కపాల మోక్షం గ్రంథము

▼

సంకల్ప శరీరం (128)

 సంకల్ప శరీరం 

బాల గణపతి కాస్త వచ్చిన ఆధారాలను చదవడం మొదలుపెట్టాడు. 


నేను మానవ భక్తులను రక్షిస్తుంటే….

నా సతి తన రాక్షసభక్తులను రక్షించే చోటు… మేమిద్దరం అనుకోని వెలసిన చోటు…

శ్రీకృష్ణుని పరిపాలించిన నగరం దగ్గరలోనే వెలిశాము…

 ఇక్కడ నేను కాస్త పాములకు అధిపతిగా వెలిశాను… 

అనే ఆధారాలు ఉండేసరికి.. శివ నందినికి ఒక పట్టాన అర్థం కాలేదు. ద్వాదశ లింగాలలో ఏ శివలింగం అయి ఉంటుందా?  అని ఆలోచన చేస్తూ ఉండేసరికి…. బాల గణపతి కాస్త పాములకి అధిపతి అన్నారు కదా!  ఆ పాముల పేరుతో ఏదైనా జ్యోతిర్లింగం ఉన్నదా?  అని ఆలోచించమ్మా అనేసరికి…. కుమారస్వామి కాస్త నాకు తెలిసినంతవరకు ద్వాదశ లింగాలలో ద్వారకా నగరానికి దగ్గరగా గుజరాత్ దగ్గర నాగ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది అనేసరికి… సరే అని చెప్పి శివ నందిని కాస్త నాగ నాగేశ్వర జ్యోతిర్లింగం అని ఇంటర్నెట్లో కొట్టగానే దానికి సంబంధించిన వీడియోలు వినడం ఆరంభించింది.  అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి నాగేశ్వరుడు, నాగేశ్వరిగా వెలిశారు అని…. అమ్మవారు రాక్షసులను రక్షిస్తానని వరం ఇవ్వటం, అయ్యవారు మానవ భక్తులను వరం ఇచ్చి రక్షిస్తాను అన్నట్లుగా స్థలపురాణ విశేషం చెప్పడం జరిగింది. అలాగే శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారకా నగరమే కదా అనుకుని….ఇవన్నీ కూడా ఈ ఆధారాలన్నీ నాగ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూపిస్తున్నాయని తెలుసుకోవడంతో, సాధన కుటుంబం అంతా రైలు ప్రయాణం చేయడానికి బయలుదేరడం జరిగింది. అప్పుడు బాలగణపతి కాస్త అమ్మ!  ఈ నాగ నాగేశ్వర క్షేత్ర విశేషాలు స్థలపురాణం చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పమని అడగడం జరిగింది. 


నాగేశ్వర జ్యోతిర్లింగం:- (పూర్వ కథ)


శివ పురాణం లోని కోటి రుద్ర సంహిత ప్రకారం పూర్వం దారుకుడు అనే రాక్షసుడు, దారుక అనే రాక్షసితో కలిసి ఒక అరణ్యంలో నివసిస్తూ ప్రజలను తీవ్రంగా హింసించేవారు. సముద్ర మార్గంలో ప్రయాణించే వ్యాపారులను బంధించి చెరసాలలో ఉంచేవారు. అలా ఒకసారి సుప్రియుడు అనే పరమశివ భక్తుడిని, మరికొందరు వ్యాపారులను బంధించి కారాగారంలో పెట్టారు. అయితే సుప్రియుడు ఎన్ని కష్టాలు ఎదురైనా తన శివభక్తిని విడిచిపెట్టలేదు. చెరసాలలో సైతం శివలింగాన్ని మనసులో ధ్యానిస్తూ, నిరంతరం ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు. తనతో పాటు బంధించబడిన వారందరికీ శివనామ మహిమను తెలియజేసి వారిచేత కూడా శివనామస్మరణ చేయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న దారుకుడు ఆగ్రహంతో సుప్రియుడిని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సుప్రియుడు ఆపదలో తనను రక్షించగలిగేది పరమశివుడు ఒక్కడేనని భావించి హృదయపూర్వకంగా మహాదేవుడిని ప్రార్థించాడు. భక్తుని ఆర్తనాదాన్ని ఆలకించిన పరమేశ్వరుడు ఒక్కసారిగా అక్కడ జ్యోతిర్మయ స్వరూపంలో ఆవిర్భవించి, దివ్యమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి రాక్షసులను సంహరించాడు. సుప్రియుడితో పాటు ఇతర ఖైదీలను కూడా విముక్తులను చేశాడు. అనంతరం భక్తుల కోరిక మేరకు అక్కడే జ్యోతిర్లింగ స్వరూపంలో కొలువై ఉండటానికి అంగీకరించాడు. అలా భక్తుల భయాలను తొలగిస్తూ, ఆపదలో ఉన్నవారిని రక్షించే పరమేశ్వరుడు శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందాడు.ఇది పదవ జ్యోతిర్లింగం. మహారాష్ట్ర సంప్రదాయంలో – ఔంఢా నాగనాథ్ మరియు ఉత్తరాఖండ్ సంప్రదాయంలో – జాగేశ్వర్ అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగం అని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.. అయినప్పటికీ…. కోటి రుద్ర సంహిత ఆధారంగా ద్వారక సమీపాన ఉన్న శివ క్షేత్రమే నాగేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి… 

ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఈ క్షేత్రమునకు చేరుకోవడం జరిగింది.  యధావిధిగా నాగ నాగేశ్వర గుడి దర్శనానికి వెళ్లడం, శివలింగ దర్శనం చేసుకోవడం కోసమని బయలుదేరడం జరిగింది. ఈ క్షేత్రంలో 125 అడుగులు ఎత్తు,25 అడుగులు వెడల్పు ఉన్న మామా శివుని విగ్రహం చుట్టు పక్కల 3 kms  వరకు కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పుడుడు T-Series అధినేత గుల్షన్ కుమార్ ఆయన మరణానంతరం అప్పట్లోనే 2 కోట్లు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పునః నిర్మాణం చేసారు అని శివ నందిని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని అక్కడ ఉన్న వారికి చెప్పడం జరిగింది. ఆలయం వెనక ఉన్న నాగేశ్వర్ చెరువుని ఈ ఆలయ పుష్కరిణిగా భావిస్తారు అని అందులో దిగి కొన్ని నీటిని తలలపై చల్లుకుని నమస్కారం చేసుకోవడం జరిగింది. ఆ తరవాత ఆలయం లోపలికి వెళ్లగానే పెద్ద ప్రాంగణం లోకి ప్రవేశించారు. ఇక్కడ ఆలయంలో జనతా నాగులను స్వామి వారికి సమర్పిస్తే విషం వల్ల కలిగే సమస్యలు, విష సర్పలా నుంచి స్వామి వారు రక్షిస్తారని భక్తుల విశ్వాసం. ఆ తరవాత ఆలయానికి ఎదురుగా ఉన్న నాంది విగ్రహానికి మంరిటీ కూర్మం దర్శనం చేసుకుని రావడం జరిగింది. బయట మర్రి చెట్టు కింద శివ పరివారం ఈయన కి ఎదురుగా శని భగవానుడు విగ్రహ మూర్తిని దర్శనం చేసుకోవడం జరిగింది.ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర్లో 5km దూరములో గోపి తలావ్ కి వెళ్ళడం జరిగింది. గుజరాత్‌లోని ద్వారకకు సమీపంలో ఉన్న గోపీ తలావ్ శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించిన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం, బృందావనంలో శ్రీకృష్ణుడితో కలిసి రాసలీలలో పాల్గొన్న గోపికలు, కృష్ణుడు మధురకు వెళ్లిపోయిన తరువాత ఆయన విరహాన్ని భరించలేకపోయారు. కృష్ణుడిని తిరిగి చూడాలనే తపనతో ద్వారకకు చేరుకున్నారు. అక్కడ తమ ప్రియమైన కృష్ణుడిని దర్శించుకుని, ఆయనతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని అనుభవించిన అనంతరం, ఆయనపై ఉన్న అపారమైన ప్రేమతో తమ దేహాలను త్యజించి కృష్ణునిలో లీనమయ్యారని స్థానిక స్థలపురాణం చెబుతుంది. వారి పవిత్ర స్మృతికి గుర్తుగా ఆ ప్రాంతంలోని మట్టి పసుపు రంగులో మారిందని, ఆ మట్టినే నేడు గోపీచందనం అని పిలుస్తారని భక్తుల విశ్వాసం. వైష్ణవ సంప్రదాయంలో ఈ గోపీచందనాన్ని నుదుటిపై తిలకంగా ధరించడం పవిత్రంగా భావిస్తారు. ఆ తరవాత దానికి సమీపంలో ఉన్న వల్లభాచార్య సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర స్థలమైన మహాప్రభుజీ బైఠక్ 61, గోపీ తలావ్ సమీపంలోని చిన్న శివాలయం,గోపీనాథ్ మహాదేవ్ ఆలయమైన మిథాపూర్ ప్రాంతంలోని ప్రశాంతమైన శివాలయం ఇలా దర్శనం చేసుకుని తిరిగి నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. 

ఇక శివ నందిని కాస్త సహస్ర చక్రం ముద్ర అయిన ప్రాణముద్ర అభ్యాసం చేస్తూ….ఈ సహస్ర చక్రంలో ఉండే సంకల్ప శరీరం జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోవాలని చెప్పేసి సాధన అభ్యాసం చేస్తూ…. ఈ గుడి పరిసరాలలోనే ధ్యాన నిష్ఠలో ఉండటం జరిగింది. ఇలా రెండు మూడు రోజులు ధ్యాననిష్ఠలో ఉన్నప్పటికీ కూడా…. ఎలాంటి ధ్యాన అనుభవాలు కానీ ధ్యాన దృశ్యాలు కానీ ఏమి కలగలేదు.  ఏదో తెలియని ఆవేశం, ఆవేదన, ఆందోళన తను ఏమన్నా తప్పు చేస్తున్నానా?  అని అనుమానం ఇలా భావాలు కలిగినప్పటికీ కూడా…. మనసు అదుపు చేసుకుంటూ సముద్రతీరం చూస్తూ కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు సాధనాభ్యాసం చేస్తూ ఉండగా….ధ్యాన దృశ్యంగా తన సంకల్ప శరీరం నుదురు భాగం అనగా సహస్ర కమలం మధ్య భాగం నుంచి తన పోలికలతో ఉన్న ఒక శరీరం బయటకు రావడం, అది కూడా భ్రుకుటి స్థానం నుంచి బయటకు రావడం, ధ్యాన దృశ్యంగా చూసింది. అంటే ఇది తన సంకల్ప శరీరం అయి ఉంటుందని గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు. అప్పుడు సంకల్ప శరీరం మాట్లాడుతున్న మాటలు శివ నందిని స్పష్టంగా వినిపించడం జరిగింది. ఇన్నాళ్ళు తనకి శరీరాలు మాట్లాడితే వినబడేది కాదు.కానీ తనకి ఈ సహస్ర చక్రం ఆధీనం అవ్వడంతో…. తనకి అన్ని రకాల సిద్ధులు వచ్చాయని చెప్పేసి శివ నందిని గ్రహించింది. దానివలన వ్యక్తుల మీద, ఆత్మల మీద, ప్రేతాత్మల మీద, రాక్షసుల మీద, దేవతల మీద, భూతప్రేత పిశాచాల మీద,యక్షగంధర్వుల… ఏ జాతికి సంబంధించిన వారి మీదనైనా, తనకి అధికారం, ఆధిపత్యం ప్రదర్శించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని శివనందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. దానితో తన సంకల్ప శరీరంతో కలిసి ధ్యాన నిష్ఠలో ఉండడం జరిగింది. అప్పుడు సంకల్ప శరీరం యొక్క ప్రస్తుత జన్మ యొక్క స్థితిగతులు ధ్యాన దృశ్యాలుగా కనిపించడం ఆరంభం అయ్యాయి. తన సంకల్ప శరీరం చిన్ననాటి దృశ్యాలు కల్పించడం మొదలైంది. తను చిన్నప్పటి నుంచి శివలింగారాధన చేస్తూ…. శివ భక్తురాలిగా ఉంటూ ఉండేది. తన తల్లిదండ్రులు ఒక గురువు సమక్షంలో ఉండి సాధన చేసుకోవడం, మోక్షం పొందాలని వాళ్ళిద్దరూ పడుతున్న తపన తాపత్రయాలు చూసి…. తను కూడా మోక్షం పొందాలి అని సంకల్పం చేసుకుంది. కానీ మోక్షం పొందాలి అంటే ఏ విధంగా మోక్షం పొందాలి…. మోక్షం అంటే ఏంటో కూడా తనకు తెలియదు. కానీ మోక్షం పొందాలి అని మాత్రం సంకల్పం చేసుకుంది. కానీ కాలం గడుస్తున్న కొద్ది వివాహ వయస్సు రావడంతో…. తల్లిదండ్రులు కాస్త సంసార బాధ్యతల్లో పడి, గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. అలా కూడా మోక్షం పొందవచ్చు అని చెప్పడంతో సరే అని, చెప్పి పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టడం జరిగింది. భర్త కూడా కేవలం పూజాదికాలు చేస్తాడు కానీ, అది కూడా అవసర భక్తి, కోరిక భక్తిగా, ప్రసాద భక్తుడిగా చేస్తాడే కానీ…. ఆసక్తిగా విజ్ఞప్తిగా చేయకపోవడం ఆమె గమనించింది.  ఎవరి పద్ధతి వాళ్ళది… ఎవరి ఆరాధన వాళ్లది అని చెప్పి ఊరుకునేది. కానీ భర్త ఏనాడు శివారాధనకి చెయ్యొద్దని చెప్పేవాడు కాదు.  ఏదైనా కానీ సమయానుసారమే చేసుకోమని చెప్పి, రోజుకు పది నిమిషాలు అర్చన ,పూజ చేసుకోమని చెప్పేవాడు. ఎందుకంటే తను సంసారంలో ఉన్నది కాబట్టి ఎక్కువ సమయం పూజలకి, పునస్కారాలకి కేటాయిస్తే… వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకునే పరిస్థితులు వస్తే ప్రమాదం ఉంది అని తన భర్త గ్రహించినవాడు అవటం వలన… పూజకి ఎక్కువ సమయం ఇవ్వకుండా తన వీలుకు తగ్గట్టుగా మాత్రమే రోజు మొత్తం మీద ఒక అరగంట మాత్రమే కేటాయించే విధంగా సమయ పాలన అలవాటు చేశాడు.  ఏదైనా గాని మంచిదే కదా!  తన భర్త అడుగుజాడల్లో ఉంటూ…. సంసార బాధ్యతలు నిర్వర్తించుకుంటూ…. మోక్షం గురించి సాధన చేసుకుంటూ….తన సాధన కొనసాగిస్తూ ఉండటం జరిగేది. కొన్ని రోజులకి అనుకోకుండా గురువుగారి దర్శనం కలగడంతో… ఆయన అనుగ్రహంతో మోక్షం అంటే ఏమిటి?  మోక్షం యొక్క విధివిధానం ఏమిటి?అని అదంతా తెలుసుకున్న తర్వాత సంతాన బంధనంలో పడితే మోక్షానికి ఆటంకం కలగవచ్చు అని తెలుసుకోవడంతో…. సంతానం వద్దు అని అనుకున్నప్పటికీ, భర్త మాత్రం సంతానం కావాల్సిందే!  వంశం వృద్ధి చెందాల్సిందే!  అని ఖచ్చితంగా చెప్పడంతో….ఇద్దరు పిల్లల తల్లి అవ్వడం జరిగింది.  60 సంవత్సరాలు వయసు వచ్చాక మోక్షం గురించి ఆలోచించుకోవచ్చు… ముందు పిల్లల బాధ్యతలు నిర్వర్తించమని చెప్పటం… పిల్లల బాధ్యతలు తీరుస్తూ…వాళ్ళు ఉద్యోగ స్థాయికి వచ్చేదాకా, తను అలా సాధన చేసుకుంటూ ఉండటం, ఇటుపక్క తల్లిదండ్రులు వృద్ధులవటం, ఒకపక్క అత్తమామలు వృద్ధులవటం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండటం, వాళ్లకి సేవలు చేస్తూనే కాలం గడుపుతూ, పిల్లలకి పెళ్లిళ్లు చేసే స్థితి వరకు…. తన సాధన అలాగే కొనసాగిస్తూ గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా…. అసలు సిసలైన సాధన ఇది కాదు, బంధాల నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి, మనసు పదేపదే కోరుతున్నప్పటికీ కూడా… వీలుకాని పరిస్థితుల్లో బంధాలు కాస్త బంధనాలుగా, తల్లిదండ్రులు ఒకపక్క అనారోగ్య సమస్యలతో, అత్తమామలకి అనారోగ్య సమస్యలు, భర్తకి ఉద్యోగం పోవడంతో ఆర్థిక సమస్యలు పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభంతో సాధనను పక్కన పెట్టే రోజులు వచ్చాయి.  15 నిమిషాలు కూడా చేసుకోలేని పరిస్థితికి వెళ్లిపోవడం జరిగింది. అయినా కూడా తన సాధన కొనసాగిస్తూనే రోజు మొత్తం మీద ఒక రెండు మూడు సార్లు అయినా శివనామస్మరణ చేసుకుంటూ…భవ బంధాల నుంచి తనని విముక్తి కలిగించాలి…. మోక్షం కలిగించాలి అని అనుకుంటూ ఉండేది. ఇది ఇలా ఉంటే ఒక రోజు వీళ్ళు భౌతిక గురువు దగ్గరికి దర్శనానికి వెళ్లడం జరిగింది. భర్త కాస్త భార్య పూజా విధివిధానాలు సాధన విధివిధానాలు.  చెపుతూ …ఎప్పుడు చూడు, శివుడు శివుడు, శివ శివ అని ఆలోచనలో ఉంటుందండి…. నేను ఉద్యోగం చేయమని చెప్పినా కూడా దాని గురించి ఆలోచన చేయడం లేదు. గురువుగారు!  మీరైనా చెప్పి ఆవిడకి ఏమైనా ఉద్యోగం చేస్తూ…. సంసారంలో ఉండేటట్లు చేయండి. సంసారం మీద వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకుంటుందేమో అని భయం వేస్తుంది అనేసరికి… గురువుగారు కాస్త ఈమెతో అమ్మ!  నువ్వు ఎంత సాధన చేసినప్పటికీ, స్త్రీలకి మోక్షం రాదు. మరు జన్మలో పురుషుడిగా జన్మ ఎత్తిన తర్వాతనే మోక్షం వస్తుంది.  కాబట్టి నువ్వు కేవలం విగ్రహారాధన చేసుకుంటూ…పతి సేవ చేసుకుంటూ….సంసారంలో ఉంటూ…. ఈ జన్మకి సాధన చేసుకుంటూ… మరుజన్మ పురుష జన్మ ఎత్తిన తర్వాతనే… నువ్వు మోక్ష సాధనకు వెళతావని చెప్పేసరికి… ఆమెలో ఉక్రోషం వచ్చి స్వామి!  మీరు అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు?  శివుడు మోక్షం పొందినట్టు అమ్మవారు మోక్షం పొందలేదా?  అంటే…. అమ్మవారే మోక్షం పొందితే…. విశ్వ ప్రకృతి ఎలా నడుపుతారు.  శివుడు మోక్షం పొందడం జరిగింది.  శాస్త్ర విధివిధానాలలో కూడా చెప్పడం జరిగింది.  అమ్మవారు దక్షయజ్ఞంలో పడి చనిపోవడం వలన 18 భాగాలుగా, 18 శక్తి పీఠాలుగా మారడం జరిగింది. భావరూపాలుగా, భావ శరీరాలుగా ఈ ప్రకృతికి కాపాడుతూనే ఉన్నది.  కాబట్టి అమ్మవారు కూడా విష్ణుమూర్తిగా అవతారం ఎత్తిన తర్వాతనే మోక్షం పొందడం జరిగింది. ఇది శాస్త్రపచనం అని చెబుతూ ఉండేసరికి…. నేను ఇప్పుడు సాధారణంగా గృహస్థాశ్రమంలో ఉండి మోక్షం పొందలేను అంటారా?  అంటే అవును అని అనితర సాధ్యమని తెలియజేసరికి ఆ సాధ్యాసాధ్యాలు నాకు తెలియదు. నేను స్త్రీ మూర్తిగానే మోక్షం పొందాలి అనుకుంటున్నాను. ఇదే సంకల్పం పెట్టుకుంటాను అనేసరికి… నువ్వు సన్యాసం తీసుకోవాలి అంటే అంత తేలికైన విషయం కాదు అనేసరికి…. ఈ క్షణం నేను సన్యాసం తీసుకుంటున్నాను.  నాకు గృహ బాధ్యతల నుంచి విముక్తి కలిగించండి. నాకు భర్త మీద, సంతానం మీద, అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద, సంసారం మీద, మోహ వ్యామోహాలు, ప్రేమ, ఆప్యాయతలు ఏమీ లేవు.  ఈ క్షణమే నేను సాధనలోకి వెళ్లి… మోక్షం పొందుతానో లేదా సంకల్పించి సాధన చేస్తాను అనేసరికి… గురువుకి శిష్యురాలికి వాదోపవాదాలు జరగడంతో…. అసలు ఈవిడ మోక్షమును ఏ విధంగా పొందుతుందో చూడాలి అని చెప్పేసి గురువు తక్షణమే ఆమెకి సన్యాస దీక్ష ఇవ్వడం…. సంసారం నుంచి బయటికి రావడం…భవ బంధాల నుంచి విముక్తి పొందడం….అంతా కూడా విధిరాత ప్రకారం రాసినట్టుగా క్షణకాలంలో జరిగిపోయేసరికి భర్తకి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిల్లో… అతను ఉంటే, ఇక నాకు సంసార బంధనాల నుంచి విముక్తి పొంది గురు సమక్షంలోనే సన్యాసం తీసుకున్నాను అని అనుకొని…ఈ క్షేత్రానికి వచ్చి సాధన చేసుకోవడం ఆరంభించింది.  అనుకొని విధంగా తన మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు వచ్చిన తరువాత…. సహస్ర చక్రంలో సాధారణంగా కనిపించే చినమస్తా దేవి ఆరాధన,  తను అమ్మవారిని చూసి ఆ స్వరూపానికి ఒక్క క్షణకాలం భయపడటంతో…. ఈమె తనని ఖండించడం క్షణకాలంలో జరిగింది.  అది కూడా భౌతికంగా తల ఖండన అవటంతో….శరీరం విభేదనం అవ్వటం… దహన సంస్కారాలు ఏవి జరగకపోవడంతో….తన సంకల్పం తీరకపోవడంతో… మోక్షం పొందాలి అనే కోరిక మిగిలిపోవడంతో… తను ఇప్పుడు సంకల్ప శరీరధారిగా అదే సంకల్పంతో ప్రేతాత్మగా తిరుగుతుంది అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఇక దానితో తను చనిపోయినప్పటికీ కూడా స్త్రీ ఆత్మగా ఉండి మోక్షం పొందాలి అని తన సంకల్పం నెరవేర్చుకోవాలని తపన తాపత్రయాలు పడుతూ ఉంటే…. ముందు స్త్రీ అస్థిపంజరానికి విముక్తి కలిగించాలి అని…. తను ఎక్కడైతే, ఏ ఇంట్లో అయితే శివారాధన చేస్తూ…. చినమస్తా దేవి ఆగ్రహానికి బలి అయిందో… ఆ ఇంటికి వెళ్ళటం అక్కడ ఉన్న అస్థిపంజరానికి విముక్తి కలిగించి, దహన సంస్కారాలను చేయడంతో…. ఆ ఆత్మ శరీరానికి ప్రేతాత్మ శక్తి కోల్పోవడంతో…. ఆత్మకాస్తా తన సంకల్పం నెరవేర్చే శివ నందిని శరీరంలోనికి సహస్ర చక్రంలోనికి ప్రవేశించడం జరిగింది. తన సంకల్ప శరీరం యొక్క సంకల్పం…స్త్రీ మోక్షం పొందుతుందా లేదా అని తెలుసుకోవాలని సాధన చేస్తుందని శివ నందినికి అర్థమయ్యింది. ఇక దానితో ఇక్కడ తన సాధన పరిసమాప్తి అయ్యింది అని అనుకొని బయలుదేరే సమయానికి….ధ్యానంలో స్త్రీ శివలింగం, పురుష శివలింగం, ఈ రెండు శివలింగాలు కలిసి …ఏకశివలింగంగా సహస్ర శివలింగాలుగా ఉన్నట్లుగా మూడు శివలింగాలు కనిపించేసరికి… శివ నందిని కి అర్థం కాలేదు. ఇది ఎక్కడ ఉన్నది ఏంటి? …. అనే తిరిగి ధ్యానంలో కూర్చున్నప్పుడు స్త్రీ ,పురుష శివలింగం నాగేశ్వరి అమ్మవారి పీఠం కింద, ,సహస్ర శివలింగం అయ్యవారి పీఠం కింద ఉన్నట్లుగా…. ధ్యాన అనుభవం అవ్వడం జరిగింది. ఓహో!  సహస్ర శివలింగం అంటే సహస్ర చక్రానికి సంబంధించింది అని…. స్త్రీ, పురుష శివలింగం అనేది సంకల్ప శరీరం యొక్క జాగృతి శివలింగాలు అని చెప్పేసి శివ నందినికి అర్థం అవ్వటం జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో దేవాలయానికి సూక్ష్మ శరీర ధారిగా శివ నందిని ప్రవేశించడం అక్కడ కూర్చుని ధ్యానం చేసేసరికి… శివుడు నాగేశ్వర స్వామి రూపంలో కనిపించి, తనకి సహస్ర శివలింగం ఇవ్వటం…. అలాగే అమ్మవారి సమక్షంలో ధ్యానం చేసేసరికి, అమ్మవారు కూడా తనకి స్త్రీ,పురుష శివలింగమును అనుగ్రహించి ఇవ్వడంతో… ఆ మూడు శివలింగాలు తీసుకొని తను కాస్త ఆలయం బయటకు రావడం జరిగింది. ఆ తరువాత ఉదయం లేచిన తర్వాత పిల్లలకి, పెద్దలకి ఆ శివలింగాలను చూపించేసరికి అదేంటమ్మా ఒక శివలింగంలో సహస్ర శివలింగాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు రుద్ర స్వామి కాస్త శ్రీశైలంలో ఈ శివలింగం చూశావు కదా!  శ్రీరాముడు ప్రతిష్ట చేశాడు కదా!  సహస్ర శివలింగం.  అలాగే సీతాదేవి కూడా సహస్ర లింగం ప్రతిష్ట చేసింది కదా! అంటే వాళ్లకి సహస్ర చక్ర జాగృతి అక్కడ శ్రీశైలంలో జరిగి ఉంటుంది.  అదే అమ్మకి ఈ నాగేశ్వర క్షేత్రంలో జరిగి ఉంటుంది అనేసరికి….బాలగణపతి కాసిన అమ్మ!  ఈ శివలింగాలలో స్త్రీ శివలింగం, పురుష శివలింగం ఏది అని ఎలా చెప్పగలుగుతావు?  అనేసరికి నేను చెప్పడం కాదు…. పరమహంస గారి సాధన అనుభవాల ప్రకారంగా నేను చూసి చెబుతున్నాను ఆయన అనుభవం ప్రకారం…. గుండ్రని పనవట్టం ఉన్నదేమో, పురుష శివలింగం.  చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం ఉన్నది స్త్రీ లింగం అని చెప్పడం జరిగింది. స్త్రీ శివలింగానికి ఎరుపు రంగులో ఉంటుందని… పురుష శివలింగం నలుపు రంగులో ఉంటుందని… ఆయన చెప్పడం జరిగింది. అలాగే శంఖాలలో స్త్రీ శంఖం, పురుష శంఖం ఉంటాయని… స్త్రీ శంఖాలకి అడుగు భాగంలో ఒక చీలిక ఉంటుందని….ఎలాంటి చీలిక లేదా మడత లేకపోతే… అది పురుష శంఖం అని చెప్పడం జరిగింది. ఇది దైవిక వస్తువుల యొక్క జ్ఞాన రహస్యాలు, ఈ  రహస్యాలు అన్నీ మనకి సహస్ర చక్రంలో తెలుస్తాయి… ఆయనకి ఈ రెండు విషయాలు ఈ సాధన స్థితికి వచ్చిన తరువాతనే లోకానికి చెప్పడం జరిగింది. సవాలక్ష విషయాలు చెప్పవచ్చు కానీ, ఇంకా అవన్నీ తెలుసుకుంటూ ఉంటే….సాధన ముందుకి వెళ్ళదు అని చెప్పి ఆయన అక్కడితో ఆగిపోవడం జరిగింది. ఓహో!  అదన్నమాట!  మూలం అని చెప్పేసి అనుకొని…. సరే అయితే, ఇప్పుడు మనం తర్వాత జీవనాడి  సాధనకి వెళ్లాల్సిందే అనేసరికి…. అవును జీవనాడికి వెళ్ళాలి అంటే…. మరి జీవనాడి కోసం ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళాలో మనం తెలుసుకోవాలి కదా!  అనేసరికి సాధన విగ్రహ మూర్తి ఉన్నది కదా!  అని ఆ సాధన విగ్రహం మూర్తి మీద స్త్రీ ,పురుష శివలింగాలలో…. పురుష శివలింగం పెట్టినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.  అలాగే స్త్రీ లింగం, అలాగే సహస్ర లింగం పెట్టినప్పటికీ ఎలాంటి ఫలితాలు కనిపించకపోయేసరికి…. శంఖం పెట్టినా …అయ్యప్ప స్వామిని పెట్టినా ఇలా ఏవి పెట్టినా ఫలితం కనిపించకపోయేసరికి… వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఉన్నటువంటి సాధన విగ్రహ మూర్తి ఎందుకు పనిచేయడం లేదు?  ఇప్పుడు జీవనాడి కి ఏ క్షేత్రానికి వెళ్ళాలో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?  అని చెప్పి…. ఎవరికి వాళ్ళు మనసులో మదనపడటం జరిగింది. ఒకవేళ తన సహస్ర చక్రం పూర్తిగా శుద్ధి చేసుకోలేదా? లేదా సంకల్ప శరీరం శుద్ధి అవ్వలేదా?  లేదా సాధనలో ఏదైనా తప్పు ఉందా?  లోపం ఉందా?  అని అదేమిటి అని అనేది అర్థం కాలేదు.  ఉన్నట్టుండి సాధనా విగ్రహ మూర్తి పనిచేయట్లేదు… అలా అని లేదు అనటానికి లేదు.  సహస్ర చక్రం నుంచి హృదయ చక్రానికి ఒక నాడి ఉన్నట్టు, హృదయ చక్రం నుంచి బ్రహ్మ రంధ్రానికి ఒకనాడి ఉన్నట్టు కనపడుతుంది. ఇది జీవనాడి, అది బ్రహ్మనాడి అయి ఉండి ఉండాలి.  కానీ ఇది జీవనాడికి ఏ క్షేత్రానికి వెళ్లాలి…?  ఎందుకు చెప్పడం లేదో…. ఆధారం ఎందుకు ఇవ్వడం లేదో… శివ నందినికి ఒక పట్టానా అర్థం కాలేదు. ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది అని ఆలోచనలో ఉన్నది.  తను ఎలాంటి మాయలో, మర్మంలోనూ… లేనప్పటికీ… కూడా తన సాధన ఎందుకు ఆగిపోతుందో…అర్థం కాలేదు.  ఆ ఆలోచనలో శివనందిని అలాగే ఉండిపోతూ ఉండేసరికి… ఉన్నట్టుండి తనకి ధ్యానంలో దత్తాత్రేయ స్వామి కనిపించడం జరిగింది.

శివ నందినికి జీవనాడి శుద్ధి కోసం ఏ క్షేత్రానికి వెళ్ళాలో ఆధారాలు రాకపోవడం ఆశ్చర్యం వేసింది. ఇక దానితో వాళ్ళు ఏకవీర క్షేత్రానికి తిరిగి రావడం జరిగింది. సాధన ఎందుకు ముందుకు వెళ్ళటం లేదో…. తనకి ఎందుకు అవాంతరాలు వస్తున్నాయి…. సాధన విగ్రహ మూర్తి ఆధారాలు ఎందుకు చూపించట్లేదు అనేది శివ నందినికి ఒక పట్టానా అర్థం కాలేదు.  సరే అని…. ఒక రోజు తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగా సజీవ మూర్తిగా దత్తాత్రేయ స్వామి కనిపిస్తూ ఉండేసరికి… శివ నందినికి అర్థం కాక ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూడడం.. తనేమైనా భ్రమ పడుతున్నానా? ఇన్నాళ్లు విగ్రహ మూర్తిగా కనపడిన దత్తాత్రేయ స్వామి ఈసారి సజీవంగా కనపడటం ఏమిటి? అని ఆశ్చర్య ఆనందాలకి గురి అవుతూ ఉండేది. తను మనోభ్రాంతి పడుతున్నాను అని,  తిరిగి ధ్యానంలో కూర్చునేది.  అయినప్పటికీ కూడా ఆయన సజీవమూర్తిగా గుహలో ఉండి, తనతో మాట్లాడాలి అన్నట్టుగా.. ప్రయత్నం చేస్తున్నట్లుగా… పెదవులు కదుపుతున్నట్టుగా… కనిపించేసరికి శివ నందినికి విషయం అర్థం కాలేదు. ఇలా పలుమార్లు జరుగుతూ ఉండేసరికి….శివ నందిని దేని గురించో కంగారుపడుతుంది… ధ్యానభంగం అవుతుంది అని గమనించిన రుద్రస్వామి కాస్త… ఏంటమ్మా!  ఏం జరిగింది? ఏమైనా ధ్యాన దృశ్యం ప్రమాదం చూశావా? అనేసరికి…. ప్రమాదం కాదయ్యా!  అనుకోకుండా సజీవ మూర్తిగా దత్తాత్రేయ స్వామి వారు కనపడుతున్నారు. అది నిజమా కాదా అని నాకు అనుమాన భయం వేస్తుంది. ఇంతవరకు ఆయన విగ్రహరూపంలోనే కనిపించేవారు. అలాంటిది ఆయన సజీవ మూర్తిగా… నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా… అనిపించేసరికి, దీనికి కారణం ఏమిటి?  అనేది అర్థం కాలేదు. నేనేమైనా భ్రమ పడుతున్నానా?  అని అనిపిస్తుంది. ఒకటికి పది సార్లు ఆయన రూపం పదేపదే కనపడుతుంది అనేసరికి…. కారణం లేకుండా సిద్ధ పురుషులు, సిద్ధయోగులు కనిపించరు. సాక్షాత్తు విశ్వ గురువు అయిన దత్తాత్రేయుడే సజీవ మూర్తిగా కనపడుతున్నాడు అంటే, కారణం లేకుండా ఉండదు. ఆయన ఎక్కడ కనపడుతున్నాడో చూడు… ఆ ప్రాంతానికి వెళ్లి వద్దాం అనేసరికి…. ఈసారి ధ్యానంలో కూర్చునే సరికి, ఆయన ఎక్కడో ఒక కొండ గుహలో, రాతి మీద కూర్చుని తనకోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపించేసరికి… ఆ కొండ గుహ ఎక్కడుంది.!  ఏంటి? అన్నది కూడా ధ్యానంలో కనిపించేసరికి….సరే అని చెప్పి రుద్రస్వామి, మహాదేవి, పిల్లలు అందరూ కలిసి అక్కడ ఉన్న స్థానికులని ఈ కొండ గురించి అడిగితే…. అది దత్తాత్రేయ స్వామి గుడి కింద ఉన్న కొండ అని, ఈ కొండ లోపల ఒక గుహ ఉంటుంది.. అందులో దత్తాత్రేయుడు సజీవ మూర్తిగా ఉంటాడు, రాత్రిపూట నిద్రపోవడానికి వస్తారు అని ఇక్కడ స్థానికులు చెప్పేసరికి… ఓహో!  ఇది కథనం కాదన్నమాట!  నిజమే అని అనుకుని… శివ నందిని కాస్త సాధన కుటుంబంతో కలిసి… ఈ గుహ ఎక్కడ ఉందో వెతకటానికి అని చెప్పేసి ఆ దత్తాత్రేయ స్వామి గుడి కింద ఉన్న కొండకి వెళ్లేసరికి ఆ కొండ గుహ ఎక్కడుందో వీళ్ళకి ధ్యానంలో కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే, అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోయేసరికి…. అక్కడే ధ్యానంలో కూర్చునే సరికి…. దానికి దగ్గరలో గుహ ద్వారం ఉన్నదని…. స్వామి!  మీ అనుగ్రహం పొందడం కోసమని మీ దగ్గరికి వచ్చాము. ద్వారం ఉన్న వైపు ఉన్నాము అని దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చేయగానే…. అక్కడ కొండలో కలిసిపోయి, అప్పటివరకు కనిపించని ద్వారం కాస్త తెరుచుకోవడంతో సాధన కుటుంబం అంతా లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ సుమారుగా గాఢాంధకార చీకటితో వెలుతురు చాలా తక్కువగా ఉండి, ఒకవైపు నీటి జలంతో ఉన్న గుహలోకి వాళ్ళు నెమ్మదిగా ఒక కిలోమీటర్ దూరం వరకు వెళ్లారు. మధ్య మధ్యలో దివిటీలు ఉండటం… వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ దివిటీల మసక వెలుతురులో…. గాఢాంధకార చీకటిలోకి వెళ్లడం జరిగింది. మహాదేవికి అనుమానభయం వచ్చి అమ్మ!  నువ్వు నిజంగానే చూసావా?. ఈ గుహలో సజీవ దత్తాత్రేయ విగ్రహ మూర్తిని?  అనేసరికి నాకు ధ్యానంలో ఇలాగే కనపడింది. అందుకే ధైర్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నీళ్లు గుహా మార్గం ధ్యానంలో కనిపించినట్టుగా ఉంది అనేసరికి….సరే అని వీళ్ళు ఆ మార్గంలో వెళుతూ ఉండేసరికి…. ఆ మార్గం చివరిలో ఒక రాతి మీద పురుషుడు జట దారిగా ఉండి, ధ్యాననిష్ఠలో ఉన్నాడు. రుద్రాక్ష మాలలు ఉన్నాయి. పద్మాసనంతో కమండలం పక్కన పెట్టుకొని మరొక పక్క యోగ దండం ఉన్నట్టుగా కనిపించింది. ధ్యాననిష్ఠలో ఉన్న ఆయన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉండేసరికి… రుద్ర స్వామికి ధారగా నీరు రావడం అందరూ గమనిస్తూ ఉండేసరికి…. మనసులో స్వామి! స్వామి! అనుకుంటున్న రుద్ర స్వామి కాస్త, పెద్దగానే మీరేనా స్వామి? అనేసరికి…. నేనే రుద్ర స్వామి!  నీకు సజీవ మూర్తిగా కనబడుతున్నాను అనేసరికి….ఇన్నాళ్లు పట్టిందా? మీకు… ఎప్పుడూ కూడా మారు రూపంలో కనిపించే వారే కానీ, ఇప్పుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామిగా సజీవ మూర్తిగా మిమ్మల్ని చూడటం జరిగింది. ఈ జన్మకి ఇది చాలు!  అనేసరికి…. నన్ను కాదు కదా!  నన్ను నువ్వు చూడాల్సింది….సజీవ మూర్తిగా రుద్ర స్వామిని రుద్ర మూర్తిని చూడాలి అని కదా! నీ లక్ష్యం, నీ సంకల్పం అనేసరికి అవును స్వామి!  అయినా మీ ఇద్దరికీ తేడా ఏముంది… అబేధం కదా!  మీకు మూడు తలలు ఉంటాయి. ఆయన ఏకతలతో ఉంటారు. ఏకతల కావాలన్నా మీకు వస్తుంది. ఇంతటి అపురూప దర్శనానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా స్వామి!  అనేసరికి.. ఇది మీ అందరికీ చెప్పవలసిన సందేశమే. ఇది నేను అందరికీ ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు చెప్తాను… ఇస్తాను…. అని అది వింటారా.!  లేదా?  అన్నది మీ ఇష్టం. సందేశం ఇవ్వడం వరకే నా బాధ్యత…అనగానే ఏంటి స్వామి!  సందేశం? అనేసరికి ఇక్కడ మీ సాధన సహస్ర చక్రం వరకు వచ్చింది. మీ అందరికీ పిల్లలతో సహా సహస్ర చక్రస్థితికి వచ్చారు. పురుష ప్రకృతికి చేరుకున్నారు. స్త్రీ ప్రకృతి అయిపోయి పురుష ప్రకృతికి చేరుకోవటం జరిగింది. ఇక నుండి మీ సాధన అంతా కూడా స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి కానీ ప్రకృతి అయిన మూల ప్రకృతి అంటే హృదయ చక్రానికి, బ్రహ్మ రంధ్రానికి వెళ్లే స్థితి ఉంటుంది. కానీ, మీరు ఆ ప్రకృతిలోకి వెళితే ఈ స్త్రీ, పురుష ప్రకృతులలో మీకు ఎటువంటి అనుబంధం ఉండదు.  ఇంక మీరు విశ్వ శూన్యంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతిలో మీకు కోరికలు ఆశలు, ఆశయాలు సంకల్పాలు, ఆలోచనలు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి.ఇక మూల ప్రకృతిలో ఇలాంటివేవీ ఉండవు. ఇక మీరు పోతే వెనక్కి తిరిగి రారు. కాటికి వెళ్లినట్లే… కాబట్టి మీకు విషయం తెలియదు కాబట్టి, చెప్పడానికి ఇక్కడ నేను ఉంటాను.  సహస్ర చక్రంలో విశ్వ గురువుగా నా గురు బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటాను. మీరు మూల ప్రకృతికి వెళతారా ? లేదా స్త్రీ పురుష ప్రకృతులలో ఉండిపోతారా?  అనేది మీరే ఆలోచించుకోండి. ఈ సహస్ర చక్రంలో మీరు పురుష ప్రకృతిలో ఉండిపోతే… మీరు ఒక బ్రహ్మాండమును సృష్టించుకోవచ్చు. మీ భావరూపాలు ఈ బ్రహ్మాండంలో ఉంటాయి. మీకు కావలసినట్టుగా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు అంతెందుకు? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు… గోకుల బ్రహ్మాండమును స్థితిలో ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన అందులో ధర్మపదంగా ఉన్న వాళ్ళతో భావరూపాలతో, భావ ఆలోచనలతో ఆయన ఆ బ్రహ్మాండం చూసుకుంటూ ఉంటాడు. అలాగే లలితాదేవి, త్రిపుర సుందరి, బాల ఇలా అందరూ ఒక్కొక్కరు… ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతెందుకు నేను కూడా గురు మండలం అని బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా దత్త రూపాలే గురువులుగా ఉండి, జ్ఞానబోధ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు కూడా మోక్ష బ్రహ్మండాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మోక్షలోకంలో స్త్రీ, పురుష జీవులలో మోక్షం పొందే స్థితిగతులు ఇవ్వచ్చు. ఇప్పటికీ స్త్రీ, పురుష ప్రకృతిలో మోక్షలోకం లేదు. కేవలం ముక్తి లోకాలు మాత్రమే ఉన్నాయి. అవి సప్త లోకాలు, సప్తముక్తి మండలాలు సప్త బ్రహ్మాండాలు, ముక్తి మండలాలు అని ఉంది కానీ, మోక్ష బ్రహ్మాండం లేదు. ఆ బ్రహ్మాండం కావాలి అనుకుంటే… నువ్వు బ్రహ్మరంధ్ర స్థితికి వెళ్లక తప్పదు. అది శూన్య బ్రహ్మ ఆధీనంలో ఉంటుంది. దానికి అధిపతిగా ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, ఇష్ట లింగం ఆరాధనతో ఉంటుంది.  దానికి అర్హత, యోగ్యత, యోగం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు శూన్యం అవడానికి ఉండదు. మోక్షం పొందటానికి ఉండదు అనేసరికి…. అంటే స్వామి!  ఇప్పుడు మేము ఏమనుకుంటే ఆ విధంగా బ్రహ్మాండం ఏర్పడుతుందా?  అంటే అవును… అలాగే వెయ్యి మంది బ్రహ్మలు అనుకోవటం వలన వెయ్యి బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. అయితే ఈ వేయి బ్రహ్మండాలు కాస్త కొన్ని కోటానుకోట్లుగా… లెక్కలేనన్ని, ఊహించలేని విధంగా గణిత శాస్త్రానికి అందలేని విధంగా కొన్ని కోటానుకోట్ల బ్రహ్మాండాలు విభజన చేయడం చెందడం జరిగింది. ఇక్కడ మూలాలు వచ్చేసరికి వెయ్యి బ్రాహ్మండాలు ఉంటాయి. 1000 బ్రహ్మాండాలు కూడా కలిసి ఒక చోట ఉంటాయన్నమాట. మీకు అర్థం అవ్వాలి అంటే ..ఒక పెద్ద హాలు ఉంటుంది, ఆ హాల్ చుట్టూ వెయ్యి గదిలో ఉంటాయి.. మళ్లీ ఆ వెయ్యి గదులకి ఆ గదిలో ఉన్న విషయాలన్నీ కూడా హాలుకు వచ్చి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి ఆదిదంపతులుగా ఉండి… మూల ప్రకృతిగా ఉండి…వాళ్ళ కనుసైగ తో ఈ బ్రహ్మాండాలని నడుస్తూ ఉంటాయి. ఇవి ఎన్ని అని చెప్పడానికి లేదు… కొన్ని కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అంతెందుకు…లలితా త్రిపుర సుందరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సుమారుగా 1000 కోట్లకు పైగా బ్రహ్మాండాలు ఆవిడ ఆధీనంలో ఉంటాయి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కో అవతారాలలో ఒక్కో బ్రహ్మాండం సృష్టించుకోవచ్చు. నాకే ఏకాదశ దత్తాత్రేయ అవతారాలలో ఏకాదశ బ్రహ్మాండాలు ఉన్నాయి. అలా విష్ణుమూర్తికి 24 బ్రహ్మాండాలు ఉన్నాయి. అలాగే శివునికి 28 అవతారాలలో 28 బ్రహ్మాండాలు ఉన్నాయి. అమ్మవారికి ఇక లెక్కలేనన్ని అవతారాలు లెక్కలేనన్నీ బ్రహ్మాండాలు ఆవిడకి ఉంటాయి. ఎందుకు అంటే నవదుర్గలుగా నవ బ్రహ్మాండాలు, అష్టాదశ శక్తి పీఠాలలో అష్టాదశ బ్రహ్మాండాలు, ఆ తరువాత దేవి దశ అవతారాలలో దశ బ్రహ్మాండాలు, ఇలా కాకుండా ఆవిడకి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది. ఎక్కువగా ఆవిడ బ్రహ్మాండాలు 80% ఉంటాయి. కాబట్టి మీకు ఈ బ్రహ్మాండ జ్ఞానం తెలియాలి కాబట్టి ఆ బ్రహ్మాండ జ్ఞానం అందించడానికి విశ్వ గురువుగా నేను ఇక్కడ ఉండి అందరికీ చెబుతాను. కానీ మీ ఇష్ట కామ్యముగా ఉండేందుకు మీకు ఈ బ్రహ్మాండములో సహస్ర చక్ర ఆరాధనలో ఉండి చేసుకోవచ్చు. మరి చేసుకుంటారా?  ఇలా చేసుకుంటే మీరు పురుష ప్రకృతిలో ఉండటం వలన మీకు స్త్రీ ప్రకృతి మీద ఆధిపత్యం కూడా వస్తుంది. ఇటు పురుష ప్రకృతి మీద కూడా మీకు ఆధిపత్యం వస్తుంది. మీరు ఈ రెండింటిని కలిపి ఉన్న బ్రహ్మాండమును ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు కావలసినట్టుగా ఉండవచ్చు .మీకు నచ్చినట్టుగాను ఉండవచ్చు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉండేసరికి.. శివ నందినికి, మిగతా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.  అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.  అసలు ఆయన ఏం చెబుతున్నాడో కూడా శివ నందినీకి అయితే అర్థం కాని అయోమయ స్థితిలో ఉండటం జరిగింది. అవతల ఉన్నది విశ్వ గురువు దత్తాత్రేయ స్వామి, మరి ఆయన చెప్పింది వేదం, సత్యం. ఆయన స్వయంగా మోక్ష బ్రహ్మాండమునే తయారు చేసుకోమని చెప్తున్నాడు. ఆ మోక్ష బ్రహ్మాండం ఇక్కడ లేదట. మోక్ష బ్రహ్మాండం మనం తయారు చేసుకునే అవకాశం లేదు. కేవలం మనకి బ్రహ్మాండాలు తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కేవలం మోక్ష బ్రహ్మాండం అనేది శూన్యబ్రహ్మ ఆధీనంలో ఉంటుంది అని అది బ్రహ్మ రంధ్రం చక్రంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది.  ఇక వెనక్కి తిరిగి రావడం కూడా ఉండదు అని కూడా చెబుతున్నారు.అంటే ఇక్కడ స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతికి ఇక అనుసంధానం తెగిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇక తన సాధన హృదయ చక్రానికి వెళితే స్త్రీ ,పురుష ప్రకృతుల గురించి కూడా ఇక మనం ఆలోచించకూడదు అని అంటున్నప్పుడే దత్తాత్రేయ స్వామి కాస్త శివ నందిని ఆలోచనను గమనించి….నువ్వు మోక్షమే పొందాలి అని నువ్వు అనుకుంటే నేను కాదనను. నేను ఆపను. దానికోసం నువ్వు హృదయ చక్రానికి వెళ్లాలి. హృదయ చక్రానికి వెళ్లాలి అంటే రాంబంటు హనుమ అనుగ్రహం నువ్వు పొందవలసి ఉంటుంది. దీని పొందాలి అంటే ముందు నువ్వు స్త్రీ, పురుష ప్రకృతిలో ఉన్న నీ సప్త దేహాలను సప్త చక్రాలను విభేదనము చేసుకోవలసి ఉంటుంది. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగివచ్చే అవకాశం ఉండదు. అక్కడికి వెళ్లిన తరువాత నువ్వు మోక్షం పొందుతావా లేదా అనేది మీ యొక్క సాధన స్థితిని బట్టి అర్హత యోగ్యత యోగమును బట్టి ఉంటుంది. అక్కడకు వెళ్లినా ప్రతివాడు మోక్షం పొందాలి అని ఖచ్చితం అయితే లేదు. అక్కడ మోక్షజీవులుగా ఉండే అవకాశం ఉంటుంది. అది నీకు తెలియనిది కాదు. కాళ్లు ఉన్న మోక్షజీవి గాను, చేతులు ఉన్న మోక్ష జీవిగాను, ఇలా రకరకాల మోక్ష జీవులుగా మనో శరీరం దగ్గర ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. ఇదిమితంగా ఇది జరుగుతుంది నువ్వు మోక్షం పొందుతావు అని అయితే చెప్పలేము మొదట అయితే హృదయ చక్రంలో జ్యోతి శరీరం జాగృతి శుద్ధి ఆధీనం వివేధనం చేసుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మ రంధ్రం దగ్గర మూడు శరీరాలు విభేదనం చేసుకోవాలి. మనో శరీరమును విభేదనం చేసుకోవాలి. మనో శరీరంలో మూడు తత్వాలు ఉంటాయి. స్త్రీ తత్వం, పురుష తత్వం, నపుంసక తత్వం. అంటే స్త్రీ లింగం, పురుష లింగం, ఆ తర్వాత అర్ధనారీశ్వర లింగం విభేదనం చేసుకునే స్థితికి నువ్వు రావాలి. ఈ మూడు అయిపోయిన తరువాత నీ పిండ దేహం కనబడుతుంది. ఆ పిండదేహం ఒక గాజు జాడీలో ఉంటుంది. ఆ పిండ దేహం అనేది నీ కోరిక, కర్మలు, కారణాలు అవన్నీ కూడా తీరిపోయాయి అని మహాదేవుడు నిర్ధారణ చేసుకుంటే ఆయన స్మశాన కారిగా నీ పిండ దేహం దహనం చేస్తాడు. ఆ పిండ దేహం దహనం అయితే ఇక లింగ దేహానికి నీ సాధన వెళుతుంది. నీ లింగ దేహం కూడా దహనం అయితే ఒక శివలింగం ఏర్పడుతుంది. అది కూడా దహనం అయితే గాని శూన్యంలో కలిసి పోలేవు. కాబట్టి అప్పుడు గాని నువ్వు మోక్షం పొందినట్టు అవుతుంది. అంటే నీ సాధన చివరిదాకా శివలింగాలుగా మారాలి. అక్కడ శివలింగం శూన్యం అవ్వాలి. శివలింగం కూడా శూన్యం అవ్వకుండా ఆగిపోవచ్చును లేదా లింగ దేహం దహనం అవ్వకుండా ఆగిపోవచ్చును. లింగ దేహం శివుడు దహనం చేయకుండా ఆయన ఆగిపోవచ్చును. మనో శరీరం దగ్గర మూడు శివలింగాలు విభేదనం చేయకుండా ఆగిపోవచ్చును.  బ్రహ్మ రంధ్రం దగ్గర ఒకవేళ  ఆగిపోయే పరిస్థితి వస్తే నువ్వు మోక్ష జీవిగా పరిపూర్ణంగా ఉండలేవు. ఎందుకంటే తల శివలింగ భాగంగా మారుతుంది. కాళ్లు ఉంటే చేతులు ఉండవు, చేతులు ఉంటే కాళ్లు ఉండవు. ఇలా తల మాత్రం పనిచేస్తుంది .మనోనేత్రం,  రెండు చెవులు మాత్రమే ఉంటాయి. అలాంటి శరీరంతో నువ్వు శూన్యస్థితికి అర్హత అనగా మోక్షమును పొందే దాకా ఆస్థితిలో ఉండవలసి ఉంటుంది. మరి ఆ బ్రతుకు బతకడం అవసరమా?  హాయిగా ఇక్కడ శరీరంతో సప్తదేహాలతో ఏ దేహం కావాలంటే ఆ దేహంతో, ఏ లోకానికి కావాలంటే ఆ లోకమునకు, ఏ లోకవాసులుగా కావాలంటే ఆ లోకవాసులుగా, ఏ రూపం కావాలంటే ఆ రూపంతో, యద్భావం తద్భవతి అన్నట్టుగా… మీకు కావలసినట్టుగా.. స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతిలో నీకు కావలసిన బ్రహ్మాండం నువ్వు ఏర్పాటు చేసుకొని నీకు కావలసినట్టుగా ఉండవచ్చును. నువ్వే బ్రహ్మాండ నాయక అవుతావు. నీకు తోడుగా వీళ్ళందరూ అంటే సాధనా కుటుంబం అంతా కూడా ఉంటుంది. వాళ్లు వాళ్లకి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక నువ్వే ఆలోచించుకో…. అని చెప్పేసి శివ నందినితో దత్తాత్రేయుడు అనేసరికి… శివ నందిని ఆలోచనలో పడింది. ఏం చేయాలా ఇప్పుడు… ఈయన చెప్పింది కూడా సత్యమే… ఇక మూల ప్రకృతికి అంటూ వెళితే వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి కాదు. అందుకోసం అని మూల ప్రకృతిని స్త్రీ, పురుష ప్రకృతికి మధ్య అనుసంధానం అనుమతిగా హనుమంతుడిని పెట్టి ఉండవచ్చు. ఎప్పుడైతే తను హనుమంతుని దాటడం జరిగిందో…. తను ఇక హృదయ చక్రానికి వెళ్లిపోవడం అంటూ జరిగితే….. కష్టాలు, నష్టాలు ఇక తనే పడవలసి ఉంటుంది. దత్త స్వామి అన్నట్టుగా…. తనకి మోక్షం పొందే అర్హత, , యోగ్యత ,యోగం ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే పర్వాలేదు…. లేకపోతే అర్ధ జీవితం… కాళ్ళు ఉన్న మోక్షజీవిగా లేదా చేతులు ఉన్న మోక్షజీవి గాను ఉండే అవకాశం ఉంది. పరమహంస సాధన అనుభవాల పరంగా చూస్తే ఈ రెండు రకాల మోక్ష జీవులు ఆయన అరుణాచల క్షేత్రంలో చూడడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని దత్తాత్రేయ స్వామి కూడా చెబుతున్నాడు.  కాబట్టి తను ఏం చేయాలి ….ముందుకు వెళ్లాలా లేక ఇక్కడ ఆగిపోవాలా?  ఇక్కడ ఆగిపోతే బ్రహ్మాండం ఏర్పాటు చేసుకొని తనే బ్రహ్మాండ నాయకగా ఉండవచ్చు… తనే మహారాణిగా ఉండవచ్చు అని ఆలోచనలు చేస్తూ ఉండటం జరిగింది. 

అప్పుడు రుద్రస్వామి కాస్త దత్తాత్రేయ స్వామితో స్వామి..! మీరు చెప్పింది నిజమే. నేను ఈ జన్మలో కాదు… ఏ జన్మలో అయినా… బ్రహ్మాండాలని ఏర్పాటు చేసుకున్నానా?. అని అడిగేసరికి …నువ్వు అనేక జన్మలలో ఈ సహస్ర చక్రానికి వచ్చి అనేక బ్రహ్మాండాలని ఏర్పాటు చేసుకున్నావు.  నువ్వు ఏర్పాటు చేసుకున్న బ్రహ్మాండాలు మీకు జన్మాంతర జ్ఞాన శక్తితో నీకే చూపిస్తాను అనేసరికి….. సరే అని రుద్ర స్వామి ధ్యాననిష్ఠలోకి వెళ్లేసరికి….. రుద్రస్వామి ఎన్నోమార్లు ఈ సహస్ర చక్రం వద్దకు రావటం, ఒకసారి దత్తాత్రేయుడు, ఒకసారి శ్రీకృష్ణుడు, ఒకసారి దక్షిణామూర్తి, ఒకసారి అమ్మవారు ఇలా నలుగురు నాలుగు రూపాలలో నాలుగు గురుస్థానాలలో ఉంచి… ఇదే విధంగా జ్ఞానబోధ చేయటం… అమాయకంగా వీళ్ళ మాటలు నమ్మి, బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకోవడం..ఆయా జన్మలో బ్రహ్మాండాలను 64 జన్మల్లో బ్రహ్మాండాలను ఏర్పాటు చేసుకున్నట్లుగాను, రాబోవు భవిష్యత్తు కాలంలో ఇంకొన్ని బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకున్నట్లుగాను, జ్ఞాన స్ఫురణ పొందడంతో…. ఆయన కళ్ళు తెరిచి స్వామి!  మీరు చెబుతున్నది నిజమే, సత్యమే, నేను కాదనటం లేదు… 64 యోగ జన్మలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ 64 జన్మల్లో నేను బ్రహ్మండాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా, నాకు జ్ఞాన స్ఫురణ అందింది. ఇది నిజమేనా? అంటే నిజమే… అలాగే నువ్వు భవిష్యత్తులో కూడా బ్రహ్మాండాలను ఏర్పాటు చేసే యోగం ఉండి ఉండాలి.. ఆ జ్ఞానం అందిందా?  అంటే ఆ జ్ఞానం కూడా అందింది… స్వామి,  నేను 27 జన్మల బ్రహ్మాండాలని ఏర్పాటు చేసుకుంటాను అనే జ్ఞానం అందింది అనేసరికి….అంటే ఇది 64 బ్రహ్మాండాలు అనుకుంటే 64 డైమెన్షన్స్, 64 లోకాలు అందింది  అని లెక్క వేసుకుంటే…. నేను 64 బ్రహ్మాండాలను పూర్తి చేసుకున్నాను ,నాకు కావలసిన బ్రహ్మాండాలు ఏవేవి అయితే పొందాలనుకున్నానో, ఏవైతే చేయాలనుకున్నానో, అవన్నీ పూర్తి చేయడం జరిగింది. మళ్లీ పొందిన అనుభవాలే తిరిగి నేను పొందుతాను అని… రాబోవు జన్మల్లో అవి 27 అంకె చూపిస్తుంది అంటే చేస్తున్నట్లే కదా స్వామి!  అనేసరికి అవును, ఒకరోజు లడ్డు తిన్నావు, ఇంకొక రోజు బూందీ తింటావు, ఇంకొక రోజు ఇంకొకటి, మళ్లీ లడ్డు తినాలనిపిస్తే తినవా ? అప్పటికే తిన్నాను కదా అని తినకుండా ఉంటావా!  లడ్డు యొక్క రుచి నిన్ను మైమరపించి జ్ఞాపకం తెస్తూ ఉంటే తినటం…. లేదంటే కొనుక్కొని తినడం చేస్తావు కదా!  అదే విధంగా కోరికని మళ్లీ తీర్చుకుంటావు అనేసరికి…. చేసిన బ్రహ్మాండాలని తిరిగి మళ్లీ నేను చేస్తూ ఉంటాను కదా!  అనేసరికి….అవును, 1000 కోరికలు, 1000 బ్రహ్మాండాలు, అంతకుమించి ఏమీ ఉండవు. అందుకనే సహస్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 1,000 కోరికలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి… నాకు తెలిసి 64 కోరికలు తీరినాయి… ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా!  అంటే వెయ్యిలో 64 కదా స్వామి!  అనేసరికి…. 64 మూలం మళ్ళీ ఆ 64కి వచ్చేసరికి తగ్గుతూ వస్తుంది. చివరికి వచ్చేసరికి ఒక కోరిక వస్తుంది. ఆ ఒక్క కోరిక 1000 కోరికలు అవుతున్నాయి అనేసరికి…. ఏదైనా ఒక కోరికను నేను బలంగా పెట్టుకుంటే,ఆ కోరికకు తగ్గట్టుగా వెయ్యి బ్రహ్మాండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కోరిక అయినా, వెయ్యి కోరికల అయినా ఒకటే కదా స్వామి ! అనేసరికి ….అది మనం ఆలోచించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన స్థాయిని బట్టి ఉంటుంది .ఇప్పుడు అన్నం ఒకటే, అన్నాన్ని నువ్వు వెయ్యి రకాలుగా మార్చుకొని తినటం అనేది మీ యొక్క కోరికను బట్టి ఉంటుంది. ఒకసారి పులిహోర, ఒకసారి దద్దోజనం, ఒకసారి చెక్కెర పొంగలి, నీకు కావలసినట్టుగా… నీకు నచ్చిన విధంగా తినడం జరుగుతుంది.  దాని గురించి కాదు, కోరికను బట్టి ఇక్కడ బ్రహ్మాండాలు ఏర్పడతాయి అని చెప్పి అనేసరికి…. అంటే ఇప్పుడు ఆశ ,భక్తి ,భయం అనే దాంట్లో నేను ఆశకి లోనైతే బ్రహ్మాండాలు ఏర్పడతాయి.. అంతే కదా!  అంటే అవును ఇప్పుడు స్త్రీ ప్రకృతిలోనూ, పురుష ప్రకృతిలోనూ లోపాలను చూసి ఉంటావు. ఆ లోపాలు లేకుండా ఉండవు,అవి లేకుండా  ఉండే ప్రకృతిలను ఏర్పాటు చేసుకో!  నీకు కావలసినట్టుగా ఈ బ్రహ్మాండాలను నడిపించుకో!  అప్పుడు నీకు కోరిక తీరిపోతుంది కదా! అనేసరికి… స్వామి!  అంటే అప్పుడు ఆదిలోనే బ్రహ్మాండంలో స్త్రీ, పురుష ప్రకృతులలో లోపాలు ఉన్నప్పుడు… నేను చేసుకున్న ప్రకృతిలో కూడా లోపాలు ఉంటాయి కదా!  మాయా ప్రభావం చేత అప్పుడు మళ్ళీ ఆ లోపాలను సరి చేసుకోవడానికి మరో బ్రహ్మాండం కావాలనుకోవడం, కోరుకోవడం జరుగుతుంది కదా!  స్వామి… అనేసరికి అవును జరుగుతుంది , ఇప్పుడు అంతా కూడా సరిగ్గా నూటికి నూరుశాతం చేయాలి అంటే కుదరదు. కాబట్టి నూటికి 99.99 శాతం మాత్రమే చేయగలం, ఆ 0.1% పూర్తి చేయడానికి ఆ కోరిక సంతృప్తి ఇవ్వకపోవడం వలన మనకు ఉన్నదాంట్లోనే మనం ప్రకృతిలోని లోపాలు ఉంటాయి.  ఆ లోపాలని సరిచేసుకునే అవకాశం మనకి ప్రకృతి ఇస్తుంది అనేసరికి….సహస్ర చక్ర సాధన స్థితికి ఇప్పుడు మేము రావాలి అంటే, సుమారుగా ఎన్ని జన్మల సాధన స్థితి ఉండాలి అంటే, 1000 కోట్ల జన్మల సన్యాస యోగంలో ఉండి….అన్నిటినీ పరిత్యాగం చేసే స్థితి కలిగి ఉండాలి.  భోగ జీవితం, యోగ జీవితం రెండిటిని కూడా పరిత్యాగం చేసి సన్యాస యోగి అయి ఉండి సహస్ర చక్రం దగ్గరికి ఇప్పుడు ఉన్న ఈ స్థితి రావటానికి వెయ్యి కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అది కూడా యోగ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అంటే 1000 కోట్ల యోగ జన్మలు ఎత్తితే గాని ప్రస్తుతం మీలాంటి వాళ్ళ అనుగ్రహం సజీవ మూర్తిగా పొందే అవకాశం ఉండదా అంటే అవును,  నువ్వు 1000 కోట్ల స్థితిని పొందడంతో…. నీకు నేను సజీవ మూర్తిగా కనిపించడం జరిగింది. నా స్థానంలో నీకు ఇదివరకు అమ్మవారు వచ్చి ఉండవచ్చు, నా అంశ అయిన విష్ణుమూర్తి వచ్చి ఉండవచ్చు, నా అంశ అయిన శ్రీకృష్ణుడు వచ్చి ఉండవచ్చు, వీళ్ళు గురువులుగా ఉంటారు. ఇదే దత్తాత్రేయ అవతారం యొక్క విశేషం.  ఇక్కడ మొత్తం నలుగురు గురువులు వస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దేవి అంశతో నా భార్య అనఘా దేవి రావడం జరుగుతుంది. విష్ణు అంశగా నేను దత్తాత్రేయుడిగా, విష్ణుమూర్తిగా, శ్రీకృష్ణునిగా, యద్భావం తద్భవతి అని… ఎవరు ఏ భావానికి తగ్గట్టుగా భావన చేస్తారో, నేను ఆ భావమును ఎత్తడం జరుగుతుంది అనేసరికి… ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎత్తిన అవతారాలు, ఎత్తిన బ్రహ్మాండాలు, ఎత్తిన రూపాలు ఎత్తుతూనే ఉన్నాను… కోరిక తీరట్లేదు… తీరదు అని చెప్పి నాకు అర్థం అయింది స్వామి! అని శివ నందిని కేసి అదోలా చూస్తూ… మరి నీకు ఈ కోరిక తీరటం అనేది జరుగుతుందా? ఎక్కడ సంతృప్తి పొందుతావు? ఏ విధంగా సంతృప్తి పొందుతావు? అందులో కోరిక తీర్చుకునేటప్పుడే మళ్లీ అందులో అసంతృప్తి కూడా  కలుస్తుంది. కోరిక తీరే వరకు నువు ఈ బ్రహ్మాండాలను సృష్టిస్తూనే ఉంటావు. అందులోనే దానికి తగ్గట్టుగానే కోరికలు తీర్చుకుంటూ ఉంటావు అనేసరికి…. కోరిక సంతృప్తి చెందిన తర్వాత వచ్చే స్థితి ఏంటి స్వామి? అంటే కోరిక లేనప్పుడు నీకు కర్మ జన్మస్థితి ఉండదు కదా! అనుభవించడానికి ఇంకేం ఉంటుంది… ఆత్మ సంతృప్తి కలిగిన తరువాత , మనసు సంతృప్తి కలిగిన తర్వాత ఇంకేముంటుంది…. అనుభవించడానికి!  ఇక ఆ తర్వాత నువ్వు స్మశాన వైరాగ్యం పొంది హృదయ చక్రానికి వెళతావు,  ఎందుకంటే నూటికి 98% మంది ఈ బ్రహ్మాండాలు ఏర్పరచడానికి కారణం…. వాళ్ళు అనుకున్న సంకల్పం తీరకపోవడం వల్లనే, ఈ సంకల్ప శరీరంతోనే బ్రహ్మాండాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏర్పరచుకున్నప్పటికీ కూడా…. మాయా ప్రభావం చేత ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా అసంతృప్తి అయితే ఉంటుంది. ఆ అసంతృప్తి వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి మూలాధార చక్రం లోకి వెళ్లిపోయి….  మళ్ళీ సంకల్పం పెట్టుకొని మూలధార చక్రం నుంచి సాధన చేస్తూ వస్తారు. మళ్ళీ సహస్ర చక్రానికి వచ్చి వాళ్లకి కావలసిన బ్రహ్మాండాన్ని వాళ్ళ సంకల్పాలానికి తగ్గట్టుగా చేస్తారు. వాళ్లకి అసంతృప్తి కలిగిస్తుంది. ఏదో ఒక విషయంలో, ఎప్పుడో ఒకచోట వాళ్లకి వ్యతిరేకంగా జరుగుతుంది అనేసరికి…. సరే స్వామి!  అయితే ఇక కోరిక సంకల్పం తీరటం అనేది మన చేతుల్లో లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా అసంతృప్తి అయితే ఏదో ఒక మూల ఉంటుంది. మళ్లీ ఆ అసంతృప్తి కాస్త కోరికగా మారుతుంది. ఆ కోరిక కాస్త సంకల్పంగా మారి …మళ్ళీ  మూలాధార చక్రం లోకి వెళ్ళిపోయి సాధన మొదలు పెట్టుకుంటూ ఉంటాను…మళ్ళీ ఈ సహస్ర చక్రానికి రావాలంటే 1000 కోట్ల జన్మలు ఎత్తాలి.  అది కూడా సన్యాస దీక్ష తీసుకున్న జన్మలు ఎత్తాలి అనేసరికి …. అవును,  అంత మహత్తర స్థితి నువ్వు పొందబట్టి, నన్ను సజీవమూర్తిగా చూడగలుగుతున్నావు. లేదు అంటే నీతో నేను అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది! మీ దగ్గరికి రావలసిన అవసరం ఏముంది!  అర్హత, యోగ్యత,యోగం ఉంది కాబట్టి… నువ్వు తెలుసుకున్నావు కాబట్టి…. నేను నీతో మాట్లాడగలుగుతున్నాను.  అంటే నీకు నాకు తేడా ఏమీ లేదు… సాధనలో ఇద్దరం ఒకే స్థితిలోనికి చేరుకోవటం జరిగింది. నేను ఎలాగైతే బ్రహ్మాండానికి ఏర్పరచుకుంటానో …నువ్వు అలాగే బ్రహ్మాండాన్ని ఏర్పరచుకుంటావా!  లేదా? అని ఇక్కడ నీ ఒక్కరికే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా సరి సమానమైన సాధనాస్థితికి చేరుకోవడం జరిగింది.  పిల్లలు కూడా చూడటానికి చిన్నపిల్లలు అయినా వాళ్ళకి కూడా 1000 కోట్ల జన్మలే. కాకపోతే వాళ్లకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. వాళ్లకి కావలసినట్టుగా వాళ్ళు ఇక్కడ బ్రహ్మాండాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.. వాళ్ళు బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకుంటాను అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేసరికి… ఇదే కదా నేను త్రిపురా రహస్యంలో పరశురాముడికి బోధన చేసింది.  ఎవరికి వారే సొంతగా బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్లకి ఆ అర్హత, యోగ్యత, యోగం మనకి ఇక్కడ సహస్ర చక్రం ఇస్తుంది. వాళ్లకి కావలసినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా…. బ్రహ్మాండాన్ని తయారు చేసుకొని ఏలుకోవచ్చు.  బ్రహ్మాండ నాయకుడిగా, బ్రహ్మాండనాయకగా మారచ్చు.  నువ్వే దేవుడివి అవుతావు, నువ్వే దేవతవి అవుతావు, నువ్వే పరమాత్మ, పరంజ్యోతి అవుతావు. నీకు కావలసినట్టుగా నువ్వే విశ్వ గురువు అవుతావు. ఇక నీకున్న ఇబ్బంది సమస్య ఏమిటి ? అనేసరికి అప్పుడు రుద్ర స్వామి కాస్త ఇక్కడ సమస్య అంటూ ఏమీ లేదు. ఇక్కడ సంకల్పం తీరదు.  సంకల్పం అలాగే ఉండిపోతుంది అని బలంగా అర్థమవుతుంది. ఆ సంకల్పం తగ్గట్టుగా బ్రహ్మాండం ఏర్పాటు చేసినప్పటికీ కూడా

 ఏదో ఒక మూల అసంతృప్తి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అసంతృప్తి కోసం పునః జన్మకు వెళ్లి మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు సాధన చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు.  కాబట్టి మేము ఇప్పటికే ఇంతకుముందు ఎన్నో జన్మలు ఈ బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, నాకైతే మళ్లీ బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన, ఉద్దేశం అయితే లేదు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే నాకు తెలియదు అని రుద్ర స్వామి మౌనం వహించేసరికి….అది నీ ఇష్టం.  నేను ఇదే చేయమని చెప్పను, అలాగే ఉండమని చెప్పను, నేను ఇక్కడ అవకాశాలు ఇస్తున్నాను.. ఒకసారి మూల ప్రకృతిలోనికి వెళితే వెనక్కి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉండదు.  ఎందుకు అంటే…. ఇక అది బంధనం అయిపోతుంది. ఇక ఆ ప్రకృతికి వెళ్తే అది గాఢాంధకార శూన్యంలోకి వెళ్ళిపోయినట్లే. అంధకారంలోకి వెళ్ళిన తరువాత వాళ్ళు లోపలికి వెళ్లిపోవడమే కానీ ఇక బయటికి రావటం అనేది ఉండదు. అక్కడికి వెళ్లిన తరువాత అక్కడ ఉన్న అర్హతను బట్టి మోక్షజీవి అవుతారా అనేది వాళ్ళ యొక్క సాధన స్థితిగతులను బట్టి, చేతలను బట్టి, చేతులను బట్టి ఉంటుంది.  నేనైతే ఏమీ చెప్పలేను, అదైతే గ్యారెంటీ ఇవ్వలేను అనేసరికి… అమ్మ!  నీ పరిస్థితి ఏమిటి అని శివ నందిని కేసి చూసేసరికి… నాది కూడా రుద్ర స్వామి లాగానే స్వామి!  నేను కూడా ఈ బ్రహ్మాండాలలో కూడా  నేను ఏర్పాటు చేసుకున్నట్లుగాను, అందులోనే నేను బ్రహ్మాండనాయకగా ఉన్నట్టు, కొన్ని స్త్రీ జన్మలు, కొన్ని పురుష జన్మలు, కొన్ని దేవతా జన్మలు, కొన్ని గురు శిష్య జన్మలు అన్నీ ఎత్తినట్లుగాను అన్నీ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడే నేను ధ్యాననిష్ఠలో చూసుకున్నాను. నేను కూడా జన్మాంతర జ్ఞాన సిద్ది పొందడం వలన ఇవన్నీ తెలిసాయి. రాబోవు జన్మలు కూడా ఉన్నాయని తెలిసింది.  ఎత్తిన జన్మలే ఎత్తుతూ సంకల్పం కోసం ఒక బ్రహ్మాండాన్ని చేసుకోవడం వలన ఉపయోగం లేదు.  మాకు ఈ స్త్రీ ప్రకృతికి, పురుష ప్రకృతికి అతీతమైన మూల ప్రకృతికి వెళ్లాలని ఉంది.  శూన్యం అవుతామా లేదా అనేది ఇక సాధనా స్థితిగతులను బట్టి అనుగ్రహం బట్టి ఉంటుంది. కాబట్టి మేము అక్కడికే వెళ్ళాలి అని నిశ్చయించుకుంటున్నాము అనేసరికి… ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో తల్లి!  ఇక మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉండదు. ఒకసారి నువ్వు హనుమంతుని దర్శనంలోకి వెళ్లావు…. ఆయన అనుగ్రహం పొంది నువ్వు దాటావు అంటే, ఇంక మూల ప్రకృతిలోనికి వెళ్లాల్సి ఉంటుంది అనేసరికి నేను ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటున్నాను స్వామి!  అనేసరికి మహాదేవి కేసి చూసేసరికి…. వాళ్ళిద్దరి బాటలోనే నేను నడుస్తాను స్వామి!  మీరు సజీవంగా కనిపించాలి అని ఒక మూల కోరిక ఉన్నది.  ఆ కోరిక ఈరోజుతో తీరిపోయింది.  ఈ జన్మకి ఇది చాలు, ఇంతకుమించి నాకు ఏ బ్రహ్మ పథం, ఏ బ్రహ్మాండాలు అనే లక్ష్యాలు అయితే లేవు. నేను కూడా ఇప్పటికే చాలా బ్రహ్మాండాలు సృష్టించినట్లు అవన్నీ నాశనం అయినట్లు రాబోవు జన్మల్లో కూడా బ్రహ్మాండాల జన్మలు ఎత్తే  యోగంలో ఉన్నట్టు లీలగా ధ్యానంలో కనిపించింది.కాబట్టి నావల్ల అయితే కాదు. నేను అయితే  మూల ప్రకృతికి వెళ్ళాలి అనుకుంటున్నాను స్వామి!  మీ అనుగ్రహం వలన నాకు మోక్షం వచ్చేలా అనుగ్రహించండి. అంతకుమించి ఇంక ఏమీ లేదు అనేసరికి…. మహాదేవి కేసి చూస్తూ… అమ్మ!  ఈ మోక్షం పొందే అర్హత, యోగ్యత ,యోగం నాకు ఉంటే , నేను ఇక్కడ సహస్ర చక్రంలో కూర్చుని జ్ఞానబోధ చేసే అవకాశం ఉండేది కాదు కదా!  నాకు మోక్షజ్ఞానం మాత్రమే  తెలుసు.  మోక్షం పొందే స్థితి నేను తీసుకోలేదు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయ, కారకం నా చేతుల్లో జరగాలని సంకల్పం పెట్టుకున్నాను.  ఆ సంకల్పమే నన్ను ముంచింది.  దానితో ఇక మూడు  సృష్టి, స్థితి,లయలు నా చేతుల మీదుగా వాటిని చూసే బాధ్యతలు నాకు మూల ప్రకృతి ఇవ్వడం జరిగింది.  ఎవడి ఆలోచనకు తగ్గట్టుగా ఈ యొక్క మూల ప్రకృతి ఏర్పాటు చేస్తుంది.  ఉదాహరణకి దోమ పుట్టగానే చనిపోవాలి అనుకుంది.  దాని ఉద్దేశం అవతలి వాళ్ళని కుడితే వాళ్ళు చనిపోవాలి అని…. కానీ తను కుడితే తనే చనిపోతుందనే విషయం గ్రహించలేకపోయింది. అలాగే ఉంటుంది మహామాయ యొక్క  ప్రభావం కూడా ….నిదర్శనానికి, నీ దర్శనానికి చాలా తేడా ఉంటుంది. నిదర్శనానికి సాక్ష్యం అని, నీ దర్శనము అంటే ఆయన దర్శనం కలిగించటం. ఇది మీకు తెలియని విషయం కాదు. కాబట్టి మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. మూల ప్రకృతికే వెళ్లిపోండి. పిల్లలకి ఇంకా తెలిసి తెలియని వయస్సు అనేసరికి…. మేము వయసు  చిన్న పిల్లలమే కానీ, మాకు అన్నీ తెలుసు. ఈ బ్రహ్మాండాలతో వీటితో మేము ఉండలేము.  మా వల్ల కాదు. నాకు ఇక్కడ ఉండ్రాళ్ళు కావాలంటే చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఉండ్రాళ్ల కోరిక తీరట్లేదు, ఈ కోరిక తీరుతుంది అని గ్యారెంటీ అయితే లేదు. భూలోకంలో అయినా నాకు కావలసినట్టుగా నేను ఉండలేకపోయాను, నాకు నచ్చినట్టుగా ఉండలేకపోయాను, కానీ బ్రహ్మాండంలో నాకు నచ్చినట్టుగా ఉంటుంది అని నేను అనుకోను అని బాలగణపతి అనేసరికి…..బాల కుమారస్వామి కాస్త నేను నా తల్లిదండ్రులతో భూలోకంలో ఉండాలనుకున్నాను. భూలోకంలో నా తల్లితండ్రులు నన్ను ఏదో ఒక చోట వదిలిపెట్టడం, తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ నాకు దక్కలేదు…. అలాంటిది ఈ బ్రహ్మాండాలలో నాకు తల్లిదండ్రుల ప్రేమ కావాలని చెప్పేసి నేను ఆగిపోయాను. వాళ్ళు లోక కళ్యాణార్థం వాళ్ళు వెళ్లిపోవడం, కాలానుగుణంగా వెళ్లిపోవడం, కర్మానుసారంగా వాళ్ళు వెళ్లిపోయారు అంటే ఆ వేదన నేను తట్టుకోలేను.  ఆ బ్రహ్మాండాలు మా వల్ల కాదు అనేసరికి… మీరు పిల్లలు కాదురా!  పిడుగులు… మీకు జ్ఞానం అందలేదు అనుకున్నాను మీకు కూడా పూర్ణజ్ఞానం అందింది అన్నమాట ! సావాస లక్ష్యం.  అందుకే సాంగత్యం పెట్టుకోవాలని గురువులు చెప్పడం జరిగింది. ఆ సాంగత్యంలో కూడా సాధనలో ఉన్న వాళ్ళని పెట్టుకుంటే, మీకు సాధనలో ధర్మసందేహాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అభిప్రాయాలు చెప్పుకోవడం వలన అనుభవాలు పంచుకోవడం వలన ఎవరు ముందు వెళ్తున్నారు? ఎవరు వెనుక వెళ్తున్నారు? ఎవరు ఆగుతున్నారు? ఏ కారణం చేత ఆగుతున్నారు? అని ఒకటికి రెండుసార్లు విశ్లేషణ చేసుకునే స్థితిని పొందడం జరుగుతుంది. మాకు మీలాగా సాంగత్యం పొందే వాళ్ళు దొరకలేదు. మాయలోనూ, భోగ కోరికలలోను… అవసరభక్తి, ప్రసాదభక్తిలోను ఉన్నవాళ్లే దొరికారు. కానీ మీలాగా నిజ సాంగత్యం మోక్షం పొందాలి అనే లక్ష్యంతో, సంకల్పంతో ఉన్న ఇలాంటి వాళ్లు సాంగత్యం దొరకడం చాలా అసాధ్యం. మీకు మోక్షం పొందే యోగం ఉంది. కాబట్టి మీరందరూ కలిశారు. సాంగత్యం పొందడం జరిగింది కాబట్టి… మీ సాధనకి నేను ఎలాంటి అవాంతరాలు కలిగించను. నా బాధ్యత చెప్పవలసి ఉంది కాబట్టి చెబుతున్నాన.  మీ అందరూ కలిసి మంచి నిర్ణయమే తీసుకున్నారు.  మీరంతా కూడా మోక్షం పొందటానికి మూల ప్రకృతి సాధన చేయాలి అనుకుంటే….ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టుగా సప్త చక్రాలలో ఉన్న సప్తదేహాలలోనూ సప్త మోక్షపురాలలో మోక్ష సాధన చేసుకోవాల్సి ఉంటుంది.  సప్త శరీరాల మోక్షం.  ఈ సాధన పరిసమాప్తి పొందితే గాని మీకు జీవనాడిలోనికి అనుమతి రాదు. అందుకనే సాధనా విగ్రహ మూర్తి నుంచి మీకు ఎలాంటి ఆధారం రాలేదు అనేసరికి…. ఇప్పుడు సప్త మోక్ష పట్టణాలలో ఏ దేహం మోక్షం పొందుతుందో ఎలా తెలుస్తుంది అని శివ నందిని అడిగేసరికి… ఈ సాధనా విగ్రహ మూర్తి యొక్క సప్త చక్రాలు ఒక్కొక్క యోగ చక్రం విభేదనం అవుతూ మాయమవుతుంది. అప్పుడు ఒక ఆధారం నీకు వస్తుంది. ఆధారం ముందు వైపు సజీవ మూర్తి గా రుద్ర మూర్తి ఎక్కడ ఉన్నాడు….ఏంటి? అని ఒక ఆధారం వస్తుంది.  ఇలా ఏడు ఆధారాలు వస్తాయి. 

ఈ సాధనా విగ్రహ మూర్తి యొక్క సప్త చక్రాలు విభేదనం అయినప్పుడు వచ్చే ఏడు ఆధారాలు ఒక వైపు సజీవ మూర్తిగా ఉండే ఆదిరుద్రుడు ఉన్న దక్షిణామూర్తి క్షేత్ర వివరాలు తెలిపితే…. మరోవైపు మీకు ఏ చక్రం నుంచి ఆధారం వచ్చిందో ఆ చక్రం యొక్క శరీరం మోక్షం పొందే క్షేత్రం పేరు ఉంటుంది అని చెప్పేసి అనేసరికి….మహాదేవి కాస్త స్వామి!  మీ మాట మీరినందుకు మీ ఆజ్ఞని మీరినందుకు మమ్మల్ని క్షమించండి అనేసరికి… ఇందులో క్షమించడానికి ఏముందమ్మా!  మీ సంకల్పం ఏమిటి!  అనేది తెలుసుకున్నాను. కేవలం నేను మార్గదర్శకుడిని. మీకు విషయం తెలియదు కాబట్టి ఈ విషయం చెప్పడానికి వచ్చాన.  పదార్థం దాటితే కానీ యదార్థం అర్థం కాదు. ఇక్కడ గురుమాయ దాటితే గాని సాధనా మాయ, మోక్షం అంటే ఏమిటి?  అనేది మీకు స్వతహాగా తెలియదు.  ఇక్కడ నేను ఇదే చేయమని చెప్పను… అవకాశాలు చెప్తాను. ఆ లోకంలో ఉండే అవకాశాలు చెప్తాను. మీకు స్త్రీ ప్రకృతిలోనూ, పురుష ప్రకృతిలోనూ ఉండే లోపాలు, మాయలు, మర్మాలు చెప్తాను. అలాగే మూల ప్రకృతిలో ఉన్న మాయలు, మర్మాలు అన్నీ నాకు తెలుసు. ఈ రెండింటిని అనుసంధానకర్తగా ప్రకృతి నన్ను ఉంచడం జరిగింది. ప్రకృతి ఇవ్వటం కాదు, నాకు నేనే నిలబడి మోక్షం పొందకుండా… మోక్షం పొందే వాళ్లకి మోక్ష మార్గంలో బ్రహ్మాండాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి సంకల్పాలకు తగ్గట్టుగా ఉండాలి అని నాకు నేనే నిర్ణయించుకుని గురుబ్రహ్మగా ఉండటం జరిగింది. ఇక్కడ నాకు ఎవరూ ఆదేశాలు ఇవ్వరు అనగానే…. పిల్లలు కాస్త స్వామి!  మరి మీరు మోక్షం పొందవచ్చు కదా!  ఈ బాధ్యత అంతా ఎందుకు? అనేసరికి…. మీలాంటి వాళ్లకి మోక్ష ఙ్ఞానం చెప్పడానికి నేను ఉన్నాను అనేసరికి…. మేము ఎక్కడి నుంచి వచ్చాము స్వామి!  మీనుంచే కదా!  మీరు తప్ప ఎవరూ ఉండరు కదా!  అలాంటప్పుడు మీరు వెళ్లిపోవచ్చు కదా!  వేరే వాళ్ళకి చెప్పడానికి ఏమున్నది …ఇప్పుడు ఏకత్వస్థితి అన్నప్పుడు అంతా దత్తమయం అని, అంతా దత్తాత్రేయులే అన్నప్పుడు మీకు మీరే చెప్పుకోవడం కోసం మీరు ఎందుకు ఉండటం అనేసరికి….ఇప్పటికే నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నేను కానిది ఏమున్నది? ఇప్పుడు బాలగణపతి కాస్త దత్త గణపతి వాడు కాస్తా దత్త కుమారస్వామి, ఉన్నది శివ దత్తం, విష్ణు దత్తం, దేవి దత్తం ఇవన్నీ కూడా నేను పేర్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు నేనే నాలో ఉన్న 1000 భాగాలలో ఒక్కో భాగానికి నేను చెప్పుకోవాలి అనుకుంటున్నాను. అందులో వినే భాగాలు ఉంటాయి..వినని భాగాలు ఉంటాయి. వినే భాగాలు ఏమో చాలా తక్కువగా ఉంటాయి. వినేవి తక్కువ, విననివి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ప్రకృతి నిలబడిపోతుంది. నీకు అర్థం అవ్వాలి అంటే, లేని విశ్వం ఉన్నది… సత్యం అనే భ్రమ, బ్రాంతిలో ఉండి ఉంది అనుకునే వాళ్ళు 99.99 శాతం ఉన్నారు… నిజమైన సత్య జ్ఞానం ఈ విశ్వం లేదు అనుకున్న వాడు 0.1% ఉన్నారు. అప్పుడు ఎవరి మాట గెలుస్తుంది అనేసరికి…. 99.99 శాతం ఉన్న వాళ్ళ మాట మాత్రమే గెలుస్తుంది. లేనిది వాళ్లు ఉన్నట్లుగా భావించుకుంటున్నారు కాబట్టి… లేని విషయం ఉన్నట్లుగా కనపడుతుంది… 0.1% ఉన్నవాడివి చాలా తక్కువ కాబట్టి, వాళ్ళు బలం నిలబడదు.  ఇప్పుడు నా శరీరంలో కూడా 1000 భాగాలలో 99.99% భాగాలు మాయకి అంకితం అయిపోయినాయి. లేని విశ్వంలో, లేని బ్రహ్మాండాన్ని ఉన్నట్లుగా….భావన చేసుకోమని భ్రమ , బ్రాంతిలో పడటం జరుగుతుంది. అది కోరిక అనుకో… సంకల్పం అనుకో ….ఆలోచన అనుకో ….భయమనుకో …. ఆశయము అనుకో…స్పందన అనుకో…. దేనికో దానికి అది రూపాంతరం చెందుతూ.. మార్పు చెందుతూ.. ఆగిపోవడం జరుగుతుంది. ఆ విధంగా నేను వెయ్యి రూపాలలో 99 రూపాలు దాని గురించే ఆలోచన చేయడం వలన ఇక్కడ ఉండిపోవలసి వచ్చింది. అదే 99 భాగాలు మాయలో పడకుండా, దేనికి స్పందించకుండా, మాయలో పడకూడదు వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు.. నేను ఇప్పుడు చెప్పడానికి ఉండదు.. ఉండటానికి ఉండదు… అలా ప్రయత్నం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండి ఉంటారు అనేసరికి… ఇక్కడ కూర్చొని మీరు ఇలా చెప్పడం వలన అందరూ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా!  అంటే నేను ఇక్కడ గురుపరీక్ష పెడతాను. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత తట్టుకోలేకపోతే అతలాకుతలమయ్యి మోక్షజీవులుగా మారడం జరుగుతుంది కదా!  రెండు రకాల జీవులుగా కూడా మారడం జరిగింది కదా! మరి ఆ స్థితి రాకుండా ఉండటానికి అని చెప్పి ఆ అర్థ శరీరాలు పొందకుండా… పూర్ణ శరీరంతో ఉండడానికి… అని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి విషయం చెబితే, ఈ లోకాల వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఎంత, ఆ లోకంలోకి వెళితే నష్టం ఏమిటి, లాభం ఏమిటి? స్థితిగతులు ఏమిటి ?ఏం పొందవచ్చు, ఏం పొందకూడదు?  అనే లోకజ్ఞానం నాకు ఉండటం వలన… నా శరీర భాగాలకి ,నా రూపాలలో ఉన్న వాళ్ళకి నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. వాటిని నేను ఒత్తిడి చేయమని చెప్పను… ఇప్పుడు మీరు ఉన్నారు,  మీరు మోక్షానికి వెళ్ళటానికి లేదు, బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకొని ఉండాలి అని అనలేదు కదా!  అంటే,  అనలేదు…. ఒత్తిడి చెయ్యలేదు… లోతుపాతులు చెప్పారు… అంటే, నేను అదే చెప్తున్నాను. ఇది పరిస్థితి, స్థితిగతి అని, అందులోకి వెళితే ఏమవుతుంది… ఇందులోకి వెళితే ఏమవుతుంది అనేది మీకు చెప్పాను. మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇదే నిర్ణయం మీరు తీసుకోవాలి అని ఏ దేవుడు, ఏ గురువు మీకు చెప్పరు. కాకపోతే అవకాశాలు ఇస్తారు. సాధనలో ముందుకు వెళ్లడానికి మార్గం చెప్పడం వరకే నా బాధ్యత. ఇప్పుడు అలా చెప్పే వాళ్ళు లేకపోవడం వలన నా శరీర భాగాలు మాయలో పడిపోవడం జరిగింది. అనుమానభయంతో నేను ఇక్కడే ఆగిపోవడం జరిగింది. కానీ, ఆ అనుమానభయమే నాకు మహా మాయగా మారింది అని ఆలోచన వచ్చింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. నేను బ్రహ్మాండం ఏర్పరుచుకోవటం జరిగింది. నేను చేసిన తప్పు మరి ఎవరు చేయకూడదు ఇక నా గురు బాధ్యతగా నేను ఇక్కడ ఉండటం జరిగింది అనేసరికి… సరే మంచిది!  ఇప్పుడు అర్థం అయ్యింది అనేసరికి.. రుద్రస్వామి కాస్త స్వామి!  మీరు సజీవ మూర్తిగా రుద్రమూర్తి అనుగ్రహం ఇస్తారా ఉన్నదా!  అంటే ఇప్పుడు మీ సప్త శరీర సాధనలో మీరు మోక్షం పొందవలసి ఉంటుంది. కర్మ కాలి ఏ శరీరం అయినా ఆగిపోయినా…. ఆ శరీరం ఏ ఏ ప్రకృతిలో ఆగిపోతే ఆ ప్రకృతిలో మళ్ళీ మాయా జీవిగా, కర్మ జీవిగా ఎత్తి మళ్లీ ఈ సాధన స్థితికి మీరు వెయ్యి కోట్ల జన్మలకి సిద్ధపడి రావలెను. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి నియమం. దానిని మీరటానికి లేదు. మీ అదృష్టం బావుండి ఈ ఏడు శరీరాలు ఏడు చక్రాలలో ఉన్నవి కూడా మోక్షం పొందితే మీకు హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. జీవనాడి మార్గం కలుగుతుంది. తద్వారా మూల ప్రకృతిక అయిన హృదయ చక్రమునకు మీరు వెళ్లడం జరుగుతుంది. ఇక ఆపై మీ సాధన అంతా కూడా ఆదిదంపతులు ఆపై బ్రహ్మ రంధ్ర సాధన అంతా కూడా శూన్యం చూసుకోవాల్సిందే. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. మీ చేతుల్లోనూ ఏమీ లేదు. మీకు అర్హత యోగ్యత యోగం పొందే స్థితిగతులు ఉన్నాయా లేదా అని మాత్రమే మీకు 70 శాతం అవగాహన రావాలి అంటే… తెలియాలి అంటే… మీరు ఈ సప్త శరీరంలో మోక్షం పొందవలసి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీ సాధన మూలాధార చక్రం లోకి వెళ్లడం జరుగుతుంది. మూలాధార చక్రం లోకి మళ్లీ స్త్రీ పురుష ప్రకృతి మాయలు మొదలు పెడుతుంది. ఆ మాయలు దాటుకుంటూ మీకు అక్కడ ఉన్న కర్మ శేషాలు ఒక్కొక్క దేహానికి కారణాలు, కర్మలు, ఋణాలు ఉంటాయి. వాటిని మీరు తీర్చుకుంటూ రావలసి ఉంటుంది. దానికి ఎలా, ఏమిటి? అనేది ప్రకృతి మీకు మార్గ నిర్దేశం చూపిస్తుంది. నేను ఇక్కడ ఒక అవగాహన మీకే ఇస్తాను… ఎందుకు అంటే బ్రహ్మ రంధ్ర గుహలో మీకు కపాలధారి దర్శనం ఇస్తాడు.  ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దర్శనం ఇస్తాడు. అవి మీకు ఇచ్చిన కపాల ధారి దర్శనాన్ని బట్టి, మీ శరీరానికి ఎన్ని కర్మలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. స్త్రీ ప్రకృతిలోనూ, పురుష ప్రకృతిలోనూ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు, ఆజ్ఞా చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఉన్న అన్ని చక్రాలకి…. ఉన్న కర్మలు సశేషంగా కర్మ శేషం లేకుండా, మీరు చేసుకోగలిగితే అప్పుడు మీకు ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలా మోక్షం పొందడం జరుగుతుంది. మూలాధార చక్రంలో ఉన్న కర్మలు సమూలంగా నాశనం అయితే, మీకు ఆది జన్మ స్థూల శరీరం పోతుంది. ఈ జన్మస్థూల శరీరం కాదు, ఆది జన్మస్థూల శరీరం పోతుంది. ఆ విధంగా ప్రస్తుత జన్మకి మూలకమైన సప్తదేహాలకు మూలాలైన ఆదిజన్మల యొక్క శరీరాలు పోతాయి. ఈ సప్తయోగ చక్రాల ద్వారా పోతాయి. ఇవి ఉండటానికి గల కారణాలు ఏమిటి?  అంటే వాటికీ కొన్ని కర్మబంధలు ఉన్నాయి.. ఋణబంధాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు మూల ప్రకృతి నుంచి బ్రహ్మ రంధ్రానికి వెళతారో, ,అక్కడ నాలుగు దేహాలు ఉంటాయి. ఈ నాలుగు దేహాలకి ఋణాను బంధాలు ఉంటాయి. స్త్రీ ప్రకృతిలోనూ, పురుష ప్రకృతిలోనూ కర్మలు బంధాలుగా అయితే, మూల ప్రకృతిలోకి వచ్చేసరికి ఋణాల బంధాలు ఉంటాయి. ఈ ఋణాలు, బంధాలు తిరితే గాని మోక్షం పొందటానికి ఉండదు. అది ఏమిటి అనేది?  దీనికి సంబంధించిన జ్ఞానం మీకే ప్రకృతి అందిస్తుంది.  కాకపోతే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఒక్కొక్క యోగ చక్రంలో కర్మలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దేహం పొందటానికి ఏంటి అన్నప్పుడు నా అనుగ్రహం వలన బ్రహ్మ రంధ్రంలో మీకు ధ్యాన నిష్ఠలో ఉన్న కపాలధారి యొక్క కపాలాల సంఖ్యను బట్టి విషయం అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీకు నేను అవగాహన ఇస్తాను. ఆ విషయం చెప్పడానికి నేను మీకు సజీవ మూర్తిగా కనిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ  ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఎవరికి నేను ఏ విధంగా కపాలధారిగా కనపడతానో అది గుర్తుపెట్టుకోండి. మీకు నాకు తెలిసినంతవరకు 11 వరుసలలో కపాలధారిగా కనపడతాను, నిజానికి 108 కపాలధారిగా నేను ఉండాలి. కానీ మీకు సాధన పూర్తి అయిపోవడంతో… 11 దేహాలకి మోక్షం ఇస్తే మోక్షం పొందుతారు కాబట్టి, సప్తదేహాలకి ఉన్న కర్మలు ఎన్ని? అలాగే నాలుగు దేహాలకి ఉన్న ఋణానుబంధాలు ఎన్ని? అనేది అవగాహన కలిగించడానికి కపాల దారి మీకు చెబుతాడు అనేసరికి… సరే అని చెప్పి ఎవరికి వారే బ్రహ్మ రంధ్రం గురించి సంకల్పం చేస్తూ… ధ్యాననిష్ఠలో సాధన కుటుంబం అంతా సజీవ మూర్తిగా ఉన్న దత్తాత్రేయ స్వామి వద్ద ధ్యానంలోకి వెళ్లడం జరిగింది. అలా వెళుతూ ఉండేసరికి రుద్ర స్వామికి ధ్యానంలో బ్రహ్మ రంధ్రం యొక్క గుహలో కపాలధారి దర్శనం ఇవ్వడం జరిగింది. అది విచిత్రంగా 1,3,5,7,9, 11, 13, 15, 17, 19 ,21 ఇలా 11 వరుసల్లో కపాలాలతో ఉన్న అస్థిపంజరం పద్మాసనంలో ధ్యానంలో ఉన్న అస్థిపంజరం కనిపించేసరికి…. ఇదేనేమో బహుశా కపాల దారి అనుకోని…. ఆ సంఖ్యలు అన్నింటిని మనసులో గుర్తు పెట్టుకోవడం జరిగింది. మహాదేవికి కూడా ఇదే విధంగా కపాలధారి దర్శనం జరిగితే…. పిల్లలకి, శివ నందినీకి మాత్రం 1,2,4,6,8,10,12,14,16,18,20 వరుసలలో ఉన్న వాళ్ళు కనిపించారు. వీళ్ళందరూ కూడా కపాలాల వరుసలు గుర్తుపెట్టుకోవటం జరిగింది. ధ్యాన భంగం అవ్వడంతో అందరూ కూడా ధ్యాననిష్ట నుంచి బయటకు రావడం జరిగింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి వీళ్ళకేసి చూస్తూ రుద్ర స్వామి కేసి చూసి మీకు కపాల ధారి ఎలా దర్శనమిచ్చారు? అని అడిగేసరికి…. నాకు 1,3,5,7,9, 11, 13, 15, 17, 19 ,21 గా కపాల ధారి దర్శనం ఇచ్చారు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే నీకు స్థూల శరీరం విముక్తి పొందాలి అంటే 21 కర్మల యొక్క కర్మ బంధాలు తీరాలి. అలాగే సూక్ష్మ శరీరం మోక్షం పొందాలి అంటే 19, అలాగే నువ్వు ఏకకపాలం దగ్గరికి వచ్చేసరికి లింగదేహం ఏర్పడుతుంది అన్నమాట! అనేసరికి…నాకు కూడా అలాగే కనిపించింది అని మహాదేవి అనేసరికి శివ నందిని మాత్రం నాకు అలా కనిపించలేదు. ఒకటి, రెండు, నాలుగు, ఆరు ఇలా కనిపించాయి అనేసరికి….పిల్లలు ఇద్దరు కూడా మాకు ఇలాగే కనిపించాయి అనేసరికి… మీకు ఋణాను బంధాలు తిరటానికి స్థూల శరీరానికి 20 కపాలాలు ఉన్నాయి. అంటే 20 కర్మ బంధాలు ఉన్నాయి. అవి తీరితే గాని స్థూల శరీరం మోక్షం పొందడం, అలాగే 18 ఆ తీరితే గాని సూక్ష్మ శరీరం మోక్షం పొందడం జరగదు. ఈ విధంగా మీరు సప్త శరీరాలను పొందుతూ రావాలి. ఏకకపాలానికి వచ్చేసరికి మీకు లింగ దేహానికి వచ్చేస్తుంది. అంటే 1 3 5 7 అనేది మూల ప్రకృతికి సంబంధించిన నాలుగు శరీరాలు అంటే జ్యోతి, మనో ,పిండ, లింగ దేహానికి సంబంధించిన శరీరాలు మోక్షాలు పొందాలి అన్నమాట!  అంటే ఏకకపాల స్థితికి మీ సాధన ఎప్పుడైతే వచ్చిందో… అది మీకు లింగదేహానికి సంబంధించిన మోక్షం అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది అనేది శివనందినీకి,పిల్లలకి సంబంధించిన జ్యోతి, మనో, పిండ, లింగ శరీరముల యొక్క మోక్షానికి సంబంధించిన… మూల ప్రకృతికి సంబంధించిన మోక్షాలు అవుతాయి అన్నమాట!  అనేసరికి… అంటే ఇక్కడ కపాల ధారి బేసి, సరి సంఖ్యల్లో ఉంటాడు. వాళ్ళ యొక్క జన్మల యొక్క కోరికలు కర్మల యొక్క తేడాల వలన ఈ కపాల ధారి తేడా ఏర్పడుతుంది. నిజానికి ఒకటి, మూడు, ఐదు, ఏడు ఉన్న కపాల దారి ఏమో పురుషకపాలధారి ,1 4 6 8 ఉన్న కపాల దారి స్త్రీ మూర్తి కపాల దారి అవుతుంది. ఇప్పుడు పరమహంస సాధన పరంగా చూస్తే ఒకటి, మూడు, ఐదు, ఏడూ, తొమ్మిది ఇలా కపాలధారిగా 11 వరుసల్లో ఉన్న కపాలధారిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు శివ నందిని ప్రకారంగా చూస్తే, ఆవిడకి అమ్మవారి కపాలధారిగా కనపడుతుంది. కాబట్టి అమ్మవారు లేరు, అయ్యవారు ఉన్నారు అని ధ్యాన అనుభవం వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమవుతారు అనేది ఇక సాధన పరిసమాప్తిలో మీకు ఆ జ్ఞానం ఆది గురువు అయిన దక్షిణామూర్తి అందిస్తారు. మీరు ఆయన అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఈయన గురు రూపం ఆయనతోనే ఆగిపోతుంది. కాబట్టి మీరు ఈ క్షేత్రం నుంచి ఏ క్షేత్రానికి వెళ్లాలో సాధనా విగ్రహ మూర్తి మూలాధార చక్రం వద్ద నిశ్చయం చేస్తుంది. మళ్లీ మీరు వెనక్కి తిరిగి వెళుతున్నారు…. మూలాధార చక్రం స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి మాయలో వెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంది. మాయా అంశ స్వరూపాలు మీ వెంట పడుతున్నాయి. స్త్రీ,పురుష రూపంలో మీ వెంట పడుతున్నారు కదా!  మళ్లీ మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు దైవిక వస్తువులను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మీరు మిగిలిన ద్వాదశ లింగాలలోనూ… అష్టాదశ శక్తి పీఠాలలో…. ఈ నాలుగు మూల ప్రకృతికి సంబంధించిన క్షేత్రాలు అన్నింటిని తిరగండి. మీకు ఎటువంటి అనుభవం అనుభూతులు మాత్రం కలగవు….దైవిక వస్తువులు వస్తాయి… లేదు అనేది ఇక దైవ నిర్ణయం. అవి వస్తే మాత్రం తీసుకోండి. ఇక ఈ క్షేత్రాలు అన్ని తిరగటం అయిన తరువాత అప్పుడు సాధనా విగ్రహం మూర్తి మీకు శరీరం మోక్షము పొందటానికి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క క్షేత్రంలో అనగా ఉదాహరణకి మూలాధార చక్రంలో స్థూల శరీరానికి 21 కర్మలు, కొంతమందికి 20 కర్మలు,ఇలా ఉన్నాయని రావడం జరిగింది. కాబట్టి ఆ 21 కర్మలు ఎప్పుడు ఎలా తీరతాయో..మీ మీకు తెలియదు. నిల్చున్న, కూర్చున్న, పడుకున్నా లేదా ఒకరికి మాట సలహా ఇచ్చినా లేదా ఒక ఇంటికి వెళ్లినా ,మంచినీళ్లు తాగినా ,ఒకరు ఇచ్చినవి తిన్నా ఎలాగైనా కర్మలు తీరిపోవచ్చు. ఒకరికి సేవ చేసినా, ఒకరికి చాకిరీ చేసినా, ఒకరికి వస్త్రాలు ఇచ్చినా, దానాలు ఇచ్చినా, దానం పుచ్చుకున్న ఎలా తీరుతుంది అనేది., ప్రకృతి ఏ విధంగా కర్మ బంధం పెట్టిందో మీకు తెలియకపోవచ్చు. ఆ 20 లేదా 21 కర్మ బంధాలు ఎప్పుడైతే తీరిపోయి ఉన్నాయో… అప్పుడు మూలాధార చక్రం నుంచి మోక్షం పొందినట్టు, శరీరం విభేదనం అయినట్టు. ఈ 20 లేదా 21 కపాలాలు విభేదనం అయినట్టుగా మీకు ధ్యాన అనుభవం కలుగుతుంది. ఆ తరువాత రెండవ చక్రం గురించి మీకు ఆధారం వస్తుంది. అప్పుడు సూక్ష్మ శరీరం కి సంబంధించి అర్హత యోగ్యత యోగం వచ్చినట్టు. ఇలా మీరు సప్త శరీరాలు కోసం క్షేత్రాలు తిరగవలసి ఉంటుంది. ఈ మిగిలిపోయిన క్షేత్రాలు, శక్తి పీఠాలు అలాగే ద్వాదశ లింగాలు కూడా మీరు పూర్తి చేసుకోండి. లేదంటే కర్మ మిగిలిపోతుంది. ఋణాలు మిగిలిపోతాయి. అప్పుడు మీకు మూల ప్రకృతి సాధనకు ఇబ్బంది అవుతుంది అని దత్తాత్రేయుడు చెప్పి అదృశ్యం అవడం జరిగింది .

సాధన కుటుంబం అంతా గుహ నుండి బయటకు వచ్చి అక్కడే ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి వద్దకు వచ్చి చర్చించుకోవడం మొదలుపెట్టారు. రుద్ర స్వామికి ఒక ధర్మ సందేహం వచ్చి, శివ నందినితో అమ్మ!  దత్తాత్రేయ స్వామి చెప్పింది నిజమేనంటావా? లేకపోతే ఆయన మనల్ని మాయలో పడేస్తున్నాడా ఏమిటి? అనేసరికి మహాదేవి కాస్త అయ్యా!  అలా అంటావేంటి ? ఆయన గురుస్వామి… ఆయన ఎందుకు మాయలో పడేస్తాడు అనేసరికి …..రుద్ర స్వామి కాస్త నువ్వు కూడా అయ్యా అంటావేంటి? నేను నీకు తండ్రి నా? నువ్వు ఆయన అని పిలువు. దానికి నేను తండ్రిని కాబట్టి అది నన్ను అయ్యా అని పిలుస్తుంది అనేసరికి….. మహాదేవి కాస్త ఏదోలే మాట జారాను …. అలవాటులో పొరపాటు జరిగింది .కాటికి కాలు చాపుకున్న వయసు వచ్చినా కానీ,ముసలాడికి ఈ బుద్ధి పోలేదు, కోరికలు తగ్గట్లేదు అని మనసులో అనుకున్నప్పటికీ ……అన్నీ తెలుస్తున్నాయి నాకు!  అని రుద్ర స్వామి అనేసరికి….మనసులో ఏమీ అనుకోనని చావలేము, బయట ఏమీ అనుకోని చావలేము, నీకు తెలియందేముందిలే… అనేసరికి, ఇప్పుడు మనం గొడవ కాదు, ముందు నువ్వేదో అంటున్నావు కదా!  అది చెప్పు అని మహాదేవి అనేసరికి….శివ నందిని కాస్త అయ్యా!  ఎందుకు నీకు దత్తాత్రేయ స్వామి మీద అలాంటి ధర్మ సందేహం వచ్చింది? అనేసరికి ఒక యోగి అనుభవం ప్రకారం చూస్తే నాకు అనుమానం మొదలైంది. అందుకోసం అని ఈయన్ని నమ్మాలంటే కొంచెం కష్టం. ఆయన అనుభవం నీకు చెబుతాను. చందోలు శాస్త్రి అని ఒక ఆయన ఉండేవారు.తన సాధన స్థితిలో సహస్ర చక్రస్థితికి వచ్చినప్పుడు, సకల శాస్త్రాల మీద ఆయన పట్టు సాధించడం జరిగింది. సకల విద్యా జ్ఞానం పొందడం జరిగింది. దానితో పాటుగా ఆయనకి మూలిక వైద్య జ్ఞానం అందింది. మూలిక వైద్యంలో ఒక వేరు సూర్యగ్రహణం నాడు సంగ్రహిస్తే  విశ్వం వశం అవుతుంది అని చెప్పి జ్ఞాన స్ఫురణ అందడంతో… 10/12 సంవత్సరాల పాటు ఆ చెట్టు వేరు ఎక్కడ దొరుకుతుంది ఏంటి…? అనేది పరిశీలించి, పరిశోధన చేయడం జరిగింది. సూర్యగ్రహణం సమయానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ వేరుని తీసుకునే సమయంలో… దత్తాత్రేయుడు ఒక బాలుడి రూపంలో వచ్చి… ఏం చేస్తున్నావయ్యా? అంటే వేరుని తీస్తున్నాను, గ్రహణ సమయంలో ఈ వేరుని మనం పూజలో పెట్టుకుంటే విశ్వం వశం అవుతుంది అని చెప్పేసి మూలికా వైద్యంలో ఉన్నది అనేసరికి…. అది నిజమే కానీ, ఇప్పుడు ఆ విశ్వాన్ని వశం చేసుకోవడం ఎందుకు? విశ్వమాత అయిన అమ్మవారు బాలా రూపంలో నీకు ప్రత్యక్ష దర్శనం ఇస్తుందని విన్నాను అనేసరికి… ఆవిడ నా సాధనా ఉపాసన బట్టి కనిపిస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది, నాకు విశ్వాధినేత పొందే స్థితి ఈ వేరు ఇస్తుంది అని చెప్పి తెలిసింది. అందుకని నేను ఈ విశ్వాన్ని వశం చేసుకోవాలని అనుకుంటున్నాను అనేసరికి… అందుకు నీకు అర్హత యోగ్యత యోగం ఉండాలి అని అనేసరికి…ప్రతి దానికి ఇలా అడ్డం పడుతున్నావు , ఎవరు నువ్వు?  అంటే నేను ఎవరో తర్వాత చెబుతాను, నువ్వు వేరే జోలికి వెళ్ళమాకు… అమ్మవారు ఆగ్రహిస్తే పెను ప్రమాదంలో పడతావు సమస్యలు వస్తాయి అనేసరికి… ఆవిడ అనుగ్రహించిన, ఆగ్రహించిన తన బిడ్డను ఏం చేయాలనుకుంటుందో తన ఇష్టం, తన బిడ్డ ఉన్నత స్థితికి వెళితే తట్టుకోలేదా? మా అమ్మ నన్ను అలా ఏం చెయ్యదు అంటూ ఉండేసరికి….సూర్యగ్రహణం అయిపోతూ సమయం మించి పోవడం జరిగింది. ఇంక కేవలం రెండు నిమిషాలే ఉంది, ఆ గ్రహణ సమయం దాటిపోతుంది, ఇంక వేరు తీసుకున్న ఉపయోగం ఉండదు అని చెప్పి అంటూ ఉండేసరికి సమయం దాటిపోవటం, ఆ పిల్లవాడు అదృశ్యం అవడం, చెట్టు వేరు ఉన్న చెట్టు క్షణకాలంలో అదృశ్యం అవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ పిల్లవాడు ఎవరు అని ధ్యానంలో చూస్తే దత్తాత్రేయ స్వామి బాల దత్తుడిగా వచ్చాడు అని తెలుసుకుని….ఆ చెట్టు యొక్క వేరుకి అధిపతి ఆయనే అని చెప్పి తర్వాత ఆయన తెలుసుకొని నిట్టూరుస్తూ…. సరే!  ఈ జన్మకి యోగం లేదనుకుంటా అని తిరిగి వెళ్లిపోవడం జరిగింది. అలాగే మనల్ని ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉండాలి, ఉంచాలి అని చెప్పి మాయ పెడుతున్నాడా?  అనేసరికి….. మహాదేవి కాస్త అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆయన ఏం చెప్పాడు…. మూల ప్రకృతిలో ఉండే స్థితిగతులు, అలాగే స్త్రీ ప్రకృతిలో ఉండే స్థితిగతుల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉంటే నువ్వు బ్రహ్మాండం కాదు సప్త శరీరాలతో శరీరంగా చూడటానికి వీలుంటుంది, అనుభవించడానికి వీలు ఉంటుంది, మీ భావాలకి తగ్గట్టుగా, నీ ఆలోచనలకు తగ్గట్టుగా, నీ కోరికలకు తగ్గట్టుగా ఉంటుంది. మూల ప్రకృతిలోకి అంటూ వెళ్ళటం జరిగితే…. వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఇక ఆ చక్రంలోకి వెళ్లిపోవడం అంటూ జరిగితే, మీ అర్హతకు బట్టి మోక్షం పొందుతావు అని చెప్పేసి అనడం జరిగింది. మోక్షం పొందవచ్చు, పొందకపోవచ్చు, దానికి నేను నమ్మకం ఇవ్వలేను, మోక్షమున పొందకపోయినా, మోక్షజీవిగా ఉండిపోతావు అని మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ప్రకృతిలోనే ఉండి పోండి… మీరు వెళ్ళటానికి లేదు అని ఆయన ఆపలేదు కదా!  మీ యొక్క ప్రకృతి యొక్క స్థితిగతులు చెబుతున్నాను, అందులో మీరు నిర్ణయం చేసుకోండి అని నేను చెప్పను అని అన్నారు కదా!  ఇప్పుడు మనం అగాధంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అగాధంలో నుంచి వెనక్కి తిరిగి రావడం అనేది కుదరదు అని ఆయన చెప్పడం అయితే చెప్తున్నాడు, ఇంతవరకు కుండలిని శక్తి మూలధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు…కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ప్రవహించే యోగం ఉంటుంది. ఆ తర్వాత నుంచి జీవనాడిలోకి కుండలిని ప్రవేశం జరిగిన తరువాత మూల ప్రకృతి లోకి వెళ్లిపోయిన తరువాత ఇక వెనక్కి తిరిగి రావడం అయితే ఉండదు. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో…. ఇక్కడ ఉంటే నువ్వు చేయవలసినవి ,చూడవలసినవి ఇవి… అక్కడ ఉంటే పొందవలసినవి ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది. నువ్వు శూన్యం అవ్వాలనుకుంటున్నావా? సశరీరంతో ఉండాలనుకుంటున్నావా అనేది మాత్రమే చెప్పడం జరిగింది. తేడాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. మనం మోక్షం పొందాలి అనుకున్నప్పుడు మిగిలిన క్షేత్రాలకి కూడా వెళ్ళండి… సప్తశరీరాలు మోక్షం గురించి సప్త మోక్ష పట్టణాలకు సంబంధించి వెళ్ళమని చెప్పడం జరిగింది గాని, ఆయన గురు మాయ ఎక్కడ పెట్టాడు… గురుబోధ మాత్రమే చేశాడు. నీకు మార్గ నిర్దేశం చేశాడు. మోక్షమును పొందుతావా? అమోక్షమును పొందుతావా అనేది నిర్ణయం చేసుకోమని మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మోక్షమార్గంలోకి వెళ్ళటం అంటూ జరిగితే తిరిగి రావడం అనేది ఉండదు అని ఆయన చెప్పాడు కదా! ఇదే చేయమని ఎక్కడా నీకు చెప్పలేదు కదా! అనేసరికి…. అది నిజమే అనుకో!  ఆయన మోక్ష జ్ఞానము,మోక్ష మార్గ నిర్దేశం ఇచ్చేశాడు అని అంటూ ఉండేసరికి… శివ నందిని కాస్త అంతెందుకు అయ్య!  దాని గురించి ఆలోచిస్తున్నావు… మనకి బ్రహ్మ రంధ్రం వద్ద  బ్రహ్మ రంధ్ర గుహలో కపాల ధారి దర్శనం అవుతుందని పరమహంస పవనానంద ధ్యానం అనుభవాల ద్వారా మనకి తెలిసింది. అది నిజమో కాదో అని నాకు అనుమానభయం ఉండేది. ఇప్పుడు గురు స్థానంలో ఆయన విశ్వ గురువుగా మారి మనకి కపాలధారి బ్రహ్మ రంధ్రం వద్ద ఎలా ఉంటాడు …ఏ విధంగా ఉంటాడు అనేది చూపించడం జరిగింది కదా!  నీకు నాకు కపాలధారీలలో తేడాలు చూపించడం జరిగింది కదా! మీ ప్రకృతిలోని కపాలధారి ఎలా ఉంటాడు.!నా ప్రకృతిలోని కపాలధారి ఎలా ఉంటాడు అనేది చూపించడం జరిగింది. కాబట్టి ఆ కపాలాలు మోక్షం పొందితే గాని, మనం మోక్షం పొందాలేము అని విడమర్చి చెప్పడం జరుగుతుంది. నిజానికి మనకి ఈ జ్ఞానం ఎక్కడ రావాలి…. మన సాధన స్థితి  బ్రహ్మ రంధ్రం వద్దకి వెళితే రావాలి. ఇక బ్రహ్మ  రంధ్రం వద్దకు వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి రావాలి…. అక్కడ పరిస్థితులకు తట్టుకోలేము అనుకున్నా గాని వచ్చే పరిస్థితి ఉండదు.  ఇక పోవడమే…ఈయన మనకి మార్గ నిర్దేశకుడిగా ఉండి మోక్షమార్గంలోకి వెళుతూ ఉన్నారు….. అగాధంలోకి వెళుతున్నారు..మోక్షం పొందాలంటే శూన్యం అవ్వటం. అది పొందుతారా లేదా అని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. మూల ప్రకృతిలో మోక్షజీవులుగా చేతులు ఉన్న మోక్ష జీవులుగానూ, కాళ్లు ఉన్న మోక్ష జీవులుగాను మిగిలిపోవడం అంటే…. కాళ్లు ఉన్నవాళ్లు జన్మలకి ఋణాను బంధాలు ఉండటం అయ్యి ఉండాలి. చేతులు ఉన్నవాళ్లు అంటే కర్మలు చేసేవాళ్ళు కర్మ బంధాల్లో ఉన్నవాళ్లు ఉన్నాయి. వాళ్లు కూడా సహస్ర చక్రంలో మార్గ నిర్దేశం పొందకుండా జీవనాడి ద్వారా వెళ్ళిపోయి ఉండవచ్చు. అక్కడ వాళ్లకి స్త్రీ ప్రకృతిలోనూ అలాగే పురుష ప్రకృతిలోనూ కర్మలు, కర్మ బంధాలు మిగిలిపోయి ఉండవచ్చు లేదా అందుకని వాళ్ళు మోక్షం పొందకుండా ఆగిపోయి ఉండవచ్చు. అవి మనకి ఉన్న కర్మ బంధాలు, కపాలాల ద్వారా విభేదనం అవ్వడంతో తీరిపోతాయి. ఎప్పుడైతే మీకు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క కర్మ తీరిపోతుందో… అప్పుడు మీకు ఆ శరీరాలు మోక్షం పొందుతాయి, కర్మబంధనాలు లేకుండా తీర్చుకోండి… అలాగే హృదయ చక్రంలో ఋణానుబంధాలు కూడా తీర్చుకోండి. శేషం లేకుండా తీర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఈ రెండు ఉండటం వలన మోక్ష జీవులు రెండు రకాలుగా మిగిలిపోయి ఉండవచ్చు కదా!  ఆయన మనకి మంచి చేస్తున్నాడని అనుకోవాలి.. మనం చెడులో కూడా మంచిని చూడాలి. మనకి ఆయన సజీవమూర్తిగా కనిపించి మోక్షమార్గ నిర్దేశం చేసి ఉండవచ్చు. ఇప్పుడు శాస్త్రి గారు ఆ వేరు పొందడం వలన ఆయనలో అహంకారం పెరిగి మోక్షం పొందే అవకాశం ఉండకపోవచ్చు ఏమో! మళ్లీ అతను ప్రపంచాదినేత అవుతాను అని  కలలు కంటూ ఉండవచ్చు. ఆయనకి బ్రహ్మాండము ఏర్పరచుకునే యోగం కలిగించి ఉండవచ్చు. ఆయన ఏమీ ఇవ్వలేడు అని ఆలోచిస్తున్నాం కానీ, ఒకరకంగా శాస్త్రి గారి కోరిక సంకల్పం తీర్చుకొని ఉండవచ్చు విశ్వాధినేత అవ్వాలని అనుకున్నప్పుడు, నాకు తెలిసినంతవరకు ఆయన దత్తాత్రేయ స్వామి చేతుల మీదుగానే శాస్త్రి గారు ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. ఆయన ఒక బ్రహ్మాండానికి నాయకుడుగా ఉండి ఉండవచ్చు. అది  వేరు వల్ల జరగదు, నా అనుగ్రహం వలన జరుగుతుంది. ఇక నీకు కావలసిన సంకల్పం నేను తీరుస్తాను అని అమ్మవారి పరంగా ఆయన తీర్చి ఉండవచ్చు. ఏదైనా కావచ్చు, ఇప్పుడు వేరు తీసుకుని దానిని సాధనలో పెట్టి ఆయన 12 సంవత్సరాలు ఉండి, ఆ వయస్సులో అయ్యో!  నేను సాధన పూర్తి చేయలేకపోయాను…విశ్వాధినేత పొందలేకపోయాను అని… అనుమాన భయం లేకుండా, ఆయన మరణానంతరం ఇప్పుడు మనకి సహస్ర చక్రంలో వచ్చినట్టుగానే, ఆయనకి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. మరణానంతరం ఆయనకి ఒక బ్రహ్మాండం ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఆ బ్రహ్మాండానికి ఆయన విశ్వాధినేత అయి ఉండవచ్చు. అది లోకానికి తెలియకపోవచ్చు. ఆయన మీద మన సాధన దృష్టి పెట్టి ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలుస్తుంది . ఆయనని ఆరాధించే శిష్య భక్తులు ఉంటే ఆ వివరాలు తెలుస్తాయి. మనం చెడులో కూడా మంచిని చూడాలి. కానీ చెడులో చెడు చూడడం మంచిది కాదు అని అనేసరికి ….ఏదోనమ్మా నా అనుమాన భయాలు. నా సాధన ఎక్కడ ఆగకూడదు. ఎందుకంటే నేను చేసిన బ్రహ్మాండాలని సృష్టిస్తున్నాను..మీ ఆనందిస్తున్నాను అని తెలిసేసరికి నా మనసు వికలం అయింది. నాకు ఇంకా సజీవంగా ఆది రుద్ర దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా!  ఇక దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు… ఏంటి?  అని చెబితే సరిపోతుంది. అది మనకు సాధనా విగ్రహ మూర్తిలోని ఆధారాల ద్వారా సప్తచక్రాలలో ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తుంది అని చెప్పి స్వామి వారు చెప్పారు కాబట్టి, ఇక ఈ ఆధారాలు జాగ్రత్తగా చూసుకుంటూ, కాపాడుకుంటూ ఉంటే మనకి మూలధార చక్రం నుంచి సహస్ర చక్రం దాకా వచ్చిన రాగి రేకులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.  ఎప్పుడైతే సప్త శరీరాలు మోక్షం పొందుతాయో…అంతవరకు రుద్ర మూర్తి సజీవ మూర్తిగా ఉన్న క్షేత్రానికి లేదా ప్రాంతానికో మనం వెళ్లే చోటికి ఈ ఆధారాలు చెప్తాయని నాకు బలంగా అనిపిస్తుంది అనేసరికి… అది నిజమే అయ్యుండొచ్చు. చూద్దాం.. ఏంటి అనేది… ముందు మనకి మిగిలిపోయిన క్షేత్రాలు ఏమిటో చూడాలి… ఆ తర్వాత ద్వాదశ లింగాలు ఏమిటి? అష్టాదశ శక్తి పీఠాలు ఏమిటి?  అనేది తెలుసుకోవాలి. ఆ క్షేత్రంలోకి వెళ్ళమంటున్నారు కదా స్వామి వారు ….అలాగే ఆ క్షేత్రాలకు వెళ్లి అక్కడ వాటికి సంబంధించిన దైవిక వస్తువులు ధ్యానంలో కనబడితే వాటిని సంగ్రహించి ఇక అన్ని పూర్తి అయిపోయినాయి అనే క్షేత్రాల ఋణానుబంధాలు తీరిపోయినాయి అని సప్త శరీరాల మోక్షం గురించి ఆలోచిద్దాం అని అనేసరికి ….సరేనమ్మా!  ఇప్పుడు మనం ఏ క్షేత్రానికి వెళ్లాలి ఏంటి?  అనేది మనం తయారు చేసుకుందాము అని ఇక వాళ్ళు అష్టాదశ శక్తి పీఠాలు, అలాగే ద్వాదశ లింగాలలో మిగిలిపోయిన క్షేత్రాలు వివరాలు రాసుకోవడం ఆరంభించారు.

మొదట శివ నందిని కాస్త ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోని వాటిని రాయడం ప్రారంభించింది. అందులో శ్రీశైలం, త్రయంబకం, ఓంకారేశ్వర లింగం, కేదారేశ్వర లింగం, వైద్యనాథ లింగం దర్శించుకోలేదు అని అర్థమైంది. శ్రీశైలంలో తనకి శక్తి జాగృతి కేంద్రంగా ఉన్నది కానీ,శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఉండటం వలన బహుశా హృదయ చక్రంలో ఉండే జ్యోతి శరీరం జాగృతి కోసం ఈ జ్యోతిర్లింగం ఉండి ఉండాలి అని శివ నందినికి జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది. ఆ తరువాత అష్టాదశ శక్తి పీఠాలలో మిగిలి పోయిన శక్తి పీఠాలు ఏమిటి అని విచారణ చేసుకుంటున్నప్పుడు… గిరిజాదేవి, భ్రమరాంబిక, చాముండేశ్వరి, వైష్ణవి దేవి శక్తి పీఠాలు నాలుగు దర్శనం చేసుకోలేదు అని అవగాహన రావటం జరిగింది. అలాగే శివుని యొక్క 14 బంధనాల్లో 10 మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన నాలుగు అలాగే ఉన్నాయి. అవి ఏమిటి అని విచారణ చేసుకుంటున్నాప్పుడు… చంద్రబంధనం, అగ్ని బంధనం, ముద్ర బంధం, త్రిదళ బంధం అని చెప్పేసి అవగాహన రావటం జరిగింది. ఎటు చూసినా కూడా నాలుగు క్షేత్రాలు, నాలుగు ద్వాదశ లింగాలు నాలుగు బంధనాలు ఉండేసరికి….ఇది కూడా నాలుగు శరీరాలకు సంబంధించినవి అయ్యి ఉండాలి… జ్యోతి, మనో, పిండ, లింగ శరీరాల సాధనకు సంబంధించినవి అయ్యి ఉండాలి. ఇవన్నీ కూడా మూల ప్రకృతికి సంబంధించినవి అయి ఉంటాయి.  నాకు తెలిసినంతవరకు  హృదయ చక్రానికి సంబంధించినవి అయి ఉంటుంది. హృదయ చక్రమునకు వెళితే ఇక బ్రహ్మ రంధ్రం వద్ద ఇక పూర్ణ శూన్య స్థితి అయి ఉండవచ్చు… నామరూపాలు లేని స్థితి అయి ఉండవచ్చు… హృదయ చక్రంలో స్త్రీ, పురుషులు కలిసిన అర్ధనారీశ్వర రూపం ఉంటే, ఆ అర్ధనారీశ్వర రూపం లేని స్థితి పూర్ణ శూన్యం అయిన బ్రహ్మ రంధ్ర స్థితి అని శివ నందినికి జ్ఞాన స్పురణ అందడం జరిగింది. ఆ తరువాత శివ స్వామి కాస్త తనకి పాతివ్రత్య ధర్మదీక్ష ఇచ్చేటప్పుడు…. కొన్ని క్షేత్రములు తిరగవలసి ఉంటుంది. అవి ఆ క్షేత్రాలు గుర్తుకు రావటంతో అక్షేత్రాలు కూడా పుస్తకంలో రాసుకోవడం ప్రారంభించింది. అవి చిదంబరం, తిరువాయుర్, తిరుచెందూర్, తిరుమేయుర్, మధుర మీనాక్షి ,ఉత్తీర్ తిరుమంగై, పాతాళ శంభు మురుగన్, పలని కుమారస్వామి క్షేత్రాలు అని జ్ఞాన స్పురణ రావడంతో… ఆ క్షేత్రాలు రాసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్షేత్రాలన్నింటినీ కూడా సాధన కుటుంబంతో కలిసి క్షేత్ర దర్శనాలు చేసుకుంటే క్షేత్ర సాధన ,దర్శనం పరిసమాప్తి అవుతుంది. అప్పుడు తన సప్త దేహాలకు కూడా మోక్షమున పొందే అర్హత యోగ్యత యోగం వస్తుంది అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంతలో బాలగణపతి కాస్త అమ్మ!  దత్తాత్రేయుడు మాటల మధ్యలో కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పడం జరిగింది కదా!  అది నిజమేనా?  అని అడిగేసరికి…. ఆ సందేహం ఎందుకు వచ్చింది రా నీకు.!  అనేసరికి …..ఒక బ్రహ్మాండం కోటానుకోట్ల బ్రహ్మాండాలుగా ఎలా మారిందో నాకు అర్థం కాలేదు అనేసరికి…. అందులో అర్థం కాకపోవటానికి ఏమున్నది. . ఒకటి రెండు అయింది ,రెండు నాలుగు అయ్యింది,నాలుగు  ఎనిమిది అయింది, 8 16 అయ్యింది, 16 32, 32 64, అలా అయ్యింది అనేసి అనేసరికి…అంటే రెట్టింపు అయ్యిందా! అంటే అవును…. ఇప్పుడు ప్రపంచంలో ఒక సెకండ్ కి నాలుగు జనాలు, రెండు మరణాలు జరుగుతాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది.  దానినిబట్టి మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య రెట్టింపులో ఉన్నాయి కదా!  అలాగే బ్రహ్మాండం కూడా అలా రెట్టింపు అవ్వడం జరిగింది. విభజన చెందడం జరిగింది. రెట్టింపు సంఖ్యలో విభజన చెందడం జరిగింది. దానివల్ల కోటానుకోట్ల సంఖ్యలో బ్రహ్మాండాలు ఏర్పడటం జరిగింది అనేసరికి…. అది కోటానుకోట్ల సంఖ్య అని ఎలా చెప్పగలం అని బాల గణపతి అనేసరికి… నీకు అర్థం అవ్వాలి అంటే… నీకు చదరంగం ఆట తెలుసా?  అంటే 64 గదులు ఉంటాయి కదా!  నలుపు తెలుపు పావులు ఉంటాయి కదా!  అనేసరికి….. ఆ చదరంగం ఆటలో 64 గదులు ఉన్నాయి కదా!ఈ 64 గదులలో నేను చెప్పినట్టుగా ఇసుక రేణువులు వెయ్యి.  విషయం నీకే అర్థమవుతుంది అనేసరికి… ఏంటి చెప్పు? అంటే ఒక గదిలో ఒకటి, రెండవ గడిలో రెండు, మూడవ గదిలో నాలుగు, అంటే ప్రతి గడిలో దాని ముందున్న గడికి రెట్టింపులో ఇసుక రేణువులు వేస్తూ ఉంటే….అంటే బాల గణపతి కాస్త….ఏముంది వెయ్యచ్చు… అదేమంత సమస్య కాదు…సమస్యేముంది అందులో…. అంటే,  అదేవిధంగా బ్రహ్మాండం కూడా 1000 కోట్లుగా విభజన చెందింది. 64 గదులు నింపడానికి 64 కోట్లు అవసరం అవుతుందా? మీకు లెక్కలు తెలియవు, నేను చూపిస్తాను  అని చెప్పేసి బాల గణపతి కాస్త 64 గదులు గీయటం ….పక్కన ఉన్న ఇసుక రేణువులు తీసుకొని ఒక్కొక్క గడిలో రెట్టింపును వేయటం మొదలుపెట్టాడు.  ఒకటవ గడిలో ఒక ఇసుక రేణువు, రెండవ గడిలో రెండు ఇసుక రేణువులు మూడవ గదిలో 4 ఇసుక రేణువులు, నాలుగవ గడిలో ఎనిమిది ఇసుక రేణువులు, ఐదవ గదిలో 16 ఇసుకరేణువులు, ఆరవగడిలో 32 ఇసుక రేణువులు, ఏడవ గదిలో 64 ఇసుక రేణువులు, వేస్తూ ఉండేసరికి బాల కుమారస్వామి కాస్త ఒరేయ్!  తమ్ముడు ,.! ఇందులో ఏదో తిరకాసు ఉంది.  అమ్మ ఊరికే చెప్పదు… నాకు తెలిసి భూ బ్రహ్మాండంలో ఉన్న ఇసుక రేణువులు కూడా సరిపోవు.  అంటే చాల్లే ఊరుకో అన్నయ్య!  64 గదులు నింపడానికి ఇక్కడ ఒక బస్తా ఇసుక సరిపోతుంది అని బాలగణపతి అనేసరికి…కాదురా తమ్ముడు!  చాలా కష్టం అది, రెట్టింపు అవుతుంది. రెట్టింపు అంటే చెప్పలేవు… నేను లెక్కేస్తా చెప్పు ….నువ్వు లెక్క వేయకపోతే…. అని చెప్పి అనేసరికి, 11వ గడికి వచ్చేసరికి 1024 అంటే…సరే మంచిది అనేసరికి… 21వ గడికి వచ్చేసరికి… 10,48,576 ఇసుకరేణువులు వేసానమ్మ అనేసరికి శివ నందిని పక్కున నవ్వింది. 22వ గడికి వచ్చేసరికి 8,20,97,152 ఇసుక రేణువులు వేసాను అనేసరికి…23వ గడికి వచ్చేసరికి అమ్మ! 41,94,304 ఇసుక రేణువులు వేసాను అనేసరికి… ఇక అప్పటికి లెక్క వేయడం బాలగణపతి వల్ల కాలేదు.  అమ్మ 23వ గడికి వచ్చేసరికి 45 లక్షలు దాకా వచ్చాయి.  ఇప్పుడు 26వ గడికి వచ్చేసరికి కోటిపైనే దాటుతుంది అనేసరికి… కుమారస్వామి కాస్త కోటి కాదు, 26వ గడికి వచ్చేసరికి 3,35,54,433 ఇసుక రేణువులు పడతాయి. అదే 27వ గడికి వచ్చేసరికి 6,71,8,864 ఇసుక రేణువులు పడతాయి. అదే 28వ గడికి వచ్చేసరికి 13,42,17,728 ఇసుక రేణువులు పడతాయి. అదే 29వ గడికి వచ్చేసరికి 26,84,35,456 ఇసుక రేణువులు పడతాయి. అదే 30 వ గడికి వచ్చేసరికి 53,68,70,912 ఇసుక రేణువులు పడతాయి. అదే 32వ గడికి వచ్చేసరికి 241,74,83,648 ఇసుక రేణువులు పడతాయి. 33వ గడికి వచ్చేసరికి 200 కోట్లు పైనే పడుతాయి. 34వ గడికి వచ్చేసరికి లక్ష కోట్లు పైనే పడతాయి. 41వ గడికి వచ్చేసరికి 10 లక్షల కోట్లు పైనే పడతాయి. 48వ గడికి వచ్చేసరికి కోటి కోట్లకు పైనే ఇసుక రేణువులు పడతాయి.51వ  గడికి వచ్చేసరికి 100 కోటాను కోట్లు పైనే పడతాయి. 58 వ గడికి వచ్చేసరికి లక్ష కోటానుకోట్ల పైనే…ఇక నావల్ల కాదు అని బాల కుమారస్వామి అనేసరికి శివ నందిని పక్కున నవ్వేసింది. అంటే ఈ లెక్కన 64 గడికి ఎంత ఇసుక రేణువులు అవసరం అవుతాయో నీకు తెలుసా అనేసరికి….18,446,774,073,709,55,615 ఈ అంకె వేసుకోని ఎలా చదువుతారు అని చదవటం ప్రారంభించింది. అది 64 గడిలో మనకి వచ్చే సంఖ్య. అదే 108వ భాగంలోకి వచ్చేసరికి బ్రహ్మాండాలు ఎన్ని ఉంటాయో లెక్కేసుకో అని అనేసరికి… ఇంక గణితంలో కూడా ఆ సంఖ్య ఉండదేమో అని అనేసరికి… ఇసుక రేణువులే నీకు ఇంత ఉన్నప్పుడు బ్రహ్మాండాలు అన్నీ ఉండటంలో తప్పులేదు కదా!  లలితా సహస్రనామంలో కూడా లలితా దేవిని కూడా అనేక కోటానుకోట్ల బ్రహ్మాండనాయక అని చెప్పడం జరిగింది. అంటే విశ్వంలో లెక్కలేనని బ్రహ్మాండాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అందుకే దత్తాత్రేయ స్వామి కూడా కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అనేసరికి… భళా ! ఎంత జ్ఞానం ఉంటే ఇంత మంచి స్థితిని పొందడం జరుగుతుంది అనేసరికి….బాలగణపతి కాస్త అసలు ఈ బ్రహ్మాండం ఎలా ఏర్పడింది? అని అనేసరికి… రుద్ర స్వామి కాస్త ఒక గోచి సిగ్గు వలన ఏర్పడింది అనేసరికి…అర్థం కాలేదు అంటే, ఒకడు తన మర్మాంగం చూసి సిగ్గుపడి… దానిని కప్పుకోవడానికి ఒక గుడ్డను పెట్టుకోవడం జరిగింది. కొన్ని రోజులకి ఒక ఎలుక వచ్చి చింపేయడంతో ఆ ఎలుకను చంపడానికి ఒక పిల్లిని పెంచడం, ఆ పిల్లి కోసం ఆహారం కావాలని పాల కోసం ఆవును పెంచడం, ఆవు కోసం గడ్డిని పెంచడం, గడ్డి కోసం పొలం వేయడం, ఆ పొలం కోసం ఇల్లు ఇల్లాలు తెచ్చుకోవడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు తమ పనులు తాము చేసుకోవడానికి సంతానం ఉండాలని పిల్లల్ని కనడం జరిగితే…. అదికాస్తా ఊరుగా, ఊరు కాస్త జిల్లాగా ,జిల్లా కాస్త రాష్ట్రాలుగా, అవి కాస్త దేశాలుగా, దేశం కాస్త ప్రపంచంగా ఇలా సమాజం ఏర్పడింది. ఇదే విధంగా ప్రపంచం ఏర్పడింది అనేసరికి…ఒక గోచిగుడ్డ వల్ల ప్రపంచం ఇంత ఏర్పడిందా?  అనేసి నోరు వెళ్ళబెట్టటం జరిగింది. 

అంటే అవును… ఈ బ్రహ్మాండాలకి మూల బ్రహ్మాండం ఉంటుంది కదా!  అది ఏదో తెలుస్తుంది కదా!  దానిని పట్టుకుంటే తెలుస్తుంది కదా అనేసరికి… ప్రతిదీ కూడా మూల బ్రహ్మాండమే అయింది.  ఇప్పుడు విశ్వ బ్రహ్మాండంలో ప్రతిదీ కూడా స్వతహాగా ఆలోచించడం జరిగింది. ఒక యోగి కాస్త పౌర్ణమి నాడు సముద్ర స్నానానికని సముద్రం ఒడ్డుకి వెళ్లడం జరిగింది. అలా వెళ్తున్నప్పుడు తన దగ్గర ఉన్న మర చెంబు ఎవరైనా తీసుకుని వెళ్లిపోతారేమో అని చెప్పేసి ఒక గుంట తీసి ఆ గుంటలో మర చెంబు పెట్టి…గుర్తుగా ఒక శివలింగ ఆకారం చేయడం జరిగింది. ఇది చూసిన కొంతమంది యోగి కారడం లేకుండా శివలింగం మట్టితో తయారు చేయడు కదా!  అని చెప్పి ఎవరికి వారే శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. స్నానాధికాలు ముగించుకొని బయటకు వచ్చేసరికి కొన్ని కోటానుకోట్ల, లక్షల్లో వేలల్లో మట్టి శివలింగాలు ఉండేసరికి….. తను పాతిపెట్టిన మర చెంబు గ్రహించలేక మౌనంగా ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోవడం జరిగింది.  ఇదేవిధంగా ఒకటి కాస్త రెండు, రెండు కాస్త నాలుగు, నాలుగు కాస్త ఎనిమిది ఇలా రూపాంతరాలుగా చెందడంతో…. కోటానుకోట్లు చెందడంతో…. దీని మూల బ్రహ్మాండం ఏది అనేది తెలియకుండా అయిపోయింది. గుర్తించలేని పరిస్థితి అయిపోయింది. దేనికదే మూలం అయిపోయింది. కానీ, నిజానికి ఒకటే మూలం ఉంటుంది. ఆ మూలానికి ఇవన్నీ కూడా ప్రతిబింబాలే. ఇక్కడ సమస్య ఏమిటంటే… ప్రతిబింబం ముక్కలు అయింది. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటున్నావనుకో! ఒకడివే కనపడతావు… అదే అద్దం ముక్కలు ముక్కలుగా అయిపోతే, ఆ ముక్కలకి తగ్గట్టుగా నీ ప్రతిబింబాలు కనపడతాయి కదా!  ఇప్పుడు అద్దం వెయ్యి ముక్కలు అయితే 1000 ప్రతిబింబాలు కనపడతాయి కదా!  అంటే అవును…. అంటే అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ఆదిలో విచ్ఛిన్నం అవ్వడంతో…. ఒక్కసారిగా అన్ని కూడా అంతే శక్తితో 1000 బ్రహ్మాండాలు కాస్త కోటానుకోట్ల బ్రహ్మాండాలుగా విభజన చెందడం జరిగింది. ఇక్కడ మూలం అనేది ఏమీ లేదు. దీనికదే మూలం దేనిక అదే పుడుతూ ఉంటాయి. దేనికదే నాశనం అవుతూ ఉంటాయి. సృష్టి చేస్తూ ఉంటాయి. సృష్టి స్థితిలయలు చేస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి లయం అవుతూ ఉంటాయి. తిరోగమనము చెందుతూ పునః సృష్టికి వెళతాయి అని రుద్ర స్వామి అనేసరికి…..అంటే ఒక దానిమ్మకాయలో దానిమ్మ గింజలు అన్నమాట! గింజలు అన్నీ కూడా బయటకు వచ్చేసాయి అనుకో!  దానిమ్మకాయ లేదన్నమాట.  మరి సృష్టి అంత నాశనం అయిపోవాలి కదా అనేసరికి…. కాయ నుంచి దానే గింజలు బయటకు వచ్చి… ఒక గింజ నాశనం అయ్యేసరికి… మరొక గింజ మొలకెత్తుతుంది కదా!  అనేసరికి….ఓహో ఒక కాయ పోతే వెయ్యి దానిమ్మ గింజలు వస్తున్నప్పుడు, ఇక సృష్టిలో నాశనం అనేది ఉండదు కదా!  మరి విశ్వమోక్షం అంటే ఏమిటి ? ఈ లెక్కన ..! అనేసరికి.., ఒక బ్రహ్మాండం మాత్రం పోవడమే విశ్వం మోక్షం అవుతుంది. కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక బ్రాహ్మండాన్ని విశ్వం లేదా విశ్వ జగత్తు అనేసి అంటారు. దానిలో 108 లోకాలు ఉంటే, అది బ్రహ్మాండం అని చెప్పి అంటారు. ఇలాంటి బ్రాహ్మండాలు కొన్ని కోటానుకోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న బ్రహ్మాండం మోక్షం పొందితే అది విశ్వమోక్షం అవుతుంది.  అంటే అది మూలం అవ్వచ్చా అనేసరికి…. అది మూలం అవుతుందని చెప్పలేము…మూలం అనేది లేదు కదా!  ఇక్కడ ప్రతిదీ మూలమే అయ్యింది అనేసరికి ….అంటే ఆదిలో మోక్షం పొందడం జరిగింది.  విశ్వమోక్షం పొందడం జరిగింది. జననం జరిగింది.. సృష్టి, స్థితి,లయలు జరిగాయి. విశ్వం అంతం జరిగింది. ఈ ఆది అంతం మధ్యలోనే మన జనన మరణాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మనం ఆది నుంచి అంతం వైపుకు నడుస్తున్నాము. ఇప్పుడు అంతంలోకి పరమహంస వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఆయన స్త్రీ ప్రకృతి మోక్షం పొందింది. పురుషుల మోక్షం పొందాడు అమ్మవారు మిగిలిపోయింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ శివ నందిని అమ్మ ద్వారా పురుష ప్రకృతిలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. ఈ మిగిలిపోయిన స్త్రీ, పురుష ప్రకృతికి కూడా మోక్షం కలిగిస్తే.. అదే విశ్వ మోక్షం అవుతుంది అనేసరికి…. నాకు తెలిసినంతవరకు కోటానుకోట్ల బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండమైన పోతుంది అనేసరికి… ఆ ఒక్క బ్రహ్మాండం పోయిందా లేదా అని తెలుసుకోవడమే, నాకు తెలిసి అది పోయే ఉంటుంది. పోకుండా ఉండదు. ఎందుకంటే శివుడు మోక్షం పొందినప్పుడు అమ్మవారు కూడా మోక్షం పొందాలి. ఎందుకంటే ఆమె శరీరం 18 భాగాలుగా ఖండనం జరిగింది.  అంటే ఆవిడ కూడా మోక్షం పొంది ఉంటుంది. కాకపోతే ఆవిడ మోక్షం పొందిన విషయం నమ్మకపోవడంతో… భావరూపాలతో…భ్రమ, బ్రాంతి తో లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా వారి వారి ప్రకృతులలో మోక్షం పొందే ఉంటారు. కాకపోతే ఇప్పుడు పరమహంస అనుభవం ప్రకారంగా…. పురుషుడు మోక్షం పొందారు. అమ్మవారు మోక్షం పొందలేదు అని తెలియటంతో ఇప్పుడు మీ అమ్మ సాధనాపరంగా అమ్మవారు మోక్షం పొందిందా లేదా అని తెలుసుకోవడమే మనం చేయవలసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మిగిలిపోయిన స్త్రీ,పురుష మూర్తులు ఏం చేశారు?  వాళ్ళు మోక్షం పొందారా? లేదా అని తెలుసుకోవడమే స్త్రీ వ్యక్తిగత మోక్షం, పూర్ణ మోక్షం, విశ్వ మోక్షం అవుతుంది. ఇదంతా కూడా ఒక బ్రహ్మాండానికి సంబంధించిన మోక్షమే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అదే అవుతుంది అనేసరికి…. ఒకవేళ ఒక బ్రహ్మాండం పోతూ ఉంటే మరో బ్రహ్మాండం పుడుతుంది కదా!  అంటే అవును…. ఒకటి రెండు అవుతుంది కదా!  నాలుగు జనాలు జరుగుతూ ఉంటే… రెండు మరణాలు జరుగుతూ ఉంటాయి. జననాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి కాబట్టి సహజంగానే ఒకరు పోతే ఇంకొకరి జననం జరుగుతుంది… ఇప్పుడు తండ్రి పోతే కొడుకు వస్తాడు. తాతపోతే మనవడు వస్తున్నాడు. తల్లి పోతే కూతురు వస్తుంది. దాని సృష్టి విధి విధానం అలాగే ఉంది. ఒకటి పోతే రెండు రావడం అనేది ప్రకృతి ధర్మం. దీని ఆపడం ఎవరివల్లా కాదు. అంటే ఇది ఎక్కడ ఉంది అని ఆపుతావు… ఏది ఉందని ఆపుతావు …ఇప్పుడు ఆ మర చెంబు సముద్రం ఒడ్డున పెట్టిన  యోగికి ఆ మర చెంబులో ఏది యోగిని అని నువ్వు చెప్పగలవా?  అంటే….. అన్ని పగలకొడుతూ వెళ్తే తెలుస్తుంది కదా అంటే… నువ్వు పగలగొడుతూ వస్తావు… ఇంకొకడు పెడుతూ వస్తాడు… పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు..మీ పగలకొట్టేవాడు తక్కువ అయ్యారు.  అప్పుడే శివుడు లయ కర్త అయినప్పుడు బ్రహ్మేమో నాలుగు తలలతో ఎనిమిది చేతులతో సృష్టి చేస్తూ ఉంటే, ,శివుడు ఒక చేత్తో ఒకేతలతో లయం చేస్తాడు. ఎవరిది ఎక్కువగా ఉంటుంది? అంటే… బ్రహ్మదేవుడు దే ఎక్కువగా ఉంది. రెట్టింపు ఉంటుంది .అలాగే మరి ఈ లెక్కన చూసుకో విష్ణుమూర్తిని స్థితికారకుడిగా నాలుగు చేతులలో ఉండి రెండు చేతుల సృష్టి, రెండు చేతుల్లో లయన్ చేసుకుంటూ ఉంటాడు. రెట్టింపు సంఖ్యలో జననాలు ఉంటే జననం రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ లెక్కన సృష్టి ఎప్పటికీ అంతం అవ్వదా?  అంటే అంతం అనేది ,ఆరంభం అనేది ఇదిమితంగా చెప్పలేము.  ఆరంభం జరుగుతూనే ఉంటుంది …సృష్టి జరుగుతూనే ఉంటుంది… ఒక పక్కన పోయేవాడు పోతూనే ఉంటాడు …వచ్చేవాడు వస్తూనే ఉంటాడు… ఇది అంతులేని కథ, అంతం లేని కథ అని చెప్పేసి రుద్ర స్వామి అనేసరికి….. సరే అయితే అయి ఉండొచ్చు.. అదే సత్యం అయ్యి ఉండవచ్చు… చూద్దాం!  ధ్యాన అనుభవాలు బట్టి, సాధన అనుభవాలను బట్టి సాధన పరిసమాప్తిని బట్టి ఎటువంటి అనుభవాలు పొందుతుందో తెలియదు కదా!  ఇదంతా ఊరికే జ్ఞాన విశ్లేషనే కదా! విచారణమే కదా అనేసరికి…. అనుభవం అయితే కానీ మనం ఏది నమ్మలేము, ఏదీ సత్యం అని చెప్పి నమ్మకం  రాదు అని రుద్ర స్వామి చెప్పడంతో….ఆ రోజుతో వాళ్ళ ఆత్మ విచారణ, వాదోపవాదాల కార్యక్రమం పరిసమాప్తి అయ్యింది. అక్కడి నుంచి మిగిలిన క్షేత్రాల దర్శనం చేసుకోవాలని చెప్పి…. ఏ క్షేత్రానికి,  ఎక్కడికి వెళ్లాలి అన్నప్పుడు రుద్ర స్వామి కాస్త ప్రస్తుతం మనం అష్టాదశ శక్తి పీఠాలు అన్ని దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత శివ స్వామి చెప్పిన ఆ నాలుగు క్షేత్రాలు కలిసి కూడా దర్శనం చేసుకుందాం అనేసరికి… సరే అని చెప్పి మిగిలిన ఈ నాలుగు అష్టాదశ శక్తి పీఠాలు దర్శనం కోసం మొదట గిరిజాదేవి శక్తి  ఉన్న క్షేత్రానికి సాధన కుటుంబం వెళ్లడం కోసం రైలు మార్గంలో ప్రయాణం చేయడం జరిగింది. 

శుభం భూయాత్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి