! నేను ఉండగా నీ దగ్గరికి ఏ మగాడు వస్తాడో చూస్తాను….. వాడెవడో…. వాడి సంగతి ఏంటో చూస్తాను ….నువ్వేం కంగారు పడమాకు! అసలే మన దగ్గర త్రిశూలం కూడా ఉంది. ఒక్క పోటు పొడిచాననుకో…. వాడు చచ్చురుకుంటాడు. ఎటు శ్రీశైలంలో శిఖర దర్శనం చేస్తే మోక్షం వస్తుంది…. ఇప్పుడు నా చేతిలో కూడా త్రిశూలం తో చస్తాడు కాబట్టి దర్శనం చేసినా, త్రిశూలంతో పొడిచి చచ్చినా…. అది మోక్షమే అవుతుంది కాబట్టి….. ఒకవేళ వాడు నీ దగ్గర ఎక్కువ తక్కువ చేసి వెదవవేషాలు వేస్తే నేను ఉంటాను కదా! నేను పొడిచేస్తాను. వాడిని వెనకనుంచి పొడుస్తానో తెలియదు….. ముందు నుంచి పొడుస్తానో తెలియదు. వాణ్ణి కాదు ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి ….. నిన్ను ఇబ్బంది పెట్టి బాధపెడితే….. నేను ఎవరిని వదిలిపెట్టను. నా దగ్గర ఉన్న త్రిశూలం తో పొడి చేస్తాను. ఈ త్రిశూలం నేను ఎవరికీ ఇవ్వను. ఇది నా దగ్గరే ఉంటుంది. ఎవరు నీ జోలి రాకుండా రక్షణగా ఈ త్రిశూలంతో ఉంటాను. ఇది అసలే రుద్ర త్రిశూలం అంట….చాలా శక్తివంతం అని రుద్రయ్య చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను! పెద్దగా బరువు కూడా లేదు. రెండు అడుగులు ఉంది. పదునుగా ఉంది. ఇది పెట్టి పొడిస్తే సచ్చూరుకుంటాడు. కాబట్టి నేను ఉన్నంతవరకు నీ జోలికి ఎవరు రారు….
అని అంటూ ఉండేసరికి…..ఆ బాల గణపతి మాటలకి దీర్ఘ ఆలోచనలో ఉన్న శివ నందిని మనసు కుదుటపడి…. నవ్వడం ఆరంభమైంది… నవ్వింది. అమ్మ నవ్వు చూసి బాలగణపతి కూడా సంతోషిస్తూ…. అమ్మ నీ ఒళ్ళు పడుకుంటాను అని త్రిశూలం చేత్తో పట్టుకొని శివ నందిని ఒడిలో పడుకున్నాడు.
రుద్రస్వామి:- అమ్మ! ఇక ఎప్పుడైతే మనం శ్రీశైలం బయలుదేరుతామో ….అక్కడి నుంచి నీ శక్తి జాగృతి అవుతుంది. ఆ తర్వాత చక్రాలు శుద్ధి అవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్క చక్రం ఒక ప్రాంతంలో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దేహాలు జాగృతి అవుతాయి. దీని అంతటికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉపయోగించవచ్చు …..అష్టాదశ శక్తి పీఠాలు ఉపయోగించవచ్చు….. ఏదైనా క్షేత్రాలను ఉపయోగించవచ్చు…. ఏ క్షేత్రానికి ఎప్పుడు ఎలా వెళ్లాలి అనేది మన సాధనామూర్తి ఇచ్చే ఆధారాలను బట్టి ఉంటుంది. కాకపోతే ఆధారాలన్నీ మనకి రావాలంటే ప్రతి చోట మనకి ఒక శివలింగం, అలాగే ఒక దైవీక వస్తువు రావాలి. ఆ రెండు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక దైవిక చిహ్నం లేదా గుర్తువస్తుంది. వీటిని ఆధారం చేసుకుని వెళ్లాలి.ఇప్పుడు ఈ త్రిశూలం తీసుకొని శ్రీశైలంలో ఎక్కడో ఒకచోట దీనిని ఉపయోగిస్తే…. ఆ ఆధారం ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి శ్రీశైలం వెళ్ళినప్పుడు, దీనిని ఎక్కడ ఉపయోగిస్తే మనకి శివలింగము లేదా దైవిక వస్తువు వస్తే గాని మనం రెండవ స్థితి పొందటానికి ఉండదు . ఇప్పుడు అక్కడికి వెళ్తే గాని మనకి ఆధారం అందదు. కాబట్టి మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. రేపటితో నువ్వు కాశీ క్షేత్రానికి వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే నవ మాసాల గర్భావస్థ ఇక నీకు ఉండదు. ఎవరైతే తొమ్మిది నెలలు గాని, తొమ్మిది రాత్రులు గానీ ఈ కాశీ క్షేత్రంలో నిద్ర చేస్తారో…… వారికి గర్భవాసం ఉండదు అని చెప్పి స్థలపురాణం చెబుతుంది. ఇక రేపటితో నువ్వు స్త్రీ గర్భంలో జన్మించే అవకాశం ఉండదు . ఒకవేళ కారణజన్మలు ఉంటే తప్ప. ఇక అకారణజన్మలు, జంతు జన్మలు నీకు ఉండవు . కారణ జన్మలు అయితే లేకుండా చూసుకోవాలి . అకారణజన్మలైతే పోతాయి. కాబట్టి మనం ఎల్లుండికి శ్రీశైల ప్రాంతానికి వెళ్లే ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి రెండు మూడు రోజుల ప్రయాణం పడుతుంది శ్రీశైలానికి…. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత శక్తి జాగృతి అయిన తర్వాత ఎలా చేయాలి? ఏంటి .? శక్తి జాగృతికి అనేది సాధనామూర్తి వివరాలు చూపించాలి.
శివనందిని:- అవును స్వామి! అది నిజమే
ఇక రేపటితో 9 నెలలు పూర్తి అవుతుంది. ఇక ఎల్లుండి ఇక్కడ ఉన్న వాళ్ళ అనుమతి తీసుకుని శ్రీశైలం వెళ్లాల్సి ఉంటుంది …
అని అంటూనే సరికి ఒక నల్లని కుక్క వగరుస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చింది . అది చూడటానికి దట్టంగా ,దిట్టంగా ఉన్న ఆడ కుక్క. దీన్ని చూడగానే నిద్రలో ఉన్న బాలగణపతి కాస్త నిద్రలేచి….
బాలగణపతి:- అరే! భైరవి వచ్చావా? చాలా రోజులు అయింది నిన్ను చూసి….. మూడు నెలల నుంచి కనబడటం లేదు. చచ్చిపోయావేమో అనుకున్నాను. నువ్వు బతికే ఉన్నావా! అమ్మ ! ఇది నాకు చాలా ఇష్టమైన కుక్క. ఇది భైరవి కుక్క. ఇది ఎక్కువగా కాలభైరవుని గుడి దగ్గరే ఉంటుంది. దీనిని భైరవ అంశ అని చెప్తారు. ఇది కేవలం భైరవుని దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రమే తింటుంది. ఇంకేం పెట్టినా తినదు. గుడి పరిసరాలను దాటి ఇది బయటకు రాదు. అలాంటిది మన దగ్గరికి వచ్చింది అంటే….. ఒకవేళ ఇది కూడా మనతోపాటు వస్తుందేమో! తీసుకెళ్దామా శ్రీశైలం.! వద్దంటే ఇక్కడే వదిలిపెడదాం. ఏంటి చెప్పు…
శివనందిని:- నాకేం తెలుస్తుంది ….రుద్రయ్య ఏం చెప్తే అది శాసనం కదా!
అని రుద్రయ్యకేసి చూసేసరికి……
రుద్రస్వామి:- భైరవి కేసి చూసి…. తన అంశతో పంపిస్తున్నాడు. మనకు రక్షణగా ఉంటున్నాడు. పైగా మన దగ్గరికి సాధనా విగ్రహం మూర్తి వచ్చింది కదా! దానికి రక్షణ! ఎలాగైతే ధర్మరాజుకి ధర్మ దేవత కుక్క రూపంలో వచ్చి పరీక్ష పెట్టిందో….. అలాగే నీ సాధన స్థితిగతులకి ఈ కాలభైరవి వచ్చి రక్షణగా ఉంటుంది. మనకి చుట్టూ కూడా ఇకనుంచి దుష్టశక్తుల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. దీని అరుపులతో…. దీని రక్షణతో….. ఆ దుష్టశక్తులు పారిపోయే అవకాశం ఉంటుంది ….లేదా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అప్రమత్తమయ్యి ఏం చేయాలో తెలుస్తుంది. కాబట్టి మనకి రక్షణగా తనంతట తానే రావాలి అనుకుంటుంది కాబట్టి…… మనం వద్దు అనుకున్న కూడా మనల్ని వదిలిపెట్టదు మన వెంట వస్తుంది. ఏది ఎప్పుడు ఎలా రావాలో అలా జరుగుతుంది….కాబట్టి మనం దేనిని ఏమీ చేయలేము. అలాగే రాబోయే కాలంలో కృష్ణస్వామి మరియు ఆదిపరాశక్తి పెట్టే ఆటంకాలను, అవాంతరాలను కూడా ఈ భైరవి కుక్క ముందే కనిపెట్టి…. పసిగట్టి మనకి చెబుతుంది. కాబట్టి మనం అప్రమత్తం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక దీనికి ఆహారం సంగతి ఏంటి? అనేది నువ్వు చూసుకుంటే చాలు.
శివనందిని:- నాకు ఆహారం పెట్టడం పెద్ద సమస్య కాదు…. దాన్ని చూసుకునే బాధ్యత అంతా బాలగణపతి కాబట్టి, నాకు దీన్ని తీసుకు వెళ్ళటానికి ఎలాంటి అభ్యంతరము లేదు. పైగా మనకి ఇది సాధనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇది వదిలిపెట్టి వెళ్లినా …..మన వెంట వస్తుంది అని చెబుతున్నారు కాబట్టి….. ఇక దీని కూడా తీసుకుని వెళ్దాము. శ్రీశైలానికి వస్తుందో మళ్లీ ఎక్కడికి వస్తుందో మనకు తెలియదు. ఇది మనతో ఎంత కాలం ఉంటే అంతకాలం తీసుకొని వెళ్దాం. చూద్దాం ..! దానికి ఎక్కడ ఏ క్షేత్రంలో అయినా మోక్షం పొందాలి అనుకుంటే, మోక్షం పొందుతుంది….. లేదు అనుకుంటే ఒకవేళ మనం అనుకోని పరిస్థితుల్లో…… సాధన పరిసమాప్తి కానీ పరిస్థితుల్లో తిరిగి మనతోపాటు కాశీ వస్తుంది.
రుద్రస్వామి:- నీ ఇష్టం తల్లి! ఇది బాధ్యత బంధం అని మాత్రం అనుకోవద్దు. ఇది ఎప్పటికీ అవదు. ఎందుకంటే నీకు జన్మంతరాలలో కాలభైరవ కర్మ ఉండి ఉండాలి. ఆ కర్మ తీరకపోతే ఇలా తీర్చుకోవడానికి….. ఆ కుక్కలు మన దగ్గరికి వస్తాయి. ఆ కుక్కకి మనం మనుషులకి చేసినట్లుగా సేవలు చేస్తే అ ఋణం తీరిపోతుంది. కాలభైరవ యాతన అని ఉంటుంది. మనం శరీరం విడిచిపెట్టినప్పుడు పిండదేహానికి ఈ ఆతన పెడతారు. ఆ యాతన భరించలేక చాలా శరీరాలు ఇబ్బంది పడతాయి. ఈ ఇబ్బంది యాతన శరీరానికి లేకుండా ఉండటానికి….. కాలభైరవుని కర్మ ఇలా కుక్క రూపంలో వస్తుంది. అది ఆడ కుక్క అవ్వచ్చు …. మగ కుక్క అవ్వచ్చు….కాబట్టి నీకు ఈ భైరవ కర్మ ఉండి ఉండాలి. దాని ఋణం తీరితే గాని మీ సాధన ముందుకు వెళ్ళదు. ఆ ఋణం తీర్చుకోవడానికి ఇది వచ్చింది. కాబట్టి ఇది నీకు ఋణం తీర్చడానికే ఉన్నది అనుకో…
శివనందిని:- సరే స్వామి! నాకేం అభ్యంతరం లేదు. సరే అయితే….. మనం ఎల్లుండి శ్రీశైలం యాత్రకు బయలుదేరాలి. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాము. నేను , బాల గణపతి, భైరవి కలిసి గదికి వెళ్ళిపోతాము.
అనగానే …..సరే మంచిది! తల్లి! శుభం భూయాత్ అని చెప్పేసి అనగానే….. మహాదేవి కూడా ధ్యానం నుంచి కళ్ళు తెరిచి నేను ఇక్కడ కొంచెం సేపు ధ్యానంలో ఉంటాను. మీకు కావాల్సిన చోటికి మీరు వెళ్లిపోండి…. అనేసరికి మహాదేవి కాస్త కొత్తగా వచ్చిన భైరవి కుక్కను చూసి ఆనంద పడుతూ ……నువ్వు కూడా వచ్చావా తల్లి! ఇక నా దేవతారాధన నీతోనే చేస్తాను. నీకు కావలసిన ఏర్పాట్లు…. నీకు కావలసిన వంట….. నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను అని మనసులో అనుకునేసరికి…. భైరవి తోక , తల ఊపుతూ ఆమెకేసి చూస్తూ సరే! అన్నట్టుగా శివ నందిని వైపు వెళ్ళింది. బాలగణపతి ఒకవైపు త్రిశూలం తో , ఒకవైపు భైరవి కుక్క తల నిమురుతూ శివ నందినితో కలిసి గదికి వెళ్లారు.
మరసటి రోజు శివనందిని, బాల గణపతి మరియు భైరవి కుక్క కలసి మణికర్ణిక ఘాటుకి వెళ్లేసరికి…. అప్పటికే ధ్యానం చేసుకుని ఉన్న… మహాదేవి మరియు రుద్ర స్వామి కనిపించేసరికి….. శివ నందిని వాళ్ళకి నమస్కారం చేసేసరికి…. బాలగణపతి కాస్త అమ్మ నేను డూండీ గణపతి గుడికి వెళ్ళొస్తాను అనేసరికి…. సరే వెళ్ళిరా నాయన జాగ్రత్త ! మళ్ళీ అన్నం తినే సమయానికి రా ! అనేసరికి….. అలాగే నాకు నువ్వు ఉండ్రాళ్ళు చేసి పెట్టు… బైరవికి అన్నం వండి పెట్టు అనేసరికి
… భైరవికొక్కేమో కాలభైరవుని గుడి వైపు వెళ్లేసరికి….. గణపతి కూడా అటువైపే వెళ్ళాడు. వాడు ఇంకా కుక్కతో ఆడుకుంటూ ఉంటాడులే! నీ గురించి పట్టించుకోవడం మానేస్తాడులే! అని రుద్ర స్వామి అనేసరికి….. వాడు ఎవరిని వదిలిపెట్టడులే స్వామి! ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటాడు. అందరిని మన అనుకుంటాడు. ఎవరికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు గౌరవం, మర్యాద, చనువు ఇస్తాడు. అందర్నీ పట్టుకుంటాడు . అందరిని నా అనుకుంటాడు . వాడికి జంతువైనా, మనుషులైనా ఒకటే. బేధ భావం లేదు. వాడు కుక్కలోను మనిషిని చూస్తాడు… మనిషిలోనూ జంతు గుణాలు చూస్తాడు. వాడి తత్వం అలాంటిది. అంటూ……. స్వామి ఇక్కడ నాకు ఒక సాధనా సందేహం ఉన్నది. ఒక స్త్రీ మూర్తి యోగ సాధన చేస్తే ఇలా విగ్రహాలు, మర్మ రహస్యాలు ఛేదించాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే నాకు సాధనా మూర్తి రావటం ఏమిటో……! ఈ విగ్రహంలో ఒక శివలింగం, ఒక దైవిక వస్తువు పెట్టగానే ఆధారాలు రావడం ఏమిటో! ఆ వచ్చిన ఆధారాలతో సాధన కేంద్రాలు తెలుసుకోవడం ఏమిటో …! ప్రతి స్త్రీకి అవసరం ఉంటుందా? ఇలా తెలుసుకుంటేనే ఆవిడ మోక్షం పొందే వీలు ఉంటుందా? అనేసరికి
రుద్రస్వామి:-అమ్మ! ఇప్పుడు ఇలా ప్రతి స్త్రీకి సాధనా విగ్రహ మూర్తి అనేది ఉండదు…. రాదు. ఇది నీ కోసమే ప్రకృతి ఈ విధంగా పెట్టడం జరిగింది. నిజానికి నీది మోక్షజన్మ. అందులోను విశ్వ మోక్షం ఇచ్చే జన్మ కావడంతో…. విశ్వ జగత్తులో శక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది…. ఈ సాధనా విగ్రహ మూర్తిలో నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రకృతి…పురుష ప్రకృతి మరియు స్త్రీ ప్రకృతిగా ఉంటుంది . పురుష ప్రకృతి కదలని ప్రకృతి అయితే , స్త్రీ ప్రకృతి కదిలే ప్రకృతి అవుతుంది. ఈ రెండు ప్రకృతుల యొక్క శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనేది ఎవరికి పడితే వారికి తెలియదు. దానికి గురువుల సహాయ సహకారాలు ఉంటేనే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరి కుండలినీ శక్తి ఎక్కడ జాగృతి అవుతుందో జ్ఞానంలో ఫలానా ప్రాంతం అని తెలుస్తుంది. లేదు అంటే వాళ్ళు అనుకోకుండా తెలిసి లేదా తెలియక ఏవైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు….. వారి మనసుకు నచ్చిన విగ్రహాలు కానీ, వస్తువులు కానీ నచ్చిన వాటిని తీసుకుంటే….. గత జన్మల్లో వాళ్ళు చేసిన సాధన వస్తువులు….. వాళ్లకి అక్కడ ఆ సమయంలో ఆ రూపంలో అందుతాయి. వాళ్లు వాటిని తీసుకొని నిత్య పూజలో ఉంచుకున్నా….నిత్య ఆరాధనగా పూజ మందిరంలో ఉంచుకున్నా చాలు. వాళ్ళ సాధనాస్థితి ముందుకు వెళ్ళిపోతుంది. అది శరీరం మోక్ష జన్మ పొందే వాళ్లకి ….వ్యక్తిగత మోక్షం పొందే వాళ్లకి మాత్రమే ఉంటుంది. నీది విశ్వమోక్ష సాధన జన్మ కాబట్టి నీకు విశ్వ జగత్తులో అమ్మవారి శక్తి, అయ్యవారి శక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవడం….. మానవ మేధస్సుకు అతీతంగా ఉంటుంది. ఏ గురువు, ఏ దైవం కూడా చెప్పలేరు. ఇది అంతర్గతమైన దైవ రహస్యం అన్నమాట! అందుకోసమని ఈ సాధన మూర్తిని మన పూర్విక మహర్షులు శక్తి కేంద్రములు ఎక్కడ ఉన్నాయి…. ఏంటి అనేది పొందుపరచడం జరిగింది . అది కూడా ఎవరు పడితే వారు ఉపయోగించకుండా, నాశనం చేయకుండా….మనకి అర్థమై అర్థం కాని భాషలో ఆధారం చెప్పడం జరిగింది. ఈ ఆధారం ఎవరికైతే అర్థం అవుతుందో….. వారే మోక్షజన్మకి తీసుకొని వెళ్తారు. విశ్వానికి మోక్షం ఇచ్చే అర్హత, యోగ్యత, యోగం ఉంటుంది. అదే గృహస్థానంలో ఉండే స్త్రీకి సాధనా గురు మంత్రం పొంది….ఆ గురు మంత్రం చేసుకుంటూ ఉంటే….తనలో యోగ చక్రాలు జాగృతి అవుతాయి. చక్రాల జాగృతి ని బట్టి శుద్ధి చేసుకోవటం…. జాగృతి శుద్ధి, స్వాధీనం, ఆధీనం చేసుకోవచ్చు. ఇక తను మోక్ష జన్మ పొందాలి అనుకుంటే… విభేదనం కూడా చేసుకోవచ్చు. అందుకే నిత్య పూజ కార్యక్రమాలు…. దీపారాధన…. ఒక ఇష్టదైవ ఆరాధనకి పూజలు చేస్తూ ఉన్నా కూడా….. ఈ నాలుగు స్థితిగతులు ఆవిడకి జరుగుతాయి. దీనికోసం మనం గృహస్థ ఆశ్రమాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు.సన్యాసం తీసుకోవలసిన అవసరం లేదు. కాకపోతే ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి….. మోక్షజన్మ చేసుకోవాలి…. అని ఎవరికైతే ఉంటుందో, వాళ్లకి మాత్రమే గృహస్థాశ్రమమును వదిలిపెట్టి సన్యాసం తప్పక తీసుకోవాలి. అది ప్రకృతి ఎప్పుడు ఎలా చేయాలో చేస్తుంది. దానికి మనం ఎలాంటి మానవ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. యోగముంటే యోగి కాక తప్పదు. అలాగే యోగము ఉంటే యోగిని కాక తప్పదు. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఉన్న ఋణానుబంధాలు తీరిపోతాయో….. అప్పుడు సన్యాస దీక్షకు అర్హత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మానసిక సన్యాస దీక్ష మరియు భౌతిక సన్యాస దీక్ష స్థితిగతులు కలుగుతాయి. అవి మన సాధన ఎప్పుడైతే హృదయ చక్రానికి వస్తుందో….. అప్పుడు బంధాలన్నీ మన నుంచి విడిపోవడం జరుగుతుంది. అలాగే నీ భర్త నుంచి నీవు విడాకులు పొందడం అనేది నీ హృదయ చక్రంలో ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి యొక్క ఋణానుబంధం తీర్చడం వలన ….అవి తీరిపోతాయి. ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైతే ఉంటారో….. ఇక అక్కడి నుంచి మోక్ష సన్యాస దీక్షకి అర్హత పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్త్రీ ఇలా సాధనా విగ్రహ మూర్తిని పొందవలసిన అవసరం లేదు. దైవ రహస్యాలను చేదించాల్సిన అవసరము లేదు….
అనేసరికి
శివనందిని:- స్వామి! మరి సాధనలో ఉన్న ప్రతి స్త్రీ మూర్తి కూడా…. అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లలేరు కదా! అప్పుడు చక్రాలు జాగృతి, శుద్ధి ,స్వాధీనం, ఆధీనం, విభేదనం , దేహమోక్షాల కోసం ఖచ్చితంగా ఆ క్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందా? దైవిక వస్తువులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా?
రుద్రస్వామి:- ఇక్కడ మన సాధన స్థితిని బట్టి ….అన్నీ ఉంటాయి. మన సాధన అనేది అవసర భక్తితోనో లేదా ప్రసాద భక్తితోనో లేక కోరికల భక్తితోనో చేస్తున్నామా లేదా గృహ అవసరాల కోసం చేస్తే భక్తా అనేది తెలుసుకోవాలి. ఇలాంటి భక్తి సాధన కాదు . అది మోక్షస్థితి ఇవ్వదు . అది గుర్తుపెట్టుకో ! మోక్షజన్మ ఎవరైతే పొందుతారో ఋణానుబంధాలన్నీ తీరిపోతూ ఉంటాయి. వాళ్ళుతెలిసో తెలియకో…అనుకోకుండా క్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుంది. అంతెందుకు పరమహంస తన సాధనలో శ్రీశైలం వెళ్ళటం జరిగింది. కాశీ వెళ్ళడం జరిగింది. చివరాకరికి అరుణాచలం వెళ్ళటము జరిగింది. కానీ తన సహాయకుడైన జిజ్ఞాసి సహాయంతో వివిధ క్షేత్రాలకి జిజ్ఞాసిని పంపించి…. అక్కడున్న దైవిక వస్తువులను తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ దైవీక వస్తువులతో చక్రాలు జాగృతి చేసుకోవడం , శరీరాలు జాగృతి చేసుకోవడం, చక్రాలు విభేదనం గావించడం….. శరీరాలకు మోక్షం ఇవ్వడం జరిగింది. కాబట్టి కాలానుగుణంగా ప్రకృతి మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇస్తుంది . ఒకే క్షేత్రంలో ఉండే అవకాశం ఉన్నది . ఆ క్షేత్రంలో ఉండి సాధన చేసుకున్న సరిపోతుంది. ఎందుకంటే పరమహంస గారు నాలుగు శరీరాలు అనగా జ్యోతి శరీరం, మనో శరీరం, పిండ శరీరం, కారుంగళి దేహమును కాస్త విబేధనం చేసుకొని శూన్యం చేసుకోవడం జరిగింది అని తన ఆత్మ కథలో చెప్పడం జరిగింది కదా! ఎప్పుడు, ఎక్కడ , ఏ క్షేత్రంలో, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాకపోతే గృహస్థాశ్రమంలో ఉన్న వాన ప్రస్థావంలో ఉన్నా , బ్రహ్మచారిగా ఉన్నా , సన్యాసిగా ఉన్నా కూడా ఏదో ఒక క్షేత్రంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ప్రాంతానికి తప్పనిసరిగా ప్రకృతి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఆ క్షేత్ర ఋణం నీకు ఉండి ఉంటే….. నిన్ను ఆ క్షేత్రం తప్పనిసరిగా పిలుస్తుంది. అక్కడ నువ్వు గత జన్మంతరాలలో ఏదో ఒక సాధన చేసి ఉంటావు. ఆ సాధనకి నీకు సంబంధించిన దైవిక వస్తువు అక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటుంది. దానిని నువ్వు అందుకోవాల్సి ఉంటుంది. పొందవలసి ఉంటుంది. దాన్ని అందుకొని నువ్వు ఇంటికి తీసుకువచ్చికొని పూజలో ఉంచినా ….పూజించకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. తద్వారా దైవిక వస్తువు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో…. ఆ క్షేత్రంయొక్క ఋణం తీరిపోతుంది. తద్వారా నీ సాధన పురోగతి చెందుతుంది. ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సన్యాసంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సన్యాసంలో ఉన్నవారు ప్రత్యక్షంగా వెళ్లి ఆ వస్తువుని పొందడం జరిగితే….. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సహాయకులుగా తెలిసినవారు లేదా బంధుమిత్రులు ఎవరో ఒకరు ఏదో ఒక వస్తువు తీసుకొని వచ్చి ఇది నీకోసం తీసుకొచ్చానని చేతిలో పెట్టడం జరుగుతుంది. ఆ వస్తువు వలన నీకు సాధన పురోగతి జరుగుతుంది . క్షేత్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు… యత్భావం భావం తద్భవతి! కాలానుగుణంగా ప్రకృతి ఎప్పుడు ఏం చేయాలనేది చేస్తుంది. సాధనకి స్త్రీ, పురుషుల తేడా లేదు. క్షేత్ర ఋణాలు ఉంటే ఖచ్చితంగా సాధకుడు, సాధకురాలు ఆ క్షేత్రానికి గత జన్మల్లో వెళ్లి వాళ్ళ చేసిన సాధనా దైవిక వస్తువులను పొందవచ్చు. పొందాల్సి ఉంటుంది . అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.
శివ నందిని వెంటనే పరమహంస ఎప్పుడో మోక్షం పొందాడని చెప్పడం జరిగింది కదా! మరి నేను కొత్తగా సాధన చేసి మోక్షం పొందడం ఏమిటి? అది కూడా విశ్వమోక్షం పొందడం ఏమిటి? నాకు అర్థం కాలేదు. ఇప్పటికే ఆయన పూర్ణ మోక్షం పొందారు కదా అంటే…
రుద్రస్వామి:- అమ్మ! ఇక్కడ ప్రకృతిలో పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి అని రెండు ప్రకృతిలు ఉంటాయి.
ఒక ప్రకృతి కదిలే ప్రకృతి అంటే స్త్రీ ప్రకృతి . కదలని ప్రకృతి అంటే పురుష ప్రకృతి . పురుష ప్రకృతిలో మళ్లీ రెండు ప్రకృతులు ఉంటాయి. ఒకటి పురుషుడు, రెండు స్త్రీ మూర్తి. పురుషుడేమో కదలకుండా ఉంటారు… స్త్రీ మూర్తి కదలకుండా ఉంటుంది . అంటే పురుష ప్రకృతిలో పురుషుడు కదలడు…. స్త్రీ మూర్తి కదులుతుంది
అదే స్త్రీ ప్రకృతిలో స్త్రీ మూర్తి మరియు పురుషుడు ఉంటారు . ఇందులో స్త్రీ మూర్తి కదలదు ….పురుషుడు కదులుతూ ఉంటాడు అన్నమాట!
అంటే పరమహంస గారి సాధన ప్రకారంగా చూస్తే, పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు అని తెలుసుకుంటాడు. అందులో స్త్రీ మూర్తి మోక్షం పొందలేదని తెలుసుకున్నాడు. ఇప్పుడు నీ సాధన పరంగా స్త్రీ ప్రకృతి సాధన నువ్వు చేయాల్సి ఉంటుంది. ఇందులో మోక్షం పొందని పురుషుణ్ణి నువ్వు పొందవలసి ఉంటుంది.
ఇప్పుడు మోక్షం పొందని కదిలే పురుషుడు …కదిలే స్త్రీ మూర్తి కలిపి అర్ధనారీశ్వర తత్వం చేసి ఏకత్వం చేయగలిగితే….. అదే విశ్వమోక్షం అవుతుంది అన్నమాట! కదిలే ప్రకృతి వల్ల మోక్షం రావట్లేదు. అమోక్షం పొందడం జరుగుతుంది. కదలని స్త్రీ పురుష ప్రకృతి వలన వచ్చేది మోక్షం అవుతుంది.
కాకపోతే పురుష ప్రకృతిలో కదలని పురుషుడు ఉంటే స్త్రీ ప్రకృతి లో కదలని స్త్రీ మూర్తి ఉండటం జరుగుతుంది. అలాగే పురుష ప్రకృతిలో కదిలే పురుషుడు ఉంటున్నాడు.
కదలని పురుష స్త్రీల వల్ల మోక్షం వస్తుంది. కదిలే పురుష స్త్రీ వలన మనకి అమోక్షం వస్తుంది. కాబట్టి కదిలే వాళ్ళని కదలని స్థితికి తీసుకురావడమే మీ ఇద్దరి సాధన పరిసమాప్తి అయ్యి….. అది విశ్వమోక్షం అవుతుంది. ఇప్పటివరకు ఆయన కదిలే అమ్మవారిని కామాక్షి దేవి విగ్రహ మూర్తిని పొందడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఆకాశ శరీర రూప దారి చేతుల్లోకి కామాక్షి విగ్రహ మూర్తి వచ్చి ఉండాలి. ఎందుకంటే కామాక్షిలో మనకి రాజరాజేశ్వరి తత్వము, అలాగే లలితాదేవి తత్వము ఉంటుంది. ఇందులో రాజరాజేశ్వరి అమ్మవారు కదలని స్థితి అయితే ….లలితా కదిలే స్థితి అన్నమాట !
ఎందుకంటే రాజరాజేశ్వరి ఎప్పుడు ఏకాంతంగా ఒంటరిగా ఉంటే….. లలితా దేవి శివుడి కింద ప్రమథ గణాలతో నిత్యం ఉంటుంది. ఇందులో కదిలే మూర్తి లలిత అయితే కదలని మూర్తి రాజరాజేశ్వరి అన్నమాట! ఇద్దరు కలిస్తే కంచి కామాక్షి అవుతుంది. ఈ కంచి కామాక్షి మూర్తియే శివానంద దగ్గరికి వచ్చి ఉండాలి . అలాగే ఇప్పుడు స్త్రీ పరంగా నువ్వు సాధన చేస్తే స్త్రీ ప్రకృతిలో కదిలేవాడు చిదంబర నటరాజు అయితే….. కదలని ఆవిడ రాజరాజేశ్వరి అవ్వాలి. ఇప్పుడు ఆ కదిలే వాడిని నువ్వు పట్టుకొని స్థిరపరిచి కదలని స్థితికి తీసుకు రాగలిగితే ఒక పురుష విగ్రహ మూర్తి వస్తుంది .
అది ఏమిటి… ఏది…. అనేది నీకు ప్రస్తుతానికి నీసాధనకి తెలియదు. సాధనా చక్రాలు పూర్తి అయిపోయి…. దేహాల మోక్షాల జాగృతి సరికి రావచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది సాధనా విగ్రహం నుంచి వచ్చే ఆధారాలను బట్టి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చే పురుష విగ్రహ మూర్తిని తీసుకొని శివానంద దగ్గరికి వచ్చిన విగ్రహ మూర్తి స్వరూపమైన కామాక్షి దేవి విగ్రహంతో అనుసంధానం చేస్తే…… వాళ్ళిద్దరూ కలిసి ఏకత్వం అయ్యి అర్ధనారీశ్వర తత్వం పొంది అటు పై నపుంసకస్థితిని పొందితే…..ఆ తర్వాత వచ్చేది విశ్వ మోక్షం మోక్షం అవుతుందన్నమాట!
ఈ విధి విధానం అంతా జరగాలంటే…. ముందు నువ్వు చక్రాల జాగృతి పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాల జాగృతి పూర్తి చేసుకోవాలి. ఇందుకుగాను విశ్వ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని…ఆ విశ్వ కేంద్రాలలో ఉన్న విశ్వశక్తి నంతా మీ సాధనా శక్తితో అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వీటన్నింటినీ సక్రమంగా చేసుకోగలుగుతావో …..అప్పుడు నీ దగ్గరికి పురుష విగ్రహ మూర్తి వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి స్త్రీ వ్యక్తిగత మోక్షం అవుతుందా! లేదా విశ్వమోక్షం అవుతుందా! అనేది కాల నిర్ణయమే చేయాలి. ఏం జరుగుతుంది…. ఏంటి…. అనేది తెలియదు కదా ! కాకపోతే పరమహంస తన సాధన పరంగా విశ్వమోక్షం పొందాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అతను వ్యక్తిగత మోక్షం అయిన పురుష మోక్షమును పొందడం జరిగిందని తన సాధన అనుభవాలు చెప్పడం జరిగింది.
కాకపోతే అంతే స్థితిగతులు…. అంతే సాధనాస్థితి అంతే అర్హత,యోగ, యోగ్యత యోగం నీకు ఉంది. కాబట్టి పరమహంస ఆకాశ శరీరంలో ధర్మపత్ని ఋణం…. నీ మనో శరీరానికి ధర్మపత్ని ఋణపాశం ఉండటం వలన… ప్రకృతి మీ ఇద్దరిని కలిపి అనుసంధానం చేస్తూ మీ సాధన శక్తితో విశ్వమోక్షమును పొందే విధివిధానమును ఏర్పాటు చేసింది. దీనికి నువ్వు నీ సాధనను బట్టి , నీ చేతను బట్టి, నీ సాధన పరిసమాప్తి అవుతుందా లేదా అనేది కాల నిర్ణయానికి వదిలేయడం జరిగింది.
ఒకవేళ నువ్వు నీ సాధన పరిశ్రమకు చేసుకుంటే మీ ఇద్దరి మరణమే విశ్వమోక్షమరణం అవుతుంది. లేదు అంటే పరమహంస ఏనాడో పురుష వ్యక్తిగత మోక్షం పొందడం జరిగింది. కాకపోతే నువ్వు సాధన చేసుకొని స్త్రీ వ్యక్తిగత మోక్షమరణం పొందుతావు. మీ ఇద్దరి మరణాలు కలిస్తే విశ్వమోక్షమరణం అవుతుంది. అంటే మీ ఇద్దరూ కాదు…. మీ ఇద్దరి చేతిలో ఉన్న విగ్రహం మూర్తులు. అవి ఎలా ఎప్పుడు ఏంటి అనేది నీ సాధనను బట్టి నువ్వు పురుష విగ్రహ మూర్తిని పొందే దాకా సాధనా విగ్రహ మూర్తి ఉండాలి. ఈపాటికి శివానంద ఈ సాధన స్థితిని పొంది ఈ స్థితికి ఎప్పుడో చేరుకొని మోక్షం పొందని స్త్రీ మూర్తి అయిన ఆదిపరాశక్తి అంశయన కంచి కామాక్షి విగ్రహం పొందడం జరిగింది. అందుకోసం దానిని అనుసంధానం కోసం నీ సాధన స్థితిని పురుష విగ్రహ మూర్తి దాక తీసుకు రావాలని చెప్పి తను ఎదురుచూస్తున్నాడే కానీ…. మరో చెడు ఉద్దేశంతో కానీ , మరొక చెడు ఆలోచన గాని, తనకి ఏనాడూ లేవు. అతను కామ వికారాలను జయించి ఇంద్రియనిగ్రహమును పొందినవాడు. నగ్నత్వమును చేదించి ఆడ తనంలో అమ్మతనం చూసే మానసిక స్థితిని పొందినవాడు. సామాన్యంగా కనిపించే అతను అసామాన్యమైన వ్యక్తి అని గుర్తుంచుకో! అజ్ఞానిగా ఉండే బ్రహ్మజ్ఞాని…. పూర్ణజ్ఞాని అని తెలుసుకో…. గ్రహించు…. అతని మాటలు, చేష్టలు అన్నీ కూడా పిల్లవాడి మాదిరిగాను ….వయసులో ఉన్న యువకుడి మాటలు లాగానే ఉంటాయి…. కానీ నిజానికి అది మన సాధనా స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి , పరిశోధించడానికి చెబుతున్నాడని గ్రహించు. మనలో ఉన్న సాధన ఆటంకాలన్నీ మాటలతో తొలగిస్తూ సాధనను ముందుకు తీసుకు వెళ్తున్నాడని తెలుసుకో ! అంతేగాని ఆయన వల్ల నీకు ఎలాంటి మాయలు వస్తాయో…. అడ్డంకులు వస్తాయని చెప్పేసి అతని దూరంగా పెట్టడానికి ప్రయత్నించకు . అయినా అతని చూస్తే ఎవరైనా అతని మాటలకి, అతని నవ్వుకి, అతని చేష్టలకి పడిపోవడమే కానీ లేవడం అనేది ఉండదు. ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాకపోతే నీ ఇంద్రియ నిగ్రహ శక్తిని ఎప్పటికప్పుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలను తట్టుకొని నిలబడగలిగే శారీరక, మానసిక స్థితిని నీకు అందిస్తూ ఉంటాడు. అతనే నీకు ఒక రకంగా దీక్ష గురువు అవుతారు. నాకు తెలిసినంతవరకు నీకు పాతివ్రత్య దీక్ష ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి ధర్మ సందేహాలు పెట్టుకోకు… సాధన సందేహాలు పెట్టుకోకు….అనుమాన భయాలు పెట్టుకోకు…. నేను నీకు మంత్ర గురువు అయితే , ఆయన నీకు దీక్ష గురువు అవుతారు. ఆ తర్వాతే అక్కడ నీకు శక్తి పాత గురువు కూడా నాకు తెలిసినంతవరకు నీకు దర్శనం అవ్వాలి. ఇక ఇక్కడి నుంచి సాధన జాగ్రత్తగా చేసుకో …జయం పొందు. రేపు ఉదయం 11 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలి. కాబట్టి బాలగణపతి, భైరవిని తీసుకొని వస్తే…మహాదేవి నేను ఇక్కడ సిద్ధంగా ఉంటాము. అనగానే సరే స్వామి! మేము బయలుదేరుతాము. ఎటు బాలగణపతి సరాసరి గదిగి వస్తాడు అనుకుంటా! వాడు వచ్చేసరికి నేను ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి. కాబట్టి నేను వెళతాను అనేసరికి…. మహాదేవి ధ్యానంలో ఉందని తెలుసుకొని… ఇబ్బంది పెట్టకూడదని…. అంటూ ఉండేసరికి సరే తల్లి! నేను ఇక్కడ కాసేపు పడుకుంటాను. నువ్వు గదికి వెళ్ళు అని అనుమతి ఇచ్చేసరికి…. ఆయనకు నమస్కారం చేసి శివ నందిని అక్కడి నుంచి తన గది వైపుకు వెళ్ళిపోతుంది.
శుభం భూయాత్





కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి