అనాహత చక్రము మరియు వాయు శరీరము
సాధనా కుటుంబం అంతా ఉజ్జయిని యాత్ర కోసం రైలులో వెళ్లడం జరిగింది కదా! అప్పుడు పిల్లలు ఉజ్జయిని స్థల పురాణ విశేషాలు చెప్పమని అడిగితే శివ నందిని చెప్పడం ప్రారంభించింది. ఇక్కడ రెండు రకాలైన స్థల పురాణాలు ఉన్నాయి… ఒకటి రాక్షసుల కాలానికి చెందినది.. మరొకటి రాజుల కాలానికి చెందిన స్థల పురాణాలు ఉన్నాయి. ఇందులో రాక్షసుల కాలంలో దూషణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను తీవ్రమైన ధ్యాన తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అదృశ్య శక్తిని వరంగా పొందడం జరిగింది. తనకి వచ్చిన అదృశ్య శక్తితో అనేకమంది రాజులని, రాజ్యాలని, లోకాలని ఆక్రమించుకోవడం జరిగింది. ఇతను శివద్వేషి. శివ ఆరాధకులు అంటే ఇతనికి పడేది కాదు. ఆ కాలంలో వేద ప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమశివభక్తుడు. ఇంటిలోనే శివలింగం పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇతనికి ఈ విషయం తెలియడంతో…. ఇక రాజ్యంలో శివారాధన చేయకూడదు అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వటంతో…. అందరూ శివలింగ ఆరాధన చేయడం మానేశారు. వేద ప్రియుని కుమారుడికి శివలింగ ఆరాధన అంటే చాలా ఇష్టం. కానీ తండ్రి శివలింగ ఆరాధనకి అనుమతి ఇవ్వకపోవడంతో బాధపడి అడవికి వెళ్లడం జరిగింది. అడవిలో ఒక నది ఒడ్డున రాతి శిలలో శివుడు ఉన్నాడని అనిపించి….ఆ రాతి శిలయే శివలింగంగా భావించుకుని…. నిద్రాహారాలు మానేసి, శివారాధన చేస్తూ ఉండేవాడు. ఈ విషయం దూషణుడు రాక్షసుడికి తెలియడంతో…. ఈ పిల్లవాడిని చంపటానికి అడవికి రావడం జరిగింది. అప్పుడు ఈ పిల్లవాడు ధ్యాననిష్ఠలో ఉండిపోయాడు. ఈ రాక్షసుని రాకని గమనించలేదు. అప్పుడు అనుకోకుండా ఈ శివలింగం నుండి ఉగ్రరూపంలో మహాకాలుడు వచ్చి హుం కారం చేస్తూ ఈ దూషణ అనే రాక్షసుడిని సంహారం చేస్తూ… అక్కడే తన త్రినేత్రంతో దహనం చేసి… అతని బూడిదని తన చితాభస్మంగా రాసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈ ఉజ్జయిని క్షేత్రంలో చితాభస్మం పూజా విధానం ప్రారంభం అయినది. ఆ రోజు ఉజ్జయిని నుంచి ఈ క్షేత్రంలో ఉన్న మహాస్మశానంలో ఎవరైనా చనిపోతే వారి బూడిదను తీసుకువచ్చి… శివుడికి నాగసాధువులు, కాపాలికులు, అఘోరాలు కలిసి చితాభస్మంతో అభిషేకం చేసి అర్చన చేసే ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. కాలక్రమంగా కొన్ని సంవత్సరాలకి ఒక రోజున స్మశానంలో శివ లీలా విన్యాసం వలన ఒక్క శవం కూడా దహనం కాలేదు. దానితో ఆలయ పూజారికి ఏం చేయాలో అర్థం కాక….. తన కుమారుడిని చంపి, కాల్చి, ఆ బూడిదను శివపూజకు వినియోగించడంతో…. మహాశివుడు సంతోషించి ప్రత్యక్షమై… నీ అపరభక్తికి మెచ్చాను. ప్రతిసారి ఈ సేవ చితా భస్మంతోనే నన్ను ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధమైన ఆవు పిడకలు కాల్చి….బూడిద చేసి…. ఆ భస్మమునే గోమయ భస్మముగా పూజకి వినియోగించవచ్చు అని చెప్పి అనుగ్రహించడంతో…. ఇక ఆ రోజు నుంచి శవం యొక్క చితాభస్మంకు బదులుగా గోమయ చితా భస్మంతో చేయడం ఆరంభమయ్యింది. ప్రస్తుత కాలంలో ఒక్క ఉదయం తెల్లవారుజామున గోమయ చితాభస్మంతో కార్యక్రమం జరుగుతుంది. ఒక అఘోర బాబా ఒక మూటలో గోమాయ చితా భస్మం తీసుకువచ్చి…. మహాకాలుడికి అలంకరణ పూర్తి అయిన తరువాత…. చితాభస్మంతో చల్లుతూ… వెదజల్లుతూ… ఒకపక్క నమఃశివాయ మంత్రం, ఒకపక్క శంఖ నాదాలు, ఒకపక్క ఢంకా నాదాలు మారు మోగిపోతూ ఉంటుంది. కైలాసంలో శివుడికి ఈ విధంగా జరుగుతుందా అనిపిస్తుంది. దీనికి మగవారికి మాత్రమే ఈ చితాభస్మం చూసే అవకాశం ఉంటుంది. ఆడవారికి మాత్రం మంత్రాలు… వాయిద్యనాదాలు వినే అవకాశం మాత్రమే ప్రస్తుత కాలంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా మరో స్థల పురాణం ప్రకారంగా చూస్తే చంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన అపర శివ భక్తుడు. తన పూజా మందిరంలో ప్రతినిత్యం షట్కాలాలలో శివలింగ ఆరాధన చేస్తూ ఉండేవాడు. హోమాలు,నిత్య అన్నదానాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అనుకోని పరిస్థితులలో…. శత్రువులు రాజ్యం మీద దాడి చేయడంతో…. అందరినీ చంపటంతో….తన ప్రాణానికి ముప్పు రావడంతో…. ఈ శివలింగం దగ్గరికి వచ్చి స్వామి! ఏం చేయాలనుకుంటున్నారో మీ నిర్ణయమే. నన్ను రక్షించాలి అనుకుంటున్నావో…. వాళ్ళ చేత సంహరించాలనుకుంటున్నావో…. నిర్ణయాన్ని నీకే విడిచిపెడుతున్నాను అని శివలింగానికి మొరపెట్టుకునేసరికి… శివలింగం నుంచి శివుడు మహాకాలుడు రూపంలో వచ్చి ఆ శత్రు రాజులను సంహారం చేసి రాజ్యం ఇచ్చాడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి మూడు అంతస్తులలో మూడు శివలింగాలు కనపడతాయి. ఒకటి మహా కాల శివలింగం…. రెండు ఓంకారేశ్వర లింగం…. మూడవది నాగచంద్రేశ్వర లింగం. ఈ నాగచంద్రేశ్వర శివలింగము నాగుల పంచమినాడు మాత్రమే తెరవటం జరుగుతుంది. మిగతా సమయంలో తలుపులు మూసి ఉంటాయి. అలాగే మహాకాళేశ్వర లింగం కింద శంఖు యంత్రం ఉంటుంది. దీనిని కొంతమంది తిరగవేసిన శ్రీ చక్ర యంత్రం అని ప్రచారం చేయడం జరిగింది. శంఖు బంధనంలో మహాకాలుడిని బంధనం చేయడం జరిగింది. ఎప్పుడైతే దూషణ రాక్షసుడు యొక్క శవ భస్మము వాడడం జరిగిందో….భస్మ బంధనం జరగటం మొదలైంది. విభూది బంధనం జరిగిందన్నమాట! ఆ తరువాత ప్రస్తుత కాలంలో శవ చితాభస్మం బదులుగా గోమయ చితా భస్మం వాడటం జరిగింది. దీనికి ఆలయ అధికారులు చితా భస్మం అభిషేకం చూడటానికి టికెట్లు పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలోనే చితా భస్మం యొక్క కార్యక్రమం మనకి కన్నులారా వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఈయన ముఖలింగానికి శివుడు సజీవ మూర్తిగా ఉన్నట్లుగా…. వివిధ రకాల అలంకారాలు చేయడం జరుగుతుంది. అది కూడా ప్రపంచంలో మరో చోట జరగదు. అలాగే ఈ క్షేత్రంలో ఐదు రకాల వింతలు, విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటంటే…. ఈ క్షేత్రంలో రాష్ట్ర మంత్రులు గాని, దేశ ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి లాంటి ఉన్నత అధికారులు నిద్ర చేయరాదు అని ఒక నియమం ఉంది. ఎందుకంటే ఈ ఉజ్జయిని క్షేత్రానికి రాజు మహాకాళేశ్వరుడు మాత్రమే అన్నమాట! ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నవారు నిద్ర చేస్తే…. మూడవరోజు లేదా వారం రోజుల్లో వాళ్ళ పదవులు పోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందో… కావాలని జరిగిందో…. తెలియదు కానీ, ఇలాంటివి జరగడం అనేది రాజకీయ నాయకుల జీవిత చరిత్రలో చూస్తే తెలుస్తుంది. అందుకని ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉజ్జయిని క్షేత్రంలో నిద్ర చేయరాదు. అలాగే ఉజ్జయిని క్షేత్రంలోని ఆలయం ముందు గుర్రం మీద పెళ్లికొడుకులు ఎక్కి సవారి చేయడం అనేది కూడా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఆ క్షేత్రానికి రాజు మహాకాలుడు. ఆయన తప్ప ఇంకెవరు గుర్రం ఎక్కకూడదు అని చెప్పి ఒక నియమం ఉంది. అలాగే ఉజ్జయిని క్షేత్రం సప్తమోక్షపురాలలో ఒకటి. అలాగే శ్రీకృష్ణుడు విద్యని అభ్యసించిన సాందీపముని ఆశ్రమం కూడా ఇక్కడే ఉన్నది. నవగ్రహాలలో కుజుడు పుట్టిన క్షేత్రం ఈ ఉజ్జయిని క్షేత్రం. విక్రమాదిత్యుడు పరిపాలించినప్పుడు… 32 సాలభంజికములు ఉన్న సింహాసనం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. అలాగే మహా కాళిదాసుని అనుగ్రహించిన మహాకాళికా కూడా ఈ క్షేత్రంలోనే ఒక శక్తిపీఠంగా ఉంది. అంటే ఈ క్షేత్రంలో ద్వాదశ లింగాలలో ఒక లింగం మహాకాలుడి లింగంగాను, అష్టాదశ శక్తి పీఠాలలో మహాకాళికాదేవి ఒక శక్తి పీఠంగాను… ఈ రెండు కూడా మనకి ఈ క్షేత్రంలో కనపడతాయి. మనకి శ్రీశైల క్షేత్రంలోనూ, కాశీ క్షేత్రంలోనూ ఇలాగే కనపడతాయి. అదేవిధంగా కుంభమేళా జరిగే నాలుగు ప్రదేశాలలో ఈ ఉజ్జయిని క్షేత్రం కూడా ఉండటం విశేషం. ఇది క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. దీనిలో ఏడు సాగర తీర్థాలు, 28 నదీ తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, జలకుండు, మహాకాళిక, సిద్ధమహాదేవి అని చెప్పేసి ఇతర దేవతల ఉప ఆలయాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న హరి సిద్ధమాత ఆలయం అష్టదశ శక్తి పీఠాలు కాకుండా 51వ శక్తి పీఠంగా చెప్పడం జరిగింది. కొంతమంది 54 శక్తి పీఠాలు ఉంటాయని చెప్పటం జరిగింది కదా! ఆ 54లో 51వ శక్తి పీఠం హరి సిద్ధమహాదేవి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఈయన ప్రతీరోజు మద్యం తాగేవాడు. పూర్వకాలంలో అఘోరాలు, కాపాలికులు, భైరవులు ఇక్కడ సాధన చేసేవారు. వాళ్ళు పంచమకారాలు ఆహారంగా పెట్టడం జరిగేది. కానీ , రాను రాను కాలానుగుణంగా ….పరిస్థితులు రావడం వలన కేవలం మద్యమును పెట్టడం జరిగింది. ఈయనకి మద్యమును ఒక పాత్రలో పోసి పెట్టినప్పుడు… సగం ఈయన కడుపులోకి పోయి, సగం మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన మద్యమును ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 100 లీటర్ల మద్యమును ప్రతిరోజు సేవిస్తాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అనేక విశేషాలు, వింతలు ఉన్న ప్రదేశాలు చూడవచ్చును అని అనేసరికి…. పిల్లలు, అయితే మనం ఈ క్షేత్రంలో మిగతా ఆలయాలు అన్నీ కూడా దగ్గర ఉండి చూడాలి అని అనుకోవడం జరిగింది. శివలింగం దక్షిణముఖంగా చూడటం వలన…మృత్యువుకి అధిపతి అయిన యముడికి ఎదురుదిశలో ఉండటం వలన ఈయన మహామృత్యుంజయుడు అని చెప్పేసి ఈ శివలింగమును దక్షిణామూర్తి శివలింగం అని స్థలపురాణం చెప్పడం జరిగింది అని చెప్పేసి అనేసరికి….అవునా! అని పిల్లలు విని ఊరుకున్నారు. ఇంతలో బాలగణపతికి ఒక సందేహం వచ్చి
బాల గణపతి:- అమ్మ! నాకు ఒక సందేహం ఉంది. తీరుస్తావా?
శివ నందిని:- చెప్పు చిన్న!
బాల గణపతి:- ఏమీ లేదు…. కామాక్షి దేవి చేతిలో ఒక రామచిలుక ఉంటుంది కదా! అలాగే అమర్నాథ్ గుహ దగ్గర రెండు పావురాళ్లు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది కదా! దైవ సన్నిధానంలో పావురాలు, చిలుకలు ఉండటంలో అర్థం ఏమిటి ?ఇందులో ఏదైనా పరమార్థం ఉందా?
శివ నందిని:- మన సాధనాస్థితి ఏ స్థితిలో ఉన్నది అనేది…. ఈ పక్షుల ద్వారా ప్రకృతి చెప్పడం జరుగుతుంది. అంటే మన సాధనా స్థితి ఏకత్వస్థితి, ద్వైతస్థితి అని రెండు రకాలుగా ఉంటాయి. అద్వైత స్థితి అంటే ఏకత్వస్థితి అన్నమాట! ద్వైత స్థితిలో స్త్రీ, పురుషుడు ఉంటారు. అద్వైత స్థితిలో ఒక పురుషతత్వం మాత్రమే ఉంటుంది. అద్వైత స్థితికి సంకేతాలుగా రామచిలుకను పెట్టడం జరుగుతుంది. అంటే అది ఏకత్వస్థితిని సూచిస్తుంది. పావురాలు అనేది ద్వైత స్థితి అంటే స్త్రీ,పురుషుల స్థితి. ఇక్కడ ప్రపంచంలో పావురాళ్లు విశ్వం యొక్క జ్ఞానాన్ని మనకి అందించడం జరుగుతుంది.. రామచిలుక వచ్చేసి మనం తెలుసుకున్న జ్ఞానం ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. రామచిలుక సాధనాస్థితికి ఎవరైతే చేరుకుంటారో… వాళ్ళు పూర్ణ జ్ఞాని అన్నమాట! వాడు తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకు పంచే అర్హత, యోగ్యత పొందిన వాడన్నమాట! కావాలంటే కొంతమంది యోగుల సాధనా సమయంలో వాళ్లు ఉన్న ఆశ్రమాల మీదకి రావటం లేదా వాళ్ళు ఉన్న ఇళ్ల దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే పావురాలు కూడా రావటం జరుగుతూ ఉంటుంది. పావురాలు అనేది అద్వైత స్థితి అన్నమాట! అంటే విశ్వం యొక్క మూల జ్ఞానమును పొందటానికి వాడికి అర్హత , యోగ్యత,యోగం ఉంటుందన్నమాట! ఒకడు తెలుసుకునేవాడు ఉంటాడు…. ఇంకొకడు తెలుసుకోవడం పూర్తి అయినవాడు ఉంటాడు.
(ఇంతలో బాల కుమారస్వామి కాస్త ….)
బాల కుమారస్వామి:- పాము యొక్క సంగతేమిటి? కొంత మంది తల మీద ఉంటుంది… కొంతమందికి మెడ మీద ఉంటుంది… కొంతమందికి కాళ్ల దగ్గర ఉంటుంది కదా!
శివ నందిని:- ఇది కూడా ద్వైత, అద్వైత స్థితులను చెప్పడానికి సూచన అన్నమాట! పాము తల మీద ఉంటే కుండలిని శక్తి ప్రవాహం బ్రహ్మరంధానికి చేరుకోవాలి అని సూచన అన్నమాట! అదే మెడలో ఉంటే వాళ్ళ సాధన పరిసమాప్తి అయ్యింది…. ఇక తను విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పడం అన్నమాట! అంటే మెడలోనే విశుద్ధ చక్రం ఉంటుంది కదా! ఆ విశుద్ధ చక్రం జ్ఞానానికి సంకేతం. ఆ జ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకున్న వాడిని పూర్ణజ్ఞాని అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు శివుడికి నాగాభరణంగా మెడకి పాము చుట్టుకుని ఉంటే అమ్మవారికి పాము ఐదు తలలతోనూ లేదా ఏకతలతోనూ లేదా ఏడు తలలతోనూ అమ్మవారి తల మీద పామును చూడటం జరుగుతుంది. అంటే ఏమిటంటే…. ఇంకా అతను ఇంకా పూర్ణ జ్ఞాని కాలేదు, తను ద్వైత స్థితిలోనే ఉంది, అద్వైత స్థితికి వెళ్ళాలి అని చెప్పడం అన్నమాట! అదే శివుడి విషయానికి వచ్చేసరికి…. ఆయన ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళాడు. ఏకత్వస్థితికి వెళ్ళాడు. పూర్ణజ్ఞాని మోక్షానికి అర్హత ఉన్నవాడు అని సూచనగా చెప్పడం జరుగుతుంది. అదే పాదాల దగ్గర పాము ఉన్నట్టయితే కుండలిని శక్తి జాగృతి అయ్యింది…. అది శక్తి జాగృతి సప్త చక్రాలు లేదా 13 యోగ చక్రాలలో జరగాలని సూచనగా చెప్పడం జరుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్న జంతువుల ఆధారంగా…. పక్షుల ఆధారంగా మన యొక్క సాధన స్థితి ఏమిటి అనేది మహర్షులు చెప్పడం జరిగింది…
అనేసరికి తమ సందేహాలు తీరినాయని పిల్లలు ఆనందపడ్డారు..
సాధనా కుటుంబం అంతా మూడు రోజులపాటు రైలు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కి చేరుకోవడం జరిగింది. దగ్గర్లో ఉన్న ఒక హోటల్లో గది తీసుకోబోతుండగా…..
రుద్రస్వామి:- అమ్మ! మనకి కావలసిన చోట కావలసిన విధంగా ఉందాము… గది తీసుకోవలసిన అవసరం ఏముంది…. అంతగా కావాలంటే ఊరికి చివరిగా డేరా వేసుకొని ఉందాము. ప్రకృతితో అనుసంధానమై ప్రశాంతంగా ఉందాము. ఈ గదిలో ఫ్యాన్ గాలి… ఏసీ గాలి ఒంటికి సరిపడడం లేదు. నేను ప్రకృతితో అనుసంధానంగా ఉండాలనుకుంటున్నాను. ప్రకృతి గాలిని పీల్చాలి అనుకుంటున్నాను.ఆ మట్టి వాసన పీల్చాలి…
మహాదేవి:- నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు కూడా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు…
పిల్లలు:- అమ్మ! మాకు గదులు పడట్లేదు. ఎక్కడైనా ప్రశాంతంగా ఉందాము…
అనేసరికి సరే ముందు టిఫిన్లు కానిచ్చేసుకుని ఇక్కడ ఉన్న రుద్ర సాగర్ తీర్థంలో స్నానం చేసి మహాకాలడిని దర్శనం చేసుకుందాము… ఇక్కడ నాలుగు గంటలకి ఉదయం చితా భస్మంతో అభిషేకం జరుగుతుంది కదా! దానిని చూద్దాము… అనేసరికి సరే అని రాత్రి అవ్వటంతో ఊరికి దూరంగా ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో డేరా వేసుకొని విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ ప్రదేశం అంతా కూడా చూడటానికి ఒక ఎడారి దిబ్బలాగా ఉన్నది. ఇక్కడ మహాకుంభమేళా జరిగే ప్రాంతమని…. ఇది క్షిప్రానది ఒడ్డున ఉంటుంది అని….. శివ నందిని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇసుక తిన్నెల మీద పడుకోవడం ఒక వింతైన అనుభవం లాగా ఉంది. ఇన్నాళ్లు మంచాలు ఏసీలు, ఫ్యాన్లు గదిలో పడుకున్న తను, ఇప్పుడు కేవలం ఒక చాప వేసుకుని ఇసుక తిన్నెల మీద సముద్రం ఒడ్డున పడుకోవడం వింత అనుభవంలా కనపడుతుంది. పైన పూర్ణచంద్రుడు…. ఆకాశంలో నక్షత్రాలు… అన్నీ కూడా చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. వేసవికాలంలో తన తల్లి ఆవకాయ కలిపిన అన్నమును రాత్రి 8 గంటలప్పుడు నక్షత్రాలను చూపిస్తూ…. ఆకాశం కేసి చూపిస్తూ…. అక్కడ విశేషాలను చెబుతూ…. తనకి అన్నం పెట్టిన రోజులు గుర్తుకు వచ్చాయి. 9 గంటల నుంచి పది గంటలకల్లా తల్లిదండ్రుల మధ్యలో తను పడుకోవటం జ్ఞాపకం వచ్చి కళ్ల వెంట నీళ్ళు రావడం శివ నందినికి జరిగింది. ఆ మధుర స్మృతులలో అలా ఆ రాత్రంతా గడిచింది. తెల్లవారుజామున మూడు గంటలకల్లా అందరూ లేచి రుద్ర సాగర్ దగ్గరికి వెళ్లి, స్నానాదికాలు పూర్తి చేసుకొని చితా భస్మం అభిషేకం చూడటానికి, దానికి సంబంధించిన టికెట్లను సాధనా కుటుంబం తీసుకుని వెళ్లడం జరిగింది.అలంకరణ పూర్తికావడంతో ఒక అఘోరుడు తన చేతిలో గోమయ భస్మము ఉన్న మూటను తీసుకొని…. మహాకాలుడి శివలింగం వద్ద నాట్యం చేస్తున్నట్లుగా… ఉన్మాదంలో ఆనంద స్థితిని తన్మయత్వ స్థితిని పొందుతూ…. ఆయన మీద చితాభస్మం చల్లుతూ ఉంటే…. అక్కడ ఉన్న ఏడుగురు వంశస్తుల పూజారులు కాస్త వేదమంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ వేదమంత్రాల ఘోష, పక్కన భక్తుల గంటా నాదం, శంఖ నాదం ఇతర వాయిద్యాల ఘోషతో ఇల కైలాసంలా మహా కాలుడికి దర్శనం చూస్తూ ఉంటే చెప్పటానికి అలవికాని అద్వితీయమైన అనుభూతిలోకి అందరూ వెళ్లడం జరిగింది. సుమారు రెండు గంటలసేపు ఈ చితా భస్మం కార్యక్రమం జరిగింది. ఉదయం ఏడు గంటలకి అందరూ బయటకు వచ్చిన తరువాత, ఆయనకి అలంకరణ చేయడం జరిగింది. ఆ అలంకరణలో ఆరోజు ఒక వైపు శివుడు మరొకవైపు అమ్మవారు ఉన్నట్లు అర్ధనారీశ్వర తత్వంలో ఉండటం…. శివ నందిని గమనించి నమస్కారం చేయడం జరిగింది. అక్కడ మహాకాలుడు పక్కన ఉన్న గోడమీద పార్వతీదేవి విగ్రహ మూర్తిని అలాగే గణపతిని, కుమార కుమారస్వామిని, సాక్షి గోపాల స్వామి గుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆలయ పరిసరాలలో ఒక ప్రాంతంలో శివనందిని ధ్యానంలో కూర్చుని తన అనాహతా చక్ర జాగృతి కోసం వాయు ముద్ర చేయడం ఆరంభించింది. ఇలా మూడు గంటలసేపు తను ధ్యానంలో ఉండిపోవడం జరిగింది. పిల్లలు కొంత సేపు ఆడుకొని… కొంతసేపు ధ్యానం…. కొంతసేపు జపం చేసేసరికి రుద్ర స్వామి మహాదేవి కూడా తమ తమ ధ్యాననిష్ట లోనికి వెళ్ళిపోయారు. ఈ విధంగా మూడు గంటలు గడిచిన తర్వాత పిల్లలకి భోజన సమయం అయ్యింది అని తెలుసుకొని శివ నందిని కాస్త ధ్యానం నుంచి బయటకు వచ్చి…. గుడి బయటకి వచ్చి భోజనాలు కానించుకొని డేరా వేసుకున్న ప్రాంతానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. క్షిప్రా నది ఒడ్డున నదీ ప్రవాహం చూస్తూ…. పిల్లలు ఆడుకోవడం చూస్తూ…. తను అందరూ కూడా ఈ నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి స్నానాదికాలు పూర్తి చేసుకుని మళ్లీ ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఈసారి ఆలయంలో ఉన్న ఉపఆలయాలను దర్శించుకోవడం జరిగింది.
ఆ తరువాత మహాకాల లింగం, ఓంకార లింగం, దర్శనం చేసుకోవడం జరిగింది. కానీ నాగచంద్ర లింగమును దర్శించుకునే అవకాశం లేకపోయింది. ఒక్క నాగుల పంచమినాడు మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు అని తెలుసుకుని ఆ తరువాత వాయుముద్రతో తన సాధనాస్థితిలో ఉండిపోవడం జరిగింది కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు కనిపించలేదు. ఇలా సుమారు వారం రోజులపాటు ఇదే విధమైన దినచర్యతో ఉండిపోవటం జరిగింది… కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. తనలో ఏదో తెలియని ఆవేదన, ఆవేశం, ఆక్రోశం,కోపం నెమ్మదిగా రావడం మొదలైంది. తన సాధనలో ఏదైనా తప్పు ఉన్నదా అని…. తన చేతి ముద్రలు వేయటంలో తప్పు ఉన్నదా….. తనకి తెలియకుండా ఏదైనా మాయలో ఉన్నానా అని పదేపదే అనుకుంటూ ఉండేది. కానీ ఆవేదన నుంచే కదా కుండలిని శక్తి జాగృతి అవుతుంది. లేదా ఆనందం వచ్చినప్పుడు కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడతాయి అని యోగుల వ్యక్తిగత అభిప్రాయం. ఇదేవిధంగా తను ధ్యాన నిష్ఠలో మరో రెండు రోజులు ఉన్నప్పటికీ కూడా….. ఎలాంటి ధ్యానానుభవాలు కలగకపోయేసరికి ఏం జరుగుతుంది! ఏమిటి? అని అనుకుంటూ ఉండేసరికి ఒక రోజు తనకి ధ్యానంలో ఏదో ఒక చక్రం తన వక్షస్థలంలో కనబడినట్లు…గా ధ్యాన దృశ్యం కనిపించసాగింది. ఆ చక్రం కనిపించి కనిపించినట్టుగా లీలాగా కనపడుతూ ఉండేసరికి తను సాధనలో మరింత శ్రద్ధ భక్తులతో ధ్యాననిష్ఠలో ఉండటం జరిగింది. ఆ తర్వాత ధ్యానంలో సుస్పష్టంగా చక్రం, దాని రంగు, బీజాక్షరం, అధిష్టాన దైవాలు ఇలా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కనిపించడం జరిగింది. తనకి కనిపించిన ఈ చక్రం యొక్క విశేషాలను రుద్ర స్వామికి చెప్పేసరికి…
రుద్రస్వామి:- అమ్మ!
ఆనాహత చక్రము:-
హృదయానికి (గుండె) ముందు మధ్యభాగంలో, వెన్నుపూసలోని సుషుమ్ననాడిలో ఉంటుంది. ఇది 12 రేకులు కలిగిన కమలమువలె ఉంటుంది. ఇది వాయువు తత్త్వమును కలది. దీనిరంగు ధూమ్రవర్ణం! "ఈశ్వర" అనేది దీని గురువు. ఈ చక్రానికి శక్తి పేరు "కాకినీ", అధిష్ఠాతృదేవత ఈశ్వరుడు, అధిష్ఠాతృ దైవం శివుడు. ఈ చక్రములో ఉండే లింగమును "బాణలింగము" అంటారు. ఈ చక్రము ప్రాణాన్ని సూచిస్తూ ఉంటుంది. దీని బీజాక్షరం "యం" అనే అక్షరం. ఈ లక్షణాలన్నీ నీకు కలిగాయి అంటున్నావు కాబట్టి నీకు అనాహతా చక్రం జాగృతి అయ్యింది. ఇంకా శుద్ధి కార్యక్రమం ఆరంభం అవుతుంది. శుద్ధిలో మనకి మాయ వస్తుంది కదా!
శివనందిని:- పరమహంస గారు కాస్త ఈ చక్రం మాయ గురించి చెప్పటం జరిగింది కదా! అది గుర్తు రావటం లేదు. ఈ చక్రానికి అధిష్టాన దైవంగా మహాకాలుడు,మహాకాళిక ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది . వీళ్ళు ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ శాంత రూపులు… కాలానికి అధిపతులు, కాలాతీత స్థితిలో ఉంటారు అని చెప్పేసి మృత్యువుకి అతీత స్థితిలో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజమా కాదా అనేది సాధన అనుభవాలు చెప్పాలి…
సరే అని… ఇంక వీళ్ళు ఆ రోజుకి ఆ ధ్యాననిష్ఠ నుంచి బయటకు వచ్చి… డేరాకు వచ్చి… విశ్రాంతి తీసుకోవడం జరిగింది. పిల్లలు ఎలాంటి భయం లేకుండా ఆడుకోవడం, పడుకోవడం చూసి వాళ్ళు మనోధైర్యానికి , శారీరక, మానసిక ధైర్యానికి శివ నందిని ఆశ్చర్యపోతూ ఉండేది. ఆ క్షిప్రా నది ఒడ్డున ఆటలాడుకుంటూ…. వాళ్ళ బాల్యం చూస్తూ…. వీళ్ళ బాల్యమును గుర్తుకు చేసుకుంటూ ఉండేవాళ్లు. ఈ విధంగా వీళ్ళు తెలియని ఆనంద స్థితిలోనూ…. సంతోష స్థితిలోనూ ఉండేసరికి మహాదేవి కాస్త….
మహాదేవి:- అమ్మాయి! నేను ఇక్కడ ఉన్న అఘోరాలు, కాపాలికలను కలిసి వాళ్ల తంత్ర విధానంలో నేను సాధన చేసుకుంటాను. మనం ఈ క్షేత్రం నుంచి వెళ్లే సమయానికి ఇక్కడికి వస్తాను. కొన్నాళ్లు నేను వాళ్ళ సమక్షంలో సాధన చేసుకొని వస్తాను..
శివ నందిని:- సరే అమ్మ… నీ ఇష్టం. నీ వీలు..
రుద్రస్వామి:- వాళ్ళు ఎవరో ఏమిటో తెలియకుండా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర సాధన చేసుకుంటే మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎవరు చూస్తారు?
మహాదేవి:- పోతే మహాకాలుడు సమక్షంలో పోతాను…. ఆయనని తంత్ర విధి విధానంలోనే ఆరాధన చేసి ఉన్నాను కదా! ఆయనే చూసుకుంటాడు. ఈ శరీరం ఆయనదే కదా! నాది కాదు… నేను చావు గురించి భయపడను అని నీకు తెలుసు కదా!
రుద్రస్వామి:- మీరు ఒక పట్టు పట్టారు అంటే అది ఉడుం పట్టే… మొండి పట్టే… మీరు ఒకసారి అనుకున్నారంటే… ఇంక ఏది పట్టించుకోరు.. ఎవరు ఎన్ని చెప్పినా ఆలోచించరు… దేనికి భయపడరు.. సరే మీ కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది.. నేను ఎవరినీ చెప్పడానికి…నేను ఎవరిని ఆపడానికి…
అనేసరికి మహాదేవి కాస్త పిల్లలకి కూడా ఈ విషయం చెప్పేసి అక్కడి నుంచి దగ్గరలో పట్టణానికి దూరంగా, స్మశానానికి దగ్గరగా ఉన్న అఘోరాలు, కాపాలికులు, భైరవుల దగ్గరికి తను వెళ్లడం జరిగింది. ఇంక ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టు ఈ క్షిప్రానది ఒడ్డున ధ్యాననిష్ఠలో ఉండిపోవటం జరిగింది.
మిగిలిన సాధనా కుటుంబం ఉదయకాలంలోనే ఈ రుద్రసాగర్ లో స్నానాదికాలు చేసుకొని… ప్రతినిత్యం చితాభిషేకం చూసుకొని…. ఆ తర్వాత ఆరు గంటల నుంచి 9 గంటల దాకా ధ్యాన నిష్ఠలో ఉండి, ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్లు కార్యక్రమాలు కానిచ్చుకొని…. పది గంటల నుంచి ఒంటి గంట దాకా ఈ ఆలయంలో ఉండి ధ్యాననిష్ఠలో ఉండడం ఒంటి గంట నుంచి ఐదు గంటల దాకా డేరా లో విశ్రాంతి తీసుకోవడం…. ఐదు గంటల నుంచి పది గంటల దాకా అనగా దేవాలయం కట్టేసేదాకా దేవాలయ పరిసరాలలోనే ఉంటూ ధ్యాననిష్ఠలో ఉండటం… 10 గంటలకు తిరిగి డేరాకు వెళ్లిపోయి విశ్రాంతి తీసుకోని నిద్రలోకి వెళ్ళటం…. ఇలా దినచర్యగా ఉండటం జరిగింది. ఇలా మరో 15 రోజులు ఈ క్షేత్రంలో ఉండేసరికి శివనందినికి ఒక రోజు ధ్యానంలో రకరకాల ఆలోచనలు, భావాలు కలుగుతూ ఉండేసరికి….తనకి కలిగిన లక్షణాలన్నీ రుద్ర స్వామికి చెప్పేసరికి….
రుద్రస్వామి:-
అనాహత జాగృతి లక్షణాలు:-
ఎక్కువసేపు ధ్యానం చేయాలనిపించడం…. శరీరంపై వెంట్రుకలు నిక్కబడుచుకున్నట్లుగా, ఒక్కొక్కసారి చలి వేస్తున్నట్లు అనిపించడం…ప్రాణ భీతి, చనిపోయిన ప్రేతాత్మ దర్శనాలు, చెట్లు మొక్కలు పెంచాలని అనిపించడం, స్పర్శ అనుభూతి కోరుకోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. …నీకు కలిగిన అనుభవాల ప్రకారంగా చూస్తే ….
ఇవి ఈ చక్ర జాగృతి లక్షణాలు అని చెప్పడం జరిగింది. ఇలా మరో 15 రోజులపాటు శివ నందిని ధ్యానంలో ఉండిపోవటం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకి కొన్ని లక్షణాలు, భావాలు కనపడుతూ ఉండేసరికి తనకి అర్థంకాక రుద్ర స్వామికి అడగడం జరిగింది. అప్పుడు
రుద్ర స్వామి:-
అనాహత చక్ర శుద్ధి లక్షణాలు:-
ఈ చక్ర ధ్యానంలో ఘంటా నాదం లీలా గా వినపడటం…ధ్యానము నందు ఆకుపచ్చరంగులో 12 దళాలు వుండి 'యం' అనే బీజాక్షరము ఉన్న ఒక పద్మము కనిపించడం, మహా కాళిక, మహా కాలును దర్శనాలు, విపరీతమైన భయంకరమైన దృశ్యాలు చూపించడం, చావు భయం కలిగించడం వంటివి జరుగుతాయి… వీటికి భయపడితే కుండలిని శక్తి మణిపుర చక్రంలోకి చేరుతుంది…. అని ఈ చక్ర శుద్ధి లక్షణాలు అని చెప్పడం జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమంలో ఉండగానే శివ నందినికి ఉన్నట్టుండి చావు భయం మొదలైంది. అంటే తనని ఎవరో చంపుతున్నారని…. ఎవరో అఘాయిత్యం చేసి చంపాలని అనుకుంటున్నారని…. తనకి అకాల మరణం ఉన్నదని…. తనని ఎవరో కత్తితో పొడిచి చంపుతారేమో… లేదా తనకి అకాల ప్రమాదాలు జరుగుతాయేమో…. లేదంటే ఏదైనా ప్రమాదంలో చనిపోతానేమో….. అని చెప్పి ఏదో తెలియని బలహీన లక్షణాలు కనిపించడం జరిగింది. తనకి అకాల మరణం వస్తే పిల్లల పరిస్థితి ఏమిటి? రుద్రస్వామి మహాదేవి పరిస్థితి ఏమిటి? తన సాధన పరిసమాప్తి కాదు కదా! అని రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే మృత్యుకి సంబంధించిన భయాలు.. మృత్యు భయానికి సంబంధించిన ఆలోచనలు…. శివ నందిని విపరీతంగా వస్తూ ఉండేవి. ఇక్కడ స్థల పురాణం ప్రకారంగా చూసుకున్నా కూడా రాజులకి అలాగే రాక్షసులకి కూడా మృత్యువు తన్నుకు వస్తున్నప్పుడు మృత్యు భయాలను,దోషాలను తొలగించి…. మృత్యుంజయుడిగా మహాశివుడు కాస్త మహాకాలుడిగా వచ్చి వాళ్ళ యొక్క మృత్యు దోషాలను తొలగించడం జరిగింది. ఈ క్షేత్రంలో సాధనలో కూడా అనాహత చక్రం శుద్ధి మాయగా చావు భయం లేదా మృత్యు భయము వస్తుంది. చావుభయం అనేది భౌతిక శరీరానికి సంబంధించినది అయితే…. మృత్యు భయం అనేది ఇతర దేహాలకి సంబంధించినది అవుతుంది. దేవతలకి మరణ భయం ఉంటుంది. జీవులకి భౌతిక మరణం చావు భయం అయితే…. దేవతలకి చావు అనేది మరణ భయం అన్నమాట పరమాత్ములకి అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి మరణం అనేది మృత్యువుతో సమానం అన్నమాట! అంటే చావు భయం, మరణం భయం అనేది అంత్యకాల మరణ స్థితి భయాలు ఈ చక్ర శుద్ధి సమయంలో వస్తాయని శివనందిని గ్రహించింది. కానీ విచిత్రంగా ఎవరో ఒక రాక్షసుడు తన వెంటపడి చంపుతున్నట్టుగాను…. ఒక ప్రేతాత్మ తనని ఆవరించి నరకయాతనతో తనని చంపుతున్నట్టుగాను….. ఆ తర్వాత ఎవరో ఒక ఆగంతకుడు తనని కత్తితో కసితీరా పొడుస్తున్నట్టుగాను….. వివిధ రకాల ధ్యాన అనుభవాలు,దృశ్యాలు ప్రతిరోజు పదేపదే శివనందినికి రావడం మొదలయింది. దానితో మనోధైర్యంగా ఉన్న శివ నందిని కాస్త రాను రాను ధైర్యం కోల్పోతూ మనోవేదనకి గురి అవుతుంది. అకాల మృత్యువు వస్తుందని భయపడుతూ… బాధపడుతూ ఉండేది. తనలో వచ్చిన మార్పులన్నీ కూడా రుద్ర స్వామి గమనించి…
రుద్రస్వామి:- అమ్మ! నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వస్తే మృత్యువే కదా! చస్తే చస్తావు…. చావు గురించి ఎందుకు ఆలోచిస్తావు….పుట్టుకతో పాటే చావు కూడా నీడలాగా వెంట ఉంటుంది కదా! చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా కూడా జరిగేది జరగక మానదు… జరగనిది ఎన్నటికీ జరగదు. నువ్వు ఉండటం వలనే మా జీవితాలు ఇది అవుతాయి… లేదంటే నీ సాధన వల్లనే పూర్ణ మోక్షం వస్తుంది…. లేదా నీవల్లనే స్త్రీ ప్రకృతికి మోక్షం వస్తుంది అనుకోవద్దు. నీ కథ ఇంతటితో ముగిసిపోయిందేమో! నీ బదులు ఇంకొక పాత్ర వస్తుంది. ఆ పాత్ర చేయవలసింది చేస్తుంది….ధైర్యంగా ఉండు..
అని చెప్పినప్పటికీ కూడా ఇసుమంత మార్పు శివ నందినిలో వచ్చేది కాదు. ఒకరోజు ఇలాగే తను గుడికి వెళుతూ ఉండగా…. సుమారు 45 నుంచి 55 సంవత్సరాలు మధ్య వయసులో ఉన్న ఒక ఆవిడ గుడి బయట కనిపించి…. అమ్మ! నేను బిల్వ దళాలను శివుడికి ఇవ్వాలి అనుకుంటున్నాను. గుడిలోకి వచ్చే అవకాశం లేదు. నువ్వు ఈ బిల్వ దళాలు తీసుకువెళ్లి మహాకాలుడికి దండగా వేస్తావా? అనేసరికి శివ నందిని యథాలాపంగా వేస్తా తల్లి అనడం జరిగింది. ఇలా ప్రతిరోజు ఒకే సమయంలో…. బిల్వ దళాలు మాల ఇవ్వడం…. శివ నందిని తీసుకువెళ్లడం జరిగింది. అలా 15 రోజులు ఇలాగే జరిగింది. ఒకరోజు ఈమె కనిపించక పోయేసరికి, మూడు రోజులు రాకపోయేసరికి, ఆ పక్కనే ఉన్న షాపులో ఆమె గురించి అడిగేసరికి…. ఇటువంటి వాళ్ళు ఎవరూ లేరే! మేము ఎవరిని చూడలేదు అని అనేసరికి…. అదేంటి 15 రోజుల నుంచి ఆవిడ బిల్వ మాల ఇస్తుంది కదా! ఆ మాలను నేను మహా కాలుడికి వేస్తున్నాను అని చెప్పి ఆవిడ ఫోటోని చూపించేసరికి…. ఎదురుగా ఉన్న ఇంటి నుంచే కదా ఆవిడ వచ్చేది అని పాడుబడ్డ ఇంటిని చూపించేసరికి ……అవును….ఆ ఇంట్లో నుంచి ఆవిడ గుడి ముందు దాకా వచ్చి ఇచ్చేది… అనేసరికి ఆవిడ చనిపోయి దాదాపు పది సంవత్సరాలు పైనే అవుతుంది. శివ భక్తురాలు. భర్త చనిపోయిన తరువాత పిల్లలు ఆవిడని పట్టించుకోకపోవడంతో ….. ఆవిడ ఈ ఇంట్లోనే ఉండి చనిపోవడం జరిగింది. ఆవిడకి మహాకాలుడు అంటే విపరీతమైన ఇష్టం. నా దగ్గరే ప్రతిరోజు ఆయనకి పూలు తీసుకుని అలంకరణ చేసేది అని ఆ ముసలావిడ చెప్పేసరికి, శివ నందినిలో ఒక విధమైన వణుకు మొదలైంది. ఇన్నాళ్లు తను ఆత్మలను, ప్రేతాత్మలను పుస్తక గ్రంథాలలో చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. కానీ, ఒక ప్రేతాత్మ తనకి బిల్వ దళం ఇచ్చింది అంటే…. ఆ ఆలోచనకే తనలో ఏదో తెలియని భయం మొదలైంది. అది నిజమా? కాదా? అని ఆ పాడుబడిన ఇంటి దగ్గరికి వెళ్లి చూద్దాం అని చెప్పేసి, దగ్గరలో ఉన్న పాడుబడ్డ ఇంటికి శివ నందిని వెళ్లడం జరిగింది. కిటికీలో తనకి ప్రతిరోజు కనిపించే ముసలావిడ కనిపించేసరికి…. అది కూడా ఒక ఆత్మ స్వరూపంగా ప్రేతాత్మగా కనిపించేసరికి….. ఒక్క క్షణం కాలం పాటు శివ నందిని స్తంభించిపోయింది. తెలియని భయం మొదలయింది. ఆ తర్వాత ఆ ముసలావిడ చెయ్యి ఊపుతూ… గాలిలో కలిసిపోవడం శివనందిని లీలగా గమనించింది. అంటే తను ఇన్నాళ్లు దైవోపాసన ఉన్న ఆత్మ ద్వారా మాల తీసుకొని మహాకాలుడికి అర్పించడం జరిగిందా! అని ఆలోచనకే మనసు ఏదో తెలియని భయంతో….తను కూడా అకాల మరణం పొందుతాను….. మృత్యువు వస్తుంది…. అని చెప్పేసి అనుమానభయంతో మనసు అంగీకరించలేక ఆరోజు ధ్యానం చేయకుండా తిరిగి తాము బసకి ఏర్పాటు చేసుకున్న డేరాకి వెళ్లిపోవడం జరిగింది. కొద్దిసేపటికి రుద్రస్వామి అక్కడికి వచ్చి
రుద్రస్వామి:- ఏంటమ్మా? ఇవాళ ధ్యానంలో లేకుండా…. గుడి దగ్గరికి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయావంట…. షాప్ వాళ్ళు చెప్పారు..
(అంటే తనకి కలిగిన అనుభవం మొత్తం చెప్పేసరికి….)
ఓ ఇదన్నమాట ..! ఇక్కడ కంగారు పడవలసింది ఏమీ లేదు…. ఆవిడ శివ ఉపాసకురాలు కాబట్టి నువ్వు చూడగలిగావు. ఆవిడ గుడిలోకి రాకపోవడం జరిగింది. ఆవిడ వల్ల నీకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కదా! ఆవిడ కోరిక నీ ద్వారా తీర్చుకొని అంతర్దానం అయ్యింది. శూన్యంలో కలిసి ఉండవచ్చు…. లేదా ఉన్నత లోకాలకు వెళ్లి ఉండవచ్చు. దానిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు….
శివ నందిని:- కాదయ్యా! నేను ఇంతవరకు ఆత్మల గురించి…. ప్రేతాత్మల గురించి…. భూత పిశాచాల గురించి పుస్తకంలోనే చదవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆవిడ మామూలు మనిషి రూపంలో వచ్చేసరికి నేను గమనించలేకపోయాను….
రుద్రస్వామి:- అమ్మ! ఇది మహాకాలుడు ఉండే ఆవాసం. మహాకాళిక కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు ఉగ్రరూపంలో ఉంటారు. వాళ్ళ యొక్క గణాలతో ఆవాసం చేస్తూ ఉంటారు. ఆ గణాలలోనే రుద్ర పిశాచాలు అనే ఒక గణం ఉన్నది. నాకు తెలిసి ఈవిడ కూడా ఆ కోవకే చెందిన ఆవిడే. దానికే నువ్వు అలా కంగారు పడిపోతే ఎలాగా! భయపడితే ఎలాగా!
శివ నందిని:-అయినా నేను ఇక్కడికి వచ్చానని నీకెలా తెలుసు…..నువ్వు ఎలా వచ్చావు?
రుద్రస్వామి:-నేను రావటం ఏమిటి?
అంటూ రుద్ర స్వామి రూపంలో ఉన్న పిశాచం కాస్త గాల్లో కలిసిపోయేసరికి….. ఎవరు మనుషులు, ఎవరు నా వాళ్ళో… ఎవరు పరాయి వాళ్ళో ….అనేది శివ నందిని కి అర్థం కాక అయోమయ స్థితిలో అలా చూస్తూ ఉండిపోయింది.. కొద్దిసేపటి తరువాత రుద్రస్వామి యధావిధిగా మామూలుగా వస్తూ ఉండేసరికి….
రుద్రస్వామి:- ఏంటమ్మా! అలా స్థాణువై చూస్తున్నావు. నోరు తెరిచి…. ఏం జరిగింది?
శివ నందిని:- మీరు ఇప్పుడు రావటమేనా?
రుద్రస్వామి:- అవును ఇప్పుడే వస్తున్నాను. నేను ధ్యానం చేసుకుని వస్తున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నువ్వు గుడిలో కనిపించలేదు సరే ఇక్కడికి వచ్చి ఉంటావులే! అని ఇక్కడికి రావడం జరిగింది.
శివ నందిని:-;15 నిమిషాలు క్రితం… మీ స్వరూపంలో ఒకరు రావడం జరిగింది.
(అంటే ఎవరా అని ఆయన ధ్యానంలో కూర్చునేసరికి ఒక రుద్ర పిశాచి తనని వెంబడిస్తూ తన రూపంలో రావడం జరిగింది అని రుద్ర స్వామి గ్రహించి…..)
రుద్ర స్వామి:- ఏం లేదులే…. ఇక్కడున్న రుద్రగణాలలో ఒక రుద్ర పిశాచం ఇలా రావడం జరిగింది. అంటే అసలు ఏం జరిగింది…
అన్నప్పుడు…. తనకి మాల ఇచ్చిన ఆవిడ గురించి తన రూపంలో వచ్చిన రుద్ర పిశాచాల గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి…. ఎవరు మనుషులు, ఎవరు ఆత్మలో, ఎవరు దయ్యాలో తెలియట్లేదు అనుకుంటూ ఉండేసరికి….కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. నీకు మానసిక ధైర్యం ఎంతవరకు ఉందో తెలుసుకోవడం అనేది ఈ మహా కాలుడు పెట్టే పరీక్షలే. అవి కేవలం మనుషులతో నేనా..? తన రుద్ర పిశాచాలని చూసి కూడా నిర్భయంగా ఉండగలవా? నీకు అంతా మనోధర్యం ఉందా లేదా? అని పరీక్ష పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గమనించు…. వాళ్ళు కూడా వివిధ దేహాలను ధరించిన వాళ్లే. మనుషులు అనేది స్థూలదేహాలు అయితే….. వాళ్ళు వేరువేరు దేహాలను ధరించిన వాళ్ళు. సూక్ష్మ శరీర దేహదారులు అయి ఉంటారు. ఆత్మ శరీర దేహదారులు అయి ఉంటారు. లేదు అంటే మనో శరీర దేహదారులు అయి ఉంటారు. ఏదైనా కానీ మిగిలిన 10 దేహదారులు అయి ఉంటారు… మనం మనుషుల లాగానే వాళ్లని కూడా గుర్తించాలి. వాళ్ళని చూసి భయపడకూడదు….వాళ్ళకున్న కోరికలు మన ద్వారా తీర్చుకుంటారు… తీసుకునే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లడం జరుగుతుంది. కొంతమంది భయపెట్టే వాళ్ళు ఉంటారు…. కొంతమంది బాధపెట్టే వాళ్లు ఉంటారు…. కొంతమంది ఏడిపించే వాళ్ళు ఉంటారు…. కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు… కొంతమంది మిత్రులు ఉంటారు… కొంతమంది శత్రువులు ఉంటారు… వాళ్ళ తత్వాలను బట్టి వాళ్ళు ఉంటారు. భూలోకంలో మనుషులు వలే ఉంటారు. కాకపోతే వాళ్లు స్థూల శరీరంతో కాకుండా ఆయా శరీరాలకు సంబంధించిన లోకాలలో ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే….ప్రేతాత్మ లోకం అని పితృదేవతల లోకం అని అనుకోవచ్చు. ఒకరకంగా చూస్తే ఇక్కడ రుద్రగణాలు ఆవాసం అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మహాకాలుడు యొక్క సేవకులు. వాళ్ళని మనం ఏమీ అనటానికి లేదు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలిగితే మహాకాలుడు ఊరుకోడు. ఆయనే చూసుకుంటాడు…
శివ నందిని:- నాకు అనుకొని విధంగా చావు భయానికి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి.?
రుద్రస్వామి:- ఈ అనాహత చక్రంలోనే మరణ భయం అనేది వస్తుంది. ఈ భయాన్ని మనం చేదించాలి. మనో ధైర్యంతో ఉండాలి. మనం చనిపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది అనే మనోధైర్యంతో ఉండు. నువ్వు లేకపోతే ఏమీ జరగదు. వీళ్ళు అన్యాయం అయిపోతారు… బ్రతకరు… వీళ్ళ జీవితం ఆగిపోతుంది అని అయితే అనుకోవద్దు…
అని చెబుతూ ఉండేసరికి అలా తను ఇసుక నేల మీద పడుకునేసరికి…. రుద్ర స్వామి కూడా ఇసుక నేల మీద పడుకుని ….వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఉన్నట్టుండి శివ నందిని గుండెల మీద ఎవరో కూర్చొని… గొంతు నులుముతున్నట్లుగానో… వక్షస్థలం మీద చేతులు వేసి నొక్కుతున్నట్లుగా…. భావాలు వచ్చేసరికి ఎంత అరవాలన్నా అరవలేక మాట బయటికి రావటం లేదని…. శరీరం కాళ్లు చేతులు కదలటం లేదని చెప్పేసి గ్రహించింది. తల తిప్ప లేక పోతుంది. చూపు చూడలేక పోతుంది… కానీ ఎవరో తన మీద ఉన్నారు… అని లీలామాత్రంగా కనపడుతూ ఉండేసరికి…. తనకి ఇంక మరణ సమయం ఆసన్నమైనది అనుకుంటూ… మహాకాలుని మంత్రం చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నాను అని అనుకుంటూ ఉండేసరికి…. కొన్ని క్షణాల తర్వాత తన మీద ఉన్న శక్తి బయటకు వెళ్లిపోవడం గమనించింది. ఊపిరి పీల్చుకుంది. నెమ్మదిగా కాళ్లు చేతులు కదపటం…. చేస్తూ లేచి కూర్చున్నది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో నీళ్లు తాగి తనకి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ …..పిల్లల వంక చూస్తే రుద్ర స్వామి, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారని గమనించి…. సరే అని ఆ నది ఒడ్డున కాసేపు నడవడం జరిగింది. ఆ అర్ధరాత్రి సమయంలో నదిని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనంద స్థితిలో ఉన్నది. ఇలా కొంతసేపు ఉన్న తర్వాత తన చాప మీద పడుకుంది. కాసేపటికి తర్వాత ఈసారి ఎవరో తన పక్కన ఉండి కామప్రేరిత పనులు చేయడం….వక్షస్థలం మీద, తన మర్మాంగం మీద, చేతులు వేసి నొక్కుతున్నట్టుగా….. అనుభవ అనుభూతులు రావడం… తనలో కామకోరికలు పెరగటం లీలామాత్రంగా కనిపించింది. కానీ, మనిషి ఎవరూ లేరు. కానీ తనకి స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. ఎవరో తన మీద పడుతున్నట్టు…. అంటే దాంపత్య జీవితంలో శృంగారం చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభవ అనుభూతులు కలుగుతాయో…. ఇక్కడ మగవాడు లేకపోయినా, తనకి అదే విధంగా అనుభవ అనుభూతులు కలుగుతూ ఉండేసరికి…. ఎవరో ప్రేతాత్మ తనతో…శృంగారం చేస్తుంది అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. తన మర్మాంగంలోనికి పురుషాంగం ప్రవేశం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండేసరికి…. తన కాళ్ళతో ఎంత నెట్టినా ….ఎలా ప్రయత్నం చేసినా…. ఎంత ప్రయత్నం చేసినా తన వక్షస్థల మీద చేతులు వేస్తున్నట్లుగా ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేసరికి ….ఎవరో ప్రేతాత్మగా ఉండి తనని బలవంతం చేస్తున్నారని… ఆగాయిత్యం చేస్తున్నారని గ్రహించి…. మహాకాలుని స్మరణ చేస్తూ ఉండేసరికి…. తన ఒంటి మీద నుంచి కొంతసేపట్లోనే ఆ ప్రేతశక్తి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి నిద్ర లేచి….తన పాతివ్రత్య ధర్మం పోయింది. బతకడం అనవసరం. శివ స్వామికి తను అన్యాయం చేసినట్లు అయ్యింది. ఎవరో ప్రేతాత్మ తనతో శృంగారం చేయడానికి ప్రయత్నించాడని, తెలిసి తెలియక చేసిన తప్పే అయినా ధర్మం తప్పినట్లే కదా! ఇక తను చనిపోవాలి అని ఉన్మాదంలో…. పిచ్చి ఆవేశంలో…. ఏ మంత్రం వేటి గురించి ఆలోచన చేయకుండా…. క్షిప్రా నదిలోకి దూకాలి అని చెప్పేసి శరవేగంతో…. ఆవేదనతో…. బాధపడుతూ ఉండేసరికి…. రుద్ర స్వామికి ఏదో అనుమానం వచ్చి అనుకోకుండా మెలకువ వచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకోవాలని శివ నందిని క్షిప్రా నది వైపుకు వెళ్లడం గమనించి…. గబగబా రుద్రస్వామి పరిగెత్తుకు …..వెళ్లి ఆమెను
రుద్రస్వామి:- ఏమైంది తల్లి! ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు…..
(అనేసరికి తనకి స్వప్నంలో జరిగిన పరాభవం చెప్పేసరికి….)
దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది స్వప్నంలో జరిగింది. నీ ప్రమేయం లేకుండానే జరిగింది. అంగప్రవేశం జరగలేదు కదా! జరిగే సమయానికి నీకు మెలకువ వచ్చేసరికి మహాకాలుని స్మరణ చేయడం వలన…. ఆ ప్రేతశక్తి తప్పుకుంది….
శివ నందిని:-నాకు ధర్మం తప్పిన భీతి కలుగుతుంది. నేను బ్రతకడం వల్ల ఉపయోగం లేదు. ధర్మదీక్షను ఇది చేశాను…
అని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండేసరికి రుద్ర స్వామి గట్టిగా చంప మీద ఒక దెబ్బ కొట్టేసరికి సహజస్థితికి వచ్చింది. శివ నందిని ఆత్మహత్య ప్రయత్నం విరమించుకుని బోరున ఏడవడం ప్రారంభించింది…
రుద్రస్వామి కాస్త…
రుద్రస్వామి:- అమ్మాయి! నువ్వేంటి….పిచ్చిదాని లాగా మాట్లాడుతున్నావు. ఆత్మహత్య చేసుకోవడానికి ఇవన్నీ ప్రేరేపించే అంశాలే. నువ్వు చావు నుంచి బయటపడతావా లేదా? అని నీ మనసుకి పరీక్షలు పెడుతున్నారు. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వేధించినప్పటికీ…. నీవు మనో ధైర్యం తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనోధైర్యానికి పరీక్షలే అని గ్రహించట్లేదు. ఈ స్థితిని నువ్వు దాటాలి. మహాకాలుడు మహామృత్యుంజయుడు కదా! ఎంతోమందికి ఆయన చావు భయం నుంచి విముక్తి కలిగించాడు కదా! ఆయన్ని నమ్ముకుని ఉండు…. నువ్వు పేలవంగా మాట్లాడుతూ నిగ్రహ శక్తిని కోల్పోయిన దానిలాగా మాట్లాడితే ఎలాగా! ఇక్కడ భౌతికంగా ఏం జరగలేదు. మానసికంగా అందులోనూ…. స్వప్నంలో జరిగింది. స్వప్నంలో వీర్య స్ఖలనం జరిగితే తప్పు కాదు కదా! అలాగే ఇది కూడా ఎవరో ప్రేతాత్మ రుద్ర పిశాచంగా నిన్ను ఆవహించి వశపరచుకోవాలని ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఆ ప్రేతాత్మ నువ్వు లొంగుతావేమోనని అని అనుకున్నారేమో.! అది కూడా ఒక విధమైన పరీక్ష. దానిని నువ్వు నిగ్రహించుకుని అతనిని పంపించడంతో… ఆ పరీక్షలో నువ్వు విజయం పొంది ఉండవచ్చు..
శివ నందిని:- ఇలాంటి పరీక్షలు పెడితే ఆడవారు సున్నితమైన మనసు మీద దెబ్బ కొట్టినట్టు కాదా! వాళ్ళకి చావు తప్ప ఇంకేమైనా ఉన్నదా?
రుద్రస్వామి:-సాధన అంటేనే మనసు మీద కొట్టడం అమ్మ! సున్నితమైన మనసు కాస్త కఠినమైన మనోస్థితికి రావాలి. ప్రతి చిన్న విషయానికి భయపడే స్థితి నుంచి ప్రతిదాన్ని దాటుకునే మనఃస్థితికి నువ్వు రావాలి. అది చిన్న విషయమా పెద్ద విషయమా అనేది ముఖ్యం కాదు. నువ్వు దాటుకున్నావా? దాటుకునే శక్తి నీలో ఉందా అనేది ప్రకృతి చూస్తూ ఉంటుంది. గమనిస్తూ ఉంటుంది. ఇంత చిన్న విషయానికి కూడా నువ్వు బాధపడితే ఎలాగా? మీ మనసుకి అది పెద్ద విషయమే కావచ్చు. కానీ లోకానికి అది చాలా చిన్న విషయం. లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటికే నువ్వు భయపడితే…. బాధపడితే ఎలాగా!
శివ నందిని:- ఏమోనయ్యా! నావల్ల అయితే కావట్లేదు…నాలో తెలియని భయం మొదలయ్యింది. ముఖ్యంగా చావు భయం మొదలయ్యింది… పాతివ్రత్య ధర్మం కోల్పోతున్నానేమో అనే భయం మొదలయ్యింది.. రుద్రస్వామి:- ఇక్కడ భయం అనేది మొదలవుతుంది…అది చావు భయం అవ్వచ్చు… ధర్మ భయం అవ్వచ్చు… ఇంకొక భయము అయినా కావచ్చు…. ఏదైనా కానీ ఇక్కడ నువ్వు భయాలను జయించాలి. నీకున్న 18 రకాల భయాలను దాటగలగాలి. దాటి భయరహిత స్థితికి నువ్వు రావాలి. ఇది పరీక్షాకాలం. నేను కాదు అనను… ఈ పరీక్షలను నువ్వు దాటుకుంటూ సున్నితమైన నీ మనసుని కఠినమైన మనసుగా మార్చుకునే స్థితికి నువ్వు రావాలి. గురువులు కూడా ఇదే చేస్తారు. శిష్యుల యొక్క మనసు మీద కొడతారు. పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు అన్నింటిని కూడా శిష్యుడు దాటుకోగలడా లేదా అని చూస్తారు. దాటుకోగలిగితే వాళ్ళకి సంబంధించిన ఉన్నత స్థితికి సాధనను తీసుకువెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతి కూడా నీకు పరీక్షలు పెడుతుంది. నువ్వు భయపడకూడదు… వాటి గురించి ఆలోచించకూడదు…
శివ నందిని:- సరే అయ్యా! ఏదో క్షణికావేశంలో ఏదో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.
రుద్రస్వామి:- నువ్వు ఎప్పుడూ ఇలా చేయకు… నీ మరణం సహజ మరణం గానే రావాలి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని చెప్పి ప్రయత్నం చెయ్యను అని నాకు మాట ఇవ్వు…
శివనందిని:- (రుద్ర స్వామి చేతిలో చేయి వేసి) నేను ఇంక ఎప్పుడూ ఆత్మహత్య ప్రయత్నం చేయను. సహజ మరణానికి ఎక్కువ అవకాశం ఇస్తాను. సహజ మరణం లాగానే నా మరణం ఉండాలని అనుకుంటున్నాను. అనాయాస మరణం పొందాలనుకుంటున్నాను. నేను ఇంక ఆత్మహత్య ప్రయత్నం చేయను. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకునే స్థితిగతులే వస్తే…. వాటిని ఎలా దాటాలి అని ఆలోచిస్తాను కానీ, క్షణిక ఆవేశంలో నేను పెట్టుకున్న పాతివ్రత్య దీక్ష తప్పానేమో అనే మనోభాయానికి గురి అయ్యి… ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇంక ఎప్పుడు కూడా ఇలా చేయను. నీ మీద ఒట్టు. ఆ మహాకాలుడు మీద ఒట్టు…
అని చెప్పి ప్రమాణం చేసేసరికి వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చి ఎవరి చాపల మీద వాళ్ళు నిద్రకి ఉపక్రమించడం జరిగింది. ఆ తర్వాత సుప్రభాత సేవా సమయం అవుతుందని పిల్లలు ,రుద్రస్వామి శివనందిని అందరూ క్షిప్రా నది ఒడ్డున ఉన్న రుద్రసాగర్ లో స్నానాధికాలు పూర్తి చేసుకుని అయ్యవారి సుప్రభాత సేవను చూడటం జరిగింది. ఆ తరువాత ధ్యానంలో కూర్చుని…. 9 గంటల కి అందరూ టిఫిన్ లు కానిచ్చుకున్న తరువాత పిల్లలిద్దరూ కలిసి అమ్మ! ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళదామా! అనేసరికి సరే ….తన మనసు కూడా స్థిమిత పడుతుంది అని సరేనమ్మా! ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి… అనుకుంటూ వెళ్లడం జరిగింది. అప్పుడు బాలగణపతి కాస్త…
బాల గణపతి:- అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ ఉంది అన్నారు కదా! ఇక్కడ అమ్మవారి ఏ భాగం పడింది?
శివ నందిని:- ఇక్కడ రెండు శక్తి పీఠాలు ఉన్నాయి. ఒకటి హరి సిద్ధమాత శక్తిపీఠం… రెండోది మహా కాళిక శక్తిపీఠం…. మహాకాళికా శక్తి పీఠం అనేది అమ్మవారి పై పెదవి పడింది అని…. హరి సిద్ధమాత శక్తి పీఠంలో అమ్మవారి మోచేయి పడింది అని ఇక్కడ ఈ స్థల పురాణం చెప్పడం జరిగింది.
అనేసరికి మొదట హరి సిద్ధమాత ఆలయానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి మహాకాళికా శక్తిపీఠానికి వెళ్లడం జరిగింది. ఇక్కడే అమ్మవారు కాళిదాసుకి బీజాక్షరాలు రాశారు అని పిల్లలకు చూపించడం జరిగింది. ఆనాటి నుంచి అజ్ఞానిగా ఉన్న కాళిదాసు కాస్త జ్ఞాని అయ్యి… మహాకవిగా మారి మహాకవి కాళిదాసు అయ్యాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళనాథ్ ఆలయానికి వెళ్లడం జరిగింది. అక్కడ కుజగ్రహ జన్మస్థలంగా కుజుడు పుట్టాడని….చెప్పడం జరిగింది. మనం అంతరిక్షంలోకి చూసి కుజ గ్రహం చూసినట్లయితే సరిగ్గా ఇదే ప్రాంతం నుంచి చూస్తే…. కుజుడు అంతరిక్షంలో కనపడతాడు అని చెప్పేసి పిల్లలకి శివ నందిని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ గుడిలో అంగారక గ్రహ దోష పూజలు కాలసర్ప దోష పూజలు జరుగుతున్నాయని శివ నందిని చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపముని ఆశ్రమం ఉండటం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజులు అనగా సుమారుగా రెండు నెలలు విద్యను అభ్యసించాడు అని స్థల పురాణం చెప్పడం జరిగింది… అని శివ నందిని అనేసరికి…
రెండు నెలలు చదివితేనే అంత జ్ఞానం పొందడం జరిగిందా! అని పిల్లలు ఆశ్చర్యంగా అడిగేసరికి….మామూలుగా 20 సంవత్సరాల పాటు చదవాలి కదా! ఈయన రెండు నెలల్లో చదివాడా? అంటే స్థలపురాణంలో అలా చెబుతుంది… నాకేం తెలుసు! అంటే ఆ తర్వాత ఆ ఆశ్రమంలోని గోమతి కుండు దగ్గరికి వెళ్లడం జరిగింది. గోమతి కుండు లో సాందీపముని కోరిక మేర సకల నది తీర్థములు కలిసేటట్లుగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడని ఇక్కడ ఈ స్థల పురాణం చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాము ఘాట్ కి వెళ్లడం జరిగింది. ఈ రామ్ ఘాట్ లో రాముడు తండ్రి అయిన దశరధుడికి శ్రాద్ధ కర్మ చేయడం జరిగింది అని చెప్పి శివ నందిని అనేసరికి… పిల్లలు ఆహా అని అన్నారు. ఆ తర్వాత కొత్తగా కట్టిన ఉజ్జయిని కారిడార్ రెండు కిలోమీటర్లు సాయంత్రం వేళ సాధనా కుటుంబం చూడటం జరిగింది. వివిధ హిందూ దేవాలయాలు ఫౌంటెన్ ను విద్యుత్ కాంతులతో వెలుగుతూ….. నీటితో నిండిన ఫౌంటెన్ల నుంచి నీరు పడటం పిల్లల, పెద్దలు అందరూ కూడా ఏదో తెలియని అలౌకిక ఆనందస్థితిని పొందడం జరిగింది. ఇక అక్కడి నుంచి హరి సిద్ధమాత ఆలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న శివాలయం దర్శించుకోవడం జరిగింది. అక్కడ మహామాయ దేవి ఆలయం చూడటం జరిగింది. కానీ ఈ దేవాలయాన్ని సరాసరి చూస్తే తట్టుకోలేరు అని… గుడికి ఉన్న ఒక చిన్న రంద్రం నుంచి ఈ మహామాయ దేవిని చూడటం జరుగుతుంది. ఇది గమనించిన బాలగణపతి కాస్త బాల గణపతి:- అమ్మ! మనకి కాశీలో క్షేత్ర పాలకురాలిగా వారాహిమాత ఉంటుంది. ఆమె శక్తిని కూడా భక్తులు తట్టుకోలేరని చెప్పేసి…. ఆవిడ ద్వారానికి ఒక చిన్న రంద్రం పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అమ్మవారి పాదాలు చూడడం జరుగుతుంది. లేదంటే పైనుంచి ఉన్న రంధ్రం ద్వారా చూస్తే అమ్మవారి పైభాగం నుంచి దర్శించుకోవడం చూడటం జరుగుతుంది అని…. ప్రత్యక్షంగా ఎదురుగా అమ్మవారిని దర్శించుకోలేమని… చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహామాయ దేవి ఆలయం కూడా ఉంది.
అంటే శివ నందిని కూడా అవును అనడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న గణపతి ఆలయం, దాని పక్కనే ఉన్న విక్రమాదిత్యుడి 32 సాలభంజికలు ఉన్న రాతి సింహాసనం చూసి…. భట్టి విక్రమార్కుడు రాజు కథలు మీరు వినే ఉంటారు కదా! సాలభంజికలు చెప్పిన కథలను వినే ఉంటారు కదా! అనేసరికి ఆ విన్నాము అనేసరికి అది ఇక్కడనే జరిగింది.. ….అని శివ నందిని అనటం జరిగింది. ఇక దానితో ఈ ఉజ్జయిని పరిసర ప్రాంతాలను చూడటం అయిపోవడంతో…. తిరిగి దారిలో భోజనాలు కానిచ్చేసుకుని తమ డేరాకు రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి వారే క్షిప్రా నది ఒడ్డున చాపను పరుచుకొని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఎవరి ధ్యానాలలో వాళ్ళు ఉండటం జరిగింది. ఆ తర్వాత శివనందిని తన హృదయం మీద చేయి వేసుకొని స్వామి! స్వామి! అనేసరికి శివ స్వామి:- చెప్పు దేవి!
శివ నందిని:-మిమ్మల్ని చూడాలని ఉంది. మీతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది.
(అనగానే శివ స్వామి కాస్త తన పక్కన ప్రత్యక్షమయ్యేసరికి)
శివ స్వామి:- ఏమైంది….
శివ నందిని:- మనమిద్దరం కలిసి ఈ క్షిప్రా నది ఒడ్డున నడుచుకుంటూ వెళదామా!
శివ స్వామి:-నది ఒడ్డునే ఉన్నాం కదా!
శివ నందిని:- కాదు…. ఈ నదిలో కాళ్ళు తడుస్తూ మీ పక్కన కూర్చొని మాట్లాడాలి….అని చెప్పి ఒక కోరిక మిగిలిపోయింది.
శివ స్వామి:-ఆడవాళ్ళకి కోరికలకి ముచ్చట్లుకి కొదవలేదు….
ఇక వీళ్లిద్దరూ నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది. ఆ నది దగ్గర శివనందిని, శివ స్వామి కూడా పాదాలు తడుస్తూ కూర్చుని ఉన్నారు. తనకి ఆ నది ప్రవాహానికి పాదాలు తడుస్తూ ఉంటే…. ఓరకంటతో శివ నందిని కాస్త శివ స్వామి కేసి చూస్తూ…
శివ నందిని:-స్వామి నాకు ఈ మధ్యన ఏం జరిగిందో మీకు తెలుసా!?
శివ స్వామి:- ఏమున్నది మృత్యు భయం పరీక్ష ….అలాగే పాతివ్రత్య ధర్మ పరీక్షలే కదా!
శివ నందిని:- అన్నీ తెలిసినా కూడా మీరు చలించకుండా ఎలా ఉండగలుగుతున్నారు?
శివ స్వామి:- దీనికి చలించాల్సిన అవసరం ఏముంది…. నువ్వు ఒక యోగ సాధకురాలివి… నువ్వు దాటుతావా లేదా! అనేదే నేను చూస్తాను. దాటితే మంచిదే ….దాటకపోతే నీ సాధన ఇక్కడితో ఆగిపోతుంది. దాని గురించి నేనెందుకు ఆలోచిస్తాను…
శివ నందిని:- అంటే మీకు బాధ కానీ, భయం కానీ ఏమీ అనిపించలేదా!? నేను తప్పు చేస్తున్నానని… అనుమానం రాలేదా?
శివ స్వామి:-ఇక్కడ తప్పు చేయడం అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. అంతేకానీ కావాలని ఎవరూ కూడా చేయరు. నువ్వు ఏదో తప్పు చేస్తావని…. నేను అనుకోలేదు. తప్పు జరగకుండా నువ్వు ఎలా దాటగలుగుతావు అనేది మాత్రమే చూస్తాను.
శివ నందిని:- ఈ ప్రమాదాలు వస్తాయని ముందే చెప్పచ్చు కదా!
శివస్వామి:- ప్రమాదాలు వస్తాయని…. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ముందే చెప్తే ఇంక ఉపయోగం ఏముంది? నేను ఉన్న వేళ ఉంటుంది… లేని వేళ ఉంటుంది. వాటిని నువ్వు దాటుకునే మనోస్థితికి నీకు రావాలి కదా! నేను దూరం నుంచి ఉంటాను. అంతే ఎందుకు? ఇప్పుడు తాబేలు పిల్ల ఉన్నది…. అది ఒడ్డున వచ్చి మట్టి తీసి గుడ్లు పెట్టి నీటిలోకి వెళ్ళిపోతుంది. తన చూపుతో గుడ్ల నుంచి పిల్లలు వచ్చేదాకా చూస్తూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి గంట,ప్రతీక్షణం తను గుడ్లు పెట్టిన మట్టి ప్రాంతాన్నీ చూస్తూ ఉంటుంది. గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చే కొద్దీ సంతోషపడుతుంది. తన పిల్లలు తన దగ్గరికి వస్తున్నాయని అనుకుంటుంది. చూపుతోనే గుడ్ల నుంచి పిల్లల్ని బయటకు తీసుకువస్తుంది. గురు శిష్య సంబంధం ఉండాలి కానీ పావురాల గుడ్లు పొదిగినట్టుగాను…. కోడి గుడ్లను పొదిగినట్టుగాను గురు శిష్యుడు ఎప్పుడూ ఉండడు. గురు శిష్యుడు సంబంధం ఎప్పుడూ తాబేలు విధివిధానంలోనే ఉంటుంది. సమస్య వచ్చిన ప్రతిసారి మీ పక్కనే నేను ఉండాలి అనుకోవడం చాలా తప్పు. నేను ఉన్న లేకపోయినా కూడా నీ సాధన పరిసమాప్తి అవ్వాలి. మధ్యలో నేనెవరిని…. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళచ్చు… వెళ్ళకుండా ఉండవచ్చు. అది కాల నిర్ణయం. నామీద ఆధారపడి నువ్వు సాధన చెయ్యట్లేదు కదా! అలాగే నేను వచ్చిన తరువాత సాధన ఆగిపోదు కదా! నేను ఉన్న లేకపోయినా నీ సాధన పూర్తి చేసుకోవాలి….
శివ నందిని:- నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని మాత్రం అనకండి. మీరు ఉన్నారు అనే మనో ధైర్యంతోనే నేను సాధన చేస్తున్నాను. కాకపోతే నిన్న జరిగిన అనుకొని సంఘటనల వలన నా పాతివ్రత్య ధర్మం తప్పానేమో అనే మనోవేదన కలుగుతుంది. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత నాకు చావు భయం మొదలైంది. ప్రమాదాల వలన గాని… లేకపోతే ఎవరైనా నన్ను చంపడం వలన గాని…. రాక్షసుల వలన ప్రేతాత్మల వలన గాని….ఇలా నాకు మరణం సంభవిస్తున్నట్టు….నాకు వివిధ రకాల ధ్యాన అనుభవాలు కలుగుతున్నాయి. వాటిని ఏం చేయాలి?
శివ స్వామి:- కనిపించే ప్రతి ధ్యాన అనుభవం కూడా నిజం కావచ్చు… కాకపోవచ్చు… అది ఒకవేళ నిజంగా అనుభవంలోకి వస్తే, వాటిని ఎలా దాటాలి? ఏ విధంగా దాటాలి? అనేది నీకున్న మనోధైర్యం బట్టి అది ఆలోచిస్తుంది. మనసుకి ఆలోచించే వివేక బుద్ధిని, విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వాలి. మనోధైర్యాన్ని కోల్పోతే చావు భయమే కాదు…. అన్నింటికీ భయపడతావు. బొద్దింకకే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. రాను రాను నువ్వు బొద్దింకకి భయపడితే…. రాను రాను పాములు భరించే స్థితికి నువ్వు ఎలా వెళతావు. పాము అనేది కూడా ఒక విధంగా భయమే కదా! బొద్దింకకే భయపడే దానివి…. పాముని మెడలో వేసుకునే స్థితికి ఎలా వెళతావు? నీ శరీరంలోని కుండలిని శక్తి స్వరూపంలోనే పాము ఉందని గ్రహించు. బయట తిరిగే పాములను చూసి నువ్వు భయపడితే ఉపయోగం ఏమిటి? నీ శరీరంలో ఉన్న పాముకేమో నువ్వు భయపడవు. సంతోషపడతావు. అదే బయట పాము కనబడితే భయపడతాను అనటంలో అర్థం ఏమైనా ఉందా? కారణం లేకుండా పాములు కాటు వేసే అవకాశాలు ఉంటాయి…..కారణం ఉండి కాటు వేసే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటిని నువ్వు గమనించాలి. పాము అనే భయాన్ని నువ్వు దాటుకోగలగాలి. అదే మృత్యు భయం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ క్షిప్రా నది ఉదృతముతో నిన్ను కొట్టుకొని పోతున్నా నువ్వు ప్రశాంతంగా, మనోధైర్యంగా ,మనో నిగ్రహంతో ఉండగలగాలి. అలాంటి మానసిక శారీరక స్థితికి నువ్వు రాగలగాలి. అప్పుడే నీ సాధన ముందుకు వెళుతుంది. ప్రతి చిన్నదానికి నువ్వు భయపడి పోయి…. బాధపడిపోయి…. అది ఇది అయిపోతే ఉపయోగం లేదు. నువ్వు బాధల నుంచి బంధనాల గురించి, బాధ్యతల గురించి ఆలోచించి…..నేను చచ్చిపోతే వీటి పరిస్థితి ఏమిటి? అనుకున్నాంత మాత్రాన ఉపయోగం లేదు. ఉన్నా లేకపోయినా కూడా జరిగే జగన్నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు విధి అలాగే రాశాడు. కాకపోతే మనం బంధాల్లో, బాధ్యతలు ఉన్నామని మనం భ్రమ పడుతూ ఉంటాము… నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్లకు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి.ఈ విషయం నువ్వు తెలుసుకో…. ఆలోచించుకో….అంతకుమించి ఇంకేమీ లేదు.
శివ నందిని:- సరే స్వామి! మీరు ఎంత చెప్పినప్పటికీ…. ఈ చావు భయం నా అనుభవాల ద్వారానే నేను దాటగలనని నాకు అర్థం అయింది. అనుభవ అనుభూతుల ద్వారానే నేను దాటగలను. నా మానసిక ధైర్యమును మీరే అనుగ్రహించగలరని నమ్మకం నాకు ఉంది. మీ ఒడిలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను….
శివ స్వామి:- నాకు ఎలాంటి అభ్యంతరం లేదు దేవి!
అనేసరికి తొడ మీద శివ నందిని పడుకోవటం జరిగింది. అలా సుమారుగా మూడు గంటలు గాఢ నిద్రలోకి వెళ్ళడము జరిగింది. ఈమెను ఇబ్బంది పెట్టకుండా శివ స్వామి కాస్త ధ్యానంలోకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత శివ నందినికి మెలకువ వచ్చేసరికి సుప్రభాత సేవకు సమయం అవుతుందని….
శివ నందిని:- స్వామి! నేను అయ్యవారి సుప్రభాత సేవకు వెళ్లాలి.
శివ స్వామి:- నేను కూడా శ్రీశైలంలో మల్లన్న సుప్రభాత సేవకు అందుకోవాలి. వెళతాను…
శివ నందిని:- మీరు కూడా రావచ్చు కదా! నాకు శివ స్వామి:- ఇద్దరు శివుళ్ళు లేరు…ఒక్కడే శివుడు ఉన్నాడు… ఎక్కడైనా శివుడే. నీకు ఇక్కడ శివుడిగా కనపడుతున్నాడు. నాకు అక్కడ శివుడుగా కనబడుతున్నాడు. నేను అక్కడికి వెళ్లి చూస్తేనే నాకు సంతృప్తి, ఆనందం. ఇక్కడ నువ్వు చూసుకుంటే ఆనందం…
శివ నందిని:- మీరు అర్థం కారు…. మీరు పట్టిందే పట్టు…
శివ స్వామి:- వెళ్ళొస్తాను దేవి! జాగ్రత్త…
అనేసరికి శివ స్వామి కాస్త అదృశ్యం అవ్వడం జరిగింది. సరే అని శివ నందిని కాస్త చుట్టూ చూసేసరికి పిల్లలు, రుద్ర స్వామి స్నానాదికాలు చేస్తున్నట్టు కనిపించే సరికి…. శివ నందిని కూడా లేచి స్నానాదికాలు చేసుకొని…. సుప్రభాత సేవకు బయలుదేరడం జరిగింది. సుప్రభాత సేవ కార్యక్రమాలు పూర్తి చేసుకునేసరికి… ఏడు గంటలు అయ్యిందని శివ నందిని ధ్యానంలో కూర్చోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ధ్యానములో ఉండడం జరిగింది.
ఒకరోజు శివనందిని యధావిధిగా ధ్యానం చేసుకుందామని గుడికి వెళుతూ ఉండగా రుద్రస్వామిని అడిగితే నాకు ఈరోజు గుడికి వచ్చే ఆసక్తి లేదు. నది ఒడ్డున ఇక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంటాను అనేసరికి…. పిల్లల్ని అడిగేసరికి పిల్లలు కూడా మేము రాము ఇక్కడే ఆడుకుంటాము అంటే….. ఒంటరిగా శివ నందిని మహా కాలుని గుడికి వెళ్ళటం జరిగింది. అనుకోని ప్రమాదం అన్నట్టుగా…. ఒక ఆగంతుకుడు ముసుగు వేసుకొని శివ నందిని వెంటపడ్డాడు. అతని చేతిలో పదునైన కత్తి ఉంది. తనని చంపడానికి వస్తున్నాడు అని చెప్పి శివ నందిని గ్రహించి కొంత దూరం పరిగెత్తింది. ఆ తర్వాత ఏముందిలే కృష్ణస్వామి అయ్యుంటాడు… తన మాయ శక్తితో మరణ భయం కలిగించాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి…. ఆగంతకుడిని దగ్గరకు రానిచ్చి…. అతనితో నువ్వు కృష్ణస్వామి అని అర్థమైంది గానీ… ముసుగు తీయి అనేసరికి…. అతను ముసుకు తీయగానే అతను కృష్ణస్వామి కాదని….ఎవరో తెలియని వ్యక్తి అని తెలిసి శివ నందినిలో మరణమయం మొదలైంది. ఇప్పుడు పొడుస్తాడా అనుకుంటూ ఉండేసరికి…. అతను కత్తితో పొడవబోతూ ఉండగా… లాఘవంగా తప్పించుకొని శివ నందిని పరిగెత్తడం జరిగింది. రక్షించండి…. రక్షించండి…. అని చెప్పి అరుస్తున్నా కూడా ఆ చుట్టూ ఉన్నవాళ్లు చోద్యం చూసినట్టు చూస్తున్నారు గాని…. ఈమెను రక్షించడానికి ఒక్కరు కూడా రాకపోయేసరికి… శివ నందిని కి భయంతో పాటు ఆశ్చర్యం వేసింది. అంటే ఈ అఘంతకుడు ఎవరో ప్రేతాత్మ అయి ఉంటాడు. ఈమెకి తప్ప ఎవరికీ కనిపించట్లేదు అని శివ నందిని గ్రహించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏముంది..! మహాకాలున్ని , కాలభైరవునికో నరబలి ఇచ్చి ఉంటారు. తంత్ర పూజలో తేడా వచ్చి ఉంటుంది. అందుకని మతిస్థిమితం జరిగి తన వెంట ఎవరో పడుతున్నారు…రక్షించండి, రక్షించండి , అని అరుస్తుంది. నిజానికి ఎవరు పడట్లేదు కదా! అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోసాగారు. విషయం గమనించి గుడి లోపలికి వెళితే ఆ ఆగంతకుడు రాడేమో అని… గుడిలోకి పరిగెత్తింది. కానీ గుడి లోపలికి కూడా ఈ ఆగంతకుడు వచ్చేసరికి….. కత్తితో వెంటపడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో… గుడి ప్రాకారాన్ని దాటి పట్టణ వీధులన్నీ దాటుకుంటూ వస్తున్నప్పటికీ…. కూడా ఆగంతకుడు తన వెంట పడుతున్నప్పటికీ రుద్రస్వామిని, శివ స్వామిని, మహా కాలుని తలుచుకున్న ఎలాంటి ఉపయోగం లేకపోయేసరికి…. తనకి అర్థం కాక అయోమయ పరిస్థితిలో తన డేరా కి వేసి పరిగెత్తడం జరిగింది. అక్కడే ఇసుక తిన్నెల మీద కూడా తను వస్తూ ఉండేసరికి….నిద్రలో ఉన్న రుద్ర స్వామిని చూస్తూ అయ్యా! ఎవరో నా వెంటపడుతున్నారు. తరుముకొస్తున్నారు. రక్షించు… రక్షించు… అనేసరికి రుద్ర స్వామి కాస్త మేల్కొని చూస్తే…. ఒక యమదూత ఆగంతకుడి రూపంలో శివ నందిని వెంటపడుతున్నాడని గ్రహించి….నువ్వు భయపడకు అమ్మ! ఎదురు తిరుగు… పొడిస్తే పొడుస్తాడు… చస్తే చస్తావు….దాని గురించి ఎందుకు ఇది అవుతావు… అతను యమదూత, యమకింకరుడు. ఈ రూపంలో వచ్చాడు అనేసరికి….అవునా ! అని చెప్పి ఏం చేయమంటావ్? అంటే చస్తే చస్తావు, పొడిస్తే పొడుస్తాడు అనేసరికి… ఇక వెనక రుద్ర స్వామి ఉన్నాడని…. మనో ధైర్యంతో ఇక భయపడటం పరిగెత్తడం ఆపేసి…. ఆగంతకుడికి ఎదురుగా నిలబడే సరికి కొన్ని క్షణాలు తట పటాయించాడు. కత్తితో పొడవాలని…. పొడిచే ప్రయత్నం చేసేసరికి…..తన శరీరానికి ఎలాంటి గాయం కాకపోయేసరికి….. వాడు మనిషి కాదని, ప్రేతాత్మ అని గ్రహించడానికి శివ నందిని కి అట్టే సమయం పట్టలేదు. దానితో మనోధైర్యం వచ్చి ఆగంతకుడి ముందు అడుగులు వేస్తూ ఉండేసరికి…ఆ ప్రేతాత్మ కాస్త వెనక్కి అడుగులు వేయడంతో… నువ్వు నా దగ్గరికి రాకు, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపితే గాని నాకు ఆత్మ శాంతి కలగదు. నిన్ను చంపాలి అని అంటూ ఉండేసరికి… నన్ను చంపడమేమిటిరా! అసలు నీకు నాకు సంబంధం ఏమిటి? ఒక ఆత్మవై ఉండి ,పిశాచంగా ఉండి, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావ్? అసలు ఎవరివి రా! నువ్వు, అనేసరికి నేను నీ వాయు శరీరాన్ని అనేసరికి…. ఆ మాట విని రుద్రస్వామి, శివ నందిని ఆశ్చర్య ఆనందాలకి లోనయ్యి నువ్వు నా వాయ శరీరం ఏమిటి? నాకు స్త్రీ శరీరం కదా ఉండాల్సింది…. అంటే కొన్ని జన్మలు స్త్రీ జన్మలు ఉంటాయి. కొన్ని జన్మలు పురుష జన్మలు ఉంటాయి అని లో గొంతుతో రుద్ర స్వామి అనేసరికి… వీడు నిజంగానే నా వాయు శరీరమా! లేకపోతే కృష్ణస్వామి లీలా విన్యాసమా అని అనేసరికి వాడు నీ వాయు శరీరం అంటున్నాడు కదా! వాడి బాధ ఏంటో తెలుసుకో..! అనేసరికి వాడు కాస్త కత్తిని తన లోపల పెట్టుకుని నీవల్లే నాకు చావు వచ్చింది… అనేసరికి నా వల్ల నీకు చావు రావడం ఏమిటి? అసలు నువ్వు ఎవరు? అనేసరికి పద నీకు విషయం చూపిస్తాను అని శివ నందిని తనని అనుసరించమని చెప్పేసరికి వీళ్లిద్దరూ, పిల్లలు కూడా అందరూ కలిసి ఈ ప్రేతాత్మ అదే శివ నందిని వాయు శరీరం వెంట వెళ్లడం జరిగింది. కొంత దూరం వెళ్లిన తరువాత మహకాలుని ఆలయానికి కొంత దూరంలో పాడుపడిన ఇంటికి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆ పాడుపడిన ఇంటిని చూస్తూ బాలగణపతి అమ్మ ఏంటి? నీ శరీరాలన్ని కూడా పాడుబడ్డ ఇళ్లలోనే ఆవాసం చేస్తున్నాయా? వీటిని కూడా దహనం చేయాలేమో చూడు… అనేసరికి బాల కుమారస్వామి కాస్త ఊరుకోరా! అమ్మ అసలే చావు భయంలో ఉంది. ఇప్పుడు కొట్టినా కొడుతుంది… కోపంలో ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనేసరికి…. రుద్ర స్వామి కాస్త మాట్లాడకుండా…. మౌనంగా ఉండమని…. సైగ చేసేసరికి….పిల్లలిద్దరూ కూడా మౌనంగా ఉంటూ వీళ్ళని అనుసరించడం జరిగింది. యధావిధిగా వాయుశరీరం లోపలికి వెళ్లిపోయేసరికి…. వీళ్ళు తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్లడం జరిగింది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు మగవాళ్ళ శవాలు ఒక ఆడపిల్ల శవము కనిపించింది. ఆడపిల్ల శవం తన పోలికలతో ఉన్నట్టుగా కనిపించింది. ఏం జరిగిందా అనుకునేసరికి…ప్రేత శరీరం కాస్త ఏడుస్తూ…
ప్రేత శరీరం:- ఇక్కడ మనం ఇద్దరం వివాహం చేసుకున్నాము. ఇది నీ అత్తగారి ఇల్లు…అక్కడ ఉన్న శరీరాన్ని చూసావా?
శివ నందిని:- అవును… అది నా పోలికలతోనే ఉంది.
ప్రేత శరీరం:- అప్పుడు విషయం చెప్పడం జరిగింది. మనం ఇద్దరం బావ మరదళ్లం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళం. నామీద నీకు అమితమైన ప్రేమ ఉండేసరికి…. మన ఇద్దరికి వివాహం చేయడం జరిగింది. వివాహం అయిన తరువాత మనము సుఖ సంసారంతో జీవనం సాగిస్తూ ఉండేసరికి…. నీకు విపరీతమైన కామపిశాచి పట్టుకున్నట్టుగా…. కామంతో ఉంటూ…. ఎప్పుడూ కామమే కావాలని అనుకునే దానివి. కామంలో కూడా దాదాపు గంటలు గంటలు ఉండాల్సి వచ్చేది. ఒకసారి శృంగార క్రీడలు మొదలు పెడితే దాదాపు ఏడు ఎనిమిది గంటలు ఆపకుండా శృంగారం చేసేదానివి. నీకు అంత కామపిచ్చి ఉండేది. కానీ నాకు అంత కామాశక్తి ఉండేది కాదు. నువ్వు ఎక్కడ పరపురుషుడు వెంట పడతావో అనే భయంతో నాకు ఇష్టం లేకపోయినా….నాకు ఓపిక లేకపోయినా…. ఆయుర్వేదం మందులు వేసుకుంటూ శృంగారం చేసేవాడిని. రాను రాను నాకు శృంగారం అంటే ఒక విధమైన వైరాగ్యం, అసహ్యం కలగడం ఆరంభించింది. కానీ రాను రాను నీకు కామాశక్తి విపరీతంగా పెరిగిపోవడం…. నేను తట్టుకోలేని కామాశక్తి ,కామోద్రేకాలు నీలో పెరగటం రోజురోజుకి రెండింతలు అవ్వడం జరిగేది. నువ్వు ఒకసారి శృంగారంలో పాల్గొంటే…. మూడు రోజుల పాటు అందులో ఉండే స్థితికి రావడం జరిగింది. కానీ నాకు ఆచార వ్యవహారాల వలన ఉద్యోగ ధర్మం వలన సుఖపెట్టక పోయేసరికి నువ్వు పర పురుషుల వెంటపడటం జరిగింది. మొదట వీడు ఉన్నాడు చూసావా..! వీడి వెంట పడడం జరిగింది. వీడు ఒక సేటు కొడుకు. వీడు నీకు ధన ఆశ చూపించి లోబరుచుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా నీ కామం తీరకపోయేది. అతడు కొన్ని గంటలు మాత్రమే ఇచ్చి సంతృప్తి చెందిన తర్వాత అతనికి సంబంధించిన చుట్టాలబ్బాయితో ఇతనే, ఇతనిని కూడా నువ్వు లోబరుచుకోవడం జరిగింది. నీ అందచందాలకు అతను లోబడి నీ కామమును తీర్చలేకపోయాడు. ఇలా మా ముగ్గురితో ఒకరికి తెలియకుండా ఒకళ్ళకి ఒకళ్లతో సంసార సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ… కూడా నీకున్న కామోద్రి కాలు తగ్గించుకోలేకపోయేసరికి దద్దమ్మల కింద మమ్మల్ని లెక్కకట్టడం మొదలుపెట్టావు. కామోద్రేకాన్ని తగ్గించలేదు అని మా ముగ్గురిని కూడా నన్నేమో కత్తితో పొడిచి చంపడం…. మరొకరిని విషం ఇచ్చి చంపడం…. మరొకరిని కావాలని పాముకాటుతో చంపించి…. మా ముగ్గురి పీడను వదిలించుకోవడం జరిగింది. కానీ మాకు నువ్వు చేసిన తప్పులు మా ముగ్గురితో కలిసి శృంగారం చేసినవి చివరి కాలంలో తెలియటంతో నిన్ను ఎలాగైనా చంపాలి అని అనుకున్న సమయంలో…. నువ్వు మా ముగ్గురిని ఈ విధంగా చంపడం జరిగింది. ఇలా అర్ధాంతరంగా చంపడం జరిగింది. కానీ మా కోరిక అలా మిగిలిపోవటంతో మా ఆత్మలు ప్రేతాత్మలుగా నీ వెంటపడడం జరిగింది. నీకు నది ఒడ్డున శృంగార భంగిమలో శృంగార ప్రయత్నం చేసింది వీడు….
అని అతని చూపించేసరికి తనకి స్వప్నంలో కనిపించిన అతని నీడ పోలికలు ఒకేలా ఉన్నాయని శివ నందిని గ్రహించింది… నేను నీ వెంట పడి చంపాలి అనుకున్నాను. వాడు మరుజన్మలో నీకు పూలమాల ఇచ్చిన ఆమె లాగా పుట్టడం జరిగింది. ఆ స్త్రీ యొక్క పోలికలు ఇతనిలో ఉన్నాయి చూడు…. అని చూపించేసరికి అతని పోలికలు ఆమెకు పూలమాల ఇచ్చిన ఆమె పోలికలు ఉండేసరికి కూడా నిన్ను చంపాలని నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాము అని అనేసరికి….శివ నందిని ఇతను చెప్పింది నిజమా కాదా అని ధ్యానంలో చూసేసరికి…. ధ్యానంలో తను చేసిన శృంగార లీలలు….తనకున్న కామపిశాచి అవన్నీ కూడా కనిపించేసరికి వాళ్ల యొక్క చావును చూపించడంతో…. తనకి చావు భయం చూపించారు అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.
శివ నందిని:- ఇప్పుడు ఏం చేయమంటావు?
ప్రేత శరీరం:- నువ్వు చావాలి… నువ్వు చస్తే గాని మాకు కోరిక తీరదు..
రుద్రస్వామి:- తనకున్న కామోద్రేకంతో తెలిసో తెలియకో తప్పు చేసింది. ఆ తప్పు నుండి తన కోరికను సంతృప్తి కలిగించట్లేదు అని ఆవేశానికి గురి అయ్యింది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. మీకోసం అని ఇప్పుడు ఈ అమ్మాయి చావు కోరితే ఎలాగా? అప్పుడే ఆ అమ్మాయిని చంపేసి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఆమె పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి సాధన చేసుకోవడానికి వచ్చింది. తన వాయు శరీరమైన మీ శరీరం శుద్ధి చేసుకోవడానికి ఈ క్షేత్రానికి రావడం జరిగింది. అనుకోకుండా చావు భయం, పాతివ్రత్య దీక్ష కోల్పోతున్నాను అని గత ఆరు నెలల నుంచి తను ఇబ్బంది పడుతుంది. దాని గురించి ఆలోచించండి…తన ప్రాయశ్చిత్తం తను చేసుకున్నానని తన పశ్చాత్తాపం తాను పడింది దానికి మించిన శిక్ష ఇంకేం ఉంటుంది..
ప్రేత శరీరం:- ఈ ముగ్గురిని కూడా క్షమాపణలు కోరుకుంటే సరిపోతుంది. తనకి అప్పుడు ఉన్న కామాశక్తి ఇప్పుడు తనలో లేకుండా పోయింది. కామోద్రేకాలు నశించాయని అర్థమయింది. ఈ జన్మలో కూడా ఇలా తప్పుదారులు పట్టదని గ్రహించడం జరిగింది.. మా ప్రేత శరీరాలకి దహన సంస్కారాలు చేసేయండి….
అనేసరికి ఇక రుద్ర స్వామి కాస్త ఆ ఏర్పాట్లు చేయడంతో…. ఆ ప్రేత శరీరాలను దహనం చేసేసరికి వాయు శరీరం కాస్త శివ నందిని అనాహతా చక్రంలోనికి…. ఆత్మ శక్తి స్వరూపంగా ప్రవేశిస్తూ…. శివ నందిని కేసి చూస్తూ….. నాకు పూర్ణ మోక్షం నీ ద్వారా కలిగేటట్టు చెయ్యి… ఆ కోరికను తీర్చు…. అనేసరికి సరే నా వంతు నేను సాధన చేస్తూ ఉంటాను. నా సాధన పరిసమాప్తి అయితేనే…. నీకు వ్యక్తిగత మోక్షం వస్తుంది. అప్పటిదాకా నువ్వు నాలో ఉండు అని శివ నందిని అనేసరికి….. వాయు శరీరం కాస్త అనాహతా చక్రం లోనికి ప్రవేశించేసరికి….. ధ్యాననిష్ఠలోకి వెళ్లిపోవడం…. అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. మిగిలిన భౌతిక శరీరాలు అన్నింటిని దహనం చేసే పనిలో రుద్ర స్వామి ఉన్నాడు. ఆ తర్వాత శివనందినికి ఉన్నట్టుండి యోగమాత్తు ఆవరిస్తూ ఉండి….కాళికామాత సజీవ మూర్తిగా కనిపిస్తూ…. తన మీద త్రిశూలంతో దాడి చేస్తున్నట్లుగా…. కనిపిస్తూ కత్తితో తలనరుకుతున్నట్టుగాను అనిపిస్తూ ఉండేసరికి …..ధ్యాన భంగమై రుద్ర స్వామికి అదే విషయం చెప్పేసరికి….
రుద్రస్వామి:- ఏముందమ్మా! నీలో ఉన్న కామపిశాచ భయమును, కామ గుణమును ఆమె దాటించి వేసింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు..
అంటూ ఉండేసరికి ఈ లోపల రుద్ర స్వామి కాస్త శవ దహనం అక్కడే చేయడం జరిగింది. ఆ బూడిదను ఒక క్షిప్రా నదిలో కలపాలి అని చెప్పేసి…. ఒక మూట కట్టడం జరిగింది. అప్పుడు వాయు శరీరం బూడిదను కాస్త ఆ అఘోర సాధువుకి అందచేస్తే….. తెల్లవారుజామున చితా భస్మం అభిషేకానికి వాడడం జరుగుతుంది…. అనేసరికి సరే వీళ్ళ కోరికను ఎందుకు కాదనాలి అనుకుని…. ఆలయ అఘోరి దగ్గరికి ఈ బూడిదని ఇచ్చే పనిలో పిల్లలను తీసుకొని వెళ్ళటం జరిగింది. ఏకాంతంగా ఒంటరిగా శివ నందిని ఆ ఇంట్లో ఉండిపోయి ధ్యాన నిష్ట లో ఉండడం జరిగింది. ఆ విధంగా ధ్యాననిష్టలో ఉండేసరికి శివనందినికి మళ్ళీ యధావిధిగా మహాకాళికా స్వరూపం సజీవంగా కనబడుతూ ఉండేసరికి….. తనకి అర్థం కాలేదు. ఏదో చెప్పాలని అనుకుంటుంది అని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఉన్నట్టుండి సజీవ మూర్తిగా కనిపించే మహాకాళి కాస్త ఒక మూడు అంగుళాల మహాకాళి బంగారపు విగ్రహంగా కనిపిస్తూ ఉండేసరికి…. ఇది ఎక్కడ ఉంది…. ఎలా కనపడుతుంది అని అనుకునేసరికి…. ఆ ఇంటిలోనే ఒక భూ గృహంలో ఉన్నట్టుగా అనిపించేసరికి….. తన వాయు శరీరం కాస్త బయటకు వచ్చి నీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ…. నేను కాళీ ఉపాసకుడిని నిజానికి నా తంత్రసాధనలో నిన్ను కాళికాదేవికి బలి ఇవ్వాలి. ఆ సమయానికి మా ముగ్గురిని నువ్వు బలి ఇవ్వడం జరిగింది. దానితో కాళికామాత సంతృప్తి చెంది నీకు ప్రసన్నం అయ్యి మాట్లాడే విగ్రహ మూర్తిగా మారడం జరిగింది. నువ్వు ఆ విగ్రహం మూర్తిని తంత్ర విధానంలో ఆరాధన చేయడం జరిగింది. ఆ విగ్రహ మూర్తి భూగృహంలోనే ఉంది చూపిస్తాను. దా…. అనుకుంటూ గోడ గదులు తలుపులు తీయమనటంతో….. ఆ గోడ గది తలుపు తీసేసరికి లోపలికి గదిలో నుంచి భూగృహం తలుపు తీయమని చెప్పడంతో….. ఆ తలుపు తీసి మెట్లు ఉన్న గదిలోకి వెళ్తూ ఉండేసరికి…. ఒక మూడు అంగుళాల ఉన్న దివ్య కాంతితో మెరిసిపోతున్న . కాళిక విగ్రహ మూర్తి కనపడటం….వెండి దీపాల వెలుగులు కనపడటం….. ఆ తర్వాత తను ఎదురుగా కూర్చుని ధ్యానం చేసుకునే పీఠం ఉండటం….. కనిపించేసరికి తను ఇంతకుముందు జన్మలో ఇక్కడ సాధన చేసుకుంటూ ఉండేసరికి…. ఆ విగ్రహ మూర్తి కూడా దివ్య కాంతితో కాళికామాత లీలా మూర్తిగా కనిపించేసరికి…. శివ నందిని కాస్త నమస్కారం చేసుకొని….. చూస్తూ ఉండగా… విగ్రహ మూర్తి నుంచి ….అమ్మ! నువ్వు నా అనుగ్రహం పొందావు. నువ్వు నా గత జన్మ భక్తురాలివి. నీకున్న అమిత కామాన్ని జయించావు. తద్వారా వచ్చిన చావు భయంను కూడా దాటావు. మృత్యువు నీకు ఇష్టకామ్యంగా వస్తుంది. నీవు కోరినప్పుడే నీకు మృత్యువు వస్తుంది. మృత్యువు నీ చేతుల్లోనే ఉంటుంది. నీకు ఈ వరమును ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతర్దానం అయ్యేసరికి…. ఆ కాళికా విగ్రహం తీసుకుంది. తిరిగి వాయు శరీరం తనలో నిక్షిప్తం అయింది. ఆ విగ్రహ మూర్తిని తీసుకొని ఇంటి బయటకు రావడంతో …..రుద్ర స్వామి కూడా తన పని పూర్తిచేసుకుని రావటంతో ఇక అందరూ కలిసి గుడికి వెళ్లడం జరిగింది.
శివ నందిని కాస్త వాయుముద్రతో ధ్యానం చేస్తూ ఉండేసరికి…. తన శరీరం కాస్త గాలిలోకి నెమ్మదిగా లేస్తూ ఉండేసరికి…. సుమారు ఇలా 21 అడుగులు గాలిలోకి లేచేసరికి…. ఆమెకి గాలి మీద ఆధిపత్యం వచ్చిందని ఆకాశానికి, భూమికి ఆకర్షణకి మధ్యలో వాయు మార్గంలో తను సంచారం చేసే స్థితికి వచ్చిందని చెప్పేసి శివ నందిని అనుకుంటూ ఉండేసరికి….. తనకి ఈ చక్రం ఆధీనం అయ్యింది అనుకుంటూ ఉండగా….. కొన్ని లక్షణాలు భావాలు మొదలయ్యాయి. ఎవరూ గమనించట్లేదని తెలుసుకొని తన మళ్ళీ యధాస్థితికి భూమి మీదకి రావడం జరిగింది. ఇదే విషయాన్ని రుద్రస్వామిని అడగగా…..
రుద్రస్వామి:- అమ్మా!
అనాహత అధీన లక్షణాలు:-
అనాహత అధీనము కోసము సాధకుడు తనలోంచి ఆగని శబ్ద నాదం వినపడును!ఈ నాదమును వినుట కోసము సాధకుడు ప్రయత్నాలు చేస్తే… కాళ్లు, చేతులు, తిమ్మిరులు ఎక్కి, స్పృహ జ్ఞానమును కోల్పోతారు! అప్పుడు సాధకునికి ధ్యానసమయమందు అనాహత చక్ర ఆకృతి, వీటి రంగు, వీటి బీజాక్షరాలు కనపడును! అప్పుడు కొన్నాళ్లకు ఈ చక్రదేవత అయిన ఈశ్వరుడు కనపడును! అప్పుడు ఈ చక్రము అధీనమగును!అంతే కాకుండా … ప్రేతాత్మ దర్శనాలు, మృత్యు భయం కలుగుతాయి. వీటిని చూసి సాధకుడు భయపడకూడదు. ఇది ఎటువంటి హాని చేయవు. ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయి.
అనాహత చక్ర బలహీనం అయినప్పుడు కలిగే లక్షణాలు:-
అనాహత చక్రం బలహీన పడినప్పుడు గుండెకి సంబంధించిన వ్యాధులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులు, వణుకు, బిపీలు, ఉద్రేకాలు, కలుగుతాయి. అలాగే మనోవికారాలు కలుగుతాయి. అలాగే ఊపిరితిత్తులు ఆహారనాళం, రక్తప్రసరణకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సాధకుడు ఈ చక్రంలో ఉన్నప్పుడు పాజిటివ్ మరియు నెగటివ్ ఆలోచనలను కలిగి ఉంటాడు. ఇక సంసారిక విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు మరియు సాంఘిక పరమైన ఒత్తిడి లను తట్టుకోలేనప్పుడు ఈ చక్రం బలహీన పడును. అలాగే ఉబ్బసం, మానసికంగా కృంగిపోవటం, మానసిక వికలత్వం, కలిగి ఉండటం, తీరని కోరికలు కలిగి ఉంటారు. మరి కొంతమంది అయితే ఎన్ని కష్టాలు కలిగిన బయటి వారికి తెలియనివ్వకుండా తమలో తామే మనసులో బాధపడుతూ ఉంటారు. పైకి అందరితోనూ నవ్వుతూనే మాట్లాడతారు. అలాగే ఇలాంటి వారికి గొడవలు, పోట్లాటలు, తర్కాలు వీరికి నచ్చవు. మరికొందరిలో అయితే తమ కష్టాలను మర్చిపోవడానికి ఎప్పుడూ స్నేహితుల, సన్నిహితుల, బంధువుల మధ్య కాలం గడుపుతారు. అలాగే సినిమాలు , సంగీత విషయాల యందు ఆసక్తిని కనపరుస్తారు. వీరు ఎక్కువగా శబ్దాలు వినటకు ఇష్టపడతారు. మరికొందరిలో అయితే రాగద్వేషాలు, అసూయ, ఓర్వలేని తనం, అనుమానించే గుణాలు చాలా హెచ్చుగా కనపడతాయి. అలాగే విపరీతమైన మానసిక ఉద్రేగాలకు గురి అవుతూ ఉంటారు. ఈ చక్రమునకు బలం చేకూర్చుటకు నాడీ శోధన ప్రాణాయామం, అజప జపం చేయాలి. అలాగే వజ్రాసనం ఉష్ట్రాసనములను వేయాలి. అలాగే ధ్యానమునందు మనం పీల్చే గాలి అనాహత చక్రంలోనికి ప్రవేశించి దానికి బలం చేకూరుతున్నట్లుగా భావనలు చేస్తూ ధ్యానం చేయాలి. లేదంటే ఈ చక్రమునకు సంబంధించిన “యం”అనే బీజాక్షరమును జపిస్తూ అరగంటసేపు ప్రతిరోజు చేయాలి. లేదంటే ధ్యానమునందు వివిధ రకాల స్పర్సలను అనుభవిస్తున్నట్లుగా భావనలు చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు అరగంటసేపు ఆరు నెలల పాటు చేస్తే ఈ చక్రమునకు బలం చేకూరును..
ఇలా భూచర సిద్ది వలన గాలిలో ఒక అడుగు దూరంలో తేలే సిద్ధి వస్తే, వాయు సిద్ది వలన తను భూ ఆకర్షణకి వ్యతిరేకంగా 21 అడుగులు దాకా ఆకాశంలో తను సంచారం చేసే అవకాశం ఉంటుందని శివ నందిని గ్రహించింది. ఆ విధంగా వాయు గమన సిద్ధి కలిగినప్పటికీ…. ఏదో తెలియని ఆనందం సంతోషం కలిగింది. ఇలాంటి ఆనంద స్థితిలో ఉండేసరికి ఎవరో తన వెనుక ఉండి తన మెడకి ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉండేసరికి…. తనకి ఇంకా రుద్ర పిశాచాలా పీడ వదలలేదా? తను మరణ భయం దాటాను అని రుద్ర స్వామి చెప్పినా…. కూడా ఈ రుద్రపిశాచాల గోల ఏమిటి అనుకునేసరికి వచ్చింది రుద్రపిశాచం కాదని ….కృష్ణస్వామి అని….. కృష్ణస్వామి తనని చంపడానికి తాడుతో మెడకి బిగబట్టి పెట్టాడని అనుకునేసరికి….శివనందిని కాస్త వాయువేగంతో గాలిలోకి లేవటం….. తనకి వచ్చిన వాయుసిద్ది ద్వారా గాలిలోకి 21 అడుగులు లేచేసి తనకి వచ్చిన లఘిమ సిద్ధి ద్వారా శరీరమును భారీగా పెంచేసరికి….. తాడు చిన్న ముక్కలాగా కనిపించింది. కంఠం తాడిబొంది లాగా కనిపించింది. ఈమెకి వచ్చిన సిద్దులకు కృష్ణస్వామి కాస్త భయపడిపోయి…. అదృశ్యం అవడం జరిగింది. తనని ఎవరైనా గమనిస్తున్నారేమో అని ఆలోచన రావడంతో….. మళ్లీ యధాస్థితికి వచ్చి ధ్యానంలో కూర్చుంది. ఇంతలో ధ్యానం చేస్తూ చేస్తూ మూడు గంటలు అయ్యేసరికి… ఒక ఆవిడ వచ్చి తనకి ఆహారం ఇవ్వబోతుంటే…. ఉచితంగా ఆహారం తీసుకోని తల్లి…. అంటే లేదమ్మా! ఇది ఇంట్లో వండిన నైవేద్యం…. అమ్మవారికి నైవేద్యం పెట్టాను, నీకెందుకో పెట్టాలనిపిస్తుంది….ఇది దైవ ప్రసాదం కాదు…. ఉచిత ప్రసాదము కాదు…. ఇక్కడ మహాకాలుడికి పెట్టిన నైవేద్యమును ఏ దేవతా మూర్తికి అయినా నైవేద్యంగా పెట్టవచ్చును….అని ఒక నియమం ఉంది అంటే….అవును దాని గురించి నేను విన్నాను….. అంటే నువ్వు సాధన చేస్తున్నావు, సాధనలో నీలో మహాకాళిక అంశ కనపడుతుంది. నేను కూడా కాళికాదేవి ఉపాసకురాలిని..ఏదో కొద్దో గొప్ప ఉపాసన పొందిన దానిని ….నీలో కూడా అమ్మవారు కనిపించేసరికి నీకు కూడా ప్రసాదం పెట్టాలనిపించింది అనేసరికి…..సరే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి నాలో కాళికా అమ్మవారిని చూస్తున్నావు కదా! అని చెప్పేసి తను ప్రసాదం తింటూ ఉండేసరికి….ఆ స్త్రీ మూర్తి కాస్త యోగాంబికగా మారి
యోగాంబిక:- ఒసేయ్ పిచ్చిదానా! నేను కాళిక భక్తురాలిని కాదే….కాళిక అంశనే పొందిన దాన్నే. నువ్వు నన్ను గమనించలేదా? తెలుసుకోలేకపోయావా? నిన్ను కాస్త పొగిడేసరికి ఎవరు ఏం పెట్టిన తినేస్తావా? అది విషం కలిపిన ఆహారం…..
(అనేసరికి నోట్లో నుంచి నురగలు వస్తూ ఉండగా….. స్పృహ తప్పే పరిస్థితుల్లో ఉండేసరికి….)
ఇక నువ్వు చచ్చావు…. నీకు మరణమే…. నేను చెప్పానుగా…
అని చెప్పేసి ఆమె అదృశ్యం అవుతూ ఉండేసరికి రుద్ర స్వామికి ధ్యానంలో ఇదంతా కనిపించేసరికి…. శివ నందినికి విష ప్రయోగం జరిగింది అని గబగబా శివ నందిని ధ్యానం చేసుకునే చోటికి వచ్చేసరికి….. శివ నందిని నోటిలో నురగవస్తు ఉండేసరికి….. శివ నందిని శరీరం కాస్త నెమ్మదిగా నీలం రంగులోకి మారుతూ ఉండేసరికి…. అక్కడ ఉన్న భక్తులు కాస్త ఈమెకి విష ప్రయోగం జరిగి అన్నా జరిగి ఉండాలి…. కాకపోతే పాము కాటేసి ఉండాలి. గబగబా ఆసుపత్రికి తీసుకువెళ్లండి అనేసరికి… అక్కడ ఉన్న ఒక వైద్యుడు, ఇంక ఈ అమ్మాయి ఎక్కువ సమయం ఉండదు. విషం శరీరం అంతటా వ్యాపించి మెదడుకి కూడా చేరింది. మెదడుకి చేరే లోపల ఆ అమ్మాయికి ఏమైనా ఇంజక్షన్ చేస్తే బతికే అవకాశం ఉండేది. ఇంకో ఎనిమిది క్షణాలకు మించి ఈ అమ్మాయి బతకదు… చనిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి… వాళ్లకి సమాచారం ఇవ్వండి… ఈ అమ్మాయి శరీరం దహనం చేయటానికి తప్ప దేనికి పనికిరాదు అని ఆయుర్వేద వైద్యుడు అనేసరికి…. ఎవరికి ఏమి చేయాలో అర్థం కాక అందరూ మినుకుండిపోయారు. రుద్ర స్వామి అక్కడికి గబగబా వెళ్లేసరికి…. అక్కడ ఉన్నవాళ్లు విషయం చెప్పేసరికి…. ఇంక అమ్మాయి ఆహారం తిన్న తర్వాతనే చనిపోయింది అని రుద్రస్వామికి అనిపించి…. ఆ ఆహారంలో విష ప్రయోగం జరిగిందని….అది యోగాంబిక చేసింది అని రుద్ర స్వామికి అర్ధమై….ఇక శివ నందిని చనిపోయిందేమో అని అనుకుంటూ ఉండేసరికి నిద్రలో లేచినట్టుగా శివ నందిని లేచేసరికి…
శివ నందిని:- ఏం జరిగిందయ్యా!
రుద్ర స్వామి:- నీ మీద విష ప్రయోగం జరిగింది…
అనేసరికి ధ్యానంలో కూర్చునేసరికి యోగాంబిక చేసిన విష ప్రయోగం అంతా ధ్యానంలో కనిపించేసరికి….. తనలో ఉన్న విషం కాస్త నెమ్మదిగా భూమి లోపలికి ప్రవేశించడం రుద్ర స్వామి గ్రహించాడు. ఎందుకంటే తనకి మృత్యువు మీద ఆధిపత్యం వచ్చింది. తను చావాలనుకున్నప్పుడే తనకి చావు వస్తుందని మహాకాళిక వరం ఇవ్వటం జరిగింది. తన కంఠంలో విషం చేరి, శివుడి కంఠం నీలంగా మారినట్టుగా శివ నందిని కంఠం మధ్యభాగంలోకి విషం చేరడం రుద్ర స్వామి గమనించాడు. అక్కడ చిన్న నీలిరంగు మచ్చగా కనిపించి కనిపించకపోవడంతో శివ నందిని కాస్త
శివ నందిని:- అయ్యా! ప్రస్తుతానికి నేను మృత్యువుని ఆపగలిగాను. మృత్యువు అనేది విషం వల్లే వస్తుంది. ఎందుకంటే మనో శరీరం విష గాలుల మధ్యలోనే ఉంటుంది అని పరమహంస గారు చెప్పారు కదా! ఈ విషం వల్లనే మనకి మహా మృత్యువు వస్తుంది. ఇంక ఏం జరుగుతుందో కాలానికే వదిలేద్దాం. ఆ విషమును నేను కంఠంలో ధరించడం జరిగింది. ఎప్పుడైతే నేను ఇచ్చా మరణ సిద్ది వలన మరణం కావాలనుకుంటానో …..ఆనాడు నిక్షిప్తం చేసుకున్న ఈ విషం కాస్త విభేదనం అయ్యి శరీరం అంతటా పాకి మహ మృత్యువు రూపంలో రావడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ విషయం నన్ను ఏమీ చేయదు ….పాము కోరల్లో విషం ఉన్నప్పటికీ, ఎలా పామును ఏమీ చేయదో….. అలా ఈ విషం కూడా నన్ను ఏమీ చేయదు..
అనేసరికి….అక్కడి వాళ్లకి వీళ్ళ మాటలు అర్థం అయ్యి కానట్టుగా ఉండేసరికి అమ్మాయి తనకి ఉన్న విషాన్ని అరాయించేసుకుంది…..ఏదో వనమూలికా రసం తాగిందట…. దీనివల్ల పాము కాటు విషం పనిచేయదు అని అనేసరికి….. సరే అని ఎవరికి వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. శివ నందిని కాస్త లేచి అయ్యా! మనం పిల్లలు తీసుకుని భోజనాలు కానించుకొని డేరాకి వెళ్ళిపోదాం…. అనేసరికి పిల్లల్ని పిలిచి అందరూ కూడా భోజనాలు చేసి డేరాకు వెళ్లడం జరిగింది.
ఎవరికి వారే పిల్లలేమో…. నడి ఒడ్డున ఆడుకుంటూ ఉండేసరికి…. వీళ్ళు కాస్త ఇసుక తిన్నెల మీద చాప వేసుకుని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు ఇద్దరు వచ్చి అమ్మ! నీకు ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం అయిపోయాయి కదా! మరి ఈ చక్రంలో ఉన్న శరీరం ఏమిటి ?అంటే వాయు శరీరం అనేసరికి…. మరి అది కూడా నీకు కనిపించి శుద్ధి చేసింది కదా! అనేసరికి బాల కుమారస్వామి చెప్పనే చెప్పాడు కదా! ఈ క్షేత్రంలోనే నీకు చక్ర శుద్ధి అవుతుంది. అలాగే ఈ చక్రంలో ఉన్న వాయు శరీరం కూడా శుద్ధి అవుతుంది అన్నాడు కదా! ఈ చక్ర జాగృతికి మహాకాళిక ఉపయోగపడితే….. శరీర జాగృతికి మహాకాలుడు ఉపయోగపడినట్టుగా ఉన్నాడు అనేసరికి…… మరి దానికి సంబంధించిన శివలింగం రావాలి కదా! శరీర జాగృతి అయినప్పుడు ఒక శివలింగం వస్తుంది కదా! అనేసరికి…..నిజానికి అది కూడా ఈ క్షేత్రమే కాబట్టి రావాలి అనేసరికి……. మరి అయితే అది నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఏ శివలింగం వస్తుంది అని అనేసరికి ….
రుద్రస్వామి:- ఏముందమ్మా? అమ్మ దగ్గర ఉన్న కాళికాదేవి విగ్రహ మూర్తిని తీసుకువెళ్లి సాధనా మూర్తి ఎడమ చేతి వైపు ఉన్న పద్మములో పెడితే అది ఎక్కడ ఉంది అనేది చెబుతాడు…
అనేసరికి సరే అని వీళ్ళు ఆ పనిలో ఉండేసరికి…. శివ నందిని కాస్త ధ్యానంలో ఉండటం జరిగింది. ధ్యాననిష్ట లో ఉండేసరికి తనకి ధ్యాన అనుభవంగా నల్లరాతి శివలింగం కనిపించడం మొదలైంది. కానీ ఆ ప్రదేశం ఎక్కడ అనేది అర్థం కాలేదు. ఆ ప్రదేశం కూడా కనిపించి కనిపించినట్టుగా ఉండేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి…. బాలగణపతి కాస్త కాళికాదేవి విగ్రహ మూర్తిని సాధనా విగ్రహ మూర్తి ఎడమవైపు ఉన్న పద్మములో పెట్టేసరికి విగ్రహ మూర్తిలో ఉన్న అనాహత చక్రం మూడుసార్లు దివ్యకాంతితో…..దివ్య తేజస్సుతో అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి అమ్మ! ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీనం అయిపోయాయి…. అనుకునేసరికి ఈ చక్రానికి వ్యతిరేకంగా వెనుక భాగంలో సాధనా విగ్రహ మూర్తి అనాహతా చక్ర ప్రాంతం నుంచి ఒక నల్ల శివలింగం ముద్ర బయటకు రావడంతో…. ఆ ముద్ర లోపలి నుంచి రాగి రేకు బయటకు రావడంతో….. తమ్ముడు !తమ్ముడు! నేను చదువుతాను ….నేను చదువుతాను….అని బాల కుమారస్వామి ఉత్సాహం చూపించేసరికి…. ఆ రాగి రేకును తీసి అందులో ఉన్న విషయాన్ని చదవటం ప్రారంభించాడు.
ఏ క్షేత్రంలో అయితే అనాహత చక్రం శుద్ధి అవుతుందో….. ఆ క్షేత్రంలోనే వాయు శరీరం కూడా శుద్ధి అవుతుంది. దీనికి వచ్చే నల్లరాతి శివలింగమును చూడటానికి అర్హత, యోగ్యత, యోగం ఉంటే రుద్ర లింగం ఆవాసం ఉన్న రుద్ర తీర్థమునందు మీకు కావలసిన శివలింగమూర్తి రుద్రమూర్తి కనపడటం జరుగుతుంది. రుద్ర మూర్తి దర్శనం కోసం, ఈ వాయు శరీర దహన చితా భస్మమును ఉపయోగించవలెను. అప్పుడే అడుగున ఉన్న రుద్ర మూర్తి పైకి వస్తాడు.
అని చెప్పేసరికి అప్పటికే ఎందుకైనా మంచిది అని రుద్రస్వామి ఒక పిడికెడు వాయు శరీరం దహన బూడిదను ఉంచిన చేతి సంచిని శివ నందిని ఇస్తూ….
రుద్రస్వామి:- ఎందుకైనా మంచిది అని నేను దాచి ఉంచాను తల్లి!
శివ నందిని:- మంచి పని చేశావయ్యా! అందుకే పెద్దలకి ముందుచూపు ఉంటుందని అంటారు. నీకు ముందుచూపు ఉండటం వలన ఇది చేశావు…. లేదంటే నేను ఇబ్బందుల్లో పడేదాన్ని.
పిల్లలంతా రోజు మనం స్నానం చేసే రుద్ర సాగర్ లో శివలింగం ఉన్నట్టు ఏమీ లేదు కదా! ఇక్కడేమో వస్తుంది అంటున్నారు…. ఎలా వస్తుందో చూద్దామా అంటే బహుశా ఈ చితా భస్మంతో….అందులో ఈ భస్మమును అందులో కలిపితే వస్తుందేమో ! అనేసరికి సరే అయితే అని అందరూ ఇక ఆ వింతను చూడటానికి బయలుదేరడం జరిగింది. రుద్ర సాగర్ తీర్థానికి చేరుకోవడం జరిగింది. మహాకాలుడిని స్మరిస్తూ చితా భస్మమును ఆ నీటిలో వేసి వేయంగానే నీళ్లు అన్నీ కూడా పక్క కి సుడులు తిరుగుతూ…. నీళ్లన్నీ కూడా పక్కకి దాటుతున్నట్టుగా ఒక మార్గంలాగా కనిపిస్తూ ఉండేసరికి….. రుద్రస్వామి కాస్త నేను లోపలికి దూకుతాను…. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేసరికి అయ్యా! అది నా వాయు శరీరం కాబట్టి నేను దూకాలేమో….. అనేసరికి అలా ఏమి ఉండదులే…..నేను దూకి తీసుకు వస్తాను అనేసరికి రుద్ర స్వామి కాస్త నీటి సుడిగుండం లోకి దూకడం జరిగింది.
సుడిగుండంలో దాదాపు 85 అడుగుల లోతు వెళ్లేసరికి….. లోపల ఒక భూ గృహం లాంటిది ఉందని తెలుసుకుని ఆ తలుపు తీసేసరికి…. లోపల ఉన్న మట్టిలోకి వెళ్లేసరికి లోపల నల్ల రాతితో ఒక శివలింగం కనిపించింది. సుమారు ఇది మూడు అడుగులు ఉన్న రాతి శివలింగం. ఈ శివలింగమును శివ నందిని వాయు శరీరం అర్చన చేసేది అని అర్థమయింది. అంటే భార్యాభర్తలుగా భర్త ఏమో శివలింగారాధన చేస్తే…. శివ నందిని భార్యగా ఉండి కాళి గా ఆరాధన చేసేది. తంత్ర ఆరాధన చేసేది. అందుకనే తనకి విపరీతమైన కామ కాంక్షలు, కామ ఆవేశాలు పొందింది అని ఈ శివలింగం తాకగానే విషయం అర్థం అయింది. ఈ మూడు అడుగుల శివలింగం కాస్త…. చేతితో తీసుకునేసరికి…. మూడు అంగుళాల నల్లరాతి శివలింగంగా స్పష్టంగా మారేసరికి…. పెద్దగా ఆశ్చర్యం చెందని రుద్రస్వామి కాస్త శివలింగం తీసుకొని యధావిధిగా మళ్లీ పైకి రావడం జరిగింది. అప్పుడు ఈ తీర్థం ఒడ్డున ఉన్న వీళ్ళందర్నీ చూస్తూ శివ నందిని కాస్త ఇదిగో అమ్మ! నీ శివలింగం అంటే …..ఇదేంటి ఇంత చిన్నగా ఉంది….. పెద్ద శివలింగం కదా! అని పిల్లలిద్దరూ అడిగేసరికి…. ఇది మూడు అడుగుల శివలింగం. నేను తాకగానే మూడు అంగుళాల శివలింగంలాగా మారింది అనేసరికి ……శివ నందిని కాస్త ఆ శివలింగమును చూస్తూ ఏడవటం ఆరంభించింది. ఏమైంది అనేసరికి…. ఇది నా భర్త ఆరాధన చేసిన శివలింగం. శివ ఉపాసకుడు. శివలింగ ఆరాధన చేసేవాడు. నేను కాళికా ఉపాసకురాలిని. కాళికా విగ్రహ మూర్తిని ఆరాధన చేసేదానిని. నాది తంత్ర విధాన ఆరాధన అయితే…. ఆయన దక్షిణాచారంలో ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇద్దరికీ పూజా విధివిధానాలు వేరుగా ఉండేవి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యాలు ఉండేవి. నా దేవుడు గొప్ప అంటే నా దేవత గొప్ప అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఈ విధంగా ఆరాధనలో ఎక్కడో ఏదో తప్పు జరగటం వలనో ఏమో…. నాకు విపరీతమైన కామకాంక్ష వచ్చింది. ఆ కామకాంక్షను ఆయన తీర్చలేక పోయేవాడు. నేను దారి తప్పడం జరిగింది. ఇదంతా తెలిసిన కథ…. అనేసరికి అందరూ కూడా విని విననట్టుగా పెద్దగా పట్టించుకోనట్టుగా శివలింగం తీసుకొని యధావిధిగా డేరాకు రావడం జరిగింది. అప్పుడు శివ నందిని కాస్త విష్ణు గ్రంధి శుద్ధి కోసం మనం ఏ క్షేత్రానికే వెళ్లాలయ్యా! అనేసరికి ఏముంది సాధనామూర్తి చెప్పగానే చెబుతాడు కదా! అని పిల్లలిద్దరూ అనేసరికి…..సరే అయితే ఆయన చేతనే చెప్పించండి అనేసరికి…. బాల కుమారస్వామి కాస్త శివ నందిని చేతిలో ఉన్న నల్ల రాతి శివలింగం తీసుకొని సాధనా విగ్రహ మూర్తి కుడివైపు చేతిలో ఈ శివలింగం పెట్టి పెట్టగానే విష్ణు గ్రంధి ప్రాంతానికి కుండలిని శక్తి ప్రవేశించి….శుద్ధి అవుతున్నట్టుగా వీళ్ళందరూ చూడటం జరిగింది. విష్ణు గ్రంధి దివ్య తేజస్సుతో దివ్యకాంతితో కనిపిస్తూ ఉండేసరికి దాని నుంచి ఒక రాగి రేకు బయటకు వచ్చేసరికి….. బాల కుమారస్వామి కాస్త విష్ణు గ్రంథి క్షేత్రానికి సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయి…. చదువుతాను…. జాగ్రత్తగా వినండి అని చదవటం ఆరంభించాడు…
బాల గణపతి కాస్త వచ్చిన రాగి రేకు మీద ఆధారాలను చదవటం ఆరంభించాడు.
ముత్తైదువులు నాకోసం వస్తారు…. వారి మాంగల్యబలం నన్ను చూస్తే కలుగుతుంది… నా వక్షోజాల మధ్యలో అఖండ జ్యోతి గా దర్శనం ఇస్తాను…. నా భర్త శివలింగ రూపంలో నా పక్కనే ఉంటాడు…. నా అన్న కాస్త పాద రూపంలో ఉంటాడు…. నేను మూడు రూపాలలో మూడు తీర్థాలలోను ఉంటాను…. నా అన్న పితృదేవతలకు ఉన్నత గతులు ఇస్తాడు….
అని ఆధారం ఉండేసరికి…. శివ నందిని కాస్త ఏదో ఆలోచిస్తూ… ఇది సతీదేవి వక్షోజాలు పడిన ప్రాంతం అయి ఉండాలి. ఆ ప్రాంతం ఏ క్షేత్రము అని వెతికేసరికి…. బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతంలో ఉన్న మాంగల్య గౌరీ అని అర్థమయింది. ఈ క్షేత్రానికి ఈ ఆధారాలు సరిపోతాయో లేదో చూడు….అనేసరికి, స్థల పురాణం విశేషాలు చూస్తూ ఉండేసరికి…. ఇక్కడ అమ్మవారు అఖండ జ్యోతి రూపంలో ఉంటుందని…. రాతి వక్షోజాలు ఉంటాయని…. తరువాత ఇక్కడ శివలింగం ఉంటుందని…. విష్ణుమూర్తి ఇక్కడ పాదగయ ప్రాంతంలో…. మూడు అడుగుల పాద రూపంలో ఉండి…. పితృదేవతల శ్రాద్ధ కర్మలు చేస్తారని….. తర్వాత ఇక్కడ ఉన్న మాంగల్య గౌరీ అమ్మవారిని దర్శనం చేసుకుంటే….. ముత్తైదువులకు మాంగల్యం పది కాలాలపాటు ఉంటుందని స్థల పురాణ విశేషంగా చెప్పడంతో….. పైగా ఇక్కడ అమ్మవారు మూడు రూపాలతో కాళిగా , దుర్గగా, సరస్వతిగా ఉంటుందని…. మూడు తీర్ధాలు కలిగిన త్రివేణి సంగమం ఇక్కడ ఉంటుందని…. స్థల పురాణం చెప్పడంతో…. ఇప్పుడు గయలో ఉన్న మాంగల్య గౌరీ క్షేత్రం విష్ణు గ్రంధి జాగృతి,శుద్ధి, ఆధీనం అవుతుందని చెప్పేసరికి….. సరే ఇక్కడి నుంచి మనం గయాక్షేత్రానికి బీహార్ కి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ నిర్ధారణకి రావడం జరిగింది. తర్వాత శివ నందినికి యోగమత్తు ఆవరిస్తూ ఉండేసరికి….. ధ్యానంలో కూర్చునేసరికి ఒక రాతి విగ్రహ మూర్తి యొక్క వక్షస్థలం మధ్యలో ఒక దివ్య జ్యోతి లీలా మూర్తిగా కనిపించేసరికి…. ధ్యాన భంగం అయ్యేసరికి తనకు కనిపించిన శక్తిపీఠం వెతకగా….. అది మాంగల్య గౌరీ శక్తిపీఠం అని నిర్ధారణ అవ్వడంతో….. తనకి దొరికిన ఆధారాలు, తనకి కనిపించిన శక్తిపీఠం ఒకటే అని చెప్పి అది మాంగల్య గౌరీ శక్తిపీఠం అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. దానితో ఇక ఎటువంటి అనుమానం, సంతోషం లేకుండా మాంగల్య గౌరీ క్షేత్రానికి వెళ్లాలని చెప్పేసి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. బాలగణపతికి ఒక చిన్న సందేహం వచ్చి….
బాల గణపతి:- అమ్మ! అనాహత చక్ర జాగృతి, వలన వాయు చరసిద్ధి వచ్చింది. మరి వాయు శరీర జాగృతి వలన నీకు ఏ సిద్ధి వచ్చింది…?
శివ నందిని:- వాయు శరీర శుద్ధి వలన లఘిమ సిద్ధి వచ్చింది. ఈ సిద్ది వలన శరీరం తేలిగ్గా చేసుకోవచ్చును… వాయు మార్గంలో ప్రయాణం చేయవచ్చును…
పిల్లలు:- ఈ రెండు శక్తులు కూడా వాయు మార్గానికి సంబంధించినవేనా?
శివ నందిని:- అవును…. ఎందుకు అంటే ఒకటి అనాహత చక్రం వాయువునకు సంబంధించినవి కాబట్టి….వాయు శరీరానికి సంబంధించింది మరియు గాలికి సంబంధించినది కావడం వలన మనకి ఈ రెండింటికీ వలన వాయువు సంబంధించిన సిద్దులే వచ్చినాయి. అదేమిటంటే….. ఈ వాయు చర సిద్ది వలన సుడిగాలి ప్రమాదాలు ఏమీ చేయలేవు. అలాగే ఈ లఘిమ సిద్ధి వలన భూమికి వ్యతిరేకంగా గురుత్వాకర్షణకి వ్యతిరేక దిశలో 21 అడుగుల ఎత్తు పైన నడుచుకుంటూ వెళ్లగలను. వాయు మార్తంలో ప్రయాణించగలను…
అనేసరికి అయితే మాకు ఈ సిద్ధిని చూపించవా? అనేసరికి శివ నందిని ధ్యానంలో ఉంటూ అనాహతా చక్రం గురించి ధ్యానం చేస్తూ…. వాయుముద్ర అభ్యాసం చేస్తూ ఉండేసరికి….. కొద్దిసేపటికి తనకి ప్రాప్తించిన వాయుచర సిద్ధి వలన గాలిలో లేచేసరికి…. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టేసరికి…. కళ్ళు తెరిచి చూసేసరికి…. ఈమె భూమికి 21 అడుగుల ఎత్తున లేవటం జరిగింది. వాయు చర సిద్ధి ఉపయోగించి…. ఈ క్షిప్రా నదిని ఎలా దాటుతానో చూడండి అంటూ ఉండేసరికి…. క్షిప్రా నది ఒడ్డున గాలిలో తిరుగుతూ….. నది మధ్యభాగం దాకా వెళ్లి….. మళ్లీ వెనక్కి తిరిగి వస్తూ ఉండేసరికి….. పిల్లలు ఆశ్చర్య ఆనందాలకు గురి అవుతూ…. తన దగ్గరకు వచ్చిన అమ్మతో అమ్మ! మమ్మల్ని కూర్చోబెట్టుకొని వాయు మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎందుకు ఉండదు అని పిల్లలు ఇద్దరినీ తన తొడల మీద కూర్చోబెట్టుకొని….. తను ఈ నది మీద వాయు మార్గంలో తిరుగుతూ ఉండేసరికి గాలిలో ఉండి నదిని చూస్తూ ఉండేసరికి పిల్లలకి అలవికాని ఆనందంలో…..
పిల్లలు:- అమ్మ ! మనం ఈ వాయు మార్గంలోనే గయాక్షేత్రానికి వెళ్లిపోదామా?
శివ నందిని:- మరి రుద్ర స్వామి మహాదేవికి ఈ సిద్ధి లేదు కదా ! ఎలా వస్తారు?
పిల్లలు:- ఏదో ఒక బస్సు కానీ, ట్రైన్ కానీ, విమానం కానీ పట్టుకొని వస్తారులే! మనం ఎంచక్కగా ఈ వాయు మార్గంలో గయాక్షేత్రానికి వెళ్లేసి వద్దాము.
శివ నందిని:- చాలా తప్పు…. మరి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఎలా ప్రయాణం చేస్తారు…..ఏదైనా ప్రమాదం వస్తే ఎలాగా?
పిల్లలు:- మరి సిద్దులు సంపాదించుకోవడం ఎందుకు? సిద్ధులు ఉపయోగించకుండా ఉంచుకోవడం ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏమిటి? అనేసరికి సిద్దులు వచ్చినాయా లేదా అనే దానివలన, మన సాధన పురోగతి సాధిస్తుంది. సిద్దులు రాకపోతే ఆ చక్రం శుద్ధి కానట్టే…. ఏదో మాయలో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అంతేగాని ఈ సిద్దులను ఉపయోగించుకోవడం వలన ఉపయోగం లేదు. పక్షులు ఉన్నాయి …..అవి వాయు మార్గంలో సంచారం చేస్తాయి. గూళ్ళు కట్టుకొని సంసారాలు చేస్తూ ఉంటాయి. దానికి భూమి మీద ఉంటే ప్రమాదం. అందుకని వాయు మార్గంలో ప్రయాణం చేసే విధివిధానం చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం కూడా పక్షుల లాగా మారిపోయి వాయు మార్గంలో ప్రయాణించవచ్చు… కానీ మన స్వార్థం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ధనం కోసం, ఈ సిద్దులను ఉపయోగించరాదు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు…. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు…. మాత్రమే సిద్ధులను ఉపయోగించాలి. అది కూడా లోక కళ్యాణార్ధం ఉపయోగించుకోవాలి…సిద్దులను ఉపయోగిస్తే మనలో ఉన్న సాధనా శక్తి అంతకు అంతా తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ దానిని శక్తి జాగృతి చేసుకుంటూ ఉండాలి . సాధన వృద్ధి చేసుకుంటూ ఉండాలి…
పిల్లలు:- సరే అమ్మ! నీ మాటలు మాకు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నాయి. విచిత్రమైన అనుభవం అనుభూతిలాగా ఉంది. గాలిలో ఈ నదిని చూస్తూ ఉంటే స్పష్టంగా తాబేలు చేపలు, శంఖాలు ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉండేసరికి బాల కుమారస్వామి కాస్త అమ్మ! మాకు ఊదే శంఖం కావాలి….కొనిస్తావా?
శివ నందిని:- నీకు వచ్చే యోగం ఉంటే…. అదే వస్తుంది. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి రావలసిన సమయంలో అదే వస్తుందిలే…ఎప్పుడూ కూడా మనం దైవిక వస్తువు కొనుక్కోకూడదు. వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి. తెలిసిన వాళ్ళ ద్వారా గాని తెలియని వాళ్ళ ద్వారా కానీ వస్తాయి. అవి వచ్చినప్పుడు తీసుకోవాలి…. లేదా ధ్యానంలో ఆ వస్తువు పదేపదే కనపడితే….. మనం తీసుకోవడం జరగాలి.
పిల్లలు:- ఓహో! మాకు ఎప్పుడూ కనపడలేదులే ….కనబడిన దైవిక వస్తువులను అడుగుతాము… నువ్వు కొనిస్తావా?
శివ నందిని:- ఆ కొనిస్తాను…. అంటూ ఉండేసరికి సరే…! మనం ఇంక తిరిగి వెళ్లిపోదామా..? అవతలి ఒడ్డుకి కూడా వచ్చేసాము…. మళ్ళీ రుద్ర స్వామి కంగారు పడిపోతాడు. ఎక్కడ నదిలో మధ్యలో పడిపోయామో …. మునిగిపోయామో అని..
బాల గణపతి:- ఆయన చచ్చినా కంగారుపడడు… శుభ్రంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మనల్ని చచ్చినా పట్టించుకోడు. మనం చస్తే దహనం చేసి వెళ్ళిపోతాడు. మన గురించి ఆలోచించడు . నువ్వు ఆయన నుంచి ప్రేమ , ఆప్యాయతలు ఆశించకు…
అని చెప్పేసి బాల గణపతి అనుభవంతో అనేసరికి…. బాలగణపతి అనుభవంతో చెబుతున్నాడులే…. అని చిరునవ్వు నవ్వి యధావిధిగా మళ్లీ ఇవతలి ఒడ్డుకి రావడం జరిగింది. అప్పటికే రుద్రస్వామి ధ్యానంలో వీళ్ళ రాకను గమనించి ధ్యానం నుంచి బయటకు వచ్చి
రుద్రస్వామి:- అప్పుడే వచ్చేశారా?
శివ నందిని:- అది కాదయ్యా! మీరు కంగారు పడతారేమో అని రావడం జరిగింది.
రుద్రస్వామి:- ఎందుకు కంగారు పడటం….
శివ నందిని:- ఏదైనా సిద్ధి మాయలో పడిపోయానా? లేకపోతే నీటిలో పడిపోయానేమో? అనుకుంటారేమో అని అనుకున్నాను.
రుద్రస్వామి:- అయినా నీకు నీటి మీద తేలే అవకాశం ఉంది కదా!నువ్వే కాపాడగలుగుతావు…. జలగండాలు ఎటు నిన్ను ఏమీ చేయలేవు కదా! వాయు మార్గంలో ప్రమాదాలు ఉండవు …ఇప్పుడు వాయుదేవుడి వల్ల ఇప్పుడు ఎలాగో ఏమీ జరగదు…నాకు దాని గురించి ఆలోచన లేదు. ప్రశాంతంగా నా ధ్యానంలో నేను ఉన్నాను… కాసేపు తిరిగి వస్తానంటే తిరిగి రండి …
అనేసరికి పిల్లలు మళ్లీ వెళ్లేసి వద్దాం అనేసరికి…. ఇక ఆ రోజంతా వాళ్ళు వాయు మార్గంలో క్షిప్రా నది చుట్టూ తిరగటం ప్రదేశాలన్నీ తిరిగి చూసి రావడం చేస్తూ ఉండేసరికి…… కాకపోతే ఎవరికంటా పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ…. శివ నందిని ఉండిపోయింది. అలా రాత్రికి వాళ్ళు భూమి మీదకి వచ్చేసి భోజనాధి కార్యక్రమాలు చేసుకుని….. ఇక చాపలు తీసుకుని ఇసుక తిన్నెల మీద ఈ నది ఒడ్డున చాపలు వేసుకొని నిద్రకి ఉపక్రమించడం జరిగింది. ఆ తరువాత రోజు గయాక్షేత్రానికి బయలుదేరాలని రుద్ర స్వామి అనడంతో …..దానికి సంబంధించిన రైలు టికెట్లను ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకునే పనిలో శివ నందిని పడిపోయింది.
శుభం భూయాత్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి