పరమహంస అమృతానుభవము(136)

  

పరమహంస అమృతానుభవము

( అంతిమ మోక్షానుభవం)



తర్జనిముద్రతో పరమేశ్వరుడు-పరమహంస

ఇలాంటి పూర్ణజ్ఞానయోగి మరియు యోగిని 27 మహా యుగాలు అనగా మహా యుగానికి నాలుగు యుగాలు చొప్పున 27*4=108 యుగాలకి పుట్టి….. నేను లేను అని మోక్షభావం చేసి…. తను ఉన్న విశ్వజగత్తులోని ఒక బ్రహ్మాండం కాస్త విశ్వ శూన్యంలో శూన్యం అవుతుంది. ఎందుకంటే విశ్వజగత్తు మోక్షం పొందాలంటే…. దీనికి మూల కారణా కారకమైన మూలస్థాన మూర్తి కాస్త నిర్జీవమూర్తి…. నిశ్చల మోక్షస్థితిలో మిళిత భావంతో భావరాహిత్య స్థితి పొంది…. భావాతీత స్థితి పొందడంతో….. ఆయన బుడిద శరీర ఆకారం అలాగే ఉండిపోయింది. ఈయనకి నేను లేను భావన ఇచ్చేవాడు లేడు. మరొకడు లేడు…. మరొకటి లేదు. ఎందుకంటే అనేక తత్వమే ఏకత్వం అయ్యింది. కాకపోతే “నేను ఉన్నాను” అనే భావం…. అలాగే “నేను లేను” అనే భావం….. ఏకకాలంలో అస్థిర మనసుతో చేయడంతో….. మిళిత మోక్ష స్థితి పొందడం జరిగింది. 


“నేను లేను” భావంతో ఆయన లేడు . ఎందుకంటే నిశ్చల మోక్షస్థితి పొందాడు. అదేవిధంగా నేను ఉన్నాను భావంతో ఆయన కాస్త భౌతిక మరణం పొందిన కూడా…… తన బూడిద శరీరంతో ఆకార రూపుడుగా ఉండటంతో నిర్జీవ మూర్తి కాస్త సజీవ మూర్తి భావం కలిగిస్తోంది. ఎందుకంటే ఈ రెండు భావాలకి కారణం….. తను అర్ధనారీశ్వర తత్వంలో ఉండి స్త్రీ, పురుష కాస్త అయ్యవారు, అమ్మవారు కాస్త ఆదిరుద్రుడు, ఆదిపరాశక్తి కాస్త ……ఆదిపరాశక్తియేమో నేను ఉన్నాను భావం చేస్తే , ఆది రుద్రుడు కాస్త నేను లేను భావం ఏకకాలంలో చేసి ……ఆ భావాలకి తగ్గట్లుగా ఆదిపరాశక్తిగా బూడిద శరీరధారిగా ఉంటే ఆది రుద్రుడు కాస్త నేను లేను అని నిశ్చల భావ స్థితిలో…..ఈ మూలస్థానేశ్వరుడై కదలటానికి వీలులేని స్థితిని పొందడంతో ……ఇలా ఈయన మనకి రూపముగా మూలస్థాన మూర్తి అది సజీవ మూర్తిగా… నిర్జీవ మూర్తిగా ఏకకాలంలో దర్శన ఇస్తున్నారు. దీనికి కారణం మిళిత భావరూప స్థితి పొందటమే అన్నమాట! ఇక్కడ కొంతమందికి ఒక ధర్మ సందేహం రావచ్చు. అది ఏమిటంటే మూలస్థాన మూర్తిలో ఇద్దరూ కూడా శివుళ్లే ఉన్నారు. శివ అర్ధనారీశ్వరమే కదా! మరి ఆదిపరాశక్తి లేనప్పుడు ఈయనకి ఎలా మిళిత భావం అయ్యింది? అన్నప్పుడు…. ఇది నిజం. ఈ ఇద్దరు శివుళ్లలో ఒక శివుడు కాస్త ఆది రుద్రుడు నుండి వస్తే, మరొక శివుడు కాస్త ఆది పరాశక్తి నుండి వచ్చాడు కదా! ఇక్కడ రూపాలు చూడవద్దు . భావాలు చూడండి. ఎందుకంటే…. ఈ ఇద్దరు శివుళ్లలో ఒక శివుడు కాస్త నేను ఉన్నాను అని…. మోక్షం బదులుగా అమోక్ష భావంతో ఉంటే …..మరొక శివుడు కాస్త, నేను లేను అని మోక్ష భావం తో ఉండటం చేత ఏకం రూప స్థితి వచ్చేసరికి… మిళిత భావ స్థితి ఏర్పడింది.ఇదే స్థితి మూల స్థాన మూర్తికి కలిగింది. అంతెందుకు మనం ఈయన దర్శనం పొందగానే మనకి శూన్యం ఉన్నదని భావం ….అలాగే శూన్యం లేదని భావం అలాగే ఉన్నదో లేదో తెలియని శూన్యభావాలు కలుగుతాయి కదా! ఇది నిజమే కదా ఇలాంటి శూన్య భావం ఉన్నది అని…. భావం కాస్త నేను ఉన్నాను అని …..అమోక్ష భావం అయితే , శూన్యము లేదు అనే భావం కాస్త, నేను లేను అని… మోక్షభావం అయితే , శూన్యం అనేది ఉందో లేదో తెలియదు అనే భావం కాస్త మిళిత భావం అవుతుంది. అందుకే సాధకుడు అంత్యమున ఈ మూడు రకాల భావాల నుండి భావ రహిత స్థితికి …..ఆపై భావాతీత స్థితి పొందాలని శాస్త్రవచనం చెప్పింది . అంతెందుకు …..పరమహంస పవనానంద స్వామీజీ కాస్త అరుణాచలం వచ్చిన కొత్తలో…. అరుణాచల శివుడు కాస్త సజీవ మూర్తిగా అరుణగిరి రూపంలో ఉన్నాడని భావంతో ఉండడం చేత , ఆయనకి సజీవ మూర్తిగా అరుణాచల శివ కాస్త శివ జ్యోతిగా ….అరుణగిరి మీద ప్రతినిత్యం, ప్రతీక్షణం… భౌతికంగా… ధ్యానంలో… అలాగే స్వప్నంలో కనిపించే వారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయనకి అంతిమ ధ్యానంలో భావంగా మిళిత భావ స్థితి ఉన్న నిర్జీవ స్థాన మూర్తి కాస్త నిశ్చల మోక్ష స్థితిలో అగుపించే సరికి …..అప్పటిదాకా తనకి సజీవ మూర్తిగా కనిపించే అరుణాచల శివ మూర్తి కాస్త నిర్జీవం అయి బూడిద కుండంగా అరుణగిరి కనిపించ సాగింది. తను ఇన్నాళ్ళు లేని వాడిని ఉన్నట్లుగా భావన చేశానని నిర్జీవ మూర్తిని  సజీవ మూర్తిగా భావన చేశానని…. అనుభవ భావ ప్రాప్తి పొందడంతో….. నేను లేను…. ఏమీ లేదు…. ఉన్నదంతా శూన్యం అని శూన్యభావ స్థితికి చేరుకోవడం జరిగింది. ఇది కూడా ఉండకూడదు అని జ్ఞాన స్ఫురణ పొందడంతో….. ఇన్నాళ్లుగా సజీవ మూర్తిగా కనిపించిన అరుణగిరి కాస్త ఎప్పుడైతే నిర్జీవ మూర్తి గా కనిపించిందో ….ఆ క్షణమే ఈ కొండను ఎక్కి…. తను ఎలా సజీవ మూర్తి నుంచి నిర్జీవ మూర్తి అయ్యాడు…..ఎక్కడ అయ్యాడు …..ఏ విధంగా అయ్యాడో …..ఏ విధంగా తను భావాతీత స్థితి నుండి భావరాహిత్యం పొందాడో తెలుసుకోవాలని…..ఒక రోజు ఈయన కాస్త కొండ ఎక్కడం జరిగింది. ఇక్కడ విచిత్ర అనుభవం ఆయనకి ఎదురయింది. 



అది ఏమిటంటే కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లాలో ఉన్న భద్రకాళి ఆలయం ఉన్న శివుడి విగ్రహ మూర్తికి ఎడమకన్ను తెరిచి ఉంటే…. కుడి కన్ను మూసి ఉంటుంది. ఎందుకంటే, తెరిచిన ఎడమ కన్ను అనేది విశ్వ సృష్టికి సంకేతం అయితే….. మూసి ఉన్న కుడి కన్ను అనేది విశ్వ వినాసనానికి సంకేతం అని ఈ గుడి స్థల పురాణం ఈయన వినడం జరిగింది. 



కాకపోతే ఈయన కాస్త ఈ కొండ ఎక్కే సమయానికి…బిక్ష సాధువు రూపంలో ఎడమ కన్ను మూసుకుపోయి.. కుడి కన్ను తెరిచి ఉన్న ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి…. కావాలని బిక్ష అడిగి తీసుకొని…. ఈయనకి నమస్కారం చేసి వెళ్లి పోవటంతో….. కేరళ గుడిలో ఇలాంటి రూపంతో…. విగ్రహం మూర్తి ఉంటే , అదే అరుణాచల క్షేత్రంలో ఇలాంటి రూపధారి సజీవ మూర్తిగా ఉన్నాడని…. తిరుగుతున్నాడని…. ఇలా తనకి గిరి ఎక్కడానికి కనిపించి అనుమతి ఇచ్చారని…. పరమహంస గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. కావాలంటే ఈ వ్యక్తి ఫోటో పెట్టాను చూడండి.. మీరు చూసే సమయానికి ఈయన సజీవమూర్తి కాస్త నిర్జీవ మూర్తి అవుతాడేమో ఎవరికి ఎరుక . ఎందుకైనా మంచిదని ఈ బిక్ష సాధువు ఫోటో పెట్టడం జరిగింది. అంటే మన భారతీయ పూర్వీక మహర్షులు తమ ధ్యానాలలో ఇలాంటి రూప ధారిని శివుడి రూపంలో చూడటంతో…గుడిలో విగ్రహ మూర్తి ప్రతిష్టించడం జరిగిందని….ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. కారణం లేకుండా మన పెద్దలు ఏమి చేయరు. ఏమీ అనరు. పదార్థం దాటుతే గాని యదార్థం ఏమిటో…అప్పుడు గాని మనకి తెలియదు. మన పురాణాలు పక్కింటి పురాణాలు కాదనీ…మన విగ్రహారాధనలు సజీవ మూర్తి నుండి వచ్చాయని…మనకి అనుభవ పాండిత్యం పొందితే గాని…అర్థం కాదని… ఇప్పటికైనా తెలుసుకోండి. గ్రహించండి. 



ఇక అసలు విషయానికి వస్తే ,పరమహంసకి తనకి అంతిమ భావంగా మూడు రకాల శూన్యభావాలు వచ్చాయని తెలుసు కదా! ఈ భావాల రాహిత్య స్థితికి కోసం ఈ గిరి మీద ఏమైనా ఉన్నాయా అని వెతకడం ఆరంభించేసరికి…. మొదట స్కందాశ్రమం కనబడింది. లోపలికి వెళ్లి ధ్యానం చేస్తే నేను ఉన్నాను అని భావం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ రమణ మహర్షి సాధన చేశారని స్థల పురాణం చెప్పడం జరిగింది. దీనిని బట్టి శూన్యం ఉన్నదని భావం ఉండటం జరిగింది. ఆ తర్వాత ఓం నమశ్శివాయ గుహకి వెళ్తే అక్కడ నేను లేను భావం మొదలైంది. ఎందుకంటే నేను ఉన్నాను అనే భావం కామమాయతో మొదలవుతుంది కదా! ఈయన కూర్చున్న భంగిమ అనగా కాళ్ళ మీద కాళ్లు మడత పెట్టి కూర్చున్న భంగిమ అనేది తిరువాయుర్లో ఉన్న కమలాదేవి కూడా ఈ భంగిమ ద్వారా కామ భావ రహిత స్థితి పొందడంతో…ఈయన ఈ భంగిమ ద్వారా తనకి ఉన్న కామ భావము తొలగడంతో నేను లేను స్థితిని పొందడం జరిగింది. ఆ తర్వాత ఈ రెండు గుహల మధ్యలో ఉన్న విరూపాక్ష గుహలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే ఏకకాలంలో కామభావం ….అలాగే జ్ఞాన భావం పరమ హంసకి కలిగాయి.భోగంలో కామ పరంగా నేను ఉన్నానని….యోగ పరంగా పూర్ణ ఙ్ఞానం పొందడం .. నేను లేను అని భావం మొదలైంది. ఈ రెండు భావాలు మిళితమై….. ఉన్నాను లేదా లేను అని చూపించడం పదే పదే జరిగింది. ఇలా ఈయన కాస్త ఈ గుహలో సుమారుగా 48 నిమిషాల.పాటు నిశ్చల ధ్యాన స్థితి పొంది…. నేను ఉన్నాను, నేను లేను, నేను ఉండి లేను .. అనే త్రిభావాల నుంచి మొదట భావ రహిత స్థితి .. ఆపై భావ రాహిత్య స్థితి పొందడం జరిగింది. ఎందుకంటే ఈ గుహలోని విరూపాక్ష యోగి కాస్త యోగాగ్ని తో తన దేహమును దహనం చేసుకొని బూడిద కుప్పగా మారి నేను ఉన్నాను అని ఈ బూడిద కుప్ప తో .. నేను లేను అని సజీవ సమాధి స్థితిలో.. మిళిత భావ సమాధి స్థితిలో అనగా మూల స్థాన మూర్తి పొందిన నిశ్చల మోక్ష స్థితి ఈయన పొందాడని…… నిజానికి ఆది యుగంలో ఆది రుద్రుడు ఎలాంటి సమాధి స్థితి పొందాడో …ఆయన అంశ అయిన ఈయన ఇలా సమాధి స్థితి పొందడానికి లలిత దేవి ఉద్భవం కోసం ఏర్పాటు చేసిన చితాగ్ని కుండమే ఈ అరుణగిరి అగ్ని పర్వతం అని పరమ హంస ఙ్ఞాన స్ఫురణ పొందడంతో….. ఈ చితాగ్ని కుండ సిద్ధాంతం అనేది హైందవ ధర్మం లోనే కాదు.. క్రైస్తవ ధర్మంలో ఉంది. ఎలా అంటే అంత్యములొ ఒక భయంకరమైన ఆరని అగ్ని గుండం ఒకటి ఉంటుందని… ఎవరి పేరు అయితే జీవ గ్రంథంలో ఉండదో… వాళ్ళు ఈ అగ్ని కుండములో దూకి ఆహుతులు అవుదురు అని చెప్పడం జరిగింది. అంతెందుకు పరమహంస అంతిమ ధ్యాన అనుభవాలు పరిశీలించి చూస్తే…. స్త్రీ, పురుష, మూల ప్రకృతులలో అంత్యముగా కరుంగలి శివ లింగము , గంధ శివ లింగము, లింగ దేహం జ్వాలాగ్ని తో దహనమై నాయి గదా! అనగా ఆది యుగం శంభు ఆది రుద్రుడు ఏర్పరిచిన చితాగ్ని కుండమే జ్వాలాగ్ని ఆరని అగ్నింగుండమై ఇప్పుడు ఇది అరుణాచల అరుణగిరి అగ్ని కొండ అయి అగ్నియుత మోక్ష కుండమై పూర్ణమోక్షం ఇస్తుందని పరమహంస కి ఙ్ఞాన స్ఫురణ అందడంతో… ఈయన సమక్షంలో తనకి ఉన్న త్రి భావ స్థితుల నుండి భావ రాహిత్య స్థితి పొందడంతో…. పరమ హంసకి చెప్పడానికి వీలులేని అద్వితీయమైన చిరు మందహాసంతో గూడిన అర చిరునవ్వు తో ఈ గుహ నుంచి బయటకి రావడం జరిగింది. ఎందుకంటే ఈయన బ్రతికి ఉండగానే చచ్చిన తర్వాత వచ్చే విశ్రాంతి స్థితి… అదే భోగ సంతోష స్థితి అలాగే యోగ సంతోష ఆనంద స్థితి దాని తర్వాత వచ్చే ప్రశాంత స్థితి -మరణం తర్వాత పొందే విశ్రాంతి స్ధితి( RIP - rest in peace)…. ఈయన పొందడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. 


ఇలాంటి ప్రశాంత స్థితి తను తొలిసారిగా పొందడంతో ….. అనిర్వచనీయమైనా స్థితితో ఈ గుహ నుండి బయటకు గిరి మెట్లు దిగి కిందకి వెళ్ళాలని అనుకుంటున్న సమయంలో…. వెనక్కి ఒక మెట్టు మధ్యలో 

నాకు వచ్చిన మూలస్ధానమూర్తి 

అంతిమంగా ధ్యాన దృశ్యంగా చూసిన మూలస్థానం మూర్తి ఆకారం పోలిన ఒక రాయి కనిపించింది. ఈయనని ఆకర్షించేసరికి దానిని చేతిలో తీసుకొని ఏదో తెలియని అద్వితీయమైన దైవిక శక్తి తన లోకి ఏకదాటిగా ధారాపాతంగా ప్రవహించేసరికి….. శరీరం కాస్త ఒక్క క్షణం పాటు తుళ్ళి పాటుపడింది. ఊగిపోయింది . కళ్ళు తిరిగాయి. కొండ తిరుగుతున్నట్లుగా భావం కలిగింది. దానితో తనకి సర్వ భావాలు తన నుండి పోయాయని అనుభవ అనుభూతి కలుగుతూ ఉండగా…. యోగమత్తు ఆవరించి కళ్ళు మూసుకుంటే….. ఒక పిడికిలి ముద్ర పదేపదే కనిపించి అదృశ్యం అయింది. ఈ ముద్ర ఏమిటో తెలియ రాలేదు అనుకోగానే…. ధ్యానభంగం అవ్వడంతో…. మూలస్థాన మూర్తిని పోలియున్న ఈ రాతిని తనకి అరుణాచల శివుడు ఇచ్చిన అనుగ్రహం అని దీనిని ఇంటికి తెచ్చుకుని , గంధం రాసి పూజ మందిరంలో పెట్టుకోవడం జరిగింది. ఇక ఆఖరికి రావలసిన స్వయంభు దైవీక వస్తువు అయిన మూలస్థాన మూర్తి కూడా వచ్చేసాడని ఇక సాధన పరిసమాప్తి అవుతుందని ఈయనకి అనుభవ జ్ఞాన స్ఫురణ అందడంతో పాటు తనకి ధ్యానంలో ఆఖరికి వచ్చిన పిడికిలి ముద్ర శివనందిని ధ్యానముద్ర అని దీనివలన సర్వ భావాతీత స్థితి  కల్గిస్తుందని అంతెందుకు…. మన చేతి వేళ్ళలో చిటికెన వేలు శరీరం అయితే, ఉంగరపు వేలు మనస్సు అయితే , మధ్యమ వేలు బుద్ధి అయితే, చూపుడు వేలు ఆత్మ అయితే,బొటన వేలు పరమాత్మ అయితే….ఆది గురువు దక్షిణామూర్తి కాస్త తన చిన్ముద్రతో ఆత్మని పరమాత్మతో ఎప్పుడైతే అనుసంధానం చేస్తారో…. అప్పుడు మనకి మూడు భావాలు వస్తాయని చెప్పడం జరిగితే…. అలాగే మహావతార్ బాబాజీ యొక్క అపాన ముద్ర ద్వారా శరీరం అలాగే ఆత్మ కాస్త విముక్తి స్థితి పొందాలంటే మనసును బుద్ధిని పరమాత్మ నామస్మరణతో పరిశుద్ధి చేసుకోవాలని చెప్పడం జరిగితే…అనగా మనస్సు, బుద్ధి చేసే రెండు భావాలు నాశనం అవ్వాలని అప్పుడే మన శరీరం, అలాగే మన ఆత్మ కాస్త కర్మ-జన్మ రాహిత్య స్థితి పొందాయని చెపితే….. ఇంక మూల ఏక భావ స్థితి …..మూల ఏక భావ స్థితిని మనం పొందాలని….



మూలస్థాన మూర్తి కాస్త తర్జనీ ముద్రతో అనగా తన కుడి చెయ్యి చూపుడువేలును ఆకాశం కేసి చూపిస్తూ… నిలబెట్టడం జరిగింది. ఈ చూపుడు వేలుకి సుదర్శన చక్రం ఆకారంలో విశ్వ జగత్తు భావ పరంపరలతో తిరుగుతూనే ఉంటుంది అని…..ఎప్పుడైతే మనము ఏక భావ స్థితికి వచ్చి….ఆపై భావరాహిత్య స్థితికి చేరుతామో అప్పుడు మన శరీరం, మనసు ,బుద్ధి కాస్త త్రిభావ రహిత స్థితి పొంది స్థిరమై అప్పుడు మనం ఉన్న విశ్వ జగత్తులో ఉన్న కదిలే విశ్వ బ్రహ్మాండం కాస్త…..నిశ్చలమవుతుంది అని… తద్వారా అంతిమమున మన ఆత్మ కూడా నిశ్చలమై, నిశ్చల మోక్ష స్థితి పొంది, అన్నింటా విముక్తి పొందిన విముక్తి ఆత్మ అయ్యి నిశ్చల మోక్షం పొందుతుందని చెప్పకనే చెప్పారని దీనిని బట్టి అర్థం అవుతుంది కదా! ఇక్కడ ఒక ధర్మ సందేహం రావచ్చును. అదేమిటంటే దక్షిణామూర్తికి చిన్ముద్ర, బాబాజీకి అపాన ముద్ర అలాగే మూలస్థానం మూర్తి కి తర్జనీ ముద్ర వచ్చినట్లుగా మరి శివ నందిని కి ఏమి చేతి ముద్ర రాలేదా అన్నప్పుడు…ఈమెకి వచ్చింది. అదే త్రి భావాలను అతీత స్థితికి తీసుకు వెళ్ళే ముష్టి ముద్ర వచ్చింది. అంటే ఇది చూడడానికి ఎదుటివాడిని కొట్టడానికి…. భయపెట్టడానికి సిద్ధపడి బిగించిన పిడికిలి ముద్ర అన్నమాట! ఈ ముద్ర లో అన్ని వేలు మూసుకుని ఉండటం…సర్వ భావాల నుండి అతీత స్థితి పొందటం జరుగుతుందని…పొందాలని…ఈ ముద్రా సంకేతం చెబుతుంది. ఈ ముద్రలో 15 నిమిషాలు శివ నందిని ఉండి భావతీత స్థితిని పొందింది.


పరమహంసకి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే….సాధన పరిసమాప్తిలో అంతిమ ధ్యానానుభవ మూలస్థాన మూర్తి కాస్త….నిర్జీవ నిశ్చల మోక్ష స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది కదా! కానీ సాధకులలో నూటికి 98 శాతం మంది ఈయన సజీవ మూర్తి అని భావన చేస్తూ ఉంటే…. మిగిలిన రెండు శాతం మంది నిర్జీవమూర్తి అని భావన చేస్తున్నారని ….అందరికీ తెలిసిన విషయమే కదా!  ఒక్క ఈ విషయ జ్ఞానములో ఎందుకు విభిన్న భావాలు వస్తున్నాయని…. పరమహంస సందేహం అన్నమాట ! 


ఒక రోజు నాకు ఇంటర్నెట్లో ఈ శ్లోకం కనిపించింది . అదేమిటంటే …


జయంతితే సుకృతినో రస సిద్దాః 

కవీశ్వరాః | 

నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం

 భయయే||


భావం:- 


పుణ్యాత్ములు,  రస సిద్ధులు, కవీశ్వరులు… వాళ్లకి కీర్తి అనే శరీరం ఉండడం చేత ముసలితనం లేదా మరణం వల్ల కలిగే భయం ఉండదని …ఎందుకంటే వీళ్ళు భౌతిక దేహం నశించినా ….వీళ్ళ కీర్తి శరీరం ఎప్పటికీ జీవించి ఉండడం చేత ఇలాంటి వారికి మరణ భయం ఉండదు.


దీనిని తెలుసుకోవాలని ధ్యాన సమాధికి వెళ్ళటం జరిగింది. విషయం అర్థమైంది…. అవగాహన అయింది. జ్ఞానస్ఫురణ అందింది. మౌనం ఆవహించింది…. అంతెందుకు,  భగవద్గీత గానం వింటే….. మనకి చనిపోయిన ఘంటసాల జ్ఞాపకం ఎందుకు వస్తున్నారు? వెంకన్న స్వామి యొక్క సుప్రభాతం వింటే…. చనిపోయిన m.s  సుబ్బలక్ష్మి ఎందుకు జ్ఞాపకం వస్తారు…?  అంతెందుకు జీవ సమాధి చెందిన యోగుల  సమాధుల దగ్గరికి వెళితే,  లోపల వాళ్ళు సజీవ మూర్తిగా ఉన్నట్లుగా…. మనకి ఎందుకు కనపడుతున్నారో…. ఆలోచిస్తే,  అంటే చనిపోయిన వాళ్ళు లేదా సమాధి చెందిన వాళ్లకి ఒక ఉనికి ఉంది.  అది ఏమిటంటే,  నేను ఉన్నాను… నేను ఫలానా పనిచేశాను…. నేను ఫలానా సేవ చేశాను…. నేను ఫలానా ధ్యాన అనుభవం పొందాను…. నేను ఫలానా పాట పాడాను…. నేను ఫలానా గేయం రాసాను…. నేను  ఫలానా గ్రంధం రాశాను… నేను ఫలానా పుస్తక రచన చేశాను…. అలాగే ఇలా భోగంలోనూ అలాగే యోగములోనూ నేను అనేది ఉంటుంది.  ఈ “నేను”అనేది వీళ్ళకి కీర్తి శరీరంగా ఉంటుందన్నమాట!  భోగంలో వాళ్ళు చనిపోయినా లేదా యోగంలో వాళ్ళు సమాధి చెందినా కూడా…… వీరికి శరీరం యొక్క కీర్తి అలాగే కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండిపోతుంది.  నిజమే కదా!  మంచి ఆటగాడు చనిపోయినా …..వాడు సంపాదించిన కప్పులు చూస్తే….. ఆ ఆటను చూసినప్పుడు….. చనిపోయిన ఆటగాడు అందరికీ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు….?  ఎందుకంటే వాడి భోగ శరీరం చనిపోయింది,  కానీ వాడి కీర్తి శరీరం ఇంకా మన మధ్యనే మిగిలిపోయింది.  ఎందుకంటే ఆటగాడు ఆటలో అంత నేర్పు, నైపుణ్యం ఎవరికి సాధ్యం కానీ పట్టు, ఒడుపులు ఆ ఆట మీద సంపాదించి…. తనకి మించిన ఆటగాడు లేడని నిరూపించి….. భోగ శరీరంతో చనిపోతే…. కీర్తి శరీరంతో అమరుడయ్యాడు.  ఇదే కీర్తి శరీరం మనకి యోగంలో కూడా వస్తుంది.  తన పొందిన ధ్యాన అనుభవాలు లోకానికి చెప్పాలని …..“తను ఉన్నాను” ఉనికి లోకానికి చూపించాలని…. యోగులు కాస్త గ్రంథ రచన చేయడం జరుగుతుంది. కావ్యాలు, గేయాలు, స్తోత్రాలు, పాటలు, ఆత్మకథ ఇలా మున్నగునవి రాయడం జరుగుతుంది. అంతెందుకు ….నేను నా వరకు యోగ దర్శనం, ప్రశ్న శాస్త్రం,   విశ్వ గురు చరిత్ర , కపాలమోక్షం, విశ్వమోక్షం , అరుణాచల శివ మహత్యం… ఇలా పలు గ్రంధ రచనలు “పరమాహంస” పేరుతో రాయడం జరిగింది కదా! రాయకపోతే కర్మ తీరదు.  రాస్తేనేమో ఇలా కీర్తికర్మ వచ్చింది. దీనికి నేను సమాధి చెందిన తర్వాత…. ఈ కీర్తి శరీరం ఇంకా బతికే ఉంటుంది కదా!  కాకపోతే  గుడ్డిలో మెల్లగా “నేను ఉన్నాను”  అనే ఉనికికి బదులుగా….“ నేను లేను” అనే భావంతో ఈ గ్రంథ రచనలు చేయడం జరిగింది.  అలాగే ప్రతి యోగికి తోకకి “పరమహంస” ఉంటూనే ఉంటుంది. ఇందులో నేను రాసిన పరమహంస  పేరు ఎవరికి తెలియదు .గుర్తుపట్టలేరు…ఒకవేళ నేనే పరమహంస అని చెప్పినా ….ఎవరూ కూడా నమ్మరు. నమ్మలేరు. ఆయన రచనలు చూస్తే వేద  వ్యాసుడిలాగా ఉంటాయి….. మీరు చూస్తే రోడ్డు మీద తిరిగే బిక్ష సన్యాసిగా ఉన్నారని   నా అవతారం చూసి చాలామంది నాతో అన్నారు.  అది కాకుండా  పరమహంస అంటే ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.  కానీ అదే రమణ మహర్షి లేదా శేషాద్రి స్వామి,  రామకృష్ణ పరమహంస అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు.  అదే నన్ను గుర్తు పట్టడం అనేది ఉండదు.  నేనే స్వయంగా చెప్పినా కూడా ఎవరూ నమ్మని స్థితిలో నా కీర్తి శరీరం ఉన్నదని నాకు అర్థమైంది… నేను చస్తే నా రచనలు ఉంటాయి. నా కీర్తి శరీరం ఉండదు. నా రచనలు కొంత కాలానికైనా మరుగున పడిపోతాయి కదా!  పాత  నీరు పోయిన తర్వాత కొత్త నీరు రావాలి కదా ! వస్తుంది కదా!  ఇది సత్యం కదా!  ఈ విషయంలో నేను కాస్త నా యోగ మిత్రుడైన జిజ్ఞాసికి కృతజ్ఞతలు చెప్పాలి.  ఎందుకంటే నేను కాస్త గ్రంధ రచనను ఆరంభం చేయగానే వాడు ఒక మాట నాతో అన్నాడు.  అది ఏమిటంటే మీరు రాయాలని అనుకున్న విషయాలు రాయండి …రాసుకోండి…ప్రచారం చేసుకోండి…. కానీ ఎవరు రాసారో…… ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి.  రాసేవాడి అవసరం అందరికీ రాకూడదు. రాసే  జ్ఞానం అందరికీ అవసరం అవ్వాలి అని…. పలానా పేరుతో కాకుండా ….పెన్ను పేరుతో రచనలు చేసుకోమని….. నాకు  పెన్ను పేరు “పరమహంస” అని వాడే పేరు పెట్టాడు.  ఆ పేరుతోనే నా రచనలు పూర్తి చేశాను.  ఇప్పుడు ఈ పరమహంస అంటే ఎవరికి తెలియదు.  ఎలా ఉంటాడో… ఎక్కడ ఉంటాడో….. ఏం చేస్తూ ఉంటాడో…. ఉన్నాడో…లేక పోయాడో  లేదో కూడా ఎవరికి తెలియదు. దానితో నాకు కీర్తి శరీరం మాయ లేకుండా పోయింది.  అలాగే నా ఆలోచనలను ప్రతిఫలాపేక్ష లేకుండా…. ధనమును ఆశించకుండా ఉచిత ప్రచారం… నా ఉనికి లేకుండా చేయడం జరిగింది.


 అంతెందుకు….. కపాల మోక్ష గ్రంథం యొక్క కాపీరైట్స్ కి 10 లక్షల నుంచి పది కోట్ల దాకా వెళ్లడం జరిగింది.  అప్పుడు నేను కాస్త చిరునవ్వుతో ఈ అవకాశం వదిలేసాను.  జ్ఞానమును అమ్ముకోరాదు.  విజ్ఞానమును అమ్ముకోవచ్చును.  జ్ఞానం అనేది ప్రకృతి ఇచ్చింది.  విజ్ఞానం అనేది మన మెదడు ఇచ్చేది.  ఈ విజ్ఞానంతో జీవుడు కాస్త ధన  సంపాదన చేసి బతకాలి . అదే ప్రకృతి ఇచ్చే జ్ఞానముతో…. పదిమందికి ఉచితంగా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా…. అలాగే లాభాపేక్ష చేయకుండా “నేను” అనే ఉనికి చూపించకుండా ఇవ్వాలి. ఇలా నేను చేయడంతో…. నా కీర్తి శరీర మాయ దాటుకోవడం జరిగింది.  నా భౌతిక శరీరం పడిపోయినా …..ఎవరూ కూడా నన్ను పట్టించుకోరు.  కానీ నా రచనలు ఉన్నంతవరకు నా పేరుతో “పరమహంస” అనుకుంటారు.  కానీ ఈ పేరుకి నామరూపాలు, ఆరాధనలు, స్తోత్రాలు, ఆశ్రమాలు, లేవు కదా!  దానితో నేను ఈ కీర్తి శరీరము మాయను దాటుకోవడం జరిగింది. ఈ శరీరం మాయలో నూటికి 98% పడి ఆగిపోతున్నారు.  ఈ కీర్తి మాయవలన మూలస్థాన మూర్తిని చూసినప్పటికీ….. ఆయన నిర్జీవ మూర్తి అయినా కూడా…. నమ్మకుండా సజీవమూర్తి అనే భావంతో వెనుతిరిగి …. పునః సృష్టిలో పడుతున్నారు.  ఎందుకంటే వీళ్ళందరికీ “నేను ఉన్నాను” ఉనికి గుర్తుచేసే కీర్తి శరీరం ఉంది. ఈ మాయ దాటడం అసాధ్యమే అని చెప్పాలి.  ఎందుకంటే శివుడే స్వయంగా తన భక్తుడికి ఎలా తన రచన స్తోత్రాలు రాసి తన కీర్తి శాశ్వతముగా ఉండే విధంగా కీర్తి శరీరము ఏర్పాటు చేశాడో మీరే చదివి తెలుసుకొండి. 



మాణిక్య వాచకర్ అనే మహా శివ భక్తుడు ఉండేవాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిదంబర క్షేత్రానికి చేరుకున్నాడు. ఈ  క్షేత్రానికి చేరుకున్న తర్వాత ఆ చిదంబర నటరాజమూర్తి మీద అద్భుతమైన స్తోత్రాలను చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ పరమేశ్వరుడు ఈ మాణిక్యవాచకర్ నివసించే ఇంటికి వృద్ధుడి రూపంలో వచ్చాడు. అప్పటివరకు శివ స్తోత్రాలు చేసి అలసిపోయి నిద్రపోయారు. ఈయన తలుపు తీసి చూసేసరికి ఒక వృద్ధుడు కనిపించాడు. నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు  చేసావంట కదా….  ఒకసారి నాకు కూడా వినిపించు…ఎక్కడినుంచో తీర్థయాత్రలు చేస్తూ…నీ స్తోత్రాలు వినాలని వచ్చాను… అన్నాడు. శివ నామం వినగానే … శివ స్తుతి చేయమని అడగగానే….రాత్రిపగలు, సత్తువ, నిస్సత్తువ లాంటి బడలికలు అన్నీ పోయి…ఆనందంతో ఆయన చేసిన స్తోత్రాలన్నీ  చెప్తూ ఉన్నారు. ఈ మాణిక్యవాచకార్ చేసే స్తోత్రాలన్నింటినీ…. ఒక గ్రంథం లాగా ఈ వృద్ధుడు రాయడం జరిగింది. ఇక  తెల్లవారుతోందని స్నానాధి సంధ్యావందనాలు చేసుకోవాలని…. ఆ వృద్ధుణ్ణి వినయంగా అడగగానే…సరే అన్నాడు. నేను కూడా సెలవా మరి అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ గ్రంథంలోని స్తోత్రాలన్నింటినీ తాళపత్రాల మీద రాసి…. వాటిని ఒక కట్టలాగా కట్టి…. చిదంబరంలోని ఆకాశ లింగం ఉన్న ద్వారం దగ్గర పెట్టి… దానిమీద నంది ముద్ర వేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అర్చకులు తలుపు తీయడానికి వచ్చేసరికి…అక్కడ తాళపత్ర గ్రంథాలు కనిపించాయి. వాటిమీద నందిముద్ర ఉండడం చూసి ఆశ్చర్యపోయి…అసలు ఇందులో ఏముంది అని ఆ పత్రాలను తెరిచి చదవడం ఆరంభించారు. అందులో ఉన్నవి శివ స్తోత్రాలని…. అందులో కొన్ని చదవగానే ఇవి మాణిక్య వాచకర్ చేసిన స్తోత్రాలని అర్థమయింది. అయితే ఈ తాళపత్రాలలో ఒకచోట పరమశివుడు తన స్వహస్తాలతో ఒక పీఠిక రాశారు. 


అదేమిటంటే…. ఈ వ్యక్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు…..  కానీ ఈయన నోటి వెంట వచ్చే  మాటలు…మాణిక్యములు. ఒకవేళ ఈయన పలికే ఈ మాణిక్యములు…కాలంలో లేకపోతే…ఈయన చనిపోయిన తరువాత…. ఇలా ఆ శివుని స్తుతించేవాళ్లు ఇలాంటి స్తోత్రములు చేసేవాళ్లు ఇకపై ఉండరని…. ఇలా ఆ  శివ తత్వమును అందించగలిగినవాడు లేడని…ఆయన చెప్పినవన్నీ స్వయంగా నేనే కూర్చుని రాశాను అనీ …వీటన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అని… దానిమీద నటరాజు అని రాసి ఉంచారు. ఆలయ అర్చకులు అందరూ మహదానందం పొంది…. మాణిక్య వాచాకర్ గారి ఇంటికి పరుగు పరుగునా వెళ్లి…రాత్రి మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? నువ్వు శివ స్తోత్రాలు చెప్పావా?  అని అడగగానే…. అవును ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. నువ్వు చేసిన శివ స్తోత్రాలు చెప్పమని అడగగానే నేను ఆ శివ స్తోత్రాలు పాడాను అని చెప్పగానే…. ఆయన ఎవరో కాదు.. ఆ పరమశివుడే…. నువ్వు చెప్పినవన్నీ విని…రాసి…తాళపత్ర గ్రంధాలుగా మార్చి…వాటిని ఆకాశలింగం ద్వారం దగ్గర పెట్టి అంతర్దానం అయిపోయారు అని చెప్పారు. ఆ మాటలు విన్న మాణిక్య వాచకర్ కి…కళ్లవెంట ఆనందంతో…ఆనందాశ్రువులు వచ్చాయి. వెంటనే స్వామి వారిని చూడాలని చిదంబర క్షేత్రంలోని నటరాజ మూర్తి దగ్గరకి వెళ్లి ఆయన ఎదురుగా నిలబడి…. శరీరం, మనసు నిశ్చలమై…తన్మయత్వంతో కూడిన చూపుతో ఆ స్వామిని  చూస్తూ…అలవికాని ఆనందంతో…ఇన్ని స్తోత్రాలు చేసినవాడు…ఆ బ్రహ్మానందానికి నోట మాట రాక…కన్నుల వెంట నీరు కారుస్తూ…సర్వస్య శరణాగతితో రెండు చేతులు చాచి నిలబడి పోయారు…. ఆ నిశ్చల ఆనందంలో ఆయన ఉండగా…ఆయనలో నుంచి ఒక దివ్య జ్యోతి ప్రకాశం బయటకు వచ్చి ఆ నటరాజ మూర్తిలో ఐక్యమయింది.


కానీ  సాధ్యం కాదని చెప్పలేము. ఎందుకంటే ఆదిదంపతులలో ఆది రుద్రుడికి ఈ కీర్తి శరీర విషయ జ్ఞానం అంది…. శరీరధారి నుంచి లింగ ధారిగా మారినప్పటికీ…. ఈ లింగంలోనే ఆ శివుని సజీవ మూర్తిగా చూస్తున్నారు కదా!  అంటే ఒకరకంగా చెప్పాలంటే ఈయన కీర్తి శరీరం ఇంకా సజీవమూర్తిగా ఉండటంతో…..మూలస్థాన మూర్తి మనకి సజీవ మూర్తిగా కనపడుతున్నాడు.  అంటే ఈ లెక్కన చూస్తే…. మూలస్థాన మూర్తికి ఇద్దరు శివుళ్ళు ఉంటారని అందరికీ తెలుసు కదా ! ఇందులో ఒక శివుడు శివధారి అయితే మరొక శివుడు కాస్త లింగ ధారి కావడంతో…ఈ అంతిమ దేహం కాస్త లింగ దేహం అయింది.  ఇందులో శరీర ధారి “నేను ఉన్నాను” అనే భావ కీర్తి శరీరం ఉంటే …..అదే లింగ ధారికి “నేను లేను” అనే భావరాహిత్యము రావటంతో…. కీర్తి శరీరం లేకుండా పోయింది.  ఇలా ఏకైక ఈ లింగ దేహం రెండు విభిన్న భావాలు ఉండడం చేతనే…. మనకి అంతిమంగా “నేను ఉన్నాను” లేదా “నేను లేను” భావ పరంపర కొనసాగుతూ ఉంది.  ఎవరి కీర్తి శరీరం ఉంటే…. వారికి “నేను ఉన్నాను” భావం…. అదే ఎవరికైతే నేను ఉనికి లేదో వాళ్ళు “నేను లేను” భావాతీత స్థితికి చేరతారు. వారికి కీర్తి శరీరం ఉండదు.  అంటే ఈ శరీరము మోక్షం పొందాలంటే…. మనకి ప్రకృతి ఇచ్చే జ్ఞానము… అదే ధ్యాన అనుభవాలు లేదా ధ్యాన దృశ్యాలు లేదా విశేష జ్ఞాన స్ఫురణలు లేదా భావాల ఉద్రేకములు లేదా ఊహలు లేదా ఆలోచనలు ఇలా ఏవైనా కూడా….. ప్రజలకి చెప్పేటప్పుడు మన ఉనికి తెలియకుండా, ఉచితంగా… ప్రతిఫలాపేక్ష లేకుండా…. లాభాపేక్ష లేకుండా…. ఏమీ ఆశించకుండా అందించాలి. నేనే గురువుని… నేనే జ్ఞానిని …నేనే దేవుడిని…. నేనే అది ….నేనే ఇది అంటూ ప్రచారాలు చేసుకుంటే,  మీ ఈ ఆశయం కాస్త…. యోగ పరంగా చూస్తే ఆశ్రమంగా మారుతుంది. ఈ ఆశ్రమ బాధ్యత కోసం చందాల సేకరణ మొదలవుతుంది . కీర్తికాంత మాయ నుండి ధనకాంత మాయలో పడతారు.  కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా…. సప్తసముద్రాలు ఈది ఇంటి వెనక మురికి కాలువలో పడి చచ్చినట్టుగా….. మీ సాధన ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితికి మీకు తెలియకుండానే… కిందకి జారిపోతుంది.  మీ సాధన చెట్టు పేరు చెప్పి శిష్య భక్తులు కాయలు అమ్ముకుంటారు.  మీరు అందరి దృష్టిలో బిచ్చగాడిగా ఉండి బిలీనియర్ అవుతారు.  భక్తి కాస్త భక్తి వ్యాపారం అవుతుంది.  మీ సమాధి కాస్త ఆశ్రమంగా మారుతుంది.  ఈ సమాధిలో మీ ఆత్మకాస్తా శూన్యంలో శూన్యం అవ్వకుండా…. కీర్తి కోసం విముక్తి ఆత్మగా మారి ఆత్మ ఘోష చేస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా?  అంటే మీ ఆశ్రమం అలాగే మీ ఆశయం కూడా కాలగర్భంలో కలిసిపోయి …..నాశనం అయ్యేదాకా…. మీ కీర్తి విముక్తి ఆత్మకి విముక్తి లభించదు. మీరు ఎన్ని సాధనలు చేసినా కూడా ఎన్ని రకాలుగా ధ్యాన అనుభవాలు పొందినా కూడా…. అన్ని దేహాల మోక్ష విధివిధానాలు పొందినా కూడా…… మీ కీర్తి శరీరం వాటిని నమ్మదు… నమ్మలేదు. “ నేను ఉన్నాను” భావం లోనే ఇది ఉంటుంది. ఎందుకంటే మీరు లేరని మీకు తెలుసు.  కానీ మిమ్మల్ని ఆరాధించే ,పూజించే మీ శిష్య భక్తులకి మీరు ఉంటారు కదా! మీరు జీవ సమాధి చెందినా కూడా… వాళ్ళు మీ సమాధిలో నిర్జీవ మూర్తిగా మారినా కూడా నమ్మకుండా ….సజీవ మూర్తిగానే ఉన్నారని,  ప్రతి ఒక్కరూ భావం చేస్తూనే ఉంటారు.  తద్వారా మీ జీవ సమాధి అనంతరం వీరి భావానికి తగ్గట్టుగా మీ కీర్తి భావ శరీరం శాశ్వతంగా ….విముక్తి ఆత్మగా సంచారం చేయక తప్పదు. ఇలా ఎవరైతే కీర్తి ప్రతిష్టల యందు పడతారో….వారికి మోక్షం పొందాను అనే భావం స్థిరపడటానికి 120 సంవత్సరాల నుంచి పది లక్షల సంవత్సరాల పైన పడుతుందని నాకు జ్ఞాన స్ఫురణ అందింది.  అప్పటికి కానీ వాడి జీవ సమాధి అలాగే,  వాడి ఆశ్రమం మరియు వాడి కీర్తి చరిత్ర కాస్త కాల గర్భంలో కలిసిపోదు.  కాబట్టి కీర్తి శరీర విషయంలో ప్రతిసాధకుడు జాగ్రత్తగా ఉండండి.  మీలో జ్ఞాన తత్వం బయటికి రాకుండా మౌనం వహించండి. మీలో యోగత్వం బయటికి రాకుండా… బాలోన్మత్త పిశాచ అవస్థలో ఉండండి.  మీలో దైవత్వం ఎవరికీ తెలియకుండా…. నేను లేను.. ఉన్నది ఆయనే …నేను కాదు ….అని గ్రహించిన వారికి చెప్తూ ఉండండి.  అంతేకానీ మీలో కలిగిన ధ్యాన అనుభవాలు కొత్తవారితో ,తెలియని వారితో, తెలిసిన వారితో, చెప్పిన వారి పొగడ్తల మాయలో మీరు పడిపోయి…. వారు మిమ్మల్ని గురువుగా లేదా దైవంగా లేదా జ్ఞానిగా భావించడం… ఆరాధించడం… పూజించడం…. చేసి ఆపై ఆశ్రమాలు ఏర్పాటు చేసి… మిమ్మల్ని అడుక్కునే వాళ్ళని పోషించమని బాధ్యత మీకు ఇస్తారు.  మీ దేహమును ఇతరులకు చూపించి…. చందాలు వసూలు చేస్తారన్నమాట!  కాబట్టి జ్ఞానం వచ్చినప్పుడు మీరు ఎవరో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకొని…. గ్రహించి…. వారినిఅణిచిపెట్టి , తొక్కిపెట్టి….మీరు తెలుసుకున్న సత్య జ్ఞానమును లోకానికి  అందించండి.  మీరు చేసే మంచి , లోకానికి తెలియాలి కానీ,  ఆ చేసిన మనిషి కనపడవలసిన అవసరం లేదు అని తెలుసుకోండి.  అప్పుడే మీ కీర్తి శరీరమునకు విముక్తి కలిగి మోక్షమును పొందుతుంది.  “నేను లేను” అనే భావం కాస్త స్థిరపడటంతో మూలస్థాన మూర్తి కాస్త నిర్జీవ మూర్తిగా దర్శన అనుభవం ఇవ్వడంతో ఆఖరిగా వచ్చే 12వ కీర్తి దేహం కూడా మోక్షం పొంది విశ్వ పూర్ణ  శూన్యంలో శూన్యం అవుతుంది.  ఇదే తధ్యము… ఇదే సత్యము.



నాకు వచ్చిన చేప మణి 

ఇదిలా ఉండగా….. ఒకరోజు ఈయన దగ్గరికి చేపలు పట్టుకునే జాలరి వచ్చి స్వామి! నా దగ్గర చేప మణి దొరికింది . మీకు కావాలా ? అనగానే ఈయనకి మొదట ఏమి చెప్తున్నాడో అర్థం కాలేదు. చేప మణి అంటాడు ఏమిటి ? పాముకి నాగమణి ఉన్నట్లుగా….. చేపలకి కూడా ఒక మణి ఉంటుందా అని సందేహం వచ్చి…. ఏది చూపించు అనగానే ఏదో గట్టి పదార్థంతో…. బంగారు రంగుతో…. ఒక కొండ ఆకారంగా కనబడింది. ఇది చూడడానికి మూలస్థాన మూర్తి ఆకారంలాగా ….రంగు లాగా కనిపించింది . అప్పుడు జాలరి కాస్త… స్వామి! మీకు ఈ మణి గురించి తెలియదు అనుకుంటా! సాధువులు దీనిని ధరించడానికి ఎగబడతారు కదా! మీరు కూడా సాధువే కదా! మీకు తెలియక పోవడం ఏమిటి? సరే నాకు తెలిసింది చెబుతాను. ఇది చేప చచ్చే సమయం వచ్చినప్పుడు దాని తలభాగం లోపల ఏదో తెల్లని పదార్థం కాస్త గట్టి పడిపోతూ ఉండగా…. చేప చచ్చి నీటి మీద తేలుతుంది. అప్పుడు ఈలాంటి పెద్ద చేపల లోనే ఈ మణి తయారయ్యి ఉంటుంది. కావాలంటే దీనిని చూడండి. చేపతలని పోలి ఉంది కదా… అనగానే అవును అన్నాను . ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి నర ఘోష, నర దిష్టి, చెడు శక్తి , ప్రేత శక్తి దరి చేరవు అంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంట. ఆరోగ్యం బాగుంటుందంట ….అనగానే…. మంచిది. దీనిని నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. దీని ద్వారా చేపకి కూడా ఒక మణి తయారవుతుందని తెలుసుకున్నాను. 


మంచిది… దీనిని ఏం చేసుకోవాలి అనగానే… మీ దగ్గరే ఉంచుకోండి. ఇది అన్ని చేపలలో ఉండదు. బాగా వృద్ధ చేపకే…. అంటే 85 సంవత్సరాలు లేదా 1000 పౌర్ణమిలో చూసిన చేపలకే ఇది తయారవుతుంది . అది చచ్చిన తేలిన తర్వాతనే ఇది బయటపడుతుంది. పెద్ద సొర చేపలలో… తిమింగలాలలో పెద్ద సముద్రపు చేపలలో….. ఈ మణి ఉంటుందని విన్నాను . చూశాను కూడా. మీకు ఇవ్వాలనిపించింది . ఇస్తున్నాను… తీసుకోండి స్వామి…. అనగానే మోహమాటం కొద్ది ….ఇది కూడా ఏదైనా దైవీక వస్తువు ఏమో అనుకొని ….వాడికి 500 ఇచ్చి దీనిని తీసుకొని ….తనకి వచ్చిన మూలస్థానం మూర్తి అరుణ శిలకి అతికించడం చేశారు. దీనిని గురించి నెట్ లో వెతికితే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఇది రాహు గ్రహదోష నివారణకి, వాస్తు దోష నివారణకి, దుష్టశక్తుల నుంచి రక్షణకి, దుర్గాదేవి ఆరాధనలో ఉపయోగిస్తారని… తెలుసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఒక రోజు ధ్యానంలో ఒక యోగి కాస్త జీవ సమాధి చెందిన మూడు రోజులకు ఈయన తల యొక్క బ్రహ్మా రంధ్రం నుంచి ఏదో తెల్లటి చిక్కటి పదార్థం బయటికి రావడం కనబడితే…. కొన్ని క్షణాలు తర్వాత ఒక పెద్ద చేపకి మరణ సమయంలో దాని తలలో ఒక చిక్కటి పదార్థం చేరి అది గట్టిపడే దృశ్యం కనిపించి అదృశ్యం అయింది. దీనితో ధ్యాన భంగమై వీటి గురించి విశ్లేషణ చేస్తుంటే…. యోగి  కి తన  బ్రహ్మ రంధ్రం నుంచి బయటకు వచ్చిన తెల్లని పదార్థం వీర్యమని….. ఇది ఎవరైతే కపాల మోక్షం పొందారో వారి బ్రహ్మా రంధ్రం నుంచి తెల్లని పదార్థం బయటకు వస్తుందని…. అలాగే ఏ చేప అయితే కపాల మోక్షం పొందుతుందో…. దాని తలభాగంలో కూడా తెల్లని వీర్య పదార్థం చేరి ….గట్టిపడగానే దాని ప్రాణాలు పోతాయని….. తద్వారా ఇది కూడా కపాలం మోక్షం పొందుతుందని…. చచ్చితేలిన చేపలలో ఇది కాస్త మణి పదార్థంగా మారుతుందని అర్థమయ్యేసరికి ….అంటే తను కపాల మోక్షం పొందిన విషయం తనకి తెలియకుండా జరుగుతుంది కాబట్టి…. తెలిస్తే అది జరగనట్లే కదా! ఇలా ఈ చేప మణి ద్వారా తనకి త్వరలో స్థూల శరీరకపాలమోక్షం కలుగుతుందని ప్రత్యక్ష నిదర్శనం కోసం ఈ చేప మణి వచ్చిందని…. ఈయనకి అర్థమై ఇక ఆఖరిగా రావాల్సిన దైవీక వస్తువైన…..మూలస్ధాలమూర్తి శిల మరియు చేపమణి రావడము జరిగిందని గ్రహించారు.


ఒకరోజు పరమాహంసకి అసలు ఈ చేప మణి వలన ఏలా కపాలమోక్షం కలుగుతుందో  తెలుసుకోవాలనిపించింది. నిజానికి మనకి మృత్యువు అనేది నీడలాగా మన వెంట ఉంటుంది అని….మనం ఆఖరి కర్మ తీరిన వెంటనే…. అది భోగులకి చావు రూపంలో… అలాగే యోగులకి కపాల విభేదన రూపంలో… మృత్యువు వస్తుందని అందరికీ తెలుసు. కానీ మన మృత్యువు అనేది, మన శరీరాలలో ఎక్కడో ఒకచోట నిక్షిప్తం చేసి ఉండాలి. అది మన ఆది కర్మ తీరిన తర్వాత మన ప్రాణశక్తి లేదా ఆత్మ శక్తిని బయటకి నవ రంధ్రాల ద్వారా పంపిస్తే…. అది భౌతిక మరణం గాను, అదే బ్రహ్మ రంధ్రం ద్వారా పంపిస్తే, కపాల మోక్ష మరణం అని అర్థమవుతుంది . కాకపోతే మన ఆత్మ శక్తి బయటకు వచ్చిన తరువాత…. మనము పుణ్యాలు చేస్తే శివ దూతలు లేదా పాపాలు చేస్తే యమ దూతలు వచ్చి ఆత్మను తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించారా? మన ప్రాణ శక్తి బయటకి ఏదో రంధ్రం ద్వారా వచ్చేదాకా యముడైన ఎదురు చూడక తప్పదు. అది బయటకు వచ్చిన తరువాతనే మన ఆత్మ శక్తిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా శివ దూతలు లేదా యమదూతలు ఎదురు చూడక తప్పదు. అంటే ఈ లెక్కన చూస్తే, మన శరీరంలో ఎక్కడో మన మృత్యువు ఏదో రూపంలో ఉండి…. అది కాస్త మన ప్రాణశక్తిని బయటకు పంపిస్తోందని అర్థం అవుతుంది కదా! అందుకే మన మరణం కూడా మన జననం వెంట నీడలాగా ఉంటుందన్నమాట! ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు… ధ్యానంలో కూర్చున్నప్పుడు…. తీవ్రమైన ధ్యాననిష్టలో విలోహిత రుద్రుడు కనిపించాడు. ఈయన ధ్యాననిష్ట పరిసమాప్తి సమయంలో ….ఈయన వీపు మీద సరిగ్గా వెన్నుపూస అగ్రభాగంలో…. భుజాల మధ్య భాగంలో కొంచెం ఉబెత్తు ఎముక భాగం ఉన్న ప్రాంతంలో…. ఒక ఎర్రటి జ్వాలాగ్ని మొదలై….. అది కాస్తా పసుపు లేదా బంగారపు వర్ణ కాంతి అగ్ని ముద్ద అయ్యి …… కంఠంలో ఉన్న కొండనాలిక ప్రాంతానికి చేరుకొని…. అది కాస్త ఒక కత్తిలాగా సాగుతూ….. బ్రహ్మ రంధ్రం వైపుకి ప్రవహిస్తూ….. యోగాగ్నిగా మారిన క్షణకాలంలో…. ఈయన బ్రహ్మ రంధ్ర విభేదనము చేయడంతో…. ఈయన శరీరం అంతా యోగాగ్నిమయం అయ్యింది. మృత్యుమయం అయింది. కాకపోతే ఈయన మృత్యుంజయుడు కావడంతో మృత్యువు రాలేదు. కానీ ఈయన శరీరం కాస్త అమితమైన వేడిమి తట్టుకోలేక చిన్నచిన్న అగ్ని ముద్దలుగా విభజన చెందటం ఆరంభించాడు. ఇది కాస్త ధ్యాననిష్ట లో ఉండే యోగులకి…. సాధువులకి ….సన్యాసులకి శరీరాలలో వీపు వెనక, వెన్నుపూస అగ్రభాగమునకు చేరి…వారి శరీరాన్ని యోగాగ్నితో దహనం చేయటం…. అలాగే దైవాల శరీరాలు కూడా దగ్ధమవుతూ ఉండేసరికి…. విషయం తెలుసుకున్న ఆదిపరాశక్తి కాస్త , విలోహిత రుద్ర యోగాగ్ని శక్తిని అండ, పిండ , బ్రహ్మాండాలు భరించలేవని….. నాశనం అవుతాయని…. గ్రహించి ఈయన శక్తిని బాడవాగ్ని శక్తిగా మార్చి నీటిలో అగ్నిపర్వత రూపంలో భద్రపరచడం జరిగింది. అప్పటికే జరగవలసినదంతా జరిగిపోయింది.విశ్వంలో ఉన్న ప్రతి జీవిలోనూ, దైవములోనూ, ఈయన శక్తి అంతర్గతంగా వెన్నుపూస అగ్రభాగంలోకి చేరుకుంది. కాకపోతే ఎప్పుడైతే ఆదిపరాశక్తి కాస్త ఈ శక్తిని నీటిలో బడవాగ్నిగా నిక్షిప్తం చేసిందో…. ఆ క్షణంలో అందరిలో చేరిన బడవాగ్ని శక్తి కాస్త కళాహీనమై… వేడిమి కోల్పోయి… ఒక గట్టి ఎముక పదార్ధంగా తెల్లగా మారిపోయింది. కానీ ఎప్పుడైతే వారి ఆఖరి కర్మ తీరిపోయిందో…. ఇది కాస్త అగ్గి కణమై ,భోగులకి భౌతిక మరణం ఇస్తుంది. ఎలా అంటే గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంధికి ఇది చేరి…. ఆ జీవుడికి మాట పడిపోయేటట్లుగా ఆహారం తినకుండా చేస్తుంది. ఇలా వాడు మూడున్నర నెలల నుంచి మూడున్నర సంవత్సరం వరకు ఈ ఈతి బాధలు పడుతూ ఉండేసరికి …..అప్పుడు వాడి కోరిక జన్మ అనుగుణంగా ఈ మృత్యువు కాస్త నవరంధ్రాలలో బయటికి పోతుంది. ఏ రంధ్రములో పోతుందో…. ఆ రంధ్రానికి తగ్గ కోరిక కర్మజన్మ వస్తుంది. ఇది విధాత మృత్యువు విధివిధానం అన్నమాట! అదే యోగుల పరంగా చూస్తే ….అమృతం స్రవించే కొండనాలికకి ఇది చేరి, అక్కడ నుంచి ఊర్ధ్వ ముఖ యోగాగ్ని మారి ప్రవహించి ….బ్రహ్మరంధ్రం విభేదనం ద్వారా కపాల మోక్షం ఇస్తుంది. పునః కర్మ జన్మ లేని స్థితి కలిగిస్తుంది. ఇంతకి ఈ మృత్యువు ఉండేది ఎందులో.తెలుసా? చేప తలలో తయారైన మణి అయిన చేప మణి లో ఇది ఉంటుంది. అంటే ప్రతి జీవికి… ఈ చేపకి ఉన్న మణి లాగానే అందరి శరీరాలలో ఇది ఉంటుంది. మనకి వీపు వెనక వెన్నుపూస అగ్రభాగంలో ఉంటుంది. ఒక మణిగా… అదే మృత్యు మణి గా నిక్షిప్తమై ఉంటుంది. ఇది చూడడానికి అచ్చుగుద్దినట్టుగా మనం మూలస్థాన మూర్తి ఆకారం రంగుతో పోలి ఉంటుంది. అంటే ఈయనే మన అందరికీ…మన శరీరంలోనే కాదు సర్వ జీవులలో మృత్యు మణి గా తల భాగం కింద కంఠమునకు వెనక వెన్నుపూస అగ్రభాగంలో మన మృత్యువు నిచ్చే మృత్యువు మణిగా మృత్యు మణి నిక్షిప్తమై ఉంటాయి. కాకపోతే మన భావమును బట్టి …. అది అమోక్ష జన్మ లేదా మోక్ష జన్మ ఇది ఇస్తుంది. భావం ఉంటే కారణం ఉన్నట్లే… ఇది ఉంటే కోరిక ఉన్నట్లే… ఇది ఉంటే కర్మ ఉన్నట్లే…. ఇది ఉంటే జన్మ ఉన్నట్లే అన్నమాట! అదే భావాతీత స్థితి పొందితే …అది యే మోక్షం అవుతుంది . మన మృత్యువు మన చేతులలో మన చేతలలోనే ఉంటుంది. ఇష్ట మరణ సిద్ధి ద్వారా యోగులు కావాలని మృత్యువు పొందడం అనేది….. ఈ మృత్యు మణి ద్వారానే చేసుకుంటారు. మిగతా వారికి తెలియకుండా ఆఖరి కర్మ తీరిన తర్వాత…. ఈ మృత్యు మణి తన పని అదే చేసుకుంటుంది . భోగికి తెలియకుండా మరణం వస్తే…. అంటే యోగికి తెలిసి మృత్యువు వస్తుంది. ఈ మృత్యు మణి అన్ని జీవరాశులలో నిక్షిప్తమై ఉంటుంది. చేపలో చేప మణి గా తల భాగంలో వెన్నుపూస అగ్ర భాగంలో ఉంటే …..అదే చెట్టుకి తల్లి వేరు అగ్రభాగంలో వేరు తొడుగు రూపంలో మృత్యు మణి ఉంటుంది. ఈ వేరు తొడుగు పోతే చెట్టు బతకదు. అందుకే తల్లి వేరు జాగ్రత్తగా తీయాలని అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఇలా అన్ని జీవరాశులలో వారి శరీరాలకు అనుగుణంగా ఈ మృత్యు మణి నిక్షిప్తమై ఉంది.


కాకపోతే ఇది కూడా తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, కాషాయం, నీలి రంగులలో ఉంటుంది . మన భావం బట్టి ఇది రంగు మారుతుంది . ఆఖరి క్షణం మృత్యు క్షణం వచ్చే క్షణంలో కూడా….ఇది రంగు మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే… జీవుడు మరణ సమయంలో అతి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు. క్షణానికి ఒక భావం పొందుతాడు. కాబట్టి ఇది మారుతుంది . నాకు తెలిసినంతవరకు పసుపు లేదా బంగారపు వర్ణంగా ఈ మృత్యు మణి ఉంటే ….అది కపాల మోక్ష మరణ సంకేతం అవుతుంది . అదే నలుపు రంగు అయితే, తీరని కోరిక మరణమై, ప్రేత జన్మకి వెళ్లడం…. అదే ఎరుపు రంగు అయితే , ఇష్ట కోరిక మాయ కోసం పునః కర్మ జన్మ చక్రంలో పడటం… అదే ఆకుపచ్చ అయితే భోగ కోరికలు తీరి యోగ కోరిక జన్మలకు వెళ్లడం ….అదే తెలుపు అయితే భోగ కోరికలు తీర్చుకునే జన్మ అవ్వడం అదే కాషాయం అయితే యోగ కోరికలు తీర్చుకునే జన్మ అవ్వడం ….. అదే నీలిరంగు అయితే యోగ కోరికలు కూడా తీరిపోయి…. మరు జన్మ కపాల మోక్ష జన్మ పొందేది అవుతుంది. మన మృత్యు మణి రంగును బట్టి మన కోరిక జన్మలు ఉంటాయి. కాకపోతే ప్రతి జీవికి ఇది తెలుపు వర్ణముతో జననముగా ఉంటుంది. కానీ మన మృత్యు సమయానికి ఇది స్థిరపడే వర్ణమును బట్టి ,మన మృత్యువు ఉంటుంది. ఈ తెలుపు కాస్త పసుపు వర్ణం అయితే వాడి మరణమే మోక్షమరణం అవుతుంది. ఎందుకంటే ఆదిమూల స్థానమూర్తి కూడా బంగారపు అగ్నిముద్ద గా మారిపోయి నిశ్చల మోక్ష స్థితి పొందడం జరిగింది కదా! ఈ స్థితి పొందాలంటే ఎవరికైతే 11 దేహాలు కూడా మోక్షం పొందుతాయో వారి మృత్యు మణి కాస్త తెలుపునుండి పసుపు లేదా బంగారపు వర్ణంలోకి మారుతుంది. ఇలా పరమహంసకి వచ్చిన పసుపు వర్ణ చేప మణి వలన ఈ. మృత్యు జ్ఞానం పొందడం జరిగింది. తన మృత్యుస్థితి మృత్యు మణి రంగు తెలుపు నుండి పసుపు వర్ణమునకు మారిందని చెప్పటానికి….. విశ్వ జగత్తు ఈ పసుపు మత్స్య మణి, అదే…. మృత్యు మణి ఇచ్చి ప్రత్యక్ష నిదర్శనం ఈయనకి ఇచ్చింది. ఈ చేప మణుల గురించి నెట్ లో వెతికితే ….తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, బ్రౌన్ రంగులో…. ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. కాకపోతే ఈయనకి పసుపు వర్ణం చేప మణి ఇచ్చి ఈ జన్మ మరణం నీది కపాల మోక్ష జన్మయని…. ఈ మోక్షమరణం పొందేది నీకు తెలియదు కాబట్టి…. తెలిస్తే అది పొందినట్లే కాదు కాబట్టి….. ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పసుపు చేప మణి…అదే మత్స్య మణి ….అదే మృత్యు మణి ప్రకృతి తనకు ఇచ్చిందని గ్రహించి మౌనంగా ఉండిపోయారు.ఆరోజు నుండి పరమహంసకి అరుణగిరి కాస్త ఒక మత్యమణిలాగా మోక్షమృత్యమణిలాగా కనపడసాగింది.నిజానికి చూస్తే అరుణాగిరి మధ్యకొండ చూస్తే ఒక చేప తల ఆకారముగా కనపడుతుంది.



అలాగే మాకు ఆకాశములో చేపమణి ఆకారములో మేఘంగా కనపడటముతో చేపమణి అనేది సత్యమని అనుభమైంది.


మణి అనుభవం 


ఇలా నాకు వచ్చిన పసుపు వర్ణ చేప మణిని చేతిలోకి తీసుకొని చూస్తే , అది గోరంత పరిమాణంలో కనిపించింది. ఎదురుగా అరుణగిరి కూడా కొండంత పరిమాణంలో ఉంది. ఈ రెండింటిని అదే పనిగా తదేకంగా నేను చూస్తుంటే… నాకు ఒక స్ఫురణ వచ్చింది అదేమిటంటే…


తెలుసుకున్నది గోరంత…

తెలుసుకోవాల్సింది కొండంత …

అని చెప్పేది నిజం కాదని,

 

తెలుసుకోవాల్సింది గోరంత ….

తెలిసేది కొండంత …

అని నాకు అర్థం అయింది. 


ఎందుకంటే నిజానికి మూలస్థాన మూర్తి భగవంతుడి రూపము… ఈ చేప మణి పరిమాణము అంటే గోరంత. కానీ దీని ప్రతిబింబము మనకి కొండంత పరిమాణముగా కనపడుతుందన్నమాట!  అంటే స్థానమూర్తి నీటి బిందువుగా ఈ చేప మణి ఉంటే… సముద్రం అంతా ఈయన భావరూప స్వప్న విశ్వ జగత్తు అవుతుంది. ఈ చేప మణి సజీవ మూర్తిగా ఉంటే , విశ్వజగత్తు సజీవ మూర్తిగా… అదే ఇది నిర్జీవ మూర్తిగా ఉంటే,  ఇది నిర్జీవ మూర్తి గాను కనపడుతుంది.  ఎందుకంటే చేపమణి నుండే విష్ణుమూర్తి కాస్త ఆదిరూప మత్స్య అవతారం ఎత్తి విశ్వ జగత్తుని నడిపించాడు కదా!  మరి ఈ చేప మణిలో మనకి ఈ రెండు రకాల భావాలు కలిగించేది ఎవరో తెలుసుకోవాలని…. నాకు అనిపించి ఈ మణిని మెడలో వేసుకుని ధ్యాన తపస్సులో కూర్చున్నాను. సుమారుగా 48 నిమిషాల తరువాత,  నాకు ధ్యానంలో పదేపదే పసుపు వర్ణ చేప మణి కనిపించసాగింది.  నేనేమో ధ్యానములో తర్జని ముద్రతో ఓంకార నాద సాధన చేస్తున్నాను.  కొన్ని క్షణాల తర్వాత చూస్తే… ఈ చేప మణిలో నాకు తెల్లని శరీరంతో… పద్మాసనం వేసుకుని తర్జని ముద్రతో ఓంకార సాధన చేస్తున్న ఒక వ్యక్తి రూపం లీలగా కనిపించ సాగింది.  అది నా కీర్తి శరీరం అని నాకు జ్ఞాన స్ఫురణ అయింది.  ఇంతలో ఈ శరీర తర్జనీ ముద్రలో ఉన్న చూపుడు వేలికి విశ్వ జగత్తు కాస్త… సుదర్శన చక్రము ఆకారంలో… శర వేగముతో తిరుగుతూ…. లీలాగా కనిపించ సాగింది.  అంటే తాను మూలస్థాన మూర్తి స్వరూపమును ఇలాగే చూడటం జరిగింది కదా!  అంటే ఈ లెక్కన చూస్తే.. ఈయన కీర్తి శరీరం నేను ధ్యానంలో చూశానని… నాకు జ్ఞాన స్ఫురణ అయింది. కొన్ని క్షణాల తరువాత నా కీర్తి శరీరం నుండి విశ్వ జగత్తు కాస్త చూపుడువేలు నుండి విడిపోయి…. నా తల పైన తిరుగుతూ ఉండటం నాకు కనిపించింది.  మరికొన్ని క్షణాల తరువాత యధావిధిగా నా చూపుడు వేలికి ఈ విశ్వ జగత్తు వచ్చి తిరగటం ఆరంభం అయ్యింది. అప్పుడు  నాకు ఎప్పుడైతే కీర్తి శరీరం కాస్త కీర్తి మాయలో పడితే ,  తన భౌతిక దేహ మరణం తర్వాత తన కీర్తితో ఈ శరీరం ఇంకా శాశ్వతంగా సజీవ మూర్తిగా ఉండటంతో… ఈ విశ్వ జగత్తు కాస్త చూపుడువేలి నుండి మన  బ్రహ్మ రంధ్రము మీదకి చేరి సజీవంగా పరిభ్రమిస్తుంది అని….అదే ఎవరికీ అయితే  ఈ కీర్తి మాయలో పడకుండా …వారి కీర్తి శరీరం కాస్త నిశ్చలమవుతుందో…. అప్పుడు విశ్వ జగత్తు కాస్త చూపుడువేలు మీద తిరుగుతూ ఉంటుంది అని…. అంటే స్తంభేశ్వర స్థితి అంటే మంది గురించి ఆలోచనలు చేస్తుంటే…. స్థానేశ్వరుడి స్థితి అంటే మది గురించి ఆలోచనలు చేస్తుంటే…. నిశ్చల స్థితి అంటే మంది లేదా మది గురించిన ఆలోచనలు భావాలు లేని స్థితి అని…. నాకు జ్ఞాన స్ఫురణ అయింది.  ఇప్పుడు తన సాధన స్థితి అనగా తన కీర్తి శరీరం కాస్త ….ఈ మూడు స్థితులలో పరిభ్రమిస్తోందని నాకు అర్థం అయింది. కాకపోతే నేను కాస్త కీర్తి మాయ నుండి అనగా గొప్ప రచయిత, మహా గురువు, పూర్ణజ్ఞాని, విశ్వ మోక్షజ్ఞాని ,మోక్షగురువు, జ్ఞాన గురువు, బోధ గురువు, మంత్ర గురువు, శక్తిపాత గురువు, దీక్ష గురువు, అరుణాచల శివ, అరుణ శివ, విలోహిత రుద్రాంశ, మౌనయోగి, జాతక బ్రహ్మ…. ఇలా మున్నగు నాకు వచ్చిన కీర్తిమాయలు ఒక్కొక్కటి దాటుకుంటూ….వీటి మాయలో పడకుండా… పడినా కూడా లేచి నిలబడి… ఆగకుండా… నా సాధనను కొనసాగించడం …అలాగే ఈ మాయలను దాటేటప్పుడు కీర్తి ఆశించకుండా ప్రతిఫలాపేక్ష ఆశించకుండా… లాభాపేక్ష ఆశించకుండా… నిష్కామ కర్మతో… నిస్వార్థముతో….ఆచరణ చేసి ఈ కీర్తి గుణ మాయను దాటుకోవటం జరిగింది. దానితో నా కీర్తి శరీరానికి యధావిధిగా విశ్వ జగత్తు కాస్త నా బ్రహ్మ రంధ్రం పై నుండి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వేలికి చేరి పరిభ్రమించడం చేసింది.  అదే ఈ కీర్తి మాయలో పడితే వారి కీర్తి శరీరం కాస్త,  వారి భావముతో ఏర్పాటు చేసుకున్న విశ్వ జగత్తుకి విశ్వాధినేత అయిన తనకి….. కీర్తి తెచ్చిన వాటిని,  పారాయణం చేసిన వారిని, స్తుతించిన వారిని, ఆచరణ చేసిన వారిని, సిద్ధాంతాలు పాటించే వారిని,  తనని పొగిడే వాళ్ళని, తనని ఆరాధించే వారిని, తనని పూజించే వారిని, తనని గౌరవించే వారిని…. ఇలా మున్నగు వారిని …ముక్తుల రూపంలో తన లోకమునకు రప్పించుకొని…. వారి భక్తి, గురు, దైవ ఆరాధనలలో శాశ్వతంగా భావ సజీవ మూర్తిగా ఉండిపోయే వారు అవుతారు. దానితో నిర్జీవ మూర్తి కావలసిన వాడు కాస్త, ఈ కీర్తి మాయలో పడి… సజీవ మూర్తిగా మారి పూజలు అందుకుంటాడు.  ఇలా 36 కోట్ల దైవ స్వరూపాలు, కోటి పరమాత్మ స్వరూపాలు,84 లక్షల యోగులు, ఈ కీర్తి మాయలో పడి…. లేని వాళ్ళు కాస్త ఉన్నట్లుగా భ్రమ, భ్రాంతి మాయలో పడి… చచ్చే వాళ్ళని చావనివ్వకుండా…. మోక్షం పొందే వారిని మోక్షం పొందనివ్వకుండా…. తమ కీర్తి శరీర మూర్తి మాయలో… ఎవరికి తగ్గట్లుగా వారిని తమ మాయలో పడవేస్తున్నారు. అంటే నమ్మేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటాడు కదా!  మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడు కదా!  నమ్మేవాడు ఉంటే నమ్మించేవాడు ఉంటాడు కదా!  నిజమే కదా! మన విచక్షణా జ్ఞానం, వివేకబుద్ధి ఉంటే వీళ్ళ కీర్తి మాయలో మనం పడేవాళ్లు కాదు కదా!  వాళ్ళని అనుకొని ఏమి లాభం!  అంతా లోపం తప్పు మనలోనే ఉంది.  మన భావ  ఆలోచనలను బట్టి వారి చేతలు ఉంటాయి కదా!  ఇకపోతే ఎప్పుడైతే నా కీర్తి శరీర కీర్తి మాయ దాటానో ….



అప్పుడు నా కీర్తి శరీరం కాస్త తర్జనీ ముద్రతో….. చూపుడు వేలు మీద విశ్వజగత్తును ఉంచుకొని…. ధ్యాన  సమాధిలోనికి వెళ్ళసాగింది. మొదట స్తంభేశ్వర స్థితి ఆపై స్థానేశ్వర స్థితి ఆపై నిశ్చల స్థితి పొందుతూ ఉండగా…. నా చూపుడువేలు మీద ఉన్న నా విశ్వ జగత్తు కాస్త విశ్వ శూన్యంలో శూన్యం అవ్వడంతో…. తర్జని ముద్ర కాస్త…. రెండు చేతులతో ముష్టి ముద్రలతో పద్మాసనంలో…. మోకాళ్ళ మీద పెడుతూ… ధ్యాన సమాధిలో పూర్ణ నిశ్చల స్థితికి నా కీర్తి శరీరం చేరుకుంటూ ఉండగా…. దీని వీపు భాగంలో ఉన్న మత్స్య మణి అదే మృత్యు మణి బంగారపు వర్ణ కాంతిపుంజముతో…. దీని ఉబెత్తు భాగము నుండి బయటకు రావటం… ఈ కాంతి తేజస్సు కాస్త తీవ్ర ధ్యాన నిష్ఠలో… ధ్యాన సమాధిలో ఉన్న నా కీర్తి శరీరం యొక్క బ్రహ్మరంధ్రం తాకటంతో…. క్షణకాలంలో యోగాగ్ని మొదలై…. నా శరీరం దహనం చేస్తూ ఉండగా…. బంగారపు వర్ణ కాంతితో మొదట దహనం అవుతూ ఉండగా…. దాని లోపల ఆ కపాలం ఉన్న అస్తిపంజరం దర్శనం అవ్వడంతో….. బంగారపు కాంతి వర్ణము కాస్త తెల్లని కాంతి వర్ణముగా  మారడంతో ….ఈ కాంతి వేడిమి ధాటికి….ఈ అస్తిపంజరం కాస్త మూల ఏక కపాలం దహనం అవుతూ ఉండగా…. నా ఈ భౌతిక శరీరానికి ధ్యానభంగం అయింది. విచారణ చేసుకుంటే …., ఈ అస్తిపంజరం యొక్క మూల ఏక కపాలం మోక్ష దృశ్యం మనం చూడలేం అని అర్థమైంది. చూస్తే మనం మోక్షమరణం పొందినట్లు కాదు కదా!  చూడకపోయినా పొందలేదని కాదు.  ఎందుకంటే మనం మరణించే స్థితి తెలుసుకోగలం కానీ మనం మరణించిన విషయం తెలుసుకోలేము.  తెలుసుకుంటే అది మరణం కాదు కదా!  తిరిగి జీవమే పొందినట్లు అవుతుంది కదా!  ఇక్కడ మనకి ధ్యాన అనుభవం… అలాగే అనుభూతి ఉండదు. ఉంటే అది మోక్షం కాదు.  పునః జన్మ అవుతుంది. అంటే ఆఖరి అంతిమ 12వ శరీరమే కీర్తి శరీరం అవుతుంది. ఎలా అంటే రుద్రుడు ఏకాదశ రుద్రుల తర్వాత 12వ రుద్రాంశగా హనుమ అవతారం అని….చెప్పడం జరుగుతుంది కదా!  ఈయన వలన రామాయణం కాస్త కీర్తి పొందిందని లోకసత్యమే కదా!  ఎందుకంటే సుందరాకాండ చదివినంతగా ఎవరూ కూడా రామాయణం చదవరు.  అలాగే హనుమాన్ చాలీసా చేసినంతగా సుందరాకాండ లేదా రామాయణ పారాయణం చేయరు కదా!  మీరే ఆలోచించండి…. నిజమే కదా!  అంటే ఈ లెక్కన చూస్తే రుద్రుడి 12వ  రుద్రాంశ హనుమ యొక్క శరీరమే రుద్ర కీర్తి శరీరం అని అర్థమవుతుంది కదా! ఈయన లేకపోతే రామాయణం లేదు కదా!  రామాయణ కీర్తికి మూలకారకుడు హనుమయే కదా!  నిజమే కదా!  ఈయన కాస్త సజీవమూర్తిగా చిరంజీవి తత్వంతో రాబోయే కాలంలో కాబోయే భవిష్యత్తు బ్రహ్మగా మారతాడని …..ఇప్పటికి ఈయన కాస్త రామేశ్వర క్షేత్ర పరిధిలో ఉన్న గంధమాదన పర్వతం మీద రామనామ ధ్యాన తపస్సులో ఉంటారని…. ఎవరైనా పిలిస్తే పలుకుతాడని…. పురాణ ఇతిహాస ఉవాచ  చెప్తుంది కదా! ఇక ఇంతటితో మోక్షం పొందేమో లేదో  తెలియని విచిత్ర అవస్థ అయితే మోక్ష భావం లేని భావతీత స్థితితో నా పూర్ణ సాధన పరిసమాప్తి అయింది.  ఇన్నాళ్లుగా…. ఎన్నాళ్లుగా…. ఎప్పుడో ఆదిలో నా అంతిమ కీర్తి శరీరం కాస్త…. పూర్ణ మోక్షం పొందినప్పటికీ…మోక్షం పొందానో లేదో అనుమాన భయంతో… ఈ దేహం కాస్త ఆది సత్య యుగంలో… విలోహిత రుద్రాంశ దైవ జన్మగాను… త్రేతాయుగంలో వాల్మీకి అంశగా మహర్షి జన్మ గాను…. ద్వాపరయుగంలో వేద వ్యాసుడి జ్ఞాని జన్మగాను….. కలియుగంలో వాత్సాయనుడి అంశ జన్మగాను…. ఆపై యుగాలలో రామచిలుక, పావురం, రాజహంసగా.., నెమలిగా, జంతువుల అంశ జన్మలుగాను….. ఆపై యుగాలలో సింహం గాను, కోతి గాను, కుక్కగాను ,దున్నపోతు జన్మలుగా….  ఆపై యుగాలలో భోగ మానవ జన్మలుగా …యోగ సాధన జన్మలుగా… యోగ భోగ మిళిత జన్మలుగా…. సన్యాసి జన్మలుగా ఇలా కోటానుకోట్ల కీర్తి శరీరం యొక్క కీర్తిమాయలో పడుతూ…. ఈ జన్మలో వీటీ మాయను దాటి ఆదియుగం ఆదిజన్మ యొక్క కీర్తి శరీర మోక్షం అనుభవ అనుభూతి పొంది…. మనసా వాచా సర్వస్య శరణాగతితో… అంచంచల భక్తి విశ్వాసంతో….. అంతిమ కీర్తి శరీర మోక్షానుభవం సత్యమని నమ్మడంతో…. ప్రస్తుత జన్మ స్థూల శరీరం కాస్త విశ్వ పూర్ణ శూన్యంలో శూన్యం అయ్యే అర్హత, యోగ్యత ,యోగం పొందింది. ఇది మోక్షం పొందుతుందని తెలుస్తుంది. కానీ మోక్షం పొందిన విషయము ఈ దేహ జన్మకి మోక్షజ్ఞానం అందదు కదా! అందితే మోక్షమరణం కాదు కదా! ఏమంటారు నిజమే కదా! నిజానికి అందరూ కూడా ఎప్పుడో …ఏనాడో పూర్ణ మోక్షం పొందాము.  కానీ ఆఖరిగా వచ్చే కీర్తి శరీర, కీర్తి మాయ దాటలేక 98% నాకు లాగా మోక్ష అనుమాన భయంతో కదలని స్థితి నుండి కదిలే స్థితికి రావడం జరిగింది. ఎప్పుడైతే నేను కాస్త కీర్తిమాయను దాటాను అని అనుభవ అనుభూతి పొందానో …అప్పుడు కాస్త రెండు శాతం మందిలో నేను కూడా చేరడంతో…. కీర్తి శరీర మోక్ష అనుభవం పొందడం జరిగితే…. దానిని ఈ దేహ జన్మ ఎలాంటి అనుమాన భయం పెట్టుకోకుండా నమ్మటం వలన,  ఈ దేహ జన్మకి పూర్ణ మోక్షం పొందుతుంది అని జ్ఞాన స్ఫురణ అందింది.  మోక్ష అనుభూతి అందలేదు.  అందదు కదా!  కాబట్టి మీరు పొందిన ఈ విచిత్ర అవస్థ అనగా…. మోక్షం పొందామో లేదో స్థితి మోక్ష అనుభవమును సత్యమని… మనస్ఫూర్తిగా నమ్మండి.  ఎలాంటి అనుమాన భయాలు పెట్టుకోకండి . పెట్టుకుంటే మోక్ష కోరికతో మోక్షజన్మ ఎత్తే పునః సృష్టి ధ్యాన అనుభవాలు చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ స్థితికి వచ్చేసరికి అనగా మీ అంతిమ ధ్యాన అనుభవ ధ్యాన దృశ్యం పసుపు వర్ణంతో ధ్యాన సమాధిలో ఉన్న మీ కీర్తి శరీరం కాస్త నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా కనపడుతుంది.  ఇది ఇలా  కనపడితే మీ శరీర సాధన పరిసమాప్తి అయినట్లే. ఈ భౌతిక శరీర భౌతిక మరణమే మోక్షమరణం అవుతుంది. దానికి నిదర్శనముగా మీ దగ్గరికి పసుపు వర్ణ చేప మణి వస్తుంది.  ఇది రాకపోయినా మీరు పొందిన అంతిమ కీర్తి శరీరం మోక్ష అనుభవం సత్యమని నమ్మి…. స్థిర మనసుతో ,నిశ్చయముగా ఉంటే చాలు.  మీ మరణమే మోక్షమరణం అవ్వక తప్పదు. అదే ఈ శరీర మోక్ష అనుభవం పొందినప్పటికీ ….మీలో ఇసుమంత అనుమాన భయం ఉంటే…దీనికి నిదర్శనంగా మీ అనుభవం సత్య నిరూపణ కోసం పసుపు వర్ణ చేప మణి వస్తుంది. ఇది వచ్చినప్పటికీ మీరు నమ్మకపోతే ,మీరు ఖచ్చితంగా మోక్ష కోరిక కోసం… మోక్షజన్మ ఎత్తడానికి పునః సృష్టిలో పడే ధ్యాన అనుభవాలు చూడక తప్పదు. అమోక్షం పొందక తప్పదు. అదే అంతిమ కీర్తి శరీరం మోక్ష అనుభవం….  అలాగే చేప మణి వస్తే,  దీనిని సత్యం అని విశ్వసిస్తారో అప్పుడు మీ భౌతిక శరీరం మరణమే, మోక్షమరణం అవ్వక తప్పదు. మోక్షం పొందక తప్పదు. ఎందుకంటే మోక్షం అనేది ఒక భావము.  ఇది మన విశ్వాసం మీద ఆధారపడుతుంది . ఈ విశ్వం అనేది విశ్వాసముతో నడుస్తుంది కదా!  


యద్భావం తద్భవతి 


మోక్షానుభవం చూపించే పంచ పాండవుల తీర్థం :





కాశీ క్షేత్రంలో ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారి గుడికి దగ్గరలో…. విశాలాక్షి బావి ఒకటి ఉంటుంది. ఇందులో చూస్తే ఎవరికీ తన నీడ కనపడదో….వారికి ఆరు నెలల్లో మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ స్థానిక యోగుల స్వానుభవాలు…. అలాగే స్థల పురాణం చెప్పడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రంలో శిఖరేశ్వర స్వామి నుండి శ్రీశైలం మల్లన్న స్వామి యొక్క ముఖ మండపం మీద ఉండే త్రిశూల శిఖర దర్శనం అయితే…..ఆరు నెలల్లో ముక్తి కలుగుతోందని….ఇక్కడి స్థల పురాణం చెప్పడం జరిగింది. అలాగే మన అరుణాచల క్షేత్రంలో కూడా మనకి మోక్షజన్మ గురించి చెప్పే తీర్థం ఒకటి ఉన్నదని చాలామందికి తెలియదు. అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదే పంచ పాండవుల తీర్థం అన్నమాట! ఇది మనకి అగ్నిలింగం ఉన్న దారిలో చివరిదాకా వెళితే పంచ పాండవులచే నిర్మించబడిన ఒక శివాలయం దర్శనమిస్తుంది. ఇందులో గుడి బయట ఒక తీర్థము…. అలాగే గుడి లోపల మరొక తీర్ధము కనపడతాయి. ఈ రెండు తీర్ధాలు కూడా పాండవ తీర్థములే అవుతాయి. గుడి లోపల ఉన్న తీర్థములోని నీరు గుడి బయటకు వచ్చి తీర్థములో కలుస్తాయి అన్నమాట! వర్షాకాలంలో గిరి మీద నుండి నీళ్ళ ప్రవాహం కాస్త ధారాపాతంగా ఈ రెండు తీర్థాలలో చేరి నిండి ఉంటాయి. 


ఇకపోతే మన ప్రస్తుత జన్మ మోక్షజన్మ అవునా? కాదా? అనేది ఈ తీర్థ రాజం ఎలా చెబుతుందో నా స్వానుభవంతోనే కాదు…. మా యోగ మిత్రుడి స్వానుభవం అలాగే ఇక్కడ స్థానిక శివయోగుల స్వానుభవాలు బట్టి… మోక్ష అనుభవం పొందడం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది వినడానికి ఒక సినిమా కథలాగా అనిపించవచ్చును… కానీ, ఇదే సత్యమని నా స్వానుభవం అయ్యేదాకా నేను నమ్మలేదు. నాకు స్వానుభవం అయిన తరువాత నమ్మక తప్పలేదు. ఖచ్చితంగా ఈ తీర్థం మన ప్రస్తుత జన్మ అనేది మోక్షజన్మ అవునో…కాదో… ఎలా చెబుతుందో నా స్వానుభవంలో జరిగిన విషయం యధాతధంగా మీకు చెబుతాను. వింటే బాగుపడతారు. లేదంటే బాధపడతారు. ఈ గుడిలో ప్రవేశానికి అలాగే మన మోక్ష జన్మకి అర్హత,యోగ్యత, యోగం పొందటానికి ఈ క్షేత్రంలో ఉండే పంచమాయలు దాటాలి. అవియే అహంకారం, మోహం, కామం, అపస్మారకం, కీర్తి ప్రతిష్టలు అనే పంచమాయలు దాటుకోవాలి.  

అహంకారమాయ:

ఈ అరుణాచల క్షేత్రంలో తప్పనిసరిగా మాయా ప్రభావమును పొందడం జరుగుతుంది. అది కాస్త అహంకారమాయ, మోహిని మాయ, యక్షమాయ, అపస్మారక మాయ, జ్ఞానమాయ, కీర్తి మాయ ఇలా పలు మాయలు ప్రతి జీవుడిని అలాగే సాధకుడిని ఈ క్షేత్రంలో పట్టుకొని పీడిస్తాయి.  ఎవరైతే ఈ మాయలు దాటగలుగుతారో…..వారికే అరుణాచల శివ అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఈ అనుగ్రహం పొందుటకు మనకి అర్హత,యోగ్యత, యోగం ఉన్నదో లేదో…. ఈ మాయలు నిత్యం పరీక్షలు పెడుతూనే ఉంటాయి. వీటిలో జయం పొందిన వాడికి ఇదే వాడి ఆఖరిజన్మ అవుతుంది. మోక్షజన్మ అయ్యి ఏ శూన్యం నుంచి వచ్చాడో ఆ శూన్యమునకు చేరి శూన్యమైపోతాడు. కర్మ జన్మా రాహిత్య స్థితి….. అన్నింటికి అతీతమైన స్థితి పొందడం జరుగుతుంది. బ్రతికి ఉండగానే జీవన్ముక్తుడు అవుతాడు. జీవుడు లేడని,శివుడే ఉన్నాడని…. శివోహం స్థితి పొందుతాడు.  మనసు పని చేయని స్థితికి…. మాటకి అందని మౌనస్థితికి…… అన్నింటి యందు సాక్షిభూత స్థితికి…… అన్నింటి యందు స్థితప్రజ్ఞత స్థితికి…. చివరికి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ మున్నగు వాటికి అతీత స్థితి పొంది…… నిశ్చల స్థితిలో నిర్జీవ మూర్తిగా మారతాడు. ఇక ఈ మాయలలో ప్రధానమైనది అహంకారమాయ.  ఇది అన్నీ మాయలకి మూలం అన్నమాట!  ఇది కామం వలన, ధనము వలన, కీర్తి ప్రతిష్టల వలన, జ్ఞానము వలన, అందము వలన, చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా మున్నగు 18 స్థితుల వలన 18  ఈ అహంకారమాయలు వస్తాయి.  అదే ఈ క్షేత్రంలో ఈ అహంకార మాయ అనేది….నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలను, నేనే జ్ఞానిని, నేనే దేవుడిని, నేనే గురువుని, నేనే ఇది, నేనే అది, అంటూ మొదలవుతుంది. 


ఒకసారి సప్త ఋషులు యాగము చేస్తున్నారు …..పరమేశ్వరుడు కాస్త వీరి భార్యల యందు నగ్నముగా ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ మనసులు మనోవికారాలు పొందడం,  అరుంధతి గ్రహించి….. తనే మిగిలిన వాళ్ళుగా మారి ఈ పరమేశ్వరుడి చెంత ఉంది. ఇది తెలియని సప్త ఋషులు కాస్త యాగము పూర్తిచేసుకుని వచ్చేసరికి….. నగ్నముగా ఉన్న పరమేశ్వరుడి దగ్గర తమ భార్యలే ఉన్నారని అనుకొని….ఈయనని చూస్తూ…. ఏ మర్మాంగ బలం ఉన్నదని అహంకరించి మా భార్యల ముందు నిలబడ్డావో ఆ అంగము తెగి భూమి మీద పడుగాక అని అహంకారముతో శాపము ఇచ్చారు.  తక్షణమే పరమేశ్వరుడి రూపంలో ఉన్న మాయా వేషధారి మర్మాంగం కాస్త భూమి మీద పడిపోతుంటే….. ఈ శక్తిని విశ్వ జగత్తు తట్టుకోలేదని….. విశ్వ లోకాలు అల్లాడిపోతాయని గ్రహించిన ఆదిపరాశక్తి కాస్త…. ఈ మర్మాంగమును తన యోని భాగములో నిక్షిప్తం చేసుకుంది.  ఆనాటి నుండి మానవ పూజిత శివలింగం అయింది. దీనికి  నిదర్శనమే తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం దేవాలయంలో పురుషాంగమును పోలిన లింగోద్భవ శివలింగం ఉంటుంది.  ఈ లింగము మధ్యలో అపస్మారక రాక్షసుడు మీద నిలుచున్న పరమేశ్వరుడు ఉంటే…. ఈ లింగము అగ్రభాగంలో హంస రూప బ్రహ్మ అలాగే…..ఈ లింగము క్రింద భాగములో వరాహరూప విష్ణుమూర్తి ఉండడం గమనించవచ్చును.  ఇలా ఈ విశ్వసృష్టిలో ఆది జీవ లింగము ఉద్భవించింది. ఇలా ఏర్పడిన శివలింగమూర్తిని చూసిన సప్త ఋషులు విషయం తెలిసి…. తప్పును క్షమించమని కోరగా…. అందుకు మాయా వేషధారి రూపము నుండి పరమేశ్వరుడు కాస్త ప్రత్యక్షమై అహంకారములు వీడండి…… మీకున్న జ్ఞాన అహంకార మాయను దాటండి… మీరు పూర్ణజ్ఞానులే కావచ్చును…. మీకున్న ఈ జ్ఞానమును ఇచ్చిన నన్ను మర్చిపోతే ఎలా? మీకు ఈ జ్ఞాన ప్రదాత నేనే కదా! నేను కానీ ఈ జ్ఞానమును మీకు ఇవ్వకపోతే…..మీరు ఎలా పూర్త జ్ఞానులు అవుతారో ఆలోచించండి…. జ్ఞాన అహంకార మాయ వలన నాకే శాపం ఇచ్చారు.  ఇది కూడా విశ్వలోక కళ్యాణార్థ కార్యముగా జరిగింది… దీనికి నేను చింతించడం లేదు.  కాకపోతే మీ అందరూ కూడా ఈ క్షణం నుండి మీ అహంకారమునకు నాకు దానంగా ఇవ్వండి.  నేను  పుచ్చుకుంటాను అని వీరి దగ్గర అహంకార దానమును తీసుకొని పరమేశ్వరుడు కాస్త అదృశ్యం అయ్యాడు.  ఆనాటి నుండి అరుణాచల శివ కాస్త తన భక్తుల అహంకారమును దానము తీసుకోవడం ప్రారంభమైంది. 

అంతెందుకు….. జ్ఞాన సంబంధర్ అనే భక్తుడు కాస్త మొట్టమొదటిసారిగా అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు…. నన్ను మించిన జ్ఞాని లేడని…. అలాగే నన్ను మించిన ఐశ్వర్యవంతుడు లేడని తన రచన కావ్యాలతో…. బంగారు ఆభరణాలతో…. మంది మార్బలంతో బయలుదేరాడు.  శిష్యులు కాస్త ఈయన ఎక్కిన పల్లకి మోస్తూ ఉండగా…. మరికొంతమంది ఈయన ఛత్రం పట్టుకొని….. మరికొంతమంది ఈయనకి కావలసిన భోజన సౌకర్యాలు చూసుకుంటూ ఉండగా….. ఇలా సుమారుగా 80 మంది శిష్యులతో ఈ యాత్రకి బయలుదేరాడు.  ఈ క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా…. కొంతమంది బందిపోట్లు వచ్చి ఈయన పల్లకిని ఛత్రము, బంగారపు ఆభరణాలు, కావ్యాలు ,భోజన పదార్థాలు వంట పాత్రలు, గుర్రాలు ఇలా అన్నీ కూడా ఎత్తుకొని పోయారు. దానితో శిష్యులకి విపరీతమైన ఆకలి దప్పికలు వేయడంతో… తమకి భోజనాలు పెట్టమని ఇతనిని ఒత్తిడి చేస్తూ ఉండేసరికి…. అప్పుడు కానీ ఇతనికి తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు.  ఈ క్షేత్రంలోకి వచ్చేటప్పుడు ఏమీ తెలియదని, ఏమీ చేయలేనని, సర్వస్య శరణాగతి భావంతో ప్రవేశించాలే కానీ….. నాకు అన్నీ ఉన్నాయి…. లేదా నాకు అన్నీ తెలుసు…. లేదా నేను అన్నీ చేయగలను…. అనే గర్వ అహంకారాలతో ఈ క్షేత్రంలోకి ప్రవేశిస్తే,  ప్రవేశం దొరకకపోగా…. అవమానాలు, అవస్థలు పడవలసి వస్తుందని గ్రహించి…. అప్పుడు శరణాగతితో అరుణాచలేశ్వరుడి మీద స్తోత్రాలు చేయడం ప్రారంభించాడు.  కొన్ని క్షణాల తర్వాత ఒక నలుగురు వ్యక్తులు వీళ్ల దగ్గరికి వచ్చి….. ఇతనితో స్వామి! మీరంతా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడికి దగ్గరలో మా బంధువుల వివాహ కార్యక్రమం జరుగుతుంది. అందరూ అక్కడికి వెళ్లి భోజనాలు చేద్దాం అని వీరందరినీ పెళ్లికి తీసుకొని వెళ్లి భోజనాలు పెట్టించారు.  ఈ భోజన కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో వీరందరికీ విపరీతమైన నిద్ర ఆవరించడంతో నిద్రపోయారు.  లేచి చూసేసరికి తమకి భోజనాలు పెట్టిన పెళ్లి గుంపు కనిపించలేదు.  అలాగే నలుగురు వ్యక్తులు అగుపించలేదు.  దానితో వీరికి ఏం జరిగిందో అర్థం అవ్వక…. కాలినడకతో అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు.  అక్కడి ప్రజలకి ఈయన గురించి ముందుగానే తెలియడంతో….. ఈయనకి స్వాగత సత్కారాలు చేస్తూ స్వామి! నిన్న రాత్రి దొంగలు పడి మీ వస్తువుల దోచుకుని వెళ్తూ మా కంటపడ్డారు.  మేము వారిని అటకాయించి ఈ వస్తువులు వారి దగ్గర నుండి లాక్కొని వారికి దేహశుద్ధి చేసి పంపించాము. వాళ్ల ద్వారా మీరంతా వస్తున్నారని తెలుసుకొని….. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఈ ఏర్పాటు చేయడం జరిగింది అనగానే…. ఈయన కాస్త వాళ్ళతో ఇది అంతా అరుణాచల శివలీలా మాయ.  నాలో ఉన్న జ్ఞాన, ధన అహంకార మాయల వలన ఈ మాయలను ఈ లీలతో మాయం చేశాడు. అన్నీ ఉన్నాయి అనే స్థితి నుండి ఏమీ లేని స్థితికి తీసుకొని వచ్చారు.  నేను ఉన్నాను స్థితి నుండి నేను లేను….. ఉన్నది ఆయనే అనే మనోస్థితికి చేర్చాడు….. అంటూ అప్పటికప్పుడు అరుణాచలేశ్వరుడు మీద అశువుగా పద్యాలు చెప్పడం ఆరంభించాడు.  ఇలా ఈ భక్తుడి ద్వారా లోకానికి….. ఈ క్షేత్రానికి వచ్చేటప్పుడు ఎలాంటి గర్వము, మదము, అహంకారము లేకుండా ప్రదర్శించకుండా వినయంతో అనుకువతో సర్వస్య శరణాగతి భావముతో….. మెలుగుతూ రావలసి ఉంటుందని చెప్పడం జరిగింది అన్నమాట!  ఇలా అహంకారమాయను మనము దాటవలసి ఉంటుంది. మనలో మనకి తెలియకుండా 18 రకాల అహంకారమాయలు ఈ క్షేత్ర ప్రవేశ సమయంలో బయటపడతాయని…..నా స్వానుభవంలో చాలా సార్లు తెలుసుకున్నాను.  వాటిని అహంకారానికి విరుగుడు ఓంకారమని గ్రహించండి….అరుణాచల శివనామస్మరణయే…. సర్వస్య శరణాగతి భావము మనకి కలిగిస్తుందని తెలుసుకోండి. 

మోహిని మాయ:

ఇకపోతే రెండవ మహామాయ అయిన మోహిని మాయ ఎలా వస్తుందో తెలుసుకోండి. ప్రధాన ఆలయమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కిలిగోపురం క్రింద నాట్యకత్తె రూపంలో ఉన్న మోహిని విగ్రహ మూర్తి ద్వారా మనకు వస్తుంది. అరుణగిరి నాధర్ అనే యోగికి ఈ మోహిని పిశాచం పట్టడంతో…. వయస్సులో ఉన్నప్పుడు వేశ్య దాసుడు అయ్యాడని… ఈయన గ్రహించి ఈమెను ఈ గోపురం కింద తన మంత్ర బలముతో బంధించడం జరిగింది.  అలాగే దీనికి ఒక నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళుతూ ఈ మోహిని విగ్రహ మూర్తిని దర్శించుకుంటే……ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కలిగించదు. అలాకాకుండా స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఈమెను దర్శించుకుంటే మాత్రం….. ఈమె మీ వెంట ఖచ్చితంగా పడుతుందని…. కాబట్టి వెళ్లేటప్పుడు చూసినా పర్వాలేదు కానీ, తిరిగి వచ్చేటప్పుడు దీనిని చూడరాదని ఖచ్చితమైన నియమముగా పెట్టడం జరిగింది. ఈ నియమం తప్పిన వారికి ఈ మోహిని పిశాచం వెంటపడటం నా స్వానుభవం కాదు…. ఎంతోమంది స్వానుభవాలు నేను చూడటం జరిగింది.  ఎలా అంటే ఈ నియమం తప్పి రెండవసారి ఈమెను దర్శనం చేసుకున్న వారికి ఇది పిశాచముగా మారి పక్కనే నీడగా వెంటాడుతుంది.  పట్టుకొని ఉంటుంది.  ఇది ఇలా ఉన్నదని మనోనేత్రం ద్వారా చూస్తే మాత్రమే కనపడుతుంది. అంతేకానీ భౌతిక నేత్రాలకి అది అగుపించదు. ఇది ఇలా మనల్ని పట్టుకుంటే….అప్పటిదాకా పాతివ్రత్య ధర్మంతో అనగా తన భార్య లేదా తన భర్త తనకి సర్వస్య సర్వస్వమని భావంతో ఉండే భార్యాభర్తకి ఈమె మోహిని మాయ ప్రభావం వలన అక్రమ సంబంధాలకి దారితీస్తుంది.  పర స్త్రీ లేదా పర పురుష  వైపు సంసారులు బ్రహ్మచార్యులు ,యోగులు, సాధకులు, గురువులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలా ఎందరో కూడా ఈ మోహిని బారిన పడి… కాంతా దాసులైన  వారిని నేను ఎందరినో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అందెందుకు నా జీవిత స్వానుభవముగా కూడా ఈ నియమము కావాలని అన్నీ తెలిసినా కూడా రెండవసారి అనగా స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు కావాలని ఈమెను చూడటం జరిగింది.  స్వప్నంలో అలాగే ధ్యానంలో ఈమె సజీవమూర్తిగా నాట్య కత్తె గా కనపడటం ఆరంభించింది . కొన్ని రోజుల తర్వాత నా జన్మాంతర భార్య అంటూ….ఒక స్త్రీ మూర్తి నా వెంటపడింది.  ఆమెను వదిలించుకోవడానికి నాకు 8 నెలలు పట్టింది.  ఆ తర్వాత నాకు స్వప్నంలో ఈ మోహిని నాట్య  కత్తె కాస్త నన్ను విడిచి పెడుతూ…. నా ఇంటి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యం కనిపించింది . ఆనాటి నుండి మళ్లీ నేను కాస్త ఈ మోహిని నాట్య కత్తె విగ్రహ మూర్తిని ఒకసారి చూసే ప్రయత్న సాహసము చేయలేదు.  చేస్తే ఖచ్చితంగా మోహిని పిశాచంగా వెంటపడుతుందని తెలిసి…. తర్వాత స్వానుభవం అయిన తరువాత…. ఇంక సాహసం చేసే స్థితికి ఎవరికి ఉంటుంది….ఉండదు కదా!  కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ఖచ్చితముగా ఈ నియమమును పాటించండి.  స్వానుభవం కావాలంటే ఈ నియమం తప్పి రెండవసారి దర్శించుకుని నానా అవస్థలు, అవమానాలు ,మానసిక ప్రశాంత స్థితి, శారీరక, అనారోగ్య సమస్యలు పొందండి…. ఇక మీ ఇష్టం… వింటే బాగుపడతారు,  లేదంటే బాధపడతారు. 

అసలు ఈ మోహిని మాయ ఈ క్షేత్రానికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని శాస్త్ర గ్రంధాలు చదవడం ఆరంభించాను.  అందులో ఒకచోట బ్రహ్మ దగ్గరికి ఒకసారి ఇంద్రుడు వచ్చి తపోధ్యానము చేసే వారికి తపస్సు భంగము అయ్యే విధంగా తన అంద చందాలతో ముగ్ధులను చేసే ఒక దివ్యశ్రీ మూర్తిని సృష్టించమని అడిగితే….. ఈయన కాస్త దివ్య మోహిని స్త్రీ మూర్తిని సృష్టించి…. ఈమె  మోహ మాయాలో ఏకముగా బ్రహ్మ పడిపోయి… తన కామకోరిక తీర్చమని ఈమె వెంట పడడం జరిగింది.  ఈమె  కాస్త ఒక రామచిలుక రూపముగా మారి అరుణాచల క్షేత్రానికి చేరుకొని….అరుణాచలేశ్వరుని వేడుకోవడం జరిగితే… ఈయన కాస్త తన వెంట పడుతూ ఈ క్షేత్రానికి వచ్చిన  బ్రహ్మతో “ఏమిరా !నువ్వు చేసిన స్త్రీ మూర్తితో ఎలా సంభోగించాలని అనుకుంటున్నావు ? ఈమెకి నీవు తండ్రివి అవుతావు కదా? ఈమె నీ కూతురు అవుతుంది కదా?  మోహ.మాయ మత్తులో పడి వావివరసలు మర్చిపోయావా? ” అని ఒక బోయవాడిగా వచ్చిన పరమేశ్వరుడు కాస్త ఈయన మీద బాణం ఎక్కు పెట్టి అనేసరికి….. ఈయన రూపం చూసిన బ్రహ్మకి మోహము నశించి స్వామి ! నన్ను క్షమించండి, నేను సృష్టించిన మోహిని మాయకి నేనే పడిపోయాను.  నన్ను క్షమించు… పాపకర్మలు చేసే మాలాంటి వారిని నీవు తప్ప ఇంక ఎవరు రక్షించగలరు… పాపపూరితమైన ఈ దేహమును సంహరించి మరొక కొత్త సృష్టికర్తను సృష్టించు అని వేడుకునే సరికి…. బోయవాడు కాస్త పరమేశ్వరుడిగా మారి “ఓ చతుర్ముఖ బ్రహ్మ!  నీ సృష్టి మాయలో నీవే పడి ఈ తప్పిదం చేశావు ….కానీ కావాలని చేయలేదుగా! పదవిలో ఉన్నవారికి రాగద్వేషాలు వదలవు కదా! కావాలని చేసినా లేదా తెలియక చేసిన తప్పు తప్పే కదా! కాబట్టి నువ్వు చేసిన ఈ తప్పిదానికి శిక్షగా నీవు నా నుండి దూరమై…. ఈ క్షేత్ర వాసిగా కొన్నాళ్ళు ఉండి నా తేజోలింగం అర్చించుకో!  స్మరించుకో!  నువ్వు చేసిన పాపము నశించును..  అంటే ఈ క్షేత్రములో ప్రదక్షిణ, నమస్కారం, నామస్మరణ స్తోత్రాలు దీపారాధన ,అరుణ జ్యోతి దర్శనం, పూజలచే నన్ను ఆరాధిస్తే వారికి శరీరముతో, మనస్సుతో మాటలతో ,బుద్ధితో, అహంకారంతో తెలిసో లేదో తెలియక చేసిన సర్వపాపాలు అన్నీ కూడా నశించును అని చెప్పి…. అంతర్దానం అయినారు.  అప్పుడు బ్రహ్మ కాస్త తనకి మోహమాయా బంధ విముక్తి కలిగించినందుకు గుర్తుగా బ్రహ్మాలింగముగా ప్రతిష్టించడం జరిగింది. ఇదే ఈ క్షేత్రంలో ఆది అన్నామలై గుడి అయింది.  అప్పుడు ఈ మోహిని కాస్త చిలుక రూపంలో తిరుగుతూ…. తీవ్ర ధ్యాననిష్టలో ఉండే వారి మీద ఇంద్రుడి ఆజ్ఞ మేర వారి తపో నిష్ఠను భంగం చేయడానికి మోహిని యక్షిణిగా….. మోహిని పిశాచముగా…. మారి ఈ క్షేత్ర తపో నిష్ఠలకి, ధ్యాన నిష్ఠలకి, ఆత్మ నిష్ఠలకి ,ధర్మ నిష్ఠలకి నిత్య మోహిని మాయ పరీక్షలు పెడుతూనే ఉంది.  నూటికి 99 శాతం మంది ఈమె మోహ మాయలో పడి…. మోక్షము పొందవలసిన వారంతా కూడా పునః సృష్టికి వెళ్లడం గమనించిన ఈ ఆధునిక కాల అరుణగిరి నాధర్ యోగి తన మంత్ర బలముతో ఈమెను కిలి గోపురం కింద మోహిని యక్ష బంధనముతో ఈమెని నాట్య కత్తె విగ్రహ మూర్తిలో….. అదికూడా ఒక నియమముతో బంధించడం జరిగింది.  ఈ నియమం కావాలని తప్పిన వారికి ,కావాలని కష్టాలు కానీ తెచ్చుకోవడం అవుతుందని గ్రహించి …..జాగ్రత్తగా మెలగండి .ఒకవేళ ఈమె మోహిని మాయలో పడితే…. ఆ అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఇంక ఎవరూ కూడా ఈ మాయాబంధనం నుంచి విముక్తులు చేయలేరని గ్రహించండి.  ఎలా అంటే ఈ మోహిని మాయ విముక్తి కావటం……ఈ మోహిని మాయ అనగా పెళ్లి అయిన మీరు కాస్త …..పరస్త్రీ లేదా పర పురుష మోహమాయలో పడుతున్నారని అనిపించినా….. లేదా బ్రహ్మచారులు కాస్త   సంసారులు  అవ్వాలని తపన తపన, తాపత్రయాలు కలుగుతున్నా కూడా….. వెంటనే ఈ మాయ నివారణ కోసం ఈ ఆది అన్నామలై గుడికి వెళ్లి అక్కడ మూడు లేదా ఐదు లేదా 8 లేదా 11సార్లు గుడి ప్రదక్షిణాలు చేసి గుడి లోపల ఉన్న బ్రహ్మ ప్రతిష్ట శివలింగం దర్శనం చేసుకుని 1008 సార్లు ఈ గుడి ఆవరణలో కూర్చుని….. అరుణాచల శివ నామస్మరణ చేస్తే ఈ మోహిని మాయ పోతుంది. నేను ఇలాగే చేసుకొని ఈ మోహమాయ నుండి విముక్తి పొందడం జరిగింది. 

యక్షులు యక్షిణి మహమాయ 

ఇక ఈ క్షేత్ర మూడవ మహామాయగా యక్షులు యక్షిణి మహమాయ వస్తుంది. ఇది ఆది అన్నామలై గుడి గాలిగోపురం మోస్తూ…. లోపలి వైపు వీరిద్దరూ యక్ష యక్షిణి విగ్రహమూర్తులు ఇప్పటికీ మనకి కనపడతారు.  ఈ ఆలయ స్థల పురాణము చూస్తే…. ఈ దేవాలయమునకి ఎన్ని సార్లు గాలిగోపురం కట్టినప్పటికీ….. ఏదో ఒక కారణంతో లేదా అకారణముగా కట్టిన గాలి గోపురం మాత్రం పడిపోయేది. గాలిగోపురం లేని దేవాలయం అనేది దర్శనానికి పనికిరాదని….. ఆగమ శాస్త్ర వచనం కాబట్టి, ఈ క్షేత్ర ప్రజలకి దీనికి పరిష్కార మార్గం గురించి మదన పడుతూ ఉంటే….. ఈ క్షేత్ర పరమేశ్వరుడు కాస్త ఒక వయోవృద్ధ సిద్ధ పురుషుడిగా వచ్చి….. ఈ గాలిగోపురం పడిపోకుండా ఉండేందుకు….. తన సిద్ధ బలముతో యక్షుడిని అలాగే యక్షిణినీ బంధనం చేసి…. ఈ గాలిగోపురం పడిపోకుండా మోసే బాధ్యతను అప్పగించి అదృశ్యం అవటం జరిగింది. ఆనాటి నుండి వీరిద్దరూ కూడా ఇప్పటికీ ఈ గుడి గాలిగోపురమున మోస్తూ విగ్రహమూర్తులు కాస్త సజీవ మూర్తులుగా ధ్యాన నిష్టలో ఉండే వారి మనో నేత్రమునందు అగుపించే ధ్యాన దృశ్యం నేను కాదు….. ఇలా ఎంతోమంది స్వానుభవాలు పొందడం జరిగింది. ఇలా వీరిద్దరూ కూడా ఎవరైతే ధ్యాన నిష్ట లేదా జప నిష్ట లేదా జ్ఞానం నిష్ఠ లేదా ధర్మ నిష్ఠ లేదా ఆత్మ నిష్ట యందు స్థిరమవ్వటానికి సిద్ధపడుతూ ఉంటారో వారి స్వప్నాలయందు లేదా ధ్యానము యందు కనిపించి గుప్తనిధులు నాగబంధనిధులు, యక్షిని బంధ నిధులు, పిశాచ బంధన సిద్దులు, వారసత్వపు నిధులు, ఎక్కడ ఎలా ఏ విధంగా ఉన్నాయో చూపించి….. వాటికున్న బంధమాయలను ఎలా బంధ విముక్తి చేయాలో మనకి ఆ జ్ఞానమును ఇస్తారు.  అంతెందుకు …….కుబేరుడు కూడా ఒక యక్షుడేనని చాలామందికి తెలియదు. ఈయన తన యక్షమాయతో మనకి ధనాకర్షణ, ఐశ్వర్యమును చేస్తాడు.   ఇలా ఎప్పుడైతే  ఈ ఇద్దరి యక్షులు చూపించే ధనమాయకీ  లొంగకపోతే….. అప్పుడు మనకి రసవిద్యలసిద్ధి ఇవ్వటానికి సిద్ధపడతారు…. తద్వారా ఈ రస సిద్ది వలన ఇనుము ద్వారా, పాదరసము ద్వారా అంతెందుకు….. ఇసుక రేణువు కూడా బంగారంగా మారుతుంది అన్నమాట!  ఈ సిద్ధిమాయలతో ఈ క్షేత్రగిరి మీద ఆవాసం చేస్తున్నారు.  అలాగే అష్టసిద్ధులలో ముఖ్యంగా ఈసత్వ, వసిత్వ, ప్రాప్తి మున్నగు సిద్ధులు కూడా ఈ యక్షులు అనుగ్రహిస్తారు . అంతెందుకు కేరళలోని మంత్రవాదులైన నంబుద్రీలు ఈ యక్షిణిలను తమ మంత్రసిద్దితో వశపరచుకొని…. ఎన్నో రకాల సిద్దులు పొందడం జరుగుతుంది. వాక్సిద్ధితో మొదలై పంచభూతాలను ఆజ్ఞాపించే సిద్ధి దాకా వస్తారు.  అలాగే గుప్తనిధులు చూసే సిద్ధి నుండి బంగారం తయారు చేసుకునే రస సిద్దిదాకా వస్తారు.  భుచర సిద్ధి నుండి ఆకాశ సిద్ధి పొందే దాకా వస్తారు.  అంటే…. యోగ శక్తులు, సిద్ధ శక్తులు, మూల కారణము ఈ యక్షిణిలు అనుగ్రహం వలనే పొందడం జరుగుతుందన్నమాట! ఇలా వీళ్ళు 64 యక్షులు 64 యక్షినీలుగా ఉండి 64 సిద్దయోగ శక్తులు మనకి యక్ష సిద్ధ మాయ అనుగ్రహించడానికి ఈ క్షేత్ర వాసులుగా ఆవాసం చేస్తూ ఉంటారు.  ఇలా ఎవరైతే ఈ యక్షులు సిద్దమాయలో పడతారో….. వారి సాధన అంతటితో ఆగిపోయి… పరిసమాప్తి కాకపోగా పునః కర్మ జన్మ చక్రంలో పడిపోవడం జరుగుతుంది. మోక్షగామీ కాస్త కామిగామిగా మారడం జరుగుతుంది అన్నమాట!  కాబట్టి ప్రతి సాధకుడు కూడా ఈ యక్షులు ఇచ్చే సిద్ధయోగ శక్తుల ,సిద్దుల మాయలో పడకుండా…. నిత్యం ఏమరపాటు లేకుండా.   బహు  జాగ్రత్తగా పులి మీద స్వారీ లాగా ప్రవర్తిస్తూ…. ఈ మాయలను దాటుకోవలసి ఉంటుంది.  నా స్వానుభవంలో ఈ యక్షమాయలు కాస్త గుప్త నిధులతో మొదలై రసవిద్య జ్ఞానం అందించే ప్రయత్నం ఎన్నోసార్లు స్వప్నము నందు, ధ్యానమునందు ఇద్దరు కూడా చూపింవారు.  వాటిని నేను కాస్త సాక్షి భూతంగా చూస్తూ పట్టించుకునే వాడిని కాదు.  ఎందుకంటే బంగారం అనేది మట్టి నుండే కదా వచ్చింది.  ఈ రసవిద్య వలన మట్టి కాస్త బంగారంగా మారుతుంది. అంతే కదా!  నా దృష్టిలో మట్టి మరియు బంగారం ఒక్కటే అనే భావంతో నిత్యము ఉండేవాడిని.  తద్వారా ఈ యక్షుల సిద్దుల మాయలలో దాటుకునే స్థితికి ఈ అరుణాచలేశ్వర స్వామి నిత్య నామస్మరణ చేస్తూ దాటుకోవడం జరిగింది.  ఎవరైతే ప్రస్తుత తమ జన్మను అంతిమ మోక్షజన్మగా చేసుకోవాలని అనుకుంటారో .,..వాళ్లు తప్పనిసరిగా ఈ యక్షసిద్ధ శక్తి మాయలు తప్పనిసరిగా దాటుకునే ప్రయత్నం చేయక తప్పదు.  చేసి జయం పొందితే మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. లేదంటే ఆ యక్షమాయకు బలి అయ్యి ఈ యక్షుడికి సేవలు చేస్తూ లేదా సేవలు పొందుతూ పునః సృష్టి, జనన మరణ చక్రము నందు నిత్యం పరిభ్రమిస్తూనే ఉండాలి. మట్టి నుండి వచ్చే బంగారానికి ఆశపడితే బంగారం లాంటి మోక్ష ప్రాప్తి కాస్త మట్టిగా మారి ఆ మట్టిలో పుడుతూ, చస్తూ ఉండాల్సి వస్తుందని గ్రహించండి.  జాగ్రత్తగా మసులుకోండి…. సాధన అంటే కత్తి మీద సామూలాంటిది అని….. తేడా వస్తే కత్తి పోటుకి బలి కావలసి వస్తుందని గ్రహించండి. 

అలాగే యక్ష పిశాచ మాయలు లేదా మోహిని పిశాచ మాయల నివారణ కోసం ….పూర్వకాలంలో ఒక చిట్కా ఉపయోగించేవారు.  అది ఏమిటంటే కాళ్ళకి చిరుగంట కట్టుకునేవారు.  ఈ గంట శబ్దానికి ఇలాంటి భూత,ప్రేత, దయ్యం, పిశాచాలు మన దగ్గరికి దరి చేరవు. రాలేవు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా శబ్దనాదానికి భయపడి పారిపోతాయి.  అందుకే దక్షిణామూర్తి విగ్రహ మూర్తి కుడి కాలికి…. ఒక చిన్న చిరుగంట కట్టినట్లుగా మనకి కనపడుతుంది చూడండి…. ఈ ఘంటానాదం వలన ఈయన కాస్త  భూతాల గణాధిపతి అయ్యాడన్నమాట!  అంతెందుకు…. శివాంశ రూపులైన జంగమ దేవర చేతిలో కూడా….ఒక పెద్ద గంట మరియు శంఖము ఉంటాయి కదా!  ఈ రెండు శబ్దాలతో ఆ ఊరిలో ఆవాసం చేస్తే,  అన్ని రకాల భూత, ప్రేత ,పిశాచాలు తనతోపాటుగా తీసుకొని…. స్మశానములో వదిలి పెడతాడన్నమాట!  అందుకే దేవాలయాలలో గంట అలాగే శంఖము ఆరాధనలో పెట్టింది.  ఎందుకంటే భక్తి ఉపాసన ప్రేతాత్మలు కూడా దేవాలయ పరిసరాలలో ఆవాసం చేసే అవకాశం ఉంది.  అవి మనల్ని ఆవహించకుండా ఉండటానికి….దేవాలయ దర్శన సమయానికి గంట కొట్టి ఆలయ ప్రవేశం చేయమని మన పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మన ఇంటిలో నిత్య పూజలో కర్పూర హారతి సమయంలో చిరుగంట నాదం చేస్తే మన ఇంటిలో ప్రవేశించిన భూత, ప్రేత,పిశాచాలు ఈ నాద శబ్దానికి భయపడి పారిపోతాయని…. ఈ విధి విధానం మన పూర్వీక మహర్షులు మనకి అందించడం జరిగింది. మన భారతీయ పూజా విధివిధానం మనకి తెలియని ఎన్నో రహస్యాలతో  నిగూఢ మర్మాలతో ఉంటాయని…. ఎప్పటికైనా తెలుసుకోండి.  మనస్ఫూర్తిగా తెలిసి లేదా తెలియక చెప్పిన పూజా విధివిధానాలు తూ. చా తప్పకుండా ఆచరిస్తే మనకి కావలసిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతెందుకు …..ఆడవాళ్ళకి గజ్జల శబ్దం వచ్చే విధంగా కాళ్ల పట్టిలు పెట్టుకునే ఆచారం పెట్టడం వెనక కూడా ఇదే కారణం ఉంది.  ఎందుకంటే నెలసరి ఐదు రోజులలో పాటు శస్త్రీ మూర్తులు కాస్త మానసికంగా అలాగే శారీరకంగా బాగా అలసిపోతారు. ఇలాంటి బలహీనక్షణాల కోసమే మన చుట్టూ ఉండే గాలిలో క్షుద్ర శక్తులు ఆవరించి ఉండి…… మన ఈ దేహాలను ఆక్రమించే  విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు వీళ్ళ కాళ్ళకి ఉన్న గజ్జల పట్టీల శబ్దానికి అవి వీరి దగ్గరికి రాలేవు…. పారిపోతాయి…. ఈ విషయం ఆనాటి మన పూర్వీక మహర్షులు గ్రహించి…. ఆడవాళ్ళకి ప్రేత బాధల నుంచి విముక్తి కలిగించడానికి  ఈ గజ్జల పట్టీలు వేసుకునే ఆచారం పెట్టడం జరిగింది అన్నమాట!  మన వాళ్ళు ఏదీ కూడా… ఏ ఆచారమైనా కూడా కారణం లేకుండా పెట్టలేదు అని తెలుసుకొని ఆచరించండి.  భావితరాలకు చెప్పి వారి చేత ఈ ఆచార వ్యవహారాలు కొనసాగేటట్లుగా చేయండి. 

అపస్మారక స్థితి మాయ

ఇకపోతే నాలుగవ మహామాయ అపస్మారక రాక్షసుడు ఇచ్చే అపస్మారక స్థితి మాయ అన్నమాట! అపస్మారకము అంటే తెలుసుకున్న జ్ఞానము మర్చిపోవడం అవుతుంది.  ఈ మాయ ఒక రకంగా మతిమరుపు లేదా అల్జీమర్ వ్యాధి లాంటిది అన్నమాట!  నేనే జ్ఞాని, నేనే దేవుడిని, నేనే గురువు అని జ్ఞాన మోహ మాయా అహంకారంతో సంచరించే వారికి ఈ మాయా పట్టుకుంటుంది.  అలాగే ఈ క్షేత్ర స్థిరవాసం చేయాలని అనుకునే వారికి అర్హత, యోగ్యత, యోగం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఈ మాయవారిని ఆవరించి పట్టుకుంటుంది.  నా స్వానుభవాల ప్రకారం చూస్తే …..ఈ క్షేత్రంలో ఉండి సాధన చేసే ప్రతి సాధకుడి  వీపు మీద ఈ రాక్షసుడు కూర్చొని కనపడటం జరుగుతుంది . నన్నే 14 నెలల పాటు నా వీపు మీద కూర్చుని  మోసాను.  కారణం లేకుండా నా భుజాలు చాలా నొప్పులు వచ్చేవి.  ఏదో బియ్యపు మూట మోస్తున్న భావం నాకు కలిగేది. కారణం తెలిసేది కాదు…..కొన్ని నెలలు తర్వాత ధ్యానములో నా వీపు మీద ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నట్లుగా గమనించాను.  ఆనాటి నుండి వీడు ఎవడో తెలుసుకోవాలని పరిశోధన చేస్తే, ఇతను అపస్మారక రాక్షసుడు అని…  ఇతని మాయవలన తెలిసిన జ్ఞానం మరిచిపోయేటట్లుగా చేస్తాడని గ్రహించాను.  నా వీపు మీదనే కాదు… ఇలా ఎందరో వీపుల మీద ఇతను ఆవాసం చేయడం చూసి ఆశ్చర్యం చెందాను.  కారణం లేకుండా కార్యము ఉండదు కదా!  అందుకే దక్షిణామూర్తి కాస్త తన పాదము కింద ఈ రాక్షసుడిని తొక్కి పెట్టి ఉంచినట్లుగా మనకి చూపించడం జరుగుతుంది. ఇతను ఉండడం నిజమేనని….. ఇక్కడి అనుభవాలు నిరూపించడంతో….. ఈ మాయను ఎలా దాటుకోవాలో ఆలోచించడం ఆరంభించి…. ఈ అపస్మారక మాయవలన తెలిసిన జ్ఞానమును మనం మర్చిపోతే….. అనగా “నేను” ఎవరో  అని తెలుసుకొని మరిచిపోతే … మళ్ళీ నేను ఎవరు అని తెలుసుకునే పునః ప్రయత్నం కోసం, పునః జన్మ  ఎత్తే పెను ప్రమాదం ఉంటుంది అన్నమాట!  ఈ మాయలో పడితే శూన్యంలో శూన్యం కావాల్సిన వాడు కాస్త శూన్యం అవ్వకుండా ఆదిపరాశక్తి చేతిలో పడి పునః సృష్టికి వెళతాడు అన్నమాట!  అప్పుడు ఈ మాయ నివారణ కోసం నాకు ఏమీ తెలియదు ,నాకు ఏమీ చేతకాదు, నేను లేను, ఉన్నదు నీవే శివ అని నిత్య భావముతో ఉంటే….. మనలో ఉన్న అహంకారమాయ మాయం అయితే కానీ…. అనగా సర్వస్య శరణాగతి భావముతో నిత్యం మనము ఉంటే ఈ రాక్షసమాయ మనల్ని ఆవరించదు.  ఒకవేళ ఆవరించినా ……అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. 

 ఒకటి గుర్తుంచుకోండి….. మీ జన్మ మోక్షజన్మ అదే అంతిమ జన్మ కావాలంటే… అరుణాచల క్షేత్రంలో ఆవాసం చేయాలి.  నిత్యం ఈయన నామస్మరణ చెయ్యాలి. గిరిప్రదక్షిణము, దర్శనము చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళరాదు.  చచ్చేదాకా ఆఖరి తుదిశ్వాస  వరకు ఈ క్షేత్ర వాసిగా ఉండాలి. ఆయన నామస్మరణే మీ శ్వాసగమనముగా సాగుతూ ఉండాలి. అప్పుడే ఈ రాక్షసమా అయిన అపస్మారక మాయను దాటడం జరుగుతుంది అన్నమాట!  ఎప్పుడైతే మీరు  18 రకాల అహంకార మాయలలో పడతారో….. తద్వారా ఈ రాక్షస అపస్వారక మాయకు బలి అయ్యి,  ఈ క్షేత్రమును వదిలిపెట్టే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇందుకు ఉదాహరణగా కావ్య కంఠగణపతి ముని అని చెప్పవచ్చును.. రమణ స్వామి శిష్యులకి అలాగే ఈయన శిష్యులకి మధ్య కలహాలు, గొడవలు, వాదోపవాదాలు జరిగి ఈ గణపతి మునికి ఎన్నో అవమానాలు జరగటంతో…..ఆయన ఈ క్షేత్రమును వదిలి వెళ్లిపోవడం జరిగింది.  నిజానికి రమణ స్వామికి అలాగే ఈ గణపతి మునికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు.  కానీ వీళ్ళని గురువులుగా…. దైవాలుగా ఆరాధించే వీరిద్దరి భక్తుల మధ్య గొడవలు రావడంతో…. మనస్పర్ధలు ఏర్పడి గణపతిముని ఈ క్షేత్రం వదిలి వెళ్ళక తప్పలేదు. అంటే ఈయన కాస్త ఈ అపస్మారక రాక్షసమాయకు బలి అయ్యాడని…. నా స్వానుభవ అభిప్రాయము ప్రకారముగా తెలిసింది. మహా తపస్వి, యోగ సామ్రాట్, మంత్రవాది, నిత్యం అబితకుచాంబికా దేవి భౌతిక దర్శనాలు పొందే ఈయన విషయంలోనే ఇలా జరిగింది అంటే….. మరి మనలాంటి వారి విషయంలో జరగకుండా ఉండాలంటే…. మనం ఎంత ఏమరపాటు లేకుండా బహు జాగ్రత్తగా మెలగాలో కదా ! 

కాబట్టి ఈ క్షేత్ర వాసిగా మోక్షజన్మ కావాలని అనుకునే వారికి తప్పనిసరిగా సన్యాస దీక్ష లేదా శివదీక్ష తీసుకోండి. ఈ క్షేత్ర వాసిగా స్థిరపడిపొండి. నిత్య నామస్మరణం వలన…. గిరి ప్రదక్షిణం వలన అరుణాచలేశ్వర శివలింగ దర్శనం వలన…. మీకు ఎలాంటి మాయలు ఆవరించవు.  ఆవరించ లేవు.  ఆవరించినా వదిలిపెడతాయి.  నా స్వానుభవం ప్రకారంగా శివ దీక్ష తీసుకున్నప్పుడు…. నాకు మోహిని మాయ, అపస్మారక మాయ, అహంకారమాయ నా వెంట పడ్డాయి. ఎప్పుడైతే శివ దీక్ష నుండి సన్యాస దీక్షకి వచ్చానో ఆనాటి నుండి అన్ని రకాల మాయలు దాటడం జరిగింది. నేను నిత్యం అరుణాచల శివనామస్మరణ వలన నా వీపు మీద ఉన్న అపస్మారక రాక్షసుడు కూడా నన్ను వదిలిపెట్టి వేరే వారిని పట్టుకునే దృశ్యం దాకా నా సాధనను కొనసాగించాను . ఎప్పుడైతే మనలో మనకి తెలియకుండా అహంకార మాయ ఆవరిస్తుందో….. ఆ క్షణమే మాయలు మన వెంట పడతాయి.  ఎప్పుడైతే మనము సర్వస్య శరణాగతి భావంతో ఉంటామో…. ఆ క్షణమే మనలో అహంకారమాయ పోతుంది. తద్వారా ఈ అపస్మారక రాక్షస మాయ కూడా పోతుంది. 

కీర్తిమాయ :

ఇకపోతే ఐదవ మహామాయ కీర్తిమాయ ఉంటుంది.  ఇది మనం చచ్చిన తరువాత ఈ మాయ వలన మన కీర్తి శరీరం ఇంకా బ్రతికే ఉంటుంది.  ఈ మాయ చాలా పెను ప్రమాదం అని తెలుసుకోండి.  ఎందుకంటే మన భౌతిక స్థూల శరీరం చనిపోయిన కూడా ……ఈ కీర్తి శరీరం బ్రతికే ఉంటుంది.  ఈ మాయలో నూటికి 99 శాతం మంది బలి అవ్వటం…. నా స్వానుభవంలో ఎందరో యోగులని చూశాను. తద్వారా ఒక అడుగు దూరంలోఉన్నా ….మోక్ష ప్రాప్తి పొందకుండా వెనుతిరిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంతెందుకు ఏమీ వద్దు అని ఇల్లు వదిలిపెట్టి ఈ క్షేత్రానికి వచ్చి గోచి గుడ్డతో సాధన 12 లేదా 14 లేదా 16 లేదా  21 సంవత్సరాల పాటు ఏకాంతముగా ఒంటరిగా గుప్తముగా మౌనంగా సాధన చేసిన తరువాత వీరి దగ్గరికి శిష్య భక్తుల పేరుతో కొంతమంది రావడం జరుగుతుంది. వీరి పొగడ్తల మాయలో పడితే… అంతే సంగతులు అన్నమాట!  మీరు శివుడే, మీరే జ్ఞాని, మీరే దేవుడు, మీరే గురువు, మీరే అది, మీరే ఇది  అంటూ పొగడ్తల మాయలో ఉంచుతారు.  అప్పుడు ఈ సాధకుడు కూడా ఇది నిజమే కదా!  ఇది సత్యమే కదా!  అంటూ తన ఉనికిని లోకానికి తెలియజేయడం ప్రారంభిస్తాడు. ఇతని భక్తి కాస్త ఇతని శిష్య భక్తుల వలన భక్తి వ్యాపారంగా మారుతుంది.  ఇతనికి ఆశయం కాస్త ఆశ్రయమిచ్చే ఆశ్రమముగా మారుతుంది.  ఇతని అభిమతం కాస్త సరికొత్త మత విధివిధానముగా మతముగా  రూపాంతరం చెందుతుంది.  గోచి గుడ్డ కాస్త పట్టు వస్త్రంగా అవుతుంది. నేల మీద కూర్చునే స్థితి నుండి ఆశ్రమ అధిపతిగా సింహాసనం మీద కూర్చునే పరిస్థితి దాక ఎదుగుతుంది.  ఆనాటి నుండి మది సాధన కాస్త మంది సాధన అవుతుంది.  దేవుడి గురించి ఆలోచించేవాడు కాస్త దేవుడి భక్తుల రాక కోసం ఎదురుచూస్తూ…..వారు ఇచ్చే ధనము, స్థలాలు, బంగారపు ఆభరణాలు, చందాల కోసం పడిగాపులు పడే స్థితికి చేరుకుంటుంది. వ్యక్తిగత అనుభవాలు కాస్త వ్యక్తిగత గ్రంథాలుగా మారతాయి.  తద్వారా ఇతని సాధన ఉన్నత స్థితి నుండి సర్వసాధారణ ఉన్న స్థితికి తెలియకుండా చేరిపోతుంది.  ఇదే కీర్తి మాయ. దీని ప్రభావం పడితే ఇలాగే జరుగుతుంది అన్నమాట!  ఇతను చనిపోయిన తరువాత ఇతని దేహ సమాధి కాస్త పూజనీయ స్థలక్షేత్రంగా మారుతుంది. చెట్టు పేరు చెప్పుకొని ఈయన శిష్య భక్తులు కాస్త కాయలు అమ్ముతూ….. భక్తి వ్యాపారము ఒక వ్యాపార సంస్థ అయిన ఆశ్రమ సంస్థానముగా మారుస్తాడు.  ఇలాగే ఈ కీర్తి మాయలో పడి వారి ఆశయాలు కాస్త ఆశ్రమాలుగా పీఠాలుగా, మఠాలుగా మారడం జరిగింది….జరుగుతోంది…..ఏమీ వద్దు అనుకొని అన్ని వదిలేసి వచ్చిన వాడికి సాధన పరిసమాప్తి అయ్యే సమయానికి శిష్య భక్తుల కీర్తిమాయలో పడి ఎవరికో లోబడి….. వారు చెప్పినట్లుగా చేస్తూ అన్నీ కావాలి అని….. భక్తి వ్యాపారం కొనసాగించడం ఎంత విడ్డూరంగా ఉంటుందో మీరే ఆలోచించండి.  మీకే అర్థం అవుతుంది. గుప్త సాధనతో గుప్తయోగిగా మారి….. తన ఉనికి ఎవరికీ తెలియకుండా…. తెలిసినా కూడా ప్రాచుర్యం కానివ్వకుండా….. ఎవరైతే  గుప్తమవుతారో…. వారే ఈ కీర్తి మాయ దాటి కీర్తి శరీరం లేకుండా పూర్ణ శూన్యమునందు శూన్యం అవుతారు.  ఎప్పుడైతే తన మది గురించి కాకుండా లోక కళ్యాణార్థం అంటూ…. మంది గురించి ఆలోచనలు చేస్తారో వారికి కాస్త తెలిసి లేదా తెలియకుండానే కీర్తి శరీర మాయాకి బలి అయ్యి శూన్యము కావలసిన వాడు కాస్త….మోక్షము పొందవలసిన వాడు కాస్త…. ఒక అడుగు దూరంలో ఆగి… వెనుతిరిగి జనాల కోసం, శిక్ష భక్తుల కోసం వెనుతిరిగితే…. ఇక వాడి మోక్షం కూడా వెనుతిరిగి పునః కర్మ జన్మ పొందడం జరుగుతుంది. ఇది నూటికి 99.99 శాతం మంది ఈ కీర్తిమాయలో పడి ఆగిపోవడం మనము గమనించవచ్చును.  ఎవరి ఉనికి అయితే, లోకానికి తెలిసినదో ఇక వాడి సాధన ఈ కీర్తి మాయకి బలి అయ్యి ఆగిపోయినదని గ్రహించండి.  నిజమైన సాధకుడు లేదా యోగి కాస్త తన మది గురించి తప్ప మంది గురించి ఆలోచించడు. ఆలోచించలేడు …..ఎందుకంటే ఇలాంటి వారి దృష్టిలో మంది లేరు…. ఉండరు…. ఉన్నది ఏకత్వమే… శూన్యము అనుకుంటే సర్వము శూన్యము…. లేదంటే శివము అనుకుంటే సర్వం శివమయం అవుతుంది. వీళ్ళకి మంది కనిపించరు.  మది కనిపిస్తుంది.  అన్నింటా ఏకత్వ భావ రూపమే కనపడుతుంది.  ఈ భావాతీత స్థితి దాటనీయకుండా కీర్తి శరీర మాయ అడ్డుగా మారుతుంది అన్నమాట!  ఇలా మది ఏకత్వ స్థితి నుండి మంది భిన్న స్థితికి ఈ మాయలో పడేవారికి ఇస్తుంది.  తద్వారా వీడు కాస్త ఈ మాయలో పడి తనని అనుసరించే శిష్య భక్తులకి కూడా ఈ మాయలో పడేటట్లుగా చేస్తాడు.  ఎందుకంటే వీళ్ళ గురుదేవుడు ఏమాయ దగ్గర ఆగిపోయాడో …..వీరిని ఆరాధించే వాళ్ళు కూడా అమాయ దగ్గర ఆగిపోక తప్పదు కదా!  ఒక గుడ్డివాడు కాస్త పదిమంది గుడ్డివాళ్ళకి దారి చూపిస్తే ఎలా ఉంటుందో….. అలా ఈ కీర్తి మాయలో పడే సాధకుడు లేదా యోగి లేదా గురువు లేదా దేవుడు కూడా ఈ మాయలో పడి ఆగిపోతే…..వీరిని ఆరాధించే, పూజించే వాళ్లంతా కూడా ఇక్కడిదాకా వచ్చి ఆగిపోవాల్సిందే కదా!  వీళ్ళ గురుదేవుడే ఈ మాయను దాటలేక ఆగిపోతే…వీరిని పూజించే వాళ్ళు కూడా ఎలా దాటగలుగుతారో మీరే ఆలోచించండి.  ఒక మర్రిచెట్టు నీడ కింద ఉన్న మొక్కలు ఎదగలేవు కదా!  ఎప్పుడైతే ఈ చెట్టు నీడ దాటి మరొక చోటికి వెళితే మాత్రమే ఈ మొక్కలు ఎదిగే అవకాశం ఉంటుంది.  ఇలా కీర్తి శరీరం మాయలో పడిన గురువులు లేదా యోగులు లేదా దైవాలనుండి మీకు మీరే తెలుసుకొని గురుమాయల నుండి దైవమాయల నుండి యోగ మాయల నుండి దాటి మీ సాధనను వ్యక్తిగతంగా ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా కొనసాగించండి.  మంది గురించి ఆలోచించడం మాని వేసి ……మీ మది గురించి ఆలోచన చేయండి.  మర్రిచెట్టు నీడ నుండి మీకు మీరే బయటకు వచ్చి…. కీర్తి ప్రతిష్టలు లేని స్థితికి….. శిష్య భక్తుల ప్రాచుర్యము, ప్రభావము లేని ఏకాంత ఒంటరి మౌనస్థితికి…. మీకు మీరు చేరుకొని…. మరో మర్రిచెట్టుగా  మౌనంగా ఎదగండి.  శూన్యంలో శూన్యం అవ్వండి… ఈ కీర్తి మాయ దాటాలంటే మీరు ఎవరో…. మీ సాధన ఏమిటో….. ఎవరికి కూడా తెలియకుండా…..జాగ్రత్తగా ఉండి…. గుప్త సాధనలో గుప్తయోగిగా లేదా గుప్త యోగినిగా మారి లుప్తమై పూర్ణ శూన్యములో పూర్ణ మోక్షముతో శూన్యం అవ్వండి.

ఇలా ఈ అరుణాచల క్షేత్రంలో అరుణగిరి కాస్త పంచ శిఖరాలతో పంచముఖ శివుడిగా ఈ పంచ మాయలుగా అనగా అహంకార మాయ ,మోహిని మాయ, యక్ష మాయ ,అపస్మారక మాయ, కీర్తి మాయలతో ఉన్నాడని తెలుసుకోండి.  ఈ పంచమాయలకి లోబడే పరమేశ్వరుడు కాస్త ఏకముఖము నుండి పంచముఖ శివుడు అయినాడు.  ఈ పంచమాయల వలన పంచ క్రియలు అనగా సృష్టి, స్థితి, లయ, తిరోగమనం, అనుగ్రహమును అఘోర ముఖముతో…. ఈశాన్య ముఖముతో….. తత్పురుషముఖముతో…. వామదేవ ముఖముతో….. సత్యోజాత ముఖముతో…. ఇలా పంచముఖాలతో చేస్తున్నాడని తెలుసుకోండి… గ్రహించండి…. ఇలా పంచమాయలు దాటితే కానీ, మీ సాధన పరిసమాప్తి అయ్యి… ఏ శూన్యంలో నుంచి మీరు వచ్చారో ……తిరిగి ఆ శూన్యంలో శూన్యం అవుతారు.  ఈ పంచమాయలు మీకు మాయం అయితే కానీ….. మీరు మాయం అవ్వలేదని గ్రహించండి మీ  ఆది రుద్రుడి నుండి ఈనాటి జీవుడి దాకా ఈ పంచమాయలలో ఏదో ఒక మాయకి బలి అవుతూ….. ఒక అడుగు దూరంలో మోక్షం పొందకుండా …..శూన్యంలో శూన్యం అవ్వకుండా…. ఇంకా ఏదో ఉంది.  ఇంకా ఏదో తెలుసుకోవాలని…. ఇంకా ఏదో చేయాలని…. ఇంకా ఏదో చెప్పాలని….ఇంకా ఏదో చూడాలని….ఈ పంచమాయలలో పడి నిర్జీవ శరీరం కాస్త సజీవ శరీరంగా మార్చుకొని మిగిలిపోతున్నారు. మోక్షం పొందకుండా ఆగిపోతున్నారు.  కాబట్టి ఇలా పంచమాయలు మీ సాధనతో దాటి మాయం అవ్వండి.  సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని తెలుసుకోండి.  మాయా అని తెలిస్తే మాయ మాయం అవుతుంది అని గ్రహించి….. సాధనను ఆపకుండా మీ శూన్యములో శూన్యం అయ్యేదాకా…. మీ సాధనను కొనసాగిస్తూ, సాధన పరిసమాప్తి చేసుకొని…. మాయలు మాయం చేసుకొని…..మీరు శూన్యములో శూన్యమై మాయం అవ్వండి.. 

ఇలా ఎవరైతే ఈ క్షేత్ర పంచమాయలు దాటుతారో …వారికి ప్రస్తుత దేహ జన్మ మోక్షజన్మ అవునో కాదో ఈ పంచ తీర్థం మనకి చెబుతుందన్నమాట! ఈ పంచమాయలు దాటించే తీర్థం కాబట్టి అలాగే పంచదేహాలకి విముక్తి కలిగించే తీర్థం అవ్వడం చేత ఇది పంచ తీర్థం అయ్యింది. ఇది పంచ పాండవులు ప్రతిష్టించిన తీర్థమని వాడుకలో ఉంది. కానీ నిజానికి ఇక్కడ మనకి పంచముఖ శివుడు సజీవ  మూర్తిగా దర్శనం ఇస్తాడు. అలాగే పంచముఖ శిఖర ప్రాంతంలో ఈయన పంచముఖ శివుడిగా ధ్యాన సమాధిలో ఉండి కనపడుతుంది. 




ఈ పంచ తీర్థం నందు పంచముఖ శివుడు కాస్త ఏకాదశ రుద్రులలో 14 చేతులున్న విలోహిత రుద్రుణ్ణి ఆరాధన చేస్తూ  కనపడతారు. అది కూడా గుడి లోపల ఉన్న తీర్థం దగ్గర (U) ఆకారంలో ఉన్న బండరాయి కనబడుతుంది.  దీని లోపల 14 చేతులతో విలోహిత రుద్ర మూర్తి సాక్షాత్కారం నాకు కలిగింది. ఈయనని ఆరాధన చేస్తున్నట్టుగా పంచముఖ శివుడి దర్శనం అయ్యింది. అందువలన ఇది పంచ తీర్థం అయ్యింది. కానీ కాలగర్భంలో ఇది కాస్త పంచ పాండవుల తీర్థమైంది. నిజానికి ఈ తీర్థం ఆదిలో పంచముఖ శివుడి వలన ఏర్పడిందన్నమాట! ఏకకాలంలో ఈ రెండు శివ మూర్తుల దర్శనం ….మనకి ధ్యానంలో ధ్యాన దృశ్యంగా…. మన మనోనేత్రం నందు దర్శనం అవ్వడం ….నాకే కాదు, అది కొద్ది మంది స్థానిక శివయోగులకు అయ్యిందని నాకు అర్థం అయింది. వాళ్లు చెప్పలేదు. ఈ దేహం చెబుతోంది. ఇక్కడ ఇద్దరు శివమూర్తులు ఉన్నారనడానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఏమిటంటే….. మనకి ఈ క్షేత్రంలో వచ్చే పంచమాయలు అనగా అహంకార, కామ,మోహ, అపస్మారక ,కీర్తి మాయలకు తగ్గట్లుగా అహంకారానికి ప్రతీకగా జ్యోతి శరీరం ఉంటే… మోహమాయకు మనో శరీరం ఉంటే….కామ భావానికి పిండ శరీరం ఉంటే… అపస్మారక మాయనికి లింగ దేహం ఉంటే….. కీర్తి ప్రతిష్టల మాయకి ప్రతికగా కీర్తి శరీరము ఉంటాయి. ఈ పంచమాయలకి పంచదేహాలు ఉంటాయన్నమాట! అందుకనే ఈ క్షేత్రంలో పంచ శిఖరాలు అనేవి పంచ దేహాలకి ప్రతీక అయితే ….పంచ తీర్థం అనేది పంచ మాయలకు ప్రతీక అన్నమాట! అందుకే మనకి అరుణాచల క్షేత్రంలో ఈ పంచమాయలు ఎవరు దాటుతారో…వారి పంచదేహాలు కాస్త విముక్తి పొంది…. మోక్ష ప్రాప్తి పొంది…. శూన్యం నందు శూన్యమై… నిరాకారమవుతారు. ఇలా పంచదేహాలకి  ప్రతీకగా పంచముఖ శివుడు ఉంటే …పంచ మాయలకు ప్రతీకగా విలోహిత రుద్ర మూర్తి ఈ క్షేత్రంలో ఉన్న పంచ తీర్థము నందు సజీవ మూర్తిగా ఉండి ఆవాసం చేస్తున్నారు.  


ఇకపోతే ఎవరైతే ఈ పంచమాయలకు ప్రతీకగా…. నా స్వానుభవం ప్రకారంగా చూస్తే…. నేను ఈ క్షేత్రమునకు వచ్చి కాషాయవస్త్రధారి అయ్యి శివ సన్యాస దీక్ష తీసుకున్న 14 నెలల నుండి 36 నెలల లోపు ఈ మాయాలకు ప్రత్యేకంగా నా దగ్గరికి పంచ వ్యక్తులు వచ్చారు. వారిలో ముగ్గురు పురుషులు ఇతర స్త్రీమూర్తులు అన్నమాట!ఇందులో స్త్రీమూర్తులు కాస్త మోహమాయకు ప్రతీక అయితే ….ముగ్గురు పురుషులు కాస్త జ్ఞాన అహంకారానికి అపస్మారక స్థితికి… కీర్తి ప్రతిష్టలకి ప్రతీకలుగా వచ్చారు. ఇలా వీరి మాయలలో నన్ను పడవేయాలని…. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను పెద్దగా స్పందించలేదు. పట్టించుకోలేదు. నేనే దేవుడిని… నేనే గురువు అని …..నా చుట్టూ కీర్తి శరీరధారి తిరిగాడు. నన్ను మోక్షదేవుడిగా, మోక్షగురువుగా మార్చి ఆశ్రమం లేదా పీఠం పెట్టించాలని ఇతగాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. అప్పుడు వాడికి నేను అనేది లేదు…. ఉన్నది ఆయనే ….నాకే ఆయన మోక్షము ఇస్తాడు ….ఉన్నది అరుణాచలేశ్వరుడే …ఆయన్ని నమ్ముకో! నాలాంటి గుడి పూజారిని నమ్మితే ఉపయోగం లేదు. గురువు లాంటి పూజారిని దాటితే గాని…గుడిలో ఉన్న దైవం దర్శనం కాదని తెలుసుకో ! నన్ను పట్టుకోకు… నేనే ఆయన్ని పట్టుకున్న గుడి పూజారి అని తెలుసుకో !అని చెప్పి నా నుంచి వాడి చూపు అరుణాచలేశ్వర స్వామి వైపు మరలించాను. లేదంటే నేను కాస్త కీర్తి ప్రతిష్టల మాయ అయిన ఆశ్రమం పెట్టి …భక్తి వ్యాపారం చేసే ఆశ్రమ అధిపతిగా మిగిలిపోయేవాడిని కదా! అలా ఈ క్షేత్రంలో ఉండే పంచమాయలు కూడా మన సాధన పరిశ్రమాప్తి కాకుండా చేస్తాయని గ్రహించండి. ఎవరైతే ఈ మాయలో పడతారో వాళ్ళు కాస్త…. మోక్షం పొందకుండా అమోక్షం పొంది ఈ క్షేత్రం నుండి తిరోగమనం పొంది వెనుతిరిగి పునః సృష్టి చక్రంలో పడే పెను ప్రమాదం ఉంది అని గ్రహించండి. తస్మాత్ జాగ్రత్త!  ఇక్కడ మోహ లేదా కామ మాయలో పడితే పరస్త్రీ లేదా పరపురుష మాయలో పడితే …పునః సృష్టికి వెళతారు. అదే ధన అహంకారం లేదా జ్ఞానాహంకారం మాయలో పడినా కూడా పునః సృష్టికి కర్మ-జన్మ ఎత్తుతారు . అదే  అపస్మారక మాయ అనగా నేనే జ్ఞాని అంటూ… నీ ఉనికి లోకానికి తెలిస్తే అప్పటిదాకా నువ్వు పొందిన జ్ఞానం అంతా కూడా పోయి…. నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ… నేను ఎవరు అని తెలుసుకుని….ఈ అపస్మారక మాయలో పడి అంతా మర్చిపోయి తిరిగి పునః కర్మజన్మ ఎత్తుతారు. అపస్మారకము అంటే తెలుసుకున్న జ్ఞానం మరిచిపోవడం అన్నమాట!  ఇకపోతే కీర్తి మాయ అంటే నేనే దక్షిణామూర్తి… నేనే మోక్షగురువు…. నేనే మోక్షగురుదేవుడు అంటూ నీకు నీవై ప్రచారంలో నీ శిష్య భక్తుల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొంది… ఆశ్రమం పెట్టి… కీర్తి పొందావో అంతటితో నీ సాధన ఆగిపోయి,  మోక్షం పొందే వాడివి కాస్త అమోక్షం పొందే అవకాశం నీకు నువ్వే ఏర్పాట్లు చేసుకునేటట్లుగా ఈ పంచమాయలు కాస్త, పంచ దేహాలుగా మారి శూన్యం కావలసిన వాడిని ఏదో ఒక శరీరంలో శాశ్వతంగా ఉండేటట్లుగా చేస్తాయి… అని ఇప్పటికైనా తెలుసుకోండి… జాగ్రత్త పడండి …. ఈ పంచమాయలు ఉన్న పంచదేహాలకి నూటికి 98 శాతం నరబలి అవటం…. నా స్వానుభవంలో చాలామందిని చూశాను. వాళ్ల పేర్లు చెబితే ఆయా శిష్య భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే చెప్పడం లేదు… కానీ ఒక సాధకుడు ఎలా ఈ పంచ మాయాలలో పడి వాడి సాధన ఆగిపోయిందో నా స్వానుభవంలో చూసిన యధార్థ సంఘటన మీకు చెబుతాను.. అప్పుడు అయినా మీరు జాగ్రత్త పడతారు కదా! 


ఒక సాధకుడు ఉన్న ఇంటిని వదిలిపెట్టి….అరుణ గిరి  యొక్క ఆధ్యాత్మిక అయస్కాంత క్షేత్ర శక్తికి ఆకర్షితుడై …ఈ క్షేత్రానికి రావడం జరిగింది.  గిరి పైన ఉన్న అగస్త్యముని ఆశ్రమానికి చేరుకొని…. అక్కడ ఉన్న త్రిలింగాలని నిత్యం అభిషేకాలు పూజలు చేయడం… రాత్రిపూట ఆ గుహలో నిద్రించడం… భోజనం వేళలో ఈ గుహ దగ్గరలో ఉన్న ఆశ్రమంలో టిఫిన్లు, భోజనాలు చేస్తూ ప్రతినిత్యం శివనామస్మరణ చేస్తూ జపం ధ్యానాదులు చేస్తూ ఉండేవాడు.  ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. ధ్యానశక్తికి, జ్ఞానశక్తికి ఇతని శరీరం, మనసు, బుద్ధి తట్టుకోలేక అస్థిరమైనాయి.  ధ్యానం లేదా జపం చేసినా మనసు నిశ్చలస్థితి పొందేది కాదు. విపరీతమైన ఆలోచనలు, భావాలు, కోరికలు, ఆశలు,భయాలు సంకల్పాలు, కొత్తవి లేదా పాతవి వచ్చి మనసు అస్థిరమయేది. దానితో ఇతను కాస్త ఇతర సాధకుల దగ్గరకు వెళ్లి   సత్సంగం పేరుతో… వారి ధ్యాన అనుభవాలు తెలుసుకోవడం…. ఈ గిరి పైన ఉన్న అలాగే గిరి కింద ఉన్న ఇతర గుహలు, ఆశ్రమాలు, తీర్థాలు,గుడులు, వివరాలు తెలుసుకుంటూ…. మంచి విషయాల మీద పట్టు సాధించాడు.  పైగా బ్రహ్మచారి కావడంతో సంసార ఈతి బాధలు ఇతనికి లేకపోవడంతో….ఈ విషయ జ్ఞానం సముపార్జన కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ…. రాను రాను ధ్యానానికి సమయం లేకుండా చేసుకొనే స్థితికి తెలియకుండానే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సాధకుడు ఇలాంటి బలహీన స్థితికి చేరుకున్నాడో…. ఈ క్షేత్ర పంచమాయలు ఇతని మీద ఇతనికి తెలియకుండా ప్రభావం చూపించడం  ప్రారంభమయ్యింది. ఎప్పుడైతే ఇతను భోజనం చేసే ఆశ్రమంలో ఉన్న ఇతర ఆశ్రమ వాసులకి ఇతనికున్న విషయ జ్ఞానము… అలాగే శివ భక్తికి ముగ్ధులై ఇతనిని మాటలతో పొగడ్తలు చేయడం ఆరంభించారు… నువ్వు ఇంత… నువ్వు అంత…. నీకు ఉన్న జ్ఞానం ఎవరికి లేదు…. అంటూ ఇలా అంటూ ఉండేసరికి ఒకరోజు కీర్తి మాయ శరీరం ఇతని దగ్గరకు వచ్చి స్వామి ! నువ్వు సన్యాస దీక్ష తీసుకొని…. ఈ ఆశ్రమ బాధ్యతలను నిర్వహించు… నీకున్న జ్ఞాన సముపార్జనతో విరాళాలు సేకరించి… ఈ ఆశ్రమ బాధ్యతలు నిర్వహించు.  ఈ ఆశ్రమ అభివృద్ధికి నీ సహాయ సహకారాలు అందించు అనగానే…. ఇంకేముంది గుహలో ధ్యానం చేసుకునేవాడు కాస్త వీడి మాయ మాటలకి ప్రలోభపడి ఆశ్రమ భోజనానికి వచ్చే ఇతను కాస్త ….సన్యాసిగా  మారి….ఆశ్రమ బాధ్యతలు తీసుకునే ఆశ్రమ వాసిగా మొదట మారి… ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం విరాళాలు సేకరించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి…. తనకి తెలిసిన వివరాలు విషయాలు, స్థలాలు, గుహలు, గుడులు, తీర్థాలు, సాధకుల అనుభవాలు చెబుతూ అన్నదానం కోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టి… లక్షాధికారి అయ్యాడు.  దానితో ఇతని వలన ఆశ్రమానికి విరాళాలు వస్తున్నాయని ఆశ్రమ పెద్దలు కాస్త ఇతనిని ఆశ్రమ అధిపతిగా మార్చారు. దానితో మనవాడు కాస్త రాను రాను శివనామస్మరణ చేసే సమయం లేక విరాళాలు సేకరించే పనిలో పడిపోయాడు. దానితో ఇలా కీర్తి మాయలో పడటం… తనకు మించిన శివ భక్తుడు, అలాగే గిరి గురించి తెలిసిన విషయ జ్ఞాని లేడనే జ్ఞాన అహంకార భక్తి అహం అనే అహంకార మాయలో ఆశ్రమ వాసుల వలన పడడం జరిగింది. నాకు ఇంతవరకు తెలుసు….


ఆ తర్వాత ఇతను ఇలా ఈ పంచ తీర్థ వీడియో కోసం ఈ తీర్థానికి రావడం జరిగింది. ఈ గుడిలో ఉన్న అష్టదళ పద్మం ఉన్న రాయి మీద కూర్చుని… ఈ వీడియో చేయడం జరిగింది. ఈ గుడిలో ఈ పంచమాయలలో పడే పంచ వస్తువులు ఉన్నాయని తెలుసుకోండి. 






అందులో ఇలా అష్టదళ పద్మ రాయి,త్రాడు కట్టిన గంట, తులసి కోట, శ్రీ చక్ర స్థూపం, హోమగుండం ఉంటాయి. ఇందులో పద్మ రాయి వలన ధనప్రాప్తి వలన వచ్చే అహంకార మాయకి ప్రతీక అయితే…. గంట ధ్వని అనేది అనగా నన్ను మించిన శివ భక్తులు లేడని భక్తి మాయకి…. శ్రీ చక్ర స్థూపం అనేది కామ మాయకి ప్రతీక అయితే….. ఎందుకంటే శ్రీ చక్ర మూల బిందువులో కామేశ్వరుడు,కామేశ్వరి కాస్త శృంగార భంగిమలలో ఉంటారు కదా!  ఇకపోతే హోమగుండం అనేది కీర్తి మాయకి ప్రతీక అన్నమాట!  అనగా హోమం చేయడం వలన మన దోషాలు తొలగి మనం అనుకున్న కోరికలు తీరడంతో జ్యోతిష్యుడు లేదా సిద్ధాంతి కీర్తి మాయలో పడే అవకాశం ఉన్నది కదా!  ఇక తులసి కోట అనేది మోహ మాయలో పడి పాతివ్రత్యం తప్పిన తులసికి ప్రతీక కదా! ఇలా ఈ గుడిలో ఉన్న పంచ వస్తువులు కాస్త… పంచ మాయలకు ప్రతీకలు.  ఈ సాధకుడి అనుభవాల ద్వారా నేను తెలుసుకొని…. ఈ గుడికి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పాపం ఈ సాధు పుంగవుడ్ని చూసినప్పుడల్లా… అడుగు దూరంలో ఆగిపోయి మోక్షం  పొందవలసిన వాడు కాస్త ….అమోక్షం పొందాడని అనిపించేది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా అన్ని విషయాలను పొంది…. తను తెలుసుకున్న విషయాలలో అహంకార మాయలో పడి ఆగిపోవడం…. విచారించదగ్గ విషయమే కదా! ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా! కాబట్టి అందరూ కూడా అనగా మోక్షం పొందాలని అనుకునే సాధకుడు….ఈ పంచమాయలు అలాగే పంచ దేహాలు…. మరియు ఈ గుడిలో ఉండే పంచ వస్తువుల విషయాలు వీటిలో జాగ్రత్తగా ఉండండి. ఈ గుడి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వస్తువులు తాకరాదు. వీటి మీద కూర్చోరాదు. ఎందుకంటే అష్టదళ పద్మం అనేది కూర్చోవడానికి చాలా వీలుగా ఉంటుంది.  కూర్చుంటే ఈ చక్రం కీర్తి పదవి లేదా మరణం తర్వాత బ్రహ్మ పదవి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి.  బహు జాగ్రత్తగా ఉండండి.  


స్వామి!  ఈ పంచమాయలలో పడితే పట్టే అధోగతి గురించి బాగానే చెప్పారు.  మరి ఈ పంచమాయలు దాటిన వారు పొందిన ఉన్నత స్థితిని గురించి చెప్తారా? అన్నప్పుడు…. ఇందుకు నిదర్శనమే నా స్వానుభవం నిలుస్తుంది.  ఎలా అంటే మోక్షం పొందాలంటే మన దేహంలో ఉండే 13 యోగ చక్రాలలో ఉండే 13 దేహాలకి మోక్ష ప్రాప్తి పొందితే గానీ….దేహం లేని నిరాకార తత్వమైన పూర్ణ శూన్యమునందు శూన్యం అవ్వడమే పూర్ణ మోక్షం అవుతుంది. అనగా మన 13 యోగ చక్రాలలో మూలధార చక్రమునందు స్థూల శరీరం, స్వాధిష్ఠాన చక్రము నందు సూక్ష్మ శరీరం ఉంటే, మణిపుర చక్రమునందు కారణ శరీరం ఉంటే, అనాహత చక్రమునందు వాయు శరీరం ఉంటే, విశుద్ధ చక్రము నందు ఆకాశ శరీరం ఉంటే, ఆజ్ఞా చక్రమునందు ఆత్మ శరీరం ఉంటే, ఇందులో ఉండే నాలుగు ఉపచక్రాలు అయిన కర్మ ,గుణ, కాల,బ్రహ్మా,చక్రాల యందు ఆత్మ శరీర ఉప అంశలు ఉంటే ….సహస్ర చక్రము నందు సంకల్ప శరీరం ఉంటే,.హృదయ చక్రమునందు జ్యోతి శరీరం ఉంటే, బ్రహ్మ రంధ్రంనందు మిగిలిన పంచ శరీరాలు అనగా మనో శరీరం, పిండ దేహం,లింగ దేహం ,కీర్తి దేహం, చేప దేహం ఉంటాయి . ఇందులో హృదయ చక్రం అనేది మన అరుణాచల క్షేత్రం అవుతుంది. ఎందుకంటే ఈ స్థల పురాణం ప్రకారం చూస్తే…. ఈ క్షేత్రం అనేది తన హృదయం వంటిదని స్వయంగా అరుణాచలేశ్వరుడు కాస్త గౌతమ మహర్షికి చెప్పడం జరిగింది. అలాగే సప్త చక్రాలలో ఉండే సప్త  దేహాల సప్త మోక్షాలు అనేవి ….అయోధ్య, మధుర, హరిద్వార్, ఉజ్జయిని, కంచి, కాశీ , ద్వారక అని సప్త మోక్షపురాలలో గత జన్మలలో జరిగినప్పుడే…ఈ జన్మ  మోక్షజన్మ అవ్వాలంటే మిగిలిన దేహాలయిన జ్యోతి ,మనో, పిండ, లింగ, కీర్తి శరీర, చేప దేహాలు విముక్తి పొందాలి. అది కూడా ఈ అరుణాచల క్షేత్రంలోనే ఈ ఆరుదేహాలకి మోక్ష ప్రాప్తి కలుగుతుందన్నమాట! ఇందులో నా సాధనాపరంగా చూస్తే నా జ్యోతి శరీరానికి మోహిని మాయగా నా గత జన్మాంతర భార్యగా ఒక స్త్రీ మూర్తి తన మోహమాయలో పడేసే ప్రయత్నం చేస్తే…. ఈమెకి మంత్ర దీక్ష ఇచ్చి యోగినిగా మార్చి ఈ మోహిని మాయ బంధనం నుంచి మోహమాయ బంధనం నుంచి విముక్తి పొందడం జరిగింది.  ఇకపోతే నా మనో శరీరం నందు నా గత జన్మాంతర ధర్మపత్నిగా ఒక స్త్రీ మూర్తి వచ్చి తన కామ మాయలో పడవెయ్యాలని ప్రయత్నం చేస్తుంటే…. ఆమెను కాస్త సన్యాసిగా మార్చి ఈమె కామ మాయ నుండి విముక్తి పొందడం జరిగింది. ఇక నాతో అప్పటికి ఏర్పడిన అనుభవ పాండిత్యం అహంకార మాయలో పడవేయడానికి ఒకాయన వస్తే…. ఈయన అహంకార మాయలో నేను పడకుండా ఆయనకి అరుణాచల శివుని యందు శరణాగతి భావంతో ఉండమని చెప్పి ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చి…. మోక్ష సన్యాసిగా మార్చి… నా అహంకార  మాయను  దాటడం జరిగింది.  ఇకపోతే అపస్మారక మాయ వలన నేను పొందిన జ్ఞానస్పురణ మరిచిపోయే ప్రమాదం వచ్చినా కూడా ….ఏ మాత్రం బాధపడకుండా ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటుందో… అంతే ప్రాప్తి ఉండటం జరుగుతుందని మౌనం వహించాను . దానితో అపస్మారక వ్యక్తి మాయ దాటడంతో ….ఇతనికి కూడా మౌన సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. నేను కాస్త పరమాహంస అని …అనుభవ జ్ఞాని అని…. ఒక కీర్తి శరీరము నా దగ్గరికి వచ్చి… నా కీర్తి ప్రతిష్టలు నాకే చెప్పి…. నన్ను కీర్తిమాయలో పడవేయాలని ….అతను చేసిన ప్రయత్నాలు నేను తిప్పి కొట్టి… నన్ను ఇంతటి స్థితికి తెచ్చిన అరుణాచలేశ్వర స్వామి యందు నీ చూపు ఉంచు… నేను కేవలం గుడి పూజారి అని…. అసలు దైవం ఆయనే… నేను కాదు… అని నేను లేను అని…. చెప్పి అతనికి గురు మంత్ర దీక్ష ఇచ్చి శివ యోగిగా మార్చడం జరిగింది.  ఇలా నా పంచదేహాలకి ఈ క్షేత్ర పంచమాయలు దాటుకోవడం జరిగిందన్నమాట!  ఇది అహంకారంతో చెప్పడం లేదు… మీరు తెలుసుకుంటే నాకు లాగా పంచదేహాల పంచమాయలు దాటే అవకాశం ఉంటుందని…. అనుభవంతో శరణాగతితో  చెబుతున్నాను. ఇలా ఈ విషయాలు తెలిసిన కూడా చెప్పే వాళ్ళు లేకపోవడంతో ఎందరో ఈ పంచమాయలకు బలి అయ్యి పునః కర్మ జన్మలో పడడం… ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది .ఇది నివారణ కోసం నా స్వానుభవం చెప్పడం జరుగుతుందని తెలుసుకోండి . జాగ్రత్త పడండి.. ఈ పంచమాయలు మూలాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని తెలుసుకొని… వీటి యందు అజాగ్రత్త లేకుండా …ఏమరపాటు లేకుండా జాగ్రత్త పడండి.  ఇలా పంచదేహాల పంచమాయలు దాటిన తర్వాత కూడా నా మనసు నిశ్చలం అవ్వలేదు… అస్థిరమవుతూ ఉంది.  దీనికి గల కారణం తెలియలేదు. చెప్పేవాడు లేడు …తెలుసుకోవాలని ఆరాటం ఆగడం  లేదు.  దానితో అప్పటిదాకా కొండ ఎక్కని నేను కాస్త…. అరుణాచలేశ్వరుడు కాస్త మూలస్థానేశ్వర మూర్తిగా నిర్జీవ నిశ్చల స్థితిలో ఉన్నాడని ధ్యానం అనుభవం పొంది ఉండటంతో…..సజీవమూర్తి నిర్జీవమూర్తి అయినాడని తెలియడంతో…. గిరి ఎక్కాను. ఇక్కడ ఉన్న అన్నీ గుహలు తిరిగాను.వీటియందు ధ్యానాలు చేశాను.  ఈ గుహలో ఆయా శివయోగుల సమాధుల కింద సజీవ మూర్తులుగా వీళ్ళు ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. అందరూ కూడా మోక్షం పొందారు అని స్థల పురాణం  చెబుతుంది.  కానీ నా ధ్యాన అనుభవంగా వీళ్లంతా కూడా  నిర్జీవ మూర్తిగా…. కీర్తి దేహంతో ధ్యాన సమాధిలో ఉన్నట్లుగా కనబడుతుంది.  మరి ఈ కీర్తి దేహం కాస్త శూన్యంలో నిరాకారము లేదా ఇలా చలనం లేకుండా కదలక మెదలక నిర్జీవ స్థానముర్తిగా శాశ్వతంగా అందరికీ కనబడుతూ ఉంటుందా? అని నన్ను బాగా కలిచి వేసింది.  నాలాంటి వాడు ధ్యానంలో ఇలాంటి గుహల యందు ధ్యానానుభవం పొంది …. ఇలా ధ్యానంలో కూర్చుని ఉంటే ….వాడికి ఇలా కీర్తి దేహములు స్థానముర్తిగా కనపడితే ఈయన  గురించి ప్రభావం చేసే  పుస్తక గ్రంథాలు… వీడియోలు, ఆడియోలు వస్తాయి కదా! అప్పుడు  శిష్య భక్తులు, అవసర భక్తులు, ప్రసాద భక్తులు తయారై ఆశ్రమం కోసం… ఆశయం కోసం…. ఆశ్రమాలు పీఠాలు, మఠాలు ఏర్పడతాయి.  భక్తుల మంది వలన మఠాలతో ముఠాలు ఏర్పడి గొడవలు పెరిగి ….ఆధిపత్య పోరు ఏర్పడుతుంది కదా !వీళ్ళు ఎలా ఎందుకు ఆఖరి దేహమైనా కీర్తి దేహంతో నిశ్చల స్థితిలో ఉండి మిగిలిపోతున్నారు. ఎందుకు శూన్యంలో శూన్యం అవడం లేదు. ఎందుకు శూన్యంలో నుంచి వచ్చిన వాడు తిరిగి శూన్యం అవటం లేదు. అసలు మోక్షం అంటే ఇలా కీర్తి దేహంతో నిశ్చల స్థితి పొందడమా లేదా శూన్యంలో శూన్యమై నిరాకారం అవ్వడమా? ఇలా ఎన్నో సాధన సందేహాలు నన్ను ఆవరించాయి… అప్పుడు ఈ గుహలలో ఇలా నిశ్చల స్థితి పొందిన శివయోగుల చరిత్రలు చదవడం ఆరంభించాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే…. వీరి సాధన పరిసమాప్తి సమయానికి వీరి జ్ఞాన ప్రాప్తి వలన కీర్తి దేహ మాయలలో పడి గురు శిష్య సంప్రదాయానికి నాంది పలికి…. వీరి అభిమతానికి తగ్గట్లుగా ఆశ్రమాలు ఏర్పరచుకొని….ఇలా శిక్ష భక్తుల అవసరాలు.. కోరికలు తీర్చడానికి …..అవి కీర్తి దేహంతో జీవ సమాధి చెంది…. ఈ దేహంతో సజీవ మూర్తిగా వీరందరినీ అనుగ్రహిస్తున్నారని గ్రహించాను.  దానితో కీర్తిమాయ అనేది ఒక మన భౌతిక స్థూల  దేహమును చచ్చినా కూడా బతికే ఉంటుంది కదా!  పాట పాడేవాడు చనిపోయిన కూడా…. వాడి పాటలు మనకి గుర్తున్నాయి అంటే,  వాటి స్థూల శరీరం చచ్చిపోయినా కూడా వాడి కీర్తి శరీరం ఇంకా బతికే ఉండటం వలన ఇంకా మనకి వీడియో పాడిన పాటలు గుర్తున్నాయి… జ్ఞాపక స్మృతులుగా మిగిలే ఉన్నాయి కదా! ఇలా యోగల విషయంలో జరుగుతోందని గ్రహించాను . మరి భౌతిక దేహం నశించినా కూడా వీడికి దేహం కాస్త ఇంకా వారి సమాధిలో సజీవ మూర్తిగా ఉండి నిశ్చల స్థితిలో ఉంటుందని తెలుసుకున్నాను.


దానితో కీర్తి శరీరం కాస్త కీర్తి మాయలలో పడకుండా ఉండాలంటే చేప చనిపోయే సమయానికి దాని తలలో ఒక తెల్లని పదార్థం చేరి… తెల్లని మణిగా మారితే…. అది చచ్చి నీటిమీద  తేలుతుంది. ఈ చేప మణి అనేది రాహు గ్రహ ప్రతీకయని …..దీనిని ధరించిన వారికి కీర్తి మాయదాటే యోగం ఇస్తుందని…. ఈ మణితో చేప ఎలా అయితే మోక్షం  పొందిందో …..అలా మిగిలిపోయి కీర్తిదేహం కూడా మోక్షం పొందుతుందని…..నా ధ్యానానుభవాల ద్వారా తెలుసుకొని ఈ  చేప మణి ధరించడం జరిగింది. ఇది జరిగిన 41 రోజుల తర్వాత ఈ క్షేత్ర పంచ తీర్థ  దర్శనానికి వెళ్లడం జరిగింది.  ఈ గుడిలో ఉన్న పంచ వస్తువులను చూడగానే…. పంచ మాయలలో తిరిగి పడవేసే వస్తువులని గ్రహించి… వాటిని తాకకుండా ఈ గుడి ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద కూర్చున్నాను. అంతిమంగా మోక్షం అనేది నిరాకార లేదా నిశ్చల స్థానమూర్తి స్థితియా అనే సందేహం వచ్చింది. మరి ప్రస్తుతం నా మోక్షస్థతి ఏమిటో తెలుసుకోవాలనిపించింది… మనసంతా కూడా అయోమయంగా, గందరగోళంగా, ఆవేదనంగా, అచంచలంగా మారింది. ధ్యానం చేయబుద్ధి కావడం లేదు…. ఈ తీర్థంలో ఏదో తెలియని మర్మం ఉన్నదని ….నా మనసుకు బలంగా పదేపదే ఆలోచనలు రావటం మొదలైంది. దానితో ఈ గుడి పరిసరాలు గమనించడం మొదలుపెట్టాను. 






గుడి లోపలికి వెళితే మాకు నేలమీద రెండు చేపల బొమ్మలు కనిపించాయి… అలాగే గుడి గోడ మీద సూర్య చంద్రులను తింటున్నట్లుగా రెండు పాముల బొమ్మలు… ఒక సింహం తల ….స్తంభం మీద రెండు తలలున్న గండబేరుండ పక్షి, దాని కింద శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా కనిపించాయి.ఇవే కాకుండా గుడిలో మాకు మొత్తము 12 చేపలు కనిపించాయి.ఇందులో నాలుగు వీడి చేపలుగాను..ఎనిమిది చేపలు 4 జంట చేపలుగా మొత్తము 12 చేపలు కాస్త మన 12 దేహలకి ప్రతీకగా అగుపించాయి.  పాముల గుర్తులను బట్టి చూస్తే… సూర్య లేదా చంద్ర గ్రహణ సమయంలో ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపించింది. అది ఏమిటో నాకు ఒక పట్టానా అర్థం కాలేదు. రెండు పాములు అలాగే రెండు చేపలు ఉండటంతో అంతరార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు. గుడి బయట గోడమీద కోనేరు దగ్గర ఒక చేప బొమ్మ చెక్కి ఉంది.  ఇక్కడ ఉన్న చేపలు అలాగే పాములు చూస్తుంటే…. మనకి ఏదో రహస్యాన్ని చెబుతున్నాయని అనిపించింది. మేము వెళ్ళిన రోజు చంద్రగ్రహణం కావడం విశేషం… ఈరోజు ఇక్కడ ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను బలంగా అనుకున్నాను.


గుడిలో పంచ వస్తువులు చూశాను…పద్మకార రాయి,తులసికోట, హోమగుండము, శ్రీచక్రస్ధూపము,పెద్దగుడిగంట కనిపించాయి. పట్టించుకోలేదు.  గుడికి ఎదురుగా మూడు నీటి గుండాలు… ఐదు బండ రాళ్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉండే ఆశ్రమ వాసులు…వాళ్ళు ధరించే బట్టలు ఇక్కడ ఉతుకుతున్నారని గ్రహించాను.  పవిత్రమైన గుడి ముందు ఈ బట్టలు ఉతకడం ఏమిటో …. నాకు అర్థం కాలేదు… మనలో ఉండే పంచమాయల వలన ఏర్పడే పంచమాలిన్యాలను ఈ బట్టలు ఉతికినట్లుగా ఈ పంచదేహాలన్నీ ఉతికితే గాని పోవు అనిపించింది…. నవ్వు వచ్చింది… కాకపోతే అప్పటికే ఈ పంచమాయలు నా పంచదేహాలు పోగొట్టుకొని మోక్ష ప్రాప్తి పొందడం జరిగింది.  కానీ అంతిమదేహమైన కీర్తి దేహం కూడా కీర్తిమాయను దాటి నిశ్చల స్థితి పొంది…. ధ్యాన సమాధిలో మిగిలిపోయింది. ఈ దేహం అనేది ఆకారం లేకుండా….నిరాకారం అవుతుందా లేక  కదలకుండా మెదలకుండా నిర్జీవంగా నిశ్చలమవుతుందా? ఏది అంతిమస్థితి అని తెలుసుకోవాలని…. తపనతో అనుకోకుండా ఈ పంచ తీర్థానికి రావటం జరిగింది అన్నమాట!  ఇలా గిరిపైన ఉన్న దాదాపు గుహై నమఃశివాయ, నారాయణ గుహ, విరూపాక్ష గుహ, చూత గుహ, మర్రిచెట్టు గుహ, అగస్త్య గుహ, జటాధారి గుహల యందు శివయోగులు కాస్త ఇలా కీర్తి దేహాలతో నిశ్చల సమాధి స్థితి పొంది గుహలలో ఆవాసం చేస్తున్నారు కదా! మరి వాళ్ళ కీర్తి దేహాలు కాస్త  నిరాకరం అవ్వవని  గ్రహించాను.  ఎందుకంటే వీరు స్థూలదేహాలలో ఉన్నప్పుడే కీర్తి దేహ మాయలో పడి కీర్తి ప్రతిష్టలు పొందడంతో…… వీరి కీర్తి దేహాలు మిగిలిపోయాయని అర్థమవుతుంది.  మరి నాలాంటి కీర్తి శరీర మాయ దాటిన వారి పరిస్థితి ఏమిటి? నా కీర్తి శరీరం కాస్త నిశ్చలమవుతుందా లేదా నిరాకారం అవుతుందా? అని తెలుసుకోవాలని గుడి పరిసరాలను గమనిస్తూ నాలో నేను ప్రశ్నించుకుంటూ….అంతిమంగా ఈ గుడి ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద ఆవాసం చేశాను.



మర్రి చెట్టు పైన నుండి ఒక మర్రి ఆకు నా ఒడిలో పడింది. దానిని చేతిలోకి తీసుకున్నాను. దానిని చూస్తే 80% ఎండిపోయి 20 శాతం పచ్చిగా ఉంది .మనకి రుద్ర మంత్రంలో ఎప్పుడైతే దోస పండ్లు పండితే దానతంట అదే చెట్టు నుండి ఊడిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో గురుదక్షిణామూర్తి నిత్యం ఆవాసం చేసే మర్రి చెట్టు నుండి కూడా మన కర్మ - జన్మ ప్రతీక అయిన మర్రి ఆకు పండిన వెంటనే అది రాలి మన ఒడిలో పడుతుందని నాకు జ్ఞాన  స్ఫురణ అయింది. ఎప్పుడైతే ఈ క్షేత్ర పంచమాయలు, పంచదేహాలు దాటి అవి మోక్ష ప్రాప్తి పొందితే….  వారు కర్మ- జన్మ చక్రం నుండి విముక్తి పొంది ….ఇలా సహజ సిద్ధంగా మర్రిచెట్టు నుండి పండిన ఆకు లాగా మారి మన ఒడిలోకి చేరుతుందని గ్రహించాను.  మరి ఈ ఆకు ఇలాగే ఎండిపోయి ఉంటుందా….అనగా మన కీర్తి దేహ పరిస్థితి ఇలాగే ఈ ఆకులాగా ఉంటుంది కదా!  లేక ఈ ఆకు నిరాకారమవుతుందా అనగా…. ఏ శూన్యం నుంచి వచ్చిందో ఆ శూన్యంలోనికి తిరిగి వెళ్లి నిరాకారం అవుతుందా…. లేదా వెళ్లకుండా కీర్తిదేహంతో ఆకార దేహముగా నిశ్చల స్థితి పొందుతుందా? అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని బలంగా అనిపించింది.  దానితో ఈ చెట్టు కింద ఉండలేకపోయాను. నా ఒడిలో పడిన ఈ మర్రి ఆకును తీసుకుని గుడి ఆవరణలో ఉన్న తీర్థమును చూస్తూ ఉండగా…. నా చేతిలో ఉన్న మర్రి ఆకు కాస్త అనుకోకుండా నీటిలో పడడం జరిగింది.  దానిని తిరిగి తీసుకోవాలని అనిపించలేదు.  ఎందుకంటే అది వచ్చి ఇవ్వవలసిన జ్ఞాన స్ఫురణ  ఇచ్చింది కదా!  నా కీర్తి దేహం మోక్షం పొంది …. నిర్జీవ నిశ్చలం స్థితిలో ఉంది అని చెప్పడం పూర్తి అవ్వడంతో…. దాని పని పూర్తి అయి నీటిలో పడింది.  కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలలో పడని నాలాంటి వాడి కీర్తి దేహం అంతిమంగా ఏమవుతుంది అనగా నిరాకారం అవుతుందా లేదా ఆకార నిశ్చలమవుతుందా ?అనే ప్రశ్నకి సమాధానం గురించి నా మనసు ఆలోచన చేస్తూ ఉండగా…. ఇలా నా చేతి నుండి నీటిలో పడిన ఆకు శబ్దానికి నీటి అడుగుభాగం నుంచి చిన్న చేపలు రావడం జరిగింది. ఇందులో వింత ఏముంది…. చెరువు అన్నాక చేపలు ఉండడం సహజమే కదా! అనిపించింది.  అప్పుడు ఈ గుడి చుట్టూ ఉన్న గిరిని చూస్తూ ఉండగా….. ఈ గుడి చుట్టూ ఉన్న గిరి మీద రాతితో ఉన్న చేప ఆకారాలు ఉన్న శిలలు కనిపించాయి.  ఈ గిరి అగ్రభాగంలో చెట్ల  మధ్యలో….చెట్ల ఆకులతో చేప ఆకారం కనిపించ సాగింది. ఈ తీర్థంలో ఉన్న రాళ్లలో కొన్ని రాళ్లు కూడా చేప ఆకారంలో కనిపించాయి.  అరే ఈ విషయం ఇప్పటిదాకా గమనించలేదని అనిపించింది. గుడి తీర్థంలో అనుకోకుండా ఒక పెద్ద పాము పాకుతూ కనిపించి…. రాళ్ళ మధ్యలోనికి వెళ్లి అదృశ్యం అయింది.  ఈ తీర్థానికి అవతలి ఒడ్డున వీరభద్రుడు విగ్రహ మూర్తి…. ఈయనకి ఎదురుగా వీరభద్ర భంగిమలో కూర్చుని ఉన్న మరో విగ్రహ మూర్తి,  వీరి పక్కనే సప్తమాతృకల  శిలలు , ఈ వీరభద్రుడి పాదాల దగ్గర స్థానమూర్తి, స్తంభేశ్వర స్వామి శిల మూర్తి ఉండటం గమనించాను. అనుకోకుండా గుడి తీర్థంలో చచ్చిన చేపలను చూడడం జరిగింది.  ఇప్పుడు దీని పరిస్థితి యే నా కీర్తిదేహ పరిస్థితి అని  గ్రహించాను. ఎందుకంటే ఈ చేప చచ్చినట్లుగానే …నాకైతే దేహము కాస్త చచ్చింది కానీ ఈ చేప దేహం మిగిలిపోయినట్లుగా చచ్చిన నాకైతే దేహం కూడా  నిర్జీవ నిశ్చల స్థితిలో మిగిలిపోతుందా లేదా నిరాకారమవుతుందా అయితే ఎలా అవుతుంది అని అనుకుంటూ…. ఇది తేలే సమస్య కాదు అనుకొని…. గుడి నుండి తిరిగి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో గుడి బయట ఉన్న పంచ తీర్థం దగ్గరికి వెళ్ళాను . 




అప్పటిదాకా గమనించని నాకు, ఈ తీర్థం నందు చేప ఆకారంగా ఉన్న శిల అలాగే నా మెడలో ఉన్న చేప మణి పోలిన రాయి కనిపించాయి. 



ఇంతలో ఈ చేప మణి రాయి దగ్గర ఒక చిన్న పాము ఉన్నట్లుగా గమనించాను.  ఇది నీళ్లలోనికి వెళ్లి ఒక చిన్న చేపను పట్టుకొని మింగటం ఆరంభించి తినేసి ఈ రాయి కిందకి వెళ్ళిపోయిన దృశ్యం చూసేసరికి…. నా మనసు కాస్త అప్పటిదాకా ప్రశ్నల ఆవేదనతో ఉన్నది కాస్త…. ఆనందంగా మారిపోయింది.  ఎందుకంటే బ్రతికి ఉండగా ఎవరైనా కీర్తి దేహ మాయలో పడి... కీర్తి ప్రతిష్టల కోసం ఖ్యాతికి వస్తారో…. వారి కీర్తి దేహం కాస్త చచ్చిన చేపలాగా నీటిమీద  తేలినట్లుగానే వారి జీవ సమాధి యందు  సజీవ మూర్తిగా నిశ్చల స్థితిలో శాశ్వతంగా మిగిలిపోతుంది. అదే ఎవరైతే బతికున్నప్పుడే వారి కీర్తి దేహము మాయలో పడకుండా….తన సాధనను తన జ్ఞాన శక్తిని లోకానికి తెలియనివ్వకుండా….గుప్తసాధన తో గుప్తయోగిగా మారి లుప్తమవుతారో వారి అంతిమ కీర్తి దేహం అనేది నిర్జీవ నిశ్చల స్థితి పొందిన తరువాత వారిలో ఉండే  కుండలిని శక్తి పాము కాస్త…. ఈ కీర్తి దేహంలో బతికి ఉన్న  చేపను ఎలా అయితే  పాము మింగిందో …అలా మనలోని  కుండలినీ శక్తి కాస్త అంతిమంగా చచ్చిపోయిన మన కీర్తి దేహమును… మన స్థూల శరీరం బతికి ఉండగానే…. మన అంతిమ కీర్తి దేహం మిగలకుండా…. ఆకార దేహం నుండి నిరాకారం చేస్తుందని గ్రహించాను . తెలుసుకున్నాను. ఇలా అంతిమ మోక్షానుభవమును ఈ స్థూల  దేహం బతికి ఉండగానే ….చచ్చిన అంతిమ కీర్తి దేహ మోక్ష ప్రాప్తి ఈ పంచ తీర్థం మనకి చూపిస్తుందని స్వనుభవంగా గ్రహించాను. 



ఇందుకు నిదర్శనమే మనకి ఒక కథ మహాభారతంలో కనపడుతుంది.  ద్రౌపదీ వివాహ సమయంలో అర్జునుడు కాస్త మత్స్య యంత్ర చేధనము చేశాడని తెలుసు కదా!  అంటే ఆకాశంలో ఒక చక్రంలో తిరిగే చేప, దీని నీడను చూస్తూ దీనిమీద బాణం వేసి ఎవరైతే చంపుతారో వాడికే ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని మత్స్య యంత్ర  చేధన పరీక్ష పెట్టడం జరిగింది కదా!  ఇలా అర్జునుడు చేసి….విజయం పొంది…. ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు కదా ! అచ్చంగా ఇలాగే మన అంతిమ దేహమైన కీర్తి శరీరం చచ్చిన చేపను పాము మింగి నాశనం చేయాలన్నమాట ! ద్రౌపది కాస్త పంచభూతాలకు పుట్టిన పంచ పాండవులకు భార్య అయింది కదా!  సరిగ్గా మనం మోక్ష అనుభవం కూడా ఈ పంచపాండవుల తీర్థమునందు అర్జునుడు కాస్త మత్స్య యంత్ర చేధన లాగా మన కీర్తి చేప దేహమును కూడా పాము మింగే విధానం ఉండడం…. యాదృచ్ఛికంగా జరిగిందా …. లేక ఇక్కడ జరిగే విధానముగా మత్స్య యంత్ర  చేధనముగా పెట్టారా అనేది పంచముఖ శివుడికే తెలియాలి.





అంతెందుకు ఈ ఆలయ గోపురము మీద మనకి ఒక బాణము గుర్తు అలాగే దీని ప్రక్కనే ధనస్సు గుర్తు కనపడుతుంది.


అంటే ఎవరైతే ఈ గుడికి వచ్చి గుడి ఆవరణలో ఉన్న మఱ్ఱి చెట్టు కింద కూర్చొని జపం లేదా ధ్యానం లేదా మౌనంగా కూర్చుని ఉంటే…. వారి మీద పడిన మర్రి ఆకును తీసుకొని ….గుడి లోపల ఉన్న పంచ తీర్థంలో వేస్తే , గుడి బయట ఆవరణలో ఉన్న పంచ తీర్థం దగ్గరికి వస్తే ….ఒక పాము కాస్త చేప మణి శిల దగ్గర మనకి కనపడి అది కాస్త మన అంతిమ కీర్తి దేహమైన చేపదేహం తినడం జరిగితే…. మీ మోక్ష ప్రాప్తి పూర్తి అయినట్లే అన్నమాట!  






ఎలా అంటే…. విష్ణుమూర్తి అవతారంలో తొలి అవతారం మత్స్య అవతారం కదా! అలాగే శివుడిలో నవనాధులలో తొలి అవతారమైనది కూడా చేపనుండి  శివాంశ గా మచ్చేంద్రనాథుడు  జన్మించాడు కదా!  అంతెందుకు…. గృహ యంత్రాలలో వాస్తు దోష నివారణ కోసం మత్స్య యంత్రమును ఉపయోగిస్తారని అందరికీ తెలుసు కదా! అంతెందుకు పండరీపుర పాండురంగడికి చేప చెవికుండాలు ఉంటాయి గదా అలాగే మహరాష్ట్రలో ఉన్న అంబోలి అడవులో ఉన్న శివాలయములో అమ్మవారు కాస్త మత్య్సావతారములో ఉంటుంది.అలాగే గుడి ముందు ఉన్న కొలనులో ఇపుడికి ప్రపంచములో ఎక్కడలేని బంగారపు వర్ణ ఏకైక చేప సజీవమూర్తిగా ఉంది.గావాలంటే వీడియోలు చూడండి.నేను చెప్పింది సత్యమని మీకు తెలుస్తుంది.అలాగే జ్యోతిష్యములో మొదటిరాశి మేషరాశి అయితే ఆఖరి రాశి మీనరాశి అనగా చేపరాశి అవుతుంది గదా.   

అంటే ఈ లెక్కన చూస్తే  చేప నుండి దేహ సృష్టి ఆరంభమైనది కదా! అలాగే చేప దేహం చనిపోవడంతో…. దేహ సృష్టి వినాశనం అవుతుంది కదా! కాకపోతే మిగిలి చచ్చే చేపను పాము మింగితే అది నిరాకారం అవుతుంది… లేదంటే ఆకార రూపంగా నిర్జీవంగా నిశ్చల స్థితిలో…. ఇది కాస్త నీటిలో తేలినట్లుగా ఈ అంతిమదేహమైన కీర్తిదేహం కాస్త మన కుండలినీ శక్తి పాము తినకపోతే….ఇది కాస్త విశ్వంలో దైవ కణంగా మిగిలిపోతుంది. కొన్ని యుగాల తర్వాత ఇలాంటి ఒక కోటి దైవకణాలు కలిసి దైవ శక్తిగా …మారి విశ్వాధినేతగా మారే అవకాశం లేకపోలేదు.  ఎందుకంటే మన్మధుడు భస్మం నుండే చిత్రకర్మ అనే గణపతి కాస్తా బండాసురుడు అనే రాక్షస ఆవిర్భావం జరిగింది  కదా! కాబట్టి అంతిమ దేహం అయిన కీర్తి దేహం కాస్త చచ్చిపోతే చచ్చిన చేప దేహం అవుతుంది. అప్పటికి మన మనసు కాస్త మౌనస్థితికి వచ్చి అన్నింటి యందు సాక్షి భూతంగా స్థితప్రజ్ఞతగా ఉండగలిగితే…. చచ్చిన చేపని పాము తిని ఎలా అయితే నిరాకారం చేసి శూన్యం చేసిందో….అలా మిగిలిన చచ్చిన కీర్తి దేహమును మన దేహంలోని కుండలిని శక్తి కాస్త నాశనం చేసి శూన్యం చేస్తుందని ఈ పంచ తీర్థం దగ్గర మాత్రమే నాకు ఈ అంతిమ మోక్ష అనుభవం అయింది. అప్పుడు అరుణాచలేశ్వర స్వామి యొక్క నిర్జీవ నిశ్చల మూలస్థాన మూర్తి శిల గుడి గోపురం పక్కనే గిరి మీద పక్కగా కనిపించింది.  ఇది పసుపు రంగులో ఉంది. ఈ స్థానమూర్తి దర్శనం కోసం ఎన్నో రోజుల నుండి పరితపిస్తున్నాను. ఎప్పుడైతే పాము కాస్త చేపను  మింగిందో అనగా ….చచ్చిన నా కీర్తి దేహమును కాస్త నాలోని కుండలినీ శక్తి పాము కాస్త  మింగినదని అంతిమ ధ్యానం అనుభవం కలిగిన తర్వాతనే ….అప్పటిదాకా కనిపించని ఈ మూలస్థాన మూర్తి శిల కనిపించడం…. నాకు అమితమైన సంతోష ఆనందము కలిగించింది.  నా ఈ అంతిమ మోక్షభావము సత్యమని చెప్పటానికి ఈ శిల నిదర్శనం అయింది.





ఇది ఇలా ఉంటే దానితో వెనుతిరిగి గుడి ఆవరణంలోకి వెళ్లి మర్రి చెట్టు కింద కూర్చొని మౌనంగా ఉండగానే ధ్యాన దృశ్యంగా అపస్మారక రాక్షసుడు కనిపించాడు. ఇక్కడ ఉన్న గిరి మీద ఉన్న శిలలలో దేనికోసమో వెతుకుతున్నాడు… అప్పుడు ఈ గిరి మీద ఉన్న శిలలలో మన అంతిమ కీర్తి దేహాలు నిక్షిప్తము చేస్తున్నట్లుగా కనిపించ సాగింది. అంటే ఈ రాతిశిలలలో కీర్తి దేహాలతో ఉన్న కాషాయ వస్త్రధారిగా ఉన్న, శివదీక్ష పరులైన శివయోగులు కనిపించ సాగారు.  అంటే అరుణగిరి మీద ప్రతి చిన్న లేదా పెద్ద శిలల యందు కూడా ఇలాంటి శివయోగుల కాస్త తమ కీర్తి దేహాలతో ఆవాసం చేస్తూ ఉంటారని తెలుసుకోవడం జరిగింది. ఇలా ఈ అపస్మారక రాక్షసుడు కాస్త ఒక శిల దగ్గరికి వచ్చి… ఆగి… దానిని చూస్తుంటే అందులో నా స్థూల దేహంతో… పోలికలతో… ఉన్న కీర్తి దేహం కనిపించింది. అప్పుడు వీరు కాస్త ఈ శిలను తన చేతులతో బద్దలు కొట్టేసరికి ఈ శిల బద్దలై అందులో నుండి నా కీర్తి దేహం బయటకు వచ్చింది.  ఎందుకంటే నా సాధన 20% దిగిలే ఉంది కదా ! అందుకే ఈ దేహము ఇంకా మిగిలే ఉన్నదని గ్రహించగానే….. ఈ కీర్తి దేహం మీదకి ఒక పెద్ద బండ రాయిని…వాడు కాస్త దొర్లించగానే నాదేహం కాస్త ప్రాణభయంతో పరిగెత్తుతూ…. ఒక గుహకి చేరింది.  అప్పుడు ఈ పెద్ద రాయి కాస్త గుహ ద్వారం శాశ్వతంగా మూసివేసి ద్వార బంధనం చేసింది. దానితో నా కీర్తి దేహం కాస్త ఈ గుహ లోపల  ఇరుక్కుని పోయింది ….అంటే ఒక రకంగా జీవ సమాధి పొందింది…

                                            



అపుడు ఈ కీర్తిదేహము నుండి ఇష్టలింగ మఠాధిపతి నుండి గౌతమమహర్షి దాకా సుమారుగా వివిధ దేహలతో రూపాంతరము చెందుతూ శిలాజమూర్తిగా మారిపోవడము జరిగింది.

అరుణాచల శివ మహత్యం గ్రంధరచన:


నా కీర్తిదేహలు ఎలా నాశనము చేసుకోవాలో ఎలా నాశనము అవుతాయో నాకు ఒక పట్టన అర్ధముకాలేదు.అసలు ఈ కీర్తిదేహము ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలని అనిపించింది.అపుడు నాకు ఒక శ్లోకము ద్వారా తెలిసింది.అది ఏమిటంటే ఆత్మన్ని కీర్తిదేహము మొట్టమొదట ఆశ్చర్యముగా చూస్తుంది.దానిని గూర్చి ఆశ్చర్యముగా వింటుంది.దానిని గూర్చి ఆశ్చర్యముగా చెపుతుంది అని తెలిసింది.ఈ మూడు స్ధితులు చూస్తే మూడు కోతుల విషయము గుర్తుకువస్తుంది.ఈ మూడు కోతులలో ఒక కోతి చెవులు మూసుకొనిఉంటే చెడు వినరాదని..అదే మరొ కోతి కాస్త కళ్ళు మూసుకొని ఉంటే చెడు చూడరాదని..అదే మరొ కోతి కాస్త నోరు మూసుకొని ఉంటే చెడు మాట్లడరాదని చెపుతారు గదా.వీటిని యోగపరముగా చూస్తే  కళ్లు మూసుకున్న కోతి ఆత్మన్ని చూడరాదని..చెవులు మూసుకున్న కోతి కాస్త ఆత్మ గూర్చి వినరాదు..నోరు మూసుకున్న కోతి కాస్త ఆత్మ గూర్చి చెప్పరాదు అన్నమాట.ఎందుకంటే కళ్ళు తెరిచిఉంటే ఆత్మశరీరము కనపడి దానిమీద మనకి కామభావము కలుతుంది.అదే చెవులు ద్వారా ఈ ఆత్మశరీరానికి సంబంధించిన విషయాలు విని మోహమాయలో పడుతుంది.అదే నోటి ద్వారా ఈ ఆత్మశరీరానికి సంబంధించిన విషయాలు ప్రచారము చేసి కీర్తిప్రతిష్ట కల్గించే కీర్తిదేహముగా మారుస్తుంది అన్నమాట.కాబట్టి ప్రతిసాధకుడు గూడ ఈ మూడు విషయాలలో బహుజాగ్రత్తగా ఉండాలి సుమ.ఇక అసలు విషయానికి వస్తే ఈ మూడు విషయాల వలన ఆత్మ కాస్త  దీనిని ప్రతిబింబ కీర్తిదేహముగా మారుతుందని నాకర్ధమైంది.ఈ దేహము కాస్త కోటి కీర్తిదేహలుగా విభజన చెందుతోందని జ్ఞానస్ఫురణ అయింది.మరి ఇన్ని కీర్తిదేహలు ఎలా నాశనమవుతాయని అర్ధముకాని అయోమయపరిస్ధితిలో ఉన్నపుడు ఆసలు నా ఆది కీర్తిదేహము ఎవరో తెలుసుకుంటే దానిని నాశనము చేస్తే ఈ కోటిదేహలు పోతాయి గదా అనిపించింది.ఇలా దీనికోసము ధ్యాననిష్టలో ఉండగా ఒకరోజు నాకు ధ్యానములో అరుణగిరి మీద ఒక 10 అడుగులు త్రికోణ శిలకి ఒక అస్ధిపంజరము కపాలము అతుకొని కనిపించింది.ఈ అస్ధిపంజరము కాస్త తన కపాలమును ఈ శిలను నుండి విడిపించుకోవాలని శతవిధాలుగా విశ్వప్రయత్నము చేస్తూన్న దృశ్యము నాకు కానవచ్చింది.  ఇది ఇలా ఉంటే ఈ అస్ధిపంజరానికి దూరముగా ఒక చెట్టు కింద ఒక స్త్రీమూర్తి తన కొడుకుతో కనపడి దీనిని దగ్గరికి రాగానే వీరిద్దరు గూడ క్షణాలలో అస్ధిపంజరాలు మారడము జరిగింది.కొన్నిక్షణాలు శిలకి అతుకున్న అస్ధిపంజరము ఎవరిది?ఎందుకు ఈ శిలకి అతుకొని ఉంది అని అనుకున్నపుడు మొదట ఒక పెద్ద త్రికోణ శిల కనపడి దానిని దగ్గరికి శివదీక్షతో ఉన్న గౌతమ మహర్షి అలాగే అరుణచలేశ్వరుడు వచ్చి శిలలోపలకి అరుణచల శివ వెళ్ళిపోతే పాపము గౌతమ మహర్షి కాస్త అస్ధిపంజరముగా మారి ఈ శిలకి అతుకొని పోవడము జరిగినట్లుగా ధ్యానదృశ్యము కానవచ్చింది.ఈయనే కాదు ఈ అరుణగిరి మీద శిల మీద ప్రతిరాయికి పరిమాణములో చిన్నపెద్ద తేడా లేకుండా ఎవరో ఒకరు తమ కీర్తిదేహముతో వాటికి అతుకొని ఉన్నారు.అలాగే ప్రతిదానిలోను శివుడు ఉన్నాడు.అందుకే కంకరు గూడ శంకరుడు  అని అలాగే ప్రతి కంకరరాయి శివలింగమని చెప్పడము జరిగింది.ఈ గిరి మీద ఉన్న 20 అడుగుల శిల నుండి ఇసుక రేణువు లో గూడ అస్ధిపంజరము అతుకొని అందులో శంకరుడు ఉండటము నేను గమనించాను.అందుకే శివం కానిది లేదు.లేనిది లేదు అన్నారు.ఈ లెక్కనచూస్తే నా ఆది కీర్తిదేహము అనేది గౌతమమహర్షి అని అనుకుంటుంగా నాకు ధ్యానభంగమైంది.దానితో బయటికి వచ్చి దీని గూర్చి ఆత్మవిచారణ చేసుకుంటే ఈయనకి శివుడికి సంబంధించి ఏదో పెద్ద ఇష్టకోరిక మాయ ఉండి ఉండాలని అనిపించింది.లేకపోతే శివమాయ దాటలేక అరుణగిరి ఆధ్యాత్మిక అయస్కాంతానికి మరి ఈయన అతుకొనిపోతాడు అనుకుంటుండగా తను మరియు తన భార్య అహల్య అలాగే కుమారుడైన శతధనుడిని తీసుకొని ఈయన ఈ క్షేత్రానికి వచ్చి అరుణాచలేశ్వరుడి ద్వారా ఈ క్షేత్ర మహత్యము తెలుసుకొని 1000 సం.రాలు పాటు ఈ క్షేత్రవాసిగా ఉండి ఇక్కడే శిలాజమూర్తిగా మారాడని నాకు ధ్యానము నందు  .అలాగే తను పొందిన ధ్యానానుభవాలతో గూడిన అరుణచల మహత్యమును ఒక గ్రంధముగా రాయాలనే కోరిక తీరక ఇలా మారాడని జ్ఞానస్పురణ అందడముతో నా ప్రస్తుత దేహము ఈయన అంశ గావడముతో ఈ గ్రంధము రాయడము ఆరంభించాలి అనుకున్నాను.కాని వేదవ్యాసుడు ఈ కేత్రము గూర్చి స్కాందపురాణములోని మహేశ్వరఖండములో చెప్పడము జరిగింది గదా అనిపించింది.అపుడు ఈ పురాణము చదివితే ఒక లోపము కనిపించింది.అది ఏమిటంటే ఈ పురాణము నందు అరుణచల మహత్యము కాస్త రెండు భాగాలుగా చెపితే మొదటిభాగములో వచ్చిన కధలే దాదాపుగా రెండవభాగములో మళ్ళి రావడముతో చదివిన కధలే మళ్ళీ చదవలసి వస్తోందని గ్రహించాను.ఈ లోటు భర్తీ చెయ్యటానికి రెండుభాగాలుగా కాకుండా ఏకభాగములో ఏకీకృత కధలుగా రాయాలని..రాసిన కథ మళ్ళీ రాకుండా చూసుకోవాలని అనిపించి నేను కాస్త అరుణచల శివ మహత్యం గ్రంధ రచన చెయ్యడము ఆరంభించాను.ఇందులో నా అరుణచల అనుభవాలతో 18 అధ్యాయాలు రాయగానే గౌతమ మహర్షి అస్ధిపంజరము కాస్త శిల నుండి ఊడిరావడము జరిగింది.ఆ తర్వాత 23 అధ్యాయాలుగా అరుణాచలేశ్వర స్వామి అలాగే పార్వతిదేవి మరియు గౌతమ మహర్షి సంవాదము రాయడము పూర్తి అయ్యేసరికి గౌతమ మహర్షి కీర్తిదేహమైన శిలాజమూర్తికి బంధవిముక్తి పొంది పూర్ణమోక్షము పొందడము జరిగింది. ఇలా ఈ గ్రంధ రచనతో అలాగే చేపమణి సహయముతో నా 12వ దేహమైన కీర్తిదేహనికి మోక్షము పొందడము జరిగింది.ఈ గ్రంధ రచనను అరుణగిరిశివ అనే బ్లాగ్ గా పెట్టడము జరిగింది.దీనిని నిత్యపారాయణ గ్రంధముగా పాఠకులు చదవడము ఆరంభించారు.


ఇపుడు నేను ఉన్న ప్రస్తుత దేహము కాస్త పూర్ణజ్ఞానము పొందడముతో కారణ,కోరిక,కర్మ,జన్మకి మూలదేహమైన కీర్తిదేహము కాస్త నిర్జీవనిశ్చలమోక్షస్ధితి పొంది దానితో ఈ కీర్తి దేహం కాస్త , చేసేది ఏమీ లేక…. ధ్యాన సమాధి లోనికి వెళ్ళగానే… యోగాగ్ని మొదలై, ఈ దేహం దగ్ధం చేయడం…. ఇది కాస్త అస్తిపంజరంగా మారి బూడిద అవ్వటం…. ఈ బూడిద కాస్త ధూళికణాలుగా మారి విశ్వ శూన్యంలో  శూన్యం అయ్యేసరికి…. దేహం కాస్త నిరాకారమై శూన్యమైనదని…. అందుకే నాకు సన్యాస దదీక్షా నామముగా నిరాకారానంద స్వామిగా ఇచ్చినారని గ్రహించి….. నా భౌతిక దేహములో ప్రశ్నల కోసం సమాధానాలు వెతికే నా మనసు కాస్త అంతిమస్థితి అయిన  మౌనః స్థితికి చేరుకోవటం జరిగింది. ఇలా నా స్థూల దేహం బ్రతికి ఉండగానే చచ్చిన తర్వాత పొందే అంతిమస్థితి… అదే నా అంతిమ కీర్తి దేహం కాస్త నిరాకారమవడం అనే అంతిమ మోక్షా అనుభవం పొందడంతో… బతికి ఉండగానే సర్వకర్మ ఋణముల నుండి జీవన్ముక్తుడిని అయ్యాను అన్నమాట!  అలాగే ఇలాంటి మోక్ష అనుభవం మనకి ఎవరు ఇస్తున్నారు….. అలాగే అపస్మారక రాక్షసుడికి ఇలా చేయమని ఎవరు చెబుతున్నారో తెలుసుకోవాలని అనుకోగానే….ఇది తెలుసుకోవడం అవసరమా అనిపించ సాగింది. తెలుసుకొని ఏమి చేయాలి ? అనే వైరాగ్యస్థితికి నా మనసు అంతిమంగా వెళుతూ ఉండగా….. అంతిమ ప్రశ్నకి సమాదానంగా నాకు జ్ఞాన దృశ్యం గుడి లోపల ఉన్న పంచ తీర్థంలోని గుహ యందు 14 చేతులు ఉన్న విలోహిత మూర్తి కాస్త సజీవ మూర్తిగా కనిపించడం….. ఈయనని పూజిస్తూ  పంచముఖ శివుడు కనిపించడంతో… శివుడే శివుడిని చూస్తున్నాడు… శివుడే శివుడిని పొందుతున్నారు.  ఇదే అసలు సిసలైన శివోహం  స్థితి అని ఇదే “నేను” అనే జీవుడు కాస్త శివుడయ్యాడని ఈ శివోహం స్థితి పొందిన నా మనస్సు కాస్త గురుదక్షిణామూర్తి యొక్క మౌనస్థితి పొందటం జరిగింది. ఇంతటి అంతిమ మోక్ష అనుభవం మీరు పొందాలంటే ఈ పంచ తీర్థమునకు వెళ్లి….మర్రి చెట్టు కింద కూర్చొని ….అక్కడ మీ మీద పడినా ఆకుని తీసుకుని గుడి ఆవరణలో …తీర్థములో వేసి… గుడి బయట ఆవరణలో పాము కాస్త చేపను తింటే మీ సాధన పరిసమాప్తి అయ్యి…. మీ భౌతిక దేహం మరణమే మోక్షమరణం తప్పక అవుతుందని… నమ్మి విశ్వాసంతో వెను దిరగండి. ఈ మోక్ష పరీక్ష ద్వారా మీ ప్రస్తుత జన్మ కాస్త మోక్ష జన్మ అవునోకాదో తెలుసుకోండి.నాకు కనిపించిన అపస్మారకుడు నిజమా?కాదా అనుకున్నపుడు మాకు ఈ గుడి గోపురము వెనుక వైపు పై భాగములో అపస్మారకుడి ముఖ గుర్తు అలాగే గుడిలోపల రెండు ముఖాలు కనిపించేసరికి నా ఈ స్వానుభవము అక్షర సత్యమని నాకర్ధమైంది.


ఇవి ఏమీ చేయకుండా గుడి బయట ఉన్న పంచ తీర్థంలో పాము కనిపించి చేప తిన్నట్లుగా కనపడితే….. అది మీ అంతిమ కీర్తి దేహమైన చేపదేహం కాదని తెలుసుకోండి.  అది ఆకలి కోసం తింటున్న చేప అని గ్రహించండి.  నేను చెప్పిన విధి విధానం చేసి అప్పుడు పాము కాస్త చేపలు తింటే….. మీ మోక్ష సాధన పరిసమాప్తి అయ్యి మీ ప్రస్తుత జన్మయే మోక్షజన్మ అయ్యి…. మీ భౌతిక మరణమే మోక్షమరణం అవుతుంది అన్నమాట!  ఈ పరీక్ష ఆరు నెలలకు ఒకసారి చేసుకోండి.  ఒకసారి ఇలా కనిపించకపోతే మళ్లీ ఆరు నెలలకి ఈ పంచ తీర్థానికి వచ్చి మీ మోక్ష సాధన ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చును. మీరు భౌతికంగా చచ్చే లోపుల ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఈ మోక్ష పరీక్ష చేసుకోవచ్చును. అది కూడా నేను తెలుసుకున్న విధివిధానంతో ఈ పరీక్ష చేసి మోక్ష జయం పొందండి.



 నిజానికి ఈ మోక్ష అనుభవం నిజమా కాదా? అని ఆత్మ విచారణ చేసుకుంటే… మనకి యోగశాస్త్రంలో  ఇడా పింగళ సుషుమ్న అని మూడు యోగ నాడుల గురించి చెప్పడం జరుగుతుంది. వీటిలో సుషుమ్నా నాడీ చూస్తే….మూలాధార చక్రం నుండి ఆఖరిదైన బ్రహ్మ రంధ్రం దాకా నిలువుగా తాకుతుంది.   అదే ఇడా పింగళ నాడులైతే, యోగ చక్రాలను రెండు మెలికల పాముల కలయిక లాగా కలుస్తాయి.  ఇవి గ్రంథుల వద్ద కలుస్తాయి.  దానితో ఈ నాడులను చూస్తే రెండు పాముల మాదిరిగాను, అలాగే వీటి కలయిక దగ్గర చూస్తే రెండు చేపల మాదిరిగాను కనపడతాయి.  కావాలంటే ఈ ఫోటోని చూస్తే మీకే అర్థమవుతుంది . 




అలాగే మాకు అరుణగిరి మీద ఆకాశములో మేఘాలతో ఒక పాము అలాగే చేప ఆకారము కనిపించేసరికి ఈ పాము చేప అనే స్వానుభవము అక్షర నగ్న సత్యానుభవమని సాక్ష్యముగా నిలిచింది.


అంటే ఈ లెక్కన చూస్తే, ఇడా పింగళ నాడులు అనేవి రెండు పాములు… అలాగే రెండు చేపలకి సంకేతముగా కనపడితే…. కుండలిని శక్తి ప్రవాహం అనేది ఒక పాము ఆకారంగా సుషుమ్న నాడీ యందు ప్రవహిస్తుందని…. యోగశాస్త్ర వచనం చెబుతోంది కదా! అంటే ఈ కుండలినీ శక్తి పాము కాస్త ఇడా పింగళ నాడులలో ప్రవహించే శ్వాస యొక్క ఉచ్వాస నిచ్వాస అనే చేపలను తింటుంది అని అర్థం అవుతుంది కదా! అలాగే నాకు ధ్యాన అనుభవంగా నా బ్రహ్మ రంధ్రం వద్ద ఉన్న బ్రహ్మ రంధ్ర గుహ యందు ధ్యాననిష్టలో పద్మాసన భంగిమలో ఉన్న ఏకతల అస్తిపంజర కపాల దారి దర్శనమిచ్చాడు…ఈయన ముందు అమృత తీర్థం ఉంది.  ఇందులో మూర పరిమాణం ఉన్న రెండు పెద్ద చేపలు కనిపించాయి. ఇవి కర్మ అలాగే జన్మ సంకేత చేపలని జ్ఞాన స్ఫురణ అయింది.  చంద్రగ్రహణ సమయంలో మన కుండలిని శక్తి కాస్త మూడు అడుగుల పాముగా…. ఈ సరస్సు నందు ప్రవేశించి ….జన్మ చేపను తినటం జరిగింది. ఆ తర్వాత సూర్యగ్రహణ సమయంలో ఇదే పాము కాస్త కర్మ చేపను తినే ధ్యాన దృశ్యం చూడటం జరిగింది. తద్వారా సాధకుడికి పునః జన్మ అలాగే పునః కర్మ నుండి జన్మ రాహిత్యము, కర్మరాహిత్యము జరిగి  శూన్యంలో శూన్యం అవుతాడని నాకు అర్థమైంది.  అంటే ఈ లెక్కన చూస్తే… ఈ పాండవ తీర్థంలో కనిపించే పాము కాస్త చేపలు తినే మోక్ష అనుభవం అక్షర సత్యం అని నాకు అర్థమై మౌనం వహించాను. 


ఇందులో చేప జన్మ అనేది కీర్తి దేహం అయితే, కర్మ జన్మ అనేది స్థూల దేహానికి సంబంధించినది. అందువలన మన సాధనలో ధ్యాన దృశ్యముగా పాము చేత కీర్తి శరీర చేప అయిన జన్మ చేప మింగే దృశ్యమును చూస్తాము. కానీ, స్థూల శరీర చేప అదే కర్మ జన్మ చేపను పాము తినే దృశ్యము చూడలేము. ఎందుకంటే…. ఆఖరి కర్మ తీరితే మన భౌతిక స్థూల దేహము మరణం పొందుతుంది. ఏది ఆఖరి నిద్రో…. ఏది ఆఖరి భోజనమో… లేదా ఏది ఆఖరి ప్రయాణమో…. ఇలా ఏది ఆఖరి కర్మయో విధాత కర్మ ప్రదాత అయిన అరుణాచలేశ్వర స్వామికే తెలుస్తుంది. కాబట్టి ఈ కర్మ చేప మరణం… మనము చూస్తే మనం మరణించినట్లు కాదు కదా! కానీ చూడకపోయినా మరణించలేదని అనుకోలేము కదా! అలాగే ఈ కర్మ చేపను పాము మింగే ప్రయత్నమును చూడవచ్చును… అనగా మన మరణ సమయమును మనం తెలుసుకోవచ్చు… కానీ మనం మరణించిన విషయం మనం తెలుసుకోలేము. 


ఆఖరిగా…. అంతిమముగా…. సాధన పరిసమాప్తి సమయంలో వచ్చే ఈ రెండు రకాలైన చేపలు… అనగా జన్మ చేప, అలాగే కర్మ చేప అనేవి తాంత్రిక విధివిధానంలో చూస్తే, ఈడ పింగళ నాడుల యొక్క శ్వాస గమనమైన ఉచ్ఛ్వాస , నిచ్వాస అనే బంగారపు చేపలుగా గుర్తించి….మత్స్య సాధన చేయటం జరుగుతుంది. అలాగే ఈ తాంత్రిక విధానంలో ఉపయోగించే పంచ మకారాలలో…. మాంసము,మద్యము,మత్స్యము,ముద్ర, మైధునము అనే ప్రక్రియలలో…. మత్స్యము పెట్టడం జరిగింది. దీనిని బట్టి చూస్తే దక్షిణాచారము లోనూ… అలాగే వామాచరము లోనూ సాధనపరిసమాప్తికి అంతిమ మోక్ష సాధనగా మత్స్య సాధన ఉన్నదని తెలుస్తుంది కదా!  అదే ఈ రెండు చేపలను భగవద్గీత పరంగా చూస్తే , అంతిమముగా చెప్పబడిన కర్మ మోక్షము అలాగే బంధం మోక్షానికి సంకేతాలుగా శబ్ద పాండిత్యం చెప్పడం జరుగుతుంది.  అంటే కర్మ చేప అనేది ఈ జన్మకి కారణ, కారకాలు గురించి చెబితే…. జన్మ చేప అనేది మనము చనిపోయినా మిగిలిపోయే మన కీర్తి దేహమునకు సంబంధించినది అన్నమాట!  ఇందులో కర్మ చేప చనిపోతే కర్మ మోక్షముగాను…. జన్మ చేప చనిపోతే బంధ మోక్షముగాను…. అవుతుంది. ఎవరైతే అరుణాచలనామ స్మరణ చేస్తూ ఉంటారో …..వారికి ఉన్న సర్వకర్మ ఋణ బంధాల నుండి విముక్తి పొంది…. అరుణమై పూర్ణ మోక్షం పొందటం జరుగుతుంది. ఇక కర్మ మోక్షము అనేది…..ఎవరైతే ఈ క్షేత్రములో స్థిర నివాసమును తను చనిపోయే ముందు క్షణము పొందే దాకా చేస్తారో…..వారికి కలిగే మోక్షమే కర్మ మోక్షము అవుతుంది.  ఎందుకంటే కర్మ ఆరంభ నివారణకి మూలము ఈ అరుణగిరి అవుతుంది. ఇక్కడ ఉన్న పర్వత లింగము యొక్క అనంత జ్యోతి శక్తికి మనలో ఉన్న సర్వకర్మలు నాశనం అవుతాయి.  కర్మ శేషము లేకుండా పోతుంది.  కాకపోతే చచ్చేదాకా ఇక్కడ స్థిర నివాసం చేయాలి …లేదా ఎక్కడైనా చస్తే మన శ్రాద్ధ కర్మను ఈ క్షేత్రంలో చేసినా కూడా కర్మ మోక్ష ప్రాప్తి అలాగే పూర్ణ మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుందని ఖచ్చితముగా నిశ్చయముగా చెప్పవచ్చును. నిజానికి అందరూ కూడా రెండు చేపలు అలాగే రెండు పాములు గురించి చెబుతారు.  కానీ మూడు చేపలు అలాగే మూడు పాములు ఉన్నాయని చాలామందికి తెలియదు.


ఇందులో ఇడా పింగళ  నాడులలోని ప్రాణశక్తి ప్రవాహమును రెండు పాములు గాను వీటి మధ్య జరిగే శ్వాస గమనమైన ఉచ్వాస నిచ్వాసలను రెండు చేపలుగాను…. రెండు చేపల మరణాలే కర్మ బంధ మోక్షాలుగా చెప్పడం జరిగింది.  కానీ మూడవది సుషుమ్న నాడీలోని  కుండలినీ శక్తి ప్రవాహం అనేది…. కాల సర్పముగాను అలాగే బ్రహ్మరంధ్ర గుహలోని అమృత తీర్థముగా ….అంతర్గతంగా మూడు అంగుళాల రూపములో ఉండే చేపను స్థూలదేహ చేపగా ఎవరు గుర్తించరు.  అంటే మన కుండలిని శక్తి రూపమైన కాలసర్పము కాస్త మహా మృత్యువుగా మన స్థూల దేహమైన స్థూల దేహ  చేపను తినటం జరిగితే కానీ…. శూన్యము నందు మనం శూన్యము కాలేము.  ఇది జరుగుతున్నప్పుడు మనకి దేహ స్పృహ ఉండదు. మన మరణం మనకి తెలియదు కదా!  తెలిస్తే మనం మరణించినట్లు కాదు కదా!  మన మరణము మనకి తెలియకపోవచ్చు…. ఇతరులకి తెలిసే అవకాశం ఉంటుంది కదా!  ఇలా మన స్థూల దేహానికి మహా మృత్యువు రావాలంటే…. ఈ దేహానికి ఉన్న కర్మ అలాగే బంధము కూడా కర్మ బంధ శేషము లేకుండా సంపూర్తిగా పూర్తి అవ్వాలి.. అంటే ఈ రెండు చేపలను రెండు పాములు తింటే ఈ రెండు పాములు కాస్త కాల సర్పము అనే పాము ఉన్న పూర్ణ శూన్యములో శూన్యం అవ్వడమే పూర్ణ శూన్య మోక్షము అవుతుంది అన్నమాట!  అందుకని మనకి పాండవ  తీర్థము గుడిలో లోపల రెండు చేపలు అలాగే రెండు పాముల గుర్తులు ఉంచితే…. గుడి బయట కోనేరు దగ్గర ఒక చేప అలాగే ఒక పాము గుర్తు పెట్టడం జరిగింది.  ఈ లెక్కన చూస్తే మూడు చేపలు అలాగే మూడు పాములు ఉన్నాయని తెలుస్తుంది కదా!  ఇదంతా కూడా మనకి ఉన్న అర్హత, యోగ్యత, యోగము బట్టి ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగి తీరుతుంది.  మధ్యలో ఆగిపోవచ్చు లేదా పూర్తి అవ్వచ్చును.  ఏది కూడా మన చేతిలో లేదు. మన కర్మ ప్రధాత రాతలో ఉంది.  అందుకే మోక్షజన్మకి శివానుగ్రహము, గురువు అనుగ్రహము ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇందులో గురువు అనుగ్రహం వలన బంధ నివృత్తి అయిన బంధ మోక్ష ప్రాప్తి కలిగితే ……శివానుగ్రహం వలన కర్మ నివృత్తి అయిన కర్మ మోక్ష ప్రాప్తి కలుగుతుంది.  ఈ రెండు జరిగినప్పుడు అంతే సహజసిద్ధంగా మూడవది అయిన మన కాలసర్పము కాస్త మన స్థూల దేహమును మహా మృత్యువు పేరుతో తన ఒడిలోనికి తీసుకొని పోతుంది.  ఇదియే వెనక్కి తిరిగి రాని మోక్ష జన్మ అవుతుంది.  ఇలా మూడు స్థితులు ఎవరైతే పొందుతారో…. వారే పూర్ణ మోక్షగామి అయ్యి,  విశ్వ పూర్ణశూన్యము నందు శూన్యము అయ్యి పూర్ణ శూన్య మోక్షము పొందటం జరుగుతుంది అన్న మాట!  ఇది ఖచ్చితంగా , నిశ్చయముగా జరిగే అక్షర సత్యం అని తెలుసుకోండి.  గ్రహించండి మోక్ష జయం పొందండి. 


ఏపుడైతే ఈ చేపమణి కాస్త పరమహంసకి చేరిన 21 రోజులకి తనకి విశ్వమోక్షస్ధితి అనగా నిశ్చల పూర్ణమోక్షస్ధితి కలుగుతోందని స్వానుభవము వచ్చిన కొన్నిక్షణాలకి తన విశుద్ధ చక్రములో ఆవాసము చేస్తున్న ఆకాశశరీరధారి శివస్వామికి  తన మనోనేత్రము ముందు కనిపించగానే అపుడు తన అంతిమ మోక్షానుభవమును చూడమని తన మిత్రులకి చెప్పడము వాళ్ళు చూస్తుండగానే..శివ నందిని కాస్త స్పటిక శివలింగమై శివానంద కంఠంలోనికి ప్రవేశించడం….శివనందిని ఏ విధంగా మోక్షం పొందినదో శివస్వామి ధ్యానాభవము ద్వారా పరమహంస తెలుసుకొన్న కొన్నిక్షణాలకి శివస్వామి గూడ మోక్షం పొందాలని తనలోనికి ప్రవేశించడముతో....ఈయన కాస్త ఆకాశ శరీరధారిగా పరమహంస యొక్క విశుద్ధ చక్రంలోనికి ప్రవేశించడం…..అక్కడ యధావిధిగా స్పటిక శివలింగం రావడంతో ….ఇలా ఇది ఏర్పటానికి ముల్ల కారణ స్పరణ రావడముతో.. ఇదంతా చేసిన శివ నందిని యొక్క ప్రస్తుత జన్మ అయిన భౌతిక స్థూల శరీరధారియైన జ్ఞానేశ్వరికి….. అన్నీ తెలిసిన పరమహంస కాస్త ఏమీ తెలియని ఈమె ఒకసారి అరుణాచలం వచ్చినప్పుడు ఈ అరుణాచల క్షేత్రంలో తనకోసం శివనందిని యొక్క భౌతిక స్పటిక శివలింగమును కొనిపించడంతో …….దానిని తాకిన ఈమెకి అప్పటిదాకా తన సాధనాస్థితి ఏ స్థితిలో ఉందో కూడా తెలియని స్థితి నుండి తన జన్మ అంతిమ మోక్షజన్మ అని….. తన భౌతిక మరణమే మోక్ష మరణం అని….. అనుభవ అనుభూతి జ్ఞాన స్ఫురణలు అందడంతో….. హృదయ స్పందనలు పెరిగి….. ఏదో తెలియని, చెప్పలేని, అలవి కానీ ఆనంద స్థితిలో….. తను ఇన్నాళ్ళుగా…. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శివ సాంగత్య స్థితిని….. ఈ శివలింగం అనుభవ అనుభూతి ఇస్తుందని …. స్ఫురణ రావడంతో….. నాకు కృతజ్ఞత చెప్పి వెళ్లిన కొన్ని నెలలకి అనుకోకుండా శ్రీశైల క్షేత్రంలో నాకోసం నాకు గురుదక్షిణగా ఇవ్వాలనిపించి….. నీలిరంగు ఆదియోగి విగ్రహ మూర్తి కొని నాకు చూపించడంతో….. ఇది నా ఆఖరి శరీర ఆకాశ శరీర ధారి శివుడని ……నీలి ఆకాశ జ్ఞాన శివుడని….. నాకు జ్ఞాన స్ఫురణ అందిన కొన్ని రోజులకి….. నా ధ్యానానుభవ దృశ్యముగా శ్రీశైలం నుంచి అరుణాచల క్షేత్రానికి మోక్షం పొందాలని రావటంతో నీలి దక్షిణామూర్తిగా మారిన ఈయన కాస్త శివనందగాను …..ఈయన రాక కోసం ఎదురుచూస్తున్న బాల అంశ అయిన అమ్మవారు కాస్త శివ నందినిగా మారి స్త్రీ ప్రకృతి సాధనను పూర్తి చేసి….. ఆపై మూల ప్రకృతి సాధన పూర్తిచేసి…… వ్యక్తిగత స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి మోక్షమును…..పూర్ణ మోక్షమును చేసి….. ఆపై విశ్వ మోక్షం చేసి…. మూలస్థాన నిర్జీవ మూర్తి ని చూసి …..శూన్యంలో శూన్యం అవడంతో….. అప్పటికే మోక్ష అనుభవం పొందటానికి సిద్ధంగా ఉన్న విలోహిత రుద్ర అంశ పరమహంస పవనానంద స్వామి గారి స్థూల శరీరంలోనికి తను కాస్త ఆకాశధారిగా ఈయన విశుద్ధ చక్రంలోనికి ప్రవేశించడం ఈ ఆకాశ శరీర మోక్షఋణమైన ధర్మపత్ని ఋణాను బంధం సంపూర్ణము అవ్వడంతో….. పరమహంస యొక్క విలోహిత రుద్రుడి యొక్క ఎరుపు అగ్ని తత్వానికి శివ స్వామి ఆకాశ శరీరం అలాగే శివ నందిని స్పటిక లింగం కాస్త  ఏకమై ఇది కాస్త బ్రహ్మ లింగమై, జ్ఞాన లింగమై, మోక్ష లింగమై విస్పోటనం చెంది శూన్యంలో శూన్యం అవడంతో ఆకాశ శరీరధారిగా మోక్షం పొందడంతో …. లింగ దేహమై…. దహనమై…. పూర్ణ శూన్యంలో శూన్యం అవడంతో పరమహంస భౌతిక దేహం యొక్క కర్మ బంధాలు, ఋణ బంధాలు అన్నీ కూడా కర్మ శేషం ఋణ శేషం లేకుండా సమూలంగా సంపూర్తిగా తీరడంతో ఈయన స్థూలదేహాము కూడా యోగాగ్నితో దహనమై …..బూడిదగా మారటం ఇది కూడా ధూళి కణాలై విశ్వంలో పూర్ణ శూన్యంలో శూన్యం అవడంతో  ఏ శూన్యంలో ఎక్కడైతే మొదలైందో…… అక్కడికి చేరి అంతమవ్వడంతో విశ్వ మోక్షధారిగా విశ్వమోక్షములో అనుభవ అనుభూతి పొందిన అంతిమ రేణువై శూన్యం అవ్వడంతో…… అందరి మరణాలు కాస్త పూర్ణ మోక్షమరణాలై విశ్వ మోక్షమై….. ఆరంభమై అంతం అయ్యింది. ……ఎందుకంటే మోక్షం అనేది భావం కావడంతో …..నేను లేను అని ఈయన స్థిర మనస్సుతో, స్థిర భావం చేయడంతో…. ఈయన మరణం విశ్వ మోక్ష మరణం అయింది. యద్భావం తద్భవతి. 


ఈ ధ్యాన అనుభవాలు జిజ్ఞాసి, జ్ఞానేశ్వరి కూడా పొందడంతో……కపాలమోక్షగ్రంథముగా ఆరంభమై... విశ్వమోక్ష గ్రంథముగా అంతం అవడం అయ్యింది.


మాయ మాయం అయితే:


మోక్షం లేదు ….అమోక్షము లేదు

 మరణం లేదు….. జననం లేదు 

దేవుడు లేడు….. జీవుడు లేడు 

మాయా లేదు……మర్మం లేదు 

జ్ఞానము లేదు….. అజ్ఞానము లేదు 

పురుషుడు లేడు….. స్త్రీ లేదు 

భావం లేదు…. రూపం లేదు 

ఆలోచన లేదు…. ఆచరణ లేదు 

కర్మ లేదు…. జన్మ లేదు 

కర్త లేదు…. క్రియా లేదు 

బంధం లేదు …..బంధనమూ లేదు 

ఏకత్వము లేదు….. ద్వైతము లేదు 

అహము లేదు….. ఇహము లేదు 

అహంకారమూ లేదు…. అనుకువ లేదు

పాపం లేదు….. పుణ్యం లేదు 

సత్యం లేదు…. అసత్యం లేదు 

ఆత్మ లేదు …..జీవాత్మ లేదు


లింగము లేదు ……బిందువు లేదు 

చూసేది లేదు…… చూపించేది లేదు 

చూసేవాడు లేడు….. చూపించేవాడు లేడు 

ఆడేవాడు లేడు ……ఆడించేవాడు లేడు 

ఉన్నదంతా …..

చూసేదంతా …..

నడిపించేదంతా ….

కనిపించేదంతా ….

కదిలేదంతా ….

మార్పు చెందేదంతా ….

రూపాంతరం చెందేదంతా …..

క్షణకాల భంగురమై ….

లేనిది ఉన్నట్లుగా ….

ఉన్నది లేనట్లుగా ….

అసత్యములు సత్యముగా ….

భ్రమ బ్రాంతి మాయగా 

ప్రేరితమైన 

నీ మనోమాయ అయిన…

 నీ మనసు యొక్క ఆలోచన భావము

కదలిక, శ్వాస స్థితిగతి అని 

ఇది ఉన్నదో లేదో తెలియని ….

పూర్ణ శూన్య పూర్ణ అతీత స్థితి యైన నిశ్చలమోక్షస్ధితి అని ….

ఎవరైతే అనుభవ అనుభూతి పొందుతారో ….

అది అక్షర సత్యం అని ….

నిత్య సత్యం అని …..

మనసా వాచా అనుమానభయంలేకుండా….

విశ్వాసముతో నమ్ముతారో….. 

వారికి మాయ మాయమవుతుంది ….

నేను అనే జీవం చచ్చిపోతుంది …

నేను కానీ నేను శివశవం శూన్యం అవుతుంది ……

ఇదే అసలు సిసలైన విశ్వమోక్షం అవుతుంది …... 




విశ్వమోక్షం దృశ్యం :


విలోహిత రుద్ర 14 బంధనాల నుండి విముక్తి పొందడం.....


సుదర్శన + శంఖు + శివ మరియు శ్రీచక్ర యంత్రాలలో …..బంధం విముక్తి పొందడం


చిదంబర నటరాజు క్షేత్రంలో శివ సుదర్శన యంత్రం తెరుచు కోవడం


కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నాగబంధం ఉన్న అది తెరుచుకోవడం


ఉజ్జయిని మహాకాలుడి శివలింగం కింద ఉన్న శంకు యంత్రం తెరుచుకోవడం.


కదిలే ప్రకృతి …కదలని ప్రకృతి …మూల ప్రకృతి…. కాస్త అండ,పిండ, బ్రహ్మాండ సర్వ లోకాలు ఉన్న విశ్వ జగత్తు కాస్త ఉన్న అరుణాచల క్షేత్రములోని అరుణగిరి కాస్త తన చుట్టు తాను తిరుగుతూ..శరవేగముగా తిరగడం ఆరంభమై....


 ప్రళయం వచ్చి భూమి అంతా నీటిలో నిండిపోతూ ….జీవులు మునిగిపోతూ…. ఆలయాలు కనుమరుగవుతూ …..సర్వ సృష్టి అంతా కూడా నీటిమయం అవుతూ ఉండగా…. భూమి వేగంగా….. అతివేగంగా…. చండవేగంగా ….. ప్రచండంగా తనలో తాను తిరుగుతూ….. పక్కనే ఉన్న ఇతర గ్రహాలు కూడా దీని దాటికి తిరుగుతూ…. గదితప్పుతూ….. చండ, ప్రచండ జ్వాలాగ్ని జ్వాలలలో….. ఉన్న సూర్యుడిలోకి ఒక్కొక్కటిగా ప్రవేశిస్తూ…. ఆ వేడిమి దాటికి ఒక్కొక్క గ్రహం విచ్ఛిన్నమవుతూ ……భూమి కూడా చివరికి విచ్ఛిన్నమై…. శూన్యమై…. సూర్యుని జ్వాలాగ్ని తగ్గుతూ…కాంతిలేని నక్షత్రం లాగా మారుతూ…. బ్లాక్ హోల్ గా మారి తన పరిసరాలలో ఉన్న అన్ని గ్రహ శకలాలను తనలో కలుపుకుంటూ ….ఏదీ లేకుండా.. ఏమీ లేకుండా…. ఉన్నదో లేదో తెలియని పూర్ణ శూన్యం అవుతూ…. ఇదే విశ్వమోక్షమని….. ఒక బ్రహ్మాండము ఆది అంతం పరిసమాప్తి అవుతూ ఉండగా….. ఈ బ్రహ్మాండం ఒక ఇసుక రేణువుగాను….. ఇది కూడా సముద్రపు ఒడ్డున రేణువు అని…. ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క బ్రహ్మాండమని ) ఇలాంటి బ్రహ్మండాలు సుమారుగా మానవ మేధస్సుకు అందినంతమేరకు 64 శూన్య భాగం వరకు లెక్కిస్తే 18,466,744,073 ,709, 551,615.అదే 1000వ శూన్యభాగం వరకు లెక్కిస్తే, మన గణిత అనుభవాలు సరిపోవు.ఇంత సర్వం ఉన్న విశ్వజగత్తు కాస్త….


 అఖండ… ప్రచండ ….చండ… వేడిమితో….. ఆకాశంలో ఉన్న ఆదిత్యుడి ఆగ్రహంతో….. సముద్రపు నీటి ఒడ్డున ఉన్న ఒక ఇసుక రేణువు కాస్త విచ్చిన్నమై…..శూన్యంలో శూన్యం అవుతూ ఉంటే 


ఇదే ఆదిత్యుడి అనుగ్రహంతో ……సముద్రపు నీటి అడుగులో ఉన్న ఒక ఇసుక రేణువు కాస్త విభజన చెంది…. ఒకటి రెండు అవుతుంటే….. 


…. పోయేది పోతుంది….. వచ్చేది వస్తోంది ….ఇక్కడ పోయేది ఏమీ లేదు….ఇంత సర్వం ఉన్న విశ్వజగత్తు కాస్త నిర్జీవ నిశ్చలమోక్షస్ధితి పొందడముతో..


సృష్టి ఆరంభములో 

జీవుడు పుడతాడు …దేవుడు పోతాడు …

సృష్టి అంతములో 

దేవుడు పుడతాడు…జీవుడు పోతాడు…


సృష్టి ఆరంభంలో

జీవ సృష్టి పుడుతుంది…. దైవ సృష్టి పోతుంది…

సృష్టి అంతములో 

జీవసృష్టి పోతుంది…. దైవ సృష్టి ఏర్పడుతుంది…


ఇది భావ రూప స్వప్నమని గ్రహించిన నాడు

 మాయ మాయం అయ్యి 

సన్యాసి అయ్యి శూన్యం అవుతాడు…

ఇది సత్యమని అనుకునేవాడే…

సంసారి అయి పునః సృష్టి కారణం అవుతాడు….


మోక్షము లేదా అమోక్షం అనేది 

శూన్యము లేదా పునః కర్మ జన్మ అనేది 

మీ ఆలోచన భావ  స్థితియే నిశ్చయిస్తుంది…


వివేక బుద్ధి ….విచక్షణ జ్ఞానమంటే 

శూన్యమవుతావు…

అవివేక బుద్ధి…. ఆలోచన రహిత స్థితి ఉంటే 

పునః సృష్టి అవుతావు…

మీ స్థిర నిశ్చయమే 

నిశ్చల మోక్షస్థితి ఇవ్వవచ్చును.. 

లేదంటే అనిశ్చల భోగ స్థితి ఇవ్వవచ్చును 


యద్భావం తద్భవతి



 ఇక్కడ కొత్తగా వచ్చేది ఏమీ లేదు …..

శక్తి సృష్టించబడదు.నాశనం అవ్వదు.

ఎందుకంటే….

ఇదంతా కూడా….

భావ రూప జగన్నాటక స్వప్న దృశ్యం.


స్వప్న దృశ్యమైన విశ్వ జగత్తు నిశ్చల మోక్ష స్థితి పొందింది .


విశ్వజగత్తు ఉన్న అరుణగిరి కాస్త అగ్నికొండ కాస్త బూడిదకొండగా మారి 

నిశ్చలమోక్షస్ధితిలో శాశ్వతముగా కదలకుండా మెదలకుండా నిశ్చలమైంది.


కాబట్టి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి .

మోక్షం అంటే ఏక భావ మోక్షభావం అని…. 

అమోక్షం అంటే మిళిత మోక్ష భావం అని. 

అదే మాయ అంటే అస్థిర భావము అని ….


మోక్ష జ్ఞాన స్ఫురణ పొంది…. మోక్షభావం పొందండి …


యద్భావం తద్భవతి 


ఇది కథ కాదు సత్య లోకంలో ఉన్న నిగూఢ రహస్య సత్య జ్ఞానం ఇది అని ఎవరైతే మనస్ఫూర్తిగా….. ఆర్తిగా…..మధుర భక్తితో….. సర్వస్య శరణాగతితో…..అమిత శ్రద్ధా భక్తులతో….. ఆత్మవిశ్వాసముతో….. నమ్ముతారో …..వారి మరణమే మోక్షమరణం. ఇది నమ్మితే బాగుపడతారు …లేదంటే బాధపడతారు…



ఓం పూర్ణమద:పూర్ణమిదం 

పూర్ణాత్ పూర్ణమదచ్యతే!

పూర్ణస్య పూర్ణమాదాయ 

పూర్ణమేవావశిష్యతే !!


భావం: అది పరమాత్మ పూర్ణం..ఇది సృష్టి పూర్ణం..పూర్ణమైన పరమాత్మ నుండి పూర్ణమైన సృష్టి ఉద్భవించింది.ఈ పూర్ణమైన సృష్టిన్ని తిరిగి పూర్ణమైన పరమాత్మ గ్రహింస్తాడు.ఇలా అది పూర్ణం నుండి ఇది పూర్ణం  తీసివేసిన తరువాత అది పూర్ణం నిశ్చల స్ధితిలో మిగిలే ఉంటుంది.



ఆదిశంకరాచార్యుడి అభిప్రాయం ప్రకారం మోక్షం అంటే నిశ్చల స్థితిని పొందడం అని మనకి భజగోవిందం శ్లోకంలో తొమ్మిదవ శ్లోకంగా 


సత్సంగత్యే నిస్సంగత్వం 

నిస్సంగత్వం నిర్మోహత్వం 

నిర్మోహత్వే నిశ్చలతత్వం 

 నిశ్చలతత్వే జీవన్ముక్తి: 


చెప్పడం దానిని బట్టి చూస్తే …..అంతిమంగా మనకి కనపడే రూప ధారి స్థితి నిశ్చల స్థితిలో ఉండి నిర్జీవమై మోక్షం పొందాడని చెప్పకనే తెలుస్తోంది గదా..! .ఈ లెక్కన చూస్తే రూప ధారి నిర్జీవ మూర్తి ఉండటం చేత… విశ్వ మోక్షం పొందామో లేదో తెలియని విచిత్ర అవస్థగా విశ్వమోక్షం ఉంటుంది.


శ్లోకం:


ఓం అసతోమా సద్గమయ |

తమసోమా జ్యోతిర్గమయ |

మృత్యోర్మా అమృతంగమయ |

ఓం శాంతిః శాంతిః శాంతిః || 


అర్థం 


అసతోమా సద్గమయ: అశాశ్వతమైన (అసత్యం) నుండి శాశ్వతమైన (సత్యం) వైపుకు నన్ను నడిపించు.

తమసోమా జ్యోతిర్గమయ: అంధకారం (అజ్ఞానం) నుండి వెలుగు (జ్ఞానం) వైపుకు నన్ను నడిపించు.

మృత్యోర్మా అమృతంగమయ: మృత్యువు నుండి అమృతత్వం (శాశ్వతత్వం) వైపుకు నన్ను నడిపించు.

ఓం శాంతిః శాంతిః శాంతిః: ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక శాంతులు కలుగుగాక. 


భావం:

ఓ దేవా, అసత్యం నుండి సత్యానికి, చీకటి నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి నన్ను నడిపించు. 



గమనిక:- 


మోక్షం అనేది ఒక భావము. ఇది పొందేమో లేదో పొందే వాడికి తెలియదు… తెలిస్తే అది పొందినట్టు కాదు…. తెలియకపోతే పొందలేదని అనుకోలేము.. కేవలం మోక్షం ఎప్పుడు పొందుతామో తెలుసుకుంటాం కానీ….. పొందామని తెలుసుకోలేము. మన మోక్ష మరణము మన తర్వాత తరాల వాళ్ళు చూసే అవకాశ రికార్డు దృశ్యం అవుతుంది. అంటే శివ నందిని మోక్షమరణ విధానమును శివ నంద స్వామి చూశాడు. ఈయన మోక్ష విధానమును పరమహంస పవనా నంద స్వామి చూశాడు. ఈయన మరణ విధానమును వీరి యోగ మిత్రుడైన జిజ్ఞాసి అలాగే యోగ మిత్రురాలైన జ్ఞానేశ్వరి చూడడం జరిగింది . తద్వారా వీరి ద్వారా వీరి అందరి మోక్ష అనుభవాలు లోకానికి కపాలమోక్షం మరియు విశ్వమోక్షం గ్రంధాలు ద్వారా తెలిసింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే…. స్త్రీ ప్రకృతిలో మోక్ష అనుభవం కారుంగలి శివలింగ దహనం ద్వారా….. అదే పురుష ప్రకృతిలో అయిన గంధపు శివలింగ దహనం ద్వారా…. అదే మూల ప్రకృతిలో లింగ దేహ దహనము ద్వారా అలాగే విశ్వ జగత్తు లో మూలస్థాన మూర్తి దర్శనం ద్వారా ….ప్రతి సాధకుడు తమ మోక్ష అనుభవాలు పొందడం జరుగుతుంది. కానీ అంతిమ మోక్ష అనుభవాల అనుభూతి పొందిన విషయం ఎవరికి వారు తెలుసుకోలేరు. గ్రహించలేరు…కానీ మోక్ష అనుభవాల ద్వారా అలాగే అంతిమ దైవిక వస్తువుల ద్వారా…. అనగా కారుంగలీ , గంధ శివలింగాల ద్వారా…. అర్ధనారీశ్వర విగ్రహం మూర్తి ద్వారా…. చేప మణి ద్వారా…. స్త్రీ ,పురుష, మూల ప్రకృతి విశ్వ జగత్తు లో జరిగే జగన్నాటకమును తమ జీవ పాత్ర స్వప్న భావ రూప ధారి పాత్ర శాశ్వతంగా నశించునని ఈ మోక్ష అనుభవాల ద్వారా అలాగే…. అంతిమ దైవిక వస్తువుల ద్వారా….. ముందుగానే తెలుసుకొని…..నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవి వచ్చినా ….రాకపోయినా జరిగేది జరగక మానదు కదా! చచ్చినట్లు మనం పూర్ణ మోక్షమును పొంది పూర్ణ సమయంలో శూన్యం అవ్వక తప్పదు …మోక్షం పొందే యోగము, యోగ్యత, అర్హత మనం సంపాదిస్తే చాలు. ఆ తర్వాత మన మోక్షం మరణము దాని అంతట అదే వచ్చి పొందక తప్పదు. ఇదే సత్యము.. ఇదే సత్య అనుభవ అనుభూతి అవుతుంది.


యాద్భవం తత్భవతి 




ఈ నా ధ్యానానుభవంగా ధ్యాన నిష్ఠలో ఓంకారం చేస్తూ….. తర్జనీ  ముద్ర సాధన చేస్తూ ఉండగా…. మొదట ధ్యానంలో పిడికిలి ముద్ర,  అదే ముష్టి ముద్ర కనపడింది . ఆ తర్వాత పసుపు వర్ణ చేప మణి కనపడింది.  దీని తర్వాత బిలాకాశం…. దీని లోపల మబ్బుల సొరంగ  మార్గం దర్శనం…. లోపలికి రెండు కిలోమీటర్లు వెళ్లిన తరువాత , అవతలి వైపు నీలి వర్ణ మగ నెమలి , ఆ తరువాత తెలుపు రాజహంస, ఆ తర్వాత తెల్లని పావురము ,ఆ తర్వాత తెల్లని రామచిలుక… ఆపై అగ్ని జ్వాలతో ఉన్న వంపు పైకి ఉన్న ఓంకారం గుర్తు కనిపించి ధ్యానభంగం అయ్యింది.


ఆత్మ విచారణ చేసుకుంటే….. నెమలి అనేది కామ భావానికి…. రాజహంస అనేది జ్ఞాన భావానికి… పావురం అనేది ప్రేమ భావానికి జ్ఞాన పాండిత్యానికి….. చిలుక అనేది శబ్దజ్ఞాన పాండిత్యానికి …..సంకేతాలు అని అర్థమైంది. నాలో ఉన్న ఈ నాలుగు భావాలు పరిసమాప్తి కోసం ముష్టి ముద్ర,  చేప మణి… ఓంకార సాధన చేస్తే భావతీత స్థితి…. నిశ్చల స్థితి…. అనుభవ అనుభూతి పొందుతారని చెప్పడం జరిగింది. దీనికి ఇంకా ఆరు సంవత్సరాల సాధన ఉంది . ఇది తెలుసుకొని , రాసుకున్న తర్వాత పెన్ను కనిపించలేదు . ఇంట్లో …బయట వెతికాను . ఎక్కడా కనిపించలేదు .పోయింది .ఎలా పోయిందో అర్థం కాలేదు.  దీనిని బట్టి చూస్తే ఇంక చెప్పడానికి…. అలాగే రాయటానికి… ఏమీ లేదని… అంతా పూర్ణమైందని…. కేవలం అనుభూతి సాధన మాత్రమే మిగిలిందని…. శబ్ద పాండిత్య, అనుభవ పాండిత్య ధ్యాన  అనుభవాలు పూర్ణమయ్యాయని గ్రహించాను.  ఇక ఈ క్షణం నుంచి నా పెన్ను పాళి  విరిగింది.  గొప్ప రచయితలలో…. రాయటం పూర్తి అయితే , పెన్ను  పాళి విరిచేస్తారు. ఇంక  రాయరు… రాయలేరు …వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం జనాలకి తన రాతల ద్వారా…. రాయడం ద్వారా….. సంపూర్తి అయ్యిందని … ఈ పాళి విరగగొట్టి,  రాయటం ఆపేస్తారు.  అదే యోగలైతే… తమ శబ్ద లేదా అనుభవ పాండిత్యం పూర్తి అయితే …..నాటి క్షణమే మౌనః యోగిగా మారిపోతారు.  నాలో ఈ రెండు భావాలు ఉండటంతో…. కొత్తగా తెలుసుకునేది , కొత్తగా రాసేది ఏమీ లేదని… నాకు అర్థం అయిందని మీకు అర్థమై ఉంటుంది . ఈ క్షణం నుంచి చెప్పడం, రాయడం ,తెలుసుకోవడం ,అనుభవాలు…. ఇలా నాలుగు భావాలు శాశ్వతంగా ఆపివేస్తున్నాను . 


ఎందుకంటే వచ్చిన పని పూర్తయింది.


         జిజ్ఞాసి అలాగే జ్ఞానేశ్వరి 


             శుభం భూయాత్




అమృతానుభవము :


ఆత్మ అనేది ….

పూర్ణ శూన్యము అనే సముద్రము నందు…

 మనసు అనే అల ప్రవాహం వలన…

శరీరము అనే చచ్చిన చేప కాస్త బ్రతికి…. కదులుతున్నట్లుగా భావము…. నిత్యం ఏర్పడుతూనే ఉంటుంది… నిజానికి

 కదిలేది లేదు ….కదలనిది లేదు….

 కానీ

 సముద్రపు అల ఆగదు… మనసు అల ఆగదు…ఆగితే “నేను” అనేది నిశ్చలమవుతుంది… అదియే నిశ్చల మోక్షం అవుతుంది….

కానీ ఎప్పుడో మనసు ఆగిన విషయం….

 ఎన్నటికీ మనసుకి తెలియదు…. తెలిస్తే 

అది ఆగినట్లు కాదు కదా! తెలియకపోతే …

ఆగలేదు అనుకోలేము కదా! మనసు ఆగిందని తెలిస్తే …పూర్ణజ్ఞానం …

అదే మనసు ఆగలేదని అనుకుంటే 

అజ్ఞానం


 మనసు ఆగితే ….“నేను కానీ నేను”

 ఆత్మయే నిశ్చలమవుతుంది…

 మనసు ఆగకపోతే “నేను” అనే అహంకారంతో అనిశ్చలం అవుతుంది. 

ఆత్మ అయినవాడు ….

సర్వకర్మ బంధాల

 నుండి విముక్తి పొందిన ….

జీవన్ముక్తుడు


మనసు అయినవాడు…. 

సర్వ కర్మ బంధాలకి బందీ అయ్యి…

 పునరపి అవిముక్తుడు….

 బంధానికి ,మోక్షానికి మనసే మూల 

మనో కారణకారకము….

 మనసు కదిలితే బంధం అవుతుంది…

 మనసు కదలకపోతే బంధ విముక్తి 

మోక్షం అవుతుంది…

 నిజానికి శరీరం, మనసు ,బుద్ధి ,ఆత్మ అనేవి కదిలేది,కదలదు అనేవాటికి… మన భావజ్ఞాన స్పురణయే ఆధారము…

యద్భావం తద్భవతి


 “నేను ఉన్నాను” అని భావిస్తే…

 కదిలే విశ్వ ప్రపంచం కదులుతూ కనిపిస్తూ ఉంటుంది…

 “నేను లేను” భావిస్తే ….

 కదిలే విశ్వ ప్రపంచంలో …కదలని పూర్ణ శూన్యం 

అవగతం అవుతుంది


 అప్పుడు ….

ఇన్నాళ్లుగా సముద్రంలో …ఆదిలో… ఏనాడో చచ్చిన చేప… కాస్త బతికి 

కదులుతున్నట్లుగా కనపడుతోందని ..

పూర్ణజ్ఞాన స్పురణ మనస్సుకి అంది ….

నెమ్మదిగా నిశ్చలమవుతూ వస్తుంది….

 అది నిశ్చలమైన విషయం “నేను” కి తెలియదు..

 తెలిస్తే అది నిశ్చలమైనట్లు కాదు కదా! తెలియకపోతే అది నిశ్చలం

 కాలేదు అనుకోలేము కదా! 

అది పొందామో లేదో తెలియని స్థితి…

 ఈ విచిత్ర అవస్థయే నిశ్చల మోక్షం అవుతుంది… యద్భావం తద్భవతి 

                           –---------

ఈ స్థితి అవగతం అవుతున్నప్పుడు…

 నేను కాస్త మౌనం అవుతుంది …

“మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు… మాట్లాడాలని అనిపించకపోవడం …”


 ఎవరైతే ….

అన్నింటి యందు…. సర్వకర్మల యందు… సర్వ బంధాలయందు… సర్వ కార్యాలయందు…

మౌనః మునిగా… మౌనః జ్ఞానిగా…

 మౌనః గురువుగా…మౌనః కర్తగా… 

మౌనః కర్మగా…. మౌనః క్రియగా…

మౌనః సాక్షి భూతముగా.. మారుతారో మారుతున్నారో …మారుపడుతున్నారో నిస్సందేహముగా వారి మనసు

నిశ్చలమవుతుంది…

నిశ్చల మోక్షస్థితి పొందుతుంది…

 ఇది పొందామో లేదో తెలియని 

అవస్థనుండి…. ఉందో లేదో తెలియని…

 శూన్యభావ స్థితి నుండి…. మనసు అతీత స్థితిని పొంది…. శూన్యాతీత పూర్ణ శూన్యము 

నందు స్థిరమై…

 నిశ్చల మౌనబ్రహ్మ అవుతుంది…

ఇదియే మౌనః బ్రహ్మ 

“దక్షిణామూర్తి అవతార అంతరార్థం”

 మనసు మౌనం పొందడమే 

నిశ్చల మోక్షము అవుతుంది. 

ఇది అసలైన “నేను” పొందే మౌనస్థితి…

 

 మనసు మౌనః స్థితి కోసమే..

 సాధనా సాధ్యతే సర్వం సాధ్యం అనే 

సాధన ఆరంభమయ్యింది …

“నేను ఎవరు” అని ఆత్మ విచారణ 

చేసుకుంటే దీనికి సమాధానమే…

 మౌనమని నీ మనసు గ్రహిస్తే …అప్పుడు

మనసు మౌనః బ్రహ్మ అయితే…

 మనో మాయ మాయం అయ్యి ….

సాధన పరిసమాప్తి అవుతుంది…

మాయ మాయమైతే పొందేది…

 మనసు పని చేయని నిశ్చల స్థితియే

 నిశ్చల మోక్షస్థితి

 ఇదియే “పూర్ణ మోక్ష జ్ఞానం”…

 ఇదే దక్షిణామూర్తి “మౌనబ్రహ్మస్థితి” ….

ఇదియే “నిశ్చల పూర్ణ శూన్యం మోక్షం”.

 

ఆఖరి బహుమతి:


నాకు అంటూ వచ్చిన మొదటి మరియు ఆఖరి బహుమతి

ఇది ఇలాయుండగా నా 48 పుట్టినరోజు అదే మరణరోజున నాకు బహుమతిగా ఒక చిన్నారి పాప జ్ఞానేశ్వరి తన చిత్రలేఖనముతో తన మనస్సులో వచ్చిన ఉహతో ఒక చేప బొమ్మను గీసి నాకు ఇచ్చింది.ఈ పాపను చూస్తే మీనాక్షి దేవి అంశయని గ్రహించి నా కీర్తిదేహమైన చేపదేహము పూర్ణశూన్యమైందని ఈ పాప చేత ఆ మీనాక్షి నాకు ప్రత్యక్షానుభవముగా చూపించిందని గ్రహించి మౌనము వహించాను. ఈ బొమ్మను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇందులో నాకు ఒక పెద్ద చేప అలాగే ఒక చిన్న చేప కనిపించాయి.పెద్ద చేప అనేది కదిలే చేపగాను..అదే చిన్న చేప అనేది కదలని నిశ్చల చేపగా అనిపించాయి.అంటే ఈ లెక్కన చూస్తే చచ్చిన చిన్నచేప యొక్క స్వప్న స్ధూల శరీరమే కదిలే పెద్ద చేప అన్నమాట.అలాగే చెరువు..నీళ్లు..పూల మొక్కలు అనే విశ్వజగత్తుకి ప్రతీక అన్నమాట.ఉపనిషత్తులో చెప్పపడిన చెట్టు మీద రెండు పక్షులుంటే వాటిలో ఒకటి ఏగురుతూంటే మరొకటి కదలకుండా ఉంటుందని చెప్పినదానిలో నిజానికి అనుభవపాండిత్యములో పరముగా చూస్తే అంతిమముగా వచ్చేది రెండు చేపలు అని అందులో ఒకటి చచ్చిన చేప   మరొకటి దీనిని స్వప్నమైన కదిలే చేప అని నాకర్ధమైంది.కాని ఇంతటి మూలజ్ఞానమును ఇంత చిన్న బుర్రలో శివుడు ఎలా పెట్టాడో కదా.ఆయనికి సాధ్యము కానిది ఏముంది..చిన్నవిత్తనములో అంత పెద్ద మర్రిచెట్టే దాచాడు గదా.ఇంతటి జ్ఞానమును ఈ పిల్లకాయ ఎలా పొందినదో తెలుసుకోవాలని అనిపించి చూస్తే నా గత జన్మాంతరాలలో ఈ పిల్లకాయ నా తంత్రసాధన ప్రియశిష్యురాలని తెలిసింది.అపుడు దీనికి నేను తంత్ర గురువుగా ఉండి సాధన చేయిస్తే అదికాస్త సాధనపరిసమాప్తి సమయములో పాము కాస్త చేపను తినే అంతిమ మోక్షానుభవమును పొంది తను లేదు అని..తను ఒక చచ్చిన చేప శవమని..తను బతికున్న శివశవమని..తను మోక్షమరణం  పొందినానని   మూలమోక్షజ్ఞానము పొందినప్పడికి తన స్వానుభవాలు మీద నమ్మకము లేక అనుమానభయముతో పాము కాస్త చేపన్ని తినటము చూసి తంత్ర సాధనలో వచ్చే పంచ మకార సాధనలో చేపను తను తినాలని ఆ జన్మాంతగూడ చేపలు తప్ప మరొకటి తినలేదు.దానితో ఈ జన్మలో దానికి చేపల మీద విరక్తి కల్గి సముద్ర పీతలు తినాలనే కోరిక మాయలో పడింది.తను ఈ జన్మలో గూడ  ఈ మోక్షమరణ అనుభవము పొందినగూడ లేని విశ్వము కోసము తను కర్మ చెయ్యాలని తపన తాపత్రయ పడుతోంది.కర్మ మాయ తీరేదాకా కర్మఫలము అనుభవించక తప్పదు గదా.తను ఈ విధంగా నాకు చేపబొమ్మ గీసి తన జన్మాంతర గురురుణము తీర్చుకొని నన్ను తన తంత్ర రుణానుబంధవిముక్తి చేసింది.మరి ఇది తెలుసుకున్న గూడ తను పూర్ణశూన్యము పొందుతుందో లేక గావాలని ఏదో ఉందని ఏదో చెయ్యాలని పున:కర్మ జన్మకి వెళ్లుతుందో ఆ శివయ్యకే తెలియాలి.ఇక ఇంతటి బహుమతి ఇచ్చిన ఈ చిన్నారికి నేను కాస్త తన పుట్టినరోజుకి చేప చెవిరింగులు,చేపగొలుసు,చేపమణి బహుమతిగా ఇచ్చాను.రుణశేషము లేకుండా పూర్తి చేసుకున్నాను. 


చెరువు ఎండిపోయింది:-



                                                                    చెరువు ఎండిపోయింది


ఎపుడైతే నాకు పాము కాస్త చేపను తినే ప్రత్యక్షానుభవము పొందిన రోజు నుండి నాకు ధ్యానములో బ్రహ్మరంద్ర గుహ వద్ద ఉండే అమృత సరస్సులో చేపలు తిరగడము కనిపించసాగింది.ఇవి సుమారుగా 12 చేపలు కనిపించాయి.ఇందులో 8 చేపలు జంటలుగా ఆడ,మగ గా ఉంటే నాలుగు పెద్ద చేపలు ఓంటరిగా కనిపించసాగాయి.ఒకరోజు ధ్యానములో మూడు అడుగుల ఉన్న బంగారపు వర్ణ ఒక సర్పము కాస్త ఈ చేపలలో ఒక చేపను పట్టుకొని తినే దృశ్యము కానవచ్చింది.దానితో ఒకరితో శాశ్వత రుణానుబంధము తీరి నా జీవితము నుండి వెళ్ళిపోవడము జరిగింది.ఇలా 12 చేపలను 12 నెలల్లో పాము తినడముతో దానితో నాకు ఉన్న  రుణ శేష బంధవిముక్తి కల్గింది.ఒకరోజు మళ్ళీ పాండవతీర్ధానికి వెళ్ళినపుడు ఈ సారి గుడి బయట ఉన్న చెరువు పూర్తిగా నీళ్ళు లేకుండా ఎండిపోతే..అదే గుడి లోపుల ఉన్న చెరువు కాస్త నీళ్ళతో కనపడింది.నాకు అర్ధము కాలేదు.ఆత్మవిచారణ చేసుకుంటే ఎండిపోయిన చెరువు అనేది నేను లేను భావానికి ప్రతీక అయితే నీళ్ళున్న చెరువు అనేది నేను ఉన్నాను అనే భావానికి ప్రతీకయని గ్రహించాను.నిజానికి పూర్ణశూన్యము అనేది ఎండిన చెరువు అన్నమాట.ఎందుకంటే నా సాధనానుభవాలు తీసుకుంటే కపాల మోక్ష గ్రంధ అనుభవాలు అనేవి స్త్రీ ప్రకృతికి సంబంధించినవి.ఇందులో పురుషుడు కాస్త కారూంగళి శివలింగమై శూన్యమైతే .. స్త్రీ మూర్తి మోక్షము పొందకుండ సజీవమూర్తిగా ఉంది.ఇక అదే విశ్వమోక్ష గ్రంధ అనుభవాలు చూస్తే పురుష ప్రకృతి అయితే ఇందులో స్త్రీమూర్తి కాస్త గంధపు శివలింగమూర్తిగా మారి మోక్షము పొందితే పురుషమూర్తి మిగిలిపోవడము జరిగింది గదా.ఆ తర్వాత అంతిమ మోక్షానుభవములో ఈ రెండు ప్రకృతులలో మిగిలిపోయిన స్త్రీ మరియు పురుష మూర్తులు ఏకమై మూలప్రకృతిలో మూలస్ధాన నిర్జీవ నిశ్చలమూర్తిగా మారాడు అని తెలుసుకున్నాము గదా.అంటే ఈ లెక్కనచూస్తే భగవంతుడు ఆదిలో జ్యోతిస్వరూపమై అంతములో ఆరేజ్యోతీయై నిరాకారమైనాడని అర్ధమైంది గదా.అంటే పూర్ణశూన్యములో ఎలాయైతే ఆదిలో వచ్చాడో అలాగే అంతములో వెనక్కి తిరిగివెళ్ళి శూన్యములో శూన్యమై అంతరించిపోయాడు గదా.అంటే పూర్ణశూన్యమనే చెరువు ఎండిపోయునట్లే గదా.నిజమే గదా.మీరే ఆలోచించండి.అంటే మనంతా గూడ నిజానికి ఆదిలో మోక్షమరణము పొందిన చచ్చిన చేపలు అన్నమాట.పూర్ణశూన్యమనే ఏండిన చెరువులో మనము ఇలా చచ్చిన చేప శవాలు అన్నమాట.కాని మనము మోక్షమరణము పొందిన విషయము మనము విశ్వాసించడము లేదు.దానితో చచ్చిన చేప గూడ బతికి ఉన్న చేపలాగా స్వప్న విశ్వజగత్తు యొక్క విశ్వజగనాటకములో ఒక పాత్రను అదిగూడ ఏనాడో జరిగిపోయి రికార్డ్ దృశ్యముగా మన ఆఖరి కీర్తిదేహము చూస్తోంది.దానితో చచ్చిన శివశవము కాస్త బతికే జీవశివగా కనపడుతోంది. ఈ ఒక విషయజ్ఞానము మీకు అర్ధమయితే అంటే నిజానికి నేను లేను..ఉన్నది చచ్చిన శివశవమని ఎవరైతే విశ్వాసింస్తారో వారిది మోక్షజన్మ అవుతుంది.ఎందుకంటే ఈ విశ్వము అనేది విశ్వాసము మీదనే నడుస్తోంది.నేను లేను అని మీరు నమ్మితే మీ దేహ చేప చస్తుంది.అదే నేను ఉన్నాను అనుకుంటే ఏనాడో మీ చచ్చినచేప గూడ బతికున్న శివశవముగా నిత్యము కనపడుతూనే ఉంటుంది.మీరు చచ్చిన శివశవమని నమ్మితే మీ విశ్వజగ్ననాటకములో మీ పాత్ర శాశ్వతముగా ఆగిపోయి ఇక ఎనాడు వెనక్కి తిరిగిరాని పూర్ణశూన్యమునందు శూన్యమైపోతుంది.లేదంటే ఈ విశ్వజగత్తులో పున;కర్మ జన్మాల కాలచక్రములోని స్వప్నరికార్డ్ దృశ్యములో మీరు నిత్యలై శాశ్వతులై అశాశ్వత భౌతికమరణాలు పొందుతూ తిరుగుతూనే ఉంటారు.ఎందుకంటే ఇది యత్భావము తత్భవతి. 


----------------------------------

నా అంతిమ జీవిత సందేశము: 

నా వయస్సు 48..నా ఆయుష్ 54..ఇందులో 48 సం.రాలలో 12 సం.రాలు తెలియని బాల్యనికి పోతే మిగిలిన 36సం.రాలలో 18 సం.రాలు భోగ జీవితానికి అలాగే 18 సం.రాలు యోగజీవితానికి ఖర్చూయాయి.ఇక మిగిలిన 6 సం.రాలు అనేవి ఏకాంత ఒంటరి ప్రశాంత జీవిత ఖర్చు కోసము ఉన్నాయి అన్నమాట.ఇకపోతే నా 36 సం.రాల జీవితానూభవములో చూస్తే 13 యేట నాకు అందరు ఉన్నారు.అదే 48 యేట వచ్చేసరికి ఎవరు లేరు.ఈ 36 సం.రాలలో భోగ పరముగా చూస్తే..చదువులు,ఆటలుపాటలు, ఉద్యోగాలు, ప్రేమలు,పెళ్ళి,సంపాదన,ఆస్తులు, ఇల్లు, స్ధలాలు, బంధాలు,బంధుత్వాలు,ఆప్తులు,మిత్రులు,ఇలా వస్తే అదే యోగపరంగా సాధానుభవాలు, దైవికవస్తువులు, ధ్యానుభవాలు,ధ్యానదృశ్యాలు,వివిధ జ్ఞానాలు పొందడము, గ్రంధరచనలు, యోగమిత్రులు, జన్మాంతర రుణానుబంధాలు రావడాలు,సిద్దులు రావడాలు, యోగశక్తులు పొందడాలు, దైవసాక్షత్కారాలు పొందడాలు ఇలా ఎన్నోన్నో రావడము జరిగింది.చివరికి 48యేట కల్లా నాకు ఇలా వచ్చిన భోగ మరియు యోగ బంధాలు అన్నిగూడ రుణము తీరి తీర్చుకొని వెళ్ళిపోయాయి.ఈ ఒంటరి ఏకాంత జీవితాన్ని అనుభవించడానికి నేను సాధన చేశానా అనిపించేది.చివరికి ఏమి మిగలలేదు.ఏ బంధము నిలబడలేదు.మరి నేను ఏమి సాధించానో నాకు అర్ధము కాలేదు.పిచ్చిపట్టినట్లుగా ఉండేది.ఒకరోజు నాకు ఆత్మవిచారణలో నా 36సం.రాలు పాటు మోక్షము మీద నాకే తెలియకుండా పరిశోధన చేసి మొక్షాస్వానుభవాలు పొంది విశ్వజగత్తులో నిగూఢ రహస్యముగా మోక్షము అలాగే మోక్షజ్ఞానము అలాగే మోక్షమార్గమును విశ్వలోకవాసులకి నేను తెలుసుకొని వారికి నా సాధానుభవాలు చెప్పి నాతోపాటుగా ఏకముగా ఆదిలోనే విశ్వమోక్షము పొందిందని నిరూపించి నేను మోక్షము పొందడము జరిగింది గదా అనిపించింది.ఇంతకంటే  ఈ లోకములో ఇంతకన్నా చెయ్యటానికి ఇంక ఏమిఉంటుదని అనిపించడముతో నా మనస్సు శాంతపడి మన:శాంతి పొందింది.ఇది నిజమే గదా.నేను పొందిన ఈ అనుభవాలు ఎందరో నా కన్న ముందే పొందారు.కాని వాళ్ళు తమ అనుభవాలు లోకానికి చెప్పటానికి భయపడ్డారు.మాయలో పడ్డారు.అనుమానభయముతో ఆగిపోయారు.కాని నేను పొందిన ప్రతి అనుభవము యతాధకముగా ఉన్నది ఉన్నట్లుగా ఏమార్చకుండా ఏమి మార్చకుండా లోకానికి చెప్పడము జరిగింది.స్త్రీ ప్రకృతి మొదలు పెట్టి పురుష ప్రకృతి దాటి మూలప్రకృతిలోనికి వెళ్ళి మూలజ్ఞానమును పొంది విశ్వజగత్తు కాస్త విశ్వమోక్షం అనేది ఆదిలోనే పొందింది అని నా ధ్యానానుభవాలు ద్వారా లోకానికి నిరూపించడము జరిగింది గదా.అలాగే జీవమాయలు,యోగమాయలు,దైవమాయలు,ఇలా ఎన్నో మాయలు దాటి ఎక్కడ మాయలో పడకుండా ఎక్కడ సాధన ఆగిపోకుండా  దాటుకొని తట్టుకొని రావడము అనేది పులి మీద స్వారీ లాంటిదే గదా.అందరు పిచ్.డిలు ఏదో విషయజ్ఞానము మీద పరిశోధన చేసి తెలుసుకొని పొందితే నేను మాత్రము మోక్షము మీద ఎవరు ఇవ్వలేని పిచ్.డి చేసాను.నా వెంట..నాలో..నేను లేని శివుడికి శివుడే ఈ మోక్షజ్ఞానము పొందాడు.


నాది అనుకుంటే శివప్రసాదమని..నాది కాదు అనుకుంటే శివార్పితమని గ్రహించాను.బంధము ఇచ్చినవాడు ఆ బంధ రుణము తీర్చి బంధవిముక్తి చేస్తాడు గదా.చెయ్యాలి గదా. ఎందుకంటే నాది మోక్ష జన్మ గావడముచేత మోక్షమంటే సర్వబంధాల మీద మోహక్షయము అవ్వడము చేత ఈ విధంగా జరిగింది.అందరికి తప్పక ఇలాగే జరుగుతుంది.గాకపోతే మోక్షము కోసము సంసారము వదిలి సన్యాసి గావాలసిన అవసరము లేదని గ్రహించండి.సంసారికి కోరికలు ఎక్కువ అదే సన్యాసి కోరికలు తక్కువ అంతే తేడా అన్నమాట.అదే సంసారి కోరిక మోహవ్యామో మాయలో పడి పున:కర్మ జన్మకి వెళ్తాడు.అదే సన్యాసికి ఈ కోరిక మీద ఎలాంటి మోహవ్యామోహలు పడకుండా ఆ కోరికను తృప్తిగా తీర్చుకొని ఆ కోరికమాయలో పడడు అన్నమాట.ఒక్కటి తెలుకొండి.సాధనకి అలాగే మోక్షానికి భోగ లేదా యోగ జీవితముతో సంబంధము లేదు.అలాగే నువ్వు సంసారముతో ఉన్నావా లేదా సన్యాసిగా ఉన్నావని చూడదు.కేవలము వాడు భోగ లేదా యోగ కోరికలను తృప్తిగా..సంతృప్తిగా..ఆనందముగా తీర్చుకుంటున్నాడా లేదా అని ప్రకృతి చూస్తుంది.ఎందుకంటే వాడి కోరిక వాడికి నచ్చినట్లుగా తీరితే ఇంక ఆ కోరిక మీద వాడికి ప్రేమ,మోహ,వ్యామోహలు కల్గవు.ఒకవేళ కల్గింది అంటే వాడు ఆ కోరికను తనకి నచ్చినట్లుగా అనుభవించలేదు అలాగే తీర్చుకోలేదు అన్నమాట.నిజానికి మాయ అంటే అనుకున్న కోరికను అనుకున్నట్లుగా అనుభవించకపోవడమేనని తెలుసుకొండి. గ్రహించండి.ఇలా మీ కోరికలు భోగమైన లేదా యోగమైనా మీకు నచ్చినట్లుగా తీర్చుకుంటే మీ మరణమే మీ మోక్ష మరణమే అవుతుంది. గాకపోతే మీరు మీ కోరికలు తీర్చుకొనేటపుడు ధర్మయుతముగా తీర్చుకొండి.తృప్తిగా అనుభవించండి.అలాగే ఏదైన కోరికను పదేపదే తీర్చుకొనే పరిస్ధితిలో మీరు ఉన్నారు అంటే ఆ కోరిక మాయలో మీరు పడుతున్నారని గ్రహించండి.ఉదహరణకి మీకు కాఫీ త్రాగాలని కోరిక ఉంది.రోజులో రెండుసార్లు త్రాగి తృప్తి చెందండి.అదే కాఫీ యావలో పడి రోజూకి 50 సార్లు త్రాగితే మీ ఆరోగ్యము దెబ్బతింటుంది గదా.కోరికను అదుపులో ఉంచుకొని ఆనందముగా అనుభవించాలి.అదే కోరిక అదుపు తప్పితే అదికాస్తా అలవాటు కాస్త అవసరముగా మారి అదిలేనిస్ధితికి వెళ్ళి ప్రశాంతస్ధితిన్ని కోల్పోవడము జరుగుతుంది.కోపావేశాలు పెరుగుతాయి. అసహనము,చిరాకు,విసుగు పెరుగుతుంది. అనర్ధాలు,అపార్ధాలు పెరుగుతాయి.సఖ్యత కోల్పోతారు.అదే మీ కోరిక మీ అదుపులో ఉంటే ఆనందము మీ వెంట ఉంటుంది.ఇక్కడ సమస్య ఏమిటంటే మనకి నచ్చిన కోరికలు మనకి నచ్చినట్లుగా అనూభవించకపోవడమేనని నా జీవితానుభవములో తెలుసుకున్నాను.ఇలా అనుభవిస్తే మోక్షకోరిక కూడ ఉండదు గదా. అంటే మన సహజస్ధితిలో మనము ఉండటము లేదు అన్నమాట.ఇలా మన సహజస్ధితిలో భోగ లేదా యోగ కోరీకలు తీర్చుకోవటానికి మీరు ఆనందపడటానికి గురువు లేదా దైవము అవసరమా?ఆలోచించండి.మీకు భోగము లేదా యోగములో ఎవరు కర్మరుణాబంధము ఉంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఆ రుణము తీర్చుకొని వెళ్ళిపోతారు.మీరు ఎవరి కోసము అలాగే దేనికోసము ఎక్కడికి వెళ్లవలసిన అవసరమే లేదు.రుణముంటే అది జన్మాంతర రుణము ఉన్నగూడ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి రుణము తీర్చుకొని పోతారు.ఇలా మీకు గురురుణము లేదా దైవరుణముంటే దీనిని తీర్చుకోవటానికి వీళ్ళే మీ దగ్గరికి చచ్చినట్లుగా వచ్చి భౌతికముగా లేదా ధ్యానములో లేదా స్వప్నములో కనిపించి వాళ్ళ రుణాలు తీర్చుకొనిపోతారు.అంతే.ఇదే సత్యము.కర్మానుసార రుణాబంధమని శాస్త్రవచనము ఉంది గదా.మీ కోరికలను బట్టి మీరు వాటికి తీర్చుకొనే విధానము బట్టి ఆయా కోరిక కర్మబంధాలు వచ్చి రుణమును తీర్చుకొనిపోతాయి.అదే మీకు క్షేత్ర రుణముంటే ఆ క్షేత్రానికి వెళ్లతారు.అదే ఈ రుణము లేదంటే ఆ క్షేత్రానికి వెళ్ళాలి అనుకున్న వెళ్ళలేరు.అంటే మన కోరిక అనేది మనము చేసుకున్న జన్మాంతర కర్మసిద్ధాంతము మీద ఆధారపడి పనిచేస్తుంది అన్నమాట.ఏ కర్మ తీరుతుందో ..ఏ కర్మ చెయ్యాల్సింటుందో మనకి తెలియదు.మనలో ఉన్న శివయ్యకి తెలుసు.వాడు చూసుకుంటాడు.కాబట్టి మీరు వివేకబుద్దితో..విచారణజ్ఞానముతో..విచేక్షణ ఆలోచనతో ..ధర్మయుతమైన కోరికలను అనుభవించండి.ఇలా మీ కోరికానందాలు తీర్చుకుంటే ధర్మ,అర్ధ,కామ తర్వాత వచ్చేది మోక్షమే గదా.కోరికను ధర్మయుతముగా ఆనందముగా అనుభవిస్తే మోక్షము లేదంటే అమోక్షమని నా జీవితానుభవాలు ద్వారా నేను తెలుసుకున్న అంతిమ సత్యము అన్నమాట. ఇదే మీకు చెప్పే అంతిమ సందేశము.

ఇకపోతే ఈ రోజు ఏప్రియల్ 14 గావడము చేత అనగా మా యోగమిత్రుడైన రమణమహర్షి ఈ రోజు మహసమాధి గావడముతో అలాగే ఇదేరోజు నా యోగమిత్రురాలైన జ్ఞానేశ్వరికి నాకు సంబంధించిన అంతిమ అనుభవము అనగా తన ధ్యానములో నా రూపధారి కనిపించి ఈమెకి గురువుగా ఉంటానని చెప్పినగూడ ఈమె గురువు అవసరము లేదని నా గురుమాయను దాటడముతో ఇక అతను కాస్త ఉన్నచోటనే నిర్జవనిశ్చలస్ధానమూర్తిగా ఒక శిలాజమూర్తిగా మారే దృశ్యము చూశానని నాకు చెప్పడముతో ఇక రాబోవు కాలములో ఇపుడు బతికి ఉన్నట్లుగా కనిపిస్తున్న నా స్ధూలశరీరము గూడ ఇలా శిలాజమూర్తి ఆపై శూన్యములో శూన్యమవుతుందని ఎందుకంటే నా చేపను పాము తినడము అలాగే ఇవి రెండు ఉన్న చెరువు ఎండిపోవడము బట్టి నా స్ధూలదేహము అనే పాము అలాగే కీర్తిదేహమైన చేప గూడ శూన్యములో శూన్యమవుతాయని నా స్ధూలదేహము ఇంక బతికి ఉండగానే నా మోక్షమరణానుభవమును పొందడము జరిగింది.ఇది అందరికి కచ్చితముగా కాలానుగుణముగా జరుగుతుంది.నా కాలము వచ్చింది.ఇలా అనుభమైంది.మీరు కూడ మీ కాల మరణ సమయము వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు.ఈ లోపు మీరు మీ కోరికలను ధర్మయుతముగా తీర్చుకొని కోరిక రాహిత్యస్ధితి పొంది మోక్షజయము పొందండి.ఇది ఏనాడో ఆదిలో పొందారు కాని నమ్మలేదు.కాలమే అన్ని నమ్మేస్తుంది.కాలమే  కాలానుగుణముగా ఇస్తుంది.చూపిస్తుంది.అపుడిదాకా ఎదురుచూడక తప్పదు.అంతెందుకు ఆదిలో ఆదియుగములో నా మరణము కాస్త మోక్షమరణము నమ్మటానికి నాకు 28 మహయోగాలు అంటే 108 యోగాలు పట్టింది.477 కోట్ల జన్మలు తీసుకోవడము జరిగింది.కాబట్టి మీ ఇష్టకోరికలు మీకు ఇష్టము వచ్చినట్లుగా తీర్చుకుంటూపోతే కోరిక లేని స్ధితికి మీరు ఎంత తొందరగా వస్తే మీ మోక్షమరణ కాలము అంత త్వరగా మీ దగ్గరికి రావడము జరుగుతుంది.వస్తే ఒక క్షణము లేదంటే పదిలక్షల సం.రాలు అవుతుంది.ఇదింతా మీ కోరిక ఆనందము మీద అలాగే మీ ఆత్మవిశ్వాసము మీద అలాగే  యత్భావము తత్బవతి మీద ఆధారపడి ఉంటుంది.ఇక ఇంతడితో నా శబ్ధ అలాగే అనుభవపాండిత్య అనుభవాలు పరిసమాప్తి గావడముతో ఇదే రోజు నా అంతిమదేహనికి అంతిమవీడ్కోలు పలకడము జరిగింది.అనగా సంపూర్ణముగా నా 12 దేహలు గూడ మోక్షము పొందడముతో నా సాధన పూర్ణమై పూర్ణశూన్యము నందు పూర్ణమోక్షముతో శూన్యమైంది.నా స్ధూలశరీరము గూడ యోగాగ్నిలో దగ్ధమై మహసమాధి పొందింది.నా శాశ్వత వీడ్కోలు..ఇక సెలవా మరి. శుభుంభూయాత్.

సర్వం సమాప్తం,,,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి