కారణ శరీరం
సాధన కుటుంబం అంతా రామేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రైలు ఎక్కడం జరిగింది అని తెలుసు కదా! అప్పుడు పిల్లలు రామేశ్వర క్షేత్ర స్థల పురాణం చెప్పమని అడిగేసరికి… ఈ స్థలం విశేషాలను అప్పటికే శివ నందిని ఇంటర్నెట్లో తెలుసుకొని ఉండటంతో… పిల్లలకి చెప్పటం ప్రారంభించింది. ఈ క్షేత్రంలో మనం రెండు శివలింగాలను చూస్తాము. ఒకటి సీతాదేవి ప్రతిష్ట శివలింగం, రెండోది హనుమంతుని ప్రతిష్ట చేసిన శివలింగం. అంటే ఏంటి? అనగానే ఇక్కడ రావణ సంహారం అనంతరం, శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న గంధమాధన పర్వతం దగ్గర ఆవాసం చేయడం జరిగింది. ఈయన్ని దర్శించుకోవడానికి యోగులు, మహర్షులు, సాధువులు, జనాలు రావడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు మహర్షులతో అయ్యా! నేను అపర శివ భక్తుడైన రావణబ్రహ్మను సంహారం చేయడం జరిగింది. అలాగే బ్రాహ్మణహత్య దోషం నాకు సంప్రాప్తించింది. ఈ దోష నివారణ కోసం ఏం చేయాలి అని అడిగినప్పుడు….. ఈ దోష నివారణ కోసం ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే, దోష నివారణ జరుగుతుంది అని చెప్పడంతో….. శ్రీరాముడు కాస్త హనుమంతుడికి కైలాసం నుంచి శివలింగమును తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు హనుమంతుల వారు భూలోక కైలాసమైన కాశి క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న శివలింగంలో ఏ శివలింగం తీసుకోవాలా ! అని హనుమంతుడు కొన్ని క్షణాల పాటు అయోమయ స్థితిలో పడటం జరిగింది. ఈలోగా ఈ క్షేత్రంలో ఉన్న సీతాదేవి దంపతులకి లింగప్రతిష్ట సమయం మించిపోతుందని చెప్పడంతో…. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవుతుందేమో అని శ్రీరాముడు గ్రహించడంతో….. శ్రీరాముడిని మనసును గ్రహించే ఇల్లాలు సీతాదేవి కావడంతో…. సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక తీసుకుని శివలింగ ఆకారం తయారు చేయడం జరిగింది. సీతాదేవి తయారు చేసిన ఈ శివలింగం శ్రీరాముడు ప్రతిష్ట మంత్రాలతో ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తరువాత హనుమ కాశీ నుంచి శివలింగమును తీసుకొని రావడం జరిగింది. అప్పటికే ఈ క్షేత్రంలో రాముల వారి చేత సీతాదేవి తయారుచేసిన సైకత లింగం ప్రతిష్ట జరిగిపోవడంతో…కించిత్ బాధపడుతూ, కష్టపడి తెచ్చిన శివలింగం వల్ల ఉపయోగం లేకుండా పోయింది అనుకుంటూ…. ఆ శివలింగమును సముద్రంలో పడవేయబోతూ ఉంటే… శ్రీరాముడు ఆపి నాయనా! హనుమ! ఆలస్యమునకు చింతించకు. మహా శివుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదా! దీనికి కారణం ఏమిటి అనేది మనకి తెలియకపోవచ్చును. నీవు తెచ్చిన ఈ శివలింగమును దర్శనం చేసుకున్న తర్వాత నా శివలింగం దర్శనం చేసుకున్న వాళ్లకి ఈ క్షేత్ర యాత్ర ఫలితం కలుగుతుందని చెప్పేసి వరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన శివలింగం ప్రతిష్ట చేయడం జరిగింది. అందువలన ఈ క్షేత్రంలో మనకి రెండు శివలింగాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఒకటి సీతాదేవి శివలింగం, రెండోది హనుమంతుని శివలింగం అన్నమాట! సీతాదేవి ప్రతిష్ట శివలింగాన్ని రామనాథ స్వామి అని చెప్పడం జరుగుతుంది. అలాగే హనుమంతుడు ప్రతిష్ట చేసిన లింగాన్ని హనుమ లింగంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో 64 తీర్ధాలు ఉంటాయి. ఈ 64 తీర్థాలలో 22 బావులలో ఉన్న తీర్థాలు శ్రేష్టమైనవి. అందులో అతి ముఖ్యమైనది అగ్నికుండ్ తీర్థం అన్నమాట! ఇందులో స్నానం చేసినట్లయితే ఈ శివలింగ దర్శనం చేసుకున్నట్లయితే సర్వపాపహరం అని స్థల పురాణం చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో అనేక గుళ్ళు దర్శనమిస్తాయి. సుమారుగా 15 ఆలయాలు ఈ క్షేత్ర పరిసరాలలో చూడవచ్చును అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయ్యవారు రామనాథ స్వామి అయితే…. అమ్మవారు పర్వత వర్ధినిగా ఉంటుంది అని…. అలాగే ఇక్కడ బ్రహ్మచారి గణపతి ఉంటాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రామనాథ శివలింగాన్ని మనం తాకడం చేయకూడదు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఒక్క శివలింగం తాకటానికి అర్హత లేదు. ఎందుకంటే ఇది సైకతలింగంగా ఉండటం…. రాబోవు తరాల వారికి ఇది అందించాలని నియమం పెట్టడం జరిగింది. దూరం నుంచి మనం ఈ శివలింగమును దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల బ్రహ్మ ముహూర్త కాలంలో స్పటిక శివలింగారాధన అభిషేకాలు జరుగుతాయి. ఈ సమయంలో ఆ స్పటిక శివలింగ దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది అని చెప్పేసి స్థల పురాణం చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏమిటంటే…. ధనుష్కోడి ప్రాంతంలో రెండు సముద్రాలు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలుస్తాయి అని చెప్పి అంటారు. ఎక్కడైనా రెండు జీవనదులు కలవటం…. ఒక జీవనది సముద్రంలో కలవడం అనేది మనం చూడవచ్చును. కానీ, రెండు సముద్రాలు కలవటం అనేది ఈ క్షేత్రంలోనే చూడడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే….. అలలు లేని సముద్రమును ఈ రామేశ్వర క్షేత్రంలోనే చూడడం జరుగుతుంది. ఎక్కడైనా సముద్రానికి విపరీతమైన అలలు వస్తాయి కదా! ఇక్కడ గాలి వలన నీరు కదలడం ఎలా అయితే జరుగుతుందో… అలా అలలు లేని సముద్రం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే…. శ్రీరాముడు లంకకి రామసేతు కట్టాలి అనుకున్నప్పుడు సముద్రుడు మొదట అనుమతి ఇవ్వలేదట… ఆగ్రహించాడట! ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు ఒక బాణం వేయగానే సముద్రుడు భయపడి దారి ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దారిలోనే రామసేతు కట్టడం జరిగింది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే నీటి మీద తేలియాడే రాళ్లు కనిపిస్తాయి. ఎక్కడైనా రాళ్లు నీటిలో మునుగుతాయి కదా! ఇక్కడ ఉన్న రాళ్లు నీటిలో మునగవు. దీనికి కారణం ఏమిటంటే…. రామసేతు కట్టేటప్పుడు వేసిన రాళ్లు వేసినట్టుగానే సముద్రంలో మునిగిపోవడంతో…. ఏం చేయాలో అర్థంకాక హనుమంతుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని…. శ్రీరామ శ్రీరామ అని రాయి మీద రాస్తే ఆ రామశక్తి వలన పైకి లేస్తుంది అని గ్రహించి ప్రతీ రాయి మీద శ్రీరామ అని రాయటంతో… ఆ రాళ్లు నీటి మీద తేలడం జరిగింది. ఇలాంటి రాళ్ళను మనం ఇక్కడ చూడవచ్చును అని చెప్పేసి అనేసరికి…. పిల్లలు కాస్త సంతోషపడుతూ… అయితే మేము ఈ రాళ్లు తెచ్చుకోవాలి…. ఈ రాళ్లు ఏంటో చూడాలి అనేసరికి…. సరే చూద్దాం అనుకున్నారు. కాసేపటి తర్వాత రైలు రామేశ్వర క్షేత్రానికి చేరుకుంది అని అనౌన్స్మెంట్ రావడంతో అందరూ కూడా తమ తమ లగేజీ సర్దుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరూ రామేశ్వర క్షేత్రంలో దిగటం జరిగింది. గుడికి దగ్గరలో ఉన్న హోటల్ కి ఆటోలో వెళ్లడం జరిగింది. హోటల్లోకి వెళ్లి గది బుక్ చేసుకోవడంతో…. కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానాలు కానించుకొని అయ్యవారి దర్శనానికి వెళ్ళాలి అని అందరూ నిశ్చయించుకోవడం జరిగింది. తద్వారా వీళ్ళు మొదట అగ్నికుండ్ తీర్థంలోకి వెళ్లి స్నానాధికాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గుడిలో 22 బావులు ఉన్న చోటికి వెళ్లి 22 బావులలోను బకెట్ల ద్వారా స్నానాధికాలు చేసుకొని బట్టలు మార్చుకొని పొడి బట్టలతో ఈ ఆలయ దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఈ ఆలయంలో మొదట మహాగణపతి, సతి సమేతంగా ఉన్న కుమారస్వామి గుళ్లను దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయం చూడటానికి పిరమిడ్ నిర్మాణం లాగా ఉన్నదని…. నాలుగు ప్రాకారాలతో నాలుగు ప్రధాన ద్వారాలతో ఉన్నది అని… శివ నందిని చెబుతూ ఉండగా, ఇక్కడ మూడు మండప ప్రాకారాలు ఉంటాయి… ఒక మండపం ప్రకారం 1012 స్తంభాలతో ఉంటే , ఇంకో ప్రకారం 108 స్తంభాలతో ఉంటే, మరొక ప్రకారం 54 స్తంభాలతో ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ 1012 ప్రకారాలు ఉన్న స్తంభం చూస్తూ ఉండేసరికి దాని స్తంభంలో…ఒక శూన్య బిందువు కనపడటం పిల్లలు గమనించి అమ్మ! చూశావా..! చివర్లో మనకి ఒక బిందువు ఉన్నట్టుగా కనబడుతుంది కదా! అనేసరికి దానినే శూన్య బిందువు అంటారు నాయనా! ఆ బిందువులోనే పూర్ణ శూన్యం ఉంటుంది…పూర్ణ మోక్షం పొందడం జరుగుతుంది. ఆ బిందువు లోనికి వెళ్లి శూన్యం అవ్వడం అని చెప్పేసి…. అనేసరికి ఓహో! పూర్వకాలంలో ఈ జ్ఞానమును చెప్పకనే చెప్పారన్నమాట అని ఈ నిర్మాణమును బట్టి అనుకున్నారు.. ఇవి ఒక్కొక్క స్తంభం సుమారు 23 అడుగుల ఎత్తు ఉండటం ఆ స్తంభాల మీద ఒక్కొక్క దేవత విగ్రహ మూర్తి, రామాయణం, మహాభారతం ఇతిహాసాలను చెక్కి ఉండటంతో…. ఎంతో సుందరంగా, ముగ్ధ మనోహరంగా ఉన్నాయి అని అనుకుంటూ…. ఆ స్తంభాలను తాకుతూ…. దేవాలయ దర్శనానికి వెళ్ళటం జరిగింది. సుమారుగా 500 మీటర్లు లోపలికి నడవడం జరిగింది. ఆ తర్వాత సీతాదేవి తయారుచేసిన సైకత లింగమైన రామనాథ స్వామి శివలింగమును దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ పక్కనే ఉన్న పర్వత వర్ధిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉన్న బ్రహ్మచారి గణపతి గుడికి, కుమారస్వామి గుడిని, ప్రత్యంగిరా విగ్రహ మూర్తి ఉన్న స్తంభమును దర్శనం చేసుకుని బహుశా..! ఇదే శంకుస్థాపన స్తంభం అనుకుంట! అని చెప్పేసి శివ నందిని అక్కడి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక పెద్ద నంది విగ్రహ మూర్తిని, సహస్ర లింగాలు ఉన్న గుడి, ఆ తర్వాత నటరాజమూర్తి గుడి, దక్షిణామూర్తి గుడి, పంచలోహాలతో తయారైన శ్రీరాముడి కుటుంబం ఉన్న గుడి, లింగోద్భవ శివలింగం ఉన్న గుడి, విశాలాక్షి గుడి, అన్నపూర్ణేశ్వరి గుడి, మహిషాసుర మర్ధిని గుడి, హనుమంతుడు ప్రతిష్ట చేసిన శివలింగం, ఆ తర్వాత శ్రీ చక్రమును, స్పటిక శివలింగం దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మవారు పర్వత వర్ధిని అమ్మవారు నిలబడి ఉన్న భంగిమలో ఉండటం వీళ్లంతా గమనించారు. ఆ తర్వాత ఎవరికి వారే ధ్యానంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు శివ నందిని కాస్త అగ్నిముద్రతో మణిపుర చక్రం ఆధీనం కోసం ఈ చక్రంలో ఉండే కారణా శరీరం జాగృతి,శుద్ధి ,ఆధీనం కోసం సాధన చేయడం ఆరంభించింది. కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు కనిపించలేదు. సుమారుగా రెండు మూడు గంటల పాటు ఏకాంతంగా ధ్యానంలో ఉండిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలు అవ్వడంతో పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పడంతో…. ఇక భోజనాలు కానించుకొని హోటల్ గదికి చేరుకోవడం జరిగింది. ఎవరికి వారే విశ్రాంతి గా మంచాల మీద పడుకునే వారు మంచాల మీద, నేల మీద పడుకునే వారు నేలమీద పడుకోవటం జరిగింది. విశ్రాంతి తీసుకునే వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు… నిద్రలోకి జారుకునేవారు నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత అందరికీ మెలకువ వచ్చేసరికి సాయంత్రం 5:00 అయింది. స్నానాదులు కానించుకొని మళ్లీ అయ్యవారి దర్శనం కోసం రావడం జరిగింది. పిల్లలు ఆటల రందిలో పడటంతో రుద్రస్వామి, మహాదేవి, శివనందిని కాస్త ధ్యాన నిష్ఠలోకి వెళ్లిపోవడం జరిగింది. కానీ శివ నందిని కి ఎలాంటి ధ్యానానుభవాలు కలగలేదు. ఇదే విధంగా దినచర్యను సుమారుగా 15 రోజులపాటు ఈ క్షేత్రంలో ఉండి కొనసాగించినప్పటికీ… ఎలాంటి ఫలితాలు కలగకపోయేసరికి ….ఒక విధమైన ఆవేదన, ఆవేశం, తన సాధనలో తప్పు చేస్తున్నానేమో అనే అనుమాన భయాలు నెమ్మదిగా శివ నందినిలో కలగటం మొదలయ్యాయి. అయినా కూడా ధ్యానము చేయడం ఆపలేదు. ధ్యాన తపస్సు అలాగే కొనసాగిస్తూ ఉన్నది.
శివనందిని ధ్యాననిష్ఠలో ఉండగా….ఒక రోజు ఉన్నట్టుండి బొడ్డు ప్రాంతంలో విపరీతమైన నొప్పి రావటం మొదలైంది. అకారణంగా నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఏదైనా అనారోగ్య సమస్య అని అనుకుంటూ ఉండేసరికి….. మణిపురాచక్రం తెరుచుకోవటం… యోగ పద్మము తెరుచుకోవడం పదేపదే ధ్యానంలో కనిపిస్తూ ఉండేసరికి…. ఏదో తనలాంటి ఆకారంతో ఉన్న శరీరం ధ్యాననిష్ఠలో ఉన్నట్టుగా కనిపించడం….. ఆ శరీరం లోపల పంచపడగలు ఉన్న నాగపడగతో ఉన్న శివలింగం కనిపించింది. ఈ శివలింగానికి తన కారణ శరీరానికి ఏదో సంబంధం ఉన్నది అని గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు. అంటే తన నొప్పికి కారణం ఈ శరీరం శుద్ధి అవ్వాలి అనుకుంట…. తెలిసి తెలియక చేసిన తప్పులు, కర్మ దోషాలు, శాపాలు ఏమైనా ఉంటే తన సాధనతో శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ శరీరం ఆధీనం అవుతుంది. ఈ శరీరం శుద్ధి అయిన తర్వాతే మనకి పంచముఖంతో ఉన్న శివలింగం ప్రాప్తం అవుతుంది అని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అలాగే సాధన కొనసాగిస్తూ ఉండేసరికి….. ఈ మణిపూరక చక్రం నుంచి సహజసిద్ధమైన ఓంకార నాదం వినడం ఆరంభించింది. ఎవరో నాదం చేస్తున్నట్టుగా అనిపించేసరికి…. ఇంకెవరూ తన కారణ శరీరమే ధ్యానంలో ఉండి ఈ నాదం చేస్తుంది అని గ్రహించింది. ఇక తను ధ్యానంలో ఉంటూ చేస్తున్న గురు మంత్రమైనా గాయత్రి కానీ, ఓంకారం కానీ తను చేయలేని పరిస్థితికి రావడం జరిగింది. తన మనసు సహజ సిద్ధంగా వచ్చే ఓంకారమును వినటానికి ఇష్టపడుతుంది అని గ్రహించింది. రాను రాను తన మనస్సు, శరీరం చేసే మంత్రాలు కూడా ఆగిపోవడం జరిగింది. నాద యోగంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి…. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నాదం ఒక్కొక్క చక్రంలో…. ఒక్కొక్క నాదం వినపడుతుంది అని చెప్పేసి శివపురాణంలో చెప్పడం జరిగింది. మహాశివుడు నాదయోగ ప్రక్రియ ద్వారానే సాధన పూర్తి చేసుకుని మోక్షమును పొందడం జరిగింది అని శివపురాణంలో నాద అభ్యాసం చేసి చెప్పడం జరిగింది కదా! అది మనకి మణిపుర చక్రంలో సహజసిద్ధమైన ఓంకార నాదం వస్తుంది అని గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు. కాకపోతే ఈ నాదం వింటూ ఉంటే శరీర స్పృహ కోల్పోతుంది అని…. బయట స్పృహకి తన శరీరం కానీ, మనసు కానీ, తన హృదయం కానీ…. మెదడు కానీ తీసుకోవట్లేదు అని చెప్పేసి….అంటే ఏదో తెలియని ఆనంద స్థితి, ఏదో చెప్పడానికి వీలులేని ఆనంద స్థితిలో ఉండిపోతుందని గ్రహించింది. ఈ నాదము వింటూ ఉంటే శరీరం స్పృహ కోల్పోవడం, మనసు లయ తప్పడం, అస్థిర మనసు కాస్త స్థిరం అవటం జరగటం జరుగుతున్నాయి అని…. ఈ విధంగా ఈ నాదమే వినడం అభ్యాసంగా చేసింది. అగ్ని ముద్ర సాధన చేస్తూ తన బొడ్డు ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ఓంకారం వినటం అభ్యాసం చేస్తూ వస్తుంది. ఇలా ఒక మండలం అనగా 41 రోజుల పాటు ఈ నాదమును వినటం మీదనే ఏకాగ్రతను పెట్టడం జరిగింది. సహజసిద్ధంగానే తను ధ్యానంలో ఉన్నా లేకపోయినా కూడా తనకి నాదం వినపడుతుంది అని గ్రహించింది. ఈ నాదం వినపడినప్పుడల్లా మనసు, శరీరం, ఆత్మ యోగ మత్తులోకి వెళ్ళిపోతుంది అని….. తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది అని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. తనకి కలుగుతున్న స్థితుల గురించి రుద్ర స్వామికి చెప్పగా….
రుద్ర స్వామి:- అమ్మ! ప్రారంభ సమాధి స్థితికి నీవు వెళ్తున్నావు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనసు, ఆత్మ ఇవేమీ స్పందించడం… ఆలోచించడం… ఆశించడం….ఇవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. మనసు ఓంకారం విని యోగమత్తు ఆవరించినప్పుడు నువ్వు అచేతన స్థితిలోనికి వెళ్లిపోవడం జరుగుతుంది. జనాలు నీకు పిచ్చి పట్టింది అని లేదా అనారోగ్య సమస్య లేదా ఫిట్స్ వచ్చాయి అని అనుకునే ప్రమాదం ఉంటుంది.(అని హెచ్చరిక చేయడంతో)…..ఈ నాదమును వేళ తప్పకుండా …..క్రమం తప్పకుండా వినటానికి అభ్యాసం చెయ్యి… వినడం ఆరంభించావు అంటే అస్థిరమైన మనసు కాస్త స్థిరమైపోయి, శరీర స్పృహ కోల్పోవడం జరుగుతుంది…
అని చెప్పడంతో… శ్రద్ధ భక్తులతో ఇక తన అదుపులో మనసు ఉండేటట్టుగా…. మనసు తన మాట వినేటట్టుగా మనసుని అభ్యాసం చేయటం ఆరంభించింది. మనసుని నెమ్మది నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడం ఆరంభించింది. క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా ఈ సహజ సిద్దమైన ఓంకార నాదం వినడం ఆరంభించింది. ఇలా ధ్యాననిష్టలో ఉన్న శివనందిని ఒక రోజు ధ్యానస్ఫురణగా తనలాంటి శరీరం ఉన్న ఒక శరీరం తన బొడ్డు ప్రాంతం నుంచి ఒక పేగు బంధం లాగా బయటకి వచ్చినట్టుగా కనిపించింది. సూక్ష్మ శరీరానికి ఎలాంటి పేగు బంధం లేదు కానీ…. ఈ కారణ శరీరానికి పేగు బంధం ఉండేసరికి…. ఆశ్చర్యం వేసింది. ఇది తన బిడ్డలాంటిది అన్నమాట! అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అలా తను బయట ఉండి అన్ని పరిసరాలను గమనిస్తూ కూర్చోవడం… నేను చూడటం… మళ్లీ అటు ఇటు తిరగటం చేసింది. ఎంత దూరం వెళ్ళినప్పటికీ… ఏం చేసినప్పటికీ…. ఈ పేగు బంధం సాగుతుంది కానీ, విడిపోవడం అనేది జరగట్లేదు అని శివ నందిని గ్రహించింది. తన ప్రతిబింబమును తనకు తానే చూస్తున్నట్లుగా… ఆశ్చర్య ఆనందాలకు గురి అయ్యింది. తనలాంటి కవల పిల్లని చూస్తున్నట్లుగా అనిపించ సాగింది. ఈ శరీరము అగ్నితత్వంతో… అగ్ని తేజస్సుతో ఉన్నట్లుగా గ్రహించింది. అగ్నితో ఆరాశక్తి ఉన్నట్లుగా దివ్య కాంతి దివ్య తేజస్సుతో ఉన్నట్లుగా లీలామాత్రంగా కనిపించింది. శరీరం అంతా కూడా అగ్నిమయంగా ఉండటం గమనించింది. అంటే ఈ శరీరం తనలో ఉండటం వలనే తన స్థూల శరీరానికి ఆరాశక్తి కలుగుతుందని గ్రహించింది. ఆరాశక్తికి మూల కారణం శరీరం అన్నమాట అని గ్రహించింది. తర్వాత ఈ శరీరం కూడా ధ్యానంలో కూర్చుని ఉండేసరికి బింబానికి ప్రతిబింబం లాగా అలా ధ్యానంలో కూర్చుని ఉండిపోయారు. కానీ ఈ శరీరం తనకి తప్ప ఇంకెవరికి కనిపించట్లేదు అని అర్థం అయింది. దాదాపు మూడు గంటలు అయిన తర్వాత కారణ శరీరం కాస్త బొడ్డు ప్రాంతంలోనికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ శరీరం తనంతట తానే శుద్ధి చేసుకోవడం ధ్యానంలో చేసుకుంటుంది అని శివనందిని గ్రహించింది. అసలు ఈ శరీరమునకు కారణం ఉండటం వలన స్థూల శరీరం ఏర్పడింది. అసలు ఈ శరీరం ఏ కారణంతో జన్మ తీసుకుందో తెలుసుకోవాలని ఆలోచన రావడంతో శివనందిని ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది. అలా తను ఎంతసేపు ధ్యానంలో ఉన్నా ఎలాంటి ధ్యాన దృశ్యాలు కనిపించకపోవడంతో పిల్లలు ఆకలి ఆకలి అని రుద్రస్వామిని అడగటంతో…. మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి భోజనం చేసుకొని గదికి వెళ్ళటం జరిగింది. గదికి వెళ్లిందనే కానీ, శివ నందిని కి నిద్ర పట్టలేదు. కారణం ఏమిటంటే…. కారణ శరీరం ఏర్పడడానికి…. జన్మ ఎత్తడానికి…. కారణం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి దాన్ని ఎలా విశ్లేషణ చేసుకోవాలి. ఎలా తెలుసుకోవాలో అర్థం కాక హృదయం మీద చేయి పెట్టి స్వామి! స్వామి! అని అనగానే శివ స్వామి కాస్త తన పక్కన కనిపించేసరికి…
శివ స్వామి:- నీకు మాత్రమే నేను కనబడుతున్నాను. మిగతా వాళ్ళకి నేను కనబడను.
శివ నందిని:- మీరు నా మాట ఎప్పుడు విన్నారులే ! నన్ను పిచ్చిదాన్ని చేయాలని ముందే నిర్ణయం తీసుకున్నారు. సరేలే….తెలియనిది ఏముంది! మీతో తప్ప నేను ఎవరితో మాట్లాడను కదా!
శివస్వామి:- ఏంటి నువ్వు జన్మ ఎత్తటానికి కారణాకారకాలు తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అదే విషయం కారణ శరీరాన్ని అడగకపోయావా?
శివ నందిని:- కారణ శరీరం దర్శనం అయితే చేసుకున్నాను గాని… అది మౌనంగా ఉంది. అది కూడా ధ్యాననిష్టలో ఉంది. కారణాకారణాలు అది చెప్పినా….నాకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. అదేదో అన్ని తెలిసిన వాళ్ళు మీరు కాబట్టి…. మీరు చెబితే బాగుంటుంది అనిపించి… అలాగే ఏదో ఒక కారణం చేత మీతో మాట్లాడాలి కదా! కారణం లేనిదే మీరు మాట్లాడరు కదా! అందుకోసమని ఈ కారణం చెప్పి మిమ్మల్ని చూడవచ్చు… మాట్లాడవచ్చు….
శివస్వామి:- సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి ….
శివనందిని:- మీరు ఏమీ అనుకోను అంటే మీ ఒళ్ళు పడుకొని సేద తీరుతాను.
శివస్వామి:- సరే నీ ఇష్టం….
శివ నందిని ఆయన ఒళ్లో తలపెట్టుకొని పడుకుంది. అలా కొంతసేపు ఆ విషయాలు, ఈ విషయాలు ముచ్చటిస్తూ…. నిద్రలోకి జారుకోవడం జరిగింది. అలాగే శివ స్వామి కూడా ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది. సుమారుగా ఒక గంట తర్వాత మెలకువ రావటంతో….. శివ స్వామి ధ్యానం చేసుకుంటున్నారని…. నెమ్మదిగా ఆయనకి ధ్యానభంగం కాకుండా లేచి…. తను కూడా ధ్యానం చేసుకుంటూ ఉండగా…. ఒక 15 నిమిషాల తర్వాత తనని ఎవరో గమనిస్తున్నారని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శివ స్వామి కళ్ళు తెరిచి చూస్తూ….
శివస్వామి:- దేవి! నువ్వు నన్ను పిలిచి నాతో ఏమీ మాట్లాడకుండా నిద్రపోతే ఎలాగా?
శివనందిని:- ఏమి చెప్పను స్వామి! మిమ్మల్ని చూడగానే నా మనసు తెలియని ఆనంద స్థితి విశ్రాంతిని కోరుకుంటుంది. అలసిన శరీరం కాబట్టి మీ దగ్గర ప్రశాంత స్థితి వస్తుంది. ఏ సమస్యలు ఉండవు…ఎలాంటి ఆలోచనలు ఉండవు…నా వాడు నా పక్కన ఉన్నాడు… అనే మనోధైర్యంతో ప్రశాంతమైన స్థితిని పొందడం జరుగుతుంది. తద్వారా నాకు ఒక విధమైన యోగం మత్తు ఆవరించి నిద్రపోవడం జరుగుతుంది. ఈ ప్రశాంతమైన ఈ నిద్ర కోసం నేను ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నానని నాకు బలంగా అనిపిస్తుంది. మీ సాంగత్యంలో నాకు ఇదే ప్రశాంతత స్థితి ఇస్తుంది… ఇది నాకు ధ్యానంతో సమానం. అది యోగనిద్ర కావచ్చు…. భోగ నిద్ర కావచ్చు…. ఒక విధమైన ప్రశాంతత ఆనంద స్థితి కలుగుతుంది. అది మాటలతో చెప్పలేని అలవి కానీ స్థితి.
శివస్వామి:- ఏముందిలే దేవి! అందరికీ జ్ఞానమార్గంలోనూ, భక్తి మార్గంలోనూ, కర్మ మార్గంలోనూ, సాధన చేసిన తర్వాత ఒక విధమైన ప్రశాంత స్థితి వస్తుంది. అలౌకికమైన స్థితిని పొందు తారు. దానినే కొంతమంది బ్రహ్మానందం అని…. కొంతమంది పరమానందం అని చెప్పడం జరిగింది. నువ్వు నా సాంగత్యంలో ఉండటం వలన నీ మనసు సేద తీరుతుంది. ఆనంద స్థితికి వెళుతుంది. సంతోషకరమైన స్థితికి వెళుతుంది. భయం లేని స్థితికి వెళుతుంది. అందువలన నువు అలవికాని అలౌకిక స్థితి కి వెళ్తున్నావు. ఇది నీకు సాధనాస్థితి ఫలితమే…
శివ నందిని:- స్వామి! నేను ఈ జన్మ ఎత్తడానికి గల కారణం ఏమిటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను…
శివస్వామి:- కారణ శరీరమే నీ అంతట నీకే సమాధానం చూపిస్తుంది. ఓర్పుతో, సహనంతో ఉండు. శ్రద్ధ భక్తులతో యధావిధిగా ధ్యాన తపస్సు లో ఉండు..
శివ నందిని:- స్వామి! నేను ఈ క్షేత్రానికి వచ్చి మూడు నెలలు అవుతుంది. పంచముఖాలు ఉన్న నాగ పడగలు మాత్రమే దర్శనం ఇస్తుంది. అది ఎక్కడ ఉంది అనేది తెలియడం లేదు. అది వస్తే కానీ ఈ కారణా శరీరం యొక్క శుద్ధి పూర్తి కాదు అని చెప్పేసి అర్థం అవుతుంది..
శివస్వామి:- అవును… ఈ శరీర శుద్ధి అవ్వటానికి ఎన్నో జన్మంతరాలలో చేసిన తప్పులు, ఒప్పులు, పాప పుణ్యాలు ఉంటాయి కదా! అవన్నీ పరిశుద్ధం అవ్వాలి కదా! సర్వకర్మల నుంచి విముక్తి అవ్వాలి కాబట్టి…. అది సాధన చేసుకుంటుంది కాబట్టి… దాని సాధన పరిసమాప్తి సమయానికి రావాల్సిన దైవిక వస్తువులు వాటి అంతటా అవే వస్తాయి… వేటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు… సహజసిద్ధంగా చేస్తున్న ఓంకార నాదం వింటూ సాధన అభ్యాసం చేసుకో. ఇకనుంచి నువ్వు మంత్రాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ దైవారాధన చేయాల్సిన అవసరం లేదు… సహజసిద్ధంగా వచ్చే ఓంకార నాదంతోనే నువ్వు సాధన పరిసమాప్తి చేసుకో వచ్చును..అప్పుడప్పుడు మనసు లయ తప్పినప్పుడు…. మనసు పక్కదారి పట్టినప్పుడు… మాయలో పడినప్పుడు ఈ నాదం వినపడడం జరగదు. ఈ నాదం ఎప్పుడు వినపడట్లేదో అన్నాడు అప్పుడు నీ సాధన తప్పుదారి పడుతుందని గ్రహించు. ఇదే ప్రకృతి మనకి ఇచ్చే సూచన.
శివ నందిని:- సరే స్వామి! నేను అనుకోకుండానే ఈ నాదం వినడంతో మనసులయం తప్పుతుంది. శరీర స్పృహ కోల్పోతున్నాను…
శివ స్వామి:- ఇదే ప్రారంభ సమాధి స్థితి. ఇది నువ్వు గదిలో ఉన్నప్పుడు ఈ స్థితిని పొందిన పరవాలేదు…. ఏదైనా గుడిలోనో …ఇతర ప్రాంతాలలో ఉన్నప్పుడు ఈ స్థితిని పొందితే ఆయా శరీరం కాస్త అచేతన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. నీకు ఫిట్స్ వచ్చాయని…. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందని ….చాలామంది నీకు పిచ్చి పట్టిందని అనుకునే సమస్య ఉంది. నిన్ను ఒక పిచ్చిదాని లాగా చూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏకాంత సమయంలో, ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు ఈ స్థితిని పొందు. అందరూ ఉన్నప్పుడు మాత్రం ఈ స్థితిని పొందకుండా మనసును అదుపులో ఉంచుకో. నీ అదుపు ఆజ్ఞలో నీ మనసు ఉండేలా చేసుకో. కానీ నాదంలోకి మనసు లయం చేయకు. లయం చేస్తే శరీర స్పృహ కోల్పోతుంది. అచేతన స్థితికి వెళ్ళిపోతుంది. అది నీ చేతుల్లో ఉంటుంది .
శివ నందిని:- సరే స్వామి! ఇప్పుడు మీరు అన్ని తెలిసినా కూడా జన్మకి కారణం ఏమిటి? అనేది చెప్పరని అర్థం అయింది.
శివ స్వామి:- దేవి! అన్ని చెబితే అందులో మజా ఏమి ఉంటుంది. ఎవరికి వారే సాధన చేసి తెలుసుకోవడంలోనే మజా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. తెలియని సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. కారణం నీకే తెలుస్తుంది ….ఎదురు చూడు…. కాస్త ఓర్పు పట్టు…. నీ కారణ శరీరమే విషయం నీకు తెలిసేలా చేస్తుంది. కారణ శరీరం నీతో మాట్లాడే స్థితి దాకా నువ్వు సాధన చేస్తూ ఉండు. నేను ఇంక ఉంటాను …నాకు ధ్యానం చేసుకునే సమయం అయింది. ఇంక శ్రీశైలం వెళుతున్నాను..
అని అంతర్ధానం అవ్వడంతో…. ఇక సమయం ఐదు గంటలు అవుతుంది అని అప్పటికే మిగతా వాళ్ళు నిద్రలో నుంచి మేలుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసి అగ్ని కుండ్ లో స్నానాధికాలు చేసుకుని…. స్వామి వారి దర్శనానికి వెళ్ళటం జరిగింది.
అన్ని దర్శనాలు పూర్తి చేసుకున్న తర్వాత శివ నందిని యధావిధిగా అగ్నిముద్రతో ధ్యాననిష్ఠలోకి వెళ్లడం జరిగింది. ఇలా సుమారుగా రెండు గంటల పాటు ధ్యానముద్రలో ఉండగా…. తనకి ధ్యాన దృశ్యంగా తన మణిపుర చక్రం నుంచి కారణ శరీరం బయటకు రావడం…. గుడిలో అన్ని ప్రదేశాలను పేగు బంధంతో తిరుగుతూ ఉండటం…. శివ నందిని ధ్యానంలో చూస్తూ గమనించింది. కళ్ళు తెరిచి చూస్తే… తన కారణ శరీరం కనిపించడం లేదని, ధ్యానంలో ఉన్నప్పుడే తన కారణ శరీరం కనపడుతుంది అని, అంటే కారణ శరీరాన్ని కూడా కేవలం మనోనేత్రంతోనే చూడడం జరుగుతుందని….. భౌతిక నేత్రాల ద్వారా చూడలేము అని చెప్పి శివ నందిని గ్రహించింది. పేగు బంధం విడిపోవడానికి ఏదైనా సమస్యలు వస్తాయి అని ఆలోచన చేసింది కానీ…. ఎలాంటి సమస్యలు రావట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి…. అగ్నికుండ్ తీర్థంలో తన కారణ శరీరం వెళ్లి స్నానాధికాలు చేయడం…. 21 బావుల్లో మునిగిరావడం…. ఆ తర్వాత అయ్యవారిని అమ్మవారిని దర్శనాలు చేసుకోవడం…. ఇతర గుళ్లను దర్శనం చేసుకోవడం చేస్తూ ఉండేసరికి… శివ నందిని… తన స్థూల శరీరంతో ఈ గుళ్లను ఎటు దర్శనం చేసుకుంటున్నాను కదా! మరి కారణ శరీరం మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు వెళ్లి దర్శనం చేసుకుంటుంది అనేది అర్థం కాలేదు. తన కారణ శరీరం మాటలు తనకి వినిపించే స్థితికి సాధన రాలేదు అని అనుకుంది. ఉన్నట్టుండి కారణ శరీరం కాస్త ఏదో ఒక ప్రాంతంలో నాగశిలలు ఉన్న ప్రాంతంలో ఒక పుట్టలోకి వెళ్ళటం గ్రహించింది. అప్పుడు ఆ పుట్ట లోపల పంచనాగ పడగలు ఉన్న శివలింగం ఉన్నట్లుగా….తనకి ధ్యానానుభవం అవ్వడం జరిగింది. ఓహో! ఇక్కడ ఎక్కడో నాగ దేవతల ఆలయం ఉన్నట్లుగా ఉన్నది. ఈ ఆలయంలోనే ఈ పంచనాగుల శివలింగమూర్తి ఉన్నట్లుగా ఉంది అని చెప్పకనే చెబుతుంది అని గ్రహించింది. సరే ఆ ప్రాంతానికి వెళ్లాలి అనుకునేసరికి… యధావిధిగా కారణ శరీరం యథావిధిగా తన మణిపుర చక్రంలో నిక్షిప్తం అవటం జరిగింది. ఓహో! తన దైవిక వస్తువైన శివలింగం రావటం కోసం తను అన్ని ప్రాంతాలను వెతికినట్టుగా ఉన్నది… అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ తర్వాత పిల్లలు కాస్త అమ్మ! అమ్మ! ఎప్పుడు ధ్యానంలోనే ఉంటావా? ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మనం దర్శనం చేసుకుందామా? అని అడిగేసరికి…. సరే వెళ్దాం నాయన! ముందు మనం ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్రాంతం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనేసరికి….. ఇక గుడి నుంచి సాధనా కుటుంబం అంతా బయటకు వచ్చి ఈ గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను దర్శనం చేసుకోవడం మొదలుపెట్టారు. మొదట గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళటం జరిగింది. శ్రీరాముడు పాదాలు ఉన్న ఈ ప్రాంతాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ గుడి నుంచి చూస్తే రామేశ్వరం మొత్తం కనిపించడం పిల్లలు గమనించి…. ఆనందంతో చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తరువాత ఆ పక్కనే ఉన్న సాక్షి హనుమాన్ గుడికి వెళ్లడం జరిగింది. ఇక్కడ రాములవారి ఆజ్ఞ మేర హనుమంతుడు సీతాదేవిని వెతకడం కోసం లంక వైపు వెళ్లడం జరిగింది. అక్కడ సీతాదేవిని లంకలోని అశోకవనంలో హనుమంతుడు చూడడం…. తను రాంబంటు అని చెప్పేసి రాములవారు ఇచ్చిన అంగుళీకం సీతాదేవికి చూపించటం…. సీతాదేవి దానిని చూసి శ్రీరాముడిది అని గ్రహించడం…. ఆ తర్వాత హనుమంతుడు కాస్త అమ్మ నిన్ను చూశాను అని రాములవారికి కూడా తెలియాలి కదా! నీకు గుర్తుగా ఏదైనా ఇస్తావా అంటే…. ఆవిడ కాస్త చూడామణి ఇవ్వడం…. ఆ చూడామణిని తీసుకొని హనుమంతుడు కాస్త ఈ లంకా ప్రాంతానికి రావడం…. రాములవారి చేతిలో సీతాదేవి యొక్క చూడామణి ఇవ్వడం జరిగింది అని…. అందుకు సాక్షిగా ఇక్కడ ఇది ఉన్నది అని శివనందిని చెప్పేసరికి…. అందరూ కూడా జై హనుమాన్, జై శ్రీరామ్ అనుకుంటూ ఆనందపడ్డారు. ఆ తర్వాత రామతీర్థం చూపించడం జరిగింది. రామతీర్థంలో మొట్టమొదటిసారిగా రాములవారు స్నానం చేస్తూ రామ రావణ యుద్ధంలో జయం పొందాలి అని శివుడిని ప్రార్థించడం జరిగింది. ఆ పక్కనే ఉన్న నాగాలయంలోకి వెళుతూ ఉండేసరికి శివ నందినికి శరీరం కాస్త అచేతనా స్థితికి వెళ్తూ…. యోగ మత్తులోకి వెళ్తూ ఉండేసరికి… తను కాసేపు ధ్యానం చేసుకుంటాను అనేసరికి….. ధ్యానంలో పంచముఖ నాగ పడగలు ఉన్న శివలింగం ఇక్కడ ఈ ప్రాంతంలోనే కనబడింది అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. చూస్తే అక్కడ నాగ ప్రతిమలు కనిపించాయి. సంతానం కోసం అని… రాహుకేతు దోష నివారణ కోసం, సర్ప దోషములు, సర్ప శాపములు నివారణ కోసం ఈ దేవాలయంలో వివిధ నాగులను ప్రతిష్ట చేయడం జరిగింది అని గ్రహించింది. కానీ ఈ శివలింగం ఎలా పొందాలో శివ నందినికి అర్థం కాలేదు. ఇదే విషయాన్ని రుద్ర స్వామికి చెప్పేసరికి ఓహో! ఈ ప్రాంతం తర్వాత వచ్చి చూద్దాం తల్లి ! ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా చూసి వద్దాం అనేసరికి…. అక్కడే దగ్గరలో ఉన్న పంచముఖ హనుమంతుని గుడికి వెళ్లడం జరిగింది. హనుమంతుడికి ఒక శాపం ఉంది…. తన శక్తి తను గుర్తించకుండా ఉండే స్థితిని హనుమంతుడు పొందడం జరిగింది. హనుమంతునికి ఎంత శక్తి ఉందో చూసేందుకు…. ఒక్కసారిగా విశ్వరూపమును పొందడం జరిగింది. ఆ విశ్వరూపం యొక్క ప్రతిరూపమే ఈ పంచముఖ హనుమాన్ గుడి అని చెప్పేసి శివ నందిని చెప్పటం జరిగింది. ఆ తర్వాత రామసేతుని నిర్మించిన రాళ్లు ఉన్న గుడికి వెళ్లడం జరిగింది. ఈ గుడిలో నీటి మీద తేలుతున్న రాళ్ళను గమనించి పిల్లలు ఆనంద, సంతోషాలు పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళని బతిమాలుకొని నీటి మీద తేలే రాళ్లను రెండింటిని పిల్లలు తీసుకోవడం జరిగింది. పిల్లల ముచ్చట పెద్దలు కాదనలేదు. ఆ తర్వాత నటరాజస్వామి ఆలయం…. ఆ తర్వాత సీతాదేవి మొదట స్నానం చేసిన తీర్థము దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని ఆలయమునకు వెళ్లడం జరిగింది. ఇందులో మొదటి అంతస్తులో అద్దాల మండపం…. రెండవ అంతస్తులో శ్రీకృష్ణుని మ్యూజియం ఉండటం జరిగింది. శ్రీకృష్ణుడి మ్యూజియంలో శ్రీకృష్ణుని జీవిత చరిత్ర ఘట్టాలన్నీ కూడా ఉండటం గ్రహించి…. వాటిని ఒక్కొక్కటిగా చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణ తీర్థమును దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్మణుడు మొట్టమొదటిసారిగా స్నానం చేస్తూ తన అన్న శ్రీరాముడు యుద్ధంలో విజయం పొందాలి అని శివుడిని ప్రార్థించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కొడి వెళ్లాలని…. అక్కడ కొన్ని ప్రాంతాలను చూడవచ్చు అని శివ నందిని ఇంటర్నెట్లో ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకొని….ఇక ఈ రోజంతా మనం ఇక్కడ గడిపేద్దాం.. మనం కొన్ని రోజుల తర్వాత మళ్లీ ధనుష్కోడి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను చూడడానికి వెళ్దాము…. ఇప్పటికే సాయంత్రం ఐదు గంటలు అవుతుంది. చీకటి పడుతుంది… మనం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి కూడా సమయం ఉండదు అని ఆటో నీ వెనక్కి తిప్పి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. దానితో పిల్లలు చూసినంతవరకు సంతృప్తి పడుతూ విశ్రాంతి తీసుకుని…. నీటిలో తేలే రాళ్లను నీటిలో వేసి రాళ్లు తేలుతూ ఉన్నాయా లేదా అనే ఆటల్లో ఉండటం….. పెద్దలు ముగ్గురు కూడా ఆలోచనలో ఉన్నారు. కారణం ఏమిటంటే పంచముఖ నాగ పడగలో ఉన్న శివలింగం మూర్తిని ఎలా సంపాదించాలి? ఎలా వస్తుంది? అనే ఆలోచనల్లో ఎవరికి వారే ఉన్నారు. మహాదేవి కాస్త…
మహాదేవి:- దాని లోపల శివలింగం ఉంది అని మనకి నిర్ధారణ అయింది కానీ, ఆ శివలింగ మూర్తిని పొందడం ఎలాగా? శివస్వామిని అడిగితే ఏమైనా చెప్తారా?
(అనేసరికి శివ నందిని తల అడ్డంగా ఊపి)
శివ నందిని:- ఆయన అన్నీ తెలిసిన కూడా…. నీ చావు నువ్వు, చావు నాకు సంబంధం లేదు అనే రకం. గంత్యంతరం లేని పరిస్థితుల్లో…. ఇక నాకు అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో…. అంత్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే తన సహాయ సహకారాలు అందిస్తాడు. దీపం వెలిగించి ఆరిపోకుండా చేతులు పెట్టాలి. చేతులు పెట్టినా కూడా ఆరిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆయన వచ్చి రక్షిస్తాడు. ఆయన మనస్తత్వం అటువంటిది. చేతులు అడ్డుపెట్టకుండా…. మానవ ప్రయత్నం చేయకుండా…. దైవప్రయత్నం కావాలి అంటే ఆయన చచ్చినా చేయడు. మానవ ప్రయత్నం చేసిన ఉపయోగం లేదు అనుకున్నప్పుడు మాత్రమే దైవ ప్రయత్నంగా అతని వంతు సహాయ సహకారాలు అందిస్తాడు. ముందు మనకి ఆ ప్రాంతంలో కావలసిన దైవిక వస్తువు ఉందని తెలిసింది కదా! ఆ తర్వాత అది ఎలా పొందాలి ఎలా చేయాలి అనేది ఇక కాలానుగుణంగా పరిస్థితులను బట్టి చూసుకోవాలి…
రుద్రస్వామి:- అది నిజమేలే మానవ ప్రయత్నం చేయకుండానే…. సరాసరి దైవప్రయత్నమే కావాలి…. దేవుడా! నువ్వే దీపం ఆరకుండా చూడు అని అనడం కూడా తప్పే. మానవ ప్రయత్నంగా దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టినప్పటికీ కూడా…. దీపం ఆరిపోయే పరిస్థితి వస్తే దైవం కాపాడక తప్పదు. మానవ ప్రయత్నంగా చేసిన దానికి ఏదైనా ఆటంకాలు….అవాంతరాలు వస్తే దైవ శక్తి కాపాడుతుంది.
అని రుద్ర స్వామి చెప్పడంతో ఎవరికి వారే వ్యక్తిగత ఆలోచనలను చేస్తూ నిద్రలోకి జారుకోవడం జరిగింది. పిల్లలు కూడా కొంతసేపు ఆడుకొని నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి ఐదు గంటలు అయ్యిందని సరే తెల్లవారు జాము అయిందని సుప్రభాత సేవకు వెళ్లాలి అని అందరూ కూడా అగ్ని కుండ్ లో స్నానం చేసి సుప్రభాత సేవకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈ దర్శనా కార్యక్రమాలు అన్ని పూర్తి అయ్యేసరికి ఉదయం 7:00 కావడంతో శివనందిని కాస్త ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది.
ధ్యాననిష్ఠలో ఉన్న శివ నందిని యొక్క మణిపుర చక్రం నుంచి కారణ శరీరం బయటికి రావటం జరిగింది. ఎదురుగా కూర్చుని తనకేసి కళ్ళార్పకుండా చూస్తూ ఉండేసరికి… శివ నందినికి ఏదో అనుమానభయము,సందేహం వచ్చింది. ఏదో మాట్లాడాలి అని కారణ శరీరం పెదాలు కదుపుతుంది కానీ, ఆ మాటలు తనకి అర్థం కావడం లేదు అని శివ నందిని గ్రహించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా తన సాధనా స్థితి అంతవరకు వెళ్ళలేదు అని గ్రహించింది. తన మాటలకు శివ నందినికి చేరడం లేదు అని కారణ శరీరం గ్రహించి….తనతో రమ్మని సైగ చేయడంతో కారణ శరీరం ముందు వెళ్తూ ఉంటే…. తన వెనక వెళ్లడం ప్రారంభించింది. ఈమెను అనుసరిస్తూ మహాదేవి, రుద్రస్వామి కూడా రావటం జరిగింది. పిల్లలు కాస్త గుడిలోనే ఆడుకుంటూ ఉంటారులే అని నిర్భయంగా అనుకొని…. ఇక వీళ్ళు కూడా రావడం జరిగింది. ఈ కారణ శరీరం నడుచుకుంటూ నడుచుకుంటూ అలా రహదారులు దాటుతూ వెళుతూ ఉండేసరికి…. వీళ్ళ ముగ్గురు కూడా ఏదో అయోమయ స్థితిలో ….అర్థం కాని స్థితిలో తనని అనుసరించడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండేసరికి ఒక పాడుబడిన ఇంటి లోపలికి వెళుతుందని గ్రహించారు. సరే అని కారణ శరీరం అయితే గోడలను దాటుకుని… తలుపులను దాటుకొని వెళ్లడం జరిగింది కానీ, భౌతిక శరీరాలు ఉన్న వీళ్ళ ముగ్గురికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తమని గమనించడం లేదు అని దొంగ చాటుగా కిటికీ చువ్వలను వంచి లోపలికి వెళ్లడం జరిగింది. లోపలికి వెళ్ళేసరికి…. తన పోలికలతో ఉన్న ఒక స్త్రీ మూర్తి ఫోటోలు, భర్తతో ఉన్న ఫోటోలు, పిల్లలు ఉన్న ఫోటోలు గమనించేసరికి ఆశ్చర్య ఆనందాలకు శివనందిని వెళ్ళింది. అంటే శివనందిని తన కారణ శరీరం యొక్క భౌతిక శరీరానికి సంబంధించిన ఇల్లు ఇది… అని అనుకుంటూ ఉండేసరికి అక్కడ ఇంట్లో ఉన్న గదులన్నీ ఒక్కొక్కటి కారణ శరీరం చూపిస్తూ ఉంటే…. వీళ్ళ ముగ్గురు వాటిని చూస్తూ రావడం జరిగింది. రుద్రస్వామి కాస్త లో గొంతుతో…
రుద్రస్వామి:- అమ్మ! ఇది నీ కారణ శరీరం యొక్క ఇల్లు అయి ఉంటుంది. ఇది నీ కారణ శరీరం యొక్క స్థూల శరీరానికి సంబంధించినది అయ్యి ఉండాలి…
అనేసరికి అవును అని శివ నందిని సైగ చేసింది. ఆ తర్వాత పూజ మందిరానికి వెళ్ళటం జరిగింది. ఆ పూజా మందిరంలో దీపపు స్తంభం, పూజకి సంబంధించిన వస్తువులు, హారతి ఇచ్చే చిన్న దీపాలు, ప్రమిదలు, తర్వాత పూజకి కావలసిన పళ్ళెములు, పసుపు కుంకుమ గిన్నెలు, విభూతి గిన్నె, గంధపు గిన్నె, అభిషేకమునకు వాడే పాత్రలు ఇవన్నీ కూడా కనిపించడంతో…. పూజా మందిరంలో ఎలాంటి ఇది కనిపించకపోయేసరికి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. ఆ పక్కన చూస్తే ఒక అస్థిపంజరం కనిపించింది. తనదే అని చెప్పి కారణ శరీరం సైగ చేసేసరికి… శివ నందినికి అర్థం కాలేదు. ఇక్కడ అస్థిపంజరం ఉండటం ఏమిటి? అసలు ఏం జరిగిందో! అని అనుకుంటూ ఉండేసరికి… కారణ శరీరం కాస్త ధ్యానంలో కూర్చోమని చెప్పి చెప్పడంతో…. ఈమె సరే అని చెప్పి తను కూడా ధ్యానంలో కూర్చోవడం జరిగింది. అప్పుడు తన కారణ శరీరం యొక్క భౌతిక శరీరం లీలామూర్తిగా కనపడటం జరిగింది. తనని వివాహం చేసుకున్న భర్త ఉద్యోగం రీత్యా రామేశ్వర క్షేత్రానికి రావడంతో…. తను ఇక్కడ ఈ క్షేత్రంలోనే స్థిరనివాసం చేసుకుంది అని… తను శివ భక్తురాలు కావడంతో సుమారుగా మూడు అడుగుల ఉన్న శివలింగం ఐదు ముఖాలు ఉన్న శివలింగమును ఇంట్లోనే పూజా మందిరంలోనే ప్రతిష్ట చేసుకుని శివారాధన చేసుకుంటూ ఉండేదని…. తనకి ముగ్గురు పిల్లలు అని… ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు అని…కాలానుగుణంగా భర్త, పిల్లలు కూడా అనారోగ్య సమస్యలతో అకాల మరణం పొందేసరికి…పిల్లల్ని, భర్తని కోల్పోవడం జరిగింది అని…. ఇక తను వితంతువుగా ఉండి శివలింగారాధన చేస్తూ ఉండేసరికి… ఆ పక్కనే ఉన్న బ్రాహ్మణ దంపతులు కాస్త గొడవలు చేసి వితంతువులు శివలింగ ఆరాధన చేయరాదు అని… శివలింగార్చన చేయరాదు అని…. నిత్యం ప్రాణపదంగా పూజించి ఆరాధించే శివలింగమును తీసుకొని వెళ్లి సముద్రంలో కలిపి వేయడం జరిగింది… అని చెప్పేసి తనకి కలిగిన మనోవేదన తోనే వితంతువుగా ఉంటూనే ఆహార పానీయాలు అన్నీ కూడా మానేసి తను అకాల మరణం పొందడం జరిగింది అని…. తన శరీరం దహనం చేసేవారు ఎవరూ లేకపోవడంతో…. ప్రేతాత్మగా మారి తను ఈ క్షేత్రంలోనే తిరుగుతుంది అని…. ఆ శివలింగమే కాలక్రమంగా ఒడ్డుకు చేరడంతో…. పాము పుట్టలు ఏర్పరచుకున్నాయి అని చెప్పేసి ధ్యాన దృశ్యాలు కనిపించడం జరిగింది. అంటే తను ధ్యానంలో చూసిన పంచముఖాల శివలింగమే తన కారణ శరీరం నిత్యం పూజించే శివలింగం అని గ్రహించింది. అలాగే తను చనిపోయిన విషయం తను మోక్షం పొందిన విషయమును నమ్మకపోవటం…. అకాల మరణం పొందడంతో….ఈ కారణ శరీరము మోక్షం పొందలేదని గ్రహించడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. ఈ ప్రపంచంలో పురుష ఆధిక్యత ఉన్నది కానీ స్త్రీ ఆధిక్యత లేదని….. పురుషులందరూ కలిసి తనని శివారాధన నుంచి దూరం చేశారని….. తన భర్త కూడా ఎల్లప్పుడూ పురుష అహంకారంతో పురుష ఆధిక్యతను చూపించడంతో…. స్త్రీ పురుషుడికి ఏ విధంగా తక్కువ కాదు, అన్నింటిలోనూ సరిసమానమే…. కావాలంటే ఇంక పురుషుని కంటే స్త్రీయే ఎక్కువ స్థాయి అని చూపించాలి అని చెప్పి పదేపదే అనుకుంటూ ఉండేది. ఈ కారణంతోనే తను జన్మ తీసుకోవడం జరిగింది అని అర్థం అయింది. ఎందుకంటే చిదంబరక్షేత్రంలో తను పురుషాదిక్యతనుస్త్రీ ఆధిక్యతలో … ఎవరి ఆధిక్యత ఎక్కువగా ఉంది అని చూపించుకోవడానికి ఆదిదంపతుల మధ్య కలహం రావడంతో…..వీరిద్దరూ నాట్యం చేయడంతో…. చివరికి వచ్చేసరికి మహాశివుడు కాస్త తన కాలిని నిలువుగా పైకి ఎత్తడం జరిగింది. కానీ అమ్మవారికి సిగ్గు, భయం ఉండటం వలన ఆ రోజు ఆ నాట్యంలో ఓడిపోవడంతో…. స్త్రీల కన్నా పురుషుడే అధికుడు అని ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తను పురుషులను ఓడించి తను కూడా కాలు ఎత్తి చూపించడం జరిగింది. ఒకప్పుడు అమ్మవారి చీరకట్టు విధివిధానంలో లోపాలు ఉండటం అప్పుడు ఓడిపోవడం జరిగితే…..ఇప్పుడు తన మడికట్టు విధివిధానంతో ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా కాలు ఎత్తే భంగిమలో జయం పొందడంతో…. ఇద్దరు సరిసమానులే, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు అని చెప్పి నిరూపించడానికి ఆ కారణంతోనే కారణ శరీరం జన్మ తీసుకుంది అని శివ నందినికి అర్థమైంది. అంటే స్త్రీ ప్రపంచంలో పురుషాధిక్యత కన్నా స్త్రీ ఆధిక్యత కూడా సమానమే అని…. ఇద్దరు కూడా సమానమే అని…. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని….. ఒకళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు అని ….చెప్పేసి తన కారణ శరీరం లోకానికి చెప్పాలి అని అనుకుంది. చేసి చూపించింది. దీనిని తట్టుకోలేని పురుషాధిక్యత కలిగిన బ్రాహ్మణులు కాస్త ఈమెను వెలివేయడం…. వితంతువు శివలింగారాధన చేయకూడదు అని చెప్పేసి శివలింగమును సముద్రంలో కలిపి వేయడం…. ఒక్కొక్క ధ్యాన దృశ్యం కనిపిస్తూ ఉండేసరికి శివ నందినికి “ తను చేసిన తప్పు ఏమిటి? ఆదిదంపతులలో అమ్మవారు చేసిన తప్పు తను సరిచేసింది ! తను సిగ్గుపడకుండా చేసింది అని అలా చూడాల్సిన అవసరం లేదు. పురుషుడికి లేని సిగ్గు, భయం స్త్రీ మూర్తికి ఎందుకు? పురుషుడు తప్పు చేసినప్పుడు…. వాడు దేనికి భయపడనప్పుడు…. అదే తప్పు చేసినప్పుడు స్త్రీ ఎందుకు భయపడాలి? అని చెప్పేసి ఇప్పుడు పురుషుడు చేసిన దానిలో ఎంత తప్పు ఉన్నదో….. అలాగే స్త్రీ చేసినప్పుడు కూడా …. పురుషుడు లాగానే నేను తప్పు చేశాను! ఆ అమ్మాయిని అనుభవించాను…. ఎన్ని రకాలుగా ముద్దులు పెట్టుకున్నాను…. ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాను …అని చెప్తున్నప్పుడు….స్త్రీ మూర్తి కూడా అదే విధంగా ….అంతే ధైర్యంగా… అదేవిధంగా నేను తప్పు చేశాను…నేను వాడితో పడుకున్నాను…. ముద్దులు ఇచ్చాను అని చెప్తే తప్పేముంది. పురుషుడికి లేని సిగ్గు, భయం స్త్రీకి ఎందుకు ఉండాలి…. స్త్రీ ఎందుకు తన తప్పు చేశాను అనుకోవాలి” అని చెప్పి ప్రతిసారి పురుషుని తప్పు ఎంత ఉందో స్త్రీ తప్పు కూడా అంతే ఉంది…. చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు అవసరం అవుతాయి…. ఒక చేతితో శబ్దం రాదు కదా! తను పురుషాధిక్యత ఎందులోనూ గొప్పది కాదు అని చెప్పేసి…. స్త్రీ ఆధిక్యత కూడా పురుషాధిక్యత కి ఏమాత్రం తక్కువ కాదు అని తను నిరూపించింది అని చెప్పేసి తన జీవిత అనుభవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ధ్యాన దృశ్యంగా శివ నందినికి కనపడుతూ ఉండేసరికి…. దారాపాతంగా తన కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. తను చేసిన తప్పు ఏమిటి? స్త్రీ పురుషులు సరి సమానం కదా! అని అన్నది. స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ అని ప్రచారం చేయలేదు. ఎక్కడ ప్రదర్శన ఇవ్వలేదు. ఇద్దరు సరి సమానమే…. పురుషుడికి కనిపించే శక్తి ఉంటే…. స్త్రీకి కనే శక్తి ఉంటుంది. పురుషుడి వీర్యం ఇస్తే, స్త్రీ గర్భం దాలుస్తుంది. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు. స్త్రీ లేకపోతే పురుషుడు లేడు.. అందుకనే ఆదిదంపతులలో పరమేశ్వరుడు తన అర్థశరీర భాగమును అమ్మవారికి ఇవ్వడం జరిగింది కదా! అలాగే విష్ణు కాస్త హృదయంలో ఇస్తే….బ్రహ్మదేవుడు కాస్త నాలుకను ఇవ్వటం జరిగింది కదా! త్రిమూర్తులకు నేనే పురుషాధిక్యత స్త్రీ ఆధిక్యత త్రిమూర్తులు వలన పుట్టిన మానవ మాత్రులకు ఎందుకు వస్తుంది! స్త్రీ గొప్పది కాదు, స్త్రీ తక్కువది, చులకనది అని పురుషుడికి ఎందుకు కలుగుతుంది…. పురుషుడు స్త్రీలు సమానం అంటే సరిపోతుంది కదా! తను చేసిన తప్పులు ఇదేనా..? లోకానికి ఇద్దరు సరిసమానం అని నిరూపించడం తప్పా ?నిదర్శనాలు చూపించడం తప్పా ? ఆధారాలు,ఆదర్శాలు ఇవ్వడం తప్పా ? అని చెప్పేసి శివ నందిని కాస్త ధ్యానం నుంచి బయటికి వస్తూ…..మహాదేవితో ఆవేశంగా చెప్పడం జరుగుతుంది. వీళ్లంతా కూడా నిదానంగా ప్రశాంతంగా వింటూ హ్మ్మ్ కొట్టడం తప్ప ఏమీ అనలేదు. నిజానికి అది శివ నందిని ఆవేశం, ఆవేదన కాదు… తనలో ఉన్న కారణ శరీరం ఆవేశం.. కారణాకారకాలు తెలియాలి కదా! తను జన్మ ఎందుకు తీసుకున్నాను…. సాధించింది ఏమీ లేదు… తను సాధించిన యోగ జీవితం అర్ధాంతరంగా పురుషుల వలన ఆగిపోయింది అనే ఆక్రందన, ఆవేదన, ఆవేశం శివ నందిని నోటి నుంచి పలికిస్తున్నాయి అని చెప్పేసి రుద్రస్వామి, మహాదేవి గ్రహించి మౌనంగా వింటూ తల ఊపడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. కొంతసేపటికి శాంతపడిన శివ నందిని కారణ శరీరం కాస్త ఆ పూజా మందిరం ప్రాంతంలో ఉన్న పలకను తొలగించమని సైగ చేయడంతో….శివనందిని కాస్త తొలగించేసరికి అక్కడి నుంచి భూగృహం లాంటి దానిలోకి వెళ్ళటానికి మెట్లు కనిపించాయి. మెట్లు దిగుతూ వీళ్ళ ముగ్గురు… వీళ్ళ కన్నా ముందు కారణ శరీరం లోపలికి వెళ్లారు. ఇది చిమ్మ చీకటి భూగృహం లాగా ఉన్నది అని చెప్పేసి వీళ్ళకి అర్థమయింది. సుమారుగా మూడు కిలోమీటర్లు లోపలికి వెళ్ళటం జరిగింది. సరాసరిగా ఒక పుట్టలో ఉన్న పంచముఖ నాగ పడగలతో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంటే శివలింగం అక్కడ పుట్టలో ఏర్పడింది అని చెప్పేసి కారణ శరీరం గ్రహించి….తను పూజా మందిరం నుంచి రహస్యంగా భూగృహం ద్వారా ఏర్పాటు చేసుకొని ద్వారము లోపలికి వచ్చి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తూ ఉండేది అని శివ నందిని గ్రహించింది. ఆ తర్వాత అక్కడ ఉన్న శివలింగమునకు దర్శించుకుంటూ ఉండేసరికి సుమారుగా ఆ శివలింగం లోపల లింగభాగము తొలగించేసరికి లోపల పీఠభాగంలో అతిశక్తివంతమైన సుమారు మూడు అంగుళాలు ఉన్న బంగారు శివలింగం కనిపించింది. ఈ శివలింగమునకు బొట్టు స్థానంలో ఒక మనిషి ఉండటం…. ఆ తర్వాత దీనిపై చుట్టుకుని ఉన్న పంచనాగుల మణులు ఉండటం జరిగింది. ఓహో! ఇదే మణిమయ శివలింగం అనుకుంట అని చెప్పేసి దానిని తీసుకోమని చెప్పేసి…. కారణ శరీరం సైగ చేయడంతో శివనందిని కాస్త దీనిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తను యధావిధిగా కారణ శరీరం పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత తన అస్థిపంజరమును ఈ ప్రాంతంలోనే దహనం చేసి… ఆ తరువాత ఆ బూడిదను సముద్రంలో కలపమని వెయ్యమని కారణ శరీరం సైగ చేస్తూ ఉండేసరికి ఆ సైగ కాస్త మాటలుగా మారి లీలా మూర్తిగా వినపడటం జరిగింది. కారణం తన చేతిలో ఉన్న మణిమయ శివలింగమూర్తి అని శివనందిని గ్రహించింది. ఆ తర్వాత తన కారణ శరీరం కోరిక మీద తనకి అర్థంతరంగా అకాల మృత్యువు, ఆత్మహత్య రూపంలో చేసుకోవడంతో తన శరీరానికి దహన సంస్కారాలు జరగకపోవడం గ్రహించి రుద్రస్వామి కాస్త దీపం వెలిగించి దీపం నూనెతో అస్థిపంజరం మీద పోసి ఆ ప్రాంతంలోనే దహనం చేయడం జరిగింది. పూర్తిగా బూడిదగా మారిన తర్వాత ఆ బూడిద కాస్త విచిత్రంగా ఒక శివలింగంలాగా మారటం అందరూ గమనించారు. ఆ బూడిద శివలింగం తీసుకొని సముద్రంలో నిమర్జనం చేయడం జరిగింది. ఆ తర్వాత కారణ శరీరం యొక్క ఆత్మ శక్తి యధావిధిగా మణిపుర చక్రంలో ఉండి పూర్ణ మోక్షం పొందడానికి అని చెప్పేసి ధ్యాననిష్టలో ఉండటం శివనందిని గమనించింది. దీని యొక్క కారణాలు తీరటం… అనాధ శవం కాస్త శవ దహన సంస్కారాలు పూర్తి అవటం…. అలాగే తను కాపలాగా ఇన్నాళ్లు ఉన్న శివలింగం కోరిక తీరటంతో తన కారణ శరీరం శుద్ధి అయ్యింది అని….తనకి ఆధీనం అయ్యింది అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఈ శివలింగం ను పిల్లలకి చూపించేసరికి భలే ఉంది ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క మణి ఉండటం….. అలాగే శివలింగం బొట్టు స్థానంలో మధ్యలో కూడా మణి ఉండటం చాలా బాగుంది. ఇది నేను పూజలో పెట్టుకోనా? అని చెప్పేసి బాల గణపతి అనేసరికి నీకు ప్రతి వస్తువు కావాలి రా! ప్రతి దైవిక వస్తువు అది శివ నందిని సంబంధించిన వస్తువు…. నీవి నీకు వస్తాయి…. ఎవరి వ్యక్తిగత వస్తువులు, ఎవరి వ్యక్తిగత సాధనను బట్టి వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు తట్టుకోలేరు… భరించలేరు అని స్వామి గద్దించేసరికి…. సరేలే నాకు ఎప్పుడైనా రాకపోతుందా! నేను ఆ సాధన స్థితికి వెళ్లక తప్పదు కదా! నేను దానిని సంపాదించుకోగలుగుతాను.. అమ్మ ! ఇది నీ దైవిక వస్తువు అంట… నువ్వే జాగ్రత్తగా ఉంచుకో! అనేసరికి రుద్రస్వామి తో శివ నందిని కాస్త అయ్యా! ఇప్పుడు మనకి కారణ శరీరం సాధన పరిసమాప్తి అయింది కదా! ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్లాలి అనేసరికి…. ఈ శివలింగమే చెబుతుంది. మనం చెప్పేది ఏముంది! అనడం జరిగింది.
దానితో రుద్ర స్వామి కాస్త శివ నందిని చేతిలో ఉన్న శివలింగమును తీసుకొని సాధన విగ్రహ మూర్తికి కుడివైపున ఉన్న పద్మంలో పెట్టేసరికి…. మణిపుర చక్రం మూడుసార్లు దివ్య కాంతి,దివ్య తేజస్సుతో తిరగటం పూర్తి అయ్యింది. అంటే శక్తి జాగృతి, శుద్ధి, అధీనం అయ్యింది అని గ్రహించారు. ఆ తర్వాత దీనికి వ్యతిరేక దిశలో వెనక భాగము నుంచి ఒక శివలింగం ఉన్న ముద్ర బయటకు రావటం జరిగింది. ఇది మణిపుర చక్రం యొక్క కారణ శరీరం సాధన అన్నమాట! దానిని తీసుకొని దాని లోపల నుంచి వచ్చిన రాగి రేకును బయటకి తీసి రుద్ర స్వామి చదవటం ఆరంభించాడు.
నేను షిప్రా నది ఒడ్డున ఆవాసం….
ఏడు సముద్ర తీర్థాలు ఉంటాయి….
84 సిద్ద లింగాలతో ఏకాదశ రుద్రులు ఉంటారు….
భయపెట్టే భక్తుల ఆరాధకుడిని….
తిరగబడిన శ్రీ చక్రం ఉన్నచోట…..
మృత్యువు ఉన్న దిక్కును చూస్తూ ఉంటాను….
ప్రతిరోజు 100 లీటర్ల మధ్యమును తాగుతాను….
శాంత, ఉగ్రరూపాలతో నా సతులు ఉంటారు…
చితాభస్మం తో నా ఆరాధన ఉంటుంది…
అని ఆధారాలు చదువుతూ ఉండేసరికి ఒక విధంగా ఆలోచనలో ఉండటం ప్రారంభించారు. అప్పుడు శివ నందిని కాస్త షిప్రా నది ఒడ్డు ఉన్న ప్రాంతం ఏమిటి? అని వెతకడం ఆరంభించింది. అప్పుడు ఈ నది ఒడ్డున ఉన్నది ఉజ్జయిని మహాకాలుడు…. మహాకాళేశ్వర శివలింగం అని అక్కడ శక్తిపీఠంగా మహాకాళిగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నది. ఇదే విషయం రుద్ర స్వామికి చెప్పేసరికి అయితే ఈ ఆధారాలు అన్నీ కూడా ఉజ్జయిని మహాకాలుడికి సరిపోతాయేమో లేదో చూద్దాము…. అనేసరికి ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు చూడటం శివ నందిని ఆరంభించింది. ఆ స్థల పురాణం ప్రకారంగా చూస్తే…. ఈ క్షేత్రం షిప్రా నది ఒడ్డున ఉంటుంది అని తెలిసింది. ఈ క్షేత్రంలో ఏడు సముద్ర తీర్థాలు ఉంటాయని…..అలాగే ఈ క్షేత్రంలో 84 సిద్ద లింగాలు ఉంటాయని….. ఏకాదశ రుద్రులతో పాటు అనేక దేవతా శివలింగాలు, 84 సిద్ద శివలింగాలు, అష్ట భైరవులు ఉంటాయి అని తెలిసింది. అలాగే ఈ క్షేత్రంలో ఉగ్రరూపిణీగా మహాకాళిక,శాంతస్వరూపిణిగా సిద్ధమహాదేవి ఉంటారని…. అలాగే మృత్యువు ఉన్న దిక్కు అంటే దక్షిణదిక్కు…. ఈ దక్షిణ దిక్కును మహాకాళేశ్వర శివలింగంను చూస్తూ ఉంటుంది అని….. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న కాలభైరవుడు కాస్త ప్రతిరోజు 100 లీటర్ల మద్యమును సేవిస్తూ ఉంటారని చెప్పేసి ప్రతిరోజూ ఉదయకాలంలో తొలి పూజగా మహాకాలుడికి చితాభస్మంతో ఆరాధన చేస్తారని అని స్థల పురాణం చెప్పడం…. అలాగే ఇక్కడ తిరగబడిన శ్రీ చక్రం ఉంటుంది అని చెప్పేసి స్థలపురాణంలో చెప్పడం…. భయపెట్టే భక్తులు అంటే అఘోరాలు, కాపాలికులు నిత్యం తంత్ర పూజ విధివిధానాలతో తాంత్రిక ఆరాధన చేస్తూ ఉండటం వలన భయపెట్టే భక్తుల ఆరాధకుడు అయ్యాడని చెప్పి…. ఈ స్థలపురాణంలో విశేషాల ఆధారంగా రాగి రేకు మీద ఉన్న ఆధారాలు సరిపోవడంతో ఇక తను అనాహత చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని క్షేత్రానికి వెళ్లాలని వీళ్ళందరికీ అవగాహన రావటం మొదలైంది. దానితో బాల గణపతికి ఒక సందేహం వచ్చి…
బాల గణపతి:- అమ్మ! ఇప్పుడు సూక్ష్మ శరీరం అలాగే నీ కారణ శరీరం దహనం చేయడం జరిగింది. వాళ్ళ మోక్షం కోసం నీ శరీరంలో ఉండటం జరిగింది. అదేవిధంగా నీ ఆది స్థూల శరీరము దహనం చేయడం మర్చిపోయావు..
మహాదేవి:- ఓరి బడవ! ఆ స్థూల శరీరం మీ అమ్మ స్థూల శరీరం. ఆ శరీరం దహనం చేస్తే మీ అమ్మ బతికి ఉండదు. అలాగే మిగతా శరీర దహనాలు మోక్షాలు పొందాలంటే మీ అమ్మ స్థూల శరీరం బతికే ఉండాలి. అప్పుడే మీ అమ్మని చంపేస్తావా?
బాల గణపతి:- ఏమో నాకేం తెలుసు! అమ్మ మర్చిపోయిందేమో అని గుర్తు చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసిన మూడు శరీరాలలో రెండు శరీరాలు దహనం చేశారు కదా! మొదటి శరీరం దహనం చేయలేదు కదా! అమ్మ ఏమన్నా హడావిడిలో మర్చిపోయిందేమో…
మహాదేవి:- అమ్మ మర్చిపోలేదు. ఆదిలో ఉన్న స్థూల శరీరమును అంతంలో అంతం చేయాలి. మిగతా పదిదేహాలు సంపూర్ణంగా దహనం అయిన తరువాత ఒకటవ దేహమైన స్థూల శరీరం పదకొండవ దేహము స్థానంలో ఉండి దహనం చేసుకోవాలి. అప్పుడు మోక్షమును పొందినట్లు అవుతుంది. అది పూర్ణ మోక్షం అవుతుంది. మిగతా పదిదేహాలు కూడా మోక్షమును పొందినాయో లేదో ఈ స్థూల శరీరం అనుభవ అనుభూతి పొందాలి. అప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా పది శరీర దహనాలు పూర్తి అయినాయని…. మోక్షం పొందామని ఋజువు అవుతుంది. ఆ తర్వాత మొదటి శరీరమైన స్థూల శరీరం దహనం అవుతుంది. శూన్యంలో శూన్యం అవుతుంది.
(అని చెప్పేసరికి ఇదంతా వింటున్న బాల కుమారస్వామికి)
బాల కుమారస్వామి:- అమ్మ! ఇక్కడ నాకు సందేహం కాదు…. ఒకటి మనసుకి తోస్తుంది…
శివ నందిని:- చెప్పు కన్నా!
బాల కుమారస్వామి:- ఇప్పుడు అనాహత చక్రానికి దేవతలు ఎవరు?
శివ నందిని:- మహాకాలుడు, మహాకాళిక అని పరమహంస గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ అనాహత చక్ర జాగృతి,శుద్ధి, ఆధీనం అక్కడ జరగడం అవుతుంది.
బాల కుమారస్వామి:- మరి అనాహత చక్రానికి ఉన్న శరీరం ఏమిటి? అంటే అనాహత చక్రంలో వాయు శరీరం ఉంటుంది అన్నారు… మరి వాయు శరీర శుద్ధికి ఏ క్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది ?
శివ నందిని;- అది సాధనా మూర్తి చెప్పాలి కదా!
బాల కుమారస్వామి:- నాకు తెలిసి, అనాహత చక్రంలో వాయు శరీరమే ఉంటుంది. మరి అనాహత చక్రానికి అధిష్టానదైవం మహాకాలుడు, మహాకాళిక అన్నప్పుడు…. చక్ర శుద్ధికి మహాకాళిక అయితే శరీర శుద్ధికి మహాకాలుడు అయి ఉండవచ్చు. నాకు తెలిసి నీకు ఈ క్షేత్రంలోనే శరీర జాగృతి, చక్ర జాగృతి అవుతాయేమో…ఆలోచించుకో!
అనేసరికి వీళ్లంతా ఆలోచనలో పడ్డారు. ఇది నిజమా కాదా అని ఆలోచన చేశారు.
బాల కుమారస్వామి:- మూలాధార చక్రం లో కంచి క్షేత్రానికి వెళితే…. అదే స్థూల దేహానికి ఘృష్ణేశ్వర క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా సూక్ష్మ శరీర చక్ర సాధన కోసం కొల్హాపూర్ వెళ్లడం జరిగితే….. ఈ శరీర జాగృతి కోసం సోమనాధ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. అలాగే మణిపుర చక్ర జాగృతి కోసం ద్రాక్షారామం, ఈ చక్రంలో ఉన్న కారణ శరీరం జాగృతి కోసం ఇప్పుడు మనం ఉన్న రామేశ్వర క్షేత్రానికి రావడం జరిగింది కదా! అలాగే నాకు తెలిసి నీ అనాహత చక్ర శుద్ధి దీనిలో ఉండే వాయు శరీర శుద్ధి కోసం ఉజ్జయిని క్షేత్రం ఎన్నుకోపడుతుందేమో! ఇది నా ఊహ మాత్రమే…
అనేసరికి మనకేం తెలుస్తుంది….అది సాధన విగ్రహ మూర్తి చెప్పాలి కదా! నీ అంచనా కూడా నిజమే అవ్వచ్చు….అవ్వకపోవచ్చు అనేసరికి సరే అని ఆఖరిసారిగా రామేశ్వరం రామనాథ స్వామిని దర్శించుకుందాం అనుకునేసరికి…. సాధన కుటుంబం అంతా గుడికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత సాధనా కుటుంబం అంతా కూడా ధ్యాననిష్ఠలో ఉండిపోయారు. శివనందిని కూడా అలాగే ధ్యాన నిష్ఠలో సుమారుగా మూడు గంటలు ఉండేసరికి…. ఉన్నట్టుండి తన శరీరంలో మార్పులు రావటం గమనించింది. తన శరీరం కొద్దికొద్దిగా పెరగటం ఆరంభిస్తుందని గ్రహించింది. తన ప్రమేయం లేకుండా తన శరీరం పెరుగుతూ ఉండేసరికి ఆశ్చర్య ఆనందాలకి లోనయ్యింది. కళ్ళు తెరిచి చూద్దాం అనుకునేసరికి…. సరే ఎంతవరకు పెరుగుతుందో చూద్దాం! అని అనుకుంటే ఆరు అడుగుల శరీరం కాస్త దాదాపు 15 అడుగుల శరీరం గాను……. అడుగున్నర నడుము కాస్త పది అడుగుల నడుముగా మారడం గమనించింది. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే…. తన శరీరం పెరగటం తనకి కనపడుతుంది కానీ, ఇతరులకి కనిపించడం లేదు అనేసరికి… హమ్మయ్య! ఒక విధంగా తనకి మంచిదే అయింది అని చెప్పేసి అనుకొని…. ఏదో ఒక సిద్ధి తన కారణ శరీరం శుద్ధి అవ్వటం వలన వచ్చింది అనుకొని…. కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లేసరికి యధావిధిగా తన శరీరం సహజ స్థితిలోనికి రావడం గమనించింది. కొద్దిసేపటికి మళ్ళీ పెరగటం, తగ్గటం చేస్తూ ఉండేసరికి…. అసహనానికి గురి అయ్యి ఈ సిద్దులు, సిద్దయోగులకు ఉపయోగపడతాయి కానీ, తనకి ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థం కాలేదు. పూర్వకాలంలో రామాయణ కాలంలో సీతాదేవి అన్వేషణ కోసం హనుమంతుడు ఈ సిద్ది వలన తన శరీరమును భారీగా మార్చుకొని…. సముద్రం దాటడానికి ఉపయోగపడింది. తన శరీరం స్థూలంగా చేసుకోవడం వలన….అతి భారీ కాయంగా అవుతుంది కానీ ఉపయోగం లేదు. తన ఈ స్థూలకాయంతో చాలామంది బాధపడటం ఇబ్బంది పడడం జరిగింది కదా! బరువులు తగ్గించుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు. తేలిగ్గా ఉన్న శరీరం కాస్త బరువుగా పెంచుకోవడం అవసరమా! అని అనుకొని అసహనం అయ్యేసరికి…. రుద్ర స్వామికి ధ్యాన భంగమై
రుద్రస్వామి:- ఏమైంది తల్లి!
శివ నందిని:- నాకు ఏదో సిద్ధి వచ్చినట్టు ఉందయ్యా! ఈ సిద్ది వలన నా శరీరం విపరీతంగా పెరిగిపోతుంది. గాలి బుడగలాగా పెరిగిపోతుంది. నా ప్రమేయం లేకుండా….!
(అనేసరికి ఆయన ధ్యానంలో శివ నందినికి వచ్చిన సిద్ధిని చూసి….)
రుద్రస్వామి:- అది అష్టసిద్ధులలో ఒకటైన మహిమ సిద్ధి అమ్మ ! ఈ సిద్ది వలన సన్నగా ఉన్న శరీరం బరువుగా మార్చుకోవచ్చును. ఈ సిద్ధి ఎలా వచ్చిందో…. అలానే అదుపులో ఉంచుకోవాలి. శరీర జాగృతి అయినప్పుడు ఏదో ఒక సిద్ధి వస్తుందని చెప్పాను కదా! ఈ శరీర జాగృతి వలన నీకు ఈ సిద్ధి వచ్చింది అని చెబుతుందిలే …
శివ నందిని:- సరే అయ్యా! ఈ సిద్దుల వలన నాకు ఎలాంటి ఉపయోగం ఉందొ తెలియదు. కానీ కాలానుగుణంగా వాటి మీద ఉపయోగాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ అనుభవ అనుభూతితో తెలుసుకున్నాను. ఇప్పుడు స్థూలంగా నా శరీరం ధ్యానంలో పెరిగినట్టు చూశాను…
అనేసరికి., ఆ…..పెరుగుతుంది. పెరిగే అవకాశం ఉంది… అనేసరికి సరే చూద్దాం ! అని కళ్ళు తెరిచి ఆ సిద్దిని ప్రయోగం చేస్తూ ఉండేసరికి… ఎలక పిల్లలా శరీరంతో ఉండే శివ నందిని కాస్త ఏనుగు పిల్లలా శరీరం ఉబ్బినట్లుగా మారేసరికి…. తన శరీరం చూసి తనకే భయం వేసింది. సన్నగా ఉండే కాళ్లు కాస్త…. ఏనుగు కాళ్ళ లాగా , తాటి బద్దల లాగా మారేసరికి ఒక విధంగా తన శరీరాన్ని చూసి తానే భయపడే స్థితికి వచ్చింది. ఆ భయం వలన ఆ సిద్ధి కాస్త సహజ స్థితికి రావడం జరిగింది. ఇదేదో బాగుంది అనుకున్నది కానీ, పదేపదే ప్రయోగం చేయడం వలన సిద్దుల మాయలో పడే ప్రమాదం ఉంది అని గ్రహించి మౌనం వహించి ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత అందరికీ ఆకలి వేయడంతో భోజనాలు కానించుకొని హోటల్ గదికి వెళ్లి ….హోటల్ గదిని ఖాళీ చేసి అక్కడి నుంచి మధ్యప్రదేశ్ కి బయలుదేరటానికి రైలులో ప్రయాణం ఎంచుకోవడం జరిగింది. ఇక ఇక్కడితో రామేశ్వరం నుంచి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి యాత్ర మొదలవడం జరిగిందన్నమాట!
సాధన కుటుంబం ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్న రైల్వే స్టేషన్ కి వచ్చారు. అక్కడి నుంచి ఉజ్జయిని క్షేత్రానికి వెళ్లడానికి రైలు కోసం ఎదురుచూస్తూ ఉండగానే…. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాస్త శివ నందిని మీద కత్తులతో, కర్రలతో దాడి చేయడం అకస్మాత్తుగా జరిగింది. ఈ ఊహించని పరిణామానికి శివ నందిని కాస్త అప్రయత్నంగా తన శరీరం ఒక్కసారిగా పెరిగి వాళ్ళ ఇద్దరి తలలను తన సంకలో పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారిగా వెంటనే వీళ్ళిద్దరూ ఎవరో చూడాలని రుద్రస్వామి కాస్త వీళ్ల ముసుగులు తెరిచి చూసేసరికి వీళ్ళిద్దరూ ఎవరో కాదు కృష్ణస్వామి మరియు యోగాంబిక అని చెప్పేసి పిల్లలు గుర్తుపట్టి… అరిచేసరికి ఇక వీళ్లిద్దరిని తన బాహువుల్లో ఉంచి గట్టిగా ఇది చేస్తూ ఉండేసరికి….. ఓహో! నీకు ఈ సిద్ది కూడా వచ్చిందా? మహిమా సిద్ధి కూడా వచ్చిందన్నమాట! ఇక నీ అంతు ఇక్కడ కాదు ఉజ్జయినిలోనే చూస్తాను. ఆ ఉజ్జయినిలో ఎటు చితాభస్మంతో అభిషేకం చేస్తారు కదా! నీ దేహ చితాభస్మం ఇచ్చేటట్టుగా చేస్తాను. నిన్ను చంపే దాకా నేను నిద్రపోను అని చెప్పేసి కృష్ణస్వామి అంటూ ఉండేసరికి…. తన బాహువుల్లో ఇంకా గట్టిగా బంధిస్తూ ఉండేసరికి….ఇక వీళ్లిద్దరూ కూడా శివ నందినిని ఏమీ చేయలేము అని చెప్పి గ్రహించి అక్కడి నుంచి అదృశ్యం అయ్యేసరికి…. రుద్ర స్వామి కాస్త …
రుద్రస్వామి:- తల్లి! నువ్వు శాంతస్వరూపంలోకి రా! నీ ఉగ్రరూపం లో పెద్దగా పెరగడం ఇక్కడ ఉన్న ప్రయాణికులు అంతా గమనిస్తున్నారు. నీ ప్రమేయం లేకుండా నీ శరీరం పెరిగింది అని గ్రహించారు. ఇప్పుడు నీకు ఏవో సిద్దులు ఉన్నాయని చెప్పి నీ వెంట పడతారు. జాగ్రత్తగా నెమ్మదిగా నీ శరీరమును యథాస్థితికి…. సహజ స్థితికి తెచ్చుకో! శివ నందిని:- రైలు వచ్చి ఎక్కే దాకా ఈ విధంగా ఈ శరీరంతోనే ఉంటాను. లేదంటే వాళ్లకి అనుమానం వస్తుంది. ఇదే నా సహజ శరీరం అని అనుకుంటారు.
అనేసరికి సరే అనడంతో…. ఈ స్టేషన్లో ఉన్న బెంచ్ మొత్తం శరీరం ఆక్రమించడం…. అంత లావుగా ఉండేసరికి ఇంత భారీ శరీరం రైలు లో పడుతుందా ! రైల్లో ఉన్న సీట్లో కూర్చొగలుగుతుందా! ఈ ప్రపంచంలో ఇంత భారీకాయ శరీరం ఉన్న స్త్రీ ఈవిడే అయి ఉంటుంది. ఎంత బరువు మోస్తుందో…. సుమారు 400 కేజీలు బరువు ఉంటుందేమో! అని చెప్పేసి శివ నందిని కేసి జాలిగా సానుభూతిగా చూస్తూ ఉంటే…. కొంతమంది భారీ కాయాన్ని చూసి నవ్వుకోవటం చేసేసరికి…. శివ నందిని కాస్త ఇబ్బందికరంగానూ, అవమానకరంగానూ అనిపించింది. భారీ కాయం ఉన్నవారు ఎంత మానసిక క్షోభ పడతారో వీళ్ళ యొక్క చూపులను బట్టి శివనందిని అర్థం చేసుకుంది. తిండి వలన లేదా థైరాయిడ్ ప్రాబ్లం వలన అనుకోకుండా విపరీతంగా శరీరం పెరిగిపోతే….. వాళ్ళకి ఉండే సమస్యలు మానసిక క్షోభ ఈ భారీ కాయం ఉన్నవాళ్లు ఎలా పడతారో అర్థం అయింది. అలాగని నించోలేని పరిస్థితి…. కూర్చోలేని పరిస్థితిలో తను ఉన్నాను అని చెప్పేసి శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాని అయోమయా స్థితి. ఇది సిద్ది వలన వచ్చింది కానీ, భారీగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకోగానే కళ్ల వెంట నీరు వచ్చింది. తనలో ప్రాయశ్చిత్తం మొదలైంది. పెళ్లి కాకముందు తను విమర్శించిన భారీ కాయ శరీరం వాళ్ళందరినీ పేరుపేరునా మనసులో క్షమాపణలు కోరుకోవడం ప్రారంభించింది. ఇంతలో ఉజ్జయిని రైలు రావడంతో అందరూ కూడా రైలు ఎక్కారు. అతి కష్టంతో శివ నందిని ఈ రైలు ఎక్కి సీట్లో కూర్చోవడానికి అవస్థలు పడుతూ ఉండేసరికి మహాదేవి కాస్త అమ్మాయి ఇక్కడ ఎవరూ లేరు…. మనం తప్ప, యధాస్థితికి సహజస్థితికి రా! ధ్యానంలో కూర్చో అనేసరికి అప్పుడు శివ నందిని కాస్త ధ్యానంలో కూర్చుంది. తనకి వచ్చిన మహిమ సిద్ధిని అదుపు చేసుకుంటూ ఉండేసరికి…. తన శరీరం మెల్లగా యథాస్థితికి భౌతిక శరీరమునకు రావటం జరిగింది. అప్పుడు తన మనసు, శరీరం స్థిమిత పడింది. ఆ తర్వాత పిల్లలు కాస్త ఉజ్జయిని యాత్ర విశేషాలు, స్థలపురాణాలు చెప్పమని అడగటం ప్రారంభించారు. అప్పటికే ఇంటర్నెట్ లో ఈ క్షేత్ర విషయాలు చూసి ఉండడంతో శివ నందిని ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పడం ఆరంభించింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని క్షేత్రం 3 వ జ్యోతిర్లింగం గా ఉన్నది. ఈ జ్యోతిర్లింగం కాలానికి ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. పూర్వ కాలంలో ఆ రోజే చనిపోయి…దహన సంస్కారాలు జరిగిన శవం యొక్క చితాభస్మమును ఎవరు చూడకుండా తీసుకువచ్చి స్వామి వారికి భస్మంతో అభిషేకం చేసేవారు. ఈ క్షేత్రంలో కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని అవంతిక అని పిలిచేవారు… ఇది సప్త మోక్ష పురాలలో ఒకటి .ఈ ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహా కాళేశ్వర లింగం …రెండు అంతస్తులో ఓం కారేశ్వర లింగం మూడవ అంతస్తులో నాగ చంద్రేశ్వర లింగం గా చెప్పడం జరుగుతుంది. నాగులలో ఒకరైన తక్షక నాగరాజు ఇక్కడ ఆవాసం చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఏదైనా ఆలయంలో దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు తిరిగి దానిని మరో దేవునికి నైవేద్యం గా పెట్టరు. కానీ మహా కాలుని నైవేద్యమును మిగిలిన దేవుళ్ళకి పెట్టడం ఇక్కడ విశేషం గా చెప్పవచ్చును. క్షీర సాగర మథనం సమయంలో అమృత కలశం కోసం దేవతలు రాక్షసులు కలహించుకున్నప్పుడు నాలుగు అమృత బిందువులు భూమి పై పడడం జరిగింది. అందులో ఒకటి అయిన క్షిప్రా నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది… ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే మహా కుంభమేళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగినది. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు ఒక అనుష్టానం చేస్తారు. ఈ అనుష్టానం పూరి అయిన తరువాత ఆకాశం మేఘావృతమై వర్షాలు పడడం జరుగుతుంది. ఈ ఆలయం లో ప్రత్యేకం గా మనం భస్మ మందిరం లో జరిగే భస్మ అభిషేకం విశేషం గా చెప్పుకోదగినది. ఇక్కడ మహా కాళేశ్వర జ్యోతిర్లింగమే కాకుండా… అష్టాదశ శక్తిపీఠమైన మహాకాళిక అమ్మవారు ఆలయం ఉండడం విశేషం….
శుభం భూయాత్


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి