బ్రహ్మ చక్రము - నాగ సాధువు సాధన
శివ నందిని కాస్త తన బ్రహ్మ చక్రసాధనకి సంబంధించిన క్షేత్రం తెలుసుకోవాలని చెప్పి తనకి కాలచక్ర శుద్ధిలో వచ్చిన కాలభైరవ విగ్రహ మూర్తిని తనంతట తానే స్వయంగా సాధన విగ్రహ మూర్తి యొక్క ఎడమవైపు చేతిలో ఉన్న పద్మములో పెట్టేసరికి….. ఆ సాధన విగ్రహ మూర్తి యొక్క బ్రహ్మ చక్రం ఒక్కసారిగా జాగృతి అయ్యి తిరిగేసరికి దానిలో నుంచి రాగి రేకు రావడం జరిగింది. ఈ రాగి రేకు అందుకున్న మహాదేవి కాస్త అందులో విశేషాలను చదవటం ఆరంభించింది.
నా తల మీద కపాలం ఉంటుంది…
నా తల మీద గబ్బిలం ఉంటుంది….
నా తల మీద బల్లి ఆవాసం చేస్తూ ఉంటుంది. నా తల మీద తేలు ఆవాసం చేస్తూ ఉంటుంది. త్రిమూర్తులను ప్రళయ కాలంలో రక్షిస్తాను…
నన్ను గృహ చండీగా పిలుస్తారు…
నేను చూడటానికి వృద్ధ మహామాంత్రికురాలిగా ఉంటాను….
నన్ను దర్శిస్తే మహామృత్యు భయం ఉండదు.
నన్ను చూస్తే అపార బ్రహ్మ జ్ఞానం ఇస్తాను…
తుంగభద్రా నది తీరమే నా ఆవాసం…
అనేసరికి శివ నందిని కాస్త ఈ ఆధారాలను వింటూ తుంగభద్ర నది సమీపంలో ఉన్న శక్తిపీఠం ఏమై ఉంటుంది అని ఇంటర్నెట్లో వెతికితే…. అది అలంపురంలో ఉన్న జోగులాంబ శక్తి పీఠం అని తెలియడంతో…. ఆ స్థల పురాణ విశేషాలు చదవడం ఆరంభించింది. ఈవిడ తల మీద కపాలం, బల్లి, గబ్బిలం, తేలు,ఉంటాయని… ఇవన్నీ కూడా త్రిమూర్తుల రూపం, శక్తి రూపం అలాగే ఇక్కడ అమ్మవారిని గృహ చండీగా ఇంట్లో అగ్ని దేవతగా ఆరాధన చేస్తారు అని…ఈవిడ చూడటానికి మహా మాంత్రికురాలిగా ఉంటుందని…. ఈవిడ అపార బ్రహ్మజ్ఞానం ఇస్తుందని…మహా మృత్యుభయం దోషాలు తీసేస్తుందని చెప్పడంతో…. ఇక తన బ్రహ్మ చక్రసాధనకి జోగులాంబ క్షేత్రం నిర్ధారణ అయిందని తెలుసుకోవడం జరిగింది. ఇక సాధన కుటుంబం అంతా రైలు మార్గం ద్వారా ఈ క్షేత్రమునకు చేరుకోవటం జరిగింది. ఇక్కడ తను నాగసాధువు దీక్షతో సాధన పరిసమాప్తి చేసుకోవాలని మహాదేవికి చెప్పడం జరిగింది.. ఈలోగా బాలగణపతి వచ్చి అమ్మ ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాలు ఇతర ప్రాంతాలు దర్శనం చేసుకుని వద్దాము…ఎప్పటిలాగానే ఆలయాలు దర్శనం చేసేటప్పుడు మాకు ఈ క్షేత్ర స్థలపురాణ విశేషాలు పురాణ కథనాలు వాటి గురించి వివరిస్తూ ఒక్కొక్క ఆలయం చూపించు అని అడిగేసరికి శివ నందిని కాస్త సరే అని ఇక అందరూ కలిసి క్షేత్ర ఆలయ దర్శనాలకి ఇతర ప్రాంతాల దర్శనానికి బయలుదేరడం జరిగింది.అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ అమ్మవారి ఆలయం తుంగభద్రా నది తీరాన ఉన్న ప్రసిద్ధ శక్తి క్షేత్రం; అష్టాదశ మహాశక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠంగా సంప్రదాయంగా పూజలందుకుంటుంది. స్థలపురాణం ప్రకారం, దక్షయజ్ఞం అనంతరం సతీదేవి దేహాన్ని మోస్తూ శివుడు సంచరిస్తున్నప్పుడు, విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించగా, సతీదేవి పై దంతాలు అలంపురంలో పడ్డాయని ఒక సంప్రదాయం చెబుతుంది;ఇక్కడ అమ్మవారు ఉగ్రయోగిని స్వరూపంలో జోగులాంబగా, శివుడు బాలబ్రహ్మేశ్వరస్వామిగా పూజలందుకుంటారు. క్షేత్ర మహాత్మ్యంలో బ్రహ్మదేవుడు ఇక్కడ శివుని గురించి తపస్సు చేసి సృష్టికార్యానికి సంబంధించిన శక్తిని పొందినట్లు కూడా చెబుతారు. చారిత్రకంగా, అలంపురం క్రీ.శ. 6–8వ శతాబ్దాల బాదామి చాళుక్యుల కాలంలో ప్రముఖ శైవక్షేత్రంగా అభివృద్ధి చెందింది; ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలు ప్రాచీన చాళుక్య శిల్పకళకు అద్భుతమైన నిదర్శనాలు. మధ్యయుగంలో జోగులాంబ ఆలయం ధ్వంసమైనట్లు సంప్రదాయ కథనాలు పేర్కొంటాయి; అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో భద్రపరిచి పూజించినట్లు చెబుతారు. అనంతరం 2005లో పునర్నిర్మించిన ఆలయంలో అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు. తుంగభద్రా, కృష్ణా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారం, అలాగే దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందింది అని చెబుతూ మొదటగా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం జరిగింది.అమ్మవారి ఆలయంలోని ప్రధాన విశిష్టత ఆమె ఉగ్రయోగిని స్వరూపం దర్శించడం జరిగింది. అమ్మవారి విగ్రహం సాధారణ దేవతా రూపాలకు భిన్నంగా ఉండి, జటాజూటంలో తేలు, బల్లి, కప్ప, పుర్రె వంటి ప్రత్యేక గుర్తులు ఉండటం అందరూ గమనించారు.. శాక్త సంప్రదాయాల ఆధ్యాత్మిక వ్యాఖ్యానంలో తేలు భయాన్ని, బల్లి–కప్ప ప్రకృతిలోని జీవశక్తులను, పుర్రె శరీరం నశ్వరమనే సత్యాన్ని గుర్తుచేసే ప్రతీకలుగా వీటిని చెప్పడం జరుగుతుంది అని అక్కడ ఉన్న ఆలయ పూజారి చెప్పగా తెలుసుకోవడం జరిగింది.అమ్మవారి ఉగ్రరూపం, శవాసనం శక్తి యొక్క అపారమైన స్వరూపాన్ని, జీవితం–మరణం అనే ద్వంద్వాలను అధిగమించే తాత్త్విక భావాన్ని సూచిస్తాయని శాక్త సంప్రదాయాల్లో వ్యాఖ్యానిస్తారు. ఈ క్షేత్రానికి చండీ, ముండీ అని అమ్మవారి ప్రతిరూపాలుగా ఉన్న విగ్రహామూర్తులు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉండేవని ….ఒకప్పుడు అదే అమ్మవారి ఆలయం అని అక్కడ పూజారి చెప్పగా తెలుసుకోవడం జరిగింది. అమ్మవారిని యోగశక్తికి అధిష్ఠాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ విధంగా ప్రకృతి, మరణం, యోగం, ఆదిశక్తి భావనలు ఒకే దేవతా రూపంలో సమన్వయమవడం జోగులాంబ అమ్మవారి విగ్రహంలోని ప్రత్యేక లక్షణం అని శివ నందిని చెప్పడం జరిగింది. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోవడానికి అని వెళ్లడం జరిగింది. ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం….అత్యంత ప్రాచీన శైవక్షేత్రాలలో ఒకటి; ఇది నవబ్రహ్మ ఆలయ సముదాయంలోని ప్రధాన పూజా క్షేత్రం. స్థలపురాణ సంప్రదాయం ప్రకారం, అలంపురంలో బ్రహ్మదేవుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేయగా, శివుడు ప్రసన్నుడై ఆయనకు సృష్టికార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించాడని చెబుతారు; అందువల్ల ఇక్కడి శివుడు బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడని భక్తుల విశ్వాసం. స్కాంద పురాణ సంప్రదాయంలో అలంపురం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ప్రాధాన్యం పొందింది. చారిత్రకంగా, ఈ ఆలయం బాదామి చాళుక్యుల కాలానికి చెందినది; తెలంగాణ ప్రభుత్వ జిల్లా వివరాల ప్రకారం, ఆలయ నిర్మాణం క్రీ.శ. 702 నాటి శాసన ఆధారాలతో అనుసంధానించబడింది. ఇక్కడి శిల్పకళలో తొలి చాళుక్య నిర్మాణశైలి, రాతి స్తంభాలు, దేవతా శిల్పాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. తరువాతి రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయుల కాలంలోనూ ఈ క్షేత్రానికి దానధర్మాలు, పూజా నిర్వహణకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా క్రీ.శ. 1057, 1080 వంటి సంవత్సరాలకు చెందిన శాసనాలు బ్రహ్మేశ్వర దేవుని పూజలు, నిత్యదీపం, ఆలయ నిర్వహణ కోసం భూదానాలు చేసిన విషయాలను నమోదు చేశాయి. మహాశివరాత్రి ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు అని స్థల పురాణ విశేషంగా చెప్పడం జరిగింది అని శివ నందిని చెప్పడం జరిగింది.ఆ తర్వాత నవబ్రహ్మ ఆలయానికి ఒక్కొక్క బ్రహ్మ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటూ రావడం జరిగింది. శివ నందిని వాటి గురించి వివరిస్తూ…ఇవి బాల బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది పేర్లతో ప్రసిద్ధి చెందాయి. పేర్లలో బ్రహ్మ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రధానంగా పరమశివునికి అంకితమైన ఆలయాలు. స్థలపురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు ఇక్కడ శివుని గురించి తపస్సు చేసి సృష్టికార్యాన్ని నిర్వహించే శక్తిని పొందాడని చెబుతారు. బాల బ్రహ్మ ఆలయం ప్రధాన పూజా క్షేత్రంగా ప్రసిద్ధి చెందగా, స్వర్గ బ్రహ్మ ఆలయం సున్నితమైన శిల్పాలు, పురాణ దృశ్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది; పద్మ బ్రహ్మ ఆలయంలో నునుపైన రాతి శివలింగం ఆకర్షణీయంగా ఉండటం అందరూ గమనించారు. గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ ఆలయాలు ప్రాచీన నిర్మాణశైలికి నిదర్శనాలుగా నిలవగా, అర్క బ్రహ్మ ఆలయ నామం సూర్యుని తేజస్సును గుర్తుచేస్తుంది. వీర బ్రహ్మ ఆలయం శివుని పరాక్రమ స్వరూపాన్ని, విశ్వ బ్రహ్మ ఆలయం విశ్వవ్యాప్త దైవత్వ భావనను, తారక బ్రహ్మ ఆలయం మోక్షమార్గ సూచనగా చెప్పడం జరిగింది అని ఆలయ పురాణ విశేషాలను శివ నందిని అందరికీ చూపిస్తూ చెబుతూ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసి పాపనాశి దేవాలయానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ పాపను ఆశేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. పాపనాశి” అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం; ఇక్కడ శివదర్శనం, పూజల ద్వారా పాపవిముక్తి కలుగుతుందని ఇక్కడ ఆలయ పురాణం కథనంగా చెప్పడం జరిగింది.రాతి స్తంభాలు, అష్టదిక్పాలకుల శిల్పాలు, నటరాజ స్వరూపం, సముద్రమథన ఘట్టాన్ని చూపించే శిల్పాలు ఈ ఆలయంలో ఉండటం గమనించి అందరూ ఆశ్చర్య ఆనందాలకు గురి అయ్యారు.కృష్ణా, తుంగభద్రా నదులు కలిసే సంగమ ప్రాంతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. స్థలపురాణ సంప్రదాయంలో సంగమేశ్వరుడు నదీ సంగమ పవిత్రతతో అనుసంధానించబడిన శివస్వరూపంగా పూజించడం జరుగుతుంది. సంగమ స్నానం, శివదర్శనం పుణ్యప్రదముగా భావిస్తారు. చారిత్రకంగా ఈ ఆలయం చాళుక్యుల కాలపు శిల్పకళా సంప్రదాయాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో పాత ఆలయం ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడటంతో, దానిని రక్షించేందుకు రాతి నిర్మాణ భాగాలను విడదీసి మరో ఎత్తైన ప్రదేశంలో పునర్నిర్మించారు అక్కడ స్థానికుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ఆలయాలని దర్శనం చేసుకుని తిరిగి సత్రానికి చేరుకొని భోజనాలు కాని చేసుకొని విశ్రాంతి తీసుకోవడం జరిగింది.
శివ నందిని నాగ సాధువు సాధన విధి విధానం
శివ నందిని ఒక చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే, మహాదేవి వచ్చి ఏంటమ్మా..! ఏంటి., ఏం ఆలోచిస్తున్నావు? అని అంటే… ఏమీ లేదు, ఇప్పుడు బ్రహ్మ చక్రం సాధనకి నాగసాధువు దీక్ష తీసుకొని సాధన చేయాలి కదా! ఇప్పుడు నాగ సాధువులు కనబడతారు కానీ, ఈ దీక్ష తీసుకున్న నాగ సాధువు స్త్రీ కనబడుతుందా లేదా అనేది ఆలోచిస్తున్నాను. అంటే…… కనబడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా నాగ సాధువులు పురుషులే కనపడతారు. స్త్రీలు చాలా తక్కువ మంది కనపడతారు. ఉన్న స్త్రీలు కూడా ఈ పురుష నాగ సాధువులకి….సేవలు చేస్తూ కనపడతారు. కాకపోతే వాళ్ళని నాగోస్ అంటారని తెలుసు. వీళ్ళు ఈ నాగోస్ అనే స్థితి నుంచి నాగసాధువులు స్త్రీలుగా మారారా లేదా అనేది నాకు తెలియదు అనేసరికి…. మహాదేవి చిలిపిగా శివ నందిని కేసి చూస్తూ… నాకు ఒక చిన్న సందేహం ఉంది, తీరుస్తావా? అనేసరికి ఏంటమ్మా… చెప్పు? అనేసరికి, మీరు ఆరు సంవత్సరాల పాటు ఆనంద భైరవి సాధన చేశారు కదా! గదిలో కూర్చుని సాధన చేశారు కదా! మరి మీరు ఇంద్రియ నిగ్రహంతో సాధన చేశారా? అసలు మీకున్న శృంగార కామ వాంఛలు కామమాయని ఎలా దాటావు? అని తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఈ ఆనంద భైరవి సాధనలోనే నాకున్న కామ వాంఛ మాయని దాటలేక అవస్థలు పడుతున్నాను. మీ ఇద్దరు కలిసి దాటేశారు అని చెప్పి నాకు అర్థం అయింది. ఎందుకంటే నువ్వు నాగసాధువు స్థితికి వచ్చావు అంటే….. ఈ దీక్షా స్థితికి వచ్చావు అంటే….నీ ఆనంద భైరవి సాధన పరిసమాప్తి అయి ఉండాలి కదా! అనేసరికి…. అటూ ఇటూ చూసి ఎవరూ లేరు అనుకుని, శివ నందిని కాస్త ఏముందమ్మ, మేము శరీరాలతో కామ వాంఛ తీర్చుకోలేదు….. కేవలం ఆత్మల సంయోగం ద్వారానే శృంగార వాంఛను తీర్చుకుంటూ సంయోగం నుంచి సమాధి స్థితిని పొందడం జరిగింది. అంటే అర్థం కాలేదు అన్నట్టుగా ఉంటే….. ఏమున్నది! మేమిద్దరం గది లోపలికి వెళ్లి ఎవరికి వాళ్ళమే ధ్యాననిష్ఠలో ఉండే వాళ్ళం. మా నుండి సూక్ష్మ శరీరాలు బయటకు వచ్చేవి. ఆ రెండు శరీరాలు రతి సంయోగంలో ఉంటే మేము మాత్రం తీవ్రమైన శివ ధ్యాన నిష్టలో ఉండే వాళ్ళం. వాళ్ళు దీర్ఘకాల సంయోగ స్థితిలో ఉండేవాళ్లు. అన్ని రకాల భంగిమల్లో శృంగారం చేస్తూ మాకు కనపడుతూ ఉండేవాళ్లు. వాటిని మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మాకు ఇంక ధ్యానం కొనసాగించలేకపోతున్నాము అనగానే…. మా ఆత్మను తిరిగి మా శరీరంలోకి ప్రవేశించేవి. అప్పుడు కావలసిన ఆహారం తిని మళ్లీ పడుకునే వాళ్ళం. మా మధ్య శారీరక శరీర వాంఛను తీర్చుకోలేదు. కేవలం ఆత్మల సంయోగం ద్వారానే శృంగారం వాంఛలు తీర్చుకోవటం జరిగింది అనేసరికి…. ఓహో! అదా, తేడా…. ఇన్నాళ్లు నేను శరీరాలతో తీర్చుకుంటూ వచ్చాను. మీరు మనసుని నిగ్రహించుకొని ఆత్మలతో సంయోగం చేసుకొని…. ఆ కామ కోరికను దాటారన్నమాట, అందుకే శృంగార వాంఛకి కామ వాంచికి తేడా ఉంది అని శాస్త్రం ఉంది. శృంగార వాంఛను మనసు, బుద్ధి, ఆత్మ కలుస్తాయి కానీ….శరీరం అంతగా కలవడం అనేది పెద్దగా పట్టించుకోరు. అదే కామ వాంఛకి వచ్చేసరికి…. శరీరాలు ఖచ్చితంగా కలవాలి…. కలుస్తూ ఉంటాయని… అది కూడా ఆ కోరిక తీరేవరకు విపరీతమైన మోహము, తపన,తాపత్రయాలలో పడిపోయి….. ఆ కోరిక తీరక సరిగ్గా అనుభవించక …..మళ్లీమళ్లీ అదే కోరిక తీర్చుకోవాలని తపన పడటం అంటే ఇదే కాబోలు అని చెప్పి అనుకొని….. ఇకనుంచి ఇంద్రియ నిగ్రహం పొందటానికి నా దగ్గరికి వచ్చే బైరవుడితో శరీరంతో కాకుండా మనసుతో సంయోగం చెందుతాను అని అంటే…ఆత్మ సంయోగము చేయడానికి అతను ఒప్పుకునేటట్టు చేస్తాను. ఇన్ని రోజుల నుంచి…. ఇన్ని సంవత్సరాల నుంచి రోజు నేను సుమారుగా 100 నుంచి 200 మందితో శారీరకంగా కామ వాంఛ తీర్చుకున్నప్పటికీ కూడా నాలో కామ వాంఛ తీరకపోవడం అనేది నాకు అర్థం కాలేదు. సుమారుగా 8 సంవత్సరాల నుంచి నేను ఇదే చేస్తున్నప్పటికీ…..నాలో కామ వాంఛలు తగ్గలేదు. ఆ కామ వాంఛలు తీరకపోవడంతో….నాకు క్షణకాల ఆనంద స్థితి మాత్రమే కలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆత్మల సంయోగం ద్వారా ఆ కామ భావం నుంచి విముక్తి పొంది ఆపై దీర్ఘకాల ఆనంద స్థితిలో ఉండి ఆపై ఆనంద రహిత స్థితి పొందటానికి అంటే ఆనందం అనే మాయను కూడా దాటి ఆనంద రహిత స్థితి అయిన నాగ సాధువు స్థితికి నువ్వు వచ్చావు అంటే ఇక్కడ శరీరాలతో కామ వాంఛ జరగకూడదు అని….. కేవలం ఆత్మల సంయోగం ద్వారానే కామ భావం జయించాలి అని నీ ద్వారా నాకు తెలిసింది. అర్థం అవుతుంది… ఇక నేను కూడా ఇదే ఆచరణ చేస్తాను. నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు అనేసరికి…. ఏముందమ్మా అందులో తప్పు? ఈ సాధనలో తప్పు ఒప్పు అనేవి ఉండవు. మంచి చెడు ఏమీ లేదు. చూసే వాళ్ళని బట్టి ఆలోచనలు తీరును బట్టి ఉంటుంది. అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని…. నా దృష్టిలో మంచి అవ్వచ్చు అదే నీ దృష్టిలో అది చెడు అవ్వచ్చు. నీ దృష్టిలో చెడుగా ఉన్నది నా దృష్టిలో మంచి అవుతుంది. యద్భావం తద్భవతి. అంతకుమించి ఏమీ లేదు… మేము చేసిన సాధన విధి విధానం నీకు సరిపోతుంది అంటే… చేసుకుని సిద్ధి పొందవచ్చును. అందులో తెలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అడిగి సందేహం తీర్చుకోవటం వలన నీ మనసులో ఉన్న అనుమానం తీరిపోతుంది కదా…. అంటూ ఉండేసరికి, అక్కడికి రుద్ర స్వామి రావటం జరిగింది. ఏంటి? తల్లి కూతుర్లు ఏవో దీర్ఘ సంభాషణలు చేస్తున్నారు అనేసరికి…. ఏమీ లేదు ఆనంద భైరవి సాధన ఎలా జరిగింది ఏంటి? అని అమ్మ అడుగుతుంటే చెప్తున్నాను అనేసరికి… సరే ఇప్పుడు ఆ స్థితి అయిపోయింది కదా! ఇప్పుడు ఆనంద రహిత స్థితి అయిన నాగ సాధువు కోసం సాధన చేయాలి కదా! అంటే అవునయ్యా, అసలు నాకు నాగ సాధువులు ఎలా ఉంటారు? వారి సాధన విధివిధానాలు ఏంటి? అనేది నాకు తెలియవు. అవి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటే…. నాకు కొద్దిపాటి విషయం జ్ఞానమే తెలుసమ్మా, నేను ఈ అఘోర స్థితిలోనే ఉన్నాను. నాగ సాధువు స్థితికి రాలేదు. మహాదేవి అఘోరస్థితి దాటి ఆనందభైరవి స్థితిలో ఉన్నది. అది కూడా భైరవ సాధనలో ఇంద్రియ నిగ్రహం కోసం కొట్టుమిట్టాడుతుంది. మా ఇద్దరికీ కూడా నాగ సాధువు స్థితికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ ఇంకా కాలమే నిర్ణయం చేయాలి. కాల నిర్ణయం చేస్తే అవ్వాల్సిన సమయానికి అవ్వక తప్పదు కదా! అనేసరికి…. మనకి సహజంగా నాగ సాధువులు అనే వాళ్ళు కుంభమేళలో కనబడుతూ ఉంటారు. ఈ కుంభమేళ గంగానది పుష్కరాలు అప్పుడు జరుగుతుంది. ఈ పుష్కరాలు నాలుగు ప్రాంతాలలో ఈ కుంభమేళా జరుగుతూ ఉంటాయి. ఒకటి కాశీ , రెండు ప్రయాగ, మూడు హరిద్వార్, నాలుగు ఉజ్జయిని క్షేత్రాలలో ఈ కుంభమేళ జరుగుతూ ఉంటాయి. ఈ కుంభమేళకి తప్పనిసరిగా నాగసాధువులు, అఘోరాలు, కాపాలికులు, భైరవులు తంత్ర విధివిధానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుండో హిమాలయాల నుంచి, అంతర్గత గుహల నుంచి స్మశానాల నుంచి వాళ్ళు సాధన చేస్తున్న ప్రదేశాల నుంచి వచ్చి మొదట మంగళ స్నానం చేస్తారు. ఆ తర్వాత మిగతా భక్తులు స్నానాలతో కుంభమేళా ప్రారంభమవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే… పైగా ఈ కుంభమేళా అనేది నాలుగు రకాలుగా జరుగుతుంది. ఒకటి మహా కుంభమేళా, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండవది పూర్ణకుంభమేళా ఇది 12 సంవత్సరాల కి ఒకసారి జరుగుతుంది… మూడవది అర్థ కుంభమేళా ఇది నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. నాలుగవది నిత్య కుంభ వేళ… ఇది 6 నెలలకి ఒకసారి జరుగుతుంది. ఇలా ఈ కుంభమేళ నాలుగు రకాలుగా చేస్తారు. కానీ, నాగ సాధువులు చూడటానికి నిరాడంబరంగా కనిపిస్తారు. కానీ వాళ్ళు ఆ నాగసాధువు సాధనకి చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మా గురువుగారు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన నాగసాధువుగా మారి హిమాలయాల్లో ఆవాసం సాధన చేస్తున్నారు. ఈ నాగ సాధువులు ఆవాసం చేస్తూ ఉండే ఆశ్రమాలని అఖండాలు అంటారు. ఇది మన భారతదేశంలో 17 ప్రదేశాలలో ఉన్నాయి. ఈ అఖండాలలో గురు శిష్యులు ఉంటారు. వీళ్ళు రాబోయే తరాల వారికి నాగ సాధువులకి శిక్షణ ఇవ్వటానికి అఖండాలలో ఆవాసం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క అఖండకి ఒక్కొక్క సాంప్రదాయం విధి విధానం ఉంటాయి. నాగ సాధువుగా మారటం అంటే అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఈ నాగసాధువులు చూడటానికి దిగంబర తత్వంతో ఉంటారు. స్మశాన విభూది ధారణ చేస్తారు. చేతిలో డమరుకం లేదా శంఖంతో ఉంటుంది. మరి కొంతమంది సాధువుల చేతిలో ఖడ్గ, త్రిశూలం ధారణ చేస్తారు. మెడలో బంతిపూల ధారణ ఖచ్చితంగా చేస్తారు. అలాగే నాగ సాధువులు రకరకాల అలంకరణలు చేసుకుంటూ ఉంటారు… తమని అమ్మవారిగా భావన చేస్తూ ఉంటారు. ఈ అలంకారం వలన తమ ఇష్టదేవుడైన పరమేశ్వర అనుగ్రహం పొందటానికి నిత్య శివనామస్మరణతో ఆయన అనుగ్రహం పొంది… దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి నాగసాధువు సాంప్రదాయం అనేది హిందూ ధర్మాన్ని కాపాడటానికి తయారు చేయబడిన నాగ సన్యాసి యోధులు అని చెప్పవచ్చును. ఎందుకంటే విదేశీయుల దాడి వలన మన భారతీయ సంప్రదాయం దెబ్బతినకుండా… ఉండటానికి అని చెప్పేసి ఈ నాగసాధువు సాంప్రదాయం ఏర్పాటు చేయటం జరిగింది. ఒక రకంగా వీళ్ళు ఆర్మీ సైనికుల లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక సైనికులు అన్నమాట! ఎవరైనా హిందూ ధర్మానికి సంబంధించి ఇబ్బంది కలిగించినా… లేకపోతే హిందూ దేవాలయాలను నాశనం చేసినా… అకారణంగా యుద్ధాలు చేసి హిందూ సాంప్రదాయం బ్రష్టు పట్టాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే, ఆ క్షణం వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని చంపేదాకా నిద్రపోరు అని చెప్పి ఒక నానుడి ఉంది. అది నానుడే కదా కాదు నిజం అని చెప్పి మా గురువుగారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మనకు చరిత్రలో కూడా సుమారుగా 30 వేల మందిని కేవలం 50 మంది నాగసాధువులు హతం చేశారు అనే ఒక చరిత్ర కూడా చెప్పడం జరిగింది. అంటే నాగసాధువు సాంప్రదాయం అనేది హిందూ పరిరక్షణకు… రక్షించడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సైనికులుగా మనం భావన చేసుకోవచ్చు. రెండోది ఇంకొక రకంగా చూస్తే, వీళ్లంతా రుద్రుడి యొక్క రుద్రగణాలుగా పరిగణించబడతారు. వీళ్ళకి రుద్రుడికి ఎలాంటి బేధం ఉండదు. శివలోకంలో ఎలా అయితే రుద్రులు ఉంటారో…. అలాగే వీళ్ళు భూలోకంలో రుద్రగణ అంశతో భౌతికంగా మనకి కనపడుతూ సంచారం చేస్తూ ఉంటారు అన్నమాట. విచిత్రం ఏమిటంటే, నాగసాధువు సాధన చూడటానికి వామాచారంలో చేస్తున్నప్పటికీ… కూడా దక్షిణాచార విధి విధానం మాత్రమే పాటించడం జరుగుతుంది. అంటే వీళ్ళు స్మశానంలో ఆవాసం చేయరు. కేవలం హిమాలయాలలో లేదా అరణ్యాలలో లేదా గుహల్లో వీళ్ళు ఆవాసం చేస్తూ ఉంటారు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే బోధించడం జరుగుతుంది. భిక్షాటన ద్వారా మాత్రమే వీళ్ళు భోజనం చేయడం జరుగుతుంది. కేవలం ఒక ఇంటికి మాత్రమే బిక్షకు వెళ్లి అందిన ఆహారం మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఇంట్లో బిక్ష దొరకకపోతే మరో ఇంటికి వెళ్లి బిక్ష తీసుకోవడం అనేది జరగదు. వెను తిరిగి ఆరోజు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఒకవేళ ఒకరోజు వీళ్ళకి బిర్యానీ దొరికితే ఆనందంగా తింటారు. మరుసటి రోజు ఆహారం దొరకక ఉపవాసం చేయాల్సి వస్తే…. అంతే ఆనందంగా ఉంటారు. అంతేగాని, శివలింగ నింద చేయడం కానీ…. శివ అపరాధము దోషం చేయటం కానీ వీళ్ళు ఎన్నడూ చేయరు. ఆహారం గురించి సమాజం గురించి, ధనం గురించి తర్వాత కుటుంబాల భవబంధాల గురించి వీళ్లు అన్నిటిని అతీతంగా ఉంటారు. వీరికి కేవలం ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటారు. ధర్మ పరిరక్షణ ఇబ్బంది కలిగించినా ….నాశనం చేయాలని ప్రయత్నం చేసినా …..వీళ్ళ దగ్గరికి ఆ ఆలోచనలతో వెళితే ఈ సాధకులు కాస్త తమ చేతిలో ఉన్న ఆయుధాలతోనే వెనక ముందు ఆలోచించకుండానే….. అతనిని చంపి ముక్కలు ముక్కలుగా చేసే అంత స్థితివంతులుగా ఉంటారు. వీళ్ళు అన్ని రకాల సకల విద్యల యందు ఆరితేరి ఉంటారు. అలాగే యుద్ధ నైపుణ్యం పొందుతారు. అనగా ఖడ్గ విద్య, మల్ల విద్య, గదా విద్య, ముష్టి యుద్ధం నైపుణ్యం పొందుతారు. ఎలా అంటే వీళ్ళు గుండు సూదితోనే ఇతరుల ప్రాణం తీయగలిగే అంత నేర్పుతో నిష్ణాతులై ఉండగలరు. తుపాకీ నుంచి వచ్చే గుండును కేవలం చేతితోనే రెండు ముక్కలుగా చేయగల సున్నిత నిష్ణాతులుగా నిజ నాగ సాధువులు ఉంటారు. వీళ్ళు చూడటానికి చాలా ప్రశాంతంగా బాలోన్మత్త అవధూత స్థితిలో కొంతమంది ఉంటే కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళకి సహజంగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం ఆగదు. కోపం వస్తే మాత్రం చంపే దాకా నిద్రపోరు. వీళ్ళకి కోపం వచ్చేది ఎప్పుడు అంటే గురుసేవలో తేడా వచ్చినప్పుడు…. లేదా ధర్మ పరిరక్షణకు ఏదైనా దోషం కలిగినప్పుడు…. సాక్షాత్తు రుద్రుడు వీళ్ళ మీదకి పోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపోద్రికులు అవుతారు. అవతలి వాళ్ళని నాశనం చేసేదాకా వీళ్ళు శాంతపడరు. అంత స్థితిలో నాగ సాధువులు ఉంటారు. కారణం లేకుండా వీళ్ళు కోపోద్రికులు అవ్వటం అనేది జరగదు…పసిపిల్లల మనస్తత్వం మరియు పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటారు.
అయ్యా! నాగ సాధువుల గురించి బాగానే చెప్పారు. నాగ సాధువుగా మారటానికి ఏమైనా ప్రత్యేక శిక్షణలు ఉంటాయా? అనేసరికి…. అమ్మ! చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు తట్టుకోలేక నాగసాధువుగా మారాలనుకున్న సాధకుడు కాస్త నూటికి 90 శాతం మంది వెనక్కి తిరిగి వెళ్లిపోయే అంత పరిస్థితులు ఉంటాయి. కనిపించే అంత తేలిగ్గా ఇవేవీ ఉండవు అని మా గురువుగారు ద్వారా నాకు తెలిసింది. ఇక్కడ నాగసాధువులకి ఎక్కువగా పరీక్షల్లో మానసికంగా, శారీరకంగా ఎన్నో పరీక్షలు పెడతారు. మనసు యొక్క ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయి… ఏంటి అని వాళ్ళు పరీక్షలు పెడుతూనే ఉంటారు. అలాగే శారీరకంగా నువ్వు దృఢంగా ఉన్నావా? అనేది చూస్తారు. ఎప్పుడైతే మానసికంగా, శారీరకంగా నువ్వు దృఢత్వం పొందిన తరువాతనే…. నీకు అసలు సిసలైన నాగసాధువుగా మారటానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముందు వీళ్ళు మూడు నుంచి 12 సంవత్సరాల పాటు ఒక గురువు నాగసాధకుడిగా మారే సాధకుడికి గురుసేవ కింద వినియోగించడం జరుగుతుంది. ఆ గురువు ఈ పన్నెండు సంవత్సరాల లోపల రకరకాలైన పరీక్షలు పెడతారు. అది మానసికంగా కావచ్చు…. శారీరకంగా కావచ్చు…. ఎలా అంటే అది నిద్రకి సంబంధించి కూడా ఉండవచ్చు… లేకపోతే భయానికి సంబంధించి ఉండవచ్చు… మానవమానాలు కలిగించేవిగా ఉండవచ్చు… లేదు బాధ కలిగించేవిగా ఉండవచ్చును… అంటే అకారణంగా తిడతారు. నువ్వు ఎంత సేవలు చేసినా గుర్తించరు…. పట్టించుకోరు. అందరి ముందు కావాలనే అవమానిస్తారు…. కొడతారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నీలో ముఖ భావాలలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని గమనిస్తారు. అంటే వీళ్ళు తిడుతున్నప్పటికీ, కొడుతున్నప్పటికీ, అవమానిస్తున్నప్పటికీ కూడా నీలో ఇసుమంత ముఖంలో మార్పుగాని…భావంగానీ రాకుండా ఓర్పుతో ఉండగలిగితే…. నిన్ను అఖండలో ఉంచుతారు. ఎప్పుడైనా నువ్వు ఒక్క క్షణం పాటు బాధపడినా….కోపం వచ్చినా నాగసాధువుగా మారటానికి పనికిరావని ఆ క్షణమే ఆ అఖండ నుంచి బయటకు గెంటి వేయడం జరుగుతుంది. ముందు మానసిక దృఢత్వంగా నువ్వు నిలబడ్డావా లేదా అన్న తర్వాత శారీరక స్థితి కోసం యోగాసనాలు హఠయోగం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీటిని నీ శరీరం తట్టుకోగలుగుతుందా లేదా అని కూడా పరీక్షలు చేస్తారు. ఒకవేళ వీటిని నీ శరీరం తట్టుకోలేకపోతే దృఢత్వం ఉండట్లేదు అన్నా…. కూడా వెనక్కి పంపించేస్తారు. ఈ రెండు పరీక్షలు దాటాలి. ముందు మానసికంగా దాటాలి. ఆ తరువాత శారీరకంగా దాటాల్సి ఉంటుంది. మానసికంగా పరీక్షలు అన్నింటిని కూడా ప్రశాంతత వదనంతో అవమానం జరిగినా కూడా…. ఉండగలిగే మానసిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు మానసిక స్థితిని పొందినట్టు. ఆ తర్వాత శారీరక స్థితిలో అనగా హఠయోగంలో నీ శరీరం పనికి వస్తుందా లేదా? వాళ్ళు చెప్పిన విధివిధానాలు నువ్వు చేస్తున్నావా లేదా? అని చూడటం చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే….. గురువుకి సేవలు చేసేటప్పుడు వాళ్ళు పెట్టే పరీక్షలు మామూలుగా ఉండవు. ఎలా అంటే వాళ్ళ మలమూత్రాలు నువ్వు ఎత్తి శుభ్రం చేయాలి. వాళ్ళకి కావలసిన వంట నువ్వే చేసి ఇవ్వాలి. ఆ వంట నువ్వు తినకుండా భిక్షాటన చేసి నువ్వు తినవలసి ఉంటుంది. వాళ్ళకి కావలసిన నీటిని ప్రతి రోజు కుండలలో తీసుకురావాల్సి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో అకారణంగా గురువు నిద్రలేపి అప్పుడు నానా మాటలు అనటం కానీ…. ఏదో ఒక పని చెప్పడం కానీ చేస్తారు. ఆ నిద్రలో కూడా నేను గురువుకు సేవ చేస్తున్నాను అనే భావంతో ఉన్నావా లేదా? నిద్ర భంగం చేసినందుకు నీకు కోపం వచ్చిందా? బాధపడ్డావా? అనేది కూడా సున్నితంగా పరీక్షిస్తారు. అంతటికీ కూడా నువ్వు ప్రశాంతవదనంతో చేసుకుంటూ వెళితే గురువు అనుగ్రహం పొందడం జరుగుతుంది….ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో తప్పు చేస్తే, దానికి తగ్గట్టుగా కఠినమైన శిక్షలు కూడా వేయడం జరుగుతుంది. మా గురువుగారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే…. ఒంటి కాలు మీద ఎండలో నిలబెట్టిస్తారు. గురువు మళ్ళీ పిలిచేదాక అంటే ఎనిమిది గంటలకు పిలవచ్చు, 12:00 తర్వాత పిలవచ్చు, లేదా 24 గంటలకి పిలవచ్చు లేదా కొన్ని రోజులపాటు… అలాగే నువ్వు ఒంటి కాలి మీద ఉన్నావు అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తూ గురువుగారు పట్టించుకోరు. ఆ గురువుగారు పిలిచేదాక నువ్వు కదలడానికి ఉండదు. అంతటి శిక్షలు వేయడం కూడా జరుగుతుంది. ఒక వేళ నువ్వు తట్టుకోలేక… ఈ శిక్ష నుంచి బయటకు వచ్చేస్తే, గురువుగారి మీద అంకిత భావం లేదు… గురువు మీద నమ్మకం లేదు అని ఆ క్షణమే నిన్ను అఖండ నుంచి బయటికి పంపించి వేయడం జరుగుతుంది. నువ్వు నాగసాధువు దీక్షకి పనికిరావు అని చెప్పి పంపించి వేయడం జరుగుతుంది. ఇంక ఎన్నో రకాలుగా కావాలని గురువుగారు నీ సహన శక్తికి పరిశీలించడానికి అని చెప్పేసి ఆ రోజులలో 20 నుంచి 70 సార్లు కావాలని మలమూత్రాదులకు వెళ్లడం జరుగుతుంది. ఆ మలమూత్రాలు నువ్వు రోజంతా ఎత్తుతావా లేదా బాధపడతావా….కోప్పడతావా ….అసహ్యించుకుంటావా… తిట్టుకుంటావా..? ఏం చేస్తున్నావు అని గమనించి సున్నితంగా చూస్తూనే ఏమి పట్టించుకోనట్టు, ఏమీ తెలియనట్టు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు వాటికి ప్రశాంత వదనంతో చిరునవ్వుతో ఓర్పుగా సహనంతో చేస్తున్నావు అన్నప్పుడే నాగ సాధువు దీక్ష పొందటానికి నీకు అర్హత, యోగ్యత, యోగం ఉందని నిర్ణయించి చేసుకుంటారు.
అసలు నువ్వు నాగసాధువుగా మారాలి అనుకున్నప్పుడు…. నీ జీవితంలో జరిగిన జీవిత విశేషాలు అన్నీ కూడా వాళ్లకి చెప్పవలసి ఉంటుంది. అవన్నీ సత్యమా కాదా అని మనోనేత్రంతో చూసుకొని…. ఇవన్నీ నిజాలే చెప్పారు అని నిజం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే, నిన్ను గురువును ఎంచుకోమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక గురువులోనూ ఐదు స్థితులను పొందవచ్చును లేదా పంచ గురువులలోనూ పంచ స్థితులనూ పొందటానికి ఉంటుంది. ఈ నాగసాధువు దీక్షలో పంచ ప్రక్రియల ద్వారా మనల్ని శుద్ధి చేయడం జరుగుతుంది. ఒక గురువు వచ్చి మంత్రోపదేశం చేస్తాడు. ఇంకో గురువు వచ్చి స్మశాన విభూతి ధారణ చేస్తాడు. మరో గురువు వచ్చి తలనీలాలను తీసుకుంటాడు. మరో గురువు వచ్చి రుద్రాక్ష మాల ధారణ చేస్తాడు. మరో గురువు వచ్చి లంగోటా ఇస్తాడు. ఇది ఒక గురువు చేయవచ్చును… లేదా పంచ గురువులు చేయవచ్చును. అలాగే వీళ్ళు వచ్చేసరికి పంచాయతన పూజా విధివిధానంగా పంచ దేవతలను ఆరాధన చేయవలసి ఉంటుంది. అనగా…. శివారాధన, విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన, సూర్య ఆరాధన, గణపతి ఆరాధన చేయడం జరుగుతుంది. శివారాధన వలన వీళ్ళు మృత్యువు ను జయించడం నేర్చుకుంటారు. విష్ణు ఆరాధన వలన మోహమాయను ఎలా జయించాలో తెలుసుకుంటారు. అలాగే శక్తి ఆరాధన నుంచి ధర్మం ఎలా కాపాడాలో నేర్చుకుంటారు. సూర్య ఆరాధన వలన ఎలా నిష్టగా ఉండాలో నేర్చుకుంటారు. గణపతి ఆరాధన నుంచి సకల విద్యలు, యుద్ధ విద్యలు పొందే నైపుణ్యతను కలుగుతుంది. ఈ ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్క స్థితి నువ్వు పొందుతున్నప్పుడు…. ఒక్కొక్క గురువు వచ్చి ఇందుకు చెప్పిన పంచ ప్రక్రియలలో మనకి దైవిక ప్రక్రియలు చేయడం జరుగుతుంది. ఇక పోతే ఆఖరి అంతిమ పరీక్షగా వచ్చేసరికి….. ఇంద్రియ నిగ్రహమునకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. అంటే నీలో కామ కోరికలు ఉన్నాయా లేదా అనేది చూస్తారు. కామకోరికలు కలుగుతున్నప్పుడు నీలో కామ భావాలు ఎలా ఉన్నాయి? కామకోరికలు ఎలా కలుగుతున్నాయి అనేది కూడా పరిశీలిస్తారు. ఈ కామ వాంఛలకి నీ మర్మాంగం ఉదృతం అవుతుందా లేదా అనేది పరీక్షిస్తారు. ఉధృతం అవుతున్నప్పుడు అది ఉదృతం కాకుండా ఉండేందుకు అని కొన్ని రకాల ఆయుర్వేద రసాయనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రసాయనాలను గురువే స్వయంగా సాధకుడు యొక్క మర్మాంగానికి పూయటం జరుగుతుంది. ఆ సమయంలో సాధకుడు సిగ్గు పడకూడదు… భయపడకూడదు… బాధపడకూడదు…. కామ వాంఛకి గురికాకుండా ఉన్నాడా… లేడా? అనేది కూడా చూస్తారు. అలా కొన్ని నెలల పాటు రసాయనాలు పూయటం వలన మర్మాంగం కాస్త కామ వాంఛలకు ఉదృతం కాకుండా.. శాశ్వతంగా ఆగిపోతుంది. ఇది అది క్లిష్టమైన పరీక్షగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మర్మాంగానికి ఇనుప గొలుసులతో బంధించడం లేదా బండరాయితో మోదీ మర్మాంగాన్ని శాశ్వతంగా పనిచేయకుండా చేయడం జరుగుతుంది. కేవలం మర్మాంగం అనేది మూత్రానికి తప్ప సంసార సుఖానికి పనికి రాకుండా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంద్రియ జ్ఞాన పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఈ పరీక్షలో సాధకుడు యోగముద్రలో ఉండి, రెండు చేతుల్లో రెండు కుండలను పట్టుకొని తర్వాత భుజాల మీద బలమైన యోగ దండం పెట్టిన తరువాత ఎర్రటి ఎండలో కదలకుండా, మెదలకుండా 24 గంటల పాటు ఒంటి కాలు మీద నిలబడవలసి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకి నాగసాధువు వచ్చి నీ చుట్టూ చేరి….. మీ యొక్క ఏకాగ్రత భగ్నం చేయడానికి అని వివిధ రకాల భజనలు, అరుపులు గోలలు, శంకనాధాలు, డమరుక నాదాలు చేస్తారు. మళ్లీ 12 గంటల పాటు అలా చేసిన తరువాత కదలట్లేదు…. మెదలట్లేదు…. అని నిర్ధారణ చేసుకున్న తరువాత, ఆఖరిగా నీ గురువు నీ దగ్గరికి వచ్చి నీ మర్మాంగం ఉదృతం అవుతుందా లేదా అని చెప్పేసి… గంటలతో అందరి ముందు మోదటం జరుగుతుంది. ఇలా ఎనిమిది గంటల పాటు నీ మర్మాంగమును వృషణాలను మోదటం అనేది పురుషుని పరంగా జరుగుతుంది. అవి కొడుతున్న ప్పటికీ నీ నోటి నుంచి ఎలాంటి అరుపు గాని బాధ గాని రాకుండా ఉండాలి. ఒకవేళ ఈ మర్మాంగం ఎప్పుడైనా ఉదృతం అయింది అని తెలిస్తే…. అంతిమ పరీక్షలో కూడా నువ్వు విఫలం అయ్యావు అని తెలిస్తే….అక్కడి నుంచి నువ్వు నాగసాధువుగా పనికిరావని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక నీ మర్మాంగంలో ఎలాంటి కదలికలు లేవు అని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అప్పుడు నాగోస్ అనే స్థితి నుంచి నాగసాధువుగా తీసుకురావడం జరుగుతుంది. ఇది గురుసేవ అయిన 12 సంవత్సరాల తరువాత సేవక స్థితి నుంచి మహాపురుష స్థితికి తీసుకురావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు నీకు ఈ విధమైన పరీక్షలు పెట్టడం జరుగుతుంది. మహాపురుష స్థితికి వచ్చినప్పుడే మనకి పంచ గురువులు పంచదైవ ఆరాధనలు పొందడం జరుగుతుంది. ఆ తరువాత ఈ మర్మంగానికి సంబంధించిన పరీక్షలు పెట్టడం జరుగుతుంది. ఈ మూడు అయిపోయిన తరువాతనే నాగసాధువు అని వీరహోమం మన చేత చేయించి….వస్త్రాలు అవన్నీ ఆ తర్వాత అందులో వేసేసి.,తల్లిదండ్రులకి, రక్తసంబంధీకులకి పిండ ప్రదానం చేసి, ఆ తర్వాత మన చేతనే మనకి ఆత్మ పిండ ప్రధానం పెట్టించి…. ఇతను బతికి ఉన్న శవము అని సమాజానికి తెలియజేస్తూ… ఇతను నాగసాధువు అని నిర్ధారించడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి నాగసాధువుగా ఖ్యాతి పొందుతూ హిమాలయాల్లో లేదా ఏదైనా అరణ్యాలలో ఏదైనా గుహలలో ఆవాసం చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇక శాశ్వతంగా నాగ సాధువుగా ఉండిపోవడం జరుగుతుంది అని చెప్పి…. నేను మా గురువుగారి దగ్గర తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ స్త్రీకి ఇంచుమించుగా ఇలాంటి పరీక్షలే పెట్టడం జరుగుతుంది. మొత్తం మీద చూసినప్పటికీ వీళ్ళు ఇంద్రియ నిగ్రహం పొందారా లేదా అని అంతిమంగా పరీక్ష పెట్టిన తరువాతనే నాగసాధువు స్థితిని పొందడం జరుగుతుంది. ఎందుకంటే కామానందం దాటితేనే కదా! ఆనంద రహిత స్థితిని పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆనంద రహిత స్థితి పొందుతారో…..అప్పుడు వాడికి స్మశాన వైరాగ్యం కలిగి సమదృష్టి, సమదర్శనం కలుగుతుంది. మంచి చెడు అనే భావం ఉండదు. కష్టం, సుఖం అనే భావం ఉండదు. కోపావేశాలు ఉండవు. రాగద్వేషాలు ఉండవు. మంచి చెడు అనే భావము ఉండదు. ద్వైత భావం నుంచి ఏకత్వ భావం కేవలం ఆనందం, సంతోషం అని చెప్పలేము… ఒక విధమైన ప్రశాంత స్థితిని పొందడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు మనసు పని చేయని స్థితికి ఎప్పుడైతే వస్తారో…. వాళ్లే నాగసాధువులుగా పరిగణించబడతారు. అంతేకానీ దిగంబరతత్వంలో ఉండి విభూది ధారణ చేసుకొని జడదారిగా ఉన్న ప్రతి వాడు కూడా నాగ సాధువు కాదు. అలాగే హిమాలయాల్లో ఆవాసం ఉన్నంత మాత్రాన నాగ సాధువు అనటానికి లేదు. నాగ సాధువుకి అఘోరాలకు చాలా తేడా ఉంటుంది. అఘోరాలు స్మశానాలను శివాలయాలుగా భావిస్తారు. నాగ సాధువులు హిమాలయ సానువులనే శివ సన్నిధానంగా భావించడం జరుగుతుంది. వీళ్ళు నాగసాధువులు సాత్విక ఆహారం తింటూ శివారాధన చేస్తూ ఉంటే….. అఘోరాలు మాంసాహారమును తింటూ శవాల మీద కూర్చుని శవారాధన చేస్తూ ఉంటారు. చాలామంది అఘోరాలని నాగసాధువులు గానూ, నాగ సాధువులని అఘోరాలుగాను అనుకొని భ్రమ పడుతూ ఉంటారు అని చెప్పేసరికి…. ఇదంతా వింటున్న మహాదేవికి నెమ్మదిగా వణుకు రావటం మొదలైంది. అమ్మ! నువ్వు చూస్తేనేమో ఆడపిల్లవి, పోయి. పోయి ఇన్ని పరీక్షలు తట్టుకొని నిలబడడం అంటే…. సామాన్యమైన విషయం కాదు. ఇది వింటుంటేనే ఒణుకు పుడుతుంది. ఇలాంటిది అనుభవంలోకి వెళితే ఎలా ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు నువ్వు మానసిక, శారీరక స్థితిని దాటగలిగితే దాటగలవు… కానీ ఇంద్రియ జ్ఞాన పరీక్షలు వింటుంటేనే ఒణుకు పుడుతుంది. పురుషునికి ఆ విధంగా మర్మంగానికి గొలుసులు కట్టి కొట్టడం…. బండరాయి పెట్టి కొట్టడం… గంటలు పెట్టి కొట్టడం ఏకధాటిగా 8, 12 లేదా 24 గంటలు కొట్టడం, రక్తం కారుతూ ఉన్నప్పటికీ కూడా… అరవకుండా ఉండటం అంటే తట్టుకునే పరిస్థితి కాదు. చాలా సున్నితమైన భాగమది. అక్కడ చేతిస్పర్శ తగిలిన కానీ ప్రాణం పోయే అంత విలవిలలాడుతూ ఉంటుంది…. అలాంటిది తలుచుకుంటేనే, ఊహించుకుంటేనే… నాకు ఒ ణుకు పుడుతుంది. .. నాగ సాధువు ఇంతటి కఠిన పరీక్షలకి ఎదుర్కోవాలా చేసుకోవాలా? అది నిజమేలే…. ఆడవాళ్ళకి వ్యసనం ఆడవాళ్ళ వ్యసనం కలిగి ఉంటే…. వీళ్లు హిందూ ధర్మ రక్షణకి పనికిరారు కదా ! స్త్రీ వ్యసనం ఉండకూడదు అని చెప్పేసి…స్త్రీ వచ్చి మోహించినా, కామించినా తన మర్మాంగం లేవలేని స్థితిలో ఉంటే అతను ఆమెకి అధీనం కాడు కదా! అయినా కూడా ఇంతటి కఠినమైన పరీక్షలను తట్టుకోవడం అంటే, అది అనితర సాధ్యం అని చెప్పవచ్చును. మానవమాత్రులకి అసాధ్యం అని చెప్పాలి. నాకు భయం వేస్తుంది. కాబట్టి శివ నందిని..! నువ్వు ఒకసారి శివ స్వామీని అడిగి విషయం తెలుసుకొని ఇందులోకి ప్రవేశించు. ఆ శివ స్వామిని అడిగిన తర్వాత నాగసాధువ దీక్షకి వెళ్ళటం మంచిదేమో, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో! తేడా వస్తే ప్రాణాలు పోతాయేమో! అంటే ఇక్కడ ప్రాణాలు పోవడం సమస్య కాదు… బతికి ఉండగానే వీళ్ళు నరకయాతన పెట్టడం లాగా ఉంది. యమలోకంలో ఉన్న 21 మహా క్రూరపు శిక్షలలో ఇలాంటి శిక్షణ శిక్షణను నేను చూడను కూడా చూడలేదు. వినను కూడా వినలేదు. గరుడ పురాణంలో చెప్పిన శిక్షలు కూడా ఈ నాగసాధువు అంతిమ పరీక్ష ముందు దేనికి పనికిరావు కావచ్చు. బతికి ఉండగానే నరకయాతన పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇలా జరుగుతుంది…. ఇలా చేస్తారు అని తెలిసినా కూడా వాళ్ళు నాగసాధువులుగా మారాలి అని అనుకుంటున్నారంటే… వాళ్ళకి శతకోటి వందనాలు చెప్పుకోవచ్చును అని మహాదేవి అంటూ ఉంటే… శివ నందిని కాస్త అమ్మ! నువ్వు భయపడకు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు… నీట మునిగిన వాడికి చలి గురించి ఆలోచిస్తే ఏం లాభం? ఇప్పటికే నేను తంత్రసాధనలో అడుగుపెట్టి మూడు విధివిధానాలు పూర్తి చేశాను. ఈ అంతిమ విధి విధానం నాలుగవది కూడా పూర్తి చేయాలి. వాళ్లు ఈ విధి విధానం ఎందుకు పెట్టారు… దేనికో అని ఇదిమితంగా మనకి తెలియక పోయినప్పటికీ… కూడా ఇంద్రియనిగ్రహం అనేది అర్థం అవుతుంది. ఇప్పటివరకు నేను కామ వాంఛలకి, కామ భావాలని దాటుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు అది తేలికగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు పెట్టే పరీక్షలకి నా శరీరం, నా మనసు, సహకరించాలి… అరవకూడదు… ఏడవకూడదు….బాధపడకూడదు… ఇవన్నీ కూడా శరీరానికి బాధ కలిగినప్పుడు వచ్చే సహజ లక్షణాలు అన్నీ కూడా కనిపించకుండా… కేవలం చిరునవ్వుతో సహనంతో ఓర్పుతో ఉండాలి. అంటే నేను మానసికంగా శారీరకంగా ఎంత దృఢత్వంను పొంది ఉండాలో అనే విషయం మాత్రమే ఆలోచించడం జరుగుతుంది. నా అదృష్టం బావుండి నాగసాధువు స్త్రీ మూర్తి గురువుగా దొరికితే నాకు అంతకంటే ఇంక నా అంత అదృష్టవంతురాలు లేరు అని అంటూ ఉండేసరికి…. రుద్ర స్వామి కాస్త అమ్మ ఇంత చెప్పినా కూడా నువ్వు ఈ నాగసాధువు దీక్షకి వెళ్లడానికి సిద్ధపడుతున్నావా? అంటే నేను వచ్చిందే నా సాధన పరిసమాప్తి చేసుకోవాలి అని... నేను విశ్వ మోక్షం పొందాలి.., పూర్ణ శూన్య స్థితికి వెళ్ళాలి… దానికి నాకు అడ్డుగా ఏమి వచ్చిన వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అన్ని రకాల దీక్షలను తీసుకొని వెళ్లక తప్పదు. నాకు నేను ఆగకూడదు. అలాగే ప్రకృతి ఇచ్చే మాయలని దాటుకుంటూ వెళ్ళాక తప్పదు. ఇప్పుడు భయపడుతూ కూర్చుంటే ఈ జన్మ కాకపోయినా…. ఏదో జన్మలో అయినా, ఎప్పుడో ఒకప్పుడు చేయక తప్పదు కదా! అదేదో ఇప్పుడే ప్రయత్నం చేసి జయం పొందచ్చు లేదా అపజయం పొందొచ్చు.. ఏదో తెలుస్తుంది కదా! ఆ ప్రయత్నం చేయకుండానే అపజయం పొందుతున్నాను అని భయపడటంలో ఉపయోగం లేదు కదా! ఏ అదృష్టమో ఉండి నాలో మానసిక శారీరక దృఢత్వం కలిగితే…. వాళ్ళు పెట్టే పరీక్షలు దాటుకుంటూ నిలబడగలిగితే నాగసాధువు స్థితికి వచ్చి నాగసాధువుగా మారే యోగం ఉన్నప్పుడు నేనెందుకు వదులుకోవాలి. నేనెందుకు బాధపడాలి…. పరిస్థితులు భయపెడతాయి… బాధపెడతాయి…. వాటిని తట్టుకొని నిలబడగలనా లేదా అనే ప్రకృతి నిత్య పరీక్షలు చచ్చేదాకా పెడుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఈ పరీక్షలను తట్టుకొని నిలబడగలుగుతాను అని అనుకుంటున్నాను. అక్కడ నేను గురువుగారు నేను వేరు అని అనుకోవటం లేదు. నాకు నేను సేవ చేసుకుంటున్నాను అనే భావంలోకి వెళ్లిపోతే సరిపోతుంది. అలాగే నా గురువు నాకు పరీక్షలు పెడుతున్నారు అని చెప్పి నేను అనుకుంటే సరిపోతుంది కదా! గురువు వేరు నేను వేరు అనుకున్నప్పుడే మానసికంగా శరీరకంగా ఆలోచనలో తేడాలు వస్తాయి అని నేను అనుకుంటున్నాను. మీరు శబ్ద పాండిత్యంలో విషయాలు చెప్పారు. కాకపోతే అనుభవ పాండిత్యంలో అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి? అనేది అనుభవం పొందకుండా నేను చెప్పడానికి లేదు. ఇప్పుడు నీటి ఒడ్డున కూర్చుని చెరువులో ఏమున్నాయి అని చెప్పి వర్ణించడం వల్ల ఉపయోగం లేదు కదా! అందులో లోతుకి దిగిన తరువాతనే ఏం జరిగింది…. ఏం జరుగుతుంది…. ఏం జరగబోతుంది…. అనేది తెలుసుకోవాలి. అనుభవం పొందాలి అనుకుంటున్నాను.. అయితే నాగ సాధువుగా మారతాను, లేకపోతే ఆనంద భైరవి సాధన తో పరిసమాప్తి చేసుకొని ఈ దేహ త్యాగం చేయడం జరుగుతుంది ….అనేసరికి సరేనమ్మా! నీ సాధన పరిసమాప్తి కి నేను అడ్డు రాను….. జరిగేది జరగక మానదు… జరగనిది ఎన్నటికీ జరగదు కదా! నీకు నాగ సాధువుగా మారే యోగం ఉంటే ఈశ్వరుడు కూడా ఆపలేడు కదా! నేను భయపెట్టడానికి నీకు ఈ విషయాలు చెప్పలేదు. అక్కడ ఉండి జరగబోయే పరిస్థితులు ఏమిటి అనేది మాత్రమే నీకు అవగాహన కలిగించడానికి మాత్రమే ఇవన్నీ చెప్పడం జరిగింది. నీకు ఈ విషయం జ్ఞానం కలిగిన తరువాత వెళ్ళాలా లేదా అనేది నీ నిశ్చయం మానసిక స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్న నాకు అభ్యంతరం లేదు. నువ్వు వెళ్లినా పర్వాలేదు… నువ్వు ఈ దీక్ష తీసుకోకపోయినా పర్వాలేదు…. నేను ఇక దాని గురించి మాట్లాడను. ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు కదా! నువ్వు అన్నట్లు ప్రయత్నం చేస్తే జయం పొందచ్చు.. అపజయం పొందచ్చు. ప్రయత్నం చేయకుండా భయపడటం వలన ఎలాంటి ఉపయోగం లేదు. పోతే ప్రాణాలు పోతాయి లేదా ప్రాణాలు శూన్యంలో కలిసిపోతాయి. ఏదో ఒకటి తాడోపేడో తేలుతుంది కదా! తెగించిన వాడికి తెడ్డే గతి అనే విశ్వాసంతో ఉంటూ ఈ క్షేత్రంలో అంతర్గత గుహలో ఒక నాగమాత నాగసాధువు దీక్షలో ఉన్నారని తెలిసింది. ఆవిడ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను. ఆవిడ అనుగ్రహం పొంది ఆవిడ పెట్టే పరీక్షలు తట్టుకొని నువ్వు నిలబడగలిగితే నువ్వు నాగ సాధువుగా తిరిగి వస్తావు. లేదంటే మేము ఇంక పిల్లలని తీసుకొని యధావిధిగా కాశి క్షేత్రానికి వెళ్లిపోవడం జరుగుతుంది అనేసరికి… సరే అయ్యా ! నా అదృష్టం బావుండి ఆవిడ ఎవరో ఉన్నారు అని చెప్తున్నారు కదా… ఆవిడ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి. ఇక్కడే విషయం ఏమిటో తెలిసిపోతుంది కదా! ఆవిడ పెట్టే పరీక్షలకి నేను తట్టుకొని నిలబడతాను అంటే మాత్రం నాగ సాధువు సాధన చేస్తాను. లేదు అంటే దేహ త్యాగం చేస్తాను లేదా ఆనంద భైరవి సాధనలో ఉండిపోవడం ఈ జన్మకి చేస్తాను అనేసరికి …..మహాదేవి కాస్త దానికి బుద్ధి లేదు, అది చిన్న పిల్ల…దానికేం అర్థం కావట్లేదు… ఇంత చెప్పినా కూడా విషయ జ్ఞానం దానికి అర్థం కావట్లేదు అనుకుంట…తెలిసి తెలిసి దాన్ని కష్టాల ఊబిలో పడవేయటం అవసరమా? అయినా దీక్ష తీసుకోకపోతే ఏమవుతుంది…ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమవుతుంది..సాధన పరిసమాప్తి కాకపోతే ఏమవుతుంది. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా మోక్షం పొందడం జరగచ్చు. కానీ ఇంతటి కఠిన పరీక్షలు ఈ పిల్ల తట్టుకోలేదు. ఇది చాలా సున్నితమైన అమ్మాయి అని మహాదేవి అంటూ ఉన్నా కూడా…. రుద్ర స్వామి ఏమి పట్టించుకోకుండా….ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, శివ నందిని కూడా ఏమాత్రం ఆగకుండా ఆలోచించకుండా కనీసం వెనక్కి తిరిగి మహాదేవి కేసి చూడకుండా రుద్రస్వామిని అనుసరించడం జరిగింది. ఇలా సుమారుగా ఒక పది కిలోమీటర్లు వీళ్ళిద్దరూ మౌనంగానే ప్రయాణం చేస్తూ ఒక అభయారణ్యం లోపల ఉన్న అంతర్గత గుహ ద్వారం దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు రుద్రస్వామి కాస్త ఆ గుహ ద్వారం వద్దకు వచ్చి మూడుసార్లు తన దగ్గర ఉన్న యోగ దండంతో మూడుసార్లు తట్టేసరికి… ఎవరు నాయనా! అనేసరికి…. అమ్మ నేను పరమహంస నాగసాధువుకి సంబంధించిన వ్యక్తులము…మా అమ్మాయి నాగ సాధువు దీక్ష తీసుకోవాలని మీ దగ్గరికి రావడం జరిగింది అనేసరికి… మీరు పరమహంస సంబంధించిన వ్యక్తులా ! మా గురువుగారికి సంబంధించిన శిష్యులా? మీరు…. అంటే భక్తులం కూడా కాదు, కేవలం ఆయన రాసిన కపాల మోక్ష గ్రంథం చదివి, స్పురణ పొంది శివదీక్షలో ఉన్న వాళ్ళం అనేసరికి… అవునా మీరు ఆయన్ని చూశారా? అంటే లేదమ్మా…! మేము ప్రత్యక్షంగా చూడలేదు, చూసే సమయానికి ఆయన జీవ సమాధి చెందారు అని తెలిసింది అనేసరికి…. లోకానికి అలా చెప్పారేమో, సరే లోపలికి రండి… అంటే లోపలికి వెళ్లేసరికి… ఆవిడ దిగంబర తత్వంలో బంతిపూల మాలతో ఉన్నది. పక్కన ఖడ్గము, త్రిశూలం, ఆయుధములు….మరోవైపు డమరుకం, శంఖము, కనపడ్డాయి. ఎదురుగా పంచముఖాలతో ఉన్న పరమేశ్వరుడు విగ్రహ మూర్తి ఆరడుగులు ఉన్న విగ్రహ మూర్తి కనిపించింది. దాన్ని చూస్తే ఆయన నిజంగానే సజీవమూర్తిగా ఉన్నాడా? అన్నట్టుగా క్షణకాలం పాటు వీళ్ళిద్దరికీ అనిపించింది. సరే నీ పేరేంటి అంటే శివ నందిని తనకి తానుగా పరిచయం చేసుకొని…. తన సాధన విధివిధానం అంతా యోగ జీవితం, భోగ జీవితం అన్ని కూడా పూసగుచ్చినట్లుగా చెప్పినప్పటికీ…. ఆ నాగ మాత కాస్త కళ్ళు మూసుకుని ఈవిడ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా? అని యోగదృష్టితో అన్నీ కూడా చూసి…. అక్షర సత్యమే అని నిజనిర్ధారణ చేసుకున్న తర్వాత…. అమ్మ! ముందు నీకు ఈ నాగసాధువుకి సంబంధించిన పరీక్షలు స్థితిగతులు అవన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చి ఉండాలి కదా… తెలుసా? వాటి గురించి, అంటే మా అయ్య రుద్ర స్వామి చెప్పాడు తల్లి… అంటే అన్ని తెలిసినా తరువాత కూడా ఈ పరీక్షలు తట్టుకొని నిలబడగలను అని నమ్మకం ఉన్నదా? అంటే నా మీద నాకు నమ్మకం లేదు…. ఈశ్వరుడి మీద నాకు నమ్మకం ఉంది. ఈశ్వరుడు కూడా నాలోనే ఉన్నాడు. చేసేది …చేయించేది… అనుభవించేది అన్నీ పొందేది కూడా నాలో ఉన్న ఈశ్వరుడే. ఈ దేహం మాత్రమే నేనుగా చేస్తుంది అనుకోవడం లేదు. నేను అనేది లేదు, ఉన్నది ఆయనే అని ఎంత మానసిక అనుభవ అనుభూతిని పొందడం జరిగింది. అనేసరికి మంచిది తల్లి! జ్ఞాన అనుభూతిని పొందావు. అనుభవంలోకి వచ్చేసరికి ఎన్నో పరీక్షలు మానసిక శారీరక స్థితిగతులు నీకు ఉన్నాయో లేదో నాకు తెలియాలి కదా! ముందు నేను గురువుగా పనికి వస్తాను అని ఉందా అనేసరికి…. నాకు మీరు గురువుగా ఉంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను మీరు మీకు శిష్యురాలుగా పనికి వస్తానా లేదా అనే నిజ నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. నా దైవం నన్ను మోసం చేయదు .ఇప్పటిదాకా నన్ను నిజ గురువు దగ్గరకే పంపించడం జరిగింది. మీరు ఇక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు. మిమ్మల్ని నేను వెతుక్కుంటూ రాలేదు. మా రుద్ర స్వామికి మీ గురించి ఎలాగో తెలిసింది. మీ అనుగ్రహం పొందటానికి నేను రావడం జరిగింది. స్వతహాగా నా ప్రయత్నం అయితే నేను ఏమీ చేయలేదు. నిజ గురువు దగ్గరికి ఎప్పుడు కూడా నిజ శిష్యుడు రాడు…. గురువే రప్పించుకుంటాడు అనే స్పురణ ఉన్నది అనేసరికి…. అవునమ్మా నువ్వు నాగసాధువు సాధన కి వస్తావా రావా అని నువ్వు చేసిన ఆనంద భైరవి సాధనలోనే అర్థమయింది. దానిని దాటుకొని ఆనంద రహిత స్థితికి అంటే నాగసాధువు స్థితికి వస్తావా రావా అని ఎదురు చూస్తున్నాను. సుమారుగా ఆరు సంవత్సరాల నుండి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ క్షేత్ర పరిసరాలలో నీ శక్తి తరంగాలు నాకు తాకటంతో రుద్ర స్వామి దగ్గరికి నా మనిషిని పంపించి….నా గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. నువ్వు నిజంగానే నా దగ్గరికి రాలేదు. నేనే నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. ఎందుకు అంటే నాగ సాధువు దీక్ష నాతో అంతరించిపోకూడదు. నాకంటూ శిష్యురాలు ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని అడుగుతున్నాను. ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు… గాని నా పరీక్షలు తట్టుకోలేక మతి భ్రమణం చెంది…. వెళ్ళిపోతే కొంతమంది పరీక్షలో తట్టుకోలేక భయపడి పారిపోవడం జరిగింది. నిజ శిష్యురాలి కోసం నేను పడిగాపులు కాస్తున్నాను. నా తదనంతరం నువ్వు ఈ విధివిధానముతో ముందుకు సాగాలి అనుకుంటున్నాను అనేసరికి…..అమ్మ! ఈ విషయంలో నన్ను క్షమించండి. కేవలం నేను 41 రోజులపాటు నాగసాధువు దీక్ష తీసుకుని, ఆ శక్తిని పొంది….. నేను మరో క్షేత్రానికి, మరో సాధన విధివిధానానికి వెళ్లిపోవాలి. నాకు ఈ ఆశ్రమ బాధ్యతలు అప్పజెప్పవద్దు. కావాలంటే మీకు ఇంకొక శిష్యురాలు కావాలి…. ఈ సాంప్రదాయం కొనసాగించడానికి అంటే ఆ శిష్యురాలు వచ్చేదాకా నేను ఉంటాను. ఆ శిష్యురాలికి నేను గురుబోధ చేసి ఈ విధివిధానం అంతా చెప్పి ఆ అమ్మాయికి ఆశ్రమ బాధ్యతలని అప్పజెప్పి నేను వెళ్లిపోవడం జరుగుతుంది. మీరు నాకు గురు బోధ చేసి మీ ఆత్మశక్తిని నాలో ప్రవేశింపచేసి మీరు శరీర త్యాగం చేస్తారని మీయొక్క శక్తి తరంగాలు నాకు తాకుతున్నట్టుగా అనిపించింది. నేను ఈ సాంప్రదాయాన్ని కొనసాగించను… నా బదులు మరో స్త్రీ మూర్తికి అర్హత, యోగ్యత, యోగం ఉన్నవాళ్లని ఎంచుకొని నేను ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం జరుగుతుంది. ఇందుకు మీకు సమ్మతం అయితేనే…. నేను సాధన లోకి వస్తాను. సాధనా దీక్ష తీసుకుంటాను… లేదు అంటే నేను ఈ క్షణమే వెను తిరిగి వెళ్ళిపోతాను అంటే… అమ్మ! ఇది నీకు ఒక విధమైన పరీక్ష పెట్టడం జరిగింది. నీకు ఆశ్రమం మీద కానీ……ఆశ్రమం అధిపతిగా ఉండాలని ఏమైనా ఆశ మోహ వ్యామోహాలు ఉన్నాయేమో అని చెప్పి పరీక్ష పెట్టడం జరిగింది. నీకు కీర్తి ప్రతిష్టలు మమకార వ్యామోహాలు ఉన్నాయేమో అని పరీక్ష పెట్టడం జరిగింది. నా తొలి పరీక్షలో జయం పొందావు. నాకు ఈ ఆచార వ్యవహార సాంప్రదాయాలు కొనసాగించడానికి 18 శిష్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. నా తదనంతరం వాళ్ళు అఖండంలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసి…. ఇక్కడ సాధనకి పంపించడం జరుగుతుంది. నూటికి 99 శాతం మంది సిద్దుల కోసం, శక్తుల కోసం పంచభూతాల ఆధీనం కోసం, ఈ ఆశ్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చాలామంది రావడం జరిగింది. ఒకవేళ ఆ ఉద్దేశంతో నువ్వు ఏమైనా వచ్చావేమో అని చిన్నపాటి పరీక్ష పెట్టడం జరిగింది. కాకపోతే నువ్వు పరమహంస అనుగ్రహం పొందావు అంటే…. నీకు ఎలాంటి పరీక్షలు పెట్టవలసిన అవసరం లేదు. మానసికంగా శారీరకంగా దృఢత్వం పొందావా లేదా అనేది నీ సాధన స్థితి గతిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన నిన్ను ఎంచుకున్నారు అంటే…. నువ్వు పరిపూర్ణ శిష్యురాలివి అన్నట్టే. ఇక మేము ఎవరం కూడా పరీక్ష పెట్టడానికి మాకు అర్హత, యోగ్యత, యోగం లేదు. పరమహంస గారు ఎవరో కాదు సాక్షాత్తు నడయాడే అరుణాచలేశ్వరుడు అని చాలామందికి తెలియదు. నిజ అరుణాచలేశ్వరుడు అరుణగిరి రూపంలో ఉంటే…. భౌతికంగా అరుణాచలేశ్వరుడు పరమహంస రూపంలో ఇలా సంచారం చేస్తూ ఉన్నారని ఆయన పరమపదించేదాకా లోకానికి గుప్త సాధన తో గుప్తయోగిగా ఉండి ఆయన పరమపదించడం జరిగింది. ఆ విషయం మేము తెలుసుకునేసరికి చేయి దాటి పోయింది. మరి అలాంటి ఆయన నిన్ను శిష్యురాలిగా పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవి కేవలం సాంప్రదాయం పరంగా మేము పరీక్షలు పెట్టాలి కదా! పెట్టక తప్పదు కదా! అనేసరికి…. మీరు ఎలాంటి పరీక్షలు పెట్టినా పరవాలేదు. మీరు ఎన్ని మానసిక శారీరక పరీక్షలు పెట్టిన నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఇబ్బంది లేదు…. కేవలం పరమహంస శిష్యురాలు అనే భావంతో నన్ను ఎంచుకోవద్దు. నాకు నేనుగా నా సాధన పరిసమాప్తి చేయగలనా లేదా అనేది నాకే తెలియాలి… తెలుసుకోవాలి… ఆయన శిష్యురాలిగా ఉన్నానో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం ఆయన ఆది గురువు… మహా గురువు…ఆయన్ని ఎన్నటికీ మర్చిపోవడం అనేది జరగదు. ఆయన అనుగ్రహంతోనే ఈ స్థితికి రావడం జరిగింది. అలాగే సాధన పరిసమాప్తి చేసుకొని విశ్వశూన్యంలో శూన్యం అవ్వటానికి వెళ్లే అర్హత యోగ్యత యోగం ఉంది అని ఏనాడో ఆయన చెప్పడం జరిగింది. జరిగిపోయింది కూడా… కానీ అది ఎలా జరుగుతుందో అనేది…. నేను అనుభవ పూర్వకంగా తెలుసుకుంటూ…. నేను ఇక్కడ దాకా రావటం జరిగింది. కాకపోతే నాగ గురువుగా మీరు ఎలాంటి పరీక్షలు పెట్టాలనుకుంటున్నారో పెట్టండి.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ… శివ నందిని మౌనం వహించింది.
నాగ మాత వెంటనే… అదేమీ లేదమ్మా! నువ్వు పరమహంసగారి శిష్యురాలివి అంటున్నావు… పరమహంస ఒకప్పుడు నాకు కూడా తాంత్రిక గురువే. ఆయన కారణం లేకుండా ఎవరిని ఎంచుకోరు. పైగా నిన్ను ఆయన ఎంచుకున్నాడు అంటే భావితరాలకి నీ ద్వారా లోకానికి ఏదో చెప్పాలని… తెలియచేయాలని సంకల్పం చేసి ఉండవచ్చు… లేదా నువ్వు లోకోత్తరమైన విషయాలను లోకానికి తెలియజేయడానికి పుట్టిన కారణజన్మురాలు అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ నాగసాధువు సాంప్రదాయ పరీక్షలు అవసరం లేదు. సరాసరి నాగసాధువు దీక్ష తీసేసుకో అంటూ ఉండంగానే…. మెరుపు వేగంతో గాలిలో నుండి 100 మంది నాగసాధువులు సజీవ మూర్తులుగా ప్రత్యక్షమై ఆగు..! నాగ మాతాజీ! ఏం చేస్తున్నారు….. నాగ సాధు సాంప్రదాయానికి విరుద్ధంగా శిష్యులకి పరీక్షలు పెట్టకుండా ఎంచుకోవడం అనేది మన నాగ సాంప్రదాయంలో లేదు కదా! మీ ఇష్ట గురువు శిష్యురాలు అయినంత మాత్రాన గురువు నిజ గురువు అయి ఉండవచ్చు…. శిష్యురాలు నిజ శిష్యురాలు అవ్వాలని ఎక్కడైనా ఉందా? ఈశ్వరుడు మనకి శిష్యుడుగా వచ్చినా కూడా పరీక్షలు పెట్టాల్సిందే అని మన నాగ సాంప్రదాయం చెబుతుంది. పరీక్షలు పెట్టకుండా ఈ అమ్మాయికి ఎలా ఇస్తారు… మీరు చేస్తున్నది తప్పు అని మాకు అందటంతో మేమంతా రావటం జరిగింది అని సుమారుగా పంచగురువులతో ఉన్న నాగసాధువులు కనిపించి, రౌద్రస్వరంతో అరుస్తున్న స్వరం వినిపించేసరికి….ఒక్క క్షణం పాటు నాగ మాతాజీ కలవరపడింది. అయినా ఈ పంచ గురువులు కారణం లేకుండా వీళ్ళు రారు …ఈ అమ్మాయి కోసం వచ్చారా? ఈ అమ్మాయికి ఇప్పుడు పరీక్షలు పెడతారా? ఈ పిల్ల చూస్తే ఏమో లేత వయసులో ఉన్నది…. పరీక్షలు తట్టుకోగలుగుతుందో లేదో కూడా తెలియదు అని మనసులో కంగారుపడుతూ…. అలా ఎం లేదు స్వామి! ఈమె అన్ని పరీక్షలలో నిష్ణాతురాలై మానసికంగా శారీరకంగా దృఢత్వం పొంది ఉంది అని నాకు నమ్మకం కలిగింది. అందుకే సరాసరిగా నాగసాధువు దీక్ష ఇస్తున్నాను అనేసరికి…. ఏ లెక్కన ఇవ్వాలనుకుంటున్నారు? అనేసరికి… తంత్ర విధి విధానంలో కాపాలిక సాధనను, అఘోర సాధనను, ఆనంద భైరవి సాధనలో…సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఈ నాగదీక్ష ద్వారా తన బ్రహ్మ చక్రమునకు శుద్ధి చేసుకోవాలని అనుకుంటుంది. అందుకని మూడు సాధనలు పూర్తి చేసింది అంటే అనితర సాధ్యమే కదా! అని చెప్పి అంటూ ఉండేసరికి… మీకు తెలియనిది కాదు కదా ! ఆ సాంప్రదాయాలు మూడు కూడా ఒక ఎత్తు, మన సాంప్రదాయం ఒక ఎత్తు కదా! మన సాంప్రదాయంలో ఎన్నో కఠినమైన పరీక్షలు సాధకుడు ఎదుర్కోవలసి ఉంటుంది కదా! 12 సంవత్సరాల పాటు కఠినమైన పరీక్షలు ఎదుర్కొని… మానసికంగా, శారీరకంగా వాళ్ళకి దృఢత్వం పొందిన తరువాతనే…. మళ్ళీ మూడు సంవత్సరాల పాటు నాగసాధువు దీక్షకి పనికి వస్తారా లేదా అని పరీక్షలు పెడతాము. అంతిమంగా పరీక్షలు ఎదుర్కోవాలి కదా! ఆ పరీక్షలు ఏమీ లేకుండా… ఏమీ చేయకుండా… ఒక గురువును నమ్మి శిష్యురాలిని ఎలా ఎంచుకోవడం చేస్తాము. అది తప్పు కదా! అది మన సాంప్రదాయ వ్యవహారాలకు విరుద్ధం కదా! అని అంటూ ఎవరమ్మా..! నువ్వు? అనేసరికి శివ నందినికేసి చూసేసరికి…. శివ నందిని కాస్త ఏమాత్రం బెదరకుండా…. తను ఎవరు? తన సాధన విధివిధానం ఏమిటి? అనేది అన్నీ కూడా పూసగుచ్చినట్టుగా చెప్పేసరికి… వాళ్ళకి ఈ అమ్మాయి అన్నీ కూడా నిజమే చెబుతుంది అని చెప్పేసి ముఖంలో ఎక్కడా బెదురు లేకుండా నిర్భయంగా ముఖ కవలికల్లో కూడా బెరుకు లేకపోయేసరికి….
నాగ సాధువు:- సరే ఇప్పుడు నీ బ్రహ్మ చక్ర సాధన కోసం నాగ సాధువు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నావు. మరి ఈ దీక్షకి ఉన్న కఠిన పరీక్షలు తెలుసా?
అనేసరికి… అక్కడే ఉన్న రుద్రస్వామి…
రుద్రస్వామీ:- ఆ తెలుసు స్వామి! నేను అన్ని వివరంగా చెప్పాను..
నాగ సాధువు:- నువ్వు ఎవరివి రా ! నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు?
రుద్రస్వామి:- నేను ఈమెకి తండ్రి వరుస అవుతాను..
నాగ సాధువు:- అంటే సొంత తండ్రివా లేక తండ్రి వరస అవుతావా?
రుద్ర స్వామి:- సొంత తండ్రిని కాదండి…. ఈ సాధనకి సహాయంగా ఉండటానికి నేను తోడుగా ఉంటున్నాను..
నాగ సాధువు:- నువ్వు ఎవడివిరా? తోడుగా ఉండటానికి…. ప్రతి జీవుడికి ఈశ్వరుడే తోడుగా ఉంటాడు కదా ! ఈశ్వరుడు నీడలాగా ఉంటాడు కదా! నువ్వుంటేనే ఆ అమ్మాయి సాధన పూర్తి చేస్తుందా ..?నువ్వు లేకపోతే అమ్మాయి సాధన పూర్తి చేయడం జరగదా ?
రుద్ర స్వామి:- అలా ఏమీ లేదు స్వామి! నేను పేరుకి మాత్రమే విగ్రహ మూర్తిని. నేను ఉన్నా లేకపోయినా…. ఆ అమ్మాయి సాధన పరిసమాప్తి చేసుకుంటుంది…
నాగసాధువు:- మరి ఇక్కడ ఎందుకు ఉన్నావురా! దొబ్బెయ్…
అని వాళ్ళలో ఒకరు గట్టిగా అరిచేసరికి ఏమాత్రం ఆలోచించకుండా రుద్రస్వామి అక్కడ నుంచి మౌనంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత శివ నందిని కేసి చూస్తూ పంచ గురువులలో ఒక గురువు…
నాగసాధు గురువు మరియు శివ నందిని సంభాషణ
గురువు:- అమ్మాయి! ఇప్పుడు నువ్వు సాధనకి ఎంతకాలం సమయం తీసుకుంటావు?
శివ నందిని:- సాధనకి నేను ఇన్ని రోజులు అని పెట్టుకోలేదు స్వామి…. నేను సాధన పరిసమాప్తి చేయగలనా లేదా అనే సందేహం కూడా లేదు… ఈశ్వరుడు సంకల్పించాడు… ఈశ్వరుడే సాధన పరిసమాప్తి చేస్తాడు అని నమ్మకంతో ఉన్నాను..
గురువు:- సాధన చేసేది నువ్వా? ఈశ్వరుడా? శివ నందిని:- నేను అనేది లేదు స్వామి! చేసేది చేయించేది… అనుభవించేది అంతా కూడా ఈశ్వరుడే .
గురువు:- మరి మాట్లాడేది ఎవరు? ఈశ్వరుడా? నువ్వా?
శివ నందిని:- ఈశ్వరుడే మాట్లాడుతున్నాడు. ఈ దేహాన్ని చూస్తే ఈశ్వరి లాగా కనబడుతుంది కానీ,ఈ దేహం లోపల ఉన్నది ఈశ్వరుడు…
గురువు:- అదేంటి అమ్మవారిలో అయ్యవారు ఉన్నారని చెబుతున్నావా?
శివ నందిని:- అంటే సర్వజీవుల్లోనూ…. స్త్రీ, పురుష భేదం లేకుండా ఈశ్వరుడే ఉన్నాడు స్వామి! మానవులు ద్వైతభావం లో ఉండటం వలన స్త్రీ పురుష అంగాలను బట్టి… స్త్రీ పురుష జాతులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏకత్వ భావంలో చూస్తే ఉన్నది ఈశ్వరుడే కదా! సర్వం శివమయం అంటారు కదా!
గురువు:- శబ్ద పాండిత్యంలో చెబుతున్నావా? అనుభవ పాండిత్యంలో చెబుతున్నావా?
శివ నందిని:- అది మాత్రం నేను ఖచ్చితంగా ఇది అని చెప్పలేను…
గురువు:- మరి నీ దృష్టిలో ఈశ్వరుడు అంటే ఎవరు?
(అనేసరికి…. మౌనం వహించింది. పక్కనే ఉన్న ఒక గురువు లేచి…)
బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడితే ఎలాగా? మౌనంగా ఉంటే సమాధానం ఎలా తెలుస్తుంది ? మౌనం మీ సమాధానమా?
శివ నందిని:- ఈశ్వరుడు అనేసరికి నామరూపాలు లేని స్థితి. ఇంద్రియాలకు అగోచరమైన స్థితి. మనసుకి మాటకి అందని స్థితి. అందుకని నేను మౌనం వహించాను. అంతే స్వామి…
గురువు:- నేను అంటే ఏమిటి?
శివ నందిని:- నేను అనేది ఒక అహంకారం. అది మాట ద్వారా వస్తుంది… ఉనికి ద్వారా వస్తుంది… ధనం, అధికారం పేరు ప్రఖ్యాతలు… స్త్రీ, పురుష సాంగత్య కామ కోరికల వల్ల, కామ భావం వల్ల ఎలా అయినా రావచ్చును..
గురువు:- ఇప్పుడు మరి నీలో నేను అనేది ఉందా?
శివ నందిని:- ఆ నేను అనేది పోగొట్టుకోవడానికి నేను సాధన పరిసమాప్తి చేసుకోవాలని చెప్పి వచ్చాను…. అందుకే నేను ఈ సాధనలోకి దిగటం జరిగింది.
గురువు:- మోక్షం పొందేది నువ్వా? ఈశ్వరుడా?
శివ నందిని:- ఈశ్వరుడే మోక్షం పొందుతున్నాడు… ఈశ్వరుడే తెలుసుకుంటున్నాడు… ఈశ్వరుడే సాధన చేస్తున్నాడు… ఈశ్వరుడే తెలుసుకొని అనుభవ అనుభూతిని పొంది, మోక్ష అనుభూతిని పొందుతున్నాడు..
గురువు:-మరి సరాసరి ఈశ్వరుడే వచ్చి ఈశ్వరుడే వచ్చి సాధన చేసుకోవచ్చు కదా! నిన్నెందుకు ఎంచుకున్నాడు?
శివ నందిని:- ఈ దేహం అనేది ఒక ఉపాధి మాత్రమే… దేహానికి చొక్కా ఎలాగో… అలాగే ఈశ్వరుడు తన సాధన పరిసమాప్తి చేసుకోవడానికి నా చొక్కా వంటి దేహాన్ని ఉపయోగించాడు. లోకానికి నేను చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చేసేది చేయించేది ఈశ్వరుడు…
గురువు:- చిలక పలుకులు బాగానే చెబుతున్నావు… శబ్ద పాండిత్యం బాగానే వంట పట్టింది… ఇక అనుభవ పాండిత్యం ఎలా ఉందో చూడాలి…?
అంటూ శిష్యులకేసి గురువు చూసేసరికి ఒక శిష్యుడు వచ్చి తన చేతిలో ఉన్న ఖడ్గముతో శివ నందిని యొక్క నల్లటి వస్త్రాలని పీలికలు పీలికలుగా చేసి నగ్నంగా మార్చేసరికి ఏమాత్రం భయపడకుండా… బాధపడకుండా… ఆవేశం చెందకుండా…. మౌనంగా సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోయింది. ముఖంలో ఎలాంటి సిగ్గు ,భయం లేదు. మేము సుమారుగా 100 మంది మగాళ్ళ మధ్య నువ్వు ఒక ఆడదానివి నగ్నంగా నిలబడ్డావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటే భయంగా అనిపించడం లేదా?
శివ నందిని:- దిగంబర ఈశ్వరుల మధ్య దిగంబర ఈశ్వరుడు ఉన్నట్లే కదా స్వామి… మీరు వేరు, నేను వేరు అనే తత్వం అయితే లేదు… ఉన్నది ఈశ్వరమయమే కదా!
గురువు:- అవునా మరి నీ కాళ్ళ మధ్యలో ఉన్నది ఏమిటి?
శివ నందిని:- కామ దృష్టిలో చూసే వాళ్ళకి ఆడతనం…. యోగ దృష్టితో చూసేవారికి అది సృష్టించే అమ్మతనం..
గురువు:- అయితే ఆడతనం మాకు సమర్పిస్తావా?
శివ నందిని:- ఈ దేహాన్నే సమర్పిస్తాను స్వామి! గురువు:- అంటే దేహం మీద నీకు మమకారం లేదా?
శివ నందిని:- దేహం అనేది కేవలం ఒక ఉపాధి. అది కూడా సాధనకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను.. అది నేను ఉపయోగించుకోవట్లేదు… ఈశ్వరుడు ఉపయోగించుకుంటున్నాడు… ఇప్పుడు దేహ త్యాగం చేయాలి అంటే చేయగలను. ఎందుకు అంటే ఈశ్వరుడు స్వయంగా వచ్చి సాధనకి ఈ దేహం పనికిరాదు. దేహ త్యాగం చేయమని చెప్పి అంటున్నాడు అని అనుకొని నేను దేహ త్యాగం చేయగలను…
(అంటే మాటలు చెప్పడం కాదు అనేసరికి…. తన వస్త్రాలు చింపిన నాగ సాధువు చేతిలో ఖడ్గం తీసుకొని తల నరుక్కోపోయేసరికి… చేతిలో ఉన్న ఖడ్గం కాస్త బంతిపూల మాలగా మారి….శివ నందిని మెడలో పడటం జరిగింది..)
గురువు:- తల్లి నీకు దేహం మీద మమకారం ఉందో లేదో అని పరీక్ష పెట్టాము…. ఈ పరీక్షలో సగం నెగ్గావు…
శివ నందిని:- మేము చేసేది ఏమీ లేదు… పరీక్షించేది శివుడే, అందులో నెగ్గేది కూడా శివుడే,
గురువు:- అవునా అయితే ఈ శివుడికి నేను అభిషేకం చేస్తాను..
(అని నాగసాధువుల్లో ఒక సాధకుడు వచ్చి తన శరీరం మీద ఉన్న లంగోటి తీసేసి …..మర్మాంగం ద్వారా శివ నందిని మీద మూత్రం పోస్తూ…. నా మూత్రం నీకు గోమూత్రంతో సమానం కాబట్టి…. నేను గోమూత్రంతో శివుడికి అభిషేకం చేస్తున్నాను అని చెప్పి అంటూ…. అవహేళన చేస్తూ శివ నందిని దిగంబర శరీరం మొత్తం తన మూత్రంతో తడుపుతూ ఉన్నప్పటికీ కూడా….. ఏమాత్రం చలించకుండా…..ఏమీ అరవకుండా, కోపేద్రేకాలు చూపించకుండా.. చిరునవ్వుతో ప్రశాంత వదనంతో అలాగే నిలబడి ఉండటం పంచ గురువులు సున్నితంగా గమనిస్తున్నారు ఉండేసరికి ….నిజంగానే అది మానవ మూత్ర వాసన రాకుండా, గోమూత్ర వాసన రావడం శివ నందిని గమనించి మౌనం వహించింది. తను ఈ పరీక్షలో కూడా నెగ్గాను అనుకునేసరికి…..)
గురువు:- ఏంటి ఈ పరీక్షలో కూడా నెగ్గాను అనే అహం నీలో మొదలయ్యిందా?
(అని పంచ గురువుల్లో ఒక గురువు అడిగేసరికి.….)
శివ నందిని:- అది అహంకారం కాదు స్వామి! అణుకువ. నేను ఈ పరీక్షలో నెగ్గాను అనేది ఈశ్వరుడి కృపవలనే జరిగింది కదా! అది నేను తెలుసుకున్నాను…
గురువు:- అయినా నీ అఘోర సాధనలో పదార్థమును మార్చే శక్తి వచ్చి ఉంటుంది కదా! అందుకని మా వాడి మూత్రమును గోమూత్రంగా మార్చావా?
శివ నందిని:- స్వామి ఈశ్వరుడు ఈశ్వరుడి ముందు మాయ చేస్తే ఏంటి లాభం? ఎవరికి ఉపయోగం… తెలియని వాడి ముందు ఏవైనా అద్భుతాలు చేయవచ్చు… కానీ తెలిసిన వాళ్ళ ముందు అద్భుతాలు చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి నాకున్న శక్తులను నేను ఉపయోగించుకొని…. ఏదో చెయ్యాలి…మీకేదో చూపించాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు. అలా శక్తులు చూపిస్తే నాలో నాకే తెలియని అహంకార బీజం మొదలవుతుంది అని తెలుసు. అందుకే నాలో శక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని నిక్షిప్తం చేసుకొని…. నేను నా సాధన పరిసమాప్తి చేసుకోవాలి అనుకుంటున్నాను…
గురువు:- అవునా? అంటే నువ్వు ఏ ఆహారాన్ని అయినా భుజించగలవు.., ఆహారాన్ని నీకు ఇష్టమైన ఆహారంగా మార్చగలవు అన్నమాట! ( అని ఒక నాగసాధువు ఈమె దగ్గరికి వచ్చి ఈమె చేతులను చాపమని చెప్పి ఆ చేతులలో మల మును విసర్జన చేసేసరికి….)
శివ నందిని:- శివప్రసాదంగా స్వీకరిస్తాను.. నాకు ఎటువంటి జుగుప్సా అసహ్యం కానీ లేవు అన్నట్టుగా…. ముఖ కవళికలు… వాసనకి కూడా మొహం పక్కకి తిప్పుకోవడం అలాంటివేవీ చెయ్యకుండా….. శివప్రసాదంగా దానిని స్వీకరిస్తాను
అని తినబోయేసరికి ….అది నిజంగానే శివుడికి ఇష్టమైన పాలపాయసంగా క్షణకాలంలో మారేసరికి…. ఈమె ఏం పదార్థములు మార్చలేదు ఈమె సంకల్పమే పదార్థంగా మారింది. అశుద్ధ పదార్థం కాస్త సుద్దమైన పదార్ధంగా మారింది అని పంచ గురువులు నిశిత దృష్టితో గమనించారు. ఈమె ముఖకవళికలు భావాలలో గాని ఎలాంటి అసహ్యకరమైన జుగుప్సాకరమైన భావాలేవీ ప్రదర్శించకుండా అన్నిటిని చిరునవ్వుతో స్వీకరిస్తుందని… పంచ గురువుల్లో ఒకరికొకరు కళ్ళతో మాట్లాడుకుని మౌనం వహించారు. ఇంతలో ఒక శక్తిమాత గురువు లేచి, ఏదో మంత్రాలు చదువుతూ ఉండేసరికి శివ నందిని మెడలో ఉన్న కపాలమాలలు కాస్త ఏడు వారాల బంగారపు నగలుగా మారాయి. వజ్ర వైడూర్యాలతో కూడిన నగలు చూసి….వచ్చిన నాగ సాధువుల్లో కొంతమంది పెడబుద్ధి ఆలోచనలు చేసినప్పటికీ… కూడా శివ నందిని మాత్రం నగలు మారినా కూడా తనకు ఏమీ తెలియదు పట్టించుకోనట్లుగా.. మౌనంగా చూస్తూ ఉండేసరికి,
గురువు:- అదేంటి తల్లి….ఆడవాళ్ళకి బంగారు ఆభరణాలు అంటే పిచ్చి కదా! కాంతకి కనకం అనేది తోబుట్టువు కదా… నీడ లాంటిది కదా… నీకు బంగారపు ఆభరణాలు, ఏడు వారాల ఆభరణాలు…. వజ్ర వైడూర్యాలతో తయారైన ఆభరణాలు కనిపించడం లేదా?
శివ నందిని:- లేదు స్వామి! నాకు మట్టిగానే కనిపిస్తుంది. నాకు మట్టితో చేసిన వస్తువులే కనిపిస్తున్నాయి.. ఈ బంగారాన్ని కూడా మూల పదార్థం మట్టే కదా!
గురువు:- అంటే వీటి మీద నీకు ఎలాంటి ఓంకారం లేదు ….మేము తీసుకోవచ్చు అంటావు ?
శివ నందిని:- సృష్టించిన వాడికి వెళుతుంది. నాకేం సంబంధం స్వామి.!నాది అంటూ ఏదీ లేదు కదా! ఈ దేహమే నాది కానప్పుడు….ఈ దేహం మీద, ఆ వస్తువులు అవేవి నావి కావు కదా !ఈ దేహమే మా తల్లిదండ్రుల నుంచి అద్దె శరీరంతో ఈశ్వర సంకల్పంతో వచ్చింది. కాబట్టి, ఈ దేహమే నాది కానప్పుడు వీటి గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను. ఏదీ కూడా నాది కాదు. నేను వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాను… కాబట్టి నేను పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాను కదా! నాకు ఈ ఆభరణాల మీద, ధనం మీద మోహ,వ్యామోహాలు లేవు స్వామి….ధనం అనేది అవసరాలు తీర్చుకోడానికి కావాలి. కానీ కనీస అవసరాలకి మాత్రమే కావాలి స్వామి.. ఆ అవసరానికి కావలసిన ధనం భిక్షాటన రూపంలో ఈశ్వరుడే ఇస్తాడు. ఆ ఈశ్వరుడే పొందుతాడు. కాబట్టి నేను ధనాన్ని కూడపెట్టుకోవాలి, ధనం సంపాదించుకోవాలి అని తపన తాపత్రయాలు నాకు లేవు. అలా ఉండే స్థితి ఉంటే నేను ఈ యోగ స్థితిలోకి ,ఈ సాధన స్థితికి రావాల్సిన అవసరం లేదు కదా! భోగ జీవితంలో నేను చూడని ధనము లేదు… నేను అనుభవించని బంగారాలు కాదు….మీరు యోగ దృష్టితో ఈపాటికి చూసి ఉంటారు. నాకు ఎలాంటి ధన వ్యామోహాలు, బంగారం మీద వ్యామోహాలు లేవు… ఉన్నాయా లేదో అని మీరు పరీక్ష పెట్టారు. నెగ్గానో లేదో మీకే తెలుస్తుంది…
గురువు:- అంటే ఏంటి మేము ఇక్కడ పరీక్ష ఏ పరీక్ష పెట్టినా కూడా అది పరీక్షా అని తప్పించుకుంటున్నావా? మేము బయటికి వెళ్లిపోయిన తరువాత ఈ ఆభరణాలు అన్ని అనుభవించాలనే కోరిక ఏ మూలనైనా ఉందా? శివ నందిని:- నాకు మీరు ఉన్నా లేకపోయినా ఆభరణాలు అనుభవించాలి…. బంగారం అనుభవించాలి అంటే నాకు క్షణకాలం పట్టదు స్వామి! నేను గుప్తవిద్యలను అభ్యసించి మట్టి నుంచి బంగారం తీస్తాను…. పాదరసం నుంచి బంగారం తీయగలను అని తెలుసు. ఆ విద్యలు నేను ఏనాడు ఉపయోగించలేదు. అవి వచ్చినాయో లేదో వాటిలో సిద్ధి పొందానో లేదో నేను ప్రయోగం చేయలేదు. ఎందుకంటే బంగారం తయారుచేసిన వాడు అంటే రసవిద్య తెలిసినవాడు బైరాగి కావాల్సిందే. బంగారం విద్య తెలిసినవాడు వైరాగ్యం పొందాల్సిందే అని బ్రహ్మదేవుడు శాపం ఉంది కదా!
అనేసరికి సరే అని వాళ్ళు మౌనం వహించారు. ఇంతలో ఒక గురువు కాస్త
గురువు:- ఇదంతా బాగానే ఉంది….. మరి నీలో కామ వికారాలు జయించావా? ఇంద్రియనిగ్రహం పొందావా?
శివ నందిని:- కామ వికారాలు నా అదుపులో ఉంచుకునే స్థితి అయితే ఉన్నది స్వామి! మాయని ఎవరూ జయించలేరు. మాయని అదుపులో ఉంచుకోగలరు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మాయా అనేది సూర్యుడికి సూర్యకాంతి ఎలా ఉంటుందో అలాగే మాయ ప్రతిదానికి అంతర్లీనంగా ఉంటుంది. మాయ లేనిదే ఈ జీవం లేదు…. ఈ సృష్టి లేదు…. మాయను మనం అదుపులో ఉంచుకోవచ్చు గాని, మాయని సంపూర్ణంగా జయించలేము అని నా అభిప్రాయం.
గురువు:- బోడి ! నీ అభిప్రాయాన్ని ఎవరికి కావాలి?. ఇంతకీ నువ్వు కామ వికారాలు జయించావా లేదా ఇంద్రియత్వం పొందావా? లేదా?
శివ నందిని:- ఇదిమితంగా అయితే చెప్పలేను …
అని అంటూ ఉండేసరికి…..ఇలా అర్ధమయ్యి కానట్టుగా…… చెప్పి చెప్పినట్టుగాను చెబితే, మాకు ఎలా అర్థం అవుతుంది అనేసరికి….సుమారుగా ఎనిమిది మంది నాగసాధువులు యువకులు ఈమె దగ్గరికి వచ్చి తమ దిగంబర తత్వం చూపిస్తున్నప్పటికీ మర్మాంగం చూపిస్తూ ఉదృతం అవుతున్నప్పటికీ కూడా…. శివ నందినిలో ఎలాంటి భయము, బెరుకు కామోద్రేకాలు పొందకుండా అంతా కూడా సాక్షిభూతంగా చూస్తూ….. ఉండిపోయింది. ఎనిమిది మంది సాధువుల యొక్క మర్మాంగాలు ఉదృతం అవుతూ ఉండేసరికి, గురువు:- అమ్మాయి వీళ్ళు ఇంద్రియ జ్ఞాన పరీక్షలో అపజయం పొందారు. వీళ్ళ నరాలు దెబ్బతినలేదు…. వీళ్ళకి మానవ మాత్రులకి ఉండే కామోద్రేకంలో వెయ్యి శాతం ఉద్రేకం ఉన్నవాళ్లు. సుమారుగా ఆడదాని స్పర్శ కోసం 12 సంవత్సరాల నుంచి కామపిశాచాలుగా పడి తిరుగుతున్నారు. అన్ని ఆలోచించుకో….వీళ్ళు గాని ఇప్పుడు నిన్ను కామ వికారంలో పడేస్తే,నువ్వు గాని కామోద్రేకం చెందితే ఇక్కడితో అన్ని రకాల దీక్షలు పూర్తి చేసుకొని మోక్షసాధనకి పనికిరాకుండా పోతావు. మతి భ్రమణం చెందుతావు. అన్ని ఆలోచించుకో! పరీక్షకి నువ్వు నిలబడతావా?
శివ నందిని:- చేసేది చేయించేది ఈశ్వరుడే. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. నేను నామమాత్రంగా ఉంటాను. మీరు చేయవలసింది చేయాలనుకుంటే మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి. నాలో ఇసుమంత ఇంద్రియానిగ్రహం కోల్పోయినట్లయితే….. నాకు నేనే మీ ముందే దేహ త్యాగం చేసుకుంటాను. సాధనకు పనికిరాని దేహంతో నేను వెళ్లి బతకాల్సిన అవసరం లేదు.
అనేసరికి….. ఈవిడ మనోధైర్యాని ఒకింత ఆశ్చర్యపోతూ….. పంచ గురువులు కాస్త సరే మీరు చేయాల్సింది మీరు చేయండి…. అని యువసాధకులకు చెప్పేసరికి, వాళ్ళు దొరికిందే అవకాశం అని చక్కని చుక్క మనకి దొరికింది అని చెప్పేసి శివ నందిని దేహం మీదకి ఒక్కసారిగా ఎగబడే సరికి….. శివ నందిని ఏమాత్రం అదరకుండా, బెదరకుండా ఉండేసరికి వాళ్ళు రకరకాలుగా ఆమెను కామోద్రేక పరుస్తూ తమ చేతులతో…స్తనాల మీద, యోని భాగం మీద, నడుము మీద, వీపు మీద, మెడ దగ్గర… చేతులు తొడల భాగం దగ్గర ముద్దులు పెడుతూ… కామసూత్రంలో చెప్పిన ప్రక్రియలు అన్నీ కూడా తెలిసినా వారిలాగా చేస్తున్నప్పటికీ కూడా…. ఇసుమంత కూడా శివ నందిని చలించకుండా శివనామ స్మరణ చేస్తూ… మనసుని ధ్యానం మీద పెడుతూ…. దేహాన్ని వీళ్ళకి అప్పచెప్పే స్థితిగతులను గమనించిన పంచ గురువులు ఇంక ఆపండి… ఈమె ఇంద్రియనిగ్రహ పరీక్ష కూడా నెగ్గింది అనేసరికి… ఇక వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్లిపోవడం జరిగింది. వీళ్ళు చేసే చేష్టలకి మామూలు స్త్రీ అయితే ఆ కామోద్రేకాన్ని తట్టుకోలేక శృంగార వాంఛ తీరక క్షణకాలంలోనే మతి భ్రమణం చెంది పిచ్చిదానిలాగా మారిపోయి వెళ్ళిపోయే స్థితి వచ్చే ఉండేది అని శివ నందిని మనసులో భావం వచ్చింది. ఈమె భావాన్ని చదివిన పంచగురువుల్లో ఒకరు అది నిజమే తల్లి..! అని చెప్పి అనేసరికి….అంటే మనసులో కూడా మనం ఏమీ అనుకోకూడదు అని అనుకొని శివనామస్మరణ చేస్తూ వాళ్ళకేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అమ్మాయి మేము నాగ సాధువులుగా మారే శిష్యులకి పెట్టే పరీక్షలు యధావిధిగా నీకు పెట్టడం జరిగింది. కాకపోతే 12 సంవత్సరాల తర్వాత ఒక్కో గురువు వచ్చి ఒక్కొక్క రకంగా పరీక్షలు పెడతారు. వాళ్ళు ఏ పరీక్షలు అయితే పెడతారో…. అవే పరీక్షలు నీకు ఈ 12 గంటల్లో పెట్టడం జరిగింది. కాబట్టి నువ్వు అన్ని పరీక్షల యందు నెగ్గావు. నిజ గురువుకు తగ్గ నిజ శిష్యురాలు అయ్యావు కాబట్టి….నీకు నాగదీక్ష ఇవ్వటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఈ దీక్షకి అర్హురాలివి. నీకు అర్హత, యోగ్యత,యోగం ఉన్నాయి అని పంచగురువుల్లో సూర్య ఉపాసన చేసిన గురువు లేచి ఆవిడకి గురు మంత్రపదేశం చేయటం జరిగింది. ఆ తర్వాత విష్ణు ఉపాసన చేసిన ఒక గురువు వచ్చి శివ నందిని యొక్క తలనీలాలు అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత శక్తి ఉపాసన చేసిన గురువు వచ్చి స్మశాన విభూతితో శివ నందిని దిగంబర శరీరం మొత్తం పూయటం జరిగింది. ఆ తర్వాత శివోపాసన చేసిన గురువు వచ్చి రుద్రాక్ష మాల ధారణం చేయడం జరిగింది. ఆ తర్వాత గణపతి ఉపాసన చేసిన గురువు వచ్చి ఈమెకి మర్మాంగం కనిపించకుండా అంగవస్త్రం చుట్టడం జరిగింది. ఇంతటితో పంచ క్రతువులు పూర్తి అయినాయి. ఈమె శరీరం పరిశుద్ధం అయ్యింది అంటూ…. అక్కడే ఉన్న నాగ మాతాజీ కేసి చూస్తూ ఈమె శివ పంచాయతన పూజ విధి విధానం….శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు ఆరాధన మంత్రాలు చెప్పించి వాటి ఉపాసనలను దగ్గరుండి చేయించండి. శివుడి నుంచి మృత్యు భయము జయించే తత్వం పొందే లాగా…. అలాగే విష్ణువు నుంచి మోహ మాయ ఎలా జయించాలో తెలుసుకోవాలి. అలాగే శక్తి నుంచి ధర్మం ఎలా కాపాడాలో తెలుసుకోవాలి. సూర్యుని నుంచి నిష్టగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. గణపతి నుంచి సకల విద్యలు యుద్ధ విద్యలు అన్నీ తెలుసుకుని…హఠ యోగం ద్వారా పంచభూతాలను, కాలమును అధీనం చేసుకునేలాగా…. సాధన స్థితి మీరు ఆమెను దగ్గరుండి బోధించాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శివ పంచాయతన పూజ చేసి… శివ పంచాయతన ఆరాధన పూర్తి అయిందో ….ఆఖరి సారిగా మేము ఈవిడకి ఇంద్రియ జ్ఞాన పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షలో ఆమె విజయం పొందితే ఈమెను సేవక నుంచి మహాపురుష, మహాపురుష నుంచి నాగసాధువుకి మారుతుందని మీకు తెలుసు కదా! ఇప్పుడు గురు సేవలు పూర్తి అవ్వటంతో నీకు 12 సంవత్సరాల పాటు చేయవలసింది…. 12 నెలల్లో పూర్తి చేస్తుంది. దానితో సేవక స్థితి నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే శివ పంచాయతన పూజలో ఉపాసన సిద్ధి పొందుతుందో….. సిద్ద జ్ఞానం పొందుతుందో…. అప్పుడు మహా పురుష స్థితిని దాటడం జరుగుతుంది. ఇక చిట్ట చివరగా ఇంద్రియ జ్ఞాన పరీక్షల్లో నెగ్గితే నాగసాధువుగా వస్తుంది కాబట్టి… సంవత్సరం తర్వాత మేము మళ్ళీ అంతిమ పరీక్ష పెట్టడానికి తిరిగి వస్తాము. అప్పటిదాకా ఈమెని నాగసాధువుల్లో సేవకస్థితి, మహాపురుష స్థితిని దగ్గరుండి పూర్తి చేయండి అని నాగమాతకి ఆజ్ఞ ఇచ్చి…. వాళ్ళు క్షణకాలంలో అదృశ్యం అవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు చెప్పినట్లుగానే శివ నందిని నాగమాతకు గురుసేవ చేయడం ఆరంభించింది. శ్రద్ధ భక్తులతో ఒక తల్లికి బిడ్డ ఏ విధంగా అయితే సేవలు చేస్తుందో… ఆమెతో కన్నతల్లిగా ఉంటూ సేవలు చేస్తూ ఆమె చెప్పిన ప్రతి పని కూడా శ్రద్ధ భక్తితో అనురక్తితోను ఏమరపాటు లేకుండా….ఏమీ ఆలోచించకుండా అన్ని పనులు కూడా ఓపికతో, శ్రద్ధతో, సహనంతో ఆసక్తితో చేయడం ఆరంభించింది. త్వరలోనే మాతాజీ అనుగ్రహమును ప్రేమ, ఆప్యాయతలను ఒక్కొక్కటిగా పొందడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ చెప్పిన శివపంచాయతన పూజా విధివిధానం…. చేసుకుంటూ శివోపాసనలో సిద్ధి పొందడానికి మృత్యు భయమును జయించడానికి మూడు నెలలు పట్టడం జరిగింది. ఆ తర్వాత విష్ణు ఉపాసనలో మోహమాయ జయించడానికి మరో రెండు నెలలు పట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ శక్తి ఉపాసనలో ధర్మంగా ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి మరో మూడు నెలల సమయం పట్టింది. ఈలోపుల ఈమెకి అన్ని రకాల వేద పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, ఇతిహాస గ్రంధాలలో అనుభవ జ్ఞానంలో శబ్ద పాండిత్యమును సమయానుకూలంగా పరిస్థితులను బట్టి మాతాజీ నుంచి అంతర్గత భావాలు…. అంతర్లీన అర్థాలతో పురాణ గ్రంధాలు చదివి వినిపిస్తూ… చదువుకుంటూ…. తెలుసుకుంటూ… ఉండమని చెప్పింది. అభ్యాసము చేయడం కూడా జరిగింది. పంచభూతాలను ఆధీనం చేసుకుని…. దేవతలను ఆధీనం చేసుకుని…. క్షుద్ర శక్తులను తిప్పికొట్టే మంత్రాలు, అలాగే భూతప్రేత పిశాచ రాక్షస మోహిని,కామిని , యక్షినీ లాంటి తాంత్రిక దేవతలను వశం చేసుకోవడం….ఇతరులకు పట్టిన వాటిని వదిలించడం… వాటి మంత్రాలను కాష్మోరా, బాణావతి వంటి తంత్ర విద్యా ప్రయోగానికి సంబంధించిన ప్రయోగ మంత్రాలను ఇలా ఎన్నో రహస్య మంత్రాలను ఒక్కొక్కటిగా సమయానుకూలంగా మంత్రపదేశం చేస్తూ…. ఆ మంత్రసిద్ది పొందేటట్టుగా మంత్ర జపం చేసుకుంటూ జపశక్తి అయ్యేటట్టు జపం పూర్తి అయ్యేటట్టుగా… మాతాజీ శివ నందినికి చేయించడం చేయిస్తూ రావడం జరిగింది. అలాగే దీనితో పాటు హఠయోగంలో ఉండే షట్ కర్మలు కూడా ఒక్కొక్కటి చేయిస్తూ వాటిలో సిద్ధి పొందేటట్టుగాను…. పంచభూతాలను కాలమును ఎలా అధీనం చేసుకోవాలి… అధీనం అయిన శక్తులను ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి మూల రహస్య విద్యా జ్ఞానమును కూడా ఈ మాతాజీ సవివరంగా శివ నందినీకి చెబుతూ….. వాటిలో సిద్ధి పొందేటట్లుగా నిష్ణాతులు అయ్యేటట్లుగా చేయడం ఆరంభించింది. ఇలా ఆ తర్వాత పంచాగ్ని సాధన అనగా 4 వైపులా హోమగుండాలని పెట్టుకొని…. మిట్ట మధ్యాహ్నం సూర్యునికేసి చూస్తూ…. పంచాగ్ని సాధన చేస్తూ సూర్య మండలం మీద ఆధిపత్యం ఎలా పొందాలి….. తద్వారా కాలాతీత స్థితికి, కాలమును ఎలా జయించాలి? త్రికాలజ్ఞానం ఎలా పొందాలి? అలాగే కాలాతీత స్థితికి ఎలా వెళ్లాలి అని చెప్పేసి దాని యొక్క సూర్య తంత్ర రహస్య విద్యలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా శివ నందినికి చెప్పడం ఆరంభించింది. ఇలా ఒక్కొక్కటిగా సిద్ధి పొంది మంత్రాలలోనూ, ఆసనాలలోనూ, హఠయోగంలోనూ నెమ్మదిగా సిద్ధిపొందుతూ…ఈమె పొందుతుందో లేదో ఎక్కడైనా ఆగితే ఆ లోపాలను సరి చేస్తూ ఒక బిడ్డకి తల్లి ఏ విధంగా తప్పులు, ఒప్పులు బిడ్డకి సరిచేస్తే సహనంగా ఉంటూ వాటిని నేర్పిస్తూ ఎలా అయితే ఉంటుందో అలా తన అంత బాగా తయారు చేసే విధంగా నాగ మాతాజీ అహర్నిశలు శివ నందిని విషయంలో కష్టపడుతూ…. అన్నింటి యందు సిద్ధి పొందేలా చేయటం జరిగింది. ఇలా సరిగ్గా 12 నెలలు అనగా సంవత్సరం కాలంలోనే శివ నందిని కి అన్నిటి యందు అంటే అన్ని మంత్రాలయందు, సిద్ధి పొందటం, అలాగే ఆసనాల యందు, రహస్య రసయోగ విద్య యందు, రహస్య మంత్రాల యందు కూడా సిద్ధి పొందడం జరిగింది. ఆ తర్వాత ఈ పంచగురువుల రాక కోసం ఆఖరి అంతిమ పరీక్ష అయిన ఇంద్రియ జ్ఞాన పరీక్ష కోసం వీళ్లిద్దరు ఎదురు చూడటం జరిగింది.
ఇది ఇలా ఉండగా శివ నందిని లో ఉన్నట్టుండి కామ ఆలోచనలు జరుగుతున్నప్పటికీ… తన మర్మాంగం లో ఎలాంటి స్పందనలు లేకపోవడం అనుభవంలోకి రావడం జరిగింది. ఇది ఎలా జరిగిందో ఆమెకి అర్థం కాలేదు అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు మాతాజీ కాస్త ఏమిటి ఆలోచిస్తున్నావు? అనేసరికి లేదమ్మా! నాలో కామ కోరికలు ఉన్నాయి… కానీ దానికి తగ్గట్టుగా నా మర్మాంగం ఉద్వేగం చెందడం లేదు. అలాగే నా స్తనాలలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు అనేసరికి…..ఏమీ లేదమ్మా! మా దగ్గర కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు…. కొన్ని రకాలైన ఆసనాలు… కొన్ని రకాలైన ఆహార పదార్థాలతో నీకు తెలియకుండానే నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ రసాయనాలను నీ మర్మంగాలకి, నీ స్తనాలకి పూయటం జరిగింది. అలాగే నువ్వు తినే ఆహారంలో మూలికా పదార్థం కలవడం జరిగింది. అలాగే నువ్వు చేసిన ఆసనాలలో కొన్ని రకాల రహస్య ఆసనాలు కూడా వేయించడం జరిగింది. ఆ ఆసనాల వలన నీ మర్మాంగం లోని నరాలు కామకోరికలు ఉదృతం పరిచే నరాలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ఈ విషయం నువ్వు ముందు చెబితే కంగారు పడతావని చెప్పేసి చెప్పలేదు అనేసరికి…. మరి ఆ స్థితి పొందినప్పుడు ఇంకా అంతిమ పరీక్ష పెట్టడం ఎందుకు? ఇంద్రియ జ్ఞాన పరీక్ష పెట్టడం ఎందుకు? అంటే ఇప్పుడు కామ భావాలు కలుగుతున్నప్పటికీ…. నీలో మర్మాంగం పనిచేయట్లేదు కానీ, మర్మాంగం పని చేయనప్పుడు ఒక విధమైన కామోద్రేకాలకు గురి అవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే కామకోరికలు కలిగినప్పుడు కామకోరికలు తీర్చుకోకపోతే….. మనిషి ఎలా అయితే కోపావేశాలకు లోనయ్యి…. విచక్షణ జ్ఞానం కోల్పోయి…. బుద్ధి పెడదారి పట్టడం జరుగుతుందో….. భార్య ఇవ్వకపోతే పరస్త్రీ అయినా ఇస్తుంది కదా సుఖానికి అని పరస్త్రీ వ్యామోహంలో పడటం జరుగుతుంది కదా, వివాహం కాని వాడు పదిమందితో తిరుగుతాడు, వివాహం అయినవాడు భార్యతోనే సంసార సుఖం పొందుతాడు కదా, ఎప్పుడైతే భార్య సుఖాలు ఇవ్వట్లేదు….కామ సుఖాలు ఇవ్వట్లేదో అప్పుడే పక్కదారులు పట్టడం జరుగుతుంది కదా ఇప్పుడు అలాంటి పరిస్థితులలోనే నీకు కామ ఆలోచనలు వస్తున్నాయి…. కానీ వాటికి నీ శరీరంలోని అంగాలు అందుకు సహకరించట్లేదు. తద్వారా నీకు తీవ్రమైన కోపావేశాలు కలుగుతున్నాయా… శాంతంగా ఉంటున్నావా…. అనేది వాళ్ళు పరీక్ష పెట్టడం జరుగుతుంది అనేసరికి…. ఓహో! అందుకేనా దాన్ని ఇంద్రియ జ్ఞాన పరీక్ష అన్నారు. మరి కామ భావాలు, కామ ఆలోచనలు ఆపడం ఎలాగా? శ్వాస తో పాటే ఆలోచనలు వస్తాయి కదా అంటే….తల్లి….!తమోగుణము, రజోగుణము, సత్వ గుణము ఉంటే…. సత్వ గుణంలో ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి… తమోగుణం ఉంటే కామ ఆలోచనలు కలుగుతాయి… రజోగుణం ఉంటే మిగిలిన రెండు కలిపి కలుగుతాయి… అందుకనే త్రిగుణాలని మాయ అని చెప్పడం జరిగింది. ఇదే శివుడి యొక్క త్రిశూలానికి సంకేతం. ఈ శుద్ధ తత్వంలో నువ్వు ఎక్కువగా ఆపాదించుకోగలిగితే ఆ శుద్ధ గుణము ఉంటే మిగిలిన గుణాలను నువ్వు అణిచి పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు చూసే దాన్ని బట్టి నీ భావం ఉంటుంది. యద్భావం తద్భవతి అంటారు కదా..! కామ దృష్టితో చూసేవాడికి…. అది ఆడతనం శృంగార భావంగా కనబడుతుంది. ఆడతనాన్ని అమ్మతనంగా యోగ దృష్టితో చూస్తాడు. అదేవిధంగా నీకు వచ్చే కామ ఆలోచనలను కూడా ఎవరి మీద కలుగుతున్నాయి అనేది నువ్వు ఆలోచించుకో..! ఆ మనిషి యొక్క శరీరాన్ని చూడకుండా…. అందులో ఉన్న పరమేశ్వరుని చూడు. అప్పుడు నీకు శరీరం మీద కామ ఆలోచనలు రావు కదా! అనేసరికి, అంటే శరీరంకేసి చూడటం వలన….ఆ శరీరంలో ఉన్న ఈశ్వరుని చూడకపోవటం వలన….నాలో కామ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి శివ నందినీకి అర్థం అయ్యి…. ఆ విధంగా సాధన కొనసాగించడం మొదలు పెట్టింది. ఎక్కువగా తనకి కామ ఆలోచనలు కలిగించేవి….శివ స్వామియే కదా! శివ స్వామి శరీరం మీద తనకి మమకారం మోహ వ్యామోహాలు ఒకరకంగా చెప్పాలంటే…. ఆనంద భైరవి సాధనలో శివసాంగత్యంలో 80% పూర్తిగా నాశనం అయిపోయినాయి. కానీ ఇంకో 20 శాతం ఉన్నాయని ఒక విధమైన అవగాహన వచ్చింది. కానీ ఆయన శరీరం నగ్నంగా చూసినప్పటికీ…. దిగంబర తత్వమే కనిపిస్తుంది కానీ, ,ఆయనతో రమించాలి సుఖ సౌఖ్యం పొందాలి అని ఆలోచనలు వస్తున్నాయని గ్రహించింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కాబట్టి తనకి కామపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి కానీ, ఆ ఆలోచనలు తగ్గట్టుగా తన శరీర అంగములు మర్మాంగం స్పందించడం లేదు అని ఒక అవగాహన మొదలైంది. కానీ అది అనుకున్నంత తేలికైన విషయం కాదు అని అనుభవంలోకి రావటం జరిగింది. ఎప్పుడైతే తనలో తీవ్రమైన కామ కోరికలు వస్తున్నాయో…. ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలో…. అర్థం కాక ఆ కోరికలు తీర్చుకోవడానికి శరీర అంగాలు సహకరించకపోవడంతో…. తీవ్రమైన కోపోద్రేకాలకు, ఆవేశానికి, మాట తడబడటం, నత్తిగా రావడం అన్ని పనులలో ఏకాగ్రత కోల్పోవడం, చిరాకు, ప్రతి పని యందు శ్రద్ధ లేకపోవడం….ఇవన్నీ కూడా తనకి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని శివ నందినికి అనుభవంలోకి రావటం జరిగింది. దీన్ని ఎలా నిగ్రహించుకోవాలి…. ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేది శివ నందినికి ఒక పట్టానా అర్థం కాలేదు. ఇక ఇదే విషయాన్ని మాతాజీ కి చెప్పుకునే సరికి అమ్మ! నేను కూడా ఈ ఇంద్రియ జ్ఞాన పరీక్షలోనే ఇంతవరకు నేను జయం పొందలేదు. అందుకని నన్ను నాగోస్ కిందనే ఉంచారు. కానీ, నాగ సాధువు కింద ఉంచలేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ కామ ఆలోచనలు ఎలా దాటాలో అర్థం కాక ఇలా గుప్తంగా ఎవరికి తెలియకుండా…. నేను ఒకదాన్ని ఉన్నానని….నాగ దీక్షలో సాధన చేస్తున్నానని… లోకానికి తెలియకుండా ఈ గుహలో ఉండి సాధన చేస్తున్నాను. నాకు తెలియని విషయాన్ని నేను చెప్పలేను తల్లి…. నీకు నువ్వే విషయం తెలుసుకుని అందులో జయం పొందితే…. ఆ విషయం జ్ఞానం నేను పొంది నేను జయం పొందటానికి వీలవుతుంది అనేసరికి….ఈ అర్థం కాని సమస్యకు పరిష్కారం ఎవరు చెప్తారు. దీన్ని మనం ఎలా జయించాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి….. మనసులో పదేపదే ఆలోచనలు చేస్తూ, వచ్చే కోపాన్ని ,ఆవేశాన్ని, చిరాకుని, అవ లక్షణాలు అన్నిటిని కూడా ప్రకటితం చేస్తూ ఎలా దాటాలి? ఎలా చేదించాలి? ఒకటికి పది సార్లు అదే ఆలోచనలతో కొనసాగిస్తూ ముందుకు సాగింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత శివ నందిని కి అసలు తనకి ఎవరి మీద కామోద్రికాలు కలుగుతున్నాయి అని ఆలోచనలు చేస్తూ ఉండేసరికి నూటికి నూరు శాతం శివ స్వామి మీద తప్ప ఇంకెవరి మీద ఆలోచనలు రావటం లేదు అని చెప్పేసి అనుకొన్నది. అప్పుడు శివ స్వామిని తన బిడ్డగా భావన చేస్తే కామోద్రికాలు తగ్గుతాయో లేదో అని చెప్పేసి….. శివ స్వామిని కామోద్రేకం, కామ ఆవేశం వచ్చినప్పుడు స్తనాలను తాకుతున్న అనుభూతులు కలుగుతున్నప్పుడల్లా…. పిల్లవాడు పాల కోసం స్తనాలను తాకుతున్న భావంలోకి తనలోని ఆలోచనలను మార్చుకోవటం జరిగింది. కామ భావం కాస్తా పుత్రభావంగా మారడం జరిగింది. ఈ విధంగా కామోద్రికాలు, కామ భావాలు కలిగినప్పుడు…. లేదా కామ ఆలోచనలు వచ్చినప్పుడు….. దానిని కామ భావంగా చూడకుండా…. దానిని పుత్రభావంగా చూడటం మొదలు పెట్టింది. అంటే భర్తని కాస్త పుత్రుడిగా ఊహించుకోవడం మొదలుపెట్టిందన్నమాట! దానితో 50% ఆమెకి ఆలోచనలు తగ్గుతూ…. పుత్ర భావం పెరుగుతూ ఉండేసరికి తనలో కోపావేశాలు బదులు సంతోషం, ఆనందం కలగడం జరిగింది. ఎందుకంటే పిల్లవాడు తల్లిపాలు తాగితే ఏ విధంగా భావోద్రేకానికి వెళ్తూ ఆనంద పడుతుందో…. అదే విధంగా తన దగ్గరికి శివ స్వామి వచ్చి స్తనాలను తాకుతున్నట్టుగా భావన వచ్చినప్పుడు…. తనకి ఆకలి వేస్తుందేమో! ఆహారం కోసం పాలు ఇవ్వాలి కాబోలు., నా బిడ్డ నా దగ్గరికి పాల కోసం వచ్చాడు అని అనుకుంటూ ఉండేసరికి….తన స్తనం నుంచి పాలు రావటం స్వప్నంలో జరగటం ఆ తరువాత నిద్ర లేచినప్పటికీ…నిద్ర నుంచి బయటికి వచ్చినప్పటికీ…. తన స్తనం నుంచి పాలు రావటంగమనించింది. అదే సాధనకి ముందు అయితే ఇదే విధంగా శివ స్వామి వచ్చి తన స్తనాల మీద చేతులు వేస్తున్నప్పుడు…. తీవ్రమైన కామోద్రేకాలకు లోనైపోయి స్వప్నంలోనే వీర్య స్ఖలనము అయ్యే పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది…భావం మారింది… కామ భావ సమయంలో పుత్ర భావం రావటంతో వీర్య స్ఖలనము బదులుగా స్తనాల నుంచి పాలు కారటం గమనించింది. అసలు కామ ఆలోచనలు, కామ భావాలు రాకుండా ఎలా చేయాలి అనుకుంటూ ఉండేసరికి….అసలు ఆయన మీద నాకు భర్త అని కాకుండా గురుదేవుడు అని భావన చేస్తే నాకు కామ ఆలోచనలు రావు కదా…., కామ ఆలోచనలు, కామ భావాలు రావు కదా! అలాంటప్పుడు కామోద్రేకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉద్రేకాలకు తగ్గట్టుగా అంగాలు పనిచేయకపోయినప్పటికీ…. తనలో ఉన్న భావాలన్నీ మారిపోతాయి కాబట్టి, కోపావేశాలు తగ్గి మనశ్శాంతి వస్తుంది కదా! చూసే దృష్టిలోనే తేడా ఉంది. కాబట్టి ప్రతి పురుషులలోనూ ఈశ్వరుని చూడగలిగితే…. కామ భావం బదులు తండ్రి భావం లేదా పుత్ర భావం లేదా దైవ భావం కలిగితే వాళ్ల మీద మనకి కామ ఆలోచనలు, కామ భావాలు ఎలా వస్తాయి….కాబట్టి యద్భావం తద్వాతి అనుకుంటూ…. తన భావం బట్టి తనలో కామోద్రేకాలు తట్టుకోలేని విధంగా వస్తాయని… కామ ఉద్రేకాలు తీరకపోతే అరిషడ్వర్గాలు తన మీద ప్రభావం చూపిస్తాయని…. చెప్పేసి ఒక అవగాహన రావటంతో ఇదే విషయాన్ని మాతాజీ కి చెప్పేసరికి ఇది అవ్వటానికి అవకాశం ఉంది. కాకపోతే ఇది ఆచరణకి ఎంతవరకు అమలు అవుతుందో తెలియదు. ఉన్నట్టుండి మనకి భర్త మీద, పరపురుషుని మీద పవిత్రమైన భావం రావాలి అంటే అది కష్ట సాధ్యం. ఎందుకంటే నేను ఈశ్వరుడిని భర్తగా భావించుకొని సిద్ధి పొందడం జరిగింది. ఎందుకంటే నాగసాధువులు సహజంగా ఈశ్వర అనుగ్రహం పొందటానికి 16 రకాల అలంకారాలు చేసుకోవడం జరుగుతుంది. అందంగా తయారవ్వటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పురుషుడిని ఆకర్షించే విధంగా ప్రవర్తించడం, మాట తీరు, నడవడిక అన్నీ కూడా మారిపోతాయి. పురుషులే ఆ విధంగా పొందుతున్నప్పుడు… సహజ సిద్ధ లక్షణాలు ఉన్న మనం ఏమాత్రం ఆలోచించకుండా…. 16 రకాలుగాఅలంకరణ చేసుకోవడం ఏమంత ఇదేమీ కాదు. సుమారుగా 20 సంవత్సరాల నుంచి నేను శివున్ని నా భర్తగా భావన చేసుకుంటూ…. నేను ఆయన భార్యగా ఉంటున్నాను అని భావ ప్రప్తి పొందుతూ ఉండటం జరిగింది అనేసరికి….. అమ్మ శివుడు ఉన్నాడు అనుకుంటేనే ఈ తిప్పలన్నీ వస్తాయి. నిజానికి శివుడు లేడు, శివుడు శవం అయ్యాడు.. అన్నప్పుడు నీకు శవం మీద కామభావాలు కలుగుతాయా ? మీ భర్త చనిపోయాడు…. నీ భర్తతో శృంగారం చేయమంటే చేయగలరా? ఆలోచించండి…. భర్త శవం చూసినప్పుడు…..శృంగార ఆలోచనలు ఎలా కలుగుతాయి అనేసరికి ….అలా అంటావేంటి? శివుడు బతికే ఉన్నాడు కదా! అంటే…..శివుడు బతికే ఉన్నాడు అన్నప్పుడు శివం శవం అయింది అని ఎందుకు అంటున్నారు. అది ఆలోచించండి….శివం శవం అయ్యిందని చెప్పి మనకి ఏ దేవుడు గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ శివం శవం అయ్యిందని చెప్పడం, శివుడు స్మశానవాసి అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి… శివుడు ఉన్నాడు అనుకున్నంత మాత్రాన మనకి భర్త, గురువు తేడా… ఇంకో ఆలోచన వస్తూ ఉంటాయి. భర్త అనే ఆలోచనలు మరింతగా పెంచుకోవడం వలన మీకు మరింత కామ భావాలు, కామోద్రికాలు కలగటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన లేడు అని భావనలోకి వెళ్లి… ఆరాధన చేయండి. ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అనేసరికి….ఇంకేముంది ఆకారతత్వం కాస్త నిరాకార తత్వమే కదా! అంటే మనం పొందవలసింది ఆకారతత్వం నుంచి నిరాకార తత్వమునకే కదా.! వెళ్లాల్సింది నిరాకార తత్వమే కదా! శూన్యంలో నుంచి ఎలా అయితే వచ్చామో తిరిగి అదే శూన్యంలో శూన్యం అవ్వాలి కదా! అదే కదా పూర్ణం మోక్షం అనేసరికి…..అవును కదా ! అది నిజమే కదా! నేను శివమాయను దాటాలా? అనేసరికి అవునమ్మా! శివకామ మాయని మీరు దాటాలి లేదా శివ మోహమాయను దాటాల్సి ఉంటుంది. శివుడు ఉన్నాడు… అని అనుకున్నంత వరకు కామా మోహ వ్యామోహాలు శివుడి మీద కలుగుతూ కలుగుతాయి. అదేవిధంగా నా గత జన్మాంతర భర్త అయిన శివ స్వామి మీద అదే విధంగా భావాలు కలుగుతున్నాయి. ఈయననే నేను భర్తగా అనుకోవడం మానేసి… పుత్రుడిగా అనుకోవటంతో…. నా కామ భావాలు తగ్గిపోయాయి. అలాగే నువ్వు శివం శవం అయిందని నీ భర్త చనిపోయాడని ఆరాధన చేసుకో! అప్పుడు నువ్వు సాకారం తత్వం నుంచి ఆకార తత్వానికి, ఆకార తత్వం నుంచి నిరాకార తత్వానికి వెళ్లడం జరుగుతుంది కదా! అప్పుడు నీ సాధన పరిసమాప్తి అవుతుంది కదా అనేసరికి….. అవును కదా నిజమే కదా అయితే, నేను దీనిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆచరణ చేస్తాను. ఎంతవరకు సాధ్యా సాధ్యం పడతాయో అనేది అవగాహన వస్తుంది అనేసరికి…. వీళ్ళిద్దరూ కూడా వాళ్లకి వచ్చిన ఆలోచనలన్నీ అచరణలో పెట్టడానికి అని చెప్పేసి….ఈ సాధనకు ఉపక్రమించడం జరిగింది. ఇలా సుమారుగా మూడు నెలల పాటు ఇదే భావంతో అనగా శివ నందిని కాస్త పుత్ర భావంతో…..గురు మాతాజీ కాస్త గురువు లేదా లేడు అనే భావంతో సాధన చేయడంతో కామ భావాలు కామ ఉద్రేకాలు దాదాపు 80 శాతం తగ్గు ముఖం పట్టడం గమనించారు. ఇన్ని సంవత్సరాలలో రాని స్థితి కేవలం మూడు నెలల్లోనే తాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడం సాధనాభివృద్ధి అవ్వటం… వీరిద్దరికీ అంతులేని సంతోషం ఇచ్చింది. ఈ అంతులేని సంతోష సమయంలోనే పంచగురువులు కాస్త తమ శిష్య గణాలతో అదృశ్యం నుంచి దృశ్యం లోనికి రావడం జరిగింది. వీళ్ళని చూడగానే వాళ్ళిద్దరూ కూడా నమస్కారాలు చేసేసరికి….. అక్కడే ఉన్న గురు మాతాజీ కేసి చూస్తూ ఏమైంది? ఈ అమ్మాయి మంత్రసిద్ధి పొందిందా ? అంటే ఆ మంత్రసిద్ధి పొందింది స్వామి! ఆసన సిద్ధి పొందింది .హఠయోగ సిద్ధి పొందింది…. పంచభూతాల మీద సిద్ధి పొందింది….కాలాతీత సిద్ధి పొందింది. పంచాగ్నిలో కూడా సిద్ధి పొందింది. ఇంద్రియ నిగ్రహ సిద్ధి కూడా పొందడం జరిగింది. ఇక మీరు అంతిమ పరీక్ష పెట్టి ఆమెకి నాగసాధువు స్థితి పొందటానికి అర్హత ఉందో లేదో అని నిరభ్యంతరంగా పరీక్ష పెట్టుకోవచ్చు అనేసరికి….. సరే అని అంతిమ ఇంద్రియ జ్ఞాన పరీక్షకి ఈమెను సిద్ధం చేయండి అని శిష్యులకి చెప్పేసరికి… శివ నందిని దిగంబరంగా ఉండటంతో ఆరుబయట మిట్టమధ్యాహ్నం పూట ఎండలో ఒంటి కాలు మీద నిల్చోబెట్టడం జరిగింది. అలాగే రెండు చేతులలోనూ నీటి కుండలు పెట్టడం జరిగింది. మెడ మీద భుజాలపైన బలమైన ఇనుప యోగ దండం సుమారుగా 20 నుంచి 30 కేజీలు ఉన్న ఇనుప యోగ దండం వేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా ఒక్కొక్క స్తనానికి 10 కేజీల బరువు వస్తువులను కట్టడం జరిగింది. అలాగే ఈమె మర్మాంగానికి బరువైన ఇనుప గొలుసులు వేలాడదీయడం జరిగింది. అలాగే ఈ మర్మాంగం లోపల గాజు సీసాలను పెట్టడం జరిగింది. ఈమె ఏమాత్రం కదిలిన మెదిలినా….. ఆలోచనలు చేసినా ….తన మర్మాంగం లో ఉన్న గాజు సీసా క్షణ కాలంలో పగిలిపోతుంది. తన ప్రాణాలు అనంత వాయువులో కలిసి పోతాయి అని శివ నందినికి అర్థం అయింది. అలాగే కదలకుండా, మెదలకుండా తను హఠయోగ సిద్ధి పొంది ఉండటంతో…. ఏమాత్రం భయపడకుండా, బెదరకుండా నిశ్చల స్థితిలో అలాగే ఉండిపోసాగింది. సుమారు ఈమె చుట్టూ 12 అడుగుల ఎత్తులో మంటలు హోమాగ్ని నాలుగు వైపులా నాలుగు పెట్టడం జరిగింది. ఆ వేడిమి శరీరాన్ని తాకుతున్నప్పటికీ కూడా ఏమాత్రం బాధ పడలేదు… ఎందుకంటే తను పంచభూతాలలోని అగ్నితత్వమును అగ్నిసిద్ధి పొంది ఉండటం వలన….. ఆ వేడి శీతలం కలిగిస్తుంది. అయితే అలాగే నీటి కుండలలో వాళ్ళు అమర్చిన బరువులు అన్నీ కూడా భూతత్వ సిద్ధి పొంది ఉండటం వలన ఆమెకి అవి పెద్దగా బరువుగా లేవు…. కానీ, చూసే వారికి అవి అతి బరువుగా బరువును పెట్టడం జరిగింది అని అనుకుంటారు. కానీ నిజానికి అవి భూమిని తీసుకువచ్చి ఆమె నెత్తి మీద పెట్టినా కూడా దూదిపింజలా అనిపించే సాధన స్థితికి శివ నందిని ఏనాడో చేరుకోవడం జరిగింది. భూతత్వ సిద్ధి పొంది ఉండటంతో.., ఇది మనకి ఏమాత్రం పెద్ద విషయంగా అనిపించలేదు. ఈ విషయం గమనించిన పంచ గురువులు ఈమె పంచభూత సిద్ధి పొంది ఉండటం వలన ఈమె మనసుని చలింప చేయడం లేదు…. శరీరాన్ని కదిలించడం లేదు అని అవగాహన రావటంతో పంచ గురువులు కాస్త ఈమె శరీరాన్ని ఒకరు నాకటం…. ఒకరు తాకటం..ఒకరు ఒత్తడం ఇలా కామ ప్రక్రియలతో ఈమెని ఉద్రేకం కలిగించాలని విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈమె రొమ్ములను అలాగే ఆ గాజు సీసా తీసేసి మర్మాంగం చిరుగంటలతో మోదటం ఆరంభించారు. ఇలా సుమారుగా 12 గంటల పాటు ఏకధాటిగా శివ నందిని పై గురువులు చేస్తున్నప్పటికీ కూడా….. శరీరం వాళ్లకి అప్పజెప్పేసి మనసుని శివుని మీద ధ్యాస పెట్టడంతో శరీరానికి ఏం జరుగుతున్నా కూడా ఈమె పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అలాగే వాళ్ళు ఆయుధాలతో ఈమె శరీరమును…. వివిధ రకాలుగా గాయపరిచి దానిమీద కారం పూసి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అరవకుండా,భయపడకుండా,బాధపడకుండా ఇదం శరీరం పరోపకార్థం అని నిశ్చల స్థితిలో స్థాన మూర్తి లా ఉండిపోవటం పంచ గురువులను గమనించారు. ఇలా 72 గంటల పాటు పరీక్షలు పెడుతూ…. పంచ గురువులు సహన శక్తిని కోల్పోయారు కానీ, శివ నందిని ఏమాత్రం చలించకుండా ఇంద్రియ నిగ్రహంతో కదలకుండా మెదలకుండా స్థానముర్తిగా ఉండిపోయేసరికి…. ఇక ఈమెను పరీక్ష పెట్టడం తమ వలన కాదు అని….ఇక అనవసరం అని ఈమె నాగసాధువులకే నాగసాధువుగా మారింది అని జ్ఞాన స్ఫురణ కూడా అందడంతో ఈమెను అన్ని రకాలుగా పరీక్షల నుంచి బంధ విముక్తి చేసి శివ నందినీకి నాగసాధువుగా అర్హత, యోగ్యత, యోగం ఉంది అని….. తర్వాత శివ నందిని చేత వీర హోమం చేయించి, ఆ హోమంలో తన వస్త్రాలన్నీ దహింపచేసి పరిపూర్ణంగా తల్లిదండ్రులకి అలాగే తనకి పిండ ప్రధానము చేయించుకొని భవ బంధాల నుంచి, సమాజం నుంచి, బాధ్యతలనుంచి విముక్తి పొంది….లోకానికి బతికి ఉన్న శవంలాగా ఉండు అని అనుగ్రహిస్తూ….నాగ సాధువు అని….అక్కడ ఉన్న మిగిలిన నాగ సాధువుల సమక్షంలో ఈమెకి నాగసాధువు స్థితి పొందింది అని చెప్పడం జరిగింది. దానితో వీళ్ళందరూ కూడా ఈమెను నాగసాధువు కింద అంగీకరించి చప్పట్లు ధ్వనులతో… గిం కార ధ్వనులతో, శంఖ నాదాలతో డమరుక నాదములతో తమ ఆనందం ప్రకటించడం చేస్తూ….. తమ సంతోషాన్ని పంచుకుంటూ…. శివ నందిని తమ జట్టులోకి ధర్మం కాపాడే నాగ సాధువుగా ఎంచుకోవడం జరిగింది. ఇక ఇంతటితో శివ నందిని కాస్త నాగసాధువుగా మారిపోవడం జరిగింది. అలాగే మిగిలిన సాధువులు అంతా కూడా క్షణకాలంలో అదృశ్యం అవ్వడంతో… శివ నందిని మరియు గురుమాత కలిసి గుహలోపలికి వెళ్లి అంతిమంగా కామానందం కలిగించే ఆనందమాయస్థితి నుంచి ఆనంద రహిత స్థితి పొందటానికి…. బ్రహ్మ చక్రంలో కలిగించే బ్రహ్మానందం నుంచి బ్రహ్మానంద రహిత స్థితి పొందటానికి మౌనంగా సాధనలో నిమగ్నం అవ్వడం జరిగింది. ఇంతటితో శివ నందిని యొక్క తంత్రసాధన అనగా కాపాలిక సాధన ,అఘోర సాధన, భైరవ సాధన, నాగ సాధువు సాధన పరిసమాప్తి అవడంతో…. సహస్ర చక్రం సాధన కోసం అని చెప్పి ఏ క్షేత్రానికి వెళ్ళాలో అని స్థానమూర్తీ విగ్రహ మూర్తిని అడగాలని అనిపించడంతో…... ఆ నాగమాత ఇచ్చిన మాతంగి విగ్రహా మూర్తిని చేతులలో తీసుకొని…. ఆవిడకి నమస్కారం చేసుకొని…. ఆ విగ్రహ మూర్తిని తనలోనే నిక్షిప్తం చేసుకొని…. తన సహస్ర చక్ర సాధన కోసం…. మరో క్షేత్రానికి వెళుతున్నాను అని ఆవిడ అనుమతి తీసుకుని అక్కడి నుంచి ఆ గుహ నుంచి బయటకు వచ్చి యధావిధిగా రుద్ర స్వామి వాళ్ళు ఉండే సత్రం వైపుకి కాషాయ వస్త్రధారిగా బయలుదేరడం జరిగింది.ఒకవేళ ఈ నాగ సాధువు దీక్ష పరీక్షలో నాగసాధువులు విఫలం అయితే, అపజయం పొందితే ….వాళ్లు మరుజన్మలో నపుంసక హిజ్రాలుగా పుట్టడం జరుగుతుంది. తద్వారా ఇలాంటి వాళ్ళు స్త్రీగా పుట్టిన వాళ్లు పురుషులుగా మారటం, పురుషులు స్త్రీలుగా మారి నిజ హిజ్రాలుగా మారడం జరుగుతుంది. ఈ నిజ హిజ్రాలను దైవాంశ సంభూతులుగా మనం అంతా కూడా పరిగణించడం జరుగుతుంది అని కాషాయ వస్త్రధారిగా అయిన శివనందినికి జ్ఞాన స్ఫురణ అందడంతో…..హిజ్రాల వెనుక ఉన్న నాగసాధు యొక్క దీక్ష పరీక్షలు ఉన్నాయని అనుకుంటూ రుద్ర స్వామి వాళ్ళు ఉన్న సత్రం వైపుకి అడుగులు సాగించింది.
ఇంతటితో శివ నందిని తంత్రసాధన పూర్తి అయింది..
సత్రం వద్దకు వెళ్ళిన శివ నందినిని చూసి రుద్ర స్వామి, మహా దేవి, పిల్లలు సంతోషంతో ఆమె దగ్గరికి వెళ్ళారు. అక్కడ తను చేసిన నాగ సాధువు సాధన స్థితిగతులు మరియు ఆమెకు వచ్చిన మాతంగి విగ్రహ మూర్తిని కూడా చూపించడం జరిగింది. అందరూ ఇది విని చాలా సంతోషించారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేసుకుని సత్రంలోని గదిలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఇలా విశ్రాంతి తీసుకుంటున్న రుద్రస్వామి తో శివ నందిని కాస్త…. అయ్యా నాగ సాధువు సాధన తో నేను బ్రహ్మ చక్రం యొక్క జాగృతి శుద్ధి ఆధీనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అదే ఇతర సాధన స్త్రీ మూర్తులకి లేదా సాధకులకి ఈ చక్రం యొక్క సాధన దక్షిణాచారంలో ఎలా ఉంటుంది అని అడిగేసరికి రుద్ర స్వామి చెప్పడం జరిగింది. ఇతర చక్రాలకు మాదిరిగానే ఈ బ్రహ్మ చక్రము సాధన కూడా పరమహంస గారు తన కపాల మోక్ష గ్రంథంలో దక్షిణాచారంలో ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని పొందుపరిచారు. ఈ చక్ర సాధనలో మేఘ గర్జన నాదం వినిపిస్తుంది.సాధకునికి మేఘగర్జన నాదము వినబడుతుందని...ఇది ఏకపాదుడి అనుగ్రహ సంకేతమని...ఈ నాదము విని భయపడి ధ్యానము నుండి బయటికి రావద్దని...ధ్యానమును అలాగే కొనసాగించాలని చెప్పడం జరిగింది.ఓంకార నాద సాధన చేస్తున్న సమయంలో ధ్యానము నందు వివిధ దేవతల యొక్క చేతి ముద్రలు తరుచుగా కనిపించడం… అనగా శ్రీరాముడి అభయముద్ర, దక్షిణామూర్తి చిన్ముద్ర, పరమ శివుడి ఆజ్ఞ ముద్ర, వెంకన్న స్వామి వరద ముద్ర ఇలా దైవాల చేతి ముద్రలు కనిపించటం జరుగుతుంది. ఎక్కువగా ఈ బ్రహ్మ చక్రము సమయంలో అక్ష మాల ముద్ర, కపాల ముద్ర, నరసింహ ముద్ర అయితే బ్రహ్మ చక్రం స్థితులకు ఉపయోగపడినాయి అని పరమ హంస తన కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది.వీటితో పాటుగా కపాల దర్శనము, కపాల మాల రావడం, కపాల యానం ఇవన్నీ అనుభవాలుగా చెప్పడం జరుగుతోంది. ఇక్కడ మనకి నేనే దేవుడిని అనే అహం బ్రహ్మాస్మితత్వంలోకి సాధకుడు వెళ్ళడం జరుగుతుంది. కాలమే తెలియని స్థితి…. భావము లేని స్థితి. ఆలోచన రాని స్థితి. శాంతి కలిగే స్థితి. బ్రహ్మానందము పొందే స్థితిని…సాధకుడు అనుభూతి చెందుతాడు. ఎవరైతే బ్రహ్మ చక్ర ఆధీన స్థితికి వస్తారో వారికి ఏకైక భావ స్థితి కోసం సాధన అనగా ఏకపాద శివమూర్తి లాగా సాధన చేయాల్సి ఉంటుందని…. ఇట్టి చక్ర స్థితిలో సాధకుడు తను ఒక బ్రహ్మ స్వరూపమని అనుభూతి పొందసాగుతాడు.అనగా హనుమాన్ కాస్త భవిష్య బ్రహ్మగా, శ్రీ లాహిరి కాస్త శూన్య బ్రహ్మగా, శ్రీ త్రైలింగ స్వామి కాస్త జ్ఞాన బ్రహ్మగా, శ్రీరాముడు కాస్త తారకరామ బ్రహ్మగా, అమ్మవారు కాస్త ప్రకృతి బ్రహ్మగా, మహావిష్ణువు కాస్త స్థితి బ్రహ్మగా, మహాశివుడు కాస్త లయ బ్రహ్మ గాను, వేదవ్యాసుడు కాస్త శబ్ద బ్రహ్మ గా, మహా బ్రహ్మ కాస్త సృష్టి బ్రహ్మగా, అరుణాచల రమణ మహర్షి కాస్త మౌన బ్రహ్మగా, పరమంహంస గారు కాస్త శూన్య బ్రహ్మగా అనుభూతి పొందడం జరిగినది. ఈ చక్రంలో సాధుడికి వచ్చే లక్షణాలలో…..కోరికలు తగ్గిపోతాయి. రుచులు పట్టించుకోవటం ఉండదు. ఆకలి అనిపించదు. నిద్రపోవాలని అనిపించదు. ఏమి పని చేయ బుద్ది కాదు. ఏమి చెయ్యలేము. ఏమి చేయాలో అర్థంకాని స్థితి. తినబుద్ధి కాదు. పడుకో బుద్ధి కాదు. పడుకుంటే లేవాలని అనిపిస్తుంది. లేస్తే తిరగాలని అనిపిస్తుంది. తిరిగితే కూర్చోవాలి అని అనిపిస్తుంది. కూర్చుంటే పడుకోవాలని అనిపిస్తుంది.పడుకుంటే లేవాలని అనిపిస్తుంది. నిద్ర రాదు. మెలుకువ స్థిరంగా ఉండదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఎవరిని కలవాలని అనిపించదు. ఎవరిని చూడాలని అనిపించదు. దేని కోసం ప్రాకులాడాలని అనిపించదు. ఏమి చేయాలని అనిపించదు. ఏదో పొందాలని అనిపించదు. పొందినామని ఆనందము అనిపించదు. బాధ అనిపించదు. దుఃఖము అనిపించదు. మానవమానాలు పట్టించుకోదు. తిట్లు పొగడ్తలు ఒకటే అనుభూతి. ఎదురు మాట్లాడాలని అనిపించదు. సమాధానం చెప్పాలని అనిపించదు. ఎవరినైనా తిట్టాలి అని అనిపించదు. దేనికి స్పందించాలని అనిపించదు.చావాలి అని అనిపించదు. బ్రతకాలి అని అనిపించదు. దేనికి బ్రతుకుతున్నామో తెలియాలని అనిపించదు. అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకోవాలని అనిపించదు. ఉంటే తింటాము. లేకపోతే లేదు. ఉంటే అనుభవించటం. లేదంటే లేదు. ఇది కావాలని అనిపించదు. ఇది లేదు అనిపించదు. ఇది పోయిందని బాధ అనిపించదు. దీనికి దెబ్బ తగిలిందని బాధ అనిపించదు. దీనికి రోగము వచ్చినదని భయము అనిపించదు. జననాలును చూసిన ఆనందము అనిపించదు. మరణాలు చూసిన చలించాలని అనిపించదు.పూజలు చేయాలని అనిపించదు. మంత్రాలు ప్రార్థనలు చదవాలి అని అనిపించదు. జ్ఞానము పొందాలని అనిపించదు. శబ్ద పాండిత్యము అనుభవ పాండిత్యములు పొందాలని ప్రయత్నాలు చేయాలని అనిపించదు. సత్ గ్రంథాలు పారాయణాలు చేయాలని అనిపించదు. యాత్రలు చేయాలని అనిపించదు. గుడికి వెళ్లాలని అనిపించదు. సినిమాలు చూడాలని అనిపించదు. ఆనందం ఇచ్చే వాటిని తీసుకోవాలని అనిపించదు. తపన తాపత్రయం లేవు.రాగ ద్వేషాలు లేవు. సుఖ దుఃఖాలు లేవు. అరిషడ్వర్గాలు లేవు. సప్త వ్యసనాలు లేవు. గుణాలు లేవు. కర్మలు లేవు. మాయలు లేవు. మర్మా లు లేవు. అన్నింటికి సాక్షీభూతంగా ఉండటం. అన్ని తెలుసుకుని మౌనంగా ఉండటం. దేనికి స్పందించాలని అనిపించదు. ఎవరితోనూ చర్చించాలని అనిపించదు. ఇది కావాలని అనిపించదు. ఇది లేదు అనిపించదు. ఇక ఏదో కావాలని అనిపించదు. ఇంకా ఏదో పొందాలని అనిపించదు. అన్నీ ఉంటాయి. ఏమి కావాలో తెలియదు. ఏది వాడుకోవాలని అనిపించదు. దొరికితే తినటం లేదంటే లేదు. తెలుసుకోవలసిన అవసరం ఉండదు. ఇతరులకు చెప్పవలసిన అవసరం ఉండదు.ఏదో చేయాలని అవసరం ఉండదు. మమతానురాగాలు ఉండవు. ప్రేమ ఆప్యాయతలు ఉండవు. పాపపుణ్యాలు ఉండవు. మోహ బంధాలు ఉండవు. బంధవిముక్తులు ఉండవు. మరణించిన ఏమీ లేదని బ్రతికున్న ఏమీ లేదని మట్టి బంగారము ఒక్కటేనని ఉంటాయి. వీరియందు ఇట్టి స్థితి శూన్య బ్రహ్మ స్థితి అని యోగ శాస్త్రాల ఉవాచ. ప్రస్తుతము మేమిద్దరము ఉండటానికి వేర్వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ మా సాధన స్థితులు అలాగే మా ఆత్మ స్వరూపాలు స్థితి ఒక్కటే కాబట్టి శూన్య బ్రహ్మ స్థితిలో ఉండడం జరుగుతుంది అని పరమ హంస తన కపాల మోక్షం గ్రంథంలో చెప్పడం జరిగింది. లాహిరి మహాశయులు తన డైరీలో(పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి గ్రంథ) రాసుకోవడం జరిగినది. ఆయన జ్యోతి బిందువుని ఆత్మ సూర్యుడు గాను మరికొన్నిచోట్ల బ్రహ్మ జ్యోతి గాను సంబోధించడం జరిగినదని అలాగే వీరికి ఈ జ్యోతి బిందువు నుండి స్త్రీ- మాత, పురుష- పితృ రూపాలు ఏర్పడినట్లు గా అనగా ఎనిమిది సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక అనగా కాస్త మాతృ రూపము (బాల రూపము) 12 సంవత్సరముల వయస్సు ఉన్న బాలుడు పితృ రూపము ఏర్పడినట్లుగా ధ్యానానుభవాలు కలిగినట్లుగా నాకు అర్థమైనది. ఇలాంటి దివ్య జ్యోతి దర్శనం నా జిజ్ఞాసికి గూడ అయినట్లుగా తర్వాత నాకు తెలిసినది. అలాగే శ్రీ శంకరాచార్యుడుకి, శ్రీ త్రైలింగ స్వామికి, రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి ఈ జ్యోతి బిందువు దర్శనము పొందినట్లుగా అలాగే ఇందులో ప్రకృతి స్త్రీ -పురుషుల యొక్క బాలిక- బాలుడు దర్శనాలు పొందినట్లుగా వారి చరిత్ర లో చూడడం జరిగినది అని …. ఇలా పరమ హంస గారికి ఏ విధం గా అనుభవాలు అయ్యాయో..ఎలా సాధన చేశారో…. ఇతర సాధకులు కూడా ఇదే విధి విధానంలో పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి మౌనము వహించడం జరిగింది.
శుభం భూయాత్


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి