సహస్ర చక్రము (127)

 సహస్ర చక్రము 



శివ నందిని సహస్ర చక్రం యొక్క జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం కోసం ఏకవీర క్షేత్రానికి వెళ్లాలని చెప్పి సాధనా విగ్రహం చెప్పడంతో వీళ్లంతా ఏకవీర క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఇది మహారాష్ట్రలో మోహూర్ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉన్నది అని ఈ క్షేత్రానికి చేరుకోవటం జరిగింది. అందరూ కూడా హోటల్లో గదిలో ఉండటం ఇష్టం లేక ఈ క్షేత్ర పరిసరాలలో ఉన్న కొండ ప్రాంతంలోనే డేరా వేసుకుని ఉండటానికి ఆసక్తి చూపడంతో…. డేరా వేసుకునే ఏర్పాట్లలో ఉన్నారు.  అప్పుడు మహాదేవి కాస్త శివ నందిని తో అమ్మ! నీ బ్రహ్మ చక్ర సాధన కూడా పరిసమాప్తి అయిపోయింది. రుద్ర గ్రంధి కూడా విభేదనము అయింది కాబట్టి…. ఇక నువ్వు వామాచారం నుంచి దక్షిణాచారానికి రావచ్చును.  ఇక్కడి నుంచి నువ్వు సాధన చేయవలసిన అవసరం లేదు. కాబట్టి, ఈ అమ్మవారి సమక్షంలో ఉన్న దత్తాత్రేయ స్వామి సమక్షంలోనే… నీకు వామాచారం నుంచి దక్షిణాచారానికి సంబంధించిన దీక్ష ఇస్తాను.  యధావిధిగా నువ్వు దక్షిణాచారంలోకి రా అనేసరికి…. సరే అమ్మ!  నీ ఇష్టం తల్లి అనేసరికి… అందరూ కూడా స్నానాధికాలు పూర్తి చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకుని, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులు అయిన… అత్రి అనసూయ మాతల గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఆఖరికి దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత మహాదేవి కాస్త శివ నందిని చేత తంత్ర వస్త్రాలలో నాగసాధువు దీక్షలో ఉన్న తన వస్త్రములు అన్ని తీయించేసి… వామాచార దీక్షకి స్వస్తి పలుకుతూ దక్షిణాచారానికి సంబంధించిన సన్యాస దీక్షకు సంబంధించి కాషాయ రంగు వస్త్రాన్ని ఇచ్చింది.  ఆ తరువాత తన మెడలో రుద్రాక్ష మాలలు వేయడం జరిగింది. ఇక తను ఆ క్షణం నుంచి దత్తాత్రేయ సమక్షంలోనే వామాచారానికి స్వస్తి పలికి దక్షిణాచారంలోనికి దీక్ష తీసుకుని సహస్ర చక్రం జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం కోసం ముద్రాసాధన అభ్యాసం చేయడం ఆరంభించింది. ఈ చక్ర జాగృతి కోసం ప్రాణ ముద్రను హస్తముద్రగా ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ చక్ర జాగృతి కోసం ప్రాణముద్ర, కమల ముద్ర, పద్మముద్ర అని మూడు రకాల ముద్రలు ఉంటాయి. గురు సమక్షంలో వారి శరీరానికి తగ్గట్టుగా…. శక్తి ప్రవాహానికి తగ్గట్టుగా గురువు ఏ చక్రమునకు ఏ ముద్ర వేయవలెను అనేది  చెప్పడం ద్వారా….. ఇప్పుడు ఈమెకి గోపాలస్వామి సమక్షంలో ముద్రల సాధన చేయడంతో…. సహస్రారా చక్ర జాగృతి కోసం శివనందిని ప్రాణముద్ర చెప్పడంతో…. ఆ ప్రాణముద్ర తోనే తన సహస్ర చక్ర జాగృతి కోసమని సాధన అభ్యాసం చేయడం ఆరంభించింది. ఇలా సుమారుగా ఏకవీర ఆలయంలో ఒక వారం రోజులు ధ్యానాభ్యాసం చేసినప్పటికీ ఎలాంటి ధ్యాన అనుభవాలు గానీ, ధ్యాన దృశ్యాలు గానీ కనిపించకపోవడంతో… ఒక విధమైన ఆవేదన, ఆవేశం, కోపం, తెలియని ఆవేదన అర్థంకాని అయోమయ స్థితిలో ఉంటూ ఉండేసరికి…. ఇలా కాదు, మనసు ప్రశాంత స్థితికి రావాలని… శివ స్వామితో మాట్లాడాలనిపించి తన హృదయ చక్రం మీద చేయి పెట్టగానే చెప్పు దేవి!  అని రుద్రాక్ష మఠంలో ఆరాధన చేస్తున్న శివ స్వామి పలికేసరికి… స్వామి!  మిమ్మల్ని చూసి చాలా రోజులైంది…మీతో మాట్లాడాలి అనేసరికి… నాతో మాట్లాడాలా!  నాతో గొడవ పడాలా!  సందేహాలు తీర్చుకోవాలా!  అంటే ఏదో ఒకటి…. మీకు అన్ని తెలుసు కదా!  ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న పెళ్ళికొడుకు కదా మీరు…. నాకు మనసుకి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి వికలమయ్యింది.  ఒక పెళ్లి కాదు…. రెండు పెళ్లిళ్లు కాదు… ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నారు.  నేను ప్రేమలో పడేటట్టు చేసిన తరువాత, ధర్మపత్ని అన్న తరువాత, అసలు విషయం చల్లగా చెప్పారు.  అదేదో ముందు చెప్పాలి కదా!  ఇప్పుడు విషయం చెప్పినంత మాత్రాన నా మనసు ఎలా తట్టుకోగలదు.  ఏకాగ్రత లేకుండా సాధన చేస్తున్నాను అనేసరికి…. సరే దేవి!  మీ అనుమాన భయాన్ని నివృత్తి చేస్తాను అనేసరికి… ఆయన తన పక్కన ప్రత్యక్షంగా కనిపించేసరికి…. శివ నందిని కాస్త ఆనందపడుతూ…. చాలా రోజులు అయింది ఏమీ అనుకోవద్దు అని ఆయన గడ్డాన్ని, మీసాలనీ పీకుతూ…..చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉండేసరికి… తనకి ఈ విధంగా చేయడం వలన మానసిక తృప్తి, ఆనందం, ఉత్సాహం కలుగుతుంది అని చెప్పేసి అనుకొని ఏమీ మాట్లాడకుండా చూస్తూ గమనించి గమనించినట్లుగా ఉండేసరికి….. శివ నందిని కాస్త ఆయన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటూ స్వామి!  మీరు ఏమీ అనుకోకపోతే…. మీకు ఈ జన్మలోనే ఎనిమిది పెళ్లిళ్లు అయ్యాయా?  ఎనిమిది పెళ్లిళ్లు అయినట్టుగా జ్ఞాన స్ఫురణలు పొందారా? నాకు విషయం అర్థం కాలేదు అనేసరికి… అదేం లేదు దేవి ఈ జన్మలోనే నాకు ఎనిమిది పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి  దాకా వచ్చినాయి.  వాటిని దాటుకునేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. వాటిని ఏదో ఒక కారణం చేత తప్పించుకోవడం జరిగింది. ఒక అమ్మాయి విషయంలో ఈ జన్మలో తప్పించుకోలేకపోయాను అని చెప్పి అనేసరికి …. దీక్షాదేవి కదా!  అంటే అవును సహస్ర చక్రంలో ఉన్నప్పుడు వచ్చిన దీక్ష దేవి…. స్వయంగా నా మరదలు అవటం వలన ఆవిడ స్వచ్ఛమైన ప్రేమను కాదనలేక పోవటం, అలాగే తను ఆధ్యాత్మిక స్థితిలో ఉండటంతో…. నేను కాదనకుండా లేచిపోయి పెళ్లి చేసుకోవడం జరిగింది.  ఇంట్లో వాళ్లకి చెప్పకుండా చేసుకోవడం జరిగింది.  కానీ 16 సంవత్సరాలు అయ్యాక అనివార్య కారణాల వలన తన అహంకారంలోనికి లోనయ్యి…. తను కాస్త అప్పటిదాకా నువ్వే అంతా అన్న అమ్మాయి కాస్త, నువ్వు ఎంత అనే స్థితికి లోనయ్యి…. అహంకార మాయలో పడి నన్ను పట్టించుకోకపోవడంతో…. నా ఆత్మాభిమానం దెబ్బ తినటంతో…. తనతో ఇక నెమ్మదిగా కలహాలు గొడవలు రావటం, ఆ తర్వాత తనకు తానే విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం, నా జీవితం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఈ జన్మలో ప్రత్యక్ష వివాహం అంటే అదొక్కటే జరిగింది అనేసరికి…. మిగతా వివాహాల గురించి నాకు చెప్పరా? నా మనసు పీకుతుంది…అనుమాన భయం వేస్తుంది.  ఆలోచనలన్నీ మీ వివాహాల గురించి పరిభ్రమిస్తున్నాయి అంటే… ఆడదాని బుద్ధిని పోనించుకోలేదు శివ నందిని.  నువ్వు కూడా ఆడపిల్లవే కదా! అనుమానం పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టింది అని అంటారు.  ఇది నీ విషయంలో కూడా జరిగింది.  అంటే…. అనుమానం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏదైనా నాకు అనవసరం.  విషయం ఏమిటో తెలుసుకోవాలి. అప్పటిదాకా నా మనసు కుదుటపడదు.  కుతూహలం ఆగదు అని చెప్పి అనేసరికి… ఇప్పుడు విషయం తెలుసుకొని ఏం చేస్తావు?  నాతో విభేదాలు చెంది విడిపోతావా?  అనేసరికి నేనే ధర్మపత్ని అని మీ అంతట మీరే వచ్చారు.  తెలుసుకున్నారు… చెప్పారు… అవునా?  కాదా?  అని చెప్పి అనుకుంటూ ఉండగానే….. నాకు ధ్యాన అనుభవాలు, ధ్యాన దృశ్యాలు ఇచ్చి మీరు గత జన్మలో నా భర్త అని నిరూపణ అవడంతోనే…. నేను మీ దగ్గరికి రావడం జరిగింది.  ధర్మపత్ని అన్నప్పుడు అష్టసతులు ఉంటారని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది.  శ్రీకృష్ణుడికి అష్టసతులు, ఒక ధర్మపత్ని ఎలా అయితే ఉంటారో… అలాగే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వాడి జీవితంలో ఉంటారు అని చెప్పేసి నాకు అర్థం అయింది.  ఈ విషయం ఏదో తెలుసుకుందాం అని చెప్పి అసలు ఎనిమిది మంది మీకు ఎలా పరిచయం అయ్యారు ఏంటి తెలుసుకోవాలని ఉంది అనేసరికి….ఆయన చెప్పడం ఆరంభించాడు. 

మొదట మూలాధార చక్రంలో రాజేశ్వరి అనే అమ్మాయి వచ్చింది అని చెప్పాను కదా!  ఆ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు.  వాడికి చెల్లెలు అంటే నాకు కూడా చెల్లెలే అవుతుంది కదా! ఒకసారి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టేసరికి…. నేను కాదన్నానని, ఒక రోజు ఎవరూ లేని సమయంలో నా దగ్గరికి వచ్చి బట్టలు విప్పతీసి నగ్నంగా మారేసరికి…. ఒక స్త్రీ మూర్తిని నగ్నంగా చూడటం… ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు జరిగింది.  నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కంగారు భయం వేసింది.  పెద్దగా అరిచేసరికి… ఆ పిల్ల పారిపోయింది.  ఆ తర్వాత ఇంక ఆ పిల్లతో ఫ్రెండ్ చెల్లెల్ని ఆ దృష్టితో చూడను… చూడలేను… వివాహం చేసుకోలేను… అని చెప్పేసి అది తెలిసి తెలియని వయసులో అలా యాదృచ్ఛికంగా జరిగింది.  ఆ తర్వాత నేను ఆధ్యాత్మిక స్థితిలో వెళుతున్నప్పుడు ఈ మాయను దాటడం జరిగి, నాకు గణపతి విగ్రహం కాణిపాక క్షేత్రం నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత నా సాధనా స్థితి స్వాధిష్ఠాన చక్రంలో ఉన్నప్పుడు… నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మహాలక్ష్మి అనే అమ్మాయి పరిచయం అయ్యింది.  ఆమె నాకు సహ ఉద్యోగిగా ఉండేది.  ఆమెకి అప్పటికే వాళ్ళ బావతో పెళ్ళి నిశ్చయము అయింది. పెళ్లి చేసుకునే సమయంలో నా మీద పడి నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు అన్నింటిని కూడా నేను కాదని తిప్పి కొట్టడంతో… తన ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోతాను అని కాలు కూడా కాల్చుకున్నా మనసు చలించలేదు.  ఎందుకంటే ఆ పిల్ల పెళ్ళి వాళ్ళ బావతో అప్పటికే నిర్ణయించుకున్న తర్వాత ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ప్రేమ భావాలు కలగలేదు.  పైగా ఆమె రాక్షస ప్రేమ చూపించడం ఆరంభించింది. తను అనుకున్నది జరగాలని… ఎలాగైనా నన్ను ఒప్పించాలని… శృంగార అనుభవాలు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా… నా పరువు తీసే పనులు ఎన్నో చేసినా కూడా…. మౌనంగా చూస్తూ భరిస్తూ రావటం జరిగింది. ఆ తర్వాత తన ఉద్యోగం తీసివేయడంతో వాళ్ల భావన పెళ్లి చేసుకోవడంతో కథా సుఖాంతం అయింది . ఇలా మహాలక్ష్మి మాయను దాటడం వలన నాకు కోల్హాపూర్ నుంచి మహాలక్ష్మి విగ్రహం మూర్తి రావటం జరిగింది. ఆ తర్వాత నా సాధనా స్థితి మణిపూరక చక్రంలో ఉన్నప్పుడు నాకు లలిత అనే అమ్మాయి రావడం జరిగింది. ఆమె పెళ్లి కాని అమ్మాయి.  ఉద్యోగ సమయంలో నాకు పరిచయం అయ్యింది. నేను చెల్లెలిగా భావించినప్పటికీ కూడా ఆమెకి నా మీద విపరీతమైన కామ భావాలు కలుగుతూ ఉండేవి. అప్పటికే ఆమెకి ఒక ప్రియుడు కూడా ఉన్నాడు.  ప్రియుడు దగ్గరకి అప్పుడప్పుడు వెళ్లి సుఖాలు అనుభవించి వస్తూ ఉండేది. ఈ విషయం నాకు వేరే వాళ్ల ద్వారా తెలిసింది. అప్పటికి ఆమె నాకు చెప్పినప్పటికీ ప్రియుడు ప్రియుడే… మీరు మీరే… ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేసరికి ….అమ్మ నేను నిన్ను ప్రియురాలు దృష్టిలో ఎప్పుడూ చూడలేదు.  నా సహ ఉద్యోగి గానే చూశాను.  నా చెల్లెలు గానే భావించాను అనేసరికి…. లోకం కోసం మనిద్దరం అన్నా చెల్లెలుగా అయినప్పటికీ కూడా నాకు మీ సాంగత్యం కావాలి.  మీతో శృంగార అనుభవాలు పొందాలి. కామ వాంఛను తీర్చాలి… లేదు అంటే మీ పరువు తీసేస్తాను.. మీరు నన్ను చెడగొట్టారు అని అల్లరి చేస్తాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి గొడవ చేసి నానా రభస చేయడం జరిగింది.  నాకు నేనే ఆ అమ్మాయి యొక్క ప్రియుడికి విషయం చెప్పేసరికి…. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అయింది.  ఇలా మణిపూరక చక్రం మాయని దాటడంతో రుక్మిణి సమేత పాండురంగ విగ్రహం మూర్తి రావడం జరిగింది. ఇక ఆ తర్వాత అనహత చక్రంలో ఉండగా పిల్లల తల్లి అయిన శివపార్వతి అనే ఆవిడ ఉద్యోగంలో ఉన్నప్పుడు పరిచయం అవ్వడం జరిగింది. భర్త మిలిటరీలో ఉండటం ప్రతిరోజూ తనకి సుఖసంసారం కావాలని ఎడబాటు తట్టుకోలేక…. నా వెంట పడటం ఆరంభించింది.  భర్త ఉండగా కేవలం సుఖం కోసం, సుఖపేక్ష కోసం, కామం కోసం, నా వెంట పడటం నాకు ఒక విధంగా అసహ్యం అనిపించింది. అప్పటికే మా ఆఫీస్ లో ఇద్దరు, ముగ్గురు అక్రమ సంబంధాలు పెట్టుకుందని తెలియడంతో…. నా జోలికి రాకుండా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆవిడతో నాకు విభేదాలు రావడం… ఉద్యోగాలు పోవడం… ఆవిడ వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో…. నా సమస్యకి పరిష్కారం దొరికినట్టు అయ్యింది. ఆ తర్వాత నాకు ఈ చక్రం మాయ దాటడంతో నాకు పండరీపురం నుంచి పాండురంగడు విగ్రహ మూర్తి రావడం జరిగింది. ఆ తర్వాత నా సాధనాస్థితి విశుద్ధ చక్రం లోకి వెళ్ళినప్పుడు గాయత్రి అని చెప్పి ఒక పెళ్లయి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆవిడకి నాకు పరిచయం అవటం జరిగింది. ఆమె దగ్గర నేను ఇంగ్లీష్ పాటలు నేర్చుకోవడానికి వెళితే ఆమె కాస్త కామపాఠాలు చెప్పడం ఆరంభించింది.  నాకు విషయం అర్థం కాలేదు.విచారణ చేస్తే తనకి పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అయినా… పిల్లలు పుట్టకపోవడంతో, తన భర్తకు సంతానం ఇచ్చే యోగ స్థితి లేదని ఐవీపీ ద్వారా సంతానం పొందింది అని తెలుసుకున్నాను.  ఆ తర్వాత ఎన్ని సార్లు ఐవిపికి వెళ్లినా తనకి సంతాన సాఫల్యం పొందకపోవడంతో ….నా ద్వారా సంతానం పొందాలని విశ్వ ప్రయత్నాలు చేయడం ఆరంభించింది. పాఠాలు చెప్పవలసిన ఆవిడ కాస్త కామ పాఠాలు చెబుతూ ఉండేసరికి… నాకు ఏం చేయాలో ఎవరికీ చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక ఆవిడకి, నాకు అనుకోని విధంగా డబ్బు విషయంలో పొరపాత్యాలు రావడంతో… గొడవలు పెరగటంతో ఎవరికి వారే మనకు తీరే అని విడిపోవడం జరిగింది. ఇక నేను ఆవిడ గురించి పట్టించుకోవడం మానేశాను.  ఆవిడ కూడా నా గురించి పట్టించుకోవడం మానేసింది.  నా నుంచి సంతానం పొందే స్థితి ఆమెకి ఇవ్వకపోవడంతో…. నేను ఈ విధంగా ఆమె మాయను దాటడంతో నాకు బాసర క్షేత్రం నుంచి సరస్వతి దేవి విగ్రహ మూర్తి రావటం జరిగింది. 

ఆ తర్వాత నా సాధన స్థితి ఆజ్ఞా చక్రానికి వస్తూ ఉండేసరికి…. జ్యోతిర్మయి అని నా చిన్ననాటి స్నేహితురాలు పెళ్లి అయిన తర్వాత కనపడడం జరిగింది. మా శివాలయానికి జాతర సమయంలో మాత్రమే నాకు కనిపించేది. మా మధ్య ప్రేమ చూపులు ఉండేవి …మాటలు, మనసులు కలిసేవి. కానీ, ఎప్పుడూ కూడా కామ భావాలు …కోరికల ఆలోచన ప్రయత్నం చేయలేదు. ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.  ఇద్దరం కూడా మంచి స్నేహితులుగా ఉంటూ ఉండేసరికి….చుట్టుపక్కల ఉన్నవాళ్లు మా మధ్య ఏదో ఉంది అని ప్రచారం చేయడంతో… ఆ అమ్మాయి 8వ తరగతి నుంచి నాకు కనిపించడం మానేసింది.  ఆ తర్వాత పదవ తరగతిలో ఒక సారి కనిపించింది.  ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కనిపించింది.  మళ్ళీ కనిపించలేదు.  అనుకోకుండా కొన్ని సంవత్సరాల తరువాత వివాహిత స్త్రీగా కనిపించింది.  తన భర్త శృంగారం చేస్తూ ఏ విధంగా నరకయాతనకి పెడతాడు…అనేవి నాతో చెప్పి ఏడుస్తూ ఉండేది.  నేను ఓదారుస్తూ ఉండేవాడిని.  అనుకోకుండా ఒకే ప్రాంతంలో ఉండటం… సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం ఉండేసరికి… శని, ఆదివారాలు వీలున్నప్పుడల్లా…. పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం.  ఇలా కాలం గడిస్తున్న కొద్ది నా మీద ఆవిడకి మనసు కలిగిన నాతో సంసార సుఖము పొందాలి అని అడిగేసరికి…. నేను నిన్ను స్నేహితురాలు గానే చూశాను కానీ, ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు కదా!  అనేసరికి మీ మంచితనం మాటలు నా మీద బాగా పనిచేసే సరికి  సమ్మోహనంలోకి వెళ్లి ప్రేమ, మోహవ్యామోహాలు కలిగి తనలో కామోద్రేకాలు కలుగుతున్నాయి అని అంటూ ఉండేసరికి ….ఆవిడతో ఇంక మాట్లాడటం మానేసి…. ఇక దూరంగా ఉంచడం జరిగింది.  ఫోన్ చేసినా కూడా ఎత్తె పరిస్థితుల్లో నేను లేను.  మనసు వికలమైంది.  కష్టం సుఖం చెప్పుకుందామని ఒక స్నేహితురాలిగా ఉంటే ఆవిడ కాస్త నాతో ప్రేమకలాపాలు చేసిన ఆలోచనకే నా మనసు తట్టుకోలేకపోయింది.   ఇద్దరి పిల్లల తల్లి అయినా కూడా….. తనలో అక్రమ సంబంధం పెట్టుకోవాలి అని…. ఆలోచన చేయటంతో, అంతగా అయితే భర్తతో అగచాట్లు తట్టుకోలేక పోతే… తన మనసుకు నచ్చిన వాడిని వివాహం చేసుకోవచ్చు గానీ, భర్తతో వివాహం అయ్యి సంసారం చేస్తూ తనతో కూడా సంసారం చేయాలని ఆలోచనకే నా మనసు వికలమైంది. దానితో అమ్మాయిని దాటడం జరిగడంతో ఆజ్ఞ చక్రం మాయని దాటడం తో నాకు కాశీ క్షేత్రం నుంచి పాదరస శివలింగం రావటం జరిగింది. ఆ తర్వాత నా సాధనా శక్తి సహస్ర చక్రానికి వచ్చేసరికి…. అప్పటికే ఆడవాళ్ళ మీద ఒక రకమైన వైరాగ్యం, విసుగు, చిరాకు రావటంతో ఆడవాళ్లు అంటేనే ఒక విధమైన భయం, ఒక విధమైన గౌరవం లేకుండా ఉండటం, చులకనగా మాట్లాడటం, వంటి పరిస్థితులు నా మనసుకి ఉంటూ ఉండగా…. నా మరదలు ఒకటి ఉంది. పలానా ఊర్లో ఉంది అని చెప్పి అనుకోకుండా…. నా దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి రావటం…. ఆవిడ నాకు స్వయానా మరదలు అవుతుందని తెలియడంతో….. నా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. ఈవిడ నాకు సరియైన సహచరిణి అని మనసు కొట్టుకుంటూ ఉండేది.  అప్పటికే ఆమె తన ప్రియుడుతో నాలుగు సంవత్సరాలు డేటింగ్ లో ఉండి ప్రేమలో ఉండి పొరపత్యాలు రావడంతో విడిపోయారని… ఆమె ద్వారా తెలుసుకున్నప్పటికీ మనసుకి కొద్దిగా బాధ కలిగించినప్పటికీ కూడా, అప్పటికే కొంత మంది స్త్రీలతో సమస్యలు ఎదురవటం వలన ….తను కూడా పురుషుడితో అలా సమస్యలు ఎదుర్కొని ఉంటుందిలే అనుకోవడంతో…. ఆ తర్వాత మా ఇద్దరి మాటలు కలవడం చూపులు కలవడంతో, ఇంట్లో పరిస్థితులు కారణాల వలన, మేమిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకోవడం ….తను నాకు భార్యగా ఉంటూ పాతివ్రత్య ధర్మం పాటిస్తూ…. ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇలా 16 సంవత్సరాల పాటు ఇల్లాలిగా ఉంటూ ఉండేసరికి…. అనివార్య కారణాల వలన నా సాధనాస్థితి కాస్త ముందుకు వెళుతూ ఉండేసరికి మౌనబ్రహ్మగా, మౌనస్థితిలో ఉండి ఎవరితోనూ మాట్లాడని పరిస్థితి, ఎవరితోనూ మాట్లాడించాలి పలకరించాలి అనిపించని స్థితికి, మౌనంలోకి వెళ్ళిపోతూ రెండు సంవత్సరాల పాటు ఎవరితో, చివరికి తనతో కూడా మాట్లాడని మానసిక స్థితికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత సంసారం మీద మా  ఇద్దరికీ స్మశాన వైరాగ్యం రావడంతో, సంసార సుఖాలు తగ్గటం ఆరంభం అయింది. ఆ తర్వాత సాధనకి సంతానం అడ్డు వస్తుందని… సంతానం కూడా వద్దు అని 16 సంవత్సరాల పాటు సాధనలో ఉంటూ ఉండేసరికి…. ఒకపక్క గృహస్థాశ్రమంలో ఉంటూ మరొక పక్క వానప్రస్థములో  సాధన చేస్తూ ముందుకు తీసుకు వెళ్తూ ఉండగా…. తనకి అనుకోని విధంగా తన సాధనాస్థితి ఆజ్ఞ చక్రం లోకి రావడం…. కాశీ సంవత్సరానికి ఒకసారి వెళ్లి పది రోజులు కార్తీక మాసంలో ఉండి రావడంతో…. తన లోనికి అహంకార మాయ మొదలవడం జరిగింది. జీవమాయగా అహంకార మాయ రావటంతో…తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు రావడంతో….ధన అహంకారం మాయ మొదలయ్యి…. తన ఆత్మ అభిమానం మీద దెబ్బకొట్టే విధంగా నువ్వే అంత అన్న అమ్మాయి కాస్త నువ్వెంత అనే స్థితికి మా మధ్య పొరపాటులు రావడం, మనస్పర్ధలు రావడం, మాట మాట పెరగడంతో, నాకు పురుషాహంకారం, ఆవిడకి స్త్రీ అహంకారం పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి దాటిపోవడంతో… తను ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేని స్థితికి వెళ్లిపోవడంతో…. ఇక మనస్పర్ధలు ఏరోజుకారోజు పెరిగిపోవటంతో…. ఇదే స్థితిలో ఉండినప్పటికీ…. నేను బంధం నుంచి బాధ్యతగా మారేసరికి…. ఇక ఆవిడ నాతో ఏమనలేని పరిస్థితి. నేను   తనతో ఉండలేని పరిస్థితి రావడంతో…. ఒకరినొకరు నటిస్తున్నామని మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నామని…. మా ఇద్దరికీ అర్థం అవ్వడంతో… అర్థం చేసుకోవడంతో… ఇక సంసార జీవితానికి స్వస్తి పలకాలని నిర్ధారణకి రావటంతో…. ఇక మేమిద్దరం కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరం కలిసి విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది.  ఇక తన సాధన ఎక్కడికి వెళ్ళింది… ఎలా వెళ్ళిందో కూడా ఇంక ఆ రోజు నుంచి పట్టించుకోవడం మానేశాను.  ఇంక అక్కడ నుంచి నేను సన్యాస దీక్ష తీసుకొని నా సాధన కోసం క్షేత్రానికి చేరడం జరిగింది.  ఇలా ఉండగా నా సాధన కాస్త హృదయ చక్రమునకు చేరుకోవటం జరిగింది. సాధన సహస్ర చక్రంలో దీక్షా దేవి మాయ దాటటంతో నాకు స్త్రీ పురుష శివలింగాలు రావడం జరిగింది. శివలింగాలలో స్త్రీ లింగాలు ఉంటాయని… పురుష లింగాలు ఉంటాయని… అప్పటిదాకా నాకు తెలియదు.  ఇది ఈ జ్ఞానం అందడం జరిగిందన్నమాట.  అలాగే శంఖాలలో స్త్రీ శంఖం, పురుష శంఖం ఉంటుందనే జ్ఞానం కూడా అందడం జరిగింది. ఆ తర్వాత నా సాధన స్థితి హృదయ చక్రమునకు చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నా గత జన్మలో భార్యగా ఒక స్త్రీ మూర్తి  రావడం జరిగింది.  సన్యాస దీక్షలో ఉండి 8వ భార్య ఋణాలు బంధం రావడం జరిగిందని చెప్పేసి ఈవిడ వల్లనే తన ఆత్మకు క్షోభ పొందటం జరుగుతుందని…. చాలా స్పష్టంగా కలగడం జరిగింది.  చూస్తే రెండు పెళ్లిళ్లు చేసుకొని… ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క సంతానం పొందిన స్త్రీ మూర్తి కావడం నాకు ఆశ్చర్యం అనిపించింది.  ఇప్పుడు తను నన్ను మూడవ వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండేసరికి నాకు నోట మాట రాలేదు. సన్యాస దీక్షలో ఉన్నా కూడా అతనికి సంసారం మాయ ఉందా లేదా అని మాయ పెడుతున్నారా ఏమిటి? అని నేను ఒకటికి పది సార్లు ఆలోచనలు చేస్తూ ఉండేవాడిని.  తనకి అసలు నామీద ఉన్నట్టుండి కామ కోరికలు ఎందుకు  కలుగుతున్నాయి….  తన భర్త అని జ్ఞాన స్ఫురణ ఎందుకు కలుగుతున్నాయని నేను ధ్యాన నిష్ఠలోకి వెళితే…. తను నా గత జన్మలో భార్యగా ఉంటూ నాతో సంసార సుఖం లేదు అని ఇద్దరు పురుషులతో ఒకరికి తెలియకుండా మరొకరితో పొందడం జరిగింది అని….ఆ యొక్క కర్మ శేషం వల్లనే ఈ జన్మలో ఇద్దరి భర్తలని వాళ్లనే పొందడం జరిగింది అని…. తన మొదటి భర్త నిజానికి నేను కావటంతో… మళ్ళీ నా దగ్గరికి వచ్చి సుఖం పొందాలి అని ఆమె మనస్సు కోరుకుంటుంది అని జ్ఞాన స్ఫురణ అందడంతో…. నాకు నవ్వాలో ఏడవలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత మేమిద్దరం కూడా ధ్యాన నిష్ఠలో ఉంటూ…. ఓంకార నాదం చేసుకుంటూ…. మాకు ఉన్న ఈ కర్మ శేషాలను ఋణానుబంధాలను తీర్చుకోవటంతో…. బంధనాన్ని కొనసాగించాలి అని నా మనసు విముక్తి చెందడంతో… తన భర్తలతోనే సుఖంగా ఉండమని చెప్పేసి…. పిల్లలతో, భర్తలతో సుఖంగా జీవించమని చెప్పేసి… ఈమెతో బంధానికి స్వస్తి పలకడం జరిగింది. ఎప్పుడైతే ఈ బంధమాయ నుంచి విముక్తి పొందానో ….అప్పుడు నాకు అర్ధనారీశ్వర శివలింగం ఓంకార క్షేత్రం నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత నా సాధన  కాస్త బ్రహ్మ రంధ్రంలోనికి ప్రవేశించడంతో… మనో శరీర స్థితిని చేరుకుంటున్నప్పుడు….ఈ మనో శరీర స్వరూపంలో… నా మనసు ఒక మాయగా ధర్మపత్ని ఋణానుబంధం నా ఆకాశ శరీరానికి ఋణం ఉందని తెలియడం…. ఆ ధర్మపత్ని ఋణం ఆవిడ యొక్క మనో శరీరం అని జ్ఞానం అందడంతో ….అధికాస్త జ్ఞానేశ్వరి అంశ అయిన శివనందిని అని అంటే నువ్వే అని తెలుసుకోవడంతో… ఇక్కడికి రావడం జరిగింది.  ఇక్కడ నీకున్న కర్మ శేషం నీ సాధన అనుభవాలు లోకానికి చెప్పాలని చెప్పేసి… పురుష ప్రకృతిలో అంతిమ అనుభవాలను చాటి చెప్పే సత్యాన్వేషి గ్రంథం పరిసమాప్తి కాకపోవటం వలన… ఈ జన్మ తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియడంతో ఈ కర్మ పరిసమాప్తి కోసమే అని నేను కాస్త విశ్వమోక్షంగా నీ సాధన అనుభవాలను రాస్తూ రావడం జరిగింది. ఇది తల్లి ఇప్పటిదాకా జరిగింది.  ఇందులో ఎనిమిది మంది ఆడపిల్లలలో ఒక ఆడపిల్లని మాత్రమే వివాహం చేసుకొని పరమహంస పవనానందగా స్థూల శరీరంతో ఉండటం జరిగింది. ఆ తర్వాత మిగతా ఏడుగురు ఆడపిల్లలు వివాహం చేసుకోవాలని శృంగార కార్యక్రమాల దాకా రావటం జరిగింది.  కానీ వాళ్ళని అంతే విధంగా నెమ్మదిగా సముదాయించి వాళ్ళ యొక్క కర్మలు తీరేదాకా ఓపికతో ,సహనంతో ఉండి వారి కర్మలను నివారణ చేసిన తరువాత వాళ్ళు వెనక్కి తిరిగి చూడని స్థితికి…. నేను వాళ్ళని వెనక్కి తిరిగి చూడని స్థితికి వెళ్లడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారో కూడా తెలియదు.  ఉన్నారో చచ్చారో కూడా తెలియని స్థితికి నా మనసు వెళ్లిపోవడం జరిగింది.  ఎందుకంటే నా మనసు లింగ దేహ దహనం అయిపోవడంతో…. వాళ్ళు మిగతా చక్రాలలో వచ్చిన శరీరాల కర్మలు కాబట్టి ….ఆ శరీరాలన్నీ మోక్షం పొందడంతో వాళ్ల గురించి ఆలోచనలు గాని, ఆలోచించే మానసిక స్థితి గాని, ధైర్యం గానీ నాలో లేకపోవడం జరిగింది. ఈ విధంగా వచ్చిన కర్మలు కర్మ శేషం లేకుండా ఋణాలు, బంధాలు లేకుండా పరిసమాప్తి చేసుకోవడంతో…. నా లింగ దేహం కాస్త శూన్యమై పూర్ణ మోక్షం పొందడం జరిగింది. ఇది లోక విధితమే కదా!  ఈ విధంగా నా సాధన పరిసమాప్తి చేసుకున్న సమయంలో…. నా ఆకాశ శరీరానికి ఋణానుబంధముగా ధర్మపత్ని ఋణం నీ రూపంలో మిగిలి ఉందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. నీకు నా కర్మ పరిశ్రమప్తి కోసం మీ సాధన అనుభవాల కోసం పుస్తక గ్రంథంలో రచించి లోకానికి అందిస్తే మీ యొక్క కర్మ కూడా పరిసమాప్తి అవుతుందని జ్ఞాన స్ఫురణ అందడంతో ఈ కర్మను పూర్తి చేయాలి అని నిశ్చయించుకోవడం జరిగింది. అసలు నా దారిన నేను వెళ్ళిపోవచ్చును. నా ఆకాశ శరీరానికి మోక్షం పొందవచ్చును.. కానీ ఒక స్త్రీ మూర్తి సాధన చేస్తే నా చేతిలో మీదుగా ఒక స్త్రీ మూర్తి సాధన పరిసమాప్తి చేయాలని చెప్పి నాకు మొదటి నుంచి కారణం తెలియకుండానే సంకల్పం కలిగింది.  అలా దీక్ష దేవితో సాధన పరిసమాప్తి చేద్దాం అనుకునే సమయంలో…. తనకి అహంకారం మాయకు గురి అవ్వటంతో…. ఆ మాయ నుంచి దాటలేకపోవటంతో…. ఆమె సాంగత్యం నుంచి ఆ సాధన నుంచి తప్పుకోవడం జరిగింది.  ఆ తర్వాత స్త్రీలు వచ్చినప్పటికీ కూడా వారెవరిలోనూ ఆధ్యాత్మిక స్థితిలో ఉండకపోవటం… రెండోది ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పటికీ కూడా… అవసర భక్తి, కోరిక భక్తిలో ఉండటం చూసి.. ఇక నాకు ఈ కోరిక తీరదేమో అని అనుకుంటూ ఉన్న సమయంలో శివనందిని అంశ అయిన దుర్గా శివాని రూపంలో పరిచయం అవటం… జ్ఞానేశ్వరిగా దీక్ష నామం ఇవ్వటం ఈ సాధన పరిసమాప్తి చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది. అందుకోసం అని నీ సాధనకి నా సహాయ సహకారాలు అందిస్తూ రావడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం నీ సాధన పరిసమాప్తి దశలో సహస్ర చక్రస్థితికి రావటం జరిగింది అని చెప్పి శివస్వామి చెబుతూ ఉండేసరికి ఆనందభాష్పాలతో కన్నీరు కారుస్తూ ఉండేసరికి… ఏమైంది దేవి!  అనేసరికి ఏమీ లేదు స్వామి!  మీరు  వెళ్ళాలి అనుకుంటే ఆకాశ శరీరానికి క్షణకాలంలో మోక్షం ఇచ్చి వెళ్లిపోవచ్చును.  కానీ నాలో ఏం చూసి మీరు ఆగారో తెలియదు.  ఏ కారణం చేత ఆగారో తెలియదు. నేను అంత అర్హత పొందిన దాన్నో కూడా తెలియదు.  ఏదో మీరు మనో శరీరం నేను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను… నా ఆధ్యాత్మిక సాధనలో ఉండి సాధన పరిసమాప్తి చేసుకుంటాను అని మీరు నన్ను ఏ విధంగా నమ్ముతున్నారో కూడా తెలియదు.  ఒక స్త్రీ మూర్తి గురించి పూర్తిగా తెలియకుండా… ఆవిడ ఎలా ఉంటుంది… ఆవిడ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి. ఏమిటి అనేది కూడా పట్టించుకోకుండా…. ఆవిడ చేసిన తప్పులు ఏమిటి… లోపాలు ఏమిటి… పాపాలు ఏమిటి… ధర్మం తప్పడాలేమిటి… ఇలాంటివి అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియకుండా… తెలియనట్టుగా… ఏమీ పట్టించుకోనట్టుగా… ఉంటూ నా సాధన పరిసమాప్తికి సహాయ సహకారాలు అందిస్తూ… కావలసిన గురువులను సమయానికి అందేటట్టుగా చేస్తూ…. కావలసిన జ్ఞాన స్ఫురణ ధ్యాన అనుభవాలు కూడా అందిస్తూ… నేను ఎక్కడైనా మాయలో పడితే… నా అంతట నేనే దాటుకుని వచ్చే విధంగా అనుగ్ర హిస్తూ ….ఆ మాయను దాటిన తర్వాత దానికి సంబంధించిన దైవిక వస్తువులకు సంబంధించిన జ్ఞానం అందిస్తూ… నా సాధన పరిసమాప్తి దగ్గర ఉండి చేయించే అంతటి స్థితి మీరు నాకు ఎందుకు అనుగ్రహించారో నాకైతే తెలియదు.  ఏనాడో నేను ఏదో ఇసుమంతా లేక అపారమైన పుణ్యం చేసి ఉంటాను.  తెలిసో తెలియకో ఏదో దానం చేసి ఉంటాను. ఆ దానఫలం వలన మీరు ప్రత్యక్షంగా శివాంశ సంభూతుడిగా శివ సాంగత్యాన్ని అనుగ్రహిస్తూ…. నా సాధన పరిసమాప్తి చేస్తున్నారు.  పూర్ణ మోక్షమును అనుగ్రహించి ఈ స్థితికి ఇస్తున్నారు.  కానీ, నేను మోక్షం పొందాలనో లేక చక్ర సాధన స్థితులను తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి రాలేదని మీకు తెలుసు.  కేవలం నాకున్న కోరికను నా ప్రత్యక్షంగా శివసాంగత్యం పొందాలని చెప్పేసి ఈ జన్మలో నాకు కోరిక బలంగా ఉండేది.  దానికి గల కారణా కారణాలు కూడా నాకు తెలిసేవి కాదు.  కానీ అనుకోని పరిస్థితుల వలన ….అనుకోని విధంగా నా భర్త అని… మీరే నడయాడే అరుణాచలేశ్వరుడు అని జ్ఞాన స్ఫురణ అందటం… జ్ఞాన అనుభవాలు చూపించడం… కనిపించడంతో… నా మనసు పరిపరి విధాలుగా పోతున్నప్పటికీ కూడా…. మనసును అదుపులో ఉంచుతూ….ఒక్కొక్క చక్రంలో ఆధ్యాత్మిక స్థితిలోనికి చేరుకుంటూ … సాధన చేసుకుంటూ వెళుతూ ఇలా నా మనసుకి ఉన్న ప్రత్యక్ష శివ సాంగత్య కోరికను, అలాగే నా సాధన పరిసమాప్తి చేస్తూ…. నా మోక్షమరణం కాస్త విశ్వమోక్ష మరణంగా అనుగ్రహించిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో… ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న కామ కోరికలు, నా మనసు మీ మీద లగ్నం అవ్వటం, మీ మీద శృంగార భావాలు కలుగుతున్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం చలించకుండా, నన్ను చలింప చేయకుండా, అదుపు చేస్తూ నాకు కావలసిన విధంగా… నాకు కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ, నా ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఉన్నప్పటికీ కూడా… నేను మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నానో లేదో అని అయోమయ స్థితిలో ఉన్నా కూడా… నేను చేసిన తప్పులు ఒప్పులు పట్టించుకోకుండా, ఏ మార్చకుండా, ఏమీ పట్టించుకోకుండా, ఏమీ ఆలోచించకుండా.. కేవలం నా మనసుని చూస్తూ నా సాధన పరిసమాప్తి చేసే అంతటి మహోన్నత వ్యక్తి ప్రత్యక్ష శివుడిగా వస్తాడని నేనైతే ఆలోచించలేదు. ఊహించలేదు.  ఇది మీరు నాకు పెట్టిన జ్ఞానభిక్షే.  మీరు అనుగ్రహించిందే. కావాలంటే మీకోసం చాలా మంది ఆడపిల్లలు రావటం జరిగింది.వాళ్ళకి ఎన్నో పరీక్షలు పెట్టడం జరిగింది.  కానీ మీరు నన్ను మానసికంగా శారీరకంగా పరీక్షలు పెడుతూ… ఈరోజు కారోజు మీ మాటలతోనూ, చేష్టలతో నా సాధలను ముందుకు తీసుకువెళుతూ అనుగ్రహిస్తూ…. నా సాధనను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నాకు తెలియకుండానే, నాకు సంబంధం లేకుండానే, నా ప్రమేయం లేకుండానే ,నా చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం చేసుకుంటూ… నా సాధన పరిసమాప్తి చేస్తారు అని ఈ విధంగా…..ఏ విధంగా చేస్తారు అని అనే అయోమయ స్థితిలో… నేను ఊహించని విధంగా ఒకపక్క శివసాంగత్యం ఇస్తూనే…మరో పక్కన సాధన పరిసమాప్తి చేస్తూనే… మరోపక్క విశ్వమోక్షం పొందేటట్లుగా చేయడానికి మీకు మీరే సాటి. మీరే ఘనాపాటి.  ఇక మీ గురించి నేను చెప్పడానికి సముద్రంలో ఉన్న నీటి బొట్టు గురించి చెప్పడం అవుతుంది. దీనికి ఇంకా మాటలు లేవు.  ఇది మాటలతోనూ, రాతలలోనూ చెప్పలేని ఆనంద స్థితిని…. ఇంతటి సాధనా స్థితిని ఇంతటి బ్రహ్మానంద స్థితి… నేను పొందుతున్నాను అని అందులోను మీలాంటి గురువుల సాంగత్యంలో, శివ సాంగత్యంలో…. నన్ను అనుగ్రహిస్తారని చెప్పేసి నేను ఎప్పుడూ ఊహించలేదు.  అనుకోలేదు.  అనుకోకుండా దొరికిన ఈ అదృష్టాన్ని నా జీవితకాలం పరిసమాప్తి లేదా మీ జీవితం అంత్య కాలం వరకు నన్ను ఇలాగే అనుగ్రహించి నన్ను మీలో ఐక్యం చేసుకోండి.  మీరు ఎటూ మోక్షం పొందారు కాబట్టి…. ఈ ఆకాశ శరీరంతో శూన్యం అయిపోండి.నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు.  నాకు వేరే మోక్షం అవసరం లేదు. విశ్వ మోక్షం నాకు ఆలోచన కూడా లేదు.  కేవలం నేను ఉన్నంతవరకే లేదా మీరు ఉన్నంతవరకు మీ సాంగత్యం నాకు అనుగ్రహించండి.  మీ అనుగ్రహ భాష్యం ప్రతినిత్యం ఉండేటట్లుగా అనుగ్రహించండి. ఇంతకంటే నాకేమీ వరాలు అవసరం లేదు. కోరికలు లేవు… అవసరాలు లేవు… నాకు మీరు మోక్షం ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ, నా అంతిమ సమయంలో కానీ… మీ అంతిమ సమయంలో కానీ… మీ తల నా తొడ మీద పెట్టుకొని మీరు మరణం పొందడం నేను కళ్ళారా చూడాలి అని అయితే ఉన్నది. నా సాధన శరీరం మీలో ఐక్యమైపోవాలి లేదా మీ సాధన ఎలా పరిసమాప్తి చేసుకుంటారో ..,శూన్యం అవుతారో… లేదా మోక్షం పొందుతారో…నేను మీలో అర్థభాగంగా…. అర్ధ నారీశ్వర తత్వంతో ఐక్యం అవ్వాలి అని చెప్పి కోరిక సంకల్పం కలుగుతుంది. ఆ సాంగత్యమును నిత్యం మీరు అనుగ్రహించాలి అని చెప్పి…. పరివిధాలుగా శివ నందిని ఆవేదన భరితంగాను …ఆవేశంతో… హృదయ విదారకంగా వేడుకోవడం చూసిన శివ స్వామి కాస్త …దేవి!  ఇది మా చేతుల్లో లేదు.  కాల నిర్ణయం చేస్తుంది.  శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా!  నీతో ఉన్న ఋణాను బంధం తీరిపోవటం, మన మధ్య గొడవలు కలహాలు వచ్చి విడిపోవడం అనేది లేదు. అది భార్యల స్థానంలో ఉన్న అష్టభార్యలతోనే అయిపోయింది.  మన మధ్య ఋణానుబంధం కానీ, కర్మ శేషం కానీ ఏమీ లేవు. కేవలం ధర్మ పతి, ధర్మపత్ని అని మాత్రమే ఉన్నది.  కేవలం ఆ బంధం బంధనం కాకుండా ఏకత్వ అర్ధనారీశ్వర స్థితిని పొందడం జరుగుతుంది. నేను ఉన్నంతకాలం నువ్వు కూడా నాతోనే ఉంటావు.  నువ్వు ఉన్నంతకాలం నేను నీతోనే ఉంటాను. ఆ తర్వాత నువ్వు నాలో ఐక్యమైపోతావు.  ఆ తర్వాత నేను ఆకాశరీరంలో శూన్యంలో ఐక్యం అవ్వడం జరుగుతుంది. ఇది విధి లిఖితం.  కాకపోతే నేనంత కాలం స్థూల శరీరంతో ఉంటానో….నువ్వు ఎంతకాలం స్థూల శరీరంతో ఉంటావు అనేది కాలమే నిర్ణయం చేయాలి. ఉన్నంతకాలం విడివిడిగా ఉన్నప్పటికీ విడిపోకుండా సాంగత్యంతో కలిసి ఉండటం జరుగుతుంది. ఇక నాకు నువ్వే ఆఖరి స్త్రీ మూర్తివి….నీకు నేను ఆఖరి పురుషుని అవుతాను.  ఇక మనకి పర స్త్రీల గురించి, పర పురుషుల గురించి ఆలోచించే స్థితిగాని ….ఆ మాయలు గాని రావు. ఎందుకంటే ఇది నా ఆఖరి ఆకాశ స్థితి.  అలాగే నీ ఆఖరి మనో శరీరానికి ఉన్న ధర్మపతి, ధర్మపత్ని అని పాతివ్రత్య ధర్మంతో సాధన పరిసమాప్తి అవుతుంది.  సాధన పూర్తి చేసుకోవాలి.  రాబోవు కాలంలోనీ సాధన పరిసమాప్తి అయి, పురుష ప్రకృతిలో ఏ విధంగా మోక్షం పొందిందో… నీ సాధన పరిసమాప్తి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నా సాధన పరిసమాప్తి లో స్త్రీ ప్రకృతికి ఏ విధంగా మోక్షం పొందిందో తెలుసుకోవడం జరిగింది కదా!  ఈ రెండు ప్రకృతిలో మిగిలిపోయిన స్త్రీ, పురుషులలోని ప్రకృతులు ఏ విధంగా మోక్షం పొందాలి.. పొందుతారా లేదా అనేది నీ సాధన పరిసమాప్తికి….నేను భౌతిక శరీరంతో పరమహంసగా వచ్చి… నీ సాధన పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడు మిగిలిపోయిన స్త్రీ , పురుష కాస్త మోక్షమును పొందితే అది పూర్ణ మోక్షంగా విశ్వమోక్షంగా రూపాంతరం చెందడం జరుగుతుంది. అది ఎలా ఏమిటి అనేది అంచనా వేయలేము. ప్రస్తుతానికి నీ సాధన సహస్రార చక్రంలో ఉన్నది కాబట్టి…..హృదయ చక్రం ,బ్రహ్మ రంధ్రంకి వచ్చిన తరువాత….. నీ సాధన పరిసమాప్తి స్థితికి వెళ్లడం జరుగుతుంది. ఇక్కడ మోక్షం పొందాలని కోరిక లేదా వ్యక్తిగత మోక్షం పొందాలి అనే కోరిక లేదా పూర్ణ మోక్షం పొందాలని కోరిక…విశ్వ మోక్షం పొందాలని కోరిక సంకల్పాలు చేయకు.  కోరిక ఉన్నప్పుడు అది తీరిందో లేదో అని అనుమానభాయంతో… పునః సృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది.  కోరిక పెట్టుకోవద్దు.  అలాగే అవసరాలతో,  మాయలలో, సిద్దులలో, శక్తులలో పడకుండా నీ సాధన పరిసమాప్తి చేసుకో… ఇక్కడ నీ సహస్ర చక్రం లోకి వచ్చినప్పుడు విష్ణుమూర్తి లీలా విన్యాసం, శ్రీకృష్ణుని లీలా విన్యాసం అలాగే చినమస్తా దేవి భయంకరమైన ధ్యాన దృశ్యం, శాస్త్ర విజ్ఞానాలు, వేద విజ్ఞానాలు ఇలాంటి శాస్త్ర పరిజ్ఞానం కలుగుతుంది. అయినా 18 అహంకారాల  మాయ ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ బ్రహ్మ పదవి నుంచి ఇంద్ర పదవి దాకా పొందే అవకాశాలు ఉంటాయి. వాటిని నువ్వు దాటుకొని రావాలి. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో…. నీ విచక్షణ జ్ఞానానికి, వివేక బుద్ధితో దాటుకుంటూ రావాలి.  మాయలో పడు… మాయని అనుభవించు.  ఇది మాయా అని తెలుసుకో.  వివేక బుద్ధి, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకుండా…. మాయని దాటడం జరగాలి.  తద్వారా దీనికి సంబంధించిన దైవిక వస్తువులు పొందవలసి ఉంటుంది. అది ఎప్పుడు ఎలా వస్తాయి …అనేది మీ సాధన పరిసమాప్తి లో…. ఈ చక్ర శుద్ధి సమయంలో…. అన్ని దైవిక వస్తువులు వస్తాయి.  అంతేగాని నా గురించి నువ్వు ఆలోచించవద్దు… నేను మధ్యలో వదిలిపెట్టేస్తాను ఏమో అని నువ్వు భయపడవద్దు.  నీ సాధన పరిసమాప్తి అయినప్పటికీ….కూడా నీ దేహం నాలో ఐక్యం అయ్యేదాకా నేను నిన్ను వదిలి పెట్టడం జరగదు.  కానీ ప్రస్తుతం నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కాబట్టి…. సన్యాస స్థితికి వచ్చేదాకా విడివిడిగా ఉండి విడిపోకుండా ఉండి సాధన పరిసమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది.  నువ్వు ఎప్పుడైతే సన్యాస దీక్షకి వస్తావో…. భౌతికంగా ప్రత్యక్షంగా నేను నీ దగ్గరికి రావడం లేదా నువ్వు నా దగ్గరికి రావడం జరుగుతుంది. అది జరుగుతుందా లేదా అనేది శివాజ్ఞ. కాల నిర్ణయానికి వదిలేద్దాము.  దానిమీద మనం ఆశ పెట్టుకోవద్దు.  భయం పెట్టుకోవద్దు.  అలా అని నువ్వు నా గురించి పలు విధాలుగా ఆలోచన చేయవద్దు . ఇది కర్మ బంధం కాదు …. ఋణాను బంధం కాదు …దీనికి అతీతమైన స్థితి.  ఎందుకంటే ఒక స్త్రీ మూర్తికి సాధన పరిసమాప్తి చేయాలని నా సంకల్పం ఉన్నది.  అది నా ఇష్ట కోరికగా మారింది. ఆ ఇష్ట కోరిక తీర్చగలిగే ధర్మపత్నివి నువ్వే అని జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది.  అలాగే శివసాంగత్యం పొందాలని నీ మనో శరీరం కోరిక కోరుకోవటం…. నాతో ప్రత్యక్ష శివసాంగత్యం అరుణాచల శివుడిని జ్ఞాన శివుడిని చూడటం… అనుభవం పొందడం జరిగింది కాబట్టి…. నేను శివోహం స్థితిని దాటడం జరిగింది.శివశవ సాధన కూడా పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సాధన పరిసమాప్తి వలన శివోహం స్థితిని పొందాను …. ఇన్నాళ్లు అందరూ నాలో శివుని చూడడం జరిగింది. కానీ ఇప్పుడు నాలో నే శివుడు అని ప్రకటితము అవ్వడంతో… అందరూ శివాని లాగా కనపడటం జరుగుతుంది. నీ సాధన వలన నాకు ప్రకృతి అంతా కూడా దేవి మయంగా కనబడుతుంది. అదే నీకు నా సాధన వలన అంతా కూడా శివమయంగా కనబడుతుంది.  రాను రాను శివమయం అలాగే దేవి మయం కూడా ఏకత్వ అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్లి నా ఆకాశరీరం, నీ మనో శరీరం ఏకమయ్యి నిలుచున్న అర్ధనారీశ్వర తత్వం పొంది ఆపై ఏం జరుగుతుందో… ఎలా శూన్యం అవుతుందో… సాధన పరిసమాప్తిలో మనకి తెలుస్తుంది.  అప్పటిదాకా నువ్వు మాయలో పడకుండా, నా గురించి అతిగా ఆలోచించకుండా… బాధపడకుండా…. భయపడకుండా… సాధన పరిసమాప్తి చేసుకో.  నా గురించి నువ్వు ఆలోచించవద్దు. నేను నిన్ను వదిలి పెట్టేస్తాను అని చెప్పి నువ్వు నన్ను వదిలిపెట్టే పరిస్థితులు వస్తాయేమో అని భయపడవద్దు…  ఆ పరిస్థితులు వచ్చిన వాటిని ఎలా దాటుకోవాలి …ఏ విధంగా పరిస్థితులను అధిగమించాలి… అని ఒకటికి పది సార్లు ఆలోచించుకొని దాటుకునే విధంగా నీ మానసిక స్థితి  వివేక బుద్ధి విచక్షణ జ్ఞానం పొందవలసి ఉంటుంది.  ముందు నువ్వు నా గురించి ఆలోచించడం, బాధపడటం మానేసి…మీ సాధన పరిసమాప్తి చేసుకొనే స్థితికి నువ్వు వెళ్ళు.  నేను నీకు మనో మాయగా ఉండకూడదు.  నాకు ఎలాంటి మాయలు లేవు. బంధాలు లేవు.  బంధానాలు లేవు.  బాధ్యతలు లేవు.  అలాగే నేను నీకు భారం అవ్వకూడదు.  మాయా అవ్వకూడదు.  బంధనం అవ్వకూడదు.  కేవలం మనిద్దరం కూడా మహాదేవి, మహాదేవుడు లాగానే మారుతూ…. మన సాధన పరిసమాప్తి చేసుకోవాలి. ఒక పక్క నువ్వు నాతో శివసాంగత్యం పొందుతూనే…. నీ సాధన పరిసమాప్తి చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి… ఇక నేను వెళ్ళొస్తాను దేవి! నాకు సాధనకు సమయం ఆసన్నమైంది అని చెప్పి శివ నందినికి  వీడ్కోలు పలుకుతూ…. శివ స్వామి అక్కడ  నుంచి అదృశ్యం అవ్వడం జరిగింది.


శివ స్వామి అదృశ్యమైన తర్వాత శివ నందిని తన ఆలోచనలతో పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ….. తను సాధనకి పనికిరాని యోగ పుష్పం అని… పూజకి పనికిరాని పువ్వు అని తెలిసినప్పటికీ, తను బురదకుంటలో పెరిగిన తామర పువ్వు అని తెలిసినప్పటికీ కూడా శివ స్వామీ లాంటి మహాత్ముడు అనుగ్రహించడంతో… తాను తనకే తెలియని… తనలో ఉన్న శక్తిని బయటికితీస్తూ… పూజకి పనికిరాని పుష్పం అని ఆకాశగంగతో…. శుద్ధి చేస్తూ, బ్రహ్మ కమలం అని చెప్పి, సాధన పరిసమాప్తి చేస్తున్న శివ స్వామి లాంటి మహానుభావులు, మహనీయులు, సిద్ధ పురుషుడు ఈ కలియుగంలో…. ఏమాత్రం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, శరీరమును ఆశించకుండా, ధర్మాన్ని ఆశించకుండా, నిష్కామకర్మఫలం గా….నిస్వార్థముగా…. తన సాధనలో  పరిసమాప్తి చేయిస్తున్న శివ స్వామికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో… ఏ విధంగా అభినందించాలో…. ఏ విధంగా తన భక్తిని చాటుకుని చెప్పాలి…ఆ  భావాలు ఎలా చెప్పాలో అర్థం కాకుండా సిగ్గుతో మనసు మొలకలు వేస్తూ ఉంటే…. అక్కడికి పిల్లలు రావడం ….వాళ్ళు వచ్చినా కూడా గమనించని స్థితిలో శివ స్వామి ఆలోచనలలో శివ నందిని ఉండటం గమనించిన బాలగణపతి కాస్త, తెలిసిందిలే…. తెలిసిందిలే…. నీ నెలరాజు వచ్చాడని తెలిసిందిలే… అని పాట అందుకోవటంతో శివ నందిని కాస్త యదార్థ స్థితికి మామూలు స్థితికి…. వచ్చి ఏం తెలిసిందిరా!  నీకు అనగానే ఏముంది?  నీ ముఖంలో సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి…. కళ్ళు మాట్లాడుతున్నాయి… బుగ్గలు సొట్టపడుతున్నాయి… పెదవులు ఆనందంతో విచ్చుకుంటున్నాయి. మనసు ఉల్లాసంగా ఉంది… అంటే శివ స్వామి వచ్చి ఉంటాడులే!  ఆమాత్రం నాకు తెలియదా?  అనేసరికి వచ్చారు… వెళ్లారు… అనేసరికి మంచిది కానీ అమ్మ మొన్న నువ్వు దేవత విగ్రహాలు మాట్లాడతాయి అని అన్నావు కదా!  ఎవరైనా దేవత విగ్రహ మూర్తి మాట్లాడేటట్టు చేయొచ్చు కదా?  అలా చేయగలవా…?  అనేసరికి దేవత విగ్రహం ఏముంది?  కపాలాలు కూడా మాట్లాడతాయి.. మన ఆరాధన స్థితిని బట్టి అనేసరికి….. కపాలాలు మాట్లాడడం సాధ్యమా అనేసరికి… శివ నందిని కాస్త తన చేతి సంచిలో నుంచి కపాలం బయటకు తీయడం జరిగింది. అమ్మ ఇది మహాదేవి నీకు తంత్ర సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు ఇచ్చిన కపాలం కదా?  అంటే ఇది నా మనో శరీరమునకు సంబంధించిన కపాలము.  ఈ మనో శరీరానికి ఏదో తెలియని కోరిక ఉంటుంది.  అది ఇష్ట కోరిక. ఆ ఇష్ట కోరిక తీరిన మరు క్షణం ఈ కపాలం కాస్త కపాల మోక్షం పొందడం జరుగుతుంది అని తెలుస్తుంది.  అంటే సాధనలో ఉండే సాధకులకు ఎప్పుడైతే తన జన్మ మోక్షజన్మ అని చెప్పి తెలియటానికి అని చెప్పేసి ఆరు నెలలు ముందుగానే ఈ కపాల విభేదనం జరుగుతుంది.  కపాల మోక్షం పొందడం జరుగుతుంది. అప్పుడు తంత్రసాధకులకి తన జన్మ మోక్షజన్మ అని తెలుస్తుంది. అదే దక్షిణాచారంలో ఉన్న సాధకులకి అయితే ధ్యాన అనుభవాలు కలుగుతాయి. తను చనిపోయిన తరువాత ఏ స్థితికి అయితే వెళతారో… ఆ స్థితిని అంతిమ ధ్యానం అనుభవంగా పొందడం జరుగుతుంది.  దానిని బట్టి మోక్షం పొందారో లేదో…. అని నిజ నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. అదే వామాచారంలో ఉన్న వాళ్లకి కపాల విభేదనం జరిగితే… ప్రత్యక్ష అనుభవం పొందుతారు.  వాళ్లు విశ్వమోక్షం పొందారో లేదో తెలుసుకుంటారన్నమాట!  ఈ విధంగా నా మనో శరీరం కపాలం…. ఇది మోక్షం పోతే నా సాధన పరిసమాప్తి అయినట్లే అనేసరికి….ఓహో!  ఇది నీ మనో శరీరం కపాలం అంటే ఇప్పుడు కాపాలికుల దగ్గర ఉండే కపాలాలన్నీ  మనో శరీరాలకు సంబంధించినవా ? అనేసరికి అవి మనో శరీరకపాలాలని చెప్పలేము…. అది 11 దేహాలలో స్థూల దేహానికి తప్పించి మిగతా శరీరాల కపాలాలు అయ్యి ఉండవచ్చు.  కపాలం యొక్క కోరిక తీరకపోవటం వలన ఆ కోరిక తీర్చుకోవడానికి అది ప్రేతాత్మగా మారుతూ సంసారం చేస్తూ ఉంటుంది. ఆ శరీరం కోరిక తీర్చుకోవడానికి అని చెప్పేసి ఆ శరీరానికి సంబంధించిన కపాలం సేకరించడం జరుగుతుంది. అందుకనే మొదట తీరని కోరికలతో ఉన్న శరీరం యొక్క కపాలం సేకరిస్తారు. ఆ తర్వాత ఈ కోరిక యొక్క స్థితిగతులని బట్టి అఘోరస్థితిలో కోరిక తీర్చుకోవడం జరుగుతుంది. ఒకరికి పదార్థం కోరిక మాయ ఉంటే, ఒకరికి కామ కోరిక మాయ ఉంటుంది. కామకోరికని శవ శరీరం మీద తీర్చుకోవడం జరుగుతుంది.  కోరిక మాయమవుతుంది. కామ కోరికని శవం శరీరం మీద తీర్చుకోవడం జరిగితే…. పదార్థ కోరిక మాయ అయితే పదార్థం రూపాంతరం చెందించి…. మనం ఆహారంగా మార్చుకోవడం…. కట్టెను ఆహారంగా మార్చుకోవడం… ఇలా నిర్జీవపదార్థాల నుంచి సజీవ పదార్థాలుగా మార్చుకొని తినడంతో… అఘోర సాధనలతో నగ్నత్వం చేదించడం జరుగుతుంది. ఇంక అప్పటిదాకా కూడా తన కోరిక తీరకపోతే…. భైరవ సాధనలో శృంగారం ద్వారా సాధన చేస్తూ సంయోగం నుంచి సమాధి స్థితి పొందడం జరుగుతుంది.  అంటే భైరవ సాధనలో సమాధి స్థితి పొందాలని కోరిక ఉంటే ఆ కోరిక ఈసాధనలో తీర్చుకోవడం జరుగుతుంది. ఇంక నాగసాధువు విధి విధానంలోకి వచ్చేసరికి… దేహం మీద మోహ వ్యామోహం ఉండటం వలన, ఆ దేహానికి కావలసిన పద్దెనిమిది రకాల అలంకారాలు చేసుకుంటూ…. ఆ దేహం ఒక భ్రమ బ్రాంతి సత్యం కాదు అనే స్థితికి  నాగ సాధువులు వెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా తంత్రసాధనలో విధివిధానాలు ఏర్పడడం జరిగింది. జరుగుతూ ఉంది.  ఇప్పటికే నాకు ఈ నాలుగు విధానాల ద్వారా ఈ నాలుగు కోరిక అంశలన్నీ తీరిపోవటం జరిగింది. నా దగ్గర ఉన్న ఈ మనో శరీర కపాలానికి శనగలు పెట్టు… అది నీతో మాట్లాడుతుంది అనేసరికి బాలగణపతి కాస్త శివ నందిని ఇచ్చిన శనగలను కపాలం ముందు పెట్టేసరికి… అది నోరు తెరిచేసరికి సెనగలు గుప్పెడు నోట్లో వేస్తూ ఉండేసరికి ….అది నములుతూ మాట్లాడటం మొదలు పెట్టేసరికి…. బాలగణపతి ఆశ్చర్య ఆనందాలకి గురి అయ్యాడు.  ఆ పక్కనే ఉన్న బాల కుమారస్వామి కూడా గమనించి, వాళ్ళు ఆ కపాలంతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదంతా కూడా రుద్ర స్వామి చూసినప్పటికీ…గమనించి గమనించినట్టు యోగనిద్ర సాధన చేసుకోవడం, మహాదేవి కూడా ధ్యాన నిష్ఠలో ఉండటం గమనించి ఇక పిల్లలు కూడా మాటల్లో పడ్డారు అని గ్రహించి…శివ నందిని తన సహస్రార చక్ర శుద్ధి కోసం ప్రాణముద్ర అభ్యాసం చేయడం జరిగింది. ఇలా మూడు రోజులపాటు ఇదే విధంగా సాధన అభ్యాసం చేస్తూ ఉండగా… ధ్యాన దృశ్యంగా ఒకరోజు అంతరిక్షం కనిపించడం జరిగింది. అంతరిక్షంలో గ్రహాలు, గ్రహ మండలాలు, నక్షత్రాలు, నక్షత్రం మండలాలు, గ్రహ శకలాలు ,రేణువులు ఇలా విశ్వంలో ఉన్న ప్రతి చిన్న అంశం కూడా బైనాక్యులర్ పెట్టి చూస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి… నక్షత్రాలు, నక్షత్రం మండలాలు, నవగ్రహాలు, గ్రహ మండలాలు ఇలా చూస్తూ అంతరిక్షంలోని ఈ వింత ప్రత్యక్షంగా ఇంత దగ్గరగా శివ నందిని చూడటం ఇదే మొదటిసారి.  అలా చూస్తూ ఉండేసరికి  పాల పుంతలు, అంతరిక్షంలో ఉన్న ప్రతిభాగం కూడా స్పష్టంగా కనబడుతూ ఉండటం చూసి ఆశ్చర్య ఆనందాలకు గురి అవుతూ ఉండగా ధ్యాన భంగం అయ్యింది.  ఓహో!  సహస్ర చక్రం అనేది అంతరిక్ష భాగానికి చెందింది శివ నందినికి జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది.  సరే అని తన సాధన అలాగే కొనసాగిస్తూ ఉండగా… రెండవ రోజు కాస్త ధ్యాన దృశ్యంగా అంతరిక్షం మధ్యభాగంలో ఒక చిన్న బిందువు లీలా మూర్తిగా కనిపించేసరికి…. ఆ బిందువు ఏమిటో అని చూస్తూ ఉండేసరికి….ఆ బిందువు దివ్యకాంతి, దివ్య తేజస్సుతో ఉండేసరికి…. బిందువు దగ్గరికి తన మనోనేత్ర చూపు వెళుతున్నప్పటికీ…. అది బిందువు కాదు ఒక మొగ్గ లాగా లీలామాత్రంగా కనిపిస్తూ ఉండేసరికి…. ఆ మొగ్గ చుట్టూ కూడా రేకులు ముడుచుకొని ఉన్నాయి.  పద్మం లాగా కనపడుతుంది అని చెప్పేసి జ్ఞాన స్ఫురణ అందడంతో…. ధ్యాన భంగమై కళ్ళు తెరవటం జరిగింది.  అప్పుడు తనలో కొన్ని లక్షణాలు కనిపించాయి.  

సహస్ర చక్రం జాగృతి లక్షణాలు:-

 సహస్రార చక్ర జాగృతి అయినప్పుడు ఈ జన్మలో చేసిన పాప పుణ్యకర్మల అనుభవాలు గుర్తుకు వస్తాయి అని చెప్పటం జరిగినది.సహస్రార చక్ర జాగృతి సమయంలో సాధకుడికి తల మధ్యభాగంలో, ముఖ్యంగా మాడు ప్రాంతంలో ఒత్తిడి, బరువు లేదా ఏదో బంతిలాంటి వస్తువు కదులుతున్న అనుభూతి కలుగుతుంది. ధ్యాన సమయంలో చిన్ననాటి సంఘటనలు, గతంలో ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, సంతోషకరమైన జ్ఞాపకాలు వరుసగా గుర్తుకు వస్తాయి. మనస్సులో వివిధ రకాల భావోద్వేగ మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ఓంకార నాదం, శంఖధ్వని వంటి అంతర్నాదాలు వినిపించిన అనుభూతి కలుగుతుంది. సహస్రదళ పద్మం దర్శనమవుతుంది. వివిధ దేవతామూర్తుల రూపాలు ధ్యానంలో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి విరాట్ స్వరూపం, దక్షిణామూర్తి, సదాశివుడు, వటపత్రశాయి వంటి దైవిక రూపాల దర్శనాలు కలుగుతాయి. ధ్యానంలో కనిపించే ఈ దృశ్యాలన్నీ చివరకు శూన్యంలో లీనమవుతున్న అనుభూతి కలుగుతుంది. రాగద్వేషాలు, సుఖదుఃఖాల పట్ల స్పందనలో మార్పులు వస్తాయి. అంతర్ముఖత పెరుగుతుంది. ధ్యానంపై తీవ్రమైన ఆసక్తి కలుగుతుంది. మనస్సు క్రమంగా బాహ్య విషయాల నుంచి అంతర్గత చైతన్యం వైపు ప్రయాణిస్తుంది.

ఇది సహస్ర చక్ర జాగృతి లక్షణాలు తల్లి!  నీకు సహస్ర చక్రం మనోధ్యానం నందు కనపడుతుంది అని రుద్ర స్వామి అనేసరికి …సరే అని ప్రాణముద్రతో ధ్యానం చేసుకోవడం ప్రారంభించింది. ఇలా పది, పదిహేను రోజులపాటు సాధన కొనసాగిస్తూ ఉండగా…. ఈసారి ధ్యానంలో అనుభవంగా.మొగ్గగా కనిపించిన కమలం కాస్త సుమారుగా ఒక వెయ్యి రేకుల కమలంగా రూపాంతరం చెందటం… విచ్చుకోవటం దాని లోపల పవళింపు సేవలో ఉన్న విష్ణుమూర్తి, శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న అనంత పద్మనాభస్వామి, పాదాల వద్ద లక్ష్మీదేవి లీలా మూర్తిగా అస్పష్టంగా కనిపించేసరికి… ఓహో!  ఇది వైకుంఠ వాసుడు విష్ణువు ఆవాసం అనుకుంట…అని అనుకుంటూ ఉండేసరికి… ధ్యాన భంగం అయింది.  ఇక అక్కడ నుంచి తనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉండేసరికి…

సహస్ర చక్రం శుద్ధి లక్షణాలు:-  

సహస్రార చక్ర శుద్ధి సమయంలో సాధకుడిలో మానసికంగా, శారీరకంగా వివిధ మార్పులు కలుగుతాయని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పేర్కొంటారు. మనస్సులో పేరుకుపోయిన పాత జ్ఞాపకాలు, బాధలు, భావోద్వేగాలు క్రమంగా బయటపడతాయి. అనవసరమైన ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. రాగద్వేషాలు, కోపం, అసూయ, మోహం వంటి మానసిక వికారాల తీవ్రత తగ్గుతుంది. మనస్సు ప్రశాంతత వైపు పయనిస్తుంది. ధ్యానంపై ఏకాగ్రత పెరుగుతుంది. బాహ్య విషయాలపై ఆసక్తి తగ్గి అంతర్ముఖ చింతన పెరుగుతుంది. శరీరంలో కలిగే అనుభూతుల పట్ల అవగాహన మారుతుంది. సాధకుడిలో ఆత్మపరిశీలన, వివేకం, వైరాగ్య భావనలు బలపడతాయి.

ఆధీనం లక్షణాలు:- 

ఇవే కాకుండా సహస్రచక్రములోనికి కుండలినీ శక్తి ప్రవేశించాలంటె సహస్ర చక్రము అలులు వాలె. దీనికి పరమగురువు వలనే సాధ్యపడును! ఆయన అనుగ్రహముతోనే సహస్ర చక్రము తెరచుకొంటుంది! ఇక్కడ బుద్ధి అనేది ఉండదు! అందుకే ఈ చక్రములో అసంప్రజ్ఞాత సమాధి స్థితి కలుగును! ఇక్కడ బుద్ధికి అతీతమైన స్థితి లభించును! ఈ చక్రములో జరిగే స్థితులను గూర్చి ఎవరూ వర్ణించలేరు! చెప్పలేరు! ఎందుకంటే బుద్ధి అనేది ఉండదు! కానీ లేశమాత్రపు అహంకారము మాత్రము ఉంటుంది! ఈ చక్రము అధీనమైతే పరమాత్ముడి విశ్వరూప సాక్షాత్కారము లభించును! పరమాత్మ విశ్వరూప సాక్షాత్కారము పొందాలంటే సహస్ర కమలములోని 1000 దళాలు విచ్చుకోవాలి! దీనికి 10 లక్షల సం॥లు పట్టును! అందుకే చాలామంది యోగులు జీవసమాధి చెంది ధ్యాన తపస్సు చేసుకొంటున్నారు! ఉదా:- రాఘవేంద్రస్వామి (323 సం॥) పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (532 సం॥). అలాగే ఈ సహస్రచక్రము అధీనమైతే అష్టసిద్ధులు లభించును! అనగా అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశితా, వశితా, అవాప్తస్మృతి అనే అష్టసిద్ధులు లభిస్తాయి! అలాగే త్రికాలజ్ఞత్వం, అద్వంద్వం, అభిజ్ఞత, ప్రతిఘాతఘం, అపరాజనం. కామరూపం, పరకాయ ప్రవేశం, స్వచ్ఛంద మరణము, సహాకృత్, యధా సంకల్ప సిద్ధి అనే దశ సిద్ధులు లభిస్తాయి! ఈ చక్రమునందే సాధకుడు బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రహ్మజ్ఞాని అవుతాడు! ఇక్కడ కలిగే ముక్తిని శ్రేష్టి ముక్తి అందురు! అటుపిమ్మట కుండలినీశక్తి బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించును! తద్వారా సాధకుడు ఆనంద సమాధిని పొందుతాడు! తద్వారా ఆనందానుభూతిని పొందుతాడు! ఈ స్థితిని ఓంకారములోని అర్ధమాత్రను ప్రతీకగా ఉంచారు! గమనించండి! ఈ స్థితిలోనే విశ్వశక్తి ధారాళంగా బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించునని మీకు తెలుసు! ఈ బ్రహ్మ రంధ్రమునందు సాధకుడికి కైవల్య ముక్తి అనగా మోక్షము లభించును!

సహస్ర చక్రం బలహీన లక్షణాలు:-

షట్చక్రాలు బలహీనపడితే సూక్ష్మక్రమము గూడ బలహీనపడును! తద్వారా చెవిటితనం, మూగతనం కల్గును! పాత విషయాలు జ్ఞాపకము వచ్చును! వీటిని మర్చిపోలేక నిద్రకు దూరము అవుతాడు! తద్వారా నిద్రలేమి వ్యాధి వచ్చును! అలాగే కొందరిలో మనస్సు కారణము లేకుండానే వ్యాకులత చెందుతుంది! అలాగే అవసరమైన ఆలోచనలు మాని అనవసరమైన ఆలోచనలకు ప్రాముఖ్యతను ఇస్తారు. మరికొందరు అయితే అన్ని విధముల సుఖాలకు, సంతోషాలకు దూరమవుతారు! మరికొందరు కష్టాలకు, దుఃఖాలకూ లోనై వీడివల్ల విపరీతముగా అలసిపోతూ ఉంటారు! మరికొందరైతే కొత్త ప్రదేశమునకు వెళితే అక్కడ ఉండలేక వెంటనే ఇంటికి వెళ్లిపోవాలనుకొంటారు! మరికొందరిలో పనియందు ఎంత అనుభవమున్నా గమనించే శక్తి లేక ఏ పనిని సాధించలేరు! నిరంతరం ప్రాణాయామాలు, నిరంతర జపము చేయుటవలన, ప్రతిరోజు ధ్యానము చేయుటవలన ఈ చక్రమునకు బలము చేకూరును!

సహస్ర చక్రములో గురువు యోగమాయ ఉంటుంది! అనగా సాధకుడు గురువు, సద్గురువుగా, పరమగురువుగా మారే అవకాశం ఉంటుంది! అనగా ఇతరులకు शक्तिపాతము చేత కుండలినీ శక్తిని జాగ్రుతి చేసే అవకాశం ఉంటుంది! అంటే ఈ మాయలో పడినవారు సద్గురువుగా ఉండిపోతారు! అలాగే బ్రహ్మజ్ఞానిగా ఉండిపోతారు! ఈ మహాయోగమాయను సాధకుడు దాటుకుంటేగాని అసంప్రజ్ఞాత సమాధిస్థితి కలుగదు! అపుడే పరమాత్మడి సాక్షాత్కారమును పొందుతాడు! అపుడుగాని కుండలినీశక్తి బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించదు! అపుడు సాధకుడికి ఆనంద సమాధి స్థితి కలిగి, మృత్యువును జయించి మృత్యువును తన అధీనములోనికి తెచ్చుకొంటాడు! అనగా సాధకుడు ఎపుడు మృత్యువుకావాలంటే అపుడు తనకి మృత్యువు వస్తుంది! అపుడు సాధకుడు సజీవ సమాధి చెంది ధ్యాన తపస్సు చేసుకొంటూ ఉంటాడు! ఈ ధ్యాన తపస్సునందు సాధకుడు ఎన్ని కోట్ల సం||లైన ఉంటాడు! ఎందుకంటే ఈ తపస్సు చేసేది సూక్ష్మశరీరమేగాని స్థూల శరీరముగాదు! తేడాను గమనించండి! ఎపుడైతే సాధకుడు మృత్యువును జయించాడో అపుడు సాధకుడికి స్థూల శరీరముతో పని ఉండదు! అందుకే జీవసమాధి చెంది సూక్ష్మశరీరముతో ధ్యాన తపస్సు చేసుకొంటూ ఉంటారు! ఎవరైతే అనన్యభక్తితో నన్ను తలుస్తారో, నా సమాధినుండి నా ఎముకలు మాట్లాడుతాయని, నా భక్తుడి దగ్గరకు ఎల్లటెక్కు టాగంగాని, బండ్లుగాని అవసరముండదని మున్ముందు విషయాల ద్వారా శిరిడి సాయిబాబా సెలవిచ్చారు! అంటే బాబావారు సజీవ…సమాధి చెంది సూక్ష్మ శరీరముతో ధ్యాన తపస్సులు చేసుకొంటున్నారని తెలుస్తోంది గదా! అలాగే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి చెందిన తర్వాత సిద్ధయ్యకు సూక్ష్మ శరీరముతో దర్శనమిచ్చారని వారి చరిత్రములో తెలియెను! ఎప్పుడైతే సాధకుడికి క్షణిక దీర్ఘ నిర్వికల్ప సమాధి స్థితి లభించునో అప్పుడు మృత్యువును సాధించవచ్చును. ఉదా:- శిరిడిసాయిబాబా, జీసస్ 3రోజులు చనిపోయిన తరువాత బ్రతికారని చెబుతారు! అంటే వీరు మృత్యువు జయించారు అన్నమాట! మృత్యువు అంటే మనలోని కుండలినీశక్తి బయటకు అనగా జీవాత్మరూపంలో పంపించడం! ఎప్పుడైతే సాధకుడికి బ్రహ్మరంధ్రము ద్వారా కుండలినీశక్తి బయటకు పోతుందో, అప్పుడు క్షణిక ఆనంద సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు విశ్వంలోనికి విశ్వశక్తి ధారాళంగా తనలోకి అనగా తనలోనికి ప్రవేశించును! అప్పుడు తిరిగి సాధకుడికి కనిపించడానికి స్థూలశరీరము ఉంటుంది! కాని ఉండెడి సూక్ష్మశరీరము ఆదికూడా విశ్వశక్తితో నింపి ఉంటుంది! అప్పుడు సాధకుడికి తన స్థూల శరీరముతో పనిఉన్నప్పుడు ఆ కర్మలు చేసి, వేరేకరివారీ మృత్యువుతో తన స్థూలశరీరము నాశనం చేసుకొంటారు. అప్పుడు వీరి స్థూలశరీరము చనిపోవును! అంటే మొదటి వారు ప్రాణం ఉండగానే సజీవ సమాధి చెందుతారు. కనిపించెడి స్థూలశరీరమున సూక్ష్మ శరీరము. ఆ విషయం వారికి తెలియెను. ఈ విషయం తన శిష్యులకు, భక్తులకు తెలియెగూడదని సజీవ సమాధి చెందుదురు. ఉదా:- రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ విషయాన్ని బలపరుస్తూ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి చరిత్రలో ఒక సంఘటన ద్వారా తెలియెను. కక్కడు కత్తితో వేటు వేసినప్పుడు బ్రహ్మేంద్రస్వామి శరీరానికి ఏమీ కాదు. యోగులు సిద్ధి పొందినప్పుడు శరీరానికి ఏమీ కాదు అనే సందేహం రావచ్చునా మరి! శిరిడి సాయిబాబా వారికి అగ్నిలో చేయిపెట్టి ఎవ్వరినో రక్షించారని అప్పుడు చెయ్యి కాలినదని, దానికి తను చనిపోయాకా ఒక భక్తుడితో ప్రతిరోజూ మర్దన చేయించుకొన్నారని, కట్టుకట్టించుకొన్నారని వారి చరిత్రలో తెలియదగదా! అంటే బాబా సిద్ధుడు గదా! అదియు గాక వీరబ్రహ్మేంద్రస్వామి తన చివర స్థితిలోనే కక్కడును కలుసుకొంటారు! తరువాత ఆయన సజీవ సమాధి చెందుతారు! అంటే కక్కడు ద్వారా స్థూల శరీరము నాశనమై తనలోనికి సూక్ష్మశరీరమే ఉన్నదని తెలుసుకొని వీరబ్రహ్మేంద్రస్వామి సజీవసమాధి చెందారు! రెండవతరగతి వారు వేరేకోవారి మృత్యువు తీసుకొని వారి స్థూల శరీరమును నాశనం చేసుకొంటారు అనగా వీరు స్థూల శరీరము చనిపోయినతరువాత వీరు సజీవసమాధి చెందుతారు! ఈ విషయము శిరిడి సాయిబాబా, జీసస్ ఈ విధంగానే సజీవ సమాధి చెందుతారు! శిరిడిసాయిబాబా వారు తతాళ్ళ మృత్యువును తీసుకొని సజీవ సమాధి చెందారని వారి చరిత్రము ద్వారా తెలియెను గదా! అందుకే కాబోలు దీర్ఘ నిర్వికల్ప సమాధిస్థితివచ్చేసరికి సాధకుడి స్థూలశరీరం ఎముకల గూడులాగా ఉంటుంది! ఈ ఎముకల గూడు లాంటి శరీరము కన్పించకుండా ఉండటానికి పైనుండి క్రిందకి దాకా ఒకే బట్టతో కప్పి వేసుకొంటారు! కావాలంటే శిరిడి సాయిబాబా, జీసస్ విషయంలో ఇలాంటి దుస్తులను వేసుకోవటం గమనించవచ్చును!

ఈ అనుభవాలు లక్షణాలు రుద్ర స్వామికి చెప్పేసరికి… సహస్ర చక్రం అనేది విష్ణు మాయ తల్లి!  విష్ణువు దగ్గర నుంచి శ్రీకృష్ణుని దాకా మనకి ధ్యానఅనుభవాలు కలుగుతాయి.  వీటిని మనం పొందవలసి ఉంటుంది.  అలాగే నీకు ఈ చక్ర శుద్ధి లక్షణాలు ప్రారంభమైనాయి.  ఈ చక్రం శుద్ధి అవుతున్నప్పుడు సహస్ర చక్రంకి సంబంధించిన మాయలు వస్తాయి.  ఇక్కడ కొంతమంది 18 రకాల అహంకార మాయ వస్తుందని చెబుతారు. కొంతమంది సహస్రమాయాలు వస్తాయని చెబుతారు.  మరికొంతమంది ఇక్కడ బ్రహ్మ పదవులు, ఇంద్ర పదవులు దాకా వస్తాయని చెప్పడం జరుగుతుంది.  ఏమాయ ఏ విధంగా వస్తుందని మనం ఇక్కడ చెప్పలేము.  మహా మాయ ఇక్కడే మొదలవుతుంది.  ఒక విధంగా చెప్పాలంటే వైకుంఠపాళీ ఆటలో ఒక పెద్ద పాము ఉంటుంది కదా… 107వ గడి నుంచి ఒకటవ గడి వరకు ఆ పాము ఎలా అయితే ఉంటుందో…. అలాగే ఇక్కడ సహస్ర చక్రంలో మహా మాయ ఉంటుంది.  ఈ మహా మాయని చేధిస్తే గాని…. మనం 108 వ గడిలోనికి వెళ్ళలేము.  ఈ మాయ సహస్ర తలలతో ఉన్న మహాసర్పం దర్శనం అవ్వటంతో ఆరంభం అవుతుంది.  జాగ్రత్తగా సాధన పరిసమాప్తి చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం నీ సాధన  మూలాధార చక్రం లోనికి అజ్ఞాన గ్రంధి లోనికి వెళ్లిపోయి…. మీ కుండలిని శక్తి నిద్రావస్థ పొందడం జరుగుతుంది. అంతటితో నీ సాధన పరిసమాప్తి అవుతుంది.  ఇక్కడ శరవేగంగా మణిపురా చక్రం లో నుంచి సహస్ర చక్రం కి నీకు తెలియకుండానే , నీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఆ ప్రవాహ వేగాన్ని నువ్వు తట్టుకోవాలి. లేదంటే మతి భ్రమణం చెందే ప్రమాదం ఉంటుంది.  ఒకప్పుడు చీమలు పాకినట్లుగా ప్రవాహం ఉంటే…. ఒకప్పుడు పాము పాకినట్లుగా శరవేగంతో ఉంటుంది. అంటే మనలో రక్త ప్రసరణ ఎలా అయితే పైకి కిందకి అవుతుందో అలా కుండలిని శక్తి ప్రవాహం జరుగుతుంది. దేనికి, ఎప్పుడూ ఏ విధంగా ప్రవాహం ఉంటుందో చెప్పలేము.  ఆవేశం కలిగినా …ఆనందం కలిగినా ….ప్రవాహంలో తేడాలు వస్తాయి.  ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత సూక్ష్మంగా భూతద్దంలో చూసే విధంగా మనసు వెళ్తుంది.  దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు.  మనో మాయ చూపిస్తుంది.  ఇక్కడ 1000 రకాలైన మనోమాయలు ఉంటాయి.  అదే సహస్ర కమలం … ఈ సహస్ర చక్రం శుద్ధిలో బహు జాగ్రత్తగా ఉండాలి.  సాధన పరిసమాప్తి చేసుకోవాలి . అయితే సిద్ధ పురుషులు అవుతారు.. లేదా మతి భ్రమణం చెందడం అనేది జరుగుతుంది. నీ చేతలను బట్టి, నీ చేతులను బట్టి నీ సాధన ఆధారపడి ఉంటుంది.  ఇక్కడ మనకి విశ్వ గురువు రావడం జరుగుతుంది.  కొంత మంది ప్రకృతి గురువులు రావటం…. కొంతమందికి జగద్గురువులు రావడం జరుగుతుంది. ఏదైనా గాని సహస్ర చక్రంలో నాలుగు విభాగాలు పెట్టుకుంటే….. 250 కమలాల చొప్పున నాలుగు భాగాలుగా వేసుకుంటే…. సహస్ర చక్రం పూర్తి అవుతుంది.  కాబట్టి ప్రతిభాగంలోనూ 250 మాయలు ఉంటాయని గుర్తుపెట్టుకో… ఒక్కొక్క చక్ర భాగం జాగృతి, శుద్ధి, ఆధీనం అవుతున్న సమయంలో….మనకి ఒక్కొక్క గురువు రావడం జరుగుతుంది. అది ఎప్పుడు, ఎలా వస్తారు… అనేది ప్రకృతి నిర్ణయం చేస్తుంది.  ఒకరు పరమ గురువు, రెండవ వారు ప్రకృతి గురువు, మూడవ వారు జగద్గురువు, నాలుగవ వారు ఆది గురువు అనేది ఇక్కడే మనకి రావడం జరుగుతుంది. ఈ నాలుగు గురువుల సహాయ సహకారాలతో….. ఈ సహస్ర చక్ర సాధన పరిసమాప్తి చేసుకోవలసి ఉంటుంది.  కాబట్టి ఇకనుంచి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వెయ్యాలి. ఈ ప్రకృతికి అతీతమైన స్థితి సహస్ర చక్రస్థితి.  ఈ సహస్ర చక్ర స్థితిని నువ్వు దాటితే నువ్వు పురుష ప్రకృతిని దాటినట్టు అవుతుంది. విశుద్ధ చక్రం దాటడం వలన స్త్రీ ప్రకృతిని, ఆజ్ఞ చక్రం, సహస్ర చక్రం దాటడం వలన పురుష, స్త్రీ అతీతమైన మూల ప్రకృతిలోనికి జీవనాడీలోనికి వెళ్లడం జరుగుతుంది. ఈ జీవనాడి అధిపతిగా మనకి హనుమంతుడు కనబడతాడు. హనుమంతుడు కనపడే దాకా చెయ్యాలి. ఆయన కనిపిస్తే తప్ప నువ్వు ఈ చక్ర సాధన పరిసమాప్తి అయింది అని నమ్మకం పెట్టుకోవడానికి లేదు.  కాబట్టి శ్రద్ధ భక్తులతో అతి జాగ్రత్తగా సాధన చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం పురుష ప్రకృతి నుంచి అనగా సహస్ర చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా …ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధ చక్రం దాకా, విశుద్ధ చక్రం నుంచి మణిపూరక చక్రం దాకా,అలాగే స్వాధిష్ఠాన నుంచి మూలాధార చక్రం లోనికి పడిపోవడానికి క్షణకాలం పట్టదు.  కానీ ఈ సహస్ర చక్ర స్థితికి రావడానికి ఏడు సంవత్సరాలు పడితే… అదే సాధన ఈ మాయలో పడటానికి ఏడు క్షణాలకు మించి పట్టదు.  అది మాత్రం గుర్తు పెట్టుకో.  ఈ సహస్ర చక్రంలో సహస్ర మాయలు ఉంటాయి.  ఒక మాయని దాటటమే అతి కష్టం.  ఏ విభాగంలో ఏమాయ వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేము.  ఈ నాలుగు విభాగాలలో నాలుగు ప్రధానమైన మాయలు ఉంటాయి. వాటిని నువ్వు విచక్షణా జ్ఞానంతో, వివేక బుద్ధితో నువ్వు దాటుకోవలసి వస్తుంది. ఇక్కడ దైవాలు, గురువులు సహాయ సహకారాలు ఎలాంటివి ఉండవు. నీకు నువ్వే దాటుకోవలసి ఉంటుంది.  విష్ణు మాయ నుంచి శ్రీకృష్ణమాయ వరకు దాటుకుంటూ వస్తేనే నీ సాధన పరిసమాప్తి అవుతుంది.  సహస్ర చక్ర సాధన అంటేనే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అది జాగ్రత్తగా ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఏ చిన్న తప్పు ఆలోచన చేసినా, ఏ చిన్న తప్పు చేసినా నీ సాధనలో ఏకత్వం పొందవలసిన దానివి కాస్త సహస్రంగా విడిపోయి పునః సృష్టిలోనికి వెళ్లడం జరుగుతుంది. సుమారుగా 1000 కోట్ల జన్మలు తీసుకున్న తర్వాత మళ్లీ సహస్ర చక్ర స్థితికి రావాల్సి ఉంటుంది.  ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం చెందకూడదు.  అది మాత్రం గుర్తుపెట్టుకో.. అని రుద్రస్వామి అనేసరికి… అలాగే అయ్యా!  ఇక నా చేతులలో ఏమున్నది… ఇక నువ్వు చెప్పినట్లు నేను ఎలాంటి సాధనా మాయలో పడకుండా… సాధన ఆగిపోకుండా… చూసుకుంటాను అని అనేసరికి… అమ్మ ఇక్కడ నీకు మనో మాయ విషయం కూడా తెలుస్తుంది.  నూటికి 99.99 శాతం మంది ఈ మనో మాయలో పడి ఆగిపోవడం జరిగింది.  విష్ణుమూర్తి కాస్తా కౌస్తుభ మణి దగ్గర, శ్రీకృష్ణుడు కాస్త  శమంతక మణి దగ్గర, గౌతమ బుద్ధుడు కాస్త చింతామణి మణి దగ్గర, ఇంద్రుడు ఇంద్రనీల మణి దగ్గర , నాగమణిలోనూ కొంతమంది, రుద్రమణిలోనూ అంటూ ఇలా రకరకాల మణి మాయలో పడడం జరిగింది. ఈ మణి మాయను నువ్వు దాటవలసి ఉంటుంది.  నాకు తెలిసినంతవరకు నువ్వు కౌస్తుభ మణి, శమంతక మణి ,రుద్ర మణికి సంబంధించిన మాయలు నీకు ఇక్కడ తెలుస్తాయి.  ఈ మణికి సంబంధించిన జ్ఞాన, విజ్ఞానాలు ఇక్కడ తెలుస్తాయి.  ఇక్కడ శాస్త్రనికి సంబంధించిన రహస్యాలు కూడా తెలుస్తాయి.  పురాణ ఇతిహాస గ్రంధాలలో… వేదాలలో ఏమున్నాయి… దాని యొక్క అంతర్గత జ్ఞానం అంతా నీకు తెలుస్తుంది.  ఆ జ్ఞానమాయను బహిర్గతం చేయగలిగితే…. నీలో ఉన్న జ్ఞానాహంకారం పెరుగుతుంది.  ఈ జ్ఞాన అహంకారం 18 రకాలుగా ఉంటుంది.  కాబట్టి జ్ఞానాహంకారం ని నువ్వు చేదించవలసి ఉంటుంది. నీకు తెలిసిన జ్ఞానమును లోకకల్యానార్థం పదిమందికి చెబితే ….అది నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రమాదం ఉంటుంది.  కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతెందుకు …..పరమహంస గారు ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడే జ్యోతిష్య జ్ఞానం అనర్గళంగా తెలిసింది.  12 సంవత్సరాల సాధన చేసి తెలుసుకోవలసిన జ్యోతిష్యజ్ఞానం కేవలం 12 నెలల్లోనే ఆయన పొందడం జరిగింది. ఆయన వాక్సుద్ధి ద్వారా సుమారుగా 10,000 మందికి ఆయన సమస్యలు పరిష్కారాలు చెప్పడం జరిగింది. తద్వారా ఈ సహస్ర చక్ర సమయంలోనే తను జ్ఞాన మాయలో ఉన్నానని తెలుసుకొని…. జాతక బ్రహ్మ పదవిని నుంచి తప్పుకోవడం జరిగింది.ఇప్పుడు అనామకుడి లాగా, ఏమీ తెలియని వాడిలాగా మారడం జరిగింది. కాబట్టి నువ్వు కూడా ఈ సాధనలో వచ్చే 18 రకాల జ్ఞాన మాయలను దాటవలసి ఉంటుంది.  ఏదైనా గాని ఈ చక్రంలో 18 మాయలు ప్రధానంగా ఉంటాయి.  వెయ్యి మాయల్లో 18 మాయలు అతి ప్రమాదకరమైనవి.  పెను ప్రమాదం కలిగిస్తాయి.  వీటిని దాటుకోవలసి ఉంటుంది. వాటిని దాటుకొని ఈ సాధన పరిసమాప్తి చేసుకోవలసి ఉంటుంది.  నీ సాధన పరంగా  ఎలాంటి మాయలు వస్తాయి.. ఏ విధంగా దాటుకుంటావు అనేది నీ వ్యక్తిగత వివేక బుద్ధి, విచక్షణ జ్ఞానం బట్టి నీ చేతను బట్టి నీ చేతులలో ఉంటుంది. మాయలో పడవు అని నేను చెప్పలేను. అలా మాయలో పడినప్పటికీ కూడా ఆ మాయను దాటే జ్ఞానం పొందాలి.  అప్పుడే మాయ మాయమవుతుంది. ఒకవేళ మాయలో పడితే… అలాగే ఉంటే…. కర్మజన్మలలో పడే ప్రమాదం ఉంటుందని శివ నందినికి రుద్ర స్వామి చెప్పడం జరిగింది.

ఇదంతా విన్న శివ నందిని కాస్త రుద్ర స్వామితో… అయ్యా! నువ్వు చెప్పింది నిజమే… యధావిధిగా సత్యమే.  ఏ విధంగా మాయలో వస్తాయో… ఏంటి అనేది, నాకున్న సాధన పరిజ్ఞానం బట్టి, జ్ఞానమును బట్టి, నాకు నేనే దాటడానికి ప్రయత్నిస్తాను. వాటి మాయలో పడకుండా ఉండటానికి చూస్తాను.  మీరు చెప్పినట్టుగానే ఈ మణుల మాయ కానీ, జ్ఞాన మాయ కానీ ఇతర మాయలలోకి పడినప్పటికీ కూడా బయటకు వచ్చే విధివిధానాలతోనూ లేదా మీలాంటి గురువుల సహాయ సహకారాలు అందిస్తే ఆ మాయం దాటగలను.  నా సాధన ఇక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్లేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి!  అని రుద్రస్వామితో అనేసరికి అమ్మ!  నా చేతుల్లో ఏమున్నది… అంతా కూడా శివయ్య చేతుల్లోనే ఉన్నట్టుంది.  ఆయన ఏ విధంగా కదిపితే ఆ విధంగా ఆడే బొమ్మలమే కదా!  చేసేవాడు ఆయనే కదా! నీ సాధన పరిసమాప్తి అవ్వాలని రాసి ఉంటే యోగిగా మారే అర్హత, యోగ్యత, యోగం నీకు ఉంటే… ఎవరు ఏమి చేయలేరు. కాకపోతే ఇక్కడ నీకు కృష్ణస్వామి మరియు యోగాంబిక కూడా వివిధ మాయ పరీక్షలు పెడతారు.  అదే విధంగా ఇక్కడ నీకు అష్ట సిద్ధులతో పాటు 18 రకాల సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల మాయలో పడకుండా జాగ్రత్తగా నువ్వు సాధన పరిసమాప్తి చేసుకోవాలి.  యోగ శక్తులు కూడా వస్తాయి.  పంచభూతాల మీద ఆదిపత్యము, అష్టసిద్ధులు, 18 రకాల సిద్దయోగ శక్తులు, సిద్ధులు వస్తాయి.  వీటిని నువ్వు దాటుకోవలసి ఉంటుంది.  ఈ సిద్దుల మాయలో పడిన వాళ్ళు సిద్ధ పురుషులుగా ఇక్కడ ఆగిపోవడం జరిగింది కాబట్టి…. నువ్వు సిద్ధులు గురించి నువ్వు పట్టించుకోవద్దు.  నీకు వచ్చిన యోగ సిద్ధుల గురించి కూడా నువ్వు పట్టించుకోవద్దు. పంచభూతాల ఆధిపత్యం గురించి కూడా నువ్వు పట్టించుకోవద్దు. అవి వచ్చాయా లేదా అని మాత్రమే నువ్వు తెలుసుకో.  అది వస్తే మాత్రం నువ్వు వాటి విషయంలో నిస్వార్ధంగా ఉండు.  స్వార్ధంగానూ లేదా ధనాపేక్ష లేదా కీర్తి కోసం నువ్వు ప్రయోగం చేస్తే తద్వారా నీకు చక్రాలు బలహీనం అయిపోవడం, తద్వారా మాయలకి లోనవ్వడం, ఇక ఆ తర్వాత కోలుకోలేని స్థితిలో నీ సాధన పరిసమాప్తి అవ్వడం జరుగుతుంది. అప్పుడు సహస్ర చక్రం నుంచి మూలాధార చక్రం లోనికి నీ సాధన స్థితి జారిపోతుంది.  తద్వారా పునః జన్మకి వెళ్లే అవకాశం ఉంటుంది.  కాబట్టి మణుల విషయంలోనూ, సిద్దుల విషయంలోనూ, యోగ శక్తుల విషయంలోనూ, జాగ్రత్తగా ఉండాలి.  అలాగే మనకి ఇక్కడ భయంకరమైన దృశ్యాలను చూపిస్తారు.  ఆ దృశ్యాలను చూసి భయపడకుండా బెదరకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మీకు జన్మాంతర జ్ఞాన సిద్ధి కలుగుతుంది.  ఈ సిద్ది వలన నీకు గత జన్మ సాధన అనుభవాలు అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ జన్మలో నువ్వు పాపాలు చేసినట్టుగాను, తప్పులు చేసినట్టుగాను, నువ్వు మోసాలు చేసినట్టుగాను, అందుకు నువ్వు మోక్షం పొందలేదు అని నీ మనసుకి పరివిధాలుగా క్షోభ కలిగిస్తారు. మానసిక క్షోభ కలిగిస్తారు.  వాటన్నింటినీ కూడా నువ్వు చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్లుగా, సాక్షిభూతంగా ఉండటం జరగాలి. అలాగే నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ జన్మలకు సంబంధించిన శరీరాలు దేవతలు నీకు కనపడతారు.భూత ప్రేతాలు,పిశాచాలు, రుద్ర గణాలు, శివగణాలు, దేవి గణాలు ఇలా ప్రతివాడు నీకు సాదృశ్యంగా గాని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, స్వప్నంలో కానీ, ధ్యానంలో కానీ కనబడతారు. వాటన్నింటినీ కూడా నువ్వు దాటుకొని వెళ్లవలసి ఉంటుంది. అలాగే ఈ సహస్ర చక్రంలో ఉన్న సహస్ర లోకాలు కనబడతాయి.  మానవ మేథస్సుకి 108 లోకాలు మాత్రమే కనపడడం జరుగుతుంది.  108వ లోకంలో ఏమేమి ఉంటాయి అనేది నీకు యాదృచ్ఛికంగా కానీ, నీ కోరిక మేర కానీ, 14 లోకాలు సర్వసాధారణంగా భౌతిక నేత్రాలతో కానీ, ధ్యానంలో కానీ కనబడతాయి. ఆ తర్వాత మనోనేత్రంలో 64 లోకాలు కనబడతాయి. ఆ తర్వాత మనో నేత్రానికి కూడా అతీతమైన స్థితిలో నీ మనసు అతీత స్థితికి వెళ్లగలిగితే, అప్పుడు 108 లోకాలు కనబడతాయి. ఆ తరువాత ఇంకాస్త స్థితికి వెళితే…. సహస్ర లోకాలు కనబడతాయి. ఈ లోకంలో ఉండే లోకవాసులు కూడా ఇలాంటి వాళ్లే. వాళ్ళు ఆయా శరీరాలతో ఆవాసం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ ఉన్న స్థితిగతులను అన్ని చూసి ఆ లోకంలో ఉంటే బాగుండును…. ఆ లోకాలలో జన్మిస్తే బాగుండును అని చెప్పి సంకల్పాలు గాని, కోరికలు గాని పెట్టుకోవద్దు. వాటిని కేవలం సాక్షిభూతంగా చూస్తూ…. ఏమీ పట్టించుకోనట్టుగా దేనికి స్పందించకుండా ఉండాలి. ఈ సహస్ర చక్రంలో ఆసక్తిగాని, భయానికి గాని, స్పందనకి గాని, ఆలోచనకే గానీ, సంకల్పం గాని, ఈ అయిదు లేకుండా చూసుకో.  వీటిలో ఏ ఒక్కటి నువ్వు చేసినప్పటికీ కూడా…. నువ్వు మహామాయకు బలి అయ్యి, పునః సృష్టికి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సహస్ర చక్రం దాటతావో అక్కడితో నువ్వు జన్మరాహిత్యం పొందడం జరుగుతుంది. కర్మరాహిత్యం అనేది నీకు హృదయ చక్రం మరియు బ్రహ్మ రంధ్రం తో సాధన పరిసమాప్తి అవుతుంది. హృదయ చక్రంలో కర్మరాహిత్య స్థితి వస్తే బ్రహ్మ రంధ్రంలో సర్వకర్మల యొక్క  ఋణాలు, బంధాల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. అప్పుడు కర్మరాహిత్యం పొందుతావు. పునః సృష్టికి కారణం, కారకం, కర్మజన్మ అని గుర్తు పెట్టుకో. ఈ కారణాకారక కర్మల నుంచి బయటికి రావటమే సాధన పరిసమాప్తి అని గుర్తుపెట్టుకో!  అప్పుడు ఈ సహస్ర చక్రం యొక్క సంకల్ప శరీర సాధన కారణం ఏమిటి అనేది నీకు తెలుస్తుంది.  ఆ కారణం తెలుసుకొని…. ఆ కారణం పరిసమాప్తి చేసుకుంటే ఇక నీకు ఏ కారణం వలన కూడా స్త్రీ గర్భంలో ప్రవేశించే అవకాశం ఉండదు.  అది జంతు జన్మ అయినా కూడా… మనిషి జన్మ అయినా కూడా… దైవ జన్మ అయినా కూడా… సృష్టి లేదు.  అప్పుడు నీ సంకల్ప శరీరం జ్యోతి శరీరం గా మారటం జరుగుతుంది. ఆ జ్యోతి శరీరం పుట్టడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకొని కర్మరాహిత్యం పొందవలసి ఉంటుంది.  హృదయ చక్రంలో ఇష్టకామేశ్వరి, ఇష్టకామేశ్వరుడు వలన జన్మ ఎత్తటం జరుగుతుంది. ఏ జంతువు జన్మ ఎత్తావో , ఏ నర జన్మ ఎత్తావో… ఏ దైవంశ జన్మ ఎత్తావో అనేది తెలుస్తుంది.  దాని యొక్క కారణం నువ్వు తెలుసుకోగలిగితే…. అప్పుడు నువ్వు జన్మరాహిత్యం పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జన్మకు కారణం అయిన కర్మ ఏంటో తెలుసుకోవాలి అంటే బ్రహ్మ రంధ్రం దగ్గర సాధన పరిసమాప్తి చేసుకోవలసి ఉంటుంది.  బ్రహ్మ రంధ్రంకి వచ్చేసరికి కర్మకి ఉన్న ఋణానుబంధం ఏంటో తెలుసుకోవలసి ఉంటుంది.  నువ్వు ఆబగా తీర్చుకో. తీర్చుకున్నట్లైతే ఆ ఋణం తీరిపోవడంతో నీ మనో శరీరం కాస్త పిండ దేహం గాను… ఆ తర్వాత లింగదేహంగాను మారి విశ్వ శూన్యం నందు శూన్యం అవడం అనేది జరుగుతుంది. అంటే సహస్ర చక్రం, హృదయ చక్రం, బ్రహ్మ రంధ్రం సాధన అనేది కారణం,కారక,కర్మ,జన్మ రాహిత్య స్థితిని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట.  ముందు ఈ సహస్ర చక్రం యొక్క సంకల్పం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది.  దానికి నువ్వు సాధన పరిసమాప్తి చేసుకోవలసి ఉంటుంది.  దీనికి సంబంధించిన మాయలను కూడా నువ్వు దాటుకోవలసి ఉంటుంది.  ఎప్పుడు ఏ విధంగా ఏమాయ ప్రభావితం చూపిస్తుందో తెలియదు కాబట్టి…..నువ్వు అప్రమత్తంగా ఉండాలి.  పగలు రాత్రి అని తేడా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆశ, భయం, ఆలోచన, స్పందన, అనేది నువ్వు పెట్టుకోవద్దు. ఒకవేళ వీటికి నువ్వు స్పందించినట్లయితే… నీకు కారణం కాస్త బంధంగా మారుతుంది. బంధం కాస్త బంధనంగా మారుతుంది. అది కాస్త బాధ్యతగా మారే ప్రమాదం ఉంటుంది.  తద్వారా నువ్వు ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం పునః జన్మకి  వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి.  ఈ సహస్ర చక్రంలో దాటడం అంటే పురుష ప్రకృతిని దాటడం… అంటే శివమాయని దాటటమే. శివుడుని నువ్వు తెలుసుకోవాలి.  శివుడిని నువ్వు చూడగలిగే స్థితికి రావాలి.  ఇప్పుడు నీలో శివుడిని చూడడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వే శివుడు అనే జ్ఞానం పొందవలసి ఉంటుంది.  తద్వారా నీకు విషయం ఏమిటి అనేది తెలుస్తుంది. పదార్థమాయ దాటితే కానీ యదార్థ జ్ఞానం తెలియదు అని చెప్పి రుద్రస్వామి అనేసరికి… శివ నందిని కాస్త అలాగే స్వామి!  మీరు చెప్పింది నేను తూచా తప్పకుండా గుర్తుపెట్టుకుని ఆచరిస్తాను.  నాకు సాధ్యమైనంత వరకు సాధన పరిసమాప్తి అయ్యేటట్టుగా చూస్తాను.  ఏ విషయంలోనూ…. ఏం మాయలో పడకుండా నా సాధన ఆగిపోకుండా చూసుకుంటాను.  ఒకవేళ తెలిసో తెలియకో తప్పుడు ఆలోచనల వలన మాయలో పడినా కూడా ….సమయానుకూలంగా ఆ మాయ నుంచి బయటకు వచ్చే విధంగా ఉండే  వివేకబుద్ధిని, విచక్షణాజ్ఞానాన్ని,  సమయానుకూలంగా…. కాలానికి అనుకూలంగా నాకు అనుగ్రహించేటట్టుగా దీవించండి స్వామి!  అనేసరికి అంతా శివలీల… శివానుగ్రహం… నాదేముంది అనేసి రుద్ర స్వామి అనడంతో… ఇక శివ నందిని కాస్త రుద్ర స్వామి చెప్పిన విషయాలని కూడా తన మెదడులో భద్రపరుచుకొని జ్ఞాపకాలుగా జ్ఞాన స్ఫురణగా ఉండాలి అని చెప్పి…. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని… అన్నీ చక్రాల లాగా ఈ చక్రంలో ఒక మాయ ఉండదని… అనేక మాయలు ఉంటాయని… ప్రతిక్షణం, అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ ఈ సాధన పరిసమాప్తి చేసుకోవాలి అనుకుంటూ…. శివ నందిని సాధనను కొనసాగించడం జరిగింది. 

ఒకరోజు శివ నందిని ధ్యాననిష్టలో ఉండగా ధ్యాన దృశ్యంగా త్రిమూర్తులు మూడు భాగాలుగా కనపడటం జరిగింది. త్రిమూర్తులు మూడు విభాగాలుగా ఎలా కనపడుతున్నారు అనేది శివ నందినికి అర్థం కాలేదు. అందులో విష్ణువు, మహావిష్ణువు, ఆదిష్ణువుగా…. విష్ణుమూర్తి కాస్త విష్ణు లోకంలోనూ, మహావిష్ణువు కాస్త మహా వైకుంఠంలోనూ, ఆదివిష్ణువు కాస్త ఈ సహస్ర దళంలో ఉన్న ఆది వైకుంఠంలో ఉన్నట్టుగా ధ్యాన అనుభవం అయింది. అంటే ఈ విధంగా ప్రతి జీవి కూడా ప్రతి దేవుడు కూడా మూడు రూపాలుగా మూడు స్థితిగతులతో ఉండటం వలన ఏకత్వస్థితి కాస్త సహస్రస్థితికి విభజన చెంది ఉంటుంది అని చెప్పేసి శివ నందినికి అవగాహన రావటంతో ధ్యానభంగం అయింది. కళ్ళు తెరిచి విచారణ చేసుకుంటే విష్ణువు వేరు, మహావిష్ణువు వేరు, ఆది విష్ణువు వేరు అన్నమాట. భగవద్గీతలో చెప్పినట్టుగా పరమపద సోపానమైన… వెనక్కి తిరిగి నా వైకుంఠ ధామానికి చేరుకోగలిగితే మోక్షం వచ్చినట్టుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పటం జరిగింది. సహస్ర చక్రంలో ఉన్న ఈ వైకుంఠధామం నకు జీవాత్మ చేరితే….. విష్ణు పరంగా మోక్షం పొందడం జరుగుతుంది అని శివ నందిని ఆత్మ విచారణ చేసుకుంది. తిరిగి మళ్లీ ధ్యానంలో కూర్చోగా ధ్యాన దృశ్యంగా ఈసారి మహావిష్ణువు కాస్త మహా లక్ష్మి గానూ ,వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహిని రూపం గాను, ఆ తర్వాత శివుడు, జగన్మోహిని కలిసినట్టుగా రకరకాల ధ్యాన దృశ్యాలు కనిపించాయి. ఇవేంటి ఇవెందుకు కనపడుతున్నాయి… అనుకునే లోపులే ధ్యానభంగం అవటం జరిగింది. ఉన్నట్టుండి శివ నందినిలోనికి జగన్మోహిని మోహమాయ ఆవరిండం ద్వారా మోహమాయలో పడటం జరిగింది. సాక్షాత్తు మహావిష్ణువు తన భర్తగా వస్తే బాగుండు అని చెప్పేసి రకరకాల ఆలోచనలలో మనసు వెళ్లడం శివ నందిని గ్రహించింది. పోయి పోయి విష్ణువును తన భర్తగా ఊహించుకోవడం ఏమిటి? ఒకవేళ తనలోనికి జగన్మోహిని అంశగాని లేక మహాదేవుని అంశ గాని ప్రవేశించడం వలన…. మహావిష్ణువు కాస్త తనకు భర్తగా కనపడుతున్నాడా?  అని ఆలోచనలు చేసుకుంటూ….ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఈ సాధన మాయ దాటాలి అని ఆవేశపడుతూ, ఆవేదన పడుతూ, ఆలోచించడం చేయసాగింది.  దీనికి తగ్గట్లుగానే ధ్యానంలో, స్వప్నంలో కనిపిస్తూ నీకు నేను భర్తగా కావాలా? కుమారుడిగా కావాలా? తండ్రిగా ఉండాలా? అని మూడు రకాల విధివిధానాలు చెప్పేసరికి.,. శివ నందినికి ఏం చెప్పాలో…. ఏం అడగాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండటం జరిగింది. అప్పుడు తనకి కలిగిన ధ్యాన అనుభవాల గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి ….ఇదేవిధంగా పరమాహంస గారికి కూడా సహస్ర చక్రంలో ఉన్నప్పుడు ఆదిపరాశక్తి కాస్త తనకి భార్యగా ఉండమంటావా?  తల్లిగా ఉండమంటావా? కూతురిగా ఉండమంటావా? అని అడగడం జరిగిందని…. ఆయన కాస్త భార్యగా ఉంటే కామ మాయగాను, తల్లిగా ఉంటే పుత్ర వ్యామోహ మాయగా ఉంటుంది కాబట్టి…. కూతురిగా ఉండమని చెప్పటం వలన ఇక తనకి సంతానయోగం లేకపోవడంతో…. తను కూతురిగా ఉండటం కుదరకపోవడం వలన.. ఒక ఆడ కుక్కగా తన దగ్గరికి రావడం జరిగింది అని పరమహంస అనుభవాలలో జరిగిన దాన్నిబట్టి చూస్తే, నీకు మహావిష్ణువు కూడా ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి, నువ్వు కొడుకుగా ఉండమని చెప్పు అనేసరికి…ఇప్పుడు నాకు శివ స్వామి ద్వారా తెలుసో తెలియకో తప్పు చేస్తే మహావిష్ణువు కాస్త కుమారుడిగా పుట్టే ప్రమాదం ఉంది కదా!  అంటే తప్పు చేస్తే మాత్రం పుట్టే యోగం అయితే ఉంటుంది.  తప్పు చేయకుండా ఇంద్రియ,మనోనిగ్రహంతో ఉండగలగాలి. లేదంటే మహావిష్ణువు సహస్ర నామాలలో ఏదో ఒక రూపం ఎత్తి రావడం జరుగుతుంది. ఎందుకంటే మహావిష్ణువు తొలి రూపమే సనక నాదులలో తొలిరూపం అని 24 అవతారాలలో ఒకటి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి… ఈ సనక నాదులు ఐదు సంవత్సరాల వయసులో ఉంటారు.  వాళ్ళు చిరంజీవులుగా ఉంటారు కాబట్టి …..మహావిష్ణువు ఈ సనక నాదులలో  ఏదో ఒక రూపంలో పుట్టి పుత్ర వ్యామోహంలో నిన్ను పడేసి, నీ సాధన ఆగిపోవడం అయితే జరుగుతుంది.  కాబట్టి నువ్వు శివ స్వామితో సంయోగానికి ,సంసార సుఖానికి దూరంగా ఉండాలి అనేసరికి…అది కాదు స్వామి అనుకోకుండా ఈ విష్ణుమూర్తిని కుమారుడిగా నేను కోరుకున్నట్లైతే…. మా ఇద్దరి మధ్యన ఎప్పుడు లేని కామ కోరిక, మోహం కలిగి సంసార సుఖమునకు లోనయి… సంతానం పొందే ప్రమాదం వస్తే అప్పుడు మహా విష్ణువు పుడితే నా పరిస్థితి ఏమిటి? అంటే జరగదు అని చెప్పడానికి లేదు..జరిగే ప్రమాదం ఉంటుంది. పుత్రుడిగా నువ్వు కావాలి అనుకున్నప్పుడు… ఆయన పుత్రుడుగా పుట్టే అంశాలను పరిశీలిస్తుంది.  ప్రకృతి మోహమాయాలు కలిగిస్తుంది.  అవకాశానికి తగ్గట్టుగా…. పరిస్థితికి తగ్గట్టుగా… పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది.  ఇప్పుడు మీ ఇద్దరు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు… కోరికలు కలిగే ప్రమాదం ఉంది. బహు జాగ్రత్తగా ఉండాలి.  ఈ విష్ణు మోహమాయని ఎలా దాటుతారు…. ఒకవేళ భర్త అనేది తీసుకుంటే ఆయన నీకు భర్త రూపంలో వచ్చే ప్రమాదం ఉంది. అలాగని తండ్రిగా తీసుకుంటే ఆయనకి కూతురిగా నువ్వు పునః జన్మ ఎత్తాల్సి ఉంటుంది. పునర్జన్మకు వెళ్లే ప్రమాదం ఉంది. ఎటు చూసినా మూడు ప్రమాదాలే ఉన్నాయి.  కాకపోతే ఇక్కడ నీకు ఉన్న అవకాశం వల్ల శివ స్వామి ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడు కాబట్టి…. ఆయన వల్ల నీకు సంతానం పుట్టే యోగం ఉండదు. ఎందుకంటే శివస్వామి పరమహంస అంశ.  పరమహంస కి సంతానయోగం లేదు కాబట్టి…. రతిక్రీడలో పాల్గొన్నప్పటికీ నీకు సంతానయోగం ఉండదు. తద్వారా నీకు పుత్రుడిగా తీసుకోవటమే మంచిది అనేసరికి…. సరే ఈసారి కనపడ్డప్పుడు ధ్యానంలో గాని, స్వప్నంలో గాని కనపడినప్పుడు ఆలోచించి చెబుతాను అని… ఎందుకైనా మంచిది అని శివ స్వామిని కూడా తన యొక్క అనుభవం గురించి ధ్యానంలో చెప్పేసరికి…. నువ్వు నా నుంచి ప్రమాదం వస్తుందని, నావల్ల సమస్య వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు.  నా వల్ల నీకు సంతాన ప్రాప్తి కలిగే యోగం లేదు.  కాబట్టి ఎలా అయితే ఆదిపరాశక్తినీ కూతురిగా తీసుకున్నానో…. అలాగే నువ్వు కూడా మహావిష్ణువుని కుమారుడిగా తీసుకోవడం జరిగితే ప్రకృతి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయని  చూస్తుంది… ఆ అవకాశాలు లేవు కాబట్టి నీకు ఏదో ఒక రూపంలో రావడం జరుగుతుంది. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నిరభ్యంతరంగా పుత్రుడి అంశనే తీసుకో అని చెప్పి శివ స్వామి మనోధైర్యం ఇచ్చేసరికి…. ఈసారి ధ్యానంలో దీనికి సంబంధించినవి కనపడితే… ఇదే విషయం  తీసుకోవాలి అని అనుకోసాగింది.  ఇలా కొన్ని రోజులు ధ్యాననిష్ఠలో ఉన్న శివ నందినికి యధావిధిగా విష్ణుమూర్తి మళ్ళీ కనపడి ….నీకు భర్తగా ఉండాలా, తండ్రిగా ఉండాలా, కుమారుడిగా ఉండాలా?  అని అనేసరికి కుమారుడిగా ఉండు అనేసరికి… సరే నీకు సనక నాదులలో ఏదో ఒక కుమారుడి అంశగా పుడతాను అనేసరికి స్వామి!  నాకు ఈ జన్మ మోక్ష జన్మ అవ్వాలనుకుంటున్నాను….నాకు సంతానం మీద మోహ వ్యామోహాలు ఏమీ లేవు. నేను భోగ జీవితం లో దానికి స్వస్థ పలికాను.  అలాగే యోగ జీవితంలో వచ్చిన పిల్లలు కూడా వాళ్ల మీద బాధ్యత తీసుకున్నానే కానీ, వాళ్ల మీద వ్యామోహాలలో నేను పడలేదు కదా!  ఎందుకు నాకు పరీక్ష పెడుతున్నారు.  మీకు అన్నీ తెలుసు… నువ్వు సాక్షాత్తు పుత్రుడిగా వచ్చినంత మాత్రాన నీ మీద వ్యామోహాలలో పడతానని చెప్పేసి అనుకోవద్దు ….ఎందుకంటే ఆదిపరాశక్తి సాక్షాత్తు పరమహంస గారికి కూతురుగా వచ్చినప్పటికీ…. కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.  కుక్క రూపంలో వచ్చినా కూడా,.....!  అలాగే నువ్వు కూడా ఏదో ఒక పక్షి రూపంలో, జంతువు రూపంలోనూ వస్తావు అని అర్థమవుతుంది.  అంటే ఇప్పుడు నీకు నేను పుత్రుడిగా వస్తే ప్రేమా మోహ వ్యామోహాలు ఉండవా?  పరీక్షించి చూడాలనుకుంటున్నాను…!  అంటే సరే స్వామి ! మీ ఇష్టం…. నేనైతే కాదనను.  ప్రకృతి ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేస్తుంది అని చెప్పి అనేసరికి… సరే అని ఆయన అంతర్ధానం అవ్వడం జరిగింది. ఇలా ధ్యానం కొనసాగిస్తూ కొన్ని రోజులు శివ నందిని ఉండటం జరిగింది.  అనుకోకుండా శివ నందిని కాస్త నదీతీరంలో స్నానం చేస్తూ ఉండగా, పొదల మధ్యలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినబడింది.  అక్కడ నక్కలు, కుక్కలు ఈ పసిపిల్లవాడిని కబళించాలి అని కారాడుతూ ఉండటం శివ నందిని గమనించింది. దగ్గరికి వెళ్లి చూస్తే అప్పుడే పుట్టిన పసికందు ఉన్నాడు.  ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవని స్థితిలో ఏడుపు అందుకున్నాడు. పాలు కావాలేమో అన్నట్టుగా… ఉంది. చూస్తే ఇప్పుడే ఒక గంట, రెండు గంటల ముందు కాన్పు అయినట్టుగా ఉంది. శరీరం మీద ఇంకా రక్తపు మరకలుతోనే ఉంది. ఎవరో అనామకురాలు అకారణంగా వచ్చిన గర్భమును లోకానికి భయపడి, సమాజానికి భయపడి పుట్టిన పురిటి బిడ్డను ఇక్కడ పొదలలో పడేసి వెళ్ళింది.  పురిటి మాంసం కోసం అని కుక్కలు, నక్కలు తినటానికి వచ్చాయి అనుకొని…. శివ నందిని గ్రహించింది. పిల్లాడి ఏడుపు ఆగకుండా వస్తుంది. ఏం చేయాలి రా!  భగవంతుడా… ఇదెక్కడి పరీక్ష?  చూస్తూ చూస్తూ జంతువులకు ఆహారంగా వేయాలా!  ఇప్పుడు తను తీసుకువెళ్లి పెంచే పరిస్థితి కాదు…. ఏం చేయాలి.?  ఈ పిల్లాడికి పాలు పట్టించగలను గాని ఇప్పుడు స్పందిస్తే అది బంధం కాస్త బంధనంగా మారి బాధ్యతగా మారుతుంది.  పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  ఈ విపత్కర పరిస్థితికి కారణం విష్ణుమాయ అని శివ నందిని కి జ్ఞాన స్ఫురణ అందడంతో శివ నందిని పొదల్లో ఏం చేస్తుందో అని రుద్ర స్వామి,మహాదేవి, పిల్లలు రావటం జరిగింది. ఈ పసిపిల్ల వాడి ఆక్రందనాలు విని వాళ్ళ ఇద్దరు కూడా అమ్మ !అమ్మ!  చిన్నపిల్లవాడు పాపం…. కళ్ళు కూడా తెరవలేదు… ఆకలేస్తుంది ఏమో… పాలు తీసుకొచ్చి పడదామా? అని బాలగణపతి అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.  అమ్మ!  ఈ పిల్లాడిని మనం పెంచుకుందాము… ఇప్పుడు ఇద్దరం ఉన్నాము. వీడు మూడవ వాడు అవుతాడు.  నేను వీడిని ఆలనా పరనా చూసుకుంటాను అని మహాదేవి తనలో ఉన్న తల్లి వాత్సల్యం బయట పెడుతూ ఉండేసరికి… రుద్ర స్వామి కేసి శివ నందిని చూసేసరికి…. రుద్ర స్వామి మాత్రం, కళ్ళతోనే ఇది విష్ణు మాయ.!  దీనికి నువ్వు స్పందించవద్దు. ఇది ఏ విధంగా జరగాలో ఆ విధంగానే జరుగుతుంది అని కనుసైగ చేయడంతో శివ నందినీకి విషయం అర్థమైంది అన్నమాట ! ఇది విష్ణు మాయలీలా విన్యాసం అన్నమాట!  అలాగే యుగ ప్రళయంలో వటపత్ర శాయిగా రావి ఆకు మీద ఒక పసి పిల్లవాడు ఉంటాడు అని చెప్పేసి …ఆ పసిపిల్లవాడి కదలిక వల్లనే సృష్టి పునః సృష్టి జరుగుతుంది అని చెప్పేసి జ్ఞాన స్ఫురణ అందడంతో….. ఈ విధంగా తనని పునః సృష్టిలో పడవేసి…. తను తల్లిగానూ ,అతను కొడుకు గానూ రావాలి అని చెప్పేసి విష్ణు లీలా విన్యాసం అని చెప్పేసి అవగతం అవ్వటంతో…. సరే పదండి అంటూ ఉండేసరికి….. పిల్లలు, మహాదేవి కాస్త ఏంటమ్మా? నువ్వు రాక్షసంగా మారిపోయావు… చిన్నపిల్లాడికి మనం పెంచలేమా…. ఒక చిన్న పిల్లాడిని పెంచితే ఏమవుతుంది …జీవితం ఇస్తే తప్పేంటి అనటం….అని మహాదేవి అనడం…మాకు ఆడుకోవడానికి ఇంకొక పిల్లవాడు ఉంటాడని పిల్లలు అనటం… వాళ్ళలో ఆవేశం,ఆవేదన  కనిపిస్తూ ఉండేసరికి…. ఇవేమీ పట్టనట్టుగా, పట్టించుకోనట్టుగా… అక్కడి నుంచి కదలాలి అన్నట్టు అనేసరికి మహాదేవి కాస్త ….నేను ఇలా వదిలిపెట్టి రాలేను అని, పిల్లలు కూడా మేము ఈ పిల్లాడిని వదిలిపెట్టి రాలేము అని…చూస్తూ చూస్తూ నక్కలు, కుక్కలు పిల్లాడిని చంపి తినడం మాకు ఇష్టం లేదు…. నువ్వు చూడకపోయినా పర్వాలేదు, మహాదేవి చూసుకుంటుంది అని అనేసరికి …మహాదేవి నేను శుభ్రంగా చూసుకుంటాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి పిల్లవాడిని చేతిలోకి తీసుకోగానే…. తన కుండలిని శక్తి ప్రవాహం…. కిందకి పైకి వేగంగా వెళుతూ ఉండేసరికి…. ఇది మాయాపూరితమైన శరీరం, ఇది శివ నందినికి పరీక్ష పెట్టడానికి వచ్చింది. ఇది భ్రమ,బ్రాంతి , సత్యం కాదు అనుకోగానే…. పిల్లాడు తనని గట్టిగా పట్టుకోవడం చూసేసరికి…. శివ నందిని కి పట్టవలసిన మహా మాయ కాస్త తనకి పట్టుకుంది అని ఆవేదన పడుతూ ఉండేసరికి…శివ నందినితో మహాదేవి కాస్త అమ్మ!  ఇది మహామాయ అంశ.   ఇది నిజం కాదు… సత్యం కాదు… పిల్లవాడు నిజం కాదు… వీడు భ్రమ బ్రాంతి కలిగిస్తున్నాడు అనేసరికి…. చిరునవ్వునవ్వి ఆ విషయం నాకు అర్థమైంది తల్లి.!  ఎప్పుడైతే నేను పుత్రుడి రూపంలో ఆ మహావిష్ణువు రావాలని అన్నానో ….అప్పుడు నాకు ఇది చూపించడం జరిగింది.  ప్రళయ కాలంలో ఈ పిల్లవాడిని చూసే పునః సృష్టి జరుగుతుంది. ఆదిపరాశక్తి ఈ పిల్లవాడి కోసం మళ్ళీ మోక్షం పొందవలసిన ఆమె కాస్త మోక్షం పొందకుండా పునః సృష్టికి వెళుతుంది.  మోక్షం పొందవలసిన దానిని కాస్త అమోక్షం పొంది పునః సృష్టికి వెళ్ళాలి అని, ఈ పిల్లవాడి రూపంలో పెట్టడం జరిగింది.  ఆ మాయ నిన్ను ఆవరించింది. ఆ మాయతో నువ్వే తిప్పలు పడాలి అని శివ నందిని వెళ్ళిపోతూ ఉండేసరికి ….పిల్లలకి ఇదేమీ అర్థం కాక ఏమాయో నాకైతే తెలియదు కానీ పిల్లాడిని అయితే పెంచుకోవాల్సిందే అని పిల్లలు మంకు పట్టు పడుతూ ఉండేసరికి…. మహాదేవికి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా రుద్ర స్వామి కేసి చూస్తూ స్వామి! నిన్ను గురువుగా భావించుకున్నాను కదా… ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?  ఈ మహామాయ వలన నేను పునః సృష్టికి వెళ్లాను.  అనుకోకుండా నాలో ఆడతనం వలన తల్లి ప్రేమ కాస్త పుత్ర వాత్సల్యం గా మారడంతో…. శివనందిని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, కుక్కలు ఇలా జంతువుల వలన ఈ పిల్లవాడు చనిపోతాడేమో అనే మనోభాయానికి గురై, ఈ పిల్లవాడిని తీసుకోవడం జరిగింది. ఈ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇది మాయా శరీరం అని చెప్పేసి నాకు అర్థం అయింది.  ఇది పునః సృష్టికి కారణం అవుతుంది అని నాకు అర్థం అయింది. ఇది విష్ణుమూర్తి యొక్క లీలా విన్యాసం అని చెప్పేసి తెలిసింది. ఈ పిల్లవాడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టడం లేదు.. పట్టుకున్నాడు.. ఇప్పుడు నాకున్న పుత్ర వ్యామోహాన్ని మీరే తీర్చాలి అనేసరికి… నాకు ఇది ముందే తెలుసు…. తీసుకునేటప్పుడే, స్పందించేటప్పుడే.. ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి కదా!  నీ అంతట నువ్వే పుత్ర వ్యామోహం లో పడ్డావు. తల్లి వాత్సల్యంలో పిల్లవాడిని తీసుకోవడం జరిగింది కదా ఎలాగైనా పిల్లవాడిని నేను పెంచుతాను అన్నావు కాబట్టి…. చచ్చినట్టు పెంచు.  ఆ పసిపిల్లవాడి బాధ్యత నువ్వు తీసుకోవాల్సిందే . సుమారు 21 సంవత్సరాలు వాడికి వివాహం అయ్యేదాకా ఆ బాధ్యత తప్పదు.  నీ కర్మ నువ్వే అనుభవించు.  నేను చేసేది ఏమీ లేదు అని అంటూ ఉండేసరికి…. అప్పుడు మహాదేవి, పిల్లలు అక్కడే కూర్చుని… ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉండేసరికి…. ఏం జరుగుతుందో అని శివ నందిని ,రుద్రస్వామి కూడా ధ్యాన నిష్ఠలోకి వెళ్లి పోవటం జరిగింది. శివ నందిని అయితే దీనికి స్పందించకపోవడం, మహాదేవి స్పందించడంతో ఇది మహాదేవికి మహా మాయగా ఏర్పడటం, శివ నందిని మాయ రహితంగా ఉండి పోవటం జరుగుతూ ఉండగా… సుమారు 3 గంటల తర్వాత…. ఏ తల్లి అయితే ఈ పిల్లవాడిని పొదల్లో పడేసి వెళ్లిందో, ఆ తల్లి తిరిగి వచ్చి…. నా బిడ్డని మీరు ఎవరైనా చూశారా?  పొదల్లో పడేసాను అని పొదల్లో వెతుకుతూ ఉండేసరికి… మహాదేవి కాస్త తన ఒడిలో ఉన్న పిల్లవాడిని చూపించి… ఈ పిల్లవాడేనా అని అనగానే అవును తల్లి!  అనగానే ఆ కన్నతల్లి ఆ పిల్లవాడిని తీసుకునేసరికి… నేను సమాజానికి భయపడి పిల్లవాడిని వదిలేశాను . తండ్రి ఎవరో లోకానికి చెప్పవలసి వస్తుందని భయం వేసింది.  వాడేమో నన్ను మోసం చేసి వెళ్లిపోవడం జరిగింది.  నా తల్లిదండ్రులకు నేను ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాలేదు. అ అనిపిస్తుంది. అకారణంగా వచ్చిన ఈ గర్భమును మొదట్లోనే అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను కానీ, వైద్యులు సహకరించలేదు… ఇక దానితో పిల్లవాడిని కనక తప్పలేదు.  ఇక సమాజానికి భయపడి పొదల్లో పడేసాను.  వాడు బతికే యోగం ఉంటే ఎవరికో ఒకరికి కంటపడతాడు అని ఇంటికి వెళ్లిపోవడం జరిగింది.  కానీ నాలో పేగు బంధం నన్ను కదిలించింది.  లోకానికి భయపడి నేను ఎందుకు నా పిల్లవాడిని వదులుకోవాలి…. తండ్రి లేకపోయినా నేను పెంచుకోగలుగుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి…. అమ్మ!  నీ మంచి మనసే నిన్ను కాపాడుతుంది.  ఈ బిడ్డకు తండ్రి ఎవరో వివరాలు చెప్పు అని మహాదేవి అనేసరికి…. అప్పుడు అతడి యొక్క రూపురేఖలు చెప్పేసరికి…. మహాదేవి కాస్త తన చేతి సంచిలో ఉన్న పిండిని బయటకు తీసి, ఒక బొమ్మలా తయారు చేసి, ఆ తండ్రికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? అంటే వెంట్రుకలు గాని, గోర్లు గాని, వస్త్రాలు కానీ ఉన్నాయా?  అంటే ఆయన వేసుకునే వస్త్రాలు ఉన్నాయి… నా దగ్గర ఆయన వాడిన కర్చీఫ్ ఉంది అని చూపించేసరికి…. దానిని ముక్కలు చేస్తూ ఏవో మంత్రాల చదువుతూ ఉండేసరికి …ఆ కన్నతల్లికి అనుమానం వచ్చి ఏంటి?  ఆయన్ని చంపుతారా?  ఆయన మీద చేతబడి చేస్తున్నారా?  అని అనేసరికి… నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా!  ఆయన ఎక్కడ ఉన్నా ఇంకో గంటలో మీ దగ్గరికి రావాలి… వచ్చేటట్టు చేస్తున్నాను… మనిషిని చంపటం లేదు. అంటే  ఆయన్ని చంపవద్దు… ఆయన మానాన ఆయన బతికితే బాగుండును.  ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలు. ఎవరితో తిరిగినా పరవాలేదు. నేను ఆయన గుర్తుగా ఈ బిడ్డను పెంచుకుంటాను.  నావల్ల ఆయనకి ప్రమాదం రాకూడదు. సమస్య రాకూడదు…చావకూడదు అని చెప్పి… నా మాంగళ్యం కాపాడండి అనేసరికి అతను లోకానికి, సమాజానికి,తల్లిదండ్రులకి భయపడి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.  వేరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.  ఇవాళ తన పెళ్లి.  నేను అనుకోకుండా ఇవ్వాలే బిడ్డని కనడం జరిగింది. ఆయన వివాహం చేసుకుంటున్నాడని స్నేహితుల ద్వారా తెలిసింది.  నేను చనిపోదాం అనుకుంటూ ఈ బిడ్డని పొదలలో పెట్టి చనిపోదాం అని నదిలో దూకడం అయితే జరిగింది.  కానీ నాకు కర్మ కాలి చావు కూడా రాలేదు.  జాలర్లు నన్ను కాపాడడం జరిగింది.  ఇక బిడ్డ విషయం పట్టించుకోకుండా నేను ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. ఏ మహాతల్లికో కంటపడక పోతాడా అని అనిపించింది . కానీ నాలో పేగు బంధం కదిలించడంతో ….లోకానికి భయపడి, సమాజానికి భయపడి, తల్లిదండ్రులకి భయపడో, నేను ఎందుకు నా బిడ్డని వదులుకోవాలి …తండ్రి తిరిగి వచ్చి నా బిడ్డ ఎక్కడ అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ…. ఇక్కడకు రావడం జరిగింది. బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. మళ్ళీ తిరిగి బిడ్డని క్షేమంగా అందించారు అని సంభాషణ జరుగుతూ ఉండగానే…. పద్మ ! పద్మ!  అనుకుంటూ తన భర్త తిరిగి రావడం చూసి కన్నతల్లి అయిన పద్మ కి నోట మాట రాలేదు.

నాకు గత వారం రోజులు నుంచి నీ గురించి ఆలోచనలు వస్తున్నాయి. బిడ్డను కన్నావో లేదో పురిటి నొప్పులతో ఎలా ఉన్నావు అని నా మనసు ఆగలేకపోయింది. నా తల్లిదండ్రులు నన్ను బంధించి ఉంచారు .వారిని ఎదిరించి నేను పారిపోయి ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎటు పెళ్లి చేసుకున్నాం కాబట్టి…. ఎక్కడో ఒకచోట నీ తల్లిదండ్రులకి, నా తల్లి తండ్రులకి దొరకకుండా ఎక్కడో ఒకచోట ఏదో గంజో…నీళ్ళో తాగి ఏదో ఒక పని చేసుకుంటూ పచ్చడి మెతుకులు తింటూ… ఏదో ఒక పని చేసుకుంటూ, మన పిల్లవాడిని మనం పెంచుకుంటూ మన సంసారం మనం చేసుకుందాము.  నేను ఇంక ఎప్పటికి నీ చెయ్యి వదిలిపెట్టను. అలాగే నువ్వు నా చేయి వదిలిపెట్టవద్దు. నేను ఎప్పుడు ఇక నీ చెయ్యి వదిలిపెట్టను. మన పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటాను ….అవును, ఇక్కడ ఉన్నావేంటి..?  ఈ పిల్లలు, వీళ్ళు… ఈ పిల్లవాడు ఎవరు అనేసరికి తను జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పేసరికి…. మహాదేవికి నమస్కరిస్తూ…. అమ్మ!  నా బిడ్డకి పునః జన్మ ఇచ్చావు.  నువ్వే పేరు పెట్టు అనేసరికి…. ఆ బిడ్డని చూస్తూ శ్రీకృష్ణ అంశతో వీడు పుట్టి ఉన్నాడు.  విష్ణుమూర్తి రూపంతో ఉన్నాడు.  అనంత పద్మనాభ అని పేరు పెట్టడంతో ఇక వాళ్ళు కూడా విష్ణుమూర్తి భక్తులు కావడంతో…. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి.  అదేవిధంగా మాకు దానికి తగ్గట్టుగానే…. పిల్లవాడికి పేరు పెట్టారు అనేసరికి…అనంత అని పిలుచుకుంటాము అని చెప్పి పిల్లవాడిని తీసుకొని… వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేసరికి మహామాయ తప్పింది… బెడద తప్పింది.  లేదు అంటే బంధనం కాస్త బాధ్యతగా మారిపోయేది అని అనుకోవడం జరిగింది. ఇది చూసినా రుద్ర స్వామి, శివ నందిని కూడా ఊపిరి పీల్చుకోవటం కథ సుఖాంతం అయ్యింది అని తెలుసుకున్నారు.  పిల్లలు మాత్రం ఎడమొహం, పెడ మొహం పెడుతూ… అయినా మనం పెంచుకోవాల్సింది కదా ! వాళ్ళకి ఇవ్వటం ఎందుకు?  ఆవిడ అలా పొదల్లో వదిలి పెట్టినప్పుడు శివ నందిని అమ్మ చూడకపోయి ఉంటే కుక్కలు తినేసేవి కదా!  మనం చూశాం కాబట్టి మన పిల్లవాడే కదా అని ఆక్రోశముగా బాల గణపతి అంటూ ఉండేసరికి….నాయనా పిల్లల్ని కనడం తేలికే కానీ, సాకటం చాలా కష్టం.  అందులోను మనం సన్యాసంలో ఉన్నాము.  వాడిని కూడా సన్యాసిగా మారుస్తావా ఏమిటి?  మీరు ఎటు సన్యాసం లోకి వచ్చేసారు. భోగ జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు.  వాడు భోగ జీవితంలో ఉన్నవాడు.  యోగ జీవితంలోకి రమ్మంటే రాడు. అప్పుడు సమస్యలు వస్తాయి.  పిల్లల్ని కనడం తేలికే కానీ సాకటం చాలా కష్టం.  అది మీకు తెలియదు… మీరు వయసుకు వచ్చిన తర్వాత, మీకు వివాహం అయిన తరువాత, మీకు పిల్లలు పుట్టిన తర్వాత అని అనబోతూ ఉండేసరికి…. రుద్ర స్వామి కాస్త వాళ్ళకి పెళ్లిళ్లు పెటాకుల గురించి నువ్వు ఆలోచించకు.  వాళ్ళిద్దరూ గోసి గుడ్డ కట్టుకొని ఎప్పుడో సన్యాసం లోకి రావడం జరిగింది. ఇది ఇక వాళ్ళ మోక్ష జన్మ.   సంసారం మాయలోకి నీ నోటితో బలం ఇచ్చి దీవించమాకు అని చెప్పి అనేసరికి …..మహాదేవి కాస్త క్షమించండి!  తప్పు, తప్పు.  సంసార జీవితంలో నుంచి సన్యాస జీవితంలోకి వచ్చేసరికి మీకు సంసారం మాయలు ఈతి బాధలు కష్టసుఖాలు ఏంటి?  అనేది మీకు తెలియదు… తెలియకూడదు.. తెలిస్తే ఇక మాయలోకి పడిపోతారు అని చెప్పేసి.. పిల్లలతో అంటే , నువ్వు అర్థం కావు నీ మాటలు అర్థం కావు. సరేలే పిల్లవాడు ఎక్కడ ఉన్నా కానీ క్షేమంగా తల్లి దగ్గరికి చేరాడు.  కాబట్టి మేమిద్దరమే కలిసి ఉంటాంలే… అనేసి ఇక పిల్లలు వాళ్లలో వాళ్లు నిగ్రహించుకొని, ఇక అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి రావడం జరిగింది. ఆలయంలో కూర్చుని ధ్యాననిష్ఠలో ఉన్న శివనందినికి ఒక్క క్షణకాలంలో ఏం జరిగిందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండటం జరిగింది. ఒకవేళ ఆ పిల్లవాడు పొదల్లో ఉండటం చూసి తను స్పందించి తను పెంచుకోవడం జరిగి ఉంటే, ఈ కన్నతల్లి వచ్చేది కాదు. ఎప్పుడైతే మహాదేవి బాధ్యత తీసుకుందో మహాదేవిని మాయ లోకి పడవేయకూడదు అని అనుకోవటం వలన…. విష్ణు మాయ కాస్త విష్ణు భక్తిగా మారి అది కాస్త ఈ కన్నతల్లికి పేగు బంధం గుర్తుచేయడంతో తిరిగిరావడం జరిగింది. అదే ఆ పిల్లవాడిని తను తీసుకున్నట్లయితే ఆవిడ పేగు బంధం గురించి పట్టించుకోనేది కాదు.  ఆలోచనలు వచ్చినా కూడా నిగ్రహించుకునేది.  పిల్లవాడు పోతే పోనీ మనకేంటి…. తండ్రికే లేని పిల్లాడి బాధ్యత నాకెందుకు పట్టింది.  నా తల్లిదండ్రులను నేను చూసుకోవాలి అని ఆలోచించేది.  తిరిగి వచ్చేది కాదు అని చెప్పి అనుకునేసరికి…. శివ నందిని ఆలోచనలో ఉండటం గమనించిన మహాదేవి కాస్త, ఏమిటి ఆలోచిస్తున్నావు? అంటే విష్ణు మాయ ఎలా ఉంటుందో రుచి చూపించాడు.  ఆ మాయ ప్రభావం లో నేను పడి ఉంటే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నాను… నేను పడకపోవడం వలన, నువ్వు పడటం వలన ఆ మాయ కాస్త భక్తిగా అయ్యి… ఆ కన్నతల్లి తిరిగి రావటం జరిగింది. అదే నేను తీసుకుని ఉంటే వచ్చేది కాదు కదా!  అయినా కూడా నీ తాంత్రిక విద్యతో ఆ పిల్లవాడు తండ్రిని రప్పించడం నాకు నచ్చింది.  క్షుద్ర పూజలు అనేది ఇన్నాళ్లు చెడుకే ఉపయోగిస్తారు అనే ఆలోచన ఉన్నది.  కానీ నీవల్ల అది చెడుకి కాదు…మంచికి కూడా ఉపయోగించుకోవచ్చు అని అర్థం అయింది.  నువ్వు చేసిన బొమ్మతో చేతబడికి ఉపయోగించుకోవచ్చు, చేతికి వచ్చే విధంగా చేయవచ్చు అని అవగాహన వచ్చింది. విద్య అనేది మన యొక్క ఆలోచన బట్టి మారుతుందని అర్థమయింది. అది మంచికైనా చెడుకైనా మారవచ్చు అని మారుతుంది… అని అర్థమయింది.  అది దక్షిణాచారమా ? వామాచారమా అనేదాన్ని బట్టి ఉండదు.  మన మనసు యొక్క ఆలోచనలను బట్టి ఉంటుందని అర్థం అయింది అని చెప్పి శివనందిని అనేసరికి….. ఏదైనా కానీ మన ఆలోచన సరళని బట్టే ఉంటుంది, స్వార్థంగా ఆలోచిస్తామా?  నిస్వార్ధంగా ఆలోచిస్తామా? అనేది చూసుకోవాలి.  ఎప్పుడైతే మనలో స్వార్థం ఉన్నదో…. మనం కాస్త భోగ జీవితంలోకి అడుగుపెట్టడం జరిగితే, మాయలో పడినట్లు.  ఎప్పుడైతే మనలో నిస్వార్థం వచ్చిందో మనలో యోగత్వం వచ్చినట్లు.  తద్వారా దైవత్వంలోకి వెళ్ళటం జరుగుతుంది దైవత్వంలో కూడా మనకి సగం సగం ఉంటాయి.  వాళ్లు కూడా స్వార్థం గురించి ఆలోచిస్తారు.  దేవుళ్ళు కూడా స్వార్థంగా ఉంటారు.  మనిషి అయితే వందకి 100% స్వార్థం గా ఉండి ఆలోచిస్తే …..దేవుళ్ళు మాత్రం 20% స్వార్థానికి 80% నిస్వార్ధానికి ఆలోచించడం జరుగుతుంది. యోగత్వంలో ఉన్నవాళ్లు స్వార్థం గురించి ఆలోచించరు. కాబట్టి మానవత్వం కన్నా యోగత్వం పరాకాష్ట . ఆ స్థితిని నువ్వు పొందాలి.  నాకు ఇవాళ బుద్ధి వచ్చింది.  దేనికి స్పందించకూడదు అనేది నాకు అర్థం అయింది అనేసరికి ….అప్పుడు శివ నందిని కాస్త దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు అనేది మన చేతుల్లో లేదు.  మనం నిగ్రహించుకునే దాన్ని బట్టి , అదుపులో ఉంచుకునే దాన్ని బట్టి ఉంటుంది.  ఒకవేళ మనం నిగ్రహం కోల్పోతే…. అది కాస్త స్పందనగా మారి, బంధం కాస్త బంధనంగా మారి, బాధ్యతగా మారే ప్రమాదం ఉంటుంది. అది అదృష్టం బావుండి బంధం మాయమైతే పరవాలేదు… కన్నతల్లి వెనక్కి తిరిగి రాకపోతే ఆ పిల్లవాడి బాధ్యత నీకే పడేది.  నువ్వు చూసుకోవాల్సి వచ్చేది.  నువ్వు అన్నట్టు కనడం తేలికే ….సాకటం చాలా కష్టం అయ్యేది.  నువ్వు ఆ పిల్లవాడి బాధ్యతలు చూసుకుంటూ ఉంటే… సాధన అటకెక్కేది అనేసరికి…. అవును, ఆ పెను ప్రమాదం ఉన్నది.  చిన్నపిల్లవాడికి ఐదు సంవత్సరాలు వచ్చేదాకా…. వాడికి వాడే నోటితో చెప్పేదాకా తెలియదు కదా!  చిన్నపిల్లల్ని పెంచడం బహు కష్టం.  అందులోను మనలాంటి వైరాగ్య స్థితిలో ఉన్నవాళ్లు పెంచడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కొద్దిగలో పెను ప్రమాదం నుండి తప్పించుకోవటం జరిగింది.  లేదంటే బాధ్యతల్లో పడిపోయేదాన్ని.  నా సాధన అటకెక్కేది.  ఏ జన్మలోనో నేను పిల్లవాడిని వదిలిపెట్టి ఉంటాను. లేదా పిల్లవాడిని తల్లి నుంచి వేరు చేసి ఉండవచ్చు.  ఆ దోషం తిరిగి మళ్లీ ఈ ఋణానుబంధం రూపంలో వచ్చి తీరిందేమో!  అంటే …..అయ్యుండొచ్చు, చెప్పలేము… కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది…. ఏంటి?  అనేది మన జన్మాంతరంలో మనం చేసిన చిన్న తప్పుల వలన ఇలా జరిగి ఉండవచ్చు.  నువ్వన్నట్టు ఈ కారణం అయి ఉండవచ్చు.  కేవలం ఒక పిల్లవాడికి ఆ తల్లికి అప్పగించడంతో ఋణం తీరిపోయింది.  లేదు అంటే నీకు ఆ బాధ్యత భారంగా అయ్యేది.  తద్వారా నీకు బంధనం అయ్యి సాధన ఆగిపోయే ప్రమాదం ఉండేది. నువ్వు వెనక్కి తిరిగి కాశి క్షేత్రానికి చేరుకునే స్థితికి వచ్చేది అని శివ నందిని అనేసరికి…. అవును నిజమే!  ఆ పిల్లవాడు ఋణ బంధమో ఏమో వాడికి నేను పేరు పెట్టే ఋణం ఉండి ఉంటుంది. పేరు పెట్టగానే వాడు వెళ్లిపోవడం జరిగింది అని చెప్పేసి…. ఇంకా మనం ఆ పిల్లవాడి గురించి ఆలోచించడం మంచిది కాదు… ఆలోచన ఉండటం కూడా మంచిది కాదు… ఇప్పుడు సాధన గురించి ఆలోచించుకో… నీ సహస్ర చక్రం గురించి ఆలోచించుకో…. వెయ్యి మాయల్లో ఒక మాయ ఏ విధంగా ఉంటే మిగతా మాయలు ఏ విధంగా ఉంటాయా అని ఆలోచిస్తున్నాను,  మాయలు వస్తాయి… ఆ మాయలకి నువ్వు స్పందించకుండా, పట్టించుకోకుండా నిగ్రహించుకొని ఉండటం అలవాటు చేసుకో… లేదంటే అది మాయ కాస్త బంధంగా, బంధనంగా బాధ్యతగా మారే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండు అనేసరికి…. శివ నందిని కాస్త నేను జాగ్రత్తగా ఉండటం కాదు… నువ్వు జాగ్రత్తగా ఉండాలి… నువ్వు దేనికి స్పందించకుండా ఆశ, భయం, స్పందన, ఆలోచన, సంకల్పాలు లేకుండా చూసుకో! నాకైతే రుద్ర స్వామి చెప్పాడు.  ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని అప్పటికే నాకు రుద్ర స్వామి కనుసైగ చేయడంతో…. పిల్లవాడు గురించి పట్టించుకోలేదు అనేసరికి…. అయితే అదేదో నాకు కూడా కనుసైగ చేయవచ్చు కదా!  అంటే…. నువ్వు మాయలో పడతావని ఆయన అనుకోలేదు.  నీలో ఉన్న తల్లి వాత్సల్యం ఒక్కసారిగా బయటపడి తీసుకున్నావు. యోగంలో ఉండబట్టి. అది మాయా ప్రేరిత భ్రమ బ్రాంతి కలిగించడానికి వచ్చిన పిల్లవాడు అని తెలుసుకోగలిగావు. అదే భోగ జీవితంలో ఉండి ఉంటే ఒక అనాధ పిల్లవాడికి జీవితం ఇచ్చాను అని చెప్పేసి వాడి కోసం నీ జీవితం పక్కన పెట్టి వాడి గురించి ఆలోచనలు చేయాల్సి వచ్చేది  అంటే… అవును అది అయితే నిజమే, ఈసారి జాగ్రత్తగా ఉండాలి.  మాయ విషయంలో ఏమరపాటుగా ఉండకూడదు.  శ్రద్ధ భక్తులతో, సమయస్ఫూర్తితో,  వివేక బుద్ధితోనో… విచక్షణ జ్ఞానంతోనూ ఉండాలి.  ఒకవేళ నేను ఏదైనా మాయలో పడి ఉంటే, సలహా ఇవ్వు.  నేను దాన్ని దాటడానికి ప్రయత్నిస్తాను… ఆలోచించడానికి ప్రయత్నిస్తాను అని మహాదేవి అనేసరికి, నేను కూడా ఆ స్థితిలో ఉండాలి కదా! నేను కూడా మాయలో పడితే ఏంటి పరిస్థితి నాకే తెలియదు… చూద్దాం, ఎలా జరుగుతుంది అనేది… ఎందుకు మనం ముందే అనుకొని భయపడటం… విషయం ఏమిటి అనేది తెలిసింది కాబట్టి, పదార్థం దాటితే కానీ యదార్థం మనకి తెలియదు కాబట్టి… మాయలు ఇలా ఉంటాయి కాబట్టి…. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి.  ఒక్కొక్క మాయలో ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తే మంచిది అనుకుంటూ….. వీళ్ళ సంభాషణ కొనసాగిస్తూ ఉండేసరికి…. ఒక ఆవిడ కాస్త శివ నందిని దగ్గరికి రావడం వీళ్లిద్దరూ గమనించారు.  వీళ్ళు ఎవరు ఏమిటి?  అనుకుంటూ… ఏమో! మహాతల్లి ఏ మాయ తీసుకొస్తుందో… ఆవిడే మహామాయేమో అని మహాదేవి అంటూ ఉండేసరికి… అమ్మ నమస్కారం!  అని శివ నందిని కేసి చూస్తూ ఉంటే…. ఆ నమస్కారం తల్లి ఏంటి?  అంటే మేము అనుకోకుండా నేపాలి దేశంలో ఉన్న పశుపతి దేవాలయానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడే గండకీలో సాలిగ్రామాలు శిలలు దొరుకుతాయని తెలియడంతో…నేను అమితమైన విష్ణు భక్తురాలు అవ్వటం వలన, సాలిగ్రామాలు కొనడం జరిగింది. కానీ,  మా ఇంటి పూజారులు కాస్త ఆడవాళ్లు సాలిగ్రామాలు తాకరాదు… పూజ చేయకూడదు… అది అరిష్టం.. దరిద్రం… దాని శక్తిని భరించడం గృహస్థుడి వల్ల కాదు. ఏదైనా దేవాలయంలో కాని, లేదా ఎవరికైనా బ్రాహ్మణుడికి సాలిగ్రామం దానం చేయమని చెప్పడం… మా ఇంట్లో దానికి తగ్గట్టుగానే విపరీతమైన పరిస్థితులు రావడం…. ఇంట్లో సభ్యుల మధ్య ఒకరికొకరు మధ్య ద్వేషాలు, కలహాలు పెరగటం… ఆస్తులు కోల్పోవడం… ప్రమాదాలు జరగటం… ఆసుపత్రి పాలు అవటం… తీవ్రమైన మానసిక శారీరక సమస్యలు కలగడంతో…. ఇదంతా ఈ సాలిగ్రామం వల్లనే అని అవగతం కావడంతో… సరే అని చెప్పి దేవాలయానికి ఇవ్వబోతుంటే అమ్మ!  దీనిని ఈ దేవాలయంలో భరించడం నావల్ల కాదు… ఇది బంగారు పూతతో స్వయంభుగా ఏర్పడిన సాలిగ్రామం.  పైగా దీనికి రెండు సుదర్శన చక్రాలు ఉన్నాయి.  పైన కింద కూడా… ఇది భరించడం మానవ మాత్రుల వల్ల కాదు.  దైవంశ సంభూతుల వల్లే సాధ్యమవుతుంది.  అంటే దైవ ఉపాసన ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి… అనడం జరిగింది అనేసరికి…. అది ఇంట్లోనే ఉంచుకోలేము.  అలాగని దేవాలయంలోనూ ఉంచలేక…. సరే అని నదిలో వదిలిపెడుతూ ఉంటే, మనసు ఒప్పలేక  సరే అని పారబోతూ ఉండగా నాకు ధ్యానంలో మీ రూపం కనపడింది.  సరే అని మీకు ఇవ్వాలి అని చెప్పి అనిపించి… మీరేమైనా కనపడతారేమో అని చెప్పేసి ఈ నది ఒడ్డునకి వస్తూ ఉండగా ఇలా కనపడ్డారు అనే శివ నందిని తో అనేసరికి శివ నందినికి  ఆ సాలిగ్రామం చూపిస్తూ ఉండేసరికి….అందులో వటపత్ర శాయి రూపంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్లుగా… లీలా మూర్తిగా కనిపించేసరికి ….అమ్మాయి!  సాలిగ్రామం తీసుకున్నాక నీకు ఏ విధంగా అనుభవాలు అనుభూతి కలిగిందో చెప్పు అనేసరికి…. ఇదేదో ఒక పుత్రుడిని తీసుకున్నట్టుగా, విష్ణుమూర్తిని ఈ సాలిగ్రామంలో పిల్లవాడిగా ఉన్నట్టు భావన కలిగింది. ఒక పుత్రుడికి మనం ఏ విధంగా అయితే సేవలు చేస్తామో…. ఆ విధంగా దీనికి కూడా ప్రతినిత్యం చేస్తూ ఉండేదాన్ని.  అభిషేకం చేయడం, ఆ తర్వాత బట్టపెట్టి తుడవడం, వస్త్రాలు వేయడం, పాలు నైవేద్యంగా పెట్టడం, ఆ తర్వాత మహా నైవేద్యం పెడుతూ ఉండేదాన్ని.  కానీ రాను రాను నా భక్తికి తగ్గట్టుగానే విష్ణుమూర్తి చిన్న పిల్లవాడిలాగా వటపత్ర సాయి లాగా స్వప్నంలో కనపడుతూ ఉండేసరికి…. ఈ స్వప్న దృశ్యాలను దర్శనాలన్నీ దీనివల్లే జరిగింది. దీని తర్వాత నాకు ఉడిపి నుంచి బాలకృష్ణుడు విగ్రహ మూర్తి రావటం జరిగిందని చెప్పేసి ఆ ఉడిపి విష్ణుమూర్తి ని కూడా చూపించేసరికి…. శివ  నందిని కాస్త మహాదేవితో ఇందులోనే వటపత్ర సాయి రూపంలో మహావిష్ణువు ఉన్నాడు.  నాకు సంతానం లేకపోవడం వలన ఈయన సాలిగ్రామం రూపంలో పుత్రుడిగా నాకు రావడం జరిగింది అని చెప్పి అనేసరికి…. ఈ మాటలు అర్థం కాక అక్కడ ఉన్నం ఆవిడకి అర్థం కాక తికమక పడుతూ ఉంటే… అమ్మ!  ఉడుపి కృష్ణుడిని నీ దగ్గర ఉంచుకో.  ఈ సాలిగ్రామం అంశ రూపమే భౌతికంగా నీ దగ్గరికి వచ్చింది. ఈ సాలిగ్రామానికి నువ్వు ఏ విధంగా అయితే పూజలు చేశావో…. అలాగే శ్రీకృష్ణునికి ఆరాధన చేసుకో.  విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి భేదం లేదు.  ఇద్దరు ఒకటే అంశకి సంబంధించిన వాళ్ళు.  కాకపోతే అవతారాలు  మారాయి… దేవత రూపంలో భేదం లేదు తల్లి …..ఏముంది అక్కడ సాలిగ్రామం ఉంటుంది, విగ్రహ రూపంలో శ్రీకృష్ణుడు ఉంటాడు అనేసరికి…. కానీ నాకు సాలిగ్రామంలో కూడా కనపడింది బాల రూపమే కదా!  వటపత్ర సాయి రూపమే కదా!  వటపత్ర శాయి శ్రీకృష్ణుని రూపమే కదా!  శ్రీకృష్ణుడు ఈ విధంగా వచ్చాడు…. నీ భక్తి అపారమైనది తల్లి…నీ భక్తిని ఇదేవిధంగా కొనసాగించుకో, సాలిగ్రామమును నేను తీసుకుంటాను.  ఇది విష్ణుమూర్తి ఆజ్ఞగా  భావించుకో!  అనేసరికి… శివ నందిని చేతి సంచిలో సాలిగ్రామం వేయడం, ఆవిడ కొంత దూరం వెళ్ళాక ఆవిడ అదృశ్యం అవ్వడం గమనించి…. సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చి నీకు విష్ణు మాయ యొక్క పుత్ర ఋణమును ఈ సాలిగ్రామం రూపంలో తీసివేయడం జరిగింది అని మహాదేవి అనేసరికి… అయ్యుండొచ్చు, ,నేను ఎటు పుత్ర వ్యామోహంలో పడను అని నిజం నిర్ధారణ కావడంతో, ఈ విధంగా జరిగి ఉండవచ్చులే అని చెప్పి అనుకొని…. తర్వాత కొంతసేపటికి అక్కడికి వచ్చిన రుద్ర స్వామి, పిల్లలకి ఈ వచ్చిన సాలిగ్రామం చూపించేసరికి…. ఆ సాలిగ్రామం నిజమైనదా కాదా అని రుద్ర స్వామి కాస్త ఒక నీటి తొట్టెలో సాలిగ్రామం వేసేసరికి ….అది నీటి అడుగులోకి వెళ్లిపోయింది.  ఆ పక్కనే ఉన్న తులసి మొక్క యొక్క ఆకులను తీసుకొని నీటి మీద వేసేసరికి యాదృచ్ఛికంగా ఆ సాలిగ్రామం ఈ తులసి ఆకులకి ఆకర్షితులై…. పైకి నీటిలో తిరుగుతూ కప్పలా తేలేసరికి…. వారు  ఆశ్చర్య ఆనందాలకు గురి అయ్యి…. ఇది నిజమైన సాలిగ్రామం దీనికి ఈ విధంగానే గండకీ నదిలో సాధువులు యోగులు మహర్షులు సాలిగ్రామం ప్రాణం ఉన్నవా లేవా అని ఇలా తులసి ఆకులు వేస్తే ….ఇవి ఇలా బయటికి వస్తాయి… అలాంటి వాటిని  తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి…. ఓహో!  ఇది స్వయంభూ సాలిగ్రామం అన్నమాట! అనేసరికి…. ఇందులో మనకి బంగారపు పూత కూడా పూసి ఉంటుంది అని… దాని మూత తీసి దానికి ఉన్న చిల్లు రంధ్రం  చూపించేసరికి…. లోపల రెండు సుదర్శన చక్రాలు కలిసి ఉన్నట్టుగా, రెండు కూడా ఒకదానితో ఒకటి అభిముఖముగా ఉన్నట్లుగా, లోపల అంతా బంగారపు పూతగా ఉన్నట్టుగా, కనపడుతూ ఉండేసరికి…. ఇది సజీవమూర్తి సాలిగ్రామం…. పిలిస్తే పలుకుతుంది… మాట్లాడుతుంది…. దీనిని నిత్యం నీళ్లలోనే ఉంచాలి. దీనిని బయట ఉంచడానికి లేదు.  దీనికి నీళ్లు ఆహారం అని చెప్పి అనేసరికి…. అయితే దీన్ని ఒక తొట్టిలో ఉన్న బాక్స్ లో పెట్టడం మంచిది అని మహాదేవి అనేసరికి…. సరే ఆ బాధ్యత నీదే అని మహాదేవికి అలా సాలిగ్రామమును శివ నందిని సంతోషంగా ఇవ్వటంతో…. ఒకరకంగా శివ నందిని విష్ణు మాయను దాటుకోవడం జరిగింది. ఈ విధంగా విష్ణు మాయను దాటుకోవడంతో….. ఆమెకి శ్రీకృష్ణ లీలా విన్యాసం ప్రారంభం అవుతుందని శివ నందినికి ఆ క్షణం తెలియదు. విష్ణు మాయ కాస్త శ్రీకృష్ణ మాయగా మారే అనుభవ దృశ్యం తనకి చూసే పరిస్థితి గానీ ,గ్రహించలేని స్థితిలో శివ నందిని తన సాధన కొనసాగిస్తున్నది.

శివనందిని ధ్యాననిష్ఠలో ఉండగా విష్ణుమూర్తి దర్శనం అయ్యింది. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ధ్యానంలో అలాగే ఉండేసరికి…..విష్ణుమూర్తి కాస్త స్త్రీ మూర్తి స్వరూపం గానూ, ఆ తర్వాత జగన్మోహిని స్వరూపంగానూ మారేసరికి అంటే ఇప్పుడు జగన్మోహిని మాయ మొదలవుతుందా అని అనుకుంటూ ఉండేసరికి…. శివ నందిని కి ధ్యాన భంగం అయ్యింది . కళ్ళు తెరిచి ఆత్మ విచారణ చేసుకుంటూ జగన్మోహిని మాయని శివుడంతటి సిద్ధ పురుషుడే దాటలేకపోయాడు.  తను దాటుతుందో లేదో అనే అనుమానభయం, ఆలోచనలో ఉండేసరికి పిల్లలు వచ్చి ఏంటమ్మా! దిగాలుగా ఉన్నావు… ఏమైంది? అనేసరికి జగన్మోహిని మాయా ప్రభావం నామీద చూపించబోతుంది అనేసరికి…. ఈ జగన్మోహిని ఎవరు? అని అడిగితే…. క్షీరసాగరమథనంలో అమృతం కోసం రాక్షసులు దేవతలు కొట్టుకుంటున్న సమయంలో…. విష్ణుమూర్తి కాస్త జగన్మోహిని రూపం ఎత్తి దేవతల పక్షాన నిలిచి దేవతలకి అమృతం అందేటట్లుగా రాక్షసులకి అందకుండా తన ముగ్ధ మనోహర సౌందర్యంలో రాక్షసులని ఉంచుతూ… దేవతలకి అమృతం అందేటట్లుగా చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ జగన్మోహిని స్వరూపాన్ని చూసి ధ్యాననిష్ఠలో ఉన్న మహా శివుడికి కూడా ధ్యాన భంగమై నిగ్రహం కోల్పోవటంతో వాళ్ళిద్దరూ శృంగార కార్యక్రమాలలో పాల్గొనడంతో అయ్యప్ప స్వామి పుట్టడం జరిగింది. వాళ్ళిద్దరూ అంతటితో అవతారం చాలించిన తరువాత ఈ అయ్యప్ప స్వామి పాల కోసం ఏడుస్తూ ఉంటే ఆదిపరాశక్తి అంశ ఆయన కంచి కామాక్షి దేవి, పిల్లవాడైన అయ్యప్ప స్వామికి ఆ పాలు అందించడం జరిగింది. మనం కంచిలో అయ్యప్ప స్వామి ఆలయంలో అమ్మవారి సమక్షంలో చూశాం కదా!  అనేసరికి అవును, నువ్వు చెప్పావు కదా!  అని పిల్లలు అనేసరికి… అవును అనగానే అదేముందిలే అమ్మ!  మరి నీ గురువైన పరమహంసకి జగన్మోహిని మాయ వచ్చిందా?  అంటే ఆయనకి కూడా సహస్ర చక్రంలో వచ్చినట్టు ఉంది. నాకు పెద్దగా గుర్తులేదు. ఆయన దాటినట్టు ఉన్నారు అనేసరికి…అనేసరికి  ఎలా దాటారు ఏంటి అనేది తెలుసుకో!  దాన్ని బట్టి ఈ జగన్మోహిని మాయ కూడా దాటచ్చు కదా!  అనేసరికి… అది మన వివేకబుద్ధి, విచక్షణ జ్ఞానం బట్టి ఆధారపడి ఉంటుంది.  సమయ స్ఫూర్తిని బట్టి దాటుకోవాలి.  అది మాయ అని మనకి తెలిసేంతవవరకు  సమస్య లేదు…. మాయ అని తెలియకపోతే ప్రతిదీ సమస్యగా ఉంటుంది.  సమయానికి అది మాయా అని తెలుసుకుని జ్ఞానం పొందితే చాలు. మనం మాయని దాటినట్టే అవుతుంది.జగన్మోహిని మాయ అంత చిన్న విషయం కాదు… చూద్దాం ఏం జరుగుతుందో! అని అంటూ ఉండగా…..సరే మేము వెళ్లి ఆడుకుంటాం అని పిల్లలు అనేసరికి… సరే అని శివ నందిని తిరిగి ధ్యానంలో కూర్చోవడం జరిగింది.  ధ్యానంలో ఒక విష్ణుమూర్తి విగ్రహం లీలా మూర్తిగా కనిపించడం జరిగింది. ముందువైపు పురుష భాగం వెనకవైపు స్త్రీ భాగం, ఈ స్త్రీ మూర్తి స్వరూపం జగన్మోహినిగా ఉండటం చూసేసరికి ఈ విగ్రహ మూర్తి ఎక్కడిదా అని అనుకునేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి… మహాదేవి ఎదురుగా కనిపించింది. ఆ విగ్రహ మూర్తి జగన్మోహినీ ర్యాలీ ప్రాంతంలో ఉంది.  ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ర్యాలీలో జగన్మోహిని విగ్రహ మూర్తి ఉంది.  పాదాల కింద కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. ముందు వైపు పురుష స్వరూపంగా విష్ణుమూర్తి స్వరూపము, వెనకవైపు మోహిని స్త్రీ స్వరూపము ఉంటుంది.  జాగ్రత్త అమ్మాయి!  ఈ జగన్మోహిని మాయ దాటడం శివుడంతటి వాడి వల్లే కాలేదు.  పుత్రుని కనడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మహాదేవి అనేసరికి…. అవును అదే ఆలోచిస్తున్నాను.  ఈ మాయ ఎలా దాటాలి అని చెప్పి..?  అసలు అది మాయా అని మనకి తెలియాలి కదా!  దాని దాటడం ఎలాగో చూద్దాము …..తర్వాత ఆలోచన చేయవచ్చు అని అనుకుంటూ శివ నందిని తిరిగి ధ్యానంలో కూర్చునే సరికి… ధ్యానంలో జగన్మోహిని రూపం లీలా మూర్తిగా నవ్వుతూ ఉండటం చూసే సరికి …. శివ నందినికి ఈ మాయ దాటక తప్పదు, ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ అలాగే ధ్యానంలో ఉంటూ…. ధ్యాన నిష్ఠ కొనసాగిస్తూ ఉండటం జరిగింది. ఇలా దాదాపుగా ఒక వారం రోజులపాటు శివ నందిని ధ్యాననిష్ఠలో ఉండటం జరిగింది. జగన్మోహిని మాయ తనమీద ఎలాంటి ప్రభావం చూపించట్లేదు అని అనుకోసాగింది. ఎలాంటి  అనుభవాలు కూడా ప్రత్యక్షంగా ఏమీ లేవు కాబట్టి మాయ ఉండదేమో అని అనుకుంటున్న సమయంలో నది ఒడ్డున ధ్యాన నిష్టలో ఉన్న శివ నందినికి ఒకరోజు ఒక తల్లి పసికందుని నీటిలో పడేస్తున్నట్టుగా దృశ్యం కనిపిస్తూ ఉండేసరికి….. మహాదేవి, రుద్ర స్వామి కాస్త అమ్మాయి ఆగాగు!  పసి పిల్లవాడిని నీటిలో పడవేస్తున్నావు… ఏమైంది?  ఏంటి ? అని అడిగేసరికి….. నా బిడ్డ, నా ఇష్టం… నేను పడేసుకుంటాను.  మీకు వచ్చిన సమస్య ఏమిటి?  అన్నట్టుగా ఆవిడ అనేసరికి l….నీ బిడ్డనే ..మేము కాదనట్లేదు, పసికందులాగా ఉన్నాడు.  రోజుల బిడ్డ లాగా ఉన్నాడు.  కాన్పు అయ్యి కూడా ఒక వారం కాలేదు కదా! అని మహాదేవి అనేసరికి అవును తల్లి!  కూతురు బిడ్డ .,అంటే తప్పేముంది, నీ కూతురు బిడ్డని నువ్వెందుకు పడేస్తున్నావు ? అనేసరికి… ఏం చెప్పమంటావు!  నా అల్లుడు నపుంసకుడు అంట.  సంసారానికి పనికిరాడు అంట.  సంతానం ఇవ్వలేడంట.  అందుకని నా కూతురు పక్కింటి వాడితో సంసారం చేసి అక్రమ సంబంధం గా ఈ పిల్లవాడిని కన్నడం జరిగింది. ఈ విషయం మా అల్లుడికి తెలిసి గొడవ పెట్టుకుని విడాకులు కావాలని అంటున్నాడు…. లేదా బిడ్డని  పడేసుకోమని అంటున్నాడు. వదిలేసుకోమని అంటున్నాడు అనేసరికి….దాని కుటుంబం దృష్ట్యా ఈ బిడ్డను వదిలేయాలని, పడవేయాలని రావడం జరిగింది.  కానీ జంతువులు చంపుతాయేమో అని భయంతో సముద్రంలో వదిలేస్తే సరిపోతుంది…. కొనఊపిరితో చచ్చిపోతాడు అని చెప్పి అనుకుంటున్నాను అనేసరికి…. అంతగా బిడ్డని పెంచలేక పోతే అక్రమ సంబంధం అనుకుంటే ఏ అనాధ ఆశ్రమంలోనూ చేర్పిస్తే సరిపోతుంది కదా! బిడ్డను ఎందుకు చేతులారా చంపడం అని చెప్పేసి అంటూ ఉండేసరికి… లేదంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి దత్తత ఇచ్చిన సరిపోతుంది కదా!  అనేసరికి ఇది అక్రమ సంబంధం అని ఊర్లో వాళ్ళ అందరికీ తెలిసింది.  ఊర్లో వాళ్ళు కూడా దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.  అందుకోసం అని నదిలో పడవేద్దాము…. దేవుడు సమక్షంలో ఐక్యమైపోతాడు అని… ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనేసరికి, మహాదేవి కాస్త ఆ బిడ్డని నేను పెంచుకుంటాను అంటూ ఉండేసరికి, శివ నందినికి విషయం అర్థమై, నువ్వు ఆ బిడ్డను పెంచుకోవడానికి ప్రయత్నం చేయవద్దు తల్లి!  అది సామాన్యమైన బిడ్డ కాదు… పరపురుషుని వ్యామోహంతో వచ్చిన బిడ్డ అంటే జగన్మోహిని మాయతో వచ్చిన బిడ్డ ఆలోచించుకో ! అని చెప్పేసి శివ నందిని అనేసరికి మాయా అవ్వని… ఏదైనా అవని…. నాకు తెలియదు . పసిపిల్లవాడు పాపం, కళ్ళు కూడా తెరవలేదు… వీడిని నీటిపాలు చేయడం నాకు ఇష్టం లేదు.  చంపడం నాకు ఇష్టం లేదు.  ఓపిక ఉన్నంతవరకు నేను పెంచుకుంటాను అని మహాదేవి అంటూ ఉండేసరికి…శివ నందిని ….. ఏమనాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది.  రుద్ర స్వామి కూడా ఓహో!  ఇది జగన్మోహిని మాయ లీలా విన్యాసమా!  అక్రమ సంబంధం అంటే పరపురుషుడి వైపు వెళ్ళటమే కదా!  జగన్మోహిని అంటే స్త్రీ కాస్త పురుషుడిగా మారడం…పురుషుడు కాస్త స్త్రీగా మారటం కదా! వీళ్ళిద్దరి మధ్య శృంగార భావం కలగటమే కదా అనుకుంటూ ఉండేసరికి….. రుద్రస్వామికి అర్దమై మౌనం వహించాడు.  కానీ మహాదేవి మాత్రం తనలో ఉన్న తల్లి వాత్సల్యం వలన ఈ బిడ్డని ఎలా అయినా పెంచుకోవాలి అని…. ఆ తల్లి దగ్గర నుంచి ఈమె తీసుకోబోతూ ఉండేసరికి…. నిజమైన కన్నతల్లి గబగబా వచ్చి నా భర్త పోతే పోనీ, ఉంటే ఉండనివ్వు, వీడిని నేను పెంచుకుంటాను, వీడిని నేను వదులుకోను, వీడు అక్రమ సంబంధం అయినా పర్వాలేదు,బాధ్యత నేను తీసుకుంటాను, సంసార సుఖం ఇవ్వలేనివాడు….. సంతానం ఇవ్వలేనివాడు.. వాడే మొగుడు వాడికి భర్తగా అర్హత కూడా లేదు, నా దృష్టిలో….. అని ఇక ఆ పిల్లవాడిని ఆ కన్నతల్లి పెంచుకుంటాను అనేసరికి… ఆమె తల్లికి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.  అమ్మ!  ఇంక తల్లి పెంచుకుంటా అన్నప్పుడు మనం మాట్లాడ్డానికి ఎవరం… పెంచుకోనివ్వవు, ఆవిడ ఎంత కాలం పెంచుతుందో…. ఒక బిడ్డనే కాబట్టి పెద్ద సమస్య కాదు… వాడికి తినే యోగం ఉంటే అన్నీ వస్తాయి అని మహాదేవి అంటూ ఉండేసరికి… ఏమో తల్లి!  దైవ నిర్ణయం ఎలా ఉందో… మొదట వాడిని పెంచలేను, నావల్ల కాదు, నాకు భర్త కావాలి అని వచ్చింది అని చెప్పి నేను నదిలో పడేద్దాం అని వచ్చాను.  ఇప్పుడేమో మళ్ళీ దానికి మనసు మారినట్టుగా ఉంది.  భర్త వద్దు పిల్లాడు కావాలి అని అంటుంది.  దానికోసం అని సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు…. మీరు చెప్పినట్టు ఆ బిడ్డని తల్లికి ఇచ్చేయడమే మంచిది. ఎలాగో ఒకలా పెంచుకుంటుందో ఏమో!  దైవ నిర్ణయం… అని చెప్పి అనేసరికి ఆ పిల్లవాడిని ఆ కన్నతల్లి తీసుకొని వెళ్ళిపోవడంతో కథ సుఖాంతం అయింది. ఇది చూస్తున్న శివ నందిని కాస్త మహాదేవితో… ఎందుకు నువ్వు ఇంత ఇదవుతున్నావు?  అది మాయ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వెంపర్లాడుతున్నావు?  నువ్వు పిల్లవాడిని పెంచగలవా? నీకు అంత ఆర్థిక స్తోమత ఉందా? ఉద్యోగాలు చేసి లేదా కూలీనాలీ చేసి ఇవ్వటం, ఇప్పుడు నువ్వు పిల్లవాడిని పెంచగలవా? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటి ఆలోచించు…. మనసు అదుపులో ఉంచుకోలేకపోతున్నావు… ఎందుకు?  అనేసరికి ఏమో నాకు తెలియట్లేదు, నాకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. మీరు చెబుతున్నప్పటికీ నాలో ఉన్న మాతృవాత్సల్యం ఆపలేకపోతున్నాను… కోరుకుంటుంది అది, అనేసరికి నీకు అంత ఇదిగా ఉంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని సంతానం కోసం భోగ జీవితంలోకి వెళ్ళిపో!  అనేసరికి అదేమీ లేదు… ఆ సమయంలో మాయా ప్రభావం వలన అలా జరుగుతుంది.  ఇప్పుడు నాకు పిల్లాడు కావాలి…. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి అనుకున్నప్పుడు నేను ఎవరు వచ్చినా తీసుకొని తిరిగి ఇచ్చే స్థితి ఉండదు కదా!  కన్నతల్లి వచ్చి అడిగితే నేను ఇచ్చేస్తున్నాను కదా! ఆ మాయా ప్రభావం ఉన్నంతవరకే నేను అలా ప్రవర్తిస్తున్నాను. దానిని దాటే శక్తి స్థితి నాకు లేకుండా పోతుంది.  మనసు అదుపులో ఉంచుకోలేకపోతున్నాను.  నాలో ఉన్న మాతృవాత్సల్యం బాగా స్పందిస్తుంది.  నేనేం చేయాలి?  అంటే మనసు అదుపులో పెట్టుకో… అవన్నీ పడి చూసి బయటకు వచ్చావు కదా!  ముగ్గురు పిల్లల్ని పెంచి వచ్చావు కదా!  అలా వచ్చిందానివి నీకు పుత్రవాత్సల్యం మీద ఇంకా ఎందుకు మమకారాలు కలుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు అని రుద్రస్వామి అనేసరికి…. శివ నందిని కాస్త అది సహజ సిద్ధమైన ప్రకృతి ధర్మం.  మనం దానిని ఆపటానికి లేదు . కానీ అదుపు చేసుకోవాలి అని అనుకుంటూ ఉండేసరికి…. ఇంతలో శివ నందిని దగ్గరికి ఒక పురుషుడు రావడం జరిగింది. అతను చూడటానికి అందంగా ఉన్నాడు…. ఎవరు స్వామి మీరు?  అని శివ నందిని అనేసరికి…. మీరు నాకు గురువుగా ఉండాలి. మీరు  సాధన విషయాలు అన్నీ చెబుతూ ఉండాలి… నాకు గురు ఉపదేశం చేయండి.  నేను మోక్షమును పొందాలి అనుకుంటున్నాను  అనేసరికి…..నాకే మోక్షం ఎలా పొందాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. ఏం చేయాలో ఏంటో అని అర్థం కాక ….అంటే మీరు సహస్ర చక్రం దాకా వచ్చారు అంటే మీరు ఏదో ఒక విధంగా గురువులు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అనేసరికి…. నేను సహస్ర చక్రం దాకా వచ్చానని నీకు ఎవరు చెప్పారు?  అంటే నాకు ధ్యాన అనుభవం అయింది… అనేసరికి అంటే ధ్యాన అనుభవం అయ్యే అంత సాధన స్థితి ఉన్నప్పుడు నాతో పని ఏంటి?  నువ్వు ఆ స్థితికి వచ్చావు కదా!  అంటే ఇప్పుడు నా సాధన ఎక్కడ ఉందో ఏ చక్రంలో ఉందో అర్థం కావడం లేదు.  మీలాంటి నిజ గురువుల కోసం నేను ఎదురు చూస్తున్నాను అనేసరికి…..ఎందుకు ఎదురు చూడవలసిన అవసరం ఏముంది?  సహస్ర చక్రంలో పరమ గురువుగాని ,లేదంటే జగద్గురువు కానీ, విశ్వ గురువు కానీ లేదంటే ఆది గురువు కానీ ఇలా ఎవరో ఒకరు వస్తారు అని తెలిసింది.  అంటే, రుద్రస్వామి కాస్త ఎవరో ఒకరు కాదు….. నలుగురు వస్తారు, సహస్ర చక్రం నాలుగు విభాగాలుగా ఉంటుంది.  అది కలువ రేకులతో ఉంటుంది.  అది 1000 బ్రహ్మాండాలతో సమానం అని చెప్పి అనేసరికి ఓహో!  ఇలా నాకు జ్ఞానం చెప్పే వాళ్ళు లేక మీ దగ్గరికి వచ్చాను అనేసరికి…. నేను ఎవరికి గురువు కాదు, గురువుగా ఉండే అర్హత, యోగ్యత, యోగ స్థితి నాకు లేదు.  నీకు కావలసిన గురువును ప్రకృతి చూపిస్తుంది అంటూ ఉండేసరికి… మహాదేవికి ఉన్నట్టుండి ఇతని మీద విపరీతమైన కామకాంక్ష మొదలవటం…. శివ నందిని లో కూడా ఇతని సహచర్యం ఉంటే బాగుండును… ఇతని సాంగత్యం ఉంటే బాగుండును…. ఇతని మాటలు సమ్మోహనం అవుతున్నాను. ఏదో తెలియని ప్రశాంత స్థితి వస్తుంది అని చెప్పి శివ నందిని లో కూడా ఒక విధమైన భావం రావటం…. వీళ్లిద్దరూ కూడా శివనందిని, మహాదేవి కళ్ళతోనే మాట్లాడుతూ ఉండేసరికి….. రుద్ర స్వామికి విషయం అర్థం అయ్యి అతను ఉండటం మంచిది కాదు అని ఏదో సాకుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి…. శివ నందిని కాస్త యువకుడితో నాయన!  నేను నీకు గురువుగా పనికిరాను, గురువు అని పేరు పెట్టుకోవాలి అనే అంత ఆనందం నాకైతే లేదు.  గురువు అంటే అనితర సాధ్యమైన స్థితి అది. ఆ పేరు మోయటం ,పెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అంటూ ఉండేసరికి… నాకు గురువుగా ఉండాల్సిన అవసరమే లేదు.  నాకు యోగ మిత్రురాలిగా ఉంటూ…. నా సాధన పరిసమాప్తి చేయవచ్చు కదా!  నాకు మోక్ష మార్గము చెప్పవచ్చు కదా అనేసరికి…..ఇక్కడికి దాకా నువ్వు వచ్చావు అంటే , ఆ పైన వాళ్ళే చూసుకుంటారు.  నారు పోసిన వాడు నీరు పోయాడా అని అనుకుంటూ ఉండేసరికి… మహాదేవి కాస్త నీకు తంత్ర విద్యలలో నీకు అనుభవం ఉందా?  అంటే తంత్రవిద్యలలో అనుభవాలు ఏమీ లేవు కానీ, అదొకటి ఉంది….కాపాలిక, అఘోర ,భైరవ, నాగసాధువు అని ఉంటుందని దానికి ఆజ్ఞా చక్రంలో ఉండే నాలుగు ఉపచక్రాలు సాధన పరిసమాప్తి చేస్తారని తెలుసుకున్నాను. కానీ దానిని నేను వామాచారంలో కాకుండా దక్షిణాచారంలో పూర్తి చేయడం జరిగింది అని చెప్పేసి…. అనేసరికి ఓహో దక్షిణాచారంలో నా?.నేనైతే తంత్ర విద్యలో వామాచారంలో పూర్తి చేయడం జరిగింది అని చెప్పేసి అంటూ…. శివ నందిని, మహాదేవి ఈ యువకుడితో మాటలలో పడిపోవటం జరిగింది. ఈ యువకుడుని మాటలానికి వీళ్ళిద్దరూ మనసు అదుపు తప్పడం జరుగుతుంది. కానీ, శివ నందిని మనసు పైకి కిందకి వెళ్తూ అతని మీద కామ భావాలు కలుగుతూ ఉన్నప్పటికీ.,వద్దు అటువైపు వెళ్ళకూడదు అని మనసును అదుపు చేస్తుంది కానీ, మహాదేవి మనసు అదుపు చేయలేక పోతుంది.  మహాదేవి కాస్త నీకు భైరవ సాధన నేర్పిస్తాను… ఆనంద భైరవుడిగా ఉండు, నేను భైరవిగా ఉంటాను, శృంగారం ఉంటుంది, నువ్వు సంయోగం నుంచి సమాధి స్థితికి వెళ్లవచ్చు అనేసరికి… ఆవిడ అతనికి ఆశ చూపిస్తూ ఉండేసరికి… శివ నందిని కి అర్థమై వద్దు, వద్దు, నువ్వు ఆ యువకుడు మీద కామప్రేరేపితం అవుతున్నావు.. అది మంచిది కాదు… అనేసరికి, అవేమీ నాకు తెలియదు.  నాకు మోహం ఎవరి మీద రాదు… అలాంటిది భైరవుడిగా ఇతని మీద నాకు మోహం కలుగుతుంది. విపరీతమైన కామకాంక్ష కలుగుతుంది.  మనసు అదుపులో ఉండట్లేదు.  అదుపు చేసుకోలేకపోతున్నాను అనేసరికి… నా మనసు కూడా అదుప తప్పుతుంది… కానీ, నేను అదుపు చేసుకోవట్లేదా? నేను అదుపు చేసుకుంటున్నాను కదా!  అనేసరికి నువ్వు మానసిక వ్యభిచారం చేసుకుంటావేమో… చేసుకో!  కానీ నేను ఇతనితో శారీరక శృంగారం చేయాల్సిందే….నావల్ల కావట్లేదు, తట్టుకోవటం…అని అంటూ ఉండేసరికి శివనందిని ఎంత చెబుతున్నా కూడా మాట వినకుండా మహాదేవి కాస్త దగ్గరలో ఉన్న ఒక గుహలోకి తీసుకువెళ్లేసరికి…. ఇక నేను చేసేది ఏమీ లేదు అని అయినా ఈ యువకుడిలో తెలియని మోహ మాయ ఉంది….జగన్మోహిని మాయ ఉంది అని శివ నందిని ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది.  మహాదేవి కాస్త, ఈ యువకుడిని తీసుకొని ఆనంద భైరవి సాధన కోసం భైరవి భైరవుడి సాధనలో శృంగార కార్యక్రమాలు చేయాలని సిద్ధపడుతూ ఉండగా…. ఎందుకో అనుమానం వచ్చి మహాదేవి కాస్త శివ నందిని దగ్గరికి వస్తూ అలుపు తీర్చుకుంటూ అమ్మాయి!  అతను అబ్బాయి కాదు, అమ్మాయి అనేసరికి…. అదేంటి?  అనేసరికి అప్పుడు అతను అబ్బాయి కాస్త అమ్మాయిగా మారాలని మారిందట.  నపుంసకస్థితి అని… అమ్మాయితో శృంగారం చేయడం ఏమిటి? నా బొంద… నా బూడిద… అని మహాదేవి నెత్తురు నోరూ కొట్టుకుంటూ ఉండేసరికి…. శివ నందిని నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వడం ఆరంభించింది.  అదేంటి అంటే….. అదే జగన్మోహిని మాయ.  స్త్రీ అబ్బాయిగా మారుతుంది.  అబ్బాయి స్త్రీ గా మారతాడు. ఇప్పుడు ఈ లీలా విన్యాసం నాకు తెలిసినంతవరకు జగన్మోహిని లీల.  కావాలంటే అతను అక్కడ ఉండడు… చూడు అనేసరికి అమ్మాయి నగ్నంగా మారిన తరువాత గాని నాకు తెలియలేదు.  అతను అబ్బాయి కాదు, అమ్మాయి అని తెలిసింది . ఇక నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను.  ఒక స్త్రీకి మరొక స్త్రీ మీద వ్యామోహం కలగడం ఏమిటి?  అని చెప్పి అనేసరికి…. సరే ఎందుకైనా మంచిది అని మహాదేవి కాస్త తిరిగి ఆ గుహలోకి వెళ్లేసరికి అక్కడ ఆ యువకుడు కనపడలేదు. ఓహో!  ఇది జగన్మోహిని లీలా విన్యాసమా అనుకునేసరికి ….అప్పుడు మహాదేవి శివ నందిని దగ్గరికి వచ్చి యువకుడు లేడు అనేసరికి అదే చెప్పాను కదా!  జగన్మోహిని లీలా విన్యాసం.  నాకు ఆ అబ్బాయి మీద కామకాంక్ష కామకోరిక మొదలైంది ….ఆ భావాలు మొదలవుతున్నప్పుడే నాకు అర్థమైంది.  ఇది జగన్మోహిని లీలా అని… ఒకవేళ లోపలికి వెళ్ళాక అమ్మాయి అని తెలిస్తే పరిస్థితి ఏమిటి?  అనే ఆలోచన రావటంతో, నా మనసు అదుపు చేసుకోవడం జరిగింది. ఈ విషయం అర్థం అయింది.  అందుకోసమని నేను మనసుని అదుపు చేసుకున్నాను.  నువ్వు మనసు అదుపు చేసుకోకుండా…. నా మాట వినకుండా… గుహలోకి తీసుకువెళ్లావు.  అక్కడ గుహలో పురుషుడు కాదు, స్త్రీ అని తెలుసుకున్న తరువాత విషయం అర్థం అయ్యింది.  ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడం జరిగింది అనేసరికి… నాకేం తెలుసు, ఇది జగన్మోహిని లీల అని ….ఈ జగన్మోహన స్థితి ఇలా ఉంటుందని నేను ఊహించలేదు.  కానీ నిజానికి ఆడపిల్ల అబ్బాయిలా మారితే ఇంత అందంగా ఉంటారా!  అని చెప్పేసి ఊహించలేకపోయాను.  అంటే అదే తల్లి లీలా విన్యాసం అనేసరికి…. ఇంకా నయం!  అతను కానీ పురుషుడైపోయి ఉంటే, నా జీవితం బుగ్గిపాలు అయ్యి ఉండేది.  అంటే ఎందుకు?  నువ్వేగా కావాలని చేసుకున్నావు …..అనేసరికి సంతానం పొందే పరిస్థితి వచ్చేది.  అంత కామ వాంఛలోకి వెళ్లిపోయాను. కొన్ని రోజులపాటు, కొన్ని నెలల పాటు శృంగారంలో ఉండిపోయే దాన్ని అని… మహాదేవి అనేసరికి ఏముంది!  నీ చక్రం ఇక్కడితో ఆగిపోయేది.  సాధన అక్కడితో ఆగిపోయి జగన్మోహన స్థితి దాటలేకపోయే దానివి అని అనుకుంటూ ఉండేసరికి…. రుద్ర స్వామి వచ్చి… ఏంటి? మహాదేవి ఈసారి కూడా తప్పటడుగు వేసిందా ? ఆ అబ్బాయితో శృంగారం చేయాలని వెళ్లిందా? ఆ అబ్బాయి కాస్త అమ్మాయిగా మారాడా? అంటే నీకు అన్ని విషయాలు తెలుసా? అంటే అందుకే కదా నేను తప్పుకుంది.  అది అబ్బాయి కాదు అమ్మాయి అని… జగన్మోహిని మాయ అనే అర్థమయ్యే మీరు దాటతారా లేదా అని నేను వెళ్ళిపోవడం జరిగింది…. అనేసరికి, అన్ని విషయాలు తెలిసి కూడా మాకు చెప్పకపోతే ఎలాగా?  అంటే ఒకపక్క శివ నందిని చెబుతూనే ఉంది.  మనసు అదుపు చేసుకొ… జాగ్రత్త ..వెళ్ళమాకు… మాయలో పడమాకు అని… దాని మాట వినని దానివి నువ్వు నా మాట ఎలా వింటావు?  అని నేను పట్టించుకోవడం మానేశాను అని రుద్రస్వామి అనేసరికి…. వామ్మో!  ఈ మాయలు ఏమిటో, ఈ సాధన ఏమిటో ,నాకైతే ఏమీ అర్థం కావటం లేదు.  కూర్చున్న పాపమే…. నిల్చున్న పాపమే… అంటే ఎలాగా!  ప్రతిదీ మాయ అంటే కష్టమే కదా!  అంటే ఇదేముంది ! ఇంకా ముందు ముందు చూడు… సహస్ర చక్రంలో సహస్ర మాయలు ఉంటాయి. అంత ఆషామాసి కాదు…. ఈ సహస్ర మాయలని నలుగురు నాలుగు విధాలుగా, నాలుగు మాయలుగా కాపాడుతూ ఉంటారు.  ఇప్పుడు మొదటి భాగంలో ఒక మాయని మీరు దాటారు.  రెండవ విభాగంలో రెండవ మాయ మొదలవుతుంది.  చూడండి అనేసరికి…. ఇంకెవరి దయ్యా అంటే శ్రీకృష్ణుడు మాయ మొదలవుతుంది.  విష్ణుమూర్తి నుంచి శ్రీకృష్ణుడు ఒక భాగం.  శ్రీకృష్ణుని లీలా విన్యాసం చూడాలి.  ఆయనది ఎలా ఉంటుందో అనేసరికి… శివ నందిని ఇదేమి పట్టించుకోకుండా…. విని ఊరుకొని ఓహో!  ఇప్పుడు శ్రీకృష్ణుని లీలా విన్యాస మాయ మొదలవుతుందా!  అనుకుని ధ్యాననిష్టలోకి వెళ్లిపోవటం జరిగింది. 

ఒకరోజు శివ నందిని ధ్యాననిష్టలో ఉండగా ఒక బాలుడు సాలిగ్రామములు వెతుకుతున్నట్టుగాను…. వెతుకుతూ ఒకదానిని తీసి తనకు చూపిస్తున్నట్టుగాను…. ధ్యాన అనుభవం అయింది.  బాలుడి వయసు సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి. నీలం పంచ కట్టుతో,తలకి తలకట్టుతో, నెమలి పించంతో, చేతులలో ఒక వేణువు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పిల్లవాడిని చూస్తుంటే గోవుల కాపరిలాగా, శ్రీకృష్ణుని అంశ అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి ధ్యానభంగం అయింది. సరే అని ఒక పది నిమిషాల తర్వాత తిరిగి ధ్యానంలో కూర్చున్నా ఇదే విధంగా ధ్యానదృశ్యం కనిపిస్తూ ఉండేసరికి… ఈ రాయి ఏమిటి?  ఈ రాయి ఎందుకు చూపించాలి అనుకుంటున్నాడు… అసలు ఏం జరిగితే అది జరుగుతుంది అని ధ్యానంలో ఉండేసరికి… ఆ రాయి మీద సూర్యకాంతి పడేలా ఆ పిల్లవాడు చేస్తూ ఉండేసరికి…. ఆ సూర్యకాంతికి ఆ రాయి కాస్త వజ్రం లాగా మెరవడం, దాని నుంచి బంగారం ధారగా కారుతూ ఉండేసరికి….దానిని ఒక పాత్రలో పట్టుకుంటూ ఉండేసరికి… ఆ పాత్ర నిండా బంగారం గా మారటం శివ నందిని కి విషయం అర్థమై, ఏదో శమంతకమణి అయ్యి ఉంటుంది అని అనుకుంటూ ఉండేసరికి ధ్యానభంగం అయింది.  ఇదే విషయాన్ని రుద్ర స్వామికి చెప్పేసరికి శమంతకమణి అయ్యి ఉండవచ్చు…. లేదా పరుసవేది మణి అయ్యి ఉండవచ్చు.. ఏదో ఒక మణి ప్రభావం అనేది అయి ఉండవచ్చు.  ఈ పిల్లవాడి రూపురేఖలు బట్టి చూస్తే ఆ పిల్లవాడు బాలకృష్ణుడి లాగా ఉన్నట్టుగా ఉన్నాడు.  ఒకవేళ ఆయనే అనుకుంటే ఆయన చేతులలో ఉండేది  శమంతకమణి సూర్యరశ్మి తో బంగారం వస్తుంది అంటే…. శమంతకమణి ఇస్తుంది.  ఇక ప్రతిరోజు శమంతకమణి ఎనిమిది మాడుగుల బంగారం ఇచ్చేది అని వినాయక చవితి కథలో చెప్పడం జరిగింది కదా… ఒకవేళ అది ఇదేనేమో అని అనేసరికి …ఆ శమంతక మణి ఆయన దగ్గర ఉండాలి కదా!  ఇప్పుడు మనం ఉన్న నది తీరంలో కనపడుతుంది.  అది నాకు ఆశ్చర్యంగా ఉంది అనేసరికి…. దానికి కాలమే సమాధానం చెబుతుంది.  నువ్వు ఎందుకు అంత ఇది అవుతావు! అనేసరికి…. అది కూడా ఈ నది తీర ప్రాంతంలోనే ఉన్నది… అది ఏమిటి అనేది తెలియట్లేదు..  ఎందుకంటే అది మణి సాలిగ్రామమో తెలియదు కదా ! అంటే సాలిగ్రామంలో కూడా బంగారం ఉంటుంది.  కాకపోతే సూర్యరశ్మి తగులుతుంటే.. దాని నుంచి బంగారం వస్తుంది అంటున్నావు కాబట్టి, నాకు తెలిసినంతవరకు అది మణి అయ్యి ఉండాలి అని చెప్పి అనేసరికి…. సరే చూద్దాం అనుకొని, ఎవరికి వారే ధ్యాననిష్ఠలో ఉండటం జరిగింది. కొన్ని రోజులు ఇలా ధ్యాననిష్ఠలో ఉన్న శివనందినీకి ఉన్నట్టుండి శమంతకమణికి సంబంధించిన జ్ఞానం అందడం మొదలయ్యింది. అంటే దానికి సంబంధించిన ధ్యాన దృశ్యాలు వరుసగా కనపడుతూ ఉండేసరికి…. శివ నందిని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మొదట ఎవరో ఒక మహారాణి అవతారంలో ఉన్న ఒక ఆవిడ శివలింగానికి ఆరాధన చేస్తూ ఉండేసరికి, శివుడు ప్రత్యక్షమై తన కంఠంలో ఉన్న ఒక మణి అనుకుంట…. ఆవిడకి ఇవ్వటం జరిగింది. ఆవిడ కాస్త ఒక మహారాజు దుస్తులలో ఉన్న శివ భక్తుడిగా ఉన్న తన భర్తకి ఆ మణిని ఇవ్వటంతో…. అతను దానిని కంఠాభరణంగా ధరించడం జరిగింది. కొన్ని రోజులకి ఏదో యుద్ధంలో వనవాస దుస్తులలో ఉన్న ఒక యువకుడి చేతిలో ఆయన మరణం పొందడంతో…..ఆయన కంఠంలో ఉన్న మణి నేల మీద పడుతూ ఉండేసరికి…. ఆయన కాస్త దానిని భద్రపరచమని సేవకుడికి చెప్పటం, ఆ సేవకుడు కాస్త దానిని ఒక నౌకలో భద్రపరిచినట్టు, ఆ తర్వాత అది కాస్త ఆ నౌకలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మణికాస్త నీటిలో పడిపోవడం …..అది కాస్త ఒక రాజుకి దొరకటం…. ఆ తరువాత ఆ రాజు నుంచి శ్రీకృష్ణుడికి రావటం శ్రీకృష్ణుడు కాస్త ఆ మణిని తన అంత్యకాలంలో ఒక సాలి గ్రామంలో భద్రపరచడం…. ఇలా రకరకాలుగా ధ్యాన దృశ్యాలు కనిపించేసరికి వాటన్నిటినీ క్రోడీకరించి చూస్తూ విశ్లేషణ చేస్తూ ఆత్మ విచారణ చేయడం ఆరంభించింది. అది కాస్త శమంతకమణి యొక్క పూర్వ ఫలాల జ్ఞానం అని రుద్ర స్వామి చెప్పటం జరిగింది. ఇది పురాణ ఇతిహాసాల ప్రకారంగా విశ్లేషణ చేయడం జరిగింది. అప్పుడు రుద్రస్వామి కాస్త తనకి కలిగిన ఒక్కొక్క ధ్యాన దృశ్యాలను విశ్లేషణ చేయడం ప్రారంభించాడు.  మొదట నీకు కనపడిన మహారాణి ఎవరో కాదు…. రావణాసురుడి భార్య అయిన మండోదరి భక్తికి మెచ్చిన శివుడు రుద్రమణిని ఇవ్వటం జరిగింది. ఆ రుద్రమణిని దశకంఠుడైన రావణబ్రహ్మకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన తన కంఠంలో ఆ మణిని ధరించడం జరిగింది. నిజానికి అది శమంతకమణి.రుద్రమణి కాస్త శమంతకమణిగా ప్రచారంలోకి రావడం జరిగింది.  ఆ శమంతకమణితోనే ఆయన ప్రతిరోజు 8 బాడుగల బంగారం పొందడం జరిగింది.  అందుకనే లంక నగరాన్ని బంగారంమయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీరాముడు రావణ సంహారంతో శ్రీరాముడు కాస్త హనుమంతుడికి ఆమణిని దాచమని చెప్పడంతో….. ఆయన ఆ మణిని రావణబ్రహ్మ నిత్యం ఉండే వాడే నౌకలో అడుగు భాగంలో దాచటంతో అది అక్కడి నుంచి నౌకామణిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆ తర్వాత అది సముద్రయానంలో రాజుకి అందడంతో… ఆ రాజు నుంచి శ్రీకృష్ణుడికి రావడం జరిగింది.  శ్రీకృష్ణుడికి వచ్చేసరికి నౌకామణిగా రుద్రమణిగా ఉన్నది కాస్త శమంతక మణిగా ఖ్యాతి పొందడం జరిగింది. ఇదంతా మనకి రామాయణంలో కనపడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన రామాయణ ఇతిహాసాలలోని విషయాలు రుద్ర స్వామి చెబుతూ ఉండేసరికి …ఓహో!  ఇప్పుడు శమంతక మణి ఇది వృత్తాంతం అని తెలిసింది.  అలాగే పరమహంస గారికి తన సాధన అనుభవాలలో శమంతకమణి ఇతివృత్తాంతం తెలుసుకున్నాడు.  శమంతకమణి ఎక్కడ ఉన్నదో తెలుసుకునేసరికి… శ్రీకృష్ణుడు గోవుల ప్రయోగం చేశాడు అని ఆయన కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది.  అక్కడి నుంచి ఆయనకి శ్రీకృష్ణుడు అంటే గౌరవం పోయి, భక్తి వైరాగ్యాలు కలిగాయి. శ్రీకృష్ణుడు అంటే శత్రుత్వ స్థానంలోనికి వెళ్లడం జరిగింది. కేవలం తనకి ఉన్న ఆ మణి మాయ దాటలేకపోయాడు అని ఆయన అనుకోవడం జరిగింది అనేసరికి…. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు శమంతకమణి గురించి విషయాలు చెప్పటం వలన నాకేంటి ఉపయోగం?  అనేసరికి…. అలా అంటావేంటి, అన్ని వదిలేసి, అన్ని త్యాగం చేసిన బుద్ధుడు చింతామణి మణి మాయలో పడ్డాడు…. రుద్రుడు కాస్త రుద్రమణి మాయలో పడ్డాడు…. విష్ణుమూర్తి కాస్త కౌస్తుభ మణి మాయలో పడ్డాడు.  శ్రీకృష్ణ కాస్త శమంతకమణి మాయలో పడ్డాడు.  నువ్వు కూడా మణి మాయలో పడతావేమో అని వాళ్ళు ఆశ పెడుతున్నారు.  ప్రకృతి ధర్మం అది.  మాయా పరీక్షలు పెట్టడం …..అంటే నాకేమీ మాయలు అక్కర్లేదు. నాకు వాటి మీద ఆశ లేదు.  రసవిద్య తెలుసుకున్న సిద్ధపురుషుడికి ఈ మణి సహాయంతో వచ్చిన దానికి తేడా ఏముంటుంది.  ఒకటి జ్ఞానంతో వస్తుంది, ఒకటి వస్తువుతో వస్తుంది. అంతే తేడా.  ఈ రెండు కూడా బంగారానికి సంబంధించినవే కదా! బంగారం తయారుచేసిన వాడు బైరాగి కాక తప్పదు అని బ్రహ్మ శాపం ఉన్నది కదా!  అయినా నాకు బంగారం మీద ఎటువంటి ఆశ లేదు… ఏముంది, పాదరసానికి మూలకాన్ని చేరిస్తే అది బంగారంగా మారుతుంది. అంతే కదా!  పాదరసానికి బంగారానికి ఏంటి తేడా!  మెరుపే కదా!  అని శివ నందిని అనేసరికి…. అందరూ అలాగే అంటారమ్మ… చేతికి వచ్చేసరికి పరిస్థితులు, స్థితిగతులు వేరవుతాయి.  అది దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. కాకపోతే ఇప్పుడు విషయం ఏమిటో నీకే తెలుస్తుందిలే అనేసరికి…. సరే అని చెప్పి ధ్యాన నిష్ఠను కొనసాగించడం జరిగింది. పదేపదే ఇదే ధ్యాన దృశ్యం కనిపిస్తూ ఉండేసరికి…. ఈమణి ఎక్కడ ఉన్నది అనేది లీలా మూర్తిగా నదీ సమీపంలోనే అమరి ఉన్నట్లుగా కనబడింది.  అంటే శ్రీకృష్ణుడు తన అంత్యకాలములో సోమనాధ క్షేత్రంలో శివలింగంలో సాలిగ్రామంలో ఈ శమంతకమణి ఆదిలో ఉంచడం జరిగింది. కానీ ఆ తర్వాత తురుష్కుల దాడి వలన అది ఎక్కడికి చేరిందో…. ఎక్కడికి వెళ్లిందో కూడా మొత్తానికే తెలియలేదు. కానీ భూమి మీద ఆ మణి మాత్రం ఎక్కడో ఒకచోట నిక్షిప్తమై ఉన్నది అని మాత్రం తెలుస్తుంది.  అది తెలుసుకునే అవకాశం తనకి ఉన్నా కూడా శివ నందిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది తెలుసుకోవడం వల్ల లోకానికి తనకి ఎలాంటి ఉపయోగము లేదు. పెను ప్రమాదం తెచ్చుకోవడం తప్ప ఉపయోగం లేదు.  శమంతకమణి గురించి తెలుసుకోవడం వలన వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు తన దగ్గరికి వచ్చి వేధించడం ఆరంభిస్తారు అని చెప్పేసి పరమహంస గారి అనుభవం ద్వారా తెలియటంతో….శివ నందిని జాగ్రత్త పడసాగింది. నిజానికి తను జపం చేస్తున్న నదీ సమీపంలోనే ఈ శిల మాత్రం ఉన్నది అని శివ నందినికి పదేపదే ధ్యాన దృశ్యాలు కనిపిస్తున్నప్పటికీ….. దానిపై ఆశ పెట్టుకోలేదు.  కానీ మాయ ఏదో ఒకటి చేయక తప్పదు కదా!  మాయ తన ప్రభావం చూపిస్తుంది కదా!  అని అనుకుంటూ ఉండేసరికి…. బాలగణపతి కాస్త గబగబా శివ నందిని దగ్గరికి వచ్చి అమ్మ! ఇది చూసావా?  అని ఒక సాలిగ్రామం లాంటి శిలను చూపించేసరికి…. ఆ శిలను చూడగానే శివ నందిని గతుక్కుమంది.  ఎందుకంటే తనకి ధ్యానంలో కనిపిస్తున్న సాలిగ్రామ శిల…. అదే అని చెప్పి శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  ఇదేంట్రా?  ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేసరికి…. మేము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటే, ఒక అన్నయ్య సుమారుగా 12 సంవత్సరాలు ఉంటాయి.. ఆయన అచ్చం శ్రీకృష్ణుడు లాగా అలంకరణ చేసుకుని ఉన్నాడు… ఆయన వచ్చి సూర్యుడికి నమస్కారం చేయగానే అందులో నుంచి బంగారు ద్రవం కారుతూ ఉండటం… దానిని తీసుకొని ఆ రాయిని అక్కడ గుంటలో పాతిపెట్టి వెళ్ళిపోవడం చేస్తూ ఉండటం గమనించాము… అన్నయ్యని అడిగాము ఈ మణిని తీసుకొని వెళ్తాము అని…  మా అమ్మకి చూపిస్తాము అని అంటే, ఇది మీ అమ్మ కోసం వచ్చిన శిల…. తన దగ్గర ఉంచుకోమని చెప్పు అన్నాడు.  మాకు ఆనందం వేసి తీసుకు వచ్చాము అనేసరికి… శివ నందిని కాస్త ఎవరు ఏది ఇస్తే అది తీసుకురావటమేనా ? అనేసరికి….ఏమో నాకేం తెలుసు…. ఇందులో బంగారం వస్తుంది కదా!  నువ్వు కూడా చూస్తావని, దైవీక వస్తువేమో అని బాల కుమారస్వామి అనేసరికి…. ఏది దైవిక వస్తువు? ఏది మాయ వస్తువు? తెలుసుకోకపోతే ఎలాగా ? ఇది నాకు ధ్యానంలో కనిపిస్తుంది…. బంగారం వస్తుందని కూడా ధ్యాన అనుభవం అయింది అనేసరికి… మాకేం తెలుసు, ఇందులో నుంచి బంగారం రావడం అన్నయ్య చేతిలో మేము గమనించి ఇదేదో బాగుంది…. ఇది నీకు దైవిక వస్తుందేమో అని తీసుకురావడం జరిగింది అనేసరికి… రుద్రస్వామీ పెద్ద పెద్దగా నవ్వుతూ మాయ ఎవరిని వదిలిపెట్టదు. మాయ పట్టుకోవాలని నిశ్చయించుకుంది అంటే చచ్చేదాకా వదిలిపెట్టదు అని అంటూ ఉండేసరికి… నేను ఆ నది సమీపంలో ఈ మణి ఉంది అని తెలిసినా కూడా నువ్వు ఆ మణిని పట్టించుకోలేదు. మణి దగ్గరికి కూడా వెళ్లలేదు.  దానిని చూడాలి, తాకాలి, ముట్టుకోవాలి అని కూడా నువ్వు అనుకోలేదు.  కానీ చూసావా?  మాయ ఎలా చేసిందో..! నీ పిల్లల చేత ఆ మణిని తెప్పించేటట్టుగా చేసింది …అనేసరికి, ఏమో!  దీనికి ధ్యానంలో కనిపించిన మణి,సాలిగ్రామం అయిన ఇది ఒకటే అని గ్యారెంటీ ఏమిటి?  అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అని మహాదేవి అనేసరికి …. ఓహో!ఏదైనా అనుభవం అయితే గాని నువ్వు నమ్మవు కదా! అని చెప్పేసి బాల గణపతి చేతులలో ఉన్న సాలిగ్రామం తీసుకొని ఎండలో పెట్టేసరికి… ఆ మణి యొక్క చిల్లు రంద్రం నుంచి, సాలిగ్రామం రంధ్రం నుంచి బంగారం బయటికి రావటం కారుతూ ఉండేసరికి…. పిల్లలు కాస్త బంగారాన్ని పాత్రలో పట్టేసరికి ద్రవ స్థితిలో ఉన్న బంగారం కాస్త ఆ పాత్రలోకి వెళ్లి ఘనస్థితిలోకి వెళ్లి ముద్దగా మారటం అందరూ గ్రహించారు… గమనించారు.  అంటే ఇప్పుడు సూర్యరస్మితో బంగారం స్రవిస్తుంది అన్నమాట!  అనేసరికి….. అదే కదా శమంతక మణి.  ఇందులో శమంతకమణి లక్షణాలు అన్నీ ఉన్నాయి.  కానీ ఇందులో ఉన్నది శమంతకమణి అవునా కాదా అన్నది తెలియదు.  కానీ అది ఎనిమిది మాడుగుల బంగారం ఇస్తే, ఇది ద్రవపదార్థంతో ఉన్న బంగారం ఇస్తుంది. ఏదైనా గాని ఇది శమంతకమణి అంశకి సంబంధించింది అనేసరికి….అయితే ఇప్పుడు ఏం చేయాలి అని శివ నందిని అనేసరికి… నీకు బంగారం కావాలి అంటే ఇది ఉంచుకో…వద్దు అనుకుంటే తిరిగి యధావిధిగా నీళ్లపాలు చేయడమే అనేసరికి…. మహాదేవి కాస్త ఇది కొంచెం బంగారమే కదా ఇస్తుంది.  100 గ్రాముల బంగారం మాత్రమే ఇస్తుంది కదా!  అంతకుమించి ఇవ్వటం లేదు కదా! ఆ బంగారాన్ని ఏ రోజుకి ఆరోజు అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి కదా!  మనకి జీవితం నడుస్తుంది కదా! అని మహాదేవి అనేసరికి నువ్వెక్కడ దొరికావే తల్లి….. ఒక పక్క మాయ అని చెప్తూ ఉంటే….ఆ మాయలో పడతాను అంటావు, మనసు అదుపు చేయాలి అనుకుంటూ ఉంటావు, మనసు అదుపు చేయలేక అందులో పడుతూ ఉంటావు అని శివ నందిని అనేసరికి… ఏమో నాకు తెలీదు, బంగారం ఎవరు వదులుకుంటారు, ఇప్పుడు బంగారం కోసం కొట్టుకు చస్తున్నారు, అలాంటిది రాబోయే కాలంలో 100 గ్రాముల బంగారం 500000 అయినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.  ఇప్పుడు బంగారం ధర ఎలా ఉన్నాయో నీకే తెలుసు.  అసలు బంగారం దొరకట్లేదు.  అలాంటిది సహజ సిద్ధంగా బంగారం వస్తుంది మనకి ….అంటే అక్షయపాత్ర దొరికినట్టే కదా!  మీకు ఏమైనా పిచ్చా వెర్రి నా? ఇష్టం లేకపోతే నాకు ఇవ్వు అని రుద్ర స్వామి దగ్గర నుంచి ఆ సాలిగ్రామం తీసుకుంటూ ఉండేసరికి…. రుద్రస్వామి కాస్త పెద్దగా నవ్వుతూ… అమ్మ!  ఆ బంగారం గీత యోగం ఉండాలి.  రస సిద్ది యోగం నీ రాతలో ఉండాలి. ఎవరికి పడితే వారికి బంగారం ఇవ్వదు.  కావాలంటే సూర్యరశ్మికి చూపించు. బంగారం వస్తుందో లేదో నువ్వే తెలుసుకో!  వస్తాదేమో చూద్దాం అనేసరికి…. ఎందుకు రాదు అని చెప్పి, తను సూర్యరశ్మి లో పెట్టినప్పటికీ కూడా… దాదాపు మూడు నాలుగు గంటలు పెట్టినప్పటికీ కూడా…. దాని నుంచి ఎలాంటి బంగారం స్రవించకపోవడం మహాదేవికి ఆశ్చర్యం వేసింది.  అదేంటి అరగంటకే 100 గ్రాములు బంగారం ఇచ్చింది కదా అనేసరికి….అది రాతలో బంగారం తయారు చేసే యోగం ఉండాలి. ఆ యోగం ఉన్నవాడు రససిద్ధి పురుషుడు అవుతాడు.  అది ఎవరికి పడితే వారికి రాదు.  ఆ రససిద్ధ పురుషుడు బంగారం తయారుచేసిన వాడు బైరాగిగా మారతాడు అని చెప్పేసి బ్రహ్మ శాపం ఎటు ఉండనే ఉన్నది కదా అనేసరికి…. అంటే ఇప్పుడు మీ ఇద్దరికీ రససిద్ధి గీత ఉన్నదా?  నాకు లేదా?  అనేసరికి ఉక్రోషంతో దీనివల్ల ఉపయోగం ఏమిటి?  అంటూ ఉండేసరికి …..నీ పరంగా చూస్తే అది విష్ణు సాలి గ్రామం, అదే శివనందినీకి ..నాకు… నా పరంగా చూస్తే సాలిగ్రామం అని శమంతక మణి ఉపాంశ అని అనేసరికి…. బంగారం ఇచ్చేది అనేసరికి…. శివ నందినీకి కాస్త , అది ఏదైనా నాకు అనవసరం.  ఆ శిలను ఎవరు ఇచ్చారు…. వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పేసరికి…. సరే అమ్మ!  అని ఏదో దైవిక వస్తువు అనుకున్నాం కానీ, మాయా వస్తువు అన్నప్పుడు… నీకు ఇష్టం లేనప్పుడు… మాకెందుకు! అని ఆ అన్నయ్య కనపడితే ఇచ్చేస్తామని బాల గణపతి అనేసరికి… వీళ్ళు వెళ్లే సమయానికి అక్కడ పిల్లవాడు ధ్యానం చేస్తూ కనపడేసరికి…. వీళ్ళు రావడం గమనించి ధ్యానం నుంచి బయటకు వచ్చి….. మీ అమ్మ వద్దు అన్నదా ? అంటే అవును… వద్దు అన్నది… అంటే దీని నుంచి బంగారం వస్తుందని తెలుసా?  అంటే తెలుసు 100 గ్రాములు బంగారం పైగా ఇచ్చింది.  అయినా కూడా మా అమ్మ వద్దు అంది . విషయం తెలిసినా కూడా తను వద్దు అన్నది ..తనకి బంగారం మీద మమకారం పోయినట్టు ఉంది అనేసరికి… అదేంటి మా అమ్మకేమో బంగారం వచ్చింది… ఇంకో అమ్మకేమో బంగారం రాలేదు అని అంటే ….అది రాతలో రాసిపెట్టి ఉండాలి.  రాసిపెట్టి ఉన్న వాళ్ళకే ఉంటుందిలే….సరే మీకేమైనా కావాలా? అంటే మా అమ్మకే లేనప్పుడు మాకెందుకు… ఇందులో మేము దైవిక వస్తువులు చూస్తూ ఉంటాము… ఇది దైవిక వస్తువు కాదు మాయ వస్తువు అని అమ్మ అన్నది.  అందుకే ఇచ్చేస్తున్నాము… అంటే మీకు బంగారంతో పని లేదా?  అంటే మాకేం బంగారంతో పనిలేదు …మాకేం అవసరం లేదు…ఆ బంగారం చేసుకొని మేమేం చేయాలి అనేసరికి…. ఆ పిల్లవాడు కాస్త అదృశ్యం అయ్యేసరికి, ఆ రాయి కూడా అదృశ్యం అవ్వడం జరిగింది. ఇదంతా  పిల్లలు కాస్త శివ నందిని కి చెప్పేసరికి….ఇది శ్రీకృష్ణుని లీలా విన్యాసం…. శమంతకమణి యొక్క ఉపాంశ అని మనకి చూపించడం జరిగింది అని అనడంతో…. శ్రీకృష్ణుడు లేదా ఇంతటితో అయిపోయిందా..? ఇంకా ఉందా..?  అనుకుంటూ…. శివ నందిని ధ్యాననిష్ఠలోనికి వెళ్లడం జరిగింది.

ఒకరోజు తీవ్రమైన ధ్యాననిష్ఠలో ఉండగా శివ నందినికి ధ్యాన దృశ్యంగా సహస్ర కమలం ధ్యానంలో కనపడుతూ ఉండేసరికి….. అందులో విష్ణుమూర్తి స్వరూపం, తర్వాత జగన్మోహిని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు కనపడుతూ ఉండేసరికి…. ఆ దృశ్యాలన్నీ అదృశ్యం అయ్యి, కమలం మధ్య భాగంలో ఒక పాంచజన్య శంఖం తిరుగుతూ…. ఓంకార నాదం చేయటం లీలామూర్తిగా కనిపించింది. ఇదేంటి, విచిత్రంగా దైవ స్వరూపాలు పోయి ఓంకార నాదం వినపడుతుంది…అది సహజ సిద్ధమైన శంఖం నుంచి నాదం చేయకుండా, ఊదకుండా దానంతట అదే ఓంకార నాదం వినపడుతుంది అనుకుంటూ ఉండేసరికి…. ధ్యాన భంగం అయింది. తనకి కలిగిన ధ్యానం అనుభవం గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి…. అది విష్ణుమూర్తి చేతిలో ఉండే పాంచజన్య శంఖం. నిజానికి ఆ పాంచజన్య శంఖంలో ఐదు ఉప శంఖాలు ఉంటాయి. అందుకని దానిని పాంచజన్య శంఖం అంటారు.  అంటే ఈ మహా శంఖంలో నాలుగు ఉపశంఖాలతో కలిపి ఐదు శంఖాలు ఉండటం వలన, దీనిని ఈ విధంగా పిలవడం జరుగుతుంది అనేసరికి…. అంటే శంఖంలో శంఖాలు ఉంటాయా?  అని శివ నందిని అనేసరికి కావాలంటే ఇది మైసూరు క్షేత్రంలో ఉన్న చాముండేశ్వరి దగ్గర ఈ మహా శంఖం చూడవచ్చును… దీనినే పాంచజన్య శంఖం అంటారు. చాలామంది తెలియక  శ్రీకృష్ణుడు వాడిన శంఖమును మామూలుగా ఉన్న పెద్ద శంఖం లాగా ఉన్న దాన్ని పాంచజన్య శంఖంగా ప్రచారం చేస్తున్నారు.  మరికొంతమంది శంఖానికి ఐదు నొక్కులు ఉంటే అదే పాంచజన్య శంఖంగా ప్రచారం చేస్తున్నారు.  నిజానికి పాంచజన్య శంఖంలో నాలుగు ఉపశంఖాలు కలిపి ఉంటాయి. ఈ నాలుగు శంఖాలు ఒకటి , పై ఒకటి వరుస కలిపి ఒకే సరళరేఖలో ఉంటాయి. ఇది మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయంలో చూడవచ్చును అనేసరికి అవునా? కాదా? అని అనుకుంటూ ఉండేసరికి…. నీకు పాంచజన్య శంఖం ఉపసంఖం వస్తుంది.  దీంట్లో సహజ సిద్ధమైన శంఖనాదం మన చెవిలో పెట్టుకుంటే…. దాని యొక్క హోరు నుండి ఓంకార నాదం వస్తుంది. దానిని మనం పాంచ జన్య శంఖంగా అనుకోవచ్చు.  ఇది సహజ సిద్ధంగా 12 సంవత్సరాల కి ఒకసారి వస్తుంది.  నిజమైన పాంచజన్య శంఖం అయితే, 72వ సంవత్సరాలకు ఒకసారి ఉల్కపడే సమయంలో… ఆ ఉల్క సముద్రంలో పడినప్పుడు, ఆ ఉల్క యొక్క doubt మహా శంఖంగా రూపాంతరం చెందుతుంది అని శాస్త్రవచనం. అది దొరకడం అంటే అసాధ్యమే కానీ…. 12 సంవత్సరాలకు ఒకసారి సహజసిద్ధంగా ఏర్పడే శంఖం ఒకటి ఉంటుంది.  అది మనకి దొరికితే దానిని ఉప శంఖ అంశగా తీసుకోవచ్చు అనేసరికి…. అంటే ఇప్పుడు మనం దైవిక వస్తువుగా పాంచజన్య శంఖం పొందడం జరుగుతుందన్నమాట అని శివనందిని అనేసరికి…. అవును తల్లి!  అనేసరికి తను ధ్యాననిష్ట లోకి వెళుతూ ఉండేసరికి…. తను ఉన్న నదిలో నుంచి 12 సంవత్సరాల తరువాత ఒక శంఖం వస్తుంది అని అది బాల కుమారస్వామి చేతుల మీదగా దొరుకుతుంది అని ధ్యాన దృశ్యం లీలా మూర్తిగా కనిపించేసరికి….నాకు తెలిసినంతవరకు రాబోవు మూడు రోజుల్లో ఈ 12 సంవత్సరాల తరువాత దొరికే పాంచజన్య శంఖం రాబోతుంది.  ఇది బాల కుమారస్వామి చేతుల మీదగా రాబోతుంది అని శివ నందిని అనేసరికి…. అది నిజమా కాదా అని మహాదేవి ఆశ్చర్యంగా ఆత్రుతగా ఎదురు చూడటం జరిగింది. మూడు రోజుల తర్వాత నది స్నానానికి వెళ్లిన పిల్లలు ఇద్దరూ ఆనందంతో వస్తూ ఉండేసరికి…. శివ నందిని ఏమైంది?  అనేసరికి బాలగణపతి కాస్త అమ్మ!  అమ్మ!  అన్నయ్యకి ఒక శంఖం దొరికింది.  భలే ఉంది.  ఆ శంఖం ఊదకుండా చెవిలో పెట్టుకుంటే… గాలి హోరుకి ఓంకార నాదం వినిపిస్తుంది.  ఓంకార నాదంగా వినపడుతుంది చూసావా?  అనేసరికి…. సుమారుగా ఒక అడుగు ఉన్న తెల్లటి శంఖం చూపించేసరికి…. తనకి సహస్ర కమలం మధ్య భాగంలో కనిపించినది ఇలాంటి శంఖమే అనుకుంటూ ఉండేసరికి…. ఇది పాంచజన్య శంఖం అంటూ ఇది దాని ఉపాంశ…నిజానికి పాంచజన్య శంఖం వేరు… ఇది 12 సంవత్సరాలకు ఒకసారి నదీ గర్భం నుంచి ఏర్పడే శంఖం అనేసరికి…. నదిలో కొట్టుకుంటూ వచ్చింది. అన్నయ్యకి దొరికింది నాకు దొరకలేదు అంటూ ఉండేసరికి ….ఎవరికి దొరికిన ఒకటే కదా! ఒకరికి దొరికింది ఒకరికి దొరకలేదు అని ఎందుకు అనుకోవాలి అని చెప్పేసి శివ నందిని అనేసరికి…. ఆ శంఖమును రుద్రస్వామి పరిశీలిస్తూ ఉండేసరికి…. దానిలో నుంచి సహజ సిద్ధంగానే ఓంకార నాదం వస్తూ ఉండేసరికి చూసావా!  గాలి హోరు ఎలా ఓంకార నాదం వస్తుందో అని అంటూ ఉండేసరికి, మహాదేవి కాస్త ఆ శంఖమును చెవిలో పెట్టుకునేసరికి, ఆ నాదానికి కుండలనీ శక్తిలో కదలికలు వస్తున్నట్టు ఉదృతం అవుతూ ఉండేసరికి,అది కాస్త సహస్ర చక్రంలో మరింత ఉదృతం అవుతూ ఉండేసరికి… ఈ శంఖ నాదానికి తనలో కుండలిని శక్తి కదలికలు సృష్టిస్తోంది… నిజమైన ఓంకార నాదమును ఇచ్చే పాంచజన్య శంఖం అని మహాదేవి నిర్ధారణ చేసుకొని శివ నందినికి ఇస్తూ…. దైవిక వస్తువుగా నీ దగ్గరే ఉంచుకో అని అనేసరికి…. ఆ శంఖమును అదృశ్య శక్తితో తనలో నిక్షేప్తం చేసుకుంటున్న సమయంలో అక్కడికి కృష్ణస్వామి మరియు యోగాంబిక రావటం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో అనుకుంటూ ఉండేసరికి…. శివ నందిని, మహాదేవి చేతిలో ఉన్న పాంచ జన్య శంఖమును చూస్తూ పాంచజన్య శంఖం పొందే అంత సాధన స్థితికి వచ్చావా?  అని కృష్ణస్వామి అనేసరికి …..ఇది నిజమైన శంఖం కాదు, పాంచజన్య శంఖం ఏదో మాకు జ్ఞానం అందింది.  అయినా మీరు శమంతకమణి  మాయను ఎలా దాటారు… సాలగ్రామం శ్రీకృష్ణుడు ఇచ్చాడు కదా!  దానితో భోగ జీవితంలోకి వెళ్లిపోవచ్చు కదా! మీరు ఎందుకు యోగ జీవితంలోనికి వచ్చి సృష్టిని నాశనం చేయాలని ఇది చేస్తున్నారు.  మీ చావు మీరు చావచ్చు కదా!  విశ్వ మోక్షం పొందాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు.  అసలు ఎందుకు మమ్మల్ని అందరినీ చంపాలని అనుకుంటున్నారు అని యోగాంబిక అనేసరికి…. ఇక్కడ చంపేదేముంది విశ్వంలో, చివర్లో ఏం జరిగిందో…. మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము.  ఇప్పుడు పరమహంస సాధన చేసి స్త్రీ ప్రకృతిలో పురుషుడు లేడు ….స్త్రీ ఉంది అని తెలుసుకున్నారు.  అదే నేను సాధన చేసి పురుష ప్రకృతిలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను ..మేము కేవలం తెలుసుకోవడమే కదా!  ఆ జ్ఞానం మీరు అందరూ ఇవ్వకుండా చేస్తున్నారు… ఏం జరుగుతుంది అనేది మాకు తెలియాలి కదా !విషయం తెలియాలి కదా !పదార్థం దాటితే కానీ యదార్ధ జ్ఞానం తెలియదు. మీరు అసలు జ్ఞానం అందకుండా మాయ పెట్టేసి, మర్మాలు పెట్టేసి, మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు అని మాకు అనుమానం మొదలైంది. అసలు నిజానికి ఆదిదంపతులు ఉన్నారా?  లేరా అనేది తెలుసుకోవాలి.  దేవతలు, దేవుడు ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి అనేసరికి… ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడా? దేవతలు ఉన్నారా?  అని తెలుసుకుంటారు.  ఆది దంపతులు ఇద్దరూ లేరు అని తెలుసుకున్నారు అనుకో… అప్పుడు విశ్వం ఏమవుతుంది?  అల్లకల్లోలం అవ్వదా?  దేవుడు లేడు, దేవత లేదు, అమ్మవారు లేరు, అయ్యవారు లేరు అని తెలుసుకొని…. మీరు ఏమి సాధిస్తారు.  ఇప్పుడు పరమహంస గారు రుద్రుడు లేడు… అయ్యవారు లేరు… అమ్మవారు ఉంది అని తెలుసుకున్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం?  అనేసరికి…. ఇక్కడ నామరూపాలు లేని భక్తి ప్రచారం అవుతుంది. ఏదో ఒక శక్తి లేకుండా అయితే ఉండదు కదా!  వేదాలు ఏం చెప్పాయి? ఆకార తత్వం నుంచి నిరాకార తత్వంలోకి రావాలి అని చెప్పటం జరిగింది. ఆకార శివుడు కాస్త నిరాకార శివుడు అయ్యాడు.  శివుడు కాస్త శివం అయ్యాడు.  శివం శవం అయ్యింది అని పరమహంస గారి అనుభవాల ప్రకారంగా తెలుస్తుంది కదా!  అలాగే ఇప్పుడు నా అనుభవాల ప్రకారంగా శివాని కూడా శవం అయ్యిందేమో!  అమ్మవారు లేరు అని తెలుస్తుంది.  తద్వారా నామరూపాలు లేని భక్తి పోతుంది.  విగ్రహారాధన భక్తి పోతుంది.  విశ్వారాధనలోకి వస్తారు.  విశ్వంలో ఏదో ఒక శక్తి ఉంటుంది కదా!  నిరాకార శక్తి , ఆ నిరాకార శక్తి లోనే నవవిధ భక్తులు ఉండవచ్చు కదా! ఇప్పుడు ఆకార శివుడిని, ఆకార శివానిని పట్టుకొని సాధన చేయడం వలన ఏం ఉపయోగం ఏముంది? మతాలు పెరగడం, విద్వేషాలు పెరగడమే కదా!  నామరూపాలు లేని శక్తిని ఆరాధన చేయడం మంచిది కదా…. నిరాకార తత్వంలోకి వెళ్లడం మంచిది కదా… మీరు మాయా స్వరూపాలు అయి ఉండి, మమ్మల్ని మోక్షం పొందనివ్వకుండా ఆపటం ఏమిటి?  చావాలలకు ఉన్న వాళ్ళని చావనివ్వకుండా చేయడం ఏమిటి? నేను చావాలనుకున్నప్పుడు మేము చచ్చామా లేదా ఎలా చచ్చామో…. ఏ విధంగా చచ్చామో అని తెలుసుకుంటున్నప్పుడే… చావనివ్వకుండా ఆ జ్ఞానం అందనివ్వకుండా చేస్తున్నారు. కానీ  మేము ఎలా చచ్చాము అనే విషయం మాకు అనుభవంలోకి రావట్లేదు.  అదే మేము సాధన చేసి తెలుసుకోవాలనుకుంటున్నాము… యోగ సాధన అంటే ఏమిటి?  తన చావు స్థూల శరీరం చచ్చిన తరువాత ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడమే కదా!  అది తెలియనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు… అవన్నీ కూడా తెలుసుకోవాలంటే చక్రాలు జాగృతి అవ్వాలి… శరీరాలు జాగృతి అవ్వాలి… దానికి సంబంధించిన దైవిక వస్తువులు రావాలి… ఆ దైవీక వస్తువులు వచ్చే సమయానికి మీలాంటి వాళ్ళు మాయాస్వరూపాలుగా ఉండి ఆపడం జరుగుతుంది.  ఆ దైవీక వస్తువులు అందకుండా చేయడం జరుగుతుంది. మీరే కాదు దేవతలు, దైవాలు కూడా అలాగే చేయటం జరుగుతుంది.  తాము చచ్చాము అన్న విషయం వాళ్లకి తెలుసు… లోకానికి అది తెలియనివ్వకుండా ఆపుతున్నారు.  చచ్చినవాడు చచ్చాడు అనే విషయం తెలియనివ్వకుండా పూజలు, ఆరాధనలు ఇవన్నీ చేస్తున్నారు.  అక్కడ శివం శవం అయ్యిందనే విషయం తెలిసినా కూడా…. తను చచ్చానని విషయం తెలిసినా కూడా…. తను బతికే ఉన్నాను అని… చెప్పేసి సజీవ మూర్తిగా ఉన్నాను అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?  మీలాంటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అనేసరికి…. అది విశ్వ సృష్టి రహస్యం విశ్వాన్ని కాపాడాలని అనుకుంటున్నాము…,అనేసరికి….. లేని విశ్వాన్ని ఉన్నట్టుగా చూపించడం విశ్వసృష్టి యొక్క రహస్యం అని చెప్పడం వాటి వల్ల ఉపయోగం ఏమిటి?  విశ్వమే లేదు అనే జ్ఞానం పొందితే తాను చచ్చాను అని తెలిసినప్పుడు వాళ్ళు భౌతిక మరణమే మోక్షమరణం అవుతుంది కదా!  ఇంక దానిమీద వాళ్లకి ఆశలు ఉండవు కదా!  భయాలు ఉండవు కదా!  అని అనేసరికి…. ఇప్పుడు పరమహంస సాధన అనుభవాల వలన పురుషుడు మోక్షం ఎలా పొందాలి అని తెలుసుకోవడం జరిగింది . దాని యొక్క మాయలని ఎలా దాటాలో తెలుసుకొని సులభతనం చేశారు.  అలాగే నేను కూడా సాధన చేసే స్త్రీలు కూడా మోక్షం పొందుతారు… మాయలు మర్మాలు దాటుకొని వారిపరంగా సులభతరం చెయ్యాలి అనుకుంటున్నాను.  ఇందులో తప్పేముంది అనేసరికి…. కృష్ణస్వామి కాస్త ఉధృతుడై ఇదంతా నాకు అనవసరం.  నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. మాకు అనవసరం , కానీ నిన్ను ఆపడమే మా వంతు.  ప్రకృతి ధర్మం.  మేము సాధన పరిసమాప్తి కాకుండా మాయలో ఉంచడమే.  మీరు ఏ మాయలో పడతారు… ఎక్కడ పడతారు… ఎక్కడ తప్పు చేస్తారు అని చూస్తూ ఉండటమే… అవకాశం  చిక్కినప్పుడు వదలకుండా ఉండటమే.. అయినా ఈ పాంచజన్య శంఖం నీకు అందనివ్వకుండా చేస్తాను అని మహాదేవి చేతిలో ఉన్న పాంచజన్య శంఖం తీసుకోవాలి… నేలకేసి పగలకొట్టాలి అని కృష్ణస్వామి ప్రయత్నం చేస్తూ ఉండేసరికి… శివ నందిని కాస్త తన కంటిచూపుతో కృష్ణస్వామిని స్తంభన చేసి, వాయు ప్రసరణ అందకుండా చేయడంతో… యోగాంబికా కి పిచ్చి పట్టినట్లు అనిపించి… కృష్ణస్వామిని స్తంభన చేసింది ,ఇంక వాడికి ఊపిరి అందదు అనే స్థితికి వెళ్ళిపోయాడు అని పిచ్చి పట్టినట్టుగా తన చేతిలో ఉన్న త్రిశూలంతో శివ నందిని మీదకి దాడి చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేసరికి ….శివ నందిని కాస్త ఆవిడని కూడా తన చూపుతో స్తంభన చేసేసరికి …వాళ్ళిద్దరూ కాస్త స్తంభించి పోవడంతో సమయం దొరికింది కదా!  అని మహాదేవి చేతిలో ఉన్న పాంచజన్య శంఖమును తన అదృశ్య శక్తితో తనలోకి నిక్షిప్తం చేసుకున్న తర్వాత…. వీళ్ళిద్దరూ మాయ వశం నుంచి విముక్తి పొంది మామూలు స్థితికి వచ్చిన తరువాత….మా మీద తంత్రవిద్యలు ప్రయోగం,  స్తంభన చేసే స్థితికి వచ్చావా?  ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు… ఎప్పుడైనా దొరకకపోతావా ? మాయలో పడక పోతావా?  తప్పు చేయకపోతావా?  అప్పుడు నీ అంతు చూస్తామని వాళ్ళిద్దరూ అదృశ్యం అవ్వడం జరిగింది. సరే మీ చావు మీరు చావండి… మీకు నచ్చింది మీరు చేయండి…. నాకేం సంబంధం లేదు… మా సాధన పరిసమాప్తి మేము చేసుకుంటాము… అని యధావిధిగా ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది .


సహస్ర చక్రం మొదటి భాగం - శ్రీ కృష్ణ నిజ రూప దర్శనం అనుభవం

శివనందిని ధ్యాననిష్ఠలో ఉండి సహస్ర చక్ర సాధన చేస్తూ ఉండసాగింది. ఒకరోజు సుమారుగా మూడున్నర గంటల పాటు ధ్యాననిష్ట లో ఉండేసరికి ఆమెకి ఒక ధ్యాన అనుభవం కనిపించడం జరిగింది.  అనగా మూలధార చక్రం నుంచి సహస్ర చక్రం దాకా తన కుండలనీ శక్తి ఒక పొగ రూపంలో జేగురు రంగు పొగలాగా, ఒక పాము పాకినట్లుగా పాకుతూ సహస్ర చక్రంలోనికి చేరుకోవటం…. తను అనుభవ దృశ్యంగా చూడసాగింది. మొగ్గలాగా ఉన్న తన సహస్ర చక్రకమలం దర్శనం చేసుకున్నది. ఉన్నట్టుండి…. ఈ సహస్ర కమలం కాస్త వెయ్యి రేకులుగా నెమ్మది నెమ్మదిగా విచ్చుకుంటూ…. వెయ్యి రేకుల సహస్ర కమలంగా దర్శనం ఇవ్వటం జరిగింది. ఏం జరుగుతుందో అని శివ నందిని కూడా తదేక దృష్టిలో ఆ సహస్ర కమలమును చూడటం ఆరంభించింది. రానురాను సహస్ర కమలం కాస్త పెద్దగా అవుతూ…. సహస్ర కమలం  మధ్యభాగంలోకి చేరుకోవటం జరిగింది. విచిత్రంగా ఇది నాలుగు భాగాలుగా కనిపిస్తూ ఉండేసరికి…. ఒక భాగం లో శ్రీకృష్ణుడు ఉన్నట్లుగాను, మరొక భాగంలో చినమస్తా దేవి ఉన్నట్లుగాను, ఇంకొక భాగంలో పలనీ కుమారస్వామి ఉన్నట్టుగాను, మరో భాగంలో దక్షిణామూర్తి ఉన్నట్లుగా…. తనకి ధ్యాన దృశ్యం కనిపించింది. అంటే సహస్ర చక్రానికి అధిష్టాన దైవాలుగా వీళ్ళు ఉంటారు అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  ఈ సహస్ర పద్మం మధ్యభాగం చూడటానికి సుదర్శన చక్రం లాగా ఉంది అని… సుదర్శన చక్రం మధ్య భాగంలో ఎలా అయితే బిందు స్థానం ఉంటుందో అలాగే ఈ సహస్ర చక్ర మధ్య భాగంలో బిందు స్థానం ఉన్నట్టుగా శివ నందిని జ్ఞాన స్ఫురణ పొందింది. ఈ బిందు స్థానంలో ఈ నాలుగు అధిష్టాన దైవాలు అనగా పురుష ప్రకృతిని అనగా ఆజ్ఞా చక్రం సహస్ర చక్రమునకు సంబంధించిన వాటికి అధిష్టాన దైవాలుగా ఈ నలుగురు ఉన్నారని చెప్పి జ్ఞాన స్ఫురణ అందడంతో ధ్యానభంగం అయింది. దానితో శివ నందిని కళ్ళు తెరిచేసరికి ఆ పక్కనే ఉన్న రుద్రస్వామితో కాస్త ఏమైంది అమ్మ?  ఏమిటి ధ్యాన భంగం అయ్యిందా?  అంటే అలా ఏమీ లేదు… ఇక నా శక్తి అంతవరకే వెళ్లి , అంతవరకే దర్శనం అయ్యింది.  సహస్ర కమలంలో నాకు నలుగురు అధిష్టాన దైవాలుగా శ్రీకృష్ణుడు, చినమస్తా దేవి, పళని కుమారస్వామి, దక్షిణామూర్తి దర్శనం ఇచ్చారు  అనగానే…. ఓహో!  అయితే సహస్ర కమలంలో ఉన్న నలుగురు నీకు దర్శనం ఇచ్చారన్నమాట! అంటే అనేసరికి…. దర్శనం ఇవ్వడం ఇచ్చారు కానీ, అనుభవ అనుభూతి ఇవ్వలేదు కదా!  అని శివ నందిని అనేసరికి…. అమ్మ!  ఈ అనుభవ అనుభూతిని నువ్వు పొందాలంటే… నువ్వు శ్రీకృష్ణుని యొక్క సప్త జ్ఞానభూమికలను, ఆ మాయల్ని దాటాల్సి ఉంటుంది.  ఈయన తన దగ్గర సప్త దైవిక వస్తువుల ఆధారంగా 14 లోకాలలో అధోలోకాలు కాకుండా ఊర్ధ్వ సప్త లోకాలకు ఈయన అధిష్టాన దైవంగా ఉన్నారు.  అంటే భూలోకం నుంచి సత్యలోకం వరకు అనగా మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఉన్న సప్త ఊర్ధ్వ లోకాలను ఈయన తన జ్ఞాన మాయలో ఉంచి అందర్నీ పరిపాలన చేయడం జరుగుతుంది. ఆదిలో శ్రీమహావిష్ణువు అంతంలోకి వచ్చేసరికి స్థితికారకుడిగా ఈ చక్రంలో ఉండటం జరుగుతుంది. ఆది విష్ణువు మహా వైకుంఠంలోని సహస్ర చక్రంలో ఉన్న బ్రహ్మాండంలో ఉంటే…శ్రీకృష్ణుడు గోకులంలో ఉండటం జరుగుతుంది. ఆది విష్ణువు ఇప్పటికే కైవల్య ముక్తి పొంది ఉండటంతో, ఈయన అంశ అయిన శ్రీకృష్ణుడు స్థితికారకుడుగా  భూమిక పాత్రను పోషిస్తున్నారు.  ఈయన మాయలను దాటడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు.  ఎందుకు అంటే…అరవింద యోగి సావిత్రి అనే మంత్ర గ్రంథంలో శ్రీకృష్ణుడు ఈ సప్త లోకాలను తన సప్త భూమికల జ్ఞానమాయతో పరిపాలన చేస్తున్నాడు.  ఈ జ్ఞానమాయను దాటాలి అంటే మామూలు శక్తి సరిపోదు…. మహానిర్వాణ శక్తి అవసరం అవుతుంది అని చెప్పేసి… తన గ్రంథంలో చెప్పడం జరిగింది కాబట్టి….నువ్వు ఈ మాయలని దాటాలి అంటే…. నిర్వాణ శక్తి కావలసి ఉంటుంది అని రుద్ర స్వామి చెప్పడం జరిగింది. ముందు శ్రీకృష్ణుడి మాయ నువ్వు దాటుకోవాలి కదా!  సాధనలో 99% శ్రీకృష్ణ మాయని దాటలేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ నుంచి వృద్ధ కృష్ణుడి దాకా ఆయన వివిధ రూపాలలో ఉండి….ఆయనే స్త్రీ రూపంలో జగన్మోహిని గాను, పురుషుడిగా జగన్మోహనుడిగాను ఉండి…. తన మోహమాయలో, జ్ఞానమాయలోను, మమకార మాయలోను, ప్రేమ మాయలోనూ, ధనమాయలోను కామమాయలోను ఇలా రకరకాల మాయలలో సాధకుడు ఈ పురుష ప్రకృతిని దాటలేక ఈ బ్రహ్మాండంలో ఏదో ఒక బ్రహ్మాండంలో ఉండిపోవటం జరుగుతుంది.  కాబట్టి శ్రీకృష్ణుడు మాయని దాటాలి. దానిని దాటడానికి ఏం చేయాలి అనేది నువ్వే ఆలోచించుకోవాలి అంటూ ఉండేసరికి…. విచిత్రంగా సుమారుగా ఒక 24 అడుగుల ఎత్తు ఉన్న యువకుడు శివ నందిని దగ్గరికి రావడం జరిగింది. సహజంగా మానవ మాత్రులు 6 నుంచి 7 అంతకుమించి ఉండరు.  ఇతను మాత్రం సుమారుగా 18 నుంచి 24 అడుగులు ఉన్నట్టుగా ఉన్నాడు.  అంటే కొబ్బరి చెట్టు అంత ఎత్తు ఉన్నట్టుగా….. అంత మనిషిని రుద్రస్వామి, మహాదేవి, శివ నందిని చూడటం అదే మొదటిసారి.  ఇతను మానవ మాత్రుడా లేకపోతే దైవాంశ సంభూతుడా అని చెప్పేసి శివ నందినికి సందేహం వచ్చింది. యోగ దృష్టిలో చూడాలి అని ధ్యానంలో చూసినప్పటికీ…. ఎలాంటి దృశ్యం కనిపించకపోయేసరికి….. శివ నందినీకి అర్థం కాక మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది.  

యువకుడు:- అక్క!  నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ఎవరో నాకే తెలియదు.. ఇంక  నీకు ఎలా తెలుస్తుంది? 

అని అనేసరికి శివ నందిని చేసిన యోగ దృష్టి ప్రయోగం ఇతను గమనించాడు అని గ్రహించి…

 శివ నందిని:- ఎవరు నాయనా నువ్వు….?

యువకుడు:-నా పేరు కిష్టయ్య అంటారు.  అందరూ బాల కిష్టయ్య అంటారు.  నాకు ఆకలి తీరట్లేదు… నాకు వెన్న అంటే మహా ఇష్టం.  ఎంత వెన్న తిన్న కూడా సంతృప్తి తీరట్లేదు.  మా అమ్మ రోజుకి ఒక కుండ వెన్న పెడుతుంది.  నాకేమో ఒకేసారి ఏడుకుండల వెన్న తినాలని ఉంది.  నువ్వు ఇప్పించగలవా?  నాకు ఏడుకొండల వెన్న ఇస్తే నీకు ఏడూ దైవిక వస్తువులు చూపిస్తాను…

అని చెప్పి అనేసరికి రుద్రస్వామి, మహాదేవికి ఏదో తెలియని అనుమానం వచ్చి…. శివ నందిని దగ్గరకు వచ్చి అమ్మ ! వీడేదో మాయాస్వరూపం లాగా ఉన్నాడు.  చూడటానికి శ్రీకృష్ణుడి అంశ లాగా ఉన్నట్టు ఉన్నాడు.  7 కుండల వెన్న అడుగుతున్నాడు అంటే…. ఏదో తేడాగా ఉంది.  మాయలో పడద్దు…. అనేసరికి శివ నందిని కాస్త మనం శ్రీకృష్ణుని మాయ అనుకోని ఆర్థిగా ఆకలితో  వచ్చిన అతిథిని వెనక్కి పంపించడం మంచిది కాదు. ఏం జరిగితే అది జరుగుతుంది. వెన్నె నే కదా అడిగింది… నేను సృష్టించి ఇస్తాను అని చెప్పేసి… ఏడు కుండల వెన్నను సృష్టించి ఇవ్వగానే ….అతను ఆ ఏడు కుండలు సంతృప్తిగా తింటూ

కిష్టయ్య:- అక్క!  నువ్వు నా  ఆకలి తీర్చడానికి ఏడుకుండల వెన్న ఇచ్చావు.  ఒకేసారి ఏడు కుండలు వెన్న తినేసరికి… నాకు వెన్న మీద కోరిక తీరిపోయింది.  నాకు సంతృప్తి అనిపించింది.  నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నా దగ్గర ఉన్న వస్తువులను చూపిస్తాను. నేను కూడా ఒకప్పుడు కాళీమాత ఉపాసకుడిని.  ఆ తర్వాత ఈ ఉపాసన శక్తిని తట్టుకోలేక పెళ్లి అయిన ఒక స్త్రీ సాంగత్యంలో ఉండేసరికి…. నా కాళికా మాత కాస్త కమలాదేవిగా మారి నాకు ఐశ్వర్య ప్రదాతగా ఇచ్చి… నన్ను స్థిత కారకుడిగా మార్చింది…

మహాదేవి:- అసలు నువ్వు మానవమాత్రుడివా లేక దైవాంశ సంభూతుడివా?

కిష్టయ్య:- ఎవరికి తగ్గట్టుగా వారికి కనపడతాను. నేను మనిషిగాను కనపడతాను…. దైవాంశ సంభూతుడిగా కనపడతాను.. యద్భావం తద్భవతి.  ఎవరు ఎలా అనుకుంటారో అలా…. ఎలా చూస్తే అలా కనబడతాను.  నేను ఫలానా రూపం, ఫలానా నామం అని లేదు. అన్నీ నేనే …సర్వం నేనే..

మహాదేవి:- అవును…. నువ్వేంటి సహజంగా మనుషులు ఏడడుగులు మించి ఉండరు కదా!  నువ్వేంటి మూడు రెట్లు ఎత్తులో 24 అడుగులు దాకా ఉన్నావు.?

కిష్టయ్య:- అదేనమ్మా!  ఆ ఎత్తే నాకు పెద్ద సమస్య అయ్యింది. నేను ఒక్కడినే మిగిలిపోయాను.  నా ఎత్తు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు.  చనిపోయారు.  నేను మాత్రం ఎందుకు బతికి ఉన్నానో నాకు అర్థం కావడం లేదు.  నేను చేసిన సాధనలో నాకున్న ఏదో కోరిక మాయను…నేను దాటలేక పోవటం వలన నేను ఇలా ఆగిపోయి ఉన్నాను అని అనుకుంటున్నాను… ఇన్నాళ్లు నాకు ఆకలి తీరలేదు. ఇవాళ ఈ అక్క పెట్టిన ఏడు కుండల వెన్న వలన నా ఆకలి బాగా తీరింది… కారణం లేకుండా ఈశ్వరుడు ఉంచడు కదా!  ఏదో కారణం చేత నన్ను ఇక్కడ ఉంచి ఉంటాడు.. 

శివ నందిని:- కారణం కోసం ఉంచాడా?  లేక నిన్ను మాయ పరీక్షల కోసం ఉంచాడా?

కిష్టయ్య:- మాయా పరీక్షలు అనుకుంటారు కానీ, వాళ్ళకున్న కోరికలే కదా.!  మాయలుగా మారేవి.  కోరిక మాయలో పడేది. ఆ మాయ ఎక్కడి నుంచి వస్తుంది….కోరిక నుంచే కదా!  కోరికనీ దాటితే మాయని దాటినట్టే.  కోరికని దాటక పోతే దానిని మాయ అంటారు.  ఇప్పుడు సూర్యునికి సూర్యకాంతి మాయ అవుతుంది. ఎందుకంటే తను చీకటి లేని ప్రాంతం చూడాలని అనుకోవడం వలన సూర్యుడికి వెలుగు అనే మాయ ఏర్పడింది. మాయ మంచిదే కానీ చెడ్డది కాదు.  కానీ కోరికలో పడి కొట్టుకుంటూ ఉంటే…. ఇంక అతను పునః కర్మజన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు.  ఆ తిరగటం అతనికి ఆనందంగా ఉంది అంటూ….. ఆ ఆనందం తీరేదాకా కోరిక మాయలోనే ఉంటాడు. కోరికే మాయ.  మాయే కోరిక.. ఆశే మాయ.. మాయే ఆశ అని చెప్పి నా స్వానుభవం ద్వారా నేను తెలుసుకున్నాను… పదండి, మీకు ఏడు దైవిక వస్తువులు చూపిస్తాను. 

అని అనేసరికి రుద్రస్వామి, మహాదేవి కాస్త ఇతని నమ్మటానికి లేదు… చూడటానికి సుమారుగా 18 నుంచి 24 అడుగులు పైనే ఉన్నాడు.  ఇతని మానవుడు కాదు.. ఏ రాక్షసుడో అయి ఉంటాడు…ఇతని రూపంలో వచ్చాడేమో… మనల్ని మింగేస్తాడేమో… మనల్ని చంపేస్తాడేమో… శివ నందిని ఒకసారి ఆలోచించుకో! ఏడు దైవిక వస్తువులు అని చెబుతున్నాడు.  ఇప్పుడు ఆ వస్తువుల మాయలో మనం పడ్డామంటే, నీ సాధన గల్లంతు అవుతుంది.  ఆలోచించుకో…

శివ నందిని:- అతను ఏ దైవిక వస్తువులు చూపిస్తాడు అనే దాని గురించి నేను ఆలోచించడం లేదు… అతను తెలుసుకున్న జ్ఞానం ఏమిటి?  అతను పొందిన అనుభవం ఏమిటి?  అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను…దైవిక వస్తువు వచ్చింది అంటే అతను ఏదో అనుభవం పొంది ఉంటాడు కదా… సుమారుగా ఇతని దగ్గర 7 దైవిక వస్తువులు ఉన్నాయి. అంటే సప్త యోగమాయలు అతను తెలుసుకొని ఉంటాడు కదా… సాధనలో పురోగతికి ఒకే ఉపయోగపడవచ్చు కదా!

మహాదేవి:-ఏమో తల్లి! ఒకటికి పది సార్లు ఆలోచించుకో! ఒకవేళ అతను మాయా స్వరూపి అయితే…. జరగరానిదే జరిగితే చాలా కష్టమవుతుంది…

శివ నందిని:- ఈ భయం మనల్ని అన్నింటికీ, సాధనకి ఆటంకం ఈ అనుమాన భయమే.  మనం సాధనలో మోక్షం పొందామో లేదో అని అనుమాన భయం ఉండటం వలన… మోక్షం పొందిన కూడా మోక్షం పొందలేదు అని వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళం అవుతాము.. కాబట్టి అతను దేవుడా లేక మానవమాత్రుడా లేక రాక్షసుడా లేదా ఇంకో జాతికి చెందిన వాడా అనేది నేను ఆలోచించట్లేదు.  అతను పొందిన జ్ఞానం ఏమిటి? అనేది అతనికి వచ్చిన సప్త దైవికలు ఏమి వచ్చాయి….వాటి వల్ల అతను ఏం తెలుసుకున్నాడు? ఎలా ఉపయోగిస్తున్నాడు?  అనే జ్ఞానం కావాలని నా మనసు చెబుతుంది.. చూద్దాం జరగరానిది ఏదైనా జరగాలి అనుకుంటే… ఈశ్వరుడి ఆజ్ఞ ఉండటంవలనే జరుగుతుంది కదా!  ఏమో నా సాధన ఇక్కడితో ఆగిపోవాలి అని ఉందేమో…ఆగిపోతానేమో… జరిగేదాన్ని ఎవరు ఆపలేరు కదా!  జరగనిది ఎన్నటికీ జరగదు కదా! 

అని చెప్పి మొండి ధైర్యంతో శివ నందిని బయలుదేరుతూ ఉండేసరికి… వీళ్ళు కూడా ఏమీ కాదనలేక ఆ యువకుడిని అనుసరించడం జరిగింది. ఆ యువకుడు వెళ్ళిపోతూ ఉండేసరికి మొదట గోవు దర్శనం ఇచ్చింది.  ఆ గోవును చూపిస్తూ….

కిష్టయ్య:- అమ్మ! ఇది కామధేనువు.అనుకున్న కోరికలని తీరుస్తుంది. దీని పాలు తాగితే శరీరం దృఢత్వం పొంది… వజ్రకాయం అవుతుంది.  మరణం లేని స్థితి వస్తుంది. రోగ పీడితం ఉండదు..

అని చెబుతూ ఉండేసరికి అవునా అని మహాదేవి అనడం జరిగింది. కానీ శివ నందిని మౌనంగా చూస్తూ ఉండేసరికి ఇంతలో రోగ పీడితుడైన వయోవృద్ధుడు ఒక చెట్టు కింద బాధ పడుతూ ఉండటం వీళ్ళు గమనించారు.  ఆ వయోవృద్ధుడి దగ్గరికి ఒక ఈ యువకుడు వెళ్లడం జరిగింది. 

కిష్టయ్య:- ఏం తాత… ఏం జరిగింది?

వయో వృద్ధుడు:- నా దగ్గరికి రాకండి… నాకు కుష్టు వ్యాధి వచ్చింది.. మీకు కూడా వస్తుంది. 

కిష్టయ్య:- శారీరక కుష్టు వ్యాధి కన్నా మానసిక కుష్టు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. మనసులో మాలిన్యాలు పెట్టుకుంటూ…ఉంటే అదే మాయగా మారిపోతుంది.  ఆ మాలిన్యాలను తెలుసుకుంటే మాయ మాయమవుతుంది ఈ శారీరక కుష్టు వ్యాధి ఈ దేహం ఉన్నంతవరకే ఉంటుంది.  మనసులో ఉన్న మాలిన్యం అనే కుష్టువ్యాధి, శరీరం పోయినప్పటికీ కూడా….మిగతా శరీరాలు అన్నింటికీ అనుసంధానమై వెళ్ళిపోతూ ఉంటుంది.  కాబట్టి ఈ భూలోకంలో ఉండి మనసుని పరిశుద్ధం చేసుకోవాలి. మాలిన్యం తొలగించుకోవాలి.  అదే నీకు నిజమైన కుష్టు వ్యాధి నిర్మూలనం అవుతుంది. నువ్వేం కంగారు పడకు… నీకు శాపగ్రస్తము వలన ఈ కుష్టు వ్యాధి వచ్చింది. ఈరోజు నా దర్శనంతో నీకు ఈ వ్యాధి పోతుంది..

అని చెప్పేసి….అతని దగ్గర ఉన్న గోవు పాలు పితికి ఆ కుష్టు వ్యాధి ఉన్న అతనికి ఇచ్చేసరికి…. ఆ పాలు తాగిన మరుక్షణంలోనే అతని శరీరం వజ్రకాయంగా మారడం…. దృఢత్వంలోకి రావడం…. ఆరోగ్యంలోకి రావటం…. క్షణకాలంలో జరిగింది.  

వయో వృద్ధుడు:- నాయనా ! నువ్వు ఎవరో నాకు తెలియదు.  ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో మందులు వాడుతున్న కూడా తగ్గని కుష్ఠ వ్యాధిని ఆవుపాలు చేత తగ్గించావు…

కిష్టయ్య:- ఆవుపాలు చాలా శ్రేష్టమైనవి… అందుకనే మన పూర్వీకులు నిత్య ఆరాధనలో పంచామృత అభిషేకం చేయమని చెప్పడం జరిగింది.  ఆ పంచామృతాలలో ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి కలపమని చెప్పడం జరిగింది.  ఎందుకంటే  ఈ ప్రపంచంలో ఏ జీవిలోనూ లేని ఆక్సిజన్ శాతం ఆవులోనే ఉంటుంది.  ఆవు శ్వాసలోనే ఆక్సిజన్ వదలటం, పీల్చుకోవటం, ప్రకృతి ఇచ్చిన వరం.  మనం గాలి పిలిస్తే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్డయాక్సైడ్ ను వదిలిపెడతాము.  కానీ ఆవు మాత్రం గాలి పీల్చడం వదలడం చేసినప్పటికీ కూడా ఆక్సిజన్తో ఉంటుంది.  మనలాంటి జీవులందరికీ ప్రాణాధారం ఆక్సిజన్.  ఆక్సిజన్ శాతాన్ని మనకి గంగ నీళ్ళు సంవత్సరాలైనా ఇస్తుంది… గంగా నదిలో కూడా 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. అందుకే మనకి గంగ నీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా పాడవవు.  అదే సాధారణమైన నీళ్లు రెండు మూడు రోజుల నిల్వ ఉంచితే పాడవుతాయి.  అదే గంగ నీళ్ళు ఎన్ని సంవత్సరాలు నిలువ చేసినా… కూడా పాడవవు.  ఎందుకంటే అవి హిమాలయాలు నుంచి రావడం వలన అక్కడ ఉన్న ఆక్సిజన్ శాతం తనలో కలుపుకొని వస్తుంది.  ఏ విధంగా అయితే గంగానీళ్లు పవిత్రమైనవో గోవు కూడా పవిత్రమైనది. చాలామంది గోమాంసభక్షణా ప్రక్రియ చేయమని చెప్పి యోగ ప్రక్రియ చేయమని చెబితే…. దానిని గోవుని చంపి  తినాలి అని మూర్ఖపు జనాలు చాలామంది గోవులను చంపటం జరిగింది.  నిజానికి గోవులు చంపటం వలన ఉపయోగం లేదు. గోవును పెంచడం వలన వారి శరీరం, వారి కుటుంబ సభ్యులు శరీరం, చుట్టుపక్కల పరిసరాలు కూడా ఆక్సిజన్ మయం అయ్యి… పరిసరాలు పరిశుద్ధం అవుతాయి. ఆవు పేడ వలన, ఆవు మూత్రం వలన, అలాగే ఆవు పాలు వలన, ఆవు పెరుగు వలన, ఆవు నెయ్యి వలన, ఈ పంచీక పదార్థాల వలన మన మనసు, శరీరం, ప్రకృతి కూడా పరిశుద్ధం అవుతాయి.  కాబట్టి నువ్వు ఈరోజు నుంచి గోవులను పెంచుతూ ఈ జీవితాన్ని పరిసమాప్తి చేసుకో…

వయో వృద్ధుడు:- అలాగే నాయనా!  ఈరోజు నుంచి గోవుల్ని పెంచడం చేస్తాను…

అని కిష్టయ్య దగ్గర అనుమతి తీసుకుని వెళ్లిపోవడం జరిగింది. 

కిష్టయ్య:- అక్క చూసావా? మా కామధేనువు వలన కుష్టు వ్యాధి పీడితుడు …వాడిని కూడా ఎలా ఆరోగ్యవంతుడిని చేసిందో గమనించావా?నీకు కావాలంటే నా దైవిక వస్తువులలో ఇది కూడా ఒకటి… ఈ గోవును నీకు ఇస్తాను…

శివ నందిని:-  నాయనా!  సాధనికి దేహం అవసరం… అలాగే దేహ ఆరోగ్యము అవసరమే.. నేను కాదనను.  కానీ గోవులను పెంచి వాటి పాలు తాగాలి అని….లోకం కోసమో లేదా ఇతరులకు కోసమో తపన తాపత్రయం అయితే లేదు.  సమాజం కోసమో…. కుటుంబ సభ్యులకు కోసమో… లేదా ఇతరుల కోసమో… ఇతరుల ఆకలి తీర్చడానికి… నేను గోవును పెంచి వాళ్ళని, వాళ్లకి పాలని దానం చేయాలి అనే సంకల్పం గాని, ఆలోచన కానీ, కోరిక గాని, నాకు లేదు. నేను ప్రతిరోజు ఉదయం ఆవుపాలు తీసుకుంటాను. నాకు కావలసిన ఆవు పాలు ప్రకృతి అందిస్తుంది. కాబట్టి నేను ఆ గోవును పెంచి సమాజసేవ చేయాలి అనే నాకు కోరిక లేదు…

కిష్టయ్య:- సరే మంచిది అక్క… 

ఇలా వీళ్ళ కొంచెం దూరం వెళ్లేసరికి… అతిలోక సౌందర్యంగా ఉన్న స్త్రీ మూర్తి వీళ్ళకి ఎదురుపడటం జరిగింది. ఆ స్త్రీ మూర్తిని చూసేసరికి శివ నందినికి, మహాదేవికి అలాగే రుద్ర స్వామికి కూడా మనసు చెదిరింది. ఈమె ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది. ఈమె మోహమాయకి, ఈమె శరీర వాసనకి క్షణకాలం పాటు మోహమాయలో పడటం జరిగింది. మనసు చెదిరింది.  వీళ్ళ పరిస్థితిని గమనించి కిష్టయ్య చిరునవ్వు నవ్వడం శివ నందిని గమనించి…

శివ నందిని:- అదేంటి…. నీకు ఆమె మీద ఎలాంటి కామ కోరికలు కలగలేదా?

కిష్టయ్య:- అక్క! ఈ శరీర సౌందర్యం చూడటం వలన దేహ మాయలో… కామమోహమాయలో పడటం జరుగుతుంది.. ఈ దేహం సౌందర్యం ఎలాంటిదో నీకు చూపిస్తాను…  నా దగ్గర ఉన్న ఒక దైవీక వస్తువు చూపిస్తాను. 

(అని తన చేతి సంచిలో నుంచి ఒక నెమలి ఈకను బయటకు తీసి…. వాళ్ళకి చూపిస్తూ….) ఈ నెమలి ఈక చూసావా? నెమలి అనేది పక్షి జాతిలోనే సౌందర్యమైనది కదా! దాని ఈకలను చూస్తే ఎంతటి వాడైనా పసిపిల్లవాడైపోతాడు. వృద్ధుడు కూడా పసిపిల్ల వాడిలాగా మనస్తత్వంతో ఈ ఈకను చూసి ఆనందపడటం జరుగుతుంది. మనం చిన్నప్పుడు ఈ నెమలి ఈకలు సేకరించి పుస్తకాల్లో పెట్టుకొని… పిల్లలు పుట్టడం జరుగుతుందని, నెమలీకలు పెరుగుతాయని ఇలా అనుకోవడం జరిగింది కదా!

శివ నందిని:- అవునవును… నేను కూడా చేశాను.

కిష్టయ్య:- ఇప్పుడు ఈ నెమలి అనేది ఈ దేహం ఉన్నంతవరకు దానికి దేహ సౌందర్యం ఉంటుంది.  నెమలి చనిపోయింది అంటే… ఆ దేహ సౌందర్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది ? అంటే దేహం ఉన్నంతవరకే దేహ సౌందర్యం ఉంటుంది. అందమైన పక్షి అయినా.. అందవిహీనమైన పక్షి అయినా ….అంటే కాకి అయినా, నెమలి అయిన రెండు కూడా… కాటికి వెళ్లాల్సిందే.  ఇక్కడ దేహాలతో సంబంధం లేదు.  ఇది అందమైన దేహం కాబట్టి దీనికి మోక్షం వస్తుంది అని… ఇది అందంగా లేదు కాబట్టి దీనికి మోక్షం రాదు అనేది లేదు కదా!  ఈ దేహ సౌందర్యం నువ్వు చూసినంత కాలం, నువ్వు మోహ మాయలో ఉంటావు.  ఆ దేహ సౌందర్యానికి కారకమైన ఆత్మ సౌందర్యం చూడటం అలవాటు అవ్వాలి  అంటే దేహం లోపల ఆత్మ చూసినట్టయితే…. ఈ దేహ సౌందర్యం మనకి మా మాయ అవ్వదు.  దేహమే శాశ్వతం అనుకున్నంతవరకు మనం మోహమాయల  కామ ఆలోచనల్లో కామ భావాలు కలుగుతూనే ఉంటాయి. ఈ దేహం ఆవిడ యవ్వన స్త్రీగా ఉన్నది… సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి. అదే 85 సంవత్సరాల తరువాత ఈ దేహ సౌందర్యం ఇలాగే ఉంటుంది అని గ్యారెంటీ లేదు కదా!  అక్క!  కాబట్టి ఈ నెమలిక ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే… దేహ సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం చాలా గొప్పది.  దేహాన్ని చూసి మోహించకూడదు… ఆత్మ సౌందర్యమును చూడాలి అని చెప్పి అనుకోవటం వలన…. ఈ దేహ సౌందర్య మాయను దాటడం జరిగింది.  కామమోహమాయలను దాటడం జరిగింది…

మహాదేవి:-  మరి ఇందాక మాటల్లో పెళ్లి అయిన స్త్రీ సాంగత్యం కోరుకున్నాను అన్నావు కదా!

కిష్టయ్య:- అదే తల్లి ….ఆ విషయం తెలుసుకోవడానికి… అనుభవం పొందేసరికి ఈ నెమలి పక్షి యొక్క అనుభవం పొందడం జరిగింది.  అశాశ్వతమైన క్షణకాల దేహ సౌందర్యం లేదా క్షణ కాల సుఖం కోసం శాశ్వతమైన పరమాత్మను వదిలిపెట్టేసానే… అని చెప్పి జ్ఞానం పొందడం వలన, ఈ నెమలిక జ్ఞానం పొందడం వలన, ఈ నెమలీకను దైవిక వస్తువుగా ఉంచడం జరిగింది.  అక్క!  ఈ నెమలిక నీకు కావాలా? 

శివ నందిని:- నాయనా!  నాకు ఎలాంటి కామా వికారాలు లేవు.  కామమాయలు లేవు. నువ్వు దేహ సౌందర్యం చూసావా?  ఆత్మ సౌందర్యం చూసావా?  అని తెలుసుకోవడానికి అడిగాను.  నీ దగ్గరికి ఎప్పుడైతే దైవిక వస్తువులు వచ్చాయి అనగానే… నాకు తెలిసినంతవరకు నువ్వు ఇంద్రియ నిగ్రహ స్థితిని పొంది ఉంటావు.  పొందావా లేదా అని అనిపించింది …

కిష్టయ్య:- పరీక్షలు పెట్టే నాకే నువ్వు పరీక్ష పెడుతున్నావా అక్క? 

శివ నందిని:- పరీక్ష కాదు… నువ్వు నాకు పరీక్ష పెడుతున్నావు… నేను దేహ సౌందర్యం చూస్తానా! ఆత్మ సౌందర్యం చూస్తానా?. అని నీకు అనుమానం ఉంది.  నాకేమో నువ్వేం చూస్తావో అని అనుమానం ఉంది.  కాబట్టి ఒకరినొకరం దేహ సౌందర్యం చూడకుండా ఆత్మ సౌందర్యం చూడడం జరిగింది. రుద్రస్వామి:-  నేను మాత్రం దేహ సౌందర్యానికి దాసుడిని అయిపోయాను.  మహాదేవి లేకపోయి ఉంటే దాని వెంటపడి వెళ్లిపోయే వాడిని..

మహాదేవి:- చూడు శివ నందిని… ఈ ముసలాడికి కామకోరికలు.  ఈ వయసులో కూడా ఉండటం అవసరమా! యోగి అంటాడు…సాధన చేస్తున్నాను అంటాడు.. అఘోరుడు అంటాడు… శరీరం మాత్రమే సాధనలో ఉంది.  మనసు సాధనలో లేదు. 

రుద్రస్వామీ:- ఏం చేయమంటావు….మనిషి అన్నాక ఉప్పు కారాలు తింటాడు.  వాటి ప్రభావం వల్ల కామ వికారాలు కలుగుతాయి.  నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను.  నిన్నేమైనా మోసం చేశానా? అన్యాయం చేశానా? ఆమె యొక్క దేహ సౌందర్యం చూసావు కదా! నీకే కామ వికారాలు కలిగినాయి.. కదా!  ఆడపిల్లవి, స్త్రీ మూర్తివి అయి ఉండి నీకే కామ వికారాలు కలిగినప్పుడు….పురుషున్ని అందులోను మగాడిని… మగతనం ఉన్నవాడిని… నాకు కోరికలు కలగవా! కలగకుండా ఉండటానికి నేనేమైనా నపుంసకుడినా? 

శివనందిని:- మీ ఇద్దరూ గొడవ పడటం ఆపండి….ఇప్పుడు దేహ సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అని తెలుసుకోవడం మంచిది. 

అని అనుకునేసరికి….. ఈసారి గూనితోను, కురిపిగాను…. దేహమంతా ఏదో తెలియని మచ్చలతో…. కర్ర సహాయంతో ఉన్న ఒక స్త్రీ మూర్తి 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆవిడ వీళ్ళకి కనిపించడం జరిగింది. ఆమెను చూసేసరికి కిష్టయ్య కాస్త! 

కిష్టయ్య:- సుందరి ఎలా ఉన్నావు?

కురూపి:- ఏరా ఎగతాళి చేస్తున్నావా…. అందరూ నన్ను కురిపి అని.. అందవిహీనురాలు అని, కురూపి కురిపి అని పిలుస్తూ ఉంటారు.  నన్ను సుందరి అని పిలుస్తున్నావు.  నీకు ఎంత ధైర్యం… నన్ను ఎగతాళి చేస్తున్నావా?  అందరూ ఎగతాళి చేసినట్టుగానే నువ్వు ఎగతాళి చేస్తున్నావా?

కిష్టయ్య:- అమ్మ!  నువ్వు నా మీద కోప్పడడం సహజమే.  కానీ నేను నీ దేహ సౌందర్యాన్ని చూడలేదు… ఆత్మ సౌందర్యాన్ని చూశాను.  నీ దేహ సౌందర్యం కురూపి అవ్వచ్చు.  కానీ ఆత్మ సౌందర్యం కురూపి కాదు కదా!  అది అందమైనది… కదా!  ముగ్ధ మనోహరమైనది కదా! 

కురూపి:- నీకులాగా ఆత్మ సౌందర్యం ఎవరు చూస్తారు!  దేహ సౌందర్యం చూస్తారు కదా!  నా దేహ సౌందర్యం చూశావు కదా… కురిపిగా తెలియని వ్యాధితో, మచ్చలు, పుండ్లు, పడిపోయి ఉన్నది.  పైగా దీనికి తోడు గూని కూడా ఉన్నది.  నా వయసు 25 సంవత్సరాలు.  కానీ 85 సంవత్సరాల ఉన్న వృద్ధ స్త్రీగా… నా శరీరం అంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లపడిపోయింది.  నీలాగా అందరూ కూడా ఆత్మ సౌందర్యం చూడరు. దేహ సౌందర్యాన్ని చూస్తారు కదా…

కిష్టయ్య:- తల్లి!  అలా ఎందుకు నువ్వు ఇది అయిపోతావు…బాధపడతావు…. నేను నిన్ను సుందరి అని పిలిచాను కాబట్టి, నీ దేహాన్ని సుందరయుతంగా మారుస్తాను.  ఒక్క క్షణం ఉండు తల్లి …

అని,  తన చేతి సంచిలో నుంచి ఒక యోగ పద్మమును కమల పుష్పం బయటకు తీసి…. ఏవో మంత్రాలు చదువుతూ, ఆమెను  ఆపాదం  తలభాగం నుంచి పాదాల వరకు తాకించేసరికి ఆమెకి ఉన్న కురూపి వ్యాధి లక్షణాలు అన్నీ పోయి… నశించి ముగ్ధ మనోహర సుందరి రూపం క్షణకాలంలో వచ్చేసరికి., ఆవిడ చాలా సంతోషిస్తూ 

కురూపి:-;ఇన్నాళ్ళకి నాకు శాప విముక్తి కలిగించావా?  

కిష్టయ్య:- శాప విముక్తి కాదు, నీ కర్మ ఫలం.  నువ్వు చేసుకున్నది ఈనాటితో తీరిపోయింది.  నీకై నువ్వు చేసుకున్న పాపం ఈరోజుతో తీరిపోయింది. నేను చేసింది ఏమీ లేదు ..

కురూపి:- ధన్యోస్మి నాయన!  ఈ కురూపి శరీరం నుంచి ఈ రోగ పీడత శరీరం నుంచి, నాకు విముక్తి కలిగించావు.  ఏం చేయమంటావో చెప్పు…

కిష్టయ్య:- సాధన చేసుకో తల్లి… ఈ దేహంతో మోక్షజన్మగా మార్చుకో…

కురూపి:- సరే నీ ఆజ్ఞ..

కిష్టయ్య:- అక్క ! చూసావా ఈ యోగ పద్మం యొక్క ప్రత్యేకత . దీనిలో సకల వైద్య విధివిధానాలు అన్నీ కూడా జ్ఞానమాయతో బంధించబడి ఉన్నాయి. అంటే ఈ విశ్వ ప్రపంచంలో వైద్య పరంగా కావలసిన జ్ఞానం, అలోపతి, హోమియోపతి ,ఆయుర్వేదం, మూలికా వైద్యం, పశు వైద్య విజ్ఞానం ఏది కావాలన్నా అది క్షణకాలంలో నీకు ఇస్తుంది.  కావాలంటే ఈ దైవిక వస్తువుని తీసుకో…

శివ నందిని: నాయన! సాధన కి దేహం, ఆరోగ్యం అవసరం.  కానీ నా దేహ ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను.  నేను సమాజం గురించి, లోకం గురించి, కుటుంబ సభ్యులకు గురించి, ఆలోచించే స్థితిగతులు నాకు లేవు. అది నీ దగ్గర ఉంచుకో… నాకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతోనే ప్రకృతి వైద్య జ్ఞానంతోనే… నా శరీరానికి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా, చిన్నపాటి పరిహారాలతో నేను నివారణ చేసుకోగలను.  సాధనకి దేహం కావాలి, దేహానికి ఆరోగ్యం కావాలి, కాబట్టి నాకున్న వైద్య పరిజ్ఞానంతో నేను పరిహారాలు చేసుకుంటాను.  ఎప్పుడైతే నీ దగ్గర నుంచి ఈ యోగ పద్మం ఆశించానో …..నా దగ్గరికి రోగ పీడితులు క్షణకాలంలో ప్రచారమై వందల నుంచి లక్షల్లో వస్తారు. వాళ్ళందరికీ సేవలు చేస్తూ కూర్చుంటే ఇక నా సాధన పరిసమాప్తి కాదు కదా!

కిష్టయ్య:- సూక్ష్మంలో మోక్షం గమనించావు అక్క!ఈ విషయం నేను గ్రహించలేక నేను ఈ యోగ పద్మం పొందడం జరిగింది. సరే ఇంక ముందుకు పదండి…

అంటూ ఉండేసరికి కిష్టయ్య తిరిగి ఆ యోగ పద్మం తన చేతి సంచిలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక చెట్టు కింద, ఒక యోగి సాధన చేసుకుంటూ….. ధ్యానంలో ఉంటూ… ధ్యాన నిష్ట కోల్పోతూ…. మళ్లీ బయటకు రావటం, మళ్లీ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండటం, మళ్ళీ బయటకు రావడం, అసహనం, కోపం, వీళ్ళు నలుగురు గమనించారు.  ఆయన దగ్గరికి వెళ్లేసరికి… కిష్టయ్య కాస్త..

కిష్టయ్య:- స్వామి ఏం జరిగింది? ఏమైంది .ధ్యాన నిష్ట కుదరట్లేదా? 

యోగి:- నాయనా!  ఈ దేహం నేను కాను…అనే ఆత్మసత్యాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. కానీ ఆ జ్ఞానంలో… ఆ అనుభవంలో నిలబడలేక పోతున్నాను.  నా మనసు అందులో స్థిరపడలేక పోతుంది.  నేను దేహం కాదు… ఆత్మని అని శబ్ద పాండిత్య గ్రంథాలు చదివాను. శబ్ద పాండిత్యం నిత్యం బోధించే గురువుల దగ్గర తెలుసుకున్న కూడా ఎందుకు నా మనసు నిలబడట్లేదో….నాకు అర్థం కావడం లేదు.

కిష్టయ్య:-స్వామి!  మీరు తెలుసో తెలియకో సాధనలో ఒక చిన్న తప్పు చేయడం జరుగుతుంది. మీరు జ్ఞానం తెలుసుకున్నారు. మూలం, దేహం కాదు… ఆత్మ అని జ్ఞానం పొందారు.  కానీ అది మీ నరాల్లోకి, మీ శరీరంలోకి ,ఆ సత్యం ఇంకిపోవాలి. ఆ అనుభూతిని పొందాలి.  జ్ఞానం తెలుసుకోవడం వలన ఉపయోగం లేదు.  ఆ జ్ఞాన అనుభవాలను పొందితే కానీ, మీ దేహం నమ్మదు . మనసు నమ్మాలి అంటే…. దానికి అనుభవ అనుభూతి పొందాలి. అనుభవం రానంతవరకు , ఎంత దేవుడు చెప్పినా ….గురువులు చెప్పినా ….లేదంటే ఇత రులు చెప్పినప్పటికీ కూడా జ్ఞానమార్గం ఏంటి?  అనేది తెలుస్తుంది. కానీ అనుభూతిని పొందనంత వరకు మీ మనసు నమ్మటం లేదు.  మీరు తెలుసుకోవడం జరిగింది కానీ , మీరు అనుభూతిలోకి రాలేదు. అందువలన మీరు సంసారికి, సన్యాసికి మధ్య ఉన్న స్థితిలో ఉండిపోయారు.  కళ్ళు తెరిచి సంసారమాయలో పడుతున్నారు.  కళ్ళు మూసుకొని సన్యాస మాయలో పడుతున్నారు.  అంటే యోగ మాయలోనూ, భోగ మాయలోనూ మీ మనసు కొట్టుకుంటుంది.  మీరు ఎండ కావాలంటే ఎండ నిర్ణయం చేసుకోండి.  నీడ కావాలంటే నీడ అని నిర్ణయం చేసుకోండి.  ఎండా, నీడ కావాలంటే కుదరదు కదా! మీ మనసు ఎలా ఉందంటే… కాసేపు భోగంలో ఉండి భోగ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటుంది.  కొంతసేపు యోగంలో ఉండాలి యోగ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటుంది. ఈ కోరిక రాహిత్య స్థితికి మీరు ఎప్పుడైతే వెళతారో, అప్పుడు మీకు అర్థమవుతుంది.  మీకు జ్ఞానం అందింది.  ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా!  ఆ అనుభవం రానంతవరకు మీరు జ్ఞానం తెలుసుకున్న ఉపయోగం లేదు. 

యోగి:- మరి సాధనలో కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో జ్ఞానమార్గం ఉన్నతమైనది అని చెబుతారు కదా! 

కిష్టయ్య:- మీరు సగమే తెలుసుకున్నారు.  కర్మ భక్తీ జ్ఞాన వైరాగ్యము ఆ తర్వాత ఆత్మసంయోగ స్థితి లేదా లయ యోగం అని లేదా రాజయోగం అని చెప్పడం జరిగింది.  ఐదు యోగ మార్గాలు 112 యోగమార్గంలో ఉన్నతమైనవిగా చెప్పడం జరిగింది. వాటిలో కర్మ ,భక్తి,జ్ఞాన, ధ్యాన ,రాజయోగం లేదా లయ యోగం కింద చెప్పడం జరిగింది.  ఇప్పుడు మీరు జ్ఞానమార్గంలో ఉన్నారు.  జ్ఞానమార్గం అంటే ఏమిటి …జ్ఞానం తెలుసుకుంటారు.  అంటే మీ సాధనలో ఏదో చక్రాలలో ఏ ఏ మాయలో ఉన్నాయి…. ఏ దేవతలు ఉంటారు… ఆ మాయలను ఎలా దాటాలి?  వాటిలో ఉన్న మర్మాలు ఏమిటి?  ఇవన్నీ కూడా వివిధ పుస్తకాల ద్వారానో లేదా గురువుల దర్శనం ద్వారానో… లేదా దైవిక వస్తువుల దర్శనం ద్వారానో…. ఒక్కొక్క సాధనలో ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క చక్రంలో తెలుసుకున్నారు.  ఫలానా మూలాధార చక్రంలో ఈ మాయ ఉంటుంది… ఈ దేవుడు ఉంటారు… ఈ మాయను ఇలా దాటాలి… ఈ దైవీక వస్తువులు వస్తుంది. ఇలా పొందడం జరిగింది… కానీ మీరు అనుభవంలోకి రాలేదు.  అనుభవంలోకి వస్తే గాని మనసు నిలబడదు.  మీరు అనుభవించలేరు.  కేవలం తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ఎవరిని అని అనుకోవడం వలన ఉపయోగం లేదు.  నేనెవరిని అనేది ఆత్మ విచారణ చేసుకుంటూ వెళ్లాలి.  అప్పుడే మీ మనసు లోపలికి వెళ్లడం జరుగుతుంది.  బయట కూర్చుని మీరు ఎంత దైవనామ స్మరణ చేసినా ఉపయోగం లేదు.  మీ మనసు లోపలికి వెళితే కానీ ఆ దైవ నామస్మరణ ఎవరికోసం చేస్తున్నామో… దేనికోసం చేస్తున్నామో …. ఎందుకు చేస్తున్నామో… ఎలా చేయాలి? ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి.  మీ మనసు లోపలికి మీరు వెళ్ళటం చేయాలి. అప్పుడు మీ మనసు దేహం దాటి, బుద్ధిని దాటి, ఆత్మస్థితి వరకు వెళుతుంది.  మీరు మనసుని, దేహాన్ని తట్టుకోలేకపోవటం జరుగుతుంది.  మనసు ,జ్ఞానం తెలుసుకోవడం వలన ఉపయోగం లేదు.  ఆ మనసు ఆ జ్ఞాన అనుభవంలోకి వెళ్లాలి.  ఇప్పుడు నువ్వు మోక్షం పొందావు అని చెప్తే అది నీకు అనుభవం అయితేనే నువ్వు నమ్ముతావు.  నీ మనసు నమ్ముతుంది.  అప్పటిదాకా నేను చెప్పినా కూడా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమై చెప్పినా కూడా…. నీ మనసు నమ్మదు.  జ్ఞానం కూడా అంతే.  తెలుసుకోవడం వలన గ్రంధం చదవడం వలన, గురువు వలన, జ్ఞానం తెలుసుకోవడం వలన, ఓహో ! ఈ జ్ఞానానికి ఇది అని తెలుసుకుంటావు కానీ , అందులోకి నువ్వు వెళ్ళాలి కదా!  ఇప్పుడు చార్మినార్ కి నాలుగు మార్గాలు ఉంటాయి… ఆ నాలుగు మార్గాలు అనగా రోడ్డు ద్వారా, బస్సు ద్వారా, విమానం ద్వారా, నడిచి ఇలా వెళ్ళవచ్చు అని తెలుసుకున్నారు.  ఇది కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గాల కింద అనుకోవాలి.  ఎప్పుడైతే నువ్వు నడక మొదలు పెట్టో లేదా బస్సు ద్వారానో చార్మినార్ కి వెళ్ళాలి కదా!  ఫలానా చోట చార్మినార్ ఉంది.  దానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి.  నాలుగు మార్గాలు ఉన్నాయి అని… ఎలా అయితే నువ్వు జ్ఞానం పొందావో …ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకొని, నువ్వు ప్రయాణం చేయాలి కదా!  ప్రయాణం చేయనంతవరకు చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి… చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవటం వలన ఉపయోగం లేదు కదా!  దేహమును, మనస్సును దాని వైపు ప్రయాణం చేయాలి కదా! ప్రయాణం చేయాలి అంటే ధ్యాన మార్గంలోకి వెళ్లాలి.  ధ్యాన మార్గంలోకి వెళ్లాలి అంటే ….నీ మనసు స్థిరం అవ్వాలి. ఇది మనస్సు స్థిరం అవ్వాలి అంటే నీ దగ్గర దైవీక వస్తువు అయిన శంఖం ఉండాలి. ఎందుకంటే ఓంకార నాదమే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది.  ఆత్మ దగ్గరికి తీసుకు వెళ్లేదే ఓంకార నాదం.  విశ్వాన్ని నడిపించేదే ఓంకార నాదం.  ఆ ఓంకార నాదాన్ని దాటి తుంకార నాదం కూడా ఉంటుంది. అది చిన్న శబ్దం.  ముందు నువ్వు ఓంకార నాదస్థితికి రావాలి.  ఓంకార నాదం చేయాలి అంటే అనే జ్ఞానం పొందడం వలన ఉపయోగం లేదు కదా! ఓం కారం చేస్తేనే కదా మనసు ఆధీనం అయ్యి…. నేను అనేది అనుభవం పొందడం జరుగుతుంది…

యోగి:- స్వామి! నీ వలన నేను నా సాధనలో చేస్తున్న తప్పు తెలుసుకున్నాను. నేను అనుకోవడమే చేస్తున్నాను.  కానీ ఆచరణ చేయడం లేదు అని నాకు అర్థం అయింది. ఇప్పుడు నేను ఆచరణ చేయాలంటే ఏం చేయాలి?

కిష్టయ్య:- శంఖము తో ఐదు సార్లు శంఖ నాదం చేయడం వలన మీ మనసుకి ఓంకార నాదం అనుసంధానం అవుతుంది. ఈ ఓంకార నాదం ఆత్మ చేసే ఓంకార నాద స్థితికి తీసుకు వెళుతుంది. అంటే భూలోకంలో నువ్వు చేసే ఓంకార నాదం…. అంతరిక్షంలో ఉన్న ఓంకార నాదానికి అనుసంధానం అవుతుంది. అప్పుడు నీకు అనుభవం కలుగుతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు అంటే…. అంతరిక్షంలో ఓంకారనాదం ఉందని జ్ఞానం తెలుసుకున్నావు.  కానీ భూలోకంలో ఉన్న నీ దేహం చేసే ఓంకార నాదం …..విశ్వంలో ఉన్న ఓంకార నాదానికి అనుసంధానం చేయడం లేదు.  విశ్వంలో ఓంకార నాదం ఉంది అని తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు.  దాన్ని అనుసంధానం చేయాలి కదా! దానికి నువ్వు దైవిక వస్తువుగా శంఖం తో ఓంకార నాదం చేయాలి.  దానికి నువ్వు ఈ శంఖాన్ని పూరించాలి. ఈ శంఖ నాదం చేయడం వలన….మనసు పరిశుద్ధం అవుతుంది.  అప్పుడు విశ్వానికి అనుసంధానం అవుతుంది. అందుకే మన దేవతల అందరి దగ్గర శంఖచక్రాలు ఆయుధా లుగా పెట్టడం జరిగింది.  అంటే మన దేహంలో ఉండే సహజసిద్ధమైన ఓంకార నాదం వినే స్థితికి నువ్వు రావాలి.  ఆ ఓంకార నాదం చేసేవాడు… ఎవరో వాడే నువ్వు అని తెలుసుకోవాలి.  అప్పుడు నేను ఎవరు అనేది అనుభవంలోకి వస్తుంది. అప్పటిదాకా నేను అనుకోవటమే జరుగుతుంది. నేను అనేది తెలుసుకోవడమే జరుగుతుంది.  ఆచరణలోకి వస్తే గాని నువ్వు ఆ స్థితికి రాలేవు అని చెప్పడం జరిగింది.ఈ స్థితి నువ్వు పొందాలి అంటే… నిత్యం ఓంకార సాధన చేసుకుంటూ ఉండాలి. 

అని…అనేసరికి … ఆ యోగి ఓంకార నాదము ,శంఖం ఐదు సార్లు పూరించేసరికి అప్పుడు మనస్సు స్థిరమై, క్షణకాలంలో తన మణిపుర చక్రంలో ఓంకార నాదం వినపడటం… అనుభవ అనుభూతి చెందడం జరిగింది. ఇక ఆయన అలాగే మౌనంగా ఉండి, ధ్యాననిష్టలోకి వెళ్లిపోవడం జరిగింది. విచిత్రం ఏమిటి అంటే….ఆయన శరీరంలో నుంచి ఓంకారనాదం అక్కడ ఉన్నవారందరికీ బహిర్గతంగా వినిపించడం శివ నందిని గమనించింది . అప్పుడు కిష్టయ్య కాస్త శివ నందిని కేసి చూస్తూ…

కిష్టయ్య:- అక్క ! ఇది పాంచజన్య శంఖం. ఇందులో నాలుగు ఉప శంఖాలు ఉంటాయి.  మొత్తం ఈ ఐదు కలిపి పాంచజన్య శంఖం కింద చెబుతారు.  ఇది శ్రీకృష్ణుని దగ్గర ఉండే మహా శంఖం.  ద్వారకా సముద్రంలో అనుకోకుండా దొరికింది. ఇది 72 సంవత్సరాలకి ఒకసారి అక్కడ పుడుతుందట.  అక్కడ జాలరి వాళ్ళు నాకు ఇచ్చారు.  కాబట్టి ఈ శంఖ నాదం చేసుకుంటే… నిత్యము ఓంకార నాదస్థితికి సహజసిద్ధంగా పొందడం జరుగుతుంది. తీసుకుంటావా?

అని అడిగేసరికి…. శివ నందిని కాస్త కళ్ళు మూసుకుంటూ, ధ్యాన నిష్ఠలోకి వెళ్ళిపోయేసరికి….తన మణిపుర చక్రం నుంచి, ఈ వయవృద్ధ యోగికి  ఎలా అయితే ఓంకార నాదం సహజసిద్ధంగా బయటకు వచ్చిందో… తనలో నుంచి ఓంకార నాదం బయటకు రావడం.. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు.  అప్పుడు కిష్టయ్య చిరునవ్వు నవ్వి… 

కిష్టయ్య:- అయితే, నీకు ఈ పాంచజన్య శంఖంతో కూడా పని లేదు అని చెప్పకనే చెప్పావా అక్క!  

అనేసరికి శివ నందిని చిరునవ్వు నవ్వి మౌనం వహించింది.  సరే అయితే ఇక ముందుకు పదండి అని ఆ పాంచజన్య శంఖం తన చేతి సంచిలో పెట్టుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. ఇలా వీళ్ళందరూ ముందుకు వెళుతూ ఉండేసరికి సుమారుగా 100 నుంచి 200 ఇల్లు ఉన్న ఒక చిన్న పల్లెటూరు గ్రామం కనిపించింది. విచిత్రంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అకారణంగా కొట్టుకోవడం, ఆవులు, జంతువులు ఇతరమైనవి అన్నీ కూడా కలహించుకుని ద్వేషించుకోవడం వీళ్ళందరూ గమనిస్తూ ఉండేసరికి…. కిష్టయ్య ఒక చెట్టు కింద కూర్చుని తన చేతి సంచిలో నుంచి వేణువు తీసి వాయిస్తూ ఉండేసరికి… ఆ నాదానికి వీళ్లంతా కలహం మానేసి, ఆ నాదం ఎక్కడి నుంచి వినపడుతుందని చెప్పి మనుషులు జంతువులు ఈయన  చుట్టూ చేరడం, మైమరచిపోవడం ఇదంతా వీళ్ళ ముగ్గురు గమనించారు.  గమనించేసరికి…. వీళ్ళు ప్రశాంత స్థితిలో తన్మయత్వంలో ఉండిపోయేసరికి కిష్టయ్య వేణునాదం ఆపడం జరిగింది. ఆపినా కూడా వీళ్లలో ప్రశాంత స్థితి కొనసాగుతూ ఉండేసరికి…. శివ నందిని కేసి చూస్తూ ….

కిష్టయ్య:- అక్క!  ఈ కర్ర చూసావా.!  దాని ద్వారా ప్రశాంత స్థితి పొందటం ఎలాగా?  అని తెలుసుకున్నావు కదా!  మనిషిలో కూడా అరిషడ్వర్గాలు ఉంటాయి.  కామ ,క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యము ఉంటాయి. వాటి వలన ఆ మాయలో ఉండటం వలన, సప్త వ్యసనాలలో పడటం జరుగుతుంది.  ఆ తర్వాత తమలో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం జరుగుతుంది.  మనకు సాధనలో కూడా అవధూత స్థితి ఉన్నది కదా! దానినే బాలోన్మాత్త పిశాచ అవధూత స్థితి అంటారు కదా ! అంటే ఈ స్థితిలోనికి వచ్చేసరికి తను బుడగ అని తెలుసుకుంటాడు.  బుడగ, సముద్రం ఇన్నాళ్ళు వేరు అని అనుకోవటం …..ఇప్పుడు అది వేరు కాదు అది వేరు కాదు, ఒకటే…అని తెలుసుకోవడం జరుగుతుంది.  కానీ ఈ బుడగ సముద్రంలో ఎలా లయం చేయాలి అనేది అర్థం కాని స్థితిలోకి సాధకుడు వెళ్లడం జరుగుతుంది. అప్పుడు దీనిని ఎలా లయం చేయాలా?  అని తీవ్రమైన ఉన్మాదంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ ఉన్మాదంలోకి వెళ్ళినప్పుడు మనసు లయ తప్పి పోవటం, కోరిక మాయలో పడిపోవడం లేదా ఏదో ఒక విషయం జ్ఞానంలో తప్పులు చేయడం జరుగుతుంది. పిచ్చివాడు అవ్వటం జరుగుతుంది. కాబట్టి రసజ్ఞత లేని వాడు పిచ్చివాడు అవుతాడు.  మనోభ్రాంతి పొందడం జరుగుతుంది. ఆ స్థితిని పొందకుండా ఉండటానికి వేణు నాదం మనకి ఉపయోగపడుతుంది.. అని అలాగే శంఖ నాదం, వీణ నాదం,మృదంగం ఇలా మనకి సంగీత వాయిద్యాలలో ఇవన్నీ మోగిస్తూ ఉండటం వలన మనకు తెలియని ఉన్మాదస్థితిలో ఉన్నది కాస్త….ప్రశాంత స్థితిని పొందడం జరుగుతుందని తెలుస్తుంది కదా!ఇప్పుడు నువ్వు చూసిన మనుషులు, జంతువులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు యోగసాధకులే.  ఆ ఉన్మాద స్థితిని దాటలేక, తమ బుడగను ఎలా నాశనం చేసుకోవాలో అర్థం కాక, ఈ పునః కర్మ జన్మలో పడి జన్మలో అరిషడ్వర్గాల మాయలో, సప్త వ్యసనాలలో పడి కొట్టుకోవటం జరుగుతుంది.  ఒకే జాతి జంతువులు అన్నీ కూడా ద్వేషించుకోవడం గమనించారు కదా! ఒకే జాతి మనుషులు కూడా ద్వేషించుకోవడం గమనించారు కదా!  ఈ ఉన్మాద స్థితిని దాటాలంటే నా దగ్గర ఉన్న దైవిక వస్తువు అయిన వేణునాదం తీసుకోవడం మంచిది. తీసుకుంటావా అక్క?

శివ నందిని:- నాయన!  నాలో అరిషడ్వర్గాలు  లేవు అని చెప్పి నేను అనను… అలాగే సప్త వ్యసనాలు అంటావా…..వాటిని నేను దూరం చేసుకున్నాను… నాశనం చేసుకున్నాను…అరిషడ్వర్గాలు నేను దాటుకున్నాను… జయించాను అని చెప్పను. వాటిని ఎవరూ కూడా జయించలేరు.  అదుపులో ఉంచుకోవాలి… మనసును, ఇంద్రియ నిగ్రహంతో అదుపులో ఉంచుకోవడం వలన, ఇవి  అధీనంలోకి వస్తాయని… అదుపులోకి వస్తాయని… నేను గ్రహించాను.  ఇంద్రియ నిగ్రహం పొందాలి అంటే మన దశ ఇంద్రియాలు కూడా అంటే పంచ జ్ఞానేంద్రియాలు శరీరం, కన్ను, ముక్కు, చెవి, నోరు మన ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే మనం నోటిని మౌనం ద్వారా, చెవులు మంచి వినడం ద్వారా, ముక్కునేమో శ్వాస ద్వారాను ,కన్ను ఏమో మంచి చూపు ద్వారా, చర్మమును జ్ఞానము ద్వారా ఆధీనంలో ఉంచుకొని…. అదుపులో ఉంచుకోవడం జరిగింది. దీనికి సంగీత వాయిద్యాలు అవసరం ఉంటుంది.  నేను కాదనను. ఆ స్థితిని నేను దాటడం జరిగింది. ఈ వస్తువు నాకు ఉపయోగం లేదు.  ఇది లోక కళ్యాణార్ధం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలాంటి ఉన్మాద స్థితిలో ఉన్న సాధకులకు గాని, మానవులకు గాని, జంతువులకు కానీ, సంగీత వాయిద్య పరికరాల ఉపయోగించడం జరుగుతుంది. దాని ద్వారా ఉన్మాద స్థితి నుంచి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. నేను లోక కళ్యాణార్థం ఈ కోరిక మాయలో పడదలచుకోలేదు. నేను మంది గురించి ఆలోచించడం మానేసి, మది గురించి ఆలోచించడం చేస్తున్నాను. నేను వేరు, వాళ్ళు వేరు అనుకోవడం లేదు. నేనే వాళ్ళు, వాళ్లే నేను అనే స్థితిలో ఉన్నాను. కాబట్టి, నాకు నేను తెలుసుకొని…. నా సాధన పరిసమాప్తి చేసుకోగలిగితే చాలు. ఈ దైవిక వస్తువు కూడా నాకు అవసరం లేదు…

మహాదేవి:-మనం ఉన్మాద స్థితిలోనికి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం కదా! ఈ వేణువు వాయిస్తూ ఉంటే దాని నుంచి బయటకు వస్తాం కదా!(శివ నందిని చెవిలో గొణుగుతూ ఉండేసరికి)

శివ నందిని:- మన దేహంలోనే సప్త చక్రాలలో సప్త నాదాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడు..

అని మూలధార చక్రంలో సముద్రపు అలలు, స్వాధిష్ఠాన చక్రంలో నీటి శబ్దం, మణిపురాచక్రంలో ఓంకార నాదం, అనాహతా చక్రంలో మృదంగనాదం, విశుద్ధ చక్రంలో మేఘనాదం, ఆజ్ఞా చక్రంలో ఓంకార నాదం, సహస్ర చక్రంలో వీణ నాదం, లీలగా సుస్పష్టంగా వినిపించడం జరిగేసరికి…. అప్పుడు కిష్టయ్య కాస్త….

కిష్టయ్య:- నీ శరీరంలోనే సహజసిద్ధమైన నాదాలు వినడం ఎప్పుడైతే ఆరంభించావో….బయట చేసే వాయిద్యాల అవసరం నీకు లేదు…

అని చెప్పి ఆ వేణువు తన చేతి సంచిలో పెట్టుకోవడం జరిగింది. ఇలా వీళ్ళు వెళుతూ ఉండేసరికి, వీళ్ళకి కొంతమంది మనుషులు ఎదురు రావడం జరిగింది. వాళ్ళు కాస్త కిష్టయ్యను చూసి స్వామి మేము పేదవాళ్ళ కోసం, వయోవృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని నడపాలనుకుంటున్నాము. దానికి మేము ధన సేకరణ చేయడం జరుగుతుంది. మీరేమైనా ధన సహాయం చేయగలరా?  అనేసరికి మీకు ఎంత ధనం అవసరం అవుతుంది అంటే…. రెండు కోట్లు సుమారుగా ఖర్చవుతుంది అనేసరికి… ఆ రెండు కోట్లు మీకు ఇస్తాను,  నేను డబ్బు రూపంలో ఇవ్వకపోవచ్చు, బంగారం రూపంలో మీకు ఇస్తాను. మీకు ఏమైనా అభ్యంతరమా? అంటే ఏ రూపంలో ఇచ్చిన చాలు స్వామి!  ఆ బంగారాన్ని అమ్ముకొని మేము డబ్బు చేసుకుంటాము అని చెప్పి వాళ్ళలో ఒక పెద్దాయన అనేసరికి….కిష్టయ్య కాస్త తన చేతి సంచిలో నుంచి ఏదో ఒక మణిని బయటకు తీసి…. దానిని మనసులో అనుకొని సూర్యుడికి చూపించేసరికి దాని నుంచి ఒక మడుగు బంగారం రావడం జరిగింది. ఒక బంగారు ఇటుక రాయిగా రావడం జరిగింది. ఆ బంగారపు ఇటుక రాయి వాళ్లకి ఇచ్చేసరికి వాళ్ళు ఆనందంగా  ధన్యోస్మి స్వామి… మహా ప్రసాదం, దీనితో మాకు వృద్ధాశ్రమం తయారైపోతుంది అని చెప్పి వాళ్ళందరూ వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు ఈ మహాదేవి కాస్త దీనిని చూస్తూ…

మహాదేవి:- అంటే ఇది శమంతకమణి నా? ఆ మణి మాత్రమే బంగారం ఇస్తుందని వినాయక చవితి కథలో చదవటం జరిగింది..

కిష్టయ్య:- ఏమో అది నాకు తెలియదు తల్లి….దీని నుంచి బంగారం వస్తుందని తెలుసుకున్నాను.  కావాల్సిన అంత బంగారం ఇలా ధనార్థుల కోసం నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉంటాయి.  వాళ్ల సమస్యలు తీరతాయి కదా అని చెప్పి….. నేను నా స్వార్థం కోసం ఏనాడు దీని నుంచి బంగారం ఆశించలేదు. అందువలన ఈ మణి ఇంకా నా దగ్గర ఉన్నది. మణి అనేది తెలీదు.. రాయో తెలీదు…. రప్పో తెలియదు.  అనుకోకుండా సూర్యుడికి ఎదురుగా ఒక రోజు రాయినీ రాతి మీద పెట్టి గోవుల్ని చూస్తూ ఉండేసరికి…. సూర్యకాంతి దీని మీద పడిన తర్వాత దీని నుంచి బంగారం రావడం గమనించాను. ఇలా రెండు మూడు సార్లు చూసి, సూర్యకాంతి ద్వారా దీని నుంచి బంగారం వస్తుందని తెలుసుకున్నాను.  దానితో ఆ బంగారాన్ని పేదవాళ్ళకి, అన్నార్థులకి ధన సహాయంగా ఇస్తూ వచ్చాను . అక్క! ఈ మణి ద్వారా నువ్వు బంగారం చేసి లోకుల యొక్క కోరికలు తీర్చొచ్చు కదా!

శివ నందిని:-ఇలా కోరికలు తీర్చుకుంటూ పోతే నవనాధుల వలనే కాలేదు… ఎందుకంటే ఒక కోరిక నుంచి వెయ్యి కోరికలు, లక్ష కోరికలు, 10వేల కోరికలు, 10 లక్షల కోరికలు, కోట్ల కోరికలు పుడతాయి. కోరికలకి అంతం లేదు కదా! అంతెందుకు….బుద్ధుడు కోరికల వలనే కష్టాలు కలుగుతాయని తెలుసుకొని…..కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం జరిగింది కదా! ఆ కోరిక చింతామణి ఇచ్చింది అని చెప్పి…నేను పరమహంస అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా స్థితికారక పరిపాలన కోసం, శమంతక మణి పొందడం జరిగిందని చెప్పేసి శాస్త్ర గ్రంధాలు చెప్పడం జరిగింది కదా!  అలాంటిదే ఈ మణి కూడా… ఇది శమంతక మణి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.  నాకు దీనిని ఉపయోగించుకొని బంగారం తయారు చేసి అన్నార్థుల కోసం అని ఆ మాయలో పడదలచుకోలేదు.  నాకు నేను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.  అంతేగాని నేను జనాల కోసమో…లోకుల కోసమో… కుటుంబ సభ్యుల కోసమో ఈ మాయలో పడదలచుకోలేదు.  నాకు అవసరం లేదు.ఇలాంటి మణులు సప్తమణులు ఉంటాయని ఈ మణుల మాయలో పడితే…. నా సాధన ఆగిపోతుందని తెలుసు.  సాధన పరిసమాప్తి కాదని తెలుసు.  నాకు ఈ మణులతో అవసరం లేదు .

కిష్టయ్య:- సరే అక్క… అన్నీ కూడా నువ్వు వద్దు అని చెప్పి అంటున్నావు. మరి నా ఆకలి తీర్చావు కదా!  మరి నా ఆకలి తీర్చినందుకు ఏదో ఒక దైవిక వస్తువును పొందాలి కదా! 

శివ నందిని:- కోరిక ఉన్నవాడికి దైవీక వస్తువులు అవసరం ఉంటుంది.  కోరిక లేనివాడికి ఎలాంటి దైవిక వస్తువు అవసరం లేదు కదా! 

కిష్టయ్య:- అంటే నీకు ఎలాంటి కోరికలు లేవా?  

శివ నందిని:-ఇదివరకు మోక్షం పొందాలని కోరిక ఉండేది.  కానీ  భగవద్గీతను ఆపాదం చదవడం వలన, మోక్షం పొందాలనే కోరిక ఉండకూడదు… ఆ కోరిక కూడా సన్యసించి మోక్ష సన్యాస యోగం పొందాలి అని… మోక్షం పొందాలి అనే కోరిక ఉండటం వలన మోక్షం పొందినా కూడా పొందామో లేదో అని అనుమాన భయం మొదలవుతుంది. అనుమాన భయం వలన పునః కర్మ జన్మ లలో పడటం జరుగుతుంది. ఎందుకంటే మోక్షం పొందాలి అనే కోరిక ఉండటం వలన మోక్ష సాధన చేయడం జరిగింది కదా!  అదే మోక్ష కోరిక ఉండకుండా మోక్షం మీద దృష్టి పెడితే, అప్పుడు తపన తాపత్రయ, కుతూహలం ఉంటుంది. తద్వారా అసలు సిసలైన మోక్ష ఙ్ఞానం పొందడం జరుగుతుంది. ఇందాక ఆ యోగికి చెప్పినట్టుగా మోక్ష జ్ఞానం పొందిన తరువాత మోక్ష జ్ఞాన అనుభవ అనుభూతిని పొందడం జరిగితే, అప్పుడు అసలు సిసలైన పూర్ణ మోక్ష స్థితిని పొందడం జరుగుతుంది.  ఈ స్థితిని పొందటానికి వచ్చే మాయలే ఇవన్నీ కూడా… ఈ మాయలన్నీ సహస్ర చక్రంలో శ్రీకృష్ణుని ఆధీనంలో ఉంటాయి అని… సప్త జ్ఞాన భూమిక మాయలు అని చెప్పడం జరిగింది అని…. అనుభవ జ్ఞానం పొందడం జరిగింది.  అవి కూడా మహామాయలు అవుతాయని.. వాటిని దాటాలి.  అలాగే దైవసాక్షాత్కారాల మాయ, ఆత్మసాక్షాత్కారాల మాయ ఇవన్నీ కూడా సాధకుడు దాటవలసి ఉంటుంది అని నేను తెలుసుకోవడం జరిగింది.  నెమ్మది నెమ్మదిగా అది అనుభవంలోకి రావటం జరుగుతుంది.  దానిని దాటుకోవడం జరుగుతుంది.  ఇప్పుడు నేను ఆ స్థితిని దాటతానా ఆగుతానా అని చెప్పి నీలాంటి వాళ్ళు పరీక్షలు పెడుతూ ఉంటారు అని నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.

కిష్టయ్య:- అక్క!  మీలాంటి యోగినీకి పరీక్షలు పెట్టే అంత స్థితిలో నేను లేను. నేను సాధనలో పొందిన దైవీక వస్తువుల యొక్క మహిమలు ఏంటి అనేది నీకు చూపిస్తున్నాను.  ఒకప్పుడు నేను ఈ ఏడు దైవిక వస్తువులు పొందటానికి 7లక్షల కోట్ల జన్మలు తీసుకోవడం జరిగింది.  ఒక్కొక్క వస్తువు మాయని పొందటం, వస్తువు మాయను దాటడానికి కొన్ని కోట్ల పైగానే నేను ఇది చేయడం జరిగింది.  కాబట్టి నేను ఈ మాయలో పడమని చెప్పను.. పడొద్దు అని చెప్పను… లోకకళ్యాణార్థం అయితే ఈ వస్తువులు తీసుకోక తప్పదు.నీకు నువ్వే సాధన చేసుకోవాలి అనుకుంటే…. ఈ వస్తువులతో అవసరం ఉండదు..

 అంటూ వీళ్ళు ముందుకు సాగటం జరిగింది. 

ఇలా వీళ్ళిద్దరూ ముందుకు వెళుతూ ఉండేసరికి ఉన్మాదస్థితిలో బ్రహ్మర్షి సాధనా స్థితిలో ఉన్న యువకుడు కనపడ్డాడు.  సుమారుగా ఆయనకి 50 సంవత్సరాలు ఉండచ్చు. ఆయన కిష్టయ్య దగ్గరికి రావడం వీళ్ళందరూ గమనించారు. 

బ్రహ్మర్షి:- స్వామి! నేనే మీ దగ్గరికి వస్తున్నాను.

కిష్టయ్య:- నా దగ్గరికి రావటం ఏమిటి? 

బ్రహ్మర్షి:- నేను విశ్వాధినేత అవ్వాలి. బ్రహ్మాధీనేతను అవ్వాలి. దానికి నువ్వొక్కడివే మార్గం చూపిస్తావని….ధ్యానంలో మీ రూపం చూపించడం జరిగింది. దానికి నువ్వు నాకు మాత్రం చూపించాల్సిందే..

కిష్టయ్య:- విశ్వాధినేత అయ్యి ఏం చేస్తావు? 

బ్రహ్మర్షి:- నాకు కావలసినట్టుగా…. నా భావాలకు తగ్గట్టుగా…. నా భావరూపాలు ఏర్పాటు చేసుకొని, నేను ఏలుతూ అధినేతగా ఉంటాను.  నా చెప్పు చేతల్లో ఉండేటట్టుగా చూస్తాను. దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, అందర్నీ నా స్వాధీనం చేసుకోవాలి. నా అధీనంలో ఉంచుకోవాలి. నేను వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇవ్వాలి. నేను విశ్వాధినేతను అవ్వాలి.  ఎలాగైనా నన్ను విశ్వాధినేత చేయాలి.  బ్రహ్మాండానికి అధిపతిని చేయాలి.

కిష్టయ్య:- అంత అర్హత, యోగ్యత, యోగం ఉంటే నువ్వే అవుతావు కదా! 

బ్రహ్మర్షి:- దానికి నేను బ్రహ్మ సాక్షాత్కారం పొందడం జరిగింది. నా కోరిక తీరటానికి వెయ్యి సంవత్సరాల పాటు సాధన చేసి బ్రహ్మర్షి స్థితికి రావాలి అని బ్రహ్మ చెప్పడం జరిగింది.

కిష్టయ్య:- బ్రహ్మర్షి స్థితికి నువ్వు వచ్చావని నీకు ఎలా తెలిసింది?

బ్రహ్మర్షి:- ఎవరి శరీరం అయితే, అగ్నిమయమై వారి బ్రహ్మ రంధ్రం నందు ధూమం ఏర్పడుతుందో…. వారు బ్రహ్మర్షి స్థితికి వస్తారు అని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. నేను 1000 సంవత్సరాలు సాధన చేసి నా శరీరాన్ని దగ్ధం చేసుకోవడం… నా బ్రహ్మ రంధ్రంలో ధూమం ఏర్పడడం జరిగింది.  తద్వారా నేను బ్రహ్మర్షి స్థితిని పొందడం జరిగింది.

కిష్టయ్య:- ఇంకేముంది…. బ్రహ్మర్షి స్థితి పొందావు కాబట్టి బ్రహ్మాండాధిపతి అవ్వచ్చు కదా! విశ్వాధినేత  అవ్వచ్చు కదా! 

బ్రహ్మర్షి:- దానికి నీ మాయ ఏదో అడ్డం వస్తుంది.  ఆ కృష్ణ మాయను దాటాలి..

కిష్టయ్య:- మాయ అడ్డం వస్తుంది అంటే నీకు ఏదో కోరిక ఉండి ఉంటుంది.  అది మాయగా ఏర్పడుతుంది.  అర్హత లేకపోవడం వలన నీకు అది మాయ అవ్వచ్చు కదా!  మాయ చెబుతుందేమో అలా అనుగ్రహించుకున్నావా? 

బ్రహ్మర్షి:- నాకు అర్హత ఉందా లేదా?  అనేది నాకు అనవసరం.నేను విశ్వాధినేత అవ్వాల్సిందే.ఆ విశ్వాధినేత అయ్యే దైవిక వస్తువు ఏదో నీ దగ్గర ఉందని బ్రహ్మదేవుడు  నాకు చెప్పడం జరిగింది…అది నాకు కావాలి 

కిష్టయ్య:- ఆ వస్తువు ఏమిటో తెలుసా? 

బ్రహ్మర్షి:- అది సుదర్శన చక్రం అని చెప్పడం జరిగింది. 

కిష్టయ్య:- నా దగ్గర ఎలాంటి సుదర్శన చక్రాలు లేవు.  అది శ్రీకృష్ణుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గర ఉంటాయి.  నా దగ్గర ఎలాంటివి లేవు. 

బ్రహ్మర్షి:- లేవా.?  నీ దగ్గర అలాంటి వస్తువు ఏదైనా ఉందా? 

కిష్టయ్య:-నా దగ్గర ముళ్ళు ఉన్న ఒక చక్రం దొరికింది.  అది అయితే ఉంది మరి.  దాని సుదర్శన చక్రం అంటారో…కాలచక్రం అంటారో….నాకు తెలియదు.  నేనైతే ఎప్పుడు దానిని ఉపయోగించలేదు. రాగి రేకు లాగా ఉంటుంది.

అని చేతి సంచిలో ఉన్న చక్రాన్ని చూపించేసరికి….

బ్రహ్మర్షి:-...! విశ్వాధినేత, బ్రహ్మాండాధిపతిని చేసేది ఇదే.  సుదర్శన చక్రం ఇది. నీకు రాగిరేకులాగా కనపడిందా! నువ్వు మూర్ఖుడివి… నీ అంత మూర్ఖులు ఎక్కడ ఉండరు.. ఈ చక్రాన్ని ఉపయోగించడం నీకు తెలియలేదు.  దీనిని యోగ దృష్టితో చూస్తే సుదర్శన చక్రంలాగా కనిపిస్తుంది.  భౌతిక నేత్రాలకి ఇది రాగి రేకులాగా కనబడుతుంది.   అని చెప్పి…. అతను దానిని గాలిలో పెట్టి, ఏవో మంత్రాలూ చదువుతూ ఉండేసరికి….అది సుదర్శన చక్రంలాగా మారిపోయి…. ఆ ప్రాంతం అంతా విస్తరిస్తూ, ఆక్రమిస్తూ తిరుగుతూ ఉండేసరికి…. ఇది నేను 1000 కోణాల్లో ఏదో ఒక కోణంలోకి వెళ్లిపోయి బ్రహ్మాండాధిపతిని అవుతాను… ఈ చక్రం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది అంటూ…. ఆ సాధకుడు కాస్త గాలిలోకి వెళ్ళిపోతూ…. ఒక కోణం లోపలికి వెళ్ళటం జరిగింది. ఒక కోణం ఒక బ్రహ్మాండంతో సమానం అని శివ నందిని అనుకోసాగింది. అంటే వెయ్యి బ్రహ్మండాలు కాస్త వెయ్యి కోట్ల బ్రహ్మాండాలుగా ఈ సుదర్శన చక్రం అదుపులో ఉంచుతుంది. అందుకని విష్ణుమూర్తి నుంచి శ్రీకృష్ణుడు స్థితి కారకుడిగా ఈ సుదర్శన చక్రం వలన ఈ స్థితి పొందడం జరిగింది. నిజానికి ఈ సుదర్శన చక్రం శివుని వద్ద వరంగా పొందడం జరిగింది అని శివ నందినికి జ్ఞాన స్ఫురణ అందుతూ ఉండేసరికి….. విశ్వ రూపంలో ఉన్న సుదర్శన చక్రం కాస్త రాగి రేకులాగా సాధారణ స్థితిలోకి రావడం జరిగింది. దానిని యధావిధిగా కిష్టయ్య తన చేతిలో పెట్టుకుంటూ….

కిష్టయ్య:- పోనీ ఇదైనా తీసుకో! ఇది దైవిక వస్తువని నాకు కూడా తెలియదు. బ్రాహ్మాండానికి అధిపతిని చేస్తుందంట. విశ్వాదినేతను చేస్తుందంట. నువ్వు విశ్వాదినేత అయ్యి ఈ విశ్వాన్ని ఏలొచ్చు కదా!  ఇప్పుడు మన కళ్ళముందే సాధకుడు వెళ్లిపోయాడు కదా!  నువ్వు కూడా అలాగే వెళ్ళిపోవచ్చు కదా!

శివ నందిని:- నాకు ఏ విశ్వాధినేత అవసరం లేదు… నాకు ఏ బ్రహ్మాండానికి అధిపతిగా ఉండాల్సిన అవసరం లేదు.  నేను పదవుల కోసం, అధినేతల కోసం ఉండాలి…చేయాలి అనుకోవడం లేదు. ఏ శూన్యం నుంచి అయితే వచ్చానో…. తిరిగి అదే శూన్యంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను.  దానికి మార్గం ఉంటే చెప్పు…

కిష్టయ్య:- అక్క!  ఇంతటితో నా సప్త దైవిక వస్తువులన్నీ కూడా చూపించాను.  వాటి మహిమలు కూడా చూపించాను.  కానీ నువ్వు వాటి మాయలో పడను… నాకు వద్దు అనుకుంటున్నావు.  ఇక చేయాల్సింది ఏమీ లేదు.  నీ కోరిక ఉంటే ఈ ప్రకృతిలో ఉంటావు. లేనప్పుడు ఈ ప్రకృతిని దాటే స్థితికి నువ్వు వెళ్తావు.  కాబట్టి నీకంటూ ఏ కోరికలు లేవు కదా!  కోరికలు లేవు, కానీ ఇష్ట కోరిక ఎదో ఉండి ఉంటుంది.  ఆ ఇష్ట కోరిక తీరితే గాని మూల ప్రకృతిలోనికి నువ్వు వెళ్ళలేవు.  మూల ప్రకృతి అంటే హృదయ చక్రస్థితికి వెళ్ళాలి.  నాకు ఈ సప్త ఇష్ట కోరికలుగా సప్త దైవిక వస్తువులు వచ్చాయి. ఈ ఇష్ట కోరికలు నేను దాటలేక పోవటం వలన, నేను ఈ స్థితిలో శాశ్వతంగా ఉండిపోవటం జరిగింది.  నువ్వు ఈ సప్త కోరిక మాయలను దాటావు. కాబట్టి ఇక నేనంటూ నిన్ను ఆపేది ఉండదు.

మహాదేవి:- అంటే నువ్వు శ్రీకృష్ణుడివి అనుకుంటున్నావా! కిష్టయ్య అనుకుంటున్నావా!? అసలు నువ్వు మానవుడివా! లేక దైవాంశ సంభూతుడివా?

కిష్టయ్య:-దేవుడికి మనిషికి తేడా ఏంటి?

మహాదేవి:- ఏమో నాకు తెలియదు….

కిష్టయ్య:- మానవత్వం ఉన్నవాడు దేవుడు అవుతాడు. మానవత్వం లేని వాడు జీవుడు అవుతాడు. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన, నిష్కామ కర్మ స్వార్థం లేనివాడు, రాగద్వేషాలు సమదృష్టితో చూసేవాడు, కోపావేశాలు లేనివాడు, ప్రశాంతస్థితి పొందినవాడు, అన్నింటియందు త్యాగిగా కూడా ఉన్నవాడు, క్షమాగుణం ఉన్నవాడు, ఇలా దైవీక గుణాలు ఉన్న  ప్రతి జీవుడు కూడా దేవుడితో సమానం.  దేవుడు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనిషిలోనే ఉంటాడు. మనిషిలో  మంచి బుద్ధి,మంచి పనులు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే వాడే దేవుడవుతాడు.  భక్తి మార్గంలోకి వెళ్లి చూస్తే దేవుణ్ణి మనిషిగా చూడడం జరుగుతుంది.  అదే జ్ఞానమార్గంలోకి వెళ్లి చూస్తే ప్రతి మనిషిలోను దేవుని చూడటం జరుగుతుంది. మనం చూసే దృష్టిని పట్టి ఉంటుంది.. సరే అక్క!  వెళ్దాము..

(అని అనేసరికి అక్కడే ఒక చెట్టు కింద బాలకృష్ణుడు, అది కూడా ద్వారకా శ్రీకృష్ణ విగ్రహం కనపడింది.)  ఇది ద్వారకా నుంచి రావడం జరిగిందమ్మా! అమ్మ ఆరాధన కోసం ఉంచడం జరిగింది. చిన్నప్పుడు నేను శ్రీకృష్ణ లాగా  ఉన్నాను అని బాలకృష్ణుడు రూపం కావాలి అంటే, నేను కృష్ణ ఉపాసన చేసి ఆయన అనుగ్రహం ద్వారా ఈ విగ్రహం పొందడం జరిగింది.  ఇది ఆరాధన చేసి మా అమ్మ కృష్ణ చైతన్యంలో కలిసి పోవడం జరిగింది. ఆవిడకి కృష్ణ సాక్షాత్కారం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి విగ్రహారాధనకి ఇది కావాలంటే ఇస్తాను. ఇంక నా దగ్గర ఇది తప్ప ఏమీ లేవు. 

శివ నందిని:- నాయన!  దైవసాక్షాత్కారం కూడా ఒక మాయే.  మహా మాయ అవుతుంది. మోక్షలోకమునకు వెళ్లేటప్పుడు చాలామంది అంటే రామదాసు లాంటి మహా భక్తులు లాంటి వాళ్ళు కూడా మోక్షలోకానికి వెళ్లకుండా దైవసాక్షాత్కార మాయలో ఆగిపోయి సాధన పరిసమాప్తి చేసుకోకుండా సాధన ఆగిపోవడం జరిగింది. అంతెందుకు…..రామదాసుకి అంతిమంలో రామ సాక్షాత్కారం జరిగాక… నిన్ను మోక్షలోకంలోకి అనుగ్రహిస్తాను అని శ్రీరాముడు చెప్పేసరికి స్వామి!  మోక్ష లోకంలో ఏముంటుంది?  అని అడిగితే ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు అని చెప్పడం జరిగింది.  మీరు అక్కడ ఉంటారా?  అంటే నేను ఆ లోకంలో ఉండను…. వైకుంఠంలో ఉంటాను.. అంటే రామదాసు కాస్త మీరు లేని లోకంలో నేను ఉండటం ఎందుకు స్వామి?  మీరు ఎక్కడ ఉంటారో, నేను అక్కడే ఉంటాను అనేసరికి…. ఈ సాక్షాత్కార మాయలోనే ఆగిపోవడం జరిగింది.  అంతెందుకు రామకృష్ణ పరమహంస ఆకార సాధన స్థితిని, నిరాకార సాధనా స్థితిని కూడా సాధన చేసి, సిద్ధి పొంది అమ్మలేని నిరాకరాస్థితిలో తను ఉండలేను అని రసజ్ఞత ఉన్న స్థితి కావాలి అని సాకార స్థితిలోనే ఆయన శాశ్వతంగా ఉండిపోవడం జరిగింది.  అంటే సాక్షాత్కార మాయ దాటలేరని అర్థం అవుతుంది కదా! కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహారాధన చేయటం వలన శ్రీకృష్ణ సాకార ఆరాధన అవుతుంది. ఇప్పుడు ఆయన సాక్షాత్కార మాయలో ఉండి నేను సాధన పరిసమాప్తి చేసుకోలేను కదా! విశ్వ శూన్యంలో శూన్యం అవటం అనేది జరగదు కదా! నేను కూడా మధురభక్తితో ఆయన్ని కొలుస్తూ ఆయన శాశ్వతడు అని ఆరాధన చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది కదా!

కిష్టయ్య:- సూక్ష్మములో మోక్షం గ్రహించావు అక్క!  మూలజ్ఞానం పొందావు.  నీకు పూర్ణ మోక్షం పొందటానికి అర్హత, యోగ్యత, యోగం ఉన్నది.  కాబట్టి నువ్వు ఈ పురుష ప్రకృతిని దాటి మూల ప్రకృతి స్థితి నువ్వు పొందగలిగావు.  శ్రీకృష్ణ సాక్షాత్కారమాయని, ఆయన ఉపయోగించిన దైవీక వస్తువుల మాయని కూడా దాటడం జరిగింది. మీకు ఇక చెప్పలేను.  ఈ ప్రకృతిలో నువ్వు ఉండలేని స్థితికి చేరావు అని నాకు అర్థం అయింది. కాబట్టి నేను ఉండమని చెప్పను అలాగని వెళ్ళమని చెప్పను.. నీవు పొందిన జ్ఞానం ఈ ప్రకృతిలో ఉన్న ఇతర జీవులకి ఇస్తే బాగుంటుంది అని కూడా అనను …ఇవ్వాలి అనిపిస్తే అది కూడా మహామాయే అవుతుందని నువ్వు తెలుసుకోవడం జరిగింది.  నువ్వు మంది గురించి ఆలోచించట్లేదు… మది గురించి ఆలోచిస్తున్నావని ఇందాక చెప్పడం జరిగింది. కాబట్టి నిన్ను ఇంక ఆపడం మంచిది కాదు. నేను ఇంక ఆపలేను. నా మాయను దాటే స్థితిని నువ్వు పొందడం జరిగింది. ఇక్కడ ఉన్న గుహలో నా దైవిక ఆరాధన చూడండి. చూపిస్తారండి.

అని వీళ్ళని తీసుకొని గుహ లోపలికి వెళ్లడం జరిగింది. గుహ లోపల సుమారుగా 20 అడుగులు ఉన్న కాళికామాత విగ్రహం వెనుక వైపు కమలాదేవి విగ్రహ మూర్తి రెండూ కలిసి ఉండటం, ముందు రాధాదేవి యంత్రం ఆరాధన చేస్తూ ఉండటం గమనించి చూస్తూ…. వీళ్ళు లీనం అవుతూ ఉండేసరికి….మహాదేవి కాస్త ఏంటి మన వెనక రావాల్సిన కిష్టయ్య రాలేదు అనేసరికి… శివ నందిని కాస్త వెనక్కి తిరిగి చూస్తే కిష్టయ్య అక్కడ కనిపించలేదు.  అదేంటి కిష్టయ్య ఏమయ్యాడు అని మహాదేవి అనుకుంటూ ఉండేసరికి…. ఇంకా అర్థం కాలేదా? ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణయ్య రూపంలో మనుష్య రూపంలో రావటం జరిగింది. అతని ఎత్తే మనకి చెప్పింది కదా!  అతను చూపించిన దైవిక వస్తువులు కూడా శ్రీ కృష్ణుడివే కదా!  ఆ మాయలో పడతాము అని…. ఆ కోరిక తీర్చుకోవడం కోసం శివ నందిని ఆగుతుందేమో అని పరీక్ష పెట్టడం జరిగింది. ఇది శబ్ద జ్ఞాన పరీక్ష అని చెప్పడం జరిగింది. దీని దాటడానికి మహా నిర్వాణ శక్తి కావలసి వస్తుంది. ఆ మహా నిర్వాణ శక్తిని రాధాదేవి, కాళికాదేవి, కమలాదేవి ఇస్తారు అని తెలుసుకోవడం జరిగింది. అలాగే అరవింద యోగి కూడా తన మంత్ర గ్రంథం అయిన సావిత్రిలో త్రిమాతల దర్శనంతోనే మనకి మహా నిర్వాణ శక్తి వస్తుందని, ఆ మూలమంత్రాలను శ్లోకాల రూపంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్వాణ శక్తి వాళ్ళ జన్మ యొక్క దైవీక వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఇవే ఉండాలని లేదు.. కాకపోతే త్రిశక్తులు మాత్రం ఉంటాయని చెప్పడం జరిగింది. కొంతమందికి మహా సరస్వతి, మహాలక్ష్మి, మహా దుర్గా ఉంటాయి. కొంతమందికి మహా గౌరీ, మహాకాళి, మహా సరస్వతి ఉంటాయి. యద్భావం భావం తద్భవతి.  జన్మాంతరంలో వాళ్ళు చేసిన దైవిక ఆరాధన శక్తులు కలిసి త్రిశక్తులుగా మారి త్రీమాత శక్తిగా మారి.. ఈ త్రిశక్తులు కలిసి ఏకత్వంలోకి వస్తేనే అది నిర్వాణ శక్తి అవుతుంది. ఆ విషయం మనకు చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఈ రూపం లో రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ  సప్త వస్తువులు, సప్త కోరికలు మనం దాటడం జరుగుతుందో…. అప్పుడు మహా నిర్వాణ శక్తి దాటడానికి త్రిమాతల దగ్గరికి రావడం జరుగుతుంది అని అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు విషయం తెలుసుకున్న శివ నందిని కాస్త ధ్యాననిష్ఠలోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు ధ్యాననిష్ఠలోకి వెళ్తూ ఉండేసరికి….అంతకుముందు సహస్రకమలంలో అధిష్టానదైవం కనబడితే, కమలం ద్వారము కనబడడం జరిగింది. పెద్ద కపాలం తలలో నుంచి ముక్కుల్లో నుంచి బ్రహ్మ రంధ్రం నుంచి రక్తం కారటం జరిగింది. కింద రక్త మాంసాలు అన్నీ కనపడుతూ ఉన్నప్పటికీ కూడా….. శివ నందిని యొక్క ఆత్మ స్వరూపం, ఆ కపాలం యొక్క ఆజ్ఞ చక్రంలో ఉన్న త్రినేత్ర రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ కూడా ఈమె పంచేంద్రియాల మాయలో ఉండకపోవటం వలన… కపాలం యొక్క త్రినేత్రం తెరుచుకోవడం జరిగింది.  ఆ తినేత్రం లోపలికి వెళుతూ ఉండేసరికి మూడు అగ్నులు ఉన్న స్థితి కనపడింది. ఆ తర్వాత త్రిమూర్తి స్వరూపంతో దత్తాత్రేయ దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళితే త్రిమాతల దర్శనం, ఒక స్త్రీ మూర్తికి మూడు తలలలో ఉన్న త్రిమాత దర్శనం జరిగింది. ఒకవైపు మహాకాళి, ఒకవైపు కమలాదేవి, మరొకవైపు రాధాదేవి దర్శనం అవటం జరిగింది. ఆ మాయలను దాటుతూ ఆ అమ్మవారిని కూడా దాటి లోపలికి వెళుతూ ఉండేసరికి…. అక్కడ హనుమంతుడు ధ్యానం చేస్తున్నట్టుగా లీలా మూర్తిగా కనిపించడంతో… ఇదేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకోగానే… ధ్యాన భంగం అయ్యి ధ్యాననిష్ట నుంచి బయటకు రావడం జరిగింది. అప్పుడు మహాదేవి కాస్త ఏమైంది అనేసరికి అప్పుడు శివ నందిని కాస్త నాకు అంత్యములో హనుమంతుడు కనపడుతున్నాడు అని చెప్పి అనేసరికి …పరమహంస గారి అనుభవం ప్రకారం అది జీవనాడి అనుసంధానం అవుతుంది. ఈ జీవనాడి కాస్త హృదయ చక్రానికి అనుసంధానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ స్థితిని పొందాలి అంటే చినమాస్తా దేవి అనుగ్రహం పొందవలసి ఉంటుంది. అంత్యంలో హనుమంతుని దర్శనం అయితే కానీ మనం జీవనాడిలోనికి వెళ్లలేము అని చూచాయగా చెప్పడం జరిగిందన్నమాట అని అనుకుంటూ ఉండేసరికి… సరే అని ఇక వీళ్లంతా బయటకు వస్తూ ఉండేసరికి… ఆ గుహ అలాగే ఆ చెట్టు కూడా క్షణకాలంలో అదృశ్యం అయ్యేసరికి… ఇది శ్రీకృష్ణ లీలా విన్యాసం, నిన్ను పురుష ప్రకృతి నుంచి మూల ప్రకృతి వైపున పంపించడానికి అనుగ్రహం ఇవ్వటం జరిగింది. ఇక్కడ నుంచి మిగతా ముగ్గురు అనుగ్రహాలు కూడా మనం పొందవలసి ఉంటుంది.  చినమస్తా దేవి, దక్షిణామూర్తి అలాగే పళని కుమారస్వామి అనుగ్రహం పొందితే గాని… నీకు సహస్ర చక్ర సాధన పూర్తి అవదు. ఎప్పుడైతే నీకు హనుమంతుడు దర్శనం అవుతుందో అప్పుడు మీకు జీవనవాడి యందు ప్రవేశం వస్తుంది. తద్వారా నీ సాధన హృదయచక్రానికి వెళ్లాల్సి వస్తుంది అని రుద్రస్వామి చెబుతూ ఉండగా వాళ్ళు క్షేత్రంలోని అమ్మవారి ఆలయ దర్శనానికి జరిగింది.


తీవ్రమైన ధ్యాననిష్ఠలో ఉన్న శివ నందిని కి ఒకరోజు ధ్యానంలో నేను అనేది త్యాగం చేస్తే శాంతి కలుగుతుంది అనే మాట పదేపదే వినిపించడం జరిగింది. నేను అనేది త్యాగం చేయడం ఏమిటి? ఏం త్యాగం చేయాలి అని అర్థం కాక ధ్యాన భంగం అయ్యేది. ఇలా సుమారుగా పలుమార్లు కొన్ని రోజులపాటు అదేపనిగా అదే వాక్యం పదేపదే వినిపించడం శివ నందిని కి ఆశ్చర్యం వేసింది. నేను అనేది ఏం త్యాగం చేయాలి అని…. అన్నీ త్యాగం చేసే ఇక్కడికి వచ్చాను కదా!  భోగ జీవితం త్యాగం చేశాను….యోగ జీవితం కూడా త్యాగం చేశాను కదా!  త్యాగం చేశాక కూడా వచ్చే శాంతి ఏమిటి?  దాన్ని పొందవలసిన అవసరం ఏముంది… ఒకవేళ అది మనశ్శాంతియా లేక ఆత్మ శాంతియా అనేది శివ నందిని కి ఒక పట్టాన అర్థం కాలేదు. సరే అని చెప్పి తను ఏదో త్యాగం చేయాలి.. అది త్యాగం చేస్తే కానీ తన సాధన ముందుకు వెళ్ళదు అని శివ నందినికి అవగాహన కలగడంతో…. రుద్ర స్వామికి విషయం చెప్పేసరికి….రుద్ర స్వామి కాస్త ఇదే విషయం మనకి పరమహంస గారి ధ్యాన అనుభవాలలో తెలుస్తుంది. ఆయన కూడా నేను అనేది త్యాగం చేస్తే కానీ శాంతి కలగదు అని చెప్పేసి అనేసరికి….ఏం చేయాలో అర్థం కాక ఇతిహాస పురాణాలన్నీ చదువుతూ…. ఒక్కొక్కరు ఏమేమి త్యాగం చేశారో తెలుసుకోవడం జరిగింది. భరతుడి దగ్గర నుంచి బుద్ధుడి దాకా ఒక్కొక్కరు ఏమేమి త్యాగం చేశారో తెలుసుకోవడం జరిగింది.  ఆ వివరాలన్నీ నీకు చెబుతాను. నీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకో!  అనేసరికి…. అప్పుడు ఇక రుద్ర స్వామి చెప్పడం ఆరంభించాడు.  మానసికంగా ప్రహ్లాదుడిలాగా తండ్రిని, భరతునిలాగా తల్లిని… ఇలా నా తల్లిదండ్రులను త్యాగము చేయాలి. ఆ తర్వాత విభీషణుడిలాగా నా తోబుట్టువులను త్యాగము చేయాలి. నా బంధువులను త్యాగము చేయాలి. నా మిత్రులను త్యాగము చేయాలి. నా శ్రేయోభిలాషులను త్యాగము చేయాలి.గౌతమ బుద్ధుడిలాగా నా కోరికలను త్యాగము చేయాలి. నా ఆశలను, ఆశయాలను త్యాగము చేయాలి. నా అనే వాళ్లను త్యాగము చేయాలి.కబీర్దాస్ లాగా నా నిత్య దైవాలను త్యాగము చేయాలి. నా ఇష్ట పూజలను త్యాగము చేయాలి. వివిధ క్షేత్రాలలో దర్శనాలను త్యాగము చేయాలి. వివిధ రకాల ఆలయ దర్శనాలను త్యాగము చేయాలి.జాతకబ్రహ్మ లాగా జాతకాలు చెప్పటాన్ని త్యాగము చేయాలి. నా జాతక భక్తులను త్యాగము చేయాలి.భర్తృహరిలాగా నా భార్యను త్యాగము చేయాలి. నా భార్య తరపు బంధుమిత్ర కుటుంబ సభ్యులను త్యాగము చేయాలి. అపరిమిత ధన సంపాదనను త్యాగము చేయాలి.జంతువులు, పక్షులు, మొక్కలు వంటి జీవులను త్యాగము చేయాలి. వివిధ రకాల ప్రేమ, మోహ, వ్యామోహాలను త్యాగము చేయాలి. రాగద్వేషాలను త్యాగము చేయాలి. మానావమానాలను త్యాగము చేయాలి. స్పందనలను త్యాగము చేయాలి.అస్థిర మనస్సును, అస్థిర బుద్ధిని త్యాగము చేయాలి. సంశయ బుద్ధిని, అనుమానపు బుద్ధిని త్యాగము చేయాలి.ద్రోణాచార్యుడిలాగా నా పంచ శిష్యులను త్యాగము చేయాలి. శిష్యులను త్యాగము చేయాలి. భీష్మునిలాగా గురువులను త్యాగము చేయాలి. భక్తులను త్యాగము చేయాలి.శుకమహర్షిలాగా జ్ఞానమును త్యాగము చేయాలి. శ్రీరాముడిలాగా అధర్మమును త్యాగము చేయాలి. యోగివేమనలాగా అతి కామమును త్యాగము చేయాలి. అధర్మ సంపాదనను త్యాగము చేయాలి. శ్రీరాముడిలాగా అధర్మ కోరికలను త్యాగము చేయాలి. శ్రీరాముడిలాగా అధర్మ ప్రవర్తనను త్యాగము చేయాలి.అమిత కోపమును త్యాగము చేయాలి. సప్త వ్యసనాలను త్యాగము చేయాలి. అహమును, మదమును, అహంకారమును త్యాగము చేయాలి. లోపబుద్ధిని త్యాగము చేయాలి. లోభమును, స్వార్థమును త్యాగము చేయాలి.శ్రీరాముడిలాగా పరస్త్రీ వాంఛను త్యాగము చేయాలి. దొంగతనాన్ని, దొంగబుద్ధిని త్యాగము చేయాలి. కర్ణుడిలాగా అన్నిటి యందు ఉన్న అతిని త్యాగము చేయాలి. ఇవన్నీ విన్న తర్వాత శివ నందిని కాస్త వాళ్ళు త్యాగం చేసిన వాటిని కూడా సరి సమానంగా నేను కూడా త్యాగం చేస్తూ వచ్చాను కదా!  ఇక కొత్తగా నేను అనేది త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది…నాకు అర్థం కావడం లేదు… అంటే నీ పరంగా ఏదో ఉండి ఉంటుంది.  అది నువ్వు త్యాగం చేయాలి. త్యాగం చేస్తే కానీ విషయం ఏమిటి అనేది తెలియదు అనేసరికి…. పరమహంస గారు ఏం త్యాగం చేశారు?  అనేసరికి ఇప్పుడు నువ్వు పరమహంస సాధన అనుభవాలు తెలుసుకోవడమే కానీ ఆయన అనుభవాలు నీ అనుభవాలతో సరిపోల్చలేము.  సరి సమానంగా ఉంటాయని చెప్పలేము.  అంటే ఆయన పురుషుడు, నేను స్త్రీని కాబట్టి సాధన అనుభవాలు వేరువేరుగా ఉంటాయా? అంటే అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చును. ధ్యాన అనుభూతి ఒకటే ఉంటుంది.  ఇక్కడ సాధన స్త్రీపరంగా…. పురుషుని పరంగా నీ  శరీరం ఒక కోరికతో వస్తుంది…. ఆయన శరీరం ఒక కోరికతో వచ్చింది. ఆ కోరికలను బట్టి మనకి ధ్యాన అనుభవాలు కలుగుతాయి, శరీర తత్వాలు మారతాయి… ఇప్పుడు శివ సాంగత్యం పొందాలని కోరికతో నువ్వు వచ్చావు. విశ్వానికి విశ్వమోక్షం ఇవ్వాలి అని విశ్వ మోక్ష కోరికతో ఆయన రావడం జరిగింది. ఇది ఇద్దరికీ అనుభవాలు తేడా వస్తాయి కదా! ఆయనకి శివుడు లేడు, దేవుడు లేడు అనే సిద్ధాంతం ఆయనది. నీకు వచ్చేసరికి శివ సాంగత్యం…. శివుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది నీ సిద్ధాంతం. ఇప్పుడు ఇద్దరిలో ఏ సిద్ధాంతం కరెక్ట్ అనేది…. మీ సాధన పరిసమాప్తి అయితే గాని తెలియదు.  ఆయన పరంగా శివుడు లేడు, అమ్మవారు ఉంది. మరి నీ సాధన పరంగా ఏముంటుంది అనేది మనకి కాలానుగుణంగా తెలుస్తుంది.  కాబట్టి ఇక్కడ ధ్యాన అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చును.  పరిస్థితులకి, కాలానుగుణంగా…. కోరికలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. యధావిధిగా అన్ని ఉండాలి, అన్నీ చేయాలి అని కాదు అనేసరికి….అవును, అది సత్యమేలే.  నా పరంగా నేను త్యాగం చేస్తే కానీ శాంతి కలగదు అని చెప్తున్నారు కదా!  అది ఏంటి అనేది చూస్తాను అని శివనందిని పదేపదే ధ్యానంలో కూర్చున్నప్పటికీ కూడా పదేపదే అదే వినిపిస్తున్నప్పటికీ…. దాదాపు 15 రోజులపాటు ఇదే వినపడుతూ ఉండేసరికి…. ధ్యానభంగం అవుతూ ఉండేసరికి…. ఏం చేయాలో అర్థం కాక ఎలా చేయాలో అర్థం కాక, అయోమయ స్థితిలో పడటం జరిగింది. రుద్ర స్వామి చెప్పిన యోగులు ఏమేమి త్యాగం చేశారో ఒక్కొక్కటి మననం చేసుకుంటూ రావడం జరిగింది. వాటన్నింటినీ త్యాగం చేసుకుంటూ వచ్చాను కదా!  మరి ఏం త్యాగం చేయాలి అనుకునేసరికి…. ఒకరోజు జ్ఞాన స్ఫురణగా నేను అనేది త్యాగం చేస్తే కానీ, తనకి శాంతి కలగదు.  నేను అనేది అహంకారం అవ్వచ్చు… జీవమాయ అవ్వచ్చు… మహామాయ అవ్వచ్చు కాబట్టి నేను అనేది త్యాగం చేయాలి అని చెప్పి అనేసరికి ఓహో!  నేను అనేది త్యాగం చేయాలన్నమాట… అనుకుంటూ తన ధ్యాన నిష్ఠను కొనసాగించడం జరిగింది.

శివనందినికి తీవ్రమైన ధ్యాన సమయంలో చిన్నమస్తా దేవి దర్శనమిచ్చింది. దేవి తన చేతిలో ఖడ్గాన్ని ధరించి, తన శిరస్సును తానే ఖండించుకున్న ఉగ్రరూపంలో కనిపించింది. ఈ దృశ్యం సాధారణ దేవతా దర్శనానికి భిన్నంగా, అత్యంత ఆశ్చర్యకరమైన అనుభూతిని కలిగించింది. అనంతరం దేవి శివనందిని శిరస్సును కూడా ఖండించినట్లుగా ధ్యాన దృశ్యంలో కనిపించింది.ఆ చినమస్తా దేవి ధ్యాన దృశ్యం చూసిన తరువాత, శివ నందిని కాస్త రుద్ర స్వామితో చెప్పేసరికి…. అమ్మ!  ఆవిడ దర్శనం అనుగ్రహం పొందావు.  ఆవిడ అనుగ్రహం పొందడం చాలా కష్టం.  ఆవిడ ధ్యాన దృశ్యం చూడటం జరిగింది అనేసరికి….. ధ్యానంలో నా తల నరికినట్టుగా ధ్యానానుభవం అయ్యింది అంటే  ఏమిటి దాని అర్థం?  అనగానే…. నేను మాయలో పడ్డానా ఏమిటి?  అనేసరికి కాదు తల్లి!  జన్మరాహిత్య స్థితిని పొందడం ఆమె ఇవ్వడం జరుగుతుంది.నువ్వు స్త్రీ, పురుష ప్రకృతికి అతీతమైన స్థితిని పొందడం కోసం ఆవిడ నీ తల  నరికినట్టుగా నీకు ధ్యాన దృశ్యం కనిపించింది. అది అనుభవంలోకి రావాలి కాబట్టి…. అప్పుడు నీ తల విబేధనం అయ్యి … నీకు కొత్త జన్మ వస్తుంది. అంటే ప్రకృతికి అతీతమైన స్థితిని నువ్వు పొందడం జరుగుతుంది అని చెబుతూ ఉండేసరికి…. కృష్ణస్వామి మరియు యోగాంబిక ప్రత్యక్షము అయ్యేసరికి మళ్ళీ  వీళ్ళేందుకు వచ్చారు అని రుద్ర స్వామి భయపడుతూ ఉండేసరికి…. యోగాంబిక కాస్త తన చేతిలో ఉన్న ఖడ్గంతో శివ నందిని తలని నరికేసరికి ….నోట మాట రాలేదు. మొండెం మీద ఉన్న తల ఒక పక్కకి వాలి ఉండేసరికి… రక్తం ధారపాత్రగా కారుతూ ఉంటే కృష్ణస్వామి మరియు యోగాంబిక ఆనందంతో విలయతాండవం చేస్తూ… మేము జయం పొందాము, ఇది మాయలో పడింది, చచ్చింది అని వాళ్ళు అదృశ్యం అయ్యేసరికి… రుద్రస్వామి, మహాదేవి, పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండేసరికి…. అక్కడికి శ్రీశైల క్షేత్రం నుంచి శివ స్వామి కాస్త ప్రత్యక్ష దర్శనం ఇవ్వడంతో స్వామి!  అనుకోకుండా ఇలా జరిగింది అనేసరికి కంగారు పడవలసింది ఏమీ లేదు, ఇది ఒక మాయ లీలా విన్యాసమే, మీరన్నట్టు శివ నందిని కాస్త కొత్త జన్మకి వెళ్తుంది. స్త్రీ,పురుష ప్రకృతిని దాటి వెళుతుంది. ఇది అందరి జీవితంలోనూ జరుగుతుంది. రావణాసురుడు ఏకాదశరుద్రులకి తన పది తలలను ఇవ్వటం జరిగింది. ఆయన అమరత్వం పొందడం జరిగింది. ఇది అమృతానంద స్థితి. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఆమె ఎదురుగా శివ స్వామి ధ్యాననిష్ఠలో ఉండేసరికి… అందరూ కూడా ధ్యాన నిష్ఠలో కూర్చుందాం అని కూర్చున్నారు.  ధ్యానంలో కూర్చున్న మనసు నిలబడలేక, ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండేసరికి.. శివ నందిని యొక్క మొండెం భాగం నుంచి రక్తం బయటకు రావటం… ఆ రక్తాన్ని శివ నందిని తల జుర్రుకుంటూ ఉండేసరికి… ఇదే కదా చినమస్తా దేవి లీలా విన్యాసం అంటే… ఇప్పుడు శివ నందిని బతికే ఉంది అని రుద్రస్వామి, మహాదేవికి అర్థం అయ్యేసరికి… యధావిధిగా కొద్దిసేపటికి కడుపు నిండిందేమో అన్నట్టుగా శివ నందిని తలకాస్త ఆ మొండానికి అతుక్కొని… శివనందిని స్వరూపం సజీవంగా తనతో ఉన్న మొండం లాగా క్షణకాలంలో జరుగుతూ ఉండేసరికి క్షణకాలం శివ స్వామిని చూసి ఆశ్చర్య ఆనందాలకి గురి అవుతూ స్వామి! మీరెప్పుడు వచ్చారు….అనేసరికి , అప్పుడు రుద్ర స్వామి కాస్త తనకి జరిగిన లీలా విన్యాసం గురించి చెప్పేసరికి ఓహో!  అంటే నేను చనిపోయానని పునః సృష్టి చేయడానికి మీరు వచ్చారా?  అనేసరికి పునః సృష్టి చేయడం కాదు, నీలో ఉన్న మాయ రహిత స్థితి స్త్రీ, పురుష ప్రకృతి నుంచి మమకార మాయలు మాయం అయ్యి ఇప్పుడు సాధన స్థితి పరిశుద్ధ స్థితికి వెళ్లడం జరుగుతుంది.  నాకు తెలిసి భోగ మాయలు దాటావు, యోగ మాయలు దాటావు ,దానికోసం అని చినమస్తా దేవి ధ్యానంలో నీ తలని ఖండన చేయడం ధ్యాన దృశ్యంగా చూడడం జరిగింది.  అదేవిధంగా రేణుకా మాత తల కూడా పరశురాముడు ఖడ్గంతో ఖండనం చేయటం వలన… ఇక్కడ ఏకవీర మాతగా రూపాంతరం చెందడం జరిగింది. అదే విన్యాసం నీకు ఇక్కడ జరిగింది. స్త్రీ పురుష ప్రకృతికి అతీతమైన స్థితికి నువ్వు వెళ్ళటం జరుగుతుంది.  మూల ప్రకృతికి వెళ్ళటానికి నీకు అర్హత, యోగ్యత, యోగం పొందే అవకాశం కలిగింది. ఇక నేను వెళ్ళొస్తాను అని శివ స్వామి కాస్త అదృశ్యం అవ్వడం జరిగేసరికి….. యధావిధిగా ఏమీ తెలియనట్లుగానే శివ నందిని కాస్త ధ్యాన నిష్ఠలోకి వెళ్లడం జరిగింది.

సహస్ర చక్రం రెండవ భాగం - చిన్నమస్తా దేవి నిజ రూప దర్శన అనుభవం

ఎప్పుడైతే శివనందిని శ్రీకృష్ణ లీలామాయలను దాటిందో….. తర్వాత యధావిధిగా ధ్యాననిష్ఠలోకి వెళ్లి సహస్ర చక్ర సాధన చేయడం ఆరంభించింది. ఇలా ధ్యానం చేస్తూ ఉండగా…..  ధ్యానంలో తనకి చిన్నమాస్తాదేవీ దర్శనం అవ్వడం లీలగా కనిపించింది. ఇక దానితో శివ నందినీకి ధ్యాన భంగమై కళ్ళు తెరిచేసరికి పక్కనే ఉన్న మహాదేవి కాస్త 

మహాదేవి:- ఏమైంది తల్లి?  అంటే ఏమి లేదమ్మా చిన్న మస్తాదేవి దర్శనమైంది.  ఇక ఇప్పుడు ఈవిడ అనుగ్రహం మనం పొందవలసి ఉంటుంది.

 రుద్రస్వామి:-చినమస్తా దేవి దర్శనం అవ్వాలంటే…. నేను అనే అహంకారం పోగొట్టుకోవాలి..

మహాదేవి:- అదేంటి….. శివ నందిని బ్రహ్మ చక్రంలో నేను అనే అహంకారం పోగొట్టుకుంది కదా…!? 

రుద్రస్వామి:- అది కాదు, అహంకారం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మహంకారం. రెండు దేహాహంకారం అని రెండు రకాలుగా ఉంటుంది.  ఆత్మహంకారం అంటే నేను అనే అహంకారం.. దేహ అహంకారం అంటే నాది అనే మమకారమే అహంకారమాయగా మారుతుంది.  ఇప్పుడు శివ నందిని బ్రహ్మ చక్రంలో నేను అనే అహంకారాన్ని పోగొట్టుకుంది. కానీ, నాది అనే మమకారాన్ని పోగొట్టుకోలేదు. అంటే ఈ దేహ అహంకారం మాయని పోగొట్టుకోలేదు…

మహాదేవి:-అంటే దేహ అహంకారం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి?

రుద్రస్వామి:- చిన్న మస్తాదేవికి దేహ  సమర్పణ ఇవ్వాలి.  తన తలని బలి ఇవ్వాలి. 

మహాదేవి:- అంటే దేహబలి ఇస్తే నరబలి అవుతుంది కదా ! అప్పుడు సాధనకు దేహం ఉండదు కదా!  అప్పుడు దీనికి సాధన ఆగిపోయినట్టే కదా! సాధన పరిసమాప్తి కాదు కదా…

(అనేసరికి రుద్ర స్వామి పెద్దగా నవ్వుతూ)

రుద్రస్వామి:-అదే చినమస్తా దేవి లీలా విన్యాసం… తినేముందు రుచేందుకు… అడగటం. ఆవిడ చూపించే లీలా విన్యాసం చూడు.  ఏం జరుగుతుందో నీకే విషయం అర్థమవుతుంది.  ఆవిడ మహామాయని శివ నందిని దాటగలిగితే ఆవిడ తల నరుకుతుంది… దాటలేదు అంటే మాత్రం సాధన ఇక్కడితో ఆగిపోతుంది.

మహాదేవి:-అయినా చినమస్తా దేవి సాధన తంత్ర విధివిధానం కదా! ఇప్పుడు మళ్ళీ వామాచారంలోకి వెళ్లాలా? 

రుద్రస్వామి:- చినమస్తా దేవి వామాచారంలో ఉన్నా ,దక్షిణాచారంలో ఉన్నా కూడా మనలో ఉన్న దేహం అహంకారం కి…. అనగా దేహభిమానమునకు, ఇతరుల మీద మమకారం మోహ వ్యామోహాలు, ఇది నాది, నా వాళ్ళు అనే మోహా వ్యామోహాలు అన్నింటిని నిర్మూలన చేస్తుంది. చినమస్తా దేవి ఆరాధన వలన ఇవన్నీ నిర్మూలన అవుతాయి. ఈ అహంకారం మాయ నిర్మూలన కోసమే ఆవిడ అధిష్టాన దైవంగా ఉన్నది.అలాగే మనకి చినమస్తా దేవి దగ్గర మనకి జయ విజయా అనే ఇద్దరు చెలికత్తెలు ఉంటారు.. వీళ్లిద్దరిలో ఒకరు ఆత్మ అహంకారానికి సంకేతం అయితే, ఇంకొకరు దేహాహంకారానికి సంకేతం. ఈ రెండు కూడా తను నిర్మూలన చేసుకుంది అని అమ్మవారు తన తలని నరికేసుకుని వీరిద్దరికీ కూడా తన రక్త ధారను ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది.అదే చినమస్తా దేవి స్వరూపం.

అనేసరికి ఓహో ఈవిడ స్వరూపంలో ఇంత అర్థం మూలార్థం ఉందా…. అని చెప్పి శివ నందిని అనుకుంటూ ఉండేసరికి… బాలగణపతి, బాల కుమారస్వామి ఆడుకుంటున్నట్లుగా చూసేసరికి… 

మహాదేవి:- వీళ్లేంటి పిల్లలు ఎక్కడికి వచ్చారు?

శివ నందిని:- ఏమో నాకేం తెలుసు? అయినా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా.!  ఆడుకోనివ్వు..

అని అంటుంటే ఇంతలో సుమారుగా 85 సంవత్సరాలు ఉన్న వయోవృద్ధురాలు స్త్రీ మూర్తి, చేతి కర్రతో నడుచుకుంటూ పిల్లల దగ్గరికి రావడం వీలు గమనించారు.  మహాదేవికి కంగారు వచ్చి…

మహాదేవి:-  పిల్లల్ని ఎత్తుకుపోయే ఆవిడేమో… ఎవరూ లేరు అనుకుని పిల్లలకి మాయమాటలు చెప్పి తీసుకువెళ్తుందేమో కదా!

అనేసరికి ఏం జరుగుతుందో అని వీళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అప్పటికే ఆ ముసలావిడ పిల్లలతో మాట్లాడుతూ కనిపించింది. 

శివ నందిని:-  ఎవరమ్మా నువ్వు?  నా పిల్లలు దగ్గరికి ఎందుకు వచ్చావు?

వృద్ధ స్త్రీ:- వీళ్ళు నీ పిల్లలా ? నీకు పుట్టిన పిల్లలా?

శివనందిని:-వీళ్ళు నాకు పుట్టకపోయినా దత్తపుత్రులు. నా వాళ్లే.

వృద్ధ స్త్రీ:- ఓహో!  ఇంకా నీది నాది అనే జ్ఞానంలోనే ఉన్నావా?  వీళ్ళు నీ పిల్లలు అంటావు.. వీళ్ళు నా పిల్లలు కాదా? మీరు నా పిల్లలు కాదా?

మహాదేవి:-అదేంటి… నేను ఇప్పుడే చూడటం జరుగుతుంది. నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు. మా అందరిని కూడా నీ పిల్లలు అనుకుంటున్నావేంటి?

వృద్ధ స్త్రీ:- భూమి పుట్టక ముందే నేను పుట్టాను. భూమి అంతరించిపోతోంది.. భూమి మీద ఉన్న జీవులు, జీవరాసులు, జీవజాతులు అన్నీ కూడా అంతరించిపోతాయి. గాని నేను మాత్రం అంతరించిపోవట్లేదు. నాకు చావు రావడం లేదు. అందుకని చావుకోసం ఎదురు చూస్తున్నాను.

మహాదేవి:- దీనికి పిచ్చి పట్టి పరాకాష్టకు చేరుకుంది. ఇది పిచ్చిది అనుకుంట.. ఏవేవో మాటలు మాట్లాడుతుంది..

అన అనేసరికి రుద్ర స్వామి కాస్త మౌనంగా ఉండమని చెప్పి సైగ చేస్తూ ఈవిడ వంక పరిశీలనగా చూస్తూ.. శివ నందిని కేసి చూసి… 

రుద్రస్వామి:- ఆవిడ ముఖ కవళికలు గమనించావా?

అనేసరికి మహాదేవి, శివ నందిని ఈవిడ వైపు పరిశీలనగా చూసేసరికి…. శివ నందిని సుమారుగా 85 సంవత్సరాల వయసు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఈవిడ ముఖ కవళికలు, శివ నందిని ముఖ కావాలి లాగా సుస్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి… 

మహాదేవి:- అవును, శివ నందిని 85 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుందో… ఈవిడ అలాగే ఉంది. కొంపతీసి ఈవిడ శివ నందినికి సంబంధించిన ఆవిడ?

రుద్రస్వామి:- ఏమో ఎవరికి తెలుసు? మనం చిన్న మస్తాదేవి దేవి గురించి మాట్లాడుతూ ఉండగానే ఈవిడ కనపడింది కదా!  ఒకవేళ ఈవిడ ఏమైనా చినమస్తా దేవినా? 

మహాదేవి:-చినమస్తా దేవికి తలభాగం ఉండదు కదా!  ఈవిడకి తలం ఉంది కదా!  ఈవిడ చిన్నమస్తా దేవి ఏంటి?  ఎవరో పిచ్చిదై ఉంటుంది.. ఏమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది.  వేదాంతానికి పరాకాష్ట పిచ్చి ఉంటుంది కదా!  మతి భ్రమణం చెంది ఉంటుంది.  నువ్వు అనవసరంగా ప్రతి వాళ్ళలోనూ భగవంతుడిని చూస్తూ, ఆ దేవత అని… ఈ దేవత అని అనుకుంటున్నావు. ఇది నిజంగా పిల్లలు ఎత్తుకుపోయేది.  ముందు పిల్లల్ని తీసుకొచ్చుకో శివ నందిని..

వృద్ధ స్త్రీ:- నేను పిల్లల్ని ఎత్తుకు వెళ్ళే ఆవిడని కాదు, పిల్లలను చంపే దాన్ని. పిల్లల్ని నేనే సృష్టిస్తాను. నేనే పెంచుతాను. నేనే నాశనం చేస్తాను.  అన్నీ నా చేతుల్లోనే జరుగుతాయి. నేనే సృష్టి, స్థితి, లయ కారకానికి మూల కారకురాలిని. నేనే ఆదిపరాశక్తిని.

మహాదేవి:- మరి ఆదిపరాశక్తివి అయి ఉండి నువ్వు ఎందుకు చావు గురించి ఆలోచిస్తున్నావు?

వృద్ధ స్త్రీ:- నాకు మోక్షం కావాలి. మోక్షమరణం కావాలి.  నన్ను చంపే ఆవిడ కోసం ఎదురు చూస్తున్నాను.

మహాదేవి:- నిన్ను చంపే వాళ్ళు ఎవరుంటారు.. నువ్వేగా ఆదిపరాశక్తివి.

మహాదేవి:- ఆదిపరాశక్తి అయినప్పటికీ.. నా అంశా రూపాలలో ఒక రూపం వచ్చి నన్ను చంపుతుంది. ఆ చంపే ఆవిడ నన్ను చంపటం లేదు.  నేను ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆవిడ అనుగ్రహం పొందటానికి చూస్తున్నాను.  ఆవిడ నన్ను చంపటం లేదు. 

అనేసరికి…. వీళ్ళ ముగ్గురికి ఈవిడ మాటలు అర్థం కానట్టుగా, అయోమయ స్థితిలో ఉంటూ ఉండేసరికి… ఒక ఆవిడ కత్తి పట్టుకొని వస్తూ ఉంటే, ఇద్దరు ఆడవాళ్లు పక్కన ఉండి వస్తున్నట్లుగా కనిపించింది. అదిగో ఆవిడ చేతిలో ఉన్న ఖడ్గం ఉంది చూసావు కదా!  ఆవిడ చేతిలోనే నాకు మరణం రావాలి.  ఆవిడ నాకు మరణం ఇవ్వట్లేదు. వస్తూ ఉండంగా ఈ పిల్లలు కనపడ్డారు. చిన్న పిల్లల మీద మమకారం, మోహ వ్యామోహం ఉండటం వలన ఆవిడ దగ్గరికి వెళ్ళటం మర్చిపోతున్నాను. ఆవిడేమో నాకు చావు ఇవ్వటం లేదు.  నేనేమో చచ్చిపోవాలి అనేసరికి… ఈ ముగ్గురు ఉన్న స్త్రీలు వీళ్ళ ముందుకు వెళుతూ ఉంటే,ఈ వృద్ధ స్త్రీ ఆవిడ దగ్గరికి వెళ్తూ….

వృద్ధ స్త్రీ:- అమ్మ నువ్వు నన్ను చంపేసేయ్.. నీ చేతిలో ఉన్న కత్తితో నా తల నరికేసేయి.

అంటూ ఉండేసరికి రుద్ర స్వామికి, మహాదేవికి, శివ నందిని కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 

రుద్రస్వామి:- ఇదేదో మాయ లాగా ఉంది. మనకు అవసరం లేదు. మనం ధ్యానంలోకి వెళ్లిపోదాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా! 

శివ నందిని:-  అసలు వీళ్ళు ఎవరు?  వీళ్ళు ఎవరో తెలుసుకుందాం… ఎందుకంటే ఆ వృద్ధురాలిలో నా ముఖ కవళికలు కనపడుతున్నాయి.  ఒకవేళ ఆవిడ నా శరీరానికి సంబంధించినదో… లేదంటే నా సాధనకు సంబంధించినదో అయ్యి ఉండవచ్చు కదా!  అసలు ఏం జరుగుతుందో ఆవిడని అనుసరిద్దాం… వాళ్ళు ఏం చేస్తున్నారో!

అని అనేసరికి కత్తి పట్టుకున్న ఆవిడని మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు అమ్మ!  మాకు ఆకలి వేస్తుంది… రక్తంతో మా ఆకలి తీర్చు అని అంటూ ఉండేసరికి… ఆ ముసలావిడ చంపమని బతిమాలుతుంది కదా ఆవిడని చంపేసేయి అంటూ ఉండేసరికి…. కత్తి పట్టుకున్న ఆవిడ కాస్త .. ఆవిడని చంపాలంటే ఆవిడకి అర్హత, యోగ్యత, యోగం ఉండాలి. తనకి ఇంకా ఆ స్థితి రాలేదు. ఆ ముసలావిడకి దేహ అహంకారం ఉంది.దేహం మీద మమకారం మోహ వ్యామోహాలు ఉన్నాయి.  నాకు చంపడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళని ఎవరినైనా చంపి మీ ఆకలి తీరుస్తాను అని అంటూ ముందుకు వెళుతూ ఉండేసరికి…. ఆ వృద్ధ స్త్రీ కూడా నాకు ఏమాయ, మోహ ,మమకారాలు, అహంకారాలు లేవు. నన్ను చంపేసేయి. నాకు విముక్తి కలిగించి… మోక్షం ఇవ్వు అనేసరికి… రుద్రస్వామి, మహాదేవి, శివ నందిని వీళ్ళని అనుసరించడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒక గుహలోకి వెళ్ళటం జరిగింది. అక్కడ గాఢాంధకారా చీకటి తప్ప ఎలాంటి విగ్రహాలు లేని గాని ఏమీ లేవు. కానీ అక్కడ ఒక బలిపీఠం లాగా నరబలులు ఇచ్చినట్లుగా అస్థిపంజరాలు అవన్నీ కనిపించడం, అస్థిపంజరం నుంచి కపాలం వేరు చేసిన దృశ్యాలు ఉన్నట్లుగా… వీళ్ళ ముగ్గురు గమనించి మౌనం వహించారు.  అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని అలాగే ఉన్నారు. ఆ ఖడ్గం పట్టుకున్న ఆవిడ ఒక్కసారిగా శివ నందిని చూస్తూ….

స్త్రీ మూర్తి:- మీరు ఎందుకు వచ్చారు ? మీరు మమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నారు.?

మహాదేవి:- ఏమీ లేదమ్మా…. ఈ ముసలావిడ తనని చంపమని బతిమిలాడుతుంది కదా!  నరబలి కావాలని ఎందుకు కోరుకుంటుందో మాకు అర్థం కాలేదు. పైగా మా అమ్మాయి శివ నందిని పోలికలు ఈ ముసలావిడలో ఉన్నాయి. అందుకోసం అని మేము రావడం జరిగింది.

స్త్రీ మూర్తి:- దేహ అహంకార మాయని దాటటానికి ఆవిడ వచ్చింది. ఆవిడ మాయని దాటలేక పోతుంది. కావాలంటే శివ నందినినీ నేను చంపుతాను. చంపమంటావా?

అనేసరికి శివ నందిని అవునని… కాదని… అనకుండా మౌనస్థితిలో అలా ఉండిపోయింది.  ఒకవేళ ఈవిడని చంపితే దేహం ఉండదు, దేహం లేకపోతే సాధన ఉండదు. సాధన ఆగిపోతుంది కదా!  సాధన పరిసమాప్తి కాదు కదా!  మోక్షమును పొందే పరిస్థితి కాదు కదా! అనే సందిగ్ధంలో శివ నందిని ఉండటం రుద్రస్వామి, మహాదేవి గమనించారు.  అది నిజమే కదా! దేహం పోతే సాధన ఆగిపోతుంది కదా! అనుకుంటూ ఉండేసరికి ముసలావిడ కాస్త…

వృద్ధ స్త్రీ:- వయసులో ఉన్న దానిని చంపుతాను అంటావు, ముసలిదానిని నన్ను చంపను అంటావు… దానికి దేహాహంకారం లేదా? . అది తన పిల్లల్ని కానీ పిల్లల్ని నా పిల్లలు అనే, నాది అనే మమకార మాయలో ఉంది. నాకు ఏ పిల్లలు లేరు.. ఏ పీచులేదు… నన్ను చంపొచ్చు కదా!  నాకు దేహం మీద కూడా మమకారం లేదు. ఈ వృద్ధ శరీరం పోతుంది. జన్మ విముక్తి కలుగుతుంది. అనేసరికి…అప్పటికి గాని శివ నందినికి విషయం అర్థం కాలేదు.  దేహ అభిమానం ఉండటం అంటే నాది, నా వాళ్ళు, నా పిల్లలు అని మమకార మాయలో ఉన్నాను అని ఈ వృద్ధురాలు చెప్పకనే చెబుతుంది…అంటే నేను అనే అహంకారాన్ని బ్రహ్మచక్రంలో పోగొట్టుకుంది కానీ… నేను, నా వాళ్ళు, నా పిల్లలు అనే మమకార మాయను తను పోగొట్టుకోలేదు. కాబట్టి ఇక ఈ మోహ మాయ పోగొట్టుకోవాలంటే చినమస్తా దేవి అనుగ్రహం పొందక తప్పదు. ఈవిడే చినమస్తా దేవి అయి ఉండాలి.. ఆ ఇద్దరు ఆడవాళ్లు కూడా జయ విజయలు చెలికత్తెలు అయి ఉండాలి. ఈవిడ ఖడ్గంతో ఉన్నది కాబట్టి…. ముసలావిడ నర బలి చేసుకోమని అడుగుతుంది.  కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ….ఖచ్చితంగా చిన్న మస్తా దేవియే అని శివ నందిని కి జ్ఞాన స్ఫురణ అందడంతో….

శివ నందిని:- అమ్మ! నేను నరబలికి సిద్ధమే.  నా తలకి నీకు సమర్పిస్తాను.  నాకు ఎలాంటి మోహమాయాలు లేవు. 

వృద్ధ స్త్రీ:- అదేమిటి?  ముసలావిడేమో నీకు పిల్లల మీద మమకారం ఉంది. నా పిల్లలు ,నా వాళ్ళు అనేది ఉంది అంటుంది కదా! అలా అయితే నీకు పిల్లల మీద మోహా వ్యామోహాలు లేవా?

శివ నందిని:- లేవు… అయినా వాళ్ళు  నాకు  పిల్లలు కాదు.. దత్త పిల్లలు. 

స్త్రీ మూర్తి:- కన్నెపిల్లలు అయితే మోహ వ్యామోహాలు ఉంటాయా?

శివ నందిని:- నాకు ఎవరి మీద ఎలాంటి ఇది లేదు.  కన్నపిల్లలైనా ….దత్త పిల్లలైనా ….పిల్లలే కదా!  కన్నతల్లి ప్రేమ అయినా, పెంచిన తల్లి ప్రేమ అయినా అంతే గొప్పగా ఉంటుంది కదా! వాళ్ళని నేను కనకపోవచ్చును… వాళ్ళని నేను పెంచుతున్నాను.. ఆ మమకారం తో బాధ్యతగా తల్లిగా వాళ్లకి నేను చూపించాను.  వాళ్ళని నేను బంధనంలో పడకుండా బాధ్యతగా పెంచితే సరిపోతుంది అని నాకు అర్థం అయింది. 

స్త్రీ మూర్తి:- అయితే ముందు నీ పిల్లలని చంపుతాను.  అందుకు నువ్వు సిద్ధమేనా? 

శివ నందిని:- తల్లి నీ ఇష్టం… నాది అనే మోహ మాయ నుంచి నేను తప్పుకున్నాను. ఇక్కడ ఎవరికీ ఎవరు పిల్లలు… అందరూ ఆదిపరాశక్తి బిడ్డలమే.. కదా! బ్రహ్మము, బ్రహ్మమును సృష్టిస్తుంది.. బ్రహ్మము బ్రహ్మమునే తినేస్తుంది…ఆయనకి ఆయనే పుడుతున్నాడు.. ఆయనకి ఆయనే పెరుగుతున్నాడు… ఆయనకి ఆయనే చస్తున్నాడు… చంపేవాడు ఎవరూ?  చచ్చేవారు ఎవరు?  అంతా ఒకటే కదా!  నేను వేరు, అది వేరు అనుకోవడమే ఇక్కడ మాయ అవుతుంది. నేను, నాది, మనది అనుకోవటమే త్రిమాయలుగా అనిపిస్తుంది. నేను, నేనే మాయని విభజన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేనైనా, వీళ్ళయినా, పిల్లలైనా, మీరైనా, ఒకటే కదా! ఒకటే బ్రహ్మ పదార్థం నుంచి వచ్చాము కదా!

స్త్రీ మూర్తి:- మెట్ట వేదాంతం నా దగ్గర చెప్పద్దు. అనుభవ పాండిత్యం కావాలి. శబ్ద పాండిత్యం ఎంతైనా చెప్పచ్చు. నీకు నిజంగా పిల్లల మీద మమకారం లేదా?  లేదు అంటే నీ పిల్లల్ని తీసుకురా!  వాళ్ళని చంపుతాను… 

(అని  ఖడ్గం పట్టుకున్న ఆవిడ అనేసరికి శివ నందిని కాస్త ఆడుకుంటున్న పిల్లల్ని గట్టిగా పిలిచేసరికి ….వాళ్ళు వచ్చి ఏంటమ్మా!  అనేసరికి….)

శివ నందిని:- ఈ అమ్మ మిమ్మల్ని చంపుతుంది అంట….చచ్చిపోతారా?

పిల్లలు:- మేము చావటానికే కదా అమ్మ వచ్చింది. నీ చేతిలో చస్తే ఏముంది…?  ఆ అమ్మ చేతిలో చస్తే ఏముంది? మాకు ఒక రావాల్సింది మోక్షం మరణమే కదా!  

స్త్రీ మూర్తి:- మరి మీకు మీ అమ్మ మీద మమకారం లేదా?

పిల్లలు:- అమ్మ మీద ప్రేమ ఉంటుంది గానీ మమకారం మాయలు లేవు. మేము అన్ని మానసికంగా వదిలేసి వచ్చాము.. శారీరకంగా మేము బంధమాయల్లో లేము.  అమ్మ ఎప్పుడైనా చనిపోవచ్చు లేదా అమ్మ కన్నా ముందు మేము చనిపోవచ్చు లేదా మా కన్నా ముందు అమ్మ చనిపోవచ్చు. చావటానికే సాధన చేస్తున్నాము. బతకడానికి కాదు కదా!  చావటానికి వెళుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుంటే ఉపయోగం లేదు. కదా! 

అని బాలగణపతి, బాల కుమారస్వామి అనేసరికి… 

స్త్రీ మూర్తి:- నీ పిల్లలు గడుగ్గాయలు లాగా ఉన్నారు… నీకన్నా అనుభవ పాండిత్యంలో ఉన్నట్టున్నారు అని ముందు వీళ్ళిద్దరిని చంపేస్తాను…

అని ఏకకాలంలో బాలగణపతిని, బాల కుమారస్వామిని తన ఖడ్గంతో తల నరికేసరికి మహాదేవి ఉలిక్కిపడి మూర్చీల్లి పడిపోయింది.  రుద్ర స్వామికి అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటే…. శివ నందిని కాస్త అలా మౌనంగా చూస్తూ ఉండిపోయింది.  రుద్ర స్వామికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి గాని, శివ నందినికి ఎలాంటి నీళ్లు రాలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. 

స్త్రీ మూర్తి:- ఇప్పుడు నీకు  నా మీద కోపం లేదా?

శివ నందిని:- అమ్మ కోపాలకి ఇక్కడ అవకాశం ఏముంది?  నీ బిడ్డలని నువ్వే పుట్టించావు.. నువ్వే పెంచావు.. నువ్వే తీసుకున్నావు.. దాంట్లో ఏముంది… నువ్వే మహా మృత్యువు.  ఈ దేహాలు ఎప్పటికైనా మృత్యువాత పడాల్సిందే కదా!  ఏవి కూడా శాశ్వతం కాదు కదా!  కాలానికి అనుగుణంగా, కర్మానుసారంగా, పరిస్థితులకు అనుగుణంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో పుడతారు. ఒక్కొక్క సమయంలో పోతారు. ఇది అంతా కూడా కాలచక్రంలో ఉండే లీలా విన్యాసమే గాని ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండరు. పిల్లలు కూడా ఇంకా అదృష్టవంతులు.  సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశ స్వరూపంలో అమ్మే స్వయంగా పిల్లల్ని తీసుకువెళ్లటానికి ఈ భూమి మీదకి వచ్చి తీసుకువెళ్లింది.  అంటే  అది వాళ్ళు చేసుకున్న పుణ్యం.  వాళ్ళు ఎన్నో జన్మల ధ్యాన స్థితిలో ఉండటం వలన వాళ్లకి ఈ యోగం వచ్చింది. నీ చేతిలో స్వయంగా మరణం పొందడం అంటే వాళ్ళు ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నారు.  నేను దాన్ని తప్పుపట్టటం లేదు. అమ్మ పుట్టించింది, అమ్మే తీసుకుంది.

స్త్రీ మూర్తి:- భలా! నువ్వు నాకు నచ్చావు. అంటే నువ్వు నాది అనే అహంకారం దాటేశావు.  నాదీ నేను  అనే మాయని కూడా దాటుకున్నావు.  అయితే ఇక నిన్ను బలి ఇస్తాను…

(అంటూ ఉండేసరికి రుద్ర స్వామి కాస్త స్పృహలోకి వచ్చి …)

రుద్రస్వామి:- అమ్మ! మరి ఈవిడని బలిస్తే …సాధనకు దేహం కావాలి కదా !

అనేసరికి పెద్దగా నవ్వుతూ పిచ్చివాడా…..! అంటూ ఉండేసరికి వయోవృద్ధురాలు కాస్త శివ నందిని శరీరంలోకి ప్రవేశించటం…వెంటనే ఖడ్గం పట్టుకున్న ఆవిడ కాస్త శివ నందిని తలను ఏకకాలంలో నరికి వేయడంతో…. తన తల పక్కకి పడిపోవడం జరిగింది. స్పృహలోకి వచ్చిన మహాదేవి కాస్త శివ నందిని చనిపోయింది అని ఏడుపు అందుకోవడం జరిగింది. 

మహాదేవి:- తల్లి…!  దేహ అహంకార మాయ కోసం నీ దేహాన్ని బలి చేసుకొని… నరబలి అయ్యావా?  ఇప్పుడు నా కూతురు సాధన పరిసమాప్తి పరిస్థితి ఏమిటి?  నా కూతుర్ని అన్యాయంగా చంపేశావు… అసలు నువ్వు ఎవరు?  నా కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది. అహంకార మాయాలో ఉంది అని నా కూతుర్ని అన్యాయంగా చంపేశావు.

అని మహాదేవి కాస్త ఖడ్గం పట్టుకున్న స్త్రీ మీదకి రాబోతుంటే…. అయోమయ స్థితిలో ఉన్న రుద్ర స్వామి కాస్త సాధారణ స్థితికి వచ్చి…

రుద్రస్వామి:- మహాదేవి ఏం చేస్తున్నావు? కోపావేశాలకి లోనవుతున్నావు… క్షణికావేశంలో ఉన్నావు… శివ నందినికి మంచే జరిగింది. శివ నందిని చనిపోలేదు.. జాగ్రత్తగా చూడు.. విషయం నీకే అర్థం అవుతుంది..

అంటూ ఉండేసరికి నేల మీద పడిన శివ నందిని కాస్త యధావిధిగా మొండానికి అతుక్కొని శివ నందిని కాస్త మామూలు స్థితికి వచ్చేసరికి… ఆ దృశ్యం చూసిన మహాదేవికి కోపావేశాలు తగ్గే సరికి… మరి ఎవరు చనిపోయారు?  అనేసరికి

రుద్రస్వామి:- శివ నందినికి ఈ సహస్ర చక్రంలో ఉన్న దేహం యొక్క తలను  చేయడం జరిగింది.  శివ నందిని భౌతిక దేహాన్ని కాదు… శివ నందిని సంకల్ప శరీరంలో ఉన్న దేహ అహంకార మాయకి శిరఖండనం జరిగింది. ఆ దేహానికి విముక్తి కలిగింది.

ఆ ఖడ్గంతో ఉన్న ఆవిడ చినమస్తా దేవిగా మారడం…. తన పక్కన ఉన్న ఆడవాళ్లు కాస్త జయ, విజయలుగా చెలికత్తెలుగా మారడం…. ఆవిడ తనకు ఖడ్గంతో తన తలను నరికేసుకుని వీరిద్దరికీ రక్త దాహం తీర్చడం…. క్షణకాలంలో జరిగిపోయి…. ఈ దృశ్యం కాస్త సజీవమూర్తిగా ఉన్న విగ్రహంగా క్షణకాలంలో మారేసరికి… ఈ విధంగా చిన మస్తాదేవి తనకి అనుగ్రహించింది అని శివ నందిని అనుకుంటూ…. శివ నందిని ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది. అనంతరం శివ నందిని తన పరిచారికలతో చినమస్తా దేవి అదృశ్యం అవటం జరిగింది. ఇక వీళ్లిద్దరూ కూడా ఆవిడకి నమస్కారం చేసి తనలో అంతిమంగా ఉన్న దేహహంకారమాయను ఈ విధంగా తొలగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటికి రావటం జరిగింది. అప్పుడు మహాదేవి కాస్త రుద్ర స్వామి తో 

మహాదేవి:- ఈ అహంకారం ఆయన దాటితే ఏమవుతుంది?

రుద్రస్వామి:- అహంకారం దాటితే అహం బ్రహ్మాస్మి స్థితి వస్తుంది. నేనే దేవుడిని నేనే విశ్వాధినేతని, సర్వం నేనే, అనే స్థితిని పొందడం జరుగుతుంది. ఈ స్థితిని అనుభవం అనుభూతి పొందాలంటే… మనం దక్షిణామూర్తి అనుగ్రహం పొందాల్సి ఉంటుంది.  ఇక సహస్ర చక్రంలో మూడవ భాగంలో ఉండే దక్షిణామూర్తి అనుగ్రహం పొందవలసి ఉంటుంది…

అని చెప్పి మాటాడుకుంటూ…. బయటకు రాగానే పిల్లలు ఆడుకుంటూ కనిపించడంతో ఇదంతా చిన మస్తాదేవి లీలా విన్యాసం అని… గ్రహించి…. మనసులోనే నమస్కారం చేసుకుని…. ఇక శివ నందిని దక్షిణామూర్తి అనుగ్రహం కోసం సహస్ర చక్ర  ముద్రతో ధ్యాన నిష్ఠలో కూర్చోవడం జరిగింది.నేను అనేది త్యాగం చేయడంతో మాటలకి అందని స్థితిని మనఃశాంతిని, ఆత్మ శాంతి అనుభవాలు, పరమ శాంతిని పొందడం శివ నందిని కి అర్థం అవ్వడం జరిగింది. దీనినే మరణం తర్వాత వచ్చే శాంతి లేదా రిప్(RIP)అంటే ఇదే కాబోలు అని శివ నందిని అనుకోసాగింది. కానీ ఇది అనుభవం లోకి రావాలంటే దక్షిణామూర్తి అనుగ్రహం పొందవలసి ఉంటుంది అని అనుకుంటూ తన ధ్యాన నిష్ఠను కొనసాగించడం జరిగింది.


సహస్ర చక్రం మూడవ భాగం - దక్షిణామూర్తి నిజరూప దర్శనం

(అహం బ్రహ్మాస్మి స్థితి అనుభవం)


శివ నందిని కాస్త దక్షిణామూర్తి అనుగ్రహం కోసం యధావిధిగా సహస్ర చక్రం ముద్రతో సాధన చేయడం ఆరంభించింది. కొంతసేపటికి సహస్ర కమలంలో మూడవ భాగంలో దక్షిణామూర్తి నిజరూప దర్శనం ధ్యాన దృశ్యంగా చూడటం జరిగింది. ఆయన దర్శనము అనుభవ పూర్వకంగా చేసుకోవాలి.  ధ్యాన అనుభవం కాదు… నిజరూప అనుభవం పొందాలి అని స్ఫురణ అందేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరవటం జరిగింది. అప్పుడు పక్కనే ఉన్న రుద్రస్వామి కాస్త….

రుద్రస్వామి:- ఈసారి దక్షిణామూర్తి దర్శనం ఇచ్చారా?

శివ నందిని:- అవును, ఆయన మౌన మూర్తిగా ఉండి దర్శనం ఇచ్చారు.  ఏమీ మాట్లాడలేదు… చూడను కూడా చూడలేదు.  అర్థనేత్రాలతో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండటం, ఆయన చుట్టూ నలుగురు వయోవృద్ధులు ఉండటం జరిగింది.  బహుశా వాళ్ళు సనకానాదులు అయి ఉంటారు.

రుద్రస్వామి:-అవును, ఆయన… వాళ్ళు నలుగురు ఉంటారు.  ఇక్కడ విచిత్రం ఏమిటంటే… గురువేమో యువకుడి రూపంలో, శిష్యులు ఏమో వయోవృద్ధుల రూపంలో ఉంటారు. అది దక్షిణామూర్తి ప్రత్యేకత. 

శివ నందిని:- అవును, నిజమే.  ఆయనని చూస్తేనేమో వయసులో ఉన్నారు.. శిష్యులు ఏమో వయోవృద్ధులుగా ఉన్నారు. ఆ విధంగానే దర్శనం అయ్యింది.

రుద్రస్వామి:- ఇక ఆయన అనుగ్రహం పొందటానికి నువ్వు ధ్యానంలో సాధన చేస్తూ ఉండు… దక్షిణామూర్తి అనుగ్రహం పొందితే అహం బ్రహ్మాస్థితిని అనుభవ పూర్వకంగా పొందడం జరుగుతుంది. నీలో ఉన్న అహంకారాలను నాశనం చేశావు కదా! ఇక అహం బ్రహ్మాస్మిస్థితి అనుగ్రహం పొందాలి అంటే మౌనమూర్తి అయిన దక్షిణామూర్తి అనుగ్రహం పొందక తప్పదు…

అవును అది నిజమే కదా అని అనుకుంటూ యధావిధిగా ధ్యానం కొనసాగించడం జరిగింది. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అలికిడిగా అరుపులు వినపడుతూ ఉండేసరికి ……ధ్యాన నిష్ఠ లోకి వెళ్ళబోతు కూడా….శివ నందిని కాస్త శబ్దం వస్తున్న వైపు చూస్తే, సుమారుగా 32 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు కనిపించాడు. ఈ యువకుడు చూడటానికి నగ్నంగా శిరోముండనం చేసుకొని ఉన్నాడు.  పైగా నల్లని దేహం, ఆరడుగుల ఆజానుబాహుడిలాగా కనిపించడం జరిగింది. విచిత్రమైన విషయం ఏమిటంటే…. స్త్రీమూర్తికి ఉండే వక్షోజం ఒకవైపు ఉంటే, మరొకవైపు పురుషుడికి ఉన్నట్టుగా ఉండడం శివ నందిని గమనించింది. ఇది ఏమిటి….?  ఈయనకి వక్షస్థలం తేడాగా ఉంది. ఒకవైపు స్త్రీ వక్ష స్థలం, మరోవైపు పురుష వక్ష స్థలం ఉంది.  కొంపతీసి ఈయన దక్షిణామూర్తి స్వరూపమా? అని అనుకుంటూ ఉండేసరికి ….ఇదే విషయాన్ని గమనించిన మహాదేవి కూడా లో గొంతుతో శివ నందిని చెవిలో

 మహాదేవి:- ఆయన వక్షస్థలం గమనించావా?

శివ నందిని:-  ఆ గమనించాను…. నడకలో కూడా తేడా ఉంది చూసావా? ఎడమకాలు ఆడపిల్ల నడిచినట్టు, కుడికాలు పురుషుడు నడిచినట్లుగా ఉంది. కొంపతీసి అనే దక్షిణామూర్తియా….?

రుద్రస్వామి:-ఎవరు పడితే వాడు దక్షిణామూర్తి స్వరూపం, దేవతల అంశ అని చెప్పి ఎవరి వెంటపడితే వారి వెంటపడితే వాళ్ళు మాయా స్వరూపాలు అవ్వచ్చు…. రాక్షస స్వరూపాలు కావచ్చు…. ఏదైనా కావచ్చు… మిమ్మల్ని తినేయొచ్చు… మోసం చేయొచ్చు..భ్రమ, బ్రాంతి కలిగించవచ్చు… వాళ్ళ మాయ మాటల్లో పడవ వేయవచ్చు… వాళ్ల తంత్రసాధనలో ఉపయోగించుకొని మిమ్మల్ని నరబలి చేయవచ్చు… 

అని అది ఇది అంటూ ఉండేసరికి, ఈ యువకుడిని అనుసరిస్తూ నలుగురు వయోవృద్ధులు రావడం గమనించేసరికి… శివ నందిని కి విషయం అర్థమైంది. ఈయన సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపమే…అనుకోగానే యువకుడు మౌనంగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ వయోవృద్ధులు నలుగురు కూడా తమలో తాము మాట్లాడుకుంటూ స్వామివారిని ప్రశ్నలు అడుగుతూ ఉండేసరికి, ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ముందుకు సాగుతూ ఉన్నారు.  దాదాపుగా 80 కిలోమీటర్ల నుండి మనం నడుస్తూనే ఉన్నాము..! కానీ, స్వామివారు మాట్లాడటం లేదు, ఈయన పూర్ణజ్ఞానం మనకి ఏమిస్తాడు?  అని చెప్పి అనుకుంటూ దాటడం జరిగింది. పూర్ణజ్ఞానం అనే మాట శివనందినికి చెవిన పడేసరికి ఇలా సాక్షాత్తు ఆది గురువు అయినా దక్షిణామూర్తి రూపమే… అని గ్రహించి…

శివనందిని:- నేను వీళ్ళని అనుసరిస్తాను, మీరు వస్తారా?

అనేసరికి సరే మేం కూడా వస్తాము అని… రుద్రస్వామి, మహాదేవి కూడా వీళ్ళని అనుసరించడం జరిగింది. ఆ యువకుడు కాస్త పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చొని వీరాసనంలో దక్షిణామూర్తి భంగిమలో కూర్చున్నట్టుగా కూర్చునే సరికి, ఈ వయోవృద్ధులు కూడా ఆయన చుట్టుపక్కల చేరి ఆయన ఏ విధంగా అయితే ధ్యానంలో ఉన్నారో…వీళ్ళు కూడా అదే విధంగా ధ్యాననిష్ఠలో ఉండిపోవడం జరిగింది. ఇలా ఉండేసరికి, వీళ్ళ ముగ్గురు కూడా ఆయన కూర్చున్నట్టుగానే కూర్చొని మౌనంగా ఉన్నారు. అందరూ కూడా మౌనస్థితిలో ఉన్నారు.ఎంతటి మౌనస్థితి అంటే, ఆ మర్రిచెట్టు యొక్క ఆకు కూడా కదలని స్థితి.  గాలి లేని స్థితి. పంచభూతాలు లేని స్థితి. కాలం లేని స్థితి. అన్నిటికీ అతీతమైన స్థితి అనుభూతిని ఈ నలుగురితో పాటు వీళ్ళు కూడా అనుభవం పొందడం జరిగింది. ఆ ధ్యాన అనుభూతిని పొందసాగారు.  అంటే ఒంటరితనం నుంచి ఏకాంత స్థితికి సాధనాస్థితి మౌనంగా జరుగుతుంది అని శివ నందినికి అర్థమయింది. కానీ వాళ్లకి ఓంకార నాదం నుంచి అతి సూక్ష్మమైన తుంకార నాదం ఆ యువకుడి నుంచి రావడం …. ఆ నలుగురు వయోవృద్ధులు గమనించడం జరిగింది. ఆ నిశ్శబ్ద నాదానికి మహాదేవి, రుద్రస్వామి తట్టుకోలేని స్థితికి వెళ్లారు. ఆ నిశ్శబ్ద నాదమును తట్టుకోలేకపోయారు.విలవిలలాడుతూ ఉండలేని స్థితి, అయోమయ స్థితి మనసు వికలం అవటం, కడుపులో ఏదో వెలితిగా ఉండటం, కడుపులో వికారాలు కలగటం, మనసు భారంగా ఉండటం, రకరకాల స్థితులను మహాదేవి, రుద్ర స్వామి అనుభవిస్తూ ఉండేసరికి... వీళ్లిద్దరూ ధ్యాననిష్ట నుంచి లేచి కళ్ళు తెరిచేసి, ఇంకా మనం ఏకాంత స్థితి సాధనను తట్టుకునే సాధన స్థితిలో లేము.మనం కేవలం ఒంటరితనం భరించగలం కానీ ఏకాంతమును భరించలేము.  మనం ఓంకార నాదస్థితిని అనుభవించగలము కానీ ఈ తుంకార నాదస్థితి అయిన  ఈ నాదమును… ఈ నిశ్శబ్ద నాదస్థితిని,  ఈ నిశ్శబ్దమును భరించడం నావల్ల కాదు. మనం ఉండలేము అని చెప్పి వీళ్లిద్దరూ కూడా రుద్రస్వామి, మహాదేవి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోవడం జరిగింది.  ఇవేవీ గమనించని స్థితిలో శివ నందిని కాస్త తీవ్రమైన ధ్యాననిష్టలోకి వెళ్లిపోవడం, మనసుని లయం చేయటం జరిగింది.  మహాదేవి, రుద్ర స్వామి వెళ్ళిపోతూ ఆ యువకుడికి నమస్కారం చేద్దాం అనుకునేసరికి…. ఆ యువకుడు కాస్త మేధా దక్షిణామూర్తిగా నిజరూప దర్శనం ఇవ్వటం, ఈ వయోవృద్ధులు కాస్త ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలుగా మారిపోయి కనపడేసరికి…. అంటే శివ నందిని ఊహించింది సరి అయినదే, ఈయనే గురుదక్షిణామూర్తి. ఈ నలుగురు వయోవృద్ధులు కాస్త సనకనాదులు శిష్యులు అన్నమాట.. అనే విషయం గ్రహించి స్వామి!  ఈ నిశ్శబ్ద నాదస్థితిని మేము తట్టుకోలేకపోతున్నాము. మీ ఏకాంత వాసం భరించడం నావల్ల కాదు, అలాగే మీ మౌనస్థితిలో ఈ ఏకాంత స్థితిని తట్టుకోలేము అని నాకు అర్థం అయింది. ఒంటరితనం భరించగలం కానీ, ఏకాంత స్థితిని భరించే అంత సాధన స్థితి పరిపక్వత మాకు లేదని మాకు అర్థమయింది. ఆ సాధన స్థితిని మాకు మరుజన్మలో అయినా అనుగ్రహించు అని చెప్పేసి వీళ్ళు దక్షిణామూర్తికి నమస్కారం చేసి ఇక అక్కడి నుంచి మౌనంగా రుద్రస్వామి, మహాదేవి కాస్త తమ నివాసానికి వెళ్లిపోవడం జరిగింది. ఇవేవీ గమనించని శివ నందిని ధ్యాననిష్ఠలోకి వెళ్తూ ఉండేసరికి…. వీళ్ళకి ఎలా అయితే దర్శనం ఇచ్చారో, అలాగే శివ నందినికి ధ్యానంలో ఆ యువకుడు దక్షిణామూర్తిగా ఆ వృద్ధులు సనక నాదులుగా శివ నందినీకి కనిపించడం జరిగింది. సరే అని అనుకుంటూ….. తన ధ్యానం కొనసాగిస్తూ ఉండేసరికి …..సహజ సిద్ధమైన ఓంకార నాదం ఈమెకి వినిపించింది. ఆ ఓంకార నాదం కూడా ఒక మోటార్ సైకిల్ చేసే శబ్దంలాగా స్పష్టంగా పెద్దగా వినిపిస్తూ ఉండేసరికి…… శివ నందిని ఆ శబ్దమును భరించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా…. భరించక తప్పదు, ధ్యానం నుంచి బయటకు రాకుండా ఉండాలి అనుకుంటూ.. ఉండేసరికి, అది కాస్త నెమ్మది నెమ్మదిగా శబ్దనాదం తగ్గుతూ తగ్గుతూ…. నీటి బిందువు లాగా అంటే నీళ్ల బకెట్లో ఒక చుక్క పెడితే ఎలా శబ్దం వస్తుందో ….అలా శబ్దం వినపడే స్థితికి రావడం జరిగింది. ఆ నీళ్ల చుక్కల యొక్క శబ్దం తుంకార నాదం అని చెప్పేసి శివ నందిని స్పురణ అందడం జరిగింది. అంటే ఇక ఇప్పుడు తను ఓంకార నాద సాధన నుంచి ఓంకారానికి మూలమైన తుంకార నాదస్థితికి  దక్షిణామూర్తి అనుగ్రహంతో తీసుకు వెళుతున్నారు అని చెప్పి శివ నందినికి అర్ధమయ్యి …ధ్యాననిష్ట నుంచి బయటకు రాకుండా, అలాగే కొనసాగించడం జరిగింది. ఇలా ధ్యాననిష్ట కొనసాగిస్తూ ఉండేసరికి…. తను ఒంటరితనం నుంచి ఏకాంత స్థితికి వెళ్తున్నాను అని తనకి అర్థం అయ్యింది.  నిశ్శబ్ద నాదమే తుంకార నాదం అని అర్థమయింది. మౌనమే తుంకార నాదం అని అర్థమయ్యి, ,నెమ్మది నెమ్మదిగా అనుభవంలోకి రావటం జరిగింది. ఇక్కడ పంచభూతాలు లేని స్థితి, కాలానికి అతీతమైన స్థితిలో తను ఉన్నాను అని చెప్పేసి శివ నందినికి అర్థం అవుతూ….. తను ఇప్పుడు మౌనస్థితిలోకి వెళ్ళిపోతుంది అని స్ఫురణ అందడం జరిగింది. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం అని స్పృహ అందటంతో…ఒంటరితనం నుంచి ఏకాంత స్థితికి, ఓంకార నాదం నుంచి తుం కార నాదంలోకి తన సాధన వెళుతుంది అని చెప్పి శివ నందినికి అవగతం అవుతూ ఉండేసరికి…. ఎదురుగా ఉన్న యువకుడు స్వరూపమైన మేధా దక్షిణామూర్తి యొక్క త్రినేత్రం తెరుచుకోవడంతో కాంతి పుంజం తన పాదాల దగ్గర కనపడటం జరిగింది. దానితో శివ నందిని యొక్క ఆత్మ శరీరం కాస్త ఈ కాంతి శక్తి మార్గంలోకి త్రినేత్ర ద్వారం లోపలికి తన ఆత్మ శరీరం వెళ్లడం  గమనించసాగింది.  ఈ లోపల ఏముందో…. ఏం జరుగుతుందో చూద్దాం అని ధ్యానం నుంచి బయటకు రాకుండా అలాగే ధ్యాననిష్ట కొనసాగిస్తూ సాధన చేస్తూ ఉండేసరికి… శివ నందిని ఆత్మ శరీరం కాస్త లోపలికి వెళ్తూ ఉండేసరికి వాటిని దాటుకుంటూ వెళ్లడం జరిగింది. ఆ తర్వాత దీర్ఘ చతురస్రాకార ద్వారాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళటం జరిగింది. ఆ తరువాత తలకిందులుగా ఉన్న త్రికోణ ద్వారం దాటుకుంటూ దాటుకోవటం జరిగింది. ఆ తరువాత బిందు ద్వారంలోకి వెళ్ళటం జరిగింది. ఆ తరువాత త్రినేత్ర ద్వారం దగ్గరికి రావడం జరిగింది. ఆ త్రినేత్ర ద్వారంలో యధావిధిగా నల్లటి శరీరంతో ఉన్న దక్షిణామూర్తి స్వరూపం,అంటే ఇప్పుడు బయట చూస్తున్నది ఆయన స్థూల శరీరం అయితే…..ఇప్పుడు చూస్తున్న ఆయన నల్లటి శరీరం ఆయన కీర్తి దేహం అయి ఉంటుంది.  అంతిమదేహం అయి ఉంటుంది అని శివ నందిని కి అవగతం అయింది.  విచిత్రంగా అప్పటిదాకా మేధా దక్షిణామూర్తిలాగా కనపడుతున్న ఆయన కాస్త …. తనలాగా కనిపిస్తూ ఉండేసరికి…. అర్థం కాలేదు.  అంటే ఏం జరుగుతుంది?  అనుకునేసరికి సనక నాదులలో కూడా తన రూపంలో తనే నాలుగు రూపాలుగా ఉన్నట్టుగా ఉండేసరికి… శివ నందిని కి ఆత్మ శరీరానికి విషయం అర్థం కాలేదు. అప్పుడు ఉన్నది తనే అన్నమాట… తనే సృష్టి, స్థితి ,లయకారకం చేస్తున్నాను అని…. తను తప్ప ఇంకెవరూ లేరు అని… అనుభవ అనుభూతి స్థితిలోనికి శివ నందిని వెళ్ళటం జరిగింది. అంటే తనే సృష్టిస్తుంది, తనే నాశనం చేస్తుంది, తను తప్ప ఇంక ఎవరూ లేరు అనే అవగాహన అనుభవ అనుభూతి పొందుతూ ఉండేసరికి….ఈ కారణం చేత శివ నందిని యొక్క ఆత్మ శరీరం కాస్త విస్తారణ పొందుతూ….. విశ్వరూప దర్శనానికి తగ్గట్టుగా దేహం పెరుగుతూ ఉండేసరికి…. అండపిండ బ్రహ్మాండాలలో అన్నీ దాటుతూ ఉండసాగింది.  అంతరిక్షం దాటేసరికి, అవన్నీ చిన్న రేణువులుగా కనిపించే పరిస్థితి వచ్చింది.  తనకి తాను చూసుకునే సరికి సహస్ర తలలు, సహస్ర చేతులు, సహస్ర బాహువులు, కాళ్లు, ఉండటం ఇదే శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం.  ఇదే శివుడు చూపించిన విరాట్ స్వరూపం. ఇదే విశ్వరూప దర్శనం అని శివనందినికి జ్ఞాన స్ఫురణ అందడంతో తనే సృష్టి, స్థితి, లయము చేస్తున్నప్పటికీ…. తెలియని కోరిక మోహమాయలో పడటం వలన…. తను బ్రహ్మం అనే విషయాన్ని మర్చిపోయి…. జీవుడిగా తన బతుకుతుంది అని, జీవుడికి ఉన్న జీవము జీవమాయ అనగా కోరిక మాయని దాటగలిగితే జీవుడు కాస్త దేవుడు అవుతాడు… దేవుడు కాస్త శివుడు అవుతాడు.. ఇదే అహం బ్రహ్మాస్మి స్థితి అని చెప్పి అనుభవ అనుభూతి పొందుతూ ఉండేసరికి…. శరీరం కాస్త సాధారణ స్థితికి వచ్చేసరికి…. యధావిధిగా దక్షిణామూర్తి స్వరూపం కనిపించడం, ఆయనకి నమస్కారం చేసి ఆత్మ స్వరూపం కాస్త యధావిధిగా శివ నందిని శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. శివ నందిని భౌతిక నేత్రాలు తెరిచేసరికి, అక్కడ మర్రిచెట్టు గాని, యువకుడు కానీ, ఆ యువకుడికి అనుసరించిన వయోవృద్ధులు కానీ, నలుగురు ఎవరు కనిపించలేదు.  తనకి ఎప్పుడైతే నేను అనే దేహ అహంకారం, నేను అనే మమకార అహంకారం పోవడంతో అహం బ్రహ్మాస్మి స్థితి పొందడం జరిగిందని చెప్పి ఆ స్థితిలో ఉండేసరికి తన చుట్టూ ఉండే చెట్లు పొట్టలు, జంతువులు, మనుషులతోనూ కూడా తను స్వరూపం కనపడుతూ ఉండేసరికి…. సర్వం శివమయం సర్వం తనమయం అని శివనందినికి ఒక విధమైన ఆనంద స్థితిలో ఉండటం జరిగింది. ఇదే బ్రహ్మానంద స్థితి అంటారు. ఈ ఆనంద స్థితి కూడా ఒక మాయే. ఈ మాయ నిర్మూలన చేయడానికి పళని కుమారస్వామి అనుగ్రహం పొందవలసి ఉంటుంది అని….జ్ఞాన స్ఫురణ అందడంతో…. అలాగే ఈ ఆనంద స్థితిని పొందాలంటే దేహంలో ఉన్న మహా మృత్యుభయం పోగొట్టుకోవలసి ఉంటుంది అని చెప్పేసి… మహా మృత్యు భయం నివారణ కోసం విషము సేవించిన పళని కుమారస్వామి అనుగ్రహం పొందవలసి ఉంటుంది.  అప్పుడే తురియ స్థితి నుంచి తురియాతీత స్థితి పొందటం అనగా ఆనంద స్థితి నుంచి ఆనంద రహిత స్థితి తన సాధన ముందుకు వెళుతుంది.  తద్వారా స్త్రీ ప్రకృతిలో సంతోషం, పురుష ప్రకృతిలో ఆనందం ఉంటుంది.  ఇక అన్నిటికీ అతీతమైన స్థితికి ఈ మూల ప్రకృతి ఉంటుంది.  ఎందుకంటే మూల ప్రకృతి నుంచి స్త్రీ పురుష తత్వాలు… నాది, నీది అనే తేడాలు, నువ్వు, నేను అనే ద్వంద ప్రవృత్తి ఏర్పడడం జరుగుతుంది. ఆ ఏక ప్రవృత్తికి అద్వైత స్థితి మనం పొందాలి అంటే….మూల ప్రకృతికి వెళ్ళాలి. మూల ప్రకృతికి వెళ్ళాలి అంటే దేహంలో ఉన్న మహా మృత్యుభయం నిర్మూలన చేసుకోవాలి. ఆ నిర్మూలన చేసుకోవాలి అంటే పళని  నవ పాషాణ   నిర్మితమైన కుమారస్వామి అనుగ్రహం పొందవలసి ఉంటుంది అని శివ నందిని కి ఙ్ఞానం అందడంతో ఇక అక్కడి నుంచి లేచి యధావిధిగా తన నివాసానికి వెళ్ళటం జరిగింది.

ఎప్పుడైతే శివనందిని ఈ విధంగా శరీర త్యాగం జరిగిందో…. అప్పటినుంచి తనకి లోక విషయాలు, శాస్త్ర విషయాలు, అంతర్గత విషయాలు ఒక్కొక్కటిగా అర్థం అవటం జరుగుతుంది. ఏ శాస్త్రం పట్టుకున్న.. చదవకపోయినా దానిలో ఉన్న మూల రహస్యాలు అన్నీ కూడా తెలియడం జరిగేది. ఏ మొక్కని పట్టుకున్నప్పటికీ కూడా దానికి శాస్త్ర పరిజ్ఞాన విషయాలు తెలుస్తూ ఉండేది. పక్షుల భాష, జంతువుల భాషలు అర్థం  అర్థమయ్యే స్థితికి వెళ్లడం జరిగింది. ఇది నిజమా కాదా అని  అనుకుంటూ ఉండేది.  కానీ దీని గురించి పరిశీలించాలి…శోధనచేయాలి అనుకునేది కాదు.  ఒకరోజు పిల్లలకి ఈ విషయం చెప్పేసరికి అమ్మ! నీకు పక్షుల భాష కూడా తెలిసిపోతుందా!  అని సరే ఆ చెట్టు మీద ఉన్న రెండు రామచిలకలు ఉన్నాయి కదా! ఏం మాట్లాడుతున్నాయో చెప్పు..?  అనేసరికి సరే విందాం అని, వాటి భాషలో అవి ఏం మాట్లాడుకుంటున్నాయో…. ఏమిటి అర్థం అయ్యేసరికి, ఏమీ లేదు…. ఆడ పక్షి కడుపుతో ఉందంట…. మూడు రోజుల్లో గుడ్లు పెట్టి పిల్లలు పుట్టబోతున్నాయి… గూడు కట్టాలి అని మగ పక్షికి చెబుతుంది అనేసరికి….అవునా!  నిజమా అనుకుంటూ ఉండేసరికి…. మగ పక్షి కాస్త గూడు కట్టడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉండేసరికి…. అమ్మ చెప్పింది నిజమే!  అని పిల్లలకి అర్థం అయ్యింది.  కొన్ని రోజులకి అది గుడ్లు పెట్టడం, పొదగటం అదంతా చూసి విచిత్రంగా ఉంది అనుకునేసరికి…. ఒకరోజు రాత్రి బల్లులు అరుస్తుంటే ఏమిటి?  బల్లులు అరుస్తున్నాయి… అంటే ఏమీ లేదు తన చెల్లెలు వస్తుందని తన భర్తకు చెబుతుంది అనేసరికి ….అక్కడ ఉన్న రెండు బల్లులను చూసి ఏది ఆడబలి, ఏది మగబల్లి అనేది నీకు ఎలా తెలుస్తుంది ? అనేసరికి చూస్తే తెలుస్తుంది… కానీ ఆ రెండు ఏం మాట్లాడుకుంటున్నాయో చెబుతున్నాను.  అంటే ఇంకో బల్లి వస్తుందా అని అనేసరికి అవును. అంటే కొద్దిసేపటికి ఎక్కడి నుంచో మూడో బల్లి రావడం ఈ మూడో సంతోష పడుతూ ఉండేసరికి అమ్మ!  నీకు భలే విషయం తెలిసిపోతుంది అనేసరికి….అప్పుడు బాల కుమారస్వామి కాస్త అయితే కోతులు మాట్లాడడం అన్నది నిజమే అన్నమాట!  అనేసరికి కోతులు వాటి భాషలో మాట్లాడుకునేవి.  రాములవారికి వాటి భాష అర్థం అయ్యి వాటితో మాట్లాడటం జరిగింది.  కోతులు మానవ భాషలో మాట్లాడలేదు.  ఈయనకి పక్షి భాష, జంతు భాష సకల భాషల జ్ఞానం కూడా తెలియడంతో…. ఆయన వాటి భాషలో సంభాషించడం తెలుసుకోవడం జరిగింది అనేసరికి… అంటే అది సత్యమే అన్నమాట! కొంతమంది మూర్ఖులు కోతులు మాట్లాడడం ఏమిటి? అని వాల్మీకి తప్పు రాశాడు అని… రామాయణంలో అనడం జరిగింది.  నిజానికి కోతులు అవి వాటి భాషలోనే మాట్లాడాయి… కానీ దాని అర్థం చేసుకున్న రాముడు వాటికి సమాధానం చెప్పడం జరిగింది. సహస్ర చక్రంలో సకల అలవాట్లు, సకల భాషలు తెలుస్తాయి అన్నమాట అని మహాదేవి అనడం జరిగింది. ఈ విధంగా జంతువుల భాషలు తెలుస్తూ ఉండేసరికి…. వీటితో పాటు త్రికాలజ్ఞానం అలాగే కాలజ్ఞాన విషయాలు ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తెలుస్తూ ఉండేసరికి…. శివ నందిని కి ఆశ్చర్యం వేసింది.  ఇదంతా నిజమా కాదా అని అనుకుంటూ ఉండేసరికి… ఒకరోజు ధ్యానంలో బాల కుమారస్వామి కాస్త పాము కాటుతో చనిపోతాడు అని చెప్పేసి ధ్యాన అనుభవం అయ్యేసరికి…. శివ నందిని కాస్త రుద్ర స్వామితో బాల కుమారస్వామి పాముకాటుతో చనిపోతాడు అంట!  మరి ఏం చేయాలి?  అనేసరికి ఏం చేస్తాం? వాడికి చచ్చేయోగం ఉంటే చస్తాడు అనేసరికి….. చూస్తూ,చూస్తూ విషయం తెలిసిన తరువాత స్పందించకపోతే ఎలాగా..? రక్షించాలి కదా..!  అంటే నువ్వు రక్షించాలి అనుకున్నా చావు రావాలి అనుకుంటే, అది ఎలా అయినా వస్తుంది.  అది మన చేతుల్లో లేదు అనేసరికి…. విషయం తెలిసిన తర్వాత నేను వాడిని ఎలా అయినా కాపాడతాను… పాముకాటు అని తెలిసినప్పుడు పాములు దగ్గరికి రానివ్వకుండా చేస్తాను… వీడిని నా పక్కనే కూర్చోపెట్టుకుంటాను అనేసరికి…. అమ్మ!  విధిరాత బలియమైనదమ్మ… దానిని ఎవరు దాటలేరు… తప్పించలేరు… కంగారు పడాల్సింది ఏమీ లేదు,  వాడి రాతలో మరణం అలా రాసిపెట్టి ఉందేమో కదా ! అనేసరికి….చూస్తూ చూస్తూ వాడి మరణ రహస్యం తెలిశాక ఎలా ఊరుకుంటాము అనేసరికి…. ఇదేనమ్మా!  నువ్వు పుత్ర వ్యామోహంలో పడుతున్నావు.  భోగపుత్రుడివిని వదిలి పెట్టావు… కానీ, యోగ పుత్రుడిని వదిలిపెట్టుకోలేకపోతున్నావు.  ఇంక అలాంటప్పుడు యోగానికి, భోగానికి తేడా ఏముంది? వాళ్ళు నీకు దత్తపుత్రులే….రక్తసంబంధీకులు కాదు, వాళ్ల గురించి ఎందుకు అంత అతిగా ఆలోచిస్తావు అంటే…. నా కళ్ళ ముందు తిరుగుతున్న పిల్లవాడిని పాము కాటు వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను?  ఇక సాధన చేసి ఉపయోగం ఏముంది?  విధిరాతను దాటించలేనప్పుడు ఎందుకు ఈ సాధన?  అనేసరికి…. నీకు చెప్పడం ముందే చెప్పాను, దేనికి స్పందించకు ,సాక్షిభూతంగా ఉండాలి అన్నాను.  నీ పిల్లల విషయానికి వచ్చేసరికి నువ్వు స్పందిస్తే ఎలాగా?  మిగిలినవన్నీ సాక్షిభూతంగా చూడగలుగుతున్నావు కానీ, నీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి నువ్వు చూడకపోతే ఎలాగా?  మానసిక ధైర్యం పెంచుకోవాలి కదా!  పాము కాటుతో వాడు మరణం పొందాలని రాస్తున్నప్పుడు రాసి ఉన్నప్పుడు వాడు సహజ మరణం పొందుతున్నాడు కాబట్టి..అంత భయపడాల్సిన అవసరం లేదు.  అంటే కానీ వాడిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది.  నేను ఎలా అయినా పాము కాటు నుండి కాపాడతాను… అంటే సరే!  విధి లిఖితం.  దైవ నిర్ణయం గెలుస్తుందో… నువ్వు గెలుస్తావో…. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, వాడికి రాసిపెట్టి ఉంటే ఏది జరుగుతుందో… అదే జరుగుతుంది . నేను చూస్తాను అంటే…. నాకు విషయం తెలిసాక నేను ఆగలేను, సాధ్యమైనంత వరకు నేను రక్షించే ప్రయత్నం చేస్తాను అని బాల కుమారస్వామిని పిలిచి నాయన!  ఒక మూడు రోజులపాటు నా దగ్గరే ఉండు… అంటే దేనికి అమ్మ? అని అడిగితే….. అవేం నువ్వు నన్ను అడగవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు.  నా సమక్షంలో నాతో పాటే ఉండు అంటే…. సరే అమ్మ ఉంటాను, నువ్వు చెప్పినట్టే ఉంటానులే అనేసరికి….సరే అని వీళ్ళ ఇద్దరూ డేరా లోనే మూడు రోజులపాటు ఉండటం జరిగింది. బయటకి రాలేదు. నాలుగవ రోజు తర్వాత వస్తాము అని వాళ్ళు డేరా లోనే ఉండిపోవడం జరిగింది. విషయం తెలిసిన రుద్రస్వామి, మహాదేవి, బాలగణపతి డేరా బయట వేరే డేరా లో పడుకోవటం జరిగింది.  ఇలా మూడు రోజులు జరుగుతూ ఉండగా…. అర్ధరాత్రి ఉన్నట్టుండి డేరా లోపలికి గాలి రావడానికి వీలుగా డేరా పైన చిన్నన్ రంధ్రం చేయడం…. అందులో నుంచి నక్షత్రాలు చూస్తూ ఉండటం జరుగుతూ ఉండేసరికి….వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండేసరికి…. ఎక్కడి నుంచో తెలియదు కానీ, ఒక పాము పిల్ల ఆ డేరాలోకి ప్రవేశించి పిల్లవాడి మీద పడటం, కాటు వేయడం, పిల్లవాడు క్షణకాలంలో శరీరమంతటా రంగు మారటం, ఇదంతా చూస్తూ శివ నందిని పెద్దగా అరిచేసరికి…. రుద్రస్వామి, మహాదేవి, బాలగణపతి గబగబా లోపలికి రావటం, పిల్లవాడిని పాము కాటు వేయడం ఎలా జరిగింది? అంటే….. డేరా కి ఉన్న చిల్లు నుంచి పాము రావడం ఇదంతా శివ నందిని చెప్పేసరికి….చెప్పాను కదా అమ్మ!  విధి బలియమైనది…. నువ్వు ఈ మూడు రోజులు ఆ చిల్లు రంధ్రం గురించి పట్టించుకోలేదు,  లోపలికి రాదు అని అనుకున్నాను …పసిపిల్లవాడు చెప్తున్నప్పటికీ రంద్రం మూసి వేయలేదు…రంధ్రం నుంచి వచ్చిన నేను చూసుకుంటాలే అనుకున్నావు కదా ! కానీ వీడి మాటలు వింటూ, దానిమీద ధ్యాస పెట్టలేకపోయాను అనేసరికి…. ఏదో పక్షి పామును తీసుకువచ్చినట్టుంది… అందుకోసం అని ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? పిల్లవాడి శరీరం కాస్త నీలం రంగులోకి మారుతుంది.  ఇప్పుడు మనం వీడిని రక్షించలేమా ? ఏమీ చేయలేమా?  అంటే రుద్ర స్వామి కాస్త తన చేతి సంచిలో నుంచి పాము విషానికి సంబంధించిన వేరును బయటకు తీసి, వేరు రసమును కొన ఊపిరితో ఉన్న పిల్లవాడి నోట్లో పోస్తూ ఉండేసరికి…. విషం కాస్త హరించుకు పోతూ నీలం శరీరం కాస్త మామూలు శరీరం గా వస్తూ ఉండేసరికి…. శివ నందిని, మహాదేవి, బాలగణపతి, రుద్ర స్వామి కాస్త చూస్తూ ఉండగానే బాల కుమారస్వామి సహజ స్థితికి రావడం జరిగింది. శివ నందిని ఆవేదన స్థితి నుంచి ఆనంద స్థితికి రావడం జరిగింది. బాల కుమారస్వామి కళ్ళు తెరిచి అందరికీ గుర్తు పడుతూ ఉండేసరికి…. పాము విషం మెదడుకి చేరలేదు, మెదడుకి చేరి ఉంటే చనిపోయి ఉండేవాడు.  గుండెకి చేరే క్రమంలో మనం ఆపివేయడం జరిగింది. ఎందుకైనా మంచిది అని నువ్వు చెప్పిన రోజే పాము విషాన్ని హరించే వేరుని సేకరించడం జరిగింది అనేసరికి…. పాము కాటు వేయకుండా చూడవచ్చు కదా!  అని శివనందిని అనేసరికి….. విది. లిఖితం ., మనం ఆపలేం తల్లి! నువ్వు పిల్లవాడికి పాము కాటు వేయడం వరకే చూశావు కానీ, ఆ పాము విషం నుంచి వాడు రక్షించబడతాడు అనేది నువ్వు చూడలేకపోయావు.  ఎందుకంటే పిల్లవాడు చచ్చిపోతాడేమో అనే మనోభయం… నిన్ను పట్టుకోవడంతో ఆ ధ్యాన దృశ్యం నువ్వు చూడలేకపోయావు.  ఆ మనోభయాన్ని నువ్వు దాటి ఉంటే బతికే ఉన్నాడు అనే ధ్యాన దృశ్యం చూసే దానివి. అప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉండేది.  అదే మాయ అంటే… జరగబోయే దానిని సగం వరకు చూపిస్తారు, మనోభయం కలిగిస్తారు, లేనిది ఉన్నట్టుగా… ఉన్నది లేనట్టుగా చూపిస్తారు. ఆ మనోభయాన్ని దాటి, ఆ స్థితిని నువ్వు చూడగలిగితే, ఆ పిల్లవాడు బతికి ఉన్న ధ్యాన దృశ్యం చూసేదానివి అంటూ ఉండేసరికి…. పిల్లవాడిని పాము కాటు వేయడం, పైనుంచి పాము పడటం, ఇదంతా కూడా జరగటం, ఆ తర్వాత రుద్ర స్వామి పిల్లవాడిని రక్షించడం, ఇదంతా ధ్యాన దృశ్యంగా చూసేసరికి…. ఓహో! పిల్లవాడిని పాము కాటు వేయడం చూసి తట్టుకోలేక మనోభయానికి గురి అయ్యి  ధ్యానం నుంచి బయటకు రావడం జరిగింది. కానీ, తను మనో నిశ్చల స్థితిలో ఉండి , మనోభయాన్ని దాటి ఉంటే…. పూర్తి ధ్యాన దృశ్యం చూడడం జరిగేది.  అంటే దైవీక వస్తువులు కూడా ఇంతే అన్నమాట!  మనోధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు దైవీక వస్తువులు రావడం జరుగుతుంది. ఈ వస్తువు వచ్చిన తర్వాత మనం ఆ భయాన్ని దాటి మనోనిబ్బరంతో, మనో ధైర్యంతో ఉండటం వలన…. ధ్యాన దృశ్యం చూసే అవకాశం కలుగుతుంది అని శివ నందినికి అవగాహన కలగటంతో….సాక్షి భూతంగా ఉండటం అంటే ఇదే అన్నమాట!  మనోభయాన్ని దాటడం అంటే ఇదే అన్నమాట!  అని చెప్పేసి శివ నందినికి అవగాహన రావటంతో…. బాల కుమారస్వామి కాస్త యధావిధిగా ఆరోగ్య స్థితికి రావడం, ,అమ్మ ! నాకు మరణ భయం పోయింది. మరణ గండం దాటానా?  అంటే దాటావు నాయనా!  నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు… ఇక్కడ తన మన అనేవి సాధనలో ఉండకూడదు అని చెప్పేసి నాకు అర్థం అయింది. ప్రకృతిలో జరిగే విపత్కరములు మనోదృష్టిలో చూస్తూ స్థిరంగా ఉంటున్నాను కానీ కుటుంబ సభ్యులకి ఏదైనా అయితే మాత్రం మనసు వికలమవుతుంది.  ఈ స్థితిని నేను దాటాలి అని మనోధైర్యం పొందాలి అని అనుకుంటూ ఉండేసరికి….. కొన్ని రోజులు మానసిక ధైర్యం కోసం ధ్యానం చేస్తూ ఉండటం కొనసాగించింది.  తనకి ధ్యాననిష్ఠలో వస్తున్న వివిధ శాస్త్ర రహస్యాలు , మర్మ రహస్యాలు, మూలిక వైద్యములకు సంబంధించిన వైద్య జ్ఞానం అలా 18 రకాల శాస్త్ర జ్ఞానాలు అందుతూ ఉండేసరికి…. తర్వాత అన్నింటినీ కూడా ప్రచారంలోకి తీసుకువస్తే, తనకి కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుందని… ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క యోగులు, శాస్త్రం మీద ఈ విధంగానే అనుభూతులు పొందడం జరిగింది అని…. కాలజ్ఞానం కూడా ఇలాగే రాసి ఉండవచ్చును అని…. త్రికాలజ్ఞానం విషయం తెలుస్తుంది.  జరిగేది ఏమిటి?జరగబోయేది ఏమిటి?  అనేది కూడా తెలుస్తుంది.  రాబోవు 100 సంవత్సరాల తర్వాత, లేదా 1000 సంవత్సరాల తర్వాత లేదా పదివేల సంవత్సరాల తరువాత లేదా 10 లక్షల సంవత్సరాల వరకు కూడా జ్ఞానానికి సంబంధించిన సాధన చేస్తే కాలజ్ఞానం అవగాహన కలుగుతుంది.దీని గురించి ఆలోచ్చనం చేస్తూ…. భవిష్యత్తు చెప్పడం వలన ఉపయోగం ఏమున్నది?  గతమై అది వర్తమానంగా నడుస్తుంది అని శివ నందినీకి అర్థం అయింది.  దానితో ఇక ఈ శాస్త్ర జ్ఞానం మీద పట్టు వచ్చినప్పటికీ కూడా చెప్పకూడదు, నిగూఢ  రహస్యాలు చెప్పకూడదని…. దీనివలన లేనిపోని మాయలకి ధన మాయ, కీర్తి కాంతా మాయలోను పడటం జరుగుతుందని…. పరమహంస గారి ధ్యాన అనుభవాల మీద అవగాహన ఉండటంతో, ఏ శాస్త్ర పరిజ్ఞానం వైపుకి శివనందిని వెళ్లకుండా నిగ్రహించుకోవడం జరిగింది. అసలు ఈ శాస్త్ర విజ్ఞానమును ఎవరు అందిస్తున్నారు?  అని చెప్పి శివ నందినికి ధర్మసందేహం వచ్చింది. ఈ ధర్మ సందేహం నివృత్తి కోసం ధ్యాన నిష్ఠలో ఉండటం జరిగింది. ఇలా కొన్ని రోజులు ఉండగా శివనందినికి పంచ శిఖరాలు, పంచ శిఖరాల మధ్యలో 85 సంవత్సరముల వయస్సు ఉన్న వయోవృద్ధుడు కాస్త దక్షిణామూర్తిగా లీలగా కనిపించేసరికి…. ఓహో!  ఇది దక్షిణా మూర్తి ఢమరుకం నుంచి వచ్చే శబ్ధ నాదము నుంచి ఈ జ్ఞానం వస్తుంది అని చెప్పేసి…. శివ నందిని కి అవగాహన రావటం జరిగింది. ఓహో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు…. ఆయన దర్శనం చేసుకోవాలి అంటే ఎవరి అనుగ్రహం పొందాలి అనుకుంటూ ఉండేసరికి… శివ నందినికి ఒక ద్వారబంధనం దగ్గర హనుమంతుడి విగ్రహం లీలా మూర్తిగా కనిపిస్తూ ఉండేసరికి…. ఇప్పుడు తను హనుమంతుడు అనుగ్రహం పొందవలసి ఉంటుంది… ఇది జీవనాడి మార్గానికి ఈయన అడ్డంగా ఉండి ఉంటాడు. ఇది హృదయ చక్రానికి అనుసంధానం అయ్యి ఉంటుంది అని చెప్పేసి శివ నందినీకి జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది. దానితో మనోధైర్యం కోసం హనుమంతుడు ధ్యానం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ….. ధ్యానంలోకి వెళ్దామని అనుకోగానే తనకు తెలియకుండానే హనుమంతుని మీద ధ్యాస పెట్టలేని స్థితికి వెళ్లడం జరిగింది. తనేదో తెలియని మాయలో ఉన్నాను అని శివ నందిని అనుకో సాగింది.  దాని గురించి ఆలోచన కొనసాగిస్తూ ధ్యాననిష్ఠలో ఉండసాగింది. 

 

ఒకరోజు శివ నందినికి విపరీతంగా శివ స్వామికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉండేసరికి….తట్టుకోలేక, అదుపులో ఉంచుకోలేక, ఎలాగైనా ఈయనతో మాట్లాడాలి అని హృదయం మీద చేయి పెట్టగానే చెప్పు దేవి! అని శివ స్వామి నుంచి సందేశం వచ్చేసరికి, ఏమీ లేదు…. ఎలా ఉన్నారు ఏంటి?  నా సాధన అనుభవాలు మీతో పంచుకోవాలని అనిపించింది అనేసరికి…. నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు? నీ సాధన స్థితి ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు.  నువ్వు ఆత్మానుసంధానం కాలేదు కదా!  అందుకని నేను కూడా పట్టించుకోవడం మానేసి…. నా ధ్యాన నిష్ఠలో నేను ఉండిపోవడం జరిగింది అనేసరికి…… అదేంటి స్వామి! మొన్ననే కదా వచ్చారు… మూడు రోజుల క్రితమే కదా ! వచ్చి నా తలను అతికించారు కదా అనేసరికి….. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ తలను అతికించడం ఏమిటి?  అసలు ఏం జరిగింది అనేసరికి…. అదేంటి మీరు రాలేదా? అంటే నేను రాలేదు…. అని అనేసరికి, శివ నందిని కి ఆశ్చర్యం వేసింది. అదేంటి?  మీరు రాకపోవడం ఏమిటి? మీరు ప్రత్యక్షంగా వచ్చి యోగాంబిక నా తలను ఖండిస్తే మీరు యధావిధిగా అతికించారు కదా అనేసరికి… శివ స్వామి కాస్త అమ్మ!  నాకు అంత సాధన స్థితి అయితే లేదు… అంత సిద్ధమాయ అయితే లేదు…ఖచ్చితంగా నా రూపంలో సిద్ధ పురుషుడు ఎవరో వచ్చారు.  నీ సాధన పరిసమాప్తి చేసి ఉండవచ్చు.  ఆ మాయని దాటించి ఉండవచ్చు.  నీ తల ఖండనము అయింది అనగానే…. నీకు చినమస్తా దేవి దర్శనం అయ్యిందా?  అనేసరికి అవును, చిన్న మస్తాదేవి దర్శనం అయ్యింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకి యోగాంబిక నామీద దాడి చేసి, నా తలని ఖండించడం అయితే భౌతికంగా జరిగింది. నా తల ఉండడం వేరుగా ఉండేసరికి… మీరే వచ్చి అతికించినట్టుగా రుద్రస్వామి చెప్పటం…. కళ్ళు తెరిచి చూసేసరికి… మీరు ఎదురుగా ఉండటం చూశాను అనేసరికి… నేనైతే రాలేదు దేవి!  ఎవరో నా రూపంలో వచ్చారు… ముందు వాళ్ళ సంగతి తెలుసుకో!  నాకు అంత సాధన స్థితి అయితే లేదు… ఏదో సాధనలో వాటికి సంబంధించిన జ్ఞానం అవగాహన ఉంది.  అంతకుమించి చనిపోయిన వాళ్ళని బతికించే స్థితి నాకు లేదు.  నాకు తెలిసినంతవరకు సహస్ర చక్రంలో పరమ గురువుగాని, విశ్వ గురువుగాని దర్శనం అవుతుంది. నీకు ఎవరో ఆ రూపంలో వచ్చి సహాయ సహకారాలు అందించి ఉంటారు. నాకు తెలిసినంతవరకు నువ్వు దత్తాత్రేయ స్వామి సమక్షంలో ఉన్నావు కదా!  రేణుకాదేవి సమక్షంలో ఏకవీర క్షేత్రంలో ఉన్నావు కాబట్టి….నాకు తెలిసి దత్తాత్రేయుడే నా రూపంలో వచ్చి ఉండవచ్చు.  ఆయనకు ఇలాంటివి చేయడం సరదా! అని అనగానే అవునా!  మీరు రాలేదా?  అంటే నేనైతే రాలేదు అనేసరికి…. నాకు నమ్మబుద్ధి కావడం లేదు అనేసరికి…. కావాలంటే నువ్వే ధ్యాననుభవం పొందు నీకే తెలుస్తుంది.. అనేసరికి అయితే ఉండండి….అనగానే శివ స్వామి అదృశ్యం అవ్వడంతో, శివనందిని అసలు విషయం ఏం జరిగిందో అర్థం కాక…. శివ స్వామికి, తనకి జరిగిన సంభాషణ అంతా రుద్ర స్వామి తో చెప్పేసరికి …అవునా అంటే శివ స్వామి రాలేదా?  నేను అప్పుడే అనుకున్నాను.  శివ స్వామి ప్రత్యక్షంగా ఇక్కడికి రాకూడదే ! ఎలా వచ్చాడు అనుకున్నాను అని రుద్ర స్వామి తన అనుమానం చెప్పేసరికి ….మరి వచ్చింది ఎవరు?  అని మహాదేవి అనేసరికి, ఆయన శివ స్వామి అనటం అయితే మీరు దత్తాత్రేయ క్షేత్రంలో ఆయన సమక్షంలో ఉన్నారు కాబట్టి దత్తాత్రేయుడే వచ్చి ఉంటాడు అని అన్నారు అనేసరికి అవునా!  అలా రావడానికి అవకాశం ఉంది.  ఎందుకంటే దత్తాత్రేయ అంశ అయిన వాసుదేవా నంద సరస్వతి యోగి కూడా భిక్షాటన చేసేటప్పుడు…. ఇంతకుముందే వచ్చావు కదా!  బిక్ష చేసి వెళ్లావు కదా!  అని అడిగేసరికి… తను మొదటిసారి బిక్షకి రావడం, అలాంటిది తన రూపంలో ఎవరు వచ్చి బిక్ష చేశారు?  అని చెప్పేసి ఆయన ధ్యానంలో కూర్చుంటే తన రూపంలోనే వచ్చి దత్తాత్రేయ స్వామి బిక్ష తీసుకున్నట్టుగా అనుభవం అయ్యేసరికి ….ఇది దత్త లీల మాయ అని ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడే వచ్చి ఉండవచ్చు అని శివ నందినితో రుద్రస్వామి అనేసరికి….శివ స్వామి రూపంలో దత్తాత్రేయుడు వచ్చి తనని బతికించినట్లుగా ధ్యాన అనుభవం అయ్యేసరికి అవును… ఆయనే వచ్చాడు ప్రత్యక్షంగా దత్తాత్రేయ స్వామి వచ్చినా నేను గుర్తు పట్టలేకపోయాను అంటే ఆయనని గుర్తుపట్టేలాగా వస్తే ఆయన వెంట పడతారని తెలుసు. అందుకనే మనకి తెలిసిన వ్యక్తి రూపంలో రావడం, మనమేమో తెలిసిన వాళ్లే కదా!  అని పెద్దగా పట్టించుకోకపోవడం, ఆయన చేయాల్సిన పని కార్యక్రమం ఆయన పూర్తి  చేసుకొని పోవటం ఇది దత్త లీలా విన్యాసంలో యధామాములే… అనే సరికి ప్రత్యక్షంగా ఇలా శివ స్వామి రూపంలో వచ్చి తన సాధన పరిసమాప్తి చేసినందుకు… చిన్నమస్తా దేవి మాయను చేదించినందుకు, అలాగే పురుష, స్త్రీ ప్రకృతి మాయలను దాటించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి అని చెప్పేసి సాధనా కుటుంబం అంతా దత్తాత్రేయ స్వామి ఉన్న కొండమీదకి వెళ్లి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసి, శివ నందిని కాస్త ధ్యానంలో కూర్చునే సరికి…. విగ్రహ మూర్తి స్థానంలో భౌతికంగా కనిపించేసరికి స్వామి! మీరే వచ్చారని నాకు అర్థం అయింది. శివ స్వామి చెబుతూనే ఉన్నాడు… దత్తాత్రేయ లీలా ఇది. దత్తాత్రేయ స్వామి వచ్చి ఉండవచ్చు అని … పరమ గురువుగా మీరు ఉండి నా సాధన పరిసమాప్తికి అనుగ్రహించినందుకు ధన్యవాదాలు అని శివ నందిని కృతజ్ఞతలు చెబుతూ ఉండేసరికి…అలా అక్కడే ధ్యాననిష్ఠలో ఉండటం జరిగింది. ఇలా ఉండగా శివ నందినికి ధ్యానంలో ఉన్నట్టుండి జగన్మోహిని స్వరూపం కనిపించడం, ఆ తర్వాత అయ్యప్ప స్వామి కనిపించడం, ఆ తరువాత అయ్యప్ప స్వామి కాస్త జ్యోతి స్వరూపంగా కనిపించడం జరిగేసరికి…. ఇదేమిలీలా అనుకునేసరికి ధ్యానభంగం అయింది. అక్కడే ఉన్న రుద్రస్వామికి విషయం చెప్పేసరికి… అమ్మ పరమాత్మ స్వరూపం, పరంజ్యోతి స్వరూపం అంటారు కదా!  ఆ పరంజ్యోతి స్వరూపం ఎలా ఏర్పడింది అనేది… మనకి జగన్మోహిని రూపంలో శివుడు విష్ణువు, సంయోగం వలన జగన్మోహిని స్వరూపంలో జరిగింది. అలాగే కుమారస్వామి కూడా జ్యోతి స్వరూపంగా ఉన్నారని చెప్పడం జరిగింది కదా!  కుమారస్వామిని పంచాయతనమునకు జ్యోతి పంచాయితనం గుర్తించడం జరిగింది కదా! ఇక్కడ పరమాత్మ స్వరూపం జ్యోతి స్వరూపం అని చెప్పేసి అంటారు.  ఈ జ్యోతి స్త్రీ, పురుష భాగాలుగా రెండు ప్రకృతులుగా స్త్రీ, పురుష ప్రకృతులలో ఏర్పడటం, అవే మనో శరీరాలు ఎత్తడం జరిగింది. నిరాకార తత్వం నుంచి ఆకార తత్వంలో మనో శరీరం ఎత్తటం జరిగింది. ఆ తర్వాత 9 దేహాలతో స్థూల శరీరం దాకా రావటం జరిగింది. ఆ తత్వం గురించి చెబుతున్నారు అనేసరికి… అక్కడికి ఒక కేరళ భక్తుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఆయన వచ్చి అమ్మ!  నేను శబరిమల  వెళ్లి వచ్చాను.  అక్కడ అనుకోకుండా ఈ అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహ మూర్తి నాకు దొరకటం జరిగింది. ఇది ఎవరికి చేరాలో వారికి చేరుతుంది.. వాళ్ళ దగ్గరికి నువ్వే వెళతావు.. ఎప్పుడైతే నేను బరువుగా మారతానో ఆ సన్నిధానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నన్ను అందజేయి అని చెప్పడం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తుడు తన చేత సంచి లో ఉన్న విగ్రహ మూర్తిని బయటకు తీసి , ఇది మీ సమక్షంలోకి వచ్చేసరికి విపరీతమైన బరువు ఉన్నది.  100 గ్రాములు కాస్త వెయ్యి గ్రాముల బరువుగా మారింది అని భక్తుడు అంటూ ఉండేసరికి…. అవునా అని శివ నందిని తీసుకునే సరికి అది 100 గ్రాముల కింద మారేసరికి….ఇది అయ్యప్ప స్వామి లీలా విన్యాసం అని అనేసరికి… అప్పుడు రుద్రస్వామి కాస్త పరమహంస గారికి కూడా అయ్యప్ప స్వామి విగ్రహం రావడం జరిగింది. దానికి బ్రహ్మచర్య దీక్షతో నియమనిష్ఠలతో ఉండాలి అని….ఏదైనా తేడా వస్తే కష్టాలు వస్తాయని… ఆయన గృహస్థాశ్రమంలో ఉండటం వలన నేను భరించలేదు అనటంతో, తిరిగి అది వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. మళ్లీ పరంజ్యోతి స్వరూప స్థితికి ఈ సాధన స్థితి రావటంతో…. ఆయన ఈ విధంగా నీ దగ్గరికి రావడం జరిగింది.  నువ్వు నీ శరీరం నియమనిష్టలతో ఉంటావు కాబట్టి భగవంతుని స్వరూపం పరంజ్యోతి స్వరూపం కాబట్టి ఈ అయ్యప్ప స్వామి ఆరాధనలో ఉంచుకో అనేసరికి… దైవిక వస్తువుగా దానిని భావించి తనలోకి అదృశ్య శక్తితో నిక్షిప్తం చేసుకోవడం జరిగింది. యధావిధిగా శివ నందిని ధ్యాన నిష్ఠలో ఉండసాగింది.

పరమహంసకి అహం బ్రహ్మాస్మి స్థితిలో కలిగిన  అనుభవాలు:-


పరమహంసగారు ఈ స్థితిని పొందిన తరువాత వారిలో తెలియని అశాంతి, ఆందోళన ప్రారంభమయ్యాయి.


- ఒకసారి గ్లాసులో పడిన నల్ల చీమ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న దృశ్యం వారి మనోనేత్రంలో కనిపించింది. ఆ చీమను బయటకు తీసేవరకు వారికి మనశ్శాంతి కలగలేదు.

- రోడ్డుపై ఆకలితో ఉన్న కుక్కను చూసినప్పుడు వారికి కూడా విపరీతమైన ఆకలి కలిగింది. ఆ ఆకలి తమది కాదని గ్రహించి, ఆ కుక్కకు ఆహారం పెట్టిన తరువాతే వారి ఆకలి తగ్గింది.

- నిత్యపూజ సమయంలో మరుగుదొడ్డి కుండీలో పడిన ఈగను రక్షించడానికి పరమహంసగారు పూజను మధ్యలోనే ఆపారు. ఆ ఈగను బయటకు తీసిన తరువాతే వారికి మనశ్శాంతి కలిగింది.

- అక్క ఇంటికి వెళ్లినప్పుడు బంక అట్టకు అతుక్కుని మరణయాతన పడుతున్న పెద్ద ఎలుకను రక్షించి, సురక్షితమైన ప్రదేశంలో వదిలిన తరువాతే వారికి ప్రశాంతత కలిగింది.

- ఆ రాత్రి ధ్యానంలో ఆ ఎలుక ముఖం కనిపించి, అది ఇంకా జీవించి ఉన్నట్లుగా అనుభూతి కలగడంతో పరమహంసగారు ఎంతో ఆనందించారు.

- కాకాజీ ఇంటికి వచ్చిన సందర్భంలో మరణయాతన అనుభవిస్తున్న ఒక జీవి బాధను వారు అనుభూతి చెందారు. వెతకగా విద్యుత్ స్తంభానికి ఉన్న గాలిపటపు మాంజాలో చిక్కుకున్న పావురం కనిపించింది.

- ఆ పావురాన్ని రక్షించే ప్రయత్నంలో విద్యుత్ తీగలకు ఇనుప రాడ్లు తగలడంతో నిప్పురవ్వలు వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరకు విద్యుత్ సిబ్బంది వచ్చి ఆ పావురాన్ని రక్షించారు.

- ఆ తరువాత మొక్కలు, చెట్లు కూడా ధ్యానంలో తమ బాధలను మౌనభాష ద్వారా తెలియజేస్తున్నట్లుగా పరమహంసగారికి అనుభవాలు ప్రారంభమయ్యాయి.

- గులాబీ మొక్క ముళ్లు మల్లె ఆకుకు గుచ్చుకోవడం ధ్యానంలో కనిపించడంతో, ఆ రెండు మొక్కల కుండీలను వేరుచేసే వరకు వారికి ఆందోళన తగ్గలేదు.

- ఇంటి తలుపుకు ఒక పురుగు రంధ్రం చేసి గుడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ధ్యానంలో కనిపించడంతో, ఆ రంధ్రాన్ని పూడ్చిపెట్టే వరకు వారికి మనశ్శాంతి కలగలేదు.

- సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు, టీవీలు, ఏసీలు వంటి వస్తువులకు ఏదైనా హాని కలుగుతున్నట్లుగా కూడా వారికి ధ్యానంలో కనిపించడం ప్రారంభమైంది.

- ఆయా వస్తువుల సమస్యలను పరిష్కరించినప్పుడే పరమహంసగారికి అంతరంగంలో ప్రశాంతత కలిగేది. రోజుకు పది నుండి ఇరవై వరకు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చేది.

- మొక్కలలో మనుష్య రూపాలు, ఇసుక రేణువులలో శివలింగాలు, నీటి బిందువులలో జలలింగాలు కనిపించడం ప్రారంభమైంది.

- ప్రాణంలేని వస్తువులలో కూడా సాధన చేసేవారి నిజస్వరూపాలు కనిపించడం ప్రారంభమైంది.

- సమస్త జీవరాశులు, వస్తువులు ఒకే చైతన్య స్వరూపంతో అనుసంధానమై ఉన్నాయని, వాటి బాధలను మౌనభాష ద్వారా తెలుసుకుంటున్నానని పరమహంసగారు భావించారు.

- వాటి అవసరాలు తీర్చినప్పుడే ప్రశాంతత కలుగుతుండటంతో, వారి జీవితం పరుల ఉపకారం కోసమే అన్నట్లుగా మారింది.

- ఇన్నాళ్లూ వరాలు పొందే స్థితిలో ఉన్న తాను, ఇప్పుడు వరాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నానని పరమహంసగారు భావించారు.

- ఈ అనుభవాలన్నింటినీ అహం బ్రహ్మాస్మి స్థితి లక్షణాలుగా భావించి, తన సాధన పరిసమాప్తి అయిందని అనుకున్నారు.

- అయితే తరువాత ఒక ధర్మసందేహం కలిగింది. మిగిలిన విషయాలను త్యాగం చేసినప్పుడు రాని శాంతి, కేవలం 'నేను' అనే భావనను త్యాగం చేసినప్పుడు ఎందుకు కలిగిందనే ప్రశ్న వారిలో ఉదయించింది.

- నిండిన నీళ్ల కుండ ఉపమానం ద్వారా పాత నీటిని కొంత తొలగించినప్పుడే కొత్త నీటికి స్థానం లభించినట్లుగా, దేహబుద్ధి, కర్మాభిమానం తొలగినప్పుడే శాంతికి స్థానం లభిస్తుందని పరమహంసగారు వివరించారు.

- ప్రతి కర్మకు 'నేను' అనే భావనను జోడించుకోవడం వల్ల కర్మఫలాలపై ఆశలు, నిరాశలు, ఆందోళనలు ఏర్పడతాయని చెప్పారు.

- 'నేను' అనే కర్తృత్వ భావన తొలగినప్పుడు కర్మఫలాల గురించి ఆందోళన తగ్గి, కేవలం బాధ్యతతో కర్మలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు.

- రైలు ఇంజన్, చివర ఉండే సెక్యూరిటీ గార్డు బోగి ఉపమానం ద్వారా జీవాత్మ, పరమాత్మల మధ్య సంబంధాన్ని వివరించారు.

- భాగవతంలోని రెండు పక్షుల ఉపమానాన్ని ప్రస్తావిస్తూ, ఒక పక్షి సాక్షీభూతంగా నిశ్చలంగా ఉంటే, రెండవ పక్షి తానే అన్నీ చేస్తున్నట్లు భావిస్తూ అనుభవాలను పొందుతుందని వివరించారు.

- చివరకు చేసేది, చేయించేది పరమాత్మ ఒక్కడేనని, జీవాత్మ తానే కర్తనని భావించడమే మాయ అని పరమహంసగారు వివరించారు అని రుద్రస్వామీ చెప్పడం జరిగింది.


ఇది ఇలా ఉండగా…. ఒక రోజు శివ నందినికి అమ్మవారు చేతిలో శివలింగం ఉన్నట్లుగాను, విష్ణుమూర్తి చేతిలో ఒక శివలింగం ఆరాధన చేస్తున్నట్లుగాను కనిపిస్తూ ఆ తర్వాత కుమారస్వామి సజీవ మూర్తిగా  ఉన్నవాడు కాస్త, విగ్రహ మూర్తిగా కనపడటం, ధ్యానానుభవం అయ్యింది.  ఇది ఏమిటి?  అనేది శివ నందిని కి అర్థం కాలేదు.  ఈ శివలింగాలు ఏమిటి?  ఇవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కాలేదు.  సరే అని కొన్ని రోజుల తరువాత ఇదే విధంగా ధ్యానం చేస్తూ ఉండేసరికి…. ఒక కొండమీద నవపాషాణాలతో ఉన్న కుమారస్వామి విగ్రహ మూర్తి కనిపించేసరికి…. ఇది పళని కుమారస్వామి.  ఇది పళని క్షేత్రం అని అర్థం అయ్యేసరికి ధ్యానభంగం అయి కళ్ళు తెరిచి చూసేసరికి…. పళని కుమారస్వామి ఎందుకు కనపడుతున్నారు అని అనుకుని…. రుద్రస్వామిని అడిగేసరికి…ఈ విగ్రహ మూర్తి అంత ఆషామాషీ అయిన విగ్రహ మూర్తి కాదమ్మా!  అది తొమ్మిది రకాల విషపదార్థాలతో తయారు చేయడం జరిగింది. అది ఎలా అంటే ఆదిపరాశక్తి తన కుమారుడు సజీవ మూర్తిగా చిరంజీవి తత్వంతో ఉండాలి అని దేహమును 64 విష పదార్థాలలో అతిముఖ్యమైన తొమ్మిది రకాల విష పదార్థాలతో కుమారస్వామి యొక్క దేహమును భద్రపరచడం జరిగింది. మమ్మీగా మార్చడం జరిగింది.  అదే నవపాషాణ విగ్రహ మూర్తిగా ఏర్పడింది.  అది అరుణాచల క్షేత్రంలో మనకి అరుణగిరి లోపల సజీవ మూర్తిగా ఇప్పటికీ కూడా నవపాషాణ విగ్రహ మూర్తి రూపంలో మనకి మధ్య భాగంలో ఉండటం జరిగింది అని చెప్పి పరమహంస ధ్యాన అనుభవాలలో నేను తెలుసుకోవటం జరిగింది. కాలక్రమేణ పద్దెనిమిది గురువులలో ఒక గురువు ద్వారా భోగర్ అనే శిష్యుడు తెలుసుకొని ఈ విషయాన్ని లోకానికి చెప్పడం జరిగింది.  ఆయన తొమ్మిది రకాల విషపదార్థాలతో అదే ఫార్ములాను ఉపయోగించి మనకి పళనిలో విగ్రహం తయారు చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా ఈ విగ్రహం మూర్తిని తయారు చేశాడో ఆ విధివిధానం చెప్పకపోయినప్పటికీ…. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి, ఆ పదార్థాలను ఉపయోగించి చేసినప్పటికీ కూడా, అంత స్థితిలో విగ్రహ మూర్తి ఏర్పడలేదు.  అది రహస్యంగానే ఉండిపోయింది.  ఇప్పుడు నవ పాషాణ విగ్రహ మూర్తి నుంచి సంతానం లేని వారికి ఈ విగ్రహ మూర్తికి అభిషేకం చేసిన నీటిని తీర్థం గా ఇవ్వడం చేస్తారు. తద్వారా వాళ్లు సంతానం పొందడం జరుగుతుంది అని చెప్పేసి…. అలాగే సర్ప దోషాలు, రాహు కేతు దోషాలు, సర్ప శాపాలు ఇవన్నీ కూడా ఈయన దర్శనం చేసుకుంటే పోతాయి అని నానుడి ఉండటంతో… పళని కుమారస్వామి ప్రఖ్యాతి పొందడం జరిగింది అని చెప్పడం జరిగింది. 

పళని కుమారస్వామి క్షేత్రము 

పళని కుమారస్వామి క్షేత్రం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మురుగన్ ఆరాధనా కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మురుగన్ స్వామివారి ఆరు ముఖ్యమైన నివాసస్థానాలైన ఆరుపడైవీడులలో ఒకటిగా పూజించబడుతోంది. పళని అనే పేరుకు సంబంధించిన ప్రాచీన రూపం ‘పొదిని’ అని తమిళ సంప్రదాయ చరిత్ర చెబుతోంది. సంగం కాలంలో ఈ ప్రాంతం వయ్యావినాడు, ఆవినాడు అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన తమిళ సాహిత్యంలో నక్కీరర్ రచించిన *తిరుమురుగாற்றுப்படை*లో ఆవినన్కుడి క్షేత్రం ప్రస్తావించబడింది. *అగనానూరు*లో పొదిని ప్రాంతం, అక్కడి వేళ్ ఆవి పాలకుల గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. ఈ ఆధారాలు పళని ప్రాంతంలో మురుగన్ ఆరాధనకు ప్రాచీనమైన నేపథ్యం ఉందని తెలియజేస్తున్నాయి. అయితే నేటి కొండపై ఉన్న దండాయుధపాణి ఆలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందో ఖచ్చితంగా నిర్ధారించే ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. ఆవినన్కుడి ఆలయం కొండ దిగువన ఉన్న ప్రాచీనమైన మురుగన్ క్షేత్రం కాగా, కొండపై ఉన్న ప్రధాన ఆలయం దండాయుధపాణి స్వామివారికి అంకితం చేయబడింది. ఈ రెండు క్షేత్రాలు పళని ఆధ్యాత్మిక చరిత్రలో విడదీయలేని భాగాలుగా నిలిచాయి. పళని స్థలపురాణంలో అత్యంత ప్రసిద్ధమైనది జ్ఞానఫలం కథ. ఒకసారి నారద మహర్షి కైలాసానికి వచ్చి శివపార్వతులకు జ్ఞానఫలాన్ని సమర్పించగా, దానిని ఇద్దరు కుమారులైన గణపతి, కుమారస్వామికి పంచడం సాధ్యం కాకపోవడంతో, ముల్లోకాలను మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందుగా తిరిగి వచ్చినవారికి ఆ ఫలాన్ని అందజేస్తానని శివుడు ప్రకటించాడని కథనం చెబుతుంది. కుమారస్వామి తన నెమలి వాహనంపై లోకప్రదక్షిణకు బయలుదేరగా, గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి వారే సమస్త విశ్వానికి మూలమని తెలియజేశాడు. గణపతి జ్ఞానాన్ని మెచ్చుకున్న శివుడు ఆయనకు జ్ఞానఫలాన్ని అందజేశాడు. తిరిగి వచ్చిన కుమారస్వామి ఈ విషయం తెలుసుకుని కైలాసాన్ని విడిచిపెట్టి దక్షిణ దిశగా వచ్చి ఒక కొండపై నివసించాడని స్థలపురాణం వివరిస్తుంది. అప్పుడు శివపార్వతులు ఆయనను సమీపించి, “పళం నీ” అంటే “నీవే జ్ఞానఫలం” అని అనుగ్రహించారని తమిళ సంప్రదాయం చెబుతుంది. ఈ ‘పళం నీ’ అనే మాట కాలక్రమంలో ‘పళని’ అనే పేరుతో అనుసంధానించబడిందని భక్తుల విశ్వాసం. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే, జ్ఞానం అనేది బాహ్య ప్రపంచాన్ని మాత్రమే అన్వేషించడం ద్వారా కాకుండా, సమస్త విశ్వానికి మూలమైన పరమతత్త్వాన్ని గుర్తించడం ద్వారా కూడా పొందవచ్చని సూచిస్తుంది. ఈ సంఘటన అనంతరం కుమారస్వామి పళని కొండపై దండాయుధపాణి రూపంలో నివసిస్తున్నారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహం ఇతర మురుగన్ క్షేత్రాల రూపాలకంటే భిన్నంగా ఉంటుంది. ఆయనకు కిరీటం, ఆభరణాలు, యుద్ధాయుధాలు వంటి అలంకారాలు ప్రధానంగా కనిపించవు; తలపై జుట్టు లేకుండా, నడుముకు వస్త్రం ధరించి, చేతిలో దండాన్ని పట్టుకుని బాలయోగి రూపంలో దర్శనమిస్తారు. అందువల్ల ఆయనను దండాయుధపాణి, పళనియాండవర్ అని పిలుస్తారు. ఈ రూపం వైరాగ్యం, త్యాగం, ఆత్మనిగ్రహం, జ్ఞానసాధనకు ప్రతీకగా భావించబడుతుంది. పళని క్షేత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన స్థలపురాణం ఇడుంబన్ కథ. శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను శివుడు అగస్త్య మహర్షికి ఇచ్చాడని, వాటిని దక్షిణ ప్రాంతానికి తీసుకెళ్లమని అగస్త్యుడు ఇడుంబాసురుడిని ఆదేశించాడని కథనం చెబుతుంది. ఇడుంబన్ ఆ రెండు పర్వతాలను కావడి ఆకారంలో మోసుకెళ్తూ మార్గమధ్యంలో విశ్రాంతి కోసం ఉంచగా, తిరిగి వాటిని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు ఒక పర్వతం కదలలేదని, దానిపై కుమారస్వామి బాలుడి రూపంలో కనిపించారని చెబుతారు. ఇడుంబన్ ఆ బాలుడిని పర్వతం నుంచి దిగమని కోరగా, ఆయన నిరాకరించడంతో యుద్ధం జరిగి ఇడుంబన్ మరణించాడని, అతని భార్య ఇడుంబి ప్రార్థనతో కుమారస్వామి అతనికి తిరిగి ప్రాణం ప్రసాదించాడని స్థలపురాణం వివరిస్తుంది. అనంతరం ఇడుంబన్‌కు స్వామివారి క్షేత్రంలో ద్వారపాలకుడి స్థానం లభించిందని, తనలాగే కావడులు మోసుకొచ్చే భక్తుల ప్రార్థనలను కూడా స్వామివారు ఆలకించాలని అతడు కోరినట్లు సంప్రదాయం చెబుతుంది. ఈ కథతో పళనిలో కావడి సంప్రదాయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏర్పడింది. నేటికీ భక్తులు పాలకావడి, పుష్పకావడి, తీర్థకావడి వంటి వివిధ రూపాల్లో కావడులు మోస్తూ పాదయాత్రగా పళని కొండకు చేరుకుంటారు. ఈ ఆచారం కేవలం శారీరక శ్రమకు సంబంధించినది మాత్రమే కాకుండా, భక్తుడు తన అహంకారాన్ని, కోరికలను, కష్టాలను భగవంతుని పాదాల వద్ద సమర్పించుకోవడాన్ని సూచించే ఆధ్యాత్మిక సంప్రదాయంగా భావించబడుతుంది. పళని క్షేత్ర చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం భోగర్ సిద్ధుడికి సంబంధించినది. తమిళ సిద్ధుల సంప్రదాయంలో భోగర్ లేదా భోగనాథర్‌ను గొప్ప సిద్ధుడిగా, రసవాద విద్యలో నిపుణుడిగా, సిద్ధ వైద్య పరిజ్ఞానం కలిగిన యోగిగా గౌరవిస్తారు. ఆయనను పదినెనిమిది సిద్ధులలో ఒకరిగా పూజిస్తారు. భోగర్ తన గురువుగా కాలాంగి నాథర్‌ను పేర్కొన్నట్లు ఆయన పేరుతో ప్రచారంలో ఉన్న సిద్ధ సంప్రదాయ గ్రంథాలు వివరిస్తాయి. కాలాంగి నాథర్ వద్ద యోగం, ధ్యానం, రసవాదం, మూలికా పరిజ్ఞానం వంటి విద్యలను అభ్యసించి, అనంతరం అనేక ప్రాంతాలు సంచరించి సిద్ధవిద్యలను విస్తరించారని భోగర్ జీవితకథలో చెప్పబడుతుంది. భోగర్‌కు ఆపాదించబడిన *భోగర్ 7000* అనే గ్రంథంలో రసవాదం, ఔషధ తయారీ, ఖనిజ పదార్థాల శుద్ధి, యోగసాధన, శరీర ధర్మాలు వంటి అనేక అంశాలు ప్రస్తావించబడినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ గ్రంథం పేరుతో లభిస్తున్న ప్రతులన్నీ భోగర్ స్వయంగా రచించినవేనని నిర్ధారించడం సాధ్యం కాదు; వాటి భాష, ప్రతుల కాలం, పాఠ్య సంప్రదాయాన్ని విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుంది. భోగర్ క్రీ.పూ. వేల సంవత్సరాల క్రితమే జీవించాడని కొన్ని సిద్ధ సంప్రదాయ కథనాలు పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం లభిస్తున్న గ్రంథ ప్రతుల ఆధారంగా ఆయన ఖచ్చితమైన జీవితకాలాన్ని నిర్ధారించలేం. పళని ఆలయ సంప్రదాయం ప్రకారం భోగర్ సిద్ధుడే కొండపై ఉన్న దండాయుధపాణి స్వామివారి మూలవిగ్రహాన్ని నవపాషాణంతో రూపొందించి ప్రతిష్ఠించాడు. ఆయన తొమ్మిది పాషాణ పదార్థాలను ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి, నిర్దిష్ట నిష్పత్తుల్లో కలిపి విగ్రహాన్ని రూపొందించాడని విశ్వాసం ఉంది. నవ అంటే తొమ్మిది, పాషాణం అంటే సిద్ధ రసవాద సంప్రదాయంలో పేర్కొనే ఖనిజ లేదా విషస్వభావ పదార్థాలు. ఈ పదార్థాలు సరైన విధంగా శుద్ధి చేసి కలిపినప్పుడు ఔషధ స్వభావం పొందుతాయని సిద్ధ వైద్య సంప్రదాయంలో భావిస్తారు. కొన్ని సంప్రదాయ వివరణల్లో ఎనిమిది పదార్థాలను కలిపి, తొమ్మిదవ పదార్థాన్ని వాటి సంయోగాన్ని స్థిరపరిచే పదార్థంగా ఉపయోగించారని చెబుతారు. అయితే పళని మూలవిగ్రహంలో ఉపయోగించిన తొమ్మిది పదార్థాల అసలు పేర్లు, వాటి ఖచ్చితమైన నిష్పత్తులు, తయారీ విధానం గురించి అనేక వాదనలు ఉన్నప్పటికీ, వాటిని నిర్ధారించే సంపూర్ణమైన ప్రజలకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ విశ్లేషణ లేదు. అందువల్ల నవపాషాణ విగ్రహం గురించి చెప్పబడే ప్రతి రసాయన వివరాన్ని నిర్ధారిత శాస్త్రీయ సత్యంగా కాకుండా సిద్ధ సంప్రదాయ విశ్వాసంగా చూడాలి. విగ్రహానికి జరిగే అభిషేకాల అనంతరం లభించే ప్రసాదాలకు ప్రత్యేకమైన పవిత్రత, ఔషధగుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా రాత్రివేళ స్వామివారికి చందనాన్ని అలంకరించి, మరుసటి రోజు దాన్ని ప్రసాదంగా అందించే సంప్రదాయం పళని ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. దీనిని రక్కాల చందనం అని పిలుస్తారు. అయితే ఈ చందనం లేదా ఇతర అభిషేక ప్రసాదాలు నిర్దిష్ట వ్యాధులను నయం చేస్తాయని వైద్యపరంగా నిర్ధారించబడినట్లు చెప్పడానికి ఆధారాలు లేవు. నవపాషాణం పేరుతో బయట విక్రయించే పూసలు, తాయెత్తులు, పొడులను ఆలయ మూలవిగ్రహ పదార్థంతో సమానంగా భావించడానికి కూడా ఆధారాలు లేవు. విషస్వభావం కలిగిన పదార్థాలను తెలియకుండా తాకడం లేదా సేవించడం ప్రమాదకరం. భోగర్ సిద్ధుడికి సంబంధించిన మరో విశేషం ఆయన గుహ, సమాధి సంప్రదాయం. పళని కొండపై ఉన్న ప్రధాన ఆలయంలోని నైరుతి భాగంలో భోగర్ సన్నిధి ఉంది. ఈ సన్నిధికి కొండ అంతర్భాగంలోని గుహతో భూగర్భ మార్గం ఉందని, ఆ గుహలో భోగర్ సిద్ధుడు సమాధి స్థితిలో ఉన్నాడని సంప్రదాయ విశ్వాసం చెబుతుంది. భోగర్ అక్కడ భువనేశ్వరి దేవిని, నవదుర్గ శక్తులను, మరకత శివలింగాన్ని ఆరాధించాడని ఆలయానికి సంబంధించిన సంప్రదాయ కథనాలు వివరిస్తాయి. ఆయన తన శిష్యుడైన పులిప్పాణి సిద్ధుడికి పూజా బాధ్యతలను అప్పగించి, అనంతరం నిర్వికల్ప సమాధి స్థితిని పొందాడని కూడా చెబుతారు. ఈ వివరాలు భోగర్ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినప్పటికీ, ఆయన భౌతికంగా ఇప్పటికీ గుహలో ఉన్నాడని నిర్ధారించే స్వతంత్ర పురావస్తు ఆధారాలు లేవు. పళని ఆలయ చరిత్రలో చేర రాజవంశానికి సంబంధించిన కథనం కూడా ఉంది. పెరుమాళ్ అనే చేర రాజు వేటకు వెళ్లిన సమయంలో కొండ ప్రాంతంలో ఆశ్రయం పొందగా, కుమారస్వామి స్వప్నంలో దర్శనమిచ్చి విగ్రహాన్ని పునరుద్ధరించమని ఆదేశించాడని, అనంతరం రాజు విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని పునరుద్ధరించి పూజలను తిరిగి ప్రారంభించాడని జిల్లా అధికారిక చరిత్రలో పేర్కొనబడింది. ఇది ఆలయ స్థలపురాణ చరిత్రలో భాగం. తరువాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయానికి రాజపోషణ లభించింది. మల్లికార్జునరాయలు, శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన శాసనాలు ఆలయంలో ఉన్నాయని తమిళనాడు హిందూ మత ధర్మాదాయ శాఖ అధికారిక చరిత్ర పేర్కొంటుంది. ఈ శాసనాల్లో ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, దీపారాధనలు, తిరుమంజనం వంటి ఆలయ కార్యక్రమాల నిర్వహణ కోసం భూములు, విరాళాలు సమర్పించిన వివరాలు కనిపిస్తాయి. ఇవి పళని ఆలయం మధ్యయుగ కాలంలో కూడా ప్రముఖ ఆరాధనా కేంద్రంగా కొనసాగిందని తెలియజేస్తాయి. కొండపై ఆలయానికి చేరుకోవడానికి ప్రాచీన కాలంలో రాతితో నిర్మించిన మెట్ల మార్గం, ఏనుగులు ఉపయోగించే మార్గం ఉండేవి. భక్తుల రాకపోకలు పెరగడంతో తరువాత విన్చ్ రైలు, రోప్‌వే వంటి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. పళని ఆలయంలో జరిగే ఉత్సవాల్లో తైపూసం అత్యంత ప్రసిద్ధమైనది. తమిళ మాసమైన తైలో పూసం నక్షత్రం సందర్భంగా జరిగే ఈ ఉత్సవానికి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తులు దీక్షలు స్వీకరించి, ఉపవాసాలు పాటించి, కావడులు మోస్తూ పాదయాత్రగా స్వామివారి దర్శనానికి చేరుకుంటారు. పంగుని ఉత్తిరం, వైకాశి విశాఖం, కంద షష్టి, సూరసంహారం వంటి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి. పళని పంచామృతం ఈ క్షేత్రానికి మరో ప్రత్యేక గుర్తింపు. అరటి, ఇతర పండ్లు, బెల్లం, తేనె, నెయ్యి వంటి పదార్థాలతో తయారుచేసే ఈ ప్రసాదం భక్తులకు పవిత్రమైన నైవేద్యంగా అందించబడుతుంది. ఆలయంలో ప్రతిరోజూ జరిగే అభిషేకాలు, అలంకారాలు, దీపారాధనలు, రాత్రి పూజలు స్వామివారి ఆరాధనా సంప్రదాయంలో ముఖ్యమైనవి. ముఖ్యంగా రాత్రివేళ స్వామివారిని నిద్రకు ఉపచారించే పళ్లియరై సంప్రదాయం కూడా ప్రస్తావించబడుతుంది. పళని క్షేత్రంలోని ఆధ్యాత్మిక రహస్యాలను తాత్త్వికంగా పరిశీలించినప్పుడు, జ్ఞానఫలం కథ మనిషి బాహ్య ప్రపంచాన్ని అన్వేషించడంతో పాటు తనలోని పరమసత్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తుంది; దండాయుధపాణి రూపం కోరికలు, ఆడంబరాలు, అహంకారాలను విడిచిపెట్టి జ్ఞానమార్గంలో నిలవడాన్ని సూచిస్తుంది; ఇడుంబన్ కావడి కథ భక్తి, ఓర్పు, శ్రమ, సమర్పణకు ప్రతీకగా నిలుస్తుంది; భోగర్ సిద్ధుడి సంప్రదాయం శరీరాన్ని, ప్రకృతిని, ఔషధ విజ్ఞానాన్ని, యోగసాధనను సమగ్రంగా పరిశీలించిన సిద్ధుల ఆలోచనా ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ విధంగా పళని క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ప్రాచీన తమిళ మురుగన్ ఆరాధన, సంగం సాహిత్యం, జ్ఞానఫలం స్థలపురాణం, ఇడుంబన్ కావడి సంప్రదాయం, భోగర్ సిద్ధుడి రసవాద కథనాలు, నవపాషాణ విగ్రహ విశ్వాసం, గుహా సమాధి సంప్రదాయం, మధ్యయుగ రాజవంశాల శాసనాలు, యోగతత్త్వం, భక్తి సంప్రదాయాలు కలిసిన ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. 

సహస్ర చక్రం నాల్గవ భాగం - పళని కుమారస్వామి నిజ రూప దర్శన అనుభవం 

శివ నందిని యధావిధిగా దక్షిణామూర్తి అనుగ్రహం పొందడంతో… అహం బ్రహ్మాస్మి స్థితిలో ఆనంద స్థితిని పొంది, విపరీతమైన ఆనంద స్థితిలో ఉంటూ కూడా…. తన సాధన ధ్యాననిష్టలో ఉండిపోవటం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ధ్యాన అనుభవ దృశ్యంగా…. సహస్ర చక్రంలో పళని కుమారస్వామి దర్శనం అవ్వడంతో.. ధ్యాన భంగం అయ్యి ధ్యానం నుంచి బయటకు రావటం జరిగింది. ఆ పక్కనే ఉన్న మహాదేవి కాస్త….

మహాదేవి:- ఏమైంది అమ్మ!  ధ్యానభంగం అయిందా?

శివ నందిని:- ఏమీ లేదమ్మా! సహస్ర చక్రం నాలుగవ భాగంలో ఉండే పళని కుమారస్వామి నిజరూప దర్శనం అయ్యింది. ఇక ఈయన అనుగ్రహం పొందవలసి ఉంటుంది.

(అనేసరికి….. మహాదేవి కాస్త పక్కనే ఉన్న రుద్రస్వామితో….)

మహాదేవి:-  అవును… కుమారస్వామి ఎందుకు నవ పాషాణ పదార్థాలతో నిర్మితమైనట్టు పళని కుమారస్వామి విగ్రహం ఉంటుంది.

రుద్రస్వామి:- కుమారస్వామి 18 సంవత్సరాల వయస్సులో ఉండగా… సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. అంటే తల్లిదండ్రుల మీద అలిగి ఆయన పళని క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అమ్మవారు ఆయనకి జ్ఞానఫలము అనుగ్రహించమని చెప్పేసి అడగటంతో…. శివుడు కాస్త మోక్ష జ్ఞాన ఫలం ఇవ్వటం జరిగింది. అందుకనే ఆ క్షేత్రమును పళని క్షేత్రం అని… ఆనాటి నుంచి ప్రాచుర్యం పొందడం జరిగింది. పైగా కుమారస్వామి జీవ సమాధి చెందిన తర్వాత ఆయన దేహమును..అమ్మవారు సుమారుగా 64 రకాల మూలిక పదార్థాలను సేకరించి, దానిని తొమ్మిది రకాల విషాలుగా మార్చి, ఆ మూలికలతో, ఆ రసముతో ఆ దేహం పాడైపోకుండా… మమ్మీగా మార్చి అరుణాచల క్షేత్రంలో అంతర్గత గుహలో సజీవ విగ్రహ మూర్తిగా ఏర్పరచడం జరిగింది. ఇప్పటికీ మనకి ఈ క్షేత్రంలోని అరుణగిరి లోపల ఉన్న గుహలోపలికి వెళ్లి చూడగలిగితే…. సాక్షాత్తు కుమారస్వామి సజీవమూర్తిగా నిలబడి ఉన్నట్లుగా కనపడుతుంది.  ఎందుకంటే అది సజీవంగా ఆయన దేహంతో ఏర్పడిన విగ్రహం అన్నమాట! విగ్రహ మూర్తి అనడానికి లేదు….సజీవ మూర్తియే . సజీవ మూర్తి యొక్క సజీవ సమాధి అని చెప్పవచ్చును. ఆ దేహం పాడైపోకుండా ఉండటానికి అని నవ విష పదార్థాలతో ఆ దేహమును అమ్మవారు కాపాడింది అని చెప్పి, అప్పటినుంచి ఆయన్ని నవ పాషాణ విగ్రహ మూర్తిగా ప్రాచుర్యం పొందింది. ఇది అక్కడ ఉన్న 18 సిద్దులలో ఒక సిద్దుడు అమ్మవారిని సహాయం చేశాడని, ఆ సిద్ధుడి అనుగ్రహంతో భోగర్ అనే సిద్ధుడు ఈ పళని క్షేత్రంలో నవ పాషాణాలతో అంటే 9 రకాల విష పదార్థాలతో ఇక్కడ ఎలా అయితే కుమారస్వామి ఉన్నాడో…. అక్కడ విగ్రహ మూర్తిని తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు అలాంటి విగ్రహ మూర్తిని ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కూడా తయారు చేయలేకపోయారు. ఆ తొమ్మిది పదార్థాలు ఏమిటో తెలుసు కానీ, అవి తగు పాలలో కలపటం అనేది వీళ్ళ ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు ఈ పళని క్షేత్రంలో ఉన్న నవపాషాణ విగ్రహం మూర్తి శరీరం నుంచి రజను తీసి, కొద్ది పాలలో తీర్థంలో కలపడం జరుగుతుంది. సంతానం లేని వారికి ఆ పొడిని తీర్థంలో కలిపి ప్రసాదంగా ఇస్తే, సంతాన ప్రాప్తి కలుగుతుందని అక్కడ స్థల పురాణం చెప్పడం జరిగింది. అంటే అక్కడ అమ్మవారు కుమారస్వామి మరణాన్ని తట్టుకోలేక….ఆయన దేహాన్ని 9 రకాల పదార్థాలతో కాపాడటం వలన, ఆయన్ని నవపాషాణ విగ్రహం మూర్తిగా చెప్పడం జరిగింది. పైగా పళని కుమారస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే…. ఆయన సన్యాస దీక్షలో ఉండటం, ఆయన మోక్ష జ్ఞాన  ఫలమును ఇక్కడే పొందడం జరిగింది. ఈ మోక్షజ్ఞానం పొందాలంటే మహమృత్యు భయం దాటుకోవాలి అని చెప్పి యోగ శాస్త్ర వచనంగా చెప్పడం జరిగింది.ఉదయం 6:30 నుంచి 7:15 గంటల వరకు  సన్యాసి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే సకల సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉదయం 8:00 నుంచి 8:30  గంటలకు వేటగాని (వేదన్) అలంకారంలో దర్శనం ఇస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే శత్రువుల భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉదయం 9:00 నుంచి 9:30గంటల వరకు బాలసుబ్రహ్మణ్య స్వరూపంలో దర్శనం ఇస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అక్కడ భక్తుల విశ్వాసంగా భావిస్తారు. మధ్యాహ్నం 12:00గంటల నుంచి12:45 వరకు వైదిక/వైదికాళ్ అలంకారంలో దర్శనం ఇస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సాయంత్రం 5:30 - 6:30 గంటల వరకు రాజ అలంకారంలో దర్శనం ఇస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే వ్యాపార అభివృద్ధి, సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తులు విశ్వాసం. రాత్రి 8:00 నుంచి  8:30 గంటల వరకు  పుష్ప అలంకారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే జీవితంలో ఆనందం, సంతోషం కలుగుతాయి అని నమ్ముతారు. అందుకని పళని కుమారస్వామి అనుగ్రహంతో…మనకి నవ పదార్థాలతో తయారైన ఇష్ట లింగం అనుగ్రహం మనం పొందడం జరుగుతుంది. వాస్తవానికి మనం ఈ ఇష్టలింగం పొందితే కానీ, ఈ హృదయ చక్రంలోనికి ప్రవేశించడానికి అర్హత, యోగ్యత, యోగం రాదు.హృదయ చక్రంలో ఇష్ట కామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, ఇష్ట లింగం అని మూడు స్థితి రూపాలు ఉంటాయి. ఈ ఇష్టలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే… మనకున్న ఇష్ట కోరికను తీర్చేసి, దేహ విముక్తి కలిగించి, మోక్ష పథమును కలిగిస్తుంది. ఈ ఇష్టలింగ విధివిధానం బసవేశ్వరుడు అనే సిద్దయోగి అనుభవ జ్ఞానం పొందడంతో…. ఆయన తొమ్మిది రకాల పదార్థాలతో… ఇష్ట లింగం తయారు చేయడం సాంప్రదాయంగా పెట్టడం జరిగింది అని కూడా అంటారు.  ఇష్ట లింగమును జీవితాంతం ధరించే వాళ్ళనే లింగాయతులు అని ఆచార సంప్రదాయం ఉంది. వాళ్ళు 5వ ఏట ఇష్టలింగం ధరించి, తమ మరణాంతరంలో దేహ దహన సమయం లో ఈ లింగం కూడా దహనం చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ తొమ్మిది రకాల పదార్థాల వలన మనసు అధీనం అయ్యి, అరిషడ్వర్గాల మాయ నుంచి మహమృత్యుభయం నుంచి సప్త వ్యసన నుంచి మనసు అదుపులో ఉంచి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుందని….దీని నుంచి వెలువడే నీలిరంగు కాంతి ప్రభావం వలన మనసు పరిశుద్ధం అవుతుంది అని చెప్పేసి కర్మలను, కర్మ బంధాలను, ఋణాలను ఋణ శేషాలను ఈ నీలి కిరణాలు నాశనం చేస్తాయని… అందుకనే విషం అనేది నీలం రంగులో ఉండటం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్ర వచనం చెప్పడం జరిగింది. ఈ ఇష్టలింగమునకు అధిష్టానం దైవంగా పళని కుమారస్వామిని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈయన మాత్రమే మనకి ఇక్కడ నవపాషాణాలతో నిండి ఉన్న విగ్రహ మూర్తిగా, ఈ క్షేత్రంలో తప్ప ప్రపంచంలో ఏ క్షేత్రంలోనూ కనిపించరు. అలాగే మనకి నవ పాషాణ పొడితో ఉన్న తాయత్తులు అలాగే నవ పాషాణాలతో తయారుచేసిన లింగాలు, క్షేత్రంలో చాలా అరుదుగా దొరుకుతాయి. ఎవరైతే ఈ క్షేత్రంలో ఇష్ట లింగమును పొందుతారో, వారు మృత్యు భయమును దాటి భవబంధాలను దాటి స్త్రీ,పురుష ప్రకృతులను దాటి మూల ప్రకృతికి పొందటానికి అర్హత, యోగ్యత, యోగం ఉంటుందని శాస్త్ర వచనంగా చెప్పడం జరిగింది. ఈయన అనుగ్రహం పొందిన తరువాతనే హృదయ చక్రానికి అనుసంధానం అయిన జీవనాడిలో ఉండే హనుమంతుని అనుగ్రహం కూడా మనం పొందవలసి ఉంటుంది. హనుమంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఇష్ట లింగమును పొందవలసి ఉంటుంది. అందుకనే రామేశ్వర క్షేత్ర నిర్మాణ సమయంలో కాశీ క్షేత్రం నుంచి శివలింగం తీసుకురమ్మని హనుమంతుడికి చెప్పడం జరిగింది. ఆయన తీసుకుని వచ్చే లోపల సీతాదేవి ఇసుకతో శివలింగం తయారు చేయడం… రామేశ్వర క్షేత్ర స్థల పురాణం చెప్పడం జరిగింది. హనుమంతుడు తెచ్చిన లింగం ఇష్ట లింగం లేదా సిద్ధలింగం అయి ఉంటుంది. అలాగే కేరళలోని అనంత పద్మనాభస్వామి చేతులలో ఉండే శివలింగం సిద్దలింగం లేదా ఇష్టలింగం అని చెప్పి శాస్త్రవచనం ఉన్నది. ఎటు చూసినా మనం మూల ప్రకృతిలో ఉండే ఇష్టకామేశ్వరుడు కామేశ్వరి అనుగ్రహం పొందాలి అంటే ఇష్టలింగ ఆరాధన ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఆ ఇష్టలింగ ఆరాధన స్థితికి  రావాలంటే మనం మహా మృత్యు భయమును దాటవలసి ఉంటుంది.ఆ  అర్హత ఉందా.! లేదా?  అని మనకి పళని కుమారస్వామి పరీక్ష పెట్టడం జరుగుతుంది. కుమారస్వామి అనుగ్రహం పొందితే, ఇక నవపాషాణ నిర్మిత లేదా నవ పాషాణాలతో తయారు అయిన ఇష్ట లింగమును పొందడం జరుగుతుంది. ఇది జరగాలంటే నువ్వు మహా మృత్యు భయమును దాటాల్సి ఉంటుంది.

(అని రుద్ర స్వామి చెబుతూ ఉండేసరికి అమ్మ! అమ్మ! అంటూ బాల కుమారస్వామి రావటం జరిగింది.)

శివ నందిని:- ఇదేంట్రా.!  నువ్వే వచ్చావు.. బాల గణపతి లేడా? 

బాల కుమారస్వామి:- వాడు ధ్యాన నిష్ఠ లో ఉన్నాడు.  కదలించడం ఎందుకు అనిపించి… అక్కడ ఉండలేక, ఆడుకోవడానికి ఎవరూ లేక, విసుగు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది.

శివ నందిని:- ఇక్కడ మేమేదో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవన్నీ నీకు అర్థం కావు కదా…

బాల కుమారస్వామి:- దానికి నాకు సంబంధం లేదు, నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది. నాకు పాలు గుడ్లు కావాలి..

(శివ నందిని విచిత్రంగా వాడికేసి చూస్తూ….)

శివ నందిని:- ఇదేంటి?  ఎప్పుడూ లేనిది …విచిత్రంగా అడుగుతున్నావేమిటి? నువ్వు వీటిని తినవు కదా! 

బాల కుమారస్వామి:- నాకు ఇవాళ తినాలని బలంగా అనిపిస్తుంది. 

మహాదేవి:- అదేంట్రా!  బాలగణపతి లేకుండా నువ్వు ఏమీ తినవు కదా!  ముందు గణపతికి పెట్టి ఆ తర్వాత తింటావు కదా.?

బాల కుమారస్వామి:- వాడు ధ్యాననిష్ట లో ఉన్నాడు… నాకు ఆకలి వేస్తుంది… మీరు ఇప్పుడు పెడతారా? పెట్టరా? చెప్పండి… లేదంటే నేను వెళ్ళిపోతాను..

అలిగినట్టుగా మాట్లాడేసరికి… వీడు నిజంగానే ఆకలి మీద ఉన్నాడు అని చెప్పి శివ నందిని గ్రహించి, తన యోగ శక్తితో కోడిగుడ్లు, పాలు సృష్టించి ఇచ్చేసరికి… వాటిని తేరిపారా చూసి సంతృప్తిగా తిని,తాగి…

బాల కుమారస్వామి:- అమ్మా! నా ఆకలి తీరింది… నేను పని మీద బయటకు వెళ్తున్నాను..

రుద్రస్వామి:-నీకేం పనిరా?  చిన్నపిల్లాడివి…ఈ అడవిలో తప్పిపోతే కష్టం. ఈ అడవిలో నీకేం పని ఉంటుంది? 

బాల కుమారస్వామి:- ఈ క్షేత్రంలో 64 విష మూలికల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలతో నేను తొమ్మిది రకాల విష పదార్థాలు తయారు చేయాలి. నాకు విషం తాగాలని ఉంది.

రుద్రస్వామి:- విషం తాగటం ఏమిటిరా?  చచ్చిపోతావు…

బాల కుమారస్వామి:- ఎప్పుడో చచ్చిపోయాను.. ఇప్పుడు చచ్చిపోయాను అని తెలుసుకోవడమే కదా!  ఈ దేహం ఎప్పుడో రాలిపోయింది. ఆ రాలిపోయిన అనుభవ జ్ఞానమును పొందాను అంటే ఈ దేహం పడిపోతుంది కదా!  ఇది కాల మహిమ ….దేహమును చూసి బతికి ఉన్నాము అనుకుంటున్నాము. నిజానికి మనం బతికి లేము కదా! మన భవిష్యత్తు గతం అయ్యి వర్తమానంగా నడుస్తుంది. మనం ఎప్పుడో చనిపోయిన వాళ్ళమే. చచ్చిన దేహాలమే.

అని వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉండేసరికి… వీళ్ళ ముగ్గురికి ఆశ్చర్యం వేసింది. ఒకపక్క అనుమానం వచ్చినప్పటికీ కూడా… ఎందుకులే  వీడు కోపావేశంలో ఉన్నాడు అని శివ నందిని కాస్త 

శివ నందిని:- విష మూలికలతో మొక్కలు ఏమిటిరా? నీకు తెలుసా?

బాల కుమారస్వామి:-  మా అమ్మ చెప్పింది… ఈ క్షేత్రంలో విష మూలికలు దొరుకుతాయి.. నీకు విషం తాగాలి అనిపించేటప్పుడు… ఆ మూలికలన్నీ కలిపి ఆ విషం తయారు చేసుకుని తాగు!  అప్పుడు నీ దేహానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నది. నాకు ఎప్పుడూ ఈ దేహం మీద పగుళ్లు లాగా వస్తున్నాయి. రక్తం బయటకు వస్తుంది. దేహానికి ఏదో అయింది. విషం తాగాలి. ఈ దేహానికి విషం పూసుకోవాలి.

అనేసరికి…. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కాక, సరే మేము కూడా వస్తాము. ఏం పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు. మాకు కూడా విషం మొక్కలు తెలియవు. మేము కూడా చూస్తాము అనేసరికి… సరే రండి అంటూ వెళ్లేసరికి పిల్లవాడు వాడి కంటికి కనిపించిన మొక్కలన్నీ పీకుతూ….. సుమారుగా 64 విష మొక్కలను తీయడం జరిగింది. 

మహాదేవి:- ఇవన్నీ విషం మొక్కలని గ్యారెంటీ ఏంటి?

అనేసరికి….ఆ పక్కనే అందర్నీ కూర్చోపెట్టి, ఒక మొక్క రసం తీసి ఆ పక్కనే పాకుతున్న చీమ మీద పోయేగానే, చీమ చనిపోవడం జరిగింది.క్షణ కాలంలో చీమ శరీరం కాస్త నీలం రంగులోకి మారేసరికి…. ఎప్పుడైతే పాము కాటు వేస్తే ఎలా అయితే శరీరం నీలంగా మారుతుందో… ఈ మొక్క రసం శరీరం మీద పడేసరికి… చీమ నీలంగా మారేసరికి…. ఇది విషం మొక్క అని అర్థం అయింది. అప్పుడు ఇంకొక మొక్క తీసి ఇది సంజీవని వేరు మొక్క రసం అంటారు అంటూ ఆ చనిపోయిన చీమ శరీరం మీద వేసేసరికి నిద్రమత్తులో లేచినట్టుగా చీమ యధావిధిగా ముందుకు పాకుతూ వెళ్తూ ఉండేసరికి ఆశ్చర్యం అనిపించింది.  శివ నందినికి మాత్రం అంత ఆశ్చర్యం అనిపించలేదు. వీడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచనలో మాత్రమే ఉంది. సరే అని….  ఆ 64 మొక్కలలో నుంచి విషాన్ని నూరి, 9 రకాల విష పదార్థాలను తయారుచేసి,కలిపేసి ఒక పాత్రలో విషంగా తీసుకుని…ఒంటికి పూసుకుని… విషం అక్కడక్కడ రాసుకుంటూ ఉండేసరికి… ఆ విషపు వాసనకి రుద్ర స్వామి, మహాదేవి స్పృహతప్పి పడిపోతే… శివ నందని తుళ్ళిపడటం జరిగింది. కానీ స్పృహ తప్పలేదు.  కల్లార్పకుండా బాల కుమారస్వామి ఏం చేస్తున్నాడు? అని చూస్తుంది. అప్పుడు బాల కుమారస్వామి కాస్త….

బాల కుమారస్వామి:- అమ్మ!  నీకు కళ్ళు రెప్పలు పడిపోతున్నాయా? మృత్యువు వస్తుందని భయం వేస్తుందా? 

శివ నందిని:- ఆ ఆలోచన లేదురా! నేను చనిపోయిన పర్వాలేదు. ఈ జన్మని  మోక్ష జన్మగా చేయాలని అనుకుంటున్నాను. కానీ నీ విష ప్రభావం వలన నేను మృత్యువుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ నువ్వు ఆ విషయాన్ని తీసుకుంటున్నావు.. నీకు ఏమీ కావట్లేదు. నాకు అదే అర్థం కాని విషయం…

బాల కుమారస్వామి:- మా అయ్య కూడా అంతే కదా! 

శివ నందిని:- మీ నాన్న ఏం చేశాడు రా?

బాల కుమారస్వామి:- మా నాన్న సాగరమథనం చేస్తున్నప్పుడు, మహా కాలకూట విషం వచ్చింది కదా!  కాలకూట విషాన్ని ఈయన ఒక పాత్రలోకి తీసుకొని తాగటం జరిగింది కదా!  అమృతం తాగిన దేవతలు కాలానుగుణంగా చనిపోతే, కాలకూట విషం సేవించిన మా అయ్య మాత్రం చనిపోలేదు. మహా మృత్యుంజయుడు అయ్యాడు కదా ! దేవతలు అమృతం సేవించినా….మనసులో అనుమానభయం ఉన్నది. ఎప్పటికైనా మృత్యువు మనల్ని చంపేస్తుంది. మృత్యు దేవత ఎప్పటికైనా మనల్ని చంపుతుందని అనుమానభయం ఉంది. అదే కాలకూట విషం తాగిన మా అయ్యకి ఎలాంటి అనుమాన భయం లేదు. మహా మృత్యువు గురించి ఆలోచించలేదు. అందుకే మృత్యువు లేని స్థితిని పొందడం జరిగింది. ఇదంతా కూడా కేవలం విషం సేవించడం వలన జరిగింది. కాలకూట నుండి విషం వలన మా అయ్యా మహా మృత్యుంజయుడు అవ్వడం జరిగితే… నేను తొమ్మిది రకాల విషాలు కలిపి నేను మృత్యుని దాటుకునే స్థితికి రావడం జరిగింది. ఇప్పుడు చూడు… ఈ విషం సేవించడం వలన, ఇందాక నా శరీరం మీద ఉన్న పగుళ్లన్నీ మాయం అయిపోయాయి. చూసావా!  నా శరీరం వజ్రకాయ దృఢత్వం పొందడం గమనించావా!  

శివ నందిని:- అవును నిజమే… కానీ, నువ్వు సేవించిన విష ప్రభావం వలన మేము మృత్యువులోకి వెళ్లడం జరిగింది కదా!  మరి నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు?

బాల కుమారస్వామి:- దీనికి కూడా ఒక తంత్రం ఉన్నదమ్మా! అదేమిటంటే శరీరం లోపలికి విషం వెళ్ళినప్పుడు వైద్య పరంగా అది ఎంత మోతాదులో తీసుకోవాలో…. అంతే తీసుకుంటే విషం కూడా వైద్యానికి పనికి వస్తుంది. అంతెందుకు….క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం మనం పాము విషాన్ని విరుగుడుగా వాడటం జరుగుతుంది కదా! ఆ క్యాన్సర్ యొక్క కణితిని పాము విషం మాత్రమే హరించగలుగుతుంది.  అలా అని ఎక్కువ మోతాదులో విషం తీసుకుంటే అది దేహాన్ని హరించేస్తుంది. అందుకని ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి?  అనే జ్ఞానం మనకి తెలియాలి.  ఆ జ్ఞానమును నాకు మా అయ్యా ఇదిగో… ఈ ఇష్టలింగ రూపంలో ఇవ్వడం జరిగింది.

అనుకుంటూ తన చేతి సంచిలో నుంచి ఇష్ట లింగమును తీసి చూపించడం జరిగింది. ఈ ఇష్టలింగం ఏ విధంగా అయితే, తొమ్మిది రకాల పదార్థాలతో తయారు చేశారో.,అలా తొమ్మిది రకాల విష పదార్థాలను సేవించడం జరిగింది. ఇదే సిద్దలింగం.ఇది ఉన్నంతవరకు నీకు మహామృత్యు భయం ఉండదు.ఇప్పుడు నీవు  చచ్చిపోతాను అనే భయం ఉందా?

శివ నందిని:- నాకు మృత్యు భయం లేదు.  ఈ దేహంతో సాధన ఇంతటితో ఆగిపోయింది అనుకుంటాను.

బాల కుమారస్వామి:- చూసావా..! ఈ విష ప్రభావానికి మహాదేవి,రుద్రస్వామి పడిపోయారు. వాళ్ళు భయానికి గురి అవ్వటం వల్ల తాము చనిపోతున్నాము అని అనుకోవటం వల్ల దేహాలు కాస్త యోగమత్తులోకి వెళ్లిపోవడం జరిగింది. నువ్వు మృత్యువుకి భయపడకుండా, మృత్యువును ఆస్వాదించడంతో.. ఈ విష ప్రభావం నీ మీద చూపించలేకపోయింది. నువ్వు నాతో చక్కగా మాట్లాడగలుగుతున్నావు.  నువ్వు మృత్యువు నువ్వు జయించావమ్మా! 

అనేసరికి…. వీడి మాటలు ఎందుకో ఈరోజు విచిత్రంగా ఉన్నాయి. చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. అసలు వీడు తన బాల కుమారస్వామేనా? అని ఒక క్షణం పాటు అనుమానం వచ్చినప్పటికీ, అచ్చు గుద్దినట్టు బాల కుమారస్వామి లాగానే ఉన్నాడు. తన కుమారుడే అయి ఉంటాడు. వాడికి శ్రీశైల క్షేత్రంలో ఈ సిద్ధవిద్య, వైద్యం గురించి తెలిసి ఉంటుంది. అక్కడ సిద్ధపురుషులు ఉన్నారు కదా అనుకుంటూ… ఉండేసరికి….

బాల కుమారస్వామి:- సరే అమ్మ!  ఈ ఇష్టం లింగం తీసుకో… నీకు మించిన అర్హత యోగ్యత యోగం ఇంకెవరికీ లేదు. నువ్వు మహా మృత్యువు జయించావు కదా! 

అని ఈ ఇష్టలింగం ఎలా ఆరాధన చేయాలి!  ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది కూడా… ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పినట్లుగా శివ నందినికి చెబుతూ ఉండేసరికి…. అన్నీ కూడా శివ నందిని ఆకలింపు చేసుకొని…

శివ నందిని:- ఇదేంటి నీ ఇష్ట లింగం చేస్తున్నావు అనేసరికి…. 

బాల కుమారస్వామి:- నా దగ్గర నవలింగాలు ఉన్నాయమ్మా!  అందులో ఒక లింగం నీకు ఇస్తున్నాను.  అర్హత యోగ్యత యోగం ఉన్నవాళ్లకే ఇస్తాను.  అది కూడా మహా మృత్యువు జయించిన వాళ్లకి మృత్యుభయం జయించిన వాళ్లకి మాత్రమే ఇస్తాను.  నువ్వు జయించావు అని చెప్పి నాకు అనిపించింది.  అందుకే ఈరోజు నీకు ఇస్తున్నాను..  అనేసరికి… ఎవరైతే అహంకారం దాటతారో వారు అహం బ్రహ్మాస్మిస్థితికి వస్తారు. అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండే ఆనంద స్థితిని దాటాలి అంటే ఇష్టలింగ ఆరాధన చేయవలసి ఉంటుంది.  తద్వారా తురియాతీత స్థితికి వెళ్లడం జరుగుతుంది. ఆనందంలో భోగానందం, యోగానందం అనే తత్వం ఉండదు. ఆనంద రహిత స్థితికి వెళితే….. ఇక ఏకత్వంలోకి వస్తారు. అదే అద్వైత స్థితి.  ఆ అద్వైత స్థితిని పొందటానికి…. ఈ ఇష్టం లింగ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇదే ఇష్ట లింగం ఆరాధన పళనిక్షేత్రంలో ఉన్నప్పుడు చేసేవాడిని… శివ నందిని:- ఇంతకీ నీది పళని క్షేత్రం కాదు కదా!  శ్రీశైలం క్షేత్రం  కదా!

అని అంత మత్తులో కూడా అనేసరికి…

బాల కుమారస్వామి:- నేను ఉండని క్షేత్రం ఎక్కడ ఉన్నది? నా తల్లిదండ్రులతో పాటే నేను అన్ని క్షేత్రాలలో ఉంటాను కదా! సరే… నేను వెళ్ళొస్తాను అమ్మ!

శివ నందిని:- ఎక్కడికి వెళ్తున్నావు?

బాల కుమారస్వామి:- ఆ గుహలోకి వెళ్లి మూత్రవిసర్జన చేసి రావాలి…

శివ నందిని:- గుహలోకి వెళ్ళటం ఎందుకు?  అక్కడ పురుగు పుట్రా ఉంటాయి .ఇక్కడ ఎక్కడైనా చెట్టు చాటుకు వెళ్లి మూత్ర విసర్జన చేసిరా! 

బాల కుమారస్వామి:- లేదమ్మా!  నాకు ఆ గుహలో మూత్రవిసర్జనకి ఒక స్థలం ఉంది. అక్కడికి వెళ్లి మూత్ర విసర్జన చేస్తాను.

శివ నందిని:- సరే త్వరగా వెళ్ళి రా! నేను నడవలేని స్థితిలో ఉన్నాను. యోగ మత్తులో ఉన్నాను. ఏం అనుకోకు…

బాల కుమారస్వామి:-ఏం కాదులేమా! ఒక 48 నిమిషాల పాటు ఈ యోగమత్తు ఉంటుంది. ఈ స్థితిని నువ్వు తట్టుకొని నిలబడగలిగావు అంటే…. మహా మృత్యువును జయించిన స్థితికి నువ్వు వెళతావు. అప్పుడు మృత్యుభయమును దాటుతావు.  లేదు అంటే ఈ మత్తులో నీ దేహం కాస్త దహనం అయిపోతుంది. ఈ విషం కాస్త దేహాన్ని దహనం చేస్తుంది. కాబట్టి నువ్వు కళ్ళు మూయకుండా స్పృహలోనే ఉంటూ…నిత్య ధ్యానం చేసుకుంటూ ఉండు.  ఇదిగో నేను చెప్పిన విధానం గాని ఇష్ట లింగం పెట్టుకొని ఆరాధన చేయి..

అనేసరికి తన పద్మాసనం వేసుకుని.. చేతి మధ్యలో ఇష్టం లింగం పట్టుకుని.. ధ్యానంలోకి వెళ్లడం జరిగింది. సుమారుగా 48 నిమిషాల దాకా కళ్ళు తిరగటం, తలలో వికారాలు రావటం, గుండె పట్టేసినట్టుగా రావటం, చేతులు కాళ్లు వణకడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ… శ్వాస ఆడక శరీరం అంతా కూడా ఏదో వేడి కుంపటిలాగా ఉండటం, ఇవన్నీ కూడా కాలకూట విషం పీల్చడం వలన అని చెప్పేసి అనుకుంటూ… కూడా  ధ్యానభంగం కాకుండా ధ్యాననిష్టలో అలాగే ఉండటం జరిగింది. తర్వాత అమ్మ!  అమ్మ!  అని పిలుపు వినిపించేసరికి…. ఈసారి బాల గణపతి, బాల కుమారస్వామి ఎదురుగా కనిపించేసరికి…. 

శివ నందిని:- ఏంట్రా? ఇంతసేపు పట్టిందా?  మూత్రవిసర్జన చేయడానికి….

(అని బాల కుమారస్వామి కేసి చూస్తూ అడిగేసరికి)

బాల కుమారస్వామి:- అదేంటమ్మా!  నేను తమ్ముడు ఇప్పుడేగా రావడం..

శివ నందిని:- ఇంతకు ముందు వచ్చావు కదా!

(అని అనేసరికి…. ఇంతలో మహాదేవి రుద్రస్వామి కూడా తెప్పరిల్లి కళ్ళు తెరిచి అడిగేసరికి…)

బాల కుమారస్వామి:- నేను అసలు రాలేదు, నేను,తమ్ముడు ఆడుకుంటూ ఉన్నాము. ఆకలేసి రావటం జరిగింది.  

శివ నందిని:- పాలు గుడ్లు తిన్నావు కదా!  ఆకలి వేయటం ఏమిటి? 

బాల కుమారస్వామి:- నేనెక్కడ వచ్చాను …నేను ఇప్పుడే రావడం… తమ్ముడుతో కలిసే వచ్చాను ఇప్పుడు. నేనేం రాలేదు. నీ మీద ఒట్టు…

అని శివ నందినతో అనేసరికి….అసలు ఏం జరిగిందో అర్థం కాక, మూత్రవిసర్జన కోసం గుహలోకి  వెళ్తా అన్నాడు కదా!  అని  వీళ్ళతో అంటూ అసలు గుహలోకి వెళ్ళినవాడు ఎవరు ? అని చెప్పి అనుకొని వీళ్ళ ముగ్గురు ,పిల్లలు లోపలికి వెళ్లేసరికి లోపల గుహలో పళని కుమారస్వామి సజీవ మూర్తిగా కనపడేసరికి అమ్మ!  నేనే నీ బాల కుమారస్వామి రూపంలో రావడం జరిగింది.  నీకు మహా మృత్యు భయము స్థితి అనుభవం ఇవ్వటం జరిగింది. అలాగే నా దగ్గర ఉన్న సిద్ధలింగం నీకు అనుగ్రహించడం జరిగింది.  ఇంక నీ సాధన సహస్ర చక్రం నుంచి పరిసమాప్తి అయింది.  ఇకనుంచి నువ్వు హృదయ చక్రానికి వెళ్లడానికి సహస్ర చక్రం నుంచి హృదయ చక్రం మధ్య మార్గమైన జీవనాడిలో ఉన్న హనుమంతుడు అనుగ్రహం పొందవలసి ఉంటుంది. నువ్వు ఇచ్చిన పాలు, గుడ్లు తిన్నాను . నాకు సంతృప్తి కలిగించావు.  నాకు తల్లిగా మారి నా ఆకలి తీర్చావు. నీ తల్లి ఋణము ఈ ఇష్టలింగం ఇచ్చి తీర్చుకున్నాను. నిజానికి నాకు బాల కుమారస్వామికి ఎటువంటి భేదం లేదు. వాడు కూడా నా అంశ యే. నేను సజీవ మూర్తిగా, ఇలా నవ పాషాణ విగ్రహ మూర్తిగా  అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు దర్శనం ఇస్తాను అని ఆ విగ్రహ మూర్తి కూడా అదృశ్యం అయ్యేసరికి….. శివ నందిని కాస్త తనకు ఇష్ట లింగం అనుగ్రహించినందుకు…పళని కుమారస్వామికి నమస్కారం చేసి అందరూ కూడా అక్కడినుంచి వెనుతిరగడం జరిగింది.  సహస్ర చక్రం యొక్క నాలుగవ భాగం కూడా పూర్తి అవ్వడం జరిగింది.


హనుమంతుని నిజ రూప దర్శన అనుభవం 

కుమారస్వామి నిజరూప దర్శనం అయిన తరువాత ఆ గుహ నుంచి బయటకు వస్తుంటే… అవును హనుమంతుని దర్శనం అవ్వాలి అన్నారు కదా! హనుమంతుడు ఇప్పటికీ సజీవతత్వంతో ఉన్నారంటారు… నిజమేనా? అని రుద్ర స్వామిని అడిగేసరికి….

రుద్రస్వామి:- హనుమంతుడే కాదు… సప్త చిరంజీవులు కూడా చిరంజీవి తత్వంతో ఉన్నారు. మార్కండేయుడు, బలిచక్రవర్తి, హనుమంతుడు, అశ్వద్ధామ, ఇలా ఏడుగురు కూడా చిరంజీవి తత్వంతో ఉండి సంచారం చేస్తూ ఉంటారని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కాకపోతే మనిషికి 125 సంవత్సరాల ఆయుష్షు ఉంటే, యోగులకి కాస్త 500 నుంచి 5వేల సంవత్సరాల వరకు ఆయుష్షు ఉంటే, దేవతలకి 5000 నుంచి 5 లక్షలు ఉంటే, పరమాత్మ కి పది లక్షల ఆయుష్షు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే…కొంతమంది ఒక  యుగం అంతంలో చనిపోతారు, కొంతమంది మహాయుగం అంతంలో చనిపోవడం జరిగితే, మరి కొంత మంది కల్పాలు, మహాకల్పాలలో అంతం అవుతారు. అదే చిట్ట చివరిగా ఉన్న మూలస్థాన మూర్తి ఆరు శ్వాసల తరువాత అంతం అవడం జరుగుతుంది.  ఆ ఆరు శ్వాసల్లో ఒక్కొక్క శ్వాస అనేది 100 మహా కల్పాలకి సమానం అని శాస్త్రవచనం ఉన్నది.  మృత్యువు అనేది కాలానుగుణంగా విభజన చేయడం జరుగుతుంది. నిజానికి అందరి ఆయుష్షు కూడా ఒకే పరిమాణంలో ఉంటుంది. ఇప్పుడు దోమ యొక్క ఒక్కక్షణం మనిషి యొక్క 120 సంవత్సరాలు. ఒకే ఆయుష్షు, ఒకే పరిమాణం ఒకే స్థితి. కానీ చూడటానికి ఒక క్షణం లో దోమల చనిపోవడం చూస్తాము…. మనిషికి 125 సంవత్సరాలు అనేది దీర్ఘకాలికంగా అనుకుంటాం… కానీ కేజీ రాయిని 100 గ్రాములు చొప్పున 10 భాగాలుగా చేసినా కూడా కేజీ రాయితో సమానమే కదా!  అలాగే మనిషిని జీవజాతులకు తగ్గట్టుగా కాల విభజన చేశారు. ఇది బ్రహ్మ సృష్టి విధి విధానం.

మహాదేవి:- అయితే, మనం హనుమంతుడిని సజీవ మూర్తిగా చూడవచ్చు.

రుద్రస్వామి:- చూడచ్చు…. ఆయన హిమాలయాల మీద ఉన్నారని గంధమాధన పర్వతం మీద ఇప్పటికీ యతి రూపంలో ఉన్నారని శ్రీరామనామం చేస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఎంతోమంది లామాలు, సిద్దయోగులు, హిమాలయాల యోగులు, వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది కదా!

మహాదేవి:- శివ నందిని!  ఒక్కసారి మనం సూక్ష్మ శరీర యానంతో హనుమంతుడిని సజీవ దర్శనం చేసుకోవడానికి వెళదామా?

శివ నందిని:- అదేంటమ్మా నీకు ఈ వింత కోరిక?

మహాదేవి:- హనుమంతుల వారిని చూడాలని ఎప్పటినుంచే కోరికగా ఉంది. విగ్రహంలో చూశాను కానీ, సజీవమూర్తిగా చూడాలని కోరిక బలంగా ఉంది. ఎటూ నీకు హనుమంతుని దర్శనం నీకు దొరుకుతుంది .నేను కాదనను… కానీ నేను స్వయంగా చూడాలి అనుకుంటున్నాను… ఆయన మన దగ్గరికి మాయాపరీక్ష కోసం రావటం కన్నా, ఆయన సజీవమూర్తిగా నిజస్వరూపంగా దర్శనం పొందడం జరుగుతుంది కదా! అని చెప్పేసి నాకు బలంగా అనిపిస్తుంది.

శివ నందిని:- సరే,  రాత్రికి మనం యోగనిద్ర సాధన విధివిధానంలో ఆత్మ శరీరంతో హిమాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుందాము..

అనేసరికి సరే అని చెప్పి…. రాత్రి  రామం పనులన్నీ ముగించుకుని సిద్ధమవటం జరిగింది. శివ నందిని కాస్త యధావిధిగా సహస్ర చక్రంలో తన ధ్యాననిష్ట లోకి వెళుతూ ఉండేసరికి…. ఈసారి సహస్ర కమలం కాకుండా సహస్ర కమలానికి మరియు హృదయ చక్రానికి మధ్యలో ఉండే నాడీ అనుసంధానం అయినట్లుగా ఒక నాళిక ఆకారంలో దర్శనం ఇస్తూ ఉండేసరికి…. ఇది జీవనాడి మార్గం అనుకుంటూ ఉండేసరికి…. ఈ జీవనాడి ముందువైపు పంచ ముఖాలతో ఉన్న హనుమంతుల వారి దర్శనం అవ్వటం జరిగింది. ఈయన ఏంటి ఇన్నాళ్లు ఏకముఖంతో దర్శనం అయినవాడు, పంచముఖాలతో దర్శనం అవుతున్నాడు… స్పురణ అవటంతో ధ్యాన నిష్ఠ నుంచి బయటకు రావడం జరిగింది. కళ్ళు తెరిచి చూస్తే సమయం రాత్రి పదిగంటలు అయ్యేసరికి అందరూ నిద్రలో ఉన్నారని…శివ నందిని ధ్యానం నుంచి లేచి నిద్రమత్తులో ఉన్న మహాదేవిని లేపి ఇప్పుడు మనం యోగనిద్ర సాధనతో, సూక్ష్మ శరీర యానంతో హిమాలయాలకు వెళ్లి సజీవ మూర్తిగా హనుమంతుని దర్శనం చేసుకుందాం!  అనేసరికి…. సరే అని వీళ్ళు అప్పటికే యోగ నిద్రలో నిష్ణాతులుగా సిద్ధి పొందడంతో క్షణకాలంలోనే వాళ్ళకి యోగ నిద్ర సిద్ధి ప్రాప్తి పొందడంతో… వాళ్లు స్థూల శరీరం నుంచి ఆత్మ శరీరం బయటకు రావడం, ఆ రెండు శరీరాలు ఆకాశమార్గం ద్వారా హిమాలయాలకు వెళ్లడం, స్థూల శరీరాల యొక్క మనోదృష్టి ద్వారా ఏం జరుగుతుందో చూస్తూ ఉండటం జరిగింది. వీళ్ళు హిమాలయ పరిసరాలలో ఉన్న కైలాస పర్వతం దర్శనం చేసుకుని…. నమస్కారం చేసుకొని…. ఈ పర్వతానికి చుట్టూ ఎనిమిది రకాల పర్వతాలు ఉండటంతో అష్టదళ పద్మం మధ్యలో కైలాస పర్వతం ఉన్నట్లుగా వాళ్లకి అనుభవం కలగడం జరిగింది. ఈ కైలాస పర్వతంలోని సదాశివుడు ఆజ్ఞ చక్రం ముద్రతో పురుష ప్రకృతిని కాపాడుతూ ఉంటాడు అని చెప్పేసి శివ నందినీకి తెలిసి ఉండటంతో…. ఇదే విషయాన్ని మహాదేవికి చెప్పడం జరిగింది. అలా ఒక పర్వతం మీద సప్త ఋషులు ఉండటం గమనించి ఏంటి..? అని మహాదేవి అడగగానే…. దీనిని నందాదేవి పర్వతం అంటారు. ఇక్కడే సప్త ఋషులు ఆవాసం చేస్తూ ఉంటారు. ఈ సప్త ఋషులు నందాదేవి నిత్య కైలాస పర్వతంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందుకని మనకి పర్వతం పరిసరాలలో ఉన్న మానస సరోవరంలో జ్యోతి రూపాలు కనపడటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సప్తఋషులతో పాటు ఇతర హిమాలయ యోగులు అలాగే బౌద్ధ మతంలో ఉన్న బౌద్ధ లామాలు కూడా తమ ఆత్మలను జ్యోతి శరీరాలుగా మార్చుకొని….ఈ మానససరోవరంలో స్నానాలు పూర్తిచేసుకుని కైలాస పర్వతంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకుంటారు.  వాళ్ళకి పార్వతీ పరమేశ్వరులు కాస్త అవలోకేశ్వరి, అవలోకేశ్వరుడు గా దర్శనమవుతారు. యద్భావం తద్భవతి. దైవం ఒకటే, దైవం భిన్న ఆచార ధర్మాలను బట్టి యద్భావం తద్భవతి అన్నట్లుగా వాళ్ళ ఊహ భావరూపాలకు తగ్గట్టుగా ఆ రూపాలలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు కైలాస పర్వతంలోకి వెళ్లి దర్శనం చేసుకుందామా? అంటే అంత అర్హత స్థితి యోగ్యత మనకి రావాలి.  ఇప్పుడు మనం వచ్చింది పర్వతానికి కాపలాగా ఉన్న హనుమంతుల వారి దర్శనం చేసుకోవడానికి గదా!  అనేసరికి… అవును కదా ఆ విషయం మర్చిపోయాను అనుకొని….కైలాస పర్వతంలో ఉన్న సదాశివుడు, శివానిని మనసులోని నమస్కారం చేసుకొ…ని హనుమంతుడు దర్శనానికి అనుమతి ఇవ్వమని ఎదురు చూస్తూ వాళ్ళు అక్కడ ఉన్న ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని హనుమంతుల వారి కోసం ఎదురు చూడసాగారు. ఇందులో సుమారుగా 12 నుంచి 16 అడుగుల ఉన్న ఒక కొండముచ్చు స్వరూపం బొచ్చుతో ఉన్న ఒక యతీశ్వరుడు రూపంలో ఉన్న ఆయన, పైనుంచి కిందకి దిగుతున్నట్లుగా లీలగా వీళ్ళకి కనిపించ సాగింది. ఈయనేనా? హనుమంతుల వారు…. అనేసరికి ఏమో హనుమంతుడు అవ్వచ్చు… అవ్వకపోవచ్చు… ఎందుకంటే ఇక్కడ యతులు కూడా తిరుగుతూ ఉంటారు. యతులు మన ఆదిమానవుల లాగా ఉంటారు. కాబట్టి, మనం ఖచ్చితంగా ఈయనే హనుమంతుడు అని చెప్పలేము. ఆయన్ని అనుసరిద్దాం…. అవునా?  కాదా?  చూద్దాం అనేసరికి….. ఈయన తప్ప మనకి ఇంకెవరూ కనిపించలేదు కదా!  ఈయన ఒక్కడే కనిపించాడు కదా! అడుగుదాం అనుకునేసరికి ….ఆయన ఒక్కొక్క పాదం సుమారుగా మూడు అడుగుల  పాదంగా ఉండటం గమనించారు. అంటే మానవ పాదానికి రెట్టింపులో ఉంది అని చెప్పి అనుకున్నారు. సరే ఈయన ఎక్కడికి వెళ్తారు ఏంటి?  అని అనుకొని…. ఇవన్నీ అనుసరిస్తూ ఉండేసరికి… ఒక్కసారిగా ఈయన తనని ఎవరో అనుసరిస్తున్నారు అని వెనక్కి తిరిగి చూసేసరికి సూక్ష్మ శరీరాలతో వీరిద్దరూ కనిపించేసరికి…. ఎవర్రా మీరు నన్ను అనుసరిస్తున్నారు?  నేను ఎవరనుకుంటున్నారు? నన్ను చంపడానికి వచ్చారా? అని తన బలమైన బాహువులతో శివ నందిని, మహాదేవిని ఆత్మ శరీరాలను పట్టుకొని పిసుకుతూ ఉండేసరికి…. స్వామి! స్వామి! క్షమించండి.. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని అనుసరించడం మేము చేసిన తప్పే.  మాకు హనుమంతుడు దర్శనం కావాలి. అందుకోసం అని రావడం జరిగింది అనేసరికి…. హనుమంతుడా?  వాడెవడు?  అనేసరికి., రామాయణంలో రాముడికి సహాయం చేసిన పెద్ద వానరుడు ఉన్నాడు కదా!  ఆయనే….  ఆయన దర్శనం కావాలి అనేసరికి… ఆయన ఎవరో నాకు తెలియదు.  మీరు నన్ను మోసం చేస్తున్నారు… నాకు మాయమాటలు చెబుతున్నారు… మీరు నన్ను చంపడానికో లేదా ఈ కైలాస పర్వతాన్ని నాశనం చేయడానికో వచ్చినట్టు ఉన్నారు. నేను ఈ కైలాస పర్వతానికి రక్షకుడిని అనేసరికి…. శివ నందిని కి విషయం అర్థం అయ్యి ఈయనే హనుమంతుడు అని జ్ఞాన స్ఫురణ అందడంతో…. శ్రీరామ మూల తారక మంత్రమును పెద్దగా జపించేసరికి… రామ మంత్రం చెవిన పడి పడగానే…. ఓహో!  మీరు నా రాముడి భక్తులా….క్షమించండి…. మీరు మాయా రూపాలు అనుకున్నాను…. నా రాముడి మధుర భక్తిని పొందినవారా?  ఆయన అనుగ్రహం  పొందటానికి వచ్చారా? …మీరు హనుమంతుని దర్శనం కావాలి కదా చూపిస్తాను రండి ….నన్ను అనుసరించండి అని చెప్పేసరికి.., శ్రీరాముడి మంత్రానికి హనుమంతుడు తప్ప ఇంకెవరు అనుసంధానం అవ్వరు అని శివ నందిని చెప్పేసరికి….. హనుమంతుడికి రామ మధుర భక్తి ఎంత ప్రధానమో అర్థం అయింది. రామనామ స్మరణకి ఈయన ఎంతటి బలవంతుడు అయినప్పటికీ ఉగ్రరూపం నుంచి సాధారణ రూపం తీసుకురాగలిగింది అంటే….. రామ మంత్రం నిజంగానే మూలతారక మాత్రమే అని అప్పటికి గాని రామ తారక మంత్రం యొక్క విశిష్టత ప్రభావం ఏమిటో మహాదేవికి అర్థం కాలేదు. దానితో రామనామ స్మరణ చేసుకుంటూ వస్తూ ఉండేసరికి… యతిస్వరూపంలో ఉన్న హనుమంతుడు కూడా రామనామస్మరణ చేస్తూ లోపలికి మంచు గుహలోకి వెళ్ళటం జరిగింది. అక్కడ మంచు గుహలో కూడా ఏమీ లేదు. రాములవారు,సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహ మూర్తి ఉంది. హనుమంతుడి విగ్రహ మూర్తి లేదు. ఎదురుగా ఒక పీఠం మీద కూర్చొని ఉండగా అప్పుడు మహాదేవి కాస్త స్వామి!  ముగ్గురు మాత్రమే ఉన్నారు. నలుగురు కదా ఉండాల్సింది… హనుమ విగ్రహ మూర్తి లేదు అనేసరికి.. ఆ హనుమసేవకుడు.  సేవ చేయడానికి వెళ్లి ఉంటాడు కదా!  ఆయన విగ్రహం మూర్తి ఎందుకు ఉంటుంది?  రామయ్య తండ్రికి సేవ చేయడానికి కదా ఆయన ఉన్నది… అందుకే ఆయనకు సేవ చేసుకోవడానికి బాధ్యతగా అంతా చూసుకుంటున్నాడు… అందుకే ఆయన విగ్రహం మూర్తి పెట్టలేదు అని చెప్పి అంటూ నేను ధ్యానం చేసుకోవాలి… నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను రామనామ స్మరణ చేస్తూ ఉండండి…అని ఆజ్ఞాపించి వీళ్లిద్దరూ చేస్తూ ఉండేసరికి… ఇది కాదు మీకు రామ తారక మంత్రం ఉపదేశం చేస్తాను అని సాక్షాత్తు హనుమంతుడే వీళ్ళిద్దరికీ రామతారక మంత్రమును మూడుసార్లు చెవిలో ఉపదేశం చేసి రామతారక మంత్రం ద్వారా మీ సాధన తారాస్థితికి వెళుతుంది.  మీరు కూడా విశ్వతారగా నిలబడతారు. మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటూ,. రామనామ స్మరణతో ధ్యాననిష్ట లోకి వెళుతూ ఉండేసరికి… కొంతసేపు అయ్యేసరికి అప్పటిదాకా యతి రూపంలో ఉన్న ఆయన కాస్త ఆ రామనామ స్మరణ ఇచ్చే మధుర ఆనందంలో ఉండిపోతూ…. తన మాయ రూపం నుంచి తన యదార్ధ రూపం అయిన హనుమంతుని రూపంలో ఉంటూ లోకాన్ని మరిచిపోయి…. వీళ్ళు ఉన్నారు అనే విషయాన్ని కూడా మరిచిపోయి…. రామనామ స్మరణ తన్మయత్వపు ఆనందంలో ఉంటూ ఉండేసరికి…ఆయన ఆనందానికి భంగం చేయడం ఇష్టం లేక ఆయన్ని అలాగే దర్శనం చేసుకుని వాళ్లు అలాగే ఆత్మ స్వరూపాలతో బయటకు వచ్చి…. యధావిధిగా వీళ్ళ స్థూల శరీరాలలోకి ప్రవేశించడం జరిగింది. కళ్ళు తెరిచేసరికి ఉదయం 6:30 అయ్యేసరికి…. అంటే రాత్రి వాళ్ళు చేసిన ప్రయాణం ఉదయం దాకా కొనసాగిందా అని అనుకుంటూ…. తనకి నిజరూప హనుమదర్శనం కలిగించినందుకు… మహాదేవి కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత ఎదురుగా ఒక సన్యాసి ఉండటం గమనించిన శివ నందిని కాస్త ఎవరు స్వామి?  అనేసరికి నేను హనుమ ఉపాసకుడిని. నీకు హనుమాన్ నిజరూప దర్శనం అయ్యింది అని నాకు రాత్రి సంకేతం అందింది. నా ఉపాసన సిద్ధి వలన  నేను హరిద్వార్ క్షేత్రంలో రామ ఉపాసన చేస్తాను.. ఆయన అక్కడికి వస్తూ ఉంటారు. కేదార క్షేత్రంలో ఆరు నెలలు గుడి  మూసేసినప్పుడు నిత్యం దీప ధూప నైవేద్యాలు అన్ని హనుమంతుడే నిర్వహిస్తూ ఉంటాడు. కేదార క్షేత్రంలో ఆయన నిజరూప దర్శనం పొందడంతో…ఆయన నాకు సజీవ మూర్తి అంశతో ఉన్న ఈ విగ్రహ మూర్తిని ఇవ్వడం జరిగింది. నన్ను హరిద్వార్ కి వెళ్లి మూలాధార చక్ర సాధన చేసుకోమని…. అక్కడ మోక్షం పొందమని చెప్పారు. నాకు రాబోవు ఆరు నెలల్లో స్థూల శరీరం మోక్షం పొందే స్థితి ఉంది. అందుకని ఈ సజీవమూర్తి హనుమంతుని ఆరాధన ఎవరు చేస్తారు… దీనికి తగ్గ అర్హత ఎవరికి ఉంది…అన్నప్పుడు నిన్ను ధ్యానంలో చూపించడం జరిగింది. నిన్ను వెతుక్కుంటూ ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఇదిగో అమ్మ…అని  సింధూరంతో కూర్చుని ఉన్న భంగిమలో అభయహస్తంతో సజీవ మూర్తిగా ఉన్న హనుమాన్ విగ్రహం చూసి ఈ విధంగానే మనకి హనుమంతుల వారు కూడా దర్శనం ఇచ్చారు కదా!  అనేసరికి అవును అని ఆ విగ్రహం మూర్తిని ప్రేమయుతంగా, ఆప్యాయంగా, మధుర భక్తితో శివనందిని తీసుకొని తన శరీరంలోకి అదృశ్య శక్తితో నిక్షిప్తం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సహస్ర చక్ర సాధన శివ నందిని పూర్తి చేసుకోవడం జరిగింది. రుద్రస్వామి  కాస్త ఇక నుంచి జీవనాడిలోనికి  సాధన వెళ్ళటానికి, ఆ అనుభవాలు పొందటానికి సాధన చేయవలెను.  అంతకుముందు నీ సహస్ర చక్రం యొక్క శరీరం జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం ఏ క్షేత్రానికి వెళ్ళాలో సాధన అనుభవాలు ఏమి పొందాలో అనేది తెలుసుకోవలసి ఉంటుంది.  కాబట్టి నీకు దైవిక వస్తువుగా వచ్చిన అయ్యప్ప స్వామి విగ్రహ మూర్తిని…. సాధనా విగ్రహ మూర్తికి తాకిస్తే, ఏ క్షేత్రానికి వెళ్ళాలో చెప్పడం జరుగుతుంది అనేసరికి….సరే అని శివనందిని కాస్త అయ్యప్ప స్వామి విగ్రహ మూర్తి అదృశ్యం నుంచి దృశ్యం లోనికి తీసుకురావటం, అలా బయటకు తీసి ఆ సాధన విగ్రహ మూర్తికి  ఎడమవైపు పద్మములో తాకించగానే…. సహస్ర చక్రం కాస్త మూడుసార్లు తిరగటంతో జాగృతి, శుద్ధి, ఆధీనం కార్యక్రమాలు పూర్తి అయ్యాయని తెలియడంతో…. దానికి వ్యతిరేక దిశలో వెనకనుంచి శివలింగం నుంచి రాగి రేకు బయటకు రావడం జరిగింది. ఆ రాగిరేకును బాల కుమార స్వామి కాస్త తీసుకొని నేను చదువుతాను అని దానిలో ఉన్న ఆధారం చదవడం ప్రారంభించాడు. 

శుభం భూయాత్ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి