కపాల మోక్షం గ్రంథము

స్వాధిష్ఠాన చక్రము (112)


 స్వాధిష్ఠాన చక్రము 



కొల్హాపూర్ మహాలక్ష్మి



సాధన కుటుంబం అంతా ఘృష్ణేశ్వర క్షేత్రం నుంచి కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి బయలుదేరడం జరిగింది అని అందరికీ తెలిసిన విషయమే కదా!  వీళ్ళు ఉదయం అక్కడికి దగ్గరలో ఉన్న మహాలక్ష్మి గుడికి వెళ్ళటానికి సాయంత్రంలోగా చేరుకుంటారని ఒక అవగాహన ఉన్నది. ఎందుకంటే స్వాధిష్ఠాన చక్ర జాగృతి,శుద్ధి ,ఆధీనం కోసం ఈ క్షేత్రానికి వెళ్లాలి అని శివ నందిని దగ్గర ఉన్న సాధనా విగ్రహ మూర్తి ఆధారంగా వీళ్ళు ఈ క్షేత్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక అందరూ బస్సు ఎక్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు.  ఇం తలో మహాదేవి శివ నందినితో లో గొంతుతో…


మహాదేవి:- నీకో విషయం చెప్తాను… రుద్రయ్య కి చెప్పకు… రుద్రయ్యేకి చెబితే కోప్పడతాడు.. 


శివ నందిని:- ఏమిటి విషయం….?

ఈ విషయం విని…. రుద్రస్వామి 


రుద్రస్వామి:- ఏం చేశావు….  ఏం కొంప ముంచే పనులు చేశావు..! ఎవరినైనా చంపి తంత్ర పూజకు వాడావా? ఎవరినైనా నరబలి చేశావా ఏమిటి? వాడి పుర్రె ఏమైనా తెచ్చావా ఏమిటి?

అని అరిచేసరికి…..


మహాదేవి:-  ఇదిగో ఈయనతో వచ్చిన సమస్య ఇదే. ఏది కూడా వినడు…. నిదానంగా వినడం మానేసి,  అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా…. విని వినట్లుగా…. విని అర్థం చేసుకోకుండా అరుస్తూ ఉంటాడు. కోప్పడుతూ ఉంటాడు.


శివనందిని:- నువ్వేం అనుకోవద్దు అమ్మ…. విషయం ఏమిటి? నువ్వు తప్పుడు పనులు చేయవని నాకు తెలుసు.  దేనికి భయపడుతున్నావు . రుద్రయ్య ఏం అనడులే 

అనేసరికి  తన చేతి సంచిలో నుంచి కొన్ని సంచులు కొన్ని సీసాలు తీసేసరికి….ఏమిటివి అని అందరూ అడిగేసరికి…. 


మహాదేవి:- నేను కాశీ క్షేత్రంలో, శ్రీశైలం, కంచి,  ఘృశ్నేశ్వర క్షేత్రాల నుంచి అక్కడ ఉన్న పుట్ట మట్టిని సేకరించాను. అలాగే అక్కడ ఉన్న ప్రాంతాలలోని కోనేరులలో నీటిని సేకరించాను….

అని చూపించేసరికి ఎందుకమ్మా ఇవన్నీ అంటే…. 


మహాదేవి:- ఏమో తెలీదు…. ఆ క్షేత్రాలలోనూ…. తీర్థాలలోనూ…. మట్టిలో శక్తి ఉండబట్టే కదా దైవిక శక్తి స్వయంభుగా వెలిసి ఆవాసం చేసింది.  మనకి సాధన శక్తికి ఆ దైవీక శక్తి తోడవుతుంది అని సేకరించాను.


రుద్రస్వామి:- ఇంతేనా ఇంకా ఏమైనా చేసావా ?


మహాదేవి:- ఇంకేం చేయలేదు.  ఇది ఒక్కటే చేశాను.


రుద్రస్వామి:-ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది? మంచి పనే చేశావు… నేనే చెబుదామనుకున్నాను… ఎందుకు అంటే… ద్వాదశ జ్యోతిర్లింగాలలోని మట్టితో ఒక శివలింగం తయారు చేసుకోవాలి. అష్టాదశ శక్తి పీఠాలలోని మట్టితో ఒక శివలింగం తయారు చేసుకోవాలి. అవే స్త్రిలింగం, పురుష లింగం అవుతుంది. అది సాధనకి ఉపయోగపడుతుంది.  తీర్ధాలు అనేవి నువ్వు చెప్పినట్టు….దైవిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఇలా తొమ్మిది రకాల శక్తులు ఈ తీర్థ జలంలో ఉంటాయి. ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు హిమాలయాల నుంచి గంగా నది, అలకనంద నది వంటి నదుల ప్రవాహం జరుగుతుంది కదా!  ఆ హిమాలయాల నుంచి ప్రవాహం మొదలుపెట్టి….. కన్యాకుమారి దాకా  ఆసాంతం మొత్తం నదీ ప్రవాహం జరుగుతుంది కదా ! ఒకే ప్రవాహానికి ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లను పెట్టుకోవడం జరిగింది. హిమాలయాలలో గంగా నదిని 80% ఆక్సిజన్ తో ఉంటే…… కాశీ క్షేత్రంలో 20% ఆక్సిజన్ తో ఉండి పరిశుద్ధంగా ఉంటుంది.  కాబట్టి ఆయా క్షేత్రాలలో ఉన్న నదుల నీరు అక్కడ క్షేత్రాలలో …. ఉన్న పుట్ట మన్ను కూడా సేకరించడం వలన…. మనకి ఆయా క్షేత్రాల యొక్క దైవిక శక్తి…. ఆ శక్తుల యొక్క పూజా శక్తి ….సాధువులు, సన్యాసుల సాధన శక్తి ఇలా వాటిలో నిక్షిప్తమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి  ఒకసారి పుష్కరాలు జరగటం వలన అఘోరాలు, కాపాలికులు, భైరవులు, నాగసాధువులు వంటి వారి స్నానాల వల్ల కూడా నదులు పునీతమవుతాయి.  పుష్కరకాలంలో కూడా నదులలో మంచినీరు పోయి కొత్తనీరు వచ్చి కొత్త శక్తితో వాటికి కూడా పాపాలన్నీ పోయి…. ప్రక్షాళన అయ్యి…. కొత్త ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకుంటాయి.  కాబట్టి వాటిని సేకరించడంలో తప్పులేదు.  శివయ్య ఆజ్ఞ లేనిది నువ్వు ఏమీ చేయలేవు కదా! ఆయన ఎందుకు సంకల్పించాడో ….వీటిని జాగ్రత్తగా ఉంచుకో. ఆ తరువాత మనం తిరిగే క్షేత్రాలు అన్నింటిలోనూ సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా తీర్థజలమును అలాగే పుట్టమన్నును సేకరించు.  ఇది నీ బాధ్యత. 


మహాదేవి:- సరే రుద్రయ్య!  నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను….. 

అని మహాదేవి అనేసరికి అందరూ కూడా వీటిని జాగ్రత్తగా ఉంచు అని శివ నందిని చేతికి ఇచ్చేసరికి….


శివనందిని:- లేదమ్మా!  వీటిని నువ్వే నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో!  ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తావు….గుర్తుపెట్టుకొని మరి.  మాకు రాని ఆలోచన నీకు వచ్చింది కాబట్టి…ఆ బాధ్యత నీదే.  అన్నీ నా నెత్తి మీద వేస్తే నేను మర్చిపోవచ్చు.. గుర్తుండొచ్చు గుర్తు ఉండకపోవచ్చు…


మహాదేవి:- సరే….  నేను అన్ని గుర్తుపెట్టుకొని అన్ని క్షేత్రాలలోని తీర్థమును మట్టిని సేకరిస్తాను.  ఎప్పుడు కోప్పడతారో….. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను.  నాకు మనోభయం పోయింది. నాకు ధైర్యం వచ్చింది. నేను చేసిన పనులలో మొట్టమొదటి పనిని రుద్రయ్య గుర్తించటం… నాకు అనుకూలంగా సమాధానం చెప్పడం జరిగింది.

అనేసరికి ఇంతలో బాల గణపతి ఉన్నట్టుండి…


బాల గణపతి:- అమ్మ!  నేను కూడా ఒక పని చేశాను.  ఎవరు ఏమీ అనుకోవద్దు…

రుద్రస్వామి:- నువ్వేం చేసావురా! 

బాల గణపతి:- అదే అనద్దు అంటున్నాను. ఏమీ అనద్దు… సౌమ్యంగా మాట్లాడు …కోపంగా మాట్లాడితే నేను చెప్పను కూడా చెప్పను.

రుద్రస్వామి:- సరే ! నువ్వు చిన్నపిల్లాడివి కదా! తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసినా నేనేమీ అనను లే! 

బాల గణపతి:- నాకు అవన్నీ తెలీదు… నాకు చేయాలనిపించింది… నేను చేశాను… తప్పు ఒప్పు నాకు తెలియదు….

అని చేతి సంచిలో నుంచి ఒక రాతి ఏనుగు బొమ్మ అరచేతి సైజులో ఉన్నది బయటకు తీసి అందరికీ చూపిస్తూ ఉండేసరికి…..

మహాదేవి:-  వారి బడవా! నేను అనుకుంటున్నాను… నేను అనుకున్నట్టే చేసావా! వద్దు తీసుకురావద్దు అన్నాను….. దాన్ని అక్కడే ఉంచమన్నాను కదా…!

బాలగణపతి:-  నాకేం తెలుసు! నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నాకు మనసు పీకింది.  ఆ విగ్రహం తీసుకురావాలనిపించింది…. తెచ్చాను.  తప్పేంటి? 

శివ నందిని:- అసలు ఏం జరిగింది?

మహాదేవి:-   మనం ఎల్లోరా గుహలకు వెళ్ళాం కదా! 16వ గుహ దగ్గర ఉన్న కైలాసనాథర్ గుహ దగ్గరికి వెళ్ళాము కదా! అక్కడ గుడి చుట్టూ కూడా ఏనుగులే ఉన్నాయి కదా!  పెద్దపెద్ద ఏనుగులు అవన్నీ ఉన్నాయి కదా!  వీడు ఏనుగులను తాకుతూ ఆనందపడుతూ…. ఉండేసరికి ముచ్చటేసింది.  ఆ తర్వాత వాడు రెండవ ప్రాకారములోకి వెళ్లి అక్కడ గోడల మీద ఉన్న రామాయణ ఇతిహాసాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ విషయం తెలుసుకుంటూ ఉన్నాడు అని అనుకుంటూ ఉండేసరికి…. వీడి చెయ్యి ఒక బొమ్మ మీద పడింది.  రాతి బొమ్మ  చెక్కి ఉంటారు కదా అని అనుకునేసరికి…. వాడు అక్కడ ఉన్న ఏనుగు బొమ్మను కదుపుతూ ఉండేసరికి…అతికించినట్టుగా ఉన్న ఏనుగు బొమ్మ అని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  వాడి దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావురా?  అనేసరికి అమ్మ ఇక్కడ చూశావా మిగతావన్నీ గోడకి చెక్కి ఉంటే ఈ ఎనుగు బొమ్మ మాత్రం అతికించినట్టుగా ఉండి కదులుతుంది ….గట్టిగా లాగితే వచ్చేస్తుంది…. నువ్వు గట్టిగా లాగి చూడు…. నీ చేతికి ఏనుగు బొమ్మ వచ్చేస్తుంది అనేసరికి…. చుట్టూ చూశాను,  నాకు భయం వేసినా లాగి చూసాను. కానీ వాడు చెప్పింది కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే అది ఏదో గుంతలో ఏనుగు బొమ్మ పెట్టినట్లుగా ఉంది అనిపించింది. కాకపోతే ఆ ఏనుగు బొమ్మ మీద ఏనుగు ముఖంతో ఉన్న ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టుగా కనిపించింది. ఏనుగు బొమ్మ మీద మహాగణపతి ధ్యానం చేస్తున్నాడు అనుకున్నాను  ఆ గణపతి మహా గణపతి కదా అంటే….. ఏనుగు రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఏనుగు చెక్కి ఉంటారేమో అని అనుకున్నాను…. కానీ అది కదులుతూ ఉండేసరికి నాకు కూడా భయం వేసి ఊరుకున్నాను. వీడిని తీయొద్దు వచ్చినా కూడా తీయొద్దు అలాగే ఉంచు అని నేను వచ్చేసాను. వాడు ఎలక్కోలా పీకేసినట్టు ఉన్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకువచ్చాడు…

బాలగణపతి:- అమ్మ!  ఆ ఏనుగు ముఖం ఉన్న ఆయన తపస్సు చేయడమే కాదు…. ఇంకొక వైపు మహాలక్ష్మి కూడా ఉంది…

అనేసరికి అప్పుడు తీసి చూస్తే ఆ ఏనుగుకి ఒక వైపు ధ్యానం చేసుకుంటున్న గజముఖ వ్యక్తి మరొకవైపు మహాలక్ష్మి దేవి పద్మంలో కూర్చున్నట్టుగా ఉండేసరికి… అప్పుడు రుద్రయ్య పరిశీలనగా చూసి…

రుద్రస్వామి:-  ఇది గణపతి ధ్యానం చేస్తున్నది కాదు. గజాసురుడు అనే రాక్షసుడు ధ్యానం చేస్తున్న భంగిమ…. మహాలక్ష్మి కనపడుతుంది అంటే ఇప్పుడు మనం వెళ్లే కొల్హాపూర్ క్షేత్రానికి, ఈ బొమ్మకి ఏదో సంబంధం ఉంది. ఎందుకు అంటే మహాలక్ష్మి కూడా అష్టలక్ష్మి క్షేత్రంలో గజలక్ష్మి అంటారు కదా!  నాకు తెలిసినంతవరకు ఈ గజము, ఆ మహాలక్ష్మికి ఏదో అనుసంధానం అయ్యి ఉంటుంది.  ఇక్కడి నుంచి అక్కడికి కైలాసనాథుడు పంపిస్తున్నాడు అంటే ఏదో అక్కడ సంబంధించినవి ఉండి ఉండాలి . కైలాసనాధుని గుళ్లో అన్ని కూడా ఏనుగులే ఉన్నాయి.  ఒకవేళ ఆదిరుద్రుడికి ఉన్న 14 బంధనాలలో గజ వస్త్రం వేసుకోవడం వలన గజాసురుడు బంధ విముక్తి ఈ ఏనుగు బొమ్మ ద్వారా తీరుతుందేమో!  అక్కడేదో దీనికి సంబంధించిన మహాలక్ష్మి దేవాలయం ఉంటుంది.  కారణం లేనిదే కార్యం కారకం జరగదు. వీడికి ఎందుకు అది కంటపడిందో…. ఈ బొమ్మ మీద గజాసుర రాక్షసుడు బొమ్మ ,మహాలక్ష్మి బొమ్మ ఎందుకు పెట్టారో …మనం స్వాధిష్ఠాన చక్రం కోసం కొల్హాపూర్ వెళ్తున్న సమయంలోనే…. ఇది వీడికంట పడటం అంతా కూడా యాదృచ్ఛికంగా అనిపించినప్పటికీ…. ఇది అంతా కూడా శివుడి ఆజ్ఞ లాగా ఉంది… అని ఒరేయ్!  నువ్వు చేసింది మంచి పనే గాని ఈసారి చెప్పి చెయ్యి.  ఏది పడితే అది తీసుకురాకు.  తీసుకు వచ్చిన నెత్తి మీద సమస్యలు పెట్టమాకు.  సమస్యలు తీసుకురాకు 

బాల గణపతి: అయ్య మెచ్చుకున్నాడు…. అయ్య నన్ను తిట్టలేదు… అనేసరికి, ఇక పిల్లాడి సంతోషం చూస్తూ….

శివ నందిని:- సరే జాగ్రత్తగా ఉంచుకో!  నీ దగ్గర, మళ్లీ నేను మహాలక్ష్మి గుడి దగ్గర నిన్ను అడుగుతాను…

రుద్రస్వామి:- అంత అడిగే అవకాశం వాడు ఇవ్వడు. వాడే దాని పరిష్కారం చూపిస్తాడు.  వీడికి ఆ బొమ్మ వచ్చింది కాబట్టి వీడికే తెలుస్తుంది.  నీదాకా రానివ్వడు లే!  

శివ నందిని:- మంచిదే కదా!  ఎవరు చేసినా… ఏం చేసినా…. కాకపోతే సమస్యలు, ఆపదలు ,ప్రమాదాలు జరగకుండా ఉంటే చాలు.  అంతకుమించి నేను ఏమీ ఆలోచించడం లేదు… 

అని చెప్పి అనేసరికి సరే! అని పిల్లోడు సంతోషపడుతూ…. ఏనుగు బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు . ఒరేయ్ జాగ్రత్త నాయన!  ఆ బొమ్మ రాతి బొమ్మ . కింద పడితే ముక్కలు ముక్కలు అవుతుంది…. అనేసరికి, 

బాల గణపతి:- నేను దైవిక వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.  అపురూపంగా చూసుకుంటాను…వాటి గురించి నేను అజాగ్రత్తగా ఉండను….

శివనందిని:-  సరే నీకు ఒక సమస్య ఇస్తాను… దానికి సమాధానం చెప్పు..

బాల గణపతి:- ఏంటమ్మా చెప్పు?

శివ నందిని:- పార్వతీ అమ్మవారికి  గణపతి పెళ్లికి ముందు పుట్టాడా? పెళ్లి తర్వాత పుట్టాడా? 

బాలగణపతి:- అందులో ఆలోచన  చెయ్యడానికి ఏముంది?  సమస్య ఏముంది?  పిల్లలు అన్నాక పెళ్లయిన తర్వాతే కదా పుట్టేది…

బాలకుమారస్వామి:-   అమ్మ కారణం లేనిదే ఏది అడగదు.  ఏదో తిరకాసు ఉంటుంది. చూడడానికి అది చిన్న సమస్య లాగానే ఉంది.  కానీ దానికి సమాధానం చాలా లోతయింది..

బాల గణపతి:- ఏముంది ఇందులో..!  మనం ఆలోచించడానికి.  ఇప్పుడు అమ్మవారికి పుట్టిన వాడే కదా!  పెళ్లయిన తర్వాతే కదా పిల్లలు పుట్టేది. శివపార్వతుల పెళ్లి అయిన తర్వాతే కదా గణపతి పుట్టింది. అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు… అమ్మకి విషయం  తెలియదనుకుంట!  అందుకే నన్ను అడుగుతుంది… నేను తెలివైన వాడిని కాబట్టి…. అన్నీ నేను పరిష్కరించగలను కాబట్టి….. సమాధానాలు చెప్పగలను కాబట్టి…. నన్ను అడుగుతుంది.  అంతే కదా అమ్మ?

శివ నందిని:- సరే నువ్వు చెప్పింది నిజం అనుకుందాం… మరి పెళ్లికి ముందు పెళ్లి సమయంలో వర పూజ చేయాలి కదా! 

బాల గణపతి:- అవును చేస్తారు…

శివ నందిని:- వరపూజ చేసేటప్పుడు పసుపు గణపతిని ఆరాధన చేయాలి కదా!  పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే కదా మిగతా పూజలు మొదలయ్యేది… అది ఏ పూజ అయిన గాని…..

బాల గణపతి:- అవును అన్నాడు.  

శివ నందిని:- మరి అక్కడ ఉన్న పసుపు గణపతి ఎవరు? పెళ్లి కాకముందు ఉన్న పసుపు గణపతి ఎవరు? 

బాల గణపతి:- అవును కదా!  మరి ఆ పసుపు గణపతి ఎవరు? 

అని బాలగణపతి ఆలోచనలో పడ్డాడు… బాల కుమారస్వామి ఆలోచనలో పడ్డాడు… దీనికి సరైన సమాధానం చెప్పు నీకు కావాల్సింది నేను ఇస్తాను కొనిస్తాను…. లేదంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అనేసరికి పిల్లలిద్దరూ కూడా వాదోపవాదాలు చేసుకుంటూ….దానికి సమాధానం ఏం చెప్పాలి అని  ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత శివ నందిని కాస్త రుద్ర స్వామి కేసి చూస్తూ….

శివ నందిని:- అయ్యా!  నాకు ఇక్కడ ఒక సందేహం వచ్చింది.  దానికి సమాధానం చెప్పు… చక్రాలు, శరీరాలు ఎందుకు జాగృతి చేసుకోవాలి?.

రుద్రస్వామి:- అమ్మ!  మన  సాధన శరీరంలో 11 శరీరాలు ఉంటాయని తెలిసింది కదా!  నిజానికి శబ్ద పాండిత్యంలో 7 దేహాలు, సప్త చక్రాలు అని అంటారు.  అదే పరమహంసగారి సాధన అనుభవం ప్రకారంగా చూస్తే….. 13 యోగ చక్రాలు, 11 శరీరాలు అని చెప్పడం జరిగింది.  ఆ తర్వాత పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్తలు ఇది  నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఏకాదశ దేహాలకు ప్రతీకగా ఏకాదశ రుద్రులు ఉండటం జరిగింది కాబట్టి… అలాగే 13 యోగ చక్రాలు ఉంటాయని చెప్పడం జరిగింది.  ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శరీరం ఆపాదించడం జరిగింది. ఈ శరీరంలోనే మనం చేసిన పాపపుణ్యాలు, కర్మలు, కర్మ ఫలితాలు, కర్మ దోషాలు, ఆ తరువాత ఋణాలు, ఋణానుబంధాలు, ఋణబంధనాలు ఇవన్నీ కూడా ఉంటాయి.  తద్వారా శరీరం సాధనకు పనికి వస్తుందా ? పనికి రాదా?  అనేది మన చక్ర జాగృతిని బట్టి…. అలాగే ఆ చక్రంలో ఉన్న శరీర స్థితిగతులను బట్టి ….మన భౌతిక స్థూల శరీర సాధన ఆధారపడి ఉంటుంది.  మోక్షజన్మ పొందాలి అంటే…. ఖచ్చితంగా చక్రాల జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం అవ్వాలి. అలాగే ఆ చక్రంలో ఉన్న శరీరము జాగృతి, శుద్ధి, ఆధీనం మోక్షమును పొందవలసి ఉంటుంది. అంటే 13 యోగ చక్రాలు విభేదనం అవ్వాలి.  అలాగే 11 దేహములు మోక్షమును పొందాలి.  అప్పుడే మన దేహం పూర్ణ మోక్షం పొందినట్టు అవుతుంది.  ఇందులో ఏ దేహం ఆగిపోయినా కూడా…..ఏ చక్రం విభేదనం కాకపోయినా కూడా…. అంటే తెలిసి తెలియక తప్పు చేసినా లేదా మాయలో పడినా ఏదైనా అనివార్య కారణాల వలన, పరిస్థితుల వలన, కాలమాయ వలన ,దైవమాయ వలన ఏదైనా గాని మనంతట మనమే సాధన ఆపితే…. ఆ చక్రముగాని, ఆ చక్రంలో ఉన్న శరీరము గాని ఆగిపోతే… మన సాధన ఆగిపోయినట్లే.  తద్వారా పూర్ణ మోక్షం కాస్త శరీరం మోక్షం పొందడంతో…. పునః జన్మకి వెళ్లడం జరుగుతుంది. ఏదైనా 11 శరీరాలు మోక్షాన్ని పొందాలి.  అలాగే 13 యోగ చక్రాలు విభేదనం పూర్తి అవ్వాలి .. దీని కోసమే మనకి చెప్పారు. అలాగే శరీర జాగృతి వలన మనకి సిద్దులు వస్తాయి.  అష్టసిద్ధులు అంటారు కదా!  ఇవి ఎనిమిది రకాల సిద్దులు ఉంటాయి.  అలాగే మనకి సహస్ర చక్రంలో అష్టాదశ యోగ శక్తులు వస్తాయి.  అంటే ఇష్టకామ రూప, ఇచ్చామరణ సిద్ధి ఇలా 18 రకాల శక్తులు వస్తాయి.  పంచభూతాలు ఆధీనం అవుతాయి.  కాలం ఆధీనం అవుతుంది. పంచభూతాలు నీ అదుపాజ్ఞలో ఉంటాయి. 


సాధన శక్తులు:-

సాధకుడికి యోగసాధన అభ్యాసముచేత మూడు రకమైన సాధన శక్తులు వస్తాయి! అవి 1. దైవ శక్తులు 2.యోగశక్తులు 3.క్షుద్రశక్తులు!వాటిలో దైవశక్తులు అనేవి అమ్మవారిని లేదా శివుడిని లేదా విష్ణువును లేదా  రాముడు లేదా శ్రీకృష్ణుడిని ఇలా మున్నగు దేవతలను ఆరాధించుట వలన గాని లేదా ఉపాసించుట వలన కలుగుతాయి. అదే పరమ గురువులైన  షిరిడీ సాయి బాబాను, ఉపాసని బాబాను, మెహెర్ బాబాను  లేదా సదాచార మార్గములో వారిని ఆరాధించినపుడు వచ్చే రమణ మహర్షి లాంటి వారిని ఆరాధించడం వలన వచ్చే శక్తులను యోగ శక్తులు లేదా సిద్ధులు అంటాము!ఇవి ధ్యాన నిష్ఠను బట్టి సాధకుడికి  వస్తాయి! అదేవిధంగా యక్షిణి, కిన్నెర, కర్ణ పిశాచి,గంధర్వ మోహిని, కామిని, డాకిని మున్నగు క్షుద్ర దేవతలను ఆరాధించినపుడు వచ్చే శక్తులను క్షుద్రశక్తులు అంటాము! వీటిని గారడి విద్యలనీ, చిల్లర మహిమలని అని కూడా  అంటాము! క్షుద్రదేవతలను ఆరాధించేవారు అధములు అని…. అదే దేవతలను ఆరాధించేవాడిని మధ్యముడు అని, పరమ గురువులను సేవించే వాడిని ఉత్తముడని, ఆత్మను ఆరాధించేవాడిని ఉత్తమోత్తముడిని అంటారు!


క్షుద్రశక్తులను సాధించడం చాలా సులభం! కేవలం 40 లేదా 90 రోజులలో వీటిని సాధించవచ్చును! వీటన్నింటి వలన డబ్బు, కీర్తి, భోగం వంటివి కొన్ని రోజుల్లోనే వస్తాయ.కానీ వీటికి లాభం కంటే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుంది! ఎందుకంటే వీటిని ఉపాసించడం వల్ల సాధకుడు మానవ స్థాయి నుంచి భూత స్థాయికి దిగజారతాడు! కాబట్టి సాధకుడు వీటి జోలికి వెళ్ళరాదు! ఇక దైవ శక్తులు అనేవి నిరంతర ధ్యానము వలన, నిరంతర జపము వలన, తీవ్రమైన ప్రాణాయామం వలన వస్తాయి! అలాంటి సాధకుడి ధ్యాననిష్ఠ 12 సం॥ నుండి 24 సం॥ల పాటు ఉంటే దైవశక్తులు వస్తాయి! వీటివలన కూడా ధనం, కీర్తి వస్తాయి! వీటి వలన కూడా లాభం కంటే నష్టమే ఎక్కువ! కారణం దైవశక్తుల వల్ల అహంకారం పెరిగి మాయ సుడిగుండంలో సాధకుడు పడే అవకాశం ఎక్కువగా ఉంది.ఇక  యోగశక్తులు అనేవి సాధకుడు గురు సేవను బట్టి, ధ్యాన తపస్సును బట్టి వస్తాయి! ఇవి రావడానికి కొన్ని సం॥రాల నుండి కొన్ని జన్మలే పట్టవచ్చును! ఎందుకంటే సాధకుడి షట్చక్రాలు అధీనం అయినప్పుడే ఈ యోగశక్తులు వస్తాయి గదా! ఈ సిద్ధుల వలన సాధకుడు మన మాయలో పడి పోవచ్చును! తద్వారా సాధకుడు ముక్తిని పొందలేడు! అందుకే ధ్యానములో కలిగే యోగశక్తులను, అష్టసిద్ధులను కూడ ఉపయోగించరాదు.వాటి సాంగత్యం సాధకుడికి పనికిరాదని చెప్పారు!


ఇప్పుడు క్షుద్రశక్తులు అనేవి ఏమిటో తెలుసుకుందాము! వీటినే గారడీ విద్యలనీ, చిల్లర మహిమలని అంటారు! అవి నోటి నుండి లింగాలు తెప్పించడం, హోమాలు నుండి లింగాలు, సాలగ్రామాలు, శ్రీచక్రాలు తెప్పించటం….ఖాళీ చేతుల నుండి విగ్రహాలు, లేదా పళ్ళు లేదా పసుపు కుంకుమలు లేదా విభూతి తెప్పించటం, చిన్న యంత్రాలు, తాయత్తులు, చిన్న చిన్న విగ్రహాలు తెప్పించటం, నిప్పులో నిలబడటం, కోరిన పరిమళం గాలిలోకి తెప్పించటం, గాలిలో నుంచి విభూతి, కుంకుమ, పువ్వులు తెప్పించటం, మున్నగు గారడీ విద్యలన్నియూ క్షుద్రశక్తులే! వీటిని చేయటానికి హస్త లాఘవం, భౌతిక, రసాయన శాస్త్రాలు పరిజ్ఞానము , గారడీచేసి మోసంతో  ప్రదర్శించే విద్యలు ఇవి! ఇలాంటివి ప్రదర్శించేది నకిలీ స్వాములు, నకిలీ బాబాలు, నకిలీ గురువులే! ఇప్పుడు దైవశక్తులు ఏమిటో తెలుసుకొందాము! ఎవరైతే తన ఇష్టదైవము ప్రతిరోజూ క్రమము తప్పకుండా, వేళ తప్పకుండా అనన్య మైన భక్తితో ఆరాధన చేస్తారో, వారికి దైవశక్తులు వస్తాయి! అనగా వాక్సిద్ధి, మూడు రోజులలో జరగబోయే విషయాలు తెలియటం, తలుచుకున్న వ్యక్తులు తారసపడటం, మనిషిని చూడగానే జరగబోయేది చెప్పటం, దారి తెన్ను లేకుండా పోతున్నపుడు సరైన మార్గాన్ని కనుక్కోవడం, మనసులో అనుకున్న విషయాలను సైగలు, మాటలు లేకుండా ఇతర మనుషులలోకి చొప్పించటం, ధ్యానము ద్వారా జడ పదార్థాలు అనగా ఉదా : కుర్చీ, బీరువా, కొండలు మున్నగు వాటిని చేతులతో తాకకుండా వాటి గురించి మనసులో తలచుకుంటూ వాటిని కదిలించగలగడం, జరగబోయే  దాన్ని ముందుగానే ఊహించి తెలుసుకోగలగడం, భూమి నుంచి కొంత ఎత్తులో లేచి నిల్చోవడం లేదా కూర్చోవడం, నీటిమీద కూర్చోవడం లేదా తేలియాడటం, ఇతరుల వ్యాధులను నయం చేయగలగటం, ఇతరుల మానసిక, శారీరక రుగ్మతలు తొలగించడం, మన మనస్సులను చిత్త భ్రమలకు లోను చేయగలగడం ఇవన్నియు దైవశక్తుల క్రిందకు వస్తాయి! ఇప్పుడు యోగశక్తులు గూర్చి వివరంగా తెలుసుకొందాము!


ఈ యోగశక్తులు అనేవి ధ్యాన తపస్సు ద్వారా షట్చక్రాలను సహస్రార సాధకుడు అధీనం చేసుకున్నపుడు వస్తాయి! ఈ యోగశక్తులు మూడు రకాలుగా ఉంటాయి అవి 1.అష్ట సిద్ధులు 2. దశసిద్ధులు 3. పంచసిద్ధులు! ఇపుడు అష్ట సిద్ధులు అనగా.. 1. అణిమ - పరమాణువు సైజుకు మారిపోవటం 2. గరిమ - కొండలను గూడ కదిలించగల శక్తిని పొందడం 3. లఘిమ - శరీరాన్ని తేలిక చేయడం, 4. ప్రాప్తి - ఏం కావాలనుకున్నా పొందగలగడం 5. వశిత్వ - ప్రపంచంలోని దేన్నైనా లొంగదీసుకొనే శక్తిని సొంతం చేసుకోవడం 6. ప్రాకామ్య - పరకాయ ప్రవేశ విద్యను తెలుసుకోవడం 7. ఈశత్వం - భగవత్ కృపతో ఆయన నుండి శక్తులను సంతరించుకోవడం 8. వశిత -ఇంద్రియ జయాన్ని కలిగించి ఉండడం! ఈ ఎనిమిది సిద్ధులనే అష్టసిద్ధులంటారు! ఇపుడు దశ సిద్ధుల గూర్చి చూద్దాం! 1. దూర దృష్టి - ఎక్కడో జరుగుతున్న విషయాలన్నింటినీ ఇక్కడే కూర్చుని ఖచ్చితంగా ఊహించడం 2. దూర శ్రవణం - ఎంత దూరం నుంచి అయినా  శబ్దాల్ని గ్రహించి వినగలగటం! 3. అనూర్మిమతత్వం - ఆకలి, దాహం, దుఃఖం కామం, మోహం మొదలగు వానిని జయించటం 4. మనోజపం - మనోవేగముతో కావాలనుకున్న చోటికి వెళ్లటం 5. కామరూపం - కోరుకున్న రూపాన్ని పొందటం 6. ప్రాకామ్యము - కంటికి కనిపించని లోకాలను దర్శించటం. 7. స్వచ్ఛందమరణం - కోరుకున్నపుడు మరణించటం 8. సహకృత్ - స్వర్గములోని దేవతల వినోద విలాసాలు చూడటం, అందులో పాల్గొనడం. 9. యధాసంకల్ప సిద్ధి - కావాలనుకున్నవి జరిపించడం 10. ఆజ్ఞా ప్రతిహతగతి - తిరుగులేని విధంగా ఆజ్ఞాపించడం. ఈ పది సిద్ధులతో దశ సిద్ధులు అంటారు.ఇపుడు పంచ సిద్ధులు చూద్దాం!

1.దివ్య దృష్టి (త్రికాలజ్ఞత్వం) - భూత, భవిష్యత్ వర్తమానాలు గ్రహించడం!

2.అద్వంద్వం- సుఖ దుఃఖాలకు, శీతోష్ణములకు మొదలగు ద్వంద్వములకు అతీతంగా వుండడం!

3.పరచిత్తాది అభిజ్ఞత - ఇతరుల మనస్సు గ్రహించడం. వారి స్వప్నాలను వివరించడం!

4.ప్రతిష్ఠంభనం:-  పంచ భూతాలను అదుపులో ఉంచడం.

5.అపరాజయం - ఓటమి అన్నది లేక అన్ని చోట్ల విజయం సాధించడం! 

వీటినే పంచ సిద్ధులంటారు!

ఇపుడు మీరు ఏది క్షుద్ర శక్తులో, ఏవి దైవ శక్తులో, ఏవీ యోగ శక్తులో తెలిసింది గదా! కాని యోగసాధకుడు ఎటువంటి సాధన శక్తులకు లోబడకూడదు! లోబడితే అంతటితో అతని సాధన సాధన ఆగిపోయి, అక్కడ నుండి ఆ యోగసాధకుడు అధోగతి పాలవుతాడు! ఈ విషయాల్ని రామకృష్ణ పరమహంస మాటల ద్వారా చూద్దాం! వంటగదిలో పనిలో వున్న తల్లి కోసం  పసి పిల్ల ఏడిస్తే…ఊరుకోబెట్టడానికి ఆటబొమ్మలు పడేస్తుంది. ఆ బొమ్మలతో ఆడుకుంటూ….. పిల్ల ఏడుపు ఆపేస్తుంది. అదేవిధంగా అదేవిధంగా పరమాత్మ కోసం ధ్యానం చేసే వారికీ దేవుడు సిద్ధులు ఇస్తాడు! ఆ సిద్ధుల మోహంలో పడి, సాధకుడు వాటిని ఇతరుల ముందు ప్రదర్శించి…ధనార్జన చేస్తూ పరమాత్మను మర్చిపోతాడు! అంతటితో ఆ సాధకుడు సాధన అధోగతి పాలవుతుంది. ! సాధకుడు ఈ సిద్ధుల బారిన పడకుండా ఉండాలంటే నాకు వచ్చిన సిద్ధులను  నానుంచి మరుగు పరుచు స్వామి అని వేడుకోవాలి.


సాధనలో వచ్చే అశక్తులు:-

అశక్తి అంటే సిద్ధులు లభించకపోవడం. ఎందుకంటే గురువుల సమక్షంలో సాధకుడు ఎలా ప్రాణాయామము లేదా ఎలా ధ్యానము చేయాలో తెలుసుకోకుండా, పుస్తక జ్ఞానముతో వీటిని చేయటం వలన, అదే అభ్యాసంగా కొనసాగించుట వలన సాధకుడికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది! ఉదా :- సాధకుడు మొదటి సారిగా గురువు దగ్గర ప్రాణాయామము ఎలా చేయాలో పూర్తిగా నేర్చుకొని అభ్యాసము చేస్తే, సరిపోతుంది! ఇక్కడ గురువు అంటే ఆధ్యాత్మిక గురువు.  మీరు మీ దగ్గరలోని యోగ సెంటర్ కి వెళ్లి అక్కడ మొదట ధ్యానము, అలాగే ప్రాణాయామము ఎలా చెయ్యాలో నేర్చుకొని అభ్యాసము చేయాలని నా మనవి! లేకపోతే పుస్తక జ్ఞానము వలన నేర్చుకొని ప్రాణాయామము చేయటం వలన అనేక ఇతి బాధలకు సాధకుడు గురికావలసి ఉంటుంది అని గమనించండి.

ఈ శక్తులు మొత్తం 28 రకాలు! వాటిలో ఇంద్రియాలకు సంబంధించిన ఆశక్తులు 11. అవి 1. చెవుడు, 2. మూగతనం 3. కుష్టు రోగం లేక పాండురోగం 4. గ్రుడ్డి తనం 5. రుచి తెలియకపోవడం 6. వాసన తెలియకపోవడం 7. ధైర్యం లేకుండ పోవటం (అధైర్యం) 8. కుంటితనం 9. నపుంసకత్వం 10. మలబద్ధకం 11. పిచ్చితనం. 


ఇప్పుడు అంతఃకరణమునకు (అనగా మనస్సు, బుద్ధి, అహంకారాలు) సంబంధించిన అశక్తులు 9. అవి ఏవంటే :


1.ప్రకృతి జ్ఞానంతో కృతార్ధులైనట్లు భావించడం! అంతమాత్రం చేతనే తాను తత్త్వజ్ఞానిఅయినట్లు, కృతార్ధుడైనట్లుగా భావించుకొని ఈ ప్రపంచం అంతా సార విహీనమైనదని విరక్తుడవడం అశక్తి అవుతుంది.! ఉదా :-నకిలీ గురువు 

2.తీర్థయాత్రలు, గంగాస్నానాదులలో విశ్వాసం ఉంచి  సన్యాసాశ్రమానికి సంబంధించిన చిహ్నాలు ధరించిన మాత్రమునే తాను గొప్పయోగి అయినట్లుగా భావించుకోవడం, అలాగే అర్హత లేకుండా కర్మ సన్యాసం చేయడం అశక్తి అవుతుంది! అంటే వీళ్లు పేరుకే సన్యాసులు అన్నమాట!

3.ప్రకృతి విజ్ఞానముతోనే ముక్తి దానంతట అదే వస్తుంది కానీ….దానికి ఎటువంటి యోగసాధనలు గాని కర్మ సన్యాసము అక్కర్లేదని….. దాని కోసం ప్రయత్నించటం, కష్టాలు సహించటం వ్యర్థమని భావించుకోవడం అశక్తి అవుతుంది .

4.సంపదతోనే ముక్తి వస్తుందని భావించి తృప్తి చెందటం ఐనట్టి అశక్తి అవుతుంది .

ఉదా : ధనవంతుడు 

5.విషయ సంగ్రహం అసంభవం అని, వాటి యెడల విముఖుడై తృప్తుడవడం అశక్తి అవుతుంది .

ఉదా : కోరికలు అన్నీ పూర్తిగా వదలక అనుభవించాలనే ఆశ ఉంటుంది గాని …ఆశకు లోనైతే సాధన  ఉండదు అనుకుని కోరికలను బలంగా అణిచివేస్తాడు. అనగా ఇలాంటి వారికి భక్తి దేవుడి మీద చిత్తం  చెప్పుల మీద ఉంటుంది. 

6.విషయ సంగ్రహం  చేయగలిగిన వాటిని కాపాడుకోలేము అని తృప్తుడవడం అశక్తి అవుతుంది .

7.విషయాలలో ఉంటే తక్కువ, ఎక్కువలు చూసి…. ఆలోచించి వాటి యెడల విముఖుడై తృప్తి చెందడం అశక్తేఅనువంది! ఉదా: కోరికలలో చిన్న కోరికగా, పెద్ద కోరికగా భావించుకోవడము….

8. విషయాల వల్ల  ఎటువంటి తృప్తి కలగదు అని తెలుసుకొని…. వాటి యెడల విముఖుడై ….తృప్తి చెందడం అశక్తి అవుతుంది .అనగా వీరంతా కోరికలు అనుభవించుట మహా పాపం అని  శరీరంతో అనుభవించకూడదు అని అనుకుంటారు గానీ……మనస్సుతో  చెయ్యకుండా ఉండలేరు . ఇవి ఎలా ఉంటాయంటే చెప్పేవి శ్రీరంగ నీతులు…దూరేవి దొంపసాని కొంపలు అన్నమాట 

9. విషయ సంపాదనలో జీవహింస తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని తెలుసుకొని వాటి ఎడల విముఖుడవడం అశక్తి అవుతుంది. అనగా ఆహారం అనేది మొక్కలు చంపి తినటం లాంటిది కాబట్టి ఆహారాన్ని సంపాదించడానికి కావలసిన డబ్బులు సంపాదించడం మానివేస్తాడు అన్నమాట!  ఇలా అంతఃకరణకు సంబంధించి తొమ్మిది రకాల ఆసక్తులు ఉంటాయి.


అష్ట సిద్ధులు:- 

ఇప్పుడు అష్ట సిద్ధులకు సంబంధించి మళ్లీ  ఎనిమిది రకాల అశక్తులుంటాయి! అనగా అష్టసిద్ధులు లభించకపోతే అష్ట అశక్తులుఅష్ట అసక్తులు ఉంటాయన్నమాట! ఈ అష్టసిద్ధులు వివిధ రకాలుగా విడిన పేర్లతో ఉన్నాయి గమనించుకోండి ఇప్పుడు అష్టసిద్ధులు ఏమంటే….


1.జన్మసిద్ధి – పూర్వజన్మసంస్కార ప్రాబల్యం ఉపదేశం పొందకుండానే….. ప్రకృతి మొదలైన వాటిని గురించిన జ్ఞానం లభించడం మొదటి సిద్ధి. ఇటువంటి సిద్ధి లేకపోవడం మొదటి అశక్తి. 

2.శబ్ధజ్ఞాన సిద్ధి – పశుపక్ష్యాదులు యొక్క శబ్దాల అర్థాలను సైతం గ్రహించగలగడం, అలాగే శబ్దాన్ని విన్నంత మాత్రం చేతనే అది ఎవరు చేశారో తెలియుట రెండవసిద్ధి! ఇటువంటి సిద్ధి లేకపోవడం రెండవ అశక్తి అన్నమాట!

3.శాస్త్ర జ్ఞాన సిద్ధి :- పూర్వజన్మ సంస్కారాల వల్ల వేదశాస్త్రాదుల సంబంధం ఉన్న విలక్షణమైన జ్ఞానం కలగడం మూడవ సిద్ధి. ఇలాంటి సిద్ది లేకపోవడం మూడవ అశక్తి అన్నమాట. 

4.అధ్యాత్మక సిద్ధి:- ఆధ్యాత్మికపరంగా తాపాలను అనగా కష్టాలను భరించగలగటం నాలుగవ సిద్ధి. ఇది లేకపోవడం నాలుగవ అశక్తి.

5.అధిభౌతిక సిద్ధి : భౌతిక పరంగా తాపాలను సహించే శక్తి కలిగి ఉండటం అనేది ఐదవ శక్తి. ఇది లేకపోవడం అయిదవ అశక్తి.

6.అధి దైవిక సిద్ధి : దైవికపరంగా తాపాలను సహించే శక్తి కలిగి ఉండటం ఆరవసిద్ధి. ఇది లేకపోవడం 6వ అశక్తి.!

7.విజ్ఞాన సిద్ధి : మంచి స్నేహితుల వల్ల, ఆప్తులైన వారి ఉపదేశాల వల్ల తత్వ జ్ఞానం కలగడం 7వ సిద్ధి! ఇటువంటి సిద్ధి లేకపోవడం అశక్తి.

8.విద్యాసిద్ధి:- గురువుకు ఇష్టమైనటువంటి దుర్లభమైనటువంటి వస్తువును సంపాదించే ఇవ్వడం అందువలన గురువు ప్రేమతో సంతోషముతో జ్ఞానబోధ చేస్తాడని తలచి ఆ విధంగా చేయడం ఎనిమిదవ సిద్ధి. ఈ సిద్ధి లేకపోవడం ఎనిమిదవ అశక్తి. 

ఈ అష్టసిద్ధులు శ్రీ శంకరాచార్యుల వారు చెప్పారు! మరికొంత మంది ఈ అష్టసిద్ధులు అనగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే ఎనిమిది రకాల సిద్ధులను అష్టసిద్ధులుగా చెప్పారు! మరికొంత మంది ఈ అష్టసిద్ధులను మరోరకంగా చెప్పారు. అవి 1. పరకాయ ప్రవేశం 2. జలాధులలో అంటకుండా ఉండడం 3. గాలిలో ఎగిరిపోగలుగుట 4. జ్వలనము 5 దివ్య శ్రవణం 6. ఆకాశ మార్గ గమనం 7. ప్రకాశావరణ క్షయం 8. భూత జయము అనే వాటిని అష్టసిద్ధులుగా చెప్పారు. 

ఇలా ఈ అష్టసిద్ధులలో భిన్న అభిప్రాయాలున్నాయి. కానీ…..ఏది ఏమైనప్పటికీ ఈ అష్టసిద్ధులు లేకపోవడము అనేది అష్ట అశక్తులకు కారణం అవుతున్నది. అందుకు సాధకుడు గురువుల సమక్షంలో ధ్యానంగానే ప్రాణాయామం గాని నేర్చుకొని తమకు సిద్ధులు వస్తున్నాయో లేదో గమనించుకోండి అంతేగాని వాటి మాయలో పడరాదు. ఒకవేళ మీకు సిద్ధులు లభించడం లేదంటే మీ యోగ సాధనలో లోపం ఉన్నదని భావించుకోండి ఈ సిద్దులు వస్తే మీకు యోగ సాధనలో పురోగతివృద్ది ఉంటుంది లేదంటే ఈ సిద్దుల మాయలో గాని సిద్ధులు రాకపోవటం కానీ జరిగితే మీ సాధన అక్కడితో ఆగిపోవును. తస్మాత్ జాగ్రత్త.


అలాగే ఇంద్రియాలకు సంబంధించిన అశక్తులు (11) సరియైన విధంగా ప్రాణాయామము, ధ్యానము గానీ, జపముగానీ, ఉపాసనలు చేయకపోవడం వలన వస్తాయి! అనగా సరియైన పద్ధతిలో ప్రాణాయామం చేయకపోతే అనగా ఎన్ని నిమిషాల పాటు గాలి పీల్చాలి….ఎన్ని నిమిషాల పాటు గాలిని తమలో ఉంచుకోవాలి…. ఎన్ని నిమిషాల తర్వాత గాలిని బయటకు వదలాలి… ఇలా మున్నగు విషయాలు తెలుసుకోకుండా పుస్తక జ్ఞానం ద్వారా చేయడం వలన మీకు ఈ అశక్తులు వస్తాయి. అందుకు మీరు ప్రాణాయామం గురించి పూర్తిగా తెలిసిన వారి వద్దకు వెళ్లి సంపూర్ణంగా ప్రాణాయామం చేయటం వారి దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీకు ఎటువంటి అశక్తులు రావు. అదేవిధంగా గురు మంత్రం ఉపదేశం లేకుండా జపము ,ఉపాసన చేయరాదు. పుస్తకాలలో మంత్రాలను నేర్చుకొని జపముగాని,ఉపాసన కానీ ప్రారంభించే ముందు ఈతి బాధలు కలుగుతాయి. అందుకు మీరు జపం గాని ఉపాసన గాని ప్రారంభించే ముందు ఎవరి దగ్గరైనా కనీసం…. దేవాలయంలోని అర్చకుడి దగ్గరైన గురు మంత్రంగా మీ ఇష్ట దైవ మంత్రము తీసుకొని ప్రారంభించండి. అప్పుడు ఆ మంత్రాల వలన మంత్రసిద్ది లభించును. తద్వారా ఈ అశక్తులు మీకు రావు. అదేవిధంగా ఒకసారి ప్రాణాయామం కానీ….. ధ్యానం కానీ….. జపం కానీ…. ఉపాసన గాని మీరు చేయడం ప్రారంభిస్తే, మీరు చచ్చేంత వరకు ఒక్కరోజు కూడా ఎగనామం లేకుండా చేయాలి. ఇలా 12 సంవత్సరాల పాటు చేయాలి. అప్పుడే మీకు ప్రాణసిద్ధి గాని, జప సిద్ధి గాని,  మంత్రసిద్ధి లేదా ఉపాసన సిద్ది గాని వస్తుంది. తద్వారా మీలో మొదటి ప్రసారం అనగా వీర్యంతో ఏర్పడిన ప్రాణశక్తి సుషుమ్ననాడి యందు ప్రవహించి షట్చక్రాలను గ్రంథులను శుద్ధి చేయను. దీనికి మళ్లీ 12 సంవత్సరాల పట్టును. ఇది సాధకుడి ధ్యాననిష్ఠను బట్టి ఉంటుంది.


ఇప్పుడు అంతఃకరణకు సంబంధించిన తొమ్మిది అశక్తులు ఎలా వస్తాయో చూద్దాం… సాధకుడికి మొదట శక్తి ప్రసారం షడ్చక్రాలు, గ్రంధులు శుద్ధి అవుతాయని తెలుసు కదా! ఈ చక్ర శుద్ధిలో ఉన్నప్పుడు సాధకుడికి ఏడు రకాల యోగ మాయలు కలుగుతాయి. ఈ యోగ మాయలలో సాధకుడు పడటం వలన అంతఃకరణకు సంబంధించిన  తొమ్మిది అశక్తులు వస్తాయి… ఉదాహరణకు మణిపురచక్రం శుద్ధి అవుతున్నప్పుడు మీకు ఇష్టదేవత అనగా మంత్ర దేవత కొన్ని నిమిషాల పాటు కనిపించను. దానికే ఆ సాధకుడు ఇంకేమిటి తనకు దైవసాక్షాత్కారం కలిగినది అని…. నా అంతటి భక్తుడు లేడు అని …మున్నగు మనోభ్రాంతులకు లోనవుతాడు. ఈ బ్రాంతులన్నీయు,మనసుకు గాని ….బుద్ధికి గానీ… అహంకారమునకు గాని… చెందినవి. అంటే అంతఃకరణ అశక్తులన్నమాట! అదేవిధంగా ఆజ్ఞా చక్రం శుద్ధి అవుతున్నప్పుడు తన ఆత్మ స్వరూపమును చూస్తాడు. అది కొన్ని రోజులపాటు చూస్తాడు.ఇంకేమిటి…. తనకు మించిన బ్రహ్మజ్ఞాని గాని, తానే దైవం అని, తానే గురువు అని, తానే పరమాత్మ అని పూజలు చేయించుకుంటాడు. ఇది కూడా మనో భ్రాంతి అన్నమాట… అంటే జీవాత్మ ఆత్మగా మారి పోయినప్పుడు ఇక జీవాత్మ ఉండదు గదా. మరి జీవాత్మకు తనను ఆత్మదర్శనానుభూతి ఇలా ఉంటుంది అని ఎలా చెప్పగలరు? ఆలోచించుకోండి! అంటే అట్టి సాధకుడికి జీవాత్మ అనేది ఆత్మగా మారుతున్నప్పుడు ఆత్మదర్శనం ఇచ్చును. అంటే అలా పొరబడడం ఆజ్ఞా చక్రం శుద్ధి అవుతున్నప్పుడు అన్నమాట!  గాని జీవాత్మ ఆత్మగా మారకముందే సాధకుడు తనకు ఆత్మదర్శనానుభూతి కలిగినదని….కాబట్టి   తానే దైవమని ,గురువని పూజలు  చేయించుకుంటారు. గాని అలాటి నకిలీ గురువులకు జీవాత్మ ఆత్మగా మారదు…..ఎందుకంటే మారే సమయంలో వచ్చే యోగమాయ అనగా జీవుడి యోగమాయకు బలి అయిపోయాడు గదా! అంటే వీరికి క్షణిక ఆత్మదర్శనానుభూతి…. అంటే తనలో దైవం ఉన్నట్లుగా తెలుసుకోవడం….. మరి నకిలీ గురువులు, నకిలీ స్వాములు ఈ అనుభూతిని పొందితే విగ్రహారాధనను ఎందుకు చేస్తారు చేస్తున్నారు అంటే దైవం తనలో లేడని విగ్రహం లోనే ఉన్నాడని కదా..! దీని అర్థం అంటే వీరు ఆత్మ దర్శనానుభూతిని పొందలేదని కదా!. మరి అనుభూతిని పొందలేకపోతే తామే దైవాలమని…..తామే గురువులమని ఎందుకు చెప్పుకొంటున్నారు; ఎందుకంటే మహాలక్ష్మి ప్రాప్తి కోసం.  అంటే వీరంతా యోగమాయలో అంటే అంతఃకరణ అశక్తులలో పడినట్లే గదా? ఆలోచించండి! అది నిజమైన ఆత్మదర్శనానుభూతి పొందాడు అంటే దానిని గూర్చి ఆయన చెప్పలేడు? నిజమైన ఆత్మదర్శనానుభూతిని పొందిన రామకృష్ణ పరమహంస అనుభవం గూర్చి తెలుసుకుందాం! ఆయన ఎన్నోసార్లు ఈ అనుభూతిని గూర్చి చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గాని చెప్పలేకపోయారు! మాటలు గొంతు వరకు వస్తున్నాయి గాని గొంతు దాటి రావడం లేదు. అందువలన ఈ అనుభూతిని నేను చెప్పలేను! ఎందుకంటే నొప్పి అనేది ఎలా ఉంటుందో అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది గాని నొప్పి  ఇలా మాత్రమే ఉంటుందని ఎలా అయితే చెప్పలేమో ….అలాగే ఆత్మ దర్శనానుభూతి గురించి అలాగే చెప్పలేము.  ఈ అనుభూతి పొందిన తరువాత ఆయన విగ్రహానికి పూలు వేయటం మానివేసి తన భక్తి పారవశ్యంలోనే తన మీదనే  వేసుకునేవారు.  అంటే దైవము అనేది విగ్రహంలో లేదు తనలో ఉన్నాడని తెలుసుకొన్నారు. ఆనాటి నుండి విగ్రహారాధన చేయడం మానివేసి మానసిక ఆరాధన చేయడం ప్రారంభించారు! అనగా బాహ్యపూజను శిష్యులచేతను, అంతరపూజగా తను చేసేవారు! అదే విధంగా శిరిడి సాయిబాబా వారు కూడా అంతర ఆరాధన చేసేవారు ! కానీ ఇప్పుడున్న నకిలీ గురువులు బాహ్య పూజలకే అంకితం అయినారు. బాహ్య పూజలు చేయువాడు నకిలీ గురువు ….నకిలీ స్వామి…. నకిలీ దైవం అన్నమాట!  ఎందుకంటే వీరు ఇష్టదేవత యోగ మాయను దాటలేక అంతఃకరణకు సంబంధించిన అశక్తులలో.  …. పడిపోయిన వారు కాబట్టి ఇలాంటి వారి యందు జాగ్రత్త వహించండి! తన ఆత్మ దర్శన అనుభూతిని గాని తన ఆత్మ అనుభూతిని గురించి గానీ ఇలా ఉంటుందని చెప్పారు అంటే వీరు నకిలీ గురువులే. ఈ విషయమును తెలియచేయుటకు ప్రకృతి వీరి నోటి నుండి పలకించును. ఎందుకంటే ఇలాంటివారు నిజమైన గురువులు కాదురా! మోసపోకండి అని చెబుతుంది. కానీ జనాలు వీరిని మాత్రమే నిజమైన గురువుగా భావించుకుంటారు. అందుకే గొర్రె కసాయి వాడినే నమ్మునని శాస్త్ర వచనం ఉంది కదా! అందుకే శిరిడి సాయిబాబా లాగా ఏవైనా సిద్ధులు చూపించమనండి. చూపించరు. ఎందుకంటే వారికి ఎలాంటి సిద్దులు ఉండవు కదా. ఒకవేళ చూపించిన ఆ సిద్దులు యోగ సిద్ధులు కాదు. క్షుద్ర శక్తులను ఆరాధించుట వలన వచ్చిన గారడీ విద్య లేనని తెలుసుకోండి. నీటితో దీపం వెలిగించమనండి. లేదంటే గాలిలో లేవమనండి. లేదంటే నీటి మీద నడవమనండి. ఇలాంటిది ఒక్కటి కూడా చూపించరు… చూపించలేరు…కానీ ఇలాంటి వారంతా నోటిలో నుంచి లింగాలు తీయడం ఖాళీ చేతుల నుంచి వస్తువులను తెప్పించటం ఇష్ట దేవతా ఫోటోల నుండి విభూతులు తేనెలను రప్పించడం….. అగ్ని యందు దేవత రూపాలుగా చూపించటం…ఇలాంటి మనోభ్రాంతికి చెందిన విద్యలు చూపిస్తారు. ఇవి మ్యాజిక్ తెలిసిన ప్రతివాడు చేస్తాడు కదా. లేదంటే కనీసం యోగ శక్తికి సంబంధించిన సిద్ధిని చూపించమంటే.. తిరిగి కోపం అలాగే అహంకారం ఎక్కువ.. మేము సిద్దుల మాయలో పడకూడదని వాటికి దూరంగా ఉన్నాము అని చెబుతారు. మరి షిరిడి సాయిబాబా ఎలా చూపించారు. మరి ఆయన వీటి సిద్ధమాయలో పడ్డారా! లేదు కదా! నీవు యోగ శక్తి కి సంబంధించిన సిద్ధులు చూపించకపోతే నీవు మాకన్నా ఎక్కువని ఎలా తెలుస్తుంది! ఆలోచించండి…మరి నీవు నిజమైన గురువుగా లేదా నకిలీ గురువా ఎలా తెలుస్తుంది? ఆలోచించుకోండి……


ఇప్పుడు అష్టసిద్ధులకు సంబంధించిన అశక్తులు ఎలా వస్తాయో చూద్దాం. సాధకుడిలో షట్చక్రాలు ఆధీనం అవుతున్నప్పుడు ఎన్నో యోగ మాయలు వస్తాయి. ఈ యోగ మాయలు దాటుకుంటే గాని ఆ సాధకుడికి చక్రాలు ఆధీనమైన దానికి సంబంధించిన సిద్ధులు రావు. ఉదాహరణకు ఆజ్ఞా చక్రం ఆధీనం అయినప్పుడు పంచ సిద్ధులు అలాగే సహస్ర చక్రము ఆధీనం అయినప్పుడు అష్టసిద్ధులు దశ సిద్ధులు వస్తాయి. ఈ సిద్ధులు సాధకుడికి రాలేదంటే దానికి సంబంధించిన అశక్తి వస్తుందన్నమాట. తప్పనిసరిగా సాధకుడికి సిద్ధులు రావాలి కానీ ఆ సిద్దులను తన స్వార్థానికి అనగా ధనార్జను కోసం, కీర్తి ప్రతిష్టల కోసం వాడరాదు. వాడితే వచ్చిన సిద్దే అశక్తి గా మారి తన యోగ సాధనను అధోగతి పాలు చేస్తుంది. సిద్దులు ఏమి సాధకుడికి ప్రాప్తించలేదంటే  సాధకుడి సాధనలో లోపం ఉన్నట్లుగా భావించుకోవాలి. అందుకే సాధకుడికి సాధనలో ఎక్కడ ఉన్నాడో తెలియచేయడానికి పరమాత్ముడు సిద్దుల ద్వారా చెబుతాడు. అదే సాధకుడు ఏ యోగ మాయలో పడినాడో తెలియడానికి అశక్తి ద్వారా చెబుతాడు. ఈ తేడాలను గమనించుకోండి.  అందుకే సిద్ధులు-అశక్తి వంటివి ఏర్పడ్డాయి. ఈ యోగ మాయలు అన్నీ ధ్యాన అనుభవాలే. ఇవి మనోభ్రాంతులేనని గుర్తుంచుకోండి. అలాగే సిద్ధులు కూడా అనుభూతి అనుభవాలే. ఇవి అహం బ్రాంతులేనని గుర్తుంచుకోండి. అదే యోగ సాధన లక్ష్యం. అనుభూతి ఆనందం పొందితే సిద్దుల మాయలో పడినట్లుగా మనో భ్రాంతి లేదా ధ్యాన అనుభవాల వలన ఆనందమును పొందితే అశక్తులు మాయలో పడినట్లుగా భావించుకోవాలి. వీటి గురించి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే కొన్ని లక్షల మందిలో యోగ సాధనలోకి వెళితే ఒక్కడు మాత్రమే పరమయోగి అవుతున్నాడు. మిగిలిన వారంతా వారి వారికి సంబంధించిన యోగ మాయలో పడిపోతున్నారు. ఇలాంటి వారికి ఏది ధ్యాన అనుభవము… ఏది సిద్ధి…. ఏది అశక్తి…. ఏది అనుభూతియో తెలియటం లేదు. అందువలన వాటిని గురించి వివరంగా రాయాల్సి వచ్చింది. అందరూ పరమయోగి అవ్వడానికి. ప్రయత్నించాలని నా మనవి. అంటే ఆనందమునకు అతీతమైన స్థితిని పొందితేనే పరమయోగి. 


ఇవన్నీ కూడా రావాలంటే ముందు చక్రాలు శుద్ధి అవ్వాలి…. ఆ తర్వాత ఆధీనం అవ్వాలి.  ఆ తర్వాత శరీరాలు శుద్ధి అయ్యి ఆధీనం అవ్వాలి.  అంటే యోగ సాధన వైపుకు వెళ్లాలి. అంటే వాటిలో ఉన్న మాయలు, కోరికలు, ఋణాలు, శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ శరీర శుద్ధి, చక్రాల జాగృతి శుద్ధి కాకపోయినప్పటికీ….నీకు యోగ శక్తులు రావడం బదులు అశక్తులు వస్తాయి. అశక్తులు వలన శరీరం పతనం అవుతుంది.  అంటే భౌతిక శరీరం పతనం అవుతుంది.  అంటే సాధన చేసేటప్పుడు భౌతిక గురువు సమక్షంలో నువ్వు చేయలేదంటే….. ప్రాణాయామం విధివిధానం తెలియకుండా పుస్తక గ్రంథాల్లో చెప్పినట్టుగా చేసినప్పటికీ….. గురు సమక్షంలో అభ్యాసం చేయకపోతే…. ఒకవేళ ధ్యానం ఎంత సేపు చేయాలి? ఎప్పుడు ఆపాలి?  అనే విషయాలు నీకు తెలియకపోతే….నీకు ఉన్మాదం, పిచ్చి, గుడ్డితనం, చెవిటితనం, అలక్ష్యం, బద్ధకం నిస్సత్తువ ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అశక్తుల వలన కలుగుతాయని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది.  కామి గాని వాడు మోక్షగామి కాలేదు అని  మచ్చేంద్రనాథుడు చెప్పడంలో చాలా అర్థం ఉంది.  కామానికి మోక్షానికి శరీర పుష్టి ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి . శరీరం సాధనకి పనికి రావాలి.    అలాగే కామానికి కూడా పనికి రావాలి లేకపోతే అటు ధ్యానానుభవాలు పొందలేవు. కామానందాలను పొందలేవు. శరీర వృద్ధి కోసం దీనికి ఆధార భూతమైన 11 శరీరాలు కూడా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని చక్ర జాగృతితో పాటు శరీర జాగృతి కూడా ఉండాలి అని చెప్పేసి…. పరమహంస గారి అనుభవం ద్వారా లోకానికి చెప్పడం జరిగింది.  అప్పుడే లోకానికి తెలిసింది.  అప్పటిదాకా ఇది గుప్తంగా ఉన్న జ్ఞానం.  ఎవరికీ తెలిసేది కాదు.  కేవలం సప్త చక్రాలు జాగృతి చేసుకొని కపాలమోక్షం పొందితే సాధన పరిసమాప్తి అయిపోతుందిని ఎవరికి వారే అనుకున్నారు.  కానీ పరవాహంస గారు అంతర్లీనంగా సాధన చేసుకుంటూ…. ఆయన పొందిన అనుభవ పాండిత్య అనుభవాలను ఏ మార్చకుండా…. ఏమీ మార్చకుండా…. ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటూ పోతూ ఉండేసరికి…. ఏడు చక్రాలు కాదు, 13 చక్రాలు అని…. దేహాలు ఏడు కాదు 11 దేహాలు అని….. ఈ దేహాలు ఏవేవి ఎక్కడ మోక్షం పొందుతున్నాయో…. ఎలా మోక్షం పొందుతాయి….దానికి ఉన్న మాయలేమిటి అని…. కూడా తనకున్న అనుభవాలు పొందుతూ లోకానికి విడమర్చి చెప్పడం జరిగింది. వాటిని మనం కూడా అనుసరిస్తూ శరీర మోక్షం అలాగే చక్రాలు వివేధనం గావించుకుంటే….. నీకు పూర్ణ మోక్షం వస్తుంది….  ఖచ్చితంగా చక్ర  జాగృతితో పాటు శరీర జాగృతి కూడా చేసుకోవాలి. ఎందుకంటే నీ సాధన చేసేది కూడా ఆయా శరీరాలు మోక్షం పొందాలి.  భౌతిక శరీరం అయిన నీ స్థూల శరీరం ఆకరిలో మోక్షం పొందాలి.  అంటే దాని లోపల ఉన్న మిగిలిన 10దేహాలు కూడా మోక్షం పొందితే గాని…. నీ దేహం పరిసమాప్తి కాదు .


శివ నందిని:- అంటే ఇప్పుడు మూలాధార చక్ర శరీర జాగృతి అయ్యింది కదా!  అది ఆది జన్మ స్థూల శరీరం జాగృతి అయ్యిందని…. ఘృష్ణేశ్వరంలో ధ్యానానుభవం అయింది కదా!  ఇప్పుడు నాకు ఏ సిద్ధి వచ్చి ఉంటుంది.


రుద్రస్వామి:- అష్ట సిద్ధులు పొందిన వాళ్లలో దత్తాత్రేయుడు, హనుమంతుడు ఉన్నారు. వాళ్లే  ఈ సిద్ధులను లోకంలో ఉపయోగించడం జరిగింది అని పురాణ ఇతిహాసాలలో తెలుస్తుంది.  దత్తాత్రేయ స్వామి ఈ అష్టసిద్ధులని అష్టభార్యలుగా పొందడం జరిగింది. ఆయన వ్రతం చేసుకునేటప్పుడు ఆయనకి అష్ట కలశం పెట్టి ఆరాధన చేయడం కూడా జరుగుతుంది. అలాగే రామాయణం చూస్తే హనుమంతుడు ఈ అష్టసిద్ధులను ఉపయోగించి లంకకి వెళ్లడం సీతమ్మను రక్షించడం జరిగింది. అంటే ఏంటంటే శరీరమును పెంచడం… శరీరమును తగ్గించడం…. శరీరాన్ని బరువుగా చేయడం…. నీటి మీద నడవటం …..వాయువేగంతో వెళ్లడం…. ఆకాశయానం చేయడం….ఇవన్నీ కూడా అష్టసిద్ధుల వలన వస్తాయి.  నాకు తెలిసి ఒక్కొక్కరి సాధనా స్థితిని బట్టి ఒక్కొక్క చక్రంలోనూ, ఒక్కొక్క శరీరంలో, ఒక్కొక్క రకమైన శక్తులు వస్తాయి.  అందరికీ ఇదేవిధంగా అష్టసిద్ధులు ఒకే వరుస క్రమంలో రావాలి అని ఇదిమితంగా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క కారణంతో వస్తుంది. దానికి తగ్గట్టుగా కర్మలు ఉంటాయి.  దానికి తగ్గట్టుగా జన్మలు ఉంటాయి. జన్మానుసారం, కర్మానుసారం బట్టి మన శరీరాల యొక్క కోరికలను బట్టి ….స్థితిగతులను బట్టి…. మన చక్రాలు జాగృతి అవ్వటం….అలాగే శరీరాలు జాగృతి అవ్వడం…. తద్వారా ఆయా శక్తులు రావడం… సిద్ధులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రంలో భూచరసిద్ధి… ఇంకొక సిద్ధి వస్తుందని…. అందరికీ అదే సిద్ధి రావాలని చెప్పలేము.  అంటే పంచభూతాల సిద్ధితో పాటు అష్టసిద్ధులలో ఒక సిద్ధి వస్తుంది.  నాకు తెలిసినంతవరకు నాకు ఉన్న అనుభవ జ్ఞానం ప్రకారంగా అష్టసిద్ధులలో నీకు మూలాధార చక్ర శుద్ధి ఆధీనం అవ్వటం వలన ప్రాప్త సిద్ధి వచ్చింది అనుకుంటున్నాను.


శివ నందిని:- ఈ ప్రాప్తి సిద్ది వలన ఉపయోగం ఏమిటి?

రుద్రస్వామి:-  నువ్వు అనుకున్న వస్తువు నీ చేతుల్లోకి వస్తుంది .ఇప్పుడు భూగర్భంలో కానీ… భూగర్భ జలాలలో కానీ…. నీకు సంబంధించిన దైవిక వస్తువు ధ్యానంలో కనిపిస్తే…. ఆ వస్తువు నువ్వు లోపలికి వెళ్లి తీసుకు రావలసిన అవసరం లేదు.  పైనే ధ్యానంలో కూర్చొని నాకు ఫలానా వస్తువు కావాలి అని అనుకునేసరికి… ఆ వస్తువు నీకు చేతుల్లోకి వస్తుంది.  దీన్ని ప్రాప్తిసిద్ధి అంటారు. అలాగే మనకి ఇష్టమైన పదార్థం ఏమిటో…. మనకి ఇష్టమైన వస్తువు ఏమిటి అనేది నీకు తెలుస్తుంది 

శివ నందిని:-  మరి ఆ సిద్ధి వచ్చిందో లేదో నేను ప్రయోగం చేసే తెలుసుకోవచ్చా?

రుద్రస్వామి:- అది నీ ఇష్టం తల్లి… ఒక సిద్ధికి అలవాటు పడ్డావంటే…. అది అవసరంగా మారుస్తుంది.  కానీ ఆ సిద్ది ఉంది అని అలవాటు పడకు.  జాగ్రత్తగా చూసుకో.  సిద్ధులు ఉన్నాయి…. సిద్దుల మాయలో పడుతున్నావు… అంటే మాత్రం నువ్వు నెమ్మదిగా పతనం అవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనాన్ని ఆశించావు అంటే…. నీకు ఉన్న జ్ఞానాన్ని నువ్వు అమ్ముకున్నట్లే . అప్పుడు జ్ఞాన సరస్వతి కాస్త మహాలక్ష్మి గా మారిపోతుంది.  తద్వారా నువ్వు మాయలో పడినట్లే అవుతుంది. సిద్ధి వచ్చిందా లేదా పరీక్షించుకోవడం…. నీకు నువ్వు తెలుసుకోవడం మంచిదే… తద్వారా అది ఎలాంటి మాయకు వెళుతుంది ఏంటి? అనేది తెలుసుకోవాలి. 

శివ నందిని:- సరే…. నేను ఈ ప్రాప్తి సిద్ధి వచ్చిందో లేదో పరీక్ష పెడతాను.

అని బస్సులోనే ధ్యానంలో కూర్చుని నాకు ఇష్టమైన దేవుడు ఎవరు?  అనేసరికి పాండురంగ సహిత రుక్మిణి దేవి ఉన్న నల్ల విగ్రహ మూర్తి ఈమె చేతిలో కనిపించేసరికి…. అందరికీ ఆశ్చర్యం వేసింది. శివుడు కానీ…. అమ్మవారిగాని ఉంటారనుకున్నాను. ఇదేంటి ఉన్నట్టుండి పాండురంగడు వచ్చాడు… అని కూడా ఈవిడ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతూ…. ఇది నేను ఇష్టపడ్డానని దీనికి ఎలా తెలుసు?  అంటే అదేంటి నువ్వు ఇష్టపడింది శివుడిని కాదా?  అంటే శివుడి కన్నా ముందు నేను ఇష్టపడింది బాలకృష్ణుడిని.  ఆ బాలకృష్ణుని అంశయే పాండురంగడు అని చెప్పేసి అంటారు.  ఇప్పుడు మీరాబాయి భక్తీ ప్రపత్తులు చూసి పాండురంగడు కనపడ్డాడని…. ఆ తర్వాత ఘోరా భక్తుడికి ఆయన సేవకుడిగా వచ్చాడని చెప్పేసి…. ఆ తర్వాత భక్తతుకారానికి సశరీరంతో మోక్షం ఇచ్చాడని…. ఆ తర్వాత జ్ఞాన దేవుడికి అనేక శక్తులు ఇచ్చాడని…. ఆయన గోడమీద నడుచుకుంటూ వెళ్లిపోయేవాడని ….ఇలా రకరకాలుగా పాండురంగ మహత్యంలోని వివిధ కథాంశాలు అన్ని ఆకట్టుకున్నాయి.  ఎప్పటికైనా, ఎలాగైనా ఈ పాండురంగడిని దర్శనం చేసుకోవాలని భౌతిక దర్శనం….నిజరూప దర్శనం చేసుకోవాలని చెప్పేసి…. నాకు బలంగా అనిపించేది.  కాకపోతే ఈయన అనుగ్రహం పొందాలంటే…. శివారాధన చేయాలని…. శివలింగారాధన చేయాలని చెప్పడంతో….. నేను ఇంక శివలింగ ఆరాధనకు   రావడం జరిగింది.  నాకు మొదటి నుంచి పాండురంగడు అంటే పిచ్చి ఇష్టం.  మీరాభాయి వల్ల ఈయన మీద పిచ్చి పట్టింది. 

రుద్రస్వామి:- సరే మంచిది తల్లి!  అంటే ఈ ప్రాప్తి నీకు సరైన సమాధానమే ఇచ్చింది అని అనుకుంటున్నావా?

శివ నందిని:- అవును…. నా మనసులో ఉన్న ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు.  కాకపోతే కాలానుగుణంగా, కర్మానుగుణంగా నేను ఈయనకి పూజలు చేసేదాన్ని కాదు. ఈయన తత్వం తెలుసు.  ఆ తత్వాన్ని ఆపాదించుకోవాలి… తెలుసుకోవాలని అనుకునేదాన్ని.  కాకపోతే నా మనసులో ఉన్న కోరిక దైవీక విగ్రహం ఇది. 

రుద్రస్వామి:- సరే ఈ కోరిక నీకు దైవమాయగా మారే ప్రమాదం ఉంటుంది.  జాగ్రత్తగా ఉండు.

శివ నందిని:- అవును….దైవ మాయ మణిపూరక చక్రంలో ఇష్టదైవం మాయ ఉంటుంది అని పరమహంస గారు తన మోక్ష గ్రంథమైన కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది.  అంటే ఇప్పుడు ఈయన నాకు దైవమాయగా వస్తారా?

రుద్రస్వామి:- నువ్వు సిద్ధి ఉందో లేదో అని ప్రయోగం చేశావు.  అంటే ఆ క్షణమే నువ్వు మాయలో పడ్డట్టే కదా!  ఆ మాయకి తగ్గట్టుగానే రాబోయే కాలంలో నీకు వచ్చే మాయను ఈ విగ్రహ మూర్తి రూపంలో చెప్పడం జరిగింది. ఈ పాండురంగడు మాయ దాటడం అంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే నూటికి 99 శాతం మంది ఈయన మాయలో పడి ఆగిపోయిన వాళ్లే.  ఈయన దాదాపుగా కృష్ణుడి అంశ విష్ణుమూర్తి అంశ. పిలిస్తే పలుకుతాడని అంటారు.  చూడటానికి ఈయన అనుగ్రహం పొందడం చాలా సులభంగా ఉంటుంది. కానీ  ఈయన్ని అందుకోవడం అనితర సాధ్యం. కాకపోతే ఈయన భక్తుల వెంట పడతాడు…. ఆయనకి నచ్చాడు అంటే మాత్రం భక్తుల వెంట ఈయన పడతాడు.  ఇప్పుడు దత్తాత్రేయుడు వెంట మనం పడాల్సి వస్తుంది.  కానీ పాండురంగడు మాత్రం తనకి నచ్చాడు అంటే మాత్రం భక్తుల వెంట పడతాడు… ఏ రూపమైనా…. ఎంతటి ఎంతటి ఇదైనా ఆయన క్షణాల్లో ఎత్తగలడు.  చేయగలడు.  మాయ పెట్టగలడు. 

శివ నందిని:- సరే ఈయన ఎందుకు వచ్చాడో ఈయన ఎందుకు ఇది చేశాడో దైవమే చెప్పాలి.  కాలమే చెప్పాలి.  అయినా నాకేం తెలుస్తుంది ఇప్పుడు ఈ దైవమాయ అనేది మణిపురక చక్రం కదా!  ముందు స్వాధిష్ఠాన చక్రం దాటాలి కదా!  సిద్ధిని ఉపయోగించడం వలన సమస్య ఏంటి అన్నది అర్థమయింది.  ఇక ఇక్కడ నుంచి వచ్చే సిద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రయోగం చేయకూడదు… వచ్చిందా లేదా అనేది కూడా ప్రయోగం చెయ్యచ్చా చేయకూడదో అనేది ఇప్పుడే అర్థం అయింది. అందుకని పరమహంస గారు తనలో సిద్దులు వచ్చనా ….దైవశక్తులు వచ్చినా ఆ విషయం మాత్రం చెప్పకుండా… దాని దాచి ఉంచారు.  చెబితే తనలో అహంకారం రావచ్చు. అలాగే భక్తులు సాధనలో సిద్దుల కోసం ,శక్తుల కోసం, సాధన చేస్తారేమో అని ఆలోచనలతో చెప్పకుండా ఉండి ఉండాలి.  ఆయనకి కూడా అష్టసిద్ధులలో వచ్చి ఉండాలి. కానీ లోకానికి తెలియకుండా….పట్టించుకోకుండా వదిలేసి ఉంటాడు. 

రుద్రస్వామి:- సిద్ధయోగులు అంతా కూడా గుప్తయోగులుగా ఉండి గుప్త సాధన చేసి లుప్తం అవుతారు.  అదే నిజయోగులకి నకిలీ  గురువులకు, నకిలీ యోగులుకి ఉన్న తేడా! 

శివ నందిని:- సరే ఇప్పుడు ఈ విగ్రహం మూర్తిని ఏం చేయాలి అయ్యా?

రుద్రస్వామి:- అది ఎలా వచ్చిందో…. అలా వెనక్కి మాత్రం వెళ్ళదు.  ఇక దీనిని నువ్వు నీ శరీరంలో నిక్షిప్తం చేసుకో!  అది ఎందుకు వచ్చిందో ఏ మాయ చూపించాలి అనుకుంటుందో…. నాకు తెలిసినంతవరకు దైవమాయ చూపిస్తుంది.  ఒక ఆట ఆడుకుంటాడు. పీడించి, పీడించి పీల్చి పిప్పి చేసేదాకా వదిలిపెట్టడు.  ఆయన నిద్రపోడు…. నిన్ను నిద్రపోనివ్వడు…. నాకు తెలిసినంతవరకు ఆయనలో ఐక్యం చేసుకునేదాకా భక్తుల్ని భక్తురాలని వదిలిపెట్టలేదు.  మరి నువ్వు ఆ మాయని దాటతావా లేదా అనేది కాల నిర్ణయమే చెప్పాలి. సరే ఇంక  కాల నిర్ణయం ఎలా ఉందో…. శివుడు ఆజ్ఞ ఎలా ఉందో నాకేం తెలుసు…

శివ నందిని:-  నేను తొందరపడి నాకు వచ్చిన సిద్దులు ఫలితమే కదా!  ఇది కావాలని చేసుకోవడం కదా!  కష్టాలు   కొని తెచ్చుకోవడం కదా!  ఇంతే కదా!  ఎవరైనా గాని ఆ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు….ఆ మాయలు దాటడం వేరు…. నేను ముందుగానే కకృతి పడి నాకున్న ఈ సిద్ధి తో తప్పుడు ప్రయోగం చేశాను.  తద్వారా ఈ ఫలితం అనుభవించాలని వచ్చినట్టు ఉంది.

అని అనుకొని మనస్సులో ధ్యానించుకొని సంకల్పించుకునేసరికి…ఆ విగ్రహం మూర్తిని తన శరీరంలో నిక్షిప్తం అయింది. ఆ తర్వాత శివ నందిని కాస్త రుద్రస్వామి కేసి చూస్తూ….

శివనందిని:-  ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం… సాధన అనేది క్షేత్రంలో చేసే సాధనకి…. ఇంట్లో చేసే సాధనకు తేడా ఉందా? 

రుద్రస్వామి:- చాలా తేడా ఉంటుందమ్మా… ఒక సినిమాని థియేటర్లో చూసినప్పుడు చూసే అనుభవ అనుభూతి… ఇంట్లో టీవీలో చూసినప్పుడు కలిగే అనుభూతిలో తేడా ఉంటుందా? ఉండదా?

శివనందిని:- ఉంటుంది… ఎందుకు ఉండదు, చాలా తేడా ఉంటుంది.  థియేటర్లో 70mm లో చూస్తాము… దూరంగా ఉన్నా కూడా స్పష్టంగా కనబడుతుంది.చాలామంది జనాల మధ్యలో చూడటం…. సరదాగా ఆనందంగా గడపడం  అది వేరుగా ఉంటుంది.  ఇంట్లో కూర్చుని మన కుటుంబ సభ్యుల మధ్య చూడటం 40 సెంటీమీటర్స్ టీవీలో చూడటం చాలా తేడా ఉంటుంది కదా!

రుద్రస్వామి:-అలాగే క్షేత్రాల్లో ఉండి సాధన చేయడానికి…. ఇంట్లో ఉండి సాధన చేయడానికి కూడా అంతే తేడా ఉంటుంది.  ఇంట్లో ఉండి సాధన చేయడం వలన… అది భోగ జీవితానికి సంబంధించిన సాధన అవుతుంది. ఇక్కడ 80% భోగ జీవితం 20 శాతం యోగ సాధన ఉంటుంది.  అంటే ఏదో సమయానికి అనుకూలంగా రోజులో  ఒక అరగంట గంట…. ధ్యానము, జపము ఉపాసన  చేసుకునే అవకాశం ఉంటుంది.  అది అందరి ముందు చేసుకునే అవకాశం ఉండొచ్చు.  తెలిసేటట్టు చేసుకోవచ్చు…. లేదా దొంగ చాటుగా చేసుకునే అవకాశాలు ఉండచ్చు…. ఎందుకంటే కుటుంబ సభ్యులకు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు…. భర్తకి, పిల్లలకి, అత్తమామలకి తల్లిదండ్రులకి… పూజలు, జపాలు, అందులోను ఆడపిల్లలు చేసుకుంటామంటే ఎవరు ఇష్టపడరు…. అవాంతరాలు కలిగిస్తారు…. ఆటంకాలు కలిగిస్తారు… మాటలతో ఏమారుస్తారు… అదే క్షేత్రానికి వచ్చేసరికి 80 శాతం యోగ సాధన ఉంటే 20% భోగ జీవితం మాత్రమే ఉంటుంది.  ఈ 20% కూడా కనీస అవసరాలు మాత్రమే ఉంటుంది.  తిండికి, గుడ్డకి, నివాసానికి మాత్రమే మనం వెతుక్కుని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు పెద్దగా ఏమీ ఉండవు. ఆకలి తీర్చుకోవడానికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. పైగా 80 శాతం మంది యోగులు సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, దైవ ఉపాసకులు, దైవ భక్తులు వీళ్లే ఉంటారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండే గృహస్థుడు కూడా….. దేవుడి మీద భారం వేసి తన గృహ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నిజ భక్తుడు అవుతాడు. అవసర భక్తుడు, ప్రసాద భక్తుడు అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ 80%  పాజిటివ్ శక్తి ఉంటుంది.  అదే ఇంట్లో అయితే 20% మాత్రమే సాధనా శక్తి ఉంటుంది.  మిగతాదంతా భోగ శక్తి ఉంటుంది.  ఆధ్యాత్మిక శక్తి భోగ కోరికలు తీర్చుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ క్షేత్రంలో నువ్వు ఒక్కరోజు సాధన చేస్తే…. 24 గంటల పాటు సాధన చేస్తే…. ఇంట్లో ఉండి చేసిన సాధనకి 41 రోజులకు సమానమవుతుంది.  అదే ఒక క్షేత్రంలో ఒక సంవత్సరం పాటు చేస్తే…. ఎంత ఫలితం ఉంటుందో నువ్వే ఆలోచించుకో!  అది మాటలతో మనం చెప్పలేము…

శివ నందిని:- అంటే క్షేత్రంలో ఒకరోజు చేస్తే… బయట ప్రపంచంలో ఒక నెల రోజులతో సమానమని చెప్తున్నారు.  అదే ఇక్కడ నెల రోజులు పాటు చేస్తే ఒక సంవత్సరంతో సమానం. అదే సంవత్సరం పాటు ఇక్కడ చేస్తే 12 సంవత్సరాలతో సమానం అవుతుందా! 

రుద్రస్వామి:- అవును ఖచ్చితంగా అవుతుంది. అంతెందుకు …..ఇప్పుడు నువ్వు కాశీ క్షేత్రంలో 12 నెలల పాటు ఉన్నావు.  గర్భావాసం దాటింది.  అంటే నీకు అక్కడ ఉన్న భౌతిక శరీరం చేసిన దోషాలు శుద్ధి ,జాగృతి అన్నీ కూడా పూర్తవడం జరిగిపోయింది.  ఆ తర్వాత శ్రీశైలంలో ఒక సంవత్సరం ….ఆ తర్వాత తిరుపతిలో ఒక సంవత్సరం….. కంచిలో ఒక సంవత్సరం ఉన్నావు. ఇప్పుడు కంచిలో నుంచి ఘృశ్నేశ్వరంలో 6 నెలలు ఉన్నావు. ఇప్పుడు కంచిలో నువ్వు ఒక సంవత్సరం పాటు ఉండి మూలాధార చక్ర జాగృతి, శుద్ధి ,ఆధీనం చేసుకుని విభేదన స్థితి దాకా వచ్చావు.  ఒక్కొక్క స్థితికి నాలుగు నెలల చొప్పున 12 నెలలు అంటే సంవత్సరకాలం పూర్తి చేసుకున్నావు.  అదేవిధంగా  ఘృశ్నేశ్వరంలో శరీర జాగృతి, ఆరు నెలలు తీసుకున్నావు.  అంటే జాగృతి, శుద్ధి ఆధీనాలకి రెండు నెలల చొప్పున ఆరు నెలలు తీసుకున్నావు.  అంటే నువ్వు క్షేత్రంలో ఉన్నావంటే భౌతికంగా బయట ప్రపంచంలో 12 సంవత్సరాలు సాధన పూర్తి చేసుకున్నట్టు.  అందుకే సన్యాసులకి క్షేత్ర వాసం చేయాలి.  గృహస్థులకేమో  తీర్థయాత్రలు చేయాలి అని చెప్పడం జరిగింది.  క్షేత్రంలో ఇప్పుడు స్వయంభు లింగానికి, మానవ ప్రతిష్ట లింగానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు భోగ జీవితంలో మనకి గుడిలో యంత్ర ప్రతిష్ట చేస్తారు… అది మానవ ప్రతిష్ట జరుగుతుంది. ఎవరో ఒక ధర్మకర్త దేవాలయాన్ని కట్టించి వారి చేత ఆ దేవతకి సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ట చేసి…. ఆ విగ్రహ మూర్తిని ప్రతిష్టకు చేయడం జరుగుతుంది.  అది మానవ ప్రతిష్ట అవుతుంది. అదే క్షేత్రాలలోనికి వచ్చేసరికి దైవ శక్తి స్వయంభుగా వెళ్లడం…. తన ఉనికిని చూపించడం…. ప్రపంచానికి నేను ఉన్నానని చెప్పడము జరుగుతుంది.  స్వయంభు జ్యోతిర్లింగానికి…. మానవ ప్రతిష్ట లింగానికి తేడా ఉందా? లేదా! అంటే చాలా తేడా ఉంటుంది. మానవ ప్రతిష్ట ఏముంది? ఒక రాయిని శివలింగాన్ని చెక్కి… దానికి తగ్గ యంత్రాన్ని పెట్టి…. ప్రతిష్ట చేయడమే కదా! దానికి మన సాధనా శక్తి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదే స్వయంభు శివలింగం అంటే…. దానికి యంత్రాలతో…. విగ్రహ మూర్తితో పనిలేదు.  దానంతట అదే తయారయ్యి వస్తుంది లేదా భూగర్భం నుంచి బయటకు వస్తుంది. దాని ఉనికిని చూపిస్తుంది.  దాని నుంచి మనకి సాధనా శక్తి వస్తుంది.  ఇప్పుడు క్షేత్రాలలో సాధన చేస్తే సాధనా శక్తి మనకి వస్తుంది. అదే ఇంట్లో సాధన చేస్తే మన సాధనా శక్తి విగ్రహ మూర్తికి ఇవ్వాల్సి వస్తుంది. అదేనమ్మ తేడా! 

శివ నందిని:- ఇక్కడ చిన్న సందేహం?  క్షేత్ర వాసి మహాపాపి అంటారు కదా!  నిజమేనా?

రుద్రస్వామి:-చాలామంది అంటారు….. కానీ అనుభవం ప్రకారంగా చూస్తే ఇక్కడ ఉన్న క్షేత్ర వాసి ప్రతిరోజు గుడికి వెళ్ళడు.  దర్శనాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడు. వాడు గృహస్థము లో ఉంటే దానికి సంబంధించిన గృహ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ… వ్యాపారం ఉద్యోగం చేసుకుంటూ…. ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరంలో ఒకరోజు లేదా పండుగలప్పుడు వెళ్లడం జరుగుతుంది. అదే బయట నుంచి మనలాంటి వాళ్ళు ప్రతిరోజు, ప్రతిక్షణం ఆ క్షేత్రం యొక్క గుడిలో ఉండటానికి ఆసక్తి చూపిస్తారు.  దాని వల్ల ఇక్కడి నుంచి వచ్చే సంచార భక్తులకి ఆ దైవం మీద మర్యాద, గౌరవం, భక్తి, విశ్వాసం ఉంటాయి. ఉన్న నాలుగు రోజులు శ్రద్ధ, భక్తులతో సర్వస్య శరణాగతితో…. జపం, ధ్యానం, మంత్రం, అమిత భక్తితో చేసుకుంటూ ఉంటారు.. కానీ, ఆ క్షేత్రంలో ఉండేవాడు అలా చేయవలసిన అవసరం లేదు. చేయడు. రాను కూడా రాడు.  దర్శనానికి సంవత్సరానికి ఒకసారి వస్తాడు.  దానివల్ల ఏంటంటే వాడు మహాపాపి అవటంవలనే దర్శనానికి రావడం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మరిచిపోతున్నారు. అది ఏమిటంటే ఇప్పుడు ఒక జమీందారు ఉన్నాడు ….ఒక పనివాడు ఉన్నాడు…. ఆ జమిందారిని పనివాడు ప్రతిరోజూ చూస్తూ ఉంటాడు. ఏదైనా పని ఉంటే చెబుతూ ఉంటాడు. పనివాడు చేస్తూ ఉంటాడు. వీడు జమీందారు ఇంట్లోనే ఉంటాడు. ఈ పనివాడు ఎప్పుడూ జమీందారుని మనసులో తలుచుకుంటూ….. ఆయన ఏం చేస్తున్నాడో… ఆయనకీ ఏం కావాలో….. కావలసిన వస్తువులు…. కావలసిన పనులు…. నోట్లో నుంచి మాట రాకముందే వీడే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అదే జమీందారుతో పనిఉన్నవాడు…. బయటనుంచి వస్తాడు. వచ్చి ఆయన పని ఉన్నంత వరకు జమీందారు కోసం తిరుగుతూ ఉంటాడు. అది నాలుగు రోజులు అవ్వచ్చు. ఒక సంవత్సరము అవ్వచ్చు… ఒక నెల పట్టచ్చు. అది ఆ పనిని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆ పని అయిన నాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు నిత్యం జమిందారు చూడవలసిన అవసరం పనిమాలా వాడికి ఏమీ లేదు. ఎందుకు అంటే వాడు గొట్ల  గొడ్ల చావిట్లో  పని చేసుకుంటున్నా…. ఏది ఉన్నా కూడా…. వాడి ఆలోచన అంతా కూడా జమీందారు గురించే ఉంటుంది.  సంచారంగా వచ్చేవాడు అవసరం కోసమో… కోరిక కోసమో… మాత్రమే వచ్చి జమీందారుతో మాట్లాడి… ఆ కోరిక తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత ఇంకొక కోరిక ఉంటే… మళ్ళీ రావచ్చు.  కానీ  పనివాడికి ఏం కోరికలు లేవు…అవసరాలు లేవు… అవన్నీ కూడా జమీందారే తెలుసుకొని అన్ని తీరుస్తాడు.  ఇక్కడ ఏంటంటే…. జమీందారికి పనివాడికి ఉన్న సంబంధమే క్షేత్రంలో ఉండేవాడికి ఆ క్షేత్రంలో ఉన్న దైవానికి ఉన్న సంబంధం లాంటిది. ఇప్పుడు వాడు ప్రతిరోజూ క్షేత్ర వాసి వెళ్లి దర్శనం చేసుకోవాలి…. చేయాలి అని….లేదు.  విగ్రహారాధనలోనే కాదు విశ్వరాధనలో కూడా చూడవచ్చు.  కాబట్టి క్షేత్రంలోనే ఉండే క్షేత్రవాసి ప్రతిరోజు దేవుని చూడనంత మాత్రాన మహా పాపి అనుకోవడం మన భ్రమ ,మన బ్రాంతి. ఎందుకంటే ఆయన్ని వాడు మనసులో తలుచుకుంటూ ఉంటాడు.  తలుచుకుంటూనే పనులు చేసుకుంటూ ఉంటాడు.. ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు… వాడి కోరికలు కానీ తీరకపోతే దర్శనం చేసుకోవడం చేస్తాడు.  “అయ్యా!  నీ దృష్టి నా మీద పెట్టు… నా సమస్య ఇది.” అది అని చెబుతాడు. ఇప్పుడు పనివాడు తనకి ఉన్న జీతం సరిపోకపోతే వెళ్లి అడుగుతాడు కదా!  లేదా వాడికి ఏమైనా సమస్యలు వస్తే అయ్యగారు! ఇది తీర్చండి అని అడుగుతారు కదా!  అలాగని ప్రతిరోజు వెళ్లి అదే పనిగా చెప్పడు కదా!  మనకి సంచారం చేసే వాళ్ళకి కోరికలు ఉన్నాయి కాబట్టి….. అవసరాలు ఉన్నాయి కాబట్టి…. మోక్షం పొందాలి అనే కోరిక కూడా ఇదే కదా!  అందుకోసం అని ఆయన  దర్శనం చేసుకోవడం…. వెళ్లడం… ఆయన కోసం కొట్టుకోవడం… తన్నుకోవడం…. ఇవన్నీ చేస్తాము.  పనివాడు చేయాల్సిన అవసరం లేదు కదా!  క్షేత్రవాసి చేయాల్సిన అవసరం లేదు కదా!  ఎందుకంటే వాడు ప్రతినిత్యం దైవ సన్నిధానంలోనే ఉంటాడు.  దైవంతోనే ఉంటాడు.  దైవం సమక్షంలోనే ఉంటాడు.  వీడు సంచార జీవి ….ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు వచ్చే అవకాశం ఉంటుంది . అది కూడా ఆయన అనుగ్రహిస్తే…. ఆయన చూడాలని అనుకుంటే ….వీడు రావడం జరుగుతుంది. ఇప్పుడు శివుడు చూడాలని అనుకుంటేనే కదా!  నువ్వు వెళ్ళేది.  కానీ పనివాడికి అలా కాదు కదా!  క్షేత్రంలో ఉండే వాడికి అలా కాదు కదా!  నిత్యం ఆయన దైవ అనుభవాలు ఇస్తూ ఉంటారు.  ఆయన సమక్షంలో వీడు ఉంటాడు. ఇప్పుడు చెప్పు ఎవరు గొప్పవాడు ఇందులో..?

శివనందిని:- అవును… నిత్యం ఆయన సన్నిధానంలో ఉండే క్షేత్ర వాసియే గొప్పవాడు. మరి ఈ క్షేత్ర వాసి రోజు వెళ్ళటం లేదు.  దర్శనం చేసుకోవడం లేదు. అంటే వాడు మానసికంగా చేస్తాడు…. ఉన్నట్టుండి వాడు కాస్త జీవుడు కాస్త శివుడు అవుతాడు.  శివోహం స్థితి పొందుతాడు.  సంచార జీవి కోరికలు అవసరాలు తీరిస్తే వస్తాడు.  తీర్చట్లేదు అంటే ఇంతకంటే గొప్ప క్షేత్రం ఎక్కడ ఉంది…. గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడో…. అక్కడికి వెళ్లిపోతాడు.  వీడు అలా వెళ్లడు కదా!  క్షేత్రవాసి కోరికలు తీర్చని…. తీర్చక పోనీ వాడికి సంబంధం లేదు.  “నా బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. నేను నీ సన్నిధానంలోనే ఉన్నాను…. నాకు కావలసిన అవసరాలు నువ్వే తీర్చుకోవాలి. నా కోరికలు నువ్వే తీర్చాలి. ఇదం శరీరం పరోపకారార్థం….నువ్వే ఈ కాయాన్ని సృష్టించావు…. నువ్వే నీకు కావలసినట్టుగా చేసుకో….. నేను లేను…. ఉన్నది నువ్వే….” అనే భావనతో ఉండిపోతాడు. అక్కడ జీవుడు ఉండడు…. శివుడు శివుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.  శివుడు శివుడే అయినప్పుడు…. దర్శనానికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా!  కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు కదా!  పూజలు చేయాల్సిన అవసరం లేదు కదా!  వాడు మానసికంగా సాధన చేస్తున్నాడు…. శారీరకంగా ఇవన్నీ చేస్తే గొప్పవాడు వాడు …..చేయట్లేదు కాబట్టి క్షేత్రవాసి మహాపాపి అని అనుకోవటం.. శబ్ద పాండిత్యంలో ఇదంతా మిడిమిడి జ్ఞానమే. అదే మన పెద్దలు అంటూ ఉంటారు…. మిడిమిడి జ్ఞానంతో పొందిన శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న.  ఏదైనా అనుభవానికి శబ్దపండిత్యానికి చాలా తేడా ఉంది. ఈ క్షేత్ర వాసి అనుభవ పాండిత్యం పొందిన యోగి… సంచార భక్తులు మిడి మిడి  జ్ఞానం పొందిన శబ్దపాండిత్యం పొందిన వాళ్లు … వాళ్లే గొప్పవాళ్లు అనే అహం లోకి వెళ్లిపోతారు.  శివుడు కూడా ఆయన సృష్టించిన వాటినే ….ఆయనకి ఇవ్వటంతో…. అలా ఇచ్చిన వాళ్ళని ఇంకెలా చూస్తాడు ….ఒకరిలో శారీరక భక్తిని చూస్తాడు…. ఎవరు ఎంతవరకు సర్వస్య శరణాగతతో ఉన్నారు.?  ఎవరు ఏ స్థితిలో ఉన్నారు? అహంభావంతో పెడుతున్నారా? ప్రేమగా పెడుతున్నారా? ఇవన్నీ కూడా ఆయన లెక్కలేసుకొని చూస్తూ ఉంటాడు.  ఆ లెక్కల ప్రకారం గా చూసే మనం క్షేత్రవాసి పుణ్యాత్ముడు అనుకోవాలి. దైవ సన్నిధానంలో నిత్యం దైవసాంగత్యం పొందుతున్నాడు కాబట్టి…. అదే మన లెక్క ప్రకారంగా చూస్తే క్షేత్ర వాసి పూజలు చేయట్లేదు… దర్శనాలు చేయట్లేదు….కాబట్టి మహా పాపిగా కనబడతాడు. మనకి మహా పాపిగా కనపడవచ్చు …కానీ దైవం దృష్టిలో వాడు మహా భక్తుడై ఉండి ఉండవచ్చు ఇక్కడ మానసిక భక్తి ఆధారం.  మనసు ఆధారం. శరీరం కాదు. కాషాయ వస్త్రము వేసుకుని…. బొట్లు పెట్టుకొని…. విభూది రేఖలు వేసుకున్నంత మాత్రాన నువ్వు గొప్ప యోగిగా పేరు ప్రఖ్యాతలు  సంపాదించవచ్చు. మనసు అశుద్ధం తింటూ ఉంటే… చిత్తం చెప్పుల మీద ,భక్తి దేవుడి మీద ఉంటే ఉపయోగం లేదు కదా ! కాబట్టి ఎవరు ఎక్కువ కాదు ….ఎవరు తక్కువ కాదు. క్షేత్రవాసి మహా పాపి అనుకోవడం మన భ్రమ ,బ్రాంతి.  వాళ్లు మహానుభావులు. మహాపాపులు కాదు, మహా పుణ్యాత్ములు. మహా భక్తులు.

శివ నందిని:- ఇప్పుడు తేడా అర్థమైంది స్వామి!  క్షేత్రంలో ఉండి చేసే సాధనకి… ఇంట్లో ఉండి చేసేసాధనకి చాలా తేడా ఉంది అని అర్థమయింది. అందుకనే నన్ను గృహస్థాశ్రమం నుంచి ఈ క్షేత్రానికి తీసుకురావడం జరిగిందని అర్థమవుతుంది. 

సరే అయితే అని పిల్లలకేసి చూస్తూ….మీకు చెప్పిన సమస్యకి సమాధానం దొరికిందా అనేసరికి… వాళ్ళు కాస్త మాకు దొరికి దొరకనట్టుగా ఉంది.  అర్థమై కానట్టుగా ఉంది. దానికి సమాధానం సరి అయిందో కాదో నువ్వే చెప్పాలి… అనేసరికి మీకు ఏ సమాధానం దొరికిందో చెప్పండి…. అని అడగడం జరిగింది. బాల గణపతి ఉన్నట్టుండి శివ నందినితో….

బాలగణపతి:- అమ్మ!  నువ్వు అడిగిన ప్రశ్నలో తప్పన్నా ఉండాలి.  తిరకాసు అయినా ఉండాలి.  ఎందుకంటే…. వినాయక చవితి కథ ప్రకారంగా ఏం చెబుతారు…. అమ్మవారు నలుగు పిండి నుండి గణపతిని తయారు చేసింది అని చెప్తారు. ఒక బొమ్మను తయారు చేస్తే… ఆ బొమ్మకు ప్రాణం పోస్తే బాలుడు అయ్యాడని….అతని ద్వారపాలకుడిగా ఉంచింది అని….. ఆ తర్వాత శివుడు గజాసురుడు అనే రాక్షసుడి కడుపు నుంచి బయటకు రావడం…. ఆ గజాసురుడు ఏనుగు తలని తనతో పాటుగా తీసుకురావడం….. ఆ తర్వాత ద్వారపాలకుడిని సంహరించి పార్వతీదేవి కోరిక మేర బాలుడి తల మీద పెట్టడం…. అప్పుడు ఆయన గణపతి అయ్యాడని చెప్పడం జరిగింది కదా! దాని ప్రకారంగా చూసుకుంటే మరి గణపతి అమ్మవారి నలుగు పిండి నుంచి వచ్చినట్టే కదా! కాకపోతే ఇప్పుడు చూస్తే  వర పూజలో పసుపు గణపతి ఆరాధన చేసింది అనేది అది అర్థం కావడం లేదు.  ఆ గణపతి వేరా? ఈ గణపతి వేరా? ఇద్దరు గణపతులు ఒకటా?

అనేసరికి బాల కుమారస్వామిని చూసి నువ్వు చెప్పు…. నీ సమాధానం ఏమనుకుంటున్నావు అంటే,.

బాలకుమారస్వామి:-అమ్మా! నాకు తెలిసినంతవరకు… నాకున్న జ్ఞానం ప్రకారంగా ఈ రెండు గణపతులు వేరు.  అమ్మవారు పూజ చేసిన గణపతి వేరు… అమ్మవారు తయారు చేసిన గణపతి వేరు.  ఎలా అంటావా ? అమ్మవారు పూజ చేసిన గణపతి మహాగణపతి. ఆయన శివుడి మూలాధార చక్రంలో ఉండి ఉండాలి.  ఎందుకంటే మూలాధార చక్ర అధిపతి ఎవరు! గణపతి కదా! అప్పుడు ఆయన మూలాధార చక్ర గణపతి అయి ఉంటాడు.  పసుపు గణపతి మూలాధార చక్ర గణపతి అయి ఉంటాడు.  అమ్మవారు తయారు చేసిన నలుగు పిండి గణపతి బాలగణపతి అయి ఉంటాడు. అంటే మూలాధార చక్ర గణపతి యొక్క అంశా రూపమే అమ్మవారికి నలుగు పిండి ద్వారా పుట్టి ఉండాలి.  నాకు తెలిసినంతవరకు ఆయన బాలా గణపతి అయి ఉండాలి.  అంటే పిల్లవాడు అయి ఉంటాడు.

బాల గణపతి:- అన్నయ్య నువ్వు చెప్పింది కూడా నిజమే… ఇదే అయ్యి ఉండాలి … ఇది అవ్వటానికి అవకాశం ఉంది.  ఇదే ఆలోచిస్తున్నాను అవునా కాదా ?అనుకుంటున్నాను. 

అనేసరికి బాలగణపతి, బాల కుమారస్వామి తెలివితేటలతో ముచ్చటపడి…

శివ నందిని:-  నువ్వు చెప్పింది నిజమే…. నిజానికి చందోలు శాస్త్రీ అయిన రాఘవ శాస్త్రి గారికి వచ్చిన సందేహం.  ప్రతినిత్యం బాల చిన్న పిల్ల రూపంలో కనపడుతూ ఉండేది. గుమ్మం మీద కూర్చుని ఉంటే…. ఆయన ఇదే ప్రశ్న అడిగితే చెప్పలేకపోయింది. అప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు అని… ఆయన చరిత్రలో తెలుస్తుంది.సరే మీ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో అని చెప్పి అడగటం జరిగింది… పరవాలేదు, మీకు ఆధ్యాత్మిక చింత, ఆధ్యాత్మిక ఆలోచన, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. విశ్లేషణ చేయగలుగుతున్నారు.  రేపొద్దున సాధనలో ఏ సమస్య వచ్చినా కూడా…. ఇలాగే విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళండి. ఆత్మ విచారణ చేసుకుంటూ వెళ్ళండి. సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. గురువులు చెప్పేది ఎటు చెప్తారు. శబ్ద పాండిత్యంలో  ఉన్నవాడు చెప్పేది చెబుతాడు. అనుభవ పాండిత్యంలో మీరంతట మీరే…. వివేక బుద్ధితో విచక్షణా జ్ఞానంతో…. అనుభవించి అనుభూతి పొంది తెలుసుకోండి. ఏదైనా గాని ఆత్మ విచారణ చేసుకోవాలి. ఈ ఆత్మ విచారణ ఎవరికి వారే చేసుకుని…విశ్లేషణ చేసుకుంటూ మనసుతోనూ… ఆత్మతోను… అనుసంధానం చేసుకుంటూ ఒకదానికొకటి ఇది అవుతూ మనసుకు సంతృప్తి అయిన సమాధానం వచ్చేవరకు… ఈ విచారణ కొనసాగిస్తూ… అప్పుడు ఆ సమాధానానికి సంతృప్తి పడండి.  అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

బాల గణపతి:-  ఓహో!  మాకు ఎలా విశ్లేషణ చేసుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి అనేది… ఒక గురువుగా ఉండి చెప్పావన్న మాట!  అయితే మేము ఇప్పుడు పోటీలో గెలిచామా? ఓడిపోయామా? 

శివ నందిని:- మీ ఇద్దరూ గెలిచారు…. ఇప్పుడు నువ్వు సమస్య చెప్పావు… ఆ సమస్యకి అన్నయ్య పరిష్కారాలు చూపిస్తూ… ముందుకు తీసుకు వెళ్ళాడు కదా!  మీ ఇద్దరి వాదోప వాదనలు వింటూనే ఉన్నాను. మీ ఇద్దరూ గెలిచారు. ఒక స్థిరమైన సమాధానానికి వచ్చారు. కాబట్టి మీకు కావలసింది నేను ఎప్పుడైనా అడిగితే కొనిస్తాను. 

బాలగణపతి:-గుర్తు పెట్టుకో! పుస్తకం లో రాసుకో! రాసుకుంటూ ఉంటావు కదా! పుస్తకం లో ఇది కూడా రాసుకుంటూ ఉండు. ఈ పాయింట్ కూడా రాసుకుంటూ ఉండు. మాకు కావలసినప్పుడు మాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి అని.

శివ నందిని:- ఇస్తాను నాయనా! 

అనేసరికి సరే అని రుద్రస్వామి యోగ నిద్రలో ఉండటం గమనించి… శివ నందిని కాస్త మహాదేవి కేసి చూస్తూ….

శివ నందిని:-! అమ్మ! నాకు స్వాధిష్ఠాన గురించి వివరాలు చెప్పవా?

మహాదేవి:- నీకు తెలిసిన విషయమే కదా.!  పరమహంస గారు రచించిన కపాల మోక్ష గ్రంథంలో చదివి ఉన్నావు కదా! ఆ వివరాలన్నీ నీకు తెలుసు కదా!

శివ నందిని:- చదివింది నాకేం గుర్తుండవు.. నాకు ఎవరైనా వివరంగా విశ్లేషించి వివరణ చేస్తే.. ఆ విషయం బాగా గుర్తుండిపోతుంది. మనసులో పడిపోతుంది. అది నిద్రలో కావాలన్నా గాని చెప్పగలను.  చదివింది చదివినంత సేపు మాత్రమే నాకు మెదడులో ఉంటుంది.  ఆ తర్వాత ఏదైనా పనిలో పడిపోతే నేను మర్చిపోతాను. 

మహాదేవి:-  నాకు ఉన్న జబ్బే నీకు ఉందన్నమాట!

(అనేసరికి రుద్ర స్వామి కళ్ళు తెరిచి ….)

రుద్రస్వామి:-మహాదేవి… చక్ర విషయాల గురించి, చక్ర జాగృతి ,శుద్ధి ఆధీన, విభేధనాల సమయాలలో వచ్చే చక్ర స్థితి గతుల గురించి.. ముందుగానే నువ్వు చెప్పమాకు. చెబితే అప్పుడు అది భావరూప ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం వల్ల ఎంతటి ప్రమాదం జరుగుతుందో నీకు తెలియనిది కాదు కదా!

మహాదేవి: ఆ..ఆ..ఆ..గుర్తుకు వచ్చింది… నీ విషయంలోనే జరిగింది కదా! ఇంకెప్పటికీ ఈ చక్రాల గురించి అవగాహన శివ నందినికి  ఇవ్వను.

శివ నందిని:-అయ్యా !అలా అంటావేంటి !నాకు చక్రాల గురించి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?

రుద్రస్వామి:- అమ్మ! నేను కావాలనే వద్దు అనట్లేదు. నేను ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు ఈ చక్రం గురించి వివరాలు చెబుతాను… ఈ చక్రం ఏ రంగులో ఉంటుంది… దీనికి ఎన్ని ఆకులు ఉంటాయి. దీనికి ఏ బీజాక్షరం ఉంటుంది. దీని అధిష్టాన దైవం ఫలానా వాడు అని చెప్పాననుకో…. ఈ చక్ర జాగృతి అయ్యేటప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి ఈ చక్ర శుద్ధి అయ్యేటప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి .. ఆధీనంలో ఈ మాయలో ఉంటాయి…. ఈ స్థితిగతులు ఉంటాయి… అని నాకున్న అవగాహనతో చెప్పొచ్చు.  నీకు అర్థం అయిపోతుంది.  తద్వారా అది భావరూప ధ్యానం అవుతుంది. ఈ చక్రం నీకు కనపడాలి అని… నువ్వు భావన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ తపస్సు గాని… ఆరాధన గాని …చేస్తూ ఉంటే అది భావరూప ధ్యానం అవుతుంది.  అంటే లేని దాన్ని ఊహించుకుంటూ నువ్వు ఊహ ప్రపంచంలోనికి భావ రూపంలో చేసే భావమే నీకు చక్రంగా కనిపిస్తుంది. నువ్వు మనసులో ఏవైతే అనుకుంటావో… ఆ రూపమే చూపిస్తుంది.  అల  కాదు… సహజ సిద్ధంగానే నీకు ఆ చక్రం రంగు, బీజాక్షరం, అధిష్టాన దైవం, కనపడాలి.

శివ నందిని:- దీనికి దానికి తేడా ఏంటి?

రుద్రస్వామి:-ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు …స్వాధిష్ఠాన చక్రమే తీసుకో!…స్వాధిష్ఠాన చక్ర ధ్యానం చేస్తున్నప్పుడు ….నువ్వు జలముద్ర వేస్తావు.  ఆ ముద్ర సిద్ధి వస్తున్నప్పుడు నీకు చక్రం యొక్క దృశ్యం ధ్యానమునందు కనపడుతుంది.  దాని యొక్క రంగు కనబడుతుంది …దాని యొక్క శక్తి కనబడుతుంది… దాని యొక్క దైవము కనపడుతుంది… దాని యొక్క సిద్ధి ఏంటి అనేది తెలుస్తుంది. అదే ఇప్పుడు జలముద్ర వేస్తున్నప్పటికీ కూడా ఫలానా రంగులో ఉండాలి …ఫలానా ఆకులు ఉండాలి…ఫలానా దేవుడు ఉండాలి…. శక్తి ఉండాలి అని చెప్పేసి…. శబ్ద పాండిత్యం పొందిన చక్రం గురించి భావన చేస్తూ ఉంటే…. ఆ భావానికి తగ్గట్టుగానే ధ్యాన దృశ్యం కనబడుతుంది.  దానివల్ల ఉపయోగం లేదు.  అది మనసు చేసే మనోమాయ అవుతుంది.  అది భ్రమ బ్రాంతి అవుతుంది. సహజసిద్ధంగా కనబడడం వేరు… నువ్వు నీ ఆలోచనలతో రూపొందించుకున్న రూపానికి తగ్గట్టుగా కనపడటం వేరు… ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది . మనో మాయ అవుతుంది.  మరొకటి స్వయంభూ సాధన అవుతుంది.

శివ నందిని:-  దీంట్లో ఇంత ప్రమాదం ఉందా? 

రుద్రస్వామి:- ఇప్పుడు సహజసిద్ధంగా ధ్యానముద్రలో సాధన చేస్తున్నప్పుడు…. స్వాధిష్ఠాన చక్ర రూపురేఖలు ఏంటి? దాని వర్ణం ఏంటి అనేది కనపడుతుంది. దాని యొక్క అధిష్టాన దైవం ఏమిటి?  అనేది కనపడుతుంది.  దాని శక్తి ఏంటి అనేది? కనపడుతుంది.  అప్పుడు నువ్వు వచ్చి అయ్యా! నాకు ఇలా కనపడుతుంది ఏమిటి?  అని అంటే…. ఇది ఫలానా స్వాధిష్ఠాన చక్రం అని చెబుతాను.  ఇప్పుడు చక్ర శుద్ధి అవుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కొన్ని ఆలోచనలు, భావాలు కలుగుతాయి. అయ్యా! నాకు ఇలా ఇలా కలుగుతున్నాయి అంటే……ఇవి చక్ర శుద్ధికి సంబంధించింది …ఇది చక్ర జాగృతికి సంబంధించినది…. లేకపోతే ఇది చక్ర అధీనానికి సంబంధించినది…. లేదా విభేదనానికి సంబంధించింది అని నేను నీకు విశ్లేషణ చేసి ఏ స్థితిగతులు దేనికి అనేది చెప్పగలను.  అంతేగాని నేను ముందుగానే నీకు శబ్ద పాండిత్యంతో…. అనుభవ జ్ఞానంతో…. ఈ చక్రం స్వాధిష్ఠాన చక్రము జాగృతి అయ్యేటప్పుడు వచ్చే లక్షణాలు, శుద్ధి అయ్యేటప్పుడు వచ్చే లక్షణాలు, ఆధీనం అయ్యేటప్పుడు వచ్చే లక్షణాలు, విభేదనం అయ్యేటప్పుడు వచ్చే లక్షణాలు… ఇవన్నీ ముందుగానే చెప్పేశాను అంటే… అది నీ మెదడులో నిక్షిప్తం అవుతుంది. మీ సాధనకి తగ్గట్టుగా….ఆలోచనకి తగ్గట్టుగా… భావాలకు తగ్గట్టుగానే…. అవే లక్షణాలు మనసు మనోమాయ చేస్తూ చూపిస్తుంది. నిజానికి నువ్వు వాటిని పొందవు.  కానీ పొందినట్టుగా భావన చేస్తుంది.  దాని వలన గృహస్థ సాధనకు, క్షేత్ర సాధనకి ఎంత తేడా ఉందో…. ప్రతిష్ట శివలింగానికి, స్వయంభూ శివలింగానికి ఎంత తేడా ఉందో …అంతే తేడా ఈ సాధనలో ఉంటుంది . అంతటితో నువ్వు చక్ర జాగృతి అయిపోయింది …శుద్ధి అయిపోయింది …అధీనం అయిపోయింది… విభేదనం అయిపోయిందని చప్పట్లు కొట్టుకుంటావు.  కానీ దానికి సంబంధించిన దైవిక వస్తువులు రావు.  దైవీక శక్తులు రావు.  ఆ చక్రం యొక్క మాయలో పడిపోయి ఉన్న…. సాధన స్థితి కాస్త అధోగతి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది.  యోగ శక్తులు కాస్త అశక్తులుగా మారే అవకాశం ఉంటుంది.  కాబట్టి శబ్ద పాండిత్యంలో వాటిని గురించి తెలుసుకొని చేసే బదులు…. అనుభవ పాండిత్యంలో నీ అంతట నీవు ముద్రాసాధనలో సిద్ధి పొందినప్పుడు…. నీ అంతటి నీకే సహజసిద్ధంగా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు నువ్వు దానిని విశ్లేషణ చేసుకోలేనప్పుడు…. ఆ లక్షణాలన్నీ భావాలని అలాంటివి చెబితే ….అనుభవ జ్ఞానంతో చెప్పడం జరుగుతుంది.  అందుకని భౌతిక గురువు ప్రతిసాధకుడికి అవసరం ఉంటుంది.  అంతేగాని పుస్తకాల్లో కనిపించినట్లుగా కనపడాలి… చేయాలి అని చెప్పి భావన చేశావనుకో…. చాలా కష్టాలు పడతావు. ఈ భావరూప సాధన వల్ల నేను పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. 

మహాదేవి:- అవును నిజమే… ఎదుర్కోవాల్సి వచ్చింది.  నేనే కదా ప్రత్యక్షంగా చూసింది ..

శివ నందిని:- దానివల్ల రుద్ర స్వామికి ఏ సమస్య ఎదుర్కొన్నాడమ్మా?

మహాదేవి:- నీకు విషయం తెలియదు కదా!  చెబుతాను… ఈయన యవ్వనంలో ఉన్నప్పుడు ఘాట్లలో ఉన్నప్పుడు…. సాధన చేసుకుంటూ ఉండేవాడు.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘాట్లో ఉండేవాడు. కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడు… ఇలానే చేసుకుంటూ ఉండేవాడు.  ఎక్కువగా 10, 15 రోజులు మణికర్ణిక ఘాట్లో లేదా పంచగంగా ఘాట్ లో ఒక వారం రోజులు ఉండేవాడు.   మిగతా ఘాట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాడు. ఈయన యవ్వనంలో ఉన్నప్పుడు దివ్య తేజస్సుతోను… మంచి కాంతి శరీరంతోను… మంచి ఆకర్షణతోను… మాట తీరుతో …చూపుతోను శరీరం నుంచి వచ్చే సుగంధ వాసనలతోనూ…. అందరూ కూడా మోహమాయలో పడేవారు.    అబ్బాయిలే కాదు…. అమ్మాయిలు కూడా పడేవాళ్లు.ఈయన పెద్దగా పట్టించుకోనేవాడు కాదు…..ఇలా 148 మంది అమ్మాయిల మాయలను దాటుకుని వచ్చాడు.

(అనేసరికి 148 ఈ అంకె పరమహంస గారి జీవితంలో కూడా జరిగింది కదా!  కొంపదీసి ఇప్పుడు రుద్ర స్వామి పరమహంస !ఏమో! సరిగ్గా 148 మంది ఏంటి! అందరి జీవితంలోనూ 148 మంది అబ్బాయిల్ని ,అమ్మాయిల్ని దాటాలా? అని ఆలోచన లోకి పోతుంటే )

మహాదేవి:- ఏంటి తల్లి! దేని గురించి ఆలోచిస్తున్నావు? 148 అంటే నీ జీవితంలో కూడా జరిగిందా!

శివ నందిని:- లేదు.. లేదులే!  ఏదో ఆలోచన వచ్చిందిలే ! విషయం చెప్పు… అనేసరికి అలా   రుద్ర స్వామి ధ్యానంలో ఉంటే మూడు ,ఐదు, పది రోజులు అలాగే చేస్తూ ఉంటాడు.  నిద్రాహారాలు మానేసి…. ఎండా వాన ఏమీ లేకుండా…. ధ్యాన నిష్ఠలో ఉండిపోతాడు.  లేదు అంటే నెలరోజుల పాటు దాని జోలికే వెళ్ళడు.  చేస్తే అతివృష్టి… లేదా అనావృష్టి అలా ఉంటుంది.  ఈయన ఎప్పుడూ  ధ్యానంలోకి వెళ్తారో…. ఎప్పుడు మామూలు స్థితిలో ఉంటారో ….ఎవరికి అర్థం కాని అయోమయ స్థితి …. కాకపోతే ఈయన మానాన ఈయన సాధన చేసుకుంటూ…. యోగనిద్ర సాధనలోనే ఉండేవాడు.  అలా యోగ నిద్రలో ఉండి ఘాట్ లలో నిద్రపోయేవాడు.  అలా నిద్రపోతూ సాధనలో ఉండిపోయేవాడు. ఒక్కోసారి రెండు రోజులకి ఒక్కోసారి …మూడు రోజులకి… ఒకసారి 10 నిమిషాలకే.. యోగనిద్ర నుంచి బయటకు వచ్చేసేవాడు.  పిల్లలతోనూ ,కుక్కలతోనూ నీటిలో జలకాలాడుతూ… సేద తీరుతూ ఉండేవాడు.  ఇలా ఇలా సాధనా సాగుతూ ఉండగా… 10 సంవత్సరాలు అయినా సంతానం లేని ఒక ఆవిడ …..ఈయన సేవ చేసుకుంటే, ఈయనకి పాద నమస్కారం చేసుకుంటే, ఈయనతో మాట్లాడితే, తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని సంతాన ప్రాప్తి కలుగుతుందేమో…అని చెప్పి 28 నుంచి 36 సంవత్సరాల మధ్యలో యవ్వనవతిగా ముఖంలో కళ,ఆకర్షణ ఉన్న ఆవిడ పాపం ఏ జన్మలో ఏ పాపం చేసిందో… గానీ పెళ్లై 10 సంవత్సరాలు అయినా సంతానం కలగకపోయేసరికి సంతాన ప్రాప్తి కోసం ఈయన దగ్గరికి వస్తూ ఉండేది. ఈయన పెద్దగా పట్టించుకునేవారు కాదు.  పెద్దగా చూసేవాడు కాదు. ఈమె తన గోడు చెప్పుకొని పాదాలకు నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఎప్పుడైనా ఈయనకి ధ్యాననిష్ట కుదరక బయటకు వచ్చినప్పుడు…. ఈ అమ్మాయితో మాట్లాడేవాడు. క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. అత్తమామల ప్రవర్తన బావమరుదులు, ఆడపడుచుల ప్రవర్తన మాటలకి ఈ అమ్మాయి బాధపడుతూ… ఏడుస్తూ… ఉంటే తన మాటలతో ఓదార్చేవాడు.  ఈయనకి కావలసిన అవసరాలు, వస్తువులు ఈ అమ్మాయి చిన్న చిన్న వస్తువులతో తీరుస్తూ ఉండేది.  అంటే చుట్ట ఇవ్వటం, తాంబూలం అంటే ఈయనకి ఇష్టం.  తాంబూలం ఇవ్వడం ఇలా చేస్తూ ఉండేది. వస్త్రాలు చిరిగిపోతే వస్త్రాలు తెచ్చి ఇవ్వటం… ఇలా ఒక సంవత్సరం పాటు జరిగింది.  ఆ తర్వాత ఈ అమ్మాయి గర్భవతి కావడం… సంవత్సరం తర్వాత కాన్పు అవడం జరిగింది.  పుట్టిన పిల్లవాడు అచ్చుగుద్దినట్లుగా ఈయన పోలికలతో ఉండేసరికి భర్తకి, అత్తమామలకి సందేహం వచ్చింది. పుట్టిన పిల్లవాడు తన కొడుకుకి పుట్టాడా లేక ఈయనకి పుట్టాడా? అని వాళ్ళు గొడవకు దిగారు.  నిజానికి వీళ్లిద్దరి మధ్య గురు శిష్య సంబంధం మాత్రమే ఉంది.  తండ్రి కూతురు సంబంధమే ఉంది. కానీ అది ఎలా జరిగిందో….ఏ విధంగా జరిగిందో…. అర్థం కాలేదు.  చూడడానికి పోలికలు అన్నీ కూడా రుద్ర స్వామి పోలికలే ఉన్నాయి. నాకే అనుమానం వచ్చింది అంటే ఆలోచించుకో!  నేను అనుమానించాను… రుద్రస్వామిని కూతుర్లాంటి అమ్మాయి జీవితం నాశనం చేశావు… అంత కక్కుర్తి పడ్డావా?  నీకు అంత కామ కోరికలు ఉంటే నేనే తీర్చేదాన్ని కదా! అభం శుభం తెలియని….. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లల్ని గురు స్థానంలో ఉండి పరిష్కారం చూపిస్తావు అని…అనుకుంటే నీ ద్వారా సంతానం ఇస్తావా? నీ ద్వారా అనుగ్రహిస్తావని అనుకోలేదు… అనేసరికి రుద్ర స్వామి తన తప్పులేదు అని మౌనంగా ఉండేవాడే గాని…. నన్ను  ఎదిరించేవాడు కాదు… కాలమే సమాధానం చెబుతుంది అనేవాడు.  కానీ చూడటానికి ఎంత ఇది అంటే ఈయనకి తొడ మీద పుట్టుమచ్చ ఉంది.  పుట్టిన పిల్లవాడికి కూడా అదే పుట్టుమచ్చ ఉండేసరికి ….ఎవరికైనా సందేహం వస్తుంది కదా!  

శివ నందిని:- అనుమానం రావడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది.    

మహాదేవి:-నేను కూడా అందరి ఆడపిల్లల లాగానే  అనుమానించాను. కానీ ఈ పిల్ల మాత్రం నెత్తినోరు కొట్టుకుంది.  నాకు ఆయన గురువుతో సమానం…. అక్రమ సంబంధాలు కట్టకండి.  నా మనసు బాగోనప్పుడు…. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు… ఆయన నన్ను ఓదార్చేవారు. సంతానం లేకపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలా? ఏ జన్మలో ఏ పాపమో చేసి ఉంటావు.. ఆ దోష నివారణ కోసం ఆయన ఈ వేదన కలిగించి ఉంటాడు. లేదంటే తల్లి బిడ్డలను వేరు చేసి ఉంటావు. లేదంటే అబార్షన్లు  పేరుతో చంపేసి ఉంటావు.  లేదా సర్ప దోషాలు పొంది ఉంటావు.  లేదా గర్భ స్త్రీ పిండాన్ని ఏదైనా చేసి ఉండవచ్చు.. ఇలా రకరకాల దోషాల వలన సంతానం రాదు.  ఉన్న సంతానం కూడా నిలబడదు. దానికి సర్ప దోషాలు ఉండవచ్చు… సర్ప శాపాలు ఉండవచ్చు. స్త్రీ శాపాలు ఉండవచ్చు. అని చెప్పేసి ఆయన చెబుతూ దైవాన్ని నమ్ముకున్నావు… దైవమే నీకు రక్షణగా ఉంటుంది… శివుడిని నమ్ముకున్నావు కాబట్టి ఏ కష్టాలు పడకు…భయపడకు.. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అని నన్ను ఓదార్చే వాళ్ళు కానీ… ఏనాడు నన్ను చెడు దృష్టితో చూసేవారు కాదు.  నాకు ఏనాడు ఆయన మీద చెడు  భావన కానీ,చెడు దృష్టి కానీ లేనేలేదు.  ఇది ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు అనేసరికి…. ఇక ఆమె భర్త కాస్త డిఎన్ఎ టెస్ట్ చేపిస్తే…. పిల్లవాడి తండ్రితో సరిపోయింది.  పిల్లాడికి తండ్రి ఆమె భర్త అని తెలిసింది. రుద్ర స్వామి  కాదని తేలిపోయింది.  కానీ ఇది ఎలా సాధ్యమని అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు ఆ పిల్ల దీనికి సమాధానం చెప్పడం జరిగింది… ప్రతినిత్యం కూడా ఈయనకి ఆరాధన చేసుకుంటూ… ఈయన గురించి ఆలోచనలు చేస్తూ… కడుపులో పిల్లాడు పడిన తర్వాత ఈయనకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. స్వామి మీ వలనే నా కడుపు పండింది మీ అనుగ్రహం వలన నాకు సంతాన భాగ్యం కలిగింది. మీ ఓదార్పు వలన, మీరు ఇచ్చిన ధైర్యం వలన అని ప్రతినిత్యం కూడా అనుక్షణం కూడా ఈయనకి గురు భావంతో నడయాడే కాశీ విశ్వనాధుడు అనే భక్తి భావంతో ఎప్పుడూ కూడా ఈయన  గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని . తద్వారా ఈయన రూపు రేఖలు లోపల ఉన్న పిండానికి ఆపాదించబడ్డాయి.  భావన చేస్తూ ధ్యానం చేస్తున్నా,పని చేస్తున్నా,రుద్ర స్వామిని మనసారా కోరుకుంటూ…. భావన చేస్తూ ఉండేదాన్ని.  ధ్యానంలో కనపడకపోతే ధ్యానం నుంచి బయటకు వచ్చేయడం…. జపం చేసుకునేటప్పుడు కూడా ఈయన పాదాలు, ఈయన శరీరం కూడా కనపడాలి అని రోజులో 24 గంటల్లో 18 గంటలు మానసికంగా జపం ఆరాధన ధ్యానం చేస్తూ ఉండటం వలన  లోపల ఉన్న పిండానికి ఈయన యొక్క లక్షణాలు, రూపురేఖలు వచ్చినాయి అని చెప్పి ఒక శాస్త్రవేత్త వివరించి చెప్పడంతో… అప్పుడు భావరూప ధ్యానం వలన వచ్చే అనర్థం ఏమిటో అర్థం అయింది.  ఆనాటి నుండి ఎవరిని కూడా శిష్యుడు లేదా శిష్యురాలిగా భక్తుడు లేదా భక్తురాలిగా స్వీకరించడం మానేశాడు.  చేసేదేదో దైవం మీద ఆరాధన చేసుకోండి.  తనని గురువుగా ఆరాధన చేసుకోవడానికి… నేను గురువును కాదు అని చెప్పేసి ఆయన ఆ గురుస్థానం నుంచి బయటకు వచ్చేసాడు.  లోకానికి ఆయన జ్ఞాని అని, గురువు అని, అనుభవ పాండిత్యం పొందిన తంత్ర వేత్త అని లోకానికి తెలియకుండా పిచ్చోడిలాగా… ఉన్మాదిలాగా… కోపిష్టి వాడిలాగా…. అజ్ఞానిగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నాడు.  గుప్తయోగిగా ఉంటూ గుప్త సాధన చేసుకుంటూ వచ్చాడు.  అదే ప్రమాదం ఇప్పుడు నీకు వస్తుందేమో అని చెప్పి భావరూప ధ్యానం చేయవద్దు అని చెప్పడం జరిగింది. అంతేకానీ నీ మీద ఏదో కోపంతో కాదు అనేసరికి 

శివ నందిని:- అమ్మ! అయ్య ఏదో అన్నాడని కోపం కాదు. ఆయన అనడానికి వెనుక ఉన్న అర్థం ఏమిటి?  దాని యొక్క పరమార్థం ఏమిటి? అని తెలుసుకోవాలనుకున్నాను.  అది నిజమే ధ్యానంలో నాకు వచ్చిన అనుభవాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి కానీ , ముందే ధ్యానంలో ఏం వస్తాయో అని మనసుకు ఆపాదిస్తే…. ఉపయోగం లేదు.  చాలా తేడా ఉంటుంది. ప్రతిష్ట లింగానికి స్వయంభూ లింగానికి ఉన్నంత తేడా ఉంటుంది.  ఇంటిలో సాధనకి, క్షేత్ర సాధనకి ఉన్నంత తేడా ఉంటుంది.  ఇప్పుడు విషయం అర్థమై ఉంటుంది.  నా అంతట నేను సాధనలో విషయం తెలుసుకోవాలి.  ఆ విషయం నాకు స్ఫురణకి రాకపోతే…. దాని లక్షణాలు మీకు చెబితే…. ఏం జరుగుతుంది ఏంటి అనేది?  మీరు చెబుతారని అర్థమయింది.  ఇంకెప్పుడూ చక్రాల గురించి దానికి సంబంధించిన స్థితిగతుల గురించి గానీ ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయను.  చదవాల్సిన అవసరం కూడా లేదు.  సహజ సిద్ధంగానే సాధనలో నాకు అవి కనపడాలి. కనపడకపోతే నా సాధనలో తప్పు ఉంది లోపం ఉంది అని తెలుసుకుంటాను.  ఏదో తెలియని మాయలో ఉన్నానని గ్రహిస్తాను.  ఆ మాయను దాటే ఆలోచన, విచక్షణ జ్ఞానం పొందితే తద్వారా…. నాకు విషయం అర్థం అవుతుంది  …

మహాదేవి:-అంతేనమ్మ నువ్వు చేయాల్సింది 

శివనందిని: మంచిది నాకు ఈ బోధ చేసినందుకు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు..

అనేసరికి సరే అమ్మ అని అంతటితో ఆ వాదన ముగించడం జరిగింది. ఉన్నట్టుండి బాల గణపతి మరియు బాల కుమారస్వామి కాస్త శివ నందినితో….అమ్మ మనం ఇప్పుడు కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయానికి వెళ్తున్నాం కదా!  ఆ స్థలపురాణ విశేషాలు చెప్పవా?  అనేసరికి ఈ స్థల పురాణం గురించి చెప్పడం ఆరంభించింది.  ఇక్కడ రెండు రకాల స్థల పురాణాలు ఉన్నాయి.  సతి దేవి కన్నులు పడటం వలన సతీదేవి స్థల పురాణం…. అలాగే మహాలక్ష్మి స్థల పురాణం గురించి చెప్పవచ్చు.  ప్రస్తుతానికి సతీదేవి విశేషాలు లుప్తం అయిపోయినాయి.  మహాలక్ష్మి యొక్క స్థల పురాణమే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ మహాలక్ష్మి ఆవిర్భావం ఇక్కడ ఎలా జరిగింది అనేది స్థల పురాణం చెప్పే కథను మీకు చెబుతాను అంటూ ఒకసారి బృగు మహర్షి వైకుంఠానికి మహాలక్ష్మి మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి… వెళ్లడం జరిగింది.  కాకపోతే వాళ్ళిద్దరూ వాదోపవాదాలు చేసుకుంటూ ఈయన రాకను గమనించలేదు.  ఈ విషయం గమనించిన భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై తన్నేసరికి మహాలక్ష్మికి కోపం వచ్చింది. ఎందుకంటే వక్షస్థలంలో ఉన్న హృదయ స్థానంలోనే మహాలక్ష్మి అవాస స్థానం అని తెలుసు కదా!  శివుడు పార్వతికి తన అర్థ శరీరం ఇస్తే….. విష్ణువు తన హృదయాన్ని మహాలక్ష్మికి ఇవ్వటం జరిగింది.  బ్రహ్మదేవుడు నాలుకను సరస్వతికి ఇవ్వడం జరిగింది. దానితో మహాలక్ష్మికి కోపం వచ్చి అలిగి వైకుంఠం నుంచి ఈ కొల్హాపూర్ కి రావటం జరిగింది అని ఈ స్థల పురాణం చెబుతుంది.  ఆ తర్వాత విష్ణుమూర్తి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా అవతరణ ఎత్తి ఈవిడ అలకను.. కోపాన్ని తీర్చాడని… ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్లారని స్థలపురాణం ఇదిమితంగా చెబుతుంది.. అలాగే సతీదేవి శరీరము విష్ణుమూర్తి 18 ఖండములుగా విభజించినప్పుడు…. ఇక్కడ ఈ ప్రాంతంలో కనులు పడ్డాయని చెప్పేసి చెబుతారు. కొల్హుడు అనే అతను పద్మావంతంపురం అనే రాజ్యానికి చక్రవర్తి. అతను బ్రహ్మపుత్రుడైనప్పటికీ…. దేవ ద్వేషిగా ఉండేవాడు. ఒకానొక సారి ఈ కొల్హుడు 1000 సంవత్సరాల తపస్సు ఆచరించాడు. ఈ తపస్సులో ఉండగా సుకేసి అనే రాక్షసుడు ఇతని రాజ్యాన్ని ఆక్రమించి ధర్మ విరుద్ధమైన పనులు చేస్తూ విధ్వంసం సృష్టించాడు. కొల్హుని తపస్సు పూర్తి అయ్యి….తిరిగి వచ్చి సుకేసితో యుద్ధం చేసి….తిరిగి తన రాజ్యాన్ని  చేజిక్కించుకున్నాడు. అయినప్పటికీ దేవతలపై దేవా తగ్గకపోగా… దేవతలందరూ మహాలక్ష్మి అమ్మవారిని ఆశ్రయించారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని భవాని అని పిల్లవాడు. జరుగుతుంది. అయితే అమ్మవారి 1000 సంవత్సరాలు ఎదురు చూసి .. దేవసేన సమేతంగా వెళ్ళి కొల్హునితో యుద్ధం చేస్తుంది. చావు బతుకుల్లో ఉన్న కొల్హునికి తన జన్మ వృత్తాంతం..బ్రహ్మ పుత్రుడిని తెలుసుకుని… అమ్మవారిని మూడు వరాలు అడగడం జరిగింది.1) తను చేసి తప్పుడు పనులు క్షమించమని…2) ఈ క్షేత్రాన్ని సిద్ధ క్షేత్రంగా మార్చమని….3) తన పేరు మీదుగా ఈ క్షేత్రం. పిలువబడాలి అని…. ఈ మూడు వరాలు ఇచ్చిన తర్వాత అమ్మవారు బ్రహ్మాస్త్రం తో వధించింది. అప్పటి నుంచి పద్మావంతంపురం లేదా కరవీర పురం కాస్త కొల్హాపూర్ గా పేరు గాంచింది. ఇదంతా వింటున్న రుద్రస్వామి ఇదే కాకుండా ….దేవి పద్మ స్కాంద పురాణం ప్రకారంగా చూస్తే…. అగస్త్య మహర్షి ఒకసారి కాశీ క్షేత్రానికి ప్రత్యామ్నాయ క్షేత్రం ఏది?  అని అడిగితే కొల్హాపూర్ అని చెప్పడం జరిగింది అని…. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే కాశి క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందని చెప్పడం జరిగిందని….. కాశీ క్షేత్రంలో శివుడు ఎలా  ఆసాంతం ఉంటాడో…. ఇక్కడ మహాలక్ష్మి కూడా ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టకుండా ఆసాంతం ఉంటుంది.  అలాగే కాశీ క్షేత్రాన్ని ఎలా అయితే శివుడు తన త్రిశూలం మీద ఉంచి, ఎలా అయితే ప్రళయకాలంలో రక్షిస్తాడో…. అలాగే ఈ క్షేత్రంలో మహాలక్ష్మి దేవి తన కరములతో పైకి ఎత్తి ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుందని…. అందుకని దీనిని కరవీర మహాలక్ష్మి క్షేత్రం అంటారని చెప్పడం జరిగింది. అలాగే ఇది సతీదేవి ఆలయం అనడానికి కూడా మనకి ఇక్కడ ఉన్న పంచగంగా ఘాటు దగ్గర అతి పురాతనమైన శివాలయం కనిపిస్తుంది. అందులో భక్తులకి ప్రవేశం లేదు.  మహాలక్ష్మి అమ్మవారు కూడా సింహవాహినిగా పద్మములో కూర్చుని ఉంటుంది లేదా గుడ్లగూబను వాహనంగా పెట్టుకోవడం పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే సింహవాహినిగా ఉంటుంది.  మొదట ఇక్కడ సతి దేవి ఉన్నట్లుగాను…. ఆ తర్వాత మహాలక్ష్మి దేవిగా ప్రచారంలోకి రావడం జరిగి ఉండాలి. ఇక ఏదైనా ఈ మూడు కూడా ఆదిపరాశక్తి అంశలే కదా!  మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి గాను ఆదిపరాశక్తి మూడు భాగాలుగా విడిపోయి ఉన్నది.  కాబట్టి మహాలక్ష్మిని కూడా మనం ఇక్కడ ఆదిపరాశక్తి అంశ అని చెప్పుకోవచ్చును. వీళ్ళిద్దరికీ భేద భావాలు లేవని అర్థం చేసుకో వచ్చును. మొదట సతీదేవి….. ఆ తర్వాత మహాలక్ష్మిగా రూపాంతరం చెంది ఉండాలి అని అనేసరికి….అయి ఉండొచ్చు అనుకున్నారు.  ఏది ఏమైనప్పటికీ సతీదేవి ఉన్నదా, మహాలక్ష్మి ఉన్నదా?  అనేది కాల నిర్ణయానికి భక్తులు యొక్క భావాలపై ఆధారపడి ఉంటుంది.స్థలపురాణాలు వేరువేరుగా చెబుతున్నప్పటికీ …..శక్తులలో భేదభావం లేదు.  కాబట్టి ఎవరైనా ఒకటే అని రుద్ర స్వామి అనేసరికి…. అవునులే!  అది నిజమే అని అనుకున్నారు. కొద్దిసేపటికి కొల్హాపూర్ వస్తుందని కండక్టర్ చెప్పేసరికి… అన్ని సర్దుకున్నారు.  ఆ తర్వాత కోల్హాపూర్ బస్టాండ్ లో బస్సు ఆగేసరికి బస్సు దిగటం జరిగింది. ఆ తర్వాత  గుడికి 200 మీటర్ల దూరంలో ఉన్న హోటల్లో వీళ్ళు రూమ్ తీసుకోవడం జరిగింది. గదిలో స్నానాదికాలు  కానిచ్చుకొని ఇక రెండు రాత్రులు ప్రయాణం చేసి ఉండటం వలన…. అలసిపోయి ఉండటం వలన…. విశ్రాంతిగా ఎవరి వీలును బట్టి వాళ్ళు కొంతమంది మంచాల మీద… కొంతమంది నేలమీద… పడుకోవటం ఆరంభించారు.  సుమారుగా మధ్యాహ్నం నాలుగు గంటలు అయ్యేసరికి మెలకువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్దాం అనుకొని…. మొదట ఇక్కడ ఉన్న పంచగంగా ఘాట్ లో  మనం స్నానం చేయాలి…. మనం అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్ళాలి అని గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పంచగంగా ఘాటుకి వెళ్ళటం జరిగింది. ఆ ఘాట్లో కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది . భక్తులు ఎవరు ఈ ఘాట్లో స్నానాధికాలు చేయకపోవడంతో చెత్తాచెదారం అంతా ఉండటంతో….  దీనిని పాడు పెడుతున్నారేమో అని శివ నందిని గ్రహించింది.  అలాగే ఈ ఘాట్ సమీపంలో అనేక దేవాలయాలు కూడా నీటిలో మునిగి ఉండటం వీళ్ళందరూ గమనించారు.  సరే అని మంచిగా ఉన్న ఒకచోట వీళ్ళందరూ స్నానాధికాలు పూర్తి చేసుకుని అమ్మవారి దర్శనానికి బయలుదేరడం జరిగింది.  రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే భవాని మండపం కనపడింది. ఆ మండపంలో ఒకవైపు అమ్మవారి దేవాలయం… మరొకవైపు శివాజీ రాజ్ కోటా ఉండటం గమనించారు.  ప్రస్తుతం ఈ కోటలోనే ప్రభుత్వ ఆఫీసులను నడుస్తున్నాయని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  సరే అని చెప్పి చిన్నదిగా, పురాతనమైనదిగా ఉన్న  దేవాలయానికి ఉన్న మెట్ల ద్వారా వెళుతూ ఉండేసరికి మధ్య గోపురంలో అమ్మవారు మూడు అడుగులు ఉన్నట్లుగా కనపడుతుందని వీళ్లంతా చూస్తూ హృదయపూర్వక నమస్కారాలు చేశారు.  ఆ తర్వాత ఆ పక్కనే మహాకాళి ,మహా సరస్వతి , వెంకన్న స్వామి ఉప ఆలయాలుగా ఉన్న నవగ్రహాలు, రాధాకృష్ణులు ,కాలభైరవ, సింహవాహిని, తుల్జా భవాని ఆలయాలను దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆలయంలో ఉన్న శ్రీ చక్ర యంత్రమును కూడా దర్శించుకోవడం జరిగింది. అమ్మవారు 5 గోపురాలు నాలుగు ద్వారాలతో ఉన్నదని అది కూడా మధ్య గోపురంలో ఉంది అని….పశ్చిమ ముఖంగా ఉండటం గమనించారు.  ఆ తర్వాత ఉన్నట్టుండి సాయంత్రం వేళ వెళ్ళటం వలన…. పడమటి దిక్కు నుండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారికి ఎదురుగా ఉన్న కిటికీలోనుంచి అమ్మవారి ముఖం మీద సూర్యకిరణాలు పడడం… ఆలయ పూజారిని అడగగా ….సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఇలా అమ్మవారి ముఖంపై పడతాయని ఈ రోజు కోసం కొన్ని వేలమంది ఎదురు చూస్తూ ఉంటారని…. ఈరోజు ఎందుకో అనుకోకుండా ఇలా పడటం జరిగింది అని అంటూ ఉండేసరికి…. సూర్యకాంతితో, సూర్యరశ్మితో మహాలక్ష్మి అమ్మవారు దివ్యకాంతితో, దివ్య తేజస్సుతో మెరుస్తూ తనకి దర్శనం ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. అప్పుడు అమ్మవారి చేతిలో ఆయుధాలు స్పష్టంగా కనిపించాయి. ఒకవైపు కత్తి, మరొకవైపు గద, మరొకవైపు డోలు, మరొకవైపు ఒక చేతిలో అక్షయపాత్ర, మరొక చేతిలో పండు ఉన్నట్లుగా వీళ్ళందరికీ  కనపడింది. చూడటానికి అమ్మవారు నిలుచునట్టుగా ఉంటుంది కానీ…. అమ్మవారు వెనుక ఉన్న సింహవాహిని మీద కూర్చొని ఉంటుందని శివ నందిని గ్రహించింది. ఇదే విషయం పిల్లలకి కూడా చెప్పేసరికి అవునా?  అని వాళ్లు కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి….అమ్మ నువ్వు చెప్పింది నిజమే…అమ్మవారు చూడటానికి  నించునట్టుగా ఉంది కానీ… కూర్చొని ఉంది అని చెప్పేసి గ్రహించారు.  రుద్ర స్వామి ,మహాదేవి కూడా అమ్మవారి భంగిమను ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. ఆ విధంగా ఆలయంలో ఉన్న రాతి శ్రీ చక్రం కూడా పరిశీలించారు.  కాకపోతే శ్రీ చక్రాన్ని తాకటానికి లేకుండా ఒక గాజు బాక్సులో ఏర్పాటు చేయడం జరిగిందని వీళ్ళు గ్రహించారు. ఆ తర్వాత అందరూ కూర్చొని జపం చేసుకోవడం ఆరంభించారు. శివ నందిని కాస్త స్వాధిష్ఠాన చక్రము జాగృతి కోసమని చెప్పేసి జల ముద్రను అభ్యాసం చేయడం ప్రారంభించింది.

సాధన కుటుంబం అంతా ఇదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే పంచగంగా ఘాట్ లో  స్నానాలు చేసుకోవడం…. ఆ తర్వాత అమ్మవారి గుడికి చేరటం…. ధ్యానం జపం చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉండటం…. పిల్లలు చేసినంతసేపు చేసుకొని ఆటల్లో ఉండటం…. ఆ తర్వాత దేవాలయాలు చుట్టూ… ఉప ఆలయాలు చూసుకుంటూ ఉండటం….. వారం రోజులు శివ నందిని ధ్యానం చేస్తున్నప్పటికీ… ఎలాంటి ఫలితాలు కనిపించకపోయేసరికి…. ఒక విధమైన నిరుత్సాహం, ఆవేదన, ఆవేశం ,బాధ, ఏదో తెలియని వేదన అనుభవించడం మొదలైంది.  ఒకవేళ తను తప్పుడు క్షేత్రానికి వచ్చిందా అని అనుమానాలు… ఏం చేయాలో అర్థం కాలేదు.  తను వచ్చి వారం రోజులు అయింది.  మిగతా క్షేత్రాలలో మూడు రోజులకే చక్ర జాగృతి అయినట్లు….అనుభూతులు వచ్చేవి.  ఇదే విషయం మూలాధార చక్రం విషయంలో జరిగింది. కానీ వారమైనప్పటికీ ఇక్కడ ఎలాంటి మార్పు, అనుభవం ఎలాంటి లక్షణాలు కనిపించకపోయేసరికి…. అనుమాన భయాలు మొదలయినాయి.  ఉన్నట్టుండి ఆమెకు వాంతులు వచ్చేలా అనిపించేసరికి…. అందరూ కలిసి హోటల్ గదికి వెళ్లారు.  విపరీతమైన వాంతులు ఆగకుండా వస్తున్నాయి.  మహాదేవికి ఎందుకో అనుమానం వచ్చి….

మహాదేవి:- (లోగొంతుతో) ఇది ఆహారం అరగక వచ్చిన వాంతులు కాదు ….కడుపుతో ఉన్నప్పుడు వచ్చే వాంతులు లాగా ఉన్నాయి. 

రుద్రస్వామి:- ఆ అమ్మాయి అలా తప్పు చేసే రకం కాదు…. అలాంటి తప్పుడు మనిషి కాదు …

మహాదేవి:- నేను ఆ అమ్మాయి తప్పు చేసింది అనలేదు… తప్పుడు మనిషి అనలేదు.. విడాకులు తీసుకుని ఆరు నెలలు అయింది కదా! ఆఖరిసారిగా ఏమైనా కలయిక జరగటం వలన కడుపు వచ్చిందేమో!  ఈ విషయం గమనించలేదేమో!  ఈ పిల్ల సాధనాస్థితిలో ఉండి గమనించలేదేమో!

రుద్రస్వామి:-అవునా! ఏమో అయితే కనుక్కో… ఎందుకైనా మంచిది.  కడుపుతో ఉంటే సాధన ఎలా పడితే అలా చేయకూడదు.  జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి వస్తుంది. లేదంటే తల్లికి , బిడ్డకి ప్రమాదం…

అనేసరికి ఎందుకైనా మంచిది అని మహాదేవి కాస్త శివ నందిని దగ్గరకు వెళ్లి తన సందేహం చెప్పేసరికి శివ నందీని:- ఛీ…ఛీ… అలాంటిదేమీ లేదు …నేను విడాకులు అర్జీ పెట్టుకొని 8 సంవత్సరాలు అయ్యింది.  విడాకులు కోర్టు నుంచి వచ్చి ఆరు నెలలు అయింది.  8 సంవత్సరాల క్రితమే ఆయన నన్ను ముట్టుకోవడం మానేశారు.  పిల్లలకు మాత్రమే తండ్రిగా ఉన్నాడు.  నాకు భర్తగా లేడు. ఇంటి అవసరాలు మాత్రమే తీర్చేవాడు.  ఇంటికి కావలసిన డబ్బు ఇచ్చేవాడు.  మా మధ్య భార్యాభర్తల సంబంధం లేనేలేదు .

మహాదేవి:- ఈ వాంతులు ఏమిటి?  ఎందుకు వస్తున్నాయి?

శివ నందిని:- ఏమో నాకు అర్థం కావడం లేదు.  పోనీ ఏదైనా ఆహారం పడట్లేదు… అందువలన వచ్చింది అనుకుంటే …నేను ఆహారం మామూలుగానే తింటున్నాను. నాకు అరుగుదల లేకపోవడం అనేది లేదు. 

మహాదేవి:- ఒకవేళ శివ స్వామి వలన…….. 

శివ నందిని:-  చ…చ ఆయన అలాంటి మనిషి కాదు. నేను ఒంటి మీద చేయి వేస్తేనే కూతురు వేసిన భావనలో ఉంటాడే గానీ….ఆయన తప్పుడు ఆలోచనలు చేయడు.  తప్పుడు పనులు చేయడు.  నాకు తెలిసిన అంతవరకు మేమిద్దరం శారీరకంగా కలిసింది కూడా లేదు…

మహాదేవి:- ఓసి పిచ్చి మొహమా!  యోగులు శారీరకంగా కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క చెమట బిందువుల వలన లేదా కన్నీళ్ళ వల్లనే…. కడుపు వచ్చిన వాళ్ళు ఉన్నారు.

 అనేసరికి అర్థం కాక అయోమయంగా…మహాదేవి కేసి చూస్తూ ఉండేసరికి…. ఇప్పుడు రామాయణంలో హనుమంతుడి చెమట, బిందువు రూపంలో పడితే  పాతాళంలో ఉన్న ఒక రాక్షసికి కొడుకు పుట్టాడు అని …..ఆ కొడుకే రావణాసురుడి తమ్ముడైన అహీరావణుడిని సంహరించాడని ఇదే ఇతిహాసం ఉంది కదా ! 

శివ నందిని:- అంటే చెమట వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందా ?

మహాదేవి:- యోగుల శరీరంలో చెమటలో…కన్నీళ్లలో… వీర్యం ఉంటుంది అని చెప్పేసి ఆ వీర్యం వలన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. వాళ్ళు బ్రహ్మచర్య దీక్షతో ఉండటం వల్ల,  చెమట బిందువులలో ఉన్న వీర్యం వలన పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది.


అనేసరికి అప్పుడు శివనందినికి ఏదో అనుమానం భయం మొదలైంది.  ఒకవేళ ఆయన చెమట బిందువు నాకు తెలియకుండా నా కడుపులోకి వెళ్లిందా? అని అనుమానంతో…

శివనందిని:- సరే!  నేను నీతో తర్వాత మాట్లాడుతాను. ఈ విషయం శివ స్వామిని అడుగుతాను.

మహాదేవి:- సరే నీ ఇష్టం…

అనేసరికి శివ నందిని అనుమాన భయంతో అయోమయంగా నేను గుడికి వెళ్లి ధ్యానంలో కూర్చుంటాను అనుకొని…. గుడికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని…. హృదయం మీద చేయి పెట్టి స్వామి!  స్వామి! అని పిలిచేసరికి ఎక్కడో శ్రీశైలంలో రుద్రాక్ష మఠంలో ధ్యాన నిష్ఠలో ఉన్న శివ స్వామికి ధ్యానభంగం అయ్యి తన ఈధ్యానభంగానికి  శివ నందిని కారణమని తెలుసుకొని …

శివ స్వామి:- చెప్పు దేవి ఏమైంది?

శివ నందిని:- స్వామి నాకు విపరీతమైన వాంతులు అవుతున్నాయి. 

శివ స్వామి:-  దానిలో తప్పేముంది?  చక్ర శుద్ధి అవుతున్నప్పుడు గానీ… జాగృతి అవుతున్నప్పుడు గానీ వాంతులు అవుతాయి అని తెలిసిందే కదా!   శివ నందిని:- ఇది అలాంటి వాంతులు కాదు.  వారం రోజులైంది. నాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.ఇప్పుడు ఏకంగా వాంతులు అవుతున్నాయి  ఏం జరుగుతుందో తెలియట్లేదు. భయమేస్తుంది.

శివ స్వామి:- ఏదైనా ఆహారం నీకు పడకపోయి ఉండాలి… లేదా నీకు గ్యాస్ ట్రబుల్ వంటివి వచ్చి ఉండాలి.  అందువల్ల వాంతులు అవుతాయి.  ఎక్కువగా ఉప్పుకు సంబంధించిన పదార్థాలు తింటే విరోచనాలు అవుతాయి.  అదే కారానికి సంబంధించినవి తింటే వాంతులు అవుతాయి కదా! 

శివ నందిని:- ఇది ఆహార పదార్థాలు తినటం వలన వచ్చిన వాంతులు లాగా లేవు.  కడుపు వల్ల వచ్చిన వాంతులు లాగా ఉన్నాయి.

శివ స్వామి:- ఏం మాట్లాడుతున్నావు దేవి! 

శివ నందిని:- నేనేమీ తప్పు చేయలేదు.  ఎవరితోనూ ఎలాంటి తప్పు చేయలేదు.

శివ స్వామి:- మరి ఇంకెందుకు నీకు ఈ ధర్మ సందేహం..

శివ నందిని:- ఇందాక మహాదేవి నా దగ్గరికి వచ్చి యోగుల యొక్క చెమట బిందువుల ద్వారా…. కన్నీళ్ళ ద్వారా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందని హనుమంతుని వృత్తాంతం చెప్పడం జరిగింది.నాలో తెలియని అనుమాన భయం మొదలైంది. 

(అనేసరికి ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి)

శివస్వామి:- ఇప్పుడు నా చెమట చుక్కల వలన నువ్వు గర్భవతివి అయ్యావు అని అనుమానమా? శివనందిని:- అంటే అనుమానం కాదు… అది అనుమానం అని చెప్పలేను… కాదని చెప్పలేను… (అని సందిగ్ధంలో ఉండేసరికి)

శివస్వామి:- అమ్మ తల్లి!  నా చెమట బిందువుల వల్ల నీకు కడుపు రాలేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను.  చెమట బిందువుల వలన… కన్నీళ్ళ వలన కడుపు వచ్చే అవకాశాలు లేనే లేవు.  కాకపోతే బ్రహ్మచార్యులకి చెమట ద్వారా ….కన్నీళ్ళ ద్వారా…. మూత్రం ద్వారా….మలం ద్వారా… వీర్యం వెళ్లిపోయే విధంగా ప్రకృతి ఏర్పాటు చేసింది.  ఎందుకంటే వాళ్ళు సంసార సుఖానికి దూరంగా ఉంటారు.వీర్యం ఉండవలసిన పరిమాణంలో ఉండాలి. అది ఎక్కువైనా తక్కువైనా పెను ప్రమాదాలు కలిగిస్తుంది. ఒకవేళ వీర్యశక్తి తక్కువ అయినప్పుడు రక్తహీనత,  శరీర అంగాలకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా వీర్యము వృషణాలలో ఎక్కువ అయిపోతే శుక్రవ్యాధి వచ్చి… వరబీజం అనే వ్యాధిగా రూపాంతరం చెంది… అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కానీ వీర్యాన్ని సమస్థితిలో ఉంచుకోవాలి. ఎక్కువగా ఉండకూడదు… తక్కువగా ఉండకూడదు… బ్రహ్మచారులకి మూడు నెలలకు ఒకసారి నిద్రలో  వీర్య స్ఖలనం అయ్యేటట్లుగా చేస్తే….సంసారికి భార్య ద్వారా వీర్య స్ఖలనం అయ్యేటట్లుగా ప్రకృతి ఏర్పాటు చేసింది. ఇప్పుడు స్వప్నంలో కూడా వీర్య స్ఖలనం కాని వాళ్ళకే ….ఈ చెమట రూపంలో, కన్నీళ్ళ రూపంలో,మలం ద్వారా, మూత్రం ద్వారా వెళ్లే విధంగా ప్రకృతి ఏర్పాటు చేసింది. నాకు అంత సీన్ లేదు తల్లి… నాకు మూడు నెలలకు ఒకసారి నిద్రలో వీర్య స్ఖలనం జరిగిపోతూ ఉంటుంది. నా చెమట వల్లనో…. కన్నీళ్ళ వల్లనో నీకు సంతానం కలిగే అవకాశం లేదు. నా చెమట బిందువులు నీ మీద ఎప్పుడూ పడలేదు.

శివనందిని:- నిజంగానే అంటారా? ఖచ్చితంగానే నా?ఎందుకంటే నేను మీ ఒడిలో పడుకునే ఉన్నాను కదా! ఒకవేళ మీ చెమట బిందువులు ఏమైనా తెలియకుండా నా నోట్లోకి వెళ్లిపోయి గర్భవతి అయ్యానేమో! అని ఒకసారి మీరు ధ్యానంలో చూడండి …

శివస్వామి:-  తల్లి మహాతల్లి…నా వల్ల నువ్వు గర్భవతివి అయ్యే అవకాశం లేదు. జాతకం ప్రకారం చూసినా నాకు సంతాన యోగమే లేదు. అలాంటప్పుడు నీకు ఎక్కడి నుంచి సంతానం వస్తుంది ? నావల్ల మాత్రం కాలేదు… అలా అని నువ్వేదో తప్పు చేశావనో….మాజీ భర్త వల్ల నీకు సంతానయోగం ఉంది అని నేను అనుకోను. ఒకటి గుర్తుపెట్టుకో! జాతకంలో సంతానయోగం లేనప్పుడే సన్యాస దీక్షకు వెళ్ళటం జరుగుతుంది. నీకు ఆ యోగం లేదు కాబట్టే ప్రకృతి ఈ యోగం ఇచ్చింది…. కాబట్టి నువ్వు సన్యాసిగా మారావు అన్న మరుక్షణమే నీకు సంతానయోగం లేనట్లు. ఇవి నీకు చక్ర శుద్ధి అవుతున్నప్పుడు అన్నా జరిగి ఉండాలి… లేదంటే చక్ర జాగృతి అవుతున్నప్పుడైనా జరిగి ఉండాలి. ఎక్కువగా  నూటికి 95% చక్రం జాగృతిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఒక 20% చక్ర శుద్ధి అవుతున్నప్పుడు జరుగుతుంది. నీకు ధనానికి సంబంధించిన దోషాలు ఏవో ఉండి ఉండాలి.. వాటిని శుద్ధి చేస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. కావాలంటే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకో .ఒకవేళ గర్భవతి అయ్యావు అంటే ….ఇక జన్మలో నీకు కనిపించను. నా దారిన నేను వెళ్ళిపోతాను.

శివ నందిని:- లేదు స్వామి! మీరు చెప్పిన తర్వాత ఒకటికి పది సార్లు ఇంక నేను ఆలోచించుకోను .ఏదో నాలో తెలియని అనుమాన భయం వచ్చింది. మహాదేవి కూడా అనేసరికి అలా కూడా అవకాశం ఉందా? అని అడుగుదామని వచ్చాను.

శివస్వామి:- దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. నేను ఖచ్చితంగా చెప్పగలను. అది గర్భం దాల్చిన లక్షణాలు కాదు. అది ఆహారం పడకపోవటం అన్నా జరిగి ఉండాలి…. లేదా చక్ర జాగృతి అయినా జరుగుతూ ఉండాలి…లేదా చక్ర శుద్ధి జరుగుతూ ఉండాలి.  అయినా ఇప్పుడు నీది చక్ర జాగృతి సమయమే కదా! అంతెందుకు…. నీకు మూలాధార చక్రం జాగృతిలో ఉన్నప్పుడు విరోచనాలు అయ్యాయి కదా..! విపరీతంగా విరోచనాలు అయ్యేసరికి మందులు వేసుకున్న తగ్గట్లేదు అని మూడు రోజులు ఇబ్బంది పడ్డావు కదా! అదే విధంగా ఈ చక్ర జాగృతిలో నీకు వాంతులు అవుతున్నాయేమో!

శివ నందిని:- అంతే అయి ఉండొచ్చులే స్వామి! నేను అనుమానభయాలు పెంచుకున్నాను..

శివస్వామి:- మంచిది… ఆరోగ్యం జాగ్రత్త మందులు వేసుకో!  మందులకి తగ్గకపోయినా కంగారు పడొద్దు. ఇది సంతానానికి సంబంధించింది అయితే కాదు..

శివ నందిని:- సరే స్వామి! ఇక మీరు చెప్పారు అంటే అది అక్షర సత్యమే కదా! ఇక వెనుక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు… ధైర్యం ఇచ్చారు 

శివస్వామి:- సరే ఉంటాను తల్లి!నేను ధ్యానం చేసుకోవాలి..

శివ నందిని:- మంచిది…

అనగానే తన హృదయంలో ఆయన అంతర్దానం అవ్వడం జరిగింది. ఆ తర్వాత యధావిధిగా శివ నందిని కాస్త జలముద్ర వేసుకొని ధ్యానం నిష్ఠలో ఉండిపోయింది.  కొన్ని రోజుల తర్వాత అది సంతానానికి సంబంధించిన వాంతులు కాదని…. చక్ర జాగృతికి అవుతున్నప్పుడు…. చక్ర శుద్ధి అవుతున్నప్పుడు వచ్చిన వాంతులు అని చెప్పి శివ నందినికి నిర్ధారణ అయింది. ఇక దానితో శివ నందినికి ఉన్న అనుమాన భయాలు అన్నీ పోయి…. శ్రద్ధా భక్తులతో జల ముద్రతో స్వాధిష్ఠాన చక్రాన్ని జాగృతి, శుద్ధి విధివిధానంలో ఉండిపోయింది.  ఇలా 15 రోజులపాటు గడిచిన తర్వాత శివ నందినికి ఉన్నట్టుండి… ధ్యానంలో వివిధ ధ్యాన దృశ్యాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.


శివ నందినికి ధ్యానంలో గుప్త నిధులు, లంకె బిందెలు, నిధులు ఉన్న భూషణాల పెట్టెలు ఉన్నట్లుగా పదేపదే ధ్యాన దృశ్యాలు కనబడుతున్నాయి.  ఇవి నిజమా కాదా?  అని ఆలోచనలు అప్పుడప్పుడు ఉండేవి. ఇవి ఎక్కడ ఉన్నాయి?  ఏ విధంగా ఉన్నాయి?  ఆ ప్రదేశాలు ఇదిమితంగా తెలిసేవి కావు.  కాకపోతే ఎక్కడో ఒకచోట ఇది ఉన్నట్టుగా కనబడుతున్నాయని అనుకుంది. అదికాక స్వాధిష్ఠాన చక్రంలో మనకి సహజసిద్ధంగా ధన మాయ వస్తుంది అని పరమహంస గారు చెప్పి ఉన్నారు కదా!  ఒకవేళ ఇవి  దానికి సంబంధించినవి అనుకునేది. కానీ తనకి ధ్యానంలో కనిపించేవన్నీ కూడా ఎలా నమ్మాలి? ప్రత్యక్షంగా ఆ నిధులు ఉన్నాయా లేదా అని చూస్తే గాని….తనకి నమ్మబుద్ధి కాదు అని పదేపదే శివ నందిని అనుకునేది. ఇదే విషయాన్ని రుద్ర స్వామికి చెప్పేసరికి

రుద్రస్వామి:- అమ్మ! ఆ నిధులు ఉండటం అనేది నిజమే!  ఆ నిధులకి రక్షణగా నాగ బంధనం చేస్తారు. నాగపాములతో బంధనం చేస్తారు. కొంతమంది పిశాచాలతో పిశాచ బంధనం  చేస్తారు.  మరి కొంతమంది దీనికి అష్ట బంధనాలు ఉపయోగిస్తారు. ఈ అష్ట బంధనాలలో ఏ బంధనం అయినా లంకె బిందెలకి వేస్తారు.  కొంతమంది వీటిని బావులలో దాచి ఉంచుతారు.  మరి కొంతమంది పాడుబడ్డ ఇళ్లల్లో లేదా తాము నివాసం ఉన్న ఇళ్లల్లో భూగుహాల్లో మరి కొంతమంది పొలాల్లో… భూమి లోపల గుహల్లో ఉంచడం జరుగుతుంది.ఈ గుప్తనిధులుకి బంధనాలు మాత్రం వేసి ఉంచుతారు. ఆ వంశస్థులు తప్ప ఇతరులు ఆ నిధులను తాకే ప్రయత్నం చేయరు.  తాకే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా ఈ బంధనాల లో శక్తిని నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఆ లంకె బిందెలు ఉండటం అనేది అక్షర సత్యం.  అవి ఉన్నాయా లేదా అని నువ్వు ప్రయత్నం చేయకు. ఆ అనుభవాలకు వెళితే ధనానికి ఆశపడి నువ్వు ధన మాయలో పడే ప్రమాదం ఉంది.

శివ నందిని:-అయ్యా !నేను అలా ఆశపడను అవి ఉన్నాయా? లేదా? తెలుసుకోవాలని ఉత్సుకత.  అంతకుమించి ఇంకేమీ లేదు.

రుద్రస్వామి:-నీ ఇష్టం తల్లి! చెప్పడం వరకే… కాదని చెప్పలేను… వద్దని చెప్పలేను…. ఇక అది నీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది.  లంకె బిందెలో ఉన్న గుప్త నిధులు చూసినప్పటికీ… నీ మనసు చలించదు అనే మనోధైర్యం నీకు ఉంటేనే… నువ్వు ప్రత్యక్షంగా వాటిని చూడటానికి ప్రయత్నం చెయ్యి.

శివ నందిని:- సరే స్వామి!  నాకు ఆ అవకాశం రావాలి కదా! వచ్చినప్పుడు చూస్తాను …ప్రస్తుతానికి అయితే లంకె బిందెలు అయితే కనబడుతున్నాయి…

రుద్రస్వామి:- సరే కాల నిర్ణయం ఎలా జరుగుతుందో లే!  

శివ నందిని:- ఒకవేళ ఇది ధన మాయ అంటారా ?

రుద్రస్వామి:-  మాయ అనలేము… మొదట స్వాధిష్ఠాన చక్రం నీకు జాగృతి అయిందో లేదో నాకు తెలియాలి కదా!

శివనందిని:- మరి నాకు ఈ లక్షణాలు కనబడుతున్నాయి …


స్వాధిష్ఠాన చక్ర జాగృతి :- 

రుద్రస్వామి:- అమ్మ!  ఈ లక్షణాలను బట్టి చూస్తే నీకు చక్ర జాగృతి అయ్యింది.. విపరీతంగా ధన సమస్యలు రావడం….ఉన్న ధనం నిలబడక పోవడం…..ఉద్యోగం వ్యాపారాలు కలిసి రాకపోవడం, ధనం ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వంటివి జరుగుతాయి…అయితేనువ్వు సాధన లో ఉన్నావు కాబట్టి….నీకు  కూడా ధ్యానంలో ధనం పై ఆశ కలిగించేలా లంకె బిందెలు దర్శనాలు… వాటిపై మోహం కలిగించేలా… ధన మాయలో పడేసే విధంగా ధ్యానానుభవాలు కలగడం… ధన సంబంధిత ఆలోచనలు పదే పదే రావడం,నీకు  బాగా ఇష్టమైన పదార్థాలు తినాలని పదే పదే అనిపించడం  జరిగింది. విపరీతమైన ధనకాంక్ష ధన లేమి సమస్యలకు సంకేతం స్వాధిష్ఠాన చక్ర దేవత అయిన మహాలక్ష్మి మహామాయలే అని గ్రహించు.ఇవి ఎక్కడి దాకా తీసుకొని వెళతాయో చూడు. అప్పటి దాకా సహనంగా ఓర్పుగా వుండు. ధన ఆశలో అసలు పడకు. ఇదంతా ధన మాయ లీల అని గ్రహించు…


శివ నందిని:- నాకు ధన మాయ ఎప్పుడు వస్తుంది? 

రుద్రస్వామి:- చక్ర శుద్ధి అవుతున్న సమయంలో ధన మాయ అనేది వస్తుంది.  కాకపోతే చక్ర జాగృతి అయినప్పుడు గుప్తనిధులు ఉన్నాయని అది మాత్రమే చూపిస్తుంది. ఎక్కడ ఉన్నాయనేది చూపించదు.  అదే చక్రం శుద్ధి అవుతున్నప్పుడు ఆ గుప్త నిధులు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తుంది. అంతే అదే తేడా… చక్ర జాగృతి అయినప్పుడు గుప్త నిధులు మాత్రమే చూపిస్తుంది. చక్ర శుద్ధి అవుతున్నప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తుంది. అదే చక్రం ఆధీనం అవుతున్నప్పుడు గుప్తనిధులను ఎలా వశం చేసుకోవాలి అనే జ్ఞానం ఇస్తుంది. దానికి ఉన్న బంధనం ఏమిటి ? దాని ఎలా బంధ విముక్తి చేయవచ్చు.  ఏ విధంగా మనం నిధులను వశం చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది….కాకపోతే నువ్వు చెప్పిన లక్షణాల ప్రకారం చూస్తే… చక్ర జాగృతి లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయి..

అని చెప్పడం జరిగింది.ఇలా శివ నందిని 15 రోజులు పాటు జలముద్రతో ఈ ముద్రకి సంబంధించిన విధివిధానాలు చేస్తూ ఉండేసరికి…. ఉన్నట్టుండి ఒకరోజు శివ నందినికి ధ్యాన నిష్ఠలో ఉండగా లంకె బిందెలు ఎక్కడో.. ఏదో ఇంట్లో ఉన్నట్టుగాను…ఏదో పొలంలో ఉన్నట్టుగాను కనిపించేసరికి… ఇప్పటిదాకా లంకెబిందెలు ఉన్నట్లుగానే కనిపించింది, ఇప్పుడు లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది అని గ్రహించింది.  అంటే ఇప్పుడు తనకి స్వాధీష్ఠాన చక్ర శుద్ధి ప్రారంభం అవుతుంది అని అనుకునేసరికి…. కొన్ని లక్షణాలు ఆమెకి కలిగినాయి…వీటి గురించి రుద్రస్వామి కి చెప్పేసరికి ….

రుద్రస్వామి:-

స్వాధిష్ఠాన చక్ర శుద్ధి లక్షణాలు:- 

అమ్మా! ఇవి చక్ర శుద్ధికి సంబంధించింది. లోక కళ్యాణార్థం అనే ధన మాయలో నువు పడుతున్నావు.. ఈ అంతులేని ధన మాయ అహంకారం,  మోహంలో పడితే ఈ చక్రం మాయలో ఆగిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే నీకు   లంకె బిందెలు కనిపించాయో  అప్పుడే ఈ చక్ర శుద్ధి మాయ ఆరంభమైనది.దీని శుద్ధి కోసం ఇష్టమైన పదార్థాలను గుర్తు చేసుకుని ధ్యానం చేయడం, ఖేచరి ముద్ర వేయడం వంటివి చేయాలి…నువు ఇక్కడ మాయలో పడకూడదు…. దీని శుద్ధి అయితే ఆ తర్వాత …దాని వలన నీకు జలములో జీవించే జంతువుల వలన హాని ఉండదు. అలాగే నీటిమీద తేలియాడే శక్తి వస్తుంది. అలాగే ఆకలి, దప్పిక లేని,దుఃఖము రాని అనూర్మిత సిద్ధి కలిగినది. అరిషడ్వర్గాలు నీ ఆధీనమవుతాయని” చెప్పటం జరిగినది.


ఆ తర్వాత పదేపదే ఇంట్లో లంకె బిందెలు ఉన్నట్లుగాను…. పొలంలో లంకె బిందెలు ఉన్నట్లుగాను కనిపిస్తూ ఉండేసరికి… ఇక ఉత్సుకత ఆపుకోలేక వీటిని ఎలాగైనా ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పేసి,తనకి ధ్యానంలో కనబడుతున్న ఒక పాడుపడ్డ ఇల్లు అని,  ఆ ఇంటి నెంబరు, అది ఏ వీధిలో  ఉంది, ఎక్కడ ఉంది అనే వివరాలు సుస్పష్టంగా ధ్యానంలో కనబడుతూ ఉండేసరికి… శివ నందిని కాస్త రుద్రస్వామి, మహాదేవిని తీసుకొని ఆ పాడుపడ్డ ఇంటి వైపుకు వెళ్లడం జరిగింది. ఆ ఇంటిని పాడు పెట్టి పది సంవత్సరాలు అవుతుందని కొడుకులు అమెరికాలో సెటిల్ అవ్వడంతో వృద్ధ దంపతులు కాలం చేసిన తర్వాత పాడు పెట్టేశారు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది.… ఆ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని ఒక ప్రచారం ఉండేది. ఎందుకంటే ఆ ఇంటి యజమానికి లంకె బిందెల మీద ఆకాంక్ష ఉండేది అని…. ఎక్కడెక్కడ ఉన్న మంత్రగాళ్లను పిలిపించి వాటిని బంధ విముక్తి చేసే వాళ్ళని… ఆ లంకె బిందెలను తీసుకువచ్చి తన ఇంట్లో భూ గృహంలో దాచి పెట్టాడని స్థానికులు కథనం చెప్పేసరికి… అది నిజమా కాదా?  అని దొంగ చాటుగా ఆ ఇంటిలోకి ప్రవేశించడం జరిగింది. కాకపోతే వీళ్ళందరికీ ఒక మూల ఏదో తెలియని అనుమానం భయం ఉండేది. ఇంతవరకు ప్రత్యక్షంగా గుప్త నిధులు వీళ్ళు చూడలేదు.  సరే అని ఆ మధ్య గదిలోకి వెళితే విశాలంగా కనిపించి…. ఆ హాల్ లో ఎక్కడ గుప్త నిధులు ఉన్నాయన్నది అర్థం కాలేదు. బూజులు పట్టి ఉన్నాయి.  గబ్బిలాలు ఆవాసం చేస్తున్నాయి.  పావురాలు ఆవాసం చేస్తున్నట్లుగా కనిపించింది.  ఏదో తెలియని భయానక వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.  సరే అని శివ నందిని ధ్యానంలో కూర్చునే సరికి… ఇక వీళ్లిద్దరూ ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అని రుద్ర స్వామి, మహాదేవి ఉత్సుకతతో ఆ ఇంట్లో ఉన్న గదులన్నీ తిరగటం ఆరంభించారు.ధ్యానంలో ఉన్నట్టుండి శివ నందినికి తన ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనే భూ గృహంలో గుప్తనిధులుగా లంకె బిందెలు ఉన్నట్లుగా.. నవరత్నాలు, హారాలు, మణులు ,మాణిక్యాలు, భూషాణం పెట్టెలు ఉన్నట్లుగా కనిపించాయి. వీటన్నింటినీ సుమారుగా 50 రకాల మూటలు ఉన్నట్లుగా….అందులో సుమారుగా ధనం మూటలే ఉన్నట్లుగాను కనిపించాయి.  వీటన్నింటి మీద ఒక ఆవిడ కూర్చొని ఉండి, ఆభరణాలు అన్నింటిని కూడా ధరించి ఉన్న ఒక ఆవిడ కూర్చుని ఉండేసరికి… ఈవిడ ఎవరు ఒకవేళ మహాలక్ష్మి ఆ..?  ఇంకెవరైనా నా?  అని అనుకునేసరికి ఆ ఖాళీ స్థలం నుంచి తమ  వైపుకి బంగారు నాణాలు, హారాలు విసిరినట్టుగా కనిపించేసరికి… ధ్యానభంగం అయింది.  కళ్ళు తెరిచి చూస్తే… తన ఒడిలో ధ్యానంలో చూసిన బంగారపు నాణాలు ,అలాగే బంగారపు హారం, వజ్రాల హారం కనిపించేసరికి వామ్మో!  ఇక్కడ నిజంగానే గుప్త నిధులు ఉన్నాయి. ఎవరో బంధనం వేసి ఉండాలి. ఆవిడే మహాలక్ష్మి అయి ఉండాలి… లేదా ఇంకెవరైనా అయి ఉండాలి. కాకపోతే పాములు అవి ఎక్కడా కనిపించలేదు అనుకుంటూ వీళ్ళిద్దరిని పెద్దగా పిలిచేసరికి ఏమైయిందా అని రుద్రస్వామి , మహాదేవి గబగబా వచ్చేసరికి తన ఒడిలో పడి ఉన్న బంగారు నాణాలు ,వజ్రాల హారం వీళ్ళకి చూపించేసరికి… ఆశ్చర్య ఆనందాలకు  గురి అయ్యి ….అంటే ఇక్కడ గుప్తనిధులు ఉండటం నిజమే అన్నమాట అంటూ నువ్వు ఏం చూసావు! యధాతధంగా చెప్పు!  అనేసరికి ఆమె చెప్పేసరికి రుద్రస్వామి:- నాకు తెలిసినంతవరకు ఆమె మహాలక్ష్మి కాదు. ధనపిశాచి అయి ఉంటుంది.  ఎందుకంటే ఆమె నోటిలో రక్తం కనపడింది అన్నావు.  వీళ్ళు పిశాచ బంధనం వేశారు.  ఆయన వేసిన బంధనంలో దానికి ఒక కోరిక తీరిస్తే, బలి ఇస్తే… అప్పుడు ఆ గుప్త నిధులకు సంబంధించిన వివరాలు చెబుతుంది.

శివ నందిని:- అవునా?  నిజమా అప్పుడు ఈ బంగారం బయటకు వస్తుంది కదా!  లోక కళ్యాణార్థం ఉపయోగించుకోవచ్చు కదా!  చారిటీ ట్రస్టులకు ఇవ్వచ్చు కదా! 

రుద్రస్వామి:- అమ్మ!  బంగారు నిధులు, గుప్త నిధులు ఉన్నంత మాత్రాన వాటిని అనుభవించే యోగం ఉండాలి. వాటిని బయటకు తీసి ఇచ్చినంత మాత్రాన వాటిని వారు అనుభవించకపోవచ్చు… అంత బంగారం చూసి  పిచ్చి వాళ్ళు అవ్వచ్చు… మతి భ్రమణం చెందవచ్చు…. ఈ కాలం ఏ విధంగా చేస్తుందో తెలియదు. మాయ ఎటు తిప్పుతుందో తెలియదు.  ఇవన్నీ ఎందుకు?  నువ్వు ప్రత్యక్షంగా చూడాలనుకున్నావు కాబట్టి ప్రత్యక్ష అనుభవం అయింది.కాబట్టి ఇక మనం వెళదాము… ఆ పిశాచి జోలికి వెళ్లడం ఎందుకు?

అనేసరికి ఇక శివ నందిని ఎప్పుడూ చూడని గుప్తనిధులను ….బంగారాన్ని… విలువైన ఆభరణాలు… రత్నాలు చూసేసరికి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదా!  కొంచెం మనసు అస్థిరమైనది . ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి కదా!  ఆభరణాలు అంటే అంతులేని ఇష్టము ఉంటుంది.  తనలో ఆడతనం బయటకు రావడం మొదలైంది…వెంటనే రుద్ర స్వామితో…

శివనందిని:- మీరు వెళ్తే వెళ్లిపోండి. నేను పిశాచికి కావాల్సింది ఇచ్చి ఆ గుప్త నిధులు తాకాల్సిందే… నేను వాటిని వేసుకోవాల్సిందే!  నేను వాటిని ఆశించట్లేదు.  ప్రత్యక్షంగా చూడాలి… తాకాలి. అవి ఉన్నాయన్న నిదర్శనం ఇచ్చింది కాబట్టి… అక్కడ ఉన్న గుప్తనిధుల మూటలు గాని… భూషాణాలు గానీ…. వాటిలో ఉన్న వజ్ర ఖచిత నవరత్న ఆభరణాలు కానీ…. ఒకసారి వాటిని ప్రత్యక్షంగా చూడాలి.

రుద్రస్వామి:- నీకు చెప్పింది అందుకే ….మనసు చంచలమవుతుంది.  వాటిని చూసి వెనక్కి తిరిగి రాలేవు.  వద్దు…. చూడవద్దు…. అని నెత్తి నోరు కొట్టుకున్నది అందుకే. 

శివనందిని:- నాకు అవన్నీ తెలీదు… నేను మాత్రం ఇక్కడి నుంచి రాను.. నా ప్రాణాలు పోయినా ఆభరణాలు చూడాల్సిందే!  ఆ గుప్తనిధులు బయటకు తీయాల్సిందే! 

(అని మొండిపట్టు పట్టేసరికి) మహాదేవి కాస్త …

మహాదేవి:- ఏంటి రుద్రస్వామి ! ఇప్పుడు ఏం చేద్దాం?

రుద్రస్వామి:- ఏముంది! శివ నందిని కాస్త ఆ పిశాచ బంధనంలోకి వెళ్ళిపోయింది.  మనం ఏం చేయలేము . దాని కర్మకి దాన్ని వదిలేయడమే. బతికి బట్టకడితే మన పిల్ల అనుకోవాలి. లేదు అనుకుంటే ఆ పిశాచానికి బలి అయింది అనుకోవాలి. 

మహాదేవి:-సమస్య వస్తే పరిష్కారం ఆలోచించకుండా ….అలా గాలికి వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా?  తెలుసో తెలియకో గుప్త నిధుల మాయలో పడింది.  బయటకు తీసుకురావాలి కదా!  

రుద్రస్వామి:- అది మాయ కాదు…. అనుభవించి దానిని తాకేదాకా అది నిద్రపోదు. దాని మనసు పీకుతూనే ఉంటుంది.  ఇప్పుడు నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకు వెళ్లినా కూడా ….తిరిగి మళ్లీ ఎప్పుడైనా రావచ్చు.  అర్ధరాత్రి అయినా రావచ్చు.  ఆ పిల్ల పిశాచానికి వశం అయింది.  దానికి మనం ఏమి చేయలేము. 

మహాదేవి:- ఇప్పుడు ఆ పిశాచి నుంచి మనం విముక్తి పొందించలేమా? దానికి ఏం పరిష్కారం లేదా?

రుద్రస్వామి:- ఆ పిశాచం యొక్క కోరిక మనం తీర్చక తప్పదు.

మహాదేవి:- సరే ఇక్కడిదాకా వచ్చాం కదా!  ఏదో తాడోపేడో తేల్చుకుందాం. ఇక పిల్ల మనకి దక్కాలి .

అని చెప్పి అనేసరికి…. సరే అని రుద్రస్వామి కాస్త .. శివ నందిని కేసి చూస్తూ…

రుద్రస్వామి:- నీకెటూ ధ్యానంలో కనపడింది అన్నావు కాబట్టి….. ఆమెతో అనుసంధానం అవ్వు. ఆ ధన పిశాచంతో మాట్లాడు… విషయం ఏమిటో నీకే తెలుస్తుంది.ఏం కావాలనుకుంటుంది.

శివ నందిని:- మీ ఇద్దరూ కూడా పక్కన కూర్చోండి. నేను ఉన్నది ఉన్నట్లుగా ధ్యానంలో చూస్తూ… కళ్ళు తెరవకుండా ఏం అడుగుతుంది ఏంటి? అనేది మీకు చెబుతాను.

అనేసరికి వీళ్ళు చెరో పక్క కూర్చుని ఉన్నారు.  ఆ తర్వాత శివనందిని ఒక గంట సేపు ధ్యాన నిష్ఠలో ఉండేసరికి….ఆ గుప్త నిధులకు కాపలా ఉన్న ధనపిశాచి స్పష్టంగా కనబడుతూ….

ధనపిశాచి:- ఏమే!  నీకు నేను ఉన్నాను అని చెప్పాను కదా! నేను ధనలక్ష్మిని కాదు. ధన పిశాచాన్ని.  ఈ నిధులకి నన్ను కాపలా ఉంచారు.  నాకు నీ రక్తం కావాలి. నీ రక్తం ఇస్తే నీకు కావలసిన మూట ఇస్తాను.  నీకు కావలసిన వస్తువులు ఇస్తాను.

శివనందిని:- సరే!  నాకు రక్తం ఇవ్వడానికి సమస్య లేదు.  వాటిని నేను ఒకసారి  తాకాలి. వాటి మీద ఆశ లేదు. తీసుకుపోవాలి అనుకోవడం లేదు. కానీ వాటిని ఒకసారి తాకాలి.

ధనపిశాచి:- అవి తీసుకువెళతావా లేదా? అనేది నాకు అనవసరం. నన్ను సంతృప్తి పరచు.  నీ రక్తంతో నాకు బలిదానం ఇవ్వు. అప్పుడు నేను తాగి నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను.

అని అనేసరికి అప్పుడు శివనందినికి ధ్యానభంగమై తనకి కలిగిన ధ్యాన అనుభవం అంతా వీళ్ళకి చెప్పేసరికి…. పక్కనే ఒక పాత్ర ఉండటం.. కత్తి ఉండటం గమనించిన రుద్ర స్వామి కాస్త  సరే ….ఆ ధనపిశాచి  కోరిక తీర్చు…అనగానే ఇక చూపుడు వేలును శివ నందిని కత్తితో కోసుకుని రక్త పాత్రలో వేసేసరికి….ఆ పాత్ర అలా గాలిలో తేలుతూ ఉండేసరికి…. రుద్ర స్వామి మరియు మహాదేవి గమనించి ధనపిశాచి రక్తపాత్రలో రక్తం తీసుకుని తాగుతూ…. సంతృప్తి పడుతుందనుకుంటా అనుకునేసరికి…

ధనపిశాచి:- నాకు ఈ బలిదానం సరిపోలేదు.  ఇంకా రక్తం కావాలి. నీ రక్తం కాదు…. నీతో పాటు వచ్చిన వాళ్ళ రక్తం కూడా ఇమ్మని చెప్పు…

(అని కోరుతూ ఉండేసరికి రుద్ర స్వామికి ఏదో అనుమానం వచ్చి)

రుద్రస్వామి:-  అమ్మ!  దీని రక్త దాహానికి ఊర్లో వాళ్ళ రక్తం అంతా ఇచ్చిన కూడా సరిపోదు.కాబట్టి మేము ఇద్దరం రక్తం ఇవ్వము.  మేము ఇద్దరం రక్తం ఇస్తే దానికి ఉన్న పిశాచ తత్వం పోయి…బంధ విముక్తురాలు అయిపోయి వెళ్ళిపోతుంది.  కావాలంటే బంధన విముక్తి అవ్వాలనుకుంటే ఇస్తాము…

అనేసరికి ఇదే విషయం శివ నందిని కాస్త ధనపిశాచికి చెప్పేసరికి….

ధనపిశాచి:- నన్ను బంధనం నుంచి బంధన విముక్తి చేయడం అనేది జరగదు.  ఎందుకంటే ఈ వంశంలో 40వ తరం వాడు రావాలి.  వాడికి నేను ఈ నిధులను అందజేయాలి. ఈ ఇంటి యజమాని 40వ తరం వారసత్వంలో పుడతాడు.  వాడికి నేను ఇవ్వాలి. వాడు వచ్చేదాకా నాకు బంధ విముక్తి కాదు అని నన్ను బంధనం చేసిన మాంత్రికుడు చెప్పడం జరిగింది. మీరిచ్చే రక్తంతో నాకు బంధ విముక్తి అవ్వదు.

ఇప్పుడు మీరు రక్తం ఇస్తారా …ఇవ్వరా? లేదంటే మీకు కావాల్సింది ఇవ్వను…అని శివ నందిని కాస్త ఊగిపోతూ పూనకం వచ్చిన దానిలాగా ధనపిశాచికి నా రక్తం ఇచ్చాను కదా…! మీ రక్తము ఇవ్వండి…. అది బంధ విముక్తి కావాల్సిందే…. నేను గుప్త నిధులు చూడాల్సిందే…. వాటిని పట్టుకోవాల్సిందే….నా కోరిక తీర్చండి ముందు…అని వీళ్లిద్దరి మీద అరిచేసరికి సరే నీ కర్మ మేమేమీ చేయలేము…. అని మహాదేవి, రుద్ర స్వామి కూడా చేతి వేళ్ళు కోసుకొని ఆ రక్తాన్ని పాత్రలో పోసి ఇచ్చేసరికి ధన పిశాచి ఆప్యాయంగా తీసుకొని తాగడం ఆరంభించింది.  ఇప్పుడు సంతృప్తి పొందాను. నా రక్త దాహం తీరింది.  చూస్తాను అన్నారు కదా! రండి…చూడండి!  మీ ముగ్గురు కూడా లోపలికి రండి …భూ గృహంలో ఉన్న నిధిని చూడండి… అనేసరికి అప్పటిదాకా మూసుకొని ఉన్న నేల కాస్త తెరుచుకునేసరికి లోపలికి వెళ్ళటానికి మెట్లు ఉండేసరికి ముగ్గురు లోపలికి వెళ్లారు.  అక్కడ లోపల ఆశ్చర్యపోయేలాగా ఏమీ కనపడలేదు.  అక్కడ ఒక గదికి నాలుగు వైపులా గోడలు…. ఆ గోడలకి అరలకి, లెక్క లేనన్ని బంగారపు ఇటుక రాళ్లు,  కడ్డీలు, వజ్ర హారాలు ఇలా ఉన్నాయి. .  గది మధ్యలో బస్తాలలో బంగారపు నాణాలు ఉన్నాయి.  ఒకపక్క రాశులుగా బంగారపు నాణేలు కనిపిస్తూ…. పెద్ద పెద్ద భూషణాలలో లెక్క లేనంత వజ్ర హారాలు దాదాపుగా రాజు కూడా సంపాదించలేనంతనిధి ఈ భూ గృహంలో ఉంది అని వీళ్ళ ముగ్గురికి అర్థం అయ్యింది.  దాంతో శివ నందినికి పిచ్చి పట్టిన దానిలాగా ఆ బంగారపు నాణాలను తన మీద వేసుకుంటూ…. ఆభరణాలు వజ్రహారాలు తనమీద ధరిస్తూ… ఆనంద పడుతూ ఉన్మాది లాగా పిశాచ అవస్థలాగా మారుతూ ఉండేసరికి ….ఇక తన సాధన స్థితి దాటుతుంది అని ఈ మాయలో ఇది ఆగిపోయేటట్లుగా ఉంది అని రుద్ర స్వామి గ్రహించి…. తన రక్తాన్ని శివనందిని యొక్క బ్రహ్మ రంధ్ర శిరస్సు మీద ఒక చుక్క వేసేసరికి…. అప్పుడు యధాస్థితికి మామూలు స్థితికి రావడం జరిగింది. అప్పుడు శివ నందినిలో మార్పు రావటం గమనించింది.  ఆ తర్వాత శివ నందిని నిద్ర నుంచి లేచిన దానిలాగా లేచి ….అయ్యా! నాకు ఏమైంది…నేను ఏం చేస్తున్నాను ఏంటి? ఈ ఒంటిమీద ఈ ఆభరణాలు ఏంటి ? బంగారం ఏమిటి? ఈ గుప్త నిధులు ఏమిటి? ఇవి ఎలా వచ్చినాయి…. అనేసరికి నీకు కథంతా చెబుతాను.  సమయం లేదు పదా!  అనేసరికి వీళ్ళ ముగ్గురు కూడా ఆ భూగృహం నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చేసరికి యధావిధిగా భూగ్రహం తలుపు మూసుకుపోవడం….. ధనపిశాచి అదృశ్యం అవడం…. ఇంటి తలుపు తెరుచుకోవడంతో వీళ్లంతా బయటపడ్డారు.  ఎవరు తమరు చూడలేదని గ్రహించి… రోడ్డుమీదకి వచ్చి నిదానంగా శివ నందినికి  రుద్ర స్వామి పూసగుచ్చినట్టుగా చెప్పేసరికి…. అవునా!  నాకు తెలియకుండానే జరిగింది.  నేను కావాలని చేయలేదు…. అంటే నువ్వు కావాలని చేయలేదమ్మా!  పిశాచ బంధం వల్లనే నువ్వు ఆ పిశాచానికి ఆధీనం అయ్యి అలా చేయడం జరిగింది. కాకపోతే మనకి అదృష్టం బాగుండి నువ్వు బయటపడ్డావు.. అనేసరికి మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉండటం వల్ల నేను బయటపడ్డాను. కృతజ్ఞతలు అని యధావిధిగా పంచగంగా ఘాట్లో స్నానం చేసి…. మళ్లీ అమ్మవారి దర్శనానికి వెళ్లి యధావిధిగా ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టారు.  దాదాపు రెండు మూడు గంటలు గడిచిన తర్వాత…ఇక పిల్లలు గది లో ఉన్నారని…..తలుపులు తాళాలు వేసుకొని వచ్చాము కదా!  ఇక తినడానికి వాళ్ళకి ఏమైనా కావాలేమో అనేసరికి… వీళ్ళు కూడా టిఫిన్లు కానిచ్చేసుకుని ఆ తర్వాత పిల్లలకు కావాల్సిన టిఫిన్లు  పార్సిల్ కట్టించుకుని గదికి వెళ్ళటం జరిగింది.


ఆ తర్వాత పిల్లలకి తన లంకెబిందెల అనుభవాలన్నీ కూడా ఒక కథలాగా చెప్పేసరికి 

బాల గణపతి:- అవునా అమ్మ!  అయినా మేము లేకుండా అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. మమ్మల్ని తీసుకొని వెళ్లాల్సింది. ధనపిశాచి సంగతి నేను చూసేవాణ్ణి..

బాల కుమారస్వామి:- ( పక్కున నవ్వి )అది నీవల్ల కాదురా!  నువ్వు చిన్నపిల్లాడివి.. అమ్మ వల్లే కాలేదు. అమ్మే దానికి వశం అయింది.  రుద్ర స్వామి వలనే అమ్మ బయటపడింది.  లేదంటే ఆ ధన  పిశాచానికి బలి అయ్యేది. ఆహారం అయ్యేది.  అయినా అమ్మా ! నీకు ధనం మీద ఆశ లేదు కదా!  మొదట్లోనే నువ్వు వజ్రాలహరం పరీక్ష పెట్టినప్పుడు దాని గురించి పట్టించుకోలేదు కదా!  ఉన్నట్టుండి మరి నీకు వజ్రాల మీద …లంకె బిందెలు తాకాలని ఎందుకు అనిపించింది. 

శివ నందిని:- అదేరా ధన మాయ. దానిని ఎవరూ ఏమీ చేయలేరు.  ఉచితంగా వస్తుంటే ఎవరు ధనం వదులుకుంటారు చెప్పు… ఎవరో కష్టార్జితాన్ని మనం ఉచితంగా పొందాలి… శ్రమ పడకుండా పొందాలి… కొద్దిగ కష్టపడితే  గుప్త నిధులు వచ్చేస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కదా!  ఈ చక్ర జాగృతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. స్వాధిష్ఠాన చక్రం జాగృతిలో ఉన్నప్పుడు కనపడతాయి.  కాకపోతే నేను వాటి మీద ఆశపడలేదు.  కానీ వాటిని నిజంగా చూడాలి…. ధ్యానంలో కనిపించినవి నిజమా కాదా అని చూడాలనుకున్నాను. అదే నా కొంప ముంచింది. ఇకనుంచి మనసుని నిగ్రహం చేసుకోవాలి. ధ్యానంలో కనిపించిన ప్రతిదాని వెంట మనం వెళ్ళకూడదు… అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను.  లేదంటే ఆ పిశాచికి  బంధనం అయ్యి బలి అయిపోయేదాన్ని. ఆహారం అయిపోయేదాన్ని. 

రుద్రస్వామి:- ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరమ్మ!  మాయ అంటేనే అది.  మాయాబంధనానికి తగ్గట్టుగానే చేస్తారు. నీ తప్పేమీ లేదు.

సరే ఇప్పుడు మనం గుడికి వెళ్దాము. గుడికి వెళ్లి ధ్యానం చేసుకుందాం.. అనేసరికి 

బాలగణపతి:- అమ్మ!  మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్రదేశాలు ఉంటే చూద్దాము…

అనేసరికి అప్పుడు శివ నందిని ఇంటర్నెట్లో ఈ కొల్హాపూర్ ప్రాంతానికి చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు సుమారుగా 10 ప్రదేశాలు ఉన్నాయని సమాచారం ఉండేసరికి… ఆ సమాచారాన్ని పిల్లలకు చెప్పి ఇక్కడ చుట్టుపక్కల పది ప్రాంతాలు ఉన్నాయట! వాటిని చూడడానికి వెళ్దాం అనేసరికి పిల్లలు స్నానాదికాలు గదిలోనే పూర్తిచేసుకుని… అందరూ మధ్యాహ్నం భోజనాలు కూడా కానిచ్చేసుకుని 1:00  అప్పుడు ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం జరిగింది. 

1.మహాలక్ష్మి దేవాలయం:- 

ప్రధాన క్షేత్రమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పంచగంగా నది ఒడ్డున ఉండటం సాధనా కుటుంబం గ్రహించి….అందులో స్నానం చేయడం జరిగింది. సానాదికాలు పూర్తి చేసుకుని ఈ ఆలయంలోనే తమ ధ్యానము జపము చేసుకోవడం జరిగింది. ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠమని….ఇక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయని…. ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు…ప్రళయకాలంలో పరమశివుడు కాశీని త్రిశూలంతో ఎత్తి పట్టుకున్నట్టుగా…. మహాలక్ష్మి అమ్మవారు తన చేతులతో ఈ నగరాన్ని ఎత్తి పట్టుకుంటుంది కాబట్టే ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని పిలుస్తారు .. కాబట్టి ఈ క్షేత్రం శ్రీమహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి అవిముక్త క్షేత్రం గా చెప్పబడుతుంది అని ఆలయ పూజారి చెబుతూ ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని కూడా చూపించడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఈ క్షేత్రానికి బిక్షకు వస్తారని చెబుతూ…. దత్తాత్రేయుని ఆలయమును చూపించడం జరిగింది. శ్రావణమాసం, దసరా నవరాత్రులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు.

2.న్యూ ప్యాలెస్ 

ఆ తర్వాత సాధన కుటుంబం అంతా న్యూ ప్యాలెస్ కి చేరుకోవడం జరిగింది…. హే ప్యాలెస్ ప్రాంగణం చాలా విశాలంగా ఉండటం…. పక్కనే తోట, ఫౌంటెన్ తో పాటుగా ఈ భవనం మొత్తం ఎనిమిది భుజాలు కలిగి ఉండి మధ్యలో ఒక గోపురంలా నిర్మించబడడం చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. ఈ రాజమౌళి పూర్తి చేయడానికి సుమారుగా ఏడు సంవత్సరాల సమయం పట్టింది అని అక్కడ ఉన్న గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. ఇందులోనే ఒక జంతుప్రదర్శనశాల మరియు భూగర్భంలో ప్రవహించే సరస్సు వంటి వాటిని చూడటం జరిగింది. శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. సాధన కుటుంబం వీటిని చూస్తూ…. పిల్లలకి చూపిస్తూ ఆనందపడుతూ అక్కడ  కాసేపు సమయం గడిపిన తర్వాత ప్రదేశానికి బయలుదేరడం జరిగింది.

3. భవాని మండపం 

సాధన కుటుంబం భవాని మండపానికి చేరుకోవడం జరిగింది. ఇది ఒకప్పుడు మహారాజు గారి యొక్క భవనంగా…ఆ తర్వాత చత్రపతి శివాజీ గారి దర్బారుగా ఉండేదని అక్కడి గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. ఈ మండపంలో షాహు మహారాజు యొక్క విగ్రహాన్ని చూడడం జరిగింది. అతని వేటాడిన జంతు కళేపరాలను శిధిలము అవ్వకుండా సందర్శకులకు వీలుగా చూసేందుకు అవకాశం కల్పించడంతో అందరూ కూడా వాటిని చూడడం జరిగింది. ఈ మండపం కింద నుంచి పనహావ అనే కొండ వరకు సొరంగ మార్గం ఉంటుందని గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. ఇలా కొంతసేపు అక్కడ సమయం గడిపిన తర్వాత తిరిగి మరో ప్రదేశానికి బయలుదేరడం జరిగింది. 

4. జ్యోతిబా ఆలయం

ఆ తర్వాత సాధనా కుటుంబం జ్యోతిబా ఆలయానికి చేరుకోవడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి కలయికగా ఈ జ్యోతిబా విగ్రహ మూర్తిని చెప్పడం జరిగింది. ఈయన నాథ్ సాంప్రదాయానికి చెందిన వారని…. రాక్షసులతో జరిగే యుద్ధంలో అంబాబాయికి ఈయన సహాయంగా ఉండి …ఆ తర్వాత ఈ పర్వతం పైనే తన రాజ్యాన్ని స్థాపించారు అని గైడ్ ద్వారా తెలుసుకొని ఆశ్చర్య ఆనందానికి లోనవ్వటం జరిగింది. 


5. రంకాల సరస్సు 

ఆ తర్వాత సాధన కుటుంబం రంకాల సరస్సులో చూడటానికి బయలుదేరడం జరిగింది…ఈ రంకాల సరస్సు అనేది మంచినీటి సరస్సుగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం…..శివుడు నందిని ఉపయోగించి, ఒక గోధుమ గింజను సరస్సు వైపు కదిలిస్తాడు మరియు ప్రతిరోజూ ఒక బియ్యపు గింజంత దూరం వెనక్కి నడుస్తాడు. హిందూ విశ్వాసాల ప్రకారం, శివుడు రాంకాల వద్దకు చేరుకుంటే, ప్రళయం ప్రారంభమవుతుంది అని విశ్వసిస్తారు. ఒకానొకప్పుడు ఇది రాతి గని లాగా ఉండేది అని గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. 

6. షాలిని ప్యాలెస్ 

రంకాల సరస్సు ఒడ్డున షాలిని ప్యాలెస్ చూడడం జరిగింది. యువరాణి షాలినీ రాజే పేరు మీదుగా  ఈ ప్యాలెస్‌కు  ఆ పేరు పెట్టడం జరిగిందని గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. 

7. పన్హలా కోట

పన్హలా అంటే సర్పాల ఇల్లు అని కూడా పిలుస్తారు అని ఆ కోటలో ఉన్న గైడ్ చెప్పగా తెలుసుకున్నారు. దక్కన్ లోని అతి పెద్ద కోటలలో ఇది ఒకటి. హోటల్ లోపలికి ప్రవేశించేటప్పుడు కనిపించే తీన్ దర్వాజా ద్వారా లోపలికి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఉన్న సజ్జ కోటి ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజు రాజ్య పరిపాలన పర్యవేక్షించే  వారని ఇక్కడి గైడ్ చెప్పగా తెలుసుకోవడం జరిగింది. రాజుల కాలంలో కనిపించే ధాన్య భాండాగారాలు అయిన అంబర్ ఖానా, అంధర్ బావడి అనబడే నీటి వనరులు, రహస్య మార్గాలు కలిగిన బావి వంటి వాటిని చూడటం జరిగింది. 

8. సమన్ఘడ్ హిల్స్ 

సమంగడ్  ఒక కొండ కోట . ఇది సముద్ర మట్టానికి 2,600 అడుగుల ఎత్తులో ఉందని తెలుసుకున్నారు. ఈ కోట కొండ యొక్క అండాకారపు శిఖరంపై ఉంది. కొండ శిఖరాన్ని చుట్టుకుని కోట యొక్క ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న గోడ ఇప్పటికీ అలాగే ఉండడం చూసి ఆశ్చర్య ఆనందాలకు గురయ్యారు. ఒకప్పుడు ఇక్కడ రాతితో చెక్కిన అనేక నీటి తొట్టెలు… కోటకు పుష్కలంగా నీటి సరఫరాను అందించేవని….కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా  చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలుసుకోవడం జరిగింది. 

9. విషాల్ఘడ్ కోట

మరాఠీయుల రాజ్యపాలనలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన కోటగా చెప్పడం జరుగుతుంది. దీనిని ఖిల్నా అని కూడా పిలుస్తారు. పవన్‌ఖిండ్ యుద్ధ  సమయంలో ముట్టడి సమయంలో శివాజీ సురక్షితంగా విశాల్‌గడ్ చేరుకోవడానికి…. బాజీ ప్రభు దేశ్‌ పాండే అనే  అతను తన ప్రాణాలను త్యాగం చేసిన చారిత్రక ఘట్టం ఈ ప్రదేశానికి సంబంధించినదిగా చెబుతారు. సాధనా కుటుంబం ఈ ప్రాంతాన్ని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత కోపేశ్వర దేవాలయానికి బయలుదేరడం జరిగింది. 

10. కోపేశ్వర ఆలయం

ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని కోపేశ్వర శివలింగం అని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి ఎదురుగా నంది ఉండకపోవడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దక్షయజ్ఞం సమయంలో సతీదేవితో పాటుగా నంది వెళ్లడంతో…. అదే దక్ష యజ్ఞములో సతికి జరిగిన అవమానం …ఆ తర్వాత సతీదేవి యోగాగ్నిలో దహనం అవటం…. అప్పుడు శివుడు వీరభద్రుణ్ణి తన జటల నుంచి సృష్టించడం…. ఈ ఘట్టమంతా కూడా ఈ ప్రదేశానికి సంబంధించినదిగా తెలుసుకోవడం జరిగింది. ఈ ఆలయంలో శివుని యొక్క లీలా విశేషాలను చెక్కటం గమనించారు.. ఆలయంలోనే స్వర్గ మండపం ఉండటం సాధన కుటుంబం గమనించడం జరిగింది. ఈ స్వర్గ మండపం లోకి ప్రవేశించగానే 48 స్తంభాలతో ఈ మండపం నిర్మించినట్టుగా చూడటం జరిగింది. శివ పరివారానికి సంబంధించిన విగ్రహాలు…బ్రహ్మ విష్ణువు యొక్క విగ్రహాలు కూడా ఉండడం గమనించారు. విష్ణుమూర్తి ఆలయం ఉన్న ఏకైక శివాలయం గా దీనిని నిర్మించడం జరిగిందని స్థానికులు  చెప్పగా తెలుసుకోవడం జరిగింది.


ఆ తర్వాత సాయంత్రం కల్లా అందరూ ఆ ప్రదేశాలన్నీ చూసుకొని యధావిధిగా… గదికి వెళ్లి స్నానాదికాలు చేసుకొని టిఫిన్ లు చేసుకుని గుడికి బయలుదేరడం జరిగింది.  ఎవరికి వారే అన్నట్టుగా  తమ తమ ఆలోచనలలో ఉండిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత ధ్యాననిష్టలో ఉన్న శివ నందినికి ఈసారి పొలంలో ఒక పెద్ద భూషాణంలో వజ్రాలు, వైడూర్యాలు మణిరత్నాలు ఉన్నట్టుగా కనిపించి…. ఆ భూషాణానికి పైన ఒక సర్పబంధనం ఉన్నట్లు… రెండు సర్పాలు తిరుగుతున్నట్లుగా… ఆ తర్వాత కొన్నాళ్లకి ఒక సర్పమును చంపేసినట్లుగా ఆ తర్వాత ఇంకొక సర్పం అక్కడ ఉన్నట్లుగా కనిపించింది.  ఎవరో మనుషులు లీలామూర్తిగా కనిపించారు.  ఇలా ధ్యాన దృశ్యం కనిపించేసరికి ఇప్పుడు ఈ పొలం దగ్గరికి వెళ్ళాలా? ఈ పొలంలో ఉన్న వాటిని చూడాలా? ఇప్పుడు అంత ఓపిక లేదు. ఆసక్తి లేదు అని అనుకోగానే ధ్యానభంగం అవడంతో కళ్ళు తెరిచింది. ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడం చూసి…. సరే అని ఆ గుడిలో ఉన్న ఉప ఆలయాలను చూస్తూ…. ఆ రోజంతా గడిచిపోయింది.  ఆ తర్వాత చీకటి పడుతూ ఉండటంతో….అందరూ కలిసి గుడి నుంచి బయటికి వచ్చి భోజనాలు కానిచ్చేసుకుని గదికి వెళ్ళటం జరిగింది. గదిలో విశ్రాంతి తీసుకుని యధావిధిగా ధ్యాన నిష్టలోకి వెళ్లిపోయింది.  అప్పుడు యధావిధిగా పొలంలో గుప్తనిధుల భూషాణం ఉన్నట్టు…దానికి సర్పబంధనం ఉన్నట్టు… కనిపించింది.  ఈసారి అస్పష్టంగా కనిపించిన మనుషులు కాస్త స్పష్టంగా కనిపించారు. భార్యాభర్తలు ఇద్దరూ సజీవ మూర్తిగా…. స్పష్టంగా కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. వీళ్లేంటి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నారు.  ఏం జరుగుతుందో అనుకోగానే…. కొంతసేపటికి భార్యాభర్త , పిల్లాడు ఉన్నట్టుగా కనిపించడం…. ఆ తర్వాత భార్య ఉండి ఆ తండ్రి ,పిల్లాడు చనిపోయినట్లుగా కనిపించడం… పాము కాటుకు బలి అయిపోయినట్లుగా కనిపించడం జరిగేసరికి…. ఈ దగ్గరిలో ఏదో నిజ సంఘటన జరిగి ఉండాలి అని…. అయినా కూడా నేను ధ్యానం చేయకపోయినా… కళ్ళు మూసుకునేసరికి ఈ విషయం పదేపదే ఎందుకు కనపడుతుంది అని అనుకునేసరికి… చివరికి కృష్ణస్వామి, యోగంబిక కనిపించేసరికి ఓహో! నేను ఈ ధన మాయలో పడతానని వీళ్ళు చేస్తున్న ప్రయోగమా?  సరే అని అనుకొని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోయేసరికి… సరే అని కాసేపు బయటకు వెళ్లి అలా తిరుగుదాం అనేసరికి కృష్ణస్వామి మరియు యోగాంబిక భౌతిక శరీరాలతో తన కళ్ళముందే నవ్వుతూ వెళ్లిపోవడం గమనించి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారన్నమాట! ఇక్కడికి వచ్చారని చెప్పడానికి తనకు నిద్రాభంగం కలిగించారన్నమాట అని… మళ్లీ యధావిధిగా కాసేపు గదికి వెళ్లి ధ్యానం చేసుకుని ఈ నాగ బంధనం ఉన్న గుప్త నిధులు కనిపించకపోయేసరికి…. మనసులో తనకి ఇష్టమైన శివుణ్ణి తలుచుకుంటూ… అలాగే ధ్యానంలోకి వెళుతూ ….నిద్రమత్తులోకి వెళ్లిపోయింది.  కళ్ళు తెరిచి చూసేసరికి…. తెల్లవారుజామున మూడు గంటలు అయిందని గ్రహించింది.  అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారని తెలుసుకొని…. తన ధ్యానం తాను చేసుకోవడం మొదలు పెట్టింది.  ధ్యానంలో తిరిగి యధావిధిగా నాగ బంధనం ,గుప్త నిధులు కనిపించడం…తను చూసిన ముగ్గురు కుటుంబ సభ్యులు కనిపిస్తూ ఉండేసరికి…. ధ్యానం నుంచి లేచి చూస్తే సుమారుగా ఐదు గంటలు అవ్వటంతో ……పిల్లలు పెద్దలు కూడా లేచారని అలికిడి అవ్వడంతో…. కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ స్నానాదికాలు చేసుకొని తనకోసం సిద్ధంగా ఉండేసరికి…. అమ్మవారి సుప్రభాత సేవకు వెళదామా అనేసరికి ….అందరూ కలిసి అమ్మవారి సుప్రభాత సేవకు వెళ్ళటం జరిగింది. అప్పటికే సుప్రభాత సేవ మొదలుపెట్టేశారు అని తెలుసుకొని మధ్యలోనే ఉండి సుప్రభాత సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి వాళ్లే ఈ కార్యక్రమం అయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నారు. పిల్లలు ఇద్దరు జపంలో కూర్చుంటే శివ నందిని, మహాదేవి , రుద్రస్వామి ధ్యానంలో కూర్చున్నారు. శివ నందినికి ధ్యానంలో యధావిధిగా నాగబంధం ఉన్న గుప్త నిధులు ,కుటుంబ సభ్యులు కనబడుతూ ఉండేసరికి…. ఏం జరుగుతుందో అని ధ్యాన నిష్ఠ  నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత శివనందినికి  కలిగిన ధ్యానంలో అస్థిరతను, అవస్థలు గమనించిన మహాదేవి, రుద్రస్వామికి కూడా ధ్యానభంగం అవ్వడంతో వాళ్లు కూడా కళ్ళు తెలిసి చూసి ఏమైంది? ఏం జరిగింది?  అని చూసేసరికి….. తనకి కలిగిన గుప్త నిధుల ధ్యాన అనుభవం, కుటుంబ సభ్యులు… పైగా కృష్ణస్వామి, యోగాంబిక గురించి చెప్పేసరికి…. ఓహో ! ఇది వీళ్ళు ఉపయోగించిన తంత్రం అయి ఉంటుంది.  సరేలే ఏం జరుగుతుందో కాలానికి వదిలేద్దాం.  వాటిని చూడాలనుకుంటున్నావా?  అంటే లేదు నాకు ప్రత్యక్షంగా చూడాలని ఆలోచన లేదు అని అనేసరికి…. సరే ఏం జరుగుతుందో ఏమో మనకేం తెలుసు.  ఎవరికి ఎరుక!  అని అనుకుంటూ ఉండేసరికి….సుప్రభాత సేవా కార్యక్రమాలు చేసుకుని…. కొంతమంది కుటుంబ సభ్యులు గుడి నుంచి బయటకు వస్తూ ఉండగా ..  అందులో ఒక ఆవిడ వితంతువుగా తన ముందు నుంచి తనని దాటి వెళ్లిపోవడం శివ నందిని ఆమెను చూసి ఆశ్చర్య ఆనందాలకు గురవుతూ….. శివ నందిని కాస్త రుద్ర స్వామి కేసి చూస్తూ…. 

శివ నందిని:- అయ్యా!  ఈవిడే నాకు ధ్యానంలో కనపడింది. కాకపోతే ధ్యానంలో ముత్తయిదువుగా కనపడింది. బయట వితంతువుగా కనబడింది.  

రుద్రస్వామి:- భర్త చనిపోయి ఉండాలి.  పిల్లాడు చనిపోయి ఉండాలి.అయితే విషయం ఏమిటో తెలుసుకుందాము… నువ్వు ఇక్కడే ఉండు ..

అని రుద్ర స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మ!  నీ భర్త , పిల్లాడు పాము కాటు వల్ల చనిపోయారా?  అది కూడా గుప్త నిధుల వేటలో చనిపోయారా?  అనేసరికి మీకు ఎలా తెలుసు స్వామి!  అయినా మీరు యోగులు లాగా ఉన్నారు. సాధకులకీ …సిద్ధ పురుషులకి తెలియనిది ఏముంది!  అది మా వంశానికి శాపం… అనేసరికి నాకు కనపడలేదు, నా కూతురికి ధ్యానంలో పదే పదే కనపడుతున్నారు.  అది తెలుసుకోవాలని మీ దగ్గరికి రావడం జరిగింది తల్లి ! అనేసరికి ధ్యానంలో కనపడటమా విచిత్రంగా ఉందే!  ఎవరికీ కనబడుతుంది అని ఆవిడ అనేసరికి… శివనందిని కేసి చూపిస్తూ ఉండేసరికి… నాకు కూడా ఈ అమ్మాయి గత మూడు రోజుల నుంచి కలలో కనపడుతుంది.  నాకు అర్థం కాలేదు.  ఈవిడ ఎవరో నాకు తెలియదు కదా! నా సమస్యకు పరిష్కారం, అర్థం ఈ అమ్మాయి చూపిస్తుందేమో!  అనేసరికి నీకు ఈ అమ్మాయి కనపడడం ఏమిటి?  అంటే మీకు విషయం అంతా చెబుతాను అయ్యా!  అని శివనందిని దగ్గరికి వచ్చి విషయం చెప్పడం ఆరంభించింది. 


శివ నందిని కి ఉన్న దివ్య తేజస్సుకి, ఆకర్షణ శక్తికి, దైవ శక్తికి …. అమ్మా !నువ్వే నా సమస్యకు పరిష్కారం చూపించాలి. దేవుడే నిన్ను పంపించినట్టు ఉన్నాడు అనేసరికి  విషయం ఏమిటి అని శివ నందిని అనేసరికి నా పేరు విజయనందిని. మా తరాల వాళ్ళందరూ ….మేము ఇక్కడే పొలం పనులు చేసుకుంటూ ఉంటాము.  అనుకోకుండా ఒకసారి పొలం కొనడం జరిగింది. ఆ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, ఆ పొలం తవ్విన తరువాత గాని మాకు తెలియలేదు.  కాకపోతే ఆ గుప్త నిధులు నాగబంధనంతో రెండు సర్పాలతో బంధనం చేసి ఉన్నట్లుగా…. మాకు ఒక మాంత్రికుడు ద్వారా తెలిసింది.  ఆ గుప్త నిధులను ఎలాగైనా వచపరుచుకోవాలని మా వారు విశ్వ ప్రయత్నాలు చేశారు.  అప్పటికి నేను అన్నాను… పాములతో పెట్టుకోవద్దు. అవి దేవతాపాములు.  పైగా బంధం వేసి ఉన్నారు. అవి ప్రాణాలు పోయే దాకా…. నిధులు ఎవరికి చెందాలో వారికి చెందేదాకా నిద్రపోవు. వంశాలే నాశనం అవుతాయి అంటే , అవన్నీ పుక్కిటి పురాణాలు అన్నారు.  మేమైనా కావాలని కోరుకున్నామా?  మేము కొన్న పొలంలో  గుప్త నిధులు ఉన్నాయి. అవి మనకే చెందాలి అని నా మాట కూడా లెక్కచేయకుండా… పట్టించుకోకుండా నాగబంధం తీసే మాంత్రికుడిని పిలవడం జరిగింది.  ఒకరోజు వీళ్ళు అర్ధరాత్రి పూజలు చేసి ఒక ఆవు పేడ ముద్దలో పాముని బంధనం చేయాలి అని అనుకున్నారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే…. దంపతుల పాములు బంధం చేశారని…. ఆ మాంత్రికుడు గమనించలేదు. సహజంగా నాగబంధం ఒక పాముతోనే బంధనం వేస్తారు.  కానీ వాళ్ళు రెండు పాములు పైగా జంట పాములతో బంధనం చేశారన్న విషయం మాంత్రికుడు గ్రహించలేకపోయాడు. లోపల గుప్త నిధుల దగ్గర ఆడ సర్పం ఉంది.  బయట మగ సర్పం ఉంది.  దాంతో వీళ్ళు బంధనం వేసేసరికి బయట తిరుగుతున్న మగసర్పం కాస్త బంధన విముక్తి కోసం పెట్టిన ఆవు పేడలో ఇరుక్కుపోయి…. ఊపిరి ఆడక చనిపోవడం జరిగింది.  ఈ విషయం గుప్త నిధులకి కాపలా కాస్తున్న ఆడ సర్పానికి తెలిసి  మా ఆయనను, సహాయం చేసిన మిత్రుల్ని,  పని వాళ్ళనీ కాటు వేసి చంపేదాకా నిద్రపోలేదు.  సరే అని చెప్పి ఇక గుప్త నిధుల జోలికి నేను వెళ్లడం మానేశాను.  ఎప్పుడైతే సర్ప  బంధనంలో గుప్త నిధులు ఉన్నాయని స్థానికులు అందరికీ తెలిసిందో… అప్పటినుంచి పొలం కొనడానికి కూడా భయపడ్డారు.  ఉచితంగా ఇస్తామన్నా కూడా దేవత సర్పాలు, సర్ప దోషాలు సర్ప శాపాలు ఉన్న వాటిని ఎవరు కొంటారు అని ఇక్కడ ఉన్న జమీందారులు అనేసరికి నేను ఇక పట్టించుకోవడం మానేశాను.  ఆ తర్వాత నా కొడుకు పెద్దవాడు అయ్యే కొద్ది…. గుప్త నిధుల మీద ఆశ పెరగటంతో వాడికి యుక్త వయసు వచ్చి వివాహం చేసుకునే వయసు వచ్చిన తరువాత …..నాకు తెలియకుండా ఒక రోజు వాళ్ళ నాన్నగారు చేసిన తప్పే వాడు చేయడం జరిగింది. ఒకరోజు అర్ధరాత్రి నాకు తెలీకుండా పొలానికి వెళ్ళి బంధనం చేయాలని చూస్తే.. పాము ఎదురు తిరిగి అందరిని చంపడం జరిగింది. నా కొడుకు పోయాడు, నా భర్త పోయాడు, నాకు వాటి మీద ఆశ లేదు.  కాకపోతే అది ఎవరికి చెందాలో వాళ్లకి చెందేటట్లు చేస్తే…. కాస్త నాకు విముక్తి కలుగుతుంది అనుకుంటున్నాను. ఆ మగ సర్ప దోషానికి ఆ రోజు నుంచి నా తరపు వాళ్ళకి మా ఆయన  తరుపు వాళ్ళకి ఈతి బాధలు కలుగుతున్నాయి.  అందరూ కూడా సర్పమును చంపిన దోషమును, సర్పమును బాధించిన విషయాల వలన ఎవరికి నిద్ర పట్టడం లేదు.  ఎవరికి వివాహాలు కావడం లేదు.  వివాహాలు అయినా కూడా విడిపోతున్నారు.  సంతానం ఉండటం లేదు.  నిలబడటం లేదు.  మగసంతానం ఉండటం లేదు.  వంశ వృద్ధి లేదు. పుడితే ఆడ సంతానం. అది  కూడా అకారణంగా ….అనారోగ్య సమస్యలతో నయంకాని సమస్యలతో పుట్టి చనిపోతున్నారు. ఇలా ఏడు తరాల నుంచి జరుగుతుంది.  నా వంశమే కాదు… ఆయన తరుపు వాళ్ళ వంశాలు కూడా ఈ సర్ప శాపానికి గురవుతున్నారు. దీనికి నా జీవితకాలం లోపల విముక్తి చేయించాలని అనుకుంటున్నాను.  ఎటు నా వంశం పోయింది….మా వారి వంశాలు… నా తరుపు మిగిలిన వారు ఎందుకు నాశనం అవ్వాలి అని చెప్పేసి… నా బాధ.  ఆ స్థలానికి సంబంధించిన యజమాని ఎవరైనా ఉంటే అవి వారికి ఇచ్చేస్తాను.  కానీ ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు.  ఆ యజమానులు ఎవరో కూడా గుర్తించలేకపోతున్నారు. ఎవరికీ ఎలా ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు. సరే  అని చెప్పి ఈ స్థలాన్ని ఉచితంగా ఎవరికైనా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఇద్దాము అని చూసినా కూడా ….కొన్నాళ్ళకి ఆ ట్రస్టు వాళ్ళు చనిపోవడం, అకాల మరణం పొందడం, నయం కానీ వ్యాధులతో ఇబ్బంది పడడంతో ఇక వాళ్ళు తిరిగి నాకు ఇచ్చివేయడం జరిగింది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.  ఇటు వంశాలు బాధపడుతున్నాయి.  అటు ఆడ పాము కూడా ఇబ్బంది పడుతుంది. మనోవేదనకి గురి అవుతున్నాము.  దీనికి నువ్వే పరిష్కారం చూపించాలి….అనేసరికి అమ్మ!  సమస్య ఉంది అని నాకు తెలిసింది. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏమి చేయాలో….ఎలా చేయాలో…. నాకు తెలియదు.  ఒకవేళ అక్కడికి వెళితే విషయం ఏమైనా తెలుస్తుందేమో! ఆ గుప్త నిధులు ఉన్న ప్రాంతానికి తీసుకు వెళ్లగలవా?  అంటే సరే రండి అని తన కారులో అందరినీ ఎక్కించుకొని  నాగ బంధనం ఉన్న నిధుల ప్రాంతానికి వెళ్లడం జరిగింది. చూస్తే విశాలమైన పొలాలు సుమారుగా 100 ఎకరాల మధ్యలో ఒక ఎకరంలో వీళ్ళు ఉన్న వైపు భూమి లోపల గుప్తనిధులు ఉన్నట్టుగా ధ్యానంలో కూర్చున్న శివ నందిని గ్రహించింది.  సరే అని శివ నందిని కాస్త తల్లి! ఇక్కడ సర్ప శాపాలు ,సర్ప దోషాలు పోవాలంటే జంట నాగులు ఉన్న దేవాలయం కట్టించాలి.  సహజ సిద్ధంగానే పుట్ట ఏర్పడుతుంది. వాటికి పూజా కార్యక్రమాలు చేయాలి.  ఒక పూజారిని ఏర్పాటు చేయాలి.  సంతాన నాగేంద్ర స్వామిగా పేరు పెట్టాలి అని పూనకం వచ్చిన దానిలాగా చెబుతూ ఉండేసరికి సరే తల్లి! నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను.  మా వంశస్థులు అందరికీ కూడా సర్ప బాధలు, సర్ప దోషాలు పోయేటట్టుగా అనుగ్రహించు తల్లి ….అంటే నాకు పూజలు చేస్తే… నా జంట నాగులు ఉన్న ప్రతిబింబానికి నిత్య అర్చన చేస్తే…. మంగళవారం మీ కుటుంబ సభ్యులు అందరూ చేస్తే…..వాళ్ళకి నా వల్ల కలిగే ఈతి బాధలు అన్నీ కూడా పోతాయి.  అలాగే గుప్త నిధులు ఉన్న యజమాని వివరాలన్నీ కూడా శివ నందిని అనర్గళంగా చెబుతూ ఉండేసరికి…. వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు… సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటారమ్మ… వాళ్ళు యజమానులు అని మాకు తెలియదు. ఒకవేళ వాళ్ళని అడిగి చూస్తాము, వాళ్ళు యజమానులు అయితే ఆ గుప్త నిధులు వాళ్ళకి అందేటట్లు చేస్తాము అనేసరికి… గబగబా తెలిసిన వాళ్ళకి ఈవిడ ఫోన్ చేసి చెప్పడంతో శివ నందిని చెప్పిన వ్యక్తుల గుర్తులు ఉన్నవాళ్లు కాస్త ఈ పొలం దగ్గరికి రావడం…. ఆ పొలం చూసి అది వాళ్ళ ముత్తాత గారి స్థలం అని చెప్పేసి మనవళ్ళు చెప్పేసరికి…. దానికి సంబంధించిన కాగితాలు అన్నీ స్థల వివరాలతో చూపించేసరికి… విజయనందిని  అనుమానాలు పోయాయి. శివ నందిని ధ్యాననిష్ట నుండి బయటకు రావడంతో… విషయం అంతా చెప్పేసరికి సరే మీకు వీళ్లే యజమానులు అని నమ్మకం కుదిరిందా? అనేసరికి నాకు ఎలాంటి అనుమాన భయం లేదు. వాళ్ళు నిజమైన యజమానులు అయ్యారో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళ ముత్తాతలకు ఈ స్థలం మీద అధికారం ఉందని చెబుతున్నారు.  ఆ గుప్తనిధుల విషయం వాళ్లే తెలుసుకోవాలి.  ఇక్కడ గుడి కట్టించడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అనేసరికి…. వాళ్ళు స్థలాన్ని ఉచితంగా ఇస్తాం అన్నప్పుడు మా వంతుగా మేము గుడి కట్టడానికి సహాయ సహకారాలు అందిస్తాము.  ఆ గుప్త నిధుల మీద మాకు ఎలాంటి ఆశ లేదు. ఆ గుప్త నిధులతోనే మనం దేవాలయం కట్టించవచ్చు అనేసరికి… సరే అని మాంత్రికుడిని పిలిపించడం జరిగింది. అతను పూజాది కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత ఒకచోట గుప్త నిధులు ఉన్నాయని తవ్వమని చెప్పడంతో….ఆ గుప్త నిధులు ఉన్నచోట తవ్వేసరికి పెద్ద  భూషాణము….ఆ భూషాణము తెరవడానికి నానా అవస్థలు పడుతుంటే… మాంత్రికుడి వల్ల కూడా కాలేకపోయింది.  అప్పుడు దీనికి సంబంధించిన వంశస్థుడైన ముని మనవడు వచ్చి పెట్టే మీదే చెయ్యి పెట్టగానే… పెట్టే తెరుచుకునే సరికి శివ నందిని, విజయనందినికి నమ్మకాలు వచ్చాయి.  ఈ గుప్తనిధులకు నిజమైన యజమానులు వీళ్లేనని గ్రహించడానికి వారికి అట్టే సమయం పట్టలేదు. వాళ్ళ ముగ్గురు వంశస్థులు ఆ భూషాణం లోపల ఉన్న ఆభరణాలు చూసి… ఇవే మా ముత్తాతల ఆభరణాలు… వాళ్ళు వాడే వారని మా అమ్మవాళ్లు చెప్పేవాళ్ళు అని ఆడవాళ్లు గుర్తులు చెబుతూ…. వాటి వెనకాల చూడంగానే ఫలానా హారం వెనకాల ఇలా పేరు ఉంటుందని…. దానిమీద సంవత్సరం కూడా రాసి ఉంటుందని వాళ్లతో పాటు వచ్చిన పెద్దావిడ వయోవృద్ధురాలు చెబుతూ ఉండేసరికి… అవునా? కాదా? అని రుద్ర స్వామి, మహాదేవి ఆభరణాలు తీసుకొని చూసేసరికి ఆవిడ చెప్పిన పేర్లు సంవత్సరాలు ఉండేసరికి అప్పుడు శివనందిని కేసి చూసి అమ్మ!  నీకు ధ్యానంలో కనిపించిన వాళ్ళు వీళ్లే. వీళ్లే  నిజమైన యజమానులు.  వీళ్ళకి గుప్త నిధులు అందాయి.  ఇంక ఎలాంటి ధర్మ సందేహాలు అనుమాన భయాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి విజయనందిని కేసి చూస్తూ అమ్మ! విజయ!  నీ కోరిక తీరిపోయింది. నువ్వు అనుకున్నట్లుగానే యజమానులకి గుప్తనిధులు అందుతున్నాయి. మాకు మాట ఇచ్చిన ప్రకారంగానే పైన జంటనాగుల ప్రతిబింబాన్ని ప్రతిష్టించు.  దేవాలయం కట్టించు అనేసరికి…. శివ నందిని చేసి చూస్తూ అమ్మ!  నువ్వు ఇంత సహాయ సహకారాలు అందించావు కాబట్టి… ఈ స్థలానికి యజమానికి నేను కాబట్టి… అందులో నీకు కావలసిన హారంగానీ, మణులుగానీ,బంగారపు నాణాలు గానీ, నీవు కావాల్సినవి తీసుకో!  దానికి తగ్గ మొత్తం యజమానులకు నేను చెల్లిస్తాను అనేసరికి శివనందిని వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వి…. నాకు అవసరం లేదు.  నాకు మణులతో సంబంధం లేదు. ఈ బంగారంతో సంబంధం లేదు. కాకపోతే నా మనోవేదన తీర్చుకోవాలి. నాకు ధ్యానానికి భంగం కలిగిస్తుంది. సమస్యకి పరిష్కారం చూడాలి అని చెప్పి వచ్చాను అని అనేసరికి ….అంటే ఇప్పుడు ఈ గుప్తనిధుల మీద నీకు ఆశ లేదంటావా మరి!  వీటి మీద ఆశ లేనప్పుడు మరి ఇంట్లో ఉన్న పిశాచ బంధనం ఉన్న దాని దగ్గరికి ఎందుకు వెళ్లావు ?ఆ నిధుల గురించి ఎందుకు ఆలోచించావని, గొంతు వినబడే సరికి ఎవరిది? ఈ గొంతు….. ఎక్కడో విన్నట్టుగా ఉంది అని అందరూ అటుకేసి చూసేసరికి….కృష్ణస్వామి మరియు యోగాంబిక వస్తూ ఉండేసరికి…. వీళ్ళను ఆ నిధుల యజమాని గుర్తుపట్టి అమ్మ ! వీళ్ళే మా దగ్గరికి వచ్చి త్వరలోనే మీ నిధులు మీకు దొరుకుతాయి.  మీకు గుప్త నిధులు ఉన్నాయి.  ఫలానా పొలంలో ఉన్నాయి. వాళ్ళంతట వాళ్లే మీ దగ్గరికి వస్తారు.  మీకు నిధులు అందేటట్టు మేము చేస్తాము.  మాకు కావాల్సిందల్లా ఈ నిధి గురించి చెప్పిన వాళ్ళకి మీరు ఈ నిధులను అంటగట్టాలి అని అన్నారు అనే సరికి…. శివ నందిని పక్కున పెద్దగా నవ్వుతూ ఓహో!  ఈ విధంగా మీరు నాకు సహాయం చేశారన్నమాట! నన్ను ఆపదలో పెట్టాలనుకున్నారు..కానీ మీకు తెలియకుండా మీ సహాయ సహకారాలు అందించారు.  మీరు గాని ముందు వెళ్లి కలవక పోయి ఉంటే…. ధ్యానంలో వీళ్ళు నాకు కలిసే వాళ్లే కాదు.  సమస్యకి పరిష్కారం అందేది కాదు. నాకు ఆపద చేయాలనుకున్న వాళ్ళు సహాయం అందించారని చెప్పి …నాకు ఎలాంటి గుప్త నిధుల మీద మమకారం లేదు.  మోహ వ్యామోహాలు లేవు.  ధ్యానంలో మొట్టమొదటిసారిగా చూడటం వలన ఆ ఇంట్లో పిశాచ బంధనంలో గుప్త నిధులు ఉన్నాయా! లేదా? ఉంటే ఎలా ఉంటాయి ఏంటి? అని తెలుసుకోవాలని వెళ్లడం జరిగింది.  అనుకొని పరిస్థితుల్లో ఆ పిశాచానికి బంధనం అవ్వటం…. ఆ. పిశాచ బంధనం నుంచి బంధ విముక్తి అవ్వటం చూసే ఉంటావు కదా!  నీకు తెలియనిది కాదు కదా! నాకు వీటి మీద మమకారాలు లేవు అని చెప్పేసి ఆ భూ గృహం నుంచి శివ నందిని ఏమీ తెలియనట్టు…. ఏమీ పట్టనట్లుగా వెళ్లేసరికి వీరిద్దరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉండేసరికి…. ఆ నిధుల యజమానులు కాస్త మీకు కావాలంటే మీకు కొంత భాగం ఇస్తామని యోగాంబికా, కృష్ణస్వామితో అనేసరికి మేమేం చేసుకోవాలి… మాకేం సంబంధం లేదు ….మాయని సృష్టించే వాళ్ళం మేము…. మాయలో పడేవాళ్ళం కాదు అని అర్థమయ్యి అర్థం కాని విధంగా మాట్లాడుతూ ఉండేసరికి….వీళ్ళిద్దరూ కూడా యధావిధిగా సాధనా కుటుంబాన్ని అనుసరించి పైకి రావడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకి విజయనందిని మాట ఇచ్చినట్టుగానే అక్కడ చిన్నపాటి ఒక దేవాలయము సంతాన నాగేంద్ర స్వామి గుడి కట్టించడం జరిగింది. జంట పాములు మధ్యలో ఒక శివలింగం ఉన్నట్లుగా మూడు అడుగుల రాతి ప్రతిబింబం ప్రతిష్ట చేయడం…. ఇవన్నీ కూడా జరిగినందుకు చెప్పడం జరిగింది. సరే మంచిది కదా అని శివ నందిని కూడా అక్కడ దేవాలయం చూడడానికి ….అక్కడికి వెళ్ళటానికి ఆసక్తి చూపించలేదు.  గుప్త నిధులు యధావిధిగా యజమానులు తీసుకున్నారని చెప్పేసి దాన్ని ప్రభుత్వానికి అందజేశారని చెప్పేసి ఏవో వివరాలు చెప్పేసరికి అది నిజమా అవునా కాదా? అని కూడా శివ నందిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.  తన ధ్యాననిష్ఠలో తను కొనసాగుతూ ఉన్నది.


శివనందినికి తనకి ధ్యానంలో కనపడిన ధ్యాన దృశ్యాలు అక్షర సత్యమని…. వాటిమీద మనం మోహ వ్యామోహాలు పడకూడదని అనుభవ అనుభూతి పొందడంతో…. ఈ చక్రంలో ఉన్న ధనమాయ కాస్త తగ్గిపోతూ ఈ చక్ర శుద్ధి పూర్తి అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ చక్ర  అధీనం చేయాలంటే… ఈ చక్రానికి సంబంధించిన అధిష్టాన దైవం రావాల్సి ఉంటుంది అని ఈమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అలాగే తనకి వచ్చిన లక్షణాలు గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి…

స్వాధిష్ఠాన చక్ర ఆధీనం లక్షణాలు:- 

రుద్రస్వామి:-  అమ్మ! నీకు  స్వాధిష్ఠాన చక్రం జాగృతి, శుద్ధి అయ్యాయి. అలాగే ఇప్పుడు ఆధీనం మొదలైంది. ఈ ఆధీనానికి చక్రదేవత అయిన మహాలక్ష్మి దేవి విగ్రహ మూర్తి రావటం జరగాలి. ఎప్పుడైతే ఆవిడ వచ్చి నీకు వశం అవుతుందో అప్పుడు నీకు ఈ చక్రం ఆధీనం అవుతుంది. తద్వారా నీకు జలసిద్ధి వస్తుంది. నీకు నీటి మీద నడిచే సిద్ధి వస్తుంది.సాధారణ యోగ సాధకులకు ఈ సమయంలో కాసు వచ్చిన లేదా లక్ష్మీ గవ్వలు వచ్చిన లేదా లక్ష్మీ శంఖం వచ్చిన ఈ చక్ర మాయ దాటి ఆధీనం అయ్యినట్లే. ఈ మాయని దాటితే చక్ర అధీనంలో నీకు జలము మీద ఆధిపత్యం వస్తుంది.

శివనందిని:- ఈ సిద్దులు రావటం అవసరమా స్వామి! ఇప్పుడు ఉన్న మాయలు చాలక ఈ సిద్దుల మాయలు కావాలా?

రుద్రస్వామి:- ఎవరైతే…. ఏ చక్రమైతే ఆధీనం అవుతుందో…. ఆ చక్రానికి సంబంధించిన సిద్ధి ఉంటుంది.  ఆ సిద్ధిని ఉపయోగించుకుంటావా! ఉపయోగించుకోవా? అని ప్రకృతి పరీక్ష పెడుతుంది.  ఒకవేళ సిద్ధుల మాయలో పడి నువ్వు ఆగిపోవచ్చు కదా!

శివ నందిని:- ఎందుకు ఈ మాయలు? ఈ మాయలు అవసరమా!

రుద్రస్వామి:- మోక్షం పొందటం ప్రకృతికి ఇష్టం లేదు.  అదే అందరూ మోక్షం పొందుతూ ఉంటే… ఈ జగన్నాటకంలో నాటకం వేసే వాళ్ళు ఎవరు? నటించే వాళ్ళు ఎవరు? జీవించే వాళ్ళు ఎవరు… ఉండే వాళ్ళు ఎవరు? అందరూ అలా శూన్యంలోకి వెళ్ళిపోతే…. ఇక జగన్నాటకంలో ఎవరు ఉండరు కదా! ఈ ఆడే నాటకం కాస్త ఆగిపోవాల్సిందే కదా!  అలా ఆగిపోవడం ప్రకృతికి ఇష్టం లేదు.  ప్రకృతి పురుషుడికి ఈ జగన్నాటకం ఆగిపోవడం ఇష్టమే.  ప్రకృతి స్త్రీకి ఈ జగన్నాటకం ఆగిపోవడం ఇష్టం లేదు.  ఎందుకు అంటే ఈ నాటకం ఉంటేనే కదా ! ఈతి బాధలు పడుతూ ఉంటేనే కదా!  ఆనందాలు కష్టాలు పడుతూ దానికి నాయిక ,ప్రతినాయక పాత్రలు ఉండి కష్టసుఖాలు పడుతూ ఉంటే ఆ నాటకం చూడటానికి వినోదభరితంగానూ….ఆశపరితంగానూ… వేధనాభరితంగానూ… నవరసాలతో ఉంటుంది.  ఆ నవరసాల నాటకాన్ని చూడాలి అని చెప్పేసి ప్రకృతి స్త్రీ అనుకుంటుంది.  పురుషుడు,  చూసిన నాటకాన్నీ ఏం చూస్తాము! విసుగు వస్తుంది అంటే…. చూసిన నాటకాన్ని ఎన్నిసార్లు అయినా చూడచ్చు. అందులో ఒక్కొక్క రకంగా…. ఒక్కొక్క విధంగా ఉంటుంది. హావభావాలు ఒక్కొక్కరకంగా పెడతారు.  వాటిని చూడాలి….అనుభవించాలి అని చెప్పేసి…. ప్రకృతి స్త్రీ చెప్పడం జరుగుతుంది.  ప్రకృతి పురుషుడికి …ఇదంతా భ్రమ ,బ్రాంతి ఇదంతా నిజం కాదు.  తన మనోభావాలకి యద్భావం తద్భవతి అన్నట్లుగానే ఆ పాత్రలు ఉంటున్నాయని ఆయన గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  అందుకనే ఆయన శూన్యం అయిపోయాడు.  శూన్యం కావాల్సిన… మోక్షం పొందాల్సిన అమ్మవారు కాస్త అమోక్షమునకు పొంది భ్రమ, బ్రాంతి అయిన ఈ నాటకం సత్యమని భ్రమింప చేస్తుంది.  ఆ భ్రమల నుంచి ఎవరైతే తొలుగుతారో….ఎవరైతే మోక్షమును పొంది శూన్యం అవుతారో….వాళ్ళని శూన్యం కాకుండా ఉండటానికి అని చెప్పేసి మహా మాయగా ఆవిడే ఉన్నది.  ఈ మహా మాయకి అధిష్టాన దైవం ఎవరో తెలుసా?  మహాలక్ష్మి.  అందుకనే ఎవరి ఇంట్లో ఉంటుందో…ఎవరి దగ్గర ఉంటుందో…. ఆవిడకి తప్ప ఇంకెవరికి తెలియదు.  అందుకనే మహామాయకి సంకేతంగా మహాలక్ష్మిని పెట్టడం జరిగింది. అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఎనిమిదవ సంఖ్య కూడా మహాలక్ష్మికి సంబంధించినదే. ఆ ఎనిమిదవ సంఖ్యను మాయా సంఖ్య అని కూడా అంటారు.  ఎందుకంటే అష్టదైవాలు, అష్టదిగ్బంధనాలు, అష్టదిక్కులు, అష్టమూర్తులలో ఇలా ఎనిమిదవ సంఖ్య గురించి చెప్పడం జరిగింది. మనం ఎవరినైనా బంధించాలి అంటే అష్టదిగ్బంధనం చేస్తాము.  ఈ అష్టదిగ్బంధనమే మాయాసంఖ్య. ఆదిమాయ శక్తి ఎవరు అంటే మహాలక్ష్మి.  ఈ మహాలక్ష్మి మాయను ఎవరైతే దాటుతారో వాళ్ల కుండలీనీ శక్తి కాస్త బ్రహ్మ గ్రంథిలోకి ప్రవేశం జరిగి…. ఆపై మణిపుర చక్రంలోనికి ప్రవేశిస్తుంది. ఈ మహా మాయను దాటడం అంటే…. నువ్వు 80% నీ సాధన పరిసమాప్తి చేసుకున్నట్లే.  కానీ ఇది దాటాలి అంటే…. భోగ జీవితంలో ధనమాయను దాటాలి. అదే యోగ జీవితంలోకి వచ్చేసరికి గుప్తనిధుల మాయను దాటవలసి ఉంటుంది.

శివ నందిని:- సరే స్వామి!  మాయ కూడా మంచిదే ఒక రకంగా అంటారు…ఆ మాయను దాటాలి అని చెబుతున్నారు.  సరే ఇప్పుడు గుప్తనిధుల మాయను దాటడం జరిగింది కదా!  ఇంకా మాయ ఎందుకు ఉండటం?

రుద్రస్వామి:- ఆ గుప్త నిధుల నువ్వు స్వార్థానికి ఉపయోగించడం లేదు కానీ,  లోక కళ్యాణార్థం ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. వాటిని ఎలా ఉపయోగించినా…. నువ్వు మాయలో పడ్డట్టే.  

శివనందిని:- నాకు అర్థం కాలేదు. 

రుద్రస్వామి:- ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నాడు. అతనికి నిధుల మీద ధనం మీద మోహ వ్యామోహాలు లేవు. కాకపోతే తన సాధన తను చేసుకుంటూ ఉండేసరికి…. తన చుట్టూ అవసర భక్తులు, ప్రసాద భక్తులు చేరతారు. వీళ్ళ పొగడ్తలకి అతను పడిపోతాడు. అతను ఒక స్వామీజీగా అవతరణ ఎత్తుతాడు. ఆ స్వామీజీ భక్తుల యొక్క పోషణార్థం….శిష్యుల యొక్క పోషణార్థం ఒక మఠము లేదా ఆశ్రమము లేదా పీఠము పెట్టే పరిస్థితి వస్తుంది. మరి ఆ పీఠం నడవాలంటే ధనం స్వీకరించాలి. ధనం స్వీకరించడం అంటే విరాళాలు స్వీకరించాలి.  విరాళాలు స్వీకరించడం అనేది లోక కళ్యాణార్థం అని చెబుతారు.  అంటే ఏంటి లోక కళ్యాణార్థం నువ్వు ధన మాయలో పడ్డట్టే కదా! ఇప్పుడు భోగ జీవితంలో ఉండి ధనం సంపాదిస్తే వాడు తన కుటుంబ అవసరాల కోసం ఉపయోగిస్తాడు.  యోగ జీవితంలో ఇలా విరాళాలు ద్వారా ధనం సంపాదిస్తున్నాడు అంటే లోకానికి ఉపయోగపడుతున్నాడు.  ఏదైనా గాని లోకానికి ఉపయోగపడినా …..తనకి వ్యక్తిగతంగా ఉపయోగపడినా …..వాడు మాయలో ఉంటున్నాడు కదా! ధనముతో సంబంధం ఉన్నవాడిగా ఉంటున్నాడు కదా!  ఆ మాయకి వాడు బందీ అయిపోతున్నాడు కదా!  అప్పుడు మోక్షం గురించి ఆలోచించడు కదా! శూన్యం గురించి ఆలోచించడు కదా! ఇప్పుడు శూన్యం అవ్వాలి స్వామీజీ అంటే….. వాడి ఆశ్రమాలు ఇదయిపోతాయి…. ఆశ్రమ భక్తులు ఏమైపోతారు…. భక్తులు ఏమైపోతారు…. అవన్నీ కూడా నామీద ఆధారపడి ఉన్నాయి… నేను బతికి ఉండాలి… అని వాడు సమాధి స్థితి కూడా పొందకుండా, సాధన చేయకుండా, విరాళాలు ఇచ్చే భక్తుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు.  అంటే వాడికి అది మాయ. అంటే దాన్ని వాడు నాకోసం చేయట్లేదు…. లోకం కోసం చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ, లోకం కోసం ఆ విధంగా కర్మ చేయాల్సిన పరిస్థితి ధన మాయ  తయారు  చేసింది అనే విషయం వీడు గమనించడు.  గమనించేసరికి మోక్ష మరణం కాస్త భౌతిక మరణం అవుతుంది.  వాడు సజీవ సమాధి కావలసిన వాడు కాస్త  రోగంతో సమాధి అవుతాడు.  దానితో మాయకి బలి అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మాయ అనేది లోక కళ్యాణార్థం కోసమా? వ్యక్తిగతమా అని అన్నది ఆలోచించరు.  నువ్వు ఆగిపోయావా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తుంది.  మాయకి కావలసింది నీ సాధనని ఆపటం.  మోక్షం గురించి ఆలోచన చేయకుండా చేయడం.  మోక్షం గురించి వచ్చే ఆలోచనని ఏ మార్చి… ఏకాగ్రత లేకుండా చేయడం… ఇప్పుడు పిల్లలు తల్లి కోసం అని తపన పడుతూ ఉంటారు.  తల్లేమో తన భర్తకి అవసరాలు తీరుస్తూ ఉండేసరికి…. వీళ్ళ దగ్గర ఉండే అవకాశాలు ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది…. పిల్లలకి బొమ్మలు ఇచ్చి తన మీద ఉన్న ఏకాగ్రతను పక్కకి తప్పించి…. బొమ్మల మీద ఏకాగ్రత ఉండేలా చేసి,  భర్త అవసరాలు తీర్చేందుకు అమ్మవారు వెళ్ళిపోతుంది. పిల్లలు అమ్మవారిని వదిలి బొమ్మల మాయలో  పడ్డారనుకో…. ఇక అమ్మవారి గురించి ఆలోచించడం మానేస్తారు కదా!  అదే మాయ అంటే.  ఎవరైతే బొమ్మలు గురించి ఆలోచించే మాయలో ఉంటారో వాళ్ళు కారణజన్మలు, అకారణ జన్మలు ఎత్తడం జరుగుతుంది. అది లోక కళ్యాణార్థ కర్మలు కావచ్చు…. వ్యక్తిగత కోరికలు తీర్చుకునే జన్మలు కావచ్చు.  ఏదైనా గాని పునఃజన్మ పొందడం జరుగుతుంది కదా!  లోక కళ్యాణం కోసం  కారణ జన్మలు ఎత్తిన వాళ్లకి మోక్షం వస్తుందని చెప్పలేము…. కానీ గుప్తంగా ఉండి గుప్త సాధన చేసుకుంటూ తను ఎవరో లోకానికి తెలియకుండా తన వలన లోకానికి జరగవలసిన మంచి గుప్తంగా చేసుకుంటూ….లుప్తం అయ్యే యోగులు ఎంతోమంది ఉంటారు.  వాళ్ళు మోక్షానికి అర్హులు.  వాళ్ళకి మఠాలతో… పీఠాలతోనూ పనిలేదు.  తను తెలుసుకున్న జ్ఞానాన్ని యధావిధిగా అక్షరసత్యంగా ఏమాత్రం భయపడకుండా,  ఏ మార్చకుండా, ఏమీ మార్చకుండా, ఉన్నది ఉన్నట్లుగా…. తన అనుభవాలన్నీ కూడా అందిస్తారు. ఆ అనుభవాలు నిజమా కాదా?  అని ప్రజలు పట్టించుకుంటారా లేదా అని ఆలోచించరు.  తన అనుభవాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి విశ్వంలో వాళ్ళ జ్ఞానం నిక్షిప్తం చేసి లుప్తమైపోతారు.  ఎవరు చెప్పారు లోకానికి అనేది తెలియకపోవచ్చు.  వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వలన రకరకాల కొత్త కొత్త ఆలోచనలు వచ్చి సృష్టి ఆగిపోవడానికి ముందుకు సాగడానికి తన సహాయ సహకారముగా ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. మాయ కూడా మంచిదే.  కాకపోతే నూటికి 80% వ్యక్తిగత కోరికల కోసం ఆగిపోతే…. నూటికి 20% మంది యోగ పరంగా లోక కళ్యాణార్థ కోరికల కోసం ఆగిపోతూ ఉంటారు. ఇద్దరు కూడా మాయలో ఉన్నారన్న విషయం తెలియనివ్వకుండా…. మహాలక్ష్మి మాయ ఆపేస్తుంది.  ఏదైనా గాని మోక్షం పొందనివ్వకుండా చేయడమే మాయ యొక్క లక్షణం.

శివ నందిని:- ఓహో! అందుకేనా మొదట వ్యక్తిగత కోరిక కోసం పిశాచ బంధనంలో గృహంలో ఉన్న గుప్తనిధుల ధ్యాన అనుభవం అయింది.  తర్వాత లోక కళ్యాణార్థం అన్నట్లుగా నాగబంధం ఉన్న గుప్తనిధులు కనిపించాయన్నమాట!  ఈ రెండింటి గురించి నేను పెద్దగా పట్టించుకోకపోయేసరికి…. నాకు మోహమాయ పోవటంతో…. ఈ చక్రం ఆధీనం అయ్యే అర్హత, యోగ్యత నేను సంపాదించాను అన్నమాట!  ఇప్పుడు మీరేదో మహాలక్ష్మి విగ్రహం మూర్తి రావాలని అంటున్నారు కదా!  ఈ చక్రానికి అధిష్టాన దైవం మహాలక్ష్మి అని పరమహంస ఏనాడో చెప్పారు కదా! ఇప్పుడు ఆ విగ్రహ మూర్తిని నేను సంపాదించాలి.  దానికి నేను నా సాధన కొనసాగించాలి.  అని నాకు అర్థం అయింది. సరే కారణ కోరికలు కూడా మాయే అని నాకు అర్థమైంది.  లోక కళ్యాణార్థం వ్యక్తిగత కోరికలు పెట్టుకోవడం కూడా మాయే అని నాకు అర్థం అయింది.  ఈ అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగింది.

అని అనుకుంటూ శివ నందిని ధ్యానంలో కూర్చుండిపోయింది. 


ఇలా జలముద్రతో ధ్యాననిష్ఠలో ఉండాలనుకున్న శివ నందిని చూస్తూ…. గబగబా అక్కడే ఉన్న బాల కుమారస్వామి కాస్త దగ్గరికి వచ్చి…

బాల కుమారస్వామి:- అమ్మ!  అమ్మ!  ఒక్క నిమిషం…కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి.  అవి తీర్చి నువ్వు ధ్యానంలోకి వెళ్ళు.

శివ నందిని:- ఏంటో చెప్పు కన్నా!

బాల కుమారస్వామి:- అవును… ఆ ఆడ పాము ఏమైంది… చచ్చిపోయిందా?  లేదంటే చంపేశారా? శివ నందిని:-  అది చనిపోలేదు… వీళ్ళు గుడి కట్టించారు కదా!  గుడిలోనే పెద్ద పుట్టగా చేసుకుని ఉండి… ధ్యాన సాధన  చేసుకుంటుంది.  అలాగే తన సంతానం అయిన మిగిలిన పాములను కూడా రప్పించుకుని సురక్షితంగా ఉంటుంది.   అసహజ మరణం పొందడం బదులు సహజ మరణం పొందాలని అనుకుంటుంది.  అలాగే స్థల యజమానులు…. గుప్త నిధులు యజమానులు కూడా మంగళవారం, శనివారం రాహుకేతు పూజలు ఇక్కడ చేస్తున్నారు.  అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే నాగుల చవితి, నాగుల పంచమికి పాలు పోస్తూ…చలివిడి ముద్దలు వేస్తూ…. పాముని సంతృప్తి పరుస్తున్నారు.  తద్వారా వీళ్ళ వంశానికి సర్ప దోషాలు, సర్పశాపాలు, సర్ప స్వప్న దర్శనాలు శాశ్వతంగా తొలగిపోయినాయి. ఆ తర్వాత ఆడ సంతానం కూడా తగ్గిపోతూ వంశవృద్ధిగా మగసంతానం కలగడం జరిగింది అని చెప్పి చెప్పారు.  అలాగే ఆ స్థల యజమానురాలు అయిన విజయ గారు కాశీ క్షేత్రానికి చేరుకొని కాశీవాసం చేస్తూ అక్కడ మరణం పొందాలని కాశీకి వెళ్లిపోయారని తెలిసింది.

బాల కుమారస్వామి:- అదేంటమ్మా!  ఇక్కడ ఉంటే కాశీ క్షేత్ర దర్శన ఫలితం వస్తుంది అంటారు కదా!  

శివ నందిని:- యద్భావం తద్భవతి ….ఎవరి నమ్మకం వారిది.  ఇప్పుడు నీకు తిరుపతి లడ్డు ఇచ్చి దీన్నే చలివిడి ముద్ద అనుకోమంటే నమ్ముతావా?

బాల కుమారస్వామి:- నేనెందుకు నమ్ముతాను… చలిముడి ముద్ద వేరు…. తిరుపతి లడ్డు వేరు కదా! ఆకారాలు, పరిమాణాలు వేరు కదా!

శివనందిని:- అదే విధంగా కాశీ క్షేత్రానికి ఉన్నంత శక్తి ఈ క్షేత్రానికి కూడా ఉందని చెప్పేసి శివుడు పురాణాలలో చెప్పడం జరిగింది. అది అందరూ నమ్మాలి…. చేయాలి అని ఏమీ లేదు కదా!  నీకు చలిమిడి ముద్ద, తిరుపతి లడ్డు ఎలా అయితే వేరుగా ఉన్నాయో…. ఆమెకి ఈ కాశీ క్షేత్రం వేరు కోల్హాపూర్ వేరు అనే భావంలో ఉండి…. కాశీ క్షేత్రానికి వెళ్లి చనిపోవాలి అనుకుంటుంది.

బాలకుమారస్వామి:- అంటే ఇక్కడ ఋణం ఉండటం వలన ఇక్కడ ఉన్నట్టు ఉంది. ఋణం తీరటం వలన ఆవిడ కాశీ క్షేత్రానికి వెళ్ళింది.  ఏదో విధంగా ఆవిడ మోక్షమరణం పొందుతుంది కదా!  నీవలన కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. 

బాల గణపతి:-  నేను కూడా లోక కళ్యాణార్థం కుటుంబాలను బాగుపరచాలని అనుకుంటున్నాను.  నాకు కూడా ధ్యానం అనుభవాలు కలిగేటట్టుగా ఏదో ఒక మంత్రం ఉపదేశించవచ్చు కదా!  మేము చేసుకుంటూ ఉంటాం కదా! ఎప్పుడు నువ్వు చేసుకోవడమేనా? నీకే నా ధ్యానానుభవాలు..!  మాకు అక్కర్లేదా? 

అని రుసరసలాడుతూ ఉండేసరికి…..

శివ నందిని:-  చేసుకుంటాను… శ్రద్ధ భక్తులతో చేస్తాను అంటే నేను మంత్ర గురువుగా మారి మంత్రోపదేశం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

బాల గణపతి:- మేము చేసుకుంటాము… ఏదో లోక కళ్యాణార్థం ఉపయోగపడతాము.  మా వలన ఉపయోగం ఉంది అంటే ఎటువంటి అభ్యంతరం లేదు.

శివనందిని:- సరే మీకు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తాను. ఆ తర్వాత ఓంకార నాదం ఉపదేశం చేస్తాను.  ఆ నాదం ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి అనేది కూడా చెబుతాను. గాయత్రి మంత్రం వలన మీలో ఉన్న ఏకాదశ దేహాలు జాగృతి, శుద్ధి అయి ఆధీనం అవుతాయి.  అదేవిధంగా ఓంకార నాదం వలన మీలో ఉన్న 13 యోగ చక్రాలు జాగృతి, శుద్ధి అయ్యి ఆధీనం అవుతాయి. కాబట్టి మీరు శ్రద్ధ భక్తులతో రోజుకి 1000 సార్లు గాయత్రీ చేసుకోండి.  సాయంత్రం వెయ్యి కూడా చేసుకోవచ్చు.  సాయంత్రం 1000, ఉదయం 1000 అలా కూడా చేసుకోవచ్చు.  కనీసంలో కనీసంగా 11 సార్లు చేసుకోండి.  11 సార్లు నుంచి 1080 సార్లు వరకు వేళ తప్పకుండా…క్రమం తప్పకుండా…. గాయత్రి మంత్రం చేసుకోండి.  మీ యొక్క పరిస్థితులను బట్టి మంత్రమును చేసుకోవాలి.  రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో అవకాశం ఉన్నంతవరకు చేసుకోవాలి.  అలాగే ఓంకార నాదం వీలు ఉన్నప్పుడల్లా చేసుకుంటూ ఉండండి.  ఈ రెండు కూడా మీకు సాధనగా మారుతాయి. ఇక ఇది మీకు పరమహంస సాధన అనుభవం ప్రకారంగా…. నాకు కలిగిన అనుభవాల ప్రకారంగానూ ఈ రెండు మంత్రాలే ఉత్తమమైన మంత్రాలు అని చెప్పేసి సాధనా మంత్రాలుగా ఉపదేశం చేస్తున్నాను…

అని చెప్పేసి గణపతి చెవిలో గాయత్రి మంత్రం, అలాగే కుమారస్వామి చెవిలో గాయత్రీ మంత్రమును మూడుసార్లు చెప్పి….. వాళ్ళ చేత చెప్పించడం జరిగింది. ఏ విధంగా అయితే శివ నందిని గాయత్రీ పలికిందో…. పిల్లలు కూడా ఆ విధంగానే పలికి మంత్రములు తీసుకోవడం జరిగింది. అలాగే ఓంకార నాదం ఎలా పలకాలి? ఎలా చేయాలి? అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పిల్లలకి మీకు వీలుంటే ఊదే శంఖం కొనుక్కోండి.  ఆ శంఖం పూరించడం వలన 11 సార్లు ప్రాణాయామం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి…..రోజుకి ఐదుసార్లు శంఖ నాదం చేయండి.

అనేసరికి  శంఖనాదం చేయటం అంటే మాకు ఇష్టం. ఇక్కడే షాపులో శంఖాలు దొరుకుతాయేమో కొనుక్కుంటాము… అనేసరికి చేసుకోండి… అలాగే స్పటిక శివలింగం ఒకటి మీకు చెరొకటి కొనిస్తాను.  ఆ స్పటిక శివలింగ ఆరాధన కూడా చేసుకోండి.. దానికి విభూతి నీళ్లతో అభిషేకం చేసుకోండి. దానికి రాసిన విభూది మీరు కూడా బొట్లుగా పెట్టుకోండి. అలవాటుగా చేసుకోండి…. చిన్న వయసులోనే మీరు కర్మ, భక్తి, జ్ఞాన,ధ్యాన మార్గాలలో అనుసరిస్తే ….కాలానుగుణంగా మీకు వయస్సు వచ్చేసరికి జ్ఞానం అందుతుంది.  ఆధ్యాత్మిక స్థితిగతులు కలిగి  ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లిపోతారు. కాలానుగుణంగా మీకు సంబంధించిన గురువులు వచ్చి జ్ఞానబోధ చేయడం జరుగుతుంది.  ఒకవేళ మాయలో పడితే పరిహార దోషాలు కూడా వాళ్లే చెబుతారు. ఇటు భోగ జీవితం ….అటు యోగ జీవితం కూడా ఇబ్బంది లేకుండా అన్ని యధావిధిగా జరిగిపోతాయి.  కాకపోతే ఒకసారి మంత్రం అందుకున్న తరువాత గురూపదేశం జరిగిన తరువాత…. ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రం ఆపటానికి ఉండదు. వాయిదా వేయటానికి ఉండదు.  కనీసంలో కనీసం ప్రతిరోజు 11 సార్లు మొదలుపెట్టి, 1000 సార్లు చేయాల్సి ఉంటుంది.  అది ఒకటి ఖచ్చితంగా పాటించాలి.  తప్పదు…. అనగానే సరే అమ్మ!  నువ్వు చెప్పినట్టే చేస్తాము… కాకపోతే ఎప్పుడైనా సమయం దొరకకపోతే కనీసంలో కనీసం 11 సార్లు అయినా చేస్తాము… నువ్వు చెప్పినట్టు మాకేదో సిద్దులు వస్తాయో… ధ్యాన దృశ్యాలు కనిపిస్తాయని ….మోక్షం వస్తుందని…. ఆ ఉద్దేశంతోనో,  ఆ సంకల్పంతోనో ఆ కోరికతోనో …..మేము చెయ్యము.  కాకపోతే మాకు దైవఅనుభవాలు , జ్ఞాన స్ఫురణలు కలుగుతాయి.  తద్వారా మాకు యోగ జీవితంలోను అలాగే భోగ జీవితంలోనూ ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆత్మ విచారణ శక్తి పెరుగుతుంది.  జ్ఞాన స్ఫురణ పెరుగుతుంది. విశ్లేషణ చేసే శక్తి పెరుగుతుంది.  వివేకబుద్ధి అలవడుతుంది.  మా మనసులు స్థిరమవుతాయి అని చెప్పేసి మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పేసరికి… సరే మీరు చేసుకోండి!  అని వాళ్ళని కూడా కూర్చోపెట్టుకొని….ముందు గాయత్రి మంత్రం 1000 సార్లు చేయించింది.  ఆ తర్వాత కొంతసేపు ఆగి ఓంకారం కూడా 108 సార్లు చేయించింది.  ఆ తర్వాత పిల్లలు ఆటల రందిలోకి వెళ్లిపోయేసరికి…. ఇక చక్రం ఆధీనం కోసం అని చెప్పేసి శివ నందిని ధ్యానంలోకి  వెళ్లిపోవడం జరిగింది.


ధ్యాననిష్ఠలో ఉన్న శివ నందినికి ధ్యాన దృశ్యాలు కనిపించడం ఆరంభం అయ్యాయి. తాను ఉన్న క్షేత్రంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి లీలగా కనిపించింది. తను ఉన్న గుడి తనకే కనపడటం ఆశ్చర్యం వేసింది. ఆ గుడి కూడా శ్రీ చక్రం మీద ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అవును…..అది నిజమే కదా! శ్రీ చక్రం యొక్క మెట్లు ఎలాగైతే ఉంటాయో…. ఈ గుడి నిర్మాణం కూడా అలాగే ఉంది అనిపించింది.  ఒక చోట ఎక్కడో మహాలక్ష్మి ముద్ర ఉన్నట్టుగాను…. అది ఏనుగు కడుపుకి మహాలక్ష్మి ముద్ర ఉన్నట్టుగా లీలాగా కనిపించింది.  ఈ ముద్రను చూసేసరికి…. గణపతికి కైలాసనాథ గుహ దగ్గర దొరికిన ఏనుగు బొమ్మకి ఉన్న ముద్ర లాగా ఉంది. ఆ బొమ్మ మీద మహాలక్ష్మి నిద్ర ముద్ర ఒక వైపు ఉంది అని లీలాగా గుర్తుకు వచ్చి…. ఒకవేళ ఆ బొమ్మని ఈ ముద్రలో పెడితే ఏదైనా జరగచ్చేమో అని చెప్పేసి జ్ఞాన స్ఫురణ అంది అందగానే…. ధ్యానభంగం అయ్యింది.  సరే ఇదేమైనా మాయకు తీసుకువెళుతుందా? లేకపోతే ఏదైనా సమస్యకు తీసుకువెళుతుందా? మనకెందుకులే గొడవ… అసలే పరిస్థితులు బాగుండటం లేదు.  మాయ ఎటైనా తిప్పచ్చు.  పైగా కృష్ణస్వామి మరియు యోగాంబికా కూడా ఇక్కడే ఉన్నారు.  వారు ఏదైనా చేయచ్చు అని…. ధ్యానం నుంచి బయటకు వచ్చింది.  సరే గుడి ఆవరణలో కాసేపు తిరుగుదామని చూస్తూ…. తిరుగుతూ ఉండేసరికి…. ఒకచోట తనకి ధ్యానంలో కనిపించిన  ఏనుగు మహాలక్ష్మీదేవి ముద్ర కనిపించేసరికి తనకి ఆశ్చర్యం వేసింది.  బాలగణపతికి దొరికిన ఏనుగు బొమ్మకి సరిపోయే అంత ముద్ర ఉండేసరికి….అంటే తనకి ధ్యానంలో కనిపించింది నిజమే అన్నమాట!  ఇప్పుడు ఈ బొమ్మను ఇక్కడ పెడితే ఏం జరుగుతుందోలే…. ఎందుకైనా మంచిది… మనం దూరంగా పట్టించుకోకపోవడం మంచిది అనుకుంటూ ఉండేసరికి….ఒకవేళ ఇది మహాలక్ష్మి ముద్ర కదా! ఒకవేళ ఇక్కడ నాకు మహాలక్ష్మి ముద్ర వస్తుందా? ఒకవేళ ఆ అవకాశం పోగొట్టుకుంటున్నానా? అని ఆలోచనలో ఉండేసరికి రుద్ర స్వామి మరియు  మహాదేవి కూడా అక్కడికి వస్తూ…. నీ అనుమానం నిజమేనమ్మా! అది మహాలక్ష్మి ముద్ర ఎక్కడ ఉన్నది అనేది ఈ లక్ష్మీదేవి మనకి చెబుతున్నది. అందుకోసమే ఇది మనకి రావడం జరిగింది అనేసరికి….

శివ నందిని:-  అయ్యా!  ఇప్పుడు మనం ఇలాంటి ప్రయోగాలు చేస్తే కృష్ణస్వామి మరియు యోగాంబిక వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో చూసుకున్నావా!

రుద్రస్వామి:-మనదేముంది…. మనం ఏమైనా ఏనుగు బొమ్మ గురించి అనుకున్నామా.! ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస నాధుడి గుడి దగ్గర నుంచి బాల గణపతి తీసుకు వస్తాడని అనుకున్నామా! ఆ ముద్ర ఇక్కడ ఉంటుందని మనం ఏమైనా ఊహించామా! అది యథాలాపంగా జరుగుతున్నాయి.  నీకు రావాల్సిన దైవీక వస్తువులు అవి.  అక్కడ ఏముందో మనకేం తెలుసు.

 అనేసరికి సరే అని బాలగణపతిని పిలిచి… ఒరేయ్ నీ దగ్గర ఉన్న ఏనుగు బొమ్మ తీసుకురా !అనేసరికి అది గదిలో ఉంది…. అనేసరికి నేను వెళ్లి తీసుకు వస్తాను అని రుద్రస్వామి, బాలగణపతి హోటల్ గదికి వెళ్లి ఆ ఏనుగు బొమ్మను తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు అయిన తరువాత ఎవరు  తమని గమనించడం లేదు అని….శివ నందిని ఆ ఏనుగు బొమ్మను మహాలక్ష్మి ముద్ర ఉన్న వైపు పెట్టేసరికి…. దీనికి తగ్గట్లుగానే ఆ ముద్ర ఉండి అతుక్కోవటంతో…. రాతి గొళ్ళెములు లాంటివి ఒకదానికొకటి విడిపోతూ ఉండేసరికి…. ఆశ్చర్య ఆనందాలకి లోనవ్వటం జరిగింది. 


అంటే అవి రాళ్లతో చేసినవి అని అందరూ అనుకున్నట్టుగానే వీళ్ళు అనుకున్నారు.  కాకపోతే ఇవి ఈ ఏనుగు బొమ్మ యంత్రం కోసం నిర్మాణం చేశారు అని అనుకుంటూ ఉండేసరికి …..ఉన్నట్టుండి గుడిలో వాళ్ళందరూ గుడికి ఏదో ప్రమాదం జరుగుతుంది.  స్తంభాలు కదులుతున్నాయి అని గుడిలో ఉన్న భక్తులు అందరూ బయటకు వచ్చేస్తూ ఉండేసరికి…. శివ నందినికి భయం వేసి ..

శివ నందిని:- అయ్యా! మనం ఆ ఏనుగు బొమ్మను తీసేద్దాము.  గుడిలో ఏవో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.  స్తంభాలు కదులుతున్నాయి.

రుద్రస్వామి:-ఇప్పుడు సమయం దాటిపోయింది.  మనం ఏమి చేయలేము..

 అంటూ ఉండేసరికి అక్కడికి కృష్ణస్వామి మరియు యోగాంబిక వచ్చేసి… వీళ్లు ఏదో చేసేశారు. వీళ్ళేదో పగలగొట్టినట్టు ఉన్నారు. ఇక్కడ ఏదో పెట్టినట్టు ఉన్నారు. అందువల్ల ఈ గుడి పడిపోయే పరిస్థితి వచ్చింది. కావాలంటే చూడండి…. వీళ్ళు ఇక్కడే నిల్చుని ఉన్నారు. పక్కన ఏనుగు బొమ్మ ఏదో పెట్టారు. ఆ ఏనుగు బొమ్మ వల్లే ఇవన్నీ జరిగినాయి.  ముందు ఆ ఏనుగు బొమ్మను  పీకేసేయండి.  ముందు వీళ్ళని తన్నండి అని పెద్దగా అరుస్తూ ఉండేసరికి…. భక్తులు అందరూ కూడా వచ్చి నిలదీసేసరికి…. ఆ ఏనుగు బొమ్మ ఎలా వచ్చింది? ఏంటి? అని శివ నందిని పూసగుచ్చినట్టు చెప్పేసరికి అంటే మీరు గుప్త నిధుల కోసం వచ్చారా? గుడి నాశనం చేయడం కోసం వచ్చారా? ఉండండి….మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాము.  పోలీసులకు అప్పచెబుతాము అనేసరికి…రుద్ర స్వామికి ,మహాదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు.  అప్పుడు ఆలయ పూజారి వస్తూ వీళ్ళు తెలుసుకోవాలనుకున్నారు.  వాళ్ళకి ఏనుగు బొమ్మ దొరకటం యాదృచ్ఛికంగానే జరిగింది.  ఏనుగు బొమ్మ ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన రావటము జరిగింది . ఎక్కడో ఉన్న ఏనుగు బొమ్మ ఈ గుడికి సరిపోవటం ఏమిటి? దీనిలో ఏదో అర్థం పరమార్థం ఉండి ఉంటుంది అని అంటూ ఉండేసరికి…మహాలక్ష్మి కాస్త ఒక ఆవిడ మీద పూని…. ఒరేయ్ నేనేరా… ఆ ఏనుగు బొమ్మ పెట్టమని వాళ్ళకి ఆలోచన ఇచ్చింది.  వాళ్ళు మంచి చేయడానికి వచ్చారురా!  వాళ్ళు సాధన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు రా! గుప్త నిధుల కోసం ఆశపడే వాళ్ళు కాదురా!  మా ఆయన ఏనుగు పంపించబట్టే… ఆ ఏనుగు ఇక్కడ పెట్టమని ధ్యానంలో చెప్పింది నేనే రా!  ఆ ఆలోచనలు నేనే ఇచ్చాను రా!  వాళ్లు స్వార్థం కోసం రాలేదు రా!  వాళ్లు మంచివాళ్లు రా! వాళ్ళు చెప్పింది చేయండి రా! ఏం జరుగుతుందో చూడండిరా! వాళ్ళకి కావలసింది వాళ్లకి ఇచ్చేయండి రా!లేదంటే గుడిని భూస్థాపితం చేసేస్తాను…. నేను తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతాను…. నన్ను శాంత పరచండి… వాళ్ళ కోరికలు తీర్చండి… వాళ్ళ కోరిక తీరిస్తే గాని నాలో ఆవేదన తీరదు.  ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మోక్షమును పొందాలి అనుకుంటున్నాను… నాకు ఉన్న బంధం నుంచి నన్ను విముక్తి కలిగించండి రా! నాకు మోక్షమును కలిగించండి ….ఆవిడ మోక్షం సాధనకు ఆవిడ వచ్చింది అని ఆవేశపడుతూ ఉండేసరికి….ఆలయ పూజారి కాస్త పూనకం వచ్చిన ఆమెకు హారతి ఇస్తూ శాంతించు తల్లి! శాంతించు! మేము నీకు సహాయ సహకారాలు అందిస్తాము.  నువ్వు చెప్పినట్లుగానే వాళ్లకి ఇవ్వవలసింది నీ చేతుల మీద గానే ఇవ్వు. నీ కోరిక ప్రకారం, నీ ఆజ్ఞ ప్రకారం చేశారని చెబుతున్నావు కాబట్టి…. మేము పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళము.  ఏం జరుగుతుందో నీ ఆజ్ఞ అంటూ ఉండేసరికి అప్పటిదాకా ఆ గుడిలో ఒక మూలన ఉన్న శ్రీ చక్ర యంత్రం కాస్త ఉన్నట్టుండి అమ్మవారి ముందుకు జరుగుతూ వస్తూ ఉండేసరికి…. ఇదేంటి రాతిది అలా ఎలా జరుగుతుంది… అనేసరికి పూర్వకాలంలో ఆ విధంగా నిర్మాణం చేసి ఉంటారు అని అనుకుంటూ ఉండేసరికి… ఒక్కసారిగా ఆ యంత్రం మధ్యభాగంలో నుంచి బంగారపు గజలక్ష్మి అమ్మవారు ఒక అడుగు విగ్రహ మూర్తి కనిపించేసరికి…. ఆ విగ్రహ మూర్తిలోనికి మహాలక్ష్మి భ్రుకుటి స్థానం నుంచి ఒక దివ్య తేజస్సు ఈ విగ్రహంలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ విగ్రహం కాస్త గాలిలో తేలి ఆడుతూ శివనందిని చేతుల్లోకి వచ్చేసరికి…. భక్తులందరూ కూడా ఈవిడ ఆవిడ భక్తురాలు అయి ఉంటుంది.  సిద్ధ స్త్రీ మూర్తి అయి ఉంటుంది.  మోక్ష సాధకురాలు అయి ఉంటుంది అని చెప్పేసి….. ఇటు అమ్మవారికి, అటు శివనందినికి హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ…. మమ్మల్ని దీవించు తల్లి!  మేము తెలిసో తెలియకో తప్పుగా నీతో ప్రవర్తించి ఉండవచ్చు…. గుప్తనిధులు దోచుకునే వాళ్ళు అనుకున్నాము అని…. వాళ్లే మహాలక్ష్మి అమ్మవారికి శివ నందిని కి క్షమాపణలు చెప్పుకుంటూ…. హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఉండేసరికి….. శివ నందిని కాస్త తన మనసులో ధ్యానం చేసుకుంటూ అమ్మవారి విగ్రహ మూర్తి మంత్రించి తన శరీరంలో క్షణకాలంలో నిక్షిప్తం చేసుకునేసరికి…. గొడవ అవ్వాల్సిన చోట సర్దుమనిగే సరికి కృష్ణస్వామి మరియు యోగాంబిక అక్కడి నుంచి మౌనంగా జారుకోవటం జరిగింది. యధావిధిగా శివ నందిని కాస్త ఆ ఏనుగు బొమ్మను బయటకు తీసివేయడంతో…. యధావిధిగా గుడిలో అలజడులు తగ్గి అంతా సర్దుమనగటంతో ఆ తర్వాత మహాలక్ష్మి విగ్రహ మూర్తి నుంచి దివ్య తేజస్సు ఆగిపోవడం…. అన్నీ కూడా క్షణకాలంలో జరిగిపోయాయి. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపల అంతా జరిగిపోయేసరికి ఏం జరిగినా మనమంచికే…. అంతా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే జరిగింది కదా ! అని చెప్పి గుడి ధర్మకర్తలు, గుడి పూజారులు అనుకొని… ఇక ఈవిడ అమ్మవారి అంశ అయి ఉంటుందని శివనందిని దగ్గరికి వచ్చి అమ్మ! నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావో అంతకాలము ఉండు.  దైవ సాధనా ప్రక్రియలు చేసుకో.  కానీ ఇలాంటివి చేసే ముందు మాకు చెప్పి చెయ్యి.  అందుకు మేము సిద్ధపడతాము.  ఏదైనా అనుకోని ప్రమాదాలు ప్రమాదాలు జరిగినా ….లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినా.. ఇబ్బంది పడకూడదు.  మావల్ల నీకు ఎలాంటి సమస్యలు రాకూడదు.  నువ్వు అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తురాలివి.  మాకు నీ వలన అమ్మవారి నిజరూప దర్శనం కలిగింది. ఆవిడ దివ్య తేజస్సును చూడటం జరిగింది.ఆవిడ ఆత్మశక్తి ఈ విగ్రహం లోనికి ప్రవేశించడం జరిగింది. అమ్మవారు స్వయంగా నీ శరీరంలోకి ప్రవేశించడం జరిగింది అనేసరికి…. ధన్యోస్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ… అక్కడి నుంచి మౌనంగా అందరూ గది ఉన్న హోటల్ వైపుకి వెళ్లడం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారు తన స్వాధిష్ఠాన చక్రంలో స్థిరపడినట్లుగా జ్ఞాన స్ఫురణ అందేసరికి సరే తల్లి!  నువ్వు నా స్వాధీష్ఠాన చక్రంలో స్థిరనివాసం చేసుకున్నావు…. అలాగే ధనమాయను నామీద ప్రయోగించవని నాకు అర్థం అయింది.  నువ్వు నాకు ఆధీనం అయ్యావని అర్థం అయింది. గ్రహించాను. ఇక విభేదనానికి కావలసిన సాధన శక్తిని నేను సంపాదించుకోవాలి.  సాధన చేసుకోవాలి అని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.


గదిలో నిద్రకి ఉపక్రమిస్తున్న శివ నందినికి తీవ్రమైన యోగమత్తు ఆవరిస్తూ ఉండగా….. సరే అని ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు ధ్యాన దృశ్యంగా ఏవో వనమూలికలతోనూ…. ఒక పాదరసం ఉన్న కప్పులోకి ఆ వనమూలిక వేర్లు లేదా ఆకులు ఏదో చెట్టు వేరు రసం కలుపుతూ ఉండేసరికి… అది కాస్త క్షణకాలంలో పాదరసం కాస్త బంగారంగా మారుతూ ఉండేసరికి ఆ వనమూలికలు ఎక్కడ ఉన్నాయి.? ఏంటి? అని స్పష్టంగా కనిపించేసరికి….ఇదేమిటో అర్థం కాలేదు.  ఆ తర్వాత ఏదో ఇసుకను ఒక కప్పులో తీసుకొని ఒక సిద్ధుడు ఒక రాయి పొడిని కలిపితే ఇసుక కాస్త బంగారంలా మారుతూ ఉండేసరికి….. ఆ విధంగా ధ్యాన దృశ్యం కనిపిస్తూ ఉండేసరికి…. ఏం జరిగిందో అర్థం కాకపోయేసరికి ధ్యానభంగం అయి ధ్యానం నుంచి బయటకు వచ్చేసరికి…. రుద్రస్వామి మెలకువగా ఉండేసరికి…. అయ్యా!  అంటూ తనకి కలిగిన ధ్యాన అనుభవాలన్నీ రుద్ర స్వామికి చెప్పేసరికి….

రుద్రస్వామి:-  అమ్మ!  కంగారు పడకు… అది రసవిద్యా జ్ఞానం.  ఇసుక నుంచి బంగారం తయారు చేయవచ్చు. అలాగే పరుసవేదిమణి నుంచి కూడా బంగారం తయారు చేయవచ్చు.  నీకు ఆ చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అని చూపించినట్లు ఉన్నారు.  అవన్నీ కూడా ఎలా ఉంటాయనేది చూపిస్తున్నారు.  వాటి మీద ప్రయోగం చేసుకుంటే చేసుకోవచ్చు.  పాదరసంతో బంగారం తయారు చేయవచ్చు.  ఇసుకతో కూడా బంగారం తయారు చేసుకోవచ్చు. అంతెందుకు…..కాళహస్తిలో స్వర్ణముఖి నది  ఉంది కదా ! అక్కడ ఇసుకలోనే బంగారం తయారవుతుంది.  అందుకే దానిని స్వర్ణముఖి అని పేరు పెట్టడం జరిగింది. అందులో అమ్మవారి పంచలోహయుతమైన లోహం దొరుకుతుంది.  పంచాయతనంలో అమ్మవారికి బదులుగా ఈ రాయిని ఉంచడం జరుగుతుంది. అక్కడ వివిధ ఖనిజాలు మట్టిలో ఉన్నాయని చెప్పేసి లోహాలను తయారు చేస్తారని…. వివిధ రకాల శాస్త్రవేత్తలు ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి, కంచు అలాగే వెండి ఇవన్నీ కూడా ఆ ఇసుకతో తయారు చేయవచ్చని పరిశోధన చేసి చెప్పడం జరిగింది. కాకపోతే దానికి పరుసవేది మణి పొడి అవసరం అవుతుంది. ఒక రకమైన రాయిపొడి అవసరం అవుతుంది. ఆ రాయి నీకు కొండరాయి ముక్కలాగానే కనపడుతుంది.  సాధారణ కంకర రాయి లాగానే ఉంటుంది. కానీ ఆ రాయిని గుర్తుపట్టడం ఒక్క రసవిద్య జ్ఞానం పొందిన రస సిద్ధుడికే తెలుస్తుంది. నీకు ఆ రాయి కనిపించి ఉండవచ్చు…. ఆ చెట్టు వేరు కూడా కనిపించి ఉండవచ్చు…

శివ నందిని:-  ఇది నిజమా కాదా మనం పరిశీలించి చూద్దామా?

రుద్రస్వామి:-  నువ్వు ఎప్పుడూ కూడా…. ఈ రసవిద్యతో బంగారం తయారుచేసి లోకకళ్యాణార్థం అని చెప్పేసి ఇతరులకు సహాయ సహకారాలు చేయడం నువ్వు చేయకూడద… అలా  అని మాట ఇస్తేనే దానికి అనుమతి ఇస్తాను.

శివ నందిని:- సరే అయ్యా!  ఊరికే ఆ ప్రయోగం చేయవచ్చా…చేయకూడదా ….అని, అయినా ఇప్పటికే నువ్వు రస సిద్ధుడివి కదా!  నువ్వు చేశావు కదా! ఇప్పుడు నా చేతుల మీదుగా చేయాలి అనుకున్నాను.

రుద్రస్వామి:- సరే…. నీకు ఆ రాయి, చెట్టు వేరు ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా!  అంటే ఫలానా ప్రాంతం…. ఫలానాచోట…. ఫలానా ఇంటి ముందు కనిపించాయి. 

శివ నందిని:- సరే అక్కడికి వెళ్లి తీసుకోవద్దాం 

అని బయలుదేరి వీళ్లిద్దరూ వెళ్లి తనకి కనిపించిన రాయి ముక్క, చెట్టు వేరు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు కొద్దిగ పాదరసం కూడా కొనుక్కొని రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రెండు కప్పుల్లో పాదరసం… మరొక కప్పులో పంచగంగా ఘాటు దగ్గర ఉన్న ఇసుకను తీసుకువచ్చి…. ఒక కప్పులో వేయడం జరిగింది.  ఆ తర్వాత ఒక వేరు రసాన్ని తీసుకువచ్చి పాదరసంలో వేసి కలుపుతూ ఉండేసరికి అది కాస్త ఒక బంగారపు ముద్దగా గట్టిపడుతూ ఉండేసరికి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యింది.  ఇది నిజమా కాదా అని చూస్తే నేల మీద గీకితే అది బంగారు చారలు కనపడటం…. పాదరసం మెరుపులు ఎక్కడా కనపడకుండా నిజంగానే బంగారపు ముద్దగా మారింది అనిపించింది. ఆ తర్వాత ఈ ఇసుకలో తను తీసుకువచ్చిన కంకర రాయిని చిన్నగా పొడి చేసి కలిపేసరికి చిన్నగా ఇసుక కాస్త బంగారు రేణువులుగా మారుతూ ముద్దగా అయ్యేసరికి ఆశ్చర్యం వేసింది.  ఆ తర్వాత దానిని నేల మీద రుద్దేసరికి 24 క్యారెట్ల బంగారం లాగా మారింది అని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. పిల్లలు ఆశ్చర్య ఆనందాలకు  గురయ్యారు.  మహాదేవి, రుద్ర స్వామికి ఇది పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. వీళ్ళిద్దరూ కూడా రస విద్యను దాటిన వాళ్లే.  ఈ బంగారం తయారు చేయడం వల్లనే వాళ్ళు విరాగులుగా మారడం జరిగింది.అలాగే ఇప్పుడు బంగారం మీద సమూలంగా వ్యామోహం పోవడానికి అని చెప్పేసి వైరాగ్యస్థితికి రావడానికి అని మహాలక్ష్మి ఈ విధంగా చేసి ఉంటుంది అని శివ నందినికి ఈ విధంగా చేసి ఉంటుంది అని అనుకున్నారు. ఈ విధంగా బంగారం సులువుగా తయారు చేసేసరికి శివ నందినిలో అప్పటిదాకా బంగారం పై ఉన్న మోహవ్యామోహాలు నాశనం అవుతూ….. ఈ ఇత్తడి పుత్తడిగా ఇసుకే బంగారంగా మారుతూ ఉండేసరికి…. నాకు బంగారం మీద మోహం పోయింది.  ఇప్పటిదాకా ఏదో మూల ఉండేది.  అదే నేను అన్నం వండినట్లు బంగారం తయారు చేసేసరికి ఆశ్చర్యం వేసింది.  నాకు నిజంగానే బంగారం మీద విరక్తి  కలుగుతుంది… ఛ….అని ఆ ఇంటి బయట మురికి కాలువలో పడేసేసరికి… పెద్ద వాళ్ళిద్దరూ సంతోషించారు.  పిల్లలిద్దరూ కూడా ఆ బంగారం అమ్ముకొని ఉంటే డబ్బులు వచ్చేవి కదా!  అంటే రుద్రస్వామి వీళ్ళిద్దరి  రెండు ముట్టికాయలు వేసి…. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారనే మీకు ఈ రసవిద్య గురించి చెప్పలేదు.  చేయలేదు.  మీరు కొంపతీసి ఆ రాయి గురించి…. వేరు గురించి తెలుసుకున్నారా ఏంటి?  అని అంటే మాకేం తెలుసు మీరే కదా వెళ్ళింది… మేము ఇంట్లోనే ఉన్నామీ కదా మహాదేవి పక్కనే …అనేసరికి అవును నిజమే కదా!  అనుకుంటూ ఆ రాయిని, ఆ చెట్టు వేరును కూడా పడేసింది. తనలో బంగారం మీద మోహం తగ్గిపోయిందని నమ్మకం రావడం మొదలయ్యింది.  అందుకే బంగారం తయారుచేసిన వాడు బైరాగి అవ్వక తప్పదు అని బ్రహ్మ శాపం నిజమని అనుభవంలోకి వచ్చేసరికి…. ఆ రసవిద్య ఉన్నదని…రసవిద్య సిద్ధపురుషులు ఉన్నారని రస విద్య చేయవచ్చు అని అనుభవ అనుభూతి పొందేసరికి…. ఇక బంగారం మీద సంపూర్తిగా వైరాగ్యం శివ నందినికి రావడం జరిగింది. ఇక దానితో బంగారం గురించి…. గుప్త నిధుల గురించి అలాగే బంధనాలలో ఉన్న విధుల గురించి ఇక వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి…. మనసా వాచా కర్మణా గట్టి నిర్ణయం తీసుకునేసరికి…. కళ్ళ ముందు ఒక్క క్షణం పాటు శివ స్వామి కనిపించి… మంచి నిర్ణయం తీసుకున్నావు.  తధాస్తు అని దీవించినట్లుగా అనిపించేసరికి…. ఓహో!  ఈయనకి కూడా మొత్తం నా అనుభవాలు అన్ని కూడా అందుతాయి అనుకొని…. సరే!  అని అక్కడ ఉన్న వాళ్ళతో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి…. ఎవరికి వాళ్లే విశ్రాంతిగా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు…. పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు….. ఆడుకునే వాళ్ళు ఆటలు రందిలో పడిపోవడం జరిగింది.


సాధన కుటుంబం అంతా పంచగంగా ఘాట్ లో సాధన చేయకుండా…ఇంకో సరస్సు అయిన రంకాల్ సరస్సులో స్నానం చేసుకొని మహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి,దర్శనాలు చేసుకొని….ఎవరికి వారే ధ్యానంలో కూర్చున్నారు.ఇలా  కూర్చునే సరికి శివ నందిని యధావిధిగా జలముద్రతో సాధన చేస్తూ ఉండేసరికి కొద్దిసేపటికి ధ్యాన దృశ్యం కనిపించడం ఆరంభం అయింది.  ఈసారి ధ్యానంలో ఏదో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం చుట్టూ ఏనుగులు ఉన్నాయి. అక్కడ శివుడి విగ్రహాన్ని నంది మోస్తున్నట్లుగా ఉంది. శివాలయం లోపల ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం ఎదురుగా నంది లేకపోవడం గమనించింది.  ఆశ్చర్యం వేసింది. ఒక బిలాకాశం చూపించి లోగిలి వాకిలి ఉన్న ఒక గుడి ప్రాకారం కనిపించింది.  దీనిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.  కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రాకపోయేసరికి…. ధ్యానభంగం అయ్యింది.  వీటి గురించి రుద్ర స్వామికి చెబుతూ ఉండేసరికి….వీటిని వింటున్న బాలగణపతి కాస్త

బాల గణపతి:-  ఆ గుర్తుకు వచ్చింది….మనం ఈ క్షేత్రంలో 10 ప్రాంతాలు చూడడం జరిగింది కదా!  ఆఖరి ప్రాంతంగా ఉన్న కోపేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం జరిగింది కదా! ఆ ఆలయంలో ఇలాగే ఉంటుంది. చుట్టూ ఏనుగులు ఉంటాయి. శివుడి బొమ్మ కింద వాహనంగా నంది ఉంటుంది. నంది లేకపోవడం గుళ్లో నేను గమనించాను.  ఆ పక్కనే ఏదో ఆకాశం మాత్రమే కనిపించే లోగిలీ లాంటిది ఒక నిర్మాణం ఉంది…

అనేసరికి అవునవును అని వీళ్ళందరూ అనేసరికి సరే ఈ గుడి ఎందుకు కనిపిస్తుందో ఒకసారి ఈ గుడికి వెళ్లేసి వద్దామా అనేసరికి….. ధ్యానంలో కనిపించింది అంటే దానికి ఏదో కారణం, కారకం లేకుండా ఉండదు. ఏదో ఒకటి అక్కడికి వెళ్లిన తరువాత విషయం అర్థమవుతుంది అని చెప్పి సరే అని అందరూ కలిసి ఈ క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోపేశ్వర ఆలయానికి రావడం జరిగింది. ఆ తర్వాత బాల గణపతి ఉన్నట్టుండి బాల గణపతి:- అమ్మ!  ఈ ఆలయ విశేషం గురించి నాకు చెప్పవా!  అప్పుడు అడుగుదాం అనుకున్నాను…. కానీ సాయంత్రం అయ్యేసరికి…. చీకటి పడుతుందని ఇక ఆలయ దర్శనం సరిగ్గా చేసుకోకుండానే చూసి చూడనట్టుగా వెళ్లిపోవడం జరిగింది.

అనేసరికి పిల్లలు ముచ్చట పడుతున్నారు…. వాళ్ళ ముచ్చట కాదనకూడదు అని అప్పటికే ఈ గుడికి సంబంధించిన వివరాలు చూసి ఉండటంతో శివ నందిని వాటిని గుర్తుపెట్టుకొని ఉండటంతో గబగబా పిల్లలకు చెప్పడం ఆరంభించింది. 

శివ నందిని:-  ఇక్కడ మహా శివుడి యొక్క మామగారైన దక్షుడు యజ్ఞం చేయడం జరిగింది. ఆ యజ్ఞానికి ఆదిదంపతులైన శివపార్వతులని తమ అల్లుడు,కూతురు అయినప్పటికీ పిలవలేదు.  దేవతలందరిని పిలిచారు. అప్పుడు పార్వతీదేవి నేను మా నాన్నగారు చేసే యజ్ఞానికి వెళ్లాలి అనుకుంటున్నాను…వెళ్తున్నాను…. మీరు అనుమతి ఇవ్వండి అనేసరికి…. శివుడు కాస్త పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు…. అది తల్లిదండ్రులు అయినా కానీ మనల్ని పిలవాలి కదా!  అల్లుడ్ని గౌరవించాలి…. అల్లుని గౌరవించకపోయినా పర్వాలేదు …..కూతురికైనా వాళ్ళు చెప్పి తీసుకువెళ్లాలి కదా!  వాళ్ళు పట్టించుకోలేదు… పిలవలేదు…. పిలవందానికి ఎందుకు వెళ్లడం?  అనేసరికి లేదు…. నా తల్లిదండ్రులు ప్రత్యేకంగా నన్ను పిలవాలా? పిలవకపోయినా నేను వెళతాను.  నాకు అనుమతి ఇవ్వండి.  మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్లక తప్పదు అని మొండిపట్టు పట్టేసరికి….. పార్వతి దేవికి తోడుగా తన నంది వాహనాన్ని పంపించడం జరిగింది. ఆ తరువాత యథావిధిగా వీళ్ళిద్దరూ కలిసి దక్షుడు చేసే యజ్ఞవాటికకు వెళ్లటం జరిగింది. యజ్ఞానికి కూతురు విచ్చేసేసరికి తండ్రి మరియు మిగతా వాళ్ళందరూ కూడా సంతోషించకపోవడం….పైగా నానా మాటలు అనడం…. ఆ మాటలు భరించలేక తీవ్ర మనోవేదన చెంది….సతీదేవి కాస్త ఈ యజ్ఞవాటికలో దూకి ప్రాణత్యాగం చేయటం జరిగింది. ఆవిడ భౌతిక దేహం దహనం అయ్యేసరికి… ఆత్మ శరీరం మిగిలిపోయేసరికి…. శివుడు కోపోద్రిక్తుడు అయి ఆయన జటల నుంచి వీరభద్రుని సృష్టించడం జరిగింది. వీరభద్రుడు కాస్త ఆ దక్ష యజ్ఞానికి వచ్చి దక్షుణ్ణి, వాళ్ళ సైన్యాన్ని చల్లాచెదురు చేసి దక్షుని తల నరకడం జరిగింది. ఆ తరువాత దక్షుని యొక్క భార్య కోరిక మేరా బ్రహ్మదేవుడు కాస్త దక్షుని తలకు బదులుగా మేక తలతో దక్షుని బతికించడం జరిగింది. ఆనాటి నుంచి మనిషి తల బదులుగా మేక తలతో పునః జన్మ పొందడం జరిగింది. దక్షుని యొక్క తప్పు తెలుసుకొని శివుణ్ణి ,వీరభద్రుని శరణు వేడుకొనేసరికి…. వీరభద్రుడు శాంతపడిపోయి ఆయన ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కోపోద్రేకుడైన శివుడు కాస్త తన సతి అస్థిపంజరం తీసుకొని…. ముల్లోకాలను మనోవేదనతో తిరగటం ఆరంభించాడు. అది ఈ క్షేత్రంలోని ఈ ఆలయంలోనే వీరభద్రుని తన కేశముల నుంచి సృష్టించడం జరిగింది. ఉధృతమైన కోపావేశంలో ఉన్న శివుడు కాబట్టి…. ఇక్కడ ఉన్న శివలింగాన్ని కోపేశ్వర శివలింగం అని చెప్పడం జరిగింది. అందుకనే ఇక్కడ నంది కనిపించదు. సతి దేవికి రక్షణగా నందిని పంపించడం వలన నందిలేని శివాలయం ప్రపంచంలో ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడ కనిపించదు…. ఆ పక్కనే మనకి బిలాకాశము చూపించే ప్రకారం ఉన్నది కదా!  అది యజ్ఞవాటిక అయి ఉంటుంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అంచనా వేయడం జరిగింది. ఇక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం….  శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆకాశం కేసి చూస్తే మోక్షం వస్తుందని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఆకాశ శరీరానికి మోక్షం పొందే అవకాశం ఉండి ఉండాలి…. అంటే ఆకాశాన్ని బిలాకాశంగా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే బహుశా ఈ ఆకాశంలోనే ఆకాశం లింగ దర్శనం కూడా అవుతుందేమో ఇదిమితంగా నాకైతే తెలియదు.

అనేసరికి వీళ్లంతా ఆ బిలాకాశ ప్రాకారంలోకి వెళ్లేసరికి….. మేఘాలు అంతా ఉన్నట్టుండి ఆకాశ లింగం లాగా మేఘాకారం ఏర్పడేసరికి…. ఆశ్చర్య ఆనందాలకి లోనవుతూ….తమ మీద కృతజ్ఞతలు చూపించినందుకు స్థానికుల కథ అభిప్రాయం నిజమేనని వాళ్ళకి అర్థం అయింది. తద్వారా ఆకాశ శరీరానికి ఈ క్షేత్రం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి కూడా గ్రహించారు. ఈ స్థల పురాణ విశేషాలు తెలుసుకొని…. పిల్లలు కూడా ఆనందపడి సంతోషం పడ్డారు. అప్పుడు రుద్రస్వామి కాస్త

రుద్రస్వామి:-  అమ్మా! యిదంతా పక్కన పెట్టు. నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి?

శివ నందిని:- నాకు తెలియదయ్యా !ధ్యానంలో నాకు ఈ గుడి కనిపించింది. ఈ గుడిలో ఏదో ఒక ఏనుగు బొమ్మ ఉన్నట్టు కనపడింది.  ఆ ఏనుగు బొమ్మ కింద గజాసురుడు…. ఏనుగు వైపు పెట్టే విధంగా కనబడుతుంది.  విషయం నాకు అర్థం కాలేదు.

రుద్రస్వామి:- అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మహాలక్ష్మి గుడిలో ఒకవైపు మహాలక్ష్మి ముద్రపెట్టినట్టుగానే…గజాసురుడి ముద్ర ఉన్న వైపు ఇక్కడ ఉండి ఉంటుంది.  దానిని మనం వెతికితే సరిపోతుంది. ఆ ముద్రలో ఈ గజాసురుడు ఉన్న బొమ్మ పెడితే విషయం ఏమిటి?  అనేది మనకి తెలుస్తుంది. 

అనేసరికి సరే అని పిల్లలకి కూడా ఉత్సాహంతో ఈ గజాసురుడు ముద్ర ఉన్న ఏనుగు ఉన్న ప్రదేశం కోసం వెతకడం ఆరంభించారు.  అలా రెండు మూడు గంటల పాటు వెతికి వెతికి వేసారి పోయేసరికి…. ఎక్కడా కూడా వారికి కనిపించకపోయేసరికి….

రుద్రస్వామి:- ధ్యానంలో నువ్వు స్పష్టంగా చూడు తల్లి! ఆ ప్రదేశం ఎక్కడ ఉందో నీకే తెలుస్తుంది… మానవమాత్రుల దృష్టికి ఇది కనపడేలా లేదు.

శివ నందిని:- ధ్యానంలో గుడి లోపల అయ్యవారి శివలింగానికి ఎదురుగా ఉన్న ఒక స్తంభంలో ఈ బొమ్మ పెట్టే వీలుగా ఉంది.

అని చెప్పేసి అనుకునేసరికి…. సరే అని ఇక అందరూ కూడా గుడి లోపలికి వెళ్లేసరికి ….అయ్యవారికి  నంది కూర్చునే స్థలానికి కొద్దిగా పక్కగా ఒక స్తంభం మాత్రం కనిపించింది.  ఆ స్తంభానికి అడుగున ఒక ఏనుగు తలతో ఉన్న ఒక మనిషి యొక్క బొమ్మ కనిపించేసరికి ఇదే అయిఉంటుంది అనుకుని…. శివ నందిని కాస్త దానిని తాకి తాకగానే ఒక పక్కకి గజాసురుడి బొమ్మ జరిగేసరికి లోపల గజాసురుడు బొమ్మ పట్టే అంత ఖాళీ ఉండేసరికి….సరే అని తన దగ్గర ఉన్న గజాసురుడు ఏనుగు బొమ్మ పెట్టి పెట్టగానే…… శివలింగం పీఠం కాస్త కదలడం ఆరంభించింది. ఒక విధమైన అనుమానభయం వేసింది. భక్తులు ఎవరు రావట్లేదు కదా అనుకుంటూ ఉండేసరికి… దాదాపుగా ఒక 100 /200 మంది భక్తులు, ఆలయ ధర్మకర్తలు, పూజారులు వచ్చేసరికి వీళ్లేంటి ఇలా ఉన్నట్టుండి వచ్చారు అనుకుంటూ ఉండేసరికి…. ఆ గుంపులో నుంచి కృష్ణస్వామి మరియు యోగాంబిక వచ్చి మౌనంగా వీళ్ళ ముందు నిలబడే సరికి…. వీళ్ళందరికీ విషయం అర్థమైంది. వీళ్లేంటి సమయం చూసుకొని వీళ్ళందర్నీ పిలిపించినట్టు ఉన్నారు.  ఇప్పుడు గొడవ పెట్టుకుని రాద్ధాంతం చేయాలి అనుకుంటూ ఉన్నారేమో! అనుకునేసరికి ధర్మకర్త కాస్త వచ్చి ఏంటమ్మా ఏంటి ? ఏం చేస్తున్నారు?  ఈ గుడిలో ఎవరూ లేరు కదా ఎవరూ పట్టించుకోవట్లేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.  ఎందుకు శివలింగం కదిలింది? ఏం చేయాలనుకున్నారు? గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు మొదలు పెట్టారా? గునపాలు లేవు… వస్తువులు లేవు… మరి ఆ శివలింగం ఎలా కదిలింది అనేసరికి కాస్త ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసరికి ఏంటి కాకమ్మ కథలు చెబుతున్నావా ? ఏదో బొమ్మని తీసుకువచ్చాను …..ఇక్కడ పెట్టాను అంటున్నావు…. ఏది ఆ బొమ్మ అంటూ తీసుకొని చూసేసరికి యధావిధిగా ఆ గజాసురుడి బొమ్మ మూసుకుపోయిన విషయం గమనించలేదు. స్వామి ఇక్కడే మాకు బొమ్మని పెట్టగానే రాత్రి విగ్రహం కదిలింది.  అనగానే ఏంటి నాటకాలు ఆడుతున్నారా? కథలు చెప్తున్నారా? ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేయడం…. లింగాలు వస్తువులు…. పురాతన కాలపు వస్తువులు అన్నింటిని పగలగొట్టడం జరిగింది. ఆనాడేమో ముష్కరుల దాడులు,  యుద్ధాలు చేసి దైవ విగ్రహాలు పగలకొట్టడం జరిగితే…. ఈనాడు గుప్తనిధుల కోసం ఆశపడి కొంతమంది జనాలు కలిసి ఇలా విగ్రహాలను పాడు చేస్తున్నారు.  చూసావు కదా! సగానికి సగం పైగా ఏనుగు బొమ్మలన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి అనేసరికి…. బాలగణపతి కాస్త అవునయ్యా!  మేము చూసాము…. ఏనుగు తొండాలన్నీ కూడా 80% పగిలిపోయి ఉన్నాయి.  దీనివల్ల నేను బాధపడ్డాను అని అనేసరికి… నువ్వు ఎవరివి రా చిన్నపిల్లవాడివి..!  చిన్నపిల్లల్ని కూడా తీసుకువచ్చారా? నరబలి ఇచ్చి గుప్త  నిధులు తీసుకోవాలా?  దానికోసం తీసుకువచ్చావా!  అని రుద్రయ్యకేసి చూస్తూ వీడి చూడటానికి మాంత్రికుడు లాగా ఉన్నాడు…. వీళ్ళేదో పథకం వేసి ఉంటారు …పిల్లల్ని చంపేసి గుప్త నిధులు తీయాలని అనుకుని ఉంటారు అనేసరికి….. మేము అలాంటి వాళ్ళం కాదు అనేసరికి…. మరి దేనికోసం వచ్చారు అనగానే……మేము దేనికోసం వచ్చామో మాకే తెలియదు.  కాకపోతే దీని వల్ల ఉపయోగం ఉంటుందని తెలిసింది అనేసరికి….మాకు మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ఇలాంటి అనుభవమే జరిగింది. కావాలంటే ఆలయ పూజారిని కనుక్కోండి అనేసరికి….. నాకు ఆలయ పూజారి నెంబర్ తెలుసు అని ధర్మకర్త కాస్త పూజారికి ఫోన్ చేసేసరికి వీళ్ళు ఎలా వచ్చారు ఎవరు ఏంటి ? అని అనేసరికి వివరాలన్నీ చెప్పేసరికి….అందరూ ఇక ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యి మహాలక్ష్మి ఆలయ పూజారి చెప్పిన విశేషాలు అన్నీ కూడా ఆ వచ్చిన జనాలకు చెప్పేసరికి వాళ్ళు కూడా శాంతపడి సరే అయితే మీరు గుప్త నిధుల కోసం రాలేదు.  ఏదో తెలుసుకోవాలని వచ్చారు. ఏమై ఉంటుంది అని శాంతంగా అడిగేసరికి…. మాకు తెలియదయ్య ఏం జరుగుతుందో ఏంటో… తెలియని దాన్ని మేము ఎలా చెప్పగలము? కాకపోతే ఈ శివలింగం ఎందుకు పక్కకి జరిగిందో తెలియలేదు అనేసరికి… ఈ ద్వారం మూసుకుంది అంటే… ఆ ద్వారం తెరుచుకుంది అంటే లోపల ఏదో ఉండి ఉంటుంది అని ధర్మకర్త, ఆలయ పూజారి తప్ప మిగిల వారంతా  బయటే ఉండి సాధన కుటుంబంతో పాటుగా వీళ్ళు  మెట్ల మార్గం ద్వారా లోపలికి ఉన్న భూ గృహం లోపలికి వెళ్ళటం జరిగింది.  భూ గృహంలో వాళ్లకి ఎక్కడా ఏమీ కనిపించలేదు.. చుట్టూ చూస్తే నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ చూస్తే యోగులు సాధన చేసుకునే పురాతన గుహ అయి ఉంటుంది అనుకున్నారు. శివ నందినికి ఏదో అనుమానంగా  ఉంది. ఇంత ఖాళీ స్థలంలో ఇంత పకడ్బందీగా లోపల ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఖాళీ స్థలంలోనే ఏమైనా ఉందా?  అనేసరికి వాళ్లకి ఈ భూగృహం మధ్యలో  భాగంలో ఈ ఆలయ పూజారికి ఏదో చిన్న అగ్గిపెట్ట అంతా ఒక పెట్టె కనిపించింది. ఇది అగ్గిపెట్టె అయి ఉంటుంది అని పారేయబోతుంటే…అది  అగ్గిపెట్టే కాదేమో చూడండి….ఇక్కడ అగ్గిపెట్టె వెలిగించేంత అవకాశం లేదు.  ఆక్సిజన్ కూడా లేదు కదా!  అగ్గిపెట్టె కాదేమో…. దానిమీద బూజు దులిపేయండి అనేసరికి…. అదేదో నువ్వే చూసుకో అన్నట్టుగా ఆలయ పూజారి కాస్త శివ నందినికి ఇచ్చేసరికి…. శివ నందిని కాస్త బూజు మొత్తం తీసేసరికి…. అది ఒక రాతితో చేసిన పెట్టే అని అర్థమయింది. సరే అని వాళ్ళు ఇంకేమీ దొరకట్లేదు…. ఇంకేమీ లేదు…. మీకు వచ్చిన రాతి బొమ్మలాగానే ఇదివరకు ఎవరికైనా వచ్చి ఉండవచ్చు.  వాళ్ళు ఇక్కడ ఏవైనా నిధులు ఉంటే వాటిని ఎత్తుకుపోయి ఉండవచ్చు అనేసరికి….అని  సరే అని ఎవరికి వాళ్ళు బయటకు రావడం జరిగింది. శివ నందిని కూడా యధావిధిగా దొరికిన ఆ రాతి పెట్టెని తీసుకుని పైకి రావడం జరిగింది.


పైకి వచ్చిన తర్వాత యధావిధిగా జనాలందరికీ కూడా ఏదో ఒక చిన్న రాతి పెట్టె మాత్రమే దొరికింది. గుప్త నిధులు ఏమీ లేవు.  గది అంతా భూగృహం అంతా ఖాళీగా ఉంది అని చెప్పేసరికి…. సరే అని ఎలాగైతే పీఠం కదిలిందో… అలా పీఠం మూసుకుపోయింది. ఆ తర్వాత గజాసురుడి బొమ్మ తెరుచుకోవడం…. ఆ లోపల నిక్షిప్తం చేసిన బొమ్మని బాలగణపతి బయటకు తీయడంతో యధావిధిగా ఈ గజాసురుడు బొమ్మ ఉన్నది కూడా మూసుకుపోయేసరికి …..అమ్మ!  మరి ఏమి దొరకలేదు.  ఈ రాతి పెట్టి మాత్రమే దొరికింది అంటూ ఉండేసరికి రుద్ర స్వామి చేతుల్లోకి తీసుకొని…. ఇది రాత్రి పెట్టే కాదు…. ఇందులో ఏదో ఉంది అని నేలకేసి కొడుతూ ఉండేసరికి…. పెట్టే తెరుచుకుంది. దానిని తెరిసి చూస్తే….దాని లోపల ఒక చర్మం లాంటిది మడతలు పెట్టి కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఈ చర్మం ఏమిటి ? అనేసరికి ఆ చర్మాన్ని తీస్తూ ఉండేసరికి….. ఇది సుమారుగా నాలుగు అడుగుల ఏనుగు చర్మం అని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. గుడి ప్రాంగణం మధ్యలో చర్మమును బయటకు తీస్తూ ఉండేసరికి….. మడతల మధ్యలో ఇది ఏనుగు చర్మం అని అర్థమయింది . ఆ ఏనుగు చర్మం వెనుక వైపు గజాసురుడు అని మాత్రం రాసి ఉంది.  అప్పుడు రుద్ర స్వామికి విషయం అర్థమయ్యి ఇది సాక్షాత్తు గజాసురుడు అనే భక్తుడి యొక్క శరీరం. శివుడు తనకి ఇక్కడ గజ వస్త్రముగా ఉపయోగించుకొని ఉండి ఉంటాడు. ఇది మాకు సాధనలో ఒక భాగం లెండి..!  ఇప్పుడు శివుడి బంధనాలలో గజబంధం అనేది ఉంది.  ఈ రోజుతో ఆయన బంధ విముక్తుడు అవుతూ ఉంటాడు అనేసరికి….. అక్కడ ఉన్న వాళ్లకి అర్థం కానట్టు ఉండేసరికి…. శివ నందిని ,మహాదేవికి విషయం అర్థమైపోయింది.  ఆహా….! ఇది గజవస్త్రం బంధ  విముక్తి కోసం వచ్చింది అని చెప్పి గ్రహించడానికి వాళ్ళకి అట్టే సమయం పట్టలేదు.  అప్పుడు ధర్మకర్త మరియు ఆలయ పూజారి కాస్త అయ్యా!  మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు.  కాకపోతే మీ సాధనకు ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు కాబట్టి…. శివుడే మీకు ఇచ్చాడు.  మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  మీరు తీసుకోండి అనేసరికి…. వీళ్ళందరికీ నమస్కారాలు చేసి, వాళ్ళు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయేసరికి…. ఇదంతా మౌనంగా గమనిస్తున్న కృష్ణస్వామి, యోగాంబిక కాస్త వీళ్ళు శివుడిని గజ విముక్తి చేశారు.  ఒక్కోటి శివ బంధనం తొలగిస్తున్నారు. కోపోద్రిక్తులు అవ్వాల్సిన జనాలు కాస్త శాంతమూర్తులుగా మారిపోయారు.  వీళ్ళ మాటలకి వీళ్ళ చేష్టలకి శాంతంగా మారిపోయారు.  మనం ఏమీ చేయలేము అని ఆవేశపడుతూ…. కోపావేశాలు పొందుతూ…. జనాలలో కలిసిపోయి…. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది.  సరే అని శివ నందిని కాస్త అక్కడ ఉన్న కోపేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్పి… స్వామి.! మమ్మల్ని ఈ విధంగా అనుగ్రహించావా? ఆగ్రహం తెప్పించే చోట అనుగ్రహం కలిగించావు…. అంతా నీ లీలా విన్యాసం.  చేసేది మేమే అయినా గాని చేయించేది నువ్వే అనే నమ్మకంతో….మేము ఇక్కడిదాకా రావడం జరిగింది. మా ధ్యానానుభవాలు తప్పు కాదని… సత్యమని నిరూపించావు అని అనుకొని… ఇక ఎవరికి వారే ధ్యానంలో కూర్చుండిపోయారు.  ఆ విధంగా కొంతసేపు ధ్యానం చేసుకున్న తరువాత బాలగణపతి కాస్త ఇంత చిన్న అగ్గిపెట్టె అంత పెట్టెలో చర్మం ఎలా పట్టిందో అర్థం కావట్లేదు అనేసరికి…. భారతీయుల కళా నైపుణ్యం గురించి నీకేం తెలుసు…. అగ్గిపెట్టలోనే చీరను భద్రపరిచే అంత జ్ఞానులు అని మహాదేవి అనేసరికి… అగ్గిపెట్టెలో కూడా చీరను పెట్టొచ్చా అనేసరికి ….అప్పుడు శివ నందిని కాస్త చీర ఎలా పెట్టొచ్చు ఏంటి అనేది తన ఫోన్లో ఉన్న వీడియోలు ద్వారా పిల్లలకి చూపించేసరికి ఆశ్చర్యపోతూ…. ఇది ఎంత విచిత్రం..! అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారంటే సామాన్యం కాదు.  వీళ్ళకి ఈ జ్ఞానం అందింది అంటే పూర్వీక మహర్షులకి అగ్గిపెట్టె అంత రాతిపెట్టిలో ఏనుగు చర్మం భద్రపరచడం పెద్ద సమస్య కాదు.  ఏముందిలే..!  భగవంతునికి సాధ్యం కానిది ఏముంది?  సూది బెజ్జంలోనే ఏనుగుని పెట్టగలరు!  అనేసరికి వీడి మాటలు అప్పుడప్పుడు బ్రహ్మ జ్ఞానిని మించి వెళుతూ ఉంటాయి అనుకునేసరికి… అందరూ కూడా అక్కడ ఉన్న కోపేశ్వర స్వామికి నమస్కారాలు చేసుకుంటూ…. మళ్లీ బిలాకాశాన్ని చూపించిన ప్రాకారానికి వెళ్లి….. కాసేపు ధ్యానం చేసుకొని….ఇక సాయంత్రం వేళ అవుతుందని ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని గదికి వెళ్లి, భోజనాలు చేసి, విశ్రాంతి తీసుకుని నిద్రలోకి జారుకుందాం అని అందరూ నిద్రపోవడం జరిగింది.  ఇలా వీళ్లంతా గదికి చేరిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు…

శివనందిని:- రుద్రస్వామి కేసి చూస్తూ అయ్యా!  ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి?

రుద్రస్వామి:-నాకేం తెలుస్తుంది… మనకి చెప్పాల్సింది సాధనా మూర్తి లేదా నీ ధ్యానానుభవం.  

అనేసరికి సాధనా మూర్తి సహాయ సహకారాలు లేకుండానే మనం ధ్యానంలో చూసి తెలుసుకుందాం అని కూర్చుంది. సుమారు రెండు మూడు గంటలకు కూర్చున్నా, ఎలాంటి ధ్యాన దృశ్యం కనిపించకపోయేసరికి….

శివ నందిని:- అయ్యా!  నాకు ధ్యానానుభవం అవ్వట్లేదు.  ధ్యాన దృశ్యం ఏమీ కనిపించట్లేదు. ఏ ప్రాంతానికి వెళ్లాలో అర్థం కావటం లేదు.  కాకపోతే ఇక్కడ మన సాధన పరిసమాప్తి అయ్యింది. స్వాధిష్ఠాన చక్రంలోనికి శరీర జాగృతి కోసం…. మనం ఏ క్షేత్రానికి వెళ్ళాలో సాధనా మూర్తి చెప్పక తప్పదు.

రుద్రస్వామి:- సాధనా మూర్తి ఎవరనుకుంటున్నావు? అది ఒక విధంగా  గురువు లాంటిది.  ఆయన నీ సాధన ముందుకు వెళ్లడానికి అనుగ్రహించేవాడు. కాకపోతే ఏంటంటే…. నువ్వు దైవీక వస్తువులు ఆదిపరాశక్తి దాచి ఉంచినవి తీస్తున్నావు కాబట్టి….దానికి సంబంధించిన దైవ గురువు అంటే శివుడే సాధనా మూర్తిగా రావటం జరిగింది. నీకు మాత్రమే తెలుసు కదా!  అమ్మవారి యొక్క సాధన దైవిక వస్తువులు ఏంటి.. అనేది.  ఆయన చెప్తేనే నీకు తెలుస్తుంది.  కాకపోతే సాధారణంగా స్త్రీ మూర్తి సాధన చేస్తే వారి వ్యక్తిగత దైవీక వస్తువులు మనకి కనపడతాయి. ఈ క్షేత్రానికి వస్తే మహాలక్ష్మి విగ్రహం తీసుకోవడం జరుగుతుంది.  ఆ విగ్రహం వలన వాళ్లకి అది దైవిక విగ్రహం అవుతుంది. నువ్వు ఏకంగా స్త్రీ ప్రకృతికి మోక్షం ఇవ్వాలి అనుకున్నప్పుడు….. అమ్మవారి దైవిక వస్తువులు బయటకు తీయాలి కదా!  గుప్తంగా ఉన్నవి….ఆ విషయం మనకి సదాశివుడే చెప్పాలి….కాబట్టి సదాశివుడు సాధనా మూర్తి రూపంలో ఆయన రావడం జరిగింది. ఆయన అనుమతి, ఆయన అనుగ్రహం లేకుండా మనం ఇసుమంత కూడా ముందుకు వెళ్లలేము.  పరిపూర్ణ సాధన స్థితిని పొందినా కూడా…. అన్ని చక్రాలు జాగృతి ,శుద్ధి, ఆధీనం అయినప్పటికీ కూడా ఆయన చెబితేనే నీకు అనుగ్రహం అవుతుంది. ధ్యాన దృశ్యం కనబడుతుంది. ఆయన సహాయం లేనిదే మనం ఇసుమంత కూడా ముందుకు వెళ్లలేము. ఇప్పుడు అనుభవంతో అర్థం అయింది కదా!  ఆయన అనుగ్రహం పొందందే….మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము అని తెలుసుకోవడం జరిగింది కదా!

శివ నందిని:- నాలో ఉన్న గర్వం పోయింది. ఇన్నాళ్లు నాలో కనిపించే ధ్యాన దృశ్యాలు అక్షరసత్యాలు అయ్యాయి అని అనుభవాలు నిరూపించేసరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రాంతానికి వెళ్ళాలి? అనేది కూడా నా ప్రమేయంతోనే నాకు కనపడుతుంది అనుకున్నాను.  కానీ అది కాదు అని చెప్పి తెలిసింది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా!  ఎక్కడికి వెళ్లాలి…. ఏంటి?  అనేది మనకి వచ్చిన సాధనా మూర్తి చెప్పాలి ఆయన మీరన్నట్టే అమ్మవారు ఆదిపరాశక్తి యొక్క దైవీక వస్తువులు…ఆయనకి తప్ప ఇంక ఎవరికీ తెలియవు.  ఆయన ఎక్కడ ఉంచాడు,  ఏ క్షేత్రంలో అమ్మవారు ఉంచింది అనేది మనకి చెబుతారు.  ఇప్పుడు స్వాదిష్టాన చక్రం యొక్క సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంది..?  ఏంటి?  అనేది సాధనా మూర్తి చెప్పక తప్పదు అన్నమాట! సరే ఇప్పుడు ఏం చేయాలి …?

రుద్రస్వామి:- ఏముంది!  ఇప్పుడు మనకి వచ్చిన బంగారపు మహాలక్ష్మి విగ్రహమే చెప్పాలి.

అనేసరికి బాలగణపతి కాస్త మొన్న అన్నయ్య పెట్టాడు కదా!  ఈసారి నేను పెడతాను అనేసరికి …..సాధనా విగ్రహ మూర్తి ఎడమవైపు ఉన్న పద్మంలోకి మహాలక్ష్మి విగ్రహ మూర్తిని తాకి తాకగానే స్వాధీష్ఠాన చక్రం మూడుసార్లు తిరగగానే ఈయన విగ్రహానికి వెనుక వైపు శివలింగం బయటకు రావడం జరిగింది. ఆ శివలింగం నుంచి ఒక రాగి రేకు బయటకు వచ్చేసరికి….. అమ్మ!  రాగి రేకు బయటకు వచ్చింది. నీ సాధనకి సంబంధించిన స్థితిగతులు పూర్తి అయిపోయినాయి.  కాకపోతే విభేదనం మాత్రం మిగిలింది.  చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం అయ్యాయి అని మూడుసార్లు తిరిగింది కదా!  పైగా ఈ చక్ర శరీరం ఉన్న ప్రాంతం గురించి వివరాలు చెబుతుందేమో మనం తెలుసుకోవాలి అనేసరికి….. సరే అదేంటో చదువు అనేసరికి పిల్లాడు చదవటం ఆరంభించాడు .


నేను గాలిలో ఉండేవాడిని …..

రాత్రివేళ కనిపించేవాడు నన్ను ప్రతిష్ట చేశాడు. 

మొదట గుడి బంగారం…. ఇప్పుడు రాయిమయం. 

నన్ను ముక్కలు చేసి ఒకడు మెట్లుగా పెట్టుకొని చచ్చాడు. 

నన్ను ఆరాధిస్తే స్వర్గలోక ప్రాప్తి .

దైవాల శత్రువులు నన్ను ఆరాధించేవారు కూడా…. 

అని ఉండేసరికి వాళ్ళకి అర్థం అయి అర్థం కానట్టుగా ఉండేసరికి…. రుద్ర స్వామి ఉన్నట్టుండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ శివలింగం చంద్రుడు చేత ప్రతిష్ట చేయబడింది అని చెబుతారు.  చంద్రుడికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆరాధన చేయటం వలన ఆయనకి కుష్ట వ్యాధి పోయింది అని ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు గాలిలో ఉండే వాడిని అనేసరికి….. సోమనాధ శివలింగం మొదట్లో అయస్కాంత శివలింగం.  దాని లోపల సాలిగ్రామ నిర్మితం ఉండేది. నాలుగు వైపులా కూడా అయస్కాంతాలు పెట్టి ఈ ఆయస్కాంతాన్ని ఆకర్షణలో పెట్టడం వలన గాలిలో ఈ శివలింగం ఉండేదని స్థల పురాణం చెప్పేది. అలాగే రాత్రి వేళలో కనిపించేవాడు ప్రతిష్ట చేశాడు…. అంటే రాత్రివేళ కనిపించేది చంద్రుడే కదా!  చంద్ర ప్రతిష్ట శివలింగం సోమనాథ శివలింగమే కదా!  అనుకునేసరికి…… మొదట్లో ఈ గుడి బంగారమయంగా ఉండేదని….. ఆ తర్వాత రాయిగా మారిందని…..అంటే మొదటి యుగమైన సత్యయుగంలో బంగారుమయం ఉండేదని…..కలియుగానికి వచ్చేసరికి రాతిమయం అయ్యిందని….స్థల పురాణం చెప్పడం జరిగింది కదా!  అలాగే ఔరంగజేబు ఈ శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిలో ఉన్న శాలిగ్రామాలు అన్నింటినీ కూడా తన మసీదుకి మెట్లుగా పెట్టుకొని నడిచేవాడని….. అలా నడవడం వలనే ఈ సాలిగ్రామ రేడియేషన్ వలన నయంకాని క్యాన్సర్ వ్యాధితో ఔరంగాజేబు చనిపోయాడని చరిత్ర చెబుతుంది కదా అనేసరికి….దైవాల శత్రువులు నన్ను ఆరాధించేవారు అంటే దైవాల శత్రువులు ఇంకెవరున్నారు రాక్షసులు.  రాక్షసులకి కూడా స్వర్గారోహణ చేయడం ఈ శివలింగ ఆరాధన ఆరాధన వలనే జరిగిందని… ఈ శివలింగం గురించి యుద్ధాలు చేయడం జరిగింది అని చెప్పి స్థల పురాణం చెప్పడం జరిగిందని రుద్ర స్వామి చెబుతూ ఉండేసరికి…. ఇది అవునా కాదా అని చెప్పేసి ఈలోపుల శివ నందిని ఫోన్లో ఈ స్థల పురాణం గురించి విశేషాలు దానికి సంబంధించిన కథలు ఒక్కొక్కటిగా చదువుతూ ఉండేసరికి….. రుద్ర స్వామి చేసిన విశ్లేషణ నూటికి నూరు శాతం నిజం అని చెప్పేసి అర్థం అయ్యేసరికి…. ఇప్పుడు మనం సోమనాథ్ గుడికి వెళ్లాలని చెప్పేసి… నిజ నిర్ధారణ అయింది అని గ్రహించటానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. ఇక సోమనాథ్ గుడికి రేపో ఎల్లుండో బయలుదేరదాము అని అందరూ అనుకుంటూ ఉండేసరికి…. ఉన్నట్టుండి శివ నందిని యోగమత్తు ఆవరించడం మొదలయ్యింది.  ఏమైంది తల్లి.!  అనేసరికి నాకు యోగమత్తు ఆవరిస్తుంది అనేసరికి…. ఏదైనా ధ్యాన స్ఫురణ కలుగుతుందేమో ధ్యానంలో కూర్చో!  అనేసరికి సోమనాథ్ గుడి లీలగా కనిపించింది. అంతకుముందే ఫోన్లో ఈ గుడిని చూడటంతో ఇది సోమనాథ్ గుడి శివలింగం అని గ్రహించడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. క్షణాలలో ఈ దృశ్యం కాస్త అదృశ్యం అయ్యి నవ్వుతున్న పాండురంగడు కనిపించేసరికి ఆశ్చర్య ఆనందం వేసింది. విగ్రహ మూర్తి కాస్త సజీవ మూర్తిగా కనిపించేసరికి…..ఆ పాండురంగడి గుడి పక్కనే కొంత దూరంలో రుక్మిణి సహిత గుడి కనిపిస్తూ ఉండేసరికి….. ఈయన ఏంటి? ఇప్పుడు కనపడుతున్నారు అని ఈ గుడి అసలు ఎక్కడ ఉందా అని అనుకుంటూ ఉండేసరికి ధ్యాన భంగం అయ్యింది. తనకి కలిగిన ధ్యాన దృశ్యాలు అలాగే పాండురంగడి గుడి గురించి చెబుతూ ఉండేసరికి రుద్రస్వామి:- అమ్మ!  ఇక్కడే ఈ మహారాష్ట్రలో ఉన్న పండరీపురంలోనే పాండురంగడు ఉంటాడు. ఆయన రుక్మిణి సమేతంగా ఉంటాడు.  కాకపోతే ఈయన ఒక గుడిలో ఉంటాడు.  ఆవిడ 200 మీటర్ల దూరంలో ఉంటుంది.

శివ నందిని:- ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్లాలా? 

రుద్రస్వామి:- ఇప్పుడు అది మణిపుర చక్రంలో దైవమాయగా పాండురంగడి మాయని దాటవలసి ఉంటుంది.  అది ఇప్పుడే ఎందుకు?  సోమనాథ్ గుడికి వెళ్ళటం చేద్దాము.  సోమనాథ్ గుడికి వెళ్ళిన తరువాత నీ ఆది జన్మ సూక్ష్మ శరీర జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం….. ఏం చేయాలి?  అని అనేసరికి ఒక మూడు రోజులు ఈ క్షేత్రంలో ఉండి సాధన కుటుంబం బస్సు యాత్ర చేయడం ప్రారంభం అయ్యింది.

ఇలా సాధనా కుటుంబం అంతా శివ నందిని సూక్ష్మ శరీర జాగృతి కోసం సోమనాథ్ గుడికి వెళ్ళాలి అని బస్సు ఎక్కుతూ ఉండగా…. బాలగణపతికి ఉన్నట్టుండి వాంతులు, విరోచనాలు అయ్యేసరికి …..ఎందుకైనా మంచిది అని ఇప్పుడు వెళ్లడం మంచిది కాదులే ….వీడికి అనారోగ్య సమస్యలు తగ్గిన తరువాత వెళదాము అని చెప్పేసి రుద్రస్వామి అనేసరికి…..ఎక్కిన బస్సు కూడా దిగి హోటల్ గదికి రావడం జరిగింది.  వచ్చిన తర్వాత పిల్లవాడికి కావలసిన మందులు అవి కొని రుద్ర స్వామి తెచ్చి వేయడంతో…. కొద్దిగ సర్దుకుని తగ్గుముఖం పట్టేసరికి  ఆహారం పడకపోవడం వలన వచ్చి ఉండవచ్చులే అని ఎవరికి వారే అనుకున్నారు. విశ్రాంతిగా పడుకున్నారు. శివనందినికి మనసు బాగోక అమ్మవారి గుడికి వెళ్లి ధ్యానం చేసుకుంటాను అనేసరికి సరే అని తోడుగా రుద్ర స్వామి కూడా రావటం జరిగింది.అక్కడ ఉన్న చెట్టు కింద శివ నందిని ధ్యానంలో కూర్చుంది. ఇంతలో ధ్యానంలో ఎక్కడో ఏదో ధ్యాన దృశ్యంగా ఎవరో ఒక పాప నీటిలో పడి కొట్టుకుపోతున్నట్లుగా….సహాయం కోసం అరుస్తున్నట్లుగా కనిపించేసరికి ఎక్కడ అనేది శివ నందినికి అర్థం కాక ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసింది.  ఈ విషయం రుద్ర స్వామికి చెప్పేసరికి అది ఇక్కడ ఎక్కడో దగ్గర్లోనే ఉన్నట్టుంది. అందువల్ల నీకు ధ్యాన దృశ్యంగా కనపడుతుంది అనేసరికి…. సరే అని మళ్లీ ధ్యానంలో కూర్చునే సరికి గుడికి దగ్గరలోనే కంకాల సరస్సులోనే ఈ ప్రమాదం జరుగుతుందని అనిపించేసరికి …..సరే ఒకవేళ ఎవరైనా పాప ప్రమాదంలో ఉందేమో అని  వీళ్లిద్దరూ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళటం జరిగింది.  కానీ అక్కడ జనాలందరూ గుమికూడి ఉండేసరికి ఎవరో కుటుంబం ఈ సరస్సు ఒడ్డున ఉండి ఏడుస్తూ ఉండేసరికి….. రుద్ర స్వామి గబగబా అక్కడికి వెళ్లి విషయం తెలుసుకొని, శివ నందిని దగ్గరికి వెళ్లి ఎవరో ఈ తీర్థంలో స్నానం చేయడానికి అని దిగి స్నానాదికాలు చేస్తూ ఉంటే వాళ్ళ పాప నదిలో కొట్టుకుపోయి…. ఈ నది  మధ్య భాగానికి చేరుకుందట.  సహాయం కోసం గజ ఈతగాళ్లని పిలవడం జరిగింది. అక్కడ ఉన్న సుడిగుండంలో పాపపడి కొట్టుకుపోతుంది.  ఎవరైనా అక్కడిదాకా వెళ్దామంటే ధైర్యం చేయలేకపోతున్నారు అనేసరికి……పాప అరుపు  వినిపించేసరికి శివ నందినిలో తెలియని ఆవేదన, ఆందోళన వచ్చేసరికి…. అయ్యా! నేను వెళ్లి చూసేస్తాను అని వెళ్లి చూసేసరికి…. చేతులు ఊపుతూ సహాయం కావాలి అని అడుగుతున్న పాప కనిపించేసరికి… ఒకపక్క తల్లిదండ్రుల ఆవేదన అవన్నీ కూడా చూసి శివ నందిని ఉండలేక …. ఆగలేకపోయి ఆ పాపని ఎలా అయినా రక్షించాలని తనకి ఈత వచ్చు కాబట్టి నీటిలోకి దూకాలి అనుకుంటూ….. రుద్ర స్వామి కేసి అలా ఓర చూపు చూసేసి తన అనుమతి తీసుకోకుండానే నీటిలోకి దూకేసింది.  నీటిలో దూకేసరికి శరీరం కాస్త నీటిపై తేలుతూ ఉండేసరికి…..ఒక్కసారిగా నిల్చుని పాప దగ్గరికి వెళ్లాలి…. పాప పిలుస్తుంది…. పాప ఆవేదన పడుతుంది అనుకుంటున్న సమయంలో…. నీటి మీద నడుచుకుంటూ వెళ్లిపోయి…. నీటి సుడిగుండం నుంచి బయటకు తీసి యథాలాపంగా నేల మీద నడిచినట్టుగానే నీటిమీద నడుచుకుంటూ వచ్చేసింది.  పిల్లని రక్షించాను అనే భావంలోనే….ఆలోచనలోనే శివ నందిని ఉండిపోయింది కానీ, తను నీటిలో మునిగిపోకుండా నీటిపై నడుచుకుంటూ వస్తుందన్న విషయం గమనించలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా….. ఈ విషయాన్ని గమనించి ఈవిడ ఎవరో సిద్ధ స్త్రీ మూర్తి అనుకుంట…. నీటిలో మునగకుండా నీటిపై తేలుతూ వస్తుంది.  ఎవరో సిద్ధయోగిని అని చెప్పేసి అనుకుంటూ ఈవిడకి నమస్కారాలు పెడుతూ ఉండేసరికి…… విషయం ఏం జరిగిందా అనుకొని వీళ్లంతా తనకి ఎందుకు నమస్కారాలు చేస్తున్నారు అని, పాపని రక్షించానని కృతజ్ఞతా భావం అనుకుంటూ ఉండేసరికి ….ఎందుకో అనుమానం వచ్చి పాదాలకేసి చూసేసరికి పాదాలు నీటి మీద ఉండటం గమనించి అంటే తను నీటి మీద నడుచుకుంటూ వెళ్లి పాపను రక్షించానన్న విషయం స్ఫురణకు రావటంతో తనకి జలసిద్ధి వచ్చిందన్న విషయం అప్పుడు కానీ అనుభవంలోకి రాలేదు. 


అయ్యో..!  ఇలా జరిగిందేంటి?  ఇప్పుడు వీళ్ళందరూ నన్ను యోగిని అనుకుంటారా!  ఏం చేయాలి? అనుకుంటూ ఉండేసరికి…. శరీరం కాస్త ఉన్నట్టుండి బరువు పెరుగుతూ ఉండేసరికి…. ఆ బరువుకి నీటిలో మునిగిపోతూ ఉండేసరికి…మిగతా వాళ్ళు శివ నందినిని రక్షించే పరిస్థితి అయ్యింది.  పాప అప్పటికే తల్లిదండ్రుల దగ్గరికి చేరడంతో…. చుట్టూ ఉన్నవాళ్లు శివ నందిని నీటిలో మునిగిపోతుందని…. గబగబా బయటకు తీసుకువచ్చారు.  విషయం ఏం జరిగిందని శివ నందినికి అర్థం కాలేదు.  ఉన్నట్టుండి నీటి మీద తేలడం ఏమిటి?  విషయం తెలిసాక మునగటం ఏమిటి? ఇవేమీ అర్థం కాక శివ నందినిని, రుద్రస్వామి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి గుడికి వెళుతూ ఉండగా…. 

శివ నందిని:- అయ్యా!  నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

రుద్రస్వామి:- మొదట నీకు నీటి మీద నడిచే జలచర సిద్ధి వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే విషయం తెలుసుకున్నావో అప్పుడు నీలో ఒక రకమైన అహం మొదలవడంతో బరువెక్కి లోపలికి వెళ్లిపోవడం జరిగింది. 

శివ నందిని:- ఈ సిద్ధి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా! ఏమిటి?

రుద్రస్వామి:- సిద్ధి అనేది అవసరాన్ని బట్టి…. చక్రంలోకి కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు సిద్దులు ప్రవేశం జరుగుతాయి. ఎప్పుడు ఎలా జరగాలి ఏంటి అనేది శివుడి ఆజ్ఞ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం లోనికి ప్రవేశించి చక్ర జాగృతి, శుద్ధి,అధీనం చేసుకుంటావో ….అప్పుడు నీకు ఈ పంచ సిద్ధులు, పంచభూతాలు అదుపు  ఆజ్ఞలోకి రావడం జరుగుతుంది.  వాటిని నువ్వు శాసించే స్థాయికి వస్తావు.  కాకపోతే అప్పటిదాకా ఈ సిద్దులు నీకు వచ్చినట్టు మాత్రమే అనుభవ అనుభూతి అవుతుంది. నీకు యాదృచ్ఛికంగా ఈ సిద్దులు వచ్చిన విషయం తెలియకుండానే జరిగిపోయింది.

శివ నందిని:- నాకు నీటి మీద తేలియాడుతాను అని ధ్యాన అనుభవాలు కలిగినాయి. కానీ ఇది అనుభవంలోకి రావడం ఇప్పుడే జరిగింది.  సరేలే… 

అనుకుంటూ ఉండేసరికి వాతావరణంలో మార్పులు వచ్చేసరికి…. గదికి వెళ్దాం అనుకొని కూడా పిల్లాడికి కాస్త బాగాలేదు కదా!  మనసు పీకుతూ ఉంటుంది…. గుడికి వెళ్దాం లే అంటే…. వర్షం పడేలా ఉంది కదా అనేసరికి …..పడితే పడని మనం ఏమైనా మొలకలు వేస్తామో అనేసరికి…. సరే ధ్యానంలో కూర్చుందాం అనేసరికి…. సరే అని  రుద్రస్వామి గుడి లోపల కూర్చుని ఉంటే…. ఆరు బయట చెట్టు కింద శివ నందిని ధ్యానంలో ధ్యాననిష్ఠలో ఉంది. అలా దాదాపు రెండు మూడు గంటలు ఉన్న తర్వాత….. వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చి వర్షం పడటం మొదలైంది.  ఏమిటంటే….. శివ నందిని మీద ఒక చుక్క వర్షం కూడా పడకుండా….. ఈమె చుట్టూ ఉన్న ప్రాంతమంతా దట్టమైన గాలివాన వంటి వర్షం పడటం జరిగింది.  అందరూ ఆశ్చర్య పోయారు.  ఈవిడ మీద ఒక్క చుక్క కూడా పడట్లేదు అని….కొన్ని క్షణాలకి ఈమె మీద మాత్రమే వర్షం పడుతూ…..మిగతా చోట్ల వర్షమే లేకుండా పోయింది.  క్షణాల్లోనే వాతావరణంలో మార్పులు రావడం సచిత్ర విచిత్రమైన అనుభవాలన్నీ చూసేసరికి…. ఈవిడ ఎవరో సంకల్ప సిద్దితో ఉండడం వలన ఇలా జరుగుతుందా?  అనుకుంటూ ఈవిడ ఎవరో సిద్దయోగిని లాగా ఉంది….. ఈవిడకి నమస్కారం చేసుకుంటే మంచిది అనేసరికి…. ఆలయ పూజారి కాస్త తాము చూసిన అనుభవాలన్నీ కూడా భక్తులకు చెబుతూ ఉండేసరికి…. ఇప్పుడు ఈవిడని దేవత చేస్తారని అనుమాన భయంతో రుద్రస్వామి కాస్త ధ్యానంలో శివ నందిని దగ్గరికి వెళ్ళి లోగొంతుతో 

రుద్రస్వామి:- అమ్మ ! మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు… నీకు నీటి మీద ఆధిపత్యం ఉన్న విషయం తెలిసిపోయింది.

శివ నందిని:- (కళ్ళు తెరిచి) ఎలా తెలిసింది? 

(అనేసరికి జరిగిన సంఘటన చెప్పేసరికి)…. అవునా అని అనుకొని ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది కదా!  

రుద్రస్వామి:- ఇక్కడ పేరు ప్రఖ్యాతలు వస్తాయి… భక్తులు నీ వెంటపడే ప్రమాదం ఉంది అనేసరికి….. వద్దయ్య!  మనకి ఆ సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.  నేను ఎలా ఉన్నానో అలా వెళ్లిపోవడమే మంచిది. నేను గుప్తంగా సాధన చేసుకుంటున్నాను. కాకపోతే నాకు సిద్ధి వచ్చిందని ప్రకృతి నిజరూప దర్శనం ఇచ్చినట్లుగా ఉంది.

అనేసరికి అక్కడ ఎవరూ చూడకుండా… ఎవరూ గమనించకుండా …..తమ గదికి వెళ్లిపోయిన తరువాత పిల్లవాడికి ఆరోగ్యం కుదుటపడింది.  అన్నం తిన్నా కూడా వాంతులు కాలేదు అని మహాదేవి అనేసరికి….. సరే అని శివ నందిని గుడిలో జరిగిన, గుడి బయట జరిగినవన్నీ చెప్పేసరికి అవునా!  అయితే నీకు నీటి మీద ఆధిపత్యం వచ్చి ఉండాలి…. అని చెప్పి పిల్లలు సంబరపడిపోతూ ఉండేసరికి…. ఈ సిద్ధి వచ్చింది అని చెప్పడానికే…. వీడికి అనారోగ్య సమస్య వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది అని అనుభవం అయిన తర్వాత ఏ సమస్య లేదు చూసావా! అనేసరికి అవును…. అని అందరూ అనేసరికి…. ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు.  సోమనాథ్ గుడికి వెళ్ళిపోవాలి. దర్శనం చేసుకోవాలి. అక్కడకు వెళ్లిన తరువాత ఏం జరుగుతుంది ఏంటి?  అనేది దైవమే చెప్పాలి అనేసరికి….సరే అని చెప్పి వీళ్ళు సాయంత్రం కల్లా సోమనాథ్ కి వెళ్లే బస్సు ఎక్కడం జరిగింది.  ఇప్పుడు ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా …..ప్రశాంతంగా వారి వారి సీట్లలో కూర్చొని  విశ్రాంతి తీసుకుంటూ…..ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటూ….. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు….. అలా సోమనాథ్ యాత్ర వైపు బస్సు వెళుతూ ఉన్నది.


శుభం భూయాత్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి